MLCs
-
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల వివాదం..‘సుప్రీం’ తుది తీర్పు అప్పుడే!
సాక్షి,ఢిల్లీ: గవర్నర్‌కోటా ఎమ్మెల్సీల వ్యవహారంలో బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ వేసిన పిటిషన్‌పై సోమవారం(డిసెంబర్ 9) విచారణ జరిగింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను దాసోజు శ్రవణ్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ప్రసన్నలతో కూడిన ధర్మాసనం కేసు విచారించింది.తదుపరి విచారణను ఫిబ్రవరి 12కు కోర్టు వాయిదా వేసింది. ఆ రోజు తుది వాదనలు వినడంతో పాటు ఫైనల్ ఆర్డర్ ఉంటుందని తెలిపింది. దాసోజు శ్రవణ్ తరపున సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహిత్గి వాదనలు వినిపించారు. సుప్రీం కోర్టు ఈ కేసులో స్టే ఇచ్చినప్పటికీ, కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం జరిగిందని సుప్రీంకోర్టు దృష్టికి ముకుల్ రోహిత్గి తీసుకువచ్చారు.కాగా, గవర్నర్ కోటా ఎమ్మెల్సీలో బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్‌ను నామినేట్ చేసినప్పటికీ అప్పటి గవర్నర్ తమిళిసై ఆమోదించకపోవడంతో ఆయన ఎమ్మెల్సీ కాలేకపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీజేఎస్ చీఫ్ కోదండరాం సహా ఇతరులను పెద్దల సభకు పంపించింది.దీంతో శ్రవణ్ తన న్యాయపోరాటాన్ని కొనసాగిస్తున్నారు. -
రాక్షస పాలనలో దళితులపై కక్ష
సాక్షి, అమరావతి: ‘‘ఎస్సీలలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా..?’’ అంటూ అహంకారపూరితంగా దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు! ఆ వర్గాన్ని ఉక్కుపాదంతో అణగదొక్కుతూ.. దళితులకు అసలు నాయకత్వమే లేకుండా చేయాలనే దుర్నీతితో సాగుతున్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తేవడం.. ప్రశ్నించడమే పాపమన్నట్లు వ్యవహరిస్తున్నారు.ఒకపక్క ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అనుక్షణం వేధింపులకు గురిచేస్తూ.. మరోవైపు నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఆర్డీవో, డీఎస్పీ, మండల స్థాయి అధికారులపై కక్ష సాధింపు చర్యలకు ఉపక్రమించారు. సూపర్ సిక్స్ సహా హామీల అమలు, అక్రమాలు, వైఫల్యాలపై కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినందుకు ఎస్సీ వర్గానికి చెందిన సామాజిక కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. వారిని పోలీసు స్టేషన్లలో అర్ధ నగ్నంగా నిలబెట్టి అవమానాలకు గురి చేసిన ఘటనపై సర్వత్రా విభ్రాంతి వ్యక్తమవుతోంది. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచి్చనప్పటి నుంచి ఎస్సీలను ఉక్కుపాదంతో అణచివేత చర్యలను రోజు రోజుకు ఉద్ధృతం చేస్తున్నారని ఆ సామాజిక వర్గ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపులు..» అధికారంలోకి వస్తూనే వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను లక్ష్యంగా చేసుకున్న కూటమి ప్రభుత్వం ఆయనపై వరుసగా కేసులు నమోదు చేస్తూ రాజకీయ వేధింపులకు తెర తీసింది. దళితులకు నాయకత్వం లేకుండా చేయాలనే కుట్రపూరిత ధోరణితో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో వరుసగా కేసులు నమోదు చేస్తూ బెయిల్ రాకుండా అడ్డుకుంటోంది. నందిగం సురేష్ పై అసలు ఎక్కడెక్కడ, ఎన్ని కేసులు ఉన్నాయో చెప్పాలంటూ స్వయంగా హైకోర్టు ఆదేశించడం రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. అన్యాయంపై ప్రశ్నించడం.. దళితుల్లో స్ఫూర్తి రగల్చడమే పాపమనే విధంగా దళిత నేతల పట్ల కూటమి సర్కారు దుర్నీతితో వ్యవహరిస్తోంది. » చంద్రబాబుపై గతంలో గులకరాయి పడిన ఘటనకు సంబంధించి నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్‌లపై కూటమి సర్కారు ఇప్పుడు అక్రమ కేసులు బనాయించి కక్ష సాధింపు చర్యలకు దిగింది. » కూటమి సర్కారు రాజకీయ క్షక్ష సాధింపుల్లో భాగంగా నారా లోకేశ్‌పై ట్వీట్ చేశారంటూ ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌పై స్థానిక పోలీస్ స్టేషన్లో పలు కేసులు నమోదు చేసింది. జోరుగా సాగుతున్న పేకాట కార్యకలాపాలను ప్రభుత్వం దృష్టికి తెచ్చిన ఓ ప్రజాప్రతినిధి పట్ల ఈ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తోందో చెప్పేందుకు ఈ ఘటనే నిదర్శనం. జరుగుతున్న విషయాన్ని చెబితే దిద్దుబాటు చర్యలు తీసుకోకుండా విపక్షంలో ఉన్నారనే ఏకైక కారణంతో ఓ ఎమ్మెల్యేపై కేసులు బనాయించడం కూటమి సర్కారు అరాచకాలకు పరాకాష్ట. » బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గతేడాది ఓ వలంటీర్ మృతి చెందిన ఘటనకు సంబంధించి మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్న కూటమి సర్కారు అధికారంలోకి రాగానే ఈ కేసులో ఎలాంటి సంబంధం లేని విశ్వరూప్ కుమారుడు డాక్టర్ శ్రీకాంత్‌ను అక్రమంగా అరెస్టు చేసింది. డాక్టర్ శ్రీకాంత్‌ను ఏ 1గా చేర్చి జైలుకు తరలించింది. ఇటీవల ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. » మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు మేరుగు నాగార్జునపై టీడీపీ నేతలు ఓ మహిళతో తప్పుడు కేసు పెట్టించారు. నాగార్జున డబ్బులు తీసుకుని మోసం చేశారని, లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ తాడేపల్లి పోలీస్ స్టేషన్లో తప్పుడు కేసు బనాయించారు. అయితే తనపై అధికార పార్టీ నాయకులు తీవ్ర ఒత్తిడి తెచ్చి తప్పుడు కేసు పెట్టించినట్లు ఆ మహిళ అఫిడవిట్లో పేర్కొంది. తాను ఎన్నడూ మేరుగు నాగార్జునను చూడలేదని, తమ ఇద్దరి మధ్య ఎలాంటి ఆరి్థక లావాదేవీలు లేవని అందులో వెల్లడించడం గమనార్హం.విద్యావంతుడికి అవమానాలు.. రాజమహేంద్రవరంలో వరదలు వచి్చనప్పుడు ప్రజలు పడిన ఇబ్బందులను నెల రోజుల్లోనే పరిష్కరించినట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. దీనిపై స్పందించిన విద్యావంతుడైన దళిత యువకుడు పులి సాగర్ తాను నివాసం ఉండే కృష్ణానగర్, బ్రదరన్ చర్చి ప్రాంతాల్లో వరద నీరు ఇంకా నిల్వ ఉండటం, సమస్యలు తొలగకపోవడంపై ప్రశ్నిస్తూ పోస్టు పెట్టారు. దీంతో ఆయనపై కేసులు నమోదు చేసిన కూటమి ప్రభుత్వం దారుణ అవమానాలకు గురి చేసింది. పోలీసు స్టేషన్‌కు రావాలని ఆదేశించడంతో ఈ నెల 2న ఆయన రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్ స్టేషన్‌కు వెళ్లారు. బీఎస్సీ, బీఈడీ చదివిన తనను పోలీసులు తీవ్ర స్థాయిలో దుర్భాషలాడుతూ, బెదిరిస్తూ.. సెల్లో అర్ధనగ్నంగా నిలబెట్టి.. మహిళా పోలీసు కానిస్టేబుళ్లను కాపలాగా ఉంచారని పులి సాగర్ వాపోయారు. దళిత యువకుడిని పోలీసులు ఘోరంగా అవమానించిన తీరును సామాజికవేత్తలు ఖండిస్తున్నారు. » చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజవర్గంలో గత ఎన్నికల సమయంలో విద్యుత్తు సబ్ స్టేషన్లో ప్రమాదానికి సంబంధించి టీడీపీ నాయకుల ప్రోద్బలంతో దళితుడైన యాదమరి ఎంపీపీ సురేష్ బాబుపై చిత్తూరు టూ టౌన్ సీఐ అక్రమ కేసు నమోదు చేశారు. ఈ ఏడాది జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడగానే పూతలపట్టు మండలం ఎగువ పాలకూరు దళితవాడలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన హరి, జయపాల్, భారతి, బాబుపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. » రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలం తప్పెటవారిపల్లెలో ఇటీవల దళిత వర్గానికి చెందిన ప్రభుపై టీడీపీ సానుభూతిపరులు మరుగుతున్న నూనెను ఒంటిపై పోయడంతో తీవ్ర గాయాలతో కడప రిమ్స్‌లో చేరాడు. » దళితుడనే చిన్న చూపుతో రాజంపేట మున్సిపల్ కమిషనర్ రాంబాబును టీడీపీ నాయకులు ఆయన కార్యాలయంలోనే వేధించారు. తీవ్ర మానసిక వేధింపులతో కలత చెందిన ఆయన అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అధికార యంత్రాంగంపై వేధింపులు» ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ ఐపీఎస్ సంజయ్‌కు నిష్పక్షపాతంగా పని చేస్తారనే పేరుంది. ఆయన ఏ రాజకీయ పక్షానికీ కొమ్ము కాయరని ఐపీఎస్ అధికారులే స్పష్టం చేస్తున్నారు. అగి్నమాపక డీజీ, సీఐడీ చీఫ్ హోదాల్లో సంజయ్ అక్రమాలు, నిధుల దురి్వనియోగానికి పాల్పడ్డారనే నెపం మోపి ఆయన్ను కూటమి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. » ఐపీఎస్ అధికారి పీవీ సునీల్‌కుమార్‌ను వేధింపులకు గురి చేస్తున్న కూటమి సర్కారు ఐపీఎస్‌లు పాల్రాజు, జాషువాకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా కక్ష సాధిస్తోంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఐపీఎస్ అధికారి అన్బురాజన్‌కు పోస్టింగ్ ఇవ్వలేదు. రాజకీయ దురుద్దేశాలతో రిటైర్డ్ సీనియర్ పోలీస్ అధికారి విజయ్‌పాల్‌ను వేధించి అరెస్టు చేసింది. » ఐఆర్ఎస్ అధికారి రామకృష్ణకు నిజాయితీగా, చట్ట ప్రకారం వ్యవహరిస్తారని అధికార వర్గాల్లో పేరుంది. గత ప్రభుత్వంలో ఆయన స్టాంపులు, రిజి్రస్టేషన్ల శాఖ ఐజీగా పని చేశారు. విధి నిర్వహణలో నిక్కచి్చగా వ్యవహరించిన రామకృష్ణపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో తనిఖీలు నిర్వహించి అక్రమాలను వెలికి తీసినందుకు ఆయనపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు దిగింది. -
వైఎస్ఆర్ సీపీ MLCల ప్రెస్ మీట్
-
కూటమి సర్కారుపై YSRCP ఎమ్మెల్సీల ప్రశ్నల వర్షం
-
బడ్జెట్‌పై చర్చ పక్కదారి
సాక్షి, అమరావతి: శాసన మండలిలో గురువారం బడ్జెట్‌పై జరిగిన చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మండిపడ్డారు. తాము మాట్లాడుతుంటే మంత్రులు పదేపదే అడ్డు తగులుతున్నారని ఆరోపించారు. శాసన మండలి మీడియా పాయింట్ వద్ద వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, వరుదు కళ్యాణి, బొమ్మి ఇజ్రాయెల్, సిపాయి సుబ్రమణ్యం, పీవీవీ సూర్యనారాయణరాజు, వంకా రవీంద్రనాథ్ మాట్లాడారు. వారు ఏమన్నారంటే.. మంత్రులందరూ అడ్డుకున్నారు..మండలిలో బడ్జెట్‌పై మాట్లాడుతుంటే వాస్తవాలు భరించలేని అధికారపక్ష నేతలు అడుగడుగునా మమ్మల్ని అడ్డుకున్నారు. టారిఫ్ పెంచబోతున్నారా అని ఎనర్జీ మీద ప్రశ్నోత్తరం ఇచ్చాం? కానీ, దానిపై చర్చ జరగలేదు. ఎన్నికల సమయంలో విద్యుత్ ఛార్జీలు పెంచబోమని సీఎం చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు ఒక్కో యూనిట్‌కు రూ.1.50 పైసలు పెంచుతున్నారు.ప్రజలపై భారం వేయకుండా ప్రభుత్వమే దీనిని భరించాలి. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటూ నెట్టుకొచ్చి ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్ అంటున్నారు. బడ్జెట్‌పై వరుదు కళ్యాణి మాట్లాడుతుంటే లోకేశ్ చర్చను తప్పుదారి పట్టించారు. సోషల్ మీడియాలో పోస్టులపై చర్చ కోరితే అడ్డుకున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియకూడదనే టీడీపీ ఎమ్మెల్సీలు ఇలా వ్యవహరిస్తున్నారు. – తోట త్రిమూర్తులుప్రజలను ప్రభుత్వం మోసం చేసింది..ప్రశ్నిస్తే గొంతును నొక్కాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది. బడ్జెట్లో జరిగిన తప్పులను లేవనెత్తడం ప్రతిపక్షంగా మా బాధ్యత. మా సభ్యులు మాట్లాడుతుంటే మంత్రులు పదేపదే అడ్డుతగులుతున్నారు. సూపర్ సిక్స్ హామీలను అమలుచేయాలంటే రూ.74 వేల కోట్లకు పైగా అవసరమవుతాయి. కానీ, అందుకు తగిన విధంగా బడ్జెట్లో కేటాయింపులు జరగలేదు. ఈ బడ్జెట్‌తో ప్రజల ఆశలు అడియాసలయ్యాయి. మూడు సిలిండర్లు ఇస్తామని ఒక్కటే ఇచ్చారు.. మరో 2 సిలిండర్ల మాటేంటి? రైతులకు పెట్టుబడి సాయం ఇప్పటివరకు ఇవ్వలేదు. ఎప్పుడిస్తారో చెప్పలేదు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఉద్యోగులకు సకాలంలో జీతాలూ ఇవ్వడంలేదు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. పోర్టులు కట్టడం చీకటి పాలన అవుతుందా? అరకొర బడ్జెట్ కేటాయించి సూపర్ సిక్స్ పథకాలు ఎలా అమలుచేస్తారు? మేం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక టీడీపీ సభ్యులు గందరగోళం సృష్టించారు. – వరుదు కళ్యాణిఈరోజు మండలి చూస్తే బాధేసింది..ఈరోజు మండలిలో జరిగిన పరిస్థితులను చూస్తే బాధేసింది. విజయనగరం జిల్లాలో అతిసార వ్యాప్తి, మరణాలపై ప్రశ్నోత్తరం ఇచ్చాం. జిల్లాలో డయేరియా వ్యాప్తి వాస్తవమేనా అంటే వైద్య మంత్రి లేదన్నారు. మొత్తం 14 మరణాలు సంభవిస్తే డిప్యూటీసీఎం పవన్ 10 మంది చనిపోయారని.. చంద్రబాబు 8 మంది చనిపోయారన్నారు. నిన్న మంత్రి సభలో నలుగురు చనిపోయారంటున్నారు. సభ్యుల ఆవేదన చూస్తే ముచ్చటేస్తోందని మంత్రి వ్యంగ్యంగా వ్యాఖ్యానించడం బాధాకరం. –పీవీవీ సూర్యనారాయణ రాజుబాబు పాలనంతా తిరోగమనమే..సభలో ఎవరైనా సభ్యులు మాట్లాడుతున్నప్పుడు అడ్డుకోవడం కరెక్ట్ కాదు. మా నాయకుడు సభ నుంచి పారిపోలేదు. వైఎస్సార్సీపీ ప్రతిపక్షంగా ఉంది కాబట్టే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అడుగుతున్నారు. గత ప్రభుత్వం రూ.14 లక్షల కోట్లు అప్పుచేసిందన్నారు. కానీ, బడ్జెట్లో రూ.6 లక్షల కోట్లు మాత్రమే చూపించారు.. ఇది మోసం కాదా? బాబు పాలనంతా తిరోగమనమే. వైఎస్సార్సీపీ హయాంలో అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగింది. – బొమ్మి ఇజ్రాయెల్ విపక్షాల గొంతు నొక్కుతున్నారు..మండలిలో ప్రస్తుతం మేం మెజార్టీ సభ్యులం. అయినా కూడా సభా పద్ధతులు పాటించకుండా టీడీపీ మంత్రులు గందరగోళం సృష్టిస్తూ ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు. ఆస్పత్రులకు వెంటనే బకాయిలు చెల్లించకపోతే పేద ప్రజలు ఇబ్బందులు పడతారు. సూపర్ సిక్స్‌లో ప్రతీ రైతుకు రూ.20 వేలు ఆర్థిక సాయం ఇస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. అంటే 11 వేల కోట్లు.. కానీ, కేటాయించింది వెయ్యి కోట్లే. ఇది మోసం కాదా? ఇక ఉచిత బస్సు ఏమైంది? – సిపాయి సుబ్రహ్మణ్యంసమయం కూడా ఇవ్వలేదు..నాకు కేటాయించిన సమయం ఇవ్వకుండానే సభను రేపటికి వాయిదా వేశారు. ప్రతిపక్ష సభ్యులపై దాడిచేసే ప్రయత్నం చేశారు. ఎంతో విలువైన 4 గంటలు వృథా అయిపోయాయి. మాలాంటి కొత్త ఎమ్మెల్సీలకు మాట్లాడే అవకాశం రావట్లేదు. కనీసం రేపైనా మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరుతున్నా. చంద్రబాబు నిత్యం మోసం, దగా చేస్తూ అబద్ధాలు చెబుతున్నారు. – వంకా రవీంద్రనాథ్ -
వీ వాంట్ జస్టిస్.. సేవ్ డెమోక్రసీ: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల నిరసన
అమరావతి, సాక్షి: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మూడో రోజు ప్రారంభమైన కాసేపటికే.. శాసనమండలిలో ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తింది. సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల వ్యవహారంపై చర్చకు వైఎస్సార్సీపీ పట్టుబట్టగా.. చైర్మన్ అందుకు నిరాకరించారు. దీంతో.. ఎమ్మెల్సీలు చైర్మన్ పోడియం చుట్టుముట్టి అరగంట పాటు నినాదాలతో తమ నిరసన తెలియజేశారు. సోషల్ మీడియా అరెస్టులతో పాటు డీఎస్సీపై పీడీఎఫ్ వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు ఆ రెండు తీర్మానాలను తిరస్కరించారు. తమ వాయిదా తీర్మానంపై చర్చించాల్సిందేనని చైర్మన్‌ను మండలిలో ప్రతిపక్ష నేత బొత్స కోరారు. అయినా అందుకు చైర్మన్ అంగీకరించలేదు. దీంతో.. పోడియం వద్దకు వచ్చి చేరిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. ‘‘వీ వాంట్ జస్టిస్..’’, ‘‘సేవ్ డెమోక్రసీ’.. అంటూ నినాదాలు చేస్తుండగా.. మరోవైపు కూటమి ఎమ్మెల్సీలు వాళ్లతో వాగ్వాదానికి దిగి రెచ్చగొట్టేందుకు యత్నించారు. కానీ, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మాత్రం సోషల్ మీడియా పోస్టుల ప్రతులను చైర్మన్‌కు చూపిస్తూ నినాదాలు కొనసాగించారు. చేసేది లేక ఆ నినాదాల నడుమే ఏపీ మంత్రులు మాట్లాడేందుకు యత్నించారు. ఈ క్రమంలో గందరగోళం నెలకొనగా.. మండలిని కాసేపు వాయిదా వేశారు చైర్మన్. ఇదీ చదవండి: చావు లెక్కలు నవ్వుతూ.. -
శాసన మండలిలో టీడీపీకి ఊహించని దెబ్బ
-
వైఫల్యాలు, మోసాలపై నిలదీస్తామని పాలక పక్షానికి భయం: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ప్రభుత్వ వైఫల్యాలు, అక్రమాలు, సూపర్ సిక్స్ మోసాలపై శాసనసభలో పాలకపక్షాన్ని నిలదీస్తామనే భయంతోనే 40 శాతం ఓట్లు సాధించిన వెఎస్సార్‌సీపీని ప్రతిపక్షంగా గుర్తించడం లేదని పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. కూటమి సర్కారు వైఫల్యాలను సభ వెలుపల ప్రభుత్వ సాక్ష్యాధారాలతో ఎండగట్టాలని పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. శాసన మండలిలో ప్రజాగళాన్ని గట్టిగా వినిపించి వైఫల్యాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని ఎమ్మెల్సీలకు సూచించారు. ప్రశ్నించే స్వరమే వినిపించకూడదనే ఆలోచనతో ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కేసులు పెడతారని ఎవరూ భయపడవద్దని, తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం ఉదయం శాసన సభ్యులతో, మధ్యాహ్నం శాసన మండలి సభ్యులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..⇒ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోరుతూ కోర్టులో పిటిషన్ వేశాం. కానీ స్పీకర్ కోర్టు ఆదేశాలకు సమాధానం ఇవ్వలేదు. కోర్టు నుంచి వచ్చిన సమన్లు కూడా స్పీకర్ తీసుకోలేదు. అసెంబ్లీలో ఉన్న ఏకైక ప్రతిపక్షం మనమే. మనం మినహా మరో ప్రతిపక్షం లేదు. అయినా కూడా వారు మనల్ని ప్రతిపక్ష పార్టీగా గుర్తించడం లేదు. ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. అలా గుర్తిస్తే... ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడ్డానికి అవకాశాలు ఇవ్వాల్సి వస్తుందనే భయంతోనే వారు ముందుకు రావడం లేదు. ⇒ సభా నాయకుడికి మాట్లాడటానికి ఎంత సమయం ఇస్తారో.. ఆ తర్వాత అంతే హక్కుగా ప్రతిపక్ష నాయకుడికి కూడా సమయం ఇవ్వాల్సి వస్తుందేమోనని, ఇవ్వక తప్పని పరిస్థితులు వస్తాయనే విషయాన్ని జీర్ణించుకోలేక ప్రతిపక్ష నాయకుడిగా అంగీకరించడం లేదు. 40 శాతం ఓట్ షేర్ సాధించిన పార్టీని ప్రతిపక్షపార్టీగా గుర్తించడానికి ఇష్టపడని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ⇒ హైకోర్టులో మనం వేసిన పిటిషన్‌పై కౌంటర్ వేయడానికి కూడా స్పీకర్ సుముఖంగా లేరు. అందుకే మన ఎమ్మెల్యేలు తమ గళాన్ని మీడియా వేదికగా ప్రజలకు వినిపించాలి.⇒ ప్రతి రోజూ మన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు మీడియా ద్వారా మాట్లాడతారు. ప్రజా సమస్యలపై, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తారు. ⇒ అసెంబ్లీలో ఏ మాదిరిగా ప్రశ్నలు వేస్తామో, అదే రీతిలో ఇక్కడ నుంచి అధికార పక్షాన్ని ప్రశ్నిస్తాం. పూర్తి వివరాలు, ఆధారాలు, సాక్ష్యాలతో ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఈ వివరాలన్నింటినీ శాసన మండలి సభ్యులు ప్రతి ఒక్కరికీ పంపిస్తాం. వాటి ఆధారంగా ప్రభుత్వాన్ని నిలదీయాలి.. ప్రశ్నించాలి. ⇒ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీనిపై ప్రశ్నిస్తే బుల్డోజ్ చేస్తూ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ⇒ అప్పుల విషయంలో ఎన్నికలకు ముందు వాళ్లు చేసిన ప్రచారం పచ్చి అబద్ధమని వాళ్లే తాజాగా బడ్జెట్ పత్రాల ద్వారా చాటి చెప్పారు. అప్పుల సంఖ్యల్లోనూ అన్నీ అబద్ధాలే. వాళ్లే అసెంబ్లీకి బడ్జెట్ పత్రాలు విడుదల చేశారు. అందులోని వాస్తవాలతో ఇప్పటివరకూ వారు చెప్పినవి అబద్ధాలేనని తేలిపోయింది. పాలక పక్షానికి చెందినవారు అడ్డంగా దొరికిపోయారు. దీనిపై రాష్ట్ర ప్రజలకు సమగ్ర వివరాలను ప్రెస్ మీట్ ద్వారా నేనే వివరిస్తా. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనని, చేసేవన్నీ మోసాలేనని ఇప్పటికే తేలిపోయింది. ఈ ఆరు నెలల కాలంలో చంద్రబాబు నైజాన్ని ప్రజలు మరోసారి గుర్తించారు. ⇒ అందరికీ ఒకటే చెబుతున్నా... ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు. కష్టాలు అనేవి శాశ్వతం కాదు. వ్యక్తిత్వాన్ని, విలువలను నిలబెట్టుకుంటూ ముందుకు సాగుదాం. కచ్చితంగా మనం తిరిగి అధికారంలోకి వస్తాం. జమిలి ఎన్నికలు లాంటి వార్తలు కూడా వింటున్నాం. ⇒ వైఎస్సార్సీపీ సైనికులుగా మండలిలో ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టాలి. గట్టిగా పోరాటం చేయండి. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపాలి. ప్రశ్నిస్తే కేసులు పెడతారన్న ఆందోళన అనవసరం. నేను మీకు అండగా ఉంటా. ⇒ నా వయసు చిన్నదే. మరో 30 ఏళ్లు రాజకీయాలను చూస్తా. మనం అందరం కలసి రాజకీయాలలో సుదీర్ఘకాలం ప్రయాణం చేస్తాం. ఎప్పుడూ లేని విధంగా మనం సోషల్ ఇంజనీరింగ్ చేశాం. ఎక్కడాలేని మార్పులు తీసుకువచ్చాం. కాలక్రమేణా మనం చేసిన పనుల ప్రాధాన్యతను ప్రజలు తప్పకుండా గుర్తిస్తారు. -
ప్రశ్నిస్తామన్న భయంతో ప్రతిపక్షహోదా ఇవ్వలేదు: వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్సీలతో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సోమవారం(నవంబర్ 11) తాడేపల్లిలో భేటీ అయ్యారు. ఎమ్మెల్సీలు శాసనమండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో చర్చించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఎమ్మెల్సీలను ఉద్దేశించి మాట్లాడారు.ప్రశ్నిస్తామన్న భయంతోనే వైఎస్సార్సీపీకి అసెంబ్లీలో ప్రతిపక్షహోదా ఇవ్వలేదన్నారు. అయినా మీడియా ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీలు ప్రభుత్వ విధానాలపై మండలి నుంచి నిలదీయాలని ఎమ్మెల్సీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు.ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ ఏమన్నారంటే..అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోరుతూ కోర్టులో పిటిషన్ వేశాం.కాని కౌంటర్‌కు స్పీకర్ సమాధానం ఇవ్వడంలేదు.అసెంబ్లీలో ఉన్న ఏకైక ప్రతిపక్షం మనమే.కాని ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ముందుకు రావడంలేదు: ప్రతిపక్ష హోదాను అంగీకరిస్తే, మాట్లాడడానికి అవకాశాలు ఇవ్వాల్సి వస్తుందని అధికారపక్షం అంగీకరించడంలేదు.ప్రతిపక్ష నాయకుడుకి హక్కుగా మైక్, సమయం లభిస్తుంది.అలా ఇవ్వాల్సి వస్తుందని, ప్రతిపక్ష పార్టీ ఒకటి ఉందని గుర్తించడానికి కూడా ముందుకు రావడంలేదు.40శాతం ఓట్ షేర్ సాధించిన పార్టీని ప్రతిపక్ష పార్టీగా గుర్తించడానికి ఇష్టపడని పరిస్థితులు కనిపిస్తున్నాయి.అందుకే ప్రతిరోజూ మీడియా ద్వారా ఎమ్మెల్యేలు,సీనియర్ నాయకులు మాట్లాడతారు.అసెంబ్లీలో ఏ మాదిరిగా ప్రశ్నలు వేస్తామో, అదేరీతిలో ఇక్కడ నుంచి అధికార పక్షాన్ని ప్రశ్నిస్తాం.పూర్తి వివరాలు ఆధారాలు, సాక్ష్యాలతో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం.ఇవన్నీకూడా ప్రతి మండలి సభ్యుడికీ పంపిస్తాం.ఆధారాలు చూపిస్తూ..ప్రభుత్వాన్ని నిలదీయండి..ప్రశ్నించండి.మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదు.ప్రశ్నిస్తే..బుల్డోజ్ చేయాలని చూస్తున్నారు.అప్పుల విషయంలో ఎన్నికలకు ముందు వాళ్లు చేసిన ప్రచారం పచ్చి అబద్ధమని వాళ్లే బడ్జెట్ పత్రాల ద్వారా చెప్పారు.దీనిపై రాష్ట్ర ప్రజలకు సమగ్రవివరాలను ప్రెస్మీట్ద్వారా నేను వివరిస్తాను.చంద్రబాబు చెప్పేవన్నీ మోసం అని, అబద్ధం అని ఇప్పటికే తేలిపోయింది.ఈ ఆరునెలల కాలంలోనే చంద్రబాబు నైజాన్ని ప్రజలు గుర్తించారు.ఎవ్వరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు.కష్టాలు అనేవి శాశ్వతం కాదు .వ్యక్తిత్వాన్ని, విలువలను నిలబెట్టుకుంటూ ముందుకు సాగుదాం.కచ్చితంగా తిరిగి మనం అధికారంలోకి వస్తాం.జమిలి ఎన్నికలు లాంటి వార్తలు కూడా వింటున్నాం.వైఎస్సార్సీపీ సైనికులుగా మండలిలో ప్రభుత్వాన్ని ఎండగట్టాలి.ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపాలి.గట్టిగా ప్రశ్నిస్తే..కేసులు పెడతారన్న భయాందోళనలు అనవసరం.నేను మీకు అండగా ఉంటాను.నా వయసు చిన్నదే.మరో 30 ఏళ్లు రాజకీయాలను చూస్తాను.మనం అందరం కలిసి ప్రయాణం చేద్దాం.ఎప్పుడూ లేని విధంగా మనం సోషల్ ఇంజినీరింగ్ చేశాం.ఎక్కడాలేని మార్పులు తీసుకు వచ్చాం.కాలక్రమేణా మనం చేసిన పనుల ప్రాధాన్యతను తప్పకుండా గుర్తిస్తారు. ఇదీ చదవండి: ఎమ్మెల్యేలతో వైఎస్ జగన్ భేటీ -
ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యులుగా నామినేట్ అయిన ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయించారు. మండలి చైర్మన్ చాంబర్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.ఎమ్మెల్సీలు మహేశ్‌కుమార్‌గౌడ్, ఎం.ఎస్.ప్రభాకర్‌రావు, శాసనసభలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతోపాటు అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ నర్సింహాచార్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. నూతన ఎమ్మెల్సీలను మండలి చైర్మన్ గుత్తా అభినందించడంతోపాటు వారికి గుర్తింపు పత్రం, మండలి నియమావళిని అందజేశారు. అనంతరం మండలి చైర్మన్, మంత్రులతో కలసి కోదండరాం, అమీర్ అలీఖాన్ గ్రూప్ ఫొటో దిగారు. ఈ ఇద్దరు ఎమ్మెల్సీల నియామకంపై ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తాజాగా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. -
ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇరువురి చేత మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణం చేయించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, విప్ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ హాజరయ్యారు.పెద్దల సభకు ఉద్యమ సారథికోదండరాం సార్‌గా సుపరిచితుడైన ముద్దసాని కోదండరాం స్వగ్రామం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నెన్నెల మండలం జోగాపూర్. 1955 సెప్టెంబర్ 5న ముద్దసాని వెంకటమ్మ, ఎం.జనార్దన్ రెడ్డి దంపతులకు జన్మించారు. హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో డిగ్రీ , ఓయూలో పీజీ (పొలిటికల్ సైన్స్), జేఎన్‌యూలో ఎంఫిల్ పూర్తి చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ కోసం చేరగా.. 1981లో ఉస్మానియా విశ్వ విద్యాలయంలో ఉద్యోగం రావడంతో పీహెచ్డీ మధ్యలో ఆపేశారు. ఆదివాసీల సమస్యలపై దివంగత హక్కుల నేత బాలగోపాల్, ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్‌రావుతో కలిసి పని చేశారు.ఓయూలో ప్రొఫెసర్‌గా సుదీర్ఘ కాలం పనిచేసిన కోదండరాం..దివంగత ప్రొఫెసర్ జయశంకర్, ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సహా అనేక మంది ప్రముఖ తెలంగాణవాదులతోనూ కలిసి పనిచేశారు. ఉద్యమ సమయంలో రాజకీయ జేఏసీ చైర్మన్‌గా అన్ని పార్టీలను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏకం చేయడంలో క్రియాశీలంగా పని చేశారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇప్పటి బీఆర్ఎస్ విధానాలతో విభేదించారు. ప్రజాస్వామిక తెలంగాణ పేరిట 2018 మార్చి 31వ తేదీన తెలంగాణ జన సమితిని ఏర్పాటు చేశారు. ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీజేఎస్ కాంగ్రెస్‌తో కలిసి పని చేసింది. అదే క్రమంలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌తో జత కట్టారు. దీనితో పాటు ఉద్యమ నేపథ్యం, ప్రొఫెసర్‌గా ఆయన అందించిన సేవలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. జర్నలిజంలో విశేష కృషి జర్నలిజంలో విశేష సేవలందించిన ఆమేర్ అలీఖాన్ (సియాసత్ ఉర్దూ దినపత్రిక రెసిడెంట్ ఎడిటర్ జాహెద్ అలీఖాన్ కుమారుడు) ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీసీఏ, తరువాత సుల్తాన్–ఉల్–ఉలూమ్ కాలేజీ ఆఫ్ బిజినెస్ అడ్మిని్రస్టేషన్ నుంచి ఎంబీఏ చేశారు. ప్రస్తుతం సియాసత్‌లో న్యూస్ ఎడిటర్‌గా ఉన్న ఆయన..ప్రతిక కర్ణాటక రాష్ట్రానికి విస్తరించేందుకు విశేష కృషి చేశారు. పలు అంతర్జాతీయ ఈవెంట్లను కవర్ చేయడానికి ప్రధానమంత్రి, రాష్ట్రపతిల వెంట విదేశీ పర్యటనలకు వెళ్లారు.మైనారిటీల్లో విద్య, నైపుణ్యాన్ని వృద్ధి చేయడానికి, నిరుద్యోగుల కోసం కోచింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఉచితంగా శిక్షణ ఇప్పించేవారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సియాసత్ ప్రస్తుతం ఖతర్ దేశానికి కూడా విస్తరించింది. 1973 అక్టోబర్ 18న హైదరాబాద్‌లో జన్మించిన అమేర్ అలీ ఖాన్‌కు ఉర్దూతో పాటు ఇంగ్లి‹Ù, హిందీ, అరబిక్, తెలుగు భాషలు తెలుసు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రాథమిక విద్యను అభ్యసించారు. -
TG: గవర్నర్‌కోటా ఎమ్మెల్సీల నియామకానికి సుప్రీం గ్రీన్‌సిగ్నల్
సాక్షి,న్యూఢిల్లీ: గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు బుధవారం(ఆగస్టు14) స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు స్టే అమల్లో ఉంటుందని జస్టిస్ విక్రమ్‌నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. తమ నియామకాన్ని పక్కన పెట్టి కొత్తగా ఎమ్మెల్సీలను గవర్నర్ కోటాలో ఎంపిక చేయడాన్ని సవాలు చేస్తూ బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. కొత్తగా ఎమ్మెల్సీలను నియమించకుండా స్టే విధించాలని పిటిషనర్లు కోరగా బెంచ్ నిరాకరించింది. కొత్త ఎమ్మెల్సీల నియామకాన్ని అడ్డుకుంటే గవర్నర్, ప్రభుత్వ హక్కులు హరించినట్లు అవుతుందని వ్యాఖ్యానించింది. ఎప్పటికప్పుడు నియామకాలు చేపట్టడం ప్రభుత్వ విధి అని పేర్కొంది. అనంతరం పిటిషన్‌పై విచారణను ధర్మాసనం నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. టీజేఎస్ అధినేత కోదండరాం, జర్నలిస్టు అమిర్ అలీఖాన్ పేర్లను తెలంగాణ కేబినెట్ తాజాగా గవర్నర్‌కోటా ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ గవర్నర్‌కు సిఫారసు చేసిన విషయం తెలిసిందే. -
కాళేశ్వరానికి బీఆర్ఎస్ బృందం.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి,కరీంనగర్ జిల్లా: కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పరిశీలించారు. గురువారం సాయంత్రం కరీంనగర్‌లోని మానేరు డ్యాం పరిశీలించారు. రేపు(శుక్రవారం) కన్నెపల్లి పంప్ హౌజ్, మేడిగడ్డ ప్రాజెక్ట్‌ను సందర్శించనున్నారు. డ్యాం పరిశీలించిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. సాగునీటి రంగంలో కొత్త విప్లవం తెచ్చిన వ్యక్తి కేసీఆర్ అని.. బీడు భూములు సాగులోకి తెచ్చారని.. దేశాన్ని తలదన్నే రీతిలో ధాన్య భాండాగారంగా తెలంగాణ మారింది. వరిసాగులో పంజాబ్, హర్యానాను తెలంగాణ వెనక్కు నెట్టిందన్నారు.‘‘45 శాతం తక్కువ వర్షపాతం ఈ సంవత్సరం నమోదైంది. లక్షల క్యూసెక్కుల నీరు వృథాగా పోతుంది. పంపింగ్ చేయాల్సి ఉన్నా చేయడం లేదు. అధికారులు పదే పదే చెప్తున్నారు అన్ని డ్యామ్‌లను పంపింగ్ చేసి నింపాలని. కాళేశ్వరం నీటిని పరివాహక ప్రాంతంలో పంపింగ్ చేయాలని అన్ని రిజర్వాయర్లను నింపాలని వాస్తవాలను ప్రజలకు చెప్పే ఉద్దేశంతో మా బృందం బయల్దేరాం. లక్షల కోట్లు వృధా అయ్యాయని.. మా పార్టీని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు సీఎం రేవంత్. మేడిగడ్డ మేడిపండు అయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.’’ అని కేటీఆర్ మండిపడ్డారు.‘‘10 లక్షల క్యూసెక్కుల నీటి వరదను తట్టుకుని బ్రహ్మాండంగా మేడిగడ్డ నిలబడి ఉంది. ఎన్నికలు అయిపోయాయి.. సీఎం రాజకీయాలు పక్కనపెట్టి నీటిని అన్ని డ్యామ్‌లకు పంపింగ్ చేయడానికి చర్యలు తీసుకోవాలి. రేపు మేడిగడ్డ, కన్నెపల్లి సందర్శిస్తాం’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. -
weekly roundup: కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ సక్సెస్.. బీఆర్ఎస్లో గుబులు!
బీఆర్ఎస్ పార్టీకి గ్రహణం పట్టుకున్నట్లైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలై అధికారాన్ని చేజార్చుకుంటే.. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సింగిల్ సీటు గెలవకుండా పట్టుకోల్పోయింది. మరోవైపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కారు దిగుతూ హస్తం పార్టీకి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. పార్టీ నేతలు అధికార పార్టీలోకి జంప్ చేయడం తలనొప్పిగా మారింది. మరోవైపు పార్టీని ఖాళీ చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఫిరయింపులను ముమ్మరం చేసుకుంటూ వెళ్తోంది. ఫిరాయింపులను తీవ్రంగా వ్యతిరేకించిన పార్టీనే.. ప్రోత్సహించడంపై రాజకీయ విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు, సీనియర్ నేత కే. కేశవరావు కాంగ్రెస్ గూటికి చేరారు. బుధవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆయనకు కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు.బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ప్రజాప్రతినిధుల వలసల పర్వం కొనసాగుతోంది. ఇప్పటివరకు ఎమ్మెల్యేలు మాత్రమే కాంగ్రెసులో చేరగా, రాజ్య సభ సభ్యుడు కేకే పార్టీలో చేరిన మరుసటి రోజే ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం అర్ధరాత్రి ఢిల్లీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి హైదరబాద్ చేరుకున్న తర్వాత జూబ్లీహిల్స్ లోని తన క్యాంపు కార్యాలయంలో వారిని కాంగ్రస్ లోకి చేర్చుకున్నారు.కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీల్లో బస్వరాజు సారయ్య, భాను ప్రసాద్ రావు, ప్రభాకర్ రావు, దండే విఠల్ , బొగ్గారపు దయానంద్, యెగ్గె మల్లేశం ఉన్నారు.తెలంగాణ శాసన మండలిలో సంఖ్యాపరంగా మైనార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వలసలను ప్రోత్సహించడం ద్వారా పట్టుబింగించేదుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే మండలిలో సుమారు నాలుగింట మూడొంతుల ఎమ్మెల్సీల బలం ఉన్న బీఆర్ఎస్ పై కాంగ్రెస్ దృష్టి కేంద్రీకరించింది.ఈ క్రమంలో గురువారం ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకోగా.. మండలిలో ఆ పార్టీ బలం 12 స్థానాలకు చేరింది. అయినా కీలకమైన బిల్లులు , తీర్మానాలను అవసరమైన సంఖ్యా బలం కాంగ్రెస్ కు లేదు.కీలకమైన ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందితే తప్ప నిధులు వ్యయం చేయడానికి వీలులేదు. ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయన్న ఉద్దేశంతోనే బీ ఆర్ ఎస్ నుంచి ఎమ్మెల్సీలను చేర్చుకునే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ముమ్మరం చేస్తోంది. రానున్న కాలంలో మరికొంత మంది ఎమ్మెల్సీలను చేర్చుకునే కార్యక్రమాన్ని ప్రయత్నాలు కొనసాగిస్తోందని తెలుస్తోంది. మరోవైపు మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ స్థానాల బలం 29 నుంచి 21 కి పడిపోయింది.దీనికంటే ముందు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి(రంగారెడ్డి), కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన విషయం తెల్సిందే. దీంతో మొత్తం 40 స్థానాలు ఉన్న మండలిలో బీఆర్ఎస్ కు 21, కాంగ్రెస్ కు చేరినవారితో కలుపుకొని 12 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు.మరోవైపు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇక ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి గతంలో బీఆర్ఎస్ సన్నిహితంగా కొనసాగినా.. ప్రస్తుతం ఆయన కూడా దూరం పాటిస్తున్నారు.కాగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాప్రతినిధులను పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించినప్పుడు తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేసినా కాంగ్రెస్ పార్టీ నాయకులే ఇప్పుడు ఫిరాయింపులను ప్రోత్సహించటంపై రాజకీయ విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.ఇక తెలంగాణ భవన్లో మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్ నగర కార్పొరేటర్లు, ఎమ్మెల్యే సమావేశానికి కార్పొరేటర్లు మినహా ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడం బీఆర్ఎస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మాధవరం కృష్ణా రావు, అరికేపూడి గాంధీ. కాలేరు వెంకటేష్,కేపీ వివేకానంద, మర్రి రాజశేఖర్ రెడ్డి, ఉప్పల్ లక్ష్మా రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి హాజరుకాలేదు. దీంతో వీరు పార్టీ మరుతున్నారా? అనే చర్చ కూడా మొదలైంది.మరోవైపు కొన్ని రోజులుగా పార్టీ మారనున్నారని ప్రచారం జరిగిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.మరో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. కాగా మరో 19 మంది కాంగ్రెస్ లో చేరితే.. బీఆర్ఎస్ఎల్పీని హస్తం పార్టీలో విలీనం చేయడానికి అర్హత సాధించినట్టు అవుతుంది.తెలంగాణలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమం విజయంతంగా కొనసాగుతోంది. మొత్తం బీఆర్ఎస్ గెలిచిన 38 సీట్లలో బండ్ల కృష్ణ మోహన్‌తో సహా ఏడుగురు కాంగ్రెస్‌లో చేరారు. దీంతో బీఆర్ఎస్ బలం 31కి పడిపోయింది. పార్టీ మారటం లేదు..తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, కార్యకర్తలు అయోమయానికి గురి కావొద్దని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ స్పష్టం చేశారు.మరోవైపు గతంలో మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పార్టీ మారుతున్నారని ప్రచారం జరిగింది. అయితే ఆమె కుమారుడు, బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. తాను, తన తల్లి సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్లోనే కొనసాగుతామని కార్తీక్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ము ఉంటే కాంగ్రెసులో చేర్చుకున్న ఆరుగురు ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి మళ్లీ గెలించుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల సవాల్ విసిరారు.బీఆర్ఎస్ జడ్పీ చైర్మన్ల ఆత్మీయ సమావేశంలో ఫిరాయింపుదారులపై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడారు. '' పార్టీ నాయకులను సృష్టిస్తుంది.. నాయకులు పార్టీని సృష్టించరు. భవిష్యత్తులో సమర్థవంతమైన యువ నాయకత్వాన్ని తయారు చేస్తాం. అత్యున్నత పదవులు అనుభవించి పార్టీ మారాతున్నవారిని ప్రజలు అసహ్యించుకుంటున్నారు'' అని కేసీర్ అన్నారు. -
కాంగ్రెస్‌లోకి ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ప్రజాప్రతినిధుల వలసల పర్వం కొనసాగుతోంది. ఇప్పటివరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రమే కాంగ్రెస్‌లో చేరగా, రాజ్యసభ సభ్యుడు కేకే పార్టీలో చేరిన మరుసటి రోజే ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం అర్ధరాత్రి ఢిల్లీ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్ చేరుకున్న తర్వాత జూబ్లీహిల్స్‌లోని తన క్యాంపు కార్యాలయంలో వారిని కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు. కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీల్లో బస్వరాజు సారయ్య, భానుప్రసాదరావు, ప్రభాకర్‌రావు, దండె విఠల్, బొగ్గారపు దయానంద్, యెగ్గె మల్లేశం ఉన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డిల సమక్షంలో సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వాస్తవానికి అసెంబ్లీ, బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్సీల చేరికపై గత నెలలోనే చర్చలు జరిగాయి. వీరంతా వారం రోజుల ముందే పార్టీలో చేరాల్సి ఉన్నా, అనివార్య కారణాల వల్ల సాధ్యం కాలేదు. ఒకవైపు ఈ నెలలోనే బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండడం, మరోవైపు ఆషాఢమాసం రానుండడంతో ఆషాఢ అమావాస్యకు ముందురోజు రాత్రి వీరంతా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరి చేరికతో మండలిలో కాంగ్రెస్ బలం 12కు చేరనుంది. కాగా, సీఎం నివాసానికి చేరుకోవడానికి ముందు ఆరుగురు ఎమ్మెల్సీలు దస్పల్లా హోటల్లో సమావేశమయ్యారు. అక్కడి నుంచి నేరుగా సీఎం నివాసానికి చేరుకున్నారు. -
99 శాతం వాగ్దానాలు అమలు చేశాం...వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్..
-
టీడీపీ-జనసేన హనీమూన్ నడుస్తోంది.. కొంతటైమిచ్చి పోరాడుదాం: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: ఎవరెన్ని కుట్రలు చేసినా.. వైఎస్సార్సీపీ పాలనలో జరిగిన మంచి ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గురువారం ఉదయం తన కార్యాలయంలో ఎమ్మెల్సీలతో ఆయన భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్.. ‘‘40 శాతం ప్రజలు మన వైపే ఉన్నారు అనేది మరిచిపోవద్దు. మనం చేసిన మంచి ఇప్పటికీ ప్రజలకు గుర్తు వుంది. ఎన్నికలు ఫలితాలు శకుని పాచికలు మాదిరిగా ఉన్నాయి. ఈవీఎంల వ్యవహారాలు పై దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. ప్రస్తుతం టీడీపీ,బీజేపీ, జనసేనల హనీ మూన్ నడుస్తోంది. మరి కొంత సమయం వారికి ఇద్దాం. శిశుపాలుడు మాదిరిగా చంద్రబాబు తప్పులను లెక్కించాలి. ఆ తర్వాత గట్టిగా పోరాటం చేద్దాం.. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే ఆయన మాటల్లోనే..జరిగిన పరిస్థితులన్నీ మీకు తెలుసు. ఈ ఫలితాలు చూసి మీరు నిబ్బరాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు. గడచిన ఐదేళ్ల కాలంలో గత చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఏకంగా 99శాతం వాగ్దానాలు అమలు చేశాం. ఏపీ చరిత్రలో కాని, దేశంలోకాని ఎప్పుడూ ఇలా జరగలేదు. మేనిఫెస్టోను బైబిల్లా, ఖురాన్‌లా, భగవద్గీతలా ఒక పవిత్రగ్రంధంలా భావించి అమలు చేశాం. మేనిఫెస్టోను చూపించి… ప్రతి అక్కచెల్లెమ్మల ఆశీస్సులు తీసుకుంటూ… ఇది అమలు జరిగిందా? లేదా? అని అడిగి మరీ టిక్ పెట్టించాం. ఏ రోజూ ఈ మాదిరిగా చేసిన పరిస్థితులు లేవు. చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు.రూ.2.7 లక్షల కోట్లు ఎలాంటి లంచాలు, వివక్షా లేకుండా అందించాం. ఏ నెలలో ఏమిస్తామో… ప్రతి సంవత్సరం కాలెండర్ విడుదలచేసి, ఆమేరకు మాట తప్పకుండా పథకాలు అమలు చేశాం. ఇవన్నీ కూడా ఎప్పుడూ కూడా చూడని మార్పులు. గతంలో ఎప్పుడూ చూడని సంస్కరణలు అమలు చేశాం. విద్య, వైద్యం, వ్యవసాయం, సామాజిక న్యాయం, మహిళాసాధికారిత, సుపరిపాలన విషయంలో ఎప్పుడూ జరగని, చూడని సంస్కరణలు తీసుకు వచ్చాం. ఇవన్నీ మనం చేసి, చూపించి… ప్రజల మన్ననలను పొందిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాం. కాని, ఎన్నికల్లో ఏమైందో తెలియదు.2019 నుంచి 2024 వరకు ఐదేళ్లు ఇట్టే గడిచిపోయాయి. అదే మాదిరిగా మళ్లీ 2024 నుంచి 2029 వరకు కూడా ఇదేళ్లు ఇట్టే గడుస్తాయి. మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే.. సినిమాలో ప్రస్తుతం ఫస్టాఫ్ మాత్రమే అయ్యింది. గతంలో ఇదే మాదిరిగా పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మనం ఏమాదిరిగా పైకి లేచామో అన్నది మీ అందరికీ తెలిసిందే. ప్రజల్లో మనం చేసిన మంచి ఇవాళ ఉంది. ఇంటింటికీ మనంచేసిన మంచి బ్రతికే ఉంది. మనంచేసిన పాలనమీద విశ్వసనీయత ప్రజల్లో ఇప్పటికీ ఉంది. మనపట్ల విశ్వసనీయత ఇంకా బతికే ఉంది. గడపగడపకూ మనంచేసిన మంచి ఇంకా బతికే ఉంది. ఇవన్నీ ఉన్నప్పుడు మళ్లీ మనం పైకి లేవడం అన్నది కూడా తథ్యం. కాకపోతే కొంత సమయం పడుతుంది. ఆ సమయం మనం ఇవ్వాలి. ఆ టైం ఇచ్చినప్పుడు, వాళ్ల పాపాలు పండినప్పుడు కచ్చితంగా మనం పైకి లేస్తాం. ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి.రాజకీయాల్లో అన్నికంటే ముఖ్యమైన అంశం క్యారెక్టర్. విలువలు, విశ్వసనీయత. ఈ పదాలకు అర్థం తెలుసుకోవడం చాలా అవసరం. రాజకీయాలంటే అధికారం మాత్రమే కాదు. అధికారంలో లేనప్పుడు కూడా ఒక మనిషి ఎలా ప్రవర్తిస్తాడు, ఎలా ఉంటాడు అన్నదికూడా రాజకీయమే. అధికారంలో లేనప్పుడు కచ్చితంగా కష్టాలు వస్తాయి. కానీ, ఆ కష్టాలు వచ్చినప్పుడు ఎలా స్పందిస్తామన్నది మన చేతుల్లో ఉంది. కష్టాలు వచ్చినప్పుడు విలువలు, విశ్వసనీయతలేని మనిషిగా రాజకీయాలు చేద్దామా? లేక ఆ కష్టాలను ఎదుర్కొంటూ, హుందాగా నిలబడుతూ.. ముందడుగులు వేసి కష్టపడితే.. మళ్లీ అధికారంలోకి వస్తామా? అన్నది ఆలోచన చేయాలి.అసెంబ్లీలో మన సంఖ్యా బలం పెద్దగాలేదు. ఆ సభలో మనకు గొంతు విప్పే అవకాశం మనకు రాకపోవచ్చు. గొంతు విప్పనివ్వకపోవచ్చు. కాని మండలిలో మనకు బలం ఉంది. దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. మనల్ని ఎవ్వరూ ఏం చేయలేరు. మహా అయితే నాలుగు కేసులు పెట్టుగలుగుతారు. అంతకు మించి వాళ్లు ఏంచేయగలుగుతారు? చంద్రబాబు నాయుడు హయాంలో చాలా త్వరగా పాపాలు పండుతాయి. మన కళ్లముందే చంద్రబాబుగారి పాపాలు ఎలా పండుతాయో గతంలో మనం అంతా చూశాం.మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడలేదు. చివరికి ఏ పార్టీకి ఎవరు ఓటు వేశారు అన్నది చూడకుండా.. ప్రతి పథకాన్ని డోర్ డెలివరీ చేశాం. అర్హత మాత్రమే ప్రమాణికంగా తీసుకుని.. ప్రతి పథకం ప్రతి ఇంటికే అందించాం. అలాంటి పాలన మనదైతే.. ఈ రోజు కేవలం వాళ్ల పార్టీకి ఓటువేయకపోవడమే పాపం అన్నట్టుగా… రావణకాష్టం సృష్టిస్తున్నారు. విధ్వంసం చేస్తున్నారు. ఆస్తులకు నష్టంచేస్తున్నారు. దాడులు చేస్తున్నారు. అవమానిస్తున్నారు. అమానుషంగా దాడులకు పాల్పడుతున్నారు. ఇవన్నీకూడా శిశుపాలుడి పాపాల మాదిరిగా మొదలయ్యాయి.ఇంకోవైపు మనం మనకు ఓటు వేయకపోయినా వివక్ష చూపకుండా పథకాలకు ప్రతి ఇంటికీ డోలివరీ చేశాం. ఇప్పుడు వారు చేసిన పాపాలు ఊరికే పోవు. చంద్రబాబు రెండో పాపంకూడా అప్పుడే పండింది. కేంద్రంలో ఇప్పుడు నెలకొన్న రాజకీయ పరిస్థితులు ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేవు. కేంద్రంలో 240 సీట్లకు అధికారపార్టీ పరిమితం కావడం, మరోవైపు రాష్ట్రంలో టీడీపీకి మంచి సంఖ్యరావడం, ఎన్టీయేలో కీలకంగా ఉన్న పరిస్ధితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేకహోదాను అడగకపోవడం చంద్రబాబు చేసిన మరో పాపం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదాను అడక్కపోతే… రాష్ట్రంలో ఏ ఒక్క యువకుడు కూడా క్షమించడు.మనం అధికారంలో ఉండి ఉంటే క్యాలెండర్ ప్రకారం అమ్మఒడి, రైతుభరోసా, విద్యాదీవెన, వసతిదీవెన, మత్స్యకారభరోసా వంటి పథకాలు ఇప్పటికే అమల్లో ఉండేవి. ఇవి ఇప్పుడు వస్తాయో, రావో తెలియని పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో ఈ పాపాలు పండుతాయి.ఈ పాపాలన్నీ పండేదాకా.. మన ఆత్మస్థైర్యాన్ని కోల్పోకూడదు. మనం గట్టిగా నిలబడి, ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లగలిగేలా ప్రజల్లో నిరంతరం ఉండాలి. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. కేవలం గుర్తు మాత్రమే చేస్తున్నాను. కష్టాలు రావడం సర్వ సహజం. ఎదుర్కొని నిలబడ్డం అన్నది మన చేతుల్లో అంశం.అసెంబ్లీలో మనకున్న బలం ప్రకారం ప్రతిపక్ష హోదా ఇస్తారా? లేదా? అన్నది సందేహమే. ఓటు వేయలేదన్న ఒకే ఒక్క కారణంతో… మనుషులు మీద దాడులు చేస్తున్న సమయంలో, ఆస్తులు నష్టంచేస్తున్నపరిస్థితుల్లో,అవమానిస్తున్న సమయంలో… ఉన్న ఒకే ఒక్క పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చేట్టుగా నైతిక విలువలు పాటిస్తారా? లేదా? అన్నది సందేహమే.హనీమూన్ పీరియడ్ ముగిసేవరకూ వారికి టైం ఇద్దాం. దాడులకు గురైన కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపే కార్యక్రమం చేద్దాం. రాబోయే రోజుల్లో ఇంకా టైం గడిచే కొద్దీ ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలు ముమ్మరం అవుతాయి. ప్రజల్లోనే ఉంటాం.. ప్రజలతో కలిసి పోరాడే కార్యక్రమాలు రానున్న రోజుల్లో చేపడదాం. ఏకంగా 14 నెలలు పాదయాత్ర చేశాను. ఆ వయసు ఇవ్వాళ్టికీ నాకు ఉంది. ఆ సత్తువ నాకు ఈ రోజుకీ ఉంది. ఆ సమయం వచ్చేదాకా ఎమ్మెల్సీలుగా మీ పాత్ర మీరు పోషించాలి.జగన్ రాష్ట్ర పర్యటనత్వరలో వైఎస్ జగన్ రాష్ట్రవ్యాప్త పర్యటన ఉంటుందని నిన్నటి నుంచి ప్రచారం నడుస్తోంది. అయితే తాజాగా ఎమ్మెల్సీల భేటీలో ఆయన ఆ విషయాన్ని ధృవీకరించారు. టీడీపీ శ్రేణుల దాడుల్లో గాయపడ్డ వాళ్లను ఆయన పరామర్శిస్తారని తెలుస్తోంది. -
ఎమ్మెల్సీలుగా నితీశ్, రబ్డీ దేవి ఏకగ్రీవం
పట్నా: బిహార్ శాసనమండలి సభ్యులుగా సీఎం నితీశ్ కుమార్, మాజీ సీఎం రబ్డీ దేవి సహా 10 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆర్జేడీకి చెందిన రబ్డీ దేవి శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. కేబినెట్ మంత్రి సంతోష్ సుమన్ కూడా మండలికి ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో ఉన్నారు. జేడీయూ చీఫ్ కూడా అయిన నితీశ్ కుమార్ గురువారం పార్టీ నాయకులతో శాసనమండలి సెక్రటేరియట్‌కు చేరుకుని ఎన్నిక ధ్రువీకరణ పత్రం అందుకున్నారు. -
ఏపీలో ఫిరాయింపు ఎమ్మెల్సీలపై వేటు
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలపై వేటు పడింది. ఎమ్మెల్సీలు వంశీ కృష్ణయాదవ్, సి. రామచంద్రయ్యలపై వేటు వేస్తున్నట్లు ప్రకటించారు శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు. ఈ ఇద్దరు వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్సీలుగా ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే వంశీకృష్ణ జనసేనలోకి, సి.రామచంద్రయ్య టీడీపీలోకి పార్టీ మారారు. దీంతో పార్టీ ఫిరాయింపుల కింద చర్యలు తీసుకోవాలంటూ మండలి కార్యదర్శికి వైఎస్సార్సీపీ నేత, మండలిలో చీఫ్ విప్ మేరిగ మురళీధర్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిలు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలంటూ.. మండలి చైర్మన్ మోషేన్ రాజు ఆ ఇద్దరికి నోటీసులు పంపించారు. నోటీసుల ఆధారంగా వాళ్లిద్దరి నుంచి వివరణ సైతం తీసుకున్నారు మండలి చైర్మన్. ఈ క్రమంలో.. ఇప్పుడు సమగ్ర విచారణ అనంతరమే ఈ ఇద్దరిపై వేటు వేసినట్లు మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రకటించారు. -
ఎమ్మెల్సీలపై మళ్లీ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్‌కుమార్, కుర్ర సత్యనారాయణలను నియమించాలంటూ రాష్ట్ర కేబినెట్ చేసిన సిఫార్సు లపై గవర్నర్ వ్యవహరించిన తీరు సరికాదని రాష్ట్ర హైకోర్టు పేర్కొంది. సదరు సిఫార్సులను తిరస్క రిస్తూ 2023 సెప్టెంబర్ 19న గవర్నర్ ఇచ్చిన ఆదేశా లను రద్దు చేసింది. దీంతోపాటు గవర్నర్ ఆదేశాల మేరకు కోదండరామ్, ఆమెర్ అలీఖాన్‌లను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ ఈ ఏడాది జనవరి 27న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌ను కూడా రద్దు చేసింది. మళ్లీ కొత్తగా ఎమ్మెల్సీల నియామకం చేపట్టాలని.. మరోసారి ఎమ్మెల్సీల పేర్లను కేబినెట్ లో ప్రతిపాదించి గవర్నర్‌కు పంపాలని స్పష్టం చేసింది. ఈ మేరకు గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక వివాదంపై దాఖలైన పిటిషన్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్ జూకంటిల ధర్మాసనం గురువారం కీలక తీర్పు వెలువరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 171 (5) ప్రకారం.. కేబినెట్ సాయం, సలహా మేర కు గవర్నర్ వ్యవహరించాల్సి ఉంటుందని పేర్కొంది. కేబినెట్ సిఫార్సు చేసిన వ్యక్తుల అర్హత, అనర్హత అంశాలను పరిశీలించడానికి గవర్నర్‌కు అధికారం ఉంటుందని.. కావాలంటే అవసరమైన పత్రాలు, సమాచారం కోరవచ్చని తెలిపింది. కేబినెట్ సిఫార్సులను పునఃపరిశీలనకు పంపే అధికారం కూడా ఉంటుందని స్పష్టం చేసింది. వాస్తవానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 361 ప్రకారం కోర్టుకు గవర్నర్ జవాబుదారీ కాదని.. గవర్నర్‌కు కోర్టులు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేవని పేర్కొంది. కానీ హైకోర్టుకు న్యాయసమీక్ష చేసే అధికారం ఉంటుందని వివరించింది. ‘గవర్నర్ కోటా’ పిటిషన్లపై వాదనలను పరిశీలించాక.. రాజ్యాంగంలోని నిబంధనలకు అనుగుణంగా తగిన చర్య తీసుకోవాలని భావించి తీర్పునిస్తున్నట్టు తెలిపింది. ఇక అప్పటి కేబినెట్ సిఫార్సులను అమలు చేయాలన్న పిటిషనర్ల డిమాండ్‌పై చర్చ అనవసరమని.. వారు గవర్నర్ తిరస్కరించడాన్ని మాత్రమే సవాలు చేశారని పేర్కొంది. ‘గవర్నర్ కోటా’వివాదం ఇదీ.. 2023 జూలై 31న భేటీ అయిన గత ప్రభుత్వ కేబినెట్ గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బీఆర్ఎస్ నాయకులు దాసోజు శ్రవణ్‌కుమార్, కుర్ర సత్యనారాయణల పేర్లను గవర్నర్‌కు సిఫార్సు చేసింది. గవర్నర్ ఈ సిఫార్సులను తిరస్కరిస్తూ సెప్టెంబర్ 19న ఆదేశాలు జారీ చేశారు. దీంతో గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లు విచారణలో ఉండగానే.. కొత్త ప్రభుత్వ కేబినెట్ సిఫార్సు మేరకు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామ్, జర్నలిస్టు ఆమెర్ అలీఖాన్‌ల నియామకానికి గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈ ఏడాది జనవరి 27న ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఈ నియామకాలను కూడా శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టులో సవాల్ చేశారు. రెండు అంశాలపైనా హైకోర్టు సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. కోదండరామ్, ఆమెర్ అలీఖాన్‌ను ప్రధాన పిటిషన్లో ఇంప్లీడ్ చేసింది. వారి ప్రమాణస్వీకారంపైనా స్టే ఇచ్చింది. తాజాగా తీర్పు వెలువరించింది. గవర్నర్ నిర్ణయం అభ్యంతరకరం! ‘‘దాసోజు శ్రవణ్ రాజకీయ నాయకుడన్న కారణంగా గవర్నర్ తిరస్కరించారు. తర్వాత నియామకమయ్యే వారు కూడా రాజకీయాలకు సంబంధం లేకుండా ఉండాలి. కానీ నియామకమైన వారు కూడా రాజకీయ నాయకులే. అందులో ఒకరు రాజకీయ పార్టీనే నడిపిస్తున్నారు’’ అని హైకోర్టులో దాసోజు శ్రవణ్ తరఫున సీనియర్ న్యాయవాది ఆదిత్యా సోంధీ వాదనలు వినిపించారు. ‘‘గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వ అర్హతలకు.. పిటిషనర్ల నామినేషన్ తిరస్కరణ కారణాలకు పొంతన లేదు. మంత్రివర్గ సిఫార్సులను తిరస్కరించే అధికారం గవర్నర్‌కు లేదు. దీనిపై సుప్రీంకోర్టు తీర్పులున్నాయి. గవర్నర్‌కు అభ్యంతరం ఉంటే పునః పరిశీలన కోసం వెనక్కి పంపవచ్చు. గవర్నర్ తిరస్కరణ కారణంగా హక్కును కోల్పోయిన పిటిషనర్‌కు కోర్టును ఆశ్రయించే అర్హత ఉంటుంది. శ్రవణ్, సత్యనారాయణల పేర్లను నెలల తరబడి పరిశీలించిన గవర్నర్.. కోదండరామ్, ఆమెర్ అలీఖాన్‌ల పేర్లను మాత్రం కొత్త కేబినెట్ సిఫార్సు చేసిన వెంటనే ఆమోదించింది’’ అని వివరించారు. కుర్ర సత్యనారాయణ తరఫున సీనియర్ న్యాయవాది మయూర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘‘మంత్రి మండలి సిఫార్సులను గవర్నర్ వెనక్కి పంపడానికి, తిరస్కరించడానికి తేడా లేదని పేర్కొనడం సరికాదు. ప్రభుత్వం సిఫార్సు చేసిన అభ్యర్థులపై గవర్నర్‌గా సంతృప్తి చెందడం వేరు.. ఓ వ్యక్తిగా సంతృప్తి చెందడం వేరు. పిటిషనర్ల పేర్లను గవర్నర్ వ్యక్తిగతంగా తిరస్కరించినట్టు కనిపిస్తోంది’’ అని పేర్కొన్నారు. గవర్నర్.. రబ్బర్ స్టాంప్ కాదు.. ‘‘ఎవరికైనా రాజ్యాంగం అనేది సుప్రీం. దాన్ని ఎవరైనా అనుసరించాలి. భాషాపరమైన, సైన్స్ వంటి రంగాల్లో సేవలందించిన వారిని మంత్రి మండలి సిఫార్సు చేయాలి. అలా కాకుండా రాజకీయ విభాగాలకు చెందిన వారిని సిఫార్సు చేస్తే.. కారణాలను పేర్కొంటూ తిస్కరించే అధికారం గవర్నర్‌కు ఉంటుంది. గవర్నర్ రబ్బర్ స్టాంప్ కాదు. గవర్నర్ తిరస్కరించిన తర్వాత వేరేవారి పేర్లు పంపడానికి ప్రభుత్వానికి అవకాశం ఉన్నా పంపలేదు. మంత్రి మండలి సిఫార్సులను వెనక్కి పంపిన గవర్నర్ చర్యలను అలహాబాద్, బాంబే హైకోర్టులు గతంలో సమర్థించాయి. కోదండరామ్, ఆమెర్ అలీఖాన్‌లను గవర్నర్ నేరుగా ఏమీ నియమించలేదు. మంత్రి మండలి సిఫార్సు చేసిన తర్వాత.. ఆయా రంగాల్లో వారు చేసిన సేవను పరిశీలించి ఆమోదముద్ర వేశారు’’ అని కోదండరామ్, అలీఖాన్‌ల తరఫు సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ కోర్టుకు విన్నవించారు. ప్రభుత్వ సిఫార్సు మేరకే నియామకం.. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) వాదనలు వినిపిస్తూ.. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఇద్దరి పేర్లను ఎమ్మెల్సీలుగా సూచిస్తూ జనవరి 24న ప్రభుత్వం సిఫార్సు చేసిందని, దాన్ని పరిశీలించాకే గవర్నర్ ఆమోదించారని వివరించారు. ఇదంతా చట్టప్రకారమే జరిగిందన్నారు. గతంలో ప్రభుత్వం చేసిన సిఫార్సులను పక్కకుపెట్టే అధికారం ఇప్పుడున్న సర్కార్‌కు ఉంటుందని స్పష్టం చేశారు. – గవర్నర్ కార్యదర్శి తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.అశోక్ ఆనంద్‌కుమార్ వాదనలు వినిపిస్తూ.. ‘‘గవర్నర్ నిర్ణయాలను కోర్టులు విచారించలేవు. రాజ్యాంగం గవర్నర్ విచక్షణాధికారాలకు పూర్తి రక్షణ కల్పించింది. గవర్నర్ విచక్షణ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మంత్రి మండలి సలహాపై.. మరొకటి సొంత విచక్షణాధికారం. ప్రజాప్రతినిధుల కోటా కింద ఎమ్మెల్సీగా ఎన్నుకునే అవకాశం ఎమ్మెల్యేలకు ఎలా ఉంటుందో.. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలను నియమించే విచక్షణాధికారాలు గవర్నర్‌కు ఉన్నాయి’’ అని వివరించారు. -
AP: ఫిరాయింపు ఎమ్మెల్సీలకు లాస్ట్ ఛాన్స్
సాక్షి, విజయవాడ: ఫిరాయింపు ఎమ్మెల్సీలకు మరోసారి నోటీసులు జారీ అయ్యాయి. అనర్హత పిటిషన్‌పై శాసనమండలి ఛైర్మన్ నోటీసులు జారీ చేశారు. ఫిరాయించిన ఎమ్మెల్సీలు వంశీకృష్ణ, సి.రామచంద్రయ్యలకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 5న తుది విచారణకు హాజరుకావాలని శాసనమండలి ఛైర్మన్ నోటీసులు జారీ చేశారు. పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలను అనర్హులుగా చేయాలని మండలి చైర్మన్‌కు వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. పార్టీ తరపున మండలి కార్యదర్శికి ఎమ్మెల్సీలు మేరుగు మురళి, లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు. కాగా, పార్టీ ఫిరాయించిన 8 మంది శాసన సభ్యులపై స్పీకర్ తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేశారు. వీరిలో వైఎస్సార్సీపీ నుంచి నలుగురు, టీడీపీ నుంచి నలుగురు ఉన్నారు. వైఎస్సార్సీపీ నుంచి శాసనసభకు ఎన్నికై పార్టీ ఫిరాయించిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (నెల్లూరు రూరల్ నియోజకవర్గం), ఆనం రామనారాయణరెడ్డి (వెంకటగిరి), మేకపాటి చంద్రశేఖరరెడ్డి (ఉదయగిరి), ఉండవల్లి శ్రీదేవి (తాడికొండ)పై ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం అనర్హత వేటు వేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ చీఫ్ విప్ ముదునూరు ప్రసాదరాజు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. -
సీఎం వచ్చి క్షమాపణ చెప్పాల్సిందే... మండలిలో బీఆర్ఎస్ సభ్యుల పట్టు
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శుక్రవారం ప్రారంభమైన శాసనమండలి తొలిరోజు రసాభాసగా మారింది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ జరగకుండానే ముగిసింది. శాసనమండలి సభ్యులపైన ఓ టీవీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి హౌజ్‌లోకి వచ్చి సభ్యులకు క్షమాపణ చేప్పేవరకు సభను ముందుకు సాగనివ్వమని బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు. దీంతో శుక్రవారం నాటి సెషన్ ఐదుసార్లు వాయిదా పడింది. అయినప్పటికీ బీఆర్ఎస్ సభ్యులు వెనక్కు తగ్గకపోవడంతో సభ ను శనివారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రకటించారు. దీంతో గవర్నర్ ప్రసంగం నేపథ్యంలో ధన్యవాద తీర్మానంపై చర్చ కు అవకాశం లేకుండా పోయింది. శనివారం బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉండటంతో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉంటుందా? లేదా? చూడాలి. సభ ప్రారంభంలోనే గందరగోళం ఉదయం సభ ప్రారంభం కాగా... చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ముందుగా సభలోకి కొత్తగా వచ్చిన ఇద్దరు సభ్యులు బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్, బల్మూరి వెంకట్‌కు స్వాగతం పలికారు. అనంతరం బడ్జెట్ సమావేశాలనుద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ చేసిన ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి అవకాశం కల్పించారు. ఇంతలో బీఆర్ఎస్ సభ్యులు భానుప్రసాద్ మాట్లాడుతూ ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శాసనమండలి సభ్యులపైన సీఎం రేవంత్‌రెడ్డి దారుణ వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సీఎం హౌజ్‌లోకి వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ సభ్యులు సైతం గొంతు కలపడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కలగజేసుకుంటూ సీఎం వాఖ్యల అంశాన్ని ప్రివిలేజ్ కమిటీ పరిశీలనకు పంపామనీ, సభ్యులు ఈ అంశంపై నోటీసు ఇస్తే చర్చకు అవకాశం కల్పిస్తానన్నారు. అయినప్పటికీ బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన విరమించకుండా సీఎం రావాల్సిందేనంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో సభను పదినిమిషాలు వాయిదా వేశారు. బీఆర్ఎస్కు మాట్లాడే అర్హత లేదన్న జూపల్లి ఆ తర్వాత సభ ప్రారంభం కాగానే బీఆర్ఎస్ సభ్యు లు అదే తీరును ప్రదర్శించారు. చైర్మన్ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఒకరిద్దరు సభ్యులు పోడియం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో మంత్రి జూపల్లి కృష్ణారావును ప్రభుత్వం తరపున మాట్లాడాలని చైర్మన్ కోర గా జూపల్లి స్పందిస్తూ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ సభ్యులు నినాదాలతో హోరెత్తించడంతో మంత్రి వారి వైఖరి పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పెగు ్గలు కలిపే వ్యక్తికి రాజ్యసభను పంపించిన బీఆర్ఎస్కి మండలిలో మాట్లాడే అర్హత లేదన్నారు. మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పడం సాంప్రదాయమని, సభ గౌరవాన్ని కాపాడాలని కోరారు. పెద్దల సభకు గౌరవం ఇవ్వాలి: జీవన్‌రెడ్డి అనుభవం ఉన్న వ్యక్తులు మండలికి వస్తారని, పెద్ద మనుషులు ఉండే పెద్దల సభను అగౌరవం పర్చేలా బీఆర్ఎస్ సభ్యులు వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రివిలేజ్ కమిటీని ఏర్పాటు చేయకపోవడం దారుణమని మండిపడ్డారు. బీఆర్ఎస్ సభ్యులు వెనక్కు తగ్గకపోవడంతో సభ పలుమార్లు వాయిదాపడుతూ వచ్చింది. -
ఆగిన ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ కోటా కింద కొత్తగా శాసనమండలి సభ్యులుగా నియమితులైన ప్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్ట్ ఆమెర్ అలీ ఖాన్ ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడింది. ఈ విషయంలో యథాతథస్థితి కొనసాగించాలని (స్టేటస్కో) ఆదేశిస్తూ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం మంగళవారం తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 8వ తేదీ వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని, ఆ రోజు పూర్తిస్థాయిలో వాదనలు వింటామని స్పష్టం చేసింది.గతంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ పేర్లను సిఫారసు చేస్తూ అప్పటి ప్రభుత్వం గవర్నర్‌కు ప్రతిపాదనలు పంపింది. అయితే 2023 సెప్టెంబర్ 19న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వాటిని తిరస్కరించారు. గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(5) ప్రకారం తనకున్న విస్తృత అధికారాల మేరకు ప్రభుత్వ ప్రతిపాదనలను తిరస్కరిస్తున్నట్లుగా గవర్నర్ ప్రకటించడాన్ని వారు సవాల్ చేశారు.ఈ పిటిషన్లపై గత వారం విచారణ చేపట్టిన సీజే ధర్మాసనం.. తదుపరి విచారణను ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది. పిటిషన్ల విచారణార్హతతో పాటు వాటిలోని వాస్తవాలు, సాంకేతిక అంశాలను పరిశీలిస్తామని చెప్పింది. ఈ పిటిషన్లపై విచారణ ముగిసే వరకు కొత్తగా గవర్నర్ కోటాలో ఎవరినీ నియమించకుండా స్టే ఇవ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు విజ్ఞప్తి చేయగా తోసిపుచ్చింది. అలా గవర్నర్‌కు ఆదేశాలు ఇవ్వడం చట్టపరంగా సాధ్యం కాదని స్పష్టం చేసింది. ‘పెద్దమనుషుల ఒప్పందం’ (జెంటిల్మెన్ అగ్రిమెంట్) మాదిరి అందరూ హుందాతనం పాటించాలని సూచించింది. కొత్త నియామకాలపై స్టే ఇవ్వండి తాజాగా గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ఫ్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్ట్ ఆమెర్ అలీ ఖాన్‌లను నియమిస్తూ.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూ గవర్నర్ తమిళిసై ఈ నెల 25న ఉత్తర్వులు వెలువరించారు. దీంతో దాసోజు శ్రవణ్, సత్యనారాయణ ఇందుకు సంబంధించిన జీవో నంబర్ 12ను సవాల్ చేస్తూ హైకోర్టులో మధ్యంతర అప్లికేషన్ (ఐఏ)లు దాఖలు చేశారు. కొత్త నియామకాలను నిలుపుదల చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అలాగే కోదండరాం, అమేర్ అలీఖాన్‌లను ప్రధాన పిటిషన్లో ఇంప్లీడ్ చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ ఐఏలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. దాసోజు తరఫున సీనియర్ న్యాయవాది అదిత్యా సోదీ వాదనలు వినిపించారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల అంశం హైకోర్టులో విచారణ దశలో ఉండగా కొత్త వారిని నియమించడం సరికాదని ఆయన అన్నారు. ఈ నెల 17న మీడియాకు విడుదల చేసిన నోట్లో.. కోర్టు ఉత్తర్వులు ఇచ్చేవరకు కొత్త నియామకాలు చేపట్టబోమని గవర్నర్ పేర్కొన్నారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.ఇది న్యాయస్థానం సూచించిన ‘పెద్దమనుషుల ఒప్పందం’ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఇద్దరి పేర్లను ఎమ్మెల్సీలుగా ప్రభుత్వం సిఫారసు చేసిందని, వాటిని పరిశీలించిన తర్వాతే గవర్నర్ ఆమోదించారని తెలిపారు. వీరి నియామకం చట్టప్రకారమే జరిగిందని, స్టే ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సీజే ధర్మాసనం దీనిపై స్టేటస్ కో విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్ లేక వీలు పడకపోవడంతో.. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో కోదండరాం, ఆమెర్ అలీఖాన్‌లు బుధవారం ప్రమాణ స్వీకారం చేసేందుకు వీల్లేకుండా పోయింది. వాస్తవానికి వీరు ప్రమాణ స్వీకారం చేసేందుకు సోమవారం (29న) నాడే శాసనమండలికి వెళ్లారు. కానీ వారు వెళ్లే సమయానికి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తన చాంబర్లో లేరు. దీంతో ఆయన రాక కోసం వారు కౌన్సిల్ హాల్లోనే చాలాసేపు ఎదురు చూశారు. అయినా చైర్మన్ రాకపోవడంతో వెనుదిరిగారు. అయితే ఆరోగ్యం బాగోలేనందున చైర్మన్ మండలికి రాలేకపోయారని, ఈ నెల 31న ప్రమాణ స్వీకారానికి రావాలని వారిద్దరికీ కౌన్సిల్ నుంచి సమాచారం అందింది. ఈ మేరకు వారు సిద్ధమవుతున్న సమయంలో స్టేటస్కో విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు వెలువరించింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా నేడు బల్మూరి, మహేశ్‌కుమార్‌ల ప్రమాణం శాసనసభ్యుల కోటాలో ఇటీవల శాసనమండలికి ఎన్నికైన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 3.30కు శాసనమండలి చైర్మన్ చాంబర్లో బల్మూరి వెంకట్, మహేశ్‌కుమార్ గౌడ్లు మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. కాగా హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉండాలని కోదండరాం, ఆమెర్ అలీఖాన్‌లు నిర్ణయించుకున్నారు. -
ప్రొ. కోదండరాం ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేకులు
హైదరాబాద్, సాక్షి: గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. యథాతథ స్థితినే కొనసాగించాలని చెబుతూ.. కొత్త సభ్యులతో ప్రమాణం చేయించొద్దని మంగళవారం తన ఆదేశాల్లో పేర్కొంది. దీంతో తదుపరి ఉత్తర్వులు వచ్చేదాకా ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీఖాన్‌ల ప్రమాణం చేయడానికి వీల్లేదు!. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీఖాన్. వీళ్ల నియామకాన్ని సవాల్ చేస్తూ దాసోజు శ్రవణ్, సత్యనారాయణలు హైకోర్టును ఆశ్రయించారు. గతంలో తాము వేసిన పటిషన్ విచారణ తేలెంత వరకు పిటిషన్ విచారణ ఆపాలంటూ కోరారు వాళ్లు. అయితే కోర్టు వాళ్ల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా ప్రమాణం చేయించవద్దని చెబుతూ.. ఫిబ్రవరి 8వ తేదీకి తదుపరి విచారణ వాయిదా వేసింది. కొద్ది నెలల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను ప్రకటించింది. గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్, సత్యనారాయణ నామినేట్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ ఇద్దరి పేర్లను గవర్నర్ కు పంపారు. అయితే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వీరి పేర్లను ఆమోదించలేదు. ఇంతలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. అయితే గవర్నర్ తమ పేరును ఆమోదించకపోవడంపై దాసోజు శ్రవణ్, సత్యనారాయణ రాష్ట్ర హైకోర్టుకు వెళ్లారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టికల్ 171 ప్రకారం తమను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసిందని.. దాన్ని తిరస్కరించే హక్కు గవర్నర్ లేదని వారు పేర్కొన్నారు. వీరి పిటిషిన్ పై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉంది. ఈలోపే కోదండరాం, అమీర్ అలీఖాన్‌లను కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ కోటాకు ప్రతిపాదించగా.. అందుకు గవర్నర్ ఆమోదం తెలపడంతోనే రాజకీయ అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. -
ఎమ్మెల్సీలుగా కోదండరాం,ఆమేర్ అలీఖాన్
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామారెడ్డి (కోదండరాం), ఆమేర్ అలీఖాన్‌లను నియమిస్తూ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా గతంలో నియమితులైన డి.రాజేశ్వర్‌రావు, ఫారూక్ హుస్సేన్‌ల పదవీకాలం 2023 ఏప్రిల్ 27తో ముగిసిపోగా, అప్పటి నుంచి ఈ రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రెండు స్థానాల్లో దాసోజు శ్రవణ్‌కుమార్, కుర్ర సత్యనారాయణలను నియమించాలని ప్రతిపాదించగా, నిబంధనల ప్రకారం వీరికి అర్హతలు లేవని గవర్నర్ తమిళిసై అప్పట్లో తిరస్కరించారు. ఈ అభ్యర్థులిద్దరూ రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉన్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా, కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కోదండరామారెడ్డి, ఆమేర్ అలీఖాన్‌ల పేర్లను ప్రతిపాదించగా, గవర్నర్ తమిళిసై సత్వరమే ఆమోదించారు. తెలంగాణ ఉద్యమంలో టీజేఏసీ చైర్మన్‌గా ప్రొఫెసర్ కోదండరాం కీలక పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆయన తెలంగాణ జన సమితి (టీజేఎస్) పేరుతో పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ఇక ఆమేర్ అలీఖాన్ ఉర్దూ దినపత్రిక సియాసత్‌కి న్యూస్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.