
దర్శకుడు, నటుడు సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'సముద్రఖనియిన్ పబ్లిక్'. నటుడు కాళి వెంకట్, నటి రిత్విక తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ఆర్.పరమన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కేకేఆర్ సినిమాస్ పతాకంపై కేకే రమేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి డి.ఇమాన్ సంగీతాన్ని, రాజేష్ యాదవ్, వెట్రిల ద్వయం ఛాయాగ్రహణను అందిస్తున్నారు.
చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను శనివారం విజయ్‌సేతుపతి, దర్శకుడు వెంకట్ ప్రభు ఆన్‌లైన్ ద్వారా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు పేర్కొంటూ ఇంతకుముందు రాజకీయ నేపథ్యంలో చాలా చిత్రాలు వచ్చాయన్నారు. కానీ తమిళ సినీ చరిత్రలోనే తొలిసారిగా రాజకీయ పార్టీల కార్యకర్తల ఇతివృత్తంతో తెరకెక్కిస్తున్న చిత్రం ఇదని తెలిపారు. చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌కు పరిశ్రమ వర్గాల నుంచి మంచి స్పందన రావడం సంతోషంగా ఉందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment