public
-
Sakshi Poll: కేంద్ర బడ్జెట్‌పై జనం ఏమన్నారంటే..
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్‌పై పలు వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2025లో మధ్యతరగతికి ఉపశమనం, ఆర్థిక వృద్ధిని పెంచే లక్ష్యం అంటూ ఆదాయపు పన్ను శ్లాబ్‌ల్లో మార్పులు చేశారు. కొత్త పన్ను విధానంలో రూ.12 లక్షల ఆదాయం వరకు ఎటువంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేకుండా రిబేట్ ప్రకటించారు.ఇది 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు నెరవేర్చే బడ్జెట్‌గా ప్రధాని మోదీ అభివర్ణించారు. బడ్జెట్లు సాధారణంగా ఖజానాను నింపడంపై దృష్టి సారిస్తాయి. కానీ.. ఈ బడ్జెట్ మాత్రం ప్రజల జేబులు నింపేందుకు అంటూ వ్యాఖ్యానించారు. ఈ బడ్జెట్లో రూ.12 లక్షల వరకూ ఎలాంటి పన్ను లేదు. అన్ని ఆదాయ వర్గాలకు పన్నులను తగ్గించారు. ఇది మధ్య తరగతి ప్రజలకు ఎంతో ప్రయోజనకరం’’ అంటూ ప్రధాని పేర్కొన్నారు.కేంద్రం చెప్పినట్లు ఈ బడ్జెట్ పేద, మధ్యతరగతికి లాభం చేకూర్చేదేనా? అంటూ అన్ని సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో సాక్షి పోల్ క్వశ్చన్‌కు భారీ సంఖ్యలో ప్రజలు స్పందించారు. అవును, కాదు, ఫిఫ్టీ.. ఫిఫ్టీ అనే ప్రశ్నలకు అధిక శాతం మంది కాదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్కువ శాతం మాత్రమే ‘అవును’ అని సమాధానం ఇచ్చారు. మిగిలిన శాతం ఫిప్టీ.. ఫిప్టీ అని తెలిపారు. -
బడ్జెట్‌పై సామాన్యుల ఆశలు
-
చంద్రబాబు వ్యాఖ్యలపై మహిళలు ఫైర్
-
అందుబాటులోకి టిన్టిన్, పొపాయ్
పిల్లలు మొదలు పెద్దలదాకా ప్రపంచవ్యాప్తంగా అందరినీ అలరించే దిగ్గజ ‘టామ్ అండ్ జెర్రీ’ కార్టూన్ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో కనువిందుచేయడం తెల్సిందే. దశాబ్దాలు గడిచిపోవడంతో ఈ వీడియోలపై ఇప్పుడు ఎలాంటి కాపీరైట్ వంటి మేథోహక్కులు ఎవరికీ లేవు. ఇప్పుడు వీటిని అందరూ ఉపయోగించుకోవచ్చు. రచయితకు ఎలాంటి రాయితీ చెల్లించకుండానే వాడుకోవచ్చు. అచ్చం ఇలాగే అమెరికాలో జనవరి ఒకటో తేదీ నుంచి ఇంకొన్ని కార్టూన్ పాత్రలు, అలనాటి అపురూప రచనలకు కాపీరైట్ గడువు ముగిసింది. దీంతో ఇప్పుడు ప్రజలంతా వాటిని తమకు నచ్చినట్లు ఉచితంగా వినియోగించుకునే అవకాశం లభించింది. ఒకప్పటి క్లాసిక్స్ అయిన టిన్టిన్, పొపాయ్ కార్టూన్ పాత్రలతోపాటు మరికొన్ని ప్రసిద్ధ రచనలపై కాపీరైట్ గడువు జనవరి ఒకటో తేదీతో ముగిసింది. వర్జీనియా వూల్ఫ్ రాసిన ‘ఎ రూమ్ ఆఫ్ వన్స్ ఓన్’, ఎర్నెస్ట్ హెమ్మింగ్వే రాసిన ‘ఎ ఫేర్వెల్ టు ఆర్మ్స్’, మార్క్స్ బ్రదర్స్ మొదటి చలన చిత్రం ‘ది కోకోనట్స్’ వంటి క్లాసిక్స్ ఈ జాబితాలో ఉన్నాయి. 1924లోని సౌండ్ ట్రాక్స్ కూడా కాపీరైట్ రహితం అయ్యాయి.జాబితాలో ఏమేమున్నాయి? కొత్త సంవత్సరంలో కాపీరైట్ కోల్పోనున్న సాంస్కృతిక రచనల జాబితాను ‘సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ ది పబ్లిక్ డొమైన్’ ప్రతి డిసెంబర్లో ప్రచురిస్తుంది. ఆగ్నేయ అమెరికా రాష్ట్రమైన నార్త్ కరోలినాలోని డ్యూక్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లాలో భాగమైన ఈ కేంద్రం ఈ జాబితాను తన వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. జనవరి ఒకటో తేదీ నుంచి అమెరికా పబ్లిక్ డొమైన్‌లోకి ప్రవేశించిన సాహిత్యంలో వర్జీనియా వూల్ఫ్ రాసిన ‘ఎ రూమ్ ఆఫ్ వన్స్ ఓన్’, ఎర్నెస్ట్ హెమ్మింగ్వే రాసిన ‘ఎ ఫేర్వెల్ టు ఆర్మ్స్’, విలియం ఫాల్కనర్ రాసిన ‘ది సౌండ్ అండ్ ది ఫ్యూరీ’, జర్మన్ రచయిత ఎరిక్ మారియా రెమార్క్ రాసిన ‘ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్’ ఆంగ్ల అనువాదం ఉన్నాయి. ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ దర్శకత్వం వహించిన ‘బ్లాక్ మెయిల్’, ఆస్కార్ అవార్డు గ్రహీత జాన్ ఫోర్డ్ రూపొందించిన మొదటి సౌండ్ ఫిల్మ్ ‘ది బ్లాక్ వాచ్’ కూడా పబ్లిక్ డొమైన్‌లోకి వచ్చాయి. ఫ్రెంచ్ స్వరకర్త మారిస్ రావెల్ ‘బొలెరో’, జార్జ్ గెర్‡్షవిన్ ‘యాన్ అమెరికన్ ఇన్ పారిస్’ వంటి ట్రాక్స్ సైతం అందుబాటులోకి వచ్చాయి. ఈ సంవత్సరం కాపీ రైట్ రహితమైన కార్టూన్ పాత్రల్లో టిన్టిన్, పొపాయ్ ది సెయిలర్ ఉన్నాయి. కామిక్ పాత్ర టిన్టిన్.. 1929లో బెల్జియం వార్తాపత్రికలో అరంగేట్రం చేసింది. కార్టూనిస్ట్ ఎల్జీ క్రిస్లర్ సెగర్ సృష్టించిన పొపాయ్ ది సెయిలర్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందాయి. 95 ఏళ్ల తరువాత... అమెరికా కాపీరైట్ చట్టం ప్రకారం పుస్తకాలు, చలనచిత్రాలు, ఇతర కళాకృతులకు 95 సంవత్సరాల తర్వాతే కాపీరైట్స్ ముగుస్తాయి. అలా 1929కి చెందిన వేలాది రచనలు, 1924లో రికార్డ్ అయిన అనేక సౌండ్స్ అమెరికాలో ఇప్పుడు ఉచితంగా అందుబాటులోకి వచ్చాయి. వేలాది సినిమాలు, పాటలు, పుస్తకాలు జనవరి 1 నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. 2024 కాపీరైట్స్ పూర్తయిన మిక్కీమౌస్, 2023లో పబ్లిక్ డొమైన్‌లోకి ప్రవేశించిన విన్నీ ది పూహ్ ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మాటే మంత్రం.. తడబడే మాటకు తర్ఫీదు ఇస్తున్నారు
మాటలే మంటలు రేపుతాయి.. చెలరేగిన మంటలను నోటి మాటలే చల్లార్చుతాయి. నోట్ల కట్టల కంటే నోటి మాటకే పదునెక్కువ. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఇందులో ప్రతి ఒక్కటీ తీసిపడేయలేని నిత్యసత్యాలే. మనం మాట్లాడే మాటకున్న విలువను తెలియజేసే సామెతలు. మనిషికి ఉన్న 64 కళల్లో వాక్చాతుర్యం ఒకటి. మాటలే కదా ఎన్నయినా మాట్లాడతాం అనుకుంటే పొరపడినట్లే.. మైక్ పట్టుకుని నలుగురిలో అనర్గళంగా మాట్లాడటం అందరికీ సాధ్యం కాదు. ప్రపంచంలో 514 రకాల భయాలు ఉండగా.. అందులో ప్రథమ స్థానంలో పబ్లిక్ స్పీచ్ నిలిచింది. రెండో స్థానంలో మరణం ఉందని అమెరికాకు చెందిన పలు సర్వే సంస్థలు తెలియజేస్తున్నాయి. నలుగురిలో ప్రసంగించాలంటే.. మనసులో ఏదో తెలియని భయం. మైక్ పట్టుకున్న చేతికి వణుకు మొదలవుతుంది. వీటిని అధిగమించిన వారికే ఏ రంగంలోనైనా ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. మనలో చాలా మందికి ఎన్నో చెప్పాలని మనసులో ఉంటుంది. అయితే బయటకు చెప్పడానికి మాటలు రావడంలేదు అంటారు. అధికారం కోసం రాజకీయ నాయకులు, ఉద్యోగం, పదోన్నతి కోసం ఇంటర్వ్యూను ఎదుర్కొనాల్సిన అభ్యర్థులు, విద్యార్థులు, తమ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవడంలో వ్యాపార సంస్థలు, తాను తీసుకున్న కేసును గెలిపించడం కోసం న్యాయవాది తదితర రంగాల్లోని వ్యక్తులకు వాక్చాతుర్యం ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. ఇటువంటి వారిలో అవసరమైన వారికి మాటలు నేరి్పంచడానికి నగరంలో పదుల సంఖ్యలో శిక్షణ కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. ఏ రంగంలోని వారికైనా సమయం, సందర్భానుసారం మాట్లాడే మెళకువలు నేర్పిస్తామంటున్నారు. ఆ భయం ఎందుకు? వేదికపై మైక్ పట్టుకుని మాట్లాడాలంటే భయంతో కాళ్లు చేతులు ఎందుకు వణుకుతున్నాయి. నలుగురిలో మాట్లాడాలంటే మాట ఎందుకు తడబడుతోంది. మనసులోని భావాన్ని చెప్పడంలో వెనుకాడటానికి కారణం.. ఇలా ఎన్నో ప్రశ్నలకు అనుభవం లేకపోవడం, సిగ్గు, బిడియం మొదలైనవి కారణాలుగా కనిపిస్తున్నాయి. ఈ కారణాలే మాటల తడబాటుకు కారణాలట. ఒక్కోసారి నలుగురిలో నవ్వులపాలవుతున్నారు. ఆ భయం పోవాలంటే ఏం చేయాలనే అంశాలపై ఫోకస్ చేస్తున్నారు. బృందాలుగా ఏర్పాటు చేసి ఒక అంశంపై చర్చలు పెడుతున్నారు. మైక్ పట్టుకుని తనకు నచి్చన అంశంపై ధారాళంగా మాట్లాడాలని ఆహా్వనిస్తున్నారు. మనసులో మాటను స్వేచ్ఛగా ప్రకటించేందుకు అవసరమైన టిప్స్ ఇస్తున్నారు. నాలుగు రోజుల నుంచి 10 రోజుల పాటు శిక్షణ ఇస్తున్నారు. దీనికి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకూ ఫీజు తీసుకుంటున్నారు.ఆకట్టుకున్నవారికే అందలం..మాట్లాడే సబ్జెక్ట్‌పై పట్టుండాలి. చెప్పే మాటల్లో కొత్తదనం కనిపించాలి. మాట్లాడే సమయంలో హావభావాలు, శారీరక కదలికలు ఇతరులను ఆకర్షించాలి. మన మాటలకు ఎదుటి వ్యక్తి ఫీలింగ్స్ పసిగట్టాలి. సందర్భానుసారం అందరినీ ఆకట్టుకునేందుకు ప్రయతి్నంచాలి. ఈ అంశాల్లో పట్టున్న వారిని మాత్రమే ప్రజలు ఆదరిస్తారు. నాయకుడనే కిరీటం అందిస్తారు. అధికారం కట్టబెడతారు.మాటలతోనే గుర్తింపు.. తొలినాళ్లలో నలుగురిలో మాట్లాడటానికి ఇబ్బందిపడాల్సి వచ్చేది. దీన్ని అధిగమించేందుకు శిక్షణ తీసుకున్నాను. ప్రొఫెషన్ పరంగా ఇప్పుడు వేలాది మంది ఉన్న సభల్లో డయాస్‌పై అనర్గళంగా మాట్లాడగలుగుతున్నాను. టీవీ షోల్లో పాల్గొంటున్నా. ఎదుటి వ్యక్తి ఎలా చెబితే వింటాడో మనం గుర్తించగలగాలి. మన ఆలోచనలను వరుసక్రమంలో పెట్టుకోవాలి. సందర్భానుసారం ఆకట్టుకునే విధంగా మాట్లాడితే మనకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. – పల్లవి, సైకాలజిస్టు, హైదరాబాద్సెల్ఫ్ కాని్ఫడెన్స్ పెరిగింది.. పబ్లిక్ స్పీచ్ అందరికీ అవసరమే. ఉద్యోగంలో భాగంగా కాన్ఫరెన్స్‌లో మాట్లాడాల్సి ఉంటుంది. గతంలో అనుకున్నంత గొప్పగా మాట్లాడలేకపోయాననే ఆలోచన ఉండేది. శిక్షణ తీసుకున్నప్పుడు చాల విషయాలు నేరి్పంచారు. సెల్ఫ్ కాని్ఫడెన్స్ మన కెరీర్‌కు ఎంతగానో ఉపయోగపడుతుంది. స్పీచ్‌కి సబ్జెక్ట్ ఎంత ముఖ్యమో.. ఆరంభం, ముగింపు రెండూ అంతే ముఖ్యం. – కిరణ్‌రెడ్డి, పోలీసు పీఆర్ఓ, సైబరాబాద్మాటలు వెనక్కి వచ్చేవి.. నాకు కమ్యూనికేషన్ ఫీల్డ్ అంటే ఇష్టం. పది మందిలో మాట్లాడాలంటే నా మనసులో మాటలు వెనక్కి వచ్చేవి. ట్రైనింగ్‌లో చేరినప్పుడు ఎలా ఉంటుందోనని భయపడ్డాను. లెక్చర్ ఇస్తారని ఊహించుకున్నాను. ఇక్కడ ప్రాక్టికల్‌గా నేరి్పస్తున్నారు. మైక్ ముందు ఐదు నిమిషాలు మాట్లాడితే బోలెడు తప్పులుండేవి. వాటిని సరిదిద్దుకుంటున్నా. పది నిమిషాలు మాట్లాడగలుగుతున్నాను. – సింధుశ్రీ, విద్యారి్థనిఅవకాశాలు కోల్పోతున్నారు.. ఆకట్టుకునే విధంగా మాట్లాడటం తెలియక చాలామంది అవకాశాలు కోల్పోతున్నారు. 15 ఏళ్ల విద్యార్థి నుంచి 70 ఏళ్ల వయసు వారికీ వాక్చాతుర్యం అవసరం. స్కిల్ అనేది జీవితాంతం ఉంటుంది. ఎక్కువగా రాజకీయ నాయకులు, విద్యార్థులు, ఉద్యోగులు వస్తున్నారు. సుమారు 800 బ్యాచ్‌లలో ఐదువేల మందికిపైగా శిక్షణ ఇచ్చాం. శిక్షణ అనంతరం తమలో మార్పు కనిపించింది అంటున్నారు.– దన్నారపు కల్పన, మీడియా జంక్షన్ డైరెక్టర్ -
పులివెందులలో జననేత.. పలకరిస్తూ, యోగక్షేమాలు తెలుసుకుంటూ (ఫొటోలు)
-
టీడీపీ 100 రోజల పాలనపై ప్రజల రియాక్షన్
-
పాల వ్యాన్ వద్ద ఎగబడుతున్న జనం
-
Pakistan: పాక్ సైనికులపై నిరసనకారుల దాడి.. ఒక జవాను మృతి
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో ఆ దేశ సైన్యంపై నిరసనకారులు తిరగబడ్డారు. పాక్ సైన్యం కొనసాగిస్తున్న అరాచకాలను వ్యతిరేకిస్తూ బలూచిస్తాన్‌లోని ఆందోళనకారులు దాడులకు దిగారు. ప్రావిన్స్‌లోని గ్వాదర్ జిల్లాలో జాతీయవాద బలూచ్ ఉద్యమంలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి.బలూచ్ యక్జేతి సమితికి చెందిన నిరసనకారులు ర్యాలీలో పాక్ భద్రతా దళాలతో ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో పాక్ ఆర్మీ జవాన్ ఒకరు మృతి చెందగా, ఓ అధికారితో సహా 16 మంది గాయపడ్డారు. అక్రమంగా నిర్బంధించిన తమ కమిటీ సభ్యులను వెంటనే విడుదల చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. తమ సభ్యులను విడుదల చేసే వరకు నిరసన కొనసాగుతుందని కమిటీ నాయకుడు మెహ్రంగ్ బలోచ్ తెలిపారు.నిరసనకారుల ధైర్యాన్ని ప్రశంసిస్తూ మెహ్రాంగ్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు ‘ఈ రోజు మీరంతా పాకిస్తాన్‌కు మాత్రమే కాకుండా ప్రపంచం అంతటికీ సందేశం ఇచ్చారు. మీ ఆందోళనల ముందు తుపాకులు, అధికారం విలువలేనివని అన్నారు. కాగా పాకిస్తాన్ భద్రతా దళాలు బలూచిస్తాన్ విశ్వవిద్యాలయం ముందు నిరసనకారులపై దాడి చేసి, 12 మంది మహిళలు, 50 మందికి పైగా పురుషులను తమతో పాటు తీసుకుపోయి నిర్బంధించాయి. -
రషీద్ ఘటనపై వినుకొండ ప్రజలు ఫైర్
-
కూటమి పేరుతో మోసం.. చంద్రబాబుకు మాస్ వార్నింగ్
-
Mosh Pub: అమ్మాయిలను ఎరగా వేసి దందా చేస్తున్న మోష్ పబ్..
సాక్షి,హైదరాబాద్: డేటింగ్ యాప్స్ కేంద్రంగా పబ్స్ యజమానులు, కొందరు యువతులు చేస్తున్న భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఈ యాప్స్ ఆధారంగా వ్యాపారులు, బడా బాబులకు ఎర వేయడం, వాళ్లను పబ్స్‌కు రప్పించడం ఇందులో మొదటి ఎత్తు. సదరు యువతులకు మద్యం పేరుతో సాఫ్ట్ డ్రింక్స్ సరఫరా చేసే పబ్స్ నిర్వాహకులు భారీ బిల్లుల్ని మాత్రం వెంట వచి్చన వారికి ఇస్తాయి. ఇలా వచ్చిన సొమ్ములో కొంత వాటా ఆ యువతులకు ఇస్తున్నాయి. కొన్నాళ్లుగా గుట్టుగా సాగుతున్న ఈ దందాలో అనేక మంది బాధితులుగా మారినా ఎవరూ బయటపడలేదు. సోమవారం హైటెక్ సిటీ సమీపంలోని మోష్ పబ్‌లో మోసపోయిన వ్యాపారి సోషల్ మీడియా ద్వారా తన గోడు వెళ్లబోసుకోవడంతో వెలుగులోకి వచి్చంది. ఓ యువతి వలలో పడి రూ.40,505 బిల్లు చెల్లించిన ఆ బాధితుడి వ్యధ ఇది.. టిండర్ యాప్ ద్వారా పరిచయం.. నగరానికి చెందిన వ్యాపారికి డేటింగ్ యాప్ టింబర్ ద్వారా రితికగా పేరు చెప్పుకున్న యువతి పరిచయమైంది. కాసేపు చాటింగ్ చేసిన ఈమె కలుద్దామంటూ ఆఫర్ ఇచ్చింది. వ్యాపారి సైతం ఆసక్తి చూపించడంతో హైటెక్ సిటీ మెట్రో స్టేషన్నుమీటింగ్ పాయింట్‌గా చెప్పింది. సోమవారం సాయంత్రం అక్కడకు వచ్చిన వ్యాపారిని కలిసిన రితిక కొద్దిసేపటికి సమీపంలోని ఓ భవనం నాలుగో అంతస్తులో ఉన్న పబ్‌కు వెళ్దామని చెప్పింది. అక్కడకు చేరుకున్న తర్వాత కొద్దిసేపు తీయగా మాట్లాడిన రితిక మద్యం తాగుదామంటూ అడిగింది. వ్యాపారి అంగీకరిచడంతో వెయిటర్‌ను కలిసి ఆ పబ్‌లో ఉన్న వాటిలో ఖరీదైన మద్యం ఆర్డర్ ఇచ్చింది. డేటింగ్ యాప్ ద్వారా వల వేయాలని, పడిన వారిని పబ్‌కు తీసుకురావాలని పబ్ యజమానులు–యువతి మధ్య ఒప్పందం ఉంది. ఈ నేపథ్యంలోనే ‘పబ్స్ అండ్ గారల్స్’ కలిసి వినూత్న స్కామ్‌కు తెరలేపారు. మద్యం పేరుతో కూల్‌డ్రింక్స్ సరఫరా.. వ్యాపారితో కలిసి సదరు యువతి రాకను గమనించే పబ్ నిర్వాహకులు వెయిటర్‌ను అప్రమత్తం చేస్తారు. దీంతో అతడు ఏ మద్యం ఆర్డర్ తీసుకున్నా.. గ్లాసుల్లో సరఫరా చేసేది మాత్రం కూల్‌డ్రింకే. రితిక సైతం ఆ రోజు ఒక్కో పెగ్గు రూ.1,799 ఖరీదు చేసే పది పెగ్గుల మద్యం ఆర్డర్ చేసింది. ఈ పేరుతో పబ్ నిర్వాహకులు సరఫరా చేసిన కూల్‌డ్రింక్ తాగుతూపోయింది. దీంతో రూ.20 ఖరీదు చేసే కూల్‌డ్రింక్‌కు యువతి సహకారంతో మద్యం రంగుపూసిన నిర్వాహకులు రూ.1,799 చొప్పున వసూలు చేశారు. ఈ ‘మద్యం’తో పాటు ఇతర డ్రింక్స్, తినుబండారాలు కలిపి రూ.40,505 (పన్నులతో కలిపి) బిల్లు చేసింది. చివరకు వెయిటర్ బిల్లు తీసుకువచి్చన తర్వాత అది వ్యాపారి చేతిలో పెట్టిన యువతి వాష్‌రూమ్‌కు వెళ్లి వస్తానంటూ ఉడాయించింది. దాదాపు పది పెగ్గులు తాగిన ఆ యువతిలో ఎలాంటి తేడా లేకపోవడం, తూలకుండా నేరుగా నడిచి వెళ్లడంతో పాటు ఆమె ఎంతకీ తిరిగి రాకపోవడంతో వ్యాపారికి అనుమానం వచ్చింది. ఆ పబ్‌కు సంబంధించిన గూగుల్ రివ్యూస్ పరిశీలించి షాక్ అయ్యాడు. అక్కడ వేదనలు నిత్యకృత్యం సదరు పబ్‌లో ఇలాంటి మోసాలు నిత్యకృత్యమంటూ అనేక మంది వెలిబుచ్చిన వేదనలు ఆ రివ్యూస్‌లో ఆ వ్యాపారికి కనిపించాయి. ఓ వ్యక్తి రూ.16 వేలు, మరో వ్యక్తి రూ.24 వేలు, ఇంకొకరు రూ.20 వేలు చొప్పున చెల్లించారని తెలిసింది. వీరిలో ఒకరైతే బాత్రూమ్కు వెళ్లిన ఆ యువతి కోసం దాదాపు ఏడెనిమిది గంటలు పబ్‌లోనే వేచి ఉన్నారట. దీనికోసం ఆయన చేసిన ఖర్చు మందు బిల్లుకు అదనం. రితిక, కృతిక పేర్లతో కొందరు యువతులు ఇదే పబ్ నిర్వాహకులతో కలిసి ఈ దందా చేస్తున్నారని, అలా వచి్చన మొత్తంలో యువతులు కొంత కమీషన్ తీసుకుంటున్నారని వ్యాపారి గుర్తించారు. ఈ విషయంపై పబ్ నిర్వాహకులను ప్రశ్నించగా.. వారి నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. అంతలోనే రంగ ప్రవేశం చేసిన బౌన్సర్లు బలవంతంగా బిల్లు కట్టించి పంపారు. దీంతో ఆ వ్యాపారి తన గోడును సోషల్ మీడియా ద్వారా వెళ్లబోసుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మోష్ పబ్‌పై కేసు నమోదు హైటెక్ సిటీలోని మోష్ పబ్ యాజమాన్యంపై శుక్రవారం సుమోటో కేసు నమోదు చేసినట్లు మాదాపూర్ ఎస్సై ఎన్వీ రమణ తెలిపారు. కొన్ని ఆన్లైన్ డేటింగ్ యాప్స్ ద్వారా అమ్మాయిలతో ఎరవేసి, అలా వచ్చిన కస్టమర్లకు విలువైన మద్యం తాగించి, వారి నుంచి ఎక్కువ మొత్తంలో బిల్లులు వసూలు చేస్తున్నట్లు ఆరోపించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన అంశాల ఆధారంగా నమోదైన ఈ కేసు దర్యాప్తులో ఉందని, వెలుగులోకి వచి్చన అంశాల ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో ఆయా యువతులకు, పబ్‌కు మధ్య సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.బాధితుల భయమే వీరికి వరం ఇలా యువతుల వల్లో పడిన బాధితుల్లో అనేక మంది వివాహితులు, ఉన్నత కుటుంబాలకు చెందిన వాళ్లు ఉంటున్నారు. దీంతో తాము మోసపోయామని తెలిసినా.. యువతి కోసం వెళ్లామని బయటపడితే పరువుపోతుందని భయపడుతున్నారు. దీంతో కొందరు మాత్రం పబ్‌కు సంబంధించిన గూగుల్ రివ్యూస్‌లో విషయం పొందుపరుస్తున్నా.. అనేక మంది మిన్నకుండిపోతున్నారు. ఇదే అటు పబ్ నిర్వాహకులు, యువతులకు వరంగా మారుతోంది. ఈ తరహా దందాలో ఆ ఒక్క పబ్‌లోనే కాదని, నగరంలోని అనేక పబ్బుల్లో జరుగుతోందనే అనుమానాలు ఉన్నాయి. వాటిలోకి ఈ ‘జంటలు’ ప్రవేశిస్తున్న సమయంలో కేవలం యువకుల వివరాలు మాత్రమే అడిగి, నమోదు చేసుకుంటున్నారు. ఈ హనీట్రాప్ దందాపై తమకు ఎలాంటి సమాచారం, ఫిర్యాదులు లేవని పోలీసులు చెబుతున్నారు. ఇలా చేయడం కచి్చతంగా నేరమే అని, దీనికి యువతులతో పాటు పబ్స్ నిర్వాహకులు బాధ్యులని స్పష్టం చేస్తున్నారు. బాధితులుగా మారిన ఎవరైనా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు. -
సీఎం జగన్ దాడిపై గన్నవరం ప్రజల రియాక్షన్..
-
తల్లడిల్లిన జన హృదయాలు
సాక్షి, అమరావతి/గన్నవరం: ప్రతి ఇంటికీ పెద్ద కొడుకయ్యాడు.. కష్టం వచ్చిన ప్రతిసారి అన్నగా తోడయ్యాడు.. అడగకుండానే ప్రజల అవసరాలు తెలుసుకుని మరీ తీరుస్తున్నాడు.. కులం చూడం.. మతం చూడం.. ప్రాంతం చూడం అంటూ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాడు.. అలాంటి సీఎం జగన్‌పై హత్యాయత్నం జరిగిందని తెలిసి రాష్ట్ర ప్రజల్లో ఆందోళన మొదలైంది. అభిమానుల హృదయం తల్లడిల్లిపోతోంది. బిడ్డ ఎలా ఉన్నాడోనని ఓ తల్లి.. కొడుకు ఏం చేస్తున్నాడోనని ఓ తండ్రి.. అన్నకేమైందోనని ఓ చెల్లి, తమ్ముడు.. ఇలా జగన్‌ను తమ కుటుంబ సభ్యుడిగా సమాదరించే వందలాది మంది ఒకసారి తమ నేతను చూడాలని తాపత్రయపడ్డారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర చేస్తున్న సీఎం జగన్‌పై విజయవాడలోని సింగ్‌నగర్ వద్ద హత్యాయత్నం జరగడంతో ఆయన తీవ్రంగా గాయపడి ఆదివారం యాత్రకు విరామం ఇచ్చారు. అయినా ఇంటికి వెళ్లిపోకుండా కృష్ణా జిల్లా కేసరపల్లి వద్ద రాత్రి బస చేసిన ప్రాంతంలోనే విశ్రాంతి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో జగన్‌ను చూడాలని, పలకరించి యోగక్షేమాలు తెలుసుకోవాలని పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఉదయం నుంచీ వస్తున్న జన ప్రవాహాన్ని పోలీసులు నిలువరించారు. గాయం తీవ్రత కారణంగా జగన్ ఎవరినీ కలిసే పరిస్థితుల్లో లేరని, ఈ ఒక్కరోజు ఆగితే బస్సుయాత్రలో మరలా ఆయన మీ ముందుకు వస్తారని నచ్చజెప్పి అందరినీ వెనక్కు పంపించారు. ‘జగనన్నా. నీకేం కాదన్నా. మేమంతా నీవెంటే ఉంటామన్నా. మీరు క్షేమంగా మా మధ్యకు రావాలన్నా. మిమ్మల్ని మళ్లీ సీఎంగా గెలిపించుకుంటామన్నా’ అని నినాదాలు చేస్తూ.. జగన్ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రారి్థస్తూ వారంతా అక్కడి నుంచి తరలివెళ్లారు. బస ప్రాంతానికి వచ్చిన మంత్రులు, ఎంపీలు గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో బస చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని పరామర్శించేందుకు ఆదివారం పలువురు ప్రముఖులు విచ్చేశారు. రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, జోగి రమేష్, విడదల రజని, రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఎంపీలు మిథున్‌రెడ్డి, రెడ్డప్ప, ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ తదితరులు ఇక్కడకు వచ్చిన వారిలో ఉన్నారు. -
తెరుచుకోనున్న తులిప్ గార్డెన్.. 17 లక్షల పూలతో కనువిందు!
జమ్మూకశ్మీర్‌లోని ప్రపంచ ప్రఖ్యాత తులిప్ గార్డెన్ మార్చి 23 నుంచి పర్యాటకుల కోసం తెరుచుకోనుంది. ఈసారి 17 లక్షల తులిప్ పూలు పర్యాటకులకు కనువిందు చేయనున్నాయని గార్డెన్ అధికారులు తెలిపారు. మార్చి 19 నుండి 20 రోజుల పాటు తులిప్ ఫెస్టివల్ జరగనుంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దాల్ సరస్సు ఒడ్డున ఉన్న ఈ తులిప్ గార్డెన్ ప్రకృతి ప్రియులను ఎంతగానో ఆకట్టుకోనుంది. ఫ్లోరికల్చర్ అధికారి జావేద్ మసూద్ మాట్లాడుతూ మార్చి 23న ఈ గార్డెన్‌ను ప్రారంభించనున్నారని, ఇక్కడి పూలు అందరినీ తప్పక ఆకట్టుకుంటాయని అన్నారు. తులిప్ గార్డెన్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఉద్యానవనమని, కశ్మీర్ లోయలో పర్యాటక రంగానికి ఇది ఊతమిస్తున్నదని అన్నారు. ఈసారి జరిగే తులిప్ ఫెస్టివల్లో ఐదు కొత్త రకాల పూలను పరిచయం చేస్తున్నామన్నారు. ఈ ఏడాది 17 లక్షల తులిప్ పూలను చూడవచ్చన్నారు. కాగా ఈ గార్డెన్‌ను సిద్ధం చేయడానికి దాదాపు ఆరు నెలలు పడుతుందని, ఇందుకోసం విస్తృతమైన ప్రణాళిక ఉంటుందన్నారు. ఈ ఏడాది పర్యాటకుల సంఖ్యపై మరింతగా పెరిగే అవకాశం ఉన్నదని గార్డెన్ అధికారులు తెలిపారు. -
చంద్రబాబు, లోకేష్ పై ఫైర్
-
విశేషాల సమాహారం.. రాష్ట్రపతి నిలయం
రసూల్‌పురా: బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో పలు విశేషాలున్నాయి. చారిత్రక, పర్యాటక ప్రాముఖ్యతలూ ఉన్నాయి. ఇవన్నీ సందర్శకులకు తెలియజేసేందుకు ప్రత్యేకంగా ఓ కరపత్రాన్ని రూపొందించారు. మంగళవారం రాష్ట్రపతి నిలయంలో జరిగిన కార్యక్రమంలో పరిపాలనాధికారిణి రజని ఈ కరపత్రాన్ని ఆవిష్కరించారు. 97 ఎకరాల్లో ఉన్న రాష్ట్రపతి నిలయంలో ప్రజల కోసం 20 రకాల ప్రత్యేక విశేషాలను తీర్చిదిద్దామని, ఇవి ఆద్యంతం సందర్శకులను ఆకట్టుకుంటాయని రజని పేర్కొన్నారు. రాష్ట్రపతి నిలయం ప్రజల సందర్శనార్థం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు తెరచి ఉంటుందని, విద్యార్థులకు ఉచిత ప్రవేశమని, 20 మంది గైడ్స్ అందుబాటులో ఉంటారని ఆమె వెల్లడించారు. కార్యక్రమంలో అడ్మిన్ అధికారి దులార్ మింగ్, అసిస్టెంట్ అడ్మిన్ అ«ధికారి రాజేష్ యాదవ్, రోహిత్ తదితరులు పాల్గొన్నారు. -
మాజీ ఎంపీపీ కవితపై స్థానికుల దాడి
-
ఆరోగ్యానికి రక్ష.. జగనన్న సురక్ష
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి ఇంటిని జల్లెడ పట్టి.. ప్రజల ఆరోగ్య సమస్యలను గుర్తించి సత్వర చికిత్సలు చేయించే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ (జేఏఎస్) కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ నెల 2వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా రెండో దశ జేఏఎస్ కార్యక్రమాన్ని వైద్య శాఖ ప్రారంభించి.. 10 లక్షల మందికి వైద్య సేవల మైలు రాయికి చేరువైంది. నిర్దేశించిన షెడ్యూల్ మేరకు గ్రామాలు, పట్టణాల్లోని వార్డుల్లో సురక్ష శిబిరాలను నిర్వహిస్తూ.. స్పెషలిస్ట్ వైద్యుల ద్వారా చికిత్సలు అందిస్తున్నారు. శిబిరం వద్దే కంటి వైద్య పరీక్షలతోపాటు, ఈసీజీ, డెంగీ, మలేరియా వంటి ఇతర పరీక్షలను నిర్వహిస్తున్నారు. 9.48 లక్షల మందికి వైద్యం ప్రతి జిల్లాలో మండలాలను విభజించి సగం మండలాల్లో మంగళవారం, మిగిలిన సగం మండలాల్లో శుక్రవారం శిబిరాలు నిర్వహిస్తున్నారు. పట్టణాలు, నగరాల్లో బుధవారం శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. 6 నెలల్లో రాష్ట్రమంతటా 13,954 శిబిరాలను నిర్వహించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నెలలో 3,583 శిబిరాలు నిర్వహించాల్సి ఉండగా.. ఇప్పటికే 2,838 నిర్వహించారు. శిబిరాల ద్వారా గ్రామాల్లో 6,94,596, పట్టణాల్లో 2,53,668 చొప్పున మొత్తంగా 9,48,264 మందికి ఉచిత వైద్య సేవలు అందించారు. ఒక్కో శిబిరంలో సగటున 334 మంది వైద్య సేవలు అందుకున్నారు. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 58,474 మంది ఉచిత చికిత్సలు పొందారు. నంద్యాల జిల్లాలో 57,894, వైఎస్సార్ జిల్లాలో 51,735 మంది స్పెషలిస్ట్ వైద్య సేవలు అందుకున్నారు. శిబిరాల వద్దే లక్షకు పైగా స్పాట్ టెస్ట్‌లు నిర్వహించారు. వైద్య పరీక్షల నిర్వహణకు 7 రకాల కిట్లను, ఈసీజీ, ఇతర పరికరాలను శిబిరాల్లో అందుబాటులో ఉంచారు. తొలి దశలో 60.27 లక్షలు తొలి దశ జేఏఎస్ కార్యక్రమంలో 12,423 శిబిరాలను నిర్వహించిన ప్రభుత్వం 60,27,843 మందికి ఉచిత వైద్యసేవలు అందించింది. వైద్య సిబ్బంది 1.45 కోట్ల గృహాలను సందర్శించి ప్రజలను స్క్రీనింగ్ చేశారు. 6.45 కోట్ల వైద్య పరీక్షలు నిర్వహించారు. శిబిరాల్లో పరిశీలించిన అనంతరం వైద్యులు 1,64,982 మందిని తదుపరి వైద్యం కోసం ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు రెఫర్ చేశారు. వీరు ఆస్పత్రులకు వెళ్లి వైద్య సేవలు పొందేలా ప్రయాణ ఖర్చుల కింద రూ.500 చొప్పున ప్రభుత్వం సాయం చేసింది. రిఫరల్ కేసుల్లో బాధితులందరికీ ప్రభుత్వమే ఉచితంగా చికిత్సలు చేయించడంతో పాటు, చికిత్స తరువాతా అండగా నిలుస్తోంది. యూరినరీ సమస్యకు పరిష్కారం కొన్ని నెలలుగా యూరినరీ సమస్యతో బాధపడుతున్నాను. మా ఊళ్లో ఆరోగ్య సురక్ష శిబిరం ఏర్పాటు చేసినప్పుడు స్పెషలిస్ట్ వైద్యులు వచ్చారు. శిబిరానికి వెళ్లి నా సమస్యను వైద్యులకు వివరించాను. విజయవాడ ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం చేస్తారని చెప్పారు. పీహెచ్సీ వైద్యులు, ఏఎన్ఎంల చొరవతో విజయవాడలోని ఆస్పత్రికి వెళితే అక్కడ ఉచితంగా సర్జరీ చేశారు. – ఖాసీంవలి, దబ్బాకులపల్లి,ఎన్టీఆర్జిల్లా నిరంతరం ఫాలోఅప్ సురక్ష శిబిరాల్లో వైద్య సేవలు అందించి, అనంతరం కూడా బాధితుల ఆరోగ్యంపై నిరంతరం ఫాలోఅప్ ఉంచుతున్నాం.రిఫరల్ వైద్యం అవసరం గల వారిని స్థానిక ఫ్యామిలీ డాక్టర్, వైద్య సిబ్బందికి అనుసంధానం చేస్తున్నాం. సంబంధిత రోగి ఆస్పత్రికి వెళ్లి సేవలు పొందేలా సమన్వయం చేస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కాలానుగుణంగా మందులు అందించడం, ఆరోగ్యం గురించి వాకబు చేస్తున్నాం. గుండె, కిడ్నీ, కాలేయం, క్యాన్సర్ సంబంధిత జబ్బుల బాధితులకు ఇళ్ల వద్దకే మందులను డెలివరీ చేస్తున్నాం. – జె.నివాస్, కమిషనర్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ -
పోటెత్తిన భక్తజనం
అయోధ్య: అయోధ్య అక్షరాలా భక్తజన సంద్రంగా మారుతోంది. అంగరంగ వైభవంగా కొలువుదీరిన బాలరామున్ని కళ్లారా దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచీ భక్తులు సరయూ తీరానికి పోటెత్తుతున్నారు. సోమవారం ప్రాణప్రతిష్ట వేడుక ప్రధానంగా వీఐపీలకు మాత్రమే పరిమితమైన విషయం తెలిసిందే. సాధారణ భక్తులకు మంగళవారం నుంచి అనుమతిస్తామని ముందుగానే ప్రకటించారు. దాంతో తెల్లవారుజాము మూడింటి నుంచే భారీ క్యూ లైన్లు మొదలయ్యాయి. ఉదయానికల్లా అవి విపరీతంగా పెరిగిపోయాయి. ఆలయానికి దారితీసే ప్రధాన రహదారి రామ్ పథ్ భక్తుల వరదతో నిండిపోయింది. వారి జై శ్రీరాం నినాదాలతో పరిసరాలన్నీ ప్రతిధ్వనించాయి. పోలీసు సిబ్బంది కష్టమ్మీద వాటిని నియంత్రించారు. ఉదయం ఆరింటి నుంచి 11.30 దాకా దర్శనాలను అనుమతించారు. ఆ సమయంలో ఏకంగా 2.5 లక్షల నుంచి 3 లక్షల మంది దర్శనం చేసుకున్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం ఏడింటికి రెండో విడతలో మరో 2 లక్షల పై చిలుకు భక్తులకు దర్శనం జరిగినట్టు అయోధ్య డివిజనల్ కమిషనర్ గౌరవ్ దయాల్ తెలిపారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మంగళవారం అయోధ్యను సందర్శించి భక్తులకు దర్శన ఏర్పాట్లు తదితరాలను స్వయంగా పర్యవేక్షించారు. దేశ నలుమూలల నుంచీ... అయోధ్యకు తరలివస్తున్న భక్తుల్లో మహారాష్ట్ర, తెలంగాణ మొదలుకుని అటు పశ్చిమబెంగాల్, అసోం దాకా పలు రాష్ట్రాల వారున్నారు. వీరిలో చాలామందికి అయోధ్య సందర్శన ఇదే తొలిసారి. వీరిలో చాలామంది కనీసం రెండు మూడు రోజుల పాటు ఉండి నగరాన్ని పూర్తిగా సందర్శించేలా ప్లాన్ చేసుకున్నవారే. పలువురు భక్తులు రైల్వేస్టేషన్, బస్టాండ్ల నుంచి నేరుగా లగేజీతో సహా ఆలయానికి వచ్చేస్తున్నారు! సోమవారం మాదిరిగానే మంగళవారం కూడా తెల్లవారుజామునే ఆలయ పరిసరాల్లో రామ్ ధున్ మారుమోగింది. అయోధ్యకు వాహనాల ట్రాఫిక్ కూడా ఊహాతీతంగా పెరిగిపోయింది. దాంతో నగరానికి 30 కిలోమీటర్ల దూరం దాకా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. మనందరి జ్ఞాపకాల్లో శాశ్వతం: మోదీ అయోధ్య భవ్య మందిరంలో సోమవారం బాల రాముని ప్రాణప్రతిష్ట మహోత్సవం జరిగిన తీరు మనందరి జ్ఞాపకాల్లో శాశ్వతంగా ఉండిపోతుందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. వేడుకకు సంబంధించిన వీడియోలను ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రాణప్రతిష్ట క్రతువులో ముఖ్య యజమానులుగా పాల్గొన్న 14 మంది దంపతుల్లోనూ ఇదే భావన వ్యక్తమైంది. దాన్ని సాటిలేని దివ్యానుభూతిగా అభివర్ణించారు. దాన్ని ఎన్నటికీ మర్చిపోలేమని వారణాసిలోని మణికరి్ణక ఘాట్ శ్మశానవాటిక కాటికాపరి కుటుంబానికి చెందిన అనిల్ చౌదరి, సప్నాదేవి దంపతులు అన్నారు. వీరందరినీ దేశ నలుమూలల నుంచీ ప్రత్యేకంగా ఎంపిక చేయడం తెలిసిందే. అయోధ్య రామయ్య ఇకపై బాలక్ రామ్ అయోధ్య మందిరంలో కొలువుదీరిన రామ్ లల్లాను ఇకపై బాలక్ రామ్‌గా పిలవనున్నారు. స్వామి ఐదేళ్ల బాలుని రూపులో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆలయ పూజారి అరుణ్ దీక్షిత్ తెలిపారు. ఆలయాన్ని బాలక్ రామ్ మందిర్‌గా పిలవనున్నట్టు ప్రకటించారు. వారణాసికి చెందిన ఆయన సోమవారం బాలరాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘‘ఇప్పటిదాకా దాదాపు 60 దాకా ఆలయాల ప్రాణప్రతిష్టల్లో పాలుపంచుకున్నా. వాటన్నింట్లోనూ అయోధ్య ప్రాణప్రతిష్ట సర్వోత్తమం. ఆ సందర్భంగా అత్యంత అలౌకికానుభూతికి లోనయ్యా’’ అని దీక్షిత్ చెప్పుకొచ్చారు. ఆరు హారతులు, నైవేద్యాలు బాలక్ రామ్ రోజూ ఆరు హారతులు అందుకోనున్నాడు. స్వామికి ఉదయం మంగళారతితో మొదలు పెట్టి శృంగార, భోగ, ఉపతన, సంధ్యా హారతుల అనంతరం చివరగా శయనారతితో నిద్ర పుచ్చుతారు. బాలక్ రాముడు సోమవారం తెలుపు వ్రస్తాల్లో, మంగళవారం ఎరుపు, బుధవారం ఆకుపచ్చ, గురువారం పుసుపు, శుక్రవారం గోధుమ, శనివారం నీలం, ఆదివారం గులాబీ రంగు వ్రస్తాలంకరణలో భక్తులకు దర్శనమిస్తాడు. రబ్డీ, ఖీర్, పళ్లు, పాలతో పాటు పలురకాల నైవేద్యాలు అందుకుంటాడు. -
అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయాలా.. వద్దా?
న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు అయితే ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలా.. వద్దా అనే దానిపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి ఆమ్ ఆద్మీ పార్టీ శుక్రవారం ఢిల్లీలో ఇంటింటికీ 'మై బీ కేజ్రీవాల్' సంతకాల ప్రచారాన్ని ప్రారంభించింది. స్థానిక మంత్రి గోపాల్ రాయ్ తూర్పు ఢిల్లీలోని లక్ష్మీ నగర్ ప్రాంతంలో ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. "ఈ రోజు మొదటి రోజు. లక్ష్మీ నగర్ నియోజకవర్గంలో ఇంటింటికీ ప్రచారం నిర్వహించాం. ప్రజలతో మాట్లాడాం. సీఎం కేజ్రీవాల్ ప్రజల కోసం చాలా పని చేశారని వారు చెప్పారు. ఉచితంగా కరెంటు, మంచినీరు, వైద్యం, విద్య, మహిళలకు బస్సు ప్రయాణం, వృద్ధులకు తీర్థయాత్రలు వంటి సౌకర్యాలు కల్పించారని, అందుకే రాజీనామా చేయకుండా జైలు నుంచే ప్రభుత్వాన్ని నడపాలని ప్రజలు గట్టిగా అభిప్రాయపడ్డారు" అని మంత్రి గోపాల్ రాయ్ అన్నారు. ఎక్సైజ్ పాలసీ కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ గత నెలలో విచారణకు పిలిచింది. అయితే కేజ్రీవాల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు విచారణకు హాజరుకాలేదు. ఇది "చట్టవిరుద్ధం, రాజకీయ ప్రేరేపితం" అంటూ నోటీసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోంది. మేం ఇంటింటికీ ప్రచారం నిర్వహించి అరెస్టు జరిగితే కేజ్రీవాల్ రాజీనామా చేయాలా లేక జైలు నుంచే ప్రభుత్వాన్ని నడపాలా అనే విషయాన్ని ప్రజలనే అడిగాం’ అని రాయ్ చెప్పారు. డిసెంబర్ 1 నుంచి 20వ తేదీ వరకు మొత్తం 2600 పోలింగ్ స్టేషన్లలో ఇంటింటికీ ప్రచారం నిర్వహిస్తామని, డిసెంబర్ 21 నుంచి 24 వరకు మొత్తం 250 వార్డుల్లో బహిరంగ సభలు నిర్వహిస్తామని రాయ్ తెలిపారు. ఏం చేయాలన్నది అంతిమంగా ప్రజలే నిర్ణయిస్తారన్నారు. -
కాంగ్రెస్ వారంటీ ముగిసిన పార్టీ
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/సూర్యాపేట: కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చూస్తోందని, అమలుకు సాధ్యం కాని హామీలతో ప్రజలను మభ్యపెడుతోందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు దుయ్యబట్టారు. ఆరు గ్యారంటీ స్కీంలంటూ మాయమాటలు చెబుతోందని ధ్వజమెత్తారు. పొరపాటునో గ్రహపాటునో కాంగ్రెస్‌ను నమ్మితే ప్రజలకు మూడు గ్యారంటీలు మాత్రం పక్కాగా ఉంటాయన్నారు. 24 గంటల ఉచిత కరెంట్ పోవుడు, మూడు గంటల కరెంట్ వాపస్ వచ్చుడు గ్యారంటీగా జరుగుతుందన్నారు. ఇక సంవత్సరానికి ఒక సీఎం చొప్పున ఐదేళ్లలో ఐదుగురు సీఎంలు మారతారని పేర్కొన్నారు. సీల్డ్ కవర్లో ఢిల్లీ నుంచి ఒక్కో సంవత్సరం ఒక్కొక్కరు దిగుతారని ఎద్దేవా చేశారు. మరోవైపు ఆకాశం నుంచి పాతాళం దాకా ఏ టూ జెడ్ కుంభకోణాలు జరగడం గ్యారంటీ అని అన్నారు. ‘ఓటుకు కోట్టు దొంగల చేతుల్లో ఉన్న ఆ పార్టీ ఇచ్చే హామీలకు గ్యారంటీ ఉందా?’అని ప్రశ్నించారు. అది వారంటీ అయిపోయిన పార్టీ అని, అలాంటి పార్టీ ఇచ్చే హామీకి విలువ ఉంటుందా? ఆలోచించి ఓట్లు వేయాలన్నారు. తొలుత ఆయన సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన ఐటీ హబ్‌తో పాటు పలు అభివృద్ధి పనులను మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం నల్లగొండలో జరిగిన ప్రగతి నివేదన సభలోనూ పాల్గొన్నారు. ఈ రెండుచోట్లా జరిగిన కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. అందరికీ అండగా ఉన్న మాది కుటుంబపాలనే.. ‘ప్ర«దానమంత్రి నరేంద్రమోదీ చేతగాని మాటలు మాట్లాడుతున్నారు. కేసీఆర్‌ది కుటుంబ పాలనగా విమర్శిస్తున్నారు. బరాబర్ మాది కుటుంబ పాలనే. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కుటుంబ పెద్ద కేసీఆర్. 70 లక్షల మంది రైతులకు రైతుబంధు ఇచ్చి ఆదుకుంటున్న సోదరుడు కేసీఆర్. 5 లక్షల మంది దళిత సోదరులకు దళితబంధు ఇచ్చి అండగా నిలిచింది కేసీఆరే. ఇన్ని రకాలుగా అందరికీ అండగా నిలబడ్డ కేసీఆర్‌ది తప్పకుండా కుటుంబ పాలనే..’అని కేటీఆర్ అన్నారు. మోదీది గాడ్సే వారసత్వం ‘బీఆర్ఎస్ పార్టీది వారసత్వ రాజకీయమని మరొకడు అంటున్నడు. మాది పక్కా వారసత్వ రాజకీయమే. రాణి రుద్రమదేవి రాజసత్వంలో వెలిగిన కాకతీయుల వారసత్వం మాది. మాది పక్కా కొమరంభీం, సర్వాయి పాపన్న, దళితజాతి వైతాళికుడు భాగ్యారెడ్డి వారసత్వం. బడుగు వర్గాలకు చేయూతనిచ్చేలా కులవృత్తులు, చేతి వృత్తులకు కొత్త ఊపిరినిచి్చన వారసత్వ ప్రభుత్వం మాది. తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమరుల వారసత్వం మాది. నా తెలంగాణ తల్లి కంజాత వల్లి అని చెప్పిన దాశరథి, కాళోజీ సాంస్కృతిక వారసత్వం మాది. మాది గాంధీ వారసత్వం అయితే.. మాపై మాట్లాడుతున్న మోదీ గారిది గాం«దీని చంపిన గాడ్సే వారసత్వం..’అని మంత్రి ధ్వజమెత్తారు. ఈ ప్రధాని తొమ్మిదేళ్లలో చేసిందేముంది? ‘రాష్ట్రానికి వచి్చన ప్రధాని మోదీ చెప్పే అబద్ధాలకు అంతే లేకుండా పోయింది. కేసీఆర్ రైతురుణ మాఫీ చేయలేదని, అందుకే రైతులు చనిపోయారంటూ ఒక ప్రధానిగా ఉండి అబద్ధాలు చెప్పొచ్చా? రెండుసార్లు రూ.37 వేల కోట్ల రుణమాఫీ చేసిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆరే. తొమ్మిదేళ్లలో ఈ ప్రధాని దేశానికి చేసిందేముంది. ఆయన ప్రధాని అయినప్పుడు గ్యాస్ సిలిండర్ ధర రూ.400 ఉంటే అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ను తిట్టారు. ఈరోజు సిలిండర్ ధర రూ.1,200కు చేరుకుంది. మోదీ పాలనలోనే డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగాయి. ఇప్పుడు మోదీని చేతగానోడు అనాలా? సన్నాసి అనాలా? దద్దమ్మ అనాలా?’అని కేటీఆర్ ప్రశ్నించారు. కరెంట్ తీగలు పట్టుకుని చెక్ చేసుకోండి ‘రాష్ట్రంలో 24 గంటల కరెంటు చూపిస్తే రాజీనామా చేస్తానని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతున్నారు. వారికి అనుమానం ఉంటే మేమే బస్సు పెడతాం. చెక్ చేసుకునేందుకు రావాలి. వెంకట్‌రెడ్డి, రేవంత్, కాంగ్రెస్ నేతలందరూ రావాలి. ఏ సమయంలో, ఏ ఊరికి వెళతారో వెళ్లి అందరూ కరెంటు తీగలు పట్టుకొని నిలబడితే తెలుస్తుంది. దేశంలో 24 గంటలు కరెంటు ఇస్తున్నది సీఎం కేసీఆర్ ఒక్కరే..’అని కేటీఆర్ స్పష్టం చేశారు. కాగా దేశాన్ని పాలించే సత్తా కేసీఆర్, కేటీఆర్‌కు మాత్రమే ఉందని, ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రాన్ని తెస్తే.. కేటీఆర్ ప్రపంచానికి తెలంగాణ అంటే ఏమిటో తెలియజేశారన్నారు. ఒక్క చెయ్యోడని అవమానించారు: ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి నల్లగొండలో జరిగిన ప్రగతి నివేదన సభలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ‘2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు నన్ను అవమానించారు. ఒక్క చెయ్యోడు ఏం చేస్తాడని అన్నారు. నాకు ఒక్క చెయ్యి మాత్రమే ఉన్నా.. మీ చేతులు నాకు తోడయ్యాయి.. లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తానని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ నాయకుడిని చిత్తుగా ఓడించారు..’అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు ఆయన్ను ఓదార్చారు. -
ఇంటింటికి వెళ్లి వైద్య పరీక్షలు చేస్తున్న వైదులు
-
ఇకనుండి తిరుపతి వచ్చే భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవు
-
ఆర్బీఐ ‘పబ్లిక్ టెక్ ప్లాట్‌ఫాం’.. లోన్ మంజూరు వేగవంతానికి చర్యలు
ముంబై: రుణాల మంజూరుకు అవసరమైన డిజిటల్ వివరాలను బ్యాంకులు సులువుగా పొందేందుకు, తద్వారా రుణ లభ్యతను మెరుగుపర్చేందుకు రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ’పబ్లిక్ టెక్ ప్లాట్‌ఫామ్’ పైలట్ ప్రాజెక్టును ఆవిష్కరిస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఒక్కో రుణ గ్రహీతకు రూ. 1.6 లక్షల వరకు కిసాన్ క్రెడిట్ లోన్లు, డెయిరీ రుణాలు, చిన్న .. మధ్య తరహా సంస్థలకు రుణాలు, వ్యక్తిగత.. గృహ రుణాలు వంటి వాటిపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఆధార్ ఈ-కేవైసీ, శాటిలైట్ డేటా, పాన్ ధృవీకరణ, ప్లాట్ఫామ్లో చేరిన రాష్ట్రాల్లో భూమి రికార్డులు మొదలైన వాటిని అనుసంధానించేందుకు ఇది ఉపయోగపడగలదని పేర్కొంది. పైలట్ ప్రాజెక్టు ఫలితాలను పరిశీలించిన తర్వాత మరిన్ని సాధనాలు, ఆర్థిక సంస్థలకు దీన్ని విస్తరించనున్నట్లు వివరించింది. ప్రస్తుతం డిజిటల్‌గా రుణాలివ్వాలంటే రుణ దరఖాస్తుదారు సామర్థ్యాల మదింపు ప్రక్రియకు అవసరమైన వివరాలు.. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు, అకౌంటు అగ్రిగేటర్లు, బ్యాంకులు, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీల్లాంటి వివిధ సంస్థల దగ్గర వేర్వేరుగా ఉంటున్నాయి. దీనితో ఆ వివరాలన్నింటినీ సేకరించి, రుణం మంజూరు చేయడానికి జాప్యం జరుగుతోంది. అలా కాకుండా కీలక సమాచారాన్ని నిరాటంకంగా అందుబాటులోకి తేవడం ద్వారా రుణ మంజూరు ప్రక్రియను వేగవంతం చేసేందుకు పబ్లిక్ టెక్ ప్లాట్‌ఫామ్ ఉపయోగపడనుంది. -
ఖరీదైనా.. రెండు గజాలు!
అదొక మెట్రోపాలిటన్ సిటీ. ప్రముఖ వాణిజ్య ప్రాంతం. అక్కడ ప్రాపర్టీ కొనాలంటే కనీసం రూ.20 కోట్లు అయినా ఉండాల్సిందే. కానీ అంత ఖరీదైన ప్రాపర్టీని సొంతం చేసుకోవాలంటే ఎగువ మధ్య తరగతి వారి వల్ల కూడా అయ్యే పని కాదు. అయినా సరే ఆ ప్రాపర్టీకి యజమాని కావాలనే కోరిక బలంగా ఉంది. ఇందుకు ఉన్న మార్గం ఏంటి..? నిజమే అంత భారీ పెట్టుబడి లేకపోవచ్చు. చేతిలో కొద్ది మొత్తమే ఉన్నా, అదే ప్రాపర్టీకి యజమానిగా మారిపోగల అవకాశం ఉంది. అదే ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్. తమకు బాగా నచ్చిన ప్రాపర్టీలో ఒక శాతం వాటాను తక్కువకే సొంతం చేసుకోవచ్చు. మధ్యతరగతి వాసులను సైతం ప్రాపర్టీ యజమానులను మార్చేదే ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్. ఈ సాధనం గురించి తెలియజేసే కథనమే ఇది. అసలు ఏంటి ఇది..? పాక్షిక అని పేరులోనే ఉంది. రియల్ ఎస్టేట్‌లో స్వల్ప వాటా. ఈ విధానంలో మీరు పెట్టుబడి పెట్టే మొత్తానికి తగ్గ వాటా మీ సొంతం అవుతుంది. అంటే ఒక ప్రాపర్టీకి అచ్చమైన యజమాని కాలేరు. ఆ ప్రాపర్టీకి ఎంతో మంది యజమానుల్లో మీరు కూడా ఒకరు అవుతారు. ఈక్విటీల గురించి తెలిసే ఉంటుంది. లిస్టెడ్ కంపెనీ మూలధనంలో ప్రమోటర్ల వాటా గరిష్టంగా 75 శాతమే ఉంటుంది. మిగిలినది పబ్లిక్ షేర్ హోల్డర్ల చేతుల్లో ఉంటుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ.17 లక్షల కోట్లు. ఒక్క షేరు ధర సుమారు రూ.2,500. కేవలం రూ.2,500 పెట్టి ఒక్క షేరు కొనుగోలు చేసినా ఆ కంపెనీ వాటాదారుగా మారతారు. ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ కూడా ఇదే మాదిరి ఉంటుంది. పాక్షిక రియల్ ఎస్టేట్‌కు ఇప్పుడు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. స్వల్ప వాటాలు తీసుకునేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి ప్రధాన ప్రేరణ టికెట్ సైజు (పెట్టుబడి పరిమాణం) చిన్నగా ఉండడమే అని చెప్పుకోవాలి. పైగా కొద్ది మొత్తానికే నాణ్యమైన రియల్ ఎస్టేట్ వాటా వస్తుండడం ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ ఆదరణ పెరుగుతుండటం గమనార్హం. ఎలా పనిచేస్తుంది..? సాంకేతికంగా చెప్పుకోవాలంటే.. మీరు, మీ స్నేహితులతో కలసి 5–10 మంది ఒక గ్రూప్‌గా ఏర్పడి ప్రాపర్టీని కొనుగోలు చేసుకోవచ్చు. కానీ ఆచరణలో ఇది అందరికీ సాధ్యం కాదు. అందరి మధ్య సఖ్యత లేదా ఏకాభిప్రాయం ఉండకపోవచ్చు. న్యాయపరమైన చిక్కులు ఏర్పడితే ప్రాపర్టీ సంగతేమో కానీ, తమ హక్కుల కోసం కోర్టు చుట్టూ తిరగాల్సి రావచ్చు. అందుకే ఈ పాక్షిక రియల్ ఎస్టేట్‌ను సాకారం చేసేందుకు పలు ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇన్వెస్టర్లు స్వల్ప పెట్టుబడితో ప్రాపర్టీలో పాక్షిక వాటా కొనుగోలుకు ఇవి అవకాశం కలి్పస్తాయి. ఇలా ఒకరితో ఒకరు పొత్తు లేకపోయినా, అందరూ కలసి ఒక ప్రాపర్టీకి ఉమ్మడి యజమానులుగా మారిపోయేందుకు పలు ప్లాట్‌ఫామ్‌లు వేదికగా నిలుస్తున్నాయి. ఈ తరహా సేవలు అందించే పోర్టళ్లను ‘ఎఫ్వోపీ’ లేదా ఫ్రాక్షనల్ ఓనర్షిప్ ప్లాట్‌ఫామ్ అని పిలుస్తారు. గడిచిన కొన్నేళ్ల కాలంలో ఇలాంటివి పదుల సంఖ్యలో ఏర్పాటయ్యాయి. ఇన్వెస్టర్ల తరఫున క్లిష్టమైన ప్రాపర్టీ కొనుగోలు, దానికి సంబంధించిన ఇతర పనులను ఇవి చక్కబెడతాయి. దాంతో కొనుగోలు, విక్రయం ఎంతో సులభంగా, సౌకర్యంగా ఉంటుంది. ప్రాపర్టీ పరిశోధన, కొనుగోలు, అమ్మకం, డాక్యుమెంటేషన్, న్యాయపరమైన అంశాలు, అద్దె వసూలు, ఆ అద్దెను యజమానులకు పంపిణీ చేయడం తదితర సేవలను ఈ ప్లాట్‌ఫామ్‌లు అందిస్తాయి. వీటి సాయం లేకుండా ఇన్వెస్టర్లు ఒక సమూహంగా ఏర్పడి ఇలాంటి కార్యకలాపాలు అన్నింటినీ సొంతంగా నిర్వహించుకోవడం సులభం కాదు. అందుకే ఈ ప్లాట్‌ఫామ్ సేవలకు ఆదరణ పెరుగుతోంది. హైదరాబాద్‌లో ఎక్కడ..? దేశవ్యాప్తంగా ఎన్నో పట్టణాలకు సంబంధించి ఫ్రాక్షనల్ ప్రాపర్టీ లావాదేవీలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో గచ్చి»ౌలిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిధిలో ఓ ప్రాపర్టీ ఆఫర్ విలువ రూ.46,60,00,000. దీని ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్/ఐఆర్ఆర్ (యాజమాన్య నిర్వహణ సమయంలో అంతర్గత రాబడి రేటు) 13.5 శాతంగా ఉంది. స్థూల ఈల్డ్ (వార్షిక అద్దె రాబడి) 8.9 శాతంగా ఉంది. అలాగే మహారాష్ట్రలోని గోరేగావ్‌లో (ఈజోన్ అపార్చునిటీ) రూ.33,60,00,000 విలువ చేసే ప్రాపర్టీకి సంబంధించి డీల్‌లో.. ఐఆర్ఆర్ 13.4 శాతంగా ఉంటే, గ్రాస్ ఎంట్రీ ఈల్డ్ 9.6 శాతంగా ఉంది. సాధారణంగా రియల్ ఎస్టేట్‌లో 10 శాతానికి పైన ఐఆర్ఆర్ ఉంటే దాన్ని మెరుగైనదిగా పరిగణిస్తారు. 18–20 శాతంగా ఉంటే అత్యుత్తమంగా భావిస్తారు. ఐఆర్ఆర్ 5% కంటే తక్కువ ఉంటే అది లాభసాటి కాదు. నిర్వహణ సులభతరం ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్‌లో ఉన్న సౌలభ్యం నిర్వహణ అని చెప్పుకోవాలి. అద్దె వసూలు, ప్రాపర్టీ నిర్మాణం, విక్రయం, పన్నుల చెల్లింపుల ఇవన్నీ ఫ్రాక్షనల్ ఓనర్íÙప్ ప్లాట్‌ఫామ్‌లే చూస్తాయి. దీంతో ఇన్వెస్టర్‌పై నిర్వహణ భారం పడదు. ప్రాపర్టీ డాక్యుమెంట్లు పట్టుకుని ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం ఏర్పడదు. సెబీ నియంత్రణ లేదు గత కొన్నేళ్లలో ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ పరిశ్రమలోకి ఎన్నో ప్లాట్‌ఫామ్‌లు వచ్చాయి. ఈ ప్లాట్‌ఫామ్‌ల లావాదేవీల పరంగా ఓ ప్రామాణిక విధానం, ప్రక్రియ, మార్గదర్శకాలు, నియంత్రణలు అంటూ లేవు. ఇన్వెస్టర్లకు సమగ్రంగా అన్ని వివరాలు వెల్లడిస్తున్నాయా? లావాదేవీల నిర్వహణ చట్టబద్ధంగానే ఉందా? అని చూసే వారు లేరు. అందుకే ఫ్రాక్షనల్ ఓనర్íÙప్ ప్లాట్‌ఫామ్‌ల నియంత్రణకు సంబంధించి చర్చా పత్రాన్ని సెబీ విడుదల చేసింది. రానున్న రోజుల్లో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్) నియంత్రణల పరిధిలోకి తీసుకువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే ఈ మార్కెట్లో లావాదేవీలకు రక్షణలు ఏర్పడతాయి. ఇన్వెస్టర్ల హక్కులు, ప్రయోజనాలకు భరోసా ఉంటుంది. అయితే ఇందుకు ఎంత కాలం పడుతుంది? అన్నది ఇప్పటికైతే స్పష్టత లేదు. ఎలాంటి ప్రాపర్టీలు..? ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్‌లో అధిక శాతం లావాదేవీలు వాణిజ్య రియల్ ఎస్టేట్‌లోనే ఉన్నాయి. ఎందుకంటే వాణిజ్య రియల్ ఎస్టేట్‌లో వృద్ధి ఎక్కువగా ఉంటుంది. పైగా పెట్టుబడి వృద్ధికి తోడు, వాణిజ్య రియల్ ఎస్టేట్ నుంచి రెంటల్ రూపంలో ఆదాయం క్రమం తప్పకుండా వస్తుండడం మరో ఆకర్షణగా చెప్పుకోవచ్చు. అందుకే వాణిజ్య ప్రాపర్టీల ధరలు చాలా ఖరీదుగా ఉంటాయి. వీటి విలువ సాధారణంగా రూ.20 కోట్ల నుంచి రూ.500 కోట్ల మధ్య ఉంటుంది. అందుకే ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్‌కు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. పైగా వాణిజ్య ప్రాపర్టీల్లో రిటైల్ ఇన్వెస్టర్ నేరుగా పెట్టుబడి పెట్టడం సాధ్యపడదు. ఈ ప్లాట్‌ఫామ్‌లు దీన్ని సాధ్యం చేస్తున్నాయి. ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్‌లో కనీసంగా ఒక టికెట్ సైజు (పెట్టుబడి పరిమాణం) విలువ రూ.10–25 లక్షల మధ్య ఉంటుంది. అందుకే రిటైల్ ఇన్వెస్టర్లు సైతం ఇందులో పెట్టుబడులకు ముందుకు వస్తున్నారు. ఫ్రాక్షనల్ ఓనర్షిప్ ప్లాట్‌ఫామ్‌లపై ప్రాపర్టీ వారీగా రాబడి రేటు, ధర తదితర వివరాలు అన్నీ ఉంటాయి. లిక్విడిటీ మాటేమిటి? రియల్ ఎస్టేట్‌లో ఉండే ప్రధాన సమస్య లిక్విడిటీయే. అవసరం వచ్చినప్పుడు విక్రయిద్దామంటే ఎక్కువ సందర్భాల్లో వెంటనే సాధ్యపడదు. విక్రయించే ప్రాపర్టీ, దాని ధర ఇతర అంశాలన్నింటినీ కొనుగోలుదారులు లోతుగా చూస్తారు. బేరసారాలు, విచారణలు అన్నీ అంగీకారం అయితేనే ప్రాపర్టీ లావాదేవీ పూర్తవుతుంది. కనుక కావాల్సినప్పుడు వెంటనే నగదుగా మార్చుకునే సౌలభ్యం సహజంగా రియలీ్టలో తక్కువ. మీరు ఆశించే ధరకే విక్రయించాలని అనుకుంటే నెలల నుంచి సంవత్సరాల పాటు వేచి చూడాల్సి వస్తుంది. ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్‌లోనూ ఇదే అమలవుతుంది. కాకపోతే విడిగా ఓ ప్రాపర్టీ లావాదేవీతో పోలిస్తే ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ టికెట్ సైజు తక్కువగా ఉంటుంది. కనుక లిక్విడిటీ కాస్తంత మెరుగు అని భావించొచ్చు. పాక్షిక ప్రాపర్టీ అయినా సరే, దాని అద్దె రాబడి ఏ మేరకు? ప్రాపర్టీ నాణ్యత మాటేమిటి? అనేది కొనుగోలు దారులు చూస్తారు. నాణ్యమైన ప్రాపర్టీ, అద్దె రాబడి మెరుగ్గా ఉంటే వేగంగా అమ్ముడుపోతుంది. లేదంటే చాలా కాలం పాటు అందులో పెట్టుబడి చిక్కుకుపోవచ్చు. పైగా ఇందులో కొనుగోలు చేసే ప్రాపర్టీ పెట్టుబడి దృష్ట్యానే తప్ప వినియోగం కోణంలో ఉండదు. అందుకని విక్రయించుకునేందుకు కొంత సమయం పట్టొచ్చు. టికెట్ సైజు తక్కువగా ఉండడం ఇందులో కాస్త అనుకూలతగా చెప్పుకోవచ్చు. -
సీఎం వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన కృష్ణలంక వాసులు
-
రేపు ప్రారంభంకానున్న శ్రీ టెక్‌టెక్స్ ఐపీవో - ధరల శ్రేణి ఇలా..
న్యూఢిల్లీ: టెక్నికల్ టెక్స్టైల్ తయారీ కంపెనీ శ్రీ టెక్‌టెక్స్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఈ నెల 26న ప్రారంభంకానున్న ఇష్యూకి ధరల శ్రేణి షేరుకి రూ. 54–61గా నిర్ణయించింది. 28న ముగియనున్న ఇష్యూలో భాగంగా 74 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. తద్వారా రూ. 45 కోట్లకుపైగా సమీకరించే యోచనలో ఉంది. యాంకర్ ఇన్వెస్టర్లకు నేడు(25న) షేర్లను కేటాయించనుంది. చిన్నతరహా కంపెనీల కోసం ఎన్ఎస్ఈ ఏర్పాటు చేసిన ఎమర్జ్ ప్లాట్‌ఫామ్ ద్వారా కంపెనీ షేర్లు లిస్ట్‌కానున్నాయి. ఇష్యూ నిధులను ఫ్యాక్టరీ షెడ్ నిర్మాణం, సోలార్ ప్లాంటు ఏర్పాటు, వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ ప్రధానంగా పీపీ నాన్ఒవెన్ ఫ్యాబ్రిక్‌ను వివిధ పరిమాణాల్లో తయారు చేస్తోంది. -
జగనన్న సురక్ష: గంటల వ్యవధిలోనే మోక్షం.. 11రకాల సేవలు ఉచితం
-
తుస్సుమన్న టీడీపీ బస్సు యాత్ర.. మొరాయించిన ప్రచార రథం
సాక్షి, అనంతపురం: రాయదుర్గంలో టీడీపీ బస్సు యాత్రకు ప్రజాస్పందన కరువైంది. జనం లేక వెలవెలబోయింది. దీనికి తోడు ప్రచార రథం మొరాయించడంతో టీడీపీ నేతలు నడుచుకుంటూ వెళ్లిపోయారు. ఎన్టీఆర్ సర్కిల్లో జరగాల్సిన సభను రద్దు చేశారు. ఇరుకుగా ఉండే వినాయక సర్కిల్లో తూతూమంత్రంగా సభ నిర్వహించారు మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు. ఇరుకు సందులో ఓ భవనం పైకి ఎక్కి టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, పరిటాల సునీత, మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి ప్రసంగించారు. చదవండి: దారుణాలకు కేరాఫ్ చంద్రబాబే! -
రైలులో ప్రయాణిస్తున్నారా? దయచేసి ఇలా చేయకండి!
-
ఇంటి తలుపు కొట్టి మరీ మా సమస్యలు తీరుస్తున్నారు
-
పబ్లిక్ కి లక్షల విలువ చేసే మొబైల్ ఫోన్స్ పంచిన పోలీసులు
-
అర్జంట్‌గా పోయాలి.. కానీ తాళం తీయట్లేదు.? ఇవ్వేం పబ్లిక్ టాయిలెట్లురా బాబోయ్
లగ్జరీ వాష్‌రూంల పేరిట కార్పొరేట్ స్థాయిలో నగరంలో నిర్మించిన లూకేఫ్ టాయిలెట్లు నిరుపయోగంగా మారాయి. అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా లక్ష్యం నెరవేరకపోవడంతో టాయిలెట్లకు వెచ్చించిన నిధులు వృథా అయ్యాయి. – వరంగల్ అర్బన్ లూకేఫ్ టాయిలెట్లు.. కార్పొరేట్ తరహాలో నిర్మించారు. గ్రేటర్ వరంగల్ నగరంలో రెండున్నర ఏళ్ల కిందట అవసరం పేరిట ఒకటి, రెండు కాదు.. 5 చోట్ల నిర్మించారు. దేశ వ్యాప్తంగా పేరు మోసిన బడా కాంట్రాక్టు సంస్థ రూ.కోటి వ్యయంతో వీటి నిర్మాణం చేపట్టింది. సగానికి పైగా బిల్లులు కూడా కట్టబెట్టారు. మిగతా సొమ్ము కోసం సదరు సంస్థ ప్రతినిధులు తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తుండటంతో ఓ ప్రజారోగ్య విభాగం అధికారి, మరో ఇంజనీర్ కలిసి ఆ బిల్లు కూడా ఇప్పించేందుకు తోడ్పాటు అందిస్తున్నారు. మరి ఇవి ఉపయోగంలో ఉన్నాయా అని బల్దియా అధికారులను అడిగితే ‘మాకేం తెలుసు’అన్న సమాధానం వస్తోంది. ఉత్సవ విగ్రహాలేనా..? నగరంలో ప్రజా మురుగుదొడ్ల నిర్వహణ నిధుల మేతగా మారింది. జీడబ్ల్యూఎంసీ ద్వారా నిర్మితమై న ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ టాయిలెట్లు చాలా వరకు మరుగున పడ్డాయి. లూకేఫ్ సంస్థ కంటైనర్ తరహాలో రూ.కోటితో కాజీపేట నిట్, కలెక్టరేట్, సర్క్యూట్ గెస్ట్‌హౌస్, వరంగల్ పోచమ్మమైదాన్, ఖిలా వరంగ ల్ ఖుష్‌మహల్ వద్ద టాయిలెట్లను నిర్మించింది. ఒక్కో ప్రాంతంలో ఆరు సీట్లతో ఏర్పాటు చేశారు. వీటిని వ్యాపార కేంద్రాలుగా మారుస్తూ బల్దియాపై ఎలాంటి భారం లేకుండా పలు సంస్థలకు, నిరుద్యోగులకు అప్పగించారు. లూకేఫ్ టాయిలెట్లను నిర్వహిస్తూ, ప్రజలు ఉచితంగా మరుగుదొడ్లు ఉపయోగించుకునేలా నిర్ణయించారు. వీటి పక్కన జిరాక్స్, టీ, పాన్‌షాపు తదితర చిన్న తరహా షాపులు ఏర్పాటు చేసుకున్నారు. కానీ అనువైన స్థలాల్లో నిర్మించకపోవడం.. ప్రజలకు అందుబాటులో లేకపోవడం, చిరు వ్యాపారాలు నడవకపోవడంతో చేతులెత్తేశారు. దీంతో లూకేఫ్ టాయిలెట్లు అలంకా ర ప్రాయంగా మారాయి. హనుమకొండ కలెక్టరేట్ కొత్తగా నిర్మాణం కావడం వల్ల లూకేఫ్ టాయిలెట్ ను కూల్చివేయడం పూర్తయింది. సమన్వయ లోపం.. నిధులు నిరుపయోగం బల్దియా టౌన్ ప్లానింగ్, ఇంజనీర్ల మధ్య సమన్వ య లోపం స్పష్టంగా కనిపిస్తోంది. జనరద్దీ కలిగిన ప్రాంతాల్లో కాకుండా ఇష్టమొచ్చిన, ప్రభుత్వ స్థలా లు ఉన్న చోట నిర్మాణాలు చేపట్టారు. దీంతో ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం, అవగా హనా రాహిత్యం తదితర కారణాల వల్ల లూకేఫ్‌లు మూలకు చేరాయి. బల్దియా పట్టణ ప్రగతి నిధులు మాత్రం నిరుపయోగంగా మారాయి. ఇవేకాకుండా నగరంలో నాలుగు చోట్ల నిర్మించిన కమ్యూనిటీ టాయిలెట్ల పరిస్థితీ దయనీయంగా మారింది. -
పులివెందులలో భాస్కర్ రెడ్డి అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ స్థానికుల ర్యాలీ
-
మల్లరెడ్డి డైలాగ్స్ చెప్పిన మంత్రి కేటీఆర్
-
విషాదాంతమైన BRS ఆత్మీయ సమ్మేళనం
-
జగన్ అంటే అభిమానం, అంత కంటే మించి ప్రాణం
సాక్షి, తిరుపతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డే మా భవిష్యత్తు అంటున్నారు జనాలు.. పేద ప్రజల బతుకులకు ఒక భరోసా ఇచ్చి.. ‘కుల, మత, పార్టీలకు అతీతంగా గత 46 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన ద్వారా ఎంతో మేలు చేస్తున్నారు సీఎం జగన్. సీఎం వైఎస్ జగన్ ప్రతినిధులుగా ఇంటికి వచ్చిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, సచివాలయాల కన్వీనర్లు, గృహ సారథులు, పార్టీ శ్రేణులు, వలంటీర్లకు కుటుంబ సభ్యులు ఎదురేగి ఆహ్వానించారు. టీడీపీ సర్కార్‌కూ ప్రస్తుత ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాలను వివరిస్తూ కరపత్రాన్ని చదివి వినిపించినప్పుడు.. సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుని తమతోపాటు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేశారనే మాట ప్రతి ఇంటా వినిపిస్తోంది. సీఎం వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పేదల కోసం అనేక కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తున్నారు. ఎన్నికలకు ముందు చెప్పిన దానికంటే ఎక్కువగానే మేలు చేస్తున్నారు. పైసా అవినీతి లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంతృప్త స్థాయిలో పథకాలను అమలు చేస్తున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీ తెల్లవారుజామునే 5 గంటలకే నిద్రలేపి మరి పింఛను ఇస్తున్నారు. ‘నా మనవడు జగనయ్య మా కోసం వలంటీర్లను పెట్టారు. ఇంటి వద్దకే పింఛన్ పంపిస్తున్నారు. మా మనవడు చల్లగా ఉండాలయ్యా’ అంటూ వృద్ధులు దీవిస్తున్నారు. చదవండి: జగనన్న కాలనీలు చూద్దాం వస్తావా బాబూ..? -
Hyderabad Metro Rail: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాక్
-
కనిపించకుండా పోయిన కిమ్.. ఆఖరికి సైనిక వార్షికోత్సవానికి..
తరుచుగా వార్తలో నిలిచి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తాజాగా అదృశ్యమై మరోసారి వార్తల్లో నిలిచారు. దీంతో ఆయనకు ఆరోగ్యం బాగోలేదని అందువల్లే.. గతకొద్ది రోజులుగా ఆర్మీ ముందుకు రావడం లేదంటూ ఉహగానాలు హల్చల్ చేస్తున్నాయి. అదీగాక ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్లో పీపుల్స్ ఆర్మీ వ్వవస్థాపక వార్షికోత్సవ పురస్కరించుకుని సాముహిక కవాతులను నిర్వహించనున్నారు. ఈ సమయంలో ఆయన కనిపంచకపోవటం ఉత్తర కొరియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఐతే కిమ్ అనుహ్యంగా గత నెల రోజులుగా బహిరంగంగా కనిపించటం లేదని స్థానిక మీడియా వర్గాలు తెలిపాయి. అఖరికి ఆదివారం జరిగిన పొలిబ్యూటో సమావేశాన్ని కూడా కిమ్ దాటవేసినట్లు సమాచారం. వాస్తవానికి కిమ్ ఇలా గతంలో 2014లో దాదాపు 40 రోజుల పాటు పబ్లిక్‌గా కనిపించకుండా ఉన్నట్లు ఉత్తర కొరియా స్థానిక మీడియా పేర్కొంది. కానీ సరిగ్గా ఇదే సమయంలో పీపుల్స్ ఆర్మీ 75వ వ్యవస్థాపక వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం లేదా బుధవారం ప్యోంగ్యాంగ్లో సాముహిక కవాతులు నిర్వహించనుంది. అయితే వార్షికోత్సవంలో కనిపిస్తాడా లేదా అనేది సందిగ్ధంగా ఉంది. అలాగే కిమ్ కూడా ఈ సాముహిక కవాతు ప్రదర్శన ద్వారా తన యుద్ధ సన్నద్ధత సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే ఉత్సుకతతో ఉన్నారు కూడా. ఇదిలా ఉండగా, మరోవైపు ఈ వార్షికోత్సవాన్ని కిమ్ అడ్వాంటేజ్‌గా తీసుకుని తన అణ్వాయుధాల క్షిపణి సామర్థాన్ని ప్రదర్శిస్తుందేమనని యూఎస్ దాని మిత్ర దేశాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. అదీగాక ఇటీవలే దక్షిణ కొరియా, యూఎస్ ఉమ్మడి సైనిక విన్యాసాలపై ఉత్తరకొరియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే యూఎస్ సైనిక ఎత్తుగలను తిప్పికొట్టేలా అత్యంత శక్తిమంతమైన అణ్వాయుధాలను ప్రయోగిస్తానని బెదిరింపులకు దిగింది కూడా. అంతేగాక ఉత్తరకొరియా 2022లోనే దాదాపు 70 కంటే ఎక్కువ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఇందులో దక్షిణ కొరియాలోని లక్ష్యాలను చేధించడానికి లేదా యూఎస్ ప్రధాన భూభాగాన్ని చేరుకునేనే సామర్థ్యం ఉన్న అణ్వయుధాలు ఉన్నాయి. (చదవండి: యూఎస్‌లో పోలీసులకు పట్టుబడ్డ తెలుగు అబ్బాయ్) -
ఖమ్మం జిల్లా ప్రజా ప్రతినిధులతో ముగిసిన సీఎం భేటీ
-
అభివృద్ధి పథంలో ఏపీ..
-
కందుకూరు ఘటనపై స్థానికుల ఆగ్రహం
-
మాకొద్దీ అమరరాజా.. వ్యతిరేకంగా నిరసనలు
-
రాష్ట్ర నలుమూలల నుంచి మహాసభకు హాజరవుతున్న బీసీలు
-
జనంలోకి జిన్‌పింగ్
బీజింగ్: చైనాలో సైనిక కుట్ర అంటూ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టిన వార్తలను పటాపంచలు చేస్తూ దేశాధ్యక్షుడు జిన్‌పింగ్ మంగళవారం జనబాహుళ్యంలో ప్రత్యక్షమయ్యారు. ఉబ్బెకిస్తాన్‌లో సమర్కండ్లో షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సమావేశాల తర్వాత 16న చైనాకు తిరిగొచ్చిన అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను గృహనిర్బంధంలో ఉంచి సైన్యం అధికార పగ్గాలు చేపట్టిందనే వార్తలు నాలుగైదు రోజులుగా అన్ని సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న విషయం విదితమే. ఈ వార్తలన్నీ ఉట్టి కాకమ్మ కథలే అని రుజువుచేస్తూ జిన్‌పింగ్ మంగళవారం బీజింగ్‌లో అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటుచేసిన ఒక ఎగ్జిబిషన్లో పాల్గొన్నారు. దశాబ్దకాలంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా సాధించిన విజయాలు, దేశ పురోగతిని ప్రతిబింబించేలా ఉన్న ప్రదర్శనను అధ్యక్షుడు జిన్‌పింగ్ తిలకించారని చైనా అధికార వార్త సంస్థ జిన్హువా తెలిపింది. జిన్‌పింగ్ వెంట దేశ ప్రధాని లీ క్వెకియాంగ్, పార్టీ కీలక నేతలు ఉన్నారు. జిన్‌పింగ్ నుంచి అధికారాన్ని సైన్యం కైవసం చేసుకుందనే వార్తలు అబద్ధమని దీంతో తేలిపోయింది. జీరో కోవిడ్ పాలసీలో భాగంగా విదేశాల నుంచి వచ్చిన ప్రతీ ఒక్కరూ ఏడు రోజులపాటు క్వారంటైన్లో ఉండాలనే నిబంధనను జిన్‌పింగ్ కూడా పాటించారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. -
షాకింగ్ ఘటన: మగ సంతానం కోసమని.. భార్యకు అందరి ముందు..
పుణే: మగ బిడ్డ కోసం, డబ్బుపై ఆశతో ఆ భర్త చేసిన పని దిగ్భ్రాంతిని గురి చేస్తోంది. వ్యాపారంలో లాభాలు రావాలన్నా.. ఇంట్లో శాంతి నెలకొనాలన్నా.. అన్నింటికి మించి మగ సంతానం కలగాలన్నా తాను చెప్పినట్లు చేయాలని ఓ ఫేక్ బాబా సలహా ఇవ్వడంతో.. భార్యను అందరి ముందు దుస్తులు లేకుండా స్నానం చేయించాడు సదరు భర్త. మహారాష్ట్ర పుణేలో ఈ షాకింగ్ ఘటన జరిగింది. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. పుణేకి చెందిన ఆమె భర్త కుటుంబం 2013 నుంచి అదనపు కట్నం, మగ బిడ్డ కోసం వేధిస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఆమె చేత క్షుద్ర పూజలు కూడా చేయించింది. ఈ మధ్య మౌలానా బాబా జామదార్ అనే వ్యక్తి ఆమె భర్తతో జలపాతం కింద అంతా చూస్తుండగా ఒంటిపై బట్టలు లేకుండా స్నానం చేయిస్తే.. మగ సంతానం కలుగుతుందని, అప్పులు సైతం తీరతాయని సలహా ఇచ్చాడు. దీంతో ఆ మూర్ఖపు భర్త, అతని కుటుంబం బాధితురాలని రాయ్‌ఘడ్‌కి తీసుకెళ్లి.. అక్కడి జలపాతం కింద ఆమె చేత బలవంతంగా ఫేక్ బాబా చెప్పినట్టు స్నానం చేయించింది. అక్కడ చాలామందే ఉన్నా.. ఎవరూ అడ్డుకునే యత్నం చేయలేదు. చివరికి.. బాధితురాలే ధైర్యం చేసి భారతీ విద్యాపీఠ్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు భర్త, అతని కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసి.. పరారీలో ఉన్న ఫేక్ బాబా కోసం గాలింపు చేపట్టారు. ఇదీ చదవండి: రూపాయి తెచ్చిన పంచాయితీ ! -
సముద్రఖని ఇన్ పబ్లిక్ ఫస్ట్ లుక్ చూశారా?
దర్శకుడు, నటుడు సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'సముద్రఖనియిన్ పబ్లిక్'. నటుడు కాళి వెంకట్, నటి రిత్విక తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ఆర్.పరమన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కేకేఆర్ సినిమాస్ పతాకంపై కేకే రమేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి డి.ఇమాన్ సంగీతాన్ని, రాజేష్ యాదవ్, వెట్రిల ద్వయం ఛాయాగ్రహణను అందిస్తున్నారు. చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను శనివారం విజయ్‌సేతుపతి, దర్శకుడు వెంకట్ ప్రభు ఆన్లైన్ ద్వారా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు పేర్కొంటూ ఇంతకుముందు రాజకీయ నేపథ్యంలో చాలా చిత్రాలు వచ్చాయన్నారు. కానీ తమిళ సినీ చరిత్రలోనే తొలిసారిగా రాజకీయ పార్టీల కార్యకర్తల ఇతివృత్తంతో తెరకెక్కిస్తున్న చిత్రం ఇదని తెలిపారు. చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌కు పరిశ్రమ వర్గాల నుంచి మంచి స్పందన రావడం సంతోషంగా ఉందని అన్నారు. -
హైటెన్షన్ పోల్ ఎక్కిన స్థానికులు..
-
తిరుమలగిరిలో హైటెన్షన్... కరెంటు స్తంభం ఎక్కిన స్థానికులు
సాక్షి, హైదరాబాద్: తిరుమలగిరి పరిధిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జేఎన్ఎన్యూఆర్ఎం పథకంలో ఇళ్లను స్థానిక నేతలు అమ్ముకున్నారని స్థానికులు ఎల్ఐసీ బిల్డింగ్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో కొందరు హైటెన్షన్ స్తంభాన్ని ఎక్కి నిరసన తెలిపారు. వెంటనే అర్హులైన తమకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. వీరిలో లక్ష్మణ్, రాములమ్మ, రాజు, మహేష్, శంకరమ్మ స్తంభం ఎక్కినట్లు గుర్తించారు. వీరంతా స్థానిక ఎమ్మెల్యేపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. తమకు కేటాయించిన స్థలాలను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులకు హమీ ఇవ్వడంతో స్తంభం నుంచి కిందకు దిగివచ్చారు. చదవండి: వివాహితకు మరో వ్యక్తితో పరిచయం.. ఏడాదిగా సహజీవనం -
మహిళ కళ్లల్లో కారం చల్లి..
-
జనానికి వాక్సిన్ అంటే భయం ఎందుకు ??
-
ఒమిక్రాన్ తరుముతున్నా తీవ్ర నిర్లక్ష్యం.. మాస్కు మరిచి ఎన్ని కథలో..
ఆదివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో విజయవాడలోని పటమట రైతుబజార్ కిటకిటలాడుతోంది. 20 దుకాణాలను పరిశీలించగా కేవలం 5 దుకాణాల యజమానులు మాత్రమే మాస్క్ ధరించారు. అలాగే.. ఓ దుకాణానికి 10 మంది వినియోగదారులు వచ్చారు. వీరిలో నలుగురు మాస్క్ ధరించలేదు. ఇద్దరు మాస్క్‌ను గడ్డం కిందకు పెట్టుకున్నారు. కేవలం నలుగురే ముక్కు, నోరు కవర్ అయ్యేలా మాస్క్ పెట్టుకున్నారు. ఇక ఈ పది మందిలో ఒక్కరే చేతులు శానిటైజ్ చేసుకున్నారు. సాక్షి, అమరావతి: కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఈ తరుణంలో వైరస్ వ్యాప్తిపట్ల రాష్ట్రంలో ప్రజలు ఏ మేరకు అప్రమత్తంగా ఉన్నారు? నిబంధనలు ఎంతవరకు పాటిస్తున్నారు? అని ‘సాక్షి’ వివిధ ప్రాంతాల్లో ఆదివారం పరిశీలిస్తే అక్కడ పరిస్థితులు ఇలా కనిపించాయి.. ►విజయవాడలోని ఓ ప్రముఖ షాపింగ్ మాల్లో గంట వ్యవధిలో 67 మంది ప్రవేశించారు. వీరిలో 15 మంది ప్రవేశద్వారం దగ్గరకు రాక ముందు నుంచి మాస్క్‌తో ఉన్నారు. 31 మంది అక్కడకు వచ్చాక జేబులోని మాస్క్ తీసి ధరించారు. లోపలికి వెళ్లాక వీరు మాస్క్‌ను తిరిగి జేబుల్లో పెట్టుకోగా, మరికొందరు గడ్డం కిందకు లాగేసుకున్నారు. ఇక మాస్క్ లేకుండా లోనికి ప్రవేశించడానికి వీల్లేదని 21మందిని సెక్యూరిటీ సిబ్బంది వారించారు. దీంతో ఐదుగురు అమ్మాయిలు చున్నీని, 11 మంది అబ్బాయిలు రుమాలును ముఖానికి కట్టుకుని లోపలికి వెళ్లారు. ఐదుగురు అప్పటికప్పుడు మాస్క్‌లు కొని వెళ్లారు. ►విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, గుంటూరు, అనంతపురం, విజయవాడ సహా పలు నగరాల్లో విద్యావంతులు మాస్క్ లేనిదే బయటికి రావడంలేదు. ►పోలీసుల తనిఖీల్లో మాస్క్‌లు ధరించకుంటే రుసుములు విధిస్తున్నారని.. షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లలోకి అనుమతించరనే కారణంతో కొందరు ఆ కాసేపటికి మాత్రమే మాస్క్‌లు ధరిస్తున్నారు. ►పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అయితే మాస్క్ వాడకాన్ని మెజారిటీ శాతం తగ్గించేశారు. చాలామంది ఆటోల్లో, ట్రాక్టర్లలో ప్రయాణిస్తున్నప్పుడు మాస్క్‌లు ధరించడమే మానేశారు. ►గతంలో గుంటూరు జిల్లా నరసరావుపేట, తూర్పు గోదావరి జిల్లాలోని కోనసీమ, అమలాపురం, చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో కరోనా కేసులు అత్యధికంగా నమోదైనప్పటికీ ఇప్పుడు అక్కడి ప్రజలు సైతం కరోనా నిబంధనలను గాలికి వదిలేస్తున్నారు. మాస్క్ పెట్టుకోని వారు ఇలా అంటున్నారు.. ►రాష్ట్రంలో పాజిటివ్ కేసుల నమోదు చాలావరకు తగ్గింది. దీంతో వైరస్ ప్రభావం పెద్దగాలేదు కదా.. ►రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నాంగా.. ►మాస్క్‌తో శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంది. సమూహానికి దూరంగా ఉన్నప్పుడు మాస్క్ ఎందుకింక.. మాస్క్‌ల వాడకం 80–90 శాతం తగ్గింది లాక్డౌన్ రోజులతో పోలిస్తే విద్యా, వ్యాపార, వాణిజ్య ఇతర కార్యకలాపాలు బాగా పెరిగాయి. ప్రజల దృష్టి కరోనా నుంచి పూర్తిగా తొలగిపోయింది. ఈ నేపథ్యంలో మాస్క్‌లు ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు పాటించడం బాగా తగ్గించారు. నగరాల్లో ప్రతి 10 మందిలో 5–6 మంది.. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 2–3 మంది మాత్రమే మాస్క్‌ను వినియోగిస్తున్నారు. ఈ లెక్కన జూలై నెలతో పోలిస్తే మాస్కుల వినియోగం 80–90 శాతం తగ్గిందని అంచనా. మాస్క్ ధరించే విధానం చాలా ముఖ్యం వైరస్ వ్యాప్తిని మాస్క్ ద్వారా అడ్డుకోవచ్చు. మాస్క్ పెట్టుకున్న వ్యక్తుల్లోకి వైరస్ ప్రవేశించినా తక్కువ లోడ్ మాత్రమే వెళ్తుŠంది. చాలామంది మొక్కుబడిగా పెట్టుకుంటున్నారు. నోరు, ముక్కు రెండూ పూర్తిగా కవర్ అయ్యేలా మాస్క్ ధరిస్తేనే రక్షణగా ఉంటుంది. టీకా వేయించుకున్న వారిలో ఒమిక్రాన్ ప్రభావంలేదని ఎక్కడా రుజువు కాలేదు. కాబట్టి.. వారూ కచ్చితంగా మాస్క్‌లు ధరించాల్సిందే. – డాక్టర్ హైమావతి, రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు తప్పనిసరి అయితేనే గర్భిణులు బయటకు వెళ్లాలి గర్భిణులపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతుంది. రెండో దశలో వైరస్ బారినపడిన గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాధారణ వ్యక్తుల్లా గర్భిణుల ఊపిరితిత్తుల పనితీరు ఉండదు. శ్వాస తీసుకోవడంలో సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి వారు మరిన్ని జాగ్రత్తలు పాటించాలి. అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదు. బాలింతలు కూడా ఈ జాగ్రత్తలు పాటించాలి. – డాక్టర్ ప్రభావతి, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ -
చనిపోయిన ప్రియుడికి కోపం తెప్పించిన ప్రియురాలు.. దెయ్యమై..
లండన్: సాధారణంగా తీరని కోరికలతో చనిపోయిన వారి మనసుకు ప్రశాంతత ఉండదని భావిస్తారు. అలాంటి వారు ఆత్మలుగా మారి.. తమకు నచ్చిన వారి చుట్టు తిరుగుతుంటారని భయపడుతుంటారు చాలా మంది. ఇలాంటి అనేక సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఇలాంటి ఇదే తరహా ఘటన ఒకటి ఇంగ్లండ్‌లో చోటుచేసుకుంది. 38 ఏళ్ల బ్రోకార్డ్ ఆక్స్ఫర్డ్ షైర్‌కు గాయనిగా పనిచేస్తుంది. బ్రోకార్డ్, ఎడ్వర్డో ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు. అయితే, కొన్ని రోజుల తర్వాత.. ప్రియుడు ఎడ్వర్డ్ చనిపోయాడు. ఈ క్రమంలో బ్రోకార్డ్ .. తన ప్రియుడు చనిపోయిన కూడా అతనితో ఉన్న గడిపిన క్షణాలను ప్రతి క్షణం గుర్తుచేసుకుంటు ఉండేది. అతను తన చుట్టు ఉన్నట్లు భావించేది. ఒక రోజు బ్రోకార్డ్ తన ప్రియుడు ఎడ్వర్డోతో ఉన్న సంబంధాన్ని మీడియా సమావేశంలో పంచుకుంది. ప్రియుడితో గడిపిన ప్రత్యేక క్షణాలు, ప్రేమను పబ్లిగ్గా పంచుకుంది. ఆతర్వాత నుంచి బ్రోకార్డ్.. తన ఇంట్లో అనుకోని సంఘటనలు జరుగుతున్నాయని తెలిపింది. ఎడ్వర్డ్ కోపంగా ఉన్నాడని నాకు అనిపిస్తోందని తెలిపింది. ఇంట్లో ఏదో రకమైన అలజడి నాకు వినిపిస్తుంది. అతను..నాపై కోపంగా ఉన్నట్లు తెలుస్తుందని బ్రోకార్డ్ బాధపడింది. మా రొమాన్స్ గురించి పబ్లిగ్గా పంచుకున్నందుకు చనిపోయిన నా ప్రియుడు కోపంగా ఉన్నాడని తెలిపింది. అయితే.. ఇంగ్లండ్‌లో హలోవిన్ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. చనిపోయిన ఆత్మలు.. హలోవిన్ను వాలెంటైన్స్గా భావిస్తారని అక్కడి వారు నమ్ముతారని తెలిపింది. తన ప్రియుడికి కెండిల్స్ను వెలిగించి .. నచ్చిన పదార్థాలను వండి నా ప్రియుడి ముందు ఉంచుతానని తెలిపింది. అదే విధంగా.. ప్రతి ఒక్కరికి వ్యక్తి గత విషయాలు ఉంటాయి. అవి బహిరంగంగా పంచుకుంటే బాధ, కోపం వస్తుంది. ఈ విషయంలో.. నా ప్రియుడికి కూడా అలాగే కోపం వచ్చుంటుందని బ్రోకార్డ్ బాధపడింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. -
ప్రజలకు ఎమ్మెల్యే రోజా వినతి
-
మీ ప్రతాపం ప్రజల మీద చూపిస్తారా?
-
CM MK Stalin: ఒక మహిళ చమత్కారం.. స్టాలిన్ నవ్వులు
ఆయన ఓ పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి. చుట్టూ భారీ కాన్వాయ్, మందీమార్బలం లేకుండా సహజంగా ఏ సీఎం కూడా కాలు బయటపెట్టరు. అయితే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అందుకు భిన్నంగా వ్యవహరించారు. సాధారణ పౌరుడిలా ‘ఎన్నమ్మా..సౌఖ్యమా’ (ఏమ్మా క్షేమంగా ఉన్నారా) అంటూ ప్రజలను నేరుగా పలుకరించి ‘వావ్ గ్రేట్’ అనిపించుకున్నారు. స్టాలిన్‌తో స్థానికులు అపూర్వమైన అనుభూతిని పంచుకున్నారు. వివరాల్లోకి వెళ్లితే.. సాక్షి, చెన్నై(తమిళనాడు): ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన ఆరోగ్యంపై ఎంతో శ్రద్ధ చూపుతుంటారు. ప్రతి రోజూ ఉదయం నగరంలో సైక్లింగ్, జాగింగ్ చేయడం ఆయనకు అలవాటు. సీఎం అయిన తరువాత ఈ ఏడాది ఆగస్టులో చెన్నై నుంచి 50 కిలోమీటర్ల దూరంలోని మహాబలిపురం వరకు సైకిల్లో వెళ్లిన విషయం తెలిసిందే. మంగళవారం చెన్నై అడయారు ఆలమరం ప్రాంతానికి జాగింగ్ కోసం వెళ్లారు. అదే సమయంలో స్థానికులు జాగింగ్ చేస్తూ స్టాలిన్‌కు తారసపడ్డారు. వారిని చూడగానే స్టాలిన్ రోడ్డుపై నిలబడి మాట కలిపారు. క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. వారిలో ఒక మహిళ.. ‘మిమ్మల్ని రెండేళ్ల క్రితం విమానాశ్రయంలో కలుసుకున్నాను, సీఎం కావాలని శుభాకాంక్షలు తెలిపాను, అయితే సెల్ఫీ తీసుకోవడం మిస్ అయ్యాను’ అంటూ పాత జ్ఞాపకాలను గుర్తు చేశారు. ‘మీరు సీఎం అయ్యాక ప్రతి ఒక్క విషయంలోనూ ఆచితూచి అడుగువేస్తున్నారు..చాలా గర్వకారణంగా ఉంది’ అంటూ మరో మహిళ ప్రశంశించారు. ‘మేమంతా ఎంతో సంతోషంగా ఉన్నాం.. ఈ మంచి రోజులు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాము’ అని ఇంకో మహిళ స్టాలిన్‌తో అన్నారు. ‘అంతర్జాతీయ ఫుట్‌బాల్ పోటీలకు వెళ్లిన మీ మనుమడు విజయం సాధించాలని కోరుకుంటున్నాము’ అని ఓ స్థానికుడు చెప్పడంతో సీఎం వెంటనే ధన్యవాదాలు తెలిపారు. ‘ఎన్నో ఏళ్లుగా మిమ్మల్ని చూస్తున్నాం..మార్కెండేయుల్లా ఉన్నారే’ అంటూ ఆయన గ్లామర్‌పై ఒక మహిళ చమత్కరించడంతో స్టాలిన్ పెద్ద పెట్టున నవ్వగా పరిసరాల్లో ఉన్నవారంతా ఆయనతో కలిసి నవ్వులు చిందించారు. ప్రతి రోజూ వ్యాయామం చేస్తా, ఆహారంలో జాగ్రత్తలు పాటిస్తా అని తన యవ్వన, ఆరోగ్య రహస్యాన్ని స్టాలిన్ ప్రజలతో పంచుకున్నారు. స్టాలిన్‌తో పాటు జాగింగ్‌లో పాల్గొన్న ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణియన్, బందోబస్తుగా వెళ్లిన పరిమిత సిబ్బంది సైతం స్థానికులతో సీఎం సంభాషణను ఎంతో ఎంజాయ్ చేశారు. సుమారు అర గంటకు పైగా సాగిన ఈ పిచ్చాపాటీతో ఆ పరిసరాలన్నీ సందడిగా మారాయి. చదవండి: ‘రేవంత్ దమ్ముంటే హుజూరాబాద్‌లో డిపాజిట్ తెచ్చుకో’ M K Stalin blushes as a lady asks the secret of his youthful look, during his morning walk. He responds "diet control". pic.twitter.com/178TnzrNxE — J Sam Daniel Stalin (@jsamdaniel) September 21, 2021 -
కార్పొరేట్ సంస్థల కోసం ప్రజలపై కాల్పులా..?
సాక్షి, చెన్నై: కార్పొరేట్ సంస్థల కోసం ప్రజలపై కాల్పులు జరపడం భావ్యం కాదని మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తూత్తుకుడిలో స్టెరిలైట్‌పరిశ్రమకు వ్యతిరేకంగా 2018లో జరిగిన ఉద్యమ ర్యాలీ తుపాకీ కాల్పులకు దారి తీసిన విషయం తెలిసిందే. ఇందులో 13 మంది మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ వ్యవహారం సీబీఐ విచారణలో ఉంది. మానవ హక్కుల కమిషన్‌తో పాటుగా గత ప్రభుత్వం నియమించిన ప్రత్యేక కమిషన్ సైతం ఈ ఘటనపై దర్యాప్తు చేశాయి. అదే సమయంలో బాధితులకు నష్ట పరిహారం చెల్లింపు, మానవ హక్కుల సంఘాల విచారణకు అడ్డంకులు, నివేదికలు తదితర వ్యవహారాలపై మద్రాసు హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యా యి. సోమవారం ఇవి విచారణకు రాగా, ప్రధాన న్యాయమూర్తి సంజీబ్ బెనర్జీ బెంచ్ తీవ్రంగానే స్పందించింది. కార్పొరేట్ సంస్థల కోసం ప్రజల మీద కాల్పులా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది భావ్యం కాదు అని, ప్రభుత్వాలపై కార్పొరేట్ సంస్థలు ఆధిక్యాన్ని ప్రదర్శించ కూడదని పేర్కొంటూ, ఈ కాల్పుల్ని తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు, గాయపడ్డ వారికి నష్ట పరిహారం పెంపు మీద దృష్టి పెట్టాలని ప్రస్తుత ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేశారు. దివ్యాంగుల కోసం.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ భవనాల్లో దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, వసతులు కలి్పంచాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యల్ని వివరిస్తూ దాఖలైన పిటిషన్‌ను సీజే సంజీబ్ బెనర్జీ బెంచ్ విచారించింది. వాదనల అనంతరం దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, వసతులు తప్పనిసరి అని ప్రభుత్వానికి బెంచ్ స్పష్టం చేసింది. ఇప్పటికే 54శాతం మేరకు ఏర్పాట్లు జరిగాయని, ఏడాదిలోపు అన్ని పనులు పూర్తి చేస్తామని కోర్టుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. లుడ్ని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
భారీగా గుంతలు: ప్రాణాలు పోతేనే.. పట్టించుకుంటారా?
సాక్షి, వరంగల్: ఉమ్మడి వరంగల్ నగరంలో అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ పేరుతో రోడ్ల వెంట భారీగా గుంతలు తవ్వుతున్నారు. పైపులైన్లు వేయడంలో ఆలస్యం కావడం.. గుంతల వద్ద కనీసం జాగ్రత్తలు పాటించకపోవడంతో వాహనదారులు, పాదచారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. శనివారం వరంగల్ హెడ్ ఫోస్టాఫీస్ సమీపంలోని ఓ వృద్ధుడు అదుపు తప్పి డ్రెయినేజీలో పడిపోయాడు. గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుళ్లు వెంకన్న, షబ్బీర్‌లు వెంటనే స్థానికుల సహకారంతో బయటకు తీశారు. ఇలా వరంగల్ స్టేషన్ రోడ్డు నుంచి చౌరస్తా వరకు నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రాణాలు పోతేనే పట్టించుకుంటారా.. వెంటనే అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ పనులు పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
ఒక బస్సు..రెండింతలజనం, కొండగట్టును మరిచారా?
సాక్షి, హైదరాబాద్: సోమవారం.. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో 75 శాతం ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) నమోదైంది. మంగళవారం 68 శాతంగా రికార్డయింది. లాక్డౌన్ ముగిసిన తర్వాత బస్సులు మళ్లీ కళకళలాడుతున్నాయి. కరోనా కేసులు తగ్గడంతో జనం ప్రయాణాలకు ముందుకొస్తున్నారు. బస్టాండ్లు, బస్సులు కిటకిటలాడుతున్నాయి. ఉదయం, సాయం త్రం వేళల్లో రద్దీ ఎక్కువగా ఉంటోంది. అందుబాటు లో ఉన్న బస్సులన్నీ రోడ్డుపైకి తెచ్చినా చాలటం లేదు. గత్యంతరం లేక డిపోల్లో మూలకు చేరిన డొక్కు బస్సులను అప్పటికప్పుడు మరమ్మతులు చేయించి వాడుకోవాల్సి వస్తోంది. వీటిల్లో కొన్ని మధ్యలోనే మొరాయిస్తుండటంతో సిబ్బంది, ప్రయాణికులు నెట్టాల్సి వస్తోంది. కొన్నిచోట్ల అవి కూడా సరిపోక, ఒక్కో బస్సులో రెండు బస్సులకు సరిపడా ప్రయాణికులను కుక్కి పంపుతున్నారు. అధికారులు డిపోల్లో నిలబడి మరీ బస్సుల్లోకి జనాన్ని ఎక్కిస్తున్నారు. ఎందుకీ పరిస్థితి....? ఆర్టీసీకి సొంతంగా 6,370 బస్సులున్నాయి. నిధులు లేక చాలాకాలంగా కొత్త బస్సులు కొనటం లేదు. ఏటా 400 బస్సులు తుక్కుగా మారుతుంటాయి. వాటి స్థానంలో కొత్త బస్సులు కొనాలి. కానీ కొన్నేళ్లుగా కొత్త బస్సుల్లేక ఆర్టీసీ సొంత బస్సులు తగ్గిపోయాయి. దీంతో నిబంధనలను సడలించి మరీ అద్దె బస్సులు తీసుకుంది. ప్రస్తుతం ఆర్టీసీలో 3,170 బస్సులు అద్దె ప్రాతిపదికనే నడుస్తున్నాయి. అయితే అసలే నష్టాలు, ఆపై కోవిడ్ కష్టాలతో అద్దె బస్సు నిర్వాహకులకు రూ.100 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. లాక్డౌన్ తర్వాత అద్దె బస్సుల వాడకాన్ని ఆర్టీసీ నిలిపేయడంతో.. 3,170 బస్సులు అందుబాటులో లేక ఇప్పుడీ కష్టాలు చుట్టుముట్టాయి. చేతిలో సొంత నిధులు లేకపోవటం, ప్రభుత్వం పూచీకత్తు ఇచ్చినా బ్యాంకు రుణాలు చేతికందకపోవటం, ప్రభుత్వం ఇచ్చే మొత్తం జీతాలకే వాడేస్తుండటం వల్ల అద్దె బస్సుల వినియోగానికి వీల్లేకుండా పోయింది. ఫలితంగా ప్రయాణికులకు ఇబ్బంది తప్పడం లేదు. కొండగట్టును మరిచారా? 2018లో 102 మందితో కిక్కిరిసి ప్రయాణిస్తున్న బస్సు కొండగట్టు వద్ద బ్రేకులు ఫెయిలై దొర్లిపడిపోయి 50 మందికిపైగా దుర్మరణం చెందారు. అది ఎన్నో కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపటంతో.. ఇక సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని ఆర్టీసీ సిబ్బందిని ఆదేశించింది. ఇప్పుడు స్వయంగా ఆర్టీసీ అధికారులే దాన్ని ఉల్లంఘించి దగ్గరుండి మరీ ఎక్కువ మందిని బస్సుల్లోకి ఎక్కిస్తున్నారు. ‘ప్రస్తుతం మాకు బస్సుల కొరత తీవ్రంగా ఉంది. అద్దె యజమానులతో ఉన్న సమస్యలను పరిష్కరించుకొని వీలైనంత త్వరగా ప్రయాణికులకు ఇబ్బందులు రాకుండా చూస్తాం’ అని ఓ ఉన్నతాధికారి చెప్పారు. -
Telangana: రద్దీ ఎప్పటిలాగే..
సాక్షి, జగిత్యాల: లాక్డౌన్ సడలింపులతో జిల్లాలో జనజీవనం సాధారణమైంది. ఉదయం నుంచే రోడ్లు జనసమర్థంగా మారాయి. బుధవారం ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు లాక్డౌన్ సడలింపులతో వ్యాపార సంస్థలు తెరిచే ఉన్నాయి. కిరాణ దుకాణాలు, కూరగాయల మార్కెట్లు, మాంసం దుకాణాలు, చేపల మార్కెట్లు రద్దీగా కనిపించాయి. హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, వాణిజ్య దుకాణాలు సాయంత్రం వరకు నడిచాయి. జిల్లాలో కరోనా ప్రభావం, కేసులు పూర్తిగా తగ్గనప్పటికీ ఎక్కడ చూసినా జనం రద్దీగా కనిపించారు. మంగళవారం వరకు ఉదయం 6 నుంచి ఒంటి గంట వరకే జన సంచారం కన్పించగా సడలింపుల నేపథ్యంలో బుధవారం నుంచి సాయంత్రం 5 గంటల వరకు జిల్లావ్యాప్తంగా అన్ని కార్యకలాపాలు యథావిధిగా కొనసాగాయి. వ్యాపారులకు ఊరట లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో వ్యాపారులకు ఊరట లభించినట్లయ్యింది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఆంక్షలు, లాక్‌డౌన్‌తో వ్యాపారులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. మొదట ఉదయం 10 గంటల వరకు అవకాశం ఇచ్చినప్పటికీ వ్యాపారుల నిర్వహణ సాధ్యం కాలేదు. హోటళ్లు, టిఫిన్ సెంటర్లతోపాటు వాణిజ్య దుకాణదారులు తమ వ్యాపారాలు నడుపుకోలేక, షాపుల అద్దెలు చెల్లించలేక ఇబ్బందులు పడ్డారు. తర్వాత ప్రభుత్వం ఒంటి గంట వరకు అవకాశం ఇచ్చినప్పటికీ వ్యాపారులు పూర్తిస్థాయిలో కార్యకలాపాలు కొనసాగించలేకపోయారు. బుధవారం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వెసులుబాటు కల్పించడంతో వ్యాపారులకు ఊరట లభించింది. భౌతికదూరం మరిచారు ప్రభుత్వం లాక్డౌన్ నిబంధనలను సడలించినప్పటికీ కరోనా నిబంధనలను మాత్రం పాటించాల్సిందే. అయితే జిల్లాలో ఎక్కడ కనీసం భౌతికదూరాన్ని పాటించడం లేదు. ఎక్కడ చూసినా జనం గుంపులుగా కనిపించారు. బ్యాంకుల ఎదుట బారులు తీరి ఉన్నారు. దుకాణాలతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లోనూ కరోనా నిబంధనలు పాటించడం లేదు. కరోనా ప్రభావం పూర్తిగా తగ్గే వరకు ప్రజలందరూ భౌతికదూరం పాటిస్తూ కరోనా నిబంధనలను అమలు చేయాల్సిందేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చదవండి: దాడి చేశాకే తీవ్రత తెలిసేది.. సెకండ్‌వేవ్‌కు అదే కారణం -
కరీంనగర్లో నైట్ కర్ఫ్యూ.. సహకరిస్తున్న ప్రజలు
-
అభివృద్ధిలో ప్రజా కోణం ఏది?
దేశానికి, ఆయా రాష్ట్రాలకు ఏ మోడల్ అవసరం అన్నది ఇప్పుడు జరుగుతున్న చర్చ. అభివృద్ధి అంటే ఏమిటి? కేవలం రోడ్లు, భవనాలు నిర్మించడమే అభివృద్ధి అవుతుందా? లేక రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా జరిగితే అభివృద్ధి అవుతుందా? తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ బాగా పెరిగిందని సంతోషపడ్డారు. బాగానే ఉంది. ఇప్పుడు హైదరాబాద్‌లో ఇళ్ల స్థలాల విలువ బాగా పెరిగిన మాట నిజం. కొన్ని ప్రతిష్టాత్మక ప్రాంతాలలో గజం లక్ష నుంచి రెండు లక్షల వరకు ధర పలుకుతుంది. అదే సమయంలో లక్షలాది మంది ఇళ్లు లేక, ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తుందేమోనని ఎదురు చూస్తున్నారు. కాని స్థలాభావం కారణంగా ఆశించిన రీతిలో వాటిని ప్రభుత్వం నిర్మించలేక పోతోంది. గత కార్పొరేషన్ ఎన్నికలలో ఆ ప్రభావం కూడా పడి టీఆర్ఎస్కు నష్టం జరిగింది. తాజాగా కేసీఆర్ తెలంగాణలో ఒక ఎకరా అమ్మితే ఏపీలో రెండు ఎకరాలు కొనుక్కోవచ్చని చెబుతున్నారు. గతంలో ఇది రివర్స్‌లో ఉందని ఆయన అన్నారు. కేసీఆర్‌తో పాటు మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు కూడా ఏపీ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు చేశారు. నిజానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఎన్నడూ కేసీఆర్‌ను కానీ, టీఆర్ఎస్ నేతలను కానీ విమర్శించలేదు. అయితే ఇప్పుడు టీఆర్ఎస్ నేతల స్వరంలో ఎందుకు మార్పు వచ్చిం దన్నది ఆసక్తికర అంశమే అవుతుంది. అభివృద్ధిలో మార్గాలు వేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల ప్రణాళిక ప్రకారం నవరత్నాల హామీలను అమలు చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. పలువురు రెండు రాష్ట్రాల మధ్య పోలిక పెట్టి మాట్లాడుతున్నారు. అది కేసీఆర్‌కు కాస్త చికాకుగా ఉంటోంది. ఉదాహరణకు ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేసుకోవాలని ఇక్కడ కార్మికులు కోరారు. కేసీఆర్ ఒప్పుకోలేదు. కాని ఏపీలో మాత్రం జగన్ చేసి చూపించారు. కేసీఆర్ కూడా పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. రైతు బంధు వంటి ప«థకం గత ఎన్నికలలో బాగా ఉపయోగపడింది. అలాగే జగన్ కూడా రైతు భరోసాతో పాటు అమ్మ ఒడి, చేయూత, వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థల ఏర్పాటు, వృద్ధాప్య పెన్షన్లు ఇంటివద్దకు తీసుకు వెళ్లి ఇవ్వడం వంటి వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాగా గతంలో అమరావతిలోనే మొత్తం డబ్బు అంతా ఖర్చు చేయాలని ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించి రాజకీయంగా దెబ్బతిన్నారు. అయితే అమరావతి ముప్పై గ్రామాల పరిధిలో రాజధాని గ్రామాలలో అక్కడ అభివృద్ధి ప్రత్యేకంగా ఏమీ లేకపోయినా భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. అదే సమయంలో ఆ 30 గ్రామాలు దాటి విజయవాడ వైపుకాని, గుంటూరు వైపు కాని భూముల ధరలు ఆ రోజుల్లోనే తగ్గిపోయాయి. దానికి తోడు రాజధాని గ్రామాలలో మినహా గుంటూరు, కృష్ణా జిల్లాలలోని పొలాలను, స్థలాలను గ్రీన్ జోన్ కింద ప్రకటించడంతో అసలు కొనేవాడు లేకపోయాడు. అప్పటి నుంచే ఏపీలో రియల్ ఎస్టేట్ బాగా పడిపోయిందన్నది వాస్తవం. కాని కేసీఆర్ ప్రకటన ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఎంతో సంతోషం కలిగించింది. జగన్‌ను విమర్శించడానికి ఆయన ఈ పాయింట్ వాడుకుంటున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయిన కొంతకాలానికి మూడు రాజధానుల విధానం ప్రతిపాదించారు. దాంతో అమరావతి ప్రాంతంలో రేట్లు కొంతమేర తగ్గాయి. కాని అదే సమయంలో విశాఖపట్నం, కర్నూలు తదితర ప్రాంతాలలో భూముల రేట్లు బాగా పెరిగాయి. విశాఖపట్నంలో అయితే ఎకరా భూమి వెల 107 కోట్ల రూపాయల వరకు ఉందని మీడియాలో వార్తలు వచ్చాయి. విశాఖతో పాటు ఉత్తరాంధ్ర అంతటా భూముల ధరలు పెరిగాయి. పేదలకు వసతుల కల్పనే అసలు అభివృద్ధి ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోకుండా, కేసీఆర్ పనిగట్టుకుని ఏపీని తక్కువ చేసి చూపించడంలో ఆంతర్యం ఏమిటా అన్న చర్చ జరుగుతోంది. జగన్ సోదరి షర్మిల సొంతంగా రాజకీయ పార్టీ పెట్టుకున్న నేపథ్యం ఏమైనా ఈ వ్యాఖ్యల వెనుక ఉందా? షర్మిల వల్ల ఏ పార్టీకి నష్టం వస్తుందన్నది ఇంకా స్పష్టత రాలేదు. భవిష్యత్తులో ఆమె ప్రకటించే విధానాలు, ఆమె యాత్రలలో వచ్చే స్పందనను బట్టి రాజ కీయం సాగుతుంది. ఆమె కూడా రాజన్న రాజ్యం అంటూ ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో కూడా వైఎస్ అభిమానులు గణనీయంగానే ఉన్నారు. ఒకవేళ షర్మిల పార్టీ వారిని ఆకర్షించితే టీఆర్ఎస్కు కూడా కొంత నష్టం జరగవచ్చు. అయితే ఈ విషయంలో వైఎస్ జగన్ ప్రమేయం లేకపోయినా, టీఆర్ఎస్కు ఈ పరిణామం నచ్చలేదేమోననిపిస్తుంది. షర్మిలతో టీఆర్ఎస్ నేతలే పార్టీ పెట్టిస్తున్నారని భారతీయ జనతా పార్టీ నేతలు విమర్శిస్తుంటే, బీజేపీ చొరవతోనే ఆమె పార్టీ విషయంలో ముందుకు వెళుతున్నారని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. మరో మూడేళ్లలో జరిగే శాసనసభ ఎన్నికలలో వైఎస్ ప్రభావం తగ్గించడానికిగాను కేసీఆర్ రియల్ ఎస్టేట్ కామెంట్లు చేశారా అన్న అనుమానం వస్తోంది. అలాగే కేటీఆర్ ఆశ్చర్యకరంగా చంద్రబాబును పొగుడుతూ మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. రియల్ ఎస్టేట్ విలువలు పెరిగితే రాష్ట్రం అభివృద్ధి అయినట్లా? లేక పేదలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం అభివృద్ధి అవుతుందా అన్నదానిపై ఏపీ, తెలంగాణల మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తోంది. దళితులకు ఒక్కొక్కరికి మూడు ఎకరాల చొప్పున భూమి ఇస్తామని గతంలో కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆ హామీని ఎంతమేర నెరవేర్చారో టీఆర్ఎస్ నేతలు చెప్పవలసి ఉంటుంది. ఏపీలో ముఖ్యమంత్రి జగన్ ముప్పై లక్షల మందికి సెంటు నుంచి సెంటున్నర వరకు పేదలకు స్థలాలు ఇచ్చారు. వాటి విలువ పాతికవేల కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఆ ప్రకారం ఆ పేదలకు అంత మొత్తం ఆస్తిని జగన్ సమకూర్చారు. ఇది అభివృద్ధిగా పరిగణించరా? కొందరు కేసీఆర్ ప్రకటన ఆధారంగా జగన్‌పై రాజకీయ విమర్శలు చేస్తున్నారు. కాని వాటికి ఎంత విలువ ఉందన్నది ఈ మధ్య జరిగిన స్థానిక ఎన్నికలు తేల్చేశాయి. కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల భావనకు తొలుత ప్రాముఖ్యత వచ్చినా, ఆశించిన రీతిలో వాటి నిర్మాణం జరగలేదు. అది కొంత ఆయనకు మైనస్ అయింది. ఆ విషయాన్ని ప్రస్తావించకుండా కేసీఆర్ తెలివిగా రియల్ ఎస్టేట్ పెరిగిందని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ముఖ్యం రియల్ ఎస్టేట్ అన్నది ఆయా పరిస్థితులను బట్టి పెరగవచ్చు, తగ్గవచ్చు. హైదరాబాద్ పలుమార్లు ఆటుపోట్లు ఎదుర్కొంది. హైదరాబాద్‌లో ఇళ్లు లేని పేదలకు ఏపీలో మాదిరి ఇక్కడ ప్రభుత్వం స్థలాలు ఇవ్వగలదా? అన్నదానికి సమాధానం దొరకదు. ఏపీలో గతంలో మాదిరి స్పెక్యులేషన్ ఉండకపోవచ్చు. అంతమాత్రాన తెలంగాణలో కన్నా ఏపీలో భూముల రేట్లు తక్కువగా ఉన్నాయని అనుకుంటే పొరపాటే అవుతుంది. కేసీఆర్ మాటలు మోతుబరులకు అనుకూలంగా ఉన్నట్లు కనబడుతుంటే, ఏపీలో మాత్రం పేదల పక్షాన ప్రభుత్వం పనిచేస్తున్నట్లు అర్థం అవుతుంది. ఏది ఏమైనా రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలి తప్ప, అనవసరంగా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకోవడం ద్వారా రెండు రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని మాత్రం చెప్పాలి. రియల్ ఎస్టేట్ విలువలు పెరిగితే రాష్ట్రం అభివృద్ధి అయినట్లా? లేక పేదలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం అభివృద్ధి అవుతుందా అన్నదానిపై ఏపీ, తెలంగాణల మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తోంది. ఏపీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముప్పై లక్షల మంది పేదలకు సెంటు నుంచి సెంటున్నర వరకు స్థలాలు ఇచ్చారు. వాటి విలువ పాతికవేల కోట్లుగా అంచనా వేస్తున్నారు. పేదలకు అంత మొత్తం ఆస్తిని జగన్ సమకూర్చారు. ఇది అభివృద్ధి కాదా? కొందరు కేసీఆర్ ప్రకటన ఆధారంగా జగన్‌పై రాజకీయ విమర్శలు చేస్తున్నారు. కాని వాటికి ఎంత విలువ ఉందన్నది ఈ మధ్య జరిగిన స్థానిక ఎన్నికలు తేల్చేశాయి. ఏది ఏమైనా రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలి తప్ప, అనవసరంగా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకోవడం ద్వారా రెండు రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని మాత్రం చెప్పాలి. వ్యాసకర్త: కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు -
మాస్క్‌పై ఏపీ పోలీసు స్పెషల్ డ్రైవ్
-
మళ్లీ ఎన్నికల సందడి
సాక్షి, తాడూరు: గ్రామాల్లో మళ్లీ ఎన్నికల సందడి నెలకొంది. శాసన సభ, సర్పంచ్ ఎన్నికలు ముగిసి నెల రోజులు దాటిందో లేదో మళ్లీ ఎన్నికల వేడి మొదలైంది. తాజాగా అధికారులు ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యుల రిజర్వేషన్లు ఖరారు చేసే ప్రక్రియను చేపట్టడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. దీంతో పాటు ఎంపీటీసీ సభ్యుల రిజర్వేషన్లు కొలిక్కి రావడంతో అధికారుల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేశారు. ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. సర్పంచ్ ఎన్నికలు ముగిసిన తర్వాత నెల రోజుల పాటు స్తబ్ధత ఏర్పడిన తాజాగా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో గ్రామాల్లో ఎక్కడ ఎంపీటీసీ రిజర్వేషన్లు గ్రామాల పరిధిపై చర్చ కొనసాగుతుంది. రిజర్వేషన్లు ఖరారు కావడంతో రాజకీయ పార్టీలు సహితం పోటీకి సమాయత్తం అవుతున్నాయి. ఆశావహుల్లో ఉత్కంఠ ఆయా స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు ఆశావహుల్లో ఉత్కంఠతో పాటు మరి కొంత మంది ఏ విధంగా బరిలోకి దిగాలన్న ఆలోచనలో పావులు కదుపుతున్నారు. గ్రామాల పునర్విభజన చేయడంతో కొత్త పంచాయతీలు ఏర్పాటయ్యాయి. మండలంలో ఆరు కొత్త గ్రామపంచాయతీలను ఏర్పాటు చేశారు. గతంలో గ్రామాలలో ఆశించిన స్థాయిలో రిజర్వేషన్లు కాకపోవడం, ప్రస్తుతం రిజర్వేషన్లు అయిన తర్వాత అనుకూలంగా రాకపోవడంతో ఆశవాహుల్లో కొంత మేరనిరాశ, ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి నుంచి ఆయా పార్టీల నాయకులు మాజీ సర్పంచ్‌లు, ప్రస్తుత సర్పంచ్‌లతో మంతనాలు మొదలయ్యాయి. దీంతో మండలంలో ఎన్నికల సందడి నెలకొంది. రిజర్వేషన్లు ఇలా.. జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు జనరల్ మహిళకు కేటాయించగా, పది ఎంపీటీసీ స్థానాలకు సిర్సవాడ జనరల్, భల్లాన్‌పల్లి జనరల్ మహిళ, తుమ్మలసుగూరు జనరల్, చర్ల తిర్మలాపూర్ ఎస్సీ మహిళ, ఇంద్రకల్ జనరల్ మహిళ, తాడూరు బీసీ మహిళ, యాదిరెడ్డిపల్లి బీసీ జనరల్, అల్లాపూర్ ఎస్సీ జనరల్, మేడిపూర్ జనరల్, అంతారం బీసీ మహిళ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. -
‘మందు’ బంద్‌కు వేళాయె!
కోహెడ(హుస్నాబాద్): కోహెడలో ఉన్న వైన్స్‌షాపుల ఎదుట బుధవారం వినియోగదారులు మద్యం కోసం భారీగా క్యూ కట్టారు. అసెంబ్లీ ఎన్నికల నింబంధనల ప్రకారం బుధవారం సాయంత్రంతో రెండు రోజులు వైన్స్‌లో మద్యం విక్రయాలు బంద్ కావటంతో వినియోగదారులు మద్యం కోనుగోలుకు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. -
ఓల్లు నారాజ్ కావొద్దని..
సాక్షి, మోర్తాడ్(బాల్కొండ): ఏంరా... రాజు ఎటు పోతున్నవ్ అసలే కనిపిత్తలేవ్... ఏంలేదు నర్సన్న రోజు ఎలచ్చన్ల పెచారంకు బోతున్న గందుకే నీకు కనిపిత్తలేను... గట్లనా మరి గదే రోజు పొద్దుగాల్ల కసీర్కాడ ఉన్న హోటల్‌కు అచ్చి చాయి తాగుతుంటివి.. మూడు నాలుగు రోజుల నుంచి సూత్తున్న కనిపిత్తలేవని అడుగుతున్న. అవు నర్సన్న మస్కట్ బోయేటందుకు విజాకు అప్లికేషన్ పెట్టిన గని ఇంకా మస్తు టైం ఉంది. గందుకే ఉట్టిగా ఇంటికాడ ఉంటే యాష్ట అత్తది. పెచారంకు బోతే పైసలత్తున్నయి. ఇంత బిర్యాని బువ్వ బెడుతుండ్రు... గందుకే పెచారంకు బోతున్న. అగో రోజు మస్తు మజా సేత్తున్నవ్ అన్నట్లు గదరా రాజు.. అవు నర్సన్న మరేంజేస్తం... ఎలచ్చన్లు అయిపోయేదాంకా పెచారంల తిరుగుతున్న.. అవు మల్ల మరి ఏ పార్టీల్లోకు పెచారంకు బోతున్నవ్ రాజు. ఏం లేదు నర్సన్న ఓల్లు ఒక రోజు ముందు సెబితే ఆల్లకు పెచారంకు బోతున్న. అగో గట్ల గిదేం తరీకర బై రాజు.. ఇగో నర్సన్న ఓల్లయిన గంతే పైసలిత్తుండ్రు. అందరి లెక్కనే బిర్యాని బువ్వ బెడుతుండ్రు. గందుకే ముందు ఓల్లు సెబితే ఆల్లకు పెచారంకు బోతున్నం. గట్ల గాదురా రాజు. ఏదన్న ఒక పార్టీకే పెచారంకు బోవాల గాని ఓల్లు సెబితే ఆల్లకు పోవుడు ఏమన్నా మంచిదావురా. ఇగో నర్సన్న.. గిప్పుడు గిట్లనే సెయ్యాలే.. ఏంటికంటే.. ఓల్లయిన ఉట్టిగనే తోల్కపోతలే. అందరు పైసలు, బిర్యాని బువ్వ పెట్టుడు కామన్ జేసిండ్రు. గందుకే ఒక రోజు ముందు సెప్పినోల్లకు పెచారంకు బోతున్నం. మల్ల పొద్దుమీక్కి మా ఇంటికచ్చి పెచారంకు రమ్మని సెప్పినోల్లకు తెల్లారి ఆల్లకు బోతున్నం. ఇగో రాజు నేను అన్నది నీకర్థం గాలే.. నేను సెప్పిదే ఏంటిదంటే ఏదన్న ఒక పార్టీకి పెచారంకు బోవాల గాని ఓల్లు సెబితే ఆల్లకు పోవుడు ఏం మంచిగలేదు. ఏదన్న ఒక పార్టీతోనే ఉండాలే అని సెప్పుతున్న. గది కరెక్టె గని నర్సన్న. మనకు ఎప్పుడు ఓల్లతోని పని బడ్తదో తెల్వదాయే. గందుకే ఏ పార్టీవోల్లు సెప్పినా పెచారంకు బోయి అత్తున్న. అంటే ఒక పాల్టీలనే తిరగవ్ అన్నట్లు గదరా రాజు. అవ్మల్ల. నర్సన్న ఒక పార్టీలనే దిరిగితే మిగిలిన పార్టీలోల్లతోని లొల్లి. గందుకే ఓల్లను కూడా నారాజ్ సేయకుండా అన్ని పార్టీవోల్లకు బోయి పెచారం సేసి అత్తున్నం. గట్లనే ఏ పార్టీవోల్లతోని బోతే ఆల్ల కండువ గప్పుకుంటున్నం నర్సన్న. అవ్రా రాజు నువ్వు సెప్పింది మస్తుగున్నది. నీ లెక్కనే రాజకీయం చెయ్యాల. మంచి పిలాన్ సేసినవ్. ఓల్లు కూడా నారాజ్ కాకుండా అందరి తాన్కి బోతున్నవ్. ఓల్లు పైసలిత్తే ఆల్లయి తీసుకుంటున్నవ్. మంచి పని జేసినవ్. పోతరా మస్తు లేట్ అయ్యింది పని బాగుంది అని ఆడికెల్లి ఇద్దరు ఎల్లిపోయిండ్రు.. -
‘పల్లె వెలుగులు’ ఏవీ?
సాక్షి, అడ్డగూడూరు : మండల కేంద్రంతో పాటుగా మండల పరిధిలోని వివిధ గ్రామాలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పల్లెవెలుగు బస్సులు పల్లెలకు కాకుండా పట్టణాలకే పరిమితమవుతున్నాయి. దీంతో పల్లె ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి రవాణా సౌకర్యంలేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులకు తప్పని తిప్పలు మండలం నుంచి ప్రజలు, విద్యార్థులు మోత్కూర్, నల్లగొండ, భువనగిరి, హైదరాబాద్, తిరుమలగిరి, సూర్యాపేట, జనగాం, తొర్రూరు, వరంగల్ తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. అయితే సరియైన బస్సు సౌకర్యం లేకపోవడంతో వారు ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగించడానికి ఇబ్బందులు పడుతున్నారు. పల్లెలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు ఆటోల కోసం పడిగాపులు కాస్తుంటారు. లేదంటే కాలినడకనే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇక వర్షాకాలంలో ప్రయాణికుల బాధలు వర్ణణాతీతం. గ్రామాల స్టేజీల నుంచి గ్రామంలోకి వర్షంలోనే నడుచుకుంటూ రావాల్సి వస్తోంది. ఆటోలే శరణ్యం.. గ్రామాలు బాగుపడాలంటే ఆ గ్రామాల్లో ప్రధానంగా రోడ్డు, రవాణా సౌకర్యం ఉండాలి. ఒక గ్రామానికి ఇంకో గ్రామానికి మధ్య అనుసంధానం చేసేది రవాణా వ్యవస్థనే. కానీ పాలకుల నిర్లక్ష్యం, అధికారుల వైఫల్యం వల్ల మండలంలోని చాలా గ్రామాలకు సరైన రవాణా సౌకర్యం లేదు. బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు ఆటోలను నమ్ముకుని ప్రయాణించాల్సి వస్తోంది. బస్సు సౌకర్యం లేని గ్రామాలు మండలంలోని మొత్తం 17 గ్రామపంచాయతీలు ఉండగా కేవలం నాలుగు గ్రామాలకే బస్సు సౌకర్యం ఉంది. చౌళ్లరామారం, అడ్డగూడూరు, ధర్మారం, చిర్రగూడూర్, కంచనపల్లి, బొడ్డుగూడెం, కోటమర్తి, డి.రేపాక మంగమ్మగూడెం, గ్రామాలకు బస్సు సౌకర్యంలేదు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ గ్రామాలకు ఆర్టీసీ వారు బస్సు సౌకర్యం కల్పించాలని పాలకులను వేడుకున్నా పట్టించుకోలేదని వారు వాపోతున్నారు. అదేవిధంగా మండలంలోని ప్రతి గ్రామాల స్టేజీలవద్ద గ్రామం పేరు తెలియజేసే బోర్డులను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. బస్సు సౌకర్యం కల్పించాలి బస్సు సౌకర్యం లేక ప్రయాణికులు ఆటోల్లో ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో వృద్ధులు మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీవారు స్పందించి గ్రామాల్లో బస్సు సౌకర్యం కల్పించాలి. – తుప్పతి మధు, అడ్డగూడూరు -
ప్రజల కోసమే పోలీసులు
భీమారం : పోలీసులు పనిచేసేది ప్రజల కోసమేనని జైపూర్ ఏసీపీ సీతారాములు అన్నారు. మండల కేంద్రంలోని బోయగూడెంలో పోలీస్‌స్టేషన్‌కు కేటాయించిన స్థలంలో స్థానిక కుటుంబాలతో బుధవారం ఆయన మాట్లాడారు. 411 సర్వే నెంబర్లో 19 గుంటల భూమిని ప్రభుత్వం పీఎస్‌కు కేటాయించిందన్నారు. దీనిని అడ్డుకోవడం సరైన పద్ధతి కాదన్నారు. సుపారిపాలన కోసమే సీఎం కేసీఆర్ నూతన జిల్లాలు, మండలాలు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఇందులో కొత్తగా ఏర్పాటైన భీమారాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసుకోవాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు స్వంత భవనాలు ఉంటేనే ఆ కార్యాలయాలకు కళ వస్తుందన్నారు. దసరా పండుగ సందర్భంగా జంబి పూజలు, మరోవైపు బతుకమ్మ ఆడుకుంటారని, ఇందుకోసమే అడ్డుకుంటున్నామని స్థానికులు తెలిపారు. వాటి కోసం మరోచోట స్థలం చూపించి ఇక్కడ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. ఉన్న స్థలంలో కొంత భాగాన్ని బతుకమ్మ, జంబి చెట్టు కు కేటాయిస్తామని ఏసీపీ హామీఇచ్చారు. చెన్నూరు సీఐ కిశోర్, ఎస్సై మంగీలాల్ æరాజ్‌కుమార్‌నాయక్, ఎంపీపీ మెండె హేమలత, సర్పంచ్ ఎల్కటూరి శంకరమ్మ తదితరులు ఉన్నారు. ఆరెపల్లిలో కార్డెన్‌సెర్చ్ మండలంలోని ఆరెపల్లి గ్రామంలో బుధవారం ఉదయం జైపూర్ ఏసీపీ సీతారాములు ఆధ్వర్యంలో కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. వాహనపత్రాలు లేని 10 ద్విక్ర వాహనాలతోపాటు టాటా ఏసీ, 9 ఆటోరిక్షాలను స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు గ్రామంలోని ఇంటింటికి వెళ్లి నిర్భంద తనిఖీ చేశారు. చెన్నూరు సీఐ కిశోర్, భీమారం ఎస్సై మంగీలాల్, శ్రీరాంపూర్ ఎస్సై రవిప్రసాద్, ఏఎస్సైలు గంగన్న, నజీర్ ఉన్నారు. -
‘నివేదన’కు స్పందించండి
గద్వాల అర్బన్ : గ్రామీణులు దూర ప్రాంతాల నుంచి ఎన్నో వ్యయప్రాయాలకోర్చి ‘ప్రజావాణి’కి రావద్దనే ఉద్దేశంతోనే నివేదన యాప్ రూపొందిం చా మని జాయింట్ కలెక్టర్ సంగీత తెలి పారు. వీలైనంత వరకు దీని ద్వారా నే ఫిర్యాదులు చేయాలని సూచించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ‘ప్రజావాణి’కి 52 ఫిర్యాదులు అందా యి. ఈ సందర్భంగా ఆయా గ్రామాలకు చెందిన ప్రజల నుంచి ఆమె అర్జీలు స్వీకరించారు. నివేదన యాప్ ద్వారా లేదా నేరుగా ఫిర్యాదు చేసిన సమస్యలపై అధికారులు నిబద్ధతతో పరిష్కరించాలని ఆదేశించారు. ఇందులో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. గ్రీవెన్స్‌కు 13 అర్జీలు గద్వాల క్రైం: ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకు 13 అర్జీలు అందాయి. గద్వాల, మల్దకల్, గట్టు, ధరూరు, వడ్డేపల్లి, ఇటిక్యాల, అయిజ మండలాల ప్రజలు ఎస్పీ విజయ్‌కుమార్‌ను కలసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని సమస్యలను వీలైనంత త్వరలో పరిష్కరిస్తామన్నారు. రేషన్ సరుకులు ఇవ్వడం లేదు కట్టెల మిషన్‌లో పనిచేసేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు చేతివేళ్ల సరిగా పని చేయడం లేదు. దీంతో వేలిముద్రలు పడటం లేదని మూడు నెలలుగా రేషన్ షాపులో సరుకులు ఇవ్వడం లేదు. ఎలాగైనా అందేలా చూడాలి. – పద్మ, వెంకటస్వామి దంపతులు, వడ్డెవీధి, గద్వాల ‘కల్యాణలక్ష్మి’ వర్తింపజేయాలి నా కూతురు కళావతికి మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకం కింద దరఖాస్తు చేసుకుంటే వివిధ కారణాలతో మండల అధికారులు ఇంతవరకు ఆమోదించడం లేదు. ఇప్పటికైనా ఈ పథకం డబ్బులు వచ్చేలా చూడాలి. – మునెమ్మ, చెనుగోనిపల్లి, గద్వాల మండలం -
‘ఛీఛీ’ రోడ్లు..!
పెంట్లవెల్లి : మండలంలోని ఎంగంపల్లి, మంచాలకట్ట, మాధవస్వామినగర్, కొండూరు తదితర గ్రామాల్లో ఇప్పటికీ సీసీరోడ్లు లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. చిన్నారులు తిరిగేందుకు నానా అవస్థలు పడుతున్నారు. రూ.లక్షలు వెచ్చించి ఎక్కడెక్కడో పనులు చేస్తున్నారు.. కానీ గ్రామాల్లో సీసీరోడ్లు మాత్రం ఇప్పటికీ వేయడంలేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ప్రతికాలనీలో సీసీరోడ్లు వేయిస్తామని చెప్పిన ప్రజాప్రతినిధులు ఇప్పటి వరకు వేయలేదని విచారం వ్యక్తం చేస్తున్నారు. అప్పుడిప్పుడంటూ కాలయాపన సీసీరోడ్లు నిర్మిస్తే ప్రయాణికులకు, గ్రామస్తులకు ఇబ్బందులు తొలగుతాయని, పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులను కోరితే మంజూరవుతాయి.. అప్పుడిప్పుడంటూ కాలయాపన చేస్తున్నారని.. ఐదేళ్లు పూర్తి కావస్తున్నా.. రోడ్లు వేయలేదని ఆరోపిస్తున్నారు. ఎన్నికల ముందు బహిరంగ సభలలో ఎన్నో హామీలిస్తారు కానీ ఎక్కడో ఒకటి రెండు తప్ప మిగతా చోట్ల న్యాయం చేయడం లేదని విమర్శిస్తున్నారు. ప్రజా ప్రతినిదులు, అధికారులు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, కాలనీల్లో సీసీరోడ్లు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. సీసీరోడ్లు నిర్మించండి మాధవస్వామినగర్‌లో సీసీరోడ్లు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. రాత్రివేళ మహిళలు, చిన్నారులు అవస్థలు పడుతున్నారు. సర్పంచ్, అధికారులు స్పందించి సీసీరోడ్డు నిర్మించేలా చూడాలి. – రాజేందర్, మాధవస్వామినగర్ ఏళ్లు గడుస్తున్నా.. మల్లేశ్వరం గ్రామంలో ఎన్నికల ముందు పలు హామీలిచ్చిన నాయకులు ప్రస్తుతం అడిగితే మాట మారుస్తున్నారు. ఇప్పటికైనా మా కాలనీల్లో సీసీ రోడ్ల కల నెరవేర్చాలి. – కుర్మయ్య, మల్లేశ్వరం -
నిఘా నేత్రం.. కట్టుదిట్టం
అలంపూర్ రూరల్ : ప్రజాభద్రతే లక్ష్యంగా పోలీస్‌శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని, అందులో భాగంగానే అలంపూర్ స్టేషన్ పరిధిలో 23 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించామని కలెక్టర్ రజత్‌కుమార్‌సైని, ఎస్పీ విజయ్‌కుమార్ అన్నారు. గురువారం అలంపూర్ పోలీస్‌స్టేషన్‌లో వారు సీసీల కెమరాలను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో పోలీస్ యంత్రాంగం పనితీరు ఎంతో బాగుందని ప్రజలనుంచి ప్రశంసలు వస్తున్నాయని, శాంతి భద్రతల విషయంలో అందరికీ ఒకేగాడిన పెడుతున్నామన్నారు. ఇకపై నియోజకవర్గ కేంద్రంలో జరిగే ప్రతి కదలికను పోలీసులు గమనిస్తూనే ఉంటారని తెలిపారు. నివేదన యాప్ జిల్లా ప్రజల కోసమే తీసుకొచ్చామని, ఏ సమస్య అయినా క్లిప్పింగ్‌లు, ఫొటోలు పంపిస్తే పరిష్కరిస్తామన్నారు. అనంతరం నేతాజీ ఫ్రెండ్స్ చైతన్య సేవాసమితి కార్యదర్శి వెంకట్రామయ్య శెట్టి ఆధ్వర్యంలో నాయకులు కలెక్టర్, ఎస్పీలను మెమోంటోలతో గౌరవించారు. కార్యక్రమంలో డీఎస్పీ సురేందర్‌రావు, డీఆర్వో వేణుగోపాల్‌రావు, సీఐ రజిత, ఎస్ఐ వాసా ప్రవీన్‌కుమార్ , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రణాళికా బద్ధ్దంగా చదివితేనే ఉత్తమ గ్రేడ్ గద్వాల అర్బన్: పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులు ప్రణాళికబద్ధంగా చదివితే మంచిమార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారని కలెక్టర్ రజత్‌కుమార్‌సైని అన్నారు. గురువారం రాత్రి జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలుర, ఆనంద నిలయంలో కలెక్టర్ చేతుల మీదుగా విద్యార్థులకు దుప్పట్లు, తివాచీలు అందజేశారు. అనంతరం జరిగిన సమావేశంలో విద్యార్థులకు పలు సూచనలు చేశారు. పరీక్షలంటే ఆందోళనకు గురికావద్దని, ఏకాగ్రతతో చదివితే సత్ఫలితాలు వస్తాయన్నారు. ఉన్నత చదువులకు పదవ తరగతి తొలిమెట్టని, తల్లిదండ్రుల కలలు, ఆకాంక్షలను నెరవేర్చేలా కష్టపడి చదవాలన్నారు. వార్డెన్లు కూడా టెన్త్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మెనూ ప్రకారం నాణ్యతతో భోజనం పెట్టించాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ హాస్టళ్ల అధికారి రాములు పాల్గొన్నారు. సమగ్ర నివేదిక తయారుచేయాలి : జోషి సాక్షి, గద్వాల: సమగ్ర భూ సర్వే అనంతరం రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు తయారు చేసి ఇవ్వాల్సి ఉన్నందున జిల్లాలో ఖాతానెంబర్లు, ఫొటోలు, ఆధార్‌కార్డు నెంబర్లు అన్నీ సరిపోయేటట్లు సమగ్ర నివేదిక తయారు చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్‌జోషి ఆదేశించారు. గురువారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సచివాలయం నుంచి కలెక్టర్లతో మాట్లాడారు. మార్చిలో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను జారీ చేసేవరకు ఎలాంటి పొరపాట్లు లేకుండా నివేదికలు కంప్యూటరీకరించి పంపాలన్నారు. కాన్ఫరెన్స్‌లో ప్రత్యేక కార్యదర్శి రాజేశ్వర్ తివారి, ప్రత్యేక కలెక్టర్ కరుణ, సంయుక్త కలెక్టర్ సంగీత పాల్గొన్నారు. దళారుల ఆటలు కట్టించండి : పార్థసారధి గద్వాల అర్బన్: కంది పంట రైతులు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర కల్పించి ఎఫ్‌సీఐ, హాకా సంస్థల ద్వారా కొనుగోలు చేస్తుంటే దళారులు అక్రమాలకు పాల్పడుతున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారథి అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని జీఏడీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్లతో సమీక్షించారు. ప్రభుత్వం కందులకు రూ.5,450 మద్దతు ధర కల్పిస్తోందని, దళారులు గోదాముల్లో నిల్వ ఉంచిన కందులు, ఇతర రాష్ట్రాల నుండి తెచ్చిన కందులను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలతో అమ్ముతున్నట్లు తెలిసిందని, తక్షణమే దాడులు నిర్వహించి వారి ఆట కట్టించాలని ఆదేశిం చారు. అనంతరం కలెక్టర్ రజత్‌కుమార్‌సైని వివరాలు వెల్లడించారు. జిల్లాలో 1.5లక్షల క్వింటాళ్ల కందులు దిగుబడి కాగా దాదాపు 50శాతం కందులను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేశామని తెలిపారు. వీసీలో జిల్లా సంయుక్త కలెక్టర్ సంగీత, మార్కెట్ శాఖ అధికారిణి పుష్పలత, జిల్లా వ్యవసాయ అధికారి గోవిందునాయక్ పాల్గొన్నారు. -
ప్రజల సౌకర్యం కోసమే కొత్త జిల్లాలు : మంత్రి
సాక్షి, నల్గొండ: సుపరిపాలన ప్రజల చెంతకు చేరాలనే లక్ష్యంతోనే కొత్త జిల్లాలు, మండలాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. నల్గొండ జిల్లా ఘట్టుప్పల్‌లో మంత్రి శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఘట్టుప్పల్‌ను కొత్త మండలం చేయాలనే డిమాండ్‌ను పరిశీలిస్తున్నామని, అలాగే గుండాల మండలాన్ని జనగామ జిల్లా నుంచి మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ముఖ్యమంత్రితో మాట్లాడి ఈ రెండు సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఘట్టుప్పల్ మండల సాధన కోసం ఆత్మహత్యయత్నం చేసి తీవ్రంగా గాయపడిన యువకుడి కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. బాధిత కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం, ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఘట్టుప్పల్ మండల సాధనలో భాగంగా నమోదైన కేసులను ఎత్తివేస్తామని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు -
జనం మెచ్చేలా పనిచేస్తాం: డీజీపీ
సాక్షి, మహబూబాబాద్ : ప్రజలు మెచ్చుకునేలా తెలంగాణ పోలీస్ యంత్రాంగం పనిచేస్తుందని రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా డీజీపీ గురువారం మహబూబాబాద్, వరంగల్ అర్భన్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లా పోలీసుల పనితీరు బాగుందని కొనియాడారు. పోలీసుల పనితీరుతో రాష్ట్రవ్యాప్తంగా నేరాల సంఖ్య తగ్గిందని చెప్పారు. శాంతి భద్రతల విషయంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో పౌరులకు ఒకే విధానం పాటిస్తున్నట్లు వెల్లడించారు. జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి పనితీరు బాగుందని ప్రశంసించారు. అదేవిధంగా వరంగల్ అర్బన్ జిల్లాలో పర్యటించిన డీజీపీ హన్మకొండ మోడల్ పోలీస్ స్టేషన్‌ను, పోలీస్ హెడ్ క్వార్టర్స్ నిర్మిస్తున్న పోలీస్ కమాండ్ సెంటర్‌ను పరిశీలించారు. అనంతరం నీట్ లో పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు. -
మోదీ పనితీరుకు జనం జేజేలు: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ స్పందించారు. ఈ ఫలితాలు మోదీ నాయకత్వంలో పనితీరుకు ప్రజలు ఇచ్చిన తీర్పుగా అభివర్ణించారు. సోమవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ గుజరాత్లో బీజేపీ విజయానికి కార్యకర్తలు ఎంతో కృషి చేశారని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ ఫథకాలను బీజేపీ నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయం సాధించారన్నారు. గుజరాత్లో అభివృద్ధి ఎజెండానే తప్ప ఎలాంటి జిమ్మిక్కులు పనిచేయలేదని లక్ష్మణ్ అన్నారు. గుజరాత్లో మోదీ చేసిన అభివృద్ధిని ప్రజలు మర్చిపోలేదని, గుజరాత్ తరహా పాలన దేశమంతటా వ్యాపిస్తోందన్నారు. జీఎస్టీ, పెద్దనోట్లపై కాంగ్రెస్ చేసిన తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదన్నారు. రాహుల్ గాంధీ గాలిలో తిరిగి చెప్పిన గాలి మాటలు గాలిలోనే కొట్టుకుపోయాయని ఆయన విమర్శించారు. భవిష్యత్‌లో బీజేపీ తెలంగాణలో పాగా వేస్తుందని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. -
మావోలతో జతకడితే ఖబర్దార్
సాక్షి, ఆదిలాబాద్ : మావోయిస్టులు, అనుబంధ సంఘలతో సంబంధాలు నేరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏజెన్సీ ప్రాంత ప్రజలను డీజీపీ హెచ్చరించారు. ఆదివాసీలు-లంబాడాల గొడవల నేపధ్యంలో మావోలు అదనుగా తీసుకునే అవకాశం ఉందని ఆయన పోలీసులను హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆదివారం ఉట్నూరులో పర్యటించిన డీజీపీ మహేందర్‌రెడ్డి శాంతిభద్రతలు, లంబాడీ - ఆదివాసీల వివాదంపై పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సమీక్షలో ఐజీలు, కమిషనర్లు, ఎస్పీలు, డీఐజీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ స్వప్రయోజనాల కోసం చట్టాలను చేతుల్లోకి తీసుకుంటే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. జనజీవనం, విద్యార్థుల చదువుకు విఘాతం కలిగిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెవెన్యూ, ఐటీడీఏ అధికారులతో కలిసి శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు మహేందర్‌రెడ్డి సూచించారు. పూర్వ ఆదిలాబాద్ జిల్లాలో లంబాడాలు-ఆదివాసీల మధ్య ఘర్షణలు తెలుత్తుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పెద్దఎత్తున ఘర్షణలు చోటుచేసుకుని పలువురు గాయపడ్డారు. ప్రస్తుతం నివురుగప్పిన నిప్పులా అక్కడి పరిస్థితి ఉంది. కాగా... ఘర్షణలను ముందే పసిగట్టలేకపోవడం, వాటిని అదుపు చేయలేకపోయారన్న కారణంతో మూడు జిల్లాల కలెక్టర్లు, ఓ డీఐజీని ప్రభుత్వం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఘర్షణలను అరికట్టలేకపోయారన్న అపవాదును పోలీస్ శాఖ మూటకట్టుకున్న నేపధ్యంలో డీజీపీయే స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. -
ఏం చేశావని ఓటేయాలి బాబూ?
సోషల్ మీడియా వేదికగా అధికార పక్షాన్ని నిలదీస్తున్న నెటిజన్లు - విచ్చలవిడి హామీలే తప్ప అమలు ఏది? - ఇప్పుడు మళ్లీ నంద్యాల ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నంపై మండిపాటు - ప్రజలను ఆలోచింపజేస్తున్న పోస్టులు సాక్షి, అమరావతి: అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా ఇప్పటివరకు ఒక్క హామీ అమలు చేయకపోగా.. ఇప్పుడు నంద్యాలకు అది చేస్తాం ఇది చేస్తామంటూ అధికారపార్టీ చేస్తున్న వాగ్ధానాలపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులుగా ఏం అభివృద్ధి చేశారని మీకు ఓటు వేయాలంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఈ మేరకు అధికార పార్టీ వైఫల్యాలు, హామీల మోసాలు, మూడేళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై సామాజిక మాధ్యమాల్లో పలువురు పెడుతున్న పోస్టులు ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి. ఓటుకు కోట్లు కేసు, పుష్కరాలు, పట్టిసీమ పేరుతో విచ్చలవిడి దోపిడీ, సదావర్తి భూముల వ్యవహారం, మహిళలపై దాడులు, పబ్లిసిటీ పిచ్చితో గోదావరి పుష్కరాల్లో 30 మంది అమాయక ప్రజలను పొట్టనపెట్టుకున్న తీరు, కాల్‌మనీ కేసులు, ఇసుక మాఫియాను దగ్గరుండి ప్రోత్సహిస్తుండడం దగ్గరనుంచి... అవినీతి డబ్బుతో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన ఉదంతం, ప్రత్యేక హోదా 15 ఏళ్లు కావాల్సిందేనంటూ ఎన్నికల్లో చెప్పి.. ప్యాకేజీకి అమ్ముడుపోయిన తీరుపై అనేక ఆలోచింపజేసే పోస్టులు పెడుతూ ఎందుకు టీడీపీకి ఓటు వేయాలని ప్రశ్నిస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నిక వచ్చిన క్రమం.. భూమా నాగిరెడ్డి మరణానికి దారితీసిన పరిస్థితులు, నంద్యాల్లో రోడ్ల వెడల్పుకు నిధులు కావాలంటూ రెండేళ్ల కిందట శిల్పా మోహన్‌రెడ్డి అభ్యర్థిస్తే.. ఎక్కడున్నాయి నిధులు, నువ్వు ఇస్తావా అంటూ చంద్రబాబు వ్యంగ్యంగా మాట్లాడిన ఘటనలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అభివృద్ధి పేరుతో హడావుడిగా ఎలాంటి సమాచారం లేకుండా ఇళ్లను కూలదోయడం.. నామమాత్రపు నష్టపరిహారాన్ని ఇస్తామంటూ మభ్యపెట్టడంపై మండిపడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రజలను ఆలోచింపజేస్తున్న పోస్టులు కొన్ని.. ► ఓట్లు వేయలేదని మూడేళ్ల పాటు రాయలసీమకు కనీసం ఎంగిలి చేతులు కూడా విదిల్చకపోగా.. ఓటేస్తేనే మీకేదైనా చేస్తాను. నాకు ఓట్లేయకుంటే రోడ్లమీద తిరగొద్దు.. పింఛన్లు, రేషన్ తీసుకోవద్దు అని బెదిరిస్తున్న వారిని నమ్ముదామా?.. నాయకత్వం కంటే ప్రజలే ముఖ్యం అని నినదించే వాడి పక్షాన నిలబడదామా..? ► విపక్షం గెలిచినా నా ప్రమేయం లేకుండా అభివృద్ధి జరగనివ్వను అనే వాళ్లను విశ్వసిద్ధామా?.. అధికారం ఉన్నా లేకపోయినా శక్తివంచన లేకుండా అభివృద్ధికి కృషి చేస్తామనే వాళ్లకు ఓటేద్దామా? ► కోట్లు వెదజల్లి విపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, కనీసం రాజీనామా చేయమనే ధైర్యం లేని వాళ్లకు ఓటేద్దామా?.. విశ్వసనీయతకు ప్రాధాన్యతనిస్తూ ఒక పార్టీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాకే తమ పార్టీలో చేర్చుకున్న వ్యక్తికి ఓటేద్దామా? ► ‘‘టీడీపీకి ఎందుకు ఓటేయ్యాలి?.. ఒక మంత్రి పదవి కూడా ఇవ్వనందుకు ముస్లిమ్స్ టీడీపీ కి ఓటు వేయాలా? ► బ్రాహ్మణులకు ఒక మంత్రి పదవీ ఇవ్వకుండా పైగా నిజాయితీపరుడైన మాజీ చీఫ్ సెక్రటరీ, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావును అవమానించినందుకు ఓటు వేయాలా? ► దళితుల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారు.. ఎస్టీలకు తెలివి ఉండదు.. అని సాక్షాత్తూ ముఖ్యమంత్రే దళితులను అవమానిస్తే.. దళితులు శుభ్రంగా ఉండరు, చదువుకోరు, రిజర్వేషన్లు అనుభవిస్తున్నారంటూ ఓ మంత్రి దారుణంగా మాట్లాడినందుకు టీడీపీ కి ఓటు వేయాలా? ► అధికారంలోకి వస్తే 6 నెలల్లో కాపులను బీసీల్లో చేరుస్తాను, ప్రతి ఏడాది వెయ్యి కోట్లు ఇస్తా అని చెప్పి.. హామీలు నెరవేర్చమని ముద్రగడ ఉద్యమిస్తే దారుణంగా అవమానించినందుకు ఓటెయ్యాలా? ► కోడలు మగ పిల్లాడిని కంటానంటే ఏ అత్త వద్దంటుంది అని మహిళల పట్ల చిన్న చూపు చూసినందుకు ఓటు వేయాలా? రాయలసీమ రౌడీలు అని పదే పదే ఒక ప్రాంతాన్ని అవమానిస్తున్నందుకు సీమ ప్రజలు ఓటు వేయాలా? ► సీమకు నీళ్లివ్వకుండా ఎండబెడుతున్నందుకు ఓటు వేయాలా? సీమలో హైకోర్ట్ పెట్టనందుకు ఓటు వేయాలా? ► నిరుద్యోగులకు రుణమాఫీ చేయనందుకు ఓటు వేయాలా? ఇంటికో ఉద్యోగం ఇవ్వనందుకా? నిరుద్యోగులకు నెలకు 2 వేలు చొప్పున 38 నెలలకు గాను ఒక్కో నిరుద్యోగికి 76 వేలు ఇవ్వనందుకు ఓటు వేయాలా?’’ అంటూ నెటిజన్లు నిలదీస్తున్నారు. -
టీడీపీకి ప్రజలే బుద్ధి చెబుతారు
కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం తథ్యం త్వరలో కాకినాడలో వైఎస్ జగన్ పర్యటన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి స్పష్టీకరణ సాక్షి ప్రతినిధి, కాకినాడ : కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీకి ప్రజలే బుద్ధి చెబుతారని, ఎన్నికల కోసం వేచి చూస్తున్నారని చంద్రగిరి ఎమ్మెల్యే, ఎన్నికల పరిశీలకులు చెవిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. కార్పోరేషన్ ఎన్నికల నేపథ్యంలో పార్టీని సమాయత్తం చేసేందుకు జిల్లాలో ఉన్న చెవిరెడ్డి భాస్కరరెడ్డి శుక్రవారం విలేకర్లతో మాట్లాడారు. ప్రాంతాలకు, కులాలకు అతీతంగా వైఎస్సార్సీపీని గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు కానుందన ప్రజలు కసితో రలిగిపోతున్నారని, ఎన్నికలెప్పుడొస్తాయా? ఎప్పుడు ఓడిద్దామని ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. టీడీపీకి ప్రజల్లో గుర్తింపు లేదని, తీవ్ర వ్యతిరేకత మధ్య అభ్యర్థులను పెట్టుకోలేని పరిస్థితిలో ఉందన్నారు. అభ్యర్థులు దొరకకే మిత్రపక్షమైన బీజేపీకి అధిక సంఖ్యలో డివిజన్లు కేటాయిస్తుందని, ఆ పార్టీ బలహీనతకు ఇదే నిదర్శనమని చెప్పారు. కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటిస్తారని వెల్లడించారు. -
జయరామయ్యా.. అభివృద్ధి ఏదయ్యా?
► పార్టీ ఫిరాయింపు సమయంలో ప్రజలకు భారీగా హామీలు ► తర్వాత అటకెక్కించిన ఎమ్మెల్యే ► ఏడాదిన్నరలో మరింత పెరిగిన జనం సమస్యలు ► తన అభివృద్ధి కోసమే పార్టీ ఫిరాయించారని మండిపడుతున్న జనం పార్టీ ఫిరాయించిన రోజు పెద్ద పెద్ద మాటలు చెప్పిన బద్వేలు ఎమ్మెల్యే జయరాములు ఇప్పుడు తన హామీల ఒట్టు తీసి గట్టున పెట్టారు. పార్టీ కండువా కప్పుకున్న తర్వాత తాను జనానికి ఇచ్చిన హామీల సంగతేమిటని మంత్రులను, సీఎంను గట్టిగా నిలదీసి నిధులు సాధించుకునే ధైర్యం చేయలేకపోతున్నారు. ఎమ్మెల్యే నిజంగా నియోజకవర్గ అభివృద్ధి మీద ధ్యాసతోనే పార్టీ ఫిరాయించి అధికార పార్టీ ఎమ్మెల్యే అవతారం ఎత్తి ఉంటే ఇప్పటి వరకూ హామీలను ఎందుకు నెరవేర్చలేక పోతున్నారని ప్రజలు రగిలిపోతున్నారు. సాక్షి ప్రతినిధి, కడప: నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను పార్టీ మారుతున్నాననీ, అధికార పార్టీలో చేరుతున్నందువల్ల నియోజకవర్గంలోని సమస్యలన్నీ ఇట్టే పరిష్కరిస్తానని బద్వేలు ఎమ్మెల్యే తిరువీధి జయరాములు గట్టిగా చెప్పారు. హామీలు దంచేసి ఏడాదిన్నర కావస్తోంది. నియోజకవర్గ కేంద్రమైన బద్వేలులో జనం నీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. కొన్ని ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే నీళ్లే దిక్కు. జయరాములు నివాసం ఉంటున్న పోరుమామిళ్ల జనం దప్పిక తీర్చడానికి రూ.90 లక్షలతో సగిలేరు నుంచి పోరుమామిళ్ల వరకు నిర్మించిన తాగునీటి పథకం పనులు నాసిరకంగా జరిగినా కాంట్రాక్టర్లు, అధికారులను ప్రశ్నించలేని పరిస్థితిలో ఉన్నారు. పోరుమామిళ్లవాసుల గొంతులు తడపడానికి రోజుకు రూ.50 వేలు ఖర్చుచేసి 115 ట్యాంకర్లతో నీళ్లు అందిస్తున్నా నీటి కటకట తీరడం లేదు. పోరుమామిళ్ల జనం నీళ్లో జయరామయ్యా అని గొంతు చించుకుంటున్నా ఎమ్మెల్యే వారి ఇబ్బందుల గురించి గొంతు విప్పే పరిస్థితిలో లేరు. సొంత అభివృద్ధి కోసమే..: ఎమ్మెల్యే జయరామయ్య గారు సొంత అభివృద్ధి కోసమే పార్టీ మారారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా నోరు విప్పడం లేదంటే గత ఏడాది ఫిబ్రవరి 23వ తేదీన జయరాములు ఎందుకోసం టీడీపీ కండువా కప్పుకున్నారనే విషయం వేరేగా చెప్పక్కర్లేదు. తాను ఇచ్చిన హామీలకు ఏడాదిన్నర నిండబోతున్న నేపథ్యంలోనైనా జయరాములు తన హామీల గురించి ఆలోచించాలని జనం కోరుతున్నారు. ఈ పనైనా చేయండి బద్వేలు మండలం అప్పరాజుపేట నుంచి అట్లూరు మండలంలోని చివరి ఆయకట్టు వరకు బ్రహ్మసాగర్ కుడికాలువ నిర్మాణ పనులు ఆగిపోయాయి. దివంగత సీఎం వైఎస్సార్ సీఎంగా ఉండగా ఈ పనులు వేగంగా జరిగాయి. ఆయన మరణం తర్వాత నిధులు లేక నీరసించాయి. ఎమ్మెల్యే జయరాములు మూడు, నాలుగు కోట్ల నిధులు సాధించి ఈ పనైనా పూర్తి చేయిస్తే సుమారు 15వేల ఎకరాల భూములకు సాగునీరందించవచ్చు. ఇదీ హామీల గతి హామీ: బద్వేలు అభివృద్ధి కోసం రూ.100కోట్ల నిధులు తెస్తా. అమలు : ఇంతవరకూ ప్రత్యేకంగా రూపాయి కూడా తేలేదు. హామీ : గోపవరం, బద్వేలు మండలాల తాగునీటి ఎద్దడి నివారణకు సోమశిల బ్యాక్‌వాటర్‌ను ఎత్తిపోతల పథకం ద్వారా ఒక టీఎంసీ నీరు సరఫరా చేయిస్తా. అమలు : ఇంతవరకూ అతీగతి లేదు. హామీ : కాశినాయన మండలానికి తెలుగుగంగ ఎడమ కాలవ నుంచి సావిశెట్టిపల్లి, ఆకులనారాయణపల్లి, వరికుంట్ల, భాలాయపల్లి, గొటువారిపల్లి, గంగనపల్లి పంచాయతీలలోని గ్రామాలకు సాగునీరు అందిస్తా. అమలు : ఇంతవరకూ దాని ఊసేలేదు. హామీ : కలసపాడు మండలానికి స్పెషల్ కోటా కింద వెయ్యి పక్కాఇళ్లు మంజూరు చేయిస్తా. అమలు : అన్ని మండలాలకు కేటాయించిన విధంగా 130 ఇళ్లే మంజూరయ్యాయి. స్పెషల్ కోటా ప్రస్తావనే లేదు. హామీ : బి.కోడూరుకు 200 వృద్ధాప్య పింఛన్లు ఇప్పిస్తా. అమలు : 80 పింఛన్లు మాత్రమే మంజూరు చేయించారు. హామీ : బి.కోడూరు మండలం సిద్దుగారిపల్లి ఎస్సీకాలనీపై వెళుతున్న 11 కేవీ విద్యుత్ లైను మార్పిస్తా అమలు : ఇంతవరకూ విద్యుత్ లైన్ మార్చలేదు. హామీ : అట్లూరు మండలంలో తాగునీటి ఎద్దడి నివారణ కోసం సిద్దవటం సమీపంలో నుంచి పెన్నా నీరు ఎత్తిపోతల పథకం ద్వారా సరఫరా చేయిస్తా అమలు : ఆ పనులు ప్రతిపాదనల దశకు కూడా చేరలేదు. హామీ : బద్వేలు నుంచి పోరుమామిళ్ల వరకూ ఉన్న సింగిల్ రోడ్డును డబుల్‌రోడ్డుగా మార్పిస్తా. అమలు : ఆ ఊసే లేదు హామీ : పోరుమామిళ్ల చెరువుకు బ్రహ్మసాగర్ నీరు తెస్తా. అమలు : ఆ పనుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. హామీ : ప్రతి జర్నలిస్టుకు ఇంటిస్థలంతో పాటు పక్కాఇళ్లు మంజూరు చేయిస్తా. అమలు : ఈ హామీకి అతీగతీ లేదు. -
బదిలీల్లో గందరగోళం
వెబ్ కౌన్సిల్ అంటూ ప్రభుత్వం జీవో జారీ దరఖాస్తు చేసుకున్న ప్రజారోగ్యశాఖ లాంగ్ స్టాండర్డ్ ఉద్యోగులు తర్వాత సాధారణ కౌన్సెలింగ్ అంటూ మరో జీవో సర్వీసు ఆధారంగా అభ్యర్థులకు కౌన్సెలింగ్ తెల్లవార్లు జరుగుతున్న ప్రక్రియ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కరువు తీవ్ర ఇబ్బందులు పడుతున్న దూర ప్రాంత ఉద్యోగులు సాక్షి, రాజమహేంద్రవరం : ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్య, వైద్య ఉద్యోగుల బదిలీల్లో ప్రభుత్వం తీసుకున్న గందరగోళ నిర్ణయాలు ఉద్యోగులను ముప్పతిప్పలు పెడుతున్నాయి. ముందు వెబ్ కౌన్సెలింగ్ అన్న ప్రభుత్వం, అందుకు అనుగుణంగా ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్న తర్వాత సాధారణ కౌన్సెలింగ్ అంటూ, అదీ కూడా వారం రోజుల్లో ముగించాలంది. కౌన్సెలింగ్‌కు సరైన ప్రణాళిక, కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు ఏర్పటు చేయకపోవడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో ఉద్యోగుల బదిలీలు చేపట్టాలని ఏప్రిల్ 24న రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 64 జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా ప్రజారోగ్య, వైద్య విభాగంలో బదిలీలు చేపట్టేందుకు ఆ శాఖ మే 6న జీవో నంబర్ 318 జారీ చేసింది. వెబ్ కౌన్సెలింగ్ విధానంలో ప్రభుత్వ ఆస్పత్రులు, బోధనాస్పత్రులలో అదే ప్రాంతంలో ఎక్కువ కాలం (లాంగ్ స్టాడింగ్) పనిచేస్తున్న వారు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. ఇందుకు అనుగుణంగా ఆయా ప్రాంతాలలో పనిచేస్తున్న వివిధ విభాగాల ఉద్యోగులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. ఈ ప్రక్రియను మే 24కి పూర్తి చేస్తామని నోటిఫికేషన్లో పేర్కొంది. ప్రణాళికా లోపం, సౌకర్యాలు లేకపోవడం వల్ల అనుకున్న సమయానికి వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించలేదు. 24 అర్ధరాత్రికి ఆయా విభాగాలలో బదిలీల కోసం జీవో నంబర్ 64 ద్వారా ప్రభుత్వం ఇచ్చిన సమయం ముగిసింది. సాధారణ కౌన్సెలింగ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో జీవో జారీ చేయకుండానే ప్రజారోగ్య,వైద్య విభాగం మే 27న జీవో నంబర్ 343 జారీ చేసింది. జూన్ 5 నాటికి బదిలీలు పూర్తి చేసేలా నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందు కోసం జోన్ స్థాయిలో ఇద్దరు అడిషనల్ డైరెక్టర్లు, ఒక రీజనల్ డైరెక్టర్‌తో త్రిసభ్య కమిటీ వేసింది. జిల్లాస్థాయిలో కలెక్టర్, డీఎంఅండ్ హెచ్‌వో, డీసీహెచ్‌లతో కూడిన త్రిసభ్య కమిటీని కౌన్సెలింగ్ కోసం ఏర్పాటు చేసింది. మార్గదర్శకాలకు నామం... రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు జోన్లలో ఉద్యోగుల బదిలీలు జరుగుతున్నాయి. జోన్–2 పరిధిలోని కృష్ణా, పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల ఉద్యోగులకు రాజమహేంద్రవరంలోని రీజనల్ డైరెక్టరేట్‌లో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. శనివారం స్టాఫ్ నర్సులు, పీహెచ్ఎన్, ఎంపీహెచ్ఎస్(ఎఫ్)ల కౌన్సెలింగ్ చేపట్టారు. దరఖాస్తు చేసుకున్న వి«ధంగా అభ్యర్థుల జాబితాను కౌన్సెలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేశారు. ఒకే ప్రాంతంలో 20 ఏళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగి తిరిగి అదే ప్రాంతంలో పని చేస్తామని తమ ఆసక్తిని కనబరుస్తూ మూడు ఆప్షన్లు పెట్టారు. ఇలా 153 మంది స్టాఫ్ నర్సులలో దాదాపు 40 మంది ఇలానే ఆప్షన్లు ఇచ్చారు. మిగతా వారు మూడు ప్రాంతాలను వేర్వేరుగా ఆప్షన్లుగా పెట్టుకున్నారు. కౌన్సెలింగ్ పిలుస్తున్న కమిటీ, అభ్యర్ధి అక్కడే పని చేస్తామని మూడు ఆప్షన్లు పెట్టుకుంటే తిరస్కరిస్తూ మరో చోట తీసుకోవాలని ఖాళీల జాబితా చూపిస్తోంది. ఈ విధానాన్ని ఇతర ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. బదిలీ అంటేనే ఉన్న ప్రాంతం నుంచి మరో చోటుకు వెళ్లడమని, కానీ వారు అదే ప్రాంతంలో పని చేస్తామని ఇచ్చిన మూడు ఆప్షన్లను పెడితే వారికి అప్పటికప్పుడు ఎంచుకోండంటూ లిస్ట్ ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమంటున్నారు. ఇలా చేయడం వల్ల ఆప్షన్లు పెట్టుకున్న ఉద్యోగులకు మూడింటిల్లో ఒక్కటి కూడా రాలేదని వాపోతున్నారు. మూడు ఆప్షన్లు పని చేస్తున్నచోటే పెట్టుకున్న వారికి అక్కడికక్కడే నచ్చిన ప్రాంతం ఎంచుకోవాలని కమిటీ సభ్యులు జాబితా ఎలా ఇస్తారని స్టాఫ్ నర్సులు ప్రశ్నిస్తున్నారు. ప్రణాళిక లోపం శనివారం మూడు విభాగాలకు సంబంధించి 232 మందికి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన కౌన్సెలింగ్ ప్రక్రియ ఆదివారం తెల్లవారుజాము 4 గంటల వరకు జరిగింది. అర్ధరాత్రి 1 గంటలకు స్టాఫ్ నర్సులు, పీహెచ్ఎన్ విభాగానికి సంబంధించి 178 మందికి కౌన్సెలింగ్ నిర్వహించారు. కౌన్సెలింగ్ నిర్వహణలో ప్రణాళిక లోపం వల్ల ఒక్కొక్క అభ్యర్థికి 20 నుంచి 30 నిమిషాల పాటు సమయం పడుతోంది. ఉద్యోగులు ముందుగా ఎంచుకున్న మూడు ఆప్షన్లు కాకుండా అప్పటికప్పుడు అక్కడే నచ్చిన చోటను ఎంపిక చే సుకుంటుండడంతో తీవ్ర జాప్యం జరుగుతోంది. కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల నుంచి వచ్చిన ఉద్యోగులు కౌన్సెలింగ్ కేంద్రం వద్ద కనీస సౌకర్యాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మంచినీరు, కూర్చునేందుకు అవసరమైన మేరకు కుర్చీలు లేక ఎక్కడికక్కడ చతికిలపడ్డారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్న ఉద్యోగుల అవస్థలు వర్ణనాతీతం. ఆదివారం సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్డినేట్, ఏఎస్వో, టీఎస్వో, ఏపీఎంవో, డీపీఎంవో, ఎంపీహెచ్ఎస్(ఎం) తదితర విభాగాల ఉద్యోగులకు కౌన్సెలింగ్ జరుగుతోంది. ఇష్టానుసారం చేస్తున్నారు... ప్రభుత్వం జీవో జారీ చేయకుండానే విభాగం జీవో 343 ద్వారా కౌన్సెలింగ్ చేయడం నిబంధనలకు విరుద్ధం. వెబ్‌కౌన్సెలింగ్ అన్నారు. తర్వాత సాధారణమన్నారు. ఉద్యోగులకు కనీసం అవగాహణ కల్పించలేదు. మార్గదర్శకాలు పాటించకుండా కమిటీ సభ్యుల ఇష్టానుసారం కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ కనీస సౌకర్యాలు కూడా లేవు. – జి.ఆస్కారరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రజారోగ్య, వైద్య ఉద్యోగుల సంఘం. వెబ్ కౌన్సెలింగ్ ఆప్షన్లను పరిగణలోకి తీసుకోం వెబ్ కౌన్సెలింగ్ కోసం ఉద్యోగులు దరఖాస్తులు, అందులో పేర్కొన్న మూడు ఆప్షన్లను సాధారణ కౌన్సెలింగ్‌లో పరిగణలోకి తీసుకోవడంలేదు. సర్వీసు ఆధారంగా వరుసగా ఉద్యోగులను పిలుస్తున్నాం. వారికి నచ్చిన చోటను ఎంపిక చేసుకోమంటున్నాం. నిబంధనల ప్రకారమే అంతా చేస్తున్నాం. కేంద్రం వద్ద సౌకర్యాలు ఏర్పాటు చేశాం. – షాలినీదేవి, రీజనల్ డైరెక్టర్, జోన్–2