
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ పరీక్ష (ఏపీ టెట్–2022) ఫలితాలను పాఠశాల విద్యాశాఖ గురువారం విడుదల చేసింది. ఈ పరీక్షకు హాజరైన 4,07,329 మంది అభ్యర్థుల మార్కుల వివరాలు https://cse.ap.gov.in/ DSE/ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్‌సీ, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు అర్హత పరీక్ష మార్కులను నార్మలైజేషన్ పద్ధతి అమలు చేసిన తర్వాత మొత్తం 58.07 శాతం మంది టెట్‌లో అర్హత సాధించారు. అభ్యర్థులు తమ మార్కుల వివరాలను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment