shamshabad
-
ఆరేళ్లలో ఐదు కోట్ల మంది ప్రయాణికులు
హైదరాబాద్: ఆరేళ్లలో శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య ఏటా 5 కోట్ల స్థాయికి చేరుతుందని జీఎంఆర్ గ్రూప్ అంచనా వేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 2.9 కోట్లుగా ఉంటుందని జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సీఈవో ప్రదీప్ పణిక్కర్ వెల్లడించారు. ‘2023–24లో 2.5 కోట్ల మంది శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రయాణాలు చేశారు. కంపెనీ ప్రస్తుత కార్గో టెరి్మనల్ విస్తరణ కోసం రూ.370 కోట్లు పెట్టుబడి పెట్టే ప్రక్రియలో ఉంది. ఏటా 4 లక్షల టన్నుల సామర్థ్యా న్ని చేరుకోవడానికి కొత్త టెరి్మనల్ ఏర్పా టు చేస్తోంది. విమానాశ్రయం ఇప్పటికే ఏటా 4 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందించేలా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసింది. 2008లో ఏటా 1.2 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా ఎయిర్‌పోర్టును నిర్మించారు’ అని వివరించారు. -
శంషాబాద్‌లో మళ్లీ ‘హైడ్రా’ కొరడా.. కమిషనర్ వార్నింగ్
సాక్షి,శంషాబాద్:శంషాబాద్ మున్సిపాలిటీలో శుక్రవారం(ఫిబ్రవరి7) హైడ్రా కొరడా ఝలిపించింది. రోడ్డుపై అనుమతులు లేకుండా ఏర్పాటుచేసిన 39 హోర్డింగ్‌లను తొలగించింది. హోర్డింగ్‌లు ఏర్పాటు చేసిన యజమానులపై చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.ఈ క్రమంలో శంషాబాద్ మున్సిపాలిటీని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సందర్శించారు. శంషాబాద్ మున్సిపాలిటీలో చెరువులు కుంటలు కూడా కబ్జా అయినట్లు తన దృష్టికి వచ్చిందని వాటి పైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఇటీవలే హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. సంపత్ నగర్, ఊట్పల్లిలో అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి కట్టిన నిర్మాణాలను, అలాగే రోడ్లపై అడ్డుగా కట్టిన నిర్మాణాలను తొలగించింది.సంపత్ నగర్లో ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసి కొందరు అక్రమ కట్టడాలను నిర్మించారు. అలాగే ఊట్పల్లిలో రోడ్డుకు అడ్డంగా ఓ గేటును ఏర్పాటు చేశారు. వీటితో పాటు మరికొన్ని నిర్మాణాలను తొలగించే చర్యలు చేపట్టింది. ప్రభుత్వ భూములు, నాలాలు, చెరువులు, పార్క్ స్థలాలు ఆక్రమిస్తే చర్యలు తప్పవని ఈ సందర్భంగా హైడ్రా హెచ్చరికలు జారీ చేసింది. -
శంషాబాద్ మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాల కూల్చివేత
-
శంషాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు
హైదరాబాద్, సాక్షి: శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఈ ఉదయం నుంచి హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. సంపత్ నగర్, ఊట్పల్లిలో అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి కట్టిన నిర్మాణాలను, అలాగే రోడ్లపై అడ్డుగా కట్టిన నిర్మాణాలను తొలగిస్తున్నట్లు సమాచారం.సంపత్ నగర్లో ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసి కొందరు అక్రమ కట్టడాలను నిర్మించారు. అలాగే ఊట్పల్లిలో రోడ్డుకు అడ్డంగా ఓ గేటును ఏర్పాటు చేశారు. వీటితో పాటు మరికొన్ని నిర్మాణాలను తొలగించే క్రమంలో హైడ్రా సిబ్బంది ఉన్నారు. ప్రభుత్వ భూములు, నాలాలు, చెరువులు, పార్క్ స్థలాలు ఆక్రమిస్తే చర్యలు తప్పవని ఈ సందర్భంగా హైడ్రా హెచ్చరికలు జారీ చేసింది. -
శంషాబాద్‌లో చెన్నై-పూణే విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో Air India విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. వాతావరణం అనుకూలించని కారణంగా విమానం శంషాబాద్‌లో ల్యాండ్ అయినట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. చెన్నై-పూణే ఎయిర్ ఇండియా విమానం శనివారం ఉదయం శంషాబాద్‌లో అత్యవసరంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. దట్టమైన పొగమంచు కారణంగా వాతావరణం అనుకూలించకపోవడంతో విమానం దాదాపు మూడు గంటల పాటు ఆకాశంలోనే చక్కర్లు కొట్టింది. అనంతరం, పైలట్ విమానాన్ని శంషాబాద్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేసినట్టు సమాచారం. ఇక, ఎయిర్ ఇండియా విమానంలో 180 మంది ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది.An Air India exp flight from Chennai to Pune has diverted to Hyd. Nearly 3 hrs in the air. pic.twitter.com/ywnbnMtG50— Mahesh (@Hanumanbhakt000) December 21, 2024 -
విమానాలకు బాంబు బెదిరింపు
శంషాబాద్ రూరల్: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు బెదిరింపు కాల్స్ కలకలం రేపాయి. ఆదివారం పలు విమానాలకు బెదిరింపు ఫోన్ కాల్ రావటంతో ఓ విమానాన్ని అత్యవసరంగా దించేశారు. గోవా నుండి కోల్‌కతా వెళ్తున్న ఇండిగో విమానానికి బెదిరింపు కాల్ రావడంతో శంషాబాద్ విమానాశ్రయంలో దింపారు.ఇందులో 180 మంది ప్రయాణికులు ఉన్నా రు. మరో గంటకు బెంగళూరు–హైదరాబాద్ ఇండిగో విమానానికి, మళ్లీ గంట తర్వాత హైదరాబాద్–పుణే ఇండిగో విమానానికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. వీటితో పాటు ఎయిర్ఇండియా విమానానికి ఇదే తరహా కాల్ వచి్చనట్లు విమానాశ్రయం వర్గాలు తెలిపాయి. దీంతో ఎయిర్‌పోర్టులో సీఐఎస్ఎఫ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. -
రూ.13 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
-
శంషాబాద్‌లో యువకుడి హల్చల్
సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో ఓ యువకుడు హల్చల్ చేశాడు. తొండుపల్లిలో ట్రాఫిక్ పోలీసులతో యువకుడు గొడవ పెట్టుకున్నాడు. తనిఖీల్లో భాగంగా ట్రాఫిక్ పోలీసులు బైక్‌ను ఆపి చెకింగ్ చేస్తుండగా.. యువకుడు పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. అనంతరం పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. దీంతో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
బెలూగా.. భలేగా..
శంషాబాద్: ఆకాశ తిమింగలంగా పేరొందిన ప్రపంచంలోని అతిపెద్ద అయింది. ఈ నెల 27న ఫ్రాన్స్‌లోని టూలూజ్ నుంచి థాయ్‌లాండ్ వెళ్లేందుకు బయలుదేరిన ఈ విమానం 28న ఫ్రాన్స్‌లోని మార్సెల్లే, 29న ఈజిప్టు రాజధాని కైరో, కార్గో విమానాల్లో ఒకటైన ఎయిర్‌బస్ బెలూగా (ఏ300–608ఎస్టీ3) మరోసారి భాగ్యనగరాన్ని పలకరించింది. గురువారం అర్ధరాత్రి 12:23 గంటలకు ముచ్చటగా మూడోసారి శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ ఒమన్ రాజధాని మస్కట్ మీదుగా ప్రయాణించి ఇంధనం నింపుకోవడంతోపాటు సిబ్బంది విశ్రాంతి కోసం హైదరాబాద్ చేరుకుంది. దాదాపు 15 గంటల హాల్టింగ్ అనంతరం శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు థాయ్‌లాండ్ బయలుదేరింది. బెలూగా–3 విమానం 2022 డిసెంబర్లో తొలిసారి, 2023 ఆగస్టులో రెండోసారి శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండైంది.ప్రత్యేకతలు ఇవీ..రష్యన్ భాషలో బెలూగా అంటే తెల్ల తిమింగలం అని అర్థం. ప్రపంచవ్యాప్తంగా ఈ రకం విమానాలు కేవలం ఐదే ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానమైన అంటోనోవ్–225కన్నా ఇది 20 మీటర్లు చిన్నగా ఉంటుంది. సాధారణ కార్గో విమానాల్లోతరలించలేని భారీ సామగ్రిని ప్రత్యేకించి విమానాల విడిభాగాలు, రక్షణ రంగ పరికరాలను ఈ విమానంలో తరలిస్తారు. దీని పొడవు పొడవు 56.15 మీటర్లు, ఎత్తు 17.24 మీటర్లు, కార్గో మోసుకెళ్లే సామర్థ్యం 47 టన్నులు. -
శంషాబాద్ ఓయో హోటల్ లో సీసీ కెమెరాలు
-
శంషాబాద్ ఓయో హోటల్ లో సీసీ కెమెరాలు
-
శంషాబాద్-బెంగళూరు హైవేపై స్కూల్ బస్సు బీభత్సం
-
శంషాబాద్‌లో స్కూల్ బస్సు బీభత్సం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: శంషాబాద్ బెంగుళూరు హైవే పై స్కూల్ బస్సు బీభత్సం సృష్టించింది. సాతంరాయి వద్ద రోడ్డు క్రాస్ చేస్తున్న వ్యక్తిని ఢీ కొట్టింది.గాల్లోకి ఎగిరిపడి అక్కడికక్కడే మృతిచెందాడు. బస్సుతో పాటు డ్రైవర్ ఎయిర్పోర్ట్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పఠాన్ చెరువుకు మెట్రో విస్తరణ..
-
Farm House: అంతా అక్రమమే..
శంషాబాద్: ఇటీవల సంచలనం రేపిన ఎమ్మార్పీఎస్ నేతలు నరేందర్, ప్రవీణ్‌లను కిడ్నాప్ చేసి బంధించిన ఫాంహౌస్‌ను సోమవారం పోలీసుల బందోబస్తు మధ్య శంషాబాద్ మున్సిపాలిటీ అధికారులు నేలమట్టం చేశారు. పట్టణంలోని 103 సర్వే నంబరులో ధర్మగిరి ఆలయానికి సమీపంలో కిడ్నాపర్లు సుమారు వెయ్యి గజాల స్థలంలో ఈ ఫాంహౌస్‌ను నిరి్మంచినట్లు గుర్తించారు. రెండు మూడేళ్ల క్రితంఎలాంటి అనుమతులు లేకుండా రెండు రేకుల షెడ్లతో పాటు ప్రహరీ, కుక్కలను ఉంచేందుకు ప్రత్యేకంగా ఎనిమిది బోన్లను ఏర్పాటు చేశారు. పదుల సంఖ్యలో బాతులు, కోళ్లను కూడా పెంచుతున్నారు. కిడ్నాప్ సంఘటనతో పాటు అప్రత్తమైన పోలీసులు ఫాంహౌస్‌లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్న గుర్తించిన మున్సిపల్ అధికారులకు సమాచారం అందించారు. అక్రమ నిర్మాణంగా తేలితే కూల్చివేయాలని సూచించారు. ఈ మేరకు మున్సిపల్ కమిషన్ బి. సుమన్‌రావు ఆదేశాలతో టౌన్‌ప్లానింగ్ అధికారులు ఇటీవల ఫాంహౌస్‌కు నోటీసులు అంటించారు. సోమవారం మూడు జేసీబీలతో కూల్చివేతలు చేపట్టారు. కుక్కలతో పాటు, కోళ్లు, బాతులను తీసుకెళ్లేందుకు పశుసంవర్థక శాఖతో పాటు బ్లూక్రాస్కు సమాచారం అందించారు. అప్పటి వరకు కుక్కలకు సంబంధించిన బోన్ల కూలి్చవేతను నిలిపివేశారు. ఫాంహౌస్ పూర్తిగా అక్రమ నిర్మాణమేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే కూల్చివేతల సమయంలో దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరూ అక్కడికి రాలేదు. ఓ వ్యక్తి అనుమానాస్పదంగా సంచరిస్తుండడంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం.. భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాజేంద్రనగర్ డీసీపీ సీహెచ్ శ్రీనివాస్ హెచ్చరించారు. భూ కబ్జాదారులు ఇబ్బంది పెడితే పోలీసులను సంప్రదించాలన్నారు. -
శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికుల ఆందోళన
-
హైదరాబాద్‌లో రూ. 7 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. శంషాబాద్‌లో దాదాపు కేజీ హెరాయిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ నుంచి హైదరాబాద్‌కు హెరాయిన్ తీసుకువచ్చి విక్రయాలు జరుపుతున్న అంతర్రాష్ట్ర ముఠాను అదుపులోకి తీసుకున్నారు..వివరాలు.. నగరంలోని రాజస్థాన్‌కు చెందిన వ్యక్తులు, వ్యాపారవేత్తలే లక్ష్యంగా విక్రయాలు సాగిస్తున్నట్లు సమాచారం అందుకున్న శంషాబాద్ ఎస్ఓటీ, మాదాపూర్ పోలీసులు సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. రాజస్థాన్‌కు చెందిన నలుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసి.. వారి నుంచి 1,250 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ రూ. 7 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు.ఈ మేరకు సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి మాట్లాడుతూ.. పెద్ద మొత్తంలో హెరాయిన్ పట్టుబడటం ఇదే తొలిసారి అని తెలిపారు. కేజీకి పైగా హెరాయిన్ స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ రూ. 7 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రధాన డ్రగ్ పెడ్లర్ నేమి చాంద్ భాటితోపాటు నార్పట్ సింగ్, అజయ్ భాటి, హరీష్ సిర్వి, సంతోష్ ఆచార్య అనే నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.వీరంతా రాజస్థాన్ నుంచి బస్‌లో డ్రగ్స్ తీసుకొచ్చారని సీపీ తెలిపారు.స్వీట్ బాక్సుల్లో పైన స్వీట్స్ పెట్టి.. కింద 250గ్రా. హెరాయిన్ ఉంచి తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లోనే హెరాయిన్ ఎక్కువగా తయారు అవుతోందని.. ఈ హెరాయిన్ ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపై ఆరా తీస్తున్నామని చెప్పారు. -
శంషాబాద్‌లో మరోసారి చిరుత కలకలం!
సాక్షి,రంగారెడ్డి : శంషాబాద్‌లో వరుసగా రెండోసారి చిరుత ఆనవాళ్లు కలకలం సృష్టిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ఘాంన్సీమియాగుడా గ్రామ శివారులో చిరుత అనవాళ్లు కనిపించాయి.పొలంలో చిరుత సంచరించినట్లు రైతులు ఆనావాళ్లు గుర్తించారు. వెంటనే చిరుతను గుర్తించాలని అటవిశాఖ అధికారులకు ఫోన్ చేశారు. అయితే అధికారులు స్పందించ లేదని రైతులు ఆరోపిస్తున్నారు. సీసీ కెమెరాల్లో కనిపించిన జంతువు జాడల్ని కనిపెట్టాలని కోరుతున్నారు. గ్రామంలో వ్యవసాయంపై అదారపడే తాము పొలం వెళ్లాలంటే అరచేతిలో ప్రాణాల్ని పెట్టుకొని వెళ్తున్నామని, వెంటనే అధికారులు సకాలంలో స్పందించి చిరుతను పట్టుకోవాలని కోరుతున్నారు.కాగా, నెల రోజుల క్రితం శంషాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో చిరుతతో పాటు రెండు పిల్లలు ఎయిర్ పోర్టు లోపలికి ప్రవేశించేందుకు ప్రహరీ దూకేందుకు ప్రయత్నించాయి. అయితే ఫెన్సింగ్ వైర్లకు చిరుత తగలడంతో ఎయిర్ పోర్ట్ కంట్రోల్ రూం అలారం మోగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే చిరుతను, దాని పిల్లల్ని బందించారు. ఆ సంఘటన మరువక ముందే మళ్ళీ చిరుత అనవాళ్లు గుర్తించడంతో స్థానికుల్లో భయాందోళన మొదలైంది. -
ఏకశిలపై సీతారామలక్ష్మణులు.. సినిమా టెంపుల్.. అమ్మపల్లి గుడిని చూశారా? (ఫొటోలు)
-
ఎట్టకేలకు బోనులో చిక్కిన చిరుత..
-
శంషాబాద్: ఆపరేషన్ చిరుత.. చిక్కేనా?
సాక్షి, రంగారెడ్డి: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మూడు రోజుల క్రితం చొరబడిన చిరుతను బంధించడం కోసం అటవీ అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. చిరుత బోన్ వరకు వచ్చి వెళ్లిపోతుంది. దీంతో చిరుతను బంధించేందుకు ఇప్పటికే 5 బోన్లు, 25 సీసీ కెమెరాల ఏర్పాటు చేశారు అధికారులు. అన్ని ట్రాప్ కెమెరాల్లో చిరుత దృశ్యాలు చిక్కాయి. మేకను ఎరగా వేసినా.. చిరుత బోనులోకి రావటం లేదు. ఒకే ప్రాంతంలో మూడు రోజుల నుంచి చిక్కకుండా చిరుత తిరుగుతోంది. చిరుత కోసం 4 రోజులుగా స్పెషల్ టీమ్స్ శ్రమిస్తున్నాయి. ఎండకాల కావడంతో అడవిలో నీరు లభించకే చిరుతలు బయటకు వస్తున్నాయని అధికారులు తెలిపారు. త్వరలోనే చిరుతను పట్టుకుంటామని చెప్పారు. ఒంటరిగా పొలాలకు, అటవీ ప్రాంతాలకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. -
ఏటీఎంలో రూ.18.99 లక్షలు ఎత్తుకెళ్లిన దొంగలు
శంషాబాద్ రూరల్: గుర్తు తెలియని దుండగులు ఏటీఎంలో చొరబడి భారీగా నగదు దోచుకెళ్లారు. అర్థరాత్రి సమయంలో ఏటీఎంలోకి వెళ్లి సీసీ కెమెరాల్లో కనిపించకుండా వాటిపై నల్లరంగు స్ప్రే చేసి..ఆధారాలు లేకుండా తప్పించుకున్నారు. మరోచోట ఏటీఎంలోకి చొరబడేందుకు యతి్నంచి విఫలమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని పాల్మాకుల బస్టాప్ వద్ద బెంగళూరు జాతీయ రహదారి పక్కన ఎస్బీఐ ఏటీఎం ఉంది. ఈ నెల 14న సీఎంఎస్ కంపెనీ వారు ఈ ఏటీఎంలో రూ.21 లక్షలు జమ చేశారు. ఆదివారం అర్థరాత్రి 1.59 గంటలకు గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు ముసుగు వేసుకుని వచ్చి..మొదట ఏటీంలోని సీసీ కెమెరాలపై నల్లరంగు స్ప్రే చేశారు. అనంతరం గ్యాస్ కట్టర్‌తో ఏటీఎంను కట్‌చేసి అందులో ఉన్న నగదు రూ.18,99,000 దోచుకున్నారు. పోలీసులకు సమాచారం.. ఏటీఎంలో దుండగులు గ్యాస్ కట్టర్‌తో కట్ చేస్తుండగా..చివరి సమయంలో అక్కడ ఉన్న సేఫ్టీ పరికరాల ద్వారా ముంబయిలోని నిర్వహణ సంస్థకు అలర్ట్ వెళ్లింది. దీంతో సంస్థ ప్రతినిధులు సుమారు 20 నిమిషాల తర్వాత శంషాబాద్ ఎస్హెచ్ఓకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లే సరికి దుండగులు నగదుతో పారిపోయారు. ఏటీఎంలోకి చొరబడిన దుండగులు షటర్‌ను మూసివేసి లోపల పని కానిచ్చారు. దీంతో అటువైపు పెద్దగా ఎవరి దృష్టి పడలేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే వరకు స్థానికులకు సమాచారం లేదు. ఏటీఎం కేంద్రాన్ని డీసీపీ నారాయణరెడ్డి, సీఐ నరేందర్‌రెడ్డి పరిశీలించారు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శంషాబాద్ పట్టణంలో.. శంషాబాద్ పట్టణంలో ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్‌కు కూత వేటు దూరంలో ఉన్న ఏటీఏంలోనూ చోరీకి దుండగులు యతి్నంచి విఫలమయ్యారు. ఇక్కడ ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో నగదు దోచుకునేందుకు దొంగలు ప్రయతి్నంచినట్లు పోలీసులు గుర్తించారు. కానీ ఎలాంటి నగదు చోరీకి గురికాలేదు. -
Hyd : నిందితుల నుంచి కిలో ఆల్ఫాజోలం స్వాధీనం, ముగ్గురు అరెస్ట్
-
విశాఖ టు శంషాబాద్ ఇక 4.30 గంటలే
సాక్షి, హైదరాబాద్: హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణానికి రైల్వేశాఖ చేపట్టిన ప్రాథమిక సర్వే తుదిదశకు చేరుకుంది. వచ్చే మార్చినాటికి ప్రిలిమినరీ ఇంజనీరింగ్ అండ్ ట్రాఫిక్ (పెట్) సర్వే పూర్తి కానుంది. పెట్ సర్వేకు రైల్వేశాఖ గతేడాది మే నెలలో ఎస్ఎం కన్సల్టెన్సీని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ సర్వే నివేదిక ఆధారంగా సమగ్రమైన సర్వే (డీపీఆర్) కోసం మరో కన్సల్టెన్సీని ఏర్పాటు చేయనున్నట్టు దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రస్తుతానికి రూ.20,000 కోట్లకుపైగా వ్యయం అవుతుందని అధికారుల అంచనా. కానీ పనులు ప్రారంభించే నాటికి నిర్మాణ వ్యయం ఇంకా పెరిగే అవకాశముంది. పెట్ సర్వేలో భాగంగా ఎంపిక చేసిన రూట్లలో ఇంజనీరింగ్ అంశాలపై అధ్యయనం చేశారు. ఎక్కడెక్కడ వంతెనలు, ఇతర నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుందనే దానిపై కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రెండు మార్గాల్లో ప్రస్తుతం రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్‌లో హైస్పీడ్ రైళ్లలో ప్రయాణికుల రద్దీ, డిమాండ్ ఎలా ఉంటుందనే అంశాలపైన కూడా పెట్‌సర్వే నివేదికలో పొందుపరచనున్నారు. దీని ఆధారంగా చేపట్టబోయే డీపీఆర్ సర్వేకు 6 నుంచి 8 నెలలకు పైగా సమయం పడుతుందని అధికారులు ఓ అంచనాకు వచ్చారు. శంషాబాద్–విశాఖకు తక్కువ సమయంలోహైస్పీడ్ రైలు అందుబాటులోకి వస్తే.. శంషాబాద్ నుంచి నాలుగున్నర గంటల్లోనే విశాఖకు చేరుకోవచ్చు. ప్రస్తుతం జంటనగరాల నుంచి రైలులో విశాఖకు వెళ్లేందుకు 12 నుంచి 13 గంటల సమయం పడుతోంది. వందేభారత్ మాత్రం 9 గంటల్లో చేరుకుంటోంది. హైదరాబాద్ నుంచి విశాఖకు నిత్యం 10 రెగ్యులర్ రైళ్లు, మరో 12 వీక్లీ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. రోజుకు 25 వేల మందికిపైగా రాకపోకలు సాగిస్తుండగా మరో 30 వేల మంది వీక్లీ ట్రైన్లలో రాకపోకలు సాగిస్తున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ప్రతి రోజు సుమారు 55,000 మంది జాతీయ ప్రయాణికులు ఉండగా మరో 10 వేల మందికిపైగా అంతర్జాతీయ ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. అమెరికా, దుబాయ్, యూరొప్ తదితర దేశాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి హైస్పీడ్ రైలులో నేరుగా విజయవాడ, విశాఖ, తదితర నగరాలకు చేరుకొనే వెసులుబాటు ఉంటుంది. ఇటు రైలు ప్రయాణికులు, అటు విమాన ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజధానులను అనుసంధానం చేసే విధంగా హైస్పీడ్ కారిడార్ మార్గాలను ఎంపిక చేసినట్టు దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. సకాలంలో ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపడితే రానున్న ఐదారేళ్లలో తెలుగు రాష్ట్రాలకు హైస్పీడ్ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఎలివేటెడ్ కారిడార్ అయితే ఎలా ఉంటుంది... హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణానికి ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ప్రాథమిక సర్వే చేపట్టినా, కారిడార్ నిర్మాణానికి ఏ రకమైన సాంకేతిక వ్యవస్థ ఎంపిక చేసుకోవాలనే అంశంపైన కూడా అధికారులు దృష్టి సారించారు. ప్రస్తుతం అన్ని రైళ్లు నేల మీద నిర్మించిన పటిష్టమైన ట్రాక్‌లపైనే నడుస్తున్నాయి. ప్రధాననగరాల్లో మెట్రోలకు మాత్రం ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించారు. ఈ క్రమంలో పటిష్టమైన ట్రాక్ వ్యవస్థ, అత్యధిక వేగం, ప్రయాణికుల భద్రత వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని హైస్పీడ్ రైల్‌కు ఎలివేటెడ్ కారిడార్ నిర్మిసేనే బాగుంటుందని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. అయితే 922 కి.మీల వరకు ఎలివేటెడ్ నిర్మాణానికి భారీ వ్యయం కావొచ్చు. ఇప్పుడున్న అంచనాలకు రెట్టింపు ఖర్చు చేయాల్సి రావొచ్చు. నేలపైనే హైస్పీడ్ కారిడార్ నిర్మిస్తే నిర్మాణ వ్యయం తగ్గే అవకాశముంది. ఈ రెండింటిలో ఏ పద్ధతిని ఎంపిక చేసుకోవాలనే అంశంపైనే డీపీఆర్ తర్వాతే ఓ అంచనాకు వస్తామని అధికారులు చెబుతున్నారు. చర్లపల్లికి సోలార్ ప్రాజెక్టు.. గ్రేటర్ హైదరాబాద్‌లో నాలుగో టర్మినల్‌గా అందుబాటులోకి రానున్న చర్లపల్లి రైల్వేస్టేషన్లో విద్యుత్ సరఫరాకు చేపట్టిన సోలార్ ప్రాజెక్టుకు కేంద్రం తాజా బడ్జెట్లో రూ.93.75 కోట్లు కేటాయించింది. స్టేషన్ అవసరాలకు కావాల్సినంత విద్యుత్ ఈ ప్రాజెక్టు నుంచి తీసుకుంటామని అధికారులు తెలిపారు. మార్చి నెలాఖరులో చర్లపల్లి నుంచి రైల్వేసేవలు ప్రారంభించనున్నట్టు జీఎం అరుణ్‌కుమార్ జైన్ తెలిపారు. సౌరశక్తి ప్రాజెక్టుతో పాటు తుదిదశలో ఉన్న చర్లపల్లి టర్మినల్ నిర్మాణ పనులకు మరో రూ.46 కోట్లు ఈ బడ్జెట్లో కేటాయించారు. -
Hyderabad: విషాదం.. చిన్నారిని బలిగొన్న వీధి కుక్కలు
శంషాబాద్: హైదరాబాద్‌లో మరో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. వీధి కుక్కల దాడిలో ఏడాది వయసున్న చిన్నారి మృతి చెందింది. ఈ హృదయ విదారక సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో మున్సిపాలిటీ ప్రాంతంలో చోటుచేసుకుంది. శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం నాగారానికి చెందిన సూర్యకుమార్, యాదమ్మ దంపతులు బతుకుదెరువు కోసం శంషాబాద్‌కు వలస వచ్చారు. అయితే వారు రాళ్లగూడ సమీపలోని ఓ గుడిసెలో తమ ఏడాది వయసున్న కుమారుడు నాగరాజుతో కలిసి నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం యాదమ్మ నిండు గర్భిణి కావటంతో ఆమెను స్థానిక ఆస్పత్రిలో చేర్చారు. బుధవారం రాత్రి చిన్నారి పాల కోసం ఏడవగా తండ్రి ఆ చిన్నారికి పాలు తాగించి నిద్రపుచ్చాడు. తెల్లవారుజామున ఆ చిన్నారి మళ్లీ ఏడుస్తూ గుడిసె బయటకు రాగా రోడ్డుమీద ఉన్న వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడి చేశాయి. అక్కడి నుంచి వస్తున్న శబ్దాలను విన్న పలువురు వాహనదారులు పల్లాడిపై దాడి చేస్తున్న కుక్కలను తరిమేశారు. వారు చిన్నారిని పరిశీలించగా.. అప్పటికే మృతి చెందాడు. ఈ దంపతులకు పుట్టిన ఇద్దరు పిల్లలు ఇప్పటికే మృతి చెందగా.. మరో చిన్నారి వీధి కుక్కలు బలితీసుకోవంటంతో బోరున విలపిస్తున్నారు. -
కల్వర్టు గుంతలో పడిన కారు
శంషాబాద్ రూరల్: రహదారిపై అదుపు తప్పిన కారు నిర్మాణంలో ఉన్న కల్వర్టు గుంతలో పడింది. గుంతలోని నీళ్లలో మునిగి ఊపిరాడక తల్లీ, కొడుకు మృతి చెందిన దుర్ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ ఎస్.శ్రీనాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈసీఐఎల్‌లోని శ్రీరాంనగర్ కాలనీ వాసి మెరువ ఆదిశేషరెడ్డి(57) బాబా ఆటోమిక్ రీసెర్స్ సెంటర్లో సైంటిఫిక్ ఆఫీసర్‌గా పని చేస్తున్నాడు. సంక్రాంతి సందర్భంగా సొంత ఊరైన ఏపీ నంద్యాల సమీపంలోని జిల్లెల గ్రామానికి తన తల్లి ఎం.రాములమ్మ(88)ను తీసుకుని ఈసీఐఎల్ నుంచి కారులో శనివారం బయలుదేరాడు. మార్గ మధ్యలో మండలంలోని ఘాంసిమిగూడ శివారులో బెంగళూరు జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న ఆటో, బైక్‌ను ఢీకొడుతూ.. నిర్మాణంలో ఉన్న కల్వర్టు గుంతలో పడింది. నీళ్లలో మునిగి మృత్యువాత.. కారు ఢీకొనడంతో బైక్‌తో పాటు ఆటో కూడా గుంత నీళ్లలో పడిపోయాయి. కారులో ఉన్న ఆదిశేషరెడ్డి, రాములమ్మ అందులోని నుంచి బయటకు రాలేకపోయారు. నీళ్లలో మునిగి ఊపిరాడక మృతి చెందారు. ఆటోలో ఉన్న ముగ్గురిలో డ్రైవర్ రాయన్నగూడ సిద్దయ్యకు గాయాలయ్యాయి. బైక్‌పై ప్రయాణిస్తున్న గొల్ల ఆంజనేయులు(25)కు కాలు విరగగా బాలికకు గాయాలయ్యాయి. వీరందరనీ స్థానికులు గుంతలో నుంచి బయటకు తీశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరి మృతదేహాలను బయటకు తీసి ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కారు అతి వేగమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
కరాచి బేకరి కిచెన్ అగ్ని ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరం
-
ఆ 181 ఎకరాలు హెచ్ఎండీఏవే..
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్‌లోని 181 ఎకరాల వివాదాస్పద భూములు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ)కే చెందుతాయని హైకోర్టు ద్వి సభ్య ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. అందులోని 50 ఎకరాలపై తమకు హక్కులు ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. 2007 నుంచి శంషాబాద్ గ్రామ పంచాయతీ జారీ చేసిన ఆస్తి పన్ను నోటీసులు, మున్సిపల్ అనుమతి, రెవెన్యూ రికార్డులు, విద్యుత్ బిల్లులు, ఫొటోలు, 2023 ఏప్రిల్ 20 నాటి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్, ఇంటి పన్ను రశీదులు, ఇంటి నిర్మాణ అనుమతి.. ఇలా అన్నీ నకిలీవేనని జ్యుడీషియల్ రిజిస్ట్రార్నివేదిక బయటపెట్టిందని స్పష్టం చేసింది. 2007లోనే తెలంగాణ రాష్ట్రం ఉన్నట్టు కల్పి త రసీదులు సృష్టించారని పేర్కొంది. 1990 సెపె్టంబర్ 4 నాటి ఉత్తర్వుగా పేర్కొంటూ.. 1992లో టైప్ చేసిన కాపీని పిటిషనర్ ఇచ్చారని, అది కూడా నకిలీదేనని తేలిందని వెల్లడించింది. అన్ని అంశాలను పరిశీలించాక పిటిషనర్‌కు ఉపశమనం పొందడానికి ఎలాంటి హక్కు లేదని స్పష్టం చేసింది. ‘పైగా’భూములని పేర్కొంటూ.. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని సర్వే నంబర్ 725/21లోని 7.31 ఎకరాలు, సర్వే నంబర్ 725/23లోని 10.07 ఎకరాలు, సర్వే నంబర్ 725/25లోని 12.34 ఎకరాలు సహా దాదాపు 50 ఎకరాల భూమిని తన పూర్వికులు పైగా (సైన్యం నిర్వహణకు పరిహారంగా నిజాం నవాబ్ మంజూరు చేసిన భూమి) యజమానుల నుంచి కొనుగోలు చేశారని హైదరాబాద్ వట్టేపల్లికి చెందిన యహియా ఖురేషి హైకోర్టులో రెండు రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. తమ వద్ద అన్ని డాక్యుమెంట్లు ఉన్నా కూడా హెచ్ఎండీఏ అధికారులు, పోలీసులు జోక్యం చేసుకుని ఇబ్బందులు క ల్పిస్తున్నారని కోర్టుకు ఫిర్యాదు చేశారు. ఈ పిటిషన్లపై చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్‌ల ధర్మాసనం విచారణ జరిపింది. రసీదులన్నీ నకిలీవే.. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది కేజీ రాఘవన్, ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. తప్పుడు పత్రాలు, రసీదులు సృష్టించి కోర్టును తప్పదారి పట్టిస్తున్నారని.. అత్యంత విలువైన ప్రాంతంలో దాదాపు 50 ఎకరాలకు పైగా భూమిని స్వాహా చేసేందుకు యత్నిస్తున్నారని ఏజీ కోర్టుకు వివరించారు. 2007, 2012లో జారీ చేసిన రసీదులు పూర్తిగా నకిలీవని స్పష్టం చేశారు. తప్పుడు రసీదులను, కోర్టు తీర్పు ఉత్తర్వుల పత్రాలను ఆయన ఈ సందర్భంగా ధర్మాసనానికి అందించారు. 2007 నాటికి తెలంగాణ రాష్ట్రమే లేదని, రసీదుల్లో మాత్రం తెలంగాణ అని పేర్కొన్నారని.. అలాగే శంషాబాద్ గ్రామం రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉండగా, హైదరాబాద్ అని మరో రసీదులో ఉందని వివరించారు. దాంతో ఈ అంశంపై పూర్తి విచారణ జరిపి సీల్డ్ కవర్లో నివేదిక ఇవ్వాలని ధర్మాసనం గతంలోనే జ్యుడీïÙయల్ రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. రిజిస్ట్రార్విచారణ జరిపి కోర్టుకు నివేదిక ఇచ్చారు. పిటిషనర్ పేర్కొన్నట్టుగా 1997లో అసలు పిటిషన్లే నమోదు కాలేదని వివరించారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పు ఇచి్చంది. -
మందుబాబులకు అలర్ట్.. నేటి నుంచే వైన్‌షాప్‌లు బంద్
హైదరాబాద్: ఎన్నికల నేపథ్యంలో శంషాబాద్ ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని వైన్స్, బార్లు, కల్లు కంపౌండ్లను ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి మూసి వేస్తున్నట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ దేవేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. 30వ తేదీ పోలింగ్ ముగిసిన అనంతరం తిరిగి షాపులను తెరుస్తారని అన్నారు. ఎవరైనా అక్రమంగా మద్యం విక్రయించినా, మద్యం నిలువ చేసినా వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో తనిఖీలను ముమ్మరం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 236 కేసులు నమోదు చేశామన్నారు. తమ ప్రాంతంలో మద్యం విక్రయించినా, డంప్ చేసినా ఫోన్ నంబర్ 8712658750లో ఫిర్యాదు చేయాలని కోరారు. -
‘పైగా’ భూములపై.. అవి తప్పుడు తీర్పు నివేదికలే..
సాక్షి, హైదరాబాద్: ‘పైగా’భూములకు సంబంధించి 1998లో ఇచ్చిన తీర్పు కాపీని సీల్డ్ కవర్లో హైకోర్టుకు రిజిస్ట్రార్ సమర్పించారు. సెపె్టంబర్ 15న విచారణ సందర్భంగా ఆదేశాలు జారీ చేయడంతో ఈ మేరకు నివేదిక అందజేశారు. పిటిషనర్ పేర్కొన్నట్లు ‘పైగా’భూములపై 1998లో హైకోర్టు ఏ తీర్పునూ ఇవ్వలేదని, అసలు పిటిషనర్ పేర్కొన్న పిటిషన్లే నమోదు కాలేదని ఆ నివేదికలో పేర్కొన్నారు. దీంతో తాము తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని పిటిషనర్‌ను ఆదేశిస్తూ, స్టేటస్ కో ఉత్తర్వులు కొనసాగుతాయని హైకోర్టు స్పష్టం చేసింది. అక్టోబర్ 13కు విచారణను వాయిదా వేసింది. 50ఎకరాల భూములపై వివాదం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ గ్రామంలోని దాదాపు 50 ఎకరాల భూమిని తన పూర్వికులు పైగా(సైన్యం నిర్వహణకు పరిహారంగా నిజాం నవాబ్ మంజూరు చేసిన భూమి) యజమానుల నుంచి కొనుగోలు చేశారని, అన్ని డాక్యుమెంట్లు ఉన్నా హెచ్ఎండీఏ అధికారులు, పోలీసులు జోక్యం చేసుకుని ఇబ్బందులు కల్పిస్తున్నారని పేర్కొంటూ హైదరాబాద్ వట్టేపల్లికి చెందిన యహియా ఖురేషి హైకోర్టులో రెండు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది కేజీ రాఘువన్, ప్రభుత్వం తరఫున బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. బోగస్ డాక్యుమెంట్లు, రశీదులు సృష్టించి కోర్టును తప్పదారి పట్టించి అత్యంత విలువైన ప్రాంతంలో దాదాపు 50 ఎకరాలకుపైగా భూమిని స్వాహా చేసేందుకు యత్నిస్తున్నారని ఏజీ గతంలో వాదనలు వినిపించారు. 2007, 2012లో జారీ చేసి న రసీదులు పూర్తిగా నకిలీవని.. తప్పుడు రసీదులను, కోర్టు తీర్పు ఉత్తర్వుల డాక్యుమెంట్లను ఆయ న ఈ సందర్భంగా ధర్మాసనం ముందు ఉంచారు. 2007నాటికి తెలంగాణ రాష్ట్రం ఎక్కడుంది? 2007 నాటికి తెలంగాణ రాష్ట్రమే లేదని, రసీదుల్లో మాత్రం అలా పేర్కొన్నారని, అలాగే శంషాబాద్ గ్రామం రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉండగా, హైదరాబాద్ అని మరో రసీదులో ఉందన్నారు. దీనిపై పూర్తిగా విచారణ జరిపి సీల్డ్ కవర్లో నివేదిక అందజేయాలని జుడీషియల్ రిజిస్ట్రార్‌ను హైకోర్టు ఆదేశించింది. శుక్రవారం ఈ మేరకు నివేదిక అందజేసింది. అనంతరం ధర్మాసనం.. ఈ నివేదిక కాపీలను అక్టోబర్ 3లోగా పిటిషనర్‌కు, ప్రభుత్వానికి కూడా అందజేయాలని ఆదేశిస్తూ, విచారణను వాయిదా వేసింది. -
బ్యాగ్‌ల అడుగున దాచి..
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ మొత్తంలో కొకైన్ పట్టుబడింది. బహిరంగ మార్కెట్లో రూ.50 కోట్ల విలువ చేసే ఐదు కిలోల కొకైన్‌ను డీఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులు శుక్రవారంస్వాధీనం చేసుకున్నారు. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు చేపట్టిన ఈ ఆపరేషన్‌లో ఓ ప్రయాణికుడి లగేజీ బ్యాగ్‌ల కింద దాచి ఉంచిన కొకైన్‌ను డీఆర్ఐ అధికారులు గుర్తించారు. ఈ మేరకు డీఆర్ఐ అధికారులు శనివారం ఓ ప్రకటనలో వివరాలు వెల్లడించారు. లావోస్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఓ ప్రయాణికుడు లావోస్ నుంచి సింగపూర్ మీదుగా హైదరాబాద్‌కు శుక్రవారం చేరుకున్నాడు. అతడు హైదరాబాద్ నుంచి తిరిగి ఢిల్లీకి వెళ్లాల్సి ఉండగా, పక్కా సమాచారం మేరకు అధికారులు అతడి లగేజీని తనిఖీ చేశారు. సూట్‌కేస్, నాలుగు మహిళా హ్యాండ్ బ్యాగ్‌ల అడుగు భాగంలో దాచి ఉంచిన కొకైన్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అందులో మొత్తం ఐదు కిలోల కొకైన్ ఉన్నట్టు గుర్తించారు. ఆ ప్రయాణికుడిపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆ ప్రయాణికుడిని అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ డ్రగ్ సిండికేట్‌లోని మరికొందరు ముఠా సభ్యులను గుర్తించేందుకు దర్యాప్తు ముమ్మరం చేసినట్టు డీఆర్ఐ అధికారులు తెలిపారు. -
దుబాయ్ టు సిటీ.. గోల్డ్ స్మగ్లింగ్
సాక్షి, హైదరాబాద్:ఆదివారం రూ.1.25 కోట్ల విలువైన 2 కేజీలు.. శనివారం రూ.4.86 కోట్ల విలువైన 8 కిలోలు.. గురువారం రూ.33.53 లక్షల విలువైన 553 గ్రాములు..మంగళవారం రూ.93.26 లక్షల విలువైన 1.52 కేజీలు.. ఈ నెల 6న రూ.1.18 కోట్ల విలువైన 1.92 కేజీలు.. 4న రూ.28 లక్షల విలువైన 461 గ్రాములు.. 2న రూ.82.42 లక్షల విలువైన 1.34 కిలోలు.. శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో స్వాధీనం చేసుకున్న బంగారం లెక్కలు ఇవి. నగరానికి పెద్దయెత్తున బంగారం అక్రమ రవాణా అవుతుండటం కస్టమ్స్ అధికారులనే కలవరపరుస్తోంది. ఈ నెల 1 నుంచి ఆదివారం వరకు మొత్తం రూ.9.66 కోట్ల విలువైన 15.79 కేజీల బంగారం పట్టుబడగా..ఇందులో 95 శాతానికి పైగా దుబాయ్ నుంచి తెచ్చిందే కావడం గమనార్హం. బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో అక్రమ రవాణా గణనీయంగా పెరుగుతోంది. కిలోకు రూ.5 లక్షల లాభం విదేశాల నుంచి పసిడిని కొనుగోలు చేసిన వారు అధికారికంగా ఇక్కడకు తీసుకురావాలంటే పరోక్ష పన్ను విధానంతో లాభసాటి కావట్లేదు. గతంలో 10 గ్రాముల బంగారానికి దిగుమతి సుంకం రూ.350 మాత్రమే ఉండేది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో 10 గ్రాముల పసిడికి ఉన్న ప్రతి 15 రోజుల సరాసరి ధరను పరిగణనలోకి తీసుకుని ఆ మొత్తంపై 10 శాతం చెల్లించేలా కేంద్రం నిబంధనలు సవరించింది. ఈ కారణంగానే బంగారం స్మగ్లింగ్ పెరుగుతుండగా..దొంగ రవాణా విజయవంతమైతే అన్ని ఖర్చులూ పోనూ స్మగ్లర్లకు కిలోకు కనిష్టంగా రూ.5 లక్షల లాభం ఉంటున్నట్లు తెలుస్తోంది. టికెట్లు కొనిచ్చి.. విదేశాలకు పంపి.. బడ్జెట్ ప్రవేశపెట్టే లోపు భారీగా అక్రమ రవాణాకు పాల్పడటం ద్వారా పెద్దయెత్తున లాభాలు ఆర్జించాలనే ఉద్దేశంతో వ్యవస్థీకృత ముఠాలతో పాటు హైదరాబాద్‌కు చెందిన బడా బాబులు రంగంలోకి దిగినట్లు పోలీసుల అనుమానిస్తున్నారు. ప్రముఖ జ్యువెలరీ సంస్థల యజమానులు, రియల్ ఎస్టేట్ సంస్థల నిర్వాహకులతో పాటు పాత నేరగాళ్లు సైతం క్యారియర్లను ఏర్పాటు చేసుకుని ఈ దందా ప్రారంభించారు. మధ్యవర్తుల ద్వారా కేరళకు చెందిన వారితో పాటు పాతబస్తీకి యువకులు, యువతులు, మహిళలకు కమీషన్ ఇస్తామంటూ ఎర వేస్తున్నారు. వీరికి టికెట్లు కొనిచ్చి విదేశాలకు పంపడం ద్వారా తిరిగి వచ్చేటప్పుడు అక్కడి తమ ముఠా సభ్యుల సహకారంతో బంగారం ఇచ్చి పంపిస్తున్నారు. వీరినే సాంకేతిక పరిభాషలో క్యారియర్లుగా పిలుస్తున్నారు. స్మగ్లర్లకు స్వర్గధామంగా దుబాయ్ దుబాయ్‌లో ఆదాయపుపన్ను అనేది లేకపోవడంతో మనీలాండరింగ్ అన్నదే ఉత్పన్నం కాదు. దీంతో ఇక్కడినుంచి హవాలా ద్వారా నల్లధనాన్ని అక్కడకు పంపి, దాన్ని బంగారంగా మార్చి ఇక్కడకు తీసుకువస్తున్నారు. దుబాయ్‌లో ఓ వ్యక్తి ఎంత భారీ మొత్తంలో అయినా బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. దాన్ని విమానంలోకి తీసుకువచ్చేటప్పుడు కూడా కేవలం చోరీసొత్తు కాదని ఆధారాలు చూపిస్తే చాలు. దీన్ని ఆసరాగా చేసుకునే స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు. జోరుగా రెక్టమ్ కన్సీల్మెంట్.. చాలామంది స్మగ్లర్లు ఈ బంగారాన్ని బ్యాగుల అడుగు భాగంలో ఉండే తొడుగులు, లోదుస్తులు, రహస్య జేబులు, బూట్ల సోల్, కార్టన్ బాక్సులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, పౌడర్ డబ్బాలతో పాటు మైబైల్ చార్జర్స్ లోనూ దాచి తీసుకువచ్చేవారు. ఆ తర్వాత బ్యాగుల జిప్పులు, బెల్టుల రూపంలోకి బంగారాన్ని మార్చి పైన తాపడం పూసి తేవడం జరుగుతోంది. కొన్ని సందర్భాల్లో రెక్టమ్ కన్సీల్మెంట్ కూడా జోరుగా జరుగుతోంది. సుదీర్ఘకాలం తమ వద్ద పని చేసే క్యారియర్లకు సూత్రధారులు ముంబై, కేరళల్లో ప్రత్యేక శస్త్రచికిత్సలు చేయించడం ద్వారా వారి మలద్వారాన్ని అవసరమైన మేర వెడల్పు చేయిస్తున్నారు. గరిష్టంగా కేజీ వరకు బంగారాన్ని అక్కడ దాచిపెట్టేలా ఏర్పాటు చేస్తున్నారు. బంగారానికి నల్ల కార్బన్ పేపర్ చుట్టడం ద్వారా స్కానర్‌కు చిక్కకుండా అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. క్లెయిమ్ చెయ్యకుంటే వేలం కస్టమ్స్ అధికారులు స్మగ్లర్లను గుర్తించడానికి 95 శాతం ప్రొఫైలింగ్ పదర్ధతినే అనుసరిస్తారు. ప్రయాణికుడి ప్రవర్తన, నడవడికతో పాటు పాస్‌పోర్ట్‌లో ఉన్న వివిధ దేశాల ఎంట్రీ, ఎగ్జిట్ స్టాంపులు, విదేశంలో ఉన్న సమయం తదితరాలను పరిగణలోకి తీసుకుంటారు. బయటి రాష్ట్రాల పాస్‌పోర్టులు కలిగిన వారు ఇక్కడ లాండ్ అయినా అనుమానిస్తారు. బంగారం స్మగ్లింగ్ వెనుక భారీ కుట్ర లేకపోతే దాన్ని తిరిగి అప్పగించడానికే ప్రాధాన్యం ఇస్తారు. స్మగ్లర్ బంగారం తనదే అని క్లైమ్ చేసుకుంటే దాని విలువపై 50 నుంచి 60 శాతం కస్టమ్స్ డ్యూటీ వసూలు చేసి ఇచ్చేస్తారు. ఒకవేళ క్లెయిమ్ చేయకపోతే ఆ బంగారాన్ని చెన్నై, ముంబైల్లో కస్టమ్స్ కార్యాలయాలకు తరలించి అక్కడ వేలం వేయడం ద్వారా విక్రయించి ఆ మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తారు. రియాద్ నుంచి వయా మస్కట్ శంషాబాద్ (హైదరాబాద్): రియాద్ నుంచి అక్రమంగా తీసుకొచ్చిన బంగారాన్ని ఎయిర్‌పోర్టులో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం రాత్రి రియాద్ నుంచి వయా మస్కట్ మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న షేక్‌ఖాజా, షేక్‌జాని అనే ఇద్దరు ప్రయాణికులు కస్టమ్స్ తనిఖీలు పూర్తి చేసుకుని లాంజ్‌లోని సిటీసైడ్ ఏరియాలోకి వచ్చారు. వారి కదలికలను అనుమానించిన సీఐఎస్ఎఫ్ అధికారులు మరోసారి లగేజీని ఈకో–5 యంత్రంలో తనిఖీ చేశారు. దీంతో డ్రైఫ్రూట్స్ ప్యాకెట్లో ఉంచిన కిలో బరువు కలిగిన బంగారు గొలుసులు బయటపడ్డాయి. దీంతో నిందితులను కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. -
వీడిన శంషాబాద్ మహిళ హత్య కేసు మిస్టరీ
-
మంజుల హత్య కేసు.. రిజ్వానా బేగం వల్లే దారుణం..
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్‌లో మహిళ దారుణ హత్య సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇక, మృతురాలిని రాళ్లకు చెందిన మంజులగా పోలీసులు గుర్తించారు. ఇక, ఈ కేసుపై శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి కీలక విషయాలను వెల్లడించారు. రుజ్వానానే మంజులను తన చీరతో ఉరివేసి చంపినట్టు తెలిపారు. కాగా, కేసు వివరాలను డీసీపీ శనివారం మీడియాకు వివరించారు. ఈ సందర్బంగా డీసీపీ నారాయణ మాట్లాడుతూ.. ఈ నెల 10వ తేదీన అర్ధరాత్రి మహిళ మృతదేహాన్ని గుర్తించాం. చనిపోయిన మహిళను వడ్ల మంజులుగా గుర్తించడం జరిగింది. రెండు రోజుల కిందట మంజుల కడుపునొప్పి వస్తుందని శంషాబాద్ ఆస్పత్రికి వెళ్తున్నట్లు భర్తకు చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. తిరిగి రాకపోవడంతో శుక్రవారం సాయంత్రం ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త చెప్పిన పోలికలు, ఘటనా స్థలం వద్ద మృతదేహంతో సరిపోలడంతో.. హత్యకు గురైందని మంజులగా గుర్తించాము. అయితే, మంజుల హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణం. మంజుల రిజ్వానా బేగం అనే మహిళకు లక్ష రూపాయాలు అప్పుగా ఇచ్చింది. ఈ డబ్బుల వ్యవహారం వివాదంతోనే మంజులను రిజ్వానా హత్య చేసింది. ముందుగా మంజుల కళ్లలో కారంతో రిజ్వానా కారంతో దాడి చేసింది. మంజుల చీర కొంగుతో రిజ్వానా మెడ గట్టిగా పట్టకుని ఉరివేసి హత్య చేసింది. అనంతరం, పెట్రోల్‌తో మంజుల మృతదేహాన్ని రిజ్వానా కాల్చి చంపింది. 24 గంటల్లోనే కేసును చేధించాం. ఈ కేసులో రిజ్వానా బేగంను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తాము. ఒక్క రిజ్వానానే ఇదంతా చేసింది. మంజుల చనిపోయిన తర్వాత ఆమె మెడలో ఉన్న బంగారం చెవుల రింగ్స్ రిజ్వానా దొంగతనం చేసింది. అనంతరం వాటిని ముత్తూట్ ఫైనాన్స్‌లో రిజ్వానా తాకట్టు పెట్టింది. ఈ క్రమంలో భర్తతో కలిసి అజ్మీర్ వెళ్లిపోవడానికి రిజ్వానా టికెట్స్ కూడా బుక్ చేసింది అని తెలిపారు. ఇది కూడా చదవండి: జగిత్యాల గొల్లపెల్లిలో విషాదం: బాలికను బలిగొన్న పిచ్చి కుక్క -
శంషాబాద్‌లో దారుణం.. కాలిపోయిన స్థితిలో మహిళ డెడ్‌బాడీ
సాక్షి, రంగారెడ్డి: శంషాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. గురువారం అర్ధరాత్రి ఓ మహిళ దారుణంగా హత్యకు గురైనట్టు తెలుస్తోంది. ఇళ్ల స్థలాల మధ్య మహిళ మృతదేహం లభ్యం కావడం స్థానికంగా సంచలనంగా మారింది. వివరాల ప్రకారం.. శంషాబాద్‌లోని సాయి ఎన్‌క్లేవ్‌లోని ఇళ్ల స్థలాల మధ్య ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. కొందరు గుర్తు తెలియని దుండగులు మహిళపై పెట్రోల్‌పోసి నిప్పంటించారు. కాగా, పూర్తిగా కాలిపోయిన స్థితిలో మహిళ మృతదేహం కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ.. శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసు స్టేషన్ పరిధిలోని శ్రీనివాస కాలనీలో ఓ గుర్తు తెలియని మహిళలు గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి పడేసినట్టు తెలిపారు. మహిళ ఎవరు ఎందుకు హత్య చేశారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మహిళ కోసం చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసులు ఏవైనా నమోదయ్యాయా, మహిళకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నారు. కాలనీలోని ప్రతి సీసీ కెమెరాలు క్షుణంగా పరిశీలిస్తున్నట్టు తెలిపారు. మహిళ 35, 36 సంవత్సరాలు వయసుగా ఉంటుంది. కాళ్లకు మెట్టలు ఉండడంతో వివాహమైన మహిళగా ప్రాథమిక గుర్తించామన్నారు. హత్య చేసిన దుండగులకు మధ్య ఘర్షణ జరిగిందా లేదంటే ఎక్కడైనా హత్య చేసి ఇక్కడ తెచ్చి పడేసి నిప్పు పెట్టారు అనే కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు. క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ ఆధారంగా వివరాలు సేకరిస్తున్నామని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: మంచిర్యాలలో వివాహిత దారుణ హత్య, శరణ్యను కిరాతకంగా.. -
ఎయిర్‌పోర్టులో దుమ్మురేపుతున్న దోస్తులు, ఫ్యామిలీ మెంబర్స్, ప్లీజ్ రావొద్దు!
శంషాబాద్: ప్రయాణికుల స్వాగత, వీడ్కోలు జరిగే సమయాల్లో అత్యధికమంది రావడంతో ఎయిర్‌పోర్టు పరిసరాల్లో పార్కింగ్, రద్దీ పెరిగి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని ఎయిర్‌పోర్టు వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. ఇటీవల విదేశాలకు వెళుతున్న విద్యార్థుల వెంట పరిమితికి మించి పెద్దఎత్తున స్నేహితులు, బంధువులు, కుటుంబసభ్యుల రాకతో ఎయిర్‌పోర్టు ప్రాంగణం కిక్కిరిసిపోతున్న సందర్భాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. సుఖవంతమైన ప్రయాణం కోసం ప్రయాణికులు, వారి కుటుంబసభ్యులు సహకరించాలన్నారు. -
బంగారం ద్రవాన్ని చీరపై స్ప్రేగా చల్లి అక్రమ రవాణా
హైదరాబాద్: అక్రమంగా తీసుకొచ్చిన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం రాత్రి దుబాయ్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఓ ప్రయాణికుడి కదలికలను అనుమానించిన అధికారులు అతడి లగేజీని పరిశీలించారు. అందులో ఉన్న ఓ కాటన్ చీరపై బంగారం ద్రవాన్ని స్ప్రేగా చల్లి తీసుకొచ్చినట్లు గుర్తించి దానిని బయటికి తీశారు. బయటపడిన 461 గ్రాముల బంగారం విలువ రూ.28 లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అప్సర హత్యకు ముందు.. గూగుల్‌లో సాయికృష్ణ
సాక్షి, హైదరాబాద్: అప్సర హత్య కేసులో రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు వెలుగు చూశాయి. వాళ్లిద్దరి పరిచయం దగ్గరి నుంచి సాయికృష్ణ అరెస్ట్ దాకా పరిణామాలు పోలీసులు అందులో పేర్కొన్నారు. ఏడాది కాలంలో వాళ్ల మధ్య బంధం ఎలా బలపడింది?.. చివరకు తాను ఆమెను హత్య ఎలా చేసింది సాయికృష్ణ చెప్పిన విషయాల ఆధారంగా నివేదిక రూపొందించారు. గత ఏడాది ఏప్రిల్ నుండి సాయి కృష్ణ అప్సర మధ్య పరిచయం ఏర్పడింది. సాయికృష్ణ పెద్ద పూజారిగా పని చేసిన సరూర్ నగర్ బంగారు మైసమ్మ గుడి కేంద్రంగానే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. తరచూ అప్సరకు వాట్సాప్ ద్వారా సాయి కృష్ణ మెసేజ్‌లు పంపేవాడు. ఈ క్రమంలో కిందటి ఏడాది నవంబర్‌లో గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయం, ద్వారక గుడిని ఇద్దరూ కలిసి సందర్శించారు. అదే టైంలో.. ఇద్దరి మధ్య బంధం మరింత బలపడి.. ఆమె వాట్సాప్ ద్వారా సాయికృష్ణకు లవ్ ప్రపోజ్ చేసింది. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయయడం ప్రారంభించింది అప్సర. లేకుంటే రోడ్డుకు ఈడుస్తానని బ్లాక్ మెయిలింగ్‌కు దిగింది. దీంతో ఆమె అడ్డు తొలగించుకునేందుకు హత్య చేసినట్లు సాయికృష్ణ అంగీకరించాడు. గూగుల్‌లో సెర్చింగ్.. హత్యకు వారం రోజుల ముందు ఇంటర్నెట్లో సాయి కృష్ణ నేరాలు ఎలా చేయాలనే వివరాలను సెర్చ్ చేశాడు. "How to Kil human being" అని గూగుల్‌లో వెతికి చూసినట్లు కూడా తెలుస్తోంది. ఈ క్రమంలో తనను కోయంబత్తూర్ కు తీసుకెళ్లాలని అప్సర పలుమార్లు సాయి కృష్ణను కోరింది. ఇదే అదనుగా భావించి ఆమె అడ్డు తొలగించుకోవాలని సాయికృష్ణ డిసైడ్ అయ్యాడు. టికెట్ కొనలేదని చెప్పి మరీ.. జూన్ 3 వ తేదీ రాత్రి 9 గంటలకు కోయంబత్తూర్ కు టికెట్ బుక్ చేశానని అప్సరను నమ్మించాడు సాయి కృష్ణ. సరూర్ నగర్ నుండి కారులో అప్సరను తీసుకుని.. 8:15గంటల సమయంలో బయల్దేరాడు. 9 గంటలకు శంషాబాద్ అంబేద్కర్ సర్కిల్ దగ్గరకు చేరుకున్నాక.. టికెట్ బుక్ చేయలేదని చెప్పాడు. ఆపై గోశాలకు వెళ్దామని చెప్పి.. రాళ్లగూడ వైపు తీసుకెళ్లాడు. డిన్నర్ కోసం ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర ఆపాడు. అప్పటికే ఆరోగ్యం బాగోలేక అప్సర ఒకసారి వాంతి చేసుకుంది. సాయికృష్ణ ఒక్కడే భోజనం చేసి.. 12 గంటల ప్రాంతంలో సుల్తాన్ పల్లి గోశాల వద్దకు చేరుకున్నారు. అక్కడ బెల్లం దంచే రాయిని అప్సరకు తెలియకుండా కారులో దాచేశాడు. అటుపై అర్ధరాత్రి 3:50 కు వెంచర్ సైడ్ వెళ్లారు. కారు ఫ్రంట్ సీట్లో నిద్రలో ఉన్న సమయంలోనే అప్సరను హత్య చేశాడు సాయి కృష్ణ. ఇదీ చదవండి: నా భర్త అమాయకుడు.. తప్పు అప్సరదే! -
మా కూతురుకు ఏ చెడు అలవాటు లేదు: అప్సర తల్లిదండ్రులు
-
గర్భవతిగా ఉన్న అప్సరను హత్య చేసిన సాయికృష్ణ
-
అప్సర కేసు: సాయికృష్ణ అమాయకుడా?
సాక్షి, హైదరాబాద్: వివాహేతర సంబంధం, ఆపై గొడవల నేపథ్యంలో అప్సరను దారుణంగా హతమార్చిన నిందితుడు, పూజారి సాయికృష్ణను పోలీసులు, శుక్రవారం అర్ధరాత్రి జడ్జి ఎదుట హాజరుపరిచారు. ఐపీసీ సెక్షన్ 201, 302 ప్రకారం అతనిపై కేసు నమోదు చేశారు. దీంతో నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించగా.. చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు. మరోవైపు అప్సర మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో ఇంకా శవ పరీక్ష(అటాప్సీ) పూర్తి కాలేదు. ఆ ఆలస్యానికి గల కారణాలను అధికారులు ప్రకటించాల్సి ఉంది. చాలాకాలం కిందట చెన్నై నుంచి హైదారాబాద్‌కు వలస వచ్చింది అప్సర కుటుంబం. ఆమె తండ్రి కాశీలో స్థిరపడిపోగా.. తల్లితో కలిసి సరూర్‌నగర్‌లో అద్దె ఇంట్లోంది అప్సర. ఈ క్రమంలో స్థానికంగా ఓ ఆలయంలో పెద్దపూజారిగా పని చేస్తున్న సాయికృష్ణతో గుడిలో అప్సరకు పరిచయం ఏర్పడింది. శంషాబాద్‌లో తాను నిర్వహించే గోశాలకు తరచూ ఆమెను తీసుకెళ్తూ ఉండేవాడు ఆ పూజారి. ఈ క్రమంలో సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానంటూ తరచూ ఆమెను కలిసే వంకతో వాళ్ల ఇంటికి సైతం వెళ్తూ వచ్చాడు సాయికృష్ణ. అప్సర తల్లిని అక్కా అని పిలుస్తూ.. ఇంట్లో అన్ని పనులు చేస్తూ ఉండేవాడు. వివాహితుడు అని తెలిసి కూడా అప్సర అతనితో చనువుగా ఉంటూ వచ్చింది. ఆ పరిచయం కాస్త ప్రేమ, ఆపై శారీరక సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చగా.. అబార్షన్ సైతం చేయించాడు. చివరకు పెళ్లి కోసం ఒత్తిడి చేయడాన్ని టార్చర్‌గా భావించి.. అప్సరను హత్య చేశానని నిందితుడు సాయికృష్ణ అంగీకరించాడు. సాయికృష్ణ అమాయకుడు! ఇక ఈ కేసులో తన కొడుకు సాయికృష్ణ అమాయకుడని అంటున్నాడు అతని తండ్రి. అప్సరతో సంబంధం ఉన్నట్లు తమకు, అంతెందుకు సాయికృష్ణ భార్యకు సైతం తెలియదని అంటున్నాడు. కేవలం డబ్బు కోసమే తన కొడుకును అప్సర కుటుంబం ట్రాప్ చేసి ఉంటుందని ఆయన అరోపిస్తున్నాడు. కూతురిని కంట్రోల్లో పెట్టుకోవాల్సింది తల్లే కదా అంటున్నాడాయన. ఓసారి అప్సర బ్యాంక్ అకౌంట్లను పరిశీలించండి.. ఆమె కుటుంబానికి ఆదాయం ఎలా వస్తుంది? అంటూ నిలదీస్తున్నాడాయన. మరోవైపు సాయికృష్ణ భార్య సైతం తన భర్తను వెనకేసుకొస్తోంది. ‘‘నా భర్తకు అప్సరతో సంబంధం లేదు. అప్సర చేసింది కరెక్ట్ కాదు. ఆమెకు ఎవరివల్ల గర్భం వచ్చిందో?. బహుశా నా భర్తను అప్సర నిజంగానే టార్చర్ చేసి ఉండొచ్చ’’ని అంటోందామె. -
అప్సర హత్య కేసులో కీలకం కానున్న పోస్ట్ మార్టం రిపోర్ట్
-
చెన్నై టూ హైదరాబాద్: అప్సర కేసులో సినిమా రేంజ్ ట్విస్ట్‌లు..
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ పరిధిలో నర్కుడ వద్ద అప్సర అనే యువతిని పూజారి సాయికృష్ణ దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. కాగా, హత్య కేసు వివరాలను శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఈ సందర్బంగా వారి మధ్య శారీరక సంబంధమే హత్యకు కారణమని స్పష్టం చేశారు. కాగా, డీసీపీ నారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘తమిళనాడులోని చెన్నైకి చెందిన అప్సర హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. అప్సర డిగ్రీ పూర్తి చేసింది. సినీ రంగంలో కొద్దిరోజులు పనిచేసింది. 2022లో ఆమె హైదరాబాద్‌కు వచ్చారు. అప్సర తండ్రి కాశీ ఆశ్రమంలో నివసిస్తున్నారు. కోనసీమ జిల్లా గన్నవరానికి చెందిన సాయికృష్ణ మార్కెటింగ్‌లో ఎంబీఏ చేశాడు. 2010లో సాయికి వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలున్నారు. ప్రస్తుతం పూజారిగా ఉన్నాడు. బిల్డింగ్ కాంట్రాక్టర్‌గా కూడా పనిచేస్తున్నాడు. అయితే, ఇద్దరికీ బంధుత్వం లేదు, ఒక్కటే కమ్యూనిటీ. అప్సర సరూర్‌నగర్‌లోని బంగారు మైసమ్మ ఆలయానికి వచ్చేది. అదే ఆలయంలో సాయి పూజరిగా ఉన్నాడు. ఈ క్రమంలో ఆమెతో సాయి పరిచయం పెంచుకున్నాడు. ఈ పరిచయం ప్రేమగా మారింది. ఇదే వారి మధ్య శారీరక సంబంధానికి దారి తీసింది. ఇటీవలే సాయికి వివాహం జరిగినట్టు అప్సరకు తెలిసింది. దీంతో, తనను పెళ్లి చేసుకోవాలని 2023 మార్చి నుంచి సాయిపై ఒత్తిడి చేసింది. ఆమెను వదిలించుకోవాలనే ఉద్దేశ్యంతోనే సాయి.. అప్సరను హత్య చేశాడు. ఈనెల 3వ తేదీన కోయంబత్తూరుకు వెళ్దామని చెప్పి అప్సరను సాయి తన కారులో ఎక్కించుకున్నాడు. ఆరోజు రాత్రి 8.15 గంటలకు సరూర్ నగర్ నుంచి కారులో స్టార్ట్ అయ్యారు. 11 గంటలకు శంషాబాద్ సరిహద్దుల్లోకి తీసుకెళ్లాడు. అప్పటికే అప్సర కారు ముందు సీటులో పడుకుని ఉంది. ఈ క్రమంలో సుల్తాన్‌పూర్‌వద్ద ఉన్న గోశాల వైపు కారును మళ్లించాడు. ముందు సీటులో ఉన్న అప్సర ముఖంపై కారు కవరింగ్ షీట్ సాయంలో బలవంతంగా నొక్కాడు. దీంతో, అప్సర ప్రతిఘటించింది. అయితే, సాయి అప్పటికే తన వద్ద ఉన్న రాయితో అప్సర తలపై కొట్టాడు. ఇలా అప్సర తలపై 10సార్లు కొట్టడంతో ఆమె చనిపోయింది’ అని తెలిపారు. మరోవైపు.. సరూర్ నగర్ తహసీల్దార్ కార్యాలయ సమీపంలోని మ్యాన్ హోల్లో నుండి అప్సర మృతదేహన్ని పోలీసులు వెలికితీశారు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే.. ఆమె రెండోసారి గర్భం దాల్చిందని అనుమానాలు ఉన్నాయి. ఈ విషయంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు భావిస్తున్నారు పోలీసులు. ఇతరులతో చనువుగా ఉన్న అప్సర.. వాళ్ల ద్వారా గర్భం దాల్చి ఉంటుందని సాయికృష్ణ అనుమానించినట్టు తెలుస్తోంది. పోస్ట్‌మార్టం రిపోర్ట్ వస్తే.. ఈ చిక్కుముడి వీడే అవకాశం ఉంది. ఇది కూడా చదవండి: హాయ్ డియర్.. హోటల్లో కలుద్దామా.. యువకులతో మాటలు కలిపి.. -
శంషాబాద్ పరిధిలో మహిళ దారుణ హత్య
-
శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
సాక్షి, హైదరాబాద్: ఇండిగో విమానం ఒకటి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. బెంగళూరు నుంచి వారణాసి మధ్య 6E897 నెంబరు ఇండిగో విమానం మంగళవారం ఉదయం 5గం.10ని. టేకాఫ్ అయ్యింది. అయితే.. సాంకేతిక సమస్యల తలెత్తడంతో శంషాబాద్ విమానాశ్రయంలో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. ఉదయం 6గం. 16ని. హైదరాబాద్ శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం హఠాత్తుగా ల్యాండ్ అయ్యింది. సాంకేతిక సమస్యలు ఏర్పడటం వల్ల ప్రయాణికుల కోసం మరో విమానాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. -
Hyderabad: మెట్రో రెండో దశ.. దూరమే!
సాక్షి, హైదరాబాద్: మెట్రోరైలు విస్తరణ పనులు మరింత ఆలస్యమయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయి. హైదరాబాద్ మెట్రోరైలు రెండో దశ కింద చేపట్టాలని భావించిన మూడు ప్రాజెక్టుల్లో ఒకటైన రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు కేరిడార్‌ను రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు శంకుస్థాపన కూడా చేసింది. మిగతా రెండు ప్రాజెక్టులైన బీహెచ్ఈఎల్ నుంచి లక్డీకాపూల్, నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు పొడిగింపు ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వంతో కలిసి జాయింట్ వెంచర్‌గా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ.. ఆ దిశగా అడుగులు అంత వేగంగా పడడం లేదు. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి సామాజిక కార్యకర్త ఇనుగంటి రవికుమార్ ఆర్టీఐ ద్వారా కేంద్రాన్ని కోరగా, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి వికాష్ కుమార్ ఈ మేరకు సమాధానమిచ్చారు. హైదరాబాద్ మెట్రో రెండో దశకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖలకు తాము స్పందించామని, తదుపరి కార్యాచరణ లేదని స్పష్టం చేశారు. మెట్రో రెండో దశ ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ రాసిన లేఖకు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి సమాధానమిస్తూ మెట్రో మంజూరుకు కీలకమైన డీపీఆర్‌లో మార్పులతో పాటు సాధ్యాసాధ్యాలపై పలు సందేహాలు వ్యక్తం చేశారు. వివరణ పంపని రాష్ట్రం డీపీఆర్‌ను ప్రస్తుత ధరలకు అనుగుణంగా మార్చాలని సూచించడంతో పాటు 14 అంశాలపై వివరణ కోరారు. తాము కోరిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణలు వస్తే పరిశీలిస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు అర్వింద్‌కుమార్‌కు గత డిసెంబర్ 1న లేఖ రాసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి వివరణ పంపలేదు. కేంద్రం అడిగిన కేబినెట్ తీర్మానం కాపీ, స్పెషల్ పర్పస్ వెహికిల్, నిధులు సమకూర్చే సంస్థను ఎంపిక చేయడం, రోడ్‌మ్యాప్ మొదలైనవాటిని ఫైనలైజ్ చేసి పంపాలని కోరినా రాష్ట్ర ప్రభుత్వం ఏమీ పంపలేదని ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నలకు కేంద్రం సమాధానమిచ్చింది. ఈ నేపథ్యంలో రెండోదశ మెట్రో పనులపై అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. -
గుడ్‌న్యూస్! శంషాబాద్‌లో ఈఎస్ఐ ఆస్పత్రికి కేంద్రం ఆమోదం
కార్మికులకు మెరుగైన వైద్య సేవలందించేందుకుగాను రాష్ట్రంలో వంద పడకల ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు ఎట్టకేలకు ఏడాదిన్నరకు మోక్షం లభించింది. ఈ ప్రతిపాదనను ఆమోదిస్తున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్రయాదవ్ మంగళవారం అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు 190వ ఈఎస్ఐ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 8 ఈఎస్ఐ వంద పడకల ఆస్పత్రులు ఏర్పాటు చేయనున్నామని, రాష్ట్రంలోని శంషాబాద్‌లో ఈఎస్ఐ ఆసుపత్రిని నిర్మించనున్నామని అధికారికంగా ప్రకటించారు. దీంతో కార్మికుల్లో హర్షం వ్యక్తమవుతోంది. హైదరాబాద్ శివారులో గగన్‌పహాడ్, కాటేదాన్, సాతంరాయి పారిశ్రామికవాడలతోపాటు కొత్తూరు, నందిగామ, బాలా నగర్, షాద్‌నగర్ పారిశ్రామిక వాడలకు శంషాబాద్ చేరువలో ఉంది. దీనికితోడు నగర శివారులోని అన్ని పారిశ్రామిక ప్రాంతాల నుంచి ఇక్కడికి రాకపోకలు సాగించేందుకు ఔటర్ రింగు రోడ్డు వంటి అనువైన అనుసంధాన రహదారులు, రైల్వే కనెక్టివిటీ ఉంది. (చదవండి: నో రూల్స్.. ఆర్టీఏ అధికారులని బురిడీ కొట్టిస్తున్న బీమా సంస్థలు) -
శంషాబాద్ లో యువతి ఆత్మహత్య
-
మెట్రో.. మెట్రో: రాయదుర్గం టు శంషాబాద్.. ఏనోట విన్నా అదే చర్చ
సాక్షి, హైదరాబాద్: రాయదుర్గం మెట్రో రైల్వేస్టేషన్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో రైలు విస్తరణ చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతో రూ.6,200 కోట్ల అంచనా వ్యయంతో త్వరలో మెట్రో పనులు ప్రారంభం కానున్నాయి. శుక్రవారం సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు, అధికారుల సమక్షంలో శంకుస్థాపన చేసేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మెట్రోతో సమయం, డబ్బు, ట్రాఫిక్ లేకుండా రాకపోకలు సాగించే వీలుండడంతో సర్వత్రా సంతోషం వ్యక్తం అవుతోంది. కొన్ని రోజులుగా మధురానగర్, ప్రశాంత్‌హిల్స్ కాలనీ, సాయివైభవ్ కాలనీ, సాయిఐశ్వర్య కాలనీ, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ల్యాంకోహిల్స్, నానాక్‌రాంగూడ ప్రాంతాలలో మెట్రోపై అందరూ చర్చించుకుంటున్నారు. గచ్చిబౌలి డివిజన్ అనగానే ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటుతో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, ఉన్నత విద్యా, శిక్షణ సంస్థలకు నిలయం. అలాంటి ప్రాంతానికి మెరుగైన రవాణా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. మెట్రో రూటు ఇదే.. ►రాయదుర్గం సర్వే నంబర్–83కి చేరువలోనే ఉన్న రాయదుర్గం మెట్రో రైల్వేస్టేషన్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు విస్తరిస్తారు. ►ముఖ్యంగా బయోడైవర్సిటీ పార్కు కూడలి చేరువ నుంచి మధురానగర్, ఖాజాగూడ, నానక్‌రాం గూడ ఓఆర్ఆర్ అండర్ బ్రిడ్జి పక్కనే ఉన్న సరీ్వస్ రోడ్డు ద్వారా నార్సింగి మీదుగా శంషాబాద్ వరకు మెట్రో రైలు నడపాలని భావిస్తున్నారు. ►ఈ మెట్రోతో గచి్చ»ౌలి, మధురానగర్, రాయదుర్గం, ప్రశాంత్‌హిల్స్, ఖాజాగూడ, సాయివైభవ్ కాలనీ, సాయిఐశ్వర్యకాలనీ, ల్యాంకోహిల్స్, నానక్‌రాంగూడ, పరిసరాల్లోని వారికి మేలు కలుగుతుంది. ►ఇటీవల ఈ ప్రాంతాలలో గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లు విరివిగా పెరగడం, ఇంకా పలు భవనాలు నిర్మాణంలో ఉండడంతో వీరంతా సంతోíÙస్తున్నారు. ►ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాల లోని ఐటీ, ఇతర సంస్థల ఉద్యోగులు కూడా మెట్రో రాకతో సొంత వాహనాలు పక్కనపెట్టి మెట్రోలోనే రాకపోకలు సాగించే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చొరవతోనే.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీరామారావు ప్రత్యేక చొరవతోనే గచ్చిబౌలి డివిజన్‌కు మెట్రో సౌకర్యం ఏర్పడే అవకాశం కలుగుతోంది. ఇప్పటికే లింకురోడ్లు, ఫ్లైఓవర్లతో చాలా వరకు తగ్గినా ఈ మెట్రోతో మా ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య చాలా వరకు తీరే అవకాశం ఉంది. రవాణా సౌకర్యం మరింతగా చేరువ కానుండడంపై అందరిలోనూ సంతోషం వ్యక్తం అవుతోంది. –సాయిబాబా, గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ రైలు సౌకర్యం వస్తుందని అనుకోలే.. మా మధురానగర్, ఖాజాగూడ, నానక్‌రాంగూడ, పరిసరాలకు మెట్రో సౌకర్యం కలుగుతుందనే భావన ఎంతో సంతోషానిస్తోంది. ఇటీవల అపార్ట్మెంట్లు విపరీతంగా వెలిశాయి. దీనికితోడు ఐటీ సంస్థలు, స్కూళ్లు పెద్ద సంఖ్యలో ఉండడంతో ట్రాఫిక్ రోజురోజుకూ పెరిగిపోతోంది. అది చాలా వరకు తగ్గుతుంది. – రమేష్‌గౌడ్,మధురానగర్ మెట్రో రావడం చాలా సంతోషం.. మెట్రోతో ముఖ్యంగా యువత, విద్యార్థులు, ఐటీ ఉద్యోగులకు ఎంతో మేలు చేకూరుతుంది. మియాపూర్, మాదాపూర్ వరకు వచి్చంది. మాకు కూడా వచి్చంటే బాగుండు అనుకున్నం. శంషాబాద్, నార్సింగి, గచ్చి»ౌలి, మాదాపూర్ వంటి ప్రాంతాలతోపాటు ఇతర చోట్లకు వెళ్ళేందుకు సమయం, డబ్బు ఆదాతోపాటు వేగంగా Ðð ళ్లేందుకు అవకాశం కలుగుతుంది. –పొన్నయ్య, ఖాజాగూడ -
హలో మేము సైబర్ క్రైమ్ పోలీసులం అంటూ..రూ.35 వేలు కాజేశారు!
సాక్షి, శంషాబాద్ రూరల్: హలో.. మేము సైబర్ క్రైమ్ నుంచి మాట్లాడుతున్నాము.. మీ వీడియో ఇంటర్నెట్లో అప్లోడ్ అయింది.. వెంటనే తొలగించాలంటూ ఓ వ్యక్తిని మాటలతో మభ్య పెట్టి రూ.35,450 కాజేసిన సంఘటన మంగళవారం శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ ఏ.శ్రీధర్‌కుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని బుర్జుగడ్డతండాకు చెందిన వాన భాస్కర్ గైడ్‌గా పని చేస్తున్నాడు. గత నెల 28న అతడికి ఫోన్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు నీకు సంబందించిన వీడియో నెట్లో అప్లోడ్ అయ్యిందని, దీన్ని తొలగించుకోవాలని చెబుతూ అతనికి ఓ ఫోన్ నంబరు ఇచ్చారు. దీంతో బాధితుడు సదరు ఫోన్ నంబర్ కాల్ చేయగా వీడియో తొలగించడానికి డబ్బులు కావాలని డిమాండ్ చేశారు. దీంతో అతను తన ఫోన్‌పే ద్వారా రూ.21వేలు పంపించాడు. ఇలా పలు దఫాలుగా మొత్తం రూ.35,450 ముట్టజెప్పాడు. ఈ డబ్బులను తిరిగి చెల్లిస్తామని చెప్పిన నేరగాళ్లు తర్వాత మరింత డిమాండ్ చేయడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. (చదవండి: అదృశ్యమైన వ్యక్తి శవమై తేలాడు.! ప్రియుడితో కలిసి భార్యే..) -
హైదరాబాద్ : మెట్రో రైల్ రెండవ దశకు ముహూర్తం ఖరారు
-
ఎయిర్‌పోర్టులో కొత్త టెర్మినల్ ప్రారంభం
శంషాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంతర్జాతీయ డిపార్చర్ కేంద్రం కార్యకలాపాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఎయిర్‌పోర్టు విస్తరణలో భాగంగా నాలుగేళ్లుగా అంతర్జాతీయ డిపార్చర్ కేంద్రాన్ని వీఐపీ మార్గంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక టెర్మినల్ భవనంలో కొనసాగించారు. గతంలో ఉన్న డిపార్చర్ కేంద్రానికి అనుసంధానంగా నిర్మించిన కొత్త భవనం ఇటీవల పూర్తయింది. దీంతో ప్రధాన టెర్మినల్‌లోనే కొత్త అంతర్జాతీయ డిపార్చర్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సీఈవో ప్రదీప్ ఫణీకర్ పూజా కార్యక్రమాలు నిర్వహించి లాంఛనంగా ప్రారంభించారు. సోమవారం సాయంత్రం సౌదీ ఎయిర్‌లైన్స్ విమానం తొలిసారిగా కొత్త టెర్మినల్ కేంద్రంగా బయల్దేరింది. ప్రయాణికులకు సౌకర్యాల కల్పనలో జీఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయం పురోగమిస్తోందని సీఈవో ప్రదీప్ ఫణీకర్ పేర్కొన్నారు. -
మాయని మచ్చగా తొండుపల్లి ఘటన.. ఆ అమానుషానికి మూడేళ్లు
ఆ దారుణం.. మనసున్న ప్రతి హృదయాన్ని కదిలించింది.. ఆ దహనం ప్రతి గుండెనూ దహించింది.. నలుగురు కామాంధులు చేసిన వికృత చేష్టలకు సమాజం దిగ్బ్రాంతికి గురైంది. దిశ ఉదంతం.. పోలీసులకు కొత్త దిశను చూపింది.. రాష్ట్ర రాజధాని శివారులోని తొండుపల్లి వద్ద మొదలై షాద్‌నగర్ శివారులో ముగిసిన దిశ విషాదం వెలుగు చూసి నేటికీ మూడేళ్లు పూర్తయింది. ఆమె మరణం.. మహిళా రక్షణ కొత్త చట్టాలకు దిశా నిర్దేశం చేసింది. మహిళల దశ మార్చే న్యాయసహాయకులకు, నిఖార్సైననిర్ణయాలకు రూపకల్పన చేసింది. అమానుషమైన నాటి ఘటన.. ఆ తర్వాత జరిగిన పరిణామాలను ఓ సారి గుర్తు చేసుకుంటే.. – షాద్‌నగర్ 2019 నవంబర్ 27న రాత్రి సుమారు 8.30 గంటల సమయం.. దిశ అనే యువతి అత్యవసర పరిస్థితుల్లో తన స్కూటీని శంషాబాద్ పరిధిలోని తొండుపల్లి టోల్‌ప్లాజా వద్ద జాతీయ రహదారి పక్కన ఆపింది. అక్కడి నుంచి పని మీద వెళ్లింది. తిరిగి వచ్చి తన స్కూటీని తీసుకొని ఇంటికి వెళ్లాలని ప్రయత్నించింది. అంతలోనే నలుగురు కామాంధులు ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు ఆమెను బలవంతంగా పక్కకు తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేశారు. నవంబర్ 28న తెల్లవారుజామున మృతదేహాన్ని నిందితులు లారీలో తీసుకొచ్చి షాద్‌నగర్ శివారులోని బైపాస్ జాతీయ రహదారి చటాన్‌పల్లి బ్రిడ్జి కింద కాల్చివేశారు. అయితే 2019 డిసెంబర్ 6 తెల్లవారుజామున సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం నలుగురు నిందితులను పోలీసులు ఘటనా స్ధలానికి తీసుకొచ్చారు. ఆ సమయంలో నిందితులు పోలీసులపై దాడి చేసి వారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు వారిని ఎన్కౌంటర్ చేయడం మరో సంచలనం అయ్యింది. దిశ హత్య ఘటన జనాలను ఎంతగా కదిలించిందంటే ఆ తర్వాత జరిగిన ఎన్‌కౌంటర్‌ను ప్రతి ఒక్కరూ సమర్తిస్తూ పోలీసులపై పూల వర్షం కురిపించారు. అంతేకాదు దిశ హత్య ఉదంతం కొత్త చట్టాలకు దిశానిర్దేశం చేసింది. ఆ తర్వాత ఎన్‌కౌంటర్‌కు గురైన మృతుల కుటుంబ సభ్యులు న్యాయం కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో కోర్టు.. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి వీఎస్ సిర్పూకర్ సీబీఐ మాజీ డైరక్టర్ కార్తీకేయన్, వీఎన్ బాంబే హైకోర్టు మాజీ జడ్జి రేఖలతో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయగా కమిటీ సభ్యులు విచారణ పూర్తి చేసి నివేదికను సుప్రీం కోర్టుకు అందజేశారు. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టులో కొనసాగుతోంది. మారిన చట్టాలు దుర్మార్గుల చేతిలో అత్యంత దారుణంగా ప్రాణాలు కోల్పోయిన దిశ పేరిట కొత్త చట్టాలను ప్రభుత్వాలు తీసుకొచ్చారు. ఆపదలో ఉన్న ఏ ఆడపిల్లయినా ఫోన్ చేస్తే క్షణాల్లో ఘటనా స్ధలానికి చేరుకొని రక్షించేలా ఫోన్ నంబర్లను, పోలీసు వ్యవస్థను, ఏర్పాటు చేశారు. అలాగే ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేశారు. మహిళలకు తగిన జాగ్రత్తలను సూచిస్తూ వారికి హాని తలపెడితే వేసే శిక్షలపై కాలేజీ విద్యార్థులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు విస్తృతం చేశారు. పోలీసు పెట్రోలింగ్‌లో సైతం వేగం పెంచారు. దిశ నిందితుల ఎన్కౌంటర్ల ప్రభావం కారణంగా మహిళలపై దాడులు, హత్యలు, అత్యాచారాల వంటివి చాలా వరకు తగ్గుముఖం పట్టాయనే చెప్పవచ్చు. అప్రమత్తత అవసరం సమాజంలో ఇంకా అక్కడక్కడా మహిళలు, బాలికలపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. మహిళల రక్షణ కోసం పోలీసులు అందిస్తున్న, కల్పిస్తున్న సదుపాయాలను యువతులు, మహిళలు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మహిళలు కూడా ఒంటరిగా ఉన్న సమయంలో, రాత్రివేళల్లో బయటకు వెళ్లినప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లో పోలీసు సేవలను వినియోగించుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. మహిళల పట్ల ఎవరు అనుచితంగా ప్రవర్తించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. -
శిల్ప లేఅవుట్ ఫ్లై ఓవర్.. 20 నిమిషాల్లో పంజాగుట్ట నుంచి ఓఆర్ఆర్కు
సాక్షి, గచ్చిబౌలి: శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు మరో సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇక నుంచి గచచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్డుకు రయ్.. రయ్‌మని వెళ్లవచ్చు. శిల్పా లేవుట్‌లో అందుబాటులోకి వచ్చిన ఫ్లైఓవర్‌తో విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు తక్కువ సమయం పడుతుంది. సిగ్నల్ ఫ్రీ రవాణా వ్యవస్థను నెలకొల్పడంలో భాగంగా ఏర్పాటు చేస్తున్న ఫ్లైఓవర్లతో వాహనదారులకు ఎంతో ఊరట లభిస్తుంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఎస్ఆర్డీపీ నిర్మించిన 17వ ఫ్లైఓవర్‌గా శిల్ప లేఅవుట్ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చింది. ఏర్పాట్లు ఇలా.. ♦ మైండ్ స్పేస్ ఫ్లైఓవర్ దిగగానే, ఐకియా వెనుక రోడ్డులో శిల్ప లేఅవుట్ ఫ్లై ఓవర్‌కు చేరుకోవాలి. ♦ ఫ్లై ఓవర్ ఎక్కిన వాహనాలు ఓల్డ్ ముంబై జాతీయ రహదారిపై దిగొచ్చు. దిగువ ర్యాంప్ ద్వారా ఔటర్‌పై కూడా దిగవచ్చు. ♦ ఔటర్ నుంచి వచ్చే వాహనాలు ఎగువ ర్యాంప్ ద్వారా నేరుగా ఫ్లై ఓవర్ పైకి వెళతాయి. గచ్చిబౌలి జంక్షన్‌లోనూ ఫ్లై ఓవర్ పైకి వాహనాలు వెళ్లేందుకు ర్యాంప్ ఏర్పాటు చేశారు. ♦ ఫ్లై ఓవర్ ముగియగానే, లెఫ్ట్ తీసుకొని డెలాయిట్ రోడ్డులో మైండ్ స్పేస్ ఫ్లైఓవర్‌పైకి చేరుకోవచ్చు. సాఫీగా ప్రయాణం.. సికింద్రాబాద్, కూకట్పల్లి, పంజాగుట్ట, అమీర్‌పేట్ తదితర ప్రాంతాల నుంచి వాహనాలు పంజాగుట్ట నాగార్జున సర్కిల్ నుంచి ప్రసాద్ ఐ హాస్పిటల్, జూబ్లీహిల్స్ చెక్ పోస్టు జంక్షన్ నుంచి రోడ్ నంబర్ 45కు వెళతాయి. ♦ అక్కడ కేబుల్ బ్రిడ్జి నుంచి నేరుగా కోహినూర్ హోటల్ , మైండ్ స్పేస్ ఫ్లైఓవర్ దిగిన వెంటనే లెఫ్ట్ తీసుకోవాలి. ఐకియా వెనుక నుంచి వెళ్లి రైట్ టర్న్ తీసుకుంటే శిల్ప లేఅవుట్లోని ఫ్లై ఓవర్ పై నుంచి నేరుగా ఔటర్ రింగ్ రోడ్డుకు చేరుకోవచ్చు. ♦ జూబ్లీహిల్స్ వైపు నుంచి వచ్చే వాహనదారులు శంషాబాద్ విమానాశ్రయం, బెంగళూర్ జాతీయ రహదారితో పాటు నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్, కోకాపేట్, శంకర్పల్లి, తెల్లాపూర్, కొల్లూరు, పటాన్చెరు వైపు వెళ్లవచ్చు. ♦ ఫ్లైఓవర్ నుంచి ఓల్డ్ ముంబయ్ జాతీయ రహదారికి దిగే వెసులుబాటు కల్పించారు. దీంతో రాయదుర్గం, మెహిదీపట్నం వైపు వెళ్లేందుకు వీలుంటుంది. ♦ శంషాబాద్ విమానాశ్రయం, పటాన్చెరు, కోకాపేట్, ఫ్లైనాన్షియల్ డిస్ట్రిక్ట్, లింగంపల్లి, గచ్చిబౌలి నుంచి వాహనదారులు నేరుగా శిల్పా లేఅవుట్ ఫ్లై ఓవర్ ద్వారా ఇట్టే జూబ్లీహిల్స్ చేరుకోవచ్చు. జంక్షన్లపై తగ్గనున్న ఒత్తిడి ♦ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి జూబ్లీహిల్స్ వెళ్లే వాహనాలు గచి్చ»ౌలి జంక్షన్ నుంచి బయోడైవర్సిటీ జంక్షన్, మైండ్ స్పేస్ జంక్షన్‌కు వెళుతుంటాయి. లేదా గచి్చ»ౌలి జంక్షన్ నుంచి అంజయ్యనగర్‌లో రైట్ టర్న్ తీసుకొని రాంకీ రోడ్డులో వెళ్లి మైండ్ స్పేస్ ప్లై ఓవర్‌కు చేరుకునేవి. ♦ శిల్ప లేఅవుట్ ఫ్లై ఓవర్ అందుబాటులోకి రావడంతో అటు బయోడైవర్సిటీ, ఇటు అంజయ్యనగర్ వైపు వెళ్లాల్సిన పని లేదు. ♦ దీంతో గచ్చిబౌలి జంక్షన్లో వాహనాల తాకిడి తగ్గనుంది. అంతే కాకుండా బయోడైవర్సిటీ జంక్షన్‌లోనూ తగ్గే అవకాశం ఉంది. ప్రాజెక్ట్ వ్యయం రూ.466 కోట్లు ►పొడవు 2,810 మీటర్లు (2.81 కిలోమీటర్లు) ►లైన్లు నాలుగు లేన్ల బై డైవర్షనల్ ఫ్లై ఓవర్ ►మెయిన్ ఫ్లైఓవర్ 956 మీటర్లు ►ఎగువ ర్యాంప్ 456.64 మీటర్లు ►దిగువ ర్యాంప్ 399.95 మీటర్లు (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Shamshabad: ప్రధాన టెర్మినల్ నుంచే విమాన సర్వీసులు
శంషాబాద్: దశలవారీగా జరుగుతున్న రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ పనుల్లో భాగంగా తాత్కాలిక అంతర్జాతీయ డిపార్చర్‌ను మూసివేయనున్నారు. ప్రధాన టెర్మినల్ అనుసంధానంగా నిర్మాణం చేసిన విస్తరణ పనులు పూర్తవడంతో ఈ నెల 28 నుంచి గతంలో మాదిరిగానే ప్రధాన టెర్మినల్ నుంచే అంతర్జాతీయ డిపార్చర్ కేంద్రం కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను జీఎంఆర్ సంస్థ పూర్తి చేసినట్లు విమానాశ్రయ వర్గాలు బుధవారం మీడియాకు వెల్లడించాయి. (క్లిక్ చేయండి: బేగంపేట మార్గంలో మళ్లీ ట్రాఫిక్ ఆంక్షలు.. ఫిబ్రవరి 21 వరకు..) -
Hyderabad: పంజాగుట్ట టు శంషాబాద్.. సిగ్నల్ ఫ్రీ
సాక్షి, హైదరాబాద్: పంజాగుట్ట నుంచి శంషాబాద్ వరకు సిగ్నల్ ఫ్రీ కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పేర్కొన్నారు. సోమవారం ఔటర్ రింగ్ రోడ్డు నుంచి శిల్పా లేఅవుట్ వరకు నిర్మించిన ఫ్లైఓవర్‌ను అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్, ఔటర్ రింగ్ రోడ్డు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లను అనుసంధానం చేస్తున్నామన్నారు. 1.4 కిలో మీటర్ల పొడవునా ఫ్లైఓవర్, 1.4 కిలో మీటర్లు ర్యాంప్, లింకు రోడ్లను రూ.300 కోట్లతో చేపట్టామన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 47 ప్రాజెక్ట్‌లు చేపట్టగా ఎస్ఆర్డీపీ ద్వారా 41 ప్రాజెక్ట్‌లు, ఇతర శాఖల ద్వారా 6 ప్రాజెక్ట్‌లు చేపట్టామని తెలిపారు. శిల్పా లేఅవుట్ నుంచి ఓఆర్ఆర్ వరకు నిర్మించిన నాలుగు లేన్ల బై డైవర్షనల్ 17వ ఫ్లైఓవర్ అని తెలిపారు. ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందన్నారు. (క్లిక్ చేయండి: హమ్మయ్య.. హైదరాబాద్ వాహనదారులకు ఊరట) -
సర్కారీ జాగా.. వేశాడు పాగా.. నాడు రామోజీ.. నేడు అధికారపార్టీ నేత
సాక్షి, హైదరాబాద్: కంచె చేను మేసిన చందంగా ప్రజాప్రతినిధే సర్కారు భూమిని కబ్జా చేశాడు. పట్టా భూమి కొనుగోలు చేసి..పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిలో పాగా వేశాడు. రూ.2 కోట్ల విలువైన ఈ భూమికి ఏకంగా ప్రహరీ కూడా ఏర్పాటు చేసి.. తన ఆధీనంలోకి తీసుకున్నాడు. పలుకుబడి కలిగిన ఆ ప్రజాప్రతినిధి ప్రభుత్వ భూమి కబ్జా వ్యవహారం తెలిసినా రెవెన్యూ అధికారులు అటువైపు వెళ్లేందుకు సాహసించడంలేదు. శంషాబాద్ మండలం పాల్మాకుల రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 13లో 32 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 28 ఎకరాలను పేద రైతులకు ప్రభుత్వం అసైన్డ్ చేసింది. అక్రమంగా నిర్మించిన ప్రహరీ నాలుగు ఎకరాలు మాత్రం ఖాళీగానే ఉంది. ఈ భూమిని ఆనుకుని పట్టా (సర్వేనం.28) భూములున్నాయి. ఈ భూమిలో కొంత మేర కొనుగోలు చేసిన ప్రజాప్రతినిధి కన్ను పక్కనే ఉన్న సర్కారు భూమిపై పడింది. పట్టా భూమి చుట్టూ ప్రహరీ నిర్మించిన ఆయన పనిలో పనిగా హద్దు రాళ్లను తొలగించి సర్కారు భూమిని కూడా తన ఖాతాలో కలిపేసుకున్నాడు. దీని విలువ బహిరంగ మార్కెట్లో రూ.రెండు కోట్లు ఉంది. ఆక్రమించిన ప్రభుత్వ భూమిలో పెద్ద గుట్ట కూడా ఉంది. ఈ బండరాళ్లను పగలగొట్టి గ్రానైట్ రాళ్లుగా మార్చి సొమ్ము చేసుకుంటున్నారు. ఆక్రమణలను అడ్డుకుంటాం ప్రభుత్వం పేదలకు అసైన్డ్ చేయగా మిగిలిన ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురైన విషయం ఇప్పటి వరకు మా దృష్టికి రాలేదు. ఆర్ఐని క్షేత్రస్థాయి పరిశీలనకు పంపుతాం. ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లు తేలితే..స్వా«దీనం చేసుకుని హెచ్చరిక బోర్డులు నాటుతాం. ఆక్రమణ దారులపై చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్, శంషాబాద్ నాడు రామోజీ.. నేడు అధికారపార్టీ నేత సర్వే నంబరు 13 సర్కారు భూముల పక్కనే మార్గదర్శి చిట్‌ఫండ్ యజమాని రామోజీరావు భూములు ఉన్నాయి. నాలుగు ఎకరాలను తన భూమిలో కలిపేసి చుట్టూ ఫెన్సింగ్ వేశారు. 2011లో ‘సాక్షి’ ఈ భూ కబ్జాపై వరస కథనాలు ప్రచురించడంతో రెవెన్యూ అధికారులు సర్వే చేసి కబ్జాను నిర్దారించారు. దీంతో ఆక్రమణదారులు అప్పట్లో ఈ నాలుగు ఎకరాలను వదిలేసి లోపలి వైపు కడీలు పాతారు. అప్పటి నుంచి ఖాళీగా ఉన్న ఈ సర్కారు భూమిపై ఇప్పుడు స్థానిక ప్రజాప్రతినిధి కన్నుపడింది. చదవండి: ఐబీఎస్ కాలేజ్ ర్యాగింగ్ ఘటన.. వెలుగులోకి సంచలన విషయాలు -
Shamshabad: వాట్సాప్‌లో అమ్మకం.. గేదెల ఫొటోను చూపించి..
సాక్షి, రంగారెడ్డి: వాట్సాప్‌లో అమ్మకానికి పెట్టిన గేదెలను కొనడానికి యత్నించిన ఓ రైతు సైబర్ నేరగాళ్లకు రూ.1,31,500 సమర్పించుకున్నాడు. పోలీసుల చెప్పిన వివరాల మేరకు... కవ్వగూడకు చెందిన రైతు బొద్దం శ్రీకాంత్ యాదవ్ వాట్సాప్ నంబరుకు గుర్తు తెలియని ఓ వ్యక్తి నుంచి ఈ నెల 6న హాయ్ అంటూ మెసేజ్ వచ్చింది. తర్వాత కొద్దిసేపటికి గేదెల ఫొటోలు పోస్టు చేసి, రెండు గేదెలు అమ్మకానికి ఉన్నాయని వాటి ధర రూ.1,10,000గా చెప్పాడు. గేదెలు కొనేందుకు శ్రీకాంత్ ఆసక్తి చూపడంతో సదరు వ్యక్తి ముందుగా రూ.10 వేలు చెల్లించాలని చెప్పాడు. అందుకు ఒప్పుకుని ఫోన్‌పే ద్వారా పలుసార్లు రూ.9వేలు పంపించాడు. గేదెలు పంపించడానికి బోర్డర్ చార్జీలు, జీఎస్టీ కలిపి అదనంగా రూ.11,500 అవుతుందని చెప్పగా ఆ మొత్తాన్ని కూడా చెల్లించాడు. గేదెలు ఇంటికి పంపించిన తర్వాత రూ.లక్ష ఇవ్వవచ్చని, మిగిలిన మొత్తాన్ని ముందుగానే చెల్లించాలని షరతు పెట్టారు. దీంతో ఈ నెల 10న గేదెలు పంపిస్తున్నట్లు చెప్పడంతో తన చిరునామా వివరాలు అందజేశాడు. ఇలా శ్రీకాంత్‌ను నమ్మించి పలుసార్లు మొత్తంగా రూ.1,31,500 వసూలు చేశారు. చివరకు తాను మోసపోయినట్లు గుర్తించిన శ్రీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
పెళ్లికి నిరాకరించిందని వివాహితపై హత్యాయత్నం
శంషాబాద్ రూరల్: తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తోందన్న కోపంతో వివాహితపై పెట్రోలు పోసి నిప్పంటించాడో వ్యక్తి. ఆ తరువాత తాను కూడా ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తొండుపల్లిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. శంషాబాద్ మున్సిపాలిటి పరిధిలోని కిషన్‌గూడ వాసి బంటారం మహేశ్‌గౌడ్, మండలంలోని గండిగూడకు చెందిన సంధ్య(29) వివాహం 2012లో జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. తొండుపల్లిలో నివాసముంటున్నారు. మూడేళ్ల క్రితం దంపతుల మధ్య గొడవలు జరగడంతో పిల్లలతో కలిసి సంధ్య గండిగూడలోని పుట్టింటికి వెళ్లింది. ఈ సమయంలో వీరింటి పక్కన నివాసముండే మహ్మద్ అల్తాఫ్తో పరిచయం ఏర్పడి ఇద్దరి మధ్య ప్రేమకు దారితీసింది. కొంత కాలం తర్వాత సంధ్య భర్త వద్దకు వెళ్లిపోయింది. పెళ్లి చేసుకోవాలని వేధింపులు.. ఈ క్రమంలో తొండుపల్లిలో ఉంటున్న సంధ్యకు తరచూ అల్తాఫ్ ఫోన్ చేస్తూ వేదిస్తున్నాడు. తనతో రావాలని, పెళ్లి చేసుకోవాలని లేదంటే చంపేస్తానని బెదిరిస్తున్నాడు. ఇటీవలే ఈ విషయాన్ని సంధ్య తన భర్తకు తెలిపింది. సంధ్య తన మాట వినడంలేదని కక్షగట్టిన అల్తాఫ్ ఆమెను ఎలాగైనా అంతం చేయాలని భావించాడు. ఇందుకోసం పథకం ప్రకారం.. శుక్రవారం మధ్యాహ్నం సంధ్య భర్త మహేశ్‌కు అల్తాఫ్ ఫోన్ చేశాడు. తాను తొండుపల్లి వద్ద వైన్‌షాపు దగ్గర ఉన్నానని, మాట్లాడుకుందాం.. అక్కడకు రావాలని చెప్పాడు. దీంతో మహేష్ ఇంటి నుంచి వైన్‌షాపు వద్దకు వెళ్లాడు. దీంతో సంధ్య ఇంట్లో ఒక్కతే ఉందని గుర్తించి అక్కడకు వెళ్లిన అల్తాఫ్.. తన వెంట బాటిల్లో తెచ్చుకున్న పెట్రోలును సంధ్యపై పోసి నిప్పటించాడు. దీంతో పాటు తాను కూడా పెట్రోలు పోసుకుని నిప్పటించుకున్నాడు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. తీవ్రగాయాలైన సంధ్యను చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అల్తాఫ్‌కు స్వల్పగాయాలవడంతో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడుపై నేర చరిత్ర.. వివాహితపై పెట్రోలు పోసి నిప్పటించిన అల్తాఫ్‌కు గతంలో కూడా నేర చరిత్ర ఉంది. మహబూబ్‌నగర్ జిల్లా ప్రాంతానికి చెందిన వీరి కుటుంబం కొన్నేళ్ల కిందట వలస వచ్చి గండిగూడలో స్థిరపడ్డారు. సుమారు 8 ఏళ్ల కిందట అల్తాఫ్ తండ్రి హత్యకు గురయ్యాడు. ఈ కేసులో అల్తాఫ్, తన అన్నతో కలిసి జైలుకు వెళ్లి వచ్చాడు. తర్వాత అల్తాఫ్ కుటుంబ గండిగూడ నుంచి ఘాంసిమియాగూడకు మకాం మార్చింది. చదవండి: ఘోర ప్రమాదం.. 11 మంది సజీవదహనం -
రాష్ట్రంలో ‘ష్నైడర్’ రెండో ప్లాంట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విద్యుత్ పరికరాల తయారీ, ఆటోమేషన్ రంగంలో ఉన్న ష్నైడర్ ఎలక్ట్రిక్ తెలంగాణలో మరో ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. శంషాబాద్ వద్ద 18 ఎకరాల్లో ఇది రానుంది. రూ. 300 కోట్ల వ్యయంతో చేపడుతున్న తొలి దశ 2023 సెప్టెంబర్‌కు సిద్ధం అవుతుంది. ఉత్పత్తుల తయారీకి స్మార్ట్ యంత్రాలు, ఉపకరణాలను ఉపయోగించనున్నట్లు కంపెనీ గురువారం ప్రకటించింది. కొన్ని ఉత్పత్తులను దేశంలో తొలిసారిగా శంషాబాద్ కేంద్రంలో ఉత్పత్తి చేయనున్నట్లు వెల్లడించింది. 30కిపైగా దేశాలకు ఇక్కడ తయారైన సరుకు ఎగుమతి చేస్తారు. భారత్‌లో సంస్థకు ఇది 31వ కేంద్రం కాగా తెలంగాణలో రెండవది. స్మార్ట్ ఫ్యాక్టరీలపరంగా కంపెనీకి దేశంలో ఇది ఎనిమిదవది కానుంది. అత్యంత స్మార్ట్ ఫ్యాక్టరీ.. భారత్‌లో ఫ్రాన్స్ రాయబారి ఎమాన్యుయల్ లెనిన్తో కలిసి రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు ష్నైడర్ ప్రతిపాదిత నూతన కేంద్రానికి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. కొత్త ప్లాంటు మూడు దశలు పూర్తి అయితే 3,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. భారత్‌లో కంపెనీకి ఇది అతిపెద్ద, అత్యంత స్మార్ట్ ఫ్యాక్టరీ అవుతుందని చెప్పారు. 75 శాతం ఉత్పత్తులు ఇక్కడి నుంచి ఎగుమతి అవుతాయని వివరించారు. స్మార్ట్ మాన్యుఫ్యాక్చరింగ్‌లో యువతకు శిక్షణ ఇచ్చేందుకు ముందుకు రావాల్సిందిగా కంపెనీ ప్రతినిధులను ఆయన కోరారు. టాప్–3లో భారత్.. ష్నైడర్‌కు ప్రపంచంలోని టాప్–3 మార్కెట్లలో భారత్ ఒకటి. సంస్థ కార్యకలాపాల్లో 10 శాతం వాటాను కైవసం చేసుకుంది. 77% ఉత్పత్తులు, సొల్యూషన్స్ భారత్‌లో అభివృద్ధి చేసినవేనని సంస్థ ఇండియా ప్రెసిడెంట్ అనిల్ చౌదరి వెల్లడించారు. ‘భారత్‌లో విక్రయిస్తున్న ఉత్పత్తుల్లో 90% దేశీయంగా తయారైనవి. ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ విద్యుత్ పరికరాలను ఇప్పటికే సరఫరా చేస్తున్నాం. చార్జింగ్ స్టేషన్లను సొంతంగా ఏర్పాటు చేస్తాం. శంషాబాద్ ఫెసిలిటీకి మూడు దశల్లో కలిపి 4–5 ఏళ్లలో రూ.900 కోట్ల దాకా పెట్టుబడి పెడతాం’ అని చౌదరి వివరించారు. భారత్‌లోనే అధికం.. ఇప్పటికే హైదరాబాద్‌లో ష్నైడర్‌కు తయారీ యూనిట్ ఉంది. ఈ ప్లాంటులో రెండు వేల మంది పనిచేస్తున్నా రు. శంషాబాద్ కేంద్రం రాకతో తొలిదశలో ప్రత్యక్షంగా వెయ్యిమందికి, పరోక్షంగా 8 వేలమందికి ఉపాధి అవ కాశాలు ఉంటాయని గ్లోబల్ సప్లై చైన్ ఎస్వీపీ జావెద్ అహ్మద్ తెలిపారు. భారత్‌లో సంస్థ ఉద్యోగుల సంఖ్య 35 వేలు. వారిలో 5,500 మంది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ విభాగంలో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ష్నైడర్లో 1.60 లక్షల మంది పనిచేస్తుండగా భారత్‌లోనే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తుండటం విశేషం. హైదరాబాద్‌లో ‘హౌస్ ఆఫ్ ఫ్రాన్స్’ తెలంగాణ, ఫ్రాన్స్ నడుమ వాణిజ్య సంబంధాలు, రాకపోకలు పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ‘హౌస్ ఆఫ్ ఫ్రాన్స్’ పేరిట కొత్త కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రకటించడాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ స్వాగతించారు. 2023 అర్ధభాగంలో కొత్త ఫ్రెంచ్ బ్యూరో పనిచేయడం ప్రారంభిస్తుందని, ఇది వాణిజ్య కార్యకలాపాల కేంద్రంగా పనిచేయడంతోపాటు కాన్సులార్, వీసా సేవలను కూడా అందిస్తుందన్నారు. తద్వారా తెలంగాణ విద్యార్థులు, బిజినెస్ వర్గాలకు ఫ్రాన్స్‌తో సన్నిహిత సంబంధాలు ఏర్పడుతాయన్నారు. ఫ్రెంచ్ బిజినెస్ మిషన్ బృందం గురువారం హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌తో భేటీ అయింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రగతిశీల విధానాలు, పారిశ్రామిక విధానాలు, సాధించిన విజయాలు, పెట్టుబడి అవకాశాలపై కేటీఆర్ ఆ బృందానికి వివరించారు. ఈ భేటీలో ఫ్రెంచ్ బృందం ప్రతినిధులు పాల్ హెర్మెలిన్, గెరార్డ్ వోల్ఫ్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి ఇ. విష్ణువర్దన్‌రెడ్డి పాల్గొన్నారు. -
జేపీ నడ్డాతో ముగిసిన హీరో నితిన్ భేటీ..
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో హీరో నితిన్ భేటీ ముగిసింది. అనంతరం మీడియాతో మాట్లాడకుండా నితిన్ వెళ్లిపోయారు. కాగా జేపీ నడ్డా- నితిన్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వరంగల్ పర్యటనను పూర్తి చేసుకున్న నడ్డా తిరిగి శంషాబాద్ నోవాటెల్ చేరుకొని హీరో నితిన్‌తో సమావేశమయ్యారు. వీరితోపాటు లక్ష్మణ్, రామచంద్రరావు ఉన్నారు. నితిన్‌తో సమావేశం అనంతరం బీజేపీ ముఖ్యలతో నడ్డా భేటీ అయ్యారు. ఇదిలా ఉండగా ఇవాళ ఉదయం జేపీ నడ్డాతో భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌భేటీ అయిన విషయం తెలిసిందే. ఇక గతవారం హీరో జూనియర్ ఎన్టీఆర్‌తో అమిత్‌షా సమావేశమయ్యారు. చదవండి: అవన్నీ అబద్దాలని చెప్పే దమ్ము టీఆర్ఎస్ నేతలకు ఉందా? కిషన్ రెడ్డి ఫైర్ -
భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త
శంషాబాద్: మద్యానికి బానిసైన ఓ వ్యక్తి భార్యను గొడ్డలితో నరికి హత్య చేసిన సంఘటన శంషాబాద్ పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. ఆర్జీఐఏ సీఐ శ్రీనివాస్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. స్థానిక రాళ్లగూడ యాదవ్‌కాలనీలో పెద్దులు, దానమ్మ (25)దంపతులు నివాసం ఉంటున్నారు. దానమ్మ కూరగాయలు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా, పెద్దులు ఏ పని చేయకపోగా మద్యానికి బానిసై తరచు భార్యతో గొడవపడుతుండేవాడు. బుధవారం రాత్రి భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. మద్యం మత్తులో ఉన్న పెద్దులు దానమ్మ మెడపై గొడ్డలితో నరకడంతో ఆమె కుప్పకూలింది. సమీపంలోనే ఉంటున్న సోదరులకు సమాచారం అందడంతో వారు అక్కడికి చేరుకుని పరిశీలించగా అప్పటికే దానమ్మ మృతిచెందింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: చర్మం ఒలిచినా దక్కని ఫలితం) -
కాంగ్రెస్ నేత ఫిరోజ్‌ఖాన్ కుమార్తె తనియా మృతి
-
కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకుడు ఫిరోజ్ ఖాన్ కుమార్తె తనియా మృతి
-
Hyderabad: ఘోర రోడ్డు ప్రమాదం.. కాంగ్రెస్ నేత కుమార్తె మృతి
సాక్షి,హైదరాబాద్: శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని శాతం రాయి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకుడు ఫిరోజ్ ఖాన్, లైలా ఖాన్ దంపతుల కుమార్తె తనియా కక్డే దుర్మరణం చెందారు. ఎయిర్ పోర్టుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తనియా మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఫిరోజ్ ఖాన్, ఇతర కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకున్నారు. తనియా కక్డే శంషాబాద్‌లో ఔటర్ రింగ్ రోడ్డుపై తన స్నేహితుడితో కలిసి I-20 కారులో వెళ్తుండగా డివైడర్‌ను ఢీకొట్టి ఈ ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఆమె అక్కడికక్కడే మరణించిందని, కారులోని మిగిలిన ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారని స్థానికులు పేర్కొన్నారు. ఈ ఘటనపై ఆర్జీఐ ఎయిర్‌పోర్టు అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చదవండి: అప్రమత్తమైన తెలంగాణ సర్కారు.. ‘తొలిమెట్టు’తో పట్టు! -
శంషాబాద్ శాతంరాయి వద్ద ప్రమాదం
-
ఇదేం విడ్డూరం.. భార్య ఇంట్లోనే భర్త చోరీ !
సాక్షి, రంగారెడ్డి: భార్య నుంచి వేరుగా ఉంటున్న భర్త.. ఆమె ఇంట్లో లేని సమయంలో నగలు, నగదు ఎత్తుకెళ్లిన ఘటన శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ ఎ.శ్రీధర్‌కుమార్ కథనం ప్రకారం.. ఊట్పల్లిలో నివాసముంటున్న ఉపాధ్యాయురాలు రావుల అనురాధతో ఫరూక్నగర్ మండలం షాద్‌నగర్ వాసి తీగలపల్లి మధుసూదనాచారితో 17 ఏళ్ల కిందట పెళ్లైంది. సంతానం లేకపోవడంతో పాటు అనురాధకు అనారోగ్యం కారణంగా వీరు వేర్వేరుగా ఉంటున్నారు. అనురాధ తన దత్తపుత్రుడు అనిరుధ్‌తో కలిసి ఊట్పల్లిలో ఉంటోంది. జూన్ ఒకటో తేదీన ఇంటికి తాళం వేసి అనిరుధ్‌తో కలిసి బీరమ్మగూడలోని బంధువుల ఇంటికి వెళ్లింది. తిరిగి జూన్ 7న ఇంటికి వచ్చి చూడగా.. ఇంటి తలుపు తాళం విరగొట్టి ఉంది. బీరువా కూడా తెరిచి ఉంది. బీరువాలోని 10 తులాల బంగారు నగలు, రూ.5 లక్షల నగదు కనిపించలేదు. చుట్టుపక్కల వారిని ఆరా తీయగా.. జూన్ 4న అర్ధరాత్రి సమయంలో అనురాధ భర్త మధుసూదనాచారి ఇంటికి వచ్చాడని చెప్పారు. దీంతో భర్తే తన నగలు, నగదు తీసుకెళ్లి ఉంటాడని భావించి.. వాటిని తిరిగి ఇవ్వాలని కోరింది. ఎంతకూ అతడి నుంచి స్పందన లేకపోవడంతో గురువారం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఓఆర్ఆర్పై కారు ప్రమాదం.. టీఆర్ఎస్ నేత కుమారుడు దుర్మరణం
సాక్షి, రంగారెడ్డి: శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్ వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న డీసీఎం వ్యాన్‌ను హ్యుందాయ్ వెర్నా కారు బలంగా ఢీకొట్టింది. కారు బోల్తాపడటంతో అందులోని యువకుడు మృత్యువాతపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన స్థలంలోని సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. మాజీ ఎంపీపీ కొడుకు చనిపోయిన వ్యక్తిని నల్గొండ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ రెగట్టే మల్లికార్జున రెడ్డి కుమారుడు దినేష్ రెడ్డిగా గుర్తించారు. దినేష్‌రెడ్డి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. తమ కొడుకు కళ్లను కుటుంబ సభ్యులు దానం చేశారు. నల్లగొండలోనీ వీటి కాలనీలోని రేగట్టే స్వగృహానికి ప్రత్యేక అంబులెన్స్‌లో మృతదేహాన్ని తరలించారు. మంత్రి జగదీష్ రెడ్డి పరామర్శ టీఆర్ఎస్ నాయకుడు రేగట్టే మల్లికార్జున్ రెడ్డి కుటుంబాన్ని మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, నల్గొండ మున్సిపల్ చైర్మెన్ మందడి సైదిరెడ్డి పరామర్శించారు. చదవండి: ఏడాదిన్నర కిందట పెళ్లి.. 9 నెలల బాబు.. చిన్న గొడవకే -
సినిమా థియేటర్‌కు యువతులు.. ఓ వ్యక్తి ఫోటోలు తీసి అసభ్యకరంగా..
శంషాబాద్(హైదరాబాద్): మహిళలు, యువతులతో అసభ్యంగా వ్యవహరిస్తున్న మరో వ్యక్తిని శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణంలోని ఓ సినిమా థియోటర్లో సినిమా చూసేందుకు వచ్చిన యువతులు, మహిళలను గత కొంత కాలంగా ఓ వ్యక్తి (35) ఫొటోలు తీయడంతో పాటు అసభ్యంగా వ్యవహరిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు సోమవారం ఉదయం నిఘా వేసి అతడిని అదుపులోకి తీసుకుని ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: అత్యాచారయత్నం కేసు.. గాయత్రి భర్త చెప్పిన షాకింగ్ విషయాలు.. -
కోట్ల అక్రమ ఆస్తులు.. శంషాబాద్ మాజీ పంచాయతీ అధికారి అరెస్ట్
సాక్షి, రంగారెడ్డి: శంషాబాద్ మాజీ పంచాయతీ అధికారి దుబ్బుడు సురేందర్ రెడ్డిని అవినీతి నిరోధకశాఖ అధికారులు అరెస్ట్ చేశారు. నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించిన అధికారులు సురేందర్‌కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనంతరం న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నారు. కాగా సురేందర్ రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు సురేందర్ రెడ్డికి సంబంధించిన నివాసంలో సోదాలు నిర్వహించారు. సురేందర్ రెడ్డి నివాసంలో భారీగా ఆస్తులు, నగలను అధికారులు గుర్తించారు. ఇంట్లో 60 తులాల బంగారం, బ్యాంక్ లాకర్స్‌లో 129.2 తులాల బంగారం, నాలుగు ఓపెన్ ప్లాట్స్, 4 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రూ. 2,31,63,600 అక్రమ ఆస్తులు గుర్తించిన ఏసీబీ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. సురేందర్ రెడ్డి అదుపులోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. చదవండి: బ్యాంక్‌కు షాకిచ్చిన క్యాషియర్.. ఐపీఎల్ బెట్టింగ్‌లో.. -
రూ. 54 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత
శంషాబాద్: మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. పదిహేను రోజులుగా టాంజానియా, దక్షిణాఫ్రికాల నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికుల నుంచి భారీ మొత్తంలో హెరాయిన్ పట్టుబడగా తాజాగా శుక్రవారం మరో మహిళ హెరాయిన్ తీసుకొచ్చిన మహిళను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దక్షిణాఫ్రికా దేశానికి చెందిన మహిళ దోహా మీదుగా ఖతర్ ఎయిర్‌లైన్స్ విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. అనుమానిత దేశాల నుంచి వస్తున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టిన అధికారులు ఆ మహిళ లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. నల్లని పాలిథీన్ కవర్‌తో ఉన్న ప్యాకేజిని తొలగించడంతో అందులో 6.75 కేజీల బరువు కలిగిన హెరాయిన్ బయటపడింది. అంతర్జాతీయ మార్కెట్లో దాని విలువ రూ.54కోట్లు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. సదరు మహిళ కూడా క్యారియర్‌గా తీసుకొచ్చినట్లు అధికారులు గుర్తించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆబ్కారీకి నకిలీ మకిలి! కోట్లలో అక్రమార్జన
సాక్షి హైదరాబాద్: ఆబ్కారీశాఖలో నకిలీ ఈవెంట్ పర్మిట్ల దందా చర్చనీయాంశంగా మారింది. వేడుకల సందర్భంగా మద్యం వినియోగానికి నకిలీ అనుమతులు ఇచ్చిన ఉదంతంలో శంషాబాద్ ఎక్సైజ్ స్టేషన్‌కు చెందిన ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు, ఓ ఔట్సోర్సింగ్ ఉద్యోగిని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. నగర శివార్లలోని ఫంక్షన్ హాళ్లు, స్టార్ హోటళ్లు, బాంక్విట్ హాళ్లు వంటి చోట్ల నిర్వహించే వేడుకల సందర్భంగా మద్యం వినియోగం కోసం పెద్ద సంఖ్యలో నకిలీ అనుమతులను ఇచ్చినట్లు వెల్లడి కావడంతో ఎక్సైజ్ శాఖ సదరు ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. ఈ ఉదంతం వెనుక పైఅధికారుల ప్రమేయం కూడా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇద్దరు సీఐలతో పాటు మరో సూపరింటెండెంట్ స్థాయి అధికారి అనుమతితోనే నకిలీ దందా కొనసాగినట్లు ఎక్సైజ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వ ఖాతాలో చేరాల్సిన సొమ్మును స్వాహా చేయడాన్ని తీవ్రంగా పరిగణించి క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సి ఉండగా కేవలం సస్పెన్షన్‌కే పరిమితం కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శంషాబాద్ ఎక్సైజ్ స్టేషన్‌తో పాటు నగర శివార్లలోని మరికొన్ని స్టేషన్ల పరిధిలోనూ ఇలాంటి నకిలీ పర్మిట్లు వందల సంఖ్యలో వెలువడ్డాయని, ఉన్నతస్థాయిలో విచారణ జరిపితే అనేక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు కొందరు అధికారులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఎక్సైజ్ శాఖలో ఏళ్లుగా.. మరోవైపు తాజాగా నకిలీ అనుమతుల ఉదంతం వెలుగులోకి వచ్చినప్పటికీ 2016 అక్టోబర్ నుంచి ఇలాంటి అనుమతుల దందా కొనసాగుతున్నట్లు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు తదితర ప్రాంతాల్లో ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో వేడుకలు జరుగుతాయి. అంతర్జాతీయ స్థాయి సమావేశాలు నిర్వహిస్తా రు. ఇలాంటి కార్యక్రమాలకు ఒకరోజు అనుమతికి రూ.8000 నుంచి రూ.9000 వరకు మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమాలకు రూ.30 వేలకుపైగా ఎక్సైజ్‌శాఖకు చలానాల రూపంలో చెల్లించి ఆన్లైన్లో అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. పైఅధికారుల అండతోనే కిందిస్థాయి సిబ్బంది అనుమతుల సమూనాపత్రాల్లో తేదీలు, వేడుక స్థలాలను మార్పు చేసి ఇస్తున్నారు. ఇలా ఏటా వందల సంఖ్యలో నకిలీ అనుమతులు వెలువడుతున్నాయి. ప్రభుత్వ ఖజానాకు చేరవలసిన ఆదాయం కొందరు అధికారులు, సిబ్బంది జేబుల్లోకొ వెళ్తోంది. మరోవైపు ఈ తరహా అక్రమాలకు పాల్పడే సిబ్బంది ఎలాంటి బదిలీలు లేకుండా ఏళ్లుగా ఒకేచోట పాతుకుపోయి పని చేయడం గమనార్హం. ఏసీబీతో విచారణ జరిపించాలి.. ప్రజాధనం దుర్వినియోగానికి పాల్పడిన నేపథ్యంలో నకిలీ అనుమతులపై ఉద్యోగుల సస్పెన్షన్, శాఖాపరమైన విచారణకు పరిమితం కాకుండా ఏసీబీ విచారణ జరిపించాలని, ఏ స్థాయి అధికారులైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ వర్గాలు కోరుతున్నాయి. (చదవండి: పడవతో గస్తీ.. లేక్ పోలీసింగ్ వ్యవస్థ) -
రాముడు నడయాడిన పవిత్ర భూమి..కోరిన కోర్కెలు తీర్చే కోదండ రామాలయం
-
ఇక నేరుగా అంతర్జాతీయ కొరియర్ నిర్వహణ
శంషాబాద్: ఇతర మెట్రోనగరాలపై ఆధారపడ కుండా ఇక అంతర్జాతీయ కొరియర్ నిర్వహణ జీఎంఆర్ ఎయిర్ కార్గో చేయబోతోంది. దీని కోసం అంతర్జాతీయ కొరియర్ ఎక్స్‌ప్రెస్ కార్గో నూతన కేంద్రాన్ని సంస్థ ఏర్పాటు చేసింది. హైదరాబాద్ కస్టమ్స్ కమిషనర్ బి.విశనాగకుమారి, ఎయిర్‌పోర్టు సీఈఓ ప్రదీప్‌ఫణీకర్, చీఫ్ ఇన్నో వేషన్ అధికారి ఎస్జికే కిశోర్‌లు ఈ కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సదుపాయంతో కార్గో రవాణా లో హైదరాబాద్ దక్షిణ భారత దేశానికి గేట్వేగా మారనుందని వారు చెప్పారు. కార్గో రంగంలో ఇదో కొత్త అధ్యాయమని, హైదరాబాద్ ఎయిర్ కార్గో తన పరిధి ఏటా విస్తరిస్తోందని తెలిపారు. కార్గో ఇటీవల సంచార శీతలీకరణ కూడాప్రారంభించిందని చెప్పారు. -
సాక్షి ఎఫెక్ట్: హెచ్ఎండీఏ భూముల పరిశీలన
సాక్షి, శంషాబాద్: కోట్లాది రూపాయలు విలువ చేసే భూముల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన హెచ్ఎండీఏ స్థానిక అధికారుల తీరుపై రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో పాటు హెచ్ఎండీఏ ఉన్నతాధికారులు శుక్రవారం ఆరా తీసినట్లు సమాచారం. ప్రైవేట్ వెంచరు పరిధిలోకి వెళ్లిన భూమి వివరాలను పూర్తిగా నివేదించాలని అధికారులను కోరినట్లు తెలిసింది. పట్టణంలోని సర్వేనంబరు 626/1 ఉన్న హెచ్ఎండీఏకు 360 ఎకరాల భూమి ఉండగా అందులో పక్కనే ఉన్న ఓ ప్రైవేట్ వెంచర్లో 5.15 ఎకరాల భూమి, రైతుల ఆధీనంలో మరో 6.29 ఎకరాల భూమి ఉన్నట్లు తాజాగా రెవిన్యూశాఖ చేపట్టిన సర్వేలో తేలింది. ఈ విషయమై శుక్రవారం ‘సాక్షి’ ‘ఆ స్థలం సర్కారుదే’ అన్న శీర్షికతో వచ్చిన కథనం అటు అధికార వర్గాల్లో.. ఇటు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పరిశీలించిన అధికారులు మున్సిపల్, రెవిన్యూ అధికారులు మరో మారు హెచ్ఎండీఏ స్థలాన్ని పరిశీలించారు. హెచ్ఎండీఏ స్థలంలో ఉన్న రహదారితో పాటు ఓ వ్యక్తికి సంబంధించిన ప్రహరీ, మరో వ్యక్తి ఇంటికి సంబంధించి ఓ పిల్లర్‌తో పాటు ఓ గది కూడా ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని హెచ్ఎండీఏ అధికారులకు వివరించారు. త్వరలో హెచ్ఎండీఏ అధికారులు పూర్తి స్థాయిలో ఫెన్సింగ్ లేదా ఎదైనా ఇతర సరిహద్దులను ఏర్పాటు చేసి విలువైన స్థలాలను పరిరక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. (చదవండి: ఐదుగురు పోలీసులపై వేటు తప్పదా..!) -
ఆ స్థలం సర్కారుదే.. వెలుగులోకి కబ్జా పర్వం
సాక్షి, శంషాబాద్: కోట్లాది రూపాయల విలువజేసే హెచ్ఎండీఏ భూ కబ్జా గుట్టు రట్టయింది. ఆరోపణలు, ఫిర్యాదులు వాస్తవమేనని సర్వే తేల్చిచెప్పింది. శంషాబాద్ పట్టణం నడిబొడ్డున చేసిన అక్రమ వెంచర్లో 5.15 ఎకరాల హెచ్ఎండీఏ భూమి అన్యాక్రాంతమైనట్లు తేలింది. దాదాపు రూ.50 కోట్ల పైచిలుకు విలువ చేసే ఈ భూమి అన్యాక్రాంతంపై హెచ్ఎండీఏ నిండా నిర్లక్ష్యం వహించినా స్థానికులు పోరు చేసి వాస్తవాలను బయటికి రప్పించారు. అసలేం జరిగింది? ► శంషాబాద్ పట్టణంలోని సర్వేనంబరు 626బై1 హెచ్ఎండీఏకు సంబంధించి 360 ఎకరాల భూమి ఉంది. ఓఆర్ఆర్ నిర్వాసితులతో పాటు విమానాశ్రయంలో ఇళ్లు, భూములు కోల్పోయిన వారికి ఇక్కడ ప్లాట్లు కేటాయించడంతో పాటు ఖాళీ స్థలాలున్నాయి. దీని పక్కనే ఆరేళ్ల క్రితం సర్వేనంబరు 551 నుంచి 600 వరకు సర్వే ఉన్న భూమిలో భారీ వెంచర్ ఏర్పాటు చేశారు. దీని పక్కనే హెచ్ఎండీఏకు సంబంధించిన సర్వే నంబరు 626బై1ని ఆనుకుని ఉంది. ► ఇది పూర్తిగా గుట్ట ప్రాంతంతో పాటు కొన్ని దేవాలయాలు కూడా ఉండేవి. కార్పొరేట్ స్థాయి వ్యక్తులు వెంచర్లు ఏర్పాటు చేసినప్పటికీ కొందరు స్థానిక నేతలే ఇందులో భారీగా క్రయ విక్రయాలు దగ్గరుండి మరీ చూసుకున్నారు. క్రమంగా అభివృద్ధి చేసిన వెంచర్లో పురాతన దేవాలయాలను తొలగించడంతో పాటు పక్కనే ఉన్న హెచ్ఎండీఏ 5.15 ఎకరాల భూమిని కూడా అందులో కలిపేసుకున్నారు. ► ఈ స్థలంలో రహదారులు వేసి అభివృద్ధి కూడా చేశారు. ఇందులో అధికార పార్టీ నేతల నుంచి కొందరు హెచ్ఎండీఏ మాజీ అధికారులు కూడా సహకరించినట్లు సమాచారం. ఇదే సర్వేనంబరు హెచ్ఎండీఏకు సంబంధించిన మరో 6.29 ఎక రాల భూమిలో రైతులు కబ్జాలో కొనసాగుతున్నారు. ఇది ప్రారంభం నుంచి వివాదాస్పదంగానే ఉంది. (క్లిక్: దృశ్యం సినిమా తరహాలో తప్పించుకునేందుకు యత్నం) నిండా నిర్లక్ష్యం ► పునరావాసం కింద కేటాయించిన స్థలాలతో పాటు హెచ్ఎండీఏ మిగులు స్థలాలపై ఆది నుంచీ నిండా నిర్లక్ష్యం కొనసాగుతోంది. ఇదే అదనుగా ఇప్పటికే కొందరు నకిలీ దస్తావేజులతో ఒకే ప్లాటు నలుగురైదుగురికి విక్రయించిన సందర్భాలు కూడా ఉన్నాయి. గతేడాది ఆర్డీఓ జారీ చేసినట్లు నకిలీ పట్టా సర్టిఫికెట్లు సృష్టించిన వైనంపై ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఆర్డీఓ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి అక్రమార్కులను కటకటాల్లోకి పంపారు. ► ఇటీవల హెచ్ఎండీఏ భూమి కబ్జాపై స్థానికులతో పాటు కొందరు ప్రజాప్రతినిధులు కూడా సీఎంఓ కార్యాలయంతో పాటు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో డిసెంబరు 29 రెవిన్యూ అధికారులు సర్వే పనులు షురూ చేశారు. రెండు రోజుల క్రితం సర్వే పూర్తి చేసి అధికారులకు నివేదిక అందించారు. కబ్జా జరిగింది వాస్తవమేనని తేల్చారు. త్వరలోనే సంబంధిత భూమిని స్వాధీనం చేసుకునేందుకు హెచ్ఎండీఏ రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం. (క్లిక్: హెచ్ఎండీఏ ప్లానింగ్‌లో దళారుల దందా : ఆమ్యామ్యాలు లేకుంటే పెండింగే) కబ్జా వాస్తవమే.. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పట్టణంలోని సర్వేనంబరు 626బై1 ఉన్న హెచ్ఎండీఏకు సంబంధించిన 360 ఎకరాలతో పాటు సమీపంలో ఉన్న స్థలాను సర్వే పూర్తి చేశాం. హెచ్ఎండీకు సంబంధించిన 5.15 ఎకరాల భూమి వెంచర్లో కలిసినట్లు తేలింది. ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాల్సిందిగా హెచ్ఎండీఏ, మున్సిపాలిటీలకు సూచించాం. సర్వే నివేదికలను ఉన్నతాధికారులకు అందజేశాం. – జనార్దన్‌రావు, శంషాబాద్ తహసీల్దార్ -
కల్యాణం.. కమనీయం
శంషాబాద్ రూరల్: భక్త జన సందోహం, వేద మంత్రాల మధ్య శ్రీరామనగరం సమతామూర్తి ప్రాంగణంలో ఉన్న 108 దివ్య క్షేత్రాల్లోని పెరుమాళ్లకు శాంతి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. శనివారం సాయంత్రం చినజీయర్ స్వామి పర్యవేక్షణలో ఈ కల్యాణోత్సవం నిర్వహించారు. కల్యాణం అనంతరం భక్తులతో 108 పెరుమాళ్ల నామస్మరణం చేయించారు. ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 60 కౌంటర్ల ద్వారా భక్తులకు అక్షింతలు, ప్రసాదా లు పంపిణీ చేశారు. మైహోం గ్రూపు సంస్థల అధినేతలు జూపల్లి రామేశ్వర్రావు, జూపల్లి జగపతిరావు కుటుంబసభ్యులు, ఏపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తెలంగాణ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారీగా సందర్శకులు వారాంతం కావడంతో సమతామూర్తి దర్శనానికి సందర్శకులు భారీగా తరలివచ్చారు. అయితే సాయంత్రం శాంతి కల్యాణోత్సవం ఉండడంతో వారిని లోపలికి అనుమతించలేదు. ఇక స్ఫూర్తి కేంద్రం ప్రధాన ప్రాంగణంలోనికి అతి కొద్ది మందిని మాత్రమే అనుమతించారు. పశ్చిమ వైపు ఉన్న 9వ నంబరు గేటు నుంచి ప్రత్యేక ఆహ్వానితులను మాత్రమే లోపలికి వదిలారు. కాగా ప్రధాన ప్రాంగణం ఎదురుగా ఉన్న ఆవరణలో సందర్శకుల కోసం ప్రత్యేక ఏర్పాటు చేయడంతో అక్కడ సుమారు పది వేల మంది వరకు కూర్చుని స్క్రీన్లపై కల్యాణోత్సవాన్ని వీక్షించారు. కల్యాణోత్సవానికి సుమారు 15 వేల మంది హాజరైనట్లు అంచనా వేశారు. -
భద్రతా వలయంలో శ్రీరామనగరం.. అడుగడుగునా పోలీసు నిఘా
సాక్షి, శంషాబాద్: రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ రానున్న సందర్భంగా ఎస్పీజీ అధికారులు బుధవారం ఉదయం విగ్రహ ప్రాంగణంతో పాటు యాగశాలను సందర్శించారు. ఎస్పీజీ డీఐజీ నవనీత్‌కుమార్ రాష్ట్ర పోలీసులతో కలిసి అక్కడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సిన భద్రత సమీక్షించారు. కమాండ్ కంట్రోల్ రూం సమతామూర్తి విగ్రహ ప్రాంగణానికి ముందు పార్కింగ్ ఏరియాకు ఎదురుగా ఉన్న భవనంలో పోలీసుల కమాండ్ కంట్రోల్ రూంను పూర్తి స్తాయిలో సిద్ధం చేశారు. ఇక్కడి నుంచి పోలీసుల భద్రత ఏర్పాట్లు, ఇతర సమాచారాలన్నింటికి కూడా కమాండ్ కంట్రోల్ రూం పనిచేయనుంది. ఎస్పీజీతో పాటు ఆక్టోపస్, ప్రత్యేక కమాండోలు భద్రత కోసం రంగంలోకి దిగారు. ఇప్పటికే సమతామూర్తి ప్రాంగణంతో పాటు యాగశాల పరిసరాల్లో వీరు నిరంతరం నిఘా కాస్తున్నారు. ఉత్సవాలకు ప్రత్యేక అశ్వాలు సమతామూర్తి సహస్రాబ్ధి సమరోత్సాహ వేడుకల్లో పూజా కార్యక్రమాల్లో దేవతా మూర్తుల రథోత్సవం వేళ ముందుగా నడిపించేందుకు ఏపీలోని కడప వ్యాసాశ్రమం నుంచి రెండు శ్వేత రంగు అశ్వాలను తీసుకొచ్చారు. రంగ, గోధ అనే పేర్లుగల ఈ అశ్వాలను ఆశ్రమంలో దేవతామూర్తుల బయటికి తీసుకొచ్చే సమయంలో ముందుగా నడిపిస్తుంటారు. వీటితో పాటు చిన్న జీయర్ ఆశ్రమంలో ఉన్న మరో అశ్వం యతి కూడా ఉత్సవాల్లో పాల్గొననుంది. ఈ అశ్వాలను ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. సమరోత్సాహ భక్తి ‘స్వీయ చిత్రం’ సమతామూర్తి సమారోహ వేదికలో స్వచ్ఛంద సేవకులుగా పనిచేయడానికి వచ్చిన మహిళలు వీరు.. యాగశాల వద్ద నరసింహస్వామి అవతారంలో ఓ వ్యక్తి తిరుగుతుండడంతో కొందరు వలంటీర్లు ఆయనకు దండం పెడుతుండగా.. మరికొందరు మహిళలు సెల్ఫీలు తీసుకుంటున్న దృశ్యం. (క్లిక్: 13 తర్వాతే సందర్శకులకు అనుమతి) యాగశాలకు చేరుకున్న ఛత్రీలు.. యాగశాల వద్దకు బుధవారం కూడా వరుసగా ప్రత్యేకంగా తయారు చేయించిన ఛత్రీలు చేరుకున్నాయి.. వాటిని తయారు చేసిన కార్మికులు కొందరు యాగశాల వరకు మోసుకుంటూ తీసుకెళ్లారు. (చదవండి: వెయ్యేళ్ల సమతాస్ఫూర్తి.. రామానుజ సమతా కేంద్రం నిర్మాణం..) టీటీడీ ప్రత్యేక సేవలు ముచ్చింతల్‌లో జరుగుతున్న సహస్రాబ్ధి సమారోహ్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం తమ వంతు పాత్ర పోషిస్తోంది. ప్రాంగణంలో తిరుమల తిరుపతి ప్రాసస్త్యం, తిరుమల నాడు–నేడు వ్యత్యాసాలు తెలిపే పలు ఛాయా చిత్రాలతో ఒక ప్రదర్శన ఏర్పాటు చేశారు. చిత్ర ప్రదర్శన కూడా నిర్వహిస్తున్నారు. విభిన్న రకాల కార్యక్రమాల్లో సహకరించేందుకు తితిదే సిబ్బంది 35 మంది రెండు వారాల పాటు ఇక్కడే ఉండనున్నారు. వీరు కాక దాదాపు 500 మంది వేద పారాయణం చేసేవారు, మ్యూజిక్ కాలేజ్ నుంచి ఆర్టిస్టులు, హరికథ కళాకారులు, మంగళవాద్యాలు మోగించే కళాకారులు 15 మంది వచ్చారు. వీరి కార్యకలాపాలను తితిదే తెలంగాణ ప్రాజెక్ట్ ఆఫీసర్ పర్యవేక్షిస్తున్నారు. ఆకట్టుకున్న శోభాయాత్ర సమతా కేంద్రంలో బుధవారం ఉదయం తొలిరోజు నిర్వహించిన శోభాయాత్ర ఆద్యంతం ఆకట్టుకుంది. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ చంద్ర, జై హనుమాన్ నినాదాలతో వేలాది మంది భక్తులు, పండితులు పాల్గొన్న ఈ యాత్ర కనుల పండుగగా సాగింది. ఈ యాత్రకు త్రిదండి చిన జీయర్‌స్వామి సారథ్యం వహించారు. వందలాదిగా రుత్వికులు వేద మంత్రోచ్చారణలు చేస్తూ ఏడుగురు పూజ్య జీయర్లను అనుసరించారు. భక్తుల భజనలకు తోడుగా కోలాట నృత్యాలు ఆహ్లాదపరిచాయి. అనంతరం వాస్తు పూజ, పుణ్యహవచనం జరిగాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సర్వమానవ సమానత్వానికే..
సాక్షి, హైదరాబాద్: రామానుజాచార్య సర్వ మానవ సమానత్వం కోసం కృషి చేశారని, జాతి, కుల, మత, లింగ వివక్షలు కూడదని బోధించారని అందుకే దీనిని సమతా పండుగ (ఫెస్టివల్ ఆఫ్ ఈక్వాలిటీ)గా పిలుస్తున్నామని త్రిదండి చినజీయర్ స్వామి తెలిపారు. విశ్వమంతా ఒకే కుటుంబం అనే భావనను, వసుదైవ కుటుంబం స్ఫూర్తిని అందించేందుకే ఈ పండుగ నిర్వహిస్తున్నామని చెప్పారు. శంషాబాద్‌లోని ముంచింతల్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సమతా స్ఫూర్తి కేంద్రంలో రామానుజాచార్యుల వెయ్యేళ్ల జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని సహస్రాబ్ది సమారోహం సంరంభం బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ మహోత్సవాలకు చినజీయర్ స్వామి సారథ్యం వహించారు. తాము తలపెట్టిన మహా యజ్ఞం నుంచి వెలువడే పొగ, పరిమళాల వల్ల మానవాళి ఆరోగ్యానికి, పర్యావరణానికి మేలు కలుగుతుందన్నారు. ఈ మహా క్రతువులో వేలాది మంది పాల్గొంటుండడం ఆనందంగా ఉందన్నారు. ఆధ్యాత్మిక పారవశ్యంలో భక్తులు తొలుత రామానుజాచార్యుల శోభాయాత్రను కనుల పండుగగా నిర్వహించారు. సాయంత్రం ప్రపంచంలోనే మున్నెన్నడూ జరగనంత భారీ స్థాయిలో లక్ష్మీనారాయణ మహా యజ్ఞానికి అంకురార్పణ చేశారు. కనీవినీ ఎరుగని రీతిలో 5 వేల మంది రుత్వికులు, 1,035 హోమ కుండాలు, 144 హోమశాలలు, 2 ఇష్టి శాలలు ఈ మహా క్రతువులో భాగం అయ్యాయి. యాగానికి సిద్ధం చేయడంలో భాగంగా భూమి శుద్ధి చేసి విష్వక్సేనుడి పూజ చేశారు. అలాగే హోమద్రవ్యాల శుద్ధి, వాస్తు శాంతిలో భాగంగా వాస్తు పురుషుడిని ప్రతిష్టించి పూజ నిర్వహించారు. యాగశాలల్లో రుత్వికులు వేద మంత్రోచ్ఛారణ చేస్తూ, మంత్రరాజంగా పేరొందిన అష్టాక్షరి మహా మంత్రాన్ని పఠిస్తూ, ఇతిహాసాలు, పురాణాలు, ఆగమాలు పారాయణం చేస్తూ.. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులలో ఆధ్యాత్మిక పారవశ్యాన్ని నింపారు. అష్టాక్షరి మహామంత్ర జపం 12 రోజుల పాటు నిర్విరామంగా సాగనుంది. ఉత్సవాలు ముగిసే సమయానికి మొత్తంగా కోటిసార్లు జపించాలనే భారీ లక్ష్యాన్ని చేరుకోనుంది. తరలివచ్చిన స్వాములు, విదేశీ భక్తులు, ప్రముఖులు ఈ సమతా పండుగకు దేశ విదేశాల నుంచి భక్తులు, రుతి్వకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అహోబిల జీయర్‌స్వామి, దేవనాథ జీయర్ స్వామి, రామచంద్ర జీయర్ స్వామి, రంగ రామానుజ జీయర్ స్వామి, అష్టాక్షరి జీయర్ స్వామి, వ్రతధర జీయర్ స్వామి తదితర అతిరథ మహారథులనదగ్గ స్వాములు తరలివచ్చారు. రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఏపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తదితర ప్రముఖులు పాల్గొన్నారు. అమెరికా నుంచి వందలాదిగా భక్తులు, 20 మంది రుత్వికులు రావడం విశేషం. యూరప్ నుంచి, ఆస్ట్రేలియా, యూఏఈ నుంచి కూడా భక్తులు హాజరయ్యారు. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న నగర యువత సైతం ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సెలవు పెట్టి మరీ వాలంటీర్లుగా ఇక్కడ సేవలు అందిస్తుండడం విశేషం. -
Statue Of Equality: 13 తర్వాతే సందర్శకులకు అనుమతి
సాక్షి, రంగారెడ్డిజిల్లా: శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహానికి అంకురార్పణ జరిగింది. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు తరలివచ్చే సందర్శకులను సమతామూర్తి ఆశీనులైన భద్రవేదికకు చేరుకునే ప్రధాన మార్గంలో ఏర్పాటు చేసిన 108 మెట్లలో మొదటి మెట్టు వరకు అనుమతించనున్నారు. అటు నుంచి యాగశాలకు ఆనుకుని ఉన్న ప్రవచన మండపానికి అనుమతించనున్నారు. ఇక్కడి నుంచే యాగశాలను దర్శించుకునేందుకు సందర్శకులకు అవకాశం కల్పిస్తారు. భద్రవేదికపై ఆశీనులైన 216 అడుగుల ఎత్తైన భగవద్రామానుజాచార్యుల విగ్రహాన్ని ఈ నెల 5న ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించనున్నారు. ఆ తర్వాతి రోజు నుంచి మూడో అంతస్తుపై ఉన్న ప్రధాన విగ్రహం వరకు సందర్శకులను అనుమతించనున్నారు. భద్రవేదిక మొదటి అంతస్తులో ఉన్న 120 కేజీల సువర్ణమయ మూర్తిని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ నెల 13న తొలి దర్శనం చేసుకోనున్నారు. ఆ తర్వాతి రోజు నుంచి 54 అంగుళాలు ఉన్న సువర్ణమయ నిత్య ఉత్సవమూర్తిని వీక్షించేందుకు సందర్శకులకు అనుమతించనున్నారు. అప్పటి వరకు వీరంతా బయటి నుంచే వీక్షించి వెళ్లాల్సి ఉంది. అంతేకాదు ఈ ప్రాంగణంలోని 108 దివ్యదేశాల ఆలయాల్లో ప్రతిష్టించిన దేవతామూర్తుల విగ్రహాల వీక్షణ, ఆరాధనకు కూడా ఆ తర్వాతే అనుమతించనున్నారు. అప్పటి వరకు ఆయా ఉత్సవమూర్తులను బయటి నుంచే సందర్శించుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. ఏర్పాట్లను పర్యవేక్షించిన కలెక్టర్ శ్రీరామానుజాచార్యల విగ్రహావిష్కరణకు ఈ నెల 5న ప్రధాని మోదీ రానున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్ మంగళవారం శ్రీరామనగరాన్ని సందర్శించారు. రోడ్లు, విద్యుత్, మంచినీరు, పారిశుద్ధ్య నిర్వహణపై సమీక్షించారు. ఆయా విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. బుధవారం ఉదయం ఆయన కేంద్ర భద్రతా బలగాలతో సమావేశం కానున్నారు. ప్రారంభానికి ముందే అవస్థలు ఇదిలా ఉంటే ఉత్సవాల ప్రారంభానికి ముందే రుత్వీకులు, వలంటీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, సందర్శకులు పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే ఈ ప్రాంగణానికి 15 వేల మందికిపైగా చేరుకోగా, పూజా కార్యక్రమాలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు గ్రేటర్ జిల్లాల నుంచి రోజుకు సగటున 50 వేల మంది సందర్శకులు వచ్చే అవకాశం ఉంది. వాలంటీర్లు, రుత్వీకులు, ప్రభుత్వ ఉద్యోగులను అంచనా వేయడంలో నిర్వాహకులు ఇప్పటికే కొంత విఫలమయ్యా రు. ఆయా నిష్పత్తి మేరకు అన్నప్రసాదాలను తయారు చేసినా వారికి అందజేయక పోవడంతో ఇక్కడికి వచ్చిన వారికి పస్తులు తప్పడం లేదు. భారీ స్వాగత తోరణాలు వేడుకలకు వచ్చే అతిథులకు ఆహ్వానం పలుకుతూ నిర్వాహకులు ఆయా మార్గాల్లో భారీ కటౌట్లు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ప్రధాన మార్గాలను సర్వంగసుందరంగా తీర్చిదిద్దా రు. అన్ని మార్గాల్లోనూ ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేశారు. (చదవండి: సమతా కేంద్రం నిర్మాణం... రామానుజులవారి జీవిత విశేషాలు)