సాక్షి, హైదరాబాద్ : మానవ మృగాల చేతిలో దారుణ హత్యకు గురైన వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డి గురించి ఆమె మామ (పేరు చెప్పడానికి ఇష్టపడలేదు) పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆయన మాటల్లోనే.. ‘ప్రియాంకకు జంతువులంటే చాలా ఇష్టం. వాటిమీద మక్కువతో మెడిసిన్‌లో సీటు వచ్చినా చేరకుండా వెటర్నరీ కోర్సు చదివింది. చిన్నప్పటి నుంచీ కుక్కలు, ఆవులు, గుర్రాలకు ఆహారం తినిపించేది. కొన్ని జంతువులను పెంచుకోవాలనుకుంది కానీ, ఇల్లు చిన్నగా ఉండడం వల్ల కుదరలేదు. ఆమె తండ్రి ఉద్యోగ రీత్యా వారానికొకసారి ఇంటికి వచ్చేవారు. దాంతో మూడేళ్ల క్రితం తనకు జాబ్ రావడంతో కుటుంబాన్ని శంషాబాద్‌కు షిఫ్ట్ చేసింది. ప్రియాంకకు ఆన్‌లైన్‌లో కొత్త వంటకాలను చేయడం, జంతువులను ప్రేమించడం, పుస్తకాలు చదవడం, కుటుంబంతో సమయం గడపడం అంటే చాలా ఇష్టం. సంప్రదాయ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన తాము పిల్లలను పద్ధతిగా పెంచామ’ని వివరించారు.
‘మా కులంలో ఎవరైనా పెళ్లి కాకముందే చనిపోతే దహన సంస్కారాలకు ముందు చెట్టుతో వివాహం జరిపించడం ఆచారం. కానీ ప్రియాంక దానికి కూడా నోచుకోలేదు. ఇప్పుడు ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకోవడం తప్ప మేం చేయగలిగిందేం లేదు. ఏం చేసినా పోయిన ప్రాణం తిరిగి రాదు కాబట్టి మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం. నిర్భయ ఘటన తర్వాత కఠినమైన చట్టాలు తెచ్చినా ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయంటే ఎక్కడో లోపం ఉంది. వాటిని సరిచేయాలి. ఆడపిల్లలకి భారతదేశంలో భద్రత ఉంటుందని తెలిసేలా తగిన చర్యలు తీసుకోవాలి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఘటనపై స్పందించలేదు. కనీసం సంతాపం కూడా తెలియజేయలేద’ని విచారం వ్యక్తం చేశారు.
చదవండి : ముందే దొరికినా వదిలేశారు!
Comments
Please login to add a commentAdd a comment