Chittoor
-
చెట్టు కొమ్మలు తొలగిస్తుండగా ప్రమాదం
తిరుపతి రూరల్ : తిరుపతి రూరల్ మండలం చిగురువాడ పంచాయతీ పరిధిలోని సంస్కృతి నగర్లో ఆదివారం సాయంత్రం పెనుగాలులకు చెట్టుకొమ్మలు విరిగి విద్యుత్తు తీగలపై పడ్డాయి. దీంతో ఆ ప్రాంతంలో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది. స్థానికుల సమాచారం మేరకు విద్యుత్తు శాఖలో జూనియర్ లైన్మెన్గా పనిచేస్తున్న మురళి అక్కడకు చేరుకుని విద్యుత్తు సబ్ స్టేషన్ నుంచి లైన్ ఆఫ్ చేసుకుని చెట్టు కొమ్ములు తొలగించే పనులు చేపట్టాడు. ట్రాన్స్ఫార్మర్ కూడా ఆఫ్ చేసుకుని దానిపై నిలుచుని చెట్టు కొమ్ములు తీస్తుండగా హఠాత్తుగా కరెంటు సరఫరా కావడంతో షాక్‌కు గురై ట్రాన్స్‌ఫార్మర్‌పైనే కుప్పకూలిపోయాడు. స్థానికులు అరవడంతో అతడితో పాటు వచ్చిన విద్యుత్తు సిబ్బంది సబ్ స్టేషన్‌కు సమాచారం అందించి ఆ ప్రాంతంలో మొత్తం సరఫరా నిలిపివేయించారు. అనంతరం లైన్మెన్ను కిందకు దించి చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ● విద్యుత్ షాక్‌కు గురైన లైన్‌మన్ -
ప్రశాంతంగా ‘నీట్’
● 677 మంది విద్యార్థులు హాజరు ● 33 మంది గైర్హాజరు చిత్తూరు కలెక్టరేట్ : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆధ్వర్యంలో ఆదివారం నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) ప్రశాంతంగా నిర్వహించారు. చిత్తూరులోని రెండు పరీక్ష కేంద్రాల్లో మొత్తం 710 మంది విద్యార్థులకు గాను 677 మంది విద్యార్థుళు హాజరయ్యారు. 33 మంది గైర్హాజరైనట్లు పరీక్షల సిటీ కో–ఆర్డినేటర్ జీవనజ్యోతి వెల్లడించారు. ముందుగానే కేంద్రాలకు పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించగా, 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకే విద్యార్థులను ఆయా కేంద్రాల్లోకి అనుమతిస్తామని అధికారులు ముందస్తుగా వెల్లడించారు. దీంతో పలు ప్రాంతాల నుంచి పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు ముందుగానే చేరుకున్నారు. అధికారుల తనిఖీ పీవీకేఎన్, సావిత్రమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలల్లోని పరీక్ష కేంద్రాలను కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ, ఎస్పీ మణికంఠ చందోలు తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. కార్యక్రమంలో చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు,ప్రిన్సిపల్ మనోహర్, ఏఆర్ డీఎస్పీ మహబుబ్‌బాషా, పీవీకేఎన్ పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ శరవణ పాల్గొన్నారు. -
దర్జాగా ప్రభుత్వ భూమి ఆక్రమణ
సాక్షి, టాస్క్‌ఫోర్స్: అధికారం అండతో కూటమి నేతలు రెచ్చిపోతున్నారు. విలువైన ప్రభుత్వ భూములను యథేచ్ఛగా ఆక్రమించుకుంటున్నారు. ఈ విషయం తెలిసినా రెవెన్యూ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తుండడం విమర్శలకు దారితీస్తోంది. చంద్రగిరి పట్టణంలో విలువైన ప్రభుత్వ భూమిని ఓ మైనార్టీ నేత అక్రమించుకుని గుట్టు చప్పుడు కాకుండా షెడ్డు నిర్మించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చంద్రగిరి లెక్కదాఖలా సర్వే నంబరు 61/3లో కొంత మేర గ్రామకంఠం భూమి ఉంది. ఆ భూమిలో కొన్నేళ్లుగా ముస్లింలు పీర్ల పండుగను నిర్వహించుకుంటున్నారు. మిగిలిన సందర్భంగా భూమి ఖాళీగా ఉంది. ప్రస్తుతం దాని విలువ రూ.50 లక్షలకు పైగా ఉంది. దీనిపై అధికార పార్టీకి చెందిన ఓ మైనార్టీ నేత కన్ను పడింది. ఇటీవల వరుస సెలవులు రావడంతో శరవేగంగా అక్రమంగా షెడ్డును నిర్మించాడు. తరతరాలుగా పీర్లచావిడిగా వినియోగించుకుటున్న భూమిని ఆక్రమించుకోవడంపై ముస్లిం పెద్దలు మండిపడుతున్నారు. 2022లో కూడా ఈ స్థలాన్ని ఆక్రమించుకోవడానికి అతను యత్నించాడని, అప్పట్లో రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారని పేర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అతను ఆక్రమించుకున్నాడని వాపోతున్నారు. తహసీల్దార్ కార్యాలయానికి 100 మీటర్ల దూరంలోనే ఆక్రమణ తహసీల్దార్ కార్యాలయానికి 100 మీటర్ల దూరంలో ఈ ఆక్రమణ జరుగుతున్నా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై ముస్లింలు, స్థానికులు మండిపడుతున్నారు. అక్రమంగా షెడ్డు నిర్మిస్తున్నట్టు రెండు వారాల క్రితం రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెబుతున్నారు. రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సీఎం, డిప్యూటీ సీఎం, కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు చెబుతున్నారు. దీనిపై వీఆర్వో పురుషోత్తంను వివరణ కోరేందుకు ఫోన్లో ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. -
కుక్కల దాడిలో బాలుడికి గాయాలు
చౌడేపల్లె : బోయకొండ గంగమ్మ దర్శనార్థం ఆదివారం తిరుపతి నుంచి వచ్చిన ఓ కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. అమ్మవారి దర్శనంకోసం నడచి వెళుతుంగా ఫణి(10) అనే బాలుడిపై వీధి కుక్కలు దాడిచేశాయి. దీంతో చిన్నారి తొడభాగంలో తీవ్రంగా గాయాలయ్యాయి. ఆందోళన చెందిన కుటుంబీకులు వెంటనే బోయకొండ గంగాపురంలోని పీహెచ్‌సీకి వెళ్లారు అక్కడ వైద్యం చేసేందుకు ఎవరూ లేరు. దీంతో గంగమ్మ ఆలయ పరిపాలన కార్యాలయానికి చేరుకుని తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఫలితం లేకపోవడంతో బాలుడిని హుటాహుటిన చౌడేపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించాల్సి వచ్చింది. నిత్యం వేలాది మంది విచ్చేసే బోయకొండ ఆలయం వద్ద కనీసం ప్రాథమిక చికిత్సకు అవసరమైన మందులు కూడా లేకపోవడంపై భక్తులు మండిపడుతున్నారు. అలాగే పెద్దసంఖ్యలో హల్చల్ చేస్తున్న వీధి కుక్కలను నియంత్రించాల్సిన అవసరముందని కోరుతున్నారు. -
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లా ఆస్పత్రి సమస్యల వలయంలోకి వెళ్లిపోయింది. ఖాళీ పోస్టులను సకాలంలో భర్తీ చేయకపోవడంతో సిబ్బంది కొరత వేధిస్తోంది. అవసరాలకు అనుగుణంగా మందులు లేకపోవడంతో వైద్యం పడకేసింది. దీనికితోడు ఆస్పత్రి నిర్వహణకు సైతం బడ్జెట్లో కోత విధిం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరంలోని జిల్లా ప్రభుత్వాస్పత్రిలో 400 పడకలు ఉన్నాయి. నిత్యం 1,200 వరకు ఓపీలు వస్తుంటాయి. అలాగే ఇన్ పేషెంట్లు 350 మంది ఉంటుంటారు. అత్యవసర సేవల నిమిత్తం జిల్లా నలుమూలల నుంచి 200 కేసుల వరకు ఓపీకి వస్తుంటాయి. అయితే ప్రభుత్వాస్పత్రిలో పలు సమస్యలు తలెత్తడంతో సరైన వైద్యం అందడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భర్తీలో నిర్లక్ష్యం జిల్లా ప్రభుత్వాస్పత్రిలో ప్రస్తుతం డాక్టర్ల నుంచి సిబ్బంది వరకు పలు పోస్టులు ఖాళీలగా ఉన్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పోస్టులు ఖాళీ అయితే వెంటనే భర్తీ చేసేలా చర్యలు తీసుకునేవారు. ఇప్పుడు పోస్టుల భర్తీ...అయోమయంగా మారింది. ప్రధానంగా ఆస్పత్రిలో డాక్టర్ల కొరత ఉంది. ఇద్దరు డాక్టర్లతోనే పోస్టుమార్టం చేయిస్తూ నెట్టుకొస్తున్నారు. ప్రతి నెలా 40 పైగా పోస్టుమార్టం కేసులు ఇక్కడకు వస్తుంటాయి. నలుగురు డాక్టర్లుంటే పోస్టుమార్టం సమస్య తీరుతుందని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. పోక్సో కేసు కౌన్సెలింగ్‌కు సంబంధించి ఒక గైనిక్ డాక్టర్ ఉండాలనే నిబంధన ఉంది. అలాగే హెడ్‌నర్సు పోస్టులు రెండు ఖాళీలున్నాయి. స్టాఫ్ నర్సులు 78 మందికి గాను 61 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఇందులో కూడా కొంత మందిని అదనపు పనులకు కేటాయించారు. ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓలు 15 మంది అవసరమవుతోందని, జీడీఓలు 8 మంది ఉండాలని, ఫార్మాసిస్ట్లు 6 మంది దాకా అవసరమని ఆస్పత్రి వర్గాలు వెల్లడిస్తున్నాయి. సిబ్బంది కొరత కారణంగా పనిభారం పెరుగుతోందని పలువురు సిబ్బంది వాపోతున్నారు. దీంతో ఆస్పత్రికి వచ్చే రోగులకు సక్రమంగా సేవలు అందించేందుకు ఇబ్బందులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో అందని మందులు జిల్లా ఆస్పత్రికి ముఖ్యంగా మందుల సరఫరాలో జాప్యం జరుగుతోంది. సకాలంలో అందక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. డ్రగ్స్ కేంద్రం నుంచే సరఫరా రావడం లేదని.ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. కనీసం జ్వరం, దగ్గు, జలుబుకు సైతం మందులు లేకపోవడం గమనార్హం. దీంతో బయట మందులు కొనుగోలు చేసుకోవాలని రోగులను కోరాల్సి వస్తోందని, వారు తమపై మండిపడుతున్నారని వైద్య సిబ్బంది వాపోతున్నారు. జిల్లా ప్రభుత్వాస్పత్రిని చుట్టుముట్టిన సమస్యలు భర్తీకి నోచుకోక ఖాళీగా పలు పోస్టులు పోస్టుమార్టానికి సైతం లేని డాక్టర్లు అందుబాటులో లేని మందులు బడ్జెట్లో యథేచ్ఛగా కోతలు నేడు జిల్లా ఆస్పత్రికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు రాక నిధుల కొరత గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జిల్లా ఆస్పత్రికి అవసరమైన మేరకు బడ్జెట్లో నిధులు కేటాయించేంది. కూటమి వచ్చాక మందులు, మాత్రలు సరఫరా కాకపోగా ఆస్పత్రి నిధులు కూడా అరకొరగా కేటాయిస్తున్నారు. చాలీచాలని నిధులిచ్చి చేతులు దులుపుకుంటున్నారు. నేడు ఆస్పత్రి పరిశీలన చిత్తూరు నగరంలోని జిల్లా ప్రభుత్వాస్పత్రిని సోమవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు సందర్శించనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఆయన ఆస్పత్రికి చేరుకుని పలు విభాగాలను పరిశీలించనున్నారు. రోగులు, ఆస్పత్రి అధికారులతో మాట్లాడనున్నారు. ఈతరుణంలో పై సమస్యలను తెలుసుకుని ఆస్పత్రి అభివృద్ధికి కృషికి చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
దోపిడీ కేసులో ఇద్దరి అరెస్ట్
పుత్తూరు : నగరి రోడ్డులోని మీనాక్షి ఏజెన్సీలో ఏప్రిల్ 19వ తేదీన పట్టపగలు ఉదయం 8 గంటలకు జరిగిన దోపిడీ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ ఓబులేసు తెలిపారు. నిందితులు పిచ్చాటూరు మండలం, శేషంబేడు గ్రామానికి చెందిన ఠాగూర్(17), పాండియన్(34)గా గుర్తించినట్లు వెల్లడించారు. తమినాడులోని గుమ్మిడిపూండికి చెందిన మరో ఇద్దరు నిందితులు దినేష్, జగన్‌లను అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు. పట్టుబడిన నిందితుల నుంచి రూ.2 లక్షల నగదు, మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. -
● జిల్లాలో అలంకారప్రాయంగా రైతు సేవా కేంద్రాలు ● నిరుపయోగంగా కియోస్క్‌లు ● అన్నదాతకు అందని పథకాలు ● గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పక్కాగా పనిచేసిన ఆర్బీకేలు ● 503 రైతు భరోసా కేంద్రాలకు గాను 340 చోట్ల సొంత భవనాలు ● రూ.109 కోట్లకు గాను రూ.74.12 కోట్లు వెచ్
కార్వేటినగరం : అన్నదాతకు చేయూతనందించేందుకు ఏర్పాటు చేసిన రైతు సేవా కేంద్రాలు నిరుపయోగంగా మారాయి. కూటమి ప్రభుత్వ నిర్వాకంతో ఈ దుస్థితి దాపురించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్సార్సీపీ పాలనలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుని రైతుల ఇంటి ముంగిటకే సేవలు అందించాలనే ఉదేదద్దేేశంతో ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రజలకు మంచి జరిగే పనులను సైతం కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తోంది. తొలుత రైతు సేవా కేంద్రాలుగా పేరుమార్చింది. తర్వాత రైతులకు కనీస సేవలు కూడా అందించకుండా ఇబ్బంది పెడుతోంది. మూలపడిన కియోస్క్ యంత్రాలు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతి రైతు భరోసా కేంద్రంలో కియోస్క్ యంత్రాలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా రైతులు ఎప్పటికప్పుడు ఎరువులు, పురుగుల మందులు బుక్ చేసుకునే సౌకర్యం కల్పించింది. అలాగే వాతావరణంలో మార్పులు తెలుసుకుని, అందుకు అనుగుణంగా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టే వెసులుబాటును అందుబాటులోకి తీసుకువచ్చింది. పంట ఉత్పత్తుల మద్దతు ధరలు కూడా ఈ యంత్రాల ద్వారా రైతులు తెలుసుకునే వారు. ప్రస్తుతం రైతు సేవాకేంద్రాల్లో కియోస్క్ యంత్రాలను మూలనపడేశారు. వీటి ద్వారా రైతులకు అందే సేవలను సైతం నిలిపేశారు. ఇప్పటికీ అదే నిర్లక్ష్యం జిల్లాలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 503 రైతు భరోసా కేంద్రాలు(ఆర్బీకే)లు ఏర్పాటు చేసింది. రూ.109 కోట్లు మంజూరు చేసి సొంత భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. రూ.74.12 కోట్లు వెచ్చించి పలు గ్రామాల్లో 340 పక్కా భవనాలు నిర్మించింది. మరో 163 భవనాలను వివిధ దశల్లోకి తీసుకువచ్చింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భవన నిర్మాణ పనులను నిలిపివేసింది. రైతు సేవా కేంద్రాలని ప్రకటించి సేవలను దూరం చేసింది. కేవలం ధాన్యం కొనుగోళ్లకు మాత్రం ఆయా భవనాల్లో కొన్నింటిని వినియోగిస్తోంది. ఆయా కేంద్రాల్లోని సిబ్బందిని సర్వేలు, పింఛన్ల పంపిణీ అంటూ బయటకు పంపేస్తోంది. అన్నదాతలకు అందుబాటులో లేకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. గతంలో నిత్యం అందుబాటులోనే.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆయా ఆర్బీకేల్లో ఉద్యానశాఖ అధికారి, వ్యవసాయాధికారి, అగ్రికల్చర్ సిబ్బంది నిత్యం రైతులకు అందుబాటులో ఉండేవారు. ఎప్పటికప్పుడు సలహాలు అందించేవారు. అప్పటి సర్కారు సైతం రైతు భరోసా కేంద్రాల నిర్వహణకు నిధుల సమస్య లేకుండా చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు సేవాకేంద్రాల నిర్వహణను గాలికి వదిలేసింది. -
డబ్బులు కాసే చెట్టు!
● మహోగని సాగుపై ఆసక్తి చూపుతున్న రైతులు ● జిల్లాలో ప్రస్తుతం 150 ఎకరాల్లో ప్రయోగాత్మకంగా సాగు ● 12 ఏళ్లకు కోత.. ఆదాయం రూ.కోట్లలో.. విజయపురం : జిల్లాలోని పలు ప్రాంతాల్లో పలువురు రైతులు వినూత్నంగా మహోగని చెట్ల సాగుకు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే 150 ఎకరాలకు పైగా మహోగని సాగు చేపట్టారు. విజయపురం మండలంలో 12 ఎకరాలు, నగరి–7, సత్యవేడు–13, చిన్నగొట్టిగల్లు–10, ఎర్రవారిపాళెం–10 ఎకరాలు ప్రస్తుం సాగులో ఉన్నాయి. ఈ చెట్లు గోధుమ రంగు కలపతో విశిష్టంగా ఉంటాయి. మహోగనికి చెందిన కలప, ఆకులు, గింజలు మార్కెట్లో అధిక ధరకు విక్రయిస్తున్నారు. ఈ చెట్టు చెక్కతో ఓడలు, ఫ్లైవుడ్, ఆభరణాలు వంటి వస్తువులను తయారు చేస్తారు. అలాగే సంగీత వాయిద్యాలు, విగ్రహాల తయారీలోను వాడతారు. సారవంతమైన నేల అవసరం మహోగని వేర్లు భూమికి కొంత పైభాగంలోనే ఉంటాయి. కాబట్టి కొండ ప్రాంతాల్లో కాకుండా మిగిలిని అన్ని రకాల భూముల్లో పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. మహోగని చెట్లు పెరగడానికి సారవంతమైన నేల అవసరం. బలమైన గాలులు వీచే చోట ఈ చెట్లను నాటకూడదు. ఎకరాకు రూ. 50వేల వ్యయం ఎకరా పొలంలో 120 మహోగని మొక్కలు నాటుకోవచ్చు. ఒక మొక్క రూ. 400న ఉంచి 450 వరకు ధర పలుకుతుంది. ఈ విధంగా ఎకరాలో నాటేందుకు రూ. 45వేలు నుంచి 55వేలు వెచ్చించాల్సి వస్తుంది. మహోగని చెట్టు పరిపక్వం చెందేందుకు 12 ఏళ్లు పడుతుంది. అయితే 5 ఏళ్లకు ఒకసారి విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది. ఒక కేజీ మహాగని విత్తనం ధర మార్కెట్లో రూ. 1,000. ఈ విధంగా కూడా రైతుకు ఆదాయం ఉంటుంది. అలాగే మహోగని చెట్టు 60 నుంచి 80 అడుగుల వరకు పెరుగుతుంది. ఒక క్యూబిక్ ఫీట్ రూ. 1,500 నుంచి 2,500 వరకు రేటు ఉంది. ఇలా ఒక మహోగని చెట్టుకు రూ. 80 నుంచి 1.20లక్షల వరకు ఆదాయం వస్తుంది. ఒక ఎకరంలో 120 మహోగని చెట్లను నాటడం ద్వారా 12 ఏళ్లలో రూ.కోటి వరకు ఆదాయం పొందవచ్చు. ఆరోగ్యానికి సైతం.. మహోగని చెట్టుకు మరో ప్రత్యేకత ఉంది. ఈ చెట్టు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ మొక్క ఔషధ గుణాలతో నిండి ఉంది. మహోగని చెట్టు దగ్గర దోమలు కూడా చేరవు. దీని ఆకులు, విత్తనాలను దోమల నివారణతోపాటు క్రిమిసంహారకాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అలాగే రంగులు, వార్నిష్లు, సబ్బులతోపాటు మందుల తయారీకి వినియోగిస్తారు. ఈ చెట్టు బెరడు నుంచి అనేక ఔషధాలను కూడా సిద్ధం చేస్తారు. మూడు ఎకరాల్లో సాగు నేను మూడు ఎకరాల్లో మహోగని చెట్లు సాగు చేస్తున్నా. మా మిత్రుడు కూడా ఇదే సాగు చేస్తున్నాడు. ముందు ఆయన సలహా మేరకే నేను కూడా ఇందులో దిగాను. 12 ఏళ్ల తర్వాత అధిక ఆదాయం ఉంటుందని తెలిసింది. కాకపోతే ఓపిక ఉండాలి. కొత్తరకం చెట్టు కాబట్టి మంచి ఆదాయం ఇస్తుందని ఎదురుచూస్తున్నా. – శేఖర్‌రాజు, కోసలనగరం. విజయపురం మండలం -
నేడు పలమనేరులో గ్రీవెన్స్
చిత్తూరు కలెక్టరేట్ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్లో నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్)ను పలమనేరు మున్సిపల్ కార్యాలయంలో చేపట్టనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు.ఆయన ఆదివారం మాట్లాడుతూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వినతులు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. అన్నిశాఖల అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. నేడు పోలీసు కార్యాలయంలో.. చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని ఆర్ముడు రిజర్వు (ఏఆర్) కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) నిర్వహించనున్నట్లు ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. ఆయన ఆదివారం మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యపై నేరుగా కలిసి తెలియ జేయవచ్చని సూచించారు. ఉదయం 10.30 గంటల నుంచి వినతులు, ఫిర్యాదులను పరిశీలించి చర్యలు చేపడతామని వెల్లడించారు. డీఆర్సీ సమావేశం రేపు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా అభివృద్ధి కమిటీ (డీఆర్సీ) సమావేశం మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టరేట్ అధికారులు వెల్లడించారు. ఈ సమావేశానికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని, గైర్హాజరైతే శాఖాపరంగా చర్యలుంటాయని హెచ్చరించారు. చిత్తూరు డీవైఈఓగా ఇందిర చిత్తూరు కలెక్టరేట్ : చిత్తూరు డీవైఈఓగా రొంపిచెర్ల ఎంఈవో–1 ఇందిరను నియమిస్తూ రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. వైఎస్సార్ కడప జిల్లా ఆర్జేడీకి రిపోర్టు చేసిన తర్వాత డీవైఈఓ విధుల్లో చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎమ్మెల్యే పేరుతో దౌర్జన్యం – బాధితుల ఆవేదన చిత్తూరు రూరల్ (కాణిపాకం): కూటమికి చెందిన ఓ మహిళా నేత జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ పేరు చెప్పి తమపై దౌర్జన్యం చేస్తున్నారని బాధితులు ఉష, సుజన ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం చిత్తూరు ప్రెస్‌క్లబ్‌లో వారు మాట్లాడారు. పెనుమూరు మండలం సామిరెడ్డిపల్లెలో తమకు రెండు ఎకరాల భూమి ఉందన్నారు. తమ తల్లిదండ్రులు పసుపు కుంకుమం కింద సదరు భూమిని ఇచ్చనట్లు వెల్లడించారు. అయితే కూటమి నేత అరుణకుమారి దారిని ఆక్రమించుకుని, దాన్ని కాపాడుకునేందుకు తమ భూమిలో సీసీ రోడ్డు వేయిస్తున్నారని ఆరోపించారు. ఎలాంటి అనుమతులు లేకపోయినా ఎమ్మెల్యే థామస్ ఆదేశించారంటూ బెదిరిస్తున్నారని వాపోయారు. ఇప్పటికై నా ఎమ్మెల్యే , ఇతర నేతలు ఆమె అక్రమాలను గుర్తించాలని కోరారు. లేకుంటే ముఖ్యమంత్రికి సైతం ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. ఐసెట్ హాల్ టికెట్లు విడుదల తిరుపతి సిటీ:ఏంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రవేశాల కోసం ఆంధ్రా యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఐసెట్–2025 హాల్ టికెట్లను ఆదివారం నుంచి ఆన్లైన్లో విడుదల చేశారు. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేసి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చునని అధికారులు వెల్లడించారు. ఈనెల 7వ తేదీన ఐసెట్–2025 పరీక్ష నిర్వహించనున్నారు. డిగ్రీ పరీక్ష సెంటర్ల మార్పు.. విద్యార్థులకు అవస్థలు తిరుపతి సిటీ: ఎస్వీయూ అధికారుల తీరుతో డి గ్రీ 2వ, 4వ సెమిస్టర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థు లు అవస్థలు తప్పడం లేదు. దేశవ్యాప్తంగా ఆదివారం జరిగిన నీట్ కోసం డిగ్రీ కళాశాలల్లో పరీ క్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. డిగ్రీ పరీక్షల సెంటర్లు ఆయా కళాశాలలో ఏర్పాటుచేసినట్టు హాల్ టికెట్లలో ఉంది. అధికారులు మాత్రం నీట్ జరుగుతున్న కేంద్రాల్లో సెంటర్లు ఉన్న డిగ్రీ విద్యార్థులకు పక్కనున్న జూనియర్ కళాశాలల్లో సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని ముందుగా తెలియజేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అక్కడే విధి నిర్వహణ లో ఉన్న పోలీసులు విద్యార్థులను సంబంధిత ప రీక్షా కేంద్రాలకు తమ వాహనాల్లో తరలించారు. -
కమిషనర్ చిన్నయ్యపై చర్యలు?
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగర పాలక సంస్థలో శానిటరీ ఇన్స్పెక్టర్గా పనిచేసి, ప్రస్తుతం సూళ్లూరుపేట మున్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తున్న చిన్నయ్యపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ (డీఎంఏ) వారం క్రితం ఆదేశాలు జారీ చేసింది. విధుల్లో చేరడం, ఉద్యోగోన్నతులు పొందడంలో అక్రమాలకు పాల్పడినట్లు అందిన ఫిర్యాదులపై విచారణ చేపట్టిన అనంతపురం మున్సిపల్ ఆర్డీ విశ్వనాథ్ నివేదిక మేరకు చిన్నయ్యను వెంటనే సూళ్లూరుపేట కమిషనర్‌గా రిలీవ్ చేస్తూ.. చిత్తూరు కార్పొరేషన్లో శానిటరీ ఇన్స్పెక్టర్గా నియమించి, విధుల్లో చేరిన తర్వాత సస్పెండ్ చేసి, క్రిమినల్ కేసు నమోదు చేయాలని పేర్కొంది. అలాగే చిన్నయ్యకు అపాయింట్మెంట్ ఆర్డర్, ప్రమోషన్లు ఇచ్చిన అధికారులపై సైతం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అయితే దీనిపై చిన్నయ్య హైకోర్టును ఆశ్రయించడంతో జీఓపై కోర్టు స్టే విధించింది. అయితే చిన్నయ్యపై క్రమశిక్షణ చర్యలు చేపట్టే దిశగా అధికారులు న్యాయ సలహాలు తీసుకుంటున్నారు. శ్రీవారి దర్శనానికి 15 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 31 కంపార్ట్మెంట్లు నిండాయి. శనివారం అర్ధరాత్రి వరకు 84113 మంది స్వామివారిని దర్శించుకోగా 33,868 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.12 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 15 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
ఎర్రచందనం దుంగలు సహా కారు సీజ్
తిరుపతి మంగళం : అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలతోపాటు కారును సీజ్ చేసినట్టు తిరుపతి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ తిరుపతి వైల్డ్‌లైఫ్ డీఎఫ్‌వో వివేక్‌కు అందిన రహస్య సమాచారం మేరకు మామండూరు బీట్ పరిధిలో ఆదివారం వాహనాల తనిఖీ చేపట్టామన్నారు. ఒక కారు ఆగకుండా వెళ్లడంతో వెంబడించినట్టు తెలిపారు. దుండగులు కారును వదిలేసి వెళ్లిపోయారని, అందులో పరిశీలించగా 26 ఎర్రచందనం దుంగలు ఉన్నాయని తెలిపారు. కారుతో పాటు ఎర్రచందనం దుంగలను సీజ్ చేసినట్టు వివరించారు. తనిఖీల్లో ఎఫ్ఆర్వో సుదర్శన్‌రెడ్డి, డీఆర్వో గౌస్ కరీమ్, ఎఫ్‌బీవోలు శరవణకుమార్, జాన్ శ్యామ్యూల్, బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు. మామిడి తోటకు నిప్పు శ్రీరంగరాజపురం : మండలంలోని ఎగువ కమ్మకండ్రిగలో భాస్కర్‌నాయుడు అనే రైతుకు చెందిన నాలుగు ఎకరాల మామిడి తోటకు ఆదివారం మధ్యాహ్నం గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో సుమారు 250 మామిడి చెట్లతోపాటు డ్రిప్ సామగ్రి కాలిపోయినట్లు బాధితుడు వెల్లడించారు. రూ.లక్ష వరకు నష్టం వాటిల్లిందని వెల్లడించారు. ప్రభుత్వ స్పందించి తను ఆదుకోవాలని కోరారు. -
పరిశ్రమల స్థాపనతో మహిళలకు ఉపాధి
● టైలరింగ్ శిక్షణ వర్క్‌షాప్‌లో ఎమ్మెల్యే, కలెక్టర్ సుమిత్‌కుమార్ గంగవరం : ఒక కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ఆ ఇంటి యజమానితో పాటు మహిళలకు కూడా జీవనోపాధి లభించినప్పుడే ఆర్థిక ఇబ్బందులు ఉండవని కలెక్టర్ సుమిత్‌కుమార్ పేర్కొన్నారు. గంగవరం మండలంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో తమిళనాడు రాష్ట్రం తిరువూరుకు చెందిన ఈస్ట్‌మెన్ ఎక్స్‌పోర్ట్స్ గ్లోబల్ క్లాతింగ్ టెక్స్ట్టైల్స్ పరిశ్రమ ద్వారా పలమనేరు పరిసర ప్రాంతంలో ఏర్పాటు చేసే కంపెనీలో పని చేసేందుకు పలమనేరు, గంగవరం, పెద్దపంజాణి, బైరెడ్డిపల్లి ప్రాంతాల్లో టైలరింగ్ అనుభవం ఉన్న డ్వాక్రా సంఘాల మహిళలకు శనివారం వర్క్‌షాప్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌తో పాటు ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పరిశ్రమల స్థాపనతోనే మహిళలకు ఉపాధి కల్పన జరుగుతుందన్నారు. గార్మెంట్స్ ఏర్పాటు ద్వారా పలమనేరు పరిసర ప్రాంతాల్లో దాదాపు 4 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి మాట్లాడుతూ.. ప్రతి మహిళను పారిశ్రామికవేత్తగా తయారు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ శ్రీదేవి, కంపెనీ సీఈఓ రితేష్‌కుమార్, జనరల్ మేనేజర్ మొయిద్దీన్, డీఐసీ ఏడీ వెంకటరెడ్డి, ఏపీఐఐసీ మేనేజర్ ఇస్మాయిల్, పలమనేరు మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు సోమశేఖర్‌గౌడ్, ఏపీఎంలు, డీపీఎంలు, సీసీలు, మహిళలు పాల్గొన్నారు. -
విద్యుత్‌శాఖకు నష్టం రూ.11 లక్షలు
చిత్తూరు కార్పొరేషన్ : జిల్లాలో శుక్రవారం సాయంత్రం వీచిన గాలీవానతో విద్యుత్‌శాఖకు రూ.11 లక్షలు నష్టం వచ్చిందని ట్రాన్స్‌కో ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. శనివారం నష్టం వివరాలను తెలియజేశారు. చిత్తూరు నగరం, గుడిపాల, యాదమరి, జీడీనెల్లూరు, పులిచెర్ల, సదుం ప్రాంతాల నందు మొత్తం 78 కరెంటు స్తంభాలు, 16 ట్రాన్స్ఫార్మర్లు, 2.5 కిలోమీటర్లు కేబుల్, కిలోమీటర్ కండక్టర్ నేలవాలిందన్నారు. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడిందన్నారు. సిబ్బంది క్షేత్రస్థాయిలో పునరుద్ధరణ చర్యలు చేపట్టారన్నారు. నగరంలో కొంగారెడ్డిపల్లెలో జరుగుతున్న పనులను ఈఈ మునిచంద్ర పరిశీలించారు. -
కౌండిన్య నదిలో మోటార్ల అపహరణ
కౌండిన్య నదిలో ఇసుకాసురుల అరాచకాలు అంతే లేకుండా పోతున్నాయి. ఇసుక దోపిడీకి అన్నదాతలు అడ్డొస్తున్నారని వారికి చుక్కలు చూపిస్తున్నారు. పంటలకు ఆదరువుగా ఉన్న వ్యవసాయ మోటార్లను అదృశ్యం చేసి రైతుల జీవితాలతో చెలగాటం ఆడుగుతున్నారు. కూటమి పదినె లల పాలనలో 50కిపైగా మోటార్లు చోరీ కావడం ఆందోళన కలిగిస్తోంది. ● పది నెలల్లో 50కి పైగా వ్యవసాయ మోటార్ల చోరీ ● ఇసుకాసురులకు అడ్డుపడితే..అంతే..! ● రాగి తీగల కోసం మరికొందరు చోరులు ● మోటార్ల చోరీతో ఎండుతున్న పంటలు ● పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం క్యాటిల్ ఫామ్ వద్ద ఇసుక తవ్వకాలు చేస్తున్న జీడిమాకులపల్లి ఇసుకాసురులు పలమనేరు : జిల్లాలోని కౌండిన్య నది పుంగనూరు, పలమనేరు నియోజకవర్గాల మీదుగా తమిళనాడులోని మోర్థన డ్యాం దాకా ప్రవహిస్తుంది. కౌండిన్య నదిని ఆనుకొని గుంతల్లో ఫిల్టర్ పాయింట్లో సబ్ మెర్సిబుల్ మోటార్లను అమర్చుకొని పంటలకు సాగునీటిని అందిస్తున్న రైతులకు ఇసుకాసురులు ఇప్పుడు విలన్లుగా మారారు. ఇసుక తవ్వకాలకు అడ్డొస్తున్నారని రైతులపై కసి పెంచుకున్న ఇసుకాసురులు మోటార్లు చోరీ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు. మరోవైపు కొంత మంది యువకులు మద్యానికి బానిసై మోటార్లను చోరీ చేస్తున్నారు. దీంతో సాగునీటిని అందించలేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మోటార్ల చోరీలు ఎక్కువైనట్లు రైతులు ఆవేదన చెందుతున్నారు. కౌండిన్య నదికి ఆనుకుని రెండు వైపులున్న రైతుల మోటార్లు ఈ పది నెలల్లో 50కి పైగా చోరీ అయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంకా పోలీసులకు అందని ఫిర్యాదులు ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇసుక అక్రమ రవాణాకు అడ్డు తగిలిన రైతులకు చుక్కలు చూపిస్తున్నారు. ఇదే ప్రాంతంలో గత నాలుగు నెలలో పది మోటార్లు చోరీకి గురయ్యాయి. కానీ ఈ చోరీలపై పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. పోలీసులు నిఘా పెట్టాలి కౌండిన్య నదికి ఆనుకొని ఎంతో మంది రైతులు ఫిల్టర్ బోర్ల ద్వారా పంటలను సాగు చేసుకుంటున్నారు. అక్కడున్న ఇసుకను తోడేస్తే వారికి నీరు రాదని ఇసుకాసురులను అడ్డగిస్తున్నారు. దీంతో వారిపై కోపం పెంచుకొన్న వారు మోటార్లను చోరీ చేస్తున్నారా లేదా ఇంకెవరైనా వీటిని దొంగలిస్తున్నారా పోలీసులు గుర్తించాల్సి ఉంది. ఏదైనా కేసులొస్తే వారు పట్టించుకోకపోవడంతో ఈ దొంగతనాలు ఆగడం లేదు. ఈ చోరీల వ్యవహారంపై పోలీసులు పూర్తి స్థాయిలో నిఘా పెట్టి రైతులకు న్యాయం చేయాలి. – వెంకటేగౌడ, వైఎస్సార్సీపీ ఇన్చార్జి, పలమనేరు పంటలు ఎండిపోతున్నాయి కౌండిన్య నది పక్కన భూమి ఉంది. నదిలో మోటారు వేసుకొని సాగు చేసుకుంటున్నా. మూడు రోజుల కిందట నా బోరుకు ఆనుకొని జేసీబీతో ఇసుకను తోడుతుండగా అభ్యంతరం చెప్పా. ఆ మరుసటి రోజు చూస్తే నా మోటారు కనిపించలేదు. అందుకే అనుమానంతో ఇసుకాసురులపై పోలీసులకు ఫిర్యాదు చేశా. ఈ అరాచకాల వల్ల పంట నిలువునా ఎండిపోతోంది. – వనార్థన్రెడ్డి, రైతు, కొంగోళ్లపల్లి, గంగవరం మండలం మోటార్లను కనిపించకుండా చేసేస్తున్నారు.. పుంగనూరు నియోజకవర్గంలోని పుంగనూరు, పలమనేరు నియోజకవర్గంలోని పెద్దపంజాణి, గంగవరం, పలమనేరు మండలాల గుండా ప్రవహించి తమిళనాడు రాష్ట్రం ద్వారా బంగాళాఖాతంలో చేరే కౌండిన్య నదికి ఆనుకొని వ్యవసాయం చేసే రైతులు వేల సంఖ్యలో ఉన్నారు. వీరు నదిలోని ఇసుక కారణంగా ఆరు ఇంచీల బోర్లను వేయలేరు. దీంతో మాన్యువల్‌గా ఫిల్టర్ పాయింట్ల ద్వారా 30 అడుగులు లోతు దాకా రెండు, మూడు ఇంచీల బోర్లను డ్రిల్ చేసి అందుకు 3 హెచ్‌పీ, 5హెచ్‌పీ సబ్ మెర్సిబుల్ మోటార్లను అమర్చుకొని పంటలను సాగు చేసుకుంటున్నారు. మరికొంత మంది పేద రైతులు నదిలోని చెక్‌డ్యామ్‌ల వద్ద గుంతల్లో నిలిచిన నీటికి మోటార్ అమర్చి పంటలను సాగు చేస్తున్నారు. అయితే నదిలో ఇసుక ఉంటేనే వీరికి నీటి లభ్యత ఉంటుంది. కానీ ఇసుకాసురులు జేసీబీలు పెట్టి మొత్తం ఇసుకను తోడేస్తున్నారు. దీంతో కడుపు మండిన రైతులు వారిని అడ్డుకుంటే రైతుల మోటార్లు కనిపించకుండా చేస్తున్నారు. అధికారులకు తెలియందేమీకాదు కౌండిన్య నదిలో నిత్యం ఇసుకను తరలిస్తున్న వారెవరు, ఇసుక డంపులు ఎక్కడున్నాయి. కర్ణాటకకు వెళుతున్న ఇసుక, ఏ గ్రామంలో ఇసుక స్మగర్లున్నా రు. ఎవరికి ఎన్ని ట్రాక్టర్లున్నాయి. కొత్తగా జేసీబీ లు కొని మరీ ఇసుక తోడుతున్న వారెవరో రెవెన్యూ, మైనింగ్, పోలీసు అధికారులు తెలియందేమీకాదు. అంతెందుకు గత ప్రభుత్వంలో ఇక్కడ అత్యంత కీలకంగా ఉన్న స్పెషల్ బ్రాంచి, ఇంటెలిజెన్స్‌లు కూటమి పాలనలో కళ్లు కనిపించని కబోధులుగా మారారనే విషయం ప్రజల్లోనే కాదు పోలీసుశాఖలోనే వినిపిస్తుండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఓ పూట మందు కోసం కొందరు... ఇసుకాసురుల అరాచకాలకు తోడు వ్యసనాలకు అలవాటు పడిన కొందరు యువకులు కౌండిన్య నదికి ఆనుకుని ఉన్న మోటార్లు, కేబుల్ వైర్లు, ట్రాన్స్ఫార్మర్లను టార్గెట్ చేసి వాటిని దొంగలించి అందులోని సిల్వర్, కాఫర్ తీగలను పట్టణంలోని గుజిడీ దుకాణాలకు అమ్మి వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరి జల్సాల కోసం ఎంత మంది రైతుల పంటలు ఎండుతున్నాయే, ఆ రైతులు ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఆ దేవుడికే తెలుసు. -
పశువులపై ఒంటరి ఏనుగు బీభత్సం
● అక్కడికక్కడే ఒక ఆవు మృతి ● చావు బతుకుల మధ్య మరొక్కటి పెద్దపంజాణి : పాడి పశువులపై ఒంటరి ఏనుగు దాడిలో ఒకటి అక్కడికక్కడే మృతి చెందగా మరో ఆవు తీవ్ర గాయాలతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ సంఘటన మండలంలోని పెద్దకాప్పల్లి పంచాయతీ అటవీ సరిహద్దు గ్రామమైన పెనుగొలకల సమీపంలోని వ్యవసాయ పొలాల వద్ద శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. బాధితుడి కథనం మేరకు వివరాలు.. పెనుగొలకల గ్రామానికి చెందిన రామయ్య కుమారుడు క్రిష్ణప్ప వ్యవసాయంతో పాటు పాడి పశువులు మేపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. పశువులను పగలంతా పొలాల వద్ద మేతకు వదిలి సాయంత్రం అక్కడే తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెడ్డు కింద కట్టేస్తుంటాడు. ఈ క్రమంలో శనివారం వేకువ జామున పలమనేరు రేంజ్ కీలపట్ల బీట్ నుంచి వచ్చిన ఒంటరి ఏనుగు పశువులపై ఒక్కసారిగా దాడి చేయడంతో ఒకటి అక్కడికక్కడే మృతి చెందగా మరో ఆవు తీవ్ర గాయాలతో చావు బతుకుల మధ్య విలవిల్లాడుతోంది. రోజువారీ కార్యక్రమంలో భాగంగా ఉదయం పొలం వద్దకు వెళ్లిన బాధిత రైతు జరిగిన సంఘటనను చూసి ఆందోళనకు గురయ్యాడు. ఏనుగుల దాడిలో దాదాపు రూ 80 వేలు నష్టం వాటిల్లిందని వాపోయాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పుంగనూరు ఎఫ్ఆర్వో శ్రీరాములు.. ఆవుకు పంచనామా నిర్వహించి, తీవ్రగాయాలతో ఉన్న మరో ఆవుకు చికిత్స చేయించారు. వివరాలను ఉన్నతాధికారులకు పంపి నష్టపరిహారం మంజూరుకు చర్యలు తీసుకుంటామని ఎఫ్ఆర్వో తెలిపారు. కార్యక్రమంలో ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్లు సుకుమార్, బాలసుబ్రమణ్యం, ఎఫ్బీఓ రవికుమార్ పాల్గొన్నారు. -
భయపెట్టిన ఈదురు గాలులు
● నేలకొరిగిన చెట్లు, స్తంభాలు, దాబాలు పుంగనూరు/చౌడేపల్లె: పుంగనూరు, చౌడేపల్లె మండలాల్లోని పలు ప్రాంతాల్లో శనివారం తీవ్రమైన గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో చెట్లు కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పుంగనూరు – భీమగానిపల్లె జాతీయ రహదారిపై కృష్ణదేవరాయుల సర్కిల్లో వున్న హైమాస్క్ లైట్లు గాలికి విరిగిపోయాయి. జాతీయ రహదారిలో ఉన్న దాబాల పైకప్పుకు వేసిన రేకులు ఎగిరిపోయాయి. ఆ సమయంలో నిర్వాహకులు మినహా ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అలాగే సింగిరిగుంట, మంగళం, ఏటవాకిలి, మొరుంపల్లి, బండ్లపల్లి, గుడిసెబండ తదితర ప్రాంతాల్లో టమాట పంట దెబ్బతినింది. చౌడేపల్లె మండలంలోనూ గాలీవాన భీభత్సం సృష్టించింది. వడగండ్ల వాన కురిసింది. మామిడి, వరి, బీర తదితర పంటలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వం సహాయం అందించాలని రైతులు కోరుతున్నారు. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీలో చోటు
చిత్తూరు అర్బన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అనుబంధ కమిటీలో ఉమ్మడి జిల్లాలోని పలువురికి చోటు కల్పిస్తూ..పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఒక ప్రకటనను విడుదల చేసింది. చంద్రగిరికి చెందిన అన్వర్ బాషాను, శ్రీకాళహస్తికి చెందిన మహ్మద్ రసూల్‌ను రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శులుగా, నగరికి చెందిన మోహన్‌రెడ్డిని రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యదర్శిగా, చంద్రగిరికి చెందిన నాగేనమ్మను రాష్ట్ర అంగన్వాడీ విభాగ కార్యదర్శిగా, నగరికి చెందిన గోపాల్‌రెడ్డిని రాష్ట్ర ఎంప్లాయిస్, పెన్షన్ విభాగ సహాయ కార్యదర్శిగా నియమిస్తున్నట్లు కేంద్ర పార్టీ కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. దళితుల శ్మశానవాటిక ఆక్రమణ – తహసీల్దార్, పోలీసులకు ఫిర్యాదు చౌడేపల్లె : మండలంలోని పెద్దయల్లకుంట్ల పంచాయతీ చిప్పిలివారిపల్లె దళితులకు చెందిన శ్మశానవాటిక (ఒలికిల గడ్డ) ఆక్రమణకు గురైందని గ్రామస్తులు శనివారం తెలిపారు. శుక్రవారం రాత్రి అదే గ్రామానికి చెందిన చిప్పిలి రెడ్డెప్ప అతని కుటుంబీకులు ట్రాక్టర్‌తో రాత్రి సమయంలో దున్నుతుండగా అడ్డుకోబోయిన వారిపై దౌర్జన్యం చేసి దున్నేశారని ఎర్రప్ప.. తహసీల్దార్, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన కథనం మేరకు వివరాలిలా...ఒలికిలగడ్డలో కొన్నేళ్లుగా తమ పూర్వీకుల నుంచి నేటికీ అదే శ్మశాన వాటికలో ఖననం చేసేవాళ్లమన్నారు. 248/3 సర్వే నంబరులో 66 సెంట్ల స్థలంలో సమాధులున్నాయని, వాటిని రాత్రిపూట దున్నేయడంతో అధికారులను ఆశ్రయించామని చెప్పారు. శ్మశాన వాటిక స్థలం తమదని ఆక్రమణదారుడు చెప్పడంతో ఇన్నాళ్లు పొలంలోకి రాని అతను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమపై దాడికి యత్నిస్తున్నారని దళితులు ఆవేదన వ్యక్తం చేశారు. పూర్వీకుల సమాధులను దున్నేయడంతో పాటు బండరాళ్లను సైతం ధ్వంసం చేశారని కన్నీటి పర్యంతమయ్యారు. కలెక్టర్ స్పందించి దళితులకు న్యాయం చేయాలని కోరారు. సర్వదర్శనానికి 20 గంటలు తిరుమల: తిరుమలలో రద్దీ అధికంగా ఉంది. సర్వ దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. క్యూకాంప్లెక్స్‌లో 20 కంపార్ట్మెంట్లు నిండాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 74,344 మంది స్వామివారిని దర్శించుకోగా 32,169 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.2.50 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 20 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
అకాలవర్షం.. అపారనష్టం
చిత్తూరు రూరల్ : జిల్లాలో శుక్రవారం సాయంత్రం కురిసిన అకాలవర్షం అతలాకుతలం చేసింది. బలమైన ఈదురుగాలులు పలు రకాల పంటలను దెబ్బతీసింది. దీని దాటికి పలు చోట్ల మామిడికి అపార నష్టం వాటిల్లింది. చెట్లు నేలవాలడంతో పాటు మామిడి కాయలు మొత్తం నేలరాలాయి. అలాగే అరటి, బొప్పాయి, కొబ్బరి పంటలు కూడా నష్టాన్ని మిగిల్చా యి. ఈ సమాచారం అందుకున్న ఉద్యానశాఖ అధికారులు శనివారం పంట పరిశీలనలో పడ్డారు. 7 మండలాల పరిధిలో పంట దెబ్బతిన్నట్లు గుర్తించారు. అధికంగా మామిడి పంట నష్టపోయినట్లు అంచనా వేశారు. మామిడితో పాటు పలు రకాల పంటలు మొత్తం 171.46 హెక్టార్లల్లో పంట దెబ్బతింటే 404 రైతులు నష్టపోయినట్లు అధికారులు అంచనా వేశారు. పెనుమూరు మండలంలో మామిడి 12 హెక్టార్లు, యాదమరిలో అరటి ఒక హెక్టారు, మామిడి 5 హెక్టార్లు, చిత్తూరులో అరటి 0.8 హెక్టార్లు, బొప్పాయి 0.4 హెక్టార్లు, మామిడి 54 హెక్టార్లు, కొబ్బరి 0.06 హెక్టార్లు, గుడిపాలలో అరటి 1.6 హెక్టార్లు, బొప్పా యి 0.4 హెక్టార్లు, మామిడి 25 హెక్టార్లు, పలమనేరు లో 39 హెక్టార్లు, తవణంపల్లిలో మామిడి 22.2 హెక్టా ర్లు, ఐరాలలో మామిడి 10 హెక్టార్లల్లో నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ నష్టం మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. జిల్లాలో గాలీవాన బీభత్సంతో దెబ్బతిన్న పంటలు అధిక విస్తీర్ణంలో దెబ్బతిన్న మామిడి 171.46 హెక్టార్లలో పండ్లతోటల నష్టం గుర్తింపు నష్టం మరింత పెరిగే అవకాశం -
అయ్యప్ప సేవలో పెద్దిరెడ్డి దంపతులు
సదుం : మండలంలోని ఎర్రాతివారిపల్లె అయ్యప్పస్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, స్వర్ణలతమ్మ దంపతులు శనివారం సందర్శించారు. ఆయ్యప్ప స్వామి ఆలయంలో అర్చకులు పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. నవగ్రహ ఆలయంలో అర్చకుల ఆధ్వర్యంలో అభిషేకాలు చేశారు. సదుమమ్మకు ప్రత్యేక పూజలు చేయించారు. పలువురు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోగా పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆయనను పలువురు వైఎస్సార్ సీపీ యూత్ విభాగం సభ్యులు కలిశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్ రెడ్డి, వైస్ ఎంపీపీ ధనుంజయరెడ్డి, ఐటీ విభాగం జిల్లా అధ్యక్షుడు ప్రకాష్ రెడ్డి, కో–ఆప్షన్ సభ్యుడు ఇమ్రాన్, పుట్రాజు, హరినాథరెడ్డి, మనోజ్, మనోహర్ రెడ్డి, ఇర్ఫాన్, దాము తదితరులు పాల్గొన్నారు. టీబీ పరీక్షలు విధిగా చేయాలి చిత్తూరు రూరల్ (కాణిపాకం) : టీబీ పరీక్షలు విధిగా చేయాలని డీఎంఅండ్‌హెచ్‌ఓ సుధారాణి ఆదేశించారు. చిత్తూరు నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో శనివారం శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఓపీలో 10 శాతం తప్పనిసరిగా టీబీ పరీక్షలు చేయాలన్నారు. పీహెచ్సీ పరిధిలో ఆశా వర్కర్లు అనుమానిత వ్యక్తులకు గళ్ల పరీక్షలు చేయించాలన్నారు. అలాగే డెంగ్యూ కేసులపై దృష్టి పెట్టాలన్నారు. కార్యక్రమంలో జిల్లా క్షయనివారణ అధికారి వెంకట ప్రసాద్, మలేరియా అధికారి వేణుగోపాల్ పాల్గొన్నారు. పీఎఫ్ సమస్యలు పరిష్కరించాలి ● జెడ్పీ సీఈఓకు వైఎస్సార్‌టీఏ నేతల వినతి చిత్తూరు కార్పొరేషన్ : జెడ్పీ ఉద్యోగుల సమస్యలపై సీఈఓ రవికుమార్ నాయుడును ఏపీ వైఎస్సార్ టీచర్ అసోసియేషన్ నాయకులు కలిశారు. శనివారం జెడ్పీ కార్యాలయంలో సీఈఓకు పలు సమస్యల పై వినతి పత్రం అందించి మాట్లాడారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి రెడ్డిశేఖర్‌రెడ్డి, జిల్లా గౌరవ అఽఽధ్యక్షుడు సోమచంద్రారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జయకాంత్ మాట్లాడారు. 2023–24కు సంబంధించి పీఎఫ్ వార్షిక స్లిప్స్‌ను ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలన్నారు. పీఎఫ్ ఫైనల్ పేమెంట్స్ కోసం దరఖాస్తు చేసుకున్నవారికి నాన్ డ్రాయల్, నో డ్యూ ధ్రువీకరణ పత్రాలు సమర్పించే విధానాన్ని తీసివేయాలన్నారు. పది సంవత్సరాల ముందు పదవీ విరమణ పొందిన చందాదారుల నిల్వ సొమ్ములు చాలా మందికి చెల్లించాల్సి ఉందన్నారు. పలమనేరు సబ్ ట్రెజరీ ద్వారా జరిగిన చెల్లింపులు సీఎఫ్ఎంఎస్ నందు సక్రమంగా ఆప్‌లోడ్ చేయనందున ఖాతాదారులకు నేటికి జమ కాలేదన్నారు. సమస్యలను పరిష్కరించి చర్యలు తీసుకోవాలని వివరించారు. కాణిపాకంలో మైనారిటీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ కాణిపాకం : కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామిని శనివారం రాష్ట్ర మైనార్టీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ సీహెచ్ శ్రీధర్ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన ఆయనకు ఆలయ ఈఓ పెంచల కిషోర్ ఘన స్వాగతం పలికారు. దగ్గరుండి స్వామి దర్శనం కల్పించారు. అనంతరం వేద ఆశీర్వచన మండపంలో పండితులు ఆశీర్వచనాలు చేశారు. అనంతరం ప్రసాదం, స్వామి చిత్రపటం అందజేశారు. -
అమరావతి అభివృద్ధి చేస్తే చాలా?
మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి కార్వేటినగరం : ఒక్క అమరావతి అభివృద్ధి చెందితే ఇతర ప్రాంతాల అభివృద్ధి అవసరం లేదా.. అని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రశ్నించారు. శనివారం పుత్తూరులోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గతంలో నరేంద్ర మోదీ ప్రధామంత్రి హోదాలో అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తే మిగిలిన ప్రాంతాలు వెనుకబడి పోతాయని డిమాండ్ చేసిన పవన్ కళ్యాణ్ నేడు ఒకే ప్రాంతం అభివృద్ధికి పెద్దపీట వేస్తుంటే ఉప ముఖ్యమంత్రి నోరు మెదపక పోవడం శోచనీయమన్నారు. గతంలో ఢిల్లీ నడిబొడ్డున ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు.. మోదీని ఇష్టమొచ్చినట్లు తిట్టి.. నేడు మోదీని పొగడ్తలతో ముంచెత్తడం చూస్తుంటే బాబు కంటే ఊసరవెల్లే నయమని అన్నారు. అమరావతితో పాటు ఇతర ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే తమ సిద్ధాంతమన్నారు. చంద్రబాబు కుటుంబానికి పోలవరం ఒక ఏటిఎం అని విమర్శించిన మోదీ నేడు చంద్రబాబు విజన్ అని ప్రశంసించడం దారుణమన్నారు. అమరావతి శంకుస్థాపన పేరుతో పబ్లిసిటీ కోసం రూ.500 కోట్లు ప్రజాధనం వృథా అయిందని నారాయణస్వామి విమర్శలు గుప్పించారు. -
తరగతులకు
మూకుమ్మడిగా రెమిడియల్ తరగతులకు టీచర్లు డుమ్మా ● కానరాని ‘పది’ సప్లిమెంటరీ విద్యార్థుల ప్రత్యేక తరగతులు ● రెమిడియల్ పేరుతో టీచర్లను వేదించడం సరికాదు ● రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులపై మండిపాటు ● ఉత్తర్వులు ఉప సంహరించుకోవాలని డిమాండ్ వేధింపులపై ఆగ్రహం రెమిడియల్ తరగతుల పేరుతో టీచర్లను వేధించడం సరికాదని ఉపాధ్యాయ సంఘం నేతలు కూటమి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తీర్ణులు కానీ విద్యార్థుల కోసం రెమిడియల్ తరగతుల పేరుతో ఉత్తర్వులు జారీ చేయడంపై టీచర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఉత్తర్వులు టీచర్ల వేసవి సెలవులను నిరోధించేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్ర అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండు వేసవిలో ప్రభుత్వ ఉపాధ్యాయులను వేధించేందుకు తీసుకున్న రెమిడియల్ తరగతుల ఉత్తర్వులను రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. టాస్క్‌ఫోర్స్ : విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఉంటే జిల్లాలో మంచి ఫలితాలు సాధ్యపడేవి. అయితే జిల్లా విద్యాశాఖ అధికారులు మెరుగైన ఫలితాల సాధనకు ఎలాంటి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేయని పరిస్థితి నెలకొంది. దీంతో 2024–25 విద్యా సంవత్సరం ‘పది’ ఫలితాల్లో సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు రాష్ట్రంలో 24వ స్థానంకు దిగజారింది. ఈ ఫలితాలపై ఇటీవల జిల్లా స్థాయిలో నిర్వహించిన జెడ్పీ సర్వసభ్య సమావేశంలో జెడ్పీటీసీలు, ఎంపీపీలు విద్యాశాఖ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేతులు కాలాక ఆకులు పట్టుకున్నారనే చందంగా పది పరీక్షల్లో విద్యార్థులు అధిక సంఖ్యలో ఫెయిల్ అయిన తర్వాత రెమిడియల్ తరగతులంటూ ఆర్భాటం చేస్తోంది. ఈ ఆర్భాటంలో భాగంగా జిల్లాలోని ప్రతి పాఠశాలలో పది ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ఈనెల 2వ తేదీ నుంచి రెమిడియల్ తరగతులు నిర్వహించాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో కనిపించని తరగతుల నిర్వహణ కూటమి ప్రభుత్వం జారీచేసిన పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల రెమిడియల్ తరగతుల నిర్వహణ జిల్లాలో ఈనెల 3 వ తేదీ ఎక్కడా నిర్వహించ లేదు. ఈనెల 2వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రెమిడియల్ తరగతులను ప్రతి ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారం ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రెమిడియల్ తరగతులు నిర్వహించాలని సూచించారు. అయితే జిల్లాలోని చిత్తూరు, పలమనేరు, కుప్పం, నగరి, పూతలపట్టు, జీడీ నెల్లూరు, పుంగనూరు నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా రెమిడియల్ తరగతుల నిర్వహణ జాడే కనిపించలేదు. ఉత్తర్వులు హడావుడిగా రాత్రిపూట రెమిడియల్ తరగతులు 2వ తేదీ నుంచి నిర్వహించాలని షెడ్యూల్ లో పేర్కొని ఉత్తర్వులేమో అదే తేదీ రాత్రికి రాష్ట్ర విద్యాశాఖ అధికారులు జారీ చేశారు. ఆ ఉత్తర్వుల్లో రెమిడియల్ తరగతుల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఆ షెడ్యూల్లో ఈనెల 2వ తేదీ నుంచి తరగతులు ప్రారంభించాలని సూచించారు. అయితే ఉత్తర్వులు మాత్రం 2వ తేదీ రాత్రి విద్యాశాఖ అధికారులకు పంపించారు. ఇలాంటి ఆకస్మిక ఉత్తర్వుల జారీపై టీచర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. మూకుమ్మడిగా బహిష్కరణ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల టీచర్లు మూకుమ్మడిగా రెమిడియల్ తరగతుల ఉత్తర్వులను పాటించకుండా బహిష్కరించారు. వేసవి సెలవుల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు విధులు ఎవరు నిర్వహిస్తారంటూ రెమిడియల్ తరగతులకు హాజరు కాకుండా డుమ్మా కొట్టారు. ముఖ్యంగా ఈ తరగతులను పర్యవేక్షించి పకడ్బందీగా అమలు చేయాల్సిన హెడ్మాస్టర్లే విధులకు డుమ్మా కొట్టారు. అయితే ఈ తరగతుల పర్యవేక్షణను ఎంఈఓలు, డీవైఈఓలు, డీఈవో సైతం పర్యవేక్షించని పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా ఈనెల 3వ తేదీన ఎన్ని పాఠశాలల్లో రెమిడియల్ తరగతులు నిర్వహించారో? ఎంత మంది విద్యార్థులు హాజరయ్యారో? ఎంత మంది టీచర్లు విధులకు హాజరయ్యారనే వివరాలు విద్యాశాఖ అధికారుల వద్దే లేని పరిస్థితి. ఈ తరగతుల నిర్వహణపై అయ్యోర్లు గుర్రుమంటుండంతో కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంటుంది. -
నేడే నీట్
● పరీక్షకు పక్కాగా ఏర్పాట్లు చేసిన అధికారులు ● జిల్లాలో 2 పరీక్ష కేంద్రాలు ● హాజరు కానున్న 710 విద్యార్థులు చిత్తూరు కలెక్టరేట్ : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆధ్వర్యంలో నిర్వహించనున్న నీట్ (నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ ) ఆదివారం జరగనుంది. వైద్య కోర్సుల్లో ప్రవేశానికి అర్హత పరీక్షగా గుర్తింపు పొందిన ఈ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 710 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే జిల్లాలో రెండు పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లను కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ, ఎస్పీ మణికంఠ చందోలు స్వయంగా పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పరీక్షల నిర్వహణకు అధికారిక యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలి నీట్‌కు జిల్లా కేంద్రంలోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సావిత్రమ్మ మహిళా డిగ్రీ కళాశాల కేంద్రాలను ఏర్పాటు చేశారు. పీవీకేఎన్‌లో 432 మంది, సావిత్రమ్మ మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 278 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్ష ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు అన్ని నియమ, నిబంధనలు పాటిస్తూ 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటలలోపు పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థులు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలలోపు ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉండదని అధికారులు వెల్లడించారు. -
● పూడికతీత పేరుతో మట్టి అక్రమ రవాణా ● జిల్లా కేంద్రం నడిబొడ్డులోని కట్టమంచి చెరువులో తవ్వకాలు ● ఉదయం నుంచి రాత్రి వరకు మట్టి తరలింపు ● నిమ్మకు నీరెత్తిన చందంగా జిల్లా యంత్రాంగం
చిత్తూరు టాస్క్‌ఫోర్స్ : సీఎం సొంత జిల్లా కేంద్రంలో మట్టి అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఈ అక్రమ రవాణా గత వారం రోజులుగా నిర్వహిస్తున్నారు. మట్టి అక్రమ రవాణా ఏదో మారుమూల సాగుతోంది అనుకుంటే పొరబాటే. జిల్లా కేంద్రంలోని నడిబొడ్డులో ఉన్న కొత్తబస్టాండ్ పక్కనే ఉన్న పేరొందిన కట్టమంచి చెరువులో ఈ అక్రమ మట్టి రవాణా తతంగం సాగుతోంది. నేలతల్లి కన్నీళ్లు పెట్టేలా ప్రతి రోజు యథేచ్ఛగా మట్టిని అక్రమార్కులు తరలించుకుపోతున్నారు. అధిక వేగంతో ట్రాక్టర్లు నగరంలోని కట్టమంచి చెరువులో తవ్వుతున్న మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్లు అధిక వేగంతో వెళుతున్నాయి. వందల చొప్పున ట్రాక్టర్లు పగటి పూట వేగంగా వెళుతుండడంతో ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారు. ట్రాక్టర్లలో మట్టి అక్రమ రవాణా కారణంగా నగరంలో ట్రాఫిక్ సమస్యలు సైతం తలెత్తుతున్నాయి. ఇంత తతంగం సాగిస్తున్నప్పటికీ చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కట్టమంచి చెరువులో అక్రమంగా ప్రొక్లైనర్లతో మట్టి తవ్వి తరలిస్తున్న ట్రాక్టర్లురోజుకు వందల లోడ్లు కట్టమంచి చెరువులో రోజు మూడు ప్రొక్లెయినర్లను పెట్టి మట్టిని తవ్విస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా 20 అడుగుల లోతు వరకు మట్టిని తవ్వుతున్నారు. ప్రతి రోజు వందల ట్రాక్టర్లలో మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. 15 రోజులుగా రోజుకు వంద లోడ్లు చొప్పున ఉదయం నుంచి రాత్రి వరకు మట్టి అక్రమ రవాణా సాగిస్తున్నారు. అక్రమంగా తరలిస్తున్న మట్టిని నగర సరిహద్దులో ఉన్న రియల్ ఎస్టేట్ వెంచర్లు, ఇటుక బట్టీలకు తరలిస్తుండడంతో విమర్శలు గుప్పుమంటున్నాయి. సుందరీకరణ పనుల పేరుతో అక్రమంగా మట్టిని తరలించి జేబులు నింపుకుంటున్న కూటమి ప్రజాప్రతినిధులపై ప్రజలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పనులు జరగలేదని అంటున్నారు. చెరువు ప్రాణాధారం..పల్లెకు, పట్టణానికి ఆయువుపట్టు. జనం పాలిట కల్పతరువు.. ఎందరో మహానుభావుల దాతృత్వంతో వీటిని తవ్వించారు. అయితే కాలక్రమేణ స్వార్థం పెరిగింది. వాటిని ఆక్రమించుకునే ప్రబుద్ధులు పెరిగారు. ఫలితంగా నీటి వనరులు తగ్గిపోయి..తరచూ కరువు తాండవిస్తోంది. ప్రజలతోపాటు జంతువులు, పక్షులకూ నీరు కరువు అవుతోంది. ఆ ఆక్రమణలను తొలగించి ఆధునికీకరించాలని నిర్ణయించారు. నిధులు మంజూరు చేశారు. అయితే నాయకులు కాసుల వేటలో పడి, ఆధునికీకరణ లక్ష్యం నీరుగార్చారు. ఇష్టారాజ్యంగా తవ్వి రియల్ ఎస్టేట్ వెంచర్లు, ఇటుక బట్టీలకు తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు. అయినా జిల్లా యంత్రాంగం నిమ్మకు నీరెత్తిన చందంగా వ్యవహరిస్తోంది. ఎమ్మెల్యే దందాకు పరాకాష్ట కట్టమంచి చెరువు సుందరీకరణకు కలెక్టర్ ప్రభుత్వ నిధులు రూ.10 లక్షలు ఇచ్చారే తప్ప.. ఇక్కడ మట్టిని తవ్వుకుని ఇష్టారాజ్యంగా అమ్ముకోమని చెప్పలేదు. ఎమ్మెల్యే చేస్తున్న దందాలకు అక్రమంగా చెరువు మట్టిని తవ్వి వ్యాపారం చేస్తుండడమే నిదర్శనం. ఇప్పటి వరకు దాదాపు 5 వేల లోడ్లకు పైగా మట్టిని అమ్ముకున్నారు. అసలు చెరువులో మట్టి ఎంత తవ్వాలి? ఎంత తవ్వుతున్నారు? ఏం చేస్తున్నారు..? అన్న విషయం గురించి ఇరిగేషన్ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడంలేదు. అధికారుల తీరుపై అవసరమైతే ఏసీబీ, విజిలెన్స్‌కు ఫిర్యాదు చేస్తాం. – ఎంసీ.విజయానందరెడ్డి, చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుకే సుందరీకరణ.. కట్టమంచి చెరువు సుందరీకరణ పనులను గత ఏడాది చేపట్టారు. కట్టమంచి చెరువు పూడికతీత పనులకు చిత్తూరు ఎంపీ దగ్గమళ్ల ప్రసాదరావు, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, మేయర్ అముద పాల్గొని, గత ఏడాది సెప్టెంబర్ 24 వ తేదీన భూమి పూజ చేసి ప్రారంభించారు. చిత్తూరు కార్పస్ ఫండ్‌తో సుందరీకరణ పనులు చేపడుతున్నట్టు కూటమి ప్రజాప్రతినిధులు ప్రకటించారు. చిత్తూరు జిల్లా కేంద్రంలో చేయాల్సిన అభివృద్ధి పనులు అనేకం ఉన్నప్పటికీ పూడికతీత పనులకే ప్రాధాన్యం ఇవ్వడంపై విమర్శలు గుప్పుమంటున్నాయి. ఈ పనుల ముసుగులో మట్టిని అక్రమంగా తరలించి కూటమి నేతలు జోబులు నింపుకుంటున్నారు. -
బస్సు ఢీకొని వృద్ధుడి మృతి
బంగారుపాళెం: మండలంలోని నలగాంపల్లె వద్ద శుక్రవారం రోడ్డు దాటుతున్న వృద్ధుడిని బస్సు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ ప్రసాద్ తెలిపారు. ఎస్ఐ కథనం మేరకు.. మండలంలోని జిల్లేడుపల్లె పంచాయతీ కొత్తూరు గ్రామానికి చెందిన చెంగల్‌రెడ్డి(79) నలగాంపల్లెలోని శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకుని, స్వగ్రామానికి వెళ్లేందుకు చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిని దాటుతుండగా తిరుపతి నుంచి బెంగళూరు వైపు వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వృద్ధుడిని 108లో ప్రథమ చికిత్స నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి ప్రమాదకరంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. విద్యుత్‌షాక్‌తో యువకుడి దుర్మరణం బైరెడ్డిపల్లె: ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని కంచనపల్లెలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సెల్వం కుమారుడు ప్రదీప్ (20) ఇంట్లో ఫ్యాన్ పాడైపోవడంతో మరమ్మతులు చేస్తున్నాడు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్‌షాక్‌కు గురయ్యాడు. దీంతో అతడిని కుటుంబసభ్యులు బైరెడ్డిపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ప్రదీప్‌ను పరీక్షించి, అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. వివాహిత ఆత్మహత్య కార్వేటినగరం: వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని పసలవానిమిట్ట గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. పసలవానిమిట్ట గ్రామానికి చెందిన జ్యోతి ప్రకాష్ ఎలక్ట్రిషీయన్‌గా పని చేసుకుంటూ తల్లిదండ్రులను పోషించుకుంటున్నాడు. ఇతడు బెంగళూరుకు చెందిన శిల్ప(21)తో ప్రేమలో పడ్డాడు. ఈ క్రమంలో ప్రేమించిన యువతితో పెద్దల సమక్షంలో మూడేళ్ల కిందట వివాహం చేసుకున్నాడు. వీరికి ఏడాది కుమారుడు ఉన్నాడు. త్వరలో తమ బిడ్డకు పుట్టెంట్రుకలు తీసే కార్యక్రమం చేయాలని నిర్ణయించుకున్నారు. భార్యాభర్తల మధ్య ఏం జరిగిందో కానీ శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి, శిల్ప ఉరివేసుకుంది. గుర్తించిన స్థానికులు మండల కేంద్రంలోని సీహెచ్‌సీకి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. శిల్ప మృతి చెందిన సమాచారాన్ని బెంగళూరులో ఉన్న తల్లిదండ్రులు సమాచారం అందించారు. మృతదేహాన్ని పుత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వివాహిత మృతిపై పోలీసులు వివరాలు ఆరా తీస్తున్నారు. -
వడగండ్ల వాన.. పంటలకు నష్టం
● చిత్తూరులో వడగండ్లవాన ● పెనుగాలులకు నేలకూలిన విద్యుత్ స్తంభాలు ● రాలిన మామిడి కాయలు చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరం, మండలంలో శుక్రవారం సాయంత్రం అర్ధగంటపాటు పెనుగాలులతో కూడిన వడగండ్లవాన బీభత్సం సృష్టించింది. దీంతో మండలంలో పలుచోట్ల కరెంటు స్తంభాలు నేల కూలిపోయాయి. అకాలవర్షం మామిడి పంటను దెబ్బతీసింది. ఈదుగాలులకు మామిడి చెట్లలో 30 నుంచి 50 శాతం వరకు కాయలు నేలరాలిపోయాయని రైతులు వాపోతున్నారు. సిద్ధంపల్లి, పెరుమాళ్లకండ్రిగ, గువ్వకల్లు, దిగువమాసాపల్లి, తాళంబేడు, చింతలగుంట తదితర ప్రాంతాల్లో అధిక శాతం చెట్లు కూలిపోయాయని రైతులు చెబుతున్నారు. పెనుగాలులకు నేలవాలిన స్తంభాలు చిత్తూరు కార్పొరేషన్: నగరంలో శుక్రవారం వీచిన పెనుగాలులకు పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలవాలాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఆకస్మాత్తుగా సాయంత్రం వాతవారణం చల్లబడింది. ఎక్కువగా గాలి వీయడంతో కొన్ని ప్రదేశాల్లో చెట్ల, కొమ్మలు లైన్‌పై పడి స్తంభాలు నేల కూలాయి. సిబ్బంది లైన్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టే పనుల్లో నిమగ్నమయ్యారు. అలాగే పలు ప్రాంతాల్లో లైన్ ట్రిప్ప్ అవడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. సత్యనారాయణపురం, బార్బర్కాలనీ, సాంబయ్యకండ్రిగ ప్రాంతాల్లో స్తంభాలు పడిపోయింది. -
యువకుడి ఆత్మహత్య
కుప్పం: పట్టణం చిత్తరంజని రోడ్డులోని ఓ ఇంట్లో యువకుడు ఆత్మహత్యకు పాల్పపడ్డిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసలు కథనం మేరకు.. కుప్పం పట్టణం చిత్తరంజని రోడ్డులో బాలసుబ్రమణ్యం శ్రాస్తీ వద్ద గుడుపల్లె మండలం కంచి బందార్లపల్లి గ్రామానికి చిరంజీవి పని చేస్తున్నాడు. శుక్రవారం ఉదయం పనికి వచ్చినా చిరంజివి ఇంటి యాజమాని బాబుస్వామి బయటకు వెళ్లాలని పిలిచినా.. తాను రావడం లేదని ఇంట్లోనే ఉంటానని చెప్పి ఉండి పోయాడు. ఏమి జరిగిందో ఏమోకానీ చిరంజీవి ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నారు. సాయంత్రం ఇంటికి వచ్చిన యాజమాని తలుపు తట్టగా తెరవకపోవడంతో అనుమానం వచ్చి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి తలుపులు తీసి చూడగా ఇంట్లో చిరంజీవి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఉన్నాడు. ఈ మేరకు మృతుడి తల్లితండ్రులకు సమాచారం అందించారు. మృతుడి తల్లితండ్రులు, ఇంటి యాజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్మెంట్లు నిండాయి. క్యూ శిలాతోరణం వద్దకు చేరుకుంది. గురువారం అర్ధరాత్రి వరకు 57,863 మంది స్వామివారిని దర్శించుకోగా 31,030 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.04 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 24 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయం కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలో అనుమతించరని స్పష్టం చేసింది. -
ఆటోను ఢీకొన్న జేసీబీ
● తండ్రి కొడుకులకు తీవ్రగాయాలు గుడిపాల: ఆటోను జెసీబీ ఢీ కొన్న ఘటనలో తండ్రి, కొడుకుతోపాటు మరో ఐదేళ్ల చిన్నారికి తీవ్రగాయాలైనట్టు గుడిపాల ఎస్ఐ రామ్మోహన్ తెలిపారు. ఎస్ఐ కథనం మేరకు.. నగరి మండలం శెట్టిగుంట గ్రామానికి చెందిన రుషేంద్రబాబు(35) తిరుపతిలో బియ్యం వ్యాపారం చేసేవాడు. తమిళనాడు రాష్ట్రం వేలూరు నుంచి కందిపప్పు, ఉద్దిపప్పు తీసుకు వచ్చి తిరుపతిలో విక్రయించేవాడు. ఈ నేపథ్యంలో గుడిపాల మండలం పల్లూరు గ్రామంలో నూతనంగా బియ్యం దుకాణం పెట్టేందుకు ఏర్పాట్లు చేశాడు. శుక్రవారం కాణిపాకం గుడికి వెళ్లి పల్లూరులో బియ్యం దుకాణం ప్రారంభోత్సవానికి కుటుంబ సమేతంగా తనకు ఉన్న ఎలక్ట్రిక్ ఆటో ఏపీ 39 డబ్ల్యుడీ 2074లో వస్తుండగా గుడిపాల మండలంలోని అనుపు గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న ఏపీ26 ఏజే6976 జేసీబీ ఎదురుగా వచ్చి ఢీ కొనడంతో రుషేంద్రబాబుతోపాటు అతని కుమారుడైన భువనచంద్ర(5) తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే చికిత్స నిమిత్తం చీలాపల్లె సీఎంసీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
కొలమాసనపల్లిలో చోరీ
పలమనేరు: మండలంలోని కొలమాసనపల్లిలో ఎంపీటీసీ మాజీ సభ్యురాలు మంజులారెడ్డి ఇంట్లో చోరీ విషయం శుక్రవారం వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు.. కొలమాసనపల్లెకు చెందిన ఎంపీటీసీ మాజీ సభ్యురాలు మంజులారెడ్డి గురువారం కుటుంబసభ్యులతో కలిసి తన ఇంటికి తాళం వేసుకుని శాంతిపురంలోని బంధువుల ఇంటికి వెళ్లింది. ఈ విషయం గమనించిన దొంగలు అదేరోజు రాత్రి ఆ ఇంటి కిటికీని తొలగించి, ఇంట్లోకి వెళ్లి బీరువా తెరిచి చోరీకి పాల్పడ్డారు. శుక్రవారం ఉదయం ఇంటికొచ్చిన బాధితురాలు చోరీ జరిగిన విషయం గుర్తించి, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా బీరువాలోని 20 గ్రాముల బంగారం, అరకిలో వెండి, రూ.80 వేల నగదును చోరీకి గురైనట్టు బాధితురాలు తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. శతాధిక వృద్ధుడి మృతి బంగారుపాళెం: మండల కేంద్రంలో శుక్రవారం శతాధిక వృద్ధుడు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. స్థానిక బీసీ కాలనీలో నివాసముంటున్న సుబ్బానాయుడు(100) వయోభారం కారణంతో మృతి చెందాడు. ఈయన అక్టోబర్ 1924లో జన్మించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పట్టణానికి చెందిన శతాధిక వృద్దుడు మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేశారు. అవార్డు గ్రహీతకు సత్కారం చిత్తూరు కలెక్టరేట్ : వరల్డ్ బెస్ట్ అచీవర్ అవార్డు అందుకున్న రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ పొన్నా యుగంధర్‌కు సత్కారం చేశారు. శుక్రవారం కలెక్టరేట్ ప్రాంగణంలో ఆయనకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. జనసేన నాయకులు మహేష్ మాట్లాడుతూ ప్రెస్‌క్లబ్ వెల్ఫేర్ వరల్డ్ వైడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటీవల విశాఖపట్టణంలో అంతర్జాతీయ సామాజిక అవార్డుల కార్యక్రమం నిర్వహించారన్నారు. ఈ కార్యక్రమంలో పొన్నా యుగంధర్ చేసిన సామాజిక సేవకు గాను వరల్డ్ బెస్ట్ అచీవర్ అవార్డు అందజేశారన్నారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాఘవ, సాయి, కిషోర్, మహేష్ బాబు, యువరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
విజన్ యాక్షన్ ప్లాన్ రూపకల్పన
తిరుపతి సిటీ: స్వర్ణాంధ్ర –2047 సాధనలో భాగంగా సీఎం విజనరీకి అనుగుణంగా నియోజకవర్గాల అభివృద్ధి కోసం విజన్ యాక్షన్ ప్లాన్ రూపకల్పన చేయాలని డీఆర్వో నరసింహులు అధికారులను ఆదేశించారు. పద్మావతి మహిళా వర్సిటీలోని సావేరి సెమినార్ హాల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా అధికారులకు నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ రూపకల్పనపై శుక్రవారం వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, టీం సభ్యులు, నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లే విధంగా పథకాలు రూపొందించాలని సూచించారు. వర్క్‌షాపులో ఏపీ ప్రణాళిక శాఖ సంచాలకులు రావి రాంబాబు, ప్రణాళికా శాఖ సీనియర్ సలహాదారు సీతాపతిరావు, సీపీఓ ప్రేమ్‌చంద్ర, తిరుపతి రెవెన్యూ డివిజనల్ అధికారి రామ్మోహన్, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల నుంచి నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, మండల పరిషత్ అధికారులు పాల్గొన్నారు. -
నైరాశ్యం..నిర్వేదం
చిత్తూరు అర్బన్: నామినేటెడ్ పదవుల్లో తమను గుర్తించకపోవడంతో రాజకీయ భవిష్యత్తు ఉంటుందో..లేదోననే నిర్వేదంలో ఉన్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో కుప్పం మినహా అన్ని చోట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడటం, ఎంపీ స్థానం గెలుచుకోవడంలో కుప్పంలో పోలైన ఓట్లు ఓ సరికొత్త రికార్డును నెలకొలపడం తెలిసిందే. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం చిత్తూరు జిల్లాలోని ఏడు స్థానాలకు గానూ ఆరు అసెంబ్లీ, ఓ పార్లమెంటు స్థానాన్ని గెలుచుకోవడంలో టీడీపీతో పాటు జనసేన, బీజేపీలకు చెందిన నేతలు కూటమిగా ఏర్పడి కీలక పాత్ర పోషించారు. కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన పది నెలల కాలంలో నాలుగు దఫాలుగా నామినేటెడ్ పోస్టుల భర్తీ పూర్తయ్యింది. ఇందులో చాలా మంది మహా మహా ఉద్దండులకు చోటు లభించకపోగా కీలక పదవులపై ఆశలు పెట్టుకున్న కూటమి నేతల ఆశలపై ఆ పార్టీ అధిష్టానం నీళ్లు చల్లి పక్కన పెట్టేసింది. అసలు తమకు రాజకీయ భవిష్యత్తు ఉందా..? రానున్న రోజుల్లో ఇవ్వడానికి ఏవైనా పోస్టులు ఉన్నాయా..? ఏ పోస్టు ఇవ్వకుంటే మున్ముందు జనం గుర్తు పెట్టుకుంటారా..? అనే ప్రశ్నలు ఆ పార్టీ ప్రధాన నేతలను కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఇదే సమయంలో తాము ప్రతిపాదించని, ఊహించని వ్యక్తులకు పలు కీలక పదవులు ఇవ్వడంపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్లకు మింగుడుపడడంలేదు. పక్కన పెట్టేశారా..? ● చిత్తూరులో ఎమ్మెల్యే జగన్మోహన్ గెలుపు చాలా మంది అంచనాలను తారుమారు చేసింది. ఈ గెలుపులో మాజీ ఎమ్మెల్యే సీకే బాబు, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు నాయుడు, జెడ్పీ మాజీ చైర్పర్సన్ భర్త చంద్రప్రకాష్ నాయుడు, మాజీ కార్పొరేటర్ వసంతకుమార్ నాయుడు ఉన్నట్టు చెప్పుకుంటారు. సీకేకు ఎమ్మెల్సీ ఇస్తారనే ప్రచారం జరిగినా నిరాశే మిగిలింది. చుడా చైర్పర్సన్ కోసం వసంతకుమార్ ఏకంగా జగన్మోహన్తోపాటు ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడగడితే ఆ సీటు మాజీ మేయర్ కటారి హేమలత తన్నుకుపోయింది. డీసీసీబీ చైర్మన్ తనకే దక్కుతుందనుకున్న దొరబాబుకు ‘అమాస’ రూపంలో భంగపాటు తప్పలేదు. ● అమర్నాథరెడ్డి గెలుపులో తానూ ఉన్నానని, ప్రభుత్వం వస్తే తనకు మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్పర్సన్ ఇస్తారకునున్న వి.కోట రామచంద్రనాయుడికి నైరాశ్యం తప్పలేదు. ఏఎంసీ చైర్పర్సన్ బీసీ–మహిళకు రిజర్వుకావడంతో ఆయన ఆశలు అడియాసలయ్యాయి. డీసీఎంఎస్ చైర్మన్ ఆశించిన పెద్దపంజాణి భాస్కర్‌రెడ్డిని అసలు పరిగణలోకే తీసుకోలేదు. ● పుంగనూరులో అనధికారిక ఎమ్మెల్యేగా కొనసాగుతూ, అన్ని అధికారాలను తన వద్దే ఉంచుకున్న చల్లాబాబు సైతం తప్పకుండా ఎమ్మెల్సీ ఇస్తారని ఊహించారు. కానీ వాటిని చంద్రబాబు ఊహలకే పరిమితం చేశారు. ఏఎంసీ చైర్పర్సన్ తనకే వస్తుందనుకున్న సమీపతికి పోటీగా సుబ్రమణ్యంరాజును తెరపైకి తీసుకొచ్చారు. బోయకొండ ఆలయ చైర్మన్ అవుతానని ఖారారుగా ఉన్న లక్ష్మీపతిరాజును వెంకటముని యాదవ్, ఎస్కె.రమణారెడ్డి రూపంలో కుర్చీకి అడ్డుగా నిల్చున్నారు. ● కుప్పంలో రెప్కో చైర్మన్ రేసులో రాజ్‌కుమార్, సురేష్‌బాబు, చంద్రశేఖర్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. తమకే రెప్కో కుర్చీ ఇస్తారా..? కొత్త వాళ్లను కూర్చోపెడతారా..? అనే ప్రశ్నలు రోజురోజుకు వీళ్లల్లో హైటెన్షన్‌ను తెప్పిస్తోంది. ఏఎంసీ చైర్మన్‌గా పోటీ పడుతున్న కాణిపాకం వెంకటేష్, నాగరాజు, ఆంజనేయుల రెడ్డి పరిస్థితి కూడా దాదాపు ఇలాగా ఉంది. ● కాణిపాకం చైర్మన్ కుర్చీ కోసం మణినాయుడు, పూర్ణచంద్రలో ఒకరికి భంగపాటు తప్పదు. శాప్ చైర్మన్, బంగారుపాళెం ఏఎంసీ చైర్మన్ ఆశించిన పూతలపట్టు ఎమ్మెల్యే మద్దతుదారుడు జయప్రకాష్ నాయుడికి ఏ పదవి రాకపోవడంతో ఇతని భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. నగరిలో దేశాలమ్మ గుడి చైర్మన్, ఏఎంసీ పదవులకు మదన్, సదాశివరెడ్డి, కృష్ణారెడ్డి మధ్య నెలకొన్న పోటీ కొత్త వ్యక్తుల తెరపైకి వచ్చేలా చెబుతున్నారు. గంగాధరనెల్లూరు నియోజకవర్గంలోని ఏఎంసీ చైర్మన్ పదవికి శ్రీధర్ యాదవ్, ధనుంజయ నాయుడు మధ్య నెలకొన్న పోటీలో ఒకరు కరివేపాకు అవడం ఖాయంగా కనిపిస్తోంది. అనుకున్నదొక్కటి.. అయినదొకటి! నామినేటెడ్ పదవులు దక్కక తమ్ముళ్ల ఆందోళన ఆశపడి నిరాశకు లోనవుతున్న కూటమి నేతలు మున్ముందు రాజకీయ భవిష్యత్తే ఉండదనే డైలామా నగరి నుంచి కుప్పం వరకు ‘పచ్చ’ నేతల నైరాశ్యం అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కీలకంగా మారాం.. పార్టీ అధికారంలోకి వచ్చింది.. మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది.. మంచి నామినేటెడ్ పదవి వస్తుంది.. అని పలువురు పచ్చ నేతలు కలలుగన్నారు. అయితే వారి ఆశలపై బాబు నీళ్లు చల్లారు. దీంతో అనుకున్నదొకటి.. అయినదొకటి.. మనల్ని కరివేపాకులా వాడుకున్నారన్న నైరాశ్యం..నిర్వేదంలో ఉన్నారు. -
ప్రజల పక్షాన పోరాడండి
మాయగాళ్లకు‘మన్ను’దన్ను సుందరీకరణ పేరుతో కూటమి నేతలు చిత్తూరు కట్టమంచి చెరువు నుంచి మట్టిని యథేచ్ఛగా తరలిస్తున్నారు.– 10లోరోడ్డు పనులకు రూ.72 కోట్లు వడగండ్ల వాన.. పంటలకు నష్టం చిత్తూరు జిల్లాలోని పలు చోట్ల గాలివాన బీభత్సం సృష్టించింది. పెనుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. శనివారం శ్రీ 3 శ్రీ మే శ్రీ 2025తిరుపతికి వెళ్లే బస్సులు రాక చిత్తూరు బస్టాండ్‌లో నిరీక్షిస్తున్న ప్రయాణికులు చిత్తూరు రూరల్ (కాణిపాకం): కూటమి నేతలు చిత్తూరు జిల్లా నుంచి 130 బస్సుల సేవలను అమరావతికి మళ్లీంచారు. దీంతో చిత్తూరు ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. సకాలంలో గమ్యస్థానానికి చేరుకోలేక ప్రయాణికులు నానా అవస్థలు పడాల్సి వచ్చింది. నిత్యం బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు పడరాని పాట్లు పడ్డారు. రాజధాని పనుల పునఃప్రారంభానికి శుక్రవారం దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమరావతికి వచ్చారు. ఇందుకు జనసమీకరణ చేయడానికి కూటమి నేతలు జిల్లాలో మహిళలు, కూటమి పార్టీల కార్యకర్తలు, నాయకులను ఆర్టీసీలో బస్సుల్లో గురువారమే అమరావతికి తరలించారు. ఇందుకు జిల్లాలోని ఐదు ఆర్టీసీ డిపోల నుంచి 130 బస్సులను ఆర్టీసీ అధికారులు వారికి కేటాయించారు. మిగిలిన అరకొరగా బస్సులను స్థానికంగా నడిపారు. దీంతో బస్సులు లేక ప్రయాణికులు గమ్యం చేరడానికి కుస్తీ పట్టాల్సివచ్చింది. గంటల తరబడి నిరీక్షణ వివిధ పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు బస్టాండ్‌కు చేరుకున్న ప్రయాణికులు బస్సులు లేక పోవడంతో గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. చిన్న పిల్లలతో వచ్చిన వారు, చికిత్స కోసం వచ్చి తిరుగు ప్రయాణమైనవారు.. వృద్ధులు బస్టాండ్లలో నిరీక్షించి, నీరసించిపోయారు. కొంత మంది తప్పని పరిస్థితుల్లో ప్రైవేటు వాహనాల్లో గమ్యానికి చేరుకున్నారు. పీఎం సభకు తరలించిన బస్సులు అత్యధిక శాతం గ్రామీణ ప్రాంతాలకు చెందినవి కావడంతో గ్రామీణ ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అరకొరగా ఉన్న బస్సుల్లో సీట్ల కోసం నువ్వా? నేనా? అన్నట్లు ఫీట్లు చేయాల్సివచ్చింది. అధికంగా తిరుపతి, బెంగళూరు, పీలేరు, పలమనేరు, పుంగనూరు, మదనపల్లి, తవణంపల్లి, పెనుమూరు, జీడీనెల్లూరు కడప తదితర మార్గాల్లో నిత్యం బస్సులు రద్దీగా కనిపిస్తుంటాయి. ఈ మార్గాల్లో నడిచే బస్సులను కూడా రాజధానికి మళ్లించారు. దీంతో ఆయా మార్గాల్లో ప్రయాణికుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. దీనికితోడు ఎండ వేడమి ఎక్కువగా ఉండడంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. చిన్నారులు, వృద్ధులు, మహిళలు ఉక్కపోతతో విలవిలాడారు. మళ్లీ అప్పులు తప్పవా..? టీడీపీ గత ఐదేళ్ల పాలనలో ఆర్టీసీ చంద్రబాబు సేవలకు మాత్రమే పరిమితమైంది. ప్రయాణికుల సేవలను పక్కన పెట్టింది. టీడీపీ ప్రభుత్వ సమావేశాలు, పోలవరం షోలకు బస్సులను మళ్లించారు. ఆర్టీసీ కూడా అవసరమైనప్పుడల్లా కావాల్సినన్ని బస్సులను పంపింది. 2015 అక్టోబర్ నుంచి 2019 వరకు వివిధ ప్రాంతాల్లో జరిగే సభలు, పోలవరం విహారయాత్రకు మొత్తం 1,292 సర్వీసులను వినియోగించుకున్నారు. ఇందుకుగాను జిల్లాలోని వివిధ డిపోలకు రూ.4 కోట్ల మేర బకాయిలు పడింది. అప్పట్లో వారు చెల్లించింది రూ.14.64 లక్షలు మాత్రమే. మళ్లీ ఇలా సభలకు వెళ్లిన బస్సులకు సుమారు రూ.1.10 కోట్ల మేర చెల్లించాల్సి ఉంటుందని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. చిత్తూరు ఆర్టీసీ బస్టాండులో ఖాళీగా ఉన్న బెంగళూరు స్టాప్ ‘నీట్’కు పకడ్బందీ ఏర్పాట్లు చిత్తూరు కలెక్టరేట్ : నీట్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. శుక్రవారం ఆయన చిత్తూరులో నీట్ నిర్వహించనున్న కేంద్రాల్లో ఏర్పాట్లను పరిశీ లించారు. కలెక్టర్ మాట్లాడుతూ నగరంలోని పీవీకేఎన్, సావిత్రమ్మ మహిళా డిగ్రీ కళాశాలల్లో ఈ నెల 4వ తేదీన నీట్ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆయా కేంద్రాల్లో వి ద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 432 మంది, సావిత్రమ్మ మహిళా ప్రభు త్వ డిగ్రీ కళాశాలలో 278 మంది విద్యార్థులు నీట్‌కు హాజరుకానున్నట్లు తెలిపారు. మధ్యా హ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగుతుందని వివరించారు. సెంటర్లోకి ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురాకుండా పకడ్బందీగా తనిఖీలు చేపట్టాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎస్పీ మణికంఠ చందోలు, పీవీకేఎన్ ప్రిన్సిపల్ జీవనజ్యోతి, సావిత్రమ్మ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ నరేంద్ర, పీవీకేఎన్ కళాశాల పరీక్షల విభాగం కో–ఆర్డినేటర్ శరవణ పాల్గొన్నారు. వ్యవసాయ జిల్లా కార్యాలయం ఏఓగా అంజయ్య గుడిపాల: జిల్లా వ్యవసా య కార్యాలయం పరిపా లన అధికారిగా గుడిపాల మండలం 189కొత్తపల్లెకు చెందిన అంజయ్య శుక్రవారం పదవీ భాధ్యతలు చేపట్టారు. ఆయన ఇక్కడే సూపరింటెండెంట్‌గా పనిచేస్తూ ఏఓగా ఉద్యోగోన్నతి పొందారు. జగనన్నపై ‘చిట్టి’ అభిమానంపలమనేరు: అభిమానానికి హద్దులు లేవనేమాట నిజమే. గంగవరం మండలం నలసానపల్లెకు చెందిన డ్రైవర్ బాలాజీకి జగన్మోహన్రెడ్డి అంటే చాలా అభిమానం. ఆయన పుట్టినరోజుకు సైతం తిరుమలకు కాలినడకన వెళ్లి వచ్చారు. ఎన్నికల వేళ తన ఇంటికి కట్టుకొనేందుకు తీసుకెళ్లిన పార్టీ బ్యానర్లు, జెండాలను జాగ్రత్తగా పెట్టుకున్నారు. ఇతని మూడేళ్ల కుమార్తె చిట్టికి సైతం జగన్మోహన్రెడ్డి అంటే చాలా ఇష్టం. టీవీలో ఆయన కనిపించగానే జగన్ మామ అంటూ కేరింతలు కొడుతోంది. దీంతో గ్రామంలో గంగజాతర మొదలైంది. కాస్త విభిన్నంగా ఆలోచించిన బాలాజీ తన కుమార్తెకు పార్టీకి చెందిన జెండాలు, బ్యానర్‌ను టైలర్కిచ్చి బిడ్డకు దుస్తులు కుట్టించాడు. వాటిని ధరించిన చిట్టి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. దుస్తులు వేసుకుని గ్రామంలో చెంగుచెంగున వెళుతుంటే గ్రామస్తులు సైతం ఆ చిన్నారిని చూసి భలే ఉంది పాప డ్రెస్ అంటూ ఆశ్చర్యంగా తిలకించారు. చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో ఆర్అండ్ బీ పరిధిలోని రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. జిల్లాలోని పలు రహదారులు 221 కిలోమీటర్ల మేర పనులు చేపట్టడానికి రూ.72 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పెద్దమల్లెల–ఎర్రావారి పాళెం రోడ్డుకు రూ.1.50 కోట్లు, చిత్తూరు–పు త్తూరు రోడ్డు నుంచి కమ్మకండ్రిగ రోడ్డు రూ.2 కో ట్లు, చిత్తూరు–తిరుత్తణి రహదారి నుంచి వేలూ రు రోడ్డు రూ.2 కోట్లు, నగరి నుంచి వెంగన్న కండ్రిగ రోడ్డుకు రూ.2 కోట్లు, అడవిబుదుగూరు క్రా స్ నుంచి తమిళనాడు సరిహద్దు వరకు రూ.1.20 కోట్లు కేటాయించారు. కుప్పం–సంగనపల్లె రోడ్డు రూ.70 లక్షలు, కుప్పం–పొగురుపల్లె–గుడుప ల్లెరూ.70 లక్షలు, రామకుప్పం–వి.కోట పేర్నంబట్టు రోడ్డుకు రూ.1.35 కోట్లు మంజూరు చేశా రు. అలాగే బందార్లపల్లె క్రాస్ నుంచి పాముగానిపల్లె రో డ్డు రూ.67 లక్షలు, రామకుప్పం–వి.కోట–పేర్నంబట్టు రోడ్డు రూ.1.90 కోట్లు, కుప్పం– చిగురుగుంట రోడ్డుకు రూ.2.65 కోట్లు, గుడ్డూరు నుంచి కర్ణాటక సరిహద్దు (వయా కేనుమాకుపల్లె, పెద్దూరు) రోడ్డుకు రూ.1.85 కోట్లు, గుడ్యాణంపల్లె–దిన్నేపల్లె రోడ్డు రూ.85 లక్షలు, 64 పెద్దూరు నుంచి కర్లగట్ట రోడ్డు రూ. 68 లక్షలు మంజూరు చేశారు. కుప్పం సరిహద్దు రహదారి నిర్మాణానికి రూ.4.95 కోట్లు, గుడ్యాణంపల్లె రోడ్డు రూ.1.15 కోట్లు, కుప్పం – గుడుపల్లె రోడ్డు రూ.80 లక్షలు, కుప్పం–పొగురుపల్లె రోడ్డు రూ. 84 లక్షలు, గు డ్యాణంపల్లె నుంచి తమిళనాడు సరిహద్దు వరకు రూ.3.55 కోట్లు, ఎన్‌హెచ్ 219 క్రాస్ రోడ్డు రూ.40 లక్షలు, యామిగానిపల్లె రోడ్డు రూ.1.05 కోట్లు,పలమనేరు–కృష్ణగిరి బైపాస్ రోడ్డు రూ.79 లక్షలు, కుప్పం–పట్చూరు రోడ్డు రూ.3.84 కో ట్లు, కుప్పం–మల్లానూరు రోడ్డుకు రూ.6.05 కో ట్లు కేటాయించారు. పలమనేరు – కృష్ణగిరి రోడ్డు కు రూ.40 లక్షలు, వెంకటపల్లె నుంచి కర్ణాటక సరిహద్దు వరకు రోడ్డుకు రూ.50 లక్ష లు, కుప్పం–పలమనేరు రోడ్డు రూ.4.05 కోట్లు, కుప్పం– గుడుపల్లె రూ.6.02 కోట్లు, కుప్పం–పెద్దపర్తికుంట రూ.5.16 కోట్లు, రామకుప్పం–విజలాపురం రూ.3.85 కోట్లు, సీకేటీ రోడ్డు–పాకాల–దామలచెరువు రూ.2.20 కోట్లు, రాయలపేట–మాధవరం రూ.2.20 కోట్లు, రాయలపేట–కల్లుపల్లె రోడ్డుకు రూ.4.45 కోట్లు కేటాయించారు. – మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి చౌడేపల్లె: ప్రతి కార్యకర్త జగనన్న సైనికుడిలా ప్రజల పక్షాన నిలబడి పోరాడాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి సూచించారు. శుక్రవారం తిరుపతిలోని పెద్దిరెడ్డి స్వగృహంలో చౌడేపల్లె మండలంలోని 19 పంచాయతీలకు చెందిన నేతలు, కార్యకర్తలు వారిని కలిశారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జరిగిన దాడులు, అన్యాయాలు, ఆక్రమణలు, కార్యకర్తలకు కలిగిన కష్టనష్టాల గురించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్‌రెడ్డికి వివరించారు. ఎమ్మెల్యే, ఎంపీ మాట్లాడుతూ కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా తామున్నామని, అధైర్యపడొద్దని భరో సా ఇచ్చారు. కష్టపడి పనిచేసిన వారికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని, అందరికీ తగిన గుర్తింపు ఉంటుందన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీలోని బలోపేతం చేయడంతోపాటు గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, చేకూరిన లబ్ధిని వివరిస్తూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేసిన మోసాలను తెలిపి, ప్రజలను చైతన్యవంతులను చేయాలన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలప్పుడు ప్రజలకిచ్చిన సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చలేదని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతి కార్తకర్త సైనికుల్లా కష్టపడి పనిచేయాల్సిన సమయం వచ్చిందన్నారు. ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వంపై పోరాడి, పేద ప్రజలకు న్యాయం చేయడమే ధ్యేయంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దామోదరరాజు, వైస్ ఎంపీపీలు నరసింహులు యాదవ్, సుధాకర్‌రెడ్డి, మాజీ ఎంపీపీలు అంజిబాబు, రుక్మిణమ్మ, వెంకటరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు నాగభూషణరెడ్డి, ఎన్ఎస్యూఐ జిల్లా మాజీ అధ్యక్షుడు మిద్దింటి కిషోర్‌బాబు, పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి కళ్యాణ్ భరత్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు కృష్ణారెడ్డి, సింగిల్‌విండో మాజీ చైర్మన్ రవిచంద్రారెడ్డి, పార్టీ స్టీరింగ్ కమిటీ జిల్లా సభ్యుడు పద్మనాభరెడ్డి, జి.శ్రీనివాసులురెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే, ఎంపీకి సత్కారం వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడిగా నియమితులైన జి.నాగభూషణరెడ్డి, పార్టీ నేతలతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డిని ఘనంగా సత్కరించారు. తనపై నమ్మకంతో అప్పజెప్పిన బాధ్యతలను నిర్వర్తించడానికి అహర్నిశలు కష్టపడి పనిచేస్తానన్నారు. పార్టీ బలోపేతం చేయడంతోపాటు గ్రామస్థాయి నుంచి ప్రజల మద్దతుతో ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు. పెద్దిరెడ్డి కుటుంబానికి జీవితాంతం రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు.– 10లో– 10లోన్యూస్రీల్ ఆర్టీసీ బస్సులు అమరావతి సభకు మళ్లింపు జిల్లా నుంచి 130 బస్సులు ప్రయాణికులకు తిప్పలు ఆర్టీసీ బస్సుల సమాచారం.. డిపోల సంఖ్య – 5 మొత్తం బస్సులు – 400 పల్లెవెలుగు – 233 ఎక్స్‌ప్రెస్ – 100 సప్తగిరి ఎక్స్‌ప్రెస్ – 33 సూపర్‌లగ్జరీలు – 30 ఇంద్ర – 04 రోజువారీ తిరిగే కి.మీ – 1.50 లక్షలు రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య – 1.11 లక్షలు గతంలో యాత్రలు, సభలకు టీడీపీ ప్రభుత్వం తీసుకున్న బస్సులు – 1,292 అప్పట్లో బకాయిలు – రూ4 కోట్లు బకాయిల్లో అప్పట్లో చెల్లించింది.. – 14.64 లక్షలు మాత్రమే ఇప్పుడు పీఎం సభకు తీసుకున్న బస్సులు – 130 బస్సులకు చెల్లించాల్సిన నగదు – రూ.1.10 కోట్లు (సుమారు) చిత్తూరు జిల్లాలో బస్సుల కొరత ప్రయాణికులను వేధించింది. గంటల కొద్దీ బస్టాండ్లలో నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంది. శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీ అమరావతి పర్యటన నేపథ్యంలో జిల్లా నుంచి జన సమీకరణ చేయాలని కూటమి ప్రభుత్వం సంకల్పించింది. జిల్లా నలుమూలల నుంచి జనాన్ని అమరావతికి తరలించేందుకు సన్నద్ధమైంది. ఇందుకోసం గురువారం రాత్రి నుంచి పలు ఆర్టీసీ సర్వీసులను వినియోగించుకుంది. దీంతో బస్సు సర్వీసులు రద్దు అయ్యాయి. ఫలితంగా సకాలంలో బస్సులు లేక ప్రయాణికులకు ప్రయాణం ప్రయాసగా మారింది. డిపోల వారీగా అమరావతికి పంపిన బస్సుల సంఖ్య డిపో పేరు పంపిన బస్సులసంఖ్య చిత్తూరు వన్‌డిపో 30 చిత్తూరు టూడిపో 35 పుంగనూరు 35 పలమనేరు 10 కుప్పం 20తిరుపతి బస్సులను కూడా మళ్లిస్తే ఎట్టా? నేను ప్రతిరోజు తిరుపతి–చిత్తూరు వస్తుంటాను. పని చూసుకుని సాయంత్రం 5 గంటల కల్లా తిరుపతికి బస్సు ఎక్కెలా చూసుకుంటున్నాను. డైలీ సాఫీగానే ప్రయాణం సాగుతోంది. 5 నుంచి 10 నిమిషాల్లో బస్సులు దొరికేది. అయితే శుక్రవారం బస్సు కోసం గంటల తరబడి వేచి చూస్తున్నా. బస్సులు అర్ధగంటకు ఒకటి వస్తోంది. అది కూడా బెంగళూరు బస్సు మాత్రమే. అన్నీ బస్సుల్లోనూ సీట్లు ఫుల్‌గా ఉన్నాయి. నిలబడి వెళదామనుకున్నా కుదరడం లేదు. తిరుపతికి వెళ్లే బస్సులను కూడా మళ్లించడం కరెక్టు కాదు. – విజి, తిరుపతి–చిత్తూరు ప్రయాణికుడు నేడు ఇదే పరిస్థితి..? అమరావతికి జనాన్ని తరలించిన బస్సులు తిరిగి శనివారం ఆయా డిపోలకు చేరుకునే అవకాశం ఉంది. దీంతో వివిధ మార్గాల్లో రద్దు చేసిన బస్సు సర్వీసులను శనివారం సాయంత్రం తర్వాతనే ఆర్టీసీ అధికారులు పునురుద్ధరించనున్నారు. అప్పటి వరకు ప్రయాణికులు ప్రైవేటు వాహనాల్లో అధిక చార్జీలు చెల్లించి, ప్రయాణించాల్సి పరిస్థితి నెలకొంది. 221 కిలోమీటర్ల మేర పలు రోడ్లు నిర్మాణం కుప్పం–మల్లానూరు రోడ్డుకు అత్యధికం -
పేద రైతుపై టీడీపీ నేతల దాష్టీకం
సాక్షి టాస్క్ఫోర్సు: పొలం పనులు చేసేందుకు వెళ్లి న పేద రైతు టి.చిన్నరెడ్డెప్ప ఆస్తిపై కన్నేసిన టీడీపీ నాయకులు ఆయన్ని చితకబాది, తీవ్రంగా గాయపరిచిన ఘటన శుక్రవారం పుంగనూరు మండలం కంగానెల్లూరు వద్ద చోటు చేసుకుంది. ఈ ఘటనపై బాధితుడి కుమార్తె టి.శ్యామల పుంగనూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె కథనం మేరకు.. గ్రామానికి సమీపంలో టి.చిన్నరెడ్డెప్పకు సుమారు 88 సెంట్ల పొలం ఉంది. అందులో వ్యవసాయం చే సేందుకు వెళ్లిన టి.చిన్నరెడ్డెప్పపై అదే గ్రా మానికి చెందిన టీడీపీ నాయకులు టి.గంగులప్ప, టి.చెన్నకేశవులు, టి.జయశంకర్ దౌర్జన్యంగా దాడి చేసి గా యపరిచారు. పొలం పనులకు వెళ్లిన ప్రతిసారి గొ డవ చేస్తున్నారని బాధితుడి కుమార్తె ఆవేదన వ్య క్తం చేశారు. కూటమి సర్కారు ఏర్పాటైనప్పటి నుంచి పలుమార్లు తమపై దాడి చేసి తన తండ్రి చిన్నరెడ్డెప్ప, తల్లి శంకరమ్మను కొట్టి గాయపరిచిన్నారని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ స్థలం వివాదమై కోర్టులో కేసు సైతం వేసినట్లు చె ప్పింది. దాడిలో తీవ్రంగా గాయపడిన చిన్నరెడ్డెప్ప ను పుంగనూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి, చికిత్స చేయి స్తున్నారు. ఫిర్యాదులో పేరొన్న కూటమి నేతల వా రి కుటుంబ సభ్యుల నుంచి తమ కుటుంబానికి ప్రా ణహాని ఉందని రక్షణ కల్పించాలని ఆమె కోరింది. -
తిరుమల: శేషాచలం అడవుల్లో ఎగసిపడుతున్న మంటలు
సాక్షి, తిరుమల: శేషాచలం అడవుల్లో మళ్లీ మంటలు చెలరేగాయి. మంటలు ఎగసిపడుతున్నాయి. అన్నమయ్య జిల్లా బాలపల్లి డివిజన్, మొగలిపెంట వద్ద మరోసారి మంటలు వ్యాపించాయి. అటవీశాఖ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు నాలుగు బృందాలుగా అటవీశాఖ సిబ్బంది యత్నిస్తున్నారు.ఫారెస్ట్ అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగానే మంటలు చెలరేగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. వేసవిలో అగ్ని ప్రమాదాలు నివారణకు అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టలేదు అటవీప్రాంతంలోకి అనుమతి లేకుండా ఎవ్వరు వెళ్లరాదని అధికారులు అంటున్నారు.కాగా, గత ఏడాది కూడా శేషాచలం అడవుల్లో మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే. పాపవినాశనం వైపు మంటలు వేగంగా వ్యాపించాయి. కోరుట్ల అటవీ ప్రాంతం, కాకులకొండల్లో భారీగా మంటలు వ్యాపించాయి. వేలాది ఎకరాల్లో అడవీ సంపద దగ్దమైంది. -
ద్విచక్రవాహనాల చోరీ కేసులో వ్యక్తి అరెస్టు
కుప్పం: గుడుపల్లి మండలంలో రెండు రోజులుగా జరిగిన ద్విచక్ర వాహనాల చోరీ కేసులో నిందితుడిని అరెస్టు చేసి, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు రూరల్ సీఐ మల్లేశ్ యాదవ్ తెలిపారు. మూడు రోజులు క్రితం గుడుపల్లిలో జరిగిన ద్విచక్ర వాహనాల చోరీ కేసు విచారణలో భాగంగా పొగురుపల్లె క్రాస్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా చోరీకి గురైన వాహనాలను గుర్తించినట్లు ఆయన తెలిపారు. కుప్పం మండలం మోడల్ కాలనీకి చెందిన సతీష్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా రెండు రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాలను చోరీ చేసినట్లు అంగీకరించాడని తెలిపాడు. అతన్ని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కారు ఢీకొని ఒకరికి గాయాలు పెద్దపంజాణి: చౌడేపల్లి–పుంగనూరు మార్గం మధ్యలోని మల్లసముద్రం వద్ద గురువారం ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి తీ వ్రంగా గాయపడ్డాడు. స్థానికుల కథనం మేరకు.. చౌడేపల్లి మండలం చారాల గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి కుమారుడు శ్రీనివాసులు రెడ్డి(మాజీ సైనికుడు)పెద్దపంజాణి మండలం రాజుపల్లి పంచాయతీ కమ్మినాయునిపల్లి సమీపంలోని హెచ్‌పీసీఎల్ పంపింగ్ స్టేషన్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో పని ముగించుకుని, ఎలక్ట్రిక్ స్కూటర్లో స్వగ్రామం చారాలకు బయలు దేరాడు. మార్గం మధ్యలోని మల్లసముద్రం వద్ద పుంగనూరుకు వెలుతున్న కారు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన శ్రీనివాసులు రెడ్డిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. వివాహిత ఆత్మహత్య వెదురుకుప్పం: కుటుంబ కలహాల నేపథ్యంలో కొండకిందపల్లె గ్రామంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. కొండకిందపల్లె గ్రామంలోని హేమలత(29)కు, కార్వేటినగరం మండలం జాండ్లపేట గ్రామానికి చెందిన నరేష్‌కు ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. అయితే గత ఆరు నెలలుగా వారిద్దరి మధ్య కలహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో నరేష్ విడాకులు ఇవ్వాలని కోరాడు. హేమలత కుటుంబ సభ్యులు ఒక్కటి చెయ్యాలని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకపోగా మనస్తాపం చెందిన హేమలత గురువారం బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు తెలిపారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం పుత్తూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. -
సీహెచ్‌ఓల సమ్మెట
జిల్లా వివరాలు పీహెచ్‌సీలు: 50 విలేజ్‌హెల్త్ క్లినిక్‌లు: 464 సీహెచ్‌ఓలు: 451 సమ్మెకు ముందు రోజువారీ ఓపీల సంఖ్య(సుమారు): 9,280 కూటమిపైవారంతా పల్లెనాడి పట్టే చిరుద్యోగులు.. నిత్యం పల్లెల్లో పేదలకు వైద్యసేవలు అందించడంలో శ్రమిస్తుంటారు. వారిని సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. పరిష్క రించమని కూటమి సర్కారుకు విన్నవించారు. పట్టించుకున్న పాపాన పోలేదు. తొలుత శాంతియుత పోరాటం చేశారు. అయినా ప్రయోజనం శూన్యం. దీంతో నిరవధిక సమ్మె సైరన్ మోగించారు. చిత్తూరు రూరల్ (కాణిపాకం): డిమాండ్ల సాధనకు మిడ్‌లెవల్ హెల్త్ ప్రొవైడర్లు, సీహెచ్‌ఓలు (కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్) నిరవధిక సమ్మెకు దిగారు. దీంతో విలేజ్ హెల్త్ క్లినిక్‌లు వెలవెలబోతున్నాయి. వైద్య సేవలు అందక పల్లె ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. చికిత్స కోసం పీహెచ్సీ, ఆర్ఎంపీలు, ప్రైవేటు ఆస్పత్రులు ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వం దిగిరాకపోవడంతో సీహెచ్‌ఓలు రోడ్డెక్కారు. వినూత్నరీతిలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. నిరసనలతో హెరెత్తిస్తున్నారు. వామ పక్ష పార్టీలు కూడా మద్దతు పలుకుతున్నాయి. జిల్లాలో 464 విలేజ్ హెల్త్ క్లినిక్‌లున్నాయి. ఇందులో 14 రకాల వైద్యపరీక్షలు, 105 రకాల మందులు, 67 రకాల వైద్య పరికరాలను అప్పటి ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. విలేజ్ హెల్త్ క్లినిక్‌ల్లో బీఎస్సీ నర్సింగ్ కోర్సు చేసిన వారిని సీహెచ్‌ఓలుగా నియమించింది. జిల్లా వ్యాప్తంగా 451 మంది సీహెచ్‌ఓలు విశేష సేవలందిస్తున్నారు. అయితే వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సేవలిలా.. మిడ్‌లెవల్ హెల్త్ ప్రొవైడర్లు, సీహెచ్‌ఓలు పల్లెల్లోని విలేజ్ హెల్త్ క్లినిక్‌లకు వచ్చే రోగులకు సాధారణ జబ్బులతోపాటు దీర్ఘకాలిక జబ్బులైన బీపీ, షుగర్‌కు సైతం వైద్యపరీక్షలు చేసి, మందులు ఇచ్చేవారు. పిల్లలు, గర్భిణులకు పరీక్షలు చేసి, చికిత్స చేసేవారు. రోగికి వచ్చిన వ్యాధిపై ఏదైనా అనుమానం ఉంటే వెంటనే పీహెచ్సీ లేదా జిల్లా కేంద్రంలోని టెలి మెడిసిన్ సెంటర్లోని వైద్యులకు ఫోన్ చేసి రోగులతో మాట్లాడించి చికిత్స చేయించారు. దీంతో రోగులు సుదూర ప్రాంతాల్లోని ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకునే అవసరం తప్పేది. అలాగే విలేజ్ హెల్త్క్లినిక్కు రాలని రోగులకు ఇంటికెళ్లి పరీక్షలు చేసి, మందులు, మాత్రలు ఇస్తున్నారు. టీకాలు వేయించడంలో ముందుండి పనిచేస్తున్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు కృషి చేస్తున్నారు. ఎన్సీడీ సర్వేలో ఏఎన్ఎంలతో సమానంగా సీహెచ్‌ఓలుగా కీలకంగా వ్యవహరించారు. కానీ వీరిని సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. దీంతో వీరు తమ సమస్యల పరిష్కారానికి రోడ్డెక్కారు. నిరవధిక సమ్మెలోకి... ఏపీ మిడ్‌లెవల్ హెల్త్ ప్రొవైడర్– కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీహెచ్‌ఓలు గతనెల 16వ తేదీ నుంచి జిల్లా వైద్య ఆరోగ్య కేంద్రం ఎదుట శాంతి యుతంగా నిరసన చేపట్టారు. 27వ తేదీ జిల్లా అధికారులకు నోటీసులిచ్చి నిరవధిక సమ్మెలోకి వెళ్లారు. దీంతో 28వ తేదీ నుంచి గ్రామాల్లోని విలేజ్ హెల్త్ క్లినిక్‌లకు సీహెచ్‌ఓలు వెళ్లడం లేదు. దీంతో పల్లె ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. సాధారణ జబ్బులతో పాటు పిల్లలు, గర్భిణలకు వైద్యం కోసం సూదూరంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లాల్సి వస్తోంది. డిమాండ్లు ఇవీ.. ● ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలి. ● ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23 శాతం వేతన సవరణ జరగాలి. ● పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్ధీకరించాలి. ● ఈపీఎఫ్ఓ పునరుద్ధరించాలి. ● క్లినిక్‌ల అద్దె బకాయిలను వెంటనే చెల్లించి క్రమబద్ధీకరించాలి. ● నిర్దిష్ణమైన జాబ్ చాటర్ అందించాలి. ● ఎఫ్ఆర్ఎస్ నుంచి సీహెచ్‌ఓలను మినహాయించాలి. ● హెచ్ఆర్ పాలసీ, ఇంక్రీమెంట్లు, బదిలీలు, పితృత్వ సెలవులు తదితరాలను త్వరిగతగతిన అమలు చేయాలి. సమ్మెలో సీహెచ్‌ఓలు జిల్లాలో సీహెచ్‌ఓల నిరవధిక సమ్మె విలేజ్ హెల్త్ క్లినిక్‌లు వెలవెల సేవలు అందక పల్లె ప్రజలకు పాట్లు దిగిరాని ప్రభుత్వం డిమాండ్ల సాధనకే సమ్మె జీతభత్యాల విషయంలో ఎన్నో స మస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించాలనే ప్రధానమైన డిమాండ్‌తో సమ్మెకు దిగాం. మా న్యాయమైన డిమాండ్ల సాధన కోసం తొలుత శాంతియుతంగానే నిరసన చేపట్టాం. ఈ నిరసనతో ఫలితం లేకపోవడంతో నిరవధిక సమ్మె చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఈనెల 28వతేదీ నుంచి సమ్మె కొనసాగుతోంది. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదు. – భానుప్రియ, ఉపాధ్యక్షురాలు, ఏపీ మిడ్‌లెవల్ హెల్త్ ప్రొవైడర్, సీహెచ్ఎ అసోసియేషన్, చిత్తూరు పీఆర్సీ ఇవ్వాలి సీహెచ్‌ఓల జీత భత్యా లు ఇవ్వడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ఆరేళ్ల సర్వీసు పూర్తయిన ఎంఎల్ హెచ్ఎపీలను రెగ్యులర్ చేయాల్సి ఉన్నా చేయడం లేదు. జీఓ నంబర్ 64 ప్రకారం ఎన్హెచ్ఎంలో అన్ని కేడర్ల ఉద్యోగులకు 23 శాతం పీఆర్సీ ఇవ్వాల్సి ఉంది. 189 కేడర్లకు ఇచ్చి సీహెచ్ఓలకు మాత్రం ఇవ్వలేదు. అందరికీ పీఎఫ్ ఇస్తున్నా మాకు మాత్రం ఇవ్వడం లేదు. – రషీద్, సీహెచ్ఓ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి ఎన్హెచ్ఎంలోని ఇతర ఉద్యోగులతో సమానంగా 23 శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలి. ప్రతి నెలా జీతంతో పాటు ఇన్సెంటివ్ ఇవ్వాలి. ప్రతి సంవత్సరం 5 శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలి. ఆర్థిక, ఆర్థికేతర సమస్యలు పరిష్కారానికి హామీ ఇవ్వాలి. ఆరేళ్లు దాటిన సీహెచ్‌ఓలను క్రమబద్ధీకరించాల్సి ఉన్నా చేయడం లేదు. మా డిమాండ్లు పరిష్కరం అయ్యేంత వరకు ఈ నిరవధిక సమ్మె ఆగదు. – మోహనకుమారి, సభ్యురాలు, ఏపీ మిడ్‌లెవల్ హెల్త్ ప్రొవైడర్సీహెచ్ఎ అసోసియషన్, చిత్తూరు -
చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. డ్రైవర్‌కు గాయాలు
పాలసముద్రం : ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీ కొనడంతో డ్రైవర్‌కు తీవ్ర గాయా లు కాగా, ఇద్దరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన గురువారం పాలసముద్రం మండంలంలో చోటు చేసుకుంది. పల్లిపట్టు ఎస్ఐ రమేష్ కుమార్ కథనం మేరకు.. తిరుపతి నుంచి వెంగళరాజుకుప్పం గ్రామానికి ఏపీ 26 జెడ్ఓ 162 ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో బయలుదేరింది. తమిళనాడు వడకుప్పం వద్దకు రాగానే బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొంది. దీంతో బస్సు ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. బస్సు డ్రైవర్ రామమూర్తి సీట్లో ఇరుకుపోయాడు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. కాగా బస్సులోని మునస్వామి, చంద్రశేఖర్ అనే ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి. స్థానికులు డ్రైవర్న్ని బయటకు తీసి, తిరుత్తణి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పల్లిపట్టు ఎస్ఐ రమేష్‌కుమార్ తెలిపారు. వ్యక్తికి గాయాలు పుంగనూరు: ద్విచక్రవాహనం అదుపుతప్పి బోల్తా పడడంతో ఓ వ్యక్తి గాయపడిన సంఘటన మండలంలోని చదళ్ల సమీపంలో గురువారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. సోమల మండలానికి చెందిన శ్రీనివాసులు(45) తన టమాట పంటకు పుంగనూరు పట్టణంలో క్రిమిసంహారక మందు కొనుగోలు చేసి, తిరిగి సోమల వైపు వెళుతుండగా ప్రమాదవశాత్తు ద్విచక్రవాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో శ్రీనివాసులుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి 108కు సమాచారం అందించడంతో చికిత్స నిమిత్తం మదనపల్లె ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో ఇంజినీర్ దుర్మరణం పుంగనూరు: రోడ్డు ప్రమాదంలో ఓ ఇంజినీర్ మృతి చెందిన సంఘటన పట్టణంలోని బాలాజీ థియేటర్ వద్ద గురువారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని అండిగానిపల్లికు చెందిన రవితేజ(24) బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీ లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. రవితేజ స్వగ్రామానికి వచ్చి తన సొంత పనుల నిమిత్తం ద్విచక్రవాహనంలో పుంగనూరు పట్టణానికి వచ్చాడు. బాలాజీ థియేటర్ వద్ద వెళుతుండగా అతివేగంగా వస్తున్న ప్రైవేటు బస్సు రవితేజ వాహనాన్ని ఢీకొనడంతో అతను అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు శవాన్ని పోస్టుమార్టానికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరుగున వచ్చి కుప్పకూలిపోయాడు! పూతలపట్టు (కాణిపాకం): చిత్తూరు–తిరుపతి జాతీయ రహదారిపై పూతలపట్టు పోలీస్ స్టేషన్ సమీపంలో గురువారం ఓ లారీ డ్రైవర్ తన వాహనాన్ని ఆపి, సమీపంలో ఓ ప్రైవేట్ క్లినిక్ వద్దకు పరుగున వెళ్లి కుప్పకూలిపోయి మృతి చెందారు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. పూతలపట్టు మండలంలోని ఓ ప్రైవేటు పాల డెయిరీకి సంబంధించిన లారీకి తమిళనాడు రాష్ట్రం తిరువరం జిల్లా మైలాడవరానికి చెందిన మదిఆలగన్ (52) డ్రైవర్ గా పనిచేస్తున్నారు. డెయిరీ వద్దకు లారీని తీసుకెళుతుండగా మార్గంమధ్యలో పూతలపట్టు పోలీస్ స్టేషన్ సమీపంలోకి రాగానే వాహనాన్ని ఆపి వేసి సమీపంలోని ప్రైవేటు క్లినిక్ వద్దకు వెళ్లి అక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే ఆర్ఎంపీ వైద్యుడు ప్రాథమిక చికిత్సకు ప్రయత్నించగా మృతి చెందారని నిర్ధారించి, పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు పోస్టుమార్టం కోసం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా రెండు రోజులుగా జ్వరం ఉందని, ఆస్పత్రిలో చూపించుకుని ఇంటికొస్తానని కుటుంబసభ్యులకు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సీపీఎస్ ఉద్యోగుల హామీలు నెరవేర్చాలి
● కలెక్టరేట్ ఎదుట ఏపీసీపీఎస్ఈఏ నాయకుల ధర్నా చిత్తూరు కలెక్టరేట్ : కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో సీపీఎస్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఏపీసీపీఎస్ఈఏ రాష్ట్ర అధ్యక్షు లు బాజీ పఠాన్, ప్రధాన కార్యదర్శి రాజేశ్వరరావు డిమాండ్ చేశారు. ఆ సంఘ నాయకులు గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. వా రు మాట్లాడుతూ రాష్ట్రంలో 3.5 లక్షల సీపీఎస్ ఉద్యోగులను ద్వితీయ శ్రేణి ఉద్యోగులుగా మార్చే విధానాలను వ్యతిరేకిస్తున్నామన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాక ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. అపరిష్కృత సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రభుత్వం చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేరన్నారు. సీపీఎస్ ఉద్యోగు లు ఆర్థికంగా, సామాజికంగా, ఒత్తిడిని ఎదుర్కొంటున్నారన్నారు. సీపీఎస్ ఉద్యోగులు పరిస్థితిని మే డే రోజున ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ధర్నా నిర్వహించామన్నారు. సీపీఎస్ అసోసియేషన్ జిల్లా నాయకులు సీపీఎస్ అమలు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు సమస్యలు కుప్పలు తెప్పలుగా పెరగడమే కానీ ఒక్క సమస్య పరిష్కారం కాలేదన్నారు. ప్రభుత్వం చెప్పే మాటలు, చేసే పనులకి పొంతన లేకుండా ఉందన్నారు. ఎన్నికల సమయంలో సీపీఎస్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను తప్పనిసరిగా నెరవేర్చాలన్నారు. అనంతరం కలెక్టర్ సుమిత్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నా లో ఆ సంఘం నాయకులు దేవకుమార్, హరిప్రసాద్‌రెడ్డి, మోహన్‌కుమార్, నరసింహులు, సుబ్బలక్ష్మి, ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. -
కౌండిన్యలో ఏనుగుల సంచారం
బంగారుపాళెం: మండలంలోని మొగిలి దేవరకొండ అటవీ ప్రాంతంలో గురువారం సాయంత్రం రెండు ఏనుగులు సంచరిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. దేవరకొండ సమీపంలో గల కౌండిన్య అడవిలో ఏనుగులు తిరుగుతున్నాయన్నారు. బుధవారం సాయంత్రం మొగిలి సమీపంలోని గౌనిచెరువులో ఏనుగులు నీటిలో సేదతీరి అడవిలోకి వెళ్లిపోయాయి. తిరిగి రాత్రి మొగిలి గ్రామంలోని శ్రీనిఫుడ్ ఫ్యాక్టరీ వద్దకు రెండు ఏనుగులు ప్రవేసించి హల్చల్ చేయడంతో సె క్యూరిటీ, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. ఏ నుగుల రాకను గుర్తించి కేకలు వేయడంతో అడవిలోకి వెళ్లిపోయాయి. ఏనుగులు దేవరకొండ ప్రాంతంలో తి రుగుతున్నాయని తెలిపారు. ఏనుగులు సంచారంతో అడవిలోకి ఎవరూ వెళ్లరాదని ఫారెస్టు అధికారులు హెచ్చరిస్తున్నారు. -
● కోట్ల విలువ చేసే రాతి సంపద దోపిడీ ● కూటమి అండతో విచ్చలవిడిగా రవాణా ● తిరుమండ్యం కొండలో అక్రమ తవ్వకాలు ● చోద్యం చూస్తున్న మైనింగ్ అధికారులు ● భారీ పేలుళ్లతో బీటలు వారిన నివాసాలు ● దుమ్ము ధూళితో దిగుబడి తగ్గుతోందంటున్న రైతన్నలు
అనుమతి గోరంత.. తవ్వేది అంతా..! అన్నట్టుగా తయారైంది వడమాలపేట మండలంలో మైనింగ్ లీజు పరిస్థితి. తిరుమండ్యం గ్రామంలో 7.5 ఎకరాలకు అనుమతి తీసుకుని దాదాపు పది ఎకరాలకుపైగా తవ్వేసినా ఎవ్వరూ అటువైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్న దృశ్యంవడమాలపేట (విజయపురం): వడమాలపేట మండలం, తిరుమండ్యం గ్రామంలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. అనుమతికి మించి కొండను పిండి చేస్తూ విలువైన రాతి సంపదను కొల్లగొడుతోంది. తిరుమండ్యం గ్రామ లెక్కదాఖలాలో సర్వే నం.175లో సుమారు 116 ఎకరాల గుట్ట పోరంబోకు ఉండగా.. అందులో 2.96 హెక్టార్లు (సుమారు 7.5 ఎకరాలు) మైనింగ్ నిమిత్తం లీజుకు తీసుకున్నారు. కొండను తవ్వి నెలకు సుమారు 45 వేల టన్నుల వరకు తరలిస్తున్నారు. ఇప్పటికే వారికి ఇచ్చిన పరిధిని దాటేశారు. దాదాపు 10 ఎకరాల మేరకు విస్తరించి తవ్వకాలు జరుపుతున్నారు. వీటిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు తనిఖీలు నిర్వహించిన దాఖలాలు లేవు. క్వారీదారుకు అధికార పార్టీ నేతల అండ ఉండడంతో మైనింగ్ శాఖ అధికారులు మొక్కుబడి తనిఖీలు, నోటీసులతో సరిపెట్టేస్తున్నారు. ‘మేము తనిఖీలు చేస్తుంటాం.. మీరు తరలిస్తూ ఉండండి’ అన్నచందంగా పరస్పర ఒప్పందంతో ఈ దందా కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక లోడ్డుకు బిల్లు చూపి.. పది లోడ్ల కంకర అక్రమంగా తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాథుడే లేకపోవడం గమనార్హం. పడగవిప్పుతున్న పర్యావరణ కాలుష్యం ఒకవైపు ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుంటే మరోవైపు సమీప గ్రామస్తులను పర్యావరణ కాలుష్యం గుదిబండగా మారింది. ఈ కార్వీకి 200 మీటర్ల దూరంలో దివంగత మహానేత వైఎస్సార్ ప్రభుత్వంలో పేదలకు నిర్మించిన 25 నివాసాలు ఉన్నాయి. క్వారీలో రాళ్లను పేల్చడానికి వాడాల్సిన నమోదుకంటే ఎక్కువ నమోదులో పేలుడు పదార్థాలు వాడడంతో ఆ ప్రకంపనలకు సమీప ప్రాంతాలు కంపించిపోతున్నాయి. ఇప్పటికే 20 ఇళ్లు బీటలు వారిపోయాయి. రాత్రి పూట కంటిపై కనుకు లేకుండా పోతోందని స్థానిక భయాందోళన చెందుతున్నారు. క్వారీకి చుట్టుపక్కల సుమారు 300 ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. రైతులు మామిడి, వరి, వేరుశనగ పంటలు సాగు చేస్తున్నారు. ఆ పంటలపై క్వారీ నుంచి వచ్చే దుమ్ము ధూళి పడడంతో దిగుబడి తగ్గిపోతోంది. సుమారు 20 ఎకరాలలో దిగుబడి దారుణంగా పడిపోయింది. అప్పుల పాలవుతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. తవ్వేసి..మింగేసి! లీజు తీసుకున్నవారికి పదేళ్లవరకు కంకర తరలింపుకు అనుమతి ఉంటుంది. కేటాయించిన విస్తీర్ణములో మాత్రమే రాళ్లను తవ్వి తరలించాలి. అలా తరలించే రాళ్లకు క్వారీదారు టన్నుకు రూ.150 చొప్పున ప్రభుత్వానికి చెల్లించాలి. అదే టన్నుకు బయట రూ.2,100 నుంచి రూ.2,500 వరకు విక్రయిస్తున్నారు. నెలకు 45 వేల టన్నుల రాళ్లను తరలిస్తుండగా అందులో 20 నుంచి 30 శాతానికి మాత్రమే రూ.150 చొప్పున చెల్లిస్తున్నారు. దీంతో కోట్ల రూపాయల సొమ్ము క్వారీదారు జేబుకు చేరుతోంది. అందులో అధికార పార్టీ నేతలు వాటాలు పంచుకుంటున్నట్టు సమాచారం. పంట దిగుబడి రావడం లేదు నాకు మూడు ఎకరాల పొలం ఉంది. అందులో ఒక ఎకర మామిడి తోట వేసుకోగా, మిగిలిన భూమిలో వరి సాగు చేసుకొని జీవనం సాగించేవాడ్ని. క్వారీ నుంచి వచ్చే దుమ్ము ధూళి పంటలపై పడి దిగుబడి చాలావరకు తగ్గిపోయింది. మామిడి చెట్లకు పూత రావడం లేదు. వచ్చే పూత కూడా రాలిపోతోంది. నష్టాలపాలవుతున్నాను. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. –ధనంజయులురెడ్డి, తిరుమండ్యం -
తాగునీరు.. తాగ లేరు!
● జలం..గరళం ● కొళాయిల్లో కలుషిత నీరునగరి : మున్సిపల్ ప్రజలకు మున్సిపాలిటీ వారు సరఫరా చేసే తాగునీరు గురువారం ఏకాంబరకుప్పం పరిధిలో రంగు మారి పింక్ కలర్లో రావడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఆ నీటిని ఎలా వాడాలంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికంగా డైయింగ్ ఫ్యాక్టరీల నుంచి వచ్చే హానికర రసాయన రంగునీటి కారణంగా ఇప్పటికే భూగర్భ జలాలు కలుషితమయ్యాయి. దీంతో బోర్లలో వచ్చే నీరు తాగడానికి వీలుపడదు. మున్సిపాలిటీ వారు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నుంచి సరఫరా చేసే నీరే అందరూ వినియోగించుకుంటున్నారు. అయితే కొళాయిల్లో వచ్చే నీరు కూడా రసాయన రంగుల్లో వస్తుండడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. చేసేదేమీలేక... ప్రైవేటు వాటర్ ప్లాంట్లకు క్యూ కడుతున్నారు. -
పోరంబోకు భూమి ఆక్రమణ
గంగాధరనెల్లూరు: మండలంలోని వింజం రెవెన్యూ నాగూరుపల్లె సర్వే నంబర్ 893 /2లో 7.37 ఎకరాల పోరంబోకు భూమి ఆక్రమణలకు గురైంది. ఈ భూమి ఎన్నో తరతరాలుగా చుట్టుపక్కల గ్రామస్తులు పశువుల మేత కోసం వాడుకునేవారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొందరు కూటమి నేతల దీనిపై కన్ను వేశారు. నకిలీ పట్టా సృష్టించి, దాన్ని ఆన్లైన్లో పొందుపరిచి అదే గ్రామానికి చెందిన అమరావతమ్మ పేరున రిజిస్ట్రేషన్ చేశారని, తరువాత అమరావతమ్మ నుంచి తన కోడళ్లకు రిజిస్ట్రేషన్ చేశారని, ప్రస్తుతం ఆ భూమిలో అమరావతమ్మ కుటుంబసభ్యులు భారీ యంత్రాలతో చదును చేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. దీంతో తాము అడ్డుకోగా తమకు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల అండదండలున్నాయని దౌర్జన్యం చేస్తున్నారని తెలిపారు. పలుమార్లు స్థానిక మండల రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయగా ఎలాంటి చర్యలు చేపట్టక పోగా ఆక్రమణదారులకే వత్తాసు పలుకుతున్నారని గ్రామస్తులు మండిపడ్డారు. సదరు భూమిపై సమాచార హక్కు చట్టం కింద ఫిర్యాదు చేయగా మండల రెవెన్యూ కార్యాలయం నుంచి సదరు సర్వే నంబర్‌పై ఎలాంటి సబ్ డివిజన్ చేయలేదని, ఎవరికి ఎలాంటి పట్టా ఇవ్వలేదని సదరు సర్వే నంబర్ పోరంబోకు భూమి అని స్పష్టం చేశారు. కాగా సదరు భూమిపై అమరావతమ్మ కుటుంబ సభ్యులకు హక్కులు ఎలా కల్పిస్తారని, తహసీల్దార్, రెవెన్యూ అధికారులు ఆక్రమణదారులకే వత్తాసు పలుకుతూ వారి మాటే చెల్లుబాటు చేస్తున్నారని ధ్వజమెత్తారు. క్రీడలతో ఉజ్వల భవిత: డీఎస్డీఓ బాలాజీ చిత్తూరు కలెక్టరేట్ : విద్యార్థులకు క్రీడలతో ఉజ్వల భవిష్యత్ ఉంటుందని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి (డీఎస్డీఓ) బాలాజీ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని మెసానిక్ మైదానంలో వేసవి శిక్షణ శిబిరం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సెలవులను వృథా చేయకుండా క్రీడా శిబిరంలో క్రీడల్లో శిక్షణ పొందాలన్నారు. క్రీడల్లో పట్టు సాధిస్తే ఉన్నత స్థాయికి ఎదగవచ్చని తెలిపారు. అనంతరం పలు క్రీడాపోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యాపారవేత్త జయప్రకాష్‌నాయుడు, ఇండియన్ బ్యాంక్ రిటైర్డ్ రీజినల్ మేనేజర్ నాగరాజు, షణ్ముగం, రాజా, కోదండరామస్వామి తదితరులు పాల్గొన్నారు. యువకునిపై హత్యాయత్నం ● గంగమ్మ చాటులో దాడి చేసిన ఓ గ్యాంగ్ ● నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు పలమనేరు: పట్టణంలో గంగమ్మ చాటు సందర్భంగా ఓ యువకునిపై కొందరు మారణాయుధాలతో హత్యాయత్నానికి పాల్పడిన ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పలమనేరు సీఐ నరసింహరాజు కథనం మేరకు.. పట్టణానికి చెందిన గాంధీనగర్ వాసి సునీల్‌కుమార్(27) పాతపేటలోని ఓ గ్యాస్గోడౌన్లో పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి గంగమ్మ జాతర చాటింపు సందర్భంగా సునీల్‌కుమార్ ఇంటికి వెళుతుండగా అతన్ని టార్గెట్ చేసిన కొందరు మారణాయుధాలతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. దీంతో అతన్ని స్థానికులు ఇక్కడి ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి మొండోళ్ల కాలనీకి చెందిన కళ్యాణ్, అతని సన్నిహితులైన పవన్, సాయి, హరి కత్తులు, రాడ్లు, బ్లేడ్లతో దాడి చేసినట్టు సీఐ తెలిపారు. ఇప్పటికే నిందితులను గుర్తించామని, వీరితోపాటు మరికొందరు ఉన్నారని తెలిపారు. ఈ ఘటన పాతకక్షల కారణంగా జరిగినట్టు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. పట్టణంలో రౌడీయిజం సహించే ప్రసక్తే లేదని నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు. -
సప్తగిరి గ్రామీణ బ్యాంకు ఇక ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలోని సప్తగిరి గ్రామీణ బ్యాంక్ పేరు గురువారం నుంచి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ పేరుగా మారింది. త్వరలో ప్రధాన కార్యాలయం నుంచి బ్రాంచ్ కార్యాలయం వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని బ్రాంచ్‌ల పేర్లను మార్చనున్నా రు. ఉమ్మడి జిల్లాతోపాటు కృష్ణా జిల్లాలో 264 బ్రాంచ్‌లు ఉన్నాయని బ్యాంక్ అధికారులు తెలిపారు. ఒకప్పటి శ్రీవెంకటేశ్వర గ్రామీణ బ్యాంకు, కనకదుర్గ గ్రామీణ బ్యాంకు కలిసి 2006లో సప్తగిరి గా మారాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుగా సేవలు అందించనుంది. పౌల్ట్రీరంగంతో ఉపాధి కల్పనకు చర్యలు చిత్తూరు కలెక్టరేట్: జిల్లాలో పౌల్ట్రీ రంగంతో ఉ పాధి కల్పనకు చర్యలు చేపట్టనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అన్నారు. గురువారం కలెక్టరేట్లో పశుసంవర్థక శాఖ, పాడిపరిశ్రమ, పౌల్ట్రీ రంగం నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రైతు లు వ్యవసాయ రంగంతోపాటు పాడి పరిశ్ర మ, పౌల్ట్రీ రంగాల్లోని ఉపాధి అవకాశాలను స ద్వియోగం చేసుకోవాలన్నారు. ఆ అవకాశాల తో ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు వెసులుబాటు ఉంటుందన్నారు. వ్యవసాయ రంగంతోపాటు పాడి పరిశ్రమ, పౌల్ట్రీ రంగాల్లో ఉ పాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పౌల్ట్రీ రంగంలో ఆసక్తి ఉన్న రైతులకు నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ సహకారంతో ముందుగా పౌల్ట్రీ రంగంలో విజయవంతమైన రైతులతో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ రంగంలో ఆసక్తి ఉన్న రైతులకు పౌల్ట్రీ ఏర్పాటుకు అవసరమైన ఆర్థిక సా యం బ్యాంకర్లతో అందించేందుకు చర్యలు చేపడుతామన్నారు. ఇందుకు అవసరమైన డీపీ ఆర్‌లను సిద్ధం చేసుకోవాలని అధికారులను సూచించారు. కాంట్రాక్ట్ అధ్యాపకులకు వేతన వెతలు గుడుపల్లె: రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కళాశాల లో కాంట్రాక్ట్ అధ్యాపకులుగా పనిచేస్తున్న 3,618 మందికి ఏడాదిగా జీతాలు అందలేదని ఆ యూ నియన్ ఉపాధ్యక్షుడు నౌషద్ ఖాన్ పేర్కొన్నారు. 2024 సంవత్సరం మే నెల నుంచి ఇప్పటి వరకు జీతాలు అందలేదన్నారు. పెండింగ్ జీతాలు చెల్లించి, వచ్చే విద్యా సంవత్సరానికి రెన్యూవల్ చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రికి, ఉన్నతా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. -
విద్యాశాఖ ఏడీ–1గా సుకుమార్
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఏడీ–1గా యూజే సుకుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. వైఎస్సార్ కడప, కర్నూలు జిల్లాల్లో విధులు నిర్వహించిన ఆయన చిత్తూరు విద్యాశాఖ ఏడీ 1గా నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన విధులు స్వీకరించిన అనంతరం డీఈఓ వరలక్ష్మిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీచర్ల సమస్యల పరిష్కారానికి, ఉన్నతాధికారుల ఉత్తర్వులు ఎప్పటికప్పుడు అమలు చేసేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం ఆయన్ని ఏడీ–2 వెంకటేశ్వరరావు, సూపరింటెండెంట్లు సత్య, వీజీ రమణ, సిబ్బంది మురళి, గోపాల్ లు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. -
తిరుమల అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం
తిరుమల: తిరుమల అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తుంబుర తీర్థం వద్ద అటవీ ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీనిపై సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది హుటాహుటీనా అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
హత్యాయత్నం కేసులో నిందితుడి అరెస్టు
చిత్తూరుఅర్బన్: నగరంలో వ్యక్తిపై హత్యాయత్నానికి పాల్పడిన నాగరత్నం అనే నిందితుడిని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. నగర శివార్ల లోని పట్రాంపల్లెకు చెందిన దిలీప్‌కుమార్ అనే వ్యక్తిపై పాత కక్షల నేపథ్యంలో నాగరత్నం అనే వ్య క్తి గతవారం కత్తితో పొడిచి పారిపోయాడు. బాధితుడి తండ్రి రామచంద్రయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితున్ని అరెస్టు చేసి, మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. నిందితుడికి మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండు విధించడంతో చిత్తూరు జిల్లా జైలుకు తరలించారు. మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య గంగవరం: మూడు నెలల కిందట కొడుకు మృతి చెందడం తీవ్ర మనస్తాపానికి గురైన ఓ తండ్రి ఆత్మహత్యకు పాల్పడి న ఘటన మండలంలో బుధువారం వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని చిన్నూరు గ్రామానికి చెందిన వెంకటేష్(54) పలమనేరు పట్టణంలో మారెమ్మగుడి ఎదురుగా దేవుళ్ల పటా ల దుకాణం నడుపుతున్నాడు. మూడు నెలల క్రి తం కొడుకు కిరణ్(27) బెంగుళూరులో ఆత్మహ త్య చేసుకుని మృతి చెందాడు. కొడుకు మృతి చెందినప్పటి నుంచి తండ్రి వెంకటేష్ తీవ్ర మనోవేదనకు లోనయ్యాడు. మూడు నెలలుగా ఇంట్లో సక్రమంగా భోజనం చేయకపోవడం, దుకాణం తెరవకపోవడం, ఇంటి పట్టున సక్రమంగా ఉండడం లే దు. ఈ క్రమంలో బుధవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన ఆయన తిరిగి ఇంటికి రాలేదు. తీరా చూస్తే మా రేడుపల్లికి సమీపంలోని కౌండిణ్య నది వద్ద చింతచెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పల మనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జిల్లాలో 201 రిజిస్ట్రేషన్లు
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలోని చిత్తూరు ఆర్వో మినహాయించి మిగిలిన 7 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం బుధవారం ప్రారంభమైంది. జిల్లాలో మొ త్తం 201 రిజిస్ట్రేషన్లు కాగా వాటి ద్వారా రూ.75.88 లక్షలు ఆదాయం వచ్చింది. చి త్తూరు రూరల్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో జిల్లా రిజిస్ట్రార్ రమణమూర్తి, సబ్‌రిజిస్ట్రార్ ఆనంద్‌తో కలిసి డ్యాకుమెంట్లను కోనుగోలుదారులకు అందజేశారు. చిత్తూరు రూరల్‌లో 33 డ్యాకుమెంట్లు జరగగా రూ.10.29 లక్షలు, పలమనేరు 32 డ్యాకుమెంట్లు రూ.14.39 లక్షలు, బంగారుపాళెం 19 రూ.10.93 లక్షలు, నగరి 25 రూ.21.94 లక్షలు, పుంగనూరు 36 రూ.6.91 లక్షలు, కుప్పంలో 36కు రూ.7 లక్షలు, కార్వే టినగరం 24 రూ.4.33 లక్షలు ఆదాయం వచ్చిందని ఆయన తెలిపారు. నేటి నుంచి రేషన్ పంపిణీ చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లా వ్యాప్తంగా గురువారం నుంచి రేషన్ పంపిణీ చేయనున్నట్లు డీఎస్ఓ శంకరన్ తెలిపారు. రేషన్‌కార్డుదారులకు పంపిణీ కోసం ప్రభుత్వం జిల్లాకు 8,500 మెట్రిక్ టన్నుల బియ్యం, 3 వేల మెట్రిక్ టన్నుల చక్కెర సరఫరా చేసినట్లు పేర్కొన్నారు. -
నేటి నుంచి వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు
చిత్తూరు కలెక్టరేట్: జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో మే ఒకటో తేదీ నుంచి వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నారు. ఎంపిక చేసిన గ్రామీణ, మండల, జిల్లా కేంద్రాల్లో మొత్తం 48 శిక్షణ శిబిరాలను నిర్వహిస్తారు. ఉదయం, సాయంత్రం వేళల్లో చిన్నారులకు వ్యాయామ విద్య, ఉపాధ్యాయులు, సీనియర్ క్రీడాకారులతోపాటు జిల్లా కేంద్రంలోని మెసానికల్ స్టేడియంలో సంబంధిత క్రీడా శిక్షకులతో ప్రాథమిక స్థాయి నుంచి వివిధ క్రీడల్లో తర్ఫీదు ఇవ్వనున్నారు. నెల రోజుల పాటు జరిగే ఈ శిబిరాల్లో క్రీడాకారులకు ఉచితంగా శిక్షణ అందిస్తారు. శిబిరాల వివరాలిలా.. ● క్రీడ శిక్షణ శిబిరాలు: ● వాలీబాల్: గుడుపల్లి మండలం అగరం గ్రామం జెడ్పీ సంగనపల్లి, పుంగనూరు జెడ్పీ, జెడ్పీ రొంపిచెర్ల, జెడ్పీ కార్వేటినగరం, జెడ్పీ కుప్పం, జెడ్పీ గరిగచిన్నేపల్లి, జెడ్పీ పెద్దహరిజనవాడ కార్వేటినగరం, ప్రభుత్వ హైస్కూల్ చిత్తూరు, జెడ్పీ గంగవరం, కేవీకే నగరి, జెడ్పీ గుడిపాల, యాదమరి ఓపెన్ ప్లేస్, బంగారుపాళెం ప్రభుత్వ పాఠశాలలో శిక్షణ ఇస్తారు. ● టెన్నికాయిట్: కుప్పం మండల కేంద్రం ప్రభుత్వ హైస్కూల్. ● బాస్కెట్‌బాల్: చిత్తూరు అర్బన్ బాస్కెట్ బాల్ కోర్టు మిట్టూరు–1, కేవీకే పలమనేరు, డీఎస్ఏ మైదానం చిత్తూరు, బంగారుపాళెం జెడ్పీ. ● హాకీ: ఐరాల మండలం కాణిపాకం జెడ్పీ హైస్కూల్ , వి.కోట జెడ్పీ. ● కబడ్డీ: నిండ్ర మండలం కొప్పేడు అంగన్వాడీ, చౌడేపల్లి జెడ్పీ హైస్కూల్, సదుం జెడ్పీ, పుంగనూరు అరడిగుంట. ● సాఫ్ట్‌బాల్: ఐరాల జెడ్పీ హైస్కూల్, వెదురుకుప్పం ఆల్లమడుగు జెడ్పీ, జెడ్పీ పూతలపట్టు. ● క్రికెట్: నగరి కేవీకే కేంద్రం, డీఎస్ఏ మైదానం చిత్తూరు. ● పుట్‌బాల్: పుంగనూరు మండలం చంద్రమాకులపల్లి జెడ్పీ హైస్కూలు, కేవీకే పలమనేరు, మెసానికల్ మైదానం. ● వ్రెస్ట్లింగ్: మెసానికల్ మైదానం చిత్తూరు. ● ఖోఖో: వి.కోట మండలం నెర్నిపల్లి జెడ్పీ, బంగారుపాళెం ఏపీటీడబ్ల్యూఎస్, తవణంపల్లి మండలం మిట్టపల్లి, యాదమరి మండలం కొట్టాలం జెడ్పీ, దుర్గానగర్‌కాలనీ మున్సిపల్ హైస్కూల్ చిత్తూరు, బైరెడ్డిపల్లి మండలం తీర్థం జెడ్పీ. సద్వినియోగం చేసుకోవాలి వేసవిలో నెల రోజుల పాటు నిర్వహించే శిక్షణ శిబిరాలను జిల్లాలో ఆయా ప్రాంతాల్లో ఉన్న చిన్నారులు సద్వినియోగం చేసుకునేలా చూడాలి. వేసవి శిక్షణ శిబిరాల్లో క్రీడా ప్రస్థానం ప్రారంభించిన చిన్నారులు భవిష్యత్‌లో ఎంతో మంచి క్రీడాకారులుగా ఎదిగారు. ఆయా క్రీడా సంఘాలు, వ్యాయామ ఉపాధ్యాయులు, తమ ప్రాంతాల్లో చిన్నారులు ఈ శిక్షణ శిబిరాలకు హాజరయ్యేలా సహాయ సహకారాలు అందించాలి. – బాలాజీ, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి, చిత్తూరు జిల్లా -
చినతిరుమల.. కీలపట్ల!
● మే 5నుంచి కోనేటిరాయుని వార్షిక బ్రహ్మోత్సవాలు ● అంత్యంత చారిత్రక నేపధ్యం ఉన్న పురాతన ఆలయమిది ● ఇక్కడి మూలవిరాట్టు తిరుమల మూలమూర్తిని పోలిఉంది ● తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలలో కీలపట్ల ప్రస్థావన ● జిల్లానుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలనుంచి సైతం భక్తులు పలమనేరు: ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని చారిత్రిక వైష్ణవాలయాల్లో తిరుమల వేంకటేశ్వరునితోపాటు పలమనేరు నియోజవర్గంలోని గంగవరం మండలం కీలపట్లలో వెలసిన కోనేటిరాయుని ఆలయానికి చినతిరుమలగా పేరుంది. తిరుమలకు వెళ్లలేని పేద భక్తులు కీలపట్ల ఆలయంలో స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. తిరుమలలోని మూలవిరాట్టు విగ్రహం ఎలా ఉందో ఇక్కడి ఆలయంలోనూ స్వామివారి మూలవిరాట్ అలాగే ఉంటారని, తిరుమల స్వామివారే ఇక్కడున్నారని భక్తుల నమ్మకం. తిరుమల తరహాలో ఇక్కడి ఆలయంలోనూ ఏటా స్వామివారికి టీటీడీ ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇదీ ఆలయ చరిత్ర.. కీలపట్లలోని మూలవిరాట్టు కోనేటిరాయుని(శ్రీ వేంకటేశ్వరస్వామి) విగ్రహాన్ని భృగుమహర్షి ప్రతిష్టించారని చరిత్ర చెబుతోంది. ఆపై చోళులు, పల్లవులు, విజయనగర రాజుల ఏలుబడిలో విశేష పూజలందిచారని తెలుస్తోంది. అప్పట్లో మహ్మదీయుల దండయాత్రలకు భయపడిన గ్రామస్తులు స్వామివారి విగ్రహాన్ని కోనేటిలో దాచి ఉంచినందునే స్వామివారికి కోనేటిరాయునిగా పేరొచ్చినట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. చంద్రగిరిని పాలించిన సామంతులు బోడికొండమ నాయుడుకి కలలో స్వామి వారు కనిపించి కోనేటిలోని విగ్రహాన్ని ఆలయంలో తిరిగి ప్రతిష్టించమని చెప్పినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. 4 నుంచి కోనేటి రాయుడి ఉత్సవాలు మే 4న సాయంత్రం సేనాధిపతి ఉత్సవంతో కోనేటిరాయుని బ్రహ్మోత్సవాల అంకురార్పణ జరుగుతుంది. మే 5న ధ్వజారోహణం, అదేరోజు సాయంత్రం పెద్దశేషవాహనం, 6న చిన్నశేషవాహనం, హంసవాహనం, మే 7న సింహవాహనం, ముత్యపుపందిరి, 8న కల్పవృక్ష వాహనం, 9న మోహినీ ఉత్సవం, సాయంత్రం శ్రీవారి కళ్యాణోత్సవం, గరుడవాహన సేవలు జరుగుతాయి. మే 10వ తేదీ ఉదయం హనుమంత వాహనసేవ, వసంతోత్సవం, గజవాహనసేవ, 11న సూర్యప్రభ, చంద్రప్రభ వాహన సేవలు, 12న స్వామివారి రథోత్సవం, ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. మూలవిరాట్లు ఒకేపోలిక కీలపట్లలోని స్వామివారు, తిరుమలలోని స్వామివార్ల మూలవిరాట్లు ఒకే తరహాలో ఉంటారని ప్రతీతి. కోనేటి రాయుని విగ్రహంపై కటి వరద హస్తాలు, శంకు చక్రాలు, విగ్రహం చాతిపై శ్రీదేవి, భూదేవి ముద్రలతో అచ్చం తిరుమలలో స్వామివారిలాగే దర్శనమిస్తున్నారు. -
శ్రీనిఫుడ్ ఫ్యాక్టరీలో ఏనుగుల హల్చల్
బంగారుపాళెం: మండలంలోని మొగిలి శ్రీనిపుడ్ ఫ్యాక్టరీలో బుధవారం రాత్రి ఏనుగులు ప్రవేశించి హల్చల్ చేశాయి. ఫ్యాక్టరీ సమీపంలోని కౌండిన్య అటవీ ప్రాంతం నుంచి గౌనిచెరువు మీదుగా రెండు ఏనుగులు ఫ్యాక్టరీలోకి ప్రవేశించాయి. సెక్యూరిటీ, ఫ్యాక్టరీ సిబ్బంది ఏనుగుల రాకను గురించి అరుపులు, కేకలు వేయడంతో తిరిగి అడవిలోకి వెళ్లిపోయాయని తెలిపారు. బుధవారం సాయంత్రం రెండు ఏనుగులు గౌనిచెరువులో దిగి సేద తీరాయని, అటు తరువాత అడవిలోకి వెళ్లి తిరిగి సమీపంలోని ఫ్యాక్టరీలోకి వచ్చాయన్నారు. మూడు, నాలుగు సార్లు ఏనుగులు ఫ్యాక్టరీలోకి వచ్చాయని సిబ్బంది తెలిపారు. -
అడవిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
శ్రీరంగరాజపురం : అడవిలోని పెద్ద చెరువు వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించిన సంఘటన మండలంలోని రాణిపురం గ్రామం వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు రాణిపురం గ్రామానికి చెందిన కొంత మంది వ్యక్తులు బీడీ తయారీకి ఉపయోగించే తూనీక ఆకుల కోసం బుధవారం పుల్లురు అడవికి వెళ్లారు.ఆ సమయంలో పుళ్లూరు అడవిలోని పెద్ద చెరువు వద్ద ఎముకలు బయటపడిన మృతదేహాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. రాత్రి 8 గంటల సమయానికి పోలీసులు స్థానికుల సాయంతో మృతదేహం ఉన్న స్థలానికి చేరుకొని పరిశీలించి మృతి చెందినది పురుషుడిగా గుర్తించారు. అతను చనిపోయి దాదాపు మూడు నుంచి ఐదు నెలలు క్రితమే మృతి చెంది ఉండవచ్చునని చెబుతున్నారు. ఆత్మహత్యా? లేక ఎవరైన హత్య చేశారా అనే విషయాలు విచారణలో తేలనున్నాయి. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుమన్ తెలిపారు. -
వరసిద్ధుడికి వెండి, బంగారు ఆభరణాలు
కాణిపాకం: వరసిద్ధి వినాయకస్వామివారికి బుధవారం ఓ భక్తుడి కుటుంబం వెండి, బంగారు ఆభరణాలను సమర్పించింది. ఆలయ మాజీ ప్రధాన అర్చకులు చంద్రమౌళి గురుక్కల్, సుబ్బరత్నమ్మ జ్ఞాపకార్థంగా వారి కుటుంబ సభ్యులు ఆభరణా లను ఈఓ పెంచలకిషోర్‌కు అందజేశారు. 200 గ్రాముల బంగారు గాజులు, కమ్మలు, హారం, చైన్ ముక్కు పుడకలు, 500 గ్రామల వెండి బిస్కెట్ ఇచ్చారు. వీటి విలువ రూ.15 లక్షలు ఉంటుందని దాత కుటుంబ సభ్యులు రాఘవేంద్ర గురుకల్, ఈఓ తెలిపారు. కార్యక్రమంలో ఏఈఓలు రవీంద్రబాబు, సిబ్బంది కోదండపాణి, వాసు, రవి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర మున్సిపల్ విభాగం కమిటీలో జిల్లా నేతలు తిరుపతి సిటీ : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర మున్సిపల్ విభాగ కమిటీని బుధవారం ప్ర కటించారు. ఇందులో తిరుపతి జిల్లాకు చెంది న చిట్టేటి హరికృష్ణ సెక్రటరీగా, కామిరెడ్డి మోహన్‌రెడ్డిని జాయింట్ సెక్రటరీగా నియమితులయ్యారు. అలాగే చిత్తూరు జిల్లాకు చెందిన జి.సుధాకర్ జాయింట్ సెక్రటరీగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. వైద్య విధాన పరిషత్ ఏడీగా సునీత చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లా వైద్య విధాన పరిషత్ ఏడీగా సునీత బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కావలి ఆస్పత్రిలో ఏఓగా పనిచేస్తున్న ఈమె ఉద్యోగోన్నతిపై ఇక్కడికి వచ్చారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా వైద్య విధాన పరిషత్ ఏడీగా బాధ్యతలను స్వీకరించారు. రిటైర్డు పోలీసులకు సన్మానం చిత్తూరు అర్బన్: జిల్లా పోలీసుశాఖలో ఉద్యోగ విరమణ పొందిన పోలీసులను ఎస్పీ మణికంఠ ఘనంగా సన్మానించారు. బుధవారం చిత్తూరులోని పోలీసు అతిథిగృహంలో జరిగిన సమావేశంలో పోలీసుశాఖలో రిటైరైన మనోహరన్ (ఏఎస్ఐ), సుధాకర్ పిల్లై (ఏఎస్ఐ), మహ్మద్ రఫీ (హెడ్ కానిస్టేబుల్), శివాజీ (ఏఆర్–హెడ్ కానిస్టేబుల్)ను సన్మానించి జ్ఞాపిక అందజేశారు. పదవీ విరమణ చేసినప్పటికీ పోలీసుశాఖ నుంచి ఎప్పుడూ సహకారం అందిస్తామని ఎస్పీ భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఏఎస్పీ శివానంద కిషోర్, డీఎస్పీ మహబూబ్ బాషా, పోలీసు యూనియన్ అధ్యక్షుడు ఉదయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
● ఉత్తమ ఆవుల వృద్ధికి పశుసంతతి పరిశీలన పథక కేంద్రం విశేష కృషి ● జన్యు సామర్థ్యపు విత్తన కోడెల ఉత్పత్తిలో ముందడుగు ● సంకరజాతి పశువుల అభివృద్ధే లక్ష్యంగా పరిశీలన పథక కేంద్రం శాస్త్రవేత్తల కార్యాచరణ
లక్ష్య సాధన దిశగా కేంద్రం జిల్లాలో 2013–14 కేంద్రం ప్రారంభం నుంచి ఈ పథకం లక్ష్యం కోసం అధికారులు కృషి చేస్తున్నారు. మంచి పాడి వృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నారు. ఇ ప్పటివరకు 305 విత్తనపు కోడెలను పరీక్షకు పెట్టా రు. అలాగే పాల దిగుబడికి 38,807 ఆవులను న మోదు చేశారు. 420 హెచ్‌జీఎం కోడె దూడలను ఉ త్పత్తి చేశారు. పాడి పంటలు..వ్యవసాయ కుంటుబాలకు రెండు కళ్లు. పంట సాగులో నష్టమొస్తే కర్షకులను పాడి పశువులు కామధేనువుల్లా ఆదుకుంటున్నాయి. అలాంటి పాడి సంపద ఉత్తమంగా ఉంటే రైతులు ఆర్థికాభివృద్ధికి మరింత చేయూత నిస్తాయి. ఇందుకు ఉత్తమ విత్తన కోడెల ఎంపికే లక్ష్యంగా చిత్తూరు కేంద్రంగా పశుసంతతి పరిశీలన కేంద్రం ఏర్పాటు అయ్యింది. ఈ కేంద్రం ఉత్తమ కోడెల ఎంపికలో లక్ష్యం దిశగా పరుగులు తీస్తోంది. అత్యుత్తమ విత్తన కోడెలు, ఆవులను వృద్ధి చేసి, పాడి సమృద్ధికి పాటుపడుతోంది. అన్నదాతలకు అండగా నిలుస్తోంది. చిత్తూరు రూరల్ (కాణిపాకం): పాల దిగుబడి పెంపే లక్ష్యంగా ఆరోగ్యకరమైన, దృఢమైన సంకరజాతి పశు సంపదను ఉత్పత్తిలో జిల్లాలోని పశు సంతతి పరిశీల న పథక కేంద్రం ప్రధాన భూమిక పోషిస్తోంది. వీర్య కేంద్రాల్లోని విత్తన కోడెలను పరిశీలించి, తద్వారా అ త్యధిక జన్యుసామర్థ్యం కలిగిన విత్తనపు కోడెలను ఉ త్పత్తి చేయడంలో ఈ కేంద్రం ముందు వరుసలో నిలిచింది. వ్యవసాయ అనుబంధ రంగమైన పాడి పరిశ్ర మలో మేలు జాతి సంతతిని పెంచుతూ పాడి పరిశ్రమాభివృద్ధికి కృషిలో గుర్తింపు పొందింది. విత్తన కోడెలను ఉత్పత్తి చేయడంలో లక్ష్యాన్ని అధిగమిస్తోంది. ఉత్తమ కోడెల ఎంపిక ఇలా.. రాష్ట్రంలోని నంద్యాల, బనవాసి, విశాఖపట్నంలోని వీ ర్య కేంద్రాలతోపాటు దేశంలోని పలు వీర్యకేంద్రాల్లోని విత్తనపు కోడెల నుంచి వీర్యాన్ని సేకరించి, ఆ వీర్య నాళికలను చిత్తూరులోని పశు సంతతి పరిశీలన పథక కేంద్రానికి పంపుతారు. ఈ కేంద్రంలోని శాస్త్రవేత్తలు ఎంపిక చేసిన గ్రామాల్లోని రైతుల పశువులకు ఆ వీర్యనాళికలను కృత్రిమ గర్భధారణ చేస్తారు. ఆ పశువు ఈ నిన దూడలను పర్యవేక్షిస్తారు. ఆ పేయదూడలు పెద్ద వై ఈనిన తరువాత పాలిచ్చే సమయంలో వాటి పాల దిగుబడిని కొలిచి, విత్తనపు కోడెల సామర్థ్యాన్ని లెక్కి స్తారు. వీటిలో మంచి పాల దిగుబడి వచ్చిన పశుసంపద జననానికి కారణమైన కోడెను నిరూపితమైన కో డె(ప్రూవింగ్ బుల్)గా గుర్తిస్తారు. ఈ కోడెకు పుట్టిన పేయదూడలను ఉత్తమ ఆవులు(ఎలైట్ డాటర్) అంటారు. ఇలా ఈ కేంద్రంలో ఏటా సుమారు 20 విత్తన కోడెల వీర్యాన్ని పరీక్షిస్తారు. ఇందులో మంచి ధృఢమై న 2–4 కోడెలను ఎంపిక చేస్తారు. అలాగే పాల దిగుబడిని కొలవడం ద్వారా అత్యధిక పాల దిగుబడి ని చ్చే ఆవులను గుర్తించడంతోపాటు ప్రూవింగ్ బుల్‌కు పుట్టిన కోడె వీర్యాన్ని, పేయ దూడలకు గర్భ ధారణ చేయించి, వాటికి పుట్టిన పశుసంపదను అత్యుత్తమ పశుసంపదగా పరిగణిస్తారు. మగ దూడలైతే హెచ్‌జీఎం(హైజెనిటిక్ మెరిట్) విత్తన కోడెలుగా పరిగణిస్తా రు. ఈ హెచ్‌జీఎం విత్తను కోడెలను ప్రభుత్వం రైతు లకు మంచి ధర చెల్ల్లించి, కొనుగోలు చేసి, దేశంలోని వీర్య కేంద్రాలకు సరఫరా చేస్తుంది. సంవత్సరం పరీక్షకు పెట్టిన పాలదిగుబడి ఉత్పత్తి చేసిన విత్తన కోడెల నమోదు చేసిన హెచ్‌జీఎం కోడె సంఖ్య ఆవులు దూడల సంఖ్య2013–14 20 567 0 2014–15 25 3129 9 2015–16 30 925 25 2016–17 30 1255 49 2017–18 30 4130 55 2018–19 18 2431 36 2019–20 18 2034 0 2020–21 20 3635 10 2021–22 22 6555 31 2022–23 23 6041 108 2023–24 23 3584 79 2024–25 23 4518 49 భవిష్యత్ దృష్ట్యా... పాల నమోదు కార్యక్ర మం ద్వారా అధిక పాల దిగుబడినిచ్చే ఉత్తమ ఆవులను గుర్తిస్తున్నాం. దేశంలోని అన్ని వీర్య కేంద్రాల్లోని సంకర జాతి జెర్సీ–సహివాల్ జాతి విత్తనపు కోడెలను పరీక్షిస్తున్నాం. అత్యధిక జన్యుసామర్థ్యం కలిగిన కోడె దూడలను ఉత్పత్తి చేస్తున్నాం. రాబోవు తరాల్లో సంకరజాతి జెర్సీ ఆవుల పాడి ఉత్పాదక జన్యు సామర్థ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా పని చేస్తున్నాం. – వాసు, జిల్లా పశుసంతతి పరీశీలన కేంద్ర డీడీ, ప్రాజెక్టు కోఆర్డినేటర్, చిత్తూరు ఇదీ ఉద్దేశం.. జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ (ఎన్డీడీబీ) ద్వారా సంకరజాతి జెర్సీ ఆవుల్లో ఎన్డీపీ–1 స్కీం కింద పశుసంతతి పరిశీలన పథకాన్ని 2013–14 సంవత్సరంలో ప్రారంభించారు. ఇది 2018–19 వరకు కొనసాగింది. తరువాత 2019–20 నుంచి ఈ పథకాన్ని రాష్ట్రీయ గోకుల్ మిషన్ (ఆర్జీఎం) కింద అమలు చేస్తున్నారు. సంకర జాతి జెర్సీ ఆ వుల్లో జన్యుపర్యంగా పాడి ఉత్పాదక శక్తిని పెంపొందించడం, వీర్య కేంద్రంలో ఉన్న విత్తనపు కోడెలను (బ్రీడింగ్ బుల్స్) పరిశీలించి, వాటి ద్వారా అత్యధిక జన్యు సామర్థ్యం కలిగిన విత్తనపు కోడెలను ఉత్పత్తి చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. చిత్తూరు కేంద్రంగా... చిత్తూరు నగరంలోని కలెక్టరేట్ సమీపంలో రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ కేంద్రం పనిచేస్తోంది. తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు ఇందులో భాగంగా ఉన్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జెర్సీ–సహివాల్ జాతి సంకర ఆవులు ఎక్కువగా ఉన్నాయి. ఈ సంకర ఆవులు మంచి రోగ నిరోధక శక్తి, ప్రతికూల పరిస్థితుల్లో కూడా మంచి పాల దిగుబడికి పేరు గాంచాయి. అందుకే రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో మాత్రమే ఈ పథకాన్ని అమలులోకి తీసుకొచ్చారు. -
ఉద్యోగులపై కపట ప్రేమ
చిత్తూరు కార్పొరేషన్: కూటమి సర్కారు ఉద్యోగులపై కపట ప్రేమ చూపుతోందని వైఎస్సార్సీపీ ఉద్యోగు లు, పెన్సన్షర్ల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. బుధవారం ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆ యన మాట్లాడారు. అధికారం కోసం ఉద్యోగులకు అ డ్డమైన హామీలిచ్చి తీరా వాటిని విస్మరించిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అధికారంలో వచ్చి 11 నెలలవుతున్న ఉద్యోగులు, పెన్షనర్లకు ఇ చ్చిన హామీలు ఏమయ్యాయో చంద్రబాబు, లోకేష్, పవన్‌కల్యాణ్‌లు చెప్పాలన్నారు. ప్రతినెల సక్రమంగా జీతాలు కూడ ఇవ్వలేకపోతున్నారని ఆరోపించారు. ఉ ద్యోగులకు అన్ని రకాలుగా కలిపి మొత్తం రూ.30 వేల కోట్లు బకాయిలు రావాల్సి ఉందన్నారు. ఆర్థిక ఇబ్బందుల పేరిట కాలయాపన చేయడం సరికాదన్నారు. సీపీఎస్ రద్దు ఎప్పుడు చేస్తారోనని 3 లక్షల మంది ఉద్యోగుల కుటుంబాలు వేచి చూస్తున్నాయన్నారు. పీఆర్సీ కమిషన్ తీసి వేశారని, ఉద్యోగులకు మూడు డీఎలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అంగన్వాడీ, ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదన్నారు. ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయసింహారెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలపై అన్ని సంఘాలను కలిసి సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు. డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేసి దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. మెదలియార్ కార్పొరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞానజగదీష్, ఉద్యోగుల సంఘం నాయకులు ప్రసాద్‌రెడ్డి, నాయకులు మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గ్రామీణ ప్రజల్లో ఆధ్యాత్మిక భావం
– మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు: గ్రామీణ ప్రజల్లో ఆధ్యాత్మిక భావాలు పె రిగాయని, ప్రతి గ్రామంలోను ఆలయాలు నిర్మిస్తున్నారని, ప్రజలందరూ సన్మార్గంలో నడిచేందుకు పునాదు లు పడుతున్నారని రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. బుధవారం ఆయన మండలంలోని జౌకొత్తూరులో బోయకొండ గంగమ్మ ఆలయాన్ని ప్రారంభించి, పూజలు చేశారు. అలాగే మరస నపల్లెలో సీతారామ లక్ష్మణుల ఆలయాన్ని పూజలు చే సి, ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పె ద్దిరెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో గంగమ్మ ఆలయాలు, శ్రీరామచంద్రుడు, ఆంజనేయస్వామి, నరసింహస్వా మి ఆలయాలతోపాటు ప్రతి గ్రామంలోనూ గ్రామదేవతల ఆలయాలు నిర్మిస్తూ , భక్తిమార్గం వైపు పయనిస్తుండడం శుభపరిణామమన్నారు. ఆలయాలు, మసీదులు, చర్చిల నిర్మాణాలకు తమ కుటుంబం వ్యక్తిగ తంగా సహాయసహకారాలు అందిస్తుందన్నారు. ప్రజ లు ప్రతి రోజూ ఆలయాలకు వెళ్లడం అలవర్చుకోవాలన్నారు. మాజీ ఎంపీ రెడ్డెప్ప, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ నరసింహులు, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు అమరనాథరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బైరెడ్డిపల్లి కృష్ణమూర్తి, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు. -
● ఈకేవైసీ గడువు పొడిగింపు ● జూన్ నెల ఆఖరు వరకు గడువు ● ఇప్పటికీ 1,05,185 మందికి పెండింగ్ ● వలస కూలీలు, ఉద్యోగులే పెండింగ్‌లో అధికం
కాణిపాకం: ఈకేవైసీ గడువు మళ్లీ పొడిగింపు జరిగింది. పేదలకు పరేషాన్ తీరింది. ఈ ప్రక్రియ గడువు బుధవారంతో ముగుస్తుందని టెన్షన్ పడిపోయారు. వచ్చే నెల నుంచి సరుకులు కట్ అనుకున్నారు. అయితే ప్రభుత్వం మళ్లీ ఈకేవైసీ గడువు జూన్ నెలాఖరు వరకు పొడిగించింది. దీంతో కార్డుదారులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికీ జిల్లావ్యాప్తంగా 1.05 లక్షల మంది పైగా ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంది. ఈ ప్రక్రియ ఎక్కడైనా చేయించుకోవచ్చని అధికారులు చెబుతున్నా క్షేత్ర స్థాయిలో ఫలితం శూన్యమవుతోంది. వలస కూలీలు, ఉద్యోగులు ఈకేవైసీ చేయించుకోవాల్సిన జాబితాలో అధికంగా ఉన్నారని అధికారులు గుర్తించారు. జిల్లావ్యాప్తంగా 1,339 రేషన్ దుకాణాల పరిధిలో 5.40 లక్షల రేషన్ కార్డులున్నాయి. ఈ కార్డుల్లో 16,70,470 మంది సభ్యులున్నారు. పారదర్శకత పేరుతో జాతీయ సమాచార సంస్థ ఆధ్వర్యంలో సాఫ్ట్వేర్ నవీకరిస్తున్నారు. మృతులు ఉండడంతోపాటు అనర్హులైన పలువురు ఉద్యోగులు రేషన్ పాందుతున్నారని ప్రభుత్వం అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో రేషన్ భారాన్ని తగ్గించుకునే ఉద్దేశంతో ఈకేవైసీ తప్పనిసరి చేసింది. కార్డులో ఉన్న ప్రతి సభ్యుడూ తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని స్పష్టం చేసింది. ఈకేవైసీ అధికంగా పెండింగ్ ఇక్కడే.. జిల్లాలో కుప్పం, వి.కోట, పలమనేరు, చిత్తూరు, నగరి, పుంగనూరు, రామకుప్పం తదితర ప్రాంతాల్లో అత్యధికంగా ఈకేవైసీ నమోదు చేయించుకోవాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతాల్లోని ప్రజలు అధిక శాతం మంది బతుకుదెరువు కోసం పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లిన వారు ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. సరుకు రాదని.. గడువు ముగుస్తుండడంతో చాలా మంది కార్డుదారులు పనులు మానుకుని ఈకేవైసీ కోసం క్యూ కట్టారు. కర్ణాటక, తమిళనాడు, హైదరాబాద్ తదితర సుదూర ప్రాంతాల్లో ఉన్న వారు పరుగు పరుగున వస్తున్నారు. మిగిలిన కొంత మంది అవగాహన లోపం కారణంగా రాలేకపోతున్నారు. ఒక రోజు పని వదులుకుంటే కష్టమని కొంతమంది, రాలేని పరిస్థితుల్లో మరికొంత ఉన్నారు. వీరికి ఉన్న చోటే ఈకేవైసీ చేసుకోవచ్చనే విషయం తెలిక ఈకేవైసీ చేయించుకోలేకపోతున్నారు. ప్రైవేటు ఉద్యోగాలు చేసే వ్యక్తులు, బయట రాష్ట్రాల్లో చదివే కళాశాల విద్యార్థులు సైతం ఈకేవైసీకి దూరంగా ఉన్నారు. వీరితోపాటు మృతులు, కదలేని వృద్ధులు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు కలిపి 75 వేల మందికి పైగా ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు. 0–5 పిల్లలు 26,628 మంది ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉందని గుర్తించారు. వీరిలో ఐదేళ్లు దాటిన పిల్లల తల్లిదండ్రులకు ఈకేవైసీ ప్రక్రియ తలనొప్పిగా మారింది. మండుటెండలో పిల్లలను వెంట పెట్టుకుని ఆధార్ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఇక ఎక్కడైతే రేషన్ తీసుకుంటున్నారో..ఆ ప్రాంతాల్లోనే ఈకేవైసీ చేయించుకోవాలని కొంత మంది డీలర్లు మెలిక పెడుతున్నారు. రేషన్‌కు ప్రతి సభ్యుడికీ ఈకేవైసీ తప్పనిసరి మెలిక.. అదీ ఏప్రిల్ 30 వరకే గడువు.. ఆపై సరుకులు కట్.. వెరసి.. రేషన్‌కార్డులు పరేషాన్ కావాల్సిన పరిస్థితి. సుదూర ప్రాంతాల్లోని పిల్లలు.. కదలలేని వృద్ధులు.. వేలి ముద్రలు పడని చిన్నారులు ఏమి చేయాలని పేదలు ఖంగారు.. ఎట్టకేలకే మళ్లీ ఈకేవైసీ గడువు పొడిగింపుతో వారి పరేషాన్ తీరింది. అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు. జిల్లా సమాచారం... చౌకదుకాణాలు – 1,339రేషన్‌కార్డుల సంఖ్య – 5.40 లక్షలు కార్డులోని సభ్యులు – 16,70,470ఈకేవైసీ చేయించుకున్నవారు – 15,37,402పెండింగ్‌లోని 0–5 వయస్సుపిల్లలు – 26,628 80 ఏళ్లు దాటిన వృద్ధులు – 1,255 చేయించుకోవాల్సి వారు మొత్తం – 1,05,185 ఈకేవైసీ కొత్తకార్డులకు శాపమా? ఈకేవైసీ ప్రక్రియను సాకుగా చూపి, కూటమి ప్రభుత్వం కొత్త రేషన్‌కార్డుల మంజూరును వాయిదా వేస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు. గతేడాది డిసెంబర్లో కొత్త రేషన్‌కార్డులకు సచివాలయంలో దరఖాస్తులు స్వీకరిస్తారని ప్రకటించింది. సంక్రాంతికి కొత్త కార్డులని, ఆ తర్వాత ఉగాదికని చెప్పింది. అప్పటికీ ఆ ఊసే లేదు. దీంతో కూటమి నేతలు కూడా ప్రజలకు సమాధానం చెప్పుకోలేక గుటకలు మింగుతున్నారు. ప్రస్తుతం ఈకేవైసీ ప్రక్రియ పొడిగింపుతో కొత్త కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి మళ్లీ నిరాశే మిగిలింది. ఆందోళన వద్దు ఈకేవైసీ చేయించుకోవాల్సిన వారు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. జూన్ నెలాఖరు వరకు గడువు ఉంది. ఈ విషయాన్ని గమనించి ఇంత వరకు ఈకేవైసీ చేయించుకోని వారు చేసుకోవచ్చు. రాష్ట్రంలో ఎక్కడైనా ఈకేవైసీ చేసుకోవచ్చు. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. డీలర్లు ఈప్రక్రియను పూర్తిచేసేలా చూడాలి. కార్డుదారులను ఇబ్బంది పెట్టవద్దు. – శంకరన్, డీఎస్ఓ, చిత్తూరు మార్చి నుంచి ప్రారంభం ఈకేవైసీ ప్రక్రియ గత మార్చి 19వ తేదీ నుంచి అన్ని రేషన్ షాపుల్లో ప్రారంభమైంది. తొలుత మార్చి 23 వరకు గడువు పెట్టారు. ఆ తర్వాత నెలాఖరు వరకూ పొడిగించారు. అ ప్పటికీ ఈ–కేవైసీ చేయించుకోవాల్సిన కార్డుదారులు పెద్ద సంఖ్యలో మిగిలిపోవడంతో ఈకేవైసీ గడువును ఏప్రిల్ 30 వరకు పొడిగించారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకూ 15, 37,402 మంది ఈకేవైసీ చేయించుకున్నారు. మరో 1,05, 185 మంది ఈ ప్రక్రియ పూర్తి చేయించుకోవాల్సి ఉంది. -
నేడు పింఛన్ల పంపిణీ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఈ నెల ఒకటో తేదీన పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. ఈ మేరకు పింఛన్ల పంపిణీపై క్షేత్ర స్థాయి అధికారులతో బుధవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మే ఒకటో తేదీన జిల్లాలోని 2,64,520 మంది లబ్ధిదారులకు రూ.112.80 కోట్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఎలాంటి అలసత్వం వహించకుండా పింఛన్‌దారుల ఇంటి వద్దకే వెళ్లి పింఛన్ నగదు అందజేయాలన్నారు. ఉదయం 7 గంటల నుంచి పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టాలన్నారు. ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలన్నారు. గత నెలల్లో వివిధ కారణాలతో పింఛన్ తీసుకోని వారికి ఈ నెలలో మొత్తం నగదు అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. శాంతిభద్రతల పటిష్టతకు చర్యలు పుత్తూరు: జిల్లాలో శాంతిభద్రతల పటిష్టతకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీ వి.హర్షవర్థన్‌రాజు తెలిపారు. బుధవారం పుత్తూరు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని వడమాలపేట, నారాయణవనం, పుత్తూరు స్టేషన్లలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ గంజాయి, సారా, గ్యాంబ్లింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపి, శాంతిభద్రతలను మరింత మెరుగుపరచనున్నట్లు తెలిపారు. ఇందుకు ప్రత్యేకించి ఈగల్ టీమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు జాతీయ రహదారుల్లో నిఘా వ్యవస్థను పెంచుతున్నట్లు తెలిపారు. పాత నేరస్తులపై నిఘా ఉంచి, బీట్ సిస్టమ్‌ను బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు. రోడ్డు ప్రమాదాల నివారణకు స్టాప్ అండ్ వాష్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ఎస్హెచ్ఓల ద్వారా గ్రామ సభలు నిర్వహిస్తూ, పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ జి.రవికుమార్, సీఐ కెబీ సురేంద్రనాయుడు, ఎస్ఐ ఓబయ్య తదితరులు పాల్గొన్నారు. -
‘నీట్’కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
● జిల్లాలో ఈ నెల 4న పరీక్ష ● కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఈ నెల 4వ తేదీన నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్)కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. జిల్లాలో ఈ పరీక్ష నిర్వహణపై బుధవారం సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి అలసత్వం లేకుండా పకడ్బందీగా నీట్ నిర్వహించాలన్నారు. ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, మెడికల్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో అడ్మిషన్లకు నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్) పరీక్షలు నిర్వహిస్తారన్నారు. ఈ పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) నిర్వహిస్తుందని చెప్పారు. జిల్లాలోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 432 మంది, సావిత్రమ్మ మహిళా డిగ్రీ కళాశాలలో 278 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. మే 4వ తేదీన మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారన్నారు. ఈ పరీక్షలను సంబంధిత అధికారులు ప్రతిష్టాత్మకంగా భావించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టాలన్నారు. పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేయండి పరీక్షలు నిర్వహించే కేంద్రాల్లో, ప్రశ్నపత్రాలు భద్రపరిచే స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పోలీస్‌ల భద్రత నడుమ కేంద్రాలకు ప్రశ్న పత్రాలను తరలించాలని చెప్పారు. పరీక్ష నిర్వహించే సమయంలో విద్యుత్ అంతరాయం కలగకుండా, మౌలిక వసతుల సమస్యలు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద నిర్దేశించిన ప్రాంతంలో తల్లిదండ్రులు వేచి ఉండేందుకు షామియానా, నీటి వసతులు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సరైన సమయానికి చేరుకునేలా రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. విభిన్నప్రతిభావంతులకు వీల్చైర్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. అత్యవసర వైద్యసేవలకు అంబులెన్స్, ఫైర్ ఇంజిన్లను అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థులు, ఇన్విజిలేటర్లు మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్లకుండా తనిఖీలు చేయాలన్నారు. మొబైల్ ఫోన్లు భద్రపరిచేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద రెవెన్యూ, పోలీసు తరపున ఒక నోడల్ అధికారిని నియమించాలని తెలిపారు. ఎస్పీ మణికంఠ చందోలు మాట్లాడుతూ ప్రశ్నపత్రాలను ఆర్ముడ్ పోలీసుల ఎస్కార్ట్‌తో పరీక్ష కేంద్రాలకు తరలించాలన్నారు. పూర్తి స్థాయిలో వీడియోగ్రఫీ, ఫొటోగ్రఫీ చేయించాలని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద వాహనాల పార్కింగ్‌కు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ విద్యాధరి, డీఆర్వో మోహన్‌కుమార్, డీఈఓ వరలక్ష్మి, ఆర్డీఓ శ్రీనివాసులు, పీవీకేఎన్ కళాశాల పరీక్షల విభాగం కోఆర్డినేటర్ శరవణ తదితరులు పాల్గొన్నారు. -
మాజీ మంత్రి రోజా విస్తృత పర్యటన
నగరి : ప్రారంభోత్సవాలు, వేడుకలు అంటూ మాజీ మంత్రి ఆర్కే రోజా బుధవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బుధవారం అరక్కోణం పనంబాకంలో నగరి పట్టణానికి చెందిన వారు నూతనంగా నిర్మించిన ఏజేఎస్ కళ్యాణ మండపాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం తిరుపతి పద్మావతిపురం సుబ్బయ్య ఫంక్షన్ హాల్లో స్విమ్స్ అమర్ కుమార్తె ఓణీ ఫంక్షన్లో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు. వడమాలపేట మండలం పూడి గ్రామంలో వైస్ సర్పంచ్ రాజశేఖర్ గారి కుమార్తె ఓణీ ఫంక్షన్లో పాల్గొని, చిన్నారిని ఆశీర్వదించారు. అనంతరం నిండ్ర మండలం ఎక్స్ సర్పంచ్ రేవతి కుమార్తె నిశ్చితార్థంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. -
జిల్లా ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌గా ఉషశ్రీ
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా బుధవారం ఉషశ్రీ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న అరుణ్‌కుమార్ రిటైర్డు అయ్యారు. ఈ మేరకు సూపరింటెండెంట్ బాధ్యతలను ఉషశ్రీకి అప్పగించారు. కాగా ఆమె బుధవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఆస్పత్రి నిర్వహణపై ఆమె అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి చర్యలు – నూతన డీసీఈబీ కార్యదర్శిగా హేమాద్రి చిత్తూరు కలెక్టరేట్: జిల్లాలోని ప్రభు త్వ పాఠశాలల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని జిల్లా ఉమ్మడి పరీక్ష ల విభాగం నూతన కార్యదర్శి హేమా ద్రి అన్నారు. నూతనంగా నియమితులైన ఆయన బుధవారం పీసీఆర్ ప్ర భుత్వ పాఠశాలలోని డీసీఈబీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆ యన మాట్లాడుతూ డీసీఈబీ నియమ, నిబంధనల ప్రకారం పరీక్షల నిర్వహణ, విద్యార్థుల ప్రమాణాలు మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం ఆయనకు పలువురు హెచ్ఎంలు అరుణ్‌కుమార్, సోమశేఖర్‌రెడ్డి, రవీంద్రరెడ్డి, హుస్సేన్‌బాషా, భాస్కర్‌రావు, జ్యోతి ప్రసాద్, మాజీ కార్యదర్వి పరశురామ్నాయుడు పుష్పగుచ్ఛాలు అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. బకాయిలు చెల్లించాలి చిత్తూరు రూరల్ (కాణిపాకం): రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ఆర్టీసీ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు డిమాండ్ చేశారు. చిత్తూరు నగరంలోని ఆర్టీసీ–2 డిపోలో బుధవారం జరిగిన ఓప్రైవేటు కార్యక్రమానికి ఆయన హాజరై, మాట్లాడారు. 11 వ పీఆర్సీకి సంబంధించి 24 నెలలు అరియర్స్, నాలుగు డీఏలు, అరియర్స్ సరెండర్ లీవులు, లీవ్ ఎన్ క్యాష్లకు సంబంధించి రూ.వేల కోట్లు బకాయిలు ఉన్నాయన్నారు. ఒక్క బకాయి కూడా సర్వీసులో ఉన్న ఉద్యోగులు, ఉద్యోగ విరమణ చేస్తున్న ఉద్యోగులకు ఇవ్వడం లేదన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి బకాయిలను దశలవారీగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్టీసీ ఉద్యోగుల ఆనందం ఆవిరైందని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న 3,500 మంది ఉద్యోగోన్నతులు వెంటనే అమలు చేయాలన్నారు. ఖాళీలు ఉన్న డ్రైవర్లు, కండక్టర్ పోస్టులతోపాటు 10వేల పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర నాయకులు అర్జున్, విజయ్‌కుమార మురళీధరన్, వి.ఎస్ మణి తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి స్కూలుకు రెండు ఎస్జీటీ పోస్టులు కేటాయించాలి
చిత్తూరు కలెక్టరేట్ : ఏకోపాధ్యాయ పాఠశాలలు లేకుండా ప్రతి స్కూలుకు రెండు ఎస్జీటీ పోస్టులు కచ్చితంగా కేటాయించాలని స్కూల్ అసిస్టెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరోత్తమరెడ్డి కోరారు. బుధవారం ఆయన పలు డిమాండ్ల పరిష్కారంపై విలేకరులతో మాట్లాడారు. ఉన్నత ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ, విద్యార్థుల నిష్పత్తి 1:45 ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. డీఎస్సీలో నియమితులయ్యే టీచర్లను క్లస్టర్లో అదనపు టీచర్లుగా నియమించాలన్నారు. ప్రతి ఉన్నత పాఠశాలకు విద్యార్థులతో నిమిత్తం లేకుండా హెచ్ఎం, అన్ని సబ్జెక్టులకు స్కూల్ అసిస్టెంట్స్, పీడీ పోస్టులను కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో సబ్జెక్ట్ టీచర్స్ని తప్పనిసరిగా నియమించాలన్నారు. ఇటీవల డైట్, సమగ్రశిక్ష శాఖలో పనిచేస్తున్న సెక్టోరల్స్ను పూర్తి కాలం కాకముందే రీ ప్యాట్రియేషన్ చేయడం దారుణమన్నారు. అలాంటి టీచర్లకు రాబోయే బదిలీల్లో అనుమతి ఇస్తూ పాత పాఠశాల నుంచి సర్వీస్ లెక్కించాలని డిమాండ్ చేశారు. వైద్య ధ్రువీకరణ గతంలోకి, ఇప్పుడు ఇస్తున్న వాటికి ఎక్కువ వ్యత్యాసం ఉన్న వాటిని తిరిగి పునఃపరిశీలించాలన్నారు. -
నేటి నుంచి జిల్లాలో స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలోని అన్ని సబ్ రిజి స్ట్రార్ కార్యాలయా ల్లో బుధవారం నుంచి స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్ చేయనున్నట్లు జి ల్లా రిజిస్ట్రార్ రమణ మూర్తి తెలిపారు. ఆయన తన కార్యాలయంలో ఈ వివరాలను వెల్లడించారు. ఈ నెల 4న తొలుత జిల్లా కేంద్రంలోని ఆ ర్వో (అర్బన్)కార్యాలయంలో ప్రయోగాత్మకంగా ఈవిధానాన్ని అమలు చేశామన్నారు. ప్రక్రియ సజావుగా జరుగుతుండడంతో ఈనెల 30 నుంచి మిగిలిన సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేస్తున్నమన్నారు. క్రయ, విక్రయదారులు ముందుగా వారు కోరుకున్న తేదీ, సమయంలో స్లాట్ బుక్ చేసుకోవచ్చన్నారు. వారికి నిర్దేశించిన సమయంలో నేరుగా కార్యాలయానికి వచ్చి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకుని వెళ్లవచ్చని చెప్పారు. దీంతో సమయం ఆదా అవుతుందన్నారు. చిత్తూరు రూరల్, బంగారుపాళెం, పలమనేరు, పుంగనూరు, కుప్పం, కార్వేటినగరం, నగరి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇక స్లాట్ బుకింగ్ ద్వారా పనులు చేసుకోవచ్చన్నారు. చిత్తూరు ఆర్వో కార్యాలయం మినహా అన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రోజు 39 స్లాట్స్ అందుబాటులో ఉంటాయని చెప్పారు. చిత్తూ రు ఆర్వోలో 78 స్లాట్స్ వెసులుబాటు ఇచ్చారన్నా రు. నిర్దేశించిన సమయంలో బుక్ చేసుకున్నవారు వచ్చినా, రాకున్నా మరొకరికి అవకాశం ఇవ్వరన్నారు. స్లాట్‌ను రీ షెడ్యూల్ చేసుకోవాలంటే రూ.200 రుసుము చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఇన్చార్జ్ డీఎల్పీఓగా శ్రీనివాసులు చిత్తూరు కార్పొరేషన్: డీఎల్పీఓ పార్వతి బుధవారం ఉద్యోగవిరమణ చేయనున్నారు. దీంతో ఆమె స్థానంలో ఇన్చార్జ్గా పూతలపట్టు డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాసులును నియమించారు. మే 1 నుంచి ఈయన ఇన్చార్జ్గా కొనసాగనున్నారు. -
వచ్చామా..చెప్పామా.. వెళ్లామా!
● మళ్లీ తూతూమంత్రంగా జెడ్పీ సర్వసభ్య సమావేశం ● అన్ని శాఖల్లోనూ నామ మాత్రంగా చర్చ ● సమావేశానికి ఇన్చార్జ్ మంత్రి, ఎమ్మెల్యేలు డుమ్మా పొంతన లేని అజెండా.. చర్చ సర్వసభ్య సమావేశంలో స్టేజీపైనా పలు శాఖల అధికారులు ప్రసంగించిన అంశాలు.. అజెండాలోని అంశాలకు పూర్తిగా వ్యత్యాసం ఉండడంతో సభ్యులు తికమకపడ్డారు. అజెండాలో పలు శాఖలు ఇచ్చిన వివరాలు రెండు నెలలు ముందువే కావడంతో సభ్యులు ఇదేమి తీరని మండిపడ్డారు. సభ్యులకు తాజా సమాచారం ఇవ్వకుండా మోసం చేయటమేమిటని ప్రశ్నించారు. అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తిరుపతి, అన్నమయ్య జిల్లాల సమాచారాన్ని సభ్యులకు తెలియజేయకుండా కేవలం చిత్తూరు జిల్లాలో 32 మండలాల సమాచారాన్నే వివరించడంపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు కార్పొరేషన్: వచ్చామా.. ఏదో చెప్పామా..వెళ్లామా అనే చందాన తూతూమంత్రంగా సాగింది జిల్లా పరిషత్ మూడో సర్వసభ్య సమావేశం. జెడ్పీ సమావేశ మందిరంలో మూడో సర్వసభ్య సమావేశం మంగళవారం చైర్మన్ శ్రీనివాసులు అధ్యక్షతన, సీఈఓ రవికుమార్‌నాయుడు నేతృత్వంలో నిర్వహించారు. జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు మాట్లాడుతూ మండలాల వారీగా తాగునీటి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా తాగునీటి స మస్యను పరిష్కారానికి పెద్దపీట వేశామన్నారు. ఎక్కడైన మండలాల్లో బోర్లు, మోటార్లు పాడైతే తమ దృష్టికి తీసుకురావలన్నారు. వెంటనే వాటిని మరమ్మతు చేయడానికి అనుమతులు ఇస్తామన్నారు. అలాగే కు రబ సంఘం నాయకుల వినతి మేరకు జెడ్పీ కార్యాలయంలో కనకదాస్ విగ్రహం ఏర్పాటుపై సభ్యుల నుంచి తీర్మానం స్వీకరించారు. వ్యయం రూ.3.888 కోట్లు సర్వసభ్య సమావేశం చివర్లో బడ్జెట్ ఆమోదంపై తీ ర్మానం చేశారు. ఈ బడ్జెట్ ఆమోదంలో 2025–26 వ ఆర్థిక సంవత్సర వ్యయం రూ.3,888 కోట్లుగా ప్ర కటించారు. అలాగే ఆదాయం రూ.3,996 కోట్లుగా నిర్ధేశించినట్లు జెడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనా ఆదాయం రూ.4133 కోట్లుగా, వ్యయం రూ.4,039 కోట్లుగా నిర్ధేశించారు. అయితే నిర్ధేశించిన అంచనాలకంటే తక్కువగా ఈ సంవత్సరం బడ్జెట్ నమోదైంది. దళిత ఎమ్మెల్యేకు అవమానం సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలాన్ని నియోజకవర్గంలో అధికారులు అవమానిస్తున్నారని ఆయన కు మారుడు నారాయణవనం జెడ్పీటీసీ సభ్యుడు సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమూల్ డెయిరీ పరిస్థితి ఏమిటి? గతంలో అమూల్ డెయిరీలో పాల ధర బాగా ఇచ్చేవారని మదనపల్లె జెడ్పీటీసీ సభ్యుడు ఉదయ్‌కుమార్ అన్నారు. ప్రస్తుతం దాదాపు అక్కడ పాలసేకరణ ఆపి వేసినట్లు తెలిసిందన్నారు. గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన డెయిరీ కావడంతో దానిపై కక్షకట్టి రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని విమర్శించారు. ఫలితాలు తుస్ పది, ఇంటర్ తరగతుల ఫలితాలు గతం కంటే త గ్గాయని శాంతిపురం జెడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాసులు అన్నారు. పేద, మధ్యతరగతి పిల్లలు ప్రభు త్వ బడుల్లో చదువుకుంటున్నారన్నారు. కానీ అక్కడ ఫలితాలు చూస్తే భయమేస్తోందన్నారు. ఆర్ఎంపీలదే రాజ్యం కుప్పం నియోజకవర్గంలో ఆర్ఎంపీ వైద్యులదే రా జ్యంగా మారిందని కుప్పం జెడ్పీటీసీ సభ్యుడు శరవ ణ ఆరోపించారు. 108 వాహనంలో వసతులు లేవని పాకాల జెడ్పీటీసీ సభ్యురాలు పద్మావతి తెలిపారు. సదుం మండలంలోని జెడ్పీ హైస్కూల్లో అనవసరంగా నిర్మిస్తున్నారని జెడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్‌రెడ్డి ఆరోపించారు. గుడుపల్లె మండంలోని పలు పాఠశాలల పనులు మధ్యలో ఆగిపోయాయని జెడ్పీటీసీ సభ్యుడు కృష్ణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. పీలేరు మండలంలో ట్రాన్స్ఫార్మర్ పాడైతే రేణిగుంటకు వెళ్లి తెచ్చుకోవడానికి రైతులు అవస్థలు పడుతున్నారని ఎ ర్రావారిపాళెం జెడ్పీటీసీ సభ్యుడు కరుణాకర్‌రెడ్డి అ న్నారు. సోలార్ అదనపులోడ్ క్రమబద్ధీకరణకు రెస్కో అధికారులు డబ్బులు కట్టించుకుని, ఇవ్వలేదని రామకుప్పం జెడ్పీటీసీ సభ్యుడు నితిన్రాఘవ్ తెలిపారు. పాలసముద్రం మండలంలో కరెంటు స్తంభాలు వాలిపోయాయని పాలసముద్రం జెడ్పీటీసీ అన్బలగన్ తెలి పారు. వికృతమాల పంచాయతీలో జరిగిన పలు పను ల్లో రూ.2 కోట్లు అవినీతి జరిగిందని ఏర్పేడు జెడ్పీటీసీ సభ్యుడు తిరుమలయ్య ఆరోపించారు. ఈ సమావేశంలో కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ, తిరుపతి డీఆర్వో నరసింహులు, జెడ్పీ వైస్ చైర్మన్ రమ్య తదితరులు పాల్గొన్నారు. కాగా జెడ్పీ సమావేశ మందిరంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి సభ్యులు కానీ వారు హాజరయ్యారు. అలాగే జీడీనెల్లూరు ఎమ్మెల్యే థామస్ వ్యక్తిగత కెమెరామెన్ వీడియో తీస్తూ హల్చల్ చేశారు. మాట్లాడుతున్న జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులుప్రభుత్వాస్పత్రులు అధ్వాన్నం: ఎమ్మెల్యే థామస్ జిల్లాలోని ప్రభుత్వాస్పత్రులు అధ్వాన్నంగా ఉన్నాయని జీడీ నెల్లూరు కూటమి ఎమ్మెల్యే థామస్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే థామస్ మాట్లాడుతూ జిల్లా ప్రభుత్వాస్పత్రిలో ఇటీవల తలకు దెబ్బతగిలి ఒక మహిళ చేరితే సీటీ స్కాన్ చేయకుండా పంపేశారన్నారు. మరుసటి రోజు ఆమె మరణించిందన్నారు. కాగా సర్వ సభ్య సమావేశంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలువురు జెడ్పీటీసీ సభ్యులు క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను పరిష్కరించాలని ప్రశ్నల వర్షం కురిపించారు. -
రెక్కలు తెగిన ఈగల్..!
ఈగల్.. పక్షి జాతిలో విభిన్నం.. ఎత్తుకు ఎగిరే కొద్దీ చిన్న జీవినైనా పసిగట్టి..వేటాడే శక్తి ఈ పక్షికి ఉంది. ఆ పక్షిలా పసిగట్టి మాదకద్రవ్యాల నివారణకు ఈగల్ పేరుతో రాష్ట్రంలో టాస్క్ఫోర్సును కూటమి సర్కార్ ఏర్పాటు చేసింది. అత్యుత్తమ లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ ఈగల్ రెక్కలు తెగిన పక్షిలా మారింది. ఫలితంగా జిల్లాలో మాదకద్రవ్యాల విక్రయం, రవాణా విచ్చలవిడిగా సాగుతోంది. చిత్తూరు అర్బన్: రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు ‘ఎలైట్ యాంటీ–నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్(ఈగల్)’ను కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మత్తు పదార్థాలను పట్టేస్తామని, నిందితులకు చుక్కలు చూపిస్తామని ఉత్తర ప్రగల్భాలు పలికింది. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే.. ఈగల్ చూడ లేక, ఎగర లేక కుక్కినపేనులా పడుంది. పట్టడానికేనా..? జిల్లాలో ఇప్పటికే ఈగల్ బృందం ఏర్పాటైంది. దీనికి ఓ ఎస్ఐతో పాటు ఆరుగురు సిబ్బంది ఉన్నారు. జిల్లాలో ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోనైనా ఈగల్ బృందం మాదకద్రవ్యాలపై దాడులు చేయవచ్చు. చిత్తూరు నగరంలో విచ్చలవిడిగా వీధివీధికి గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి. పూతలపట్టు గంజాయి రవాణాకు స్టాక్ పాయింట్‌గా నిలుస్తోంది. గంజాయి బెంగళూరు తరలడానికి పలమనేరును దాటించడంలో నిందితులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. కానీ ఈగల్ ఏర్పాటయ్యాక జిల్లాలో పెద్దగా ఎక్కడా నిందితులను పట్టుకున్న దాఖలాలు లేవు. సొంతంగా కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేసింది లేదు. పోనీ పాత కేసుల్లో పేరు మోసిన వ్యక్తులపై నిఘా ఉంచారా..? అంటే సమాధానం లేదు. అసలు ఈగల్ బృందంలోని సిబ్బందికి కేసుల దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానం, మెలకువలు, నిందితుల డేటా విశ్లేషణ, ఆర్థిక లావాదేవీలపై కనీస పరిజ్ఞానం కూడా లేనట్టు తెలుస్తోంది. ఇటీవల మురకంబట్టులో ఈగల్ బృందం పందెం కోళ్లను పట్టుకోవడమే వీళ్ల పనితీరుకు నిదర్శనం. ఇందులో పనిచేసే అధికారులు, సిబ్బందికి 30 శాతం అలవెన్సు సౌకర్యం కల్పించడంతో, గతంలో సస్పెన్షన్లకు గురైన వాళ్లను కూడా అనుభవజ్ఞులుగా ఈగల్లో పెట్టుకోవడం విమర్శలకు తావిస్తోంది. నిఘా బలోపేతమైతేనే.. జిల్లాకో నార్కోటిక్ కంట్రోల్ విభాగం ఏర్పాటు చేశామని చెప్పిన ప్రభుత్వం చిత్తూరులో ఇది ఎక్కడ ఉందో చెప్పనేలేదు. పైగా ఈగల్ కేసుల విచారణకు తిరుపతిలో ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామన్న హామీ ఉత్తర ప్రగల్భాల్లా కనిపిస్తోందే తప్ప.. ఇప్పటి వరకు ఏం చర్యలు చేపట్టారన్నది ప్రశ్నార్థకం. ప్రతి కాలనీ, గ్రామస్థాయిలో మాదక ద్రవ్యాల వినియోగంపై నిఘా ఉంచి, సమాచార వ్యవస్థను బలోపేతం చేసుకోవడం, పాఠశాలలు, కళాశాలల స్థాయిలో పౌరులను ఇందులో బాధ్యులుగా చేస్తూ గంజాయి విక్రయాలు, ఉపయోగాలపై రహస్యంగా సమాచారం తెప్పించుకోవడం చేయాలి. పాత కేసుల్లో నిందితుల కదలికలు..? ఇప్పుడు ఏం చేస్తున్నారు..? కొన్ని స్టేషన్ల పరిధిలో పట్టుబడుతున్న మాదక ద్రవ్యాల కేసుల్లో విశ్లేషణాత్మకమైన దర్యాప్తు..? లాంటి వాటిని అధిగమిస్తేనే ఈగల్‌కు ప్రాణం వచ్చినట్లవుతుంది. అలా చేయనిపక్షంలో జిల్లా పోలీసుశాఖలో ‘ప్రత్యేక విభాగం’ ఎలాగైతే స్తబ్దుగా ఉందో ‘ఈగల్’ కూడా ఓ మూలన కూర్చోక తప్పదు. మాదక ద్రవ్యాల కట్టడిపై కూటమి ప్రగల్భాలు జిల్లా మొత్తానికి ఓ ఎస్ఐ.. ఆరుగురు సిబ్బంది ఇలాగైతే గంజాయి..మత్తు పదార్థాలను అరికట్టినట్టే ఈగల్ బృందంలో ఆరోపణలున్న వాళ్లకు చోటు లక్ష్యం పెద్దది! మాదక ద్రవ్యాల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నవంబర్‌లో ‘ఈగల్’ను తీసుకొచ్చింది. గంజాయి స్మగ్లింగ్, మత్తు పదార్థాల వినియోగం, మత్తెక్కించే రసాయనాల నియంత్రణ, డ్రగ్స్ కట్టడికి ప్రతి జిల్లాలో ఈగల్ పని చేయనున్నట్లు పేర్కొంది. మత్తు పదార్థాలు ఎక్కడైనా ఉపయోగించినా, స్మగ్లింగ్ చేసినా సమాచారం ఇవ్వడానికి ఫోన్–1972 అనే ఉచిత టోల్ ఫ్రీ నంబర్‌ను సైతం అందుబాటులోకి తీసుకొచ్చింది. రాష్ట్రస్థాయిలో ఐజీ స్థాయి అధికారిని నియమించిన ప్రభుత్వం.. జిల్లాల్లో ఎస్పీలకే పర్యవేక్షణ బాధ్యత అప్పగించింది. -
ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలి
చిత్తూరు కలెక్టరేట్: జిల్లాలోని కమ్యూనిటీ హెల్త్ ఉద్యోగుల డిమాండ్లను కూటమి ప్రభుత్వం నె రవేర్చాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు వా డ గంగరాజు డిమాండ్ చేశారు. మంగళవారం కలెక్టరేట్ ఎదుట కమ్యూనిటీ హెల్త్ ఉద్యోగులు రెండో రోజు నిరవధిక సమ్మె నిర్వహించారు. ఈ సమ్మెకు సీఐటీయూ నాయకులు మద్దతు ప లికారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా కమ్యూనిటీ హెల్త్ ఉద్యోగుల న్యాయమైన స మస్యలు పరిష్కరించాలన్నారు. కమ్యూనిటీ హెల్త్ ఉద్యోగులపై పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు. ఏపీ మిడ్ లెవల్ హెల్త్ ప్రొ వైడర్స్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నిరంజన్, ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్, నాయకులు వినోద్, మమత, శ్రీవాణి, అనిత పాల్గొన్నారు. 2న కలెక్టరేట్ ఎదుట ధర్నా చిత్తూరు కార్పొరేషన్: తల్లీబిడ్డల ఎక్స్‌ప్రెస్ డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం మే 2వ తేదీన కలెక్టరేట్ ఎదుట ధర్నా చేయనున్నట్లు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గంగరాజు తెలిపారు. మంగళవారం స్థానిక యూనియ న్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వాస్పత్రిలో ప్రసవం చేసుకున్న తల్లులను సురక్షితంగా వాహనాల్లో ఇంటికి చేర్చే డ్రైవర్ల సమస్యలు తీర్చడం లేదన్నారు. వాహనాలను మరమ్మ తు చేయడం లేదన్నారు. తల్లీబిడ్డల సంరక్షణ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు నాగరాజు, డ్రైవర్లు పాల్గొన్నారు. నేడు పాలిసెట్ పలమనేరు: పట్టణంలోని ఐదు పరీక్ష కేంద్రాల్లో బుధవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్న పాలిసెట్ ఎంట్రెన్స్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్టు స్థానిక పాలిసెట్ కో–ఆర్డినేటర్ మహమూద్ తెలిపా రు. పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాల, మున్సిపల్ ఆఫీసు ఎదురుగా ఉన్న బాలికోన్నత పాఠశాల, గుడియాత్తం రోడ్డులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, హైస్కూల్, మదనపల్లె రోడ్డులోని సాయి శ్రీచైతన్య కళాశాల సెంటర్లలో నిర్వహించే ఈ ప్రవేశ పరీక్షకు 1626మంది విద్యార్థులు రాయనున్నట్టు తెలిపారు. ఇక్కడి సెంటర్లలో ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలను ఎస్వీయూ రీజియన్ ఆర్జేడీ నిర్మల్‌కుమార్ ప్రియ, జిల్లా కో–ఆర్డినేటర్ జగన్నాధరావు, జిల్లా పరిశీలకు లు సుబ్బన్న పరిశీలించారు. ఇప్పటికే హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకున్న విద్యార్థులు సంబందిత సెంటర్లకు గంట ముందుగా చేరుకోవాలని వారు సూచించారు. ఈ పరీక్షల నిర్వహణ కోసం ఐదుగురు చీఫ్ సూపరింటెండెంట్లు, ఐదుగురు జాయింట్ సూపరింటెండెంట్లు, ఆరుగురు డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, వందమంది ఇన్విజిలేటర్లు,40మంది అసిస్టెంట్లు, ఏడుగురు అబ్జర్వర్లు నియమితులయ్యారని, వీరంతా ఆర్డీఓ పర్యవేక్షణలో ఉంటారన్నారు. -
ఒకరు కాదు.. నలుగురు!
అధ్యాపకుడే విద్యార్థిగా మారిన సంఘటనలో ఒకరు కాదు.. నలుగురు ఉన్నట్లు సమాచారం.దీనిపై విచారణ సాగుతోంది.నేడు పాలిసెట్ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి బుధ వారం చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.బుధవారం శ్రీ 30 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025నాసి రకం విత్తనాలు.. నకిలీ నార్లు.. సాగు చేసిన రైతులకు తప్పని కష్టాలు.. వీటి నుంచి గట్టెక్కించి.. కర్షకుడి కష్టం తీర్చి.. నాణ్యమైన నారు..మేలైన పంట.. అధిక దిగుబడి.. గిట్టు బాటు ధర దక్కేందుకు కృషి చేస్తూ.. అంటు క ట్టిన మొక్కలను అందజేస్తోంది ఏపీ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ విజిటెబుల్స్ అండ్ ఫ్లవర్స్. పుడమిపుత్రులకు అండగా నిలుస్తోంది. పలమనేరు: నాసిరకం విత్తనాలతో ఏటా రైతులు పండించిన పంట చేతికి రాక రైతులు నష్టాలు పడు తూనే ఉన్నారు. ఇక ప్రైవేటు నర్సరీలో కూరగాయల మొక్కలు కొందామంటే అధిక ధరల కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో మన రాష్ట్రంతోపాటు కర్ణాటక, తమిళనాడు రైతులకు అంటుకట్టిన మొక్కలను కుప్పం సమీపంలోని పెద్దబంగారునత్తం వద్ద ఉన్న ఏపీ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ విజిటెబుల్స్ అండ్ ఫ్లవర్స్ అందిస్తోంది. ఏపీలోని రైతులు 90 శాతం రాయితీతో అవసరమైన కూరగాయల నార్లను పొందవచ్చు. హైబ్రిడ్ రకాలను అంటుకట్టి రైతులకు అందిస్తోండడంతో ఆ మొక్కలతో సాగు చేసిన రైతులు అధిక పంట దిగుబడులు సాధిస్తున్నారు. గ్రాఫ్టింగ్ మొక్కలతో పలు లాభాలు నాణ్యమైన విత్తనాలతో మొక్కలను పెంచి వాటికి హైబ్రిడ్ వంగడాలను అంటుకట్టి పెంచుతారు. తద్వారా ఈ మొక్కలు చీడపీడలను తట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటాయి. ● భూమి ద్వారా మొక్కకు సంక్రమించే వ్యాధులు తక్కువగా ఉంటాయి. ● ఎకరానికి అవసరమైన మొక్కలు సంఖ్య బాగా తగ్గుతుంది. ● ఆరోగ్యవంతమైన మొక్క కారణంగా అధిక పంట దిగుబడి వస్తుంది. ● నాణ్యమైన ఉత్పత్తి కారణంగా రైతులకు గిట్టుబాటు ధర దక్కుతుంది. ఇప్పటికే 70 లక్షల టమాట మొక్కల పంపిణీ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ద్వారా 6 వేల మంది రైతులకు సాహో రకం హైబ్రిడ్ రకం టమాట నారు 70 లక్షల మొక్కలను 90 శాతం సబ్సిడీతో అందజేశారు. దీంతోపాటు మరో 40 లక్షల వంగ, కాకర, బీర, కర్భూజ నార్లను పంపిణీ చేశారు. టమాట మొక్కకు అంటుకడుతున్న గ్రాఫ్టర్రైతులకు పంపిణీ చేయడానికి తయారు చేసిన టమాట నారు– 8లో– 8లో– 8లోన్యూస్రీల్ 90 శాతం సబ్సిడీతో అంటుకట్టిన కూరగాయల నారు ఈ ఏడాది 1.20 కోట్ల మొక్కల పంపిణీ ఇప్పటికే టమాట, వంగ, కాకర, బీర, కర్బూజ మొక్కలు త్వరలో క్యాబేజీ, కాలీఫ్లవర్, క్యాస్పికం నారు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ లక్ష్యం ఇదీ.. కొత్త కూరగాయల మొక్కలను అంటుకట్టడం, అభివృద్ధి చేయడం. తక్కువ విస్తీర్ణంలో అధిక పంట ఉత్పత్తుల ను సాధించడం. తక్కువ నీటితో ఎక్కువ పంటసాగు చేయడం. క్రాప్ వైజ్ వాల్యూ చైన్ డెవలప్మెంట్. కొత్త పద్ధతుల్లో నర్సరీ మేనేజ్మెంట్ విధానాలు. నారు కోసం కర్ణాటక నుంచి వచ్చా... నేను మూడెకరాల్లో ట మాట సాగు చేస్తున్నా ను. ఇందుకు టమాట మొలకల కోసం కర్ణాటక నుంచి ఇక్కడికి వచ్చా. ప్రైవేటు నర్సరీలో మొక్కలు కొంటే గ్యారెంటీ ఉండదు. అందుకే ఇక్కడ కొచ్చి తీసుకెళుతుంటాం. – చెన్నమారియప్ప, మల్లసంద్ర, కోలారు గ్రాఫ్టింగ్ మొక్కతో అధిక దిగుబడి నేను ఇక్కడ నాలుగేళ్ల నుంచి గ్రాఫ్టర్గా పనిచేస్తున్నా. అంటుకట్టిన మొక్కలను నాటితే ది గుబడి బాగుంటుంది. అందుకే మూడు రా ష్ట్రాలకు చెందిన రైతులు ఇక్కడే కూరగాయల మొక్కలను తీసుకెళుతుంటారు. ఇది పూర్తిగా హార్టికల్చర్ అధికారుల పర్యవేక్షణలో జరుగు తుంది. నాణ్యమైన సీడ్స్‌తో మొక్కలను పెంచి ఆపై అంటుకడతాం. – రాశి, గ్రాఫ్టర్, ఎక్స్‌లెన్స్ సెంటర్, కుప్పం ప్రయోగాలన్నీ రైతుల మేలు కోసమే.. టమాట కాండంగా వంగ, వంగకు కాండంగా మరో మొక్క, ఇలా ప్రయోగాలు చేసి విత్తనాలను మొలకెత్తించిన మొక్కలకు హై బ్రిడ్ రకాలను అంటుకట్టి రైతులకు అందిస్తున్నాం. ఈ సీజన్లో 1.20 కోట్ల కూరగాయల మొక్కలను రైతులకు అందజేశాం. అంటుకట్టిన మొక్క సాగుతో మంచి దిగుబడులు వస్తాయి. మేము చేసే ప్రయోగాలన్నీ రైతులకు మేలు చేసేందుకే. – కోటేశ్వరావు, ఏడీ, సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్, కుప్పం త్వరలో మరిన్ని కూరగాయల నార్లు ఈ సెంటర్లో త్వరలో రైతులకు అవసరమైన కాస్పికం, కాలీఫ్లవర్, స్వీట్‌కార్న్ నార్లను సైతం సిద్ధం చేస్తున్నట్టు ఇక్కడి హార్టికల్చర్ అధికారులు తెలిపారు. నారు అవసరమైన రాష్ట్రానికి చెందిన రైతులు సంబంధిత హెచ్ఓ ద్వారా లేఖ తీసుకు ని వస్తే, ధర ఉన్న మొక్కను 90 శాతం సబ్సిడీతో రూ.9 పైసలకే రైతులు పొందవచ్చు. ఇతర రాష్ట్రాల రైతులు మాత్రం పూర్తి ధర చెల్లించాల్సి ఉంటుంది. టమాటకు సంబంధించి ప్రైవేటు నర్సరీలో మొక్క రూ.2 నుంచి 3 వరకు డిమాండ్ ఆధారంగా విక్రయిస్తున్నారు. దీంతో రైతులు ఎక్స్‌లెన్స్ సెంటర్లో మొక్కలను తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. -
ఒకరు కాదు...నలుగురు!
● డిగ్రీ కళాశాలలో అధ్యాపకుల బీఈడీ లీలలు ● బీఈడీ విద్యార్థులుగా మారిన అధ్యాపకులు ● ఎస్వీయూ అధికారుల విచారణ ప్రారంభం పలమనేరు: అధ్యాపకుడే విద్యార్థిగా మారిన ఘటనలో ఒకరు కాదు నలుగురు ఉన్నట్లు సమాచారం. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విధులు నిర్వహిస్తున్న ఓ అధ్యాపకుడు బంగారుపాళెంలోని ఓ ప్రైవేటు బీఈడీ కళాశాలలో విద్యార్థిగా మారి, పలమనేరు డిగ్రీ కళాశాల సెంటర్లోనే బీఈడీ పరీక్షలు రాస్తున్న విషయం తెలిసిందే. దీనిపై సాక్షి దినపత్రికలో ఈనెల 27న ‘ఇక్కడ అధ్యాపకులు.. అక్కడ విద్యార్థులు’ అనే శీర్షికన కథనం వెలువడిన విషయం విదితమే. ఇలా ఉండగా ఇదే కళాశాలకు చెందిన రెగ్యులర్, కాంట్రాక్ట్, కంప్యూటర్ ఆపరేటర్లు సైతం ఇక్కడ విధులు నిర్వహిస్తూ జీతాలు పొంది, అక్కడి బీఈడీ కళాశాలలో విద్యార్థులుగా ఇప్పుడు ఇదే సెంటర్లో బీఈడీ పరీక్షలు రాస్తున్నట్టు తెలిసింది. దీనిపై ఎస్వీయూ అధికారుల విచారణ చేస్తున్నట్టు సమాచారం. అక్కడా.. ఇక్కడా హాజరు ఎట్టా.. ప్రైవేటు బీఈడీ కళాశాలలో కనీసం 40 శాతం హాజరున్న విద్యార్థులను ఆపై కొంత అపరాధంతో నిర్వాహకులు పరీక్షకు అనుమతిస్తుంటారు. అయితే ప్రభుత్వ కళాశాల అధ్యాపకులే అక్కడ విద్యార్థులు కావడంతో ప్రైవేటు కళాశాల యాజమాన్యం వారి హాజరుపై ఏదోలా మ్యానేజ్ చేసిందనే మాట వినిపిస్తోంది. దీంతో ఏడాదిలో కనీసం 150 రోజులైనా వీరు ప్రైవేటు కాలేజీకి వెళ్లి ఉండాలి. అలాంటప్పుడు పలమనేరులో వారు విధులకు గైర్హాజరు అయి ఉండాలి. కానీ అలా జరగలేదు. వీరు ఇక్కడి కళాశాల పనిదినాల్లో పనిచేసినట్టుగానే నమోదైనట్టు తెలుస్తోంది. దీంతో విచారణ చేసే అధికారులకు ఏమి సమాధానం చెప్పాలో అర్థంగాక కళాశాల ప్రిన్సిపల్ తలపట్టుకుంటున్నట్టు సమాచారం. పది మంది వరకు ఉద్యోగులు... బంగారుపాళెంలోని ప్రైవేటు బీఈడీ కళాశాలలో పలమనేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని పలువురు అధ్యాపకులతోపాటు జిల్లాలోని పది మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు బీఈడీ విద్యార్థులుగా ఉన్నట్టు సమాచారం. దీనిపై సైతం యూనివర్సిటీ అధికారులు విచారిస్తున్నట్టు తెలుస్తోంది. అదనపు జీతమొస్తుందని.. పీజీ, పీహెచ్‌డీలతో అధ్యాపకులైన వీరు బీఈడీ, ఎంఈడీ డిగ్రీలుంటే అదనపు జీతమొస్తుందనే ఇలా డ్యూయెల్ రోల్ చేస్తున్నట్టు మేధావులు చెబుతున్నారు. బంగారుపాళెంలోని ప్రైవేటు బీఈడీ కళాశాల గాడి తప్పిన పరీక్షల నిర్వహణ ప్రైవేటు కళాశాలల బీఈడీ పరీక్షలు ఓపెన్ స్కూల్ పరీక్షల్లా మారాయనే మాట గట్టిగా వినిపిస్తోంది. ఇష్టానురాజ్యంగా అనుకూలమైన చోట సెంటర్లను తెచ్చుకోవడం మొదలు మాస్ కాపీయింగ్ షరా మామూలుగా మారింది. బీఈడీ పరీక్షలు రాస్తున్న విద్యార్థులతో పాటు అదే సెంటర్లోని అధ్యాపకులు పరీక్ష కలిసి రాస్తుండడంతో పరీక్షల తీరు గాడి తప్పిందనే విమర్శలున్నాయి. చిత్తూరు సెంటర్లో ఒకే బల్లపై ముగ్గురు విద్యార్థులు పరీక్షలు రాయడం, మాస్ కాపీయింగ్‌తో పరీక్షలంటేనే నమ్మకం పోయింది. ఇలా పరీక్షలు రాసి పాసై, రేపు ఉద్యోగాలు పొందే వారు పిల్లలకు ఎలా పాఠాలు చెబుతారో ఎస్వీయూ అధికారులే ఆలోచించాలి. ఈ విషయమై స్థానిక ప్రిన్సిపాల్ వెంకటేశును వివరణ కోరగా ఇక్కడున్న అధ్యాపకులు బీఈడీ విద్యార్థులుగా ఇదే సెంటర్లో పరీక్ష రాస్తున్న విషయం సాక్షిలో వచ్చే వరకు తెలిదని, ఇప్పుడు విచారిస్తున్నామని చెప్పడం కొసమెరుపు. -
చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడిగా చవ్వా రాజశేఖర్‌రెడ్డి
తిరుపతి సిటీ: వైఎస్సా ర్ సీపీ అధ్యక్షుడు వై ఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు చిత్తూ రు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడిగా చ వ్వా రాజశేఖర్ రెడ్డిని నియమిస్తూ ఆ పార్టీ కా ర్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతపురం జిల్లా, అనంతపురం పట్టణానికి చెందిన ఆయన ఎంఏ, పీహెచ్డీ పూర్తి చేశారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై ఆసక్తితో దివంగత వైఎస్సార్ అడుగుజాడల్లో నడిచారు. అనంత రం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ సీపీ బలోపేతానికి కృషి చేశారు. పార్టీకి విధేయుడిగా అంకితభావంతో పనిచేసిన ఆయ న సేవలను గుర్తించిన పార్టీ ఆయన్ని చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ ప రిశీలకుడిగా పార్టీ నియమించింది. ఆయన మా ట్లాడుతూ కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తానన్నారు. పదవిని అప్పగించిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి రుణపడి ఉంటానన్నారు. వైఎస్సార్ సీపీ తిరుపతి పార్లమెంట్ పరిశీలకుడిగా ఎంపీ మేడా రఘునాథరెడ్డి తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడిగా రాజ్యసభ స భ్యులు మేడా రఘునా థరెడ్డి నియమితులయ్యారు. వైఎస్సార్ క డప జిల్లా నందలూ రు మండలం, చెన్నయ్యగారిపల్లెకు చెందిన ఆ యన పారిశ్రామిక వేత్తగా, సీనియర్ రాజకీనాయకుడిగా గుర్తింపు పొందారు. 2024లో ఆ య న్ని పార్టీ రాజ్యసభ ఎంపీగా ఎంపిక చేసింది. -
జర్నలిస్టులపై దాడుల నివారణకు త్వరలోనే కమిటీ
చిత్తూరు అర్బన్: పాత్రికేయులపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి వీలైనంత త్వరలోనే ‘జర్నలిస్టులపై దాడుల నివారణ కమిటీ’ ఏర్పాటు చేసి, సమావేశం కూడా నిర్వహిస్తామని చిత్తూరు కలెక్టర్ సుమిత్‌కుమార్ హామీ ఇచ్చారు. శ్రీకాళహస్తిలో ‘సాక్షి’ రిపోర్టర్ శ్రీనివాసులుపై స్థానిక టీడీపీ నేతలు దాడి చేయడాన్ని ఖండిస్తూ, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ యూ నియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, కలెక్టర్ సుమిత్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు లోకనాథన్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అశోక్‌కుమార్ మాట్లాడుతూ ఇటీవల పాత్రికేయులపై దాడులు పెరుగుతున్నాయన్నారు. వీటిని ఆదిలోనే అడ్డుకోవాలంటే జర్నలిస్టులపై దాడుల నివారణ కమిటీ రూపొందించి, నిందితులపై తీసుకుంటున్న చర్యలపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించి, ఎస్పీతో కలిసి త్వరలోనే కమిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి ఇషార్అహ్మద్, చిత్తూరు ప్రెస్‌క్లబ్ ఉపాధ్యక్షులు శివప్రసాద్, పవన్‌కుమార్, నవీన్, శివ, చంద్ర, రాజేష్, మహేష్, హరీష్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
కృతజ్ఞతాభావమే సనాతన ధర్మం
పుత్తూరు: కృతజ్ఞతాభావమే సనాతన ధర్మం అని ఉడిపి పీఠాధిపతి శ్రీఈషాప్రియ తీర్థ స్వామీజీ పేర్కొన్నారు. ఉడిపి మఠం నుంచి పాదయాత్రగా వస్తున్న స్వామీజీ మంగళవారం సాయంత్రం పుత్తూరు చేరుకున్నారు. స్థానిక ఈశ్వరాలయ ప్రాంగణంలోని శ్రీకృష్ణమందిరంలో స్వామీజీ ఉపన్యసిస్తూ శివ నామస్మరణతో అంతఃకరణ శుద్ధి ఏర్పడుతుందని తద్వారా వైరాగ్యం ఏర్పడి జ్ఞానం వైపు నడుస్తామని వెల్లడించారు. ప్రకృతితో మమేకమై జీవించాలని సూచించారు. మనం తీసుకుంటున్న గాలి, నీరు, భోజనం ఎవరి ద్వారా వచ్చిందో వారిపై కృతజ్ఞతాభావంతో ఉండాలని అప్పుడే సనాతన ధర్మాన్ని కాపాడగలమని ఉద్భోదించారు. మనం భూమీదకు వచ్చిన తాత్కాలిక సందర్శకులం మాత్రమేననే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని తెలిపారు. భారతదేశం గురించి తెలుసుకోవాలని, శరీరమనే క్షేత్రాన్ని ఎలా శుద్ధిగా ఉంచుకొవాలనే విషయాన్ని తెలియజేయాలని, సనాతన ధర్మం వైపు ఎలా నడవాలని పూర్వీకులు చెప్పిన విషయాలను తిరిగి తెలియజెప్పాలని, శాస్త్రాలు చదవడంతో పాటు దేశాన్ని పర్యటించడంతో జ్ఞానం కలుగుతుందనే ఉద్దేశంతో పాదయాత్రను ప్రారంభించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో హిందూ సేవా సమితి సభ్యులు బాలకృష్ణారెడ్డి, మురళీకృష్ణ, నాగభూషణం, కోటకొండ బాబు, సుబ్రమణ్యం, రామకృష్ణ, రమేష్ పురోహితులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. -
రైల్వేస్టేషన్‌ను పరిశీలించిన డీఆర్ఎం
చిత్తూరు కార్పొరేషన్: చిత్తూరు రైల్వేస్టేషన్‌ను మంగళవారం సాయంత్రం డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం) చంద్రశేఖర్గుప్త పరిశీలించారు. కాణిపాకం దర్శనార్థం చిత్తూరుకు వచ్చిన ఆయన వచ్చారు. తిరుగు ప్రయాణంలో స్టేషన్‌ను తనిఖీ చేశారు. రైల్వేస్టేషన్లో జరుగుతున్న నిర్మాణ పనులను చూసి పనులు నెమ్మదిగా జరుగుతున్నాయని, వేగంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో రైల్వే పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తనిఖీలు మెరుగ్గా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ మాస్టర్ ముత్తుస్వామి, ఆర్పీఎఫ్ సీఐ కుమార్, జీఆర్పీ ఎస్ఐ ప్రవీణ్ పాల్గొన్నారు. -
ప్రభుత్వ బడుల అభివృద్ధికి చర్యలు చేపట్టాలి
చిత్తూరు కలెక్టరేట్ : కూటమి ప్రభుత్వం ప్రభుత్వ బడుల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆ సంఘం కార్యాలయంలో బదిలీల చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ ప్రాథమిక పాఠశాల వ్యవస్థను ఫౌండేషన్, బేసిక్, మోడల్ ప్రాథమిక పాఠశాలలుగా మార్పు చేసిందన్నారు. ఫౌండేషన్ పాఠశాలలో ఒక రకంగా, బేసిక్ ప్రాథమిక పాఠశాలలో వేర్వేరుగా సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులను కేటాయించడం సరికాదని మండిపడ్డారు. ఫౌండేషన్ పాఠశాలల్లో 1:20గా సెకండరీ గ్రేడ్ టీచర్లను నియమించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక నిధులు కేటాయించాలి మోడల్ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులతో సంబంధం లేకుండా ఐదుగురు ఉపాధ్యాయులు, ఐదు తరగతి గదులు, ప్రత్యేక నిధులు కేటాయించాలని వెంకటేశ్వర్ డిమాండ్ చేశారు. బదిలీలు, ఉద్యోగోన్నతులు, రేషనలైజేషన్ పారదర్శకంగా చేపట్టాలన్నారు. ఏ ఒక్క ఉపాధ్యాయుడికి అన్యాయం జరగకుండా పిల్లలకు నాణ్యమైన విద్య అందించేలా సర్దుబాటు ప్రక్రియ చేయాలన్నారు. రాష్ట్ర కార్యదర్శి జీవి రమణ మాట్లాడుతూ ఉపాధ్యాయుల బదిలీలు, ఉద్యోగోన్నతుల్లో రోజుకు ఒక రకమైన కసరత్తు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఈ కసరత్తుతో టీచర్లలో గందరగోళం నెలకొంటుందన్నారు. టీచర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సోమశేఖరనాయుడు, మణిగండన్ కోరారు. వారు మాట్లాడుతూ ఏప్రిల్ 24 నుంచి మే 30వ తేదీ వరకు జరుగుతున్న బదిలీలు, ఉద్యోగోన్నతులు ,రేషనలైజేషన్‌కు సంబంధించి టీచర్లకు ఏ సమస్యలొచ్చినా పరిష్కారానికి కృషి చేస్తామ న్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షులు పి.సుధాకర్‌రెడ్డి, సహధ్యక్షులు కె.రెడ్డెప్పనాయుడు, ఎస్ రెహానాబేగం, కోశాధికారి కె. ప్రసన్న కుమార్, రాష్ట్ర కౌన్సిలర్లు ఎస్ పి బాషా, పీఆర్ మునిరత్నం, జిల్లా కార్యదర్శులు సీపీ ప్రకాష్, డి. ఏకాంబరం, బి. ఈశ్వర్ మహేంద్ర, కె. సరిత తదితరులు పాల్గొన్నారు. -
ఆ హత్యలే పరువు తీస్తున్నాయ్..!
● కులాంతర ప్రేమ వివాహాలు జీర్ణించుకోలేని పెద్దలు ● క్షణికావేశంలో కన్నపిల్లల్ని కడతేర్చుతున్న పోకడ ● ప్రాణం తీశాక జైల్లో ఊచలు.. రోడ్డున కుటుంబం ● పరువు హత్యల్లో మారాల్సింది పెద్దల ఆలోచనలు ఈ రెండు ఘటనల్లోనూ కనిపిస్తున్న సాధారణ అంశం.. కులాంతర వివాహాలు. వీటి నుంచి తమ పెద్దరికాన్ని కాపాడుకోవడానికి కన్న వాళ్లే ప్రాణాలు తీసే యముళ్లుగా మారుతున్నారు. పరువు హత్యలకు పూనుకుంటున్నారు. పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్నందకు కన్న కూతుర్ని హత్య చేయడంతో పోయిన పరువు తిరిగి వచ్చిందా..? అసలు కులాంతర వివాహం చేసుకుంటే పరువు పోయిందా..? అసలు పరువు అనే పదానికి ఈ తరంలో చోటు ఉందా..? పరువు హత్యలతో జైలు జీవితం కాకుండా, సాధించింది ఏమైనా ఉందా..? అని ప్రశ్నించుకుంటే అసలు పరువు హత్యల జోలికి ఏ ఒక్కరూ వెళ్లరు. ● ‘‘ పలమనేరులోని ఊసరపెంటకు చెందిన భాస్కరనాయుడు కుమార్తె హేమావతి అదే గ్రామానికి చెందిన దళిత యువకుడు కేశవను ప్రేమించింది. పెళ్లికి యువతి తరఫున అంగీకరించకపోవడంతో వాళ్లను కాదని వివాహం చేసుకున్నారు. తిరుపతిలో కాపురం పెట్టారు. ఏడాది తరువాత హేమావతి మగబిడ్డకు జన్మనిచ్చింది. కాన్పు అనంతరం భార్య, బిడ్డను ఇంటికి తీసుకెళుతుండగా భర్త ఎదుటే భాస్కర నాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి హేమావతి మెడకు తాడు బిగించి కన్న కూతుర్ని కడ తేర్చాడు.’’ – 2019, జూన్ ● ‘‘యాస్మిన్ భాను. ఎంబీఏ పూర్తి చేసి, సాయితేజ అనే దళిత యువకుడిని ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లాడింది. సరిగ్గా రెండు నెలల తరువాత తండ్రి డిప్రెషన్లో ఉన్నాడని, చూసి వెళ్లాలని ఫోన్ రావడంతో చిత్తూరులోని బాలాజీ కాలనీకి బయలుదేరింది. కారులో ఎక్కించుకున్న తండ్రి షౌకత్ అలీ, మరో ఇద్దరు బంధువులు.. తాము సూచించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశారు. యాస్మిన్ ఒప్పుకోకపోవడంతో, ఆమె కాళ్లను తొక్కిపెట్టిన తండ్రి ఓ తాడుతో మెడకు రెండు చుట్లు వేసి హత్య చేసి.. కర్కశంగా కన్నపేగును తెంచేశాడు.’’ – పది రోజుల క్రితం చిత్తూరు అర్బన్: ప్రస్తుతం నడుస్తున్నది ఏఐ (ఆర్టిఫి షియల్ ఇంటలిజెన్స్)తో కూడుకున్న ఆధునిక సమాజం. ఇక్కడ ఎవరి గురించి, ఎవరూ పట్టించుకునేంత సమయం లేదు. అది పట్టణమైనా, పల్లెటూరైనా సరే. ఈ ఆధునికీకరణ సమాజంలో అసలు పరువు అనే పదానికి చోటే లేదు. పక్కవాడు మన గురించి ఏమనుకుంటాడో..? 24 గంటలు మనల్ని నిశితంగా పరిశీలిస్తూ, మనం చేసే పనులకు మార్కులు వేస్తాడా..? అనే ప్రశ్నలకు ఇక్కడ తావులేదు. ఇక్కడ ఎవరి పనులు వాళ్లవి. కాలంతోపాటు పరుగెత్తుతున్న మనుషులు పరువు గురించి పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు. ఆలోచనలు మారాలి.. మొన్న భాస్కర నాయుడు, నిన్న షౌకత్ అలీ.. పేర్లు ఏవైనా వీలిద్దరూ తమ పిల్లల్ని చంపేసిన తండ్రులుగా సమాజంలో నిలిచిపోయారు. పైగా పలమనేరు, చిత్తూరులో జరిగిన పరువు హత్యల అనంతరం, వాటిని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయ త్నం చేసి పోలీసులకు దొరికిపోయారు. ఈ కేసులు కోర్టులో రుజువైతే జీవిత ఖైదు నుంచి ఉరిశిక్ష వరకు శిక్ష పడే అవకాశం ఉంది. చిత్తూరులో యాస్మిన్‌ను హత్య చేశాడనే ఆధారాలు సేకరించిన పోలీసులు షౌకత్‌అలీని జైలుకు తరలించారు. ఇప్పుడు అతని భార్య, పిల్లలు రోడ్డున పడ్డారు. అసలు ప్రేమ పెళ్లి చేసుకుంటే ఎదురయ్యే ఆర్థిక, సామాజిక పరమైన ఇబ్బందులను తల్లిదండ్రులు పిల్లలకు వివరించాలి. అప్పటికే ప్రేమ వివాహంపైనే ఆసక్తి ఉంటే.. సమాజంలో ఎలా ధైర్యంగా నిలబడాలో పిల్లలకు నేర్పించాలి. అంతేతప్ప, పిల్లల ప్రాణాలు తీసే అధికారం తమకు లేదనే నిజాన్ని తల్లిదండ్రులు గుర్తించాలి. పిల్లలు సైతం తాము మేజర్లు, తమ ఇష్టం వచ్చినవారిని పెళ్లాడుతామని కాకుండా.. తల్లిదండ్రుల అభిప్రాయాలు కూడా పరిగణలోకి తీసు కుని వారి అనుమానాలను నివృత్తి చేయాలి. ప్రేమ పెళ్లి చేసుకున్నా జీవితంలో సంతోషంగా ఉంటామనే ధైర్యాన్ని ఇవ్వాలి. రెండు వైపులా ఆలోచనా విధానాలు మారితే తప్ప.. పరువు హత్యలనే పదం మాసిపోదు. -
Tirupati: భవనం పైనుంచి పడి ముగ్గురు కార్మికుల మృతి
తిరుపతి: నగరంలోని మంగళం సమీపంలో విషాద ఘటన చోటుచేసుకుంది. తుడా క్వార్టర్స్‌లో నిర్మాణంలో ఉన్న హెచ్ఐజీ భవనం పైనుంచి కిందపడి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. మృతులు బోటతొట్టి శ్రీనివాసులు, వసంత్, కె.శ్రీనివాసులుగా గుర్తించారు. -
మత్తు మందు చల్లి చైను లాక్కెళ్లారు!
పుంగనూరు: కూరగాయల సంతకు వచ్చిన ఓ వృద్ధురాలిపై మత్తుమందు చల్లి చైను లాక్కెళ్లిన సంఘటన సోమవారం పట్టణంలోని కూరగాయల సంతలో జరిగింది. సీఐ సుబ్బరాయుడు కథనం మేరకు.. రామసముద్రం మండలం కొండూరు గ్రామానికి చెందిన సరోజమ్మ సొంత పనుల నిమిత్తం పుంగనూరుకు వచ్చి సంతలో కూరగాయలు కొనుగోలు చేసేందుకు వెళ్లింది. అక్కడ ఇద్దరు యువకులు ఆమైపె మత్తుమందు చల్లారు. ఆమె ఏమి తెలియని స్థితికి వెళ్లిపోవడంతో చైనులాకెళ్లి పరారయ్యారు. ఆమె స్పృహలోనికి వచ్చి లబోదిబో మంటు కేకలు వేయడంతో స్థానికులు ఆమెను తీసుకెళ్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయించారు. సుమారు 34 గ్రాములు బంగారు చైనును లాకెళ్లినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో ఎస్ఐ లోకేష్ నిందితుల ఆచూకీ కోసం సీసీ పుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి పుంగనూరు: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. పుంగనూరు మండలంలోని చిన్నతాండా గ్రామానికి చెందిన బుక్యా విశ్వనాథనాయక్(37) గత వారం శరీరంపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని చికిత్స నిమిత్తం తిరుపతికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఇరువర్గాల ఘర్షణ –ఇద్దరికి గాయాలు వెదురుకుప్పం: మండలంలోని వేణుగోపాలపురం వడ్డిఇండ్లు గ్రామంలో సోమవారం జరిగిన పరస్పర దాడుల్లో ఇరువురికి గాయాలైనట్లు ఎస్ఐ వెంకటసుబ్బయ్య తెలిపారు. ఎస్ఐ కథనం మేరకు.. వేణుగోపాలపురం వడ్డిఇండ్లు గ్రామానికి చెందిన రాజవేలు అదే గ్రామానికి చెందిన కన్నయ్య వద్ద రూ.3.50 లక్షలు అప్పు చేశాడు. సోమవారం అప్పు ఇస్తానని ఇవ్వలేని పక్షంలో ప్లాట్ రాసిస్తానని గతంలో పంచాయితీ చేశారు. సోమవారం కన్నయ్య వెళ్లి రాజవేలును అప్పు తీర్చమని అడిగాడు. లేని పక్షంలో ప్లాట్ రాసివ్వాలని కోరాడు. దీంతో రాజవేలు అయన అల్లుడు లోకేష్ కలిసి డబ్బుల్లేవు, ప్లాట్ ఇచ్చేది లేదంటూ దూషించారు. దీంతో మాటమాట పెరిగిన ఇరువర్గాల వారు తాటి మట్టలతో పరస్పర దాడులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో ఇద్దరికి గాయాలై తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఎస్ఐ చెప్పారు. ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అయూబ్‌ఖాన్‌కు నేషనల్ ఎక్స్‌లెన్సీ అవార్డు పుంగనూరు: సామాజిక సేవకుడు, అబ్దుల్ కలామ్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ పి.అయూబ్‌ఖాన్‌కు సోమవారం నేషనల్ ఎక్స్లెన్నీ అవార్డును ఢిల్లీలో ప్రదానం చేశారు. నూఢిల్లీలోని మహారాష్ట్ర సదన్‌లో జరిగిన కార్యక్రమంలో జస్టిస్ బాలకృష్ణన్, సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అగర్వాల్ చేతులు మీదుగా అవార్డును ఆయన అందుకున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి, సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనందుకు భారత్ మన్చ్ ట్రస్ట్, ఇండియన్ గెలాక్సీ వారు సంయుక్తంగా ఈ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా పట్టణ ప్రముఖులు అయూబ్‌ఖాన్‌ను అభినందించారు. -
ఖజానా ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నరేష్‌బాబు
చిత్తూరు కలెక్టరేట్ : ఖజానా, లెక్కల శాఖ ఉద్యోగ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా డి.నరేష్‌బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ఖజానా, లెక్కల శాఖ ఉద్యోగ సంఘం ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో నరేష్‌బాబు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈయన చిత్తూరు జిల్లా ఖజానా సంఘం ఉపాధ్యక్షుడిగా 2008 నుంచి 2011 వరకు మూడేళ్లపాటు పనిచేశారు. ప్రస్తుతం రాష్ట్ర సంఘ అడహాక్ కమిటీ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘం బలోపేతానికి తన వంతు కృషి చేస్తానన్నారు. అనంతరం ఆయన్ని జిల్లా అధ్యక్షుడు చెంగల్రాయుడు, కార్యదర్శి పయణి, కోశాధికారి చలపతి, ఉపాధ్యక్షులు శ్రీనివాసులు, సంయుక్త కార్యదర్శి సుబ్రహ్మణ్యం తదితరులు అభినందించారు. -
డీసీసీబీ చైర్మన్‌గా అమాస రాజశేఖర్‌రెడ్డి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు డీసీసీబీ చైర్మన్‌గా అమాస రాజశేఖర్‌రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన గతంలో కూడా డీసీసీబీగా చైర్మన్‌గా పదవి అనుభవించారు. ఈ పదవిలో 13ఏళ్లుగా కొనసాగారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో డీసీసీబీ చైర్మన్ పదవిని మళ్లీ అమాస రాజశేఖర్‌రెడ్డే సొంతం చేసుకున్నారు. దీంతో సొంత పార్టీ నేతలే చిర్రెత్తిపోతున్నారు. అమాస రాజశేఖర్‌రెడ్డికి పదవి కట్టబెట్టడంపై భగ్గుమంటున్నారు. ఈ చైర్మన్ పదవి చిత్తూరు నగరానికి చెందిన టీడీపీ సీనియర్ నేత దొరబాబుకే ఇస్తారని తొలి నుంచి కూటమి నేతలు జోరుగా ప్రచారం చేశారు. పక్కాగా దొరబాబుకే ఇస్తారని ఆపార్టీ నేతలు బల్లగుద్ది చెప్పారు. గట్టి నమ్మకంతో ఉన్నారు. అయితే ఆ ఆశలంతా ఇప్పుడు అడియాశలయ్యాయి. కూటమి ప్రభుత్వం వారి ఆశలపై ఊహించని దెబ్బకొట్టింది. ఊహించని వ్యక్తి..అందులో గతంలో పనిచేసిన అమాసకు ఇవ్వడం ఏమిటని పలువురు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. గతంలో డీసీసీబీ చైర్మన్‌గా ఉన్నప్పుడు ఆయన చేసిన తప్పిదాలపై పెదవి విరుస్తున్నారు. బీరు బాటిల్‌తో దాడి..వ్యక్తి తీవ్రగాయాలు కార్వేటినగరం: బీరు బాటిల్‌తో దాడి చేయడంతో వ్యక్తి గాయపడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని కొల్లాగుంట వద్ద ఉన్న మద్యం షాపులో మద్యం తాగడానికి కొటార్వేడు దళితవాడకు చెందిన భారత్‌రాజ్, అదే గ్రామానికి చెందిన జీవరత్నం, రాజ కలసి ద్విచక్రవాహనంలో వెళ్లి మద్యం కొనుగోలు చేసి, ముగ్గురు కలసి మద్యం తాగడానికి సమీపంలోని కొబ్బరి తోటకు వెళ్లారు. అయితే అదే ప్రాంతంలో మద్యం తాగుతున్న కొటార్వేడు దళితవాడకు చెందిన వెంకటేష్‌కు భారత్రాజ్కు మాటామాటా పెరిగి గొడవకు దారి తీసింది. దీంతో భారత్రాజ్పై వెంకటేష్ బీరుబాటిల్‌తో దాడి చేశాడు. దీంతో భారత్రాజ్కు గాయాలయ్యాయి. అలాగే భారత్రాజ్తోపాటు ద్విచక్రవాహనంలో వచ్చి జీవరత్న, రాజ కూడా వెంకటేష్‌తో కలసి భారత్రాజ్పై దాడికి దిగి గాయపరిచారు. స్థానికులు గుర్తించి అతనిని కార్వేటినగరం సామాజిక ఆరోగ్యకేంద్రానికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నగరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై భారత్‌రాజ్ భార్య కోకిల సోమవారం పోలీసులక ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆత్మస్థైర్యంతో ముందుకుసాగాలి చిత్తూరు కలెక్టరేట్ : బధిరులు ఆత్మస్థైర్యంతో జీవితంలో ముందుకు సాగాలని జాయింట్ కలెక్టర్ విద్యాధరి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో బదిరులకు టచ్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ బదిరులు (మూగ, చెవిటి) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వైకల్యం ఉందని నిరాశ చెందకుండా ధైర్యంగా ముందుకు సాగాలన్నారు. అనంతరం రూ.15 వేలు విలువ చేసే 30 టచ్ ఫోన్లను జేసీ చేతుల మీదుగా బదిరులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి చిత్తూరు అర్బన్: నగర శివారుల్లో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో జె.ధనంజయులు (39), ఆసీఫ్ (35) అనే ఇద్దరు మృతి చెందారు. తాలూక ఎస్ఐ మల్లికార్జున కథనం మేరకు.. పెనుమూరు మండలం పూనేపల్లెకు చెందిన ఆసీఫ్ కత్తులను గీటురాయి ద్వారా సానా పట్టే వృత్తి చేస్తున్నాడు. నగర శివారుల్లోని మురకంబట్టు వద్ద ఆదివారం తన ద్విచక్రవాహనంలో వెళుతూ, ముందు వెళుతున్న లారీను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ స్కూటరిస్టు ఆదివారం అర్థరాత్రి తమిళనాడులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా సోమవారం చిత్తూరు–తచ్చూరు జాతీయ రహదారిపై అనుప్పల్లె సమీపంలో జె.ధనంజయులు తన ద్విచక్రవాహనంపై వెళుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీ కొంది. తలకు బలమైన గాయం కావడంతో ధనంజయులు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు గ్రానైట్ రాళ్లను లోడ్ చేసే వృత్తి చేస్తున్నాడు. ఈ రెండు కేసులపై ఎస్ఐ మల్లికార్జున కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రైనీ కలెక్టర్‌గా నరేంద్ర పడాల్
– సివిల్స్‌లో ఆల్ ఇండియా స్థాయి 545 ర్యాంక్ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా ట్రైనీ కలెక్టర్‌గా చిట్టపులి నరేంద్ర పడాల్ నియమితులయ్యారు. రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలానికి చెందిన ఆయన రెండో ప్రయత్నంలో సివిల్స్‌లో ఆల్ ఇండియా 545 ర్యాంక్ సాధించారు. ఆయన సోమవారం ట్రైనీ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ, జాయింట్ కలెక్టర్ విద్యాధరిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ పూర్తి చేశారు. మారుమూల గ్రామంలో జన్మించిన ఆయన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో సివిల్స్ సాధించారు. -
ఉపాధి హామీ నిర్వీర్యానికి కుట్ర
బంగారుపాళెం: ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసి, పేదల కడుపు కొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు ఆరోపించారు. సోమవారం మండలంలోని తగ్గువారిపల్లె పంచాయతీలో ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలతో ఆయన మాట్లాడారు. ఉపాధి హామీ పథకం నిరుపేదలకు వరమన్నారు. ఈ పథకంలోని పలు అంశాలను కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కుతుందని విమర్శించారు. పేదలకడుపు కొట్టి అగ్రవర్ణాలకు కొమ్ముకాస్తుందని మండిపడ్డారు. ఉపాధి పనిదినాలను 100 రోజుల నుంచి 200 రోజులకు పెంచాలని, రోజు వేతనం రూ.600 ఇచ్చేలా పోరాటం సాగిస్తామన్నారు. 15 రోజులకు వేతనాలు చెల్లించాలని లేని పక్షంలో 2 శాతం వడ్డీతో చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హక్కులను కాపాడాలని మే నెల 20వ తేదీ చేపట్టనున్న సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు మాట్లాడుతూ మే ఒకటి నుంచి అమలు చేసే ఇన్సూరెన్స్ పథకాన్ని ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. జాబ్‌కార్డు ఉన్న వారందరికీ అమలయ్యేలా అధికారులు చరలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం కార్యదర్శి శంకరన్ తదితరులు పాల్గొన్నారు. -
గ్రీవెన్స్‌కు వినతుల వెల్లువ
పలమనేరు: పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి. ఉదయం 10 గంటల నుంచే కార్యాలయ ప్రాంగణం అర్జీదారులతో నిండిపోయింది. రీసర్వే, భూ సమస్యలు, వివాదాలకు సంబంధించిన వినతులే ఎక్కువగా వచ్చాయి. సమస్యలను శాఖల వారీగా అధికారులు క్షేత్రస్థాయిలో విచారించి, త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి, జేసీ విధ్యాధరి, డీఆర్వో మోహన్‌కుమార్, పలమనేరు ఆర్డీఓ భవానీ, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్రపాడల్ అర్జీలు స్వీకరించారు. మొత్తం 436 సమస్యలు గ్రీవెన్స్‌డేకి మొత్తం 436 వినతులందాయి. వీటిలో భూ ఆక్రమణలు 71, ఆర్ఓఆర్ 53, పట్టాదారు పాసు పుస్తకాలు 41, అసెన్మైంట్లు 14, ముటేషన్లు 10, దారి సమస్యలు 20, సామాజిక పింఛన్లు 39 అర్జీలు అందాయి. మిగిలివన్నీ పలు శాఖలు, వ్యక్తిగత సమస్యలే ఉన్నాయి. కొందరి సమస్యలివీ.. పెద్దపంజాణి మండలం పెనుగొలకలకు చెందిన గుర్రమ్మ తనకు వితంతు పింఛన్ మంజూరు చేయాలని కోరింది. పలమనేరు మున్సిపాలిటీకి చెందిన చెంగమ్మ(75) వృధ్యాప్య పింఛన్ కోసం పలుమార్లు అర్జీలిచ్చిన ఎవరూ పట్టించుకోలేదని విన్నవించింది. స్థానిక 17వార్డు ఏప్రిల్ నెల కోటా రేషన్ ఇవ్వలేదని పలువరు మహిళలు అర్జీ ఇచ్చారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తహసీల్దార్‌ను ఆదేశించారు. రీసర్వేలో పట్టాభూమి డీకేటీగా నమోదు చేశారని సమస్యను పరిష్కరించాలని తొమ్మిదినెలలుగా గంగవరం రెవెన్యూ అధికారులను ఆశ్రయించినా పట్టించుకోలేదని గంగవరం మండలం పత్తికొండకు చెందిన మంజునాథ్ తెలిపారు. దీనిపై స్పందించిన కలెక్టర్ సాయంత్రంలోపు సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పలమనేరులోని గాంధీనగర్ నుంచి గంటావూరుకు వెళ్లే మెయిన్‌రోడ్డు ఆక్రమణలకు గురైందని పట్టణానికి చెందిన వెంకట రెడ్డిప్రసాద్ అర్జీ ఇచ్చారు. దీనిపై మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కరెంట్ షాక్ కొట్టడంతో వెన్నుముఖ దెబ్బతిని సగం శరీరం స్పర్శ లేకుండాపోయిందని సదరంలో 91శాతం వికలత్వ సర్టిఫికెట్ ఇచ్చినా వికలాంగ పింఛను రాలేదని ఓ ట్రాన్స్‌కోలో పనిచేసే కూలి తెలిపారు. ఎక్స్ప్రెస్హైవేకు భూములిచ్చినా ఇంకా అవార్డు పాసు చేయలేదని వి.కోట మండలం తోటకనుమకు చెందిన నవమోహన్రెడ్డి అర్జీ ఇచ్చారు. ఎస్సీలమైన తమ ఇంటిస్థలాల్లోకి రానీయకుండా అక్కడి అగ్రవర్ణాలు అడ్డుకుంటున్నారని జగమర్ల వాసులు విన్నవించారు. పలమనేరు నుంచి ఉదయం 4నుంచి 6 దాకా చిత్తూరు వైపు బస్సులేవని దీనిపై స్థానిక ఎమ్మెల్యే ద్వారా చెప్పించినా ఆర్టీసీ నిర్లక్ష్యం చూపుతోందని పలమనేరు పరిరక్షణ సమితి నిర్వాహకులు విన్నవించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీసీఈఓ రవికుమార్‌నాయుడు, పీఆర్ ఎస్ఈ చంద్రశేఖర్‌రెడ్డి, డ్వామా పీడీ రవికుమార్, డీపీఓ సుధాకర్‌రావు పాల్గొన్నారు. -
ఆశగా వచ్చారు.. నిరాశతో వెళ్లారు!
చిత్తూరు కలెక్టరేట్ : ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సమస్యలు పరిష్కరించుకుందామని ఆశతో వచ్చా రు. అయితే కలెక్టరేట్లో కార్యక్రమం రద్దు కావడంతో ఏమీ చేయలేక నిరాశతో వెనుదిరిగారు. జిల్లా లోని పలు ప్రాంతాలకు చెందిన అర్జీదారులు సమస్యల పరిష్కార కోసం సోమవారం కలెక్టరేట్‌కు విచ్చేశారు. కాగా, కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికను రద్దు చేసి పలమనేరులో నిర్వహించిన విషయం విదితమే. దీంతో మధ్యాహ్నం వరకు పలువురు అర్జీదారులు కలెక్టరేట్లో నిరీక్షించి చేసేదేమి లేక నిరాశగా ఇళ్లకు వెనుదిరిగారు. ఎంఎల్‌హెచ్‌పీల సమస్యలు పరిష్కరించాలి కూటమి టీడీపీ ప్రభుత్వం ఎంఎల్‌హెచ్‌పీ (మిడ్‌లెవల్ హెల్త్ ప్రొవైడర్స్, కమ్యునిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోషియేషన్) జిల్లా అధ్యక్షుడు నిరంజన్, ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ డిమాండ్ చేశారు. డిమాండ్ల పరిష్కారం నిమిత్తం ఆ సంఘ నాయకులు సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరవదిక సమ్మె నిర్వహించారు. వారు విలేకరులతో మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం తమకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. సమ్మెలో ఆ సంఘ నాయకులు మమత, రాజేష్, గణేష్, శ్రీవాణి, అనిత తదితరులు పాల్గొన్నారు. పొలానికి దారి లేకుండా చేస్తున్నారు తన పొలానికి వెళ్లేందుకు దారి లేకుండా ఇబ్బందులు సృష్టిస్తున్నారని గంగాధరనెల్లూరు మండలం ముకల్తూరు గ్రామానికి చెందిన మాజీ సైనికుడు రాజమాణిక్యం ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్లో అర్జీ ఇచ్చేందుకు విచ్చేసిన ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ గ్రామ పరిధిలో సర్వే నంబర్ 478/28 లో ఐదు ఎకరాల భూమి ఉందన్నారు. తాను సైనికుడిగా పనిచేసి రిటైర్డ్ అయినప్పటి నుంచి ఆ భూమిలోనే పంటలు పండించుకుని జీవనం కొనసాగిస్తున్నట్లు తెలిపారు. తన సమస్యను గంగాధరనెల్లూరు తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లగా వీఆర్వో, ఎంఆర్ఐ వచ్చి సమస్యను పరిశీలించారన్నారు. అయినప్పటికీ తనకు న్యాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
వైఎస్సార్‌టీఏ జిల్లా అధ్యక్షుడిగా గోవిందస్వామి
చిత్తూరు కలెక్టరేట్ : వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా ఎం.గోవిందస్వామి (ఎస్జీటీ)ని ప్రకటించారు. సోమ వారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్‌కుమార్‌రెడ్డి, సుధీర్ ఈ విషయం వెల్లడించారు. నూతన జిల్లా అధ్యక్షుడు గోవిందస్వామి మాట్లాడుతూ జిల్లాలోని టీచర్లకు ఎటువంటి సమస్యలున్నా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. అనంతరం ఏపీ పరిశ్రమలు, సాంకేతిక సంస్థ ఉపాధ్యక్షులు కండ్లగుంటి బాబు, తదితర ఉపాధ్యాయులు నూతన జిల్లా అధ్యక్షుడిని అభినందించారు. హత్యాయత్నం కేసులో ఇద్దరి అరెస్టు చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో మూడు రోజుల క్రితం జరిగిన హత్యాయత్నం కేసులో నిందితులు మణితేజ, చంద్రను టూటౌన్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. పాత కక్షల నేపథ్యంలో శనివారం పాత కలెక్టరేట్ సమీపంలో చామంతిపురానికి చెందిన మనోజ్‌పై మణితేజ, చంద్ర కత్తితో దాడి చేసి పారిపోయారు. దీనిపై కేసు నమోదుచేసిన పోలీసు లు నిందితులను అరెస్టు చేసి జడ్జి ఎదుట హాజరుపరిచారు. వారికి జడ్జి 14 రోజుల రిమాండుకు ఆదేశించడంతో చిత్తూరులోని జిల్లా జైలుకు తరలించారు. రైలు నుంచి పడి గుర్తు తెలియని మహిళ మృతి కుప్పంరూరల్: బెంగళూరు – చైన్నె రైల్వే మార్గంలో కుప్పం పట్టణానికి సమీపంలోని ఫ్లై ఓవర్ వద్ద సుమారు 55 ఏళ్ల మహిళ రైలు నుంచి జారిపడి మృతి చెందినట్లు కుప్పం రైల్వే పోలీసులు సోమవారం తెలిపారు. మృతురాలు ఎరుపు రంగు జాకెట్, గళ్లచీర కట్టుకుందని చెప్పారు. ఈమె ఆచూకీ తెలిసిన వారు కుప్పం రైల్వే పోలీసుస్టేషన్ 9000716436, 9494228854 నంబర్లలో సంప్రదించాలని కోరారు. మృతదేహాన్ని కుప్పం ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు చెప్పారు. -
ప్రజాస్వామ్యం..అపహాస్యం
డబ్బు, పదవులకు లొంగని వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ● అడ్డదారిలో కుప్పం చైర్మన్‌గిరి టీడీపీ కై వశం ● ఎదురొడ్డి నిలిచిన తొమ్మిది మంది సభ్యులు ● కొనియాడుతున్న కుప్పం జనం ● నైతిక విజయం వైఎస్సార్ సీపీదే కుప్పంరూరల్: హ్యాట్సాప్ వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు అని కుప్పం జనం మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే ప్రలోభాలు, బెదిరింపులు, దాడులకు వెరవకుండా మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ప క్షాన నిలిచిన కౌన్సిలర్లకు వందనం..శత వందనం.. మీరే నిజమైన మా నాయకులు అని కుప్పం జనం కొనియాడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎలాగైనా కుప్పం మున్సిపల్ చైర్మన్ గిరిని దక్కించుకోవాలని అధికార పార్టీ మదిలో పడింది. ఇందుకు అనుగుణంగానే ప్రణాళికలు సిద్ధం చేసింది. కుప్పం కౌన్సిల్లో ఉన్న సభ్యులకు బెదిరింపులు, వేధింపులు మొదలు పెట్టింది. మొదటగా నలుగురు కౌన్సిలర్లు టీడీపీకి సరెండర్ అయ్యారు. తరువాత 2024 నవంబర్‌లో డాక్టర్ సుధీర్ చైర్మన్, కౌన్సిలర్ పదవులకు రాజీనామా చేశారు. అప్పటివరకు ఉన్న కౌన్సిల్‌ల్లో మార్పులు వచ్చాయి. చైర్మన్ రాజీనామా చేసి వెళ్లిపోగా, సభ్యుల సంఖ్య 24కు చేరింది. నలుగురు టీడీపీ వైపు వెళ్లిపోవడంతో వైఎస్సార్ సీపీకి ఉన్న బలం 19 నుంచి 14కు చేరింది. ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు 28న ఎన్నికలు ఖరారు చేసింది. ఖరారు చేసినప్పటి నుంచి అధికార పార్టీ వైఎస్సార్ సీపీ వారిని రకరకాలుగా ప్రలోభాలకు గురిచేసింది. ఒక్కొక్కరికి రూ.50 లక్షలు ఆశ చూపింది. మరి కొంత మందికి ఉద్యోగం, మరొకరికి ఏకంగా చైర్మన్ పదవే ఆశ చూపారు. వీరి ప్రలోభాలకు నలుగురు ఆకర్షితులు కాగా, మరో ఇద్దరు ఓటింగ్‌కు దూరమయ్యారు. కానీ ఎమ్మెల్సీ భరత్ పాటు 9 మంది సభ్యులు మాత్రం రూ.లక్షల డబ్బు, ఉద్యోగాలు, పదవులు దేన్నీ లెక్క చేయక వైఎస్సార్ సీపీ తరఫున ఎన్నికల్లో పాల్గొన్నారు. ఓటమి దరిదాపుల్లోకి వచ్చినా ఎక్కడా వెరవక తమను ఎన్నుకున్న ప్రజలు, పార్టీ తరుఫున నిలబడి ఎన్నికల్లో పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ దొడ్డిదారి కొంత మంది కౌన్సిలర్లను కొని చైర్మన్ గిరి దక్కించుకోగా, వైఎస్సార్ సీపీ సభ్యులు మాత్రం నైతిక విజయం మాదే అంటు వెనుతిరిగి, కుప్పం జనం మనస్సు గెలుచుకున్నారు. మున్సిపల్ చైర్మన్‌గా సెల్వరాజ్ కుప్పం: మున్సిపల్ చైర్మన్‌గా టీడీపీ అభ్యర్థి సెల్వరాజ్ ఎన్నికయ్యారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల అధికారి కుప్పం ఆర్డీఓ శ్రీని వాసులరాజు ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ ఎ న్నిక నిర్వహించారు. మున్సిపాలిటీలో 24 మంది కౌన్సిలర్లు ఉండగా చైర్మన్ ఎన్నికల ఓటింగ్‌లో 22 మంది కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. వీరిలో అధికార పార్టీ చైర్మన్ అభ్యర్థిగా సెల్వరాజ్‌ను ప్రతిపాదించగా ఆయనకు 19 వార్డు కౌన్సిలర్ దాము, 20 వ వార్డు కౌన్సిలర్ సోములు సహకరించారు. వైఎస్సార్సీపీ చైర్మన్ అభ్యర్థిగా హఫీజ్ పార్టీ ప్రకటించగా ఆయనకు 2వ వార్డు సభ్యులు మునిరాజ్, 11వ వార్డు సభ్యురాలు మాధవి ప్రతిపాదించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారుడు సెల్వరాజ్‌కు 14 మంది చేతులెత్తి తమ మద్దతును పలికారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి హఫీజ్‌కు 9 మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు మద్దతు పలికారు. మెజారిటీ టీడీపీకే ఉండడంతో కుప్పం మున్సిపల్ చైర్మన్‌గా 5వ వార్డు కౌన్సిలర్ సెల్వరాజ్ ఎన్నికయ్యారు. సోమవారం ప్రజాస్వామ్యంలో బ్లాక్ డేమండల సచివాలయం వద్ద చైర్మన్ ఎన్నిక సందర్భంగా బందోబస్తు సోమవారం జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ దౌర్జన్యాలు, అడ్డదారుల్లో మున్సిపల్ చైర్మన్ పదవి దక్కించుకోవడాన్ని కుప్పం ప్రజలు జీర్ణించుకోవడం లేదు. సోమవారం ఒక ప్రజాస్వామ్యంలో ఒక బ్లాక్ డేగా అభివర్ణిస్తున్నారు. 18 మంది కౌన్సిలర్ల బలం స్పష్టంగా ఉన్నా ఓడి పోవడం ఏమిటని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని మరికొంత మంది అంటున్నారు. దమ్ముంటే తమవైపునకు తిప్పుకున్న కౌన్సిలర్లను రాజీనామాలు చేయించి, ఉప ఎన్నికల్లో గెలిపించుకుని చైర్మన్ ఎన్నికలకు వెళ్లాల్సిందని ఘాటుగా విమర్శిస్తున్నారు. అధికారాన్ని, వ్యవస్థలను అడ్డం పెట్టుకుని గెలుచుకునే బదులు ఎన్నిక లేకుండా వారే చైర్మన్‌ను ప్రకటించుకుంటే సరిపోయేదంటున్నారు. ఏది ఏమైనప్పటికీ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు ప్రజాస్వామ్య బద్ధంగా జరగలేదని, నియంతల పాలనలో జరిగినట్లు ఉందని విశ్లేషిస్తున్నారు. కుప్పంలో 144 సెక్షన్‌తో బోసిపోయిన రోడ్లువీళ్లే మా నేతలు అంటున్న జనం ఎలాంటి ప్రలోభాలకు లొంగక చివరి వరకు పోరాడిన వీరే తమ నాయకులని ఆయా వార్డు జనం అంటున్నారు. తమ విలువైన ఓటు వేసి గెలిపించినందుకు తమకు ఇప్పుడు గర్వంగా ఉందన్నారు. ఇతరుల మాదిరిగా వ్యక్తిగత ప్రయోజనాలకు పోకుండా ప్రజాక్షేమమే ధ్యేయంగా నడుచుకున్న వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల వెంటనే తాము ఉంటామని జనం అంటున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఫ్యాను గుర్తుకే ఓటు వేసి వీరిని నాయకులుగా ఎన్నుకుంటామని దీమా వ్యక్తం చేస్తున్నారు. కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక దుర్మార్గం ధ్వజమెత్తిన వైఎస్సార్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి తిరుపతి మంగళం: వైఎస్సార్సీపీని బలహీనపరచాలన్న దురాలోచనతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు అపహాస్యం చేస్తు న్నారని వైఎస్సార్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పం మున్సిపల్ చైర్మన్ ఉపఎన్నికపై సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పం మున్సిపాలిటీలో టీడీపీకి బలం లేకపోయినా దుర్మార్గంగా వ్యవహరించిందన్నారు. ఆరుగురు కౌన్సలర్లతో కు ప్పం మున్సిపాలిటీని ఎలా కై వసం చేసుకోగలదని ప్రశ్నించారు. తన సొంత నియోజకవర్గంలో ఓటమి పాలవుతారన్న భయంతో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ఒక్కొక్కరిని రూ.50లక్షలతో కొనుగోలు చేసినట్టు ఆరోపించారు. కేవలం పది నెలల పదవీ కాలం మాత్రమే ఉన్న కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో చంద్రబాబు ఇంతటి అరాచకాలు సృష్టించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ నాయకులు ఎవరైనా కూటమి ప్రభుత్వంలో చేరడానికి వస్తే చేర్చుకునే ప్రసక్తేలేదని చంద్రబాబు నీతులు ఒలకబోశారని గుర్తుచేశారు. గత రెండు నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు అన్నీఇన్నీ కావన్నారు. తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాడిపత్రి మున్సిపాలిటీలో టీడీపీ నుంచి ఇద్దరు కౌన్సిలర్లను వైఎస్సార్సీపీ వైపు తిప్పుకుని ఉంటే తమ పార్టీనే చైర్మన్ పదవి చేపట్టి ఉండేదని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా టీడీపీకి మెజారిటీ లేకపోయినా స్థానిక సంస్థల ఎన్నికల్లో కౌన్సిలర్లను, కార్పొరేటర్లను కొనేసి గెలుచుకున్నామంటూ గొప్పలు చెప్పు కోవడం చంద్రబాబు నీచ రాజకీయాలకు నిదర్శనమన్నారు. చంద్రబాబు అరాచకాలను రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని, తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. -
● ప్రజలకు సంక్షేమం దూరం చేసిన కూటమి సర్కారు ● జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో చర్చ నామ మాత్రమే ● ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సమస్యల తాండవం ● నేడు జెడ్పీలో మూడో సర్వ సభ్య సమావేశం
ఎన్నికల్లో అద్భుతాలు చేస్తామన్న కూటమి నేతలు అభివృద్ధిని మరిచారు. దీంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాను సమస్యలు వేధిస్తున్నాయి. స్థానిక సంస్థల ను నిర్వీర్యం చేశారు. ఈ క్రమంలో జనం పాలకా.. ఏమిటీ ఏలిక అని ప్రశ్నిస్తున్నారు. ఈ నెల 29వ తేదీన ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్న 3వ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలోనైనా వీటిపై దృష్టి సారిస్తారోలేదో చూడాల్సి ఉంది.నియోజకవర్గాల్లో సమస్యలిలా.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నియోజకవర్గాల్లో అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. కుప్పం: నియోజకవర్గంలో భూ కబ్జాలు ఎక్కువయ్యా యి. శాంతిపురం మండలంలో 15 ఎకరాలు, కుప్పం మండలం పెద్దవంక సరిహద్దులో అటవీ భూములు, ఇదే మండలంలోని బొగ్గుపల్లిలో 2 ఎకరాల ప్రభుత్వ భూమిని టీడీపీ నేతలు కబ్జా చేశారు. తిరుపతి: నియోజకవర్గంలో 8 చెరువులు, 395.71 ఎకరాల్లో 20 శాతం భూములు ఆక్రమణకు గురైనట్లు సమాచారం. నగరి: నియోజకవర్గంలో రైతులకు విద్యుత్ సరఫరాలో ఎక్కువగా అంతరాయం కలుగుతోంది. నిండ్ర నేటమ్స్ షుగర్స్ మూతపడటంతో చెరుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్రీకాళహస్తి: నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో సువర్ణముఖి నదీ పరివాహక గ్రామాల్లో ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. రోజుకు సగటున 800 నుంచి 900 ట్రాక్టర్లు, 150 టిప్పర్ల ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. గంగాధరనెల్లూరు : నియోజకవర్గంలో అధికార పార్టీ భూ కబ్జాలు ఎక్కువయ్యాయి. పేదలందరికీ ఇళ్ల పురోగతికి కూటమి సర్కారు నిధులు ఇవ్వడం లేదు. పూతలపట్టు : నియోజకవర్గంలో టీడీపీ ప్రజాప్రతినిధి కనుసన్నల్లో అక్రమ ఇసుక రవాణా సాగుతోంది. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. సత్యవేడు : నియోజకవర్గంలో రోడ్లు మరమ్మతులకు నోచుకోకపోవడంతో ప్రజలు రాకపోకలకు అవస్థ పడుతున్నారు. అలాగే పారిశుద్ధ్యం పడకేసింది. గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో పురోగతికి నోచుకోని పక్కా గృహాలు చిత్తూరు కలెక్టరేట్/కార్పొరేషన్:ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అన్ని మండలాల్లో సమస్యలు రాజ్యమేలుతున్నా వాటిని పరిష్కరించడంలో కూటమి సర్కారు అలసత్వం వహిస్తోంది. దీనికితోడు ప్రజలకు సంక్షేమ పథకాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. 14 నియోజకవర్గాల్లోని 66 మండలాల్లో గ్రామాల అభివృద్ధికి స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులను ప్రజలు ఎన్నుకున్నారు. అయితే వారికి కూటమి ప్రభుత్వం అధికారాలు లేకుండా నిర్వీర్యం చేసింది. దీంతో అభివృద్ధి కుంటుపడింది. అద్భుతాలు చేస్తామన్నారు...అభివృద్ధి మరిచారు మా పాలన వస్తే అద్బుతాలు చేస్తాం.. ప్రతి రంగంలోని సమస్యలను పరిష్కరిస్తామం ఇచ్చిన మాటలను నిలబెట్టుకుంటామంటూ ఎన్నికల్లో చంద్రబాబు, లోకేష్, పవన్కళ్యాన్లు చెప్పిన మాటలివి. వారు చెప్పిన మాటలు 11 నెలలు గడుస్తున్నా ఏ ఒక్కటీ నెరవేరలేదు. పేరుకుపోయిన ఆరోగ్యశ్రీ బకాయిలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆరోగ్య శ్రీ బకాయిలు రూ.300 కోట్లుకు పైగా పేరుకుపోయాయి. గడిచిన 11 నెలలుగా బకాయిలను కూటమి ప్రభుత్వం ఏ మాత్రం విడుదల చేయకపోవడంతో ఆరోగ్య సేవలు దూరమయ్యాయి. కరువు పరిహారం శూన్యం గతేడాది వేరుశనగ సాధారణ సాగు విస్తీర్ణం 43,174 హెకార్టులు కాగా, సాగు విస్తీర్ణం 13,044 హెక్టార్లు ఉంది. ఇందులో 9 వేల హెక్టార్లలో పంట నష్టం కలిగింది. ఇందుకు రూ.15.42 కోట్లు పరిహారం ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు అందలేదు. జెడ్పీటీసీ సభ్యుల వేతనాలు లేవ్ జెడ్పీటీసీ సభ్యులకు వేతనాలు మంజూరు చేయడం లేదు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అధికంగా వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ సభ్యులే ఉన్నారు. దీంతో కూటమి సర్కారు వారికి వేతనాలను మంజూరు చేయకుండా కుట్రలు చేస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 65 జెడ్పీటీసీ సభ్యులకు దాదాపు రూ.43 లక్షల వరకు జీతాలు చెల్లించాల్సి ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు. ట్రాన్స్‌కో సేవలు తిరుపతి నుంచే.. జిల్లా విద్యుత్‌శాఖ కార్యాలయం చిత్తూరులో ఏర్పాటు చేసినా ఇంకా తిరుపతి జిల్లా నుంచే సేవలు అందిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో ఎస్ఈ కార్యాలయం ఏర్పాటై 6 నెలలవుతున్నా తిరుపతి నుంచి ఇంకా 15 మంది ఉద్యోగులు విధుల్లో చేరాల్సి ఉంది. కష్టాల ఆస్పత్రి జిల్లాకేంద్రంలోని ప్రభుత్వాస్పత్రి కష్టాల ఆస్పత్రిగా పేరు తెచ్చుకుంది. ఇక్కడికి చికిత్స కోసం వెళ్లే ప్రజలకు మెరుగైన వైద్యం అందకపోగా ఆరోగ్యం మరింతగా క్షీణించి అనారోగ్యం పాలవుతున్నారు. వందల సంఖ్యలో ఓపీలు వస్తున్నా సేవలు మాత్రం శూన్యం. వైద్యుల పోస్టులు ఖాళీ, ఉన్న సీనియర్ వైద్యులు సమయపాలన లేమితో రోగులు ఈ ఆస్పత్రికి వెళ్లాలంటే జంకుతున్నారు.పెండింగ్‌లో రహదారుల బిల్లులు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పల్లెపండుగ కార్యక్రమంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల కింద రూ.84 కోట్లకు పనులు చేపట్టారు. అందులో రూ.26 కోట్లు మాత్రమే ఇచ్చారు, మిగిలిన రూ.61 కోట్లు బిల్లులు రావాల్సి ఉంది. అలాగే ఆర్అండ్బీ పరిధిలో రూ.23 కోట్లతో ప్యాచ్‌వర్క్‌లు చేపట్టారు వీటి బిల్లులు సైతం పెండింగ్‌లో ఉన్నాయి.23 మండలాల్లో తాగునీటి సమస్య ప్రస్తుత వేసవిలో చిత్తూరు జిల్లాలోని 23 మండలాల్లో తాగునీటి సమస్యలున్నాయి. జిల్లాలోని 23 మండలాల్లో 923 గ్రామాల్లో నీటి సమస్య తలెత్తే అవకాశం ఉన్నట్లు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. తాగునీటి సరఫరాకు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కావాల్సి ఉంది. -
అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ఇవ్వాలని ధర్నా
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు మే నెల మొత్తం వేసవి సెలవులు ప్రకటించాలని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు ప్రేమ డిమాండ్ చేశారు. ఆ సంఘ నాయకులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం ఎండలు మండుతున్నాయని తెలిపారు. పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. కొత్తగా ప్రవేశపెట్టిన బాల సంజీవని, 2.0.0 యాప్, ఈకేవైసీ ఓటీపీ ప్రక్రియలు ఎత్తివేయాలన్నారు. ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ వేసవిని దృష్టిలో పెట్టుకుని అంగన్వాడీ చిన్నారులకు మే నెల మొత్తం టేక్ హోం రేషన్‌తో సెలవులు ఇవ్వాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఫ్యాన్లు సైతం లేవన్నారు. ప్రాథమిక స్థాయి నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు సెలవులు ప్రకటించారని, అంగన్వాడీ చిన్నారులకు మాత్రం సెలవులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ధర్నాలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, జిల్లా అధ్యక్షులు ప్రభావతి, నాయకులు అరుణ, హైమావతి, కాంచన, రాజేంద్ర, రఘు, రవి తదితరులు పాల్గొన్నారు. -
పోలీసు గ్రీవెన్స్‌కు 41 ఫిర్యాదులు
చిత్తూరు అర్బన్: నగరంలో నిర్వహించిన పోలీ సు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో 41 వినతులు అందాయి. చిత్తూరు ఎస్పీ మణికంఠ ఏఆర్ కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీ కరించారు. వీటిలో మోసాలు, వేధింపులు, కు టుంబ తగాదాలు, ఇంటి తగాదాలు, భూ త గాదాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమస్యలున్నాయి. పలు ఫిర్యాదులపై అప్పటికప్పుడే వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆయా స్టేషన్ హౌజ్ అధికారులతో మాట్లాడారు. ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో నమోదు చేయాల న్నారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి సమస్యపై విచారణ జరిపి, ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. వేసవి శిక్షణ శిబిరాలు విద్యార్థులకు ఎంతో ఉపయోగం చిత్తూరు కార్పొరేషన్: జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని సమగ్రశిక్షా శాఖ ఏపీసీ వెంకటరమణ తెలిపారు. ఆయన సోమవారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో వేసవి శిక్షణా శిబిరాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ శిబి రంలో స్పోకెన్ ఇంగ్లీష్, డ్రాయింగ్, క్యారమ్స్, కథలు చెప్పడం, వినడం, క్విజ్, పేపర్ క్రాఫ్ట్‌లలో శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. ఎంపీడీవో శ్రీనివాసులు, ఎంఈవో–2 మోహన్ మాట్లాడుతూ వేసవి సెలవుల్లో విద్యార్థులకు ప్రయోజనం కలిగేలా శిక్షణా శిబిరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో విజయం విద్యాసంస్థల ఏఓ రాజగోపాల్, జన విజ్ఞాన వేదిక మాజీ కోఆర్డినేటర్ రంగనాథన్, డిప్యూటీ లైబ్రేరియన్ లలిత తదితరులు పాల్గొన్నారు. -
కుప్పంలో ప్రజాస్వామ్యం ఖూనీ.. కూటమి అరాచక పాలన..
కుప్పం మున్సిపల్ చైర్సన్ ఎన్నికల అప్డేట్స్..చిత్తూరు..కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన టీడీపీసీఎం చంద్రబాబు ప్రాతినిద్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం ఖూనీసంఖ్య బలం లేకపోయినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి కౌన్సిలర్లను పార్టీలో చేర్చుకున్న టీడీపీకుప్పం మున్సిపల్ చైర్మన్‌గా సెల్వ రాజ్ ఎన్నిక5వ వార్డు కౌన్సిలర్ సెల్వరాజ్ కుప్పం మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికటీడీపీ చైర్మన్ అభ్యర్థికి 15 మంది కౌన్సిలర్ల మద్దతువైఎస్సార్సీపీ అభ్యర్ధి హఫీజ్‌కు తొమ్మిది మంది మద్దతు, ఇద్దరు కౌన్సిలర్లు గైర్హాజరుకుప్పంలో 144 సెక్షన్నేడు ఉదయం 11 గంటలకు కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నికబెంగళూరు క్యాంపు నుంచి వైఎస్సార్సీపీ పార్టీ కౌన్సిలర్లతో కుప్పంకు ట్రైన్లో బయలుదేరిన ఎమ్మెల్సీ భరత్కుప్పం రైల్వేస్టేషన్ నుంచి ఎంపీడీవో కార్యాలయం వరకు పోలీస్ భద్రతతో రానున్న కౌన్సిలర్లుఎమ్మెల్సీ భరత్ ఎక్స్ అఫీషియో హోదాలో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశంబెంగళూరు క్యాంపు నుంచి వస్తున్న వైఎస్సార్సీపీ కౌన్సిలర్లకు బందోబస్తు కల్పించాలని హైకోర్టు ఆదేశాలువైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 18 మంది కౌన్సిలర్లకు విప్ జారీ చేసిన రెండో వార్డు కౌన్సిలర్ మునిరాజా ఈరోజు కుప్పంలో 144 సెక్షన్ అమలు..పోలీసుల కనుసన్నల్లోనే కుప్పంమున్సిపల్ చైర్మన్ ఎన్నిక నిర్వహించేందుకు ఎంపీడీవో కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఎన్నికల అధికారులుఅడిషనల్ ఎస్పీ, ముగ్గురు డిఎస్పీలు, ఐదు మంది సీఐలు, ఏడుగురు ఎస్సై లు, కానిస్టేబుల్స్, 92 మందితో మున్సిపల్ ఎన్నికలు గుంటూరు..నేడు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికబలం లేకపోయినా మేయర్ అభ్యర్థి నిలబెట్టిన కూటమి ప్రభుత్వంగుంటూరు కార్పొరేషన్ పరిధిలో మొత్తం 57 డివిజన్లువైఎస్సార్సీపీ-46, టీడీపీ-9, జనసేన-2 స్థానాల్లో గత ఎన్నికల్లో విజయంవైఎస్సార్సీపీ కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకోవడానికి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు, జనసేన నాయకులుఇప్పటికే కొంతమంది కార్పొరేటర్లను బెదిరించి భయపెట్టి తమ వైపుకు తిప్పుకున్న కూటమి నేతలువైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లకు కూటమి నేతలు ప్రలోభాలు, బెదిరింపులుకార్పొరేటర్లను కొనుగోలు చేస్తున్న కూటమి నేతలుమేయర్ ఎన్నికల్లో విప్ జారీచేసిన వైఎస్సార్సీపీ..అచ్చాల వెంకటరెడ్డిని మేయర్ అభ్యర్థిగా ఎన్నుకున్న వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు 👉ఏపీలో కూటమి సర్కార్ పాలనలో దౌర్జన్యం పీక్ స్టేజ్‌కు చేరుకుంది. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక ఉత్కంఠను రేకెత్తిస్తోంది. వైఎస్సార్సీపీకి సంఖ్యా బలం అధికంగా ఉన్నప్పటికీ.. ప్రలోభాలు, దౌర్జన్యాలతో ఎలాగైనా సరే ఆ పదవిని చేజిక్కించుకోవడానికి టీడీపీ బరితెగించింది. కౌన్సిలర్ల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది.👉వైఎస్సార్సీపీకి చెందిన డా. సుధీర్ కొద్ది నెలల క్రితం కుప్పం చైర్పర్సన్ పదవితో పాటు కౌన్సిలర్ పదవికి కూడా రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో నూతన చైర్‌పర్సన్‌ను ఎన్నుకునేందుకు సమావేశం నిర్వహిస్తున్నారు. ఇక్కడ మొత్తం 25 వార్డులకు గాను వైఎస్సార్సీపీ 19, టీడీపీ కేవలం 6 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. సుధీర్ రాజీనామా చేసినప్పటికీ 18 మందితో వైఎస్సార్సీపీ స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. అయినప్పటికీ టీడీపీ ‘ముఖ్య’ నేత సూచన మేరకు ఆ పార్టీ నేతలు కొందరు బరితెగిస్తూ నేరుగా రంగంలోకి దిగారు. బెదిరింపులు, తాయిలాలతో కౌన్సిలర్లను దారిలోకి తెచ్చుకుని చైర్మన్ గిరీ కొట్టేయాలని కుట్రకు తెరతీశారు. నేడు విశాఖ, గుంటూరు మేయర్ల ఎన్నిక👉అలాగే.. విశాఖపట్నం, గుంటూరు నగర మేయర్ పదవులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరో ఐదు మున్సిపాలిటీలలో మొత్తం తొమ్మిది పదవులకు సోమవారం ఎన్నికలు జరగనున్నాయి. కుప్పం, తుని, పాలకొండలో మున్సిపల్ చైర్పర్సన్ పదవులకు.. మాచర్ల, తాడిపత్రి (2), తునిలో వైస్ చైర్పర్సన్ పదవులకు ఎన్నికలు జరుగుతాయి. ఆ మున్సిపాలిటీల్లో ఎన్నికల కోసం ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఈనెల 22న నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. -
ప్రమాదాలపై ఫోకస్
రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ ప్రత్యేక దృష్టి సారించి దిశానిర్ధేశం చేస్తున్నారు... మృతదేహంతో ఆందోళన గంగవరం మండలంలో విద్యార్థి మృతదేహంతో ఆదివారం కళాశాల ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.సోమవారం శ్రీ 28 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025కుప్పం రూరల్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. 2024 నవంబర్ నుంచి ఖాళీగా ఉన్న కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు సమయం ఆసన్నమైంది. సోమవారం జరగనున్న ఈ ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా కుప్పం ఆర్డీఓ శ్రీనివాసరాజు, అబ్జర్వర్‌గా జాయింట్ కలెక్టర్ విద్యాధరిని ప్రభుత్వం నియమించింది. చైర్మన్ అభ్యర్థి గెలుపునకు కావాల్సిన బలం వైఎస్సార్సీపీకి ఉన్నా.. అధికార బలంతో ఎలాగైనా చైర్మన్ కుర్చీని దక్కించుకోవాలని కూటమి ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది. సమాయత్తమైన ఇరుపార్టీలు సంఖ్యా పరంగా చూసుకుంటే వైఎస్సార్సీపీనే గెలవాలి. కానీ అధికార పార్టీ కుతంత్రాలకు దిగింది. 2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 19 మంది కౌన్సిలర్లతో విజయఢంకా మోగించింది. టీడీపీ ఆరుగురు కౌన్సిలర్లకే పరిమితమైంది. కుప్పం మున్సిపల్ చైర్మన్‌గా డాక్టర్ సుధీర్ కొనసాగారు. కుటమి ప్రభుత్వం రావడంతో ఆయన తన పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. అలాగే మరో నలుగురు కౌన్సిలర్లు టీడీపీలో చేరిపోయారు. దీంతో కౌన్సిల్లో టీడీపీ బలం పదికి పెరిగింది. ప్రస్తుతం గెలవాలంటే మరో నలుగురు అభ్యర్థులు అవసరం. బలం లేకపోయినా టీడీపీ బరితెగిస్తోంది. వైఎస్సార్ సీపీ అభ్యర్థులను అంగడి సరుకులా కొనేందుకు సిద్ధమైంది. ఇప్పటికే వీరి వలలో నలుగురు కౌన్సిలర్లు చిక్కుకోగా, మరో ఇద్దరు ఓటింగ్‌లో పాల్గొనకుండా భయపెట్టినట్టు తెలిసింది. ఇలా జరిగితే టీడీపీ గెలుపు ఖాయమనిపిస్తోంది. వైఎస్సార్ సీపీ మాత్రం ప్రజాస్వామ్యపై నమ్మకంతో ఎన్నికల బరిలో దిగుతోంది. సంప్రదాయాన్ని పాటించరా? వైఎస్సార్ సీపీ 2019లో అధికారం చేపట్టగానే టీడీపీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా వైఎస్సార్ సీపీలోకి వచ్చేందుకు సుముఖత చూపారు. అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మాత్రం వారిని తమ పదవులకు, పార్టీకి రాజీనామా చేసి రావాలని షరతు విధించారు. ఇదే సంప్రదాయాన్ని కుప్పం మున్సిపల్ కౌన్సిలర్ల విషయంలోనూ టీడీపీ అధిష్టానం పాటించాలని కుప్పం జనం సూచిస్తున్నారు. తమ వైపునకు తిప్పుకున్న కౌన్సిలర్ల చేత రాజీనామాలు చేయించి, గెలిచిన తరువాత చైర్మన్ ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. కుప్పం పట్టణం ఏరియల్ వ్యూ – 8లో– 8లో– 8లోన్యూస్రీల్నేడు పోలీసు గ్రీవెన్స్ చిత్తూరు అర్బన్ : చిత్తూరు వన్‌టౌన్ పక్కన ఉన్న ఆర్మ్‌డు రిజర్వు కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. నేడు పలమనేరులో గ్రీవెన్స్ చిత్తూరు కలెక్టరేట్ : ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం పలమనేరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. పలమనేరు రెవెన్యూ డివిజన్లోని ప్రజా సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. 30న డీఆర్సీ వాయిదా చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో ఈనెల 30వ తేదీన నిర్వహించాల్సిన డీఆర్సీ (జిల్లా అభివృద్ధి సమీక్షా కమిటీ సమావేశం)వాయిదా వేశారు. ఈ సమావేశాన్ని పలు కారణాల చేత వాయిదా వేసినట్లు కలెక్టరేట్ అధికారులు చెప్పారు. ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్ – మరొకరిపై కేసు నమోదుకు ఆదేశం చిత్తూరు కార్పొరేషన్ : వి.కోట పంచాయతీలో రూ.50 లక్షలు నిధులు దుర్వినియోగమయ్యా యి. అందుకు కారకులైన ఇద్దరు పంచాయతీ సి బ్బందిని కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆదేశాల మేరకు డీపీఓ సుధాకర్‌రావు సస్పెండ్ చేశారు. ప్రస్తుత పొలకల పంచాయతీ జూనియర్ అసిస్టెంట్ యా దవపతి గతంలో డిప్యూటేషన్‌పై వి.కోట పంచా యతీ ఇన్చార్జి ఈఓగా విధులు నిర్వహించారు. అ తడితో పాటు ఆ పంచాయతీ బిల్లు కలెక్టర్ ఫృథ్వీ, మరొక కాంట్రాక్ట్ ఉద్యోగితో కలిసి ప్రజలు చెల్లించిన పన్నులు, పన్నేతర నిధులను పంచాయతీ ఖాతాకు జమ చేయకుండా రూ.1.50 కోట్లు దుర్వినియోగం చేసినట్లు స్థానికులు అధికారులకు ఫి ర్యాదు చేశారు. దీనిపై డీఎల్పీఓ స్థాయి అధికారి విచారణ చేయించారు. రూ.50 లక్షలు పక్కదారి పట్టినట్లు నిర్ధారించారు. ఇందులో యాదవపతి రూ.16 లక్షలు, ఫృథ్వీ రూ.34 లక్షలు వారి సొంతానికి వాడుకున్నట్లు విచారణలో వెల్లడైంది. ని ధుల దుర్వినియోగానికి పాల్పడిన కారణంగా వా రిని సస్పెండ్ చేసినట్లు డీపీఓ తెలిపారు. ఈ విషయంలో బాధ్యుడిగా గుర్తించిన కాంట్రాక్ట్ ఉద్యోగి పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పంచాయతీ కార్యదర్శికి డీపీఓ ఆదేశించారు. నేడు కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సంపూర్ణ మెజారిటీతో ఊపుమీదున్న వైఎస్సార్సీపీ బలం లేకపోయినా బరితెగించేందుకు సిద్ధమైన టీడీపీ వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ఓటింగ్‌కు రానీయకుండా కుయుక్తులు ఇప్పటికే ఆరుగురిని తమవైపు తిప్పకున్న కూటమి ఎలాగైనా చైర్మన్ గిరి దక్కించుకోవాలని కుట్రలు ఎన్నికకు సర్వం సిద్ధం చేసిన అధికారులు కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. సాక్షాత్తు సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కావడంతో ప్రజానీకం మొత్తం కుప్పం వైపే చూస్తోంది. పట్టు నిలుపుకునేందుకు వైఎస్సార్సీపీ పోరాడుతుండగా.. బలం లేకపోయినా బరితెగించేందుకు టీడీపీ సిద్ధమైంది. ఇందులో భాగంగానే ఎత్తుకు పైఎత్తులు వేస్తోంది. కుట్రలు, కుతంత్రాలు, ప్రలోభాలకు తెరలేపుతోంది. నేడు జరగనున్న చైర్మన్ గిరి ఎన్నికలో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను పాల్గొనకుండా అడ్డుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టింది. వైఎస్సార్సీపీ చైర్మన్ అభ్యర్థిగా హఫీజ్ వైఎస్సార్సీపీ చైర్మన్ అభ్యర్థిగా అధిష్టానం 9వ వార్డు కౌన్సిలర్ ఎస్డీ.హఫీజ్‌ను ఎంపిక చేసింది. ప్రత్యామ్నాయంగా 2వ వార్డు కౌన్సిలర్ ఆర్.మునిరాజును కూడా నియమించింది. ఇందుకు సంబంధించిన విప్‌ను అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కరుణాకరరెడ్డికి అందజేశారు. ఆయన కౌన్సిల్‌లోని 2వ వార్డు కౌన్సిలర్ ఆర్.మునిరాజుకు విప్ జారీ అధికారాన్ని కట్టబెట్టారు. రక్షణ కోసం హైకోర్టును ఆశ్రయించారు. సర్వం సిద్ధం కుప్పం చైర్మన్ ఎన్నిక సోమవారం ఉదయం 11 గంటలకు స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించన్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కోరం ప్రకారం 14 మంది సభ్యులు హాజరైతే అధికారులు ఎన్నిక జరిపే అవకాశం ఉంది. కోరం లేని పక్షంలో అధికారులు చైర్మన్ ఎన్నికను వాయిదా వేయొచ్చని సమాచారం. రామకుప్పం ఎంపీపీ ఎన్నిక తరహాలో ప్రత్యేక జీఓ పాచిక ప్రయోగిస్తారా? అనేది వేచి చూడాల్సి ఉంది. బలం లేకపోయినా బరితెగింపే! 5 నవంబర్, 2024 వరకు మున్సిపల్ చైర్మన్‌గా కొనసాగిన 16వ వార్డు కౌన్సిలర్ డాక్టర్ సుధీర్ వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశారు. అప్పటి నుంచి చైర్మన్ కుర్చీ ఖాళీగా ఉంది. ఎన్నికల సంఘం ఏప్రిల్ 28న మున్సిపల్ చైర్మన్ ఎన్నిక తేదీని ప్రకటించింది. 25 వార్డులు ఉన్న కుప్పం మున్సిపాలిటీలో డాక్టర్ సుధీర్ రాజీనామాతో ఆ సంఖ్య 24కు చేరింది. వీరికి ఎక్స్ అఫిషియో సభ్యులుగా స్థానిక ఎమ్మెల్యే చంద్రబాబు, ఎమ్మెల్సీలు కంచెర్ల శ్రీకాంత్, భరత్‌కు ఓటు హక్కు ఉంది. దీంతో సభ్యుల సంఖ్యా బలం 27కు చే రింది. ఇందులో చంద్రబాబు వచ్చే అవకాశాలు త క్కువగా ఉండడంతో 26 మంది సభ్యులతోనే ఎన్నిక నిర్వహించనుంది. 14 మంది అభ్యర్థులు ఎవరికి మ ద్దతు ఇస్తే వారే చైర్మన్ గిరిని దక్కించుకునే అవకాశం ఉంది. ఈ మేరకు కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు పూర్తి చేశారు. చైర్మన్ గిరి కోసం కుమ్ములాట! కుప్పం: ‘ఆలూలేదు.. శూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగం’ అన్నట్టు తయారైంది కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీ పరిస్థితి. వైఎస్సార్సీపీకి సంపూర్ణ బలం ఉండడంతో ఆ పార్టీకి విజయావకాశాలు నల్లేరుపై నడకేనని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే బలం లేకపోయినా.. బరితెగించి కుప్పం చైర్మన్ గిరిని తన్నుకుపోవాలని టీడీపీ కాచుకు కూర్చొంది. ఈ క్రమంలోనే 19, 20, 5 వార్డుల కౌన్సిలర్లు దామోదరం, సోమశేఖర్, సెల్వరాజు చైర్మన్ కుర్చీ కోసం పోటీపడుతున్నట్టు తెలుస్తోంది. శనివారం రాత్రి హొసూరు సమీపంలో క్యాంప్‌లో ఉన్న టీడీపీ మద్దతుదారుల మధ్య వివాదం రేగి, కుమ్ములాటలకు దారితీసినట్టు సమాచారం. -
నాబిడ్డకంటే పార్టీ ముఖ్యం కాదు
● జిల్లా ఆస్పత్రిలో అందని వైద్యం ● వైద్యం కోసం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లకండి ● న్యాయం జరిగేంత వరకు రాజీలేని పోరాటం చేస్తా ● బీసీ నాయకుడు షణ్ముగం చిత్తూరు రూరల్ (కాణిపాకం): ‘చిత్తూరులోని ప్రభుత్వ ఆస్పత్రిలో సరైన వైద్యం అందడం లేదు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. చిన్న జబ్బు అయినా ఆ ఆస్పత్రికి వెళ్లొద్దు’ అని బీసీ సంఘం, టీడీపీ నాయకుడు షణ్ముగం తెలిపారు. ఆయన ఆదివారం చిత్తూరు నగరంలోని బీసీ సంఘ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అక్కడి డాక్టర్ల నిర్లక్ష్యంతోనే తన బిడ్డ శ్రీదుర్గ మృతి చెందిందని ఆరోపించారు. బిడ్డ మృతికి అక్కడి వైద్యులే కారకులన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తానన్నారు. రాష్ట్ర స్థాయి అధికారులు, మెడికల్ కౌన్సిల్, రాష్ట్ర వైద్యఽశాఖ మంత్రికి ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు. కానీ పక్షంలో ప్రాణత్యాగానికై నా సిద్ధమన్నారు. నా బిడ్డకంటే పార్టీ ముఖ్యం కాదని వివరించారు. సోమవారం నుంచి ప్రజాయాత్ర మొదలవుతుందని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడి ఆశయం నీరుగారిందన్నారు. చిన్న జబ్బు వచ్చినా చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లకండని పిలుపునిచ్చారు. సమావేశంలో బీసీ నాయకులు రవీంద్రరాజు, రుద్రయ్య ప్రతాప్, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ నాయకులు శోభారాణి, సాధిక్ తదితరులు పాల్గొన్నారు. -
రేపు ఉడిపి పీఠాధిపతి పాదయాత్ర
పుత్తూరు : గోసంరక్షణ నిమిత్తం ఉడిపి పీఠాధిపతి శ్రీఈషాప్రియ తీర్థ స్వామిజీ నిర్వహిస్తున్న పాదయాత్ర ఈనెల 29వ తేదీ మంగళవారం సాయంత్రం 7 గంటలకు పుత్తూరు చేరుకుంటుంది. స్వామిజీకి స్థానిక ఆర్డీఎం గేటు వద్ద హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి శివాలయం వరకు పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. 8 గంటలకు స్వామి అనుగ్రహ భాషణం ఉంటుందన్నారు. రాత్రి తడుకు గ్రామంలో బసచేసి, 30 తేదీ ఉదయం 8 గంటలకు అనుగ్రహ భాషణం అనంతరం 10 గంటలకు పాదయాత్ర రేణిగుంట వైపు కొనసాగుతుందని చెప్పారు.నాటుసారా తాగి గుర్తు తెలియని వ్యక్తి మృతిరొంపిచెర్ల : నాటు సారా తాగి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన తిరుపతి–మదనపల్లె జాతీయ రహదారిలోని రొంపిచెర్ల–పీలేరు మండలాల సరిహద్దులో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. బండకిందపల్లె పంచాయతీలోని బడబళ్ల వంక వద్ద రోడ్డు పక్కన సుమారు (45) ఏళ్ల వయస్సున్న వ్యక్తి మూడు రోజులుగా కమోళ్లపల్లె పక్కన ఉన్న రామానాయక్ తండా– యర్రగుంటపల్లె మధ్య తిరుగుతున్నాడని గ్రామస్తులు తెలిపారు. దుస్తులు లేకుండా డ్రాయర్ మాత్రమే వేసుకొని తిరుగుతున్నాడని చెప్పారు. పీలేరు మండలం రామానాయక్ తండాలో నాటుసారా తాగి అక్కడ నుంచి రోడ్డు పక్కకు వచ్చి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు రోడ్డు మీద వెళ్తున్న వారు రొంపిచెర్ల పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్ఐ సుబ్బారెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని వివరాలను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. మృతదేహం ఎడమ చేతిపైన మన్మద్రాజ్ అనే పచ్చ బొట్టుతో పేరు రాసుకున్నాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం కోసం పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు తమిళనాడు రాష్టానికి చెంది ఉంటారని అనుమానిస్తున్నారు. మృతదేహం ఆచూకీ తెలిసిన వారు రొంపిచెర్ల పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ సుబ్బారెడ్డి కోరారు.రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణంగంగవరం : సొంత పని మీద పలమనేరుకు నడుచుకుంటూ వెళ్తున్న మహిళను ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఈ ఘటన మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని కూర్నిపల్లి గ్రామానికి చెందిన గిరిజమ్మ (57) గ్రామం నుంచి పలమనేరుకు నడుచుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలో కూర్నిపల్లి క్రాస్ ఓం శక్తి గుడి వద్ద హైవేలో అటుగా వెళ్తున్న ద్విచక్ర వాహనం ఆమెను ఢీకొంది. ఈ ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలు కాగా స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం చిత్తూరుకు రెఫర్ చేయగా అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.విద్యార్థిని అదృశ్యం : కేసు నమోదుతవణంపల్లె : మండలంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థిని అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చిరంజీవి తెలిపారు. మండలంలోని విద్యార్థిని (14) పదో తరగతి పరీక్షలు రాసి ఇంటి వద్ద ఉండేదని వివరించారు. ఈనెల 24వ తేదీన ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు పేర్కొన్నారు. బంధువుల ఇళ్లు, పరిసర గ్రామాల్లో వెతికినా ఆచూకీ కనిపించలేదన్నారు. విద్యార్థిని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు.పేకాటరాయుళ్ల అరెస్టుబంగారుపాళెం : మండలంలోని తగ్గువారిపల్లె సమీపంలో ఆదివారం సాయంత్రం పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. తగ్గువారిపల్లెకు చెందిన రాజన్న మామిడి తోపు సమీపంలో పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ 3,940 స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.వారిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.రూ.1.75 కోట్ల విద్యుత్ బిల్లుల వసూలుచిత్తూరు కార్పొరేషన్ : ఆదివారం విద్యుత్ బిల్లులు చెల్లింపు కేంద్రాలు పనిచేశాయి. దీంతో చిత్తూరు, తిరుపతి జిల్లాలో విద్యుత్ బిల్లుల వసూలు కేంద్రాలను తెరిచారు. మొత్తం 12,200 మంది వినియోగదారులు బిల్లులు చెల్లించగా తద్వారా రూ.1.75 కోట్లు వచ్చిందని ట్రాన్స్‌కో ఎస్ఈలు ఇస్మాయిల్ అహ్మద్, సురేంద్రనాయుడు వివరించారు.శ్రీవారి దర్శనానికి 18 గంటలుతిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 31 కంపార్ట్మెంట్లు నిండాయి. శనివారం అర్ధరాత్రి వరకు 82,811 మంది స్వామివారిని దర్శించుకోగా 34,913 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.24 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
దళితుల దాడులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : రాష్ట్రంలో దళితుల దాడులపై హోం మంత్రి, డీజీపీకి చిత్తశుద్ధిలేదని బహుజన సేన రాష్ట్ర అధ్యక్షుడు చందు మండి పడ్డారు. చిత్తూరులోని ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఆయన సమావేశం నిర్వహించి మాట్లాడారు. గుట్టు చప్పుడు కాకుండా 98 మంది ఎస్సీ, ఎస్టీ స్పెషల్ పోలీస్ స్టేషన్ల డీఎస్పీ పోస్టింగ్‌లను ప్రభుత్వం రద్దు చేసిందని ఆయన ఆరోపించారు. ఈ స్పెషల్ డీఎస్పీల వ్యవస్థను ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని బలపరచడానికి, ఎస్సీ, ఎస్టీ బాధితుల వర్గానికి మెరుగైన సత్వర న్యాయాన్ని అందించడానికి జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసుల ద్వారా 2014వ సంవత్సరంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సమస్యను పరిష్కారం చేయకుండా, చట్టాన్ని నీరు గార్చేవిధంగా ప్రభుత్వం వ్యవహరిస్తే తప్పకుండా తిరుగుబాటు ఉద్యమం తప్పదని హెచ్చరించారు. మే 5వ తేదీన చలో విజయవాడ మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. అనంతరం కరపత్రాలను ఆవిష్కరించారు. బహుజన సేన రాష్ట్ర కార్యదర్శి గోవిందప్ప, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు సతీష్, ఉపాధ్యక్షులు కుమార్, హరివర్ధన్, బాలు, భాస్కర్ పాల్గొన్నారు. -
సంక్రాంతిపల్లెలో దొంగల బీభత్సం
● అయిదు ఇళ్లలో చోరీలు ● రెండు ఇళ్లల్లో బీరువాలను దర్జాగా తీసుకెళ్లి దోచుకున్న వైనం ● 81 గ్రాముల బంగారం, రూ .1.80 లక్షల నగదు అపహరణ బంగారుపాళెం : మండలంలోని సంక్రాంతిపల్లెలో ఆదివారం అర్ధరాత్రి దొంగలు పడి గ్రామంలోని 5 ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డారు. సుమారు 10 లక్షల విలువైన నగలు, నగదు అపహరించుకుపోయారు. రెండిళ్లల్లోని బీరువాలను గ్రామ సమీపంలోకి తీసుకెళ్లి అక్కడ ధ్వంసం చేసి నగలు, నగదు దోచుకుపోవడం గమనార్హం. జాతీయ రహదారికి కూత వేటు దూరంలో గల గ్రామంలో నిందితులు దర్జాగా చోరీకి పాల్ప డడం చర్చనీయాంశంగా మారింది. పోలీసులు, గ్రా మస్తుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సంక్రాంతిపల్లెలో అర్ధరాత్రి సమయం గుర్తుతెలియని వ్య క్తులు గ్రామానికి చెందిన ఉమేష్, మునిరత్నం, శాంతమ్మ, ఇళ్లతో పాటు దళితవాడలోని మునెయ్య, చిట్టిబాబు ఇళ్లల్లో ఇంటి తాళాలను పగులగొట్టి లోపలికు ప్రవేశించారు. ఉమేష్, మునిరత్నం ఇళ్లలోని బీరువాలను గ్రామ సమీపంలోకి తీసుకెళ్లి అక్కడ పగులగొట్టా రు. ఉమేష్ బీరువాలో రూ. 2 లక్షల నగదు, 60 గ్రా ముల బంగారు ఆభరణాలు, మునిరత్నంకు చెందిన బీరువాలో రూ.15 వేల రూపాయలు నగదు, 16 గ్రా ముల బంగారు నగలు అపహరించారు. శాంతమ్మ ఇంటిలో పెట్టెలను పగులగొట్టి చూశారు. ఏమీ లేకపో వడంతో వెళ్లిపోయారు. దళితవాడలో మునెయ్య ఇంటిలో రూ.2 వేల రూపాయల నగదు, బంగారు కమ్మలు(జత) రెండు గ్రాములు, చిట్టిబాబు ఇంట్లో మూడు గ్రాముల విలువైన మూడు జతల కమ్మలు, 2,500 రూపాయల నగదు దోచుకుపోయారు. తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో గ్రామానికి చెందిన మోహన్ టిఫిన్ దుకాణం నిర్వహించేందుకు ఇంటి నుంచి బయటకు రావడంతో నలుగురు వ్యక్తులు ఉ మేష్ ఇంటి వద్ద ఉండడంతో కేకలు వేయడంతో దొంగలు పారిపోయినట్లు తెలిపారు. చోరీ సమాచారం అందుకున్న బంగారుపాళెం సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ రమేష్, సిబ్బంది సంక్రాంతిపల్లె గ్రామానికి చేరుకున్నారు. చోరీకి గురైన ఇళ్లను పరిశీలించారు. బాధితు లతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మిట్టపల్లె గ్రామంలో మహాభారత కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న హరికథకు స్థానికులు వెళ్లినట్లు తెలిపారు. ఉమేష్, మునిరత్నం ఇళ్లకు తాళాలు వేసు కుని మిద్దైపెన నిద్రపోయినట్లు తెలిపారన్నారు. సంఘటనా స్థలాన్ని పలమనేరు డీఎస్పీ ప్రభాకర్ సందర్శించారు. చిత్తూరు నుంచి క్లూస్‌టీమ్ సభ్యులు చోరీ జరిగిన ఇళ్లలో వేలి ముద్రలను సేకరించారు. కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. -
కారు ఢీకొని వ్యక్తికి తీవ్రగాయాలు
పెద్దపంజాణి: మండలంలోని పలమనేరు–పుంగనూరు రోడ్డు ముత్తుకూరు క్రాస్ వద్ద ఆదివారం సాయంత్రం ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడంతో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల క థనం మేరకు.. మండలంలోని కొళత్తూరు పంచా యతీ గళ్లావారిపల్లికి చెందిన వెంకటరమణ కు మారుడు జ్యోతీశ్వర్ మదనపల్లిలోని ఓ హోటల్ లో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో స్వగ్రామం నుంచి మదనపల్లికి ద్విచక్ర వాహనంలో బయలుదేరాడు. ముత్తుకూరు క్రాస్ వద్ద పుంగనూరు నుంచి పలమనేరు వెళుతున్న కారు ఢీకొంది. తీ వ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్న జ్యోతీశ్వర్‌ను స్థానికులు 108లో పుంగనూరు ప్ర భుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు మదనపల్లి ఏరియా ఆస్పత్రికి రెఫర్ చేశారు.ఈతకెళ్లిన విద్యార్థి మృతిబైరెడ్డిపల్లె: స్నేహితులతో కలిసి సరదాగా ఈతకెళ్లిన విద్యార్థి మృతి చెందిన సంఘటన మండల సమీపంలోని కర్ణాటక రాష్ట్రం సనిగపల్లెలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు..మండలంలోని గంగినాయనపల్లెకు చెందిన వెంకటరమణరెడ్డి కుమారుడు తేజేష్‌రెడ్డి (10) బైరెడ్డిపల్లెలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు రావడంతో అమ్మమ్మ గ్రామమైన సనిగపల్లెకు వెళ్లాడు. అక్కడ గ్రామ సమీపంలోని చెరువులో ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
● రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట ప్రణాళిక ● ప్రత్యేక దృష్టి సారించిన కలెక్టర్ ● ప్రమాదాల నివారణకు కార్యాచరణ ● జిల్లాలో 25 బ్లాక్స్పాట్ల గుర్తింపు ● క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు
మొగిలి ఘాట్ రోడ్డు వద్ద ప్రమాదాల నివారణకు ఏర్పాటు చేసిన స్పీడ్‌బ్రేకర్లు బ్లాక్‌స్పాట్‌గా చిత్తూరుకు సమీపంలోని మురకంబట్టు కూడలి బంగారుపాళ్యం మండలం మొగిలిఘాట్ వద్ద 2024 సెప్టెంబర్ 13వ తేదీన ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా 30 మంది గాయపడ్డారు. ఈ ఘటన కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీని తీవ్రంగా కలిచివేసింది. ఈ ఒక్క ఘటనే కాదు.. నిత్యం జిల్లాలో పలు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల నివారణకు పటిష్ట ప్రణాళిక అమలు చేయాలని కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు రెవెన్యూ, రవాణా, వైద్య, పోలీసు శాఖల సమన్వయంతో ప్రతివారం సమీక్షలు, ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన అంశాలపై లోతుగా చర్చించి దిశానిర్దేశం చేస్తున్నారు. చిత్తూరు కలెక్టరేట్ : ప్రాణం విలువ ఎంతో ముఖ్యమైనది. జిల్లాలో నిత్యం ఎక్కడో ఒకచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం, గాయాలు కావడం నిత్యం చూస్తూనే ఉన్నాం. అతివేగం, డ్రైవింగ్ నిర్లక్ష్యం వల్ల రోడ్డు ప్రమాదంలో మృతి చెందే వ్యక్తుల కుటుంబాలు చీకటిమయం అవుతున్నాయి. డ్రైవింగ్ అలసత్వం, మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల బతుకులు గాల్లో కలిసిపోతున్నాయి. ఇలాంటి రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నారు. నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై క్షేత్రస్థాయిలో ప్రజలు, యువతకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతున్నారు. నిర్ధిష్ట ప్రణాళిక అమలుతో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు కృషి చేస్తున్నారు. సహాయం ముఖ్యం ఒక కుటుంబంలో ఎవరైనా ప్రమాదాల బారినపడి మృతి చెందితే ఆ కుటుంబం సర్వస్వం కోల్పోయి, కుటుంబం రోడ్డున పడాల్సిన పరిస్థితి వస్తుంది. రోడ్లపై నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసే అలసత్వాన్ని వీడాలి. మానసిక ప్రశాంతతో డ్రైవింగ్ చేయాలి. లైసెన్స్ లేకుండా వాహనం నడపకుండా, హెల్మెట్ ధరించి వాహనాలు నడిపేలా క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే నష్టాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా తెలియజేస్తున్నారు. ప్రమాదాలు జరిగితే వెంటనే స్పందించేలా అధికారులు, 108 వాహనాలు, డాక్టర్లు, పోలీసుల నంబర్లను తెలుసుకునేలా అవగాహన కల్పిస్తున్నారు. ఎక్కువ ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో సహాయం నిమిత్తం 108 వాహనాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్స్పాట్లుగా.. జిల్లాలో ఎక్కువ ప్రమాదాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో గుర్తించారు. ఆయా ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించి అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో 25 ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించి ఆ ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మితిమీరిన వేగం, మద్యం తాగి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని అవగాహన కల్పిస్తున్నారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో విద్యుత్‌లైట్లు, హైవేలపై వేగ నియంత్రణకు లేజర్ స్పీడ్ గన్స్, వేగాన్ని నియంత్రించేందుకు బ్లాక్‌స్పాట్స్ సమీపంలో రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేశారు. ప్రమాద స్థలం వాహనదారులకు తెలిసేలా పవర్ బ్లంకర్స్,సైన్ బోర్డులు, బారికేడ్లు, సీసీ కెమెరాలు, సోలార్ స్టెన్స్ ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో గుర్తించిన బ్లాక్స్పాట్లు ఇవే.. ● ఎన్ హెచ్– 69 రోడ్డులో.. : ఎంఎస్ఆర్ క్రాస్, చీలాపల్లి క్రాస్, గంగాసాగరం వద్ద ఉన్న ఆర్ఎంఎం ఫ్యాక్టరీ , యాదమరి జంక్షన్, వరిగపల్లి జంక్షన్, కేజీ సత్రం, మొగిలి ఘాట్ (శ్రీనీఫ్యాక్టరీ వద్ద), దొర చెరువు (మొగలి ఘాట్), జగమర్లక్రాస్, దండపల్లి (వి.ఎస్.ఆర్) జంక్షన్, పొన్నమాకులపల్లి క్రాస్, అలకుప్పం (కుక్కలదొడ్డి క్రాస్). ● ఎన్‌హెచ్ 42 రోడ్డు : గొల్లపల్లి క్రాస్, దేవదొడ్డి, కుమ్మరమడుగు క్రాస్, జువనిపల్లి క్రాస్, నాయనపల్లి పెట్రోల్ బంక్, విజలపురం క్రాస్, కె.సి హాస్పిటల్. ● ఎన్‌హెచ్ 40 రోడ్డు : మురకంబట్టు జంక్షన్, ఎన్ హెచ్ 140 లో తెల్లగుండ్ల పల్లి క్రాస్, పి.కొత్తకోట రైల్వే అండర్ బ్రిడ్జి, ● ఎన్‌హెచ్ 716 లో హెచ్‌పీ పెట్రోల్ బంక్, గవర్నమెంట్ ఆసుపత్రి ఎదురుగా, మిట్ట ప్రదేశాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించి ప్రమాదాల కట్టడికి చర్యలు చేపడుతున్నారు. 25 బ్లాక్‌స్పాట్స్‌లో 2024 సంవత్సరంలో ప్రమాదాలు ఇలా... లైట్‌వెయిట్ వాహన ప్రమాదాలు 249 ద్విచక్ర వాహనాల ప్రమాదాలు 209 గాయపడినవారు 510 మంది మృతిచెందిన వారు 228 మంది ద్విచక్రవాహన ప్రమాదాల్లో మృతులు 128 2025 మార్చి నెల వరకు ప్రమాదాలు ఇలా.. లైట్ వెయిట్ వాహనాల ప్రమాదాలు 53 ద్విచక్ర వాహనాల ప్రమాదాలు 63 గాయపడిన వారు 153 మంది ప్రమాదాల్లో మృతి చెందినవారు 51 మంది పాటించాల్సిన నియమాలు ట్రాఫిక్, రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలి. మద్యం తాగి వాహనాలు నడపరాదు. మూల, మలుపుల వద్ద వేగాన్ని తగ్గించాలి. వాహనం నడుపుతున్న సమయంలో సెల్‌ఫోన్ వినియోగించకూడదు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ వినియోగించాలి. రోడ్డుపై ప్రయాణించేటప్పుడు పెద్ద వాహనాలకు దూరంగా ఉండాలి. కార్లల్లో ప్రయాణించే వారు తప్పనిసరిగా సీట్ బెల్టు వినియోగించాలి. జిల్లాలో డివిజన్ల వారిగా గుర్తించిన బ్లాక్స్పాట్లు డివిజన్ ఎన్‌హెచ్–69 ఎన్‌హెచ్–42 ఎన్‌హెచ్–140 ఎన్‌హెచ్–40 ఎన్‌హెచ్–716 మొత్తం చిత్తూరు 7 0 2 2 0 11 పలమనేరు 6 3 0 0 0 09 కుప్పం 0 2 0 0 0 02 నగరి 0 0 0 0 3 03 మొత్తం 13 5 2 2 3 25 -
విద్యార్థి మృతదేహంతో ఆందోళన
● కళాశాల వద్ద కుటుంబీకుల ధర్నా ● రోడ్డుపై బైఠాయించి నిరసన ● కళాశాల యాజమాన్యమే చంపేసిందని ఆరోపణ ● రాత్రి వరకూ కళాశాల వద్ద ఉద్రిక్త వాతావరణం గంగవరం : మా బిడ్డ కళాశాలలో ఆత్మహత్య చేసుకున్నాడా లేక చంపేశారా.. కళాశాల యాజమాన్యమే సమాధానం చెప్పాలి.. లేకపోతే ఇక్కడ నుంచి కదిలేది లేదంటూ కళాశాలలో ఉరేసుకుని అనుమానాస్పదంగా మృతి చెందిన ఇంటర్ విద్యార్థి కుటుంబికులు, బంధువులు కలిసి కళాశాల ఎదుట రోడ్డుపై ధర్నా చేశారు. కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలు ఇలా.. కుప్పం వద్ద శాంతీపురం మండలం గెసికపల్లి గ్రామానికి చెందిన సుబ్రమణ్యం కుమారుడు యోగేష్(16) గంగవరం మండలంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఈ మధ్య వెలువడిన ఫలితాల్లో ఫెయిల్ అయ్యాడు. అయితే గత 23వ తేదీన సప్లిమెంటరీ పరీక్షలకు ప్రిపేర్ కావడం కోసం అతన్ని తల్లిదండ్రులు కళాశాలలో విడిచి వెళ్లారు. శనివారం రోజున కళాశాలలోని ఇంజినీరింగ్ విద్యార్థి ఉంటున్న హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకున్నట్లుగా శవమై కనిపించడంపై పలు అనుమానాలకు దారి తీసింది. విద్యార్థి మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. 6 కి.మీ మృతదేహాన్ని ఎత్తుకొని నడుచుకుంటూ.. పోస్టుమార్టం ముగిసిన తరువాత ఆదివారం విద్యార్థి మృతదేహాన్ని చేతుల్లో మోసుకుంటూ దాదాపు 6 కిలోమీటర్లు రోడ్డు మార్గాన నడుచుకుని కళాశాల వద్దకు చేరుకున్నారు. అక్కడ మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి తమకు న్యాయం చేయాలంటూ నిరసన చేపట్టారు. పలమనేరు డీఎస్పీ ప్రభాకర్, గంగవరం, పలమనేరు సీఐలు ప్రసాద్, నరసింహరాజు, భాస్కర్ అక్కడికి చేరుకుని మృతుడి కుటుంబికులకు సర్ది చెప్పాలని చూసినా వారు వినలేదు. తమ బిడ్డను కళాశాల యాజమాన్యం చంపేసి నిజాలను దాచిపెడుతున్నారని వాపోయారు. పదుల సంఖ్యలో పోలీసులు , బెటాలియన్‌తో కలిసి అక్కడ గుమికూడిన విద్యార్థి కుటుంబికులను కళాశాలలోనికి అనుమతించకుండా అడ్డుకున్నారు. దీంతో కళాశాల ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చాలాసేపు తరువాత మృతుడి కుటుంబికులకు, కళాశాల యాజమాన్యానికి మధ్యన పోలీసులు రాజీ కుదర్చడంతో మృతదేహంతో అక్కడి నుంచి వెనుదిరిగారు. -
ఓటమి భయంతో అధికార పార్టీ కుట్రలు
● ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న అధికార పార్టీ ● కౌన్సిలర్లను అంగడి సరుకులా కొనేందుకు యత్నం ● ఒకరిద్దరు టీడీపీకి మద్దతు తెలిపే అవకాశం ● పార్టీలు మారే కౌన్సిలర్లు తమకొద్దంటున్న ప్రజానీకం ● ఓటింగ్‌కు అడ్డుపడే అవకాశం ఉండడంతో రక్షణ కోసం హైకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు ● కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మరో రామకుప్పం ఎంపీపీ ఎన్నికను తలపించనుందా..? కుప్పం రూరల్: సంఖ్యా బలం లేకపోయినా ఎలాగైనా కుప్పం మున్సిపల్ చైర్మన్ గిరి దక్కించుకోవాలని అధికార టీడీపీ బరితెగింపులకు పాల్పడుతోంది. ప్రత్యర్థి పార్టీ కౌన్సిలర్లను అంగడి సరుకుల్లా కొనేందుకు బరితెగిస్తున్నారు. ఇప్పటికే ఒకరిద్దరు టీడీపీతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. కౌన్సిలర్లు లొంగని పక్షంలో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను సమావేశానికి రానివ్వకుండా అడ్డుకుని, ప్రత్యేక జీఓల ద్వారా అడ్డదారుల్లో గెలిచే అవకాశాలపై ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. వీరి ఆలోచనలు పసిగట్టిన వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు రక్షణ కోసం కోర్టును ఆశ్రయించారు. ప్రజాస్వామ్యం గెలుస్తుందా..? అధికార పార్టీ కుతంత్రాలు గెలుస్తాయా? అనేది కుప్పం జనంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. పార్టీ ఫిరాయింపులు మంచిది కాదు కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వేళ ఒకరిద్దరు వైఎస్సార్ సీపీ వారు టీడీపీకి మద్దతు ఇస్తారనే పుకార్లు షికార్లు కొడుతున్నాయి. ఫార్టీ ఫిర్యాయిస్తారనే కౌన్సిలర్ల పరిధిలోని ప్రజలు మాత్రం ఇది మంచి పద్ధతి కాదని అభిప్రాయపడుతున్నారు. తాము మంచి చేస్తారని ఓట్లు గెలిపిస్తే వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ ఫిరాయిస్తే వారికి గట్టిగా బుద్ధి చెబుతామని హెచ్చరికలు సైతం చేస్తున్నారు. మరో రామకుప్పం ఎంపీపీ ఎన్నిక కానుందా? కుప్పం మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక మరో రామకుప్పం ఎంపీపీ ఎన్నిక కానుందా? అనే అనుమానాలు జనంలో నెలకొన్నాయి. గత నెలలో రామకుప్పం ఎంపీపీ ఎన్నికల్లో కోరం లేకపోయినా టీడీపీ అభ్యర్థులు గెలుపొందినట్లు ప్రకటించుకున్నారు. మండలంలో 16 ఎంపీటీసీ సభ్యులుండగా, ఎంపీపీ అభ్యర్థి శాంతకుమారి అకాలమరణం పొందింది. దీంతో సభ్యుల సంఖ్య 15కు చేరింది. ఎన్నిక నిర్వహించాలంటే కోరం 8 మంది సభ్యులు హాజరు కావాల్సి ఉంది. వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులను ఎన్నికలకు హాజరు కాకుండా అడుగడుగునా అడ్డుకుని, హాజరైన ఆరుగురు టీడీపీ సభ్యులతోనే ఎంపీపీ ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికలో టీడీపీ అభ్యర్థులే గెలిచినట్లు అధికారులు ప్రత్యేక జీఓ అనే అస్త్రాన్ని ఉపయోగించుకుని గెలుపును నిర్ణయించుకున్నారు. ఇదే తరహాలో కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు జరిగే అవకాశాలు లేకపోలేదని మేధావులు అభిప్రాయపడుతున్నారు. కోర్టును ఆశ్రయించిన వైఎస్సార్సీపీ కౌన్సిలర్లుఅధికార పార్టీ నుంచి తమకు ఇబ్బందులున్నాయని, రక్షణ కల్పించాలని కౌన్సిలర్లతో పాటు ఎమ్మెల్సీ భరత్ శుక్రవారం హైకోర్టును ఆశ్రయించారు. సభ్యులకు రక్షణ కల్పించాలని కోర్టు జిల్లా, స్థానిక పోలీసు, రెవెన్యూ అధికారులకు ఆదేశాలు సైతం జారీ చేసింది. కౌన్సిలర్లు ప్రయాణించే వాహనాల నంబర్లు, ఆధార్‌కార్డులు పోలీసులకు అందజేయాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు స్థానిక పోలీసు స్టేషన్లో ఇందుకు సంబంధించి పత్రాలు అందజేశారు. సర్వత్రా ఉత్కంఠ కుప్పం మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక సోమవారం కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో జరగనున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎక్కడ చూసినా చైర్మన్ ఎన్నికపైనే చర్చలు సాగుతున్నా యి. టీ షాపులు వద్ద నలుగురు గుమికూడిన ప్రతి చోట చైర్మన్ అభ్యర్థిత్వంపైనే చెవులు కొరుక్కుంటున్నారు. ఒకరు ఒకరికి వస్తుందని, లేదు లేదు మరోకరికి వస్తుందనే వాదనలు నడుమ మాటలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ సోమవారం ఏ పార్టీ వారికి మంచి రోజు అవుతుందో అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. షీల్డు కవరే శరణ్యమా? చైర్మన్ ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా సాగితే వైఎస్సా ర్ సీపీ గెలుపు ఖాయం. వైఎస్సార్ సీపీలో ఇప్పటికే చైర్మన్ అభ్యర్థి ఎవరనేది అధిష్టానం స్పష్టమైన నిర్ణ యం తీసుకుంది. చిక్కల్లా టీడీపీలోనే ఉంది. అడ్డదారుల్లో టీడీపీ చైర్మన్ గిరి దక్కించుకుంటే అభ్యర్థి విషయంలో స్పష్టత లేదు. ఎవరికి వారు తామే చైర్మన్ అ ని ప్రచారాలు చేసుకుంటున్నారు. 19 వార్డు కౌన్సిలర్ దాము తనకే దక్కాలని గట్టిగా ప్రయత్నిస్తున్నా డు. 20వ వార్డు కౌన్సిలర్ సోమశేఖర్ అయితే అధిష్టానం ఆశీర్వాదం తనకే ఉందని దీమాగా ఉన్నాడు. 5వ వార్డు కౌన్సిలర్ సెల్వం కుప్పంలో 60 శాతం ఓ టర్లు తమ సామాజిక వర్గం వారే ఉన్నారని, తనకు ఇస్తేనే సముచితమని, ఇప్పటికే పలుసార్లు మద్దతు కోసం సామాజిక వర్గ సమావేశాలు నిర్వహించారు. మరో వ్యక్తి కూడా చైర్మన్ గిరిపై ఆశపడుతున్నట్లు తెలుస్తోంది. నలుగురైదుగురు పోటీ ఉన్న నేపథ్యంలో నిర్ణయం అధిష్టానానికి వదిలే స్తారనే వాదన లేకపోలేదు. పైనుంచి వచ్చే షీల్డు కవర్లో ఎవరు పేరు ఉంటే వారే చైర్మన్ అన్న అభిప్రాయం లేకపోలేదు. -
నూతన సంస్కరణలపై అవగాహన తప్పనిసరి
చిత్తూరు అర్బన్: న్యాయ వ్యవస్థలో ఉన్నత న్యా యస్థానాలు ఇచ్చే తీర్పు లు, నూతన సంస్కరణలపై న్యాయమూర్తులు తప్పనిసరిగా అవగాహ న కలిగి ఉండాలని ఉ మ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక అన్నారు. శనివారం చిత్తూరు నగరంలోని జిల్లా న్యాయస్థానాల సముదాయంలో ఉమ్మడి జిల్లాలోని న్యాయమూర్తులకు ‘లా ఆఫ్ రెపుటేషన్’ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా జడ్జి మాట్లాడుతూ దేశ, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులపై ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండాలన్నారు. ఏవైనా సందేహాలు వచ్చినప్పుడు సీనియర్లను అడిగి తెలుసుకోవాలన్నారు. రిటైర్డు జిల్లా జడ్జిలు కెపి.బాలజీ, ఎస్.జగన్నాథం రీసోర్స్ పర్సన్‌గా వ్యవహరించి పలు విషయాలపై న్యాయమూర్తులకు అవగాహన కల్పించారు. న్యాయమూర్తులు రమేష్, భారతి తదితరులు పాల్గొన్నారు. 12 మందికి ఎంపీడీఓలుగా పదోన్నతులుచిత్తూరు కార్పొరేషన్: ఉమ్మడి జిల్లాలో 12 మంది డిప్యూటీ ఎంపీడీఓలు, ఏఓలకు ఎంపీడీఓలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీడీనెల్లూరు, రామకుప్పం, వెదురుకుప్పం, పులిచెర్ల ఎంపీడీఓ కార్యాలయాల్లో డిప్యూ టీ ఎంపీడీఓలుగా ఉన్న హరిప్రసాద్‌రెడ్డి, రాధాకృష్ణ, పురుషోత్తం, రాజశేఖర్‌బాబును చిత్తూరు జి ల్లాకు కేటాయించారు. అలాగే కడప, అనకాపల్లె లో పనిచేస్తున్న హరిప్రసాద్‌రెడ్డి, శిరీషను చిత్తూ రు జిల్లాకు ఇచ్చారు. ఎర్రవారిపాళెం, నాగలాపురంలో విధులు నిర్వహిస్తున్న మాలతి, వెంకటరమణను తిరుపతి జిల్లాకు కేటాయించారు. నగరి, గంగవరం, బైరెడ్డిపల్లె ఎంపీడీఓ కార్యాలయాల్లో ఏఓలుగా పనిచేస్తున్న సతీష్, భాస్కర్, మహేష్ కు ఉద్యోగోన్నతి కల్పించి, చిత్తూరు జిల్లాకు కేటాయించగా, రామసముద్రం ఏఓ గౌస్‌బాషాను కడప జిల్లాకు ఇచ్చారు. వీరికి త్వరలో మండలాలను కేటాయించనున్నారు. -
ఆధునిక నేర పోకడపై అవగాహన తప్పనిసరి
చిత్తూరు అర్బన్: ఆధునిక సమాజంలో నేరాలు జరుగుతున్న తీరు, ప్రజలు ఎలా మోసాలకు గురవుతున్నారనే విషయాలపై అవగాహన తప్పనిస రని చిత్తూరు ఎస్పీ మణికంఠ అన్నారు. శనివారం చిత్తూరు నగరంలోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో నేర సమీక్ష నిర్వహించారు. ఎస్పీ మాట్లాడు తూ సాంకేతిక నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త ర కాల నేరాలకు పాల్పడుతూ ప్రజలను ఆర్థికంగా, సామాజికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నా రు. సైబర్‌క్రైమ్‌పై నిర్లక్ష్యం చేయకుండా ఆయా స్టేషన్ హౌస్ ఆఫీసర్లు బాధితులు స్టేషన్‌కు వస్తే వెంటనే స్పందించాలన్నారు. పెండింగ్ కేసుల ద ర్యాప్తు సకాలంలో పూర్తి చేయాలని ఇప్పటికే పలు మార్లు హెచ్చరించినా, కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరించడం మంచిదికాదన్నారు. ఇక నేరస్తుల కదలికలను గుర్తించడానికి రూపొందించిన సీసీటీఎన్ఎస్ యాప్‌ను ఎప్పటికప్పుడు వివరాలను అప్డేట్ చేయాలన్నారు. డ్రోన్ల సాయంతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారి ఆట కట్టించాలన్నారు. మూడు రోజులు పాటు డ్రోన్ శిక్షణ కోసం జిల్లాకు వచ్చిన సిబ్బందికి మెలకువలు నేర్పించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంతో ప్రజలతో సన్నిహితంగా ఉండాలని, ప్రజా సమస్యల ఫిర్యా దు వేదికకు వచ్చే అంశాలకు ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలన్నారు. ఏఎస్పీ రాజశేఖర్ రాజు, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు. ఉద్యోగమేళా రేపు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని ఉపాధి కా ర్యాలయంలో ఈ నెల 28వ తేదీన ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జి ల్లా ఉపాధి అధికారి పద్మజ తెలిపారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈ ఉద్యోగమేళాలో పలు జాతీయ కంపెనీలు పాల్గొంటాయ న్నారు. జిల్లాలో డిప్లొమా, ఐటీఐ, ఇంటర్మీడియ ట్, డిగ్రీ పూర్తీ చేసి 19–35 సంవత్సరాల వ యస్సులోపు ఉన్న నిరుద్యోగులు అర్హులన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న నిరుద్యోగులు ఈ నెల 28వ తే దీన విద్యార్హత సర్టిఫికెట్లతో మేళాకు హాజరుకావాలని కోరారు. -
బాలికల భద్రతే.. దేశ బాధ్యత
చిత్తూరు కలెక్టరేట్ : కిశోర బాలికల భద్రతే దేశ బాధ్యత అని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ (ఐసీడీఎస్) ప్రాజెక్ట్ డైరెక్టర్ డి.వెంకటేశ్వరి అన్నారు. కలెక్టరేట్లోని డీఆర్డీఏ సమావేశ మందిరంలో శనివారం జిల్లాస్థాయిలో కిశోరవికాసం– సమ్మర్ స్పెషల్ కార్యాచరణపై మండల స్థాయిలో వివిధ శాఖల నుంచి హాజరైన నోడల్ ఆఫీసర్లకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పీడీ మాట్లాడుతూ కిశోర బాలికల సాధికారతకు ప్రతి కృషి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వేసవి సెలవుల్లో అమలు చేయాల్సిన ప్రత్యేక క్యాలెండర్ విడుదల చేసినట్లు తెలిపారు. ఆ క్యాలెండర్ ప్రకారం గ్రామాల్లో ప్రత్యేక కార్యచరణ అమలు చేయాలన్నారు. బాల్య వివాహాల కట్టడికి అన్ని శాఖలు సమన్వయంతో కలిసి పనిచేయాలని తెలిపారు. నేడు చాలా వరకు అన్నీ పోటీ పరీక్షలలో బాలికలదే పైచేయిగా ఉన్నప్పటికీ, ఎంతో మంది కిశోర బాలికలు తమ కళలను నెరవేర్చుకోక ముందే బాల్య వివాహాలకు బలైపోతున్నారని అన్నారు. మరి కొంతమంది బాల కార్మికులుగా మారిపోతున్నారని చెప్పారు. మరొకవైపు బాలికలు ఇంటా బయట, తెలిసిన వ్యక్తుల చేతుల్లో లైంగిక వేదింపులకు గురై చెప్పుకోలేక తమలో తామే కుమిలిపోతున్నారన్నారు. మరికొంత మంది తెలియని తనంతో ప్రేమ, ప్రలోభాలకు గురై, నమ్మి మోసపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్లు జిల్లా బాలల పరిరక్షణ అధికారి (డీసీపీఓ) డాక్టర్ దాసరి సుబ్రహ్మణ్యం, ఐరాల ఎంపీడీఓ ధనలక్ష్మి, సమగ్రశిక్ష జీసీడీఓ ఇంద్రాణి, ఆర్బీఎస్కే జిల్లా కో–ఆర్డినేటర్ డాక్టర్ గిరి తదితరులు పాల్గొన్నారు. -
పలమనేరులో ప్రజాసమస్యల పరిష్కార వేదిక రేపు
చిత్తూరు కలెక్టరేట్ : ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 28వ తేదీన పలమనేరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పలమనేరు రెవెన్యూ డివిజన్లోని ప్రజా సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను వినతుల రూపంలో అందజేసి, పరిష్కరించుకోవాలని కలెక్టర్ కోరారు. ఐరాలలో చిరుత సంచారం ఐరాల: మండలంలోని నగరి, చెంగనపల్లె గ్రామాల్లో చిరుత పులుల సంచరిస్తున్నాయి. శనివారం చెంగనపల్లె సమీపంలోని బంగారుచింతల గ్రామానికి చెందిన రైతు మల్లీశ్వర్‌రెడ్డి మామిడి తోటలో చిరుత పులి పాదముద్రలను పోలిన ముద్రలు కనిపించాయి. విషయాన్ని వెంటనే ఐరాల బీట్ అధికారి రెడ్డిప్రసాద్‌కు తెలిపారు. దీంతో ఆయన ఉదయం మామిడి తోటలో పాదముద్రల గుర్తులున్న ప్రాంతానికి వెళ్లి వాటిని సేకరించారు. పాదముద్రలను గుర్తించడం కోసం ఫొటోలను ఉన్నతాధికారులకు పంపినట్లు తెలిపారు. కాగా ఈ పాదముద్రలు దగ్గర దగ్గరగా ఉన్నాయని, చిరుత పులి పాదముద్రలు దూరం దూరంగా ఉంటాయని చెప్పారు. అయితే నగరి, చెంగపల్లె సమీపంలోని పెద్దకొండలో నాలుగు చిరుత పులులు సంచరిస్తున్నట్లు తెలిపారు. తాగునీటి కోసం పెద్దకొండ నుంచి దుర్గంకు వెళ్లే దారిలో మామిడి తోటలో నీటి కోసం చిరుత పులులు వస్తున్నట్లు చెప్పారు. -
గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతమే లక్ష్యం
చౌడేపల్లె: గ్రామస్థాయి నుంచి వైఎస్సార్సీపీని బలోపేతం చేయడమే లక్ష్యమని ఆ మండల అధ్యక్షుడు జి. నాగభూషణరెడ్డి అన్నారు. శనివారం పెద్దకొండామర్రిలో కోటూరుకు చెందిన మైనార్టీ నేతలు, పార్టీ నాయకులతోపాటు బోయకొండ ఆలయ కమిటీ మాజీ చైర్మన్ మిద్దింటి శంకర్ నారాయణ తదితర నేతలు కలిసి నూతనంగా ఎన్నికై న అధ్యక్షుడిని సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి, ప్రజల్లో చైతన్యం తేవడానికి ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేయాలని కోరారు. కష్టపడి పనిచేసిన వారికి పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. త్వరలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించి కార్యక్రమాలకు స్వీకారం చుడతామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జాఫర్, ఇంమ్రాన్, ఫయాజ్,రాంబాబు, హస్సేన్, మల్లికార్జున, అజారుధ్దీన్, సలీం, అలీ, మునిగిరిబాబు,శ్రీరాములు, వెంకీ, కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
జాగ్రత్త పనిచేసుకోండి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఎందుకు మా వరకు ఫిర్యాదులొస్తున్నాయి. మీరెందుకు పనిచేయడం లేదు..జాగ్రత్తగా పనిచేసుకోండని కలెక్టర్ సుమిత్‌కుమార్ సుతిమెత్తగా హెచ్చరించినట్లు తెలిసింది. ఈనెల 19వ తేదీన సాక్షి దినపత్రికలో శ్రీచిన్నపనైనా..చేయి తడపాల్సిందేశ్రీ అనే శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై కలెక్టర్ స్పందించినట్లు తెలిసింది. అధికారుల ఇచ్చిన సమాచారం మేరకు.. సోమవారం చిత్తూరు అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే అధికారులు, సిబ్బంది, వీఆర్వోలకు కలెక్టర్ పిలుపునిచ్చారు. ముందుగా ఓ సర్వేయర్‌కు వార్నింగ్ ఇచ్చారు. హిట్‌లిస్టులో ఉన్నవని, మంచిగా పనిచేయాలని హెచ్చరించారు. వీర్వోలు క్షేత్రస్థాయిలో ఏం చేస్తున్నారని, ఫిర్యాదులన్నీ అర్బన్ నుంచి అత్యధికంగా వస్తున్నాయన్నారు. ఎందుకు ఫిర్యాదుదారుల నుంచి వినతులు తీసుకోవడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. పద్ధతి మార్చుకుని, పనిచేయాలని హుక్కుం జారీ చేశారని సమాచారం. కాగా ఈవిషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా ఓ సర్వేయర్ తప్పిదాలు, నిర్లక్ష్యంను గుర్తించి షోకాజ్ నోటీసులు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమైన సమాచారం. షోకాజ్ నోటీసులో తహసీల్దార్ సంతకం పెడితే సోమవారం ఆ సర్వేయర్‌కు నోటీసులు ఇవ్వనున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
ఒకే ఈతలో 4 పిల్లలు
బైరెడ్డిపల్లె: మండలంలోని కుప్పనపల్లె గ్రామానికి చెందిన నాగరాజు మేకలను పెంచుతూ జీవిస్తున్నాడు. తన మేకల మందను శనివారం మేత కోసం గ్రామ సమీపంలోకి తీసుకెళ్లగా మందలోని ఓ మేక 4 పిల్లలకు జన్మనిచ్చింది. సాధారణంగా మేకలు ఒకటి, రెండు పిల్లలను మాత్రమే వేస్తాయని, 4 పిల్లలు ఒకే కాన్పులో వేయడంతో రైతు నాగరాజు ఆనంద పడ్డాడు. కారు ఢీకొని వ్యక్తికి తీవ్రగాయాలు పుంగనూరు: మండలంలోని రాంపల్లి వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల కథనం మేరకు.. మోటారుసైకిల్‌పై వెళ్తున్న గుర్తు తెలియని వ్యక్తిని ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో రెండు కాళ్లు పూర్తిగా విరిగిపోయాయి. దీనిని గమనించిన ఆప్రాంత వాసులు 108లో బాధితుడిని ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య వెదురుకుప్పం: మండలంలోని మారేపల్లె సమీపంలో శనివారం గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు వెదురుకుప్పం ఎస్ఐ వెంకటసుబ్బయ్య తెలిపారు. మృతి చెందిన వ్యక్తి వయస్సు 35–40 సంవత్సరాల మధ్యలో ఉంటుందని 5 అడుగుల 5 అంగుళాల పొడవు ఉన్నట్లు చెప్పారు. తను వేసుకున్న పింక్ కలర్ షర్ట్‌తో చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయినట్లు పేర్కొన్నారు. మృతుడి ఎడమ చేతిపై షీలా అని ఆంగ్లంలో పచ్చబొట్టు ఉన్నట్లు తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చెప్పారు. కాగా మృతుడి వివరాలు తెలిస్తే 9440900691 నంబర్‌కు తెలియజేయాలని కోరారు. -
నగరిలో కొండముచ్చు హల్చల్
నగరి : పట్టణంలో శనివారం ఒక కొండముచ్చు హల్చల్ చేసింది. ఎక్కడో అడవుల్లో మాత్రమే కనిపించే కొంముచ్చు దారితప్పి ఎలాగో నగరి పట్టణానికి వచ్చేసింది. దీన్ని చూడడానికి స్థానికు లు, చిన్నారులు ఆసక్తి చూపారు. అరటి పండ్లు, టెంకాయలు అందిస్తూ దాని వెంట పడ్డారు. తెగిన వైర్లు.. 50 మామిడి చెట్లు ధ్వంసం వెదురుకుప్పం: మండలంలోని చెంచుగుడి సమీపంలో శనివారం సాయంత్రం 220 కేవీ విద్యుత్ లైన్ తెగిపడినట్టు గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనలో 50 మామిడి చెట్లు ధ్వంసం అయ్యాయి. సాయంత్రం సమయంలో ఉన్నట్టుండి హఠాత్తుగా పెద్ద శబ్దంతో విద్యుత్ తీగలు తెగి పడ్డాయి. దీంతో గ్రామస్తులు భయాందోళన చెందారు. పొలాలపై విద్యుత్ వైర్లు పడడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో రైతు లోకేష్ రెడ్డికి చెందిన 50 మామిడి చెట్లు విరిగిపోయినట్లు బాధితుడు తెలిపారు. మామిడి కాయలు నేలరాలినట్లు పేర్కొన్నారు. 30న జిల్లా అభివృద్ధి సమీక్ష కమిటీ సమావేశం చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో ఈ నెల 30వ తేదీన జిల్లా అభివృద్ధి సమీక్ష కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. ఇందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా ఇన్చార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు. జిల్లాలోని ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ ప్రత్యేక ఆహ్వానితులుగా, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొననున్నారు. ఈ సమావేశం నిర్వహణ, అజెండా అంశాల ఏర్పాటుకు సంబంధించి డీఆర్వో మోహన్‌కుమార్ క్షేత్రస్థాయి అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్ధేశం చేశారు. -
గోల్డ్ కుంభకోణంలో కీలక నిందితుడి అరెస్టు
పలమనేరు: పలమనేరు, పుంగనూరు నియోజకవర్గాల్లో కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్ బ్యాంకులో బంగారు ఆభరణాల మోసం కేసుకు సంబంధించిన కుంభకోణంలో అసలు నిందితుడిని పలమనేరు పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పలమనేరు, పుంగనూరు ప్రాంతాల్లో గత కొన్నేళ్లుగా కనకదుర్గ ఫైనాన్స్ పేరిట బ్యాంకులు ఏర్పాటు చేశారు. ఇందులో పని చేస్తున్న అధికారులు, సిబ్బంది కలసి బంగారు నగల విషయంలో అక్రమాలు జరిగి రూ.కోట్లలో మోసాలు జరిగాయి. దీనిపై సాక్షి దినపత్రికలో పలు కథనాలు వెలువడ్డాయి. కాగా దీనిపై స్థానిక పోలీసుల పెద్దగా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుడైన నరసింహులు న్యాయవాదుల ఆధ్వర్యంలో పలమనేరులోని కోర్టులో లొంగిపోయారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు నిందితుడిని విచారించేందుకు పిటిషన్ వేసి అదుపులోకి తీసుకున్నారు. దీనిపై విచారణ చేసి ఈ కుంభకోణంలో మొత్తం నిందితులను త్వరలో అరెస్టు చేస్తామని సీఐ నరసింహరాజు తెలిపారు. ఇలా ఉండగా స్థానిక పోలీసులు నిందితుడిని స్థానిక పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకెళుతుండగా బాధితులు పెద్ద సంఖ్యలో నిందితుని పై దాటికి ప్రయత్నం చేయడం గమనార్హం. దీనిపై స్థానిక సీఐ నరసింహరాజును వివరణ కోరగా కనకదుర్గ ఫైనాన్స్ కుంభకోణంలో కీలక నిందితుడిని కోర్టు ద్వారా విచారణకు తీసుకున్న విషయం నిజమేనని, దీనిపై పూర్తి విచారణ పూర్తి చేశాక వివరాలను తెలుపుతామని చెప్పారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం కుప్పంరూరల్: మండలంలోని ఇంజినీరింగ్ కళాశాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వెండుగంపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి మృతి చెందినట్లు కుప్పం పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం మేరకు.. కుప్పం మండలం వెండుగంపల్లి గ్రామానికి చెందిన ఎం.ముత్తు తన స్నేహితుడు శేఖర్‌తో కలిసి కూలీ పనుల కోసం మల్లానూరు గ్రామానికి బయలుదేరాడు. శేఖర్ ద్విచక్ర వాహనం నడుపుతుండగా, మార్గం మధ్యలోని ఇంజినీరింగ్ కళాశాల వద్దకు చేరుకోగానే స్పీడ్ బ్రేకర్ల వద్ద ద్విచక్ర వాహనం బ్రేక్ కొట్టడంతో వెనుక వైపు కూర్చున్న ఎం.ముత్తు (28) అదుపు తప్పి ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను ఢీ కొన్నాడు. ప్రమాదంలో శేఖర్ సురక్షితంగా బయటపడగా, ఎం.ముత్తు అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారమందుకున్న పోలీసులు టిప్పర్ డ్రైవర్ బాలక్రిష్ణను అదుపులోకి తీసుకుని, ముత్తు మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం కుప్పం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మృతుడు ఎం.ముత్తుకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. జారిపడి వ్యక్తి మృతి చిత్తూరు అర్బన్: తాగి ఇంట్లో జారి పడిన వ్యక్తి తలకు తీవ్రగాయాలై మృతి చెందిన ఘటన శుక్రవారం చిత్తూరు నగరంలోని చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. యాదమరి మండలం ముత్తురామాపురానికి చెందిన తులసికుమార్(40) అనే వ్యక్తి న్యూ బాలాజీ కాలనీలో నివాసిస్తున్నాడు. భార్య ఊరెళ్లడంతో తులసికుమార్ మద్యం సేవించి తూగుతూ ఇంటికి వెళ్లాడు. ఇంటికి వెళ్లిన వ్యక్తి టైల్స్‌పై జారి పడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన స్థలంలోనే మృతి చెందడంతో భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని టూటౌన్ ఎస్ఐ బలరామయ్య తెలిపారు. కాగా ఇతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
డైయింగ్ ప్లాంట్లు తరలించాల్సిందే!
● అజెండా తీర్మానం వాయిదా ● మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన నగరి: నగరి మున్సిపల్ సమావేశానికి హాజరైన కౌన్సిలర్లు మిషన్ డైయింగ్, మాన్యువల్ డైయింగ్ యూనిట్లు ఏదైనా సరే ఊరిలో ఉండకూడదు దూరంగా నివాసేతర ప్రాంతాలకు తరలించాల్సిందేనంటూ అజెండా తీర్మానం వాయిదా వేసి రోడ్డెక్కారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్, పొల్యూషన్ బోర్డు అధికారుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన చేపట్టారు. మున్సిపల్ కౌన్సిల్ హాలులో చైర్మన్ పీజీ నీలమేఘం అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి మున్సిపల్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అయితే అధికారులు పొందుపరచిన అజెండాను వినడానికి కూడా తాము సంసిద్ధంగా లేమని డైయింగ్ యూనిట్ల పొల్యూషన్ సమస్య పరిష్కారం అయిన తరువాతే అజెండాలోని అంశాలు వింటామని అధికారులకు స్పష్టం చేశారు. దీనిపై కమిషనర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ డైయింగ్ యూనిట్లపై చర్యలు తీసుకోవాల్సింది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మాత్రమేనని వారు ఆరు యూనిట్లు సక్రమంగా ఉన్నాయంటూ కార్యాలయానికి లేఖ అందిందన్నారు. దీనిపై వైస్ చైర్మన్లు వెంకటరత్నంరెడ్డి, బాలన్‌తో పాటు కౌన్సిలర్లు బీడీ భాస్కర్, దయానిధి, ఇంద్రయ్య, కోఆప్షన్ సభ్యులు ఎల్లప్పరెడ్డి మాట్లాడుతూ సక్రమంగా ఉందంటే అది ఏ ఆధారంగా తేల్చారన్నారు. గతంలో ఏ ప్లాంటు సక్రమంగా నిర్వహించడం లేదని మున్సిపల్ అధికారులు స్పష్టం చేస్తే, నేడు బాగుందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు తెలపడం విడ్డూరంగా ఉందన్నారు. అన్ని ప్లాంట్లు మూసే అధికారం మీకు లేకుంటే చేతులెత్తేయండి ఉన్నతాధికారుల వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేస్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిలర్ మోహన్‌రాజ్ మాట్లాడుతూ 16 డైయింగ్ యూనిట్లు ఉంటే అందులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారి ప్లాంట్లకు మాత్రమే సీల్ వేశారన్నారు. అన్ని డైయింగ్ యూనిట్లు మూసి వేస్తామని అధికారులు చెబుతున్నారని, అయితే టీడీపీకి చెందిన కొన్ని మిషన్ డైయింగ్, మాన్యువల్ డైయింగ్ యూనిట్లు నిర్వహణలో ఉన్నాయన్నారు. వైస్సార్సీపీ వారి ప్లాంటు నుంచి విషం వస్తే టీడీపీ ప్లాంటు నుంచి అమృతం వస్తుందా? అంటూ అధికారులను నిలదీశారు. ప్లాంటు ఏదైనా మూసివేయాల్సిందే ఊరికి దూరంగా వెళ్లాల్సిందే అన్నారు. దీంతో కౌన్సిలర్లు అందరూ ఏకీభవించారు. ఓ దశలో సమావేశాన్ని బాయ్‌కాట్ చేయడానికి కౌన్సిల్ సిద్ధమైంది. దీనిపై చైర్మన్ పీజీ నీలమేఘం మాట్లాడుతూ పాలకవర్గంగా ఉన్నవారే బాయ్‌కాట్ చేయడం సబబుకాదన్నారు. డీఈ మాట్లాడుతూ కౌన్సిలర్లు హాజరైనట్లు రికార్డు ఉంటేనే గౌరవ వేతనం కూడా వస్తుందన్నారు. దీనిపై కౌన్సిలర్లు మాట్లాడుతూ కౌన్సిలర్ల మాటలకు గౌరవమే లేనపుడు గౌరవ వేతనం ఎందుకని ప్రజల బాగు కోసం వేతనం వదులుకోవడానికి కూడా తాము సిద్ధమన్నారు. పారాటానికి తాను కూడా సిద్ధమేనని, అయితే పద్ధతి ప్రకారం పోరాడుదామని చైర్మన్ తెలపడంతో కౌన్సిలర్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ డైయింగ్ ప్లాంట్లను తరలించే వరకు సమావేశం జరిగినా ఏ అంశానికి కౌన్సిల్ ఆమోదం ఉండదని వాయిదా తీర్మానాలే వేయాలని ఇందుకు సమ్మతమా? అని ప్రశ్నించారు. దీనిపై అందరూ ఏకీభవించడంతో హాజరు పట్టికలో మాత్రమే సంతకాలు చేసి తీర్మానాలు వాయిదా వేసిన కౌన్సిల్ సమావేశం నుంచి బయటకు వచ్చి రోడ్డెక్కింది. మున్సిపల్ కార్యాలయం ఎదుట నిలబడి నిరసన వ్యక్తం చేసింది. డైయింగ్ ప్లాంట్లను దూరప్రాంతాలకు తరలించడమే మా ప్రధాన అజెండా అని, అది నెరవేరేంతవరకు ఏ అజెండాలకు ఆమోదం లేదంటూ స్పష్టం చేసింది. -
కర్ణాటకలో శవమై తేలిన కుప్పం మహిళ
కుప్పంరూరల్: భార్య ఆస్తిపై కన్నేసిన భర్త 2021లో బావమరిదిని, తాజాగా భార్య ను చంపి శవాన్ని అడవిలో పడేసి తన క్రూరత్వాన్ని చాటుకున్నాడు. రెండు వా రాల కిందట హత్యకు గురైన మహిళ మృతదేహాన్ని శుక్రవారం కర్ణాటక పోలీసులు వెలికి తీశారు. వివరాల్లోకి వెలితే..కుప్పం మండలం, చీగలపల్లి గ్రామానికి చెందిన వికలాంగుడు వెంకటేష్, చిన్నపాప దంపతులకు రాజేశ్వరి, వెంకటాచలం పిల్లలు ఉన్నారు. కుమార్తె రాజేశ్వరిని పదేళ్ల కిందట కర్ణాటక రాష్ట్రం బంగారుపేట తాలూకా పాతరామగోలు గ్రామానికి చెందిన రాఘవేంద్రకు ఇచ్చి వివాహం చేశాడు. మొదట్లో వారి కాపురం సజావుగా సాగింది. వారికి ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. 2021 ఉగాది పండుగ సందర్భంగా వెంకటేష్ తన కుమార్తె రాజేశ్వరిని కుటుంబ సమేతంగా చీగలపల్లెకు రావాలని ఆహ్వానించాడు. తండ్రి కోరిక మేరకు రాజేశ్వరి తన భర్త రాఘవేంద్ర, ఇద్దరు పిల్లలతో కలిసి పుట్టింటికి వచ్చింది. అప్పటికే కొంత ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న రాఘవేంద్ర పండుగ పూట మామ వెంకటేష్‌ను కొంత డబ్బు ఇవ్వమని అడిగాడు. తమ వద్ద లేదని వెంకటేష్ తిరస్కరించాడు. ఆస్తి అమ్మి అమ్మి అయినా ఇవ్వాలని గొడవకు దిగాడు. తనకు 3 ఎకరాల ఆస్తి మాత్రమే ఉందని, దాన్ని తన కొడుకు వెంకటాచలానికి ఇవ్వాలని, అమ్మడం కుదరదని తెగేసి చెప్పాడు. దీంతో రాఘవేంద్ర వెంకటాచలంపై కసి పెంచుకుని, జనసంచారం లేని ప్రదేశానికి తీసుకెళ్లి హత్య చేశాడు. మృతదేహాన్ని గ్రామానికి సమీపంలోని రోడ్డుపై పడేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరణకు ప్రయత్నించాడు. బిడ్డ మృతిపై వెంకటేష్ కుప్పం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు అనుమానితుడైన రాఘవేంద్రను అరెస్టు చేసి, విచారణ జరపగా హత్య చేసినట్లు అంగీకరించాడు. దీంతో హతుడు రాఘవేంద్ర జైలుకు వెళ్లాడు. అప్పటి నుంచి రాజేశ్వరి తన ఇద్దరి పిల్లలతో స్వగ్రామం చీగలపల్లిలోనే ఉండిపోయింది. నిత్యం బెంగళూరుకు రాకపోకలు సాగిస్తూ తల్లిదండ్రులు, పిల్లలను పోషిస్తోంది. తాజా భార్య రాజేశ్వరి.. ఏడాది తరువాత జైలు నుంచి బయటికి వచ్చిన రాఘవేంద్ర ఎలాగైనా భార్యను హతమార్చి ఆస్తి కాజేయాలని కసిపెంచుకున్నాడు. ఈ క్రమంలో మూడు నెలలుగా భార్య రాజేశ్వరితో తాను మారిపోయానని నమ్మబలికి కుటుంబ సభ్యులకు తెలియకుండా ఫోన్లలో మాట్లాడుతున్నాడు. దీంతో రాజేశ్వరి భర్తను నమ్మింది. ఈ క్రమంలో ఏప్రిల్ 11న రాజేశ్వరి ఉదయం లేచి కూలీ పనులకు బెంగళూరుకు బయలుదేరింది. భర్త బంగారుపేటలో దిగమని ఆదేశించడంతో రాజేశ్వరి బంగారుపేటలో దిగింది. భర్తతో కలిసి పాతరామగోలు అటవీ ప్రాంతానికి వెళ్లారు. వారం రోజులు గడిచిన బెంగళూరు వెళ్లిన రాజేశ్వరి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు వెంకటేష్, చిన్నపాప దంపతులు కుప్పం పోలీసులను ఆశ్రయిస్తారు. పోలీసులు కేసు నమోదు చేసి రాజేశ్వరి కాల్‌డేటాను పరిశీలించగా, అందులో భర్త రాఘవేంద్రతో మాట్లాడినట్లు నిర్ధారించుకున్నారు. బూదికోట పోలీసుల సహకారంతో భర్త రాఘవేంద్రను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా, రాజేశ్వరిని తాను హత్య చేసినట్లు అంగీకరించాడు. శుక్రవారం కర్ణాటక పోలీసులు అడవిలో కుళ్లిపోయిన రాజేశ్వరి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం బంగారుపేటకు తరలించి బంధువులు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న ఇద్దరు పిల్లలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రాజేశ్వరి హత్య, పిల్లల రోదన చూసి చీగలపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
పోలీసు కుటుంబానికి ఆర్థిక సాయం
చిత్తూరు అర్బన్: జిల్లా పోలీసుశాఖలో నాలుగో తరగతి ఉద్యోగిగా పనిచేస్తూ ఈనెల 19న మరణించిన శంకరమ్మ కుటుంబానికి రూ.1.50 లక్షల ఆర్థిక సాయాన్ని ఏఎస్పీ రాజశేఖర్‌రాజు శుక్రవారం అందజేశారు. చిత్తూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో మృతురాలి కుమారుడు చంద్రబాబుకు ఐడీఆర్‌ఎఫ్ నిధుల నుంచి రూ.లక్ష, విడో ఫండ్ నుంచి రూ.50 వేలు, మొత్తం రూ.1.50 లక్షలు చెక్కు రూపంలో అందజేశారు.అర్హులకు అందుతున్న వ్యవసాయ పరికరాలుపలమనేరు: పలమనేరు వ్యవసాయశాఖ డివిజన్‌కు సంబంధించి సబ్సిడీ వ్యవసాయపరికరాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి సంబంధిత వ్యవసాయశాఖ అధికారులు వారు కొరుకున్న పరికరాలను పంపిణీ చేస్తున్నారు. ఆ మేరకు పలు మండలాల్లో శుక్రవారం రైతులకు వీటిని రైతు సేవా కేంద్రాల సిబ్బంది ద్వారా పంపిణీ చేశారు. గత నెల 9వ తేదీన సాక్షి దినపత్రికలో ‘తమ్ముళ్లకే యంత్రసాయం’ శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ అదే రోజు సమావేశం నిర్వహించారు. అర్హులైన వారికి వ్యవసాయ పరికరాలు విధిగా అందించాలని ఏఓలకు సూచించారు. ఇందులో ఎలాంటి రాజకీయాలకు తావులేదని స్పష్టం చేశారు. దీంతో పరికరాల పంపిణీ సజావుగానే సాగుతోంది. ఆ మేరకు పలమనేరు మండలంలోని కల్లాడు సచివాలయంలో సైతం పార్టీలకతీతంగా రైతులకు అవరసమైన పనిముట్లను సిబ్బంది పంపిణీ చేశారు.బావిలో శవమై తేలిన మహిళపూతలపట్టు (కాణిపాకం): పూతలపట్టు మండలంలో అదృశ్యమైన ఓ మహిళా బావిలో శవమై తేలింది. పోలీసుల కథనం మేరకు.. పూతలపట్టు మండలం గాండ్లపల్లికి చెందిన లక్ష్మి(70) అనే మహిళ నాలుగు రోజుల కిందట అదృశ్యమైంది. అప్పటి నుంచి కుటుంబసభ్యులు ఆమె ఆచూకీ కోసం గాలించారు. శుక్రవారం సాయంత్రం గ్రామానికి సమీపంలో ఉండే బావి నుంచి దుర్వాసన వచ్చింది. దీంతో స్థానికులు పూతలపట్టు సీఐకి సమాచారం అందజేశారు. పోలీసులు బావి వద్దకు చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా కాలు జారి పడిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
వైభవంగా ఉరుసు ప్రారంభం
పుంగనూరు: పట్టణంలోని చెరువు కట్టపై ఉన్న హజరత్ సయ్యద్‌నూర్‌షావలిబాబా ఉరుసు ఉత్సవం శుక్రవారం గంధంతో వైభవంగా ప్రారంభమైంది. రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముస్లిం వేషధారణలో చాదర్‌ను నెత్తిన పెట్టుకుని ర్యాలీగా వచ్చి దర్గాలో బహూకరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కాగా 27వ తేదీన ఖవ్వాలి, 28న తహలీల్ ఫాతేహా నిర్వహిస్తారు. ఈ మేరకు దర్గాను విద్యుత్ దీపాలతో అలంకరించారు. దర్గాలో ప్రత్యేక పూలు చాదర్లు పెట్టి హజరత్‌లు పూజలు చేశారు. స్థానిక ఎన్ఎస్.పేటలోని కళాశాల మైదానంలో ఉరుసు సందర్భంగా దుకాణాలు, రంగుల రాట్నాలు ఏర్పాటు చేశారు. ఉరుసు కార్యక్రమానికి వేలాది మంది ముస్లిం, హిందువులు రానుండటంతో దర్గా కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉరుసు కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో అన్నదానం ప్రారంభించారు. మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా, కమిషనర్ మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు పారిశుద్ధ్య కార్యక్రమాలు, మంచినీరు, వైద్యసేవలతో పాటు విద్యుత్ అంతరాయం కలగకుండ ఏర్పాట్లు చేపట్టారు. అలాగే పలమనేరు డిఎస్పీ ప్రభాకర్ ఆధ్వర్యంలో సీఐ సుబ్బరాయుడు, ఎస్ఐలు లోకేష్, కేవీ రమణ, సిబ్బంది కలసి ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు. చాదర్ బహూకరించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి ప్రార్థనలో పాల్గొన్న వేలాది మంది ముస్లింలు -
మూగవేదన..తీరని రోదన
● నేడు వరల్డ్ వెటర్నరీ డే.. జిల్లా సమాచారం.. జిల్లా పశువుల ఆస్పత్రి – 1 ఏరియా పశు వైద్యశాలలు – 14 వెటర్నరీ డిస్సెన్సరీ వైద్యశాలలు – 68 రూరల్ లైఫ్స్టాక్ యూనిట్లు – 75 రైతు భరోసా కేంద్రాలు – 297 పాడి ఆవులు – 4,67,507, గేదెలు – 1,036 మేకలు – 13,80,063 గొర్రెలు – 4,38,362 పందులు – 359 కుక్కలు, కోళ్లు – 5,08,808 చాప్కటర్ పంపిణీ వివరాలు.. 2021–22 670 2022–23 365 2023–24 1800 మొత్తం 2,835 చిన్న జబ్బు చేసినా మనం ఆస్పత్రికి ఉరుకులు..పరుగులు తీస్తాం. మూగ జీవాల పరిస్థితి వేరు. ప్రభుత్వ పశువైద్యశాలలు తప్ప గ్రామాల్లో వీటికి ప్రత్యేక ఆస్పత్రులు లేవు. ఉన్న వైద్యశాలల్లో సిబ్బంది లేరు.. మందులు లేక వెలవెలబోతున్నాయి. దీనికితోడు గత సర్కారు హయాంలో అమలవుతున్న పథకాలు ఆగిపోయాయి. వెరసి మూగవేదన తీరని రోదనగా మారింది. పశువైద్యం గాలిలో దీపం అన్న చందమైంది. కాణిపాకం: కూటమి పాలనలో పశువైద్యం పడకేసింది. అత్యవసర సేవలు అటకెక్కాయి. గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో పాడి పరిశ్రమ పరుగులు పెట్టింది. అప్పటి ప్రభుత్వం పాడి వృద్ధి, మెరుగైన పశు వైద్యానికి కృషి చేసింది. పలు పథకాలు అమలు చేస్తూ పాడి రైతులను ప్రోత్సాహించింది. క్షేత్రస్థాయిలో పశువులు, జీవాలకు తక్షణ వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పాడి పథకాలు నీరుగారాయి. వైద్య సేవలు కుంటుపడ్డాయి. క్షేత్రస్థాయిలో పనిచేసే పశు సంవర్థక సహాయకులు సర్వేలకు పరిమితమయ్యారు. దీంతో పల్లెల్లో పశు వైద్యం అందని ద్రాక్షలా మారింది. నేడు వరల్డ్ వెటర్నరీ డే సందర్భంగా ప్రత్యేక కథనం. వరల్డ్ వెటర్నరీ డే చరిత్ర... ఏటా ఏప్రిల్ చివరి శనివారం రోజు వరల్డ్ వెటర్నరీ డే జరుపుకుంటున్నారు. జంతువుల ఆరోగ్యం, సంరక్షణ, జంతు హింసను నిరోధించడానికి తీసుకోవాల్సిన ప్రయత్నాలపై అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. అయితే ఇందుకు తగ్గట్టు జిల్లాలో పశు వైద్య సేవలు అమలు కాలేదు. వేధిస్తున్న సమస్యలివీ.. పశు వైద్యశాలలు, ఆరోగ్య కేంద్రాల్లో పశు వైద్యం మరుగున పడింది. మందుల, మాత్రల కొరత వేధిస్తోంది. డాక్టర్లు విధుల్లో ఉండడం లేదు. చాలా చోట్ల మధ్యాహ్ననానికే డుమ్మా కొడుతున్నారు. జిల్లా పశు వైద్యశాలలో టైపిస్ట్ 1, రేడియోగ్రాఫర్ 1, అటెండర్లు –2, వెటర్నరీ అసిస్టెంట్ –1తోపాటు పలు పోస్టులు ఖాళీలున్నాయి. వీటిని భర్తీ చేయడంలో ప్రభుత్వం మీనామేషాలు లెక్కిస్తోంది. అలాగే మండలాల్లోని పశు వైద్య ఆరోగ్య కేంద్రాల్లో కూడా పలు పోస్టులు ఖాళీలున్నాయి. ఇక ఉన్న సిబ్బంది కూడా సర్వేలకు పరిమితమయ్యారు. క్షేత్రస్థాయిలో మూగజీవులు అనారోగ్య బారిన పడితే ప్రైవేటు వైద్యులే దిక్కుగా మారుతున్నారు. ఈ కారణంగా పశు వైద్యం మూగబోయి మూగజీవులు మృత్యువాత పడుతున్నాయి. పశువైద్యానికి ఇబ్బందిగా ఉంది ముందు పశువైద్యానికి ఎలాంటి ఢోకా ఉండేది కాదు. ఫోన్ చేస్తే ఎక్కడున్న వైద్య సిబ్బంది వచ్చి వైద్యం చేస్తున్నారు. టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేస్తే బండి ఇంటికాడికి వచ్చేది. ఇప్పుడు పశువులకు వైద్యం చేయించడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు సిబ్బందికి ఫోన్ చేస్తే సర్వేలంటున్నారు. వాళ్లకు కూడా సర్వేలు ఇస్తే మూగ జీవాలు ఏమైపోవాలి. వారి సేవలు గ్రామాల్లో అవసరం. మనిషికి ఏ రకంగా తక్షణ వైద్యం అవసరమో..ఆ రకంగా జీవాలకు తక్షణ వైద్యం అవసరం. అధికారులు దీనినిగుర్తించాలి. – రాజేంద్ర, శ్రీరంగరాజుపురం ప్రస్తుత ప్రభుత్వ పాలనలో.. పశు సంచార పశు ఆరోగ్య సేవలు ఆపివేసింది. అవగాహన కార్యక్రమాలు, వైద్య శిబిరాలు జరగడం లేదు. రాయితీ పాడి పరికరాల అందజేతకు స్వస్తి పలికింది. బల్క్ మిల్క్ సెంటర్లను మూయించింది. మందులు, మాత్రల కొరత వేధిస్తోంది. ఉచిత బీమాకు, పశు నష్ట పరిహారానికి మంగళం పాడింది. గత ఐదేళ్ల పాలనలో.. గత ఐదేళ్ల పాలనలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం పశు వైద్య సేవలకు ప్రాధాన్యత ఇచ్చింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా పలు పథకాలను అమలు చేసింది. మెరుగైన వైద్యం అందిస్తూ వచ్చింది. పశుసంవర్థక సహాయకుల నియామకం. వైఎస్సార్ పశునష్ట పరిహారం..ఉచిత బీమా పశు హెల్త్ కార్డులు వైఎస్సార్ చేయూత ద్వారా పశువుల కొనుగోలు 1962 నంబర్‌కు ఫోన్ చేస్తే వైఎస్సార్ సంచార పశు ఆరోగ్యసేవలు రాయితీ ద్వారా పశువులకు అవసరమైన మొక్క జొన్నలు, చాప్కటర్, మినరల్ మిక్చర్, పశువుల దాణా సరఫరా. సీజనల్ వ్యాధుల కట్టడికి ముందస్తు చర్యలు. పశువులు, జీవాలకు టీకాలు, పురుగుల మందులు పంపిణీ. వారానికొకసారి రైతులతో పశు సంవర్థక అవగాహన కార్యక్రమాలు, వైద్య శిబిరాలు. గ్రామంలో బల్క్‌మిల్క్ సెంటర్లు ఏర్పాటు చిత్తూరు నగరంలో మూతపడిన విజయ డెయిరీకి పునర్జీవనం పోసింది. అమూల్ డెయిరీకి అప్పగించి, అభివృద్ధిలోకి తీసుకొచ్చింది. ఈ ఫలితంగా జిల్లాలో పాడి పరిశ్రమ పుంజకుంది. చాలా మంది ఇతరాత్ర పనులను వదిలి పాడి ఆవులతో పాల ఉత్పత్తిని పెంచుకుంటూ జీవనం చేసేందుకు అడుగులు వేశారు. -
అంతా తికమక
మెగా మెలిక..● టెట్ ఉత్తీర్ణత సాఽధించినా డీఎస్సీ అర్హత కఠినతరం ● పది, ఇంటర్లో 50 శాతం అర్హత అవసరమా! ● ఇంటర్ తప్పి తిరిగి 35 శాతంతో పాసైన వారు ఐఏఎస్‌లు కాలేదా? ● సివిల్స్‌కు లేని నిబంధనలు డీఎస్సీకి ఎందుకు? ● ఇది కుట్రలో భాగమే అంటున్న నిరుద్యోగులు ● మండిపడుతున్న విద్యార్థి సంఘాలు, డీఎస్సీ అభ్యర్థులు ఉమ్మడి చిత్తూరు జిల్లా సమాచారం ప్రాథమిక పాఠశాలలు – 3,766 ప్రాథమికోన్నత పాఠశాలలు – 445 ఉన్నత పాఠశాలలు – 705ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు– సుమారు 6,245ప్రస్తుతం భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చిన పోస్టులు – 1,478 పోటీపడనున్న అభ్యర్థులు – 72 వేల మంది అర్హత మెలికతో డీఎస్సీకి దూరం కానున్న అభ్యర్థులు– సుమారు 14వేల మంది తిరుపతి సిటీ: ప్రభుత్వం విడుదల చేసిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వివాదాలకు తావిస్తోంది. డీఎస్సీకి దరఖాస్తు చేయాలంటేనే అభ్యర్థులు వణికిపోతున్నారు. ఆన్లైన్ అగచాట్లు తలబొప్పి కట్టిస్తుండగా.. అర్హత నిబంధనలు తికమకపట్టిస్తున్నాయి. పది, ఇంటర్లో 40 నుంచి 50శాతం మార్కులు సాధించి ఉండాలని, అలాగే డిగ్రీలో 50శాతం, పీజీలో 55 శాతం తప్పనిసరి చేయడంతో అభ్యర్థులు అయోమయంలో పడ్డారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 శాతం వెసులుబాటు కల్పించారు. గతంలో జరిగిన డీఎస్సీలో ఇలాంటి కఠన నిబంధనలు లేవని, కొత్తగా పది, ఇంటర్, డిగ్రీ మార్కుల అర్హతలను ప్రామాణికం చేయడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడంలేదని డీఎస్సీ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది కుట్రలో భాగమేనా? సివిల్స్ సర్వీసుకు సైతం ఎలాంటి నిబంధనలు లేవు. పది, ఇంటర్లో సప్లమెంటరీ పరీక్షలు రాసి 35 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన ఎంతో మంది సివిల్స్ సాధించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులయ్యారు. అలాంటిది టెట్ పరీక్ష ఉత్తీర్ణత సాధించినా పది, ఇంటర్, డిగ్రీల పర్సెంటేజ్‌పై నిబంధనలు పెట్టడం విమర్శలకు తావిస్తోంది. డీఎస్సీని సజావుగా జరపకూడదనే కుట్రతోనే ప్రభుత్వం మెలికలతో కూడిన డీఎస్సీని విడుదల చేసిందని నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. -
డైయింగ్ ప్లాంట్లు తరలించాల్సిందే
డైయింగ్ యూనిట్లు నివాసాలకు దూరంగా తరలించాల్సిందేనని నగరి మున్సిపల్ కౌన్సిలర్లు రోడ్డెక్కారు.శనివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025కుప్పం మున్సిపల్ చైర్మన్.. ఈ పదవికి కావాల్సిన బలం కూటమి పార్టీలకు లేదు..అయితేనేం.. అధికార బలం ఉంది.. ఆ బలుపు కనబరిచి.. ప్రలోభాల ఎర చూపి.. ఎత్తులు, జిత్తులు వేసి.. ఎలాగైనా చైర్మన్ గిరిని దక్కించుకోవాలని యత్నిస్తున్నారు. ఇందుకు బెంగళూరు కేంద్రంగా క్యాంపు రాజకీయాలకు తెర లేపారు. ప్రతిపక్ష పార్టీ కౌన్సిలర్ల ఇళ్లకు వెళ్లి నగదు ఆశ చూపి.. దానికి లొంగకుంటే బెదిరింపులకు పాల్పడుతున్నారు కూటమి నేతలు. కుప్పంరూరల్: స్థానిక మున్సిపల్ చైర్మన్ పదవికి కావాల్సిన బలం లేకపోయినా అధికార బలం కనబరిచి ఆ పదవి దక్కించుకోవాలని కూటమి యత్నిస్తోంది. కూటమి ప్రభుత్వం రాగానే అప్పటి వరకు ఉన్న కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ అనివార్య కారణాలతో రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో కుప్పం మున్సిపల్ చైర్మన్ పదవి 2024 నవంబరు 5వ తేదీ నుంచి ఖాళీగా ఉంది. చైర్మన్ ఎన్నిక కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం మిగిలిన తుని, పాలకొండలతో పాటు కుప్పం మున్సిపాలిటికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 28వ తేదీన ఎన్నికకు ముహూర్తం ఖరారు చేసింది. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీల్లో ఒక్కసారిగా ఎన్నికల వేడి రగిలింది. బలం లేకపోయినా ఎలాగైన అధికారాన్ని అడ్డం పెట్టుకుని చైర్మన్ గిరి దక్కించుకోవాలని టీడీపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఎన్నికలు ఇలా... సంఖ్యాపరంగా చూసుకుంటే వైఎస్సార్సీపీకి 15, టీడీపీకి 12 ఓట్లు ఉన్నాయి. మొత్తం 27 మంది సభ్యుల్లో 14 మంది ఎన్నికకు హాజరైతే కోరంగా పరిణగించి, ఎన్నికలు నిర్వహిస్తారు. హాజరైన అభ్యర్థుల్లో ఎక్కువ మంది ఎవరికి చేతులెత్తి మద్దతు తెలుపుతారో వారు చైర్మన్ అభ్యర్థిగా పరిగణిస్తారు. బెంగళూరు కేంద్రంగా క్యాంపు రాజకీయాలు కుప్పం మున్సిపాలిటీ ఎన్నికలు 28న జరగనున్న నేపథ్యంలో నాలుగు రోజులు ముందుగా వైఎస్సార్ సీపీ, టీడీపీ అధిష్టానాలు కౌన్సిలర్లను బెంగళూరు తరలించి క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. ఎవరికి వారు తమ అభ్యర్థులు జారీ పోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కౌన్సిలర్ల ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి క్యాంపునకు తరలించారు. అక్కడ అన్ని రకాల సదుయాలు కల్పించి కౌన్సిలర్లు జారిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందరి దృష్టి సోమవారంపైనే... కుప్పం మున్సిపాలిటీలోని ప్రజల దృష్టి సోమవారంపైనే నిలిచింది. ఎవరు మున్సిపాలిటీ చైర్మన్ అవుతారో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎన్నిక జరుగుతుందా..? జరిగితే ఎవరు గెలుస్తారు..? అధికార పార్టీ తమ అధిపత్యాన్ని నిలుపుకునేందుకు ఎలాంటి కుతంత్రాలు పన్నుతోంది..? అనే విషయాలపై ప్రజల దృష్టి నిలిచింది. ఏది ఏమైనప్పటికీ సుమారు 56 వేల జనాభా ఉన్న కుప్పం ప్రజల చూపు సోమవారంపైనే నిలిచింది. కుప్పం మున్సిపాలిటీలో ప్రస్తుత బలాబలాలు.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పులివెందుల నియోజక వర్గంతోపాటు ప్రతిపక్ష నాయకుడి నియోజక వర్గమైన కుప్పంపై వివక్ష చూపకుండా ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేశారు. ఇందులో భాగంగానే కుప్పానికి రెవెన్యూ, పోలీసు డివిజన్లు వచ్చాయి. కుప్పం పట్టణాన్ని ఆరు పంచాయతీలతో కలిపి మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేశారు. ఈ క్రమంలో కుప్పం మున్సిపాలిటీకి 2021 నంబర్ 15వ తేదీన ఎన్నికలు నిర్వహించారు. పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన వైఎస్సార్ సీపీకి ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. మున్సిపాలిటీలో 25 వార్డులకుగాను వైఎస్సార్ సీపీ అభ్యర్థులు 19 మంది, టీడీపీ అభ్యర్థులు 6 గెలుపొందారు. వైఎస్సార్ సీపీ సభ్యులు అధిష్టానం అభీష్టం మేరకు డాక్టర్ సుధీర్‌ను చైర్మన్‌గా ఎన్నుకున్నారు. ఆయన నాయకత్వంలో మున్సిపాలిటీలో అభివృద్ధి పరుగులు తీసింది. గత ఏడాది జూన్ 4వ తేదీన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మున్సిపాలిటీలో కుదుపు మొదలైంది. కూటమి నాయకులు, ప్రభుత్వం నుంచి వైఎస్సార్ సీపీ సభ్యులపై రకరకాల ఒత్తిళ్లు మొదలయ్యాయి. మొదటి వికెట్‌గా 2024 నంబర్ 5వ తేదీన చైర్మన్ డాక్టర్ సుధీర్ చైర్మన్ పదవితోపాటు, 16వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిత్వానికి రాజీనామా చేసి, టీడీపీలోకి వెళ్లిపోయారు. దీంతో 16 వవార్డు కౌన్సిలర్ ఖాళీ కాగా, మొత్తం కౌన్సిలర్ల సంఖ్య 24కు చేరింది. ఆయన బాటలోనే మరో ఐదుగురు కౌన్సిలర్లు టీడీపీలోకి వెళ్లిపోయారు. వెళ్లిన వారిలో 24వ వార్డు కౌన్సిలర్ సయ్యద్ ఆలీ తిరిగి వైఎస్సార్సీపీలోకి వచ్చారు. ఈ పరిణామంతో మున్సిపాలిటీలో వైఎస్సార్ సీపీకి 14, టీడీపీకి 10 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వీరే కాకుండా ఎక్స్ అఫిషియో సభ్యులు స్థానిక ఎమ్మెల్యే చంద్రబాబు, పట్టభద్రుల ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ భరత్ మున్సిపాలిటీ ఓటర్లుగా ఉన్నారు. వీరిని కలుపుకుంటే వైఎస్సార్ సీపీ కి 15, టీడీపీ 12గా సమీకరణలు మారాయి. ఆశావహుల్లో గుబులు... వైఎస్సార్ సీపీ చైర్మన్ అభ్యర్థి ఎవరనే విషయం కౌన్సిలర్లకు అధిష్టానం ఇప్పటికే స్పష్టం చేసిన దృష్ట్యా అందరు ఏకతాటిపై ఉన్నారు. అధికార పార్టీ టీడీపీలో మాత్రం అలజడి నెలకొంది. ముఖ్యంగా 19వ వార్డు కౌన్సిలర్ జిమ్ దాము, 20వ వార్డు కౌన్సిలర్ సోమశేఖర్, 5వ వార్డు కౌన్సిలర్ సెల్వం చైర్మన్ రేసులో ఉన్నారు. వీరు ముగ్గురు తమకంటే తమకే అధిష్టానం ఆశీర్వాదం ఉన్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. తమ పార్టీ వారే కాకుండా ఎదుట పార్టీ వారిని ఫోన్ల ద్వారా పలకరిస్తూ తమకే మద్దతుగా నిలవాలని ఆశావాహుల్లో ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. – 10లో– 10లోన్యూస్రీల్28న కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక బలం లేకపోయినా నెగ్గేందుకు సిద్ధమవుతున్న టీడీపీ ఎలాగైనా చైర్మన్ పదవి దక్కించుకోవాలని ప్రలోభాలు మొదలైన ఇరుపార్టీల క్యాంపు రాజకీయాలు, రహస్య సమావేశాలు కుప్పంలో హాట్‌టాపిక్‌గా మారిన చైర్మన్ ఎన్నిక కుప్పం మున్సిపాలిటీ సమాచారం మొత్తం వార్డులు – 25 ఎన్నికల్లో పాల్గొంటున్న వార్డు సభ్యులు – 24 ఎక్స్ అఫిసియో సభ్యులు – 3 మొత్తం జనాభా – 48,532 (2011 లెక్కల ప్రకారం) మొత్తం ఓటర్లు – 39,319 పురుష ఓటర్లు – 18,838 మహిళా ఓటర్లు – 20,473 ట్రాన్స్జెండర్లు – 8 కుప్పంలో 144 సెక్షన్ అమలు కుప్పం: మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా కుప్పం మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ఆర్డీఓ శ్రీనివాసులరాజు తెలిపారు. ఈ నెల 28వ తేదీన మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక జరగనుండడంతో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యాలయం వంద మీటర్ల దూరంలో పూర్తి స్థాయిలో 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్త కుటుంబంపై దాడి
బంగారుపాళెం: మండలంలోని ఎద్దులవారిపల్లె దళితవాడలో గురువారం వైఎస్సార్సీపీ కార్యకర్త కుటుంబంపై టీడీపీ సానుభూతిపరులు దాడి చేశారు. గ్రామంలో పంచాయతీ తాగునీరు ఒకరోజు ఓ వైపు, మరో రోజు ఓ వైపు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం తాగునీటి కొళాయికి సంబంధించిన గేట్‌వాల్‌ను టీడీపీ కార్యకర్త గోవిందస్వామి కుమారుడు రంజిత్‌కుమార్, మరో పక్కకు తిప్పాడు. దాంతో వైఎస్సార్సీపీ కార్యకర్త శ్రావణ్‌కుమార్ గేట్వాల్ ఎందుకు తిప్పావని రంజిత్‌కుమార్‌ను ప్రశ్నించాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుని దుర్భాషలాడుకున్నారు. నీటి కొళ్లాయి విషయంపై గురువారం ఉదయం మళ్లీ గోవిందస్వామి కుటుంబ సభ్యులు, శ్రావణ్‌కుమార్ కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరిగింది. దీంతో గోవిందస్వామి, అతని భార్య నాగరాజమ్మ, అతని కుమారుడు రంజిత్‌కుమార్, బంధువు శివయ్య, చిలకమ్మ కలసి శ్రావణ్‌కుమార్, అతని భార్య స్వాతి, బంధువు సరితపై రాళ్లతో దాడి చేశారు. దీంతో శ్రావణ్‌కుమార్, స్వాతి, సరిత గాయపడ్డారు. ఇరువర్గాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
హెల్మెట్ విధిగా పెట్టుకోండి
ద్విచక్రవాహనచోదకులు ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ పెట్టుకోవాలని ఎస్పీ మణికంఠ చందోలు సూచించారు.తిరుపతి, చిత్తూరు జిల్లాల పది ఫలితాల సమాచారం పరీక్షలకు హాజరైన బాలురు 24,786 ఉత్తీర్ణులైన బాలురు 17,377 పరీక్షలకు హాజరైన బాలికలు 22,689 ఉత్తీర్ణులైన బాలికలు 17,867 ఫెయిల్ అయిన బాలురు 7,409 ఫెయిల్ అయిన బాలికలు 4,822 మొత్తం ఫెయిల్ అయిన విద్యార్థులు 12,231 – 8లో -
డీఎస్సీ ఉచిత ఆన్లైన్ శిక్షణ ప్రారంభం
చిత్తూరు కలెక్టరేట్ : రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ ఉచిత ఆన్లైన్ శిక్షణ ప్రారంభించిందని జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఇన్చార్జ్ డీడీ మునీంద్రయ్య తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆన్లైన్ డీఎస్సీ శిక్షణ ప్రారంభ కార్యక్రమాన్విన గురువారం జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులకు ఉపాధ్యాయ ఉద్యోగాలకు సహాయం చేసేందుకు ఆన్లైన్ డీఎస్సీ శిక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నైపుణ్యం కలిగిన అధ్యాపకులతో ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తారని వెల్లడించారు. -
తహసీల్దార్ హుస్సేన్ సస్పెన్షన్
చిత్తూరు కలెక్టరేట్ : ఇటీవల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన స దుం ఇన్చార్జ్ తహసిల్దార్ హుస్సేన్ సస్పెండ్ అయ్యా రు. ఈ మేరకు గురువారం కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ సస్పెండ్ ఉత్త ర్వులు జారీ చేశారు. ఆయనతో పాటు సదుం వీఆర్వో మహబూబ్ బాషాను సైతం సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. ఆ మండలానికి నూతన తహసీల్దార్ నియమించే వరకు ప్రస్తుతం పని చేస్తున్న డిప్యూటీ తహసీల్దార్ కు మార్కు అదనపు బాధ్యతలను అప్పగిస్తున్న ట్లు పేర్కొన్నారు. హెల్మెట్ విధిగా పెట్టుకోండి చిత్తూరు అర్బన్: ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని చిత్తూరు ఎస్పీ మణికంఠ సూచించారు. రోడ్డు భద్రతా అవగాహనలో భాగంగా గురువా రం చిత్తూరులోని గాంధీ విగ్రహం వద్ద హెల్మెట్ ర్యాలీ, రోడ్డు భద్రతపై రూపొందించిన పాటను ఎస్పీ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఇ టీవల స్కూటరిస్టులు రోడ్డు ప్రమాదాల్లో ఎక్కు వ మంది మరణిస్తున్నారని, హెల్మెట్ వాడకపోవడమే ఇందుకు కారణమన్నారు. గత ఐదేళ్లలో 350 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతే, 170 మంది వరకు ద్విచక్ర వాహన చోదకులే ఉండటం ఆలోచించాల్సిన విషయమన్నారు. రోడ్డు భ ద్రతా నియమాలు పాటిస్తే ఎలాంటి నష్టం ఉండదని స్పష్టం చేశారు. ఇక పాటను రూపొందించడంలో శ్రద్ధ చూపించిన ట్రాఫిక్ సీఐ నిత్యబా బును ఎస్పీ అభినందించారు. ఏఎస్పీ శివానంద కిషోర్, డీఎస్పీలు చిన్నికృష్ణ, మహబూబ్ భాష, ఈస్ట్ సీఐ శ్రీనివాసరావు, ఆర్ఐలు భాస్కర్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. వ్యక్తి ఆత్మహత్యాయత్నం కార్వేటినగరం: గొంతుకోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన గురువారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. కార్వేటినగరం త్యాగరాజ పిళ్లై వీధికి చెందిన చిన్నిరెడ్డి కుమారుడు గోపాల్(52) కొన్నాళ్లుగా గొంతు క్యాన్సర్ వ్యాఽధితో బాధపడుతున్నాడు. గురువారం ఆ బాధ ఎక్కువ కావడంతో తాళలేక అతనే బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గుర్తించిన స్థానికులు అతనిని ప్రైవేటు వాహనంలో స్థానిక సీహెచ్‌సీకి తరలించారు. అక్కడ వైద్యులు ప్రథ మ చికిత్స చేసి, తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. అతన్ని రుయాకు తరలించారు. ప్రస్తు తం అతను రుయాలో చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
ఇంటర్ కళాశాల అభివృద్ధికి కృషి చేస్తా
– బాధ్యతలు స్వీకరించిన నూతన డీఐఈఓ శ్రీనివాసులు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాల అభివృద్ధికి కృషి చేస్తానని నూతన డీఐఈఓ (జిల్లా ఇంటర్మీడియట్ అధికారి) శ్రీనివాసులు అన్నా రు. గురువారం ఆయన పీసీఆర్ జూనియర్ కళాశాల లోని ఇంటర్మీడియట్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన విలేకరులతో మా ట్లాడారు. రానున్న విద్యాసంవత్సరంలో ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్ల పెంపునకు చర్యలు చేపడతామన్నా రు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న వి ద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేలా కృషి చేస్తామని తెలిపారు. మెరుగైన ఫలితాల సాధనకు ప టిష్ట ప్రణాళికను అమలు చేస్తామన్నారు. అనంతరం ఆయనకు మాజీ డీఐఈఓ సయ్యద్ మౌలా, ప్రిన్సిపల్ శరత్చంద్ర, అబ్దుల్ మజీద్, ప్రైవేట్ కళాశాలల నిర్వాహకులు కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. -
దళితులపై ఎందుకీ వివక్ష
శ్రీరంగరాజపురం : దళితులైన తమపై టీడీపీ నాయకులు, ఫీల్డ్ అసిస్టెంట్ వివక్ష చూపుతున్నారని మంగుంట దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, టీడీపీ నేతల దళితులపై వివక్ష చూపుతున్న నేపథ్యంలో గురువారం వారు విలేకరుల ఎదుట తమ గోడు వెల్లబోసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం గ్రామాల్లోని పేద ప్రజల వలసల నివారణకు స్థానికంగానే పనులు కల్పించాలని ఉపాధి హామీ పథకం అమలు చేసి, 100 రోజులు పని కల్పనకు చర్యలు తీసుకుందన్నారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ఉపాధి కూలీలపై నిర్లక్ష్యం, వివక్ష చూపుతుందని ఆరోపించారు. తమకు పని కల్పించాలని ఫీల్డ్ అసిస్టెంట్ మోహన్‌కు ఎన్నిసార్లు విన్నవించుకున్నా స్పందించక పోగా.. మీకు పని కావాలంటే టీడీపీ నాయకులు జీవన్బాబురెడ్డి, చంద్రరెడ్డి చెబితేనే కల్పిస్తాననని, లేకుంటే లేదని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నాయుకులు జీవన్బాబురెడ్డి, చంద్రరెడ్డిని అడిగితే మా ఇంటి, పొలం వద్దకు పనిచేయడానికి వస్తేనే మీకు పని కల్పిస్తామని, లేకుంటే లేదని చెబుతున్నారని తెలిపారు. ఈ విషయమై ఎంపీడీఓ మోహన్‌మురళి, ఏపీఓ లలితకూమారికి ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న దాఖాలలు లేవన్నారు. కానిస్టేబుల్ లక్ష్మికి పోలీసు లాంఛనాలతో వీడ్కోలు చౌడేపల్లె: కుటుంబ సభ్యుల మనస్పర్థల కారణంగా బుధవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందిన కానిస్టేబుల్ లక్ష్మికి పోలీసు లాంఛనాలతో కన్నీటి వీడ్కోలు పలికారు. గురువారం ఎస్ఐ నాగేశ్వరరావు కుటుంబసభ్యుల నుంచి అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. జిల్లా పోలీసు సంఘం అధ్యక్షుడు ఉదయ్‌కుమార్, గుడిపల్లి, సోమల, చౌడేపల్లె, పుంగనూరుతోపాటు పలువురు పోలీసు సిబ్బంది కానిస్టేబుల్ లక్ష్మి మృతదేహాన్ని సందర్శించి, నివాళులర్పించారు. రూ: లక్ష ఆర్థిక సహాయం అందజేశారు. లక్ష్మి మృతితో గోసలకురప్పల్లెలో విషాధ చాయలు అలుముకున్నాయి. ప్రభుత్వాస్పత్రిలో హత్యలు జరుగుతున్నాయి – టీడీపీ నాయకుడు షణ్ముగం చిత్తూరు రూరల్ : ప్రభుత్వాస్పత్రిలో హత్యలు జరుగుతున్నాయని, తన కుమార్తె శ్రీదుర్గ మృతికి ముమ్మాటికి ఆస్పత్రిలోని జూనియర్ డాక్టర్లే కారణమని బీసీ నాయకుడు, టీడీపీ సీనియర్ నాయకుడు పి షణ్ముగం ఆరోపించారు. గురువారం చిత్తూరు నగరంలోని బీసీ సంక్షేమ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన తన కుమార్తె మృతికి చిత్తూరు జిల్లా ప్రభుత్వాస్పత్రిలోని వైద్యులే ప్రధాన కారణమన్నారు. నిర్లక్ష్యంగా వైద్యం చేయడంతోనే చనిపోయిందని కన్నీంటి పర్యంతమయ్యారు. తలలో గాయపడిన విషయాన్ని తెలుసుకోకుండా ప్రథమ చికిత్స చేసి ఇంటికి పంపడంతోనే ఆమె మృతి చెందిందని గోడు వెలబోసుకున్నారు. తన బిడ్డకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం తక్షణ న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. దీనిపై కలెక్టర్ ద్వారా సీఎం పేషీకి ఫిర్యాదు చేసినట్లు ఆయన వెల్లడించారు. -
పది పాసైన విద్యార్థులకు సువర్ణావకాశం
తిరుపతి సిటీ: జిల్లా విద్యార్థులకు నేషనల్ యూనివర్సిటీలో ఇంటర్మీడియెట్ చదివే అవకాశాన్ని తిరుపతి జాతీయ సంస్కృత వర్సిటీ కల్పిస్తోంది. పదోతరగతి పాసైన విద్యార్థులు ఇంటర్మీడియెట్ కోర్సులో (పాక్శాసీ్త్ర) చేరేందుకు అవకాశం కల్పిస్తూ వచ్చే నెల 3వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు వర్సిటీ అధికారులు తెలిపారు. ఇందులో ఇంగ్లిషు, హిందీ, సంస్కృతం, తెలుగు మాధ్యమాలు ఉంటాయన్నారు. ఇంటర్మీడియెట్ కోర్సుల్లో కంప్యూటర్, గణితం, హిస్టరీ, వ్యాకరణం, సాహిత్యం, జ్యోతిష్యం, పిలాసఫీ, యోగా వంటి సబ్జెక్టుల్లో బోధన ఉంటుందని పేర్కొన్నారు. నూతన విద్యావిధానంలో భాగంగా జాతీయ సంస్కృత వర్సిటీలో పాక్శాసీ్త్ర కోర్సులలో అడ్మిషన్లు పొందే విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు హాస్టల్ వసతి కల్పించనున్నట్టు తెలిపారు. వచ్చేనెల 3 నుంచి దరఖాస్తులు జాతీయ సంస్కృత వర్సిటీలో ఇంటర్మీడియెట్ కో ర్సులు చేరదలుకున్న విద్యార్థులు వచ్చే నెల 3వ తే దీ నుంచి వర్సిటీ వెబ్సైట్ www.nrktu.ac.inలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోలేని విద్యార్థులకు కోసం వర్సిటీలో అకడమిక్ సెక్షన్లో ఏర్పాటు చేసిన హెల్ఫ్ డెస్క్‌ను సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సద్వినియోగం చేసుకోండి ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ పరీక్షల ఫలితాలలో ఉత్తీర్ణులై న విద్యార్థులకు జాతీయ సంస్కృత వర్సిటీ ఆహ్వానం పలుకుతోంది. నేషనల్ యూనివర్సిటీలో ఇంటర్మీడియెట్ కో ర్సు పూర్తి చేసే అవకాశం వర్సిటీ కల్పిస్తోంది. పాక్శాసీ్త్ర (ఇంటర్మీడియెట్) కోర్సుకు ఆసక్తిగల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కోర్సులో చేరిన విద్యార్థులకు స్కాలర్షిప్లు సైతం అందనున్నాయి. –ప్రొఫెసర్ జీఎస్ఆర్ కృష్ణమూర్తి, వీసీ, ఎన్ఎస్యూ నేషనల్ వర్సిటీలో ఇంటర్ చదివే భాగ్యం ఇంటర్మీడియెట్ (ప్రాక్శాస్త్రి) కోర్సులకు ఆహ్వానం పలుకుతున్న ఎన్ఎస్యూ వచ్చే నెల 3 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు ప్రారంభం -
రైలు కిందపడి ఇద్దరు యువకులు మృతి
కుప్పంరూరల్: వేర్వేరు చోట్ల జరిగిన రెండు రైలు ప్రమాదాల్లో ఇద్దరు యువకులు గురువారం మృతి చెందా రు. కుప్పం మండలం క్రిష్ణదాసనపల్లి గ్రామానికి చెందిన యువకుడు బెంగళూరులో ఆత్మహత్యకు పాల్పడ్డగా, బీహార్‌కు చెందిన మరో యువకుడు కుప్పం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు నుంచి జారీ కిందపడి దుర్మరణం పాలయ్యాడు.కుప్పం యువకుడు బెంగళూరులో...కుప్పం మండలం, క్రిష్ణదాసనపల్లి గ్రామానికి చెందిన లేట్ సోమశేఖర్ కుమారుడు కె. ఎస్. భువనచంద్ర (27) బెంగళూరు వైట్‌ఫీల్డ్‌లో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తుల కథనం మేరకు.. తల్లిదండ్రులు లేని భువన చంద్ర బెంగళూరు పట్ణణంలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేస్తున్నాడు. నిత్యం బెంగళూరుకు ఉదయం వెళ్లి, రాత్రి ఇంటికి వస్తుంటాడు. రోజులాగానే భువన చంద్ర గురువారం ఉదయం బయలుదేరి బెంగళూరు వెళ్లాడు. ఏమైదో తెలియదు గానీ బెంగళూరు నగరంలోని వైట్‌ఫీల్డ్ వద్ద రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బెంగళూరు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. గురువారం రాత్రి రైల్వే పోలీసులు భువన చంద్ర మృతదేహానికి పోస్టుమార్టమ్ చేసి బంధువులకు అప్పగించారు.రైలు నుంచి జారీపడి బిహార్ యువకుడు...సుమారు 27 ఏళ్ల వయస్సు ఉన్న బిహార్‌కు చెందిన యువకుడు బుధవారం అర్థరాత్రి రైలు నుంచి ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందినట్లు కుప్పం పోలీసులు తెలిపారు. బుధవారం రాత్రి బెంగళూరు – గౌహతి వెళ్లే రైలు నుంచి జారి పడి ఉండవచ్చని రైల్వే పోలీసులు అనుమానిస్తున్నారు. వైట్ టీషర్టు, బ్లాక్ ఫ్యాంటు ధరించి ఉన్నట్లు చెప్పారు. అతని వద్ద బెంగళూరు నుంచి కంచ్గంజ్ వెళ్లే రైల్వే టికెట్ ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ఈ మేరకు శవాన్ని కుప్పం ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు కుప్పం రైల్వే పోలీసులు తెలిపారు. -
బెడిసికొట్టిన కూటమి సర్కారు ప్రణాళికలు
● సర్కారు పాఠశాలలపై పర్యవేక్షణ శూన్యం ● ఉపాధ్యాయుల కొరతతో పలు సబ్జెక్టుల్లో తప్పిన విద్యార్థులు ● సీఎం సొంత జిల్లాల్లో వేల సంఖ్యలో విద్యార్థులు ఫెయిల్ ● చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ప్రభావం చూపని పది ఫలితాలు చిత్తూరు కలెక్టరేట్ : చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వేల సంఖ్యల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా పది విద్యార్థులు ఫెయిల్ కావడం విస్మయానికి గురి చేస్తోంది. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌కు తొలి మెట్టులాంటి పదో తరగతిపై కూటమి సర్కారు అలసత్వ వైఖరి చూపడంతోనే ఈ చేదు ఫలితాలు చోటు చేసుకున్నట్లు విద్యావేత్తలు పెదవి విరుస్తున్నారు. చిత్తూరు జిల్లాలో 2,436, తిరుపతి జిల్లాలో 2,444 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. చిత్తూరు జిల్లా నుంచి 20,796 మంది, తిరుపతి జిల్లా నుంచి 26,679 మంది మొత్తం 47,475 మంది విద్యార్థులు పది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో చిత్తూరు జిల్లాలో 13,456, తిరుపతి జిల్లాలో 21,298 మొత్తం 34,754 మంది ఉత్తీర్ణత సాధించారు. మిగిలిన విద్యార్థులు పది పబ్లిక్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు. సీఎం చంద్రబాబునాయుడు సొంత జిల్లాల్లో పది పరీక్షల్లో ఫలితాలు బోల్తా కొట్టడం పై విద్యావేత్తలు పెదవి విరుస్తున్నారు. కుప్పంలోనూ అదే వెనుకబాటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోనూ పది ఫలితాలు వెనుకబడ్డాయి. కుప్పం మండలంలో 1,833 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 703 మంది ఫెయిల్ అయ్యారు. ఇందులో బాలురు అధికంగా 449, బాలికలు 254 మంది పది పరీక్షల్లో తప్పారు. సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం మండలంలోనే ఈ పరిస్థితి ఉంటే మిగిలిన మండలాల్లో పరీక్షల్లో తప్పిన విద్యార్థుల సంఖ్య ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. విద్యార్థులకు ప్రభుత్వాలు ఇచ్చే బహుమతి ఏదైనా ఉందంటే అది చదువు ఒక్కటే అని గత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భావించారు. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఆ విషయాన్ని గాలికి వదిలేసింది. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో టీచర్ల కొరతతోనే ఎక్కువ మంది విద్యార్థులు పది పరీక్షల్లో ఫెయిల్ కావాల్సిన దుస్థితి ఏర్పడింది. కూటమి సర్కారు నిర్లక్ష్యం.. అనాలోచిత నిర్ణయాలు.. ప్రణాళిక లేమి.. విద్యాశాఖపై కొరవడిన పర్యవేక్షణ..ఉపాధ్యాయుల కొరత.. విద్యార్థికి అందని బోధన.. అభ్యసన సామగ్రి.. వెరసి పది పరీక్షల ఫలితాలపై ప్రభావం చూపింది. తండ్రి రాష్ట్రానికి ముఖ్యమంత్రి.. కుమారుడు సాక్షాత్తు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించినా వారి నిర్లక్ష్యం.. ఉదాసీనత.. అసంబద్ధ నిర్ణయాలతో సొంత జిల్లాల్లోనే పదో తరగతి విద్యార్థులు పరీక్ష ఫలితాల్లో పదింతలు వెనుకపడ్డారు. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో పేద పిల్లలు చదువుకు దూరం కావాల్సిన పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వ పాలనలో ఇలా.. విద్యాసంవత్సరం ప్రారంభంలోనే టీచర్ల కొరత సర్దుబాటుచేసి బోధన సకాలంలో సిలబస్ పూర్తి ఉత్తమ ఫలితాల కోసం ప్రత్యేక మెటీరీయల్ ముద్రించి సరఫరా ప్రణాళిక ప్రకారం రివిజన్ తరగతుల నిర్వహణ ఉత్తమ ఫలితాలకోసం విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం, ప్రణాళిక అమలు కీలకమైన 77రోజుల కార్యాచరణ, ప్రత్యేక తరగతుల నిర్వహణ చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో గత ఏడాది 3,578 మంది విద్యార్థులు ఫెయిల్ఈ ఏడాది కూటమి పాలనలో.. విద్యాసంవత్సరం మధ్యలో టీచర్లను సర్దుబాటు చేయడం జనవరి, ఫిబ్రవరి నెలల్లోనూ సిలబస్ పూర్తి చేయని పరిస్థితి ప్రస్తుతం అలాంటి మెటీరియల్ జాడే లేదు ఫిబ్రవరి పూర్తి అయినా రివిజన్ తరగతులు లేమి ప్రత్యేక సమావేశం లేదు, పటిష్ట ప్రణాళిక సైతం అమలు కాలేదు కీలకమైన కార్యాచరణ లేనే లేదు. ప్రత్యేక తరగతులు ఆలస్యంగా నిర్వహణ ఈ ఏడాది చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 12,231 మంది విద్యార్థులు ఫెయిల్అలసత్వం తగదు ప్రభుత్వ పాఠశాల ల్లో చదివే పేద విద్యార్థులపై కూట మి సర్కారు ప్రదర్శిస్తున్న అలసత్వ వైఖరి తగదు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌కు పదో తరగతి చాలా కీలకం. అలాంటి పదో తరగతి పరీక్షలపై ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం అన్యాయం. ప్రభుత్వ అలసత్వ వైఖరితోనే సీఎం సొంత జిల్లాలైన చిత్తూరు, తిరుపతి జిల్లాలల్లో వేల సంఖ్యలో విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. – ప్రవీణ్, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం జిల్లా కన్వీనర్, చిత్తూరు జిల్లాఅనాలోచిన నిర్ణయాలే కారణం కూటమి ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించకుండా అనాలోచిత నిర్ణయాలు తీసుకుంది. విద్యాసంవత్సరం మధ్యలో సర్దుబాటు కార్యక్రమం ఎవరైనా నిర్వహిస్తారా? అనాలోచిత నిర్ణయాలతో వేల సంఖ్యలో విద్యార్థులు పరీక్షల్లో తప్పారు. ఇందుకు గల కారణాలు విద్యాశాఖ అధికారులు నోరు మెదపకపోవడం బాధాకరం. సీఎం సొంత జిల్లాల్లో వేల సంఖ్యలో విద్యార్థులు ఫెయిల్ కావడం విస్మయానికి గురిచేస్తోంది. – శివారెడ్డి, ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి, తిరుపతి జిల్లా -
పకడ్బందీగా ప్రవేశ పరీక్షలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఈ నెల 25వ తేదీన నిర్వహించే ఏపీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల, కళాశాల ప్రవేశాల పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్వో మోహన్ కుమార్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో పరీక్షల నిర్వహణపై సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ జిల్లాలో శుక్రవారం నిర్వహించే ప్రవేశ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జూనియర్ కళాశాల ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారన్నారు. ఈ పరీక్షలకు జిల్లా కేంద్రంలో విజయం డిగ్రీ కళాశాల, నారాయణ ఇంగ్లిష్ మీడియం స్కూల్, కేశవరెడ్డి ఇంగ్లిష్ మీడియం హైస్కూల్, క్యాంఫర్డ్ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 756 మంది విద్యార్థుల పాఠశాల అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకున్నారన్నారు. అదే పరీక్ష కేంద్రాలతో పాటు గిరింపేట మున్సిపల్ పాఠశాలలో జూనియర్ కళాశాలల అడ్మిషన్లకు పరీక్షలు నిర్వహిస్తారన్నారు. ఈ పరీక్షలకు 1,082 మంది దరఖాస్తులు చేసుకున్నారని చెప్పారు. పరీక్షల నిర్వహణకు చీఫ్ సూపరింటెండెంట్, రూట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ సూపరింటెండెంట్లు, జిల్లా కో ఆర్డినేటర్లను నియమించారన్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేశారన్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్లకూడదన్నారు. పరీక్ష కేంద్రాలకు సమీపంలో ఉన్న జిరాక్స్ కేంద్రాలను మూసి వేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఈఓ వరలక్ష్మి, జిల్లా గురుకుల కళాశాలల కోఆర్డినేటర్ భార్గవి తదితరులు పాల్గొన్నారు. -
ఐఏఎస్ అయ్యాడు!
నాన్నమాటతోఉన్నత ఉద్యోగం.. రూ.కోటి ప్యాకేజీ.. జీవిత భాగస్వామికీ మంచి కొలువు.. మంచి సంసారం..సాఫీగా సాగే జీవనం.. అయినా ఏదో తెలియ ని వెలితి.. అసంతృప్తి.. ఏదో సాధించాలన్న తపన.. ఎలాగైనా కలెక్టర్ కావాలన్న పదే పదే గుర్తుకు వచ్చే చిన్ననాటి నాన్న మాట.. అతడిని సివిల్స్ వైపు నడిపించింది. అదే లక్ష్యం.. పట్టుదల..కృషి.. స్వీయశిక్షణ.. ప్రణాళిక.. మొక్కవోని ఆత్మస్థైర్యం.. వెరసి సివిల్ ర్యాంకర్‌గా నిలిచారు బైరెడ్డిపల్లె వాసి రంపా శ్రీకాంత్. పలమనేరు: లక్ష్యం కోసం కష్టపడి ప్రయాణిస్తేనే అది తప్పకుండా దక్కుతుందంటున్నారు ఇటీవల సివిల్ సర్వీసెస్‌లో 904 ర్యాంకు సాధించిన బైరెడ్డిపల్లి వాసి రంపం శ్రీకాంత్. ఉత్తమ ఉద్యోగం ఉన్నా జీవితంలో ఏదో తెలియని లోటు.. తాను సివిల్ సర్వేంట్ కావాలన్న తపనతో సివిల్స్ కోసం రోజుకు ఎనిమిది గంటల కష్టపడి చదువుతూ, కోచింగ్ తీసుకుంటేనే పరీక్షలు ఉత్తీర్ణత సాధించగలమన్న ఆలోచనను పక్కన పెట్టి, స్వీయశిక్షణతోనే తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. రూ.కోటి పాకేజీ కంటే తండ్రి మాటే వేదంగా.. ‘నాన్న నువ్వు బాగా చదివి ఎలాగైనే కలెక్టర్ కావాలి.. అప్పుడే మనలాంటి పేదలకు సాయంగా ఉండొచ్చు.’ అని తండ్రి నాగరాజు చిన్నప్పుడు శ్రీకాంత్‌కు చెప్పిన మాట ఎప్పుడూ గుర్తు పెట్టుకున్నారు. ప్రఖ్యాత కంపెనీలో భారీ ప్యాకేజీతో కొలువున్నా సంతృప్తి చెందలేదు. సివిల్స్ కొట్టాలనే తపన శ్రీకాంత్‌ను వేధిస్తూనే ఉండేది. దీంతో 2021 నుంచి ఆఫీసు పని ముగిశాక స్వీయ శిక్షణతో నాలుగు సార్లు సివిల్స్ రాసి, ఈ సారి ర్యాంకర్‌గా నిలిచారు. కోచింగ్‌తోనే ఐఏఎస్ ఛాన్స్ భావన పొరబాటు ఆన్లైన్లో మెటీరియల్‌తో స్వయంగా చదివా డీఎంఎంగా మంచి జీతం ఉన్నా అసంతృప్తి చిన్నప్పుడు తండ్రి మాటే జీవిత బాటగా.. సివిల్ సర్వీసెస్‌లో 904 ర్యాంకర్ శ్రీకాంత్ కష్టపడితే ఎప్పటికై నా విజయం క్యాట్ రాసిన అనుభవంతో సివిల్స్‌కు స్వయంగా చదవడం మొదలు పెట్టా. ఆన్లైన్లో మెటీరియల్, డైలీ న్యూస్ పేపర్లు చదవాను. ఆప్షనల్‌గా పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ పెట్టుకున్నా. ఇంటర్వ్యూలో సైతం ఎక్కువగా అంతర్జాతీయ వ్యవహారాలైన ఉక్రెయిన్ వార్, చైనా క్యాఫ్టలిస్ట్జం, టెర్రరిజం తదితరాలపైనే ఎక్కువ ప్రశ్నలడిగారు. చివరగా మనం చిన్నపాటి గ్రామంలో ఉన్నాం కదా ఐఏఎస్ కావాలంటే ఢిల్లీ కెళ్లి కోచింగ్ తీసుకోవాలనే మాట పక్కన పెట్టి ధైర్యంగా ముందుకెళ్లాలి. – రంపం శ్రీకాంత్, బైరెడ్డిపల్లి ఇదీ కుటుంబ నేపథ్యం పలమనేరు నియోజకవర్గంలోని బైరెడ్డిపల్లి రంపం శ్రీకాంత్ స్వగ్రామం. తండ్రి నాగరాజు గంగవరం పాఠశాలలో హెచ్ఎంగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. తల్లి రేణుక గృహిణి. శ్రీకాంత్ బైరెడ్డిపల్లెలో ప్రాథమిక విద్య పూర్తి చేశారు. ఆపై 6,7 తరగతులు అక్కడే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివారు. 8 నుంచి 10వ తరగతి వరకు పలమనేరులోని లిటిల్ ఏంజెల్స్, ఇంటర్ శ్రీ చైతన్యలో చదివారు. ఆపై హైదరాబాద్‌లోని సీబీఐటీ బీటెక్ కంప్యూటర్ సైన్సు, తరువాత బెంగళూరులోని ఐఐఎంలో ఎంబీఏ పూర్తి చేశారు. తొలుత అమెజాన్‌లో ఉద్యోగంలో చేరారు. ప్రస్తుతం గూగూల్లో రూ.కోటి ప్యాకేజీతో ఉద్యోగం చేస్తూనే సివిల్స్‌కు స్వీయశిక్షణ పొందుతూ స్వయంగా చదివారు. తిరుపతికి చెందిన అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ జోత్న్స కుమార్తె శ్రావ్యను ఐదేళ్ల కిందట వివాహం చేసుకున్నారు. శ్రావ్య సైతం బెంగళూరులోని టార్గెట్ కంపెనీలో ఫైనాన్స్ మేనేజర్‌గా పనిచేస్తోంది. వీరికి మూడేళ్ల పాప ఉంది. -
22 మంది విద్యార్థుల డిబార్
తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలో గురువారం నుంచి ప్రారంభమైన డిగ్రీ 2వ, 4వ సెమిస్టర్ పరీక్షల్లో తొలిరోజు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 22 మంది విద్యార్థులను డిబార్ చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ దామ్లానాయక్ తెలిపారు. హైపవర్ ఇన్స్ఫెక్షన్ కమిటీ ఇచ్చిన సమాచారం మేరకు మదనపల్లి జోన్ పరిధిలో 16 మంది, చిత్తూరు జోన్ పరిధిలో ఆరుగురు విద్యార్థులు మాస్‌కాపీయింగ్‌కు పాల్పడగా అధికారులు వారిని డిబార్ చేసినట్లు పేర్కొన్నారు. డీపీఓకు రాష్ట్రస్థాయి అవార్డు చిత్తూరు కార్పొరేషన్: గత ఆర్థిక సంవత్సరం పంచాయతీ పన్నుల వసూళ్లలో రాష్ట్ర స్థాయిలో జిల్లా మొదటి స్థానం వచ్చింది. ఇందుకుగాను జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా గురువారం డీపీఓ సుధాకర్‌రావు విజయవాడలో డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్‌కల్యాణ్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. గుడిపాల మండలం చీలాపల్లె పంచాయతీలో జలజీవన్ మిషన్, ఇతర పథకాల్లో ప్రతిభ చూపినందుకు గుడి పాల ఆర్డబ్ల్యూఎస్ ఏఈ పవన్‌కుమార్, సర్పంచ్ అరుణ్‌కుమార్ అవార్డులు అందుకున్నారు. పశుబీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోండి చిత్తూరు రూరల్ (కాణిపాకం): పశు బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇన్చార్జ్ జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి అరిఫ్ తెలిపారు. ఒక కుటుంబానికి 100 జీవాల వరకు బీమా చేసుకోవచ్చన్నారు. పది పశువులకు బీమా సౌకర్యం వర్తిస్తుందన్నారు. ప్రభుత్వ రాయితీ పోను మేలు జాతి పశువుకు రూ.288, నాటు జాతి పశువురూ.114 ప్రీమియం చెల్లించాల్సి ఉందన్నారు. అలాగే గొర్రెలు, మేకలు, పందులకు సంవత్సరకాలనికి రూ.27, రెండేళ్లకు రూ.40, మూడేళ్లకు రూ.56 చొప్పున్న ప్రీమియంగా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ అవకాశాన్ని పాడిరైతులు సద్వినియోగంచేసుకోవాలని, ప్రీమియం చెల్లింపునకు రైతు భరోసా కేంద్రాలను సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు. సీఎంసీ ఆస్పత్రిలో సౌకర్యాలపై ఆరా గుడిపాల: చీలాపల్లె సీఎంసీ ఆస్పత్రిలో రోగులకు అందిస్తున్న సౌకర్యాలపై జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆరా తీశారు. గురువారం సీఎంసీ ఆస్పత్రిని ఆయన సందర్శించారు. రోగులకు వైద్యం అందిస్తున్న సౌకర్యాలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఎమెర్జెన్సీ, ఎక్స్‌రే, ఓపీ కేంద్రాలను సందర్శించారు. -
చిన్నారి హల్ సెల్
కూర్చున్నా.. పరిగెడుతున్నా..తింటున్నా..పడుకున్నా..సెల్ చెంతనే ఉండాల్సిందే. ఇది లేని జీవితాన్ని ఊహించడం కష్టసాధ్యంగా మారుతోంది. పిల్లలు పెద్దల ప్రమేయం లేకుండానే గేమ్‌లు ఆడుతున్నారు. తమకు కావాల్సిన ఆటలు డౌన్లోడ్ పెట్టుకుంటున్నారు. ఈ పరిణామం ఆందోళన కలిగిస్తోంది. ఇందులో మంచితోపాటు చెడు మిళితమై ఉండడంతోపాటు అతి వినియోగంతో అనర్థాలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పలమనేరు: స్మార్ట్ఫోన్ల వినియోగదారుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఎలాంటే.. ఒక నిమిషం చేతిలో సెల్ లేకుంటే బతకలేమన్నట్టుగా తయారయ్యారు నేటి విద్యార్థులతు, పిల్లలు, యువకులు. డ్రగ్స్‌కు బానిసైనట్టు స్మార్ట్‌ఫోన్ (Smartphone) కారాగారంలో నేటి తరం బందీలుగా మారారు. ఇప్పుడు పట్టణాలు, పల్లెలనే తేడా లేకుండా స్మార్ట్ఫోన్ల వాడకం విద్యార్థుల్లో ఎక్కువైంది. పిల్లాడు అన్నం తినాలంటే మొబైల్, బడికి రెడీ కావాలంటే మొబైల్, బడి నుంచి రాగానే సెల్‌ఫోన్ చేతిలో పెట్టాల్సిందే. పసిబిడ్డలు సైతం ఏడుపు ఆపాలంటే తల్లిపాలు పట్టడం కంటే చేతిలో సెల్ పెట్టగానే సైలెంట్ అవుతున్నారు. మొబైల్ లేకుంటే మనషులకు బుర్ర కూడా పనిచేయడం లేదు. మితిమీరిన సెల్ వాడకం మనిషి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తున్నా మార్పు రావడం లేదు. ఇప్పటికే చాలామంది వారికి తెలియకనే మానసిక రోగుల్లా మారారు. ఇంకొందరు అనారోగ్యం పాలవుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు స్టార్ట్ఫోన్లకు బానిసలుగా మారిపోవడం తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తోంది. ఏటా15 శాతం పెరుగుతున్న సెల్ ఫోన్ వినియోగం గత నాలుగేళ్లుగా సెల్ఫోన్ల వాడకం ఏటా 15 శాతం పెరుగుతున్నట్టు ట్రాయ్ (టెలీఫోన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) లెక్కలు చెబుతున్నాయి. స్మార్ట్ఫోన్లను వాడేవారిలో రోజుకు సగటున యువత 4 గంటలు, విద్యార్థులు 2 గంటలు, గృహిణిలు 2 గంటలు, అధికారులు 1.30 నిమిషాలు, పిల్లలు గంటపాటు సమయాన్ని కేటాయిస్తున్నట్టు తెలిసింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉదాహరణే తీసుకుంటే... 1990లో కీప్యాడ్ఫోన్ల వాడకం మొదలైంది. తొలుత తిరుపతి, చిత్తూరు, కుప్పం, మదనపల్లెలో రిలయన్స్ మొబైల్ టవర్ల ద్వారా నెట్‌వర్క్‌ను అందిస్తూ సేవలను మొదలు పెట్టారు. ఆపై పలు సెల్ కంపెనీలు మార్కెట్లోని వచ్చాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 8 వేల దాకా సెల్‌ఫోన్ టవర్లున్నాయి. ఉమ్మడి జిల్లా జనాభా 44 లక్షలు కాగా వీరిలో సెల్ఫోన్లు (కీఫ్యాడ్, టచ్ మొబైల్)వాడే వారి సంఖ్య ప్రస్తుతం 10 లక్షలకు చేరింది.ఇదిగో సాక్ష్యం.. పలమనేరు పట్టణంలో ఇంజినీరింగ్ చదవుతున్న ఓ విద్యార్థిని సెల్‌ఫోన్ అతిగా వాడొద్దని తల్లిదండ్రులు మందలించారు. దీంతో అప్పటికే సెల్‌కు బానిసైన ఆ విద్యార్థి తన గదిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణంలోని పదో తరగతి చదివే బాలికకు సెల్‌ఫోన్ కొన్విలేదని తన చేతిని బ్లేడ్‌తో కోసుకుని ఆస్పత్రి పాలైంది. సెల్ ఇవ్వలేదని ఐదో క్లాస్ చిన్నారి ఇంటి నుంచి పరారయ్యాడు. ఇలాంటి సంఘటనలు జిల్లాల్లో నిత్యకృత్యంగా మారాయి.ఎక్కువ మంది యూట్యూబ్ వీక్షకులే స్మార్ట్‌ఫోన్ వాడుతున్న వారిలో 80 శాతం మంది యూట్యూబ్ చూస్తుండగా, 60 శాతం మంది వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్ట్ర్రాగామ్ను వాడుతున్నట్టు గూగూల్ చేసిన సర్వేలో తేలింది. విద్యార్థులు, యువతలో 50 శాతం మంచి ఆన్లైన్లో గేమ్స్ కోసం సమయాన్ని వెచ్చిస్తున్నారు. మహిళలు పనిపాట చేసుకుంటూ కూడా సీరియళ్లను సెల్లోనే చూసేవారి సంఖ్య పెరుగుతోంది. ఇక చిన్నపిల్లలు సైతం స్మార్ట్‌ఫోన్‌లో కార్టూన్ స్టోరీస్ చూడకుండే ఏడుపు మొదలు పెట్టడం చూస్తూనే ఉన్నాం.అనారోగ్య సమస్యలు తప్పవుసెల్ చూస్తున్న కారణంగా నిద్రలేమి ప్రధాన సమస్యగా మారుతోంది. దీంతో మనిషి జ్ఞాపకశక్తి, ఏకాగ్రత దెబ్బతింటోందని(డబ్ల్యూహెచ్ఓ) ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వేలో తెలిపింది. శరీరంలో మెలటోనియన్ నిల్వలు నశించి డిప్రెషన్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నిద్రలేమి కారణంగా అధిక బరువు, లావెక్కడం జరుగుతుంది. పిల్లలకు తలనొప్పి, చూపు మందగించి కంటి అద్దాలను వాడాల్సిందే. అలాగే పలు అనారోగ్య సమస్యలు తప్పవు. – మమతారాణి, ఏరియాఆస్పత్రి సూపరిండెంటెంట్, పలమనేరుసోషల్ మీడియా వాడకం పరిస్థితి ఇదీ! ఇటీవల యాన్యువల్ స్టేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ నివేదికలో వెల్లడించిన అంశాలు తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. సోషల్ మీడియా (Social Media) బానిసలైన వారిలో 14 ఏళ్లలోపు పిల్లలు 79 శాతం, 15 నుంచి 20 ఏళ్ల వయసున్న వారిలో 82 శాతం, మహిళలు 75 శాతం ఉండడం కొసమెరుపు. -
అది పరువు హత్యే...!
చిత్తూరు అర్బన్: సంచలనం సృష్టించిన యాస్మిన్ భాను (26) అనుమానాస్పద మృతి కేసు మిస్టరీ వీడింది. ఆమెది ఆత్మహత్య కాదని, పరువు హత్యేనని నిర్ధారణ అయ్యింది. కన్న కూతురు ఇతర మతస్తుడిని ప్రేమించి పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేక కూతురిని హత్య చేసిన తండ్రి షౌకత్ అలీ (56), వరుసకు సోదరుడు అయిన మహ్మద్ బాషా అలియాస్ లాలా (29)ను పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు అబ్దుల్ కలామ్ పరారీలో ఉన్నాడు. ఈ ఘటన వివరాలను చిత్తూరు టూటౌన్ సీఐ నెట్టికంటయ్య బుధవారం మీడియాకు వివరించారు. పోలీసులను ఆశ్రయించినా లేని ఫలితం! చిత్తూరులోని బాలాజీ కాలనీకి చెందిన షౌకత్ అలీ చిత్తూరు రూరల్ మండలంలోని తుమ్మింద గ్రామంలో ఆర్ఎంపీ వైద్యుడిగా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, ముగ్గురు కుమార్తెలున్నారు. మూడో కూతురు యాస్మిన్ భాను బీటెక్ చదివే సమయంలో సాయితేజతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. భాను తన ప్రేమ విషయం పెద్దలకు చెబితే వారు అంగీకరించలేదు. పైగా తమ సమీప బంధువుతో ఈ ఏడాది ఫిబ్రవరి 9వ తేదీన పెళ్లి చేయాలని నిశ్చయించి, అందరికీ శుభ లేఖలు కూడా పంచేశారు. అయితే ఫిబ్రవరి 6వ తేదీన యాస్మిన్ భాను, సాయితేజ ఒక ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. పెద్దల నుంచి ముప్పు ఉందంటూ చంద్రగిరి డీఎస్పీని కూడా ఆశ్రయించారు. దీనితో షౌకత్ అలీని చంద్రగిరికి పిలిపించి, వీళ్ల జోలికి వెళ్లొద్దంటూ కౌన్సెలింగ్ ఇచ్చి పంపించేశారు. అటు తర్వాత సాయితేజ భార్యతో తన సొంత ఊరైన పూతలపట్టు మండలంలోని పోటుకనుమ గ్రామంలో కాపురం పెట్టాడు. కొద్ది రోజుల్లోనే తల్లి ముంతాజ్, ఇద్దరు అక్కలు యాస్మిన్ భానుతో ఫోన్లో మాట్లాడుకుంటూ దగ్గరయ్యారు.నమ్మించి గొంతు నులిమి..ఆగిపోయిన వ్యక్తితోనే పెళ్లి చేసి, కూతురిని దుబాయ్ పంపాలనుకున్న షౌకత్ అలీ.. ప్లాన్ బీ కూడా సిద్ధం చేసుకున్నాడు. అనారోగ్యంతో ఉన్న తండ్రిని చూసి వెళ్లాలని తల్లి కోరడంతో, ఏప్రిల్ 13వ తేదీన భర్తతో కలిసి యాస్మిన్‌భాను చిత్తూరుకు కారులో వచి్చంది. అప్పటికే మరో కారులో వేచివున్న లాలా, వారి మరో సమీప బంధువు అబ్దుల్ కలాం.. భానును వారి కారులో ఎక్కించుకుని అక్కడి నుంచి బయలు దేరారు. మధ్యలో తండ్రి షౌకత్ అలీ కూడా కారులో ఎక్కాడు. మాపాక్షి గ్రామ సమీపంలోకి వెళ్లిన తర్వాత, సాయితేజను వదిలేసి తాను చూసిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని యాస్మిన్‌ను తండ్రి షౌకత్ కోరాడు. ఆమె ఎంతకూ ఒప్పుకోలేదు. దీనితో కూతురి కాళ్లను తొక్కిపెట్టి, అప్పటికే తెచ్చుకున్న తాడుతో ఆమె గొంతుకు బిగించి చంపేశాడు. ఆపై బాలాజీ కాలనీలోని తన ఇంటివద్దకు వెళ్లి మృతదేహాన్ని ఇంట్లో పడేసి వెళ్లిపోయాడు. తన కుమార్తె కొన ప్రాణాలతో ఉందేమోనని భావించిన తల్లి ముంతాజ్, స్థానికుల సాయంతో యాస్మిన్‌ను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తన భర్త తిట్టడంతోనే భాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ముంతాజ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, అనుమానాస్పద మృతిగా ఈ కేసును తొలుత పోలీసులు నమోదు చేశారు. తన భార్యను కుటుంబ సభ్యులే హత్య చేసినట్లు సాయితేజ పోలీసులకు చెప్పడం, యాస్మిన్ గొంతుకు రెండుసార్లు తాడు బిగించిన ఆనవాళ్లు ఉండటంతో కేసు దర్యాప్తు మరో దిశలో సాగింది.పరారీలో ఉన్న షౌకత్ అలీతో పాటు లాలాను పోలీసులు అరెస్టు చేసి, హత్యకు ఉపయోగించిన కారు, తాడును స్వా«దీనం చేసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది. అవసరమైతే మరికొందరు అరెస్టు అయ్యే అవకాశం ఉంది. -
వేసవి సెలవులు.. దొంగలతో జాగ్రత్త
చిత్తూరు అర్బన్ : పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం కావడంతో.. విహార యాత్రలు, ఊర్లకు వెళ్లే ప్రజలు ఇంట్లో చోరీలు జరగకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ మణికంఠ ఒక ప్రకటనలో కోరారు. ఎవరైనా బయటి ప్రాంతాలకు వెళితే తప్పనిసరిగా పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. అలా చేస్తే తాళం వేసిన ఇళ్లపై పోలీసుల నిఘా ఉంటుందన్నారు. అలాగే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ (ఎల్‌హెచ్‌ఎంఎస్) ద్వారా కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తామన్నారు. దీనికితోడు జిల్లా వ్యాప్తంగా 16,500 స్మార్ట్ డోర్ లాక్స్ సైతం పంపిణీ చేశామన్నారు. ఎవరైనా బయటి ఊర్లకు వెళితే ఫోన్ 112, పోలీసు వాట్సాప్ 94409 00005 నంబర్లకు తప్పనిసరిగా సమాచారం ఇచ్చి, పోలీసుశాఖకు సహకరించాలని కోరారు. 28 నుంచి వేసవి శిక్షణ తరగతులు చిత్తూరు కార్పొరేషన్ : జిల్లాలోని గ్రంథాలయాల నందు ఈనెల 28 నుంచి జూన్ 6 వరకు వేసవి శిక్షణ తరగతులను నిర్వహించనున్నట్లు డిప్యూటీ గ్రంథాలయాధికారి లలిత తెలిపారు. పుస్తక పఠనం, పుస్తక సమీక్ష, కథలు చెప్పడం, స్పోకెన్ ఇంగ్లీషు, డ్రాయింగ్, పెయింటింగ్, పేపర్ క్రాఫ్ట్స్, డాన్స్, చెస్, క్యారమ్స్, క్విజ్, జీకే అంశాలపై శిక్షణ ఉంటుందన్నారు. ఆ రోజుల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు తరగతులు నిర్వహించనున్నామన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఊపందుకున్న ‘గుజ్జు’ పరిశ్రమలు ● కేరళ నుంచి ‘మామిడి’ దిగుమతి చిత్తూరు రూరల్ (కాణిపాకం) : చిత్తూరు జిల్లాలో కొన్ని మామిడి గుజ్జు పరిశ్రమలు తెరుచుకున్నాయి. అప్పుడే గుజ్జు తయారీని మొదలుపెట్టాయి. జిల్లాలో 47 గుజ్జు పరిశ్రమలుండగా... నాలుగు పరిశ్రమలు గుజ్జు తయారీని ప్రారంభించాయి. కేరళ నుంచి అల్పోన్సో రకం కాయలను దిగుమతి చేసుకుంటున్నాయి. గుజ్జు తయారీని ఆచితూచి చేస్తున్నాయి. ఇలా నిత్యం 90 టన్నుల వరకు దిగుమతి అవుతున్నట్లు పరిశ్రమ నిర్వాహకులు చెబుతున్నారు. కాగా జిల్లాలో గతేడాది మామిడి గుజ్జు 2.75 లక్షల టన్నుల తయారీ చేసి నిల్వ చేశారు. యుద్ధాలు, ఇతర కారణాల వల్ల గుజ్జు నత్తనడకన అమ్ముడుపోతున్నాయి. ఇప్పటి వరకు 50 శాతం వరకు అమ్ముడుపోయిందని పరిశ్రమ నిర్వాహకులు చెబుతున్నారు. పరిశ్రమదారులు పట్టుబట్టి విదేశాల ఎగుమతిపై దృష్టి పెట్టారు. దీని కారణంగా గుజ్జు ఎగుమతులు కదులుతున్నాయి. టెక్నాలజీతో జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి తిరుపతి సిటీ: టెక్నాలజీని సంస్కృత శాస్త్రాలలో విరివిగా వినియోగించుకుని విద్యార్థులు జ్ఞానాన్ని పొందాలని వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి సూచించారు. వర్సిటీలో జాతీయ సంస్కృత వర్సిటీ, సీడాక్ సంస్థ సంయుక్తంగా ఏఐ, ఎంఎల్, క్వాంటం కంప్యూటింగ్, ఐకేఎస్పై రెండు రోజులు నిర్వహించిన జాతీయ సదస్సు బుధవారం ముగిసింది. ఆయన మాట్లాడుతూ సంస్కృతాన్ని ఆధునిక సమాజానికి అందించాలంటే టెక్నాలజీతోనే సాధ్యమన్నారు. కార్యక్రమంలో ఐఐటీ ప్రొఫెసర్ కృష్ణప్రపూర్ణ, విభాగాధిపతి ప్రొఫెసర్ గణపతి భట్, ప్రొఫెసర్ రమాశ్రీ, డాక్టర్ జానకి, ప్రొఫెసర్ చంద్రశేఖరం, శ్రీధర్, నాగలక్ష్మీ, ప్రసన్న పాల్గొన్నారు శ్రీవారి దర్శనానికి 8 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 2 కంపార్ట్మెంట్లు నిండాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 61,828 మంది స్వామిని దర్శించుకున్నారు. 21,165 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.61 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని వారికి 8 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
ప్రైవేటు చేతికి అస్త్రం
ప్రభుత్వ సేవలను ప్రైవేటు పరం చేయడంతో వాహన సామర్థ్య పరీక్షలు ప్రైవేటు నిర్వాహకుల చేతిలోకి వెళ్లనున్నాయి. ఓపెన్ ‘పది’ బోల్తా ● పదిలో 8.91 శాతం, ఇంటర్లో 20.05 శాతం చిత్తూరు కలెక్టరేట్ : ఏపీ ఓపెన్ స్కూల్ పరీక్షా ఫలితాల్లో చిత్తూరు జిల్లా బోల్తా కొట్టింది. ఈ విద్యాసంవత్సరం జిల్లాలో ఏపీ ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ పరీక్షలను విద్యాశాఖ అధికారులు పకడ్బందీగా నిర్వహించారు. దీంతో ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం తగ్గడంతో పాటు అత్యధికంగా అభ్యర్థులు ఫెయిల్ అయ్యారు. పది ఫలితాల్లో.. ఏపీ ఓపెన్ స్కూల్లో గతంలో ఎన్నడూ నమోదు కాని విధంగా ఈ సంవత్సరం పది ఫలితాల్లో 8.91 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా పురుషులు 506, మహిళలు 358 మొత్తం 864 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో పురుషులు 61, మహిళలు 16 మంది మొత్తం 77 మంది ఉత్తీర్ణులయ్యారు. పురుషులు 12.06 శాతం, మహిళలు 4.47 మొత్తం 8.91 శాతం జిల్లా ఉత్తీర్ణత నమోదైంది. 787 మంది ఫెయిల్ అయ్యారు. ఓపెన్ పది పరీక్షల్లో చిత్తూరు జిల్లా రాష్ట్రంలో 20 స్థానంలో నిలిచింది. ఇంటర్లో .. ఏపీ ఓపెన్ స్కూల్ ఇంటర్ ఫలితాల్లో చిత్తూరు జిల్లా ఉత్తీర్ణత శాతం 20.05 నమోదైంది. ఈ పరీక్షలకు పురుషులు 2005, మహిళలు 1003 మొత్తం 3008 మంది హాజరయ్యారు. వీరిలో పురుషులు 360, మహిళలు 243 మొత్తం 603 మంది ఉత్తీర్ణులయ్యారు. పురుషులు 17.96, మహిళలు 24.23 మొత్తం 20.05 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా రాష్ట్రంలో చిత్తూరు జిల్లా 20వ స్థానంలో నిలిచింది. ఈ పరీక్షల్లో 2405 మంది ఫెయిల్ అయ్యారు. – 4లో -
కుప్పం కిరీటంపై కూటమి కన్ను
వైఎస్సార్ సీపీ సభ్యులకు ప్రలోభాలు అధికారం చేపట్టిన టీడీపీ ఎలాగైనా మున్సిపల్ కౌన్సిల్ ఎంపిక కోసం ప్రస్తుతం 9 మంది కౌన్సిల్ సభ్యులతో ఉన్న తెలుగుదేశం పార్టీ మరో ముగ్గురిని పార్టీలోకి లాగేయాలని ప్రలోభాలకు గురి చేస్తోంది. ఓ మహిళా కౌన్సిలర్ కుమారుడికి ఉద్యోగం కల్పిస్తామని ఆశ పెట్టారు. మరో ముగ్గురు కౌన్సిలర్లను బెదిరింపులకు గురిచేస్తున్నట్లు సమాచారం. అందరి దృష్టి కుప్పం చైర్మన్ గిరిపైనే పడింది. టీడీపీ నుంచి ఇద్దరు, వైఎస్సార్ సీపీ నుంచి ఒకరు పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ఎవరు చైర్మన్ అవుతారనే విషయం 28వతేదీన తేలనుంది. -
టైర్ పరిశ్రమలో భారీ పేలుడు
● చెలరేగిన మంటలు ● భయాందోళనకు గురైన గ్రామస్తులు ● త్రుటిలో తప్పిన ప్రమాదం ● తరచూ ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోని వైనం నగరి : మండలంలోని నాగరాజకుప్పం మార్గంలోని దీపం టైర్ పరిశ్రమలో బుధవారం ఉదయం భారీ పేలుడు శబ్దం వచ్చి అగ్ని ప్రమాదం సంభవించింది. అకస్మాత్తుగా భారీగా మంటలు చెలరేగాయి. ప్లాంటుపై ఉన్న ఇనుప రేకులు ఒక్కసారిగా ఎగిరి పొగలు కక్కుతూ పక్కనే ఉన్న రోడ్డుపై పడ్డాయి. ఒక్కసారిగా పెద్ద ఎత్తున పేలుడు సంభవించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్లాంటు పక్కనే ఉన్న రోడ్డులో తరచూ ద్విచక్ర వాహనదారులు సంచరిస్తూ ఉంటారు. అదృష్టవశాత్తు ఆ సమయంలో రోడ్డుపై ఎవరూ ప్రయాణించక పోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కార్మికులు ప్రమాదాన్ని ముందే పసిగట్టి భయటకు వచ్చేయడంతో ఎవరూ గాయపడలేదు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా ఉదాసీనతే.. ఈ పరిశ్రమలో అగ్ని ప్రమాదం ఇది వరకే సంభవించి పేలుడు దాటికి విద్యుత్ స్తంభాలు వంగిపోయిన సంఘటనలు ఉన్నాయి. ఈ ప్లాంటుకు ఆనుకొని నాగరాజకుప్పం, భీరకుప్పం, ఓజీకుప్పం, కృష్ణాపురం గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి ఉంది. ప్లాంటుకు కూతవేటు దూరంలోనే సుమారు 1300 మందికి కేటాయించిన జగనన్న కాలనీ ఉంది. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. టైర్లు కాల్చే దుర్వాసన కాలనీలోని నివాసాల వరకు వ్యాపిస్తోందని. దానిని భరించలేకున్నామని స్థానికులు చెబుతున్నారు. ప్లాంటు పక్కన రోడ్డుపై వెళ్లే సమయంలో ముక్కు మూసుకొని వెళ్లే పరిస్థితి ఉందన్నారు. ప్రస్తుతం మంటలు చెలరేగడంతో దుర్వాసన రెట్టింపైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నివాసాలకు సమీపంగా ఉన్న ప్రమాదకర పరిశ్రమ నివాసాలకు దూరంగా మార్చి తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. మంటలు ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. పేలుడు శబ్ధం వినిపించినా ప్లాంటు యజమానులు మాత్రం షార్ట్ సర్క్యూట్ కారణంగా టైర్లు మండి ప్రమాదం సంభవించిందని తెలుపుతోంది.మండుతున్న టైర్ ప్లాంటు -
ప్రైవేటు చేతికి అస్త్రం
● వాహనాల ఫిట్నెస్ పరీక్ష ప్రైవేటు పరం ● జిల్లాలో ప్రత్యేకంగా టెస్టింగ్ స్టేషన్ ఏర్పాటు ● ప్రభుత్వ ఆదాయానికి గండి ● వాహనాల పరీక్షలపై అనుమానాలు కాణిపాకం : ప్రభుత్వ సేవల్లో అత్యంత ప్రధానమైన, ప్రజలకు ఉపయోగకరమైన సేవలను ప్రైవేటుకు కట్టబెట్టే ప్రక్రియ జరుగుతోంది. రైల్వే శాఖలో పలు సేవలను ఇప్పటికే ప్రైవేటుకు అప్పగించారు. తాజాగా ఆ జాబితాలోకి రాష్ట్ర రవాణా శాఖ కూడా చేరింది. ఇందులో అత్యంత కీలకమైన వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్ల జారీ సేవలను ప్రైవేటు సంస్థకు అప్పగించారు. ఈ మేరకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బదిలీ విధానం వేగంగా సాగిపోయింది. ప్రతి జిల్లాకు ఒక ఆటోమేటెడ్ వెహికల్ ఫిట్నెస్ టెస్టింగ్ స్టేషన్ మంజూరైంది. ఇప్పటి వరకూ రవాణా శాఖ ద్వారా ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకుంటే ఆయా వాహనాలకు ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం చలానా కట్టించుకుని ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చేవారు, ఇకపై లైట్, హెవీ మోటార్ వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్లను ప్రభుత్వం నిర్ణయించిన ప్రైవేటు సంస్థ మాత్రమే జారీ చేస్తుంది. ఈ సంస్థపై స్థానికంగా ఎవ్వరి అజమాయిషీ ఉండదు. కేంద్ర ప్రభుత్వమే నేరుగా పర్యవేక్షిస్తుంది. సర్టిఫికెట్ల జారీ జిల్లా వ్యాప్తంగా వివిధ రకాల వాహనాలు 3,67,008 ఉన్నాయి. వీటికి ఫిట్నెస్ సర్టిఫికెట్ల జారీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా ఒక్కో జిల్లా నుంచి రూ.కోట్లలో ఆదాయం సమకూరేది. దీనిని ప్రైవేటు సంస్థకు అప్పగించడంతో ఆ మేరకు ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది. కేంద్ర ట్రాన్స్పోర్ట్ ఇండియా సలహా మేరకు వాహనాల ఫిట్నెస్ టెస్ట్ కోసం వసూలు చేసిన సొమ్మును ఫిట్నెస్ స్టేషన్లు రెండేళ్ల పాటు తమ సొంతానికి వినియోగించుకోవచ్చు. ప్రభుత్వానికి ఒక్క పైసా చెల్లించనక్కరలేదు. ఈ మేరకు టెండరలలో నిబంధన పెట్టారని చెబుతున్నారు. బంగాపాళ్యం వద్ద టెస్టింగ్ స్టేషన్.. జిల్లాకు సంబంధించి బంగారుపాళ్యం మండలం మహాసముద్రం టోల్గేట్ సమీపాన సుమారు రూ.4.5 కోట్లతో వెహికల్ ఫిట్నెస్ టెస్టింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు. త్వరలో ప్రారంభానికి నోచుకోనుంది. ఈ స్టేషన్లో మెషీనరీతో పాటు 21 మంది సిబ్బంది పనిచేయనున్నారు. వాహనాల ఫిట్నెస్ పరీక్షలు, సర్టిఫికెట్ల జారీ ఇక్కడే జరుగుతాయి. సిబ్బందిని సైతం సంబంధిత ప్రైవేటు ఏజెన్సీ నియమించుకుంటుంది. ఇందులో రాష్ట్ర రవాణాశాఖ అధికారుల ప్రమేయం కాని, అజమాయిషీ కానీ ఏమాత్రం ఉండదు. పారదర్శకత ప్రశ్నార్థకం వాహనాల ఫిట్నెస్ ప్రక్రియ పారదర్శకంగా జరగాలి. అప్పుడే ప్రమాదాల నుంచి గట్టెక్కే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించడం. అన్నీ ప్రైవేటు వ్యక్తులే చేస్తుండటంతో పారదర్శకతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఎటువంటి లోటుపాట్లు లేకుండా టెస్టులు నిర్వహిస్తే మంచిదేనని, తమకు ఎవరూ నియంత్రించలేరంటూ ఎలాపడితే అలా చేస్తే ప్రమాదాలు తప్పవని పలువురు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి..ఈ టెస్టులో మార్పులు చేసి పారదర్శకతను జోడించాలని పలువురు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని వాహన వివరాలు.. ఫిట్నెస్ టెస్ట్ ఇలా.. రోడ్లపై తిరిగే ప్రైవేటు బస్సులు, కార్లు, క్యాబ్, ట్రాక్టర్లు, లారీలు, గూడ్స్ వాహనాలు, ట్యాంకర్లు, స్కూల్ బస్సుల వంటి ప్రతి వాహనానికీ ఫిట్నెస్ టెస్టులు తప్పనిసరి, పసుపు రంగు నంబర్ ప్లేట్ ఉంటే ట్రాన్స్పోర్ట్, తెలుపు రంగు నంబర్ ప్లేట్ ఉంటే నాన్– ట్రాన్స్‌పోర్టు వాహనాలుగా పరిగణిస్తారు. కొత్త వాహనానికి లైఫ్ టైంలో మొదటి ఎనిమిదేళ్లలో ప్రతి రెండేళ్లకోసారి ఫిట్నెస్ టెస్ట్ చేయించాలి. ఎనిమిదేళ్ల తర్వాత ఏడాదికోసారి ఈ పరీక్ష తప్పనిసరి. 15 ఏళ్లకు కండిషన్ చూసి, ఆపేయాలి, స్కూల్ బస్సులకు 15 ఏళ్ల వరకే ఫిట్నెస్ చూస్తారు. తర్వాత వాటిని స్కూల్ బస్సుల కింద వాడకూడదు. ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీని ప్రైవేటు సంస్థలకు అప్పగించడంతో వాహన తనిఖీలు ఎంత వరకూ సక్రమంగా జరుగుతాయనే ప్రశ్న తలెత్తుతోంది. గతంలో రవాణాశాఖ కార్యాలయాల్లో ఫిట్నెస్ పరీక్షలు ప్రహసనంగా జరిగేవి, కొందరు. అధికారులు మామూళ్లు దండుకుని చూసీ చూడనట్లు వ్యవహరించేవారు. దీంతో, ప్రమాదాలు చోటు చేసుకునేవి. ప్రధానంగా స్కూల్ బస్సుల ఫిట్‌నెస్‌లో ఇలాంటి ఘటనలు తరచుగా జరిగేవి. ఇప్పుడు ప్రైవేటు చేతిలో పెడితే అటువంటి పరిస్థితులే ఎదురైతే ఎలాగనే ప్రశ్న వాహనదారులు, ప్రజల్లో ఉత్పన్నమవుతోంది. ప్రైవేటు ఏజెన్సీపై పర్యవేక్షణకు జిల్లాలో ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
మహిళా కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి
చౌడేపల్లె : కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళా కానిస్టేబుల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన చౌడేపల్లె మండలంలోని గోసలకురప్పల్లెలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నాగరాజ , నాగమ్మలకు ముగ్గురు కుమార్తెలు. తండ్రి కొన్నేళ్ల కిందట మృతి చెందగా తల్లి నాగమ్మ, అక్క మంజులతో కలిసి కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వై.లక్ష్మి(34) నివసిస్తున్నారు. చౌడేపల్లె సర్కిల్ కార్యాలయంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న లక్ష్మి ఇటీవల బదిలీల్లో భాగంగా గుడిపల్లె పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. లక్ష్మి భర్త హరి ప్రసాద్ పలమనేరులోని ఓ ప్రవేటు బ్యాంకులో పనిచేస్తున్నాడు. మృతురాలి తల్లి నాగమ్మ, అక్క మంజులతో పాటు కలిసి ఇంట్లో మాట్లాడుతుండగా ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో తన అక్క కుమార్తెతో భర్త సరిగా మాట్లాడలేదని ఎందుకని ప్రశ్నిస్తూ భర్తను కానిస్టేబుల్ లక్ష్మి నిలదీసిందన్నారు. భర్త కుటుంబ సభ్యుల ముందు సమాధానం చెప్పకపోవడంతో కోపంతో హాలులో నుంచి బెడ్ రూములోకి లక్ష్మి కోపంగా వెళ్లి తలుపు గడియ పెట్టుకొందని, ఈక్రమంలో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకొందన్నారు. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ నాగేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కానిస్టేబుల్ మృతికి గల కారణాలపై ఆరా తీశారు. మృతురాలి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతురాలికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. లక్ష్మి మృతితో గోసలకుర్పల్లెలో శోక సంద్రంగా మారింది. -
ఉగ్రదాడి పిరికి చర్య
చిత్తూరు కార్పొరేషన్ : కశ్మీర్లో జరిగిన దాడితో భారతీయుల ఆత్మస్థైర్యం దెబ్బతీయలేరని వైఎస్సార్సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి తెలిపారు. దాడికి కారణమైన వారిని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. ఉగ్రదాడికి నిరసనగా ఆ పార్టీ ఆధ్వర్యంలో నగరంలో రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. బుధవారం జ్యోతిరావుపూలే విగ్రహం నుంచి గాంధీవిగ్రహం వరకు నాయకులతో కలిసి దాడులను ఖండిస్తూ నినాదాలు చేశారు. కాల్పుల్లో 26 మంది చనిపోవడం, 20 మందికి పైగా గాయాలపాలవడం బాధాకరమన్నారు. డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాయత్రీదేవి, మొదలియార్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞానజగదీష్ , మున్సిపల్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిణిరెడ్డి, ఉద్యోగులు, పెన్షనర్ల విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయసింహారెడ్డి మాట్లాడారు. కుటుంబ సభ్యులతో విహారయాత్రకు వెళ్లిన వారిని ఇలా చంపడం అత్యంత హేయమన్నారు. దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి ఇలాంటి పిరికిపింద చర్యలు చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో నాయకులు నగర పార్టీ అధ్యక్షుడు కేపీ శ్రీధర్, గుడిపా మండల పార్టీ అధ్యక్షుడు ప్రకాష్, నాయకులు , ప్రజాప్రతినిధులు సరళమేరి, అంజలిరెడ్డి, ఆను, రజనీకాంత్, అన్బు, లక్ష్మణస్వామి, చల్లాముత్తు, దేవరాజు, శేఖర్, సురేష్, రాజశేఖర్, మనోహర్‌రెడ్డి, స్టాండ్లీ, శివ, చాన్‌బాషా, అల్తాఫ్, అఫ్జల్ఖాన్, చామంతి, రంజిత్, రాజేష్, శాంతి, హరీషారెడ్డి, సెల్వ పాల్గొన్నారు. కశ్మీర్ ఘటనకు నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ పాల్గొన్న విజయానందరెడ్డి, చంద్రశేఖర్ -
మెరిసిన ఆణిముత్యాలు
చిత్తూరు కలెక్టరేట్ : గతంలో ఏ ప్రభుత్వం ఖర్చు చేయని విధంగా వైఎస్సార్సీపీ సర్కారు విద్యాభివృద్ధికి వేల కోట్లు ఖర్చు చేసింది. పేద విద్యార్థులు విద్యనభ్యసించే సర్కారు బడుల్లో సకల సౌకర్యాలు కల్పించారు. దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలుతో పేదింటి పిల్లల చదువులు సమున్నత స్థాయికి చేరాయి. ప్రాథమిక పాఠశాలల్లో స్మార్ట్ టీవీలు, ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ బోధన అందించారు. దీంతో విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యాలు పెరిగాయి. తాజాగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి శభాష్ అనిపించుకున్నారు. కార్పొరేట్‌ను తలదన్నేలా .. ఒక్కప్పుడు కార్పొరేట్ విద్యారంగానికే పరిమితమైన స్టేట్ ర్యాంకులు, మండల ర్యాంకులను ప్రస్తుతం ప్రభుత్వ బడుల విద్యార్థులు కై వసం చేసుకున్నారు. గత ఐదు సంవత్సరాల్లో జిల్లాలో విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు భవిష్యత్ రూపురేఖలను పూర్తిగా మార్చివేశాయి. సీబీఎస్ఈ సిలబస్ , అత్యుత్తమ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపునకు దోహదపడ్డాయి. ప్రభుత్వ బడుల్లో మండలాల వారీగా ఇలా... జిల్లాలోని ప్రభుత్వ బడులకు చెందిన పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. హేమ 592 మార్కులు (మంగళపల్లి జెడ్పీ, బంగారుపాళ్యం), అలేఖ్య 592 మార్కులు(విజయపురం మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్), చందు, మంజుల 590 (బైరెడ్డిపల్లి మండలం, కమ్మనపల్లి గురుకుల), రెడ్డి ప్రసన్న 589 (పుంగనూరు బాలికల పాఠశాల), భావన 588 (పలమనేరు బాలికల పాఠశాల), కుష్ నిహాజ్ 587 (పులిచెర్ల మండలం కల్లూరు జెడ్పీ) , సుష్మశ్రీ 587 (పెద్దపంజాణి మండలం శంకర్రాయలపేట బీసీ గురుకుల), దినీషా 586 (పూతలపట్టు మండలం పి.కొత్తకోట జెడ్పీ), శ్రావణి 586 (కుప్పం మండలం, గరిగశీనేపల్లి జెడ్పీ), రిషిత 585 (రొంపిచెర్ల మండలం ఏపీ మోడల్ స్కూల్), రితిక 584 (వి.కోట మండలం వి.కోట బాలికలు), యోగిత 583 (గంగాధర నెల్లూరు మండలం కాలేపల్లి జెడ్పీ), జయంత్ 583 (ఐరాల మండలం ఎం.పైపల్లి జెడ్పీ), సుదర్శన్ 582 (సదుం మండలం బీసీ గురుకుల), కౌసర్ 582 (చిత్తూరు అర్బన్ డీఈవో కార్యాలయం పక్కనున్న ప్రభుత్వ పాఠశాల), సతీష్ 582 (నగరి మండలం చింతలపట్టెడ జెడ్పీ), విష్ణు 581 (ఎస్ఆర్పురం మండలం ఎస్ఆర్పురం జెడ్పీ), లిఖిత 580 (చౌడేపల్లి మండలం ఏ.కొత్తకోట జెడ్పీ), మేఘన 578 (వెదురుకుప్పం మండలం జక్కదొన జెడ్పీ), భానుప్రకాష్ 577 (సోమలమండలం పెద్దఉప్పరపల్లి జెడ్పీ), ప్రశాంత్ (కార్వేటినగరం మండలం కత్తెరపల్లి), హారతి (గంగవరం మండలం జీఎల్ఎస్ఫార్మ్ జెడ్పీ), భూమిక (యాదమరి మండలం డీకే చెరువు జెడ్పీ) 576 మార్కులు, జ్ణానహర్ష (పెనుమూరు మండలం జెడ్పీ), సబీహా సధాఫ్ (రామకుప్పం మండలం రామకుప్పం బాలికలు జెడ్పీ) 571 మార్కులు, సింధుభార్గవి 568 (గుడిపాల మండలం కేటీపల్లి జెడ్పీ), ఇందుజా (శాంతిపురం మండలం ఏపీమోడల్), స్వప్న (గుడుపల్లి మండల కేంద్రం జెడ్పీ) 567 మార్కులు, అభినయ 563 (పాలసముద్రం మండలం టీఆర్‌పురం జెడ్పీ), మౌనేష్ 554 (తవణంపల్లి మండల కేంద్రంలోని జెడ్పీ), వికాస్ 545 (చిత్తూరు రూరల్ మండలం బీఎన్‌ఆర్‌పేట హైస్కూల్), అనుష్క 542 (నిండ్ర మండల కేంద్రంలోని హైస్కూల్) లో ఉత్తమ ఫలితాలు సాధించారు. ప్రభుత్వ బడుల్లో ఉత్తమ ఫలితాలు ఫలించిన గత సర్కారు సంస్కరణలు ప్రైవేట్‌కు దీటుగా విద్యార్థుల ప్రతిభ పది పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు బంగారుపాళ్యం, విజయపురం మండలాల్లో 592 మార్కులు గుడిపాల మండలంలో అత్యధిక ఉత్తీర్ణత జిల్లా వ్యాప్తంగా పదో తరగతి ఫలితాల్లో 67.06 ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో అత్యధికంగా గుడిపాల మండలం పదో తరగతి విద్యార్థులు 95.6 శాతం ఉత్తీర్ణత సాధించారు. అత్యల్పంగా శ్రీరంగరాజపురం మండలంలో 35.83 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మిగిలిన మండలాల్లో బైరెడ్డిపల్లిలో 66.98, బంగారుపాళ్యం 54.78, చిత్తూరు 75.92, చౌడేపల్లి 64.94, గంగాధర నెల్లూరు 60.09, గంగవరం 73.69, గుడుపల్లి 54.17, ఐరాల 68.77, కార్వేటినగరం 71.12, కుప్పం 61.65, నగరి 67.8, నిండ్ర 66.49, పలమనేరు 70.56, పాలసముద్రం 81.87, పెద్దపంజాణి 70.49, పెనుమూరు 57.51, పులిచెర్ల 54.34, పుంగనూరు 72.61, పూతలపట్టు 85.91, రామకుప్పం 49.78, రొంపిచెర్ల 58.62, శాంతిపురం 57.62, సదుం 85.71, సోమల 75.14, తవణంపల్లి 80.66, వెదురుకుప్పం 70.64, వి.కోట 57.26, విజయపురం 70.71, యాదమరి 64.56 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గత వైఎస్సార్సీపీ సర్కారు పాలనలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధితో పాటు ఎన్నో విప్లవాత్మకమైన విద్యా సంస్కరణలు తీసుకొచ్చారు. ఆ ఫలితం నేడు కనిపిస్తోంది. బుధవారం విడుదలైన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లాలోని సర్కారు బడుల విద్యార్థులు ప్రతిభ చాటారు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తల్లిదండ్రుల కలలను సాకారం చేశారు. ఉత్తమ ఫలితాలు సాధించి మండల టాపర్లుగా నిలిచారు. -
జర్నలిస్టులకు రక్షణేదీ?
చిత్తూరు అర్బన్ : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జర్నలిస్టులకు రక్షణ కరవయ్యిందని, రాష్ట్రంలోని జర్నలిస్టులపై తప్పుడు కేసులు నమోదు చేయడం.. భౌతిక దాడులకు పాల్పడటం పరిపాటిగా మారిందని ఏపీ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) జిల్లా అధ్యక్షుడు లోకనాథన్ పేర్కొన్నారు. ఏలూరు సాక్షి కార్యాలయంపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు దాడి చేయడాన్ని నిరసిస్తూ బుధవారం ఏపీయూడబ్ల్యూజే, చిత్తూరు ప్రెస్‌క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. జిలా అధ్యక్షుడు లోకనాథన్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే చింతమనేని వేధింపులు తాళలేక టీడీపీకి చెందిన దంపతులు మంగళగిరిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడితే.. ఆ వార్త రాసినందుకు సాక్షి కార్యాలయంపై దాడి చేయడం సరైంది కాదన్నారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులు చేస్తూ.. పాత్రికేయ రంగాన్ని భయపెట్టాలని చూడాలనుకోవడం అవివేకమన్నారు. ఈ దాడులకు పాల్పడ్డ కూటమి నేతలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో పాత్రికేయులపై దాడులు జరగకుండా జర్నలిస్టుల రక్షణ కోసం కమిటీను ఏర్పాటు చేసి, దుండగులను శిక్షించే కొత్త చట్టాలను చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుని, జర్నలిస్టులకు రక్షణ కల్పించడానికి అసెంబ్లీలో చట్టాలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ఉపాధ్యక్షుడు ఇషార్ అహ్మద్ మాట్లాడుతూ.. వార్త నచ్చకుంటే ఖండించాలని, వివరణ ఇవ్వాలని.. ఇలా భౌతికంగా దాడులకు పాల్పడటం ఎంత వరకు సమంజసమన్నారు. అనంతరం ఆర్డీఓ శ్రీనివాసులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ప్రెస్‌క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు రమేష్‌బాబు, కాలేశ్వరరెడ్డి, ఏపీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్వి మురళీకృష్ణ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అశోక్‌కుమార్, చిత్తూరు ప్రెస్‌క్లబ్ ఉపాధ్యక్షుడు శివప్రసాద్, పవన్‌కుమార్, గంగాధర నెల్లూరు ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు తిరుమలయ్య, జిల్లా సీనియర్ జర్నలిస్టులు హేమంత్‌కుమార్, శివకుమార్, వీర రాఘవులు నాయుడు, బాలసుందరం, హరీష్, రాజేష్, శ్రీనివాసులు, చిన్న, చంద్రప్రకాష్ పాల్గొన్నారు. ‘సాక్షి’ కార్యాలయంపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి దాడులకు పాల్పడడంపై మండిపడిన సంఘాలు చిత్తూరులో కదం తొక్కిన పాత్రికేయులు -
బాలికలదే హవా
● పదో తరగతి ఫలితాల్లో జిల్లాకు 24వ స్థానం ● సీఎం జిల్లాలో దారుణ ఫలితాలు ● గతేడాది 6వ స్థానం నుంచి 24కు దిగజారిన వైనం ● 67.06 శాతం ఉత్తీర్ణత నమోదు ● 20,796 మందికి 13,946 మంది ఉత్తీర్ణత ● జిల్లా ఫలితాలు విడుదల చేసిన డీఈఓ పదో తరగతి పరీక్షా ఫలితాలు బుధవారం విడుదల కాగా అందులో జిల్లాకు తీవ్ర నిరాశే ఎదురైంది. సీఎం సొంత జిల్లా రాష్ట్రంలో 24వ స్థానంలో నిలిచి అందరినీ విస్మయానికి గురిచేసింది. 67.06 శాతం ఉత్తీర్ణత సాధించి అటు విద్యాధికారులు, ఇటు తల్లిదండ్రులను తీవ్ర నిరాశ పర్చింది. గతేడాది జిల్లా 6వ స్థానంలో ఉండగా నేడు ఏకంగా 24వ స్థానానికి పడిపోవడంతో మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఎం ఇలాఖలో పది ఫలితాలు దారుణంగా పడిపోవడంపై తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఊరట చెందాల్సిన అంశం బాలికలు 73.20 శాతం ఉత్త్తీర్ణత సాధించి జిల్లా పరువు నిలబెట్టారు. జిల్లా ఫలితాలు విడుదల చేస్తున్న డీఈఓ వరలక్ష్మి చిత్తూరు కలెక్టరేట్ : పదో తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను బుధవారం విజయవాడలో రాష్ట్ర విద్యాశాఖమంత్రి లోకేశ్ విడుదల చేశారు. ఈ ఫలితాల్లో చిత్తూరు జిల్లా రాష్ట్రంలో 26 స్థానాల్లో 24వ స్థానంలో నిలిచింది. సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు 24వ స్థానంలో నిలవడం ఆందోళనకు గురి చేసింది. జిల్లాలో పదో తరగతి విద్యార్థులు సాధించిన ఫలితాలను డీఈఓ వరలక్ష్మి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వరరావు, ఎంఈవోలు, సిబ్బంది మురళి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఏటా లాగే ఈ ఏడాది సైతం బాలుర కంటే బాలికలే జిల్లాలో ముందంజలో నిలిచారు. ఫలితాల్లో బాలుర కంటే బాలికలు 11.9 శాతం ఎక్కువ ఉత్తీర్ణతను కై వసం చేసుకున్నారు. దిగజారిన జిల్లా స్థానం. సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు స్థానం పదో తరగతి ఫలితాల్లో దిగజారింది. గత విద్యాసంవత్సరంలో చిత్తూరు జిల్లా స్థానం రాష్ట్రంలో 6వ స్థానం సాధించగా ఈ విద్యాసంవత్సరం 24వ స్థానానికి పడిపోయింది. రాష్ట్రంలో చిత్తూరు జిల్లా స్థానం 67.06 శాతం నమోదైంది. గత విద్యాసంవత్సరం కంటే ఫలితాలు తగ్గడంపై క్షేత్రస్థాయిలో విమర్శలు వెలువెత్తుతున్నాయి. 6,850 మంది ఫెయిల్ జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో 6,850 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. గత విద్యాసంవత్సరం 1826 మంది విద్యార్థులు పరీక్షలు తప్పారు. ఈ విద్యా సంవత్సరం అంత కంటే ఎక్కువగా పరీక్షల్లో ఫెయిల్ కావడం విమర్శలకు తావిస్తోంది. ఈ విద్యాసంవత్సరం జిల్లాలో 20,796 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 13,946 మంది ఉత్తీర్ణత చెందగా 6,850 మంది పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు.సందేహం ఉంటే .. 2025ఉత్తమ ఫలితాల్లోనూ అథమ స్థానమే.. జిల్లా వ్యాప్తంగా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల్లో మొదటి డివిజన్లో 10,096 మంది ఉత్తమ ఫలితాలు సాధించారు. ఈ పరీక్షల్లో 13,946 మంది ఉత్తీర్ణత సాధించగా అందులో మొదటి డివిజన్లో 10,096, రెండో డివిజన్లో 2,562, మూడో డివిజన్లో 1,288 మంది ఉత్తీర్ణత పొంది ఉత్తమ ఫలితాలు సాధించారు. ఈ మూడు డివిజన్ల ఉత్తమ ఫలితాల సాధనలో చిత్తూరు జిల్లా రాష్ట్రంలో 20వ స్థానంలో నిలిచింది. జిల్లా ఫలితాల సమాచారం పరీక్షలు రాసిన బాలురు 10,723 ఉత్తీర్ణత చెందిన బాలురు 6,573ఉత్తీర్ణత శాతం 61.30 శాతంపరీక్షలు రాసిన బాలికలు 10,073 ఉత్తీర్ణత చెందిన బాలికలు 7,373ఉత్తీర్ణత శాతం 73.20 శాతంఫెయిల్ అయిన విద్యార్థులు 6,850పదో తరగతి పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చినా.. బాగా రాసి ఫెయిల్ అయినా.. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. రీ కౌంటింగ్‌కు ఒక్కో సబ్జెక్టుకు రూ.500, రీ వెరిఫికేషన్ కు సబ్జెక్టుకు రూ.1000 చొప్పున మే1వ తేదీ రాత్రి 11 గంటల లోపు చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా ఫెయిల్ అయిన విద్యార్థులకు మే 19వ తేదీ నుంచి మే 28వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు మే 30 వ తేదీ లోపు అపరాధ రుసుం లేకుండా, రూ.50 అపరాధ రుసుంతో మే 1 నుంచి 18 వ తేదీ లోపు పరీక్ష ఫీజును చెల్లించాల్సి ఉంటుందని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. -
కుప్పంలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా
సాక్షి, చిత్తూరు జిల్లా: కుప్పం నియోజకవర్గంలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో టీడీపీ నేతల అరాచకాలు మితిమీరిపోతున్నాయి. పెద్దవంక నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న కానీ అధికారులు పట్టించుకోవడం లేదు. రోజుకు సుమారు 150 టిప్పర్లలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. హంద్రీనీవా పేరుతో అక్రమంగా ఇసుకను అమ్ముకుంటున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.పగలు రాత్రి తేడా లేకుండా అతివేగంతో టిప్పర్లు నడుపుతుండటంతో రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. టిప్పర్ అతివేగంగా రావడంతో ఎదురుగా ద్విచక్ర వాహనంలో వచ్చిన తాము కింద పడటంతో తృటిలో ప్రాణాపాయం తప్పిందని బాధితులు అంటున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. కుప్పంలో అధికార పార్టీకి చెందిన బడా నాయకుడి బావమరిది కనుసన్నల్లో ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. ఆంధ్రా-తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో భారీ ఎత్తున ఇసుక మాఫియా అక్రమ రవాణా చేస్తోంది. -
పేదలకు బియ్యం కోత..!
● జిల్లాలో అరకొరగా బియ్యం సరఫరా ● వేలిముద్రలు వేసుకుని బియ్యం ఇవ్వని వైనం ● ముగిసిన పంపిణీ గడువు కాణిపాకం: కూటమి ప్రభుత్వం పేదల కడుపు కొడుతోంది. డీలర్ల చేతివాటానికి కార్డుదారులను బలి చేస్తోంది. పలుచోట్ల వేలిముద్రలు వేసుకుని బియ్యం ఇవ్వకుండా డీలర్లు చేతులు దులుపుకున్నారు. రేషన్ పంపిణీ గడువు సోమవారంతో ముగియడంతో కార్డుదారులు లబోదిబోమంటున్నారు. అయినా పౌరసరఫరాల శాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. చిత్తూరు జిల్లాలోని 1,390 చౌక దుకాణాల పరిధిలో 5,36,686 రేషన్ కార్డులున్నాయి. వంద శాతం రేషన్ పంపిణీకి మిగులు బియ్యం ఆధారంగా ప్రతి నెలా జిల్లాకు 9 నుంచి 10 టన్నుల రేషన్ బియ్యం అవసరమవుతోంది. అయితే ఈ నెల 8,300 టన్నుల బియ్యం మాత్రమే సరఫరా జరిగింది. కోతలిలా.. జిల్లాలో ఈ నెలకు 9 వేల టన్నుల రేషన్ బియ్యం అవసరం కాగా కేవలం 8 వేల టన్నులు మాత్రమే ప్రభుత్వం సరఫరా చేసింది. వెయ్యి టన్నుల వరకు జిల్లాకు కోత పెట్టింది. ఆ తర్వాత 300 టన్నుల బియ్యాన్ని సరఫరా చేసి చేతులు దులుపుకుంది. ఈ లెక్కన్న 6 షాపులకు సరిపడ బియ్యం ఉందని ప్రభుత్వం సరఫరాను ఆపేసినట్లు అధికారులు చెబుతున్నారు. మరో 40 షాపులకు 10 శాతం బియ్యం సరఫరా చేసినట్లు చెబుతున్నారు. మరికొన్ని షాపులకు 20 నుంచి 30 శాతం వరకు మాత్రమే సరుకు చేరిందని వెల్లడించారు. దీని దెబ్బకు జిల్లా వ్యాప్తంగా రేషన్ పంపిణీ గందరగోళంగా మారింది. కొన్ని చోట్ల రేషన్ సకాలంలో ఇవ్వక ఇబ్బంది పెట్టేశారు. మరికొన్నిచోట్ల కార్డుదారుల నుంచి ముందుగానే వేలిముద్రలు వేసుకుని, బియ్యం వరకు సర్దుబాబు చేశారు. కొన్ని షాపుల్లో వేలిముద్రలు వేసుకుని సరుకులు లేదని చెప్పేశారు. కొంత మంది అసలు రేషన్ రాలేదని తిప్పి పంపించేశారు. సోమవారం సాయంత్రానికి జిల్లా వ్యాప్తంగా 5,36,686 కార్డులదారులగాను 4,69,468 మంది రేషన్ తీసుకున్నట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. ఈ లెక్కన్న 67,218 మంది రేషన్‌కు దూరమయ్యారు. ఐరాలలో మండలంలో ఇలా.. బియ్యం పంపిణీ గడువు ముగిస్తున్నా బియ్యం ఇవ్వకపోవడంతో ఆదివారం ఐరాల మండలం పుల్లూరు గ్రామానికి చెందిన కార్డుదారులు రేషన్ కార్డులు చూపుతూ నిరసన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వీఆర్వో ద్వారా సరుకులు ఇస్తున్నారని.. ఆయన వేలిముద్రలు వేసుకుని సరుకులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. 70 మందికి ప్రతినెలా సరుకులు ఇవ్వడం లేదని తక్షణమే అధికారులు చర్యలు తీసుకుని పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. రెండు నెలలుగా ఇవ్వలేదు.. ప్రభుత్వం ఇచ్చే రేషన్ సరుకులతోనే మూడు ముద్దలు తింటున్నాం. ఆ బియ్యం రెండు నెలలుగా రేషన్ ఇవ్వకపోతే మేం ఎట్టా బతకాలి. డీలర్ షాప్‌కు వస్తే స్టాక్ రాలేదంటున్నారు. బయట ఇదే రేషన్ బి య్యం కేజీ రూ.20 నుంచి రూ.25కు అమ్ముతున్నా రు. సన్నబియ్యం కేజీ రూ. 60 ఆ ధరలు చూస్తేనే మా కడుపులు మండిపోతున్నాయి. –సుధాకర్, పుల్లూరు, ఐరాల మిగులు ఏమైనట్టో.. జిల్లాలో 250 చౌక దుకాణాల పరిధిలో ఈ నెల బియ్యం కొరత వచ్చింది. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిగిన పంపిణీలో సగటున లెక్క వేసి, బియ్యం డీలర్లకు సరఫరా చేశారు. గత నెల మిగులు బియ్యం, తాజాగా సరఫరా అయిన స్టాక్‌తో ఏ సమస్య రాకూడదు. అయితే గత రెండు, మూడు మాసాలుగా బియ్యం కొరత వస్తోందంటున్నారు. దీనికి కారణమేమిటో అధికారులే చెప్పలేకపోతున్నారు. జిల్లాలో రేషన్ వివరాలు ఎంఎల్ఎస్ పాయింట్లు 41 చౌకదుకాణాలు 1390 మొత్తం రేషన్‌కార్డులు 5,36,686 రేషన్ తీసుకున్న కార్డుదారులు 4,69,468 రేషన్ తీసుకోనివారు 67,218 పుంజుకున్న అక్రమ వ్యాపారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలో రేషన్ అక్రమ వ్యాపారం పుంజుకుంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని జిల్లాలో 250 మందిపైగా డీలర్లను తొలగించారు. దీంతో అక్కడి నుంచి ఆరంభమైన అక్రమవ్యాపారం..జోరుగా సాగింది. గత పది నెలల కాలంలో 80 మెట్రిక్ టన్నుల బియ్యం పట్టుబడగా, అందుకు సంబంధించిన వ్యాపారులంతా కూటమి పార్టీకి చెందిన వారే కావడం గమనార్హం. ఇట్టా చేస్తే ఎట్టా... మేము పేదోళ్లం. మా కడుపులు కొడితే ఎట్టా. రేషన్ ఇవ్వకుండా మానేస్తే ఏం చేయాలి..ఏం తినాలి. దీనే నమ్ముకుని బతుకుతుండాం. ఈనెల రేషన్ ఇవ్వకుండా చేస్తే...దిక్కుమొక్కుల లేన్నోళ్లం. ప్రతి నెల ఇది మాదిరిగానే జరిగితే కష్టం. అధికారులు ఓ తూరి మా బతుకులు చూసి రేషన్ ఇచ్చేలా చూడండా. –అదెమ్మ, పుల్లూరు గ్రామం, ఐరాల -
రైతుల రక్తం పీల్చేస్తున్నారు!
● చిత్తూరులో కూటమి పార్టీ దౌర్జన్యాల ‘గేటు’ ● పేదల నుంచి రైతుల వరకు ఇష్టారాజ్యంగా వసూలు ● అడిగే దిక్కులేదు.. అడగాల్సిన అధికారుల మౌనం ● ‘మార్కెట్ గేట్’ పేరిట జనం నుంచి రూ.లక్షల లూఠీ బలవంతపు వసూళ్లు చిత్తూరులో రోడ్లపై చిన్నపాటి వ్యాపారాలు చేసుకునేవారు, రైతుల రక్తాన్ని పీలుస్తూ.. వారి కష్టాన్ని దర్జాగా దోచుకోవడానికి ‘గేటు’ అనే పేరు పెట్టుకున్న కూటమి పార్టీకి చెందిన నాయకులు నడిరోడ్డుపై చేస్తున్న దౌర్జ న్యాలను ప్రశ్నించే దిక్కు కనిపించడంలేదు. ఎక్కడో మారుమూల పల్లెలో పనులు దొరకని రైతులు పండించుకున్న కూరగాయాలను చిత్తూరులో విక్రయించుకుని, నాలుగు రూపాయలు సంపాదించుకోవడాని కి వస్తుంటే.. వాళ్ల రక్తాన్ని పీల్చేస్తున్నారు. చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, గంగాధరనెల్లూరు నియోజకవర్గాల్లోని మండలాల రైతులు, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలకు చెందిన రైతులు చిత్తూరు నగరానికి కూరగాయలను తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. కార్పొరేషన్ అధికారులు నిర్ణయించిన ధరలు కాకుండా.. గేటు కాంట్రాక్టు దక్కించుకున్న వ్యక్తులు ఇష్టారాజ్యంగా బలవంతపు వసూళ్లకు పాల్పడుతూ రైతుల ఉసురు పోసుకుంటున్నారు. తాటి ముంజెలు అమ్ముతున్న వ్యక్తి నుంచి రూ.50 గేటు వసూలు చేస్తున్న కలెక్షన్ బాయ్ ‘‘మండుటెండల్లో కొబ్బరికాయలు అమ్ము తున్న ఈ రైతు పేరు సుబ్రమణ్యం. రోజూ కొబ్బరికాయల కోసం చెట్టు ఎక్కే కొడుకు.. అదే చెట్టు పైనుంచి పడి చనిపోతే, వయసైపోయిన భార్య ను పోషించడానికి, ఈ పెద్దాయనే ప్రస్తుతం చెట్టు ఎక్కి కొబ్బరికాయలు కోసుకొచ్చి చిత్తూరు లో అమ్ముతున్నాడు. ఇందుకోసం ఈ రైతు రోజూ చెల్లిస్తున్న కప్పం రూ.50. వాస్తవానికి కట్టాల్సిన గేటు రూ.20 మాత్రమే.’’ ‘‘రెండు రోజుల కిందట చిత్తూరు ప్రశాంత్ నగర్ వద్ద బలవంతపు గేటు వసూళ్లపై చిత్తూరుకు చెందిన జగ్గా, జంగాలపల్లెకు చెందిన కిరణ్ అనే ఇరువర్గాలు రోడ్లపై కొట్టుకున్నాయి. వా రపు సంతలో గేటు ఎవరు వసూలు చేయాలో తెలియక ఇరువర్గాలు కొట్టుకోవడంతో యాద మరి పోలీసులు కేసులు నమోదు చేశారు.’’ చిత్తూరు అర్బన్: నగరంలో మార్కెట్ గేటు పేరిట కూటమి పార్టీకి చెందిన నేతల బహిరంగ దోపిడీకి పాల్పడుతున్నారు. రోజూ వేలాది మంది రైతులు, రోడ్లపై పూసలు అమ్మేవారు, కూరగాయలు, బొమ్మలు, పండ్లు, ఆకు కూరలు విక్రయించే వారు.. ఇలా ప్రతి ఒక్కరి నుంచి దౌర్జన్యంగా మార్కెటు గేటును వసూలు చేస్తున్నారు. అసలు ఎవరు గేటు చెల్లించాలి..? ఎవరికి మినహాయింపు ఉంది..? తట్టలో వ్యాపారం చేస్తే ఎంత..? బుట్ట పెట్టుకునే వాళ్లు ఎంత ఇవ్వాలి..? అనే ప్రశ్నలకు కార్పొరేషన్ అధికారులు నోరువిప్పి మాట్లాడకపోవడం, కనీసం నగరంలో గేటు ధరలు తెలిపే బోర్డులు పెట్టకపోవడం ఈ దౌర్జన్యాలకు ఊతమిచ్చినట్లవుతోంది. నెలకు రూ.20 లక్షలకు పైనే.. చిత్తూరు నగరానికి ఐదు కిలో మీటర్ల పరిధిలో జరుగుతున్న గేటు దౌర్జన్యకాండను అటు పాలకులు, ఇటు అధికారులు పట్టించుకోవడంలేదు. రోజుకు రూ.60 వేల నుంచి రూ.లక్ష వరకు గేటు వసులు చేస్తున్నారు. నెలకు సగటున రూ.20 లక్షల చొప్పున, ఏటా రూ.2 కోట్లపైనే వసూలు చేస్తున్నారు. గేటు వసూలు చేయడం చట్టవిరుద్ధం కాదు. కానీ వసూలు చేయాల్సిన దానికన్నా ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తుండడమే సమస్యకు కారణం. చాలా మంది రైతులు వాళ్ల కన్నీళ్లను దిగమింగుకుని ఈ గేటు చెల్లిస్తున్నారు. గేటు వసూళ్లల్లో వచ్చిన విభేదాలు నాటి టీడీపీ ప్రభుత్వ హయంలో అప్పటి మేయర్ అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ జంట హత్యలకు కారణమనే విషయం చిత్తూరు ప్రజలకు తెలిసిన బహిరంగ సత్యం. అలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఈ బలవంతపు గేటుకు కళ్లెం వేయాల్సిన అవసరం ఉంది.చిన్న సన్నకారులు రైతులు.. చిన్న కమతాల్లో వ్యవసాయం.. అరకొర దిగుబడులు.. ఆ పంట ఉత్పత్తులు చిత్తూరులో విక్రయం.. వచ్చిన సంపాదనతో జీవనం.. అయితే ఆ బడుగుజీవులనూ కూటమి నేతలు విడవడం లేదు. కాసులపై ఆశతో మార్కెట్ గేట్ పేరిట బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. అడిగే దిక్కులేక పోవడంతో ఆ కర్షకులు కక్కలేక మింగలేక తమకు వచ్చిన అరకొర ఆదాయంలో వారడిగినంత ముట్టజెప్పుతున్నారు. -
రక్తహీనత రహిత సమాజమే లక్ష్యం
గంగాధరనెల్లూరు: రక్తహీనత రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా శిశు సంక్షేమ శాఖ పీడీ వెంకటేశ్వరి అన్నారు. సోమవారం గంగాధర నె ల్లూరు మండలంలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో పౌష్టికాహార పక్షోత్సవాల్లో భాగంగా గర్బిణులు, బాలింతలకు పౌష్డికాహారం ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. పీడీ మాట్లాడుతూ పోషణ్ పక్వాడ్ కార్యక్రమంపై గ్రామాల్లో అవగాహన కల్పించి, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి రక్తహీనత లేని సమాజాన్ని నిర్మూలించాలని సూచించారు. అనంతరం గర్భిణులకు సీమంతాలు నిర్వహించి, చిన్నారులకు పీడీ వెంకటేశ్వరి, సీడీపీఓ వినీతాశ్రీ, అన్నప్రాసన్న చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ హరిప్రసాద్‌రెడ్డి, ఎంఈఓ గుణశేఖర్రెడ్డి, సీహెచ్‌ఓలు శ్రీనివాసులు, జ్ఞానశేఖర్, సర్పంచ్ సుబ్రమణ్యం, పర్యవేక్షకులు అనురాధ, బిందు, మాలతి, నాగరత్నమ్మ, భాగ్యలక్ష్మి, సంగీత పాల్గొన్నారు. -
ఇంటర్ డీఐఈఓగా శ్రీనివాసులు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా ఇంటర్మీడియట్ డీఐఈఓగా ఏ. శ్రీనివాసులు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కోనశశిధర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వుల మేరకు శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూ రు జిల్లా కేంద్రంలో డీకే ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్‌గా విధులు నిర్వహిస్తున్న ఏ శ్రీనివాసులును చిత్తూరు డీఐఈఎగా నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఆయనకు వైఎస్సార్‌కడప జిల్లా ఇంటర్మీడియట్ విద్య ఆర్జేడీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. గతంలో చిత్తూరు డీఐఈఓగా పనిచేస్తున్న సయ్యద్ మౌలా తన పూర్వపు స్థానం కణ్ణన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్‌గా కొనసాగనున్నారు. నూతన డీఐఈఓ త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. వరసిద్ధుడికి రూ.1.77 కోట్ల ఆదాయం కాణిపాకం: వరసిద్ధి వినాయకస్వామివారి ఆలయానికి హుండీల ద్వారా రూ.1.77 కోట్ల ఆదాయం వచ్చిందని ఈఓ పెంచలకిషోర్ తెలిపారు. కాణిపాకంలోని వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో హుండీల్లోత భక్తుల సమర్పించిన కానుకలను సోమవారం ఆలయాధికారులు లెక్కించారు. హుండీల ద్వారా దేవస్థానానికి రూ.1.71,77,943 ఆదాయం వచ్చిందని ఆయన తెలిపారు. అలాగే గోసంరక్షణ హుండీ ద్వారా రూ.13,814, నిత్యాన్నదానం హుండీ ద్వారా రూ.42,436 వచ్చిందన్నారు. 309 యూఎస్ఏ డాలర్లు, 10 యూరోలు, 50 కెనడా డాలర్లు, 5 ఆస్ట్రేలియా డాలర్స్, 4 మలేషియా రింగిట్స్, 135 యూఏఈ దిర్హామ్స్ వచ్చాయన్నారు. బంగారం 165 గ్రాములు, వెండి 1.350 కిలోలు భక్తులు కానుక రూపంలో సమర్పించుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు రవీంద్రబాబు, హరిమాధవరెడ్డి, ధనంజయ, ప్రసాద్, నాగేశ్వరరావు, కోదండపాణి, శ్రీధర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
పోలీసు గ్రీవెన్స్‌కు 55 ఫిర్యాదులు
చిత్తూరు అర్బన్: నగరంలో నిర్వహించిన పోలీసు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో 36 వినతులు అందాయి. చిత్తూరు ఏఎస్పీ రాజశేఖర్‌రాజు స్థానిక ఏఆర్ కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు తీసుకున్నారు. వీటిలో కుటుంబ తగాదాలు, వేధింపులు, మోసాలు, ఇంటి త గాదాలు, భూ తగాదాలు, లావాదేవీలకు సంబంధించిన సమస్యలున్నాయి. పలు ఫిర్యా దులపై అప్పటికప్పుడే వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆయా స్టేషన్ హౌజ్ అధికారులతో మాట్లాడారు. ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి సమస్యపై విచారణ జరిపి, ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే చిత్తూరు పోలీసు శిక్షణ కేంద్రం డీఎస్పీ రాంబాబు సైతం ప్రజల నుంచి ఫిర్యాదులను తీసుకున్నారు. పదో తరగతి ఫలితాలు రేపు చిత్తూరు కలెక్టరేట్ : పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఈ నెల 23వ తేదీన విడుదల చేస్తారని డీఈఓ వరలక్ష్మి వెల్లడించారు. ఆమె సోమవారం విలేకరులతో మాట్లాడారు. 23వ తేదీ ఉదయం 10 గంటలకు ఫలితాలు విడుదల చేస్తారన్నారు. పరీక్షలు రాసిన విద్యార్థులు bre.ap.gov.in మనమిత్ర వాట్సా ప్, లీప్ యాప్‌లలో చూసుకునేలా వెసులుబాటు కల్పించారన్నారు. వాట్సాప్‌లో 95523 00009 నంబర్‌కు ఏజీ (హాయ్) అని మెసేజ్ పంపి రోల్ నంబర్ నమోదు చేస్తే ఫలితాల పీడీఎఫ్‌ను పొందవచ్చని డీఈఓ వెల్లడించారు. -
రాష్ట్ర స్థాయి పరుగు పందెం పోటీల విజేత విక్రాంత్‌రెడ్డి
రొంపిచెర్ల: రాష్ట్రస్థాయి దివ్యాంగుల రన్నింగ్ డేస్ పోటీల్లో రొంపిచెర్ల ఆదర్శ పాఠశాల దివ్యాంగ విద్యార్థి విక్రాంత్ రెడ్డి విజేతగా నిలిచాడు. చిత్తూరు జిల్లా సదుం మండలం ఎర్రాతివారిపల్లెకు చెందిన విక్రాంత్ రెడ్డి రొంపిచెర్ల ఆదర్శ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో సోమవారం జరిగిన దివ్యాంగుల రాష్ట్రస్థాయి పరుగుపందెం పోటీల్లో విక్రాంత్ రెడ్డి విజేతగా నిలిచారని ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ సరళ, భవిత పాఠశాల ఉపాధ్యాయురాలు అములు తెలిపారు. విన్నర్స్‌గా నిలిచిన విద్యార్థి విక్రాంత్ రెడ్డిని పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంఈఓలు ఇందిర, శ్రీనివాసులు, ఉపాధ్యాయులు అభినందించారు. కక్ష కట్టి దాడులు చిత్తూరు రూరల్ (కాణిపాకం):కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కక్షకట్టి దాడులకు పాల్పడుతున్నారని, దౌర్జన్యంగా పెద్దిరెడ్డి కుటుంబంపై తప్పడు కేసులు బనాయిస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి వెంకటరమణ ధ్వజమెత్తారు. చిత్తూరు నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తనయుడు మిథున్‌రెడ్డిపై పెట్టిన తప్పుడు కేసులపై ఎలాంటి ఆధారాలు లేవని, నియోజకవర్గంలో నిజాయితీగా అభివృద్ధికి పాటుపడ్డారన్నారు. కూటమి ప్రభుత్వంవారిపై లేనిపోని నిందలు మోపడమే పనిగా పెట్టుకుందని అన్నారు. వైఎస్సార్సీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టడం మానుకుని, రాష్ట్రాభివృద్ధిపై దృష్టి సారించాలని హితవు పలికారు. ప్రశ్నించే వారిని ఇబ్బంది పెట్టవద్దని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా పదవి ఇవ్వడం పట్ల అధినేత జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డిలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
అయ్యా..సమస్యలు పరిష్కరించండి!
● కలెక్టరేట్లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక ● అర్జీలు స్వీకరించిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ● 258 అర్జీలు నమోదు చిత్తూరు కలెక్టరేట్ : ‘అయ్యా దూర ప్రాంతాల నుంచి ప్రతి సోమవారం కలెక్టరేట్‌కు విచ్చేస్తున్నాం. సమస్యల పరిష్కారం కోసం అర్జీలు ఇస్తూనే ఉన్నాం. అయితే క్షేత్రస్థాయిలో తమ సమస్యలు ఏ మాత్రం పరిష్కారానికి నోచుకోవడం లేదు. సమస్యల పరిష్కారానికి ఇంకెన్ని సార్లు కార్యాలయాల చుట్టూ తిరగాలయ్యా అంటూ అర్జీదారులు ఆవేదన వ్యక్తం చేశారు. దయచూపి తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నారు.’ 258 అర్జీలు నమోదు కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ శాఖలకు సంబంధించి 258 అర్జీలు నమోదయ్యాయి. ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించిన అర్జీలే 213 ఉండడం గమనార్హం. మిగిలిన శాఖలకు సంబంధించి పోలీసు 6, డ్వామా 1, ఆర్అండ్బీ 1, డీఆర్డీఏ 26, డీసీహెచ్ఎస్ 1, మున్సిపల్ కమిషనర్ నగరి 2, డీఎస్ఓ 4, పశుసంవర్థకశాఖ 2, హౌసింగ్ 3 మొత్తం 258 అర్జీలను ప్రజలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు అనుపమ, విజయలక్ష్మి, వెంకటశివ, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. గుడి స్థలం ఆక్రమిస్తున్నారు గుడి స్థలాన్ని కొందరు ఆక్రమణకు ప్రయత్నిస్తున్నా రని గంగాధరనెల్లూరు మండలం పిళ్లారికుప్పం ప్రజలు రామప్ప, సుజిత్ తదితరులు వాపోయారు. వారు మాట్లాడుతూ తమ గ్రామంలో దాదాపు 100 సంవత్సరాల నుంచి శ్రీరామకృష్ణ భజన మందిరం ఉండేదన్నారు. కాల క్రమేణా ఆ మందిరం శిథిలావస్థకు చేరుకోగా భజనమందిరం వెనుక వైపున తాత్కాలికంగా దేవుడి పటాలు ఏర్పాటు చేశామన్నా రు. అక్కడే దూపదీపనైవేద్యాలు సమర్పిస్తున్నామన్నారు. నూతన భభజన మందిరం నిర్మాణానికి తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది సర్వే చేసి, సర్వే నంబర్ 366/1లో 0.04 సెంట్ల భూమిని కేటాయించి హద్దు రాళ్లు నాటారని చెప్పారు. అయితే ఆ భూమిని ప్రస్తుతం ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. ఫీల్డ్ అసిస్టెంట్లంటే చిన్నచూపెందుకు? ఉపాధి హామీ పథకంలో విధులు నిర్వహిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లంటే సర్కారుకు చిన్నచూపెందుకని క్షేత్రసహాయకుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు అన్నామలై ప్రశ్నించారు. ఆ సంఘ నాయకులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. అకారణంగా ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడం అన్యాయమని చెప్పారు. తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే ఈ నెల 28 నుంచి విధులను బహిష్కరించి నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు. ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలి జిల్లాలోని నగరి మండలం నత్తంకండ్రిగ దళితవాడలో 30 ఏళ్లుగా నివాసం ఉంటున్న దళిత కుటుంబాలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. ఆ పార్టీ నాయకులు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఆయన మాట్లాడుతూ నగరిలోని 9వ వార్డులో నెత్తంకండ్రిగ దళితవాడలో నివాసం ఉంటున్న ఇళ్లకు ఇంటిపట్టాలు మంజూరు చేయాలన్నారు. పార్టీ నగరి నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య, చిత్తూరు పట్టణ కార్యదర్శి గోపినాథ్, నాయకులు దాసరి చంద్ర,మణి,విజయ్ కుమార్, నత్తం కండ్రిగ గ్రామ కమిటీ నాయకులు రాజు వేలు,యేసయ్య,హరి తదితరులు పాల్గొన్నారు.ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటున్నారయ్యా! ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటున్నారయ్యా అంటూ వెదురుకుప్పం మండలం యనమలమంద గ్రామానికి చెందిన ప్రజలు గణేష్, మునెమ్మ, గిరి, గోవిందమ్మ తదితరులు వాపోయారు. ఆ గ్రామస్తులు ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఈ మేరకు అర్జీని అందజేశారు. వారు మాట్లాడుతూ వెదురుకుప్పం మండలం యనమలమంద గ్రామం ఆళ్లమడుగు లెక్కదాఖలాలో సర్వే నంబర్ 435/2 లో 2.87ఎకరాల ప్రభుత్వ స్థలం ఉందన్నారు. ఆ స్థలాన్ని గ్రామానికి చెందిన శ్రీరాములురెడ్డి కబ్జా చేస్తున్నారని చెప్పారు. ఈ విషయాన్ని అనేక సార్లు వెదురుకుప్పం తహసీల్దార్‌కు విన్నవించుకున్నా ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆక్రమించుకుంటున్న స్థలాన్ని కాపాడి ఇళ్లు లేని పేదలకు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామానికి చెందిన నరసింహులు, వంశీ, నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. -
కొడుకు చేతిలో గాయపడిన తండ్రి మృతి
– గ్రామస్తుల సహకారంతో అంతిమ వీడ్కోలు చౌడేపల్లె: కొడుకు, కోడలి దాడిలో గాయపడిన తండ్రి మనోవేదనతో మృతి చెందిన ఘటన ఏ.కొత్తకోట పంచాయతీ అంకుతోటపల్లెలో సోమవారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. అంకుతోటపల్లెకు చెందిన చిన్నప్పరెడ్డి(90), రాజమ్మ దంపతులకు కుమారుడు మనోహర్‌రెడ్డి, కోడలు సరస్వతమ్మ ఉన్నారు. కొడుకు,కోడలు కలిసి గత మార్చి 30వ తేదీన చిన్నప్పరెడ్డిని చితకబాదడంతో కాలు విరిగి పోయింది. ఈ ఘటనపై సాక్షిదినపత్రికలో ‘కడుపున పుట్టినోళ్లా...తోడేళ్లా’ అనే శీర్షికన వృద్ధ దంపతుల ధీనగాథపై ప్రత్యేక కథనం ప్రచురితమైన విషయం పాఠకులకు తెలిసిందే. ఈ కథనంపై స్పందించిన ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు చౌడేపల్లె పోలీసులు కొడుకు, కోడలిపై కేసు నమోదు చేశారు. కాగా తీవ్రంగా గాయపడి కాలు విరిగిన చిన్నప్పరెడ్డిను మాజీ సర్పంచ్ విజయకుమార్‌రెడ్డి సహకారంతో గ్రామస్తుల కలిసి మదనపల్లెలో ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. వారం రోజుల క్రితం డిస్చార్జి కాగా ఇంటికి వచ్చిన చిన్పప్పరెడ్డి మనోవేదనకు గురై అస్వస్థకు గురై సోమవారం మృతి చెందాడు. కుటుంబసభ్యులెవరూ సహకరించకపోవడంతో ఇలాంటి కష్టం మరెవరికీ రాకూడదంటూ మృతుడు భార్య రాజమ్మ చేసిన రోదన పలువురిని కలిచివేశాయి. గ్రామస్తుల సహకారంతో అంతిమయాత్ర నిర్వహించారు. రోడ్డు ప్రమాదంలో మదరసా హజ్రత్ మృతి పలమనేరు: చైన్నె– బెంగళూరు జాతీయ రహదారిపై స్థానిక హెచ్‌పీ పెట్రోల్ బంకు వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగమంగళం మదరసా హజ్రత్ సోహైల్ అహ్మద్(35) అక్కడిక్కడే మృతి చెందాడు. పట్టణంలో నుంచి స్కూటీలో నాగమంగళంలోని మదరసాకు వెళతుండగా ఎదురుగా సేలం నుంచి తిరుపతికి వెళుతున్న తమిళనాడు ఆర్టీసీ బస్సు స్కూటీని ఢీకొంది. దీంతో ఆయన తలకు తీవ్ర గాయమై మృతి చెందాడు. ఆయనకు భార్య ముగ్గురు ఆడపిల్లలున్నారు. విషయం స్థానికుల ద్వారా తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. భూసమస్యల పరిష్కారమే ప్రత్యేక అజెండా పలమనేరు: భూ సమస్యల పరిష్కారమే ప్రత్యేక అజెండాగా చేసుకుని వీటి పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపుతామని జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ వెల్లడించా రు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఎస్సీ మణికంఠ చందోలు, జేసీ విద్యాధరి, ఎ మ్మెల్యే అమరనాథరెడ్డితో కలసి గ్రీవెన్స్‌డే నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇక్కడొచ్చిన సమస్యల్లో 95 శాతం రెవెన్యూ సమస్యలే ఉన్నాయన్నారు. వీటి పరిష్కారానికి ఆయా తహసీల్దార్లు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. రానున్న మూడు నెలల్లో ప్రతి సోమవారం ఇక్కడే గ్రీవెన్స్‌డేను నిర్వహించనున్నట్టు తెలిపారు. జిల్లాలో పీజీఆర్ఎస్ ద్వారా 53 వేల వినతులందగా వీటిల్లో 12వేల అర్జీలు కుప్పం నియోజకవర్గంనుంచే ఉన్నాయన్నారు. త్వరలో కుప్పంలోనూ ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు తెలిపా రు. గతంలో పుంగనూరులో జమీందారి వ్యవస్థ, పలమనేరు ప్రాంతంలో కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా ఎక్కువగా సమస్యలున్నాయని ఎమ్మెల్యే అమరనాథరెడ్డి తెలిపారు. -
కూర్చున్నా.. పరిగెడుతున్నా..తింటున్నా..పడుకున్నా..సెల్ చెంతనే ఉండాల్సిందే. ఇది లేని జీవితాన్ని ఊహించడం కష్టసాధ్యంగా మారుతోంది. పిల్లలు పెద్దల ప్రమేయం లేకుండానే గేమ్‌లు ఆడుతున్నారు. తమకు కావాల్సిన ఆటలు డౌన్లోడ్ పెట్టుకుంటున్నారు. ఈ పరిణామం ఆందోళన కలిగిస
● సోషల్ మీడియాకు బానిసలువుతున్న విద్యార్థులు ● పెరిగిన సోషల్ మీడియా వినియోగం ● అనవసర వీక్షణ ● ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పది లక్షలు దాటిన సెల్‌ఫోన్ యూజర్లు ● అతివాడకంతో ఆరోగ్య సమస్యలు తప్పవంటున్న వైద్యులు ఎక్కువ మంది యూట్యూబ్ వీక్షకులే స్మార్ట్‌ఫోన్ వాడుతున్న వారిలో 80 శాతం మంది యూట్యూబ్ చూస్తుండగా, 60 శాతం మంది వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్ర్ట్రాగామ్ను వాడుతున్నట్టు గూగూల్ చేసిన సర్వేలో తేలింది. విద్యార్థులు, యువతలో 50 శాతం మంచి ఆన్లైన్లో గేమ్స్ కోసం సమయాన్ని వెచ్చిస్తున్నారు. మహిళలు పనిపాట చేసుకుంటూ కూడా సీరియళ్లను సెల్లోనే చూసేవారి సంఖ్య పెరుగుతోంది. ఇక చిన్నపిల్లలు సైతం స్మార్ట్‌ఫోన్‌లో కార్టూన్ స్టోరీస్ చూడకుండే ఏడుపు మొదలు పెట్టడం చూస్తూనే ఉన్నాం.పలమనేరు: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో స్మార్ట్ఫోన్ల వినియోగదారుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఎలాంటే.. ఒక నిమిషం చేతిలో సెల్ లేకుంటే బతకలేమన్నట్టుగా తయారయ్యారు నేటి విద్యార్థులతు, పిల్లలు, యువకులు. డ్రగ్స్‌కు బానిసైనట్టు స్మార్ట్‌ఫోన్ కారాగారంలో నేటి తరం బందీలుగా మారారు. ఇప్పుడు పట్టణాలు, పల్లెలనే తేడా లేకుండా స్మార్ట్ఫోన్ల వాడకం విద్యార్థుల్లో ఎక్కువైంది. పిల్లాడు అన్నం తినాలంటే మొబైల్, బడికి రెడీ కావాలంటే మొబైల్, బడి నుంచి రాగానే సెల్‌ఫోన్ చేతిలో పెట్టాల్సిందే. పసిబిడ్డలు సైతం ఏడుపు ఆపాలంటే తల్లిపాలు పట్టడం కంటే చేతిలో సెల్ పెట్టగానే సైలెంట్ అవుతున్నారు. మొబైల్ లేకుంటే మనషులకు బుర్ర కూడా పనిచేయడం లేదు. మితిమీరిన సెల్ వాడకం మనిషి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తున్నా మార్పు రావడం లేదు. ఇప్పటికే చాలామంది వారికి తెలియకనే మానసిక రోగుల్లా మారారు. ఇంకొందరు అనారోగ్యం పాలవుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు స్టార్ట్ఫోన్లకు బానిసలుగా మారిపోవడం తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పది లక్షల స్మార్ట్ఫోన్లు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1990లో కీప్యాడ్ఫోన్ల వాడకం మొదలైంది. తొలుత తిరుపతి, చిత్తూరు, కుప్పం, మదనపల్లెలో రిలయన్స్ మొబైల్ టవర్ల ద్వారా నెట్‌వర్క్‌ను అందిస్తూ సేవలను మొదలు పెట్టారు. ఆపై పలు సెల్ కంపెనీలు మార్కెట్లోని వచ్చాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 8 వేల దాకా సెల్‌ఫోన్ టవర్లున్నాయి. ఉమ్మడి జిల్లా జనాభా 44 లక్షలు కాగా వీరిలో సెల్ఫోన్లు (కీఫ్యాడ్, టచ్ మొబైల్)వాడే వారి సంఖ్య ప్రస్తుతం 10 లక్షలకు చేరింది. గత నాలుగేళ్లుగా సెల్ఫోన్ల వాడకం ఏటా 15 శాతం పెరుగుతున్నట్టు ట్రాయ్(టెలీఫోన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) లెక్కలు చెబుతున్నాయి. స్మార్ట్ఫోన్లను వాడేవారిలో రోజుకు సగటున యువత 4 గంటలు, విద్యార్థులు 2 గంటలు, గృహిణిలు 2 గంటలు, అధికారులు 1.30 నిమిషాలు, పిల్లలు గంటపాటు సమయాన్ని కేటాయిస్తున్నట్టు తెలిసింది. అనారోగ్య సమస్యలు తప్పనట్టే సెల్ చూస్తున్న కారణంగా నిద్రలేమి ప్రధాన సమస్యగా మారుతోంది. దీంతో మనిషి జ్ఞాపకశక్తి, ఏకాగ్రత దెబ్బతింటోందని(డబ్ల్యూహెచ్ఓ) ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వేలో తెలిపింది. శరీరంలో మెలటోనియన్ నిల్వలు నశించి డిప్రెషన్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నిద్రలేమి కారణంగా అధిక బరువు, లావెక్కడం జరుగుతుంది. పిల్లలకు తలనొప్పి, చూపు మందగించి కంటి అద్దాలను వాడాల్సిందే. అలాగే పలు అనారోగ్య సమస్యలు తప్పవు. – మమతారాణి, ఏరియా ఆస్పత్రి సూపరిండెంటెంట్, పలమనేరు మంచి కంటే చెడే ఎక్కువ పుట్టిన పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇప్పుడు సెల్‌ఫోన్ ఓ లోకంలా మారిపోయింది. కొందరైతే కనీసం టూజీబీ ఖాళీ చేస్తే గానీ మనసు కుదుటపడదు. ముఖ్యంగా చిన్నపిల్లలు బడి నుంచి ఇంటికి రాగానే చేతిలో సెల్ ఉండాల్సిందే. విద్యార్థులకు సైతం స్మార్ట్‌ఫోన్ వ్యామోహం పెరిగింది. వీటిని తల్లిదండ్రులు నియంత్రించాలి. ఎక్కువగా సెల్ వాడకంతో మంచికంటే చెడే ఎక్కువ అని గ్రహించి సమాజంలో మార్పు రావాలి. – డాక్టర్ రాజేంద్రరెడ్డి, విశ్రాంత ప్రిన్సిపల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పలమనేరు సోషల్ మీడియా వాడకం పరిస్థితి ఇదీ! ఇటీవల యాన్యువల్ స్టేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ నివేదికలో వెల్లడించిన అంశాలు తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. సోషల్ మీడియా బానిసలైన వారిలో 14 ఏళ్లలోపు పిల్లలు 79 శాతం, 15 నుంచి 20 ఏళ్ల వయసున్న వారిలో 82 శాతం, మహిళలు 75 శాతం ఉండడం కొసమెరుపు. ఇదిగో సాక్ష్యం.. పలమనేరు పట్టణంలో ఇంజినీరింగ్ చదవుతున్న ఓ విద్యార్థిని సెల్‌ఫోన్ అతిగా వాడొద్దని తల్లిదండ్రులు మందలించారు. దీంతో అప్పటికే సెల్‌కు బానిసైన ఆ విద్యార్థి తన గదిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణంలోని పదో తరగతి చదివే బాలికకు సెల్‌ఫోన్ కొన్విలేదని తన చేతిని బ్లేడ్‌తో కోసుకుని ఆస్పత్రి పాలైంది. సెల్ ఇవ్వలేదని ఐదో క్లాస్ చిన్నారి ఇంటి నుంచి పరారయ్యాడు. ఇలాంటి సంఘటనలు జిల్లాల్లో నిత్యకృత్యంగా మారాయి. -
చెక్‌డ్యామ్ ధ్వంసం
శాంతిపురం: రాళ్లబూదుగూరు పంచాయతీలోని సాతు వద్ద ఉపాధి హామీ నిధులతో ని ర్మించిన చెక్ డ్యామ్‌ను గుర్తు తెలియని వ్య క్తులు ధ్వంసం చేశారు. రెడ్డివారిపల్లి నుంచి సాతు కొత్త చెరువుకు నీరు వెళ్లే వంకపై పదేళ్ల క్రితం చెక్ డ్యామ్ నిర్మించారు. ఇక్కడ నీరు నిండితే సమీపంలోని బోర్లలో నీటి మట్టం పెరిగి రైతులకు ఉపయోగంగా ఉండేది. కానీ ఇటీవల ఎవరో చెక్ డ్యామ్‌ను పగులగొట్టినట్టు స్థానికులు గుర్తించారు. చెక్ డ్యామ్‌నకు గండి కొట్టడంతో వర్షాలు కురిసి వంకలో నీరు వచ్చినా రైతులకు ఉపయోగపడని పరిస్థితి ఏర్పడిందని వారు వాపోతున్నారు. అధికారులు స్పందించి చెక్ డ్యామ్ మరమ్మతులు చేసి, దాన్ని ధ్వంసం చేసిన వారిని గుర్తించి శిక్షించాలని వారు కోరుతున్నారు. సీఆర్సీ నిధులు దుర్వినియోగంపై ఫిర్యాదు గుడుపల్లె: ప్రభుత్వ పాఠశాలకు ఏటా ఇచ్చే మెయిన్టెన్స్ గ్రాంట్ నిధులను సీఆర్సీ ఇన్‌చార్జ్‌లు దుర్వినియోగం చేశారని పాఠశాల ఉపాధ్యాయులు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. గుడుపల్లె మండలంలో గుడుపల్లె, శెట్టిపల్లె, పొగురుపల్లె, యామగానిపల్లె, సోడిగానిపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలను 5 క్లస్టర్ పాఠశాలలు ఉన్నాయి. 2024–25 సంవత్సరానికి గాను ఒక్కొక్క క్లస్టర్‌కు రూ.లక్ష వంతున రూ.5 లక్షలు నిధులు మంజూరు చేశారు. ఈ నిధులను క్లస్టరు పాఠశాలకు మెయిటెన్స్ కోసం ఖర్చు చేయాలన్నారు. కానీ గుడుపల్లె క్లస్టర్‌కు సంబంధించిన రూ. లక్ష నిధులు దుర్వినియోగం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. క్లస్టర్ సమావేశం నిర్వహించకుండా ఉపాధ్యాయుల సూచనలు తీసుకోకుండా బినామి బిల్లులు పెట్టారన్నారు. గతంలో నా డు– నేడు కార్యక్రమంలో తీసుకువచ్చిన ఫర్నిచర్, బుక్స్‌లు, మెటీరియల్‌తోపాటు పాత వస్తువులను చూపి, కొత్త బిల్లులు సృష్టించారు. ఈ బిల్లులు ప్రకారం 2024–25 సంవత్సరానికి సంబంధించిన ఈసీలను ఉన్నతాధికారులకు అందించారన్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులు విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
పెనుమూరు..గంజాయి జోరు
● దాణా పేరుతో విచ్చలవిడిగా అమ్మకాలు ● చీకటి పడితే బీడు భూముల్లో ముఠాలు ● పక్క రాష్ట్రాల నుంచి యఽథేచ్ఛగా దిగుమతి ● నిద్ర మత్తులో అధికారులు సాక్షి టాస్క్‌ఫోర్స్ : గంజాయి, మట్కా, గుట్కా వంటి అసాంఘిక కార్యకలాపాలకు పెనుమూరు మండల కేంద్రం నిలయంగా మారింది. మత్తుకు యువత బానిసలై తమ నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. పెనుమూరు మండల కేంద్రంలో కొన్ని నెలలుగా గంజాయి అమ్మకాలు జోరందుకున్నాయి. కొందరు దాణా వ్యాపారం పేరుతో గంజాయి అమ్మకాలు చేస్తూ చాపకింద నీరులా తమ అక్రమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకుంటున్నారు. అలాగే కొన్ని నిత్యావసర సరుకుల దుకాణాల్లో గంజాయి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. పెనుమూరు మండల కేంద్రం చుట్టూ ఉన్న బీడు భూముల్లో చీకటి పడితే చాలు గంజాయి కేంద్రాలుగా మార్చేస్తున్నారు. మహిళలు బహిర్బూమికి వెళ్లాలంటే భయబ్రాంతులకు గురవుతున్నారు. చిత్తూరు జిల్లాకు సమీపంలో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ఉండడంతో అక్రమ వ్యాపారులు కొందరు ప్రయాణికుల్లా ఎవరికీ అనుమానం లేకుండా చేతి సంచులు, కట్టె బ్యాగుల్లో రహస్యంగా ఆర్టీసీ బస్సుల్లో తెచ్చుకుంటున్నట్లు సమాచారం. ఎక్కువగా కర్ణాటక రాష్ట్రం నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గంజాయి మత్తుకు బానిసలైన యువత, విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దుకాణాల్లో తనిఖీలు లేకపోవడంతో అక్రమ వ్యాపారాలు యథేచ్ఛగా సాగిస్తున్నారు. అక్రమ వ్యాపారులు గంజాయితో రూ.లక్షలు గడిస్తూ పెనుమూరును గంజాయి వ్యాపారానికి కేంద్రంగా మారుస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు నిద్రమత్తును వీడి గంజాయి అమ్మకాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
● బాబు జన్మదిన కానుకగా నోటిఫికేషన్ ● దళితులకు, బీసీలకు ఇచ్చే ఉచిత శిక్షణపై మండిపాటు ● తొలిసారిగా సీబీటీ విధానంలో పరీక్షలంటూ మెలిక ● జిల్లాలో 1,478 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఉమ్మడి చిత్తూరు జిల్లా సమాచారం ప్రాథమిక పాఠశాలలు 3,766ప్రాథమికోన్నత పాఠశాలలు 444 ఉన్నత పాఠశాలలు 705ఉమ్మడి జిల్లాలో 1,478 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ చిత్తూరు కలెక్టరేట్ : అధికారంలోకి రాగానే డీఎస్సీ పరీక్షను నిర్వహిస్తామంటూ గత ఎన్నికల సమయంలో టీడీపీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక సీఎంగా ప్రమాణ స్వీకారం రోజున చంద్రబాబు మెగా డీఎస్సీ పరీక్ష ఫైల్‌పై తొలి సంతకం చేశారు. అయితే పరీక్షల నోటిఫికేషన్ జారీ చేయకుండా నెలల తరబడి సాగదీశారు. చివరికి క్షేత్ర స్థాయిలో నిరుద్యోగుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగాయి. తాజాగా ఈనెల 20న చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని ఆర్భాటంగా నోటిఫికేషన్‌ను మంత్రి లోకేష్ విడుదల చేశారు. కాగా సీబీటీ విధానంలో పరీక్షలు నిర్వహిస్తామంటూ మెలిక పెట్టడంతో అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు. నిధులను కాజేసేందుకేనా.. సీబీటీ విధానంలో పరీక్షలు నిర్వహించాలంటే అందుకు సరిపడే సౌకర్యాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కేంద్రాల్లో లేవు. ప్రత్యామ్నాయంగా ప్రైవేట్ ఇంజినీరింగ్, మరికొన్ని కంప్యూటర్ కేంద్రాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రైవేట్ కేంద్రాల్లో సీబీటీ విధానంలో డీఎస్సీ పరీక్షల నిర్వహణకు రూ.కోట్ల కొద్ది బిల్లులు చెల్లించాల్సి వస్తుంది. అదే పాత విధానంలో ఒకే రోజు డీఎస్సీ పరీక్షను ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల కేంద్రాల్లో నిర్వహిస్తే ప్రభుత్వానికి తక్కువ ఖర్చుతో సరిపోయేది. అలా కాకుండా డీఎస్సీ పరీక్షను నెల రోజుల పాటు ఇంజినీరింగ్ కళాశాలల్లో నిర్వహించి నిధులను నొక్కేసేందుకు ప్రణాళిక రచించినట్లు విమర్శలున్నాయి. మొక్కుబడిగా ఉచిత శిక్షణలు డీఎస్సీ పరీక్షకు ఉచిత కోచింగ్ హామీ ప్రకారం నోటిఫికేషన్‌కు కనీసం అయిదు నెలల ముందు శిక్షణ ఇచ్చి ఉంటే నిరుద్యోగులకు ఉపయోగం ఉండేది. ఉచిత కోచింగ్ అంటూ ప్రచారం చేసిందే తప్ప శిక్షణ ఇచ్చిన పాపాన పోలేదు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ప్రారంభించినప్పటికీ 5 మంది అభ్యర్థులు కూడా లేరు. ఎస్సీ అభ్యర్థులకు ఇటీవలే శిక్షణ ప్రారంభించారు. శిక్షణ కేంద్రాల్లో నైపుణ్యం కలిగిన అధ్యాపకులు లేకపోవడంతో అభ్యర్థులు ఉచిత శిక్షణ పై నమ్మకం లేక ప్రైవేట్ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. ఉచిత శిక్షణ లోనూ ప్రభుత్వం నిరుద్యోగులను మోసగించింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రకారం డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేశారు. ఉమ్మడి జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పాఠశాలల్లో వివిధ కేడర్లలో 1,473 పోస్టులను భర్తీ చేయనున్నారు. అధికంగా ఎస్జీటీ పోస్టులు 979 పోస్టులను భర్తీ చేయనున్నారు. మిగిలిన స్కూల్ అసిస్టెంట్ కేడర్‌లో 499 పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఏప్రిల్ 20వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. దళితులను మోసగించింది ఉచిత డీఎస్సీ శిక్షణ ఇస్తామంటూ కూటమి ప్రభుత్వం దళితులను మోసగించింది. దూర ప్రాంతాల్లో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి రొడ్డెక్కేలా చేసింది. ప్రణాళిక ప్రకారం ఎస్సీ నిరుద్యోగులకు ఇవ్వాల్సిన ఉచిత డీఎస్సీ కోచింగ్ ఇప్పించడంలోప్రభుత్వం విఫలమైంది. – నాగరాజు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఇబ్బంది పెట్టడం సరికాదు డీఎస్సీ నిరుద్యోగులను ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం సరికాదు. ప్రమాణ స్వీకారం రోజున సంతకం చేశారు. నోటిఫికేషన్ ఇచ్చేందుకే పది నెలలకు పైగానే సమయం పట్టింది. అభ్యర్థులకు ఇచ్చిన మాట ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉచిత శిక్షణ సక్రమంగా ఇచ్చారా అంటే అదీ లేదు. – శివారెడ్డి, ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి పరీక్షలు నెలరోజులా.. డీఎస్సీ పరీక్షను ఈసారి తొలిసారిగా సీబీటీ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) విధానంలో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని నోటిఫికేషన్లో తెలియజేశారు. సీబీటీ విధానం ప్రకారం పరీక్షలను నెల రోజుల పాటు నిర్వహించనున్నారు. గతంలో ఒక్క రోజులోనే డీఎస్సీ పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించేవారు. ఉద్ధేశపూర్వకంగా ఏదో ఒక మెలిక పెట్టాలనే ఇలా నిర్వహిస్తున్నారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. -
నేడు పలమనేరులో ప్రజాసమస్యల పరిష్కార వేదిక
చిత్తూరు కలెక్టరేట్ : ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) సోమవారం పలమనేరు ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పలమనేరు ఆర్డీఓ కార్యాలయంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రజలు తమ సమస్యలను వినతుల రూపంలో అందజేయాలని కోరారు. నేడు పోలీసు గ్రీవెన్స్చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలోని వన్‌టౌన్ పక్కన ఉన్న ఆర్ముడు రిజర్వు (ఏఆర్) కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (గ్రీవెన్స్‌డే) కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్పీ మణికంఠ చందోలు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు వారి సమస్యలు ఏవైనా ఉంటే తనను నేరుగా కలిసి మాట్లాడొచ్చన్నారు. ఉదయం 10.30 గంటల నుంచి ఇక్కడ ఇచ్చే వినతులు, ఫిర్యాదులను పరిశీలించి చర్యలు చేపడుతామని ఎస్పీ తెలిపారు. ముఖ్యమంత్రా..మజాకా! – సీఎం జన్మదినం.. ప్రత్యేక పూజలకు ఉత్తర్వులా? కాణిపాకం : హవ్వా..నవ్విపోదురుగాక నాకేంటి అనే చందంగా మారింది కూటమి పరిస్థితి.. సీఎం జన్మదినానికి..ప్రత్యేక పూజలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై ఆధ్యాత్మికవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాలు ఇలా.. సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఆదివారం కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ప్రత్యేక గణపతి హోమం చేశారు. ఎమ్మెల్యే మురళీ మోహన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అన్నదానం చేశారు. అయితే సీఎం జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ప్రత్యేక పూజల కోసం ఉత్తర్వులు జారీ చేయడం కాణిపాకంలో చర్చనీయాంశంగా మారింది. ఆలయ చర్రితలో ఇలాంటి ఉత్తర్వులు ఎప్పుడూ లేదంటూ కాణిపాక గ్రామస్తులు, ఉభయదారులు, భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సీఎం చంద్రబాబు.. డీఎస్సీ తొలి సంతకానికే దాదాపు 11 నెలలు సాగదీశారు.. ఇక నిరుద్యోగ అభ్యర్థుల ఒత్తిడి తాళలేక ఎట్టకేలకు బాబు జన్మదిన కానుకగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు. కాగా పరీక్ష ఎప్పడూ ఒకే రోజు నిర్వహించే డీఎస్సీని ఇప్పుడు నెల రోజులు నిర్వహించేలా మెలిక పెట్టారు. ఎందుకు ఇలా చేశారంటే.. ప్రజాధనాన్ని ప్రైవేటు సంస్థలకు దోచిపెట్టడం కోసమే ఇలా జరిపిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. కాగా కనీసం అయిదు మాసాలు ఉచిత డీఎస్సీ శిక్షణ ఇవ్వాల్సిన ప్రభు త్వం కేవలం ప్రచార ఆర్భాటానికే పరిమితం కావడంపై అభ్యర్థులు మండిపడుతున్నారు. -
● పనిచేయని బాలసంజీవని 2.0 ● పూర్వప్రాథమిక విద్య బలోపేతం పేరుతో పనిఒత్తిళ్లు ● సాంకేతిక సమస్యలు పరిష్కరించకుండా కొత్త యాప్‌లు ● పనిచేయని ఫోన్లు వెనక్కి ఇచ్చేందుకు సిద్ధమవుతున్న కార్యకర్తలు ● సెల్ఫోన్ల స్థానంలో ట్యాబ్‌లు ఇవ్వాలని డిమాండ్
జిల్లా సమాచారంకార్వేటినగరం : అంగన్వాడీ కేంద్రాల నుంచి గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు రేషన్ సరుకులను మరింత పకడ్బందీగా పంపిణీ చేయాలని ప్రభుత్వం యాప్‌లో మార్పులు, చేర్పులు చేసింది. అప్పటి నుంచి అంగన్వాడీలకు కష్టాలు మొదలయ్యాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్‌లు మొబైల్ ఫోన్లలో ఇన్స్టాల్ కాక అంగన్వాడీలు అవస్థలు పడుతున్నారు. యాప్‌ల నిర్వహణలో ఉన్న సమస్యలను పరిష్కరించకుండా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు సరుకులు పంపిణీ చేయాలని ఒత్తిడి చేస్తుండటంతో అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తాజాగా బాలసంజీవని 2.0 వెర్షన్‌తో కొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.ఈ యాప్‌లో వర్కర్లు, హెల్పర్లు ఫొటో క్యాప్సర్ చేసి గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం పంపిణీ చేయాల్సి ఉంది. అయితే తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతుండడంతో అంగన్వాడీలు పోషకాహార పంపిణీలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొత్తగా అమల్లోకి వచ్చిన యాప్ సక్రమంగా పనిచేయకపోవడంతో కూటమి ప్రభుత్వం అంగన్వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో పనిని మూడు యాప్‌ల్లో వివరాలు అప్లోడ్ చేయాల్సి ఉండటం, యాప్‌లో సాంకేతిక లోపం కారణంగా పనిచేయకపోవడంతో అవస్థలు పడుతున్నారు. హాజరు ఇలా.. భోజనం ఎలా? ప్రతి రోజు విధిగా ఉదయం 9 గంటలకు, తిరిగి సాయంత్రం 4 గంటలకు ఫేస్ యాప్ వేయాలి. అలాగే వచ్చిన వెంటనే పిల్లల హాజరు ఫొటో తీయాలి. ఎంత మంది హాజరైతే అంత మంది చిన్నారులకు మాత్రమే ఆహారం అందించాల్సి ఉంది. మూడేళ్లల్లోపు చిన్నారులు కావడంతో జిల్లాలోని చాలా అంగన్ఽవాడీ కేంద్రాల్లో ఉదయం 10.30 గంటల వరకు పిల్లలు వస్తూనే ఉంటారు. ముందుగానే యాప్ నమోదు చేసిన కారణంగా తర్వాత వచ్చిన పిల్లలకు ఆహారం అందించేందుకు అవకాశం లేకపోవడంతో వండిన ఆహారాన్నే అందరికి సరిపెట్టాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ సమస్యను అధికారుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కావడం లేదని అంగన్వాడీలు వాపోతున్నారు. పనిచేయని ఫోన్లతో ఇబ్బందులు ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన బాలసంజీవని యాప్ సక్రమంగా పనిచేయడం లేదు. ప్రస్తుతం ఉన్న ఫోన్లలో యాప్ ఇన్స్టాల్ అయినా సర్వర్లు మొరాయిస్తుండటంతో వివరాలు నమోదు చేసేందుకు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయం అంతంత మాత్రంగానే ఉంది. నెట్ లేకపోతే యాప్ ఓపెన్ కావడం లేదు. – విజయ, సీఐటీయూ ఆధ్యక్షురాలు, కార్వేటినగరం ప్రాజెక్టు, శ్రీరంగరాజపురం ట్యాబ్‌లు పంపిణీ చేయాలి బాలసంజీవని 2.0 యాప్‌తో అంగన్వాడీలు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఇచ్చిన మొబైల్ ఫోన్లలో ఈ యాప్ పనిచేయడం లేదు. పాత ఫోన్లను వెనక్కు తీసుకుని ఆ స్థానంలో 5జీ ట్యాబ్‌లు పంపిణీ చేసి అంగన్వాడీలకు యాప్ కష్టాలు తొలగించాలి. యాప్‌ల నిర్వహణతో అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీలు పడుతున్న అవస్థలు తొలగించాలి. – మమత, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి, కార్వేటినగరం ప్రాజెక్టు, కార్వేటినగరం పనిభారం తగ్గించాలి అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలపై పనిభారం అఽధికమైంది. కేంద్రాల్లో యాప్‌ల నిర్వహణతో సతమతమవుతున్నారు. ఈ పనులే కాకుండా ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరు కావాలని ఒత్తిళ్లు చేస్తున్నారు. అరకొర వేతనం ఇస్తూ అంగన్వాడీలతో వెట్టి చాకిరి చేయించడం సరికాదు.అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు వారిపై పనిభారం తగ్గించకుంటే రాబోయే రోజుల్లో ఆందోళనలు చేపడుతాం. – వాడ గంగరాజు, సీఐటీయూ జిల్లా గౌరవాధ్యక్షుడు, చిత్తూరుసెల్ఫోన్లు వెనక్కి తీసుకుని 5జీ ట్యాబ్‌లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న అంగన్వాడీలు అంగన్వాడీ కేంద్రాలు 2420 సీడీపీఓలు 12 మంది మొత్తం కార్యకర్తలు 2420పర్యవేక్షకులు 70 మంది గత ప్రభుత్వంలో పకడ్బందీగా సేవలు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అంగన్వాడీ కేంద్రాల్లో స్మార్ట్ఫోన్ల వినియోగంతో పకడ్బందీగా సేవలు అందాయి. ఆరు యాప్‌లు అమలు చేసి పారదర్శకతకు పెద్దపీట వేసింది. పోషణ ట్రాకర్ యాప్, వైఎస్సార్ సంపూర్ణ పోషణ యాప్, హాట్‌కుక్ యాప్ తదితర యాప్‌లతో ప్రభుత్వం నిత్యం పర్యవేక్షించింది. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల, గర్భిణులు, బాలింతలకు తాగునీరు, మరుగుదొడ్లకు సంబంధించి వినియోగించుకునేందుకు నీరు అందుబాటులో ఉంచింది, లేనిది యాప్ వివరాలు నమోదు చేస్తే ఆర్‌డబ్ల్యూస్ శాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదికన నీటి సమస్య పరిష్కరానికి చర్యలు తీసుకునేలా కృషి చేసింది. గుడ్ల సరఫరాకు ప్రత్యేక యాప్ అందుబాటులోకి తెచ్చి అమలు చేసింది.