
శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయం నుంచి తిరుపతి బయలుదేరిన విమానం అక్కడ వాతావరణం అనుకూలించకపోవడంతో తిరిగి వెనక్కి వచ్చి శంషాబాద్ ఎయిర్‌పోర్టులోనే అత్యవసరంగా ల్యాండయింది. శుక్రవారం ఉదయం 6.20 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి స్పైస్ జెట్ 1075 విమానం తిరుపతి విమానాశ్రయానికి చేరుకునే సమయంలో అక్కడ వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ల్యాండింగ్‌కు అనుమతినివ్వలేదు.
దీంతో ఆ విమానం తిరిగి శంషాబాద్ విమానాశ్రయానికి 9.30 గంటలకు చేరుకుంది. ఏటీసీ అనుమతి మేరకు ల్యాండ్ చేసిన విమానం 10 గంటలకు మరోసారి ఇక్కడి నుంచి టేకాఫ్ తీసుకుని బయలుదేరి 11. 26 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్నట్టు ఎయిర్‌పోర్టు వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment