New Districts
-
యూపీలో కొత్తగా మహా కుంభమేళా జిల్లా
ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో మరో జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు ప్రయాగ్‌రాజ్ జిల్లా పరిధిలో ఉన్న ఈ ప్రాంతానికి ఇకపై కొత్త గుర్తింపు రానుంది. ఈ జిల్లా పేరు మహాకుంభమేళా. ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ అధికారులతో సమావేశమైన అనంతరం దీనిపై ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ప్రయాగ్‌రాజ్ జిల్లా మేజిస్ట్రేట్ ఒక నోటిఫికేషన్ జారీ చేస్తూ, ఈ విషయాన్ని ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.జనవరిలో రాబోయే కుంభమేళాను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. డీఎం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం కొత్తగా ఏర్పాటైన జిల్లాను మహాకుంభమేళా జిల్లాగా పిలవనున్నారు. కుంభమేళాను సజావుగా నిర్వహించేందుకు, పరిపాలనా పనులను మరింత మెరుగ్గా నిర్వహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.మహా కుంభమేళా జిల్లాలో ఇండియన్ సివిల్ సెక్యూరిటీ సెక్షన్ 14 (1) ప్రకారం ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, జిల్లా మేజిస్ట్రేట్, అదనపు జిల్లా మేజిస్ట్రేట్లను నియమించనున్నారు. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే మహాకుంభమేళా ప్రయాగ్‌రాజ్‌లో 2025, జనవరి 13 నుండి ప్రారంభమై 2025, ఫిబ్రవరి 26 వరకూ కొనసాగనుంది.ఇది కూడా చదవండి: నేడు రైతుల ఆందోళన.. ప్రభుత్వం అప్రమత్తం -
సికింద్రాబాద్ ప్రత్యేక జిల్లా కోసం ఆందోళనలు
సికింద్రాబాద్ ప్రాంత ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి నిరసలుగా మారి మళ్లీ లష్కర్ ప్రత్యేక జిల్లా ఉద్యమం ఊపందుకుంది. లష్కర్ ప్రత్యేక జిల్లా సాధన సమితి పేరుతో ఆవిర్భవించిన ఉద్యమం క్రమేణా ఉధృతం అవుతున్న నేపథ్యంలో ‘సాక్షి’ ‘మీతో సాక్షి’ కార్యక్రమాన్ని నిర్వహించింది. సికింద్రాబాద్ క్లాక్‌టవర్, ఖైరతాబాద్ గణపతి వేదిక వద్ద ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టింది. ఈ సందర్భంగా లష్కర్ జిల్లా సాధనకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సమితి ప్రతినిధులు, ఈ ప్రాంత ప్రజలు స్పష్టం చేశారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటులో సికింద్రాబాద్ నగరానికి అన్యాయం జరిగిందనే వాదన ఈ ప్రాంత ప్రజల్లో బలంగా నెలకొంది. అప్పట్లో సికింద్రాబాద్ జిల్లా ఏర్పాటుకు సన్నాహాలు చేశారు. కలెక్టరేట్ నిర్మాణం కోసం స్థల పరిశీలన కూడా చేశారు. అయితే హైదరాబాద్ జిల్లా ప్రాధాన్యం తగ్గుతుందన్న ఒకే ఒక్క కారణంతో సికింద్రాబాద్ జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం స్వస్తి పలికిందన్న ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలో రెండు, మూడు నియోజకవర్గాల పరిధితో కొత్త జిల్లాను ఏర్పాటు చేసి చరిత్రాత్మక సికింద్రాబాద్ నగరాన్ని జిల్లాగా ఏర్పాటు చేయకపోవడం పట్ల లష్కర్ ప్రజల్లో నిరసనలు మొదలయ్యాయి. ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్‌గా ఉన్న సికింద్రాబాద్‌ను హైదరాబాద్‌లో విలీనం చేసి ఒకమారు, జిల్లా ఏర్పాటు చేయకుండా మరోమారు ఈ ప్రాంతానికి అన్యాయం చేశారని అప్పట్లో వివిధ రంగాల ప్రతినిధులు నిరసనలు చేపట్టారు. అమలుకు నోచుకోని విలీన షరతులుసికింద్రాబాద్ నగరానికి 1960 నుంచి జరుగుతున్న వరుస అన్యాయాలు, వివక్షతో క్రమేణా ప్రాభవం తగ్గిందని ఆ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధిలోనూ పూర్తిగా వెనుకబడిందని వారు పేర్కొంటున్నారు. ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్‌గా ఉన్న సికింద్రాబాద్‌ను 1960లో హైదరాబాద్ కార్పొరేషన్లో విలీనం చేశారు. విలీనం నాటి నుంచి ఇప్పటి వరకు పన్నుల రూపంలో ఇక్కడి నుంచి గణనీయమైన ఆదాయం చేకూరుతున్నా అభివృద్ధి పనులకు మాత్రం ఆశించిన మేర నిధులు రావడం లేదన్న విమర్శలు ఉన్నాయి. కార్పొరేషన్ల విలీనం సందర్భంగా మేయర్, డిప్యూటీ మేయర్ల నియామకం, నిధుల కేటాయింపు తదితర అంశాలపై రూపొందించిర షరతులను విస్మరించారన్న వాదనలున్నాయి. ప్రత్యేక ప్యాకేజీని మరిచారు...బేగంపేట విమానాశ్రయం, గాంధీ ఆసుపత్రి, ఉస్మానియా యూనివర్సిటీ, పలు రైల్వేస్టేషన్లతోపాటు ప్యారడైజ్, మోండా మార్కెట్, జనరల్‌బజార్, రాణిగంజ్ వంటి చారిత్రాత్మక వ్యాపార వాణిజ్య కేంద్రాలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో రహదారులు, ట్రాఫిక్ సమస్యలు యధాతథంగా ఉండడం ఈ ప్రాంత ప్రజలను అసంతృప్తికి గురి చేస్తున్నాయి.చదవండి: అద్దె అర లక్ష! హైదరాబాద్‌లో హడలెత్తిస్తున్న హౌస్ రెంట్సికింద్రాబాద్ నగరం 200 సంవత్సరాలు నిండిన నేపథ్యంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ద్విశతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించి అభివృద్ధి కోసం రూ.200 కోట్ల ప్యాకేజీని ప్రకటించినా అమలుకు నోచుకోలేదు. ద్విశతాబ్ది వేడుకల సందర్భంగా అయినా ప్రత్యేక ప్యాకేజీతో ఈ ప్రాంతంలో ఓ మోస్తరు అభివృద్ధి జరుగుతుందని ఆశించిన ప్రజలకు భంగపాటే ఎదురైంది.ప్రత్యేక జిల్లాకు అర్హతలు ఇవీ.. పరిధి: సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గాలు (7): సికింద్రాబాద్, ముషీరాబాద్, అంబర్పేట్, ఖైరతాబాద్, నాంపల్లి, జూబ్లీహిల్స్, సనత్‌నగర్. మున్సిపల్ డివిజన్లు: 42 ప్రత్యేక జిల్లాతోనే న్యాయం నగరాల అభివృద్ధిలో నా బాల్యం నుంచి సికింద్రాబాద్‌కు ప్రాధాన్యం దక్కలేదు. ప్రత్యేక జిల్లా ఏర్పాటు ద్వారా ఈ ప్రాంత ప్రజలకు అన్ని విధాల న్యాయం జరిగే అవకాశం ఉంది. వివిధ ప్రభుత్వ కార్యాలయాలు రావడం ద్వారా ఈ ప్రాంతం సత్వర అభివృద్ధి సాధిస్తుంది. ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుంది. దశాబ్దాల కాలంగా జరుగుతున్న అసమానతలను సవరించుకునేందుకు మార్గం సుగమం అవుతుంది. – విజయ్‌కుమార్, సికింద్రాబాద్ సీనియర్ సిటిజన్ఉద్యమానికి అనూహ్య స్పందన జిల్లా సాధన సమితి చేపట్టిన ఉద్యమానికి సికింద్రాబాద్ ప్రాంత ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభిస్తుంది. ఏడాది కాలంగా సికింద్రాబాద్ ప్రాంతానికి జరిగిన అన్యాయాలపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేశాం. ప్రజాప్రతినిధులకు సమస్యను వివరించాం. మున్ముందు ఆందోళనలు ఉధృతం చేస్తాం. – సాదం బాల్‌రాజ్‌యాదవ్,ప్రధాన కార్యదర్శి జిల్లా సాధన సమితిప్రభుత్వంపై ఒత్తిడితో సాధిస్తాం ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం ద్వారా సికింద్రాబాద్ ప్రత్యేక జిల్లాను సాధించుకుంటాం. ఇప్పటికే రాష్ట్ర, కేంద్ర మంత్రులు, శాసనభ్యుల మద్దతును కూడగట్టాం. ఈ ప్రాంతంలోని అన్ని వర్గాల ప్రజలను జాగృతం చేసి ఉద్యమాలను ఉధృతం చేస్తున్నాం. జిల్లా సాధన జరిగే వరకు నిరంతర ఆందోళనలు కొనసాగిస్తాం. – గుర్రం పవన్‌కుమార్‌గౌడ్, అధ్యక్షుడు జిల్లా సాధన సమితి -
లఢఖ్‌లో ఐదు కొత్త జిల్లాల ఏర్పాటు: అమిత్ షా
ఢిల్లీ: లఢఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో కొత్తగా ఐదు జిల్లాలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రహోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. కొత్తగా జన్స్కర్, ద్రాస్, షామ్, నుబ్రా, చాంగ్‌థాంగ్‌లను జిల్లాలుగా ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజన్ ప్రకారం లఢఖ్‌లో అభివృద్ధి, శ్రేయస్సును కేంద్రం అందిస్తుందని తెలిపారు. ఇక.. కొత్త జిల్లాల ఏర్పాటు నిర్ణయంతో ప్రతి ఇంటికీ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందుతాయని ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు.In pursuit of PM Shri @narendramodi Ji's vision to build a developed and prosperous Ladakh, the MHA has decided to create five new districts in the union territory. The new districts, namely Zanskar, Drass, Sham, Nubra and Changthang, will take the benefits meant for the people…— Amit Shah (@AmitShah) August 26, 20242019లో పూర్వపు జమ్ము కశ్మీర్ రాష్ట్రాన్ని జమ్ము కశ్మీర్‌ను అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలితం ప్రాంతంగా లఢఖ్ను సాధారణ కేంద్ర పాలిత ప్రాంతంగా విభజించిన విషయం తెలిసిదే. దీంతో లఢఖ్‌లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రత్యక్ష పరిపాలనా కొనసాగుతోంది. -
317 జీవోపై కేబినెట్ సబ్ కమిటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కొత్త జోన్లు, కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగుల సర్దుబాటు కోసం ఉద్దేశించిన జీవో నంబర్ 317పై ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల అభ్యంతరాల దృష్ట్యా మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్‌గా మంత్రి దామోదర, సభ్యులుగా మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ ఉంటారు. 2021లో ఇచ్చిన జీవో 317, జీవో 46పై వివాదాలు, ఉద్యోగుల అభ్యంతరాలపై ఈ కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫార్సులు చేయనుంది. పీఆర్టీయూటీఎస్ హర్షం గత ప్రభుత్వం జారీ చేసిన జీవో 317పై ఉద్యోగుల అభ్యంతరాలను అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేబ్‌నెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం పట్ల పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. 317 జీవోతో ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోయారు: టీఎస్‌యూటీఎఫ్ ఉద్యోగుల శాశ్వత కేటాయింపు కోసం గత ప్రభు త్వం జీవో 317 ద్వారా ఏకపక్షంగా విడుదల చేసిన మార్గదర్శకాల కారణంగా పలువురు ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోయారని టీఎస్‌యూటీఎఫ్ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి పేర్కొన్నారు. ఇప్పుడు ఆ సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారాలను సిఫారసు చేయటం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. జీవో 46పై సబ్ కమిటీతో నిరుద్యోగులకు న్యాయం: బల్మూరి వెంకట్ జీవో నంబర్ 46పై కేబినెట్ సబ్ కమిటీ వేయడాన్ని ఎంఎల్‌సి బల్మూరి వెంకట్ స్వాగతించారు. జీవో 46 వల్ల గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి తాము సూచనలు, సల హాలు చేసినా పట్టించుకోలేదని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ప్రజా ప్రభుత్వం సబ్ కమిటీ వేసిందని వెంకట్ హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో నిరుద్యోగులకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి ఉద్యోగ అవకాశాల్లో ఎలాంటి అన్యా యం జరగకుండా సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పీఆర్ కమిషనర్‌కు టీపీఎస్ఏ వినతిపత్రం ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు అంశాలు, బదిలీలపై గత సర్కార్ ఇచ్చిన జీవో 317తో ముడిపడిన సమస్యల పరిశీలనకు సీఎం రేవంత్‌రెడ్డి కేబినెట్ సబ్‌కమిటీని నియమించడం పట్ల తెలంగాణ పంచాయతీ సెక్రటరీస్ అసోసియేషన్ (టీపీఎస్ఏ) హర్షం ప్రకటించింది. ఈ జీవో కారణంగా పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్‌కు టీఎస్పీఏ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు శనివారం పీఆర్ కమిషనరేట్‌లో కమిషనర్‌కు టీఎస్పీఏ ప్రతినిధులు మధుసూదన్‌రెడ్డి, .శ్రీనివాస్, పండరీనాథ్ వినతిపత్రం సమర్పించారు. ఈ జీవో వల్ల కొందరు కార్యదర్శులు స్థానికతను కోల్పోయి కుటుంబాలకు దూరంగా ఇబ్బందులుపడుతున్నారని కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. -
తెలుగు రాష్ట్రాల్లో బంగారం కొంటున్నారా? ఈ జిల్లాల్లో అమలులోకి కొత్త రూల్స్
బంగారు నగల హాల్‌మార్కింగ్‌కు సంబంధించిన మూడో దశను కేంద్ర ప్రభుత్వం తాజగా ప్రకటించింది. రెండేళ్ల క్రితం గోల్డ్ హాల్‌మార్కింగ్ (Gold Hallmarking) నిబంధనల్ని ప్రకటించిన కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా జిల్లాలవారీగా దశలవారీగా అమలు చేస్తూ వస్తోంది. ఇప్పటికి రెండు దశలను అమలు చేసిన ప్రభుత్వం తాజాగా మూడో దశలో 16 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 55 కొత్త జిల్లాల్లో హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గోల్డ్ హాల్‌మార్కింగ్ అనేది బంగారం, బంగారు ఆభరణాల స్వచ్ఛత ధ్రువీకరణ ప్రమాణం. 2021 జూన్ 16 వరకు ఇది స్వచ్చందంగా ఉండేది. ఆ తర్వాత ప్రభుత్వం దశలవారీగా గోల్డ్ హాల్‌మార్కింగ్‌ని తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన నోడల్ ఏజెన్సీగా బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ (BIS) వ్యవహరిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తం 343 జిల్లాల్లో గోల్డ్ హాల్‌మార్కింగ్ తప్పనిసరి. 2021 జూన్ 23న ప్రారంభించిన మొదటి దశలో 256 జిల్లాలు, 2022 ఏప్రిల్ 4 నుంచి రెండవ దశలో మరో 32 జిల్లాల్లో హాల్ మార్కింగ్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇక మూడో దశలో సెప్టెంబర్ 8వ తేదీ నుంచి కొత్తగా మరో 55 జిల్లాల్లో హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ న నోటిఫికేషన్ జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో జిల్లాలు ఇవే.. కేంద్రప్రభుత్వం మూడో దశలో ప్రకటించిన హాల్‌మార్కింగ్ తప్పనిసరి జిల్లాల జాబితాలో తెలుగు రాష్ట్రాల్లో 9 జిల్లాలు ఉన్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్‌లో అన్నమయ్య, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, నంద్యాల జిల్లాలు ఉండగా తెలంగాణలో మేడ్చల్ మల్కాజ్గిరి, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాల్లో బంగారు నగలపై హాల్‌మార్కింగ్ తప్పనిసరి. హాల్‌మార్క్ అంటే ఏమిటి? బంగారు నగల స్వచ్ఛతను తెలియజేసే ముద్రనే హాల్‌మార్క్ అంటారు. ఈ హాల్‌మార్కింగ్‌లో మొదట బిస్ లోగో, బంగారం స్వచ్ఛత, వ్యాపారి లోగో, అస్సేయింగ్, హాల్‌మార్కింగ్ సెంటర్ వివరాలు ఉండేవి. కానీ 2023 ఏప్రిల్ 1 నుంచి కొత్త HUID హాల్‌మార్కింగ్ వచ్చింది. ఇందులో మూడు అంశాలు ఉంటాయి. అవి BIS లోగో, ఆభరణం స్వచ్ఛత, ఆరు అంకెల ఆల్ఫాన్యూమరిక్ HUID. ఒక్కో ఆభరణానికి ఒక్కో రకమైన విశిష్ట సంఖ్య ఉంటుంది. -
భీమవరం.. తొలి వసంతం.. ప్రగతి పథం
సాక్షి, భీమవరం/భీమవరం(ప్రకాశం చౌక్): రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలనా వికేంద్రీకరణ లో భాగంగా జిల్లాలను విభజించారు. నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిని భీమవరం కేంద్రంగా నూతన పశ్చిమగోదావరి జిల్లా ఏర్పాటుచేశారు. గతేడాది ఏప్రిల్ 4న కొత్త జిల్లా కేంద్రం నుంచి పాలన ప్రారంభం కాగా ఇప్పుడు ఏడాది పూర్తి చేసుకుంది. ప్రజలకు పాలనను చేరువ చేయడం, అభివృద్ధి పరుగులు పెట్టించడం, సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడమే ధ్యేయంగా కొత్త జిల్లాలో పాలన సాగుతోంది. పాలకొల్లు నియోజకవర్గం భగ్గేశ్వరంలో 64 ఎకరాల్లో రూ.475 కోట్లతో వైద్య కళాశాల, భీమవరంలో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో రూ.10 కోట్లతో 100 పడకల ఆస్పత్రి నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం భీమవరంలోని కలెక్టరేట్ జిల్లాలోని అన్నిప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉండటంతో వ్యయప్ర యాసలు తప్పాయి. జిల్లాలో సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంలో ఏడాది కాలంలో 15,423 దరఖాస్తులు రాగా 14,574 అర్జీలను పరిష్కరించారు. పాలనపై ప్రత్యేక మార్క్ నూతన పశ్చిమగోదావరి జిల్లాకు మొదటి కలెక్టర్‌గా పి.ప్రశాంతి పనిచేస్తున్నారు. ఆమె పాలనలో తనదైన శైలిలో వ్యవహరిస్తున్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలను సకాలంలో అందించడంతో పాటు అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించారు. వరదల సమయంలో.. గతేడాది గోదావరికి వరదలు వచ్చిన సమయంలో లంక గ్రామాలు నీటమునగాయి. కలెక్టర్ ప్రశాంతి అధికార యంత్రాంగంతో ఆయా ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలను ముమ్మరం చేశారు. నెల రోజులపాటు జిల్లా యంత్రాంగం సమర్థంగా సేవలందించడంతో ఏ ఒక్క ప్రాణానికి హాని కలగలేదు. స్వగృహ‘మస్తు’ జిల్లాలో పేదలకు ఇళ్ల నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటివరకూ 20 వేల మంది లబ్ధిదారులు గృహప్రవేశాలు చేసుకున్నారు. మరిన్ని ఇళ్లు నిర్మాణ దశల్లో ఉన్నాయి. లేఅవుట్లలో మౌలిక వసతుల కల్పన పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంకు భీమవరంలోని రాయలంలో రూ.1.60 కోట్లతో బ్లడ్ బ్యాంకును ఏర్పాటుచేశారు. కలెక్టర్ ప్రోత్సాహంతో ప్రభుత్వ ఉద్యోగులు, దాతలు రూ.50 లక్షల విరాళం అందించారు. త్వరలో బ్లడ్ బ్యాంకును ప్రారంభించనున్నారు. భీమవరం.. సుందర పట్టణం భీమవరం సుందర పట్టణంగా రూపుదిద్దుకుంటోంది. వెల్కమ్ ఆర్చిలు, వాటర్ ఫౌంటెన్లు, వాల్ పెయింటింగ్స్, డివైడర్ల మధ్యలో మొక్కలు ఆకట్టుకుంటున్నాయి. వ్యాపారవేత్తలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో పట్టణ సుందరీకరణకు కలెక్టర్ కృషిచేస్తున్నారు. ‘రియల్’కు మంచి రోజులు భీమవరం పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంది. ఆయా ప్రాంతాల్లో భూముల ధరలు పెరిగాయి. భీమవరంలో కొత్త వెంచర్లు వెలుస్తున్నాయి. కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు అందుబాటులో ఉండటంలో రియల్ వ్యాపారం జోరుగా సాగుతోంది. అలాగే రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ప్రభుత్వానికి మంచి ఆదాయం వస్తోంది. పెరిగిన హోటళ్ల వ్యాపారం భీమవరంలో హోటళ్ల వ్యాపారం గణనీయంగా పెరిగింది. గతంలో పట్టణంలో 80 హోటళ్లు ఉండగా ప్రస్తుతం వీటి సంఖ్య 130 వరకు పెరిగింది. కలెక్టరేట్లో పనిచేసే ఉద్యోగులతోపాటు జిల్లా నలుమూలల నుంచి వివిధ అవసరాల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజల సంఖ్య పెరగడంతో హోటళ్ల వ్యాపారం పుంజుకుంది. ఇళ్లు అద్దెలూ.. భీమవరంతోపాటు సమీప గ్రామాలైన విస్సాకోడేరు, తాడేరు, చినఅమిరం, రాయలం తదితర గ్రామాల్లో ఇళ్ల అద్దెలు పెరిగాయి. ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటుకావడంతో ఉద్యోగుల సంఖ్య పెరిగింది. దీంతో ఇళ్ల అద్దెలు పెరుగుతున్నాయి. పాలన మరింత చేరువ జిల్లాల పునర్విభజనతో ప్రజలకు ప్రభుత్వ పాలన మరింత చేరువైంది. సమస్యలను సత్వరమే పరిష్కరించి అభివృద్ధిని వేగం చేయడానికి అవకాశం ఏర్ప డింది. పేదలకు నవరత్నాల పథకాలను అందించేందుకు కృషి చేస్తున్నాం. జిల్లా పరిధి తక్కువ విస్తీర్ణంలో ఉండటంతో ఎక్కడ సమస్య తలెత్తినా వెంటనే వెళ్లి పరిష్కరించగలుగుతున్నాం. – పి.ప్రశాంతి, కలెక్టర్ సత్వర సేవలందించేలా.. నూతన జిల్లా విస్తీర్ణం తక్కువ, రవాణా సౌకర్యం అనుకూలం, తగినంత పోలీసు సిబ్బంది ఉండటంతో ప్రజలకు సత్వర సేవలందించగలుగుతున్నాం. దీంతో నేరాల సంఖ్య కూడా బాగా తగ్గింది. మారుమూల ప్రాంతాలకు కూడా వెంటనే చేరుకోగలుగుతున్నాం. సారా, గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నాం. – యు.రవిప్రకాష్, జిల్లా ఎస్పీ -
AP: కొత్త జిల్లాల పేర్లతో అడ్రస్ సర్టిఫికెట్లు రెడీ..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్త జిల్లాల పేర్లతో చిరునామా సర్టిఫికెట్లు జారీ చేయడానికి ఆ శాఖ ఏర్పాట్లు చేసింది. ఆధార్ కార్డుల్లో కొత్త జిల్లాల పేర్లను చేర్చుకోవడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది. ఆధార్‌కార్డు జారీ సంస్థ యూఐడీఏఐ సూచించిన ఫార్మాట్లో సోమవారం నుంచే అడ్రస్ సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు. రాష్ట్రంలో అంతకు ముందు 13 జిల్లాలు ఉండగా.. వైఎస్ జగన్ ప్రభుత్వం ఆ సంఖ్యను 26కు పెంచింది. ఈ నేపథ్యంలో ప్రజలు తమ ఆధార్ కార్డులలో కొత్త జిల్లా పేరుతో చిరునామా మార్చుకోవాలంటే.. ఆ వివరాలతో కూడిన ఏదో ఒక ధ్రువీకరణ పత్రం దాఖలు చేయాల్సి ఉంటుంది. దీంతో ప్రజలు ఇబ్బంది పడకుండా.. కొత్త జిల్లాల పేర్లతో కూడిన అడ్రస్ సర్టిఫికెట్లను సచివాలయాల ద్వారా జారీ చేసేందుకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఏర్పాట్లు చేసింది. అడ్రస్ సర్టిఫికెట్ల జారీ బాధ్యతను సంబంధిత గ్రామ, వార్డు సచివాలయ రెవెన్యూ అధికారులకు అప్పగించారు. ఇందుకనుగుణంగా సచివాలయాల సేవలకు సంబంధించిన ఆన్లైన్ పోర్టల్‌లో కొత్తగా ఈ సేవను కూడా చేర్చారు. ఈ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగకుండా క్యూఆర్ కోడ్‌తో కూడిన ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని నిర్ణయించారు. ఈ ధ్రువీకరణ పత్రాల పై సంబంధిత వ్యక్తి ఫోటో.. దానిపై గ్రామ, వార్డు రెవెన్యూ అధికారుల సంతకం, సచివాలయ స్టాంప్ ముద్ర వేసి అందజేయనున్నట్లు గ్రామ, వార్డు సచివాలయ శాఖ అధికారులు వెల్లడించారు. కాగా, ఆధార్ జారీకి ఉద్దేశించిన పోర్టల్‌లో కొత్త జిల్లాల పేర్లను చేర్చినట్టు యూఐడీఏఐ హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయ డిప్యూటీ డైరక్టర్ జనరల్ పి.సంగీత మార్చి 16న సీఎస్ జవహర్‌రెడ్డికి లేఖ రాశారు. కొత్త జిల్లాల పేర్లను ఎవరికి వారు తమ ఆధార్‌లో అప్డేట్ చేసుకునేందుకు అడ్రస్ సర్టిఫికెట్ల అవసరముంటుందని అందులో పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: తమ్ముడి వివాహేతర సంబంధం.. అన్నకు శాపమైంది -
తెరపైకి కొత్త జిల్లాలు
రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు విషయం తెరపైకి వచ్చింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు 8 కొత్త జిల్లాలు ఏర్పాటుచేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. దీనికి అసెంబ్లీలో శనివారం రెవెన్యూ మంత్రి కేకేఎస్ఎస్ఆర్ రామచంద్రన్ చేసిన వ్యాఖ్యలు బలాన్ని చేకూర్చుతున్నాయి. అలాగే చైన్నెలో ట్రాఫిక్ రద్దీ క్రమబద్ధీకరణకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. షోళింగనల్లూరులో బ్రహ్మాండ గ్రీన్ పార్క్ ఏర్పాటు కానుంది. సాక్షి, చైన్నె : రాష్ట్రంలో 2019 వరకు 32 జిల్లాలు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో విల్లుపురాన్ని విడగొట్టి కళ్లకురిచ్చి, తిరునల్వేలిని విడగొట్టి తెన్కాశి, కాంచీపురాన్ని చీల్చి చెంగల్పట్టు, వేలూరును విడదీసి తిరుపత్తూరు, రాణిపేట, నాగపట్నం నుంచి మైలాడుతురై జిల్లాలు ఆవిర్భవించాయి. దీంతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 38కి చేరింది. అదే సమయంలో తంజావూరును చీల్చి కుంభకోణం కేంద్రంగా ఓ జిల్లాతో పాటు మరికొన్ని కొత్త జిల్లాల ఏర్పాటు చేయాలని ప్రజలు డమాండ్ చేశారు. అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగడంతో ఆ నినాదం మరుగున పడింది. మళ్లీ కొత్త జిల్లాల డిమాండ్ అసెంబ్లీ సమావేశాలలో భాగంగా శనివారం పోలూరు ఎమ్మెల్యే సేవూరు రామచంద్రన్ తన ప్రసంగంలో కొత్త జిల్లాల ఏర్పాటు విషయాన్ని తెరమీదకు తెచ్చారు. తిరువణ్ణామలై అతి పెద్ద జిల్లాగా ఉందని, దీన్ని విడదీసి ఆరణి కేంద్రంగా కొత్త జిల్లా ప్రకటించాలని కోరారు. దీనిపై రెవెన్యూ మంత్రి కేకేఎస్ఎస్ఆర్ రామచంద్రన్ స్పందించారు. రాష్ట్రానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు పలువురు ఇప్పటికే పలు కొత్త జిల్లాల కోసం ప్రభుత్వానికి వినతులు పంపించారని వివరించారు. దీన్నిబట్టి చూస్తే రాష్ట్రంలో కొత్తగా మరో 8 జిల్లాల ఆవిర్భావం అవశ్యమని పేర్కొన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటులో రెవెన్యూ డివిజన్లు, తాలూకాలు, రెవెన్యూ గ్రామాలు, బ్లాకులు, మున్సిపాలిటీలు, పట్టణ, గ్రామ పంచాయతీల విభజన తప్పనిసరని తెలిపారు. ఈ వ్యవహారంపై సీఎంకు విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. దీనిపై చర్చించాల్సిన అవసరం కూడా ఉందన్నారు. అన్నీ సజావుగా జరిగితే కొత్త జిల్లాలపై దృష్టి పెడతామన్నారు. మంత్రుల సమాధానాలు ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యుల ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇచ్చారు. మంత్రి నెహ్రూ మాట్లాడుతూ కావేరి – కొల్లిడం ఉమ్మడి తాగునీటి పథకం త్వరలో అమల్లోకి తెస్తామని తెలిపారు. పెరంబలూరు వాసుల దాహార్తిని తీర్చేందుకు రూ. 90 కోట్లతో పథకం చేపట్టనున్నట్టు వివరించారు. రూ.90 కోట్లతో పలాలవరం భూగర్భ డ్రైనేజీ పనులను చేపట్టినట్టు తెలిపారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో వార్డుల విభజన పనులపై దృష్టి పెట్టామని, రెండేళ్లలో ముగిస్తామన్నారు. కావేరి– వైగై– గుండారు అనుసంధానం జరిగి తీరుతుందని మంత్రి దురైమురుగన్ చెప్పారు. రూ. 36 కోట్లతో 7 ఆలయాలకు రాజగోపురాలను నిర్మించనున్నామని దేవదాయ శాఖమంత్రి శేఖర్ బాబు తెలిపారు. పేపర్ ప్రసంగాలు వద్దు సభ్యులకు స్పీకర్ అప్పావు సున్నితంగా క్లాస్ పీకారు. మాజీ మంత్రి అన్భళగన్ పేపర్లో రాసుకొచ్చిన విషయాలను చదువుతుండగా స్పీకర్ అప్పావు జోక్యం చేసుకున్నారు. పేపర్ లెస్‌గా సభ వ్యవహారాలు జరుగుతున్నా, అనేక మంది సభ్యులు పేపర్లో ప్రసంగాలు రాసుకొచ్చి చదివేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పద్ధతి మారాలని ఆయన హితవు పలికారు. మూడు శాఖలపై చర్చ అసెంబ్లీలో మూడు శాఖలకు నిధుల కేటాయింపులపై చర్చ జరిగింది. మంత్రి ఏవీ వేలు రహదారులు, ప్రజా పనుల శాఖలకు నిధుల కేటాయింపులు. కొత్త పథకాలను వివరించారు. చైన్నెలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక పథకం అమలు చేయబోతున్నామని ప్రకటించారు. త్వరలో వివరాలను వెల్లడిస్తామన్నారు. రామేశ్వరం నుంచి శ్రీలంకకు ప్రయాణికుల పడవ నడిపేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. రాష్ట్రంలోని పురాతన, పారంపర్య భవనాల సంరక్షణకు చర్యలు తీసుకుంటామన్నారు. ఐటీ శాఖ మంత్రి మనోతంగరాజ్ మాట్లాడుతూ షోళింగనల్లూరులో రూ.20 కోట్లతో గ్రీన్ పార్క్ ఏర్పాటు చేయనున్నామని ప్రకటించారు. అలాగే ఆన్లైన్ గేమింగ్ వ్యవహారంలో ప్రత్యేక పాలసీ తీసుకు రానున్నామని తెలిపారు. -
రాజస్తాన్‌లో 19 కొత్త జిల్లాలు
జైపూర్: రాజస్తాన్‌లో కొత్తగా 19 జిల్లాలను, మూడు డివిజన్లను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 50కి చేరనుంది. 2008 తర్వాత రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ఇదే తొలిసారి. కొత్త జిల్లాల్లో అత్యధికంగా జైపూర్‌లో నాలుగు జిల్లాలు, జోథ్‌పూర్‌లో మూడు ఏర్పాటు కానున్నట్టు గహ్లోత్ వెల్లడించారు. కొత్త జిల్లాలు, డివిజన్లలో మౌలిక వసతులు, మానవ వనరుల కల్పనకు బడ్జెట్లో రూ.2 వేల కోట్లు కేటాయించామన్నారు. విస్తీర్ణపరంగా దేశంలో రాజస్తాన్ అతిపెద్ద రాష్ట్రమన్న విషయం తెలిసిందే. -
మండల స్థాయిలోనూ ‘స్పందన’
సాక్షి, అమలాపురం: కొత్త జిల్లాలు ఏర్పడిన తరువాత స్పందన కార్యక్రమం అనగానే అర్జీదారులు కలెక్టరేట్ వద్దనే బారులు తీరుతున్నారు. చిన్నచిన్న సమస్యలకు సైతం వ్యయప్రయాసలకోర్చి జిల్లా కేంద్రానికి వస్తున్నారు. దీనిని గుర్తించిన ప్రభుత్వం గ్రామాలు, పట్టణాల్లోని సచివాలయాల్లో రోజూ క్రమం తప్పకుండా స్పందన నిర్వహించాలని గతంలోనే నిర్ణయించింది. అయినప్పటికీ ఇంకా చాలా మంది కలెక్టరేట్‌కు వస్తున్నారు. దీంతో మండల స్థాయిలో కూడా స్పందన కార్యక్రమం నిర్వహించాలని, దీనిని ఈ సోమవారం నుంచి పక్కాగా అమలు చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఎంపీడీఓ కార్యాలయాల్లో.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో గ్రీవెన్స్ సెల్ పేరుతో గతంలో మండల, డివిజన్ స్థాయిల్లో అర్జీలు స్వీకరించేవారు. కొత్త జిల్లా ఏర్పడిన తరువాత స్పందన నిర్వహణ మండల స్థాయిలో నిలిచిపోయింది. కలెక్టరేట్ దగ్గర కావడంతో అర్జీదారులు జిల్లా కేంద్రానికే పెద్ద సంఖ్యలో వస్తున్నారు. అమలాపురం కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే జిల్లా స్థాయి స్పందనకు తొలి రోజుల్లో 225 నుంచి 250 వరకూ అర్జీలు వచ్చేవి. శివారు ప్రాంతాలకు తాగునీరు అందడం లేదని, ఇళ్ల ముందు డ్రెయిన్లలో పూడిక తీయడం లేదని, రహదారులు నిర్మించాలనే చిన్నచిన్న సమస్యలు సైతం కలెక్టరేట్‌కు వస్తున్నాయి. వీటి కోసం ఆయా అర్జీదారులు రామచంద్రపురం, మండపేట, కొత్తపేట, రాజోలు నియోజకవర్గాల నుంచి ఇక్కడకు వస్తున్నారు. ఇదిలా ఉండగా గ్రామ/వార్డు సచివాలయాల్లో క్రమం తప్పకుండా ప్రతి రోజూ ప్రభుత్వం స్పందన కార్యక్రమం నిర్వహిస్తోంది. దీంతో కలెక్టరేట్‌కు వచ్చే అర్జీదారుల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం ప్రతి సోమవారం నిర్వహించే జిల్లా స్థాయి స్పందనకు 150 నుంచి 175 మంది వరకూ వస్తున్నారు. ఇలా వస్తున్న అర్జీల్లో కూడా మండల స్థాయిలో తహసీల్దార్, ఎంపీడీఓ, పోలీసు, ఇతర శాఖలు పరిష్కరించే సమస్యలే అధికంగా ఉంటున్నాయని గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇక నుంచి మండల స్థాయిలో కూడా స్పందన కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో సోమవారం నుంచి జిల్లాలోని 22 ఎంపీడీఓ కార్యాలయాల్లో స్పందన కార్యక్రమం ప్రారంభం కానుంది. రెవెన్యూ, న్యాయపరమైన వివాదాలకు, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి, రోడ్లు, ఇతర చిన్నచిన్న సమస్యలకు వివిధ శాఖల అధికారులు స్థానికంగానే అందుబాటులో ఉండనున్నారు. దీంతో అర్జీదారులకు సైతం కలెక్టరేట్‌కు వచ్చే వ్యయప్రయాసలు తగ్గనున్నాయి. -
కొత్త జిల్లాల్లో త్వరగా ఖాళీల భర్తీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్త జిల్లాల్లో మండల, జిల్లా స్థాయి పోస్టులతో పాటు గ్రామ, వార్డు సచివాలయాలు సహా వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి ఏపీపీఎస్సీ ద్వారా రిక్రూట్మెంట్ ప్రక్రియ జరిగే లోగా తాత్కాలిక ప్రాతిపదికన ప్రస్తుతం ఉన్న సిబ్బంది రేషనలైజేషన్, పదోన్నతులు, ఇన్చార్జి బాధ్యతల అప్పగింత ద్వారా త్వరగా భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఇందుకు సంబంధించి తక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కేఎస్ జవహర్ రెడ్డి కార్యదర్శులకు సూచించారు. గురువారం రాష్ట్ర సచివాలయం ఐదవ బ్లాకు కలెక్టర్ల సమావేశ మందిరంలో సీఎస్ అధ్యక్షతన కార్యదర్శుల సమావేశం జరిగింది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలను మరింత మెరుగు పరచడం, అధికారాల బదిలీ, కలెక్టర్లతో వీడియో సమావేశాల్లో వచ్చిన అంశాలపై ఫాలోఅప్ చర్యలు, అసెంబ్లీకి సంబంధించి పెండింగ్‌లో ఉన్న వివిధ ఎల్ఏక్యూ, ఎల్సీక్యూలపై సత్వరం సమాచారం అందించడం, తదితర అజెండా అంశాలపై సీఎస్ కార్యదర్శులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. ► గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్‌కు చర్యలు తీసుకోవాలి. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూపు 1, 2స్థాయి పోస్టుల ఖాళీల వివరాలను వెంటనే సాధారణ పరిపాలన శాఖకు అందజేయాలి. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇ–ఆఫీస్ విధానం కింద ఇ–రశీదులు, ఇ–డిస్పాచ్ విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలి. ► త్వరలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అసెంబ్లీ, శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత శాఖలు త్వరగా సమాధానాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలి. వివిధ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న ఏసీబీ, విజిలెన్సు కేసులను నిరంతరం మానిటర్ చేస్తూ ఆయా కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలి. ► ఏపీ ఆన్లైన్ లీగల్ కేసుల మేనేజ్మెంట్ విధానం కింద వివిధ శాఖల్లో నమోదు అవుతున్న కోర్టు కేసులకు సంబంధించి సకాలంలో కౌంటర్లు దాఖలు చేయాలి. కోర్టు కేసులపై జాప్యం లేకుండా సకాలంలో చర్యలు తీసుకోవాలి. దీనిపై త్వరలో జీపీలు, కార్యదర్శులతో వర్కషాపు నిర్వహిస్తాం. ► గతంలో నిర్వహించిన ఉద్యోగ సంఘాల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాల్లో ఉద్యోగ సంఘాల నుండి వచ్చిన డిమాండ్లలో ఆర్థికేతర అంశాలకు సంబంధించిన డిమాండ్లను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలి. -
వివిధ విభాగాల కార్యదర్శులతో సీఎస్ జవహార్‌రెడ్డి సమీక్ష
-
AP: కొత్త జిల్లాల్లో పదోన్నతులు, ఖాళీలపై సీఎస్ కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో గ్రామ, వార్డు సచివాలయాలు సహా వివిధ విభాగాల్లో ఖాళీలపై సీఎస్ కేఎస్. జవహర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉన్న సిబ్బంది రేషనలైజేషన్ లేదా పదోన్నతులు కల్పించుట లేక ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడం ద్వారా త్వరితగతిన ఖాళీలు భర్తీ చేసేందుకు తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. కాగా, గురువారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం ఐదవ బ్లాక్‌లో కలెక్టర్ల మీటింగ్ హాల్లో సీఎస్ అధ్యక్షతన కార్యదర్శుల సమావేశం నిర్వహించారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలను మరింత మెరుగుపరచడం, డెలిగేషన్ ఆఫ్ పవర్స్, ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్ 1, 2 పోస్టుల ఖాళీల భర్తీ, ఈ-ఆఫీసు ద్వారా ఈ-రిసీప్ట్స్, ఈ-డిస్పాచ్ ఆపరేషనలైజేషన్, ఏసీబీ, విజిలెన్స్ కేసుల పరిష్కారం, కలెక్టర్లతో వీడియో సమావేశాల్లో వచ్చిన అంశాలపై ఫాలోఅప్ చర్యలు, అసెంబ్లీకి సంబంధించి పెండింగ్‌లో ఉన్న వివిధ ఎల్ఏక్యూ, ఎల్సిక్యూలపై సత్వరం సమాచారం అందించడం, ఏపీ ఆన్లైన్ లీగల్ కేసుల మానిటరింగ్ విధానం తదితర అజెండా అంశాలపై సీఎస్ జవహర్ రెడ్డి కార్యదర్శులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ.. కొత్త జిల్లాల్లో గ్రామ, వార్డు సచివాలయాలు సహా వివిధ విభాగాల్లో ప్రస్తుతం ఉన్న సిబ్బంది రేషనలైజేషన్ లేదా పదోన్నతులు కల్పించాలి. లేనిపక్షంలో ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడం వంటి చర్యలు ద్వారా ఖాళీల భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాలి. సచివాలయాల్లో పనిచేస్తున్నఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్‌కు చర్యలు తీసుకోవాలి. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూపు 1, 2 స్థాయి పోస్టుల ఖాళీల వివరాలను వెంటనే సాధారణ పరిపాలన శాఖకు అందజేయాలన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ-ఆఫీస్ విధానం కింద ఈ-రిసీప్ట్స్, ఈ-డిస్పాచ్ విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలి. త్వరలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగనున్ననేపథ్యంలో అసెంబ్లీ, శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధించిన వివిధ శాఖలు అందించాల్సిన సమాధానాలను త్వరితగతిన అందించేందుకు చర్యలు తీసుకోవాలని అన్ని శాఖల కార్యదర్శులను ఆదేశించారు. వివిధ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న ఏసీబీ, విజిలెన్స్ కేసులను నిరంతరం మానిటర్ చేస్తూ ఆయా కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలి. అదే విధంగా ఏపీ ఆన్లైన్ లీగల్ కేసుల మేనేజ్మెంట్ విధానం కింద వివిధ శాఖల్లో నమోదు అవుతున్న కోర్టు కేసుల్లో సకాలంలో కౌంటర్లు దాఖలుచేయడం కోర్టు కేసులపై జాప్యం లేకుండా సకాలంలో చర్యలు తీసుకోవాలని అన్ని శాఖల కార్యదర్శులను ఆదేశించారు. దీనిపై త్వరలో జీపీలు, కార్యదర్శులతో ఒక వర్క్ షాపు నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. గతంలో నిర్వహించిన ఉద్యోగ సంఘాల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాల్లో ఉద్యోగ సంఘాల నుండి వచ్చిన డిమాండ్లలో ఆర్ధికేతర అంశాలకు సంబంధించిన డిమాండ్లను త్వరిత గతిన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో పలు ఇతర అంశాలపై కూడా కార్యదర్శులతో సమీక్షించారు. -
తూర్పు కనుమల అభివృద్ధిపై విభిన్న వైఖరి!
అప్పటి వరకూ ఎవరూ ప్రవేశించని చోట– ‘లోపలికి వెళ్లడం’ అనేసరికి, ఒక్కొక్క ప్రభుత్వం తీరు ఒక్కొక్క విధంగా ఉంటుంది. ప్రధా నంగా వాటి దృక్పథంపై అది ఆధారపడి ఉంటుంది. ఆ ప్రకారమే, అది తనతో– ‘రాజ్యాన్ని’ అంటే– ‘ఎగ్జి క్యూటివ్’ ‘జ్యుడీషియరీ’ వంటి వ్యవస్థలను, అవి ఇంకా చేరని మారుమూలల ఉన్న మానవ సమూహాల వద్దకు తనతో తీసుకు వెళుతోంది. ప్రజా స్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ఒక్క– ‘లెజిస్లేటి వ్’కు మాత్రమే అటువంటి గమన శక్తి ఉంటుంది. రాష్ట్ర విభజన తర్వాత, తూర్పు కనుమలలోని మన్యం – ‘లోపలికి వెళ్లడం’ అనే విషయంలో, అక్కడ మొదటి పదేళ్ల కాలంలో ఏమి జరుగుతున్నది అనేది లోతైన సమీక్ష అవసరమైన అంశం. వామపక్ష తీవ్రవాద సిద్ధాంత కార్యాచరణకు తూర్పు కనుమల మన్య ప్రాంతం నాలుగు దశాబ్దాల పాటుగా క్రియాశీల స్థావరం కావడంపై, ఇప్పుడు ప్రభుత్వ– ‘ఫోకస్’ తప్పనిసరి అయింది. అయితే అది– ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక్కో తీరుగా అర్థమయింది. ఒకరు అంటారు– ‘విదేశాల నుంచి పోలీస్ శాఖ కొనాల్సిన ‘కమ్యూనికేషన్’ ఉపకరణాలు సకాలంలో ప్రభుత్వం కొని ఉంటే, ఒక గిరిజన ఎమ్మెల్యే నక్సల్స్ చేతిలో చనిపోయేవాడు కాదు’ అని. మరొక ప్రభుత్వ దృష్టి, అందుకు భిన్నంగా– ఆ ప్రాంతాన్ని... అక్కడ భూమిలోని ఖనిజ నిక్షేపాలను విలువైన ఆదాయ వనరుగా చూడ్డంగా కాకుండా, ఆ ప్రాంత ప్రజా ప్రయోజనాల దృష్టి నుంచి దాన్ని చూడాలి అని అనుకోవచ్చు. వామపక్ష తీవ్రవాద చర్యల్ని కట్టడి చేయడానికి 1989లో ఏపీ పోలీస్‌లో– ‘గ్రే హౌండ్స్’ విభాగం మొదలయింది. ప్రస్తుతం విశాఖపట్టణం వద్ద తాత్కాలిక ‘క్యాంపు’ల్లో ఉండి పనిచేస్తూ ఉంది. అయితే సాయుధ దళాల దన్నుతో కాకుండా... పౌరపాలన దృష్టితో ఈ ప్రాంత అభివృద్ధిని చేపట్టాలి అనే– ‘దార్శనికత’ ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు అది మునుపటికి భిన్నంగా ఉంటుంది. ఇలా భిన్నమైన దృక్పథాల మధ్య 2022 నాటికి ఇప్పటి యువ నాయకత్వానికి ఉన్న కొత్త చూపు నుంచి వచ్చినవే– పాడేరు కేంద్రంగా ‘అల్లూరి సీతారామరాజు’ జిల్లా, పార్వతీపురం కేంద్రంగా ‘మన్యం’ జిల్లాలు. అంటే– ‘లోపలికి వెళ్లడం’ అనేది చిన్న పరిపాలనా యూనిట్ల ద్వారా... సూక్ష్మ స్థాయికి పరిపాలన తీసుకు వెళ్లడం వల్లనే సాధ్యమని ఈ ప్రభుత్వం నమ్మకం. నిజానికి ఇది– ప్రపంచ దేశాల చరిత్రలో కాలపరీక్షకు నిలిచిన సత్యం. అలా చూసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల్లో– గ్రామ సచివాలయాల ఏర్పాటు, విద్య–వైద్య రంగాల్లో సంస్కరణలు, ఉత్తర్వులు వెలువడిన వెంటనే కొత్త జిల్లా కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు ఏజెన్సీ ప్రాంతంలో పని మొదలు పెట్టడం, ప్రతి సోమవారం జరిగే– ‘స్పందన’ ప్రజా ఫిర్యాదులకు రద్దీ పెరగడం, పాడేరులో కొత్తగా మెడికల్ కాలేజీ నిర్మాణం చురుగ్గా జరగడం, రోడ్లు, వంతెనల నిర్మాణం, ఇవన్నీ అమలవుతున్న సంక్షేమ పథకాలకు అదనంగా ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులుగా కనిపిస్తున్నాయి. గతంలో ప్రాంతమూ–ప్రజల మధ్య పెనవేసుకుపోయి ఉండే బంధాన్ని విస్మరిస్తూ రూపొందించే అభివృద్ధి నమూనాలు, వీరి పక్షాన మావోయిస్టులు – ‘రాజ్యాన్ని’ వ్యతిరేకించడానికి బలమైన కారణమైంది. కానీ– ఇప్పుడు ప్రభుత్వ దృక్పథం మారింది. అప్పటి వరకు ఉన్న పట్టు జారిపోతున్నప్పుడు, వ్యూహాలు మార్చుకోవడం ఎవరికైనా తప్పదు. విభజన తర్వాత, ఇంత త్వరగా ఇటువంటి కొత్త వాతావరణం ఏజెన్సీ గ్రామాల్లో ఏర్పడుతుందని వారు కూడా అనుకుని ఉండక పోవచ్చు. దాంతో– ముఖ్యులైన మావోయిస్టుల లొంగుబాట్లు మొదలయ్యాయి. కొత్తగా వచ్చి చేరుతున్నవారు లేరు అంటున్నారు. ఈ జూన్ నెలలో జరిగిన నాయకుల అరెస్టు సందర్భంగా 33 మంది మావోయిస్టులు, 27 మంది మిలీషియా సభ్యులు పోలీసులకు లొంగిపోయారు. రూ. 39 లక్షల నగదు, అత్యంత విలువైన ఆయుధాలు స్వాధీనం అయ్యాయి. మళ్ళీ మరొకసారి ఈ సెప్టెంబర్ 7న పెదబయలు వద్ద మరొక అత్యంత భారీ ఆయుధాలు, కమ్యూనికేషన్ సిస్టం, స్కానర్లు సీఆర్పీఎఫ్ పోలీస్ దళాలు వెలుపలికి తీశాయి. ఈ జిల్లాలో రెండు నెలల వ్యవధిలో రెండవసారి ఛేదించిన ఆయుధాల నిల్వలివి. ఈ మొత్తం వ్యవహారంలో ఆసక్తికరమైన అంశం ఏమంటే– ఇప్పట్లో ఇక్కడ వీటి అవసరం ఉండదని, వారు వీటిని జక్కిని అటవీ ప్రాంతంలో భూమిలో పూడ్చిపెట్టి, ఛతీస్‌గఢ్‌లో భద్రత వున్న రహస్య ప్రాంతాలకు వెళ్లిపోయారు. (క్లిక్ చేయండి: విద్యారంగంలో దూసుకుపోతున్న ఏపీ) జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పర్యావరణాన్నీ, జీవవైవిధ్యాన్నీ పరిరక్షిస్తూనే స్థానిక ఆదివాసుల ఆవాసాల మధ్య పర్యాటక రంగం అభివృద్ధి కొరకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అందుకు పాడేరులో– ‘ఒబెరాయ్ హోటల్స్ గ్రూప్’ 7 స్టార్ హోటల్ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇక మారు మూల ప్రాంత అభివృద్ధి కోసం పార్వతీపురం మన్యం జిల్లాగా ఏర్పడ్డంతో ఇక్కడి – కురికుట్టి వద్ద 1200 మెగావాట్లు, కర్రివలస వద్ద 1,000 మెగా వాట్లు సామర్థ్యం గల అదానీ గ్రీన్ ఎనర్జీ పవర్ ప్రాజెక్టులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇవి పూర్తి అయ్యాక, ఒకప్పుడు – గ్రే హౌండ్స్ పోలీసులతో ‘ఏఓబీ’గా పిలవబడిన ఆంధ్ర–ఒడిస్సా సరిహద్దున, ఒక్కొక్క పవర్ ప్రాజెక్టు వల్ల 3,000 మందికి ఉపాధి లభిస్తుంది. ఏదేమైనా–ఏటిట్యూడ్ ఈజ్ ఎవ్రిథింగ్ (దృక్పథమే సమస్తమూ) అనేది, అన్ని కాలాలకు వర్తించే పాత సూక్తి. - జాన్సన్ చోరగుడి అభివృద్ధి, సామాజిక అంశాల వ్యాఖ్యాత -
Eknath Shinde Govt: త్వరలో కొత్త జిల్లాలు!
సాక్షి, ముంబై: మహారాష్ట్ర చిత్రపటం (మ్యాపు) రూపురేఖలు త్వరలో మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో అనేక కొత్త జిల్లాలు ఏర్పాటుచేయాలని గత అనేక రోజులుగా డిమాండు ఉండటంతో నూతన జిల్లాల ఏర్పాటుకు నూతన ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు సమాచారం. అయితే ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి సమాచారం అందలేదు. కానీ ముఖ్యమంత్రి షిందే నాసిక్ జిల్లా పర్యాటనలో ఉన్నారు. ఆయన శుక్రవారం రాత్రి మాలేగావ్‌లో బసచేయనున్నారు. దీంతో అక్కడి నాయకులతోపాటు స్థానిక ప్రజలు అనేక సంవత్సరాలుగా డిమాండు చేస్తున్నట్లుగా నాసిక్ జిల్లాను విభజించి మాలేగావ్‌ను జిల్లాగా చేయాలన్న ప్రతిపాదనను ఆయన ముందు ఉంచనున్నారు. దీనిపై ఆయన కూడా సానుకూలంగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం తన పర్యటనలో నూతనంగా మాలేగావ్ జిల్లాను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించే అవకాశాలు కన్పిస్తున్నాయిని చెబుతున్నారు. దీంతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య పెరగనుంది. మాలేగావ్తోపాటు అనేక జిల్లాలను విభజించి కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదలను మరోసారి కదలికవచ్చింది. దీంతో రాబోయే రోజులలో మరిన్ని జిల్లాలు ఏర్పాటైతే రాష్ట్ర మ్యాప్ మారనుంది. జిల్లాల విభజన డిమాండుకు ప్రధాన కారణం ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులు, అసౌకర్యం, ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న పనుల జాప్యాన్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని జిల్లాలను విభజించి అదనంగా జిల్లాలు, తాలూకాలు ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. రాష్ట్రంలో అనేక జిల్లాలను విభజించి కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్ అనేక సంవత్సరాలు ఉంది. దేశంలో అతిపెద్ద జిల్లాగా వెలుగొందుతున్న ఠాణే జిల్లాను 2013లో కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ప్రభుత్వం రెండుగా విభజించింది. అందులో పాల్ఘర్ జిల్లా కొత్తగా ఆవిర్భవించింది. దీంతో మిగతా జిల్లాల డిమాండ్లు ఆ సమయం నుంచి అధికమయ్యాయి. కానీ ఒక్కో కొత్త జిల్లా ఏర్పాటు చేయడానికి సుమారు రూ.350 కోట్లకుపైగా ఖర్చవుతాయి. దీంతో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదన అటకెక్కింది. కానీ కొత్తగా ఏర్పడిన షిందే ప్రభుత్వం ఆ ప్రతిపాదనను తెరమీదకు తెచ్చి ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో 36 జిల్లాలు, 288 తాలూకాలు ఉన్నాయి. ఇందులో 18 జిల్లాలను విభిజించి అందులోంచి 22 జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేయాలనే డిమాండు ఎప్పట్నుంచో ఉంది. ముఖ్యంగా 2015లోనే ఈ అంశంపై ప్రభుత్వం ఓ కమిటీని కూడా వేసింది. అయితే రాష్ట్రంలో మారిన ప్రభుత్వాలు, రాజకీయ సమీకరణాలు తదితరాల అనంతరం మళ్లీ ఈ జిల్లాల విభజన అంశం తెరపైకి వచ్చింది. విభజన కానున్న లాతూరు జిల్లా! లాతూరు జిల్లాను విభజించి లాతూర్‌తోపాటు ఉద్గీర్ జిల్లాను కూడా ఏర్పాటు చేయాలని డిమాండు ఉంది. ఈ మేరకు ఉద్గీర్ జిల్లా ఏర్పాటు విషయంపై విభాగ కమిషనర్ సునీల్ కేంద్రేకర్ సూచనలను కోరారు. ముఖ్యంగా జిల్లా ఏర్పాటు అయితే నూతన జిల్లా కేంద్రం ఉద్గీర్లో జిల్లా కలెక్టరేట్ భవనం ఇతర విషయాలపై పరిశీలన కూడా జరగుతున్నట్లు సమాచారం. ఉద్గీర్ పట్టణం కర్ణాటక, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉంది. లాతూరు నుంచి 70 కిలోమీరట్ల దూరంలో ఉన్న ఉద్గీర్‌లోని మార్కెట్లు చుట్టుపక్కల పరిసరాల్లో ఎంతో ప్రసిద్ధి. అనేక ఏళ్లుగా లాతూరు జిల్లాను విభజించి ఉద్గీర్ జిల్లాను ఏర్పాటు చేయాలన్న డిమాండు ఉంది. ఉద్గీర్ జిల్లా ఏర్పాటు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనట్లు తెలుస్తోంది. నూతనంగా ఉద్గీర్ జిల్లా ఏర్పాటైతే లాతూర్ జిల్లాలోని మూడు తాలూకాలతోపాటు నాందేడ్ జిల్లాలోని లోహా కంధార్ తాలూకాలను కలిపి ఈ జిల్లాను ఏర్పాటు చేయనున్నారు. దీంతో మరిన్ని జిల్లాలు ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు ఉన్నాయి. రాష్ట్రంలో ముఖ్యంగా కొత్తగా 22 జిల్లాలు, 49 తాలూకాలు ఏర్పాటు చేయాలని విషయంపై రాష్ట్ర ప్రభుత్వం వద్ద ప్రతిపాదనలున్నాయి. అయితే రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఎన్ని కొత్త జిల్లాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వనుందనేది వేచిచూడాల్సిందే. -
కొత్త జిల్లాల ఏర్పాటు మంచి నిర్ణయం: జేపీ
ఒంగోలు మెట్రో: రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు మంచి నిర్ణయమని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ ఎన్.జయప్రకాష్ నారాయణ ప్రశంసించారు. ప్రకాశం జిల్లా నామకరణ స్వర్ణోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని చెన్నపురి తెలుగు అకాడెమీ ఆధ్వర్యంలో డాక్టర్ తూమాటి సంజీవరావు సంపాదకత్వంలో వెలువరించిన ‘స్వర్ణ ప్రకాశం’, ‘ప్రకాశం జిల్లా సాహిత్య చరిత్ర’, ‘ఒంగోలు గురించి ఒకింత’ తదితర పుస్తకాల ఆవిష్కరణ సభ శనివారం ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ‘స్వర్ణ ప్రకాశం’ పుస్తకాన్ని జయప్రకాష్ నారాయణ ఆవిష్కరించి ప్రసంగించారు. కేవలం కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆగిపోకూడదని, అధికార వికేంద్రీకరణ, పాలన వికేంద్రీకరణ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఓటుకు వెలకట్టే సమాజం బాగుపడదని, ఓటుకు, నిరసనకు మధ్య పరిమితమైతే అది బూటకపు ప్రజాస్వామ్యమవుతుందన్నారు. కాగా, ఉన్నం జ్యోతివాసు రచించిన ‘ప్రకాశం జిల్లా సాహిత్య చరిత్ర’, మారేపల్లి సూర్యకుమారి రచించిన ‘ఒంగోలు గురించి ఒకింత’ పుస్తకాలను ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం ఆవిష్కరించారు. -
కొత్త జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్ సీపీ నిర్ణయం
-
జిల్లాల విభజనతో ప్రజలకు పాలన చేరువ
సాక్షి, అమరావతి: చెప్పిన ప్రతి మాటను నెరవేర్చే క్రమంలో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం వైఎస్ జగన్ ప్రభుత్వం జిల్లాలను విభజించింది. 42 ఏళ్ల తర్వాత ఆంధ్ర ప్రాంతంలో జిల్లాల విభజన జరిగింది. చివరిసారిగా 1979 జూన్ 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విజయనగరం జిల్లా ఏర్పాటైంది. శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలతో అప్పట్లో విజయనగరం జిల్లాను ఏర్పాటు చేశారు. అంతకుముందు 1970 ఫిబ్రవరి 2న ఒంగోలు కేంద్రంగా ప్రకాశం జిల్లా ఏర్పాటైంది. కర్నూలు, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలను విడదీసి ప్రకాశం జిల్లాను ఏర్పాటు చేశారు. స్వాతంత్య్రం వచ్చాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్రా ప్రాంతంలో ఏర్పడిన జిల్లాలు ప్రకాశం, విజయనగరం మాత్రమే. మిగిలిన 11 జిల్లాలు బ్రిటిష్ హయాంలో ఏర్పాటైనవే. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత.. తెలంగాణ విడిపోయిన అనంతరం.. ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం శాస్త్రీయంగా జిల్లాలను విభజించింది. ఇప్పుడు కొత్త జిల్లాల్లో పరిపాలన సజావుగా సాగుతోంది. పాలన ప్రజలకు మరింత చేరువైంది. పరిపాలన వికేంద్రీకరణ, భౌగోళిక అనుకూలత, సెంటిమెంట్లకు పెద్దపీట పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికగా ప్రభుత్వం 13 జిల్లాలను 26 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించి రాష్ట్రానికి కొత్త రూపు ఇచ్చింది. 51 రెవెన్యూ డివిజన్లను 74కి పెంచి పరిపాలనకు మరింత వెసులుబాటు కల్పించింది. పరిపాలన సౌలభ్యం, స్థానిక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పకడ్బందీగా విభజన ప్రక్రియ చేయడంతో అన్ని వర్గాల ఆమోదం లభించింది. విభజనకు ముందు ప్రభుత్వం విస్తృత అధ్యయనం, సుదీర్ఘ కసరత్తు చేసి పూర్తి శాస్త్రీయతతో నిర్ణయాలు తీసుకుంది. భౌగోళిక, సామాజిక, ఆర్థిక, చారిత్రక, సాంస్కృతిక అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంది. పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా జిల్లాలను విభజించింది. సాధ్యమైనంతవరకు ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒకే జిల్లాలోకి తెచ్చింది. ప్రజలు, ప్రజాప్రతినిధులకు ఇబ్బందులు లేకుండా జిల్లాకు కనీసం రెండు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసింది. ఎక్కువకాలం ముఖ్యమంత్రిగా పనిచేసినా.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గాన్ని చంద్రబాబు రెవెన్యూ డివిజన్‌గా మార్చలేదు. జిల్లాల విభజన సమయంలో చంద్రబాబు కుప్పం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ను కోరడంతో ప్రభుత్వం అంగీకరించి ఆ డివిజన్ ఏర్పాటు చేసింది. పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని 25 జిల్లాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. గిరిజన ప్రాంతం విస్తృతి దృష్ట్యా అరకు పార్లమెంట్ నియోజకవర్గాన్ని రెండు జిల్లాలుగా చేశారు. సంవత్సరాల ఆకాంక్షల మేరకు.. తమ ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లా చేయాలని, అత్యంత ప్రముఖుల పేర్లను జిల్లాలకు పెట్టాలనే డిమాండ్లు పలుచోట్ల అనేక సంవత్సరాలుగా ఉన్నాయి. ఇలాంటి అనేక అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది. స్థానిక ప్రాధాన్యాన్ని, కొన్ని ప్రాంతాలకు ఉన్న చారిత్రక నేపథ్యం, స్థానిక పరిస్థితులను గుర్తించి కొత్త జిల్లాల్లో ప్రతిబింబించేలా చూసింది. అదే సమయంలో పాత జిల్లాల ప్రాధాన్యం, ప్రాశస్త్యం దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంది. మన్యం విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు స్వాతంత్య్ర పోరాటం జరిపిన ప్రాంతాన్ని ఆయన పేరుతో ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ దశాబ్దాలుగా ఉంది. పాడేరు కేంద్రంగా ఆ జిల్లాను ఏర్పాటు చేసి జగన్ ప్రభుత్వం ఆ డిమాండ్‌ను నెరవేర్చింది. పార్వతీపురం కేంద్రంగా పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పాటుతో గిరిపుత్రులకు గౌరవం ఇచ్చింది. గోదావరి జిల్లాల ప్రాశస్త్యం దెబ్బతినకుండా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలను పునర్వ్యవస్థీకరించింది. తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమ ప్రాంతం ప్రత్యేకతను తెలియజెప్పేలా కోనసీమ జిల్లా ఏర్పాటు చేసి అక్కడి ప్రజల మనోభావాలను గౌరవించింది. దానికి డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా పేరు పెట్టి రాజ్యాంగ నిర్మాతను గౌరవించింది. రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గాన్ని తూర్పు గోదావరి జిల్లాగా, నరసాపురం పార్లమెంటు నియోజకవర్గాన్ని భీమవరం కేంద్రంగా పశ్చిమ గోదావరి జిల్లాగా మార్చి వాటి ప్రాధాన్యతను కొనసాగించింది. ఎన్టీఆర్ జన్మించిన కృష్ణాజిల్లాకు ఆయన పేరు పెట్టాలని చాలాకాలం నుంచి కోరుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. చంద్రబాబు సుదీర్ఘకాలం సీఎంగా ఉన్నా ఈ విషయాన్ని పట్టించుకోలేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి తాను అధికారంలోకి వస్తే కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామని ప్రకటించారు. ఆ మాట నెరవేరుస్తూ విజయవాడ పార్లమెంటు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాగా ఏర్పాటు చేశారు. మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గాన్ని కృష్ణాజిల్లాగా కొనసాగించి దాని చారిత్రక ప్రాధాన్యతను నిలబెట్టారు. గుంటూరు జిల్లాలో పల్నాడు ప్రాంతం ప్రత్యేకతను నిలబెడుతూ పల్నాటి పౌరుషాన్ని ప్రతిబింబించేలా నరసరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లాను ఏర్పాటు చేసింది. బాపట్లను జిల్లాగా చేయాలని సుదీర్ఘకాలంగా ఉన్న కల నెరవేరింది. పుట్టపర్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లా, ప్రముఖ వాగ్గేయకారుడు అన్నమయ్య నడయాడిన రాయచోటి ప్రాంతాన్ని ఆయన పేరుతో అన్నమయ్య జిల్లాగా ఏర్పాటు చేసింది. -
కొత్త జిల్లాలకు డీఎంహెచ్‌వోల నియామకం
సాక్షి, అమరావతి: కొత్తగా ఏర్పాటైన పలు జిల్లాలకు డీఎంహెచ్వోలను నియమిస్తూ వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. వీరిని ఏడు రోజుల్లోగా కేటాయించిన ప్రాంతాల్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. -
కొత్తగా భీమవరం పోలీస్ సబ్‌డివిజన్
నరసాపురం: జిల్లాల పునర్విభజనలో భాగంగా భీమవరం కేంద్రంగా ఏర్పడిన పశ్చిమగోదావరి జిల్లాలో పోలీసు శాఖలో మార్పులు జరుగనున్నాయి. కొత్తగా భీమవరం పోలీస్ సబ్‌డివిజన్‌ను ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నూతన జిల్లాలో ఇప్పటికే ఉన్న నరసాపురం పోలీస్ సబ్‌డివిజన్‌తో పాటు భీమవరం సబ్ డివిజన్ ఏర్పాటుకానుంది. దీంతో పోలీసు శాఖలో పాలనపరమైన ఇబ్బందులు తొలగుతాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఓ రెవెన్యూ మండలంలోని గ్రామం మరో మండలంలోని పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉంది. దీనివల్ల గ్రామీణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వీటిని మార్చాలనే డిమాండ్ ఏళ్ల తరబడి ఉన్నా పాలకులు పట్టించుకోలేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొ త్తగా పోలీస్ సబ్‌డివిజన్ ఏర్పాటు చేయనుండటంతో స్టేషన్ల పరిధిని సవరించే ఆలోచన ఉందని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. పక్క మండలం స్టేషన్ పరిధిలో.. మండలంలోని ఓ గ్రామంలో సమస్య వస్తే పక్క మండలంలోని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాల్సిన పరిస్థితి నరసాపురం సబ్‌డివిజన్ పరిధిలోని పలు గ్రామాల్లో ఉంది. ముఖ్యంగా నరసాపురం రూరల్, మొగల్తూరు, పాలకొల్లు రూరల్, భీమవరం రూరల్ ప్రాంతాల పోలీస్స్టేషన్ల పరిధిలో ఇలాంటి ఇబ్బందులతో సిబ్బంది సతమతమవుతు న్నారు. ప్రజలూ సమస్యలను ఎదుర్కొంటున్నారు. నరసాపురం రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మత్స్య పురి, తుందుర్రు గ్రామాలు ఉన్నాయి. ఇవి రెండు నరసాపురం మండల పరిధిలోకి రావు. తుందుర్రు గ్రామం భీమవరం రూరల్, మత్స్యపురి గ్రామం వీరవాసరం మండలాలకు చెందినవి. నరసాపురం రూరల్ మండలంలోని ఎల్బీచర్ల, పస లదీవి, తూర్పుతాళ్లు, పెదమైనవానిలంక గ్రామాలు మొగల్తూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్నాయి. భీమవరం రూరల్ మండలానికి చెందిన వెంప గ్రామం ప్రస్తుతం మొగల్తూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉంది. తణుకు మండలానికి చెందిన రెండు గ్రామాలు ఇరగవరం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్నాయి. పాలకొల్లు రూరల్ మండలంలోని అడవిపాలెం గ్రామం పోడూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉంది. సబ్‌డివిజన్ ఎలా ఉండవచ్చంటే.. ప్రస్తుతం నరసాపురం పోలీసు సబ్ డివిజన్ పరిధిలో 19 పోలీస్స్టేషన్లు, ఆరు సర్కిళ్లు ఉన్నాయి. నరసాపురం పట్టణం, నరసాపురం రూరల్, మొగల్తూరు, పాలకొల్లు, పాలకొల్లు రూరల్, ఆచంట, పోడూరు, యలమంచిలి, వీరవాసరం, పెనుగొండ, ఇరగవరం, పెనుమంట్ర, భీమవరం–1 టౌన్, భీమవరం–2 టౌన్, భీమవరం రూరల్, ఆకివీడు, ఉండి, కాళ్ల, పాలకోడేరు పోలీస్స్టేషన్లు పనిచేస్తున్నాయి. భీమవరం పోలీసు సబ్ డివిజన్ కొత్తగా ఏర్పాటు చేస్తే సగం మండలాలు అటు, సగం మండలాలు ఇటు మారవచ్చు. భౌగోళిక అంశాలను పరిగణనలోకి తీసుకుని మండలాల విలీనం జరగనున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇబ్బందులు లేకుండా నిర్ణయం గతంలో ఉన్న ఇబ్బందులు, సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఓ మండలంలో ఊరు, మరో మండల పోలీసుస్టేషన్ పరిధిలో ఉండటం నరసాపురం డివిజన్లో చాలాచోట్ల ఉంది. పోలీసుల విధుల నిర్వహణలో ఇది పెద్ద ఇబ్బంది. కొత్తగా భీమవరం పోలీసు సబ్‌డివిజన్ ఏర్పాటు సమయంలో ఇలాంటి సమస్యలన్నీ తొలగిపోవచ్చు. – వి.వీరాంజనేయరెడ్డి, నరసాపురం డీఎస్పీ నరసాపురం రెవెన్యూ డివిజన్ నరసాపురం, మొగల్తూరు, పాలకొల్లు, పోడూరు, యలమంచిలి, ఆచంట, పెనుగొండ, పెనుమంట్ర, తణుకు, ఇరగవరం మండలాలు భీమవరం రెవెన్యూ డివిజన్ భీమవరం, వీరవాసరం, ఉండి, ఆకివీడు, కాళ్ల, పాలకోడేరు, తాడేపల్లిగూడెం, పెంటపాడు, అత్తిలి మండలాలు -
వికేంద్రీకరణ ఫలితాలు ఇప్పటికే షురూ!
ఎప్పుడూ ముందుతరం కన్నా తర్వాతి తరం తెలివిగా ముందంజ వేస్తుంది. శ్రీశ్రీ ‘నేను తిక్కన కన్నా గొప్పవాడిని– ఎందుకంటే నాలాగా తిక్కనకి వేమన తెలీదు, గురజాడ తెలీదు’ అన్నారు. అలాగే యువకులైన ముఖ్యమంత్రులు ఢిల్లీలో కేజ్రీవాల్, ఆంధ్రలో జగన్ పాలనలో కొత్త సంస్కరణలు వేగంగా అమలు జరుపుతున్నారు. వీరిద్దరూ ప్రభుత్వ బడులు తీర్చిదిద్దిన విధానం చక్కని ఉదాహరణ. కేంద్రీకృత విధానం అవలంబిస్తే అన్ని ప్రాంతాలకీ న్యాయం జరగదని భావించి, వికేంద్రీకరణకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎదుర్కొని ముందుకు వెళుతోంది జగన్ ప్రభుత్వం. వికేంద్రీకరణలో భాగంగా గ్రామ సచివాలయాలు, కొత్త జిల్లాలు, మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయాలు తీసుకుంది. ఈరోజు సచివాలయాల వలన ఎంత సౌఖ్యంగా ప్రజలున్నారో మనకు తెలుసు. ఒక వాలంటీర్‌కు 50 కుటుంబాలను అప్పజెప్పడంతో వారు వాట్సాప్ గ్రూప్ పెట్టి రేషన్ వచ్చిందనీ, వ్యాక్సిన్ వేయించుకోమనీ, పన్ను కట్టమనీ మెసేజ్‌లు ఇస్తున్నారు. ఇటు ఆ ప్రజలకి కూడా ఇంటి ముందు చెత్త ఉందనీ, పెన్షన్ రాలేదనీ వెంటనే అడిగే అవకాశం వచ్చింది. ఈ వ్యవస్థ వల్ల జవాబుదారీతనం పెరిగింది. ఉత్తమ మేనేజ్మెంట్కి ఉదాహరణగా... ఉద్యోగులకు ‘సేవా మిత్ర’, ‘సేవా రత్న’, ‘సేవా వజ్ర’ అవార్డులు ఇస్తున్నారు. నిజంగా దిగువ స్థాయి ఉద్యోగుల శ్రమని ఇంతలా గుర్తించిన ముఖ్యమంత్రులు నేటి దాకా ఎవరూ లేరనే చెప్పాలి. ఒకప్పుడు రాష్ట్ర సెక్రటేరియట్ అంటే మంత్రులూ, వారి పీఏలూ వారి చుట్టూ ఊరి పెద్దలూ, కుల పెద్దలూ తిరుగాడుతుండేవారు. ఇప్పుడు ఆ దృశ్యాలు కనిపించడం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వానికీ, ప్రజలకూ గ్యాప్ లేకుండా పాలన అందుతోంది. ఇది వికేంద్రీకరణ ఫలితమే. ఇక నూతన జిల్లాల ఏర్పాటు విషయానికొస్తే... నిజానికి చిన్న జిల్లాల ఏర్పాటు చేయాల్సిన అవసరం చాలా ఉంది. ముఖ్యంగా మన్యం ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాలుగా విభజించడం వలన అమాయక గిరిజన ప్రజలనూ, ఆ ప్రాంతాల్నీ అసాంఘిక శక్తుల బారిన పడకుండా మరింతగా రక్షించే అవకాశం వస్తుంది. దగ్గర్లోనే కలెక్టర్, ఎస్పీ, పోలీసు బలగం ఉన్నందువల్ల కచ్చితంగా ‘లా అండ్ ఆర్డర్’ అమలు జరుగుతుంది. ప్రస్తుత ప్రభుత్వానికి మూడు రాజధానులు అనే కొత్త ఆలోచన వచ్చినందుకు... ‘వెనుకబడిన ప్రాంతాలు వెనుకబడిన ప్రాంతాలు’ అని వినీ వినీ విసిగి వేసారిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలకు కాస్త ఊరట కలిగింది. కర్నూలులో హైకోర్టు ఉంటే అవసరమున్నవారు కర్నూలు వెళ్తారు. అమరావతిలోనే హైకోర్టు కూడా ఉంటే అక్కడ హోటల్ సేవలు ఖరీదు అవుతాయి. ఆటోలు దొరకవు. ట్రాఫిక్ పెరిగి పోతుంది. దీనివల్ల జనసామాన్యానికి చాలా ఇబ్బంది. అవసరాన్ని బట్టి కర్నూలుకు కొంతమందీ, విశాఖకి కొంతమందీ వెళ్తే అక్కడ కూడా అనేక వ్యాపారాలు పెరుగుతాయి. ఉపాధి పెరుగుతుంది. ప్రజాస్వామ్యంలో అన్ని ప్రాంతాల అభివృద్ధీ, అన్ని రకాల మనుషుల అభివృద్ధీ చూడవలసిన బాధ్యత ప్రభుత్వానిదే. (క్లిక్: ‘సోషల్ ల్యాబ్’ పని మొదలైంది) ప్రభుత్వ పనుల్ని అడ్డుకోవడంలో భాగంగా ప్రతిపక్షాలు కృష్ణ, గుంటూరు జిల్లాల మీద లేని ప్రాంతీయ అభిమానం చూపిస్తూ... విశాఖ, కర్నూలు రాజదానులుగా పనికిరావు అంటే అక్కడ ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలకు ఆనందం అభివృద్ధి వచ్చే విధంగా నూతన చట్టం తెచ్చి అయినా మూడు రాజధానుల ప్రక్రియ పూర్తి చేస్తారని ఆశిద్దాం. (క్లిక్: జగన్ స్కీములు చంద్రబాబుకు సవాలే!) - డాక్టర్ అయ్యగారి సీతారత్నం తెలుగు ప్రొఫెసర్, ఆంధ్ర విశ్వవిద్యాలయం -
నాలుగు సెక్షన్లతో పాలన
శ్రీకాకుళం పాతబస్టాండ్: కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ఉన్నతాధికారులను ప్రజలకు దగ్గర చేసే పనిని ప్రభుత్వం మొదలుపెట్టింది. నూతనంగా ఏర్పడిన జిల్లాలో జనాభా, విస్తీర్ణం తగ్గడంతో కలెక్టరేట్లో పాలన కోసం ఏర్పాటు చేసే సెక్షన్లను కుదించారు. ఇప్పటివరకు 8 సెక్షన్లు ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 4కు తగ్గింది. ఈ మేరకు జీఓ కూడా విడుదలైంది. కలెక్టరేటే కీలకం.. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం, పనులు త్వరగా జరిగేలా చూడడంలో కలెక్టరేట్ కీలక పాత్ర పోషిస్తుంది. కలెక్టర్ కార్యాలయంలో ఇదివరకు ఏ, బీ, సీ, డీ, ఈ, ఎఫ్, జీ, హెచ్ అనే 8 సెక్షన్లు ఉండేవి. వీటికి తోడుగా మీ సేవ, లీగల్ సెక్షన్లు కూడా సేవలు అందించేవి. పథకాలు, సేవలపై ప్రజలు కలెక్టర్‌కి విన్నవించినా, వాటిని కలెక్టర్ ఈ సెక్షన్లలోని అధికారుల ద్వారా పరిష్కరించేవారు. సెక్షన్ –1: ఇప్పటి వరకు ఉన్న ఎ, బి సెక్షన్లను కలిపి సెక్షన్–1గా మార్చారు. ఎ–సెక్షన్లో ఉన్న ఎస్టాబ్లిష్మెంటు (పరిపాలన), ఆఫీస్ ప్రొసీడ్స్, ఎస్టాబ్లిష్మెంటు అండ్ సర్వీస్ మేటర్లు, డిసిప్లనరీ మేటర్లు అన్నీ క్యాడర్లకు సంబంధించినవి ఉంటాయి. బి–సెక్షన్లో అకౌంట్సు, ఆడిటింగ్, జీ తాలు, కోనుగోళ్లు, రికార్డుల నిర్వహణ ఉంటాయి. ఈ రెండు సెక్షన్లు ఒకటి చేశారు. సెక్షన్–2 : ఈ, జి, ఎఫ్ లను కలిసి ఒక సెక్షన్ చేశా రు. ఈ సెక్షన్లో ల్యాండ్ మేటర్లు, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, ల్యాండ్ ఎలిసేషన్, అసైన్మెంటు, హౌస్ సైట్స్, ప్రోహిబిటెడ్ ప్రోపర్టీ నిర్వహణ 22ఎ, ఫిషరీస్ అండ్ అదర్ ల్యాండ్ రికారŠుడ్స ఉంటాయి. జి సెక్షన్లో సెటిల్మెంట్లు, ఎస్టేట్ ఎ బోల్స్ యాక్టు, ఇనాం భూములు, కోర్టు సంబంధిత, ఫారెస్టు ల్యాండ్ వంటి అంశాలు ఉంటాయి. ఎఫ్‌లో భూ సేకరణ, ఆర్అండ్ఆర్ తదితర అంశాలు ఉంటాయి. ఈ మూడింటిని ఒక్కటి చేశారు. సెక్షన్–3 : సి, హెచ్ సెక్షన్లు కలిపారు. మెజిస్టీరియల్ సెక్షన్, కుల వెరిఫికేషన్, ఫైర్ అండ్ సేఫ్టీ, ఎలక్షన్ అంశాలు, లా అండ్ ఆర్డర్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ఇతర అనుబంధ అంశాలు ఉంటాయి. హెచ్ సెక్షన్లో ప్రోటోకాల్, గ్రీవెన్సు, ఇతర రిలేటెడ్ అంశాలు ఉంటాయి. సెక్షన్–4 : ఇందులో డి సెక్షన్ ఉంటుంది. ఇందులో డిజాస్టర్ మేనేజ్మెంటు, విపత్తులు ఇతర అంశాలు ఉంటాయి. పై సెక్షన్లకు సూపరింటెండెంట్లను కూడా నియమించారు. ఇవి కాకుండా ఎప్పటిలాగానే లీగల్ సెక్షన్, మీ సేవ సెక్షన్లు నడుస్తున్నాయి. వీటికి సీనియర్ సూ పరింటెండెంట్లు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్ప టి వరకు ఉన్న సిబ్బందిని కుదించారు. కలెక్టరేట్ నుంచి సిబ్బంది విజయనగరం, మన్యం జిల్లాలకు వెళ్లారు. సమస్యలు లేవు.. జిల్లాల విభజన తర్వాత సెక్షన్లను కుదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఆ మేరకు సెక్షన్లను కుదించాం. సమస్యలేవీ లేవు. తగినంత మంది సిబ్బందిని సమకూరుస్తున్నాం. – ఎం.రాజ్యలక్ష్మి, డీఆర్ఓ -
పార్టీ బలోపేతంపై సీఎం జగన్ ఫోకస్
-
‘సోషల్ ల్యాబ్’ పని మొదలైంది
ప్రభుత్వ వ్యతిరేక ఓటు– అంటూ ఇటీవల రాష్ట్ర రాజకీయాల్లో ఏమాత్రం పొసగని అంశాన్ని పనిమాల చర్చకు తెచ్చారు. మరో రెండున్నర ఏళ్ల తర్వాత ఎన్నికలు ఉండగా, అప్పుడే వీళ్ళు– ‘ప్రభుత్వ వ్యతిరేక ఓటు’ అంటున్నారు! వైసీపీ ప్రభుత్వం కుదురుకుంటున్న దశలో ‘కరోనా’ వచ్చిపడింది. అయినా కొత్త రాష్ట్రం పునర్నిర్మాణం కోసం అవసరమైన పరిపాలనా సంస్కరణలను అమలు చేస్తున్నారు. మరో పక్క రాష్ట్ర ఆర్థిక వనరులను పెంచుకోవడానికి ఉన్న మార్గాలను వెతుక్కుంటున్న ప్రాథమిక దశ ఇది. ఇంతలోనే– ‘ప్రభుత్వ వ్యతిరేక ఓటు’ అని అజ్ఞానంతోనో అర్ధ జ్ఞానంతోనో ఎవరైనా అన్నప్పటికీ... అది అభ్యంతరకరమని ‘మీడియా’ విశ్లేషకులకు, పార్టీల అధికార ప్రతినిధులకు అనిపించకపోవడం బాధ్యతా రాహిత్యం అవుతుంది. ‘ప్రభుత్వ వ్యతిరేక ఓటు’ అనగానే, ప్రధాన ‘మీడియా’తో పాటుగా సామాజిక మాధ్యమాల్లో దానిపై ‘చర్చ’తో డజన్ల కొద్దీ– ‘యూట్యూబ్’ వీడియోలు వెలువడ్డాయి. వాస్తవాల వైపు జనం చూడకుండా, వారి కళ్ళ మీద ఇలా– ‘గరం మసాలా తెరలు’ కడుతున్న ఈ మొత్తం యంత్రాంగం పట్ల మనకు కనుక అప్రమత్తత లేకపోతే, మున్ముందు తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో 2022 నాటికి– ‘ప్రభుత్వ వ్యతిరేకత’ అనేది ఎంత పేలవమైన వాదన అవుతుందో చూద్దాం. ఈ ప్రభుత్వం ఏర్పడిన తొలి రెండున్నర ఏళ్ల పరిణామాల్లో మూడు ప్రధానమైన అంశాలను ఇందుకోసం ఇక్కడ పరిశీలిద్దాం. ‘కోవిడ్’ విషయంగా ప్రభుత్వ చర్యలు బహిరంగమే కనుక, దాన్ని ఒదిలిపెడితే, మిగతా రెండింటిలో మొదటి పరిపాలనా చర్య– ‘గ్రామ సచివాలయాలు’. వీటిని ఇప్పటికే పలు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నమూనాగా పరిశీలిస్తున్న విషయం తెలిసిందే. ఇక చివరిది– 13 కొత్త జిల్లాల ఏర్పాటు. ఇందులోకి మళ్ళీ– నేరుగా నగదు బదిలీ జరిగే 33 సంక్షేమ పథకాలూ, ‘రైతు భరోసా కేంద్రాల’ ఏర్పాటూ, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణా, 50కి పైగా వెనుకబడిన కులాల అభివృద్ధి కార్పోరేషన్ల ఏర్పాటూ, విద్యా–వైద్య రంగాల్లో సంస్కరణల వంటివీ కలపడం లేదు. గడచిన రెండున్నర ఏళ్లలో ‘కోవిడ్’ కల్లోల కాలం, ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ ఆందోళన పోను... మిగిలిన పని గంటల్లో ఈ ప్రభుత్వం పూర్తి చేసిన పనులివి! అయితే, ఇందులో– ‘ప్రభుత్వ వ్యతిరేక ఓటు’ ఒడిసి పట్టుకోవడం అనే సాహసం గురించి ఇప్పుడు వీళ్ళు చర్చకు తెస్తున్నారు. ఒక వార్డు స్థాయిలో కొత్తగా ప్రభుత్వ లబ్ధిదారుగా మారిన యువ సమాజంలోని వ్యక్తి– ‘స్టేట్ స్టేక్ హోల్డర్’గా ఆమె లేదా అతడు మున్ముందు అలవర్చుకోవలసిన– ‘సివిక్ సెన్స్’ను మొగ్గలోనే తుంచే ప్రయత్నం ఇది! నిజానికి ఇక్కడ జరగాల్సింది, ప్రతిపక్షాలు ప్రభుత్వ సేవల్లో లోపాలను గుర్తించి వాటిని సరిచేసే దిశలో ఒత్తిడి తేవడం. కానీ, అందుకు భిన్నంగా– సమయం సందర్భం లేకుండా ‘ప్రభుత్వ వ్యతిరేక ఓటు’ అనడం అంటే, ప్రజల్ని– 24x7 ఓటర్లుగా చూడడం తప్పు కాదు అని వీరంతా వత్తాసు పలుకుతున్నట్టుగా ఉంది! (క్లిక్: ‘ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ’తో కొత్త వెలుగు!) ఒకప్పుడు ఉమ్మడి ఏపీ రాజకీయాలపై మధ్యతరగతి బుద్ధిజీవులు విలువైన విమర్శలు చేసేవారు. ఇప్పుడు వారు నోరు మెదపటంలేదు. ఆశ్చర్యం– ప్రభుత్వ పాఠశాలల్లో బలహీన వర్గాలకు– ‘ఇంగ్లిష్ మీడియం’ చదువుల ప్రతిపాదన సమయంలో ఇది మరింతగా స్పష్టమయింది. గడచిన ఏడు దశాబ్దాలలో మనం ఎటూ ఏరు దాటి– ‘ఎన్నారై’లు అయ్యాం కనుక, ఇక ఇప్పుడు ప్రభుత్వ సేవలు వినియోగించుకునే వర్గాలు ఎటూ కింది కులాలే అయినప్పుడు ఇప్పుడవి మనం పట్టించుకునే అంశాలు కాదు అనేది వీరి మౌనానికి కారణమైతే; ఇకముందు ఎన్నిక కావలసిన ప్రభుత్వాలు, వాటి విధాన నిర్ణయాలు కూడా వర్ధమాన వర్గాల చేతిలోనే ఉండడం, అందుకు దోహదం చేసే నాయకత్వం చేతిలోనే ప్రభుత్వ పగ్గాలు ఉండడం సరైనది అవుతుంది. (క్లిక్: అందరూ బాగుపడాలి కదా!) ‘వలంటీర్లు’ సచివాలయాల సిబ్బందిగా... అరవై శాతం పైగా బలహీన వర్గాల యువత ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగంలో క్షేత్ర స్థాయిలో భాగమయ్యారు. ప్రభుత్వం నుంచి దిగువకు వచ్చే ‘ప్రయోజనం’ పై స్థాయిలో ఎన్ని దశల్లో ఆపడానికి అవకాశాలు ఉన్నదీ, ఆ అవరోధాన్ని దాటించి చిట్టచివర ఉన్న లబ్ధిదారుకు దాన్ని తాము చేర్చడం ఎంత కష్టమో ఇప్పుడు వారికి తెలుసు. అలా ఒక ఆసక్తికరమైన సాంఘిక ప్రయోగానికి ఇప్పుడు సచివాలయాలు వేదిక అయ్యాయి. ‘ఫంక్షనల్ పాలిటిక్స్’తో పవర్ పాలిటిక్స్’ తలపడినప్పుడు, సేవల బట్వాడాలో జరిగే జాప్యం గురించి మన సామాజిక దొంతర్లలోని చిట్టచివరి జాతుల యువతకు సాకల్యంగా స్పష్టం కావడం అనేది ఎంతమాత్రం చిన్న విషయం కాదు! (క్లిక్: అందరికీ అభివృద్ధి ఫలాలు) - జాన్ సన్ చోరగుడి అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత -
అభివృద్ధే అందరి లక్ష్యం
రంపచోడవరం: ఏజెన్సీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని, జిల్లాను ప్రగతి పథంలో నడిపించేందుకు కష్టపడి పనిచేయాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. రంపచోడవరం ఐటీడీఏ సమావేశం హాల్లో సోమవారం ఎస్పీ సతీష్, జేసీ ధనంజయ్, సబ్ కలెక్టర్ కట్టా సింహాచలంతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏజెన్సీలో పనిచేసే అధికారులు, సిబ్బంది వారి ప్రధాన కేంద్రాల్లో నివాసముండాలని ఆదేశించారు. మండల, డివిజన్ స్థాయి అధికారులతో సమావేశాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. జిల్లాలో 200 నుంచి 300 గ్రామాలకు పక్కా రోడ్లు నిర్మించనున్నట్టు తెలిపారు. పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమశాఖ ఇంజినీర్లతో ఏజెన్సీలోని రోడ్ల పరిస్థితిపై సమీక్షించారు. ఏజెన్సీలో ఆస్పత్రులు, వాటిలో అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. రేషన్‌కార్డు, పింఛన్ల సమస్యలు ఉంటే పూర్తిస్థాయిలో పరిష్కరించే బాధ్యత ఆయా శాఖ అధికారులపై ఉందన్నారు. ప్రతి వారం నిర్వహించే స్పందనకు అధికారులు విధిగా హాజరు కావాలని ఆదేశించారు.ఏజెన్సీలో లింక్ రోడ్ల నిర్మాణానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తెలిపారు.గిరిజనులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించాలని వ్యవసాయ, హార్టికల్చర్ అధికారులకు కలెక్టర్ సూచించారు. గిరిజనులకు సేవ చేయడం అదృష్టం జిల్లా ఎస్పీ సతీష్ మాట్లాడుతూ ఏజెన్సీలో గిరిజనులకు సేవ చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. గిరిజన ప్రాంత అభివృద్ధికి తోడ్పాటును అందించాలని అధికారులకు సూచించారు.సమావేశంలో ఏపీవో సీఎస్ నాయుడు, డీడీ ముక్కంటి, ఈఈ డేవిడ్‌రాజు, ఐ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
రెవెన్యూలో సర్వేయర్ల పాత్ర కీలకం
బాపట్ల: జాతీయ సర్వే దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లా సర్వేయర్లు దాతృత్వం చాటారు. ఆదివారం బాపట్ల పట్టణంలోని బదిరుల ఆశ్రమ పాఠశాలలో జాతీయ సర్వే దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు స్వీట్లు, కేకులు, పండ్లు పంపిణీ చేశారు. మండల సర్వేయర్లు సత్యనారాయణ రెడ్డి , ఆది రామచంద్ర, ఖాదర్ వలీ మాట్లాడుతూ భూములకు సంబంధించిన అంశాల్లో సర్వేయర్ల పాత్ర కీలకమన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ ద్వారా భూ సర్వే గ్రామ స్థాయిలో తేలికవుతుందని పేర్కొన్నారు. గ్రామ సర్వేయర్ల పని తీరు బాగుందని కొనియాడారు. జాతీయ సర్వే దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు చేయూత అందించడం ఆనందంగా ఉందని చెప్పారు. కార్యక్రమంలో చైన్ మన్ శ్రీనివాస్, గ్రామ సర్వేయర్లు పాల్గొన్నారు. -
క్షేత్రస్థాయి పాలనకు జిల్లాల ఏర్పాటు నాంది
బాపట్ల: క్షేత్రస్థాయి పాలనకు జిల్లాల ఏర్పాటు నాంది పలుకుతుందని వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు నరాలశెట్టి ప్రకాశరరావు పేర్కొన్నారు. బాపట్ల జిల్లా ఏర్పాటుతో ఆదివారం స్థానిక శ్రీభావన్నారాయణస్వామి దేవాలయం, ఆంజనేయస్వామి దేవాలయంలో డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఆధ్వర్యంలో టెంకాయలు కొట్టి ఉత్సవాలను ప్రారంభించారు. జిల్లా ఏర్పాటు అన్నిరంగాల్లో అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఉపాధి అవకాశాలు పెరగడంతోపాటు వనరులు సద్వినియోగం చేసుకోవడంతో ఉత్తమ ఫలితాలు అందుతాయని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కోకి రాఘవరెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ గవిని కృష్ణమూర్తి, ఇనగలూరి మాల్యాద్రి, యజ్రయ్య, బొడ్డు సుబ్బారెడ్డి, సి.కె.నాయుడు, బ్రహ్మనందరెడ్డి, ఇమ్మడిశెట్టి శ్రీను పాల్గొన్నారు. -
4 సెక్షన్లుగా కలెక్టరేట్ పాలన
ఏలూరు(మెట్రో): ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో, ప్రజల పనులు జరిగేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంలో జిల్లా కలెక్టరేట్ కీలక పాత్ర పోషిస్తోంది. కలెక్టరేట్ అంటే కేవలం కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఆర్వో మాత్రమే అనుకుంటారు. అయితే కలెక్టర్ కార్యాలయంలో ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జీ, హెచ్ అనే 8 సెక్షన్లు ఉంటాయి. ప్రజలకు ఏ అవసరం వచ్చినా, ఏ సమస్య పరిష్కరించాలన్నా ఈ సెక్షన్లు కీలక పాత్ర పోషిస్తాయి. పథకాలు, సేవలపై ప్రజలు కలెక్టర్‌కు ఏం విన్నవించినా.. వాటిని కలెక్టర్ ఆయా సెక్షన్లకు పంపిస్తారు. పూర్తిస్థాయిలో ఆ ఫిర్యాదు, వినతికి ఒక రూపం తెచ్చాక జాయింట్ కలెక్టర్, కలెక్టర్ ఆమోదముద్ర వేస్తారు. ఈ సెక్షన్లే జిల్లాకు కీలకం.. ప్రస్తుతం జిల్లాల విభజనలో భాగంగా ఇంత వరకు కలెక్టర్ కార్యాలయంలోని 8 సెక్షన్లను నాలుగింటిగా కుదించి పరిపాలన సాగించేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో పురపాలన అందించేందుకు ప్రస్తుతం 8 సెక్షన్లను నాలుగింటిగా విభజించారు. ఎస్టాబ్లిష్మెంట్, అకౌంట్స్ అండ్ ఆడిట్ విభాగాలు గతంలో ఏ, బీ సెక్షన్లుగా ఉండేవి. ప్రస్తుతం ఆ రెండు సెక్షన్లను ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్‌గా మాత్రమే ఉంచారు. అలాగే ఆఫీస్ ప్రొసీజర్, ఎస్టాబ్లిష్మెంట్ అండ్ సర్వీస్ మేటర్, డిసిప్లీనరీ యాక్షన్స్, అకౌంట్స్, ఆడిటింగ్, శాలరీస్, పర్చేజ్, మెయింటెనెన్స్ శాఖలను దీనిలో కలిపారు. అదేవిధంగా ఈ, జీ, ఎఫ్ లలో నిర్వహించే ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, ల్యాండ్ ఎక్విజేషన్, ల్యాండ్ రీఫారŠమ్స్ సెక్షన్లను ల్యాండ్ మ్యాటర్ సెక్షన్లుగా ఏర్పాటు చేశారు. ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, అసైన్మెంట్, అవుట్‌సైడ్, ప్రొహిబిడెడ్, 22ఏ రిజిస్ట్రేషన్, ఫిషరీస్, సెటిల్మెంట్ రెగ్యులరైజేషన్స్, ఆల్ కోర్ట్ కేసెస్, ఫారెస్ట్ సెటిల్మెంట్స్, ఆర్ అండ్ ఆర్ అంశాలు, ల్యాండ్ రిలేటెడ్ మ్యాటర్స్ దీనిలో విలీనం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కేవలం సి సెక్షన్‌ను మాత్రం ఉంచి సి పేరు తొలగించి మెజిస్టీరియల్ సెక్షన్‌గా ఏర్పాటు చేశారు. ఈ సెక్షన్లో గతంలో సి సెక్షన్లో నిర్వహించే మెజిస్టీరియల్, సినిమాటోగ్రఫీ, కాస్ట్ వెరిఫికేషన్, లా అండ్ ఆర్డర్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, లోకాయుక్త, హెచ్ఆర్సీ, ఎన్హెచ్ఆర్సీ, ఆర్టీఐ వంటివి నిర్వహించనున్నారు. డీ, హెచ్ సెక్షన్లను విలీనం చేసి కోఆర్డినేషన్ సెక్షన్‌గా ఏర్పాటు చేశారు. డి, హెచ్లో ఉన్న పనులు నేచురల్ కలామిటీస్, వాటర్ ట్యాక్స్, వెబ్లాండ్ ఇస్యూస్, ఆర్వోఆర్, కంప్యూటరైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్, ఈ–గవర్నెన్స్, ఆల్ ఎలక్షన్ వర్క్స్, ప్రొటోకాల్, గ్రీవెన్సెస్, స్పందన, సీఎంపీ వంటి అంశాలను ఏర్పాటు చేసి ఈ సెక్షన్లో పొందుపరిచారు. ఆయా సెక్షన్లలో ఇక నుంచి విధులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విభజనలో భాగంగా ఈ ఏర్పాట్లు చేశాం ఇంతవరకు 8 సెక్షన్లుగా ఉన్న జిల్లా పరిపాలనను ప్రస్తుతం నాలుగు సెక్షన్లుగా ఏర్పాటు చేశాం. ప్రభుత్వం ఈ మేరకు జీవో సైతం విడుదలైంది. ఇక నుంచి 4 సెక్షన్ల ద్వారా ప్రజలకు అందాల్సిన అన్ని సేవలను అందించేందుకు చర్యలు తీసుకుంటాం. నాలుగు సెక్షన్లకు సూపరింటెండెంట్లను నియమించి ఆయా సెక్షన్ల ద్వారా కలెక్టరేట్ పరిపాలన చేపడతాం. – ప్రసన్న వెంకటేష్, కలెక్టర్ -
మిన్నంటిన ‘నూతన’ సంబరాలు
సాక్షి నెట్వర్క్: కొత్త జిల్లాల ఏర్పాటుపై రాష్ట్రవ్యాప్తంగా నాలుగోరోజు గురువారం కూడా ప్రజలు సంబరాలు నిర్వహించారు. ప్రదర్శనలు, బైక్ ర్యాలీలు, వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. పుట్టపర్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లా ఏర్పాటు చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు నల్లమాడ నుంచి పుట్టపర్తి వరకు భారీ ఎత్తున బైక్‌ర్యాలీ నిర్వహించారు. జై జగన్, జైజై జగన్, థ్యాంక్యూ సీఎం సార్.. అంటూ ప్రజలు నినదించారు. అనంతరం సత్యమ్మ కూడలిలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేశారు. శ్రీసత్యసాయి జిల్లా ఏర్పాటును హర్షిస్తూ మడకశిరలో మహిళా సంఘాల సభ్యులు సంబరాలు చేశారు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. విశాఖపట్నం జిల్లాలో విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మçళ్ల విజయప్రసాద్ ఆదేశాల మేరకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. గాజువాక నియోజకవర్గంలో 66, 70, 72, 73 వార్డులకు చెందిన వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు, వార్డు ఇన్చార్జీలు ర్యాలీ నిర్వహించారు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలోని రావికమతం మండలంలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు 300కి పైగా బైక్‌లతో ర్యాలీ చేశారు. కృష్ణాజిల్లాలో కృత్తివెన్ను నుంచి లక్ష్మీపురం వరకు పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ ఆధ్వర్యంలో వందలాది బైక్‌లతో ర్యాలీ నిర్వహించారు. దారి పొడవునా ప్రజలు పూలు చల్లుతూ, బాణసంచా కాల్చుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాపాలనలో చరిత్రను లిఖించిన మహోన్నత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గరుడప్రసాద్, జెడ్పీటీసీ సభ్యురాలు రత్నకుమారి, ఏఎంసీ చైర్మన్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. -
Andhra Pradesh: రెండు జిల్లాలకు ఒక డీఐజీ
సాక్షి, అమరావతి: జిల్లాల పునర్వ్యవస్థీకరణతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో రెండు జిల్లాలకు కలిపి ఒక డీఐజీని నియమించారు. పునర్వ్యవస్థీకరణకు ముందు 13 జిల్లాలకు 13 మంది డీఐజీలు ఉండేవారు. గతంలో ఒక జిల్లా బాధ్యతలు చూసిన డీఐజీలు ఇప్పుడు రెండు జిల్లాల బాధ్యతలు చేపట్టారు. జిల్లా రిజిస్ట్రార్ పోస్టులను మాత్రం 26 జిల్లాలకు సర్దుబాటు చేశారు. వాస్తవానికి జిల్లాల విభజనకు చాలాకాలం ముందు నుంచే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా రిజిస్ట్రేషన్ జిల్లాలు ఏర్పాటయ్యాయి. ఒక్కో జిల్లాకు ఒక్కో జిల్లా రిజిస్ట్రార్‌ను (డీఆర్) నియమించారు. కొత్త జిల్లా కేంద్రాల ప్రకారం ఇప్పుడు వారిని సర్దుబాటు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా రిజిస్ట్రార్‌గా ప్రకాశం జిల్లా మార్కాపురం డీఆర్‌ను నియమించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా డీఆర్‌గా గూడూరు డీఆర్‌ను, బాపట్ల డీఆర్‌గా తెనాలి డీఆర్‌ను, ప్రొద్దుటూరు డీఆర్‌ను అన్నమయ్య జిల్లా డీఆర్‌గా, హిందూపురం డీఆర్‌ను సత్యసాయి జిల్లా డీఆర్‌గా నియమించారు. మిగిలిన పాత జిల్లా కేంద్రాలు, రిజిస్ట్రేషన్ జిల్లాల కేంద్రాల్లో అక్కడి వారినే కొనసాగిస్తూ ఉత్తర్వులిచ్చారు. -
కొత్త జిల్లాలకు కోడ్లను కేటాయించిన కేంద్రం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన కొత్త జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం లోకల్ గవర్నమెంట్ డైరెక్టరీ (ఎల్జీడీ) కోడ్లు కేటాయించింది. పార్వతీపురం మన్యం జిల్లాకు 743, అనకాపల్లికి 744, అల్లూరి సీతారామరాజు జిల్లాకు 745, కాకినాడకు 746, కోనసీమకు 747, ఏలూరుకు 748, ఎన్టీఆర్ జిల్లాకు 749, బాపట్లకు 750, పల్నాడుకు 751, తిరుపతికి 752, అన్నమయ్య జిల్లాకు 753, శ్రీ సత్యసాయి జిల్లాకు 754, నంద్యాలకు 755 కోడ్లను కేటాయించింది. రాష్ట్రాలతో కేంద్రం జరిపే పాలనాపరమైన సంప్రదింపులు, వివిధ పథకాలకు సంబంధించి జిల్లాల వారీగా కేటాయింపులు తదితర అంశాల్లో వీటిని వినియోగిస్తారు. చదవండి: (ఏపీ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు ముహుర్తం ఖరారు!) -
ఏపీలో సుస్థిర ప్రగతికి సీఎం జగన్ శ్రీకారం..
-
నవశకం ఆరంభం
-
భారీ ర్యాలీలు.. జేజేలు
సాక్షి నెట్వర్క్: నూతన జిల్లాల ఏర్పాటు చేయడంపై ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు సంబరాలు చేసుకున్నారు. పార్వతీపురం–మన్యం జిల్లా కేంద్రమైన పార్వతీపురంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. పార్వతీపురం, సాలూరు, కురుపాం, పాలకొండ నియోజకవర్గాల ప్రజలు పెద్దసంఖ్యలో పార్వతీపురం చేరుకుని ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి పాత బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులు చేతబూని ‘థ్యాంక్యూ సీఎం సర్’ అంటూ నినదించారు. ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, ఎమ్మెల్యేలు అలజంగి జోగారావు, పీడిక రాజన్నదొర, విశ్వాసరాయి కళావతి పాల్గొన్నారు. పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి, అరకు సంతబయలులో ర్యాలీలు నిర్వహించారు. ఎమ్మెల్యేలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, చెట్టి పాల్గుణ పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేస్తూ పుట్టపర్తిలో సంబరాలు జరిగాయి. వేలాది మంది విద్యార్థులు, డప్పు కళాకారులు, ప్రజలు ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి కార్యాలయం నుంచి హనుమాన్ జంక్షన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. నంద్యాల జిల్లా బ్రాహ్మణకొట్కూరు నుంచి పలు గ్రామాల మీదుగా నందికొట్కూరు వరకు మోటార్ సైకిల్ ర్యాలీ జరిగింది. ‘సీఎం సార్.. థ్యాంక్యూ సార్’ అంటూ ప్రజలు నినదించారు. ఎమ్మెల్యేలు తొగురు ఆర్థర్, శిల్పా చక్రపాణిరెడ్డి, ఎంపీపీ దేరెడ్డి చిన్న సంజీవరెడ్డి పాల్గొన్నారు. బాపట్ల జిల్లా ఏర్పాటు చేయటంతో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన జరిగింది. వారం రోజులపాటు ఉత్సవాలు జరపాలని నిర్ణయించారు. జిల్లాల పునర్విభజన, విజయవాడ ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేయడాన్ని హర్షిస్తూ విజయవాడ నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కృష్ణా జిల్లా గూడూరు, కోడూరుతోపాటు వివిధ గ్రామాల్లో బైక్ ర్యాలీలు జరిగాయి. ఆయా ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు జోగి రమేష్, సింహాద్రి రమేష్, విజయవాడ తూర్పు నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి దేవినేని అవినాష్ తదితరులు పాల్గొన్నారు. ప్రదర్శనలు, సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకాలు శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం కరవంజ, ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని కంచిలి, టెక్కలి, నందిగామ తదితర ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహాలకు పాలాభిషేకాలు చేశారు. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, పిరియా సాయిరాజ్, రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ నర్తు రామారావు, సీడాప్ చైర్మన్ సాడి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, కళింగ కార్పొరేషన్ చైర్మన్ పేరాడ తిలక్ పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లాలో భారీఎత్తున సంబరాలు నిర్వహించారు. చోడవరం, అడ్డరోడ్డు, రాంబిల్లి తదితర ప్రాంతాల్లో బైక్ ర్యాలీలు జరిగాయి. ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, జెడ్పీటీసీ విజయశ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో సీఎం చిత్రపటానికి స్థానికులు క్షీరాభిషేకం నిర్వహించారు. భీమవరంలో మోటారు సైకిళ్ల ర్యాలీ నిర్వహించి సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. ఉండి, ఆకివీడు మండలం కుప్పనపూడి, కొయ్యలగూడెం, పోలవరం తదితర ప్రాంతాల్లో సంబరాలు జరిగాయి. ప్రకాశం జిల్లా టంగుటూరు బొమ్మల సెంటర్లో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. తిరుపతిలో వేలాది మందితో భారీ ర్యాలీ నిర్వహించి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి, మేయర్ శిరీష, డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్‌రెడ్డి, ముద్రనారాయణ, పార్టీ నగర అధ్యక్షులు పాలగిరి ప్రతాప్‌రెడ్డి తదితరులు క్షీరాభిషేకం చేశారు. భారీ కేక్ కట్‌చేసి సంబరాలు జరుపుకున్నారు. -
సీఎం జగన్ మరో ముందడుగు..
-
ఏపీలో త్వరలో మరో కొత్త జిల్లా!
-
ఏపీలో త్వరలో మరో కొత్త జిల్లా!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త జిల్లా ఏర్పాటుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. గిరిజన ప్రాంతాలు కలిపి ఒకే జిల్లాగా ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు 26 జిల్లాలకు అదనంగా మరో జిల్లా వచ్చే అవకాశం ఉందని మంత్రి పేర్ని నాని సంకేతాలు కూడా పంపించారు. రంపచోడవరం, పొలవరం ముంపు గ్రామాలతో కలిపి కొత్త జిల్లా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. -
కొత్త జిల్లాల సమగ్ర సమాచారం
-
ఏపీ లో పోలీస్ వ్యవస్థకు కొత్త రూపు
-
కొత్త జిల్లాలకు డీఈవోల నియామకం
సాక్షి, అమరావతి: కొత్తగా ఏర్పాటైన జిల్లాలన్నిటికీ విద్యాశాఖ అధికారులను నియమిస్తూ పాఠశాల విద్యాశాఖ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల్లో క్యాడర్ సంఖ్యకు సంబంధించి కూడా జీవో విడుదల చేసింది. ప్రస్తుతం డీఈవోలుగా ఉన్న వారికి స్థానచలనంతో పాటు కొత్తగా అసిస్టెంట్ డైరెక్టర్లు, డిప్యూటీ ఈవో, సీటీఈ ప్రిన్సిపాల్, డిప్యూటీ డైరెక్టర్లకు డీఈవోలుగా బాధ్యతలు అప్పగించారు. -
కళ్లెదుటే మార్పులు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: మనందరి ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల ఫలాలు ఈరోజు మీ అందరి కళ్లెదుటే కనిపిస్తున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం 13 నూతన జిల్లాలను వర్చువల్ విధానంలో ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనలో చేపట్టిన సంస్కరణలు, వినూత్న విధానాల గురించి వివరించారు. గడప, గడపకూ పరిపాలన... ఇవాళ ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క వార్డులో ఇంకా చెప్పాలంటే ఇంటింటికీ, గడప గడపకూ పరిపాలన చేరువ కావటాన్ని ఈరోజు మనమంతా చూస్తున్నాం. గ్రామస్థాయి నుంచి పౌరసేవల్లో వేగం, పారదర్శకత పెరిగింది. అవినీతి, వివక్ష లాంటివి పూర్తిగా నిర్మూలించడంతో సంతృప్త స్థాయిలో అర్హులందరికీ పథకాలు అందుతున్నాయి. మెరుగైన వైద్య సేవలు.. రాష్ట్రంలో వైద్య సేవలు చాలా చాలా మెరుగైన పరిస్థితిలో ఉన్నాయి. దాదాపు 1100 వాహనాలు 108, 104లు కళ్లెదుటే కనిపిస్తున్నాయి. ఎవరికి బాగాలేకపోయిన 20 నిమిషాల లోపే చేరుకుని వైద్య సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అక్క, చెల్లెమ్మలకు భద్రత... అక్క చెల్లెమ్మల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తూ దిశ యాప్‌ను తెచ్చాం. దాదాపుగా 1.19 కోట్ల మంది ఫోన్లలో దిశ యాప్ ఉంది. ఆపద సమయంలో కేవలం 10 నుంచి 20 నిమిషాలలోపే పోలీసు సోదరులు వారిని ఆదుకుంటున్నారు. దేశంలోనే తొలిసారిగా డోర్ డెలివరీ.. రేషన్ సరుకులను ఇంటికే తీసుకొచ్చి డోర్ డెలివరీ చేస్తున్న మొట్ట మొదటి ప్రభుత్వం మనదే. మిగిలిన రాష్ట్రాలు కూడా మనల్ని అనుసరిస్తున్నాయి. బర్త్ సర్టిఫికెట్ దగ్గర నుంచి రేషన్ కార్డు, కులధ్రువీకరణ పత్రం, పెన్షన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు.. ఇలా ఏదైనా కూడా నిర్దేశిత సమయంలో ఇవ్వాలని గడువు విధించి మరీ అందజేస్తున్న సచివాలయాల వ్యవçస్థ మన కళ్లెదుటే కనిపిస్తోంది. ఒకటో తేదీన నిద్ర లేవకముందే, అది సెలవు రోజైనా సరే సూర్యోదయాన్నే గుడ్ మార్నింగ్ అంటూ పలకరించి మన ఇంటికే వచ్చి వలంటీర్లు సామాజిక íపింఛన్లు అందిస్తున్నారు. గ్రామగ్రామాన సచివాలయాలు.. గ్రామ స్థాయిలో వికేంద్రీకరణ గురించి చెప్పాల్సి వస్తే ప్రతి 2వేల మందికి గ్రామ, వార్డు సచివాలయ వ్యవçస్థ్ధ, ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్, ఏకంగా 15,004 సచివాలయాల ద్వారా విజయవంతంగా సేవలందిస్తున్న తొలి ప్రభుత్వం మనదే అని సగర్వంగా చెబుతున్నాం. గ్రామగ్రామాన సచివాలయాలను నెలకొల్పాం. రైతు భరోసా కేంద్రాలు... గతంలో ఇలాంటి కాన్సెప్ట్ ఎక్కడా లేదు. మన ప్రభుత్వంలో 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. విత్తనం నుంచి అమ్మకం వరకు రైతన్నకు ప్రతి అడుగులోనూ తోడుగా నిలబడే గొప్ప వ్యవస్థ రూపుదిద్దుకుంది. విద్య, వైద్య రంగాల్లో సంస్కరణలు.. ఇవాళ ప్రభుత్వ స్కూళ్లను చూసినా, ప్రభుత్వ ఆస్పత్రులను చూసినా రూపురేఖలు పూర్తిగా మారిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టి పేదల పిల్లలకు నాణ్యమైన విద్య అందుబాటులోకి తెస్తున్నాం. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో 11 బోధనాస్పత్రులు మాత్రమే ఉండగా ఇప్పుడు మరో 16 యుద్ధప్రాతిపదికన అందుబాటులోకి తెస్తున్నాం. మేనిఫెస్టోలో చెప్పినట్లుగానే... గ్రామస్థాయి నుంచి వార్డు స్థాయిలో వచ్చిన మార్పులతో పాటు జిల్లా పరిపాలనకు సంబంధించిన మార్పులు కూడా అంతే అవసరం. గ్రామస్థాయి నుంచి చోటు చేసుకున్న మార్పులకు రెవెన్యూ, జిల్లా స్థాయిలో మార్పులు తోడైతేనే చిరస్థాయిగా ఉంటాయి. అందుకే కొత్త జిల్లాల ఏర్పాటును ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాం. జిల్లా ముఖ్య పట్టణానికి ఆ జిల్లాలోని చివరి ప్రాంతం దూరంగా ఉండటం వల్ల అభివృద్ధిలో తేడాను, ప్రజల ఇబ్బందులను నా సుదీర్ఘ పాదయాత్రలో గమనించా. అలాంటి తారతమ్యాలను తొలగించాలనే గొప్ప ఆలోచనతోనే అడుగు ముందుకు వేశాం. -
AP: కొత్త కళ.. గడప వద్దకే పాలన
రాష్ట్రంలో నవశకం ఆవిష్కృతమయ్యింది. ప్రజలకు పరిపాలన మరింత చేరువయ్యింది. పాలన వికేంద్రీకరణలో భాగంగా సత్వర, సమగ్ర, సమాన, సర్వజన సంపూర్ణాభివృద్ధి లక్ష్యంగా 13 కొత్త జిల్లాలు అవతరించాయి. దీంతో 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్ సాక్షాత్కారమయ్యింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణతో రాష్ట్రమంతటా సంబరాలు మిన్నంటాయి. ప్రతిచోటా పండుగ వాతావరణం నెలకొంది. కలెక్టర్లు సహా, జిల్లాల ఉన్నతాధికారులు బాధ్యతలు చేపట్టడంతో కలెక్టరేట్లు సందడిగా మారాయి. కొత్త జిల్లాల ఏర్పాటువల్ల ప్రజలకు కలగబోయే లాభాల గురించి ప్రజలు విస్తృతంగా చర్చించుకుంటున్నారు. గ్రామం నుంచి రాజధానుల వరకు..పరిపాలనకు సంబంధించి డీ సెంట్రలైజేషన్ (వికేంద్రీకరణ) ప్రజలకు మంచి చేస్తుంది. అదే సరైన విధానం కాబట్టి గ్రామంతో మొదలు రాజధానుల వరకు ఇదే మా విధానమని మరొక్కసారి స్పష్టం చేస్తున్నా. కుప్పం ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు.. కుప్పం స్థానిక ఎమ్మెల్యే (టీడీపీ అధినేత చంద్రబాబు) విజ్ఞప్తి మేరకు.. ప్రజల ఆకాంక్షలను కూడా పరిగణనలోకి తీసుకుని రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నాం. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా రెవెన్యూ డివిజన్ కూడా ఏర్పాటు చేసుకోలేకపోగా ఇప్పుడు ఆయనే అక్కడ రెవెన్యూ డివిజన్ కావాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మరో 21 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశాం. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: సచివాలయాల వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటి గడప వద్దకే పాలన తీసుకువెళ్లామని, ఇందులో భాగంగానే గ్రామ స్థాయి నుంచి రాజధానుల వరకు పరిపాలన వికేంద్రీకరణ చేపట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. పరిపాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. నూతన జిల్లాల ద్వారా కార్యాలయాల ఏర్పాటుతో పాటు వ్యాపార, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు బాగా పెరుగుతాయన్నారు. కొత్త జిల్లాలతో ప్రజలకు మరింత మెరుగైన పాలన, శాంతి భద్రతలు, పథకాలు పారదర్శకంగా అందాలని ఆకాంక్షించారు. పాలన వికేంద్రీకరణలో భాగంగా కొత్తగా ఏర్పాటైన 13 జిల్లాలను సీఎం జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా కంప్యూటర్ బటన్ నొక్కి ప్రారంభించారు. తొలుత పార్వతీపురం మన్యం జిల్లాతో ఆరంభించి వరుసగా మిగతా జిల్లాలను సీఎం ప్రారంభించారు. 26 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, ఉన్నతాధికారులనుద్దేశించి సీఎం జగన్ మాట్లాడారు. ఆ వివరాలివీ.. గ్రామ స్థాయి నుంచి చూశాం.. పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా జరిగే మంచిని మనమంతా గ్రామస్థాయి నుంచి చూశాం. జిల్లా స్థ్ధాయిలో కూడా వికేంద్రీకరణ జరగడంతో రాష్ట్ర ప్రజలకు నేటి నుంచి మరింత మేలు జరుగుతుంది. ఇవాళ్టి నుంచి 26 జిల్లాలతో మన రాష్ట్రం రూపు మారుతోంది. కొత్తగా ఏర్పాటైన 13 జిల్లాల ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మహోన్నత వ్యక్తులు.. మనోభావాలు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, నంద్యాల, శ్రీసత్యసాయి, అన్నమయ్య, తిరుపతి... ఇవీ కొత్తగా ఏర్పాటైన 13 జిల్లాలు. పరిపాలన సౌలభ్యం, వికేంద్రీకరణ అవసరంతో పాటు స్వాతంత్య్ర సమరయోధులు, గిరిజన అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ముల సెంటిమెంట్, మహోన్నత వ్యక్తిత్వం కలిగిన వాగ్గేయకారులను దృష్టిలో ఉంచుకుని వీటి పేర్లను నిర్ణయించాం. కొత్త జిల్లాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్. చిత్రంలో మంత్రి పేర్ని నాని, సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, అజేయ కల్లం, అధికారులు కొత్తవి ఏర్పాటు కాకపోవడంతో.. గతంలో ఉన్న జిల్లాల పేర్లు అలాగే ఉన్నాయి. భీమవరం, రాజమహేంద్రవరం గత జిల్లాలకు ముఖ్య పట్టణాలుగా మారాయి. గతంలో ఉన్న జిల్లా కేంద్రాలను యథాతథంగా కొనసాగిస్తూ పార్లమెంట్ నియోజకవర్గానికి కనీసం ఒకటి చొప్పున మొత్తం 26 జిల్లాలు ఈరోజు నుంచి కొలువుదీరుతున్నాయి. 1970 మార్చిలో ప్రకాశం జిల్లా ఆవిర్భవిస్తే చివరిగా 1979 జూన్‌లో విజయనగరం జిల్లా ఏర్పాటైంది. తరువాత కొత్త జిల్లాలు ఏర్పాటు కాకపోవడంతో పరిపాలన సంస్కరణలు, వికేంద్రీకరణ విషయంలో బాగా వెనుకబడిన రాష్ట్రంగా మిగిలిపోయాం. జిల్లాల సంఖ్య, రెవెన్యూ డివిజన్లు పెరగడం వల్ల ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలుపై పర్యవేక్షణ పెరిగి సమర్థంగా అమలవుతాయి. అరుణాచల్‌లో 53 వేల మందికి జిల్లా దేశంలో 727 జిల్లాలు ఉండగా యూపీలో అత్యధికంగా 75, అతి తక్కువగా గోవాలో రెండు జిల్లాలే ఉన్నాయి. దేశంలో ఏడో అతిపెద్ద రాష్ట్రమైన ఏపీలో మాత్రం నిన్నటివరకు 13 జిల్లాలే ఉన్నాయి. 1.38 కోట్ల జనాభా కలిగిన, అతి చిన్న రాష్ట్రాల్లో ఒకటైన అరుణాచల్‌ప్రదేశ్‌లో కూడా ఏకంగా 25 జిల్లాలున్నాయి. 2011 లెక్కల ప్రకారం ఏపీలో 13 జిల్లాల్లో 4.90 కోట్ల మంది జనాభా ఉండగా ప్రతి జిల్లాలో సగటున 38 లక్షల మంది ఉన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ జిల్లాకు సగటున ఇంత జనాభా లేదు. మహారాష్ట్రలో ఒక్కో జిల్లాలో సగటున 31 లక్షలు, తెలంగాణాలో 10.06 లక్షల మంది చొప్పున నివసిస్తున్నారు. ఉత్తరాఖండ్‌లో 6 లక్షల మందికి ఒక జిల్లా ఏర్పాటు కాగా మిజోరాంలో లక్ష మందికి, అరుణాచల్‌ప్రదేశ్‌లో కేవలం 53 వేల మందికి ఒక జిల్లా చొప్పున ఏర్పాటయ్యాయి. కర్ణాటకలో 20 లక్షల మందికి, యూపీలో 26.64 లక్షల మందికి జిల్లాలు ఏర్పాటు చేశారు. అధికారంతో పాటు బాధ్యత నూతన జిల్లాల ఏర్పాటుతో సగటున జిల్లాకు 19 లక్షల మంది జనాభాతో రూపురేఖలు మారుతున్నాయి. గిరిజన జిల్లాలు మినహా మిగిలిన అన్ని చోట్ల 6 నుంచి 8 అసెంబ్లీ స్థానాలతో జిల్లాలు ఏర్పాటయ్యాయి. కనీసం 18 లక్షల నుంచి 23 లక్షల మధ్య జనాభా ఉండేలా పునర్వ్యవస్థీకరణ చేశాం. జిల్లాల ఏర్పాటు ఎందుకు చేయాల్సి వచ్చిందో మరింత వివరంగా చెప్పాలంటే.. మన దేశ జనాభా స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సుమారు 100 కోట్లకుపైగా పెరిగింది. నాడు జనాభా దాదాపు 35 కోట్లు కాగా ఈ రోజు 138 కోట్లు అని లెక్కలు చెబుతున్నాయి. ఆ రోజు కలెక్టర్లుకు ఉన్నది అజమాయిషీ, అధికారం అయితే ఈ రోజు వారికి అధికారంతో పాటు ప్రజల పట్ల బాధ్యత ఎక్కువగా ఉంది. కలెక్టర్ల ఆధ్వర్యంలోనే... గతంలో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రధానంగా రెవెన్యూ మాత్రమే ఉండేది. ఇప్పుడు శాంతి భద్రతలు, రెవెన్యూ, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, ట్రెజరీ, సోషల్ వెల్ఫేర్, వ్యవసాయం, పశుపాలన, ప్రా«థమిక విద్య, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, సివిల్ సఫ్లైస్, కార్మిక చట్టాలు, విపత్తు నిర్వహణ, పంపిణీ విభాగం, ఎన్నికల నిర్వహణ కూడా కలెక్టర్ల ఆధ్వర్యంలోనే ఉన్నాయి. ఈ సేవలు, పరిపాలన ప్రజలకు మరింత చేరువ కావాలనే సంస్కరణలు చేపట్టి గ్రామ స్థాయి నుంచి మార్పులు తెచ్చాం. అన్నమయ్య జిల్లా ఏర్పాటుపై సంతోషం వ్యక్తం చేస్తూ రాయచోటిలో ర్యాలీ చేస్తున్న ప్రజలు కనీసం 15 ఎకరాల్లో అన్ని కార్యాలయాలు... కొత్త జిల్లాల ఏర్పాటుతో కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు, మిగిలినవి అన్నీ ఒకేచోటకి వస్తాయి. కనీసం 15 ఎకరాల విస్తీర్ణంలో అన్నీ ఒకేచోట ఏర్పాటు కాబోతున్నాయి. వీటిని ఇంటిగ్రేటెడ్‌గా ఏర్పాటు చేస్తే అన్ని కార్యాలయాలు ఒకే చోట కనిపిస్తాయి. వీటికోసం ఎక్కడెక్కడో తిరగాల్సిన అవసరం లేకుండా ఒకేచోట ఉండేలా గొప్ప వ్యవస్థను తీసుకొస్తున్నాం. ప్రజల విజ్ఞప్తి మేరకు కొన్ని మార్పుచేర్పులు చేశాం. తొలుత నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకుని జిల్లాలు ఏర్పాటు చేశాం. ఇందులో కూడా 12 నియోజకవర్గాల్లో మండలాలను కొద్దిగా విభజించి కొన్ని మండలాలను ఒక జిల్లాలో, కొన్ని మండలాలను మరొక జిలాలోనూ ప్రజల ఆకాంక్షల మేరకు చేయాల్సి వచ్చింది. కార్యక్రమంలో రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, సీసీఎల్ఏ స్పెషల్ సీఎస్ జి.సాయిప్రసాద్, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, పరిశ్రమలశాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవన్, ఆర్ అండ్ బీ ముఖ్యకార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ప్రణాళికా శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్ పాల్గొన్నారు. మారుతున్న ప్రపంచంతో పాటు.. మారుతున్న ప్రపంచంతో పాటు ప్రజల అవసరాలు, ఆకాంక్షల మేరకు మనం మార్పులు చేపట్టాల్సిన పరిస్థితులున్నాయి. బ్రిటీషర్ల హయాంలో గమనిస్తే జిల్లా కలెక్టర్లు అంటే జిల్లా రెవెన్యూ కలెక్ట్ చేసే వారు అని భావించే రోజులవి. ఇప్పుడు రెవెన్యూ వసూలు వారి విధుల్లో ఒకటి మాత్రమే. వారంతా ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ ఆలోచనా విధానాన్ని సక్రమంగా అమలు చేసే ప్రతినిధులుగా నిలుస్తున్నారు. జిల్లావ్యాప్తంగా సమన్వయం చేస్తూ పర్యవేక్షించే బాధ్యత ఈరోజు కలెక్టర్ల భుజస్కందాలపైనే ఉంది. ► ఒక గొప్ప చరిత్రలో భాగస్వాములమవుతున్నాం. జిల్లా అభివృద్ధికి, ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలు చేరవేసేందుకు నిబద్ధతతో పనిచేస్తా. -బాపట్ల జిల్లా కలెక్టర్ కె.విజయ ►తిరుపతి జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి ఆస్కారముంది. స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తా. మెరైన్ డెవలప్మెంట్ చేసి జిల్లాను ముందుకు తీసుకెళతాం. – తిరుపతి కలెక్టర్‌కె.వెంకట రమణారెడ్డి ►గిరిజనులతో మమేకమై వారి జీవన విధానాన్ని మెరుగుపరిచేందుకు కృషి చేస్తా. పరిపాలన వికేంద్రీకరణ వల్ల ప్రజలు వారి సమస్యలను అధికారుల దృష్టికి త్వరగా తీసుకువచ్చే అవకాశమేర్పడింది. – అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్ ► గిరిజనులతో మమేకమవుతాం... ఈ రోజు మా అందరికీ ఎంతో మంచిరోజు. మాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు. అల్లూరి సీతారామరాజు పేరుతో నూతన జిల్లా ఏర్పాటు చేయడం, ఈ జిల్లాకు మొదటి కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టడం నాకు గర్వకారణం. జిల్లా యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు అందరూ సహకరించారు. జిల్లాలో పని చేయటాన్ని ఒక చాలెంజ్‌గా తీసుకుంటా. గిరిజనులతో మమేకమై వారి జీవన విధానాన్ని మరింతగా మెరుగుపరిచేలా కృషిచేస్తా. పరిపాలనా వికేంద్రీకరణ వలన ప్రజలకు మరింతగా చేరువయ్యే అవకాశం ఉంది. కొత్త జిల్లాల ఏర్పాటు వలన ప్రజలు వారి సమస్యలను అధికారుల దృష్టికి త్వరితగతిన తెచ్చే అవకాశం ఉంది. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి ప్రతి సమస్యలను సత్వరమే పరిష్కరిస్తాం. మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. – సుమిత్ కుమార్, జిల్లా కలెక్టర్, అల్లూరి సీతారామరాజు జిల్లా (వారంలో రెండు రోజులు రంపచోడవరంలో ఉండాలని సీఎం జగన్ ఈ సందర్భంగా కలెక్టర్‌కు సూచించారు ► పథకాలను చేరవేయడంలో నిబద్ధతతో పనిచేస్తాం కొత్త జిల్లాకు కలెక్టర్‌గా అవకాశం ఇవ్వడాన్ని గౌరవంగా భావిస్తున్నా. థ్యాంక్యూ సార్. ఒక చరిత్రలో భాగస్వామినయ్యానని భావిస్తున్నా. బాపట్ల జిల్లా అభివృద్ధి కోసం కృషిచేస్తా. మేం చిత్తశుద్దితో పనిచేసి మీ కలలను నిజం చేస్తాం. ప్రతీ పథకాన్ని ప్రజలకు చేరవేయడంలో నిబద్ధతతో పనిచేస్తాం. మీ ఆలోచనలకు ప్రతిరూపంగా జిల్లా అభివృద్ధి్దలో భాగస్వాములవుతాం. – కె.విజయ, కలెక్టర్, బాపట్ల జిల్లా ► మెరైన్ డెవలప్మెంట్తో ముందుకు.. ఈ గొప్ప కార్యక్రమంలో భాగస్వాములు కావటాన్ని గౌరవంగా భావిస్తున్నాం. తిరుపతి జిల్లాలో మహిళల శాతం ఎక్కవగా ఉంది. దీనివల్ల అభివృద్ధి కూడా వేగంగా జరుగుతుంది. ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధికి అవకాశం ఉండడంతో పాటు అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఉంది. ఆర్ధికాభివృద్ధికి అవకాశం ఉంది. స్ధానిక ప్రజా ప్రతినిధులతో చర్చించి అన్ని సమస్యలు పరిష్కరించి జిల్లా అభివృద్ధికి పాటుపడతాం. మా జిల్లా ద్వారా రాయలసీమకు సముద్ర తీరం అందుబాటులోకి వచ్చింది. మెరైన్ డెవలప్మెంట్ చేసి జిల్లాను ముందుకు తీసుకెళతాం. ప్రజల ఆశలు, ఆకాంక్షలు, బాధ్యతలను నెరవేరుస్తాం. దేశంలోనే మొట్టమొదటిసారిగా గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి వారి సమస్యలను ఎక్కడికక్కడే తీరుస్తున్నారు. పరిపాలనా వికేంద్రీకరణ వల్ల ప్రజలకు మరింతగా ప్రభుత్వ సేవలు అందుతున్నాయి. ప్రజల సమస్యలను పరిష్కరించేలా నిబద్ధతతో పనిచేస్తాం. కొత్త జిల్లాను అభివృద్ధి బాటలో నడిపేందుకు పూర్తి సిద్ధంగా ఉన్నాం. – కె.వెంకట రమణారెడ్డి, కలెక్టర్, తిరుపతి జిల్లా ► మంచిపేరు తెస్తాం.. మీ ఆశయాలకు అనుగుణంగా పనిచేసి ప్రభుత్వానికి, పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకొస్తాం. – పరమేశ్వరరెడ్డి, తిరుపతి జిల్లా ఎస్పీ -
పాజిటీవ్ రెస్పాన్స్.. పాలన వికేంద్రీకరణ చాలా బాగుంది: సజ్జల
-
పాజిటీవ్ రెస్పాన్స్.. పాలన వికేంద్రీకరణ చాలా బాగుంది: సజ్జల
సాక్షి, అమరావతి: పరిపాలనా వికేంద్రీకరణ అనేది పూర్తిగా జరిగిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అనుకున్న దాని కంటే ఎక్కువ పాజిటీవ్ రెస్పాన్స్ వస్తుందన్నారు. పరిపాలనా వికేంద్రీకరణ చాలా బావుందని.. మిడిల్ లెవల్ అడ్మినిస్ట్రేషన్ సమూలంగా సంస్కరించబడిందన్నారు. వికేంద్రీకరణ ఫలాలు కూడా వచ్చే ఐదారు నెలల్లో వస్తాయన్నారు. సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థలా ఇది కూడా విజయవంతమవుతుందన్నారు. చదవండి: కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం జగన్‌కు గవర్నర్ అభినందనలు ‘‘పార్లమెంట్ నియోజకవర్గాన్ని కొలమానంగా తీసుకోవడం వల్ల సమస్యలు లేవు. 12 అసెంబ్లీ నియోజకవర్గాలు రెండు జిల్లాల పరిధిలోకి వచ్చాయి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చేయడం వల్లే జిల్లాల పునర్విభజన సజావుగా జరిగింది. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట రెవెన్యూ డివిజన్‌పై కూడా సీఎం నిర్ణయం తీసుకున్నారు. 7న కేబినెట్లో పెట్టి నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తారని సజ్జల తెలిపారు. -
జిల్లాల విభజన పరిపాలన సౌలభ్యం మరింత పెరిగింది:గుడివాడ అమర్నాథ్
-
AP: కొత్త జిల్లాల కేంద్రాలకు రిజిస్ట్రేషన్ ఛార్జీల సవరణ
సాక్షి, అమరావతి: కొత్త జిల్లాల కేంద్రాలకు రిజిస్ట్రేషన్ ఛార్జీలను సవరిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. 13 కొత్త జిల్లా కేంద్రాల్లో మాత్రమే రిజిస్ట్రేషన్ ఛార్జీల సవరణ వర్తిస్తుంది. కొత్త జిల్లా కేంద్రాల ఆస్తుల విలువ పెరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అర్బన్, రూరల్ ప్రాంతాల మార్కెట్ విలువ సవరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చదవండి: కొత్త జిల్లాలతో ప్రజలకు మేలు: సీఎం జగన్ కొత్తగా 13 జిల్లాల ఏర్పాటుతో పునర్వ్యవస్థీకరించిన 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన చరిత్రలో నవశకానికి నాంది పలికింది. కొత్త జిల్లాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం ప్రారంభించారు. చిన్న జిల్లాల ఏర్పాటు ద్వారా జిల్లా కేంద్రం నుంచి మారుమూల సరిహద్దు గ్రామాలకు దూరభారం తగ్గనుంది. జిల్లా పరిపాలన యంత్రాంగం ప్రజలకు మరింత చేరువకానుంది. ప్రజల ఇంటి వద్దకు పాలన ద్వారా జవాబుదారీతనం ఇంకా పెరగనుంది. పాలనాపరంగా పర్యవేక్షణ పెరగనుంది. అభివృద్ధికి దూరంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించే వెసులుబాటు ఉంటుంది. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు క్షేత్ర స్థాయిలో మరింత వేగంగా మరింత పారదర్శకంగా అమలు చేసే అవకాశం ఉంటుంది. అన్ని ప్రాంతాల సమతులాభివృద్ధికి బాటలు వేయొచ్చు. అభివృద్ధిలో ప్రాదేశిక సమానత్వం, సమ్మిళిత ఆర్థిక వృద్ధి, బడుగు, బలహీన వర్గాల వికాసంతో పాటు సుస్థిర ప్రగతికి బాటలు వేస్తుంది. వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల కోసం ప్రజలు వ్యయ ప్రయాసలకోర్చి మైళ్ల కొద్దీ తిరిగే దుస్థితిని తొలగిస్తూ జిల్లా కలెక్టర్, జిల్లా పోలీసు అధికారి కార్యాలయాలు, వారి క్యాంపు కార్యాలయాలతో సహా అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం కనీసం 15 ఎకరాల సువిశాల స్థలంలో మంచి డిజైన్లతో పది కాలాలపాటు గుర్తుండే విధంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం సాగనుంది. -
మేము పల్నాడు వాళ్ళం కాదు కానీ వచ్చాం గెలిచాం :అంబటి రాంబాబు
-
చంద్రబాబు పై పేర్ని నాని ఫైర్
-
చంద్రబాబు దున్నపోతు ఈనిందని చెబితే పవన్ కట్టెసే రకం: పేర్ని నాని
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నూతన ఆధ్యాయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాంది పలికారని మంత్రి పేర్ని నాని తెలిపారు. పరిపాలన సౌలభ్యం కోసం ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మార్చారని పేర్కొన్నారు. ఈ మేరకు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి మాట్లాడుతూ... ప్రజల సౌలభ్యం కోసం 13 కొత్త జిల్లాలను ఏర్పాట్లు చేశారని, ఇది ఆంద్రప్రదేశ్ చరిత్రలో ఒక మైలు రాయిగా నిలుస్తోందన్నారు. కేవలం మూడేళ్ళ అనుభవంలోనే ఇలాంటి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవడం గొప్ప విషయమన్నారు. మంచి చేసేప్పుడు మంచి అని చెప్పలేని వారు నోటికి తాళం వేసుకోవాలని హితవు పలికారు. వైఎస్ జగన్ చెప్పిన ప్రతిమాటలో 95 శాతం హామీలను నెరవేర్చారని మంత్రి తెలిపారు. చంద్రబాబు హయాంలో పాఠశాలలు మూతవేసే స్థాయి నుంచి ఈ రోజు సీట్లు లేవని బోర్డులు పెట్టె స్థాయికి సీఎం జగన్ తీసుకొచ్చారని కొనియాడారు. నలభై ఏళ్ల ఇండస్ట్రీ అని కోతలు కూసే కింగ్ మేకర్ చంద్రబాబు అనుభవం ఏమైందని మంత్రి పేర్నినాని ప్రశ్నించారు. చివరికి ఒక నవ యువకుడి వద్ద కుప్పంను రెవిన్యూ డివిజన్ చేయాలని అభ్యర్థించారని ప్రస్తావించారు. చదవండి: ఎన్టీఆర్ అభిమానుల కోరిక తీరింది.. ‘1979కే 13 జిల్లాలు ఏర్పడితే ఈ 43 ఏళ్లలో పెరిగిన జనాభాకు అనుగుణంగా ఎన్ని జిల్లాలు పెరగాలి. చంద్రబాబు దున్నపోతు ఈనింది అని చెబితే పవన్ కల్యాణ్ కట్టెసే రకం. అమరావతి రైతుల వద్ద భూములు లాక్కుంటే చంద్రబాబుని ఒక్క అడుగు కూడా కదలనివ్వను పవన్ అన్నాడు. దివిస్ ల్యాబ్ వద్దకు వెళ్లి మాటలు చెప్పారు. వారికి ఏం న్యాయం చేశారు. ఉద్దానం వాళ్ళ బాధ్యత తీసుకున్నాను అన్నారు కదా.. ఏమయ్యాయి ఆ బాధ్యతలు. జిల్లాల నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎక్కడున్నాడు పవన్. ప్రభుత్వాన్ని ఏమైనా కలిసి, ఏమైనా సూచనలు చేశాడా..? చంద్రబాబు కార్యాలయం నుంచి వచ్చిన దానిపై సంతకం చేయడం తప్ప ఏమీ చేశావ్? మీరు ప్రభుత్వాన్ని నడిపినప్పుడు ఒక్క రోజైనా ఈ కుకునూరు లాంటి ప్రజల అభిప్రాయాలు వినిపించారా? చదవండి: సరికొత్త చరిత్ర ... ‘సీమ’కు సముద్రం పవన్ పల్లకి మోసిన టీడీపీ ప్రభుత్వం కాదు. ప్రజల ఆకాంక్షలతో నడుస్తున్న ప్రభుత్వం. పోలవరం, రంపచోడవరం లాంటి ప్రాంతాల సమస్యలను వైఎస్ జగన్ పరిశీలిస్తున్నారు. ప్రజలకు అవసరమైన వాటికి నాలుగు మెట్లు దిగి పరిష్కరించే వ్యక్తి జగన్. గుండెల నిండా టీడీపీ. మనసు నిండా చంద్రబాబు ఉన్న కమ్యూనిస్టు పార్టీ నాయకులు రామకృష్ణ, నారాయణ కూడా మాట్లాడతారు. చంద్రబాబు హయాంలో ఒక్కరోజన్నా శివరామకృష్ణన్ కమిటీ వికేంద్రీకరణ సూచనపై అఖిలపక్షం వేయమని ఆడిగారా? ప్రత్యేక హోదా ఇస్తానన్న, తెస్తానన్న వారిపై అఖిలపక్షం వేయమని ఆడిగారా? ప్యాకేజీ ముద్దు అన్నప్పుడు అఖిలపక్షం కావాలని ఆడిగారా? అప్పుడేమో నోరు కుట్టేసుకుని చంద్రబాబుకి అవసరం అయినప్పుడు మాట్లాడతారు.’ అని ప్రతిపక్ష నాయకులపై మంత్రిపేర్ని నాని నిప్పులు చెరిగారు. -
కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం జగన్‌కు గవర్నర్ అభినందనలు
సాక్షి, విజయవాడ: జిల్లాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా నూతనంగా 13 జిల్లాలను ఏర్పాటు చేయటం అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. పాలనా వికేంద్రీకరణలో భాగంగా సత్వర, సమగ్ర, సమాన, సర్వజన, సంపూర్ణ అభివృద్ధి లక్ష్యంగా చరిత్రలో నవశకానికి నాంది పలుకుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకోవటం అనుసరణీయమన్నారు. నూతన జిల్లాల ఏర్పాటుతో పునర్ వ్యవస్థీకరించిన 26 జిల్లాల పాలన ప్రారంభం కావటం అన్ని ప్రాంతాల ఏకీకృత అభివృద్ధికి బాటలు వేస్తుందని విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేసారు. చదవండి: కొత్త జిల్లాలతో ప్రజలకు మేలు: సీఎం జగన్ కొత్త జిల్లాల ఏర్పాటు ప్రభుత్వంలో మరింత పారదర్శకతను తీసుకువస్తుందని ఇది రాష్ట్ర పరిపాలనా చరిత్రలో నూతన అధ్యాయాన్ని సృష్టిస్తుందన్నారు. నూతన జిల్లాలతో అభివృద్ధిలో ప్రాదేశిక సమానత్వం, పథకాల అమలులో మరింత వేగం, ప్రజలకు చేరువగా పాలన సాధ్యమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకే ప్రాంగణంలో అన్ని కార్యాలయాలు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయటం మంచి ఆలోచన అని గవర్నర్ పేర్కొన్నారు. -
కొత్త జిల్లాల ఏర్పాటుతో వైఎస్ఆర్ సీపీ శ్రేణుల సంబరాలు
-
సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన కోనసీమ ప్రజలు
-
పరిపాలనా వికేంద్రీకరణతో ప్రజలకు మేలు : సీఎం జగన్
-
నూతన జిల్లాలను లాంఛనంగా ప్రారంభించిన సీఎం జగన్
-
నూతన జిల్లాల ఫైనల్ రిపోర్టుని ఆవిష్కరించిన సీఎం జగన్
-
కొత్త జిల్లాలతో ప్రజలకు మేలు: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: జిల్లా స్థాయిలో వికేంద్రీకరణతో రాష్ట్ర ప్రజలకు మంచి జరిగే గొప్ప రోజు ఇవాళ అవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఉదయం క్యాంప్ కార్యాలయంలో.. కొత్త జిల్లాలను ప్రారంభించిన అనంతరం జిల్లాల ఏర్పాటు ఆవశ్యకతను ఆయన స్వయంగా వివరించారు. అంతకు ముందు 26 జిల్లాల ఏపీ రాష్ట్రంగా రూపుమారుతున్న సందర్భంగా.. ప్రజలకు, అధికారులకు, ఉద్యోగులకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు సీఎం వైఎస్ జగన్. కొత్త జిల్లాల పేర్లను స్వయంగా చదివి వినిపించిన ఆయన.. ప్రజల సెంటిమెంట్లను, గొప్పవాళ్లను పరిగణనలోకి తీసుకున్నాకే జిల్లాలను ఏర్పాటు చేశామని, వాటికి పేర్లు కూడా పెట్టినట్లు వెల్లడించారు. పరిపాలన సౌలభ్యం, వికేంద్రీకరణ అవసరం మేరకే కొత్త జిల్లాలు అని మరోసారి స్పష్టం చేసిన సీఎం జగన్.. గతంలో ఉన్న జిల్లాలు యథాతధంగానే ఉంటాయని గుర్తు చేశారు. ఏపీతో పోలిస్తే తక్కువ జనాభా ఉన్న అరుణాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రంలోనే 26 జిల్లాలు ఉన్నాయని చెబుతూ.. జనాభా ప్రతిపాదికన చూసుకుంటే ఏపీకి జిల్లాల ఏర్పాటు అవసరం తప్పక ఉందని పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో జిల్లాకు ఇంత ఎక్కువ జనాభా ఉన్న పరిస్థితి లేదని, సుమారు 4 కోట్ల 96 లక్షల మంది జనాభా ఉన్న ఏపీకి జిల్లాల ఏర్పాటు ఎంతో అవసరమని తెలిపారు. ఇంతకు ముందు 38 లక్షల 15 వేల మందికి ఒక జిల్లా ఉండేదని.. ఇప్పుడు 26 జిల్లాల ఏర్పాటుతో 19 లక్షల 7 వేల మందికి ఒక జిల్లా ఉంటుందని తెలిపారు. గిరిజన జిల్లాల్లో మినహా 6 నుంచి 8 అసెంబ్లీ సెగ్మెంట్లతో ఒక జిల్లా ఏర్పాటు చేసినట్లు సీఎం జగన్ తెలిపారు. కొత్త జిల్లాలతో మెరుగైన పాలనా, శాంతి భద్రతలు, పారదర్శకత.. ఉంటుందని చెప్పారాయన. గ్రామస్థాయి నుంచి పరిపాలనపై దృష్టి పెట్టిన తమ ప్రభుత్వం.. అందుకు తగ్గట్లే జిల్లాలను, రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసిందని, ఏరకంగా చూసుకున్నా ఇదే సరైన విధానమని సీఎం జగన్ స్పష్టం చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఏపీ కొత్త జిల్లాల అవతరణ
-
ఏపీ కొత్త జిల్లాల అవతరణ.. అప్డేట్స్
అప్డేట్స్ తూర్పుగోదావరి జిల్లా: జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టిన సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ రాజమండ్రి కొవ్వూరు రైల్ కం రోడ్డు వంతెనపై ఎంపీ భరత్ రామ్ భారీ పాదయాత్ర నిర్వహించారు. కొవ్వూరు టోల్ గేట్ నుంచి రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్ వరకు పాదయాత్ర కొనసాగింది. పాదయాత్రలో మంత్రి తానేటి వనిత, ఎమ్మెల్యేలు శ్రీనివాస్ నాయుడు, డాక్టర్ సూర్య నారాయణ రెడ్డి, తలారి వెంకట్రావు, రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ పాల్గొన్నారు. గుంటూరు: కొత్త జిల్లాలను స్వాగతిస్తూ గుంటూరు లాడ్జ్ సెంటర్ నుంచి శంకర్ విలాస్ సెంటర్ వరకు ఎమ్మెల్యేలు మద్దాలి గిరిధర్, ముస్తఫా, మేయర్ మనోహర్ నాయుడు, మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ లక్ష్మణ్ రెడ్డి, మిర్చి యార్డ్ చైర్మన్ ఏసురత్నం ర్యాలీ నిర్వహించారు. నంద్యాల జిల్లా: జిల్లాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా నూతనంగా నంద్యాల జిల్లా ఏర్పాటుపై న బనగానపల్లె ఎమ్మేల్యే కాటసాని రామిరెడ్డి అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ గుండం నాగేశ్వర్ రెడ్డి,ఎంపీపీ మానస వీణ, జెడ్పీటీసీ సుబ్బ లక్ష్మమ్మ,సర్పంచ్ ఈసారి ఎల్లమ్మ,మైనారిటీ నాయకుడు అబ్దుల్ ఫైజ్,డాక్టర్ మహమ్మద్ హుస్సేన్,కోడూరు రామ చంద్ర రెడ్డి,వైయస్సార్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు పార్వతీపురం జిల్లా: పార్వతీపురం కేంద్రంగా పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పటు అయ్యింది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి నూతన జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. నెల్లూరుజిల్లా : రాపూరుని నెల్లూరు జిల్లాలో కొనసాగించడంతో హర్షం వ్యక్తం చేస్తున్న మండల వాసులు ►సీఎం వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలుపుతూ భారీ ర్యాలీ ర్యాలీ లో పాల్గొన్న ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి , జడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ ,వైఎస్సార్సీపీ నేతలు.. బాణాసంచారాలు పేల్చి సంబరాలు ►ప్రజాభిప్రాయాన్ని గౌరవించిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు.. ఆయన చిత్రపటానికి పాలాభిషేకం ►థాంక్యూ సీఎం సార్ అంటూ ప్ల కార్డులు ప్రదర్శించిన చిన్నారులు ►చిన్నారులకు టెట్రా మిల్క్ , బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆనం 12:53 PM కాకినాడ జిల్లా: కాకినాడ జిల్లాగా ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ ఎంపీ వంగా గీత. ఎమ్మెల్యే పెండెం దొరబాబు. కార్పొరేషన్ చైర్మన్ సుంకర ప్రసన్న. ►కాకినాడ జిల్లా.. ప్రగతి తొలిమెట్టు నినాదాలు చేస్తూ పార్టీ కార్యాలయం నుండి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు ర్యాలీ. ►ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి ప్రజలు గురించి ఆలోచించే వారు లేరు చిన్న వయసులోనే ప్రజల మన్ననలు పొందిన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి -ఎంపీ వంగా గీత 12: 35 PM పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో నూతన కొత్త కలక్టరేట్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఎస్పీ రవి ప్రకాష్, శాసనమండలి చైర్మన్ కొయ్యే మోసేనురాజు, గృహ నిర్మాణ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్యేలు గ్రంధి శ్రీనివాస్, కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, ఉండి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జ్ గోకరాజు రామరాజు, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి సర్రాజు, డిసిసిబి చైర్మన్ పి వి ఎల్ నరసింహ రాజు 11:28AM కృష్ణాజిల్లా: జిల్లాల పునర్విభజనకు మద్దతుగా అవనిగడ్డ పార్టీ కార్యాలయం నుంచి వంతెన సెంటర్ వరకు పాదయాత్ర నిర్వహించి వతెన సెంటర్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, దివి మార్కెట్ యార్డ్ చైర్మన్ కడవకోల్లు నరసింహారావు 10.20 AM జిల్లా ఏర్పాటుపై చాలా గర్వంగా, ఆనందంగా ఉంది. గిరిజనులకు సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఒక టీమ్‌గా తామంత పనిచేస్తాం. -అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్. చరిత్రలో ఒక భాగమైనందకు ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ప్రభుత్వ సూచనలతో జిల్లాను అభివృద్ధి చేస్తాం. -బాపట్ల జిల్లా కలెక్టర్ విజయ తిరుపతి జిల్లా ప్రజల తరుఫున కృతజ్ఞతలు. స్పెషాలిటీ ఉన్న జిల్లా తిరుపతి. ఇక్కడ సెక్స్ రేషియో 1:1 గా ఉంది. ఎకానమీ పరంగా తిరుపతి నుంచి మంచి రెవెన్యూ బూస్ట్ ఉంటుంది. జిల్లా అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు, అధికారులను కలుపుకొని ముందుకు వెళ్తాం. -తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి 9.36 AM కొత్త జిల్లాలను వర్చువల్‌గా ప్రారంభించిన తర్వాత సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘ఏపీలో పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా జరిగే మంచిని గ్రామస్థాయి నుంచి చూశాం. ఇప్పుడు జిల్లా స్థాయిలో కూడా వికేంద్రీకరణ చేస్తున్నాం. ఇవ్వాళ్టి నుంచి మనది 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌గా రాష్ట్రం ఏర్పడింది. తమతమ బాధ్యతలు తీసుకుని, పనులు ప్రారంభిస్తున్న ఉద్యోగులు, సిబ్బంది, అధికారులకు అభినందనలు తెలియజేస్తున్నాను. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, నంద్యాల, శ్రీసత్యసాయి, అన్నమయ్య, తిరుపతి పేరుతో 13 కొత్తజిల్లాలు. పరిపాలనా సౌలభ్యాన్ని, వికేంద్రీకరణ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాల పేర్లు పెట్టాం. గతంలో ఉన్న జిల్లాల పేర్లు అలాగే ఉన్నాయి. కనీసం ఒక పార్లమెంటు నియోజకవర్గానికి ఒకటి చొప్పున జిల్లాను ఏర్పాటుచేశాం’ అని అన్నారు. ► కొత్త జిల్లాల ఏర్పాటుతో ఏపీలో సుస్థిర ప్రగతికి బాటలు వేసిన ప్రభుత్వం. అన్ని ప్రాంతాల సమతులాభివృద్ధికి బాటలు. ► ఆంధ్రప్రదేశ్‌లో 42 ఏళ్ల తర్వాత.. కొత్త జిల్లాల ఏర్పాటు 9.29 AM ► తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి.. కొత్త జిల్లాలను ఒక్కొక్కటిగా వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్ ► ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాలను వర్చువల్‌గా ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. పునర్వ్యవస్థీకరణలో భాగంగా.. 13 జిల్లాలు కాస్త 26గా మార్పు. ఇకపై ఏపీ రాష్ట్రంలో 26 జిల్లాలు, 72 రెవెన్యూ డివిజన్లు. 9.24 AM ► కొత్తపేట ప్రజల మనోభావాలను, ఆకాంక్షలను సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. కొత్తపేట రెవెన్యూ డివిజిన్ ఏర్పాటును కోరుకుంటున్నారని వెల్లడి. జగ్గిరెడ్డి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న సీఎం వైఎస్ జగన్. తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన సీఎం వైఎస్ జగన్ ► ప్రభుత్వ భవనాల్లోనే అత్యధిక శాతం కార్యాలయాలు. ఇప్పటికే సరిపడా అధికారుల, ఉద్యోగుల కేటాయింపులు. 8.55 AM ► మరికాసేపట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల అవతరణ.. వర్చువల్‌గా ప్రారంభించనున్న సీఎం వైఎస్ జగన్ ► కొత్త జిల్లాలతో పరిపాలన వికేంద్రీకరణ ద్వారా పాలనను ప్రజల చెంతకు మరింత దగ్గరగా తీసుకువెళ్లనున్నారు. ► సోమవారం ఉదయం 9.05 గంటలకు 26 జిల్లాల కలెక్టర్లు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ తర్వాత మిగిలిన శాఖల జిల్లా అధికారులు బాధ్యతలు స్వీకరిస్తారు. ► కొత్తగా 13 జిల్లాల ఏర్పాటుతో పునర్వ్యవస్థీకరించిన 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన చరిత్రలో నవశకానికి నాంది పలకనుంది. కొత్త జిల్లాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం ఉదయం 9.05 – 9.45 గంటల మధ్య లాంఛనంగా ప్రారంభించనున్నారు. ► ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన జిల్లాల పునర్వ్యవస్థీకరణ వాగ్దానాన్ని కార్యరూపంలోకి తీసుకు రానుంది వైఎస్సార్సీపీ ప్రభుత్వం. జిల్లాల పెంపుతో ఉపయోగాలివే ► చిన్న జిల్లాల ఏర్పాటు ద్వారా జిల్లా కేంద్రం నుంచి మారుమూల సరిహద్దు గ్రామాలకు దూరభారం తగ్గనుంది. జిల్లా పరిపాలన యంత్రాంగం ప్రజలకు మరింత చేరువకానుంది. ప్రజల ఇంటి వద్దకు పాలన ద్వారా జవాబుదారీతనం ఇంకా పెరగనుంది. ► పాలనాపరంగా పర్యవేక్షణ పెరగనుంది. అభివృద్ధికి దూరంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించే వెసులుబాటు ఉంటుంది. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు క్షేత్ర స్థాయిలో మరింత వేగంగా మరింత పారదర్శకంగా అమలు చేసే అవకాశం ఉంటుంది. ► అన్ని ప్రాంతాల సమతులాభివృద్ధికి బాటలు వేయొచ్చు. అభివృద్ధిలో ప్రాదేశిక సమానత్వం, సమ్మిళిత ఆర్థిక వృద్ధి, బడుగు, బలహీన వర్గాల వికాసంతో పాటు సుస్థిర ప్రగతికి బాటలు వేస్తుంది. ► వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల కోసం ప్రజలు వ్యయ ప్రయాసలకోర్చి మైళ్ల కొద్దీ తిరిగే దుస్థితిని తొలగిస్తూ జిల్లా కలెక్టర్, జిల్లా పోలీసు అధికారి కార్యాలయాలు, వారి క్యాంపు కార్యాలయాలతో సహా అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం కనీసం 15 ఎకరాల సువిశాల స్థలంలో మంచి డిజైన్లతో పది కాలాలపాటు గుర్తుండే విధంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం సాగనుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) సంబంధిత వార్త: ఏపీ కొత్త జిల్లాల స్వరూపమిదే..పెద్ద జిల్లా, చిన్న జిల్లాలు ఇవే.. -
పాత జెడ్పీ చైర్మన్లే.. నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం
సాక్షి, అమరావతి: కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత కూడా పాత జిల్లా పరిషత్‌ల విధానమే కొనసాగనుంది. ప్రస్తుత జెడ్పీ చైర్మన్లు, వైస్ చైర్మన్ల పదవీకాలం ముగిసే వరకు పాత జిల్లాల విధానంలోనే ఆయా పదవుల్లో కొనసాగుతారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. నాలుగో తేదీ నుంచి ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా వర్గీకరిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ప్రస్తుత జిల్లా ప్రజా పరిషత్‌ల పదవీ కాలం ముగిసే వరకు పంచాయతీరాజ్ చట్టం ప్రకారం వాటి పరిధి, అధికారాలపై కొత్త జిల్లాల ఏర్పాటు ఎలాంటి ప్రభావం చూపదు అని నోటిఫికేషన్లో పేర్కొంది. 2026 సెప్టెంబరు వరకు.. గతేడాది సెప్టెంబర్ 25న రాష్ట్రంలో జిల్లా పరిషత్ చైర్మన్ల ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుత జిల్లా పరిషత్‌ల పదవీ కాలం 2026 సెప్టెంబరు 24 వరకు ఉంది. ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం అప్పటి వరకు పాత జిల్లాల ప్రాతిపదికనే జిల్లా పరిషత్‌ల పాలన కొనసాగనుంది. పాత జిల్లాల ప్రాతిపదికనే జెడ్పీ సీఈవో కార్యాలయాలు కొనసాగుతాయి. కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాలలో జెడ్పీ కార్యాలయాలు ప్రత్యేకంగా ఉండవు. అడ్వకేట్ జనరల్ సూచనల మేరకు న్యాయ వివాదాలు తలెత్తకుండా జిల్లా పరిషత్తులపై ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. తెలంగాణలోనూ.. తెలంగాణలో జిల్లాల పునర్విభజన జరిగినప్పుడు కూడా ఇదే విధానాన్ని అనుసరించారు. తెలంగాణలో 2016లో దసరా రోజు కొత్త జిల్లాలు ఏర్పాటు కాగా అప్పటికి జిల్లా పరిషత్ చైర్మన్ల ఎన్నిక జరిగి రెండున్నరేళ్లు కూడా పూర్తి కాలేదు. దీంతో 2014లో ఎన్నికైన జెడ్పీ చైర్మన్లే 2019లో పూర్తి పదవీకాలం ముగిసే వరకు కొనసాగారు. 2019లో జెడ్పీటీసీ ఎన్నికలకు ముందు మాత్రమే 33 జిల్లాల ప్రాతిపదికన జిల్లా పరిషత్‌లను విభజించి ఎన్నికలు నిర్వహించారు. ఇది చదవండి: ఏపీలో కొత్త డివిజన్లకు ఆర్డీవోల నియామకం -
కొత్త డివిజన్లకు ఆర్డీవోల నియామకం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 47 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యుటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేస్తూ కొత్త రెవెన్యూ డివిజన్లకు ఆర్డీవోలుగా నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. 21 కొత్త రెవెన్యూ డివిజన్లకు ఆర్డీవోల నియామకం కోసం పలువురిని బదిలీ చేశారు. కొత్తగా ఏర్పాటైన రెవెన్యూ డివిజన్లలో సోమవారం నుంచి పరిపాలన ప్రారంభం కానుంది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా జేసీ (ఆసరా–సంక్షేమం)గా పని చేస్తున్న కె. శ్రీరాములు నాయుడును సహకార శాఖ (సొంత శాఖ)కు బదిలీ చేశారు. ప్రస్తుతం కర్నూలు జిల్లా జేసీ (ఆసరా–సంక్షేమం)గా పనిచేస్తున్న ఎం.కె.వి. శ్రీనివాసులును వ్యవసాయ, సహకార శాఖ (సొంత శాఖ)కు బదిలీ చేశారు. ఆర్డీవోల బదిలీలు ఇలా ఉన్నాయి. -
AP: నవ శకానికి నాంది
సాక్షి, అమరావతి : కొత్తగా 13 జిల్లాల ఏర్పాటుతో పునర్వ్యవస్థీకరించిన 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన చరిత్రలో నవశకానికి నాంది పలకనుంది. కొత్త జిల్లాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం ఉదయం 9.05 – 9.45 గంటల మధ్య లాంఛనంగా ప్రారంభించనున్నారు. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా పాలనను ప్రజల చెంతకు మరింత దగ్గరగా తీసుకువెళ్లనున్నారు. తద్వారా మేనిఫెస్టోలో ఇచ్చిన జిల్లాల పునర్వ్యవస్థీకరణ వాగ్దానాన్ని నేడు కార్యరూపంలోకి తీసుకు వస్తున్నారు. నిన్న గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు ద్వారా పాలన వికేంద్రీకరణలో తొలి అడుగు వేశారు. నేడు కొత్త జిల్లాల ఆవిర్భావంతో ఈ దిశగా మరో అడుగు ముందుకు వేశారు. రేపు ఇదే స్ఫూర్తితో మూడు ప్రాంతాల సమానాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు ముందుకు వేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్ చర్యలు తీసుకుంటున్నారు. సత్వరాభివృద్ధి, సమగ్రాభివృద్ధి, సమానాభివృద్ధి, సర్వజనాభివృద్ధి, సంపూర్ణాభివృద్ధి లక్ష్యంగా పాలన వికేంద్రీకరణను చేపట్టారు. అభివృద్ధి ఏ ఒక్క వర్గానికో, ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాకూడదని, పాలన సామాన్య ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు చేరువగా ఉండాలని, అభివృద్ధి ఫలాలు అందరికీ పారదర్శకంగా ఇంకా మెరుగ్గా అందాలన్న సమున్నత లక్ష్యంతో నవశకానికి నాంది పలుకుతున్నారు. జిల్లాల పెంపుతో ఎన్నో ఉపయోగాలు ► చిన్న జిల్లాల ఏర్పాటు ద్వారా జిల్లా కేంద్రం నుంచి మారుమూల సరిహద్దు గ్రామాలకు దూరభారం తగ్గనుంది. జిల్లా పరిపాలన యంత్రాంగం ప్రజలకు మరింత చేరువకానుంది. ప్రజల ఇంటి వద్దకు పాలన ద్వారా జవాబుదారీతనం ఇంకా పెరగనుంది. ► పాలనాపరంగా పర్యవేక్షణ పెరగనుంది. అభివృద్ధికి దూరంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించే వెసులుబాటు ఉంటుంది. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు క్షేత్ర స్థాయిలో మరింత వేగంగా మరింత పారదర్శకంగా అమలు చేసే అవకాశం ఉంటుంది. ► అన్ని ప్రాంతాల సమతులాభివృద్ధికి బాటలు వేయొచ్చు. అభివృద్ధిలో ప్రాదేశిక సమానత్వం, సమ్మిళిత ఆర్థిక వృద్ధి, బడుగు, బలహీన వర్గాల వికాసంతో పాటు సుస్థిర ప్రగతికి బాటలు వేస్తుంది. ► వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల కోసం ప్రజలు వ్యయ ప్రయాసలకోర్చి మైళ్ల కొద్దీ తిరిగే దుస్థితిని తొలగిస్తూ జిల్లా కలెక్టర్, జిల్లా పోలీసు అధికారి కార్యాలయాలు, వారి క్యాంపు కార్యాలయాలతో సహా అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం కనీసం 15 ఎకరాల సువిశాల స్థలంలో మంచి డిజైన్లతో పది కాలాలపాటు గుర్తుండే విధంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం సాగనుంది. జిల్లాల ఏర్పాటులో హేతుబద్ధత ► ప్రతి జిల్లా దాదాపు ఒక పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ప్రతి జిల్లాలో సగటున ఆరు, ఏడు, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 18 నుంచి 23 లక్షల జనాభా ఉంటుంది. గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం, దూరం దృష్ట్యా అరకు పార్లమెంట్ నియోజకవర్గం మాత్రం రెండు ప్రత్యేక జిల్లాలుగా ఏర్పాటైంది. ► ప్రజా సౌకర్యం, పరిపాలన సౌలభ్యం కోసం ప్రతి జిల్లాలో కనీసం రెండు, మూడు, నాలుగు రెవెన్యూ డివిజన్లు ఉండేలా కొత్త డివిజన్లతో కలిపి మొత్తం 72 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటయ్యాయి. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12 మినహా, ఒక అసెంబ్లీ నియోజకవర్గం పూర్తిగా ఒకే జిల్లాలో ఉండేలా కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. ► సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక నేపథ్యంపై లోతైన అధ్యయనం, ప్రజల నుంచి వచ్చిన 17,500 పైగా విజ్ఞప్తుల పరిశీలన తర్వాత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నూతన జిల్లాలు ఏర్పాటయ్యాయి. -
శాస్త్రీయ అధ్యయనంతో జిల్లాల పునర్వ్యవస్థీకరణ
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత శాస్త్రీయంగా అధ్యయనం చేశాక జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను ముందుకు సాగించింది. ఇందుకోసం సీఎం వైఎస్ జగన్ అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన అధ్యయన కమిటీని నియమించింది. ఈ కమిటీలోని ఉన్నతాధికారులు పలుమార్లు సమావేశమై జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఎలా ఉండాలి? సరిహద్దుల నిర్ధారణకు ప్రాతిపదికగా తీసుకోవాల్సిన అంశాలేమిటి? దీనివల్ల ఎదురయ్యే సాంకేతిక సమస్యల పరిష్కారానికి ఏ విధానం పాటించాలి? ఇలా అనేక అంశాలపై కూలంకషంగా చర్చించి మార్గదర్శకాలు రూపొందించారు. వాటి ఆధారంగా లోతైన అధ్యయనం తర్వాత 26 జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మరోవైపు మౌలిక వసతుల కల్పన, ఉద్యోగుల విభజన– ఆర్థిక అంశాలు, ఐటీ సంబంధిత విషయాలు, ఇతర అంశాలపై అధ్యయనం, మార్గదర్శకాల కోసం మరో నాలుగు సబ్ కమిటీలు, జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేసింది. రవాణా, ఆర్ అండ్ బీ శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ కొత్త జిల్లాల్లో అవసరమైన మౌలిక వసతులు, కలెక్టరేట్లు, ఎస్పీ ఇతర జిల్లా కార్యాలయాలు ఎక్కడ ఏర్పాటు చేయాలో గుర్తించింది. కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల అయ్యే వ్యయం, ఉద్యోగుల విభజన, దానికి సంబంధించిన విధివిధానాలు తదితర అంశాలపై ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ నివేదిక ఇచ్చింది. మరో రెండు కమిటీలు ఇతర అంశాలపై నివేదికలు ఇచ్చాయి. వాటి ఆధారంగా ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుకు సిద్ధమైంది. జనాభా గణన అంశంతో జాప్యం అయితే కేంద్రం జనాభా గణన చేపడుతూ అది పూర్తయ్యే వరకు జిల్లాల సరిహద్దులు మార్చవద్దని రాష్ట్రాలకు సూచించింది. దీంతో కొత్త జిల్లాల ఏర్పాటుకు బ్రేక్ పడింది. కానీ కరోనా కారణంగా కేంద్రం జనాభా గణన చేపట్టలేదు. పలుమార్లు షెడ్యూల్‌ని ప్రకటించినా, కరోనా కారణంగా సాధ్యపడలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో జరిపిన సంప్రదింపుల తర్వాత 2022 జూన్ వరకు జనాభా గణన చేపట్టలేమని, అప్పటి వరకు జిల్లాల హద్దులు మార్చడంపై నిషేధం ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను 2021 సంవత్సరం చివర్లో తిరిగి కొనసాగించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన కొత్త జిల్లాల ప్రతిపాదనలతో జనవరి 26న రిపబ్లిక్ డే రోజున ప్రాథమిక గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు, సూచనల కోసం 30 రోజుల గడువు ఇచ్చింది. సూచనలన్నింటిపై క్షుణ్ణంగా అధ్యయనం కొత్త జిల్లాల ఏర్పాటుపై వచ్చిన అన్ని రకాల అభ్యంతరాలు, సూచనలను క్షుణ్ణంగా పరిశీలించి, అధ్యయనం చేసేందుకు ప్రణాళిక శాఖ కార్యదర్శి, సీసీఎల్ఏ కార్యదర్శి, అన్ని జిల్లాల కలెక్టర్లతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లాల ఏర్పాటు ప్రజల మనోభావాలతో ముడిపడి ఉండడంతో ప్రజల నుంచి వచ్చే ప్రతి అంశాన్ని పరిశీలించి, అవసరమైన సమాచారంతో విస్తృతంగా అధ్యయనం చేశాకే దానిపై నిర్ణయం తీసుకోవాలని సీఎం జగన్ ఈ కమిటీకి సూచించారు. సుమారు 17,500 సలహాలు, సూచనలు రావడంతో వాటిని 284 అంశాలుగా ఈ కమిటీ విభజించింది. ప్రతి అభ్యంతరం, పరిశీలనపై తొలుత సంబంధిత జిల్లా కలెక్టర్ సిఫారసు తీసుకుని, ఆ తర్వాత కమిటీ దాన్ని పరిశీలించి తన నిర్ణయాన్ని నమోదు చేసింది. ఈ కమిటీ సిఫార్సులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ పరిశీలించి తుది సిఫారసు చేసింది. ఇందులో భాగంగానే కొత్త జిల్లాల ఏర్పాటులో పలు మార్పులు జరిగాయి. అంతిమంగా వాటన్నింటినీ రాష్ట్ర మంత్రివర్గానికి పంపి అక్కడ ఆమోదం తీసుకున్నాక ఉగాది రోజున తుది నోటిఫికేషన్ ఇచ్చారు. మొత్తంగా జిల్లాల విభజన ప్రక్రియ అంతా పకడ్బందీగా, శాస్త్రీయంగా ఉండేలా ప్రభుత్వం అడుగడుగునా చర్యలు తీసుకుని.. అందుకనుగుణంగా ఆ పని పూర్తి చేసింది. -
AP: సరికొత్త పాలనకు సర్వం సిద్ధం
సాక్షి, అమరావతి: చరిత్రాత్మకంగా ఏర్పాటైన కొత్త జిల్లాల్లో నేటి నుంచి కార్యకలాపాలు సాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. సోమవారం ఉదయం 9.05 గంటలకు 26 జిల్లాల కలెక్టర్లు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ తర్వాత మిగిలిన శాఖల జిల్లా అధికారులు బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుత జిల్లా కేంద్రాలు, కొత్త జిల్లా కేంద్రాలకు కేటాయించిన ఉద్యోగులకు ఇప్పటికే ఆర్డర్ టు సెర్వ్ ఉత్తర్వులు జారీ చేయడంతో వారు కూడా నేటి ఉదయం విధుల్లో చేరనున్నారు. 9.45 గంటలలోపు అధికారులు, ఉద్యోగులు కొత్త జిల్లా కేంద్రాల్లో విధుల్లోకి రానున్నారు. ఇందుకోసం పాత జిల్లా కేంద్రాలు, కొత్తగా ఏర్పడుతున్న 13 జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్లు, జిల్లా పోలీసు కార్యాలయాలు, కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్ క్యాంపు కార్యాలయాలు, ఇతర జిల్లా కార్యాలయాలు ముస్తాబయ్యాయి. 70% కార్యాలయాలను ప్రభుత్వ భవనాల్లోనే ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేని చోట మాత్రమే ప్రైవేట్ భవనాలు ఎంపిక చేశారు. విజయవాడలో సిద్ధమైన ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్. అనకాపల్లి, పశ్చిమగోదావరి జిల్లా కేంద్రాలైన అనకాపల్లి, భీమవరంలో ప్రభుత్వ భవనాలు ఒక్కటీ అందుబాటులో లేకపోవడంతో అక్కడ కలెక్టరేట్ సహా అన్నింటినీ ప్రైవేటు భవనాల్లో ఏర్పాటు చేస్తున్నారు. పుట్టపర్తి కేంద్రంగా ఏర్పాటవుతున్న సత్యసాయి జిల్లాలో ఎస్పీ క్యాంపు కార్యాలయం మినహా మిగిలిన ముఖ్య కార్యాలయాలు సత్యసాయి ట్రస్ట్ భవనాల్లో పెడుతున్నారు. రాయచోటి కేంద్రంగా ఏర్పాటు కాబోతున్న అన్నమయ్య జిల్లాలోనూ ఎక్కువగా ప్రైవేటు భవనాలనే ఎంపిక చేశారు. నరసరావుపేట కేంద్రంగా ఏర్పాటు కానున్న పల్నాడు, తిరుపతి కేంద్రంగా ఏర్పాటవుతున్న బాలాజీ, నంద్యాల కేంద్రంగా ఉండే నంద్యాల, పార్వతీపురం కేంద్రంగా ఏర్పడుతున్న పార్వతీపురం మన్యం, రాజమండ్రి కేంద్రంగా ఏర్పాటయ్యే తూర్పుగోదావరి, విజయవాడ కేంద్రంగా ఏర్పడుతున్న ఎన్టీఆర్ జిల్లాల్లో పూర్తిగా ప్రభుత్వ భవనాల్లోనే ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నారు. కొత్త రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో రెండు, మూడు చోట్ల తప్ప ఆర్డీవో కార్యాలయాలన్నింటికీ ప్రభుత్వ భవనాలే ఎంపిక చేశారు. ఈ కార్యాలయాల్లో అవసరమైన సివిల్, విద్యుత్ మరమ్మతు పనులు పూర్తవడంతోపాటు ఫర్నిచర్ సమకూర్చారు. విజయవాడలో సిద్ధమైన ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్. కార్యాలయంలోని కలెక్టర్ చాంబర్ కార్లు, ఫర్నీచర్ విభజన పూర్తి ప్రస్తుత జిల్లా కేంద్రంలో ఉన్న కార్లు, ఇతర వాహనాలు, ఫర్నిచర్, స్టోరేజి ర్యాకుల విభజన చాలా వరకు పూర్తయింది. ప్రస్తుతం ఉన్న జిల్లాలకు అవసరమైన వాటిని అక్కడే ఉంచి మిగిలిన వాటిని కొత్తగా ఏర్పడుతున్న జిల్లాలకు ఇచ్చారు. ఆ జిల్లాలకు అవి చాలకపోతే, అవసరమైన మేరకు కొత్తగా సమకూర్చుకుంటున్నారు. కంప్యూటర్లు, ఇతర విడిభాగాలు, వీడియో కాన్ఫరెన్స్ ఎక్విప్మెంట్.. తదితర వాటి విభజన కూడా పూర్తయింది. పునర్వ్యవస్థీకరణను బట్టి జిల్లాల్లో ఫైళ్ల విభజన వేగంగా జరుగుతోంది. కొత్త జిల్లాల పరిధిలోకి వచ్చే రెవెన్యూ డివిజన్లు, మండలాలను బట్టి ఈ విభజన చేస్తున్నారు. ఇటీవల ఎక్కువగా ఈ–ఫైల్స్ వ్యవస్థ నడుస్తుండడంతో ఈ పనికి పెద్దగా ఇబ్బంది లేదని చెబుతున్నారు. -
వందేళ్లకు సరిపడా వరాలు.. థాంక్యూ జగనన్న..
-
సరికొత్త శకానికి సీఎం జగన్ ప్రభుత్వం శ్రీకారం
-
AP: కొత్త జిల్లాల స్వరూపమిదే.. పెద్ద జిల్లా ఏదంటే?
AP New Districts List With Mandals, సాక్షి, అమరావతి : జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత విస్తీర్ణ పరంగా ప్రకాశం (14,322 చదరపు కిలోమీటర్లు), జనాభా పరంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా(24.697 లక్షలు) పెద్ద జిల్లాలుగా ఆవిర్భవించాయి. 8 నియోజకవర్గాలు, 38 మండలాల చొప్పున ఈ రెండు జిల్లాలు పెద్దవిగా ఏర్పడ్డాయి. తక్కువ విస్తీర్ణం (3,659 చదరపు కిలోమీటర్లు), తక్కువ జనాభా (9.253 లక్షలు)తో పార్వతీపురం మన్యం జిల్లా అత్యంత చిన్న జిల్లాగా ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కేవలం మూడు నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి. ప్రతి జిల్లాలో 3 నుంచి 8 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒకే ఒక అర్బన్ జిల్లాగా ఏర్పడిన విశాఖ జిల్లాలో కేవలం 11 మండలాలు మాత్రమే ఉండగా, జనాభా మాత్రం 19.595 లక్షలు ఉంది. ప్రతి జిల్లాలో 9.253 లక్షల నుంచి 24.5 లక్షల వరకు జనాభా ఉంది. భౌగోళికంగా, పాలనాపరంగా సౌలభ్యంగా ఉండేలా పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేసింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పూర్తిగా ఏదో ఒక జిల్లాలో ఉండేలా చూసింది. స్థానికంగా వచ్చిన విజ్ఞప్తులను బట్టి కొన్ని మండలాలను సమీప జిల్లాల్లో చేర్చింది. దీనివల్ల ఆయా నియోజకవర్గాల ప్రజలకు పరిపాలనాపరంగా ఎటువంటి ఇబ్బందులు ఎదురవకుండా జాగ్రత్తలు తీసుకుంది. పునర్వ్యవస్థీకరణ తర్వాత జిల్లాల స్వరూపం, జనాభా (2011 లెక్కల ప్రకారం) ఇలా ఉంది. శ్రీకాకుళం జిల్లా జిల్లా కేంద్రం: శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గాలు: 8 (ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, ఆమదాలవలస, పాతపట్నం, నరసన్నపేట) రెవెన్యూ డివిజన్లు: పలాస (కొత్త), టెక్కలి, శ్రీకాకుళం. మండలాలు : 30, పలాస డివిజన్లోని మండలాలు: ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, కంచిలి, పలాస, మందస, వజ్రపుకొత్తూరు, నందిగం టెక్కలి డివిజన్లోని మండలాలు: టెక్కలి, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి, సారవకోట, మలియపుట్టి, పాతపట్నం, కొత్తూరు, హిరమండలం, లక్ష్మినరసుపేట, శ్రీకాకుళం డివిజన్లో మండలాలు: శ్రీకాకుళం, గార, ఆమదాలవలస, పొందూరు, సరుబుజ్జిలి, బుర్జ, నరసన్నపేట, పొలాకి, ఎచ్చెర్ల, లావేరు, రణస్థలం, జలుమూరు, గంగువారిశిగడం విస్తీర్ణం: 4,591 చదరపు కిలోమీటర్లు జనాభా: 21.914 లక్షలు విజయనగరం జిల్లా.. జిల్లా కేంద్రం : విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (రాజాం, బొబ్బిలి, చీపురుపల్లి, నెల్లిమర్ల, విజయనగరం, శృంగవరపుకోట, గజపతినగరం) రెవెన్యూ డివిజన్లు : బొబ్బిలి (కొత్త), చీపురుపల్లి (కొత్త), విజయనగరం. మండలాలు : 27 బొబ్బిలి డివిజన్లో మండలాలు : బొబ్బిలి, రామభద్రాపురం, బాదంగి, తెర్లాం, గజపతినగరం, దత్తిరాజేరు, బొండపల్లి, మెంటాడ చీపురుపల్లి డివిజన్లో మండలాలు: చీపురుపల్లి, గరివిడి, గుర్ల, నెల్లిమర్ల, మెరకముడిదం, వంగర, రేగిడి ఆమదాలవలస, సంతకవిటి, రాజాం విజయనగరం డివిజన్లో మండలాలు : విజయనగరం, గంట్యాడ, పూసపాటిరేగ, డెంకాడ, భోగాపురం, శృంగవరపుకోట, జామి, వెపడ, లక్కవరపుకోట, కొత్తవలస విస్తీర్ణం : 4,122 చదరపు కిలోమీటర్లు జనాభా : 19.308 లక్షలు పార్వతీపురం మన్యం జిల్లా జిల్లా కేంద్రం : పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గాలు : 4 (పాలకొండ, పార్వతీపురం, సాలూరు, కురుపాం) రెవెన్యూ డివిజన్లు: పార్వతీపురం, పాలకొండ మండలాలు : 15 పార్వతీపురం డివిజన్లో మండలాలు : పార్వతీపురం, సీతానగరం, బలిజపేట, సాలూరు, పాచిపెంట, మక్కువ, కొమరాడ, గరుగుబిల్లి పాలకొండ డివిజన్లో మండలాలు : జియమ్మవలస, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, పాలకొండ, సీతంపేట, భామిని, వీరఘట్టం విస్తీర్ణం : 3,659 చదరపు కిలోమీటర్లు జనాభా : 9.253 లక్షలు అల్లూరి సీతారామరాజు జిల్లా జిల్లా కేంద్రం : పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాలు : 3 (పాడేరు, అరకు, రంపచోడవరం) రెవెన్యూ డివిజన్లు : పాడేరు, రంపచోడవరం మండలాలు : 22 పాడేరు డివిజన్లో మండలాలు : అరకు వ్యాలీ, పెదబయలు, డుంబ్రిగూడ, ముంచంగిపుట్టు, హకుంపేట, అనంతగిరి, పాడేరు, జి మడుగుల, చింతపల్లి, గూడెం కొత్తవీధి, కొయ్యూరు రంపచోడవరం డివిజన్లో మండలాలు : రంపచోడవరం, దేవీపట్నం, వై రామవరం, అడ్డతీగల, గంగవరం, మారేడుమిల్లి, రాజవొమ్మంగి, యెటపాక, చింతూరు, కూనవరం, వర రామచంద్రపురం విస్తీర్ణం : 12,251 చదరపు కిలోమీటర్లు జనాభా : 9.54 లక్షలు విశాఖపట్నం జిల్లా జిల్లా కేంద్రం : విశాఖపట్నం అసెంబ్లీ నియోజకవర్గాలు : 6 (భీమిలి, విశాఖ ఈస్ట్, విశాఖ నార్త్, విశాఖ వెస్ట్, విశాఖ సౌత్, గాజువాక) రెవెన్యూ డివిజన్లు : భీమునిపట్నం (కొత్త), విశాఖపట్నం. మండలాలు : 11 భీమునిపట్నం డివిజన్లో మండలాలు : భీమునిపట్నం, ఆనందపురం, పద్మనాభం, విశాఖపట్నం రూరల్, సీతమ్మధార విశాఖపట్నం డివిజన్లో మండలాలు : గాజువాక, పెదగంట్యాడ, గోపాలపట్నం, ములగడ, మహారాణిపేట, పెందుర్తి విస్తీర్ణం : 1,048 చదరపు కిలోమీటర్లు జనాభా : 19.595 లక్షలు అనకాపల్లి జిల్లా జిల్లా కేంద్రం : అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (పాయకరావుపేట, నర్సీపట్నం, మాడుగుల, అనకాపల్లి, యలమంచిలి, పెందుర్తి, చోడవరం) రెవెన్యూ డివిజన్లు : అనకాపల్లి, నర్సీపట్నం మండలాలు : 24 అనకాపల్లి డివిజన్లో మండలాలు : దేవరపల్లి, కె కొత్తపాడు, అనకాపల్లి, కశింకోట, యలమంచిలి, రాంబిల్లి, మునగపాక, అచ్యుతాపురం, బుచ్చయ్యపేట, చోడవరం, పరవాడ, సబ్బవరం నర్సీపట్నం డివిజన్లో మండలాలు : నర్సీపట్నం, గోలుగొండ, మాకవారిపాలెం, నాతవరం, నక్కపల్లి, పాయకరావుపేట, కోటఅవురుట్ల, ఎస్ రాయవరం, రావికమతం, రోలుగుంట, మాడుగుల, చీడికాడ విస్తీర్ణం : 4,292 చదరపు కిలోమీటర్లు జనాభా : 17.270 లక్షలు కాకినాడ జిల్లా జిల్లా కేంద్రం : కాకినాడ అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పెద్దాపురం) రెవెన్యూ డివిజన్లు : పెద్దాపురం, కాకినాడ మండలాలు : 21 పెద్దాపురం డివిజన్లో మండలాలు : పెద్దాపురం, జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి, తుని, కోటనందూరు, ప్రత్తిపాడు, శంఖవరం, ఏలేశ్వరం, రౌతులపూడి, తొండంగి కాకినాడ డివిజన్లో మండలాలు : సామర్లకోట, పిఠాపురం, గొల్లప్రోలు, యు కొత్తపల్లి, కరప, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, పెదపూడి, కాజులూరు, తాళ్లరేవు విస్తీర్ణం : 3,019 చదరపు కిలోమీటర్లు జనాభా : 20.923 లక్షలు కోనసీమ జిల్లా జిల్లా కేంద్రం : అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (రామచంద్రాపురం, మండపేట, అమలాపురం, రాజోలు, గన్నవరం, కొత్తపేట, ముమ్మిడివరం) రెవెన్యూ డివిజన్లు : రామచంద్రాపురం, అమలాపురం మండలాలు : 22 రామచంద్రాపురం డివిజన్లో మండలాలు : రామచంద్రాపురం, కె గంగవరం, మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం, కొత్తపేట, రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు అమలాపురం డివిజన్లో మండలాలు : ముమ్మిడివరం, ఐ పోలవరం, కాట్రేనికోన, అమలాపురం, ఉప్పలగుప్తం, అల్లవరం, రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి, మామిడికుదురు, పి గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి, విస్తీర్ణం : 2,083 చదరపు కిలోమీటర్లు జనాభా : 17.191 లక్షలు తూర్పుగోదావరి జిల్లా జిల్లా కేంద్రం : రాజమండ్రి అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (అనపర్తి, రాజానగరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం) రెవెన్యూ డివిజన్లు : రాజమండ్రి, కొవ్వూరు మండలాలు : 19 రాజమండ్రి డివిజన్లో మండలాలు : రాజమండ్రి అర్బన్, రాజమండ్రి రూరల్, కడియం, రాజానగరం, సీతానగరం, కోరుకొండ, గోకవరం, అనపర్తి, బిక్కవోలు, రంగంపేట కొవ్వూరు డివిజన్లో మండలాలు : కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి, నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి, దేవరపల్లి, గోపాలపురం, నల్లజర్ల విస్తీర్ణం : 2,561 చదరపు కిలోమీటర్లు జనాభా : 18.323 లక్షలు పశ్చిమగోదావరి జిల్లా జిల్లా కేంద్రం: భీమవరం అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (ఆచంట, పాలకొల్లు, నర్సాపురం, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం) రెవెన్యూ డివిజన్లు : నర్సాపురం, భీమవరం (కొత్త). మండలాలు : 19 నర్సాపురం డివిజన్లో మండలాలు : నర్సాపురం, మొగల్తూరు, పాలకొల్లు, పోడూరు, యలమంచిలి, ఆచంట, పెనుగొండ, పెనుమంట్ర, తణుకు, ఇరగవరం భీమవరం డివిజన్లో మండలాలు : అత్తిలి, భీమవరం, వీరవాసరం, ఉండి, కాళ్ల, పాలకోడేరు, ఆకివీడు, తాడేపల్లిగూడెం, పెంటపాడు విస్తీర్ణం: 2,178 చదరపు కిలోమీటర్లు జనాభా: 17.80 లక్షలు ఏలూరు జిల్లా జిల్లా కేంద్రం: ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (ఉంగుటూరు, కైకలూరు, దెందులూరు, ఏలూరు, పోలవరం, నూజివీడు, చింతలపూడి) రెవెన్యూ డివిజన్లు : జంగారెడ్డిగూడెం, ఏలూరు, నూజివీడు. మండలాలు : 28 జంగారెడ్డిగూడెం డివిజన్లో మండలాలు: జంగారెడ్డిగూడెం, పోలవరం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, కొయ్యలగూడెం, కుక్కునూరు, వేలేరుపాడు, కామవరపుకోట, టి నర్సాపురం, ద్వారకాతిరుమల ఏలూరు డివిజన్లో మండలాలు: ఏలూరు, దెందులూరు, పెదవేగి, పెదపాడు, ఉంగుటూరు, భీమడోలు, నిడమర్రు, గణపవరం, కైకలూరు, మండవల్లి, కలిదిండి, ముదినేపల్లి, నూజివీడు డివిజన్లో మండలాలు: నూజివీడు, ఆగిరిపల్లి, చాట్రాయి, ముసునూరు, చింతలపూడి, లింగపాలెం విస్తీర్ణం: 6,679 చదరపు కిలోమీటర్లు జనాభా: 20.717 లక్షలు కృష్ణా జిల్లా జిల్లా కేంద్రం : మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (గుడివాడ, పెనమలూరు, గన్నవరం, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు) రెవెన్యూ డివిజన్లు : గుడివాడ, మచిలీపట్నం, ఉయ్యూరు (కొత్త) మండలాలు : 25 గుడివాడ డివిజన్లో మండలాలు : గుడివాడ, గుడ్లవల్లేరు, నందివాడ, పెదపారుపూడి, పామర్రు, గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరు ఉయ్యూరు డివిజన్లో మండలాలు: ఉయ్యూరు, పమిడిముక్కల, కంకిపాడు, పెనమలూరు, తోట్లవల్లూరు, మొవ్వ, ఘంటసాల, చల్లపల్లి మచిలీపట్నం డివిజన్లో మండలాలు : పెడన, గూడూరు, బంటుమిల్లి, కృత్తివెన్ను, మచిలీపట్నం, అవనిగడ్డ, మోపిదేవి, నాగాయలంక, కోడూరు విస్తీర్ణం : 3,775 చదరపు కిలోమీటర్లు జనాభా : 17.35 లక్షలు ప్రకాశం జిల్లా జిల్లా కేంద్రం: ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గాలు: 8 (యర్రగొండపాలెం, గిద్దలూరు, సంతనూతలపాడు, ఒంగోలు, కొండెపి, దర్శి, కనిగిరి, మార్కాపురం) రెవెన్యూ డివిజన్లు: మార్కాపురం, కనిగిరి (కొత్త), ఒంగోలు. మండలాలు : 38 మార్కాపురం డివిజన్లో మండలాలు: మార్కాపురం, గిద్దలూరు, బెస్తవారిపేట, రాచర్ల, కొమరోలు, కంభం, అర్థవీడు, యర్రగొండపాలెం, పుల్లలచెరువు, త్రిపురాంతకం, దోర్నాల, పెద్దారవీడు, తర్లుపాడు కనిగిరి డివిజన్లో మండలాలు: పొదిలి, హనుమంతునిపాడు, వెలిగండ్ల, కనిగిరి, పెదచెర్లోపల్లి, చంద్రశేఖరపురం, పామూరు, కొనకనమిట్ల, దర్శి, దొనకొండ, కురిచేడు, మర్రిపూడి, పొన్నలూరు ఒంగోలు డివిజన్లో మండలాలు: ముండ్లమూరు, కొండపి, జరుగుమిల్లి, తాళ్లూరు, శింగరాయకొండ, ఒంగోలు, కొత్తపట్నం, సంతనూతలపాడు, నాగులుప్పలపాడు, మద్దిపాడు, చీమకుర్తి, టంగుటూరు విస్తీర్ణం: 14,322 చ.కి.మీ. జనాభా : 22.88 లక్షలు బాపట్ల జిల్లా జిల్లా కేంద్రం: బాపట్ల. అసెంబ్లీ నియోజకవర్గాలు: 6 (వేమూరు, రేపల్లె, బాపట్ల, పర్చూరు, అద్దంకి, చీరాల) రెవెన్యూ డివిజన్లు: బాపట్ల (కొత్త), చీరాల (కొత్త) మండలాలు: 25 బాపట్ల డివిజన్లో మండలాలు: వేమూరు, కొల్లూరు, చుండూరు, భట్టిప్రోలు, అమృతలూరు, రేపల్లె, నిజాంపట్నం, నగరం, చెరుకుపల్లి, బాపట్ల, పిట్టవానిపాలెం, కర్లపాలెం చీరాల డివిజన్లో మండలాలు: చీరాల, వేటపాలెం, అద్దంకి, జె పంగులూరు, సంతమాగులూరు, బల్లికురువ, కొరిశపాడు, పర్చూరు, యద్దనపూడి, కారంచేడు, ఇంకొల్లు, చినగంజాం, మార్టూరు విస్తీర్ణం : 3,829 చ.కిమీ. జనాభా: 15.87 లక్షలు పల్నాడు జిల్లా జిల్లా కేంద్రం: నర్సరావుపేట అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (పెదకూరపాడు, గురజాల, మాచర్ల, చిలకలూరిపేట, నర్సరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి) రెవెన్యూ డివిజన్లు : గురజాల, నర్సరావుపేట, సత్తెనపల్లి (కొత్త). మండలాలు : 28 గురజాల డివిజన్లో మండలాలు : గురజాల, దాచేపల్లి, పిడుగురాళ్ల, మాచవరం, మాచర్ల, వెల్దుర్తి, దుర్గి, రెంటచింతల, కారెంపూడి, బొల్లాపల్లి సత్తెనపల్లి డివిజన్లో మండలాలు : సత్తెనపల్లి, రాజుపాలెం, ముప్పాళ్ల, అచ్చంపేట, క్రోసూరు, అమరావతి, పెదకూరపాడు, బెల్లంకొండ, నకిరేకల్లు నర్సరావుపేట డివిజన్లో మండలాలు : చిలకలూరిపేట, నాదెండ్ల, ఎడ్లపాడు, నర్సరావుపేట, రొంపిచర్ల, వినుకొండ, నూజెండ్ల, శావల్యపురం, ఈపూరు విస్తీర్ణం : 7,298చ.కిమీ. జనాభా: 20.42 లక్షలు గుంటూరు జిల్లా జిల్లా కేంద్రం : గుంటూరు అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (తాడికొండ, గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్, మంగళగిరి, తెనాలి, పొన్నూరు, ప్రత్తిపాడు) రెవెన్యూ డివిజన్లు : గుంటూరు, తెనాలి మండలాలు : 18 గుంటూరు డివిజన్లో మండలాలు : తాడికొండ, తుళ్లూరు, ఫిరంగిపురం, మేడికొండూరు, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, ప్రత్తిపాడు, వట్టిచెరుకూరు, పెదనందిపాడు, పెదకాకాని తెనాలి డివిజన్లో మండలాలు: మంగళగిరి, తాడేపల్లి, తెనాలి, కొల్లిపర, పొన్నూరు, చేబ్రోలు, దుగ్గిరాల, కాకుమాను విస్తీర్ణం : 2,443 చ.కిమీ. జనాభా : 20.91 లక్షలు ఎన్టీఆర్ జిల్లా జిల్లా కేంద్రం : విజయవాడ. అసెంబ్లీ నియోజకవర్గాలు: 7 (విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం) రెవెన్యూ డివిజన్లు: విజయవాడ, తిరువూరు (కొత్త), నందిగామ (కొత్త). మండలాలు : 20 తిరువూరు డివిజన్లో మండలాలు : రెడ్డిగూడెం, తిరువూరు, విస్సన్నపేట, గంపలగూడెం, ఎ.కొండూరు, మైలవరం నందిగామ డివిజన్లో మండలాలు: నందిగామ, కంచికచర్ల, చందర్లపాడు, వీరుళ్లపాడు, జగ్గయ్యపేట, వత్సవాయి విజయవాడ డివిజన్లో మండలాలు: ఇబ్రహీంపట్నం, విజయవాడ రూరల్, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, విజయవాడ నార్త్, విజయవాడ ఈస్ట్, జి.కొండూరు విస్తీర్ణం : 3,316 చ.కిమీ. జనాభా : 22.19 లక్షలు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జిల్లా కేంద్రం: నెల్లూరు. అసెంబ్లీ నియోజకవర్గాలు: 8 (కోవూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, సర్వేపల్లి, ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, కందుకూరు) రెవెన్యూ డివిజన్లు: కందుకూరు, కావలి, ఆత్మకూరు, నెల్లూరు. మండలాలు: 38 కందుకూరు డివిజన్లో మండలాలు: కందుకూరు, లింగసముద్రం, గుడ్లూరు, ఉలవపాడు, ఓలేటివారిపాలెం, కొండాపురం, వరికుంటపాడు కావలి డివిజన్లో మండలాలు: కావలి, బోగోలు, అల్లూరు, దగదర్తి, జలదంకి, కలిగిరి, దత్తులూరు, విడవలూరు, కొడవలూరు, వింజమూరు ఆత్మకూరు డివిజన్లో మండలాలు: ఆత్మకూరు, పేజర్ల, అనుమసముద్రంపేట, మర్రిపాడు, సంగం, అనంతసాగరం, ఉదయగిరి, సీతారామపురం, కలువోయ, నెల్లూరు డివిజన్లో మండలాలు: నెల్లూరు రూరల్, నెల్లూరు అర్బన్, కోవూరు, బుచ్చిరెడ్డిపాలెం, ఇందుకూరిపేట, తోటపల్లిగూడూరు, ముత్తుకూరు, వెంకటాచలం, మనుబోలు, పొదలకూరు, సైదాపురం, రాపూరు విస్తీర్ణం: 10,441 చ.కి.మీ. జనాభా: 24.697 లక్షలు కర్నూలు జిల్లా జిల్లా కేంద్రం: కర్నూలు. అసెంబ్లీ నియోజకవర్గాలు: 8 (పాణ్యం, కోడుమూరు, కర్నూలు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు, పత్తికొండ) రెవెన్యూ డివిజన్లు: కర్నూలు, ఆదోని, పత్తికొండ (కొత్త). మండలాలు: 26 కర్నూలు డివిజన్లో మండలాలు: కల్లూరు, ఓర్వకల్లు, సి బెళగల్, గూడూరు, కర్నూలు అర్బన్, కర్నూలు రూరల్, కోడుమూరు, వెల్దుర్తి ఆదోని డివిజన్లో మండలాలు: ఆదోని, మంత్రాలయం, పెద్దకడుబూరు, కోసిగి, కౌతాళం, హొలగుంద, ఎమ్మిగనూరు, నందవరం, గోనెగండ్ల పత్తికొండ డివిజన్లో మండలాలు: హాలహర్వి, ఆలూరు, ఆస్పరి, దేవనకొండ, చిప్పగిరి, పత్తికొండ, మద్దికెర ఈస్ట్, తుగ్గలి, కృష్ణగిరి విస్తీర్ణం: 7,980 చ.కి.మీ. జనాభా: 22.717 లక్షలు నంద్యాల జిల్లా జిల్లా కేంద్రం: నంద్యాల. అసెంబ్లీ నియోజకవర్గాలు: 6 (నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లె, డోన్, నందికొట్కూర్, శ్రీశైలం). రెవెన్యూ డివిజన్లు: ఆత్మకూరు (కొత్త), నంద్యాల, డోన్ (కొత్త). మండలాలు: 29 ఆత్మకూరు డివిజన్లో మండలాలు: శ్రీశైలం, ఆత్మకూరు, వెలుగోడు, నందికొట్కూరు, పగిడ్యాల, జూపాడు బంగ్లా, కొత్తపల్లి, పాములపాడు, మిడుతూరు, బండి ఆత్మకూరు నంద్యాల డివిజన్లో మండలాలు: నంద్యాల, గోస్పాడు, శిరివెళ్ల, దొర్నిపాడు, ఉయ్యాలవాడ, చాగలమర్రి, రుద్రవరం, మహానంది, ఆళ్లగడ్డ, పాణ్యం, గడివేముల, సంజామల, కొలిమిగుండ్ల డోన్ డివిజన్లో మండలాలు: బనగానపల్లె, అవుకు, కోయిలకుంట్ల, డోన్, బేతంచర్ల, ప్యాపిలి విస్తీర్ణం: 9,682 చ.కి.మీ. జనాభా: 17.818 లక్షలు అనంతపురం జిల్లా జిల్లా కేంద్రం: అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గాలు: 8 (రాయదుర్గం, కళ్యాణదుర్గం, శింగనమల, అనంతపురం అర్బన్, గుంతకల్, ఉరవకొండ, రాప్తాడు, తాడిపత్రి) రెవెన్యూ డివిజన్లు: గుంతకల్ (కొత్త), అనంతపురం, కళ్యాణదుర్గం. మండలాలు: 31 గుంతకల్ డివిజన్లో మండలాలు: ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూర్, గుంతకల్, గుత్తి, పామిడి, యాడికి, పెద్దవడుగూరు అనంతపురం డివిజన్లో మండలాలు: అనంతపురం, తాడిపత్రి, కూడేరు, ఆత్మకూరు, పెద్దపప్పూరు, శింగనమల, గార్లదిన్నె, పుట్లూరు, యల్లనూరు, నార్పల, బీకే సముద్రం, రాప్తాడు కళ్యాణదుర్గం డివిజన్లో మండలాలు : రాయదుర్గం, డి హీరేహల్, కనేకల్, బొమ్మనహాల్, గుమ్మఘట్ట, కళ్యాణదుర్గం, బ్రహ్మసముద్రం, శెట్టూరు, కుందుర్పి, కంబదూరు, బెళుగుప్ప విస్తీర్ణం: 10,205 చ.కి.మీ. జనాభా: 22.411 లక్షలు శ్రీ సత్యసాయి జిల్లా జిల్లా కేంద్రం: పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గాలు: 6 (మడకశిర, హిందూపురం, పెనుగొండ, పుట్టపర్తి, కదిరి, ధర్మవరం) రెవెన్యూ డివిజన్లు: ధర్మవరం, కదిరి, పుట్టపర్తి (కొత్త), పెనుకొండ. మండలాలు: 32 ధర్మవరం డివిజన్లో మండలాలు : ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ, రామగిరి, కనగానిపల్లి, చెన్నేకొత్తపల్లి కదిరి డివిజన్లో మండలాలు : కదిరి, తలుపుల, నంబులపూలకుంట, గాండ్లపెంట, నల్లచెరువు, తనకల్లు, అమడగూరు పుట్టపర్తి డివిజన్లో మండలాలు: బుక్కపట్నం, కొత్త చెరువు, పుట్టపర్తి, నల్లమాడ, ఓ.డి.చెరువు, గోరంట్ల పెనుగొండ డివిజన్లో మండలాలు: పెనుకొండ, సోమందేపల్లి, రొద్దం, హిందూపురం, చిల్లమత్తూరు, మడకశిర, పరిగి, లేపాక్షి, గుడిబండ, రోళ్ల, అమరాపురం, అగళి విస్తీర్ణం: 8,925 చ.కిమీ. జనాభా: 18.400 లక్షలు వైఎస్సార్ జిల్లా జిల్లా కేంద్రం: కడప అసెంబ్లీ నియోజకవర్గాలు: 7 (కడప, కమలాపురం, ప్రొద్దుటూరు, బద్వేల్, మైదుకూరు, పులివెందుల, జమ్మలమడుగు) రెవెన్యూ డివిజన్లు: బద్వేల్, కడప, జమ్మలమడుగు మండలాలు: 36 బద్వేల్ డివిజన్లో మండలాలు: మైదుకూరు, దువ్వూరు, చాపాడు, శ్రీ అవధూత కాశీనాయన మండలం, కలసపాడు, పోరుమామిళ్ల, బి.కోడూరు, బద్వేల్, గోపవరం, బ్రహ్మంగారి మఠం, అట్లూరు, ఖాజీపేట కడప డివిజన్లో మండలాలు: కడప, చక్రాయిపేట, ఎర్రగుంట్ల, వీరపనాయునిపల్లె, కమలాపురం, వల్లూరు, చెన్నూరు, చింతకొమ్మదిన్నె, పెండ్లిమర్రి, ఒంటిమిట్ట, సిద్ధవటం, వేంపల్లె జమ్మలమడుగు డివిజన్లో మండలాలు: జమ్మలమడుగు, పెద్దముడియం, మైలవరం, ముద్దనూరు, కొండాపురం, పులివెందుల, సింహాద్రిపురం, లింగాల, తొండూరు, వేముల, ప్రొద్దుటూరు, రాజుపాలెం విస్తీర్ణం: 11,228 చ.కి.మీ. జనాభా: 20.607 లక్షలు అన్నమయ్య జిల్లా జిల్లా కేంద్రం: రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గాలు: 6 (రాజంపేట, కోడూరు, రాయచోటి, తంబళ్లపల్లె, మదనపల్లి, పీలేరు) రెవెన్యూ డివిజన్లు: రాజంపేట, రాయచోటి (కొత్త), మదనపల్లె. మండలాలు: 30 రాజంపేట డివిజన్లో మండలాలు: పోడూరు, పెనగలూరు, చిట్వేల్, పుల్లంపేట, ఓబులవారిపల్లె, రాజంపేట, నందలూరు, వీరబల్లె, టి సుందరపల్లె రాయచోటి డివిజన్లో మండలాలు: రాయచోటి, సంబేపల్లి, చిన్నమండెం, గాలివీడు, లక్కిరెడ్డిపల్లె, రామాపురం, పీలేరు, గుర్రంకొండ, కలకాడ, కంభంవారిపల్లె. మదనపల్లె డివిజన్లో మండలాలు: మదనపల్లె, నిమ్మనపల్లె, రామసముద్రం, తంబళ్లపల్లె, మొలకలచెరువు, పెద్దమండ్యం, కురబలకోట, పెద్ద తిప్ప సముద్రం, బి.కొత్తకోట, కలికిరి, వాల్మీకిపురం విస్తీర్ణం: 7,954 చ.కి.మీ. జనాభా: 16.973 లక్షలు చిత్తూరు జిల్లా జిల్లా కేంద్రం: చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గాలు: 7 (నగరి, గంగాధర నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమలేరు, కుప్పం, పుంగనూరు). రెవెన్యూ డివిజన్లు: చిత్తూరు, నగరి (కొత్త), పలమనేరు (కొత్త), కుప్పం (కొత్త). మండలాలు: 31 నగరి డివిజన్లో మండలాలు: నగరి, శ్రీరంగరాజపురం, వెదురుకుప్పం, పాలసముద్రం, కార్వేటినగరం, నిండ్ర, విజయపురం చిత్తూరు డివిజన్లో మండలాలు: చిత్తూరు, గుడిపాల, యాదమరి, గంగాధర నెల్లూరు, పూతలపట్టు, పెనుమూరు, తవణంపల్లె, ఈరాల, పులిచెర్ల, రొంపిచర్ల పలమనేరు డివిజన్లో మండలాలు: పలమనేరు, గంగవరం, పెదపంజాని, సోమ్ల, చౌడుపల్లి, పుంగనూరు, సదుం, బంగారుపాలెం, బైరెడ్డిపల్లి, వెంకటగిరికోట కుప్పం డివిజన్లో మండలాలు: కుప్పం, శాంతిపురం, గుడుపల్లె, రామకుప్పం విస్తీర్ణం: 6,855 చ.కి.మీ. జనాభా: 18.730 లక్షలు తిరుపతి జిల్లా జిల్లా కేంద్రం: తిరుపతి. అసెంబ్లీ నియోజకవర్గాలు: 7 (సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి, తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు). రెవెన్యూ డివిజన్లు: గూడూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి, తిరుపతి మండలాలు: 34 గూడూరు డివిజన్లో మండలాలు: గూడూరు, చిల్లకూరు, కోట, వాకాడు, చిత్తమూరు, బాలాయపల్లె, వెంకటగిరి, డక్కిలి సూళ్లూరుపేట డివిజన్లో మండలాలు: ఓజిలి, నాయుడుపేట, పెళ్లకూరు, దొరవారిసత్రం, సూళ్లూరుపేట, తడ, బుచ్చినాయుడి కండ్రిగ, వరదయ్యపాలెం, సత్యవేడు శ్రీకాళహస్తి డివిజన్లో మండలాలు: శ్రీకాళహస్తి, తొట్టంబేడు, రేణిగుంట, ఏర్పేడు, కుమార వెంకట భూపాలపురం, నాగులాపురం, పిచ్చాటూరు, నారాయణవనం తిరుపతి డివిజన్లో మండలాలు: తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి, రామచంద్రాపురం, వడమాలపేట, పుత్తూరు, యర్రవారిపాలెం, చిన్నగొట్టిగల్లు, పాకాల విస్తీర్ణం: 8,231 చ.కి.మీ. జనాభా: 21.970 లక్షలు. -
ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల
-
కొత్త జిల్లాలకు కలెక్టర్లు, జేసీల నియామకం
సాక్షి, అమరావతి: పరిపాలనా సౌలభ్యంలో భాగంగా కొత్తగా ఏర్పాటు చేస్తున్న 13 జిల్లాలతో కలిపి మొత్తం 26 జిల్లాలకు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ నెల 4వ తేదీ నుంచి ఆయా జిల్లాల్లో వారు బాధ్యతలు నిర్వర్తిస్తారు. -
Andhra Pradesh: సరికొత్త శకం
సాక్షి, అమరావతి: కొత్త జిల్లాలతో రాష్ట్రంలో సరికొత్త శకానికి వైఎస్ జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు పరిపాలనా సౌలభ్యం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇప్పుడున్న 13 జిల్లాలను 26 కొత్త జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించింది. అలాగే 21 కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసింది. దీంతో డివిజన్ల సంఖ్య 51 నుంచి 72కు చేరింది. ఈ మేరకు శనివారం తుది గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేసింది. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ప్రాథమిక నోటిఫికేషన్ ఇవ్వగా, ఉగాది పర్వదినాన శనివారం తుది నోటిఫికేషన్ ఇచ్చింది. 1974 ఏపీ డిస్ట్రిక్ట్ (ఫార్మేషన్) చట్టం ప్రకారం ఈ కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసింది. అంతకుముందు శనివారం సాయంత్రం తుది నోటిఫికేషన్లో కొద్దిపాటి మార్పులకు రాష్ట్ర మంత్రివర్గం వర్చువల్‌గా ఆమోదముద్ర వేసింది. విస్తృత అధ్యయనం, సుదీర్ఘ కసరత్తు ద్వారా పూర్తి శాస్త్రీయతతో ప్రభుత్వం జిల్లాల విభజనను పూర్తి చేసింది. భౌగోళిక, సామాజిక, ఆర్థిక, చారిత్రక, సాంస్కృతిక అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంది. సీఎం జగన్ నిర్ణయం మేరకు ఏప్రిల్ 4వ తేదీ నుంచి కొత్త జిల్లాల నుంచి పరిపాలన ప్రారంభం కానుంది. ప్రజల అభిప్రాయం మేరకు స్వల్ప మార్పులు కొత్త జిల్లాల ప్రతిపాదనలపై రాష్ట్ర వ్యాప్తంగా 284 అంశాలపై ప్రజల నుంచి 17,500కు పైగా సూచనలు వచ్చాయి. వాటిని రాష్ట్ర ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించింది. సహేతుకంగా ఉన్న వాటిపై అధ్యయనం చేసి అందుకనుగుణంగా స్వల్ప మార్పులు చేసింది. దీనివల్ల కొత్త జిల్లాల్లో గతంలో ప్రతిపాదించిన కొన్ని మండలాలు అటు ఇటు మారాయి. ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో ఉండి విభజన తర్వాత తూర్పు గోదావరి జిల్లాలోకి వెళ్లిన ద్వారకాతిరుమల మండలాన్ని అక్కడి ప్రజల అభీష్టం మేరకు ఏలూరు జిల్లాలోకి మార్చారు. అనకాపల్లి జిల్లాలోకి వెళ్లిన పెందుర్తిని స్థానికుల కోరిక మేరకు విశాఖ జిల్లాకు మార్చారు. ఇలా పలుచోట్ల మండలాల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రతి జిల్లాలో 2011 లెక్కల ప్రకారం సగటున జిల్లాకు 18 నుంచి 20 లక్షల జనాభా ఉండేలా చూశారు. పార్లమెంటు నియోజకవర్గం ఒక యూనిట్ పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని జిల్లాలను విభజించింది. సాధ్యమైనంత వరకు ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒకే జిల్లాలోకి తెచ్చింది. ఇలా చేయడం వల్ల స్థానికంగా ఇబ్బందులు ఉన్నచోట ఆ మండలాలను మార్చింది. ప్రజలు, ప్రజాప్రతినిధులకు ఇబ్బందులు లేకుండా జిల్లాకు కనీసం రెండు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసింది. 10 జిల్లాల్లో రెండు, 12 జిల్లాల్లో మూడు, నాలుగు జిల్లాల్లో 4 చొప్పున మొత్తం 72 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశారు. రెవెన్యూ డివిజన్ల విషయంలో సీఎం వైఎస్ జగన్ ఎంతో ఉదారతతో వ్యవహరించారు. ఈ కారణంగానే 51 డివిజన్లు 72కు చేరాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజవర్గం కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నన్నాళ్లూ ఆయన కుప్పంను పట్టించుకోలేదు. ఇప్పుడు వైఎస్ జగన్ జిల్లాల విభజన చేస్తున్న సమయంలో కుప్పంను రెవెన్యూ డివిజన్ చేయాలని కోరారు. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో ప్రభుత్వం కుప్పం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసింది. మన్యం అభివృద్ధికి రెండు జిల్లాలు పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని 25 జిల్లాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా, గిరిజన ప్రాంతం విస్తృతి దృష్ట్యా అరకు పార్లమెంట్‌ను రెండు జిల్లాలుగా చేశారు. పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు నియోజకవర్గాలతో పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పాటు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాను అరకు వ్యాలీ, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాలతో ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రాలు ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఒక్కటి మినహా జిల్లాల పేర్లు యథాతథం ప్రాథమిక నోటిఫికేషన్లో ప్రతిపాదించిన మేరకు కొత్త జిల్లాల పేర్లను ప్రభుత్వం దాదాపు అలాగే ఉంచింది. తిరుపతి కేంద్రంగా ప్రతిపాదించిన బాలాజీ జిల్లాను మాత్రం అక్కడి ప్రజల కోరిక మేరకు తిరుపతి జిల్లాగా మార్చింది. తమ ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లా చేయాలని, అత్యంత ప్రముఖుల పేర్లను జిల్లాలకు పెట్టాలనే డిమాండ్లు పలుచోట్ల అనేక సంవత్సరాలుగా ఉన్నాయి. ఇలాంటి అనేక అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది. అక్కడి స్థానిక ప్రాధాన్యాన్ని, కొన్ని ప్రాంతాలకు ఉన్న చారిత్రక నేపథ్యం, స్థానిక పరిస్థితులను స్వయంగా ప్రభుత్వమే గుర్తించి కొత్త జిల్లాల్లో ప్రతిబింబించేలా చూసింది. అదే సమయంలో పాత జిల్లాల ప్రాధాన్యం, ప్రాశస్త్యం దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంది. మన్యం విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు స్వాతంత్య్ర పోరాటం జరిపిన ప్రాంతాన్ని ఆయన పేరుతో ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఎన్నో దశాబ్దాల నుంచి ఉంది. దాన్ని ప్రభుత్వం ఇప్పుడు సాకారం చేసింది. పాడేరు కేంద్రంగా అరకు ప్రాంతాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లాగా ఏర్పాటు చేసింది. పార్వతీపురం కేంద్రంగా మన్యం జిల్లా ఏర్పాటుతో గిరిపుత్రులకు గౌరవం ఇచ్చింది. తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమ ప్రాంతం ప్రత్యేకతను తెలియజెప్పేలా కోనసీమ జిల్లా ఏర్పాటు చేసి, అక్కడి ప్రజల మనోభావాలను గౌరవించింది. గోదావరి జిల్లాల ప్రాశస్త్యం దెబ్బ తినకుండా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలను పునర్వ్యవస్థీకరించింది. రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గాన్ని తూర్పు గోదావరి జిల్లాగా, నర్సాపురం పార్లమెంటును భీమవరం కేంద్రంగా పశ్చిమ గోదావరి జిల్లాగా మార్చి వాటి ప్రాధాన్యతను కొనసాగించింది. ఈ జిల్లాలు గోదావరి తీర ప్రాంతాలు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు ఎన్టీఆర్ జన్మించిన కృష్ణా జిల్లాకు ఆయన పేరు పెట్టాలని ఈ ప్రాంత వాసులు చాలా కాలం నుంచి కోరుతున్నా, ఎవరూ పట్టించుకోలేదు. చంద్రబాబు సుదీర్ఘకాలం సీఎంగా ఉన్నప్పటికీ ఈ విషయాన్ని పట్టించుకోలేదు. తాము అధికారంలోకి రాగానే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామని పాదయాత్ర సమయంలో వైఎస్ జగన్ ప్రకటించారు. ఆ మాట నెరవేర్చుకుంటూ విజయవాడ పార్లమెంటు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాగా ఏర్పాటు చేశారు. దీనిపై సర్వత్రా సానుకూలత వ్యక్తమవుతోంది. మరోవైపు మచిలీçపట్నాన్ని కృష్ణా జిల్లాగా కొనసాగిస్తూ దాని చారిత్రక ప్రాధాన్యతను ప్రభుత్వం నిలబెట్టింది. గుంటూరు జిల్లాలో పల్నాడు ప్రాంతం ప్రత్యేకతను నిలబెడుతూ పల్నాటి పౌరుషాన్ని ప్రతిబింబించేలా నర్సరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లాను ఏర్పాటు చేసింది. బాపట్లను జిల్లాగా చేయాలనే డిమాండ్ సుదీర్ఘ కాలంగా ఉన్న కల నెరవేరింది. పుట్టపర్తి ప్రాంతానికి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకువచ్చిన సత్య సాయిబాబాను స్మరిస్తూ శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటు చేసి ముందడుగు వేసింది. ప్రముఖ వాగ్గేయకారుడు అన్నమయ్య నడయాడిన ప్రాంతాన్ని ఆయన పేరుతో అన్నమయ్య జిల్లాగా ఏర్పాటు చేసింది. -
ఏపీలో కొత్త జిల్లాలకు సర్వం సిద్ధం
-
AP: పూర్తయిన కొత్త జిల్లాల ప్రక్రియ..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తైంది. శనివారం వర్చువల్‌గా భేటీ అయిన కేబినెట్.. చిన్న చిన్న మార్పులకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం గెజిట్‌ను విడుదల చేయబోతోంది. జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. ‘‘కొత్త జిల్లాల ఏర్పాటు ఒక చారిత్రక ఘట్టం.. వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తున్నాం. కొత్త జిల్లాలకు సంబంధించి కసర్తతు పూర్తైంది. ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు. ఏప్రిల్ 4వ తేదీన కొత్త జిల్లాల ఏర్పాటు ప్రారంభమవుతుంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే జిల్లాల ఏర్పాటు జరిగింది’’ అని తెలిపారు. కాగా, 26 జిల్లాలు, 73 రెవెన్యూ డివిజన్లతో ఫైనల్ గెజిట్ సిద్దమైంది. ఈ క్రమంలో పలు మండలాలను ప్రభుత్వం మార్చింది. రెవెన్యూ డివిజన్ల సంఖ్య 51 నుండి 73కి పెరిగింది. పాత రెవెన్యూ డివిజన్లన్నీ యథాతథంగా కొనసాగనున్నాయి. కొత్త జిల్లాల వారీగా రెవెన్యూ డివిజన్లు.. 1. శ్రీకాకుళం జిల్లా : పలాస (కొత్త), టెక్కలి, శ్రీకాకుళం 2. విజయనగరం : బొబ్బిలి (కొత్త), చీపురుపల్లి (కొత్త), విజయనగరం 3. ప్వార్వతీపురం మన్యం : పార్వతీపురం, పాలకొండ 4. అల్లూరి సీతారామరాజు : పాడేరు, రంపచోడవరం 5. విశాఖపట్నం : భీమునిపట్నం (కొత్త), విశాఖపట్నం 6. అనకాపల్లి : అనకాపల్లి, నర్సీపట్నం, 7. కాకినాడ : పెద్దాపురం, కాకినాడ 8. కోనసీమ : రామచంద్రాపురం, అమలాపురం, కొత్తపేట (కొత్త) 9. తూర్పుగోదావరి : రాజమహేంద్రవరం, కొవ్వూరు 10. పశ్చిమగోదావరి : నర్సాపురం, భీమవరం (కొత్త) 11. ఏలూరు : జంగారెడ్డిగూడెం, ఏలూరు, నూజివీడు 12. కృష్ణా : గుడివాడ, మచిలీపట్నం, ఉయ్యూరు (కొత్త) 13. ఎన్టీఆర్ : విజయవాడ, తిరువూరు (కొత్త), నందిగామ (కొత్త) 14. గుంటూరు : గుంటూరు, తెనాలి 15. బాపట్ల : బాపట్ల (కొత్త), చీరాల (కొత్త) 16. పల్నాడు : గురజాల, నర్సరావుపేట, సత్తెనపల్లి (కొత్త) 17. ప్రకాశం : మార్కాపురం, ఒంగోలు, కనిగిరి (కొత్త) 18. నెల్లూరు : కందుకూరు, కావలి, ఆత్మకూరు, నెల్లూరు 19. కర్నూలు : కర్నూలు, ఆదోని, పత్తికొండ (కొత్త) 20. నంద్యాల : ఆత్మకూరు (కొత్త), డోన్ (కొత్త), నంద్యాల 21. అనంతపురం : అనంతపురం, కళ్యాణదుర్గం, గుంతకల్ (కొత్త) 22. శ్రీ సత్యసాయి : ధర్మవరం, పెనుకొండ, కదిరి, పుట్టపర్తి (కొత్త) 23. వైఎస్సార్ కడప : బద్వేల్, కడప, జమ్మలమడుగు 24. అన్నమయ్య : రాజంపేట, మదనపల్లె, రాయచోటి (కొత్త) 25. చిత్తూరు : చిత్తూరు, నగరి (కొత్త), పలమనేరు (కొత్త), కుప్పం (కొత్త) 26. తిరుపతి : గూడూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి (కొత్త), తిరుపతి. కొత్త జిల్లాలు, మండలాల సంఖ్య.. - శ్రీకాకుళం జిల్లా.. 30 మండలాలు - విజయనగరం జిల్లా.. 27 మండలాలు - పార్వతీపురం మన్యం జిల్లా.. 15 మండలాలు - అల్లూరి సీతారామరాజు జిల్లా.. 22 మండలాలు - విశాఖపట్నం జిల్లా.. 11 మండలాలు - అనకాపల్లి జిల్లా.. 24 మండలాలు - కాకినాడ జిల్లా.. 21 మండలాలు - కోనసీమ జిల్లా.. 22 మండలాలు - తూర్పుగోదావరి జిల్లా.. 19 మండలాలు - పశ్చిమగోదావరి జిల్లా.. 19 మండలాలు - ఏలూరు జిల్లా.. 28 మండలాలు - కృష్ణా జిల్లా.. 25 మండలాలు - ఎన్టీఆర్ జిల్లా.. 20 మండలాలు - గుంటూరు జిల్లా.. 18 మండలాలు - బాపట్ల జిల్లా.. 25 మండలాలు - పల్నాడు జిల్లా.. 28 మండలాలు - ప్రకాశం జిల్లా.. 38 మండలాలు - నెల్లూరు జిల్లా.. 38 మండలాలు - కర్నూలు జిల్లా.. 26 మండలాలు - నంద్యాల జిల్లా.. 29 మండలాలు - అనంతపురం జిల్లా.. 31 మండలాలు - శ్రీ సత్యసాయి జిల్లా.. 32 మండలాలు - వైఎస్సార్ కడప జిల్లా.. 36 మండలాలు - అన్నమ్మయ్య జిల్లా.. 30 మండలాలు - చిత్తూరు జిల్లా.. 31 మండలాలు - తిరుపతి జిల్లా.. 34 మండలాలు -
సింగపూర్ కాకపోతే దాని తాతను రాజధానిగా నిర్మించొచ్చ:సజ్జల
-
డెడ్‌లైన్‌తో అభివృద్ధి ఎలా సాధ్యం?
అమరావతి: అమరావతి నిర్మాణానికి నిధులే ప్రధాన అడ్డంకని, మరి అటువంటిప్పుడు డెడ్‌లైన్ విధించి అభివృద్ధి చేయమంటే సాధ్యమవుతుందా అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ఎకరాకు రూ. 2 కోట్లు అవసరం అవుతుందని సీఎం జగన్ లెక్కలతో సహా అసెంబ్లీ వేదికగా చెప్పిన విషయాన్ని సజ్జల గుర్తు చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు, అమరావతి నిర్మాణం అంశాలపై శనివారం మీడియాతో మాట్లాడిన సజ్జల.. అమరావతి నిర్మాణానికి నిధులే ప్రధాన అడ్డంకని పేర్కొన్నారు. లక్ష కోట్లతో రాజధాని నిర్మించడం ఏంటి?, కేవలం ఒక్క ప్రాంతం అభివృద్ధి కోసం లక్షల కోట్లు ఖర్చు పెడితే ఎలా అని ప్రశ్నించారు. నిధులు ఉంటే సింగపూర్ కాకపోతే దాని తాతను రాజధానిగా నిర్మించవచ్చని ఆయన తెలిపారు. ఆచరణ సాధ్యం కాని ఆదేశాలు కాబట్టి సీఎస్ అఫిడవిట్ దాఖలు చేశారన్నారు. ఇక కొత్త జిల్లాల అంశంపై మాట్లాడుతూ.. ‘కొత్త జిల్లాలకు సంబంధించి కసరత్తు పూర్తయ్యింది. ఎప్పడైనా నోటిఫికేషన్ వస్తుంది. కొత్త జిల్లాల ఏర్పాటు ఒక చారిత్రక ఘట్టం. ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి అనుగుణంగా వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తున్నాం. పార్లమెంట్ కేంద్రాలను బేస్ చేసుకుని జిల్లాల విభజన చేస్తాం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే జిల్లాల ఏర్పాటు ఉండబోతుంది. చిన్న చిన్న మార్పులతోనే నోటిఫికేషన్ వెలవడబోతోంది. 90 శాతం ప్రభుత్వ భవనాల్లోనే కొత్త జిల్లాల కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నాం. కొత్త జిల్లాల్లో అడ్మినిస్ట్రేషన్, పొలీస్ అడ్మినిస్ట్రేషన్ ఒకే చోటా ఉండేలా నిర్ణయం తీసుకున్నాం. కొత్తగా నిర్మించే శాశ్వత భవనాలు 15 ఎకరాల్లో ఉండేలా చూడాలని సీఎం ఆదేశించారు. 2023 నాటికి మొత్తం కొత్త జిల్లాల శాశ్వత భవనాలు పూర్తవుతాయి. మంత్రి వర్గం విస్తరణ మొత్తాన్ని సీఎం చూస్తున్నారు.సీఎం జగన్ సోషల్ జస్టిస్‌కు అనుగుణంగానే మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెద్దపీట వేసేలా క్యాబినెట్ కసరత్తు ఉంటుంది’ అని సజ్జల తెలిపారు. -
కొత్త జిల్లాల ఏర్పాటును ప్రజల్లోకి తీసుకెళ్లండి
సాక్షి, అమరావతి: దశాబ్దాల నాటి రాష్ట్ర ప్రజల స్వప్నాలను సాకారం చేస్తూ.. జిల్లాల పునర్వ్యవస్థీకరణ ద్వారా 26 జిల్లాలను ఏర్పాటుచేస్తూ సీఎం వైఎస్ జగన్ చారిత్రక నిర్ణయం తీసుకున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్పర్సన్లు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లతో శుక్రవారం ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కొత్త జిల్లాల ఏర్పాటును ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. వారం రోజులపాటు పెద్దఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకులు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో సజ్జల మాట్లాడుతూ.. జిల్లాల ఏర్పాటుకు సంబంధించి చాలాచోట్ల చారిత్రక ప్రాధాన్యం, ప్రజల నుంచి డిమాండ్లు, సెంటిమెంట్లు ఉన్నాయన్నారు. వాటిని గౌరవిస్తూ కొత్త జిల్లాలను ఏర్పాటుచేస్తామని సీఎం తొలి నుంచి చెబుతూ వచ్చారన్నారు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటుచేశారని.. ఇప్పుడు జిల్లాల పునర్వ్యవస్థీరణ ద్వారా ప్రతి ఇంటి గడప వద్దకు ప్రభుత్వాన్ని తీసుకెళ్లిన ఘనత సీఎం జగన్‌కు దక్కుతుందన్నారు. కోర్టులో కేసులు లేకపోతే 3 రాజధానుల ఏర్పాటు ప్రక్రియ ఇప్పటికే ఆచరణలోకి వచ్చి ఉండేదన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేశారని.. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సజ్జల పార్టీ ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రాల్లో, కొత్తగా ఏర్పాటయ్యే రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో స్థానికంగా ఉండే విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాసంఘాలను భాగస్వాములను చేస్తూ వారంపాటు పండగలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. అధికార యంత్రాంగం కూడా సాంస్కృతిక శాఖ ద్వారా పలు కార్యక్రమాలు నిర్వహిస్తుందని చెప్పారు. జానపద కళారూపాలు, స్థానిక సంస్కృతులు, సాంప్రదాయాలు వంటివి ఈ కార్యక్రమంలో ఉండేలా చూసుకోవాలన్నారు. సదస్సులు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించాలన్నారు. వలంటీర్ల సత్కారం, అవార్డులిచ్చే కార్యక్రమాలు కూడా ఇదే సమయంలో జరుగుతాయని.. వాటిని ఈ కార్యక్రమంలో సమన్వయం చేసుకుంటూ నిర్వహించాలని ఆయన సూచించారు. వచ్చే నెల నుంచి గడప గడపకూ.. ఇక మే నుంచి ‘గడప గడపకు’ వెళ్లే కార్యక్రమాన్ని చేపట్టాలని సజ్జల కోరారు. బూత్ కమిటీలకు సంబంధించి సమీక్ష చేసుకోవాలని.. గతంలో ఉన్నవారు చురుగ్గా లేకపోతే కొత్తవారిని ఎంపిక చేసుకోవాలన్నారు. బూత్ సైజ్‌ను బట్టి బూత్ కమిటీ నిర్మాణం కన్వీనర్ నేతృత్వంలో జరగాలని.. ఈ కమిటీల్లో మహిళలకు సరైన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పార్టీ ప్లీనరీ జూలై 8న నిర్వహిస్తున్న నేపథ్యంలో 20 రోజుల్లోగా బూత్ కమిటీల నియామకం పూర్తిచేయాలని సజ్జల సూచించారు. -
ఆ తర్వాతే కేంద్ర ప్రణాళిక శాఖకు కొత్త జిల్లాలు: విజయ్‌కుమార్
సాక్షి, విజయవాడ: ఏప్రిల్ 4న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొత్త జిల్లాలను ప్రారంభించస్తారని ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. 26 జిల్లాల ఏర్పాటుకి రెండు రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తాం. ప్రజల నుండి 17,500కి పైగా సూచనలు, అభ్యంతరాలు వచ్చాయి. మొత్తం 284 అంశాలపై ప్రజలు వినతులు వచ్చాయి. 90 శాతం అంశాలకు సీఎం వైఎస్ జగన్ సానుకూలంగా పరిష్కరించారు. కొన్ని మండలాలను ప్రజల డిమాండ్ మేరకు జిల్లాలు మార్చాం. పూర్తి శాస్త్రీయంగా ప్రజల సౌకర్యార్థం పునర్విభజన చేశాం. ప్రతి జిల్లాలో కనీసం రెండు రెవెన్యూ డివిజన్లు ఉంటాయి. అదనంగా రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేశాం. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన సాధించేలా జిల్లాల పునర్విభజన జరిగింది. ఏప్రిల్ 4 తర్వాత కేంద్ర ప్రణాళిక శాఖకు కొత్త జిల్లాలను పంపుతామని ప్రణాళిక కార్యదర్శి విజయ్‌కుమార్ అన్నారు. చదవండి: (ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మారుతున్నాయి: సీఎం జగన్) -
ఆలస్యం... అమృతం... విషం!
గణతంత్రదినోత్సవం నాడు రాష్ట్రంలో పరిపాలన, బౌగోళిక మార్పులకు శ్రీకారం చుడుతూ కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం చారిత్రాత్మకం. బ్రిటిష్ వారు 120 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన జిల్లాలకు అదనంగా స్వాతంత్య్రం వచ్చిన తరువాత నేటికి జనాభా 5 రెట్లు పెరిగినా కొత్త జిల్లాలు కేవలం రెండు (విజయనగరం, ప్రకాశం) మాత్రమే ఏర్పడ్డాయి. కేంద్ర ప్రభుత్వం 2021 జనగణనను కరోనా విపత్తు వల్ల నిరవధికంగా వాయిదా వేసి కొత్త పరిపాలనా విభాగాల ఏర్పాటు మార్పు చేర్పులపై వున్న నిషేధాన్ని 2022 జూన్ 30 వరకు ఎత్తివేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ నూతన జిల్లాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం సరైన సమయంలో తీసుకున్న సాహసోపేత చర్య. జూన్ 30 నాటికి కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, రెవెన్యూ గ్రామాల ఏర్పాటు, సరిహద్దుల్లో మార్పులు వంటివి పూర్తి చేసి కేంద్ర హోంశాఖకు నివేదిస్తే జూలై తరువాత ఎప్పుడు జనగణన జరిగినా రాష్ట్రంలోని కొత్త జిల్లాల ప్రకారమే జనగణన చేపడతారు. కొత్త జిల్లాల ఏర్పాటు ఆవశ్యకత ఆంధ్రప్రదేశ్‌లో ఎంతైనా వుంది. రాష్ట్రంలో సగటు జిల్లా జన సంఖ్య 37.98 లక్షలు కాగా మొత్తం జిల్లాలు 13 మాత్రమే. నూతనంగా ఏర్పడిన తెలం గాణలో జిల్లా సగటు జనాభా 11.35 లక్షలు ఉంటే జిల్లాలు 33 ఉన్నాయి. మనకన్నా జిల్లా సగటు జనాభా (26.64 లక్షలు) తక్కువగా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో 80 జిల్లాలు ఉండటం గమ నార్హం. దేశంలో ఒక్క పశ్చిమ బెంగాల్లో (39.68 లక్షలు) మాత్రమే ఏపీలోని జిల్లా సగటు జనాభా కన్నా ఎక్కువ జన సంఖ్య ఉంది. ఈ గణాంకాలను దృష్టిలో పెట్టుకొని చూసిన ప్పుడు ఏపీలో జిల్లాల సంఖ్య బాగా తక్కువగా ఉన్నట్లు స్పష్ట మవుతున్నది. కొత్త జిల్లాల ఏర్పాటుకు ఇదీ ఒక కారణమే. దాదాపు పార్లమెంట్ నియోజకవర్గం సరిహద్దులే కొత్త జిల్లా సరిహద్దులకు ప్రాతిపదికగా తీసుకోవటం, అసెంబ్లీ నియోజక వర్గాలు రెండు మూడు జిల్లాల్లో విస్తరించకుండా ఏ జిల్లాకి ఆ జిల్లాలోనే ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం మేలైన నిర్ణయం. ఆంధ్రప్రదేశ్‌లో 1974 జిల్లాల చట్టంలో ఉన్నవీ, 1984లో రూపొందించిన నిబంధనలనూ పరిశీలించినప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటుకు గమనించాల్సిన ముఖ్యాంశాలు– ప్రాంతం, జనాభా, ఆదాయం... కొత్త, పాత జిల్లాల్లో దాదాపు సమపాళ్లలో ఉండేటట్లు తుది ముసాయిదా నాటికి సవరిం చాలి. అలాగే చారిత్రక నేపథ్యం, ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించిన సమస్యలు; సాంస్కృతిక పరమైన, విద్య, మౌలిక సదుపాయాలూ; ఆర్థిక పురోభివృద్ధి అవకాశాలు వంటి వాటిని దృష్టిలో పెట్టుకోవాలి. అభివృద్ధి చెందిన, లేదా బాగా వెనుకబడిన ప్రాంతాలు అన్నీ ఒకే దగ్గరకు రాకుండా చూడాలి. పార్లమెంట్ సరిహద్దు ప్రాతిపదికనే కాకుండా పరిస్థితిని బట్టి కొద్దిపాటి మార్పులు, చేర్పులు చేయవలసి ఉంది. కొంతమంది 2026లో అసెంబ్లీ, పార్లమెంట్ నియోజక వర్గాల పునర్విభజన జరుగుతుంది కాబట్టి... పార్లమెంటు సరిహద్దులు మారుతాయనీ, అందువల్ల ఇప్పుడు కొత్త జిల్లాలు ఏర్పాటు సరికాదనీ అంటున్నారు. ఇది వాస్తవం కాదు. 2001లో జరిగిన 91వ రాజ్యాంగ సవరణను అనుసరించి 2026 తరువాత వచ్చే తొలి జనాభా లెక్కల ప్రకారం (అంటే 2031 సెన్సెస్) డీలిమిటేషన్ కమిటీ ఏర్పాటు చేసి దేశ వ్యాప్తంగా పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలు పునర్విభజన చేయ డానికి 3 సంవత్సరాలు పడుతుంది. అసలు జనాభా లెక్కల తుది జాబితానే 2034లో ప్రకటిస్తారన్న సంగతి గుర్తించాలి. అంటే 2039 ఎన్నికల వరకు పార్లమెంటు స్థానాల సంఖ్య తేలే అవకాశమే లేదన్నమాట! కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలకు... ప్రత్యేకించి మెడికల్ కాలేజీలు, కేంద్రీయ విద్యాలయాలు, గ్రామీణా భివృద్ధి, పశువైద్యశాలలు, యువజన కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, వ్యవసాయ కళాశాలల ఏర్పాటుకు జిల్లాను యూని ట్‌గా తీసుకొని కేటాయింపులు చేస్తుంది. నూతన జిల్లాలను ఏర్పాటు చేస్తే... కొత్త జిల్లాలకు అదనపు నిధులు, మౌలిక సదుపాయాలకు హోం, డిజాస్టర్ శాఖల నుండి ప్రత్యేక నిధులు తెచ్చుకునే అవకాశం వుంటుంది. ఇంత ప్రయోజన కరమైన కొత్త జిల్లాల ఏర్పాటు ఎంత తొందరగా సాకారం అయితే అంతమంచిది. ‘ఆలస్యం అమృతం విషం!’ అందుకే వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర పరిధిలోనే ఉన్న కొత్త జిల్లాల ఏర్పాటు అంశంపై దృష్టి సారించింది. తద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజల దగ్గరకు మరింత సమర్థవంతంగా, వేగంగా చేర్చడానికి వీలుండటమే కాక అభివృద్ధి ఊపందుకుంటుంది. ఇనగంటి రవికుమార్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు మొబైల్: 94400 53047 -
కొత్త జిల్లాల ఏర్పాటుకు సర్వం సిద్ధం
-
AP New Districts: ముహూర్తం 4న
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నూతన జిల్లాల అవతరణకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 4వ తేదీన ఉదయం 9:05 నుంచి 9:45 గంటల మధ్య 13 కొత్త జిల్లాల అవతరణ ముహూర్తానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమోదం తెలిపారు. ప్రాథమిక సమాచారం మేరకు కొత్త జిల్లాల కార్యకలాపాలను సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభిస్తారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా సేవలందిస్తున్న వలంటీర్లకు సత్కారాన్ని ఏప్రిల్ 6వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు. ఏప్రిల్ 8వ తేదీన వసతి దీవెన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. నూతన జిల్లాల అవతరణ, మౌలిక సదుపాయాల కల్పన, పరిపాలనా సముదాయాల నిర్మాణం తదితర అంశాలపై ముఖ్యమంత్రి జగన్ బుధవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సుస్థిర ఆర్థిక ప్రగతి కోసం నిర్దేశించుకున్న లక్ష్యాలను కొత్త జిల్లాలతో అనుసంధానం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. పరిపాలనా సముదాయాల నిర్మాణాల కోసం అనువైన స్థలాల ఎంపిక త్వరగా పూర్తి చేయాలని, కనీసం 15 ఎకరాల స్థలం ఉండేలా చూడాలని సూచించారు. కలెక్టర్‌తోపాటు జిల్లా పోలీసు అధికారి కార్యాలయాలన్నీ కూడా ఒకే సముదాయంలో ఏర్పాటు చేయాలని, క్యాంపు కార్యాలయాలు కూడా అదే ప్రాంగణంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. భవనాల కోసం మంచి డిజైన్లను ఎంపిక చేసుకోవాలని, పది కాలాలు గుర్తుండేలా భవనాల నిర్మాణం ఉండాలని స్పష్టం చేశారు. అద్దె ప్రాతిపదికన భవనాలు తీసుకున్న జిల్లాల్లో నూతన భవనాల నిర్మాణాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా.. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియకు సంబంధించిన వివరాలను సమావేశంలో సీఎస్, ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రజల నుంచి 16,600 సలహాలు, అభ్యంతరాలు వచ్చాయని, ప్రజాభిప్రాయానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసినట్లు తెలిపారు. ప్రజలు, ప్రజాప్రతినిధులతో చర్చించిన తర్వాతే కలెక్టర్లు సిఫార్సులు చేశారని చెప్పారు. సిబ్బంది విభజన, పోస్టింగుల్లో ఆరు సూత్రాల ఫార్ములా తదితరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకునే కొత్త జిల్లాల పాలనా యంత్రాంగం నిర్మాణం, పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనలు తయారు చేశామని వెల్లడించారు. కొత్త జిల్లాలకు సిబ్బంది వెళ్లేలోగా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సరి చూసుకునేందుకు చెక్‌లిస్టు కూడా రూపొందించినట్లు చెప్పారు. సాఫ్ట్‌వేర్‌లో మార్పుచేర్పులు.. నూతన వెబ్సైట్లు, యంత్రాంగానికి అనుగుణంగా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేర్పులు పూర్తయినట్లు వివరించారు. కొత్త జిల్లాల సమాచారంతో హ్యాండ్ బుక్స్ కూడా సిద్ధం చేశామన్నారు. కలెక్టర్లు, జిల్లా పోలీసు అధికారుల కార్యాలయాలు, క్యాంపు కార్యాలయాలను ఖరారు చేశామని, ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేనిచోట్ల ప్రైవేట్ భవనాలను అద్దె ప్రాతిపదికన తీసుకున్నట్లు తెలిపారు. సమీక్షలో ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ జి. సాయిప్రసాద్, జీఏడీ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, ప్రణాళిక శాఖ కార్యదర్శి వి.విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. కొత్త జిల్లాలు, డివిజన్ల ఖరారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 కొత్త జిల్లాలతో పాటు కొత్త రెవెన్యూ డివిజన్లను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. కొత్త జిల్లాలతో కలిపి మొత్తం 26 జిల్లాలు, కొత్త డివిజన్లతో కలిపి మొత్తం 73 రెవెన్యూ డివిజన్లకు సంబంధించిన ఫైలును రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ పర్చువల్ విధానంలో కేబినెట్ ఆమోదానికి బుధవారం పంపించారు. ప్రజల నుంచి, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞాపనలను పరిగణనలోకి తీసుకుని కొన్ని మార్పులు, చేర్పులతో కూడిన కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లకు కేబినెట్ ఆమోదం లభించిన తరువాత ఏప్రిల్ 3వ తేదీన తుది గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అదే రోజు కొత్త జిల్లాలకు కలెక్టర్లను, జేసీలను, ఎస్పీలను, ఉద్యోగులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయనున్నారు. ఈ నెల 4 నుంచి విధుల్లోకి.. కొత్తగా ఏర్పాటయ్యే 13 జిల్లాలకు ఒక్కో కలెక్టర్, ఒక్కో జాయింట్ కలెక్టర్, ఒక్కో ఎస్పీని నియమించనున్నారు. ఇప్పటికే 13 జిల్లాల్లో ఆసరా, సంక్షేమ జాయింట్ కలెక్టర్లుగా పనిచేస్తున్న వారిని కొత్త జిల్లాలకు జిల్లా రెవెన్యూ అధికారులుగా నియమిస్తారు. ఈ నెల 4న ఉదయం 9.05–9.45 గంటల మధ్య కొత్త జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, జిల్లా రెవెన్యూ అధికారులతో పాటు ఆ జిల్లాల్లోని రెవెన్యూ డివిజన్ల కార్యాలయాల్లో ఉద్యోగులు బాధ్యతలు చేపట్టి పరిపాలన కార్యకలాపాలు ప్రారంభిస్తారు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లలో పనిచేయాల్సిన ఉద్యోగులు, అధికారుల పంపిణీ కసరత్తును ఇప్పటికే సంబంధిత శాఖలతోపాటు ఆర్థిక శాఖ కూడా పూర్తి చేసింది. ప్రస్తుత జిల్లాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారులనే జనాభా ప్రాతిపదికన కొత్త జిల్లాల్లో పనిచేయడానికి తాత్కాలిక ప్రాతిపదికన బదిలీ చేయనున్నారు. ఆరు సూత్రాలు, జోన్లకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చేవరకు కొత్త జిల్లాల్లో పనిచేసే ఉద్యోగులు పదోన్నతులు, సీనియారిటీ, స్థానికతలో ఎటువంటి మార్పు ఉండదు. ప్రస్తుతం ఉన్న సీనియారిటీ, స్థానికత యథాతథంగా ఉంటుంది. మొత్తంగా కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లకు బదిలీ అయ్యే ఉద్యోగుల సంఖ్య 10వేల నుంచి 12వేల లోపు ఉంటుందని అధికారులు అంచనా. -
ఏపీ: కొత్త జిల్లాల అవతరణకు ముహుర్తం ఖరారు
-
అందరూ బాగుపడాలి కదా!
మన దేశీయ ఉత్పత్తుల విదేశీ ఎగు మతులు మొదటిసారి అనుకున్న సమయానికన్నా ముందే వార్షిక లక్ష్యం 400 బిలియన్ డాలర్లకు చేరిన సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఈ విజయానికి కారకులైన రైతులు, చేనేత కార్మికులు, మత్స్య కారులు, ఎంఎస్ఎంఈ, ఔత్సాహికులను అభినందించారు. ఈ సందర్భంగా కేంద్ర పరిశ్రమలు–వాణిజ్య శాఖా మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీ– ‘ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో’లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ– ‘‘ఇన్నాళ్లుగా ప్రభుత్వానికి – ఉత్పాదక రంగానికి మధ్య ఈ లక్ష్యాన్ని చేరడానికి అవరోధంగా వున్న ప్రతి అడ్డంకినీ, ధ్వంసం చేయడం వల్ల ఇది సాధ్యమయింది’’ అంటూ, ప్రభుత్వంలో ఉంటూ ‘ధ్వంసం’ అనే కొత్త పద ప్రయోగాన్ని అధికారిక వేదిక మీది నుంచి వ్యక్తం చేశారు! ఈ విశేషమైన లక్ష్యాన్ని సాధించడానికి ‘మొత్తం ప్రభుత్వ విధానం’ – ‘మొత్తం దేశ విధానం’ కూడా తదుపరి స్థాయికి చేరిందని గోయల్ అభివర్ణించారు. పదమూడు కొత్త జిల్లాలు ఏర్పడుతున్న చారిత్రక సందర్భంలో ఎందుకు ఈ విషయాన్ని ఇప్పుడు ఇక్కడ ప్రస్తావించడం అంటే... రాష్ట్ర విభజనను ‘సమైక్యం’ అంటూ అడ్డుకోబోయి, భంగపడి నిస్సహాయంగా మిగిలిన ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణాన్ని ఐదేళ్ల తర్వాత – ‘తదుపరి స్థాయికి’ తీసుకువెళ్లడమే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నది కూడా. ‘రాజ్యానికి – ప్రజలకు’ మధ్య ఇన్నాళ్లు అవరోధంగా ఉన్న ప్రతి అడ్డంకినీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ధ్వంసం చేస్తూ, మూడు రాజధానులు, పదమూడు కొత్త జిల్లాలతో ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థను, చిట్టచివరి ప్రాంత ప్రజలకు చేరువ చేస్తున్నది. కానీ గత ప్రభుత్వ పెద్ద... ఇప్పటికీ– ‘కేంద్రీకృత అభివృద్ధి’ నమూనా అమలు కోసం పట్టుపట్టడం విస్మయం కలిగిస్తున్నది. రాష్ట్ర విభజనకు దారి తీసిన– శ్రీ కృష్ణ కమిటీ, రాజధాని ఎంపిక కోసం పనిచేసిన శివరామకృష్ణన్ కమిటీ... రెండూ కూడా రాయలసీమ నాలుగు జిల్లాలు, ఉత్తరాంధ్ర మూడు జిల్లాల వెనుకబాటుతనం గురించి చేసిన ప్రస్తావనను, గత ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. విభజన చట్టంలోనే కేంద్ర ప్రభుత్వ పరిధిలోని కొన్ని విద్యా సంస్థలు ఈ ఏడు జిల్లాల్లో ఏర్పాటు చేయాలనే షరతు కారణంగా– సెంట్రల్ యూనివర్సిటీ అనంతపూర్, కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ విజయనగరం వంటివి వెనుకబడిన ప్రాంతాల్లో ఏర్పడటానికి మార్గం సుగమం అయింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ‘కోవిడ్ –19’ నీలిమేఘాలు కమ్మేశాయి. దేశంలో వివిధ ప్రాంతాలకు పొట్ట చేతపట్టుకుని వెళ్లిన వలస కార్మికులు ప్రాణాలు అరిచేతులో పెట్టుకుని – ఒడిస్సా, ఛతీస్‌గఢ్, జార్ఖండ్, పశ్చమబెంగాల్, బిహార్, రాష్ట్రాలలోని ఇళ్లకు బయలుదేరిన వేళ, విజయవాడ జంక్షన్ అందుకు– సజీవ సాక్షి అయింది. మన రాష్ట్ర ప్రభుత్వ– ‘స్పర్శ’ ఆ అన్నార్తులకు ఆలంబన అయింది. ఈ మానవీయ దృక్పథమే– ‘సంక్షేమం’ పట్ల రాష్ట్ర ప్రభుత్వ ’ఫోకస్’ మరింత పెరగడానికి కారణం అయింది. దీన్ని తప్పు పడుతూ– ‘సంక్షేమ పథకాలతో ప్రజల్ని సోమరులను చేస్తున్నారు’ అంటున్నవారు ఇప్పటికీ వున్నారు. అయితే, ఇక్కడే వీరు ఒక కీలక అంశం దృష్టిలో ఉంచుకోవాలి. ఈ ప్రభుత్వ ద్రవ్య వినిమయంపై ‘కాగ్’ – ‘నీతి ఆయోగ్’ వంటి కేంద్ర స్వతంత్ర సంస్థలు వెలువరిస్తున్న వార్షిక నివేదికల గురించి, జగన్ కఠోర విమర్శకులు సైతం నోరు మెదపడం లేదు! (క్లిక్: ఎవరిది యజ్ఞం? ఎవరు రాక్షసులు?) వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన మూడేళ్ళ తర్వాత... వేరే సందర్భంలో– ‘తదుపరి స్థాయికి’ చేరడానికి అడ్డంకులను–‘కూల్చడం’ అని కేంద్ర మంత్రి అని వుండవచ్చు. కానీ తొలి కలెక్టర్ల సమావేశం ముగిసిన తర్వాత, 24 జూన్ 2019న నిబంధనలకు విరుద్ధంగా గత ప్రభుత్వం నదీ గర్భంలో నిర్మించిన– ‘ప్రజావేదిక’ను కూల్చి భవిష్యత్ ఎలా ఉంటుందో సింబాలిక్‌గా చెప్పారు జగన్. ఈ వ్యవహారాన్ని కేవలం కట్టడాల తొలగింపుగా చూస్తే స్పష్టత రాదు. ఇందులో యాభైకి పైగా నిర్లక్ష్యానికి గురైన జాతుల అభివృద్ధికి కార్పొరేషన్లు, వాటికి– చైర్మన్లు, చైర్–పర్సన్లు, వైస్– చైర్మన్లు, డైరక్టర్ల నియామకాల్ని... జగన్ కొత్తగా తొలగిస్తున్న పాత అడ్డుగోడలు దృష్టి నుంచి చూడవలసివుంది. రాబోయే కొత్త జిల్లాల్లో తొలుత వీరు స్థానిక సంస్థల ప్రతినిధులుగా తర్ఫీదు పొంది, రేపు చట్టసభల ఎన్నికలకు పోటీదార్లు అవుతారు. అయితే ఈ సరికొత్త సామాజిక సరళీకరణ కదలికల్ని మొత్తంగా ఆపడానికి చేస్తున్న ప్రయత్నమే– ‘అమరావతి’! (క్లిక్: మీ అన్నను మాట్లాడుతున్నాను...) - జాన్సన్ చోరగుడి అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత