Appointment
-
వైట్‌హౌస్ స్టాఫ్ చీఫ్‌గా సూజీ వైల్స్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌కు తొలి అధికారి నియామకాన్ని ప్రకటించారు. తన ప్రచార మేనేజర్ సూజీ వైల్స్‌ను వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నియమిస్తున్నట్లు గురువారం వెల్లడించారు. 67 ఏళ్ల వైల్స్ అమెరికా చరిత్రలో ఈ పదవిని చేపట్టిన తొలి మహిళగా రికార్డు సృష్టించనున్నారు. ‘అమెరికా చరిత్రలో గొప్ప రాజకీయ విజయాన్ని సాధించడానికి సూజీ వైల్స్ నాకు సాయపడ్డారు. 2016లో, 2020లో, ఇప్పుడు నా ప్రచారంలో అంతర్భాగంగా ఉన్నారు. ఆమె కఠినమైన, తెలివైన, సృజనాత్మకమైన వ్యక్తి. అమెరికా చరిత్రలో తొలి మహిళా చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా సూజీని నియమించడం గౌరవంగా భావిస్తున్న’ అని ట్రంప్ వెల్లడించారు. ఇది గొప్ప వార్తని ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన జేడీ వాన్స్ హర్షం వ్యక్తం చేశారు. ప్రచారంలో కీలక పాత్ర పోషించిన సూజీ వైట్‌హౌస్‌లోనూ అంతే కీలకంగా పనిచేస్తారని తెలిపారు. ఎవరీ సూజీ వైల్స్?సూజీ వైల్స్.. నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ (ఎన్ఎ ఫ్ఎల్) ఆటగాడు, స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టర్ పాట్ సమ్మరల్ కుమార్తె. 1957 మే 14న జన్మించిన ఆమె.. న్యూయార్క్ రిపబ్లికన్ జాక్ కెంప్ అధ్యక్షుడిగా ఉన్నసమయంలో వైట్‌హౌస్‌లో తన కెరీర్‌ను ప్రారంభించారు. 1980లలో రోనాల్డ్ రీగన్ అధ్యక్ష ప్రచార బృందంలో చేరారు. ఇది జాతీయ రాజకీయాల్లో ప్రత్యక్ష ప్రమేయానికి నాంది పలికింది. రీగన్ అధ్యక్ష ఎన్నికల ప్రచారం తరువాత పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌గా ఆమె ఫ్లోరిడాకు వెళ్లారు. అక్కడ ఆమె ఇద్దరు జాక్సన్విల్లే మేయర్లకు సలహాదారుగా పనిచేశారు. వ్యాపారవేత్త అయిన రిక్ స్కాట్ గవర్నర్‌గా గెలిచేందుకు తోడ్పడ్డారు. 2012లో ఉటా గవర్నర్ జాన్ హంట్స్‌మన్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. అదే ఆమెకు మరోమారి వైట్‌హౌస్‌కు బాటలు వేసింది. 2016లో డోనాల్డ్ ట్రంప్ ప్రచార బృందానికి నాయకత్వం వహించారు. ఆ తరువాత 2018లో ఫ్లోరిడా గవర్నర్‌గా రాన్ డిశాంటిస్ గెలుపులోనూ సూజీ కీలక పాత్ర పోషించారు. ఇదీ చదవండి: ముంచింది బైడెనే.. -
నూతన సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా
సాక్షి, న్యూఢిల్లీ: భారత సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయ్యారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ గురువారం ఈ విషయం ‘ఎక్స్’లో వెల్లడించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో సంప్రదించి నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నాను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జస్టిస్ ఖన్నా నియామకం నవంబర్ 11వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. కొత్త సీజేఐ వచ్చే నెల 11న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన స్వల్పకాలమే పదవిలో ఉంటారు. 2025 మే 13న పదవీ విరమణ చేయనున్నారు. అంటే కేవలం ఆరు నెలలపాటు సీజేఐగా కొనసాగుతారు. జస్టిస్ ఖన్నా 1960 మే 14న జన్మించారు. ఢిల్లీ యూనివర్సిటీలో న్యాయ విద్య అభ్యసించారు. 1983లో న్యాయవాద వృత్తిలో అడుగుపెట్టారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీలో అడ్వొకేట్‌గా నమోదయ్యారు. వేర్వేరు కోర్టుల్లో పనిచేశారు. తీస్ హజారీ జిల్లా కోర్టు, ఢిల్లీ హైకోర్టులో న్యాయవాదిగా వ్యవహరించారు. 2005లో ఢిల్లీ హైకోర్టు అదనపు జడ్జిగా నియమితులయ్యారు. 2006లో అదే కోర్టులో శాశ్వత జడ్జిగా చేరారు. ఢిల్లీ జ్యుడీషియల్ అకాడమీ, ఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ చైర్మన్‌గా సేవలందించారు. వృత్తిలో అంచెలంచెలుగా ఎదుగుతూ 2019 జనవరి 18న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. నేషనల్ లీగల్ సరీ్వసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా, భోపాల్‌లోని నేషనల్ జ్యుడీíÙయల్ అకాడమీ గవరి్నంగ్ కౌన్సిల్ సభ్యుడిగానూ పనిచేస్తున్నారు. కీలక తీర్పులు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ఖన్నా పలు కీలక తీర్పులు వెలువరించారు. ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాలకు(ఈవీఎంలు) సంబంధించి వీవీప్యాట్లలోని 100 శాతం ఓట్లను లెక్కించాలని కోరుతూ అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను 2024లో కొట్టివేసిన డివిజన్ బెంచ్‌కు ఆయన నేతృత్వం వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచి్చన ఎలక్టోరల్ బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని 2024లో చరిత్రాత్మక తీర్పు ఇచ్చారు. ఆరి్టకల్ 370ని రద్దు చేయడాన్ని సమర్థిస్తూ 2023లో తీర్పు ఇచి్చన ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనంలో జస్టిస్ ఖన్నా సభ్యుడిగా ఉన్నారు. వివాహ బంధం పూర్తిగా విఫలమైన సందర్భాల్లో దంపతులకు నేరుగా విడాకులు మంజూరు చేసే అధికారం ఆరి్టకల్ 142 ప్రకారం సుప్రీంకోర్టుకు ఉందని 2023లో స్పష్టంచేశారు. సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) పరిధిలోకి సుప్రీంకోర్టు కార్యాలయం వస్తుందంటూ 2019లో మరో కీలక తీర్పు వెలువరించారు. -
ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్‌గా రిటైర్డ్ ఐపీఎస్ అనురాధ
సాక్షి, విజయవాడ: ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్‌గా రిటైర్డ్ ఐపీఎస్ ఎఆర్ అనురాధను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. రేపు ఉదయం 11 గంటలకి ఎపీపీఎస్సీ చైర్మన్‌గా ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తూ గత ఏడాది అక్టోబర్ నెలాఖరున అనురాధ పదవీ విరమణ చేశారు. గతంలో ఏపీ ఇంటిలిజెన్స్ డీజీగా, విజిలెన్స్ డీజీగా, హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా పలు కీలక శాఖలు ఆమె నిర్వహించారు.ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతం సవాంగ్‌ను జులై నెలలో కూటమి ప్రభుత్వం బలవంతపు రాజీనామా చేయించిన సంగతి తెలిసిందే. అయితే, గత మూడు నెలలుగా చైర్మన్ లేకుండా ఏపీపీఎస్సీ ఉంది. చైర్మన్ లేకపోవడంతో జులై 28 న జరగాల్సిన గ్రూప్-2, అలాగే సెప్టెంబర్ 2 నుంచి పది వరకు నిర్వహించాల్సిన గ్రూప్-1ను చంద్రబాబు సర్కార్ వాయిదా వేసింది. ఏడాది పాటే ఏపీపీఎస్సీ చైర్మన్‌గా అనురాధ ఉండనున్నారు. చైర్మన్ పదవికి గరిష్ట వయస్సు 62 ఏళ్లు కావడంతో అనూరాధకి ఏడాది పాటే పనిచేసే అవకాశం ఉంది.ఇదీ చదవండి: చంద్రబాబుకు ఇదే నా హెచ్చరిక: వైఎస్ జగన్ -
వైఎస్సార్సీపీలో పలు నియామకాలు
సాక్షి, గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. ఆయన ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా అంబటి రాంబాబు, కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పేర్ని నాని, ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా దేవినేని అవినాష్, రాష్ట్ర అధికార ప్రతినిధిగా కైలే అనిల్ కుమార్.. గుంటూరు, నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులుగా మోదుగుల వేణుగోపాలరెడ్డి, మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా దొంతిరెడ్డి శంకర్‌రెడ్డి నియమితులయ్యారు.వైఎస్సార్సీపీ నేతలతో వైఎస్ జగన్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం ఆయన ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. పలు అంశాలపై పార్టీ నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు.ఇదీ చదవండి: చంద్రబాబు పాపాలు కడిగేందుకే పూజలు: పేర్నినాని -
దసరాకు ‘కేబినెట్’ ధమాకా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. దసరా పండుగ సమయంలో కొత్త మంత్రులను నియమించేందుకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. టీపీసీసీ అధ్యక్షుడి నియామక ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో.. కేబినెట్ విస్తరణకు అడ్డంకులు తొలగినట్టేనని, ఈసారి మంత్రివర్గ విస్తరణ ఖాయమని గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వచ్చే నెల 5వ తేదీ తర్వాత ఎప్పుడైనా కొత్త మంత్రులు కొలువుదీరనున్నారని నేతలు చెబుతున్నారు. ఎవరెవరికి చాన్స్ ఇవ్వాలన్న దానిపై మరోమారు చర్చలు జరిపి ఖరారు చేయనున్నట్టు వివరిస్తున్నారు.బెర్తుల కోసం పోటాపోటీనిబంధనల ప్రకారం.. రాష్ట్రంలో గరిష్టంగా సీఎం సహా 18 మందికి మంత్రివర్గంలో చోటు ఉంటుంది. ప్రస్తుతం సీఎంతోపాటు 11 మంది మంత్రులు ఉన్నారు. దీనితో మరో ఆరుగురికి మంత్రివర్గంలో చోటు కల్పించే వెసులుబాటు ఉంది. వీటి కోసం తీవ్ర పోటీ నెలకొంది. పదేళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో.. తమకంటే తమకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు. ప్రస్తుతం కేబినెట్లో ప్రాతినిధ్యం లేని జిల్లాల నుంచే కాకుండా.. మిగతా జిల్లాల నుంచి కూడా డజను మందికి పైగా ఎమ్మెల్యేలు తమకు కేబినెట్ బెర్త్‌పై ఆశతో ఉన్నారు.ఇప్పటివరకు ప్రాతినిధ్యం లేని జిల్లాల నుంచి పరిశీలిస్తే.. మల్రెడ్డి రంగారెడ్డి, టి.రామ్మోహన్‌రెడ్డి (రంగారెడ్డి), జి.వివేక్, జి.వినోద్, కె.ప్రేమ్‌సాగర్‌రావు (ఆదిలాబాద్), పి.సుదర్శన్‌రెడ్డి (నిజామాబాద్), దానం నాగేందర్, అమీన్ అలీఖాన్ (హైదరాబాద్) మంత్రి పదవులు ఆశిస్తున్నారు. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, బాలు నాయక్ (నల్లగొండ), వాకిటి శ్రీహరి (మహబూబ్‌నగర్), టి.జీవన్‌రెడ్డి (కరీంనగర్) కూడా కేబినెట్ బెర్త్ కోసం ఒత్తిడి చేస్తున్నారు. వీరికితోడు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎమ్మెల్యే కె.మదన్మోహన్రావు, ఆది శ్రీనివాస్, బీర్ల అయిలయ్య, వేముల వీరేశం తదితరులు కూడా సామాజిక వర్గాల ప్రాతిపదికన చాన్స్ ఇవ్వాలని విజ్ఞప్తులు చేస్తున్నారు.సామాజిక సమీకరణాలే ప్రాతిపదికగా..కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో ఎవరెవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న దానిపై అధిష్టానం ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర నాయకత్వంతో చర్చలు జరిపింది. పీసీసీ అధ్యక్ష పదవికి, కేబినెట్ విస్తరణకు మధ్య సామాజిక వర్గాల వారీగా లెక్కలు కుదరకపోవడంతో నిర్ణయం వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా పీసీసీ అధ్యక్షుడిగా బీసీ నేతను నియమించడంతో మిగతా సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో స్థానం కల్పించే విషయంలో ఓ నిర్ణయం తీసుకునే వెసులుబాటు కలిగింది. ప్రస్తుతం మంత్రిమండలిలో ఏడుగురు ఓసీ వర్గానికి చెందినవారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.ఇద్దరు ఎస్సీలు, ఇద్దరు బీసీలు, ఒక ఎస్టీ నేత ఉన్నారు. కులాల వారీగా చూస్తే నలుగురు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు. ప్రస్తుతం రెడ్లకే చెందిన మరో నేతకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వనున్నట్టు అంచనా. మాదిగ, ఎస్టీ (లంబాడా), బీసీ సామాజిక వర్గాలకు కూడా ఒక్కో బెర్త్ కేటాయించాల్సి ఉంటుందని చెబుతున్నారు. మిగతా రెండు పదవులు ఎవరికన్నది పార్టీ వెసులుబాటు ప్రకారం కేటాయించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.ఇతర పదవుల భర్తీ కూడా..వివిధ వర్గాలకు మంత్రివర్గంలో స్థానంతోపాటు అసెంబ్లీలో చీఫ్ విప్, విప్ పదవులు కూడా ఇచ్చే చాన్స్ ఉంది. వీటితోపాటు కీలకమైన ఆర్టీసీ, మైనింగ్, ఎంఐడీసీ, మూసీ డెవలప్మెంట్ వంటి కీలక కార్పొరేషన్లకు ఎమ్మెల్యేలను చైర్మన్లుగా నియమిస్తారనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఏ పదవి ఎవరికి ఇవ్వాలన్న దానిపై సామాజిక వర్గాల కోణంలో నిర్ణయం ఉంటుందని అంటున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత.. ఆయనతోపాటు సీఎం రేవంత్, సీనియర్ మంత్రి ఉత్తమ్, పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ తదితరులు ఢిల్లీ వెళ్లి.. అధిష్టానంతో చర్చించనున్నట్టు సమాచారం. మొత్తమ్మీద దసరా పండుగకు మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే చర్చ.. రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో ఆసక్తి రేకెత్తిస్తోంది. -
ఎయిర్‌ఫోర్స్ తదుపరి చీఫ్ అమర్‌ప్రీత్‌సింగ్
న్యూఢిల్లీ:ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ తదుపరి చీఫ్‌గా ఎయిర్ మార్షల్ అమర్‌ప్రీత్ సింగ్ నియమితులయ్యారు.అమర్‌ప్రీత్‌సింగ్ ప్రస్తుతం ఎయిర్‌ఫోర్స్ వైస్ చీఫ్‌గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా విధులు నిర్వర్తిస్తున్న వివేక్ రామ్ చౌదరి పదవీ కాలం త్వరలో ముగియనుంది.దీంతో అమర్‌ప్రీత్ సింగ్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం(సెప్టెంబర్21) ఒక ప్రకటన విడుదల చేసింది. 1964 అక్టోబరు 27న జన్మించిన ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ,డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ నేషనల్ డిఫెన్స్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.1984 డిసెంబర్లో ఎయిర్‌ఫోర్స్‌లో ప్రవేశించారు.దాదాపు నాలుగు దశాబ్దాల కెరీర్లో అత్యంత అనుభవజ్ఞుడైన ఫ్లైయర్‌గా, ప్రయోగాత్మక టెస్ట్ పైలట్‌గా అమర్‌ప్రీత్‌సింగ్ గుర్తింపు పొందారు.ఎన్నో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.ఇదీ చదవండి.. భారత వృద్ధికి కీలక చర్చలు : పియూష్ గోయెల్ -
మరో మూడు జిల్లాలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుల నియామకం
సాక్షి, గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. మరో మూడు జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించారు. ఆయన ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షులుగా ధర్మాన కృష్ణదాస్, విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షులుగా జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), పార్వతీపురం మన్యం జిల్లా పార్టీ అధ్యక్షులుగా శత్రుచర్ల పరీక్షిత్ రాజు, శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులుగా తమ్మినేని సీతారాం నియమితులయ్యారు.ఇదీ చదవండి: ఎల్లో మీడియాకు నటి కాదంబరీ జత్వానీ ఝలక్కాగా, నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ పరిశీలకులుగా ఆదాల ప్రభాకర్‌రెడ్డి, నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, (ఎమ్మెల్సీ), నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఆనం విజయ్ కుమార్‌రెడ్డి, నెల్లూరు కార్పొరేషన్ పార్టీ పరిశీలకులుగా పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శిగా ఖలీల్ అహ్మద్ నియమితులయిన సంగతి తెలిసిందే. -
రెండు నియోజకవర్గాలకు వైఎస్సార్సీపీ ఇన్‌చార్జ్‌ల నియామకం
సాక్షి, గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పదవుల భర్తీ ప్రక్రియలో భాగంగా ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పలు నియామకాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో రెండు నియోజకవర్గాలకు వైఎస్సార్సీపీ ఇన్‌చార్జ్‌ల నియామకం జరిగింది.వైఎస్ జగన్ ఆదేశాల మేరకు కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. మైలవరం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా జోగి రమేష్, పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా దేవభక్తుని చక్రవర్తిలను నియమించారు.కాగా, ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా, అనుబంధ విభాగాలకు అధ్యక్షులుగా మరికొందరిని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నియమించిన సంగతి తెలిసిందే. మొత్తం 15 విభాగాలకు అధ్యక్షులను నియమించారు. -
నేపాల్ కొత్త ప్రధానిగా కె.పి శర్మ ఓలి
కఠ్మాండు: నేపాల్ నూతన ప్రధానిగా కేపీ శర్మ ఓలి ఆదివారం(జులై 14) నియమితులయ్యారు. మాజీ పీఎం పుష్ప కమల్ దహల్ అలియాస్ ప్రచండ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఇటీవల కుప్పకూలిన విషయం తెలిసిందే.పార్లమెంటులోని ప్రతినిధుల సభలో శుక్రవారం నిర్వహించిన విశ్వాస పరీక్షలో ప్రచండ ఓడిపోయారు. ఈ క్రమంలోనే కె.పి.శర్మ ఓలి (72) నేతృత్వంలోని సీపీఎన్-యూఎంఎల్, మరో మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా సారథ్యంలోని నేపాలీ కాంగ్రెస్(ఎన్సీ)ల కూటమి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే 165 మంది సభ్యుల (సీపీఎన్-యూఎంఎల్- 77, ఎన్సీ- 88) సంతకాలను ఓలి సమర్పించారు. దీంతో కొత్త ప్రధానిగా ఓలిని దేశ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ నియమించారు. ఓలితో పాటు మంత్రివర్గం సోమవారం ప్రమాణ స్వీకారం చేయనుంది. ఇప్పటికే ఓలి, దేవ్బాల మధ్య అధికారాన్ని పంచుకోవడంపై ఒప్పందం కుదిరింది. తొలి 18 నెలలు ఓలి ప్రధానిగా ఉంటారు. ఆ తర్వాత పార్లమెంటు గడువు ముగిసేవరకూ దేవ్బా ప్రధానిగా కొనసాగుతారు.ఓలికి దేశ ప్రధానిగా రెండుసార్లు పనిచేసిన అనుభవం ఉంది. -
లోక్‌సభలో కాంగ్రెస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, విప్ నియామకం.. ఎవరంటే?
న్యూఢిల్లీ: లోక్‌సభలో పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా ఎంపీ గౌరవ్ గొగొయ్‌ను తిరిగి నియమించినట్లు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఎక్స్(ట్విటర్)లో ఆదివారం(జులై14) వెల్లడించారు.గతంలోనూ గౌరవ్ గొగొయ్ పార్టీ లోక్‌సభపక్ష ఉపనేతగా బాధ్యతలు నిర్వహించారు. లోక్‌సభలో పార్టీ చీఫ్‌విప్‌గా 8సార్లు ఎంపీగా గెలిచిన సీనియర్ మెంబర్ కొడికున్నిల్ సురేశ్‌ను నియమించారు. వీరికి తోడు సీనియర్‌నేతలు మాణిక్యం ఠాగూర్, ఎండీ జావెద్‌లకు లోక్‌సభలో విప్ బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాలకు సంబంధించి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియాగాంధీ లోక్‌సభ స్పీకర్‌కు ఒక లేఖ రాశారు. లోక్‌సభలో పార్టీ కొత్తగా నియమించిన ఉపనేత, చీఫ్‌విప్, విప్ల పేర్లను లేఖలో తెలిపారు. ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ మార్గదర్శకత్వంలో లోక్‌సభలో ప్రజావాణిని బలంగా వినిపిస్తామని కేసీవేణుగోపాల్ ట్వీట్లో పేర్కొన్నారు. -
అతడికి మాత్రమే ఆ అర్హత.. గౌతం గంభీర్ భార్య నటాషా పోస్ట్ వైరల్(ఫొటోలు)
-
సమాచార కమిషనర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సమాచార కమిషనర్ల కోసం దరఖాస్తులను తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించింది. జూన్ 29వ తేదీ లోపు ఆసక్తి ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది. సీఎస్ శాంతకుమారి నోటిఫికేషన్ విడుదల చేశారు.తెలంగాణ ప్రభుత్వం అధికారిక వెబ్సైట్ TSIC.GOV.IN ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. గతంలో దరఖాస్తు చేసిన వారు మళ్లీ చేయాల్సిన అవసరం లేదని సీఎస్ శాంతికుమారి స్పష్టం చేశారు. -
‘‘స్వాతి మలివాల్‌కు సీఎం అపాయింట్మెంట్ లేదు’’
న్యూఢిల్లీ: ఎంపీ స్వాతి మలివాల్‌కు మే13వ తేదీ సీఎం కేజ్రీవాల్ అపాయింట్మెంట్ లేదని సీఎం సహాయకుడు బిభవ్‌కుమార్ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆ రోజున ఆమె సీఎం ఇంటి వద్ద భద్రతా ఉల్లంఘనకు పాల్పడ్డారన్నారు. మలివాల్‌పై 13న సీఎం ఇంట్లో దాడి జరిగిన కేసులో కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్‌కుమార్‌ను ఢిల్లీ పోలీసులు శనివారం(మే17) అరెస్టు చేశారు.బిభవ్ అరెస్టయిన వెంటనే ఆయన న్యాయవాది కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా బిభవ్‌కుమార్ న్యాయవాది వాదనలు వినిపించారు. ఎంపీ స్వాతిమలివాల్ సీఎం ఇంటికి వచ్చినరోజుకు సంబంధించి సోషల్‌మీడియాలో సర్క్యులేషన్లో ఉన్న వీడియోలను కోర్టుకు సమర్పించారు. అసలు స్వాతి మలివాల్‌పై సీఎం ఇంట్లో ఎలాంటి దాడి జరగలేదని తెలిపారు. -
ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా.. నియమించిన ‘ఈసీ’
సాక్షి,విజయవాడ: ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా హరీష్‌కుమార్ గుప్తాను ఎన్నికల కమిషన్(ఈసీ) నియమించింది. సోమవారం(మే6) సాయంత్రం 5 గంటలలోపు బాధ్యతలు తీసుకోవాలని గుప్తాను ఈసీ ఆదేశించింది. ఇప్పటివరకు డీజీపీగా బాధ్యతలు నిర్వహించిన రాజేంద్రనాథ్‌రెడ్డిని ఆదివారం ఈసీ బదిలీ చేసిన విషయం తెలిసిందే. తర్వాత ఏపీ చీఫ్ సెక్రటరీ(సీఎస్) ముగ్గురు సీనియర్ అధికారులతో జాబితాను పంపగా అందులో నుంచి హరీష్‌కుమార్‌గుప్తాను డీజీపీగా ఈసీ నియమించింది. -
జూన్‌లో జాబ్‌ల జాతర
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగాల భర్తీలో భాగంగా జూన్ నెలలో అపాయింట్మెంట్, పోస్టింగ్‌లు ఇచ్చేందుకు టీఎస్ పీఎస్సీ కసరత్తు చేస్తోంది. పార్ల మెంట్ ఎన్నికల కోడ్ ముగియగానే జాబ్‌ల జాతరకు లైన్‌క్లియర్ కానుంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్–4 కేటగిరీలో 9వేల ఉద్యో గాలకు సంబంధించి ఇప్పటికే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్(జీఆర్ఎల్)ను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. దీంతో పాటు అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కేటగిరీలో దాదాపు 2వేలకు పైబడి ఉద్యోగాలున్నాయి. వీటికి కూడా జీఆర్ఎల్ విడుదల చేశారు. భూగర్భ జలవనరుల శాఖలో గెజిటెడ్ అధికారులు, పట్టణ ప్రణాళిక విభాగం, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, ఇతర సంక్షేమ శాఖలు, ఇంటర్మీడియట్ విద్య, సాంకేతిక విద్య ఇలా పలు విభాగాల్లో దాదాపు 5వేల ఉద్యోగాలకు సంబంధించిన కసరత్తు ఓ కొలిక్కి వచ్చింది. హారిజాంటల్ రిజర్వేషన్లకు అనుగుణంగా ఆయా శాఖల నుంచి సవరించిన రోస్టర్ జాబితాలకు అనుగుణంగా ఖాళీల వివరాలను సైతం టీఎస్పీఎస్సీ తెప్పించింది. ఆ మేరకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ వేగవంతం చేసింది. తాజాగా ఒక్కో కేటగిరీలో జిల్లాస్థాయిలో 1:2 నిష్పత్తి, జోనల్, మల్టీ జోనల్ కేటగిరీల్లో 1:3 నిష్పత్తిలో ప్రాథమిక ఎంపిక జాబితాలను సైతం రూపొందిస్తోంది. ప్రాథమిక ఎంపిక జాబితాల ప్రక్రియ అనంతరం అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తిచేసి తుది జాబితాలను విడుదల చేస్తుంది. ఈ ప్రక్రియ జూన్ రెండోవారంకల్లా పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. ఆలోపు పార్లమెంట్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి సైతం తొలగిపోనుంది. దీంతో టీఎస్పీఎస్సీ తుది జాబితాలను బహిర్గతం చేసిన తర్వాత ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందిస్తారు. జూన్ మూడోవారం నుంచి నియామక పత్రాల పంపిణీ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. గురుకుల పోస్టుల్లో కూడా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన దాదాపు 1500 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వలేదు. పార్లమెంట్ కోడ్ ముగియగానే జూన్ మొదటివారం తర్వాత వీరికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారు. ఫిబ్రవరి నుంచే.. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా వివిధ కేటగిరీల్లో ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థులకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి నియామక పత్రాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి వరుసగా పోలీస్‌శాఖలో కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలతో పాటు వైద్య,ఆరోగ్య శాఖ పరిధిలో స్టాఫ్ నర్సులు, గురుకుల విద్యాసంస్థల్లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ తదితర కేటగిరీల్లో దాదాపు 33వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలను రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. ఇవన్నీ తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామకాల బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ), తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ), తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు(టీఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) ద్వారా భర్తీ చేసినవే. మూడు బోర్డుల ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలు ఒక ఎత్తయితే... టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలు మరో ఎత్తు. ఎందుకంటే ఈ మూడు బోర్డుల పరిధిలోని ఉద్యోగాల సంఖ్యతో దాదాపు సమానంగా టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఉంటుంది. ప్రస్తుతం టీఎస్పీఎస్సీ పలు కేటగిరీల్లో అర్హత పరీక్షలు నిర్వహించి ఫలితాల విడుదలకు కసరత్తు చేస్తోంది. -
AP: పలు జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీల నియామకం
సాక్షి, విజయవాడ: ఏపీలో మూడు జిల్లాలకు కలెక్టర్లు, 5 జిల్లాలకు ఎస్పీలను నియామకం జరిగింది. ఇటీవల బదిలీ చేసిన అధికారుల స్థానంలో ఎన్నికల కమిషన్ నియామకాలు చేపట్టింది. ఈ రోజు రాత్రి 8 గంటల లోపు విధుల్లోకి చేరాలని ఈసీ తెలిపింది. ►కృష్ణ కలెక్టర్‌గా డీకే బాలాజీ ►అనంతపురం కలెక్టర్‌గా వినోద్ కుమార్ ►తిరుపతి కలెక్టర్‌గా ప్రవీణ్ కుమార్ ►ప్రకాశం ఎస్పీగా సుమిత్ సునీల్ ►పల్నాడు ఎస్పీగా బిందు మాధవ్ ►చిత్తూరు ఎస్పీగా మణికంఠ చందోలు ►అనంతపురం ఎస్పీగా అమిత్ బర్దర్ ►నెల్లూరు ఎస్పీగా అరిఫ్ హఫీజ్ ►గుంటూరు ఐజీగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి బదిలీ -
టీ.కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గాల ఇంఛార్జ్‌ల నియామకం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదునుపెడుతోంది. తెలంగాణలోని మొత్తం 17 లోక్‌సభ సెగ్మెంట్లకు ఇంఛార్జీలను ఆ పార్టీ నియమించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ ఉత్తర్వులు జారీ చేశారు. టీ.కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గాల ఇంఛార్జీలు భవనగిరి-కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నాగర్ కర్నూల్- జూపల్లి కృష్ణారావు ఖమ్మం-పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నల్గొండ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వరంగల్-రేవూరి ప్రకాశ్‌రెడ్డి మహబూబాబాద్-తుమ్మల నాగేశ్వర్రావు నిజామాబాద్- సుదర్శన్‌రెడ్డి ఆదిలాబాద్-సీతక్క కరీంనగర్- పొన్నం ప్రభాకర్, పెద్దపల్లి-శ్రీధర్‌బాబు హైదరాబాద్-ఒబెదుల్లా కొత్వాల్ సికింద్రాబాద్-కోమటిరెడ్డి వెంకటరెడ్డి మహబూబ్‌నగర్-సంపత్, చేవెళ్ల-వేం నరేందర్‌రెడ్డి మల్కాజ్గిరి-మైనంపల్లి హన్మంతరావు మెదక్- కొండా సురేఖ జహీరాబాద్-దామోదర రాజనర్సింహ -
అంతా నిబంధనల మేరకే
న్యూఢిల్లీ: ఇద్దరు నూతన కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామకం నిబంధనల మేరకే జరిగిందని కేంద్రం పేర్కొంది. ఈ ప్రక్రియ హడావుడిగా జరిగిందన్న ఆరోపణలను తోసిపుచి్చంది. ఈసీల ఎంపిక కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేకపోవడాన్ని సమరి్థంచుకుంది. ఎంపిక కమిటీలో న్యాయవ్యవస్థ ప్రాతినిధ్యమే ఈసీ స్వతంత్ర ప్రతిపత్తికి ప్రాతిపదిక కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ సుప్రీంకోర్టులో బుధవారం అఫిడవిట్ దాఖలు చేసింది. ఈసీల ఎంపిక కమిటీ నుంచి సీజేఐని మినహాయించడాన్ని సవాలు చేస్తూ కోర్టులో ఈ కేసులో తదుపరి విచారణ గురువారం జరగనుంది. -
ఈసీల నియామకం.. సుప్రీంకోర్టు తీర్పుపై ఉత్కంఠ
న్యూఢిల్లీ: కొత్త చట్టం ప్రకారం ఎన్నికల కమిషనర్ల నియామకం చేపట్టవద్దని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్)అనే సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం(మార్చ్ 15) విచారించనుంది. ఫిబ్రవరిలో ఎన్నికల కమిషనర్ అనూప్‌చంద్ర పాండే రిటైర్ అవడం, ఇటీవలే మరో ఎన్నికల కమిషనర్ అరుణ్‌గోయెల్ ఆకస్మికంగా తన పదవికి రాజీనామా చేయడంతో లోక్‌సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఎన్నికల కమిషన్‌లో రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ రెండు ఖాళీలను నింపేందుకు ప్రధాని నేతృత్వంలోని కమిటీ ఈ వారంలోనే సమావేశమవనుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏడీఆర్ వేసిన పిటిషన్‌ను లిస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కొత్త చట్టం ప్రకారం ఈ కమిటీలో ప్రధాని, కేంద్ర మంత్రి, లోక్‌సభలో ప్రతిపక్షనేత సభ్యులుగా ఉంటారు. గతంలో ఉన్న చట్టం ప్రకారం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా(సీజేఐ) కమిటీలో సభ్యుడిగా ఉండగా కొత్త చట్టంలో ఆయన స్థానంలో కేంద్రమంత్రికి అవకాశం కల్పించారు. అయితే ఎంపిక కమిటీ నుంచి సీజేఐని తప్పించిన తర్వాత తొలిసారి ఈసీలను కేంద్రం ఎంపిక చేస్తుండటంతో ఏడీఆర్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు చెప్పనుందనేదానిపై ఉత్కంఠ నెలకొంది. కాగా, లోక్‌సభ ఎన్నిలకు త్వరలో షెడ్యూల్ వెలువడనుండగా ఎన్నికల కమిషనర్ అరుణ్‌గోయెల్ ఇటీవల ఆకస్మికంగా రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. సీఈసీతో ఉన్న విభేదాల కారణంగానే గోయెల్ తన పదవికి రాజీనామా చేశారన్న ప్రచారం జరిగింది. అరుణ్‌గోయెల్ ఆకస్మిక రాజీనామాతో ఎన్నికల కమిషన్ విశ్వసనీయతపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఇదీ చదవండి.. ఈసీ కసరత్తులు చివరికి ఎల్లుండే షెడ్యూల్ -
డిప్యూటీ సీఎం పదవులు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
న్యూఢిల్లీ: డిప్యూటీ సీఎం పదవులపై సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పు వెల్లడించింది. ఈ పదవులపై రాజ్యాంగంలో ఎలాంటి ప్రస్తావన లేకపోయినప్పటికీ డిప్యూటీసీఎంల నియామకం చట్ట విరుద్ధం కాదని చీఫ్ జస్టిస్ డీవైచంద్రచూడ్, జస్టిస్ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం పేర్కొంది. డిప్యూటీ సీఎంల నియామకాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీకి చెందిన ఓ రాజకీయ పార్టీ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వాజ్యాన్ని కోర్టు ఈ సందర్భంగా కొట్టివేసింది. ‘కొన్ని రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎంలను నియమిస్తున్నారు. మంత్రి వర్గంలోని సీనియర్ లీడర్లకు ప్రాధాన్యం ఇవ్వడానికి లేదా సంకీర్ణంలోని పార్టీలకు సముచిత స్థానం కల్పించడానికి డిప్యూటీ సీఎంలను అపాయింట్ చేస్తున్నారు. పేరుకు డిప్యూటీ సీఎం అని పిలిచినప్పటికీ ఆయన కూడా మంత్రి వర్గంలో ఒక మంత్రే. డిప్యూటీ సీఎంల నియామకం రాజ్యాంగంలోని ఏ నిబంధనను ఉల్లంఘించడం లేదు’అని సుప్రీంకోర్టు తెలిపింది. ప్రస్తుతం దేశంలోని 14 రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎంలు ఉండటం గమనార్హం. ఇదీ చదవండి.. తమిళనాడు సర్కారుకు గవర్నర్ షాక్ -
TS: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు వీరే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఎంపిక చేశారు. ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామ్, మీర్ అమీర్ అలీఖాన్‌ను ఎంపిక చేస్తూ గవర్నర్ ఆమోదం తెలిపారు. వారం రోజుల క్రితం ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లను గవర్నర్‌కు ప్రభుత్వం పంపింది. దావోస్ పర్యటనకు ముందు పేర్లను గవర్నర్‌కు పంపగా, నిన్న గవర్నర్ తో భేటీ సందర్భంగా ఎమ్మెల్సీల అంశం చర్చకు వచ్చింది. ఇవాళ లేదా రేపు గవర్నర్ అధికారిక ప్రకటన చేయనున్నారు. కాగా, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) చైర్మన్‌గా ఎం. మహేందర్‌రెడ్డిని నియామకం ఖరారైంది. మాజీ డీజీపీ అయిన మహేందర్‌రెడ్డి నియామకాన్ని ఆమోదిస్తూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గురువారం నిర్ణయం తీసుకున్నారు. అలాగే టీఎస్పీఎస్సీ సభ్యులుగా రిటైరర్డ్ ఐఏఎస్ అనిత రాజేంద్ర, పాల్వాయి రజనీ కుమారి, అమీర్ ఉల్లా ఖాన్, యాదయ్య, వై రాంమోహన్‌రావు నియమితులయ్యారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ పోస్టింగ్ కోసం మొత్తంగా 370 వరకు దరఖాస్తులు అందాయి. ప్రభుత్వం సెర్చ్ కమిటీని నియమించి.. దరఖాస్తుల పరిశీలన, అర్హులను సూచించే బాధ్యతలను అప్పగించింది. కమిటీ వేగంగా దరఖాస్తుల పరిశీలన చేపట్టింది. చైర్మన్ పదవి కోసం దరఖాస్తు చేసినవారిలోంచి మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి పేరును ప్రభుత్వానికి సూచించింది. ప్రభుత్వం ఆ పేరును గవర్నర్‌కు పరిశీలనకు పంపింది. చివరకు గవర్నర్ ఆయన నియామకానికి ఆమోదం తెలిపారు. ఇదీ చదవండి: బాలకృష్ణ అక్రమార్జన.. అధికారులే కంగుతినేలా..! -
టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ప్రక్షాళనకు అడుగులు పడ్డాయి. టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 18వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హులైన అభ్యర్థులు www.telangana.gov.in వెబ్సైట్ నుంచి దరఖాస్తు నమూనా పత్రాలను డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించింది. కాగా, దాదాపు నెలరోజులుగా పెండింగ్‌లో ఉన్న చైర్మన్ జనార్ధన్‌రెడ్డి, సభ్యుల రాజీనామాలకు గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ బుధవారం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. టీఎస్పీఎస్సీలో చైర్మన్‌తో పాటు 10 సభ్యులుంటారు. కానీ గత ప్రభుత్వం చైర్మన్, ఆరుగురు సభ్యులను మాత్రమే నియమించింది. వీరిలో ఒక సభ్యుడు పదవీ విరమణ పొందగా..ఐదుగురు కొనసాగుతూ వచ్చారు. అయితే ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం, కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో చైర్మన్ బి.జనార్దన్ రెడ్డి, సభ్యులు ఆర్.సత్యనారాయణ, ప్రొఫెసర్ బండి లింగారెడ్డి, కె.రవీందర్ రెడ్డి రాజీనామాలు సమర్పించారు. రాజీనామాలను గవర్నర్ ఆమోదించిన మరుక్షణమే టీఎస్పీఎస్సీకి కొత్త చైర్మన్, సభ్యులను నియమిస్తామని డిసెంబర్ 27న సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం నియామకాలు చేపడ్తామని, నిరుద్యోగులెవరూ ఆందోళనకు గురికావద్దని అన్నారు. తాజాగా నియామక ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం టీఎస్పీఎస్సీ పరిధిలో దాదాపుగా అన్ని కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఇదీ చదవండి: సంక్రాంతి ఎఫెక్ట్: విజయవాడ హైవేపై కదలని వాహనాలు -
YSRCP: మూడు అనుబంధ విభాగాలకు సహాధ్యక్షుల నియామకం
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన అనుబంధ విభాగాలను మరింత విస్తృతం చేసింది. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో YSRCP మూడు అనుబంధ విభాగాలకు రాష్ట్ర సహాధ్యక్షుల నియామకం జరిగింది. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర సహాధ్యక్షులుగా గుర్రంపాటి దేవేందర్ రెడ్డి, సేవాదళ్ విభాగం రాష్ట్ర సహాధ్యక్షులుగా డా.కట్టి వెంకటేశ్వర్లు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ సహాధ్యక్షులుగా బసిరెడ్డి సిద్ధారెడ్డి నియమితులయ్యారు. సిద్ధారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. అన్నమయ్య జిల్లాకు చెందిన సిద్ధారెడ్డి పార్టీ రాష్ట్ర కార్యదర్శిగానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తనపై నమ్మకముంచి తనకు కీలకమైన బాధ్యతలు అప్పగించిన పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిగారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని, పార్టీ ప్రచార బాధ్యతలను నెరవేర్చడానికి శక్తి వంచన లేకుండా పనిచేస్తానని సిద్ధారెడ్డి తెలియజేశారు. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షుడిగా ఇప్పటికే ఆర్. ధనుంజయ్‌రెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బసిరెడ్డి సిద్ధారెడ్డి, YSRCP రాష్ట్ర ప్రచారకమిటీ సహాధ్యక్షులు గుర్రంపాటి దేవేందర్‌రెడ్డి, YSRCP పంచాయతీ రాజ్ విభాగం సహాధ్యక్షులు కట్టి వెంకటేశ్వర్లు, YSRCP సేవాదళ్ విభాగం సహాధ్యక్షులు ఇదీ చదవండి: జగన్ పదునైన ప్రశ్నలు.. ఇంకేం ఇద్దరూ గప్‌చుప్! -
Winter Parliament Session 2023: సీఈసీ, ఈసీల నియామకానికి ప్రధానమంత్రి ప్యానెల్!
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ), ఎన్నికల కమిషనర్ల(ఈసీ) నియామకం కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన కీలక బిల్లును లోక్‌సభ గురువారం ఆమోదించింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్, అదర్ ఎలక్షన్ కమిషనర్స్ (అపాయింట్మెంట్, కండీషన్స్ ఆఫ్ సరీ్వస్ అండ్ టర్మ్ ఆఫ్ ఆఫీస్) బిల్లు–2023ని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ సభలో ప్రవేశపెట్టారు. స్వల్పకాలిక చర్చ అనంతరం మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లును ఈ నెల 12న రాజ్యసభ ఆమోదించిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే బిల్లును తీసుకొచి్చనట్లు అర్జున్‌రామ్ మేఘ్వాల్ లోక్‌సభలో చర్చ సందర్భంగా ప్రకటించారు. ఈసీసీ, ఈసీల సరీ్వసు నిబంధనలకు సంబంధించి 1991 నాటి చట్టంలో కొన్ని అంశాలు అపరిష్కృతంగా ఉన్నాయని, వాటిని పరిష్కరిస్తూ కొత్త బిల్లును రూపొందించినట్లు తెలియజేశారు. ప్రతిపాదిత కొత్త చట్టం సుప్రీంకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఉందన్న వాదనను ఆయన కొట్టిపారేశారు. సీఈసీ, ఈసీల నియామకానికి చట్టాన్ని తీసుకొచ్చేవరకూ ముగ్గురు సభ్యులతో ఒక ప్యానెల్ ఏర్పాటు చేయాలని ఈ ఏడాది మార్చి నెలలో ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించిందని అన్నారు. ఈ ప్యానెల్లో ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సభ్యులుగా ఉండాలని పేర్కొందని గుర్తుచేశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగానే బిల్లును తయారు చేసినట్లు స్పష్టం చేశారు. రాజ్యాంగం నిర్దేశించిన అధికారాల విభజనకు అనుగుణంగా రూపొందించామని అన్నారు. అలాగే సీఈసీ, ఈసీల హోదా, వేతనాలకు సంబంధించిన సవరణలను కూడా బిల్లులో పొందుపర్చారు. బిల్లులో ఏముంది? ► ప్రస్తుతం సీఈసీ, ఈసీలను కేంద్ర ప్రభుత్వ సిఫార్సు మేరకు రాష్ట్రపతి నియమిస్తున్నారు. ► సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సీఈసీ, ఈసీల నియామకం ఇకపై ప్రధానమంత్రి నేతృత్వంలోని ప్యానెల్ పరిధిలోకి రానుంది. అంటే కార్యనిర్వాహక వర్గమే సీఈసీ, ఈసీలను నియమిస్తుంది. ► బిల్లు చట్టంగా మారిన తర్వాత సీఈసీ, ఈసీల నియామకం కోసం కేంద్ర న్యాయ శాఖ మంత్రి ఆధ్వర్యంలో సెర్చ్ కమిటీని ఏర్పాటు ఏయాల్సి ఉంటుంది. ఇందులో ఇద్దరు కేంద్ర కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. సీఈసీ, ఈసీల నియామకం కోసం ఐదుగురి పేర్లతో షార్ట్‌లిస్టు తయారు చేసి సెలక్షన్ కమిటీకి పంపించాలి. ► ఆ తర్వాత ప్రధానమంత్రి నేతృత్వంలో ఒక కేంద్ర మంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేతతో కూడిన ప్యానెల్ ఎన్నికల సంఘం సభ్యులను ఎంపిక చేస్తుంది. ► ఒకవేళ లోక్‌సభలో ప్రతిపక్ష నేత లేకపోతే సభలోని ఏకైక అతిపెద్ద పార్టీ నాయకుడిని సెలక్షన్ ప్యానెల్లో సభ్యుడిగా నియమిస్తారు. ► సెర్చ్ కమిటీ సూచించిన షార్ట్‌లిస్టులో లేని పేర్లను కూడా పరిగణనలోకి తీసుకొనే అధికారం ప్యానెల్‌కు ఉంటుంది. ► సవరించిన బిల్లు ప్రకారం.. సీఈసీ, ఈసీలకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సమాన హోదా లభిస్తుంది. ► సీఈసీ, ఈసీలకు సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సమానంగా వేతనం చెల్లిస్తారు. ► అధికారిక విధులు నిర్వర్తించే క్రమంలో సీఈసీ, ఈసీలకు కోర్టు కేసుల నుంచి రక్షణ కలి్పస్తూ సవరణ బిల్లులో కొన్ని అంశాలు చేర్చారు. ► సీఈసీ సిఫార్సు లేకుండా ఈసీలను పదవి నుంచి తొలగించడానికి వీల్లేదు. ► సుప్రీంకోర్టు జడ్జిని పదవి నుంచి తొలగించడానికి ఉపయోగించే ప్రక్రియనే సీఈసీ విషయంలోనూ ఉపయోగించాలి. ► సెక్రెటరీ ర్యాంకు లేదా సమాన హోదా ఉన్నవారిని మాత్రమే సీఈసీ, ఈసీలుగా నియమించాలి. ► సీఈసీ, ఈసీలపై గతంలోనే కేసులు ఉంటే.. వారు పదవుల్లో ఉన్నంతకాలం ఆయా కేసుల్లో విచారణ కొనసాగించకూడదు. గతంలో సీఈసీ రాజీవ్ కుమార్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించిన స్పెషల్ సెషన్స్ జడ్జిని తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని పదవుల్లో ఉన్న సీఈసీ, ఈసీలపై విచారణ కొనసాగించకూడదన్న నిబంధననను బిల్లులో చేర్చారు. -
నూతన సీపీలు, ఎస్పీల నియామకంపై డీజీపీ కసరత్తు.. హైదరాబాద్ సీపీ రేసులో ఉన్నది వీరే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలపై 20 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, నాన్ కేడర్ ఎస్పీలపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ సీపీ సహా ముగ్గురు పోలీసు కమిషనర్లు, నాలుగు జిల్లాల కలెక్టర్లు, 10 జిల్లాల ఎస్పీలు, ఓ శాఖ కార్యదర్శి, మరో శాఖ డైరెక్టర్, ఇంకో శాఖ కమిషనర్లపై బదిలీ వేటు వేసింది. వీరిలో 18 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, నాన్ కేడర్ ఎస్పీలకు శాసనసభ ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి బాధ్యతలు అప్పగించకూడదని ఆంక్షలు విధించింది. బదిలీ అయిన అధికారులు సత్వరమే బాధ్యతల నుంచి తప్పుకొని తమ తర్వాతి స్థానంలో ఉన్న అధికారికి బాధ్యతలు అప్పగించాలని స్పష్టం చేసింది. ఈ మూడు శాఖలకు కొత్త ముఖ్య కార్యదర్శులతోపాటు బదిలీ వేటుపడిన 20 మంది అధికారుల స్థానంలో ఈ రోజు సాయంత్రం 5 గంటల్లోగా కొత్త అధికారులను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది ఈ క్రమంలో నూతన సీపీలు, ఎస్పీల నియామకంపై డీజీపీ అంజనీకుమార్ కసరత్తు ప్రారంభించారు. సీఈసీకి పంపే లిస్ట్‌ను డీజీపీ సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్ సీపీ రేసులో మహేష్ భగవత్, షికా గోయల్, శివధర్‌రెడ్డి, కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, నాగిరెడ్డి, సజ్జనార్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ముగ్గురి పేర్లతో సీఈసీకి ప్రభుత్వం లిస్ట్ పంపనుంది. ప్రతి పోస్టుకు ముగ్గురు పేర్లతో జాబితాను ప్రభుత్వం పంపనుంది. ఆ ముగ్గురిలో ఒకరిని ఆయా పోస్టుల్లో ఈసీ ఎంపిక చేయనుంది. రాష్ట్ర సర్కార్ పంపిన ముగ్గురి జాబితాలోని పేర్లపై అభ్యంతరాలు ఉంటే ఈసీ తిరస్కరించే అవకాశం ఉంది. మళ్లీ కొత్తగా పేర్లు ప్రతిపాదన చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈసీ కోరనుంది. ఈసీ ఫైనల్ చేసిన తర్వాత ఆయా నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది.