
ఇంటర్ కళాశాల అభివృద్ధికి కృషి చేస్తా
– బాధ్యతలు స్వీకరించిన నూతన డీఐఈఓ శ్రీనివాసులు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాల అభివృద్ధికి కృషి చేస్తానని నూతన డీఐఈఓ (జిల్లా ఇంటర్మీడియట్ అధికారి) శ్రీనివాసులు అన్నా రు. గురువారం ఆయన పీసీఆర్ జూనియర్ కళాశాల లోని ఇంటర్మీడియట్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన విలేకరులతో మా ట్లాడారు. రానున్న విద్యాసంవత్సరంలో ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్ల పెంపునకు చర్యలు చేపడతామన్నా రు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న వి ద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేలా కృషి చేస్తామని తెలిపారు. మెరుగైన ఫలితాల సాధనకు ప టిష్ట ప్రణాళికను అమలు చేస్తామన్నారు. అనంతరం ఆయనకు మాజీ డీఐఈఓ సయ్యద్ మౌలా, ప్రిన్సిపల్ శరత్‌చంద్ర, అబ్దుల్ మజీద్, ప్రైవేట్ కళాశాలల నిర్వాహకులు కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు.