క్షేత్రస్థాయి పాలనకు జిల్లాల ఏర్పాటు నాంది | The beginning of development with the formation of the district Bapatla | Sakshi
Sakshi News home page

క్షేత్రస్థాయి పాలనకు జిల్లాల ఏర్పాటు నాంది

Published Mon, Apr 11 2022 6:54 PM | Last Updated on Mon, Apr 11 2022 7:21 PM

The beginning of development with the formation of the district Bapatla - Sakshi

బాపట్ల: క్షేత్రస్థాయి పాలనకు జిల్లాల ఏర్పాటు నాంది పలుకుతుందని వైఎస్సార్‌ సీపీ పట్టణ అధ్యక్షుడు నరాలశెట్టి ప్రకాశరరావు పేర్కొన్నారు. బాపట్ల జిల్లా ఏర్పాటుతో ఆదివారం స్థానిక శ్రీభావన్నారాయణస్వామి దేవాలయం, ఆంజనేయస్వామి దేవాలయంలో డెప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి ఆధ్వర్యంలో టెంకాయలు కొట్టి ఉత్సవాలను ప్రారంభించారు.

జిల్లా ఏర్పాటు అన్నిరంగాల్లో అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఉపాధి అవకాశాలు పెరగడంతోపాటు వనరులు సద్వినియోగం చేసుకోవడంతో ఉత్తమ ఫలితాలు అందుతాయని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కోకి రాఘవరెడ్డి, మార్కెట్‌ యార్డు చైర్మన్‌ గవిని కృష్ణమూర్తి, ఇనగలూరి మాల్యాద్రి, యజ్రయ్య, బొడ్డు సుబ్బారెడ్డి, సి.కె.నాయుడు, బ్రహ్మనందరెడ్డి, ఇమ్మడిశెట్టి శ్రీను పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement