టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం | tdp mlas, mlcs boarding plane land safely in bad weather | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం

Published Sun, Nov 1 2015 11:34 AM | Last Updated on Fri, Aug 10 2018 7:19 PM

టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం - Sakshi

టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం

విశాఖపట్నం: ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రమాదం తప్పింది. వారు ప్రయాణిస్తున్న ట్రూజెట్ విమానం వర్షం కారణంగా విశాఖపట్నంలో ల్యాండ్ అయ్యేందుకు వాతావరణం అనుకూలించలేదు. దీంతో గంట పాటు విమానం ఆకాశంలో చక్కర్లు కొట్టింది. చివరకు విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

రాష్ట్ర మంత్రి నారాయణ కుమార్తె వివాహానికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. నెల్లూరులో జరిగిన ఈ వివాహానికి వెళ్లేందుకు మరో మంత్రి గంటా శ్రీనివాసరావు.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. వివాహం అయిన తర్వాత టీడీపీ నేతలు రేణిగుంట నుంచి విశాఖకు విమానంలో బయల్దేరారు. మంత్రి గంటా శ్రీనివాసరావు కొడుకుతో మంత్రి నారాయణ కుమార్తె వివాహం జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement