Union Budget 2025
-
ఆర్థిక మంత్రి చెప్పకముందే.. బడ్జెట్ బయటికొచ్చేసిన వేళ..
బడ్జెట్ అంటే కేవలం ఆదాయం, వ్యయం లెక్కలే కాదు.. వేటి ధరలు తగ్గబోతున్నాయి? ఏవి పెరగబోతున్నాయి? పన్నులేమైనా తగ్గిస్తారా, పెంచుతారా? కొత్తగా వచ్చే ప్రయోజనాలేంటన్న ఆసక్తి అందరిలో ఉంటుంది. కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టేదాకా ఇవన్నీ రహస్యమే. ఎందుకంటే ముందే బడ్జెట్ ప్రతిపాదనలు బయటికి తెలిస్తే... చాలా తేడాలు వచ్చేస్తాయి. ధరలు పెరిగిపోయేవి ముందే కొని దాచేసుకోవడం, తగ్గిపోయేవాటిని మార్కెట్లోకి వదిలేయడం, స్టాక్ మార్కెట్లలో కంపెనీల షేర్ల కొనుగోళ్లు, అమ్మకాలు.. ఇలా మరెన్నో. కొన్నిసార్లు మోసాలకూ, అవకతవకలకూ చాన్స్ ఉంటుంది. ఇలా మన దేశ బడ్జెట్ ఓసారి ముందే లీకై, కేంద్ర ఆర్థిక మంత్రి రాజీనామాకు దారి తీయడంతోపాటు... బడ్జెట్‌కు రూపకల్పన చేసే ప్రక్రియనే మార్చేసింది తెలుసా?అది 1950వ సంవత్సరం.. జాన్ మథాయ్ కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఆయన, వివిధ శాఖల ఉన్నతాధికారులు కూర్చుని కేంద్ర బడ్జెట్ రూపకల్పన పూర్తిచేశారు. ప్రింట్ చేసి పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టడమే తరువాయి. అప్పట్లో రాష్ట్రపతిభవన్‌లోని ప్రెస్‌లో బడ్జెట్ ప్రతులను ముద్రించేవారు. ఇప్పుడున్నంత కఠినంగా సెక్యూరిటీ ఉండేది కాదు. దీనితో బడ్జెట్ పత్రాలు లీకయ్యాయి. రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన కొందరు జర్నలిస్టుల చేతికి చిక్కాయి. జాన్ మథాయి పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టేలోపే జనానికి అందులోని అంశాలు తెలిసిపోయాయి. ధనికులు, పెద్దలకు ప్రయోజనం కలిగించేలా బడ్జెట్ ఉందన్న విమర్శలు చెలరేగాయి. ఈ దెబ్బకు బడ్జెట్ పత్రాల ప్రింటింగ్‌ను ఢిల్లీలోని మింటో రోడ్లో ఉన్న ప్రభుత్వ ప్రెస్‌కు మార్చారు. తర్వాత 1980లో కేంద్ర సెక్రటేరియట్ ఉన్న నార్త్ బ్లాక్ భవనంలోని బేస్మెంట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రింటింగ్‌లో ముద్రించడం ప్రారంభించారు. ఇప్పుడు బడ్జెట్ పత్రాల రూపకల్పన, ప్రింటింగ్ అంటే... అధికారులు, సిబ్బంది క్వారంటైన్లో ఉన్నట్టే. ఎవరూ వారం పాటు కాలు బయటపెట్టడానికి వీల్లేదు, ఫోన్లు వాడటానికి అస్సలు వీల్లేదు. -
నీ సంగతి దేవుడెరుగు! మా సార్‌కు మాత్రం మంచి జరిగింది!
-
ఇక ఆర్‌బీఐవైపు మార్కెట్ చూపు
ముంబై: లోక్‌సభలో వారాంతాన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు స్పందించనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. రంగాలవారీగా పెట్టుబడుల కేటాయింపులు, పథకాలు తదితర ప్రతిపాదనల ఆధారంగా స్టాక్స్ కదలికలు నమోదుకానున్నట్లు తెలియజేశారు. రూ. 12 లక్షలవరకూ ఆదాయంపై పన్ను చెల్లింపులు లేకపోవడంతో శనివారం ట్రేడింగ్‌లో వినియోగ రంగ కౌంటర్లు జోరు చూపాయి. బీమా రంగానికి బూస్ట్‌నిస్తూ ఇప్పటివరకూ 75 శాతంగా అమలవుతున్న ఎఫ్‌డీఐలను 100 శాతానికి పెంచుతూ బడ్జెట్లో ప్రతిపాదించారు. బడ్జెట్లో యువత, మహిళలు, రైతులకు సైతం మద్దతుగా పలు చర్యలు ప్రతిపాదించారు. ఈ బాటలో ఇన్వెస్టర్లు మరిన్ని రంగాలవైపు దృష్టిపెట్టనున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా అభిప్రాయపడ్డారు. వినియోగ రంగం మరింత జోరు చూపవచ్చని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా, యాక్సిస్ సెక్యూరిటీస్ సీఈవో, ఎండీ ప్రణవ్ హరిదాసన్ అంచనా వేశారు. 7న పాలసీ నిర్ణయాలు కొత్త ఏడాదిలో తొలిసారి పరపతి సమీక్షను చేపట్టనున్న రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం(7న) విధాన నిర్ణయాలను ప్రకటించనుంది. దాదాపు ఐదేళ్ల తదుపరి ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించవచ్చని మెహతా ఈక్విటీస్ రీసెర్చ్ సీనియర్ వీపీ ప్రశాంత్ తాప్సీ అంచనా వేస్తున్నారు. గత 11 సమావేశాలలో వడ్డీ రేట్లకు కీలకమైన రెపోను 6.5 శాతం వద్దే యథాతథంగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి కాలంలో రెపో రేటులో 2.5 శాతం కోతను అమలు చేసింది. రిటైల్ ధరల ఇండెక్స్(సీపీఐ) డిసెంబర్లో 4 నెలల కనిష్టం 5.22 శాతానికి దిగివచి్చంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 4 శాతానికి పరిమితంకానున్న అంచనాల నేపథ్యంలో ఈసారి ఆర్బీఐ రెపో రేటును పావు శాతం తగ్గించవచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. దిగ్గజాలు రెడీ ఈ ఏడాది(2024–25) మూడో త్రైమాసిక ఫలితాల సీజన్ ఇప్పటికే వేడెక్కింది. మరిన్ని దిగ్గజాలు ఈ వారం క్యూ3((అక్టోబర్–డిసెంబర్) ఫలితాలు విడుదల చేయనున్నాయి. జాబితాలో ఏషియన్ పెయింట్స్, అపోలో టైర్స్, భారతీ ఎయిర్టెల్, ఐటీసీ, ఎస్బీఐ, ఎంఅండ్ఎం, ఎల్ఐసీ, టైటన్, ఎన్‌హెచ్‌పీసీ, టాటా పవర్, పీసీ జ్యువెలర్స్ తదితరాలున్నాయి. పనితీరు ఆధారంగా ఇన్వెస్టర్లు వివిధ స్టాక్స్‌లో పొజిషన్లు తీసుకునే వీలున్నట్లు మార్కెట్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకోనున్నట్లు ఏంజెల్ వన్ డెరివేటివ్స్ సీనియర్ విశ్లేషకులు ఓషో కృష్ణన్ పేర్కొన్నారు.ఇతర అంశాలు ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలకూ మార్కెట్లో ప్రాధాన్యత ఉన్నట్లు నిపుణులు పేర్కొన్నారు. రూపాయి ఇటీవల బలహీనపడుతుంటే చమురు ధరలు పటిష్టంగా కదులుతున్నాయి. మరోపక్క యూఎస్ డాలరు, ట్రెజరీ ఈల్డ్స్ మరింత పుంజుకుంటే సెంటిమెంటుపై ప్రభావంపడే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే దేశీ స్టాక్స్‌లో విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) అమ్మకాలకు మొగ్గు చూపుతున్నారు. జనవరిలో ఎఫ్‌పీఐలు 8 బిలియన్ డాలర్ల విలువైన స్టాక్స్ విక్రయించినట్లు అంచనా. గత వారమిలాగత వారం(జనవరి 27–ఫిబ్రవరి1) దేశీ స్టాక్ మార్కెట్లు జోరు చూపాయి. సెన్సెక్స్ నికరంగా 1,316 పాయింట్లు(1.7 శాతం) బలపడి 77,506 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 390 పాయింట్లు(1.7 శాతం) పుంజుకుని 23,482 వద్ద స్థిరపడింది. కాగా.. ఎఫ్‌పీఐల అమ్మకాల కారణంగా జనవరిలో సెన్సెక్స్, నిఫ్టీ 3.5 శాతం క్షీణించగా.. మిడ్, స్మాల్ క్యాప్స్ 9 శాతం చొప్పున పతనమయ్యాయి. -
కేంద్ర బడ్టెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం... నిధులు సాధించడంలో సీఎం చంద్రబాబు ఘోర వైఫల్యం
-
ప్రైవేట్ రంగానికి పీఎం గతి శక్తి డేటా..
చివరి అంచె వరకు డెలివరీ సేవలు అందేలా చూసేందుకు, మౌలిక సదుపాయాల ఆధారిత యాప్‌లను రూపొందించేందుకు ఉపయోగపడేలా పీఎం గతి శక్తి పోర్టల్‌లోని నిర్దిష్ట డేటా, మ్యాప్‌లను ప్రైవేట్ రంగానికి అందించే దిశగా బడ్జెట్లో కేంద్రం ప్రతిపాదన చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పటిష్టం చేసేందుకు, ప్రాజెక్ట్ ప్లానింగ్‌లో ప్రైవేట్ రంగానికి తోడ్పడేందుకు ఇది ఉపయోగపడుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వివిధ శాఖలు అందించే రైల్వే స్టేషన్లు, గూడ్ షెడ్లు, జాతీయ.. రాష్ట్ర రహదారులు, గిడ్డంగులు, విమానాశ్రయాలు, ఎంఎంఎల్‌పీలు (మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులు) మొదలైన డేటా, ప్రైవేట్ రంగం లాస్ట్ మైల్ డెలివరీ సేవలను మెరుగ్గా అందించేందుకు ఉపయోగపడనుంది. అలాగే, స్మార్ట్ సిటీ సొల్యూషన్స్‌ను రూపకల్పన, టెక్ ఆధారిత లాజిస్టిక్స్ నిర్వహణ తదితర అవసరాలకు కూడా ఈ వివరాలు ఉపయోగపడతాయి. -
కస్టమ్స్ టారిఫ్‌లు ఇక ‘ఎనిమిదే’
బేసిక్ కస్టమ్స్ డ్యూటీలను కేవలం ‘ఎనిమిదింటికి’ పరిమితం చేస్తున్నట్టు బడ్జెట్లో ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రతిపాదించారు. అయినప్పటికీ సెస్సును సర్దుబాటు చేయడం ద్వారా చాలా వస్తువులపై నికర సుంకాలను ప్రస్తుతం మాదిరే కొనసాగించే విధంగా ఈ మార్పులు చేయడం గమనార్హం. 2025–26 బడ్జెట్లో మొత్తం మీద ఏడు టారిఫ్‌లను తొలగించారు. 2023–24లోనూ ఇదే మాదిరిగా ఏడు టారిఫ్‌లను ఎత్తివేశారు. దీంతో ఇప్పుడు ‘సున్నా’ రేటు సహా మొత్తం ఎనిమిది రేట్లే మిగిలాయి. ఇది సులభతర వ్యాపార నిర్వహణకు అనుకూలిస్తుందన్నది ప్రభుత్వ ఉద్దేశ్యంగా ఉంది. దీంతో పెద్ద సంఖ్యలో ఉన్న టారిఫ్‌ల గందరగోళానికి తెరదించినట్టయింది. డెలాయిట్ ఇండియా పార్ట్నర్ హర్‌ప్రీత్ సింగ్ స్పందిస్తూ.. బడ్జెట్లో 25 శాతం, 30 శాతం, 35 శాతం, 40 శాతం టారిఫ్‌లను విలీనం చేసి 20 శాతానికి మార్చినట్టు.. సబ్బులు, ప్లాస్టిక్, కెమికల్స్, పాదరక్షలకు ఇది వర్తిస్తుందని చెప్పారు. అలాగే 100 శాతం, 125 శాతం, 150 శాతం టారిఫ్‌లను 70 శాతం టారిఫ్‌లో విలీనం చేసినట్టు తెలిపారు. లేబరేటరీ కెమికల్స్, ఆటోమొబైల్స్‌కు ఇది అమలవుతుందన్నారు. -
స్టార్టప్‌లకు జోష్
దేశంలో స్టార్టప్‌లను ప్రోత్సహించే దిశగా బడ్జెట్లో కేంద్రం పలు కార్యక్రమాలు ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.10 వేల కోట్ల కార్పస్‌తో నిధుల నిధి (ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్ఎఫ్ఎస్) పథకాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. అర్హత కలిగిన స్టార్టప్‌లకు పన్ను రాయితీలు కల్పించేందుకు సంబంధించిన విలీన కాలపరిమితిని (ఇన్కార్పొరేషన్ పీరియడ్) ఐదేళ్లు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2016లో కూడా కేంద్రం రూ.10 వేల కోట్ల కార్పస్‌తో ఎఫ్ఎఫ్ఎస్ తరహా పథకాన్ని ప్రారంభించింది. వెంచర్ మూలధన పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో దీనిని నెలకొల్పారు. సెక్యూరిటీ అండ్ ఎక్సే్చంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)లో రిజిస్టర్ అయిన ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధులకు (ఏఐఎఫ్‌లకు) పెట్టుబడి సమకూర్చే చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు (సిడ్బీ) దీనిని నిర్వహిస్తుంది. కాగా ఈ ఏఐఎఫ్‌లు తిరిగి స్టార్టప్‌లలో పెట్టుబడి పెడతాయి. స్టార్టప్‌ల కోసం ఉద్దేశించిన ఈ ఏఐఎఫ్‌లు రూ.91 వేల కోట్లకు పైగా విలువైన ఒప్పందాలను కలిగి ఉన్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. రూ.10 వేల కోట్ల ప్రభుత్వ కార్పస్‌తో కూడిన నిధుల నిధి పథకం వీటికి దన్నుగా నిలుస్తుందని తెలిపారు. తాజాగా మరో రూ.10 వేల కోట్ల సహాయంతో ఓ కొత్త నిధుల నిధి పథకాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. పరిశ్రమలను, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ)తో భేటీలో ఏఐఎఫ్‌లు ఈ పథకం కింద మరిన్ని నిధుల కోసం డిమాండ్ చేశాయి. ఎఫ్ఎఫ్ఎస్ సహకారం పొందుతున్న ప్రముఖ స్టార్టప్ పెట్టుబడి సంస్థల్లో చిరాటే వెంచర్స్, ఇండియా కోషియెంట్, బ్లూమ్ వెంచర్స్, ఐవై క్యాప్ తదితరాలున్నాయి. ఎఫ్ఎఫ్ఎస్ కింద ప్రయోజనం పొందే ఏఐఎఫ్‌లు..తాము అంగీకరించిన మొత్తానికి కనీసం రెండింతలు స్టార్టప్‌లలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. 2024 అక్టోబర్ నాటికి ఏఐఎఫ్‌లు రూ.20,572 కోట్ల మేర స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టాయి. కంపెనీల హర్షం ఎఫ్ఎఫ్ఎస్ పథకంపై పలు కంపెనీలు హర్షం వ్యక్తం చేశాయి. బడ్జెట్ భారత్‌ను ప్రపంచ ఆవిష్కరణల పవర్‌హౌస్ గా నిలబెడుతుందని పేర్కొన్నాయి. రూ.10 వేల కోట్ల తాజా కార్పస్‌తో స్టార్టప్‌లకు అవసరమైన పెట్టుబడులు అందుబాటులోకి వస్తాయని భారత్ పే వ్యవస్థాపకుడు శాశ్వత్ నకరాని చెప్పారు. కొత్త స్టార్టప్‌లకు తాజా ఎఫ్ఎఫ్ఎస్ పథకం కీలకమైన ఆర్థిక మద్దతును అందజేస్తునందని స్టార్టప్ పాలసీ ఫోరం (ఎస్పీఎఫ్) అధ్యక్షుడు, సీఈఓ రాజ్‌పాల్ కోహ్లి పేర్కొన్నారు. -
ఐఎఫ్ఎస్సీలో కార్యకలాపాలకు ఊతం..
ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ సెంటర్లో (ఐఎఫ్ఎస్సీ) కార్యకలాపాలకు ఊతమిచ్చే విధంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో పలు ప్రతిపాదనలు చేశారు. షిప్ లీజింగ్ యూనిట్లు, అంతర్జాతీయ కంపెనీలు ఏర్పాటు చేసే బీమా ఆఫీసులు, ట్రెజరీ కార్యాలయాలకు ప్రయోజనాలను కల్పించే ప్రణాళికలు వీటిలో ఉన్నాయి. పలు పన్ను మినహాయింపుల గడువును 2030 మార్చి వరకు వరకు పొడిగించారు. వాస్తవానికి కొన్ని మినహాయింపులు ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ముగిసిపోనున్నాయి. మరోవైపు, ఐఎఫ్ఎస్సీలోని ట్రెజరీ సెంటర్లకు సంబంధించి డివిడెండ్ నిర్వచనం క్రమబద్ధీకరణ, ఫండ్ మేనేజర్లకు సరళతరమైన విధానాలను కూడా బడ్జెట్లో కేంద్రం ప్రతిపాదించింది. అంతర్జాతీయంగా ఆర్థిక సేవల రంగంలో భారత్ పురోగమించేందుకు ఇవి దోహదపడగలవని గిఫ్ట్ సిటీ ఎండీ తపన్ రే తెలిపారు. పన్ను ప్రయోజనాల గడువు పొడిగించడం వల్ల ఇన్వెస్టర్లకు దీర్ఘకాలికంగా ఒక స్పష్టత లభిస్తుందని ధృవ అడ్వైజర్స్ పార్ట్నర్ ఆదిత్య హన్స్ చెప్పారు. -
జీఎస్టీలో కొత్త సవరణలు..
పన్నులు ఎగవేసేందుకు ఆస్కారమున్న ఉత్పత్తులను ట్రాక్ చేసేందుకు ఉపయోగపడేలా ‘ట్రాక్ అండ్ ట్రేస్’ నిబంధన సహా వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) విధానంలో కేంద్ర బడ్జెట్ పలు సవరణలు ప్రతిపాదించింది. ఈ నిబంధన అమలు కోసం విశిష్ట గుర్తింపు మార్కింగ్‌కు నిర్వచనం ఇస్తూ సెంట్రల్ జీఎస్టీ చట్టంలో కొత్త నిబంధన చేర్చింది. ప్రత్యేకమైన, సురక్షితమైన, తొలగించడానికి వీలుకాని విధంగా ఉండే డిజిటల్ స్టాంప్, డిజిటల్ మార్క్ లేదా ఆ కోవకు చెందిన ఇతరత్రా గుర్తులు ‘విశిష్ట గుర్తింపు మార్కింగ్’ కిందికి వస్తాయి. సరఫరా వ్యవస్థను మెరుగ్గా పర్యవేక్షించడానికి, వ్యాపారవర్గాలను డిజిటైజేషన్ వైపు మళ్లించడానికి ఇలాంటి చర్యలు దోహదపడగలవని ఏఎంఆర్‌జీ అండ్ అసోసియేట్స్ సీనియర్ పార్ట్నర్ రజత్ మోహన్ తెలిపారు. -
టీడీఎస్ ఖుషి
న్యూఢిల్లీ: వ్యక్తిగత ఆదాయపన్ను పరంగా భారీ ఊరటనిచ్చిన కేంద్ర సర్కారు, మరోవైపు అద్దె చెల్లింపులపై టీడీఎస్, విదేశీ రెమిటెన్స్ల్లోనూ ఊరట కల్పించింది. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 194–ఐ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో సంస్థల మధ్య అద్దె చెల్లింపులు రూ.2.40 లక్షలు మించితే కిరాయిదారు మూలం వద్దే పన్ను (టీడీఎస్) మినహాయించాల్సి ఉంటుంది. తాజాగా ఈ పరిమితిని రూ.6 లక్షలకు (నెలవారీ అయితే రూ.50,000) పెంచుతున్నట్టు ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రకటించారు. ఎవరికి ప్రయోజనం..?తాజా ప్రతిపాదన ప్రధానంగా వ్యాపార సంస్థలకు ఊరటగా చెప్పుకోవాలి. ప్రస్తుతం వ్యక్తులు, హెచ్‌యూఎఫ్‌లకు కిరాయి చెల్లింపులు నెలవారీ రూ.50,000 (వార్షికంగా రూ.6లక్షలు) మించినప్పుడు 5 శాతం టీడీఎస్ అమలవుతోంది. అదే వ్యాపార సంస్థలు/ట్రస్ట్‌లు/ఎన్జీవోలు తదితర వర్గాలకు వార్షిక అద్దె రూ.2.4 లక్షలు మించినప్పుడే టీడీఎస్ అమలవుతోంది. ఇప్పుడు వ్యక్తులు, హెచ్‌యూఎఫ్‌ల మాదిరే సంస్థలకూ టీడీఎస్ అమలు పరిమితిని నెలవారీ రూ.50,000కు పెంచారు. మరింత స్పష్టత, ఏకరూపత కోసం ఈ చర్య తీసుకున్నట్టు మంత్రి సీతారామన్ తెలిపారు. ‘‘భూమి లేదా మెషినరీని కొన్ని నెలల కోసం అద్దెకు ఇచ్చినప్పుడు, నెలవారీ అద్దె రూ.50,000 మించితే టీడీఎస్‌లు అమలు చేయాల్సి వస్తుంది’’అని డెలాయిట్ ఇండియా ఆర్తి రాటే తెలిపారు. తక్కువ పన్ను చెల్లించే వారు, భూ/భవన యజమానులకు ఈ పెంపు ప్రయోజనం కల్పిస్తుందని క్రెడాయ్–ఎంసీహెచ్ఐ ప్రెసిడెంట్ డొమినిక్ రామెల్ అభిప్రాయపడ్డారు. కోటి మంది పన్ను కట్టక్కర్లేదు: సీతారామన్ ఐటీ శ్లాబుల్లో మార్పులు చేయడం ద్వారా ప్రజల చేతుల్లో పెద్ద ఎత్తున ఆదాయాన్ని మిగిల్చినట్టు ఆర్థిక మంత్రి సీతారామన్ వ్యాఖ్యానించారు. ‘‘రూ.12 లక్షలకు ఆదాయపన్ను మినహాయింపును పెంచడం వల్ల మరో కోటి మంది ప్రజలు పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. ప్రజల డిమాండ్లకు ప్రభుత్వం స్పందన ఇది. మధ్య తరగతికి ప్రయోజనం కల్పించేందుకు పన్ను రేట్లను తగ్గించాం’’అని మంత్రి ప్రకటించారు. కొత్తగా సులభతర ఆదాయపన్ను చట్టం కొత్త ఆదాయపన్ను బిల్లును వచ్చే వారం పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్టు మంత్రి సీతారామన్ తెలిపారు. ప్రస్తుతమున్న ఆరు దశాబ్దాల క్రితం నాటి ‘ఆదాయపన్ను చట్టం 1961’ స్థానంలో దీన్ని తీసుకొస్తున్నట్టు చెప్పారు. ‘ముందు విశ్వసించండి. తర్వాత పరిశీలించండి’ అన్న భావనతో ‘న్యాయ’ స్ఫూర్తితో ఈ బిల్లు ఉంటుందన్న సంకేతం ఇచ్చారు. ‘‘కొత్త బిల్లు చాలా స్పష్టతతో, చాప్టర్లు, పదాల పరంగా ప్రస్తుత చట్టంతో పోల్చి చూసినప్పుడు సగం పరిమాణంలోనే ఉంటుంది. పన్ను చెల్లింపుదారులు, పన్ను అధికారులు అర్థం చేసుకునేంత సరళంగా ఉంటుంది. ఫలితంగా పన్నుల స్పష్టత ఏర్పడి, వివాదాలు తగ్గిపోతాయి’’అని మంత్రి వివరించారు. కొత్త ఆదాయపన్ను బిల్లును స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపిస్తామని చెప్పారు. రూ.10 లక్షలు మించితేనే రెమిటెన్స్‌లపై టీసీఎస్ఆర్బీఐ లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ కింద విదేశాలకు పంపుకునే నిధుల(రెమిటెన్స్/చెల్లింపులు)పై టీసీఎస్‌లో మార్పు చోటుచేసుకుంది. ఏడాదిలో రూ.7లక్షలు మించితే మూలం వద్దే పన్ను వసూలు (టీసీఎస్) ప్రస్తుతం అమల్లో ఉండగా, దీన్ని రూ.10 లక్షలకు పెంచుతున్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించారు. నిర్దేశిత ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్ నుంచి రుణం తీసుకుని విదేశీ విద్య కోసం పంపుకునే రెమిటెన్స్‌లపై టీసీఎస్‌ను తొలగిస్తున్నట్టు చెప్పడం విద్యార్థుల తల్లిదండ్రులకు మరింత ఊరటనిచ్చేదే. విదేశాల్లో చదువు కోసం, ఇతర అవసరాల కోసం వెళ్లిన వారికి నిధుల అవసరం ఏర్పడొచ్చు. అలాంటప్పుడు స్వదేశం నుంచి వారికి సులభంగా నిధులు పంపుకునేందుకు ఆర్బీఐ లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ వీలు కల్పిస్తుంది. వచ్చే ఐదేళ్లలో 75,000 మెడికల్ సీట్లు పెంచనున్నట్టు ప్రకటించడం స్వాగతించదగిన నిర్ణయం. వైద్య విద్య, ఆరోగ్య సంరక్షణలో పరిశోధన, మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. తద్వారా విద్యార్థులు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించడానికి అవసరమైన నైపుణ్యాలు అందుకుంటారు. అప్పుడే పెరిగిన మెడికల్ సీట్ల ప్రయోజనాలను నిజంగా పొందగలం. కామినేని శశిధర్ఎండి, కామినేని హాస్పిటల్స్సిమెంట్ రంగ వృద్ధికి..హౌసింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులపై పెరిగిన కేటాయింపులు నిర్మాణ సామగ్రికి డిమాండ్‌ను పెంచుతాయి. అలాగే సామర్థ్య విస్తరణకు దారితీస్తుంది. రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాలపై పెరిగిన పెట్టుబడులతో సిమెంట్ రంగ వృద్ధికి అవకాశాలు విస్తరిస్తాయి. సవాళ్లు ఉన్నప్పటికీ సిమెంట్ పరిశ్రమ స్థాపిత తయారీ సామర్థ్యం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6 శాతం కంటే ఎక్కువ స్థిర వార్షిక వృద్ధి రేటును సాధించడానికి ఈ చర్యలు మద్దతు ఇస్తాయి. – నీరజ్ అఖౌరీ, ప్రెసిడెంట్, సిమెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్.మెడికల్ టూరిజంకు బూస్ట్..దేశీయంగా ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను పటిష్టం చేసే దిశగా బడ్జెట్లో ప్రతిపాదనలు ఉన్నాయి. మెడికల్ టూరిస్టులకు వీసా–ఆన్–అరైవల్ సదుపాయాన్ని ప్రవేశపెట్టడంతో హెల్త్‌కేర్ గమ్యస్థానంగా భారత్ బలోపేతం అవుతుంది. ప్రజారోగ్యం, ఆర్థిక వృద్ధిపై చిత్తశుద్ధిని ప్రతిబింబించేలా బడ్జెట్ ఉంది. – బి. భాస్కర్ రావు, సీఎండీ, కిమ్స్పోటీతత్వాన్ని పెంచడానికి.. ప్రైవేట్ రంగంలో మూలధనాన్ని సానుకూల దిశలో కేటాయించడాన్ని ప్రోత్సహిస్తుంది. ప్రపంచం కోసం మేక్ ఇన్ ఇండియా అనే అంశం ఈ బడ్జెట్లో కీలకంగా ఉంది. తయారీ ఖర్చులను తగ్గించే ప్రయత్నాలు దేశం యొక్క ప్రపంచ పోటీతత్వాన్ని గణనీయంగా పెంచడానికి సిద్ధంగా ఉన్నాయి. – అనీష్ షా, సీఈఓ, ఎండీ, మహీంద్రా గ్రూప్.ఈవీల ఉత్పత్తికి బాసట.. బ్యాటరీ తయారీకి కీలక ముడిపదార్థాలపై దిగుమతి సుంకాలు తొలగించడం దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని పెంచుతుంది. స్థిర పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహిస్తుంది. పర్యావరణ అనుకూల ఆర్థిక వ్యవస్థకు భారతదేశాన్ని మార్చడానికి ఒక వ్యూహాత్మక చర్య. – గిరీష్ వాఘ్, ఈడీ, టాటా మోటార్స్. ఉద్యోగాలను సృష్టించడానికి..వృద్ధిని పెంపొందించడానికి, ఉద్యోగాలను సృష్టించడానికి బలమైన, నమ్మకమైన వేదికను అందిస్తుంది. రాష్ట్రాల సహకారంతో ఆరు విభాగాలలో సంస్కరణల ద్వారా వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, పెట్టుబడి, ఎగుమతుల వంటి శక్తివంతమైన ఇంజిన్లను పటిష్టం చేయడానికి చేసిన విధాన ఎంపికలు స్వాగతించదగినవి. – సంజీవ్‌పురి, ప్రెసిడెంట్, సీఐఐపట్టణ సంస్కరణలకు.. ఊతంప్రతి మంత్రిత్వ శాఖకు 3 సంవత్సరాల పైప్‌లైన్ ప్రాజెక్ట్‌లను రూపొందించడం ద్వారా పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యాలకు ప్రాధాన్యత ఇవ్వడం మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ప్రైవేట్ రంగ ప్రమేయాన్ని ప్రభావితం చేసే స్పష్టమైన ఉద్దేశాన్ని ప్రతిబింబిస్తుంది. దీనికి ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఫండ్ మరింత మద్దతునిస్తుంది. రూ. లక్ష కోట్ల అర్బన్ ఛాలెంజ్ ఫండ్ పట్టణ సంస్కరణలకు అంకితం. – వై.ఆర్.నాగరాజా, ఎండీ, రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. -
చిన్న సంస్థలకు.. భారీ బూస్ట్
న్యూఢిల్లీ: దేశానికి వెన్నెముకగా ఉంటున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) మరింత ఊతమిచ్చే విధంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో పలు సంస్కరణలను ప్రతిపాదించారు. ఎంఎస్ఎంఈల వర్గీకరణకు సంబంధించి పెట్టుబడి, టర్నోవరు పరిమితులను పెంచడం, రుణ హామీ పథకం కవరేజీని పెంచడం, ఉద్యమ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్న సూక్ష్మ సంస్థలకు కస్టమైజ్ చేసిన క్రెడిట్ కార్డులు అందించడం మొదలైనవి వీటిలో ఉన్నాయి. వర్గీకరణకు సంబంధించి పెట్టుబడి, టర్నోవరు పరిమితులను వరుసగా రెండున్నర రెట్లు, రెండు రెట్లు పెంచుతూ బడ్జెట్లో మంత్రి ప్రతిపాదనలు చేశారు. వీటి ప్రకారం రూ. 2.5 కోట్ల వరకు పెట్టుబడులు, రూ. 10 కోట్ల వరకు టర్నోవరు ఉన్న సంస్థలను ’సూక్ష్మ’ సంస్థలుగా వర్గీకరిస్తారు. రూ. 25 కోట్ల వరకు పెట్టుబడి, రూ. 100 కోట్ల వరకు టర్నోవరు ఉన్నవి ’చిన్న’ తరహా సంస్థలుగా, రూ. 125 కోట్ల వరకు పెట్టుబడులతో రూ. 500 కోట్ల లోపు టర్నోవరు ఉన్న సంస్థలను ’మధ్య’ తరహా సంస్థలుగా వ్యవహరిస్తారు. ఎంఎస్ఎంఈల విషయంలో ప్రకటించిన చర్యలను పరిశ్రమ స్వాగతించింది. దేశ ఎకానమీలో తయారీ రంగ వాటాను పెంచే దిశగా ఇది కీలకమైన అడుగని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ సీఎండీ సజ్జన్ జిందాల్ తెలిపారు. కీలకమైన రెండో ఇంజిన్.. దేశాభివృద్ధికి కీలకమైన రెండో ఇంజిన్‌గా ఎంఎస్ఎంఈలను నిర్మలా సీతారామన్ అభివర్ణించారు. ఉత్ప త్తి సామర్థ్యాలను పెంచుకునేందుకు, టెక్నాలజీని మె రుగుపర్చుకునేందుకు, మరింతగా పెట్టుబడులను సమకూర్చుకునేందుకు తాజా ప్రతిపాదనలు ఉపయోగపడతాయని మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కార్యకలాపాలను విస్తరించేందుకు, యువతకు మరిన్ని ఉద్యోగాలు కల్పించేందుకు లఘు సంస్థలకు ధీమా లభిస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం కోటి పైగా ఉన్న రిజిస్టర్డ్ ఎంఎస్ఎంఈలు, సుమారు 7.5 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. తయారీ రంగంలో వీటి వాటా 36 శాతంగాను, ఎగుమతుల్లో దాదాపు 45%గా ఉంది. మరిన్ని విశేషాలు.. → 5 లక్షల మంది మహిళలు, షెడ్యూల్డ్ కులాలు, తెగల ఎంట్రప్రెన్యూర్లకు ప్రయోజనం చేకూర్చేలా మంత్రి కొత్త ప్రతిపాదన ప్రకటించారు. వచ్చే అయిదేళ్లలో రూ.2 కోట్ల వరకు టర్మ్ లోన్లు అందించేందుకు తోడ్పడుతుంది. → లఘు, చిన్న సంస్థలకు రుణ హామీ కవరేజీని రూ. 5 కోట్ల నుంచి రూ. 10 కోట్లకు పెంచారు. దీనితో వచ్చే అయిదేళ్లలో రూ. 1.5 లక్షల కోట్ల అదనపు రుణాలు లభిస్తాయి. → స్టార్టప్‌లకు క్రెడిట్ గ్యారంటీ కవరేజీని రూ. 10 కోట్ల నుంచి రూ. 20 కోట్లకు పెంచారు. → ఉద్యమ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్న సూక్ష్మ సంస్థలకు రూ. 5 లక్షల పరిమితితో కస్టమైజ్డ్ క్రెడిట్ కార్డులు అందించనున్నారు. తొలి ఏడాదిలో 10 లక్షల కార్డులు జారీ చేస్తారు. → మేడిన్ ఇండియా ఆట»ొమ్మలకు గ్లోబల్ హబ్‌గా భారత్‌ను తీర్చిదిద్దే దిశగా ఇంటర్నేషనల్ మాన్యుఫాక్చరింగ్ మిషన్ ఏర్పాటు. -
నిధుల్లో మేజర్
న్యూఢిల్లీ :గణతంత్ర వజ్రోత్సవాలు జరుపుకొంటున్న మన దేశాన్ని ఆధునిక రణతంత్రం దిశగా నడిపించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో రక్షణ రంగానికి భారీగా కేటాయింపులు చేశారు. గత బడ్జెట్లో కేటాయించిన రూ.6.22 లక్షల కోట్లతో పోలిస్తే... సుమారు 9.53 శాతం అదనంగా ఈసారి రూ.6.81 లక్షల కోట్లు ప్రతిపాదించారు. ఇది మొత్తం బడ్జెట్లో 13.45 శాతం, మన దేశ జీడీపీలో ఇది 1.91 శాతం కావడం గమనార్హం.రక్షణ సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు వీలుగా మూలధన వ్యయం కింద రూ.1,92,387 కోట్లను చూపారు. ఇందులో అత్యాధునిక యుద్ధ విమానాలు, నౌకలు, ఆయుధాలు, పరికరాల కొనుగోళ్లకు రూ.1,48,722 కోట్లను.. దేశీయంగా ఆయుధాలు, రక్షణ సాంకేతికతల అభివృద్ధి కోసం రూ.31,277 కోట్లను.. డిఫెన్స్ సర్వీసెస్ కోసం రూ.12,387 కోట్లను కేటాయించారు. గత బడ్జెట్ సవరించిన అంచనాల ప్రకారం.. మూలధన వ్యయం రూ.1.59 లక్షల కోట్లు. దానితో పోలిస్తే ఈసారి రూ.21 వేల కోట్లు అదనంగా ఇవ్వనున్నారు.ఆధునీకరణ కోసం.. మూలధన వ్యయం కింద చేసిన కేటాయింపులను రక్షణ రంగం ఆధునీకరణ కోసం వినియోగించనున్నారు. ఇందులో రూ.48,614 కోట్లను యుద్ధ విమానాలు, వాటి ఇంజన్ల కొనుగోలు, అభివృద్ధి కోసం కేటాయించారు. నౌకా దళంలో కొనుగోళ్లు, అభివృద్ధి కోసం రూ.24,390 కోట్లు, నావికాదళ డాక్‌యార్డుల ప్రాజెక్టుల కోసం అదనంగా రూ.4,500 కోట్లు ఇచ్చారు. ఇతర ఆయుధాలు, క్షిపణుల కొనుగోలు, అభివృద్ధి కోసం రూ.63,099 కోట్లు కేటాయించారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిణామాల నేపథ్యంలో.. దేశ సరిహద్దుల రక్షణతోపాటు యుద్ధాలు, దాడులకు సంబంధించి వ్యూహాత్మక సన్నద్ధత దిశగా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.జీతాలు, పెన్షన్లకు అధిక వ్యయం..రక్షణ రంగానికి చేసిన కేటాయింపులలో ఈసారి కూడా పెద్ద మొత్తంలో రక్షణ బలగాల వేతనాలు, పెన్షన్లు, రోజువారీ నిర్వహణ వ్యయమే అధికంగా ఉన్నాయి. మొత్తం కేటాయింపుల్లో రూ.4,88,822 కోట్లు అంటే 71శాతానికిపైగా వీటికే ఖర్చుకానున్నాయి. ఇందులో రూ.1,60,795 కోట్లు పెన్షన్ల కోసమే వ్యయం కానున్నాయి.సరిహద్దుల్లో రోడ్ల నిర్మాణానికి రూ.7,146.5 కోట్లుదేశ సరిహద్దుల్లో వ్యూహాత్మక రోడ్ల నిర్మాణానికి బడ్జెట్లో రూ.7,146.5 కోట్లు కేటాయించారు. చైనా, పాకిస్తాన్ సరిహద్దుల వెంట భద్రతా దళాల కదలికలు సులువుగా సాగేందుకు వీలుగా రోడ్లు, సొరంగాలు, వంతెనల నిర్మాణానికి ఈ నిధులను వినియోగిస్తారు.దేశీయంగానే రక్షణ కొనుగోళ్లకు పెద్దపీట రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించడంలో భాగంగా మూలధన వ్యయంలో 75 శాతాన్ని దేశీయంగానే ఖర్చు చేయనున్నట్టు బడ్జెట్లో పేర్కొన్నారు. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుంచే రక్షణ పరికరాలు, ఆయుధాలను కొనుగోలు చేస్తారు. ఈ మేరకు రూ.1,11,544 కోట్లను దేశీయంగా ఖర్చు చేయనున్నట్టు బడ్జెట్లో వెల్లడించారు. ఈ వ్యయంలో రూ.27,886 కోట్ల (25 శాతం)ను మన దేశంలోని ప్రవేటు రక్షణ, పరిశోధన సంస్థల నుంచి కొనుగోళ్ల కోసం వినియోగించనున్నట్టు తెలిపారు.డీఆర్డీవోకు రూ.26,817 కోట్లు..కీలకమైన ‘రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో)’కు ఈ బడ్జెట్లో రూ.26,817 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్ కేటాయింపులు రూ.23,856 కోట్లతోపోలిస్తే సుమారు రూ.3 వేల కోట్లు అదనంగా ఇచ్చారు. దేశీయంగా రక్షణ పరికరాలు, ఆయుధాలపై పరిశోధన, అభివృద్ధి కోసం ఈ నిధులను వినియోగించనున్నారు. ⇒ మొత్తం బడ్జెట్లో 13.45%⇒ మన దేశ జీడీపీలో 1.91%⇒ ఆయుధాలకొనుగోళ్లు, అభివృద్ధికి 1,92,387 కోట్లు⇒ వేతనాలు, రోజువారీ వ్యయానికి రూ.4,88,822 కోట్లు (ఇందులో పెన్షన్లకు 1,60,795 కోట్లు) -
బీమాకు 100% దన్ను
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి సీతారామన్ తాజా బడ్జెట్లో బీమా రంగానికి పూర్తిస్థాయిలో మద్దతిచ్చారు. బీమా రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐలు)ను అనుమతించేందుకు ప్రతిపాదించారు. ప్రస్తుతం బీమాలో 74 శాతంవరకూ ఎఫ్‌డీఐలకు అనుమతి ఉంది. ఆధునికతరం ఫైనాన్షియల్ రంగ సంస్కరణలలో భాగంగా ఇందుకు తెరతీశారు. అయితే మొత్తం ప్రీమియంను దేశీయంగా ఇన్వెస్ట్ చేసే కంపెనీలకు మాత్రమే పెంచిన పరిమితి వర్తించనున్నట్లు సీతారామన్ పేర్కొన్నారు. వెరసి విదేశీ పెట్టుబడుల పరిమితులను సమీక్షించడంతోపాటు సరళతరం చేసినట్లు వెల్లడించారు. ఎఫ్‌డీఐ పరిమితి పెంపునకు వీలుగా ప్రభుత్వం బీమా చట్టం 1938, జీవిత బీమా చట్టం 1956, బీమా నియంత్రణ, అభివృద్ధి అ«దీకృత చట్టం 1999లకు సవరణలు చేయనుంది. మరిన్ని సంస్థలు ప్రవేశించడం ద్వారా బీమా విస్తృతి పెరగడంతోపాటు భారీ ఉద్యోగ అవకాశాలకు తెరలేవనుంది. కొన్ని నిబంధనలు, విధానాలను సరళతరం చేసే ముసాయిదా బిల్లు త్వరలో పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం 25 జీవిత బీమా, 34 సాధారణ బీమా కంపెనీలు దేశీయంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. కాగా.. ఇంతక్రితం 2021లో బీమా రంగంలో ఎఫ్‌డీఐల పరిమితిని 49 శాతం నుంచి 74 శాతానికి ప్రభుత్వం హెచ్చించింది. అంతకుముందు 2015లో 26 శాతం నుంచి 49 శాతానికి పెంచేందుకు అనుమతించింది. -
కీలక ఖనిజాలపై సుంకాల రద్దు
న్యూఢిల్లీ: కీలకమైన 12 ఖనిజాలు, లిథియం అయాన్ బ్యాటరీల స్క్రాప్, సీసం, కొబాల్ట్ ఉత్పత్తులు, జింకు మొదలైన వాటితో పాటు క్యాన్సర్, ఇతరత్రా అరుదైన వ్యాధుల చికిత్సలో ఉపయోగించే 36 ఔషధాలపై దిగుమతి సుంకాలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రకటించారు. కీలక ఖనిజాలపై సుంకాల తగ్గింపుతో వాటి ప్రాసెసింగ్, రిఫైనింగ్కి ఊతం లభిస్తుందని, వాటిపై ఆధారపడిన రంగాలకు సదరు ఖనిజాల లభ్యత మెరుగుపడుతుందని పేర్కొన్నారు. సెస్సు వర్తించే 82 ఉత్పత్తుల కేటగిరీలపై సామాజిక సంక్షేమ సర్చార్జిని తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒకటికి మించి సెస్సు లేదా సర్‌చార్జీని విధించకుండా ప్రతిపాదన చేశారు. నౌకా నిర్మాణ సంబంధిత ప్రయోజనాలు అందడానికి సుదీర్ఘ సమయం పడుతుంది కాబట్టి ముడి వస్తువులు, విడిభాగాలపై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ (బీసీడీ) మినహాయింపును మరో పది సంవత్సరాలు పొడిగించారు. క్యాన్సర్, అరుదైన వ్యాధులు, ఇతర తీవ్ర వ్యాధులతో సతమతమవుతున్న పేషంట్లకు ఊరటనిచ్చేలా బీసీడీ నుంచి పూర్తిగా మినహాయింపు ఉండే ఔషధాల జాబితాలోకి 36 ఔషధాలను చేరుస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ డిస్ప్లేపై బీసీడీని 10 శాతం నుంచి 20 శాతానికి పెంచగా, ఓపెన్ సెల్ మొదలైన వాటిపై అయిదు శాతానికి తగ్గించారు. -
ఎన్పీఎస్ వాత్సల్యకూ పన్ను ఊరట
న్యూఢిల్లీ: చిన్నారుల రిటైర్మెంట్కు గణనీయమైన నిధిని సమకూర్చుకునే ఉద్దేశ్యంతో తీసుకొచ్చిన పీఎం వాత్సల్య ఎన్పీఎస్ పథకానికి తాజా బడ్జెట్లో రూ.50,000 పెట్టుబడులపై పన్ను ఆదా ప్రయోజనం కల్పించారు. తొలిసారిగా 2024–25 బడ్జెట్లో ఈ పథకాన్ని ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. మైనర్ల పేరిట తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఎన్పీఎస్ వాత్సల్య ఖాతా ప్రారంభించి ఇన్వెస్ట్ చేయవచ్చు. చిన్నారులు 18 ఏళ్లు నిండిన తర్వాత రెగ్యులర్ ఖాతా కింద మార్చుకుని, అప్పుడు వారు స్వయంగా ఇన్వెస్ట్ చేసుకోవడానికి వెసులుబాటు ఉంది. దీని కింద ఇప్పటికే 89,475 ఖాతాలు ప్రారంభమయ్యాయి. వీటి పరిధిలో రూ.62 కోట్ల పెట్టుబడులు సైతం సమకూరాయి. ఈ పథకానికి మరింత ఆదరణ కల్పించే ఉద్దేశ్యంతో తాజాగా పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని ఆర్థిక మంత్రి కల్పించారు. సాధారణ ఎన్పీఎస్ ఖాతాకు ఉన్నట్టుగానే ఎన్పీఎస్ వాత్సల్యకు ఒకే విధమైన పన్ను విధానాన్ని ప్రతిపాదిస్తున్నట్టు చెప్పారు. కాకపోతే చట్టం పరిధిలో ప్రస్తుతమున్న గరిష్ట ప్రయోజనాల పరిధిలోనే ఇది ఉంటుందన్నారు. సెక్షన్ 80 సీసీడీ(1బి) కింద సాధారణ ఎన్పీఎస్కు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50 వేల జమలపై పన్ను మినహాయింపు ప్రయోజనం ప్రస్తుతం పాత పన్ను విధానం కింద అమల్లో ఉంది. -
ఆప్ ఆశలపై ఐటీ దెబ్బ!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ సారథి అరవింద్ కేజ్రీవాల్ హ్యాట్రిక్ ఆశలకు ఎలాగైనా గండి కొట్టేందుకు కృతనిశ్చయంతో ఉన్న మోదీ సర్కారు ప్రచారం చివరి దశకు చేరిన వేళ తురుపుముక్కను గురి చూసి మరీ వదిలింది. రాజధానిలో మూడొంతుల దాకా ఉన్న వేతన జీవులను ఆకట్టుకునేలా ‘ఐటీ మినహాయింపుల’ అస్త్రాన్ని ప్రయోగించింది! వారికి ఆదాయ పన్ను మినహాయింపు పరిధిని ఎవరూ ఊహించని విధంగా ఏకంగా రూ.12 లక్షలకు పెంచింది. శనివారం నాటి కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మేరకు చేసిన ప్రకటన ఆప్ శిబిరంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇది నిజంగా మోదీ మాస్టర్‌స్ట్రోకేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరో మూడు రోజుల్లో (బుధవారం) జరగనున్న ఢిల్లీ ఎన్నికల పోలింగ్‌లో ఐటీ మినహాయింపు ప్రభావం గట్టిగానే ఉండగలదని వారంటున్నారు. మాస్టర్ స్ట్రోక్! ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య ప్రతిష్టాత్మక పోరుకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వేదికగా మారాయి. పాతికేళ్ల తర్వాత ఎలాగైనా గెలుపు ముఖం చూసేందుకు కాషాయ పార్టీ, వరుసగా మూడో విజయం కోసం ఆప్ ఇప్పటికే ఓటర్లకు లెక్కలేనన్ని వాగ్దానాలు చేశాయి. రాజధాని జనాభాలో 97 శాతం నగర, పట్టణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. వారిలోనూ మధ్య తరగతి వర్గం ఏకంగా 67 శాతానికి పైగా ఉంది. దాంతో వాళ్లను ఆకట్టుకోవడానికి రెండు పారీ్టలూ శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. పదేళ్లపాటు సామాన్యులు, అల్పాదాయ వర్గాలే లక్ష్యంగా సంక్షేమ, అభవృద్ధి పథకాలు అమలు చేస్తూ వచ్చిన ఆప్ ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత, కేజ్రీవాల్‌పై అవినీతి మచ్చ తదితరాలతో సతమతమవుతోంది. ఈ ప్రతికూలతలను అధిగమించేందుకు మిడిల్‌క్లాస్‌పై గట్టిగా దృష్టి సారించింది. తనమేనిఫెస్టోను కూడా మధ్యతరగతి పేరిటే విడుదల చేసింది. ఆ సందర్భంగా మాట్లాడిన కేజ్రీవాల్, ఐటీ మినహాయింపు పరిధిని రూ.10 లక్షలకు పెంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తద్వారా వేతన జీవులను ఆకట్టుకోవచ్చని భావించారు. కానీ ఆ పరిధిని ఏకంగా రూ.12 లక్షలకు పెంచుతూ మోదీ సర్కారు అనూహ్య నిర్ణయం తీసుకుంది. కేజ్రీవాల్ కంటే రెండాకులు ఎక్కువే చదివానని నిరూపించుకుంది. ఢిల్లీ ఓటర్లలో వేతన జీవులు చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు. వారందరినీ ఇది బాగా ప్రభావితం చేసేలా కనిపిస్తోంది. దీనికి తోడు బీజేపీ వ్యతిరేక ఓటు ఈసారి ఆప్‌కు బదులు కాంగ్రెస్‌కు పడొచ్చన్న విశ్లేషణలు కేజ్రీవాల్ పార్టీని మరింతగా ఆందోళనకు గురి చేస్తున్నాయి. బీజేపీతో హోరాహోరీ పోరు జరిగే నియోజకవర్గాల్లో ఇది తీవ్రంగా దెబ్బ తీయవచ్చని ఆప్ భావిస్తోంది. గత ఎన్నికల్లో 15కు పైగా స్థానాల్లో 10 వేల లోపు మెజారిటీ నమోదవడం గమనార్హం. కేజ్రీవాల్‌కూ ఎదురీతే! ఆప్‌తో పాటు దాని సారథి కేజ్రీవాల్ కూడా కష్టకాలంలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఆయన కంచుకోట అయిన న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఈసారి ఎదురీత తప్పేలా లేదు. ఈ స్థానం పరిధిలో ప్రభుత్వోద్యోగులు, గ్రేడ్ ఏ, బీ అధికారులు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. తాజా బడ్జెట్లో ప్రకటించిన ఐటీ వరంతో వీరిలో అత్యధికులు లబ్ధి పొందనున్నారు. అవినీతి ఆరోపణలు, అధికార నివాసం కోసం కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని మంచినీళ్లలా వెచ్చించారంటూ బీజేపీ చేస్తున్న ప్రచారం ఇప్పటికే కేజ్రీవాల్‌కు తల బొప్పి కట్టిస్తున్నాయి. వీటికి తోడు మౌలిక సదుపాయాలు మెరుగు పరుస్తానన్న హామీని నిలబెట్టుకోలేదంటూ ఓటర్లు పెదవి విరుస్తున్నారు. 2013లో తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన ఆయన ఏకంగా నాటి సీఎం అయిన కాంగ్రెస్ సీనియర్ షీలా దీక్షిత్‌నే మట్టికరిపించారు. నాటినుంచీ అక్కడ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఈసారి మాత్రం బీజేపీ నుంచి సాహెబ్‌సింగ్ వర్మ కుమారుడు పర్వేశ్ వర్మ, కాంగ్రెస్ నుంచి షీలా కుమారుడు సందీప్ దీక్షిత్ రూపంలో ఏకంగా ఇద్దరు మాజీ సీఎంల వారసులు ఆయనకు గట్టి సవాలు విసురుతున్నారు. కేజ్రీ ఓట్లకు సందీప్ భారీగా గండి కొడతారని, ఇది అంతిమంగా పర్వేశ్‌కు లాభిస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
Sakshi Poll: కేంద్ర బడ్జెట్‌పై జనం ఏమన్నారంటే..
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్‌పై పలు వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2025లో మధ్యతరగతికి ఉపశమనం, ఆర్థిక వృద్ధిని పెంచే లక్ష్యం అంటూ ఆదాయపు పన్ను శ్లాబ్‌ల్లో మార్పులు చేశారు. కొత్త పన్ను విధానంలో రూ.12 లక్షల ఆదాయం వరకు ఎటువంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేకుండా రిబేట్ ప్రకటించారు.ఇది 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు నెరవేర్చే బడ్జెట్‌గా ప్రధాని మోదీ అభివర్ణించారు. బడ్జెట్లు సాధారణంగా ఖజానాను నింపడంపై దృష్టి సారిస్తాయి. కానీ.. ఈ బడ్జెట్ మాత్రం ప్రజల జేబులు నింపేందుకు అంటూ వ్యాఖ్యానించారు. ఈ బడ్జెట్లో రూ.12 లక్షల వరకూ ఎలాంటి పన్ను లేదు. అన్ని ఆదాయ వర్గాలకు పన్నులను తగ్గించారు. ఇది మధ్య తరగతి ప్రజలకు ఎంతో ప్రయోజనకరం’’ అంటూ ప్రధాని పేర్కొన్నారు.కేంద్రం చెప్పినట్లు ఈ బడ్జెట్ పేద, మధ్యతరగతికి లాభం చేకూర్చేదేనా? అంటూ అన్ని సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో సాక్షి పోల్ క్వశ్చన్‌కు భారీ సంఖ్యలో ప్రజలు స్పందించారు. అవును, కాదు, ఫిఫ్టీ.. ఫిఫ్టీ అనే ప్రశ్నలకు అధిక శాతం మంది కాదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్కువ శాతం మాత్రమే ‘అవును’ అని సమాధానం ఇచ్చారు. మిగిలిన శాతం ఫిప్టీ.. ఫిప్టీ అని తెలిపారు. -
లక్ష్మీదేవిగా నిర్మలమ్మ.. బడ్జెట్‌పై నెట్టింట ఫన్నీ మీమ్స్
సోషల్ మీడియాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురించి, ఆమె చేసే వ్యాఖ్యల గురించి తరచూ సరదా చర్చ నడుస్తుంటుంది. అయితే.. వాటిని తాను కూడా అంతే సరదాగా చూస్తానని ఆమె అంటుంటారు. ఈ క్రమంలో ఇవాళ ఆమె ప్రవేశపెట్టిన బడ్జెట్‌పైనా నెట్టింట మీమ్స్ సందడి చేస్తున్నాయి.దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయి...' అని గురజాడ అప్పారావు రాసిన కవితను ఆమె బడ్జెట్ ప్రసంగంలో చదివి వినిపించడం తెలిసిందే. రెండు దశాబ్దాల తర్వాత ట్యాక్స్ పేయర్స్‌కు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఊరట ఇవ్వడంతో ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతూ పోస్టులు పెడుతున్నారు. NO INCOME TAX UPTO RS 12 LAKH! pic.twitter.com/FunZJjyGvB— Arjun* (@mxtaverse) February 1, 2025 అంతేకాదు.. మధ్యతరగతి పాలిట లక్ష్మీదేవి అంటూ మీమ్స్‌తో సందడి చేస్తున్నారు. అయితే ఇది కేవలం మీమ్స్ దగ్గరే ఆగిపోలేదు. ఏఐ జనరేటెడ్ ఫొటోలు, వీడియోలు.. మార్ఫింగ్ ఫొటోలతో మీమర్స్ చెలరేగిపోతున్నారు.How middle class is seeing @nsitharaman ji today. pic.twitter.com/PsrUDavoWj— Ankit Jain (@indiantweeter) February 1, 2025సబ్ కా వికాస్ లక్ష్యంగా.. అన్ని ప్రాంతాల అభివృద్ధి తమ ప్రభుత్వ ధ్యేయమని బడ్జెట్ ప్రసంగంలో సీతారామన్ అన్నారు. కానీ, బడ్జెట్ లెక్కలు పొంతన లేకుండా పోయాయి. ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న జేడీయూ పాలిత రాష్ట్రం బీహార్‌కు భారీగా వరాలు కురిపించింది కేంద్రం. దీంతో సహజంగానే మిగతా ప్రాంతాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రత్యేకించి.. ఆమె తన ప్రసంగంలో పదే పదే బీహార్ పేరును ప్రస్తావించడమూ ‘ఆచార్య పాదఘట్టం’ తరహాలో నెట్టింట ట్రోలింగ్‌కు దారి తీసింది.Bihar supremacy Budget mein 💪#NirmalaSitharaman#Budget2025 pic.twitter.com/JlC39kuWWS— Raja Babu (@GaurangBhardwa1) February 1, 2025 Most repeated words. #Budget2025 pic.twitter.com/4pjtahNdks— Sagar (@sagarcasm) February 1, 2025ఇదిలా ఉంటే.. ఇవాళ్టి బడ్జెట్‌తో ఎనిమిదిసార్లు వరుసగా కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఘనత నిర్మలా సీతారామన్ దక్కించుకున్నారు. గంటా 17 నిమిషాలపాటు ఆమె ప్రసంగం కొనసాగింది. -
కేంద్ర బడ్జెట్లో వైఎస్ జగన్ మార్క్?!
ఏపీలో గత ఐదేళ్లపాటు ప్రజా సంక్షేమమే పరమావధిగా పాలన కొనసాగింది. ఎక్కడా అవినీతి, లంచం ప్రస్తావన లేకుండా.. పారదర్శకమైన వ్యవస్థలతో నేరుగా అర్హులకే మేలు కలిగింది. ఆ టైంలో జగన్ పాలనపై దేశవ్యాప్త చర్చ నడవడగా.. ఇవాళ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లోనూ ఆయన మార్క్ కనిపించడం విశేషం.ఈసారి బడ్జెట్లో వచ్చే ఐదేళ్లకుగానూ ‘‘పేద, యువత, అన్నదాత, మహిళల.. అభివృద్ధి, సంక్షేమం’’ మీద దృష్టిసారించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందుకోసం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినట్లు.. ప్రధాని నరేంద్ర మోదీ సైతం ప్రకటించుకున్నారు. అయితే ఈ అభివృద్ధి ఎలా ఉంటుందో సీఎంగా జగన్ తన పాలనలో చేసి చూపించారు. 👉వ్యవ‘సాయాని’కే తొలి ప్రాధాన్యమంటూ నిర్మలమ్మ ప్రసంగం పేర్కొంది. ఈక్రమంలో.. ప్రధాన మంత్రి ధాన్య కృషి యోజన కింద పంట ఉత్పత్తులను పెంచడంతోపాటు రైతులకు పలు రకాల సాయాలు అందిస్తామని కేంద్రం ప్రకటించింది. అలాగే వెనుకబడిన జిల్లాల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం అందించే క్రమంలో.. గోదాములను ఏర్పాటు చేయిస్తామని ప్రకటించింది. ఇక.. జగన్ పాలనలో.. రైతు భరోసాతో పంట సాయం అందించడం, ఆర్బీకే సెంటర్లు.. ఆర్బీకే పరిధిలోని రైతన్నలకు వ్యవసాయ పనిముట్ల అందజేత, ఒకవేళ పంట నష్టం జరిగినా సత్వర పరిహారం లాంటి చర్యలు తీసుకున్నారు. దేశంలో వ్యవసాయంలో ముందంజలో ఉన్న రాష్ట్రాలు కూడా ఈ తరహా సంక్షేమాన్ని అందించలేకపోవడం గమనార్హం. 👉వైద్య విద్యను విస్తరించే క్రమంలో 10,000 అదనపు సీట్లు కేటాయిస్తున్నట్లు బడ్జెట్లో కేంద్రం ప్రకటించింది. అయితే.. దశాబ్దాల తర్వాత ఏపీలో ఏకంగా 17 కొత్త మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి వైద్య విద్యను ప్రొత్సహించారు వైఎస్ జగన్. అలాగే.. ప్రజారోగ్య భద్రత కోసం ఆరోగ్యశ్రీ పరిధిని విసర్తించడం, ఇంటికే వైద్యంలో భాగంగా విలేజ్.. ఫ్యామిలీ క్లినిక్‌ల ఏర్పాటు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 👉దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ తీసుకొస్తామని బడ్జెట్లో కేంద్రం ప్రకటించింది. 50వేల ప్రభుత్వ పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయడంతో పాటు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ శిక్షణ కోసం ఏర్పాట్లు చేయాలనుకుంటోంది. కానీ, జగన్ హయాంలో.. నాడు-నేడుతో స్కూళ్లు కళకళలాడాయి. డిజిటల్ క్లాస్ రూంలతో కార్పొరేట్ బడులకు ఏమాత్రం తీసిపోకుండా తీర్చిదిద్దారాయన. అలాగే.. ఇంకోవైపు విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలతో విద్యార్థులను చదువును దూరం కాకుండా చూసుకోగలిగారు. 👉మహిళా సాధికారత కోసం కేంద్రం తరఫున రకరకాల పథకాలను ప్రవేశపెడతామని బడ్జెట్లో కేంద్రం ప్రకటించింది. అయితే పేద వర్గాలకు వైఎస్సార్ చేయూత, ఆసరా, ఇంకా వివిధ పథకాలతో జగన్ ప్రభుత్వం సాయం అందించింది తెలిసిందే. గ్రామ స్వరాజ్యం, ప్రజారోగ్యం, విద్యా రంగం, మహిళా సాధికారికత.. ఇలా దాదాపు కేంద్ర బడ్జెట్‌కు సంబంధించిన కీలక అంశాల్లో జగన్ మార్క్ స్పష్టంగా కనిపించిందనే అభిప్రాయం ఇప్పుడు వ్యక్తమవుతోంది. -
‘నిర్మలమ్మ బడ్జెట్ ఓ పెద్ద జోక్’
ఢిల్లీ: ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బీజేపీ తమ ప్రయోజనాల కోసమే బీహార్‌కు వరాలు ఇచ్చిందన్నారు. బీహార్ కోసమే బడ్జెట్ ఉందని ఎద్దేవా చేశారు. హర్యానా రైతులకు కనీస మద్దతు ధర కూడా ప్రకటించలేదన్నారు. ఉద్యోగం, ఆదాయం గురించి కాదు.. నిరుద్యోగం గురించి ఆర్థిక మంత్రి ప్రస్తావనే లేదన్నారు.కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్ నేతలు స్పందించారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మాట్లాడుతూ.. ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే మనకు జీతం లేకపోతే ఏం జరుగుతుంది? ఆదాయం ఎక్కడి నుండి వస్తుంది? మీరు ఆదాయపు పన్ను ఉపశమనం నుండి ప్రయోజనం పొందాలంటే, మీకు నిజంగా ఉద్యోగాలు అవసరం. నిరుద్యోగం గురించి ఆర్థిక మంత్రి ప్రస్తావించలేదు. మీకు జీతం ఉంటే మీరు తక్కువ పన్ను చెల్లిస్తున్నట్లు అనిపించవచ్చు. అలాగే, ఒక దేశం, ఒక ఎన్నిక కోరుకునే పార్టీ వాస్తవానికి ప్రతి సంవత్సరం ప్రతి రాష్ట్రంలోని ప్రతి ఎన్నికలను ఉపయోగించి మరిన్ని ఉచితాలను అందిస్తుందని చెప్పడం హాస్యాస్పదం.#WATCH | On #UnionBudget2025, Congress MP Shashi Tharoor says, "I think frankly the applause you heard from the BGP benches was for the middle-class tax cut. We look at the details and that may be a good thing. So if you have a salary you may be paying less tax. But the important… pic.twitter.com/vbOJHyMMMy— ANI (@ANI) February 1, 2025కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ స్పందిస్తూ..‘వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, పెట్టుబడులు, ఎగుమతులు.. అనే నాలుగు ఇంజిన్ల గురించి ఆర్థికశాఖ మంత్రి మాట్లాడారు. అభివృద్ధికి ఇది శక్తి యంత్రాలుగా పని చేస్తాయన్నారు. కానీ, చాలా ఇంజిన్లు ఉన్న ఈ బడ్జెట్ పూర్తిగా పట్టాలు తప్పింది. త్వరలో బీహార్‌లో ఎన్నికలు జరగనున్నాయి. తమ ప్రయోజనాల కోసమే కేంద్రం ఆ రాష్ట్రంలో బొనాంజా ప్రకటించింది’ అని ఎద్దేవా చేశారు.The FM spoke of 4 engines: Agriculture, MSMEs, Investment, and Exports. So many engines that the Budget has been completely derailed.— Jairam Ramesh (@Jairam_Ramesh) February 1, 2025కాంగ్రెస్ ఎంపీ కుమారి సెల్జా మాట్లాడుతూ..‘రైతులకు కనీస మద్దతు ధర లభించలేదు. అణు విద్యుత్ గురించి మాట్లాడారు కానీ హర్యానాలో ఉన్న గోరఖ్‌పూర్‌లోని అణు విద్యుత్ కేంద్రం చాలా కాలంగా ఉంది. దీని గురించి మాట్లడలేదు. అక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. MGNREGA వంటి అనేక సమస్యలు ఉన్నాయి. కానీ, ఈ విషయంలో ఏమీ ప్రకటించలేదు. ప్రకటించినదంతా ప్రధానంగా బీహార్ గురించే ఉందన్నారు. #WATCH | #UnionBudget2025 | Congress MP Kumari Selja says, "Farmers didn't get MSP. They talked about nuclear but our nuclear power plant in Haryana's Gorakhpur (Gorakhpur Haryana Anu Vidyut Pariyojana) has been there for a long and both are happening there. Many such issues are… pic.twitter.com/fanSTExEzs— ANI (@ANI) February 1, 2025 -
తక్కువ ధరకే ఎలక్ట్రిక్ వెహికల్స్!
యూనియన్ బడ్జెట్ 2025-26 లిథియం బ్యాటరీలు.. సంబంధిత రంగాల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి గణనీయమైన పన్ను మినహాయింపులను ప్రకటించింది. స్థానిక తయారీని మెరుగుపరచడం మాత్రమే కాకుండా.. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం పన్నులు తగ్గించింది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్ ధరలు తగ్గుముఖం పడతాయి.కోబాల్ట్, లిథియం అయాన్ బ్యాటరీ స్క్రాప్, సీసం, జింక్, 12 ఇతర కీలకమైన ఖనిజాల వంటి అవసరమైన పదార్థాలపై కూడా కేంద్రం ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని (BCD) తొలగించింది. బ్యాటరీలు, సెమీకండక్టర్లు, పునరుత్పాదక శక్తి పరికరాల తయారీకి ఈ పదార్థాలు చాలా ముఖ్యమైనవి. కాబట్టి ఎలక్ట్రిక్ వాహనాలకు, క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ తయారీలో ఈ పదార్థాలపై ఆధారపడే పరిశ్రమలకు ఖర్చులను తగ్గిస్తుంది.ఈవీ బ్యాటరీ ఉత్పత్తిలో ఉపయోగించే 35 అదనపు వస్తువులు, మొబైల్ ఫోన్ బ్యాటరీ తయారీకి 28 వస్తువులపై ట్యాక్స్ తగ్గించడం వల్ల.. కంపెనీలు అదనపు పన్నులు లేకుండా బ్యాటరీ ఉత్పత్తికి అవసరమైన యంత్రాలను, సాధనాలను దిగుమతి చేసుకోవచ్చు. టాటా, ఓలా ఎలక్ట్రిక్, రిలయన్స్ వంటి కంపెనీలను భారతదేశంలో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రోత్సహించడం లక్ష్యంగా దీనిని ప్రవేశపెట్టడం జరిగింది.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025 హైలైట్స్కేంద్రప్రభుత్వ చర్య వల్ల.. ఈవీ బ్యాటరీలు కొంత తక్కువ ధరకే లభిస్తాయి. ఇది ఉత్పత్తి ఖర్చులను తగ్గించి.. దేశీయ తయారీని పెంచుతుంది. ఇది చైనా, ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. ఇవన్నీ క్లీన్ ఎనర్జీ వృద్ధికి.. భారతదేశ పునరుత్పాదక ఇంధన లక్ష్యాలకు సహాయపడుతుంది. -
బడ్జెట్లో ఏపీకి నిల్!
విజయవాడ, సాక్షి: ఎన్డీయే కూటమి సర్కార్‌లో టీడీపీ, జేడీయూలు కీలక భాగస్వాములుగా ఉన్నాయి. బిహార్‌కు ప్రత్యేక హోదా సాధ్యం కాదని తేల్చిచెప్పిన కేంద్రం.. వీలుచిక్కినప్పుడల్లా ఆర్థికంగా ప్యాకేజీలు ఇస్తూ వస్తోంది. అదే ఏపీ విషయంలో అటు ప్రత్యేక హోదా, ఇటు ప్యాకేజీ రెండూ ఇవ్వడం లేదు. కానీ, బాబు సర్కార్‌కు అప్పులిప్పించడంలో సాయం చేస్తోంది. ప్చ్.. ఇప్పుడు బడ్జెట్లోనూ ఇదే వివక్ష ప్రదర్శించింది. నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్(Union Budget 2025) ప్రసంగంలో ఎక్కడా ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన కానరాలేదు. పోనీ.. రాష్ట్రాల వారీగా విడుదల చేసిన జాబితాలోనూ ఏపీ పేరు ఉందా? అంటే అదీ లేదు. కొత్త ప్రాజెక్టులేవీ ప్రకటించలేదు. సరికదా.. అమరావతి, మెట్రో రైల్.. లాంటి కీలకాంశాల గురించి ప్రస్తావించలేదు. టీడీపీ(TDP)కి ప్రస్తుతం 21 మంది ఎంపీలు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం.. చంద్రబాబు మీదే ఆధారపడి నడుస్తోందంటూ టీడీపీ గప్పాలు కొట్టుకుంటోంది. అలాంటిది ప్రత్యేక కేటాయింపులను సాధించడంలో ఇటు చంద్రబాబు, అటు బీజేపీకి దగ్గరైన పవన్ కల్యాణ్‌లు ఘోరంగా విఫలమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బిహార్ విషయంలో.. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల తర్వాత జులైలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా రహదారుల అభివృద్ధి, గంగానది రెండు లైన్ల వంతెన నిర్మాణం, విద్యుదుత్పత్తి కేంద్రం వంటి పలు ఆర్థిక వరాలు ఇచ్చింది. ఏపీకి మాత్రం అరకోర నిధులను పడేస్తోంది. -
బడ్జెట్ 2025: గిగ్ వర్కర్లకు ఇక మంచిరోజులు
న్యూఢిల్లీ, సాక్షి: అసంఘటిత రంగాల ఉద్యోగులకు(గిగ్ వర్కర్లకు) కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. బడ్జెట్(Union Budget 2025) ద్వారా వాళ్లకు గుర్తింపుతో పాటు ఆరోగ్య బీమా సదుపాయం కల్పించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో కోటి మంది గిగ్ వర్కర్స్కు లాభం చేకూరనుంది. ఈ-శ్రమ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశంతో పాటు ఆరోగ్య బీమా సదుపాయం కల్పించాలని నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) తన బడ్జెట్ ప్రసంగంలో వినిపించారు. ఈ నిర్ణయంతో గిగ్ వర్కర్లకు ఐడెంటిటీ కార్డులు ఇవ్వనున్నారు. అలాగే.. ప్రధాన మంత్రి ఆరోగ్య యోజన(PM-JAY) కింద ఉద్యోగి కుటుంబానికి ఏడాది ఐదు లక్షల దాకా ఆరోగ్య బీమా సదుపాయం కల్పిస్తారు. అలాగే గిగ్ వర్కర్ల సామాజిక భద్రత త్వరలో కోసం ప్రత్యేక పథకం తీసుకురానున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వీటితో పాటు ఆయుష్మాన్ భారత్, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలనూ వర్తింపజేసే ప్రతిపాదనలు ఉన్నట్లు తెలిపారామె. గిగ్ వర్కర్లు అంటే..తాత్కాలికంగా.. తమకు ఉన్న వీలును బట్టి ఉద్యోగాలను చేసేవాళ్లను గిగ్ వర్కర్లు అంటారు. ప్రత్యేకించి.. యాప్‌ల ద్వారా సేవలందించే ఉద్యోగాల్లో ఎక్కువ మంది ఉన్నారు. డెలివరీ యాప్‌లు, రైడ్ యాప్‌లతో పని చేసే ఉద్యోగులతో పాటు ఫ్రీలాన్సర్లు, ఆన్లైన్ ట్యూటర్లు ఈ విభాగంలోకి వస్తారు. అయితే.. సంప్రదాయ ఉద్యోగులకు ఉన్నట్లు వీళ్లకు ఉద్యోగ భద్రత లేదు. అది కల్పించాలని ఉద్యమాలు నడుస్తున్నా.. ఈ తరహా ఉద్యోగాల్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వాలు ఇంతకాలం తీవ్రంగా భావించాలేదు. ఈ నేపథ్యంలో తాజా నిర్ణయాలు.. రాబోయే రోజుల్లో వాళ్లకు మంచి రోజులు వస్తాయనే సంకేతాలు అందించాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా.. పది కోట్లకు పైగా గిగ్ వర్కర్లు ఉన్నట్లు అంచనా. 2030 నాటికి ఆ సంఖ్య 23 కోట్లకు చేరుతుందని నీతి ఆయోగ్ అంచనా వేస్తోంది. కిందటి బడ్జెట్లో గిగ్ వర్కర్ల కోసం కొన్ని ప్రతిపాదనలు చేసినప్పటికీ అవి ఆచరణలోకి రాలేదు. అయితే ఈసారి బడ్జెట్లో కచ్చితమైన నిర్ణయాలు ప్రకటించడం గమనార్హం. -
నిర్మలమ్మ పద్దుపై భారీ ఆశలు
-
పార్లమెంట్లో బడ్జెట్ ప్రసంగం.. విపక్ష సభ్యుల ఆందోళన
సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఏడాదికి సంబంధించి బడ్జెట్ ప్రసంగం చేస్తున్నారు. ఈ క్రమంలో విపక్ష సభ్యులు ఆందోళన చేస్తున్నారు. దీంతో, విపక్ష నేతల నిరసనల మధ్య నిర్మల.. ప్రసంగిస్తున్నారు. అనంతరం, విపక్ష పార్టీల నేతలు సభ నుంచి వాకౌట్ చేశారు. పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ ప్రసంగాన్ని విపక్ష నేతలు ఆందోళనలు చేస్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీ చీప్ అఖిలేష్ యాదవ్, పార్టీ సభ్యులు నిరసనలు తెలుపుతూ నినాదాలు చేశారు. దీంతో, స్పీకర్ వారిని నినాదాలు ఆపాలని సూచించారు. అయినప్పటికీ వారు ఆందోళనలను ఆపలేదు. అనంతరం, సభ నుంచి సభ్యులు వాకౌట్ చేసినట్టు తెలుస్తోంది. #WATCH | #UnionBudget2025 | MPs from the opposition parties walk out of Lok Sabha as Finance Minister Nirmala Sitharaman reads her budgetary speechShe began her budgetary speech amid protests by Samajwadi Party MPs including party chief Akhilesh Yadav(Source - Sansad TV) pic.twitter.com/O0qcgw3BS4— ANI (@ANI) February 1, 2025 #WATCH | Union Finance Minister Nirmala Sitharaman begins her budget speech amid protest by Samajwadi Party MPs including party chief Akhilesh Yadav(Source - Sansad TV) pic.twitter.com/8YrrXSRgzR— ANI (@ANI) February 1, 2025 -
బడ్జెట్ లో వ్యవసాయానికి ప్రాధాన్యత ఉంటుందా ?
-
బడ్జెట్ పై కోటి ఆశలు
-
ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలాసీతారామన్
-
ఈ పొద్దు.. ఆశల పద్దు!
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్‌పై మహా నగరం ఆశలు పెట్టుకుంది. మౌలిక వసతులు, ఇతర రంగాలకు ప్రాధాన్యం ఉంటుందని, నిధుల కేటాయింపులు ఉంటాయని నగర వాసులు ఎదురుచూస్తున్నారు. ఎంఎంటీఎస్ కొత్త రైళ్లతో పాటు చర్లపల్లి టెర్మినల్ నుంచి పూర్తి స్థాయిలో నగరంలోని అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ, పుణ్య క్షేత్రాలకు మరిన్ని రైళ్లను అందుబాటులోకి తెస్తారని ఆశిస్తున్నారు. మూసీ పునరుజ్జీవానికి కేంద్రం నిధులు కేటాయించాలని కోరిన రాష్ట్ర ప్రభుత్వ విన్నపానికి అనుకూలంగా స్పందిస్తుందని భావిస్తున్నారు. విశ్వ నగరిగా విస్తరిస్తున్న భాగ్యనగరంలో ఐటీ రంగానికి మరింత బూస్ట్ ఇచ్చేలా కేంద్రం కరుణిస్తుందని, బల్దియా పరిధిలో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పెద్దపీట వేస్తారని అంతా ఆశాభావంతో ఉన్నారు. –సాక్షి, సిటీబ్యూరోబల్దియాను ఆదుకునేనా?కేంద్ర బడ్జెట్లో జీహెచ్ఎంసీకి ఏ మేరకు కేటాయింపులుంటాయోనన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. నగరంలో వివిధ కార్యక్రమాలు చేపడుతున్న జీహెచ్ఎంసీ పలు కార్యక్రమాలకు కేంద్రంపై ఆశలు పెంచుకుంది. గృహ నిర్మాణానికి పీఎంఏవై నిధులతోపాటు ఫ్లై ఓవర్లు, రహదారుల అభివృద్ధి, వరద సమస్యల పరిష్కారం, విపత్తుల నిర్వహణ, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం తదితరాల కోసం రూ. 10 వేల కోట్లకు పైగా కేంద్రాన్ని కోరింది. వరద ముంపు సమస్యల పరిష్కారంతో పాటు చెత్త సమస్య పరిష్కారానికి నిధులు అడిగింది. హైదరాబాద్ వారసత్వాన్ని పరిరక్షించేందుకు పురాతన కట్టడాల పరిరక్షణ తదితరమైన వాటి కోసం కోరింది. రోజురోజూకూ పరిధి పెరుగుతూ, విస్తృతమవుతున్న జనాభాకనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు నిధులవసరముంది. బల్దియా కోరికల్లో ఎన్నింటికి నిధులిస్తారోనని జీహెచ్ఎంసీ వర్గాలు వేచి చూస్తున్నాయి.కొత్త రైళ్లకు పచ్చజెండా ఊపేనా? రెండో దశలో భాగంగా అటు మేడ్చల్ నుంచి ఇటు ఉందానగర్ వరకు. ఘట్కేసర్ నుంచి తెల్లాపూర్ వరకు ఎంఎంటీఎస్ లైన్లు పూర్తయ్యాయి. నాంపల్లి, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి ప్రయాణికులు ఎక్కడికైనా అతి తక్కువ చార్జీలతో రాకపోకలు సాగించే సదుపాయం ఉంది. ప్రయాణికుల డిమాండ్ మేరకు రైళ్లు లేకుండాపోయాయి. కొత్త లైన్లతో పాటు 9 బోగీలతో కూడిన కొత్త ఎంఎంటీఎస్ రైళ్లను కూడా కొనుగోలు చేయాలనే ప్రతిపాదన ఉంది. కానీ ఇప్పటి వరకు ఒక్క రైలు కూడా కొనుగోలు చేయలేదు. దీంతో ఉన్న రైళ్లనే వివిధ ప్రాంతాల మధ్య నడుపుతున్నారు.చర్లపల్లికి ఏదీ కనెక్టివిటీ..మార్చి నుంచి పలు రెగ్యులర్ రైళ్లు చర్లపల్లి నుంచి రాకపోకలు సాగించనున్నాయి. చర్లపల్లి టెరి్మనల్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా పునరభివృద్ధి చేసి ప్రారంభించినప్పటికీ పూర్తిస్థాయి కనెక్టివిటీ లేదు. ప్రయాణికులు వివిధ ప్రాంతాల నుంచి చర్లపల్లికి చేరుకొనేలా ఎంఎంటీఎస్ సేవలను పెంచాలి. కాచిగూడ, నాంపల్లి, సికింద్రాబాద్ స్టేషన్లతో పాటు నగరంలోని ఏ ఎంఎంటీఎస్ స్టేషన్ నుంచైనా బయలుదేరి చర్లపల్లికి వెళ్లేలా సరీ్వసులను విస్తరించాల్సి ఉంది.యాదాద్రి ఎంఎంటీఎస్ నత్తడనక..గత ఏడాది బడ్జెట్లో యాదాద్రికి ఎంఎంటీఎస్ పొడిగింపునకు రూ.10 కోట్లు కేటాయించారు. కానీ రైల్వేశాఖ, రాష్ట్రప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు, వనరులు, భూమి, తదితర మౌలిక సదుపాయాల కొరత వెంటాడుతోంది. ఘట్కేసర్ నుంచి రాయగిరి వరకు 33 కిలోమీటర్లు పొడిగించేందుకు 2015లో ప్రణాళికలను సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టు కోసం రూ. 430 కోట్లతో అంచనాలు రూపొందించారు.కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ లభించలేదు. రైల్వేశాఖ ఇప్పటి వరకు రెండు దఫాలుగా రూ.60 కోట్లు మాత్రం కేటాయించింది. కానీ పనులు ప్రారంభించలేదు.పుణ్యక్షేత్రాలకు వెళ్లేదెలా? హైదరాబాద్ నుంచి అయోధ్య, షిరిడీ, శబరిమల తదితర పుణ్యక్షేత్రాలకు లక్షలాది మంది భక్తులు రాకపోకలు సాగించే అనేక ప్రాంతాలకు డిమాండ్‌కు సరిపడా రైళ్లు లేకపోవడంతో ఐఆర్సీటీసీ ప్యాకేజీలపై ఆధారపడాల్సి వస్తోంది. మరోవైపు ప్రత్యేక రైళ్లు ప్రకటిస్తే తప్ప రైలెక్కడం సాధ్యం కాదు. షిరిడీకి ప్రస్తుతం అజంతా ఎక్స్‌ప్రెస్ ఒక్కటే ఉంది. శబరిమలకు కూడా ఒక్క రైలే అందుబాటులో ఉంది. అయోధ్యకు వెళ్లేందుకు దానాపూర్ ఎక్స్‌ప్రెస్ మాత్రమే ఉంది. పదేళ్లుగా రైళ్ల పెంపు లేకుండాపోయింది.ఆశల మూసీ భాగ్యనగరానికి మణిహారమైన మూసీ నదికి పునరుజ్జీవం కల్పించాలన్న రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మూసీ శుద్ధి, వ్యర్థాలు, వరదల నియంత్రణ వ్యవస్థ, సుందరీకరణ, బృహత్ ప్రణాళిక రూపకల్పనలపై మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఆర్డీసీఎల్) దృష్టి సారించింది. మూసీ పునరుజ్జీవానికి రూ.14,100 కోట్ల బడ్జెట్‌ను అవసరం అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ మేరకు శనివారం కేంద్ర బడ్జెట్లో సహాయం అందుతుందని ఎంఆర్డీసీఎల్ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మూసీ నదికి పునరుజ్జీవం కల్పించడంతో పాటు పట్టణ నీటి నాణ్యతను మెరుగుపర్చడం, సుస్థిర ప్రగతిని సాధించేందుకు దశల వారీగా నిధులు కేటాయించాలని కోరారు.మూసీ పునరుజ్జీవంలో భాగంగా తొలిదశలో బాపూఘాట్, మీరాలం ట్యాంక్ వద్ద అభివృద్ధి పనులను చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. బాపూఘాట్ వద్ద రక్షణ శాఖకు చెందిన 220 ఎకరాల భూ సమీకరణతో పాటు రిజర్వాయర్, మురుగు నీటి అప్గ్రేడ్లు, మూసీ నదిపై హెరిటేజ్ వంతెనల నిర్మాణం తదితరాల వ్యయాలను బడ్జెట్లో కేటాయింపులు చేయాలని కోరారు.మూసీని ఆదాయ వనరుగా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోంది. పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్íÙప్ (పీపీపీ) ద్వారా పర్యాటకం, ఆతిథ్యం, స్థిరాస్తి రంగాల నుంచి కార్పొరేట్ సోషల్ రెస్సాన్సిబులిటీ (సీఎస్ఆర్) కింద నిధులను సమీకరించనున్నారు. మూసీ చుట్టూ ఉమ్మడి అభివృద్ధి ప్రాజెక్ట్‌లు, రియల్ ఎస్టేట్ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు స్పానర్íÙప్లు, పేర్ల హక్కులు, పర్యాటక కార్యకలాపాలతో ఆదాయ వనరులను సృష్టించనున్నారు.ఐటీ బూస్ట్..‘సాఫ్ట్వేర్ ట్రయినింగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా’గా పిలిచే హైదరాబాద్ ఐటీ రంగం బడ్జెట్‌పై కోటి ఆశలు పెట్టుకుంది. దేశీయ సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో రాష్ట్రం వాటా 31 శాతంఆ ఉంటుంది. ప్రధానంగా ఐటీ రంగం కేంద్రీకృతమైన హైదరాబాద్‌లో సుమారు 1,500లకు పైగా కంపెనీలలో 9 లక్షలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారం చేపట్టాక గ్రేటర్లో నాల్గో నగరంగా ఫ్యూచర్ సిటీని నిర్మించాలని సంకల్పించారు. ఇందులో ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సిటీతో పాటు ఐటీ రంగానికి అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. తాజాగా కేంద్రం ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో ఏఐ సిటీతో పాటు ఐటీ పార్క్‌లకు ప్రత్యేక కేటాయింపులు, పన్ను మినహాయింపులతో పాటు ఐటీ మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రత్యేక కేటాయింపులు చేయాలని పరిశ్రమ నిపుణులు కోరుతున్నారు.హైదరాబాద్‌లో ఐటీ, ఐటీఈఎస్ ఎగుమతులు 2023–24 ఆర్థిక సంవత్సరంలో 11.3 శాతం వృద్ధిని నమోదు చేసింది. మార్చి 31తో ముగియనున్న సంవత్సరానికి తెలంగాణ ఐటీ ఎగుమతులు రూ.2.7 లక్షల కోట్లకు చేరుతాయని అంచనా వేశారు. మధ్య తరగతి జీతభత్యాలకు పన్ను మినహాయింపులతో కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్టార్టప్స్ కోసం పన్నులను హేతుబద్దీకరించాలని, నైపుణాభివృద్ధికి బడ్జెట్లో అధిక ప్రాధాన్యమివ్వాలని కోరారు. ఎంఎస్ఎంఈ రంగానికి దన్నుగా నిలిచేలా బడ్జెట్లో కేటాయింపులు చేయాలిజలమండలిపై దయ చూపేనా..లక్డీకాపూల్: కేంద్ర బడ్జెట్‌పై జలమండలి ఆశలు పెట్టుకుంది. నలువైపులా విస్తరిస్తున్న çమహా హైదరాబాద్ పరిధిలో మురుగు నీటి నెట్వర్క్ సమగ్ర సీవరేజీ మాస్టర్ ప్లాన్ ప్రాజెక్టు కోసం సుమారు రూ.17,212.69 కోట్లు, మూసీ ప్రక్షాళనలో భాగంగా నదిలో మురుగు నీరు చేరకుండా ఇరువైపులా 55 కి.మీ (మొత్తం 110 కి.మీ) కాల్వల ట్రంక్ సీవర్స్ మెయిన్స్, లార్జ్ సైజ్ బాక్స్ డ్రెయిన్స్, కొత్త సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణాల ప్రాజెక్టు నిర్మాణాల కోసం మరో రూ.10 వేల కోట్లు కేటాయించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించింది. ఈ రెండు పథకాలను అమృత్ పథకం– 2.0 కి చేర్చాలని లేదా ప్రత్యేక ప్రాజెక్టుగా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసింది.రైల్వే బ్రిడ్జిల అభివృద్ధికి రూ.500 కోట్లు కావాలికేంద్ర ప్రభుత్వానికి ఎంపీ ఈటల ప్రతిపాదనలుదేశంలో అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజిగిరిలో రైల్వే అండర్ బ్రిడ్జిలు, ఓవర్ బ్రిడ్జిలను అభివృద్ధి చేయటంతో పాటు రైల్వే క్రాసింగ్, రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ తదితర పనులకు కేంద్ర బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించాలని కోరుతూ స్థానిక ఎంపీ ఈటల రాజేందర్ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశారు. శనివారం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈటల తన నియోజకవర్గ పరిధిలో రైల్వే అభివృద్ధి, ఆధునికీకరణ పనుల కోసం బడ్జెట్లో నిధుల కేటాయింపుపై ప్రతిపాదనలతో కూడిన నివేదికను అందజేశారు.మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని బోల్లారం నుంచి సికింద్రాబాద్ వరకు ఉన్న 12 అండర్, ఓవర్ సింగిల్ బ్రిడ్జిలను పెరుగుతున్న కాలనీలు,బస్తీలకు అనుగుణంగా.. మారుతున్న పట్టణీకరణకు తగ్గట్టుగా ట్రాఫిక్ సమస్య నుంచి ప్రజలను గట్టేక్కించేందుకు డబుల్ బ్రిడ్జిలుగా అభివృద్ధి చేయాలని కేంద్రానికి సమర్పించిన ప్రతిపాదనల్లో పేర్కొన్నారు.యాభై ఏళ్ల క్రితం నాటి రైల్వే క్రాసింగ్‌లు, రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాని ఎంపీ ఈటల కోరారు. ఈ నేపథ్యంలోనే రైల్వే అభివృద్ధి పనులకు సుమారు రూ.500 కోట్ల ని«ధులు అవసరమవుతాయని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరానికి సమాంతరంగా శివారు మేడ్చల్ జిల్లాను అభివృద్ధి చేసేందుకు అమృత్ పథకంలో అత్యధిక నిధులు కేటాయిచాలని కోరారు. -
ఊరట దక్కేనా.. నిర్మలమ్మ వరాలు ఇచ్చేనా !
-
బడ్జెట్ 2025: ముఖ్యాంశాలు
కొత్త ట్యాక్స్ విధానం పాటించే వారికి మాత్రమే మినహాయింపులు -
ఆర్థిక సర్వే
అన్ని చేతులూ కలిస్తేనే తయారీ దిగ్గజంభారత్ను అంతర్జాతీయ తయారీ కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం, ప్రైవేటు రంగం, విద్యా సంస్థలు, పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) సంస్థలు, ఆర్థిక సంస్థల మధ్య సమన్వయంతో కూడిన సహకారాత్మక చర్యలు అవసరమని ఆర్థిక సర్వే సూచించింది. నియంత్రణలు సడలించడం, అవసరమైన నైపుణ్యాలు, ఉపాధి కల్పన వ్యూహాలు అమలు చేయడం, ఎంఎస్ఎంఈలకు ప్రత్యేకమైన మద్దతు చర్యలతో భారత పరిశ్రమల పోటీతత్వాన్ని పెంచొచ్చని అభిప్రాయపడింది. అప్పుడు అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితులు, సవాళ్లను భారత సంస్థలు ఎదుర్కొని రాణించగలవని వివరించింది. బంగారం తగ్గొచ్చు.. వెండి పెరగొచ్చు బంగారం ధరలు ఈ ఏడాది తగ్గొచ్చని, వెండి ధరలు పెరగొచ్చని ఆర్థిక సర్వే అంచనాలు వెల్లడించింది. ప్రపంచ బ్యాంక్ కమోడిటీ మార్కెట్ అవుట్‌లుక్ 2024 నివేదికను ప్రస్తావిస్తూ. కమోడిటీ ధరలు 2025లో 5.1 శాతం, 2026లో 1.7 శాతం తగ్గుతాయన్న అంచనాలను ప్రస్తావించింది. మెటల్స్, వ్యవసాయ ముడి సరకుల ధరలు స్థిరంగా ఉంటాయని, చమురు ధరలు తగ్గొచ్చని, సహజ వాయువు ధరలు పెరగొచ్చని పేర్కొంది. బంగారం ధరలు తగ్గడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై ప్రభావం చూపించొచ్చని తెలిపింది. దేశం దిగుమతి చేసుకునే కమోడిటీల ధరలు తగ్గడం అది సానుకూలమని, ద్రవ్యోల్బణం ఒత్తిళ్లను తగ్గిస్తుందని అభిప్రాయపడింది. చైనాపై ఆధారపడడాన్ని తగ్గించాలి.. ఈవీల తయారీలో స్వావలంబన ఎలక్ట్రిక్ వాహనాలు, ఎల్రక్టానిక్స్ తయారీలో స్వావలంబన దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఆర్థిక సర్వే నొక్కి చెప్పింది. ముడి సరుకులు, విడిభాగాల కోసం చైనా తదితర కొన్ని దేశాలపై ఎక్కువగా ఆధారపడడాన్ని తగ్గించాలని, సరఫరా వ్యవస్థలోని రిస్‌్కలను తొలగించే చర్యలు చేపట్టాలని సూచించింది. కీలక విడిభాగాలు, ముడి సరుకులపై అంతర్జాతీయంగా చైనా ఆధిపత్యాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది. సంప్రదాయ వాహనంతో పోల్చి చూసినప్పుడు ఈవీల తయారీలో ఆరు రెట్లు అధికంగా ఖనిజాలను వినియోగించాల్సిన పరిస్థితిని ప్రస్తావించింది. ఈ ఖనిజాల్లో చాలా వరకు మన దగ్గర లభించకపోవడాన్ని గుర్తు చేసింది. ‘‘సోడియం అయాన్, సాలిడ్ స్టేట్ బ్యాటరీలు తదితర అత్యాధునిక బ్యాటరీ సాంకేతిక పరిజ్ఞానాలకు పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) నిధులు పెంచడం ద్వారా స్వావలంబన ఎకోసిస్టమ్‌ను ప్రోత్సహించాలి. ఈ విభాగంలో మేధో హక్కులను సంపాదించుకోవాలి. బ్యాటరీ రీసైక్లింగ్ సదుపాయాలపై పెట్టుబడులు పెట్టాలి. దీనివల్ల భారత ఆటోమొబైల్ రంగానికి దీర్ఘకాల ప్రయోజనాలు ఒనగూరుతాయి’’అని ఆర్థిక సర్వే సూచించింది. మరోవైపు పర్యావరణ అనుకూల ఇంధనాలకు మళ్లే విషయంలోనూ చైనా దిగుమతులపై అధికంగా ఆధారపడడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణలు సడలించడం ద్వారా దేశీ పరిశ్రమకు మద్దతుగా నిలవాలని సూచించింది. పీఎల్ఐ, ఫేమ్ పథకాలను ప్రస్తావిస్తూ.. భవిష్యత్తులో ఈవీల అవసరాలను తీర్చే విధానాలపై దృష్టి సారించాలని పేర్కొంది. వారానికి 60 గంటలు మించి పని.. ఆరోగ్యానికి హానికరం.. వారానికి 60 గంటలకు మించి పని చేస్తే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఎకనమిక్ సర్వే పేర్కొంది. ఆఫీస్ డెస్క్ ముందు గంటల తరబడి కూర్చోవడమనేది మానసిక ఆరోగ్యానికి హానికరమని వివరించింది. రోజూ 12 గంటలకు పైగా డెస్క్‌లోనే గడిపే వారు ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపింది. ఉద్యోగి ఉత్పాదకతకు ఆఫీసులో గడిపిన సమయమే కొలమానమని అభిప్రాయం నెలకొన్నప్పటికీ మెరుగైన జీవన విధానాలు, వర్క్‌ప్లేస్ సంస్కృతి, కుటుంబ సంబంధాలు మొదలైనవి కూడా ఉత్పాదకతకు కీలకమని సేపియన్ ల్యాబ్స్ సెంటర్ అధ్యయన నివేదికలో వెల్లడైనట్లు ఆర్థిక సర్వే వివరించింది. వారానికి 70–90 గంటలు పని చేయాలన్న ఇన్ఫీ సహవ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, ఎల్అండ్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతున్న తరుణంలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. మెరుగుపడిన విమాన కనెక్టివిటీ కొత్త విమానాశ్రయాలు, ఉడాన్ స్కీముతో దేశీయంగా ఎయిర్ కనెక్టివిటీ గణనీయంగా మెరుగుపడినట్లు ఆర్థిక సర్వే తెలిపింది. 2020–25 ఆర్థిక సంవత్సరాల మధ్య నిర్దేశించిన రూ. 91,000 కోట్ల పెట్టుబడి వ్యయాల లక్ష్యంలో ఎయిర్పోర్ట్ డెవలపర్లు, ఆపరేటర్లు దాదాపు 91 శాతాన్ని ఖర్చు చేసినట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే భారత్‌లో ఏవియేషన్ మార్కెట్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతోందని, భారతీయ ఎయిర్‌లైన్స్ భారీ స్థాయిలో కొత్త విమానాలకు ఆర్డర్లిచ్చాయని సర్వే వివరించింది. మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్ (ఎంఆర్వో) పరిశ్రమకు సంబంధించి భారత్‌లో ప్లాంట్లను ఏర్పాటు చేయాలంటూ తయారీ కంపెనీలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపింది. రియల్ ఎస్టేట్‌లో బలమైన డిమాండ్ ఆర్థిక స్థిరత్వం, రహదారులు, మెట్రో నెట్‌వర్క్‌ల కల్పన వంటివి దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగంలో డిమాండ్‌ను పెంచినట్టు ఆర్థిక సర్వే నివేదిక వెల్లడించింది. రియల్ ఎస్టేట్ రంగ నియంత్రణ కోసం ‘రెరా’తోపాటు, జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం ఈ రంగానికి మేలు చేసినట్టు తెలిపింది. 2036 నాటికి ఇళ్లకు డిమాండ్ 9.3 కోట్ల యూనిట్లకు చేరుకుంటుందన్న పలు నివేదికల అంచనాలను ప్రస్తావించింది. 2024 మొదటి ఆరు నెలల్లో ఇళ్ల అమ్మకాలు 11 ఏళ్ల గరిష్టానికి చేరుకోవడాన్ని గుర్తు చేసింది. రెరా రాకతో రియల్ఎస్టేట్ రంగంలో మోసాల నుంచి రక్షణ లభించిందని, పారదర్శకత, సకాలంలో ప్రాజెక్టుల పూర్తికి దారి చూపిందని వివరించింది. ఇళ్ల ప్లాన్లకు ఆన్లైన్ అనుమతులుతో జాప్యం తగ్గి, పారదర్శకత పెరిగినట్టు తెలిపింది. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లకు(రీట్లు) ప్రోత్సాహం వాణిజ్య రియల్ ఎస్టేట్‌కు సానుకూలిస్తుందని అభిప్రాయపడింది. 11.6 బిలియన్ డాలర్లకు డేటా సెంటర్ మార్కెట్మౌలిక సదుపాయాల విస్తరణ, డిజిటల్ సేవలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో దేశీయంగా డేటా సెంటర్ మార్కెట్ 2032 నాటికి 11.6 బిలియన్ డాలర్ల స్థాయికి చేరవచ్చని ఎకనమిక్ సర్వే అంచనా వేసింది. 2023లో ఇది 4.5 బిలియన్ డాలర్లుగా ఉంది. ఐటీ, డిజిటల్ సేవల వ్యవస్థ పటిష్టంగా ఉండటం, రియల్ ఎస్టేట్ ధరలు తక్కువగా వల్ల డేటా సెంటర్ల ఏర్పాటు వ్యయాలు చౌకగా ఉండటం భారత్‌కు లాభిస్తుందని పేర్కొంది. డేటా సెంటర్ ఏర్పాటుకు ఆ్రస్టేలియాలో సగటున ప్రతి మెగావాట్‌కు వ్యయాలు 9.17 మిలియన్ డాలర్లుగా, అమెరికాలో 12.73 మిలియన్ డాలర్లుగా ఉండగా భారత్‌లో 6.8 మిలియన్ డాలర్లేనని సర్వే వివరించింది. జీసీసీల్లో ’గ్లోబల్’ ఉద్యోగాలుభారత్లో ఏర్పాటు చేస్తున్న గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో (జీసీసీ) అంతర్జాతీయ కార్యకలాపాలకి సంబంధించి నియమించుకునే (గ్లోబల్) ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరగనుందని ఆర్థిక సర్వే తెలిపింది. 2030 నాటికి ఇది నాలుగు రెట్లు పెరిగి 30,000కు చేరుతుందని వివరించింది. ప్రస్తుతం ఈ సంఖ్య 6,500గా ఉంది. గత దశాబ్ద కాలంలో భారత్‌లో జీసీసీ వ్యవస్థ పురోగమించిందని, ప్రోడక్ట్ మేనేజర్లు, ఆర్కిటెక్టుల్లాంటి హై–ఎండ్ ఇంజినీరింగ్ ఉద్యోగాలను కూడా టెక్ నిపుణులు దక్కించుకుంటున్నారని సర్వే తెలిపింది. 2019లో 1,430గా ఉన్న జీసీసీల సంఖ్య 2024 నాటికి 1,700కు పెరిగిందని, వీటిల్లో దాదాపు 19 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని పేర్కొంది.ఏఐతో ఉద్యోగాలకు రిస్కే కృత్రిమ మేథతో (ఏఐ) ఎంట్రీ స్థాయి ఉద్యోగాలకు ముప్పు ఉంటుందని, ముఖ్యంగా జీవనోపాధి కోసం ఉద్యోగాల మీదే ఎక్కువగా ఆధారపడే భారత్‌లాంటి దేశాల్లో ఈ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని ఆర్థిక సర్వే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సరైన ప్రణాళికలు లేకుండా ఉద్యోగుల స్థానాన్ని ఏఐతో భర్తీ చేసేందుకు కంపెనీలు తొందరపడటం శ్రేయస్కరం కాదని ఐఎంఎఫ్ నివేదికను ఉటంకిస్తూ, సూచించింది. ఒకవేళ అలా చేసిన పక్షంలో ఉపాధి కోల్పోయిన వర్కర్లకు తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వం స్వయంగా జోక్యం చేసుకుని, కార్పొరేట్ల లాభాలపై మరింతగా పన్నులు విధించడం, ఇతరత్రా పాలసీపరమైన చర్యలు తీసుకునే పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని వివరించింది. ఎఫ్డీలకు అన్ని అడ్డంకులు తొలగాలి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) భారత్ మరింతగా ఆకర్షించేందుకు వీలుగా అన్ని అవరోధాలను తొలగించాలని, పన్నుల పరమైన నిలకడను తీసుకురావాలని ఆర్థిక సర్వే సూచించింది. సమీప కాలంలో వడ్డీ రేట్లు, ద్రవ్యల్బోణ ఒత్తిళ్లు, అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితులు ఉన్నా కానీ, దీర్ఘకాలానికి భారత్ ఎఫ్డీలకు అనుకూల కేంద్రంగా కొనసాగుతుందని అభిప్రాయపడింది. బలమైన దేశ ఆర్థిక మూలాలు, ప్రస్తుతం కొనసాగుతున్న నిర్మాణాత్మక సంస్కరణలు, కన్జ్యూమర్ మార్కెట్ వృద్ధి సానుకూలతలుగా పేర్కొంది. ఇప్పటికే చాలా రంగాల్లో ఎఫ్డీలను ఆటోమేటిక్ మార్గంలో అనుమతిస్తున్నట్టు తెలిపింది. డిజిటల్ కనెక్టివిటీకి 5జీ దన్నుదేశవ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో 5జీ సర్విసులను ప్రవేశపెట్టడంతో పాటు టెలికం మౌలిక సదుపాయాలను, యూజర్ అనుభూతిని మెరుగుపర్చేందుకు నియంత్రణ సంస్థ తీసుకుంటున్న చర్యలతో డిజిటల్ కనెక్టివిటీ మెరుగుపడినట్లు ఆర్థిక సర్వే తెలిపింది. ప్రస్తుతం 783 జిల్లాలకు గాను 779 జిల్లాల్లో 5జీ సేవలు అందుబాటులో ఉన్నట్లు వివరించింది. భారత్ నెట్ ప్రాజెక్టు కింద 2024 డిసెంబర్ నాటికి 6.92 లక్షల కి.మీ. ఆప్టికల్ ఫైబర్ కేబుల్ (ఓఎఫ్సీ) వేసినట్లు పేర్కొంది. -
సంస్కరణల మోత.. వృద్ధికి చేయూత!
భారత ఆర్థిక వ్యవస్థ మందగమనాన్ని ఎదుర్కొంటోందని ఆర్థిక సర్వే కుండబద్దలు కొట్టింది. మన ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగానే ఉన్న నేపథ్యంలో తక్షణం ఆర్థిక వ్యవస్థకు చికిత్స చేసి, వృద్ధికి చేయూతనివ్వాలంటే... పెట్టుబడులకు అడ్డంకిగా ఉన్న పలు నియంత్రణలను తొలగించడంతో పాటు భూ, కార్మిక తదితర కీలక సంస్కరణలు అమలు చేయాలని తేల్చిచెప్పింది. మరోపక్క, ప్రజల కొనుగోలు శక్తిని పెంచి, వినిమయం భారీగా పుంజుకునేలా చర్యలు చేపట్టాలని సూచించింది. మరికొద్ది గంటల్లో మోదీ 3.0 సర్కారు కీలక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న తరుణంలో 2024–25 ఏడాదికి సంబంధించిన ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం పార్లమెంట్‌కు సమర్పించారు. న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం (2025–26)లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 6.3–6.8 శాతానికి పరిమితం కావచ్చని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఈ ఏడాది వృద్ధి 6.4 శాతానికి పడిపోవచ్చని ఇప్పటికే కేంద్రం ముందస్తు అంచనాల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇది నాలుగేళ్ల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. కరోనా తర్వాత జీడీపీ వృద్ధి రేటు మళ్లీ ఇంతలా బలహీనపడటం ఇదే తొలిసారి. 2023–24 ఏడాదికి వృద్ధి రేటు 8.2 శాతంగా నమోదైంది. కాగా, 2024 నాటికి వికసిత భారత్ (అభివృద్ధి చెందిన దేశం)గా అవతరించాలంటే వచ్చే ఒకట్రెండు దశాబ్దాల పాటు జీడీపీ ఏటా 8 శాతం చొప్పున వృద్ధి చెందాల్సిన అవసరం ఉందని సర్వే నొక్కి చెప్పింది. ఈ ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని సాధించాలంటే పలు రంగాల్లో, ముఖ్యంగా భూ, కార్మిక సంస్కరణలు చేపట్టాలని తెలిపింది. అంతేకాకుండా, జీడీపీలో పెట్టుబడుల శాతాన్ని ఇప్పుడున్న 31 శాతం నుంచి 35 శాతానికి పెంచాల్సిందేనని కూడా పేర్కొంది. తయారీ రంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), రోబోటిక్స్, బయో టెక్నాలజీ వంటి వర్ధమాన టెక్నాలజీల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించాలని సూచించింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనాల ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ 2027–28లో 5 ట్రిలియన్ డాలర్లను, 2029–30లో 6.3 ట్రిలియన్ డాలర్లను తాకే అవకాశం ఉంది. ధరలు దిగొస్తాయి... కొత్త పంట చేతికి రావడం, సీజనల్‌గా కొన్ని కూర గాయల ధరలు తగ్గుముఖం పట్టడంతో ఇక ఆహార ద్రవ్యోల్బణం శాంతించే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది. ఆర్బీఐ ద్రవ్యోల్బణ లక్ష్యం 4%కి అటుఇటుగానే రిటైల్ ద్రవ్యోల్బణం ఉండొ చ్చని పేర్కొంది. అయితే, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, అంతర్జాతీయంగా కమోడిటీ ధరల సెగ వంటి రిస్కులు పొంచిఉన్నాయని తెలిపింది. 2024 డిసెంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం 4 నెలల కనిష్టమైన 5.2%కి దిగొచ్చింది. అయితే, కూరగాయల ధరల మంటతో ఆహార ద్రవ్యోల్బణం ఇంకా భారీగానే 8.4%గా నమోదైంది. ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు తగ్గుతున్నప్పటికీ, భౌగోళిక రాజకీయ రిసు్కలు ఆందోళనకరంగానే ఉన్నా యని కూడా సర్వే పేర్కొంది.నియంత్రణల సంకెళ్లు తెంచాలి... ‘మౌలిక రంగంలో పెట్టుబడులను పెంచాలంటే వ్యవస్థలో పాతుకుపోయిన నియంత్రణ సంకెళ్లను తెంచాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాలు కూడా వ్యాపారాలకు అడ్డంకులుగా నిలుస్తున్న పలు నిబంధనలను సరళీకరించడంతో పాటు పలు రకాల టారిఫ్‌లలో కోత విధించాలి. దేశంలో నవకల్పనలను ప్రోత్సహించి, చిన్న మధ్య తరహా సంస్థల (ఎస్ఎంఈ) రంగానికి దన్నుగా నిలిచేందుకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. జర్మనీ, స్విట్జర్లాండ్, జపాన్, సింగపూర్ తదితర దేశాల ఆర్థిక విజయంలో ఎస్ఎంఈలు కీలక పాత్ర పోషించాయి. అధిక నియంత్రణ వల్ల ఇన్నోవేషన్, ఆర్థికవ్యవస్థ చురుకుదనానికి తీవ్ర విఘాతం కలుగుతుంది. ఈ దిశగా భూ, కార్మిక, తదితర సంస్కరణలు అత్యవసరం’ అని సర్వే పేర్కొంది.సర్వేలో ఇతర ముఖ్యాంశాలు... → దేశంలో సేవల రంగం మంచి పనితీరును కనబరుస్తోంది. తయారీ రంగం మా త్రం కొన్ని ప్రాంతాల్లో సమస్యలు ఎదుర్కొంటోంది. → ప్రపంచ ఆర్థిక అనిశి్చతిని సైతం తట్టుకుని మన ఫైనాన్షియల్ రంగం పురోగమిస్తోంది. బ్యాంకులు లాభాలు మెరుగుపడ్డాయి. రుణాలు, డిపాజిట్ల మధ్య వ్యత్యాసం తగ్గుతోంది. → పెట్టుబడులకు దన్నుగా, పొదుపులను మదుపుగా మార్చడంలో, సంపద సృష్టిలో మన క్యాపిటల్ మార్కెట్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. 2013–14 నుంచి 2023–24 మధ్య ఐపీఓ ద్వారా కంపెనీల లిస్టింగ్‌లు ఆరు రెట్లు పెరిగాయి. ఇప్పుడు స్టాక్ మార్కెట్లకు యువ ఇన్వెస్టర్లే చోదక శక్తిగా నిలుస్తున్నారు. → విదేశాల్లో డిమాండ్ తగ్గడంతో ఎగుమతుల వృద్ధి మందగించింది. మరోపక్క, దేశీయంగా పటిష్ట డిమాండ్‌తో దిగుమతులు పెరిగాయి. రక్షణాత్మక ధోరణులు పెరిగిపోవడంతో ప్రపంచ వాణిజ్య ధోరణులు ఆందోళన కలిగిస్తున్నాయి. మన ఎగుమతులకు పోటీతత్వం పెంచాలంటే వ్యూహాత్మక వాణిజ్య రోడ్‌మ్యాప్ అత్యవసరం. → అధిక ప్రభుత్వ వ్యయం, మెరుగుపడుతున్న వ్యాపార విశ్వాసంతో పెట్టుబడులు మళ్లీ పుంజుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. → సమృద్ధిగా 640 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉన్నాయి. ఇది 90 శాతం విదేశీ రుణానికి సమానం, అలాగే దాదాపు 11 నెలల దిగుమతులకు సరిపోతాయి. → వ్యాపారాలకు సానుకూల వాతావరణం కల్పించేలా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0లో రాష్ట్రాలు మరింత చొరవ తీసుకోవాలి. క్షేత్ర స్థాయిలో సమస్యల పరిష్కారంపై ఫోకస్ చేయాలి. → అధిక వృద్ధి పథంలో సాగాలంటే వచ్చే రెండు దశాబ్దాల పాటు మౌలిక రంగంలో పెట్టుబడులను దశలవారీగా పెంచాలి. → కార్పొరేట్ రంగం సామాజిక బాధ్యత విషయంలో మరింతగా దృష్టి సారించాలి. → పప్పు ధాన్యాలు, నూనెగింజలు, టమాటా, ఉల్లి ఉత్పత్తిని పెంచేలా పరిశోధనలు జరగాలి. అన్నిరకాల వాతావరణ పరిస్థితులను తట్టుకునే పంట రకాలను రూపొందించడంతో పాటు పంట దిగుబడి పెంచి, పంట నష్టాలను తగ్గించడంపై దృష్టి పెట్టాలి.వ్యవసాయోత్పత్తి పుంజుకోవడం గ్రామీణ డిమాండ్‌కు దన్నుగా నిలుస్తోంది. ఆహార ధరలు శాంతించే అవకాశం ఉండటం, స్థూల ఆర్థిక పరిస్థితులు స్థిరంగా ఉన్న నేపథ్యంలో సమీప భవిష్యత్తులో వృద్ధి మళ్లీ పట్టాలెక్కనుంది. భౌగోళిక రాజకీయ, వాణిజ్య అనిశి్చతులతో పాటు కమోడిటీ ధరల షాక్‌లు మన ఆర్థిక వ్యవస్థకు ప్రధాన అడ్డంకులుగా నిలుస్తున్నాయి. అయినప్పటికీ మనదే ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఎకానమీ. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలంటే వృద్ధిని పరుగులు పెట్టించాల్సిందే’. – వి. అనంత నాగేశ్వరన్, ప్రధాన ఆర్థిక సలహాదారుపటిష్టమైన దేశీ డిమాండ్, పెట్టుబడులు పుంజుకుంటున్న నేపథ్యంలో వృద్ధి కాస్త మెరుగ్గానే (6.5–6.8%) ఉండొచ్చు. వ్యవసాయ దిగుబడుల జోరు, బలమైన సేవల రంగం వృద్ధికి కీలక చోదకాలు. పాశ్చాత్య దేశాల పాలసీలు, భౌగోళిక–ఆర్థిక అడ్డంకులు సరఫరా వ్యవస్థల రూపురేఖలను మార్చేస్తున్నాయి’. – రుమ్కి మజుందార్, డెలాయిట్ ఇండియా ఎకనమిస్ట్‘భారత్ వృద్ధి రేటు జోరును కొనసాగించాలంటే ప్రపంచ దేశాలతో పోటీతత్వాన్ని పెంచుకోవాల్సిందే. నిర్మాణాత్మక సంస్కరణలు, నియంత్రణల తొలగింపు ద్వారానే ఇది సాధ్యం’ – అదితి నాయర్, ఇక్రా చీఫ్ ఎకనమిస్ట్ -
Budget 2025: ఆర్థిక సర్వేలో పని గంటల ప్రస్తావన
వర్క్-లైఫ్ బ్యాలెన్సింగ్ గురించి ఈ మధ్యకాలంలో విస్తృతస్థాయి చర్చ నడుస్తోంది. చైర్మన్, సీఈవో స్థాయిలో ఉన్న వ్యక్తులు నేరుగా స్పందిస్తుండడం.. వాటిపై విమర్శలు-సమర్థనలతో ఈ చర్చ కొనసాగుతోంది. ఈ దరిమిలా ఇవాళ విడుదలైన ఆర్థిక సర్వే సైతం పనిగంటల అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది.పని గంటల చర్చలో ఇప్పుడు ఎకనామిక్ సర్వే సైతం భాగమైంది. వారానికి 60 గంటలకు మించి పని చేయడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆర్థిక సర్వే హెచ్చరించింది. వివిధ అధ్యయనాల నివేదికలను ఇందులో ప్రముఖంగా ప్రస్తావించింది. ఆర్థిక సర్వే 2024-25 ప్రకారం..‘‘ఆఫీసుల్లో ఎక్కువ సేపు గడపడం వల్ల మానసిక శ్రేయస్సుకు మంచిది కాదు. రోజుకు 12, అంతకంటే ఎక్కువ గంటలు పనిచేసే వ్యక్తులు గణనీయమైన స్థాయిలో బాధను అనుభవిస్తున్నారు. వారానికి ఎక్కువ గంటలు పని చేయడం ఆరోగ్యానికి హానికరం. ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ కార్మిక సంస్థ(ILO) అధ్యయనాల నివేదికలూ ఈ విషయాన్నే స్పష్టం చేశాయి... అనధికారికంగా.. ఎక్కువ పని గంటలతో ఉత్పాదకత(Productivity) పెరిగినా.. వారానికి 55-50 గంటల మధ్య పని చేయడం ఆరోగ్యాన్ని దెబ్బ తీయడమేనని డబ్ల్యూహెచ్‌వో-ఐఎల్వో సంయుక్త అధ్యయన నివేదిక స్పష్టం చేసింది’’ అని ఆర్థిక సర్వే వెల్లడించింది. అలాగే.. సుదీర్ఘంగా ఒకే దగ్గర ఎక్కువ గంటలు పని చేయడం మానసిక ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుందని సపెయిన్ లాబ్స్ సెంటర్ ఫర్ హుమన్ బ్రెయిన్ అండ్ మైండ్ స్టడీ రిపోర్ట్‌ను ఎకనామిక్ సర్వే హైలెట్ చేసింది.ఇక.. పని గంటలపై పరిమితులు విధించడం ఆర్థిక వృద్ధికి అవాంతరాన్ని కలిగించొచ్చని సర్వే అభిప్రాయపడింది. అలాగే కార్మికుల సంపాదన సామర్థ్యాన్ని దెబ్బ తీసే అవకాశం లేకపోలేదని తెలిపింది. కాబట్టి సౌకర్యవంతమైన పని గంటల విధానం భారతదేశాన్ని ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఉంచుతుందని.. ఈ చర్యలతో చిన్న, మధ్య తరహా పరిశ్రమల వృద్ధికి తోడ్పడుతుంది అని ఆర్థిక సర్వే సూచించింది.బడ్జెట్ సమావేశాల్లో భాగంగా.. ఇవాళ పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించారు. అనంతరం 2024-25 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. గత సంవత్సర కాలంలో దేశ ఆర్థిక పనితీరును.. రాబోయే సంవత్సరంలో ఆర్థికంగా ఎదురయ్యే సవాళ్లను ముందుగానే అంచనా వేసి చెప్పేదే ఆర్థిక సర్వే. బడ్జెట్‌కు ముందర దీనిని ప్రవేశపెడతారు. ఆర్థిక మంత్రిత్వశాఖకు చెందిన ఎకనామిక్ అఫైర్స్ డిపార్ట్మెంట్లోని ఎకనామిక్ డివిజన్ ఈ సర్వేను రూపొందిస్తుంది. -
పదేళ్లలో ఇదే తొలిసారి
బడ్జెట్(Union Budget 2025-26) సమావేశాలకు ముందు 2014 తర్వాత తొలిసారి అశాంతిని రెచ్చగొట్టేలా విదేశీ ప్రయత్నాలు జరగలేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్ సమావేశాలకు ముందు ఆయన చేసిన ప్రసంగంలో ఈ మేరకు ప్రకటన చేశారు. గత దశాబ్ద కాలంగా పార్లమెంటు కీలక సమావేశాలకు ముందు రాజకీయ వాతావరణాన్ని అస్థిరపరిచేలా విదేశీ సంఘటనలు ఉన్నాయని తెలిపారు. 2014 తర్వాత ఏ విదేశీ సంస్థ కూడా అశాంతి సృష్టించేందుకు ప్రయత్నించకపోవడం ఇదే తొలిసారని ఆయన ఉద్ఘాటించారు.ఆర్థిక సర్వేకేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతున్న 2025 ఆర్థిక సర్వే గత ఏడాది కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ పనితీరుపై సమగ్ర అంచనాను అందిస్తుంది. కీలక పరిణామాలు, సవాళ్లు, భవిష్యత్తు వృద్ధికి రోడ్ మ్యాప్‌ను ఈ సర్వే వివరిస్తుంది. జీడీపీ వృద్ధిని పెంచడానికి, నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి, మౌలిక సదుపాయాల అభివృద్ధిని పెంచడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఇది హైలైట్ చేస్తుంది.కేంద్ర బడ్జెట్ 2025ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ 2025లో సమ్మిళిత వృద్ధి, ఆర్థిక స్థిరత్వంపై దృష్టి సారించే అవకాశం ఉంది. భారత స్వాతంత్ర్య శతాబ్దిని పురస్కరించుకుని 2047 నాటికి ‘వికసిత్ భారత్(Vikasit Bharat)’ లక్ష్యాన్ని సాధించడానికి బడ్జెట్ సమావేశాలు కొత్త నమ్మకాన్ని, శక్తిని నింపుతాయని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. నూతన ఆవిష్కరణలు, పెట్టుబడులకు ప్రభుత్వ నిబద్ధతను ప్రధాని మోడీ పునరుద్ఘాటించారు. మహిళా సాధికారత, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో బడ్జెట్ సమావేశాల్లో కీలక సంస్కరణలు, నిర్ణయాలను ప్రవేశపెడతామని ఆయన హామీ ఇచ్చారు.ఇదీ చదవండి: మహా కుంభమేళా.. విమాన ఛార్జీలు తగ్గింపుగతంలో విదేశీ జోక్యం ఇలా..దశాబ్ద కాలంలో బడ్జెట్ సమావేశాలకు ముందు విభిన్న సంఘటనల ద్వారా విదేశీ జోక్యం చోటు చేసుకుంటుంది. 2019, 2021 కెనడా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేలా చైనా, భారతదేశం పాల్గొన్నాయని కెనడా కమిషన్ నివేదిక వెల్లడించింది. చైనాను ప్రధాన పాత్రధారిగా గుర్తించగా, భారత్ పార్టీలకు అతీతంగా అభ్యర్థులను ప్రభావితం చేస్తోందని ఆరోపించారు. ఈ ఆరోపణలు నిరాధారమైనవని భారత విదేశాంగ శాఖ కొట్టిపారేసింది. 2023లో సిక్కు వేర్పాటువాద నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. ఇది దౌత్య సంక్షోభానికి దారితీసింది. కెనడా అక్రమ వలసలు, నేరాలకు అనుమతించే వాతావరణాన్ని ప్రోత్సహిస్తోందని భారతదేశం ఆరోపించింది. -
భారత్‌ను గ్లోబల్ ఇన్నోవేషన్ పవర్ హౌస్‌గా మారుస్తాం: రాష్ట్రపతి
👉 వన్ నేషన్-వన్ ఎలక్షన్ దిశగా అడుగులు పడుతున్నాయి. బడ్జెట్లో రైతులు, మహిళలు, యువతకు ప్రాధాన్యం ఉంటుంది. వికసిత్ భారత్ దిశగా భారత్ అడుగులు వేస్తోంది. మూడోసారి మా ప్రభుత్వం మూడు రెట్లు అధిక వేగంతో అభివృద్ధిలో దూసుకుపోతోంది. వ్యవసాయ సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా లక్షలాది మంది ఇంటి కల నెరవేర్చాం. కోట్లాది మందిని ప్రభుత్వం పేదరికం నుంచి బయటపడేసింది. మూడు కోట్ల మంది పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నాం.👉మహాకుంభమేళాలో కోట్లాది మంది పుణ్యస్నానాలు చేస్తున్నారు. మహాకుంభమేళా భారత సంస్కృతికి చిహ్నం. మౌని అమావాస్య రోజు జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన భక్తులకు నివాళి అర్పిస్తున్నాను.👉 ఇటీవల 76వ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరుపుకున్నాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా లక్షలాది మంది సొంత ఇంటి కల నెరవేరబోతుంది. అమృత్‌భారత్, నమో భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి.👉 వందో ప్రయోగాన్ని ఇస్రో విజయవంతంగా నిర్వహించింది. ఇస్రో భారత కీర్తి పతాకం ఎగురవేసింది. స్పేస్ డాకింగ్‌తో మరో అడుగు ముందుకేశాం. అంతరిక్షంలో భారతీయుడు అడుగుపెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. మేకిన్ ఇండియాతో అద్భుత విజయాలు సాధిస్తున్నాం. ఇండియా ఏఐ మిషన్‌ను ప్రారంభించాం. సైబర్ నేరాలను నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సైబర్ నేరాలు, డిజిటల్ నేరాల నుంచి బయటపడేందుకు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఈ-గవర్నెన్స్‌కు ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రపంచస్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తున్నాం.👉 ఖేలో ఇండియా మన దేశ యువతకు ఎంతో ఉపయోగకరం. మన దేశ మహిళలు ఒలంపిక్స్‌లో పథకాలు సాధిస్తున్నారు. మహిళా సాధికారిత కోసం డ్రోన్ దీదీ పథకం తీసుకువచ్చాం. లక్షా 15వేల మంది మహిళలు లక్పతి దీదీలుగా మారారు. మూడు లక్షల మంది మహిళలను లక్పతి దీదీలుగా మార్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. డ్రోన్ దీదీ స్కీమ్ మహిళలకు ఉపయోగపడుతోంది. మధ్య తరగతి కుటుంబాలకు హోం లోన్స్ ఇస్తున్నాం. దేశంలో 70 ఏళ్లు దాటిన ఆరు కోట్ల మందికి ఆరోగ్య బీమా అందిస్తాం. రైతులను ఆదుకునేందుకు, వారి ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. యువతను వారి వారి మాతృ భాషల్లో ఎడ్యుకేట్ అయ్యేలా ప్రోత్సహిస్తున్నాం. 👉 భారత ఆర్థిక వ్యవస్థకు చిరు వ్యాపారులే కీలకం. భారత్‌ను గ్లోబల్ ఇన్నోవేషన్ పవర్ హౌస్‌గా మారుస్తాం. టెక్నాలజీ రంగంలో భారత్ అద్భుతంగా దూసుకుపోతోంది. డిజిటల్ చెల్లింపుల్లో రికార్డులు సాధిస్తున్నాం. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రారంభించాం. ఎంఎస్ఎంఈ కోసం క్రెడిట్ గ్యారంటీ స్కీం తీసుకొచ్చాం. 👉 వైద్య, ఆరోగ్య రంగానికి మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం నూతన టెక్నాలజీ తీసుకొచ్చాం. దేశవ్యాప్తంగా చాలా మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశాం. టీబీ రహిత దేశంగా భారత్‌ను తీర్చిదిద్దుతున్నాం. తక్కువ ధరకే క్యాన్సర్ మందులను అందుబాటులోకి తీసుకొచ్చాం.👉 ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే బ్రిడ్జిని కశ్మీర్లో నిర్మించాం. దేశంలో మెట్రో వ్యవస్థలను వేగంగా విస్తరిస్తున్నాం. ఢిల్లీలో మెట్రో వ్యవస్థను విస్తరిస్తున్నాం. స్వచ్చమైన నీటి కోసం నదులను అనుసందానం చేస్తున్నాం. దేశంలో పౌరవిమానయాన రంగం అభివృద్ధి చెందుతోంది. రైతులు, పరిశ్రమలు, సైన్స్‌పై మా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.👉చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు గొప్ప ముందడుగు. ఆదివాసీల్లో సికెల్‌సెల్ వ్యాధిని నివారించాం. మహిళలతోనే ఆర్థిక అభివృద్ధి అని మా ప్రభుత్వం నమ్ముతోంది. దళితుల కోసమే కొన్ని ప్రత్యేక పథకాలు తీసుకువచ్చాం. వన్ నేషన్-వన్ ట్యాక్స్ అభవృద్ధి చేశాం. 👉త్వరలోనే ప్రపంచంలోనే మూడో ఆర్థిక శక్తిగా భారత్ అవతరించబోతుంది. భారత రాజ్యాంగానికి నా సెట్యూట్. వక్ఫ్ బోర్డులో సంస్కరణపై మా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మహిళా సాధికారితకు మా ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుంది. అందరికీ ఫలాలు అందాలన్నదే మా ఉద్దేశ్యం. 25కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొస్తాం. దేశాభివృద్ధికి వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం. గ్రామీణ రహదారుల అభివృద్ధికి రూ.70వేల కోట్లు కేటాయించాం. ట్యాక్స్ విధానాలను సరళీకరించాం. ఉద్యోగుల కోసం ఎనిమిదో వేతన సంఘాన్ని నియమించాం. విద్యారంగంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు.. పేదలకు లబ్ధి కలిగిస్తున్నాయి. President Murmu says, "My government is committed to fulfilling the dream of the middle class of having their own house..." pic.twitter.com/Y58sa0z61Z— ANI (@ANI) January 31, 2025 👉మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఇటీవల మరణించిన పార్లమెంట్ సభ్యలకు ఉభయ సభలు సభ్యులు నివాళి అర్పించారు. 👉బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తున్నారు. President Droupadi Murmu to address the joint sitting of both Houses of Parliament, shortlySource: DD News pic.twitter.com/2RVQS79blX— ANI (@ANI) January 31, 2025👉కాసేపట్లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ వద్ద ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడుతూ.. మూడోసారి దేశ ప్రజలు మాకు విజయాన్ని అందించారు. మూడోసారి అధికారంలోకి వచ్చాక తొలి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నాం. 140 కోట్ల మంది భారతీయుల సంకల్పాన్ని పరిపూర్ణం చేస్తాం. వికసిత్ భారత్‌కు ఈ బడ్జెట్ ఊతమిస్తుంది. దేశంలోని పేదలు, మధ్య తరగతిపై లక్ష్మీదేవి కరుణ చూపాలని ప్రార్థిస్తున్నాను. 👉ఈ సమావేశాల్లో చర్చకు ప్రతిపక్షాలు సహకరిస్తాయని ఆశిస్తున్నాను. దేశాన్ని భౌగోళిక, సామాజిక, ఆర్థికంగా అభివృద్ధి చేస్తాం. ఇన్నోవేషన్, ఇన్వెస్ట్‌మెంట్‌కు ప్రాధాన్యత ఇస్తాం. పార్లమెంట్లో అన్ని అంశాలపై చర్చ జరగాలని ఆకాంక్షిస్తున్నాను. దేశాన్ని భౌగోళిక, సామాజిక, ఆర్థికంగా అభివృద్ధి చేస్తాం. ఇన్నోవేషన్, ఇన్వెస్ట్‌మెంట్‌కు ప్రాధాన్యత ఇస్తాం. ఈ బడ్జెట్ భారతీయులకు నూతన శక్తిని ఇస్తుంది. ఈ బడ్జెట్ యువతకు ఆశాజనకంగా ఉంటుంది. చారిత్రాత్మక బిల్లులను ఈ సమావేశాల్లో ప్రవేశపెడతాం. వక్ఫ్, బ్యాంకింగ్, రైల్వేలు సహా 16 కీలక బిల్లులు ప్రవేశపెట్టబోతున్నాం. పార్లమెంట్లో అన్ని అంశాలపై చర్చ జరగాలని ఆకాంక్షిస్తున్నాను అని కామెంట్స్ చేశారు.#WATCH | #BudgetSession | PM Modi says, "I pray that Maa Lakshmi continues to bless the poor and middle class of our country. It is a matter of great pride that India completed 75 years as a democratic nation. India has established itself well on the global pedestal...This is the… pic.twitter.com/BF2dT2oTz9— ANI (@ANI) January 31, 2025 👉ఈరోజు సమావేశాలు ప్రారంభమైన తొలిరోజు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పార్లమెంట్ ఉభయ సభలను ఉద్ధేశించి లోక్‌సభ హాల్లో ప్రారంభోపన్యాసం చేస్తారు. అనంతరం ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ సామాజిక, ఆర్థిక సర్వే నివేదికను లోక్‌సభలో, రాజ్యసభలో ప్రవేశపెడతారు. శనివారం నిర్మల లోక్‌సభలో 2025–26 సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఫిబ్రవరి రెండో తేదీన రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. ఈ చర్చకు రాజ్యసభ, లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం ఇస్తారు. బడ్జెట్ సమావేశాల తొలి సెషన్ జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 దాకా, రెండోసెషన్ మార్చి 10 నుంచి ఏప్రిల్ 4వ తేదీ దాకా జరుగుతుంది. నిలదీసేందుకు విపక్షాల వ్యూహరచనమోదీ సర్కార్‌ను నిలదీసేందుకు విపక్షాలు వ్యూహరచన చేస్తున్నాయి. ముఖ్యంగా దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రైతుల కష్టాలు, కుంభమేళాలో అపశ్రుతి సహా కేంద్ర–రాష్ట్ర సంబంధాలు, చైనా సరిహద్దు వివాదం వంటి ప్రధాన అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని విపక్షాలు నిర్ణయించాయి. రాష్ట్రపతి ప్రసంగాన్ని సైతం కొన్ని రాజకీయ పార్టీలు బహిష్కరించి వాకౌట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రైతులు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి సమస్యలపై సీపీఐ, సీపీఎం పార్టీలు, చైనా సరిహద్దు వివాదాలు, రూపాయి పతనం, బడా కార్పొరేట్లకు మాత్రం అన్ని కాంట్రాక్టులు దక్కేలా కుట్ర వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా కాంగ్రెస్ వ్యూహాన్ని సిద్ధంచేశాయి. సహకరించాలన్న మోదీ సర్కార్శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు కేంద్ర ప్రభుత్వం గురువారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఉభయ సభలు సజావుగా సాగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కేంద్ర మంత్రులు కోరారు. దేశం ఎదుర్కొంటున్న ముఖ్య సమస్యలతో పాటు రాష్ట్రాల పరిధిలో పెండింగ్‌లో ఉన్న అంశాలపై చర్చకు అవకాశం ఇవ్వాలని పలు పార్టీలు డిమాండ్‌చేశాయి. మహాకుంభమేళాలో భక్తులను గాలికొదిలేసి వీఐపీ సంస్కృతికి యోగి ప్రభుత్వం జై కొట్టిందని, ఈ నిర్లక్ష్య ధోరణిపై చర్చ జరపాలని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు పట్టుబట్టగా ఎజెండాలో ఏమేం ఉండాలో సభావ్యవహా రాల సలహా కమిటీ నిర్ణయిస్తుందని మంత్రి కిరెణ్ రిజిజు చెప్పారు.వక్ఫ్ సహా కీలక బిల్లులు ఈ సమావేశాల్లోనే.. ఈ సమావేశాల్లోనే అత్యంత కీలకమైన వక్ఫ్ సవరణ బిల్లును కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లును సమీక్షించేందుకు ఏర్పాటుచేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ తన నివేదికను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు గురువారం సమర్పించింది. వక్ఫ్ సవరణ బిల్లును గత ఏడాది లోక్‌సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టడం తెల్సిందే. కాగా గురువారం నాటి అఖిలపక్ష భేటీలో పార్లమెంట్లో ప్రవేశపెట్టే బిల్లుల జాబితాను అఖిలపక్ష నేతలకు ప్రభుత్వం అందజేసింది. ఈ జాబితాలో వక్ఫ్ సవరణ బిల్లు సైతం ఉంది. 16 బిల్లులను ఈ సెషన్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉభయసభల ముందుకొచ్చే బిల్లుల జాబితాలో బ్యాంకింగ్ చట్టాల(సవరణ) బిల్లు, రైల్వే(సవరణ) బిల్లు, విపత్తు నిర్వహణ బిల్లు, చమురు క్షేత్రాల(సవరణ) బిల్లు, షిప్పింగ్ బిల్లు, వైమానిక వస్తువుల ప్రయోజనాల పరిరక్షణ బిల్లు, త్రిభువన్ సహకారీ యూనివర్సిటీ బిల్లు, వలసల, విదేశీయుల బిల్లు వంటివి ఉన్నాయి. -
బ్లాక్ బడ్జెట్ గురించి తెలుసా?: ఎప్పుడు ప్రవేశపెట్టారంటే..
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1947 నవంబర్ 26న దేశ ఆర్థిక పరిస్థితిని అంచనా వేయడానికి మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ తరువాత క్రమంగా బడ్జెట్లను ప్రవేశపెడుతూనే ఉన్నారు. కానీ 1973లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను 'బ్లాక్ బడ్జెట్' (Black Budget) అన్నారు. ఇంతకీ దీనికి ఆ పేరు ఎందుకు వచ్చింది? దాని వెనుక ఉన్న అసలు విషయం ఏమిటనేది ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.1971లో ఇండియా - పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధం దేశాన్ని ఆర్ధిక సంక్షోభానికి గురి చేసింది. యుద్ధం కారణంగా కరువు ఏర్పడింది, మరోవైపు ప్రకృతి వైపరీత్యాలు కూడా వ్యవసాయం మీద గణనీయమైన ప్రభావం చూపించాయి. ఆ తరువాత 1973లో అప్పటి ప్రధానమంత్రి 'ఇందిరా గాంధీ' (Indira Gandhi) నాయకత్వంలో ఆర్థిక మంత్రి 'యశ్వంతరావు చవాన్' (Yashwantrao Chavan) బడ్జెట్ ప్రవేశపెట్టారు.దేశ ఆర్ధిక పరిస్థితి దిగజారిందని, కరువు కారణంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి కూడా తగ్గిందని.. ఈ కారణంగా లోటు బడ్జెట్ పెరిగిందని.. బడ్జెట్ ప్రసంగంలో చవాన్ వెల్లడించారు. ఆ సమయంలో ఏకంగా రూ. 550 కోట్ల ఆర్థిక లోటును ప్రకటించారు. ఈ క్రమంలో బొగ్గు గనులు, బీమా కంపెనీలు, ఇండియన్ కాపర్ కార్పొరేషన్ వంటి కీలక రంగాల జాతీయీకరణకు రూ. 56 కోట్లు కేటాయింపు ప్రకటించారు.ఇదీ చదవండి: బడ్జెట్లో మాకేంటి? ఎవరెవరు ఏం కోరుకుంటున్నారంటే..బొగ్గు గనులను జాతీయం చేయడం ద్వారా.. దేశంలో ఇంధన రంగం అభివృద్ధి చెందితుందని ప్రభుత్వం తెలిపింది. ఈ నిర్ణయాలు భారతదేశ ఆర్ధిక విధానాలపై ప్రభావాన్ని చూపించాయి. ఈ కారణంగానే దీనిని 'బ్లాక్ బడ్జెట్' అని అన్నారు. బ్లాక్ బడ్జెట్ అనే పదం లోటును మాత్రమే కాకుండా ఆర్థిక సంస్కరణల తక్షణ అవసరాన్ని కూడా హైలైట్ చేసింది. -
టీమ్ సీతారామన్... బడ్జెట్ మే ‘సవాల్’!
దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది... ఒకపక్క ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి జారిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు నాలుగేళ్ల కనిష్ట స్థాయి అయిన 6.4 శాతానికి తగ్గుతుందని స్వయంగా ప్రభుత్వ అంచనాలే చెబుతున్నాయి. ప్రజల వినిమయం తగ్గిపోవడం, ప్రైవేటు పెట్టుబడుల్లో స్తబ్దత, భౌగోళిక రాజకీయ ఉద్రికత్తలు మోదీ సర్కారుకు కత్తిమీద సాముగా మారాయి. రూపాయి పాతాళానికి నిచ్చెనేసినట్లు జారిపోతోంది. తాజాగా డాలర్‌తో దేశీ కరెన్సీ మారకం విలువ 86.7 జీవిత కాల కనిష్టానికి క్రాష్ అయ్యింది. మరోపక్క, అమెరికా ఆధ్యక్ష పీఠమెక్కిన ట్రంప్... చాలా దేశాలతో పాటు మన మెడపైనా సుంకాల కత్తి పెట్టడంతో టారిఫ్ వార్ 2.0కు తెరలేచింది. దీంతో మన ఎగుమతులకు గడ్డుకాలం తప్పేలా లేదు. ఇంటాబయటా ఇలాంటి ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డు స్థాయిలో వరుసగా ఎనిమిదోసారి దేశ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.50 లక్షల కోట్లకు మించిన బడ్జెట్‌ను రెడీ చేశారు. ఆర్థిక క్రమశిక్షణ గాడి తప్పకుండానే ప్రగతిని పట్టాలెక్కించడం ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలు. ఈ నేపథ్యంలో 140 కోట్లకు పైగా దేశ ప్రజల కోసం సీతారామన్ అండ్ టీమ్ తయారు చేసిన ఈ బడ్జెట్ నలభీమ పాకాన్ని అలుపెరగకుండా వండివార్చిన ఉద్ధండ అధికారుల సంగతేంటో చూద్దాం...ఎం. నాగరాజుఆర్థిక సేవల కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 1993 బ్యాచ్ త్రిపుర కేడర్ ఐఏఎస్ అధికారి ఆయన. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితుల పెంపు వంటి సంస్కరణలకు రోడ్‌మ్యాప్ రూపొందించడం, అంతకంతకూ పెరుగుతున్న సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేయడం, బ్యాంకింగ్ రంగానికి మరింత ఆర్థిక జవసత్వాలను అందించడంపై బడ్జెట్లో ఫోకస్ చేశారు.తుహిన్ కాంత పాండే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో అత్యంత సీనియర్ అధికారి. ఆర్థిక, రెవెన్యూ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2019లో దీపమ్ (పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం) కార్యదర్శిగా ఉన్నప్పటి నుంచి దేశ బడ్జెట్ రూపకల్పన ప్రక్రియలో పాలుపంచుకుంటున్నారు. 1987 బ్యాచ్ ఒడిశా కేడర్ ఐఏఎస్ అధికారి అయిన పాండే గతేడాది సెప్టెంబర్‌లో ఆర్థిక శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. దీపమ్ సెక్రటరీగా ఎయిరిండియా ప్రైవేటీకరణ, ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూ)ల డివిడెండ్ పాలసీ వంటి కీలక చర్యలు చేపట్టి దమ్మున్న అధికారిగా పేరు దక్కించుకున్నారు. దీపమ్ సెక్రటరీగా రాకముందు ఆయన ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంలో పని చేయడంతో పాటు ఐక్యరాజ్యసమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (యూఎన్ఐడీఓ) ప్రాంతీయ కార్యాలయంలో కూడా సేవలందించారు. వి. అనంత నాగేశ్వరన్2022లో ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ)గా నియమితులయ్యారు. మోదీ 3.0లోనూ కొనసాగుతుండటం ఆయన దీక్షాదక్షతలకు నిదర్శనం. 2025–26 కేంద్ర బడ్జెట్‌కు ముందు వరుసగా మూడోసారి ఆర్థిక సర్వేను రూపొందించారు. ఆర్థికాంశాల బోధనతో పాటు క్రెడిట్ సూసే గ్రూప్ ఏజీ, జూలియస్ బేయర్ గ్రూప్ వంటి దిగ్గజ సంస్థల్లో టాప్ ఎగ్జిక్యూటివ్‌గా కూడా గతంలో పనిచేశారు. నేడు పార్లమెంట్‌కు సమరి్పంచనున్న ఆర్థిక సర్వేలో నాగేశ్వరన్ భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత స్థితిగతులను కళ్లకు కట్టడంతో పాటు 2047 నాటికి వికశిత భారత్ (అభివృద్ధి చెందిన దేశం)గా నిలిపేందుకు అవసరమైన కీలక సూచనలను కూడా పొందుపరిచడానికి తీవ్రంగా శ్రమించారు. అజయ్ సేథ్ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా ప్రస్తుతం విధుల్లో ఉన్నారు. 2021 నుంచి నాలుగు దఫాలుగా బడ్జెట్ రూపకల్పన జట్టులో కీలకంగా వ్యవహరించారు. ఆర్థిక శాఖలో రెండో సీనియర్ అధికారిగా ఆయన నేతృత్వంలోనే వివిధ విభాగాలను సమన్వయం చేసుకుంటూ మొత్తం బడ్జెట్ ప్రక్రియకు చుక్కానిగా నిలుస్తున్నారు. ఆయన సారథ్యంలో బడ్జెట్ విభాగం ప్రభుత్వ ఆదాయ వ్యయాలు, రుణ సమీకరణ మధ్య సమతూకంతో బ్యాలెన్స్ షీట్‌కు తుదిమెరుగులు దిద్దింది. భారతదేశంలో తొలి సార్వ¿ౌమ గ్రీన్ బాండ్స్ జారీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ సెక్రటేరియట్ ఏర్పాటు వంటి సాహసోపేతమైన చర్యల అమలు ఘనత సేథ్ సొంతం. ద్రవ్యలోటును ప్రభుత్వ లక్ష్యమైన 4.5 శాతం దిగువన కట్టడి చేస్తూ ఆర్థిక క్రమశిక్షణకు పెద్దపీట వేయడంతో పాటు జీడీపీతో పోలిస్తే ప్రభుత్వ రుణ నిష్పత్తి విషయంలో సరికొత్త వ్యూహాన్ని అమలు చేయడం రానున్న బడ్జెట్లో ఆయన ప్రధాన అజెండాగా మారింది.మనోజ్ గోవిల్1991 బ్యాచ్ మధ్యప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన గోవిల్... మోదీ 3.0లో 2024 ఆగస్టులో కేంద్ర వ్యయ విభాగం కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. కేంద్ర బడ్జెట్ రూపకల్పనలో మొదటిసారి భాగస్వామ్యం వహిస్తున్నారు. రూపాయి ఘోరంగా పడిపోతున్న తరుణంలో బడ్జెట్లో సబ్సిడీలకు సంబంధించి అంచనాలు, కేటాయింపుల వంటి కఠిన వ్యవహరాలపై కఠోరంగా శ్రమించారు.అరుణీశ్ చావ్లా దీపమ్, ప్రభత్వ రంగ సంస్థల విభాగం (డీపీఈ) కార్యదర్శిగా 2024 డిసెంబర్లో చార్జ్ తీసుకున్నారు. 1992 బ్యాచ్ బిహార్ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన చావ్లా ప్రభుత్వానికి అదనపు ఆదాయాన్ని సమకూర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ, డాక్టరేట్ పొందిన చావ్లాకు 2014 నుంచి వ్యయాల విభాగం జాయింట్ సెక్రటరీగా పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉంది. ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణ, పీఎస్‌యూలకు చెందిన నిరుపయోగ ఆస్తుల విక్రయం, పీఎస్‌యూల కార్యకపాలాలను గాడిలో పెట్టి, మరింత బలోపేతం చేయడం వంటి వాటిపై బడ్జెట్లో ఆయన ప్రధానంగా దృష్టి సారించారు. -
ఆరోగ్య సేవలకు టానిక్ ఇస్తారా..?
ప్రజలందరికీ ఆరోగ్య సదుపాయాలు మరింతగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వీలుగా.. ప్రజారోగ్యంపై ప్రభుత్వం మరింత దృష్టి సారించడంతోపాటు కేటాయింపులను గణనీయంగా పెంచాలని ఈ రంగానికి చెందిన నిపుణులు కోరుతున్నారు. ప్రభుత్వరంగంలో కొత్త ఆస్పత్రుల ఏర్పాటుతోపాటు, ప్రైవేటు రంగంలో ఆస్పత్రులకు సైతం పలు రకాల ప్రయోజనాలతో ప్రోత్సాహం అందించాలన్న సూచనలు వస్తున్నాయి. వైద్య సేవలు, పరికరాలు, ఔషధాలపై జీఎస్టీని తగ్గించాలన్న డిమాండ్లు నెలకొన్నాయి. మరోవైపు 11 కోట్ల మందికి ఉపాధి కలి్పస్తూ జీడీపీలో 30–35 శాతం వాటా కలిగిన ఎంఎస్ఎంఈ రంగం సైతం విధానపరమైన మద్దతు చర్యలను ఆశిస్తోంది. అంచనాలు–డిమాండ్లు.. → 2024–25 బడ్జెట్లో ఆరోగ్య రంగానికి రూ.90,171 కోట్లు కేటాయించారు. అత్యాధునిక ఆరోగ్య సదుపాయాలు మరింత మందికి అందుబాటులోకి రావాలంటే జీడీపీలో కేటాయింపులు 2.5 శాతానికి పెంచాలి. → ఒకరికి వినియోగించిన లేదా పునరి్వనియోగానికి అనుకూలంగా మార్చిన (రిఫర్బిష్డ్) వైద్య పరికరాల విషయంలో తగిన నియంత్రపరమైన విధానాల తీసుకురావడం ద్వారా.. ఈ పరికరాలు సమాజంలో వైద్య సదుపాయాలు అంతగా అందని వర్గాలకు చేరువ చేయొచ్చు. → వ్యాధి నివారణ ముందస్తు ఆరోగ్య చికిత్సలు, టెస్ట్‌లకు పన్నుల ప్రయోజనాలు కల్పించాలి. వైద్య, ఆరోగ్య సేవలు, జీవనశైలి వ్యాధులు(మధుమేహం, స్థూలకాయం తదితర) ప్రాణాధార ఔషధాలపై జీఎస్టీని తగ్గించాలి. → గత బడ్జెట్లలో టెలీ మెడిసిన్‌కు మద్దతు లభించింది. నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ (ఎన్డీహెచ్ఎం)ను సైతం కేంద్రం ప్రవేశపెట్టింది. 2025 బడ్జెట్లోనూ హెల్త్ యాప్‌లు, ఏఐ ఆధారి డయాగ్నోస్టిక్స్ టూల్స్ తదితర డిజిటల్ హెల్త్ సేవల విస్తరణ దిశగా చర్యలు ఉంటాయని అంచనా. → ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్స్ కేంద్రాల విషయంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) బలోపేతం చేసే దిశగా చర్యలు అవసరం. → ఫార్మాస్యూటిక్సల్, వైద్య పరికరాల కోసం దేశం మొత్తానికి ఒకే నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలి. → పరిశోధన, అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు, ప్రోత్సాహకాలు కల్పించాలి. ప్రభుత్వం నుంచి పరిశోధనా ప్రోత్సాహకాలు ప్రస్తుతం ఇనిస్టిట్యూషన్లు, విద్యా కేంద్రాలకే వెళుతున్నాయి.→ క్లినికల్, డిస్కవరీ రీసెర్చ్ కార్యక్రమాల్లో పాల్గొనే కాంట్రాక్ట్ రీసెర్చ్ సంస్థలకు (సీఆర్వోలు) నిధులు, ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఎంఎస్ఎంఈలకు రుణ విస్తృతి అవసరం→ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎఎస్ఎంఈలు) కృత్రిమ మేధ (ఏఐ) టెక్నాలజీతో అనుసంధానం కావాల్సి ఉంటుంది. కనుక ఈ రంగంలోని కారి్మకులకు డిజిటల్ నైపుణ్యాల కల్పన, ఏఐ ఆధారిత శిక్షణ కార్యక్రమాలను అందించాలి. → ఎఎస్ఎంఈలకు నిధుల లభ్యత పెద్ద సమస్యగా ఉంది. అత్యవసర క్రెడిట్ గ్యారంటీ సహా పలు రకాల పథకాలను ప్రభుత్వం తీసుకొచ్చినప్పటికీ ఆచరణలో లోపం నెలకొంది. దీంతో టైర్ 3, 4, గ్రామీణ ప్రాంతాల్లోని ఎంఎస్ఎంఈలకు రుణాల లభ్యత కష్టంగానే ఉంది. ఏఐ ఆధారిత రుణ దరఖాస్తుల మదింపు, రిస్క్ ప్రొఫైలింగ్‌తో రుణ లభ్యతను విస్తృతం చేయొచ్చు. → తయారీ విస్తరణకు, తక్కువ వడ్డీరేట్లపై రుణాలు అందించాలి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
Budget-2025: బడ్జెట్లో మాకేంటి?
కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఆర్థికమంత్రి 'నిర్మలా సీతారామన్' (Nirmala Sitharaman) చదివే పద్దుపై అందరిలోనూ అంచనాలున్నాయి. ఆదాయ పన్ను విషయంలో ఊరట ఉంటుందా? ధరలు తగ్గిస్తారా?. ఏవి తగ్గుతాయి? ఏవి పెరుగుతాయి? ఇలా రకరకాల ప్రశ్నలకు ఆరోజున సమాధానం దొరకనుంది. అయితే సాధారణంగా బడ్జెట్‌తో మాకేంటి? అని జనం అనుకుంటారనే భావన ఒకటి ఉంది. కానీ, అది తప్పని సాక్షి.కామ్ ప్రయత్నం నిరూపించింది. బడ్జెట్లో మాకేంటి అంటున్న ‘సామాన్యుడి’ మనోగతం వాళ్ల మాటల్లోనే తెలుసుకుందాం.. 👉సాధారణ ప్రజలకు మాదిరిగా కాకుండా.. సూపర్ రిచ్ వారికి కొంత ట్యాక్స్ పెంచాలి. ఎందుకంటే సాధారణ ప్రజలు, కోటీశ్వరులు ఇద్దరూ కూడా సమానంగా ట్యాక్స్ కడుతున్నారు. ఇది ధనవంతులపై ప్రభావం చూపకపోయినా, సామాన్యులకు భారంగా ఉంటుందని కార్పొరేట్ ఉద్యోగి అన్నారు. టోల్ గేట్ చార్జీలను కూడా కొంత తగ్గిస్తే బాగుంటుందని కూడా పేర్కొన్నారు.👉భారత్ వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి వ్యవసాయ రంగానికి కొంత ఎక్కువ బడ్జెట్ కేటాయించాలి. రైతుకు ఉపయోగపడే విధంగా బడ్జెట్ ఉంటే బాగుంటుందని.. చిత్తూరు జిల్లాకు చెందిన యువకుడు పేర్కొన్నారు.👉మధ్యతరగతి వేతన జీవులు.. ప్రతీసారి బడ్జెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. కానీ చివరకు నిరాశే మిగులుతూ వస్తోంది. ఈసారైనా మాలాంటి వాళ్ళను దృష్టిలో ఉంచుకుని ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచడం వల్ల, కొంత ఉపశమనం లభిస్తుంది. అత్యధిక జనాభా ఉన్న భారత్‌లో ఆరోగ్య రంగానికి బడ్జెట్లో ప్రాధాన్యత చాలా తక్కువగా ఉంటోంది. కాబట్టి ఈసారి బడ్జెట్లో మరీ ముఖ్యంగా ఆరోగ్య రంగానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ::ఏపీకి చెందిన ఓ వైద్యుడి అభిప్రాయం👉ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ. 10 లక్షలకు పెంచాలని.. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే, అందరికి ఉపయోగకరంగా ఉంటుందని, మదనపల్లెకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి నిర్మలమ్మ ప్రవేశపెట్టనున్న బడ్జెట్ 2025పై తన ఆశాభావం వ్యక్తం చేశారు.👉2025-26 బడ్జెట్లో నిత్యావసరాల ధరలపై ట్యాక్స్ తగ్గించాలని, చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవారికి కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని మెదక్ జిల్లాకు చెందిన డిగ్రీ విద్యార్ధి చెప్పారు.👉బడ్జెట్ వచ్చినప్పుడల్లా.. ఏదేదో అంచనాలు వేసుకుంటూనే ఉంటాను. కానీ అంచనాలను తగ్గట్టుగా ఎప్పుడూ బడ్జెట్ ఉండటం లేదు. ఈ సారైనా నిత్యావసర వస్తువులపై ట్యాక్స్ తగ్గించాలని జర్నలిస్ట్ పేర్కొన్నారు.👉నిత్యావసరాల ధరలతో పాటు ఎలక్ట్రానిక్స్ & ఆటోమొబైల్ మీద కూడా ట్యాక్స్ తగ్గించాలని ఆశిస్తున్నట్లు.. హైదరాబాద్‌లో కెమెరామెన్‌గా పని చేసే వ్యక్తి చెప్పారు.👉సీనియర్ సిటిజన్, హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి, ఈ బడ్జెట్ 2025పై స్పందిస్తూ.. వ్యవసాయదారులకు అవసరమైన పథకాలను మరిన్ని ప్రవేశపెట్టాలని, వ్యవసాయ పనిముట్ల మీద కూడా ట్యాక్స్ తగ్గించాలని పేర్కొన్నారు.:: సిరికుమార్, సాక్షి వెబ్ బిజినెస్ డెస్క్ -
కేంద్ర బడ్జెట్ పై సామాన్య ప్రజల అభిప్రాయాలు
-
బడ్జెట్ 2025 రూపొందించిన ప్రముఖులు వీరే..
ఆర్థిక మంత్రి 'నిర్మలా సీతారామన్' (Nirmala Sitharaman) తన ఎనిమిదవ బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న సమర్పించనున్నారు. వికసిత భారత్ లక్ష్యంగా కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఇప్పటికే.. బడ్జెట్ తయారీ చివరి దశకు గుర్తుగా 'హల్వా వేడుక' కూడా ముగిసింది. కాగా త్వరలో సమర్పించనున్న బడ్జెట్‌ను రూపొందించే వ్యక్తులు ఎవరనేది, ఈ కథనంలో చూసేద్దాం.తుహిన్ కాంత పాండే (ఆర్థిక & రెవెన్యూ కార్యదర్శి)తుహిన్ కాంత పాండే 1987 బ్యాచ్ ఒడిశా కేడర్ ఐఏఎస్ అధికారి. ఆర్ధిక, రెవెన్యూ విభాగాల్లో ఈయనకు గొప్ప అనుభవం ఉంది. పన్ను రాయితీలను బ్యాలెన్స్ చేస్తూ.. ఆదాయాలను తగ్గకుండా చూసుకోవాల్సిన పని ఈయనదే. బడ్జెట్ ప్రారంభం కావడానికి ముందు.. పాండే ఈ బాధ్యతలను స్వీకరించారు. కాగా రాబోయే సెషన్లో ఆదాయపన్ను చట్టాన్ని పునరుద్ధరించే అవకాశం ఉంది.వీ అనంత నాగేశ్వరన్ (ప్రధాన ఆర్థిక సలహాదారు)అనంత నాగేశ్వరన్ ఐఐఎమ్ అహ్మదాబాద్ పూర్వ విద్యార్థి. ఈయన ప్రధానమంత్రికి ఆర్థిక సలహా మండలిలో తాత్కాలిక సభ్యునిగా పనిచేశారు. అతను, అతని బృందం రచించిన ఆర్థిక సర్వే అభివృద్ధిని ప్రోత్సహించడం, సంస్కరణ ఫలితాలను అంచనా వేయడం వంటివి చేస్తుంది.మనోజ్ గోవిల్ (డిపార్ట్మెంట్ ఆప్ ఎక్స్పెండిచర్ కార్యదర్శి)మనోజ్ గోవిల్ 1991 బ్యాచ్ మధ్యప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి. ఈయన డిపార్ట్మెంట్ ఆప్ ఎక్స్పెండిచర్ కార్యదర్శిగా చేరడానికి ముందు.. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా ఉన్నారు. రాయితీల హేతుబద్ధీకరణ మరియు కేంద్ర ప్రాయోజిత పథకాలు ఖర్చు నాణ్యతను మెరుగుపరచడం వంటివి గోవిల్ బృందం విధి.అజయ్ సేథ్ (ఆర్ధిక వ్యవహారాల శాఖ కార్యదర్శి)అజయ్ సేథ్.. 1987 బ్యాచ్ కర్ణాటక కేడర్ ఐఏఎస్ అధికారి. ఈయన తుది బడ్జెట్ పత్రాలను సిద్ధం చేయడం, స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని పర్యవేక్షించే విభాగానికి నాయకత్వం వహిస్తారు. ఆర్ధిక వనరులను నిర్వహించడం, వ్యయాల నియంత్రణ అంటివన్నీ ఆయన పర్యవేక్షణలోనే ఉంటాయి.ఇదీ చదవండి: అరుణాచల్ ప్రదేశ్‌పై ప్రశ్న.. ఖంగుతినే సమాధానం చెప్పిన డీప్సీక్ఎం నాగరాజు (డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్)నాగరాజు 1993 బ్యాచ్ త్రిపుర కేడర్ ఐఏఎస్ అధికారి. ఈయన డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో చేరడానికి ముందు.. ప్రైవేట్ వాణిజ్య మైనింగ్ రంగంలో ఉన్నారు. ఆ సమయంలోనే సుమారు 113 కంటే ఎక్కువ బొగ్గు గనులను వేలం వేయడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఈయన బృందం డిపాజిట్ల మొబలైజేషన్, ఫిన్‌టెక్‌ల నియంత్రణ, బీమా కవరేజిలను పెంచడం వంటివి చూస్తుంది.అరుణిష్ చావ్లా (డీఐపీఏఎం & డీపీఈ సెక్రటరీ)అరుణిష్ చావ్లా 1992 బ్యాచ్ బీహార్ కేడర్ ఐఏఎస్ అధికారి. అయితే ఆర్థిక మంత్రి బృందంలో కొత్త సభ్యుడు. చావ్లా ఇంతకుముందు ఫార్మాస్యూటికల్స్ విభాగానికి నాయకత్వం వహించారు. అయితే ప్రస్తుతం ఆస్తుల నిర్వహణ, డిజ్ఇన్వెస్ట్మెంట్ వంటి అంశాలను పర్యవేక్షిస్తున్నారు. అంతే కాకుండా.. ఐడీబీఐ బ్యాంక్, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల దగ్గర ఉన్న ఆస్తుల నుంచి నిధుల సమీకరణకు ప్రణాళికలు తయారు చేశారు. -
బడ్జెట్లో అన్నదాత వాటా పెరుగుతుందా..?
భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముకగా నిలుస్తోంది. లక్షలాది మందికి ఈ రంగం జీవనోపాధిని అందిస్తోంది. అయితే వాతావరణ మార్పుల వల్ల పంటనష్టం పెరుగుతోంది. దాంతో సంప్రదాయ వ్యవసాయ పద్ధతులు పాటిస్తున్న రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి ప్రవేశపెట్టబోయే బడ్జెట్(Budget 2025)లో సుస్థిర వ్యవసాయం దిశగా ప్రభుత్వం కేటాయింపులు పెంచాలి. వీటితో వ్యవసాయ రంగంలో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించవచ్చు. అధిక విలువలు కలిగిన పంటల్లో ప్రైవేట్ పెట్టుబడులు పెరిగేలా ప్రోత్సాహకాలు అందించవచ్చు. అన్నదాతలకు అనుకూలంగా ఉన్న సాంకేతికతలను అభివృద్ధి చేసేందుకు డిజిటల్ ఇంటిగ్రేషన్‌ను ప్రవేశపెట్టవచ్చు.స్థితిస్థాపక వ్యవసాయంవాతావరణ స్థితిస్థాపక వ్యవసాయంలో కరవు, వరదలు, వడగాలులు వంటి తీవ్రమైన పరిస్థితులను తట్టుకునేలా కొత్త పద్ధతులపై ప్రభుత్వం రైతులను ప్రోత్సహించాలి. కరవును తట్టుకునే విత్తనాలు, సమర్థవంతమైన నీటి యాజమాన్య వ్యవస్థలు, భూసార పరిరక్షణ పద్ధతుల వాడకంపై అవగాహన అందించాలి. పంట మార్పిడి, సేంద్రియ వ్యవసాయం వంటి కార్యక్రమాలు భూసారాన్ని పెంచడంతో పాటు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గిస్తాయి. సబ్సిడీలు, సాంకేతిక మద్దతును అందించడం ద్వారా ప్రభుత్వం స్థిరమైన పద్ధతులను అవలంబించేలా రైతులను ప్రోత్సహించాలి.ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (PPP) వ్యవసాయ ముఖచిత్రాన్ని మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు నమ్ముతున్నారు. ప్రైవేటు సంస్థలతో కలిసి పనిచేయడం ద్వారా, వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచడానికి ప్రభుత్వం మరింత సాంకేతికతను ఉపయోగించుకోవాలి. ఉదాహరణకు, పీపీపీల సాయంతో అధునాతన వ్యవసాయ సాంకేతికతలు సృష్టించి వ్యవసాయ పరికరాలు, అధిక నాణ్యత విత్తనాల అభివృద్ధి, వాటి వ్యాప్తిని సులభతరం చేసేలా చూడాలి. ప్రైవేట్ కంపెనీలు కోల్డ్ స్టోరేజీ(Cold Storage) సౌకర్యాలు, రవాణా నెట్‌వర్క్‌లు వంటి గ్రామీణ మౌలిక సదుపాయాలపై పెట్టుబడి పెట్టేలా ప్రభుత్వం సహకారం అందించాలి. ఈ విధానాలు వ్యవసాయ రంగం సామర్థ్యాన్ని, లాభదాయకతను పెంచుతాయి.అధిక విలువ కలిగిన పంటలువ్యవసాయ ఆదాయాన్ని మరింత వైవిధ్యంగా మార్చడానికి పండ్లు, కూరగాయలు(Vegetables), సుగంధ ద్రవ్యాలు, ఔషధ మొక్కలు వంటి అధిక విలువ కలిగిన పంటలపై ప్రభుత్వం పెట్టుబడి పెట్టాలి. సాంప్రదాయ ప్రధాన పంటలతో పోలిస్తే ఈ పంటలకు తక్కువ నీరు, భూమి అవసరం అవుతుంది. దాంతోపాటు అధిక రాబడిని పొందే వీలుంది. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఈ పంటల సాగు పెంచేందుకు రైతులకు ఆర్థిక ప్రోత్సాహకాలు, శిక్షణ అందించాలి. వాతావరణ మార్పులను తట్టుకునే పంట రకాలపై పరిశోధనలు జరగాలి.ఇదీ చదవండి: భారత పారిశ్రామికవేత్తలకు మస్క్ ఆతిథ్యండిజిటల్ ఇంటిగ్రేషన్డిజిటల్ ఇంటిగ్రేషన్ వ్యవసాయ రంగానికి ఎంతో తోడ్పడుతుంది. డిజిటల్ సాధనాల ద్వారా ప్రభుత్వం రైతులకు రియల్ టైమ్ సమాచారాన్ని అందించే వీలుంది. ఉదాహరణకు, మొబైల్ యాప్‌ల ద్వారా వాతావరణ సూచనలు, తెగుళ్ల నియంత్రణ సలహాలు, మార్కెట్ ధరలను అందించవచ్చు. రైతులు ఈ సమాచారంతో అనువైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇవి సహాయపడుతాయి. ఇప్పటికీ చాలామంది రైతులు సాంకేతికతకు దూరంగా ఉన్నారు. దీనిపై ప్రభుత్వం ప్రజల్లో అవగాహన పెంచాలి. ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ల్లో రైతులను నేరుగా వినియోగదారులతో అనుసంధానించే అవకాశం ఉంటుంది. దళారులను తొలగించి రైతులకు మద్దతుగా నిలవాలి. -
రెండు దశల్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు(Budget 2025 Session) జనవరి 31 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి. ఈ సెషన్‌ను రెండు భాగాలుగా విభజించారు. మొదటి భాగం జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు, రెండో భాగం మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు జరుగుతుంది. ఈమేరకు కేంద్రమంత్రి కిరణ్ రిజుజు తన ఎక్స్ ఖాతాలో వివరాలు వెల్లడించారు.జనవరి 31న ఉదయం 11 గంటలకు ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించడంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ ప్రసంగంలో రాబోయే సంవత్సరానికి ప్రభుత్వ ఎజెండా, ప్రాధాన్యతలను వివరించనున్నారు. రాష్ట్రపతి ప్రసంగం అనంతరం దేశ ఆర్థిక పనితీరు, భవిష్యత్ అంచనాలను తెలిపే ఆర్థిక సర్వేను ప్రవేశపెడతారు.కేంద్ర బడ్జెట్ సమర్పణఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. సీతారామన్‌కు ఇది వరుసగా ఎనిమిదో పూర్తికాల బడ్జెట్ కావడం విశేషం. ఈ బడ్జెట్లో కీలక ఆర్థిక సవాళ్లను పరిష్కరించడంతో పాటు ప్రభుత్వ ఆర్థిక విధానాలను వివరిస్తారు. ఈ బడ్జెట్లోని అంశాలను పార్లమెంటు ఉభయ సభలు నిశితంగా పరిశీలిస్తాయి. ఇందులోని అంశాలు, వివిధ నిబంధనలపై చర్చలు, వాదోపవాదాలు జరుగుతాయి.ఇదీ చదవండి: క్విక్ కామర్స్‌పై విమర్శలు ఎందుకు..The Hon'ble President of India Smt Droupadi Murmu ji on the recommendation of the Government of India, has approved summoning both Houses of Parliament for the Budget Session 2025 from 31st January, 2025 to 4th April 2025 (subject to exigencies of parliamentary business).-The… pic.twitter.com/pCVXIEexXp— Kiren Rijiju (@KirenRijiju) January 17, 2025రెండో దశల్లో చర్చలుజనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరిగే తొలి దశ సమావేశాల అనంతరం వివిధ పార్లమెంటరీ కమిటీలు బడ్జెట్ ప్రతిపాదనలను సమగ్రంగా పరిశీలించేందుకు వీలుగా ఫిబ్రవరి 14 నుంచి మార్చి 9 వరకు పార్లమెంట్ విరామం తీసుకోనుంది. తిరిగి మార్చి 10న రెండో విడత సమావేశాలు పునఃప్రారంభమై ఏప్రిల్ 4న ముగుస్తాయి. ఈ సందర్భంగా వివిధ మంత్రిత్వ శాఖల గ్రాంట్ల డిమాండ్లపై చర్చించి బడ్జెట్ ప్రక్రియను పూర్తి చేస్తారు. -
పాత పన్ను విధానం తొలగింపు..?
కేంద్ర ప్రభుత్వం 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరిలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో పాత వ్యక్తిగత ఆదాయపు పన్ను(Income Tax) విధానంపై కీలక నిర్ణయాలు తీసుకోనుందని సమాచారం. క్రమంగా ఈ పాత పన్ను(Old Tax) విధానాన్ని తొలగించే ప్రకటనలు చేయాలని ప్రభుత్వ యోచిస్తోంది. కొత్త పన్ను(New Tax) విధానాన్నే పన్నుదారుల ఎంపికగా మార్చే లక్ష్యంతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రోడ్ మ్యాప్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటివరకు పన్నుదారులు పాత, కొత్త విధానాల్లో ఏదైనా ఎంచుకునే వీలుంది. ప్రభుత్వం ఒకవేళ దీనిపై నిర్ణయం తీసుకుంటే ఇకపై ఈ వెసులుబాటు ఉండదని నిపుణులు చెబుతున్నారు.2021 ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టిన కొత్త పన్ను విధానం తక్కువ పన్ను రేట్లను అందిస్తుంది. కానీ పాత పన్ను విధానంలో ఉన్నన్ని మినహాయింపులు మాత్రం కొత్త విధానంలో లేవని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పటికే 72% పైగా పన్ను చెల్లింపుదారులు కొత్త విధానాన్ని అనుసరిస్తున్నారు. ఈ విధానంలో ప్రభుత్వం తీసుకొచ్చిన తక్కువ రేట్లకు పన్నుదారులు ఆకర్షితులయ్యారు. వీరిని మరింత ప్రోత్సహించడానికి కొత్త శ్లాబ్‌లను తీసుకురావాలని ప్రభుత్వం వద్ద ప్రతిపాదనలున్నాయి.ఇదీ చదవండి: మీకు వచ్చే పెన్షన్ తెలుసుకోండిలా..ప్రస్తుతం కొత్త విధానంలో ఏడాదికి రూ.3 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు ఉంది. ఈ పరిమితిని రూ.4 లక్షలకు పెంచే అవకాశం ఉంది. మొదటి శ్లాబుగా ఉన్న రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల పరిధిని రూ.4 లక్షల నుంచి రూ.7 లక్షలకు సర్దుబాటు చేయవచ్చు. కొత్త విధానం చాలా మందికి అనుకూలంగా ఉన్నప్పటికీ, ఇంటి అద్దె భత్యం, పెట్టుబడులు, గృహ రుణ వడ్డీ వంటి వివిధ మినహాయింపులు, వాటి వల్ల కలిగే ప్రయోజనం పొందే అవకాశం పాత విధానంలో మెరుగ్గా ఉండేదనే వాదనలున్నాయి. -
ప్రభుత్వ మూలధన వ్యయాలు తగ్గుతాయ్!
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్లో మూలధన వృద్ధికి కోత పెట్టే అవకాశం ఉందని విదేశీ బ్రోకరేజ్ గోల్డ్‌మన్ శాక్స్ అంచనా వేసింది. మార్చితో ముగిసే 2024–25 వార్షిక బడ్జెట్లో మూలధన వృద్ధి రేటు 17 శాతం అయితే, రానున్న 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఈ వృద్ధి రేటు 7 శాతానికి పరిమితం కావచ్చని విశ్లేషించింది. ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటును 4.5 శాతానికి (2024–25లో 4.9 శాతం) కట్టడి చేయడమే లక్ష్యంగా కొత్త బడ్జెట్లో మూలధన వ్యయాలకు కోత పెట్టే వీలుందని పేర్కొంది. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే..ఇదీ చదవండి: ఎలాన్ మస్క్ చేతికి టిక్‌టాక్..?లోక్‌సభలో బీజేపీకి మెజారిటీ సీట్లు రాని నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలకు, సంక్షేమ పథకాలకు బడ్జెట్ నిధులు కేటాయింపు పెరిగే అవకాశం ఉంది. సెప్టెంబరు త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 11 త్రైమాసిక కనిష్ట స్థాయి 5.4 శాతం తగ్గుదలకు ప్రభుత్వ మూలధన వ్యయాల్లో తగ్గుదల ఒక కారణం. ఆర్బీఐ ద్రవ్య పరపతి కఠిన విధానమూ ఇందుకు దారితీసింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 2047 నాటికి 100 ఏళ్లు పూర్తవనున్న నేపథ్యంలో వచ్చే బడ్జెట్ దీర్ఘకాలిక ఆర్థిక విధానం గురించి కూడా విస్తృత స్థాయిలో చర్చించే వీలుంది. ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభించే తయారీ, సూక్ష్మ, లఘు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, ఆయా రంగాలకు రుణ లభ్యత, గ్రామీణ గృహ నిర్మాణాలకు ప్రోత్సాహం, ధరల స్థిరత్వానికి ఫుడ్ చైన్ పటిష్టత వంటి అంశాలపై బడ్జెట్ దృష్టి సారించే వీలుంది.