bapatla
-
నేను చెప్పిందే ‘యాక్ట్’
ఇసుక, బుసక, గ్రావెల్, గ్రానైట్, బియ్యం... ఏది దొరికినా అమ్మకానికి పెట్టి అక్రమార్జన..! రాబడి ఉందనుకుంటే ఏ ఒక్కరినీ, సంస్థలను వదలకుండా వేధింపులు..! అధికారంలోకి వచ్చిందే తడవుగా ఇదీ పచ్చ నేతల బరితెగింపు..! ఇప్పుడు వారు బెదిరింపుల పర్వానికీ తెరలేపారు..! తాజాగా బాపట్ల పచ్చ నేత చూపు యాక్ట్ కేబుల్ టీవీపై పడింది. ఇక్కడ తాను చెప్పిందే ‘యాక్ట్’ అంటూ సంస్థను నియోజకవర్గం నుంచి తరిమేసి మొత్తం కనెక్షన్లు తన కేబుల్ టీవీకి మళ్లించుకునేందుకు ఆయన ఎత్తు వేశారు. ఇందుకోసం శక్తిమంతమైన యాక్ట్ యాజమాన్యాన్నే బెదిరించారు. ఆయన బరితెగింపు జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం కాగా కూటమి ప్రభుత్వంలోనూ చర్చకు దారితీసింది. –సాక్షి ప్రతినిధి, బాపట్లకార్యాలయానికి పిలిపించుకుని బెదిరింపుల పర్వంబాపట్ల పచ్చ నేత నియోజకవర్గంలో 30 ఏళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది యాక్ట్ కేబుల్ యాజమాన్యం. ఇప్పుడు దానినే బెదిరిస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. సంస్థకు ఉన్న 32 వేల కనెక్షన్లు తనకు అప్పగించి నియోజకవర్గం వదిలిపెట్టాలని బాపట్ల పచ్చ నేత హుకుం జారీ చేశారు. ఇటీవల యాక్ట్ కేబుల్‌కు చెందిన అసిస్టెంట్ మేనేజర్ మొదలు ఉద్యోగులందరినీ తన కార్యాలయానికి పిలిపించుకుని మరీ అల్టిమేటం జారీ చేశారు. ‘మీ కనెక్షన్లన్నీ మా సోదరుడి కేబుల్ టీవీకి బదలాయించండి’అని ఆదేశించారు. కాదూ.. కూడదంటే నియోజకవర్గంలో ఉండలేరన్నారు. వెళ్లకపోతే పోలీసు కేసులు పెట్టిస్తానని బెదిరించారు. ‘మీరంతా చిన్న ఉద్యోగులు.. యాక్ట్‌ను నమ్ముకుని కేసుల్లో ఇరుక్కోవద్దు’ అంటూ తనదైన శైలిలో సూచనలు చేశారు. తక్షణం ఉద్యోగాలు వదలి వెళ్లిపోవాలని ఆల్టిమేటం ఇచ్చారు. ఈ విషయం యాక్ట్ యాజమాన్యానికి తక్షణమే చేరవేయాలని కూడా సూచించారు. తన మాట ఖాతరు చేయకుండా పార్టీ పెద్దలు, లేదా మీ సంస్థకు పరిచయమున్న మంత్రులతో ఫోన్లు చేయించినా వినేది లేదని పచ్చనేత ఖరాకండిగా చెప్పారు. నాతో పెట్టుకోవద్దంటూ ఇలా నేరుగానే బెదిరించారు. యాజమాన్యంతో మీరే మాట్లాడాలని యాక్ట్ ఉద్యోగులు సూచించగా ‘మీ యాజమాన్యంతో మాట్లాడేంత తక్కువ స్థాయి వ్యక్తిని కాదు నేను. అవసరమనుకుంటే వారే నా వద్దకు రావాలి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.వారంలో వెళ్లకపోతే కేసులే..వారం రోజుల్లో బాపట్ల వదలి వెళ్లాలని, లేదంటే ఎలా పనిచేస్తారో చూస్తామని.. వరుస కేసులు పెట్టి అంతుచూస్తామని యాక్ట్ ఉద్యోగులకు పచ్చ నేత ఫైనల్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో.. మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్తామని, వారు ఒప్పుకోవాలి తప్ప తామేమీ చేయలేమని చెప్పి యాక్ట్ ఉద్యోగులు వెనుదిరిగినట్లు తెలిసింది. తర్వాత పచ్చనేత సమీప బంధువు వచ్చి నియోజకవర్గానికి సంబంధించి 50 శాతం వాటా ఇస్తే ఓకే చెప్పిస్తానని యాక్ట్ ఉద్యోగుల వద్ద బేరం పెట్టినట్లు సమాచారం. ఇక బెదిరింపుల క్రమంలో ఇటీవల తమ కేబుల్‌ను కట్ చేశారన్న సాకు చూపి కర్లపాలెం పరిధిలో యాక్ట్ ఉద్యోగిపై అక్రమ కేసు నమోదు చేయించినట్లు తెలిసింది. ఇదే కాకుండా ఇటీవల పలుసార్లు యాక్ట్ ఉద్యోగులను పోలీసు ఫిర్యాదుల పేరుతో వేధిస్తున్నట్లు చెబుతున్నారు.ఇన్నేళ్లలో ఎప్పుడూ చూడలే..పచ్చ నేత బెదిరింపులను యాక్ట్ యాజమాన్యం కొందరు ప్రభుత్వ పెద్దల దృష్టికి సైతం తెచ్చినట్లు సమాచారం. వాస్తవానికి యాక్ట్ డిజిటల్ టీవీ బలమైన మీడియా సంస్థ. దేశంలోనే మూడో అతిపెద్ద కేబుల్, ఇంటర్నెట్ కంపెనీ. నాన్ టెలికంలో దేశంలో నంబర్‌వన్ స్థానంలో ఉంది. దేశ వ్యాప్తంగా 20 వేల మంది ఉద్యోగులు ఈ సంస్థలో పనిచేస్తున్నారు. బాపట్ల నియోజకవర్గంలో 30 ఏళ్ల నుంచి 32 వేల కనెక్షన్లతో ఉంది. ఏడాదిన్నర క్రితం బాపట్ల పచ్చనేత తన రాజకీయ అవసరాల కోసం లోకల్ కేబుల్ పెట్టారు. తర్వాత అధికారంలోకి రావడంతో ఏకంగా బలమైన యాక్ట్ కేబుల్‌ను కనెక్షన్లు తనకు అప్పగించి వెళ్లాలని బెదిరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్నేళ్లలో ఏ నాయకుడూ తమను బెదిరించలేదని, మొదటిసారి బాపట్లలో ఇలాంటి పరిస్థితి చూస్తున్నామని యాక్ట్ యాజమాన్యం పేర్కొంటోంది. -
బాపట్ల టు గుజరాత్..
సాక్షి ప్రతినిధి, బాపట్ల: బాపట్ల జిల్లాలో పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. కొందరు వ్యాపారులు గుజరాత్ రాష్ట్రానికి తరలించి అక్రమార్జనకు పాల్పడుతున్నారు. బాపట్ల సమీపంలోని వెదుళ్లపల్లిలో ఉన్న ఓ రైస్‌మిల్లు యజమాని ఈ చౌక బియ్యాన్ని సేకరించి పాలిషింగ్ చేసి తరలిస్తున్నట్లు సమాచారం. ఆయనతోపాటు బాపట్ల పట్టణం పరిధిలోని మరో రైస్‌మిల్లు యజమానితోపాటు ఇదే మండలం అప్పికట్ల ప్రాంతంలోని ఇంకో రైస్‌మిల్లుకు చెందిన బాపట్ల టీడీపీ నేత అనుచరుడు రేషన్ బియ్యాన్ని కొని పాలీíÙంగ్ చేసి రాష్ట్ర సరిహద్దులు దాటించేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సేకరణ.. బాపట్లతో పాటు పర్చూరు, అద్దంకి, రేపల్లె, చీరాల, వేమూరు, పొన్నూరు ప్రాంతాల్లోని డీలర్ల నుంచి కిలో బియ్యాన్ని రూ.15కు ఈ ముఠా కొనుగోలు చేస్తోంది. ఇలా సేకరించిన బియ్యాన్ని వెదుళ్లపల్లితో పాటు మిగిలిన ఇద్దరు మిల్లర్లకు కిలో రూ.22 చొప్పున విక్రయిస్తున్నారు. వెదుళ్లపల్లి మిల్లు యజమాని ఒక్కరే నెలకు సుమారు 15 వేల క్వింటాళ్ల బియ్యాన్ని తన మిల్లుకు తరలించి ఎప్పటికప్పుడు పాలీషింగ్ చేసి లారీలు, ట్రక్కుల ద్వారా పొన్నూరు, గుంటూరు, మిర్యాలగూడా మీదుగా హైదరాబాద్‌కు, అక్కడి నుంచి గుజరాత్‌కు తరలిస్తున్నట్లు సమాచారం. ఇక్కడ కిలో రూ.22కు కొన్న రేషన్ బియ్యాన్ని గుజరాత్లో కిలో రూ.40కు అమ్ముతున్నట్లు సమాచారం. ఇలా ఒక్కో కిలోకు అన్ని ఖర్చులూపోను రూ.15 తక్కువ కాకుండా వస్తోంది. ఈ లెక్కన నెలనెలా రూ.కోట్లలోనే రాబడి ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, వెదుళ్లపల్లి మిల్లు యజమాని నెలకు 15 వేల క్వింటాళ్లు సేకరిస్తుండగా.. మిగిలిన రెండు మిల్లుల నుంచి మరో 10 వేల క్వింటాళ్లు అనుకున్నా మొత్తంగా జిల్లా నుంచి గుజరాత్‌కు సగటున 25 వేల క్వింటాళ్లు తరలిపోతున్నట్లు సమాచారం. వెదుళ్లపల్లి మిల్లుకు చెందిన వ్యాపారితోపాటు బాపట్ల, అప్పికట్ల మిల్లులకు చెందిన వ్యాపారులు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలతోపాటు గుంటూరు జిల్లా పొన్నూరు, పల్నాడు జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో రేషన్ బియ్యాన్ని సేకరించి ఎగుమతి చేస్తున్నారు.రేషన్ బియ్యం ఖరీదు ఇలా.. నిజానికి.. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కార్డుదారులకు డీలర్లు కిలోకు రూ.8 చెల్లించి బియ్యం వ్యాపారులకు రూ.12కు ఇచ్చేవారు. అలాగే, బియ్యం అక్రమ రవాణాదారులు బియ్యం సేకరణ వ్యాపారులకు రూ.20 చెల్లించేవారు. కానీ, రేషన్ బియ్యానికి డిమాండ్ పెరగడంతో కార్డుదారులకు రూ.10 నుంచి రూ.12.. డీలర్లకు రూ.15 నుంచి రూ.17 వస్తోంది. ఇక వ్యాపారుల వద్ద నుంచి అక్రమ ఎగుమతిదారులు కిలో రూ.22 నుంచి రూ.24కు కొనుగోలు చేస్తున్నారు. కార్డుదారులను వంచిస్తున్న డీలర్లు.. మరోవైపు.. కొందరు డీలర్లు కార్డుదారులకు మొక్కుబడిగా డబ్బులు చెల్లిస్తుండగా.. మరికొందరు దౌర్జన్యంగా లాగేసుకుంటున్నారు. ఏమైనా ప్రశ్నిస్తే తెల్లకార్డు గల్లంతవుతుందని పచ్చనేతలు బెదిరిస్తున్నారు. దీంతో.. బియ్యం పోతే పోయింది కార్డు అయినా మిగులుతుందని చాలామంది పేదలు మిన్నకుండిపోతున్నారు. దీంతో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్న అద్దంకి, రేపల్లెతోపాటు పర్చూరు, చీరాల, బాపట్ల, వేమూరు నియోజకవర్గాల్లోనూ చాలామంది డీలర్లు గోడౌన్ల నుంచే రేషన్ బియ్యాన్ని వ్యాపారులకు అప్పగించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం అస్సలు పట్టించుకోవడంలేదు. -
మిర్చి ధర ఢమాల్.. రైతుల విలవిల
-
సిద్ధమవుతున్న వరి విత్తనాలు
సాక్షి ప్రతినిధి, బాపట్ల: ఖరీఫ్ సీజన్‌కు బాపట్ల వ్యవసాయ పరిశోధన స్థానం, వ్యవసాయ కళాశాల క్షేత్రాల్లో వరి విత్తనాలు సిద్ధమవుతున్నాయి. ఈ ఏడాది బాపట్ల నుంచి 2,550 క్వింటాళ్ల వరి విత్తనాలు ఉత్పత్తి అవుతున్నాయి. డిమాండ్‌కు అనుగుణంగా బీపీటీ రకాలను ఇక్కడ ఉత్పత్తి చేస్తున్నారు. 128 ఎకరాల్లో వంగడాలను సాగు చేశారు. తేమ శాతం 12 వచ్చే వరకూ ఆరబెట్టి, తర్వాత బ్యాగుల్లో నింపుతున్నారు. ఫిబ్రవరి రెండో వారానికి ఈ ప్రక్రియ పూర్తిచేస్తారు. మార్చి మొదటివారం నుంచి ప్రాసెసింగ్ మొదలు పెట్టి ఏప్రిల్ నాటికి నాణ్యమైన విత్తనాలను సిద్ధం చేయనున్నారు. మే నెల నుంచి ప్రభుత్వం, దేశవ్యాప్తంగా పలు సీడ్ కంపెనీలతోపాటు రైతులకు పంపిణీ చేస్తారు.ఇక్కడ ఉత్పత్తి చేసిన బ్రీడర్ సీడ్‌ను నేషనల్ సీడ్ కార్పొరేషన్ తీసుకొని ఫౌండేషన్ సీడ్‌గా పునరుత్పత్తిచేసి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున రైతులకు అందజేస్తారు. ఏపీ సీడ్స్‌తోపాటు పలు ప్రైవేట్ కంపెనీలు సైతం ఇక్కడ ఉత్పత్తి చేసిన బ్రీడర్ సీడ్ కొనుగోలు చేసి ఫౌండేషన్ సీడ్‌గా మార్చి రెండు తెలుగు రాష్ట్రాల రైతులకు అందిస్తున్నాయి.వ్యవసాయ పరిశోధన స్థానంలో 13 రకాల వంగడాలువ్యవసాయ పరిశోధన స్థానం నుంచి బీపీటీ 2270, 2846, 2782, 2841, 2295, 2776, 2858, 2231, 2411, 3050, 2766, 3291, 2595 పేరుతో 13 రకాల వరి విత్తనాలను 20 ఎకరాల్లో సాగు చేశారు. వీటిని బ్రీడర్ సీడ్‌గా ఉత్పత్తి చేస్తున్నారు. ఈ విత్తనాలు 400 క్వింటాళ్లు దిగుబడి వస్తాయని అంచనా. ఇవికాకుండా 7 ఎకరాల్లో బీపీటీ 2846, 2595 రకాలను ఫౌండేషన్ సీడ్‌గా ఉత్పత్తి చేస్తున్నారు. ఇవి 150 క్వింటాళ్లు వస్తాయని అంచనా. ఏపీ సీడ్ సర్టిఫికేషన్‌తో మే నెల నుంచి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సూచించిన సుమారు 60 కంపెనీలకు బ్రీడర్ సీడ్ ఇస్తారు. మిగిలిన సీడ్‌ను ఇక్కడి రైతులకు అందజేస్తారు. ఫౌండేషన్ సీడ్‌ను జూన్‌లో రైతులకు విక్రయిస్తారు.వ్యవసాయ కళాశాల నుంచి బీపీటీ 5204, 2270, 2782, 2595బాపట్ల వ్యవసాయ కళాశాల క్షేత్రంలో బీపీటీ 5204, 2270, 2782, 2595 రకాల ఫౌండేషన్ సీడ్‌ను సుమారు 101 ఎకరాల్లో సాగుచేశారు. ఇక్కడ మొత్తం 2 వేల క్వింటాళ్ల విత్తనాలు ఉత్పత్తి అవుతాయని అంచనా. ఇప్పటికే మూడు రకాల విత్తనాల హార్వెస్టింగ్ పూర్తయింది. మిగిలింది ఫిబ్రవరి మొదటివారానికి పూర్తవుతుంది. మార్చిలో ప్రాసెసింగ్ మొదలుపెట్టి నాణ్యమైన విత్తనాలను సర్టిఫికేషన్ అనంతరం మేలో నేరుగా 3,500 మంది రైతులకు పంపిణీ చేస్తారు.బీపీటీ 5204కు డిమాండ్1986లో బాపట్లలోనే అభివృద్ధి చేసిన బీపీటీ 5204 రకం వరికి డిమాండ్ ఎక్కువ ఉంది. దీని పంటకాలం 140 నుంచి 145 రోజులు. బియ్యం తెలుపు రంగులో సన్నగా ఉండి అన్నానికి అనుకూలంగా ఉంటుంది. 1000 గింజల బరువు 14.5 గ్రాములు ఉండి అధిక దిగుబడినిస్తుంది. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో 20 లక్షల హెక్టార్లలో రైతులు ఈ రకాన్ని సాగుచేస్తున్నారు.దేశవ్యాప్తంగా రైతులకు బీపీటీ విత్తనాలుబాపట్ల వ్యవసాయ పరిశోధన స్థానంలో ఇప్పటివరకూ 15 రకాల వరి వంగడాలను ఉత్పత్తి చేశాం. ఈ ఏడాది 20 ఎకరాల్లో 13 రకాల బీపీటీ విత్తనాలను బ్రీడర్ సీడ్‌గా 7 ఎకరాల్లో 2 రకాలు ఫౌండేషన్ సీడ్‌గా ఉత్పత్తి చేస్తున్నాం. ఈ సంవత్సరం 550 క్వింటాళ్లు మే నెలలో ప్రభుత్వం, ప్రైవేటు కంపెనీలకు సరఫరా చేస్తాం. మిగిలింది ఇక్కడి రైతులకు పంపిణీ చేస్తాం. – కృష్ణవేణి, ప్రిన్సిపల్ సైంటిస్ట్ అండ్ హెడ్, వ్యవసాయ పరిశోధన స్థానం, బాపట్ల రైతులకోసం ఫౌండేషన్ సీడ్ ఉత్పత్తిబాపట్ల వ్యవసాయ కళాశాల క్షేత్రంలో ఈ ఏడాది 101 ఎకరాల్లో బీపీటీ నాలుగు రకాలు ఫౌండేషన్ సీడ్‌గా ఉత్పత్తి చేశాం. హార్వెస్టింగ్ పూర్తయింది. మార్చిలో ప్రాసెసింగ్ మొదలుపెట్టి మే నెల నాటికి పూర్తిచేస్తాం. సుమారు 2000 క్వింటాళ్ల విత్తనాలను వచ్చే సీజన్‌కు రైతులకు అందించాలన్నది లక్ష్యం. రాష్ట్రవ్యాప్తంగా అవకాశమున్న మేర వరి విత్తనాలను పంపిణీ చేస్తాం.– అరుణ, సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్, వ్యవసాయ కళాశాల క్షేత్రం, బాపట్ల -
మందేసి చిందేసిన టీడీపీ ఎమ్మెల్యే
-
గ్రానైట్... రాంగ్ రూట్లో రైట్ రైట్!
సాక్షి ప్రతినిధి,బాపట్ల: రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని బల్లికురవ, సంతమాగులూరు మండలాల నుంచి గ్రానైట్ పాలీషింగ్ పలకలు అక్రమంగా తరలిపోతున్నాయి. ప్రభుత్వానికి ఎటువంటి సేల్స్‌టాక్స్, మైనింగ్ టాక్స్ చెల్లించకుండానే జీరోలో రోజుకు పదుల సంఖ్యలో లారీల పలకలు అటు తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా తరలిస్తున్నారు. పై రెండు మండలాల నుంచే రోజుకు 40 నుంచి 50 లారీలు తరలిపోతున్నాయి. మంత్రి ప్రధాన అనుచరుడు ఈ అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం చెబుతున్నా కాంట్రాక్ట్ దక్కించుకున్న కంపెనీ మాత్రం అనధికారికంగా ఆ బాధ్యతలను మంత్రి అనుచరుల చేతుల్లో పెట్టి వాటాలు పంచుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. జీరోలో పలకలు తరలించాలనుకునే వ్యాపారుల వద్ద లారీకి రూ.32 వేలు కప్పం కట్టించుకొని చెక్ పోస్ట్ కంపెనీ పేరున స్లిప్పులు ఇస్తున్నారు. వాటిని చూసి చెక్ పోస్ట్ సిబ్బంది పచ్చ జెండా ఊపుతున్నారు. వాస్తవానికి టన్ను పాలీషింగ్ పలకలకు సేల్స్‌టాక్స్ రూ.1300, మైనింగ్ టాక్స్ రూ.700 చొప్పున రూ.2 వేలు చెల్లించాలి. లారీ సగటున 35 టన్నుల పలకలు తీసుకెళుతుంది. ఈ లెక్కన ప్రభుత్వానికి లారీకి రూ.70 వేలు పన్ను చెల్లించాల్సి వుంది. కానీ మంత్రి అనుచరులకు రూ.32 వేలు చెల్లిస్తే దర్జాగా గ్రానైట్ పలకలను తీసుకెళ్లే అవకాశం ఉండడం, దాని మూలంగా లారీకి రూ.25 వేలు మిగులు తుండడంతో చాలామంది వ్యాపారులు జీరోలో గ్రానైట్ పలకలు తీసుకెళ్లేందుకు మొగ్గు చూపిస్తున్నారు.దందా అంతా అనిల్ కనుసన్నల్లోనే...కూటమి అధికారంలోకి వచ్చిన ప్రారంభం నుంచి మార్టూరుకు చెందిన వ్యాపారులు పర్చూరు నియోజకవర్గ టీడీపీ నేతకు కప్పం కట్టి జోరోలో గ్రానైట్ పలకలు ఇతర రాష్ట్రాలకు తరలించేవారు. మార్టూరు నుంచి రోజుకు 70కి పైగా లారీలు ఈ తరహాలో అక్రమ రవాణా సాగించేవి. ప్రారంభంలో లారీకి రూ.28 వేలు కప్పం కట్టించుకునేవారు. ఆ తర్వాత మంత్రి నియోజకవర్గం నుంచి గ్రానైట్ పలకలు ఎగుమతి అవుతుండటంతో మంత్రి ప్రధాన అనుచరుడికి ఈ జీరో వ్యాపారంపై కన్నుపడింది. పర్చూరు టీడీపీ నేతతో మిలాఖత్ అయ్యారు. అప్పటికే ఈ వ్యవహారంలో ఆరితేరిన మార్టూరుకు చెందిన అనిల్ అనే వ్యక్తికి దందాను అప్పగించారు. అనిల్ మంత్రి ప్రధాన అనుచరుడికి సైతం అత్యంత సన్నిహితుడు కావడంతో జోడీ కుదిరింది. ఇందుకు మంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం ఉంది. లేకపోతే బల్లికురవ, సంతమాగులూరు నుంచి ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా గ్రానైట్ తరలుతుంటే చూస్తూ ఎందుకు ఊరుకుంటారు? మొత్తంగా గ్రానైట్ జీరోవ్యాపారం జోరందుకుంది. ప్రస్తుతం అద్దంకి, పర్చూరు నియోజకవర్గాలనుంచి రోజుకు 110 లారీల గ్రానైట్ పలకలు అక్రమంగా ఇతర రాష్ట్రాలు, అక్కడినుంచి ఇతర దేశాలకు దర్జాగా తరలి పోతున్నాయి.ఆ నేతలకు నెలకు కోట్లలో ఆదాయం...ఒక్కోలారీలో 35 టన్నులకు తగ్గకుండా గ్రానైట్ పలకలను తరలిస్తారు. ఇందుకోసం దందా నిర్వాహకులు గతంలో కంటే రూ.4 వేలు పెంచి లారీకి రూ.32 వేలు వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన జోజుకు 110 లారీలకు రూ.35,20,000, నెలకు రూ.10,56,60,000 వసూలు చేస్తున్నారు. ఈ మొత్తంలో చెక్‌పోస్టుల కాంట్రాక్ట్ నిర్వాహకులకు లారీకి రూ.16 వేలు చొప్పున సగం డబ్బులు చెల్లించి మిగిలిన దాంట్లో కొంత మొత్తంలో చిలుకలూరిపేట, నరసరావుపేట, మాచర్ల, పిడుగురాళ్ల టీడీపీ నేతలకు వాటాలు పంచుతున్నారు. వారితోపాటు అటు మైనింగ్, పోలీసు, విజిలెన్స్ తదితర అధికారులకు నెలకు కొంతమొత్తం చెల్లిస్తున్నారు. మిగిలిన మొత్తాన్ని పర్చూరు నేత, మంత్రి అనుచరుడు వాటాలుగా పంచుకుంటున్నట్లు సమాచారం. నెలకు కోట్లలోనే రాబడి ఉండడంతో దందా పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ రాబడిలో కొంత మొత్తాన్ని ప్రభుత్వంలోని కొందరు పెద్దలకు సైతం చేరవేస్తున్నట్లు సమాచారం.ప్రభుత్వ రాబడికి గండి..టీడీపీ నేతల అక్రమ దందా పుణ్యమా అని పలువురు గ్రానైట్ వ్యాపారులు పన్నులు చెల్లించకుండా అక్రమంగా గ్రానైట్ తరలిస్తుండటంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. ప్రతి టన్ను పాలిషింగ్ పలకలకు సేల్స్‌టాక్స్ రూ.1300, మైనింగ్ టాక్స్ రూ.700 చొప్పున మొత్తం రూ. 2 వేలు ప్రభుత్వానికి చెల్లించాలి. ఈ లెక్కన జీరోలో వెళ్లే 35 టన్నుల లారీకి రూ.70 వేలు టాక్స్ చెల్లించాలి. రోజుకు 110 లారీలకు అనుకుంటే రూ.77 లక్షలు, ఆ ప్రకారం నెలకు రూ.23.10 కోట్లు టాక్స్‌లు చెల్లించాల్సి ఉంది. కానీ వ్యాపారులు ప్రభుత్వానికి పైసా చెల్లించకుండా అక్రమ మార్గంలో గ్రానైట్‌ను తరలిస్తున్నారు. అయినా అధికారులు తమకేమీ పట్టనట్లు మిన్నకుండి పోతున్నారు. -
రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ లో విషవాయువులు లీక్
-
బాపట్ల బీచ్ లో బాదుడే బాదుడు
సాక్షి ప్రతినిధి, బాపట్ల : గత ప్రభుత్వ హయాంలో విశాఖ రుషికొండలోని బ్లూఫ్లాగ్ బీచ్‌లో ప్రవేశరుసుం వసూలుచేయాలని సంకల్పిస్తే నానా యాగీచేసిన పచ్చబ్యాచ్ ఇప్పుడు బాపట్ల సూర్యలంక బీచ్‌లో సిగ్గూఎగ్గూ లేకుండా అదే పనికి బరితెగిస్తున్నారు. ఇక్కడకు వచ్చే పర్యాటకుల నుంచి భారీగా పిండుకునేందుకు రంగం సిద్ధంచేశారు. బీచ్‌కు వచ్చే ఒక్కొక్కరి నుంచి రూ.20 చొప్పున వసూలుచేయాలని నిర్ణయించారు. అంతేకాదు.. ఇప్పటివరకూ వేలంపాట నిర్వహించి తద్వారా వాహనాల నుంచి టోల్గేట్లో డబ్బులు వసూలుచేసేవారు. ఇప్పుడు ఆ వేలంపాట ఎత్తేసి పంచాయతీ ముసుగులో తెలుగు తమ్ముళ్లే ఈ తతంగం మొత్తం నిర్వహించి బీచ్‌ను తమ గుప్పెట్లో పెట్టుకోనున్నారు. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ శుక్రవారం జరిగిన బాపట్ల మున్సిపల్ సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించగా సభ్యులు, అధికారులు చప్పట్లతో స్వాగతించారు. ఈనెలాఖరు నుంచే పచ్చబ్యాచ్ వాహనాల నుంచి డబ్బులు వసూలుచేయనుండగా ఆ తర్వాత సందర్శకుల నుంచి వసూలు చేయనున్నారు. మరోవైపు.. పక్కనే ఉన్న చీరాలలో కూడా కొద్దిరోజులుగా ఇదే రీతిలో వసూళ్ల పర్వం సాగుతుండడంతో అక్కడ పచ్చనేతల దోపిడీపై పర్యాటకులు మండిపడుతున్నారు.వేలంపాటకు మంగళం..నిజానికి.. ఇప్పటివరకూ వేలంపాటలో టోల్గేట్ నిర్వహణను దక్కించుకున్న వారు సందర్శకుల నుంచి వాహనాలకు డబ్బులు వసూలు చేసేవారు. కానీ, ఇప్పుడు గ్రామ పంచాయతీ మాటున పచ్చ మాఫియాయే నేరుగా టోల్గేట్ వసూళ్లతోపాటు తీరంలో టాయిలెట్లు, ఇతరత్రా రాబడి వనరులన్నింటినీ తమ గుప్పెట్లోకి తీసుకుని దందా సాగించేందుకు సిద్ధమయ్యారు. ఎందుకంటే.. వారంలో ప్రతి శని, ఆదివారాల్లో ఇక్కడికి విపరీతంగా పర్యాటకులు వస్తారు. వారాంతంలో రెండ్రోజులు దాదాపు 20 వేల మంది పర్యాటకులు వస్తుండగా.. మిగిలిన ఐదురోజుల్లో 10 నుంచి 15 వేల మంది చొప్పున నెలకు 1.20 లక్షల మందికి తగ్గకుండా పర్యాటకులు వస్తున్నారు.ఈ లెక్కన నెలకు రూ.24 లక్షల రాబడి ఉంటుంది. దీంతో పచ్చ తమ్ముళ్లు దీనిని పాడికుండలా భావించి దీనిపై కన్నేశారు. అలాగే, టూవీలర్‌కు రూ.15, ఆటోకు రూ.30, కారుకు రూ.50, బస్సుకు రూ.100 చొప్పున ధరలు నిర్ణయించారు. గత ఏడాది ఇది వేలంపాటలో రూ.30 లక్షలు పలికింది. దీంతోపాటు ఇక్కడి కొన్ని టాయిలెట్స్, వాష్‌రూములు ఏర్పాటుచేసి నిర్వహణ కోసం వేలంపాట పెట్టగా అదీ ఏడాదికి రూ.5 లక్షలు పలికింది. ఇవికాకుండా బల్లలు, గుర్రాలు, తీరంలో పర్యాటకులను తిప్పే బైక్‌లు నడిపేవారు పంచాయతీకి పన్నులు చెల్లిస్తున్నారు. మొత్తంగా ఏడాదికి రూ.38 లక్షల వరకు తీరంపై రాబడి ఉంది. ఇలా ఇవన్నీ వేలంపాటలు కావడంతో రాబడిపై అందరికీ స్పష్టత ఉంది.కానీ, ఇప్పుడు ఈ వ్యవహారాన్నింట్లో ఇక తెలుగు తమ్ముళ్లదే పెత్తనం కావడంతో రాబడిపై అనేక అనుమానాలు ముసురుకుంటున్నాయి. ఎందుకంటే.. ఇప్పుడు ఎంత వస్తుందో అన్నది ఎవరికీ తెలిసే అవకాశంలేదు. అధికార పార్టీ కనుక అడిగేవారూ ఉండరు. ఇదే ఆలోచనకు వచ్చిన ఎల్లోగ్యాంగ్ తీరంలో పాగా వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక కొద్దిరోజుల్లో కార్తీక మాసం ప్రారంభమవుతుండడంతో పచ్చనేతలకు పండగే పండగ. కారణం.. ఈ మాసంలో జనం లక్షల్లో తీరానికి వస్తారు. పెద్దఎత్తున వాహనాల రానుండటంతో రూ.లక్షల్లో వసూలుచేసుకునే అవకాశముంది. ఇదిచూసి.. పచ్చనేతల సొంత లాభం కోసమే పర్యాటకుల నుంచి డబ్బులు వసూళ్లకు దిగుతున్నారని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానించడం కొసమెరుపు. -
పోరాటాలు వైఎస్సార్సీపీకి కొత్తేమి కాదు: కారుమూరి
సాక్షి, బాపట్ల జిల్లా: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటారని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి కూటమి ప్రభుత్వం దుర్మార్గపు పాలన చేస్తోందని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఎవరు అధైర్య పడాల్సిన పనిలేదని, పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. పోరాటాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొత్తేమి కాదని చెప్పారు.బాపట్ల జిల్లా ఎమ్‌ఎస్సార్ కళ్యాణ మండపంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మేరుగు నాగార్జున ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఎమ్మెల్సీ లేళ్లప్పిరెడ్డి, ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి, నియోజకవర్గ ఇంచార్జీలు వరికుట్టి అశోక్ బాబు, ఈవూరి గణేష్, కరణం వెంకటేష్, హనుమారెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి శ్యామల, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.పోలీసులు కూటమి నాయకులకు కొమ్ముగాస్తున్నారు!అనంతరం మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. తన మీద నమ్మకంతో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఎంతో పెద్ద బాధ్యత అప్పగించారని తెలిపారు. ఏ కార్యకర్తకు ఇబ్బంది వచ్చిన ముందు తాముంటామని పేర్కొన్నారు. కూటమి నాయకులు జిల్లాలో కొన్నిచోట్ల తమ పార్టీ కార్యకర్తలను, నాయకులను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో మహిళలు, చిన్నారులపై దాడులు, అఘాయిత్యాలు హత్యలు పెరిగిపోయాయని అన్నారు. పోలీసులు కూటమి నాయకులకు కొమ్ముగాస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు: శ్యామల‘కోవిడ్ లాంటి భయంకరమైన విపత్తు వస్తే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎవరిని యాచించలేదు. కానీ ఎప్పటి ప్రభుత్వం విపత్తు వస్తే ప్రజల నుంచి విరాళాలు యాచించే పరిస్థితి. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు. రాష్ట్రంలో చిన్నారులపై అఘాయిత్యాలు, మహిళలపై దాడులు హత్యలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం మహిళల భద్రతపైన దృష్టి పెట్టలేదు కానీ మద్యంపైన దృష్టి పెట్టింది’. అని విమర్శలు గుప్పించారు.కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది: లేళ్ల అప్పిరెడ్డి‘పేదలు, అణగారిన వర్గాల ప్రజల జీవితాల్లో మార్పు కోసం వైఎస్ జగన్ ఎన్నో పథకాలు అమలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలని టార్గెట్ చేసి దాడులు చేసి వేదిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జోలికొస్తే చూస్తూ ఊరుకోం. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది’ అన్నారు. -
నిలిచిన వందేభారత్
బాపట్ల టౌన్: వర్షాల కారణంగా ట్రాక్ దెబ్బతినడంతో బాపట్ల ప్రాంతంలో వందేభారత్ రైలు సుమారు గంటన్నరకుపైగా నిలిచిపోయింది. చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్న వందేభారత్ రైలు సోమవారం సాయంత్రం 6.12 గంటలకు ఒంగోలు నుంచి బయలుదేరింది. 7.45 గంటలకు గుంటూరు చేరుకోవాల్సి ఉంది.7 గంటలకు పొన్నూరు మండలం మాచవరం రైల్వేస్టేషన్ ప్రాంతానికి చేరుకునే సమయానికి మాచవరం సమీపంలో ట్రాక్ దెబ్బతిన్న సమాచారం అందుకున్న లోకో పైలట్ రైలు నిలిపేశాడు. ట్రాక్ ఏ ప్రాంతంలో దెబ్బతిందో.. ఎంతమేర దెబ్బతిందనే విషయంపై స్పష్టమైన సమాచారం లేకపోవడంతో రైలును మాచవరం నుంచి అప్పికట్ల రైల్వేస్టేషన్ వరకు వెనక్కి తీసుకొచ్చారు. రాత్రి 8.30 గంటల సమయంలో ట్రాక్ మరమ్మతు చేయడంతో రైలు యధావిధిగా గుంటూరు వైపు ప్రయాణించింది. -
కాసులు కురిపిస్తున్న అలంకరణ ఆకు!
సాక్షి ప్రతినిధి, బాపట్ల: శుభకార్యం ఏదైనా సరే అలంకరణలో ‘‘డెకరేషన్ ఆకు’’ ఉండి తీరాల్సిందే! బాపట్ల తీర ప్రాంతంలోని ఇసుక నేలల్లో సాగు చేసే ఈ ప్రత్యేకమైన ఆకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కించుకుంది. మన రైతులు డెకరేషన్ ఆకు (లైన్ ఆకు)ను రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలతోపాటు తెలంగాణలోని గుడి మల్కాపూర్ పూల మార్కెట్‌కు పెద్ద ఎత్తున సరఫరా చేస్తున్నారు. అక్కడి నుంచి పలు రాష్ట్రాలకు ఎగుమతి అవుతోంది. ఆకర్షణీయంగా, వాడిపోకుండా ఉండే లైన్ ఆకును పూలమాలల్లో కలుపుతారు. ప్రధానంగా శుభకార్యాల సందర్భంగా ఫంక్షన్ డెకరేషన్లో విరివిగా వినియోగిస్తున్నారు. అందువల్లే దీన్ని ఫంక్షన్ ఆకు, డెకరేషన్ ఆకు అని కూడా వ్యవహరిస్తారు.ఇసుక నేలలు అనుకూలం కావడంతో బాపట్ల పరిసరాల్లోని దరివాద కొత్తపాలెం, వెదుళ్లపల్లి కొత్తపాలెం, పోతురాజు కొత్తపాలెం, నాగేంద్రపురం, సుబ్బారెడ్డిపాలెం, కుక్కలవారిపాలెం, మరుప్రోలువారిపాలెం, బసివిరెడ్డిపాలెం, తులసీనగర్ తదితర గ్రామాల్లో దాదాపు 400 ఎకరాల్లో రైతులు దీన్ని విరివిగా సాగు చేస్తున్నారు. నెల రోజులకు తొలి కోతడెకరేషన్ ఆకును ఒకసారి సాగుచేస్తే రెండు నుంచి నాలుగేళ్ల పాటు దిగుబడి వస్తుంది. తొలి ఏడాది రూ.లక్షకు పైగా పెట్టుబడి వ్యయం అవుతుంది. నాటిన నెల రోజులకు కోతకు వస్తుంది. నాలుగు నుంచి ఆరు అంగుళాలు పెరగ్గానే ఆకును కోస్తారు. ప్రతి 40 నుంచి 50 రోజులకు ఒకసారి కోసి మార్కెట్‌కు తరలిస్తారు. ఆకు పెరిగేందుకు ఎరువుల వాడకంతోపాటు పాచి తెగులు, కుళ్లు తెగుళ్ల నివారణకు ఐదు రోజులకు కొకసారి మందులు పిచికారీ చేయాల్సి ఉంటుంది. పెట్టుబడి ఖర్చు అధికంగానే ఉన్నప్పటికి ఆకుకు ధర ఉంటే మంచి లాభాలే ఉంటాయని రైతులు పేర్కొంటున్నారు. లాభదాయకమే..రెండు నెలల క్రితం కిలో రూ.25 పలికిన డెకరేషన్ ఆకు ప్రస్తుతం రూ.20 ఉంది. 70 క్వింటాళ్లు దిగుబడి వస్తే ఎకరాకు రూ.1.40 లక్షలు రాబడి వస్తుంది. ఏడాదిలో 8 కోతలు ద్వారా రూ.10 లక్షలు ఆర్జిస్తే పెట్టుబడి వ్యయం రూ.3 – 4 లక్షలు పోనూ ఎకరాకు రూ.6 లక్షల వరకు రైతుకు ఆదాయం వస్తుంది. కిలో రూ.5 నుంచి రూ.10 లోపు అమ్మిన సందర్భాల్లో నష్టాలు వచ్చాయని రైతులు చెబుతున్నారు. అయితే మిగిలిన పంటలతో పోలిస్తే లైన్ ఆకు సాగు లాభదాయకమేనన్నది రైతుల అభిప్రాయం. సీజన్‌తో నిమిత్తం లేకుండా ఏడాది పొడవునా దిగుబడి వస్తుండడంతో రైతులు ప్రతి 40 రోజులకు కోత కోసి 70 కిలోల చొప్పున బస్తాల్లో నింపి హైదరాబాద్‌లోని గుడి మల్కాపూర్ మార్కెట్‌కు లారీల్లో తరలిస్తున్నారు. కొందరు విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, చెన్నై తదితర మార్కెట్లకు విక్రయిస్తున్నారు. మొత్తంగా డిమాండ్ నేపథ్యంలో లైన్‌ఆకు రైతులకు లాభాలు ఆర్జించి పెడుతోంది.ధర ఉంటే మంచి రాబడి20 సెంట్లలో లైన్‌ఆకు సాగు చేశా. తొలుత రూ.40 వేలు పెట్టుబడి పెట్టా. ఒకసారి సాగు చేస్తే మూడు సంవత్సరాలు పంట ఉంటుంది. ప్రతి 40 రోజులకొకసారి ఆకు కోతకోసి గుడిమల్కాపూర్ మార్కెట్‌కు పంపుతున్నాం. ప్రస్తుతం కిలో ఆకు రూ.20 ఉంది. ఈ మాత్రం ధర ఉంటే రైతుకు గిట్టుబాటు అవుతుంది. – ఎం.నారాయణరెడ్డి, రైతు, దరివాద కొత్తపాలెంకొమ్మ తెచ్చి నాటాలి70 సెంట్లలో లైన్ ఆకు సాగుచేశా. కొమ్మ తెచ్చి నాటితే మూడు నాలుగేళ్లు ఉంటుంది. కోసిన ఆకును 70 కిలోల బస్తాల్లో నింపి గుడిమల్కాపూర్ పూల మార్కెట్‌కు పంపుతున్నాం. – రామకృష్ణారెడ్డి, రైతు, దరివాద కొత్తపాలెంజాగ్రత్తగా పెంచుకోవాలిఎకరం పొలంలో డెకరేషన్ ఆకు సాగు చేశా. తొలుత రూ.లక్ష పెట్టుబడి పెట్టా. ఆకు కోసిన ప్రతిసారీ ఎరువులు వేయడంతోపాటు వారానికి ఒకసారి పురుగు మందులు పిచికారీ చేస్తున్నా. ఆకును జాగ్రత్తగా పెంచుకోవాలి. నెల క్రితం కిలో రూ.25 చొప్పున ధర ఉంది. రైతులకు మంచి లాభాలు వస్తున్నాయి. రేటు తగ్గితే మాత్రం పెట్టుబడులు కూడా రావు.– కుక్కల కోటిరెడ్డి, రైతు, కుక్కలవారిపాలెంఏడాది పొడవునా పంటడెకరేషన్ ఆకు నాటిన నెలకే కోతకు వస్తుంది. పంటను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రతి 40 రోజులకొకసారి కోతకు వస్తుంది. ఏడాది పొడవునా పంట ఉంటుంది. ఒకసారి సాగుచేస్తే మూడు నాలుగేళ్లు ఉంటుంది. ప్రస్తుతం దరలు బాగున్నాయి. – ఏ.రవణమ్మ, రైతు, దరివాద కొత్తపాలెం -
పలు జిల్లాల వైఎస్సార్సీపీ నేతలతో వైఎస్ జగన్ భేటీ
సాక్షి, గుంటూరు: ప్రకాశం, బాపట్ల జిల్లాల వైఎస్సార్సీపీ నేతలతో ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, జిల్లా అధ్యక్షుల ఎంపిక తదితర అంశాలపై చర్చిస్తున్నారు.కాగా, నిన్న(గురువారం) కూడా పలు జిల్లాల వైఎస్సార్సీపీ నేతలతో జగన్ భేటీ అయ్యారు. పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లాల వైఎస్ఆర్సీపీ నేతలతో సమావేశమయ్యారు. జిల్లాల్లో తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ నిర్మాణ విషయాలపై చర్చించారు. వైఎస్సార్సీపీలో పలు కీలక నియామకాలను చేపట్టారు.ఇదీ చదవండి: తిరుమల లడ్డూ వివాదంపై హైకోర్టుకు వైఎస్సార్సీపీశ్రీకాకుళం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడిగా ధర్మాన కృష్ణదాస్, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులుగా తమ్మినేని సీతారాంను, విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షులుగా జెడ్పీ చైర్మన్‌గా మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను)ను, పార్వతీపురం మన్యం జిల్లా పార్టీ అధ్యక్షులుగా శత్రుచర్ల పరీక్షిత్రాజులను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం పేర్కొంది. -
బాపట్ల కేంద్రీయ విద్యాలయంలో 20 మంది విద్యార్థులకు అస్వస్థత..
-
బాపట్ల కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థులకు అస్వస్థత
సాక్షి, బాపట్ల: బాపట్ల కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. కాఫీ పొడి, ఉప్పు, శానిటైజర్‌ను ఓ విద్యార్థిని మిశ్రమంగా చేసింది. ఆ మిశ్రమాన్ని వాసన చూసిన 20 మందికి విద్యార్థులకు అస్వస్థత గురయ్యారు. ఊపిరి ఆడకపోవడంతో పలువురు ల్యాబ్ నుంచి బయటకు పరుగులు తీశారు. ఉపాధ్యాయులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
మంత్రి అనగాని అరాచకం.. సామాన్యుడి ఇల్లు కూల్చివేత
-
దీక్ష విరమించిన వైఎస్సార్సీపీ నేత అశోక్‌బాబు
సాక్షి, బాపట్ల జిల్లా: చెరుకుపల్లిలో దీక్ష చేపట్టిన వైఎస్సార్సీపీ వేమూరు నియోజకవర్గ ఇన్చార్జి వరికూటి అశోక్ బాబుకు మాజీ ఎంపీ నందిగం సురేష్ సంఘీభావం తెలిపారు. అద్దేపల్లిలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని వీడియో కాల్లో అశోక్ బాబుకు నందిగం సురేష్ చూపించారు. 24 గంటల్లో ఎక్కడైతే వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేశారో అక్కడే కొత్త విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. అశోక్ బాబుకి మాజీ ఎంపీ నందిగం సురేష్ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరంపజేశారు.కాగా భట్టిప్రోలు పంచాయతీ పరిధిలోని అద్దేపల్లి దళితవాడలో శనివారం ఉదయం 6 గంటలకు అందరూ చూస్తుండగానే టీడీపీ వర్గీయులు దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. వైఎస్సార్సీపీ వేమూరు నియోజకవర్గ ఇన్చార్జి వరికూటి అశోక్‌బాబు శనివారం రాత్రి అద్దేపల్లి విచ్చేసి కాలిపోయిన వైఎస్ విగ్రహాన్ని పరిశీలించారు. అక్కడే వైఎస్సార్ మరో విగ్రహం ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. విగ్రహం ఏర్పాటు పూర్తయ్యే వరకూ ఆయన స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద కళ్లకు గంతలు కట్టుకుని మౌనదీక్ష చేశారు.దళితవాడ ప్రజలు అండగా వచ్చి ఆయనకు మద్దతుగా దీక్షలో పాల్గొన్నారు. రాత్రి 10గంటల ప్రాంతంలో పోలీసులు అశోక్‌బాబు దీక్షను భగ్నంచేసి ఆయన్ను రేపల్లె తరలించారు. అక్కడా ఆయన పోలీసు వాహనం దిగకుండా దీక్ష కొనసాగించారు. -
నా దీక్ష ఆగదు..
-
వైఎస్ఆర్ విగ్రహ ధ్వంసంపై వైఎస్ఆర్ సీపీ ఆందోళన
-
రెడుబుక్ ఉన్మాదమిది
ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి టీడీపీ శ్రేణుల ఆగడాలకు హద్దే లేకుండా పోయింది. ప్రధానంగా గ్రామాల్లో, ఎస్సీ, ఎస్టీ వాడల్లో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సానుభూతి పరులపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడుతున్నారు. ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. జేసీబీలతో ఇళ్లను కూలదోస్తున్నారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులని కూడా చూడకుండా చితకబాదుతుండటం ఊరూరా కనిపిస్తోంది. శిలాఫలకాలు, వైఎస్సార్ విగ్రహాలను తొలగిస్తున్నారు.. పగలగొడుతున్నారు.బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలు పంచాయతీ పరిధిలోని అద్దేపల్లి దళితవాడలో శనివారం ఉదయం 6 గంటలకు అందరూ చూస్తుండగానే టీడీపీ వర్గీయులు దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఇదేం కక్ష సాధింపు? గతంలో ఎన్నో ప్రభుత్వాలు మారాయి. ఎవరైనా ఇలా చేశారా? అధికారం చేజిక్కించుకుంటే ఇలా దాడులు చేయడానికి, ఆస్తులు ధ్వంసం చేయడానికి లైసెన్స్ వచ్చినట్లా? లేక అధికారంతోపాటు హిస్టీరియా ఏమైనా వచ్చిందా? రెడ్ బుక్.. రెడ్ బుక్.. అంటూ లోకేశ్‌కు వచి్చన పూనకం తాలూకు ఉన్మాదమే ఇప్పుడు ఆ పార్టీ శ్రేణులకూ నరనరాన ఎక్కినట్లుంది. రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చడమే మీ ఉన్మాద లక్ష్యం అయితే.. ప్రజాగ్రహ జ్వాల ఉవ్వెత్తున ఎగిసి పడటం ఖాయం. ఆ సెగలో మాడి మసి అవుతారో.. లేక పద్ధతి మార్చుకుని బుద్ధిగా పాలన సాగిస్తారో చూడాలి.అద్దేపల్లి (భట్టిప్రోలు)/సాక్షి ప్రతినిధి బాపట్ల: టీడీపీ మాజీమంత్రి నక్కా ఆనందబాబు ఎమ్మెల్యేగా ఉన్న వేమూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు బరితెగించారు. భట్టిప్రోలు పంచాయతీ పరిధి అద్దేపల్లి దళితవాడలో శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో అందరూ చూస్తుండగానే దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. విగ్రహం ముప్పావు భాగానికి పైగా దగ్ధమైంది. దీంతో దళితవాడలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే, వైఎస్సార్ విగ్రహానికి సమీపంలో ఉన్న టీడీపీ జెండా దిమ్మెను వైఎస్సార్సీపీ వారు పగులగొట్టారని, అందుకు ప్రతీకారంగా వైఎస్ విగ్రహాన్ని తగులబెట్టినట్లు టీడీపీ వర్గీయులు ప్రచారం చేస్తున్నారు. కానీ, టీడీపీ నేతలు ఉద్దేశపూర్వకంగానే తమను రెచ్చగొట్టేందుకు జెండా దిమ్మెను కొద్దిగా పగులగొట్టుకుని ఆ సాకుతో వైఎస్ విగ్రహాన్ని కాల్చివేశారని వైఎస్సార్సీపీ నేతలు వాదిస్తున్నారు. ఇరువర్గాలూ పరస్పర ఫిర్యాదులుబాపట్ల జిల్లాలోని రేపల్లె, వేమూరు నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు అనంతరం టీడీపీ అరాచకపర్వం కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ నేతలే టార్గెట్‌గా టీడీపీ నేతలు దాడులు చేస్తూ వారి ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. దీంతో చాలామంది వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు గ్రామాలు వదలి వెళ్లిపోయారు.ఈ పరిస్థితిలో టీడీపీ జెండా దిమ్మెలను పగులగొట్టే పరిస్థితి వైఎస్సార్సీపీ నేతలకు లేదన్నది టీడీపీ నేతలకూ తెలుసు. కాకపోతే ఏదో ఒక సాకుచూపి విధ్వంసాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. టీడీపీ కార్యకర్తలే వైఎస్ విగ్రహాన్ని ధ్వంసం చేశారని ఏడు మందిపై వైఎస్సార్సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. టీడీపీ జెండా దిమ్మె ధ్వంసం చేశారంటూ టీడీపీ నేతలు ప్రతిగా 14 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలపై ఫిర్యాదు చేశారు. ఇరువర్గాలపై కేసులు : ఎస్‌ఐఈ ఘటన గురించి తెలుసుకున్న వేమూరు సీఐ పి.రామకృష్ణ, ఎస్ఐ కాసుల శ్రీనివాసరావు, సిబ్బందితో çఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. విషయం తెలుసుకున్న బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ కూడా భట్టిప్రోలు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి వివరాలు తెలుసుకున్నారు. కాగా, వైఎస్సార్ విగ్రహం దగ్ధం చేసిన ఏడుగురిపై వైఎస్సార్సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.నిందితులపై 435, 427, 507 ఆర్/34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు. మరోవైపు టీడీపీ జెండా దిమ్మను ధ్వంసం చేసినట్లు ఆ పార్టీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. దళితవాడలో ఎటువంటి అల్లర్లు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీస్ పికెట్ ఏర్పాటుచేశారు. విగ్రహాలు ధ్వంసం హేయం : మేరుగుస్ఫూర్తిని నింపిన మహనీయుల విగ్రహాల ధ్వంసం, దహనం చేయడం వంటి దుశ్చర్యలకు పాల్పడటం హేయమైన చర్య అని మాజీమంత్రి మేరుగు నాగార్జున అన్నారు. విగ్రహం దహనం విషయం తెలుసుకున్న ఆయన అద్దేపల్లిని సందర్శించి విగ్రహాన్ని పరిశీలించారు. టీడీపీ దురాగతాన్ని ఖండించారు.హుటాహుటిన మరొక విగ్రహం ఏర్పాటుకు యత్నంవైఎస్సార్సీపీ వేమూరు నియోజకవర్గ ఇన్చార్జి వరికూటి అశోక్‌బాబు శనివారం రాత్రి అద్దేపల్లి విచ్చేసి కాలిపోయిన వైఎస్ విగ్రహాన్ని పరిశీలించారు. అక్కడే వైఎస్సార్ మరో విగ్రహం ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. విగ్రహం ఏర్పాటు పూర్తయ్యే వరకూ ఆయన స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద కళ్లకు గంతలు కట్టుకుని మౌనదీక్ష చేశారు. దళితవాడ ప్రజలు అండగా వచ్చి ఆయనకు మద్దతుగా దీక్షలో పాల్గొన్నారు. రాత్రి 10గంటల ప్రాంతంలో పోలీసులు అశోక్‌బాబు దీక్షను భగ్నంచేసి ఆయన్ను రేపల్లె తరలించారు. అక్కడా ఆయన పోలీసు వాహనం దిగకుండా దీక్ష కొనసాగిస్తున్నారు. మహిళలు, చిన్నారులు అని చూడకుండా పోలీసులు నిర్ధాక్షిణ్యంగా లాఠీచార్జి చేశారు. విగ్రహాన్ని దగ్ధం చేయడం గ్రామ చరిత్రలో బ్లాక్ డేగా నిలిచిందని.. చంద్రబాబు రాక్షస పాలనకు ఇది పరాకాష్టని అశోక్‌బాబు మండిపడ్డారు. -
మీపై ప్రజలు తిరగబడే రోజు దగ్గర్లోనే ఉంది: మేరుగు నాగార్జున
సాక్షి, గుంటూరు: వేమూరు నియోజకవర్గంలో దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహాన్ని దగ్ధం చేయటం అత్యంత హేయమైన చర్య అని మాజీ మంత్రి మేరుగు నాగార్జున మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైఎస్సార్ విగ్రహానికి నిప్పంటించి పక్కనే ఉన్న జెండా దిమ్మను పగలగొట్టిన టీడీపీ నాయకులు.. మా కార్యకర్తలపై కేసు పెట్టడానికి పూనుకున్నారని ధ్వజమెత్తారు.ఇదేనా మీ పాలన అంటూ చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ను దుయ్యబట్టారు. మీకు ప్రజలు అధికారం ఇచ్చింది ప్రజలపైన దాడులు చేయడానికా...? మహా నాయకుల విగ్రహాలు తగలబెట్టడానికా...? ప్రజలు మీపై తిరగబడే రోజు దగ్గర్లోనే ఉంది’’ అంటూ మేరుగ నాగార్జున హెచ్చరించారు.బాపట్ల జిల్లాలో టీడీపీ నేతలు అరాచకం సృష్టించారు. జిల్లాలోని వేమూరు నియోజకవర్గంలో దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి టీడీపీ నాయుకులు నిప్పంటించారు. ఈ ఘటన భట్టిప్రోలు మండలం అద్దేపల్లి దళితవాడలో చోటు చేసుకుంది. రోజురోజుకు పెరుగుతున్న టీడీపీ నేతల అరాచకాలపై వైఎస్సార్సీపీ నాయకులు తీవ్రంగా మండిపడితున్నారు. -
వైఎస్ఆర్ విగ్రహానికి నిప్పు పెట్టిన దుండగులు
-
టీడీపీ నేతల అరాచకం.. వైఎస్సార్ విగ్రహానికి..
సాక్షి, బాపట్ల: ఏపీలో టీడీపీ దమనకాండకు, అరాచకాలకు తెరపడటం లేదు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతిపరులపై దాడులకు తెగబడుతున్నారు. పలు చోట్ల గత ప్రభుతానికి సంబంధించిన శిలాఫలకాలు, వైఎస్సార్ విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు. తాజాగా బాపట్ల జిల్లాలో టీడీపీ నేతలు అరాచకం సృష్టించారు. జిల్లాలోని వేమూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు బరితెగించారు. దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి టీడీపీ నాయుకులు నిప్పంటించారు. ఈ ఘటన భట్టిప్రోలు మండలం అద్దేపల్లి దళితవాడలో చోటు చేసుకుంది. రోజురోజుకు పెరుగుతున్న టీడీపీ నేతల అరాచకాలపై వైఎస్సార్సీపీ నాయకులు తీవ్రంగా మండిపడితున్నారు. -
అమెరికాలో కాల్పులు.. బాపట్ల యువకుడు మృతి
కర్లపాలెం/సాక్షి, అమరావతి: అమెరికాలో ఓ దుండగుడి తుపాకీ కాల్పుల్లో బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజలి గ్రామానికి చెందిన దాసరి గోపీకృష్ణ (32) మృతి చెందాడు. రైతు కూలీ కుటుంబానికి చెందిన దాసరి శ్రీనివాసరావు, లక్ష్మి దంపతుల కుమారుడు గోపీకృష్ణ హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ హెచ్–1బి వీసా రావటంతో సుమారు 11 నెలల కిందట అమెరికా వెళ్లాడు. ఓ వైపు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ.. మరో వైపు టెక్సాస్ రాష్ట్రం డల్లస్ సిటీలోని సూపర్ మార్కెట్లో పార్ట్‌టైమ్ జాబ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి ఓ దుండగుడు సూపర్ మార్కెట్‌కు వచ్చి గోపీకృష్ణపై గన్‌తో కాల్పులు జరిపి ఏవో వస్తువులు తీసుకుని పారిపోయాడు. తీవ్రగాయాలైన గోపీకృష్ణ అక్కడే కుప్పకూలిపోగా స్థానికులు ఓ వైద్యశాలలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. దీంతో వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గోపీకృష్ణకు రెండున్నరేళ్ల క్రితం ప్రవల్లి కతో వివాహం జరిగింది. వీరికి ఏడాది న్నర కుమారుడు ఉన్నాడు. ్రప్రజాప్రతి నిధులు స్పందించి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తమ బిడ్డ భౌతికకాయాన్ని త్వరగా తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని గోపీకృష్ణ కుటుంబసభ్యులు కోరుతున్నారు. గోపీకృష్ణ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలిఅమెరికాలోని సూపర్ మార్కెట్లో జరిగిన కాల్పుల ఘటనలో దాసరి గోపీకృష్ణ మృతి చెందటం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోపీకృష్ణ కుటుంబానికి ప్రభుత్వం తోడుగా నిలవాలని, అన్ని రకాలుగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. గోపీకృష్ణ కుటుంబానికి తగిన సహాయ సహకారాలు అందించాల్సిందిగా కేంద్ర విదేశాంగ శాఖను కోరారు. మృతుడి కుటుంబానికి వైఎస్ జగన్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. -
బహిర్భూమికి వెళ్లిన యువతిపై దుండగుల అత్యాచారం
-
‘వాగు’లో గల్లంతైన నలుగురి మృతి
బాపట్లటౌన్: విహారయాత్రలో భాగంగా హైదరాబాద్ నుంచి బాపట్ల ప్రాంతానికి వచ్చిన 12 మందిలో బుధవారం నల్లమడవాగులో నలుగురు గల్లంతైన విషయం తెలిసిందే. వీరిలో సునీల్‌కుమార్ (36), అతని కొడుకు అనురాజ్ (13) మృతదేహాలు బుధవారం రాత్రి ఏరియా వైద్యశాలకు తరలించారు. మరో ఇద్దరు ఆచూకీ లభించకపోవడంతో జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా, ఎస్పీ వకుల్‌జిందాల్ ఆదేశాల మేరకు రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, సూర్యలంక తీరంలోని గజ ఈతగాళ్లు, అగ్నిమాపక అధికారులు టీమ్‌లుగా ఏర్పడి నల్లమడ వాగులో సుమారు 3 కిలోమీటర్ల మేర గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపులో భాగంగా వడ్లకొండ కిరణ్‌గౌడ్ (35) మృతదేహాన్ని గురువారం ఉదయం 6.30 గంటల సమయంలో గుర్తించి వెలికి తీశారు. అదే సమయంలో బండా నందు (35) మృతదేహం మూలపాలెం గ్రామశివారులోని తుమ్మచెట్ల మధ్యలో ఉన్నట్లు గుర్తించి వెలికి తీశారు. నలుగురు మృతదేహాలకు గురువారం బాపట్ల ఏరియా వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుల కుటుంబసభ్యులు మృతదేహాలను చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. రూరల్ సీఐ శ్రీహరి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బాపట్ల బీచ్‌లో హైదరాబాదీల గల్లంతు
బాపట్ల జిల్లా: బాపట్ల శివారు నల్లమడ వాగులో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బాపట్ల శివారు నల్లమడ వాగులో ఈత కొట్టడానికి వెళ్లి గల్లంతయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం పర్యటక కేంద్రం సూర్యలంక బీచ్‌కు వచ్చిన వారు తిరుగు ప్రయాణంలో నల్లమడ వాగులో స్నానానికి దిగారు. తొలుత ప్రవాహ ఉద్ధృతికి ఒకరు కొట్టుకుని పోయారు. అతడిని రక్షించే క్రమంలో మిగతా ముగ్గురు గల్లంతైనట్లు తెలిపారు.వారంతా కూకట్‌పల్లిలోని ఒకే కుటుంబానికి చెందిన సన్నీ ,కిరణ్ , నందులుగా గుర్తించారు. రెండు మృతదేహాలు లభించగా, గల్లంతైన మరో ఇద్దరి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు అధికారులు. వేసవి నుంచి ఉపశమనం పొందడం కోసం హైదరాబాద్ నుంచి సూర్యలంక బీచ్‌కు వచ్చినట్లు యువకుల తల్లిదండ్రులు చెబుతున్నారు. పాపం ఆ తల్లిదండ్రులు తమ బిడ్డలను ఎలాగైనా రక్షించాలని పోలీసులను ప్రాధేయపడుతున్న తీరు అందర్నీ కంటతడి పెట్టించింది. -
బాపట్ల లో టీడీపీ కి భారీ ఎదురుదెబ్బ.. YSRCPలో చేరిన కీలక నేత
-
కంటైనర్ లో డబ్బుల మూటలు...అడ్డంగా దొరికిన టీడీపీ అభ్యర్థి
-
టీడీపీ అభ్యర్థి కంపెనీలో సోదాలు.. కంటైనర్‌లో భారీగా నగదు
సాక్షి, బాపట్ల: బాపట్ల టీడీపీ అభ్యర్థి నరేంద్ర వర్మకు చెందిన రాయల్ మెరైన్ కంపెనీలో పోలీసులు సోదాలు చేపట్టారు. చీరాల మండలం కావూరి వారిపాలెంలోని కంపెనీలో సోదాలు చేపట్టారు. కంటైనర్‌లో రూ.56 లక్షలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టీడీపీ అభ్యర్థి నరేంద్ర వర్మకు చెందిన నగదుగా గుర్తించారు. చీరాల డీఎస్పీ బేతపూడి ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కంటైనర్‌లో ఉన్న నగదును పోలీసులు సీజ్ చేశారు. -
ప్రకాశం జిల్లా: కోరిశపాడు జాతీయ రహదారిపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ (ఫొటోలు)
-
అద్దంకి సిద్ధం సభకు ఎన్ని ప్రత్యేకతలో తెలుసా?
సాక్షి, బాపట్ల: రాష్ట్ర వ్యాప్తంగా అద్దంకి 'సిద్ధం' సభ హోరెత్తుతోంది. ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్సీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నాలుగో.. చివరి క్యాడర్ సమావేశం ఇది. ఈ సమావేశానికి బాపట్ల, గుంటూరు, ప్రకాశం, పల్నాడు, నెల్లూరు, తిరుపతి మొత్తం ఆరు జిల్లాల (మొత్తం 43 నియోజక వర్గాలు) నుంచి ఏకంగా 15 లక్షల మంది హాజరయ్యారని ఒక అంచనా. బాపట్ల ఈవెంట్లో ప్రత్యేకత ఏమిటంటే.. మేదరమెట్లలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం పై నుంచి చూస్తే 'వై' లాగా కనిపించే ర్యాంప్, సీఎం జగన్ యుద్ధ నినాదం 'వై నాట్ 175' అని మధ్యలో రాసి ఉంది. హీలియం బెలూన్లు, సిద్ధమ్ కటౌట్లు, జెండాలు, ఆటో బ్రాండింగ్, బైక్ బ్రాండింగ్ వంటి బ్రాండింగ్ కార్యకలాపాలు, వేదిక స్థలంలో ఎక్కువ మంది సీఎం జగన్ ప్రసంగం వీక్షించేలా పెద్ద ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. 'సిద్ధం' స్టాంపుల వంటి ఇంటరాక్టివ్ కార్యకలాపాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఇప్పటికే వైఎస్సార్సీపీ మూడు సిద్ధం సభలు సక్సెస్ అయ్యాయి. జనవరి 27న భీమిలిలో జరిగిన మొదటి సభకు 3 లక్షల కంటే ఎక్కువ మంది హాజరయ్యారు. ఫిబ్రవరి 3న ఏలూరులో జరిగిన రెండో సభకు 6 లక్షల మంది హాజరయ్యారు. ఆ తరువాత ఫిబ్రవరి 18న అనంతపురం సభకు 10 లక్షల మంది (1 మిలియన్) హాజరై.. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద రాజకీయ ర్యాలీగా రికార్డ్ క్రియేట్ చేసింది. పార్టీ సోషల్ మీడియా విభాగం కూడా 'మేం సిద్దం' అనే పేరుతో వెబ్సైట్ ప్రారంభించింది. ఇందులో 'జగనన్న కనెక్ట్స్' ద్వారా వారి పేరుతో ఫ్రీ సిద్దం పోస్టర్‌ను రూపొందించుకోవడానికి ఆప్షన్ ఉంది. ఇప్పటికే.. కేవలం నాలుగు గంటల వ్యవధిలో ఈ వెబ్సైట్ ద్వారా 4,00,00లకు పైగా ప్రత్యేక పోస్టర్లు క్రియేట్ చేసుకున్నారు. సరికొత్త ప్రచారం 'నా కల' ఇక పొతే ఏపీలో వైఎస్సార్సీపీ కొత్త క్యాంపెయిన్ 'నా కల'కు శ్రీకారం చుట్టింది. అద్దంకి సిద్ధం సభ వేదికపై సీఎం జగన్ ఈ కొత్త ప్రచార కార్యక్రమం ప్రారంభించబోతున్నారు. ఈ క్రమంలోనే ముందస్తుగా.. రాష్ట్ర వ్యాప్తంగా నా కల పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి. యువత, రైతులు, మహిళలు, కార్మికులు, వృద్ధులు, విద్యార్థుల కోసం ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది అధికార వైఎస్సార్సీపీ. -
చరిత్రలో నిలిచిపోయేలా సిద్ధం ముగింపు సభ
-
ఈ రైతన్న మాటలకు సీఎం జగన్ ఫిదా
-
భారీ ప్రణాళికలతో బాపట్ల సిద్ధం సభ
-
YSRCP: మేనిఫెస్టో ప్రకటనకు ముహూర్తం ఖరారు
సాక్షి, ప్రకాశం: బాపట్ల జిల్లాలోని మేదరమిట్ల వద్ద సిద్ధం సభకు సంబంధించిన ఏర్పాట్లను వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్, ఎంపీ విజయసాయిరెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఇక, ఈ సభలోనే వైఎస్సార్సీపీ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ క్రమంలోనే సిద్ధం సభకు సంబంధించిన పోస్టర్‌ను వైఎస్సార్సీపీ నేతలు విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ..‘మేదరమీట్లలో సిద్ధం సభను ఈనెల పదో తేదీన నిర్వహిస్తున్నాం. ఈ సభలో నాలుగు సంవత్సరాల పదినెలల్లో మేము చేసిన అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన విషయాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వివరిస్తారు. ఈ సభలోనే వైఎస్సార్సీపీ ఎన్నికల మేనిఫెస్టోను కూడా ప్రకటిస్తాం. గతంలో ఏం చేశాం.. రాబోయే కాలంలో ఏం చేస్తామో సీఎం జగన్ వివరిస్తారు. ఈ సిద్దం సభకు 15లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నాం. సిద్ధం సభలకు ప్రజల నుంచి స్పందన బాగా ఉంది. ఒక దానిని మించి ఇంకో సభకు ప్రజలు పోటెత్తుతున్నారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం వైఎస్సార్సీపీ ఏం చేసిందో ప్రజలకు బాగా తెలుసు. బీసీల కోసం పాటుపడిందెవరో బీసీలకు బాగా తెలుసు. సిద్ధం సభకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా సభను నిర్వహిస్తాం. మార్చి పదో తేదీ తర్వాత ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది’ అని కామెంట్స్ చేశారు. -
Siddam Sabha: బాపట్ల ‘సిద్ధం’.. మార్చి 10న
సాక్షి, బాపట్ల జిల్లా: అద్దంకి నియోజకవర్గం మేదరమెట్లలో వైఎస్సార్సీపీ ‘సిద్ధం’ సభను మార్చి 10న నిర్వహించనున్నట్లు ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. మార్చి 3న జరగాల్సిన సభను మార్చి 10వ తేదీకి మార్పు చేసినట్లు ఆయన తెలిపారు. సిద్ధం సభలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని విజయసాయిరెడ్డి అన్నారు. మొత్తం 15 లక్షల మంది సభకు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. ‘‘98 ఎకరాలలో సభ ప్రాంగణం ఉంటుంది. పార్కింగ్ కోసం కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నాం. 6 జిల్లాల నుంచి ప్రజలు హాజరవుతారు. ప్రభుత్వ పథకాలు, పాలన తీరుపై పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సభలో దిశా నిర్ధేశం చేస్తారు. 13,14 తేదీలలో ఎన్నికల ప్రకటన వచ్చే అవకాశం. ఏప్రిల్ రెండో వారంలో ఎన్నికలు ఉండవచ్చు’’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ‘‘సిద్ధం సభలో ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. పేద వర్గాలతో పాటు అగ్రకులాలలో కూడా వైఎస్సార్సీపీపై అపూర్వ స్పందన ఉంది. ప్రభుత్వం పథకాలు గురించి సిద్ధం సభల్లో వివరిస్తున్నాం. గతంలో ఏ రాజకీయ పార్టీ కానీ, ప్రభుత్వం కానీ చేయని విధంగా వైఎస్ జగన్ ప్రభుత్వం పాలన చేసింది. ప్రజల స్పందన చూస్తే 175 కి 175 సీట్లు వస్తాయనే నమ్మకం మాకు ఉంది. మేదరమెట్ల సిద్ధం సభలో మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్ ప్రసంగిస్తారు. 5 గంటలకు సభ ముగుస్తుంది’’ అని విజయసాయిరెడ్డి తెలిపారు. ‘‘మేనిఫెస్టో పై చర్చ జరుగుతోందని.. అతి త్వరలో విడుదల చేస్తామన్నారు. సిద్ధం సభలోపే అన్ని సీట్లు ప్రకటించడం జరుగుతుందని, పొత్తులు ఎవరు పెట్టుకున్నా.. ప్రజలు మా వైపే ఉన్నారని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఇదీ చదవండి: ఆస్తుల అమ్మకం.. పవన్ సరికొత్త నాటకం -
బాపట్ల: మార్చి 3న మేదరమెట్లలో ‘సిద్ధం’
సాక్షి, బాపట్ల జిల్లా: వైఎస్సార్సీపీ ‘సిద్ధం’ నాలుగో సభ ఖరారైంది. మార్చి 3న బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం మేదరమెట్లలో వైఎస్సార్సీపీ సిద్ధం సభ నిర్వహించనున్నారు. రాప్తాడులో నిర్వహించిన సభను మించి మేదరమెట్ల సభ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సిద్ధం సభకు గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల కార్యకర్తలు హాజరుకానున్నారు. సభ ఏర్పాట్లపై తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలతో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి సన్నాహక సమావేశం నిర్వహించారు. కాగా.. భీమిలి, ఏలూరు, రాప్తాడులలో నిర్వహించిన సభలకు జనం సంద్రంలా పోటెత్తడం.. జయహో జగన్, మళ్లీ సీఎం జగనే అన్న నినాదాలతో సభా ప్రాంగణాలు ప్రతిధ్వనించడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు సమరోత్సాహంతో కదం తొక్కుతున్నాయి. కంచు కోటలను బద్దలు కొట్టేలా జరుగుతోన్న సిద్ధం సభకు కీలక ప్రాంతాలను వేదికలుగా వైఎస్సార్సీపీ ఎంచుకుంటోంది. భారీ సభల నిర్వహణ ద్వారా రాజకీయంగా పైచేయి సాధించటంతో పాటుగా.. వైఎస్సార్సీపీ కేడర్‌లో కొత్త ఉత్సాహం పెరుగుతోందని భావిస్తున్నారు. ఈ సభలోనే సీఎం జగన్ కీలక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. గెలుపు నినాదంతో పాటు రైతులకు, మహిళలకు సంబంధించిన కీలక ప్రకటన ఉంటుందని సమాచారం. నాలుగు ముఖ్యమైన రీజియన్లలోని నాలుగు ప్రాంతాల్లో సిద్ధం సభలు పూర్తి అయిన తర్వాత పార్టీలో, ప్రభుత్వంలో కీలక సమావేశం ఉండవచ్చు. ఆ తర్వాత పాలనా పరంగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే అభ్యర్థుల ఖరారు పూర్తి కావడంతో పూర్తి స్థాయిలో ప్రచారంలోకి దూసుకెళ్తోంది వైఎస్సార్సీపీ. ఇదీ చదవండి: కుప్పం నుంచే చంద్రబాబు బైబై అంటున్నాడు: సీఎం జగన్ -
Repalle: టీడీపీకి భారీ షాక్.. వైఎస్సార్సీపీలోకి భారీగా చేరికలు
సాక్షి, తాడేపల్లి: రేపల్లె నియోజకవర్గంలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. రేపల్లె, నిజాంపట్నం, చెరుకుపల్లి, నగరం మండలాల నుంచి వైఎస్సార్సీపీలోకి టీడీపీ శ్రేణులు భారీగా చేశారు. ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో రాజ్యసభ సభ్యులు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి సమక్షంలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పిన విజయసాయిరెడ్డి.. వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, రేపల్లె వైసీపీ ఇంఛార్జి ఈవూరు గణేష్, మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లిఖార్జునరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ, పేదలకు సీఎం జగన్ ప్రభుత్వంలో మేలు జరిగిందన్నారు. పేదలను ఆర్థికంగా, రాజకీయంగా బలోపేతం చేయాలన్నదే సీఎం జగన్ ఆలోచన అన్నారు. సీఎం ఆలోచన మేరకు గణేష్‌ను రేపల్లె నియోజకవర్గానికి ఇంఛార్జిగా నియమించారన్నారు. మళ్లీ వైఎస్ జగన్ సీఎం కావాలని అంతా కోరుకుంటున్నారన్నారు. 175కి 175 సాధించడమే లక్ష్యమని మోపిదేవి అన్నారు. ఈవూరు గణేష్‌ను రేపల్లె ప్రజలంతా గెలిపించి సేవ చేసుకునే అవకాశం కల్పించాలని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ‘‘పార్టీ కోసం మోపిదేవి వెంకటరమణ చేసిన త్యాగం మరువలేనిది. కేసులు పెట్టినా ధైర్యంగా నిలబడి పార్టీ కోసం కృషి చేశారు. మోపిదేవికి మరొక్కసారి రాజ్యసభ ఇవ్వనున్నట్లు సీఎం చెప్పారు. రేపల్లె నుంచి ఈవూరు గణేష్‌ను గెలిపిస్తే అటు అసెంబ్లీలోనూ, ఇటు పార్లమెంట్‌లోనూ మీ సమస్యలు వినిపించే అవకాశం దక్కుతుంది’’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ‘‘టీడీపీ నేత అనగాని సత్యప్రసాద్‌కు మూడో సారి రేపల్లె నుంచి అవకాశం ఇవ్వొద్దని కోరుతున్నా. అనగాని సత్యప్రసాద్ నియోజకవర్గంలో అందుబాటులో ఉండరు. సత్యప్రసాద్ హైదరాబాద్‌లో కూర్చుని పేకాట ఆడుకుంటాడు. అలాంటి వ్యక్తిని కాకుండా నిత్యం మీతోనే ఉండే ఈవూరు గణేష్‌ను గెలిపించుకోవాలని కోరుతున్నాను’’ అని విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. అసెంబ్లీ, లోక్‌సభకు బీసీ, ఎస్సీ, ఎస్టీ,మైనార్టీ వర్గాలకు చెందిన వారికి సీఎం జగన్ అధికప్రాధాన్యత ఇచ్చారు. అణగారిన వర్గాలకు సరైన ప్రధాన్యం కల్పించాలనేదే సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటున్నారు. రిజర్వేషన్ల శాతానికి మించి ప్రాధాన్యత కల్పిస్తున్నారు. చంద్రబాబులాగా మనం నటించడం లేదు. వాస్తవాలకు దగ్గరగానే మనం నడుచుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా ఇదే సామాజిక సమతుల్యత పాటిస్తాం. రాబోయే రెండు, మూడు రోజుల్లో టీడీపీ బీజేపీతో జతకట్టడానికి తహతహలాడుతుంది. వైఎస్సార్సీపీ అలా చేయదు. పార్టీ పెట్టిన నాటి నుంచి ఒంటరిగానే పోటీ చేశాం. భవిష్యత్తులోనూ ఒంటరిగానే పోటీచేస్తాం. కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించడం కోసమే కొన్ని అంశాల్లో మనం మద్దతిచ్చాం.సీఎం జగన్‌ని బలోపేతం చేసి మరింత గొప్ప విజయాన్ని అందించాలని కోరుతున్నాను’’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. -
దటీజ్ జగన్: ఆశ్చర్యానికి గురైన నిర్మాత కోన వెంకట్
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత కోన వెంకట్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనపై ప్రశంసలు కురిపించారు. విద్యావ్యవస్థలో ఆయన తీసుకొచ్చిన సమూల మార్పులను చూసి కోన ఆశ్చర్యపోయారు. విషయం ఏంటంటే.. ఆంధ్రప్రదేశ్‌లోని తన సొంత గ్రామానికి వెళ్లిన ఆయన అక్కడి ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. స్కూల్ వాతావరణం, వసతులు, తరగతి గదులు పరిశీలించారు. నా సొంత ఊర్లో ఇంతటి అద్భుతమైన ప్రభుత్వ పాఠశాల ఉన్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు. స్కూల్లో కల్పించిన మౌలిక సదుపాయాలు పట్ల తనకు ఆశ్చర్యం కలిగించిందన్నారు. బాపట్లలో ని కర్లపాలెంలో ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన ఫోటోలను తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా..ప్రస్తుతం అధికారంలో ఉన్న ఏపీ ప్రభుత్వం నాడు-నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేసింది. గవర్నమెంట్ స్కూల్స్‌లో ఇంగ్లీష్ మీడియంతో పాటు అద్భుతంగా తీర్చిదిద్దింది. పాఠశాలల మౌలిక సదుపాయాల కల్పనకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రైవేట్‌కు ధీటుగా ప్రభుత్వం పాఠశాలలను అభివృద్ధి చేసింది. Very happy and surprised to see a beautiful Government School in Karlapalem which is part of my Hometown Bapatla!! pic.twitter.com/QdwENpKnem — KONA VENKAT (@konavenkat99) January 29, 2024 -
బాపట్లలో బాహాబాహీ
బాపట్ల టౌన్: తెలుగు తమ్ముళ్లు తన్నుకున్నారు. సాక్షాత్తూ జిల్లా కేంద్రం బాపట్లలోని టీడీపీ కార్యాలయంలోనే ఆ పార్టీ ఐ టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు మానం శ్రీనివాసరావు, తెలుగుదేశం పట్టణ అధ్యక్షుడు గొలపల శ్రీనివాసరావు బాహాబా హీకి దిగారు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ దుర్భాషలాడుకున్నారు. రా తేల్చుకుందాం అంటూ తొడలు చరుచుకున్నారు. మాటల తీవ్రత పెరిగి, దాడికి తెగబడ్డారు. పార్టీ కార్యకర్తల సమక్షంలోనే కలబడ్డారు. ఇదే అదునుగా పార్టీకి చెందిన కమ్మ, యాదవ సామాజిక వర్గాలు రెండుగా విడిపోయి చెరో పక్షం చేరి సవాళ్లు విసురుకున్నాయి. శనివారం జరిగిన ఈ ఘటన తెలుగుదేశం పార్టీలోని వర్గ విభేదాలను మరోమారు బట్టబయలు చేసింది. అసలేం జరిగిందంటే.. బాపట్ల మండలంలోని రెండో క్లస్టర్ పరిధి నాయకులతో ఐ టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు మానం శ్రీనివాసరావు సమీక్ష నిర్వహించారు. సమావేశం జరుగుతుండగా అక్కడే ఉన్న పార్టీ పట్టణ అధ్యక్షుడు గొలపల శ్రీనివాసరావు ‘‘ఇన్నాళ్లూ ఎక్కడున్నారు? సమావేశాల్లో మినహా గ్రౌండ్ లెవల్లో ఐ టీడీపీ ఎక్కడా పనిచేస్తున్నట్లు లేదు’’ అని అనడంతో ఒక్కసారిగా మానం శ్రీనివాసరావు ఆగ్రహానికి గురయ్యారు. మమ్మల్ని అడిగేందుకు నువ్వెవరు? అంటూ దురుసుగా మాట్లాడుతూ గొలపలపైకి దూసుకొచ్చారు. గొలపల కూడా అంతే స్థాయిలో నేనెవరో నీకు తెలీదా? అంటూ ఎదురుతిరిగారు. ఒక్కసారిగా ఇద్దరూ తన్నులాటకు దిగారు. దూషణలు చేసుకుంటూ, తొడలు చరుచుకున్నారు. వీరు తన్నులాటకు దిగడంతో ఓ వైపు కమ్మ సామాజిక వర్గం నాయకులు, మరోవైపు యాదవ సామాజిక వర్గం నాయకులు రెండు గ్రూపులుగా విడిపోయి పరస్పరం దాడికి యత్నించారు. వెంటనే స్పందించిన పార్టీ నాయకులు ఇరువర్గాలకూ సర్దిచెప్పారు. యాదవ నేతపై గతంలోనూ దాడి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కొంతకాలంగా కొనసాగుతున్న ముసలం శనివారంతో బట్టబయలైంది. గతంలో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వేగేశన నరేంద్రవర్మ, అతని తనయుడు రాకేష్ వర్మ యాదవ సామాజికవర్గానికి చెందిన మద్దిబోయిన రాంబాబుపై తనకు రావాల్సిన డెకరేషన్ డబ్బులు అడిగాడనే కోపంతో దాడి చేశారు. దీంతో రాంబాబు బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే శనివారం కమ్మ సామాజిక వర్గానికి చెందిన మానం శ్రీనివాసరావు కూడా వర్మ, అతని తనయుడి బాటలోనే యాదవ సామాజిక వర్గానికి చెందిన పార్టీ పట్టణ అధ్యక్షుడు గొలపల శ్రీనివాసరావుపై దాడికి దిగడంతో ఒక్కసారిగా బీసీ నేతలు భగ్గుమన్నారు. పార్టీకి తమ సత్తా చూపిస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఎవరికి వారే..'బాపట్ల' తీరే !
బాపట్ల తెలుగుదేశం పార్టీలో ఐక్యత కొరవడింది. వర్గపోరుతో అట్టుడికిపోతోంది. ఏ నియోజకవర్గం చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టు ప్రతి చోటా తమ్ముళ్ల తగవులాటే కనిపిస్తోంది. జిల్లా కేడర్ ఎవరికివారే యమునాతీరే అన్నట్టు వ్యవహరిస్తోంది. కారంచేడులో సొంత పార్టీ ఫ్లెక్సీలనే కార్యకర్తలు చింపేయడం... ఎమ్మెల్యేపై దూషణల పర్వానికి దిగడం... అధిష్టానానికి మింగుడుపడటం లేదు. చీరాలలో కొండయ్య నాయకత్వాన్ని బహిరంగంగానే వ్యతిరేకించడం... వేమూరులో ఓ వర్గానికి నక్కా కొమ్ముకాయడం... బాపట్ల ఇన్చార్జి రోజుకో నాయకుడ్ని వెనకేసుకు రావడం... అక్కడి కార్యకర్తలకు రుచించడం లేదు. రేపల్లె... అద్దంకిలో ఇంటిపోరు తీవ్రరూపం దాల్చడం అధినాయకత్వాన్ని ఇరకాటంలో పడేస్తోంది. సాక్షి ప్రతినిధి, బాపట్ల: ఎన్నికల వేళ పచ్చపార్టీలో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ పార్టీ ముఖ్యనేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. ఒకరంటే మరొకరికి గిట్టక వెన్నుపోట్లకు సిద్ధపడుతున్నారు. ఆధిపత్యపోరుతో అమీతువీుకి సిద్ధపడుతున్నారు. రేపల్లెలో సొంత పార్టీనేతనే ఏకంగా హత్య చేసిన ఘటన జరగ్గా మిగిలిన నియోజకవర్గాల్లో తమ్ముళ్ల మధ్య వర్గ విభేదాలు ముదిరి ఘర్షణలకు దిగిన ఘటనలు కోకొల్లలు. ‘ఏలూరి’ తీరుపై కేడర్ విసుగు పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తీరుపై కేడర్ విసిగెత్తిపోతోంది. ఇటీవల కారంచేడులో మండల టీడీపీ నేతలు వర్గాలుగా విడిపోయి సొంతపార్టీ ఫ్లెక్సీలనే చింపేసి, ఎమ్మెల్యేపై దూషణలకు దిగారు. పోపూరి శ్రీనివాసరావు, ద్రోణాల దరశి, ఇంకొల్లులో పార్టీ సీనియర్ నేత కొల్లూరు నాయుడమ్మ ఎమ్మెల్యే తీరుపై అసంతృప్తితో ఉన్నారు. గతంలో టీడీపీ అధికారంలోకి రావాలని ఈయన తిరుపతి వరకూ వెనక్కు నడిచారు. ఇప్పుడు ఆయనే వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. కొండయ్యా... ఏందయ్యా ఇది? చీరాల టీడీపీ ఇన్చార్జ్ ఎం.ఎం.కొండయ్యను ఆ పార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఆయన్ను మార్చాలని చంద్రబాబు, లోకేశ్‌లకు ఫిర్యాదు చేస్తున్నారు. మంగళగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ కాండ్రు శ్రీనివాసరావు, చీరాలకు చెందిన డాక్టర్ సజ్జా హేమలత, సజ్జా వెంకటేశ్వరరావు, మాజీ మంత్రి పాలేటి రామారావు తదితరులు ఇక్కడ టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. పట్టణ పార్టీ మాజీ అధ్యక్షుడు డేటా నాగేశ్వరరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొడుగుల గంగరాజుతో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు కొండయ్యను వ్యతిరేకిస్తున్నవారిలో ఉన్నారు. మరోవైపు తమ వర్గానికి కాకుండా వేరొకరికి టికెట్ ఇస్తే తాము సహకరించేది లేదని యాదవ సామాజికవర్గం తేల్చి చెబుతోంది. ‘నక్కా’నూ... పక్కన పెట్టేస్తారా? వేమూరు నియోజకవర్గంలో అన్ని మండలాల్లోనూ టీడీపీలో అంతర్గత పోరు నడుస్తోంది. వేమూరు మండల టీడీపీ అధ్యక్షుడు దండె సుబ్బారావు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబుల మధ్య విభేదాలున్నాయి. కొల్లూరు మండలంలో మాజీ ఎంపీపీ మైనేని మురళి, మధుసూదనరావుకు, అమృతలూరులో మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్, మాజీ జెడ్పీటీసీ చరణ్గిరి, భట్టిప్రోలులో మాజీ ఎంపీపీ తూనుగుంట్ల సాయిబాబు, మండల పార్టీ మాజీ అధ్యక్షుడు కరణ శ్రీనివాసరావు మధ్య వర్గపోరు నడుస్తోంది. ఈ మండలాలన్నింట్లో ఓ వర్గానికి ఆనందబాబు కొమ్ముకాయడంతో రెండో వర్గం ఆయనకు దూరంగా ఉంటోంది. ‘వేగేశన’తో వేగలేం ! బాపట్ల నియోజకవర్గంలో టీడీపీ ఇన్చార్జి వేగేశన నరేంద్రవర్మ వైఖరి నచ్చక అన్నం సతీష్ ప్రభాకర్ దూరంగా ఉంటున్నారు. పైగా ఈయన హయాంలో పట్టణ పార్టీ అధ్యక్షునిగా నియమించిన తానికొండ దయాబాబును తొలగించి వడ్లమూడి వెంకటేశ్వరరావును నియమించడం, తర్వాత ఆయన్నూ తొలగించి గోలపల శ్రీనివాసరావును నియమించడం, సతీష్ మండల పార్టీ అధ్యక్షుడిగా నియమించిన కావూరి శ్రీనివాసరెడ్డిని తొలగించి ముక్కాముల శివను నియమించడంపై కేడర్ గుర్రుగా ఉంది. వీరే గాకుండా బాపట్ల మాజీ ఎంపీపీ మానం విజేత, వడ్లమూడి వెంకటేశ్వరరావు, ముక్కాముల శివ, గొలపల శ్రీను, నక్కల వెంకటస్వామి, ఏపూరి భూపతిరావు, కర్లపాలెం మండలంలో తెలుగురైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు పమిడి భాస్కరరావు, మాజీ జెడ్పీటీసీ గుంపులకన్నయ్య, మైనారిటీ సెల్ మాజీ మండల అధ్యక్షుడు మహ్మద్ హజీజుల్లాబేగ్, పార్టీ అధ్యక్షుడు వసంతారెడ్డితో కూడిన ఒక వర్గం వర్మను వ్యతిరేకిస్తోంది. కర్లపాలెం మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్న నక్కల వెంకటస్వామిని తొలగించి ఏపూరి భూపతిరావును నియమించడం, పిట్టలవానిపాలెం మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్న గోకరాజు శ్రీధర్‌వర్మ స్థానంలో కనుమూరి సాంబమూర్తిరాజును నియమించడం, కొన్నాళ్ళ తర్వాత మహ్మద్ అబ్జల్‌ను నియమించడంతో అక్కడ అసంతృప్తి నెలకొంది. ‘అన్నే’ మరణం.. ‘అనగాని’కి శరాఘాతం.. రేపల్లె పట్టణానికి చెందిన 14వ వార్డు కౌన్సిలర్ అన్నే రామకృష్ణను సొంత పార్టీలోని పరిటాల యువసేన నేతలు హత్య చేయడంతో నియోజకవర్గ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌పై వ్యతిరేకత చోటు చేసుకుంది. రాబోయే ఎన్నికల్లో దీని ప్రభావం స్పష్టం కానుంది. ఈ సారి ‘గొట్టిపాటి’కి గట్టిదెబ్బే.. అద్దంకి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కొందరికే ప్రాధాన్యమిస్తుండటం,ప్రధానంగా సంతమాగులూరు, బల్లికురవ, అద్దంకి తదితర మండలాల్లో విభేదాలు అధికంగా ఉన్నాయి. సంతమాగులూరు మండల పార్టీ మాజీ అధ్యక్షుడు నాగబోతు రామాంజనేయులు, కొరిశపాడు మాజీ జెడ్పీటీసీ ముత్తవరపు రమణయ్య మరికొందరు నేతలు ఇప్పటికే పార్టీని వీడి అధికార వైఎస్సార్ సీపీలో చేరారు. ఇటీవల సంతమాగులూరు మండలం కొప్పరం, అద్దంకి మండలం మోదేపల్లి, జె.పంగులూరు మండలాల పరిధిలో వందలాది కుటుంబాలు టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరాయి. రాబోయే ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
చంద్రబాబు నమ్మించి గొంతుకోసే రకం: నందిగం సురేష్
సాక్షి, బాపట్ల: టీడీపీ అధినేత చంద్రబాబు నమ్మించి గొంతుకోసే రకమని ఎంపీ నందిగం సురేష్ మండిపడ్డారు. బడుగు, బలహీన వర్గాలను చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దపీట వేశారని తెలిపారు. బడుగు బిడ్డలకు సీఎం జగన్ పాలనలోనే మంచి భవిష్యత్తు ఉందని చెప్పారు. సీఎం ప్రజలకు చేసిన మేలే మళ్లీ జగన్‌ను ముఖ్యమంత్రిని చేస్తుందని అన్నారు. బాపట్ల జిల్లా చీరాలలో పార్టీ ఇంచార్జి కరణం వెంకటేష్ ఆధ్వర్యంలో సోమవారం వైఎస్సార్సీపీ సామాజిక సాధికార సభ నిర్వహించారు. ఈ సభలో మంత్రి మేరుగ నాగార్జున, ఎంపీ నందిగం సురేష్ , రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యే కరణం బలరాం, ఎమ్మెల్సీ పోతుల సునీత, వైఎస్సార్సీపీ యువనాయలు, ఏపీఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ యనమల నాగార్జున యాదవ్, తదితరులు పాల్గొన్నారు. సీఎం జగన్ పేదల పక్షపాతి అని ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. బాబుకు దోచుకోవడం, దాచుకోవడం మాత్రమే తెలుసన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆత్మ బంధువు సీఎం జగన్ అంటూ ప్రశంసించారు. సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయని తెలిపారు. బీసీలను ఎప్పుడూ బాబు బ్యాక్వర్డ్గానే చూశారని మేరుగు నాగార్జున మండిపడ్డారు. బాబు హయాంలో దళితులపై జరిగినన్ని దాడులు దేశంలో ఎక్కడా జరగలేదని పర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను అక్కున చేర్చుకున్న ఘనత సీఎం జగన్‌దేనని అన్నారు. సోనియా, రాహుల్, బాబు చేతుల్లో షర్మిల కీలు బొమ్మ అని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో షర్మిల ఉనికి కోల్పోయి, కాంగ్రెరస్లో పార్టీనిని వీలినం చేశారంటూ దుయ్యబట్టారు. సీఎం జగన్ పాలనను తప్పుబట్టే అర్హత షర్మిలకు లేదని తెలిపారు. వైఎస్సార్సీపీపై షర్మిల విమర్శలు రాజకీయ స్వార్థంతో చేసినవని మండిపడ్డారు. రాష్ట్రంలో అభివృద్ధి ఆమెకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. చదవండి: AP: ఓటర్ల తుది జాబితా విడుదల.. జిల్లాల వారీగా లిస్ట్ ఇదే -
ఏపీ సీఎంగా ఎప్పటికీ జగనే ఉండాలంటున్న అంబేద్కర్ అభిమానులు
-
రైతుల పరామర్శ పేరుతో బాబు రాజకీయ పర్యటన: ఆమంచి
సాక్షి, బాపట్ల: చంద్రబాబుకు వ్యవసాయంపై చిత్తశుద్ధి లేదని వైఎస్సార్సీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు హయాంలో క్రాఫ్ ఇన్సూరెన్స్ ఐదేళ్లకు రూ. కోటి ఇస్తే, వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాలుగేళ్లకే రూ. 30 కోట్లు ఇచ్చిందన్నారు. శవాలపై పేలాలు ఏరుకున్నట్లు చంద్రబాబు రైతులను పరామర్శించారు. రైతుల పరామర్శ పేరుతో చంద్రబాబు రాజకీయ పర్యటన చేశారని ఆమంచి కృష్ణమోహన్ మండిపడ్డారు. ఇదీ చదవండి: తప్పుడు కథనాలతో రామోజీ శునకానందం: మంత్రి అంబటి -
మత్స్యకారులకు దొరికిన వాయుసేన మిస్సైల్
వేటపాలెం: మత్స్యకారుల వలకు మిలిటరీ వాయుసేనకు చెందిన చిన్నపాటి మిస్సైల్ దొరికింది. ఈ ఘటన శుక్రవారం బాపట్ల జిల్లా, వేటపాలెం మండలం పొట్టిసుబ్బయ్యపాలెంలో చోటుచేసుకుంది. దాన్ని మత్స్యకారులు బోటులో ఒడ్డుకు తీసుకొచ్చారు. మెరైన్ ఎస్ఐ సుబ్బారావు బాపట్ల సూర్యలంకకు చెందిన ఎయిర్‌ఫోర్సు మిలిటరీ అధికారులకు సమాచారం అందించారు. ఏం జరిగిందంటే... సూర్యలంకకు చెందిన మిలటరీ అధికారులు ఏటా ఎయిర్‌ఫోర్సుకు చెందిన రిహార్సల్స్ నిర్వహిస్తుంటారు. ఈనెల 3వ తేదీ నుంచి 22వ తేదీ వరకు సముద్ర గగనతలంలో అడ్వాన్స్డ్ మిస్సైల్ సిస్టంపై రిహార్సల్స్ నిర్వహిస్తున్నారు. చిన్నపాటి యుద్ధ మిస్సైల్‌ను ప్రయోగించి అది లక్ష్యం చేరుకోక ముందే సూర్యలంక కేంద్రం నుంచి పేట్రియాట్ మిస్సైల్‌తో దాన్ని పేల్చివేసే రిహార్సల్స్ జరుగుతున్నాయి. దీన్లో భాగంగా ప్రయోగించిన ఈ మిస్సైల్ సముద్రంలో మత్స్యకారులకు దొరికింది. దాన్ని మెరైన్ అధికారుల సమక్షంలో ఎయిర్‌ఫోర్సు అధికారులకు అప్పగించారు. -
రైతుల పంటకు ఇన్సూరెన్స్ ఇచ్చింది ఒక్క వైఎస్ఆర్సీపీనే.. సీఎం జగన్
-
పేదల సీఎం మన జగన్.. బాపట్ల ఎమ్మెల్యే
-
బాపట్ల జిల్లా పాతనందాయపాలెంలో సీఎం జగన్ పర్యటన
-
బాపట్ల జిల్లాలో సీఎం జగన్ పర్యటన (ఫోటోలు)
-
Live తుఫాను బాధితులకు నేరుగా సీఎం వైఎస్ జగన్ పరామర్శ
-
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన
Updates.. 3:44 PM, Dec 8, 2023 తుపాను వల్ల నష్టపోయిన వారిని అన్ని విధాల ఆదుకుంటాం: సీఎం జగన్ ఏ ఒక్కరికీ నష్టం జరగకుండా చూసుకుంటాం బాధితులను గుర్తించి పారదర్శకంగా సాయం అందిస్తాం రేషన్‌తో పాటు రూ.25,00 ప్రతి ఇంటికి అందిస్తున్నాం గత టీడీపీ ప్రభుత్వంలో కరువు వచ్చినా, వరద వచ్చినా పట్టించుకోలేదు సంక్రాంతిలోపు ఇన్‌ఫుట్ సబ్సిడీ అందిస్తాం రైతు భరోసాతో పాటు కరీఫ్ ఇన్సూరెన్స్ డబ్బులు ఇస్తున్నాం అపోహలను ప్రచారం చేస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి చదవకండి ఈటీవీ, ఏబీఎన్, టీవీ5 ఛానళ్ల ప్రసారాలను చూడకండి ఎల్లో మీడియా అసత్య కథనాలతో ప్రజలను తప్పుతోవ పట్టిస్తున్నారు బాపట్ల జిల్లా మరుప్రోలువారిపాలెంలో పర్యటించిన సీఎం జగన్ తుపాను వల్ల దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించిన సీఎం తుపాను బాధితులు, రైతులతో సీఎం జగన్ సంభాషణ బాపట్ల జిల్లా పాతనందాయపాలెంలో సీఎం జగన్ పర్యటన 2:51 PM, Dec 8, 2023 మరుప్రోలువారి పాలెంలో దెబ్బతిన్న పంటల ఫోటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించిన సీఎం జగన్ 2:45PM, Dec 8, 2023 బాపట్ల జిల్లా మరుప్రోలు వారి పాలెంలో సీఎం జగన్ పర్యటన కర్లపాలెం మండలం పాతనందాయ పాలెం, బుద్ధాం గ్రామాల్లో సీఎం జగన్ పర్యటన తుపాను వల్ల దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడనున్న సీఎం జగన్ 12:00PM, Dec 8, 2023 బాలిరెడ్డిపాలెం(తిరుపతి జిల్లా): తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంగా బాధితులతో సీఎం వైఎస్ జగన్ ముఖాముఖి.. ఈ ప్రాంతంలో కురిసిన వర్షాలు, జిల్లాలో మొత్తం యావరేజ్‌తో పోల్చుకుంటే కూడా అందులో సగం ఈ నాలుగైదు రోజుల్లోనే కురిశాయి. దాదాపు 40-60 సెంటీమీటర్ల వర్షం వచ్చిన పరిస్థితులు. మనందరికీ జరిగిన నష్టం, వచ్చిన కష్టం ఎవరైనా చెప్పడానికి కూడా సాధ్యపడనంత బాధ కలిగించే అంశాలే. దాదాపు ఈ ప్రాంతంలో 92 రిలీఫ్ క్యాంపులను పెట్టాం. 8,364 మందిని రిలీఫ్ క్యాంపులకు షిప్ట్ చేయడం జరిగింది. దాదాపు 60 వేల మందికి పైచిలుకు, వారికి రేషన్ బియ్యం 25 కేజీలు, కందిపప్పు, పామాయిల్ లీటరు, కేజీ ఆనియన్లు, బంగాళాదుంపలు.. ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఏ రాష్ట్రంలో లేని వ్యవస్థ మన రాష్ట్రంలో ఒకటి ఉంది. అది వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ. ఈ వ్యవస్థ వల్ల ఎవరికి ఎక్కడ ఏ నష్టం జరిగినా ఎవరూ కంగారు పడాల్సిన పని లేదు. అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని ప్రతి ఒక్కరికీ భరోసా ఇస్తూ చెబుతున్నా. ఏ ఒక్కరికీ నష్టం జరగదు. నాకు నష్టం జరిగినా ఎదుటివాడికి వచ్చింది, నాకు రాలేదని అనుకోవాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరికీ మంచి జరిగించే కార్యక్రమం జరుగుతుంది. డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. 62 వేల కుటుంబాలకు రేషన్ డిస్ట్రిబ్యూషన్ కిట్లు పంపిణీ చేస్తున్నాం. ప్రతి ఇంటికీ రూ.2,500 డబ్బులు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. దాని వల్ల మీ ఇళ్లలో నీళ్లు వచ్చిన వారికి, సామాన్లకు నష్టం జరిగిన వారికి, ఇబ్బందులు పడిన పరిస్థితుల్లో ఈ డబ్బుతో కాస్తో కూస్తో ఉపశమనం కలుగుతుంది. ఈరోజు మొదలు పెడితే మరో నాలుగు రోజుల్లో ప్రతి ఇంటికీ వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది వచ్చి ప్రతి ఇంట్లోనూ రూ.2,500 డబ్బులిచ్చే కార్యక్రమాలు చేసుకుంటూ పోతారు. పంట నష్టపోయిన పరిస్థితుల్లో ఏ ఒక్కరు ఉన్నా భయపడాల్సిన, బాధపడాల్సిన అవసరం లేదు. ఈ జిల్లాల్లో స్టాండింగ్ క్రాప్ లేదు కాబట్టి కాస్తో కూస్తో ఉపశమనం. ఎవరెవరు పంట వేశారో, నష్టపోయారో 80 శాతం సబ్సిడీతో సీడ్ ఇచ్చే కార్యక్రమం చేస్తాం. నాలుగైదు రోజుల్లో అన్నీ దగ్గరుండి కలెక్టర్లు పూర్తి చేశారు. ఈరోజు నుంచి వారం పట్టొచ్చు. ప్రతి ఒక్కరికీ జరగాల్సినమంచి జరుగుతుంది. కరెంటు చాలా ఫాస్ట్‌గా రీస్టోర్ చేశారు. యంత్రాంగం అంతా ఇక్కడే పని చేస్తున్నారు. రెట్టించిన వేగంతో పని చేస్తున్నారు. టీమ్స్ ను మొబిలైజ్ చేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో కరెంటు రీస్టోర్ అయ్యింది. కొన్ని కాలనీల్లో రీస్టోర్ కాని పరిస్థితి ఉంటే అవన్నీ డీటెయిల్స్ తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కలెక్టర్లు వాలంటీర్ల ద్వారా రీస్టోర్ అయ్యిందా అనే డీటెయిల్స్ తీసుకొని ప్రతి ఒక్కరికీ ఆ సమస్య లేకుండా చేస్తారు. అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం మీకు తోడుగా ఉంటుందని మరోసారి మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి రాకముందు స్వర్ణముఖిలో జరిగిన బ్రీచ్ కారణంగా ఎలాంటి నష్టం జరిగిందో చూశాను. దానికి పర్మినెంట్ సొల్యూషన్ వెతకాలని చెప్పాను. హైలెవల్ బ్రిడ్జి కడితే బాగుంటుందని చెప్పారు. దాని కోసం రూ.30 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. హైలెవల్ బ్రిడ్జిని శాంక్షన్ చేస్తున్నా జిల్లాలో 110 ట్యాంకులు ఉంటే కొన్ని చోట్ల బ్రీట్చ్ అయ్యాయి. రోడ్లు రిపేర్ చేసే కార్యక్రమాలు, టెంపరరీ పనులన్నీ మొదలు పెట్టి పునరుద్ధరణకు శ్రీకారం చుడతాం. రోడ్లు, ఆర్డబ్ల్యూఎస్, ఆర్అండ్బీ రోడ్లు, చిన్న చిన్న ట్యాంకుల రిపేరీ కోసం రూ.32 కోట్ల ప్రపోజల్స్ వచ్చాయి. యుద్ధ ప్రాతిపదికన మొదలు పెట్టించే కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ప్రభుత్వం మీది అన్నది గుర్తు పెట్టుకోండి. ఈ ప్రభుత్వంలో ఏ ఒక్కరికైనా మంచే జరుగుతుంది తప్ప.. చెడు అనేది ఎప్పుడూ జరగదు. ఏ చిన్న సమస్య అయినా, వాళ్లకు రావాల్సింది రాని పరిస్థితి ఎక్కడైనా ఎవరికైనా ఉందంటే జగనన్నకు చెబుదాం 1902కు ఫోన్ కొట్టండి.. నా ఆఫీస్‌కే ఫోన్ వస్తుంది. అందరికీ అందించే కార్యక్రమం కలెక్టర్ బాధ్యతలు తీసుకుంటారు. ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది. నాలుగైదు రోజుల్లో అన్నీ పూర్తి చేసి కలెక్టర్ దగ్గర నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటా. మీ అందరికీ మంచి జరగాలని మనసారా కోరుకుంటూ మిగిలిన ప్రాంతాలకు వెళ్లే కార్యక్రమం చేస్తాను. ఫోటో ఎగ్జిబిషన్‌ను సందర్బించిన సీఎం జగన్ ►తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన. ►తిరుపతి జిల్లా వాకాడు మండలం విద్యానగర్ చేరుకున్న సీఎం జగన్ ►తిరుపతి, బాపట్ల జిల్లాల్లో ముఖ్యమంత్రి జగన్ క్షేత్రస్థాయి పర్యటన ►బాధితులు, రైతులను కలిసి వారితో మాట్లాడనున్న సీఎం జగన్ ►స్వర్ణముఖి నదికట్ట తెగి నష్టపోయిన ప్రాంతాల్లో పరిశీలన ► తిరుపతి, బాపట్ల జిల్లాల పర్యటనకు బయలుదేరిన సీఎం వైఎస్ జగన్ ►ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు (శుక్రవారం) తిరుపతి, బాపట్ల జిల్లాల్లో పర్యటించనున్నారు. మిఛాంగ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటించనున్నారు. తొలుత తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డి పాలెం వెళ్లనున్న సీఎం జగన్. అక్కడ స్వర్ణముఖి నది కట్ట తెగి నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించనున్నారు. ► అనంతరం బాపట్ల జిల్లా మరుప్రోలువారిపాలెం వెళ్లి బాధితులతో మాట్లాడనున్నారు. ► తర్వాత కర్లపాలెం మండలం పాతనందాయపాలెం చేరుకుని బాధిత రైతును పరామర్శించనున్నారు. తర్వాత బుద్దాంలో దెబ్బతిన్న వరి పంటను పరిశీలించి రైతులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. -
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నేడు సీఎం వైఎస్ జగన్ పర్యటన
-
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రేపు సీఎం జగన్ పర్యటన
సాక్షి, తాడేపల్లి:ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(శుక్రవారం) తిరుపతి, బాపట్ల జిల్లాల్లో పర్యటించనున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటించనున్నారు. తొలుత తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డి పాలెం వెళ్లనున్న సీఎం.. అక్కడ స్వర్ణముఖి నది కట్ట తెగి నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించనున్నారు. అనంతరం బాపట్ల జిల్లా మరుప్రోలువారిపాలెం వెళ్లనున్న సీఎం జగన్.. అక్కడ తుపాను బాధితులతో మాట్లాడనున్నారు. అనంతరం కర్లపాలెం మండలం పాతనందాయపాలెం చేరుకుని బాధిత రైతును పరామర్శించనున్నారు. తర్వాత బుద్దాంలో దెబ్బతిన్న వరి పంటను పరిశీలించి రైతులతో సీఎం సమావేశం కానున్నారు. ఇదీ చదవండి: అబద్ధాల బాబు.. నిజం చెప్పరుగా! -
Cyclone Michaung In AP Photos: ఏపీలో తుపాను బీభత్సం (ఫొటోలు)
-
‘మిచౌంగ్’ దెబ్బ.. ఇలా వచ్చి.. అలా ముంచేసింది
సాక్షి, అమరావతి: మిచౌంగ్ తుపాను బీభత్సం సృష్టించింది. మధ్యాహ్నం 12:30 నుంచి 2:30 గంటల మధ్య బాపట్ల సమీపంలో తీరం దాటింది. రాగల రెండు గంటల్లో తీవ్ర తుపాను క్రమంగా తుపానుగా బలహీనపడుతూ, ఉత్తర దిశలో ప్రయాణిస్తుంది. తీరం వెంబడి గంటకు 100 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. చెట్లు విరిగిపడి, వాహనాలు ధ్వంసం అయ్యాయి. తీరం దాటినప్పటికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు, పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. వాతావరణ శాఖ.. 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. బాపట్ల సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. ఎగిపడుతున్న అలలు, భారీ వర్షాలతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వ సహాయక చర్యలు ముమ్మరం చేసింది. తుపానుపై ప్రజలను అప్రమత్తం చేసింది. విపత్తు నిర్వహణ శాఖ 4 కోట్ల మంది సెల్ఫోన్లకు అలర్ట్ మెసేజ్‌లు పంపింది. 25 మండలాలు, 54 గ్రామాలు, 2 పట్టణాలపై తుపాను అధిక ప్రభావం చూపింది. జిల్లాల్లో 211 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసింది. 10 వేల మందిని పునరావాస శిబిరాలకు అధికారులు తరలించారు. తుపాను సహాయ చర్యల కోసం 11 జిల్లాలకు రూ.20 వేల కోట్లు నిధులు ప్రభుత్వం విడుదల చేసింది. 36 గంటలపాటు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. జిల్లాల్లో పలు చోట్ల వరిపంట, అరటి తోటలు నేలకొరిగాయి. -
