bad weather
-
విమానం దారి మళ్లింపు... వారణాసిలో కోల్‌కతా జట్టు
న్యూఢిల్లీ: కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాళ్లకు సోమవారం రాత్రి కునుకు లేకుండా గడిచింది. క్రికెటర్లు ప్రయాణించిన విమానం లక్నో నుంచి కోల్‌కతాకు బయలుదేరాల్సి ఉండగా... ప్రతికూల వాతావరణంతో పలుమార్లు దారి మళ్లించారు. వారి చార్టర్ ఫ్లయిట్‌ను తొలుత గువాహటికి మళ్లించారు. అక్కడి నుంచి కోల్‌కతాకు క్లియరెన్స్ రావడంతో టేకాఫ్ అయిన విమానానికి మళ్లీ వాతావరణం ఏమాత్రం అనుకూలించలేదు. దీంతో ఉన్నపళంగా ఫ్లయిట్‌ను వారణాసి ఎయిర్‌పోర్ట్‌కు మళ్లించాల్సి వచి్చంది. అలా తీవ్రమైన ప్రయాణ బడలిక, క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల మధ్య ఆటగాళ్లు సోమవారమంతా వారణాసిలోని హోటల్లో గడపాల్సి వచ్చింది. మంగళవారం మధ్యాహ్నం తర్వాత తమ విమాన ప్రయాణం ఉండటంతో ఈలోపు కోల్‌కతా జట్టు క్రికెటర్లు వారణాసిలో కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని సందర్శించుకున్నారు. ఎట్టకేలకు మంగళవారం సాయంత్రం తర్వాత నైట్‌రైడర్స్ జట్టు కోల్‌కతాకు చేరుకోగలిగింది. ఈ నెల 11న సొంతగడ్డపై కోల్‌కతా నైట్‌రైడర్స్ తమ తదుపరి లీగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో తలపడుతుంది. -
ప్రధాని మోదీ భూటాన్ పర్యటన వాయిదా.. ఎందుకంటే?
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు రోజుల భూటాన్ దేశ పర్యటన వాయిదా పడింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ పర్యటన వాయిదా పడినట్లు విదేశాంగ కార్యాలయం వెల్లడించింది. ‘భూటాన్‌లోని పారో విమనాశ్రయం వద్ద గల ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా మార్చి 21-22 తేదీల్లో ప్రధాని భూటాన్ పర్యటనను వాయిదా వేయాలని ఇరు దేశాలు నిర్ణయించుకున్నాయి. కొత్త తేదీలపై ఇరుపక్షాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే తెలియజేస్తాం’ అని ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా రేపు(గురువారం) ప్రధాని భూటాన్ బయలుదేరాల్సి ఉంది. రెండు రోజుల పాటు ఆ దేశంలో మోదీ పర్యటించాల్సి ఉంది. భారత్ సన్నిహిత, సరిహద్దు దేశం భూటాన్ పర్యటనతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడుతాయని అంతా ఆకాంక్షించారు. అయితే షెడ్యూల్ సందర్శనకు ఒక రోజు ముందు పర్యటన వాయిదా పడినట్లు ప్రకటన వెలువడింది. మరోవైపు ప్రధాని పర్యటన నేపథ్యంలో భూటాన్‌లోని రోడ్లమీద.. మోదీకి స్వాగతం పలుకుతూ భారీ ఎత్తున పోస్టర్లు అంటించారు. ఇదిల ఉండగా గత వారం భూటాన్ ప్రధాని షేరింగ్ టోబ్గే అయిదు రోజులపాటు భారత్‌లో పర్యటించారు. గత జనవరిలోభూటాన్ ప్రధానిగా బాధ్యతలు స్పీకరించిన తర్వాత టోబ్గే తొలి విదేశీ పర్యటన ఇదే కావడం విశేషం. ఈ క్రమంలో తమ దేశంలో పర్యటించాలని ప్రధాని మోదీని ఆయన ఆహ్వానించారు. ఈ ఆహ్వానాన్ని ప్రధాని మోడీ అంగీకరించారు. చదవండి: రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులతో ప్రధాని మోదీ ఫోన్ కాల్.. -
అయ్యయ్యో ప్యాసింజర్లు : పాస్‌పోర్ట్ లేకుండానే ఢాకాకి
వాతావారణ పరిస్థితులు విమాన ప్రయాణాలకు చాలా కీలకం. దట్టమైన పొగమంచు కారణంగా విమాన రాకపోకలకు ఆటంకం కలిగిస్తూ ఉంటుంది. ఈ సమయంలో ప్రయాణీకులు కూడా ఇబ్బందులు పడతారు. తాజాగా ఇండిగో విమానం అనుకోని పరిస్థితుల్లో ఇరుక్కొంది. దీంతో ముంబై నుంచి గువాహటి వెళ్లాల్సిన ప్రయాణీకులు అనూహ్యంగా బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ల్యాండ్ అయ్యారు. ఇండిగో ఎయిల్‌లైన్స్‌కు చెందిన 6ఈ 5319 విమానం ముంబై నుంచి గువాహటి బయల్దేరింది. కానీ అక్కడి వాతావరణం, పొగమంచు కారణంగా గువాహటి విమానాశ్రయంలో ల్యాండింగ్ కష్టంగా మారింది. దీంతో విమానాన్ని ఢాకాకు దారిమళ్లిచి ఢాకాలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. అయితే ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని ఇండిగో ప్రకటించింది. STORY | Guwahati-bound IndiGo flight from Mumbai diverted to Dhaka due to bad weather READ: https://t.co/nQPVWCfi2s VIDEO: (Source: Third Party) pic.twitter.com/NFuVYIxKPb — Press Trust of India (@PTI_News) January 13, 2024 అయితే ఈవిషయంపై ముంబై యూత్ కాంగ్రెస్ చీఫ్ సూరజ్ సింగ్ ఠాకూర్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. విమానంలో ఉన్న తామంతా పాస్‌పోర్ట్ లేకుండానే దేశ సరిహద్దులు దాటాం అంటూ ఎక్స్‌లో రాసుకొచ్చారు. ఈ విమానంలో ప్రయాణిస్తున్న గువాహాటిని మంచుదుప్పటి కప్పేయడంతో ఢాకాలో ల్యాండ్ అయ్యామని తెలిపారు. 178 మంది ప్రయాణికులతో 9 గంటలుగా ఇబ్బందులు పడుతున్నాం. గౌహతి తిరిగి వెళ్లడానికి మరొక సిబ్బంది కోసం నాలుగు గంటలకు పైగా వేచి ఉన్నాం, దయచేసి వేగంగా స్పందించండి మరో ప్రయాణికుడు ట్విటర్ ద్వారా వేడుకున్నారు. I took @IndiGo6E flight 6E 5319 from Mumbai to Guwahati. But due to dense fog, the flight couldn't land in Guwahati. Instead, it landed in Dhaka. Now all the passengers are in Bangladesh without their passports, we are inside the plane.✈️ — Suraj Singh Thakur (@SurajThakurINC) January 13, 2024 దీంతో దీనిపై అసౌకర్యానికి చింతిస్తున్నామంటూ ఇండిగో స్పందించింది. ప్రతికూల వాతావరణం కారణంగా విమానాన్ని మళ్లించామని, ప్రయాణీకులకు వీలైనంత మేర సాయం చేస్తున్నాం. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ఫ్లైట్రాడార్ 24 ప్రకారం, ఇండిగో విమానం శుక్రవారం రాత్రి 8.20 గంటలకు ముంబై నుండి బయలుదేరి రాత్రి 11.10 గంటలకు గౌహతిలో దిగాల్సి ఉంది. -
జపాన్ చందమామ ల్యాండర్ ప్రయోగం వాయిదా
టోక్యో: చందమామపై తొలిసారిగా అడుగుపెట్టాలన్న జపాన్ లక్ష్యం చివరి నిమిషంలో సాకారం కాలేదు. జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్‌ను సురక్షితంగా దించి, పరిశోధనలు చేయడమే లక్ష్యంగా జపాన్ చేపట్టిన మూన్ ల్యాండర్ రాకెట్ ప్రయోగం వాయిదా పడింది. జాక్సా టానేగíÙమా స్పేస్ సెంటర్లోని యోషినోబు లాంచ్ కాంప్లెక్స్ నుంచి సోమవారం ఉదయం 9.26 గంటలకు హెచ్2–ఏ రాకెట్‌ను ప్రయోగించాల్సి ఉన్నది. ప్రతికూల వాతావరణం కారణంగా లాంచింగ్‌కు 27 నిమిషాల ముందు ఈ ప్రయోగాన్ని వాయిదా వేసినట్లు జపాన్ అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘జాక్సా’ తెలియజేసింది. ప్రయోగ కేంద్రం వద్ద తీవ్రస్థాయిలో బలమైన గాలులు వీచడం, ఉపరితల వాతావరణంలో అనిశి్చత పరిస్థితులు నెలకొనడం వల్లే వాయిదా పడినట్లు తెలుస్తోంది. తదుపరి ప్రయోగ తేదీని ఇంకా ఖరారు చేయలేదు. సెపె్టంబర్ 15వ తేదీ తర్వాత తదుపరి ప్రయోగం ఉండొచ్చని సమాచారం. చంద్రుడిపై పరిశోధనల కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా), యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సహకారంతో సాఫ్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్(స్లిమ్) అనే లూనార్ ప్రోబ్‌ను జపాన్ అభివృద్ధి చేసింది. ఈ ప్రయోగం విజయవంతమైతే చంద్రుడిపై ల్యాండర్‌ను క్షేమంగా దించిన ఐదో దేశంగా జపాన్ రికార్డు సృష్టిస్తుంది. అయితే ప్రయోగించిన 4 నెలల తర్వాత ఈ స్పేస్‌క్రాఫ్ట్ చంద్రుడి కక్ష్యలోకి చేరనుంది. ఇదిలా ఉండగా, హెచ్–2ఏ రాకెట్ ద్వారా ఇప్పటిదాకా 46 ప్రయోగాలు చేయగా, అందులో 45 ప్రయోగాలు విజయవంతమయ్యాయి. -
ఎవరెస్ట్ యమ డేంజర్.. పది వేల అడుగులు దాటితే..
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరం మౌంట్ ఎవరెస్ట్. ఆకాశానికి నిచ్చెన వేసినట్టుగా వెండి కొండలా ధగధగలాడిపోతూ మంచుతో నిండిపోయిన ఈ పర్వత శిఖరం చేరుకోవడమంటే ప్రపంచాన్ని తమ పాదాక్రాంతం చేసుకోవడమే. అందుకే ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో అడుగడుగునా ప్రమాదాలు పొంచి ఉన్నా, ప్రాణాలతో తిరిగి వస్తామన్న భరోసా లేకపోయినా ప్రతీ ఏడాది ఎందరో సాహసికులు ఈ పర్వత శిఖరాన్ని చేరుకోవాలని తమ దేశ జెండాని పాతాలని ఆరాటపడుతుంటారు. మౌంట్ ఎవరెస్ట్‌ను తొలిసారి ఎక్కడం ప్రారంభించి 70 ఏళ్లయింది. 1953 సంవత్సరం మే 29న న్యూజిలాండ్‌కు చెందిన ఎడ్మండ్ హిల్లరీ భారత్‌కు చెందిన టెన్జింగ్ నార్గేలు ఎవరెస్ట్ శిఖరాగ్రం చేరుకున్నారు. ఈ 70 ఏళ్లలో కనీవినీ ఎరుగని మార్పులు వచ్చాయి. సాంకేతిక పరిజ్ఞానం పెరిగి, ఆధునిక సదుపాయాలు చోటు చేసుకోవడంతో ఎవరెస్ట్ అధిరోహించే వారి సంఖ్య భారీగా పెరిగింది. ఎవరెస్ట్‌పై ట్రాఫిక్ జామ్ పర్వతారోహకులకు ఈ ఏడాది నేపాల్ ప్రభుత్వం విచ్చలవిడిగా అనుమతులు మంజూరు జారీ చేయడంతో ఎవరెస్ట్ అధిరోహణ మరింత ప్రమాదకరంగా మారింది. అసాధారణ రీతిలో 900 మంది పర్వతారోహకులకు అనుమతులు మంజూరు చేసింది. దీంతో కొండపై భారీగా ట్రాఫిక్ జామ్‌లు కనిపించాయి. శిఖరాగ్రం చేరుకోవాలంటే 26 వేల అడుగులు పైకి వెళ్లాలి. పది వేల అడుగులు దాటితే ఇంక మృత్యువు ముఖంలోకి అడుగు పెట్టినట్టే. అంత ఎత్తులో ఆక్సిజన్ సరిగా అందదు. ఊపిరి పీల్చుకోవడమే కష్టంగా మారుతుంది. రక్తం గడ్డ కట్టేలా వాతావరణం మైనస్ 20 డిగ్రీలకు పడిపోతుంది. శారీరకంగా ఎంత ఫిట్నెస్ ఉన్నప్పటికీ అనారోగ్య సమస్యలు చుట్టుముట్టి ప్రాణాలు పోతాయి. సముద్ర మట్టానికి అంత ఎత్తుకు చేరుకుంటే ఒక్కోసారి మెదడు, ఊపిరితిత్తులకు వాపు వచ్చి శరీరంపై స్వాధీనం కోల్పోతారు. ఈ సారి ఏకంగా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు మంచులో గల్లంతయ్యారు. ఇటీవల ఈ స్థాయిలో మరణాలు ఎప్పుడూ సంభవించలేదు. ‘‘ఒకేసారి పర్వతారోహకులు కొండ ఎక్కుతూ ఉంటే వారికి ఆక్సిజన్ అవసరం ఎక్కువగా ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఆక్సిజన్ ఏర్పాటు చేయడం అత్యంత ముఖ్యం. మా ద్వారా ఎవరెస్ట్ అధిరోహించే పర్వతారోహకులెవరూ ఇప్పటివరకు ఏ సమస్య ఎదుర్కోలేదు’’అని ఆస్ట్రియాకు చెందిన లుకాస్ ఫర్టెన్‌బాచ్ అనే కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. ఈ ఏడాది తమ సంస్థ తరఫున 100 మంది దిగ్విజయంగా ఎవరెస్ట్ ఎక్కి వచ్చారని చెప్పారు. వాతావరణ మార్పులతో పెరుగుతున్న ముప్పు ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న మార్పులు ఎవరెస్ట్ అధిరోహకులకు అతి పెద్ద ప్రతిబంధకంగా మారుతోంది. 1979 నుంచి చూస్తే గత 40 ఏళ్లలో ఎవరెస్ట్‌పై ఉష్ణోగ్రతలు సగటున 2 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగాయి. దీంతో హిమానీ నదాలు కరిగి మంచు చరియలు విరిగి పడటం వంటిæ ప్రమాదాలు ముంచుకొస్తాయి. కొన్నేళ్లుగా ఎవరెస్ట్ అధిరోహించే వారు ఈ మార్పుల ప్రభావం విపరీతంగా ఉంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. మరో పదేళ్లలో ఎవరెస్ట్ ఎక్కే మార్గం ఎలా మారుతుందో ఊహకి కూడా అందడం లేదని నేపాల్ మౌంటనీరింగ్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ఆంగ్ షెరింగ్ పేర్కొన్నారు. ఆదాయానికి ఆశపడి..? నేపాల్‌కు పర్యాటకమే ప్రధాన ఆధారం. ఎవరెస్ట్ అధిరోహణ నుంచే అధికంగా ఆదాయం సమకూరుతుంది. పశ్చిమ దేశాల నుంచి వచ్చే పర్వతారోహకుల నుంచి11 వేల డాలర్లు (రూ.9 లక్షలు) చొప్పున వసూలు చేస్తున్నట్టు చెబుతున్నారు. అదే కాకుండా వెంట తీసుకు వెళ్లే ఆక్సిజన్, ఆహారం, గైడ్ల కోసం మొత్తంగా ఒక్కొక్కరికి 27 వేల డాలర్లు (దాదాపుగా రూ.22 లక్షలు) ఖర్చు అవుతుంది. అయితే నేపాల్ ప్రభుత్వం ఆదాయానికి ఆశపడే అనుమతులు ఎక్కువగా ఇస్తున్నామన్న ఆరోపణల్ని తోసిపుచ్చింది. ప్రతీ పర్వతారోహకుడి ప్రాణ రక్షణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, బేస్ క్యాంప్‌లో వైద్యులు, అధికారుల బృందం ఈ సాహస యాత్రను పర్యవేక్షిస్తుందని స్పష్టం చేసింది. ఏదైనా సాధ్యమే ప్రపంచంలో ఎవరెస్ట్ మ్యాన్‌గా పేరు పొందిన నేపాల్‌కు చెందిన షెర్పా కామి రిటా 28 సార్లు ఎవరెస్ట్ ఎక్కిన వ్యక్తిగా నిలిచి తన రికార్డు తానే బద్దలు కొట్టాడు. ఈ ఏడాది వారం రోజుల తేడాలో రెండు సార్లు శిఖరాగ్రానికి చేరుకున్నాడు. తన రికార్డుని పసాంగ్ దావా అనే షెర్పా సమం చేయడంతో ఆ మరుసటి రోజే మళ్లీ ఎక్కి అత్యధికసార్లు ఎవరెస్ట్‌ని ఎక్కిన వ్యక్తిగా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఇక బ్రిటన్‌కు చెందిన మాజీ సైనికుడు హరి బుధా మాగర్ కృత్రిమ కాలుతో ఎవరెస్ట్ ఎక్కిన వ్యక్తిగా అరుదైన ఘనత సాధించాడు. మనిషి తలచుకుంటే ఏదైనా సాధ్యమేనని నిరూపించాడు. ఒక మలేసియన్ పర్వతారోహకుడు అనారోగ్యం బారిన పడితే నేపాలీ గైడ్ గెల్జీ అతనిని మోసుకుంటూ కొండ దిగడం మరో అరుదైన ఫీట్‌గా నమోదైంది. ఎవరెస్ట్ శిఖరాగ్రానికి చేరితే ప్రపంచాన్నే జయించినంత ఆనందం వస్తుంది కాబట్టే ప్రాణాలకు తెగించి మరీ ఎవరెస్ట్ ఎక్కే వారి సంఖ్య ఏడాదికేడాది పెరుగుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
విశాఖ: గాల్లో చక్కర్లు కొట్టిన విమానం.. దారి మళ్లింపు
సాక్షి, విశాఖపట్నం: బెంగళూరు-విశాఖ రూట్లో ప్రయాణించే విమానం ఒకటి బుధవారం దారి మళ్లించబడింది. ఈదురుగాలుల ప్రభావంతో ల్యాండింగ్ కు అంతరాయం ఏర్పడగా.. 20 నిమిషాల పాటు గాల్లోనే విమానం చక్కర్లు కొట్టింది. దీనికి సంబంధించి అదనపు సమాచారం అందాల్సి ఉంది. -
బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదం: ప్రతికూల వాతావరణమే కారణం
న్యూఢిల్లీ: మేఘావృతమైన ప్రతికూల వాతావరణంలోకి హఠాత్తుగా హెలికాప్టర్ ప్రవేశించడంతో.. అది పైలట్ అధీనంలో ఉన్నప్పటికీ దాని పథం మారి కిందకు దూసుకొచ్చి కూలిందని సీడీఎస్ రావత్ ఘటనపై త్రివిధ దళాల దర్యాప్తు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దర్యాప్తులో వెల్లడైన ప్రాథమిక వివరాలు కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి చేరాయని భారత వాయుసేన శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ముందుస్తు కుట్ర, ఉగ్రవాద దుశ్చర్చ, హెలికాప్టర్లో లోపాలు, పైలట్ తప్పిదం.. ఇలాంటి వాదనలు అన్నీ అవాస్తవం’ అని స్పష్టంచేసింది. చదవండి: కోడలి నగలు భద్రపరచడం క్రూరత్వం కాదు ఫ్లైట్ డాటా రికార్డర్, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్లో నమోదైన సమాచారంతోపాటు ఘటనాస్థలిలో సేకరించిన సమాచారాన్ని పరిశీలించి ప్రాథమిక అంచనాకు వచ్చారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికసహా 14 మంది ప్రయాణిస్తున్న భారత వాయుసేన హెలికాప్టర్ గత ఏడాది డిసెంబర్ ఎనిమిదిన కూనూర్‌లో నీలగిరి కొండల్లో నేలకూలిన విషయం తెల్సిందే. -
తిరుపతి వెళ్లి ల్యాండ్ అవకుండానే వెనక్కి
శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయం నుంచి తిరుపతి బయలుదేరిన విమానం అక్కడ వాతావరణం అనుకూలించకపోవడంతో తిరిగి వెనక్కి వచ్చి శంషాబాద్ ఎయిర్‌పోర్టులోనే అత్యవసరంగా ల్యాండయింది. శుక్రవారం ఉదయం 6.20 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి స్పైస్ జెట్ 1075 విమానం తిరుపతి విమానాశ్రయానికి చేరుకునే సమయంలో అక్కడ వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ల్యాండింగ్‌కు అనుమతినివ్వలేదు. దీంతో ఆ విమానం తిరిగి శంషాబాద్ విమానాశ్రయానికి 9.30 గంటలకు చేరుకుంది. ఏటీసీ అనుమతి మేరకు ల్యాండ్ చేసిన విమానం 10 గంటలకు మరోసారి ఇక్కడి నుంచి టేకాఫ్ తీసుకుని బయలుదేరి 11. 26 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్నట్టు ఎయిర్‌పోర్టు వర్గాలు వెల్లడించాయి. -
32 విమానాల దారి మళ్లింపు..!
న్యూఢిల్లీ : వాతావరణం అనుకూలించకపోవడంతో ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునే 32 విమానాలను శనివారం దారి మళ్లించారు. వర్షం, తీవ్రమైన గాలుల నేపథ్యంలో లక్నో, జైపూర్, అమృత్సర్ ఎయిర్‌పోర్టుల్లో విమానాలను ల్యాండింగ్ చేయించామని అధికారులు తెలిపారు. పది ఫ్లైట్లను సాయంత్రం 4 నుంచి 5 మధ్య, మరో 22 విమానాలను రాత్రి 9 నుంచి 10 మద్య దారి మళ్లించామని వెల్లడించారు. -
ప్రధాని 4 గంటలు ఎయిర్‌పోర్ట్‌లోనే..
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉద్దమ్‌సింగ్‌నగర్ జిల్లాలో ఒక ర్యాలీలో ప్రసంగించాల్సిన ప్రధాని నరేంద్రమోదీ వాతావరణం అనుకూలించకపోవడంతో నాలుగు గంటలకుపైగా డెహ్రాడూన్‌లోని జాలీ గ్రాంట్‌లో విమానాశ్రయంలో వేచిఉండాల్సి వచ్చింది. గురువారం ఉదయం ఏడుగంటలకు విమానాశ్రయానికి చేరుకున్న మోదీ తెల్లవారుజామునుంచే ఇక్కడ వర్షం పడుతుండడంతో దాదాపు నాలుగు గంటలకుపైగా అక్కడే నిరీక్షించారు. హెలికాప్టర్లో ఆయన రుద్రాపూర్ బయల్దేరాలని అనుకున్నప్పటికీ ప్రతికూల వాతావరణం కారణంగా కుదరకపోవడంతో ఫోన్లోనే ర్యాలీనుద్దేశించి ప్రసంగించారు. రుద్రాపూర్ రాలేకపోయినందుకు చింతిస్తున్నానంటూ క్షమాపణ కోరారు. ర్యాలీలో పాల్గొనడంతోపాటు, రాష్ట్ర సమీకృత సహకార అభివృద్ధి సంస్థను ప్రధాని ప్రారంభించాల్సి ఉంది. -
భారీ వర్షాలతో నిలిచిన అమర్నాథ్ యాత్ర
జమ్మూ : ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా సోమవారం జమ్మూలో అమర్నాథ్ యాత్రను నిలిపివేసినట్టు అధికారులు వెల్లడించారు. భారీ వర్షాలతో పాటు వాతావరణ పరిస్థితి అనుకూలించకపోవడంతో జమ్మూలోని భగవతినగర్ బేస్ క్యాంప్ నుంచి యాత్రను రద్దు చేశామని అధికారులు తెలిపారు. జమ్మూ నుంచి యాత్రికులను అమర్నాథ్ వైపు అనుమతించలేదని చెప్పారు. జూన్ 28న రెండు మార్గాల్లో ప్రారంభమైన 60 రోజుల అమర్నాథ్ యాత్ర ఆగస్టు 26న రక్షా బంధన్ రోజు ముగియనుంది. కాగా ఆదివారం సాయంత్రం వరకూ 2,78,878 మంది యాత్రికులు అమర్నాథ్ ఆలయాన్ని సందర్శించారు. మరోవైపు అమర్నాథ్ యాత్రపై ఉగ్రవాదులు దాడులతో విరుచుకుపడవచ్చనే ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలతో యాత్ర సాగే మార్గంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. -
చిక్కుకుపోయారు
పశ్చిమగోదావరి, ఏలూరు (సెంట్రల్): కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన పశ్చిమగోదావరి జిల్లావాసులు టిబెట్‌లో చిక్కుకుపోయారు. మానస సరోవర్‌లో దర్శనం ముగించుకుని తిరిగి వస్తుండగా టిబెట్‌లోని పిన్‌కోట్ ప్రాంతంలో వాతావరణం అనుకూలించకపోవడంతో జిల్లావాసులతో పాటు దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన 90 మంది వరకు ఆగిపోయినట్టు ఏలూరు మేయర్ నూర్జహాన్ భర్త ఎస్ఆర్ఎం పెదబాబు ఆదివారం ‘సాక్షి’కి ఫోన్లో తెలి పారు. పిన్‌కోట్ ప్రాంతంలో దట్టంగా మంచు కురవడంతో నేపాల్ నుంచి ఈ ప్రాంతానికి విమాన రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో యాత్రికులు పిన్‌కోట్ ప్రాంతంలో చిక్కుకున్నారు. ఎటువంటి సహాయక చర్యలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మానస సరోవర్ యాత్రికులను సురక్షితమైన ప్రదేశాలకు తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్టు ఇప్పటికే ప్రకటిం చింది. యాత్రికులను నేపాల్ తరలించేందుకు నేపాల్ అధికారులతో సంపద్రింపులు జరుపుతున్నామని, యాత్రికులకు ఆహారం, వైద్యం అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు చె బుతోంది. అయితే వారిని సురక్షితంగా తీసుకువచ్చేందుకుచేస్తున్న ప్రయత్నాలకు అక్కడి వాతావరణం ప్రతికూలంగా మారింది. జిల్లాలోని ఏలూరు నుంచి మేయరు షేక్ నూర్జహాన్ భర్త ఎస్ఎంఆర్ పెదబాబు, ఆయన బావమరిది బాజీ, కాంట్రాక్టర్ గంటా కోటేశ్వరరావు మరికొందరు గతనెల 23న ౖMðలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లారు. వీరంతా 31న మానస సరోవర్‌లో దర్శనం ముగించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. టిబెట్‌లోని పిన్‌కోట్ ప్రాంతానికి రాగా అక్కడ నుంచి నేపాల్ వచ్చేందుకు వాతావరణం అనుకూలించకపోవడంతో జిల్లావాసులతో పాటు మొత్తం 90 మంది వరకు పిన్‌కోట్ ప్రాంతంలో చిక్కుకుపోయినట్టు పెదబాబు ‘సాక్షి’కి తెలిపారు. పిన్‌కోట్ ప్రాంతం నుంచి ముందుగా నేపాల్‌కి యాత్రికులను తరలించాలంటే విమానాలు ఉపయోగించాల్సి ఉంటుంది. కాని అక్కడ దట్టమైన మంచు కురుస్తుండటంతో విమానాల రాకపోకలకు ఆటంకం కలిగిందని పెదబాబు చెప్పారు. ఆహారం అందక ఇబ్బందులు టిబెట్‌లోని పిన్‌కోట్ ప్రాంతంలో చిక్కుపోయిన జిల్లావాసులకు ఆహారం లభించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు తెలిసింది. యాత్రకు వెళ్లిన వారిలో వృద్ధులు, బీపీ, సుగర్‌తో బాధపడుతున్నవారు ఉన్నా రు. వారికి మందులు అందడం లేదు. యాత్రికులకు పూర్తిస్థాయిలో ఆహారం, తాగునీరు లభించకపోవడంతో అవస్థలు పడుతున్నట్టు పెదబాబు చెప్పారు. ప్రభుత్వం నుంచి ఇప్పటివరకూ ఎటువంటి సహాయక కార్యక్రమాలు ప్రారంభం కాలేదని మిగిలిన యాత్రికుల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఎంపీ మాగంటికి వినతి యాత్రికులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలని ఏలూరు ఎంపీ మాగంటి బాబును నగర మేయరు షేక్ నూర్జహాన్ ఫోన్ ద్వారా కోరారు. పెదబాబుతో మాట్లాడామని, ఆయన సురక్షితంగానే ఉన్నారని, బీపీ, సుగర్‌తో బాధపడుతున్నకొందరు యాత్రికులు మందులు అయిపోవడం, సరైన ఆహారం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్టు పెదబాబు చెప్పారని మేయర్ నూర్జహాన్ తెలిపారు. ఎవరూ ఆందోళన చెందవద్దు టిబెట్‌లోని పిన్‌కోట్ ప్రాంతంలో చిక్కుకున్న వారిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్, రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సంపద్రించామని ఏలూరు ఎంపీ మాగంటి బాబు ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే రక్షణశాఖకు చెందిన ప్రత్యేక హెలికాప్టర్‌ను పంపించారని, ఎవరూ ఆందోళన చెం దాల్సిన అవసరం లేదని ఎంపీ పేర్కొన్నారు. -
మూడోరోజు ఉస్సూరు..ఎగరని బెలూన్స్
సాక్షి, అరకులోయ : పర్యాటక ప్రాంతం అరకులోయలో జరుగుతున్న అంతర్జాతీయ బెలూన్ ఫెస్టివల్ మూడోరోజు కూడా వాతావరణం సహకరించకపోవడంతో ఒక్క బెలూన్ కూడా ఎగరలేదు. 13 దేశాలకు చెందిన 16మంది బెలూనిస్ట్లు, వారి స్నేహితులంతా స్థానిక ఎన్టీఆర్ మైదానానికి గురువారం ఉదయం 7 గంటలకే చేరుకున్నారు. అయితే అప్పటికే ఆకాశ«మంతా మబ్బులు కమ్ముకోవడంతో పాటు తేలికపాటి వర్షం కురిసింది. దీంతో ఇవాళ కూడా పర్యాటకులు నిరాశగా వెనుదిరిగారు కాగా నిన్న కూడా (బుధవారం) ప్రతికూల వాతావరణంతో బెలూన్లు ఎగిరే పరిస్థితి లేకపోవడంతో చాలా సమయం నిరీక్షించారు. దీంతో బెలూన్ ఫెస్టివల్‌ను సాయంత్రానికి వాయిదా వేసారు. బెలూన్ ఫెస్టివల్ రెండో రోజు రద్దవ్వడంతో వీదేశీయులంతా నిరాశ చెందారు. మైదానంలో ఉదయం 9 గంటల వరకు నిరీక్షించినా ఫలితం లేకపోవడంతో వారంతా ఉసూరుమన్నారు. సాయంత్రం నాలుగు గంటల సమయానికి కూడా వాతావరణంలో మార్పు రాలేదు. దీంతో రెండో రోజు బెలూన్ల రైడింగ్‌ను పూర్తిగా రద్దు చేశారు. బెలూన్ల వాహనాలకు వర్షం నుంచి రక్షణకు ప్లాస్టిక్ కవర్లు కప్పారు. విదేశీయులు, పర్యాటకులకు నిరాశ అంతర్జాతీయ బెలూన్ ఫెస్టివల్ తొలిసారిగా అరకులోయలో జరగడంతో ప్రాధాన్యత నెలకొంది. అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో తొలిరోజు బెలూన్ల రైడింగ్ పూర్తిస్థాయిలో జరగలేదు. మంగళవారం అయినా బెలూన్ ఫెస్టివల్ బాగా జరుగుతుందని 13 దేశాల రైడిస్ట్లు, పర్యాటకులు ఆశపడ్డారు. అయితే రెండో రోజు కూడా ప్రతికూల వాతావరణంతో బెలూన్ల రైడింగ్ సాయంత్రం వరకు జరగకపోవడంతో ఫెస్టివల్ ఆశయానికి తూట్లు ఏర్పడ్డాయి. మూడు రోజుల నుంచి బెలూన్ల రైడింగ్‌తో హల్చల్ చేద్దామని వీదేశీయులు, ఈ రైడింగ్‌ను కనులారా చూద్దామని పర్యాటకులు ఎంతో ఆశపడ్డారు. అయితే వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి. బుధవారం ఉదయాన్నే ఎన్టీఆర్ మైదానానికి చేరుకున్న పర్యాటకుల సంఖ్య తక్కువగానే ఉంది. స్థానిక అరకు పట్టణ ప్రజలు కూడా పట్టించుకోలేదు. అయితే ఉన్నపాటి పర్యాటకులు కూడా బెలూన్ రైడింగ్ లేకపోవడంతో నిరాశ చెందారు. 16మంది విదేశీయులతో సెల్ఫీలు దిగడం మినహా బెలూన్ ఫెస్టివల్‌కు మరే విశేషం లేదు. -
ఆలస్యంగా నడుస్తున్న 53 రైళ్లు
న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశం చలికి వనికిపోతోంది. దట్టమైన పొగమంచు వల్ల జనజీవనం స్తంభించిపోయింది. దేశ రాజధాని ఢిల్లీలో పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దట్టమైన పొగమంచు కారణంగా 53 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరో 26 రైళ్ల వేళల్లో మార్పులు చేసి.. మూడు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. పొగమంచు మూలంగా తెలంగాణ ఎక్స్‌ప్రెస్ సోమవారం ఆలస్యంగా బయలుదేరనుంది. మధ్యాహ్నం 12:25 గంటలకు తెలంగాణ ఎక్స్‌ప్రెస్ బయలుదేరుతుందని అధికారులు తెలిపారు. -
38 విమానాలు ఆలస్యం
న్యూఢిల్లీ: ప్రతికూల వాతావరణంలో దేశ రాజధాని ఢిల్లీలో రవాణా వ్యవస్థకు అవాంతరాలు ఎదురవుతున్నాయి. పొంగ మంచు దట్టంగా కమ్మేయడంతో విమాన, రైళ్ల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. పొంగ మంచు కారణంగా ఢిల్లీకి రావాల్సిన 81 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఆరు రైళ్లను రద్దు చేశారు. 51 రైళ్ల రాకపోకల సమయాన్ని మార్చారు. వెలుతురు తగ్గిపోవడంతో ఢిల్లీ కేంద్రంగా నడుస్తున్న 3 విమానాలను దారి మళ్లించారు. వాతావరణం సహకరించకపోవడంతో ఢిల్లీ నుంచి బయలు దేరాల్సిన 38 విమానాలు ఆలస్యమయ్యాయి. ప్రతికూల వాతావరణం మరికొన్ని రోజులు కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. -
రాష్ట్రంలో భిన్నమైన వాతవరణం
-
పొగమంచులోనూ స్పష్టంగా చూడొచ్చు
న్యూఢిల్లీ: శీతాకాలం పొగమంచులో కూడా రైల్వే డ్రైవర్లు స్పష్టంగా చూసేలా ఇంజిన్లలో ఆధునిక పరికరాన్ని ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది. త్రినేత్ర అనే ఈ కొత్త వ్యవస్థతో డ్రైవర్లు ప్రతికూల వాతావరణంలో ట్రాక్‌ను స్పష్టంగా చూడగలరు. ముందున్న ప్రాంతాన్ని చిత్రీకరించడం, రాడార్ వ్యవస్థ సాయంతో ఈ పరికరం పనిచేస్తుందని రైల్వే శాఖ అధికారి ఒకరు తెలిపారు. దీంతో స్టేషన్ లేదా, సిగ్నల్‌కు ఎప్పుడు చేరేది డ్రైవర్ కచ్చితంగా తెలుసుకునే అవకాశముంటుంది. తిన్నగా ఉన్న ట్రాక్‌పై కిలోమీటరు దూరంలోని వస్తువుల్ని కూడా డ్రైవర్ చూడవచ్చు. -
టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం
-
టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం
విశాఖపట్నం: ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రమాదం తప్పింది. వారు ప్రయాణిస్తున్న ట్రూజెట్ విమానం వర్షం కారణంగా విశాఖపట్నంలో ల్యాండ్ అయ్యేందుకు వాతావరణం అనుకూలించలేదు. దీంతో గంట పాటు విమానం ఆకాశంలో చక్కర్లు కొట్టింది. చివరకు విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్ర మంత్రి నారాయణ కుమార్తె వివాహానికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. నెల్లూరులో జరిగిన ఈ వివాహానికి వెళ్లేందుకు మరో మంత్రి గంటా శ్రీనివాసరావు.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. వివాహం అయిన తర్వాత టీడీపీ నేతలు రేణిగుంట నుంచి విశాఖకు విమానంలో బయల్దేరారు. మంత్రి గంటా శ్రీనివాసరావు కొడుకుతో మంత్రి నారాయణ కుమార్తె వివాహం జరిగింది. -
నిలిచిన అమరనాథ్ యాత్ర
శ్రీనగర్: ప్రతికూల వాతావరణం నేపథ్యంలో ఈ రోజు అమరనాథ్ యాత్ర నిలిపివేసినట్లు పోలీసు ఉన్నతాధికారి శుక్రవారం శ్రీనగర్‌లో వెల్లడించారు. యాత్రకు వెళ్లే మార్గంలో ఆకస్మాత్తుగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. దాంతో మార్గమధ్యంలో భారీగా కొండ చరియలు విరిగిపడుతున్నాయని చెప్పారు. దీంతో అమరనాథ్ యాత్రను ఈరోజు తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితిపై నేటి సాయంత్రం సమీక్షి నిర్వహిస్తామన్నారు. ఈదురుగాలులు, భారీ వర్షాల కారణంగా శ్రీనగర్ - లేహ్ జాతీయరహదారిపై ఉన్న కులాన్ గ్రామంలో 15 ఏళ్ల బాలిక మృతి చెందిందన్నారు. ఈ గ్రామంలో అమరనాథ్ యాత్రకుల కోసం బేస్ క్యాంప్ నిర్వహిస్తున్నామని తెలిపారు. అయితే అమరనాథ్ యాత్రికులంతా క్షేమంగా ఉన్నారని చెప్పారు. కాశ్మీరీ వ్యాలీలో మరో రెండు రోజుల పాటు సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్థానిక వాతావరణశాఖ అధికారులు తెలిపినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. -
ప్రతికూల వాతావరణమే ముంచింది!
జకార్తా: ప్రతికూల వాతావరణం కారణంగానే ఎయిర్ ఆసియా విమానం కూలిపోయిందని ఇండోనేసియా వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ భయానక ఘటన గల కారణాన్ని ఇండోనేసియా తొలిసారి అధికారికంగా ప్రకటించింది. విమానం అదృశ్యమవడానికి ముందున్న సమాచారం ఆధారంగా ఈ నిర్ధారణకు వచ్చింది. ప్రతికూల వాతారణ ప్రభావం విమాన ఇంజిన్ పై పడడంతో ప్రమాదం జరిగివుండొచ్చని ఇండోనేసియా మెటరాలజీ, క్లైమటాలజీ, జియోఫిజిక్స్ ఏజెన్సీ(బీఎంకేజీ) పేర్కొంది. కాగా, జావా సముద్రం నుంచి ఆదివారం నాలుగు మృతదేహాలు వెలికితీశారు. ఇప్పటివరకు 34 మృతదేహాలు వెలికితీశారు. గత ఆదివారం నుంచి ఇండోనేసియాలోని సురయ నుంచి 162 మందితో సింగపూర్ వెళుతూ ఎయిర్ ఆసియా విమానం జావా సముద్రంలో కూలిపోయిన సంగతి తెలిసిందే. -
జిల్లాకు హుదూద్ ముప్పు
పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాలు.. ఆందోళనలో రైతులు సాక్షి, విజయవాడ : జిల్లాకు మరో తుపాను(హుదూద్) ముప్పు పొంచి ఉంది. అండమాన్ దీవులకు సమీపంలో ఏర్పడిన వాయిగుండం మచిలీపట్నం తీరానికి 1,700 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని, దాని ప్రభావంతో రానున్న 24 గంటల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవారణ శాఖ ప్రకటించింది. ఈ క్రమంలో వాతవరణంలో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. కంకిపాడు, ఉయ్యూరు, పెనమలూరు, చాట్రాయి తదితర ప్రాంతాల్లో బుధవారం వర్షం కురిసింది. గత అనుభవాలను గుర్తు చేసుకుని మళ్లీ తుపానుల వల్ల కష్టాలు తప్పవని అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. అసలే ఆలస్యంగా ప్రారంభమైన సాగు.. బ్యాంకర్లు రుణాలు ఇవ్వకపోవటంతో ఈ ఏడాది సీజన్ నిర్ణీత కాలవ్యవధి కంటే రెండు నెలలు ఆలస్యంగా మొదలైంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 6.25 లక్షల ఎకరాల్లో వరి, 1.30 లక్షల ఎకరాల్లో పత్తి, 40 వేల ఎకరాల్లో చెరుకు, 20 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 6వేల ఎకరాల్లో పసుపు తదితర పంటలు సాగులో ఉన్నాయి. అనేక ప్రాంతాల్లో వరి ఇంకా చిరుపొట్ట దశలోనే ఉంది. మిగిలిన పంటలు పిలకల దశలో ఉన్నాయి. బుధవారం వర్షం కురిసిన ప్రాంతాలైన ఉయ్యూరు, పెనమలూరు, కంకిపాడు ప్రాంతాల్లో వరి చిరుపొట్ట దశలోనే ఉంది. ఈ దశలో వర్షాలు కురిసి పొలాల్లో నీరు నిలిస్తే పంటకు పూర్తిగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. గతేడాది వచ్చిన మూడు తుపానుల్లో రెండు బందరు వద్దే తీరం దాటడంతో ఆ ప్రభావం వల్ల జిల్లాలో భారీగా వర్షాలు కురిశాయి. సుమారు రూ.200 కోట్ల మేర పంటను నష్టపోయారు. -
ప్రతికూల వాతావరణం వల్లే కూలిన విమానం
అల్జీర్స్/బమకా: అల్జీరియా విమానం ఏహెచ్5017 కూలిపోవడానికి ప్రతికూల వాతావరణమే కారణమై ఉంటుందని ఆ దేశాధ్యక్షుడు అబ్దుల్మాలెక్ సెల్లాల్ పేర్కొన్నారు. బర్కినా ఫాసో నుంచి అల్జీరియా వెళతున్న విమానం ఆఫ్రికాలోని ఉత్తర మాలిలో ఈనెల 24 గురువారం కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 118 మంది మృతి చెందారు. విమానం టేకాఫ్ తీసుకున్న తర్వాత దట్టమైన మేఘాలు, బలమైన గాలులు, ఇసుక తుపాను వంటి క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు ఎదురైనట్లు ఆయన చెప్పారు. కూలిపోవడానికి కొన్ని రోజుల ముందే విమానాన్ని ఫ్రెంచ్ విమానయాన నిపుణులు తనిఖీ చేశారని, మంచి స్థితిలోనే ఉందన్నారు. ఈ విమానానికి సంబంధించిన బ్లాక్‌బాక్స్‌లను పరీక్షల కోసం ఫ్రాన్స్‌కు పంపినట్లు ఫ్రెంచ్ దౌత్యాధికారి మాలి రాజధాని బమకాలో చెప్పారు. ఇదిలా ఉండగా అల్జీరియా విమానం ఘటనపై నిపుణులు దర్యాప్తు చేస్తోంది. పూర్తిగా మంటల్లో కాలిపోయిన విమాన శకలాల నుంచి శనివారం రెండో బ్లాక్‌బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. విమానం చాలా బలంగా నేలను ఢీకొట్టడంతోపాటు గాలిలోకి ఎగిరిపడి ఉంటుందని, అందుకే ముక్కలుచెక్కలై అర కిలోమీటరు పరిధిలో శిథిలాలు చెల్లాచెదురుగా పడ్డాయని నిపుణులు భావిస్తున్నారు. విమానంలో ప్రయాణిస్తున్నవారంతా మరణించారు. కొన్ని కుటుంబాలకు చెందిన అందరూ దుర్మరణం చెందారు. ఫ్రాన్స్‌కు చెందిన ఒక కుటుంబంలోని 10 మందీ చనిపోయినట్లు అధికారులు తెలిపారు. ఛిద్రమైన, కాలిపోయిన మృతుల అవయవాలు మాత్రమే సంఘటనాస్థలంలో లభించాయని, దీంతో మతదేహాల గుర్తింపు వీలుకావడం లేదని అధికారులు పేర్కొన్నారు. మరణించిన వారిలో బర్కినా ఫాసో, లెబనాన్, అల్జీరియా, స్పెయిన్, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్‌లకు చెందినవారు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు మలేసియా విమానం ఎమ్హెచ్17 కూల్చివేతకు గురైన ప్రాంతం (ఉక్రెయిన్)లో అంతర్జాతీయ పోలీసుల బందం పర్యటన రద్దయింది. రష్యా అనుకూల మద్దతుదారుల ప్రాబల్యం ఉన్న సంబంధిత ప్రాంతంలో దాడులు జరుగుతుండడమే దీనికి కారణమని పోలీసు బృందం అధిపతి అయిన అలెగ్జాండర్ హగ్ చెప్పారు. -
దేశరాజధానిలో ఇసుక తుఫాన్, అంధకారంలో ఢిల్లీ!
న్యూఢిల్లీ: దేశరాజధాని న్యూఢిల్లీలో ఇసుక తుపాను భీభత్సం సృష్టించింది. ఇసుక తుఫాన్ ప్రభావంతో పట్టపగలే ఢిల్లీ లో అంధకారం అలుముకుంది. బీభత్సమైన ఈదురుగాలులతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గాలి దుమారంతో విద్యుత్‌కు అంతరాయం కలుగడంతో వ్యాపారస్థంస్థలు, ప్రజలు ఇబ్బందులకు లోనయ్యారు. వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని గుర్గావ్, ఇతర ప్రాంతాల్లో అంధకారం నెలకొంది. ఈదురుగాలులతోపాటు వర్షం కూడ పడటం, రహదారులపై చెట్టు విరిగి పడటంతో ఢిల్లీలో గందరగోళం నెలకొంది. ఊహించని విధంగా, ఆకస్మికంగా వాతవరణ పరిస్థితులు మారిపోవడంతో ఉద్యోగులు, ప్రజలు ఇబ్బందులకు లోనయ్యారు.