బాపట్ల: జాతీయ సర్వే దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లా సర్వేయర్లు దాతృత్వం చాటారు. ఆదివారం బాపట్ల పట్టణంలోని బదిరుల ఆశ్రమ పాఠశాలలో జాతీయ సర్వే దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు స్వీట్లు, కేకులు, పండ్లు పంపిణీ చేశారు. మండల సర్వేయర్లు సత్యనారాయణ రెడ్డి , ఆది రామచంద్ర, ఖాదర్ వలీ మాట్లాడుతూ భూములకు సంబంధించిన అంశాల్లో సర్వేయర్ల పాత్ర కీలకమన్నారు.
సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ ద్వారా భూ సర్వే గ్రామ స్థాయిలో తేలికవుతుందని పేర్కొన్నారు. గ్రామ సర్వేయర్ల పని తీరు బాగుందని కొనియాడారు. జాతీయ సర్వే దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు చేయూత అందించడం ఆనందంగా ఉందని చెప్పారు. కార్యక్రమంలో చైన్ మన్ శ్రీనివాస్, గ్రామ సర్వేయర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment