కూనో చీతాలకు నీరు పోశాడు.. ఉద్యోగం నుంచి సస్పెండ్‌! | Kuno National Park Cheetah Responds To Command, Drinks Water Offered To Her Video Goes Viral | Sakshi
Sakshi News home page

కూనో చీతాలకు నీరు పోశాడు.. ఉద్యోగం నుంచి సస్పెండ్‌!

Published Sun, Apr 6 2025 1:49 PM | Last Updated on Sun, Apr 6 2025 3:33 PM

Kuno Park Cheetah Responds Drinks Water Offered

గాంధీనగర్‌: ఎండా కాలంలో దాహంతో ఉన్న చీతాలకు నీరు అందించిన కారణంగా ఓ డ్రైవర్‌ తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్‌ పార్క్‌లో చోటుచేసుకుంది. అదేంటీ.. నీరు పోసినందుకు ఎందుకు ఉద్యోగం పోయిందనుకుంటున్నారా? అసలు ట్విస్ట్‌ అక్కడే ఉంది.

వివరాల ప్రకారం.. కూనో పార్కులో చీతా జ్వాల దాని పిల్లలు ఇటీవల ఓ జంతువును వెంబడిస్తూ గ్రామంలోకి చొరబడ్డాయి. పొలంలోని కొందరు వాటిని చూసి ఆందోళనకు గురయ్యారు. గ్రామస్థులు చీతాలపై రాళ్ల దాడికి తెగబడ్డారు. అక్కడి నుంచి పారిపోయి ప్రాణాలతో బయటపడ్డాయి. ఈ క్రమంలో ఓ చెట్టు కింద సేద తీరుతున్న జ్వాల (చిరుత) దాని నాలుగు పిల్లలను గమనించిన అటవీ శాఖకు చెందిన ఓ డ్రైవర్.. వాటికి నీరు అందించాడు. ఓ క్యానులో నీటిని తీసుకొచ్చి.. పాత్రలో నీటిని నింపి వాటిని తాగమంటు పిలిచాడు. దాహంతో ఉన్న ఆ వన్యప్రాణులు వాటిని తాగాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియో అటవీ శాఖ అధికారులు దృష్టికి చేరింది. ఆ డ్రైవర్‌పై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఓ ప్రకటనలో..‘చీతాలకు నీరు అందించాలని గ్రామస్థులు అనుకుంటున్నారు. ఈ జీవాలు సహజంగానే ముప్పు కలిగించేవి కావని తెలుసుకుంటున్నారు. కానీ, ఈ ప్రాంతం సహజ పర్యావరణ వ్యవస్థలో భాగమని వారంతా గ్రహించారు. అందుకే, వన్యప్రాణులతో (చీతాలతో) స్నేహపూర్వకంగా ఉండాలని కోరుకుంటున్నారు. కానీ, ఇది ఏ మాత్రం పద్ధతి కాదు. ఇలాంటి చర్యలు వాటి మనుగడకే ప్రమాదం’ అంటూ వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు.. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ సదరు డ్రైవర్‌ చేసిన పనికి అభినందనలు తెలుపుతున్నారు. ఆ వ్యక్తి చేసింది నిజంగా గొప్ప పని.. మనుషులు, వన్యప్రాణులకు మధ్య ఇలాంటి స్నేహపూర్వక బంధం ఉండాలి అంటూ కామెంట్స్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement