TS: గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలు వీరే! | Appointment Of Governor's Quota Mlcs In Telangana | Sakshi
Sakshi News home page

TS: గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలు వీరే!

Published Thu, Jan 25 2024 3:45 PM | Last Updated on Thu, Jan 25 2024 4:04 PM

Appointment Of Governor's Quota Mlcs In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గవర్నర్‌ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఎంపిక చేశారు. ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్‌ కోదండరామ్‌, మీర్‌ అమీర్‌ అలీఖాన్‌ను ఎంపిక చేస్తూ గవర్నర్‌ ఆమోదం తెలిపారు.

వారం రోజుల క్రితం ప్రొఫెసర్‌ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లను గవర్నర్‌కు ప్రభుత్వం పంపింది. దావోస్ పర్యటనకు ముందు పేర్లను గవర్నర్‌కు పంపగా, నిన్న గవర్నర్ తో భేటీ సందర్భంగా ఎమ్మెల్సీల అంశం చర్చకు వచ్చింది. ఇవాళ లేదా రేపు గవర్నర్‌ అధికారిక ప్రకటన చేయనున్నారు.

కాగా, తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(TSPSC) చైర్మన్‌గా ఎం. మహేందర్‌రెడ్డిని నియామకం ఖరారైంది. మాజీ డీజీపీ అయిన మహేందర్‌రెడ్డి నియామకాన్ని ఆమోదిస్తూ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ గురువారం నిర్ణయం తీసుకున్నారు. అలాగే టీఎస్‌పీఎస్‌సీ సభ్యులుగా రిటైరర్డ్‌ ఐఏఎస్‌ అనిత రాజేంద్ర, పాల్వాయి రజనీ కుమారి, అమీర్‌ ఉల్లా ఖాన్‌, యాదయ్య, వై రాంమోహన్‌రావు నియమితులయ్యారు.

టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ పోస్టింగ్‌ కోసం మొత్తంగా 370 వరకు దరఖాస్తులు అందాయి. ప్రభుత్వం సెర్చ్‌ కమిటీని నియమించి.. దరఖాస్తుల పరిశీలన, అర్హులను సూచించే బాధ్యతలను అప్పగించింది. కమిటీ వేగంగా దరఖాస్తుల పరిశీలన చేపట్టింది. చైర్మన్‌ పదవి కోసం దరఖాస్తు చేసినవారిలోంచి మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి పేరును ప్రభుత్వానికి సూచించింది. ప్రభుత్వం ఆ పేరును గవర్నర్‌కు పరిశీలనకు పంపింది. చివరకు గవర్నర్‌ ఆయన నియామకానికి ఆమోదం తెలిపారు.

ఇదీ చదవండి: బాలకృష్ణ అక్రమార్జన.. అధికారులే కంగుతినేలా..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement