
సాక్షి, హైదరాబాద్ : శంషాబాద్‌లోని సిద్దులగుట్ట సమీపంలో మహిళ అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిన్న సాయంత్రం మహిళ ఆ పరిసరాల్లో సంచరించడాన్ని గుర్తించినట్లు పోలీసుల విచారణలో స్థానికులు వెల్లడించారు. ఏడుస్తూ తిరుగుతున్న ఆమెను స్థానిక పూజారి ప్రశ్నించగా... ఆ మహిళ హిందీలో మాట్లాడిందని, తనకు అర్థం కాలేదని పూజారి తెలిపారు. కాగా మహిళ ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. సిద్ధులగుట్ట ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తుంచారు. మృతురాలు ధూల్‌పేటకు చెందిన కవితా భాయ్ (35)గా గుర్తించారు. గత కొంతకాలంగా ఆమె మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
చదవండి: శంషాబాద్‌లో మరో ఘోరం
Comments
Please login to add a commentAdd a comment