Priyanka
-
Priyanka Mohan: నేనొక శారీ లవర్ని
బంజారాహిల్స్: ‘నాకు చీరలంటే ఎంతో ఇష్టం.. ఒక్క మాటలో చెప్పాలంటే నేనొక శారీ లవర్ని’ అని చెప్పారు హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్. జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లో గ్జితి వీవ్స్లో ఏర్పాటు చేసిన నూతన కలెక్షన్లను మంగళవారం ఆవిష్కరించారు. మహిళలకు చీర అందాన్ని ఇవ్వడమే కాకుండా మరింత గౌరవాన్ని ఇస్తుందని ప్రియాంక అన్నారు. తాను నిత్యం రకరకాల కలెక్షన్లు అన్వేషిస్తూ ఉంటానని, నచ్చిన చీరను తెప్పించుకోడం.. కట్టుకొని ముచ్చట తీర్చుకోడం జరుగుతుందన్నారు. మార్కెట్లోకి ట్రెండీ డ్రెస్‌లకు ధీటుగా శారీలు కూడా వస్తుండటం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా గ్జితి వీవ్స్ ప్రతినిధులు సౌజన్య, బాబీ మాట్లాడుతూ ప్రతి అవసరానికీ ఓ చీర, ప్రతి సీజన్‌కు ఓ చీర అనే కాన్సెప్‌్టతో దేశంలోని భిన్న రకాల చేతి వృత్తుల చీరలతో పాటు డిజైనరీ చీరలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. – నటి ప్రియాంక -
'సరిపోదా శనివారం' బ్యూటీ ప్రియాంక మోహన్ చీర లుక్స్ తో రచ్చ చేస్తుందిగా..! (ఫోటోలు)
-
తెలుగులో క్వీనే వచ్చేను...
‘మామా మామా కమ్ అండ్ సింగు... క్వీనే వచ్చెను... నువ్వే కింగు...’ అంటూ మొదలవుతుంది ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’(Jabilamma Neeku Antha Kopama) సినిమాలోని ‘గోల్డెన్ స్పారో...’ పాట. పవీష్, అనిఖా సురేంద్రన్, ప్రియా ప్రకాశ్ వారియర్, మాథ్యూ థామస్, వెంకటేశ్ మీనన్, రబియా ఖతూన్, రమ్యా రంగనాథన్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబం’. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీకి హీరో ధనుష్ దర్శకత్వం వహించారు.ఆర్కేప్రోడక్షన్స్‌తో కలిసి ధనుష్(Dhanush) సొంత నిర్మాణ సంస్థ వండర్‌బార్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 21న విడుదల కానుంది. ఈ మూవీని ‘జాబిలమ్మ నీకు అంత కోపమా..’ అనే టైటిల్‌తో తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పి రిలీజ్ చేస్తోంది. తాజాగా ఈ మూవీలోని ‘గోల్డెన్ స్పారో’ పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు.‘గోల్డెన్ స్పారో... నా గుండెలో యారో... నువ్వు లేని లైఫు ఫుల్ శారో..,’ అంటూ సాగే ఈ స్పెషల్ సాంగ్‌లో పవీశ్, అనిఖాలతో పాటు హీరోయిన్ ప్రియాంకా మోహనన్(Priyanka Mohan) డ్యాన్స్ చేశారు. ఈ పాటకు రాంబాబు గోసాల లిరిక్స్ అందించగా, అశ్విన్ సత్య–సుదీష్ శశికుమార్–సుభాషిణి ఆలపించారు. ఈ సిని మాకు సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్. -
నా క్యారెక్టర్‌కు కనెక్ట్ అవుతున్నారు
సదన్, ప్రియాంకా ప్రసాద్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్రణయ గోదారి’. పీఎల్ విఘ్నేష్ దర్శకత్వంలోపారమళ్ళ లింగయ్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదలైంది. ఈ చిత్రం సక్సెస్‌మీట్‌లో పీఎల్ విఘ్నేష్ మాట్లాడుతూ– ‘‘మా సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బాగుందని చెప్పడం హ్యాపీగా ఉంది’’ అన్నారు.‘‘ఈ సినిమాలో నాపాత్రకు ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు ప్రియాంకా ప్రసాద్. ‘‘ఈ సినిమాపాటలకు మంచి స్పందన లభిస్తోంది’’ అన్నారు సంగీత దర్శకుడు మార్కండేయ. -
ఇది అన్ని టాక్ షోలలా ఉండదు
ప్రస్తుత జెనరేషన్‌కు మార్పు అన్నది ఆక్సిజన్ లాంటిది. ప్రతిక్షణం నిత్య నూతనంగానే కాదు వినూత్నంగా చూడాలని కోరుకుంటుంది నేటి తరం. మామూలుగా ఇంటర్వ్యూ, టాక్ షోలంటే ఇద్దరు ఎదురెదురుగా పద్ధతిగా కూర్చోవడం నుండి నడుస్తూ మాట్లాడడం వరకు చూశాం. నాటి దూరదర్శన్ టాక్ షోల నుండి నేటి ఓటీటీ టాక్ షోల వరకు ఇంచుమించుగా ఇదే పద్ధతి అవలంబిస్తున్నారు. కానీ వాటన్నిటికీ విభిన్నంగా నేటి తరం నేటివిటీకి దగ్గరగా ‘ది రానా దగ్గుబాటి షో’ ఉంది. దీనికి హోస్ట్‌గా పేరుకు తగ్గట్టే నేటి ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి వ్యవహరించడం విశేషం. ఈ కార్యక్రమం స్ట్రీమ్ అయ్యేకన్నా ముందు ప్రముఖ యాంకర్ సుమతో ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రమోషనల్ప్రోమో ఒకటి రిలీజ్ చేశారు.ఆప్రోమోలోనే ఈ షోకి సంబంధించిన కాన్సెప్ట్ రిలీజ్ చేశారు. ప్రోమోలో సుమ స్టూడియోకి వచ్చి రానాను కలుస్తుంది. ‘టాక్ షో అన్నావు కదా... గెస్టులు ఎవరు? దానికి సంబంధించిన అధికారిక అనౌన్సమెంట్ ఇలా ఉండాలి’ అని రానాకి సూచిస్తుంటే, ‘నేను టాక్ షో అన్నాను కానీ అనౌన్స్మెంట్, ఇంట్రో అని చెప్పలేదు కదా... చాలా షోస్ ఇలానే రొటీన్‌గా చేస్తున్నావు కదా.. మా టాక్ షో వాటన్నిటికీ విభిన్నం’ అని రానా చెబుతారు. రానా అన్నట్టే ఇప్పటిదాకా తెలుగులో వచ్చిన టాక్ షోస్ సంప్రదాయాన్ని ‘ది రానా దగ్గుబాటి షో’ బ్రేక్ చేసిందనే చెప్పాలి.ముఖ్యంగా ఈ షోలో రానా హోస్ట్ అనే కంటే వచ్చిన గెస్ట్‌లతో ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ క్యాజువల్‌గా షో నడపడం చాలా బాగుంది. ఈ షో మొదటి ఎపిసోడ్లో భాగంగా ప్రముఖ తెలుగు హీరో నాని, ‘హను– మాన్’ ఫేమ్ తేజ సజ్జా, నటి ప్రియాంకా మోహన్ అతిథులుగా వచ్చారు. వారిని షోలకి పిలవడం దగ్గర నుండి వాళ్ళతో మాట్లాడడం, ఆటలాడడం అంతా సరికొత్తగా అనిపిస్తుంది. ఎదుటివారి అభిరుచిని కనిపెట్టడం మీడియాలో దర్శకులకు తెలిసినంత మరెవరికీ తెలిసుండదు. అలా వాళ్లు ప్రేక్షకుల నాడిని పడతారు కాబట్టే వారి కాన్సెప్ట్స్ ప్రేక్షకాదరణ పొందుతాయి. దానికి నిలువెత్తు నిదర్శనమే ఈ ‘ది రానా దగ్గుబాటి షో’. ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న ఈ షో వర్తబుల్... వాచిట్. – హరికృష్ణ ఇంటూరు -
అంతర్జాతీయ స్థాయిలో ‘కల్కి 2’: స్వప్న, ప్రియాంక
‘‘కల్కి 2’ సినిమా పనులు ఇప్పటికే మొదలయ్యాయి.. ప్రీప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి’’ అని నిర్మాతలు స్వాప్న దత్, ప్రియాంక దత్ చెప్పారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్ , కమల్ హాసన్ , దీపికా పదుకొనె, దిశా పటానీ ప్రధాన పాత్రల్లో నటించిన మైథలాజికల్ అండ్ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్‌పై సి.అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది జూన్ లో విడుదలై, ఘనవిజయం సాధించింది.‘కల్కి సినిమాటిక్ యూనివర్స్’లో భాగంగా వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’కి సీక్వెల్‌గా ‘కల్కి 2’ రానుందని చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం గోవాలో జరుగుతున్న 55వ ఇఫీ (ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా) వేడుకల్లో మెయిన్ స్ట్రీమ్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ‘కల్కి 2898 ఏడీ’ సినిమాని ప్రదర్శించారు. అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు స్వాప్నదత్, ప్రియాంక దత్ బదులిస్తూ.. ‘‘ప్రస్తుతం ‘కల్కి 2’ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. తొలి పార్టు చిత్రీకరణ టైమ్‌లోనే 30 నుంచి 35 శాతం ‘కల్కి 2’ షూటింగ్ పూర్తయింది. అయితే ఈ సినిమాలోని ప్రధాన నటీనటుల షూటింగ్ కాల్షీట్స్ ఫైనలైజ్ కావాల్సి ఉంది. తొలి పార్టులో మదర్ రోల్ చేసిన దీపికా పదుకొనే ‘కల్కి 2’లోనూ మదర్ రోల్ చేస్తారు. ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో రిలీజ్ చేస్తాం’’ అని పేర్కొన్నారు ‘కల్కి 2’ చిత్రీకరణ వచ్చే ఏడాది ్రపారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
Sai Priyanka pagadala: అమ్మలాంటి అన్నదాత కోసం...
తల్లి తన ఆకలి గురించి పట్టించుకోదు. పిల్లల కడుపు నిండిందా లేదా అనేదే ఆమెకు ముఖ్యం. రైతులు కూడా అమ్మలాంటి వారే. అందుకే వారిపై దృష్టి పెట్టింది సాయిప్రియాంక. తాను పండించే పంటల ద్వారా ఎంతోమందికి పోషకాహార శక్తిని అందిస్తున్న రైతు ఆ శక్తికి ఎంత దగ్గరలో ఉన్నాడు? ఎంత దూరంలో ఉన్నాడు... అనే ఆసక్తితో పరిశోధన బాట పట్టింది. తన పరిశోధన అంశాలను కొలంబోలో జరిగే అంతర్జాతీయ సదస్సులో వివరించడానికి సిద్ధం అవుతోంది.సాయిప్రియాంక చదువుకున్నది పట్టణాల్లో అయినా ఆమెకు పల్లెలు అంటేనే ఇష్టం. పల్లెల్లో పచ్చటి పొలాలను చూడడం అంటే ఇష్టం. ఆ ఇష్టమే వ్యవసాయం గురించి తెలుసుకోవాలనే ఆసక్తికి కారణం అయింది. ఆ ఆసక్తే తనను ‘అగ్రికల్చరల్ సైంటిస్ట్’ను చేసింది.ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐఎఫ్పీఆర్ఐ) అనేది వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం. పోషకాహార లోపానికి సంబంధించి పరిశోధన ఆధారిత పరిష్కారాలను అందించే సంస్థ ఇది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇతర సంస్థలతో కలిసి ఈ సంస్థ ‘డెలివరింగ్ ఫర్ న్యూట్రిషన్ ఇన్ సౌత్ ఏషియా: కనెక్టింగ్ ది డాట్స్ ఎక్రాస్ సిస్టమ్స్’ అనే అంశంపై కొలంబోలో డిసెంబర్ 3,4,5 తేదీలలో అంతర్జాతీయ సదస్సు ఏర్పాటు చేస్తోంది. పోషకాహారం దాని ప్రభావిత అంశాల గురించి చర్చించడానికి ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన నిపుణులు, విధానకర్తలు, పరిశోధకులను ఏకతాటిపై తీసుకు వస్తోంది.మన దేశం నుంచి ఆరుగురు ప్రతినిధులు ఈ ప్రతిష్ఠాత్మకమైన సదస్సులో పాల్గొనబోతున్నారు. వారిలో సాయి ప్రియాంక ఒకరు. తన పరిశోధనకు సంబంధించిన అంశాలను ఈ అంతర్జాతీయ సదస్సులో ప్రియాంక వివరించనుంది. ప్రత్యేక గ్రామాలు తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా పస్తాపూర్, అర్జున్ నాయక్ తాండా, బిడకన్నె గ్రామాలకు వ్యవసాయ పరంగా ప్రత్యేకత ఉంది. వీటిని ‘ప్రత్యేక గ్రామాలు’ అనుకోవచ్చు. కొర్రలు, సామలు, ఊదలులాంటి సిరిధాన్యాలతో పాటు సుమారు 20 రకాల ఆకుకూరలు సాగు చేస్తుంటారు అక్కడి రైతులు. రసాయనాలు వినియోగించకుండా సేంద్రియ పంటలను పండిస్తున్నారు. దక్కన్ డవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్)లాంటి సంస్థల ప్రోత్సాహంతో ఈ గ్రామాల్లోని రైతులు పౌష్టికాహారాన్ని ఇచ్చే ప్రత్యేక పంటలు సాగు చేస్తున్నారు.పత్తి, సోయా, చెరుకు లాంటి వాణిజ్య పంటలు సాగు చేసే గ్రామాలతో పోల్చితే ఈ ప్రత్యేక గ్రామాల్లోని ప్రజలకు పౌష్టికాహారం ఏ మేరకు అందుతోందనే అంశంపై ఎంతోమంది రైతులతో మాట్లాడింది సాయిప్రియ.‘అగ్రి న్యూట్రీ స్మార్ట్ విలేజెస్’ పేరుతో క్షేత్రస్థాయిలో పరిశోధనలు చేస్తోంది. రైస్, పప్పులులాంటి ఒకేరకమైన ఆహారంతో పాటు ఆకు కూరలు, సిరిధాన్యాలు తీసుకోవడం ద్వారా ఆ మూడు గ్రామాల ప్రజలు మెరుగైన పౌష్టికాహారం పొందగలుగుతున్నారని ఆమె పరిశోధనల్లో తేలింది. ఈ గ్రామాలతో పాటు హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్రామాల్లో కూడా పరిశోధనలు చేస్తోంది.ఐఏఆర్ఐలో పీహెచ్డీఖమ్మం పట్టణానికి చెందిన పగడాల సాయి ప్రియాంక పదో తరగతి వరకు ఖమ్మంలో, ఇంటర్ విజయవాడలో చదువుకుంది. తల్లిదండ్రులు రాజరాజేశ్వరి, నర్సింహరావులు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే. ‘డాక్టర్ కావాల్సిందే’ ‘ఇంజనీర్ కావాల్సిందే’లాంటి సగటు తల్లిదండ్రుల ఆలోచనకు దూరంగా కూతురుకి వ్యవసాయ రంగంపై ఉన్న ఆసక్తిని ప్రోత్సహించారు.వ్యవసాయ పరిశోధనపై ఎంతో ఆసక్తి ఉన్న సాయి ప్రియాంక అశ్వారావుపేటలో బీఎస్సీ అగ్రికల్చర్, మేఘాలయలోని సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తి చేసింది. ఢిల్లీలోని ఐఏఆర్ఐ (ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్)లో పీహెచ్డీ చేస్తోంది. ప్రస్తుతం జహీరాబాద్ ‘కృషి విజ్ఞాన కేంద్రం’లో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సైంటిస్ట్‌గా పనిచేస్తోంది.‘ఇవి మాత్రమే మనం చేరుకోవాల్సిన గమ్యాలు’ అని యువతరం ఒకే వైపు దృష్టి సారించినప్పుడు ఎన్నో రంగాలు మూగబోతాయి. ఆ రంగాలలో పరిశోధనలు ఉండవు. ప్రగతి ఉండదు. విభిన్న ఆలోచనలు ఉన్న సాయిప్రియాంక లాంటి అమ్మాయిలు తాము కొత్త దారిలో ప్రయాణించడమే కాదు ‘మనం ప్రయాణించడానికి, అన్వేషణ కొనసాగించడానికి ఒకే దారి లేదు. ఎన్నో దారులు ఉన్నాయి’ అనే విషయాన్ని చెప్పకనే చెబుతున్నారు. ఈ కోణంలో సాయిప్రియాంక ‘కృషి’ యువతరంలో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంది.సంతోషంగా ఉంది‘అగ్రి న్యూట్రీ స్మార్ట్ విలేజ్’ అనే ్రపాజెక్ట్పై మూడు ప్రత్యేక గ్రామాల్లో నా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ‘గ్లోబల్ హంగర్ ఇండెక్స్’లాంటి వాటి ఆధారంగా ఈ గ్రామాల్లో ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్‌ను తయారు చేస్తున్నాము. ఇతర గ్రామాలతో పోల్చితే ఈ ప్రత్యేక గ్రామాల్లో కాస్త మెరుగైన పౌష్టికాహారం అందుతోంది. దక్షిణ ఆసియా దేశాలకు చెందిన సుమారు 600 మంది ప్రతినిధులతో కొలంబోలో జరిగే అంతర్జాతీయ సదస్సులో పాల్గొనే అవకాశం లభించినందుకు ఎంతో సంతోషంగా ఉంది.– సాయి ప్రియాంక, వ్యవసాయ శాస్త్రవేత్త పాత బాల ప్రసాద్, సాక్షి, సంగారెడ్డి -
ఉగ్రావతారం
‘‘హైదరాబాద్‌తో నాకు ఎంతో అనుబంధం ఉంది. నా భర్త ఉపేంద్రగారిని తొలిసారి ఇక్కడే కలిశాను. అందుకే హైదరాబాద్ నాకు చాలా లక్కీ సిటీ. నా కెరీర్లో తొలి యాక్షన్ ఫిల్మ్ ‘ఉగ్రావతారం’. ఈ పాత్రకు నేను సరిపోతానని డైరెక్టర్ గురుమూర్తిగారు నమ్మారు. నా మొదటి పాన్ ఇండియన్ మూవీని అందరూ చూడాలని కోరుకుంటున్నాను’’ అని నటి ప్రియాంకా ఉపేంద్ర అన్నారు. ప్రియాంకా ఉపేంద్ర లీడ్ రోల్లో గురుమూర్తి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఉగ్రావతారం’.ప్రియాంకా ఉపేంద్ర సమర్పణలో ఎస్జీ సతీష్ నిర్మించిన ఈ సినిమా నవంబరు 1న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో ఈ చిత్రం ట్రైలర్, సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. నిర్మాత రాజ్ కందుకూరి ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేయగా, నిర్మాత కరాటే రాజు, నటుడు సత్యప్రకాశ్ పాటను రిలీజ్ చేశారు. డైరెక్టర్ గురుమూర్తి మాట్లాడుతూ– ‘‘సమాజంలో జరిగే అన్యాయాలు, అఘాయిత్యాలపై మంచి సందేశాత్మాక చిత్రంగా ‘ఉగ్రావతారం’ ఉంటుంది’’ అన్నారు. -
మూడేళ్ళ గ్యాప్ తర్వాత రీఎంట్రీ.. టాలీవుడ్ దూసుకెళ్తున్న ‘శనివారం’ బ్యూటీ (ఫొటోలు)
-
తెర వెనక 'సరిపోదా శనివారం'.. నాని-ప్రియాంక ఇలా (ఫొటోలు)
-
మీ సోనియా ఇటలీ నుంచి వచ్చారు కదా !
శివాజీనగర: తాను రాజస్థాన్ నుండి వచ్చినవాడైతే మీ పార్టీ అధినాయకురాలు సోనియాగాంధీ ఇటలీ నుండి వచ్చారు, ఆమె కూడా తమ రాష్ట్ర నుండి రాజ్యసభకు ఎంపికయ్యారనేది మరువరాదని మంత్రి ప్రియాంక్ ఖర్గేకు రాజ్యసభ సభ్యుడు లెహర్ సింగ్ ఎదురుదాడికి దిగారు. కేఐఏడీబీ భూముల వ్యవహారాన్ని ప్రశ్నించినందుకు ఖర్గే జూనియర్ వారి స్నేహితులు రాజస్థాన్ వారని తనపై ఆరోపణ చేశారు. తాను అడిగేందుకు ఇష్టపడుతున్నాను. సోనియాగాంధీ రాజస్థాన్ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఇటలీలో జని్మంచారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సీ.వేణుగోపాల్ సికార్‌లో, రణదీప్ సింగ్ సుర్జేవాలా చురులో జని్మంచారు. వారు ఏ రాష్ట్రం నుండి రాజ్యసభకు ఎంపికయ్యారని ఆయన ప్రశ్నించారు. రాజస్థానీ కావటం నేరమా? రాజస్థాన్ పాకిస్థాన్‌లో లేదని అన్నారు. నెహ్రూ కుటుంబం ఉత్తరప్రదేశ్ నుండి వచ్చిందా లేదా కాశీ్మర్ నుండి వచ్చిందా అని ప్రశ్నించారు. తాను 59 సంవత్సరాల నుండి కర్ణాటకలో నివసిస్తున్నాను. తాను కన్నడ మాట్లాడుతున్నాను. చదువుతాను, రాస్తాను. తాను కర్ణాటక బీజేపీలో కోశాధికారి అని, తాను తన పార్టీలో ఎమ్మెల్సీ, ఎంపీగా సేవలందించాను. తాను రాజకీయం వంశం నుండి వచ్చినవాడు కాదు. రాహుల్ గాని, ఖర్గే జూనియర్.. రాళ్లు వేసే ముందు గాజు గదిలో ఉన్నారనేది తెలుసుకోవాలి అని లెహర్ సింగ్ ధ్వజమెత్తారు. -
చిరంజీవి గారితో నన్ను పోల్చడం.. కల్కి 2 లో నాని..?
-
సుదర్శన్ థియేటర్లో ‘సరిపోదా శనివారం’ ట్రైలర్ విడుదల ఈవెంట్ (ఫొటోలు)
-
నడకలో నిరాశ
పారిస్ ఒలింపిక్స్ అథ్లెటిక్స్ పోటీల తొలి రోజు భారత్‌కు నిరాశ తప్పలేదు. 20 కిలోమీటర్ల రేస్ వాక్‌లో మన అథ్లెట్లు ఆకట్టుకోలేకపోయారు. మహిళల విభాగంలో ప్రియాంక గోస్వామి 1 గంటా 39 నిమిషాల 55 సెకన్లలో లక్ష్యాన్ని చేరి 41వ స్థానంతో సరిపెట్టుకుంది. ఆసియా క్రీడల్లో రజత పతకం సాధించి ఆశలు రేపిన ప్రియాంక... ‘పారిస్’ క్రీడల్లో అదే ప్రదర్శన కనబర్చలేకపోయింది. 28 ఏళ్ల ప్రియాంక తన అత్యుత్తమ ప్రదర్శన (1 గంట 28 నిమిషాల 45 సెకన్లు) కంటే 11 నిమిషాలు వెనుకబడింది. పురుషుల విభాగంలో వికాస్ సింగ్ 30వ స్థానంతో, పరమ్‌జీత్ సింగ్ 37వ స్థానంతో రేసును ముగించారు. మరో వాకర్ అ„Š దీప్ అనారోగ్యం కారణంగా రేసు పూర్తి చేయలేకపోయాడు. -
చారులత ఆన్ డ్యూటీ
నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సరిపోదా శనివారం’. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. ‘గ్యాంగ్ లీడర్’ మూవీ తర్వాత నాని, ప్రియాంక మోహన్ జోడీగా నటిస్తున్న రెండో చిత్రం ‘సరిపోదా శనివారం’. ఎస్జే సూర్య, సాయికుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్ మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు.ఈ సినిమా నుంచి ప్రియాంక మోహన్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. ‘‘యాక్షన్ అడ్వెంచర్‌గా రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘సరిపోదా శనివారం’. ఈ మూవీలో చారులత అనే పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటిస్తున్నారు ప్రియాంక మోహన్. ఆమె పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. భారీ బడ్జెట్, ఉన్నత ప్రమాణాలతో నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఆగస్టు 29న ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
రైడర్ ప్రియాంక
ఓ వైపు వృత్తి.. మరోవైపు హాబీ.. చాలా మంది ఈ రెంటిలో ఏదో ఒక్కదానికే ప్రాధాన్యం ఇస్తారు. అతికొద్దిమంది మాత్రమే ఈ రెంటినీ బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతారు.. అలా రెంటిలోనూ గుర్తింపు తెచ్చుకోడం అంత సులువేం కాదు.. అందునా ఓ మహిళ ఇలా మల్టీ టాస్కింగ్ చేయడం చెప్పుగోదగ్గ విషయం.. పైగా అతి కష్టతరమైన గుర్రపు స్వారీలో రాణించడమంటే ఎంతో గుండె ధైర్యం కూడా ఉండాలి.. అలా గుర్రపు స్వారీలో రాణిస్తూనే.. ఎనీ్టపీసీలో మేనేజర్‌గా బిజీగా ఉంటూ.. మరోవైపు రచయిత్రిగానూ రాణిస్తున్నారు.. నగరానికి చెందిన ప్రియాంక భుయాన్. పలువురికి రోల్‌మోడల్‌గా నిలుస్తున్న ఆమె అనుభవాలు సాక్షితో పంచుకున్నారు... ఆ వివరాలు మీకోసం.. మహిళలంటే వంటింటికే పరిమితం అనే అపోహలను చెరిపేస్తూ.. అన్నింటిలోనూ పోటీకి సిద్ధమని నిరూపిస్తున్నారు నేటి మహిళలు.. కేవలం ఉద్యోగాలకే పరిమితం కాకుండా ఆటల్లోనూ ముందడుగేస్తున్నారు. ఎంత కష్టమైనా.. ఎదురు నిలిచి.. గెలిచి చూపిస్తున్నారు.. అంతటితో ఆగకుండా మరోవైపు కుటుంబ బాధ్యతలను భారంగా కాకుండా ఎంతో నిబద్ధతతో చక్కదిద్దుతూ ముందుకు సాగుతున్నారు ఎనీ్టపీసీలో మేనేజర్‌గా పనిచేస్తున్న ప్రియాంక భుయాన్. గుర్రపు స్వారీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ.. నలుగురికీ రోల్‌మోడల్‌గా నిలుస్తున్నారు. చిన్నన్నాటి కల.. అస్సాంలోని గువహటిలో జన్మించాను. అక్కడే నా బాల్యం గడిచింది. మూడేళ్లు వయసప్పుడు అమ్మ ఇచ్చిన ఓ గ్రీటింగ్ కార్డులో తొలిసారిగా గుర్రం బొమ్మ చూశాను. అప్పటి నుంచి గుర్రాలంటే పిచ్చి. కాస్త పెరిగాక గుర్రపు స్వారీపై ఆసక్తి పెరిగింది. కానీ ఆర్థిక పరిస్థితులు అందుకు సహకరించలేదు. గుర్రాన్ని దగ్గరి నుంచి చూడటమే విశేషం. కానీ ఇప్పుడు గుర్రం స్వారీ చేస్తూ పోటీల్లో పాల్గొనడం, పతకాలు సాధించడం నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎన్నో ఆటంకాలు... వృత్తిలో భాగంగా 2020లో రాయ్‌పూర్ బదిలీ అయ్యాను. కుటుంబం నుంచి దూరంగా ఉండటంతో ఒంటరిగా ఫీలయ్యేదాన్ని. అప్పుడే హార్స్ రైడింగ్ కలకు చేరువవ్వాలని నిర్ణయించుకున్నా.. అయితే మొదట్లో ఎవరేం అనుకుంటారో అని కాస్త భయపడ్డా. పైగా మహిళలకు ఈ రంగంలో చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అయినా ధైర్యం చేసి∙ట్రైనింగ్సెంటర్లో చేరాను. ట్రైనింగ్సెంటర్కు వెళ్లి గుర్రాలను చూడగానే ఎగిరి గంతేశాను. అయితే ప్రాక్టీస్ సమయంలో కింద పడి గాయాలయ్యాయి. వాటన్నింటినీ దాటుకుని ముందుకెళ్లాను. ఢిల్లీలో జరిగిన పోటీలో కాంస్య పతకం గెలుచుకున్నా.ఆ బాండింగ్ ప్రత్యేకం.. హార్స్ రైడింగ్ నేర్చుకోవడమే కాదు.. గుర్రంతో మంచి అనుబంధం ఉండాలి. ఎంత బాండింగ్ ఉంటే అంత అద్భుతంగా రాణించగలుగు తాం. ఒక్కోసారి గుర్రాలు మనకు సహకరించవు. దీనివల్ల గాయాలు కావొచ్చు. ప్రాణాలు కూడా పోవచ్చు. ముందస్తు జాగ్రత్తలతో పాటు గుర్రంతో స్నేహం చేయాలి. కుదిరితే సొంత గుర్రం కొనుక్కోవడం మంచిది.ధర ఎక్కువే..గుర్రాల్లో చాలారకాలుంటాయి. స్వారీలకు వేడి రక్తం ఉన్న విదేశీ గుర్రాలను వాడుతుంటారు. వాటిని దిగుమతి చేసుకోవడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఒక్కోదాని ఖరీదు రూ.30 నుంచి రూ. 40 లక్షలు ఉంటుంది. దీనికి పన్ను అదనం. దేశవాళీ గుర్రాలు అయితే కాస్త తక్కువ ధరకు దొరుకుతాయి. కానీ అనుకున్నన్ని సాహసాలు, మిరాకిల్స్ కష్టం. నేనూ ఓ గుర్రాన్ని కొనుక్కున్నా. కాకపోతే దురదృష్టవశాత్తు కొన్ని నెలలకే క్యాన్సర్‌తో మరణించింది. గుర్రాన్ని పెంచడమూ ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే.రాయడమూ ఇష్టమే..గుర్రపు స్వారీతో పాటు పుస్తకాలు రాయడమూ హాబీ. ఇప్పటివరకూ మూడు పుస్తకాలు రాశాను. వాటికి పాఠకుల నుంచి స్పందన వచి్చంది. కురుక్షేత్రంలో మహిళల గురించి ప్రపంచానికి పరిచయం చేయాలని నా తపన. అందుకే వీలు చిక్కినప్పుడల్లా పుస్తకాలు రాస్తుంటాను. -
పార్ట్నర్షిప్ నుంచి తప్పుకున్న ప్రియాంక చోప్రా.. మూతపడనున్న రెస్టారెంట్!
సెలబ్రిటీలు కేవలం సినిమాలే కాదు. మరింత ఆదాయం కోసం కొత్త దారుల్లోనూ వెళ్తుంటారు. పలువురు సినీతారలు ఇప్పటికే బిజినెస్‌లు కూడా స్టార్ట్ చేశారు. అలా అందరిలాగే సరికొత్తగా హోటల్ బిజినెస్‌లో అడుగుపెట్టింది బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా. అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ఓ రెస్టారెంట్‌ను ప్రారంభించింది. ఈ హోటల్‌ను మరొకరి భాగస్వామ్యంతో ఆమె మొదలు పెట్టింది.అయితే న్యూయార్క్ సిటీలో సోనా పేరుతో ప్రారంభించిన రెస్టారెంట్ పార్ట్నర్షిప్ నుంచి ప్రియాంక చోప్రా పక్కకు తప్పుకుంది. దీంతో ఆమె వైదొలిగిన కొన్ని నెలలకే సోనా హోటల్‌ను పూర్తిగా మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. మూడేళ్ల పాటు చేసుకున్న ఒప్పందం ముగియడంతో షట్ డౌన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈనెల 30 సోనా రెస్టారెంట్‌కు చివరి రోజుగా ఇన్‌స్టా ద్వారా వెల్లడించారు. మూడేళ్లుగా మీకు సేవ చేయడం మాకు గొప్ప గౌరవం అంటూ పోస్ట్‌లో రాసుకొచ్చారు.కాగా.. 2021లో ప్రియాంక చోప్రా, మనీష్ గోయల్ కలిసి సంయుక్తంగా సోనా రెస్టారెంట్‌ను ప్రారంభించారు. 2023 చివర్లో చోప్రా రెస్టారెంట్‌తో తనకున్న భాగస్వామ్యాన్ని ముగింపు పలికింది. దీంతో ఆమె తప్పుకున్న ఆరు నెలలకే రెస్టారెంట్ మూసివేస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. కాగా.. ప్రియాంక చోప్రా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంది. కార్ల్ అర్బన్‌తో కలిసి 'ది బ్లఫ్' షూటింగ్‌తో బిజీగా ఉంది. View this post on Instagram A post shared by SONA (@sonanewyork) -
రూ.200 కోట్లు కొట్టేశారు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకు (టీఎస్‌సీబీ) మేనేజర్ భర్త, కుమారుడు కలిసి ఏర్పాటు చేసిన ప్రియాంక ఫైనాన్స్ సంస్థ రూ.200 కోట్లు మేర స్వాహా చేసి బిచాణా ఎత్తేసింది. అధిక వడ్డీ పేరుతో అనేక మంది నుంచి డిపాజిట్లు సేకరించి ఐపీ పిటిషన్ దాఖలు చేసింది. బాధితుల ఫిర్యాదుతో సోమ వారం కేసు నమోదు చేసుకున్న నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధికారులు దర్యాప్తు బాధ్యతల్ని సిట్‌కు అప్పగించారు. సోమవారం సీసీఎస్ కార్యాలయం వద్ద నిరసన తెలిపిన బాధితులు తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాకు చెందిన నిమ్మగడ్డ వాణి బాల, నేతాజీ భార్యాభర్తలు. సైదాబాద్‌లో వీళ్లు నివసిస్తుండగా... వాణి బాల ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో–ఆపరేటివ్ బ్యాంక్‌లో విధుల్లో చేరారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది టీఎస్సీబీగా మారగా ప్రస్తుతం వాణి బాల మేనేజర్ స్థాయిలో పని చేస్తున్నారు. 15 శాతం వడ్డీ ఇస్తామని చెప్పి.. దాదాపు 20 ఏళ్ల నుంచి వాణి బాల ఓ పథకం ప్రకారం బ్యాంక్‌కు వచ్చే వినియోగదారులను ఆకర్షిస్తూ వచ్చారు. టీఎస్సీబీలో డిపాజిట్ చేస్తే సాలీనా కేవలం 6 నుంచి 7% మాత్రమే వడ్డీ వస్తుందని, అబిడ్స్‌లోని టీఎస్‌సీబీ సమీపంలోనే తన భర్త నేతాజీ నెలకొలి్పన ఫైనాన్స్ సంస్థ ప్రియాంక ఎంటర్‌ప్రైజెస్‌లో డిపాజిట్ చేస్తే 15శాతం వడ్డీ వస్తుందని నమ్మబలికారు. బ్యాంకు కస్టమర్లతో పాటు సహోద్యోగులు, స్నేహితులను ఇందులో డిపాజిట్ చేసేలా ప్రేరేపించారు. చాలాకాలం చెల్లింపులు సక్రమంగా జరగడంతో అనేక మంది దృష్టి ఈ ప్రైవేట్ సంస్థపై పడింది.బ్యాంకులో భారీ మొత్తం డిపాజిట్ చేస్తే ప్రతి ఏడాదీ ఐటీ శాఖ వారికి లెక్కలు చూపాలని, తమ సంస్థలో ఆ ఇబ్బంది ఉండదంటూ మరికొందరిని ఆకర్షించారు. డిపాజిట్లుగా సేకరించిన మొత్తంతో ఏం చేస్తున్నారంటూ ఇటీవల కొందరు ప్రియాంక సంస్థ నిర్వాహకులను ప్రశ్నించారు. దీనికి నిర్వాహకులు తమకు జీడిమెట్ల, బెంగళూర్‌లో వ్యాపారాలు, కర్మాగారాలు ఉన్నాయంటూ చెప్పి నమ్మిస్తూ వచ్చారు. దీంతో వీరి వద్ద డిపాజిట్లు పెరిగాయి. గరిష్టంగా రూ.2 కోట్ల వరకు డిపాజిట్ చేసిన వాళ్లూ ఉన్నారు. కాగా, ఆ ఫైనాన్స్ సంస్థలో ఆమె కుమారుడు శ్రీహర్ష కీలకంగా వ్యవహరించాడు. ఆఫీసు, ఇంటికి తాళాలు: ఈ నెల 14న ఆఖరుసారిగా కార్యాలయం తెరిచిన నేతాజీ ఆయన కుమారుడు శ్రీహర్ష సిబ్బందిని హఠాత్తుగా పంపేసి తాళం వేశారు. ఈ విషయం తెలిసిన బాధితులు సైదాబాద్‌లోని ఇంటికి వెళ్లగా అక్కడా తాళమే కనిపించింది. దీంతో తాము మోసపోయామని భావించి అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భారీ మొత్తంతో ముడిపడిన కుంభకోణం కావడంతో సీసీఎస్‌కు వెళ్లాల్సిందిగా అక్కడి అధికారులు సూచించారు. దీంతో వాళ్లు సోమవారం సీసీఎస్ డీసీపీ ఎన్.శ్వేతను కలిసి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. బాధితుల్లో అనేక మంది వృద్ధులు ఉన్నారని, వీళ్లంతా తమ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ప్రియాంక సంస్థలో పెట్టుబడిగా పెట్టారని అధికారులు చెప్తున్నారు. ఆర్నెల్లుగా వడ్డీల చెల్లింపుల్లో జాప్యం గతేడాది నవంబర్, డిసెంబర్ నుంచి వడ్డీల చెల్లింపులు సక్రమంగా జరగట్లేదు. అదేమని కొందరు ప్రశ్నించగా... ఎన్నికల సమయం కావడంతో డబ్బుల లావాదేవీలు తగ్గాయని అందుకే వడ్డీలు ఇవ్వడంలో ఆలస్యం అవుతోందంటూ నిర్వాహకులు చెప్పుకొచ్చారు. ఈ నెలాఖరుకు వాణి బాల సరీ్వసు పూర్తి కావస్తుండటంతో పదవీ విరమణ పొందాల్సి ఉంది. దీంతో ఈ నెల 3న ప్రియాంక సంస్థ నిర్వాహకులు సిటీ సివిల్ కోర్టులో దివాలా పిటిషన్ (ఐపీ) దాఖలు చేశారు. -
‘నిద్ర’కూ ఓ స్టార్టప్.. సూపర్ సక్సెస్!
ఒకరోజు నిద్ర పట్టక రకరకాలుగా ఆలోచిస్తుంటే... ‘నిద్ర’కు సంబంధించిన స్టార్టప్ ఐడియా తట్టింది ప్రియాంక సలోత్కు. ఆ రాత్రి వచ్చిన ఐడియా తనని ‘ఉద్యోగి’ స్థాయి నుంచి ‘ది స్లీప్’ కంపెనీ ద్వారా ‘ఎంటర్ప్రెన్యూర్’గా మార్చింది. దిండు నుంచి పరుపుల వరకు పేటెంటెడ్ స్మార్ట్‌గ్రిడ్ టెక్నాలజీతో ‘ది స్లీప్ కంపెనీ’ రూపొందించిన ఉత్పత్తులు మార్కెట్లో ప్రత్యేకతను చాటుకున్నాయి.రాజస్థాన్‌లోని గంగానగర్ జిల్లాకు చెందిన ప్రియాంక సలోత్ స్కూల్ రోజుల్లో హిందీ మీడియం నుంచి ఇంగ్లిష్ మీడియంలోకి వచ్చింది. అంతా కొత్త కొత్తగా అనిపించింది. అయితే అదేమీ తనని భయపెట్టలేదు. ఉత్సాహాన్ని ఇచ్చింది. హిందీ మీడియంలోలాగే ఇంగ్లిష్ మీడియంలోనూ చదువులో దూసుకుపోయింది. ఐఐఎం కోల్‌కత్తాలో చదువు పూర్తయిన తరువాత కార్పొరేట్ ప్రపంచంలోకి అడుగు పెట్టింది.యంగ్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్ అయినæప్రియాంక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంపెనీ జేపీ మోర్గాన్‌తో కెరీర్ప్రారంభించింది. ఆ తరువాత సింగపూర్‌లో వేరే కంపెనీలో చేరింది. కొన్ని నెలల తరువాత... కన్సల్టింగ్ అండ్ ఇన్వెస్టింగ్ రోల్స్ తనకు సరికాదేమో అనిపించింది. నిజానికి ఈ రియలైజేషన్ అనేది ప్రియాంకకు ఇదే మొదటిసారి కాదు.దిల్లీలో ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు ‘షూడాగ్’ ‘స్టీవ్ జాబ్స్’ పుస్తకాల ప్రభావంతో ‘సాంకేతిక రంగంలో ఉండాలనుకోలేదు. ఇంజినీర్ కావాలనుకోలేదు. మరి నేనెందుకు ఇంజినీరింగ్ చేస్తున్నాను?’ అని తనని తాను ప్రశ్నించుకుంది. చాలామంది టాపర్స్లాగే ‘ఇంజనీరింగ్ లేదా మెడిసిన్’ అని ఆలోచించి ఇంజినీరింగ్ చేస్తుందే తప్ప ప్రత్యేక కారణం అంటూ లేదు. ఈ నేపథ్యంలోనే మేనేజేమెంట్ విషయాలపై తనకు ఉన్న ఆసక్తితో మేనేజ్మెంట్ కోర్సు చేసింది.సింగపూర్ నుంచి తిరిగివచ్చిన తరువాత ముంబైలోని కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీ ‘పీ అండ్ జీ’లో చేరి కన్సూ్యమర్ బ్రాండ్స్‌పై ఆసక్తిని పెంచుకుంది. ఏరియల్ డిటర్జంట్ బ్రాండ్‌లో పనిచేసిన తరువాత బేబీ డైపర్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ ‘΄ాంపర్స్’ హెడ్‌గా నియామకం అయింది. ఆ తరువాత... ప్రెగ్నెన్సీ వల్లప్రొఫెషనల్ లైఫ్ నుంచి విరామం తీసుకోవాల్సి వచ్చింది.ఆ సమయంలో ‘ఉద్యోగం కాదు సొంతంగా ఏదైనా వ్యా΄ారం చేయాలి’ అనే ఆలోచన ఆమెలో పెరిగి పెద్దదైంది. అదే సమయంలో చిన్న భయం కూడా మొదలైంది. ‘పెద్ద జీతాన్ని కాదనుకొని వ్యా΄ారం చేస్తే... ఎన్నో రిస్కులు ఎదురవుతాయి. వృత్తిజీవితంలో ముందుకు దూసుకుపోతున్నప్పుడు రిస్క్ చేయడం ఎందుకు?’ అనిపించింది. అయితే కొద్దిరోజుల్లోనే ఆమె కంఫర్ట్ జోన్ ఆలోచనల నుంచి బయటికి వచ్చింది.ఒక బిడ్డకు జన్మనిచ్చిన ప్రియాంక ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపింది. అలాంటి ఒక రాత్రి వచ్చిన ఆలోచనే... ది స్లీప్ కంపెనీ. తనలాగే ఎంతోమంది నిద్రలేమితో సతమతమవుతున్నారు. దీనికి ఒక పరిష్కారం ఆలోచిస్తే ‘స్లీప్ అండ్ కంఫర్ట్’ బిజినెస్‌కు సంబంధించి మంచి అవకాశం ఉంది అనిపించింది. తన స్టార్టప్ ఐడియా మిత్రులకు నచ్చలేదు. మళ్లీ ‘రిస్క్’ అనే భయం ముందుకు వచ్చింది. అయితే ఆ భయాన్ని వెనక్కి నెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసి తన ఐడియాపై సంవత్సరానికి పైగా పనిచేసింది.డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్‌లో పని చేసిన మాజీ ఉద్యోగి ఏకే త్రి΄ాఠీతో కలిసి హైటెక్–్ర΄ాడక్ట్ రూపకల్పన చేసింది. తరువాత భర్త హర్షిల్ సలోత్తో కలిసి ‘ది స్లీప్ కంపెనీ' ప్రారంభించింది. ప్రియాంక బిజినెస్ ఐడియా సక్సెస్ అవుతుందని నమ్మినవారి సంఖ్య తక్కువ. అయితే పేటెంటెడ్ స్మార్ట్‌గ్రిడ్ టెక్నాలజీతో వచ్చిన ‘ది స్లీప్ కంపెనీ’ మార్కెట్లో తనదైన ప్రత్యేకతను సృష్టించుకుంది. మొదట్లో రకరకాల సవాళ్లు ఎదురైనా కంపెనీకి సంబంధించిన ఫండింగ్ జర్నీ సాఫీగా సాగింది. పెద్ద సంస్థలు కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపించాయి. మ్యాట్రస్ బ్రాండ్ నుంచి స్లీప్ అండ్ కంఫర్ట్ టెక్ సొల్యూషన్ కంపెనీగా ఎదిగింది ది స్లీప్ కంపెనీ.వెయ్యి ఫెయిల్యూర్స్ తరువాత...‘ది స్లీప్ కంపెనీ’ లాంచ్ చేయడానికి ముందుప్రాడక్ట్స్కు సంబంధించి వెయ్యికి పైగా ప్రయోగాలు చేస్తే అన్నీ విఫలం అయ్యాయి. ఈ పరాజయాలు ఒక దశలో నన్ను నిరాశలోకి నెట్టి ‘ఉద్యోగానికి రాజీనామా చేసి తప్పు చేశానా?’ అని సందేహించేలా చేశాయి. ఫండ్ రైజింగ్ క్రమంలో ‘మీప్రాడక్ట్లో కొత్త ఏం ఉంది’ అంటూ రిజెక్షన్స్ మొదలయ్యాయి. ‘ఇక వెనక్కి వెళదాం’ అని ఆ సమయంలో అనుకొని ఉంటే ఎంటర్‌ప్రెన్యూర్‌గా నాకు పెద్ద విజయం దక్కేది కాదు. – ప్రియాంక సలోత్, కో–ఫౌండర్, ది స్లీప్ కంపెనిఇవి చదవండి: Sankari Sudhar: మాతృత్వం వరం! కెరీర్ రీ లాంచ్... అవసరం! -
వయనాడ్, రాయ్‌బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
ఐదో దశ నామినేషన్ల చివరి రోజు వరకు యూపీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారనే ఉత్కంఠను ఆ పార్టీ కొనసాగించింది. అయితే చివరికి ఆయన రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తున్నట్లు పార్టీ వెల్లడించింది. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ మరో సస్పెన్స్‌కు తెరలేపింది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఒకవేళ రాహుల్ అటు కేరళలోని వయనాడ్, ఇటు యూపీలోని రాయ్‌బరేలీలలో గెలిస్తే ఏ సీటును వదులుకుంటారనే ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ మెదులుతోంది.గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న రాయ్‌బరేలీ నుంచి మే 3న రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. రాహుల్‌కు ముందు ఆయన తల్లి సోనియా గాంధీ ఈ స్థానానికి వరుసగా 20 ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు ఆమె రాజ్యసభ సభ్యురాలు. ఇదిలా ఉండగా వయనాడ్, రాయ్‌బరేలీలలో గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు? అనే ప్రశ్నకు లక్నో యూనివర్శిటీ రాజనీతి శాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ సంజయ్ గుప్తా విశ్లేషణ చేశారు.తల్లి రాజకీయ వారసత్వం కోసం రాహుల్ గాంధీ అమేథీని వదిలి, రాయ్‌బరేలీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఈ నిర్ణయం ద్వారా రాహుల్ గాంధీ సురక్షితమైన పందెం ఆడారు. మొదటిది బీజేపీ మహిళా నేత, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో పోటీపడితే గతంలో మాదిరిగా పరాభవం ఎదురుకాకుండా చూసుకున్నారు. మరోవైపు తన తల్లి గతంలో పోటీ చేసి, విజయం సాధించిన రాయ్‌బరేలీ స్థానాన్ని కాపాడుకునే ప్రయత్నం కూడా చేశారు.ఇక వయనాడ్ విషయానికొస్తే ముస్లిం, క్రైస్తవ ఓటర్లు అధికంగా ఉన్న ఈ లోక్‌సభ స్థానం సురక్షితమని రాహుల్ గాంధీ భావించారు. అలాగే అమేథీలో కన్నా రాయ్‌బరేలీలో పోటీ చేయడమే సరైనదని రాహుల్ నిర్ణయించుకున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్‌లో రాహుల్‌కు 7 లక్షల 6,000 ఓట్లు వచ్చాయి. ఆయన ప్రత్యర్థికి కేవలం రెండు లక్షల నాలుగు వేల ఓట్లు మాత్రమే దక్కాయి.అయితే ఈసారి వయనాడ్‌లో పరిస్థితులు మారాయి. రాష్ట్రంలోని అధికార వామపక్ష కూటమి ఈసారి అభ్యర్థిని మార్చింది. ఈసారి బీజేపీ ప్రధాన కార్యదర్శి డి.రాజా భార్య అన్నే రాజాపై రాహుల్ ఎన్నికల బరిలోకి దిగారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా రాహుల్‌కు ఇండియన్ ముస్లిం లీగ్ మద్దతు ఉంది. అయితే ఇక్కడ బీజేపీ కూడా తన సత్తాను చాటుకునే ప్రయత్నంలో ఉంది. ఒకవేళ రాహుల్ అటు వయనాడ్, ఇటు రాయ్‌బరేలీ రెండింటిలో గెలిస్తే రాయ్‌బరేలీని వదులుకుని, వయనాడ్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశాలున్నాయని ప్రొఫెసర్ సంజయ్ గుప్తా అన్నారు. అయితే అటువంటి సందర్భం ఏర్పడినప్పుడు రాయ్‌బరేలీకి జరిగే ఉప ఎన్నికలో రాహుల్ సోదరి ప్రియాంక పోటీ చేసి, గాంధీ కుటుంబపు కంచుకోటకు కాపాడే ప్రయత్నిం చేస్తారని ఆయన తన అభిప్రాయం తెలిపారు. -
ప్రియాంక హక్కును రాహుల్ లాక్కున్నారా?
యూపీలోని రాయ్‌బరేలీ నుంచి ప్రియాంకా గాంధీ పోటీచేస్తారని భావిస్తున్న తరుణంలో అక్కడి నుంచి రాహుల్ ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు కాంగ్రెస్ ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. ఇక్కడి నుంచి రాహుల్ గాంధీ నామినేషన్ కూడా దాఖలు చేశారు.ఈ నేపధ్యంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై పలు ఆరోపణలు చేశారు. రాయ్‌బరేలీ నుంచి నామినేషన్ దాఖలు చేయడం ద్వారా రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా, ఆమె భర్తకు గల హక్కులను లాక్కున్నారని ఆరోపించారు. గుణ లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా జరిగిన బహిరంగ సభలో సీఎం మోహన్ యాదవ్ ఈ ఆరోపణలు చేశారు.ఓటమి భయంతో రాహుల్ గాంధీ అమేథీ (ఉత్తరప్రదేశ్) నుంచి వయనాడ్ (కేరళ)కు పారిపోయారని కూడా మోహన్ యాదవ్ ఎద్దేవా చేశారు. ఇటీవల రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రా ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారంటూ ఆ పార్టీ మద్దతుదారులు పోస్టర్లు అంటించారని యాదవ్ గుర్తు చేశారు. మొత్తంగా చూస్తే రాహుల్ గాంధీ అటు తన సోదరి ప్రియాంక, ఇటు బావ రాబర్ట్ వాద్రాల హక్కులను లాక్కున్నట్లయ్యిందని మోహన్ యాదవ్ పేర్కొన్నారు. -
ప్రియాంక విజయానికి ‘స్పెషల్ 24’!
యూపీలోని కాంగ్రెస్ కంచుకోట రాయ్ బరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ విషయమై పార్టీ అధిష్టానం ఏ క్షణంలోనైనా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. రాయ్‌బరేలీలో ఎన్నికల నిర్వహణ కోసం రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ 24 మంది సభ్యులతో కూడిన సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. దీనిలో అసెంబ్లీ ప్రతినిధులు, ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, జిల్లా కాంగ్రెస్ కమిటీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.రాయ్‌బరేలీ నుంచి ఎవరు పోటీ చేయనున్నారనేది కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించనున్నారు. తాజాగా జరిగిన కాంగ్రెస్ సెంట్రల్ కోర్ కమిటీ సమావేశంలో మల్లికార్జున్ ఖర్గేకు టికెట్ ఖరారు చేసే అధికారాన్ని పార్టీ అధిష్టానం అప్పగించింది. ప్రస్తుతానికి ప్రియాంకగాంధీ పేరు ఫైనల్ అయినట్లు భావిస్తున్నప్పటికీ, అధిష్టానం అధికారికంగా ప్రకటించలేదు.రాయ్‌బరేలీ లోక్‌సభ ఎన్నికల కోసం సోనియా గాంధీ ప్రత్యేకంగా 24 మంది సభ్యులతో కూడిన సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో సోనియాగాంధీతోపాటు ఆమె ప్రతినిధి కేఎల్ శర్మ, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పంకజ్ తివారీ, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు ధీరజ్ శ్రీవాస్తవ, బచ్రావాన్ ఎమ్మెల్యే సుశీల్ పాసి, హర్చంద్పూర్ మాజీ ఎమ్మెల్యే సురేంద్ర విక్రమ్‌సింగ్, డాక్టర్ మనీష్ సింగ్ చౌహాన్, సరేని ఎమ్మెల్యే సుధా ద్వివేది, అతుల్ సింగ్, ఉంచహార్ ఎమ్మేల్యే సాహబ్ శరణ్ పాశ్వాన్, రాయ్‌బరేలీ మున్సిపాలిటీ అధ్యక్షుడు శత్రోహన్ సోంకర్, లాల్ గంజ్ నగర్ పంచాయతీ అధ్యక్షురాలు సరితా గుప్తా, రాయ్ బరేలీ మాజీ అధ్యక్షుడు ఇలియాస్, ఏఐసీసీ మాజీ సభ్యుడు కళ్యాణ్ సింగ్ గాంధీ, డీడీసీకి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత వీకే శుక్లాలు ఉన్నారు. ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్, ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జ్ అవినాష్ పాండే, రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆరాధన మిశ్రా రాయ్‌బరేలీ ఎన్నికల్లో వ్యూహకర్తలుగా కీలక పాత్ర పోషిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. -
రాయ్‌బరేలీ నుంచి ప్రియాంకా గాంధీ!
దక్షిణాదిలో కొంతవరకూ తమ ఎన్నికల పోరు ముగిసిన తరువాత కాంగ్రెస్ థింక్ ట్యాంక్ ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లోని తమ రాయ్‌బరేలీ కోటను కాపాడుకునేందుకు సిద్ధమయ్యింది. తాజాగా ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ సెంట్రల్ కోర్ కమిటీ సమావేశంలో రాయ్‌బరేలీ రాజకీయ సమీకరణాలపై చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాయ్‌బరేలీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే దానిపై నేడు (ఆదివారం)వెల్లడికానుంది.ప్రియాంక గాంధీ రాయ్‌బరేలీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని తెలుస్తున్నప్పటికీ ఆమె పేరును పార్టీ ఇంకా అధికారికంగా వెల్లడించాల్సివుంది. ప్రియాంక గాంధీ పోటీకి సంబంధించి జిల్లా కాంగ్రెస్ కమిటీకి ఇంకా హైకమాండ్ నుండి ఎటువంటి ఆదేశాలు రాలేదు. అయితే కాంగ్రెస్ జిల్లా కార్యాలయానికి రంగులు వేసే పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రియాంక గాంధీ రాయ్‌బరేలీకి రాగానే ఆమె తొలుత జిల్లా కార్యాలయంలో సమావేశం నిర్వహిస్తారని, ఆ తర్వాత కోర్ కమిటీతో సంప్రదింపులు జరుపుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.జిల్లా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు ఈరోజు (ఆదివారం) చాలా ముఖ్యమైన రోజు. నేడు ప్రియాంక పోటీపై ఢిల్లీ నుంచి సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పంకజ్ తివారీ మాట్లాడుతూ ఇప్పుడు తాము ఢిల్లీ నుంచి వచ్చే సమచారం కోసం ఎదురు చూస్తున్నామన్నారు. ఏదిఏమైనప్పటికీ రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక పోటీ ఖాయమని, ఆమె ఇక్కడకు రాగానే ఎన్నికల సన్నాహాలు మొదలవుతాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
రాయ్‌బరేలీకి ఇద్దరు గాంధీలు? 40 ఏళ్ల కిందటి చరిత్ర పునరావృతం?
ఉత్తరప్రదేశ్‌లోని హై ప్రొఫైల్ సీట్లలో ఒకటైన రాయ్‌బరేలీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే విషయాన్ని అటు కాంగ్రెస్ గానీ, ఇటు బీజేపీగానీ ఇంకా వెల్లడించలేదు. అయితే ప్రియాంక గాంధీ రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపధ్యంలో ప్రియాంకకు పోటీగా నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన వరుణ్‌గాంధీని ఎన్నికల బరిలోకి దించాలని బీజేపీ నిర్ణయించింది. రాయ్‌బరేలీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు వరుణ్‌గాంధీకి బీజేపీ తాజాగా ఆఫర్ ఇచ్చిందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే వరుణ్ తన సోదరి ప్రియాంకా గాంధీపై ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం అడిగారని సమాచారం.రాయ్‌బరేలీ అభ్యర్థుల ప్యానెల్లో వరుణ్ గాంధీ పేరును కూడా బీజేపీ కేంద్ర నాయకత్వం చేర్చినట్లు సమాచారం. రాయ్‌బరేలీ సీటు కాంగ్రెస్‌కు కంచుకోటగా పేరొందింది. ఈసారి సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్లడంతో ప్రియాంక గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వరుణ్‌గాంధీని రంగంలోకి దించితే కాంగ్రెస్‌కు గట్టిపోటీ ఎదురవుతుందని బీజేపీ అంతర్గత సర్వేలో వెల్లడైంది. ఈ నేపధ్యంలోనే వరుణ్ గాంధీని ఇక్కడి నుంచి పోటీచేయించేందుకు బీజేపీ రంగం సిద్ధం చేసింది. ఒకవేళ వరుణ్ గాంధీ రాయ్ బరేలీ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తే, గాంధీ కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు పోటీ చేయడం 40 ఏళ్ల తర్వాత జరుగుతున్నట్లవుతుంది. 1984 లోక్‌సభ ఎన్నికల్లో వరుణ్ గాంధీ తల్లి మేనకా గాంధీ అమేథీ నుంచి రాజీవ్ గాంధీపై పోటీ చేశారు. అప్పట్లో ఆమె ఓటమిని ఎదుర్కొన్నారు. ఆ తరువాత మేనకా గాంధీ, సోనియా గాంధీ కుటుంబాలు పరస్పరం ఎన్నికల్లో పోటీకి దిగలేదు. ప్రస్తుతం యూపీలోని సుల్తాన్పూర్ స్థానం నుంచి మేనకా గాంధీ మరోసారి ఎన్నికల బరిలోకి దిగారు. -
అఖిలేష్ ర్యాలీ, ప్రియాంక రోడ్ షో..
ఉత్తరప్రదేశ్‌లోని ఎనిమిది లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. నేటి (బుధవారం) సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ నేపధ్యంలో నేడు ఘజియాబాద్‌లో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలిసి ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించనున్నారు. మరోవైపు సహరాన్‌పూర్‌లో పార్టీ అభ్యర్థి ఇమ్రాన్ మసూద్‌కు మద్దతుగా ప్రియాంక గాంధీ రోడ్‌షో నిర్వహించనున్నారు. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చౌదరి భూపేంద్ర సింగ్ కూడా సంస్థాగత సమావేశాన్ని నిర్వహించి, బూత్ నిర్వహణకు కార్యకర్తలకు పలు సూచనలు చేయనున్నారు. ఎన్నికల ప్రచారానికి చివరి రోజున పార్టీలన్నీ తమ ప్రచారహోరును పెంచాయి. ఉత్తరప్రదేశ్‌లోని సహారన్పూర్, కైరానా, ముజఫర్‌నగర్, బిజ్నోర్, నగీనా, మొరాదాబాద్, రాంపూర్, పిలిభిత్‌లలో మొదటి దశలో ఓటింగ్ జరగనుంది. ఈ ఎనిమిది స్థానాల్లోని ఏడు స్థానాల్లో బీజేపీ అభ్యర్థి, ఒక స్థానంలో ఆర్ఎల్డీ అభ్యర్థి పోటీలో ఉన్నారు. అలాగే ఎస్పీ నుంచి ఏడుగురు, కాంగ్రెస్ నుంచి ఒకరు ఎన్నికల బరిలోకి దిగారు. మొత్తం ఎనిమిది స్థానాల్లో బీఎస్పీ తమ అభ్యర్థులను నిలబెట్టింది. ఎస్పీ అధినేత అఖిలేష్ ప్రచార ర్యాలీని కూడా నిర్వహించనున్నారని సమాచారం. -
కాంగ్రెస్‌కు ఓటు వేయలేని స్థితిలో రాహుల్, సోనియా?
ఈ టైటిల్ చూసి ఏవేవో ఊహలకు వెళ్లకండి. ఓటు వేసే విషయంలో వారిపై ఎటువంటి నిర్బంధం లేదు. అయితే ఇక్కడొక ట్విస్ట్ ఉంది. అదేమిటో, వారితో పాటు ప్రియాంకా గాంధీ కూడా కాంగ్రెస్‌కు ఓటు వేయలేని పరిస్థితిలో ఎందుకు ఉన్నారో, దీనికి గల కారణమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఢిల్లీలో ఆసక్తిగా మారనున్న రాజకీయ సమీకరణాలను మనం చూడబోతున్నాం. ‘ఇండియా కూటమి’ ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీతో సీట్లను పంచుకున్నప్పుడు, గాంధీ కుటుంబానికి చెందిన ఈ ముగ్గురు నేతల ఓట్లు కాంగ్రెస్‌కు పడే అవకాశాలు లేవని ఎవరూ ఊహించివుండరు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు న్యూఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన ఓటర్లు. అయినా వారు ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో వారి సొంత పార్టీకి ఓటు వేసుకోలేరు. ‘ఆప్’తో పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న న్యూఢిల్లీ స్థానాన్ని అరవింద్ కేజ్రీవాల్ పార్టీకి అప్పగించింది. న్యూఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, తూర్పు ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ లోక్‌సభ స్థానాల్లో ‘ఆప్’ పోటీ చేయనుండగా, కాంగ్రెస్ చాందినీ చౌక్, ఈశాన్య ఢిల్లీ, నార్త్ వెస్ట్ ఢిల్లీలో పోటీ చేస్తోంది. న్యూఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్ రాజకీయాలకు నెలవుగా ఉండేది. అయితే 2014లో మోదీ వేవ్ ఇక్కడి అన్ని సమీకరణలను తుడిచిపెట్టేసింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి గాంధీ కుటుంబ సభ్యులు తమ సొంత పార్టీకి ఓటు వేయలేని పరిస్థితి ఏర్పటడం బహుశా ఇదే తొలిసారి. నిజానికి కాంగ్రెస్ పార్టీ తనకు తగ్గుతున్న మద్దతు కారణంగా, యూపీ, ఢిల్లీతో సహా అనేక రాష్ట్రాల్లో ఇతర పార్టీలతో చేతులు కలపవలసి వచ్చింది. 1952- 2009 మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ న్యూఢిల్లీ స్థానాన్ని ఏడు సార్లు గెలుచుకుంది. బీజేపీకి చెందిన మీనాక్షి లేఖి ఇక్కడి నుంచి వరుసగా రెండుసార్లు లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. 2004, 2009 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ న్యూఢిల్లీ స్థానం నుండి గెలిచి పార్లమెంటుకు చేరుకున్నారు. కాంగ్రెస్ నేతలైన సోనియా, రాహుల్, ప్రియాంకల ఇళ్లు న్యూఢిల్లీ ఏరియాలోనే ఉండటంతో వారికి ఇక్కడే ఓటు హక్కు ఉంది. మరోవైపు ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రాజీవ్ శుక్లా కూడా న్యూఢిల్లీ ఓటర్లే. దీంతో వీరు కూడా కాంగ్రెస్‌కు ఓటు వేయలేని స్థితిలో ఉన్నారు. -
భారత్ జోడో న్యాయ యాత్రలో రాహుల్, ప్రియాంక!
కాంగ్రెస్ రెండో దశ భారత్ జోడో న్యాయ యాత్ర ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ నుంచి తిరిగి ప్రారంభమైంది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, పార్టీ అధినేత్రి ప్రియాంక గాంధీ ఓపెన్ జీపులో యాత్రలో పాల్గొన్నారు. వీరిని చూసేందుకు జనం తరలివచ్చారు. రాహుల్, ప్రియాంకలను స్వాగతిస్తూ జనం వారిపై పూల వర్షం కురిపించారు. ఈ సమయంలో సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలు కూడా యాత్రలో పాల్గొన్నారు. అమ్రోహా, సంభాల్, బులంద్‌షహర్, అలీఘర్, హత్రాస్, ఆగ్రా, ఫతేపూర్ సిక్రీ వరకు జరిగే ఈ యాత్రలో రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ కూడా పాల్గొంటున్నారు. ఆదివారం ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా ఈ యాత్రలో పాల్గొననున్నారు. ఆగ్రా అనంతరం ఈ యాత్ర రాజస్థాన్‌లోకి ప్రవేశిస్తుంది. మార్చి 26న ఈ యాత్రకు విరామం కల్పించనున్నారు. రాహుల్ గాంధీ ఫిబ్రవరి 27, 28 తేదీలలో న్యూఢిల్లీలో జరిగే పార్టీ సమావేశాలకు హాజరుకానున్నారు. అనంతరం భారత్ జోడో న్యాయ యాత్ర మార్చి 2న మధ్యాహ్నం 2 గంటలకు ధోల్పూర్ నుంచి తిరిగి ప్రారంభంకానుంది. ఈ యాత్ర మొరెనా, గ్వాలియర్, శివపురి, గుణ, షాజాపూర్, ఉజ్జయిని, మధ్యప్రదేశ్‌లోని పలు జిల్లాల మీదుగా సాగనుంది. -
సోనియా రాజ్యసభ నామినేషన్.. వెంటవచ్చిన రాహుల్, ప్రియాంక!
రాజ్యసభ ఎన్నికల్లో రాజస్థాన్ నుంచి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పోటీ చేస్తున్నారు. ఇందుకోసం ఆమె ఈరోజు(బుధవారం) నామినేషన్ దాఖలు చేయనున్నారు. రాజధాని జైపూర్ చేరుకున్న ఆమె వెంట రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. సోనియా గాంధీ లోక్‌సభ నుంచి కాకుండా రాజ్యసభ నుంచి పార్లమెంటుకు చేరుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రియాంక గాంధీ యూపీలోని రాయ్‌బరేలీ స్థానం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగుతారనే ప్రచారం జరుగుతోంది. రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోటసార నివాసంలో సోనియాగాంధీ నామినేషన్ సెట్‌పై ఎమ్మెల్యేలందరూ సంతకాలు చేశారు. #WATCH कांग्रेस संसदीय दल की अध्यक्ष सोनिया गांधी राज्यसभा चुनाव के लिए अपना नामांकन दाखिल करने के लिए जयपुर, राजस्थान पहुंचीं। उनके बेटे और पार्टी सांसद राहुल गांधी और उनकी बेटी और पार्टी महासचिव प्रियंका गांधी वाड्रा उनके साथ हैं। pic.twitter.com/0oGUmMr1to — ANI_HindiNews (@AHindinews) February 14, 2024 సీనియర్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ 1999 లోక్‌సభ సభ్యురాలుగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలి లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె అమేథీ లోక్‌సభ సభ్యురాలిగానూ ఉన్నారు. ఆమె పార్లమెంటు ఎగువ సభకు వెళ్లడం ఇదే తొలిసారి. ఫిబ్రవరి 8వ తేదీ నుంచి రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్ పత్రాల పరిశీలన ఫిబ్రవరి 16న జరగనుంది. అభ్యర్థులు ఫిబ్రవరి 20లోగా తమ పేర్లను ఉపసంహరించుకోవచ్చు. అవసరమైతే ఫిబ్రవరి 27న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ నిర్వహించి, అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు. -
ప్రియుడితో ప్రేమ పెళ్లి.. విడాకులతో షాకిచ్చిన బుల్లితెర నటి!
కోలీవుడ్‌లో బుల్లితెరపై మెప్పించిన నటి ప్రియాంక నల్కారి. తమిళంలో సీతారామన్ అనే సీరియల్‌తో కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత రోజా సీరియల్‌తో ఫేమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత సమ్‌థింగ్ సమ్‌థింగ్’, ‘కాంచన-3’ సినిమాల్లోనూ మెరిసింది. అంతేకాకుండా టాలీవుడ్లో అందరి బంధువయా సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఎస్ఎంఎస్, హైపర్, నేనేరాజు నేనేమంత్రి, వైఫ్ఆఫ్ రామ్, కిక్-2 చిత్రాల్లో నటించింది. అయితే గతేడాది ఆడియన్స్‌కు ఊహించని షాకిచ్చింది ప్రియాంక. తన ప్రియుడిని సీక్రెట్‌గా పెళ్లాడింది. బుల్లితెర నటుడు రాహుల్ వర్మను మలేషియాలో పెళ్లి చేసుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేసింది. ఆ వార్త విన్న ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురయ్యారు. కోలీవుడ్‌లో బుల్లితెరతో పాటు వెండితెరపై మెరిసిన ప్రియాంక నల్కారి ఇండస్ట్రీలో బాగానే గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తమిళంలో నలదమయంతి అనే సీరియల్లో లీడ్ రోల్ పోషిస్తున్నారు ప్రియాంక నల్కారి. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంటోంది.' ఏడాదిలోపే విడాకులు..! గతేడాది మార్చిలో పెళ్లిబంధంతో ఒక్కటైన ఈ జంట విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆడియన్స్‌తో నిర్వహించిన ఇంటరాక్షన్‌లో సెషన్లో ఈ విషయాన్ని వెల్లడించింది. మీరు భర్తతో విడిపోయారా? అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు అవునని సమాధానమిచ్చింది ప్రియాంక. అలా అభిమానులు అడిగిన ప్రశ్నలకు తన ఇన్‌స్టా స్టోరీస్ ద్వారా సమాధానాలిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ షాక్‌కు గురవుతున్నారు. పెళ్లైన ఏడాదిలోపే ప్రియాంక విడాకులు తీసుకోవడంతో కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో వివాహం జరిగిన కొద్ది రోజుల్లోనే ప్రియాంక సీతారామన్ సీరియల్ నుంచి తప్పుకుంది. అప్పట్లోనే దీనికి కారణం తన భర్తే అని కూడా చెప్పుకొచ్చింది. ప్రియాంక ఓ సీరియల్లో నటించేందుకు చెన్నైకి రావడం.. ఆమె భర్త మలేషియాలో ఉండడంతో వారి మధ్య దూరం పెరగడం వల్లే ప్రియాంక నటనకు స్వస్తి చెప్పిందని కూడా కొందరు రాసుకొచ్చారు. కానీ.. ఆ తర్వాత ప్రియాంక నలదమయంతి అనే సీరియల్‌తో మళ్లీ నటించడం ప్రారంభించింది. కొన్ని రోజుల క్రితమే ప్రియాంక తన ఇన్స్టాగ్రామ్ పేజీలో భర్త ఫోటోలన్నింటినీ తొలగించింది. ప్రియాంక భర్త రాహుల్ కూడా ఆమెతో ఉన్న ఫోటోలన్నీ డిలీట్ చేశాడు. అయితే విడిపోవడానికి గల కారణాన్ని మాత్రం ప్రియాంక నల్కారి వెల్లడించలేదు. ఈ టాపిక్ ప్రస్తుతం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఇక ప్రియాంక భర్త రాహుల్ వర్మ విషయానికొస్తే.. నటుడు, బిజినెస్ మేన్ రాణిస్తున్నారు. అతడు తెలుగులో పలు సీరియల్స్‌లో నటించాడు. అదే క్రమంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. కొంతకాలంగా ప్రేమలో మునిగితేలిన ఈ జంట 2018లో సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ఆ తర్వాత గతేడాది మలేషియాలో సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారు. View this post on Instagram A post shared by Priyanka Nalkari Official (@nalkarpriyanka) -
ప్రియాంకకు చెప్పాలనుకున్న బ్యాడ్ న్యూస్ ఇదేనా?
-
త్వరలో పెళ్లి చేసుకోబోతున్న ప్రియాంక, శోభా శెట్టి !
-
లోక్‌సభ ఎన్నికల్లో యూపీ నుంచి రాహుల్, ప్రియాంక పోటీ?
ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో అధిష్టానంతో సమావేశమయ్యారు. అనంతరం యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో యూపీ నుంచి పోటీ చేయడం గురించి ఆయన మాట్లాడుతూ..‘అది వారి ఇల్లు. అక్కడి నుంచే వారు పోటీ చేస్తారు. అలహాబాద్, ప్రయాగ్‌రాజ్, రాయ్ బరేలీ, అమేథీలలోని వారి పూర్వీకులతో వారికి మంచి సంబంధాలు ఉన్నాయి. 40 ఏళ్లుగా అక్కడి ప్రజలతో వారికి దృఢమైన అనుబంధం ఉంది. ఈ బంధం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది’ అని అన్నారు. పార్టీ అధిష్టానం ఉత్తరప్రదేశ్‌పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని, ఖర్గే , రాహుల్, ప్రియాంక తదితర జాతీయ నాయకులు యూపీ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని తాము కోరామన్నారు. యూపీలో పొత్తుల గురించి అజయ్ రాయ్ మాట్లాడుతూ దీనిపై నిర్ణయాన్ని పూర్తిగా జాతీయ నాయకత్వానికే వదిలేశామని అన్నారు. తాము ఏకగ్రీవ తీర్మానం చేసి, ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కాగా ఢిల్లీలో అధిష్టానంతో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఎంపీ రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: నేడు అయోధ్యకు శ్రీరామ పాదుకలు कांग्रेस मुख्यालय, दिल्ली में राष्ट्रीय अध्यक्ष श्री @kharge जी, जननायक श्री @RahulGandhi जी, कांग्रेस महासचिव/प्रभारी, UP श्रीमती @priyankagandhi जी व राष्ट्रीय महासचिव संगठन @kcvenugopalmp जी ने प्रदेश अध्यक्ष श्री @kashikirai जी, CLP लीडर श्रीमती @aradhanam7000 जी व प्रदेश के… pic.twitter.com/Yp4vbrcIxZ — UP Congress (@INCUttarPradesh) December 18, 2023 -
రాహుల్, ప్రియాంక పర్యటించిన చోట్ల
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేతల ఎన్నికల ప్రచారం ఆ పార్టీ అభ్యర్థులకు మిశ్రమ ఫలితాన్నిచ్చింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించిన స్థానాల్లో కొన్ని చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలవగా, మరికొన్ని చోట్ల పరాజయం పాలయ్యారు. ఈ ఏడాది అక్టోబర్18న తన సోదరి ప్రియాంకతో కలిసి వరంగల్ జిల్లాకు వచ్చిన రాహుల్ ప్రచారం నిర్వహించిన ములుగు, వరంగల్ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. రాహుల్ వెళ్లిన భూపాలపల్లి, వరంగల్ ఈస్ట్, కొల్లాపూర్, కల్వకుర్తి, జడ్చర్ల, షాద్‌నగర్, బోధన్, వేములవాడ స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక, ఆయనతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెళ్లినప్పటికీ సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఓటమి పాలు కావడం గమనార్హం. ప్రియాంక వెళ్లిన కొడంగల్, ఖానాపూర్, పాలేరు, ఖమ్మం, మధిర స్థానాల్లో గెలవగా, జహీరాబాద్, మల్కాజ్గిరి స్థానాల్లో పార్టీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. రాహుల్ వెళ్లిన కామారెడ్డి, ఆదిలాబాద్‌లోనూ పార్టీ అభ్యర్థి ఓడిపోగా, ఆంధోల్‌లో విజయం సాధించారు. జీహెచ్ఎంసీ పరిధిలో రాహుల్ ప్రచారం చేసిన జూబ్లీహిల్స్, నాంపల్లి, మల్కాజ్గిరి స్థానాల్లో అభ్యర్థులు ఓడిపోయారు. ఖర్గే హాజరైన నల్లగొండలో కోమటిరెడ్డి భారీ మెజార్టీతో గెలవగా, ఆలంపూర్లో సంపత్‌కుమార్ పెద్ద తేడాతో ఓటమి పాలయ్యారు. గతంలో సోనియాగాంధీ సభ నిర్వహించిన తుక్కుగూడలో పార్టీ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి (ఇబ్రహీంపట్నం) భారీ మెజార్టీతో విజయం సాధించడం గమనార్హం -
సీన్ మారింది
పెళ్లయిన కథానాయికలు సినిమాల్లో కొనసాగాలంటే ‘కీ’ రోల్స్‌తో సరిపెట్టుకోవాల్సిందే అనే సీన్ మారిపోయింది. పెళ్లయినా, తల్లయినా ‘లీడ్’ రోల్స్ చేయొచ్చనే సీన్ వచ్చింది. మరీ ముఖ్యంగా ఫార్టీకి దగ్గర్లో, ఫార్టీ ప్లస్ తారలు లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తూ లీడ్ లేడీస్‌గా, రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల్లో హీరోల సరసన నటిస్తూ దూసుకెళుతున్నారు. హాలీవుడ్లో ఫార్టీ, ఫిఫ్టీ ప్లస్ తారలు కూడా లీడ్ రోల్స్ చేస్తున్నట్లు ఇండియన్ హీరోయిన్లు చేయడం ఓ శుభ పరిణామం. ఇక ఆ కథానాయికలు చేస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. ►లేడీ సూపర్ స్టార్ అనిపించుకున్న నయనతార చేతిలో ఎప్పుడూ మూడు నాలుగు సినిమాలు ఉంటాయి. వాటిలో లేడీ ఓరి యంటెడ్ మూవీస్ మినిమమ్ మూడు అయినా ఉంటాయి. ప్రస్తుతం ఆమె కథానాయికప్రాధాన్యంగా చేస్తున్న చిత్రాల్లో ‘అన్నపూరణి’ (అన్నపూర్ణ), ‘టెస్ట్’ ఉన్నాయి. ‘అన్నపూరణి’ నయనకి 75వ చిత్రం. డిసెంబరు 1న విడుదల కానున్న ఈ చిత్రంలో బ్రాహ్మణ యువతిగా నటించారు నయన. ఈ చిత్రం టీజర్లో మాంసాహారానికి సంబంధించిన బుక్ చదువుతూ కనిపించారామె. ఇక మరో చిత్రం ‘టెస్ట్’. ఇందులో మాధవన్, సిద్ధార్థ్, నయనతార లీడ్ రోల్స్‌లో కనిపిస్తారు. మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ముగ్గురి జీవితాలు క్రికెట్‌తో ఎలా ముడిపడ్డాయనేది ఈ చిత్రం కథాంశం. ► హీరో సూర్యను పెళ్లి (2006) చేసుకుని సుమారు పదేళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన జ్యోతిక 2015 నుంచి ఇప్పటివరకూ దాదాపు డజను కథానాయికప్రాధాన్యంగా సాగే చిత్రాల్లో నటించారు. ఆ తరహా చిత్రాలు మరిన్ని చేయడానికి కథలు వింటున్న జ్యోతిక ఇరవయ్యేళ్ల తర్వాత ఇటీవల హిందీలో ‘శ్రీ’, ‘బ్లాక్ మ్యాజిక్’ చిత్రాల్లో లీడ్ రోల్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే మలయాళంలో ‘కాదల్–ది కోర్’ అనే చిత్రంలో ముమ్ముట్టితో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. పదేళ్ల తర్వాత జ్యోతిక మలయాళంలో చేస్తున్న చిత్రమిది. ఇరవయ్యేళ్ల తర్వాత హిందీలో, పదేళ్ల తర్వాత మలయాళంలో సినిమాలు ఒప్పుకున్నారంటే నటిగా తన కెరీర్‌ని ఇంకా విస్తరించేలా జ్యోతిక ప్లాన్ చేసుకుంటున్నారని ఊహించవచ్చు. ►హీరో ఉపేంద్ర భార్య, నటి ప్రియాంక ఓ ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సింగిల్ లెన్స్‌తో తీసిన తొలి చిత్రం ‘క్యాప్చర్’లో ఆమె లీడ్ రోల్ చేశారు. ఒక నటి లీడ్ రోల్ చేసిన ఈ చిత్రానికి లీడ్ రోల్స్ చేస్తూ దూసుకెళుతున్న మరో నటి రాధికా కుమారస్వామి సమర్పకురాలిగా వ్యవహరించడం విశేషం. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. ఇలా ఏజ్‌తో సంబంధం లేకుండా తగ్గేదే లే అంటూ లీడ్ రోల్స్ చేస్తున్న తారలు ఇంకొందరు ఉన్నారు. ►కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి భార్య, నటి రాధికా కుమారస్వామి ఒకేసారి రెండు ఫీమేల్ ఓరియంటెడ్ చిత్రాలు ‘అజాగ్రత్త’, ‘భైరా దేవి’లో నటిస్తున్నారు. ‘భైరా దేవి’ సినిమాలో ఆమె అఘోరాగా కనిపించనున్నారు. ఇక ‘అజాగ్రత్త’ ఏడు భాషల్లో విడుదల కానుంది. మామూలుగా స్టార్ హీరోల చిత్రాలు పాన్ ఇండియాగా పలు భాషల్లో విడుదలవు తుంటాయి. కథానాయికప్రాధాన్యంగా సాగే ఓ సినిమా ఏడు భాషల్లో పాన్ ఇండియాగా రిలీజ్ కావడం అంటే చిన్న విషయం కాదు. ►నలభయ్యేళ్ల వయసులో ఉన్న తారల్లో త్రిష ఒకరు. ఈ బ్యూటీ ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాల్లో కన్నా రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల్లో హీరోల సరసన నటిస్తూ బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం అజిత్ సరసన తమిళంలో ‘విడా ముయర్చి’, మోహన్‌లాల్‌తో మలయాళంలో ‘రామ్’ చిత్రాల్లో నటిస్తున్నారు త్రిష. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లో ‘పొన్నియిన్ సెల్వన్ 2’లో యువరాణిగా కనిపించిన త్రిష గత నెల విజయ్ సరసన ‘లియో’తో పాటు ‘ది రోడ్’ అనే ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలో కనిపించారు. -
ప్రియాంక ఉపేంద్ర ప్రయోగాత్మక చిత్రం 'క్యాప్చర్' విడుదలకు సిద్దం
కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర భార్య ప్రియాంక ప్రయోగాత్మక చిత్రం క్యాప్చర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటి వరకు తెరపైకి రానటువంటి ప్రయోగాత్మక చిత్రమిదని యూనిట్ తెలిపింది. సినిమా మొత్తం కూడా సీసీటీవీ ఫుటేజ్ నుంచి షూట్ చేసినట్టుగా అనిపిస్తుంది. సింగిల్ లెన్స్‌తో తీసిన మొట్ట మొదటి సినిమా కూడా ఇదే. దర్శకుడు లోహిత్.హెచ్ ఎప్పుడూ కూడా కొత్త పాయింట్‌తోనే సినిమాలు తీస్తుంటారు. ప్రియాంక ఉపేంద్ర, లోహిత్ కాంబోలో ఇది వరకు మమ్మీ, దేవకి వంటి చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు మూడోసారి మరో ప్రయోగాత్మక చిత్రమైన ‘క్యాప్చర్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రాన్ని షమికా ఎంటర్ప్రైజెస్, శ్రీ దుర్గా పరమేశ్వరి ప్రొడక్షన్స్ బ్యానర్స్ మీద రవి రాజ్ నిర్మిస్తున్నారు. రాధికా కుమారస్వామి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ అంతా కూడా గోవాలోనే జరిగింది. 30 రోజుల పాటు నిరవధికంగా చిత్రీకరించారు. ప్రస్తుతం షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమాను విడుదల చేయాలని మేకర్లు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ప్రియాంక ఉపేంద్ర పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌ను గమనిస్తే ప్రియాంక మొహం మీద తీవ్ర గాయాలు కనిపిస్తున్నాయి. ఇక ఆమె చుట్టూ సీసీటీవీ కెమెరాలు కనిపిస్తున్నాయి. వాటి మధ్యలో ఓ కాకి కనిపిస్తోంది. వ్యక్తుల చేతులు కూడా కనిపిస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఏదో ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో సినిమాను మలిచినట్టుగా ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిపోయింది. శివ రాజ్ కుమార్ తగరు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న మన్విత కామత్ ఈ చిత్రంలో ఓ కీ రోల్ పోషిస్తున్నారు. మాస్టర్ కనిష్‌రాజ్ ఈ చిత్రంతో బాలనటుడిగా పరిచయం కాబోతున్నారు. పాండికుమార్ ఈ చిత్రానికి కెమెరామెన్‌గా, రవిచంద్రన్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. -
16 నుంచి కాంగ్రెస్ ప్రచార హోరు
సాక్షి, హైదరాబాద్: నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియగానే రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్, ప్రియాంకా గాందీలతోపాటు కీలక నేతలను రంగంలోకి దింపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వారు వారం రోజుల పాటు ఇక్కడే మకాం వేసి, జిల్లాల్లో విస్తృతంగా పర్యటించేలా షెడ్యూల్ రూపొందిస్తోంది. ఈ నెల 15న నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార గడువు ముగియనున్న నేపథ్యంలో 16వ తేదీ నుంచి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలనూ ప్రచార బరిలోకి దింపాలని భావిస్తోంది. అయితే భారీ సభలు కాకుండా రోడ్‌షోలు, కార్నర్ మీటింగ్‌ల ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. అన్ని ఉమ్మడి జిల్లాల్లో పర్యటించేలా.. ఈ నెల 16 తర్వాత రాహుల్, ప్రియాంకా గాందీలతో రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించేలా షెడ్యూల్ తయారవుతోంది. పెద్ద సభలను ఏర్పాటుచేసి ప్రజలను అక్కడికి తీసుకురావడం కంటే ప్రజల వద్దకే వెళ్లేలా కార్యక్రమాలు నిర్వహించేందుకు టీపీసీసీ సిద్ధమైంది. అన్ని కొత్త జిల్లాల్లో ఇద్దరు అగ్రనేతలతో రోడ్‌షోలు చేయించాలని, అక్కడే కార్నర్ మీటింగ్‌ల ద్వారా కాంగ్రెస్ ఎన్నికల గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు సిద్ధరామయ్య, అశోక్‌గెహ్లోత్, సుఖ్విందర్సింగ్ సుక్కు, భూపేశ్ బఘేల్‌లను కూడా ఎన్నికల ప్రచారానికి తీసుకురానుంది. హిమాచల్‌ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అమలు చేసిన పథకాల గురించి వారు వివరించనున్నట్టు టీపీసీసీ వర్గాలు చెప్తున్నాయి. ఇక కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదంటూ బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టేలా సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వంటి నేతలను ప్రచార భాగస్వాములను చేయనుంది. ఈ ప్రచారమంతాపూర్తయ్యాక చివరిగా ఏఐసీసీ అగ్రనేత, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీతో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోగానీ, ఉత్తర తెలంగాణలోని కీలక ప్రాంతంలోగానీ భారీ బహిరంగ సభ నిర్వహించి, పోలింగ్ మూడ్‌లోకి వెళ్లిపోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. నేడు కామారెడ్డిలో బీసీ గర్జన సభ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం కామారెడ్డిలో బీసీ గర్జన సభ నిర్వహించనుంది. నామినేషన్ల దాఖలుకు చివరిరోజు కావడంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి గా నామినేషన్ వేయనున్నారు. ఆ కార్యక్రమం ముగిశాక బీసీ గర్జన సభ నిర్వహించనున్నారు. దీనిలో బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించనున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ సభలో పాల్గొంటున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ఆయన స్పష్టమైన ప్రకటన చేస్తారని.. బీఆర్ఎస్ ఆరోపణలకు తగిన విధంగా బదులిస్తారని టీపీసీసీ వర్గాలు చెప్తున్నాయి. -
సరిహద్దుల్లో పటిష్ట నిఘా! కలెక్టర్‌తో వ్యయ పరిశీలకుల భేటీ..
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లా సరిహద్దులో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పటిష్ట పర్యవేక్షణ చేస్తున్నామని, వాహనాలను నిశిత పరిశీలన చేస్తూ నగదు, మద్యం, ఇతర వస్తువుల రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల వివరించారు. కలెక్టర్‌తో శనివారం ఎన్నికల వ్యయ పరిశీలకులు సంజీబ్‌కుమార్ పాల్, అజయ్‌లాల్ చంద్‌లు కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. జిల్లాలోని పినపాక, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాలకు అజయ్‌లాల్ చంద్, కొత్తగూడెం, ఇల్లెందు, అశ్వారావుపేట నియోజకవర్గాలకు సంజీబ్‌కుమార్ పాల్ వ్యయ పరిశీలకులుగా ఎన్నికల సంఘం నియమించింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్ని కల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కమిటీలను నియమించినట్లు తెలిపారు. సెన్సిటివ్ నియోజకవర్గాలైన ఇల్లెందు, కొత్తగూడెంలలో అదనపు సహా వ్యయ పరిశీలకులను, వీడియో వ్యూయింగ్ టీంలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఫిర్యాదులకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. జిల్లా సరిహద్దుగా ఉన్న ఇతర రాష్ట్రాల నుంచి మద్యం, ఇతర వస్తువులు రాకుండా చర్యలు తీసుకున్నామని, చెక్‌పోస్టులు, సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ జరుగుతోందని అన్నారు. ఎన్నికల వ్యయ పరిశీలకులు మాట్లాడుతూ సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఖర్చులు పక్కాగా నమోదు చేయాలి.. అభ్యర్థుల ఖర్చులు కచ్చితంగా నమోదు చేయాలని ఎన్నికల వ్యయపరిశీలకులు సంజీబ్‌కుమార్ పాల్ అన్నారు. శనివారం కలెక్టరేట్లో కొత్తగూడెం, అశ్వారావుపేట, ఇల్లెందు నియోజకవర్గాల వ్యయ, ఎంసీఎంసీ, ఆబ్కారీ, ఆదాయపన్ను శాఖ, ఎన్నికల ప్రవర్తనా నియమావళి నోడల్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ప్రక్రియలో పాటించాల్ని విషయాలను సోదాహరణంగా వివరించారు. పెయిడ్ న్యూస్‌ను గుర్తించాలి! నిరంతర పర్యవేక్షణతో పెయిడ్ న్యూస్‌ను గుర్తించాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు సంజీబ్‌కుమార్ పాల్ సూచించారు. శనివారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఎంసీఎంసీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజూ వివిధ దినపత్రికలు, శాటిలైట్ చానల్స్, కేబుల్, సిటీ కేబుల్, సామాజిక మాధ్యమాల్లో అభ్యర్థుల ప్రచారాలను పరిశీలించాలని చెప్పారు. గుర్తించిన పెయిడ్ న్యూస్, ప్రకటనలపై ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల ద్వారా అభ్యర్థులకు నోటీసులు జారీ చేయాలన్నారు. జిల్లాలో చెక్‌పోస్టుల వద్ద కొనసాగుతున్న పర్యవేక్షణను, సీసీ కెమెరాల రికార్డింగ్ పనితీరును పరిశీలించారు. సీ విజిల్ వచ్చిన ఫిర్యాదులు వాటి పరిష్కారాలు, ఎస్ఎస్టీ, ఎఫ్‌ఎస్‌టీి టీముల పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాల్లో పినపాక రిటర్నింగ్ అధికారి ప్రతీక్‌జైన్, వ్యయ నియంత్రణ నోడల్ అధికారులు వెంకటేశ్వరరెడ్డి, వెంకటేశ్వర్లు, లైజన్ అధికారులు సంజీవరావు, సీతారాంనాయక్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు దారా ప్రసాద్, ఎంసీఎంసీ నోడల్ అధికారి, డీపీఆర్వో ఎస్.శ్రీనివాసరావు, మైనార్టీ సంక్షేమ అధికారి సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. ఇల్లెందులో.. ఎన్నికల వ్యయ పరిశీలకులు సంజీవ్‌కుమార్ పాల్, అజయ్ లాల్‌చంద్ సోనేజీ శనివారం ఇల్లెందులో పర్యటించారు. తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్యాలయంల అకౌంటింగ్ బృందాన్ని కలుసుకున్నారు. ఇవి చదవండి: జంప్ జిలానీలు..! ఉన్న నేతలు ఎప్పుడో ఏ పార్టీలో చేరుతారో? -
అరరే... ఎంత పనైపాయే!
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన పోలీస్ కానిస్టేబుల్ ప్రియాంక మిశ్రా ఊరకనే ఉండి ఉంటే వైరల్ అయ్యేది కాదు. సదరు కానిస్టేబుల్ ఇన్స్టాగ్రామ్ రీల్ చేసి వైరల్ అయింది. ఈ రీల్లో ప్రియాంక మిశ్ర ‘కర్తవ్యం’ సినిమాలో విజయశాంతిని గుర్తు తెచ్చేలా ఓ లెవెల్లో నటించింది. సహజత్వం కోసం సర్వీస్ గన్ను ఉపయోగించి మరీ నటించింది. ఈ వీడియో వైరల్ కావడం మాట ఎలా ఉన్నా పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం ‘చాల్లేండి సంబడం’ అంటూ ఆమెను సస్పెండ్ చేసింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా మళ్లీ పోలీస్ డిపార్ట్మెంట్లో పని చేయడానికి ప్రియాంక దరఖాస్తు చేసుకుంది. ఆమె దరఖాస్తు ఆమోదం పొందింది. ఆగ్రాలో పోస్టింగ్ కూడా ఇచ్చారు. అయితే 48 గంటల్లోనే ఆమె నియామకాన్ని పోలీస్ కమిషనర్ ప్రీతిందర్సింగ్ రద్దు చేశారు. ప్రియాంక మిశ్రాపై సోషల్ మీడియాలో సానుభూతి చూపుతున్నవారితో పాటు, సానుభూతి చూపుతూనే ‘స్వయంకృతాపరాధం’ అని విమర్శించిన వాళ్లు కూడా ఉన్నారు. -
డిటెక్టివ్ తీక్షణ
‘రణరణమున రథము నిలిపి, రుధిర నదిని ఎదురు మలిపి..’’ అంటూ సాగుతుంది ‘డిటెక్టివ్ తీక్షణ’ చిత్రంలోని ‘రేజ్ ఆఫ్ తీక్షణ’ పాట. చిత్ర సంగీత దర్శకుడు పెద్దపల్లి రోహిత్ రాసిన ఈ పాటను హైమత్ మొహమ్మద్, సాయి చరణ్ భాస్కరుని, అరుణ్ కౌండిన్య పాడారు. ప్రియాంకా ఉపేంద్ర టైటిల్ రోల్లో ఈ చిత్రానికి త్రివిక్రమ్ రఘు దర్శకత్వం వహించారు. గుత్తా ముని ప్రసన్న, ముని వెంకట చరణ్, పురుషోత్తం .బి కోయురు నిర్మించిన ఈ చిత్రం కన్నడ, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, బెంగాలీ, ఒరియా భాషల్లో రిలీజ్ కానుంది. -
తన స్నేహితురాలు.. రూంకు వచ్చి చూసేసరికి..
సాక్షి, కరీంనగర్: నగరంలోని పాతబజారులో నివా సం ఉండే ఓ యువతి అదృశ్యమైంది. వన్‌టౌన్ పోలీసుల వివరాల ప్రకారం.. మానకొండూర్ మండలం కొండపల్కలకు చెందిన టి.ప్రియాంక(22) ఇంటర్ పూర్తిచేసింది. పాతబజారు ప్రాంతంలో స్నేహితులతో అద్దెకుంటూ స్థానికంగా ఓ షాపింగ్‌మాల్‌లో పనిచేస్తోంది. శుక్రవారం ఉదయం పని నిమిత్తం గదినుంచి బయటకు వెళ్లింది. రాత్రి తన స్నేహితురాలు రూంకు వచ్చిచూసేసరికి తాళం వేసి ఉండడంతో వారి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. పలుచోట్ల వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో శనివారం వన్‌టౌన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంకెప్పటికి మారతాం?!
ఆ కేంద్రపాలిత ప్రాంతం మొత్తంలో ఏకైక మహిళా ఎమ్మెల్యే ఆమె. అక్కడి ప్రభుత్వంలో ఉన్న ఒకే ఒక్క మహిళా మంత్రి కూడా ఆమే! తీరా, అలాంటి వ్యక్తి కూడా తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందంటే ఏమనాలి? మామూలు పరిస్థితుల్లో రాజీనామా చేయడం కాదు... లింగ, కుల దుర్విచక్షణల్ని తట్టుకోలేక రాజీనామా చేశానంటున్నారు. ఆ ఆరోపణలు దిగ్భ్రమ కలిగిస్తున్నాయి. పుదుచ్చేరిలోని ఏకైక దళిత, మహిళా ఎమ్మెల్యే సి. చంద్ర ప్రియాంక ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తిగా మారారు. అయితే, ఆమె అసమర్థత రీత్యానే పదవి నుంచి తప్పించామని అధికార కూటమి అంటోంది. ఏమైనా, ఈ మహిళా మంత్రి రాజీనామా ఉదంతం స్త్రీలు, వెనుకబడిన కులాల పట్ల మన వ్యవస్థలోని చిన్నచూపును మరోసారి చర్చకు పెడుతోంది. దాదాపు 40 ఏళ్ళ విరామం తర్వాత పుదుచ్చేరిలో మంత్రి పదవి దక్కిన మహిళ చంద్రిక అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ముప్ఫై మంది సభ్యుల పుదుచ్చేరి అసెంబ్లీలో కారైక్కాల్ ప్రాంతంలో రిజర్వుడు స్థానమైన నెడుంగాడు నుంచి ఎన్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి సారథ్యంలోని ఎన్డీఎ ప్రభుత్వంలో 2021లో ఆమెకు మంత్రి పదవి దక్కింది. ‘మంచి ఆలోచనలతో, కష్టపడి పనిచేయాలని రాజకీయాల్లోకి వచ్చాన’న్న చంద్రిక పురుషాధిక్య రాజకీయ ప్రపంచంలో వివక్షకు గురయ్యానని ఆరోపించారు. ప్రజాదరణ ఉన్నా కుట్రల్ని తట్టుకొని, ధనశక్తి అనే భూతంపై పోరాడడం తేలిక కాదని గ్రహించినట్టు ఆమె తన రాజీనామా లేఖలో ఆవేదన చెందారు. ప్రతిపక్ష కాంగ్రెస్, డీఎంకె, వామపక్షాలు ప్రభుత్వాన్నీ, సీఎం ‘దళిత వ్యతిరేక వైఖరి’నీ తప్పు బట్టాయి. అయితే, కీలకమైన మంత్రి పదవిని చంద్రిక సమర్థంగా నిర్వహించట్లేదనీ, ఆరునెలలుగా చెబుతున్నా పట్టించుకోవట్లేదనీ, అందుకే ఆమెను పదవి నుంచి తప్పించామనీ, కేంద్రానికి లేఖ పంపగానే అది తెలిసి ఆమె ముందే రాజీనామా చేశారనీ అధికార పక్షం చెబుతోంది. చిత్రమేమిటంటే, అధికారపక్షం చెబుతున్న ఈ కథనాన్నే పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నరైన మరో మహిళ తమిళిసై సౌందరరాజన్ పేర్కొనడం! దుర్విచక్షణ ఉన్నట్టు తెలీదనీ, తనకు చెబితే పరిస్థితిని చక్కదిద్దేదాన్ననీ గవర్నర్ అన్నట్టు తమిళ పత్రికల కథనం. అయితే, మన దేశంలో అలాంటివి లేవనుకోవడం వట్టి భ్రమ. ఆ మాటకొస్తే, ఎవరూ బయటపడకపోయినా చంద్రిక కథ లాంటిదే... ఈ దేశంలోని పలు వురు మహిళా నేతల వ్యధ! పురుషాధిక్య ప్రపంచంలో, అందులోనూ రాజకీయాల్లో ఎన్నో సహించి, భరిస్తే కానీ స్త్రీలు తమకంటూ చిన్నచోటు దక్కించుకొని, గొంతు విప్పలేరన్నది నిష్ఠురసత్యం. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ, చట్టం చేయడానికి సైతం దశాబ్దాలు పట్టిన రాజకీయ వ్యవస్థ మనది. అది అమలయ్యేదెన్నడో నిర్దిష్టంగా చెప్పలేని పరిస్థితి. ఈ పరి స్థితుల్లో చంద్రిక లాంటి వారి ఉదంతాలు ఒక మేలుకొలుపు. ఆమె ఆరోపణలు సంపూర్ణ అసత్యాలని కొట్టిపారేయలేం. స్వతంత్ర భారత శతవసంతాల నాటికి మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చేయాలనేది పాలకులు ప్రవచిస్తున్న లక్ష్యం. 2047 కల్లా అది సాధ్యం కావాలంటే, జనాభాలో దాదాపు సగం ఉన్న మహిళల పాత్ర, వారి ప్రాతినిధ్యం కీలకం. కానీ, అధిక శాతం పార్టీలు, ప్రభుత్వాల చేతలు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. గమనిస్తే, 1970ల వరకు లోక్‌సభలో మహిళా ప్రాతినిధ్యం 5 శాతం వద్దే తచ్చాడుతూ వచ్చింది. 2009లో గానీ అది రెండంకెలకు చేరు కోలేదు. రాజ్యసభలో అయితే 1951 నుంచి ఇప్పటి దాకా ఏనాడూ మహిళల సంఖ్య 13 శాతమైనా దాటలేదు. రాష్ట్ర శాసనసభల్లోనైతే సగటు మహిళా ప్రాతినిధ్యం 10 శాతం కన్నా తక్కువే. మహిళా మంత్రుల సంఖ్యలోనూ మన దేశంలో ఇదే పరిస్థితి. గత మూడు దశాబ్దాల పైచిలుకులో కేంద్రంలో మంత్రిపదవులను చేపట్టిన స్త్రీలు నాటి మహిళా ప్రాతినిధ్యంతో పోలిస్తే 11 శాతమే. క్యాబినెట్ హోదా దక్కినవారైతే 7 శాతమే. రాజకీయ పాలనలో కాదు, ప్రభుత్వ అధికార యంత్రాంగంలోనూ ఆడవారి వాటా మరీ తీసికట్టు. మొత్తం 30 లక్షల పైచిలుకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో 11 శాతమే స్త్రీలు. కార్యనిర్వాహక, శాసన నిర్మాణ వ్యవస్థలతో పోలిస్తే, భారత న్యాయ వ్యవస్థలో లింగ సమానత మరీ కనాకష్టం. 1950 నుంచి చూస్తే, సుప్రీమ్ కోర్ట్ జడ్జీల్లో కూడా ఆడ వాళ్ళు 3 శాతమే. ప్రతిచోటా ఉన్నత స్థాయికి చేరడానికి అతివలకు అనేక అవరోధాలు. ఈ గణాంకాలన్నీ ఇప్పటికీ మహిళల పట్ల మనకున్న దుర్విచక్షణకూ, మారని మన పితృస్వామ్య భావజాలా నికీ నిలువుటద్దాలు. దానికి తోడు దళితులు, వెనుకబడిన వర్గాల స్త్రీల పరిస్థితి మరీ కష్టం. ఈ నేపథ్యం నుంచి పుదుచ్చేరి ఉదంతాన్ని చూసినప్పుడే సమస్య లోతులు స్పష్టమవుతాయి. దాదాపు 156 దేశాల్లో సగటున 23 శాతం మహిళా మంత్రులుంటే, భారత్ తద్భిన్నం. కేంద్రంలో పేరుకు మహిళా మంత్రుల సంఖ్య పెంచినా, వారికి రక్షణ, పరిశ్రమలు, రైల్వేలు, రవాణా, వ్యవసాయం లాంటి కీలక శాఖలు అప్పగించడం అరుదు. ఈ పరిస్థితిని మార్చాలంటే, మహిళా రిజర్వేషన్ చట్టాలు తెస్తే సరిపోదు. కులం, మతం, ప్రాంతం, జెండర్ అంశాల్లో పార్టీల, ప్రజల ఆలోచన మారాలి. వెనుకబడిన వర్గాల, స్త్రీల సమర్థతను శంకించడం క్షమార్హం కాదు. అవకాశమిచ్చి, ప్రోత్సహిస్తే, పలువురు నేతల కన్నా వారే సమర్థులు. పాలిచ్చి పెంచిన అమ్మలు మనల్ని పాలించ లేరా? కుటుంబానికి ఇరుసుగా మారి, మొత్తం సమాజాన్ని నిలబెడుతున్న స్త్రీలు సమర్థులు కారా? వారికా సమర్థత లేదనుకోవడం మూర్ఖత్వం. మకిలిపట్టిన మనసుల్లోని మనుస్మృతి భావజాలం! -
అమ్మాయిల స్కెచ్.. యవర్ అడ్డంగా బలైపోయాడు!
'బిగ్‌బాస్'లో ఎప్పుడేం జరుగుతుందో అస్సలు ఊహించలేకపోతున్నాం. ఇప్పుడు కూడా అలానే జరిగింది. అంతా బాగానే ఉందనుకునే టైంలో ప్రిన్స్ యవర్‌కి ఇద్దరమ్మాయిలు షాకిచ్చారు. వాళ్లు వేసిన స్కెచ్ దెబ్బకు మనోడు అడ్డంగా బలైపోయాడు. ఏడుపు తప్ప ఇంకేం మిగల్లేదు. ఇంతకీ హౌసులో 19వ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందనేది ఇప్పుడు హైలైట్స్‌లో చూద్దాం. (ఇదీ చదవండి: 'సప్త సాగరాలు దాటి' సినిమా రివ్యూ) ఫిట్టింగ్ పెట్టేశాడు! తొలి రెండు వారాల్లో పవరస్త్రని సందీప్, శివాజీ గెలుచుకున్నారు. మూడో వారం పవరస్త్ర కోసం జరిగిన పోటీలో ఫైనల్‌గా ముగ్గురు మిగిలారు. కదలకుండా నిల్చుకుని ప్రిన్స్ యవర్, అత్యంత కారంగా ఉండే చికెన్ ముక్కలు తిని శోభా, జుత్తుని కత్తిరించుకుని ప్రియాంక.. ఫైనల్-3లో నిలబడ్డారు. ఇక శుక్రవారం ఎపిసోడ్ మొదలవడమే బిగ్‌బాస్ ఫిట్టింగ్ పెట్టేశాడు. పోటీలో ఉన్న ముగ్గురిలో ఏ ఒక్కరు అనర్హులో.. వాళ్లే డిసైడ్ చేసుకోవాలని బిగ్‌బాస్ చెప్పుకొచ్చాడు. యవర్ బలైపోయాడు అయితే సైడ్ అయ్యే వ్యక్తి ఎవరా అని ముగ్గురు చాలాసేపు డిస్కషన్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే శోభా, యవర్ పేరుని.. యవర్, శోభా పేరుని చెప్పారు. అలా చెప్పిన టైంలో ఒకరిపై ఒకరు అరుస్తూ గొడవపడ్డారు. ఇక డిసైడింగ్ ఓటు వేయాల్సిన ప్రియాంక.. శోభా పేరు చెప్పింది. అలానే టేబుల్ పై ఉన్న యవర్ బొమ్మని ఇద్దరూ కలిసి సుత్తితో ఇరగ్గొట్టారు. తనని పక్కకు జరపడాన్ని తట్టుకోలేకపోయిన యవర్.. అదే సుత్తితో తన బొమ్మ ఉన్న బెంచ్‌ని బలంగా కొట్టాడు. దెబ్బకు అది విరిగిపోయింది. (ఇదీ చదవండి: ఎట్టకేలకు ఓటీటీలోకి రాబోతున్న 'ఏజెంట్') కోపానికి కారణాలు చెప్పాడు గతవారం రణధీర టీమ్‌లో ఉండి కష్టపడినప్పుడు కావొచ్చు.. ఇప్పుడు కావొచ్చు యవర్‌కి అవకాశం రాలేదు. దీంతో తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. తొలుత హౌస్ అంతా అరుస్తూ తిరిగాడు. కాసేపటికి ఏడుపు మొదలుపెట్టాడు. శివాజీ దగ్గర కూర్చుని తన బాధలు చెప్పాడు. జాబ్ లేదు, ఒకానొక టైంలో రూ.100 కూడా లేని రోజులు ఉన్నాయని.. అందుకే తనకు కోపం, ఆకలి అని కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పాడు. తనకు సరైన జడ్జిమెంట్ దక్కట్లేదని బాధపడిపోయాడు. ఆమె గెలిచిందా? చివరగా మిగిలిన ప్రియాంక-శోభాశెట్టి మధ్య బుల్ ఫైట్ పోటీ పెట్టాడు. ఇందులో భాగంగా ఎలక్ట్రికల్ బుల్ ఉంటుంది. దానిపై మూడు రౌండ్లు కలిపి ఎవరైతే ఎక్కువసేపు ఉంటారో వాళ్లు విజయం సాధించినట్లు అని బిగ్‌బాస్ చెప్పాడు. ఈ ఆటలో భాగంగా చాలా తెలివిగా వ్యవహరించిన ప్రియాంక.. బుల్‌పై తాడుని పట్టుకుని పడుకున్న పొజిషన్లో ఉండిపోయింది. మూడుసార్లు అలానే చేసింది. శోభాశెట్టి మాత్రం ప్రతిసారి కూర్చున్న పొజిషన్లో బుల్‌పై తక్కువసేపే ఉన్నట్లు అనిపించింది. ఇద్దరు ప్రియాంకనే విజేత అనిపిస్తుంది. కానీ అధికారిక ప్రకటన మాత్రం వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున చేస్తారని బిగ్‌బాస్ చెప్పడంతో శుక్రవారం ఎపిసోడ్ ఎండ్ అయింది. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్'లో 3వ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమెనా?) -
నేడు సోనియా సమక్షంలో కాంగ్రెస్ గూటికి తుమ్మల
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అసంతృప్తనేత, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు శనివారం(నేడు) కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. సీడ బ్ల్యూసీ సమావేశాల విరామ సమయంలో శనివారం ఆ పార్టీ అగ్ర నేతలు సోనియా, రాహుల్‌గాంధీల సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. పార్టీలోకి రావాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఇప్ప టికే తుమ్మలను ఆహ్వానించిన విషయం తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని తుమ్మల నివాసా నికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రేతోపాటు రేవంత్, భట్టి విక్ర మార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెళ్లారు. పార్టీలోకి రావాలని మరోమారు ఆహ్వానించగా సానుకూలంగా స్పందించిన తుమ్మల శనివారం కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని గాంధీభవన్ వర్గాలు తెలిపా యి. కాగా, సీడబ్ల్యూసీ సమావేశాల సందర్భంగా రాష్ట్రంలోని పలువురు మాజీమంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమా చారం. వీరిని ఈ నెల 17న తుక్కుగూడ సభా వేదికగా పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించినప్ప టికీ అనివార్య కారణాల వల్ల దానిని మార్చారని తెలిసింది. శని, ఆదివారాల్లో జరిగే సీడబ్ల్యూసీ సమావేశాల విరామ సమయంలోనే వీరిని సోని యా, రాహుల్, ఖర్గే సమక్షంలో పార్టీలో చేర్చుకోవా లని నిర్ణయించినట్టు సమాచారం. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి తుమ్మల పోటీ చేసే అవకాశముందని సమాచారం. -
పల్లెటూరి వాడివంటూ భార్య వేధింపులు
కర్ణాటక: కుటుంబ కలహాలతో ఓ మెట్రో ఇంజినీర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. గురువారం తుమకూరు జిల్లా తిపటూరు తాలూకా కిబ్బనహళ్లి పరిధిలో చోటు చేసుకుంది. మంజునాథ్ (38) జిల్లాలోని కుందూరుపాళ్య గ్రామానికి చెందిన వాడు. బెంగూళూరు నగరంలో మెట్రోలో ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్న ఇతడు పదేళ్ల క్రితం తురువెకెరెకు చెందిన ప్రియాంకను పెళ్లి చేసుకున్నాడు. ఇదిలా ఉంటే దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. పల్లెటూరి వాడివంటూ మంజునాథ్‌ను ప్రియాంక వేధించేదని సమాచారం. ఆమె వేధింపులు తట్టుకోలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మంజునాథ్ తన సోదరుడికి ఆడియో మెసేజ్ పంపాడు. కిబ్బనహళ్లి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
టాలీవుడ్ సీరియల్ నటి నూతన గృహప్రవేశం.. ఎలా ఉందో చూశారా!
మౌనరాగం ఫేమ్ ప్రియాంక జైన్ గురించి పరిచయం అక్కర్లేదు. మాటలు రాని మూగ అమ్మాయిగా నటించి అద్భుతహ అనిపించింది. ముంబయికి చెందిన ముద్దుగుమ్మ తెలుగులో సీరియల్స్‌తో పాటు సినిమాల్లోనూ నటించింది. జానకి కలగనలేదు సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. చల్తే చల్తే, ఎవడు తక్కువ కాదు, వినరా సోదర వీర కుమార లాంటి చిత్రాల్లో కనిపించింది. అంతే కాకుండా మౌనరాగంతో పాటు ఇంటికి దీపం ఇల్లాలు సీరియల్లో నటించింది. అయితే మౌనరాగం ఫేమ్, సహనటుడు శివకుమార్ మరిహల్తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలైంది. గతంలో వీరిద్దరు చాలా సార్లు హోమ్ టూర్స్ చేస్తూ జంటగా కనిపించారు. వారి మధ్య రిలేషన్ గురించి ఇప్పటికే చాలా వీడియోలు చేశారు. (ఇది చదవండి: ఎమ్మెల్యేగా పోటీ అంటూ ఊహాగానాలు.. రాహుల్ సిప్లిగంజ్ క్లారిటీ) అయితే వీరి పెళ్లి సంగతి పక్కనపెడితే ఆమె నటిస్తోన్న జానకి కలగనలేదు సీరియల్‌ను అర్ధాంతరంగా ఆపేశారు. కొంతకాలంగా ప్రేక్షకులకు తలభారంగా మారడంతో ఎలాగోలా 662 ఎపిసోడ్ వరకు అతి కష్టం మీద లాక్కొచ్చారు. కానీ చివరికీ ఇక నిర్మాతలు కూడా చేతులెత్తేయడంతో సీరియల్‌కు ఎండ్ కార్డ్ వేయక తప్పలేదు. తాజాగా జానకి కలగనలేదు ఫేమ్ ప్రియాంక జైన్ తన యూట్యాబ్ ఛానెల్లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. తాము కొత్త ఇంటిలో చేరబోతున్నట్లు వీడియోలో వెల్లడించింది. నూతన గృహ ప్రవేశానికి సంబంధించిన కార్యక్రమాన్ని ఆ వీడియోలో చూపించింది. గృహ ప్రవేశానికి వచ్చిన వారందరికీ ప్రియాంక జైన్, శివ కుమార్ కానుకలు కూడా అందజేశారు. ఈ సందర్భంగా తమ సొంతింటి కల సాకారమైందని ప్రియాంక ఆనందం వ్యక్తం చేశారు. కాగా.. ఇక ప్రియాంక జైన్, శివ కుమార్.. ‘మౌనరాగం’ సీరియల్ అప్పటి నుంచి రిలేషన్లో ఉన్నారు. (ఇది చదవండి: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇల్లు చూశారా? ఎంత బాగుందో!) -
రాష్ట్ర సచివాలయంలో ఉచిత వైద్య శిబిరం
సాక్షి, అమరావతి: రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణకు గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మణిపాల్ ఆస్పత్రి వైద్యులు ఉద్యోగులకు వైద్య పరీక్షలు చేశారు. కార్డియాలజీ, ఆర్థోపెడిక్స్, జనరల్ ఫిజిషియన్ స్పెషలిస్ట్, క్యాన్సర్ వైద్య పరీక్షలతో పాటు, ఈసీజీ, 2డీ ఎకో ఇతర వైద్య పరీక్షలు చేశారు. మొత్తం 750 మంది వైద్య సేవలు పొందారు. శిబిరంలో డాక్టర్ వేణు గోపాల్‌రెడ్డి, డాక్టర్ ప్రియాంక, డాక్టర్ శివ, ఏపీ సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
శరీరమంతా స్క్రూలు, రాడ్లు.. బతకడం కష్టమేనన్నారు: నటి
సాధారణంగా సెలబ్రిటీలు అంటే అందరూ వాళ్ల పూలపాన్పులాంటిదేనని భావిస్తుంటారు. కానీ అలాంటి వారి జీవితాల్లోనూ తెరవెనుక కన్నీళ్ల కథలు కూడా ఉంటాయి. అలా తెరపై అందరినీ నవ్వించే ప్రియాంక కామత్ నిజ జీవితంలోనూ నరకం అనుభవించింది. తన హాస్యంతో రియాల్టీ షోలలో నవ్వులు పూయిస్తూ.. తన జీవితంలో తెరవెనుక కన్నీటి బాధను అనుభవించింది. (ఇది చదవండి: ఆగస్ట్‌లో ‘మెగా’ సందడి.. వారానికో సినిమా, బరిలో చిన్న చిత్రాలు కూడా!) మజ్జా భరత, గిచ్చి గిలి గిలీ ఫేమ్ ప్రియాంక కామత్ శాండల్‌వుడ్‌లో పరిచయం అక్కర్లేని పేరు. ఆమె కలర్స్ కన్నడలోని గిచ్చి గిలి గిలి షోలో తన పంచ్ కామెడీతో ప్రేక్షకులను అలరించింది. సోషల్ మీడియాలోనూ రీల్స్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. అంత సవ్యంగా సాగిపోతున్న నటి జీవితంలో అనారోగ్యంతో బారిన పడి చావు అంచులదాకా వెళ్లి వచ్చింది. గతేడాది డిసెంబర్లో ప్రియుడు అమిత్ పెళ్లి చేసుకున్న ప్రియాంకకు వెన్నెముక సంబంధించిన అనారోగ్యం సమస్యలు తలెత్తాయి. దాదాపు నడవలేని స్థితికి చేరుకుంది ఆమె. దాదాపు ఎనిమిది నెలలపాటు బెడ్‌కే పరిమితమైన ప్రియాంక ఆ తర్వాత అనారోగ్యం నుంచి కోలుకుంది. ఈ ఆపద సమయంలో తన భర్త అండగా నిలిచి తనకు పునర్జన్మనిచ్చాడని ఎమోషనలైంది ప్రియాంక. ఆమె మాట్లాడుతూ.." గతేడాది అమిత్‌తో నిశ్చితార్థం జరిగింది. కొన్ని నెలలకే నాకు వెన్నెముక సమస్యలు వచ్చాయి. వెన్నెముక శస్త్రచికిత్స తర్వాత.. మరో రెండు శస్త్రచికిత్సలు కూడా జరిగాయి. నా శరీరానికి 70 శాతం ఇన్ఫెక్షన్ వచ్చింది. నేను బతికే అవకాశాలు 50 శాతం మాత్రమేనని డాక్టర్స్ చెప్పారు. ఎందుకంటే నా శరీరంలో స్క్రూలు, రాడ్లు అమర్చారు. దాదాపు 8 నెలలు మంచానికే పరిమితమయ్యా. దీంతో అమిత్‌కు నన్ను విడిచిపెట్టి మరొకరిని పెళ్లి చేసుకోమని చెప్పా. కానీ అతను కష్టకాలంలో నాకు అండగా నిలిచాడు. అంతే కాదు తను నా డ్రెస్సింగ్, డైపర్ ప్యాడ్లు మార్చడంలో నాకు సహాయం చేసేవాడు.' అంటూ చెప్పుకొచ్చింది. కాగా.. ఈ జంట డిసెంబర్ 2022 లో వివాహం చేసుకున్నారు. ఇప్పుడు ఈ జంట ఆనందంగా ఉన్నారు. (ఇది చదవండి: భర్తకి ప్రముఖ నటి విడాకులు.. ప్రాణం పోయిన ఫీలింగ్!) View this post on Instagram A post shared by People of India (@officialpeopleofindia) View this post on Instagram A post shared by Priyanka Kamath (@kamath.priyanka) -
నేటి నుంచి తల్లిపాల వారోత్సవాలు..
భద్రాద్రి: ఆగస్టు 1 నుంచి 7 వరకు నిర్వహించే తల్లిపాల వారోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల పిలుపునిచ్చారు. ఐడీఓసీలో సోమవారం నిర్వహించిన సమావేశంలో వారోత్సవాల వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తల్లిపాల ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు కె.వెంకటేశ్వర్లు, మధుసూదన్‌రాజు, డీఎంహెచ్ఓ డాక్టర్ శిరీష, ఆస్పత్రుల సమన్వయ అధికారి రవిబాబు, మహిళా, శిశు సంక్షేమాధికారి సబిత, ఉపాధి కల్పన అధికారి విజేత పాల్గొన్నారు. వరద నష్టాల నివేదిక అందించాలి జిల్లాలో వరద నష్టాల నివేదికలను అందజేయాలని కలెక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. ఐడీఓసీలో పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరద సహాయక చర్యల్లో అధికారుల పనితీరును అభినందించారు. వర్షాలు, వరదలతో దెబ్బతిన్న పంటలు, పశువులు, ఇళ్లు, పిడుగుపాటు తదితర అంశాలపై సమగ్ర నివేదికలు రూపొందించాలని సూచించారు. ఆర్అండ్బీ శాఖ పరిధిలో నాలుగు వంతెనలు దెబ్బతిన్నాయని, పంచాయతీరాజ్ పరిధిలో 97 రహదారులు మరమ్మతులకు గురి కాగా 60 పనులు పూర్తి చేశామని తెలిపారు. 11 చోట్ల దెబ్బతిన్న పైపులైన్లకు మరమ్మతులు చేపట్టాలన్నారు. ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి, సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు. వచ్చిన దరఖాస్తులలో కొన్ని.. ► ఇల్లెందు సీఎస్పీ బస్తీకి చెందిన ఆదివాసీ వ్యవసాయదారులు.. తాము 1987 నుంచి పట్టా భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్నామని సింగరేణి అధికారులు జేకే 5 ఓసీ ఏర్పాటుకు సర్వే నిర్వహించి ఏర్పాటు చేసిన హద్దుల ప్రకారం తమ భూములను కోల్పోతున్నామని, జీవనోపాధి కల్పించాలని దరఖాస్తు చేయగా రెవెన్యూ అధికారులకు ఎండార్స్ చేశారు. ►పాల్వంచ నవభారత్ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలలో సౌకర్యాలు లేక విద్యార్థినులు ఇబ్బంది పడుతున్నారని, ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది నిర్లక్ష్యంతో తప్పుదోవ పడుతున్నారని విద్యార్థి, యువజన సంఘాలు దరఖాస్తు చేయగా త్వరలో పరిశీలించి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ►కొత్తగూడెం మున్సిపాలిటీ నాలుగో వార్డులో కాలువల నిర్మాణం మంజూరైనా ప్రారంభించ లేదని బీజేపీ పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్ అగర్వాల్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు జోగు ప్రదీప్ తదితరులు ఫిర్యాదు చేయగా కమిషనర్‌ను పిలిచి సమస్యపై ఆరా తీశారు. సంబంధిత వార్డు కౌన్సిలర్, చైర్‌పర్సన్‌ను ఆహ్వానించి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. -
ఆ లేఖ నాదే, నేనే రాశా
కర్ణాటక: ఎమ్మెల్యేలకు మంత్రులు అస్సలు విలువ ఇవ్వడం లేదు, తక్షణం సీఎల్పీ భేటీ ఏర్పాటు చేయాలని ఆయన పార్టీ పెద్దలకు లేఖ రాస్తారు. దానిపై వివాదం ఏర్పడితే.. అబ్బే ఆ లేఖ నేను రాయలేదు, ఎవరో నకిలీ లేఖను సృష్టించారు, బీజేపీ వారికి ఇదే పని అని ఎస్పీకి ఫిర్యాదు చేస్తారు. మరుసటి రోజుకు మాట మార్చి.. ఆ లేఖ నాదే..అగౌరవాన్ని సహించేది లేదు అని హుంకరిస్తారు. కలబుర్గి కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ వైఖరి ఇప్పుడు చర్చనీయాంశమైంది. తాజాగా ఏమన్నారంటే లేఖ రాయడంపై క్షమాపణ కోరేది లేదని బీ.ఆర్.పాటిల్ తాజాగా ప్రకటించారు. ఆదివారం కల్బుర్గిలో మాట్లాడిన పాటిల్, ఎవరు క్షమాపణ కోరారో నాకు తెలియదు. సీఎల్పీ సమావేశం నిర్వహించాలని కోరడం మా హక్కు. కొందరు మంత్రుల ప్రవర్తన అనేకమందికి అసంతృప్తికి కారణమైంది. ఆత్మగౌరవానికి భంగం కలిగితే రాజీనామా చేస్తాను అని పాటిల్ చెప్పారు. సీఎల్పీ సమావేశంలో తాను ఎలాంటి క్షమాపణ కోరలేదని తెలిపారు. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని అందరి ముందు చెప్పలేనన్నారు. లేఖ రాయడం నా హక్కు, నేనే రాశాను.అయితే క్షమాపణ కోరలేదు. ప్రియాంక్ ఖర్గేతో అన్ని విషయాలనూ చర్చించాను అని చెప్పారు. -
వెన్నెల నవ్వితే... ఆ అందం నువ్వే!
రజనీకాంత్ ‘జైలర్’ సినిమాలోని ‘నువ్వు కావాలయ్యా’ పాట సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అనిరుథ్ రవిచందర్ ఈ పాటకు స్వరాలు సమకూర్చి శిల్పారావుతో కలిసి పాడాడు. ఈ పాటకు తమన్నా భాటియా వేసిన స్టెప్లను నెటిజనులు షేర్ చేస్తున్నారు. ఈ క్యాచీ బీట్స్ పాట యూ ట్యూబ్‌లో 74 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఈ పాటలో తమన్నా హుక్ స్టెప్స్‌ను అనుసరిస్తూ మిస్ కేరళ (2017) ప్రియాంక మేనన్ అందమైన వీడియో చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో 47.2 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. కామెంట్ సెక్షన్ హార్ట్ ఇమోజీలతో నిండిపోయింది. -
ఇంకా ఉత్కంఠే.. నీటి మట్టం 60 అడుగుల వరకూ..
ఖమ్మం: గోదావరి నదికి వరద ప్రవాహం పెరుగుతుండడంతో తీర ప్రాంత వాసుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. స్థానికంగా వర్షాలు తగ్గినా ఎగువ నుంచి వరద వస్తుండడంతో గోదావరి శాంతించడం లేదు. అయితే అంతే స్థాయిలో వరద దిగువకు వెళుతుండడంతో భద్రాచలం వద్ద నీటిమట్టం నెమ్మదిగా పెరుగుతోంది. వరద తీవ్రత, తీసుకోవాల్సిన చర్యల గురించి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, కలెక్టర్ ప్రియాంక ఆల ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఐఏఎస్ అధికారి దురిశెట్టి అనుదీప్, ఎస్పీ డాక్టర్ జి.వినీత్, ఏఎస్పీ పరితోశ్ పంకజ్, ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్ తదితరులు సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. నేడూ వరద పోటు.. శనివారం రాత్రి 12 గంటల సమయంలో భద్రాచలం వద్ద గోదావరి 15,96,899 క్యూసెక్యుల నీటి ప్రవాహం దిగువకు వెళుతుండగా నీటి మట్టం 56.10 అడుగులుగా ఉంది. గోదావరికి ఎగువ ప్రాంతాన ఉన్న సమ్మక్క బ్యారేజీ వద్ద నీటిమట్టం శనివారం రాత్రి 9 గంటలకు 13 లక్షల క్యూసెక్కులుగా నమోదైంది. సమ్మక్క బ్యారేజీ భద్రాచలనికి ఎగువన 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ శనివారం మధ్యాహ్నం వదిలిన గరిష్ట వరద భద్రాచలం చేరేందుకు 24 గంటల సమయం పడుతుంది. దీంతో ఆదివారం మధ్యాహ్నం వరకు వరద పోటు కొనసాగే అవకాశం ఉంది. గరిష్ట వరద భద్రాచలం చేరుకునే సమయానికి నీటి మట్టం 60 అడుగుల వరకు చేరుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆదివారం సాయంత్రానికి భద్రాచలం దగ్గర నీటి మట్టం 53 అడుగుల దిగువకు తగ్గి, ఎగువ నుంచి వరద రాకుంటే పునరావాస శిబిరాల నుంచి ఇళ్లకు వెళ్లేందుకు ముంపు బాధితులకు అనుమతి ఇస్తామని అధికారులు చెబుతున్నారు. -
విషాదం: ప్రియాంక ఆత్మహత్య
సాక్షి, మైదుకూరు: కడుపు నొప్పి భరించలేక సచివాలయ ఉద్యోగి ధనపాల ప్రియాంక (27) ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర ఘటన వైఎస్సార్‌జిల్లా మైదుకూరులో చోటుచేసుకుంది. మృతురాలి తండ్రి యుగంధర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మైదుకూరు మండలం నంద్యాలంపేట –2లో మైదుకూరుకు చెందిన ధనపాల ప్రియాంక (27) అగ్రికల్చర్ అసిస్టెంట్‌గా పనిచేస్తోంది. ఆమె కొన్నాళ్లుగా కడుపు నొప్పితో బాధపడుతోంది. ఈ క్రమంలో కడుపు నొప్పి ఎక్కువ కావడంతో మూడు రోజుల కిందట విషం తాగింది. అది గమనించిన వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రియాంక మృతి చెందింది. ఇక, జిల్లా వ్యవసాయాధికారి నాగేశ్వరరావు, మండల వ్యవసాయ అధికారి లక్ష్మీప్రసన్న ప్రియాంక మృతదేహాన్ని పరిశీలించి, ఆమె తండ్రి యుగంధర్‌ను పరామర్శించారు. ఇది కూడా చదవండి: ఆర్కే బీచ్: దీపక్‌కు తృటిలో తప్పిన ప్రమాదం -
‘భద్రాద్రి’ సుపరిచితమే !
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి జిల్లా తనకు సుపరిచితమేనని, గతంలో ఈ జిల్లాకు చాలా సార్లు వచ్చానని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల తెలి పారు. జిల్లా అధికారుల సమీకృత కార్యాలయం (ఐడీఓసీ)లో శనివారం సాయంత్రం ఆమె బాధ్యతలు స్వీరించారు. అనంతరం ఐడీఓసీ ప్రాంగణమంతా కలియదిరిగారు. ఇదే క్యాంపస్‌లో ఉన్న కలెక్టర్ క్యాంపు కార్యాలయాన్ని సైతం కుటుంబసభ్యులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. బంధుత్వం ఉంది తనది తెలంగాణేనని, పుట్టి పెరిగింది అంతా హైదరాబాద్‌లోని ఉప్పల్ అని కలెక్టర్ తెలిపారు. స్థానికురాలినే కావడంతో ఈ రాష్ట్రం, ఇక్కడి జిల్లాలపై అవగాహన ఉందన్నారు. పైగా భద్రాద్రి జిల్లాలో బంధువులు కూడా ఉన్నారని, చిన్నప్పుడు చాలా సార్లు ఈ జిల్లాకు వచ్చానని గతాన్ని గుర్తు చేసుకున్నారు. 2016లో ఐఏఎస్‌గా ఎంపికై న తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్‌గా, హైదరాబాద్ నగర పరిధిలో అడిషనల్ కమిషనర్, జోనల్ కమిషనర్‌గా పని చేసినట్టు తెలిపారు. తన సర్వీసులో పని చేసిన రెండూ అర్బన్ ప్రాంతాలని, తొలిసారిగా గ్రామీణ ప్రాంత జిల్లా అధికారిగా రావడం సంతోషంగా ఉందని చెప్పారు. పైగా ఈ జిల్లాలో గిరిజన జనాభా ఎక్కువగా ఉందని, ప్రభుత్వం తరఫున వారికి చేయాల్సింది ఎంతో ఉందని అన్నారు. చాలా చేయొచ్చు.. ఇక్కడికి బదిలీ అయిందని తెలియగానే జిల్లాకు సంబంధించిన విషయాలు తెలుసుకునే పనిలో పడ్డానని చెప్పారు. ఇంతకాలం ఇక్కడ కలెక్టర్‌గా పని చేసిన అనుదీప్ దురిశెట్టి తనకు ఫోన్ చేసి.. రాష్ట్రంలోనే ఆదివాసీలు అధికంగా నివసించే జిల్లాకు కలెక్టర్‌గా వస్తున్నందుకు శుభాకాంక్షలు తెలిపారని చెప్పారు. కలెక్టర్‌గా ఈ జిల్లాకు చాలా పనులు చేయొచ్చని, బదిలీపై వెళ్తున్న తనకు ఈ జిల్లా ఎంతో సంతృప్తిని ఇచ్చిందని అన్నారని తెలిపారు. 4:23 గంటలకు హైదరాబాద్ నుంచి నేరుగా కొత్తగూడెం ఐడీఓసీకి శనివారం సాయంత్రం కలెక్టర్ చేరుకున్నారు. ఐడీఓసీ మొదటి అంతస్తులోని కలెక్టర్ చాంబర్‌కు చేరుకుని ఆసీనులయ్యారు. సాయంత్రం 4:23 గంటలకు కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ.. వైద్య విద్యను అభ్యసించిన తాను ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో సివిల్ సర్వీస్‌లోకి వచ్చినట్లు తెలిపా రు. కలెక్టర్‌కు వివిధ శాఖల అధికారులు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. తమను తాము పరిచయం చేసుకున్నారు. కలెక్టర్ ప్రియాంక అలా వెంట అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, అన్ని ప్రభుత్వ శాఖ జిల్లా అధికారులు ఉన్నారు. ఎంబీబీఎస్ టు సివిల్స్.. కలెక్టర్ ప్రియాంక హైదరాబాద్ నగరంలోని ఉప్పల్‌లో పుట్టి పెరిగారు. హబ్సిగూడలోని జాన్సన్ గ్రామర్ స్కూల్లో చదువుకున్నారు. ఇంటర్ తర్వాత మహారాష్ట్రలోని ఎంజీఎంఎస్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఆ తర్వాత సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యారు. 2016 బ్యాచ్‌లో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. ఆమె భర్త మణిపాల్కుమార్ గాంధీ ఆస్పత్రిలో సర్జన్‌గా పని చేస్తున్నారు. పిల్లలు మైరా (పాప), కియాన్ (బాబు) ఉన్నారు. -
సిద్దిపేట అదనపు కలెక్టర్‌గా గరిమా అగర్వాల్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: సార్వత్రిక ఎన్నికల క్రమంలో బదిలీల వేగం పుంజుకుంది. ఇటీవల డీఎస్పీలను బదిలీ చేసిన ప్రభుత్వం శుక్రవారం అదనపు కలెక్టర్లను బదిలీ చేయగా కన్ఫర్డ్ ఐఏఎస్‌లకు పదోన్నతి కల్పిస్తూ అదనపు కలెక్టర్లుగా నియమించింది. అలాగే ఆర్డీవోలకు సైతం స్థానచలనం కల్పించింది. ఉమ్మడి జిల్లాలో పలువురు అదనపు కలెక్టర్లను బదిలీ చేయగా నేడు, రేపు కూడా మరిన్ని బదిలీలు జరిగే అవకాశముందని సమాచారం. ► సిద్దిపేట అదనపు కలెక్టర్(లోకల్ బాడీస్) ముజమ్మిల్‌ఖాన్‌ను పెద్దపల్లి కలెక్టర్‌గా నియమించగా పెద్దపల్లి కలెక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణను టీఎస్ ఫుడ్స్ ఎండీగా నియమించారు. ► జయశంకర్ భూపాలపల్లి జిల్లా అదనపు కలెక్టర్(లోకల్ బాడీస్) దివాకర్‌ను జగిత్యాల అదనపు కలెక్టర్(లోకల్ బాడీస్)గా నియమించగా అదనపు కలెక్టర్ మంద మకరంద్‌ను నిజామాబాద్ మునిసిపల్ కమిషనర్‌గా బదిలీ చేశారు. ► పెద్దపల్లి అదనపు కలెక్టర్(లోకల్ బాడీస్) కుమార్ దీపక్‌ను నాగర్‌కర్నూల్ అదనపు కలెక్టర్‌గా బదిలీ చేయగా అతనిస్థానంలో కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సతీమణి కరీంనగర్ జెడ్పీ సీఈవో ప్రియాంకను నియమించారు. ► వెయిటింగ్లో ఉన్న జల్ద అరుణశ్రీని కరీంనగర్ అదనపు కలెక్టర్(లోకల్ బాడీస్)గా నియమించారు. ఈమె గతంలో కరీంనగర్ డీఆర్డీవోగా విధులు నిర్వహించారు. ► కరీంనగర్ జాయింట్ కలెక్టర్(ట్రైనీ) నవీన్ నికోలస్‌ను తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ సెక్రటరీగా నియమించారు. ► కరీంనగర్ అదనపు కలెక్టర్(లోకల్ బాడీస్) గరిమా అగర్వాల్‌ను సిద్దిపేట అదనపు కలెక్టర్(లోకల్ బాడీస్)గా నియమించారు. ► కరీంనగర్ అదనపు కలెక్టర్(రెవెన్యూ)గా ఉన్న శ్యాం ప్రసాద్‌లాల్‌ను పెద్దపల్లి అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా బదిలీఅయ్యారు. ► శ్యాంప్రసాద్ లాల్ స్థానంలో సిద్దిపేట స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్న కె.లక్ష్మికిరణ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆర్డీవోలు సైతం ప్రస్తుతం ఉట్నూరు ఆర్డీవోగా ఉన్న కె.మహేశ్వర్‌ను కరీంనగర్ ఆర్డీవోగా నియమించారు. కరీంనగర్ ఆర్డీవోగా ఉన్న ఎన్.ఆనంద్‌కుమార్‌ను సిరిసిల్లకు బదిలీచేశారు. సిరిసిల్ల ఆర్డీవోగాఉన్న టి. శ్రీనివాసరావు డిప్యూటీ కలెక్టర్ అండ్ తహసీల్దార్ శేరీలింగంపల్లికి బదిలీపై వెళ్లనున్నారు. ప్రస్తుతం జగిత్యాల ఆర్డీవోగా ఉన్న మాధురిని సంగారెడ్డి అడిషనల్ కలెక్టర్‌గా పంపారు. సివిల్స్–2016లో తెలంగాణ టాపర్ ముజమ్మిల్‌ఖాన్ 2014లో తొలిసారిగా సివిల్స్ రాస్తే ఐఆర్టీఎస్ వచ్చింది. శిక్షణ పూర్తయ్యాక ఏసీఎంగా కొలువు దక్కింది. 2015లో మళ్లీ సివిల్స్ రాయగా ఐఆర్ఎస్కు ఎంపికయ్యారు. అందులో చేరకుండా పాత ఉద్యోగంలోనే కొనసాగుతూ మూడోసారి 2016లో సివిల్స్ రాయగా జాతీయస్థాయిలో 22వ, రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్‌ను సాధించారు. ఐఏఎస్ శిక్షణ పూర్తి చేశాక 2018లో వికారాబాద్ అసిస్టెంట్ కలెక్టర్, హుస్నాబాద్ డిప్యూటీ కలెక్టర్ పని చేశారు. ఫిబ్రవరి 2020లో సిద్దిపేట జిల్లాకు అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం పెద్దపల్లి కలెక్టర్‌గా పదోన్నతిపై బదిలీ అయ్యారు. ఈయన మాజీ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏకే ఖాన్ కుమారుడు కావడం గమనార్హం. -
కలెక్టర్‌గా ప్రియాంక
భద్రాచలం/సూపర్‌బజార్ (కొత్తగూడెం): ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. దీంతో జిల్లా నూతన కలెక్టర్‌గా 2016 బ్యాచ్‌కు చెందిన ప్రియాంక ఆల నియమితులయ్యారు. ఇప్పటివరకు ఆమె గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో అడిషనల్ కమిషనర్‌గా పని చేస్తున్నారు. 2021లో జరిగిన గ్రేటర్ ఎన్నికలను సమర్థంగా నిర్వహించిన అధికారిగా ఆమె పేరు తెచ్చుకున్నారు. అంతకుముందు ఆమె యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రత్యే క అధికారిగా పనిచేశారు. కలెక్టర్‌తోపాటు భద్రాచలం –ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా ఉన్న గౌతమ్ పొట్రు సైతం బదిలీ అయ్యారు. సెర్ప్ సీఈఓగా గౌతమ్‌ను బదిలీ చేసిన ప్రభుత్వం ఆయన స్థానంలో రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్‌గా ఉన్న ప్రతీక్ జైన్‌ను నియమించింది. ఈ బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం పేర్కొంది. ట్రైనీగా మొదలుపెట్టి.. సివిల్స్ పరీక్షల్లో జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు సాఽధించిన దురిశెట్టి అనుదీప్ జిల్లాలో ట్రైనీ కలెక్టర్‌గా తొలిసారి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత ఇక్కడే స్థానిక సంస్థలకు అడిషనల్ కలెక్టర్‌గా పదోన్నతి పొందారు. ఈ రెండు పోస్టుల్లో జిల్లా అంతటా ఆయన విస్త్రృతంగా పర్యటించారు. అశ్వారావుపేట దగ్గర కొండరెడ్లపై ప్రత్యేకంగా పరిశోధన చేశారు. వారి జీవిత స్థితిగతులను దగ్గరుండి పరిశీలించారు. ఆ తర్వాత జిల్లా కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. గతేడాది రికార్డు స్థాయిలో వరదలు వచ్చినప్పుడు కలెక్టర్ హోదాలో అనుదీప్ చేసిన కృషికి సర్వత్రా ప్రశంసలు దక్కాయి. డైబ్బె అడుగులకు పైగా గోదావరి వరద వచ్చినా ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ సహాయక కార్యక్రమాలు చేపట్టారు. వీటితోపాటు గతేడాది డిసెంబరులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనను విజయవంతం చేశారు. రాష్ట్ర గవర్నర్, సీఎంలు ఒకేసారి జిల్లాలో పర్యటించినా ప్రోటోకాల్ సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పోడు పట్టాలు.. గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న భద్రాద్రి జిల్లాలో పోడు రైతులకు పట్టాలను అతి తక్కువ సమయంలో అందివ్వడంలో కలెక్టర్‌గా అనుదీప్ ఎంతో శ్రమించారు. సుమారు లక్షన్నర వరకు వచ్చిన దరఖాస్తులను వడబోసి కేవలం రెండున్నర నెలల సమయంలో లక్షన్నర ఎకరాలకు సంబంధించి యాభై ఐదు వేల పట్టాలను తయారు చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేశారు. అదనపు గంటలు పని చేశారు. ఎంతో జఠిలంగా మారిన పోడు పట్టాల పంపిణీని ప్రజల నుంచి పెద్దగా వ్యతిరేకత రాకుండానే విజయవంతంగా పూర్తి చేయగలిగారనే భావన ప్రజల్లో నెలకొంది. మారుమూల గిరిజన ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలను మెరుగుపరచడంలోనూ తనదైన ముద్ర వేశారు. అశ్వారావుపేట, ఇల్లెందు, చర్ల, మణుగూరు వైద్యశాలలను ఆధునీకరించటంతోపాటు వైద్యులను నియమించి వైద్య సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ముఖ్యంగా చర్ల, అశ్వారావుపేట ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు మెరుగు పరచడానికి వ్యక్తిగతంగా కూడా చొరవ చూపించారు. ఆయన కలెక్టర్‌గా ఉన్న సమయంలో జిల్లాకు స్వచ్ఛ సర్వేక్షణ్, ఆరోగ్య పంచాయతీ, జలసంరక్షణ విభాగంలో జాతీయ అవార్డులు వరించాయి. సెర్ప్ సీఈఓగా గౌతమ్ పొట్రు భద్రాచలం ఐటీడీఏ పీఓగా పనిచేస్తున్న గౌతమ్ పొట్రు సెర్ప్ సీఈఓగా బదిలీ అయ్యారు. 2020, ఆగస్టు 7న పీఓగా గౌతమ్ బాధ్యతలు స్వీకరించారు. గిరిజనాభివృద్ధికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించటంలో కృషి చేశారు. కాగా గిరిజన దర్బారులో అందుబాటులో లేకపోవడం, గిరిజన గ్రామాల్లో క్షేత్ర స్థాయి పర్యటనలు లోపించటం వంటి అపవాదులను ఆయన మూటగట్టుకున్నారు. కల్లూరు ఆర్డీఓగా శివాజీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (భూసేకరణ)గా ఉన్న శివాజీని కల్లూరు ఆర్డీఓగా బదిలీ చేశారు. గతంలో ఆయన భద్రాచలం ఆలయ ఈఓగా పని చేశారు. -
ముగ్గురు పల్లెటూరి పిల్లగాళ్ల కథే తురుమ్ ఖాన్ సినిమా
నిమ్మల శ్రీరామ్, దేవరాజ్ పాలమూర్, అవినాష్ చౌదరి హీరోలుగా, పులి సీత, విజయ, శ్రీయాంక హీరోయిన్లుగా నటించిన పల్లెటూరి రివెంజ్ కామెడీ డ్రామా ఫిల్మ్ ‘తురుమ్ ఖాన్లు’. శివకల్యాణ్ దర్శకత్వంలో ఆసిఫ్ జానీ నిర్మించిన చిత్రం ఇది. త్వరలోనే ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు శివకల్యాణ్ మాట్లాడుతూ– ‘‘ఈ ఆధునిక యుగంలో బ్రహ్మ, విష్ణు, ఈశ్వర్ అనే ముగ్గురు యువకులు ఒకే ఊరిలో పుట్టి, పెరిగి సరదాగా ఒకరినొకరు ఎలా ఆటపట్టించుకుంటారు? ఒకర్ని ఒకరు ఎలా ఏడిపించుకుంటారు? అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించాం’’ అన్నారు. ‘‘తురుమ్ ఖాన్లు’ చిత్రం చిన్న సినిమాగా విడుదలైనా రిలీజ్ తర్వాత పెద్ద సినిమా అవుతుంది’’ అన్నారు నిర్మాత ఆసిఫ్. ఈ చిత్రానికి సంగీతం: వినోద్ యాజమాన్య, అఖిలేష్ గోగు, సహనిర్మాత: కె. కల్యాణ్ రావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దేవరాజ్ పాలమూర్. -
బిగ్ బాస్ నటిపై తీవ్ర ఆరోపణలు.. పోలీసులకు ఫిర్యాదు!
ప్రముఖ బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ ఇషితా గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు. బిగ్ బాస్ -16 కంటెస్టెంట్ ప్రియాంక చాహర్ చౌదరి తన డిజైన్లను కాపీ కొట్టారని ఆరోపిస్తూ ముంబయి పోలీసులను ఆశ్రయించారు. ఇటీవలే నిర్వహించిన ఓ ప్రదర్శనలో తనకు తెలియకుండానే వాటిని ప్రదర్శించారని ఆమె ఆరోపించారు. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా ఆమె వెల్లడించారు. ప్రియాంక చౌదరి ధరించిన డిజైన్స్ ఓ ఫ్యాషన్ లైన్ కోసం ప్రత్యేకంగా రూపొందించామని పేర్కొంది. ప్రియాంక ధరించిన డిజైన్స్ న్యూయార్క్ మ్యాగజైన్ కవర్ పేజీని కోసం తయారు చేశామని తెలిపింది. అయితే ఇషిత ఆరోపణలపై ప్రియాంకచౌదరి ఇంకా స్పందించలేదు. సోషల్ మీడియాలో లైక్స్ కోసమే ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోందని ఆరోపించింది. అయితే ఇషిత ఆరోపణలపై కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు డిజైన్లు ఒకేలా లేవని చెబుతున్నారు. కాగా.. ప్రియాంక చాహర్ చౌదరి బిగ్ బాస్- 16 సీజన్లో సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. ప్రైమ్ టైమ్ టీవీ షో 'ఉదరియాన్' ద్వారా పేరు సంపాదించింది. ఇటీవలే కుచ్ ఇత్నే హసీన్లోనూ కనిపించింది. .@ishitarehagupta Please share the details of your complaint here: https://t.co/kMC70YRHG9 https://t.co/xCqnBikWsj — मुंबई पोलीस - Mumbai Police (@MumbaiPolice) April 23, 2023 Bade aye chors! Show chal raha tha that time muh band tha cz reputation kharab ho jata. Bahar aake meri hi nakal ki continuity. Wannabe and envy ke definition. Zero integrity or dignity. Only knows how to use people. Cheap personality. — ISHITA (@ishitarehagupta) April 23, 2023 -
పోలీసులపై బాలల హక్కుల సంఘం చీఫ్ సంచలన ఆరోపణలు
బాలల హక్కుల సంఘం చీఫ్ ప్రియాంక కనూంగో పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు. తనపై దాడి చేసి దుర్భాషలాడరని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను తోసిపుచ్చారు అధికారులు. తాము ఆయనకు సహకరించామని, అతనే తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించారు. ఈ వారంలో కోల్‌కతాలోని తిల్జాలా ప్రాంతంలో ఒక మైనర్ తన పొరుగింటి వారి చేతిలోనే హత్యకు గురయ్యింది. ఈ విషయమైన తాను అక్కడకు వచ్చానని నేషనల్ కమిషన్ ప్రోటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్(ఎన్సీపీసీఆర్) చైర్ పర్సన్ ప్రియాంక కనూంగో చెప్పారు. అప్పుడే కోల్‌కతా పోలీసులు తనపై దాడి చేసి అసభ్యంగా ప్రవర్తించారని చెప్పారు. పోలీసులు మాపై జరుపుతున్న దర్యాప్తు ప్రక్రియలను రహస్యంగా రికార్డు చేస్తున్నారని, దీన్ని వ్యతిరేకించినందుకే తనపై దాడి చేరని కనూంగో సోషల్ మీడియా వేదికగా హిందీలో ట్వీట్ చేశారు. దీనిపై పశ్చిమ బెంగాల్ కమీషనర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్(డబ్ల్యూసీపీసీఆర్) చీఫ్ సుదేష్నా రాయ్ స్పందిస్తూ..తనను, తమ సహోద్యోగులను కనూంగో అవమానించాడని అన్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆలోచిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. అసలు ఎన్సీపీసీఆర్ బృందం మాకు సమాచారం ఇవ్వకుండా ఆ బాలిక కుటుంబం వద్దకు వెళ్లిందన్నారు. నిజానికి ఆ ప్రతిపాదిత పర్యటన అవసరం లేదని చెప్పారు. ఈ విషయాన్నే పేర్కొంటూ రాయ్ ఎన్‌సీపీసీఆర్‌కి లేఖ కూడా రాశారు. (చదవండి: విమానంలో మరో అనుచిత ఘటన: తాగిన మత్తులో 62 ఏళ్ల ప్రయాణికుడి వీరంగం) -
బిడ్డల చెంతకు చేరిన తల్లి
కాకినాడ క్రైం: ప్రాణప్రదంగా చూసుకునే ఇద్దరు బిడ్డల్నీ వదిలేసి రోడ్డు పాలైన ఓ తల్లి తిరిగి వారి చెంతకు చేరింది. భర్త వదిలేశాడనే వేదన తాళలేక మతిస్థిమితం కోల్పోయిన ఓ మహిళను దిశ వన్‌స్టాప్ సెంటర్ అక్కున చేర్చుకుంది. రాష్ట్రాలు దాటి వచ్చి అనాథలా రోడ్లు పట్టిన ఆ తల్లిని తిరిగి బిడ్డల చెంతకు చేర్చింది. వివరాలివీ.. సుమారు నెల రోజులక్రితం ఓ రోజు అర్ధరాత్రి కాకినాడ జిల్లా కాకినాడ టౌన్ రైల్వేస్టేషన్లో ఒంటరిగా కూర్చున్న ఓ అనాథ మహిళ వెంట ఇద్దరు వ్యక్తులు పడ్డారు. వారినుంచి తప్పించుకున్న ఆమె సహాయం కోసం రైల్వే సిబ్బంది క్యాబిన్ తలుపులు కొట్టింది. సిబ్బంది బయటకు రావడంతో ఆ దుండగులిద్దరూ పరారయ్యారు. రైల్వే చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ ఏవీకే సంతోష్ ఆ మహిళ దుస్థితిని గమనించి, మతిస్థిమితం కోల్పోయిందని నిర్ధారించారు. ఆమె పరిస్థితిని జిల్లా మహిళా, శిశు సాధికార అధికారి ప్రవీణకు వివరించి సహాయం కోరారు. తక్షణమే స్పందించిన ఆమె దిశ వన్‌స్టాప్ సెంటర్ అడ్మిన్ కె.శైలజకు తగిన ఆదేశాలిచ్చారు. శైలజ బాధిత మహిళను కాకినాడ జీజీహెచ్‌లోని దిశ వన్‌స్టాప్ సెంటర్‌కు తరలించారు. నెల రోజులపాటు సపర్యలు చేసి ఆమె వివరాలు రాబట్టారు. ఆమె పేరు ప్రియాంక షైనీ అని, ఊరు గోరఖ్‌పూర్ అని గుర్తించారు. దీంతో ఆమె ఫొటో సర్క్యులేట్ చేసి... ఆ మహిళ బంధువుల కోసం తీవ్రంగా ప్రయత్నించారు. 2021 నవంబర్ 2వ తేదీన ఆ మహిళ అదృశ్యమైనట్టు గోరఖ్‌పూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని నిర్ధారణ కాగా.. అక్కడి పోలీసుల ద్వారా ప్రియాంక షైనీ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వీడియో కాల్లో ఆమెను చూసి నిర్ధారించుకుని కాకినాడ వచ్చారు. దిశ వన్‌స్టాప్ బృందం ఏఎస్ఐ చంద్ర, కౌన్సిలర్ జమీమా, ఐటీ స్టాఫ్ దుర్గాదేవి సమక్షంలో ప్రియాంకను అధికారులు గురువారం ఆమె సోదరికి అప్పగించారు. ప్రియాంక సోదరి మాట్లాడుతూ తన అక్కకు 12, 10 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారని, ఏడాదికాలంగా అమ్మ ఏదని వారు అడుగుతుంటే ఊరెళ్లిందని, త్వరలోనే వచ్చేస్తుందని అబద్ధం చెబుతూ కాలం గడిపామని భావోద్వేగానికి గురైంది. -
సీక్రెట్‌గా పెళ్లి పీటలు ఎక్కిన నటీనటులు.. ఫొటోలు వైరల్
ప్రముఖ సినీ నటి ప్రియాంక నల్కారి పెళ్లి పీటలు ఎక్కింది. సీక్రెట్‌గా ప్రియుడు, నటుడితో మలేషియాలో ఏడుడుగులు వేసింది. ఈ విషయాన్ని ప్రియాంకస్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రటించింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి ఫొటోలు, వీడియోలు షేర్ చేసి షాకిచ్చింది. అయితే ఎలాంటి హడావుడి లేకుండ సీక్రెట్‌గా గుడిలో పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రియాంక వెండితెరపై,బుల్లితెరపై నటిగా మంచి పాపులారిటి సంపాదించుకుంది. 2010లో విడుదలైన ‘అందరి బంధువయా’ సినిమాతో నటిగా పరిచయమైంది. చదవండి: హీరో సిద్ధార్థ్‌తో డేటింగ్‌పై ప్రశ్న.. అదితి షాకింగ్ కామెంట్స్ తమిళంలో ‘సమ్‌థింగ్ సమ్‌థింగ్’, ‘కాంచన-3’ సినిమాల్లో నటించింది. ఇక ప్రియాంక పెళ్లి చేసుకున్న వ్యక్తి విషయానికి వస్తే.. అతడి పేరు రాహుల్ వర్మ, నటుడు, బిజినెస్ మేన్ అని సమాచారం. అతడు తెలుగులో పలు సీరియల్స్‌లో నటించాడు. అదే క్రమంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. కొంతకాలంగా ప్రేమలో మునిగితేలిన ఈ జంట 2018లో సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇద్దరు కెరీర్లో బిజీగా ఉన్న నేపథ్యంలో పెళ్లిని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: నా కెరీర్లోనే బెస్ట్ ఒపెనింగ్స్ ఇచ్చింది ఈ సినిమా: విశ్వక్ సేన్ అయితే ఇరు కుటుంబ సభ్యులు లేకుండానే మలేషియాలోని మురుగన్ ఆలయంలో వీరిద్దరు రహస్య వివాహం చేసుకున్నట్లు సమాచారం. తన పెళ్లి ఫొటోలు షేర్ చేస్తూ #JustMarried అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేసింది. ఆమె పోస్ట్ చూసి అంతా షాక్ అవుతున్నారు. సడెన్‌గా ఇలా రహస్య వివాహం చేసుకోవాల్సిన అవసరం ఏముందంటూ నెటజన్లు ఆరా తీస్తున్నారు. కాగా ప్రియాంకకు తెలుగులో ప్రస్తుతం అవకాశాలు లేనప్పటికీ తమిళంలో నటిగా ఫుల్ బిజీగా ఉంది. తమిళ్లో ఆమె నటిస్తున్నరోజా సీరియల్ టాప్ రేటింగ్‌తో దూసుకుపోతోంది. View this post on Instagram A post shared by Priyanka Nalkari Official (@nalkarpriyanka) -
కవిన్‌తో రొమాన్స్‌కు సిద్ధమేనా?
నాలుగేళ్లలోనే మూడు భాషలలో నటించిన లక్కీ నటి ప్రియాంక మోహన్. 2019లో మాతృభాషలో కథానాయకిగా పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ.. అదే ఏడాదిలో తెలుగులో నాని గ్యాంగ్ లీడర్ చిత్రంలో నటించే లక్కీ చాన్స్ దక్కించుకుంది. ఆ వెంటనే కోలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. ఇక్కడ శివ కార్తికేయన్‌కు జంటగా డాక్టర్ చిత్రంలో నటించింది. ఈమె కెరీర్లో మంచి విజయాన్ని సాధించిన చిత్రం ఇదే. ఆ తరువాత వెంటనే సూర్యకు జంటగా ఎదుర్కుమ్ తుణిందన్ చిత్రంలో నటించే అవకాశం తలుపు తట్టింది. అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. ఆ తరువాత శివకార్తికయేన్తో జతకట్టిన డాన్ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. కాగా ప్రస్తుతం ధనుష్ సరసన నటిస్తున్న కెప్టెన్ మిల్లర్ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అదే విధంగా దర్శకుడు రాకేష్ నూతన చిత్రంలో ప్రియాంక మోహన్ నాయకిగా నటించనుంది. అదే విధంగా సూర్యతో మరోసారి వాడివాసల్ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. కాగా తాజాగా ఈ అమ్మడు మరో అవకాశం వరించినట్లు తెలిసింది. డా డా చిత్ర విజయంతో మంచి జోరు మీద వున్న నటుడు కవిన్‌తో ప్రియాంక మోహన్ రొమాన్స్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. దీనిని నృత్య దర్శకుడు సతీష్ తెరకెక్కించనున్నారు. దీనికి అనిరుధ్ సంగీతాన్ని అందించనున్నట్లు తెలిసింది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉందని సమాచారం. కాగా ఇప్పటి వరకు తాను నటించిన చిత్రాలలో పక్కింటి అమ్మాయి ఇమేజ్ను సంపాదించుకున్న ప్రియాంక మోహన్‌కు గ్లామరస్ పాత్రలపై దృష్టి పెట్టింది. ఈ కారణంతోనే ఇటీవల అందాల ఆరబోతతో ఫొటోలను సామాజిక మాధ్యమాలలో తరచూ విడుదల చేస్తోందనే ప్రచారం సాగుతోంది. -
పారిస్ ఒలింపిక్స్‌కు ఆకాశ్‌దీప్, ప్రియాంక అర్హత
రాంచీ: జాతీయ ఓపెన్ రేస్ వాకింగ్ చాంపియన్‌షిప్‌లో పురుషుల 20 కిలోమీటర్ల విభాగంలో పంజాబ్‌కు చెందిన ఆకాశ్‌దీప్ సింగ్... మహిళల 20 కిలోమీటర్ల విభాగంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రియాంక గోస్వామి విజేతలుగా నిలిచారు. ఈ ఏడాది ఆగస్టులో బుడాపెస్ట్‌లో జరిగే ప్రపంచ అథ్లెటిక్స్ పోటీలకు... వచ్చే ఏడాది పారిస్ ఒలింపిక్స్ క్రీడలకు అర్హత సాధించారు. ఆకాశ్‌దీప్ 20 కిలోమీటర్ల దూరాన్ని 1 గంట 19 నిమిషాల 55 సెకన్లలో పూర్తి చేసి కొత్త జాతీయ రికార్డు సృష్టించాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్, పారిస్ ఒలింపిక్స్ అర్హత ప్రమాణ సమయాన్ని (1గం:20ని:10 సెకన్లు) అధిగమించాడు. ప్రియాంక 1 గంట 28 నిమిషాల 50 సెకన్లలో లక్ష్యానికి చేరి ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్, పారిస్ ఒలింపిక్స్ అర్హత ప్రమాణ సమయాన్ని (1గం:29ని:20 సెకన్లు) అధిగమించింది. చదవండి: టీ20 బ్లాస్ట్‌లో దుమ్మురేపనున్న మ్యాక్స్‌వెల్.. ఏ జట్టుకు అంటే..? -
నాలుగు జంటల ప్రేమకథ
‘1940లో ఒక గ్రామం, కమలతో నా ప్రయాణం, జాతీయ రహదారి’ వంటి చిత్రాలతో అవార్డులు అందుకున్న దర్శకుడు నరసింహ నంది తెరకెక్కించిన తాజా చిత్రం ‘అమ్మాయిలు అర్థంకారు’. అల్లం శ్రీకాంత్, ప్రశాంత్, కమల్, మీరావలి హీరోలుగా, సాయిదివ్య, ప్రియాంక, స్వాతి, శ్రావణి హీరోయిన్లుగా నటించారు. శ్రీ లక్ష్మీ నరసింహ సినిమా పతాకంపై నందిరెడ్డి విజయలక్ష్మి రెడ్డి, కర్ర వెంకట సుబ్బయ్య నిర్మించిన ఈ సినిమా నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా ట్రైలర్‌ని దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ బసిరెడ్డి, తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్, నిర్మాత మేడికొండ వెంకట మురళీకృష్ణ రిలీజ్ చేశారు. ‘‘నరసింహ తన అభిరుచికి తగ్గ సినిమాలు చేశారు. అదే కమర్షియల్ సినిమాలు తీసి ఉంటే ఇప్పటికే పెద్ద దర్శకుల జాబితాలో చేరేవారు’’ అన్నారు తమ్మారెడ్డి. ‘‘మధ్య తరగతి జీవితాల్లో జరిగే నాలుగు ప్రేమ జంటల కథలతో ఈ చిత్రం తెరకెక్కించాను’’ అన్నారు నరసింహ నంది. ‘‘చిత్తూరు, తిరుపతి ్ర΄ాంతాల యాసను నేపథ్యంగా తీసుకుని ఈ చిత్రాన్ని నిర్మించాం’’ అన్నారు కర్ర వెంకట సుబ్బయ్య. -
24 గంటలపాటు ప్రసంగం
విద్యారణ్యపురి: కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించింది ప్రియాంక సుంకురుశెట్టి. 24 గంటలపాటు నిరంతరాయంగా ప్రసంగించి తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. సూర్యాపేటకు చెందిన ప్రియాంక హనుమకొండ నక్కలగుట్టలోని ఆస్పైర్ క్లినీ అకాడమీలో ఆదివారం ఉదయం 9:30 గంటల నుంచి సోమవారం ఉదయం 9:30 గంటల వరకు 24 గంటపాటు ‘సన్‌రైజ్ టు సన్‌రైజ్’పేరుతో మారథాన్ లెక్చర్ ఇచ్చారు. ప్రతిగంటకు 5 నిమిషాల చొప్పున విశ్రాంతి తీసుకున్నారు. క్లినిక్ రీసెర్చ్ అండ్ క్లినిక్ డేటా మేనేజ్మెంట్ తదితర అంశాలపై 24 గంటల పాటు ఆమె ప్రసంగించారు. తెలుగు బుక్ ఆఫ్ జ్యూరీ సభ్యుడు టీవీ అశోక్‌కుమార్, అబ్జర్వర్లు నిమ్మల శ్రీనివాస్, వనపర్తి పద్మావతి ఇతర విషయ నిపుణుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం హనుమకొండ వాగ్దేవి కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమెకు సర్టిఫికెట్ అందజేశారు. -
ప్రపంచ దేశాల ఐక్యతతోనే అది సాధ్యం: ప్రియాంక
ఐక్యరాజ్యసమితి: ‘‘న్యాయమైన, సురక్షితమైన, ఆరోగ్యకరమైన సమాజం ప్రతి వ్యక్తి హక్కు. ప్రపంచ దేశాల ఐకమత్యంతోనే ఇది సాకారమవుతుంది’’ అని నటి, దర్శకురాలు ప్రియాంకా చోప్రా జోనాస్ అన్నారు. ప్రపంచదేశాలు సంఘీభావంతో వ్యవహరించాల్సిన అవసరం మునుపటి కంటే ఇప్పుడే ఎక్కువగా ఉందని ఆమె చెప్పారు. ఇందుకు నిర్దేశించుకున్న సుస్థిరాభివృద్ధి లక్ష్యా(ఎస్డీజీ)ల సాధనకు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. యునిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్ అయిన చోప్రా ఎస్‌డీజీపై మంగళవారం జరిగిన ఐరాస సర్వసభ్య సమావేశంలో ప్రసంగించారు. ప్రమాదం ముంగిట ప్రపంచం ప్రపంచ దేశాల మధ్య విభేదాలు భద్రతా మండలి వంటి కీలక అంతర్జాతీయ వ్యవస్థలను బలహీనపరుస్తున్నాయని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఆందోళన వెలిబుచ్చారు. ప్రపంచం ప్రమాదం అంచున ఉందన్నారు. అంతర్జాతీయ సహకారం లేకుండా మనుగడ సాగించలేమని గుర్తు చేశారు. ప్రపంచం ముంగిట ఉన్న సవాళ్లను సహకారం, చర్చల ద్వారా మాత్రమే ఎదుర్కోగలమని తెలిపారు. -
Priyanka Panwar: ఆమెకు వంద ముఖాలు! అతడి మరణవార్త విని.. మొదటిసారి..
ముఖ కవళికలను మరింత అందంగా తీర్చిదిద్దడానికి మంచి సాధనం మేకప్. ఒకప్పుడు అందాన్ని పెంచడానికి వాడే ఈ సాధనం నేడు అనేక రకాల మేకప్ ట్రెండ్స్‌తో కొత్త పుంతలు తొక్కుతోంది. మేకప్‌లో సరికొత్త మెళకువలతో చిత్ర విచిత్ర జిమ్మిక్కులను ఆకర్షణీయంగా రూపొందించి అలరిస్తున్నారు కళాకారులు. మేకప్ మీద ఉన్న మక్కువతో చేస్తోన్న ఉద్యోగాన్ని సైతం వదిలేసి మంచి ఆర్టిస్ట్‌గా మారింది ప్రియాంక పన్వర్. దేశవిదేశాల్లోని ప్రముఖ సెలబ్రెటీల ముఖాన్ని తన ముఖంపై చిత్రించి ఔరా అనిపిస్తోంది. దివికేగిన ఎంతో మంది సెలబ్రెటీలకు సైతం తన మేకప్ ద్వారా నివాళులర్పిస్తోంది. ఆసక్తి లేకపోవడంతో.. ఘజియాబాద్‌కు చెందిన ప్రియాంక పన్వర్ ఫార్మసీలో మాస్టర్స్ చేసిన తరువాత, రెగ్యులేటరీ అఫైర్స్‌లో ఉద్యోగం చేసుకుంటూ బిజీగా ఉండేది. ఉద్యోగంలో చేసే పని బావున్నప్పటికీ తనకి పెద్ద ఆసక్తి ఉండేది కాదు. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా.. తనకి ఎంతో ఇష్టమైన కెనడాకు చెందిన ఇల్యూషన్ ఆర్టిస్ట్ ‘మిమి చాయిస్’ మేకప్ వీడియోలను చూస్తూ తను కూడా ఆమెలానే ఆర్టిస్ట్ కావాలనుకుంది. అనుకున్న వెంటనే బేసిక్ మేకప్ కోర్సు నేర్చుకుంది. తనకు నచ్చిన సెలబ్రెటీల రూపాలను వేయడం ప్రారంభించి చక్కగా వేయడం వచ్చాక చేస్తోన్న ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి సమయాన్ని ఇల్యూషన్ మేకప్‌కు కేటాయించింది. View this post on Instagram A post shared by Illusion Mua - Priyanka Panwar (@makeupbypriyankapanwar) అతని మరణ వార్త విని.. తనకు నచ్చిన ముఖ కవళికలను మేకప్ మెళకువలతో అందంగా రూపొందిస్తూ ‘మేకప్ బై ప్రియాంక పన్వర్’ పేరుతో ఉన్న తన ఇన్‌స్టా అకౌంట్లో పోస్టు చేస్తుండేది. ప్రియాంక మేకప్ వీడియోలు నెటిజనులకు నచ్చుతుండడంతో మరింత ఉత్సాహంతో ఇల్యూషన్ స్కెచ్‌లు వేస్తుండేది. సుశాంత్ రాజ్‌పుత్‌సింగ్ ఇక లేడన్న వార్త తెలియడంతో .. మేకప్‌తో తనముఖంపై సుశాంత్ ముఖాన్ని చిత్రించి నివాళులు అర్పించింది. సుశాంత్ రూపం తీసుకురావడానికి ఏడు గంటలపాటు కష్టపడి పనిచేసింది. తొలి సెలబ్రెటీ రూపం అయినప్పటికీ ఎంతో చక్కగా వచ్చిందని వ్యూవర్స్ కామెంట్స్ చేయడంతో ఆమె అప్పటినుంచి ఇల్యూషన్ ఆర్టిస్ట్‌గా దూసుకుపోతోంది. View this post on Instagram A post shared by Illusion Mua - Priyanka Panwar (@makeupbypriyankapanwar) సెలబ్రెటీల నుంచి సినిమాలదాకా సుశాంత్ సింగ్ముఖంతో ప్రారంభమైన ప్రియాంక ఇల్యూషన్ మేకప్ ఆ తరువాత విరాట్ కోహ్లి, మనీ హీస్ట్ నటులు, బప్పీ లహరీ, రాజ్‌కుమార్ రావ్, అల్లు అర్జున్, గురురంధ్వా, కెల్లీ జెన్నర్, బిల్లీ పోర్టర్, దిల్జిత్ సింగ్, మిల్కా సింగ్, మొన్న హత్యకు గురైన గాయకుడు మూసావాల రూపాలను చక్కగా తీర్చిదిద్ది వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. సెలబ్రెటీల ముఖాలేగాక ‘రే’ సినిమాలోని కేకే మీనన్ క్యారెక్టర్‌ను తన ఇల్యూషన్ ఆర్ట్‌తో చక్కగా తీర్చిదిద్దింది. ఎంతోమంది సెలబ్రెటీల రూపాలు చిత్రించిన ప్రియాంక తన నానమ్మ ముఖాన్ని చిత్రించిన వీడియో బాగా వైరల్ అయ్యింది. View this post on Instagram A post shared by Illusion Mua - Priyanka Panwar (@makeupbypriyankapanwar) మనసు పెడితే కష్టం కాదు మేకప్‌లో చిన్న తప్పు జరిగినా మొత్తం పాడైపోతుంది. అనుకున్న రూపు రేఖలు రావు. ఇల్యూషన్ ఆర్ట్ సవాలుతో కూడుకున్నదైనప్పటికీ మనసుపెట్టి వేస్తే పెద్ద కష్టం కాదు. ఒక్కో ముఖాన్ని అచ్చుగుద్దినట్టు తీసుకురావడానికి కొన్ని గంటలు పడితే, మరికొన్నింటికి రోజంతా పడుతుంది. త్రీడి ఇమేజ్ రావాలంటే చాలా కష్టపడాలి. యాక్సెసరీస్, విగ్స్, లెన్స్, అవుట్ ఫిట్స్ అన్నీ చక్కగా కుదిరితేనే ఇల్యూషన్ ఇమేజ్ చక్కగా వస్తుంది. ‘‘ఏపీజే అబ్దుల్ కలాం, విక్రమ్ బాత్ర, జీత్లాల మా నానమ్మ ముఖాలు నేను రూపొందించిన వాటిలో నాకు బాగా నచ్చినవి. – ప్రియాంక పన్వర్ చదవండి: వ్యర్థాల నుంచి అర్థాలు: హీనంగా చూడకు దేన్నీ పనికొచ్చేవేనోయ్ అన్నీ! -
11ఏళ్ల అనంతరం వీడిన మర్డర్ మిస్టరీ!
పెద్దదోర్నాల: పదకొండేళ్ల క్రితం సంచలనం సృష్టించిన యువతి మర్డర్ మిస్టరీ ఎట్టకేలకు వీడింది. వివాహేతర సంబంధం నెరుపుతుందనే కారణం చూపి సోదరుడితో కలిసి కట్టుకున్న ఇల్లాలు ప్రియాంకను (19)ను దారుణంగా హతమార్చాడు కర్ణాటకకు చెందిన ఉపాధ్యాయుడు హుచ్చప్ప. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం విజయపూర్ జిల్లా వాదావేన్ తాలూకా ముధుదేహాల్‌కు చెందిన హుచ్చప్ప, ప్రియాంక భార్యాభర్తలు. కొన్నాళ్లపాటు అన్యోన్యంగానే కాపురం కొనసాగించారు. ఈ నేపథ్యంలో ప్రియాంక ఓ దళిత యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయాన్ని గమనించిన భర్త హుచ్చప్ప పద్ధతి మార్చుకోవాలని భార్యను పలుమార్లు హెచ్చరించాడు. అయితే భర్త మాటలను పెడచెవిన పెట్టిన ప్రియాంక.. వివాహేతర సంబంధం కొనసాగించేది. దీంతో ఎలాగైనా భార్యను చంపేయాలని భావించిన హుచ్చప్ప పక్కాగా ప్లాను వేశాడు. దైవదర్శనం కోసం శ్రీశైల పుణ్యక్షేత్రానికి వెళదామంటూ తన సోదరుడు, భార్యతో కలిసి బయలు దేరాడు. ఈ నేపథ్యంలో శ్రీశైలంలో దర్శనం పూర్తి చేసుకున్న వీరు 2011వ సంవత్సరం జూలై 25 తేదీ అర్ధరాత్రి ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండల పరిధిలోని కొర్రప్రోలు సమీపంలోకి రాగానే ముందుగా వేసుకున్న పథకం ప్రకారం సోదరుడి సహాయంతో నైలాన్ తాడును ప్రియాంక గొంతుకు బిగించి హతమార్చారు. అనంతరం మృతదేహాన్ని ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు .. ఒంటిపై ఉన్న దుస్తులను తొలగించి లోదుస్తులతో ఉన్న మృతదేహాన్ని రోడ్డు పక్కనే ఉన్న చప్టాలో పడేసి కర్ణాటకకు చేరుకున్నారు. ఈ హత్య విషయం మృతురాలి తల్లిదండ్రులకు తెలిసినా, కుమార్తె ప్రవర్తనతో విసిగిపోయిన వారు కూడా మౌనంగానే ఉన్నారు. ఈ క్రమంలో పరిచయం ఉన్న వారు నీ భార్య ఏదంటూ అడగగా, ఆమె ఎవరితోనో వివాహేతర సంబంధం పెట్టుకుని వెళ్లిపోయిందంటూ అందరినీ నమ్మించాడు. అప్పట్లో కేసు నమోదు చేసుకున్న దోర్నాల పోలీసులు దీనిపై చాలా కాలం విచారణ చేపట్టి విసిగి పోయారు. ప్రియాంక హత్య విషయం బయట పడిందిలా.. ప్రియాంకను భర్తే హతమార్చిన విషయం బంధువులందరికీ తెలిసినా ప్రియాంక ప్రవర్తన, నడవడిక కారణంగా ఎవరూ ఆ విషయాన్ని బయట పెట్టకుండా మనస్సులోనే దాచుకున్నారు. హుచ్చప్పకు, అతని దాయాదులకు ఆస్తి పంపకాల్లో నెలకొన్న విభేదాల కారణంగా మనస్పర్థలు వచ్చాయి. దీంతో వారు ప్రియాంక హత్యకు గురైన విషయాన్ని కర్ణాటకకు చెందిన పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది. గతేడాది జూన్ 1వ తేదీన మిస్సింగ్ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో కర్ణాటక పోలీసులు విచారణ చేపట్టి నిందితులు చెప్పిన ఆధారాల మేరకు పెద్దదోర్నాల పోలీసు స్టేషన్‌కు చేరుకోవడంతో అసలు విషయం బయట పడింది. దీంతో భర్త, అతని సోదరుడిపై కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేశారు. -
Fashion: బ్రాండ్ వాల్యూ.. ప్రియాంక మోహన్ కట్టిన చీర ధర 98 వేలు!
ఫొటోలో ఉన్న నటి తెలుసు కదా.. నాని ‘గ్యాంగ్ లీడర్’ హీరోయిన్ ప్రియాంక మోహన్. ఇటీవల జరిగిన ఓ అవార్డ్ ఫంక్షన్లో ఇలా సంప్రదాయ కట్టు.. ఫ్యాషన్ లుక్‌లో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా నిలిచింది. అలా ఆమెను నిలబెట్టిన అవుట్ ఫిట్, జ్యూయెలరీ బ్రాండ్స్ ఏంటో చూద్దాం.. జేడ్ బై మోనికా అండ్ కరిష్మా పెళ్లి కూతురి కలెక్షన్స్‌కు పెట్టింది పేరు ఈ బ్రాండ్. తమలోని ఫ్యాషన్ స్పృహ, భారతీయ హస్తకళల పట్ల తమకున్న మక్కువ, గౌరవాలకు ప్రతీకగా దీన్ని స్థాపించారు మోనికా షా, కరిష్మా స్వాలి. భారతీయ సంప్రదాయ నేత కళకు ఆధునిక ఆకృతులు, రంగులు, హంగులు అద్దుతున్నారు. జేడ్ బై మోనికా అండ్ కరిష్మా బ్రాండ్ పేరుకు దేశీయమైనా ఫ్యాషన్ రంగంలో అంతర్జాతీయ కీర్తిని సొంతం చేసుకుంటోంది. ధరలనూ అంతే స్థాయిలో అంచనా వేసుకోవచ్చు. ఆన్లైన్లో లభ్యం. ఏవీఆర్ స్వర్ణ మహల్ దక్షిణ భారతదేశానికి చెందిన జ్యూయెలరీ బ్రాండ్ ఇది. దీని ఎంబ్లమ్లో రెండు హంసలు ఉంటాయి. నగల స్వచ్ఛత, నాణ్యతకు గుర్తుగా. సరికొత్త డిజైన్సే కాదు కొనుగోలుదారుల నమ్మకం కూడా ఈ బ్రాండ్‌కు యాడెడ్ వాల్యూ. చెన్నై, సేలం, బెంగళూరు మొదలు దక్షిణ భారతదేశంలోని పదహారు ప్రాంతాల్లో పద్దెనిమిది షోరూమ్స్ ఉన్నాయి ఈ బ్రాండ్‌కు. నాణ్యత, డిజైన్లను బట్టి ధరలు. బ్రాండ్ వాల్యూ చీర బ్రాండ్: జేడ్ బై మోనికా అండ్ కరిష్మా ధర: రూ. 98,800 జ్యూయెలరీ బ్రాండ్: ఏవీఆర్ స్వర్ణ మహల్ ధర: నగల డిజైన్, నాణ్యతను బట్టి నేను వెరీ సింపుల్.. నార్మల్.. హ్యాపీ హ్యూమన్ బీయింగ్‌ని. ఎప్పుడూ పాజిటివ్‌గానే ఆలోచిస్తాను. ఇవే నన్ను గ్రేస్‌ఫుల్‌గా ఉంచుతున్నాయనుకుంటా! – ప్రియాంక మోహన్ -దీపిక కొండి -
వైరల్ చాయ్వాలీ ప్రియాంక.. దుకాణం బంద్!
పాట్నా: నిరుద్యోగంపై ఎదురు తిరిగి.. చివరకు సొంతంగా చాయ్ దుకాణం పెట్టిన ప్రియాంక కథ.. ఇంటర్నెట్లో ఎంతో స్ఫూర్తి ఇచ్చింది. రెండేళ్ల ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోవడంతో సొంతంగా ఆమె టీ స్టాల్ పెట్టుకుని.. గ్రాడ్యుయేట్ చాయ్‌వాలీగా గుర్తింపు దక్కించుకుంది. అయితే ఇప్పుడామె ఆ స్టాల్‌ను మూసేసింది. ఆగండి.. అందుకు ఓ ప్రత్యేక కారణం ఉంది. బీహార్ పాట్నాలో ఉమెన్స్ కాలేజీ దగ్గర ఓ టీ స్టాల్ నడిపిస్తోంది ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్ ప్రియాంక గుప్తా. 2019లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని ఉద్యోగ ప్రయత్నాలు చేసింది. కానీ, ఈ రెండేళ్లలో ఎలాంటి ఫలితం కనిపించలేదు. ఈ క్రమంలో.. ఎంబీఏ చాయ్‌వాలా ప్రఫుల్ బిలోర్(మధ్యప్రదేశ్) కథనం ఆమెకు స్ఫూర్తి ఇచ్చిందట. ఎప్పుడూ చాయ్‌వాలా కథనాలేనా? అందుకే చాయివాలీ కూడా ఉండాలన్న ఉద్దేశంతో ఈమధ్యే ఈ 24 ఏళ్ల అమ్మాయి టీ స్టాల్ ఓపెన్ చేసింది. ఇందుకు తల్లిదండ్రుల సహాకారం కూడా లభించింది. అయితే ఈ గ్రాడ్యుయేట్ చాయ్వాలీ కథనం.. ఓ వ్యక్తిని కదిలించిందట. అందుకే ప్రియాంక తన బిజినెస్‌ను విస్తరించుకునేందుకు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. ప్రియాంకకు ఫుడ్ ట్రక్‌ను అందించారు. దీంతో టీ స్టాల్‌ను ఎత్తేసిన ప్రియాంక.. ఫుడ్ ట్రక్‌ను కొందరు స్టాఫ్‌తో కలిసి నడిపిస్తోంది. తక్కువ టైంలో ఎదిగిన ఆమె కథతో సోషల్ మీడియా పవరేంటో మరోసారి నిరూపితమైంది. Bihar: Priyanka Gupta, an economics graduate sets up a tea stall near Women's College in Patna I did my UG in 2019 but was unable to get a job in the last 2 yrs. I took inspiration from Prafull Billore. There are many chaiwallas, why can't there be a chaiwali?, she says pic.twitter.com/8jfgwX4vSK — ANI (@ANI) April 19, 2022 -
ఫస్ట్ టైమ్ పర్వతాలు పరవశించి... ఆశీర్వదించాయి!
‘మనుషులు పర్వతాలతో కలిసి కరచాలనం చేసినప్పుడు గొప్ప అద్భుతాలు సంభవిస్తాయి’ అలాంటి అద్భుతాలను అయిదుసార్లు చవిచూసి మాటలకు అందని మహా అనుభూతిని సొంతం చేసుకుంది ప్రియాంక మోహితే. తాజాగా ప్రపంచంలోనే మూడో ఎల్తైన శిఖరం కాంచన్‌జంగా(8,586 మీటర్లు)ను అధిరోహించి జేజేలు అందుకుంటోంది మహారాష్ట్రలోని సతారాకు చెందిన ప్రియాంక మోహితే. ఈ విజయం ద్వారా ప్రపంచంలోని ఎనిమిదివేల మీటర్లకు పైగా ఎత్తు ఉన్న అయిదు పర్వతశిఖరాలను అధిరోహించిన తొలి భారతీయ మహిళగా రికార్డ్ సృష్టించింది. చిన్నప్పటి నుంచి పర్వతారోహణ గురించిన విషయాలు తెలుసుకోవడం, పర్వతారోహకులతో మాట్లాడడం అంటే ప్రియాంకకు చాలా ఇష్టం. ఆ ఇష్టమే తనను ప్రపంచం మెచ్చిన పర్వతారోహకురాలిగా మలిచింది. టీనేజ్‌లో తొలిసారిగా ఉత్తరాఖండ్‌లోని బందర్‌పంచ్ పర్వతశ్రేణిని అధిరోహించింది ప్రియాంక. ఇక ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. 2013లో మౌంట్ ఎవరెస్ట్(8,849 మీ), 2016లో మౌంట్ మకలు(8,485 మీ), మౌంట్ కిలిమంజారో(5,895 మీ), 2018లో మౌంట్ లోట్సే (8,516 మీ), గత సంవత్సరం మౌంట్ అన్నపూర్ణ (8,091 మీ) పర్వతాలను అధిరోహించింది. గత సంవత్సరం మౌంట్ అన్నపూర్ణ అధిరోహించడానికి బయలుదేరేముందు కోవిడ్ భయాలు సద్దుమణగలేదు. రకరకాల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోకతప్పలేదు. కొత్త విజయాన్ని నా ఖాతాలో వేసుకోబోతున్నాను...అంటూ ఒక వైపు అంతులేని ఆత్మవిశ్వాసం, మరోవైపు అక్కడి ప్రతికూల వాతావరణ పరిస్థితుల గురించి విన్న భయంగొలిపే విషయాలు తన మనసులో కాసేపు సుడులు తిరిగాయి. అయితే చివరికి మాత్రం ప్రతికూల ఆలోచనలపై ఆత్మవిశ్వాసమే అద్భుత విజయాన్ని సాధించింది. స్ట్రెంత్ ట్రైనింగ్ నుంచి క్రాస్ ఫిట్ వరకు ప్రత్యేక దృష్టి పెట్టింది. సాహసయాత్రకు బయలుదేరేముందు– ‘ప్రతి విజయం తరువాత సోషల్ మీడియాలో నా ఫాలోవర్స్ సంఖ్య పెరుగుతున్నారు. ఈసారి కూడా అలాగే జరగాలని ఆశిస్తున్నాను’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసింది ప్రియాంక. మౌంట్ అన్నపూర్ణను విజయవంతంగా అధిరోహించిన తరువాత సోషల్‌మీడియాలో ఆమె ఫాలోవర్స్ ఇబ్బడిముబ్బడిగా పెరిగారు. నాట్యం చేసిన పాదాలు పర్వతాలను ముద్డాడాయి (ప్రియాంకకు భరతనాట్యంలో మంచి ప్రావీణ్యం ఉంది)...అని కవిత్వం చెప్పినవారు కొందరైతే– ‘మీ విజయం నాలో ఆత్మవిశ్వాసాన్ని ఎంత పెంచిందో మాటల్లో చెప్పలేను’ అన్నవారు కొందరు. ప్రతి విజయ యాత్రకు ముందు– ‘నా కల నెరవేర్చుకోవడానికి బయలుదేరుతున్నాను’ అని పోస్ట్ పెడుతుంది ప్రియాంక. ఆ వాక్యానికి ఎన్నెన్ని ఆశీర్వాద బలాలు తోడవుతాయోగానీ ఆమె అద్భుత విజయాలను సాధిస్తుంటుంది. ముంబై యూనివర్శిటీలో బయోటెక్నాలజీలో పీజీ చేసిన ప్రియాంకకు పర్వతారోహణ అంటే టీనేజ్‌లో ఎంత ఉత్సాహంగా ఉండేదో, ఇప్పుడూ అంతే ఉత్సాహంగా ఉంది. ఆ ఉత్సాహమే 30 సంవత్సరాల ప్రియాంక బలం, మహా బలం! -
ఎవరూ కిడ్నాప్ చేయలేదు.. ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నాం: ప్రియాంక
సాక్షి, గుంతకల్లు రూరల్: బుగ్గసంగమేశ్వరాలయంలో ఇటీవల వివాహం చేసుకున్న ఓ జంట తహసీల్దార్ రామును గురువారం ఆశ్రయించింది. వివరాలు.. మైదుకూరుకు చెందిన ప్రియాంక అనే సచివాలయ ఉద్యోగి, గుంతకల్లు పట్టణానికి చెందిన సుమంత్ అనే యువకుడు కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ ఇద్దరూ ఈనెల 18న గుంతకల్లు సమీపంలోని బుగ్గ సంగమేశ్వరాలయంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. తమ కూతురు కిడ్నాప్ అయ్యిందని ప్రియాంక తల్లిదండ్రులు పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ జంట తహసీల్దార్‌ను కలిసి తామిద్దరూ ఇష్టపూర్వకంగానే వివాహం చేసుకున్నామని తెలిపింది. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని యువతి ప్రియాంక తహసీల్దార్‌కు తెలిపింది. తహసీల్దార్ సమక్షంలో మరోమారు దండలు మార్పించి ఒక్కటి చేశారు. చదవండి: (త్వరలో పెళ్లి, అంతలోనే కాబోయే భార్యభర్తలు జలసమాధి) -
బీజేపీలో చేరిన యూపీ కాంగ్రెస్ పోస్టర్‌గాళ్
లక్నో: డాక్టర్ ప్రియాంక మౌర్య... యూపీలో ప్రియాంకా గాంధీ వాద్రా రూపొందించిన ‘నేను అమ్మాయిని... పోరాడగలను’ నినాదపు గొంతుక. యూపీలో మహిళా సాధికారతకు ముఖచిత్రం. ప్రియాంకా గాంధీకి కుడిభుజంగా మెలిగిన ఆమె... గురువారం బీజేపీలో చేరారు. ఎన్నికల నేపథ్యంలో యూపీలో కాంగ్రెస్ పార్టీకి ఇది కోలుకోలేని దెబ్బ. ప్రియాంక మౌర్య... హోమియోపతి డాక్టర్. సామాజిక ఉద్యమకారిణి. అజాంగఢ్‌లో పుట్టి పెరిగారు. గ్వాలియర్ యూనివర్సిటీలో ఉన్నతవిద్యనభ్యసించారు. 2008లో స్పైస్‌జెట్‌లో చేరి ఎగ్జిక్యూటివ్‌గా రెండేళ్లపాటు పనిచేశారు. 2012లో తిరిగి డాక్టర్‌గా ప్రాక్టీస్ మొదలుపెట్టింది. అది మొదలు... ‘నేకీ కి దివార్’, ‘రోటీ బ్యాంక్’ వంటి స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేశారు. కరోనా పాండమిక్ సమయంలోనూ సేవకుగాను పలు అవార్డులు సైతం అందుకున్నారు. 2020 డిసెంబర్లో ఆమె కాంగ్రెస్‌పార్టీలో చేరారు. ఆ తరువాత 2021 నవంబర్‌లో పార్టీ ఆమెను మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలిగా నియమించింది. ప్రియాంక మౌర్య... మంచి వక్త. తన మాటలతో యువతను ఇట్టే ఆకట్టుకునే గుణం. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. లక్షల మంది అభిమానులున్నారు. ఐదు కోట్ల మంది మహిళా ఓటర్లున్న యూపీ రాజకీయాల్లో వారి పాత్ర కీలకం. దాంతో ప్రియాంక గాంధీ... . 2021 డిసెంబర్ 8న మహిళా మేనిఫెస్టో ‘శక్తి విధాన్’ను విడుదల చేశారు. మహిళా సాధికారతకు గుర్తుగా ‘మై లడకీ హూ... లడ్ సక్తీ హూ’ స్లోగన్‌కు ప్రియాంక మౌర్యను ప్రచారకర్తగా ఎంచుకున్నారు. పార్టీ కోసం పనిచేస్తూనే... లక్నోలోని సరోజిని నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రియాంకమౌర్య సీట్ ఆశించారు. అందుకనుగుణంగానే తన కార్యకలాపాలను విస్తరించారు. తీరా సీట్ల కేటాయింపుల్లో కాంగ్రెస్‌పార్టీ ప్రియాంకను పక్కన పెట్టింది. ఆమె పనిచేస్తున్న అసెంబ్లీ నియోజకవర్గ సీటును రుద్రదామన్ సింగ్‌కు కేటాయించింది. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ప్రియాంక బీజేపీలో చేరారు. కాంగ్రెస్ మహిళా వ్యతిరేక పార్టీ ‘‘నా నియోజకవర్గంలోని ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కుతుందనుకున్నాను. కానీ కాంగ్రెస్‌పార్టీ మోసం చేసింది. వాళ్లు ముందే అనుకున్నట్టుగా మరో వ్యక్తికి సీటిచ్చారు. మహిళలు, మౌర్య, కుష్వాహ, శాక్య, సైనీ కులాల ఓట్లను రాబట్టుకోవడానికి నన్ను వాడుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రచారంకోసం నన్ను, సోషల్‌మీడియాలో నాకున్న లక్షల మంది అభిమానులను ఉపయోగించుకున్నారు. వెనుకబడిన వర్గాలకు చెందినదాన్ని, లంచం ఇవ్వలేను కాబట్టి నాకు టికెట్ ఇవ్వలేదు. కాంగ్రెస్ మహిళా వ్యతిరేక పార్టీ. ‘లడకీ హూ... లడ్ సక్తీ హూ’ అనే నినాదమిచ్చారు. నినాదాలు, మాటలతోనే పనవ్వదు. అవకాశాలు ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోరాడటానికి నాకు అవకాశమే ఇవ్వలేదు. ప్రియాంకగాంధీతో సైతం నేను పోరాడగలను అని ఇప్పుడు నిరూపించుకుంటాను. శక్తి, సమయం వెచ్చించి నేను పనిచేసిన ఆ పార్టీ నాకు టికెట్ ఇవ్వలేదు కాబట్టే బీజేపీలో చేరాను. నేను హోమియోపతి డాక్టర్‌ను... తీయటి మందులివ్వడమే కాదు.. తీయగా మాట్లాడటమూ వచ్చు. ఇప్పుడా పని బీజేపీ కోసం చేస్తాను. నిత్యం సమాజ సేవలోనే ఉంటా.’’ -
ప్రియాంక నాకు మంచి ఫ్రెండే కానీ...
-
బెంగాల్ లో మూడు స్థానాలకు ఉపఎన్నిక పోలింగ్
-
దీదీ వర్సెస్ ప్రియాంక సమరానికి సై
-
తల్లిదండ్రులకు మళ్లీ పెళ్లి చేసిన బుల్లితెర నటి
'మౌనరాగం' సీరియల్‌తో అమ్ములుగా తెలుగు ప్రేక్షకులను అలరించిన బుల్లితెర నటి ప్రియాంక జైన్. ఈ సీరియల్‌తో ఎంతో గుర్తింపు పొందిన ఈ భామ ప్రస్తుతం 'జానకి కలగనలేదు' సీరియల్లో మెయిన్ లీడ్ పాత్ర పోషిస్తుంది. ఈ సీరియల్ ఇప్పుడు టీఆర్పీ రేటింగ్‌లో దూసుకుపోతుంది. సోషల్‌మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే ప్రియాంకకు బాగానే ఫాలోవర్లు ఉన్నారు. తనకు సంబంధించిన అప్డేట్స్ను షేర్చేస్తూ ఎప్పకటిప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా తన తల్లిదండ్రుల 24వ వార్షికోత్సవం సందర్భంగా వారికి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చింది. 'ఈరోజు మా అమ్మానాన్నల పెళ్లిరోజు. అప్పట్లో వారు ఇంట్లో తెలియకుండా పెళ్లిచేసుకున్నారు. కాబట్టి వాళ్లకు ఈ రోజు మళ్లీ పెళ్లి చేస్తున్నాం. తల్లిదండ్రులు ఎప్పుడూ తమ పిల్లల క్షేమాన్ని, సంతోషాన్నే కోరుకుంటారు. కానీ పిల్లలుగా ఈసారి మేం వాళ్లకు మర్చిపోలేని సంతోషాన్ని ఇవ్వాలనుకుంటున్నాం. 24వ వివాహ వార్షికోత్సవాన్ని మరింత స్పెషల్‌గా సెలబ్రేట్ చేయాలనుకున్నాం. అందుకే వాళ్లకు మళ్లీ పెళ్లి చేశాం' అని పేర్కొంది. ఇక ఈ వీడియోలో హల్దీ, మెహందీ సహా అన్ని కార్యక్రమాలను ప్రియాంక దగ్గరుండి సెలబ్రేట్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) చదవండి : హీరో శింబుకు ఊరట.. రెడ్‌కార్డు రద్దు అప్పుడే విలన్ పాత్రల గురించి ఆలోచిస్తా : సుధీర్ బాబు -
ప్రియాంక ఫిర్యాదు.. పోలీసుల అదుపులో తీన్మార్ మల్లన్న
సాక్షి, హైదరాబాద్: యూ ట్యూబ్ చానల్ క్యూ న్యూస్ వ్యవస్థాపకుడు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ప్రియాంక అనే యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మల్లన్నతో పాటు క్యూ న్యూస్ చానల్‌పై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే సైబర్ క్రైమ్ పోలీసులు, టాస్క్‌ఫోర్స్ బృందం, స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్వోటీ) అధికారులతో పాటు స్థానిక పోలీసులు రాత్రి క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి చేశారు. మల్లన్నను అదుపులోకి తీసుకోవడంతో పాటు ఆ సంస్థ కార్యాలయం నుంచి కొన్ని హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. కొన్ని రోజులుగా క్యూ న్యూస్ మాజీ విలేకరి చిలుక ప్రవీణ్, తీన్మార్ మల్లన్న మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో రెండు రోజుల కిందట విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన ప్రవీణ్ అందులో మల్లన్నపై అవినీతితోపాటు పలు ఆరోపణలు చేశారు. దీనికి కౌంటర్‌గా మల్లన్న ఆదివారం న్యూస్‌లో కొన్ని ప్రత్యారోపణలు చేశారు. సైబర్ క్రైమ్ ఏసీపీకి ప్రియాంక ఫిర్యాదు.. ఈ నేపథ్యంలోనే మల్లన్న.. ప్రవీణ్‌తో కలసి ఉన్న కొందరు యువతుల ఫొటోలు, వీడియోలను ప్రదర్శిస్తూ అభ్యంతరకరంగా వ్యాఖ్యానించారు. వాటిలో ప్రియాంక ఫొటోలు కూడా ఉన్నాయి. ఈ విషయం తెలుసుకున్న ఆమె మంగళవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. తాను ప్రవీణ్ స్నేహితురాలినని.. స్నేహపూర్వకంగా దిగిన ఫొటోలను చూపిస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆమె పేర్కొన్నారు. క్యూ న్యూస్‌లో మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యల వల్ల తన వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతినడంతో పాటు తీవ్ర మనోవేదనకు గురయ్యానంటూ ప్రియాంక ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు సోమవారం ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేశారు. మల్లన్న వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను సంగ్రహించారు. వీటి ఆధారంగా బుధవారం రాత్రి క్యూ న్యూస్ కార్యాలయంపై ప్రత్యేక బృందాలు దాడి చేశాయి. సైబర్ క్రైమ్ పోలీసులు మల్లన్నను అదుపులోకి తీసుకోవడంతో పాటు హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. అతన్ని విచారిస్తామని, ఆపై అరెస్టు చేయాలా? నోటీసులు జారీ చేయాలా? అనేది నిర్ణయిస్తామని అధికారులు పేర్కొన్నారు. అదుపులోకి తీసుకునే సమయంలో కొందరు మల్లన్న అభిమానులు క్యూ న్యూస్ కార్యాలయానికి చేరుకొని పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో అక్కడ గందరగోళం నెలకొంది. -
కలుద్దామా డార్లింగ్.. కానీ తేరుకునేలోపు కటకటాల్లో
అతడో రేపిస్ట్. అమాయకురాలిని మోసం చేసి గర్భవతిని చేశాడు. మూడు రోజుల క్రితం ఆ సంగతి హాస్పిటల్ వర్గాల నుంచి ఢిల్లీ మహిళా పోలీస్ సెల్‌కు అందింది. అక్కడ ఎస్.ఐ ప్రియాంక సయాని. అతణ్ణి పట్టుకోవాలి. ‘ఆకాశ్’ అన్న పేరు తప్ప వేరే ఏ వివరాలు తెలియవు. ఆమె ఫేస్బుక్లో అకౌంట్ ఓపెన్ చేసింది. ‘ఆకాశ్’ అనే పేరున్న ఢిల్లీ కుర్రాళ్లందరికీ ఫ్రెండ్ రిక్వెస్ట్స్ పంపింది. తర్వాత? నేరం చేసి తప్పించుకుందాం అనుకునేవారికి ప్రియాంక వంటి ఆఫీసర్ల నుంచి ఇలాంటి మెసేజే వస్తుంది... ‘కలుద్దామా డార్లింగ్’... జూలై 30– 2021. ఢిల్లీలోని ఒక హాస్పిటల్ నుంచి ద్వారకాలోని మహిళా సెల్‌కి ఫోన్ వచ్చింది. అక్కడ డ్యూటీలో ఉన్న ఎస్.ఐ. ప్రియాంక సయాని ఆ కాల్ అటెండ్ చేసింది. అవతల డాక్టర్ ఆమెతో మాట్లాడాడు. ‘మా దగ్గర ఒక మైనర్ అమ్మాయి వచ్చింది. ఆమె మీద లైంగిక దాడి జరిగింది. ఎన్నాళ్లుగా జరుగుతున్నదో తెలియదు. ఆమె ప్రస్తుతం గర్భవతి’ అని డాక్టర్ చెప్పాడు. వెంటనే ప్రియాంక సయాని హాస్పిటల్‌కు వెళ్లింది. బాధితురాలితో మాట్లాడింది. బాధితురాలు అమాయకురాలు అని తెలుస్తోంది. ‘ఎవరు?’ అని అడిగితే ‘ఆకాశ్’ అని చెప్పింది. ఎక్కడ ఉంటాడు అంటే ఆమెకు తెలియదు. ఏం చేస్తుంటాడు అంటే గాజుల బిజినెస్ అని అంది. అతని ఫొటో కూడా ఆ అమ్మాయి దగ్గర లేదు. ఢిల్లీ అంటే మహా నగరం.ఇంత పెద్ద నగరంలో ఇంత దుర్మార్గాన్ని చేసిన వాణ్ణి ఎలా పట్టుకోవడం? కాని పట్టుకోవాలి అని ప్రియాంక నిశ్చయించుకుని ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసింది. ఆ రోజు రాత్రే తన ఫొటోతోనే, సాధారణ బట్టల్లో ఉన్న ఫొటో పెట్టి, ఒక దొంగ పేరుతో ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసింది ప్రియాంక. ఢిల్లీలో నివసిస్తున్న ఆకాశ్ అనే పేరున్న ఫేస్బుక్ ఐడిలకు రాండమ్‌గా ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పెట్టడం మొదలెట్టింది. కొంత మంది యాక్సెప్ట్ చేశారు. కొంతమంది రిజెక్ట్ చేశారు. ఆ నిందితుడు ఆకాశ్ అనేవాడు రిజెక్ట్ చేసినవారిలో ఉండొచ్చు... లేదా యాక్సెప్ట్ చేసినవారిలో ఉండొచ్చు. అంతా లాటరీ. తన ఫ్రెండ్ రిక్వెస్ట్ ఓకె చేసిన ఆకాశ్‌లకు మెసేజ్‌లు పెట్టడం ప్రారంభించింది ప్రియాంక. హాయ్... ఎలా ఉన్నావ్... ఫ్రీనా... ఎవరూ పట్టించుకోలేదు. ఒక్కడు మాత్రం రియాక్ట్ అయ్యాడు. హాయ్ అని రిప్లై పెట్టాడు. వీడేనా వాడు అని ప్రియాంక అనుకుంది. నెక్ట్స్ అంకానికి తెర తీసింది. మెల్లగా మాటలు మొదలెట్టింది. ఏం చేస్తుంటావు... అని అడిగితే గాజుల డిజైనర్ అని చెప్పాడు. తను మెచ్చుకుంది. నీ ఫొటో కావాలి అని మెసెంజర్లోనే తెప్పించుకుంది. వెంటనే దానిని రేప్ విక్టిమ్‌కి చూపితే ఇతనే అని చెప్పిందా అమ్మాయి. ఇక పట్టుకోవాలి. ప్రియాంక ఇప్పుడు అతనితో పీకల్లోతు ప్రేమలో దిగిపోయానని చెప్పింది. మనం వెంటనే కలవాలి అని కూడా చెప్పింది. అంతా చేసి అప్పటికి రెండు రోజులే అయ్యింది నాటకం మొదలయ్యి. అతను కూడా హుషారుగా స్పందించాడు. నంబర్ ఇవ్వు అన్నాడు. తన నంబర్ ఇచ్చాడు. వీడియో చాటింగ్ చేద్దాం అన్నాడు. ప్రియాంక వీడియో కాల్ చేసి తీపి కబుర్లు చెప్పింది. ‘మనం కలవాలి డార్లింగ్’ అంది. ఎక్కడ కలుద్దామో నువ్వే చెప్పు అంది. వీడియో కాల్ కూడా మాట్లాడటంతో అతడికి నమ్మకం కుదిరింది. మొదట మెట్రో స్టేషన్లో అన్నాడు. కాని చివరి నిమిషంలో కేన్సిల్ చేశాడు. మిస్సయిపోయాడని ప్రియాంక అనుకుంది. కాని మళ్లీ అతడే శ్రీమాతా మందిర్‌లో కలుద్దాం అన్నాడు. ప్రియాంక చక్కగా తయారై అక్కడకు వెళ్లింది. తోడు మఫ్టీలో ఉన్న పోలీసులు. అతడు ఏదో ఊహించుకుని వచ్చాడు. కానీ తేరుకునేలోపు కటకటాల్లో ఉన్నాడు. ప్రియాంక తెలివిని ద్వారకా డీసీపీ సంతోష్ కుమార్ అభినందించాడు. కేవలం రెండు రోజుల్లో ఆమె అతణ్ణి పట్టుకున్నందుకు మీడియాకు సమాచారం అందించి స్త్రీలకు అన్యాయం చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని తేల్చి చెప్పాడు. ఇప్పుడు ఢిల్లీలో స్టార్ పోలీస్ ప్రియాంక. -
ఒలింపిక్స్ నడక
‘‘ఒలింపిక్స్ అన్న మాటే నా ఆలోచనల్లో ఉండేది కాదు. ఇప్పుడు ఏకంగా ఒలింపిక్స్‌లోనే ఆడబోతున్నాను’’. ఫిబ్రవరి 13 న రాంచీలో జరిగిన రేస్ వాకింగ్ జాతీయ స్థాయి పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించి, ఒలింపిక్స్‌కి అర్హత పొందిన ప్రియాంక గోస్వామి (24) అన్న మాట ఇది!! నిజమే, ఆమె కుటుంబ పరిస్థితులు కూడా అటువంటివే! చదువే భారమైనప్పుడు ఆటలు, ఆటల పోటీలు, ఒలింపిక్స్.. ఇవన్నీ ఊహకైనా సాధ్యమయేవేనా! అయ్యాయి. అందుకు ముగ్గురు వ్యక్తులు కారణం. తల్లి, తండ్రి, కోచ్. ‘‘ఈ ముగ్గురూ స్పోర్ట్స్‌లో నాకొక అందమైన భవిష్యత్తును ప్రసాదించారు. వారు చూస్తుండగా ఒలింపిక్స్‌లో ఆడబోతున్నాను’’ అని సంబరంగా అంటున్న ప్రియాంక ప్రస్తుతం టోక్యోలో జూలైలో జరిగే ఒలింపిక్స్‌కి సాధన చేస్తోంది. ప్రియాంక ఈ ఫిబ్రవరిలో 1:28:45 నిముషాలలో 20 కి.మీ. రేస్ వాక్‌లో లక్ష్యాన్ని సాధించి, విజేతగా నిలిచినప్పటి నుంచీ రానున్న టోక్యో ఒలింపిక్స్ లో భారత్‌కు ఆమె ఒక పసిడి ఆశ అయింది. ప్రియాంక ఉత్తర ప్రదేశ్ క్రీడాకారిణి. ఆమె తండ్రి మదన్ పాల్ ప్రభుత్వ రవాణా శాఖలో బస్ కండక్టర్. వాళ్లుండే ముజఫర్‌నగర్ బుధాన ప్రాంతంలోని సాగడి గ్రామం నుంచి ఉద్యోగం కోసం భార్యాబిడ్డలతో మీరట్ వచ్చేశారు ఆయన. ప్రియాంక పెద్దమ్మాయి. ఆమె తమ్ముడు కపిల్. తల్లి అనిత గృహిణి. డ్యూటీలో ఉండగా ఒక రోడ్డు ప్రమాదం కేసులో బస్ డ్రైవర్ తో పాటు, ప్రియాంక తండ్రి ఉద్యోగం కూడా పోయింది. ఆర్థికంగా అసలే అంతంత మాత్రం అయిన ఆ కుటుంబం ఒక్కసారిగా కుదేలైపోయింది. అయితే బిడ్డల చదువు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆగకూడదని తీర్మానించుకున్నారా భార్యాభర్తలు. మదన్‌పాల్ టాక్సీ అద్దెకు తీసుకుని నడిపాడు. భార్య చేత చిన్న కిరాణా దుకాణం పెట్టించాడు. పిండి మర ఆడించాడు. స్కూలు లేనప్పుడు పిల్లలిద్దరూ తల్లిదండ్రుల కష్టాన్ని పంచుకునేవారు. ప్రియాంక మీరట్‌లోని కనోహర్లాల్ గర్ల్స్ స్కూల్లో చదివింది. పాటియాలలో బి.ఎ. పూర్తి చేసింది. బి.ఎ. చదువుతున్నప్పుడే ఆమె రేస్ వాక్‌ను తనకు ఇష్టమైన క్రీడాంశం గా ఎంచుకుని ప్రాక్టీస్ చేసింది. ఆ సమయంలో తండ్రి పంపించిన డబ్బుతోనే సర్దుకునేది. నెలకు ఐదు నుంచి ఆరు వేల రూపాయల వరకు పంపేవారు ఆయన. వాటిల్లోనే కొంత మిగుల్చుకుని మిగతా ఖర్చులకు వాడుకునేది. అందుకోసం తరచు ఆమె ఒక పూట మాత్రమే భోజనం చేసింది. 2011లో రేస్ వాక్‌లో రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించాక ఆ ఈవెంట్‌పై మరింత శ్రద్ధ పెట్టింది ప్రియాంక. ఆమె తమ్ముడు కూడా స్పోర్ట్స్మనే. స్టేట్ లెవల్ బాక్సింగ్ ప్లేయర్. మీరట్‌లో ఇప్పుడు ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. 2014–15లో ప్రియాంక డిగ్రీ అయ్యాక ఆమెకు బెంగళూరులోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉచితంగా శిక్షణ లభించడానికి ఆమె కోచ్ గౌరవ్ త్యాగి చేసిన ప్రయత్నాలే కారణం. 2018లో ప్రియాంకకు స్పోర్ట్స్ కోటాలో రైల్వేలో ఉద్యోగం వచ్చాక ఆ కుటుంబ పరిస్థితి కాస్త మెరుగైంది. ‘‘స్కూల్లో ఉన్నప్పుడే నాన్న నాకు అప్పు చేసి స్కూటీ కొనిచ్చాడు. దానిపై స్కూలుకూ, స్టేడియంలో ప్రాక్టీస్‌కీ వెళ్లేదాన్ని. పరీక్షలు, స్పోర్ట్ ఈవెంట్లు ఉన్నప్పుడు ఆమ్మ నిద్ర మానుకుని మరీ నాకోసం అన్నీ అమర్చిపెట్టే పనిలో ఉండేది. ఇక నా కోచ్ త్యాగి సర్ అయితే నా శిక్షణ కోసం చాలా కష్టపడ్డారు. వారందరి వల్లే నేను ఈ రోజు ఒలింపిక్స్‌కి అర్హత సాధించాను’’ అని ప్రియాంక చెబుతోంది. స్కూల్లో ఉండగా ప్రియాంకకు క్రీడల్లో అసక్తికరమైన అంశం జిమ్నాస్టిక్స్. కొంతకాలం తర్వాత అథ్లెటిక్స్ వైపు వచ్చింది. డిగ్రీ అయ్యాక రేస్ వాకింగ్పై ఇష్టం పెంచుకుంది. ఫ్యాషన్ మోడలింగ్ కూడా ఇష్టం. -
'శ్రీకారం' మూవీ రివ్యూ
టైటిల్ : శ్రీకారం నటీనటులు : శర్వానంద్, ప్రియాంకా అరుళ్ మోహన్, సాయికుమార్, మురళీ శర్మ, రావు రమేశ్ తదిరులు నిర్మాణ సంస్థ : 14 రీల్స్ ప్లస్ నిర్మాతలు : రామ్ ఆచంట, గోపీ ఆచంట దర్శకత్వం : బి.కిశోర్ సంగీతం : మిక్కీ జె. మేయర్ సినిమాటోగ్రఫీ : జే యువరాజ్ ఎడిటింగ్ : మార్తండ్ కె వెంకటేశ్ విడుదల తేది : మార్చి 11, 2021 'జాను' సినిమాతో నిరాశపర్చిన శర్వానంద్ ఈసారి లవ్‌స్టోరీని కాకుండా రైతుల స్టోరీని ఎంచుకున్నాడు. "కావాల్సినంత ప్రేమ.. సరిపోయే సెంటిమెంట్.. అల్లరి చేసే ఫ్రెండ్స్.. ఏడిపించే నాన్న.. నవ్వించే విలన్.. అందమైన అమ్మాయి.. అన్నం పెట్టే భూమి.. దీని చుట్టూ తిరిగే హీరో కారెక్టర్.. ఇదే శ్రీకారం కథ" అంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కథ, కాన్సెప్ట్ పూర్తిగా రివీల్ చేశాడు శర్వానంద్. ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందన్న ఈ చిత్రం మహాశివరాత్రి సందర్భంగా నేడు(మార్చి 11)న రిలీజైంది. దీనికి పోటీగా మరో రెండు, మూడు సినిమాలు కూడా విడుదలయ్యాయి. అయితే ఇటీవల రైతు కథాంశం మీద వచ్చిన సినిమాలు తక్కువే. చాలా కాలం తర్వాత వస్తున్న ఈ కర్షకుల చిత్రం ఎలా ఉంది? రైతు బిడ్డగా శర్వానంద్ ఏ మేరకు మెప్పించాడు? అన్న అంశాలను రివ్యూలో తెలుసుకుందాం... కథ: అనంతరాజపురానికి చెందిన రైతు కేశవులు(రావు రమేష్) కొడుకు కార్తీక్ (శర్వానంద్) ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. తన పనితనంతో ఆఫీస్‌లో అందరి మన్ననలు పొందుతాడు. చైత్ర(ప్రియాంకా అరుళ్ మోహన్) ఇతడిని బుట్టలో వేసుకునేందుకు ఎంత ట్రై చేసినప్పటికీ ఆమెను పట్టించుకోకుండా తన పని తను చేసుకుపోతుంటాడు. ఒక ప్రాజెక్ట్ వర్క్‌ను విజయవంతం చేయడంతో కంపెనీ యాజమాన్యం అతన్ని అమెరికా పంపించేందుకు డిసైడ్ అవుతుంది. కానీ కార్తీక్ మాత్రం ఉద్యోగం మానేసి వ్యసాయం చేయడానికి తన గ్రామానికి వెళ్తాడు. వ్యవసాయం దండుగ అని వదిలేసిన కొంత మంది రైతులతో కలిసి ఉమ్మడి వ్యవసాయం మొదలు పెడతాడు. అసలు కార్తిక్ సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేసి వ్యవసాయం వైపు ఎందుకు మళ్లాడు? ఉమ్మడి వ్యవసాయం అంటే ఏంటి? ఉమ్మడి వ్యవసాయంలో ఎదురైన సమస్యలను కార్తిక్ ఎలా పరిష్కరించాడు? టెక్నాలజీని ఉపయోగించి వ్యవసాయాన్ని ఎలా లాభసాటిగా మలిచాడు అనేదే మిగతా కథ. నటీనటులు విభిన్నమైన కథాంశాలను ఎంచుకునే శర్వానంద్ ఈ సినిమాలోనూ నటనతో మెప్పించాడు. కంప్యూటర్ ముందు యంత్రంలా పని చేసే యువ సాఫ్ట్వేర్ పొలంలోకి దిగుతే ఎలా ఉంటుందన్నది కళ్లకు కట్టినట్లు చూపించాడు. సాధారణ రైతు కుటుంబానికి చెందిన కార్తిక్ పాత్రలో శర్వానంద్ ఒదిగిపోయాడు. తనకు ఉన్న అనుభవంతో కొన్ని ఎమోషనల్ సీన్లను కూడా చక్కగా పండించాడు. కథనంతా తన భూజాన వేసుకొని నడిపించాడు. తుంటరి పిల్ల చైత్ర పాత్రలో ప్రియాంకా అరుళ్ మోహన్ మెప్పించింది.ఇక ఈ సినమాకు మరో ప్రధాన బలం హీరో తండ్రి కేశవులు పాత్ర చేసిన రావు రామేశ్‌ది. నిరుపేద రైతు కేశవులు పాత్రలో రావు రమేశ్ ఒదిగిపోయాడు. ఇక మంచితనం ముసుగు కప్పుకొని జనాన్ని మోసం చేసే ఏకాంబరం పాత్రలో సాయి కుమార్ పర్వాలేదనిపించారు. హీరో తల్లిగా ఆమని ఆకట్టుకుంది. నరేశ్, మురళి శర్మ, సత్య తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. విశ్లేషణ చదువుకున్న యువకులు వ్యవసాయం చేస్తే ఎంత లాభం ఉంటుందో తెలియజేసే కథే ‘శ్రీకారం’. వ్యవసాయం, రైతు యొక్క గొప్పతనాన్ని తెరపై చక్కగా చూపించాడు దర్శకుడు బి.కిశోర్. కష్టంపడి పనిచేసి పంటను పండించిన రైతు.. తన పంటను అమ్ముకోలేక ఎంతటి కష్టాలు పడుతాడో ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. అలాగే రైతులకు అప్పులు ఇచ్చిన వడ్డీ వ్యాపారులు.. వారిని ఎలా పీక్కుతింటారనేది వాస్తవానికి దగ్గరగా చూపించాడు. మంచి సందేశాత్మక కథ అయినప్పటికీ.. ఇది అందరికి తెలిసిన సబ్జెక్టే. రైతుల కష్టం నేపథ్యంలో ఇప్పటికే బోలెడు చిత్రాలు వచ్చాయి. కొత్తదనం లేకపోవడం ఈ సినిమా ప్రధాన లోపం. దానికి తోడు స్లో నెరేషన్ కూడా ప్రేక్షకుడిని కాస్త ఇబ్బంది పెడుతుంది. మిక్కీ జె. మేయర్ సంగీతం కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. పెంచలదాస్ రాసి పాడిన ‘వస్తానంటివో’ పాట తప్ప మిగతావన్ని అంతంతమాత్రమే. ఇక ఈ సినిమాకు ప్రధాన బలం సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్. ‘ఒక హీరో తన కొడుకును హీరో చేస్తున్నాడు.. ఒక డాక్టర్ తన కొడుకును డాక్టర్ చేస్తున్నాడు.. ఒక ఇంజనీర్ తన కొడుకును ఇంజనీర్ చేస్తున్నాడు.. కానీ ఒక రైతు మాత్రమే తన కొడుకును రైతు చేయడం లేదు’, ‘తినేవాడు నెత్తి మీద జుట్టంతా ఉంటే.. పండించేవాడు మూతి మీద మీసం అంత లేరు’లాంటి సంభాషణలతో రైతుల దీనగాథను వివరించారు. అలాగే ‘పనిని పట్టి పరువు.. పరువుని పట్టి పలకరింపు’, ‘ఉద్యోగం వస్తే అమ్మని బాగా చూసుకుందాం అని అనుకున్నానురా.. ఇప్పుడు ఉద్యోగం తప్ప ఇంకేం చూసుకోలేకపోతున్నా’అనే డైలాగ్స్ యువతను ఆలోచింపజేస్తాయి. స్క్రీన్‌ప్లే బాగుంది. ఎడిటర్ మార్తండ్ కె వెంకటేశ్ తన కత్తెరకు కాస్త పనిచెప్పాల్సింది. చాలా సన్నివేశాలను ఇంకాస్త క్రిస్ప్‌గా కట్ చేస్తే బాగుండనిపిస్తుంది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. b ప్లస్ పాయింట్స్ శర్వానంద్ నటన సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ మైనస్ పాయింట్స్ రొటీన్ స్టోరీ స్లో నేరేషన్ సెకండాఫ్‌లో కొన్ని సాగదీత సీన్లు - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్