60 అడుగులు ముందుకు వచ్చిన సముద్రం
-
మిచౌంగ్ ముంచేసింది.. తీరం దాటింది.. అప్డేట్స్
cyclone michaung Live Updates.. బాపట్ల జిల్లా: అద్దంకి లో మిచౌంగ్ తూపాను ప్రభావంతో పొంగిపొర్లుతున్న వాగులు నల్లవాగు, దోర్నపువాగు ఉధృతంగా ప్రవహించడంతో నిలిచిన రాకపోకలు అద్దంకి, పరిసర ప్రాంతాలలో విరిగిపడ్డ చెట్లు, నిలిచిన విద్యుత్ సరఫరా రేపు పాఠశాలలు, కళాశాలలకు సెలవు ►భారీ వర్షాలు కారణంగా రేపు ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం తీరం దాటిన మిచౌంగ్ తుపాను 12:30 నుంచి 2:30 గంటల మధ్య బాపట్ల సమీపంలో తీరం దాటిన తీవ్ర తుపాను తీరం వెంబడి గంటకు 90-100 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు రాగల రెండు గంటల్లో తుపానుగా బలహీనపడనున్న తీవ్ర తుపాను తీరం దాటినప్పటికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: విపత్తుల నిర్వహణ సంస్థ కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన కాకినాడ జిల్లా తుపాను ప్రభావంతో గడిచిన 24 గంటలలో జిల్లా వ్యాప్తంగా నమోదయిన వర్షపాతం జిల్లా వ్యాప్తంగా 990.6 మి.మి అత్యధికంగా కాజులూరు మండలం 79.08 మి.మి, తాళ్లరేవు 73.08 మి.మి వర్షపాతం అత్యల్పంగా రౌతులపూడి మండలంలో 24 మి.మి నమోదు కాకినాడ రూరల్ 72.6. మి.మి, కాకినాడ అర్భన్ 60.2 మి.మి వర్షపాతం నమోదు కోనసీమ పంట నష్టం జరిగిన ప్రాంతాలను పరిశీలించిన మంత్రి పినిపే విశ్వరూప్ భగవంతుడి దయవల్ల కోనసీమపై మిచౌంగ్ ప్రభావం పెద్దగా లేదు ఇప్పటికే లక్షా ఆరు వేల ఎకరాల్లో పంట కోతలు పూర్తయ్యాయి ఇంకా 51 వేల ఎకరాల్లో మాత్రమే కోతలు కోయాల్సి ఉంది దాదాపు తొమ్మిది వేల ఎకరాలపై తుఫాన్ ప్రభావం ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా తడిచిన ధాన్యాన్ని, రంగు మారిన ధాన్యాన్ని, మొలకెత్తిన ధాన్యాన్ని సైతం కచ్చితంగా కొనుగోలు చేస్తాం మిల్లర్లకు ఆదేశాలు.. ప్రత్యేక అధికారిణి జయలక్ష్మి కోనసీమలో పంట నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించాం సీఎం జగన్ ఆదేశాల మేరకు తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని మిల్లర్లను ఆదేశించాం రైతుకు ఏమాత్రం నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకుంటున్నాం రైతుల్ని ఆదుకుంటాం.. కలెక్టర్ హిమాన్షు శుక్లా చేలలో నీరు నిల్వ ఉండకుండా జాతియ ఉపాధి హామీ పథకం కూలీలను పెట్టి నీటిని బయటికి తోడిస్తున్నాం దీనివల్ల నేలనంటిన పైరు సైతం నష్టపోకుండా ఉంటుంది ప్రాథమికంగా తొమ్మిది వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు గుర్తించాం నక్కా రామేశ్వరం వద్ద డ్రైన్‌కు పూర్తిస్థాయిలో మరమ్మత్తులు చేయడంతో చేయడంతో వర్షపు నీరు చాలా వరకూ బయటకు పోతుంది సహాయ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాలు ప్రజల్ని ఆదుకుంటున్నాం పశ్చిమగోదావరి జిల్లా ► మొగల్తూరు మండలం పేరుపాలెం సౌత్ మోళ్లపర్రు లో పర్యటించి పునరావాస కేంద్రాలను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు ► ఈడురు గాలులు ఎక్కువగా ఉన్నందున దయచేసి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు. ► ఇళ్ళ నుండి బయటకు రావొద్దు.. పిడుగులు పడే ప్రమాదం ఉంది కనుక జాగ్రత్తగా ఉండాలి. ► పునరావాస కేంద్రాలకు రావాలి.. అన్ని సదుపాయాలను కల్పించడం జరిగింది. ► పోలీస్,రెవెన్యూ,ఎలక్ట్రికల్,ఇతర అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేయటం జరిగింది. ఏలూరు జిల్లా ►తూఫాన్ నేపథ్యంలో వాతారవరణ హెచ్చరికల మేరకు ఏలూరు జిల్లాలో జిల్లా, డివిజన్, మండల స్థాయిలలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు . ►ఏలూరు జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ 18002331077. ►సబ్ కలెక్టర్ కార్యాలయం నూజివీడు : 08656-232717 ►ఆర్డీఓ కార్యాలయం, జంగారెడ్డిగూడెం : 9553220254 ►ఆర్డీఓ కార్యాలయం, ఏలూరు - 8500667696 కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ ►కంట్రోల్ రూమ్ లను అత్యవసర సహాయం కోసం వినియోగించుకోవాలి. ►లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిరావాలి. ►నేడు, రేపు భారీ, అతి భారీ వర్షాలు ఉంటాయి ►ప్రజలు అవసరమైతే తప్ప ఇంటిని వదిలి బయటికి రావద్దు. ►బలహీనంగా వున్న ఏటిగట్లు, వంతెనలు, తదితర ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలకు అధికారులకు ఆదేశాలు జారీ. ప్రకాశం జిల్లా: ►మిచౌంగ్ తుఫాన్ కారణంగా సంతనూతలపాడు మండలం మంగమూరు-ఒంగోలు మధ్యలోనీ రోడ్డుపై పారుతున్న వర్షపు నీరు ►రాకపోకలు అంతరాయం ►రెండు రోజుల వరకు ఈ రోడ్డులో ఎవరు ప్రయాణం చేయవద్దని సూచించిన అధికారులు ►దగ్గరుండి సహాయ చర్యలు చేపడుతున్న ఎమ్మార్వో మధుసూదన్ రావు, సిబ్బంది నెల్లూరు జిల్లా: ►ఉలవపాడు మండలంలోని తుపాను పునరావాస కేంద్రాలను సందర్శించిన ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి. ►బాధితులను పరామర్శించి భోజన ఏర్పాట్లు గురించి అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే. ►నిర్వాసితులకు బ్రెడ్, బిస్కెట్లు అందజేసిన వైఎస్సార్సీపీ శ్రేణులు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: ►సఖినేటిపల్లి మండలం మోరి గ్రామంలో మినీ టోర్నడో బీభత్సం ►విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తో పాటు పలు దుకాణాలు ధ్వంసం కృష్ణాజిల్లా ►జిల్లాలో 25 మండలాల పై మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్ ►పంట నష్టం పై ప్రాధమిక అంచనా ►68392 హెక్టార్లలో వరి,212 హెక్టార్లలో పత్తి, 162 హెక్టార్లలో మొక్కజొన్న,583 హెక్టార్లలో మినుము,854 హెక్టార్లలో వేరుశెనగ, పంట నష్టం జరిగినట్లు అంచనా వేసిన అధికారులు విశాఖ: ►విశాఖ రూరల్ అత్యధికంగా 51.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు ►ఆనంద పురంలో 37.2 మిల్లీ మీటర్ల వర్షపాతం ►భీమిలి లో 44.2 మిల్లీ మీటర్ల వర్షపాతం ►పద్మనాభం 35.2 మిల్లీ మీటర్ల వర్షపాతం ►సితమ్మధర 44.6 మిల్లీ మీటర్ల వర్షపాతం ►పెందుర్తి 35.8 మిల్లీ మీటర్ల వర్షపాతం ► గాజువాక 44.6 మిల్లీ మీటర్ల వర్షపాతం ►గోపాలపట్నం 46.8 మిల్లీ మీటర్ల వర్షపాతం ► ములగడ 49.2 మిల్లీ మీటర్ల వర్షపాతం గుంటూరు: ► తెనాలి మండలం ఖాజీపేట, కొలకలూరు లో మిచౌంగ్ తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను సందర్శించిన జిల్లా వ్యవసాయాధికారి నున్న. వెంకటేశ్వర్లు. గుంటూరు జిల్లా: ►ప్రత్తిపాడులో పొంగుతున్న ప్రత్తిపాడు-గొట్టిపాడు మధ్యనున్న లోలెవల్ చప్టా వద్ద పోలీసుల పహారా ►ప్రజలు, ప్రయాణీకుల భద్రత దృష్ట్యా రాకపోకలు నిలిపివేసిన ఎస్ఐ రవీంద్ర బాబు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: ►మిచౌంగ్ తుఫాను ప్రభావంతో కురుస్తూన్న భారీ వర్షాలకు ►కోనసీమ ముఖద్వారం రావులపాలెం ఆర్టీసీ బస్సు స్టాండ్ నీటమునక ►బస్సు రాకపోకలకు అంతరాయం కాకినాడ జిల్లా ►మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో ఉప్పాడ తీరంలో కోత గురయిన ప్రాంతాలను సందర్శించిన పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు ►ఉప్పాడ,మాయపట్నం,సుబ్బంపేటలో బైక్ మీద తిరుగుతూ తుఫాన్ సహయక చర్యలు పరిశీలించిన ఎమ్మెల్యే దొరబాబు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: ►మిచౌంగ్ తుఫాను ప్రభావంతో కురుస్తూన్న భారీ వర్షాలకు ►కోనసీమ ముఖద్వారం రావులపాలెం ఆర్ టి సి బస్సు స్టాండ్ నీటమునక ► బస్సు రాకపోకలకు అంతరాయం ► బాపట్ల దగ్గర కొనసాగుతున్న మిచౌంగ్ తుపాను ల్యాండ్‌ఫాల్ ప్రక్రియ ► మరో మూడు గంటల్లో పూర్తిగా తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా ►తీరం వెంబడి గంటకు 100-120కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు ► మరో రెండు గంటల్లో మిచౌంగ్ తుపాను తీరం దాటనుండగా.. తుపాను తీవ్రత నెమ్మదిగా తగ్గుముఖం పడుతోంది. తీరాన్ని తాకిన మిచౌంగ్ తుపాను: డా. బి.ఆర్ అంబేద్కర్, మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల సంస్థ. ►మరో రెండు గంటల్లో పూర్తిగా తీరాన్ని దాటనుంది ►తీరం వెంబడి గంటకు 90-110 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు ►తీరం దాటినప్పటికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ►ఈరోజు కోస్తాంధ్రలో చాలాచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ►పలుచోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు. ►అక్కడక్కడ తీవ్రభారీ వర్షాలు కురిసే అవకాశం నెల్లూరు జిల్లా: ►మిచౌంగ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పర్యటన ►గొలగమూడి,అనికేపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను పరిశీలించి,బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పిన మంత్రి ►బాధితులకు కల్పిస్తున్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి, బాధితులకు దుప్పట్లు, ఆహారం అందజేసిన మంత్రి ►కనుపూరు చెరువు ఆయుకట్టను జిల్లా కలెక్టర్ హరి నారాయణ్‌తో కలిసి పరిశీలించిన మంత్రి కాకాణి. తాడేపల్లి: మిచౌంగ్ తుపాను బాధిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం క్యాంప్ కార్యాలయంలో మంళవారం సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ జి సాయి ప్రసాద్, సీసీఎల్ఏ సెక్రటరీ ఇంతియాజ్, సీఎంఓ అధికారులతో సీఎం భేటీ అయ్యారు. తుపాను పరిస్థితులపై ఆరా: ► నెల్లూరు –కావలి మధ్య సగం ల్యాండ్ ఫాల్, సగం సముద్రంలో తుపాను గమనం ఉందని తెలిపిన అధికారులు ► చీరాల, బాపట్ల మధ్య పయనించి అక్కడ పూర్తిగా తీరం దాటనుందని ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు ► తిరుపతి, నెల్లూరు జిల్లాలో తుపాను ప్రభావం ఈ ఉదయం నుంచి క్రమంగా తగ్గుముఖం పడుతోందన్న అధికారులు ► తిరుపతి, నెల్లూరు జిల్లాలో సహాయ కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయని వెల్లడి ► ప్రకాశం, గుంటూరు, కృష్ణా తదితర జిల్లాల కలెక్టర్లనూ అప్రమత్తంగా చేశామని చెప్పిన అధికారులు ► ఇప్పటివరకూ 211 సహాయ శిబిరాల్లో సుమారు 9500 మందిని తరలించినట్టు వెల్లడి సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ►బాధితులకు మంచి సదుపాయాలు అందించాలి. ►సౌకర్యాల కల్పనలో ఎలాంటి పొరపాట్లు రాకుండా చూడాలి. ►నెల్లూరు, తిరుపతి సహా తుపాను వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో కరెంటు సరఫరా వ్యవస్థను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలి. ►మనుషులు, పశువులు మరణించినట్టు సమాచారం అందితే 48 గంటల్లోగా పరిహారం అందించాలి. ►తుపాను తగ్గిన వెంటనే ఎన్యుమరేషన్ కూడా ప్రారంభం కావాలి. ►గ్రామ, వార్డు సచివాలయ, వాలంటీర్ వ్యవస్ధలను వాడుకుని రేషన్ పంపిణీ సమర్ధవంతంగా చేపట్టాలని సీఎం వైఎస్ జగన్ అధికారును ఆదేశించారు. తుపాను ఎఫెక్టుపై వైసీపి కేంద్ర కార్యాలయం సమీక్ష ► తీర ప్రాంత ఎమ్మెల్యేలతో టెలికాన్ఫరెన్స్ ► ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించాం: కేంద్ర కార్యాలయ ఇన్‌ఛార్జి కేళ్ల అప్పిరెడ్డి ► బాధితులను పునరావాస కేంద్రాలకు తరలింపులో నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారు ► ట్రాక్టర్లు, ఆటోలలో బాధితులను తరలిస్తారు ► ఇల్లు ఖాళీ చేయాల్సిన సమయంలోనూ సహకరిస్తారు ► ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటం తమ ధర్మం ► రైతులు ఎవరూ భయపడాల్సిన పనిలేదు ► తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని సీఎం జగన్ చెప్పారు ► వర్షాలు తగ్గగానే పంటనష్టం అంచనాలు వేస్తారు తిరుమలలో టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి జలాశయాల పరిశీలన. ► నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నిండుకుండలా మారిన జలాశయాలు. ► తిరుమలలో ఉన్న ఐదు జలాశయాలు ఫుల్ ► పాప వినాశనం, ఆకాశగంగ, గోగర్భం డ్యామ్ లలో నీటి నిల్వాలను అధికారులు అడిగి సమాచారం తీసుకున్న టీటీడీ చైర్మన్ ► పాప వినాశనం ,గోగర్భం డ్యామ్ లు గెట్లు ఎత్తిన అధికారులు. ► 23న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహం హోమం మొదలైన రోజు నుంచి వర్షం కురుస్తుంది ► రెండు రోజులుగా 200 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు ► తిరుమలలో అన్ని జలాశయాలు నిండాయి ► ఒకటిన్నర సంవత్సరానికి సరిపడా నీరు చేరింది ► తిరుపతి భూగర్భ నీటిశాతం పెరిగింది ► శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహం హోమం ద్వారానే వర్షాలు కురిశాయి. తీరానికి చేరువలో మిచౌంగ్ తుపాను: విశాఖ వాతావరణం కేంద్రం డైరెక్టర్ సునంద ► మరి కాసేపట్లో బాపట్ల వద్ద తీరాన్ని దాటే అవకాశం ► తుపాను ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు ► మచిలీపట్నం నిజాంపట్నం పోర్టులో పదో నంబరు ప్రమాద సూచిక కాకినాడలో తొమ్మిదో నెంబర్ ప్రమాద సూచిక ఎగురువేత ► తీరం దాటిన తర్వాత తుఫానుగా ఉత్తర దిశలో పయనించనున్న తుపాను ► తుపాను ప్రభావంతో ఉత్తరకొస్తా జిల్లాలో ఈరోజు రేపు కూడా భారీ వర్షాలు ► తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు ► తుపాను ప్రభావంతో ఒడిశా, చత్తీస్‌గఢ్ తెలంగాణ జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు ఉయ్యూరు మండలం గండిగుంట ఆర్బికే కేంద్రాన్ని పరిశీలించిన సివిల్ సప్లై కమిషనర్ అరుణ్ కుమార్ ► తుఫాను వలన రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకున్నాం: అరుణ్ కుమార్ ► రాష్ట్ర వ్యాప్తంగా 5లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం ► ప్రతి గింజా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది ► రవాణ సమస్య లేకుండా చర్యలు తీసుకున్నాం ► రైతులు దళారుల చేతుల్లో మోసపోవద్దు ► సీఎం జగన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు ► రాష్ట్రంలో మిచౌంగ్ తుపాను ప్రభావంపై అప్రమత్తంగా ఉన్నాం: ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్‌రెడ్డి ► ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ► నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అత్యధికంగా వర్షాలు కురుస్తున్నాయి. ► రాష్ట్రంలో ని అన్ని ప్రాంతాల్లోనూ వర్షపాతం నమోదు అవుతోంది ► 8 జిల్లాలకు సీనియర్ ఐఏఎస్ అధికారులను పంపాము ► రేపు సాయంత్రం వరకు వర్షాలు కురుస్తాయి ► 22 కోట్లు తక్షణ చర్యలు కోసం విడుదల చేశాం ► లక్ష టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం ► 4 లక్షల టన్నుల ధాన్యాన్ని తడవకుండా చర్యలు తీసుకున్నాం ► 11 వేల మంది పునరావాస కేంద్రాల్లో ఉన్నారు ► అందరికి ఆహారం, నిత్యావసరాలు, ఆర్థిక సహాయం అందిస్తున్నాం ► తుపాను ప్రభావంతో కలిగే నష్టాన్ని వెంటనే అంచనా వేసి కేంద్రానికి పంపిస్తాం ► వర్షాలు అధికంగా ఉన్న చోట పాఠశాలలకు సెలవు ప్రకటించాం ► ఇప్పటివరకు ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం కృష్ణాజిల్లా : ► కృత్తివెన్ను మండలం పీతలావ, వర్లగొంది తిప్ప గ్రామాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు. ► పునరావాస కేంద్రాల్లో ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేసిన అధికారులు. ► నిడమర్రు, చిన్న గొల్లపాలెం, పడతడిక, ఇంతేరు సముద్ర తీరం వెంబడి 75 మంది అదనపు పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు జిల్లా ఎస్పీ జాషువా. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: ► రాజోలు నియోజకవర్గంలో భారీ వర్షంతో నేలకు ఒరిగిన చేతికి అంది వచ్చిన వరిచేలు. ► శ్రమించి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో ఈ తుపాను కారణంగా చేతికి అందకుండా పోయిందని రైతుల ఆవేదన. ► ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్న రైతులు. తిరుపతి: ►మిచౌంగ్ తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భక్తుల భద్రతా దృష్ట్యా తిరుమల ఘాట్ రోడ్డు మార్గంలో ఆంక్షలు విధించారు. వర్షాల కారణంగా రెండు ఘాట్ రోడ్లలో పొగ మంచు దట్టంగా కమ్ముకుంది. దీంతో వాహన రాకపోకులకు అంతరాయం కలుగుతోంది. ►అంతేకాకుండా ద్విచక్ర వాహనదారులు ముందున్న వాహనాలు సరిగా కనపడక ఇబ్బందులకు గురవుతున్నారు. తద్వారా వాహనాలు, ప్రయాణికులు ప్రమాదాలకు గురి అయ్యే అవకాశం ఉంది. ► ఈ నేపథ్యంలో వర్షాలు తగ్గి సాధారణ స్థితి వచ్చేంత వరకు రెండు ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాలను ఉదయం 6 నుండి సాయంత్రం 8 వరకు మాత్రమే అనుమతించేలా చర్యలు తీసుకున్నారు. వరద సృష్టించిన విధ్వంసం(ఫోటోలు) బాపట్ల జిల్లా: ►చీరాలలో 10 నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు. ►మిచౌంగ్ తుపాను ప్రభావంతో చీరాలలో ఈదురు గాలులతో కూడిన వర్షం. ►తీరప్రాంతంలోని 25 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు. ►విపత్తును ఎదుర్కొనేందుకు 16 మంది ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని సిద్ధం చేసిన అధికారులు. ►మిచౌంగ్ తుపాను కారణంగా చీరాల తహశీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు. మిచౌంగ్ తుపాను ప్రభావంతో మరో మూడు రైళ్లు రద్దు. ►గూడూరు-రేణిగుంట, రేణిగుంట-గూడూరు, తిరుపతి-పుల్ల రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే. ►హౌరా కన్యాకుమారి రైలు దారి మళ్లింపు. తిరుపతి ► వరద బాధితులకు అండగా నిలుస్తూ అవసరమైన ఏర్పాట్లను చేపడుతున్న టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి. ► అప్రమత్తంగా ఉండాలని, ఏ అవసరమొచ్చిన తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించిన భూమన. ► పూలవాని గుంట, గొల్లవాని గుంట ప్రాంతాల్లో వరద బాధితులను పరామర్శించిన భూమన. ► పునరావాస కేంద్రాలకు తరలించిన వారితో పాటు అవసరమైన ప్రాంత ప్రజలకు పునరావాస కేంద్రాలకు రాలేని పరిస్థితి ఉన్నా సరే అలాంటి వారికి ఆహార పానియాలను అందజేయాలని తహశీల్దార్ వెంకట రమణను ఆదేశించిన భూమన. రైళ్ల రాకపోకలపై తుపాను ఎఫెక్ట్ ►హైదరాబాద్ నుంచి దక్షిణాదికి నిలిచిన రైళ్లు ►ఉత్తరాది నుంచి వచ్చే వాటికీ బ్రేక్ ►ఇప్పటికే 150కిపైగా రైళ్లను రద్దు చేసిన దక్షిణమధ్య రైల్వే ►వివరాల కోసం ప్రత్యేక సహాయ కేంద్రాలు ఏర్పాటు ►తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని రైల్వే అధికారులకు జీఎం ఆదేశాలు ►అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయాలని సూచనలు కాకినాడ జిల్లా ►పెద్దాపురం:మీచాంగ్ తూపాన్ నేపథ్యంలో సామర్లకోట మండలంలో 4000 వేలమంది రైతుల వద్ద నుండి ఆన్లైన్లో 17,450, ఆఫ్ లైన్లో 1504 మెట్రిక్ టన్నుల ధాన్యం. ►పెద్దాపురం మండలంలో 832 మంది రైతుల వద్ద నుండి ఆన్లైన్లో 4303, ఆఫ్‌లైన్‌లో 369 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిన వ్యవసాయ అధికారులు. ►రెండు మండలాల్లో 80 శాతం పూర్తైన వరి కోతలు. నెల్లూరు జిల్లా: బంగాలఖాతంలో ఏర్పడ్డ తుపాన్ ప్రభావంతో ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలకు సోమశిల జలాశయానికి కొనసాగుతున్న వరద. ►ఇన్ ప్లో 10,915 క్యూసిక్కులు,అవుట్ ప్లొ 70 క్యూసెక్కులు. ►ప్రస్తుత జలాశయం సామర్థ్యం 30.756 టీఎంసీలు. మిచౌంగ్ తుపాను ప్రభావంతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షం పశ్చిమగోదావరి జిల్లాకు రెడ్ ఎలర్ట్, ఏలూరు జిల్లాకు ఆరెంజ్ ఎలర్ట్ ప్రకటన తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు ముందస్తు చర్యలు నర్సాపురం, మొగల్తూరు రెండు మండలాల్లో 12 తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు గుర్తింపు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు భీమవరం కలెక్టర్ కార్యాలయంలో 'మిచాంగ్' తుఫాన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు. అత్యవస సహాయం కోసం కంట్రోల్ రూమ్ నెంబర్ 08816 299219... విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన అధికారులు ఎన్ డి ఆర్ ఎఫ్ ,ఎస్ డి ఆర్ ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచిన అధికారులు జిల్లాలో 1. 40 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు ముమ్మరంగా తుపాను సహాయచర్యలు చేపట్టిన ఏపీ ప్రభుత్వం జిల్లా కలెక్టర్లు, అధికార యంత్రాంగానికి సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం రాష్ట్రంలో తుపాను ప్రభావిత జిల్లాల్లో పటిష్టమైన చర్యలు చేపట్టిన ప్రభుత్వం బాపట్ల, కోనసమీ, తూర్పుగోదావరి, కాకినాడ, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, పశ్చిమగోదావరి జిల్లాలకు ప్రత్యేక అధికారుల నియామకం పలు జిల్లాల్లో తుపాను ప్రభావంతో భారీ వర్షపాతం నమోదు కోనసీమలో86, క్రిష్నా జిల్లాలో 55, బాపట్ల జిల్లాలో 64, నెల్లూరు జిల్లాలో 55, చిత్తూరు జిల్లాలో 93 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు గత రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాలు. 10 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదు తిరుపతి జిల్లా కోటలో అత్యధికంగా 388 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు మనుబోలు లో 366, చిల్లకూరు లో 350, నాయుడు పేటలో 271, బలయపల్లిలో 239, సైదాపురంలో 223, వెంకటాచలంలో 213 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో సున్నపువాగులో చిక్కుకున్న బండారు పల్లెకు చెందిన శివ, వెంకటేష్ నిన్న సాయంత్రం సున్నపు వాగు ఉదృతి పెరగడం తో మధ్యలో నిలిచిపోయిన వ్యవసాయ కూలీలు రక్షించే ప్రయత్నం చేస్తున్న రెవెన్యూ అధికారులు, ఫైర్ అధికారులు కాకినాడ: మిచాంగ్ తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వానలు తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్డులో వాహనాల రాకపోకలను నిలిపివేసిన పోలీసులు ఇవాళ కూడా పాఠశాలలకు శెలవు ప్రకటించిన అధికారులు కాకినాడ పోర్టులో ఎగుమతులు, దిగుమతులకు ఆటంకం వేటను నిలిపివేసి తీరానికే పరిమితమైన గంగపుత్రులు ఉప్పాడలో తుపాను పునరావాస కేంద్ర ఏర్పాటు భారీ వర్షాలకు 3 వేల ఎకారాల్లో నేల కొరిగిన వరి పంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్రతుఫాను మిచౌంగ్: ప్రస్తుతానికి నెల్లూరుకు 50 కి.మీ, బాపట్లకు 110 కి.మీ, మచిలీపట్నానికి 170కి.మీ. దూరంలో తుపాను మధ్యాహ్ననంలోపు నెల్లూరు - మచిలీపట్నం మధ్య బాపట్ల దగ్గర తీవ్రతుఫానుగా తీరం దాటనున్న మిచౌంగ్ తీరం వెంబడి గంటకు 90-110 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు మిచౌంగ్ తుపాను కారణంగా విశాఖలో బీచ్‌లు మూసివేత ఆర్కే బీచ్‌లో పోలీసుల ప్రత్యేక పెట్రోలింగ్ అన్ని బీచ్‌ల వద్ద పోలీసుల పర్యవేక్షణ పర్యాటకులు బీచ్‌లోకి దిగకుండా ఆంక్షలు చెన్నైలో జలప్రళయం ముంచెత్తిన మిచౌంగ్ తుపాను ఏకంగా 35 సెంటీమీటర్ల వాన పూర్తిగా స్తంభించిన జనజీవనం వరదలకు కొట్టుకుపోయిన పార్కింగ్ ప్రదేశాల్లో ఉన్న వందలాది కార్లు, వాహనాలు నడుం లోతుకు పైగా నీరు చేరడంతో నగరంలోని అన్ని హైవేలను, సబ్‌వేలను మూసేశారు. రన్ వేపైకి నీరు చేరడంతో చెన్నై విమానాశ్రయం కూడా మూసివేత హైవేలు, సబ్‌వేల మూసివేత నీట మునిగిన విమానాశ్రయం 160 విమానాలు రద్దు నేడు మరింత వర్ష సూచన! Chennai in deep trouble.. 😔#ChennaiRain #MichaungCyclone pic.twitter.com/DSXZvIo3p5 — Dr. Jitendra Nagar (@NagarJitendra) December 5, 2023 తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రి నగరంలో నిలిచిపోయిన వర్షం.. స్తబ్దంగా ఉన్న వాతావరణం ఏజెన్సీ ప్రాంతంలో తుఫాను ప్రభావంతో ఏకధాటిగా కురుస్తున్న వర్షం ముందస్తు చర్యగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 30 పురావస కేంద్రాల ఏర్పాటు ఇవాళ తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల పరిధిలో పాఠశాలలకు సెలవు ప్రకటించిన అధికారులు సముద్ర తీర ప్రాంతంలోకి మత్స్యకారులు గాని, పిక్నిక్ల పేరిట సాధారణ జనం కానీ వెళ్ళద్దని హెచ్చరికలు గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే కోతలు పూర్తి చేసి, ఆరబెట్టిన ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు రైతులకు సహాయపడుతున్న అధికారులు తీర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ఉండేందుకు సిబ్బందిని ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్న జిల్లా యంత్రాంగం రాజమండ్రి కలెక్టరేట్, రాజమండ్రి ,కొవ్వూరు ఆర్డీవో కార్యాలయాల్లోను, అమలాపురం కలెక్టరేట్లోనూ కంట్రోల్ రూమ్ ఏర్పాటు తిరుపతి: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను, అధికారులను అప్రమత్తం చేశాం: భూమన గత అనుభవాల దృష్ట్యా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం జరిగింది. ముందుస్తుగా వరద కాలువల్లో పూడిక తీయడం వంటి చర్యలు చేపట్టం జరిగింది దీని వల్ల మరీ లోతట్టు ప్రాంతాల్లో మినహా వరద నీటి ఉదృతి చాలా వరకు తగ్గింది తిరుమలలో కూడా జలాశయాన్ని పూర్తిగా నిండాయి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించడం జరిగింది కృష్ణాజిల్లా: మచిలీపట్నం హార్బర్ లో గ్రేట్ డేంజర్ సిగ్నల్ 10 వ నెంబర్ ప్రమాద హెచ్చరిక ఎగురవేత తీరప్రాంతాల్లో దంచికొడుతున్న వర్షం తుపానుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్రతుఫాను మిచౌంగ్ ప్రస్తుతానికి చెన్నైకి 170 కి.మీ, నెల్లూరుకు 20 కి.మీ, బాపట్లకు 150 కి.మీ, మచిలీపట్నానికి 210కి.మీ. దూరంలో తుపాను మధ్యాహ్ననికి నెల్లూరు - మచిలీపట్నం మధ్య బాపట్ల దగ్గర తీవ్రతుఫానుగా తీరం దాటనున్న మిచౌంగ్ తీరం వెంబడి గంటకు 90-110 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు కోస్తాంధ్రలో చాలాచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, పలుచోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు, అక్కడక్కడ తీవ్రభారీ వర్షాలు కురిసే అవకాశం రేపు రాయలసీమల, ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీవర్షాలు నమోదైయ్యే అవకాశం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి 4 జిల్లాల్లో కుండపోత వర్షాలు తీవ్ర రూపం దాల్చిన తుపాను.. 4 జిల్లాల్లో కుండపోత వర్షాలు తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వాన పలు చోట్ల 15–20 సెంటీమీటర్ల కంటే అధికంగా వర్షం.. అత్యధికంగా బుచ్చినాయుడు కండ్రిగలో 28 సెంటీమీటర్లు కృష్ణపట్నం పోర్టులో 10వ నంబరు ప్రమాద హెచ్చరిక జారీ.. పొంగుతున్న వాగులు, వంకలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం బాపట్ల, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లోనూ మొదలైన వానలు.. నేటి మధ్యాహ్నం చీరాల, బాపట్ల మధ్యలో తీరం దాటే అవకాశం ఉప్పాడ తీరంలో గ్రామాల్లోకి చొచ్చుకొచ్చిన సముద్రపు నీరు.. నేడు, రేపు కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలకు అవకాశం బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుపాను సోమవారం తీవ్ర రూపం దాల్చింది. గంటకు పది కిలోమీటర్ల వేగంతో దక్షిణ కోస్తాంధ్రకు సమాంతరంగా కదులుతుండడంతో తీరం వెంబడి ఉన్న జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా, నెల్లూరు జిల్లాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలకు అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగలో 28.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. తిరుపతి జిల్లా పెళ్లకూరులో 23.1, దొరవారిసత్రంలో 26.4, నాయుడుపేట 21, సూళ్లూరుపేట 20.3, నెల్లూరు 24.3, ఇందుకూరుపేటలో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆయా ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా నీరు చేరింది. నేడు, రేపు భారీ వర్షాలు మిచౌంగ్ తుపాను తీవ్రరూపం దాలుస్తూ కోస్తాంధ్ర వైపు దూసుకొస్తోంది. గుంటూరు జిల్లా రేపల్లె, ప్రకాశం జిల్లా చీరాల, ఒంగోలు, కృష్ణా జిల్లా మచిలీపట్నం, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటల్లో సముద్రం 120 నుంచి 250 మీటర్ల వరకు ముందుకు చొచ్చుకు వచ్చే అవకాశం ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఐఎండీ సూచన తుపాను ప్రభావం వల్ల మంగళ, బుధవారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, తిరుపతి, నెల్లూరు, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు.. కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, వైఎస్సార్, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఒకట్రెండు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ఎఎస్సార్, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలకు ఆస్కారం ఉంది. ఫలితంగా తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, యానాం, చిత్తూరు, కర్నూలు, కడప జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం. తెలంగాణలోని ఖమ్మం, నాగర్ కర్నూలు, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల్లో వరదకు అవకాశం ఉంది -
తీవ్ర తుపానుగా మిచాంగ్
సాక్షి, హైదరాబాద్: నైరుతి బంగాళాఖాతంలో కొన సాగుతున్న మిచాంగ్ తుపాను సోమవారం మరింత బలపడి తీవ్ర తుపానుగా మారింది. దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరాలకు దగ్గరగా కొనసాగుతోంది. క్రమంగా బలపడుతూ, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి సమాంతరంగా కదులుతూ.. మంగళవారం మధ్యాహ్నం బాపట్ల సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దాని ప్రభావంతో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశా యని తెలిపింది. మంగళ, బుధవారాల్లోనూ పలు ప్రాంతాల్లో మోస్తరు వానలు పడతాయని వెల్లడించింది. పలుచోట్ల భారీ వర్షాలు మంగళవారం ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు.. జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నల్గొండ జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. వర్షాలు కురిసే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు, గంటకు 30 నుండి 40కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలు లు వీస్తాయని తెలి పింది. ఇక బుధవారం రోజున పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడ తాయని.. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడవచ్చని వివరించింది. ఉష్ణోగ్రతలు తగ్గే చాన్స్ సోమవారం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలో నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. అత్యధికంగా రామగుండంలో 33.1 డిగ్రీల గరిష్టఉష్ణోగ్రత.. అత్యల్పంగా మెదక్, ఆదిలాబాద్‌లలో 18.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వివరించింది. మంగళ, బుధవారాల్లో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశంఉందని తెలిపింది. -
పేదల జీవితాల్లో వెలుగులు
సాక్షి ప్రతినిధి, బాపట్ల: రాష్ట్రంలోని పేదల జీవితాల్లో ఇప్పుడే వెలుగులు చూస్తున్నామని, ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి ఫలితమేనని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ చెప్పారు. సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా శనివారం సాయంత్రం బాపట్ల అంబేడ్కర్ సెంటర్లో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళలు, అగ్రవర్ణ పేదలకు చేసిన మేలును వివరించారు. ఈ సభలో మంత్రి రమేష్ మాట్లాడుతూ.. నాలుగున్నరేళ్ల పాలనలో సీఎం వైఎస్ జగన్ సామాజిక ధర్మాన్ని పాటిస్తున్నారని, అన్ని వర్గాలకు మేలు చేకూర్చారని చెప్పారు. దేశంలోనే తొలిసారిగా బడుగు, బలహీనవర్గాలు సగర్వంగా సామాజిక సాధికార యాత్ర చేసే అవకాశం కల్పించారని తెలిపారు. కేబినేట్లో 15 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అవకాశం కల్పించారని, దేశంలో మరే ఇతర రాష్ట్రంలో ఇంత స్థాయిలో భాగాన్ని ఇచి్చన ముఖ్యమంత్రి లేరని అన్నారు. రాజ్యసభ స్థానాలను చంద్రబాబు రూ.100 కోట్లకు అమ్ముకునే వారని, ఈ రోజున పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణారావును రాజ్యసభ సభ్యులను చేసిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతోందని వివరించారు. మోషేన్ రాజును శాసన మండలి చైర్మన్‌ను చేశారన్నారు. నెట్లో చూసి ఇంగ్లిష్ నేర్చుకోవచ్చంటున్న పవన్ కళ్యాణ్.. అతని పిల్లలకూ అలానే నేర్పుతారా అంటూ నిలదీశారు. ఈ యాత్రను లోకేశ్ గాలియాత్ర అంటున్నారని, ఇది గాలియాత్ర కాదని, ప్రజా వ్యతిరేకులైన చంద్రబాబు అండ్ కోపై దండయాత్ర అని చెప్పారు. సాధికార యాత్రకు జనం లేరని రాధాకృష్ణ, రామోజీ, టీవీ 5 బీఆర్ నాయుడు ప్రచారం చేస్తున్నారని, వారికి దమ్ముంటే వచ్చి ఈ యాత్రలకు ప్రభంజనంలా వస్తున్న ప్రజలను చూడాలని సవాల్ చేశారు. జగన్ కటవుట్ చూస్తేనే జనం ఇలా వస్తే.. జగనే స్వయంగా వస్తే బాపట్ల పట్టుద్దా అని అన్నారు. ప్రతి కుటుంబానికి లబ్ధి: ఎంపీ మోపిదేవి వైఎస్ జగన్ పాలనలో ప్రతి పేద కుటుంబం ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా లబ్ధి పొందిందని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు చెప్పారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చేంతవరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు న్యాయం జరగలేదన్నారు. జగన్ పాలనలోనే అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పదవులు లభించాయని చెప్పారు. జగనన్న పాలనలో మహిళా ఆర్థికాభివృద్ధి సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో పేదరికం లేకుండా చేసేందుకు పలు కార్యక్రమాలు చేపట్టారని ఎమ్మెల్సీ పోతుల సునీత చెప్పారు. విద్య, వైద్యం, వ్యవసాయంలో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. మహిళా సాధికారిత జగనన్న పాలనలోనే సాధ్యమైందని చెప్పారు. భువనేశ్వరి ఏనాడూ మహిళల కోసం బయటకు రాలేదని, ఈ రోజు అవినీతి చేసి జైలుకు వెళ్లిన భర్త కోసం బయటకు వచ్చి డ్రామాలు చేస్తోందని ఎద్దేవా చేశారు. జగన్ పాలన దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే కోన రఘుపతి రాష్ట్రంలో వైఎస్ జగన్ అందిస్తున్న పరిపాలన దేశానికే రోల్‌మోడల్‌గా ఉందని, దేశం మొత్తం మనవైపే చూస్తోందని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి చెపాపరు. మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు గురించి జగనన్న ఆలోచిస్తున్నారన్నారు. పేదల గురించి ఇంతగా ఆలోచించే వ్యక్తిని ఇంతవరకు చూడలేదన్నారు. మనకు జిల్లాను ఇచి్చనందుకు, మెడికల్ కళాశాల ఇచ్చినందుకు తిరిగి జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకోవాల్సి ఉందన్నారు. జగనన్నతోనే పేదల అభ్యున్నతి బాపట్ల ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ పేద పిల్లల ఉచిత చదువుల కోసం, మహిళల ఆర్థికాభివృద్ధి కోసం, ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్యం కోసం, రైతు భరోసా కోసం మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం అమలు చేసిన ఘనుడు జగనన్న అని చెప్పారు. ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని చంద్రబాబు అవహేళన చేస్తే.. వైఎస్ జగనన్న ఎస్సీలు మేనమామలని అన్నారని గుర్తు చేశారు. అమరావతి భూములతో చంద్రబాబు అవినీతి చేస్తే, ఆ భూములను పేదలకు పంచిన వ్యక్తి జగనన్న అని కొనియాడారు. చంద్రబాబు రూ.370 కోట్లు కాజేస్తే అది చిన్న అమౌంటేనని పవన్ చెప్పడం సిగ్గుచేటుగా పేర్కొన్నారు. చంద్రబాబు ఎస్సీ, బీసీలను దొంగలని జైల్లో పెడితే జగనన్న ఢిల్లీలో కూర్చొపెట్టారని చెప్పారు. వైఎస్ జగన్‌కు భయం పరిచయం చేస్తానని లోకేశ్ అంటున్నాడని, సోనియా గాంధీకే ఆయన భయపడలేదని, పిల్లకుంక లోకేశ్ ఎంత అని ఎద్దేవా చేశారు. -
YSRCP Bus Yatra: మనకు మళ్లీ జగనన్నే కావాలి
సాక్షి, బాపట్ల: వైఎస్సార్సీపీ సామాజిక సాధికారిత బస్సుయాత్రలో భాగంగా మూడో రోజు బాపట్లలో నిర్వహించిన సభలో పలువురు వైఎస్సార్సీపీ నేతలు ప్రసంగించారు. ఈ సభకు హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి నేతలు మాట్లాడారు. మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. ‘వైఎస్సార్సీపీ సామాజిక సాధికారిత బస్సుయాత్ర చేపడితే నారా లోకేష్ ఇది గాలి యాత్ర అంటూ చులకనగా మాట్లాడుతున్నాడు. లోకేష్ ఇది గాలి యాత్ర కాదు.. దండయాత్ర అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. మన సామాజిక యాత్రను చులకనగా మాట్లాడుతున్నారు. బీసీ, ఎస్టీలను తేలిక చేసి మాట్లాడుతున్న లోకేష్‌కు గుణపాఠం చెబుదాం. సీఎం జగన్‌ను పీకేస్తాం.. తేల్చేస్తాం అంటూ ఏదో చెత్త వాగుడు వాగుతున్నారు. సీఎం జగన్ ఏమైనా మొక్క అనుకున్నారా.. పీకేయడానికి. సీఎం జగన్ ఒక వీరుడు, ధీరుడు, దమ్మున్న నాయకుడు’ అని మరోసారి స్పష్టం చేశారు. ఎమ్మెల్యే పోతుల సునీత మాట్లాడుతూ.. ‘సామాజిక సాధికారితకు ఒక కొత్త నిర్వచనం ఇచ్చారు మన సీఎం జగనన్న. సామాజిక సాధికారితతో ఒక ఉద్యమాన్ని సృష్టించారు.అంబేద్కర్, పూలే, అల్లూరి సీతారామారాజు స్ఫూర్తితో, వైఎస్సార్ ఆశయాలతో సామాజిక సాధికారితకు శ్రీకారం చుట్టారు మన జగనన్న.పేదలకు కష్టాల్లో అండగా నిలబడి అందరికి నేనున్నాను అనే భరోసా ఇచ్చారు. మహిళా సాధికారితకు కూడా సీఎం జగన్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. గత ప్రభుత్వం మహిళలను ఓటు బ్యాంకుగా చూసేరే కానీ మహిళా సాధికారిత గురించి ఏనాడు ఆలోచించలేదు.చంద్రబాబువి మోసపూరిత హామీలే. గత ప్రభుత్వ పాలనకు నేటి పాలనకు తేడా గమనించండి. అందరికీ అండగా నిలబడ్డ మన జగనన్న మళ్లీ రావాలి ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. జగన్మోహన్రెడ్డి గారు మన జీవితాల్ని బాగు చేయడానికి ముందుకొచ్చిన నాయకుడు. అటువంటి నాయకుడ్ని వదులుకోవద్దు. మన బీసీల్ని, మన ఎస్సీల్ని పార్లమెంట్లో కూర్చోబెట్టిన నాయకుడు సీఎం జగన్. బీసీల్ని, ఎస్సీల్ని చులకనగా మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు. మనకు జగనన్న మాత్రమే కావాలి.. ఇంకో నాయకుడు అవసరం లేదు’ అని నొక్కి చెప్పారు. -
చంద్రబాబు చరిత్ర ముగిసింది: విజయసాయిరెడ్డి
సాక్షి, బాపట్ల: వైఎస్సార్ సీపీ పెత్తందారుల పార్టీ కాదని.. పేదల, బలహీన వర్గాల పార్టీ అని రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు తన స్వార్థం కోసమే పరిపాలన చేశారని, ఆయన హయాంలో ప్రజలకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. చంద్రబాబుకు తెలిసింది మోసం, దగా మాత్రమేనని ధ్వజమెత్తారు. బాబు వల్ల అభివృద్ధి చెందింది ఆయన వర్గీయులేనని దుయ్యబట్టారు. అందుకే బాబు పట్ల ప్రజలు సానూభూతి చూపడం లేదని, జాతీయ నాయకులు కూడా సపోర్టు చేయడం లేదని విమర్శించారు. పక్కా ఆధారాలతోనే బాబు అరెస్ట్ లోకేష్‌కు నాయకత్వ లక్షణాలు లేవని, ప్రజల కోరికలు నెరవేర్చే వ్యక్తి కాదని విజయసాయిరెడ్డి విమర్శించారు. చంద్రబాబులా.. లోకేష్ కూడా వ్యవస్థలను మేనేజ్ చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. బాబు పాపం పండింది కాబట్టే జైల్లో ఉన్నారని అన్నారు. పక్కా ఆధారాలతోనే ఆయన అరెస్ట్ అయ్యారని పేర్కొన్నారు. మంత్రివర్గం కూర్పులో కూడా సామాజిక న్యాయం చేశామని తెలిపారు. పురంధేశ్వరిది నిలకడలేని రాజకీయమని విమర్శించారు. ఆమెకు ఓ నియోజకవర్గం లేదని, స్వార్త, కుటుంబ, సొంత అజెండాతోనే ఆమె రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. పురంధేశ్వరికి తెలిసింది ఆమె సామాజిక వర్గం గురించి మాత్రమేనని మండిపడ్డారు. ఆధారాలు లేని ఆరోపణలు ఆరోపణలు చేసే ముందు పురంధేశ్వరి ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని హితవు పలికారు. ఏ మాత్రం సంబంధంలేని ఇద్దరు వ్యక్తులపై పురంధేశ్వరి ఆరోపణలు చేయడం తగదని చురకలంటించారు. ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారు. లిక్కర్ విషయంలో తనపై, విథున్‌రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇళ్ల నిర్మాణాలు చూసి టీడీపీ తట్టుకోలేకపోతుంది ‘బాబు ఆయన కుటుంబాన్ని మాత్రమే చూసుకున్నారు. బడుగు బలహీన వర్గాలను చంద్రబాబు మోసం చేశారు. ప్రజలకు ద్రోహం చేశారు కాబట్టే బాబును ప్రజలు పట్టించుకోవడం లేదు. ఇళ్ల నిర్మాణాలు చూసి టీడీపీ తట్టుకోలేకపోతుంది. పేదలకు పెన్షన్ పెంచుతుంటే తట్టుకోలేకపోతుంది. సంక్షేమ పథకాలు చూసి ఓర్చుకోలేకపోతుంది. చంద్రబాబు చరిత్ర ముగిసింది. అన్ని స్థానాల్లో వైఎస్సార్సీపీ గెలవబోతుంది’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. బాపట్లలో సామాజిక సాధికార యాత్ర బాపట్ల నియోజకవర్గంలో సామాజిక సాధికార యాత్ర కొనసాగుతోంది. పిట్టలవానిపాలెం మండలం సంగుపాలెం కోడూరు నుంచి సామాజిక సాధికార బస్సు ప్రారంభం అయ్యింది. వైఎస్సార్సీపీ ఎంపీలు విజయ్ సాయి రెడ్డి, మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యే కోన రఘుపతి, ఎమ్మెల్సీలు ఉమా రెడ్డి వెంకటేశ్వర్లు, పోతుల సునీత, మార్కెటింగ్ ప్రభుత్వ సలహాదారులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, పార్టీ నేతలు పాల్గొన్నారు. -
మూడో రోజు వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్ర ఇలా..
సాక్షి, తాడేపల్లి: సామాజిక సాధికారత రాష్ట్రమంతటా ప్రతిధ్వనిస్తోంది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ఫలితాలను ప్రజల స్పందన ప్రతిబింబిస్తోంది. సీఎం జగన్ నాయకత్వంలోని వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర, సభలకు పేదలు వెల్లువెత్తుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ వెంటే తాము అంటూ నినదిస్తున్నారు. గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో సీఎం వైఎస్ జగన్ తమకు మంచి చేశారని ప్రశంసిస్తున్నారు.ఇక, నేడు మూడో రోజు సామాజిక సాధికార బస్సు యాత్ర ఉత్తరాంధ్రలో భీమిలి, కోస్తాంధ్రలో బాపట్ల, రాయలసీమలో పొద్దుటూరులలో జరుగనుంది. ఉత్తరాంధ్రలో షెడ్యూల్ ఇలా.. ►మధ్యాహ్నం 12 గంటలకు విశాఖపట్నంలోని పార్టీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం ►12:45 గంటలకు మధురవాడలోని ప్రభుత్వ స్కూల్లో నాడు నేడు పనులను పరిశీలించనున్న పార్టీ నేతలు. ►2:30 గంటలకు భోగిపాలెం నుండి ర్యాలీ ప్రారంభం. ►మూడు గంటలకు తగరపువలస ఫుట్‌బాల్ గ్రౌండ్ వద్ద బహిరంగ సభ. ►సభకు హాజరుకానున్న పార్టీ రీజినల్ ఇంఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ, పలువురు నేతలు కడప జిల్లా ప్రొద్దుటూరులో బస్సు యాత్ర ►మంత్రి అంజాద్ భాష, రీజనల్ కోఆర్డినేటర్ అమర్నాథ్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే హఫీస్ ఖాన్ యాత్రకు హాజరు ►మధ్యాహ్నం ఒంటి గంటకు వైవీఆర్ ఫంక్షన్ హాల్లో మీడియా సమావేశం ►3:15 గంటలకి బైక్ ర్యాలీ ప్రారంభం, ►సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభ కోస్తాంధ్రలో బాపట్లలో బస్సుయాత్ర ►చందోలు నుంచి బైకు ర్యాలీ ప్రారంభం ►కర్లపాలెం మీదగా బాపట్ల చేరుకోనున్న బస్సు యాత్ర ►అంబేద్కర్ బొమ్మ సెంటర్లో జరగనున్న బహిరంగ సభ -
రేపు బాపట్లలో సామాజిక సాధికార బస్సు యాత్ర
-
బాపట్ల ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఇంగ్లిష్ అదుర్స్
తాము చెప్పాలనుకున్న భావాన్ని వ్యక్తీకరించలేక, ఎలా వ్యక్తం చేయాలో తెలియక విద్యార్థులు సతమతమవుతుంటారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో కమ్యూనికేషనే ప్రధానం. కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడంతో అనేకమంది విద్యార్థులు ఉన్నత కొలువులు సాధించడంలో విఫలమవుతుంటారు. మరికొందరు ఉద్యోగాల్లో ఉన్నత స్థానాలను అధిరోహించలేక ఉన్నచోటే ఉండిపోతుంటారు. అయితే కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాధాన్యతను గుర్తించిన ఓ ఇంగ్లిష్ టీచర్.. విద్యార్థులు ఇకపై తమ భావాన్ని వ్యక్తపరచలేక ఇబ్బంది పడకూడదని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం వినూత్నంగా ఆలోచించాడు. ఆ ఆలోచనలోంచి పుట్టిందే పెన్ పాల్ కార్యక్రమం. ప్రస్తుతం ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ఫోనే దర్శనమిస్తోంది. వాట్సప్ చాటింగ్, ఈ-మెయిల్స్ ద్వారానే ఒకరినొకరు కమ్యూనికేట్ అవుతున్నారు. ఇలాంటి సమయంలో సదరు ఇంగ్లిష్ టీచర్ లెటర్ల(ఉత్తరాలు)కు పనిపెట్టారు. విద్యార్థులు తాము చెప్పాలనుకున్న భావాన్ని, విషయాన్ని ఉత్తరాల్లో రాయాలని సూచిస్తున్నాడు. ఇలా రాయడం వల్ల ఇంగ్లిప్ ప్లూయెన్సీగా రావడంతో పాటు, విద్యార్థులు ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడగలుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లాలోని ఐలవరం జిల్లా పరిషత్ పాఠశాలలో ఇంగ్లిష్ టీచర్‌గా పచ్చారు హరికృష్ణ పనిచేస్తున్నాడు. విద్యార్థుల్లోని హ్యాండ్ రైటింగ్‌కు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు వారి భావాలను స్పష్టంగా వ్యక్తీకరించాలని సూచిస్తున్నాడు. ఇందుకోసం నాలుగేళ్ల కిందట ప్రారంభించిన పెన్‌పాల్ కార్యక్రమం క్రమేణా సత్ఫలితానిస్తోంది. ఇక్కడి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అమెరికాలోని Nebraska ప్రాంతంలో ఉన్న రీగాన్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులతో కమ్యూనికేట్ అవుతున్నారు. దీంతో మన విద్యార్థుల్లో ఇంగ్లిష్ భాషా నైపుణ్యాలు గణనీయంగా మెరుగయ్యాయి. విద్యార్థులు తమ దినచర్య, పండుగలు, సెలవులు, తాము చదువుకునే పాఠాలు ఇలా.. ప్రతీ ఒక్కదాన్ని అమెరికాలోని తమ మిత్రులతో పంచుకుంటున్నారు. ఐలవరం పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న కె.రాగనందిని మాట్లాడుతూ "ఒకసారి నేను అమెరికా జెండాను చూడలేదని నా పెన్ స్నేహితుడితో చెప్పాను. అతను మాకు ఆ దేశ జెండాలను పంపాడు. అలాగే స్థానికంగా లభించే చాక్లెట్లు, టీ-షర్టులు పంపించాడు. వారికి నేను భారత జెండాలు, బిస్కెట్లు, ఇతర వస్తువులను పంపించా' అని తన అనుభవాన్ని పంచుకుంది. అమెరికా టు బాపట్లకు ఉత్తర ప్రత్యుత్తరాలు ఖర్చుతో కూడుకున్నవి. విద్యార్థులు రాసే ఉత్తరాలను కొరియర్ ద్వారా పంపడానికి రూ.25 వేల నుంచి రూ.30 వేలు ఖర్చవుతోందని.. ఈ మొత్తాన్ని తానే పెట్టుకుంటున్నట్లు హరికృష్ణ చెబుతున్నాడు. ప్రతీ ఏటా మూడు దఫాలుగా ఉత్తరాలను పంపిస్తున్నారు. పెన్ పాల్ ప్రోగ్రామ్‌తో పాటు మన విద్యార్థులు యుఎస్, కెనడా, మెక్సికో, స్వీడన్, క్రొయేషియా, డెన్మార్క్, ఫ్రాన్స్, పోలాండ్, ట్యునీషియా, జపాన్, దక్షిణ కొరియా, శ్రీలంక, బంగ్లాదేశ్, చిలీ, టర్కీతో సహా 60 దేశాలలోని సుమారు 300 పాఠశాలల విద్యార్థులతో స్కైప్ ద్వారా ఇంటరాక్ట్ అవుతున్నారు. స్పేస్ సైన్స్, సోషల్ స్టడీస్ గురించి విద్యార్థులు చర్చించుకుంటారని ఉపాధ్యాయుడు హరికృష్ణ చెబుతున్నారు. హరికృష్ణ ఇలా ఇప్పటివరకు స్కైప్ ద్వారా నాసా ప్లానెటరీ సైన్స్ విభాగంలో ప్రోగ్రామ్ సైంటిస్ట్ హెన్రీ థ్రోప్, నాసా చీఫ్ టెక్నాలజిస్ట్ జేమ్స్ ఆడమ్స్, ఎక్స్‌ఫ్లోర్ మార్స్ ప్రెసిడెంట్ జానెట్ ఐవీ, స్విట్జర్లాండ్‌కు చెందిన భౌతిక శాస్త్రవేత్త క్లెయిర్ లీలతో విద్యార్థులు సంభాషించారు. ఫేస్‌బుక్‌ను ప్రధాన సాధనంగా ఉపయోగించుకుని, తాను ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు హరికృష్ణ చెప్పాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులతో సంప్రదింపులు జరిపి, వారి అనుమతితో పెన్ పాల్ ఏర్పాటు చేశానని పేర్కొంటున్నాడు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులలో కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందించడం కోసమే తాను ఈ వినూత్న పద్ధతిని రూపొందించినట్లు చెప్పారు. తాను రూపొందించిన కార్యక్రమం వల్ల విద్యార్థుల కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగయ్యాయని, స్నేహితులతో తమ భావాలను చక్కగా వ్యక్తీకరించుకోగలుగుతున్నారని... ఒక ఉపాధ్యాయుడిగా తనకు ఇతకంటే ఏంకావాలని అంటున్నారు హరికృష్ణ. -
స్కూల్ బస్సు బోల్తా: 9 మంది విద్యార్థులకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
సాక్షి, బాపట్ల: అమృతలూరు మండలం కూచిపూడి వద్ద స్కూల్ బస్సు బోల్తా పడటంతో 9 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బస్సులో మొత్తం 35 మంది విద్యార్థులు ఉన్నారు. కూచిపూడి-పెద్దపూడి గ్రామాల మధ్య ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోతుండగా బస్సు అదుపు తప్పినట్లు తెలిసింది. స్వాతంత్ర్య వేడుకలు ముగించుకుని విద్యార్థులు తిరిగి ఇళ్లకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. గాయపడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చదవండి: కాకినాడలో విషాదం..పందుల్ని కాల్చబోతే పాపకు తూటా తగిలి.. -
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఫలితాలు విడుదల.. బాపట్ల యువకుడికి ఫస్ట్ ర్యాంక్
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఫ్ఎస్) ఎగ్జామినేషన్-2022 తుది ఫలితాలను యూపీఎస్సీ జులై 1న విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 147 మందిని ఐఎఫ్ఎస్కు యూపీఎస్సీ ఎంపిక చేసింది. కాగా బాపట్లకు చెందిన కొల్లూరు వెంకట శ్రీకాంత్ మొదటి ర్యాంకు సాధించాడు. హైదరాబాద్‌కు చెందిన సాహితిరెడ్డికి 48, తొగరు సూర్యతేజకు 66వ ర్యాంకు వచ్చింది. జనరల్ క్యాటగిరీలో 39 మంది, ఈడబ్ల్యూఎస్- 21, ఓబీసీ 54, ఎస్సీ-22- ఎస్టీ 11.. మొత్తం 147 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. కాగా ఐఎఫ్ఎస్ పరీక్షకు సంబంధించి గతేడాది నవంబర్‌లో రాత పరీక్షలను నిర్వహించగా.. ఇంటర్వ్యూలను ఈ ఏడాది జూన్‌లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
కుటుంబం దుఃఖంలో ఉంటే ఇంత నీచ రాజకీయం చేస్తావా
-
ప్లాన్ ప్రకారమే అమర్ హత్య: బాపట్ల ఎస్పీ
సాక్షి, బాపట్ల: చెరుకుపల్లి మండల పరిధిలో దారుణ హత్యకు గురైన పదో తరగతి స్టూడెంట్ అమర్నాథ్ ఉదంతంపై బాపట్ల ఎంపీ వకుల్ జిందాల్ స్పందించారు. ఈ హత్య ప్లాన్ ప్రకారమే జరిగిందని.. కేసుకు సంబంధించి పలు వివరాలను తెలియజేశారాయన. అమర్నాథ్ హత్య వెనుక రాజకీయ కారణాలు లేవు. ప్లాన్ ప్రకారం అతనిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. అమర్ సోదరికి ఫోన్స్, మెసేజ్ చేసి వెంకటేశ్వరరెడ్డి వేధిస్తున్నాడు. ఆ విషయం ఇంట్లో చెప్పడంతో.. అమర్ పై వెంకటేశ్వరరెడ్డి కోపం పెంచుకున్నాడు. నిందితుడు వెంకటేశ్వరరెడ్డికి హత్యలో గోపిరెడ్డి, వీరబాబు, సాంబిరెడ్డి సహకరించారు అని తెలిపారు. ఈ కేసులో వెంకటేశ్వరరెడ్డి సహా ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. సాంబిరెడ్డి పరారీలో ఉన్నాడని.. అతని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నట్లు వివరించారాయన. ఇదీ చదవండి: అమర్ కుటుంబానికి న్యాయం చేసి తీరతాం -
అమర్నాథ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుంది: ఎంపీ మోపిదేవి
సాక్షి, బాపట్ల: సోదరి రక్షణ కోసం ఎదురెళ్లి దుండగుల చేతిలో హతమైన విద్యార్థి అమర్నాథ్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, దోషులను కఠినంగా శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు ఎంపీ మోపిదేవి వెంకటరమణ. తన అక్కపై జరుగుతున్న వేధింపులను అడ్డుకునే యత్నంలో పదో తరగతి విద్యార్థి అమర్నాథ్ను నలుగురు కిరాతకంగా తగలబెట్టి కాల్చి చంపిన సంగతి తెలిసిందే. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండల పరిధిలోని ఉప్పలవారిపాలెంలో ఈ ఘోరం జరిగింది. ఈ ఘటన పట్ల ఎంపీ మోపిదేవి స్పందించారు. శనివారం ఉదయం ఉప్పలవారిపాలెంకు వెళ్లిన ఆయన అమర్నాథ్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ఓదార్చారు. ఈ కేసులో వీలైనంత త్వరగా న్యాయం చేస్తామని, దోషుల్ని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అమర్నాథ్ కుటుం సభ్యులకు హామీ ఇచ్చారాయన. అమర్నాథ్ కుటుంబాన్ని అన్నివిధాల ప్రభుత్వం ఆదుకుంటుందని ఎంపీ మోపిదేవి ప్రకటించారు. తక్షణ సాయంగా రూ.50 వేలను అందించారాయన. అలాగే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. ఇదీ చదవండి: అక్కను వేధించవద్దన్నందుకు అమానుషం -
టీడీపీ నాయకుడి ఇంట్లో ఐటీ సోదాలు..
రేపల్లె: బాపట్ల జిల్లా రేపల్లె పట్టణానికి చెందిన రొయ్యల వ్యాపారి, టీడీపీ నాయకుడు దండుప్రోలు పిచ్చయ్య ఇంట్లో గురువారం ఆదాయ పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేశారు. ఆయన సోదరుడు దండుప్రోలు వెంకటేశ్వరరావు ఇంట్లో, వారికి చెందిన రొయ్యల కంపెనీలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. పట్టణంలోని వేంకటేశ్వరస్వామి దేవాలయం పక్కన ఉన్న దండుప్రోలు పిచ్చయ్య ఇంటితోపాటు సమీపంలోని దండుప్రోలు వెంకటేశ్వరరావు నివాసం, వీరికి చెందిన రొయ్యల కంపెనీలో ఉదయం ఒకేసారి అధికారులు సోదాలు ప్రారంభించారు. వెంకటేశ్వరరావు ఇంట్లో, రొయ్యల కంపెనీలో మధ్యాహ్నం వరకు సోదాలు నిర్వహించారు. దండుప్రోలు పిచ్చయ్య ఇంట్లో మాత్రం రాత్రి వరకు సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒడిశాలోని పాల్కన్ రొయ్యల మేత, రొయ్యల ఎగుమతి కంపెనీతోపాటు ఆ సంస్థతో వ్యాపార లావాదేవీలు కలిగి ఉన్న కంపెనీలు, వాటి నిర్వాహకుల ఇళ్లలో ఐటీ సోదాలు జరుగుతున్నాయని, దీనిలో భాగంగా రేపల్లెలోని దండుప్రోలు పిచ్చయ్య, ఆయన తమ్ముడి ఇళ్లు, వారి కంపెనీలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. పిచ్చయ్య ఇంటి వద్ద ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. దండుప్రోలు పిచ్చయ్య ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తుండటం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ఇది కూడా చదవండి: అనుమతి లేకుండానే విదేశాలకు మార్గదర్శి ఎండీ.. -
ఆక్వా పార్కుతో రైతుకు మరింత భరోసా
బాపట్ల జిల్లాలో ఆక్వా పార్కు ఏర్పాటు వల్ల వేలాది మంది రైతులకు అనేక విధాలుగా మేలు కలగనుంది. రైతులకు స్థానికంగా అవసరమైన నాణ్యమైన సీడ్ దొరకనుంది. ప్రాసెసింగ్ యూనిట్లు కూడా అందుబాటులోకి రానుండటంతో గిట్టుబాటు ధర లభించనుంది. ఇక్కడి నుంచే విదేశాలకు ఎగుమతులు చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు జిల్లాలోని రేపల్లె, నిజాంపట్నం, బాపట్ల, కర్లపాలెం, పిట్టలవారిపాలెం, చీరాల, వేటపాలెం, చిన్నగంజాం, నగరం, భట్టిప్రోలు తదితర మండలాల పరిధిలో 21,400 ఎకరాల్లో రైతులు ఆక్వా సాగు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో 2013 నుంచి వెనామీ రకం 80 శాతం సాగు చేస్తుండగా, మిగిలిన రకాలు 20 శాతం సాగు చేస్తున్నారు. – సాక్షి ప్రతినిధి, బాపట్ల ఆక్వా పార్కు రైతులకు వరం రేపల్లె నియోజకవర్గం నిజాంపట్నం మండలంలోని పరిశావారిపాలెం వద్ద రూ.185 కోట్లతో 280 ఎకరాల్లో ఆక్వా పార్కు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ పార్కు నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు. ఈ పార్కులో పీతలు, పండుగప్పలతోపాటు పలు రకాల చేపలు, రొయ్యల సీడ్‌ను ఉత్పత్తి చేయనున్నారు. ప్రస్తుతం వెనామీ, టైగర్ రొయ్యలు, పీతలు, పండుగప్పల సీడ్‌ను రైతులు తమిళనాడులోని రామే శ్వరం, రామనాథపురంతోపాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి తదితర ప్రాంతాలకు వెళ్లి తెచ్చుకుంటున్నారు. దీనివల్ల రవాణా ఖర్చులు అధికం కావడంతో రైతులకు ఆరి్థక భారం పెరుగుతోంది. అదేవిధంగా ప్రస్తుతం రైతుల నుంచి వ్యాపారులు రొయ్యలు, చేపలు కొనుగోలు చేసి కృష్ణపట్నం, కాకినాడ, చెన్నై ప్రాంతాలకు తీసుకువెళ్లి అక్కడే ప్రాసెసింగ్ చేసి ఎగుమతి చేస్తున్నారు. జిల్లా నుంచి ఏటా 52 దేశాలకు రూ.2వేల కోట్ల విలువైన రొయ్యలు, రూ.250 కోట్ల మేర చేపల ఎగుమతులు జరుగుతున్నాయి. అయినా స్థానికంగా ప్రాసెసింగ్ యూనిట్ లేకపోవడంతో రైతులకు గిట్టుబాటు ధరలు లభించడంలేదు. ఆక్వా పార్కు ఏర్పాటు వల్ల స్థానికంగా సీడ్ దొరకడంతోపాటు ప్రాసెసింగ్ యూనిట్లు అందుబాటులోకి వస్తాయి. దీనివల్ల రైతులకు ఖర్చులు తగ్గడంతోపాటు అధిక ధరలు లభించనున్నాయి. ఫలితంగా జిల్లాతోపాటు సమీప ప్రాంతాల్లో పదివేల ఎకరాల వరకు ఆక్వా సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. రైతులకు మరింత మేలు మా ప్రాంతంలో ఆక్వా పార్కు ఏర్పాటు చేయడం వల్ల రైతులకు మరింత మేలు కలుగుతుంది. ఇక్కడ రొయ్యలతోపాటు పీతలు ఎక్కువగా సాగు చేస్తున్నారు. స్థానికంగా పీతల సీడ్ దొరకదు. తమిళనాడుకు వెళ్లాలంటే రవాణా ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఇక్కడే సీడ్ దొరికితే ఖర్చులు తగ్గుతాయి. గిట్టుబాటు ధర లభిస్తుంది. – మోపిదేవి శివనాగేశ్వరరావు, ఆక్వా రైతు, నిజాంపట్నం జగనన్నకు ధన్యవాదాలు మా మండలంలో ఆక్వా పార్కు ఏర్పాటు చేస్తున్నందుకు సీఎం జగనన్నకు ధన్యవాదాలు. పార్కు వస్తే అన్ని రకాల సీడ్ దొ రుతుంది. రవాణా ఖర్చులు మిగులుతాయి. ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయడం వల్ల రైతులకు మంచి ధర లభిస్తుంది. – కొక్కిలిగడ్డ జగదీష్, నిజాంపట్నం మండలం -
మత్స్యకార భరోసాపై సీఎం జగన్ ట్వీట్
తాడేపల్లి: బాపట్ల జిల్లా నిజాంపట్నం వేదికగా మంగళవారం అయిదో విడత వైఎస్సార్ మత్స్యకార భరోసా నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. కంప్యూటర్లో బటన్ నొక్కి 1,23,519 మత్స్యకార కుటుంబాల ఖాతాల్లో రూ.231 కోట్లు జమ చేశారు. అనంతరం మత్స్యకార భరోసాపై సీఎం జగన్ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘సముద్రంలో వేట నిషేధ సమయంలో మత్స్యకారుల కుటుంబాలు ఇబ్బంది పడకుండా మన ప్రభుత్వంలో వైయస్సార్ మత్స్యకార భరోసా ద్వారా వారికి సాయం అందిస్తున్నాం. ఈ పథకం ప్రవేశపెట్టి నాలుగేళ్ల లోపే ఐదు విడతలనూ పూర్తి చేశాం. ఒక్కో మత్స్యకార సోదరుడికి మొత్తం రూ. 50 వేలను అందజేశాం’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. సముద్రంలో వేట నిషేధ సమయంలో మత్స్యకారుల కుటుంబాలు ఇబ్బంది పడకుండా మన ప్రభుత్వంలో వైయస్సార్ మత్స్యకార భరోసా ద్వారా వారికి సాయం అందిస్తున్నాం. ఈ పథకం ప్రవేశపెట్టిన నాలుగేళ్ళలోపే ఐదు విడతలనూ పూర్తి చేసి ఒక్కో మత్స్యకార సోదరుడికి మొత్తం రూ.50 వేలను అందజేశాం.… pic.twitter.com/79r8mU0wFs — YS Jagan Mohan Reddy (@ysjagan) May 16, 2023 చదవండి: జగనన్నా మీ మేలు మరిచిపోము.. నువ్వే మా ధైర్యం, మా నమ్మకం బాబు చెప్తే ఎవరికి విడాకులు ఇవ్వమన్నా ఇస్తాడు.. పవన్ గాలి తీసేసిన సీఎం జగన్ -
జగనన్నా మీ మేలు మరిచిపోము.. నువ్వే మా ధైర్యం, మా నమ్మకం
సాక్షి,బాపట్ల: బాపట్ల జిల్లా నిజాంపట్నం వేదికగా అయిదో విడత వైఎస్సార్ మత్స్యకార భరోసా నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. కంప్యూటర్లో బటన్ నొక్కి 1,23,519 మత్స్యకార కుటుంబాల ఖాతాల్లో రూ.231 కోట్లు జమ చేశారు. ఈ సందర్భంగా నిజాంపట్నంకు చెందిన బొమ్మిడి బాలరాజు అనే లబ్ధిదారుడు మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. ‘అన్నా నమస్తే, నేను మత్స్యకార కుటుంబం నుంచి వచ్చాను, గతంలో మత్స్యకారులకు భరోసా లేదు, గతంలో వేట నిషేద భృతి నామామాత్రం, ఏప్రిల్, మే నెలలో దరఖాస్తు చేస్తే నవంబర్, డిసెంబర్ నెలల్లో ఇచ్చేవారు, అవి కూడా కొందరికే వచ్చేవి, కానీ మన జగనన్న మా కష్టాలు పరిశీలించి మత్స్యకారులను ఆదుకునేలా భరోసా కల్పించారు, సకాలంలో మాకు సాయం అందిస్తున్నారు, ఏటా రూ. 10 వేల చొప్పున అకౌంట్లో వేస్తున్నారు, జగనన్నా మీ మేలు మరిచిపోము, మత్స్యకారుడు గతంలో చనిపోతే శవం కనపడితేనే డబ్బులు ఇస్తామనేవారు, అప్పుడు ఆఫీస్‌ల చుట్టూ తిరగగా తిరగగా ఆ కుటుంబానికి రూ. 5 లక్షలు ఎప్పటికో ఇచ్చేవారు, కానీ మన జగనన్న వచ్చిన తర్వాత రూ. 10 లక్షలు అకౌంట్లో వేస్తున్నారు. శవం కనబడినా కనబడకపోయినా సాయం అందుతుంది, గతంలో ఆయిల్ సబ్సిడీ చిన్న బోట్లకు ఉండేది కాదు, కేవలం పెద్ద బోట్లకు కూడా వెయ్యి లీటర్లకే ఇచ్చేవారు, ఆ డబ్బు కోసం ఆఫీసుల చుట్టూ తిరిగేవాళ్ళం, కొంతమందికి వచ్చేవే కాదు, కానీ ఇప్పుడు పెద్ద బోట్లకు, చిన్న బోట్లకు కూడా సబ్సిడీ ఇస్తున్నారు, పైగా వెంటనే మన ఖాతాలో, మన మత్స్యకారులంతా జగనన్నను మరిచిపోకూడదు. గతంలో నిజాంపట్నం హార్బర్ లేదు, చాలా కష్టాలు పడ్డాం, సముద్రంలోకి వెళ్ళాలంటే మెరక, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు, మన జగనన్న ఆ హార్బర్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేస్తున్నారు. జగనన్నా నువ్వే మా ధైర్యం, మా నమ్మకం. ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉంటాయి, ధన్యవాదాలు’ అని సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమాన్ని కొనియాడాడు. -
వేట సమయంలో చనిపోయిన మత్స్యకారులకు రూ.10 లక్షలు ఇస్తున్నాం
-
నిజాంపట్నంలో మత్స్యకార భరోసా సభ.. జగనన్నకు జన నీరాజనం (ఫొటోలు)
-
‘ వైఎస్సార్ మత్స్యకార భరోసా’ నిధుల విడుదల: భారీగా తరలి వచ్చిన జన సందోహం (ఫొటోలు)
-
చేపల వేటపై 2 నెలలు నిషేధం.. మత్స్యకారులకు అండగా ఏపీ ప్రభుత్వం
చీరాల టౌన్: రెండున్నర నెలల పాటు సముద్ర తీర ప్రాంతాల్లో హైలెస్సా.. హైలెస్సా అనే మాటలు వినపడవు. తీరం ఒడ్డున మత్స్యకారుల సందడి కనిపించదు. సముద్రంలో మత్య్సకారుల బోట్లు కనిపించవు. సముద్రం బోసిగా దర్శనమివ్వబోతోంది. ప్రభుత్వం వేటపై నిషేధాజ్ఞలు జారీ చేసింది. కానీ వేట తప్ప మరో పని తెలియని మత్స్యకారుల పరిస్థితి ఈ సంధికాలంలో సుడిగండంలో ఉన్న మత్య్సకారులకు అండగా సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నిలవనున్నారు. మే 15 కల్లా గంగపుత్రులకు మత్య్సకార భరోసా కింద ఒక్కో మత్య్సకార కుటుంబానికి ఆర్థిక తోడ్పాటు అందించేలా రూ.10 వేలు ఇవ్వను న్నారు. ఈనెల 15 నుంచి జూన్ 15 తేదీ వరకు సముద్రంలో చేపల వేట నిలుపుదల చేస్తున్నట్లు మత్స్యశాఖ అధికారులు ప్రకటించారు. ప్రతిఏటా ఈ సమయంలో చేపలు పునరుత్పత్తి సమ యం సందర్భంగా సముద్రంలో మరబోట్లు, యాంత్రీకరణ తెప్పలకు నిషేధ సమయంలో పూర్తిగా వేటను నిలుపుదల చేయాలని ఆదేశాలిచ్చారు. నిషేధ సమయంలో మత్స్యకారులకు వైఎస్సార్ సీపీ సర్కారు ఒక్కో కుటుంబానికి ఆర్థిక సాయం అందించనుంది. బాపట్ల జిల్లా పరిధిలోని ఆరు నియోజకవర్గాలు ఉండగా రేపల్లె, బాపట్ల, చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లోని ఏడు మండలాల్లో 9600 మత్య్సకార కుటుంబాలు ఉన్నాయి. బాపట్ల జిల్లాలో 50 వేల మత్య్సకారులు ఉండగా 25000 మంది మత్య్సకారులు వేటపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఒక్కో బోటుకు ఆరుగురు మత్య్సకారులు ఉంటారు. బాపట్ల జిల్లాలో ఉన్న ఏడు తీరప్రాంత మండలాల్లో 76 కిలో మీటర్లు ఉన్న సముద్రతీర ప్రాంతంలో 50,000 మంది మత్య్సకార జనాభా, 9600 మత్య్సకార కుటుంబాలు ఉన్నాయి. జిల్లాలో మోటారు, మెకనైజ్డ్ బోట్లు 2924 పైచిలుకు బోట్లు ఉన్నాయి. జిల్లాలోని రేపల్లె, నిజాంపట్నం, బాపట్ల, చీరాల, వేటపాలెం, చినగంజాం మండలాల్లో సముద్ర తీరప్రాంతం ఉంది. సముద్రతీర ప్రాంతం జిల్లాలోని రేపల్లెలోని లంకెనవాలిపల్లి దిబ్బ నుంచి చినగంజాం మండలం ఏటిమొగ వరకు తీరప్రాంతం విస్తరించి ఉంది. ఈ మండలాల్లోని మత్య్సకారులు సముద్రంలో వేట చేసి మత్స సంపదను విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. జూన్ 14 వరకు సముద్రంలో వేట నిషేధం విధించడంతో మత్య్సకారుల వేట సామగ్రిని, బోట్లను ఒడ్డుకు తీసుకువచ్చి నిలుపుదల చేశారు. కుటుంబ పోషణకు అండగా మత్య్సకార భరోసా.. సాధారణంగా వాడరేవు మత్స్యకారులు కృష్ణా జిల్లా మచిలీపట్నం, నెల్లూరు జిల్లా రామాయపట్నం వరకు వేటకు వెళ్లి గురకా, పాములు, బొంత, కూనాము, వంజరం, పండుగప్పలు లాంటి చేపలను పట్టుకొస్తుంటారు. నిషేధ కాలం రెండున్నర నెలలు ఉండటంతో మత్య్సకారులు ఇబ్బందులు ఇబ్బందులకు తొలగించేందుకు ప్రభుత్వం మత్య్సకార భరోసా అందిస్తూ అండగా నిలుస్తోంది. బోట్లతో వేట సాగిస్తే చర్యలు సముద్రంలో చేపల సంతానోత్పత్తి పెరిగే కారణంగా శనివారం నుంచి జూన్ 14 వరకు వేట నిషేఽ దం అమలు చేస్తున్నాం. సంప్రదాయ తెప్పలు వేట సాగించుకోవచ్చనని, మెకనైజ్డ్ ఇంజిన్ బోట్లతో సముద్రంలో వేట సాగిస్తే చర్యలు తీసుకుంటాం. మత్య్సకారులు కేంద్రం ప్రభుత్వ ఆదేశాలు విధిగా పాటించాలి. మత్య్సకార భరో సా కింద బోట్లు పరిశీలన చేసి దరఖా స్తులను ఆన్లైన్ నిక్షిప్తం చేస్తాం. విచారణ చేసి మే 1న భరోసా తుది జాబితా ప్రకటిస్తాం. మేలో సీఎం జగన్ మత్య్సకారులకు భరోసా సాయాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. – ఎ.సురేష్, మత్య్సశాఖ జిల్లా అధికారి, బాపట్ల -
మా నమ్మకం నువ్వే జగన్ అంటూ ప్రజల నినాదాలు
-
ప్యాడీ డ్రయ్యర్: ధర రూ. 15 లక్షలు.. 50–60% సబ్సిడీ! పొలం దగ్గరే ఇలా!
రైతులు రోడ్లపై ధాన్యాన్ని ఆరబెడుతూ ప్రజలకు అసౌకర్యం కలిగించటం తగదని సుప్రీంకోర్టు ఇటీవల వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా ధాన్యాన్ని కొద్ది గంటల్లోనే నాణ్యత కోల్పోకుండా ఆరబెట్టుకోవడానికి ట్రాక్టర్‌తో నడిచే పాడీ డ్రయ్యర్లు వీలు కల్పిస్తున్నాయి. 50 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రతతో ధాన్యాన్ని నాణ్యత చెడకుండా, మొలక శాతం తగ్గకుండా ఆరబెట్టే ఆధునిక సాంకేతికతతో కూడిన పాడీ డ్రయర్లు బాపట్లలోని కోత అనంతర పరిజ్ఞాన పరిశోధన కేంద్రం ద్వారా రైతులకు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ధాన్యాన్ని నూర్చిన తర్వాత తేమ తగ్గేవరకూ సరిగ్గా ఆరబెట్టకపోవటం వల్ల సుమారు 10 శాతం మేరకు నష్టం కలుగుతోందని అంచనా. అధిక తేమ ఉన్న ధాన్యాన్ని బస్తాల్లో నిల్వ చేస్తే ధాన్యం వేడెక్కి రంగు మారుతుంది. అటువంటి అనుకూల వాతావరణంలో ముక్క పురుగులు, శిలీంధ్రాలు ఆశిస్తాయి. బూజు పడుతుంది. ధాన్యం చెడిపోయి వాసన వస్తుంది. వరి ధాన్యాన్ని (కంబైన్ హార్వెస్టర్) యంత్రాల ద్వారా కోసిన తర్వాత సక్రమంగా ఆరబెట్టకపోతే నాణ్యత దెబ్బతింటుంది. 12% కన్నా తక్కువ తేమ శ్రేయస్కరం సాధారణంగా కంబైన్ హార్వెస్టర్‌తో గింజరాలు నష్టాన్ని తగ్గించడానికి వరి ధాన్యంలో తేమ శాతం 22–24% ఉన్నప్పుడు వరి కోతలు చేస్తుంటారు. నాణ్యత కోల్పోకుండా ఉండాలంటే ధాన్యం నూర్చిన 24 గంటల్లోగా తేమ శాతాన్ని 17–18కి తగ్గేలా ఆరుదల చేయాల్సి ఉంటుంది. వరి ధాన్యాన్ని నాణ్యత కోల్పోకుండా ఆరు నెలల వరకు నిల్వ ఉంచాలంటే తేమను 12–13 శాతానికి తగ్గించాల్సి ఉంటుంది. ఏడాది కంటే ఎక్కువ కాలం నిల్వ ఉంచాలంటే 12 కన్నా తక్కువ శాతానికి తేమను తగ్గించాల్సి ఉంటుంది. ఏకకాలంలో రైతులందరూ పంట నూర్పిళ్లు చేయటం వల్ల పాత పద్ధతుల్లో నేలపైన నచ్చు/ పరదాలపై లేదా రోడ్లపైన ధాన్యాన్ని ఆరబెట్టడం సాధ్యం కావటం లేదు. ఒక్కోసారి అకాల వర్షాల వల్ల ఆరబెట్టిన ధాన్యం తడిచి నాణ్యత మరింత కోల్పోయే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ట్రాక్టర్ ద్వారా నడిచే మొబైల్ ప్యాడీ డ్రయ్యర్లు రైతులకు ఉపయోగకరంగా ఉన్నాయి. గ్రీన్‌సిగ్నల్ పరిశోధనా సంస్థలు, కంపెనీలు రూపొందించే వ్యవసాయ యంత్రాలు, పరకరాలను అధికారికంగా క్షేత్రస్థాయిలో సబ్సిడీపై అందుబాటులోకి తేవాలంటే వాటి పనితీరును పరిశీలించి కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖలోని యంత్రీకరణ– సాంకేతిక విభాగం ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది జనవరి 23న యంత్రీకరణ– సాంకేతిక విభాగం డిప్యూటీ కమిషనర్ ఎ.ఎన్. మెష్రం 32 యంత్రాలు, పరికరాలకు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. చెన్నైలోని కర్ది డ్రయ్యర్స్ సంస్థ రూపొందించిన ప్యాడీ మొబైల్ డ్రయ్యర్ కూడా ఒకటి. సబ్–మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్ (ఎస్.ఎం.ఎ.ఎం.) పథకం ద్వారా కస్టమ్ హైరింగ్ సెంటర్స్ / హైటెక్ హబ్స్, గ్రామస్థాయి ఫామ్ మెషినరీ బ్యాంక్స్‌కు మాదిరిగానే స్వీయ సహాయక బృందాల (ఎస్.హెచ్.జి.ల)కు కూడా ఈ డ్రయ్యర్‌ను సబ్సిడీపై అందించవచ్చని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీలు, చిన్న, సన్నకారు రైతులు, మహిళలకు 60%, ఇతరులకు 50% సబ్సిడీపై ఈ మొబైల్ పాడీ డ్రయ్యర్‌ను అందించవచ్చని ఆ ఉత్తర్వు పేర్కొంది. బ్యాచ్‌కు 2–12 టన్నులు కోయంబత్తూరులోని ఐసిఏఆర్ అనుబంధ సంస్థ అయిన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్‌లోని ప్రాంతీయ విభాగంతో పాటు, బాపట్లలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అనుబంధ కోత అనంతర పరిజ్ఞాన పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు తమ 2.5 టన్నుల మొబైల్ పాడీ డ్రయ్యర్ పనితీరును పరీక్షించి, సంతృప్తిని వ్యక్తం చేశాయని కర్ది డ్రయ్యర్స్ సంస్థ తెలిపింది. ధాన్యాన్ని ఎత్తిపోయటం ద్వారా ఆరుదల చేసే అనేక స్టాటిక్(స్థిర), మొబైల్(చర) డ్రయ్యర్లను ఈ సంస్థ రూపొందిస్తూ దేశ విదేశాల్లో విక్రయిస్తోంది. స్థిరంగా ఒకచోట నెలకొల్పి విద్యుత్/ డీజిల్ జనరేటర్ ద్వారా ధాన్యాన్ని ఆరుదల చేసే 12 టన్నుల సామర్థ్యం గల డ్రయ్యర్లను సైతం ఈ సంస్థ రూపొందించింది. అదేవిధంగా, పొలం దగ్గరకే తీసుకువెళ్లి ధాన్యాన్ని నూర్చిన వెంటనే అక్కడికక్కడే ఆరబెట్టుకునేందుకు ఉపయోగపడే మొబైల్ పాడీ డ్రయ్యర్లలో బ్యాచ్‌కు 2 టన్నుల నుంచి 70 టన్నుల సామర్థ్యం కలిగిన డ్రయ్యర్లు అందుబాటులోకి వచ్చాయి. ట్రాక్టర్‌తో పొలం దగ్గరకే లాక్కెళ్లి రీసర్క్యులేటరీ వ్యవస్థ ద్వారా ధాన్యాన్ని ఆరుదల చేయడానికి ఉపకరించే 2 టన్నుల సామర్ధ్యంగల మొబైల్ డ్రయ్యర్ ధర రూ. 15 లక్షలు. 50–60% సబ్సిడీపై అందించడానికి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదిస్తున్నామని కర్ది డ్రయ్యర్స్ సంస్థ జనరల్ మేనేజర్ దిలీపన్(90940 13375) తెలిపారు. వరితోపాటు మొక్కజొన్న బ్యాచ్‌కు 1 టన్ను నుంచి 5 టన్నుల సామర్థ్యం గల మొబైల్ పాడీ డ్రయ్యర్ల ద్వారా వరి ధాన్యంతో పాటు మొక్కజొన్నలు, తీపి మొక్కజొన్నలు, బార్లీ, గోధుమలను కూడా ఆరుదల చేయవచ్చని దిలీపన్ వివరించారు. 35–65 హెచ్‌పి ట్రాక్టర్ పిటిఓ ద్వారా ఇవి పనిచేస్తాయి. అతి తక్కువ ఖర్చుతో ధాన్యాలను ఆరబెట్టడంతో పాటు ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారించుకోవచ్చు. ఎండలో ఆరుబయట ఆరబెట్టే సమయంలో 20% సమయంలోనే (2–2.5 గంటలు) ఈ డ్రయ్యర్‌తో కోత కోసిన రోజే, తక్కువ శ్రమతో ఆరుదల చేసి, వెంటనే బస్తాల్లోకి నింపుకోవచ్చు. ఎక్కువ తక్కువ లేకుండా ధాన్యం అంతా సమంగా, సక్రమంగా ఆరుదల జరుగుతుంది కాబట్టి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. వెంటనే అమ్మేసుకోవాల్సిన అవసరం ఉండదు. నిశ్చింతగా నిల్వ ఉంచుకొని మంచి ధరకు అమ్ముకోవచ్చు. మొబైల్ డ్రయ్యర్ పనితీరు బాగుంది పచ్చి వరి ధాన్యాన్ని (బక్కెట్ ఎలివేటర్‌తో తిరిగి ఎత్తిపోస్తూ) ఆరుదల చేసే ఈ 2.5 టన్నుల మొబైల్ డ్రయ్యర్‌ను బాపట్లలోని మా పరిశోధనా కేంద్రంలో పరీక్షించాం. తేమ శాతం 22% నుంచి 13.5%కి తగ్గింది. చాలా బాగా పనిచేస్తోంది. బ్యాచ్‌కు ముప్పావు ఎకరంలో వరి ధాన్యం (35 బస్తాలు) ఆరుదల చేయొచ్చు. రోజుకు 5 బ్యాచ్‌లు చేయొచ్చు. డ్రయ్యింగ్ రెండు దశల్లో చేయాలి. 17–18% వరకు మొదటి దశ, 13% వరకు రెండో దశలో తగ్గించాలి. ఈ ధాన్యాన్ని విత్తనంగా కూడా వాడుకోవచ్చు. మొలక శాతంలో ఎటువంటి తేడా ఉండదు. నూక శాతం తగ్గుతున్నట్లు కూడా నిర్థరణైంది. ప్రభుత్వానికి నివేదిక పంపాం. – డా. బి.వి.ఎస్. ప్రసాద్ (80083 73741), ప్రధాన శాస్త్రవేత్త (వ్యవసాయ ఇంజనీరింగ్),అధిపతి, కోత అనంతర పరిజ్ఞాన పరిశోధన కేంద్రం, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, బాపట్ల -
అమెరికాలో ఎయిర్పోర్ట్ ప్రమాదంలో తెలుగు వ్యక్తి దుర్మరణం
న్యూయార్క్: స్నేహితుడికి స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి వచ్చిన భారతీయ అమెరికన్, తెలుగు వ్యక్తి విశ్వచంద్ కోళ్ల (47) అనుకోని ఎయిర్పోర్ట్ బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మార్చి 28న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భారత్ నుంచి వస్తున్న విశ్వచంద్ స్నేహితుడైన ఒక సంగీత కళాకారుడు మసాచుసెట్స్ రాష్ట్ర రాజధాని బోస్టన్ సిటీలోని లోగన్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌లో దిగనున్నారు. ఆయన కోసం విశ్వచంద్ లోగన్ ఎయిర్‌పోర్ట్‌కు మార్చి 28 సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఎస్యూవీ వాహనంలో చేరుకుని టర్మినల్–బి వద్ద వేచిచూస్తున్నారు. విమాన ప్రయాణికులు, లగేజీతో అదే సమయంలో అటుగా వచ్చిన డార్డ్మౌత్ ట్రాన్‌పోర్టేషన్ బస్సు విశ్వచంద్‌ను పక్క నుంచి గుద్దుకుంటూ వెళ్లింది. దీంతో రెండు వాహనాల మధ్య ఇరుక్కుని నలిగిపోయి అక్కడే పడిపోయారు. ప్రథమ చికిత్స చేసే ప్రయత్నం చేసినా అప్పటికే ప్రాణాలు కోల్పోయారు. విశ్వచంద్ది ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా రేపల్లె అని సమాచారం. అమెరికాలో తకేడా ఫార్మాస్యూటికల్స్ కంపెనీలోని గ్లోబల్ అంకాలజీ విభాగంలో డాటా అనలిస్ట్‌గా పని చేస్తున్నారు. ఆయనకు భార్య సౌజన్య, కుమారులు ధృవ, మాధవ్ ఉన్నారు. విశ్వచంద్ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు బంధువులు గోఫండ్‌మీ ద్వారా ఇప్పటికే 4,06,151 డాలర్లు (దాదాపు రూ.3.3 కోట్లు) విరాళంగా సేకరించారు.