results declared
-
తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
సాక్షి,హైదరాబాద్: టీజీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు ఆదివారం విడుదల అయ్యాయి. 1:50 ప్రకారం మెయిన్స్‌కు క్వాలిఫై అయిన అభ్యర్థుల హాల్‌టికెట్ల నంబర్లను టీజీపీఎస్సీ వెల్లడించింది. సెప్టెంబర్ 21 నుంచి 27వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. ఫలితాల కోసం క్లిక్ చేయండిఇదిలా ఉండగా.. గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాల్లో 1:100 రేషియోతో అభ్యర్థుల ఎంపిక ఉండాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. కానీ, ప్రభుత్వం మాత్రం 1:50 రేషియాతో ఫలితాలను వెల్లడించడం గమనార్హం. -
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఫలితాలు విడుదల.. బాపట్ల యువకుడికి ఫస్ట్ ర్యాంక్
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఫ్ఎస్) ఎగ్జామినేషన్-2022 తుది ఫలితాలను యూపీఎస్సీ జులై 1న విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 147 మందిని ఐఎఫ్ఎస్కు యూపీఎస్సీ ఎంపిక చేసింది. కాగా బాపట్లకు చెందిన కొల్లూరు వెంకట శ్రీకాంత్ మొదటి ర్యాంకు సాధించాడు. హైదరాబాద్‌కు చెందిన సాహితిరెడ్డికి 48, తొగరు సూర్యతేజకు 66వ ర్యాంకు వచ్చింది. జనరల్ క్యాటగిరీలో 39 మంది, ఈడబ్ల్యూఎస్- 21, ఓబీసీ 54, ఎస్సీ-22- ఎస్టీ 11.. మొత్తం 147 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. కాగా ఐఎఫ్ఎస్ పరీక్షకు సంబంధించి గతేడాది నవంబర్‌లో రాత పరీక్షలను నిర్వహించగా.. ఇంటర్వ్యూలను ఈ ఏడాది జూన్‌లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఏపీ టెట్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ పరీక్ష (ఏపీ టెట్–2022) ఫలితాలను పాఠశాల విద్యాశాఖ గురువారం విడుదల చేసింది. ఈ పరీక్షకు హాజరైన 4,07,329 మంది అభ్యర్థుల మార్కుల వివరాలు https://cse.ap.gov.in/ DSE/ వెబ్సైట్లో పొందుపరిచారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్సీ, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు అర్హత పరీక్ష మార్కులను నార్మలైజేషన్ పద్ధతి అమలు చేసిన తర్వాత మొత్తం 58.07 శాతం మంది టెట్‌లో అర్హత సాధించారు. అభ్యర్థులు తమ మార్కుల వివరాలను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. చదవండి: (రేషన్ కార్డుదారులకు కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్) -
ఏపీ లాసెట్, ఎడ్‌సెట్- 2022 ఫలితాలు విడుదల
సాక్షి, విజయవాడ: ఏపీ లాసెట్, ఏపీ ఎడ్‌సెట్- 2022 ఫలితాలు విడుదలయ్యాయి. లాసెట్, పీజీఎల్ సెట్, ఏపీ ఎడ్‌సెట్ పరీక్షలను శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నిర్వహించింది. లాసెట్ ఫలితాల్లో టాప్ టెన్ ర్యాంకుల్లో మొదటి ఆరు ర్యాంకులు సాధించి మహిళలు సత్తా చాటారు. ఏపీ ఎడ్‌సెట్ ఫలితాలు ► బైలాజికల్ సైన్లో గుంటూరు జిల్లాకు చెందిన విద్యార్థి ఓరం అమర్నాథ్ రెడ్డికి మొదటి ర్యాంకు. ► మాథమ్యాటిక్స్‌లో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన మల్లెల గిరీష్ కుమార్ రెడ్డికి తొలి ర్యాంకు. ► ఇంగ్లీష్‌లో కేరళ రాష్టానికి చెందిన అంజనాకు మొదటి ర్యాంకు. ► సోషల్ స్టడీస్‌లో నంద్యాల జిల్లాకు చెందిన ఏ శివానీకి మొదటి ర్యాంకు. ► ఫిజికల్ సైన్స్‌లో విజయనగరం జిల్లాకు చెందిన కె.వాణికి మొదటి ర్యాంకు. ఏపీ లాసెట్ ఫలితాల్లో సత్తాచాటిన మహిళలు.. ఏపీ లాసెట్ ఫలితాల్లో మహిళలు సత్తా చాటారు. కృష్ణా జిల్లా చల్లపల్లికి చెందిన బి.కీర్తికి లాసెట్ 5 ఇయర్స్ స్ట్రీమ్‌లో మొదటి ర్యాంకు వచ్చింది. టాప్ టెన్ ర్యాంకుల్లో మొదటి ఆరు ర్యాంకులు మహిళలకే దక్కాయి. ఇదీ చదవండి: పాఠం స్కాన్ చేసేయొచ్చు.. మళ్లీ మళ్లీ వినొచ్చు -
ఏపీపీఎస్సీ 2018 గ్రూప్-1 ఫలితాల ప్రకటన
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2018 గ్రూప్ 1 ఫలితాలు ప్రకటించింది. ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ మంగళవారం సాయంత్రం ఫలితాలను విడుదల చేశారు. మొత్తం లక్షా నలభై వేల మంది పరీక్షలు రాయగా. స్క్రీనింగ్ టెస్ట్‌కి యాభై వేల మందికి పైగా హాజరయ్యారు. 167 గ్రూప్ వన్ పోస్టులకి గాను 325 మంది ఇంటర్వ్యూలకి హాజరయ్యారు. కరోనాతో పాటు న్యాయపరమైన అంశాల వల్ల ఫలితాలు ప్రకటించడం ఆలస్యమైందని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. ఫలితాల్లో.. పిఠాపురం ప్రాంతానికి చెందిన సుష్మితకు ఫస్ట్ ర్యాంక్ దక్కింది. వైఎస్సార్ జిల్లా కొత్తులగుట్టకు చెందిన శ్రీనివాసులుకు రెండో ర్యాంక్, హైదరాబాద్‌కు చెందిన సంజన సిన్హాకు మూడో ర్యాంక్ దక్కింది. మొదటి పది స్ధానాలలో ఏడుగురు మహిళలు ఉండడం గమనార్హం. గ్రూప్-1 2018 నోటిఫికేషన్లో 167 పోస్టులకుగానూ.. 165 పోస్టులకు ఇప్పుడు ఫలితాలు ఇచ్చారు. వీటిలో 30 పోస్టులు డిప్యూటీ కలెక్టర్, 28 డిఎస్పీ పోస్టులు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 12వ తేదీలోపు బోర్డు ముందు హాజరై.. హామీ పత్రం ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారాయన. వచ్చే నెలలోనే గ్రూప్-2 నోటిఫికేషన్లు ఉంటాయని, రాబోయే కాలంలో మరో 13 నోటిఫికేషన్లు ఉంటాయని, మరో రెండు వేల పోస్టులు భర్తీ చేస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. -
సివిల్స్-2020 ఫలితాలు విడుదల
న్యూఢిల్లీ: సివిల్స్-2020 తుది ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. మొత్తం 761 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. వీరిలో 545 మంది పురుషులు, 216 మంది మహిళలు ఉన్నారు. 263 మంది జనరల్, 229 ఓబీసీ, 122 ఎస్సీ, 61 ఎస్టీ, 86 మంది ఈడబ్య్లూఎస్ కేటగిరి అభ్యర్థులు ఎంపికయ్యారు. సివిల్స్-2020 తుది ఫలితాల్లో ఐఐటీ బాంబే నుంచి బీటెక్(సివిల్ ఇంజనీరింగ్) చేసిన శుభం కుమార్‌కు మొదటి ర్యాంకు రాగా, భోపాల్ నిట్ నుంచి బీటెక్(ఎలక్రికల్ ఇంజనీరింగ్) చేసిన జాగృతి అవస్తికి రెండో ర్యాంకు వచ్చింది. మహిళల విభాగంలో అవస్తి టాపర్‌గా నిలవడం విశేషం. కాగా ఈ ఏడాది జనవరిలో సివిల్ సర్వీసెస్ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూలు నిర్వహించిన అనంతరం శుక్రవారం సాయంత్రం తుది ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. ఇక సివిల్స్‌లో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు ► పి. శ్రీజకు 20వ ర్యాంకు ►మైత్రేయి నాయుడుకు 27వ ర్యాంకు ►జగత్ సాయికి 32వ ర్యాంకు ►దేవగుడి మౌనికకు(కడప) 75వ ర్యాంకు ►రవి కుమార్‌కు 84వ ర్యాంకు ►యశ్వంత్ కుమార్ రెడ్డికి 93వ ర్యాంకు సివిల్స్-2020 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టీఎస్ ఎంసెట్ అగ్రికల్చర్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఎంసెట్ అగ్రికల్చర్ ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ టి. పాపిరెడ్డి శనివారం విడుదల చేశారు. పరీక్ష రాసిన 63,857 మంది అభ్యర్థులకు గాను 59,113 మంది క్వాలిఫై అయినట్లు పాపిరెడ్డి తెలిపారు. అర్హత సాధించిన అభ్యర్థులు ర్యాంకు కార్డులను www.sakshieducation.com వెబ్ సైట్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. కాగా మెడిసిన్ అగ్రికల్చర్ విభాగంలో మొత్తం 79,978 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. గత నెల 28, 29వ తేదీల్లో నిర్వహించిన పరీక్షకు 63,856 మంది హాజరయ్యారు. కాగా నవంబర్‌లో కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఎంసెట్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్ లో టాప్ 10 రాంకులు వీరే.. 1. గుట్టి చైతన్య సింధు... తెనాలి 2. సాయి త్రిషా రెడ్డి... సంగారెడ్డి 3. తుమ్మల స్నేహిత....హైదరాబాద్. 4. దర్శి విష్ణు సాయి..... నెల్లూరు. 5. మల్లిడి రిషి..... ఖమ్మం 6. మల్లిక్ చిగురుపాటి... మేడ్చల్ 7. ఆవుల సుబాస్.... హైదరాబాద్. 8. గారపాటి గుణ చైతన్య... కర్నూల్ 9. జి.వినయ కుమార్... చిత్తూరు 10. కోటావెంకట్.... కృష్ణా జిల్లా -
1,027 మందికి గ్రూప్–2 కొలువులు
సాక్షి, హైదరాబాద్: రెండేళ్లుగా ఎదురు చూస్తున్న గ్రూప్–2 ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. వివాదాలు, న్యాయ సమస్యలతో ఇన్నాళ్లూ ఆగిపోయిన పోస్టుల భర్తీ పూర్తయింది. 2015, 2016 సంవత్సరాల్లో జారీచేసిన గ్రూప్–2 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1,032 ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టగా అందులో 1,027 పోస్టులకు టీఎస్పీఎస్సీ అభ్యర్థులను ఎంపిక చేసింది. 5 పోస్టులకు అభ్యర్థులు లభించకపోవడంతో వాటిని భర్తీ చేయలేదు. పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను www.tspsc.gov.inలో అందుబాటులో ఉంచింది. టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి అధ్యక్షతన కమిషన్ కార్యాలయంలో సమావేశం జరిగింది. అసలేం జరిగిందంటే.. గ్రూపు–2 పోస్టుల భర్తీకి అదే ఏడాది నవంబర్ 11, 13 తేదీల్లో రాత పరీక్షలను నిర్వహించింది. ఈ పరీక్షల సమయంలో కొన్ని పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లు అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను ఒకరివి మరొకరికి ఇచ్చారు. దీనిని గుర్తించిన ఇన్విజిలేటర్లు వాటిని వెనక్కి తీసుకొని ఎవరి ఓఎంఆర్ షీట్లను వారికి ఇచ్చేశారు. అప్పటికే ఓఎంఆర్ షీట్ తీసుకున్న అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాలను అందులో నమోదు చేశారు. తరువాత ఎవరి ఓఎంఆర్ షీట్లను వారికి ఇచ్చేయడంతో ఆ అభ్యర్థులు వైట్నర్ ఉపయోగించి తమ వ్యక్తిగత వివరాలను సరిదిద్దారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్లు కూడా టీఎస్పీఎస్సీకి నివేదికలు ఇచ్చారు. దీంతో టీఎస్పీఎస్సీ ఈ అంశంపై టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఘటనపై నివేదిక ఇచ్చింది. ఓఎంఆర్ షీట్లో వ్యక్తిగత సమాచారాన్ని తప్పుగా నమోదు చేసినందున, వైట్నర్ ఉపయోగించి సరిచేసిన అభ్యర్థులను పరిగణనలోకి తీసుకోవాలని, వైట్నర్ ఉపయోగించి పార్ట్–బీలోని జవాబులను కనుక దిద్దితే వాటిని పరిగణనలోకి తీసుకోవద్దని సిఫారసు చేసింది. దీని ఆధారంగా జవాబు పత్రాలను వాల్యుయేషన్ చేసింది. అందులో వైట్నర్ వాడిన 343 మంది సహా 3,147 మందికి 2017లో 1:3 నిష్పత్తి లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించింది. అయితే వైట్నర్ ఉపయోగించిన వారికి సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించవద్దని కొంత మంది కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. వైట్నర్ ఉపయోగించిన వారిని తొలగించాలని తీర్పు ఇచ్చారు. ఈ ఉత్తర్వుల మేరకు టీఎస్పీఎస్సీ వైట్నర్ ఉపయోగించిన 343 మందిని తొలగించి.. ఆ తర్వాత మెరిట్ లో ఉన్న 343 మందికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించింది. సింగిల్ జడ్జి తీర్పుపై వైట్నర్ ఉపయోగించిన బాధిత అభ్యర్థులు ధర్మాసనానికి అప్పీల్ చేసుకున్నారు. టెక్నికల్ కమిటీ సిఫారసులను అమలు చేయాలని, పార్ట్–ఏలో వైట్నర్ ఉపయోగించిన వారిని పరిగణనలోకి తీసుకోవాలని ధర్మాసనం తీర్పు ఇచ్చింది. -
టీఆర్టీ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యాశాఖలో ఉపాధ్యాయ నియామకాల్లో భాగంగా సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) తెలుగు మీడియం పోస్టుల భర్తీకి చేపట్టిన టీచర్ రిక్రూట్మెంట్ టెస్టు (టీఆర్టీ) తుది ఫలితాలను టీఎస్పీఎస్సీ శుక్రవారం విడుదల చేసింది. 3,325 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. 2017లో జారీ చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా 3,786 పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టింది. మరో 910 ఎస్జీటీ ఇంగ్లిష్ మీడియం పోస్టుల భర్తీ కోసం 2018 ఫిబ్రవరి నుంచి మార్చి వరకు టీఎస్పీఎస్సీ రాత పరీక్షలు నిర్వహించింది. అదే ఏడాది డిసెంబర్లో ఎస్జీటీ ఇంగ్లిష్ మీడియం ఫలితాలు వెల్లడించింది. దీంతో రీలింక్విష్మెంట్ తీసుకోవాలంటూ కొంతమంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ఎస్జీటీ తెలుగు మీడియం పోస్టుల అవసరం లేని వారు రీలింక్విష్ మెంట్ ఇవ్వాలని టీఎస్పీఎస్సీ పేర్కొంది. ఆ మేరకు అభ్యర్థులు కొందరు రీలింక్విష్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత ఏప్రిల్ మొదటి వారంలో ఎస్జీటీ తెలుగు మీడియం పోస్టులకు ఎంపికైన వారి ఫలితాలు వెల్లడించిం ది. అయితే తెలుగు మీడియం అభ్యర్థులకు ఇంగ్లిష్ మీడి యం పోస్టులు వస్తే అవి వద్దంటూ రీలింక్విష్‌మెంట్‌కు అవకాశం ఇవ్వాలంటూ మరికొంత మంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. దీంతో మళ్లీ రీలింక్విష్‌మెంట్‌కు అవకాశం ఇవ్వాల్సి రావడంతో తుది ఫలితాల వెల్లడి ఆలస్యమైంది. ఎట్టకేలకు శుక్రవారం 3,325 ఎస్జీటీ తెలుగు మీడియం పోస్టులకు అభ్య ర్థులను ఎంపిక చేసింది. వికలాంగుల కేటగిరీకి సంబంధించి విద్యాశాఖ నుంచి రావాల్సి ఉన్నందున 270 పోస్టుల ఫలితాలను తర్వాత ప్రకటి స్తామని పేర్కొంది. ఏజెన్సీ ప్రాంతా నికి సంబంధించిన అంశాల్లో కోర్టు వివాదాలు ఉన్నందున 117 పోస్టుల ఫలితాలను విత్ హెల్డ్‌లో పెట్టింది. మరోవైపు వివిధ కేటగిరీల్లో అర్హులైన అభ్యర్థులు లభించనందున 74 పోస్టులు ఖాళీగా ఉండిపోయాయి. మొత్తానికి 3,325 పోస్టుల ఫలితాలను వెల్లడించింది. ఈ జాబితాను త్వరలోనే తమ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని టీఎస్పీఎస్సీ తెలిపింది. మరోవైపు ఎస్జీటీ ఇంగ్లిష్ మీడియం పోస్టుల ఫలితాలు త్వరలోనే వెల్లడిసా ్తమని టీఎస్పీఎస్సీ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత గ్రూప్–2 ఫలితాలు విడుదల చేస్తామని వెల్లడించాయి. టీఎస్పీఎస్సీ ఫలితాలు విడుదల చేయడంతో తదుపరి కార్యాచరణను ప్రకటించేందుకు విద్యాశాఖ సిద్ధం అవు తోంది. ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగులు ఇచ్చేందుకు 15 రోజుల్లో షెడ్యూలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై మంత్రి సబిత విద్యాశాఖ, టీఎస్పీఎస్సీ అధికారులతో చర్చించిన సంగతి తెలిసిందే. -
సీమ్యాట్‌లో ఒకే ఒక్కడు
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఆమోదం పొందిన మేనేజ్మెంట్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించిన కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్టు (సీమ్యాట్), జాతీయ స్థాయి ఫార్మసీ, ఎంఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్టు (జీప్యాట్) ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. గత నెల 28, 29 తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహించింది. సీమ్యాట్‌లో శర్మ నవాంశ్ సురేంద్ర అనే విద్యార్థి ఒక్కరే 100 పర్సంటైల్ సాధిం చి మొదటి ర్యాంకర్‌గా నిలిచినట్లు ఎన్టీఏ వెల్లడించింది. జ్యీపాట్‌లోనూ 302 మార్కులతో యావల్కర్ అంకిత నితిన్ ఒక్కరే 100 పర్సంటైల్ సాధించి మొద టి ర్యాంకర్‌గా నిలిచినట్లు వివరించింది. జీప్యాట్ స్కోర్‌కు మూడేళ్ల వ్యాలిడిటీ ఉంటుందని వెల్లడించింది. సీమ్యాట్‌కు హాజరయ్యేందుకు 64,582 మంది దరఖాస్తు చేసుకోగా 54,516 మంది హాజరైనట్లు వెల్లడించింది. బాలికలు 29,166 మంది బాలురు, 25,350 మంది బాలికలు హాజరైనట్లు వెల్లడించింది. జీప్యాట్ రాసేందుకు 42,827 మంది దరఖాస్తు చేసుకోగా, 40,649 మంది పరీక్షకు హాజరయ్యారు. అందులో 18,044 మంది బాలురు, 22, 604 మంది బాలికలు ఉన్నట్లు వివరించింది. అందులో పీహెచ్డీ లో ప్రవేశానికి, స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకునేం దుకు 4,119 మంది అర్హత సాధించినట్లు తెలిపింది. అందులో 1,909 మంది బాలురు, 2,210 మంది బాలికలు ఉన్నారు. ఇందుకు అన్‌రిజర్వ్‌డ్‌లో 141 మార్కులు కటాఫ్ అని, దాంతో 1,952 మంది ఎంపి కయ్యారు. ఓబీసీ నాన్ క్రీమీలేయర్‌లో కటా ఫ్ 117 మార్కులుగా 1,103 ఎంపిక అయ్యారు. ఎస్సీలలో 95 మార్కుల కటాఫ్‌తో 626 మంది, ఎస్టీలలో 74 కటాఫ్‌తో 313 మంది ఎంపికైనట్లు వివరించింది. -
ఓయూసెట్ ఫలితాలు విడుదల
హైదరాబాద్: పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఓయూసెట్– 2018 ఫలితాలను వీసీ ప్రొఫెసర్ రాంచంద్రం గురువారం విడుదల చేశారు. ఫలితాలను ఓయూ, పీజీ అడ్మిషన్స్ వెబ్సైట్లలో అందుబాటు లో ఉంచారు. 70,361 మంది ఓయూసెట్‌కు దరఖాస్తు చేసుకోగా 59,638 మంది ప్రవేశ పరీక్షలకు హాజరయ్యారని, వీరిలో 56,457 (94.67%) మంది అర్హత సాధించినట్లు వీసీ తెలిపారు. శుక్రవారం(జూలై 7) నుంచి 17 వర కు విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, 9 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఓయూతోపాటు తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ వర్సిటీల్లోనూ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశా మన్నారు. ఈ నెల 21లోగా కౌన్సెలింగ్ పూర్తి చేసి.. 23 నుంచి తరగతులను, అదేరోజు నుంచి హాస్టల్ ప్రవేశాలనూ ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి, పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ కిషన్, పలు వర్సిటీల రిజిస్ట్రార్లు తదితరులు పాల్గొన్నారు. -
నేడు తెలంగాణ టెన్త్ ఫలితాలు
-
సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
న్యూఢిల్లీ: అఖిల భారత స్థాయి ఉద్యోగుల ఎంపిక కోసం నిర్వహించే సివిల్స్ ప్రాథమిక పరీక్షల (ప్రిలిమ్స్) ఫలితాలను శుక్రవారం యూపీఎస్సీ (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) విడుదల చేసింది. ఆగస్టు 7న జరిగిన ఈ పరీక్షకు వేల మంది అభ్యర్థులు హాజరయ్యారు. మెయిన్స్‌కు అర్హత సాధించిన ఉద్యోగార్థులు కమిషన్ వెబ్‌సైట్‌లోని నిర్దేశిత పేజీకి వెళ్లి తమ పూర్తి సమాచారం నింపి దరఖాస్తు చేయాలనీ, ఈ పేజీ అక్టోబరు 7 నుంచి 20 సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందని కమిషన్ పేర్కొంది. తుది ఫలితాలు వెలువడిన తర్వాతనే అభ్యర్థుల మార్కులు, కటాఫ్ మార్కులు, సమాధానాల కీలను వెబ్సైట్లో అప్లోడ్ చేస్తామని యూపీఎస్సీ చెప్పింది. -
ఏపీ ఇంటర్ ఫస్టియర్ ఫలితాల విడుదల
-
అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ మే 25 నుంచి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 25 నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్ రెండు వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. గురువారం మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రథమ సంవత్సర పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఫలితాల వివరాలు తెలియజేసిన ఆయన అనంతరం మాట్లాడుతూ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల వివరాలు తెలియజేశారు. ఈ పరీక్షలు రాసే విద్యార్థులు మే 1 లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రీ కౌంటింగ్ కోసం రూ.600 మీ సేవా ద్వారా, ఏపీ ఆన్ లైన్ ద్వారా కూడా చెల్లించే వెసులుబాటు ఉంది. కాగా, ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షల్లో జనరల్ విభాగాల్లో 72 మందిపై, ఒకేషనల్ విభాగంలో 12 మందిపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలియజేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 4శాతం ఉత్తీర్ణత పెరిగింది. -
ఏపీ ఇంటర్ ఫస్టియర్ ఫలితాల విడుదల
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ ఫలితాలను విడుదల చేశారు. 62.98 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం 4,61,932 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, బాలుర ఉత్తీర్ణత శాతం 59 గాను, బాలికల ఉత్తీర్ణత శాతం 67 గాను నమోదైంది. ఎప్పటిలాగే బాలుర కంటే బాలికలే ఎక్కువ శాతం ఉత్తీర్ణులయ్యారు. జనరల్‌లో 52.13 శాతం మందికి ఎ గ్రేడ్, 24.08 శాతం మంది బి గ్రేడ్, 13 శాతం మంది సి గ్రేడ్, 6.10 శాతం మంది డి గ్రేడ్‌లో పాసయ్యారని గంటా శ్రీనివాసరావు తెలిపారు. కృష్ణాజిల్లా (76 శాతం) అగ్రస్థానంలో నిలిచింది. వైఎస్ఆర్ కడప (59 శాతం) జిల్లా చిట్టచివరి స్థానంలో ఉంది. వచ్చే సంవత్సరానికి అక్కడ ఫలితాలు మెరుగుపరిచేందుకు ప్రయత్నం చేస్తామని గంటా శ్రీనివాసరావు చెప్పారు. ఒకేషనల్‌లో 60 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. పూర్తి మార్కులతో కూడిన ఫలితాలకు ఇక్కడ క్లిక్ చేయండి.