‘వస్తానని చెప్పావు కదా బేబీ’! : భోరున విలపించిన పైలట్‌ భార్య | IAF PilotSiddharth YadavFiancee Breaks Down Next To His Coffin | Sakshi
Sakshi News home page

‘వస్తానని చెప్పావు కదా బేబీ’! : భోరున విలపించిన పైలట్‌ భార్య

Published Sat, Apr 5 2025 2:56 PM | Last Updated on Sat, Apr 5 2025 4:08 PM

IAF PilotSiddharth YadavFiancee Breaks Down Next To His Coffin

జాగ్వార్ ఫైటర్ జెట్ ప్రమాదంలో మరణించిన IAF పైలట్ సిద్ధార్థ్ యాదవ్ దుర్మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. క్లిష్టమైన సమయంలో అత్యంత ధైర్య  సాహసాలను ప్రదర్శించి,  తోటి పైలట్‌ను, అనేక మంది  పౌరులను కాపాడిన  సిద్దార్థ్‌ యాదవ్‌కు యావద్దేశం సంతాపం ప్రకటించింది. ఆయన త్యాగం, ధైర్యాన్ని గుర్తు చేసుకుంటూ  అశ్రు నయనాలతో సెల్యూట్‌ చెబుతున్నారు. త్రివర్ణ పతాకం కప్పి, పూర్తి సైనిక గౌరవాలతో మజ్రా భల్ఖిలోని ఆయప స్వగ్రామంలో  ఏప్రిల్ 4న అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల సమయంలో   సిద్ధార్థకకు కాబోయే భార్య సోనియా యాదవ్ అతని శవపేటిక పక్కనే కుప్పకూలిపోయింది. పెళ్లి బారాత్‌లో ఆనందంగా ఊరేగి వెళ్లాల్సిన బిడ్డకు, అంతిమ వీడ్కోలు పలకాల్సి రావడం కన్నతల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది.

ఫ్లైట్ లెఫ్టినెంట్ సిద్ధార్థ్ ఈ జెట్ ప్రమాదంలో మరణించడానికి కేవలం పది రోజుల ముందు సోనియా యాదవ్‌తో నిశ్చితార్థం జరిగింది. నవంబరు 2న అంగరంగవైభంగా ఈ జంటకు పెళ్లిచేసేందుకు ఇరు కుటుంబాలు ఏర్పాట్లలో మునిగి ఉండగా ఊహంచని విషాదం తీరని శోకాన్ని మిగిల్చింది. ఫైటర్‌జెట్‌ ప్రమాదంలోమరణించిన సిద్దార్థ్‌ పార్ధివ దేహాన్ని స్వగ్రామానికి తరలించి, గౌరవ లాంఛనాలతో అంత్య క్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాబోయే భార్య సోనియా సిద్దార్థ శవపేటిక పక్కనే కూలిపోయింది.  

ఇదీ చదవండి:  మొన్ననే ఎంగేజ్‌మెంట్‌, త్వరలో పెళ్లి, అంతలోనే విషాదం

భోరున విలపిస్తూ అంతులేని శోకంతో ఆమె మాట్లాడిన మాటలు అక్కుడన్న ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించాయి. సిద్ధార్థ్ యాదవ్ శవపేటికను కౌగిలించుకుని ‘‘వస్తానని చెప్పావు కదా బేబీ...రానేలదు ("బేబీ తు ఆయా నహీ...తునే కహా థా మై ఆవుంగా’’) అంటూ విలపించిన తీరు అందర్నీ కలిచివేసింది. కన్నీళ్లు ఆపుకోవడం అక్కడున్న ఎవ్వరి తరమూ కాలేదు. పలువురు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు , ఇతర అధికారులు  సిద్ధార్థ్‌కు వీడ్కోలు పలికారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement