జిల్లా ఇన్‌చార్జి మంత్రుల నియామకం | The appointment of district in-charge ministers | Sakshi
Sakshi News home page

జిల్లా ఇన్‌చార్జి మంత్రుల నియామకం

Published Sat, May 16 2015 2:18 AM | Last Updated on Sun, Sep 3 2017 2:06 AM

The appointment of district in-charge ministers

చిత్తూరు జిల్లా ఇన్‌చార్జిగా నారాయణ  కేఈకి దక్కని అవకాశం
హైదరాబాద్: జిల్లాలకు ఇన్‌చార్జి మంత్రులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్‌చార్జి మంత్రుల ఆధ్వర్యంలో ఆయా జిల్లాల్లో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాల అమలు తీరు తెన్నులను సమీక్షిస్తారు. ఉద్యోగుల బదిలీలను కూడా వీరి ఆధ్వర్యంలోనే చేయనున్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరు ఇన్‌చార్జి మంత్రిగా మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ నియమితులయ్యారు. సీనియర్, ఉప ముఖ్యమంత్రి కె.ఈ. కృష్ణమూర్తిని ఏ జిల్లాకూ నియమించలేదు.

వివరాలు.. పరిటాల సునీత (శ్రీకాకుళం), పల్లె రఘునాథరెడ్డి (విజయనగరం), యనమల రామకృష్ణుడు (విశాఖపట్నం), దేవినేని ఉమా మహేశ్వరరావు (తూర్పుగోదావరి), చింతకాయల అయ్యన్నపాత్రుడు (పశ్చిమగోదావరి), ప్రత్తిపాటి పుల్లారావు (కృష్ణాజిల్లా), నిమ్మకాయల చిన రాజప్ప (గుంటూరు), రావెల కిషోర్‌బాబు (ప్రకాశం), శిద్ధా రాఘవరావు (నెల్లూరు), పి. నారాయణ (చిత్తూరు), గంటా శ్రీనివాసరావు (వైఎస్సార్(కడప), కె.అచ్చెన్నాయుడు (కర్నూలు), కామినేని శ్రీనివాస్ (అనంతపురం).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement