breaking news
Chittoor District Latest News
-
దయ చూపండయ్యా!
చిత్తూరు కలెక్టరేట్ : ‘అయ్యా.. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వినతులు ఇస్తూనే ఉన్నాం.. దయ చేసి న్యాయం చేయండి’ అంటూ వివిధ ప్రాంతాలకు చెందిన అర్జీదారులు వేడుకున్నారు. కలెక్టర్ సుమిత్ కుమార్‌గాంధీ, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, ట్రైనీ కలెక్టర్ నరేంద్రపాడేల్ ఎదుట తమ సమస్యల గోడును విన్నవించుకున్నారు. ఇదిలావుండగా పలు సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన ధర్నాలతో కలెక్టరేట్ దద్ధరిల్లింది. వివిధ సమస్యలపై 292 అర్జీలు వచ్చినట్టు కలెక్టరేట్ ఏవో వాసుదేవన్ వెల్లడించారు. కార్పొరేట్ సెలూన్ షాపులను అరికట్టాలి చిత్తూరులో కార్పొరేట్ సెలూన్ షాపులను అరికట్టాలని నాయీ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు వెంకటేష్ డిమాండ్ చేశారు. ఆ సంఘం ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో నాయీ బ్రాహ్మణులు కలెక్టరేట్‌కు విచ్చేసి ధర్నా నిర్వహించారు. చిత్తూరులో అధిక సంఖ్యలో విచ్చల విడిగా కార్పొరేట్ సెలూన్ షాపులు పుట్టుకొస్తున్నాయన్నారు. వీటి వల్ల తమకు అన్యాయం జరుగుతోందన్నారు. ఆత్మహత్యే శరణ్యం పెనుమూరు తహసీల్దార్ వద్దకు ఎన్ని సార్లు తిరిగినా న్యాయం జరడం లేదని, తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యమని పెనుమూరు మండలం, శాతంబాకం గ్రామానికి చెందిన సురేష్, నదియా దంపతులు వాపోయారు. తమకున్న కొంత సాగుభూమికి వెళ్లే దారిని మూసి వేసి అగ్రకులస్తులు దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. మండల రెవెన్యూ అధికారులు ఏకపక్షంగా వ్యవహరించి దళితులమైన తమపై చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలి యాదమరి మండలంలోని బుడితిరెడ్డిపల్లి ముస్లింవాడలో ఉండే మూడు ముస్లిం కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. బుడితిరెడ్డిపల్లి ముస్లింవాడలో ఓ కుటుంబానికి చెందిన ఒక మహిళను పెళ్లి చేస్తుకున్నారనే నెపంతో గ్రామ బహిష్కరణ చేశారన్నారు. కలెక్టర్ జోక్యం చేసుకుని గ్రామ బహిష్కరణకు గురైన బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మునెమ్మకు న్యాయం చేయాలి గంగవరం మండలం, బూడిదిపల్లికి చెందిన దళిత మహిళ మునెమ్మకు న్యాయం చేయాలని కలెక్టరేట్ వద్ద కేవీపీఎస్, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడుతూ గత 50 ఏళ్లుగా మునెమ్మ అనుభవంలో ఉన్న రేకుల షెడ్‌ను ప్రైవేట్ వాహనంతో తొలగించడం దారుణమన్నారు. ఈ సమస్యపై కలెక్టర్ స్పందిస్తూ వారంలోపు సమస్య పరిష్కరించాలని పలమనేరు ఆర్డీవోను ఆదేశించారు. లేని పక్షంలో తానే స్వయంగా వచ్చి బాధితులకు న్యాయం చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. జీతాలు పెంచాలి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న వంట కార్మికులకు జీతాలు పెంచాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ నిత్యావసర ధరల పెరుగుదలకు అనుగుణంగా విద్యార్థులకు ఇచ్చే మెస్ బిల్లులను పెంచాలన్నారు. నాలుగు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న మధ్యాహ్నభోజన కార్మికుల జీతాల బిల్లులను వెంటనే విడుదల చేయాలన్నారు. తమిళనాడు, కర్ణాటకలో జీతాలు పెంచారని, ఏపీలో మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా స్పందించాలని కోరారు. కలెక్టర్‌కు దండం పెట్టి వేడుకుంటున్న అర్జీదారులు గ్రామ బహిష్కరణ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటున్న సీపీఐ నాయకులు -
ఇంత చిన్న చూపా?
చిత్తూరు కలెక్టరేట్ : కూటమి ప్రభుత్వానికి సచివాలయ ఉద్యోగులంటే ఎందుకంత చిన్న చూపని ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ ప్రశ్నించింది. వలంటీర్లు చేయాల్సిన పనులను సచివాలయ ఉద్యోగులతో చేయించడం ఏ మాత్రం భావ్యం కాదని మండిపడింది. డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు కలెక్టరేట్ ప్రధాన గేటు వద్ద బైఠాయించి ధర్నా నిర్వహించింది. అనంతరం కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీకి వినతిపత్రం సమర్పించింది. వలంటీర్ విధులు మాకొద్దు వలంటీర్ల విధులు తమకొద్దని ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ జిల్లా అధ్యక్షుడు వినోద్ తేల్చిచెప్పారు. ఆయన మాట్లాడు తూ తమ న్యాయమైన సమస్యలను కూటమి ప్రభు త్వం పరిష్కరించాలన్నారు. గ్రామ, వార్డు సచివాల య ఉద్యోగులకు ప్రభుత్వం వలంటీర్ పనులు అప్పగించి ఒత్తిడి చేయడం దారుణమన్నారు. సచివాలయ ఉద్యోగులకు కచ్చితమైన జాబ్‌చార్ట్ విడుదల చేయాలన్నారు. ప్రొబేషన్ 9 నెలల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. వివిధ సర్వేల పేరుతో ఒత్తిడికి గురి చేస్తున్నారన్నారు. డోర్ టు డోర్ సర్వేల నుంచి తమకు విముక్తి కల్పించాలన్నారు. ఇంటింటి సర్వేలకు వెళ్తుంటే ప్రజలు ఓటీపీ చెప్పడానికి ఇష్టపడడం లేదన్నారు. డిమాండ్లు పరిష్కరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆ సంఘ సభ్యులు త్యాగరాజు, జానకీరామ్, బాలాజీ, అరుణకుమారి, జయశ్రీ, హరికృష్ణ పాల్గొన్నారు. -
ప్రజల్లోకి ‘సూపర్ జీఎస్టీ .. సూపర్ సేవింగ్స్’
చిత్తూరు అర్బన్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ‘సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్స్’ కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ రవీంద్రనాథరెడ్డి, కమిషనర్ పి.నరసింహప్రసాద్ పిలుపునిచ్చారు. సోమవారం నగరపాలక కార్యాలయంలో ‘సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్’ కార్యక్రమంపై ఆర్పీలు, సీవోలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జాయింట్ కమిషనర్ మా ట్లాడుతూ.. నూతన జీఎస్టీ శ్లాబులు, సేవింగ్స్ పై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నా రు. కార్యక్రమంలో వాణిజ్య పనులు శాఖ డిప్యూటీ కమిషనర్ పరదేశి నాయుడు, అసిస్టెంట్ కమిషనర్ మహేష్‌కుమార్, సహాయ కమిషనర్ ఏ.ప్రసాద్, ఎంహెచ్వో డా.లోకేష్, ఎంఈ వెంకట రామిరెడ్డి, ఇన్చార్జ్ సీఎంఎం గణేష్, పాల్గొన్నారు. -
పోలీసు గ్రీవెన్స్‌కు 41 ఫిర్యాదులు
చిత్తూరు అర్బన్: నగరంలో నిర్వహించిన పోలీసు ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమానికి 41 వినతులు అందాయి. చిత్తూరు నగరంలోని ఏఆర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ మహబూబ్‌బాషా ప్రజల నుంచి వినతులు తీసుకున్నారు. వీటిలో కుటుంబ తగాదాలు, వేధింపులు, మోసాలు, ఇంటి తగాదాలు, భూ తగాదాలు, లావాదేవీలకు సంబంధించిన సమస్యలున్నాయి. ప్రతీ ఫిర్యాదును ఆన్లైన్ చేయడంతో పాటు నిర్ణీత గడువులోపు పరిష్కారమయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పలు ఫిర్యాదులపై వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆయా స్టేషన్ హౌస్ అధికారులతో మాట్లాడారు. ప్రతీ ఫిర్యాదును ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. చిత్తూరు వెస్ట్ సీఐ శ్రీధర్ నాయుడు, వన్‌టౌన్ సీఐ మహేశ్వర సైతం ప్రజల నుంచి ఫిర్యాదులను అందుకున్నారు. ఆధిపత్య రగడ చౌడేపల్లె: ఆలయ ఆవిర్భావ వంశస్తులకు, దాత మధ్య మండలంలోని గాండ్లపల్లె అభయాంజనేయస్వామి దేవస్థానం నిర్వాహక ఆధిపత్య రగడ సాగుతోంది. ఈ వివాదం సోమవారం సత్యప్రమాణాలకు నిలయమైన రాజనాలబండకు చేరింది. పంచాయతీ పరిధిలోని పలు గ్రామాలకు చెందిన ప్రజలు అక్కడికి చేరుకొని నిర్వహణ అర్హతపై చర్చించారు. ఇందులో వెలుగుచూపిన అంశాలు మూడు తరాల క్రితం దుర్గసముద్రం పంచాయతీ పరిధిలోని గాండ్లపల్లెకు చెందిన జమ్మలమడుగు పెద్ద రామాంజులమ్మ, వెంకటస్వామి దంపతులకు ఏళ్ల తరబడి సంతానంలేదు. స్వామీజీ వద్దకు శాస్త్రానికి వెళ్లగా ఆంజనేయస్వామి ఆలయాన్ని నిర్మించి పూజలు చేయాలని సెలవించారు. స్వామీజీ సూచనల మేరకు గ్రామపంచాయతీలోని చెన్నకేశ్వరస్వామి మాన్యం భూమిలో ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి వారి వంశస్తులే ధూపధీప నైవేద్యాలను సమర్పిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణకర్త మనవడు జమ్మల మడుగు హరినాథ్ బాధ్యతలు చూస్తున్నారు. ఇలా ఉండగా 2007లో అదే పంచాయతీకి చెందిన దాత గిరినాథప్రకాష్ గ్రామ పెద్దల వద్ద అనుమతి తీసుకొని ఆలయానికి ప్రాకారం నిర్మించారు. కొంత కాలంగా ఆలయంపై దాత ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తూ కొంతమంది ద్వారా వివాదాలు సృష్టిస్తున్నారు. నిర్వాహకులు, దాత మధ్య వివాదం పెరుగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాకారం నిర్మాణం చేపట్టిన సమయంలోనే పెద్దల సమక్షంలో కలిసి నిజానిజాలను అందరి అభిప్రాయాలను రికార్డు చేశారు. అనాధిగా ఆలయ నిర్మాణానికి కారణమైన వారి వంశుస్తులకే నిర్వహణ భాధ్యత ఉంటుందని అందరూ అభిప్రాయపడ్డారు. గాండ్లపల్లెకు చెంది పుంగనూరులో ఉన్న మాజీ ఎమ్మెల్యే బగ్గిడిగోపాల్, సర్పంచుల సంఘ మండలాధ్యక్షుడు కృష్ణారెడ్డి, సర్పంచ్ సరస్వతమ్మ పాల్గొన్నారు. సెలవులో డీఆర్వో చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) మోహన్‌కుమార్ వ్యక్తిగత పనుల నిమిత్తం సెలవు పెట్టారు. అక్టోబర్ 2 వరకు ఆయన సెలవు పెట్టడంతో ఇన్చార్జి బాధ్యతలను డిప్యూటీ కలెక్టర్ కేడర్ అధికారికి అప్పగించారు. కలెక్టరేట్లో ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ కలెక్టర్ కుసుమకుమారికి ఇన్చార్జ్ డీఆర్వోగా బాధ్యతలప్పగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
కోర్టులో ఉన్న భూమిపై కూటమి నేత పెత్తనం
పెనుమూరు(కార్వేటినగరం): వైఎస్సార్ సీపీ సానుభూమి పరులపై అధికార పక్షానికి చెందిన నాయకులు దౌర్జన్యాలకు పాల్పడుతూ అధికారులను సైతం బెదిరింపులకు గురిచేస్తున్నారని సాతంబాకం రెవెన్యూ లెక్క దాఖలాలోని కొందరు రైతులు సోమవారం పెట్రోల్ క్యాన్‌తో నిరసన వ్యక్తం చేశారు. మహిళా రైతులు మాట్లాడుతూ పెనుమూరు మండలం, సాతంబాకం రెవెన్యూ పరిధిలోని సర్వే నం.39/1లో 1.79 సెంట్లు నాగేశ్వరరావు, భారతి పేరుతో ఉందన్నారు. అలాగే సర్వే నం.40లో 79 సెంట్లు జీఎస్.సుబ్రమణ్యంరెడ్డి పెరుతో ఉందన్నారు. తమ భూములకు ఆనుకుని అదే గ్రామానికి చెందిన కూటమి నేత సురేష్‌కు కొంత భూమి ఉండడంతో ఆ భూమికి దారి కల్పించాలని అధికారులపై దౌర్జన్యం చేస్తున్నాడని ఆరోపించారు. ఈ భూతగాదా ప్రస్తుతం కోర్టులో ఉందన్నారు. అయినప్పటికీ కూటమి నాయకులు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. గ్రామంలో తాము లేని సమయంలో జేసీబీ యంత్రాలతో చదును చేస్తూ అక్రమంగా దారి ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. అడితే తమపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయకుంటే చావే శరణ్యమంటూ పెట్రోల్ క్యాన్‌తో నిరసన తెలిపారు. -
వైభవోత్సవం
బ్రహ్మాండ నాయకుడు శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువలా సాగుతున్నాయి. సోమవారం ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం స్వర్ణరథం, రాత్రి గజవాహనంపై స్వామివారు ఊరేగుతూ భక్తకోటికి దర్శనమిచ్చారు. దేవదేవుని దివ్యమంగళరూపాన్ని దర్శించుకున్న భక్తులు దివ్యానుభూతిని పొందారు. వాహన సేవల్లో కళాకారుల నృత్యాలు, కోలాటాలు, భజన బృందాల సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. భద్రతా సిబ్బంది హడావుడి ఏ మాత్రం తగ్గలేదు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పాల్గొన్నారు. – తిరుమలహనుమంత వాహనంపై కోదండరాముడు మంగళవారం శ్రీ 30 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025సరస్వతీ..నమోస్తుతే! దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఏడో రోజు అయిన సోమవారం బోయకొండ గంగమ్మ చదువుల తల్లి సరస్వతీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. పిల్లలకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం ఉత్సవమూర్తి ఎదుట ఈఓ ఏకాంబరం తోపాటు ఉభయదారులు ప్రత్యేక హోమ పూజలు, పూర్ణాహుతి నిర్వహించారు. చౌడేపల్లె -
ఇన్ని నిబంధనలా?
వైద్య వృత్తిలో ఎదుగుదల లేదంటే పీజీ చదవడం దేనికని పీహెచ్‌సీల వైద్యులు ప్రశ్నిస్తున్నారు. కార్పొరేట్ సంస్థలో చేరే ఉద్యోగికి కూడా ఇన్ని షరతులు ఉండవని వాపోతున్నారు. ఈ నిబంధనలు సడలించాలని కోరుతున్నారు. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పరిధిలో పనిచేస్తున్న వైద్యాధికారులకు 20 ఏళ్లుగా పదోన్నతులు లేవు. వారికి పదోన్నతులిస్తామని ఎన్నికల వేళ అసోసియేషన్ నాయకులకు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కింది. ఇప్పుడు ఆ విషయం ప్రస్తావిస్తే కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటోందని వైద్యులు చెబుతున్నారు. కోవిడ్ వేళ అత్యవసర పరిస్థితిలో చేరి, ప్రాణాలకు తెగించి మరీ రోగులకు వైద్య సేవలందించిన తమపై కూటమి ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. -
న్యాయం గెలిచింది!
పుంగనూరు: అక్రమ మద్యం కేసులో అరెస్టయిన ఎంపీ మిథున్‌రెడ్డికి బెయిల్ రావడంపై జిల్లాలో వైఎస్సార్సీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. కూటమి కుట్రలు, కుతంత్రాలకు కోర్టులు కళ్లెం వేస్తున్నాయని, న్యాయపోరాటంలో అంతిమ విజ యం మిథున్ అన్నదే అని నినాదాలు మిన్నంటించారు. వైఎస్సార్సీపీ జిల్లా మైనారిటీ సెల్ ఇన్చార్జ్ ఫకృద్దీన్షరీఫ్, పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా, మిథున్‌రెడ్డి యువసేన అధ్యక్షుడు రాజేష్ ల ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. సోమ వారం ఎంపీ మిథున్‌రెడ్డికి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేయడంపై పట్టణంలోని బస్టాండ్‌లో గల రాజన్న విగ్రహం వద్ద అభిమానులు మిఠాయిలకు పంపిణీ చేశారు. అలాగే ఇందిరా సర్కిల్లో బాణసంచా పేల్చారు. పట్టణ అధ్యక్షుడు ఇర్ఫాన్, పట్టణ బలిజ సంఘ నాయకుడు కొండవీటి నరేష్, కౌన్సిలర్ కాళిదాసు, నాయకులు అజ్ము, గౌసి, నూర్, మమ్ము, అస్లాంమురాధి, నజీ ర్, అఫ్సర్, జావీద్, బావాజాన్, జవహార్, సిద్ధిక్, ఆయాజ్, నయాజ్, జిమ్ ఇర్ఫాన్, అజిజ్ పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ సంబరాలు పులిచెర్ల(కల్లూరు): ఎంపీ మిథున్‌రెడ్డికి బెయిల్ రావడంపై మండలంలోని వైఎస్సార్సీపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. కల్లూరు నాలుగు రోడ్ల కూడలిలో వైఎస్సార్ విగ్రహానికి నివాళి అర్పించారు. న్యాయం గెలిచిందన్నారు. మండల కన్వీనర్ నాదమునిరెడ్డి, మాజీ జిల్లా ప్రింటింగ్ ప్రెస్ చైర్మన్ గోటూరి మురళీమోహన్‌రెడ్డి, ఎన్ఎస్ రెడ్డి ప్రకాష్, మువ్వల నరశింహులుశెట్టి, రెడ్డి అహమ్మద్, నిరంజన్‌రెడ్డి, చంద్రశేఖరరెడ్డి, రాయల్‌మోహన్, గోవిందరెడ్డి, సౌకత్, మునస్వామి, మునీశ్వర, విజయకుమార్, శ్రీనివాసులు, మునీర్‌ఖాన్, కోదండ సైదుల్లా, అమీన్, రాజారెడ్డి, దేవేంద్రరెడ్డి పాల్గొన్నారు. కల్లూరు: సంబరాలు చేసుకుంటున్న వైఎస్సార్సీపీ నేతలు పుంగనూరు: స్వీట్లు పంపిణీ చేస్తున్న నేతలు మిథున్‌రెడ్డి కడిగిన ముత్యంలా వస్తారు చిత్తూరు అర్బన్: రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డికి న్యాయస్థానం బెయిల్ ఇవ్వడంపై వైఎస్సార్సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త హర్షం వ్యక్తం చేశారు. మిథున్‌రెడ్డి కడిగిన ముత్యంలో బయటకు వస్తారని చెప్పారు. కూటమి చేసే ప్రతి తప్పులను జగన్మోహన్రెడ్డి లెక్కిస్తూనే ఉన్నారన్నారు. -
పట్టాలు తప్పిన రైలు ఇంజిన్
పూతలపట్టు(యాదమరి): పూతలపట్టు మండలం, కొత్తకోట పంచాయతీ పరిధిలోని మోటకంపల్లి వద్ద రైల్వే విద్యుత్ లైన్లు తనిఖీ చేసే రైలింజిన్ అదుపుతప్పింది. వివరాలు.. సోమ వారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో చిత్తూరు–తిరుపతి రైల్వే మార్గంలో విద్యుత్ లైన్ల పరిశీలన నిమిత్తం ఓ ఈహెచ్ఈ ఇన్ఫెక్షన్ కారు వెళ్తోంది. ఇంజిన్ నడుపుతున్న లోకోపైలెట్ అజాగ్రత్త వల్ల పట్టాలు తప్పింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. కాగా ఈ ఘట న కారణంగా ఈ మార్గంలో ప్రయాణించే పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో విధి లేని పరిస్థితుల్లో దారి మళ్లించారు. రైల్వే అధికారులు ఘటనా స్థలికి చేరు కుని మరమ్మతులు చేయిస్తున్నారు. శిక్షణకు హాజరుకావాల్సిందే చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మెగా డీఎస్సీకి ఎంపికై న నూతన టీచర్లు తప్పనిసరిగా శిక్షణకు హాజరుకావాల్సిందేనని డీఈవో వరలక్ష్మి చెప్పారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో డీఎస్సీలో ఎంపికై న నూతన టీచర్లకు అక్టోబర్ 3 నుంచి 10వ తేదీ వరకు శిక్షణ ఉంటుందన్నారు. అభ్యర్థులు అక్టోబర్ 3 ఉదయం 7 గంటలకు తమకు కేటాయించిన శిక్షణ కేందాల్లో హాజరుకావాలన్నారు. వంద శాతం హాజరు తప్పనిసరి అన్నారు. లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్, అపాయింట్మెంట్ ఆర్డర్లను తీసుకురావాలన్నారు. చిత్తూరు జిల్లాలోని ఎస్వీ ఫార్మసీ (ఆర్వీఎస్ నగర్, చిత్తూరు), ఆర్కే పాఠశాల (కట్ట మంచి, చిత్తూరు), ఢిల్లీ పబ్లిక్‌స్కూల్ (చిగురువాడ, తిరుపతి), విశ్వం స్కూల్ (జీవకోన, తిరుపతి), మెడ్జీ స్కూల్ (తిరుపతి), ఆదిశంకర ఇంజినీరింగ్ కళాశాల (బైపాస్‌రోడ్డు, గూడూ రు)లో శిక్షణ ఉంటుందని డీఈవో వెల్లడించారు. -
వైద్య విద్య..అందని ద్రాక్ష
కార్వేటినగరం: కూటమి ప్రభుత్వంలో వైద్య విద్య పేదలకు అందని ద్రాక్షలా మారిందని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. పుత్తూరులోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రభుత్వ వైద్య విద్యను ప్రైవేటు పరం చేసి పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేయడం రివాజుగా మారుతోందన్నారు. 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను తన లబ్ధి కోసం పెత్తందారుల చేతిలో పెట్టిన ఘనత చంద్రబాబుదేనన్నారు. నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రి అయినప్పటికీ ఒక్క మెడికల్ కళాశాలను తీసుకు రాలేక పోయాడని ఎద్దేవాచేశారు. అధికారం చేపట్టిన 15 నెలలకే అన్ని రంగాల అధికారులు, విద్యార్థులు నిరసన సెగలు తెలుపుతున్నా బాధ్యతగల పదవిలో ఉంటున్న చంద్రబాబు పట్టించుకోకపోవడ దారుణమన్నారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్మెంట్లు అన్నీ నిండిపోయాయి. క్యూ కృష్ణతేజ అతిథి గృహం వద్దకు చేరుకుంది. ఆదివారం అర్ధరాత్రి వరకు 79,496 మంది స్వామివారిని దర్శించుకున్నారు 29,591 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.79 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో తిరుమలేశుని దర్శించుకోగలగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలైలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది. సెలవు దినం అయినా.. చిత్తూరు కార్పొరేషన్ : ప్రజల సౌకర్యార్థం ఈనెల 30న ప్రభుత్వ సెలవు దినం అయినప్పటికీ విద్యుత్ బిల్లులు వసూలు కేంద్రాలు పనిచేస్తాయని విద్యుత్ శాఖ ఈఈ మునిచంద్ర తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చిత్తూరు డివిజన్ పరిధిలోని అన్ని వసూలు కేంద్రాలు మంగళవారం యథావిధిగా పనిచేస్తాయన్నారు. -
చెరువు చెప్పదు.. ఆక్రమణ ఆగదు
చెరువులు ఆక్రమణలకు గురవుతున్నా పట్టించుకునే వారు కరవయ్యారు. అధికారులు చెరువుల చుట్టూ శాశ్వత హద్దులు ఏర్పాటు చేయకుండా మొక్కుబడిగా వ్యవహరిస్తున్నారు. చెరువు భూముల్లో మట్టిని, గ్రానైట్ వ్యర్థాలను పోస్తూ టీడీపీ నేతలు అధికార దర్పంతో ఆక్రమణకు పాల్పడుతున్నారు. చిత్తూరు కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో ఉన్న గంగాసాగరం చెరువును ఆక్రమించేస్తున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ సంబంధిత శాఖల అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తూ టీడీపీ కబ్జాదారులకు సహకరిస్తుండడంతో సర్వత్రా విమర్శలు గుప్పుమంటున్నాయి. జిల్లా కేంద్రానికి సమీపంలోని గంగాసాగరం చెరువు ఆక్రమణపై సాక్షి కథనం.. చిత్తూరు కలెక్టరేట్ : రాష్ట్రంలో ఎప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చినా ఆ పార్టీ నేతలు ప్రకృతి వనరులపైనే పడతారు. వాటిని ఆక్రమించడం.. ప్లాట్లు వేసి అమ్ముకోవడం పరిపాటిగా మార్చుకున్నారు. గత ఎన్నికల్లో మళ్లీ కూటమి అధికారంలోకి రావడంతో తమ పంథా మొదలుపెట్టారు. చెరువు ఏదైనా తమదే ఆక్రమణ అనేలా తెగబడుతున్నారు. వీరి ఆక్రమణలకు అంతులేకుండా పోవడంతో భవిష్యత్ రోజుల్లో మనం పుస్తకాల్లో మాత్రమే చెరువుల గురించి చదువుకునే స్థితికి చేరుకునేలా కబ్జాలకు గురవుతున్నాయి. కూటమి సర్కారు పాలనలో చెరువులు యథేచ్ఛగా ఆక్రమణలకు గురవుతున్నాయి. దీంతో చెరువులు పూర్వపు రూపురేఖలు కోల్పోతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా టీడీపీ నేతలు అధికారదర్పంతో చెరువుల ఆక్రమణకు పాల్పడుతున్నారు. చెరువులు ఆక్రమణలతో ఆయకట్టుదారులకు సమీప గ్రామాల ప్రజలకు నీరందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టీడీపీ కబ్జాదారుల ఆక్రమణలపై పలుమార్లు పీజీఆర్ఎస్ (ప్రజాసమస్యల పరిష్కార వేదిక)లో ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ స్పందన లేదు. అధికారుల ఉదాశీనతతో చెరువులు రూపురేఖలు కోల్పోతుండగా తూములు పూడిపోతున్నాయి. కలెక్టరేట్‌కు కూతవేటులో ఆక్రమణ జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌కు కూతవేటులో ఉన్న గంగాసాగరం చెరువు ఎంతో పురాతనమైనది. ఇది జిల్లాలోని ప్రధాన నీటి వనరులలో ఒకటిగా గుర్తింపు పొందింది. గంగాసాగరం చెరువు 45 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా, ఇప్పటికే 15 ఎకరాల వరకు ఆక్రమణకు గురైంది. చెరువు సమీపంలో 125–1 సర్వే నంబర్లో 1975లో డీకేటీ పట్టా ఇచ్చారు. దాన్ని మళ్లీ అధికారులే 1978లో రద్దు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గంగాసాగరం చెరువుపై టీడీపీ నేత కన్ను పడడంతో కబ్జా చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఆ చెరువులో మట్టి, గ్రానైట్ వ్యర్థాలను తీసుకొచ్చి పూడ్చేసి ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చెరువు ఆక్రమణపై పలుమార్లు రెవెన్యూ అధికారుల దృష్టికి అక్కడి స్థానికులు ఫిర్యాదు చేసినా ఏమాత్రం పట్టించుకోని దుస్థితి. కలెక్టర్ ప్రత్యేక దృష్టి వహించి గంగాసాగరం చెరువు ఆక్రమణకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు. కొన్ని ఆక్రమణలు ఇలా.. ఏ చెరువులోనూ సెంటు భూమిని కూడా ముట్టుకునే అధికారం జిల్లా సర్వోన్నత అధికారాలు ఉన్న కలెక్టర్‌కు కూడా లేవు. ప్రజాప్రతినిధులకు సైతం వాటిని ప్రోత్సహించే హక్కు లేదు. ప్రజా ప్రయోజనాల అవసరం కోసం చెరువును ముట్టుకున్నా, దానికి చట్టపరమైన విధి విధానాలకు లోబడే జరగాలి. – చెరువుల పరిరక్షణపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇవి చెరువుల వివరాలు.. జిల్లాలోని చెరువులు 4303 ఆయకట్టు 46,903 ఎకరాలు నీరందుతున్న ఆయకట్టు 20 వేల ఎకరాలు ఆక్రమణకు గురైన చెరువులు 1800 కబ్జాబారిన పడిన విస్తీర్ణం 1147 ఎకరాలు చిత్తూరు నగర పరిధిలో చెరువుల విస్తీర్ణం 630 ఎకరాలు నగర పరిధిలో ఆక్రమణకు గురైన చెరువులు 75 ఎకరాలు -
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం
కుప్పంరూరల్: రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం పాలైన సంఘటన కుప్పంలో వెలుగు చూసింది. తమిళనాడు రాష్ట్రంలో జరిగిన కారు ప్రమాదంలో 17 ఏళ్ల బాలుడు దుర్మరణం పాలవగా, కుప్పం మండలం వెండుగంపల్లి వద్ద జరిగిన ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. వివరాలు ఇలా.. తమిళనాడు ప్రమాదంలో .. కుప్పం పట్టణానికి చెందిన రవికుమార్ ఓ ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం సొంత పనులపై భార్య, కుమారుడు సాత్విక్ (17)తో కలిసి చైన్నెకి వెళ్లాడు. పనులు ముగించుకుని శనివారం రాత్రి కుప్పానికి తిరుగుప్రయాణం అయ్యారు. మార్గమధ్యలో నాట్రంపల్లి వద్ద లారీని వెనుక వైపు నుంచి ప్రమాదవశాత్తు ఢీకొన్నాడు. ఈ ఘటనలో సాత్విక్ (17) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. రవికుమార్, అతని భార్య గాయాలతో బయటపడ్డారు. వెండుగంపల్లి వద్ద ఘటనలో.. కుప్పం మండలం వెండుగంపల్లి వద్ద ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. కుప్పం మండలం గట్టప్పనాయునిపల్లికి చెందిన మునెప్ప (50) ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం సొంత పనులపై బైక్‌లో వెండుగంపల్లి వైపునకు వెళ్లాడు. పైనాసికి క్రాస్ వద్ద మునెప్ప ప్రయాణిస్తున్న బైక్‌ను టాటాఏస్ వేగంగా వచ్చి ఢీకొంది. ప్రమాదంలో మునెప్ప అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. విషయం తెలుసుకున్న స్థానికులు బంధువులకు సమాచారం ఇచ్చి మృతదేహాన్ని కుప్పం ఏరియా ఆస్పత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. -
శ్రీసిటీ మ్యాంగో రిసార్ట్‌కు పురస్కారం
శ్రీసిటీ(సత్యవేడు) : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పర్యాటక రంగం ఎంపిక చేసిన 2024–25 పర్యాటక ఎక్సలెన్సీ అవార్డులలో ‘ఉత్తమ థీమ్–బెస్ట్ రిసార్ట్’ అవార్డును శ్రీసిటీ మ్యాంగో రిసార్ట్ అందుకుంది. ఇక్కడ అమలు చేస్తున్న స్థిరమైన ఆకర్షణీయమైన అతిథ్య సేవలకు గాను ఈ గుర్తింపు దక్కింది. శుక్రవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ప్రపంచ పర్యాటక దినోత్సవం–25 సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు , పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్ , సీనియర్ ప్రభుత్వ అధికారులు హాజరైన కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. మ్యాంగో రిసార్ట్ తరఫున రిసార్ట్ జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు ఈ అవార్డును స్వీకరించారు. శ్రీసిటీలోని సుందర సువిశాల ప్రాంతంలో ఉన్న మ్యాంగో రిసార్ట్ 20 లగ్జరీ కాటేజీలు, 10 సాధారణ గదులను కలిగి ఉంది. ఇక్కడ బస చేసే అతిథులు మంచి ప్రకృతిని వీక్షించడంతో పాటు కయాకింగ్, ట్రెక్కింగ్, సైక్లింగ్ పక్షలను వీక్షించడం వంటి వివిధ రకాల కార్యకలాపాలను ఆస్వాదించవచ్చు. శ్రీసిటీ మ్యాంగో రిసార్ట్‌కు వరుసగా రెండవ సారి అవార్డు దక్కడం విశేషంగా చెప్పవచ్చు. రీసార్టును తీర్చిదిద్దిన విధానాన్ని ప్రశంసించారు. -
గ్రామీణ వైద్యానికి ఆటంకం
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు సమ్మైసెరన్ మోగించారు. సోమవారం నుంచి సమ్మెలోకి వెళ్లడంతో పాటు ఓపీ సేవలకు స్వస్తి పలకనున్నారు. అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఇస్తూ..డిమాండ్ల సాధనకు పిడికిలి బిగించారు. ఈమేరకు ఏపీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ (ఏపీపీహెచ్‌సీడీఏ) నాయకులు నోటీసు సైతం అందజేశారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు జిల్లావ్యాప్తంగా సమ్మె చేపట్టనున్నారు. దీంతో పల్లె వైద్యానికి ఆటంకం ఏర్పడనుంది. చిత్తూరు రూరల్ (కాణిపాకం): గ్రామీణ పని చేసే వైద్యుల విషయంలో ప్రభుత్వం వహిస్తున్న నిర్లక్ష్యం కారణంగా డాక్టర్లు సోమవారం నుంచి సమ్మెలోకి వెళ్తన్నట్లు ప్రకటించారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో సీజనల్ ఫీవర్స్ పట్టి పీడిస్తున్న తరుణంలో డాక్టర్లు సమ్మెలోకి వెళ్తే ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. అయినా కూడా పీహెచ్సీ వైద్యుల డిమాండ్లను పరిష్కరించే దిశగా ప్రభుత్వం చొరవ చూపడం లేదు. జిల్లాలో 50 పీహెచ్‌సీలు, 15 అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. వీటి పరిధిలో దాదాపు 95 మంది వైద్యులు సేవలందిస్తున్నారు. పీహెచ్సీ వైద్యులు పీజీ కోర్సులు చేసేందుకు గతంలో క్లినిక్‌లు 30 శాతం, ఫిజియాలజీ, ఎనాటమీ, ఫార్మసీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్ తదితర నాన్క్లినిక్లకు 50 శాతం సీట్లు ఉండేవి. కూటమి ప్రభుత్వం గతేడాది క్లినిక్‌లు 15 శాతానికి, నాన్ క్లినికల్ 30 శాతానికి తగ్గించింది. అప్పట్లో వైద్యులు ఆందోళనకు దిగడంతో క్లినికల్ 20 శాతానికి పెంచారు. తాజాగా మళ్లీ 15 శాతానికి తగ్గించేసినట్టుగా ఏపీపీహెచ్‌సీడీఏ చెబుతోంది. సీహెచ్‌సీల్లో పనిచేస్తే మూడు, నాలుగేళ్లకే డిప్యూటీ సివిల్ సర్జన్స్‌గా ప్రమోషన్ ఇస్తుంటే 20 ఏళ్లుగా పీహెచ్‌సీల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్‌గా పని చేస్తున్నా పదోన్నతులు రాక సీనియర్ మెడికల్ ఆఫీసర్స్‌గానే మిగిలిపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. సేవలను గుర్తించని కూటమి ప్రభుత్వం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన సర్వేలు, పల్స్ పోలియో, వరదలు, విపత్తుల సమయంలో క్షేత్రస్థాయిలో సేవలందిస్తున్న సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు పదోన్నతులు రావడం లేదని, జాయిన్ అయినప్పుడు ఉన్న కేడర్లోనే రిటైర్డు అవుతున్న పరిస్థితి ఉంటోందని వైద్యులు చెబుతున్నారు. ఇదీ వైద్యుల డిమాండ్.. సర్వీస్‌లోని పీహెచ్సీ వైద్యులకు పీజీ కోటాలో సీట్లను పునరుద్ధరించాలి. టైం బాండ్ ప్రమోషన్స్ కల్పించాలి. మారుమూల ప్రాంతాల్లో పనిచేసేవారికి బేసిక్‌పై 50 శాతం అలవెన్స్, చంద్రన్న సంచార చికిత్స కార్యక్రమానికి రూ.5 వేలు అలవెన్స్ ఇవ్వాలి. కౌన్సెలింగ్ విషయంలో అర్బన్ అండ్ నేటివిటీపై ఆరేళ్ల గడువును ఐదేళ్లకు కుదించాలి. సీజనల్‌కు సమ్మె ఎఫెక్ట్ జిల్లావ్యాప్తంగా సీజనల్ వ్యాధులు ముసురుకుంటున్నాయి. ప్రధానంగా ప్రతి పల్లెజనం విషజ్వరంతో అల్లాడిపోతున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు జ్వరం బారిన పడ్డారు. జేబులో డబ్బులు ఉంటే ఆర్ఎంపీ, ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారు. ఆర్థిక స్థోమత లేనివారంతా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే క్యూకడతారు. ఈ మధ్యకాలంలో జ్వరం కేసులు ఆరోగ్య కేంద్రాలను చుట్టిముడుతున్నాయి. ఇలాంటి తరుణంలో డాక్టర్ల సమ్మె పేద రోగులకు ఇబ్బందికరంగా మారనుంది. ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించి ఆర్థిక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. -
మహాచండీగా బోయకొండ గంగమ్మ
దసరా మహోత్సవాల్లో భాగంగా ఆరవరోజైన ఆదివారం బోయకొండ గంగమ్మ మహాచండీ దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా.. భక్తుల పాలిట వరాలిచ్చే కొంగు బంగారంగా అమ్మవారు ప్రసిద్ధికెక్కారు. అమ్మవారిని పట్టుపీతాంబరాలు, రంగు రంగులపూలు, స్వర్ణాభరణాలతో శత్రు సంహారి మహాచండీ దేవిగా కొలువుదీర్చారు. అమ్మవారి ఉత్సవమూర్తి ఎదుట ఈఓ ఏకాంబరంతో పాటు ఉభయదారులచే అమ్మవారికి ప్రత్యేక హోమ పూజలతో పాటు పూర్ణాహుతి చేశారు. అనంతరం పవిత్ర తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. – చౌడేపల్లె -
వైఎస్సార్సీపీ శ్రేణుల రక్షణకు డిజిటల్ బుక్
నగరి : కూటమి పాలనలో అన్యాయానికి గురైన వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సామాన్య ప్రజల కోసం పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ లాంచ్ చేశారని మాజీ మంత్రి ఆర్కేరోజా స్పష్టం చేశారు. ఆదివారం ఆమె తన నివాస కార్యాలయంలో వైఎస్సార్సీపీ డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్సార్సీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టే వారికి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని భరోసా కల్పించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 15 నెలలుగా అరాచక పాలన సాగుతోందని, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులపై అక్రమ కేసులు పెడుతూ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎప్పటికప్పుడు కోర్టులు అక్షింతలు వేస్తున్నా ఈ ప్రభుత్వానికి బుద్ధి రావడం లేదన్నారు. ఎవరికి అన్యాయం జరిగినా ‘డిజిటల్ బుక్’లో నమోదు చేయవచ్చన్నారు. ‘‘డీబీ.డబ్ల్యూఈవైఎస్‌ఆర్‌సీపీ.కామ్’’ అనే వెబ్సైట్లో గానీ, 040–49171718 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. పార్టీ లీగల్ సెల్ ప్రధానకార్యదర్శి రవీంద్ర, నగరి, పుత్తూరు మున్సిపల్ చైర్మన్లు నీలమేఘం, హరి, వైస్ చైర్మన్లు జయప్రకాష్, శంకర్, బాలన్, జెడ్పీటీసీ పరంధామన్, నిండ్ర, విజయపురం ఎంపీపీలు లత, మంజుబాలాజి, భార్గవి, నగరి, పుత్తూరు, నిండ్ర, విజయపురం, వడమాలపేట మున్సిపల్, మండల అధ్యక్షులు, మండల పార్టీ కమిటీ, అనుబంధ కమిటీ నేతలు పాల్గొన్నారు. -
రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలి
చౌడేపల్లె: రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని, పంటలు బాగా పండాలని, ప్రజలంతా ఆనందంగా జీవనం గడపాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సతీమణి స్వర్ణమ్మ దంపతులు బోయకొండ గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులు అనీషారెడ్డి, బైరెడ్డిపల్లె కృష్ణమూర్తి, కొండవీటి నాగభూషణం, శ్రీనాథరెడ్డి, జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు, జెడ్పీటీసీ సభ్యుడు దామోదరరాజుతో కలిసి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. వీరికి ఆలయ ఈఓ ఏకాంబరం ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయంలో మహాచండీ దేవి అలంకరణలో కొలువుదీరిన అమ్మవారికి పెద్దిరెడ్డి దంపతులు ప్రత్యేక అభిషేక పూజలు, అర్చనలు, చేశారు. అనంతరం హోమ పూజల్లో పాల్గొని, ప్రధాన గర్భాలయం కింద ఉన్న మూలస్థానం, రణభేరి గంగమ్మ అమ్మవార్లకు పూజలు చేశారు. వేదపండితులు పెద్దిరెడ్డి దంపతులకు ఆశీర్వాదం అందించారు. అనంతరం ఈఓ పవిత్ర తీర్థప్రసాదాలతోపాటు అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎంపీపీల సంఘ అధ్యక్షుడు బైరెడ్డిపల్లె రెడ్డెప్ప, పుంగనూరు ఎంపీపీ భాస్కర్‌రెడ్డి, మండల ఇన్చార్జి కొత్తపల్లి చెంగారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు నాగభూషణరెడ్డి, మాజీ ఎంపీపీలు అంజిబాబు, రుక్మిణమ్మ, వైస్ ఎంపీపీ నరసింహులు యాదవ్, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
కిక్కిరిసిన కొండ
గరుడ వాహన సేవ కోసం భక్తులు పోటెత్తారు. తిరుమల కొండ భక్తులతో నిండిపోయింది. ఉదయం నుంచే గ్యాలరీల్లో పడిగాపులు పడ్డారు. ఉదయం మోహినీ వాహన సేవలో పాల్గొన్న భక్తులే ఎక్కడికక్కడ గరుడ వాహన సేవ కోసం నిరీక్షించారు. రెండు లక్షల మంది కూర్చునే విధంగా సిద్ధం చేసిన గ్యాలరీలు మధ్యాహ్నం ఒంటి గంటకే నిండిపోయాయి. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్లలో వేచి ఉండే భక్తులను సుపథం, సౌత్ వెస్ట్ కార్నర్, గోవింద నిలయం నార్త్ వెస్ట్ గేట్, నార్త్ ఈస్ట్ గేట్ల ద్వారా గ్యాలరీల్లోకి అనుమతించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇలా రెండోసారి భర్తీ చేసి భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. సంప్రదాయ నృత్య ప్రదర్శనలో కళాకారులుతిరుమల : అఖిలాండ బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఐదో రోజు ఆదివారం ఉదయం జగద్రక్షకుడైన శ్రీ వేంకటేశ్వరుడు మోహినీ రూపంలో దంత పల్లకీపై శృంగార రసాధి దేవతగా, పక్కనే వెన్న ముద్ద చేతబట్టిన చిన్ని కృష్ణుడితో కలసి హోయ లొలుకుతూ భక్తకోటిని సాక్షాత్కరించారు. కట్టుదిట్టమైన భద్రత తమిళనాడు ఘటన నేపథ్యంలో పోలీసులు, అధికారులు తిరుమల భద్రతను మరింత పెంచారు. గరుడ వాహన సేవలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఎస్పీ సుబ్బరాయుడు పటిష్ట భద్రతను కల్పించారు. పరిమిత సంఖ్యలోనే భక్తులను గ్యాలరీల్లోకి అనుమతించారు. అధిక సంఖ్యలో భక్తులు ఆలయ వీధుల్లోకి రాకుండా కట్టడి చేశారు. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో నడిచి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, ఆలయ సిబ్బంది అప్రమత్తతో భక్తులకు త్వరగా దర్శనం కల్పించారు. ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల అనుమతి లేకపోవడంతో భక్తులు ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ ట్యాక్సీల్లో తిరుమలకు రావాల్సి వచ్చింది. గరుడోత్సవంలో భాగంగా కళాకారుల ప్రదర్శనమురుగన్ వేషధారణభక్తులను నియంత్రిస్తున్న పోలీసులుబారులు తీరిన వాహనాలువైభవంగా శ్రీవారి గరుడ సేవ -
రేబిస్‌తో బీకేర్‌ఫుల్
చిత్తూరు రూరల్ (కాణిపాకం): రేబిస్‌తో బీకేర్‌ఫుల్ అని జిల్లా పశుసంవర్థకశాఖ జేడీ ఉమామహేశ్వరి సూచించారు. చిత్తూరు నగరంలోని జిల్లా పశు వైద్యశాలలో ఆదివారం ప్రపంచ రేబిస్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా కుక్కలకు వ్యాధి నిరోధక టీకాలు వేశారు. అనంతరం యజమానులకు పెంపుడు కుక్కల సంరక్షణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. ప్రతి యజమాని తమ పెంపుడు కుక్కలకు విధిగా టీకాలు వేయించాలన్నారు. కుక్కలను బయటికి తీసుకెళ్లేటప్పుడు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పెంపుడు కుక్కల వల్ల ఇరుగుపొరుగు వారికి ఇబ్బంది లేకుండా చూసుకోవాలన్నారు. కుక్క కరిస్తే ప్రజలు వెంటనే టీకాలు వేయించుకోవాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో ఎపిడిమాలజిస్ట్ శ్రీవాణి, పశుసంవర్థకశాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. 1,276 కుక్కలకు టీకాలు ప్రపంచ రేబిస్ డేలో భాగంగా జిల్లావ్యాప్తంగా 1,276 పెంపుడు కుక్కలకు టీకాలు వేసినట్లు జిల్లా పశుసంవర్థకశాఖ జేడీ ఉమామహేశ్వరి తెలిపారు. 33 మండలాల పరిధిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. సాయంత్రానికి 1276 కుక్కలకు వ్యాధి నిరోధక టీకాలు వేశామన్నారు. -
మీకు అండగా ఉండేందుకే డిజిటల్ బుక్
కార్వేటినగరం: కూటమి ప్రభుత్వంలో దౌర్జన్యాలు, అక్రమ అరెస్టులు పెరిగిపోయాయని, అందుకే అన్యాయానికి గురైన వైఎస్సార్సీపీ కార్యకర్తలకు అండగా ఉండేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డిజిటల్ బుక్ ఆవిష్కరించారని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి అన్నారు. ఆదివారం ఆయన పుత్తూరులోని తన నివాసంలో నాయకులతో కలిసి డిజిటల్ బుక్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను పార్టీ కేంద్ర కార్యాలయానికి రికార్డులతో చేరవేయడానికి జననేత జగనన్న ఎంచుకున్న బాణం డిజిటల్ బుక్ అని అన్నారు. డిజిటల్ బుక్‌లో నమోదు చేసే ప్రతి సమస్యను అధికారం చేపట్టిన వెంటనే పరిష్కరించడం జరుగుతుందని జగనన్న కార్యకర్తలకు భరోసా ఇస్తున్నారని చెప్పారు. ఎవరైనా ఇబ్బందులు పెడితే 040–49171718 నంబర్‌కు కాల్ చేసి తమ సమస్యలు చెప్పవచ్చన్నారు. వైఎస్సార్సీపీ విజయానికి నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా కలసికట్టుగా పని చేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. డిజిటల్ బుక్‌పై గ్రామ స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించి కూటమి ప్రభుత్వం చేపడుతున్న ఆగడాలను ఎండగట్టాలన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్లు, ఎంపీపీలు, మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిలిపివేయాలి
చిత్తూరు కలెక్టరేట్ : కూటమి ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిలిపివేయాలని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు సూర్యప్రతాప్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం కలెక్టరేట్ వద్ద వైఎస్సార్సీపీ జిల్లా లీగల్ సెల్ ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. వైఎస్సార్సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ.. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు కూటమి ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ విడుదల చేయడం దారుణమన్నారు. పీపీపీ పద్ధతిలో కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను అప్పగించడం సబబు కాదని విమర్శించారు. 2019–2024 సంవత్సరాల్లో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందన్నారు. వాటిలో 5 కళాశాలలు 2023–24 విద్యాసంవత్సరం నుంచి ప్రారంభం అయినట్లు తెలిపారు. ఆ కళాశాలల్లో 750 సీట్లతో మెడికల్ విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించారన్నారు. జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉండాలనే ఉద్దేశంతో గత సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక మెడికల్ కళాశాలను స్థాపించారన్నారు. కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు నిధుల కొరత అనే కుంటి సాకుతో ప్రారంభించకుండా ప్రైవేటీకరణ చేయడం దారుణమన్నారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 12 మెడికల్ కళాశాలలకు నిధులు కేటాయించకుండా కూటమి ప్రభుత్వం కుంటి సాకులతో ప్రైవేటీకరణ చేస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల కాలంలో రెండు లక్షల కోట్లను అప్పుచేసి అమరావతి రాజధాని నిర్మాణానికి 70 వేల కోట్ల టెండర్లను పిలిచిందని విమర్శించారు. ప్రజలకు మేలు కలిగే 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు కూటమి ప్రభుత్వం నిధులు కేటాయించడం విఫలమైందని ఆరోపించారు. కార్పొరేట్ వ్యక్తులకు అప్పజెప్పేందుకే.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ఎలాగైనా కార్పొరెట్ వ్యక్తులకు అప్పజెప్పాలనే కుట్రతోనే కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణకు శ్రీకారం చుట్టిందని రాష్ట్ర లీగల్ సెల్ మెంబర్లు సుగుణశేఖర్‌రెడ్డి, గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. వారు మాట్లాడుతూ.. గతంలో చంద్రబాబు పాలనలో ఒక్క మెడికల్ కాలేజీని స్థాపించలేకపోయారన్నారు. కూటమి ప్రభుత్వం వ్యక్తిగత స్వాలాభం కోసం కుట్రలు చేసి ప్రైవేటీకరణ చేస్తోందని మండిపడ్డారు. నిర్మాణ దశలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాలను పూర్తి చేసేందుకు రూ.5 వేల కోట్లు పెడితే సరిపోతోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారన్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రైవేటీకరణకు అడుగులు వేస్తున్నారని విమర్శించారు. రూ.8 వేల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు లీజుకు ఇవ్వడం దోచుకునేందుకేనని విమర్శించారు. కూటమి ప్రభుత్వం తన తీరును మార్చుకోకపోతే న్యాయపరంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీకి వినతిపత్రం అందజేసి ప్రైవేటీకరణ సమస్యలను విన్నవించారు. నిరసన కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ జిల్లా జాయింట్ సెక్రటరీలు దివాకర్‌రెడ్డి, గౌమతి, ఉదయ్‌భాను, చిత్తూరు నియోజకవర్గం అధ్యక్షులు చక్రవర్తిరెడ్డి, జీడీ నెల్లూరు నియోజకవర్గం జాయింట్ సెక్రటరీ హరిబాబు, పలమనేరు నియోజకవర్గం అధ్యక్షులు సోమశేఖర్‌రెడ్డి, సెక్రెటరీలు కృష్ణమూర్తి, ఇషాద్, నగరి నియోజకవర్గం అధ్యక్షులు బాబు, సెక్రెటరీ నాగరాజు, మెంబర్ తిరుమలయ్య, పలమనేరు కార్పొరేషన్ లీగల్ సెల్ మెంబర్ హరికృష్ణారెడ్డి, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. -
కాసుల‘గుట్టలు’
జిల్లాలో అక్రమ క్వారీలు సవారీ చేస్తున్నాయి. మైనింగ్ అనుమతులకు తూట్లు పొడుస్తున్నారు. కూటమి నేతలు కసితీరా గుట్టలను కొల్లగొట్టి దోచేస్తున్నారు. అక్రమాలకు కూటమిలో ని కొందరు బడా నేతలు, ప్రజాప్రతినిధులు బ్రాండ్ అంబాసి డర్లుగా నిలిచారు. వీరిచ్చే అనుమతులకు ప్రతిఫలంగా లక్ష లు జేబులోకి వెళ్తోంది. దీనిపై మైనింగ్ శాఖ అధికారులు చో ద్యం చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కూటమిలోని సీనియర్ నేతలు మైనింగ్ మాఫియా విషయాన్ని సీఎం చెంతకు తీసుకెళ్లారనే విషయం జిల్లాలో ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. సాక్షి టాస్క్‌ఫోర్స్ : జిల్లాలో 400 వరకు క్వారీలకు అనుమతులున్నాయి. వీటిలో చాలా క్వారీలు జోరుగా నడుస్తున్నాయి. ఇందులో 200 క్వారీలు కాసులు కుమ్మరిస్తున్నాయి. మిగిలిన వాటిలో కొన్ని నాసిరకం, క్రాక్‌లు, ఆర్థిక కష్టాల కారణంగా నిలిచాయి. మరికొన్ని మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. అయితే దీనికి దీటుగా అక్రమ క్వారీలు వెలుస్తున్నాయి. చిత్తూరు, గంగాధర నెల్లూరు, వెదురుకుప్పం, పాలసముద్రం, కుప్పం, ఎస్ఆర్పురం, యాదమరి, జీడీనెల్లూరులో విచ్చలవిడిగా కొండలు ఛిద్రమవుతున్నాయి. బంగారుపాళ్యంలో అధికారాన్ని అడ్డుపెట్టి ఎత్తులు వేశారు. దీంతో అక్కడ నల్లబంగారమే అక్రమ గనులకు రూ.కోట్లు తెచ్చి పెడుతున్నాయి. అనుమతులు ఇలా.... క్వారీ నడపాలంటే తొలుత మైనింగ్ శాఖ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. రెవెన్యూ, అటవీశాఖ అధికారుల నుంచి ఎన్ఓసీ తీసుకోవాలి. ఆ దరఖాస్తు మేరకు మైనింగ్ శాఖ అధికారులు సర్వే చేసి విజయవాడకు పంపుతారు. దీంతో అక్కడి నుంచి ఎల్ఓఐ (లెటర్ ఆఫ్ ఇండెంట్) వస్తుంది. అనంతరం మైనింగ్ ఫ్లానింగ్, ఈసీ, పొల్యూషన్ సర్టిఫికేట్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత డైర్క్టర్ నుంచి తదుపరి అనుమతులు వస్తాయి. డీడీకి గ్రాంట్ ఆర్డర్ వచ్చాక , సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. ఈ చెల్లింపుతో వర్క్ ఆర్డర్ ఇస్తారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి అయ్యేందుకు కనీసం మూడు నెలల నుంచి ఆరు నెలల సమయం పడుతుంది. మామూళ్లు రూ.లక్షల్లో చేరిపోతున్నాయి మైనింగ్ శాఖ చుట్టూ తిరగకుండా కొంత మంది కూటమి నేతలు అధికారపార్టీ బలాన్ని కొండలపై పెడుతున్నారు. మైనింగ్ శాఖ చట్టానికి, అనుమతులకు తూట్లు పొడుస్తున్నారు. కొందరు బడానేతలు, ప్రజాప్రతినిధుల నోటి మాటలే అనుమతులుగా మలిచి క్వారీలపై సవారీ చేస్తూ రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. ఇందుకు ప్రతి ఫలంగా కొందరు ప్రజాప్రతినిధులు, బడానేతలకు రూ. లక్షల్లో క్వారీ కాసులు చేరుతున్నట్లు సొంత పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. క్వారీలో అడుగు పెట్టాలంటే రూ. 5 నుంచి రూ. 10 లక్షలు, రాళ్లు బయటపడితే నెలవారీ మామూళ్లు రూ. 20 నుంచి రూ. 30 లక్షల వరకు వెళుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఇందులో ఓ మంత్రి పేరు సైతం వాడేస్తున్నారని ఆగ్రహానికి లోనవుతున్నారు. అడ్డొచ్చే వారికి, ఈ అక్రమ క్వారీల విషయాన్ని బయట పొక్కకుండా కాపాడేందుకు వివిధ శాఖ అధికారులకు నెలవారీ మామూళ్లు పంపుతున్నామని అక్రమ క్వారీ నిర్వాహకులు బహిరంగంగా చెప్పడం విమర్శలకు తావిస్తోంది. ఈ ప్రతిఫలంగా అధికారులు అక్రమ క్వారీ నిర్వాహకులను కంటికి రెప్పలా కాపాడుతున్నారని టీడీపీలోని ఓ వర్గం నేతలు గొంతు చించుకుంటున్నారు. అక్రమంపై ఫిర్యాదు చేస్తే.. ఆ కార్వీలకు దరఖాస్తులు పెట్టుకున్నారని అధికారులు తోసి పుచ్చుతున్నట్లు వారు మండిపడుతున్నారు. అక్రమ క్వారీ వ్యవహారంపై కలెక్టర్‌కు కూడా మైనింగ్ అధికారులు తప్పుడు నివేదికలు పంపుతున్నారని వాదిస్తున్నారు. అనుతులుంటే నష్టపోతున్నారు.. అక్రమ క్వారీలతో పక్కాగా అనుమతులు తీసుకుని క్వారీలు నడిపిస్తున్న వారు నష్టపోతున్నారు. అక్రమ క్వారీలకు గిరాకీ పెరగడంతో వారు ఆర్థికంగా చితికిపోతున్నారు. అక్రమ గ్రానైట్ తక్కువ రేటుకు లభించడంతో అక్రమ క్వారీలకు క్యూ కడుతున్నారు. అక్కడ తక్కువ రేటుకు కొనుగోలు చేస్తూ...అనుమతులతో నడిపిస్తున్న క్వారీపై పూర్తిగా ముఖం చాటేస్తున్నారు. అక్రమ క్వారీ నిర్వాహకులు గ్రానైట్ తరలింపునకు దొంగ బిల్లులు అంటగడుతూ..గ్రానైట్ ఫ్యాక్టరీ నిర్వాహకులను బుట్టలో వేసుకుంటున్నారని జిల్లాలో జోరుగా చర్చ సాగుతోంది. దీని దెబ్బకు అనుమతులతో క్వారీ నడిపిస్తున్న వారు ఏకమయ్యారు. అక్రమ క్వారీలతో తమ కడుపు కాలుతోందని..వారంతా రాష్ట్ర నేతల వద్ద గోడు వెలబోసుకుంటున్నారు. దొంగబిల్లుల రచ్చ... చిత్తూరు కేంద్రంగా నడుస్తున్న దొంగ బిల్లుల వ్యవహారం రచ్చ కెక్కింది. ఈ వ్యవహారానికి మూల పురుషుడుగా రారాజేనని కూటమి నేతలు ముద్రవేశారు. సాక్షిలో వచ్చిన వరుస కథనాలను టీడీపీలోని నేతలే నిజమని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారని తెలిసింది. ఈ వ్యవహారం సీఎం చంద్రబాబు దృష్టికి చేరినట్లు ఓ వర్గం కోడై కూస్తోంది. ఈ విషయాన్ని తొక్కే పడేయాలని కొందరు అధికారులు, రారాజు వర్గం విశ్వ ప్రయత్నాలు చేస్తోందని వ్యతిరేక వర్గం చెబుతోంది. ఈ వ్యవహారంపై చర్యలు ఉంటాయని చెబుతున్నారు. బంగారుపాళెం మండలంలో నడుస్త్తున్న అక్రమ క్వారీలు జిల్లాలో ఆగని అక్రమ క్వారీలు -
కృష్ణాలంకృతుడై..తృష్ణవల్లభుడై..!
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిలిపివేయాలి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిలిపివేయాలని నిరసన చేపట్టారు.ఆగని ఏనుగుల దాడులు పంట పొలాలపై ఏనుగుల దాడి కొనసాగుతోంది. శనివారం పంటలపై పడి బీభత్సం సృష్టించాయి.ఆదివారం శ్రీ 28 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025హోమ పూజల్లో పాల్గొని పూర్ణాహుతి చేస్తున్న ఈఓ, ఉభయదారులుశాకాంబరీదేవి అలంకరణలో అమ్మవారు ఓ పక్క రుక్ష్మిణ..మరో పక్క సత్యభామ.. మురళీలోలుడు బకాసురుడిని వధిస్తూ భక్తులకు కనువిందు చేశారు. స్వర్ణతేజోమయంగా కాంతులీనుతున్న సర్వభూపాలుడిని అధిరోహించిన స్వామి సకల భూపాలురకు తానే అధిపతినని.. తన భిక్షే రాజ్యాధికారమని సందేశమిచ్చారు. అంతకుముందు కోరిన కోర్కెలు తీర్చే కల్పవృక్షంపై రాజమన్నార్ అవతారంలో వచ్చి భక్తులకు అభయమిచ్చారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శనివారం కల్పవృక్ష. సర్వభూపాల వాహనసేవలు నిర్వహించారు. తిరుమాడ వీధుల్లో భక్తులు మలయప్పను దర్శించుకుని, మొక్కులు తీర్చుకున్నారు. వాహనసేవల ముందు కళాప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. – తిరుమల శాకాంబరీగా బోయకొండ గంగమ్మ దసరా మహోత్సవాల్లో భాగంగా ఐదవ రోజైన శనివారం బోయకొండ గంగమ్మ శాకాంబరిదేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా భక్తుల పాలిట కొంగు బంగారమై అమ్మవారు ప్రసిద్ధి కెక్కారు. పట్టుపీతాంబరాలు , రంగు రంగుల పుష్పమాలికలు , స్వర్ణాభరణాలతో పాటు కూరగాయలతో శాకాంబరిగా కొలువు దీర్చారు. అమ్మవారి ఉత్సవమూర్తికి ఈఓ ఏకాంబరంతో పాటు ఉభయదారులచే అమ్మవారికి ప్రత్యేక హోమ పూజలతో పాటు పూర్ణాహుతి చేశారు. – చౌడేపల్లె -
పర్యాటకాభివృద్ధికి ప్రాధాన్యం
– 2 కే రన్ ప్రారంభించిన ఎంపీ చిత్తూరు కలెక్టరేట్ : పర్యాటక రంగం అభివృద్ధి రాష్ట్రానికి అవసరమని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం పురస్కరించుకుని శనివారం పర్యాటక దినోత్సవం నిర్వహించారు. గాంధీ విగ్రహం నుంచి మెసానికల్ మైదానం వరకు 2 కే రన్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని ఎంపీ జెండా ఊపి ప్రారంభించారు. పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చెందితే స్థానికంగా ఉపాధితో పాటు ప్రజలకు రాష్ట్రానికి ఆదాయం చేకూరుతుందన్నారు. జిల్లా పర్యాటక శాఖ అధికారి నరేంద్ర మాట్లాడుతూ.. ప్రపంచంలో పర్యాటక ప్రదేశాల గుర్తింపు, పరిరక్షణ, చారిత్రక కట్టడాల పరిరక్షణకు సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో ప్రతిభ చాటిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బాలాజీ, సమగ్రశిక్షా శాఖ ఏపీసీ వెంకటరమణ, సీఐ మహేశ్వర్, విద్యార్థులు పాల్గొన్నారు. -
కిక్కిరిసిన గోవిందరాజులగుట్ట
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : పెరటాసి నెలను పురస్కరించుకుని చిత్తూరు మండలం టి.వేపనపల్లి సమీపంలోని గోవిందరాజుల గుట్టకు శనివారం జనం పోటెత్తారు. గుట్టలోని శ్రీవారి పాదాలకు క్షీరాభిషేకం చేశారు. చుట్టూ పక్కల గ్రామస్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సాంస్కృతిక కార్యక్రమాలు, భజన కార్యక్రమాలతో అలరించారు. కార్యక్రమంలో తాళంబేడు సర్పంచ్ అమర్నాథ్రెడ్డి, సభ్యులు సోమనాథరెడ్డి, నందగోపాల్నాయుడు, మధుబాబు, గోవిందరాయుడు, శ్రీరాములు, నీరాజాక్షులునాయుడు, అర్చకులు సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. అలాగే చిత్తూరు నగరంలోని శ్రీవేంకటేశ్వస్వామి ఆలయంలో కూడా భక్తులు కిక్కిరిశారు. గోవింద నామస్మరణలతో మార్మోగించారు. అనంతరం స్వామివారిని నగర వీధుల్లో ఊరేగించారు. -
ఆగని ఏనుగుల దాడులు
పులిచెర్ల (కల్లూరు) : పంట పొలాలపై ఏనుగుల దాడి నిరంతరం కొనసాగుతూనే ఉంది. తాజాగా శనివారం తెల్లవారుజామున మండలంలోని దిగువమూర్తి వారిపల్లె, మిట్టమీద రాచపల్లె, మర్రి కుంట వారిపల్లె, పాళెం, కొంగరవారిపల్లె గ్రామాల్లోని పొలాల్లో ఏనుగులు పంటలను ధ్వంసం చేశాయి. మిట్టమీద రాచపల్లెకు చెందిన సుధాకర్, ప్రభాకర్ పొలాల్లో వరి పంటను తొక్కి నాశనం చేశాయి. అలాగే కృష్ణారెడ్డికి చెందిన టమాట పంటను ధ్వంసం చేశాయి. దిగవ మూర్తి వారిపల్లెకు చెందిన సుధాకర్ పొలంలో మామిడితోటలో కొమ్మలను విరిచేశాయి. ఏనుగులు రాత్రి సమయంలో చుట్టు పక్కల పొలాలపై దాడి చేసి ధ్వంసం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. -
టీటీడీకి 12 టన్నుల కూరగాయల వితరణ
పలమనేరు : తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టణంలోని గంటావూరుకు చెందిన శ్రీవారి భక్తుడు మురుగన్ 12 టన్నుల కూరగాయలను టీటీడీ అన్నదాన సత్రానికి శనివారం వితరణ చేశారు. ఈ సందర్భంగా స్థానిక శ్రీవారి సేవకులు కాబ్బల్లి రవీంద్రారెడ్డి దాతను అభినందించారు. ఆ మేరకు కూరగాయలు నింపిన ప్రత్యేక వాహనానికి పూజలు నిర్వహించి గోవింద నామస్మరణాల మధ్య తిరుమలకు ఇక్కడి నుంచి తరలించారు. ప్రసవాల సంఖ్య పెంచాలి చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రతి పీహెచ్సీలో వంద శాతం గర్భిణుల నమోదు చేపట్టాలని, అలాగే ప్రసవాల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్‌గాంధీ సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు శనివారం కలెక్టరేట్లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ 12 వారాలకే గర్భిణుల నమోదు చేయాలన్నారు. ఇప్పటికి 80 శాతం మాత్రమే పూర్తి అయ్యిందన్నారు. గర్భిణులు, చిన్నపిల్లలకు ఆధార్ కార్డుతో అనుసంధానం ఉందా లేదా అని పరిశీలించాలన్నారు. డీఎంఅండ్‌హెచ్‌వో సుధారాణి, డీసీహెచ్ఎస్ పద్మాంజలి పాల్గొన్నారు. -
లోన్ మంజూరైందంటూ ఘరానా మోసం
చౌడేపల్లె : ఫోన్ చేసి హలో.. మీకు రూ.5 లక్షల లోన్ మంజూరైందని మాటలతో బురిడీ కొట్టి రూ.50 వేలు సొమ్ము కాజేసిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. మోసపోయానని గ్రహించిన బాధితుడు రవి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. వివరాలు ఇలా.. చౌడేపల్లె మండలం 29 ఏ చింతమాకులపల్లెకు చెందిన డి. కృష్ణప్ప కుమారుడు రవికి శుక్రవారం 8601605396 నంబరుతో ఫోన్లో ‘ధని ప్రవేటు పైనాన్స్ కంపెనీ మేనేజరు విజయరావు మాట్లాడుతున్న.. మీకు లోన్ మంజూరైంది, అది జమ కావాలంటే తొలుత కొంత సొమ్ము చెల్లించాలని కోరాడు’. రవిని నమ్మించడానికి విజయరావు పైనాన్స్ మేనేజరు ఐడీ , ఆధార్ కార్డులను వాట్సాప్‌నకు పంపించడంతో నిజమేనని నమ్మిన రవి తొలుత రూ.20 వేలు, తరువాత రూ.30 వేలు చెల్లించేశాడు. ఎంతసేపటికీ తనకు రూ.5 లక్షలు లోన్ సొమ్ము ఖాతాకు జమ కాకపోవడం, తనకు వచ్చిన ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో మోసపోయాయని గ్రహించిన బాధితుడు లబోదిబోమంటూ గుండెలు బాదుకున్నాడు. చివరికి ఇది సైబర్ నేరగాళ్ల పనిగా గుర్తించి పోలీసులను ఆశ్రయించనున్నట్లు తెలిపాడు. ధని పైనాన్స్ మేనేజరుగా పంపిన విజయరావు గుర్తింపు కార్డు, ఆధార్ -
చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి
చిత్తూరు అర్బన్ : ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందాడు. చిత్తూరు నగర శివారులోని జిల్లా పోలీసు శిక్షణా కేంద్రం సమీపంలో ఈనెల 6వ తేదీన ఓ ద్విచక్రవాహనం ఢీ కొని, దాదాపు 62 ఏళ్ల వయస్సున్న వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని స్థానికులు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందగా, శనివారం ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడి ఆచూకీ తెలిస్తే 94910 74515 , 70135 54201 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ట్రాఫిక్ పోలీసులు కోరారు. తాళాలు పగులగొట్టి నగలు చోరీ పుంగనూరు : గుడికి వెళ్లి వచ్చేలోపు ఇంటి తాళాలు పగులగొట్టి సుమారు రూ.20 లక్షలు విలువ చేసే నగలు, నగదును దోచేసిన ఘటన శుక్రవారం రాత్రి పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని బజారువీధిలో నివాసం ఉన్న రాధాకృష్ణయ్యశెట్టి కుటుంబ సభ్యులతో కలిసి గుడికి వెళ్లి ఇంటికి వచ్చారు. ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గుర్తించి చూడగా ఇంట్లో ఉన్న బీరువాను పగులగొట్టి 150 గ్రాముల బంగారు ఆభరణాలు, 2 కిలోల వెండి వస్తువులు, రూ.40 వేలు నగదు అపహరించినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాహనాలను ఢీ కొట్టిన కారు చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలో ఓ వ్యక్తి కారుతో అతివేగంతో వచ్చి.. మరో రెండు వాహనాలను ఢీ కొట్టాడు. శనివారం కట్టమంచి వద్ద ఢిల్లీ రిజిస్ట్రేషన్ నంబరుతో అతి వేగంతో వస్తున్న కారు.. ఎదురుగా వస్తున్న మరో కారును ఢీ కొట్టింది. ఆపై ఆటోను ఢీ కొట్టి, ఓ పాదచారిని సైతం ఢీ కొట్టారు. కారులో ఉన్న పిల్లలకు స్వల్ప గాయాలు కాగా పాదచారి చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. గాయపడ్డ వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కారు నడిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న ట్రాఫిక్ పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాలకమండలిలో బీజేపీకి అన్యాయం చిత్తూరు రూరల్ (కాణిపాకం) : ప్రధాన ఆలయాల పాలక మండలి నియామకాల్లో బీజేపీకి తీవ్ర అన్యాయం జరుగుతోందని బీజేపీ నాయకులు విమర్శించారు. శనివారం చిత్తూరు ప్రెస్‌క్లబ్‌లో వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. నాయకులు రామభద్ర మాట్లాడుతూ.. చిత్తూరు నగరంలోని ప్రధాన ఆలయాల్లో పాలక మండలి ఏర్పాటు నియామకంలో తమ పార్టీకి చెందిన నాయకులకు చైర్మన్ పదవులు అడగలేదన్నారు. కనీసం పాలక మండలి సభ్యులుగా పదవులు ఇవ్వాలని కోరామన్నారు. అయితే బీజేపీ తరఫున చిత్తూరు ఎమ్మెల్యే కార్యాలయానికి పంపిన ప్రతిపాదనలపై ఇంత వరకు అతీగతీ లేదన్నారు. ఎమ్మెల్యే కార్యాలయంలో ఏం జరుగుతుందో ఆయనకే తెలియాలని ఆవేదన చెందారు. ఎమ్మెల్యే సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి తమ పార్టీకి జరుగుతున్న అన్యాయంపై దృష్టి సారించాలని కోరారు. సమావేశంలో చిత్తూరు సెంట్రల్ మండల అధ్యక్షుడు షణ్ముగం, తోటపాలెం వెంకటేష్ విజయ్ తదితరులు పాల్గొన్నారు. -
ముత్యాల మురిపెం
సింహాసన యోగం.. ధనలక్ష్మీ నమోస్తుతేధనలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. కరెన్సీ నోట్లతో ధనలక్ష్మీదేవిగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఉభయదారులు, ఈఓ ఏకాంబరం పాల్గొన్నారు. – చౌడేపల్లెఇల వైకుంఠంగా అలరారుతున్న తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ వేంకటేశ్వరస్వామి శుక్రవారం ఉదయం సింహ వాహనంపై యోగ నృసింహుడి రూపంలో దర్శనమిచ్చారు. రాత్రి శ్రీ మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవితో కలిసి కాళీయ మర్ధనుడి అలంకారంలో ముత్యపుపందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులకు కటాక్షించారు. శ్రీకృష్ణుడు ముక్కుపై, మెడలో ముత్యాల ఆభరణాలు ధరించినట్టు పురాణాల్లో ఉంది. ఆదిశేషుని పడగలను ముత్యాల గొడుగా పూనిన స్వామివారిని దర్శించినా, స్తోత్రం చేసినా సకల శుభాలు కలుగుతాయని పురాణ ప్రశస్తి. చల్లని ముత్యాలకింద నిలిచిన శ్రీనివాసుని దర్శనం తాపత్రయాలను పోగొట్టి, భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూర్చుతుంది. – తిరుమల -
శ్రీవారి దర్శనానికి 16 గంటలు
తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 16 కంపార్ట్మెంట్లు నిండాయి. గురువారం అర్ధరాత్రి వరకు 67,388 మంది తిరుమలేశుని దర్శించుకున్నారు. 21,998 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.1.74 కోట్లు సమర్పించారు. టైం స్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారికి 16 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో వెంకన్నను దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలో అనుమతించరని స్పష్టం చేసింది. -
మట్టి ఎత్తివేయడంతో గుంతల మయమైన కట్టమంచి చెరువు
అధికార బలంతో కూటమి నేతలు కన్నుమిన్ను కానకుండా ప్రవర్తిస్తున్నారు. ఎంతో చరిత్ర కలిగిన చిత్తూరు జిల్లా కేంద్రంలోని కట్టమంచి చెరువుపై కన్నేశారు. పూడికత తీత పేరుతో మట్టి అక్రమ రవాణాకు ఒడిగట్టారు. పొద్దున్నుంచి చీకటి పడేవరకు యంత్రాల సహాయంతో తవ్వేయడం.. ఆపై ట్రాక్టర్లలో తరలించి సొమ్ము చేసుకోవడం అలవాటుగా చేసుకున్నారు. దాదాపు ఎనిమిది నెలలుగా ఈ తంతు సాగుతున్నా ఏ ఒక్క అధికారీ వారికి అడ్డుచెప్పలేకపోయారు. ఎట్టకేలకు గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు నమోదు కావడంతో తోకముడిచారు. శుక్రవారం మట్టితవ్వకాలకు ఫుల్స్టాప్ పెట్టారు. కన్నుమన్ను కానకుండా..!ఆగిన పనులు సాక్షి, టాస్క్‌ఫోర్స్ : చిత్తూరు జిల్లా కేంద్రంలోని కట్టమంచి చెరువును కూటమి నేతలు చెరబట్టారు. అధికారంలోకి రాగానే ఆ పార్టీ నాయకులు అక్రమ తవ్వకాలకు పాల్పడ్డారు. పూడికతీత పేరుతో మట్టి అక్రమ రవాణాకు పూనుకున్నారు. గత ఎనిమిది నెలలుగా ఉదయం నుంచి రాత్రి వరకు యంత్రాలు పెట్టి అందినకాడికి అడ్డంగా తవ్వేశారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక లోతు లోడేశారు. ఈ అక్రమ తవ్వకాల్లో స్థానిక టీడీపీ ప్రజాప్రతినిధి పాత్ర కీలకంగా ఉందనే ఆరోపణలు మిన్నంటాయి. ఎనిమిది నెలల క్రితం నుంచి తవ్వుతున్నా ఏ ఒక్కరూ కన్నెత్తి చూడ లేదు. ప్రొక్లైనర్లతో మట్టి తవ్వి వందల ట్రాక్టర్లతో రవాణా చేస్తున్నా అడ్డుచెప్పలేదు. దీనిపై ఇదివరకే సాక్షి దినపత్రికలో ఈ ఏడాది మే 03, మే 12, జూలై 19 తేదీలలో పతాక స్థాయిలో వార్తలు వెలువడ్డాయి. అయినా ఏ ఒక్కరూ స్పందించలేదు. గతంలో సాక్షిలో ప్రచురితమైన ప్రత్యేక కథనంగ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు నమోదు కావడంతో టీడీపీ నేతలకు ముచ్చెమటలు పట్టడం మొదలయ్యాయి. ఈ అక్రమ తవ్వకాలపై అనేక ఆరోపణలు నమోదైనప్పటికీ అధికారిక యంత్రాంగం పట్టించుకోలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎంతో చరిత్ర కలిగిన కట్టమంచి చెరువు రూపురేఖలు మారిపోయినా కన్నెత్తి చూడలేదు. ఇష్టానుసారంగా మట్టి తవ్వితే కట్టమంచి చెరువుకు ప్రమాదం అని తెలిసినప్పటికీ అడ్డుకోలేదు. ప్రస్తుతం గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు నమోదు కావడంతో కట్టమంచి చెరువులో శుక్రవారం నుంచి మట్టితవ్వకాలు నిలిపివేశారు. పక్కా ఆధారాలతో గ్రీన్ ట్రిబ్యునల్‌కు జిల్లా కేంద్రంలోని గాండ్లపల్లి రెవెన్యూ పరిధి సర్వే నం.1లోని కట్టమంచి చెరువులో టీడీపీ నేతలు పూడికతీత పేరుతో మట్టి అక్రమ రవాణాకు పూనుకున్నారు. ఈ విషయం పై తిరుపతి జిల్లా, కేవీబీపురం మండలం, కళత్తూరు గ్రామానికి చెందిన కోలా విజయ్‌కిరణ్ అనే న్యాయవాది గ్రీన్ ట్రిబ్యునల్ చైన్నె బెంచ్‌లో పిటీషన్ వేశారు. కట్టమంచి చెరువులో మట్టిని తొలగించడం పర్యావరణ రక్షణ చట్టం 1986 సెక్షన్ 5ను ఉల్లంఘించడమేనని ఉద్ఘాటించారు. కట్టమంచి చెరువులో 2 కి.మీ చుట్టు కొలతతో అక్రమ తవ్వకాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ అక్రమ రవాణాపై పీజీఆర్ఎస్ (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్)లో పిటీషన్ వేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. కట్టమంచి చెరువును కాపాడేందుకు గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు నమోదయ్యింది. ఏపీ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ, ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్, సైన్స్, టెక్నాలజీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, చిత్తూరు కలెక్టర్, చిత్తూరు నగరపాలక కమిషనర్, చిత్తూరు తహసీల్దార్, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కార్యదర్శిని ప్రతివాదులుగా నమోదు చేశారు. -
పీఈఎస్ విద్యాసంస్థలపై ఐటీ దాడులు
కుప్పం: ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని పీఈఎస్ యూనివర్సిటీ విద్యాసంస్థలపై ఐటీ శాఖ అధికాలు దాడులు నిర్వహించారు. కుప్పం పట్టణ సమీపంలోని పీఈఎస్ వైద్య కళాశాలలో మూడు రోజులుగా తమిళనాడు రాష్ట్రం, చైన్నెకి చెందిన 12 మందితో కూడిన ఆదాయ పన్నుశాఖ అధికార బృదం ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. శుక్రవారం పీఈఎస్ మెడికల్ కళాశాల మెయిన్ గేట్‌ను మూసివేసి, ఎంట్రాన్స్ వద్ద బారికేడ్లను ఏర్పాటు చేసి ఎవ్వరినీ లోనికి అనుమతించలేదు. కళాశాలలో పనిచేసే సిబ్బంది సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని లోనికి అనుమతించారు. ఇప్పటికే బెంగళూరులోని పీఈఎస్ యూనివర్సిటీలో ఐటీ దాడులు జరిగిన విషయం విధితమే. పంటలపై ఏనుగుల దాడి పులిచెర్ల(కల్లూరు): మండలంలో ఏనుగులు స్వైర విహారం చేస్తున్నాయి. నిత్యం ఏదో ఒక చోట పంటలను ధ్వంసం చేస్తూనే ఉన్నాయి. శుక్రవారం తెల్లవారుజామున మండలంలోని పాళెం, దేవళంపేట పంచాయతీల్లో పంట పొలాలను నాశనం చేశాయి. దాదాపు పది మంది రైతులకు సంబంధించిన పంటలను తొక్కిపడేశాయి. పాళెం పంచాయతీతోపాటు దేవళంపేట పంచాయతీలోని దిగవమూర్తివారిపల్లె, మర్రికుంటవారిపల్లె, బాలిరెడ్డిగారిపల్లె గ్రామాల్లో మామిడి చెట్ల కొమ్మలను విరిచేశాయి. మామిడి తోపునకు అమర్చిన ఇనుప గేటును గొడతో సహా పెకళించివేశాయి. తిరిగి సమీపంలోని చింతల వంకకు చేరు కున్నాయి. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి ఏనుగుల బారి నుంచి పంటలను రక్షించాలని పలువురు రైతులు కోరుతున్నారు. -
మా భూమిని ఆక్రమిస్తున్నారయ్యా!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): తమ అనుభవంలోని రెండెకరాల భూమిని టీడీపీ యాదమరి మండల అధ్యక్షుడు మురార్జీ, కార్యకర్త కుప్పయ్యమందడి ఆక్రమిస్తున్నారని అదే మండలం, రసూల్ నగర్ ఏఏడబ్ల్యూ కాలనీకి చెందిన బుజ్జి ఆరోపించారు. చిత్తూరు ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. యాదమరి తహసీల్దార్ అండతో అక్రమార్కులు తప్పుడు రికార్డులు సృష్టించి తమను వేధిస్తున్నారని ఆవేదన చెందారు. తమ భూమిలోని టేకు, మామిడి చెట్లను తొలగించారని.. ప్రశ్నించిన తమను కులం పేరుతో దూషించారని కన్నీటిపర్యంతమయ్యారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే తమపై తప్పుడు కేసు పెడుతామని అధికారులు, టీడీపీ నేతలు బెదిరిస్తున్నారని చెప్పారు. తమ బతకులు రోడ్డు పాలు చేస్తున్న మురార్జీ పై చర్యలు తీసుకోవాలని కోరారు. కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి గుడుపల్లె: వ్యవసా య పొలం వద్ద కరెంట్ షాక్‌కు గురై వేలు (40) అనే వ్యక్తి శుక్ర వారం మృతి చెందా డు. బంధువుల కథనం.. మండలంలోని కంచిబందార్లపల్లె గ్రామానికి చెందిన వేలు తన పొలం వద్ద ఇల్లు నిర్మించుకుని జీవనం సాగిస్తున్నాడు. వ్యవసాయ బావి వద్ద ఉన్న స్టార్టర్‌లోని స్వీచ్ వేసేందుకు వెళ్తుండగా కరెంట్ వైరు తగిలి షాక్‌కు గురయ్యా డు. స్థానికులు అతన్ని కుప్పం ఆస్పత్రికి తరలి స్తుండగా.. మార్గమధ్యంలో మృతిచెందాడు. గ్రానైట్ వ్యాపారి ఆత్మహత్యాయత్నం చిత్తూరు అర్బన్: జిల్లా గ్రానైట్ ఫ్యాక్టరీల సంఘం నాయకుడు, చిత్తూరుకు చెందిన ప్రముఖ గ్రానైట్ వ్యాపారి శేఖర్ నాయుడు శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. చిత్తూరులోని మిట్టూరుకు చెందిన శేఖర్‌నాయుడుకు పలు క్వారీలు, గ్రానై ట్ ఫ్యాక్టరీలు ఉన్నా యి. దీంతోపాటు కొన్ని క్వారీలను లీజుకు తీసుకొని నడిపిస్తున్నాడు. శుక్రవారం రాత్రి చిత్తూరు మండలంలోని సిద్ధంపల్లె వద్ద కు ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. అప్పటికి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న శేఖర్‌నాయుడు తనతో తెచ్చుకున్న పురుగుల మందు తాగి పడిపోయాడు. స్థానికులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వేలూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గరుడసేవ నాడు ద్విచక్ర వాహనాల రాకపోకలు రద్దు తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబరు 28న గరుడ సేవ నాడు విశేషంగా భక్తులు తిరుమలకు చేరుకుంటారు. ఘాట్ రోడ్లలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సెప్టెంబరు 27న సాయంత్రం 6 గంటల నుంచి సెప్టెంబరు 28 ఉదయం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలను టీటీడీ రద్దు చేసినట్లు తెలిపింది. తిరుపతిలోని అలిపిరి పాత చెక్ పాయింట్ వద్ద ద్విచక్ర వాహనాలను పార్క్ చేసుకునే సదుపాయాన్ని టీటీడీ కల్పిస్తోంది. -
బాలకృష్ణ తాగి అసెంబ్లీకి వెళ్లాడేమో!
రేణిగుంట: ఎమ్మెల్యే బాలకృష్ణ మద్యం సేవించి అసెంబ్లీకి వెళ్లి మాట్లాడాడా..? అనే అనుమానం వస్తోందని మాజీ డెప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. విజయవాడ నుంచి శుక్రవారం రాత్రి రేణిగుంటకు చేరుకున్న ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీ ప్రతి ఒక్కరికీ దేవాలయం లాంటిదని, అలాంటి ప్రదేశంలో బాలకృష్ణ మాట్లాడిన మాటలను ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారని తెలిపారు. మానవత్వం, కృతజ్ఞత అనేది బాలకృష్ణకు ఉంటే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పై అలాంటి మాటలు మాట్లాడరన్నారు. కౌరవుల సభలో ద్రౌపదిని అవమానించి ఆనందించినట్లు అసెంబ్లీలో అభివృద్ధిని పక్కనపెట్టి జగన్ జపం చేస్తున్నారని అన్నారు. బాలకృష్ణ చేసిన పనికి రాజశేఖరరెడ్డి తలుచుకుని ఉంటే జీవితాంతం జైల్లో ఉండేవారన్నారు. మానవత్వం చూపిన కుటుంబంపై ఈ విధంగా మాట్లాడడం తగదన్నా రు. జగన్మోహన్రెడ్డి కూడా బాలకృష్ణ అభిమానే అని.. అలాంటి వ్యక్తిపై వ్యక్తిత్వం చంపుకొని మాట్లాడడం బాధాకరమన్నారు. అయితే సినీ నటుడు చిరంజీవి హుందాతనంతో వెంటనే స్పందించారని అన్నారు. చిరంజీవి స్పందించకుండా ఉంటే ప్రజల్లోకి వేరే విధంగా వెళ్లి ఉండేదన్నారు. మెగాస్టార్ చిరంజీవి లాగానే పవన్ కళ్యాణ్ కూడా నడుచుకుంటే బాగుంటుందని హితవు పలికారు. -
భూకబ్జాలో రవితేజం!
కూటమి అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతల కన్ను ప్రభుత్వ, పేదల భూములపై పడుతోంది. అధికారం అడ్డుపెట్టుకుని ఏకంగా పేదల ఇళ్ల స్థలాలతోపాటు అటవీశాఖ భూమిని సైతం దర్జాగా కబ్జా చేశాడు. కార్పొరేట్ స్థాయిలో కొబ్బరి తోట సాగుకు పూనుకున్నాడు. దాదాపు కోటి రూపాయల విలువైన 8 ఎకరాలను ఆక్రమించాడు. ఈ యవ్వారంపై శుక్రవారం బాధితులు, వైఎస్సార్సీపీ నాయకులు ఆందోళన చేయడంతో అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. భూమి ని చదును చేస్తున్న జేసీబీని సీజ్ చేశారు. చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఇళ్లు లేని నిరుపేదలకు సొంతింటి కల సాకారం చేయాలని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తమ పాలనలో బండపల్లె ప్రాంతంలో సుమారు 30 ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించింది. ఎకరాకు రూ.6 లక్షల చొప్పున పరిహారం చెల్లించింది. సుమారుగా 500 మందికి ఇళ్ల స్థలాలను కేటాయించింది. నీటి వసతి, కరెంటు సౌకర్యం కల్పించింది. అయితే ఆర్థిక స్థోమత లేకపోవడం, ఇతర కారణాలతో కొంత మంది ఇళ్లు కట్టుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఓ కార్పొరేటర భర్త ఆ స్థలంపై కన్నేశారు. ఎలాగైనా దానిని సొంత చేసుకోవాలని కరెంటు స్తంభాలు, నంబర్ రాళ్లను, నీటి పైపులను ధ్వంసం చేశాడు. పేదల ఇళ్ల స్థలాలతో పాటు అటవీ భూములను సైతం ఆక్రమించేశాడు. ఆక్రమించిన సుమారు 8 ఎకరాల స్థలంలో దాదాపు 400 కొబ్బరి చెట్లు నాటాడు. ఇది ఆ నోటా ఈనోటా పడి చివరకు అధికారుల చెవిలో పడింది. గురువారం రెవెన్యూ అధికారులు ఆ భూమిని పరిశీలించి ఆక్రమణకు గురైనట్లు గుర్తించి కొబ్బరి చెట్లను తొలగించారు. పేదల స్థలాన్ని కబ్జా చేస్తారా..? రెవెన్యూ అధికారులు కబ్జాకు చెక్ పెట్టినా మళ్లీ ఆక్రమణ పర్వం కొనసాగడంతో వైఎస్సార్సీపీ నాయకులు, పేదలు శుక్రవారం ఆక్రమిత ప్రాంతంలో ఆందోళనకు దిగారు. ఆక్రమణ వ్యవహారాన్ని మీడియా ముందుకు పెట్టి, నాయకులు అంజలిరెడ్డి, హరీషారెడ్డి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నేతలు దోచుకోవడమే పనిగా పడ్డారన్నారు. టీడీపీ కార్పొరేటర్ జయలక్ష్మి భర్త పేదల ఇళ్ల స్థలాలతోపాటు అటవీశాఖ భూములను సైతం కబ్జాచేశారని, కరెంటు స్తంభాలు, పైపులైన్లను దౌర్జన్యంగానే తొలగించారని మండిపడ్డారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు జేసీబీని సీజ్ చేశారన్నారు. జయలక్ష్మి భర్త లెప్రసీ డాక్టర్‌గా పనిచేస్తూ రెండు నెలల క్రితమే ఉద్యోగ విరమణ చెందారని, వారికి కోట్లాది రూపాయల ఆస్తులు సైతం ఉన్నాయన్నారు. అధికారులు తనకు 8 ఎకరాల స్థలం కేటాయించినట్లు ఆయన చెప్పుకుంటున్నారని, ఇదే నిజమైతే ఎవరికి ఎంతెంత వాటాలందాయో, దీని వెనుక బాగోతమేమిటో ఉన్నతాధికారులే తేల్చాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఇక్కడ బాధితులకు ఎమ్మెల్యే సైతం జోక్యం చేసుకుని న్యాయం చేయాలని లేనిపక్షంలో కలెక్టరేట్ వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు సయ్యద్, మురగయ్య, ప్రభాకర్‌రెడ్డి, వెంకటముని, సుధా, బాలాజి, సురేంద్ర, రమేష్, మోహన్, మురగ, సెల్వం, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. దీనిపై రూరల్ తహసీల్దార్ జయప్రకాష్‌ను వివరణ కోరగా.. ఆక్రమణలను తొలగించినట్లు చెప్పారు. చదును చేసిన భూమిధ్వంసమైన తాగునీటి ట్యాంక్, పైపులు విద్యుత్ స్తంభాలు -
మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచాలి
చిత్తూరు కలెక్టరేట్ : మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి అభివృద్ధి చెందేందుకు చర్యలు చేపట్టాలని డీఆర్డీఏ పీడీ శ్రీదేవి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని డీఆర్డీఏ కార్యాలయంలో జిల్లా సమాఖ్య ప్రతినిధులకు జెండర్ కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. పీడీ మాట్లాడుతూ హింస లేని కుటుంబాలే లక్ష్యంగా జిల్లా గ్రామీ ణాభివృద్ధి సంస్థ సిబ్బంది కృషి చేయాలన్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ మహిళల అభ్యున్నతికి అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. అయితే సంఘాల్లో ఉన్న మహిళలకు ఆర్థిక వనరులు అందుకుంటున్న కుటుంబాల్లో హింస కారణంగా వనరులను సక్రమంగా సద్వినియోగం చేసుకోలేకపోతున్నారన్నారు. సమావేశంలో వయోజన విద్యాశాఖ డీడీ మహమ్మద్ ఆజాద్, డీపీఎం మంజుల, ఏపీఎంలు మధు, సుబ్బారెడ్డి, హేమ పాల్గొన్నారు. -
క్రీడలతో ఉజ్వల భవిత
చిత్తూరు కలెక్టరేట్ : క్రీడలతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బాలాజీ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా స్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ ఎంపిక పోటీలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు ఓటమి పొందిన సమయంలో కుంగిపోకుండా తిరిగి పోటీల్లో రాణించేలా ప్రయత్నం చేయాలన్నారు. జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు చందు మాట్లాడుతూ క్రీడల్లో మంచి పుణ్యం ప్రదర్శిస్తే క్రీడా కోటాలో ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడవచ్చన్నారు. జిల్లా స్థాయి సాఫ్ట్‌బాల్ క్రీడా పోటీల్లో ఎంపికై న జట్లకు అక్టోబర్ 4, 5, 6 తేదీల్లో విశాఖపట్టణం జిల్లా నర్సీపట్టణంలో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తారన్నారు. అనంతరం జిల్లా స్థాయిలో ప్రతిభ చాటిన జట్లను అభినందించారు. అనంతరం ఉచితంగా క్రీడాదుస్తులు అందజేశారు. ఫిజికల్ డైరెక్టర్లు దేవానంద్, నూరుద్దీన్, కృష్ణా, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. -
బంగారుపాళెంలో అగ్ని ప్రమాదం
ఇంట్లో కాలిపోయిన వస్తువులుఇంట్లో నుంచి వస్తున్న పొగ బంగారుపాళెం: మండల కేంద్రమైన బంగారుపాళెంలో శుక్రవారం సాయంత్రం ఓ ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సుమారు రూ.5 లక్షల విలువైన వస్తువులు దగ్ధమయ్యాయి. మండలంలోని మొగిలి వెంకటగిరి గ్రామానికి చెందిన నాగరాజ బంగారుపాళెంలో వినాయక టెక్స్టైల్స్ దుకాణాన్ని నిర్వహింస్తున్నాడు. పాత తాలూకా వీధిలో సొంత గృహాన్ని నిర్మించుకుని నివాసముంటున్నాడు. ఇంటికి తాళం వేసి దుకాణానికి వెళ్లాడు. సాయంత్రం ఇంట్లో నుంచి పొగలు రావడాన్ని చుట్టుపక్కల వారు గుర్తించారు. స్థానికులు పోలీసులకు, విద్యుత్‌శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఇంటి తలుపులు, కిటికీలు పగులగొట్టి మంటలను అదుపుచేశారు. అగ్నిమాపక సిబ్బంది బంగారుపాళ్యానికి చేరుకుని మంటలను పూర్తి స్థాయిలో ఆర్పివేశారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
ఆ గౌరవం కూడా పోయింది
పలమనేరు: అసెంబ్లీలో బాలకృష్ణ వ్యవహారశైలి, మాట్లాడిన తీరును చూసి వారి తండ్రి ఎన్టీరామారావుపై ప్రజల్లో ఉన్న గౌరవం కూడా పోయిందని పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ తెలిపారు. బాలకృష్ణ సినిమాల కోసం గత ప్రభుత్వంలో వైఎస్.జగన్మోహన్రెడ్డి నుంచి లబ్ధిపొందినప్పుడు ఆయన మంచివారు.. ఇప్పుడు చెడ్డవారా..? అని ప్రశ్నించారు. బాలకృష్ణ వ్యాఖ్యలు ఆయన దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. సభలో సంబంధంలేని చిరంజీవిపై తూలనాడడం ఏ మాత్రం సమంజసం కాదన్నారు. ఇంత జరిగినా జనసేన మంత్రులు, ఎమ్మెల్యేలు అసలు మాట్లాడకపోవడం మరీ ఘోరమన్నారు. దీన్నిబట్టి చూస్తుంటే ఎన్నటికీ టీడీపీకి జనసేన కట్టుబానిసగా ఉండాల్సిందేనని తెలుస్తోందన్నారు. బాలకృష్ణ అదే అసెంబ్లీలో జగనన్నకు సారీ చెప్పాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. -
నేషనల్ అథ్లెటిక్స్‌లో ప్రతిభ
పలమనేరు: పట్టణంలోని కేవీఎస్ వీధికి చెందిన గౌతమిప్రసాద్రెడ్డి కుమార్తె మోక్షితారెడ్డి నేషనల్ అథ్లెటిక్స్‌లో వివేష ప్రతిభ కనబరించింది. ఈనెల 24న గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగిన 36వ సౌత్‌జోన్ జూనియర్ నేషనల్స్ అథ్లెటిక్ చాంపియన్ షిప్పు 2025లో అండర్–16 విభాగం లాంగ్ జంప్‌లో విజేతగా నిలచింది. నిర్వాహకుల చేతుల మీదుగా బంగారు పతకాన్ని అందుకుంది. బాలిక ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదవుకుంటూ హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ స్పోర్ట్స్ అకాడమీలో శిక్షణ పొందుతోంది. గతేడాది జరిగిన ఇదే క్రీడల్లో బాలిక గోల్డ్‌మెడల్ సాధించిన విషయం తెల్సిందే. -
నేడు ఐఐటీ ఫేజ్–బీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ఏర్పేడు : తిరుపతి ఐఐటీ శాశ్వత క్యాంపస్ అభివృద్ధి పనుల్లో భాగంగా ఫేజ్–బీ పనులకు శనివారం భారత ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్ విధానంలో భూమి పూజ చేయనున్నట్లు ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ కేఎన్ సత్యనారాయణ శుక్రవారం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఐఐటీ అభివృద్ధికి ఫేజ్–బీ కింద రూ.2,313 కోట్లు నిధులు కేటాయించింది. ఫేజ్–ఏలో ఇప్పటికే రూ.1,444 కోట్లు ఖర్చు చేయగా, ఫేజ్–బీ నిధులతో మరింతగా ఐఐటీ శాశ్వత ప్రాంగణం అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ డాక్టర్ మద్దెల గురుమూర్తితో పాటు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ హాజరు కానున్నారు. -
మార్గం సుగమం!
చిత్తూరు నగర నడిబొడ్డున రోడ్ల విస్తరణ అంశం తుది అంకానికి చేరుకుంది. మూడో దశ రోడ్ల అభివృద్ధి (ఆర్డీ) ప్రణాళికలను ఆమోదిస్తూ అధికారులు గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఫలితంగా స్వచ్ఛందంగా రోడ్డు విస్తరణకు భవన స్థలాన్ని ఇచ్చే యజమానులకు ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) బాండ్లను ఇవ్వడానికి మార్గం సుగమమైంది. ఇక టీడీఆర్ కోసం దరఖాస్తు చేసుకునేవారికి కార్పొరేషన్ కమిటీ అధికారికంగా బాండ్లను పంపిణీ చేయనుంది. ఆర్డీ ప్లాన్ ఆమోదిస్తూ.. సంతకం చేస్తున్న కమిషనర్ చిత్తూరు హైరోడ్డులో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులు చిత్తూరు అర్బన్: మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రతీ పదేళ్లకు ఓసారి మాస్టర్ ప్లాన్‌ను రూపొందిస్తారు. పెరుగుతున్న జనాభా, వాహనాలు, ట్రాఫిక్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మాస్టర్ ప్లాన్ తయారుచేస్తారు. చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్లో 2022లో నూతన మాస్టర్ ప్లాన్ అమల్లోకి వచ్చింది. ఇది పదేళ్ల పాటు అమల్లో ఉంటుంది. నూతన మాస్టర్ ప్లాన్ ప్రకా రం కట్టమంచి నుంచి గిరింపేట దుర్గమ్మ ఆలయం వరకు ఉన్న రోడ్డును వంద అడుగులకు విస్తరించాల్సి ఉంది. 2018లో హై రోడ్డులోని కృష్ణుడి ఆలయం నుంచి గిరింపేట దుర్గమ్మ ఆలయం వరకు ఆర్డీ ప్లాన్‌ను ఆమోదించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో కట్టమంచి నుంచి రైల్వే అండర్ బ్రిడ్జి వరకు, తాజాగా రైల్వే అండర్ బ్రిడ్జి నుంచి కృష్ణుడి ఆలయం వరకు ఆర్డీ ప్లాన్ ఆమోదించడంతో విస్తరణ పనులకు లైన్ క్లియర్ అయ్యింది. దీంతో పాటు టీడీఆర్ బాండ్ల పంపిణీ ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే జిల్లా న్యాయస్థానాల సముదాయ ప్రహరీ గోడ, రైల్వే స్టేషన్, వక్ఫ్‌బోర్డు, దేవదాయ శాఖ స్థలాల్లో కట్టడాలను తొలగించారు. టీడీఆర్ బాండ్ల జారీ ఇలా.. విస్తరణలో భవనాలు, కట్టడాలు కోల్పోయేవారికి పరిహారం స్థానంలో టీడీఆర్ బాండ్లను ఇవ్వడానికే అధికారులు ఆసక్తి చూపిస్తున్నారు. చిత్తూరు హై రోడ్డు విస్తరణలో భవన యజమానులు 600–1000 అడుగుల వరకు స్థలాన్ని కోల్పోవాల్సి ఉంటుందని అంచనా. పరిహారమైతే భూమి రిజస్టర్ విలువ ప్రకారం రూ.100కు రూ.200 ఇస్తారు. టీడీఆర్ బాండ్లు ప్రతీ వంద అడుగులకు 400 అడుగుల విలువ చేసే పత్రాలు ఇస్తారు. గత టీడీపీ ప్రభుత్వంలో టీడీఆర్ బాండ్లను జిల్లాలో మాత్రమే విక్రయించుకునే వెసులు బాటు ఉండగా, వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో దీన్ని రాష్ట్రంలో ఎక్కడైనా విక్రయించుకునే అవకాశం కల్పించడంతో టీడీఆర్ బాండ్లకు విలువ పెరిగింది. టీడీఆర్ బాండు కలిగి వ్యక్తి.. తాను ఎక్కడైనా భవనం నిర్మించేటప్పుడు రెండు అంతస్తులకు అను మతి ఉంటే, టీడీఆర్ బాండు ద్వారా అదనంగా మరో రెండు అంతస్తులకు అనుమతులు పొందొచ్చు. భవ నం చుట్టూ సెట్‌బాక్స్‌ను కూడా వదలాల్సిన అవసరం ఉండదు. టీడీఆర్ బాండ్ల జారీ కమిటీలో సబ్–రిజిస్ట్రార్, రెవెన్యూ అధికారులను తొలగించి.. మునిసిపల్ కమిషనర్, సహాయ కమిషనర్, ఏసీపీ, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఆర్డీలను సభ్యులుగా ఉంచడంతో బాండ్ల జారీ సులభతరం కానుంది. నిధులిస్తేనే అభివృద్ధి చిత్తూరు కార్పొరేషన్లో ఇక ఎవరైనా విస్తరణ స్థలం కోల్పోయే వ్యక్తులు టీడీఆర్ బాండ్ల కోసం అధికారికంగా దరఖాస్తు చేసుకోవచ్చు. కమిటీ మార్కెట్ విలువను సబ్–రిజిస్ట్రార్ నుంచి తీసుకుని, భవన యజమానులకు టీడీఆర్ బాండ్లను జారీచేసి, ఆన్లైన్లో ఉంచుతుంది. అయితే విస్తరణలో మరో కీలక అంశం నిధుల విడుదల. ప్రస్తుతం 50 అడుగల మేరకు రోడ్డును విస్తరించాల్సి ఉంది. విస్తరించిన స్థలంలో రోడ్లు వేయడం, కాలువలు కట్టడం, విద్యుత్ లైన్లు, మౌలిక వసతులు, సదుపాయాల కల్పనకు దాదాపు రూ.100 కోట్లు అవసరం ఉంది. కార్పొరేషన్ వద్ద అంత నిధులు లేవు. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి నిధులు తీసుకొస్తేనే చిత్తూరులో అభివృద్ధి చూడడం సాధ్యమవుతుంది. లేకుంటే రోడ్ల విస్తరణ కాస్త కొట్టేసిన భవనాలు, గుంతలు పడ్డ రహదారులతో అందహీనంగా కనిపించనుంది. దీనిపై కలెక్టర్ నుంచి ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రభుత్వం నుంచి నిధులు ఎలా తీసుకొస్తారని సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
సహకార సంస్థలు ఎంతో ఉపయోగకరం
చిత్తూరు కలెక్టరేట్ : సహకార సంస్థలు ప్రజలకు ఎంతో ఉపయోగకరమని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ జీవనజ్యోతి తెలిపారు. కళాశాలలో గురువారం సహకార సంస్థల అంతర్జాతీయ సంవత్సరం 2025పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ విద్యార్థులు సహకార సంస్థల ప్రయోజనాలను తెలుసుకుని ఇతరులకు తెలియజేయాలన్నారు. జిల్లా సహకార శాఖ అధికారిణి లక్ష్మి మాట్లాడుతూ సహకార బ్యాంకులు రైతులు, వ్యాపారులకు రుణాలను ఇస్తున్నాయన్నారు. ప్రస్తుతం సహకార బ్యాంకుల్లో ఆన్లైన్ సేవలు సైతం అందుబాటులో ఉన్నాయన్నారు. అనంతరం విద్యార్థులకు సహకార సంస్థల ప్రయోజనాలపై వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి విజేతలకు సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు డిప్యూటీ జనరల్ మేనేజర్ చలపతి, కళాశాల వైస్ ప్రిన్సిపల్ నాగేంద్ర, అసిస్టెంట్ రిజిస్ట్రార్లు శ్రీనివాసులురెడ్డి, ప్రసాద్, చిత్తూరు కో–ఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్ రఘుబాబు పాల్గొన్నారు. -
86,700 పశువుల కొనుగోలుకు ఆమోదం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు 86,700 పశువులు కొనుగోలు చేసేందుకు జిల్లా కమిటీ ఆమోదం తెలిపిందని డీఆర్డీఏ పీడీ శ్రీదేవి తెలిపారు. ఈ మేరకు గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. డీఆర్డీఏ శాఖ ఆధ్వర్యంలో పేదరిక నిర్మూలన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా జిల్లాలో పశువుల పెంపకాన్ని, సంఖ్యను మరింతగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు. జిల్లాలో ఎక్కువ ప్రైవేట్ డెయిరీలు, 35 ప్రభుత్వ బల్క్ మిల్క్ చిల్లింగ్ సెంటర్లు ఉన్నందున పాల ఉత్పత్తి అవసరం విరివిగా ఉందన్నా రు. ఈ పథకం విజయవంతంగా అమలుకు బ్యాంక్ లింకేజీ, సీ్త్ర నిధి, సీఐఎఫ్ అంతర్గత రుణా లు ఇంటర్నల్ లెండింగ్ వంటి పథకాలతో స్వయం సహాయక సంఘాల మహిళలకు నచ్చిన విధంగా ఆరోగ్యకరమైన పశువులు కొనుగోలు చేయవచ్చన్నారు. సకాలంలో కౌంటర్లు దాఖలు చేయండి చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ కేసులకు సంబంధించి జిల్లా ప్రధాన కోర్టులో సకాలంలో కౌంటర్లు దాఖ లు చేయాలని కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ ఆదేశించారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లో రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రధాన కోర్టు లో నమోదైన రెవెన్యూ కేసులకు సకాలంలో కౌంటర్లు దాఖలు చేయాలన్నారు. ఈ విషయంలో ఆర్డీవోలు, తహసీల్దార్లు అలసత్వం వహించరా దని ఆదేశించారు. జిల్లా ప్రధాన న్యాయ స్థానంలోని 14 కోర్టుల పరిధిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 54 కేసులు నమోదైనట్లు తెలిపారు. ఈ కేసుల్లో 27 ఎక్స్‌పార్టీగా గుర్తించినట్లు చెప్పారు. వీటికి సంబంధించి వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. ప్రభు త్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడా ల్సిన బాధ్యత తహసీల్దార్లదేనన్నారు. మండలాల పరిధిలో నమోదైన కేసులకు సంబంధించి పూర్తి బాధ్యత తహసీల్దార్లు తీసుకోవాలన్నారు. ప్రస్తు తం ఎక్స్‌పార్టీగా ఉన్న కేసులన్నింటికీ రెండు రోజుల్లో రిటర్న్ స్టేట్మెంట్, కౌంటర్లు దాఖలు చేయాలన్నారు. జిల్లా కోర్టులోని రెవెన్యూ కేసులకు సంబంధించి తహసీల్దార్లను సమన్వయం చేసేలా వీఆర్వో కేడర్ సిబ్బందిని లైజన్ అధికారిగా నియమించనున్నట్టు తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ విద్యాధరి, డీఆర్వో మోహన్‌కుమార్ పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ విస్తృత స్థాయి సమావేశం రేపు సదుం: మండలంలోని ఎర్రాతివారిపల్లెలో పుంగనూరు నియోజకవర్గ స్థాయి వైఎస్సార్ సీపీ వి సృ ్తత స్థాయి సమావేశం శనివారం నిర్వహించను న్నట్టు పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 9.30కు నిర్వహించే ఈ సమావేశానికి పార్టీ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి హాజరుకానున్నట్లు పేర్కొంది. రాష్ట్ర ముఖ్య నాయకులు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల నియోజకవర్గ సమన్యకర్తలు పాల్గొంటారని వెల్లడించింది. సీజనల్ వ్యాధులపై అప్రమత్తం చిత్తూరు రూరల్ (కాణిపాకం): సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని డీఎంఅండ్‌హెచ్‌ఓ సుధారాణి ఆదేశించారు. చిత్తూరులోని తన కార్యాలయంలో గురువారం ఆ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వర్షాలు కురుస్తున్న కారణంగా సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయన్నారు. విష జ్వరాలు, డెంగ్యూ, డయేరియా వంటి కేసులు నమోదవుతున్నాయన్నారు. క్షేత్ర స్థాయిలోవ్యాధుల కట్టడికి చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు అనిల్, అనూష, నవీన్తేజ్రాయ్, జార్జ్, వేణుగోపాల్, జయరాముడు, రామ్మోహన్, శ్రీవాణి పాల్గొన్నారు. -
శ్రీవారి దర్శనానికి 10 గంటలు
తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 7 కంపార్ట్మెంట్లు నిండాయి. బుధవారం అర్ధరాత్రి వరకు 58,628 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 21,551 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.01 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారికి 10 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో తిరుమలేశుని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయాని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది. -
12 ఏళ్ల తర్వాత విముక్తి
గుడిపాల: ఇటుక బట్టీలో బంధీలైన 23 మందికి ఎట్టకేలకు విముక్తి లభించింది. వివరాలు.. గుడిపాల మండలం, గట్రాళ్లమిట్ట గ్రామంలో ఇర్పాన్ అనే అతను ఇటుక బట్టీల వ్యాపారం చేస్తున్నాడు. ఇతని వద్ద 2013లో తమిళనాడు రాష్ట్రం, వేలూరుకు చెందిన 18 మంది, బంగారుపాళ్యం మండలానికి చెందిన ఐదుగురు ఎస్టీ కాలనీ వాసులు పనులకు వచ్చారు. అప్పట్లోనే ఇర్పాన్ వారికి అడ్వాన్స్‌గా రూ.5 వేలు ఇచ్చి పనిలో పెట్టుకున్నారు. అప్పటి నుంచి వారిని బంధీలుగా మార్చేశారు. ఇందులో ఆరుగురు మగవారు, మరో ఆరుగురు మహిళలు, 11 మంది పిల్లలు ఉన్నారు. వీరందరూ రోజూ ఇటుకలకు సంబంధించి మట్టి కలపడం, మోల్డింగ్ చేయడం, ఇటుకలను కాల్చడం, ఇటుకలు రవాణా చేయడం వంటి కార్యకలాపాలు చేసేవారు. ఇటీవల వీరిపై శారీరక దాడులు చేయడంతోపాటు అవమానకరమైన మాటలు, వేధింపులు ఎక్కువయ్యాయి. విషయం తెలుసుకున్న రెవెన్యూ, లేబర్, సోషల్ వెల్ఫేర్, స్థానిక పోలీసులు వెళ్లి వారి పరిస్థితులపై ఆరా తీశారు. వారికి జరుగుతున్న అవమానాలను తెలుసుకున్నారు. రోజుకు సుమారు 15 గంటలు పనిచేయిస్తుండడంతో పాటు తాత్కాలిక గుడారాలలో నివసిస్తూ, కరెంట్ కూడా లేకుండా జీవిస్తున్నట్టు గుర్తించారు. జేసీ భరోసా గుడిపాల మండలంలోని గట్రాళ్లమిట్టలో జరిగిన పరిణామాలపై ఎస్టీ లందర్నీ గుడిపాల తహసీల్దార్ కార్యాలయానికి పిలిపించారు. జాయింట్ కలెక్టర్ విద్యాధరి కూడా రాత్రి 9గంటలకు అక్కడికి చేరుకుని ఎస్టీలతో మాట్లాడారు. వారి బాధలను తెలుసుకున్నారు. వారందరికీ ఆర్థిక సాయం చేయడంతో పాటు రిలీవింగ్ ఆర్డర్ కాఫీలను అందజేసి, వారి గ్రామాలకు పంపించారు. స్వేచ్ఛగా జీవించాలని సూచించారు. అనంతరం ఇటుక బట్టీ యజమాని ఇర్పాన్‌తో జేసీ మాట్లాడారు. ఇన్ని రోజులు వారిని ఎందుకు నీ అదుపులో పెట్టుకున్నావ్ అని ఆరా తీశారు. ఇటుక బట్టీ యజమానిపై కేసు నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. ఆర్డీవో శ్రీనివాసులు, డెప్యూటీ తహసీల్దార్ వెంకటరమణ, సర్వేయర్ గోపీనాథ్, వీఆర్ఓలు పాల్గొన్నారు. -
చెట్టును ఢీకొన్న సుమో
– యువకుడికి తీవ్ర గాయాలు గంగవరం: మండలంలోని కల్లుపల్లి గ్రామ సమీపంలో ఏసీ గోడౌన్ వద్ద గురువారం సుమో చెట్టును ఢీకొనడంతో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల కథనం మేరకు.. పలమనేరు మండలం కరిడిమడుగు గ్రామానికి చెందిన ప్రవీణ్(22) పట్టణంలో మినరల్ వాటర్‌ను తరలించే వాహనం డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పలమనేరులోని పూల మార్కెట్ నుంచి పూల హారాలు తీసుకుని స్నేహితుడు మోహన్‌తో కలిసి బోయకొండకు బయలుదేరారు. తిరిగి వస్తుండగా మండలంలోని కల్లుపల్లి సమీపంలోని ఏసీ గోడౌన్ వద్ద సుమో ముందు టైరు పంక్చర్ అయి ఎదురుగా ఉన్న చెట్టును ఢీకొంది. దీంతో ప్రవీణ్ తీవ్రంగా గాయపడ్డాడు. మోహన్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సుమో ముందుభాగం పూర్తిగా ధ్వంసమైంది. స్థానికులు అతన్ని పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వైద్యులు తిరుపతికి రెఫర్ చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
గుండె, నరాల వ్యాధులకు చికిత్స
చిత్తూరు రూరల్ (కాణిపాకం): గుండె, నరాల వ్యాధులకు చికిత్స అందించేలా చిత్తూరులో కేంద్రాన్ని నిర్వహించనున్నట్లు వేలూరుకు చెందిన నర్వి ఆస్పత్రి నిర్వాహకులు తెలిపారు. వారు గురువారం చిత్తూరు నగరం ప్రీతం ఆస్పత్రిలో హార్ట్ అండ్ న్యూరాలజీ స్పెషలిస్ట్ మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ శిబిరం నెలకు రెండుసార్లు ఆసుపత్రిలో నిర్వహించి వైద్య పరీక్షలు చేస్తామని తెలిపారు. నర్వి ఆస్పత్రి నిర్వాహకులు శరవణన్ రామన్, వినాయక్ శుక్లా, జార్జ్, లోకేష్ పాల్గొన్నారు. మామిడి పంటపై ఏనుగుల దాడి పులిచెర్ల(కల్లూరు) : మండలంలోని పాళెం పంచాయతీలో వున్న మామిడి తోటలోకి గురువారం తెల్లవారు జామున ఏనుగులు ప్రవేశించాయి. మామిడి చెట్ల కొమ్మలను విరిచివేశాయి. ఏనుగులు 20 రోజులుగా మండలంలో తిరుగుతూ పొలాలపై పడి పంటలను నాశనం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. -
ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలి
చౌడేపల్లె: ప్రకృతి వ్యవసాయంపై రైతులు దృష్టిసారించాలని డీపీఎం జి.వాసు తెలిపారు. ఆయన గురువారం బోయకొండ సమీపంలోని గట్టువారిపల్లెలో ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ నేచరల్ ఫామింగ్ రైతు సాధికార సంస్థ (ఈవీఎస్) ఆధ్వర్యంలో జిల్లాలో 263 క్లస్టర్లలో ప్రకృతి సేద్యంపై రైతులను చైతన్యవంతులను చేశామన్నారు. వేరుశనగ, వరి, కూరగాయల పంటలు సాగు చేస్తున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో అన్ని గ్రామాల్లోనూ ప్రకృతి సేద్యం చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అనంతరం అక్కడే సాగుచేసిన వరిపంటతోపాటు కషాయాన్ని పరిశీలించి రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎన్పీ ఎంఎంటీ సుధాకర్ నాయుడు, ఎన్ఎఫ్ఏ నాంచారమ్మ, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది గంగిరెడ్డి, రామనాథం, తదితరులు పాల్గొన్నారు. -
అక్రమ క్వారీల ఆగడాలను నివారించాలి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని పాలసముద్రం మండలంలో అక్రమ క్వారీల ఆగడాలను నివారించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. ఆయన గురువారం ఆ పార్టీ నాయకులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఆయన మాట్లాడుతూ పాలసముద్రంలో గుట్టలను తవ్వి గ్రావెల్‌ను యథేచ్ఛగా తమిళనాడుకు తరలిస్తున్నారని ఆరోపించారు. తద్వారా రూ.లక్షలు ఆర్జిస్తున్నారని దుయ్య బట్టారు. ఈ విషయం తెలిసినా రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారులు ఎందుకు చర్య లు తీసుకోవడం లేద ని నిలదీశారు. లీజు అనుమతికి మించి గ్రా వెల్‌ను తవ్వేస్తున్నారని ఆరోపించారు. కలెక్టర్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. -
మరమ్మతులకు పచ్చజెండా
పాలసముద్రం : స్థానిక రెవెన్యూ కార్యాలయ మరమ్మతులకు నివేదికలు పంపాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ తహసీల్దార్ అరుణకుమారిని ఆదేశించారు. గురువారం పాలసముద్రం రెవెన్యూ కార్యాలయాన్ని కలెక్టర్ సందర్శించారు. పెచ్చులూడి, అధ్వానంగా ఉండడంతో వెంటనే మరమ్మతులకు చర్యలు చేపట్టాలన్నారు. ఎంతమేర నిధులు అవసరమవుతాయని ఏఈ జయరాజ్‌ను అడగగా రూ.15 లక్షల వరకు అవుతుందని చెప్పారు. రెవెన్యూ సమస్యలపై కార్యాలయానికి వస్తున్న రైతులతో స్నేహభావంతో మెలగాలని సిబ్బందిని ఆదేశించారు. చిత్తూరు నుంచి బలిజకండ్రిగకు వస్తున్న జాతీయ రహదిరి కూడా అధ్వాన్నంగా ఉందని, దాన్ని కూడా త్వరలో మరమ్మతులు చేస్తామన్నారు. గత ప్రభుత్వంలో వనదుర్గాపురం నుంచి మండల కేంద్రానికి రోడ్డు పనులు ప్రారంభించారని, అవి అర్ధంతరంగా ఆగిపోవడంతో తమిళనాడు రాష్ట్రం మీదుగా 15 కి.మీ చుట్టుతిరిగి రావాల్సి వస్తోందని ఎంపీపీ శ్యామలశివప్రకాష్ రాజు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. పరిశీలించి చర్యలు చేపడుతామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఏఓ ఢిల్లీన్రసాద్, ఆర్ఐ దేవి, వీఆర్ఓ తంగరాజ్, శ్రీనివాసులు పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయంతో సంపూర్ణ ఆరోగ్యం పాలసముద్రం: ప్రకృతి వ్యవసాయ పంటలు, కూరగాయలను తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుందని జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ తెలిపారు. గురువారం మహదేవపురం, తిరుమలరాజుపురంలో ప్రకృతి వ్వవసాయ క్షేత్రం, నర్సరీని ఆయన పరిశీలించారు. రసాయనాలతో సాగు చేసే పంటలు హానికరమని, రైతులు ప్రకృతి పద్ధతిలో సాగుపై ఆసక్తి చూపాలని తెలిపారు. అనంతరం తిరుమలరాజుపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాల సమీపంలో పాడైన బావిని పూడ్చి వేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో తహశీల్దార్ అరుణ కుమారి, ఆర్ఐ దేవి, వీఆర్ఓలు, రైతులు పాల్గొన్నారు. -
పరిసరాల శుభ్రత అందరి బాధ్యత
చిత్తూరు అర్బన్: పరిశుభ్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యతతో మెలగాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ చెప్పారు. స్వచ్ఛతాహి సేవ– 2025లో భాగంగా గురువారం చిత్తూరు నగరంలోని గంగినేని చెరువు వద్ద శ్రీఏక్ దిన్.. ఏక్ గంట.. ఏక్ సాత్ స్వచ్ఛతశ్రీ కార్యక్రమాన్ని కలెక్టర్‌తో పాటు మేయర్ అముద, కమిషనర్ నరసింహ ప్రసాద్ ప్రారంభించారు. పార్కులో వ్యర్థాలను తొలగించారు. స్వచ్ఛతా ప్రతిజ్ఞ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ నగరాన్ని శుభ్రంగా ఉంచడం కోసం వందల మంది పారిశుద్ధ్య కార్మికులు వేకువజాము నుంచే పనిచేస్తున్నారన్నారు. 50 శాతం చెత్త ప్రజల ద్వారానే ఉత్పత్తి అవుతోందన్నారు. ప్రజలు బాధ్యతగా.. బిస్కెట్ కవర్లు, వాటర్ బాటిళ్లు, ఇతర వ్యర్థాలు రోడ్లపై పడేయకుండా అవగాహనతో వ్యవహరిస్తే పారిశుద్ధ్య కార్మికులపై పనిభారం తగ్గించడమే కాకుండా నగరం పరిశుభ్రంగా ఉంటుందన్నారు. ప్రార్థన స్థలాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత, పచ్చదనం పెంచడానికి ప్రతినెలా మూడో శనివారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. మేయర్ అముద మాట్లాడుతూ.. పారిశుద్ధ్య పనులు నిర్వహించే కార్మికులకు ప్రజలు సహకరించాలన్నారు. కమిషనర్ పి నరసింహ ప్రసాద్ మాట్లాడుతూ.. స్వచ్ఛతాహీ సేవ కార్యక్రమాల్లో భాగంగా నగరంలో మాస్ శానిటేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి వార్డు సచివాలయం పరిధిలో కార్యక్రమాలు జరుగుతున్నాయని, ప్రజాప్రతినిధులు, ప్రజలను భాగస్వాములను చేస్తూ పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్‌రెడ్డి, సహాయ కమిషనర్ ప్రసాద్, ప్రజారోగ్యశాఖ అధికారి డా.లోకేష్, కార్పొరేటర్ ఇందు, మునిసిపల్ డీఈ శ్రావణి తదితరులు పాల్గొన్నారు. -
విపంచి ధరించి.. విహరించి..
పాలకడలిపై తేలియాడే శేషుడు తిరువీధులకు తరలివచ్చాడు. ఆపద మొక్కుల వాడికి వాహనమయ్యాడు. శ్రీహరి చిద్విలాసంగా విహరించాడు. రాయంచ సింహసం కాగా శ్రితపరిపాలకుడు వీణాపాణి ధరించి, విహరించాడు. వివేచన బోధించాడు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తన్మయులయ్యారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రెండోరోజు గురువారం చిన్న శేష, హంస వాహనాలపై మలయప్పస్వామి విహరించారు. ఈ వాహనసేవల్లో ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కళా ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ పాల్గొన్నారు. – తిరుమలఅన్నపూర్ణాదేవిగా బోయకొండ గంగమ్మఅన్నపూర్ణా.. పాహిమాంచౌడేపల్లె: దసరా మహోత్సవాల్లో భాగంగా బోయకొండ గంగమ్మ గురువారం అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితులు గోవర్థనశర్మ, గంగిరెడ్డి తదితర అర్చక బృందం ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక హోమ పూజలు చేశారు. ఉభయదారులు, ఈఓ ఏకాంబరం పాల్గొన్నారు. -
కూలి పనులకెళ్తూ..!
రొంపిచెర్ల: ఆటోను గుర్తుతెలియని ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి చెందగా మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బెంగళూరు– తిరుపతి జాతీయ రహదారిలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. బాధితుల కథనం.. రొంపిచెర్ల మండలం, రామచంద్రాపురం కాలనీ, మూరేవాండ్లపల్లె, పిచ్చిగుంట్లవారిపల్లె గ్రామాలకు చెందిన మహిళలు అన్నమ్మయ్య జిల్లాలోని కలకడ మండలంలో టమాట తోటల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. గురువారం ఉదయం ఆ మూడు గ్రామాలకు చెందిన 14 మంది మహిళలు ఆటోలో కలకడకు బయల్దేరారు. నేషనల్ హైవేలోని బోనంవారిపల్లె సమీపంలో ఆటోను పీలేరు వైపు నుంచి వస్తున్న గుర్తుతెలియని ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పిచ్చిగుంట్లవారిపల్లెకు చెందిన అలివేలమ్మ (53) మృతి చెందారు. అలాగే మూడేవాండ్లపల్లెకు చెందిన పీ.రత్నమ్మ, పీ.లక్ష్మీదేవి, పీ.శాంతమ్మ, టీ.నారాయణమ్మ, పీ.కమలమ్మ, పీ.నారాయణమ్మ, రామచంద్రాపురం కాలనీకి చెందిన పీ.రాణి, ఎం.రాములమ్మ, పిచ్చిగుంట్లవారిపల్లెకు చెందిన రాజేశ్వరి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని రొంపిచెర్ల ఎస్ఐ సుబ్బారెడ్డి పరిశీలించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రొంపిచెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాఽధితులను పరామర్శించిన జెడ్పీటీసీ క్షతగాత్రులను జెడ్పీటీసీ రెడ్డిశ్వర్‌రెడ్డి పరామర్శించా రు. ఆయన నేరుగా పీలేరు ప్రభుత్వాస్పత్రికి చేరు కుని బాధితులను పరామర్శించి, అండగా ఉంటా మని భరోసానిచ్చారు. అనంతరం ఈ విషయాన్ని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తెలయజేశారు. బాధితులకు దగ్గరుండి మెరుగైన వైద్యం అందేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే ఆదేశించారు. మృతురాలు అలివేలమ్మ గాయపడిన మహిళలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు -
భలే మంచి టెట్రా బేరము
పలమనేరు: కర్ణాటక టెట్రా ప్యాకెట్ల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఇటు చిత్తూరు జిల్లాతోపాటు అటు తమిళనాడుకు గుట్టుచప్పుడు కాకుండా తరలిపోతున్నాయి. కర్ణాటకలో 90 ఎంఎల్ ప్యాకెట్ టెట్రా ప్యాకెట్ రూ.45కే లభ్యమవుతోంది. దీన్ని ఆసరాగా చేసుకుని అక్రమార్కులు ఏపీలోని సరిహద్దు ప్రాంతాల నుంచి తమిళనాడుకు చేరవేస్తున్నారు. దీనికితోడు తమిళనాడులో మద్యం కొరతను సైతం తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. బజ్జీ దుకాణాల్లోనూ మద్యమే కన్నడ టెట్రా ప్యాకెట్లతోపాటు ఏపీ మద్యం దుకాణాల నుంచి తీసుకెళ్లే మందు విక్రయాలు జిల్లాలోని అంతర్రాష్ట్ర సరిహద్దు నియోజకవర్గాల్లో ఊపందుకున్నాయి. గతంలో రహస్యంగా సాగుతున్న ఈ తంతు ఇప్పుడు బహిరంగగానే విక్రయిస్తున్నారు. గ్రామాల్లోని చిల్లరకొట్లు, టీ దుకాణాలు, హోటళ్లు, బజ్జీ, బోండా అంగళ్లల్లోనూ మద్యం లభిస్తోంది. కొందరైతే దీన్నే జీవనోపాధిగా చేసుకున్నారు. రకరకాల మార్గాలు కర్ణాటక రాష్ట్రం నుంచి తమిళనాడుకు ఎన్నో అడ్డదారులున్నాయి. రకరకాల మార్గాల్లో నిత్యం మద్యం అక్రమంగా తరలిస్తున్నారు. కన్నడ మద్యం దుకాణాల నిర్వాహకులకు ఆన్లైన్లో నగదును జమచేస్తే మద్యాన్ని వారే ఏపీ సరిహద్దుకు చేరవేస్తున్నారు. అక్కడి నుంచి స్మగ్లర్లు సులభంగా తమిళనాడుకు రవాణా చేస్తున్నారు. మరికొందరు కర్ణాటక నుంచి ఇక్కడికి చేరిన సరుకును ఇళ్లల్లో కాకుండా గ్రామాల్లోని పొలాలు, గడ్డివాములు, భూమిలో పాతిపెట్టి, ఆపై తమిళనాడుకు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. చౌకబేరము! కర్ణాటకాకు చెందిన విస్కీ, ఒరిజినల్ చాయిస్, డీలక్స్ విస్కీ, త్రిబుల్‌ఎక్స్ రమ్, ఓల్డ్ అడ్మిరల్, బ్రాందీ తదితర బ్రాండ్లు 180 ఎంఎల్ టెట్రా ఫ్యాకెట్ల రూపంలో దొరుకుతున్నాయి. అక్కడ వీటి ధరలు ఒక్కో ప్యాకెట్ 90 ఎంఎల్ రూ.45, క్వార్టర్ ప్యాకెట్ రూ.90గా ఉంది. అదే సరుకు తమిళనాడుకు చేరితే 90 ఎంఎల్ రూ.100, క్వార్టర్ రూ.140గా ఉంది. కన్నడ కిక్కుకు అలవాటు పడిన మందుబాబులు వాటి వైపే మొగ్గు చూపుతున్నారు. రోజుకు రెండు కేసులు అమ్మినా రూ.5 వేలదాకా మిగులుతోంది. ఆగిన తనిఖీలు గత ప్రభుత్వంలో సెబ్ స్క్వాడ్లు నిరంతరం బోర్డర్లలో నిఘా పెట్టేవారు. కర్ణాటక మద్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సెబ్‌ను తీసేసింది. కేవలం ఎక్సైజ్ శాఖ మాత్రమే అదీ మద్యం దుకాణాల నిర్వహణలో ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణాపై అసలు తనిఖీలే లేకుండా పోయాయి. ఏపీలో చీఫ్ ట్రిక్స్ ఏపీలోని మద్యం ప్రియులకు రూ.99కే మద్యం ఇస్తామన్న కూటమి ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదు. ఇక్కడున్న మద్యం కంటే కన్నడ మద్యం ధర తక్కువ. దీంతో కుప్పం, పలమనేరు, పుంగనూరు నియోజకవర్గాల్లో ఇప్పటికీ కన్నడ టెట్రాప్యాకెట్లే రాజ్యమేలుతున్నాయి. -
నోటీసు ఇవ్వకనే నగలు వేలం
పలమనేరు: తాము ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో తనఖా పెట్టిన నగలకు గడువు మీరిందని నోటీసు ఇవ్వకుండానే తమ బంగారాన్ని వేలం వేసిందే కాకుండా మళ్లీ నెలనెలా వడ్డీ వసూలు చేశారని బాధితులు ఆ కంపెనీ నిర్వాహకులను నిలదీశారు. ఈ ఘటన గురువారం పలమనేరులో చోటుచేసుకుంది. వివరాలు.. బైరెడ్డిపల్లి మండలం, సీసీగుంటకు చెందిన నల్లమణి 4.4 గ్రాములు, కేశవ 20 గ్రాముల బంగారు నగలను పట్టణంలోని కీర్తన ఫైనాన్స్ కంపెనీలో తనఖా పెట్టారు. ఇందుకు సంబంధించి వీరు నగలు సకాలంలో విడిపించుకోలేదని కంపెనీవారు గత ఏప్రిల్‌లో ఆ నగలను వేలం వేశారు. ఇందుకు సంబంధించి బాధితులకు ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వలేదని బాధితులు తెలిపారు. అంతేకాకుండా మేలో సైతం తాము పెట్టిన నగలకు వడ్డీ కట్టించుకున్నారని ఆరోపించారు. నగలు ఇప్పటికే వేలం వేశారని తెలిసిన బాధితులు సంబంధిత కంపెనీ మేనేజర్‌తో గురువారం గొడవకు దిగారు. దీనిపై తాము పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు వారు తెలిపారు. -
కాయకష్టమే!
ప్రకృతి ప్రకోపానికి తోడు ప్రభుత్వ ప్రోత్సాహం లేక వేరుశనగ రైతులు విలవిల్లాడుతున్నారు. వేల రూపాలు పెట్టుబడి పెట్టినా దిగుబడి నామమాత్రంగా కూడా లేకపోవడంతో ‘కాయ’ కష్టమే మిగిలిందని నిట్టూర్చుతున్నారు. దీనికితోడు గత ఏడాది పంట నష్టపరిహారమూ అందక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోకుంటే చావే శరణ్యమని గగ్గోలు పెడుతున్నారు.కాణిపాకం: ఖరీఫ్‌లో ప్రతి ఏటా జిల్లాలో వర్షాధార పంటగా వేరుశ నగను రైతులు విత్తుతుంటారు. ఈసారి ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 80 వేల హెక్టార్లు కాగా.. వేరుశనగ పంట సాధారణ విస్తీర్ణం 35,238 హెక్టార్లుగా అధికారులు లెక్కలుగట్టారు. ప్రభుత్వం 30,283 క్వింటాళ్ల కాయలు సరఫరా చేసింది. ఒక్కో రైతుకు ఒక్కో బ్యాగు కాయలు ఇచ్చారు. మిగిలిన కాయలు ఏమయ్యాయో దేవుడుకే ఎరుక. దీనికారణంగా 4,092 హెక్టార్లల్లో మాత్రమే వేరుశనగ సాగులోకి వచ్చింది. వర్షాభావ పరిస్థితులు, ప్రభుత్వ ప్రోత్సాహం, విత్తనాలు పూర్తి స్థాయిలో అందక పోవడంతో చాలామంది రైతులు వేరుశనగ సాగుపై ముఖం చాటేశారు. తడి ఆరిన ఆశలు! జిల్లాలో 10 నుంచి 15 శాతం మంది రైతులు వేరుశనగ విత్తారు. జూన్, జూలై నెలల్లో తీవ్ర వర్షాభావం నెలకొనడంతో పంట ఎండుముఖం పట్టింది. తర్వాత అదునుకు తగ్గ వర్షాలు లేవు. ఇది పంట దిగుబడిపై ప్రభావం చూపింది. ఊడలు దిగే సమయంలో కూడా వర్షం కరుణించకపోవడంతో రైతుల చేతికి తీగలు మాత్రమే మిగిలాయి. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలు పంట ఒబ్బిడికి ప్రయోజనకరంగా మారాయి. పరిహారం ..పరిహాసం! 2024 ఖరీఫ్‌లో వేరుశనగ సాధారణ విస్తీర్ణం 43,174 హెక్టార్లు కాగా 13,044 హెక్టార్లల్లో పంట సాగులోకి వచ్చింది. అయితే వర్షం కరుణించక పోవడంతో పూర్తిగా దెబ్బతింది. పరిశీలనకు దిగిన వ్యవసాయ శాఖ అధికారులు 9వేల హెక్టార్లల్లో మాత్రమే పంట దెబ్బతిన్నట్లు నివేదికలు పంపారు. 24,342 మంది రైతులకు గాను రూ.15.42 కోట్ల మేర పంట నష్టం జరిగినట్లు తేల్చారు. గుడిపాల, పెనుమూరు, యాదమరి మండలాలను అత్యంత కరువు మండలంగా ప్రకటించారు. మరో 13 మండలాలను మధ్యస్థ కరువు మండలాలుగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో జనవరి 8వ తేదీన కేంద్ర బృందం యాదమరి, గుడిపాల మండలాలను సందర్శించింది. ఖరీఫ్‌లో నష్టపోయిన రైతులతో ముఖాముఖి నిర్వహించింది. అయితే నష్టపోయిన రైతులకు పరిహారం ఇంతవరకు ఇవ్వకపోవడంపై పలువురు మండిపడుతున్నారు. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు రైతులు వేరుశనగ ఒబ్బిడిలో బిజీబిజీగా మారారు. అయితే దిగుబడి చూసి కన్నీరుమున్నీరవుతున్నారు. చెట్టుకు రెండు గట్టి కాయలు కూడా లేకపోవడంతో పెట్టుబడిపై పూర్తిగా ఆశలు వదులుకుంటున్నారు. ఎకరాకు 15 బ్యాగులకుగాను (బ్యాగుకు 40 కేజీలు) రెండుమూడు బ్యాగులు కూడా వచ్చేపరిస్థితి లేదని రైతులు నిట్టూర్చుతున్నారు. 3 శాతం మంది రైతులు మాత్రం బోర్ల కింద పంటను కాపాడుకోగలిగారు. కాయలు లేవు నేను 1.5 ఎకరాల్లో వేరుశనగ వేశా. పెట్టుబడి 30 వేలు అయ్యింది. ఐదు బ్యాగుల కాయలకే 10 వేల దాకా పెట్టా. ప్రభుత్వం ద్వారా ఒక్క బ్యాగు కాయలు మాత్రమే ఇచ్చారు. కొంతమంది సాయంతో నాలుగు బ్యాగుల కాయలు సంపాదించా. వేస్తే చెట్టుకు గట్టి కాయలు రెండు కూడా లేవు. పెట్టిన పెట్టుబడి కూడా రాదు. గతేడాది కూడా పూర్తిగా నష్టపోయాం. ఇంత వరకు పరిహారం ఇవ్వలేదు. ఈ ఏడాది కూడా నష్టపోయాం. ప్రభుత్వం పరిహారం ఇస్తే రైతులు కోలుకుంటారు. –పట్టాభి, పాలూరు, చిత్తూరు మండలం -
‘నా భూమిని లాక్కున్నారు..న్యాయం చేయండి’
పలమనేరు : తన భూమిని పరిశ్రమల కోసమంటూ రెవెన్యూ అధికారులు అన్యాయంగా స్వాధీనం చేసుకున్నారని తనకు న్యాయం చేయాలంటూ పట్టణానికి చెందిన రాజేశ్వరి అనే బాధితురాలు మీడియాను ఆశ్రయించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నాగమంగళం రెవెన్యూలో రాళ్లు, చెట్లతో ఉన్న మూడెకరాల పొలాన్ని రాజేశ్వరి కుటుంబీకులు వ్యవసాయ యోగ్యంగా మార్చుకుని 30 ఏళ్లుగా వర్షాధారిత పంటలను సాగు చేసుకుంటున్నారు. ఇందుకు రెవెన్యూ అధికారులు 2005లో డీకేటీ పట్టాను మంజూరు చేశారు. ఇందుకు పట్టాదారుపాసు పుస్తకాలను మంజూరు చేయాలని బాధితురాలు పలు దఫాలు స్థానిక రెవెన్యూ అధికారులకు విన్నవించుకున్నారు. అయినా ఇవ్వకపోవడంతో బాధితురాలు 2023లో హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల సైతం ఇక్కడి అధికారులు పట్టించుకోలేదు. ఈ భూమిని పరిశ్రమల స్థాపనకోసం ప్రభుత్వం తీసుకుంది. దీనిపై బాధితురాలు బుధవారం భూమి వద్దకెళ్లి తనకు న్యాయం చేయాలని కోరగా ఇది ప్రభుత్వం ఇచ్చిన స్థలమంటూ ఎలాంటి హక్కులేదంటున్నారని బాధితురాలు వాపోయింది. -
శుభలేఖ ఇస్తామని పిలిచి చితకబాదారు
చౌడేపల్లె : ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయమైన స్నేహితుడికి తన వివాహపు శుభలేఖ ఇవ్వాలని, పిలిచి కట్టెలతో చితకబాదిన ఘటన బోయకొండ మార్గంలోని మిట్టూరుకు వెళ్లే కూడలిలో బుధవారం చోటు చేసుకుంది. బాధితుడి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పుదిపట్ల పంచాయతీ మిట్టూరుకు చెందిన గణేష్ (22) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో నిమ్మనపల్లె మండలం పిఠావాండ్లపల్లెకు చెందిన సతీష్‌తో గతేడాదిగా ఇన్‌స్ర్ట్రాగామ్‌లో పరిచయమయ్యాడు. వీరిద్దరూ స్నేహితులు కావడంతో బుధవారం తన పెళ్లని శుభలేఖ ఇవ్వాలని బోయకొండ మార్గంలోని మిట్టూరు కూడలిలో ఉన్నానని త్వరగా రా.. నేను మళ్లీ వెళ్లాలంటూ ఫోన్ చేశాడు. ఇంటి వద్ద ఉన్న గణేష్ అతడితో పాటు నాగార్జున కలిసి బైక్‌పై వెళ్లారు. సతీష్‌తోపాటు మరో 8 మంది కలిసి గణేష్ చేతిలోని సెల్‌ఫోన్‌ను లాక్కొని వెంట తెచ్చుకొన్న కర్రలతో మూకుమ్మడిగా కలిసి చితకబాదారు. కేకలు వేయడంతో చుట్టు పక్కలవారు అక్కడికి చేరుకొని అడ్డుకొనే ప్రయత్నం చేసినప్పటికీ దారుణంగా చితకబాదారన్నారు. హతమార్చడానికే వారువచ్చారని అదే గ్రామానికి చెందిన గోపాల్‌తో తనకు పాత కక్షలున్నాయని అతడే ఈ దురాగతానికి పాల్పడ్డారని, అతను కూడా ఘటనా స్థలంలోనే ఉన్నాడని ఈ దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. తీవ్రంగా గాయపడిన అతడిని పుంగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
ఆదిశక్తి అలంకరణలో వరాలతల్లి
చౌడేపల్లె : బోయకొండ గంగమ్మ ఆలయంలో నిర్వహిస్తున్న దసరా మహోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన బుధవారం అమ్మవారు ఆదిశక్తి పార్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. అనంతరం విశేషాభరణాలతో పార్వతీదేవిగా అలంకరించి పూజలు నిర్వహించారు. వేదపండితులు గోవర్ధనశర్మ, తదితర అర్చక బృందం ఉత్సవమూర్తి ఎదుట ఈఓ ఏకాంబరం, ఉభయదారులతో కలిసి హోమ పూజలు చేశారు. కార్యక్రమానికి జిఆర్ఎస్రమణ ( బోయకొండ), ఎం. వేణుగోపాల్‌రెడ్డి, సుగుణ (తిరుపతి) రామచంద్రయ్య, క్రిష్ణవేణి (సోమల) గురుప్రసాద్, గుణ నేత్ర ( బెంగళూరు) రాఘవేంధ్ర, మమత (చిక్బల్లాపురం) చంద్రశేఖర్‌రెడ్డి,దుర్గ ( రామాపురం వైఎస్సార్ కడప) వారు ఉభయదారులుగా వ్యవహరించారు. ఆలయంలో గణపతి పూజ, అభిషేకాలు, అర్చనలు, ఊంజల్‌సేవ, హోమం, చండీ హోమం, పూర్ణాహుతి చేశారు. -
ప్రైవేటు బస్సు బోల్తా
పూతలపట్టు (యాదమరి) : పూతలపట్టు మండలం పాలమూరు సమీపంలో బెంగళూరు–తిరుపతి జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడిన ఘటనలో 22 మంది ప్రయాణికులు గాయపడ్డారు. అదృష్టవశాత్తు పెను ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. పోలీసుల కథనం మేరకు... బెంగళూరు నుంచి తిరుపతి వైపుగా 40 మంది ప్రయాణికులతో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో అతి వేగంతో ప్రయాణిస్తున్న బస్సు పూతలపట్టు మండల పరిధి పాలమూరు గ్రామ సమీపానికి రాగానే ఎదురుగా వెళ్తున్న ఓ ఐచర్ వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో మొత్తం 22 మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిలో బెంగళూరుకు చెందిన హైమ, పుష్పవతి, సౌభాగ్య, భారతి, దివ్యశ్రీ, సంపూర్ణ, లత, సునిత, లక్ష్మి, లీలావతి, మునిరాజ్, సాంసన్, వెంకటరమణ, అరుణ్‌కుమార్, ఉదయ్, మునిసోమేష్, సంజన్, కృష్ణమూర్తి, లవ, మోహిత్‌రావు, శ్రీనివాసులు, వినయ్ ఉన్నారు. గాయపడ్డవారిని స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు 108 వాహనం ద్వారా క్షతగాత్రులను చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. పూతలపట్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కేబుల్‌వైర్ల చోరీ దొంగ పట్టివేత
చౌడేపల్లె : వ్యవసాయ బోర్ల వద్ద కేబుల్‌వైర్లు, ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్ తీగలు చోరీ చేసే నిందితుడు బీట్ పోలీసులకు జంగాలపల్లె వద్ద పట్టుబడిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది.స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మంగళవారం రాత్రి చారాల మార్గంలో కానిస్టేబుళ్లు మునిరాజ, శ్రీనివాసులు బైక్‌పై చారాలకు వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు సంచిలో వైర్లతో వెళ్తుండగా గమనించిన కానిేస్టేబుళ్లు జంగాలపల్లె మార్గంలో ఛేజింగ్ చేశారు. పట్టుబడిన దొంగల్లో పుంగనూరు మేలిపట్లకు చెందిన గంగాధర్ పట్టుబడగా మరొక దొంగ పరారైయ్యాడు. వారి వద్ద గల సుమారు 500 మీటర్ల కేబుల్ వైర్లను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఎక్కడెక్కడ చోరీ చేశారు..? ఎక్కడ విక్రయిస్తున్నారు అనే కోణంలో పోలీసులు ఆరా తీశారు. కాగా దొంగను పుంగనూరు పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది.జేడీవీగా ఉమామహేశ్వరి బాధ్యతల స్వీకరణచిత్తూరు రూరల్ (కాణిపాకం) : జిల్లా పశుసంవర్థకశాఖ జేడీగా ఉమామహేశ్వరి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. చిత్తూరు నగరంలోని కార్యాలయంలో ఆమె బాధ్యతలు స్వీకరించగా పలువురు కలిశారు. అనంతరం శాఖ అధికారులతో చర్చించారు. పాడి పరిశ్రమలో ఎదురవుతున్న సమస్యలపై ఆరాతీశారు.పకడ్బందీగా ఓటరు జాబితా కసరత్తుచిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కసరత్తు పకడ్బందీగా చేపడుతున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్లోని ఎన్నికల గోడౌన్‌ను తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. 2002 ఓటరు జాబితాలో 2025 ఓటరు జాబితాను సరిపోల్చే కార్యక్రమం జిల్లాలో చేపడుతున్నామన్నారు. ఈ ప్రక్రియ జిల్లాలో ఈనెల 19 నుంచి 26 వరకు నిర్వహిస్తామన్నారు. ఇప్పటి వరకు 25 శాతం ఓటరు జాబితా సరిపోలిందన్నారు. ఈ ప్రక్రియలో చిత్తూరు జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియలో బోగస్, మృతిచెందిన ఓటర్లను జాబితా నుంచి తొలగించడం జరుగుతుందన్నారు. పారదర్శకమైన ఓటర్ జాబితాకు చర్యలు చేపడుతున్నామన్నారు. సమావేశంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, డీఆర్వో మోహన్‌కుమార్, కలెక్టరేట్ ఏవో వాసుదేవన్, ఎన్నికల సెక్షన్ సూపరింటెండెంట్ రాజేంద్ర పాల్గొన్నారు. -
ఎర్రమట్టి.. కొల్లగొట్టి
టాస్క్‌ఫోర్స్ : చౌడేపల్లి మండలంలోని చెరువుల్లో మట్టి, ఇసుక డంప్ చేసినా అధికారులకు కనపడడంలేదు. రెవెన్యూ , నీటిపారుదల , పోలీసులు, రవాణా శాఖ అధికారులు తెలిసినా నోరు మెదపడంలేదని స్థానికుల నుంచి తీవ్ర విమర్శలున్నాయి. జేసీబీ, ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా రాత్రిపూట అక్రమంగా రవాణా చేస్తున్నా అడిగే నాథుడే కరవయ్యారు. రాత్రిపూట ప్రభుత్వ స్థలాల్లోని ఎర్రమట్టిని జేసీబీతో పెకలించి ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా రవాణా సాగిస్తున్నారు. ఒక లోడు ఎర్రమట్టి రూ.600 నుంచి దూరాన్ని బట్టి రూ.750 వరకు తీసుకుంటున్నారు. ఎర్రమట్టి కనిపిస్తే చాలు జేసీబీలు పెట్టి తవ్వి అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఇదేమని ప్రశ్నించిన వారిపై కూటమి నేతలు బెదిరిస్తున్నారు. గుట్టను చదును చేస్తున్నా... పెద్దకొండామర్రి పాలింపల్లె వద్ద ఇమాంసాబ్కు చెందిన పొలంలో రాత్రిపూట గ్రావెల్ తీస్తుండగా సమాచారం తెలుసుకొని అడ్డుకొని వాహనాలను వెనక్కు పంపారు. చెడుగుట్ల పల్లె సమీపంలోని మనుకూరమ్మ గుట్ట వద్ద గల ప్రభుత్వ స్థలాలు, గుట్టలోని ఎర్రమట్టిని సైతం వదలడంలేదు. శెట్టిపేట పంచాయతీ తోటకురప్పల్లె వద్ద గల అడ్డ గుట్ట అటవీ స్థలంలో ఎర్రమట్టిని దర్జాగా తరలిస్తూ గుట్టనే చదును చేస్తున్నా అటవీశాఖ అధికారులు నోరు మెదపడం లేదు. చెరువుల్లో ఇష్టానుసారంగా మట్టిని తరలిస్తున్నా అధికారులు కన్నెత్తి చూడడంలేదు. ఇసుక డంప్లున్నా ఉదాసీనతే.. అక్రమార్కులకు ఇసుక కాసుల వర్షం కురిపిస్తోంది. ఇసుకను డంప్ చేయడం విరుద్దమని తెలిసినా డంప్ ఉన్నప్పటికీ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండడం విమర్శలు చెలరేగుతున్నాయి. ట్రాక్టర్ ద్వారా రూ.5 నుంచి రూ. 6 వేల చొప్పున గ్రామాల్లో విక్రయిస్తున్నా అధికారులు చర్యలు చేపట్టడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. తోటకురప్పల్లెవద్ద అడ ్డగుట్టను తవ్వి మట్టిని తరలిస్తున్న దృశ్యం -
మాఫియాపై నిఘా
జిల్లాలో జరుగుతున్న మైనింగ్ మాఫియా, వసూళ్ల పర్వంపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. సాక్షిలో వరుసగా ప్రచురితమైన కథనాలపై స్పందించారు. అక్రమాల గనుడు కథనంతో లోతు విచారణకు ఆదేశించారు. ఇందుకు ఓ కమిటీని నియమించారు. రెవెన్యూ, పోలీసు, మైనింగ్ శాఖలతో కూడిన కమిటీ నియమించి మైనింగ్ మాఫియాపై నిఘా పెట్టారు. మళ్లీ ఆదివారం ప్రచురితమైన గ్రానైట్ రైట్ రైట్, సోమవారం ప్రచురితమైన మైనింగ్ మాఫియా అక్రమాలు ఆపరయా అనే కథనాలకు కలెక్టర్ స్పందించినట్లు తెలిసింది. మైనింగ్ మాఫియాపై వివరాలు అడిగినట్లు తెలిసి వచ్చింది. త్వరలో దీనిపై కమిటీతో చర్చించినట్లు తెలిసింది. ఇంతలో లోతు విచారణ చేసి నివేదికలు ఇవ్వాలని ఆయన ఆదేశించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. -
● వి‘శేష’ విహారం
ధ్వజారోహణలో వేదపండితులుపెదశేషవాహనంపై ఉభయదేవేరులతో శ్రీవారుఅఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని వైభవంతో తిరుగిరులు విరాజిల్లుతున్నాయి. బ్రహ్మోత్సవ శోభతో దేదీప్యంగా కాంతులీనుతున్నాయి. ధ్వజ పటం తేజస్సుతో నూతన వెలుగులను సంతరించుకున్నాయి. గోవిందనామస్మరణలతో మార్మోగుతున్నాయి. ఈ క్రమంలోనే ఏడు పడగల పెదశేషునిపై విహరిస్తున్న వైకుంఠనాథుని వీక్షించి భక్తజనులు పరవశించారు. ఉభయ దేవేరీ సమేతంగా ఊరేగుతున్న మలయప్పస్వామిని దర్శించుకుని పునీతులయ్యారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని బుధవారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టువస్త్రాలను సమర్పించారు. ఏడుకొండలస్వామివారిని ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ భక్తిశ్రద్ధలతో సేవించుకున్నారు. – తిరుమల -
గంజాయిపై ఉక్కుపాదం
పుంగనూరు : గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని, పాఠశాలలు, కళాశాలల సమీపంలోని 500 మీటర్ల దూరంలో గల షాపులపై ప్రత్యేక నిఘా పెట్టి తగు చర్యలు చేపడుతామని నూతన ఎస్పీ తుషార్‌డూడి తెలిపారు. బుధవారం ఆయన పట్టణ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని క్రైమ్ రికార్డులను పరిశీలించారు. స్టేషన్‌కు వచ్చిన బాధితులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. మహిళా పోలీసులతో సమావేశం నిర్వహించి, వారికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గంజాయిని పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులను మంచిగా మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. ఆయన వెంట పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్, సీఐ సుబ్బరాయుడు, ఎస్బీ సీఐ సూర్యనారాయణ, ఎస్ఐలు హరిప్రసాద్, రమణ పాల్గొన్నారు. త్వరితగతిన నియామక ప్రక్రియ చేపట్టండి చిత్తూరు కార్పొరేషన్ : కారుణ్య నియమాకానికి జెడ్పీలో దరఖాస్తు చేసుకున్న దివ్యాంగుడు అరుణ్‌కు త్వరితగతిన నియామక ప్రక్రియను పూర్తి చేయాలని జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు ఆదేశించారు. బుధవారం జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణలో కారుణ్య నియామక ప్రక్రియ పురోగతిని తెలుసుకునేందుకు నిరీక్షిస్తున్న దివ్యాంగుడు అరుణ్‌ను జెడ్పీ చైర్మన్ పలకరించి సమస్యను అడిగి తెలుసుకున్నారు.దివ్యాంగుడికి అందాల్సిన ఫ్యామిలీ పెన్షన్, ఉద్యోగ ప్రక్రియను ఈ నెల 29 లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. -
విష్వక్సేన వీక్షణ
ఫల పుష్ప ప్రదర్శనశాలతిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు మంగళవారం నిర్వహించిన అంకురార్పణతో టీటీడీ శ్రీకారం చుట్టింది. బుధవారం నుంచి పూర్తిస్థాయి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందు వైఖానస ఆగమశాస్త్ర నియమబద్ధంగా వేదపండితులు అంకురార్పణ ఘట్టాన్ని నిర్వహించారు. ఉత్సవాల ఏర్పాట్లను శ్రీవారి సేనాధిపతి శ్రీ విష్వక్సేనుడు తిరువీధుల్లో ఊరేగుతూ వీక్షించారు. సేనాపతి శంఖం, చక్రం, గద, ఖడ్గం తదితర ఆయుధాలను ధరించి ఛత్ర, చామర, మంగళ వాయిద్యాలతో భేరినాదాల నడుమ తిరుమాడ వీధుల్లో బంగారు తిరుచ్చి వాహనంపై వైభవంగా ఊరేగారు. అంకురార్పణ క్రతువులో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, సివీఎస్ఓ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కాగా తిరుమల కొండ విద్యుద్దీప కాంతులతో శోభిల్లుతోంది. ఉద్యానవనంలో టీటీడీ ఏర్పాటు చేసిన ఫలపుష్ప ప్రదర్శనశాల భక్తులను ఆకట్టుకుంటోంది. బుధవారం నుంచి ప్రారంభమయ్యే వాహన సేవల్లో శ్రీ మలయప్ప స్వామి ఆయా వాహనాలపై ఆలయ మాడ వీధుల్లో వైభవంగా ఊరేగుతారు. – తిరుమల -
గృహ నిర్మాణాల పురోగతిలో అలసత్వం వద్దు
చిత్తూరు కలెక్టరేట్ : గృహ నిర్మాణాల పురోగతిలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ సుమిత్ కుమార్‌గాంధీ హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్లో హౌసింగ్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గృహ నిర్మాణాల వేగవంతంలో హౌసింగ్ ఇంజినీరింగ్ అసిస్టెంట్లు కీలకపాత్ర పోషించాలన్నారు. వివిధ దశల్లో ఉన్న గృహ నిర్మాణాలను త్వరతిగతిన పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలన్నారు. నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడంలో వెనుకబడితే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. హౌసింగ్ పీడీ సుబ్రహ్మణ్యం, ఈఈ శంకరప్ప, ఏఈలు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. -
దళిత కుటుంబంపై కూటమి ఆటవిక చర్య
గంగవరం: దళితుల పక్షాన నిలబడి తమకు న్యాయం చేయాల్సిన కూటమి ప్రభుత్వం అగ్రవర్ణాలకు దాసోహమై దళితులపైనే దాడులు, దౌర్జన్యాలకు పూనుకోవడం సమంజసం కాదని దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని కల్లుపల్లి పంచాయతీ బూడిదపల్లిలో సోమవారం దళిత కుటుంబానికి చెందిన రేకుల ఇంటిని రెవెన్యూ, పోలీసు అధికారులు కూల్చివేసిన ఘటనపై నియోజకవర్గంలోని దళిత సంఘాల నాయకులు స్పందించారు. గంగవరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం నిరసన తెలిపారు. బాధితులైన నరసింహులు కుటుంబానికి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కె.వి.పి.ఎస్), వ్యవసాయ కార్మిక సంఘాల నాయ కులు మద్దతుగా నిలిచారు. వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు ఓబుల్రాజు మాట్లాడుతూ దళిత కుటుంబంపై కూటమి ప్రభుత్వ ఆటవిక చర్యగా పరిగణిస్తున్నామన్నారు. ఇదే గ్రామంలో టీడీపీకి చెందిన పెత్తందారీలు అనేకమంది కుంట పొరంబోకు, దళితుల శ్మశాన వాటిక దాదాపు 16 ఎకరాలకు పైగా ఆక్రమించుకుంటే అధికారులు నిద్రావస్థలో ఉన్నారని ఆరోపించారు. అదే పాడుబడిన బావి ఆనుకుని సెంటు స్థలంలో తరతరాలుగా ఉన్న రేకుల ఇంటిని కూల్చి నేలమట్టం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఘటన జరుగుతున్న సందర్భంలో నరసింహులు భార్య మణెమ్మ మనస్తాపానికి గురై అధికారుల కళ్లెదు టే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించినా పట్టించుకోలేదన్నారు. చావు వతుకుల్లో ఉన్న మహిళను ఆస్పత్రికి తరలించకుండా ఇంటి నుండి పక్కకు తోసేసి బాధితులను నానా రకాలుగా దూషించడం దళిత హక్కులను ఉల్లంఘించడం కాదా అని ప్రశ్నించారు. ఆమె ప్రాణాలకు హాని జరిగితే అందుకు బాధ్యులు తహసీల్దార్ రేఖ, పోలీసు అధికారులే కారకులవుతారని హెచ్చరించారు. దళితులపై ఇంతటి వివక్ష చూపుతున్న అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే గ్రామంలోని పెత్తందారీలు ఆక్రమించుకున్న పొరంబోకు భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోకపోతే నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బాధితు లు చాలాసేపు కార్యాలయం ఎదుట నిరసన తెలిపినా అధికారులు ఏమాత్రం స్పందించలేదు. తహసీల్దార్ రేఖ సెలవులో ఉండడంతో డీటీ సహానాకు అర్జీని సమర్పించారు. కార్యక్రమంలో దళిత నాయకులు ఈశ్వర, బాధిత కుటుంబాల ప్రజలు పాల్గొన్నారు. -
తెలుగు ఉపాధ్యాయుడికి జాతీయ అవార్డు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న తెలుగు ఉపాధ్యాయు డు పాపయ్యకు జాతీ య అవార్డు లభించింది. ప్రభుత్వ పాఠశాల ల అభివృద్ధికి, ఉత్తమ విద్యాబోధనకు హైదరాబాద్‌కు చెందిన శారద ఎడ్యుకేషన్ సొసైటీ ఆయనను జాతీయ అవార్డుకు ఎంపిక చేసింది. వెదురుకుప్పం మండలం, బొమ్మయ్యపల్లికి చెందిన ఆయన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన ఈనెల 25న హైదరాబాద్‌లోని భాస్కర ఆడిటోరియంలో నేషనల్ టీచర్ ఎక్స్‌లెన్స్ జాతీయ అవార్డును అందుకోనున్నారు. ఆయనకు డీఈవో వరలక్ష్మి, హెచ్ఎం హసన్‌బాషా, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. భార్య మందలించిందని! బంగారుపాళెం: భార్య మందలించడంతో భర్త కనిపించకుండా వెళ్లిపోయాడు. భర్త అదృశ్యంపై మంగళవారం భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు.. మండలంలోని ఎర్రాండ్లపల్లె దళితవాడకు చెందిన శరత్‌బాబు(40) ట్రాక్టర్ డ్రైవర్. తరచూ మద్యం తాగి ఇంటికి వెళ్లేవాడు. ఈ నెల 17న మద్యం సేవించి ఇంటికి వెళ్లడంతో భార్య పుష్ప గొడవపడింది. దాంతో భార్యపై అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి కనిపించలేదు. ఈ మేరకు భార్య పుష్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
దౌర్జన్యం చేస్తున్నారు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): భాగ పరిష్కారం ద్వారా సంక్రమించిన ఇంటి స్థలాన్ని ఆక్రమించేందుకు జీడీ నెల్లూరు మండలం పాత వెంకటాపురం పంచాయతీ గెరికలపల్లికి చెందిన సందీప్ నాయు డు, మనోహర్ నాయుడు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని అదే గ్రామానికి చెందిన మహాలక్ష్మీ ఆరోపించారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో మంగళవారం ఆమె మాట్లాడారు. తమ గ్రామంలో ఉన్న ఆస్తిని గతంలో పూర్వీకులు సమంగా పంచి ఇచ్చారని చెప్పారు. అయితే ఈ భూమిని ఆక్రమించేందుకు సందీప్ నాయుడు తప్పుడు పత్రాలు సృష్టించి వేధిస్తున్నారని వాపోయారు. వారి దౌర్జన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా తమ పైనే ఫిర్యాదు చేస్తారా అంటూ బెదిరించారని కన్నీటి పర్యంతమయ్యారు. సందీప్ నాయుడుతో పాటు అతని అనుచరులు బాబు నాయుడు, నీరజాక్షుల నాయుడు నుంచి ప్రాణహాని ఉందని చెప్పారు. జిల్లా ఎస్పీ స్పందించి చట్టపరంగా తమకు న్యాయం జరిగేలా చూడాలని విన్నవించారు. -
బాబు మోసాలపై పోరాటాలకు సిద్ధం
చిత్తూరు కార్పొరేషన్: అబద్ధాలు, దుష్ప్రచారాలు, మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పేదలకు సంక్షేమం, అభివృద్ధిని దూరం చేస్తున్నారని వైఎస్సార్సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి విమర్శించారు. మంగళవారం 22వ డివిజన్ తేనబండలో పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లీనారెడ్డి, నాయకులు జగ్గ, మురళీనాయకర్ల ఆధ్వర్యంలో శ్రీబాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీశ్రీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల తేనబండలో పార్టీ కార్యకర్తల పై కూటమి నాయకులు కక్ష గట్టి కేసులు పెట్టారని గుర్తుచేశారు. నీవా నది చుట్టూ ప్రహరీ గోడ కడుతాం, కొత్తగా లిల్లీబ్రిడ్జి నిర్మిస్తామన్న ప్రజాప్రతినిధి హామీ ఏమైందని ప్రశ్నించారు. ప్రజలు చంద్రబాబుకు వేసిన ఒక్క ఓటు వల్ల డివిజన్ వాసులు అక్షరాలా ఏడాదిలో రూ.కోట్లు నష్టపోయారని తెలిపారు. గతంలో ఏ పథకం ప్రవేశపెట్టినా మహిళల పేరుతోనే అమలు చేశారని గుర్తుచేశారు. అనంతరం నగర పార్టీ అధ్యక్షుడు కేపీ శ్రీధర్, మొదలియార్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞానజగదీష్, లీనారెడ్డి, మున్సిపల్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిణిరెడ్డి మాట్లాడారు. చివరిగా క్యూఆర్‌కోడ్ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు అంజలిరెడ్డి, ఆను, చాన్‌బాషా, నవాజ్, నౌషద్, నారాయణ, చక్రీ, మురళీ, చామంతి, అభిద్బాషా, సాధిక్‌బాషా, అస్లాంబాషా, బావాజాన్, అరుణ్, రాజేష్, కుమా రేష్, జ్యోతి, జాన్ పాల్గొన్నారు. -
గిరిజనులకు కలెక్టర్ వరాలు
సోమల(చౌడేపల్లె): సోమల మండలం, ఇరికిపెంట పంచాయతీ, పాయలగుట్ట, గువ్వలగుట్ట గిరిజనులకు కలెక్టర్ సుమిత్‌కుమార్ వరాలు కురిపించారు. మంగళవారం అధికారులతో కలిసి ఆయన కాలినడకన గిరిజనులున్న ప్రాంతాలకు చేరుకొని వారితో మమేకమయ్యారు. తర్వాత సమస్యలపై ఆరా తీశారు. గుడిెసెలు, పాకల్లో నివాసమున్న 14 మందికి పక్కా గృహాలు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ఒక్కో ఇంటికి రూ.1.5 లక్షల చొప్పున మంజూరు చేస్తామన్నారు. ఆధార్, రేషన్ కార్డులు లేని వారిని గుర్తించి వెంటనే జారీచేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ప్రతి విద్యార్థినీ బడికి పంపాలని, విద్యతో గిరిజన కుటుంబాల్లో మార్పు వస్తుందని సూచించారు. పాయలగుట్ట గ్రామస్తులనడిగి సమస్యలు తెలుసుకున్నారు. దారిసౌకర్యం కల్పించాలని కోరారు. చెన్నపట్నం చెరువు కట్టకింద గువ్వలగుట్టకు వేళ్లే మార్గంలో దారికి గండిపడి కోతకు గురైందని, వెళ్లడానికి ఇబ్బందికరంగా మారిందని చెప్పడంతో వెంటనే కల్వర్టు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పాయలగుట్టలో హేచరీ వల్ల ఇబ్బంది పడుతున్నామని కలెక్టర్‌కు తెలిపారు. గువ్వలగుట్టలో యానాది కవిత, పాయలగుట్టలో హనుమంతప్ప పేరిట భూమి పట్టాతోపాటు కరెంటు సర్వీసు వెంటనే మంజూరుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట డీపీఓ సుధాకర్, తహసీల్దార్ మధుసూదన్, ఎంపీడీఓ ప్రసాద్, ఇరిగేషన్ అధికారిణి ఝూన్సీ, సర్పంచ్ రెడ్డెప్ప, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాసులనాయుడు, ఇరికిపెంట చెరువు కట్ట చైర్మన్ గల్లా బోస్ తదితరులు పాల్గొన్నారు. గువ్వలగుట్టలో గిరిజనుల సమస్యలు తెలుసుకుంటున్న కలెక్టర్ సుమిత్‌కుమార్ గిరిజనుల గుడిసెలు పరిశీలిస్తున్న కలెక్టర్ సుమిత్‌కుమార్ -
ప్రభాకర్ కోసం ముమ్మర గాలింపు
దేవరపల్లి: పోలీసుల కళ్లు కప్పి సోమవారం రాత్రి పారిపోయిన కరుడు గట్టిన నేరస్తుడు బత్తుల ప్రభాకర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివిధ కేసుల్లో ముద్దాయిగా ఉండి రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఖైదీగా ఉన్న ప్రభాకర్ తూర్పు గోదావరి జిల్లా, దేవరపల్లి మండలం, దుద్దుకూరు వద్ద చేతులకు బేడీలతో పరారైన ఘటన పాఠకులకు తెలిసిందే. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏలూరు డీఐజీ అశోక్‌కుమార్, జిల్లా ఎస్పీ నరసింహకిషోర్, సీఐ నాగేశ్వరనాయక్ ఘటనా స్థలానికి చేరుకుని నేరస్తుడి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు 50 మంది యువకులతో బైక్‌లపై పరిసర ప్రాంతాల్లో గాలించినప్పటికీ ఫలితం లేకపోయింది. అర్ధరాత్రి వరకు యువకులు, పోలీసులు పొలాల్లో గాలించారు. కరుడుగట్టిన నేరస్థుడు ప్రభాకర్ చిత్తూరు జిల్లాకు చెందిన బత్తుల ప్రభాకర్ కరుడుగట్టిన నేరస్తుడని పోలీసులు చెబుతున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల్లో అతనిపై అనేక కేసులు ఉన్నాయి. పలు కేసుల్లో రిమాండ్ ఖైదీగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉంటున్నాడు. సోమవారం ఉదయం ఒక కేసులో పోలీసులు విజయవాడ కోర్టుకు తీసుకు వెళ్లి తిరిగి వస్తుండగా దేవరపల్లి మండలం, దుద్దుకూరు వద్ద హైవేపై గల హోటల్ వద్ద ఆగారు. ఆ సమయంలో ప్రభాకర్ టీ తాగడానికి చేతులకు ఉన్న హ్యాండ్స్ కప్స్‌ను ఒక చేతిది తీసి మరొక చేతికి ఉంచారు. టీ తాగుతున్న క్రమంలో ప్రభాకర్ ఎస్కార్ట్ పోలీసుల కళ్లు కప్పి హోటల్ వెనుక నుంచి పొలాల్లోకి పరారయ్యాడు. పోలీసులు వెంటపడినప్పటికీ దొరకలేదని డీఎస్పీ దేవకుమార్ తెలిపారు. ప్రభాకర్‌కు ఇద్దరు ఏఆర్ హెడ్ కానిస్టేబుళ్లు ఎస్కార్ట్‌గా వెళ్లారు. వీరిద్దరిని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ సస్పెండ్ చేశారు. 15 ప్రత్యేక బృందాల ఏర్పాటు పోలీసుల కళ్లుకప్పి పరారైన నేరస్థుడు బత్తుల ప్రభాకర్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్టు కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ తెలిపారు. మంగళవారం దేవరపల్లి పోలీస్ స్టేషన్లో విలేకరులతో మాట్లాడారు. 15 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ముద్దాయి కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. నేరస్థుడు ప్రభాకర్‌పై ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళలో సుమారు 80 కేసులు నమోదైనట్టు తెలిపారు. 2011 నుంచి ప్రభాకర్ నేరాలకు పాల్పడుతూ పట్టుబడినట్టు ఆయన చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి, ఉండ్రాజవరం పోలీస్ స్టేషన్లలో దొంతనం కేసుల్లో ముద్దాయిగా ఉన్న ట్టు పేర్కొన్నారు. 2022లో హైదరాబాద్‌లోని గచ్బౌలిలోని పబ్‌లో ఉన్న అతనిని పట్టుకోవడానికి వెళ్లిన పోలీసులపై ప్రభాకర్ కాల్పులు జరిపినట్టు తెలిపారు. ఫీజులు కట్టే సమయంలో విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు, గృహాలను లక్ష్యంగా పెట్టుకుని ఒంటరిగా దొంగతనాలు చేస్తాడన్నారు. ఉండ్రాజవరం మండలం వేలివెన్ను కాలేజీలో రూ.30 లక్షలు, దేవరపల్లి మండలంలో రోమన్ కేథలిక్స్ స్కూల్లో రూ.3 లక్షలు చోరీ చేసినట్టు తెలిపారు. పారిపోయిన సమయంలో చేతికి హ్యాండ్ కప్స్, వైట్ కలర్ టీ షర్టు, బ్లాక్ కలర్ ట్రాక్ ఫ్యాంటు ధరించి ఉన్నట్టు తెలిపారు. ఎక్కడెక్కడ నేరాలు చేస్తున్నాడు, సన్నిహితుల ఆచూకీని తెలసుకుంటున్నట్టు చెప్పారు. ముద్దాయి ఆచూకీ తెలిపిన వారికి రూ.50 వేల పారితోషికం ఇవ్వనున్నట్టు చెప్పారు. ఆచూకీ తెలిసిన వారు దేవరపల్లి పోలీసుల మొబైల్ నెంబర్లు 94407 96584 (సీఐ), 9440796624 (ఎస్సై)కు సమాచారం ఇవ్వాలని కోరారు. -
బంగారుపాళెంలో భారీ వర్షం
మొగిలి వద్ద ఎన్స్ప్రెస్ హైవే టెంట్లల్లోకి చేరిన నీరు బంగారుపాళెం: నిండుకుండలా గుంతూరు చెరువుమొరవపోతున్న అనబండచెరువు బంగారుపాళెం: మండలంలో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. అటవీ ప్రాంతంలోని వాగు లు, వంకలు, చెక్‌డ్యాంలు సాగి చెరువులకు భారీగా నీరు చేరుతోంది. మండలంలోని మొగిలి గ్రామంలోని గౌనిచెరువు, అనబండచెరువులు నిండి మొరవలు సాగుతున్నాయి. జంబువారిపల్లె, గుంతూరులోని వెంకటప్పనాయుని చెరువు, వీరప్పనాయుని చెరువులు నిండుకుండలా మారాయి. బలిజపల్లెలోని కామాక్షమ్మ చెరువుకు నీరు చేరుతున్నాయి. చీకలచెరువుకు నీరు చేరుతోంది. పాలేరులోని చిల్లామల చెరువుకు వంకలద్వారా నీరు చేరడంతో జలకళ సంతరించుకుంది. పాలేరు సమీపంలోని గజాగుండం జలపాతం వర్షపు నీటితో పరవళ్లు తొక్కుతోంది. బండరాయి మీదుగా జోరుగా నీరు ప్రవహిస్తోంది. మండలంలోని మొగిలి గ్రామ సమీపంలో అనబండచెరువు మొరవ పోవడంతో నీరు ఎక్స్‌ప్రెస్ హైవే పనులు జరుగుతున్న ప్రాంతానికి చేరుకోవడంతో కూలీలు బసఉండే టెంట్లు నడుములోతు నిండాయి. రైతుల పంటపొలాలపైకి నీరు వచ్చిందని రైతులు అంటున్నారు. వేరుశెనగ పంటకు వర్షం ప్రతికూలంగా మారిందని రైతులు చెబుతున్నారు. తేమకు పంట దిగుబడి దెబ్బతినే అవకాశం ఉందని అంటున్నారు. -
అప్పు చెల్లించలేదని హత్య?
–పూతలపట్టులో హోటల్ యజమాని ఘాతుకం పూతలపట్టు(యాదమరి): పూతలపట్టు మండల పరిధి, రంగంపేట క్రాస్ సమీపంలోని ఓ హోటల్ యజమాని తన దగ్గర పనిచేస్తున్న ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన మండలంలో చర్చనీయాంశమైంది. పోలీసుల కథనం.. రంగంపేట క్రాస్ సమీపంలోని ఓ ప్రముఖ కర్మాగారం దగ్గర బంగారుపాళ్యంకు చెందిన విజయ్‌నాయుడు హోటల్ నడుపుతున్నాడు. చంద్రగిరి మండలం, ఐతేపల్లి గ్రామానికి చెందిన రూబన్(42) ఆ హోటల్లో పనిచేయడానికి సదరు యజమానిని అడిగాడు. అందుకు సమ్మతించిన విజయ్‌నాయుడు అడ్వాన్సుగా రూ.20 వేలు రూబన్కి ఇచ్చాడు. డబ్బులు తీసుకున్న తరువాత ఎంతకీ విధులకు రాకపోవడంతో విషయాన్ని రూబన్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. వారి సూచన మేరకు కొద్దిరోజులుగా రూబన్ హోటల్లో పనిచేసుకుంటున్నాడు. సోమవారం రాత్రి విధులు పూర్తయ్యాక విజయ్‌నాయుడు, అతని స్నేహితుడు శ్రీను, రూబన్ ముగ్గురూ కలసి తిమ్మిరెడ్డిపల్లి జగనన్న కాలనీలోని రూబన్ ఇంటికి వెళ్లారు. అక్కడ ముగ్గురూ మద్యం సేవించారు. మద్యం మత్తులో రూబన్ తీసుకున్న డబ్బుల విషయంగా అక్కడ వాగ్వాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. విజయ్‌నాయుడు, రూబన్ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. విచక్షణ కోల్పోయిన విజయ్‌నాయుడు, అతని స్నేహితుడు శ్రీను రూబన్పై దాడి చేశారు. తీవ్ర రక్తస్రావం కావడంతో భయాందోళనకు గురైన విజయ్ పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సోమవారం రాత్రి రూబన్‌ను చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మంగళవారం మెరుగైన చికిత్స నిమిత్తం తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. తీసుకున్న అప్పు చెల్లించలేదనే రూబన్‌ను హత్య చేశారని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
ఓ నారీ..ఆరోగ్యంపై అశ్రద్ధ తగదు
యాదమరి: ప్రస్తుత సాంకేతిక యుగంలో తీరిక లేని సమయాన్ని గడుపుతున్న నారీమణులు తమ ఆరో గ్యంపై అశ్రద్ధ వహించడం అంత క్షేమం కాదని జిల్లా వైద్యాధికారి సుధారాణి అన్నారు.ఆమె స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండల పరిధిలోని మోర్దానపల్లిలో పర్యటించారు. ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం మానవ ఆరోగ్యాన్ని కబళిస్తున్న మధుమేహం, రక్తపోటు, మహమ్మారి వివిధ రకాల క్యాన్సర్లు బయటపడితే అటువంటి వారికి మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పారు. ఈనెల 25న యాదమరి పీహెచ్సీలో వైద్య నిపునులచే ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు మండల వైద్యాధికారి డా.అనిల్‌కుమార్ నాయక్ చెప్పారు. ఈ కార్యక్రమంలో సీహెచ్ఓ శ్రీనివాసమూ ర్తి, సూపర్వైజర్లు లక్ష్మీపతి, సెలవరాణి, వైద్య సహా యకులు సురేంద్రనాథరెడ్డి, సర్పంచ్ వాసుదేవరెడ్డి పాల్గొన్నారు. -
నేడు బాధ్యతలు చేపట్టనున్న జేడీ
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లా పశుసంవర్థ క శాఖ జేడీగా ఉమామహేశ్వరి బుధవారం బాధ్యతలు చేపట్టనున్నారు. తిరుపతి జిల్లాలో డీడీగా పనిచేస్తున్న ఆమెను చిత్తూరు జిల్లాకు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. 26న సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ జట్ల ఎంపిక చిత్తూరు కలెక్టరేట్: ఉమ్మడి చిత్తూరు జిల్లా సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ జిల్లా స్థాయి జట్ల ఎంపిక పోటీలు ఈ నెల 26న నిర్వహించనున్నట్లు చిత్తూరు సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు చందు వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చిత్తూరు జిల్లా కేంద్రంలోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈనెల 26న ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అర్హులైన క్రీడాకారులు 2011 తర్వాత జన్మించి ఉండాలన్నారు. ఒరిజినల్ ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలన్నారు. జిల్లా స్థాయిలో ఎంపికయ్యే క్రీడాకారులు అక్టోబర్ 4, 5, 6 తేదీల్లో విశాఖపట్టణం జిల్లా, కేడీపేట నర్సీపట్టణంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి క్రీడాపోటీల్లో పాల్గొంటారన్నారు. ఇతర వివరాలకు 9581887409, 7013989059 నంబర్లలో సంప్రదించాలని కోరారు. ప్రకృతి వ్యవసాయంతో స్థిరమైన ఆదాయం చిత్తూరు కలెక్టరేట్ : ప్రకృతి వ్యవసాయంతో స్థిరమైన ఆదాయం పొందవచ్చని కలెక్టర్ సుమిత్ కుమార్‌గాంధీ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో ప్రకృతి వ్యవసాయం అమలుపై సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రకృతి వ్యవసాయం పై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు రాబోయే తరాలకు నీటిని సంరక్షించడం ప్రకృతి వ్యవసా యం ముఖ్య ఉద్దేశమన్నారు. జిల్లాలో పాడిరైతుల ను అభివృద్ధి చేసి పశుగ్రాసం పెంచేందుకు సహజ, సేంద్రియ వ్యవసాయ విధానాలను అమలు చేయాలన్నారు. డీఆర్డీఏ, కృషి విజ్ఞాన కేంద్రాలు, గ్రామ పంచాయతీ, పలు శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రకృతి వ్యవసాయ లక్ష్యాలను సాధించాలన్నారు. జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ వాసు మాట్లాడుతూ జిల్లాలో 35,211 మంది రైతులు 34,633 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారన్నారు. జిల్లాలోని 260 క్లస్టర్లలో ఎన్ఎంఎంఎఫ్ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం ముందుకు తీసుకెళ్లాలన్నారు. అనంతరం జిల్లాలో ప్రకృతి వ్యవసాయంలో మంచి ఫలితాలు సాధించిన వెంకటసుబ్బరాజు, నరేంద్ర, చందుకుమార్, సుజా త, సుమతి, నాగరాజు, చెంగల్‌రెడ్డి, మహేష్, కవి తను దుశ్శాలువతో సత్కరించారు. రాయలసీమ కో–ఆర్డినేటర్ చంద్రశేఖర్, డీఆర్డీఏ పీడీ శ్రీదేవి, ఉద్యానశాఖ డీడీ మధుసూదన్‌రావు, వ్యవసాయశాఖ అధికారి మురళీకృష్ణ పాల్గొన్నారు. రూ.480 కోట్లు జమ చేయండి! చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మామిడి రైతుల అకౌంట్లో తక్షణం రూ.480 కోట్లు జమ చేయాలని ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతుల సంక్షేమ సంఘం కార్యవర్గం తీర్మానించింది. మంగళవారం చిత్తూరు ఎస్టీయూ కార్యాలయంలో మామిడి రైతుల సంక్షేమ సంఘం సమావేశం టి.జనార్దన్ అధ్యక్షతన జరిగింది. సంఘ నేతలు మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో పల్ప్ ఫ్యాక్టరీలకు తోతాపురి మామిడి సరఫరా చేసి మూడు నెలలు దాటినా నేటికీ డబ్బులు జమ చేయక పోవడం దుర్మార్గమన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 35 వేల మంది రైతులు 4 లక్షల టన్నుల మామిడి సరఫరా చేసినట్టు వెల్లడించారు. 15 రోజుల్లోగా బిల్లులు చెల్లించాలనే నిబంధన ఉన్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. కిలోకు రూ.12 చొప్పున చెల్లించాల్సి ఉందన్నారు. ప్రపంచ మామిడి దినోత్సవం సందర్భంగా చిత్తూరు, పూతలపట్టు ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీలు సైతం మరిచారన్నారు. ఈనెల 30లోగా నగదు జమచేయకుంటే అక్టోబర్‌లో ప్రత్యక్ష ఆందోళనకు సంసిద్ధం కావాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. సమావేశంలో ఉపాధ్యక్షులు హేమలత, సీ.మునీశ్వర్‌రెడ్డి, కె.మునిరత్నంనాయుడు ఏ.ఉమాపతి నాయుడు, పీ.భారతి, బీ.మురళి, సహాయ కార్యదర్శులు ఎం.లవకుమార్‌రెడ్డి కే.హరిబాబు, చంద్రమౌళిరెడ్డి, కే.సురేంద్రన్, కోశాధికారి పీఎల్.సంజీవరెడ్డి, బీ.శ్రీనివాస్ పాల్గొన్నారు. -
అక్రమ కేసులు కక్ష సాధింపే
అధికారం చేపట్టిన నాటి నుంచే కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు, దాడులు ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే పత్రికల గొంతు నొక్కి అక్రమ కేసులు బనాయించడం కక్ష సాధింపే. ప్రభుత్వం చేస్తున్న అరచాకాలను వెలుగులోకి తెచ్చేలా వార్తలు రాస్తే వారిపై కక్ష సాధింపు చర్యగా పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించేలా వ్యవస్థలను చేతుల్లోకి తీసుకునేలా వ్యవహరించడం, సాక్షి దినపత్రిక ఎడిటర్‌తోపాటు విలేకర్లపై అక్రమ కేసులు పెట్టడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేయడమే. – జీ శశికుమార్, గూడూరు నియోజకవర్గ కార్యదర్శి, సీపీఐ -
తమిళనాడుకు ‘చిత్తూరు లాటరీ’
చిత్తూరు అర్బన్: చిత్తూరులో నిర్వహిస్తున్న నిషేధిత లాటరీ టికెట్ల విక్రయాలు ఇప్పటికే జిల్లా సరిహద్దులు దాటి.. విజయవాడకు వరకు చేరాయి. తాజాగా ఈ లాటరీ టికెట్లను తమిళనాడుకు సైతం పంపుతుండడంతో అక్కడి పోలీసులు చిత్తూరు నగరంపై దృష్టి పెట్టారు. ఈ మేరకు తిరువణ్ణామలై పోలీసులు రెండు రోజుల క్రితం అక్కడ లాటరీలు విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పట్టుకుని విచారించారు. తనకు చిత్తూరుకు చెందిన వ్యక్తి లాటరీ టికెట్లు సరఫరా చేస్తున్నాడని సమాచారం ఇచ్చాడు. దీంతో చిత్తూరుకు చెందిన ఓ పంపిణీ దారుడిని తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. సచివాలయంలో ప్రింటర్ చోరీ వెదురుకుప్పం : మండలంలోని తిరుమలయ్యపల్లె సచివాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు ప్రింటర్‌ను చోరీ చేశారు. కార్యదర్శి సోమ వారం ఈమేరకు వెదురుకుప్పం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు సచివాలయ తలుపులకు వేసిన తాళాలను పగులగొట్టి ప్రింటర్‌ను అపహరించినట్లు పేర్కొన్నారు. సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో ఇదే విధంగా కొమరగుంట, బ్రాహ్మణపల్లె సచివాలయాల్లో ప్రింటర్లు అపహరణకు గురవడం గమనార్హం. గ్రావెల్ తరలింపుపై ధర్నా పాలసముద్రం : మండలంలోని వనదుర్గాపురం పంచాయతీ జగనన్న కాలనీ సమీపంలోని గుట్ట ను తవ్వి అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న ఘటన పై సోమవారం గ్రామస్తులతో కలిసి సీపీఎం, టీడీపీ నేతలు ధర్నాకు దిగారు. ఎర్రమట్టిని టిప్పర్లకు లోడ్ చేస్తున్న ప్రాంతంలో నిరసన తెలిపారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు రెవెన్యూ, మైనింగ్ అధికారులు ఇష్టారాజ్యంగా మట్టి తవ్వకాలకు అనుమతిస్తున్నారని మండిపడ్డారు. సుమారు ఐదు నెలలుగా మట్టి యథేచ్ఛగా తమిళనాడుకు తరలి పోతున్నప్పటికీ ఎమ్మెల్యే కనీసం స్పందించడం లేదని ఆరోపించారు. దీనిపై సమాచారం అందుకున్న తహసీల్దార్ అరుణకుమారి వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని గ్రామస్తుల ఫిర్యాదును తీసుకున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి మట్టి తరలింపును అడ్డుకుంటామని హామీ ఇచ్చారు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్సులకు నోటిఫికేషన్ విడుదల తిరుపతి రూరల్: శ్రీపద్మావతీ మహిళా యూనివర్సిటీలో సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ (సీడీఓఈ)లో వివిధ యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు వర్సిటీ అధికారులు సోమవారం నోటిఫికేషన్ జారీ చేశారు. బీఈడీ అడిషనల్ మెథడాలజీ, ఎంకామ్, ఎంఏ తెలుగు, ఎంఏ సంగీతం, డిప్లొమా ఇన్ మ్యూజిక్ (సంకీర్తన), వర్ణం, అన్నమయ్య అంతరంగం కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆసక్తి గల వారు ఈనెల 30 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు www.spmvv.ac.in వెబ్‌సైట్‌ను చూడాలన్నారు. -
ఉచితం.. ఊసే లేదు!
పుత్తూరు: ఉచిత విద్యుత్ అందిస్తామని కేబినెట్లో తీర్మానించి, జీఓ విడుదల చేసినప్పటికీ ఎందుకు అమలు చేయడం లేదని పవర్‌లూమ్స్ కార్మికులు మండిపడ్డారు. సోమవారం స్థానిక గేట్పుత్తూరులో వందలాది మంది కార్మికులు ఆందోళను దిగారు. ఏపీఎస్పీడీసీఎల్ ఈఈ ఆశీర్వాదానికి వినతిపత్రం అందజేశారు. సమస్య పరిష్కారం కోసం స్థానిక వైఎస్సార్సీపీ, టీడీపీ నేతలు ఏకమై ప్రభుత్వాన్ని నిలదీయడం విశేషం. కార్మిక నాయకులు మాట్లాడుతూ గత ఏడాది సెప్టెంబర్ నుంచి పవర్‌లూమ్స్‌కు 500 యూనిట్లు, చేనేత కార్మికులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీని అమలు చేయడానికి ఈఏడాది మార్చి 16వ తేదీన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారన్నారు. అనంతరం ఆగస్టు 7వ తేదీ నుంచి ఉచిత విద్యుత్‌ను అమలు చేస్తున్నట్లు జీఓ విడుదల చేశారని తెలిపారు. అయితే ఆగస్టులోనూ తాము బిల్లులు చెల్లించామని, ఈ సెప్టెంబర్‌లోనూ మళ్లీ యధావిధిగా విద్యుత్ బిల్లులు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము బిల్లులు చెల్లించే పరిస్థితిలో లేమని తేల్చి చెప్పారు. బిల్లులు చెల్లించాలని నిర్భందిస్తే ఆందోళన తప్పదని హెచ్చరించారు. దీనిపై ఈఈ ఆశీర్వాదం మాట్లాడుతూ ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని తెలిపారు. కార్మిక సంఘాల నేతలు శంకర్, పొన్నుస్వామి, సురేష్, నాగప్ప, జ్యోతి, సెల్వం, శివ, ఇళయరాజ, పాండియన్, కన్నప్ప, కన్నియప్పన్, అన్నామలై, కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
స్వస్థ్ నారీని పకడ్బందీగా నిర్వహించాలి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): స్వస్థ్ నారీని పకడ్బందీగా నిర్వర్తించాలని డీఎంఅండ్‌హెచ్‌ఓ సుధారాణి ఆదేశించారు. సాక్షి దినపత్రికలో ఈనెల 19వ తేదీన స్వస్థ్ నారీ వెతలు పేరుతో వార్త వెలువడింది. దీనిపై స్పందించిన డీఎంఅండ్‌హెచ్‌ఓ సోమవారం వైద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమ అమలు తీరుపై చర్చించారు. పీహెచ్‌సీలోని డాక్టర్లు, సిబ్బంది స్థానికంగానే ఉండాలన్నారు. స్వస్థ్ నారీ కార్యక్రమాన్ని విధిగా నిర్వహించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ లక్ష్యం మేరకు జరిపించాలన్నారు. 18 ఏళ్లు పైబడి, అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారికి కచ్చితంగా స్క్రీనింగ్ పరీక్షలు చేయించాలన్నారు. ప్రతి ఒక్కరికీ ఆబా ఐడీ నమోదు చేయాలన్నారు. బాలింతలకు రక్తహీనత పరీక్షలు చేసి ఐరన్ మాత్రలు ఇవ్వాలన్నారు. అనుమానిత క్యాన్సర్ కేసులను గుర్తించాలన్నారు. అలాగే టీబీ పరీక్షలు చేసి నిర్ధారణ అయినా కేసులకు మెరుగైన వైద్య సేవలందించాలన్నారు. మాతా శిశు సంరక్షణ సేవలను శనివారానికి వంద శాతం పూర్తిచేయాలని ఆదేశించారు. డాక్టర్లు ప్రతిరోజూ జరిగే స్వస్థ్ నారీ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ వెంకట ప్రసాద్, హనుమంతరావు, ప్రవీణ, అనూష, నవీన్తేజ్ రాయ్, అర్పిత తదితరులు పాల్గొన్నారు, -
అమ్మా..గంగమ్మా!
బోయకొండ(చౌడేపల్లె): దసరా మహోత్సవాలకు బోయకొండ గంగమ్మ ఆలయం ముస్తాబైంది. మంగళవారం నుంచి అక్టోబరు 2వ తేదీ గురువారం వరకు పది రోజులపాటు అంగరంగ వైభవంగా శరన్నవరాత్రి దసరా మహోత్సవాలు నిర్వహించేందుకు యంత్రాంగం సిద్ధమైంది. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తిచేసినట్టు బోయకొండ ఆలయ ఈఓ ఏకాంబరం తెలిపారు. కోరిన కోర్కెలు తీర్చే అమ్మగా పేరొందిన బోయకొండ అమ్మకు కన్నుల పండువగా బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. పవిత్రమైన పుష్కరిణి తీర్థం అమ్మవారి ఆలయ సమీపాన ఉన్న పుష్కరిణిలోని నీరు అతి పవిత్రమైన తీర్థంగా భక్తులు భావిస్తారు. ఈ తీర్థాన్ని సేవించడం వల్ల సకల రోగాలు మాయమవుతాయని, పంటలపై తీర్థాన్ని చిలకరిస్తే చీడ, పీడలు తొలగుతాయని భక్తుల నమ్మకం. దుష్టసంబంధమైన గాలి భయాలు దూరమవుతాయని భక్తుల విశ్వాసం. రూ.20కే బాటిల్‌తో సహా తీర్థాన్ని భక్తులకు అందిస్తున్నారు. పుష్ప మహిమ భక్తులు తమ కోరికలు నేరవేరుతాయో లేదో తెలుసుకునేందుకు మ్మవారి శిరస్సుపై మూడు పుష్పాలుంచి కోరికలను మనస్సులో స్మరించమంటారు. అమ్మవారు కుడివైపున పుష్పం పడితే కోరికలు తీరుతాయని, ఎడమవైపు పడితే ఆలశ్యంగా నెరవేరుతాయని, మధ్యలో పడితే తటస్థంగా భావించవచ్చని భక్తులు విశ్వసిస్తుంటారు. రవాణా మార్గాలు చౌడేపల్లె నుంచి బోయకొండ ఆలయం వద్దకు 12 కి.మీ దూరం ఉంది. ఈ మార్గంలో ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. అలాగే పుంగనూరు నుంచి బోయకొండకు 14 కి.మీ దూరం. మదనపల్లె నుంచి 16 కి.మీ. ఇక్కడి నుంచి ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడి నుంచే కాకుండా బెంగళూరు నుంచి కూడా బోయకొండకు ప్రత్యేకంగా కర్ణాటక ఆర్టీసీ బస్సు సర్వీసులున్నాయి. గతంలో గతుకుల రోడ్లులతో భక్తులు ఇబ్బందులు పడేవారు. గత ప్రభుత్వం డబుల్ రోడ్డు ఏర్పాటు చేయడంతో ప్రయాణానికి సౌకర్యవంతంగా ఉంది. కొండ కింద నుంచి ఆలయం వరకు ప్రయివేటు వాహనాల ద్వారా ప్రయాణం చేయొచ్చు. ప్రత్యేక సౌకర్యాలు దసరా మహోత్సవాల సందర్భంగా భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. దసరా మహోత్సవాల్లో పాల్గొన దలచిన ఉభయదారులు రూ.5,116 చెల్లించాల్సి ఉంటుందని ఈఓ పేర్కొన్నారు. దుర్గా సప్తశతి చండీహోమం (పౌర్ణమి రోజున) పాల్గొనే ఉభయదారులు రూ.2,116, శ్రీఘ్రఫలదాయిని పూజలో పాల్గొనే భక్తులు రూ.516 చెల్లించొచ్చు. రూ.వెయ్యి చెల్లించి వేద ఆశీర్వాదం టికెట్టు కొనుగోలు చేసిన ఇద్దరు భక్తులకు దర్శనంతోపాటు వేద ఆశీర్వాదం పొందవచ్చు. ఉభయదారుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు ఊంజల్ సేవ, అభిషేకం, గణపతి, చండీహోమాలు నిర్వహించేలా ఏర్పాట్లు సినట్టు ఈఓ తెలిపారు. ఉభయదారులకు అమ్మవారి ప్రసాదం, పవిత్రమైన శేషవస్త్రం, చీరతో పాటు రవిక పీసు, అమ్మవారి కుంకుమ, గాజులు, అమ్మవారి మెమెంటో ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. బోయకొండ ఆలయ ముఖచిత్రంబోయకొండ గంగమ్మతల్లికోరిన కోర్కెలు తీర్చే అమ్మ బోయకొండ గంగమ్మ దశావతారాలు ఈ నెల 23 నుంచి అమ్మవారికి పది రోజుల పాటు ప్రత్యేక అలంకరణలు చేపట్టనున్నారు. 23న శ్రీబాలాత్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. 24న శ్రీపార్వతీదేవిగా, 25న శ్రీఅన్నపూర్ణాదేవి, 26న శ్రీధనలక్ష్మిదేవిగా, 27న శ్రీశాఖాంబరీదేవిగా, 28న శ్రీమహాచండీదేవిగా, 29న శ్రీసరస్వతీదేవిగా, 30న దుర్గాదేవిగా, అక్టోబరు 1న శ్రీమహిషాసురమర్థినిగా, 2న శ్రీరాజ రాజేశ్వరిదేవిగా బోయకొండ గంగమ్మ భక్తులను కటాక్షించనున్నారు. -
సంఘమిత్ర చేతి వాటం
– రూ.4.9 లక్షలు స్వాహా వెదురుకుప్పం: ఓ సంఘమిత్ర చేతి వాటాన్ని ప్రదర్శించాడు. గ్రామ సమైఖ్య(వీఓ) ద్వారా పేదలకు అందించే రుణాల్లో గోల్మాల్ చేసి రూ.4 లక్షలకుపైగా స్వాహా చేశాడు. ఈ ఘటన సోమవారం వెదురుకుప్పం మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితుల కథనం...మండలంలోని తిరుమలయ్యపల్లె పంచాయతీ, సుందరాంగిణిపల్లె ఎస్సీ కాలనీలో ఽసాయి వీఓ పరిధిలో ధనలక్ష్మి, వినాయక, తరుకాణమ్మ, కనకదుర్గ స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. 2014లో పీఓపీ కింద ఎస్సీ, ఎస్టీ మహిళలు ఒక్కో సభ్యురాలికి రూ.40 వేల చొప్పున రుణాలు మంజూరు చేశారు. సాయి వీఓ పరిధిలోని ధనలక్ష్మి, వినాయక, తరుకాణమ్మ, కనకదుర్గ స్వయం సహాయక సంఘాల్లోని కొంత మందికి ఒక్కో మహిళకు రూ.40 వేల చొప్పున రుణాలు మంజూరు చేశారు. ఆ రుణాలను తిరిగి చెల్లించే క్రమంలో సంఘమిత్రగా ఉన్న సుబ్రమణ్యంరెడ్డి తన చేతి వాటాన్ని ప్రదర్శించారు. నెలనెలా సభ్యుల వద్ద వసూలు చేసి బ్యాంకులో జమచేస్తానని నమ్మబలికి రుణాలు స్వాహా చేశాడు. 18 మంది నుంచి రుణాల చెల్లింపు పేరిట వసూలు చేసిన మొత్తాన్ని తన అవరాలకు వాడుకునేశాడు. ధనలక్ష్మి సంఘం నుంచి రూ.44,463, వినాయక సంఘం నుంచి రూ.1,31,850, తురకాణమ్మ సంఘం నుంచి రూ.1,54,449, కనకదుర్గ సంఘం నుంచి రూ.1,59,429 చొప్పున మొత్తం రూ. 4,90,191 వసూలు చేశాడు. తాజాగా స్వయం సహాయక రుణాల కోసం బ్యాంకు వద్ద కు సంఘ సభ్యులు వెళ్లడంతో అసలు విషయం బహిర్గతమైంది. గతంలో తీసుకున్న రుణాలను చెల్లించలేదని చెప్పడంతో అవాక్కయ్యారు. దీంతో సోమవారం వెదురుకుప్పంలో సంఘమిత్రపై చర్యలు తీసుకోవాలంటూ వెదురుకుప్పం ఎస్ఐ, వెలుగు ఏపీఎం పరశురామిరెడ్డికి ఫిర్యాదు చేశారు. సంఘమిత్ర పై విచారణ సంఘమిత్ర సుబ్రమణ్యం రెడ్డిపై మండల సమైఖ్య కమిటీ ద్వారా విచారణ చేపట్టినట్టు ఏపీఎం పరశురామిరెడ్డి తెలిపారు. సుబ్రమణ్యంరెడ్డి వసూలు చేసిన నగదును తానే వాడుకున్నట్లు ఒప్పుకుని సభ్యుల నుంచి వసూలు చేసిన డబ్బును ఒక నెలలోపు తిరిగి చెల్లిస్తానని వెలుగు కార్యాలయంలో రాత పూర్వకంగా రాసిచ్చారు. కాగా సుబ్రమణ్యంరెడ్డి పై జిల్లా అధికారులకు నివేదికలు అందించి తగు చర్యలు తీసుకుంటామని ఏపీఎ సంఘ సభ్యులకు హామీ ఇచ్చారు. -
వైఎస్సార్సీపీలో కార్యకర్తలే కీలకం
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు: వైఎస్సార్సీపీని గ్రామ స్థాయి నుంచి పటిష్టం చేస్తూ కార్యకర్తలే కీలకంగా కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. సోమవారం పుంగనూరు నియోజకవర్గంలోని మున్సిపాలిటీతో సహా అన్ని మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులతో కలసి తిరుపతిలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరులో వినూత్న పద్ధతిలో వార్డులు, గ్రామాల వారీగా ఇన్‌చార్జ్‌లను, కార్యకర్తలను ఎంపిక చేశారు. వారితో సెల్ఫోన్ల ద్వారా పెద్దిరెడ్డి నేరుగా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యక్రమ కమిటీల ఏర్పాటు డేటాను మండలాల వారీగా స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నియంత పోకడలను, అరాచక పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యపరచాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. వైఎస్.జగన్మోహన్రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడాలన్నారు. పుంగనూరు నియోజకవర్గంలో చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరితోనూ నేరుగా సంభాషిస్తూ, వారి కష్టసుఖాలను తెలుసు కుని అండగా ఉంటానని భరోసానిచ్చారు. ఎలాంటి ఒత్తిళ్లకు, బెదిరింపులకు తలొగ్గాల్సిన పనిలేదని ఆయన స్పష్టం చేశారు. కార్యకర్తలకు ఏకష్టం వచ్చినా పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వజ్ర భాస్కర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి అనీషారెడ్డితో పాటు పార్టీ మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు. -
రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలి
జిల్లాలో రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు కోరారు. ఆయన మాట్లాడుతూ బంగారుపాళ్యం మండలంలో దారి, కాలువ సమస్య పరిష్కారించాలని ఆన్లైన్లో ఫిర్యాదు చేస్తే పరిష్కరించకుండానే పరిష్కారం అయిపోయినట్లు అధికారులు చెప్పడం దారుణమన్నారు. అలాగే అనేక మండలాల్లో ఇదే దుస్థితి ఉందన్నారు. రాత్రికి, రాత్రే భూములు ఆక్రమించేస్తున్నారని ఆరోపించారు. గంగవరం మండలంలో మునెమ్మ అనే మహిళ రెవెన్యూ అధికారుల అలసత్వానికి యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి యత్నించడం బాధాకరమన్నారు. -
కదం తొక్కిన విద్యుత్ ఉద్యోగులు
చిత్తూరు కార్పొరేషన్: తమ సమస్యలను పరిష్కారించాలంటూ విద్యుత్ ఉద్యోగులు కదంతొక్కారు. సోమవారం జిల్లా కేంద్రంలోని అమూల్ డెయిరీ వద్దకు వందలాది మంది ఉద్యోగులు చేరుకున్నారు. అక్కడి నుంచి ర్యాలీగా తమ డిమాండ్ల సాధన కోసం నినాదాలు చేసుకుంటూ కదిలారు. అనంతరం కలెక్టరేట్ వద్దకు చేరుకొని ఆందోళన వ్యక్తం చేశారు. తర్వాత కలెక్టర్ సుమిత్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. జిల్లా జేఏసీ నాయకులు మురళీకృష్ణ, వివేకానందరెడ్డి, యజ్ఞేశ్వరరావు మాట్లాడుతూ ప్రమాదాలు జరిగినప్పుడు ఆస్పత్రిలో వైద్యఖర్చులకు రూ.లక్షలు ఖర్చువుతోందన్నారు. కానీ మెడికల్ బిల్లులు 60 శాతం కూడా కవర్ కావడం లేదన్నారు. మొత్తం వైద్యఖర్చులు చెల్లించే విధంగా చూడాలన్నారు. పెండింగ్‌లో ఉండే నాలుగు డీఏ బకాయిలను విడుదల చేయాలని, 1999–2004 మధ్య ఉద్యోగంలో చేరినవారికి ఈపీఎఫ్ పింఛన్ విధానం అమలు చేయాలన్నారు. జేఎల్ఎం గ్రేడ్–2 ఉద్యోగులను విద్యుత్‌శాఖలో విలీనం చేసి, జీతాలు పెంచాలన్నారు. డిప్లొమా చేసిన ఓఅండ్ఎం ఉద్యోగులకు పదోన్నతిలో అవకాశం కల్పించాలన్నారు. లైన్మెన్లకు లైన్ఇన్స్స్పెక్టర్ట్గా, సబ్ఇంజినీర్లను ఏఈగా, ఏఈలకు డీఈ, ఈఈలుగా అవకాశం కల్పించాలన్నారు. నాయకులు బద్రి, బాబు, బాలాజీ, జాఫర్, రమణ, హేమచంద్ర, వరదరాజులు, గోవిందు, అక్బర్, నాగయ్య, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. యాదమరి ఆదర్శంగా నిలవాలి యాదమరి: మన డబ్బులు మన లెక్కలు కార్యక్రమంలో భాగంగా యాదమరి చిత్తూరు జిల్లాలోనే ఆదర్శంగా నిలవాలని డీఆర్డీఏ పీడీ శ్రీదేవి సూచించారు. సోమవారం ఆమె ఎండీఎంఎల్ కార్యక్రమంలో భాగంగా మండలంలోని అతిగారిపల్లి, పెరియంబాడి గ్రామాల్లోని సంఘ సభ్యులకు అవగాహన కల్పించారు. ఆమె మాట్లాడుతూ సంఘ చెల్లింపులు పారదర్శకత కోసమే ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు వెల్లడించారు. అందులో భాగంగానే మండలంలోని పెరియంబాడి, అతిగారిపల్లి, 14కండ్రిగ, మోర్దానపల్లి, తెల్లరాళ్లపల్లి–2ఏ గ్రామ సమైఖ్య సంఘాలలో అమలు చేస్తున్నామన్నారు. ప్రతి పది సంఘాలకు ఒక ఈ–నారీని గుర్తించి వారి ద్వారా సంఘం యొక్క లావాదేవీలు తెలుసుకోవచ్చన్నారు. -
పంటలు ధ్వంసం
పులిచెర్ల మండలంలో ఏనుగుల దాడులు ఆగ నంటున్నాయి. నిత్యం ఏదో ఒక గ్రామంలో పంటలను ధ్వంసం చే స్తూనే ఉన్నాయి. ఆలకిస్తూ..భరోసానిస్తూ! చిత్తూరు అర్బన్: సుదూర ప్రాంతాల నుంచి న్యాయం కోసం వచ్చిన ప్రజల సమస్యలను ఓపికగా విన్నారు. వీటిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి..? విచారణ నేపథ్యంపై ఆయా స్టేషన్ హౌజ్ ఆఫీసర్లతో (ఎస్‌హెచ్‌వో) మాట్లాడి, ప్రజలకు భరోసా ఇచ్చారు. చిత్తూరు నగరంలోని ఏఆర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి తొలిసారి హాజరైన ఎస్పీ తుషార్ డూడీ.. ప్రజల నుంచి వినతులు తీసుకున్నారు. వీటిలో కుటుంబ తగాదాలు, వేధింపులు, మోసాలు, ఇంటి తగాదాలు, భూ తగాదాలు, లావాదేవీలకు సంబంధించిన సమస్యలున్నాయి. తన వద్ద కు వచ్చిన బాధితులతో ఆయన ఓపిగా మాట్లాడి, న్యా యం చేస్తామన్నారు. ఫిర్యాదులను ఆన్లైన్ చేయడంతో పాటు నిర్ణీత గడువులోపు సమస్యలు పరిష్కారమయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పలు ఫిర్యాదులపై అప్పటికప్పుడే ఎస్హెచ్వోలత మాట్లాడారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి ఒక్క సమస్యపై విచారణ చేపట్టి, ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. మొత్తం 53 ఫిర్యాదులు అందాయి. అలాగే చిత్తూరు ఏఎస్పీ రాజశేఖర రాజు సైతం ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. మహిళా సంరక్షణ కార్యదర్శిపై వేటు పెనుమూరు(కార్వేటినగరం): మండల పరిధిలోని సీఆర్ కండ్రిగ గ్రామ సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న మహిళా సంరక్షణ కార్యదర్శి శకుంతలను కలెక్టర్ సుమిత్ కుమార్ సస్పెండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సస్పెండ్ ఆర్డర్లు జారీ చేశారు. వివరాలు.. సీఆర్ కండ్రిగ గ్రామ సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న శంకుతల రిజిస్టర్లో సంతకం చేయక పోవడంతో పాటు బయోమెట్రిక్ హాజరు కూడా నమోదు కాలేదు. విధులకు ఆలస్యంగా హాజరు కావడంపై కారణం అడగ్గా సక్రమంగా సమాధానం చెప్పక పోవడంతో ఎంపీడీవో నీలకంటేశ్వర్రెడ్డి ఇచ్చిన నివేదిక ప్రకారం ఆమెను విధుల నించి తొలగించినట్టు కలెక్టరేట్ అధికారులు పేర్కొన్నారు. -
డిప్యుటేషన్‌పై వైద్య సిబ్బంది
పెనుమూరు(కార్వేటినగరం): సక్రమంగా విధులు నిర్వర్తించని పెనుమూరు సీహెచ్‌సీ వైద్యసిబ్బందిని కుప్పం ఏరియా ఆస్పత్రికి డిప్యుటేషన్‌పై బదిలీ చేసినట్లు సమాచారం. ఈ నెల 18వ తేదీ పెనుమూరు కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది సేవలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అధికారులు డీసీహెచ్ఎస్ పద్మాంజలి, డాక్టర్ గీతాకుమారిని కలెక్టర్‌కు సరెండర్ చేశారు. రేడియోగ్రాఫర్ గీతాకుమారిని డిప్యూటేషన్‌పై కుప్పం ఏరియా ఆస్పత్రికి బదిలీ చేసినట్లు తెలిసింది. టీబీని తరిమికొట్టాలి చిత్తూరు కలెక్టరేట్ : టీబీ వ్యాధిని తమిరికొట్టాలని కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ చేతుల మీదుగా 100 మంది క్షయ వ్యాధి గ్రస్తులకు ఆహార పదార్థాలను పంపిణీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ క్షయా వ్యాధి పట్ల క్షేత్ర స్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. మారుతున్న జీవన విధానం, తగ్గుతున్న వ్యాధి నిరోధకశక్తి కారణంగా కొన్నేళ్లుగా పిల్లలు సైతం క్షయ వ్యాధి బారిన పడుతున్నారన్నారు. అప్రమత్తతతో పాటు క్రమం తప్పకండా మందులు వాడితే క్షయ నివారణ సాధ్యమేనన్నారు. క్షయ నిర్మూలనకు నిక్షయ్ సంపర్క్ హెల్ప్‌లైన్ 1800–11–6666 టోల్ ఫ్రీ నెంబర్లలో సంప్రదించాలన్నారు. జేసీ విద్యాధరి, డీఎంఅండ్‌హెచ్‌వో సుధారాణి, అడిషనల్ డీఎంఅండ్‌హెచ్‌వో వెంకటప్రసాద్ పాల్గొన్నారు. అర్జీలు పరిష్కరించాలి చిత్తూరు కలెక్టరేట్ : పీజీఆర్ఎస్లో ప్రజలు అందజేసే అర్జీలను సంతృప్తి స్థాయిలో పరిష్కరించాలని కలెక్టర్ సుమిత్ కుమార్‌గాంధీ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నమోదయ్యే ప్రతి అర్జీని నిర్ణీత గడువులోపు పరిష్కరించాలన్నారు. అర్జీల పరిష్కారంలో ఎలాంటి అలసత్వం వహించకూడదన్నారు. అర్జీలు రీ ఓపెన్ అయితే శాఖాపరంగా చర్యలుంటాయని హెచ్చరించారు. పీజీఆర్ఎస్లో ప్రతి వారం 200 నుంచి 300 అర్జీలు నమోదవుతున్నాయని, అధిక శాతం అర్జీలు నమోదవుతున్న శాఖల అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో గత ఏడాది జూన్ 15 నుంచి ఇప్పటి వరకు 63,063 అర్జీలు నమోదైనట్లు వెల్లడించారు. జిల్లాలోని అన్ని శాఖల్లో కచ్చితంగా ఈ ఆఫీస్ అమలు చేయాలన్నారు. మాన్యువల్ విధానంలో ఫైల్స్ పంపకూడదన్నారు. ప్రతి కార్యాలయంలో ఉద్యోగులు ఎన్ని ఫైల్స్ పరిష్కరించారు, ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయనే వివరాలను నివేదికల రూపంలో సిద్ధంగా పెట్టుకోవాలన్నారు. జిల్లాలోని మామిడి రైతులకు త్వరలో రూ.157 కోట్లు సబ్సిడీ అందజేయనున్నట్లు వెల్లడించారు. ఈ సమీక్షలో జాయింట్ కలెక్టర్ విద్యాధరి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. 24న తిరుపతికి చేరుకోవాలి చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో డీఎస్సీకి ఎంపికై న అభ్యర్థులు ఈ నెల 24న తిరుపతిలోని చదలవాడ ఇంజినీరింగ్ కళాశాలకు చేరుకోవాలని డీఈవో వరలక్ష్మి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో డీఎస్సీలో ఎంపికై కాల్ లెటర్లు అందుకున్న అభ్యర్థులు ఈ నెల 24న తిరుపతిలోని చదలవాడ ఇంజినీరింగ్ కళాశాలకు ఉదయం 7 గంటలకు చేరుకోవాలన్నారు. అభ్యర్థులు తమ సౌకర్యార్థం బ్లాంకెట్స్, తలదిండు, గొడు గులు తీసుకొచ్చుకోవాలన్నారు. చేరుకునే అభ్యర్థులను రిపోర్టు చేసుకున్న జాబితా ప్రకారం ఈ నెల 25న విజయవాడలో జరిగే కార్యక్రమానికి ఐడీ కార్డులు అందజేస్తామన్నారు. అభ్యర్థులు తమ ఫొటోతో పాటు విచ్చే సే అభ్యర్థుల పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, ఐడీ కార్డు ను తీసుకురావాలన్నారు. తిరుపతి నుంచి ప్రత్యేక బస్సుల్లో అభ్యర్థులను విజయవాడకు తరలిస్తామని ఆమె వెల్లడించారు. -
అంతా విలవిల!
సైబర్ వల.. ● కుప్పంకు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగికి ‘తల్లికివందనం’ డబ్బులు ఇంట్లో పిల్లలందరికీ రావాలంటే కింది లింకుపై క్లిక్ చేయమని టెక్ట్స్ మెసేజ్ వస్తే అలాగే చేశాడు. తీరా తన యూపీఐ ఖాతాలో ఉన్న రూ.32 వేలు పోగొట్టుకున్నాడు. ● ఇటీవల విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో ర్యాంకు తెలుసుకోవాలంటే ఫైల్ ఓపెన్ చేయమని వచ్చిన మెసేజ్‌ను తెరిస్తే.. వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ నగరికి చెందిన విద్యావంతుడు రూ.12 వేలు పోగొట్టుకున్నాడు. చిత్తూరు అర్బన్: ఇప్పుడంతా ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) యుగం. ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియని పరిస్థితి. ఆన్లైన్లో ఆర్థిక నేరాలు చేసేవాళ్లు సైతం ఏఐని ఉపయోగించి సరికొత్త మోసాలకు పాల్పడుతూ రూ.కోట్లు ఆర్జిస్తున్నారు. మోసం చేసిన వ్యక్తి ఎవరో తెలియదు. ఎక్కడ ఉంటాడో చెప్పలేని పరిస్థితి. ఆడ, మగా కూడా గుర్తించడం వీలుకాదు. కానీ బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.లక్షలకు రూ.లక్షలు కొల్లగొట్టేస్తున్నారు. నిందితులను గుర్తించడం, పట్టుకోవడం, పోగొ ట్టుకున్న నగదును రికవరీ చేయడం పోలీసులకు ఓ సవాలుగా మారుతోంది. రోజూ కొత్తకొత్త నేరాలు చిత్తూరు జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లకు ఇటీవల వస్తున్న సైబర్ మోసాలు చూస్తుంటే పోలీసులే షాక్‌కు గురవుతున్నారు. అడ్డూ అదుపులేని దురాశ, అనవసరమైన వాటిని క్లిక్ చేయడం మోసాలకు ప్రధాన కారణంగా మారుతోందని గ్రహించారు. మీట నొక్కనంతవరకు సేఫ్ వాట్సాప్, టెక్ట్స్ మెసేజ్‌ల్లో చాలా వరకు ఏపీకే ఫైల్స్ వస్తుంటాయి. వీటిని ఏ మాత్రం క్లిక్ చేసినా ఖాతాలో డబ్బులు ఖాళీ అవుతాయి. కొందరు లక్కీడిప్‌లో బహుమతి వచ్చిందని సతాయించి డబ్బులు దోచేస్తున్నారు. అనవరసమైన వాటి జోలికి వెళ్లడం, సంబంధంలేని ఫైల్స్‌పై క్లిక్ చేయడమే సైబర్ నేరం జరగడానికి బీజంగా పడుతోంది. తమ కంపెనీకి రోజూ 5 స్టార్ రేటింగ్ ఇస్తే.. రోజూ రెండు కాయిన్ల చొప్పున నెలకు 60 కాయిన్లు ఇస్తామని, ఈ–మెయిల్ ఐడీ వేరుగా ఉండాలని చెప్పి ఓ మహిళకు ఆన్లైన్లో ఆఫర్ వచ్చింది. తీరా 600 కాయిన్లు గెలుచుకున్న తనకు రూ.60 వేలు ఇవ్వాలని మహిళ కోరగా, తొలుత రూ.5 వేలు చెల్లించాలని చెప్పారు. ఇలా క్రమంగా ఆమె నుంచి రూ.3.75 లక్షలు కాజేయగా తాలూకా పోలీసులను ఆశ్రయించారు. చిత్తూరు కలెక్టరేట్లో పనిచేసే ఓ ఉద్యోగికి ప్రధాన మంత్రి కిసాన్ యోజన పేరిట ఏపీకే ఫైల్ వాట్సాప్‌కు వచ్చింది. దీన్ని నలుగురికి ఫార్వర్డ్ చేస్తే, బహుమతి వస్తుందని మెసేజ్‌లో ఉంది. తీరా ఫైల్ ఓపెన్‌చేస్తే, ఫోన్‌పేలో ఉన్న రూ.1.3 లక్షలు పోగొట్టుకోవడంతో పాటు ఫోన్ హ్యాక్‌కు గురైంది.... పై ఘటనలు మచ్చుకు కొన్ని మాత్రమే. జిల్లాలో నిత్యం పదుల సంఖ్యలో వెలుగు చూస్తున్నాయి. సైబర్ నేరగాళ్ల మోసాలకు పలువురు బలైపోతున్నారు. బయటకు చెప్పుకోలేక కొంతమంది నలిగిపోతున్నారు. వీటి కట్టడికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నా.. నగదు రికవరీలో ఇబ్బందులు తలెత్తుతుండడంతో బాధితులు తలలు పట్టుకుంటున్నారు. ఒక్క నిమిషం ఆలోచిస్తే ఇలాంటి మోసాలకు తావుండదని పోలీసులు సూచిస్తున్నారు. అవమానంగా భావిస్తూ.. ఆర్థికంగా చితికిపోతూ.. నగదు పోగొట్టుకున్న తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరువు పోతుందని కొందరు మిన్నకుండిపోతున్నారు. కానీ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్ల పోగొట్టుకున్న నగదు మళ్లీ బ్యాంకు ఖాతాకు తెప్పించడం పోలీసులకే సాధ్యం. సైబర్ మోసగాళ్లు విసురుతున్న సరికొత్త సవాళ్లను ఛేదిస్తూ, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ జిల్లా పోలీసు యంత్రాంగం అండగా నిలుస్తోంది. గత మూడేళ్లల్లో సైబర్‌క్రైమ్ ద్వారా పోగొట్టుకున్న దాదాపు రూ.2.16 కోట్ల నగదును బ్యాంకుల్లోనే ఫ్రీజ్ చేయగలగడం జిల్లా పోలీసు యంత్రాంగానికే సాధ్యం. ఒక్క నిమిషం ఆలోచిస్తే స్మార్ట్ ఫోన్ల వాడకంలో ఏది అవసరం..? ఏది అనవసరం..? అని రెండే ప్రశ్నలు వేసుకుంటే సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసి నట్టే. ఏదో గిఫ్ట్ వచ్చిందని, స్టాక్ మార్కెట్లో వారానికి రూ.లక్ష సంపాదించొచ్చని రకరకాలుగా మోసాలు చేస్తున్నారు. ఒక్క నిమిషం మనం ఏం చేస్తున్నామో ఆలోచిస్తే అసలు నేరం జరగదు. సైబర్ నేరాలపై జిల్లా వ్యాప్తంగా పోలీసులు ప్రతి రోజూ అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. ఒకవేళ ఎవరైనా మోసపోయినా పరువుపోతుందని భయపడొద్దు. వెంటనే సైబర్ హెల్ప్‌లైన్–1930, ఫోన్–9440900005, 9121211100 నెంబర్లకు ఫోన్‌చేస్తే పోగొట్టుకున్న డబ్బును తిరిగి తీసుకురావడం సాధ్యమవుతుంది. – తుషార్ డూడీ, ఎస్పీ, చిత్తూరు -
రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
కూటమి ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పట్నం సురేంద్రరెడ్డి కోరారు. ఈ మేరకు ఆ సంఘం నాయకులు సోమ వారం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల మంది రెడ్డి కులస్థులు ఉండగా అందులో 80 శాతం మంది పేదలున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి పాలకమండలిని ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం వహించడం దారుణమన్నారు. సంఘం సభ్యులు దామోదరరెడ్డి, దేవరాజులురెడ్డి, ధనంజయులురెడ్డి, లోకనాథరెడ్డి పాల్గొన్నారు. -
పూర్తి స్థాయిలో నిండిన వైఎస్సార్ జలాశయం
పలమనేరు: మండలంలోని కాలువపల్లి వద్దనున్న వైఎస్సార్ జలాశయం వరద నీటితో పూర్తిస్థాయిలో నిండింది. మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి, సిబ్బందితో కలిసి ఆదివారం ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టు నిండినందున పట్టణవాసులకు తాగునీటికి సమస్య ఉండదన్నారు. ప్రాజెక్టు వద్ద ఫిల్టర్ బెడ్లు, మోటార్ల మరమ్మతులు చేపట్టనున్నట్టు తెలిపారు. మొరవ పారుతున్న వెంకటపతయ్య చెరువు బైరెడ్డిపల్లె: వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని తీర్థం సమీపంలో ఉన్న వెంకటపతయ్య చెరువు నిండి పొంగి మొరవపోతోంది. దీంతో గ్రామస్తులు ఆదివారం గంగమ్మకు పూజలు చేశారు. చెరువు నిండడంతో సాగునీటికి ఇబ్బంది ఉండదని ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేశారు. -
ఎక్స్‌ప్రెస్ హైవే అధికారుల నిర్లక్ష్యం
గుడిపాల: మండల కేంద్రమైన గుడిపాల మీదుగా చైన్నె– బెంగళూరు ఎక్స్‌ప్రెస్ హైవే వెళుతోంది. ఈ రోడ్డు నిర్మాణంలో భాగంగా చాలా ప్రాంతాల్లో చెరువు కట్టలు, మొరవలను ధ్వంసం చేశారు. తర్వాత వాటికి మరమ్మతులు చేయకపోవడంతో వర్షపు నీరు చెరువుల్లోకి వెళ్లకుండా గ్రామాల్లోకి చేరుతోంది. కొన్ని ప్రాంతాల్లో పొలాల్లోకి చేరుతుండడంతో పంటలు మునిగిపోతున్నాయి. ముఖ్యంగా గుడిపాల మండలంలోని బంగారక్క చెరువు కట్ట మట్టిని తొలగించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు చెరువులోకి నీరు చేరుతోందని, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని చుట్టుపక్కల గ్రామస్తులు భయపడుతున్నారు. అలాగే మొరవను కూడా కొట్టివేశారు. దీంతో పాటు పశుమంద చెరువు, సుబ్బారెడ్డి చెరువు, చలిచీమలపల్లె చెరువుల కట్టలు, వాగులను ఎక్కడపడితే అక్కడ తవ్వేయడంతో వర్షపు నీరు ఇళ్లలోకి వస్తోందని గ్రామస్తులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
బడబళ్లవంక ప్రాజెక్టు తూముకు గండి
రొంపిచెర్ల– పులిచెర్ల మండలాల మధ్య ఉన్న బడబళ్లవంక ప్రాజెక్టుకు గండి పడడంతో పంటలు నీట మునిగి నష్టం వాటిల్లింది.పలమనేరు: పేదరికంలో ఉన్న ఒక మహిళ తన భర్తకు అంత్యక్రియలు చేయలేని దుస్థితిలో ఉండగా పలమనేరు హెల్పింగ్ హ్యాండ్స్ నిర్వాహకులు ఆదుకున్నారు. ఆ వ్యక్తికి అంతిమ సంస్కారాలు చేసి మానవత్వం చాటుకున్నారు. స్థానిక కప్పలవీరాస్వామి వీధిలో కాపురం ఉంటున్న వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడు. అతనికి అంతిమ సంస్కారాలు చేయడానికి ఆర్థిక స్తోమత లేక భార్య వీరిని ఆశ్రయించగా సంప్రదాయబద్ధంగా అంతిమ సంస్కారాలు చేశారు. మాన్యువల్‌గా కౌన్సెలింగ్ నిర్వహించండి చిత్తూరు కలెక్టరేట్ : డీఎస్సీ అభ్యర్థులకు మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని ఆపస్ రాష్ట్ర అధ్యక్షుడు బాలాజీ కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చాలా ఏళ్లుగా అభ్యర్థులు కష్టపడి చదివి డీఎస్సీ పరీక్షలో తమ ప్రతిభను చాటారన్నారు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో మ్యాన్యువల్ కౌన్సెలింగ్‌లో ప్రత్యక్షంగా ఖాళీలను ఎంపిక చేసుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. తద్వారా అభ్యర్థులు సంతోషంగా విధులలో చేరే అవకాశం ఉంటుందన్నారు. తప్పనిసరిగా మ్యాన్యువల్ కౌన్సెలింగ్ అమలు చేసి తీరాలని ఆయన డిమాండ్ చేశారు. శ్రీవారి దర్శనానికి 8 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 10 కంపార్ట్మెంట్లు నిండాయి. శనివారం అర్ధరాత్రి వరకు 82,042 మంది స్వామివారిని దర్శించుకోగా 23,393 మంది భక్తు లు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.59 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం అవుతుండగా, టిక్కెట్లు లేని వా రికి 8 గంటల్లో లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శన టి క్కెట్లు ఉన్నవారికి 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
పేదల భూములపై పచ్చ పంజా
సాక్షి టాస్క్‌ఫోర్స్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విజయపురం మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఏడాదికాలంగా గ్రావెల్ అక్రమ రవాణాతో రెచ్చిపోయిన నాయకులు ఇప్పుడు భూకబ్జాకు పథక రచన చేస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా అధికారం ఉండగానే కాసులు వెనుకోవాలనే యోచనతో ఎడాపెడా ప్రకృతి సంపదను కాజేస్తూ.. ప్రభుత్వ భూములను, పేదలకు ఇచ్చిన భూములను ఆక్రమించేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు గ్రావెల్ అక్రమ రవాణా, భూకబ్జాలకు పాల్పడుతున్నారు. తాజాగా గతంలో భూమి లేని నిరుపేదలకు అందజేసిన అసైన్డు భూమిని విజయపురం టీడీపీ నేతలు తమ అనుచరులకు కట్టబెట్టేందుకు సిద్ధమయ్యారు. భూమిలేని పేదలకు పంచిన మహానేత విజయపురం మండలం జగన్నాథపురం రెవెన్యూ గ్రామంలోని సర్వే నంబర్ 206, 207లో 200 ఎకరాల భూమిని 2006లో అప్పటి సీఎం మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి పన్నూరుకు చెందిన సుమారు 200 మంది ఎస్సీ, ఎస్టీలకు ఎకరా చొప్పున 200 ఎకరాలను పంపిణీ చేసి పట్టాలు ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆ భూములను ఆక్రమించుకోవడానికి కూటమి నేత లు సిద్ధమయ్యారు. గత వారం రోజులుగా ఆ భూమి ని కబ్జా చేసేందుకు తెరచాటు రాజకీయాలు చేస్తున్నా రు. ఇప్పటికే ముళ్ల చెట్లు తొలగించడం, భూమిని చదును చేయడం వంటి కార్యక్రమాల ను చేపట్టారు. తమకు పట్టాలు ఇచ్చిన భూమిలో మీరెందుకు చదు ను చేస్తున్నారని ప్రశ్నిస్తే.. దిక్కున్న చోట చెప్పుకోండని బెదిరింపులకు దిగుతున్నారని హక్కుదారులు వాపోతున్నారు. దీనిపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదంటున్నారు. తమ భూముల జోలికి వస్తే పెద్దఎత్తున పోరాటాలకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. జగన్నాథపురంలో కూటమి నాయకులు ఆక్రమించుకోవాలనుకుంటున్న భూమి దివంగతనేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఇచ్చిన పట్టాదారు పాస్‌బుక్ -
నేడు పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్‌డే
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని వన్‌టౌన్ పక్కన ఉన్న ఆర్ముడు రిజర్వు (ఏఆర్) కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (గ్రీవెన్స్‌డే) కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్పీ తుషార్ డూడీ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు వారి సమస్యలు ఏవై నా ఉంటే తనను నేరుగా కలిసి మాట్లాడొచ్చన్నారు. ఉదయం 10.30 గంటల నుంచి ఇక్కడ ఇచ్చే వినతులు, ఫిర్యాదులను పరిశీలించి చర్యలు చేపడుతామని ఎస్పీ తెలిపారు. నేడు కలెక్టరేట్లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక చిత్తూరు కలెక్టరేట్ : ప్రజల సమస్యల పరిష్కా రం కోసం సోమవారం కలెక్టరేట్లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్‌గాంధీ వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఆయన విలేకరులతో మా ట్లాడారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సమావేశానికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలన్నారు. మానవత్వం చాటుకున్న పోలీసులు నగరి: మతిస్థిమితం లేని మధ్యప్రదేశ్‌కు చెందిన మహిళను ఆమె తల్లిదండ్రులకు అప్పగించి నగరి పోలీసులు మానవత్వం చాటుకున్నారు. ఈ నెల 16వ తేదీన నగరి పట్టణంలో సుమారు 30 ఏళ్ల వయసు గల ఒక మహిళ రోడ్డుపై తిరుగుతూ, అందరితో గొడవపడుతూ, నివాస ప్రాంతాల వద్దకు వెళ్లి సమస్యలు సృష్టించడం పోలీసుల దృష్టికి వచ్చింది. సీఐ విక్రమ్ మతిస్థిమితం లేని మహిళ ఎక్కడి నుంచో తప్పిపోయి వచ్చినట్లు గుర్తించి డీఎస్పీ సయ్యద్ మహమ్మద్ అజీజ్‌కు తెలియజేశారు. ఆయన ఆదేశాల మేరకు ఎస్ఐ విజయనాయక్, మహిళా కానిస్టేబుల్ భార్గవి మతిస్థిమితం లేని మహిళ వివరాలు సేకరించారు. ఆమె పేరు ప్రస్తుథీషేన్ (31) అని, ఆమె భర్త పేరు రమేష్ అని వారి నివాస ప్రాంతం మధ్యప్రదేశ్ పఠాన్ జిల్లా, జబల్పూర్ అని కనుగొన్నారు. పోలీసు శాఖ ద్వారా ఆమె కుటుంబ సభ్యులకు వివరాలు అందించారు. మహిళను చిత్తూరు వన్ స్టాప్ సెంటర్‌కి తరలించి, సిబ్బంది సహకారంతో 5 రోజులపాటు అవసరమైన చికి త్స అందించారు. మతిస్థిమితం లేని మహిళను ఆమె తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు. మతిస్థిమితం లేని మహిళను తల్లిదండ్రుల చెంతకు చేర్చిన నగరి పోలీసులను జిల్లా ఎస్పీ తుషార్ డూడి అభినందించారు. -
అవకాశాలను అందిపుచ్చుకోవాలి
చిత్తూరు కలెక్టరేట్ : దివ్యాంగులు అవకాశాలను అందిపుచ్చుకోవాలని జిల్లా సమగ్రశిక్షా శాఖ ఏపీసీ వెంకటరమణ అన్నారు. ఈ మేరకు ఆదివారం జిల్లా కేంద్రంలోని డీఈఓ కార్యాలయం పక్కన ఉన్న ప్రభుత్వ పాఠశాలలో దివ్యాంగులకు అసెస్మెంట్ క్యాంప్ నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఏపీసీ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగులకు కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. దివ్యాంగులు వికలత్వంపై కుంగిపోకూడదని, దివ్యాంగులుగా ఉంటూ ఎంతోమంది ఉన్నత పదవులు, ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. అలాంటి వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. ఇప్పటివరకు జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో అసెస్మెంట్ క్యాంప్‌లు నిర్వహించినట్లు తెలిపారు. చిత్తూరులో నిర్వహించిన ఐదవ క్యాంప్‌లో 50 మంది దివ్యాంగ విద్యార్థులకు వైద్యులు అసెస్మెంట్ పరీక్షలు నిర్వహించారన్నారు. ఈ నెల 22వ తేదీన గంగాధరనెల్లూరు ప్రాథమిక పాఠశాలలో ఆరవ అసెస్మెంట్ క్యాంప్ నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో చుడా చైర్మన్ హేమలత, బీజేపీ నాయకులు అట్లూరి శ్రీనివాసులు, ఎంఈఓలు మోహన్, హసన్‌బాషా తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థిని అదృశ్యం కేసులో ముగ్గురి అరెస్టు
పుత్తూరు: గత ఆగస్టు 23వ తేదీన ఇంటి నుంచి వెళ్లిపోయిన ఇంటర్ విద్యార్థిని అదృశ్యం కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎస్ఐ ఓబయ్య కథనం మేరకు.. గేట్‌పుత్తూరుకు చెందిన జోషువ లారెన్స్, అనుప్రియ దంపతుల కుమార్తె జె.యోషిని(17) పుత్తూరులోని ప్రభుత్వ బాలికల కళాశాలలో ఇంటర్మీడియెట్ తొలి ఏడాది చదువుతోంది. గత నెల 23వ తేదీన తన కుమార్తె యోషిని కనిపించడం లేదని, గేట్‌పుత్తూరు వీవర్స్ కాలనీకి చెందిన శరవణన్ కుమారుడు జ్యోతిప్రసాద్ తన కుమార్తెను తీసుకెళ్లి ఉంటాడని అనుప్రియ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నెల 14వ తేదీ సాయంత్రం యోషిని తన తల్లి అనుప్రియతో పోలీస్ స్టేషన్‌కు వచ్చి వాంగ్మూలం ఇచ్చింది. యోషిని చెప్పిన వివరాల మేరకు.. గేట్‌పుత్తూరుకు చెందిన జ్యోతిప్రసాద్ తనను మోసపూరిత మాటలతో నమ్మించి, తమిళనాడులోని రెడ్‌హిల్స్‌లోని మదన్‌కుమార్, మల్లిక ఇంటిలో నిర్బంధించాడని తెలిపింది. వీరికి ప్రేమలత అనే మరో మహిళ సహాయం చేసినట్లు చెప్పింది. 20 రోజులపాటు నిర్బంధించిన జ్యోతిప్రసాద్ తన నోట్లో గుడ్డలు కుక్కి, పలుమార్లు లైంగిక దాడి చేశాడని వెల్లడించింది. రెడ్‌హిల్స్‌లోని వినాయకుడి ఆలయంలో బలవంతంగా వివాహం చేసుకున్నాడని తెలిపింది. పుత్తూరులో పోలీసు కేసు నమోదు అయిందన్న విషయం తెలుసుకున్న జ్యోతిప్రసాద్ ఈ నెల 14వ తేదీన పుత్తూరు–నారాయణవనం జంక్షన్ వద్ద తనను వదలిపెట్టి వెళ్లిపోయాడని వెల్లడించింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన పుత్తూరు పోలీసులు ఏ1 జ్యోతిప్రసాద్, ఏ2 ప్రేమలత, ఏ4 మల్లికను ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఏ3 మదన్‌కుమార్ పరారీలో ఉన్నాడు. -
ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం
ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా పాలకులు చేసే తప్పులు, పొరపాట్లను ప్రజలకు చేరవేయడంలో పత్రికలది ప్రధానపాత్ర. ప్రజాస్వామ్య పరిరక్షణలో అవి కీలకపాత్ర పోషిస్తాయి. ప్రభుత్వ అవినీతిని, పాలకుల వైఫల్యాలను ప్రశ్నిస్తూ ప్రజలకు వాస్తవాలను చేరవేస్తోందనే అక్కసుతో సాక్షిదినపత్రికపై కక్ష సాధింపులకు పాల్పడడం సరైన విధానం కాదు. సాక్షి ఎడిటర్, రిపోర్టర్లపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి. కేసులు పెట్టడం పత్రికా స్వేచ్ఛపై దాడి చేయడమే. – సోమురెడ్డి, విశ్రాంత వీఆర్వో అసోసియేషన్ నాయకులు -
డ్రోన్ సహాయంతో ఏనుగుల గుర్తింపు
పులిచెర్ల(కల్లూరు) : ఏనుగుల ఉంటున్న, తిరుగుతున్న ప్రదేశాలను డ్రోన్ ద్వారా గుర్తించి చర్యలు తీసుకుంటామని చిత్తూరు డీఎఫ్ఓ సుబ్బరాజు తెలిపారు. ఆదివారం ఆయన సిబ్బందితో కలిసి కల్లూరుపాళెం సమీపంలోని జూపల్లె బండ వద్ద డ్రోన్ల సాయంతో ఏనుగుల స్థావరాలను పరిశీలించారు. గత సంవత్సర కాలంగా ఈ ఏనుగుల గుంపు మండలంలోనే తిరుగుతూ పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. ఎన్ని చర్యలు తీసుకున్నా బయటకు పోవడం లేదు. ఇక్కడే ఉంటూ రోజూ ఏదో ఒక ప్రాంతంలో పొలాలపై పడి పంట నాశనం చేస్తున్నాయని క్షేత్రస్థాయి అటవీ అధికారులు వివరించారు. దీనిపై డీఎఫ్ఓ స్పందిస్తూ ఏనుగుల కట్టడికి చర్యలు తీసుకుంటామని, సిబ్బంది నిత్యం అప్రమత్తంగా ఉండి ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణహాని కలుగకుండా చూడాలని ఆదేశించారు. తమకు ప్రజలు కూడా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎఫ్ఆర్వో థామస్ సుకుమార్, ఎఫ్ఎస్ఓ మహమ్మద్‌షఫీ, ఎఫ్బీఓ మధు, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. పంటపొలాలపై ఏనుగుల దాడి పులిచెర్ల(కల్లూరు) : పులిచెర్ల మండలంలోని దేవళంపేట, దిగువ మూర్తివారిపల్లె, జూపల్లె, కోటపల్లె, వీకే పల్లె, కుమ్మరపల్లె తదితర గ్రామాల్లో రైతులు సాగు చేసిన ఆదివారం పంటలను నాశనం చేశాయి. మరో ఏనుగుల గుంపు పాతపేట, తలారివారిపల్లె, ఎద్దులవారిపల్లె గ్రామాల్లో సంచరిస్తూ పంటలపై దాడి చేసి నష్టం కలిగించాయి. అలాగే జూపల్లెలో సుబ్బ రత్నం, దేవళంపేటలో సుధాకర్, ప్రభాకర్, బసవరాజు పొలాల్లోని మామిడి, వరి పంటలను తొక్కి నాశనం చేశాయి. ఎక్కువగా వరిపంటలను నేల తొక్కి పారేవాయి. మండలంలో ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట ఏనుగులు దాడులు చేస్తూ అన్నదాతలకు నష్టం కలిగిస్తున్నాయి. వీటిని కట్టడి చేయకపోతే పంటలను సాగు చేసుకునే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. వివాహిత అదృశ్యంపై ఫిర్యాదు బంగారుపాళెం: మండలంలోని కీరమంద గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన భార్య కనిపించడం లేదని ఆదివారం రాత్రి ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గ్రామానికి చెందిన ఓ వివాహిత ఉదయం బంగారుపాళెం ఆస్పత్రికి వెళ్లి వస్తానని చెప్పి తిరిగి రాలేదు. దీంతో ఆమె భర్త పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మైనర్ బాలిక అదృశ్యం.. మండలంలోని మొగిలివెంకటగిరి గ్రామానికి చెందిన ఓ మైనర్‌బాలిక అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ఉదయం నుంచి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో బాలిక అదృశ్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
బడబళ్లవంక ప్రాజెక్టు తూముకు గండి
రొంపిచెర్ల: రొంపిచెర్ల–పులిచెర్ల మండలాల సరిహద్దులో ఉన్న బడబళ్లవంక ప్రాజెక్టు తూముకు శనివారం గండి పడింది. ఈ ప్రాజెక్టును గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాజీమంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చొరవతో రూ.34.57 కోట్లతో నిర్మించారు. కాలువ పనులను సైతం 80 శాతం పూర్తి చేశారు. దీని నుంచి 4 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ క్రమంలో ప్రాజెక్టు తూముకు శనివారం రాత్రి గండి పడింది. ఆదివారం ఉదయం నీరు వృథాగా పోతున్న విషయాన్ని గుర్తించిన స్థానికులు రెవెన్యూ, ఇరిగేషన్, పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చారు. తహసీల్దార్ అమరనాథ్, ఇరిగేషన్ ఏఈ మునిశేఖర్, ఎస్ఐ సుబ్బారెడ్డి అక్కడికి చేరుకుని పరిశీలించి రైతులతో మాట్లాడారు. శనివారం రాత్రి 9, 11 గంటల ప్రాంతంలో పెద్ద శబ్దం వచ్చిందని తెలిపారు. ప్రాజెక్టు తూము వద్ద పేల్చినట్లు గానీ, పగులగొట్టిన ఆనవాళ్లు కనిపించలేదని, తూముకు అమర్చిన బండ పగలడం వల్ల శబ్దం వచ్చి ఉండవచ్చని అధికారులు చెప్పారు. మునిగిన 20 వ్యవసాయ మోటార్లు వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు బడబళ్లవంక ప్రాజెక్టు 70 శాతం మేర నిండింది. మూడు అడుగుల ఎత్తు నీరు వస్తే ప్రాజెక్టు మొరవపోయే అవకాశం ఉంది. దీంతో ముంపు భూముల్లో ఉన్న 20 వ్యవసాయ బోరు మోటార్లు మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో మోటార్లను బయటకు తీసుకునేందుకు తూమును పగులగొట్టారా? లేక పరిహారం మంజూరు కాకపోవడంతో ఆగ్రహంతో తూము బండను పగులగొట్టారా? అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
చలపరకోన..చారిత్రక వీణ
నగరి సమీపంలో ఉన్న చలపన కోన చరిత్రకు ఆనవాళ్లకు సాక్ష్యంగా నిలుస్తోంది. కోనలోని రాళ్లలో కొన్ని వేల ఏళ్ల చరిత్ర దాగుంది. ఆదిమానవుల జీవన శైలిని తెలిపే అనేక గుర్తులు ఇక్కడ దర్శనమిస్తున్నాయి. ప్రాచీన చరిత్రను తెలిపే ఆధారాలు ఇక్కడ అనేకం. ఆది మానవుడి కాలం నాటి శిలా చిత్రలేఖనాలు, ఎరుపు వర్ణంలో మానవ చిత్రాలు, చక్రాల గుర్తులు దర్శనమిస్తాయి. మహర్షులు తప్పస్సు చేసినట్లు ఆనవాళ్లు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఈ కోన ఖ్యాతిని పెంచి పర్యాటక కేంద్రంగా మార్చాలని నగరి ప్రజలు కోరుతున్నారు. కొండపైకి వెళ్తున్న పర్యాటకులు చలపర కోన కొండ గుహనగరి : మండలంలోని ముడిపల్లి గ్రామం నుంచి 3 కి.మీ దూరంలో స్థానికంగా చలపరకోన కొండ ఉంది. ఇక్కడ వెలసిన చలపరమ్మ అనే దేవత కారణంగా ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చింది. స్థానిక ప్రజలు అమ్మవారికి పూజలు చేస్తారు. సమీపంలో ఉన్న గుహ లోపల చలపరమ్మ దేవత ఉండేదని చెబుతారు. ఈ ప్రదేశానికి దగ్గరగా గతంలో పురాతన శిలాయుగం పనిముట్లు గుర్తించబడ్డాయి. పరిసరాల్లో 3వ శతాబ్దం నాటి చారిత్రక అవశేషాలు కనుగొన్నారు. రాతిశాసనానికి 600 ఏళ్లు చారిత్రక విశేషాలకు నెలవుగా చెప్పుకునే చలపరకోన, నాగతీర్థం కొండలకు సమీపంగా కరియమాణిక్య స్వామి ఆలయ సమీపంలో ఒక రాతి శాసనం ఏర్పాటు చేయబడింది. అందులో ప్రాచీన తమిళలిపిలో చెక్కబడి ఉన్న సమాచారం పురావస్తుశాస్త్ర వేత్తలు అధ్యయనం చేసిన మేరకు ఈ శాసనం 1426 సెప్టెంబరు 8వ ఏర్పాటుచేశారు. ఇప్పటికే ఈ శాసనం 600 ఏళ్లు పూర్తిచేసుకుంది. మెగాలిథిక్ కళతో సారూప్యత ప్రాచీన చరిత్ర, పురావస్తు శాస్త్ర పరిశోధకులు కొండగుహలోని చిత్రాల ఆధారంగా చేసిన పరిశోధనల్లో చల పరకోనలో చెక్కి ఉన్న చక్రాల బొమ్మలు మల్లయ్యపల్లి, సుండుపల్లి మెగాలిథిక్ సమాధుల్లో చిత్రించిన చక్రాలతో సారూప్యతలను కలిగి ఉన్నాయని, మానవ బొమ్మలు మల్లయ్యపల్లి మెగాలిథిక్ కళతో సారూప్యతలను కలిగి ఉన్నాయని వీటి ఆధారంగా చలపరకోన రాతికళ మెగాలిథిక్ కాలానికి చెందినదిగా ఉండవచ్చని పురావస్తు అధ్యయనకారులు చెబుతున్నారు. ఆపై ఇక్కడ నివశించిన మహర్షులు కొండగుహలో శివలింగం ప్రతిష్ట చేసి, రాతిపై తమిళంలో నాగదేవతకు ప్రతీకగా సర్పాలను 1894లో చెక్కినట్లు తెలుస్తోంది. వీటి ఆధారంగా ఈ ప్రాంతానికి నాగతీర్థం అనే పేరు స్థిరపడింది. ఇక్కడి కొండలపై మహర్షులు (మునులు) తపస్సుచేసినట్లుగా రాతిగుహల్లో నిర్మించుకున్న కుటీరాలు ఉన్నాయి. అందుకే ఈ మునిపల్లి కాస్త ముడిపల్లిగా మారిందని చరిత్రకారులు చెబుతారు. ఉట్టి పడే రాతి కళ చలపరకోన గుహలో ఆది మానవులు గీసిన చిత్రాలు దర్శనమిస్తున్నాయి. రాతి కళలో మానవ, జంతు, మత, రేఖాగణితం, తదితర వంటివి గుర్తించబడని డ్రాయింగ్లకు చెందిన అనేక చిత్రాలు కనుమరుగయ్యే స్థితిలో ఉన్నాయి. చిత్రాలను గీయడానికి ఆది మానవుడు ఎరుపు, ఎరుపు గోధుమ, తెలుపు వర్ణద్రవ్యాలను ఉపయోగించాడు. ఈ రాతి గుహలోని రాతి కళ వివిధ పురావస్తు కాలాల ద్వారా కళాత్మక వ్యక్తీకరణల కొనసాగింపును చూపుతుంది. ప్రస్తుతం చలపరకోన రాతి గుహలో రాతిపై చెక్కిన చక్రాలు, త్రిశూలాలు, వృత్తాలు, ఒకరి చేతులు ఒకరు పట్టుకున్న మానవ వరుస, తల్లిదండ్రులు బిడ్డ చేయి పట్టుకుని నడుస్తున్న ఆకారాన్ని గుర్తించారు. ఆర్కియాలజికల్ అధ్యయనాలు వెల్లడించిన మేరకు ఆది మానవులు సహజంగా లభించే ఖనిజాలు, మూలికలు, జంతు పదార్థాలను వాటి పరిసర వాతావరణంలో కలపడం ద్వారా రంగులు వేశారు. పలు చిత్రాలు మసకబారి ఉన్నాయి. -
విద్యతోనే మెరుగైన జీవితం
గుడిపాల: విద్య ద్వారా మెరుగైన జీవన విధానం పొందవచ్చని, ప్రతి గిరిజన కుటుంబంలోని పిల్లలందర్నీ బడికి పంపించి చదివించాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ పిలుపునిచ్చారు. శనివారం గుడిపాల పరిధిలోని అనుపు ఎస్టీ కాలనీలో స్వర్ణాంధ్ర.. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఓ మొక్కను నాటారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం మండల స్థాయి అధికారులతో కలిసి గ్రామసభను నిర్వహించారు. గిరిజనుల స్థితిగతులు మార్పు చెందాలంటే వారి పిల్లలను కచ్చితంగా బడికి పంపించాలన్నారు. విద్య ద్వారానే ఉపాధి పొందవచ్చని చెప్పారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలతో వృద్ధి చెందాలన్నారు. కాలనీవాసులు తమకు పక్కా ఇళ్లు కావాలని కోరగా రెండు వారాల్లో చర్యలు చేపట్టాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. తహసీల్దార్, స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించి శ్మశాన వాటిక దారి సమస్యను తీర్చడానికి త్వరలో సర్వే బృందాన్ని పంపుతామని హామీ ఇచ్చారు. తమిళనాడు నుంచి వచ్చిన వలసదారులకు వెంటనే ఆధార్ కార్డులు వచ్చేలా చర్యలు చేపడుతామన్నారు. చదువుకున్న యువతకు అమరరాజా ఫ్యాక్టరీలో శిక్షణ ఇప్పించి, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, ఆడపిల్లలు కంప్యూటర్ విద్యకు సంబంధించి నైపుణ్య శిక్షణ పొందాలని, అందుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామన్నారు. అంగన్వాడీ కేంద్రాన్ని పునరుద్ధరించి బాగు చేస్తామన్నారు. తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో కుమార్, డ్వామా ఏపీడీ సుబ్రమణ్యం, ఎంఈఓ హసన్‌బాషా, వ్యవసాయాధికారి సంగీత, డాక్టర్ సంధ్య, ఏఈలు ప్రసాద్, పవన్, శివకుమార్ పాల్గొన్నారు. -
తాళంబేడులో ఆగని టీడీపీ రగడ
సాక్షి టాస్క్‌ఫోర్స్: చిత్తూరు మండలం, తాళంబేడు పంచాయతీలో టీడీపీ నేతల మధ్య రేగిన రగడ ఆగనంటోంది. మండల నేతలు పంచాయితీ చేసినా మళ్లీ వివాదం తెరపైకి వచ్చింది. ఓ నేత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివాదం మొదటికొచ్చింది. రగడ ఏంటంటే? తాళంబేడులోని ఓ టీడీపీ నేత మద్యం విక్రయిస్తున్నారని ఇద్దరు నేతలు ప్రొబిషన్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో గొడవ మొదలైంది. ఈ ఫిర్యాదు ఆ ఇద్దరు నేతలే చేశారని మద్యం విక్రయిస్తూ ఆపేసిన నేత చెవిలో పడింది. ఆ నేత వాళ్లకు సంబంధించిన గోకులం షెడ్డు, అంగన్వాడీ ఇతరాత్ర వాటిపై ఫిర్యాదు చేయడంతో వివాదం తారస్థాయికి చేరింది. చివరకు పోలీస్ స్టేషన్‌కు కూడా చేరింది. గురువారం బీఎన్‌ఆర్‌పేటలో ఇరువర్గాల నేతలను పిలిచి మండల నేతలు పంచాయితీ చేశారు. సర్దుబాటు చేశామని మండల నేతలు ఊపిరి పీల్చుకున్నారు. ఆ లోపు మళ్లీ ఆ ఇద్దరిలో ఓ నేత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో యవ్వారం మళ్లీ మొదటికొచ్చింది. మూడు రోజుల తర్వాత మళ్లీ పంచాయితీకి ఫిక్స్ నిర్వహించేందుకు మండల నేతలు ఖరారు చేశారు. కాగా ఇదంతా ఓ మండల నేత నడిపిస్తున్నారని టీడీపీ నేతలు భావిస్తున్నారు. నేనొక్కడినే బెంగళూరులో స్థిరపడిన నేతే ఎన్నికల సమయంలో పంచాయతీలో టీడీపీని గటెక్కించేందుకు సాయశక్తుల కృషి చేశారని పలువురు టీడీపీ నాయకులు అంటున్నారు. లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టారని చెబుతున్నారు. కూటమి అధికారంలోకి రావడంతో మంగాపురంలోని మరో నేత పంచాయతీలో పెత్తనం చలాయిస్తున్నారని ఓ వర్గం మండిపడుతోంది. వర్క్‌లు, సిబ్బందిపై పెత్తనం.. ఇలా అన్నింటిలోనూ అన్నీ తానై తలదూరుస్తున్నారని ఆ వర్గం ఆగ్రహానికి గురవుతోంది. ఎన్నికల సమయంలో లక్షలాది రూపాయలు తామే ఖర్చు చేస్తే.. తళుక్కుమనే వారికి పెత్తనం ఇస్తే ఎలా అని మండిపడుతోంది. ఎన్నికల రోజు తలదాచుకున్న వ్యక్తులు, జేబులో నుంచి రూపాయి ఎత్తని వ్యక్తులు ఈ రోజు పంచాయతీలో తామే నాయకులమని చెబితే ఎలా అని ఆ వర్గం ప్రశ్నిస్తోంది. కాగా బెంగళూరులో ఉండే వాళ్లు.. ఇక్కడేమి రాజకీయం చేస్తారని మరో వర్గం దీటుగా సమాధానం ఇస్తోంది. ఇంతకీ ఈ పోరులో ఎవరు గెలుస్తారో వేచి చూడాలి మరీ. పల్లె పోరు ఎఫెక్ట్ ఈ వివాదం వెనుక పల్లెపోరు ఎఫెక్ట్ ఉందని పలువురు టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇదివరకు ఇద్దరు మండల నేతలు మాత్రం జెడ్పీటీసీకి పోటీపడేవారు. పల్లె పోరు జనవరి ఉండడంతో మరో కొత్త నేతను ఆ పార్టీలోని కొందరు తెరపైకి తీసుకొచ్చారు. తాళంబేడు పంచాయతీ, మంగాపురానికి చెందిన ఆ నేత బెంగళూరులో స్థిరపడ్డారు. ఆర్థికంగా మంచి పలుకుపడి ఉంది. పంచాయతీని బాగానే లీడ్ చేస్తున్నారు. ఈ నేత కూడా జెడ్పీటీసీ టిక్కెట్టు ఆశిస్తున్నారని ఓ మండల నేత చెవిలో పడింది. ఈ వివాదాన్ని అదునుగా తీసుకుని సదరు మండల నేత తాళంబేడు పంచాయతీలో ఆ వర్గాన్ని తొక్కే ప్రయత్నంలో పడ్డారని వారు చెబుతున్నారు. కొత్త అభ్యర్థిగా తెరపైకి వచ్చిన నేత మద్దతు మద్యం విక్రయిస్తూ ఆపేసిన నేతకు ఉంది. దీంతో మద్యం ఆపేసిన నేతకు పోలీసుల ద్వారా ఆ మండల నేత ద్వారా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం జరుగుతోందనే విమర్శలు వస్తున్నాయి. జెడ్పీటీసీ అభ్యర్థిగా కొత్త నేతను తెరపైకి తీసుకోరావడం వెనుక పంచాయతీలోని ఇద్దరు నేతల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. మద్యం విక్రయిస్తూ ఆపేసిన నేతను పంచాయతీలో నామరూపాలు లేకుండా చేయాలని ఆ మండల నేతను ఉసిగొలిపి ఇదంతా చేయిస్తున్నారనే ప్రచారం ఉంది. -
మూగ నేస్తం.. అందని వైద్యం
మందులు పక్కదారి..? మూగ జీవుల వైద్యంపై ప్రభుత్వ వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వ్యాధులు సోకితే సరైన చికిత్స అందక పాడి పశువులు అల్లాడుతున్నాయి. వాటికి వైద్యం అందించలేక పాడి రైతులు ఆవేదన చెందుతున్నారు. జీవనోపాధి కోసం పోషిస్తున్న పాడి పశువులు వ్యాధులతో బాధపడుతుంటే చూడలేక పశుపోషకులు ప్రైవేటు వైద్యులను ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రైవేటు వైద్యులకు రూ.వేలల్లో ఫీజులు ముట్టజెప్పినా ఫలితం లేకపోపోతోంది. ఫలితంగా పశు సంపదకు నష్టం వాటిల్లి, పాడి పరిశ్రమ దెబ్బతింటోంది. పాడి రైతులు జీవనోపాధి కోల్పోవాల్సిన దుస్థితి నెలకొంటోంది. చిత్తూరు రూరల్ (కాణిపాకం): పశువులకు ఉచిత వైద్యం కోసం ప్రభుత్వం సరఫరా చేస్తున్న మందులు పక్కదారి పడుతున్నాయి. ప్రభుత్వ మందులను ప్రైవేటు వ్యక్తులు అమ్ముకుని, సొమ్ము చేసుకుంటున్నారు. రోగ నిర్ధారణ పరీక్షలు చేయడం మానేశారు. పాడి రైతులు తమ పశువులను ఆస్పత్రులకు తీసుకు వచ్చినా మందుల్లేవని, బయట కొనుగోలు చేసుకోమని, చీటీలు రాసి ఇచ్చి, కమీషన్లు కొట్టేస్తున్నారు. పాడి పరిశ్రమే ఆధారం జిల్లాలో పాడి పరిశ్రమపై ఆధారపడి సుమారు 3 లక్షల కుటుంబాలు జీవిస్తున్నాయి. పాడి పోషణ ద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబాలను నడుపుతున్నాయి. గత ఐదేళ్ల కాలంలో ఈ పాడి పరిశ్రమ మరింత వృద్ధి చెందింది. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 1,036 గేదెలు, 4.67 లక్షల పాడి ఆవులున్నాయి. వీటి ద్వారా 18 లక్షల నుంచి 20 లక్షల వరకు పాలసేకరణ జరుగుతోంది. తద్వారా వచ్చే ఆదాయంతోనే లక్షలాది కుటుంబాలు జీవిస్తున్నాయి. అయితే పాడి పశువులకు వ్యాధులు వస్తే నయం చేసుకోవడానికి రైతులు సొమ్మసిల్లిపోతున్నారు. పశు వైద్యం కరవు జిల్లాలో జిల్లా పశువుల ఆస్పత్రి, ఏరియా పశు వైద్యశాలలు, వెటర్నరీ డిస్పెన్సరీ వైద్యశాలలు, రూరల్ లైఫ్స్టాక్ యూనిట్లు, రైతు భరోసా కేంద్రాలు 455 వరకు ఉన్నాయి. వీటి పరిధిలో మండల పశు వైద్యాధికారులు 68 మంది, ఏడీలు 14, ఏహెచ్ఏలు 282 మంది, గోపాలమిత్రలు 114 మంది ఉన్నారు. అయితే కొందరి వైద్యుల అలసత్వం, ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వెరసి పశువైద్యానికి సుస్తీ చేసింది. ఉదయం 9, 10 గంటలకు వచ్చి 11 గంటలు, మధ్యాహ్నం 1 గంటకు ఆస్పత్రులకు తాళం వేసి వెళ్లిపోతున్నారు. లేకుంటే సిబ్బందిని ఆస్పత్రికి కాపాలా పెట్టి వెళ్లిపోతున్నారు. దీంతో పశువైద్యం పూర్తిగా కొరవడుతోంది. పాడి రైతులు పశువులకు ఉచిత వైద్యం కోసం నానా తిప్పలు పడుతున్నారు. ప్రైవేటు వైద్యమే దిక్కు... జిల్లాలో పలు చోట్ల పశుపోషకులకు ప్రైవేటు వైద్యులే దిక్కుగా మారుతున్నారు. మధ్యాహ్నం పైగా ప్రభుత్వ వైద్యం వారికి పూర్తిగా అందడం లేదు. వైద్యులు మీటింగ్ పేరుతో విధులకు డుమ్మా కొడుతున్నారు. పశువులకు జబ్బు చేస్తే రైతులు ప్రైవేటు డాక్టర్ల వద్దకు పరుగులు తీస్తున్నారు. లేకుంటే వాళ్లకు ఫోన్ చేసి ఇంటి వద్దకు రప్పించుకుంటున్నారు. వారి ద్వారా పశు వైద్య సేవలు పొందుతూ రూ.వేలల్లో ఫీజులు చెల్లించుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో వీహెచ్‌ఏలు కూడా స్పందించడం లేదని పలువురు పాడి రైతులు వాపోతున్నారు. వీరి నిర్లక్ష్యం కారణంగా నకిలీ డాక్టర్లు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నారు. ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది రావడం లేదని రైతులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నకిలీ వైద్యులతో తంటాలు.. జిల్లాలో పాడి పశువులకు మంచి గిరాకీ ఉంది. ఈ క్రమంలో ఒక్కొక్క ఆవు రూ.80 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు పలుకుతోంది. అంత ధర పెట్టి కొనుగోలు చేసిన పశువులకు వైద్యం సక్రమంగా అందడం లేదు. కొందరు నకిలీ కేటుగాళ్లు ఎలాంటి అర్హత లేకుండా పాడి ఆవులకు వైద్యం చేస్తున్నారు. విచ్చలవిడిగా యాంటీ బయోటిక్స్ వాడేస్తున్నారు. దీంతో పాడి పశువుల్లో సంతానోత్పత్తి దెబ్బతింటోంది. విద్యార్హత లేని వ్యక్తులు సైతం పశు వైద్యులుగా చలామణి అవుతూ పాడి పశు సంపదను నాశనం చేస్తున్నారు. ఈ విష యం తెలియని తాము ఆర్థికంగా నష్టపోతున్నామని పాడి రైతులు కంట తడిపెడుతున్నారు. జిల్లా సమాచారం జిల్లా పశువుల ఆస్పత్రి 1 ఏరియా పశు వైద్యశాలలు 14 వెటర్నరీ డిస్పెన్సరీ వైద్యశాలలు 68 రూరల్ లైఫ్ స్టాక్ యూనిట్లు 75 రైతు భరోసా కేంద్రాలు 297 పాడి ఆవులు 4.67 లక్షలు గేదెలు 1036 కొంత మంది వైద్యులు మధ్యాహ్ననానికే ఇంటి బాట పట్టడంతో ప్రైవేటు, నకిలీ డాక్టర్లకు చేతి నిండా పనిపడుతోంది. నకిలీ వైద్యులు కొందరు ప్రభుత్వ వైద్యులతో చేతులు కలిపి, ప్రభుత్వ పశు వైద్యశాలలు, కేంద్రాలకు సరఫరా చేసే మందులను విచ్చలవిడిగా దారి మళ్లిస్తున్నారు. ప్రైవే టు వ్యక్తులు ఏ మందు కావాలన్నా ప్రభుత్వ పశు వైద్య కేంద్రాల నుంచే పట్టుకెళుతున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ మందులను ప్రైవేటు షాపుల్లో తీసుకొచ్చామని రైతులు దగ్గర డబ్బులు గుంజేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. గర్భకోశవ్యాధుల నివారణ మందులు, లివర్ సిరఫ్, కాల్షియం, జ్వరం మాత్రలు, పారుడురోగ నివారణ మందులు, నట్టల నివారణ, కడుపు ఉబ్బరం మందులు అధికంగా దారిమళ్లుతున్నట్లు సిబ్బందే ఆరోపిస్తున్నారు. ఉచితంగా వేయాల్సిన టీకాలను కూడా డబ్బులకు అమ్మేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ప్రైవేటు వైద్యుల నుంచి ప్రభుత్వ వైద్యాధికారులకు వాటాలు వెళుతున్నాయనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో వైద్యులు మందులు, మాత్రలు ఇక్కడ లేవని, బయట కొనుగోలు చేసుకోమని చీటీలు రాయిస్తున్నారు. ఈ వ్యవహారం అందరికీ తెలిసినా ఏమి తెలియనట్లు వ్యవహరించడంపై విమర్శలకు దారితీస్తోంది. -
పరిశుభ్రతకు ప్రాధాన్యం
శ్రీరంగరాజపురం : గ్రామీణులు పరిశుభ్రతకు అధిక ప్రాధ్యాన్యమివ్వాలని జెడ్పీ సీఈఓ వి.రవికుమార్ అన్నారు. శనివారం మండలంలోని జీ.ఎం.ఆర్.పురం, శ్రీరంగరాజపురం పంచాయతీల్లో నిర్వహించిన స్వర్ణాంధ్ర.. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకం కింద పాతపాళ్యం దళితవాడకు రోడ్డు, డ్రైనేజీ నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరైనట్టు తెలిపారు. కొండపాళ్యం ఎస్టీ కాలనీలో మౌలిక వసతులకు నివేదక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం జీ.ఎం.ఆర్.పురం, కొండపాళ్యం ఎస్టీ కాలనీకి నూతనంగా ఏర్పాటు చేస్తున్న సీసీ రోడ్డును పరిశీలించి, చెట్లను నాటారు. ఎంపీడీఓ వనజం, ఏఓ మోహన్‌మురళి, ఏఈ సునీల్, సర్పంచ్ చిరంజీవి పాల్గొన్నారు. -
ప్రచార వాహనం ప్రారంభం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో శనివారం ఎయిడ్స్‌పై అవగాహన కల్పించే ప్రచార వాహనాన్ని డీఎంఅండ్‌హెచ్‌ఓ సుధారాణి ప్రారంభించారు. ఈ వాహనం 15 రోజుల పాటు జిల్లాలో పర్యటిస్తుందన్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో పలు హైరిస్క్ కేసులు, జన సమూహ ప్రాంతాల్లో వీడియో ద్వారా ఎయిడ్స్‌పై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఎయిడ్స్ నోడల్ అధికారి వెంకటప్రసాద్, అధికారులు హనుమంతరావు, ప్రవీణ, అనిల్‌కుమార్, అనూష, నవీన్తేజ్, వేణుగోపాల్, జార్జి, జయరాముడు, శ్రీవాణి పాల్గొన్నారు. -
ఇండస్ట్రియల్ విజిట్‌కు
ఇండస్ట్రియల్ విజిట్‌కు తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ విద్యార్థులు వెళ్లారు. ఎన్ఎంఎంఎస్ రెన్యూవల్‌కు అవకాశం చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో 2024 డిసెంబర్ 8న నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పరీక్షలో ఎంపికై న విద్యార్థులు రెన్యూవల్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు శనివారం డీఈవో కార్యాలయానికి ఉత్తర్వులు పంపారు. ఆ ఉత్తర్వుల మేరకు 2021, 2022, 2023 సంవత్సరాల్లో ఎంపికై గత సంవత్సరం నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్‌లో అప్లికేషన్ నమోదు చేసుకున్న విద్యార్థులకు మరొక అవకాశం కల్పించారు. నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్‌లో ఈ నెల 30వ తేదీలోపు రెన్యువల్ చేసుకునేలా వెసులుబాటు కల్పించినట్లు పేర్కొన్నారు. ఈ సంవత్సరంలో 10, 11, 12 తరగతుల ప్రభుత్వ, ఎయిడెడ్ విద్యాలయాల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు తప్పకుండా రెన్యువల్ చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి తన బ్యాంక్ ఖాతా, తన ఆధార్ నెంబర్‌కు సీడ్ చేయించుకుని డీబీటీ రూపంలో నగదు జమ అయ్యేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు డీఈవో కార్యాలయంలోని పరీక్షల విభాగంలో సంప్రదించాలని పేర్కొన్నారు. విద్యుత్ అంతరాయాలు తగ్గించండి చిత్తూరు కార్పొరేషన్: విద్యుత్ అంతరాయాలను తగ్గించాలని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి విజయానంద్ ఆదేశించారు. శనివారం విజయవాడ నుంచి ఎస్ఈ, ఈఈలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. జిల్లా ట్రాన్స్‌కో ఎస్ఈ కార్యాలయం నుంచి ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్, ఈఈలు సమావేశానికి హాజరయ్యారు. ప్రజల్లో విద్యుత్‌శాఖ పై సానుకూలత పెంపొందించే విధంగా పనిచేయాలన్నారు. జిల్లాలో 60 శాతం వినియోగదారుల సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారని ఎస్ఈ తెలిపారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల ఎక్కువగా అంతరాయాలు లేవన్నారు. గాలి వచ్చినప్పుడు మాత్రమే అంతరాయం వస్తోందన్నారు. పీఎం సూర్యఘర్ పథకం వినియోగం పై మరింత అవగాహన కల్పిస్తామన్నారు. -
దొంగబిల్లుల రారాజు ఎవరు?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కొందరు నేతల కన్ను గ్రానైట్‌పై పడింది. వారు క్వారీలపై పడి కాసులు పిండుకునే పనిలో నిమగ్నమైపోయారు. ఈ క్రమంలో రాయల్టీ వసూళ్లకు బాధ్యతలు ఉన్న సంస్థను తోసిపుచ్చారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని బిల్లులే లేకుండా చాలా వరకు గ్రానైట్‌ను అమ్ముకుంటున్నారు. దీనికితోడు దొంగ బిల్లులతో గ్రానైట్ దందాకు ఆజ్యంపోస్తున్నారు. సంస్థలు, అసోసియేషన్లను తెరపైకి తీసుకొచ్చి గ్రానైట్ దందాల్లో కోట్లాకు పడగెత్తుతున్నారు. తద్వారా రాయల్టీకి డుమ్మా కొడుతున్నారు. అయితే ఈ బినామీ సంస్థకు రూపశిల్పి... ఆ ‘రా’ రాజు ఎవరనేది ఇప్పుడు జిల్లాంతా హట్‌టాపిక్‌గా మారింది. -
పంట పొలాలపై ఏనుగుల దాడి
పులిచెర్ల(కల్లూరు): మండలంలోని కమ్మపల్లె పంచాయతీ, బాలిరెడ్డిగారిపల్లెలో శనివారం తెల్లవారు జామున ఏనుగులు స్వైర విహారం చేశాయి. దాదాపు ఆరు ఏనుగులు ఈ ప్రాంతంలో మామిడి కొమ్మలు, వరి, టమాటా పంటలను తొక్కి నాశనం చేశాయి. బాలిరెడ్డిగారిపల్లెకు చెందిన రైతులు మనోజ్, ప్రవీణ్, రమేష్ సాగు చేసిన పంటలను ధ్వంసం చేశాయి. ముఖ్యంగా ప్రవీణ్‌కు చెందిన వరి, టమాటా పంటలను తొక్కి వేయడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. అటవీ అధికారులు స్పందించి ఏనుగుల బారి నుంచి పంటలను రక్షించాలని పలువురు రైతులు కోరుతున్నారు. రాష్ట్ర స్థాయి క్రీడలకు ఎంపిక శ్రీరంగరాజపురం: రాష్ట్ర స్థాయి సెపక్ తక్రా క్రీడలకు మండలంలోని గంగమ్మగుడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికై నట్లు హెచ్ఎం కే.కళావతి తెలిపారు. ఈ మేరకు ఎంపికై న విద్యార్థులను శనివారం పాఠశాలలో అభినందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అనంతపురం జిల్లా జిల్లా, ఉరవకొండలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో విద్యార్థులు కె.హేమంత్, విష్ణు, యోగనందం పాల్గొననున్నట్టు తెలిపారు. వీరికి శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయులు లోకనాథంను ప్రత్యేకంగా అభినందించారు. -
కలెక్టర్‌ను కలిసిన నూతన ఎస్పీ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఇటీవల బాధ్యతలు స్వీకరించిన నూతన ఎస్పీ తుషార్ డూడి కలెక్టర్‌ను కలిశారు. ఈ మేరకు శనివారం ఆయన కలెక్టర్ సుమిత్కుమార్గాంధీని మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. అనంతరం జిల్లాలో శాంతిభద్రతలకు సంబంధించి చేపట్టాల్సిన పలు అంశాలపై కలెక్టర్‌తో చర్చించారు. రేపటి నుంచి దసరా సెలవులు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు ఈనెల 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటిస్తున్నట్లు డీఈవో వరలక్ష్మి వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలు(మైనారిటీ పాఠశాలలు తప్ప) కచ్చితంగా దసరా సెలవులను అమలు చేయాలన్నారు. సెలవుల్లో ఎలాంటి ప్రత్యేక తరగతులు నిర్వహించరాదన్నారు. జిల్లాలోని మైనారిటీ పాఠశాలలకు ఈనెల 27 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు సెలవులు ఉంటాయని తెలిపారు. జిల్లాలోని డీవైఈవోలు, ఎంఈవోలు ప్రైవేట్ పాఠశాలల్లో తరగతులు నిర్వహించకుండా ప్రత్యేక నిఘా పెట్టాలని డీఈవో ఆదేశించారు. పీహెచ్‌సీల్లో మెరుగైన వైద్యం చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రతి పీహెచ్సీలో ప్రజలకు మెరుగైన వైద్యం అందజేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్‌గాంధీ ఆదేశించారు. ఈ మేరకు శనివారం కలెక్టరేట్లో వైద్యఆరోగ్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ హైరిస్క్ గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అన్ని కాన్పులు ఆస్పత్రుల్లోనే జరిగేలా శ్రద్ధ వహించాలన్నారు. గర్భిణులకు తప్పనిసరిగా అభ ఐడీ నమోదు చేయాలని చెప్పారు. ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకంలో మొదటి కాన్పులో ఇద్దరు ఆడ పిల్లలకు రూ.6 వేలు తప్పక అందించాలన్నారు. పీహెచ్సీ డాక్టర్లు విధుల పట్ల అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ సుధారాణి, డీసీహెచ్ఎస్ డాక్టర్ పద్మాంజలి, వైద్యాధికారులు వెంకటప్రసాద్, హనుమంతరావు, అర్పిత పాల్గొన్నారు. ప్రజల ప్రాణాలు గాలికి పాలసముద్రం: కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలను గాలికొదిలేసిందని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ధ్వజమెత్తారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విష జ్వరాలతో ప్రజలు విలవిల్లాడుతున్నా, కూటమి ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదన్నారు. ఇదే తరుణంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం దారుణమన్నారు. జగనన్న 17 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేస్తే, చంద్రబాబు తన 15 ఏళ్ల పాలనలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కళాశాలను కూడా తీసుకురాలేదని ఎద్దేవా చేశారు. పేదవాడికి వైద్యం అందకుండా చేయాలనే కుట్ర పన్నుతున్నట్టు ఉందని చెప్పారు. సంపద సృష్టిస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రూ.8 వేల కోట్ల విలువ చేసే 17 మెడికల్ కాలేజీలను తన బినామీలకు ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. విధులు బాధ్యతగా నిర్వహించాలి చిత్తూరు కలెక్టరేట్ : టీచర్లు తమ విధులను బాధ్యతగా నిర్వహించాలని డీఈవో వరలక్ష్మి ఆదేశించారు. ఆమె శనివారం సంతపేటలో ఉన్న పీఎన్సీ మున్సిపల్ పాఠశాలలో నిర్వహించిన సీఆర్సీ సమావేశాన్ని తనిఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ ప్రతి ఉపాధ్యాయుడు విద్యలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. పదవ తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టిసారించి పబ్లిక్ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేలా చర్యలు చేపట్టాలన్నారు. 100 శాతం ఉత్తీర్ణతకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. -
ప్రశ్నించే పత్రికలపై అక్రమ కేసులు
కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, ప్రజావ్యతిరేక కార్యకలాపాలను ప్రశ్నించి ప్రచురించిన పత్రికలపై అక్రమ కేసులు బనాయించడం ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తే కక్ష సాధింపు చర్యలకు దిగడం పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించినట్లే. వ్యవస్థలను ప్రభుత్వం చేతుల్లోకి తీసుకుని సాక్షి ఎడిటర్, విలేకర్లతో పాటు పలు టీవీ ఛానళ్లపై కేసులు పెట్టడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లే. – బండి చలపతి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి, తిరుపతి -
క్రమబద్ధకం
చిత్తూరు జిల్లాలో పెద్ద ఎత్తున కొత్త లేఅవుట్లు వెలుస్తున్నాయి. సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునే వారంతా వీటిలో అవగాహన లేకుండా ప్లాట్లు కొనుగోలు చేస్తున్నారు. ఇలాంటి వాటిని క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అవగాహన లేని ప్లాట్ల యజమానులకు అవగాహన కల్పించి, స్థలాలను క్రమబద్ధీకరించాల్సిన యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఫలితంగా అటు ప్లాట్ల యజమానులకు నష్టం కలుగుతుండగా, ఇటు ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. చిత్తూరు అర్బన్: అనుమతి లేకుండా వెలసిన లే–అవుట్లలో స్థలాల క్రమబద్ధీకరణ పథకంపై ప్రజల్లో ఆదరణ కరవు అయ్యింది. ప్రజలకు మేలు చేయా లని తీసుకొచ్చిన లే–అవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్)పై అవగాహన కల్పించడంలో యంత్రాంగం స్తబ్దుగా ఉంది. ప్రిన్స్‌పల్ కార్యదర్శి నుంచి మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ వరకు ఎల్ఆర్ఎస్పై చొరవ చూపడంలేదని, వేగం పెంచాలని పదే పదే వీడియో కాన్ఫరెన్సుల్లో ఆదేశిస్తున్నా యంత్రాంగం దానిపై పెద్దగా దృష్టి సారించడంలేదు. పట్టణాల్లో సచివాలయా సిబ్బంది, మున్సిపల్ అధికారులు ఎల్ఆర్ఎస్పై వేగం పెంచితే తప్ప.. ఇది కదిలేలా కనిపించడంలేదు. పల్లెల్లో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు (యూడీఏ) దీనిపై పెద్దగా శ్రద్ధ పెట్టడం లేదు. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు మేలు చేయడంతో పాటు ప్రభుత్వ ఖజానాకు ఆదాయం రావాలంటే అధికారులు అడుగుబయట పెట్టాల్సిందే. చెబుతున్నారా..? ఎల్ఆర్ఎస్ పథకంలో సామాన్యులు పడుతున్న ఇబ్బందులను సులువుగా తీర్చే అవకాశం ఉంది. ప్రధానంగా పట్టణాల్లో అనుమతి లేని లే–అవుట్లలో అధికారులు ప్లాన్ అప్రూవల్స్ ఇవ్వకపోవడంతో ఇళ్లు కట్టడానికి వీల్లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది జూన్ 6వ తేదీ వరకు ఎక్కడైతే అనుమతుల్లేకుండా లే–అవుట్లు వేశారో, వాళ్లంతా కూడా ఎల్ఆర్ఎస్ పరిధిలోకి వస్తారు. ఇదే సమయంలో నిర్ణీత తేదీలోపు సంబంధిత ఎల్ఆర్ఎస్లో ఒక్క ప్లాటయినా విక్రయించి ఉండాలి. దీనికి సంబంధించి రిజిస్ట్రర్ పత్రాలు తప్పనిసరి. ప్రభుత్వం సూచించిన తేదీకన్నా పదేళ్లు, ఇరవై ఏళ్ల క్రితం ఉన్న లే–అవుట్లను సైతం ఈ పథకంలో క్రమబద్ధీకరించుకునే అవకాశం ఉంది. జిల్లాలో చిత్తూరు కార్పొరేషన్లో 33, పలమనేరులో 18, పుంగనూరులో 15, కుప్పంలో 6, నగరిలో 12 వరకు అనుమతుల్లేని లే–అవుట్లు ఉన్నాయి. వీటి ద్వారా ఆయా మున్సిపాలిటీలకు రూ.కోట్లలో ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కానీ చాలా చోట్ల అధికారులు దీనిపై సరైన అవగాహన కూడా కల్పించడంలేదు. రూ.4 కోట్లకు పైగా ఆదాయం ఓపెన్ ప్రాంతంలో 14 శాతం ఫీజులు చెల్లించి, మార్కెట్ విలువలో 10–30 శాతం వరకు అపరాధ రుసుము చెల్లిస్తే ప్రతి ప్లాటును క్రమబద్ధీకరించుకోవచ్చు. గతనెల 1వ తేదీ నుంచి ఆన్లైన్లో పోర్టల్ అందుబాటులోకి వచ్చినా.. దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య వంద కూడా దాటలేదు. జిల్లాలోని కార్పొరేషన్, నాలుగు మున్సిపాలిటీల్లో 1700 వరకు ప్లాట్లు క్రమబద్ధీకరించుకోవాల్సి ఉండగా.. వీటి ద్వారా దాదాపు రూ.4.50 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. సరైన ధ్రువీకరణ పత్రాలను లైసెన్డ్ ఇంజినీరు, సర్వేయర్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే.. అన్ని సక్రమంగా ఉంటే మూడు రోజుల్లో ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ అనుమతులు మంజూరవుతాయి. అక్టోబర్ నెలాఖరుకు ఈ పథకానికి గడువు ముగియనుంది. కానీ చాలాచోట్ల యంత్రాంగం కాలు కదపడంలేదు. గ్రామాల్లో దారుణం.. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కాకుండా.. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎల్ఆర్ఎస్ను ఉపయోగించుకోవచ్చు. చిత్తూరు పరిసరాల్లోని గ్రామాలు చుడా ద్వారా అనుమతులు పొందచ్చు. అలాగే పలమనేరు, కుప్పం, నగరి డివిజన్లలో అక్కడున్న అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల ద్వారా ఎల్ఆర్ఎస్లో ప్లాట్లు క్రమబద్ధీకరించుకోవాలి. కానీ చాలా గ్రామాల్లో యూడీఏ అధికారులు కనీస అవగాహన కల్పించడంలేదనే విమర్శలున్నాయి. -
ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు
ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలో భాగంగా పత్రికా రంగంపై అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గం. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల దృష్టి తీసుకొచ్చేది మీడియా మాత్రమే. అలాంటి మీడియాపైన అక్రమ కేసులు బనాయించి బెదిరింపులకు దిగడం దారుణం. సాక్షి ఎడిటర్, పత్రికా విలేకరులపై పెట్టిన కేసులు తక్షణం ఉపసంహరించుకోవాలి. పత్రికా స్వేచ్ఛను హరించే ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలి. – భగత్ రవి, ఎస్ఎఫ్ఐ, జిల్లా కార్యదర్శి, తిరుపతి -
పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని స్వయం సహాయక సంఘాల సభ్యులు, రైతులు పీఎం ఎఫ్ఎంఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఆర్డీఏ పీడీ శ్రీదేవి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని డీఆర్డీఏ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. పీడీ మాట్లాడుతూ ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల క్రమబద్ధీకరణ(పీఎంఎఫ్ఎంఈ) పథకం స్వయం సహాయక సంఘాల సభ్యులు, రైతులకు వరంలాంటిదన్నారు. ఈ పథకం సంఘ సభ్యులు పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి దోహదం చేస్తుందన్నారు. వ్యవసాయం, అనుబంధ శాఖలపై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ వ్యాపారానికి అన్ని విధాలుగా తోడ్పాటు అందించి, ఆధునిక సాంకేతికతతో సంఘటిత రంగాల్లో వ్యాపారులుగా నిలబెట్టడమే ప్రధాన లక్ష్యమన్నారు. జిల్లా టమాట, మామిడి, బెల్లం, జామ తదితర ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు అనువైన ప్రాంతమని చెప్పారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చిన్న తరహా పరిశ్రమ ఏర్పాటుకు ఔత్సాహికులు ముందుకు రావాలన్నారు. ఈ పథకం ఆధ్వర్యంలో యూనిట్ వ్యయంలో లబ్ధిదారుల వాటా 10 శాతం పెట్టుబడిగా పెడితే ప్రభుత్వం బ్యాంకు రూపంలో 90 శాతం రుణ సౌకర్యం కల్పిస్తుందన్నారు. అలాగే 35 శాతం సబ్సిడీ అందజేస్తుందని తెలిపారు. వ్యాపారానికి సంబంధించి ఆధునిక పద్ధతులు, పరికరాలు వినియోగం, తదితర రంగాల్లో శిక్షణ సైతం ఇస్తారన్నారు. జిల్లాలో ఈ రంగాలపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని వినియోగించుకుని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలన్నారు. హార్టికల్చర్ డీడీ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో మధ్య తరహా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు మంచి అనువైన వాతావరణం ఉందని తెలిపారు. దీన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను అందిపుచ్చుకుని యూనిట్లు ఏర్పాటు చేస్తే లాభదాయకంగా ఉంటుందన్నారు. ఇందుకు తమ శాఖ నుంచి అవసరమైన పూర్తి సహాయ సహకారాలను అందజేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రతినిధి మ్యాజ్యూస్, డీపీఎం రవికుమార్, ఏపీఎంలు మధు, సుబ్బారెడ్డి, గోపాల్‌రెడ్డి, హేమ తదితరులు పాల్గొన్నారు. -
నేటమ్స్ షుగర్స్ చైర్మన్ అరెస్టు
నిండ్ర : నిండ్ర నేటమ్స్ షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ నందకుమార్‌ను శుక్రవారం రాత్రి పోలీసులు ఆరెస్టు చేశారు. చెరుకు రైతు లకు, ఫ్యాక్టరీ కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించక ఫ్యాక్టరీ మూసివేసి వెళ్లడంతో అతనిపై వారు నమోదు చేసిన కేసులు నడుస్తున్నాయి. 2019 నుంచి 22 వరకు ఫ్యాక్టరీ నిర్వహణ చేపట్టిన కాలంలో 3,210 మంది రైతులు వారు పండించిన చెరుకును ఫ్యాక్టరీకి తరలించారు. వీరికి రూ. 37 కోట్లు చెల్లించాల్సి ఉంది. అలాగే 310 మంది కార్మికులు ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా వారికి ఏడాది పాటు జీతాలు చెల్లించక ఫ్యాక్టరీ మూసివేయడంతో వారికి చెల్లించాల్సిన వేతనాల బకాయిలు రూ.6 కోట్లు ఉంది. బకాయిలు చెల్లించక 2022 సంవత్సరం ఫ్యా క్టరీని ఆకస్మికంగా మూసివేయడంతో రైతులు, కార్మికులకు బకాయిలు చెల్లించలేదు. దీనిపై చెరుకు రైతు సంఘాలు, కార్మిక యూనియన్ల నేతృత్వంలో పలు మార్లు, ఆందోళనలు నిరసనలు, నిరాహార దీక్షలు చేశారు. ఫ్యాక్టరీ కార్మికులు విడివిడిగా యాజమాన్యంపై కేసులు వేశారు. ఈనేపథ్యంలో శుక్రవారం తిరుపతిలో సౌత్ ఇండియా షుగర్ మిల్ అసోసియేషన్ సమావేశానికి నందకుమార్ విచ్చేశారు. సమాచారం అందుకుని నందకుమార్‌ను అక్క డే అదుపులోకి తీసుకున్నట్లు నగరి రూరల్ సీఐ భాస్క ర్ తెలిపారు. కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. -
మొగిలి ఘాట్‌లో ప్రమాదం.. లారీ డ్రైవర్ మృతి
బంగారుపాళెం: మండలంలోని మొగిలి ఘాట్ లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి చెందగా, క్లీనర్ స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. ఎస్ఐ కథనం మేరకు.. మంగళూరు నుంచి రాజమహేంద్రవరానికి వెళుతున్న లారీ మార్గం మధ్యలో మొగిలి ఘాట్ వద్ద ముందువెళుతున్న మరో లారీని వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో తూర్పుగోదావరి జిల్లా గండేపల్లె మండలం జెడ్.రాగంపేటకు చెందిన లారీ డ్రైవర్ సూర్యచంద్రరావు(51) తీవ్రంగా గాయపడి క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, లారీ క్యాబిన్లో ఇరుక్కపోయిన డ్రైవర్‌ను స్థానికులు, ఇతర వాహనచోదకుల సాయంతో అతికష్టంపై బయటకు తీశారు. చికిత్స నిమిత్తం హైవే అంబులెన్స్‌లో బంగారుపాళెం ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో కార్మికుడి మృతి నగరి : మండలంలోని వీకేఆర్ పురం గ్రామం వద్ద నగరి– తిరుత్తణి హైవేపై మోటారు సైకిల్ కల్వర్ట్ను ఢీకొనడంతో రాజ్ కమల్ (35) అనే కార్మికుడు తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కథనం మేరకు.. నగరి పట్టణం వీకేఎస్ లేఅవుట్ లో కాపురమున్న రాజ్‌కమల్ శుక్రవారం తిరుత్తణిలో మృతి చెందిన బంధువు అంత్యక్రియలకు మోటారు సైకిల్‌పై వెళ్లాడు. అనంతరం తిరిగి ఇంటికి వస్తుండగా మార్గం మధ్యలో వీకేఆర్ పురం వద్ద మోటారుసైకిల్ అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది. దీంతో అతడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తర లించారు. ప్రైవేటు కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్న రాజ్‌కమల్‌కు భార్య, 3వ తరగతి చదివే ఒక కుమార్తె, 4వ తరగతి చదివే ఒక కుమారుడు ఉన్నారు. ఇతని మరణంతో వీకేఎస్ లేఅవుట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. సర్పంచ్‌లకు గౌరవ వేతనం విడుదల చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో సర్పంచ్‌లకు రూ.49,69,138 గౌరవ వేతనం విడుదలైందని డీపీఓ సుధాకర్‌రావు తెలిపారు. ఎన్నికలు జరిగిన 684 పంచాయతీల్లోని సర్పంచ్‌లకు రెండో విడత కింద ఆ మొత్తాన్ని ప్రభుత్వం ఇచ్చిందన్నారు. ఒక్కొక్క సర్పంచ్‌కు గౌరవ వేతనంగా రూ.3 వేలు వంతున విడుదల కాగా వాటిని బ్యాంకు ఖాతాలకు జమచేయనున్నామని తెలిపారు. -
పవిత్రోత్సవం.. పరిసమాప్తం
వడమాలపేట (పుత్తూరు): అప్పలాయగుంటలో టీటీడీ అనుబంధ శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో మూడు రోజుల పాటు నిర్వహించిన పవిత్రోత్సవాలు శుక్రవారం పవిత్ర విసర్జనతో వైభవంగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. తెల్లవారు జామున శ్రీవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి శుద్ధి, తోమాలసేవ, అర్చన చేశారు. అనంతరం ఆలయ పండిత బృందం యాగశాలలో వైదిక కార్యక్రమాలను నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకించారు. సాయంత్రం ఉభయ దేవేరులతో స్వామి వారిని పట్టు పీతాంబరాలు, విశేష స్వర్ణాభరణాలు, సుగంధ భరిత పుష్పమాలికలతో సుందరంగా అలంకరించి తిరుచ్చిపై కొలువుదీర్చారు. అనంతరం మేళతాళాల నడుమ తిరువీధి ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అడుగడుగునా నారికేళ కర్పూర నీరాజనాలు సమర్పించారు. పవిత్రోత్సవాల్లో చివరి రోజైన శుక్రవారం పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమాలను డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, సూపరింటెండెంట్ శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ పర్యవేక్షించారు. -
జేశాప్ జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవం
తిరుపతి ఎడ్యుకేషన్ : రాష్ట్రంలోనే ఏకై క జర్నలిస్టు క్రీడా సంఘంగా గుర్తింపు పొందిన జేశాప్ (జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ) ఉమ్మడి తిరుపతి, చిత్తూరు జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యింది. జేశాప్ రాష్ట్ర అధ్యక్షుడు రత్నాకర్, ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్, తిరుపతి జిల్లా ఇన్చార్జ్ నరేష్ ఆదేశాల మేరకు శుక్రవారం తిరుపతి కరకంబాడి రోడ్డులోని సీవీ క్రికెట్ అకాడమీలో జిల్లాస్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జేశాప్ గత జిల్లా కమిటీ అధ్యక్షుడు పులుగూరు శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి ఎన్.శ్రీనివాసులు సమక్షంలో పలు తీర్మానాలు చేశారు. ఇందులో భాగంగానే నూతన జిల్లా కమిటీని వారు ప్రకటించారు. జేశాప్ తిరుపతి, చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా విజయ యాదవ్, ప్రధాన కార్యదర్శిగా నారా హరిబాబు, కోశాధికారిగా భూమిరెడ్డి నరేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా పి.సుబ్రహ్మణ్యం, దుగ్గాని ప్రసాద్, నెల్లూరు శ్రీనివాసులు, ఉప కార్యదర్శులుగా కామేశ్వరయ్య, శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం, ప్రసాద్, సీనయ్య ఎన్నిక కాగా ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా నాగార్జున, ప్రతాప్ కుమార్, చిన్నబాబు, మునిశేఖర్, అమర్నాథ్, విజయ్ కుమార్, మునికృష్ణారెడ్డి, భాస్కర్, లోకేష్ రాజు, సతీష్ కుమార్, తులసి రామ్, జగదీష్, మనోహర్ ఎన్నికయ్యారు. జర్నలిస్టులకు క్రీడలు అవసరం జర్నలిస్టులకు క్రీడలు ఎంతో అవసరమని, జర్నలిస్టు లు రాష్ట్ర స్థాయిలో క్రీడల్లో రాణించాలని రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రత్నాకర్, విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. అక్టోబర్ నెల 5, 6, 7, 8 తేదీల్లో అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో పోటీలు జరగనున్నాయి. -
కబడ్డీ జిల్లా జట్ల ఎంపిక
సదుం: చిత్తూరు జిల్లా జూనియర్ బాల, బాలికల కబడ్డీ జట్లను స్థానిక పోలీస్ గ్రౌండ్స్‌లో శుక్రవారం ఎంపిక చేసినట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షురాలు వుమత, కార్యనిర్వాహక కార్యదర్శి రవీంద్రరెడ్డి తెలిపారు. వివిధ ప్రాంతాలకు చెందిన బాలికలు 46 మంది, బాలురు 78 మంది ఈ పోటీలకు హాజరయ్యారని పేర్కొన్నారు. వారిలో ప్రతిభ చూపిన 12 మందిని ఒక్కో జట్టుకు ఎంపిక చేశామన్నారు. వీరు ఈ నెల 25వ తేదీ నుంచి గొల్లపూడిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో పీడీలు భాస్కర్, నౌషాద్, అంజినేయులు, శేఖర్, గుల్జార్, పవిత్ర పాల్గొన్నారు. -
పోలీసునని చెప్పి.. మహిళల వద్ద బంగారం లూటీ
చిత్తూరు అర్బన్: పోలీసునని చెప్పి మహిళల వద్ద బంగారం లూటీ చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం స్థానిక పోలీసు అతిథిగృహంలో సీఐ మహేశ్వర ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ ఏడాది జూన్‌లో ఓ ప్రేమజంట చిత్తూరు నగరంలోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఒంటరిగా ఉంది. వారి వద్దకు వెళ్లిన గుర్తుతెలియని వ్యక్తి తాను పోలీసునని చెప్పి పరిచయం చేసుకున్నాడు. ‘మీరు ఇక్కడ చేస్తున్న చేష్టలన్నీ డ్రోన్ కెమెరాలో రికార్డు అయ్యాయి. స్టేషన్‌కు పదండి..’ అంటూ బెదిరించాడు. స్టేషన్‌కు వెళితే పరువు పోతుందని మహిళ వేడుకోగా, మెడలో ఉన్న బంగారు గొలు సును లాక్కుని వారిని వదిలేశాడు. గతనెల కూడా ఇదే తరహా ఘటన వేలూరు రోడ్డులో చోటు చేసుకుంది. బాధితులు ఎట్టకేలకు ధైర్యం చేసి, జరిగిన విషయాన్ని మూడు రోజుల క్రితం వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితుడు కొంగారెడ్డిపల్లెకు చెందిన అఖిల్(30)గా గుర్తించారు. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నట్టు గుర్తించారు. 2022 లో కూడా నిందితుడిపై ఈ తరహా కేసు నమోదైనట్లు సీఐ తెలిపారు. పీవీకేఎన్ కళాశాల వెనుక ఉన్న అటవీప్రాంతంలో తిరుగు తున్న అఖిల్‌ను పట్టుకున్న పోలీసులు, అతడి వద్ద ఉన్న 12 గ్రా ముల రెండు బంగారు గొలుసులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి, న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టగా రిమాండ్‌కు ఆదేశించారు. అనంతరం నిందితుడిని చిత్తూరులోని జిల్లా జైలుకు తరలించారు. కాగా నిందితుడిపై కేసు నమోదు కావడంతో అతడిని విధుల నుంచి తొలగించినట్లు మున్సిపల్ కమిషనర్ నర సింహ ప్రసాద్ తెలిపారు. మరోవైపు నిందితుడికి వైఎస్సార్సీపీ నేతల ప్రోద్బలంతోనే కార్పొరేషన్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం లభించిందని సీఐ వ్యాఖ్యానించారు. దీనిపై ఆ పార్టీ చిత్తూరు సమన్వయకర్త విజయానందరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి నేత వద్ద పీఏగా పనిచేసిన నిందితుడు, విధులకు వెళ్లకుండా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అక్రమంగా వేతనాలు పొందాడని ఆరోపించారు. ఇతను అధికారపార్టీ నేతలకు కొమ్ముకాస్తే, నిందను తమపార్టీపై వేయడం సీఐ అవివేకానికి నిదర్శమమని మండిపడ్డారు. -
మా భూములు వదిలేయండి సామీ!
రామకుప్పం(కుప్పం): అభివృద్ధి పేరిట తమకు జీవనాధారమైన వ్యవసాయ భూములను లొక్కోవద్దని కోరుతూ రామకుప్పం మండలంలోని రెండు గ్రామాల రైతులు నిరసనకు దిగారు. మండలంలోని మణేంద్రం పంచాయతీ రైతులు శుక్రవారం ఆ గ్రామ సచివాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించారు. ఇప్పటికే విమానాశ్రయం కోసమని రెండు విడతలుగా తమ భూములను లాక్కున్న ప్రభుత్వం పరిశ్రమల పేరుతో మరో సారి భూ సేకరణ చేస్తోందని వాపోయారు. హంద్రీనీవా కాలువలో నీరు వచ్చిన ఆనందం తమకు 15 రోజులు కూడా లేకుండా చేస్తూ మళ్లీ 600 ఎకరాల భూములు లాక్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బంజరు భూములను చదును చేసి, అభివృద్ధి చేసుకుని కుటుంబాలను పోషించుకుంటున్నామని చెప్పారు. భూములన్నీ కోల్పోతే రైతు, వ్యవసాయ కూలీల కుటుంబాలు వీధిన పడతాయన్నారు. నలబై ఏళ్లుగా సీఎం చంద్రబాబును గుండెల్లో పెట్టుకుని గెలిపిస్తుంటే ఇలా చేయడం తగదన్నారు. రైతుల సాగు భూముల్లో కాక మరో చోట ఎక్కడైనా ప్రభుత్వ భూముల్లో పరిశ్రమలు పెట్టాలని కోరారు. సీఎం, జిల్లా కలెక్టర్లు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. మరో వైపు తమ భూముల్లో సోలార్ ప్రాజెక్టు వద్దని బల్ల గ్రామానికి చెందిన బాధిత రైతులు నిరసనకు దిగిన అంశం వెలుగులోకి వచ్చింది. కంపెనీ ప్రతినిధులు జేసీబీలతో భూమి చదునుకు పూనుకోవడంతో రైతులు, వారి కుటుంబ సభ్యులు పనులను అడ్డుకున్నారు. ప్రభుత్వం తమకు కేటాయించి, సాగు చేసుకుంటున్న భూముల్లో తమకు తెలియకుండానే పనులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు, రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకున్నా బాధితులు జేసీబీలను పని చేయనివ్వలేదు. అధికారులు సాంకేతిక అంశాలను ప్రస్తావించినా రైతులు అంగీకరించలేదు. తాము సాగు చేస్తున్న భూములను వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. -
నేడు ఎస్ఎంసీ, క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 20వ తేదీన ఎస్ఎంసీ (స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ), క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాలను పకడ్బందీగా నిర్వహించేందుకు రాష్ట్ర విద్యాశాఖాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వుల ప్రకారం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పకడ్బందీగా సమావేశాలను నిర్వహించాలని డీఈఓ వర లక్ష్మి ఆదేశించారు. ప్రతి పాఠశాలలో మధ్యా హ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాలు కచ్చితంగా నిర్వహించాలని ఆదేశించారు. ఎలాంటి అలసత్వం వహించినా చర్యలు తప్పవని డీఈఓ హెచ్చరించారు. 26లోపు మ్యాపింగ్ పూర్తి చేయాలి చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఓటర్ల జాబితా మ్యాపింగ్ ప్రక్రియ ఈ నెల 26వ తేదీ లోపు పూర్తి చేయాలని డీఆర్వో మోహన్ కుమార్ అన్నారు. ఈ మేరకు ఓటర్ల జాబితా ప్రక్రియపై విజయవాడ నుంచి ఎన్నికల సంఘం అధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ అనంతరం డీఆర్వో మాట్లాడుతూ ఓటర్ల జాబితా ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఓటర్ల జాబితా ప్రక్రియలో ఎలాంటి తప్పిదాలు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. మ్యాపింగ్ ప్రక్రియ ను నిర్ధేశించిన గడువు లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కాన్ఫరెన్స్‌లో పలువురు అధికారులు పాల్గొన్నారు. భద్రత మరింత పటిష్టం చేయాలి కాణిపాకం: ఆలయ భద్రతను మరింత పటిష్టం చేయాలని ఏఎస్పీ రాజశేఖర్‌రాజు, నందకిషోర్ పేర్కొన్నారు. కాణిపాకంలోని వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో శుక్రవారం ఆక్టోపస్ మాక్ డ్రిల్‌పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన ఈఓ పెంచలకిషోర్, పోలీసుశాఖ, రెవెన్యూ, అగ్నిమాపక, ఆరోగ్యశాఖల అధికారులతో ఆలయ భద్రతపై చర్చించారు. రాష్ట్ర ఆక్టోపస్ ఆధ్వర్యంలో జరిగే మాక్ ఉద్దేశాన్ని వివరించారు. కార్యక్రమంలో ఆక్టోపస్ డీఎస్పీ తిరుమలయ్య, సీఐ శ్రీధర్‌నాయుడు, ఎస్ఐ నరసింహులు తదితరులు పాల్గొన్నారు. వరసిద్ధుడికి రూ.2.39 కోట్ల ఆదాయం కాణిపాకం: వరసిద్ధి వినాయకస్వామి ఆలయానికి రూ.2,39,09,202 ఆదాయం వచ్చినట్లు ఈఓ పెంచలకిషోర్ తెలిపారు. వరసిద్ధివినాయకస్వామివారి ఆలయంలో హుండీల లెక్కింపును శుక్రవారం అధికారులు పగడ్బందీగా చేపట్టారు. ఈ హుండీ లెక్కింపులో ఆలయానికి రూ.2,39,09,202 ఆదాయం వచ్చిందని ఈఓ తెలిపారు. 54 గ్రాముల బంగారం, 1.910 కిలోల వెండి వచ్చిందని చెప్పారు. అలాగే గోసంరక్షణ హుండీ ద్వారా రూ.29,485, నిత్యాన్నదానం హుండీ ద్వారా రూ.67,339 వచ్చిందన్నారు. 157 యూఎస్ఏ డాలర్లు, 12 సింగపూర్ డాలర్లు, 52 మలేషియా రింగిట్స్, 572 యూఏఈ దిర్హామ్స్, 280 కెనడా డాలర్లు, 20 ఆస్ట్రేలియా డాలర్లు, 5 యూరోలు, 15 ఇంగ్లాడ్ పౌండ్స్ వచ్చాయని ఈఓ పెంచలకిశోర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈఓ సాగర్‌బాబు, ఏఈఓలు ఎస్వీ కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, హరిమాధవరెడ్డి, ధనపాల్, ప్రసాద్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
మెడికలపై ఉక్కుపిడికిలి
ఆందోళన చేస్తున్న వైఎస్సార్ సీపీ యువజన, విద్యార్థి విభాగం నేతలు, పార్టీ ప్రముఖులు‘మెడికల్ కోర్సు చదవాలన్న పేదల కలలపై చంద్రబాబు ఉక్కుపిడికిలి బిగించారు. రాష్ట్రంలో వైద్యవిద్యను విక్రయానికి ఉంచారు. దీంతో పేదలకు వైద్యవిద్య దూరం.. సామాన్యులకు ఉచిత వైద్యం గగనం అవుతుంది. కూటమి సర్కారు దీన్ని వెంటనే ఆపాలి.’ అని వైఎస్సార్ సీపీ చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల నేతలు డిమాండ్ చేశారు.సాక్షి ప్రతినిధి, తిరుపతి: సీఎం చంద్రబాబు పేద విద్యార్థుల వైద్యవిద్య కలపై ఉక్కుపిడికిలి బిగిస్తున్నారని, దేశంలోని మెడికల్ కళాశాలల్లో ఎక్కడా పీపీపీ విధానం లేదని, చంద్రబాబు చెబుతున్న నిధుల కొరత కథ అంతా నాటకమేనని వైఎస్సార్ సీపీ చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల నేత లు ధ్వజమెత్తారు. మదనపల్లె ప్రభుత్వ వైద్యకళాశా ల ప్రైవేటీకరణను నిరసిస్తూ శుక్రవారం వైఎస్సార్ సీపీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో చలో మదనపల్లె మెడికల్ కళాశాల కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్ సీపీ చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల నేతలు పాల్గొని, మాట్లాడారు. చంద్రబాబు హయాంలో ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేయలేదని, ఒక మెడికల్ సీటు పెంచలేదన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషితో రాష్ట్రంలో 2,550 మెడికల్ సీట్లు వస్తుండగా వాటిపై కూటమి నేతల దుష్ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. వైద్యకళాశాలల ప్రైవేటీకరణతో పేద, మధ్య తరగతికి విద్యార్థులు వైద్యవిద్యకు దూరం కావడమే కాకుండా, పేదలకు ఉచిత సేవలు దూరం అవుతాయని ఆవేదన చెందారు. వైద్య కళాశాలల పీపీపీ ప్రక్రియను తక్షణం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. చలో మదనపల్లె మెడికల్ కళాశాల భారీ సక్సెస్ ప్రభుత్వ వైద్యవిద్య పరిరక్షణే ధ్యేయంగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన చలో మదనపల్లె మెడికల్ కళాశాల కార్యక్రమం భారీ సక్సెస్ అయ్యింది. వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నిరసన జ్వాలలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నేతలు, విద్యార్థి విభాగం, యువజన విభాగం నేతలు మాట్లాడుతూ అ యినవారికి దోచిపెట్టడమే చంద్రబాబు నైజమని మండిపడ్డారు. పేదింటి బిడ్డలకు వైద్యవిద్య భారం కాకూడదని, పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలనే సంకల్పంతో గత ప్రభుత్వంలో అప్పటి సీ ఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 17 నూతన వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టారని చె ప్పారు. అందులో భాగంగానే అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రూ.470 కోట్లతో 95 ఎకరాల్లో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని నిర్ణయించారని చెప్పారు. కళాశాల భవన నిర్మాణాలు చాలా వరకూ పూర్తి అయ్యాయని తెలిపారు. కూటమి సర్కారు అధికారంలోకి రావడంతో మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులు ఆగిపోయాయని తెలిపారు. ఏడాదిన్నరగా పనులు సాగలేదని ఆరోపించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనే రాష్ట్రంలో ఐదు మెడికల్ కళాశాలలను ప్రారంభించారన్నారు. ఆ సమయంలోనే ఎన్నికలు రావడం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయిందన్నారు. పేదల ఆశలపై నీళ్లు చల్లుతూ సీఎం చంద్రబాబు ‘పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్టనర్షిప్’ (పీపీపీ) విధానాన్ని తెరపైకి తీసుకొచ్చారని చెప్పారు. రాష్ట్రంలో 10 మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసే చ ర్యలకు ఉపక్రమించారని తెలిపారు. ప్రైవేట్ చేతుల్లోకి మెడికల్ కళాశాలలు వెళితే పేద విద్యార్థులు ఆ వైద్య కళాశాలల గుమ్మం ఎక్కలేని పరిస్థితి తలెత్తనుండడంతోపాటు వైద్యం ఖరీదవుతుందని, ఇది సమాజానికి మంచిది కాదన్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్ సీపీ పోరాటాలకు సిద్ధమై, శుక్రవారం యువజన, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన ‘చలో మదనపల్లె మెడికల్ కాలేజ్’ కా ర్యక్రమం భారీ సక్సెస్ అయ్యిందన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి, పార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ రెడ్డి, మదనపల్లె ఇన్చార్జ్ నిస్సార్ అహమ్మద్, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి, పుంగనూరు నియోజక వర్గ నేతలు శ్రీనాథరెడ్డి, అనూషరెడ్డి, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు భూమన అభినయ్ రెడ్డి, విద్యార్థి విభాగం తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి, యువజన విభాగం అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు శివప్రసాద్ రెడ్డి, అన్నమయ్య జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు జంగంరెడ్డి కిషోర్ దాస్, పార్టీ రాష్ట్ర ప్రచార అధ్యక్షుడు హరిప్రసాద్ రెడ్డితోపాటు 17 నియోజకవర్గాల నేతలు పాల్గొన్నారు. అనంతరం మెడికల్ కళాశాల భవనాలను వైఎస్సార్ సీపీ నేతలు పరిశీలించారు. ప్రధాన భవనం వద్ద బైఠాయింపు నిర్మాణదశలో ఉన్న ప్రధాన భవనం వద్ద విద్యార్థులు, యువకులతో కలసి వైఎస్సార్ సీపీ నేతలు బైఠాయించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పేదల కలలు– ప్రభుత్వ కళాశాలలు, పేదలకు దూరంగా వైద్యం..బాబు బినామీలకు నైవేద్యం అని నినాదాలు చేశారు. భవిష్యత్తును కాలరాస్తున్న కూటమి రాష్ట్ర ప్రజల భవిష్యత్తును కూటమి ప్రభుత్వం కాలరా స్తోంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రూ.8,500 కోట్లతో 17 మెడికల్ కళాశాలల నిర్మాణం చేపట్టగా ఇంకా రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తే పనులు పూర్తవుతాయి. ఈ నిధులు ఖర్చు చే యడం భారమని ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పు కుని ప్రైవేటుకు ఇవ్వాలని ప్రజలను మభ్యపెడుతోంది. దీంతో వేల కోట్లను ఆర్జించాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. కళాశాలలు అందుబాటులోకి వస్తే పేద విద్యార్థులు త క్కువ ఖర్చుతో వైద్య విద్యను అభ్యసించే అవకాశం దక్కుతుంది. మదనపల్లె కళాశాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం 99 ఎకరాలను కేటాయించింది. ఇక్కడ భవనాలు నిర్మించారు. కొన్ని పూర్తయ్యే దశలో ఉన్నాయి. ఈ వాస్తవాలను ప్రజలను తెలియా లనే నిరసన కార్యక్రమం చేపట్టాం. చంద్రబాబు చర్యలతో రాష్ట్ర భవిష్యత్తు నాశనం అవుతుంది. – భూమన అభినయ్ రెడ్డి, వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జగనన్న కట్టించిన మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నడపాలి గత ప్రభుత్వంలో జగనన్న కట్టించిన మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నడపాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వ చ్చిన తరువాత ఆ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలని చూ స్తోంది. పేద విద్యార్థులకు వైద్య విద్యను చేరువచేయాలని జగనన్న సంకల్పిస్తే, తన వర్గానికి అడ్డగోలుగా కాలేజీలను కట్టబెట్టడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పిస్తున్నా రు. ఇది నిజంగా పేద విద్యార్థులకు చేస్తున్న తీరని ద్రోహం. ప్రయివేటుపరం చేయబోతున్న మెడికల్ కాలేజీల విషయంలో జరుగుతున్న స్కాంను ప్రజల ముందుకు తీసుకువెళతాం.. ఎట్టి పరిస్థితుల్లోను ప్రైవేటు పరం కాకుండా చూ డటానికి పోరాడుతాం. ప్రభుత్వం తమ పోరాటాలను లెక్క చేయకుండా ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జగనన్న ఆ టెండర్లను రద్దు చేస్తారని ఇప్పటికే ప్రకటించారు. ఆ మెడికల్ కాలేజీల జోలికి ఎవ్వరు రావద్దని హెచ్చరిస్తున్నా. – చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు -
భక్తిశ్రద్ధలతో రాహుకాల అభిషేక పూజలు
చౌడేపల్లె: బోయకొండ గంగమ్మ ఆలయంలో అమ్మవారికి శుక్రవారం భక్తిశ్రద్ధలతో రాహుకాల అభిషేక పూజ లు చేశారు. ఉదయం ఆలయ అర్చకులు అమ్మవారి గర్భాలయాన్ని శుద్ధి చేశారు. రాహుకాల సమయం 10.30 నుంచి 12 గంటల మధ్య శాస్త్రోక్తంగా అర్చన, అభిషేక పూజలు నిర్వహించారు. పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి రాహుకాల అభిషేక పూజలకు ఉభయకర్తలుగా వ్యవహరించారు. అనంతరం అమ్మవారిని స్వర్ణాభరణాలు, సుగంధభరి త పుష్పాలతో విశేషాలంకరణ చేసి, భక్తులకు దర్శ నం కల్పించారు. అమ్మవారి పవిత్ర తీర్థప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. -
గజరాజుల బీభత్సం
పరిశ్రమలు పెట్టొద్దని ఆందోళన ద ళితుల భూముల్లో పరిశ్రమలు పెట్టొద్దని స్థానిక దళితులు ఆందోళన వ్యక్తం చేసి కలెక్టర్‌కు విన్నవించారు.కల్లూరు, పాతపేట, జూపల్లిలోని పంట పొలాల్లో గజరాజులు బీభత్సం సృష్టించి ఆస్తి నష్టం కలిగించాయి. పరిశుభ్రత అంతంతే.. ఏడాదికి రెండుసార్లే ట్యాంకుల శుభ్రత పాడి రైతులను ప్రోత్సహించాలి జిల్లాలోని మహిళా పాడి రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాందీ పేర్కొన్నారు. శుక్రవారం శ్రీ 19 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. మరోవైపు తాగునీటి కలుషితంతో వివిధ ప్రాంతాల్లో ప్రజలు అస్వస్థతకు గురవుతున్నారు. చిత్తూరు జిల్లా కేంద్రంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పైపులైన్ లీకేజీలతో తాగునీరు కలుషితం అవుతోంది. ఫలితంగా ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. రెండు నెలలకు ఒక్కసారి కూడా ట్యాంక్‌లను శుభ్రం చేయడం లేదు. కాలువల్లో పైపులైన్లు, గేట్‌వాల్వ్‌లు ఉన్నా ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో తాగునీరు విషతుల్యం అవుతోంది. సీజన్లో అప్రమత్తం కావాల్సిన అధికారులు మొక్కుబడి చర్యలతో ప్రజలు వ్యాధులకు గురవుతున్నారు. కనీసం పర్యవేక్షణ చర్యలు కూడా తూతూమంత్రంగా చేస్తుండడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. చిత్తూరు కార్పొరేషన్ : జిల్లా వ్యాప్తంగా రెండు వారాలుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇంటింటికీ పంపిణీ చేసే తాగునీటి సరఫరాలో అనేక లోపాలున్నాయి. పైపులైన్ లీకేజీలతో తాగునీరు కలుషితం అవుతోంది. ప్రజలు అదే నీటిని తాగుతుండటంతో జబ్బుల బారిన పడుతున్నారు. పట్టణాలు, చిత్తూరు నగరంలో అడుగడుగునా పైపులైన్ లీకేజీలే దర్శనమిస్తున్నాయి. నీటిని శుద్ధి చేయడానికి ప్రత్యేక యంత్రాంగం ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదు. ట్యాంకులను శుభ్రం చేయడం, బ్లీచింగ్ పౌడర్ చల్లడం లాంటివి మొక్కుబడిగా చేస్తున్నారు. కొన్ని మండలాల్లో నెలలు గడుస్తున్నా ట్యాంకులు శుభ్రం చేయడం లేదు. నెలల తరబడి అవే సమస్యలు పల్లెలు, పట్టణాలు, నగరాలు తేడా లేకుండా కలుషిత తాగునీరే సరఫరా అవుతోంది. పైపులైన్ లీకేజీలు, గేట్‌వాల్వ్‌ల వద్ద గుంతలతో నీటి వనరులు మురికిగా మారుతున్నాయి. ప్రస్తుతం వర్షాకాల సమయంలో మురుగు నీటి సరఫరా ఎక్కువగా ఉంటోంది. నెలలు, సంవత్సరాలు అవుతున్నా ఈ సమస్య పరిష్కారం కావడం లేదు. కలుషిత నీరు తాగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. కొన్ని వారాలుగా జిల్లాలో కురుస్తున్న వర్షాలకు అనేక ప్రాంతాల్లో తాగునీరు కలుషితమవుతోంది. మొక్కుబడిగా నీటి నాణ్యతా పరీక్షలు జిల్లాలోని 696 పంచాయతీలకు కాలం చెల్లిన కిట్లు సరఫరా చేయడంతో ఫలితం అంతగా కనబడటం లేదు. నీటి పరీక్షల పరంగా ఆర్డబ్ల్యూఎస్ , పంచాయతీ, సచివాలయ కార్యదర్శులు, వైద్యశాఖల మధ్య సమన్వయం లేదు. ఆర్డబ్ల్యూఎస్ శాఖ పరంగా పంచాయతీకి ఒక టెస్టింగ్ కిట్ అందజేశారు. వీటి ద్వారా తక్షణం వంద పరీక్షలు చేయవచ్చు. అక్కడ సమస్య ఉందని తెలిస్తే ల్యాబ్‌కు పంపి పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటారు. సమస్య ఉంటే క్లోరినేషన్ పనులు చేస్తున్నారు. గుడిపాల, పలమనేరు, బైరెడ్డిపల్లె, పుంగనూరు, నగరి ప్రాంతాల్లో అపరిశుభ్ర నీటిని తాగి ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. తరచూ పంచాయతీ, సచివాలయ కార్యదర్శులు నీటి పరీక్షలు చేయడం లేదు. అసలే కిట్లు కనిపించడం లేదు. జిల్లాలో చిత్తూరు, కార్వేటినగరం, పలమనేరు, పుంగనూరు, కుప్పం, నగరి ప్రాంతాల్లో ఆర్‌డబ్ల్యూఎస్‌శాఖ పరంగా నీటి పరీక్షల ల్యాబ్‌లు ఉన్నాయి. జిల్లా గ్రామీణ నీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) ఏర్పాటు చేసిన నీటి నాణ్యత విభాగం తనిఖీలు తూతూ మంత్రంగా చేస్తున్నట్లు తెలుస్తోంది. మూలకు చేరిన నీటి పథకాలు పంచాయతీ పారిశుద్ద్యం, నీటి సరఫరాపై దృష్టి సారించాలని కలెక్టర్ ప్రతి సమావేశం చెబుతుంటారు. కానీ క్షేత్రస్థాయిలో వీటిపై పెద్దగా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. అనేక చేతిపంపులు మరమ్మతులకు గురయ్యాయి. అనేక గ్రామాల్లో పంపింగ్ స్కీము లు కూడా మూలన పడ్డాయి. కొన్ని ప్రాంతాకు మంచినీరు నేటికి సరఫరా అందే పరిస్థితి లేదు. కిట్లతో నీటి నాణ్యత పరిశీలించి ప్రజలకు తాగేందుకు సరఫరా చేయాలి. నీటిలో ఫ్లోరిన్, కలుషితం, పీహెచ్ ఏమోతాదు లో ఉందనే అంశాలను నీటి కిట్లతో తెలుసుకోవచ్చు. కానీ ఈ పరీక్షలు అంతంత మాత్రంగానే సాగుతున్నట్లు తెలుస్తోంది. కలుషిత నీటితో దుష్ప్రభావాలు ఇలా.. ● నివాస గృహాల నుంచి వెలువడే మురుగు నీరు, జంతువుల మలమూత్ర విసర్జితాల నుంచి నీటిలోకి చేరి బ్యాక్టీరియా, సూక్ష్మజీవులను వ్యాధి కారకాలుగా గుర్తిస్తారు. ఇవి జీర్ణాశయ పేగు సంబంధమైన వ్యాధులకు దారితీస్తాయి. ● కలుషిత నీటిని తాగడంతో కలరా, డయేరియా, టైఫాయిడ్, పచ్చ కామెర్లు మొదలైన వ్యాధులు వ్యాపిస్తాయి. ● నీటిలో కాడ్మియం శాతం ప్రమాదకర స్థాయిని దాటితే ఎముకల సాంద్రతను తగ్గిస్తుంది. నీటిలో చేరిన సీసం కారణంగా మూర్ఛ వ్యాధి, అధిక రక్తపోటు, కీళ్ల నొప్పులు, జ్ణాపకశక్తి లోపించడం జరుగుతాయని వైద్యులు చెబుతున్నారు. ట్యాంకుల శుభ్రత ఉండాల్సి ఇలా.. నీటి ట్యాంకులను నెలకు రెండుసార్లు, పాఠశాలలు, అంగన్వాడీలలో నెలకు ఒకసారైనా పరిశుభ్రం చేయాలి. ఎప్పుడు శుభ్రం చేసింది తర్వాత శుభ్రం చేసే తేదీలను విధిగా ట్యాంకుల వద్ద నమోదు చేయాలి. అయితే క్షేత్రస్థాయిలో వాటిని విస్మరించారు. ● ప్రతి రక్షిత తాగునీటి పథకం వద్ద రిజిస్టర్లు ఏర్పాటు చేసి ఎంత పరిమాణం తాగునీటి సరఫరా చేసింది. బ్లీచింగ్ పొడి ఎంత కలిపారో నమోదు చేయాలి. అసలు రిజిస్టర్లే చాలా ప్రాంతాల్లో అమలు చేయడం లేదు. గుర్తించిన సమస్యలు ఇలా... ● చిత్తూరు జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో లీకేజీ సమస్యలు ఉండటంతో మురుగు నీరు పైపులైన్లలోకి చేరి తాగునీరు కలుషితం అవుతోంది. ఇలాంటి లీకేజీలు 100కు పైగానే ఉన్నట్టు తెలుస్తోంది. ● జిల్లాలో ఇటీవల కురుస్తున్న వర్షాలకు గ్రామాల్లో వాగులు, కాలువల నుంచి నేరుగా మోటార్ల సాయంతో నీటిని పంపింగ్ చేస్తున్నారు. దీంతో తాగునీరు కలు షితం అవుతోంది. ● ఓవర్‌హెడ్ ట్యాంకులను సరిగ్గా శుభ్రం చేయకపోవడంతో తాగునీరు కలుషితం అవుతోంది. చాలా ట్యాంకులలో పాచి పేరుకుపోయింది. అధికారులు అలసత్వం వహిస్తున్నారు. నిండ్ర ధర్మరాజ గుడి వద్ద పైపులు బిగించని ట్యాంకు చిత్తూరులోని ల్యాబ్‌లో నీటి పరీక్షలుబిల్డింగ్ కోర్సుకు దరఖాస్తు చేసుకోండి చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో అర్హులైన అభ్యర్థులు స్పెషల్ కెపాసిటీ బిల్డింగ్ కోర్సుకు ఈనెల 25లోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బాలాజీ తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో కోర్సు నిర్వహిస్తున్నారన్నారు. కోర్సు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో స్పోర్ట్స్ కోటాలో పనిచేసే క్రీడాకారుల నైపుణ్యాలు, వృత్తిపరమైన సామర్థ్యాలను పెంచుకునేందుకు ప్రత్యేకంగా రూపొందించినట్లు తెలిపారు. ఎటువంటి ప్రామాణిక, దీర్ఘకాలిక సెలవు అవసరం లేకుండా కోర్సును రెండు సంవత్సరాల వ్యవధి లోపు పూర్తి చేయవచ్చన్నారు. క్రీడాకారుల ప్రస్తుతం నిర్వహిస్తున్న ఉద్యోగాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా కోర్సు పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఆసక్తి ఉన్న వారు 9599303866 నంబర్లో సంప్రదించాలని కోరారు. 15 నుంచి గాలికుంటు నివారణ టీకాలు చిత్తూరు రూరల్ (కాణిపాకం) : జిల్లాలోని పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా లు వేస్తున్నట్లు జిల్లా పశువైద్యాధికారి ఆరీఫ్ తెలిపారు. ఈనెల 15 నుంచి పశువులకు టీకాలు వేస్తున్నామన్నారు. జిల్లాకు 4.52 లక్షల డోస్‌ల వ్యాక్సినేషన్ వచ్చిందన్నారు. ఈ కార్యక్రమం అక్టోబర్ 15 వరకు కొనసాగుతుందని, పాడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరో రెండు బార్లకు లైసెన్సులుచిత్తూరు అర్బన్ : జిల్లాలో మద్యం బార్ల నిర్వహణ కోసం రెండో విడత జారీ చేసిన నోటిఫికేషన్లో రెండు బార్లను నిర్వాహకులు దక్కించుకున్నారు. చిత్తూరు నగరంలో 5, పలమనేరులో ఒక బార్ ఏర్పాటు చేయడానికి ఈనెల 3న అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. చిత్తూరు నగరంలో ఒకటి, పలమనేరులో ఓ బార్ కోసం బుధవారం ఎనిమిది దరఖాస్తులు వచ్చాయి. వీటిని గురువారం చిత్తూరు కలెక్టరేట్లో కలెక్టర్ సుమిత్‌కుమార్ లాటరీ తీసి, లైసెన్సులు ఎవరికి దక్కాయో ప్రకటించారు. మూడేళ్ల కాలపరిమితి ఉండేలా లైసెన్సులు జారీ చేస్తున్నట్లు జిల్లా ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. కాగా చిత్తూరులో ఎన్పీఎస్, పలమనేరులో రాజలక్ష్మి అనే ఇద్దరు బార్ లైసెన్సులను దక్కించుకున్నారు. ఆడిట్ నివేదికలు పంపండి చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఇళ్ల పట్టాల మంజూరుకు సేకరించిన భూ వివరాలకు సంబంధించిన ఆడిట్ సమాధానాల నివేదికలు వెంట నే పంపాలని తహసీల్దార్లను డీఆర్వో మోహన్‌కుమార్ ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టరేట్ నుంచి టెలీకాన్ఫరెన్స్‌లో తహసీల్దార్లతో మాట్లాడారు. పుంగనూరులో సర్వే నంబర్ 335/2లో ఇళ్ల పట్టాలకు సేకరించిన భూమిని ప్రైవేట్ సంస్థలకు అప్పగించారనే అంశంపై వివరణ ఇవ్వాలన్నారు. అదే విధంగా పుంగనూరులో ఇళ్ల పట్టాలకు 363 మందికి ఒక సెంట్ భూమికి బదులు 1.5 సెంట్ల భూమి, 452 మందికి 8.22 ఎకరాల భూమి సేకరించగా కేవలం 246 మందికి మాత్రమే పంపిణీ చేశారనే అభియోగాలపై విచారణ చేయాలన్నారు. చిత్తూరు నగర పరిధిలోని అనుపల్లి, బండపల్లి, దొడ్డిపల్లి ప్రాంతాల్లో భూ సేకరణ ఎక్కువ చేశారనే ఫిర్యాదులున్నాయన్నారు. జిల్లాలో ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంట్ల భూమి పంపిణీ చేయాల్సి ఉండగా, ఇష్టానుసారం పంపిణీ చేశారన్నారు. ఇందుకు గల కారణాలను తహసీల్దార్ల నుంచి ఆర్డీవోలు సేకరించి నివేదికలను కలెక్టరేట్‌కు పంపాలని డీఆర్వో ఆదేశించారు. నేడు జిల్లా జూనియర్ కబడ్డీ జట్ల ఎంపిక చిత్తూరు కలెక్టరేట్: జిల్లా జూనియర్ బాలబాలికల కబడ్డీ జట్ల ఎంపిక శుక్రవారం సదుం మండల కేంద్రంలోని పోలీస్ గ్రౌండ్లో మధ్యా హ్నం 2 గంటలకు నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షురాలు మమత, ఆర్గనైజింగ్ సెక్రటరీ రవీంద్రరెడ్డి గురువారం విలేకరులకు తెలిపారు. 2006 డిసెంబర్ 31 తర్వాత జన్మించిన వారే పాల్గొనడానికి అర్హులని, బాలురు 75 కేజీలలోపు, బాలికలు 65 కేజీలలోపు బరువు ఉండాలన్నారు. ఆసక్తి కలిగిన క్రీడాకారులు తమ ఒరిజినల్ ఆధార్ కార్డు, 10వ తరగతి మార్కుల జాబితాతో పాటు ఐదు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు తీసుకురావాలన్నారు. ఎంపికై న వారు 25 నుంచి 28వ తేదీ వరకు విజయవాడలోని గొల్లపూడిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఇతర వివరాలకు 9440345455 నంబర్లో సంప్రదించాలన్నారు. జిల్లాలోని పంచాయతీలు 696 మొత్తం చేతిబోర్లు 8,329 బోరు బావులు 6,734, ఓహెచ్‌ఆర్ ట్యాంకులు 2,886 ఓఎస్ఎల్ఆర్ ట్యాంకులు 699 శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ మహిళ ల ఆరోగ్యమే కుటుంబానికి రక్ష ఐరాల : మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం శ్రేయస్సుగా ఉంటుందని , కుటుంబం శ్రేయస్సుగా ఉంటే సమాజం శక్తివంతమవుతుందని, అందుకే మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుధారాణి సూచించారు. గురువారం స్థానిక పీహెచ్సీలో వైద్యాధికారి రెడ్డెప్ప ఆధ్వర్యంలో స్వస్త్ నారీ– స్వశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని డీఎంహెచ్ఓ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. ప్రత్యేక వైద్య శిబిరాలు అక్టోబర్ 2 వరకు కొనసాగుతాయన్నారు. మహిళల ఆరోగ్య సంరక్షణను మరింత బలోపేతం చేయడం, కుటుంబ సుభిక్షానికి పునాది వేయడం కార్యక్రమం లక్ష్యమని వివరించారు. గ్రామీణ ప్రాంత మహిళలు ఉచిత వైద్య సేవలను వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్పెషలిస్ట్ డాక్టర్లు రక్తహీనత సమస్యలపై పరీక్షలు, సలహాలు, క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు, గర్భధారణ జాగ్రత్తలు, తల్లీ బిడ్డ ఆరోగ్యానికి వైద్య సూచనలు, ప్రసూతి అనంతరం సంరక్షణ, తదితర వ్యాధులపై అవగాహన కల్పిస్తారన్నారు. అనంతరం స్పెషలిస్ట్ డాక్టర్లు మహిళలకు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. కార్యక్రమంలో డీపీఎంఓ డాక్టర్ ప్రవీణ, వైద్యాధికారి రెడ్డెప్ప , స్పెషలిస్ట్ డాక్టర్లు ఉషా, సంధ్య, శ్రీవాణి, అర్పిత, వెంకట్రావు, మునికుమార్, పీహెచ్సీ వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఆకస్మిక తనిఖీ కాణిపాకం పీహెచ్సీ పరిధిలోని జంగాలపల్లెలో నిర్వహిస్తున్న స్వస్త్ నారీ– సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని బుధవారం డీఎంహెచ్ఓ సుధారాణి తనిఖీ చేశారు. మహిళలకు అందుతున్న వైద్య సేవలపై పీహెచ్సీ డాక్టర్ స్వాతిసింధూరని అడిగి తెలుసుకున్నారు. మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రవేశ పెట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకునేలా వైద్య సిబ్బంది చొరవ చూపాలని ఆదేశించారు. ప్రత్యేక వైద్య శిబిరంలో 640 మందికి వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. జిల్లా ఎన్హెచ్ఎం కో–ఆర్డినేటర్ డాక్టర్ ప్రవీణ్ పాల్గొన్నారు. వడమాలపేట (పుత్తూరు) : అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీవారి పవిత్రోత్సవాల్లో రెండవ రోజైన గురువారం స్వామి వారికి శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. అనంతరం మూలవిరాట్టు, ఉత్సవర్లకు, పద్మావతీ, ఆండాళ్ అమ్మవారు, జయ విజయులు, గరుడాళ్వార్, ఆంజనేయస్వామికి, ధ్వజస్థంభం, ఇతర పరివార దేవతలకు పవిత్ర సమర్పణ చేశారు. సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. పవిత్రోత్సవాల సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. కార్యక్రమాలను డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, సూపరింటెండెంట్ శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ పర్యవేక్షించారు. పవిత్రోత్సవాల్లో నేడు : పవిత్రోత్సవాల్లో మూడవ రోజు శుక్రవారం ఉదయం 9–30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. 11–30 గంటల నుంచి 12–30 గంటల మధ్య స్వామి అమ్మవార్లకు మహా పూర్ణాహుతి, పవిత్ర విసర్జన నిర్వహించనున్నారు. పాచిపట్టిన ట్యాంకులు పాలసముద్రం : మండలంలో తాగునీటి ట్యాంకు ను క్లోరినేషన్ చేయాల్సి ఉన్నా ఏ ఒక్క గ్రామా ల్లో అమలు కావడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఏదో మొక్కుబడి గా ట్యాంకుల్లో బ్లీచింగ్ కలిపి తాగునీటిని సరఫరా చేస్తున్నారని విమర్శిస్తున్నారు. రక్షిత మంచినీటి ట్యాంకులకు సరిగా శుభ్రం చేయకపోవడంతో పాచి పెరిగి కలుషిత నీరు సరఫరా అవుతోందని చెబుతున్నారు. పాలసముద్రం మండలంలో రక్షిత నీటి పథకం నిర్వహణ పంచాయతీ , ఆర్డబ్యూఎస్ అధికారులు పటించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఎంపీడీఓ సతీష్‌ను వివరణ కోరగా ఆరు రోజులకొకసారి తప్పకుండా క్లోరినేషన్ బ్లీచింగ్ చేయించాలని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారు. క్లోరినేషన్ సక్రమంగా చేపట్టకపోతే కార్యదర్శులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. జాడలేని నీటి నాణ్యత పరీక్షలునీటిలో నాణ్యత ఎంత అనేది ప్రశ్నార్థకంగా మారింది. వర్షాకాలం నేపథ్యంలో విధిగా తాగునీటి పరీక్షలు పెంచాల్సి ఉండగా అందుకు భిన్నమైన పరి స్థితి నెలకొంది. ప్రధానంగా పైప్లైన్్ లీకేజీలు ప్రజలను కలవరపెడుతున్నాయి. జలశయాలు, ట్యాంకుల వద్ద నమూనాలు సేకరించి పరీక్షలు విధిగా చేయాలి. నాణ్యత లోపించినట్లు నిర్ధారణ అయితే వెంటనే చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా గ్రామా ల్లో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కొళాయిలను గాలికి వదిలేస్తున్నారు. నీటి నాణ్యత, పర్యవేక్షణ విషయాన్ని అధికారులు పూర్తిగా మరిచిపోయారు. ట్యాంకులు, మురికివాడల నుంచి సరఫరా అయ్యే నీటికి నాణ్యత పరీక్షలు చేయడం లేదు. ముఖ్యంగా పాఠశాలలు కొళాయిల్లో నీటిని పరీక్షించాలనే బాధ్యతను అధికారుల విస్మరించారు. జిల్లా సమాచారం నగరి : నగరిలో తాగునీటి సరఫరాకు 18 ట్యాంకులు ఉండగా వాటిలో 11 మరమ్మతులకు గురయ్యాయి. 7 ట్యాంకులు మాత్రమే వినియోగిస్తున్నారు. వినియోగించే ట్యాంకుటను 15 రోజులకు ఒకసారి శుభ్రపరచి క్లోరినేషన్ చేస్తున్నారు. ట్యాంకులు వినియోగంలో లేని ప్రాంతాలకు డైరెక్ట్ పంపింగ్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. తరచూ మోటార్లు రిపేరు అవుతుండటం, జాతీయ రహ దారి పనుల్లో భాగంగా పైపులు పగలడం కారణాలతో కొన్ని ప్రాంతాలకు నీటి సరఫరాలో సమస్యలున్నాయి. నగరి మున్సిపాలిటీలో రెండు నెలలక్రితం వాటర్ టెస్టింగ్ చేశారు. ప్రస్తుతం శాంపిల్స్ పంపారు. ఇంకా రిపోర్టు రాలేదు. బంగారుపాళెం : మండలంలో తాగునీటి ట్యాంకుల పరిశుభ్రత అంతంత మాత్రంగానే ఉంది. ట్యాంకుల పరిశుభ్రతపై పెద్దగా దృష్టి సారించలేదు. నిబంధనల ప్రకారం 15 రోజులకు ఒక్కసారి తాగునీటి ట్యాంకులు బ్లీచింగ్‌తో శుభ్రం చేసి , క్లోరినేషన్ చేసిన నీరు సరఫరా చేయాల్సి ఉంది. అంతే కాకుండా తాగునీటి నాణ్యత పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఇప్పటి వరకు తాగునీటి నాణ్యత పరీక్షలు నిర్వహించిన దాఖలాలు లేవు. నీటి నాణ్యత పరీక్షలకు గత ప్రభుత్వంలో అందించిన కిట్లు ఏమయ్యాయో తెలియడంలేదు. సంవత్సరానికి రెండు , మూడు సార్లు తప్ప ట్యాంకులు శుభ్రం చేయరని ప్రజలు చెబుతున్నారు. మండలంలో 41 గ్రామ పంచాయతీల పరిధిలో 180 గ్రామాలు ఉన్నాయి. వీటి పరిధిలో 200 ట్యాంకులపైగా ఉన్నాయి. ఏడాదికి ఒక్కసారే ట్యాంకు శుభ్రం ఏడాదికి ఒక్కసారే తాగునీటి ట్యాంకు క్లోరినేషన్, బ్లీచింగ్ చేస్తున్నారు. మరుగు నీరు కాలువలు కూడా శుభ్రం చేయకపోవడంతో దోమలు తాకిడి అధికమైంది. కంటి నిండా నిద్ర ఉండడం లేదు. – ఆనట్స్రాజ్, ఆముదాల దళితవాడ, పాలసముద్రం మండలం రోగాల బారిన పడుతున్నాం చాలా రోజులుగా తాగునీటి ట్యాంకును శుభ్రం చేయకపోవడంతో అందులో వస్తున్న నీటిని తాగడంతో రోగాలు వస్తున్నాయి. వారానికి ఒకసారి తాగునీటి ట్యాంకును శుభ్రం చేసి, క్లోరినేషన్, బ్లీచింగ్ పౌడర్లు వేయాలి. – ధనపాల్, ఆముదాల , పాలసముద్రం మండలం -
ద్రవిడ వర్సిటీ అధికారులపై కలెక్టర్ ఫైర్..!
కుప్పం: ద్రావిడ విశ్వవిద్యాలయంలో వైస్ చాన్సలర్ సామాజిక వర్గానికి చెందిన వారికే ప్రాధాన్యమిస్తూ వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల పేరిట నూతన ఉద్యోగాలు, తన సామాజిక వర్గానికి చెందిన వారికే ఉద్యోగోన్నతులపై ‘ద్రవిడ వర్సిటీలో ‘కమ్మ’టి పదోన్నతులు’ శీర్షికతో సాక్షి ప్రచురించిన కథనంపై ఉన్నతాధికారులు స్పందించారు. దీనిపై సీరియస్ అయి గురువారం జిల్లా కలెక్టర్ వర్సిటీ ఫోన్ ద్వారా నూతన ఉద్యోగాలపై వర్సిటీ అధికారులను ఆరా తీసినట్లు తెలిసింది. ప్రభుత్వ అనుమతి లేకుండా ఇష్టానుసారంగా ఎలా ఉద్యోగాలు ఇస్తారంటూ మండిపడినట్లు తెలిసింది. కలెక్టర్ దెబ్బకు కొత్త ఉద్యోగాలకు స్వస్తి ఇంజినీరింగ్ కళాశాల పేరిట కొత్తగా వీసీ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది ఉద్యోగుల భార్యలకు ఉద్యోగాలు కల్పించేందుకు వర్సిటీ అధికారులు పూనుకున్నారు. దీనిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ నియామకాలకు తాత్కాలికంగా స్వస్తి పలికినట్టు సమాచారం. వాస్తవానికి ఇప్పటికే వర్సిటీలో 200 మందికి పైగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులు వివిధ క్యాడర్లలో పనిచేస్తున్నారు. వీరికి జీతాలు ఇవ్వడానికే నానా తంటాలు పడుతున్నారు. అయితే ఇవేమీ పట్టించుకోకుండా ఉద్యోగాల్లో నియామకాలకు పూనుకోవడం విమర్శలకు తావిచ్చింది. ఇప్పటికే వర్సిటీ మేథమేటిక్స్ విభాగంలో పని చేస్తున్న ఓ కాంట్రాక్టు అధ్యాపకురాలికి అడ్హాక్ పద్ధతిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టు కట్టబెట్టారు. అయితే సంబంధిత విభాగంలో ఒక్క విద్యార్థి కూడా లేకపోవడడం గమనార్హం! దీంతో పాటు ఇంజినీరింగ్ విభాగంలో కాంట్రాక్టు పద్ధతిలో ఇద్దరు అధికారులను నియమించుకోవడం కూడా విమర్శలకు తావిచ్చింది. రైతు కుటుంబాలతో ముట్టడిస్తామని వార్నింగ్ ఇష్టానుసారంగా నూతన ఉద్యోగాల కల్పన విషయంగా దుమారం రేగడంతో వర్శిటీకి భూములు ఇచ్చి ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు పొందిన ఉద్యోగులు వీసీని నిలదీశారు. తమకు 20 ఏళ్లుగా న్యాయం చేయకుండా, కనీసం జీతాలు సక్రమంగా ఇవ్వకుండా కొత్త ఉద్యోగాలు, ఉద్యోగోన్నతులు ఎలా కల్పిస్తారంటూ ప్రశ్నించారు. తమకు న్యాయం చేయకుండా బయటి వ్యక్తులకు ఉద్యోగాలు కల్పిస్తే సహించేది లేదని, వర్సిటీకి భూములు ఇచ్చిన రైతు కుటుంబాలతో కలిసి ముట్టడిస్తామని హెచ్చరించినట్లు సమాచారం. ఇదలా ఉంచితే, వర్సిటీని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని కూటమి ప్రభుత్వం పేర్కొంటున్నా, ఇక్కడి ఇన్చార్జి అధికారులు మాత్రం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. -
‘స్వస్థ్ నారీ’వెతలు
దళితుల భూముల్లో పరిశ్రమలు పెట్టొద్దని ఆందోళన శ్రీరంగరాజపురం : పరిశ్రమల ఏర్పాటుకు కలెక్టర్ సుమిత్‌కుమార్, రాష్ట్ర ఏపీఐఐసీ ప్రతినిధి సుబ్బరావుతో కలిసి మండలంలోని 56–కనికాపురం పాతపాళ్యం, జీఎంఆర్‌పురం రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ, డీకేటీ, ప్రైవేటు స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు మండలంలోని పరిశ్రమలు ఏర్పాటుకు 1000 ఎకరాల భూమి అవసరం ఉందన్నారు. మా భూముల్లో పరిశ్రమలు పెట్టొద్దు : రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పాతపాళ్యం దళితులకు, జీ.ఎం.ఆర్.పురం ఎస్టీలకు భూమి లేని పేదలకు డీకేటీ పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల పేరుతో దళితుల భూములను లాక్కోవాలని చూస్తోందని వాపోయారు. పరిశ్రమల ఏర్పాటుకు భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేమని కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. దీంతో కలెక్టర్ సానుకూలంగా స్పందించి బాధితులకు న్యాయం చేస్తామని , త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు. కార్యక్రమానికి తహసీల్దార్ లోకనాథపిళ్‌లై, మండల సర్వేయర్ సురేష్, ఎంపీడీఓ వనజ, సచివాలయం, రెవెన్యూ సిబ్బంది త దితరులు పాల్గొన్నారు. గజరాజుల బీభత్సం పులిచెర్ల (కల్లూరు) : మండలంలోని కల్లూరు, పాతపేట, పాళెం, జూపల్లె, పూరేడువారిపల్లె, ఎద్దలవారిపల్లెలోని పొలాల్లో ఏనుగులు పంటలను ధ్వంసం చేశాయి. గురువారం తెల్లవారుజామున ఏనుగుల గుంపు మామిడి కొమ్మలు, కొబ్బరి చెట్లు, వరి పంటను నాశనం చేశాయి. జూపల్లెకు చెందిన నరసింహులు, నాగరాజు, నరేష్ పొలాల్లో మామిడి తోటల్లో కొమ్మలు విరిచేశాయి. అలాగే కల్లూరులో ఇక్బాల్, రాజన్న పొలాల్లో పశుగ్రాసం తొక్కేయగా, మామిడి కొమ్మలు విరిచేశాయి. దాము పొలంలో వరి, కొబ్బరి చెట్లను నాశనం చేశాయి. పంట పొలాలపై ఏనుగులు రాకుండా కట్టడి చేయాలని రైతులు కోరుతున్నారు. చిత్తూరు రూరల్ (కాణిపాకం) : స్వస్థ్ నారీ–సశక్త్ పరివార్ అభియాన్‌కు నిధుల కొరత వేధిస్తోంది. ప్రారంభంలోనే అభియాన్ అష్టకష్టాలు పడుతోంది. నిర్వహణకు ముందస్తు వ్యయం లేక కార్యక్రమం నీరసించిపోతోంది. క్షేత్రస్థాయిలోని అధికార పార్టీ నాయకులను ఆశ్రయిస్తే చేతులెత్తేస్తున్నారు. ఆ ఖర్చులు తాము భరించలేమంటూ సిబ్బంది సైతం వెనకడుగు వేస్తున్నారు. ఖర్చు పెడితే తర్వాత బిల్లు లు ఇస్తామని జిల్లా అధికారులు ఖర్చు మాటను దాట వేస్తున్నారు. దీంతో కార్యక్రమం మొక్కుబడిగా సాగుతోంది. మహిళలకు సంపూర్ణ ఆరోగ్యం కల్పించాలనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం స్వస్థ్ నారీ సశక్త్ అభియాన్ పేరిట ప్రత్యేక కార్యక్రమం తలపెట్టింది. ఇందులో భాగంగా మహిళలకు ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన, అవసరమైన చికిత్సలు, వైద్య పరీక్షలు, ప్రత్యేక వైద్య నిపుణుల సేవలను 17 నుంచి అక్టోబర్ 2 వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, ప్రాథమిక , పట్టణ, సామాజిక , ప్రాంతీయ ఆరోగ్య కేంద్రాలు, వైద్య కళాశాల ఆసుపత్రులు ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య నిపుణులు సహకారంతో మహిళలు, పిల్లల కేంద్రీకృత ఆరోగ్య శిబిరాలు నిర్వహణ స్క్రీనింగ్, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. 538 శిబిరాలు జిల్లా వ్యాప్తంగా 538 శిబిరాలు చేపట్టేలా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు తీసుకున్నా రు. ఈ క్యాంపులను 50 పీహెచ్‌సీలు, 15 అర్బన్ హెల్త్ సెంటర్లు, 437 విలేజ్ హెల్త్ క్లినిక్‌లు , 5 సీహెచ్‌సీలు, 3 ఏరియా ఆస్పత్రులు, 2 స్పెషలిస్ట్ క్యాంపులు నిర్వహించేలా ముందస్తు చర్యలు చేపట్టారు. అయితే క్యాంపు నిర్వహణ క్షేత్ర స్థాయిలో కష్టతరంగా మారింది. శిబిరం నిర్వహణలో గందరగోళం ముందస్తు ప్రణాళికల ప్రకారం క్యాంపులు నిర్వహిస్తున్నారు. అయితే క్యాంపు నిర్వహణ ఏర్పాట్లకు ముందస్తు వ్యయం చేసే వారు లేక క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. నాయకులు సైతం పలు చోట్ల చేతులెత్తేస్తున్నారు. ఖర్చు చేయాలంటే వెనకడుగు వేస్తున్నారు. షామీయానా, కుర్చీలు, టేబుళ్లు, మధ్యాహ్నం భోజనం, టీ, కాఫీ, బిస్కెట్క్...ఇలా ఒక్కో క్యాంపునకు రూ. 10 వేల నుంచి రూ. 20వేల వరకు ఖర్చు అవుతోంది. దీంతో చాలా మంది మా వల్ల కాదని చేతులెత్తేస్తున్నారు. జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలోని సిబ్బందిపై భారం మోపుతున్నారు. ముందు ఖర్చు పెడితే..తర్వాత బిల్లులు వస్తాయని చేతులు దులుపుకుంటున్నారు. దీంతో వైద్య సిబ్బంది అంతా డబ్బులు ఎక్కడి నుంచి పెట్టాలని వాపోతున్నారు. ప్రజల్లో కొరవడిన అవగాహన మహిళా ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజల్లో అవగాహన కొరవడుతోంది. ముఖ్యంగా మహిళలకు ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించడం లేదు. పలు చోట్ల నిర్వహణపై మహిళలకు సమాచారం లేదు. దీంతో క్యాంపులో మహిళలు రాక శిబిరం వెలవెల బోతోంది. కుర్చీలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. మహిళల కంటే వైద్య సిబ్బందే అధికంగా కనిపిస్తున్నారు. క్యాంపు లక్ష్యం అధిగమించలేకపోతున్నారు. పలుచోట్ల బలవంతంగా మహిళలను శిబిరాలకు లాక్కొస్తున్నారు. మహిళలు క్యాంపునకు వచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీనికి తోడు కొన్ని రకాల మందులు, మాత్రలు మాత్రమే ఉన్నాయని, చాలా వరకు లేవని వైద్య సిబ్బంది చెబుతున్నారు. జగనన్న సురక్ష కార్యక్రమ నిర్వహణకు ముందుగానే మండల ప్రజా పరిషత్‌కు నిధులు కేటాయించి, ఇబ్బందులు లేకుండా క్యాంపులు జరిపించామనే విషయాన్ని వైద్య బృందం గుర్తు చేస్తోంది. రామాపురం క్యాంపులో మహిళలు లేక ఖాళీగా దర్శమిస్తున్న కుర్చీలు తవణంపల్లిలోని క్యాంపులో అరకొరగా ఇలా.. ఓపీరకం సంఖ్య సాధారణ ఓపీ 10193 ఏఎన్సీ 1133 ఎంసీపీ కార్డు మంజూరు 106ఆస్పత్రి క్యాంపుల సంఖ్య జిల్లా ఆస్పత్రి 1 సీహెచ్‌సీ 6 పీహెచ్సీ 7 విలేజ్ హెల్త్ క్లినిక్ 77రెండు రోజుల పాటు క్యాంపు వివరాలు ఓపీ వివరాలు -
గోవిందదాసుడిగా ఎన్ని కష్టాలకై నా సిద్ధం
తిరుపతి మంగళం : శ్రీరాముడి పట్ల అకుంటితమైన పరమభక్తుడిగా ఆనాడు రామదాసు ఎన్ని కష్టాలు పడ్డాడో.. అదేవిధంగా ఈరోజు గోవిందదాసుడిగా శ్రీవారి ఆలయ పరిరక్షణ, హైందవ ధర్మాన్ని కాపాడడం కోసం తాను ఎన్ని కష్టాలు పడడానికై నా సిద్ధమేనని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి స్పష్టంచేశారు. తిరుపతి పద్మావతీపురంలోని తన నివాసంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. అలిపిరి పాదాల చెంత మలమూత్రాలు, మద్యం బాటిళ్ల మధ్య మహావిష్ణువు విగ్రహాన్ని టీటీడీ పాలకవర్గం, అధికారులు పడవేసి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విషయాన్ని ఎత్తిచూపితే తనపై వ్యక్తిగత ఆరోపణలు చేయడంతో పాటు ఎదురు దాడులకు సిద్ధపడడం సిగ్గుచేటన్నారు. చేసిన తప్పిదాలను సరిదిద్దుకోకుండా టీటీడీ పాలకవర్గం, టీడీపీ, జనసేన నాయకులు దానికి రాజకీయ రంగు పులమడం వారి నీచతత్వానికి నిదర్శనమన్నారు. మహావిష్ణువు విగ్రహం కాదని, శనేశ్వరస్వామి విగ్రహమని, గత 20 ఏళ్లుగా ఉందని, అసంపూర్తిగా ఉన్న శనేశ్వరస్వామి విగ్రహం గనుక పట్టించుకోలేదంటూ రకరకాలుగా చెబుతున్నారన్నారు. ఆ విగ్రహం ముమ్మాటికీ మహావిష్ణువు విగ్రహం అనడానికి ఎలాంటి సందేహం లేదని స్పష్టంచేశారు. రాయలచెరువు దగ్గర తయారు చేసిన శనేశ్వరస్వామి విగ్రహాన్ని టీటీడీ స్థలంలోకి తీసుకురావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. తాను ఇలాంటి కేసులకు భయపడేవాడిని కాదని, తనపై ఎన్ని కేసులు పెట్టినా హైందవ ధర్మ పరిరక్షణను, శ్రీవారి ప్రతిష్టను కాపాడుకునేందుకు టీటీడీలో జరిగే తప్పిదాలను ఎత్తిచూపుతూనే ఉంటానన్నారు. -
మహిళా పాడి రైతులను ప్రోత్సహించాలి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని మహిళా పాడి రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. గురువారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళల జీవనోపాధుల వృద్ధికి చర్యలు చేపట్టాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎస్‌హెచ్‌జీ మహిళల ఆర్థికాభివృద్ధిలో వ్యవసాయ, అనుబంధ ఇతర రంగాలకు సంబంధించి ప్రణాళికలు రూపొందించాలన్నారు. మహిళలకు తమ ఇంటి వద్ద ఉన్న అవకాశాన్ని బట్టి కిచెన్ గార్డెన్ ఏర్పాటుకు అవసరమైన అవగాహన కల్పించి విత్తనాలు సరఫరా చేయాలన్నారు. సీడీపీవోలు క్షేత్రస్థాయిలో ప్రతి అంగన్న్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి నివేదికలు అందజేయాలన్నారు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ రంగంలో మహిళలు రాణించేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. నగరి, విజయపురం, కార్వేటినగరం, ఎస్ఆర్పురం మండలాల్లో మహిళా రైతులకు ఉద్యానవన పంటలపై ఆసక్తి పెంచేలా కృషి చేయాలన్నారు. మహిళా రైతులకు అవగాహన కార్యక్రమాలు జిల్లాలోని మహిళా రైతులకు టిష్యూ కల్చర్ విధానంలో అరటి, బొప్పాయి పంటలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లాలో ని మహిళా పాడి రైతులను గుర్తించి అవగాహన కార్యక్రమాలు కల్పించాలన్నారు. వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. వ్యవసాయరంగంలో డ్రోన్ వినియోగం పై విస్తృతంగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ శ్రీదేవి, డీఈవో వరలక్ష్మి, జెడ్పీ సీఈవో రవికుమార్ నాయుడు తదితర అధికారులు పాల్గొన్నారు. -
మహిళా దొంగలు పట్టివేత
పలమనేరు : పట్టణంలోని బాలాజీ స్వర్ణ మహల్లో చాకచక్యంగా బంగారాన్ని దొంగలించే ఇరువురు మహిళా దొంగలను దుకాణ నిర్వాహకులు పట్టుకుని పోలీసులకు అప్పగించిన సంఘటన గురువారం పలమనేరులో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా.. మధ్య వయస్కులైన ఇరువురు మహిళలు తమిళ, తెలుగు యాసలో మాట్లాడుతూ.. దుకాణంలోకి వచ్చి బంగారు కమ్మలు కావాలని అడిగి పలు రకాలు చూశారు. ఇంకో మోడల్ అంటూ చూడడం మొదలు పెట్టారు. ఎందుకో వీరిపై అనుమానం కలిగిన దుకాణ యజమాని సీసీ కెమెరాలో వీరిని గమనించడం మొదలు పెట్టారు. ఈ ఇద్దరు దొంగలు ముందుగానే తెచ్చుకున్న డూప్లికేట్ రెండు గ్రాముల కమ్మలను అక్కడ పెట్టి బాక్సులోని ఎనిమిది గ్రాముల బంగారు కమ్మలను తీసుకెళ్లారు. దీంతో ఈ చోరీని గమనించిన దుకాణ నిర్వాహకులు ఆ ఇద్దరు మహిళలను పట్టుకుని స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున పోలీసులు అక్కడ జరిగిన చోరీని సీసీ కెమెరాల్లో గమనించారు. దీంతో వారిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. వీరు తమిళనాడుకు చెందిన చేయి తిరిగిన బంగారు దొంగలుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిస్థాయిలో విచారించి ఆపై మిగిలిన విషయాలను వెల్లడించనున్నట్లు పోలీసులు తెలిపారు. -
పవిత్రోత్సవాలు ప్రారంభం
వడమాలపేట (పుత్తూరు) : అప్పలాయగుంటలోని టీటీడీ అనుబంధ శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారు జామున సుప్రభాత సేవతో శ్రీవారిని మేల్కొలిపి శుద్ధి, తోమాల సేవ, అర్చన నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు యాగశాలలో వైదిక కార్యక్రమాలు చేపట్టారు. పద్మావతి, ఆండాళ్ సమేత ప్రసన్న వేంకటేశ్వరస్వామికి స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లను అలంకరించి తిరుచ్చిపై కొలువుదీర్చి తిరువీధి ఉత్సవాన్ని నిర్వహించారు. రాత్రి 7.30 గంటలకు ఆలయ ప్రధాన అర్చకులు సూర్యకుమారాచార్యులు శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ట నిర్వహించారు. తదుపరి యోగశాలలో హోమం, వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమాలను ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, ఇతర అధికారులు పర్యవేక్షించారు. పవిత్రోత్సవాల్లో నేడు పవిత్రోత్సవాల్లో రెండవ రోజైన గురువారం ఉదయం 9.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆత్సవర్తకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. 11.30 గంటల నుంచి 12.30 మధ్య స్వామి, అమ్మవార్లకు పవిత్రాలు సమర్పిస్తారు. -
ప్రతికా స్వేచ్ఛను హరించడం తగదు
ప్రభుత్వం తప్పులను, ప్రజా సమస్యలను ఎత్తిచూపి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్న పత్రికలపై అక్రమ కేసులు బనాయించడం తగదు. పత్రికా స్వేచ్ఛను హరించే ప్రయత్నం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. సాక్షి పత్రికతో పాటు , టీవీ ఛానళ్ల, విలేకరులపై అక్రమ కేసులును తక్షణం వెనక్కి తీసుకోవాలి. కక్ష సాధింపు చర్యలను విడనాడాలి. అవసరమైతే ప్రచురించిన వార్తలో వాస్తవం లేకపోతే ఖండించాలి తప్ప ఇలా అక్రమ కేసులు బనాయించడం సరికాదు. – వందవాసి నాగరాజ, సీపీఎం జిల్లా కార్యదర్శి, తిరుపతి -
అధైర్యపడొద్దు అండగా నిలబడుతాం
కార్వేటినగరం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ అండగా ఉంటానని, ఎవరూ అధైర్యపడాల్సిన అవసరంలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పినట్లు మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. బుధవారం తాడేపల్లిలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డిని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, జీడీ నెల్లూరు నియోజకవర్గం సమన్వయకర్త కృపాలక్ష్మితో పాటు బంగారు పాళ్యం పర్యటనలో అక్రమ కేసులో జైలుకు వెళ్లిన కార్యకర్తలు వినోద్‌కుమార్, మోహన్, టీడీపీ నాయకులు నరికి వేసిన మామిడి చెట్ల బాధితులు శంకర్‌రెడ్డి కలిశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని కలిసిన వారిలో జీడీనెల్లూరు మండల కన్వీనర్ వెంకటరెడ్డి, గుణశేఖర్రెడ్డి, బలరామరెడ్డి, హరిబాబు, వెంకటేష్‌రెడ్డి, ఏకాంబరం, డిల్లిబాబు, రూపచంద్రరెడ్డి, సుధాకర్‌రెడ్డి ,గౌతం, త్యాగరాజులురెడ్డి, భరత్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. -
ప్రభుత్వాన్ని విమర్శించడం నేరం కాదు
రాజ్యాంగం కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛలో భాగమే పత్రికా స్వేచ్ఛ. అలాంటి పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించటం అంటే రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది. ‘ జర్నలిస్ట్ ల పై క్రిమినల్ కేసులు పెట్టడం మానుకోవాలి. భావప్రకటన స్వేచ్ఛ కు విఘాతం కలిగించ రాదు.‘ అని సుప్రీం కోర్టు ప్రభుత్వాలను ఇటీవల హెచ్చరించింది. ‘ ప్రభుత్వాన్ని విమర్శించడం నేరం కాదని కూడా సుప్రీం కోర్టు మరొక కేసులో స్పష్టం చేసింది. సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డిపై పెట్టిన కేసులను కూటమి ప్రభుత్వం ఉప సంహరించుకోవాలి. – రాఘవ శర్మ, సీనియర్ జర్నలిస్ట్, తిరుపతి -
అదృశ్యమైన మహిళ .. హత్య
విచారణలో వెలుగు చూసిన హత్యోదంతం పెనుమూరు (కార్వేటినగరం) : అదృశ్యమైన మహిళ అస్థి పంజరంగా ప్రత్యక్షమైన సంఘటన మండలంలోని సామిరెడ్డిపల్లి సమీపంలో బుధవారం వెలుగు చూసింది. చిత్తూరు రూరల్ ఈస్ట్ సీఐ నిత్యబాబు కథనం మేరకు వివరాలిలా.. బంగారు పాళ్యం మండలం బలిజపల్లి గ్రామానికి చెందిన గోవిందు భార్య బుజ్జమ్మ 2023 సంవత్సరం డిసెంబర్లో తమ కుమార్తె ఈ.చెంచులక్ష్మి(28) అదృశ్యమైయిందని బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో తేలిన మేరకు బంగారు పాళ్యం మండలానికి చెందిన చెంచులక్ష్మి, ప్రియుడు దేవేంద్రతో కలిసి పెనుమూరు మండలం సామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన సుదాకర్‌రెడ్డి మామిడి తోటలో కాపలా ఉంటూ వచ్చారు. అయితే 2023 సంవత్సరం డిసెంబర్ నెలలో ఓ రోజు వారి ఇరువురి మధ్య డబ్బుల కోసం గొడవ రావడంతో దేవేంద్ర తాగిన మత్తులో చెంచులక్ష్మిని మామిడి తోటకు సమీపంలో ఉన్న కుంటలోని నీటిలో ముంచి హత్య చేశాడు. చెంచులక్ష్మి తల్లి బుజ్జమ్మ తన కుమార్తె కనిపించడం లేదని బంగారు పాళ్యం పోలీసే స్టేషన్లో ఫిర్యాదు చేయగా మహిళ అదృశ్యం కేసు నమోదు చేశారు. అనంతరం ఆమె అదృశ్యమైనది పెనుమూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కావడంతో 2024 జనవరిలో ఆ కేసును పెనుమూరు స్టేషన్‌కు ట్రాన్స్ఫర్ చేశారు. తన కుమార్తె అదృశ్యం వెనుక దేవేంద్ర హస్తం ఉందని చెంచులక్ష్మి తల్లి బుజ్జమ్మ అనుమానించడంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తును వేగవంతం చేశారు. దీంతో నిందితుడు దేవేంద్ర డబ్బులు విషయంలో గొడవలు రావడంతో చెంచులక్ష్మిని తాగిన మత్తులో మామిడి తోట పక్కనే ఉన్న కుంటలో ముంచి చంపేసినట్లు అంగీకరించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ వెంకట నరసింహులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా చెంచులక్ష్మిని నీటిలో ముంచి హత్య చేసి పూడ్చిన ప్రాంతంలో అస్థి పంజరాన్ని వెలికి తీసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు చిత్తూరు రూరల్ ఈస్ట్ సీఐ నిత్యబాబు తెలిపారు. -
ఆర్టీసీ బస్సు.. సీఎన్జీగా మార్పు!
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : ఆర్టీసీ ఆదాలో పడింది. నష్టాలను అధిగమించేందుకు అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో సరికొత్త మార్పునకు శ్రీకారం చుట్టింది. డీజల్ బండిని సీఎన్జీ ( కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ )గా మార్చేందుకు పూనుకుంది. థింక్ గ్యాస్‌తో ఒప్పందం కుదుర్చుంది. రాష్ట్రంలోనే తొలిసారిగా చేపట్టిన ఈ ప్రయోగం ఫలించింది. బుధవారం ఆ మార్పు చేసిన బస్సును ఆర్టీసీ అధికారులు రోడ్డుపైకి తీసుకొచ్చారు. చిత్తూరు–వేలూరు మార్గంలో తిప్పుతున్నారు. దీంతో ఆర్టీసీకి ఆదాయం ఆదాతో పాటు బండి పొల్యూషన్‌ను నియంత్రవచ్చునని ఆర్టీసీ అధికారులు వెల్లడిస్తున్నారు. ఆర్టీసీ, థింక్ గ్యాస్ ఒప్పందం మేరకు సీఎన్జీ మార్పునకు చిత్తూరు టూ డిపో ఎక్స్‌ప్రెస్ బస్సును ఎంపిక చేశారు. చిత్తూరు–వేలూరు మార్గంలో తిరిగే ఈ బస్సును రెండు నెలల క్రితం మార్పునకు తరలించారు. చిత్తూరు నగరం అనుపల్లిలోని సీఎన్జీ ఫిలింగ్ స్టేషన్‌కు పంపించారు. అక్కడ రెండు నెలలుగా శ్రమించి డీజల్ బస్సును సీఎన్జీ బస్సుగా మార్పు చేశారు. రాష్ట్రంలోనే డీజల్ బస్సును సీఎన్జీలోకి మార్చడం ఇదే తొలిసారి అని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఆదా ఇలా... ప్రస్తుతం ఆర్టీసీకి కంపెనీ డీజల్ లీటర్ రూ.96కు ఇస్తోంది. అదే సీఎన్జీ రూ. 84కు లభిస్తోంది. డీజల్ నుంచి సీఎన్జీకి మార్పు చేయడం వల్ల ఆర్టీసీ లీటర్‌పై రూ.12 దాకా ఆదా కానుంది. కేఎంపీఎల్ 5.4 నమోదవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అంటే ఒక్క సిలిండర్ (11 కేజీలు) 58 కి.మీ ప్రయాణం చేయవచ్చునని వివరిస్తున్నారు. ప్రారంభోత్సవం చిత్తూరు టూ డిపో గ్యారేజీలో బుధవారం సీఎన్జీ బస్సును ప్రారంభించారు. డీపీటీఓ రాము జెండా ఊపి బస్సును ప్రారంభించి..చిత్తూరు–వేలూరు మార్గంలో నడిపారు. వేలూరు వరకు ట్రయల్ చూశారు. కేఎంపీల్, స్పీడ్, శబ్ధం తదితర వాటిని పరిశీలించారు. ఈ బస్సు విజయవంతంగా నడిస్తే మరిన్ని బస్సుల మార్పుకు చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. గతంలో కూడా ప్రయోగం సక్సెస్ 2022లో కూడా చిత్తూరు–2 డిపోకు సంబంధించిన సప్తగిరి ఎక్స్‌ప్రెస్ బస్సును ఎలక్ట్రికల్ బస్సుగా మార్పు చేశారు. బెంగుళూరులోని వీర వాహన ఉద్యోగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ మార్పును విజయవంతంగా పూర్తి చేసింది. 2 గంటల ఛార్జింగ్‌తో 200 కి.మీ మేర ప్రయాణం చేసేలా మార్పు చేసింది. ఈ బస్సు ప్రయోగం పూర్తవ్వగానే తిరుపతి–తిరుమల మార్గంలో తిప్పారు. -
శ్రీగంధం చెట్లు నరికివేత
● రూ.2 లక్షలు విలువ చేసే కలప చోరీ చౌడేపల్లె : రాత్రికి రాత్రే గుర్తు తెలియని వ్యక్తులు పొలంలో పెంచిన శ్రీగంధం చెట్లను రంపంతో కోసి అపహరించుకెళ్లిన ఘటన ఏ కొత్తకోట పంచాయతీ ఎస్ అగ్రహారంలో బుధవారం వెలుగులోకి వచ్చింది. బాధిత రైతు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్ అగ్రహారం కు చెందిన ఆర్.మునీంద్రకు పెద్ద గుట్ట సమీపంలో వ్యవసాయ భూమిలో కొన్నేళ్లుగా శ్రీగంధం చెట్లను పెంచుతున్నాడు. మంగళవారం రాత్రి భారీ వర్షం కురుస్తుండడంతో ఇదే అదునుగా భావించిన గుర్తుతెలియని వ్యక్తులు పొలంవద్ద పెంచిన శ్రీగంధం చెట్లను కోసి విలువైన కలపను అపహరించారు. పొలం వద్దకెళ్లిన రైతు గుర్తించి లబోదిబోమంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. కలప విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని, కలపతో పాటు చెట్టు వేర్లతో సహా కోసి తీసుకెళ్లారని వాపోయాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు రైతు పేర్కొన్నారు. రేపు చలో మెడికల్ కాలేజ్ చిత్తూరు కార్పొరేషన్: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ, పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ 19న శుక్రవారం ‘చలో మెడికల్ కాలేజ్’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వైఎస్సార్సీపీ యువజన విభాగం జోనల్ అధ్యక్షుడు హేమంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఆందోళనలో భాగంగా మదనపల్లెలోని నూతన ప్రభుత్వ మెడికల్ కళాశాల వద్ద యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో నిజానిజాలను ప్రజలకు వివరించే కార్యక్రమం చేపట్టనున్నామని తెలిపారు. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల పార్టీ యువత, విద్యార్థి విభాగం నాయకులు కార్యక్రమానికి హాజరై జయపద్రం చేయాలని కోరారు. ఎన్నికల ముందు అమలు కానీ వాగ్దానాలు చేయడం అధికారంలోకి వచ్చిన తర్వాత గాలికి వదిలేయడం చంద్రబాబుకు పరిపాటి అనిఎద్దేవా చేశారు. పంట పొలాలపై ఏనుగుల దాడి పులిచెర్ల (కల్లూరు) : మండలంలోని కల్లూరు, పాళెం, జూపల్లె గ్రామాల్లో బుధవారం తెల్లవారుజామున ఏనుగుల గుంపు పంట పొలాలపై పడి నాశనం చేశాయి. దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. పది రోజులుగా ఏనుగులు ఈ చుట్టు ప్రాంతాల్లోనే సంచరిస్తూ పంటలను నాశనం చేస్తున్నాయి. కల్లూరుకు చెందిన పీరూసాహెబ్, సాజహాన్, ఇక్బాల్ , రామచంద్రకు చెందిన మామిడి తోటల్లో కొమ్మలను విరిచేశాయి. అలాగే జూపల్లెకు చెందిన నరసింహులు, సైద్ బాషాకు చెందిన వరి పంటను తొక్కి ధ్వంసం చేశాయి. కృత్రిమ కాళ్ల కోసం పేర్లు నమోదు చేసుకోండి చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా కృత్రిమ కాళ్లు పొందేందుకు అర్హత ఉన్న దివ్యాంగులు పేర్లను నమోదు చేసుకోవాలని జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ వినోద్ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులకు కృత్రిమ కాళ్లు అందజేయడం జరుగుతుందన్నారు. కావాల్సిన వారు 99892 06667, 90000 10390 నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
నగరి : జాతీయ స్థాయి జూనియర్ బాల్ బాడ్మింటన్ పోటీలకు నగరి పట్టణ పరిధిలోని సాయివివేకానంద కళాశాలలో ఇంటర్ చదువుతున్న కేసీ తేజేస్ ఎంపికయ్యాడు. అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలం రామాపురం జడ్పీ ఉన్నత పాఠశాలలలో నిర్వహించిన అంతర్ జిల్లాల జూనియర్ బాల్‌బాడ్మింటన్ పోటీల్లో చిత్తూరు జిల్లా నుంచి పాల్గొన్న తేజేష్ ప్రతిభ కనబరిచి జాతీయ జట్టుకు ఎంపిక కావడంతో పాటు స్టార్ ఆఫ్ ఆంధ్ర ధ్రువీకరణ పత్రాన్ని పొందాడు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న తేజేష్‌ను బుధవారం కళాశాలలో ప్రిన్సిపల్, అధ్యాపకులు అభినందించారు. -
ద్రవిడ వర్సిటీలో.. ‘కమ్మ’ని పదోన్నతులు!
కుప్పం: ద్రావిడ విశ్వవిద్యాలయంలో పదోన్నతులు, ఇంజినీరింగ్ కళాశాల పేరిట నూతన ఉద్యోగాల్లో వర్సిటీ వీసీ సామాజిక వర్గానికి చెందిన వారికే పెద్దపీఠ వేస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది ముగిసినా ద్రవిడ వర్సిటీకి మాత్రం నూతన రెగ్యులర్ వీసీని నియమించ లేదు. దీంతో ఇన్చార్జి వీసీగా వర్సిటీ లైబ్రేరియన్ ఆచార్య దొరస్వామి కొనసాగుతున్నారు. వర్సిటీకి నూతనంగా ఇంజినీరింగ్ కళాశాలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అవసరం లేకున్నా! ద్రావిడ యూనివర్సిటీ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలలో బోధించేందుకు బోధన సిబ్బంది, బోధనేతర సిబ్బందిని నియమించేందుకు చర్యలు చేపట్టారు. ఇంజినీరింగ్ కళాశాలలో లైబ్రరీకి లైబ్రరీ అసిస్టెంట్ పోస్టును భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చారు. వర్సిటీ ఔట్సోర్సింగ్ పద్ధతిలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగికి లైబ్రరీ అసిస్టెంట్ పోస్టును కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వర్సిటీలో ఇప్పటికే ఏడుగురు లైబ్రరీ అసిస్టెంట్లు రెగ్యులర్ పద్ధతిలో, నలుగురు తాత్కాలిక పద్ధతిలో విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం వీరిలో కొందరిని ఇంజినీరింగ్ కళాశాలలో ఉపయోగించుకోవచ్చు. కానీ వీసీ సామాజిక వర్గానికి చెంది, ఆయనకు ఆప్తుడు అయిన అతనికి లైబ్రరీ అసిస్టెంట్‌ను కట్టబెట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే ఇంటర్వ్యూను సైతం ముగించేశారు. ఈ పోస్టుకు స్థానికులు కొందరు దరఖాస్తులు చేసుకుని ఇంటర్వ్యూకు హాజరయ్యారు. అదేవిధంగా స్థానిక నాయకులు ఈ ఉద్యోగం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేదనే చెప్పాలి. స్థానిక దళిత ఉద్యోగికి అన్యాయం వర్సిటీలో గతంలో చంద్రశేఖర్ అనే తాత్కాలిక ఉద్యోగికి తన అర్హత మేరకు అటెండర్ నుంచి శానిటరీ ఇన్స్పెక్టర్గా పదోన్నతి కల్పించి జీతాన్ని పెంచారు. అయితే కూటమి ప్రభుత్వం రాగానే ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించిన వీసీ అతనికి డీ–ప్రమోట్ చేసి మళ్లీ అటెండర్‌గా మార్చారు. వీసీ సామాజిక వర్గానికి చెందిన ఓ ఉద్యోగికి శానిటరీ ఇన్స్పెక్టర్ పదవిని కట్టబెట్టినట్టు బాధితుడు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు సైతం ఫిర్యాదు చేశాడు. ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం సీనియర్ అసిస్టెంట్‌కు పదోన్నతి! ఇటీవల వర్సిటీలో సూపరింటెండెంగ్గా విధులు నిర్వహిస్తున్న ఆర్ముగం అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఖాళీ ఏర్పడిన ఈ పోస్టుకు వీసీ సామాజిక వర్గానికి చెందిన ఓ సీనియర్ అసిస్టెంట్‌కు పదోన్నతి ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ మేరకు గతంలో ఇక్కడ విధులు నిర్వహించి రిటైర్డ్ అయిన ఓ ఉన్నతాధికారిని పిలిపించుకుని మరీ సంబంధిత సీనియర్ అసిస్టెంట్‌కు ఎలా పదోన్నతి కల్పించాలని మంతనాలు జరిపినట్టు వర్సిటీలో చర్చసాగుతోంది. భూములు కోల్పోయిన ఉద్యోగులకు మొండి చేయి ద్రావిడ వర్సిటీ వెయ్యి ఎకరాలకుపైగా భూములతో విస్తరించి ఉంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తమ భూములను వర్సిటీకి ధారాదత్తం చేశారు. భూములు కోల్పోయిన వారికి కుటుంబానికి ఒకరికి తాత్కాలిక పద్ధతిలో అటెండర్లు, స్వీపర్లుగా ఉద్యోగాలు కల్పించారు. అయితే గత 20 ఏళ్లుగా వారు తాత్కాలిక పద్ధతిలో విధులు నిర్వహిస్తూ కనీస జీతాలు సైతం నోచుకోక మగ్గిపోతున్నారు. గతంలో ఏడాది కాలానికి జీతాలు అందించినా.. మరళా ఐదు నెలల పాటు జీతాలు అందక వారి పరిస్థితి దారుణంగా మారింది. కొత్తగా ఏజెన్సీని నియమించి జీతాలు ఇస్తామంటూ కాలయాపన చేస్తున్నారు. ద్రవిడ వర్సిటీని ప్రక్షాళన చేస్తామని పదే పదే అధికార పార్టీ నేతలు అంటున్నా ఇక్కడి అధికారులు మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తుండడం గమనార్హం. -
ప్రక్షాళన జరిగేనా?
చిత్తూరు అర్బన్ : ఇంట గెలిచి, రచ్చ గెలవాలన్నది పెద్దల మాట. పోలీసుశాఖపై ప్రజల్లో నమ్మకం కల్పించి, ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు బాటలు వేస్తామని చిత్తూరు ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన తుషార్ డూడీ.. ఇటీవల చాలా స్పష్టంగా చెప్పారు. ఖాకీలపై ప్రజల్లో నమ్మకం రావాలంటే ముందుగా సొంత శాఖను ప్రక్షాళన చేయడానికి పూనుకోవాల్సిందే. ఆపై ఒకరు చెప్పకున్నా సమాజంలో పోలీసులపై ప్రజలకు కచ్చితంగా నమ్మకం కలుగుతుంది. తొలి అడుగు ఎస్బీ నుంచే చేపట్టాలి! జిల్లా పోలీసుశాఖ ఎస్పీ పర్యవేక్షణలో పనిచేస్తుంది. ఎస్పీ తరువాత పోలీసుల పనితీరు, సమాజంలో జరుగుతున్న పరిస్థితిని తెలుసుకోవాల్సింది స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) విభాగం. ఎస్పీ తరువాత ఏ ప్రాంతాల్లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి..? పోలీస్ స్టేషన్లో అవినీతి విచ్చలవిడిగా ఉందా..? ఎస్‌హెచ్‌వోలు ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారా? గంజాయి ఎవరు సరఫరా చేస్తున్నారు? లాటరీ టికెట్ల కింగ్‌పిన్ ఎవరు? పోలీసు వెల్ఫేర్‌కు ఏం చేయాలి? వయసు మళ్లిన తల్లిదండ్రులకు చూసుకోవాడానికి కానిస్టేబుల్‌కు ఏ స్టేషన్‌కు డీవో వేస్తే బాగుంటుంది? స్టేషన్లలో వసూల్ రాజాలు ఎవరు? ఇలా చాలా విషయాలను తెలుసుకుని ఎస్పీకు ఎప్పటికప్పుడు ఫీడ్‌బ్యాక్ ఇవ్వాల్సిన బాధ్యత ఎస్బీ విభాగంపై ఉంది. కానీ కొన్ని నెలలుగా ఎస్బీ నిస్తేజమైపోయింది. కొన్ని విషయాలు తెలిసినా ఎస్పీ వద్దకు వెళ్లి చెప్పే ధైర్యం చేయలేకపోవడం. మరికొన్ని వాస్తవాలు చెబితే ఎస్పీ ఏమనుకుంటారో అనే అనుమానం. పైగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఎస్బీలో చాలా వరకు ఒకే సామాజిక వర్గం ఉండటం, వాళ్లకు అధికారపార్టీ నేతలతో సన్నిహిత సంబంధాల కారణంగా వాస్తవాలు ఏమాత్రం ఎస్పీకు తెలియడంలేదు. ఎవరేమనుకున్నా తనకు జరుగుతున్న నిజాలు ఎప్పటికప్పుడు తెలియాలనుకుంటే మాత్రం ఎస్బీ నుంచే ప్రక్షాళన మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. పారదర్శకతకు పెద్దపీట వేయాలి ఇప్పుడంతా స్మార్ట్ కాలం నడుస్తోంది. ఓ కానిస్టేబుల్ రూ.వంద తీసుకుంటే అప్పటికప్పుడే సామాజిక మాధ్యమాల్లో వీడియోలు, వార్తలు వైరల్ అయిపోతున్నాయి. ఇదే సమయంలో సంబంధింత కానిస్టేబుల్‌పై ఏం చర్యలు తీసుకున్నారని సామాన్యులే హ్యాష్‌ట్యాగ్‌లు పెట్టి ప్రశ్నిస్తున్నారు. అధికారులపై అవినీతి ఆరోపణలు వస్తే, విచారణకు ఆదేశించి వాటిని మూలన పడేయకుండా ఆరోపణలు నిజమా, కాదా అని చెప్పడంతో పాటు ఏం చర్యలు తీసుకున్నారో ప్రజలు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు. పోలీసుశాఖలో దేశ భద్రత అంశాలు తప్ప.. అధికారులు పారదర్శకత పాటిస్తే ప్రజల్లో పోలీసుశాఖపై నమ్మకం పెరుగుతుంది. ఇదే సమయంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే నిందితులను కాపాడటానికి రాజకీయ నాయకుల సిఫార్సును పూర్తిగా నిషేధించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో పోలీసుశాఖ ఉదాసీనతగా ఉంటే.. తప్పు చేసిన వాళ్లు తమ ఎమ్మెల్యేలు అయినా వదలొద్దని స్వయానా సీఎం చెబుతున్న మాటలు నీటిమూటలైపోతాయనే విషయం గుర్తించుకోవాలి. ఒడిస్సా, విశాఖ నుంచి పూతలపట్టు, పలమనేరు, చిత్తూరు, కుప్పానికి దిగుమతవుతున్న గంజాయి వ్యాపారం విచ్చలవిడిగా జరుగుతోంది. దుకాణాల్లో సిగరెట్లు దొరికినంత సులువుగా గంజాయి విక్రయాలు సాగుతున్నాయి. నిషేధిత లాటరీ టికెట్లు చిత్తూరు కేంద్రంగా జరుగుతూ.. పలమనేరు, పుంగనూరు, మదనపల్లె, శ్రీకాళహస్తి, తిరుపతి మీదుగా విజయవాడ వరకు ఎగుమతి అవుతున్నాయి. మాదకద్రవ్యాల నివారణ కోసం ఏర్పాటైన ‘ఈగల్’ పేరుకు గంభీరంగా ఉన్నా, ఎగరలేని పరిస్థితి. ఇటీవల ఇందులోని ఓ ఖాకీ ఏకంగా బ్యాంకు ఉద్యోగిని బెదిరించి సస్పెండ్‌కు గురవడం చర్చనీయాంశమయ్యింది. చిత్తూరుతో పాటు నగరి, గంగాధర నెల్లూరు, పూతలపట్టు, యాదమరి, పలమనేరు ప్రాంతాల్లో పేకాట క్లబ్బులు నిర్వహిస్తూ నెలకు రూ.కోట్లు చేతులు మారుతున్నాయి. చీకటి పడితే చిత్తూరు గాంధీ విగ్రహం సాక్ష్యంగా వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా అక్రమ గ్రానైట్ దిమ్మెల స్మగ్లింగ్, అధికార పార్టీ నాయకుల సివిల్ సెటిల్ మెంట్లు రూ.కోట్లు కురిపిస్తున్నాయి. మరి కొత్త ఎస్పీ డూడీ.. ఈ సమస్యలను అధిగమించి, శాంతి భద్రతల పర్యవేక్షణలో సఫలీకృతులవుతారని ప్రజలు ఆశిస్తున్నారు. -
వైఎస్సార్సీపీ హయాంలో బలోపేతం
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : కూటమి పాలనలో ఆర్యోగ సేవలు ఆమడదూరంలో నిలిచాయి. ప్రజల ఆరోగ్యం గాలిలో దీపంలా మారింది. ఆరోగ్యశ్రీకి బకాయిల బెడద పట్టుకుంది. రూ.కోట్లలో పేరుకుపోయిన బకాయిలతో ఆరోగ్యశ్రీ సేవలపై ప్రభావం చూపుతోంది. సేవలు దారి తప్పుతున్నాయి. పలు నెట్వర్క్ ఆస్పత్రులు సర్వర్‌ను బూచిగా చూపుతూ సేవలను నిలిపివేస్తున్నాయి. బిల్లులు చెల్లించకపోవడంతో నిర్వహణ కష్టతరంగా మారిందని కొన్ని నెట్వర్క్ ఆస్పత్రులు సేవలకు స్వస్తి పలుకుతున్నాయి. పేదల ఇంట ఆరోగ్య దీపం వెలిగించే పథకం అంధకారం దిశగా అడుగులు వేస్తోంది. మోయలేని భారం ఎన్టీఆర్ వైద్య సేవా పరిధిలో జిల్లా వ్యాప్తంగా పలు నెట్వర్క్ ఆసుపత్రులు ఉన్నాయి. అందులో ప్రైవేట్ కార్పొరేట్ (నెట్వర్క్) ఆసుపత్రులతో పాటు ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ఉన్నాయి. ప్రైవేట్ ఆసుపత్రులు వంద పడకలు, 50 పడకలు గల ఆసుపత్రులు ఉన్నాయి. ఒక రోజుకు వేల మంది నిరుపేద రోగులు ఉచిత వైద్యం కోసం నెట్వర్క్ ఆసుపత్రులకు వస్తుంటారు. వారికి వైద్య సేవలు అందించాలంటే ఆసుపత్రుల యాజమాన్యానికి ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఈ ఆసుపత్రులకు ప్రభుత్వం రూ.కోట్లలో బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఒక నెలకే ఒక ఆసుపత్రికి రూ.లక్షల్లో ఖర్చు ఉంటుంది. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి బకాయిలను సక్రమంగా చెల్లించలేదు. విడుదల చేసిన నిధుల కన్నా.. ఆసుపత్రుల్లో అందించిన వైద్య సేవలు, అందాల్సిన బిల్లులు అధికంగా ఉన్నాయి. ప్రభుత్వ రంగానికి చెందిన ఆసుపత్రుల్లో ’వైద్య ’ సేవా’ పథకం కింద ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ డెలివరీలు, పెద్దాసుపత్రుల్లో సాధారణ డెలివరీలతో పాటు సర్జరీలు, అలాగే గర్భాశయం తదితర వ్యాధులకు సంబంధించి ఉచిత వైద్య సేవలు అందిస్తారు. ఇందుకు గాను ఒక్కో వ్యాధిని బట్టి వైద్య సేవా ట్రస్ట్ నుంచి బిల్లులు మంజూరవుతాయి. ఆ విధంగా వచ్చిన డబ్బును ప్రోత్సాహకం కింద వైద్యులకు 45 శాతం, ఆసుపత్రుల అభివృద్ధికి 55 శాతం కేటాయిస్తారు. అయితే అధిక సంఖ్యలో ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల ద్వారానే దాదాపుగా 35 రకాలకు పైగా వ్యాధులకు ఉచిత వైద్య సేవలు లభించడంతో ఈ ఆసుపత్రులపైనే భారం పడనుంది. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కుంటుపడుతోంది. బిల్లులు చెల్లింపులు జాప్యం చేస్తోంది. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో రూ.కోట్లలో బకాయిలు పేరుకుపోయాయి. దీంతో నెట్వర్క్ ఆస్పత్రులు సేవలపై ముఖం చాటేస్తున్నాయి. జిల్లాలో పలు ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఉచిత ఓపీ సేవలను మంగళవారం నుంచి నిలిపేశారు. జిల్లా కేంద్రంలోని ఓ ఆస్పత్రి ఆరోగ్యశ్రీకి నోటీసులు ఇచ్చి సేవలకు స్వస్తి పలికాయి. బకాయిల భారంతో ఓపీ సేవలు చూడలేమని చేతులెత్తేసింది. అలాగే మరో ఆస్పత్రి సర్వర్‌ను సాకుగా చూపిస్తూ సేవలను నిలిపివేసింది. మరికొన్ని ఆస్పత్రులు మొక్కుబడిగా సేవలు అందిస్తోంది. ఇంకొన్ని ఆస్పత్రులు ఓపీ వదలి కేవలం అత్యవసర కేసులను మాత్రం తీసుకుంటున్నాయి. చాలా వరకు సీఎం సొంత జిల్లా కావడంతో ఇబ్బందులుంటాయని సేవలను కొనసాగిస్తున్నాయి. ఈ కారణంగా ఉచిత వైద్యం కోసం ఆసుపత్రులకు వచ్చిన పేదలు రూ.300 పైగా డాక్టరుకు ఫీజు చెల్లించి వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. సాధారణంగా అయితే ఉచిత వైద్యం అందించే వారికి ఓపీ సేవలు ఉచితంతోనే ప్రారంభం అవుతాయి. ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు గత్యంతరం లేక ఓపీ సేవలు నిలుపుదల చేశారు. ఈ నిర్ణయం ఎన్ని రోజులు ఉంటుందో తెలియడంలేదు. 2007–2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేదలకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఖరీదైన వైద్యం అందించాలనే సంకల్పంతో ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేశ పెట్టారు. తద్వారా లక్షలాది మంది ఉచిత వైద్యం ద్వారా పునర్జన్మ పొందారు. అనంతరం వైఎస్సార్ ప్రభుత్వ హయాంలో ఈ పథకాన్ని మరింత బలోపేతం చేశారు. 1000 లోపు ఉన్న వ్యాధుల సంఖ్యను 3,255కు చేర్చారు. అయితే టీడీపీ ప్రభుత్వం ఎప్పుడొచ్చినా ’ఆరోగ్య శ్రీ’ పథకం ఒడుదొడుకులను ఎదుర్కొంటోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 14 నెలల కాలంలోనే 4వసారి ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు వైద్య సేవలను నిలుపుదల చేశాయి. దీంతో ఎన్టీఆర్ వైద్య సేవ’ వెంటిలేటర్‌పై ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా బకాయిల భారంతో ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆసోసియేషన్ ఓపీ సేవలను నిలుపుదలకు పిలుపుచ్చింది. ఈ పిలుపు మేరకు జిల్లాలో పలు ఆస్పత్రులు సేవలను నిలిపివేశాయి. -
ఒంటరి ఏనుగు దాడిపై విచారణ
పలమనేరు : ఇటీవల ఒంటరి ఏనుగు పలమనేరులోకి వచ్చి హల్‌చల్‌చేసి స్థానిక ఎఫ్ఆర్వో సుకుమార్‌తో పాటు ఎలిఫెంట్ ట్రాకర్ హరిపై దాడి చేసిన సంఘటనపై డీసీసీఎఫ్ చైతన్యకుమార్‌రెడ్డి విచారణ చేపట్టారు. బుధవారం పట్టణ సమీపంలోని పాతకీలపట్లరోడ్డులో సుకుమార్‌ను ఏనుగు దాడి చేసిన స్థలాన్ని స్థానిక అధికారులతో కలిసి పరిశీలించారు. సంఘటన జరిగినప్పుడు ఏనుగు ఎక్కడ ఉంది, ఏ వైపు నుంచి వచ్చిందని ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం మొసలిమడుగు వద్ద ఉన్న కుంకీ ఎలిఫెంట్ క్యాంపునకు వెళ్లి అక్కడి పరిస్థితులను గమనించారు. కుంకీలతో ఏనుగులను ఎలా మళ్లిస్తున్నారు, ఇక్కడ ఏనుగుల దాడులు ఎందుకు తగ్గలేదని ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏనుగుల కారణంగా ఒక్క ప్రాణం కూడా పోరాదనే తలంపుతో డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ కుంకీలను తెప్పించారన్నారు. అయితే అనుకున్న మేర ఫలితాలు రావాల్సి ఉందన్నారు. దీనిపై మరింత మెరుగ్గా చేయాలని అనుకుంటున్నామన్నారు. ఏనుగు దాడిలో తీవ్రంగా గాయపడి తిరుపతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సెక్షన్ ఆఫీసర్ సుకుమార్‌ను ఆయన పరామర్శించి వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఆయన వెంట సబ్ డీఎప్‌ఓ వేణుగోపాల్, ఎఫ్ఆర్వో నారాయణ, సిబ్బంది ఉన్నారు. -
విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కరించాలి
చిత్తూరు కార్పొరేషన్ : విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని జిల్లా జేఏసీ నేతలు మురళీకృష్ణ, యజ్ఞేశ్వరరావు, వివేకానందరెడ్డి, చంద్రమౌళి తెలిపారు. బుధవారం ట్రాన్స్‌కో ఎస్ఈ కార్యాలయం ఎదుట భోజన విరామ సమయంలో నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేపట్టేందుకు కార్యాచరణను ప్రకటించామన్నారు. ప్రధాన సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకుండా పోయినందున ఆందోళన కార్యక్రమాలు చేపట్టామన్నారు. నగదు రహిత వైద్యం అందించాలని, 1999 ఫిబ్రవరి 1 నుంచి 2004 ఆగస్టు 31 మధ్య చేరిన ఉద్యోగులకు పెన్షన్ సదుపాయం కల్పించాలన్నారు. దళారీ వ్యవస్థను రద్దు చేసి కార్మికులకు నేరుగా వేతనాలు చెల్లించాలన్నారు. జేఎల్ఎం గ్రేడ్–2లను, జేఎల్‌ఎంలుగా పరిగణించి వేతనాలు ప్రయోజనాలు ఇవ్వాలన్నారు. పెండింగ్‌లో ఉన్న 4 డీఏలను మంజూరు చేయాలన్నారు. ఇంజినీరింగ్ డిగ్రీ కలిగిన సబ్ ఇంజినీర్లకు, ఏఈలుగా పదోన్నతిలో అవకాశం కల్పించాలన్నారు. అర్హులైన ఓఅండ్ఎం ఉద్యోగులను జూనియర్ సహాయకులు, సబ్ ఇంజినీర్‌గా ఖాళీలలో నియమించాలన్నారు. గురువారం సైతం నిరసన వ్యక్తం చేసి, 19, 20న రిలే దీక్షలు, 22న ర్యాలీగా వెళ్లి కలెక్టర్‌కు విన్నపం సమర్పించనున్నామని వివరించారు. -
సర్వే పకడ్బందీగా చేపట్టాలి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా రెండవ విడత గిరిజన గృహ స్థలాల సర్వే పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడించారు. బుధవారం కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈనెల 25వ తేదీ నుంచి నిర్వహించే గిరిజన గృహ స్థలాల సర్వేకు పకడ్బందీగా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న పలు సంక్షేమ పథకాలను అర్హులైన గిరిజనులకు చేరువ చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా గిరిజన స్థలాల్లో గృహ సర్వే మొదటి విడతలో 10 మండలాల్లో నిర్వహించినట్లు తెలిపారు. రెండవ విడత సర్వేలో పలు సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. జెడ్పీ, ఉపాధి నిధుల నుంచి గిరిజన కాలనీల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ విద్యాధరి, డీఆర్డీఏ పీడీ శ్రీదేవి, గిరిజన సంక్షేమ శాఖ అధికారి మూర్తి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. -
బోయకొండ.. పుష్ప శోభితం
ఆర్టీసీ బస్సు.. సీఎన్జీగా మార్పు! ఆర్టీసీ డీజిల్ ఇంజిన్‌ను సీఎన్జీగా చిత్తూరు డిపోలో మార్పుకు శ్రీకారం చుట్టారు. ప్రయోగాత్మకంగా నడిపారు.చౌడేపల్లె : ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న బోయకొండ గంగమ్మ ఆలయానికి నూతన శోభ నెలకొంది. బుధవారం బెంగళూరు దేవనహళ్లి లక్ష్మీ ఫ్లవర్ డెకరేషన్స్ నిర్వాహకులు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూలతో ఆలయాన్ని ముస్తాబు చేశారు. వీటి విలువ సుమారు రూ.3 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. రంగు రంగు పూలతో పాటు పూల సువాసనలు కొత్త దనంతో ఆలయం భక్తులను ఆకట్టుకొంది. 17 సంవత్సరాలుగా ఏటా క్రమం తప్పకుండా దసరా మహోత్సవాలకు ముందు వారం వీరు ఆలయాన్ని బెంగళూరు నుంచి పూలను తీసుకొచ్చి వారే స్వయంగా పూలతో ముస్తాబు చేసి ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీగా జరుగుతోంది. ఆలయం లోపలే కాకుండా ఆలయం ముందు భాగం పరిసరాల్లో పూలతో అలంకరించడంతో నూతన శోభ సంతరించుకొంది. తరువాత ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక అభిషేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం వీరిని ఆలయ ఈఓ ఏకాంబరం సన్మానించి అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. -
ప్రపంచంలోనే మొదటి వాస్తుశిల్పి
చిత్తూరు కలెక్టరేట్ : విశ్వకర్మను ప్రపంచంలోనే మొదటి వాస్తు శిల్పిగా భావిస్తారని జాయింట్ కలెక్టర్ విద్యాధరి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో విశ్వకర్మ జయంతిని నిర్వహించారు. విరాట్ విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. విశ్వకర్మ కృష్ణుడు పరిపాలించిన పవిత్రమైన ద్వారకా నగరాన్ని పాండవుల కోసం ఇంద్రప్రస్థ రాజ భవనాన్ని నిర్మించారన్నారు. ప్రజా ప్రయోజనకరంగా వాస్తు ప్రకారం పట్టణాలు, భవనాల నిర్మాణాలు చేపట్టి అభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు విశ్వకర్మ కృషి చేశారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, నగర మేయర్ అముద, బీసీ కార్పొరేషన్ రాష్ట్ర జేడీ శ్రీధర్‌రెడ్డి, జిల్లా బీసీ సంక్షేమ శాఖ డీడీ రబ్బానిభాషా, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. పీపీపీ విధానంలో పాత బస్టాండు ! చిత్తూరు అర్బన్ : చిత్తూరు పాత బస్టాండు వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఇక్కడున్న ఖాళీ స్థలాన్ని పీపీపీ విధానంలో ఇంటిగ్రేడ్ బస్టాండుగా నిర్మించడానికి బుధవారం చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. మేయర్ అముద, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నాయుడు, కమిషనర్ నరసింహ ప్రసాద్ కలిసి.. ఓ ప్రైవేటు కన్సల్టెంట్ ప్రతినిధితో సమీక్షించారు. ఇప్పటికే పీపీపీ విధానంలో బస్టాండును అభివృద్ధి చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయని, త్వరలోనే ఆమోదం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోమారు బస్టాండు అంశం తెరపైకి రావడం, ఏం జరుగుతుందోనని వ్యాపారులు ఆసక్తిగా గమనిస్తున్నారు. క్విజ్ పోటీలు సద్వినియోగం చేసుకోండి చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని విద్యార్థులు వికసిత్ భారత్ క్విజ్ పోటీలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా యువజన అధికారి ప్రదీప్ కుమార్ అన్నారు. నగరంలోని ఆ కార్యాలయంలో వికాస్ దివస్ కార్యక్రమం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టిన రోజును పురస్కరించుకుని 15 రోజుల పాటు స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రాంతీయ గణాంక అధికారి బాబురెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలోని విద్యార్థులు మై భారత్ వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ క్విజ్ పోటీలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇందుకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.మై భారత్.జీవోవి.ఇన్ వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని కోరారు. అనంతరం ఆ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటి వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సపోర్ట్ అధ్యక్షులు జోసెఫ్ రాజ్, పలువురు వలంటీర్లు పాల్గొన్నారు శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగోన్నతులు కల్పించండి చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని స్కూల్ అసిస్టెంట్లకు శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగోన్నతులు కల్పించాలని స్కూల్ అసిస్టెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరోత్తమరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. డీఎస్సీ పోస్టింగ్స్ ఇవ్వక ముందే హైస్కూల్ ప్లస్‌లో ఖాళీగా ఉన్న పోస్టులకు శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగోన్నతులు కల్పించాలన్నారు. ఇటీవల ఉద్యోగ విరమణ పొందిన హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్ ఖాళీలను ఉద్యోగోన్నతి కల్పించి వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రక్రియ అనంతరం డీఎస్సీ అభ్యర్థుల పోస్టింగ్స్ ఇవ్వాలన్నారు. దసరా సెలవులు ఈనెల 21వతేదీ నుంచి ప్రకటించాలన్నారు. కరువు భత్యం వెంటనే విడుదల చేసి ఇంటీరియం రిలీఫ్‌ను దసరా కానుకగా ఇవ్వాలని కోరారు. -
ఎందుకో హంగామా?
నియామకమా..మెగా డీఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం ప్రచార ఆర్భాటానికి తెగబడింది. 150 రోజుల పాటు కసరత్తు జరిపి నానాహంగామా సృష్టించింది. తీరా అర్హులకు న్యాయం చేశారా.. అని చూస్తే అదీ లేదు. అనర్హులకు, అనుకూలమైన వారికి ఉద్యోగాలు కల్పించారని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు నియామకపత్రాల పంపిణీ పేరుతో మరో డ్రామాకు తెరలేపింది. ఈనెల 19న విజయవాడ వేదికగా నిర్వహించే కార్యక్రమంలో మెగా డీఎస్సీలో ఉద్యోగాలు పొందిన వారికి నియామకపత్రాలు పంపిణీ చేస్తామంటూ హంగామా సృష్టిస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి దాదాపు మూడు వేల మందిని తరలించాలని టార్గెట్ విధించింది. దీనిపై పలువురు మండిపడుతుండడంతో ఏం చేయాలో దిక్కుతోచక అధికారులు తలలు పట్టుకోవాల్సి వస్తోంది. చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు వ్యాప్తంగా నిర్వహించిన మెగా డీఎస్సీ కసరత్తు విమర్శలకు తావిస్తోంది. 150 రోజుల పాటు సాగదీసి అర్హులకు మొండిచేయి చూపారని పలువురు మండిపడుతున్నారు. ఈనెల 15న మెగా డీఎస్సీ తుది ఎంపిక జాబితాను ప్రచురించారు. ఈ జాబితా ప్రచురించాక వందల సంఖ్యలో హెల్ప్‌డెస్క్‌కు కాల్ చేశారు. చిత్తూరు డీఈవో కార్యాలయానికి పరుగులు పెట్టారు. న్యాయం చేయండి మహాప్రభో అంటూ అధికారుల కాళ్లావేళ్లా పడ్డారు. అయితే అభ్యర్థులకు విద్యాశాఖ అధికారులు ఎలాంటి సమాధానం చెప్పలేని దుస్థితిలో మిగిలిపోయారు. డీఎస్సీ పేరుకే తిలోదకాలు గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం డీఎస్సీ (డిస్టిక్ సెలెక్షన్ కమిటీ) పేరుకు తిలోదకాలు వదిలింది. నిబంధనల ప్రకారం డీఎస్సీ కసరత్తు మొత్తం ఎన్నో ఏళ్లుగా జిల్లా స్థాయిలోనే జరిగేది. అయితే ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలోనే నిర్వహించారు. ఈ కసరత్తులో పలు అక్రమాలు చోటు చేసుకున్నాయని అభ్యర్థులు పెదవి విరుస్తున్నారు. ఫలితాలు వెల్లడించిన తర్వాత మెరిట్, రోస్టర్ ప్రకారం విడుదల చేయాల్సిన ఎంపిక జాబితా ఆఖర్లో గందరగోళం సృష్టించారు. ఎంపిక జాబితా పేరుతో ఐదు సార్లు ప్రచురించి, కాల్‌లెటర్లు పంపి, సర్టిఫికెట్లు పరిశీలించారు. తీరా తుది జాబితా ప్రచురించే సమయానికి ఎక్కువ ర్యాంక్‌లు ఉన్న అభ్యర్థులకు ఉద్యోగాలు, తక్కువ ర్యాంక్‌లు వచ్చిన అభ్యర్థులను అనర్హులుగా పేర్కొన్నారు. దీంతో వందలాది మంది అభ్యర్థులు నష్టపోయారు. న్యాయస్థానంలోనే తేల్చుకుంటాం డీఎస్సీలో నష్టపోయిన అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అభ్యర్థులు న్యాయస్థానంలో 104 కేసులను వేశారని రాష్ట్ర విద్యాశాఖ అధికారుల అధికారిక సమాచారం. ప్రచార ఆర్భాటం మెగా డీఎస్సీలో ఎంపికై న అభ్యర్థులకు అందజేసే నియామకపత్రాల పంపిణీ కసరత్తును కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రచార ంగా మలుచుకుంది. ఈ ప్రక్రియను రాష్ట్ర స్థాయిలో విజయవాడలో నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం 3 వేల మందిని విజయవాడకు పంపాలంటూ టార్గెట్ విధించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా టార్గెట్ విధించడంతో విద్యాశాఖ అధికారు లు తలలు పట్టుకుంటున్నారు. ఎంపికై న అభ్యర్థులతో పాటు కుటుంబ సభ్యులను కూడా విజయవాడకు తీసుకురావాలని విద్యాశాఖ అధికారులు సందేశాలు పంపుతున్నారు. ఈ ప్రక్రియ తిరుపతి డీఈవో కేవీఎన్.కుమార్ పర్యవేక్షణలో సాగుతోంది. ఇందుకు ప్రత్యే కంగా 70 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. వేలాది మంది అభ్యర్థులు మెగా డీఎస్సీలో నష్టపోయి కన్నీళ్లు పెట్టుకుంటుంటే కూటమి ప్రభుత్వం ప్రచార ఆర్భాటానికే పరిమితమైందని పలువురు మండిపడుతున్నారు. డీఎస్సీ నియామకపత్రాల పంపిణీ 19వ తేదీన నోటిఫైడ్ పోస్టులు 1,478 ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు 1,408 విజయవాడ తరలింపుకు విధించిన టార్గెట్ 3వేల మంది ఏర్పాటు చేస్తున్న ఆర్టీసీ బస్సులు 70 ప్రయాణం చేయాల్సిన దూరం – తిరుపతి – విజయవాడ 418 కి.మీ -
స్పష్టత ఇవ్వాలి
మెగా డీఎస్సీ అభ్యర్థుల తుది జాబితా ఈనెల 15న ప్రచురించారు. ఆ తర్వాత నష్టపోయిన అభ్యర్థులు న్యాయం కోసం పరుగులు పెడు తున్నారు. కాల్‌లెటర్లు పంపించి, సర్టిఫికెట్లు పరిశీలించి ఉద్యోగం వస్తుందన్న అధికారులే నేడు ఉద్యోగం రాలేదని పేర్కొనడం బాధిస్తోంది. జిల్లా స్థాయిలో నిర్వహించాల్సిన డీఎస్సీ ప్రక్రి య రాష్ట్ర స్థాయిలో నిర్వహించడంలో దాగి ఉన్న రహస్యమేమిటో తెలియని దుస్థితి. తుది జాబితా అనంతరం హెల్ప్‌డెస్క్‌కు ఫిర్యాదు చేసి న్యాయం కోసం వస్తున్న అభ్యర్థులకు స్పష్టత ఇవ్వాలి. – రెడ్డిశేఖర్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ట్రెజరర్