
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఫ్‌ఎస్) ఎగ్జామినేషన్-2022 తుది ఫలితాలను యూపీఎస్సీ జులై 1న విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 147 మందిని ఐఎఫ్ఎస్‌కు యూపీఎస్సీ ఎంపిక చేసింది. కాగా బాపట్లకు చెందిన కొల్లూరు వెంకట శ్రీకాంత్ మొదటి ర్యాంకు సాధించాడు. హైదరాబాద్‌కు చెందిన సాహితిరెడ్డికి 48, తొగరు సూర్యతేజకు 66వ ర్యాంకు వచ్చింది.
జనరల్ క్యాటగిరీలో 39 మంది, ఈడబ్ల్యూఎస్- 21, ఓబీసీ 54, ఎస్సీ-22- ఎస్టీ 11.. మొత్తం 147 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. కాగా ఐఎఫ్‌ఎస్ పరీక్షకు సంబంధించి గతేడాది నవంబర్‌లో రాత పరీక్షలను నిర్వహించగా.. ఇంటర్వ్యూలను ఈ ఏడాది జూన్‌లో నిర్వహించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment