లక్ష్మీదేవిగా నిర్మలమ్మ.. బడ్జెట్‌పై నెట్టింట ఫన్నీ మీమ్స్‌ | Funny Memes on Budget 2025 and Nirmala Sitharaman Viral | Sakshi
Sakshi News home page

లక్ష్మీదేవిగా నిర్మలమ్మ.. బడ్జెట్‌పై నెట్టింట ఫన్నీ మీమ్స్‌

Published Sat, Feb 1 2025 4:59 PM | Last Updated on Sat, Feb 1 2025 5:11 PM

Funny Memes on Budget 2025 and Nirmala Sitharaman Viral

సోషల్‌ మీడియాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురించి, ఆమె చేసే వ్యాఖ్యల గురించి తరచూ సరదా చర్చ నడుస్తుంటుంది. అయితే.. వాటిని తాను కూడా అంతే సరదాగా చూస్తానని ఆమె అంటుంటారు. ఈ క్రమంలో ఇవాళ ఆమె ప్రవేశపెట్టిన బడ్జెట్‌పైనా నెట్టింట మీమ్స్‌ సందడి చేస్తున్నాయి.

దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయి...' అని గురజాడ అప్పారావు రాసిన కవితను ఆమె బడ్జెట్‌ ప్రసంగంలో చదివి వినిపించడం తెలిసిందే. రెండు దశాబ్దాల తర్వాత ట్యాక్స్‌ పేయర్స్‌కు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ఊరట ఇవ్వడంతో ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతూ పోస్టులు పెడుతున్నారు. 

 

అంతేకాదు.. మధ్యతరగతి పాలిట లక్ష్మీదేవి అంటూ మీమ్స్‌తో సందడి చేస్తున్నారు. అయితే ఇది కేవలం మీమ్స్‌ దగ్గరే ఆగిపోలేదు. ఏఐ జనరేటెడ్‌ ఫొటోలు, వీడియోలు.. మార్ఫింగ్‌ ఫొటోలతో మీమర్స్‌ చెలరేగిపోతున్నారు.

సబ్‌ కా వికాస్‌ లక్ష్యంగా.. అన్ని ప్రాంతాల అభివృద్ధి తమ ప్రభుత్వ ధ్యేయమని బడ్జెట్‌ ప్రసంగంలో సీతారామన్‌ అన్నారు. కానీ, బడ్జెట్‌ లెక్కలు పొంతన లేకుండా పోయాయి. ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న జేడీయూ పాలిత రాష్ట్రం బీహార్‌కు భారీగా వరాలు కురిపించింది కేంద్రం. 

దీంతో సహజంగానే మిగతా ప్రాంతాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రత్యేకించి.. ఆమె తన ప్రసంగంలో పదే పదే బీహార్‌ పేరును ప్రస్తావించడమూ ‘ఆచార్య పాదఘట్టం’ తరహాలో నెట్టింట ట్రోలింగ్‌కు దారి తీసింది.

 

ఇదిలా ఉంటే.. ఇవాళ్టి బడ్జెట్‌తో ఎనిమిదిసార్లు వరుసగా కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఘనత నిర్మలా సీతారామన్‌ దక్కించుకున్నారు. గంటా 17 నిమిషాలపాటు ఆమె ప్రసంగం కొనసాగింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement