కొత్త జిల్లాలకు ఇన్‌చార్జ్ మంత్రులు | Telangana new districts help ministers, many to become district in-charge | Sakshi
Sakshi News home page

కొత్త జిల్లాలకు ఇన్‌చార్జ్ మంత్రులు

Published Fri, Oct 21 2016 2:09 AM | Last Updated on Wed, Oct 17 2018 3:38 PM

Telangana new districts help ministers, many to become district in-charge

ఒక్కో మంత్రికి రెండు జిల్లాల అప్పగింత
 సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాలకు ఇన్‌చార్జ్ మంత్రులను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పునర్వ్యవస్థీకరణతో పెరిగిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా మంత్రులకు ఇన్‌చార్జ్ బాధ్యతలను అప్పగించాలని యోచిస్తోంది. నియోజకవర్గాల అభివృద్ధికి ప్రభుత్వం ఇచ్చే ప్రత్యేక అభివృద్ధి నిధిని (ఎస్‌డీఎఫ్) ఖర్చు చేసే కీలక బాధ్యతలు ఇన్‌చార్జి మంత్రులకు అప్పగించిన విషయం తెలిసిందే. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌కు రూ.2 కోట్ల అభివృద్ధి నిధిని తెలంగాణ ప్రభుత్వం కేటాయిస్తోంది.
 
 ముఖ్యమంత్రి మొదలు మంత్రులు, ఎమ్మెల్యేలందరి కోసం ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌లో దాదాపు రూ.5,000 కోట్లు ప్రత్యేక నిధిగా పొందుపరిచారు. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటికి రూ.238 కోట్లు కేటాయించిన ప్రభుత్వం పనుల గుర్తింపు, మంజూరీ బాధ్యతలను ఇన్‌ఛార్జీ మంత్రులకు అప్పగించింది. గతంలో ఉన్న పది జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహించే మంత్రులు రాష్ట్ర కేబినెట్‌లో ఉన్నారు. దీంతో వారికే ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగించారు.
 
  ఇప్పుడు కొత్త జిల్లాలు ఏర్పడటంతో కొన్ని జిల్లాల నుంచి మంత్రివర్గంలో ప్రాధాన్యం లేకుండా పోయింది. ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో పాటు 18 మంది మంత్రులున్నారు. కానీ జిల్లాల సంఖ్య 31కి చేరింది. దీంతో ఒక్కో మంత్రికి రెండు జిల్లాల చొప్పున ఇన్‌చార్జి బాధ్యతలు ఇవ్వాల్సి ఉంది. ఎస్‌డీఎఫ్ నిధుల వినియోగపు అవసరాల దృష్ట్యా ప్రణాళిక విభాగం ఇన్‌చార్జ్ మంత్రుల ఫైలును సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి ఆమోదానికి పంపించినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement