కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్‌పై పలు వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2025లో మధ్యతరగతికి ఉపశమనం, ఆర్థిక వృద్ధిని పెంచే లక్ష్యం అంటూ ఆదాయపు పన్ను శ్లాబ్‌ల్లో మార్పులు చేశారు. కొత్త పన్ను విధానంలో రూ.12 లక్షల ఆదాయం వరకు ఎటువంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేకుండా రిబేట్ ప్రకటించారు.
ఇది 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు నెరవేర్చే బడ్జెట్‌గా ప్రధాని మోదీ అభివర్ణించారు. బడ్జెట్‌లు సాధారణంగా ఖజానాను నింపడంపై దృష్టి సారిస్తాయి. కానీ.. ఈ బడ్జెట్ మాత్రం ప్రజల జేబులు నింపేందుకు అంటూ వ్యాఖ్యానించారు. ఈ బడ్జెట్‌లో రూ.12 లక్షల వరకూ ఎలాంటి పన్ను లేదు. అన్ని ఆదాయ వర్గాలకు పన్నులను తగ్గించారు. ఇది మధ్య తరగతి ప్రజలకు ఎంతో ప్రయోజనకరం’’ అంటూ ప్రధాని పేర్కొన్నారు.
కేంద్రం చెప్పినట్లు ఈ బడ్జెట్ పేద, మధ్యతరగతికి లాభం చేకూర్చేదేనా? అంటూ అన్ని సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో సాక్షి పోల్ క్వశ్చన్‌కు భారీ సంఖ్యలో ప్రజలు స్పందించారు. అవును, కాదు, ఫిఫ్టీ.. ఫిఫ్టీ అనే ప్రశ్నలకు అధిక శాతం మంది కాదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్కువ శాతం మాత్రమే ‘అవును’ అని సమాధానం ఇచ్చారు. మిగిలిన శాతం ఫిప్టీ.. ఫిప్టీ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment