
నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సరిపోదా శనివారం’. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. ‘గ్యాంగ్ లీడర్’ మూవీ తర్వాత నాని, ప్రియాంక మోహన్ జోడీగా నటిస్తున్న రెండో చిత్రం ‘సరిపోదా శనివారం’. ఎస్‌జే సూర్య, సాయికుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్ మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు.
ఈ సినిమా నుంచి ప్రియాంక మోహన్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. ‘‘యాక్షన్ అడ్వెంచర్‌గా రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘సరిపోదా శనివారం’. ఈ మూవీలో చారులత అనే పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటిస్తున్నారు ప్రియాంక మోహన్. ఆమె పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. భారీ బడ్జెట్, ఉన్నత ప్రమాణాలతో నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఆగస్టు 29న ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది’’ అని చిత్రబృందం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment