సాక్షి, హైదరాబాద్: ఫలానా వర్గానికి చెందిన వ్యక్తులను మంత్రులుగా నియమించడం తప్పనిసరి అని (కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక శాఖలు మినహా) రాజ్యాంగంలో ఎక్కడా లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. మంత్రి మండలి కూర్పులో కుల, మత, లింగ, వర్గ వివక్షకు తావు లేదని స్పష్టం చేసింది. రాష్ట్ర మంత్రి మండలిలో ఎవరికి స్థానం కల్పించాలన్నది ముఖ్యమంత్రి విచక్షణపైనే ఆధారపడి ఉంటుందంది. అయితే మంత్రిగా నియమితులైన వ్యక్తి రాజ్యాం గం ప్రకారం అనర్హుడైతే తప్ప, ఇటువంటి వ్యవహారాల్లో 226 కింద న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని హైకోర్టు స్పష్టం చేసింది.
కేసీఆర్ మంత్రి వర్గంలో మహిళలకు స్థానం కల్పించకపోవడాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని వరంగల్ అ ర్బన్ జిల్లా, సుబేదారికి చెందిన న్యాయవాది శ్రీశైలం దాఖలు చేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్ట తిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామ సుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం 4 రోజుల క్రితం తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా శ్రీశైలం వాదనలు వినిపిస్తూ, మంత్రి మండలిలో ఒక్క మహిళకు సైతం స్థానం కల్పించకపోవడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఇది కుల వివక్షే కాక, లింగ వివక్ష కూడా అని అన్నారు. వాదనలు విన్న ధర్మాసనం, చివరకు ఈ వ్యాజ్యాన్ని కొట్టేసింది.
Comments
Please login to add a commentAdd a comment