First Look Poster
-
సుమ తనయుడి కొత్త చిత్రం.. ఫస్ట్ లుక్ పోస్టర్ చూశారా?
టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. గతేడాది బబుల్గమ్ మూవీతో టాలీవుడ్ హీరోగా అరంగేట్రం చేశారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది.అయితే తాజాగా మరో చిత్రానికి రెడీ అయ్యారు రోషన్. కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ డైరెక్షన్లో నటించనున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి మోగ్లీ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా విడుదలైన పోస్టర్ చూస్తే రోషల్ వైల్డ్ లుక్‌ను తలపిస్తోంది. ఈ మూవీలో బాలీవుడ్ భామ సాక్షిసాగర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీని లవ్ స్టోరీగానే తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. 𝐓𝐇𝐄 𝐋𝐎𝐔𝐃𝐄𝐒𝐓 𝐖𝐀𝐑 𝐎𝐅 𝐀 𝐒𝐈𝐋𝐄𝐍𝐓 𝐋𝐎𝐕𝐄 𝐒𝐓𝐎𝐑𝐘 ❤🔥#Mowgli ’s Wild Adventure Begins 💥💥Stay tuned for more exciting updates!#Mowgli2025A @SandeepRaaaj directorial.🌟ing @RoshanKanakala & #SakshiMhadolkarA @Kaalabhairava7 musical 🎵… pic.twitter.com/vxtDMvAqU4— People Media Factory (@peoplemediafcy) December 19, 2024 -
మంచు విష్ణు కన్నప్ప మూవీ.. మోహన్ లాల్ క్యారెక్టర్ రివీల్!
టాలీవుడ్ హీరో మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ తారాగణంతో రూపొందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఫస్ట్ లుక్‌ను రివీల్ చేశారు.ఈ చిత్రంలో మోహన్ లాల్ కిరాటా పాత్రలో కనిపించనున్నారు. తాజాగా విడుదలైన మోహన్ లాల్ ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ఈ విషయాన్ని మంచు విష్ణు తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి స్టార్స్ సైతం నటిస్తున్నారు. ఓ యదార్థ కథ ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 25,2025లో థియేటర్లలో సందడి చేయనుంది. ‘KIRATA’! The legend Sri. Mohanlal in #Kannappa. I had the honor of sharing the screen space with one of the greatest Actor of our time. This entire sequence will be 💣💣💣💣💣 ! @Mohanlal pic.twitter.com/q9imkDZIxz— Vishnu Manchu (@iVishnuManchu) December 16, 2024 -
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.. మోహన్ బాబు మనవరాళ్లను చూశారా?
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా వస్తోన్న చిత్రం 'కన్నప్ప'. ఈ మూవీ భారీ బడ్జెట్‌తో అవా ఎంటర్ టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ ఇందులో నటిస్తున్నారు. ఇటీవలే మోహన్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్.తాజాగా మరో అప్డేట్తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ మూవీలో మోహన్ బాబు మనవరాళ్లు అరియానా, వివియానా కూడా నటిస్తున్నారు. వీరిద్దరికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను కన్నప్ప టీమ్ రివీల్ చేసింది. ఈ మూవీ ద్వారా మోహన్ బాబు మనవరాళ్లు సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్నారు. వీరి ఫస్ట్ లుక్ పోస్టర్ సినీ ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది.కాగా.. ఇప్పటికే రిలీజైన కన్నప్ప టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. టీజర్ ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్‌లా ఉంది. విష్ణు మంచు యాక్షన్ సీన్స్, యుద్ధ సన్నివేశాలు, స్టన్నింగ్ విజువల్స్‌తో కన్నప్ప టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. యూట్యూబ్‌లో ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి 30 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. Immerse yourself in the spirit of devotion with #Ariaana & #Viviana Manchu, and witness their full-look in #Kannappa🏹 — A perfect blend of talent and spirituality dedicated to Lord Shiva.🎬✨#HarHarMahadevॐ @themohanbabu @iVishnuManchu @Mohanlal #Prabhas @akshaykumar… pic.twitter.com/vquzPB6b6s— Kannappa The Movie (@kannappamovie) December 2, 2024 -
కిల్లర్‌తో వస్తోన్న టాలీవుడ్ డైరెక్టర్.. ఆసక్తిగా పోస్టర్స్!
శుక్ర, మాటరాని మౌనమిది, ఏ మాస్టర్ పీస్ లాంటి డిఫరెంట్ సినిమాలతో అలరించిన డైరెక్టర్ సుక్కు పూర్వాజ్. తాజాగా మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ప్రస్తుతం ఆయన డైరెక్షన్లో కిల్లర్ అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. బుల్లితెర బ్యూటీ జ్యోతి పూర్వాజ్ కీలక పాత్రలో కనిపించనుంది.తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్స్ చూస్తుంటే కిల్లర్ మూవీపై అంచనాలు పెంచేస్తున్నాయి. పూర్వాజ్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. చేతిలో రివాల్వర్‌తో కనిపిస్తోన్న ఈ పోస్టర్స్ మూవీ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమానుఏయు అండ్ఐ, మెర్జ్ ఎక్స్ ఆర్ సంస్థతో థింక్ సినిమా బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. View this post on Instagram A post shared by Venkata Suresh Kumar Kuppili (@poorvaaj) -
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.. మోహన్ బాబు లుక్ చూశారా?
టాలీవుడ్ హీరో మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఈ మూవీలో పలువురు సూపర్ స్టార్స్ నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రంలో మోహన్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రివీల్ చేశారు. ఇందులో మహదేవ శాస్త్రి పాత్రలో మోహన్ బాబు కనిపించనున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోన్న ఈ మూవీని డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.ఇప్పటికే ఈ చిత్రం నుంచి మధుబాల,శరత్‌కుమార్, దేవరాజ్ వంటి ప్రముఖ నటుల పోస్టర్లను విడుదల చేశారు. కన్నప్పలో ప్రభాస్ లాంటి అగ్రహీరో కూడా కనిపించనున్నారు. అంతేకాకుండా మోహన్ లాల్, బ్రహ్మానందం, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో కన్నప్ప పాత్రను మంచు విష్ణు పోషిస్తున్నారు. కాగా.. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. త్వరలోనే కన్నప్ప థియేటర్లలో సందడి చేయనుంది. Unveiling the divine look of @themohanbabu garu as 'Mahadeva Shastri' in #Kannappa🏹. Witness the devotion and grandeur as they come to life! 🌟✨ #HarHarMahadevॐ#MohanBabu @ivishnumanchu @Mohanlal #Prabhas @akshaykumar @realsarathkumar #MukeshRishi @mukeshvachan… pic.twitter.com/Z8XbIV3ccd— Kannappa The Movie (@kannappamovie) November 22, 2024 -
అలా అయితేనే సినిమాలు చేసేందుకు ముందుకు రండి: ఆర్పీ పట్నాయక్
కిట్టు తాటికొండ, కష్మీరా,రోహిత్, వైశాలి, సునీల్ రావినూతల, శ్రీ గోపి చంద్ కొండ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం 'కరణం గారి వీధి'. ఈ చిత్రాన్ని సౌత్ బ్లాక్ బస్టర్ క్రియేషన్స్ బ్యానర్‌పై అడవి అశోక్ నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం హేమంత్, ప్రశాంత్ తెరకెక్కిస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్లో కంప్లీట్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీ త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ - 'కరణం గారి వీధి సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నా చేతుల మీదుగా రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. పోస్టర్, టైటిల్ డిజైన్ చాలా కొత్తగా అనిపించింది. కొత్త టాలెంట్ ఎంత ఎక్కువగా వస్తే ఇండస్ట్రీకి అంత మంచిది. ఈ టీమ్ కూడా మంచి ప్రయత్నం చేసి ఉంటారని ఆశిస్తున్నా. ఈ సినిమా టీమ్‌కు మంచి పేరు రావాలి. కొత్త ఫిలిం మేకర్స్‌కు నాదొక చిన్న సలహా. సినిమా మీద కనీస అవగాహన, ప్యాషన్ ఉనప్పుడే సినిమాలు చేసేందుకు ముందుకు రండి. అప్పుడే మీరు చేసే సినిమా బాగుంటుంది'అని అన్నారు.నిర్మాత అడవి అశోక్ మాట్లాడుతూ..' మా కరణం గారి వీధి సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్ చేసిన ఆర్పీ పట్నాయక్‌కు థ్యాంక్స్. ఆయన మ్యూజిక్‌తో పాటు ఆయన తెరకెక్కించిన సినిమాలంటే మాకు ఇష్టం. ప్రేక్షకులు కోరుకునే అన్ని ఎలిమెంట్స్ ఉన్న చిత్రమిది. త్వరలోనే సినిమాను థియేటర్స్‌లోకి తీసుకొస్తాం' అని అన్నారు.దర్శకుడు హేమంత్ మాట్లాడుతూ - 'పల్లెటూరి నేపథ్యంగా సాగే కంప్లీట్ ఎంటర్ టైనింగ్ మూవీ ఇది. మనం నిజ జీవితంలో చూసే వాస్తవిక ఘటనలు ఉంటాయి. కరణం గారి వీధి సినిమాను అందరికీ నచ్చేలా రూపొందిస్తున్నాం. త్వరలోనే రిలీజ్ డేట్ ప్లాన్ చేసి మీ ముందుకు చిత్రాన్ని తీసుకొస్తాం' అని అన్నారు.దర్శకుడు ప్రశాంత్ మాట్లాడుతూ..' లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా కరణం గారి వీధి సినిమాను రూపొందిస్తున్నాం. విలేజ్ బ్యాక్ డ్రాప్లో ఉంటూ మంచి కామెడీతో మీరంతా ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది. ఆర్పీ సార్ తమ టైమ్ కేటాయించి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నాం' అని అన్నారు. -
ఫ్యామిలీ ఎంటర్టైనర్గా 'లగ్గం టైమ్'.. ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసింది!
రాజేష్ మేరు, నవ్య చిట్యాల జంటగా నటిస్తోన్న చిత్రం లగ్గం టైమ్. ఈ చిత్రానికి ప్రజోత్ కె వెన్నం దర్శకత్వం వహిస్తున్నారు. 20th సెంచరీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై కె.హిమ బిందు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రముఖ దర్శకుడు సాగర్ కె చంద్ర చేతుల మీదుగా పోస్టర్‌ను విడుదల చేశారు.పోస్టర్ చూస్తుంటే లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గానే ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆకాంక్షించారు. ప్రేమ, వివాహం నేపథ్యంలో సాగే ఈ మూవీ ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే ఓ మంచి కథతో రానుందని మేకర్స్ అంటున్నారు. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసే సినిమాగా తెరకెక్కిస్తున్నట్లు మూవీ మేకర్స్ వెల్లడించారు. కాగా.. ఈ చిత్రంలో నెల్లూరు సుధర్శన్, ప్రీతి సుందర్, ప్రణీత్ రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి పవన్ సంగీతమందిస్తున్నారు. త్వరలోనే లగ్గంటైమ్కు సంబంధించిన మరిన్నీ వివరాలు తెలియజేస్తామని ప్రకటించారు. -
జై హనుమాన్ ఫస్ట్ లుక్.. సర్ప్రైజ్ అదిరిపోయిందిగా!
హనుమాన్తో సూపర్ హిట్ కొట్టిన టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. తేజ సజ్జా ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ఈ చిత్రం సంక్రాంతి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. పెద్ద సినిమాలను వెనక్కి నెట్టిన ఈ సినిమా కళ్లు చెదిరే కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో సీక్వెల్ తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు యంగ్ డైరెక్టర్.ఇప్పటికే ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేయగా.. దీపావళికి అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. జైహనుమాన్ పేరుతో తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో కన్నడ స్టార్, కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి హనుమంతుని పాత్రలో కనిపించనున్నారు. తాజాగా రిలీజైన పోస్టర్లో శ్రీరాముడి విగ్రహాన్ని చేతిలో పట్టుకుని కనిపించారు రిషబ్ శెట్టి.అందరూ ఊహించినట్లుగానే'కాంతార' ఫేమ్ రిషభ్ శెట్టి ఈ పోస్టర్లో హనుమంతుడిగా కనిపించారు. ఈ అద్భుతమైన పోస్టర్ రిషబ్ శెట్టిని హైలైట్ చేయడమే కాకుండా హనుమంతుని భక్తి, శక్తి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పాత్రలో లెజెండరీ యాక్టర్ అద్భుతంగా సెట్ అయినట్లుగా కనిపిస్తోంది. ఈ పాత్రలో రిషబ్ శెట్టిని తెరపై చూడడానికి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ సీక్వెల్లో ప్రశాంత్ వర్మ మరింత గొప్ప కథను ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అద్భుతమైన ఫస్ట్ లుక్ పోస్టర్లో అది స్పష్టంగా అర్థమవుతోంది. ఈ సినిమాను ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా మైత్రి మూవీ మేకర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మిస్తున్నారు In the spirit of Diwali and the guiding light of the divine ✨Honoured to be teaming up with the National Award-winning actor @shetty_rishab sir and the prestigious @MythriOfficial to bring our grand vision #JaiHanuman 🙏🏽Let’s begin this DIWALI with the holy chant JAI HANUMAN… pic.twitter.com/i2ExPsflt2— Prasanth Varma (@PrasanthVarma) October 30, 2024 -
రవితేజ 'మాస్ జాతర'.. ఈ సారి మోత మోగిపోవడం పక్కా!
టాలీవుడ్ హీరో మాస్ మహారాజ్ మరో యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మిస్టర్ బచ్చన్ తర్వాత ఆర్టీ75 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తోన్న మూవీలో నటిస్తున్నారు. తాజాగా దీపావళీ సందర్భంగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. టైటిల్ రివీల్ చేయడంతో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.రవితేజ నటిస్తోన్న 75వ చిత్రానికి మాస్ జాతర అనే టైటిల్ ఖరారు చేశారు. మనదే ఇదంతా అనే ట్యాగ్‌లైన్ కూడా ఇచ్చారు. తాజాగా రిలీజైన రవితేజ ఫస్ట్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. చేతిలో గంట పట్టుకుని కనిపిస్తోన్న మాస్ మహారాజాను చూస్తుంటే.. ఈ సినిమాలో మోత మోగిపోవడం ఖాయం అనిపిస్తోంది. రవితేజ ఫ్యాన్స్‌కు మరోసారి మాస్ ఎంటర్టైనర్ పక్కా అని అర్థమవుతోంది. టైటిల్‌కు తగ్గట్టుగానే ఈ సినిమా థియేటర్లలో మాస్ జాతరను తలపిస్తుందని నిర్మాతలు అభిప్రాయం వ్యక్తం చేశారు.ఆ సూపర్ హిట్ జోడీ రిపీట్కాగా.. సామజవరగమన వంటి హిట్ సినిమాకు ఓ రచయితగా చేసిన భాను బోగవరపు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. గతంలో వీరిద్దరు జోడి ధమాకా మూవీతో సూపర్ హిట్ అందుకున్నారు. దీంతో మరో బ్లాక్ బస్టర్ రావడం ఖాయమని చిత్ర బృందం భావిస్తోంది. ఈచిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్లో మే 9న విడుదల చేయనున్నారు. ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ మాస్ ఎంటర్టైనర్ మే 9, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. Get ready for a Re-Sounding Entertainer 💥Presenting our 𝐌𝐀𝐒𝐒 𝐌𝐀𝐇𝐀𝐑𝐀𝐀𝐉 @RaviTeja_offl in an out-and-out ‘MASS JATHARA’ 🧨🧨🎇BLASTING the screens with highly MASSIVE & EXPLOSIVE entertainment from MAY 9th, 2025 😎 💣 Wishing you all a very #HappyDiwali 🧨🪔… pic.twitter.com/k2CTLGdKMV— Sithara Entertainments (@SitharaEnts) October 30, 2024 -
ఈ దీపావళికి మోత మోగిపోద్ది.. మాస్ అప్డేట్ వచ్చేసింది!
ఇటీవల మిస్టర్ బచ్చన్ సినిమాతో మెప్పించిన టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ. ప్రస్తుతం మరో చిత్రంతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తోన్న మూవీకి సంబంధించిన లేటేస్ట్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. దీపావళీ సందర్భంగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్ ఇవ్వనున్నారు.రవితేజ నటిస్తోన్న 75వ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని పోస్టర్ ద్వారా వెల్లడించారు. బుధవారం సాయంత్రం 04:05 గంటలకు విడుదల చేస్తామని నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పోస్ట్ చేసింది. ఈ దీపావళికి మోత మోగిపోద్ది.. మనదే ఇదంతా అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు.కాగా.. సామజవరగమన వంటి హిట్ సినిమాకు ఓ రచయితగా చేసిన భాను బోగవరపు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. శ్రీలీల హీరోయిన్గా నటిస్తోన్న ఈ మూవీని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి కోహినూర్ అనే టైటిల్‌ను పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. 𝐌𝐀𝐒𝐒 𝐌𝐀𝐇𝐀𝐑𝐀𝐀𝐉 @RaviTeja_offl is gearing up to bring you a Special Cracker of a Surprise TOMORROW at 04:05 PM 🧨🧨🧨🎇Ee saari Deepavali ki Motha Mogipoddi... "Manade Idantha" 😎🔥Keep watching this space 🔥 #RT75FirstLook #RT75 🤩@sreeleela14 @BhanuBogavarapu… pic.twitter.com/udYz4c70EM— Sithara Entertainments (@SitharaEnts) October 29, 2024 -
రాజ్ తరుణ్ హీరోగా పాన్ ఇండియా చిత్రం.. ఆకట్టుకుంటున్న ఫస్ట్‌లుక్
రాజ్ తరుణ్ , సందీప్ మాధవ్ హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం రామ్ భజరంగ్. సన్ రైజ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మాత స్వాతిసుధీర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సి.హెచ్.సుధీర్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు.మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. దసరా సందర్భంగా రామ్ భజరంగ్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా మాసీగా ఉందని, ఇద్దరు హీరోలు రాజ్ తరుణ్, సందీప్ మాధవ్ చాలా డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నారు. 1980 బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ సినిమాలో యాక్షన్ తో పాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఐదు భాషల్లో (తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ) ఈ సినిమాను విడుదల చెయ్యడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. గదర్ 2 హీరోయిన్ సిమ్రత్ కౌర్, బిచ్చగాడు ఫేమ్ సట్న టీటస్, ఛాయా దేవి, మనసా రాధాకృష్ణన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో రాజా రవీంద్ర, రవి శంకర్, షఫీ, శివరామరాజు వెంకట్, సత్యం రాజేష్, ధనరాజ్, రచ్చ రవి, ఐశ్వర్య ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. -
ఫ్యాన్స్‌కు హీరో నిఖిల్ సర్ప్రైజ్.. ఇలా ట్విస్ట్ ఇచ్చాడేంటి?
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం స్వయంభూ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తోంది. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుగుతోంది.అయితే ఈ సినిమా లైన్లో ఉండగానే ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చాడు హీరో నిఖిల్. ఈ దీపావళికి థియేటర్లలో సందడి చేసేందుకు వచ్చేస్తున్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న మూవీ టైటిల్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఎలాంటి ప్రకటన లేకుండానే డైరెక్ట్‌గా టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అసలు ఈ సినిమా ఎప్పుడు మొదలైందంటూ చర్చించుకుంటున్నారు. ఏదేమైనా దీపావళికి థియేటర్లలో అలరించేందుకు యంగ్ హీరో నిఖిల్ రానుండడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.(ఇది చదవండి: స్వయంభూ సెట్లో నిఖిల్ బర్త్‌డే సెలబ్రేషన్స్..)అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అంటూ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ మూవీలో రుక్మిణి వసంత్, దివ్యాంశ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. Into the World of #AppudoIppudoEppudo ❤️This'll thrill you, tickle you & breeze you 🤗@actor_Nikhil @rukminitweets @divyanshak @harshachemudu @dvlns @BvsnP @SunnyMROfficial @singer_karthik @NavinNooli @SVCCofficial pic.twitter.com/elyKT8ESJC— sudheer varma (@sudheerkvarma) October 6, 2024 -
కన్నప్ప: పీడించే మారెమ్మగా ఐశ్వర్య.. ఫస్ట్ లుక్ చూశారా?
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్లు వస్తూనే ఉన్నాయి. విష్ణు చెప్పినట్టుగా ప్రతి సోమవారం క్యారెక్టర్లు రివీల్ చేస్తూ, ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తూ ఇలా ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు శరత్ కుమార్, మధుబాల, దేవరాజ్, ముఖేష్ రిషి, మంచు అవ్రామ్, అర్పిత్ రంకా, అక్షయ్ కుమార్ పాత్రలకు సంబంధించి లుక్ విడుదల చేశారు.గత వారం కన్నప్ప నుంచి విధేయుడు, స్నేహితుడు అంటూ తిన్నడు ఉపయోగించే గుర్రం టిక్కి లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ రోజు కన్నప్ప నుంచి మారెమ్మ పాత్రకు సంబంధించిన లుక్ విడుదల చేశారు. నటి ఐశ్వర్య ఈ మారెమ్మ లుక్‌లో అందరినీ భయపెట్టేలా ఉన్నారు. అడవిని పీడించే అరాచకం మారెమ్మ.. కుతంత్రమే ఆమె మంత్రం అంటూ రిలీజ్ చేసిన పోస్టర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది.ఇప్పటికే కన్నప్ప టీజర్‌తో సినిమా మీద మంచి హైప్ ఏర్పడింది. విష్ణు మంచు టైటిల్ రోల్లో కనిపించనున్న ఈ మూవీని అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. Introducing #Aishwarya as #Maremma who is set to unleash wildness in the forests; get ready to experience the force chaos in #Kannappa🏹#HarHarMahadevॐ@themohanbabu @ivishnumanchu @Mohanlal #Prabhas @akshaykumar @realsarathkumar #MukeshRishi @mukeshvachan @MsKajalAggarwal… pic.twitter.com/gpkgux8s6f— Kannappa The Movie (@kannappamovie) September 23, 2024 -
టాలీవుడ్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్.. ఈ సారి డబుల్ మ్యాడ్!
టాలీవుడ్లో యూత్‌ఫుల్ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన చిత్రం మ్యాడ్. ఈ కామెడీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. గతేడాది అక్టోబర్‌లో రిలీజైన ఈ సినిమాను కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ మూవీతోనే ఆయన డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. మ్యాడ్ సూపర్ హిట్ కావడంతో మేకర్స్ మరోసారి ఆడియన్స్‌ను నవ్వించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే మ్యాడ్ స్వ్కేర్ తెరకెక్కించనున్నట్లు ప్రకటించిన మేకర్స్ తాజాగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.(ఇది చదవండి: మొన్న టిల్లు స్వ్కేర్.. ఇప్పుడు మ్యాడ్ స్వ్కేర్)ఈ చిత్రంలోనూ నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్లో ముగ్గురు కూడా పంచెకట్టులో కనిపించారు. పోస్టర్ చూస్తుంటే మ్యాడ్‌ను తలదన్నేలా కనిపిస్తోంది. అంతే కాకుండా ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ను సెప్టెంబర్ 20న విడుదల చేస్తామని ప్రకటించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో రానున్న ఈ మూవీకి బీమ్స్ సిసిరోలియో సంగీతమందిస్తున్నారు. This time it’ll be MAD MAXX!! 😎🤘🏻Here’s the First Look of #MADSquare 🕺First single coming out on 20th September 🤩🔥#ThisTimeItsMADMAXX 💥@kalyanshankar23 @vamsi84 #HarikaSuryadevara #SaiSoujanya @NarneNithiin @SangeethShobhan #RamNitin #BheemsCeciroleo @NavinNooli… pic.twitter.com/Bzod0AzKLo— Sithara Entertainments (@SitharaEnts) September 18, 2024 -
భయం ఎందుకు?
హీరోయిన్ వేదిక ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఫియర్’. ఈట హరిత గోగినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నటుడు అరవింద్ కృష్ణ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. దత్తాత్రేయ మీడియా బ్యానర్‌పై ఏఆర్ అభి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నటుడు, డైరెక్టర్, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసి, ‘‘పోస్టర్ ఆసక్తికరంగా ఉంది.. సినిమా విజయం సాధించాలి’’ అని ఆకాంక్షించారు.‘‘వైవిధ్యమైన సస్పెన్స్ థ్రిల్లర్ కథతో రూపొందిన చిత్రం ‘ఫియర్’. చీకటి గదిలో భయపడుతూ చూస్తున్న వేదిక స్టిల్‌తో డిజైన్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తి పెంచుతోంది. ఈ చిత్రం విడుదలకు ముందే వివిధ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమై 60కి పైగా అవార్డులను సొంతం చేసుకుని రికార్డ్ సృష్టించింది. ఈ సినిమాని త్వరలోనే రిలీజ్ చేయనున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: ఐ ఆండ్రూ. -
బాలయ్య వారసుడి గ్రాండ్ ఎంట్రీ.. డైరెక్టర్‌గా ఎవరంటే?
నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న తరుణం వచ్చేసింది. బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. హనుమాన్తో సూపర్ హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో మోక్షజ్ఞ తొలి సినిమా చేయబోతున్నారు. ఇవాళ మోక్షజ్ఞ బర్త్ డే కావడంతో ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రివీల్ చేశారు. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఈ ఏడాది హనుమాన్ మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఈ చిత్రాన్ని ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ బ్యానర్‌పై తెరకెక్కించనున్నారు. అంతకుముందు సింబా ఇజ్ కమింగ్ అంటూ ప్రశాంత్ వర్మ చాలాసార్లు హింట్ ఇస్తూ వచ్చారు. తాజాగా నందమూరి వారసుడిని హీరోగా పరిచయం చేస్తున్నట్లు ప్రకటించారు. మొదటి సినిమా కావడంతో నందమూరి ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. With great joy & privilege, Introducing you…“NANDAMURI TARAKA RAMA MOKSHAGNYA TEJA” 🦁Happy birthday Mokshu 🥳 Welcome to @ThePVCU 🤗Let’s do it 🤞Thanks to #NandamuriBalakrishna Garu for all the trust & blessings 🙏 Hoping to make this one much more special &… pic.twitter.com/gm9jnhOvYx— Prasanth Varma (@PrasanthVarma) September 6, 2024 -
తుపాకులతో బంధించడం కొత్తగా ఉంది: హీరో శ్రీకాంత్
ఎవరినైనా తాళ్ళతోనో , సంకెళ్ళతోనో కట్టి బంధిస్తారు..కానీ ‘పోలీస్ వారి హెచ్చరిక’ పోస్టర్లో పోలీసునే తుపాకులతో కట్టి బంధించడం కొత్తగా ఉంది. సినిమా కూడా అంతే కొత్తగా ఉండి..అందరికి ఆకట్టుకుంటుందని భావిస్తున్నాను’అని అన్నారు హీరో శ్రీకాంత్. అభ్యుదయ దర్శకుడు బాబ్జీ దర్శకత్వం వహించిన చిత్రం ‘పోలీసు వారి హెచ్చరిక’. తూలిక తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై బెల్లి జనార్థన్ నిర్మించిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ని హీరో శ్రీకాంత్ రిలీజ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎప్పుడూ కొత్త కథల తో , కొత్త ఆలోచనలతో అడుగులేసే దర్శకుడు బాబ్జీ ఈ సినిమాతో మంచి సక్సెస్ సాధిస్తాడని నాకు గట్టి నమ్మకం ఉందని అన్నారు.మంచి మనసున్న శ్రీకాంత్ గారి చేతులమీదుగా ఫస్ట్ లుక్ ను విడుదల గావించుకున్న మా "పోలీస్ వారి హెచ్చరిక” చిత్రాన్ని మంచి మనసున్న ప్రేక్షక మహాశయులు గొప్పగా ఆదరిస్తారనే నమ్మకం మాకుందని" దర్శకుడు బాబ్జీ అన్నారు. నా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ని శ్రీకాంత్ ఆవిష్కరించడం నేను చేసుకున్న అదృష్టం అని నిర్మాత బెల్లి జనార్ధన్ అన్నారు. ఈ కార్యక్రమం లో యీ చిత్ర కథానాయకుడు సన్నీ అఖిల్, నటి జయ వాహిని, ప్రాజెక్టు కో ఆర్డినేటర్ యస్, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. -
జాతకాలు చెబుతానంటోన్న టాలీవుడ్ హీరో..!
ఇటీవలే డార్లింగ్ మూవీతో ప్రేక్షకులను మెప్పించిన యంగ్ హీరో ప్రియదర్శి పులికొండ. నభా నటేశ్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా మరో కొత్త సినిమాకు రెడీ అయిపోయాడు. టాలీవుడ్లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రియదర్శి, రూప కొడువాయూర్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'సారంగపాణి జాతకం'. ఈ మూవీని ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు.ఇవాళ ప్రియదర్శి బర్త్‌డే కావడంతో సారంగపాణి జాతకం ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు టైటిల్ రివీల్ చేశారు. తాజాగా విడుదలైన పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పోస్టర్ చూస్తుంటే థియేటర్లలో నవ్వులు పూయిచండం ఖాయంగా కనిపిస్తోంది.ఈ సందర్భంగా దర్శకుడు ఇంద్రగంటి మాట్లాడుతూ… 'నమ్మకం మనిషికి బలాన్ని ఇస్తుంది. కానీ మూఢ నమ్మకం బుద్ధిమంతుడిని కూడా బలహీనుడిని చేసి నవ్వుల పాలు చేస్తుంది. అలా నవ్వుల పాలైన ఓ మధ్య తరగతి మంచి అబ్బాయి కథే సారంగపాణి జాతకం. తన నమ్మకం, తను ఇష్టపడిన అమ్మాయి ప్రేమ మధ్య కొట్టుమిట్టాడిపోయాడా? లేదా బయట పడ్డాడా? అనే కథాంశంతో ఉత్కంఠభరితంగా పొట్ట చెక్కలయ్యేలా నవ్వించే హాస్య చిత్రమని' అన్నారు.ఇప్పుడే మొదలైంది, త్వరలో మీకే తెలుస్తుంది 🤩😉Taking you on a jam-packed comedy ride with our #SarangapaniJathakam 🖐🏻🔍@krishnasivalenk #MohanKrishnaIndraganti @PriyadarshiPN @RoopaKoduvayur @ItsActorNaresh @TanikellaBharni #Vennelakishore #AvasaralaSrinivas @harshachemudu… https://t.co/80Zwnf84Fv— Priyadarshi Pulikonda (@PriyadarshiPN) August 25, 2024 -
సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘ది డీల్’
రంగస్థలం నటుడు హనుకోట్ల హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘ది డీల్’. సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రం పోస్టర్ని రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ కేవి రమణాచారి విడుదల చేశారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ.. నటన, దర్శకత్వంపై మంచి అవగాహన ఉన్న హను కోట్ల ది డీల్ సినిమాతో మన ముందుకు రావడం సంతోషకరమని అన్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. తెలుగు సినీ రంగంలో అడుగు పెడుతున్న దర్శకుడు హను కోట్లకు అభినందనలు తెలిపారు. ‘ఒక డిఫరంట్ స్టోరీతో వస్తున్న నన్న ప్రేక్షకులు ఆశ్వీరదించాలని కోరుతున్నాను’ అని హనుకోట్ల అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎఫ్‌పీసీ అధ్యక్షుడు కేఎల్ దామోదర్ ప్రసాద్, ప్రముఖ సినీ రచయిత బుర్రా సాయిమాధవ్ తదితరులు పాల్గొన్నారు. -
చారులత ఆన్ డ్యూటీ
నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సరిపోదా శనివారం’. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. ‘గ్యాంగ్ లీడర్’ మూవీ తర్వాత నాని, ప్రియాంక మోహన్ జోడీగా నటిస్తున్న రెండో చిత్రం ‘సరిపోదా శనివారం’. ఎస్జే సూర్య, సాయికుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్ మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు.ఈ సినిమా నుంచి ప్రియాంక మోహన్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. ‘‘యాక్షన్ అడ్వెంచర్‌గా రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘సరిపోదా శనివారం’. ఈ మూవీలో చారులత అనే పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటిస్తున్నారు ప్రియాంక మోహన్. ఆమె పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. భారీ బడ్జెట్, ఉన్నత ప్రమాణాలతో నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఆగస్టు 29న ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
పట్టు వదలకుండా..!
అజిత్, త్రిష జంటగా రూపొందుతున్న చిత్రం ‘విడా ముయర్చి’ (పట్టు వదలకుండా ప్రయత్నించడం). లైకా ప్రోడక్షన్స్పై మగిళ్ తిరుమేని దర్శకత్వంలో సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి అజిత్ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా లైకాప్రోడక్షన్స్ హెడ్ జీకేఎం తమిళ్ కుమరన్ మాట్లాడుతూ – ‘‘మా బేనర్లో అజిత్‌తో సినిమా ప్రకటించినప్పట్నుంచి అభిమానులు, ప్రేక్షకులు ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారి అంచనాలను చేరుకునేలా మంచి కథా కథనాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఆగస్ట్‌లో సినిమా చిత్రీకరణ పూర్తవుతుంది. విడుదల ఎప్పుడనేది త్వరలో చెబుతాం’’ అన్నారు. ఇక ప్రచారంలో ఉన్న ప్రకారం ఈ చిత్రకథ ఏంటంటే... ఓ భార్యాభర్త విహార యాత్రకు వెళతారు. అకస్మాత్తుగా భార్య కనిపించకుండా పోతుంది. ఆమెను కనుగొనే క్రమంలో కనిపించని శత్రువులతో పట్టు వదలకుండా హీరో చేసే పోరాటం నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని తెలిసింది. ఆరవ్, రెజీనా కసాండ్ర, నిఖిల్, అర్జున్ నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్, కెమెరా: ఓం ప్రకాశ్. -
మాస్ మల్లి
సిగరెట్ కాల్చుతూ రిక్షాలో మాస్‌గా కూర్చొన్న అతని పేరు మల్లి. ఇంటిపేరు బచ్చల. చేసేది ట్రాక్టర్ డ్రైవర్‌గా... ఇంకా అతని పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకునేవారు థియేటర్స్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ‘అల్లరి’ నరేశ్ టైటిల్ రోల్ చేస్తున్న తాజా చిత్రం ‘బచ్చల మల్లి’. 1990 నేపథ్యంలో సాగే ఈ సినిమాకు ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫేమ్ సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహిస్తున్నారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేశ్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.మంగళవారం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నారు ‘అల్లరి’ నరేశ్. ‘‘ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ బచ్చల మల్లి చాలా రోజులు గుర్తిండిపోతాడు. నిర్మాణం పనులు తుది దశకు చేరుకున్నాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. అమృతా అయ్యర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో రోహిణి, రావు రమేశ్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరితేజ, ప్రవీణ్, వైవా హర్ష ముఖ్య పాత్రధారులు. ఈ సినిమాకు సంగీతం: విశాల్ చంద్రశేఖర్, కెమెరా: రిచర్డ్ ఎం. నాథన్. -
కామెడీ ఎంటర్టైనర్గా వస్తోన్న నమో.. ఆకట్టుకుంటోన్న ఫస్ట్ లుక్ పోస్టర్!
విశ్వంత్ దుద్దంపూడి, అనురూప్ కటారి, విస్మయ ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం నమో. శ్రీ నేత్ర క్రియేషన్స్, ఆర్మ్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద ప్రశాంత్ ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రం ద్వారా ఆదిత్య రెడ్డి కుందూరు దర్శకులుగా పరిచయం కాబోతున్నారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది.విశ్వంత్- అనురూప్ కాంబోలో వస్తోన్న ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ పోస్టర్, టీజర్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. జూన్ 7న సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రానికి కెమెరామెన్‌గా రాహుల్ శ్రీవాత్సవ్.. మ్యూజిక్ డైరెక్టర్‌గా క్రాంతి ఆచార్య వడ్లూరి.. ఎడిటర్‌గా సనల్ అనిరుధన్ పని చేశారు. -
యాక్షన్ ఎంటర్టైనర్గా లారీ చాప్టర్-1.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్!
శ్రీకాంత్ రెడ్డి ఆసం హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం "లారి చాప్టర్ -1". యూట్యూబ్‌లో తన వీడియోలతో కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకుని మంచి పాపులారిటీ సంపాదించుకున్న శ్రీకాంత్ రెడ్డి హీరోగా వెండి తెరకు పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా చంధ్ర శిఖ నటించనుండగా.. రాఖీ సింగ్ ప్రధాన పాత్రలో నటించారు. కింగ్ మేకర్ పిక్చర్స్ పతాకంపై ఆసం వెంకట లక్ష్మి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి ఆసం మాట్లాడుతూ..'చెన్నై లయోల కాలేజీలో డైరెక్షన్ కోర్స్ చేసిన మొదట యూట్యూబ్‌లో నా కెరీర్ ప్రారంభించాను. మంచి పాపులారిటీ వచ్చింది. అలాగే చాలా సినిమాలకు వివిధ శాఖలలో పని చేశాను. ఇప్పుడు "లారి చాప్టర్ -1" అనే సినిమాతో మీ ముందుకు వస్తున్నా. ఇది ఒక యాక్షన్ ఎంటర్టైనర్. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, బెంగాలీ భాషలో ఒకేసారి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నా. నా మొదటి సినిమా అందరికీ నచ్చుతుంది"' అని తెలిపారు. -
హనుమాన్ హీరో కొత్త మూవీ.. గ్లింప్స్ చూస్తే గూస్‌బంప్సే!
హనుమాన్ మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన యంగ్ హీరో తేజ సజ్జా. ఈ సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ దక్కించుకున్నారు. తేజ మరో హిస్టారికల్ మూవీ చేసేందుకు రెడీ అయిపోయారు. తేజ సజ్జాకు జంటగా రితికా నాయక్ నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఆయన రవితేజతో ఈగల్ మూవీని తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ టైటిల్‌తో పాటు గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. హైదరాబాగ్లోని రామానాయుడు స్టూడియోలో జరిగిన కార్యక్రమంలో టైటిల్ రివీల్ చేశారు. తేజ సజ్జా తాజా చిత్రానికి మిరాయి అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రంలో తేజ సూపర్‌యోధ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్లో తేజ సజ్జ సూపర్ యోధా లుక్‌లో కనిపించారు. బద్దలయ్యే అగ్నిపర్వతం పైన నిలబడి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను అశోకుని కాలంలో జరిగిన కళింగ యుద్ధం ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు గ్లింప్ల్ చూస్తే అర్థమవుతోంది. మిరాయి సినిమాను తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీతో పాటు చైనీస్ భాషల్లోనూ వచ్చే ఏడాది ఏప్రిల్ 18న విడుదల చేయనున్నారు. From the hush of ancient narratives📜 Comes a thrilling adventurous saga of a #SuperYodha 🥷⚔️#PMF36 x #TejaSajja6 Titled as #𝐌𝐈𝐑𝐀𝐈 ⚔️#MIRAITitleGlimpse out now💥 -- https://t.co/k4tycunRkA In Cinemas on 18th APRIL 2025 ~ 2D & 3D🔥 SuperHero @tejasajja123… pic.twitter.com/WN2MB2EPlE — People Media Factory (@peoplemediafcy) April 18, 2024