Chittoor District News
-
కోళ్లఫామ్ గోడౌన్‌కు నిప్పు
పులిచెర్ల(కల్లూరు): మండలంలోని 106 రామిరెడ్డి గారిపల్లె పంచాయతీ చెరువు ముందరపల్లెకు చెందిన నాగిరెడ్డి కోళ్ల ఫామ్ గోడౌన్‌కు ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. దీంతో గోడౌన్‌లోని 15లక్షలు విలువ చేసే ఆటోమెటిక్ ఫీడింగ్ మిషన్, మోటరు, ఫీడర్లు, ప్లాస్టిక్ సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. దీనిపై కల్లూరు పోలీస్టేషన్లో ఫిర్యాదు చేయగా అధికారులు వచ్చి పరిశీలించారు. సోమవారం స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు రెడ్డీశ్వరరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ముర్వత్ బాషా గోడౌన్‌ను పరిశీలించారు. ఉచిత ఆన్లైన్ శిక్షణను సద్వినియోగం చేసుకోండి చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో డీఎస్సీకి సన్నద్ధం అవుతున్న బీసీ, ఈడబ్ల్యూసీ అభ్యర్థులు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఆన్లైన్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో మెగా డీఎస్సీ 2025 పరీక్షకు సిద్ధం అవుతున్న బీసీ, ఈడబ్ల్యూసీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ శిక్షణను ఉచితంగా అందిస్తోందన్నారు. బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెంది టెట్ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియో గం చేసుకోవాలన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న వారు కలెక్టరేట్లోని బీసీ సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించాలని తెలిపారు. దర ఖాస్తుతో పాటు కుల, జనన, ఆదాయ ధ్రువీకర ణ పత్రాలతో పాటు టెట్ ధ్రువీకరణ పత్రం సమర్పించాలన్నారు. ఇతర వివరాలకు 917742 9494 నంబర్లో సంప్రదించాలని కలెక్టర్ కోరారు. ఒకే మీడియంలో గణిత ప్రశ్నపత్రం ● పది పరీక్షల నిర్వహణలో సర్కారు అలసత్వం చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా సోమవారం పదోతరగతి గణితం పరీక్ష నిర్వహించారు. అయితే ఒకే మీడియంలో ప్రశ్నపత్రం ఇవ్వడంతో విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులకు ఇంగ్లిష్ అర్థం అయ్యేందుకు గత వైఎస్సార్సీపీ సర్కారు బైలింగ్వల్ విధానం ప్రవేశపెట్టింది. ఇది విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా మారింది. ఈ విద్యాసంవత్సరంలో పదో తరగతి విద్యార్థులకు బైలింగ్వల్ విధానంలోనే (ఒక వైపు తెలుగు, మరో వైపు ఇంగ్లీష్) పాఠ్యపుస్తకాలు ఇచ్చారు. అలాగే పాఠశాల స్థాయిలో నిర్వహించిన ఫ్రీ ఫైనల్స్, గ్రాండ్ టెస్ట్ ప్రశ్నపత్రాలు సైతం బైలింగ్వల్లోనే అందించారు. అయితే పబ్లిక్ పరీక్షలకు వచ్చే సరికి గణితం ప్రశ్నపత్రం మాత్రం ఒకే లాంగ్వేజ్‌లో ముద్రించారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తికమకపడి అవస్థలు ఎదుర్కొన్నారు. కీలకమైన పరీక్షలపై కూటమి ప్రభుత్వం నిర్లక్షంగా వ్యవహరించడంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. -
గంజాయి విక్రేతల అరెస్టు
నగరి: మండలంలోని వీకేఆర్‌పురం గ్రామం వద్ద నగరి–తిరుత్తణి మెయిన్ రోడ్డు సమీపంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. డీఎస్సీ మహమ్మద్ సయ్యద్ అజీజ్ తెలిపిన కథనం మేరకు.. సరిహద్దు ప్రాంతాల్లో గంజాయి రవాణాపై ప్రత్యేక నిఘాలో భాగంగా సోమవారం ఉదయం సీఐ విక్రమ్‌కు రహస్య సమాచారం అందింది. దీనిపై స్పందించిన ఆయన డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది, పోలీసులతో కలసి వీకేఆర్‌పురం గ్రామంలో దాడులు చేశారు. తమిళనాడు నుంచి వచ్చి వీకేఆర్ పురంలో స్థిరనివాసం ఏర్పరుచుకున్న ఎ.అబ్బాస్ (39), మండలంలోని ఓజీ కుప్పం గ్రామానికి చెందిన ఓ.మోహన్ (30) నగరి–తిరుత్తణి మెయిన్ రోడ్డు సమీపంలో గంజాయి విక్రయిస్తుండగా అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.32 వేలు విలువచేసే 2.35 కిలోల గంజాయిని, ఒక మోటార్ సైకిల్‌ను, మొబైఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరితో పాటు గంజాయి విక్రయిస్తున్న మరో ఇద్దరు పరారయ్యారు. ఈ సందర్భంగా డీఎస్పీ మహమ్మద్ సయ్యద్ అజీజ్ మాట్లాడుతూ నగరి సరిహద్దు ప్రాంతం కావడంతో గంజాయి అక్రమ రవాణా, అమ్మడం, కొనడం, సేవించడం పైన ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, నిందితులను అరెస్టు చేశామని తెలిపారు. ఈ కేసులో ప్రతిభ చూపిన సిబ్బంది ఇంద్ర కుమార్, గోపి, గజేంద్ర, రమేష్, పవన్ కళ్యాణ్‌లను అభినందించారు. -
కుక్కల దాడిలో జింకకు గాయాలు
గుడిపాల: కుక్కల దాడిలో జింకకు గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు.. బట్టువాళ్లూరు గ్రామం సమీపంలో కుక్కలు సోమవారం ఉదయం అటవీమార్గం నుంచి వస్తున్న జింకను వెంబడించి, దాడి చేశాయి. దీంతో జింకకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గుర్తించి, దాన్ని కాపాడి అటవీశాఖాధికారులకు సమాచారం అందించారు. అటవీ బీట్ఆఫీసర్ ఢిల్లీరాణి, అరుణ సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన జింకను స్థానిక పశువైద్యశాలకు తరలించారు. డాక్టర్ సాయిసుధ జింకకు చికిత్స చేశారు. కాళ్లకు తీవ్రంగా గాయం కావడంతో కాళ్లను తీసివేశారు. అనంతరం చిత్తూరు డియర్పార్క్కు తరలించి అబ్జర్వేషన్లో ఉంచడం జరుగుతుందని వారు తెలిపారు. వైద్యమిత్రలపై అలసత్వం తగదు – కలెక్టరేట్ ఎదుట నిరసన చిత్తూరు కలెక్టరేట్ : కూటమి సర్కారు వైద్యమిత్రపై అలసత్వం తగదని, వారికి కనీస వేతనాలు ఇవ్వకపోవడం దారుణమని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు వాడ గంగరాజు, వైద్యమిత్ర అసోసియేషన్ జిల్లా కార్యదర్శి లత ఆరోపించారు. ఆ సంఘం నాయకులు, వైద్య మిత్రలు సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని వైద్య మిత్రలకు కనీస వేతనాలు, ఉపాధి భద్రత కల్పించకపోవడం అన్యాయమన్నారు. గత 17 సంవత్సరాల సర్వీసుని పరిగణలోకి తీసుకుని కాంట్రాక్టు ఉద్యోగులుగా పరిగణించాలన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్న సమయంలో వైద్య మిత్రలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఉద్యోగి మృతి చెందిన కుటుంబాలకు రూ.15 లక్షలు ఎక్స్‌గ్రేషియా మంజూరు చేయాలన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్ రూ.10 లక్షలు, ప్రభుత్వ ఉద్యోగంలో సర్వీసు వెయిటేజీ కల్పించాలని కోరారు. వైద్య సేవ సిబ్బందికి అంతర్గత ఉద్యోగోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశార. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 27 చలో గుంటూరు కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. అప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోతే సమ్మెలో పాల్గొంటామన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య మిత్ర లు పాల్గొన్నారు. -
నాకు ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి
రొంపిచెర్ల: అధికార పార్టీ నాయకుల నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని బాధితుడు జిల్లా కలెక్టర్, ఎస్పీకి సోమవారం ఫిర్యాదు చేశారు. బాధితుని కథనం.. మండలంలోని గానుగచింత పంచాయతీ ఓబులవారిపల్లెకు చెందిన ఉమాపతిరెడ్డి గ్రామంలో అధికార పార్టీకి చెందిన కొందరితో గడ్డి పందిరి విషయమై వివాదం నడుస్తోంది. వందేళ్లుగా గడ్డి పందిరి ఉమాపతిరెడ్డి కుటుంబం అనుభవంలో ఉంది. అయితే పార్టీ ముసుగులో కొందరు పందిరిని కూల్చి వేయడానికి ప్రయత్నిస్తున్నారని, సర్వే నంబరు 128–2, 129లలో గ్రామంలో అందరికీ భాగాల ఉన్నాయని, కొలతలు వేసి వారికి వస్తే తీసుకోమని చెప్పినా పట్టించుకోకుండా దౌర్జన్యంగా ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నాయకుల నుంచి ప్రాణహాని ఉందని ఉన్నతాధికారులను ఆశ్రయించి తన గోడు నివేదించాడు. -
హుండీ లెక్కింపుపై విచారణ
– టెంపుల్ ఇన్స్పెక్టర్, ఈఓలపై భక్తుల ఫిర్యాదు – విచారణ చేపట్టిన అసిస్టెంట్ కమిషనర్ పుత్తూరు: స్థానిక శ్రీకామాక్షీ సమేత శ్రీసదాశివేశ్వరస్వామి, ఆరేటమ్మ ఆలయాల్లో చేపట్టిన హుండీలోని కానులక లెక్కింపులో దేవదాయశాఖ అధికారులు చేతివాటం చూపారన్న ఫిర్యాదుపై చిత్తూరు జిల్లా దేవదాయ అసిస్టెంట్ కమిషనర్ రామకృష్ణారెడ్డి సోమవారం విచారణ చేపట్టారు. సదాశివేశ్వరాలయంలోని హుండీల్లో భక్తులు గత ఏడాది జనవరి 3వ తేదీ నుంచి జూన్ 15 వరకు సమర్పించిన కానుకల ద్వారా రూ.3,41 లక్షల ఆదాయం వచ్చింది. శనివారం నిర్వహించిన 9 నెలల్లో భక్తులు హుండీలో వేసిన కానుకల లెక్కింపులో రూ.2 లక్షలే వచ్చిందని టెంపుల్ ఇన్స్పెక్టర్ సుమన ప్రియ, ఈఓ జయక్రిష్ణ నిర్ధారించారు. దీనిపై ఏసీ రామకృష్ణారెడ్డి లెక్కింపులో పాల్గొన్న వారి నుంచి స్టేట్మెంట్లను రికార్డు చేసుకున్నారు. అలాగే ఫిర్యాదు చేసిన వారు రెండవ దఫా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడం గమనార్హం. ఉన్నతాధికారులు నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి చేతివాటం ప్రదర్శించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. -
శతాబ్దాల ఉత్సవం..
● నేటి నుంచి శ్రీసుగుటూరు గంగమ్మ జాతర పురజనుల ఉత్సాహంపుంగనూరులో జాతరకు ముస్తాబైన జమీందారుల ప్యాలెస్ శతాబ్దాలుగా సాగుతున్న ఉత్సవం..కుల మతాలకతీతం..చిన్నా పెద్దా లేడా లేకుండా పురజనులకు ఉత్సాహం.. జమిందార్ల ఆధ్వర్యంలో నిర్వహించే జాతర వైభవం.. అదే ఆరోగ్యప్రదాయిని.. భక్తుల పాలిట కల్పవల్లి.. సుగుటూరు గంగమ్మ తల్లి జాతర. ఈ నెల 25, 26 తేదీల్లో జరిగే ఈ పండుగపై కథనం. పుంగనూరు: పరశురామ క్షేత్రంగా ఆవిర్భవించి.. పుంగపురిగా మారి..కాలక్రమేణ పుంగనూరుగా రూపాంతరం చెందింది ఈ పట్టణం. గౌని వంశానికి చెందిన ఇమ్మడి తిమ్మరాయల సంతతే పుంగనూరు జమిందార్లు అని చరిత్ర చెబుతోంది. నాటి జమిందార్లు 18వ శతాబ్దం పూర్వార్థంలో ప్రారంభించిన సుగుటూరు గంగమ్మ జాతర నేటికీ ఏటా వారి వంశస్తుల ఆధ్వర్యంలోనే జరుగుతోంది. ఆరోగ్య ప్రదాయినిగా, భక్తుల పాలిట కల్పవల్లి పేరొందిన సుగుటూరు గంగమ్మ జాతర హోలీ తరువాత జిల్లాలో జరిగే అతి పెద్ద జాతరగా పేరుగాంచింది. పుంగనూరులో కులమతాలకతీతంగా సు మారు ఎనిమిది శతాబ్దాలుగా జమీందారు ల కులదైవమైన శ్రీ సుగుటూరు గంగమ్మ జాతరలో భాగంగా మంగళవారం రాత్రి అ మ్మవారికి జమీందారి కుటుంబీకులు రాజ సోమశేఖర్ చిక్కరాయుల్, రాజా మల్లికార్జు న చిక్కరాయల్, వారి కుటుంబీకులు ప్యాలె స్లో తొలిపూజలు చేయనున్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, స్వర్ణమ్మ దంపతులు, ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్‌రెడ్డి దర్శించు కుని పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేయడం ఆనవా యితీ. అనంతరం అమ్మవారిని ప్యాలెస్ నుంచి తీసుకొచ్చి, పురవీధుల్లో ఊరేగిస్తారు. వేలాది మంది భక్తు లు హాజరై, ఊరేగింపులో అమ్మవారికి జంతుబలులు సమర్పించి, మొక్కులు చెల్లించుకుంటారు. బుధవారం ఉదయం అమ్మవారిని ప్యాలెస్ ఆవరణలోని ఆలయంలో కొలువు దీర్చి, వేకువజామున జమీందారి కుటుంబీకులు తొలిపూజలు నిర్వహించి, భక్తుల దర్శనానికి అనుమతిస్తారు. అదే రోజు రాత్రి అమ్మవారిని నిమజ్జనం చేస్తారు. ప్యాలెస్ ఆవరణలో జమీందారుల ఆధ్వర్యంలో మంగళవారం గొర్రెల సంత నిర్వహిస్తారు. ఏర్పాట్లు ఈ నెల 25, 26 తేదీల్లో జరిగే జాతరకు కర్ణాటక, తమిళనాడు నుంచి వేలాది మంది భక్తులు రానున్నారు. కాగా జాతరలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మున్సిపల్ కమిషనర్ మధుసూదన్‌రెడ్డి, చైర్మన్ అలీమ్‌బాషా, పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేపట్టారు. చలివేంద్రాలు, వైద్యశిబిరా లు, విద్యుత్ దీపాలు, సీసీ కెమెరాలు, ఆలయ ప్రాంగణంలో బ్యారీకెడ్లు, షామీయానాలు ఏర్పాటు చేశారు. 400 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు. పుంగనూరు శ్రీ సుగుటూరు గంగమ్మజాతర ఏర్పాట్ల పరిశీలన పుంగనూరులో జరుగుతున్న శ్రీసుగుటూరు గంగమ్మ జాత ర ఏర్పాట్లను జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు పరిశీలించారు. సోమవారం రాత్రి ఆయన పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్‌తో కలసి ప్యాలెస్‌లోకి వెళ్లారు. అక్కడ జమీందారి కుటుంబీకులను కలసి అమ్మవారి ఊరేగింపు, నిమజ్జనం కార్యక్రమాలపై చర్చించారు. ప్యాలెస్‌లో భక్తుల రద్దీ లేకుండా చూడాలని పోలీసులను ఆదేశించారు. రద్దీ సమయంలో చైన్ స్నాచర్లు, జేబు దొంగల కట్టడితోపాటు అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా పోలీసులు గస్తీ ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యంగా చిన్న పిల్లల విషయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈయన వెంట ఎస్బీ సీఐ భాస్కర్, సీఐలు రామ్‌భూపాల్, ఉమామహేశ్వరరావు తదితరులు ఉన్నారు. -
సైబర్ క్రైమ్ బాధితుడి సత్వర న్యాయం
యాదమరి/చిత్తూరు అర్బన్: సైబర్ క్రైమ్నకు గురైన బాధితులు తక్షణం స్పందించి, పోలీసులకు సమాచారం ఇస్తే.. సత్వర న్యాయం జరుగుతుందని చిత్తూరు ఎస్పీ మణికంఠ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. దీని అర్థం ఎలాంటిదో ఈ ఘటనే నిదర్శనం. యాదమరి మండలానికి చెందిన ఓ వ్యక్తికి ఈనెల 20వ తేదీన రాత్రి 10.40 గంటల ప్రాంతంలో రెండుమార్లు ఓటీపీ మెసేజ్ వచ్చింది. మొదటిగా రూ.1,12,900, రెండోసారి రూ.23 వేలు తన ఖాతా నుంచి ఖర్చయినట్లు సారాంశం. కొద్దిసేపు ఆలోచించిన వ్యక్తి, తాను ఆన్లైన్లో ఏదీ కొనుగోలుచేయలేదని నిర్ధారించుకున్న తరువాత రాత్రి 10.50 గంటలకు యాదమరి ఎస్ఐ ఈశ్వర్‌కు, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టర్ (ఎన్సీఆర్పీ) వెబ్సైట్లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. ఆదివారం సంబంధిత వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి సైబర్‌క్రైమ్ ద్వారా దొంగిలించిన మొత్తం కూడా అతని ఖాతాలో జమ చేసేలా చేశారు. మోసం జరిగినప్పుడు బాధితులు వెంటనే ఫోన్–1930, పోలీసు వాట్సప్–9440900005 నంబర్లకు సమాచారం ఇస్తే, త్వరగా చర్యలు తీసుకుని డబ్బులు తెప్పించే ప్రయత్నం చేస్తామని ఎస్పీ తెలిపారు. కార్యదర్శులకు కౌన్సెలింగ్ చిత్తూరు కార్పొరేషన్: ఉమ్మడి జిల్లాలో పంచాయతీ కార్యదర్శులకు బదిలీలపై సోమవా రం కౌన్సెల్సింగ్ నిర్వహించా రు. జెడ్పీ సమావేశ మందిరంలో సీఈఓ రవికుమార్‌నాయు డు, డీపీఓ సుధాకర్‌రావు ప్రక్రియను నిర్వహించారు. గ్రేడ్ 5 నుంచి గ్రేడ్ 4కు పదోన్నతి పొందిన కార్యదర్శులు ఆప్షన్ పెట్టుకున్నారు. మొత్తం 83 మంది బదిలీలకు అర్హత సాధించగా అందులో 77 మంది వారు కోరుకున్న స్థానాల ను తెలియజేశారు. సంబంధిత పత్రాలను అధికారులు పరిశీలించారు. ఈ నివేదికను ఆమోదం కోసం కలెక్టర్‌కు పంపుతామన్నారు. ప్రక్రియ పూర్తయిన తర్వాత ఉద్యోగోన్నతులు, బదిలీ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఖాళీల భర్తీలను ప్రభుత్వ ఆమోదంతో ఉద్యోగోన్నతి ద్వారా చేపడతామన్నారు. -
నేనేమన్నా.. పోలీసులనంతా మార్చమన్నానా!
● జిల్లాలో 264 మందిని మార్చి ఆ నెపం నాపైకేస్తే ఎట్లా? ● పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ్‌రెడ్డి పలమనేరు: తాను పుంగనూరులో వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్న పోలీసులను మా ర్చమంటే జిల్లాలోని 264 మందిని మార్చమన్నానా? అని పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పలమనేరులని టీడీపీ కార్యాలయంలో ఆదివారం ని ర్వహించిన నియోజకవర్గ బూత్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘నా వల్ల జి ల్లాలోని పోలీసులను బదిలీ చేశారనుకుని, వారి కుటుంబ సభ్యుల తిట్లు నాకు అవరస మా. మేము అధికారంలోకి వచ్చి తొమ్మిది నె లలవుతాంది. మాకు అనుకూలంగా ఉన్న వా రిని వేయమన్నాను. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ నాయకులు వారికి అనుకూలంగా ఉన్న పోలీసులను వేయించుకోవడం సా ధారణ విషయమే. రాజకీయ పార్టీలు ఐదేళ్లుంటాయి, మళ్లీ వేరే పార్టీ రావచ్చు కానీ అధికారులు మాత్రం శాశ్వతంగా ఉంటారు. నేను ఈ ప్లగ్ తీసి ఆ ప్లగ్ పెట్టబ్బా కరెంట్ ఇక్కడ మలగాలి కదా? అంటే ఎక్కడో తమిళనాడు బోర్డర్లో ఉండే ప్లగ్‌లో పెట్టమన్నానా?. జిల్లాలో 264 మందిని మార్చి ఆ నెపం నాపైకేస్తే ఎట్లబ్బా’ అని జిల్లా ఎస్పీనుద్దేశించి మాట్లాడారు. -
ఇంధనం గుట్టు..పట్టేదెట్టా?
పెట్రోల్ నాణ్యత.. కొలతల్లో తేడా.. కల్తీ తది తర కారణాలతో వినియోగదారులు మోసపోతున్నారు.మంగళవారం శ్రీ 25 శ్రీ మార్చి శ్రీ 2025వేసవి ప్రారంభంలోనే భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. ఒక వైపు ఎండ తీవ్రత, మరోవైపు వేడి గాలుల దాటికి నీరు ఆవిరవుతోంది. గత ఏడాది వర్షపాతం అంతంత మాత్రంగానే నమోదు కావడం..దానికి తోడు చెరువులు, కుంటల్లో జలా లు కూడా లేకపోవడంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారుతోంది. జిల్లాలోని పలు మండలాల్లో రోజు రోజుకు భూగర్భజలమట్టం పాతాళంలోకి చేరుతోంది. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా జిల్లాలో తాగు, సాగునీటికి సమస్యలు ఏర్పడే పరిస్థితులు నెలకొంటున్నాయి. జిల్లాలో 2024 నుంచి ఈ ఏడాది మార్చి వరకు సాధారణ వర్షపాతం 1099.96 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. అయితే పలు గ్రామాల్లో వేసవి ప్రారంభంలోనే నీటి ఎద్దడి సమస్యలు తలెత్తుతున్నట్లు రైతులు వాపోతున్నారు. కరెంట్ కోతలతో పాటు సాగునీటి వనరులు అడుగంటిపోవడంతో అన్నదాతలు అయోమయానికి గురవుతున్నారు. వేసవి ప్రారంభంలోనే బోరుబావులు, చెరువులు, కుంటలు, వాగుల్లో జలధారాలు అడుగంటుక పోవడంతో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. ప్రాజెక్టుల్లోనూ తగ్గుతోంది చిత్తూరు జిల్లాలోని కృష్ణాపురం ప్రాజెక్ట్ నీటి సా మర్థ్యం 0.2 టీఎంసీకాగా ప్రస్తుతం 0.13 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ఎన్టీఆర్ జలాశయం నీటి సామర్థ్యం 0.12 టీఎంసీలు కాగా 0.1 టీఎంసీల నీటి నిల్వలున్నాయి. అలాగే కృష్ణాపురం ప్రాజెక్ట్‌లో 689.13, ఎన్టీఆర్ జలాశయంలో 965.14 అడుగుల లోతులో నీటి నిల్వలున్నట్లు అధికారిక నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఎండలు మండుతుండడంతో ఈ నీళ్లు ఎన్ని రోజులకు సరిపోతాయన్న ప్రశ్న జిల్లా ప్రజల్లో తలెత్తుతోంది. వేసవి ప్రారంభంలోనే కష్టాలు వేసవి ప్రారంభంలోనే నీటి కష్టాలు త ప్పడం లేదు. జిల్లాలోని పలు గ్రామాల్లో ఇప్పటికి చాలా గ్రామాలకు తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికే కొన్ని గ్రామాలకు మంచినీటి సరఫరా కాక పోవడంతో ప్రజలు వ్యవసాయ బావులు, బోరు బావులపై ఆధారపడి కాలం వెళ్లదీస్తున్నారు. పలమనేరు నియోజకవర్గంలోని పలమనేరు, గంగవరం, వి.కోట, కుప్పం నియోజకవర్గం గుడుపల్లి, రామకుప్పం మండలాల్లోని కొన్ని గ్రామాల్లో కిలోమీటర్ల మేర ఖాళీ నడకన వెళ్లి నీటిని తెచ్చుకునే పరిస్థితులు నెలకొన్నాయి. మారుమూల గ్రామా లకు పైపులైనన్ వేసినప్పటికీ నీటి కనెక్షన్ ఇచ్చే పనులు పూర్తి చేయకపోవడం, చిన్నపాటి మరమ్మతులు చేయకపోవడంతో తాగునీటి సమస్యలు తలెత్తుతున్నాయి. చెరువులు, కుంటలు, వాగులపై ఆ ధారపడి సాగు చేసినా.. అడుగంటిపోవడంతో వరి, ఇతర పంటలు ఎండుముఖం పట్టే పరిస్థితి తలెత్తుతోంది. ప్రత్యామ్నాయ మార్గం లేక చేతికి వచ్చిన పంటను వదిలించుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమోనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశుగ్రాసం కొరతతో పాటు నీటిఎద్దడి ఏర్పడడంతో పశువులు అల్లాడుతున్నాయి. జిల్లాలో భూగర్భ జలాల పరిస్థితి ఇదీ.. జిల్లాలో తాజాగా జిల్లా భూగర్బ జలవనరుల శాఖ ఫిబ్రవరి నెలలో సేకరించిన వివరాల ప్రకారం.. జిల్లాలో సగటు లోతు 11.05 మీటర్లుగా నమోదైంది. జిల్లాలోని కుప్పం నియోజకవర్గం గుడుపల్లిలో 51.73 మీటర్ల లోతుకు నీటిమట్టం పడిపోవడం విస్మయానికి గురిచేస్తోంది. అలాగే గంగవరంలో 12.53, కుప్పంలో 17.59, పలమనేరులో 11.98, పుంగనూరులో 12. 92, రామకుప్పంలో 16.71, శాంతిపురంలో 14.11, వి.కోటలో 22.18 మీటర్లతో అత్యధికంగా లోతుల్లోకి భూగర్భజలాలు పడిపోయాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే మీటర్ల లోతుల్లోకి నీటిమట్టం పడిపోయింది. 2024వ సంవత్సరం ఫిబ్రవరి లో జిల్లాలోని అన్ని మండలాల్లో నీటి మట్టం 10.56 ఉండగా అదే ఈ ఏడాది ఫిబ్రవరి లో 11.05 కి పడిపోయింది. పది పరీక్షలకు 214 మంది గైర్హాజరు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా సోమ వారం నిర్వహించిన పదో తరగతి గణితం పబ్లిక్ పరీక్షకు 214 మంది గైర్హాజరయ్యారని డీఈఓ వరలక్ష్మి వెల్లడించారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా లోని 118 పరీక్ష కేంద్రాల్లో రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులు 21,080 మంది హాజరుకావాల్సి ఉండగా 20,866 మంది హాజరయ్యారన్నారు. 214 మంది గైర్హాజరైనట్లు వెల్లడించారు. డీఈఓ 2, ఫ్లయింగ్ స్క్వాడ్ 15 మంది, 18 కేంద్రాలను, సిట్టింగ్ స్క్వాడ్లు 65 పరీక్ష కేంద్రాల్లో విధులు నిర్వహించారని డీఈఓ తెలిపారు. జెడ్పీలో కారుణ్య నియామకాలు చిత్తూరు కార్పొరేషన్: జిల్లాపరిషత్ పరిధిలో పలువురికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇచ్చారు. సోమవారం జెడ్పీ కార్యాలయంలో చైర్మన్ శ్రీనివాసులు, సీఈఓ రవికుమార్‌నాయుడు సంబంధిత పత్రాలను అందజేశారు. మొత్తం ఏడుగురికి జూనియర్ సహాయకులుగా బాధ్యతలు అప్పగించారు. వీరు త్వరలో విధుల్లో చేరనున్నారు. జిల్లాలో కారుణ్య నియమాకాల కింద ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. విచారించి.. న్యాయం చేయండి చిత్తూరు అర్బన్: ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదు, సమస్యపై క్షేత్రస్థాయిలో విచారించి, న్యాయం చేయాలని చిత్తూరు ఎస్పీ మణికంఠ అధికారులను ఆదేశించారు. చిత్తూరు నగరంలోని ఏఆర్ పోలీసు కార్యాలయంలో సోమ వారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహించి, ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వచ్చిన అర్జీలను పరిశీలించి పరిష్కరించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పలు ఫిర్యాదులపై ఆయా పోలీస్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్లతో వీడియో సమావేశంలో మాట్లాడి, సూచనలు చేశారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు..కుటుంబ తగాదా లు, ఆర్థిక అంశాలు, మోసాలు, వేధింపులు, భూ తగాదాలకు సంబంధించిన 45 ఫిర్యాదు లు ఎస్పీకి అందజేశారు. ఈ గ్రీవెన్స్‌లో ఏఎస్పీ రాజశేఖర్‌రాజు, డీటీసీ డీఎస్పీ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. సఫ్ల్లయ్ చానళ్లను పూడ్చేస్తున్నారు! చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలోని పలు సమస్యలపై సోమవారం జెడ్పీలో చైర్మన్ శ్రీనివాసులుకు ప్రజాప్రతినిధులు, నాయకులు, స్థానికులు విన్నవించారు. ఇందులో భాగంగా వి.కోట మండలం మీదుగా బెంగళూరు–చైన్నె ఎక్స్‌ప్రెస్ హైవే రోడ్డు నిర్మాణం జరుగుతోంది. ఇందులో భాగంగా వి.కోట, పైపల్లి, పట్రపల్లి చెరువులకు వర్షపునీరు వచ్చే సఫ్లయి చానళ్లను ఎక్స్‌ప్రెస్ హైవే అధికారులు పూడ్చేస్తున్నారని మొరపెట్టుకున్నారు. కర్ణాటక రాష్ట్రం ఎగువ ప్రాంతాల్లో చెరువులు నిండినా, వర్షాలు కురిసినప్పుడు మొరవ ద్వారా వి.కోట, పైపల్లి, పట్రపల్లి చెరువులకు నీరు చేరుతుందన్నారు. ఈ నీటి ద్వారానే ఈ మూడు గ్రామాల ప్రజలకు సాగు, తాగునీరు అందుతోందన్నారు. అయితే ఎక్స్‌ప్రెస్ హైవే అధికారులు కాలువను పూడ్చి దానిపైన రోడ్డు వేస్తున్నారని ఆరోపించారు. అనంతరం మీడియాకు సమస్యను తెలిపారు. చిత్తూరు రూరల్ మండలంలో బోరు, పంపుసెట్ మంజూరు చేయాలని జెడ్పీటీసీ బాబునాయుడు విన్నవించారు. తుమ్మింద పంచాయతీ అడవిచేనులోని మర్రిమాను ఇండ్లు వద్ద 30 కుటుంబాలు ఉన్నాయన్నారు. వీరు నీటి సదుపాయం లేక అవస్థ పడుతున్నారని చెప్పారు. వ్యవసాయబావిలో నీరు తెచ్చుకుని అవస్థలు పడుతున్నారన్నారు. నీటి సమస్యను పరిష్కరించి కొత్త బోరు, పంపుసెట్ మంజూరు చేయాలన్నారు. సఫ్లయ్చానళ్ల సమస్యను కలెక్టర్‌కు నేరుగా కలిసి తెలియజేస్తానని చైర్మన్ తెలిపారు. నీటి సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశిస్తామని వివరించారు. – 8లో– 8లోన్యూస్రీల్జిల్లాలో ముంచుకొస్తున్న జలముప్పు జిల్లాలో వేగంగా అడుగంటుతున్న భూగర్భజలాలు ఎండిపోతున్న చెరువులు, బావులు, కుంటలు యంత్రాంగం అప్రమత్తత అవసరంభూమాతకు గర్భశోకం వచ్చింది. ఈ ఏడు భానుడి ప్రతాపంతో ఆ తల్లి కడుపులో దాచుకున్న జలమట్టం రోజురోజుకూ దారుణంగా పడిపోతోంది. వెరసి.. కుంటలు, చెరువులు, బావులు, బోరు బావుల్లో నీళ్లు అడుగంటిపోయాయి. భూతలం మొత్తం ఎడారిని తలపిస్తోంది. ఫలితం జిల్లాలో కన్నీటి గడియలు మంచుకొస్తున్నాయి. నీటి కోసం జనం నీరసించిపోయే పరిస్థితులు నెలకొంటున్నాయి. వేసవి ప్రారంభంలోనే జిల్లాకు దుర్భిక్షం పరిచయం అయ్యింది. కొన్ని గ్రామాల్లో ఇప్పటికే నీటి కోసం చుక్కలు చూడాల్సి వస్తోంది. – చిత్తూరు కలెక్టరేట్ అత్యధిక నీటిమట్టం పడిపోయిన మండలాలు మండలం పడిపోయిన లోతు(మీటర్లు) గుడుపల్లి: 51.73 వి.కోట: 22.18 కుప్పం: 17.59 రామకుప్పం: 16.71 శాంతిపురం: 14.11 పుంగనూరు: 12.92 గంగవరం: 12.53 పలమనేరు: 11.98 జిల్లాలో నీటి వనరుల సమాచారం కాలువలు: 244 చెరువులు: 4,067 బావులు: 88,650 పెద్ద చెరువులు: 658 బోరుబావులు: 5,456 మొత్తం: 99,075 ఈ మండలాల్లో ఉపశమనం జిల్లాలోని చౌడేపల్లిలో 1.72 మీ టర్లు, నగరిలో 2.16, ఎస్ఆర్ పు రంలో 3.54, తవణంపల్లెలో 1.99, వెదురుకుప్పంలో 3.71, పూతలపట్టు 2.94, కార్వేటినగరంలో 3.86 మీటర్ల లోతుల్లోనే భూగర్భజలాలు అందుబాటులో ఉండడంతో అక్కడి ప్రజలకు ఉపశమనం కలిగింది. వేసవి ప్రారంభంలోనే భూగర్భజలాలు పడి పోతుండగా, ఏప్రిల్, మే నాటికి పరిస్థితి మరింత దిగజారవచ్చని నిపుణులు వెల్లడిస్తున్నారు. 11.05 మీటర్లకు పడిన సగటు నీటిమట్టం జిల్లాలో రోజురోజుకు నీటిమట్టం పడిపోతోంది. ఫిబ్రవరి చివరి నాటికి జిల్లా సగటు భూగర్భ జలమట్టం 11.05 మీటర్లకు పడిపోయినట్లు అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తుంది. జిల్లాలోని గుడుపల్లి, రామకుప్పం, వి.కోట, గంగవరం మండలాల్లో నీటిమట్టం అత్యధిక లోతుకు పడిపోతున్నట్లు తెలిసింది. ఇప్పటికే జిల్లాలో 38 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో అన్నదాతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే రాబోయే ఏప్రిల్, మే నెలల్లో భూగర్భ జలాల పరిస్థితి ఎలా ఉంటుందోనని అన్నదాతలు, ప్రజలు భయాందోళన చెందుతున్నారు. నీటి సంరక్షణ అందరి బాధ్యత నీటి సంరక్షణ ప్రతి ఒ క్కరూ బాధ్యతగా భా వించాలి. నీటిని జాగ్రత్త గా వాడుకోవాలి. అప్పు డే భావితరాలకు నీటి ఎద్దడి లేకుండా చేయవ చ్చు. పశ్చిమ మండలాల్లో కొద్దిగా నీటి సమస్య ఇబ్బందిగానే ఉంది. తాగునీటి సమస్యలున్న గ్రామాల్లో ఇంకుడుగుంతలు ఏర్పాటు చేసుకోవాలి. భూగర్భజలాలను వృథా చేయకుండా వాడుకోవాలి. అర్బన్ ప్రాంతాల్లో నీటిమట్టాలు తగ్గిపోతున్నాయి. కొత్త భవనాల్లో రీచార్జి బిట్ల ను కచ్చితంగా కట్టాలనే ప్రభుత్వ నిబంధన ఉంది. అయితే చాలా చోట్ల ఆ నిబంధన అమలుకు నోచుకోవడం లేదు. పొలాల్లో నీటి గుంటలు, కందకాలను ఏర్పాటు చేసుకోవాలి. – గోవర్ధన్‌రెడ్డి, జిల్లా భూగర్భ జలశాఖ అధికారి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలి నగరం, పరిసర ప్రాంతాల్లో జనాభా పెరగడంతో భూగర్భ జలాల వినియోగం పెరిగింది. వర్షాలు అంతగా లేకపోవడంతో భూగర్భ జలాలపై ఒత్తిడి పెరిగింది. దీంతో కొన్నిచోట్ల బాగా అడుగంటిపోయాయి. నీటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రతి ఇళ్లు, అపార్టుమెంట్ ఆవరణలో ఇంకుడుగుంతలు ఏర్పాటు చేయాలి. నీటి రీసైక్లింగ్ విధానం అమలు చేయాలి. నగర పరిసరాల్లో కొండలు చుట్టూ కందకాలు తవ్వాలి. డబ్బు మాదిరిగానే నీటి వినియోగంలో అంతే పొదుపు, జాగ్రత్తలు పాటించాలి. – రవికుమార్‌నాయుడు, జెడ్పీ సీఈఓ, చిత్తూరు జిల్లా భూగర్భ జలమట్టం పడిపోయిన మండలాల వివరాలివీ.. 10 నుంచి 20 మీటర్ల లోపు నీటిమట్టం పడిపోయిన మండలాలు: 8 20 నుంచి 30 మీటర్ల లోతుకు పడిపోయినవి: 2 5 నుంచి 10 మీటర్ల లోతుకు పడిపోయినవి: 8 -
రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణకు సన్మానం
కుప్పం: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణను కుప్పం బార్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. సోమవారం ఓ కార్యక్రమానికి విచ్చేసిన ఆయన కుప్పం కోర్టు ప్రాంగణాన్ని సందర్శించారు. జూనియర్ న్యాయవాదులు న్యాయ వ్యవస్థ పటిష్టతకు పాటుపడాలని సూచించారు. ప్రస్తుతం కోర్టు భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో దీనిపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నూతన భవనం నిర్మాణం కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి ఆదినారాయణ, జూనియర్ సివిల్ జడ్జి వరణ్ తేజ్, బార్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. -
అయ్యా..స్పందించండి!
విచారణ నిర్వహిస్తున్న ఏసీ రామకృష్ణారెడ్డి ● కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ● సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన ప్రజలు ● వివిధ సమస్యలపై 299 అర్జీలు ● స్వీకరించిన కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ చిత్తూరు కలెక్టరేట్ : ‘అయ్యా..చాలా దూరం నుంచి ప్రతివారం కలెక్టరేట్‌కు వస్తున్నాం .. మా సమస్యలు పరిష్కరించండి’.అంటూ ప్రజలు అధికారులను వేడుకున్నారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన ప్రజలు అధికారులకు అర్జీలు అందజేశారు. అన్ని శాఖలకు సంబంధించి 299 అర్జీలు నమోదుకాగా రెవెన్యూ శాఖకు మాత్రం 247 అర్జీలు వచ్చాయి. ప్రతివారం అధిక శాతం రెవెన్యూ సమస్యలపైనే అర్జీలు నమోదవుతున్నాయి. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ, జేసీ విద్యాధరి, డీఆర్వో మోహన్‌కుమార్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అప్డేట్ కోసం వెళితే పేరునే మార్చేశారు ఆధార్‌కార్డులో అప్డేట్ కోసం వెళితే పాప పేరునే మార్చేశారని బాధిత విద్యార్థిని పూర్ణిమ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సమస్య పరిష్కారించాలని బాలిక, కుటుంబసభ్యులు సోమవారం కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు. విద్యార్థిని పూర్ణిమ మాట్లాడుతూ తాను చిత్తూరు నగరంలోని గిరింపేట నగరపాలక ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుకుంటున్నట్లు తెలిపారు. ఇటీవల ఆధార్ అప్డేట్ కోసం సచివాలయానికి వెళ్లగా అక్కడ పూర్ణిమకు బదులు సౌందర్య అని పేరు మార్చేశారన్నారు. సమస్య పరిష్కరించాలని సచివాలయంలో పలు మార్లు సంప్రదించినా న్యాయం చేయలేదని తెలిపారు. ఎన్నిసార్లు అర్జీ ఇచ్చినా ఇళ్లు ఇవ్వలేదు ఎన్నిసార్లు అర్జీ ఇచ్చినా సొంతిళ్లు మంజూరు చేయడం లేదని పెనుమూరు మండలం విజయనగరం ఎస్టీ కాలనీకి చెందిన కళ్యాణి, గౌరి, యామని తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు విలేకరులతో తమ సమస్యను వెల్లడించారు. తమకు సొంతిళ్లు లేకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. సొంతిళ్లు మంజూరు చేయాలని మండల అధికారులకు ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. న్యాయం చేయాలని కోరారు. సర్వే చేయించి..న్యాయం చేయండి దొంగపట్టాలు చేయించుకున్నారని పరిశీలించి రికార్డుల్లో పేర్లు తొలగించాలని పెనుమూరు మండలం పులికల్లు హరిజనవాడ గ్రామస్తులు అశ్విని, తులసి, మునెమ్మ కోరారు. ఈ మేరకు వారు సోమవారం కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. తమ పూర్వీకుల కాలం నుంచి తమ గ్రామంలోని సర్వే నంబర్ 1196,1197లో 44 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందన్నారు. ఆ భూమిని ప్రభాకరన్ అనే వ్యక్తి ఆక్రమించుకుని దొంగ పట్టాలు చేయించుకున్నారన్నారు. రెవెన్యూ రికార్డుల్లో కుటుంబసభ్యుల పేర్లతో వివరాలు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. ఈ సమస్యపై గత కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా విచారణ చేయించి ప్రభాకరన్ ఆ భూమిలోకి రానివ్వకుండా చేశారన్నారు. అదే భూమిని ప్రస్తుతం పులికల్లు హరిజనవాడకు చెందిన హరి అనే వ్యక్తి ప్రభాకరన్ ద్వారా పట్టాలు పొందినట్లు దౌర్జన్యం చేస్తున్నారని చెప్పారు. శ్మశానవాటిక ఆక్రమించుకున్నారు తమ గ్రామంలోని శ్మశానవాటిక స్థలాన్ని అగ్రకులస్తులు ఆక్రమించుకున్నారని వెదురుకుప్పం మండలం శ్రీనివాసపురం గ్రామస్తులు యుగంధర్, నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్లో వారు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ తమ గ్రామంలోని శ్మశానస్థలాన్ని అగ్రకులస్తులు ఆక్రమించుకున్నారని చెప్పారు. ప్రశ్నించినందుకు దాడులకు పాల్పడుతున్నట్లు వాపోయారు. మండల అధికారులకు తమ సమస్యను ఎన్నిసార్లు విన్నవించుకున్నా న్యాయం చేయడంలేదని తెలిపారు. పరిశీలించి న్యాయం చేయాలని కోరారు. -
పట్టేదెట్టా?
ఇంధనం గుట్టు..పెట్రోల్‌లో నాణ్యతలో తేడా.. కొలతల్లో వ్యత్యాసం.. బంకుల్లో కనీస వసతులు లేమి..తదితర కారణాలతో వినియోగదారులు మోసపోతున్నారు. బంకు యజమానులు పెట్రోల్ పంపుల్లో సాంకేతి పరిజ్ఞానం, చిప్‌లను వినియోగించి నిలువునా దోచేస్తున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నారు. మరి ఈ మోసాలు పట్టేదెలా అని సామాన్యులు చింతిస్తున్నారు. చిత్తూరు అర్బన్: కొన్ని పెట్రోలు బంకుల్లో జరుగుతున్న మోసాలపై రాష్ట్ర హైకోర్టు ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. జరిమానాలతో వాటిని సరిచేయొద్దని కూడా ఘాటుగా వ్యాఖ్యానించింది. అయితే పెట్రోలు బంకుల్లో అసలు ఏం జరుగుతోంది..? ఇక్కడ లభ్యమవుతున్న పెట్రోలు నాణ్యత పరిస్థితి..? వాహన చోదకులకు ఎలాంటి సౌకర్యాలు బంకుల వద్ద లభించాలి..? వీటిపై పర్య వేక్షణ పెట్టాల్సిన అధికారులు ఏం చేస్తున్నారు..? అనే విషయాలను తెలుసుకోవడానికి జిల్లా వ్యాప్తంగా శ్రీసాక్షిశ్రీ బృందం పెట్రోలు బంకులను పరిశీలిస్తే పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. కల్తీ గుర్తించే వీల్లేదు.. పెట్రోలు నాణ్యతను నిర్ధారించేదే ఫిల్టర్ పేపర్ పరీక్ష. బంకుల నిర్వాహకుల వద్ద తప్పనిసరిగా ఫిల్టర్ పేపర్ ఉండాలి. నాణ్యతపై అనుమానం వస్తే..ఓ ఫిల్టర్ పేపర్ తీసుకుని దానిపై నాలుగు చుక్కల పెట్రోలు పోయాలి. నిమిషం తరువాత పేపర్‌పై ఎలాంటి మరక కనిపించకపోతే అది నాణ్యమైనది. ఏదైనా మరక ఏర్పడితే అందులో కల్తీ జరిగిందని గుర్తించాలి. పెనుమూరు, గంగాధరనెల్లూరు, వి.కోట, శాంతిపురం, గుడిపాల, యాదమరి, చిత్తూరులోని పలు పెట్రోలు బంకుల్లో ఫిల్టర్ పేపర్ లేదని చెబుతున్నారు. ఇలా జిల్లాలోని 67 పెట్రోలు బంకుల్లో అసలు ఫిల్టర్ పేపర్ అందుబాటులో లేదు. కొన్ని చోట్ల ఫిల్టర్ పేపర్ ఇస్తుంటే, మరికొన్ని చోట్ల ఉన్నా కూడా ఇవ్వడంలేదు. ఇక పెట్రోలు నాణ్యత తెలుసుకోవడానికి పెట్రోలు పోసే పంపులను గమనిస్తే.. పెట్రోలు 720–775, డీజిల్ 820–345 మధ్యలో ఉంటేనే అది నాణ్యమైనదిగా అర్థం. చాలా చోట్ల లీటరు పెట్రోలు ధర, ఎంత పడుతున్నారనే విషయం తప్ప మరేమీ కనిపించడంలేదు. చిత్తూరు నగరంలోని హై రోడ్డులో ఉన్న బంకులో సాంద్రత రీడింగు ఏమాత్రం కనిపించడంలేదు. ఇదే బంకులో పెట్రోలు పరిమాణం తెలుసుకోవడానికి ఖాళీ బాటిల్లో పెట్రోలు నింపుకుని, వాటర్ బాటిల్ పరిమాణంతో తనిఖీ చేస్తే తేడా కనిపిస్తోంది. మీటరు రీడింగు సున్నా ఉన్నప్పటికీ ఒకేసారి రూ.4 జంప్ అవుతోంది. వసతులు కనిపిస్తే ఒట్టు.. మరోవైపు వాహనాలకు ఉచిత గాలి నింపేందుకు బంకుల్లో పరికరాలు తప్పనిసరిగా ఉండాలి. బంకులు కొత్తగా ఏర్పాటు చేసేప్పుడు కనిపించే ఈ పరికరాలు ఆపై తుప్పుపట్టి ఉంటున్నాయి. గాలి పట్టడానికి వెళితే పనిచేయడంలేదని సిబ్బంది చెబుతున్నారు. అత్యవసర వేళ కాలకృత్యం తీర్చుకోవడానికి వాష్‌రూమ్ తప్పనిసరిగా ఉండాలి. జిల్లాలోని 38 బంకుల్లో వాష్‌రూమ్‌లు లేవు. 42 బంకుల్లో వాష్‌రూమ్‌ల్లో నీళ్లు లేవని, రిపేర్లలో ఉన్నాయని నిర్వాహకులు లోపలకు వెళ్లనీయడంలేదు. ఎక్కువ పరిమాణంలో పెట్రోలును క్యాన్లలో నింపుకుంటున్న విక్రయదారులు, వాటిని పల్లెల్లోకి తీసుకెళ్లి.. కిరోసిన్‌ను కలిపి విక్రయిస్తున్నారు. అధికారులెక్కడ..? పెట్రోలు ఫిల్లింగ్ స్టేషన్లను తనిఖీ చేయాల్సిన పౌరసరఫరాల అధికారులు, తూనికలు–కొలతల శాఖ అధికారులు ఏమాత్రం వినియోగదారుల సమస్యలు పట్టించుకోవడంలేదు. చిత్తూరు నగరంలోని పుత్తూరు రోడ్డులో ఓ బంకులో ఎలక్ట్రానిక్ చిప్‌ను అమర్చి, పెట్రోలు పరిమాణంలో భారీ తేడాలతో దోచుకుంటుంటే ఐదేళ్ల కిందట చేసిన తనిఖీలు తప్ప.. మరేవీ ప్రజలకు గుర్తులేదు. కొన్నిచోట్ల నిర్వాహకుల నుంచి నెలసరి మామూళ్లు, ప్రభుత్వ కార్యక్రమాలకు కుర్చీలు వేయడం, టీ–బిస్కెట్లు ఇవ్వడం లాంటి పనులకు వీళ్లను ఉపయోగించుకుంటున్న అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. జిల్లాలో పెట్రోలు బంకుల వివరాలు పెట్రోలు బంకుల సంఖ్య: 170 పెట్రోలు అమ్మకాలు (నెలకు): 30 లక్షల లీటర్లు డీజిల్ (నెలకు): 30.28 లక్షల లీటర్లు లావాదేవీలు(నెలకు): రూ.30.02 కోట్లు ఫిల్టర్ పేపర్లు లేనివి: 67 బంకులు వాష్‌రూమ్‌లు లేనివి: 38 బంకులు వాష్‌రూమ్‌లు రిపేర్లు: 42 బంకులు గాలి నింపే మిషన్లు రిపేర్లు: 89 ఏది అసలు.. ఏది కల్తీ తెలియని వైనం నాణ్యత నిర్ధారణకు బంకుల్లో వస్తువుల్లేవు వసతులు.. కనీస సౌకర్యాలు కనిపించవు అధికారుల తనిఖీలు నామమాత్రమే ‘సాక్షి’ పరిశీలనలో వెలుగులోకి వాస్తవాలు చర్యలు తప్పవు.. పెట్రోలు ఫిల్లింగ్ స్టేషన్లలో ఏటా తనిఖీలు చేసి, ఎక్కడైనా తేడాలు కనిపిస్తే చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడైనా ఇబ్బందులుంటే మాకు ఫిర్యాదు (ఫోన్–8008301423 )చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. – శంకరన్, జిల్లా పౌరసరఫరాల వాఖ అధికారి, చిత్తూరు. -
కనిపించే దేవత అమ్మ
● ఆచార్య గార్లపాటి దామోదరనాయుడు ● ఘనంగా పైనేని మునెమ్మ స్మారక పురస్కారాలు శ్రీరంగరాజపురం (కార్వేటినగరం) : తల్లికి మించిన దైవం ఏదీ లేదని.. కనిపించే దైవం అమ్మ అని ఆచార్య గార్లపాటి దామోదరనాయుడు అన్నారు. ఆదివారం ఆరిమాకులపల్లె తెలుగుతల్లి కళా ప్రాంగణంలో పైనేని మునెమ్మ స్మారక పురస్కార ప్రదాన కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ.. తల్లిని పూజించగలిగిన వారే భార్యను ప్రేమించగలడని అన్నారు. అనంతరం శతావధాని ఆముదాల మురళీ మాట్లాడుతూ.. సమాజాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దడానికి తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. కథల పోటీలలో గెలుపొందిన రోహిణి వంజారి (హైదరాబాద్), డాక్టర్ సుగుణారావు (విశాఖపట్టణం), ఓట్ర ప్రకాశరావు (తిరుత్తణి), నర్శిరెడ్డి (అనంతపురం), అరుణకుమారి (చిత్తూరు), సీతారామరాజు (కాకినాడ), డాక్టర్ కోటేశ్వరరావు (కరీంనగర్), సింహ ప్రసాద్ (హైదరాబాద్), విమల (చిత్తూరు), సారిపల్లి నారాయణ (హైదరాబాద్), మౌనిక (తిరుపతి) నగదు బహుమతులతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి అధ్యక్ష ,కార్యదర్శులు పైనేని తులసీనాథం నాయుడు, పుష్ప, కోశాధికారి పైనేని మురళీ, జొన్నవత్తుల శ్రీరామచంద్రమూర్తి, ఆనందబాబు, నరేంద్ర, యుగంధర్, విజయేంద్రనాయుడు, కాంతమ్మ, రమ్య, రేణుక, ప్రసాద్ పాల్గొన్నారు. -
దమ్ముంటే పట్టుకో..
● యథేచ్ఛగా ఇసుక, గ్రావెల్ అక్రమ రవాణా ● రూ. కోట్లు కొల్లగొడుతున్న నేతలు ● రెచ్చిపోతున్న పచ్చ మాఫియా ● చేష్టలుడిగి చూస్తున్న అధికారులు వెదురుకుప్పం : సమయం లేదు మిత్రమా.. అందిన కాడికి దోచేద్దాం.. ఎవరైనా అడ్డొస్తే వాళ్ల సంగతి తేల్చేద్దాం.. అధికారులు మాట వినకపోతే వేటు వేద్దాం.. ఇదీ కూటమి ప్రభుత్వంలో బరి తెగిస్తున్న పచ్చనేతల తీరు. అక్రమాలను అడ్డుకుంటున్న అధికారులపై ప్రలోభాలు, బెదిరింపులు.. ప్రత్యక్ష, పరోక్ష దాడులతో హడలిపోతున్నారు. నిక్కచ్చిగా విధులు నిర్వహించాలంటే ఇక్కడ సాధ్యమయ్యే పనికాదు.. నేతలు చెప్పిందల్లా చేస్తే సరి.. ఎదురు తిరిగితే.. పోస్టింగ్ కోసం ఎదురు చూడక తప్పని పరిస్థితులు కల్పిస్తున్నారు. పుష్ప సినిమాను తలదన్నేలా నిర్విరామంగా సాగుతున్న సిండికేట్ దందాలు అన్నీ ఇన్నీ కావు. జిల్లాలో చోటా నాయకుల నుంచి ప్రజాప్రతినిధుల వరకూ అడ్డూ అదుపూ లేకుండా చేస్తున్న అరాచకాలు, దౌర్జన్యాలకు హద్దు లేకుండా పోతోంది. ఇసుక, మట్టి ఉన్న ప్రాంతాల్లో పాగా వేసి అక్రమ సామ్రాజ్యాన్ని నెలకొల్పి భారీ దోపిడీ చేస్తున్నారు. ఆదాయ వనరులుగా ఇసుక, గ్రావెల్ చిత్తూరు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లోనూ కూట మి నాయకులు చేస్తున్న దందాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఎమ్మెల్యేల కనుసన్నల్లో ఇసుక, గ్రావెల్ దోపిడీ ఇష్టారాజ్యంగా నడుస్తోంది. ప్రధానంగా ఇసుక, మట్టిని విచ్చలవిడిగా తోడేస్తున్నారు. సహజ సిద్ధంగా ఏర్పడిన ఇసుక, మట్టి అక్రమార్కులకు ఆదాయ వనరుగా మారింది. ప్రజాప్రతినిధుల అండ దండలతో రూ. కోట్లు ఆర్జిస్తున్నారు. పట్టపగలే గ్రావెల్‌తో పాటు ఇసుకను తవ్వి రవాణా చేస్తున్నా అధికారులు చేతులు ముడుచుకుని చేసేది లేక మిన్నుకుండి పోతున్నారు. జిల్లా నుంచి వందల సంఖ్యలో ట్రాక్టర్లు, టిప్పర్లతో ఒక పక్క ఇసుక మరో పక్క గ్రావెల్‌ను తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు తరలించి రూ. కోట్లు దండుకుంటున్నారు. అక్రమార్కులకు అడ్డాగా.. జీడీ నెల్లూరు అక్రమార్కులకు అడ్డాగా మారింది. అధికారుల కళ్లు గప్పి పెద్ద ఎత్తున ఇసుకను అక్రమ రవాణా చేస్తున్న తీరు చూస్తే విస్తుపోవాల్సిందే. సహజ సిద్ధంగా ఏర్పడిన మట్టి, ఇసుక కూటమి నేతలకు కా సులు కురిపిస్తున్నాయి. కొండలు కనిపిస్తే చాలు ఠంచనుగా నాయకులు వాలిపోయి జేసీబీలతో తవ్వి సొ మ్ము చేసుకుంటున్నారు. అక్రమార్కుల దనార్జనకు కొండలు, గుట్టలు కరిగిపోతున్నాయి. గంగాధర నె ల్లూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లోనూ కూ టమి నేతలు ఇలా మట్టి, ఇసుక దోపిడీ చేస్తూ రూ. కోట్లు గడిస్తున్నారన్నదే ప్రజలందరికీ తెలిసిన బహిరంగ సత్యం. తమిళనాడుకు సరిహద్దు ప్రాంతమైన గంగాధర నెల్లూరు నియోజకవర్గం పచ్చ మాఫియాకు అనుకూలంగా మారింది. ప్రధానంగా పాలసముద్రం, గంగాధర నెల్లూరు, శ్రీరంగరాజపురం, కార్వేటి నగరం మండలాల్లో నిత్యం వందల సంఖ్యలో ట్రాక్ట ర్లు, టిప్పర్ల ద్వారా గ్రావెల్‌ను తరలిస్తున్నారు. పెద్ద ఎత్తున దందాలు క్వారీ యజమానుల వద్ద నుంచి స్థానిక ఎమ్మెల్యే పేరు చెప్పి వసూళ్లకు తెగపడుతున్నారు. ఆరు మండలాల్లోనూ పీఏలను నియమించిన ఓ ప్రజాప్రతినిధి ఆ యా మండలాల్లో ఎన్ని క్వారీలు ఉన్నాయనే వివరాలను అధికారుల వద్ద నుంచి సేకరించి దందాలకు పాల్పడుతున్నారు. నేను ప్రజాప్రతినిధి పీఏని మామూళ్లు ఇస్తావా వాహనాలు సీజ్ చేయమంటావా అంటూ బెదిరింపులకు దిగుతున్నట్లు యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని రికార్డులు సక్రమంగా ఉంచుకుని క్వారీలను నడుపుతున్నా ఏదో ఒక సాకు చెప్పి నిలిపివేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మామూళ్లు ఇచ్చుకుంటేనే సరి లేకుంటే దౌర్జన్యాలు, బెదిరింపులకు దిగుతున్నట్లు చెబుతున్నారు. గతంలో ఇలాంటి దోపిడీలు లేవని, ఈ దోపిడీ విషయంలో గత ప్రభుత్వం ఎన్నో రెట్లు మేలని చెప్పుకుంటుండడం విశేషం. అక్రమాలు ఇలా.. గంగాధర నెల్లూరు మండలంలోని ముక్కలత్తూరు, కొట్రకోన, పాతపాళెం ప్రాంతాల్లో ఇసుక రీచ్‌లు ఉన్నాయి. ముక్కలత్తూరులో నీవా నది నుంచి చైన్నెకి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. ఇక్కడ పచ్చ బ్యాచ్ ఇసుకను డంప్ చేసి రాత్రికి రాత్రే ట్రాక్టర్లు ద్వారా తమిళనాడుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇక్కడ నుంచి వెళ్లే ఇసుక రవాణాకు ఎలాంటి అనుమతి ఉండవని చెబుతున్నారు. పాలసముద్రం మండలంలోని వనదుర్గాపురం, సింహరాజపురం, బలిజకండ్రిగ, మటవలం గ్రామాల్లో ఇసుక డంప్ చేసి రాత్రికి రాత్రే టిప్పర్లు, ట్రాక్టర్లలో కూటమి నేతలు తరలిస్తున్నారు. ఒక టిప్పర్ రూ. 25 వేలు పలుకుతోంది. వెదురు కుప్పం మండలంలోని పచ్చికాపల్లం, వెదురుకుప్పం ప్రాంతాల నుంచి మట్టి దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. రాత్రి పూట జేసీబీల నుంచి గుట్టలను తవ్వి అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నారు. శ్రీరంగరాజపురం మండలంలో కూటమి నేతలు విచ్చలవిడిగా మట్టిని విక్రయించి దోచుకుంటున్నారు. ఇక్కడ కూటమి నేతలు చెప్పినట్టే అధికారులు తలలు ఊపుతున్నారు. గ్రావెల్ కోసం పచ్చని గుట్టలను మాయం చేస్తున్నారు. పాతపాళ్యం వద్ద ఉన్న కొండను తవ్వి సొమ్ము చేసుకున్నారు. తర్చూరు హైవే రోడ్డు పనుల నిమిత్తం మట్టిని తరలించే క్రమంలో దాన్ని సాకుగా చూపి పెద్ద ఎత్తున గ్రావెల్ తరలిస్తున్నట్లు స్థానికలు ఆరోపిస్తున్నారు. కార్వేటినగరం మండలంలో గ్రావెల్, ఇసుక అక్రమ రవాణాకు అడ్డూ అదుపూ లేదు. ప్రజాప్రతినిధి సొంత మండలం కావడంతో ఇసుకను డంప్ చేసుకుని రవాణా చేస్తున్నారు. ఇక్కడ టీడీపీ, జనసేన పార్టీలు పోటా పోటీగా అక్రమాలకు పాల్పడుతున్నారు. -
భక్తిశ్రద్ధలతో పెద్ద దేవర్లు
కనిపించని సౌర వెలుగులు కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన సూర్యఘర్ పథకానికి జిల్లాలో స్పందన అంతంత మాత్రంగానే ఉంది.మానవాళి సంక్షేమానికే సైకిల్ యాత్ర సోమవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 2025కాణిపాకం : సచివాలయ వ్యవస్థ కింద ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,069 మంది ఏఎన్ఎంలు పని చేస్తున్నారు. ఫస్ట్ ఏఎన్ఎంలుగా 247 మంది, సెకండ్ ఏఎన్ఎంలుగా 644 మంది విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా కొన్నేళ్లుగా సెకండ్ ఏఎన్ఎం, కాంట్రాక్టు ఏఎన్ఎంలుగా విధులు నిర్వర్తించడంతో 2019లో జరిగిన గ్రామ, వార్డు సచివాలయ హెల్త్ సెక్రటరీ పోస్టులకు కొందరు డిస్ట్రిక్ సెలక్షన్ కమిటీ ద్వారా 10 నుంచి 15 మార్కుల వెయిటేజీతో విధుల్లో చేరారు. విడతల వారీగా చేరుతూ.. గ్రామ, వార్డు సచివాలయాలు 2019 అక్టోబర్ 2న ప్రారంభం కాగా, హెల్త్ సెక్రటరీలుగా సరైన రికార్డులతో విధుల్లో చేరాల్సి ఉంది. అందులో కొందరు అక్టోబర్ 14న కొంత మంది విధులకు రిపోర్టు చేశారు. మరికొంత మంది అక్టోబర్ 16 నుంచి డిసెంబరు నెలాఖరు వరకు విధుల్లో చేరుతూ వచ్చారు. జిల్లాలో మూడు విడతలుగా పోస్టింగ్ ఆర్డర్లు విడుదల చేయగా.. అభ్యర్థులు వారికి అనుకూలమైన తేదీల్లో జాయినింగ్ అయ్యారు. కొంత మంది అభ్యర్థుల సర్టిఫికెట్లు సక్రమంగా లేకపోవడం, పూర్తి స్థాయిలో సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వడం ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో బోగస్ సర్టిఫికెట్లతో విధుల్లో చేరిన కొందరిని గుర్తించి, తిరిగీ సర్టిఫికెట్లు పరిశీలించగా.. కొంత మంది సకాలంలో సమర్పించకపోవడంతో విధుల నుంచి తొలగించారు. రూపకల్పన ఇలా.. గ్రేడ్–3 ఏఎన్ఎం నుంచి గ్రేడ్–2 ఏఎన్ఎంల ఉద్యోగోన్నతులకు గతేడాది ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఈ మేరకు జిల్లాలో ఖాళీగా ఉన్న గ్రేడ్–2 పోస్టులకు అర్హుల జాబితా తయారవుతోంది. అయితే ఈ జాబితా తయారీలో వైద్య ఆరోగ్య జిల్లా వైద్యాధికారుల తీరు ఏఎన్‌ఎంలలో అలజడి సృష్టిస్తోంది. కార్యాలయంలో ఇష్టారాజ్యంగా తీసుకుంటున్న నిర్ణయాలు వారిని అయోమయంలో పడేస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా జాబితా తయారీ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈక్రమంలో ఎస్టీ కేటగిరికి 6 శాతం, ఎస్సీకి 15 శాతం రిజర్వేషన్ ప్రకారం చేశారు. అయితే జనరల్ కేటగిరిలో ఎస్టీ కేటగిరికి తీవ్ర అన్యాయం జరిగిందని గోలగోల చేస్తున్నారు. ఎస్టీ కులానికి చెందిన కొందరు ఏఎన్ఎంలకు మెరిట్ ఉన్న జనరల్ కేటగిరిలో వారిని పక్కన పెట్టేశారని, వికలాంగులను పట్టించుకోలేదనే వాదనలు ఉన్నాయి. సిఫార్సులకు తలొగ్గినట్లు విమర్శలు వస్తున్నాయి. కొన్నింటికి బేరసాలు జరిగినట్లు, కలెక్టర్ బంగ్లాకు సమీపంలోని ఓ కేఫ్‌లో బేరసాలు జరిగినట్లు కొందరు ఆరోపిస్తున్నారు. తప్పులు కప్పిపుచ్చే ప్రయత్నం ఉద్యోగోన్నతుల జాబితా తయారీలో పలు ఆరోపణలు వస్తున్నా వాటిని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పూర్తిగా పట్టించుకోవడంలేదు. ఏఎన్ఎంలు పలు సమస్యలు తీసుకొస్తున్నా వాటిని లెక్క చేయకుండా ప్రభుత్వ విధి విధానాల పేరుతో తప్పించుకుంటున్నారు. జాబితాలో తప్పులు ఉన్న వాటిని కప్పి పుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై జిల్లా యంత్రాంగం ప్రశ్నించిన జాబితా విషయంలో దొరక్కుండా సమాధానం ఇవ్వాలని హుకుం జారీ అయినట్లు సమాచారం. ఇఫ్తార్ నిర్వహణకు రూ.4.35 లక్షల విరాళం – పెద్దిరెడ్డి కుటుంబం ఔదార్యం పుంగనూరు : రంజాన్ ఉపవాస దీక్షల నేపథ్యంలో ముస్లింల పట్ల పెద్దిరెడ్డి కుటుంబం తమ ఔదార్యాన్ని చాటుకుంది. పట్టణంలోని 29 మసీదుల్లో ఇఫ్తార్ నిర్వహణకు పెద్దిరెడ్డి కుటుంబం తరఫున తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి రూ.4.35 లక్షల విరాళాన్ని ముస్లిం పెద్దలకు ఆదివారం అందజేశారు. ఏటా ముస్లింలకు విరాళం అందజేయడం తమ కుటుంబం సంప్రదాయమని చెప్పారు. కార్యక్రమంలో చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప, పలువురు మసీదు పెద్దలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఒక్క రోజులో బిల్లుల చెల్లింపు రూ.1.14.కోట్లు చిత్తూరు కార్పొరేషన్ : విద్యుత్ బిల్లులు చెల్లింపుల కేంద్రానికి ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ అందుబాటులో ఉంచారు. ఈ మేరకు చిత్తూరు, తిరుపతి జిల్లాల నందు సేవలను వినియోగదారులు వాడుకున్నారు. రెండు జిల్లాల పరంగా మొత్తం10 వేల 200 మంది వినియోగదారులు బిల్లులు చెల్లించగా తద్వారా రూ.1.14 కోట్లు వచ్చిందని ట్రాన్స్‌కో ఎస్ఈలు ఇస్మాయిల్ అహ్మద్, సురేంద్రనాయుడు వివరించారు. ఒకే ఈతలో మూడు దూడలు ఐరాల : మండలంలోని యదర్లపల్లెలో ఆదివారం రైతు వినోద్‌కు చెందిన ఆవు ఒకే ఈతలో మూడు కోడె దూడలను ఈనింది. వీటిని చూసేందుకు స్థానిక, సమీప గ్రామస్తులు ఆసక్తి కనబ రిచారు. అయితే కొద్దిసేపటికి రెండు దూడలు మృతి చెందాయి. ఒక దూడ ఆరోగ్యంగా ఉందని రైతు తెలిపారు. ఇలాంటి సంఘటనలు జన్యుపరమైన లోపంతో జరుగుతుంటాయని పశువైద్యశాఖ ఏడీ పద్మావతి తెలిపారు. ఇవి బతకపోవడానికి రెండు కారణాలు ఉంటాయని, బలహీనంగా ఉండడం, చేతులతో గట్టిగా లాగడం చేస్తే దూడలు చనిపోతాయని తెలిపారు. నేడు కలెక్టరేట్లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక చిత్తూరు కలెక్టరేట్ : ప్రజల సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారని పేర్కొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం ఎదుట ఏఎన్ఎంల నిరసన నేడు ప్రపంచ టీబీ దినోత్సవ ర్యాలీ చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరంలో సోమవారం ప్రపంచ టీబీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా క్షయ నివారణ అధికారి వెంకట ప్రసాద్ తెలిపారు. ఇందులో భాగంగా ఉదయం 8.30 గంటలకు చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ చేపడతామన్నారు. అనంతరం జెడ్పీ సమావేశ మందిరంలో సమావేశం ఉంటుందని తెలిపారు. నగరి: మానవాళి సంక్షేమాన్ని కోరుతూ సైకిల్ యాత్ర చేపట్టినట్లు నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం శ్రీపతిరావుపేటలోని సంజీవరాయ ఆంజనేయస్వామి ప్రధాన అర్చకులు కాశ్యపు అశోకయ్యస్వామి తెలిపారు. ఆయన ఈ నెల 19న ఆత్మకూరు నుంచి తమిళనాడులోని ఘటికాచలం వరకు 450 కిలోమీటర్ల సైకిల్ యాత్ర ప్రారంభించారు. ఆదివారం నగరి పట్టణ పరిధిలోని నెత్తంకండ్రిగకు చేరుకున్నారు. ఆయన మాట్లాడుతూ నంద్యాల, ఆళ్లగడ్డ, మైదుకూరు, కడప, రేణిగుంట, తిరుపత్తణి మీదుగా ఘటికాచలం చేరుకోనున్నట్లు తెలిపారు. గతంలోనూ ఆత్మకూరు నుంచి పండరీపురం, శ్రీకోయిలూరు మీదుగా మంత్రాలయానికి సైకిల్ యాత్ర చేసినట్టు తెలిపారు. గుడుపల్లె : మండలంలోని జోగ్యానూరులోని సిద్ధేశ్వరస్వామి, బీరేశ్వరస్వామి ఆలయాల్లో కురబ కులస్తులు పెద్ద దేవర్ల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మూడు రోజుల పాటు గ్రామంలోని ఆలయ ఆవరణలో కర్ణాటక, ఆంధ్రా రాష్ట్రాల్లోని 300 మంది కురబ కులస్తులు పెద్ద దేవర సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. బయట ప్రాంతాల నుంచి వచ్చిన కురబ కుటుంబాల వారు ఒకరోజు రాత్రి అక్కడే బస చేసి ఉదయాన్నే స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయంలో సంప్రదాయబద్ధంగా దేవర ఎద్దుకు ప్రత్యేక పూజలు చేశారు.ఆలయం వద్ద భక్తిశ్రద్ధలతో తలపై టెంకాయలు కొట్టే కార్యక్రమం చేపట్టారు. రాత్రి భక్తుల వినోదం కోసం కోలాటలు, పౌరాణిక నాటకాలను ప్రదర్శించారు. – 8లో– 8లోన్యూస్రీల్ఉమ్మడి జిల్లా ఏఎన్ఎంల వివరాలు.. సచివాలయ ఏఎన్ఎంలు – 1069 ఫస్ట్ ఏఎన్ఎంలు – 247 సెకండ్ ఏఎన్ఎంలు – 644 పదోన్నతుల జాబితా – 307 ఎస్టీల రిజర్వేషన్ – 6 శాతం ఎస్సీల రిజర్వేషన్ – 15 ఆర్డర్ మేరకు ఇవ్వాలి.. వైద్య ఆరోగ్యశాఖలో ర్యాంకు ప్రకారమే పదోన్నతులు చేస్తామని చెబుతున్నారు. ఈ విషయాన్ని కలెక్టర్‌కు తెలియజేశాం. కలెక్టర్ అపాయింట్ ఆర్డర్ ప్రకారమే చేస్తామని హామీ ఇచ్చారు. అయితే జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం ర్యాంకు ప్రకారమే చేస్తామని చెబుతున్నారు. అప్పుడు మూడు బ్యాచ్‌లుగా తీసుకున్నారు. ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్‌కు పదోన్నతుల్లో తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. – గీత, ఏఎన్ఎం కలెక్టర్ చెప్పినా పట్టించుకోవడం లేదు.. మమల్ని ఫస్ట్ బ్యాచ్‌లో తీసుకున్నారు. అయితే ఫస్ట్ బ్యాచ్‌ను పక్కన పెట్టి..ర్యాంకు ఆధారంగా చేసుకుంటున్నారు. దీనిపై మాకు అనుమానాలున్నాయి. ఉద్యోగోన్నతుల కోసం దొంగ సర్టిఫికెట్లు ఇచ్చారు. ఇలా చేస్తే ఫస్ట్ ఏఎన్ఎం, సెకండ్ ఏఎన్ఎంల, వయస్సు మళ్లిన వారి పరిస్థితి ఏంటి? ఈ విషయంపై కలెక్టర్ చెప్పినా పెడచెవిన పెడుతున్నారు. ఫస్ట్ బ్యాచ్‌కు పదోన్నతులు కల్పించాలి . – క్రిష్ణమ్మ, ఏఎన్ఎం పారదర్శకంగా చేపడుతాం ఏఎన్ఎంల పదోన్నతుల ప్రక్రియను ప్రభుత్వ ఆదేశాల మేరకు పారదర్శకంగా చేస్తున్నాం. కలెక్టర్‌కు వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం. 307 మందితో మెరిట్ లిస్ట్ ఇచ్చాం. ఆ 307 మందికి పదోన్నతులు ఉండవు. 297 మందికే ఉంటాయి. జాబితాలో ఏవైనా లోటుపాట్లు ఉంటే..అందుకు అదనంగా కొంత మందిని లిస్టులో పెట్టాం. మరో 5 మందిని జాబితాలోకి తీసుకోలేదు. ఇంకా జాబితా పూర్తి కాలేదు. – సుధారాణి, డీఎంఅండ్‌హెచ్‌ఓ, చిత్తూరు ఏఎన్ఎంల ఉద్యోగోన్నతుల జాబితాలో గందరగోళం నెలకొంది. ర్యాంకు ఆధారంగా ఫైనల్ జాబితా సిద్ధం చేశారంటూ ఆందోళన మొదలైంది. డేట్ ఆఫ్ జాయినింగ్ పక్కన పెట్టారని, జాబితా తయారీలో అన్యాయం జరిగిందంటూ పలువురు ఏఎన్ఎంలు ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగోన్నతుల కోసం తప్పుడు పత్రాలు సమర్పించారని, సిఫార్సులకు పెద్దపీట వేశారని, ఎస్టీ కేటగిరికి జనరల్‌లో అన్యాయం జరిగిందంటూ ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖలో ఇష్టారాజ్యం 2 రోజుల్లో ఏఎన్ఎంల పదోన్నతుల జాబితా ప్రకటన? ర్యాంకు ఆధారంగా ఫైనల్ లిస్టు సిద్ధం డేట్ ఆఫ్ జాయినింగ్‌ను పక్కన పెట్టిన వైనం జాబితా తయారీలో అన్యాయంపై ఏఎన్ఎంల ఆందోళన తప్పుడు పత్రాలు ఉన్నాయంటూ ఆరోపణలు ఎస్టీలకు జనరల్ కేటగిరీలో అన్యాయం కలెక్టర్‌కు ఫిర్యాదుల పరంపర స్పష్టత లేని జాబితా గ్రేడ్–3 ఏఎన్ఎంలు 1069 మంది ఉన్నారు. ఉద్యోగోన్నతుల్లో భాగంగా ఇటీవల విడుదల చేసిన మెరిట్ లిస్టులో 307 మంది పేర్లను ప్రకటించారు. ఇందులో 297 మందికే పదోన్నతులు ఉంటాయని చెప్పడంపై గందరగోళంగా మారింది. దీనిపై అనుమానం రావడంతో తమకు అన్యాయం జరిగిందంటూ కొంత మంది కలెక్టర్‌ను కలిసి విన్నవించార. ఈ మేరకు మరో 5 పోస్టులు ఇవ్వాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు శాఖ కమిషనర్‌కు నివేదికలు సమర్పించినట్లు తెలుస్తోంది. దీంతో ఆ 5 మంది పేర్లను జాబితాలో చేర్చారని తెలిసింది. మళ్లీ కొంత మంది కలెక్టర్‌ను కలిసి పదోన్నతుల జాబితాలో జరిగిన తప్పులను ఎత్తి చూపిస్తున్నారు. ఇష్టానుసారంగా జాబితాను తయారు చేయడంపై మండిపడుతున్నారు. ఇలానే కొనసాగితే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. -
కనిపించని సౌర వెలుగులు
● సూర్యఘర్ పథకంపై నిరాసక్తత ● రాయితీ ఉన్నా వినియోగించుకోని వైనం ● జిల్లాలో దరఖాస్తులు 5 వేలు ● 250 యూనిట్లే ఏర్పాటుచిత్తూరు కార్పొరేషన్ : కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకానికి జిల్లాలో స్పందన అంతంత మాత్రంగానే ఉంది. సౌర ఫలకాల ఏర్పాటు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. మార్చి నాటికి జిల్లాలో సుమారు 6 వేల యూనిట్లను ఏర్పాటు చేయించాలన్నది లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 5 వేల మంది దరఖాస్తు చేయగా, 288 మంది మాత్రమే డబ్బులు చెల్లించారు. వీరిలో 250 మంది ఇళ్లపై రూఫ్ టాప్ సోలార్ యూనిట్లు ఏర్పాటు చేశారు. ఇందులో చిత్తూరు డివిజన్‌లోనే 146కు పైగా ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో విద్యుత్ సరఫరాను దృష్టిలో పెట్టుకొని సోలార్ యూనిట్ల ఏర్పాటును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. సొంత ఇంటి పై సౌర పలకాలు ఏర్పాటుతో సొంతంగా విద్యుత్ ఉత్పత్తిని చేసుకోవచ్చు. మిగులు విద్యుత్‌ను శాఖా పరంగా కొనుగోలు చేసి బిల్లులో సర్దుబాటు చేయనున్నారు. ఒకేసారి పెట్టుబడి పెడితే కరెంటు బిల్లు జోలికి పోవాల్సిన అవసరం ఉండదు. ఆసక్తి చూపని జిల్లావాసులు సౌర విద్యుత్‌కు ప్రభుత్వం రాయితీ ఇస్తోంది. బ్యాంకు రుణాలకు బ్యాంకర్లు మొండిచేయి చూపడంతో వినియోగదారులు ఆసక్తి చూపడంలేదు. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా వీటిని ఏర్పాటు చేస్తుండటంతో.. భవిష్యత్తులో అందరికీ ఇలా పెడతారనే నమ్మకంతో కొంత మంది ఉన్నారు. దీనికి తోడు కుప్పం నియోజకవర్గం మొత్తం పైలట్ ప్రాజెక్టుగా అందరికీ అందించనున్నారు. పెట్టుబడి లేకుండా సొలార్ పలకాలను ఏర్పాటు చేయనున్నారు. యూనిట్ వ్యయం రికవరీ అయ్యే వరకు విలువ మొత్తంను మిగులు విద్యుత్‌లో మినహాయించుకోనున్నారు. ఈ విధానం విజయవంతం అయితే కొన్ని సంవత్సరాల తర్వాత జిల్లా అంతటా పెడతారని భావిస్తున్నారు. డీలర్లు అయిదేళ్ల పాటు ఉచిత సర్వీసు అందిస్తున్నారు. ఈ పథకంను కేంద్ర ప్రభుత్వం గతేడాది ఫిబ్రవరిలో అందుబాటులోకి తెచ్చింది. సౌర విద్యుత్ ప్యానళ్లు, ఇతర సామగ్రికి అయ్యే వ్యయంలో కొంత మొత్తం ప్రభుత్వం రాయితీ అందజేస్తోంది. ఆదాయం పొందవచ్చు మొత్తం విద్యుత్ వినియోగం ఆధారంగా 120 యూనిట్లలోపు ఉన్న వారికి 1 కిలోవాట్ అవసరమవుతుంది. దీనికి రూ.30,000 రాయితీని అందిస్తున్నారు. 240 యూనిట్లు నెలకు వాడుకునే వారికి 2 కిలోవాట్లు అవసరం కాగా రూ.60,000 రాయితీ ఇస్తున్నారు. 360 యూనిట్లు వినియోగిస్తున్న వారికి 3 కిలోవాట్లు అవసరమవుతుంది. వీటికి రూ.78,000 రాయితీ ఇస్తున్నారు. దాదాపు రూ.2 లక్షలు విలువైన 3 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ప్యానెల్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం రూ.78 వేల రాయితీ కల్పించింది. రూ.20 వేలు లబ్ధిదారుడి వాటాపోనూ మిగిలిన మొత్తానికి 7 శాతం తక్కువ వడ్డీతో బ్యాంకు రుణం పొందవచ్చు. ఈ వ్యవస్థ ద్వారా ఏడాదికి దాదాపు రూ.32 వేలు ఆదా అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వినియోగించుకున్న మిగిలిన సౌర విద్యుత్‌ను గ్రిడ్‌కు ఇవ్వడం ద్వారా యూనిట్‌కు రూ.2.09 ఆదాయం పొందవచ్చు. రుణం పొందేందుకు బ్యాంకులకు సెక్యూరిటీ కింద ఎటువంటి డాక్కుమెంటులు సమర్పించాల్సిన అవసరం లేదు. అపోహలు వద్దు సోలార్ పవర్ వల్ల విద్యుత్ బిల్లు భారీగా తగ్గుతుంది. మొదట పెట్టుబడి ఎక్కువగా అనిపించినప్పటికీ భవిష్యత్తులో ఊహించని ప్రయోజనం చేకూరుతుంది. సోలార్ రూఫ్ టాప్ విషయంలో ఎటువంటి అపోహలు అవసరం లేదు. బ్యాంకులు రుణంగా ఇస్తాయి. బ్యాంకు అప్పు తీరిపోతే 15 సంవత్సరాల పాటు ఇంటికి ఉచితంగా విద్యుత్ పొందడంతో పాటు మరికొంత సొమ్ము ఎస్పీడీసీఎల్ నుంచి వస్తుంది. – ఇస్మాయిల్ అహ్మద్, ఎస్ఈ ట్రాన్స్‌కో -
కళాశాల వేడుకలో వినూత్న నిరసన
పలమనేరు : పలమనేరు సమీపంలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం రాత్రి కళాశాల వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగానికి ముందు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. పలువురు విద్యార్థులు వైఎస్సార్సీపీ జెండాలతో నృత్యం చేస్తూ జగనన్న జిందాబాద్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. దీంతో ప్రజాప్రతినిధితో పాటు కళాశాల యాజమాన్యం సైతం ఖంగుతింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాటలు వేసి వినిపించినా విద్యార్థులు తామే తగ్గేదేలేదంటూ జగనన్న నినాదాలతో హోరెత్తించారు. జగన్నన విద్యాదీవెన, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్మెంట్ లేకుండా చేసిన కూటమి సర్కార్‌పై ఈ విధంగా విద్యార్థులు నిరసన తెలిపారు. దీంతో కళాశాల నిర్వాహకులు సైతం చేసేదీమీ లేకుండా పోయింది. కార్యక్రమానికి విచ్చేసిన స్థానిక ప్రజాప్రతినిధి సైతం మిన్నుకుండిపోవాల్సి వచ్చింది. -
గంగ జాతరకు పటిష్ట ఏర్పాట్లు
● రేపటి నుంచి జాతర ఉత్సవాలు ● 400 మంది పోలీసులతో బందోబస్తు ● పలమనేరు డీఎస్పీ ప్రభాకర్ వెల్లడి పుంగనూరు : ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే శ్రీసుగుటూరు గంగమ్మ జాతరను పటిష్టంగా నిర్వహించేందుకు అన్నిశాఖల అధికారులతో సమన్వయం చేసుకున్నామని పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ తెలిపారు. ఆదివారం పోలీస్ స్టేషన్లో సీఐలు, పట్టణ ప్రముఖులు, రాజకీయ నాయకులు, వివిధశాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. జాతర జరిగే ప్యాలెస్ ఆవరణం , ప్యాలెస్‌లో జమీందారులు సోమశేఖర్ చిక్కరాయల్, మల్లికార్జున చిక్కరాయల్తో సమావేశమై జాతర ఏర్పాట్లు గురించి చర్చించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. డీఎస్పీ, సీఐలు, ఎస్ఐలు , సిబ్బంది 400 మందిని జాతర బందోబస్తుకు నియమించామన్నారు. 25న మంగళవారం రాత్రి అమ్మవారి ఊరేగింపుతో ప్రారంభమై 26న బుధవారం వేకువజాము నుంచి అమ్మవారిని ప్రజల దర్శనార్థం ప్యాలెస్‌లో ఉంచుతారని తెలిపారు. అదే రోజు రాత్రి అమ్మవారి నిమజ్జనం ఉంటుందని తెలిపారు. శాంతి కమిటీ ఏర్పాటు జాతరలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు చేపట్టామని డీఎస్పీ తెలిపారు. అనుమానితులు , జేబు దొంగలను ముందుగానే అదుపులోకి తీసుకునేలా ఐడీ పార్టీ బృందాలను నియమించామన్నారు. జాతరకు వేల మంది రానున్న కారణంగా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తామని , ఇందుకోసం ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. జాతరను జయప్రదం చేసేందుకు అన్ని వర్గాలతో కలిపి శాంతి కమిటీని ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. సమావేశంలో ఎస్బీ సీఐ భాస్కర్, సీఐలు రామ్‌భూపాల్, ఉమామహేశ్వర్రావు, ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు, ఎస్ఐ లోకేష్ తదితరులు పాల్గొన్నారు. ట్రాఫిక్ మళ్లింపు పట్టణ సమీపంలోని అరబిక్ కళాశాల నుంచి బస్సులు, లారీలు , కార్లు బైపాస్‌రోడ్డు నుంచి చదళ్ల క్రాస్‌కు మళ్లిస్తున్నామన్నారు. అలాగే పట్టణంలోని సెంటర్‌లాడ్జి, తూర్పుమొగశాల, నగిరివీధి, బ్రాహ్మణవీధి, కట్ట కిందపాళ్యెం ప్రాంతాలలో కార్లు , ద్విచక్రవాహనాలు పూర్తిగా నిషేధిస్తామన్నారు. అత్యవసర సమయాల్లో అనుమతిస్తామన్నారు. పార్కింగ్ కోసం చెరువు కట్టపైన , ఆర్టీసీ డిపో , ఎన్ఎస్ పేట, బీఎంఎస్ క్లబ్ ప్రాంతాలలో స్థలం ఏర్పాటు చేశారు. -
● ఆ అధికారి వింత చేష్టలు ● అనుమానం వస్తే తప్పని వేధింపులు ● చిత్తూరోళ్లంటే గిట్టని వైనం ● కార్యాలయంలో అనధికారిక డెప్యూటేషన్లు
అపరిచితుడు ! సాక్షి టాస్క్‌ఫోర్స్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఓ అధికారి తీరుతో శాఖ అధికారులు, సిబ్బంది బేజారవుతున్నారు. ప్రతి దానికి అందరిపై అనుమానం పడుతున్నారని తలలు పట్టుకుంటున్నారు. కార్యాలయంలో జరిగే విషయాలు బయటకు, పత్రికలకు ఎలా తెలుస్తున్నాయని ఆ అధికారి తిట్ల పురాణం మొదలు పెడుతున్నారని పలువురు వాపోతున్నారు. ఇకపై విషయాలు బయటికొస్తే ఎవరిని వదిలిపెట్టను..సస్పెండ్ చేస్తానని ఆ అధికారి హెచ్చరికలు జారీ చేసినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్తూరోళ్లు అంతా ఇలానే ఉంటారంటూ బహిరంగా చెప్పడంపై పలువురు విస్తుపోతున్నారు. విలేకరులతో ఎవరెవ్వరూ మాట్లాడుతున్నారో గుచ్చి గుచ్చి అడుగుతున్నారని, అలా అనుమానం ఉన్న వాళ్లపై నిఘా పెట్టి వేధిస్తున్నారని కంటతడి పెడుతున్నారు. ఈ తరుణంలో 20 మంది వరకు సీట్లు మార్చారని పలువురు కోడైకూస్తున్నారు. ఇందులో అటెండర్ స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు ఉన్నారని చెబుతున్నారు. కార్యాలయంలోని అందరూ తన వర్గానికి అనుకూలంగా ఉండాలని కొంత మందిని అనధికారికంగా డెప్యూటేషన్‌పై తీసుకొచ్చారని అంటున్నారు. డెప్యూటేషన్లను ప్రభుత్వం రద్దు చేసినా...ప్రత్యేకంగా డెప్యూటేషన్లు ఇవ్వడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. వర్క్ ఆర్డర్ సాకు చూపి ఇలా చేయడం దారుణమని పలువురు మండిపడుతున్నారు. ఇంట్లో సమస్యలు, ఈ వేధింపులు పడకలేక మాకు ఆత్మహత్య తప్ప వేరే మార్గం లేదని మహిళా ఉద్యోగులు ఆవేదనకు గురవుతున్నారు. దీనిపై జిల్లా యంత్రాంగం స్పందించి కార్యాలయంలో అనుమానం పేరుతో ఇబ్బంది పడుతున్న అధికారులు, సిబ్బందికి ఇబ్బందులు లేకుండా చూడాలని కార్యాలయ అధికారులు, సిబ్బంది వేడుకుంటున్నారు. లారీని ఢీకొన్న బైక్ – ఇద్దరికి తీవ్ర గాయాలు బంగారుపాళెం : మండలంలోని మొగిలి ఘాట్ చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు నుంచి పలమనేరు వెళుతున్న లారీని మొగిలి ఘాట్ వద్ద ముందుపోతున్న ద్విచక్ర వాహనాన్ని అధిగమించే క్రమంలో మరో ద్విచక్రవాహనం లారీ వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో తమిళనాడులోని తిరువళ్లూరుకు చెందిన మనోజ్, చైన్నెకి చెందిన వేలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 వాహనంలో బంగారుపాళెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సారా విక్రయిస్తూ మహిళ అరెస్టు చిత్తూరు అర్బన్ : నాటు సారా విక్రయిస్తున్న ఓ మహిళను ఆదివారం టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు ఇలా... టూటౌన్ పోలీసులు చిత్తూరు నగరం తేనేబండ ప్రాంతంలో నాటు సారా విక్రయాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గౌరీ (45) అనే మహిళ సారా విక్రయిస్తుండగా నాలుగు లీటర్ల సారాను స్వాధీనం చేస్తుకున్నారు. మహిళపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు వెల్లడించారు. -
దృఢ సంకల్పమే విజయానికి ఆయుధం
– ఎస్వీయూలో ఘనంగా సిగ్మాండ్–2025 ఫెస్ట్ తిరుపతి సిటీ : దృఢ సంకల్పం ఉంటే జీవితంలో లక్ష్యాన్ని చేరుకోవచ్చని, దృఢ సంకల్పమే ఆయుధంగా ముందుకు సాగాలని ఎస్వీయూ పూర్వ విద్యార్థి, తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్‌రెడ్డి తెలిపారు. ఎస్వీయూ ఇంజినీరింగ్ కళాశాల ఈసీఈ విభాగం ఆధ్వర్యంలో ఆదివారం సిగ్మండ్–2025 ఫెస్ట్‌ను ఘనంగా నిర్వహించారు. ఇందులో ఆయన వర్చువల్ విధానంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. తాను ఎస్వీయూలో ఈసీఈ విభాగంలో 2012లో ఇంజినీరింగ్ పూర్తి చేశానని తెలిపారు. సివిల్స్ లక్ష్యంగా శ్రమించానని, పలు ప్రయత్నాల్లో విఫలమైనా ఆత్మ విశ్వాసాన్ని వదలలేదన్నారు. తర్వాత తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నానని తెలిపారు. ప్రతి ఒక్కరికీ విద్యార్థి దశ కీలకమన్నారు. ఎస్వీయూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో నిపుణులైన అధ్యాపకులకు కొదవలేదన్నారు. వారి సూచనల మేరకు క్రమశిక్షణతో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. –ఐఏఎస్ అధికారి మాటలతో స్ఫూర్తి పొందిన విద్యార్థులు తమ కళాశాలలో చదివి ఐఏఎస్‌గా ఎంపికై న రాహుల్ కుమార్‌రెడ్డి మాటలతో ఈసీఈ విభాగం విద్యార్థులు స్ఫూర్తి పొందారు. ఆయన విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సావధానంగా సమాధానం ఇచ్చారు. సందేహాలను నివృత్తి చేశారు. విఫలం చెందామని నిరుత్సాహ పడకుండా ముందుకు సాగితే లక్ష్యం కాళ్ల వద్దకు చేరుతుందన్నారు. సివిల్స్ కష్టసాధ్యమైన పరీక్ష అంటూ సమాజంలో ఎంతో మంది వెనుకడుగు వేస్తారని, అది సత్యదూరమన్నారు. –ఎస్వీయూ విద్యార్థి ఐఏఎస్ సాధించడం గర్వకారణం వీసీ అప్పారావు మాట్లాడుతూ ఎస్వీయూ ఈసీఈ విభాగం పూర్వ విద్యార్థి రాహుల్ కుమార్‌రెడ్డి ఐఏఎస్ సాధించడం గర్వకారణమన్నారు. విద్యార్థులు ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత లక్ష్యాలతో శ్రమించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ సుబ్బారావు, ఈసీఈ విభాగం హెడ్ స్వర్ణలత, కన్వీనర్ ప్రొఫెసర్ వరదరాజన్, స్టూడెంట్ కోఆర్డినేటర్స్ రామ్ హర్షన్, వర్షిత, పలు కళాశాలల నుంచి సుమారు 500మంది విద్యార్థులు పాల్గొన్నారు. -
చంద్రగిరి ‘కూటమి’లో విభేదాలు
సాక్షి, టాస్క్‌ఫోర్స్ : కూటమి ప్రభుత్వం ఏర్పడిన 9 నెలల్లోనే టీడీపీ, జనసేన, బీజేపీ నేతల్లో విభేదాలు మొదలయ్యాయి. ఆదివారం చంద్రగిరిలో జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో నేతల నడము పొరపొచ్చాలు బహిర్గతమయ్యాయి. చంద్రగిరి జనసేన నియోజకవర్గ ఇన్చార్జి దేవర మనోహర్ ఆధ్వర్యంలో కార్యాలయం ప్రారంభించేందుకు సన్నాహాలు చేశారు. ఈ మేరకు కూటమి ప్రజాప్రతినిధులు, నేతలను ఆహ్వానించారు. ఈ మేరకు పట్టణంలో కూటమి నేతల ఫొటోలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. 8 గంటలకు అని చెప్పినా..! పార్టీ కార్యాలయాన్ని ఉదయం 8 గంటలకు ప్రారంభించనున్నట్లు జనసేన నేతలు తొలుత ప్రకటించారు. అయితే మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా టీడీపీ, బీజేపీ నాయకులు కనిపించకపోవడంతో జనసేన నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక చేసేది లేక తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, జనసేన జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్‌తో కలిసి కొత్తపేటలోని పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించి, కార్యాలయం ప్రారంభించారు. ఇంటికెళ్లి పిలిచినా..! జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి రావాలంటూ టీడీపీ చంద్రగిరి నియోజకవర్గ ప్రజాప్రతినిధి ఇంటికెళ్లి జనసేన నేతలు ఆహ్వానించినట్లు సమాచారం. అయినప్పటికీ ఆయన ముఖం చాటేయడంపై జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారు. -
● కాలిన ఎర్ర చందనం, ఉసిరి, నేరేడు చెట్లు ● కనిపించని అటవీశాఖ అధికారులు
అడవికి నిప్పు ..రూ.కోట్లలో నష్టం శ్రీరంగరాజపురం (కార్వేటినగరం) : గుర్తు తెలియని వ్యక్తులు అడవికి నిప్పు పెట్టిన సంఘటన మండల పరిధిలోని మర్రిపల్లి అటవీ ప్రాంతంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా.. మెదవాడ సమీపంలోని అడవికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో వన సంరక్షణ సమితి ఆధ్వర్యంలో సుమారు లక్షల రూపాయలు వెచ్చించి వంద హెక్టార్లలో పెంచిన విలువైన ఎర్ర చందనం, నేరేడు, ఉసిరి చెట్లు దగ్ధమయ్యాయని వాటి విలువ రూ.కోట్లలో ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఇంత జరిగినా కనీసం అటవీశాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. అడవి చుట్టూ అనేక గ్రామాలు ఉండడంతో మంటలు గ్రామాల వైపు వస్తుండడంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం చోటు చేసుకుంటుందనే ఆందోళనకు గురైనట్లు తెలిపారు. -
సిబిల్ స్కోర్ తగ్గితే భవిష్యత్ గోవిందా!
● బ్యాంకు రుణాలు అందడం గగనమే ● సిబిల్ స్కోర్‌లో పురుషుల కంటే మహిళలే టాపర్స్ ● జిల్లాలో 60శాతం మందిపై ప్రభావం తిరుపతి సిటీ:ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు, ఆకాంక్షలను సాకారం చేసుకునేందుకు క్రెడిట్ కార్డు లు, రుణాలపై ప్రజలు ఆధార పడుతుంటారు. వీటిని పొందడంలో సిబిల్ స్కోర్ కీలక పాత్ర పోషిస్తోంది. రుణాలిచ్చేటప్పుడు బ్యాంకులు, ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలు వ్యక్తి ఆర్థిక క్రమశిక్షణను పరిగణలోకి తీసుకుంటాయి. దీంతో చాలామంది మూడంకెల సంఖ్యను మెరుగుపరుచుకోవడానికి ఆరాటపడుతుంటారు. సిబిల్ స్కోర్ అంటే... సిబిల్ స్కోర్ అంటే వ్యక్తి, సంస్థ, కంపెనీల క్రెడిట్ చరిత్రను గణనచేసేందుకు 2017లో రిజర్వు బ్యాంక్ అనుమతి పొందిన సంస్థ. క్రెడిట్ చరిత్రను తెలుసుకోవడానికి దేశంలో నాలుగు సంస్థలు ఉన్నాయి. అందులో ప్రధాన మైంది క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్ (సీఐబీఐఎల్). దీనినే సిబిల్గా పిలుస్తుంటారు. సిబిల్ స్కోర్ టాపర్స్ మహిళలే జిల్లాలో రుణాలు తీసుకుంటున్న మహిళల సంఖ్య పెరుగుతోంది. పురుషుల కంటే సీ్త్రలు తమ కంతుల చెల్లింపులలో అగ్రస్థానంలో ఉంటూ సీబిల్ స్కోర్‌ను కాపాడుకుంటున్నారు. జిల్లాలో సుమారు 91శాతం మంది మహిళలు 800ప్లస్ స్కోర్‌లో ఉన్నారంటే ఆతిసయోక్తికాదు. సిబిల్ స్కోర్ ఆశాజనకంగా ఉంటే ప్రయోజనాలు ఇవే.. అవసరమైన వెంటనే రుణాలు తక్కువ వడ్డీతో ఎక్కువ రుణం ష్యూరిటీలతో పని ఉండదు ఎక్కవ కాలపరిమితి గల రుణాలు గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు పొందడానికి హామీలతో పనిలేదు క్యాష్ బ్యాక్ సౌకర్యం, ఎంపిక చేసిన కొనుగోళ్లపై రివార్డులు ప్రీ అప్రూవ్డ్ రుణాల పేరుతో బ్యాంకులు, ప్రైవేటు సంస్థలు స్వయంగా రుణాలను అఫర్ చేస్తాయి. సాధారణ బీమా పాలసీలకు ప్రీమియం తగ్గింపు ఫైనాన్స్ సంస్థలు, బ్యాంకుల నుంచి ప్రీమియం క్రెడిట్ కార్డులు పొందే అవకాశం సిబిల్ స్కోర్ పెంచుకోండి ఇలా రుణాల చెల్లింపులు, ఈఎంఐలు, క్రెడిట్ కార్డుల చెల్లింపులు సకాలంలో చేయాలి పాత బ్యాంకు ఖాతాలు, క్రెడిట్ కార్డులను కొనసాగించాలి. క్రెడిట్ లిమిట్‌ను పూర్తిగా వాడేయొద్దు పదేపదే రుణాలకు దరఖాస్తు చేయొద్దు రుణాల చెల్లింపులో కంతులను సక్రమంగా చెల్లించాలి జాయింట్ అకౌంట్లతో రుణాలను తీసుకోకపోవడం మంచిది. అన్సెక్యూర్డ్ రుణాలను తక్కువ తీసుకోవాలి ఒకే వ్యక్తి స్థోమతకు మించి ష్యూరిటీ లేని రుణాలను తీసుకోవద్దు సిబిల్ స్కోర్‌తో అప్రమత్తంగా ఉండాలి రుణగ్రస్తులు సిబిల్ స్కోర్ పట్ల నిర్లక్ష్యం వహించొద్దు. జిల్లాలో సుమారు 60శాతం మంది రుణగ్రస్తులకు 550లోపు స్కోర్ ఉంది. సక్రమంగా రుణాల చెల్లించకపోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు.– నరసింహస్వామి, పేరొందిన ప్రభుత్వ బ్యాంక్ రిటైర్డ్ మేనేజర్, తిరుపతి భవిష్యత్తుపై ప్రభావం ప్రైవేటు, ప్రభుత్వ ఫైనాన్స్ సంస్థలు, బ్యాంకులు రుణగ్రస్తుల అవసరాలకు రుణాలను మంజూరు చేస్తాయి. వాటిని గడువులోపు చెల్లిస్తే ఇబ్బంది ఉండదు. లేనిపక్షంలో రుణగ్రస్తుని ఆర్థిక స్థితికి మించి అపరాధం కట్టుకోవాల్సి ఉంటుంది. – రవిచంద్రారెడ్డి, ప్రముఖ ఫైన్సాన్ కంపెనీ, సేల్స్ మేనేజర్, తిరుపతిసిబిల్ స్కోర్ తగ్గడానికి కారణాలు ఆదాయానికి మించి రుణాలు పొందడం, రుణాల చెల్లింపులలో అలసత్వం, ప్రభుత్వ ఉద్యోగులకు నెల మొదటి వారంలో సక్రమంగా వేతనాలు అందకపోవడం, రుణగ్రస్తులైన వ్యాపారుల ఆర్థికలావాదేవీలలో ఆలస్యం, ఆకస్మిక ఉద్యోగాల తొలగింపు, గ్రామీణ రైతుకు గిట్టుబాటు ధర అందకపోవడం వంటివి సిబిల్ స్కోర్ తగ్గడానికి ప్రధాన కారణాలు.సిబిల్ స్కోర్ ఎంత ఉండాలంటే... సాధారణంగా సీబిల్ స్కోర్ 300 నుంచి 900 మధ్య ఉంటుంది. 550 కంటే తక్కువ ఉంటే రుణాల మంజూరుకు బ్యాంకులు అనుమతించవు. 750నుంచి 900 అత్యుత్తమ స్కోర్, 650 నుంచి 750 ఉంటే మంచి స్కోర్, 550 నుంచి 650 యావరేజ్, 300 నుంచి 550 ఉంటే డేంజర్ స్కోర్. -
న్యాయమూర్తులతో సమీక్ష
● చిత్తూరులో హైకోర్టు న్యాయమూర్తి చిత్తూరు అర్బన్ : రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పోర్ట్‌ఫోలియో (పరిపాలనా) జడ్జి జస్టిస్ కె.సురేష్‌రెడ్డి శనివారం చిత్తూరుకు వచ్చారు. ఉమ్మడి జిల్లాలోని న్యాయమూర్తులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన పలు విషయాలపై చర్చించారు. అనంతరం ఉమ్మడి జిల్లాలోని న్యాయమూర్తులతో గ్రూప్ ఫొటో దిగారు. కాగా హైకోర్టు న్యాయమూర్తికి జిల్లా జడ్జి భీమారావుతో పాటు కలెక్టర్ సుమిత్‌కుమార్ స్వాగతం పలికి పుష్పగుచ్ఛం అందజేశారు. -
రోడ్డు ప్రమాదంలో చెల్లెలు మృతి
● అన్నకు తీవ్ర గాయాలు ● రోడ్డుదాటుతుండగా ఢీకొట్టిన కారు నగరి : అన్నా చెల్లెళ్లను విధి శాశ్వతంగా విడదీసింది. ముక్కు పచ్చలారని చిన్నారిని రోడ్డు ప్రమాదం చిదిమేసింది. కూలి పనులతో పొట్ట నింపుకొని ఉన్నదాంతో సంతృప్తి పడుతూ ఆనందంగా గడిపే ఆ కుటుంబంలో రోడ్డు ప్రమాదం తీరని విషాదం నింపింది. శనివారం వీకేఆర్ పురం గ్రామం వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం ఈ విషాదానికి కారణమైంది. ఈ రోడ్డు ప్రమాదంలో జి.నోమేశ్వరి (10) మృతి చెందగా, సోదరుడు జి.మహేష్ (14) తీవ్ర గాయాలపాలయ్యాడు. సీఐ విక్రమ్ తెలిపిన వివరాల మేరకు వీకేఆర్ పురం జగనన్న కాలనీలో ఉంటున్న కూలీలు గోపి, బుజ్జి దంపతుల కుమారుడు జి.మహేష్ తడుకుపేట జడ్పీ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. కుమార్తె నోమేశ్వరి.. ఎంఎన్ కండ్రిగ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది. ప్రస్తుతం ఒంటిపూట బడులు కావడంతో మధ్యాహ్నమే బడి అయిపోయింది. అయితే తడుకుపేట పాఠశాలలో పదో తరగతి పరీక్షలు జరుగుతుండటంతో మధ్యాహ్నం నుంచి ఒంటి పూట బడి జరుగుతుంది. దీంతో అన్న వచ్చే వరకు ఎంఎన్ కండ్రిగలో బంధువుల ఇంటి వద్ద నోమేశ్వరి వేచి ఉంటుంది. ఇద్దరూ కలసి సాయంత్రం ఇంటికి చేరుకుంటారు. ఈ క్రమంలో శనివారం 4 గంటలకు ఇంటికి వెళ్లడానికి ఇరువురు రోడ్డు దాటుతుండగా చైన్నె వైపుగా వెళ్లే కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నోమేశ్వరి అక్కడికక్కడే మృతి చెందగా, మహేష్ గాయాలపాలయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా పిల్లల పెద్ద సోదరుడు భూపతి ఐటీఐ చదువుతున్నాడు. -
హైకోర్టు జడ్జిని కలిసిన న్యాయశాఖ ఉద్యోగులు
చిత్తూరు అర్బన్: హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పోర్టుపోలియో జడ్జి జస్టిస్ సురేష్‌రెడ్డిని న్యాయశాఖ ఉద్యోగులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. చిత్తూరుకు వచ్చిన న్యాయమూర్తిని జిల్లా జడ్జి భీమారావుతో కలిసి ఓ హోటల్లో బేటీ అయ్యారు. ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. కార్యక్రమంలో న్యాయశా ఖ ఉద్యోగ సంఘ అధ్యక్షుడు గోపీనాథ్‌రెడ్డి, స భ్యులు లక్ష్మీపతి, బాలసుందరం, రవీంద్రారె డ్డి, రాజేష్, హరికృష్ణ, ప్రభాకర్‌రెడ్డి, సంతోష్, దిలీప్, యువరాజ్, రెడ్డెప్ప, చంద్రశేఖర్, భ్రమ రాంబ, పవన కుమారి మినిమా పాల్గొన్నారు. నేడు విద్యుత్ బిల్లుల చెల్లింపునకు అవకాశం చిత్తూరు కార్పొరేషన్: కరెంటు బిల్లులను వినియోగదారులు ఆదివారం సైతం చెల్లించవచ్చని ట్రాన్స్‌కో చిత్తూరు, తిరుపతి జిల్లా ఎస్ఈలు ఇస్మాయిల్‌అహ్మద్, సురేంద్రనాయుడు తెలిపారు. శనివారం వారు మాట్లాడుతూ విద్యుత్ బిల్లుల చెల్లింపు కేంద్రాలు పనిచేస్తాయని, వినియోగదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పట్టా భూమి కబ్జా ● టీడీపీ నేతల అరాచకం వడమాలపేట (విజయపురం ) : పట్టా భూమిని కబ్జా చేసి గుడిసెలు వేసిన సంఘటన వడమాలపేట మండలం, బాలనాయుడుకండ్రిగ పంచాయతీ ఎన్వీఆర్ కండ్రిగ ఆది ఆంధ్రవాడలో చోటు చేసుకొంది. వడమాలపేట మండలం ఎన్వీఆర్కండ్రిగ ఆదిఆంధ్రవాడ ఆనుకొని సర్వే నంబర్ 95–2ఎలో 0.73 సెంట్ల పట్టా భూమి ఉంది. దేవరాజులురెడ్డి భార్య వనజాక్షిపై రెవెన్యూ అధికారులు పట్టా ఇచ్చారు. సుమారు 10 దశాబ్దాల నుంచి భూ యజమానులు అందులో సాగు చేస్తున్నారు. రెవెన్యూ రికార్డుల్లో, వెబ్ ల్యాండ్‌లో ఇది పట్టా భూమిగా, యజమానుల పేర్ల మీద ఉంది. కానీ స్థానికంగా ఉన్న ముగ్గురు టీడీపీ నేతలు శనివారం పట్టా భూమిని కబ్జా చేసి తన అనుచరులతో గుడిసెలు వేయించారు. విషయం తెలుసుకొన్న భూ యజమాని అక్కడికి వెళ్లగా టీడీపీ నాయకులు అతడిపై దాడికి పాల్పడినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశారు. చేసేది ఏమి లేక తహశీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. -
ఖాకీల సోకు!
● సహకరించిన పోలీసులకు యూనిఫామ్‌కు వెచ్చించిన వైనం ● దొంగ సొమ్ములు బయటపడకుండా పోలీస్ స్టేషన్‌కు రంగులు? ● రూ.12.50 లక్షల్లో కొద్ది ఖర్చులు.. ఆపై మొత్తం స్వాహా ● ‘పోలీసు దొంగల’ కేసులో యంత్రాంగం నివేదిక సిద్ధం? ● నలుగురిపై వేటు..? క్రిమినల్ కేసు నమోదుపై ఆరాచోరీ సొమ్ముతోచిత్తూరు అర్బన్ : దొంగ నుంచి రికవరీ చేసిన సొమ్మును బాధితులకు అప్పగించకుండా వాటాలు వేసేసుకున్నారు. పంచుకున్న వాటాల డబ్బుల్లో ఏకంగా సిబ్బందికి యూనిఫామ్ పంపిణీ చేశారా..? స్టేషన్‌కు రంగులు వేయించారా..? అనే ప్రశ్నలకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. చిత్తూరు జిల్లా పోలీసుశాఖలో ఓ దొంగను పట్టుకున్న పోలీసులు అతడి నుంచి రూ.12.50 కొట్టేయడం, ఈ విషయాన్ని రాయచోటి పోలీసులకు పట్టుబడ్డ దొంగ బహిర్గతం చేయడం తెలిసిందే. అక్కడి నుంచి సమాచారం చిత్తూరు పోలీసుశాఖకు చేరడంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. దీనిపై ఇటీవల ‘సాక్షి’లో ‘పోలీసు దొంగలు..?’ శీర్షికన కథనం ప్రచురితం అయింది. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు ఎస్పీ మణికంఠ ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రాథమిక విచారణ పూర్తి జిల్లా పోలీసుశాఖలో సంచలనం సృష్టించిన ఈ ఘటనలో ప్రాథమిక విచారణ పూర్తి చేసి నివేదిక సిద్ధం చేసినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. దొంగ నుంచి లంచంగా తీసుకున్న రూ.12.50 లక్షల్లో.. ఓ పోలీసు రూ.3.50 లక్షలు, మరో పోలీసు రూ.9 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. అయితే దొంగను పట్టుకోవడంలోని బృందంలో ఉన్న కానిస్టేబుల్ పెద్ద మొత్తంలో నగదును తన సమీప బంధువుల బ్యాంకు ఖాతాలకు మళ్లించి, ఆపై దీన్ని తన అధికారికి ఇచ్చినట్లు విచారణలో ఒప్పుకున్నట్లు తెలిసింది. ఇదే సమయంలో దొంగ సొమ్ముతో స్టేషన్లో పనిచేసే పోలీసులకు ఖాకీ యూనిఫామ్ పంపిణీ చేయడంతో పాటు స్టేషన్‌కు రంగులు వేయించారనే ఆరోపణ విచారణలో బయటపడినట్లు సమాచారం. చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసులు, లంచంగా తీసుకున్న డబ్బును వ్యక్తిగత అవసరాలను వాడుకోవడంతో పాటు నీతి, నిజాయితీ, క్రమశిక్షణకు మారుపేరైన పోలీసుశాఖలోని సిబ్బందికి యూనిఫామ్‌ను కొనుగోలు చేసి ఇవ్వడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కేసు నమోదుపై చర్చ విచారణ అధికారులు పూర్తి చేసిన ప్రాథమిక నివేదికపై ఓ పోలీసు ఉన్నతాధికారి, జిల్లా అధికారితో చర్చించినట్లు తెలుస్తోంది. ‘దొంగ ఇచ్చిన రూ.12.50 లక్షలు ఎన్ని కేసుల్లో చోరీ చేశాడో, అన్ని కేసుల్లోనూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులను నిందితులుగా ఎందుకు చేర్చకూడదు..? అప్పగించిన పనిని పూర్తి చేయడంలో నమ్మక ద్రోహం చేసి, పోలీసుశాఖ పరువు తీసిన వీళ్లపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 316(5) కింద కేసు నమోదు చేయొచ్చా..?’ అని సుదీర్ఘంగా చర్చించారనే సమాచారం గుప్పుమంటోంది. ఇక రూ.3.50 లక్షలు స్వయంగా తీసుకున్న పోలీసును సస్పెండ్ చేయడంతో పాటు, మరో పోలీసును సస్పెండ్ చేయడం లేదా వీఆర్‌కు పంపాలని.. ఇద్దరు కానిస్టేబుళ్లను సైతం విధుల నుంచి తొలగించాలని నిర్ణయించినట్లు సమాచారం. పనితీరు నచ్చి, తాను కాస్త చనువుగా ఉన్నంత మాత్రాన.. తప్పు చేసిన వాళ్లను కాపాడే ప్రసక్తేలేదని, ఈ ఘటనపై చట్టం ప్రకారం ముందుకు వెళ్లడం తప్ప మరో ఆలోచనలేదని పోలీసు ‘బాస్’ సైతం ఒకరిద్దరితో స్పష్టం చేసినట్లు తెలిసింది. ఏది ఏమైనా దొంగలను పట్టుకోవడంలో ప్రతిభ చూపిస్తే అవార్డులు, రివార్డులు పంపిణీ చేసే అధికారులు.. తప్పు చేసినపుడు చర్యలు తీసుకుంటే తప్ప సామాన్యులకు పోలీసుశాఖపై నమ్మకం ఉండదనేది బహిరంగ వాదన. ఈ ఘటన ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి. -
27న షబ్–ఏ–ఖదర్
చిత్తూరు రూరల్ : ముస్లింలు షబ్ ఏ ఖదర్ పండుగను ఈనెల 27వ తేదీన జరుపుకోవాలని జిల్లా ప్రభుత్వ ఖాజీ జనాబ్ మోల్వి సయ్యద్ షా మహమ్మద్ కమాలుల్లా జుహురీ లతీఫ్ జునైది ఒక ప్రకటనలో తెలిపారు. పండుగ రాత్రి అత్యంత భక్తిశ్రద్ధలతో జాగారం, నమాజు చేసి విశ్వ శాంతికి అల్లా వద్ద దువా చేయాలన్నారు. నెల రోజుల్లో ఎలిఫెంట్ బేస్ క్యాంపు ● త్వరలో శిక్షణ పొందిన కుంకీ ఏనుగులు రాక ● పనులను పరిశీలించిన ఉన్నతాధికారులు పలమనేరు : మరో నెల రోజుల్లో ముసలిమొడుగు వద్ద నిర్మిస్తున్న ఎలిఫెంట్ బేస్‌క్యాంపు పనులు పూర్తికానున్నాయని కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ యశోధ పేర్కొన్నారు. ఆ మేరకు మండలంలోని కాలువపల్లి వద్ద సాగుతున్న ఎలిఫెంట్ క్యాంపు పనులను శనివారం ఆమె పరిశీలించారు. ఇందులో డీఎఫ్ భరణి, సబ్ డీఎఫ్‌వో వేణుగోపాల్ స్థానిక అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ.. ఇక్కడ సాగుతున్న అన్ని రకాల పనులు 80శాతం పూర్తయ్యాయని తెలిపారు. కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు నుంచి శిక్షణ పొందిన నాలుగు ఏనుగులను ఇక్కడికి రప్పించనున్నట్లు తెలిపారు. బేస్ క్యాంపు చుట్టూ ఎలిఫెంట్ ఫ్రూప్ ట్రెంచిలు, హ్యాగింగ్ సోలార్ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేశామన్నారు. కౌండిన్యలోని మదపు టేనుగుల బారీ నుంచి కుంకీ ఏనుగుల ద్వారా మళ్లించడం జరుగుతుందన్నారు. ఇక్కడి ప్రజల సందర్శనార్థం సుందరీకరణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. భయపడే ప్రసక్తే లేదు చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని, దాక్కోవాల్సిన గతి పట్టలేదని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి తెలిపారు. శనివారం చిత్తూరు జిల్లా ఆస్పత్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. విదేశాల్లో నివసిస్తున్న కుమార్తె వద్దకు వెళితే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 145 గ్రామాల్లోని ఆలయాలను రూ.10లక్షల చొప్పున వెచ్చించి అభివృద్ధి చేశామన్నారు. జీడీనెల్లూరు నియోజకవర్గంవలో రోడ్లు వేశామని, తాగునీటి ట్యాంకులు నిర్మించామని, అవినీతికి తావు లేకుండా గ్రామీణాభివృద్ధికి కృషి చేశామని వివరించారు. కుమార్తె దగ్గరకు వెళితే భయపడి వెళ్లిపోయారని చెప్పడం కరెక్టు కాదన్నారు. అలాగైతే విదేశాలకు వెళ్లేవారంతా భయపడి వెళుతున్నారా అంటూ ప్రశ్నించారు. అసత్య ప్రచారాలను వదలిపెట్టి, ప్రజాసేవపై దృష్టిపెట్టాలని సూచించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అసలు పనులను పక్కనపెట్టి కేసులతో వేధించడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. క్షతగాత్రులకు పరామర్శ శ్రీరంగరాజపురం మండలం పొదలపల్లె వద్ద ట్రాక్టర్ బోల్తా ఘటనలో గాయపడిన వారిని చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి పరామర్శించారు.బాధితులకు ఆర్థిక సహాయం అందించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు గురవారెడ్డి, ఎస్ఆర్పురం మండల అధ్యక్షుడు మణి, నేతలు సాము, వెంకటేష్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఆర్థిక అక్షరాస్యతకు కృషి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు అక్షరాస్యత ఎంతో ముఖ్యమని డీఆర్డీఏ పీడీ శ్రీదేవి అన్నారు. ఈ మేరకు శనివారం కలెక్టరేట్లోని డీఆర్డీఏ సమావేశ మందిరంలో స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఆర్థిక అక్షరాస్యతపై కమ్యూనిటీ రీసోర్స్పర్సన్లకు శిక్షణ నిర్వహించారు. డీఆర్డీఏ పీడీ మాట్లాడుతూ స్వయం సంఘా ల సభ్యులు ఆర్థిక అక్షరాస్యత సాధించడానికి కృషి చేయాలన్నారు. సంఘం, అందులోని సభ్యు లకు ఆర్థిక ప్రణాళిక పొదుపు, ఆవశ్యకత, ఖర్చు లు చేసే అంశాలకు అవగాహన ముఖ్యమన్నా రు. రుణాలు పొందడం, డిజిటల్ లావాదేవీలు, సామాజిక భద్రత ఇన్సూరెన్స్‌పై అవగాహన పెంచుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని మైక్రో ఫైనాన్స్ సంస్థలను నియంత్రించి సంఘం సభ్యులకు రక్షణ కల్పించాలని ఆదేశించారు. సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ హరీ ష్, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లు పాల్గొన్నారు. 12 మంది ఎస్ఐల బదిలీ చిత్తూరు అర్బన్: జిల్లాలో 12 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ మణికంఠ శనివారం ఉత్తర్వు లు జారీ చేశారు. వేకెంట్ రిజర్వులో (వీఆర్) ఉ న్న కొందరికి స్టేషన్లు కేటాయించారు. దాదాపు ఏడు నెలలకు పైగా ఖాళీగా ఉన్న పెనుమూరు స్టేషన్‌కు సైతం ఎస్ఐను నియమించారు. స్థానచలనం పొందిన ఎస్ఐల వివరాలు... వీఆర్‌లో ఉన్న ఇ.ఎర్రిస్వామిని చిత్తూరు వన్‌టౌన్, పి.వెంకటరమణ– చిత్తూరు టూటౌన్, బి.తులసన్న– చిత్తూరు సీసీఎస్, జి.రామచంద్రయ్య– పెనుమూరు, పి.విజయ్‌నాయక్– నగరి, ఎ.వెంకటనారాయణ– ఎన్ఆర్.పేట, కె.రంగ– విజయపురం, కె.వెంకటరమణ –పుంగనూరు, ఎన్.ధనంజయరెడ్డి –పంజాణి, చిత్తూరు టూటౌన్లో ఉ న్న ప్రసాద్‌ను బంగారుపాళ్యం, పంజాణిలో ఉ న్న బి.శ్రీదేవిని చిత్తూరు పోలీస్ కంట్రోల్ రూ మ్, విజయపురంలో ఉన్న కె.బలరామయ్యను చిత్తూరు పోలీసు శిక్షణ కేంద్రానికి బదిలీ చేశా రు. ఈ క్రమంలోనే ఎన్ఆర్.పేటలో ఉన్న వెంకటసుబ్బమ్మ ఏపీ ట్రాన్స్‌కోకు బదిలీపై వెళ్లారు. -
తెలుగు సాహిత్యానికి పోతన దిక్సూచి
● భాగవతంలోని బ్రహ్మ సూత్రాలను తెలుసుకోవాలి ● జాతీయ సదస్సులో యోగి వేమన విశ్వవిద్యాలయ ఆచార్యులు వెల్లడి పలమనేరు : నేను, నీవు అనే భేదాలను విడిస్తే జీవితం ఉన్నతంగా ఉంటుందని భాగవతం ద్వారా మానవాళికి సూచించిన మహోన్నతుడు పోతన అని యోగి వేమన విశ్వ విద్యాలయం తెలుగు విభాగం ఆచార్యులు ఈశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. పలమనేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భాగవతం–భక్తి, తాత్వికత, సామాజికత అనే అంశంపై జాతీయ సదస్సు శనివారం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు సాహిత్యానికి జీవం పోసిన పోతన మన తెలుగు గడ్డపై పుట్టడం మన అదృష్టమన్నారు. ముఖ్యంగా భాగవతంలోని 555 బ్రహ్మ సూత్రాలను మనం తెలుసుకోవాలని సూచించారు. మానవ జన్మకు అర్థం, పరమార్థం తెలుసుకోవాలంటే కచ్చితంగా భాగవతాన్ని చదవాలన్నారు. అనంతరం స్థానిక కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశులు మాట్లాడుతూ.. ప్రతిఫలం ఆశించకుండా చేసే యజ్ఞ యాగాదుల గురించి భాగవతంలో విఫులంగా వివరించారన్నారు. సదస్సు సంచాలకులు వాసు మాట్లాడుతూ.. దేశంలో ఇప్పటికీ ఇతిహాసాలను చదవని వారెందరో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పలు విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన ఆచార్యులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
● జిల్లాలో పెరిగిన ప్రీ వెడ్డింగ్ షూట్లు ● సినిమాను తలపించేలా చిత్రీకరణ ● ప్రత్యేక స్థలాలు, బీచ్‌లు ఎంపిక ● షూటింగ్‌కు రూ.లక్షల్లో వ్యయం ● ప్యాకేజీల పేరుతో ఆఫర్లు ● అధిక ప్రాధాన్యం ఇస్తున్న కొత్త జంటలు
మీమ్స్ నయా ట్రెండ్ నూతన దంపతులు దిగిన ఫొటోలు, వీడియోలను మీమ్స్ మార్చి వాటిని పెళ్లిలోనే ప్రదర్శించి నవ్వులు పూయిస్తున్నారు. ఎల్ఈడీ తెరను ఏర్పాటు చేసుకుని కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి వీక్షిస్తున్నారు. ఈ క్షణాలనూ వీడియో తీసుకుంటున్నారు. ప్రీవెడ్డింగ్ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో రీల్స్ పెట్టడానికి ఎక్కువ జంటలు ఆసక్తి చూపిస్తున్నాయి. అలాగే కుటుంబంలో చనిపోయిన కుటుంబీకులను కూడా బతికి ఉన్నట్లుగా చూపిస్తున్నారు. వధూ వరులను ఆశీర్వదించేలా, కుటుంబీకులతో కలిసి ఫొటోలు దిగేలా తెర మీద చూసుకుంటున్నారు. ఇలాంటి వాటికి ఇప్పుడు మరింత క్రేజ్ ఏర్పడింది. కాణిపాకం : పెళ్లి.. జీవితాంతం గుర్తుండిపోయే మధుర వేడుక. ఆ సంబరాలకు సంబంధించిన జ్ఞాపకాలు భద్రంగా ఉండాలి కదా! అందుకో మార్గం ఉంది.. ఫొటో, వీడియో షూట్. అయితే.. ఈ మధ్య ఫొటో, వీడియో షూట్ల ట్రెండ్ మారింది. పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్, కపుల్ షూట్ తప్పనిసరి అయిపోయాయి. సినిమాను తలపించే లైటింగ్, ఎఫెక్ట్స్, సెట్టింగులతో ఫొటో, వీడియో షూట్లు నిర్వహిస్తున్నారు. చేయి తిరిగిన ఫొటోగ్రాఫర్, అత్యాధునిక కెమెరా, స్వర్గాన్ని తలపించే లొకేషన్స్ ఎంపిక చేసుకుని ప్రీ వెడ్డింగ్‌లో కిసిక్..కిసిక్కుగా కొత్తజంటలు మైమరిచిపోతున్నాయి. పెళ్లంటే పందిళ్లు....సందళ్లు తప్పెట్లు..తాళాలు తలంబ్రాలూ మూడుముళ్లు..ఏడడు గులు ఇదీ అందరికీ తెలిసిందే. కానీ ప్రస్తుతం వీటి తో పాటు పెళ్లి వేడుకలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. పెళ్లి సంబరాలు చెదరని మధుర జ్ఞాపకంలా జీవితాంతం గుర్తుండి పోయేలా యువతీ యు వకులు పెళ్లికి సిద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగా ప్రీవెడ్డింగ్ షూట్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. జిల్లాలో ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ ట్రెండ్‌గా మా రింది. కొత్తగా పెళ్లి ఫిక్స్ అయితే ముందుగా ఫ్రీ వెడ్డింగ్ ఫొటో, వీడియో షూట్‌కు రెడీ అవుతున్నారు. అదిరేలా... గతంలో పెళ్లాయ్యక హనీ మూన్‌కు ఎక్కడికెళ్లాలి అంటూ అందరితో ఆరా తీసేవారు. ఇప్పుడు నిశ్చితార్థం కాకముందే ప్రీవెడ్డింగ్ ఫొటో, వీడియో షూట్‌కు సిద్ధమవుతున్నారు. అందమైన ప్రదేశంలో ఫొటో, వీడియో షూట్లు తీసే లా ముందస్తుగా ప్లాన్ చేసుకుంటున్నారు. వివాహానికి ముందే వధూ వరులు తమ హావభావాలు, సంభాషణలు, సాన్నిహిత్యాన్ని చిత్రీకరించుకుంటున్నారు. భిన్న కోణాల్లో చూసు కుని మురిసిపోయేందుకు.. రేపటి తరానికి చూపించేందుకు ఎంత వ్యయమైనా వెచ్చించేందుకు వెనుకాడడం లేదు. ప్యాకేజీలతో... గతంలో పెళ్లికి ఫొటోలు, వీడియో తీయించుకోవాలంటే తెలిసిన ఫొటోగ్రాఫర్లకు చెప్పుకునేవాళ్లు. కానీ ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కేవలం ప్రీ వెడ్డింగ్ షూట్ కాకుండా ఆల్బమ్, వీడియోలు అన్ని కలిపి ప్యాకేజీగా తీసుకుంటున్నారు. దీనికి రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు పలు రకాల ప్యాకేజీలున్నాయి. ఇందులో ప్రీ వెడ్డింగ్ షూట్, పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ ఉంటాయి. వివాహానికి కొద్ది రోజుల ముందు, వివాహమైన తర్వాత రెండు రోజుల పాటు ప్రత్యేకంగా షూటింగ్ చేసి వీడియోలను చిత్రీకరిస్తున్నారు. పెళ్లి సీజన్లకు అనుగుణంగా ఫొటో, వీడియో గ్రాఫర్లు ప్యాకేజీలు ప్రకటిస్తున్నారు. ఈ ప్రాంతాల్లోనే... జిల్లాలోని రిసార్ట్లు, పెద్ద హోటల్ ప్రాంతాలు, రద్దీగా లేని జాతీయ రహదారులు, తమిళనాడులోని వేలూరు, చైన్నె బీచ్, సినిమా స్పాట్లు, పాండిచ్చేరిలోని బీచ్, సినిమా చిత్రీకరించిన ప్రదేశాల్లో ఫొటో, వీడియో షూట్‌కు ఇష్టపడుతున్నారు. కర్ణాటకలోని జారువాలే జలపాతాలు, పొగ మంచుతో కమ్ముకునే ఉండే ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. పల్లె ప్రాంతాల్లో పచ్చని పంట పొలాలు, కొబ్బరి తోటల గట్ల మీద, చెరువులు, పచ్చదనం పరుచుకున్న కొండ ప్రాంతాలను ఎంపిక చేసుకుంటున్నారు. ప్రీ వెడ్డింగ్‌తో పనులొచ్చాయి ముందు అయితే పెళ్లి సీజన్లో మాత్రమే గిరాకీలుండేవి. ప్రస్తుతం నడుస్తున్న నయా ట్రెండ్ వల్ల కాస్త చేతికి కావాల్సినంత పని దొరికింది. ప్రీ వెడ్డింగ్ షూట్ల వల్ల పెళ్లికి ఫొటో గ్రాఫర్లు, వీడియో గ్రా ఫర్లు పెళ్లికి ముందే గిరాకీలు వస్తున్నాయి. మంచి నైపుణ్యం ఉన్న వారికి భలే డిమాండ్ ఉంది. అత్యా ధునిక కెమెరాలనే షూట్‌కు వినియోగిస్తున్నాం. – కృష్ణంరాజు, ఫొటోగ్రాఫర్, చిత్తూరు -
చిరుధాన్యాలతో ఆరోగ్య రక్షణ
తిరుపతి సిటీ : ఆరోగ్య రక్షణలో చిరుధాన్యాలు కీలకపాత్రం పోషిస్తాయని ఆర్‌ఏఆర్‌ఎస్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్.కలీముల్లా తెలిపారు. శుక్రవారం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఆధ్వర్యంలో ‘చిరుధాన్యాలపై అవగాహన, ప్రాసెసింగ్ యంత్రాల సందర్శన’ అనే అంశంపై 25 మంది ఎస్సీ మహిళలకు శుక్రవారం శిక్షణ తరగతులు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ చిరుధాన్యాలు తీసుకుంటే శరీరానికి పోషకాలు పుష్కలంగా అందుతాయని చెప్పారు. అనంతరం చిరుధాన్యాలను శుద్ధి చేయడం, పొట్టు తీయడం, తినుబండారాల తయారీపై మహిళలకు శిక్షణ ఇచ్చారు. ఏడీఆర్ డాక్టర్ వి.సుమతి మాట్లాడుతూ చిరుధాన్యాలను ఆహారంగా తీసుకుంటే రక్తపోటు, చక్కెర వ్యాధి, అధిక కొవ్వును అరికట్టవచ్చని వెల్లడించారు. అనంతరం మహిళలకు కిట్, సర్టిఫికెట్లతో పాటు తినుబండారాలను పంపిణీ చేశారు. పరిశుభ్రతతో వ్యాధులు దూరం చిత్తూరు రూరల్ (కాణిపాకం): చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే దోమలు రావని జిల్లా మలేరియా అధికారి వేణుగోపాల్ పేర్కొన్నారు. చిత్తూరు నగరం మాపాక్షిలో శుక్రవారం ఫ్రైడే డ్రైడేను నిర్వహించారు. ఆయన ఈ కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మాపాక్షిలోని కొన్ని వీధులను పరిశీలించి ప్రజలకు పలు సూచనలు చేశారు. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. దోమల వ్యాప్తితో వచ్చే వ్యాధులను గుర్తు చేశారు. కార్యక్రమంలో సిబ్బంది రామకృష్ణ, నారాయణ ఉన్నారు. -
ఎస్పీడబ్ల్యూలో బయోటెక్ ఫెస్ట్
తిరుపతి సిటీ :పద్మావతి డిగ్రీ, పీజీ కళాశాల బయోటెక్నాలజీ విభాగం, ఐక్యూఏసీ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ నారాయణమ్మ అధ్యక్షతన శుక్రవారం బయోటెక్ రెవల్యూషన్ ది నెక్ట్స్ ఫ్రాంటియర్– ట్రాన్స్ఫార్మింగ్ సైనన్స్ టు సొల్యూషన్ అనే అంశంపై బయోటెక్ ఫెస్ట్ నిర్వహించించారు.ఐజర్ ప్రొఫెసర్ డాక్టర్ శివకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఆయన మాట్లాడుతూ ఆధునిక సమాజంలో బయోటెక్నాలజీ పాత్ర, ప్రాముఖ్యత, అవకాశాలపై అవగాహన కల్పించారు. అనంతరం బయోటెక్నాలజీ సైన్స్ ఎక్సోపో ప్రారంభించారు. కార్యక్రమంలో డాక్టర్ బుడోల్లాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ బి.విశ్వనాథ్, విభాగాధిపతి డాక్టర్ భువనేశ్వరి, డాక్టర్ భద్రమణి, అధ్యాపకులు హేమలత, కుసుమ పాల్గొన్నారు. -
జనారణ్యంలోకి దుప్పి
చిత్తూరు కార్పొరేషన్ : నగరంలోని పీవీకేఎన్ డిగ్రీ ప్రభుత్వ కళాశాల ప్రాంతంలో దుప్పి కనిపించింది. శుక్రవారం ఉదయం రెడ్డిగుంట అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చి కళాశాల ప్రాంగణం వైపుగా వచ్చినట్లు తెలుస్తోంది. జనాలను చూసి భయపడటంతో పరుగులు తీస్తూ సమీపంలోని కమ్మీలకు కొమ్ములు చిక్కుకోవడంతో అక్కడ ఇరుక్కుపోయింది. గమనించిన కళాశాల సిబ్బంది అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకొని దుప్పిని రక్షించి పశువైద్యశాలకు తరలించారు. చికిత్స ఇచ్చిన అనంతరం అటవీ ప్రాంతంలో వదిలేసినట్లు ఎఫ్బీఓ గౌస్‌బాషా తెలిపారు. దొంగలు అరెస్టు.. బంగారం స్వాధీనం గడుపల్లె : ఇంట్లోకి చొరబడి బంగారు, వెండి నగలు దొంగలించిన గోపాల్, ఇబ్రహీం నిందితులను గుడుపల్లె ఎస్ఐ శ్రీనివాసులు పట్టుకుని నగలను స్వాధీనం చేసుకుని అరెస్టు చేశామన్నారు. గుడుపల్లె మండలంలోని పెద్దశెట్టిపల్లె గ్రామానికి చెందిన వళ్లీయమ్మ ఇంట్లో ఈనెల 16వ తేదీన ఇంటి తాళాలు పగలు కొట్టి బీరువాలో ఉన్న బంగారు, వెండి నగలను దొంగలించుకు వెళ్లారన్నారు. దొంగలించిన నగలు అమ్ముకునేందుకు శాంతీపురానికి వెళుతుండగా మార్గమధ్యలో పోలీసులు సమాచారం తెలుసుకుని వెళ్లి పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న బంగారం, వెండి నగలను స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపామన్నారు. గత ఏడాది రామకుప్పం మండలంలోని చెల్దిగానిపల్లెలోని ఒక సూపర్ మార్కెట్లో రాత్రి సమయంలో షట్టర్లు ఎత్తి దొంగలించిన కేసు కూడా రామకుప్పం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయిందన్నారు. -
కార్యదర్శులపై పనిభారం తగ్గించాలి
చిత్తూరు కార్పొరేషన్ : పంచాయతీ కార్యదర్శులపై పనిభారం తగ్గించాలని ఏపీ గ్రామ పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా నాయకులు తెలిపారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు శుక్రవారం కలెక్టర్, డీపీఓ కార్యాలయంలో డీపీఓ సుధాకర్‌రావుకు వినతిపత్రం అందజేశారు. పలురకాల సర్వేలు, కార్యక్రమాలు విజయవంతం కావడంలో కార్యదర్శుల పాత్ర కీలకమైనదన్నారు. ప్రసుత్తం మిస్సింగ్ సిటిజన్, ఎంప్లాయిస్, ఆధార్ సర్వే, వర్క్‌ఫ్రంహోం, హౌస్ హోల్డర్స్, డెత్ రీవెరిఫికేషన్, పీఎసీఎస్, ఎన్‌పీసీఎల్, నాన్ ఏపీ రెసిడెన్స్, విలేజ్ అసెట్, ప్రొఫెల్ సర్వేలు చేస్తున్నామన్నారు. వీటితో పాటు తమ రోజువారి విధులు అయిన ఇంటి , నీటి పన్నులు, లైసెన్స్, లీజ్, వేలం పాట ఇతర పన్నుల వసూళ్లు, పారిశుద్ధ్య నిర్వహణ, వర్మికంపోస్టు పర్యవేక్షణ, వాటర్ ట్యాంకుల క్లోరినేషన్, భూముల సర్వే వంటి పనుల చేస్తున్నామన్నారు. సర్వేలకు సచివాలయ సిబ్బంది సహకారం లేదన్నారు. దీంతో పని ఒత్తిడి కార్యదర్శులపై పడుతోందన్నారు. సచివాలయ సిబ్బంది సర్వే, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు గిరి, శివశంకర్, రమేష్ పాల్గొన్నారు. సహకరించని సచివాలయ ఉద్యోగులు డీపీఓకు నాయకులు వినతి -
కిక్కిరిసిన ‘సదరం’
కుప్పం : కుప్పం వంద పడకల ఆస్పత్రిలో దివ్యాంగుల కోసం శుక్రవారం నిర్వహించిన సదరం శిబిరానికి విశేష స్పందన వచ్చినట్లు కడా పీడీ వికాస్ మరమ్మత్ తెలిపారు. గుడుపల్లి, రామకుప్పం, శాంతిపురం మండలాలకు చెందిన దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లు పరిశీలన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా 2,247 మంది దివ్యాంగులు హాజరై చికిత్సలు చేసుకున్నారు. వీరిలో 1407 మంది దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. నేడు మున్సిపాలిటీ, రూరల్ ఏరియాలో శిబిరం శనివారం కుప్పం మున్సిపాలిటీ, కుప్పం రూరల్ పరిధిలోని దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహిస్తున్నట్లు పీడీ తెలిపారు. ఈ అవకాశాన్ని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
ట్రాక్టర్ బోల్తా.. 42 మందికి గాయాలు
శ్రీరంగరాజపురం (కార్వేటినగరం) : ట్రాక్టర్ బోల్తా పడి 42 మందికి గాయాలైన సంఘటన మండల పరిధిలోని పొదలపల్లి వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా.. వెదురుకుప్పం మండలం యనమలమంది గ్రామానికి చెందిన నరసింహులు అత్త గంగాధర నెల్లూరు మండలంలోని అరవచేనుపల్లి గ్రామంలో మృతి చెందడంతో అంత్యక్రియలకు స్థానికులతో కలిసి సుమారు 45 మంది ట్రాక్టర్లో తరలి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో శ్రీరంగరాజపురం మండలం పొదలపల్లి వద్ద వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న 42 మందికి గాయాలు కావడంతో స్థానికులు వారిని ద్విచక్రవాహనాలు, కార్లు, వంటి వివిధ వాహనాలలో శ్రీరంగరాజపురం మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో పండమ్మ, బుడిగమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో పండమ్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. అయితే , ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న 45 మందిలో 42 మందికి స్పల్పగాయాలు అయ్యాయని, ఇద్దరికి మాత్రం తీవ్ర గాయాలు కావడంతో వారిని మెరుగైన చికిత్స కోసం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. -
నేటి నుంచి వర్సిటీలో అంతర్జాతీయ వర్క్‌షాపు
తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత వర్సిటీ వేదికగా శనివారం నుంచి ఈ నెల 28వ తేదీ వరకు రామరంజన్ ముఖర్జీ ఆడిటోరియంలో శాబ్దబోధ మీమాంశ అనే అంశంపై వారం రోజులపాటు అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. ఈ వర్క్‌షాప్‌లో పద్మభూషణ నవలపాకం శతకోప రామానుజతాచార్య రచనలో వివరించిన శాబ్దబోధంపై తత్వశాస్త్ర, భాషా విశ్లేషణ జరగనుంది. దర్శన, వ్యాకరణ విభాగాలలో పరిశోధన విద్యార్థులు, అధ్యాపకులను లక్ష్యంగా చేసుకుని, స్పోటవాదం, అభిహితాన్వయ, అన్వితాభిధానవాదం వంటి ముఖ్యమైన అంశాలపై మహాపండితులు చర్చించనున్నారు. ఆసక్తిగల వారు రిజిస్ట్రేషన్‌తో పాటు మరిన్ని వివరాలకోసం ప్రొఫెసర్ సి రంగనాథన్ 94409 19106, డాక్టర్ ఓజీపీ కళ్యాణ శాస్త్రి 88856 73667లను సంప్రదించాలని వర్సిటీ అధికారులు ఒక ప్రకటలో తెలిపారు. పుత్తూరు రైటర్ వీఆర్‌కు! – రాజకీయ ఒత్తిల్లే కారణమా? పుత్తూరు : స్థానిక పోలీస్ స్టేషన్లో రైటర్‌గా పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ బి.రవి తిరుపతి ఎస్పీ ఆదేశాల మేరకు వీఆర్ (వేకన్సీ రిజర్వుడు)కు బదిలీ అయ్యారు. గురువారం జరిగిన ఈ బదిలీ కేవలం స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. పోలీస్ స్టేషన్‌కు వివిధ కేసుల్లో పట్టుకొస్తున్న నిందితులను స్థానిక టీడీపీ నాయకులు వారు మావారే వదిలి పెట్టాలంటూ పోలీసులపై అధికార జులుం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఇలాంటి ఘటనలపైనే ఇలా అయితే మా ఉద్యోగాలు ఎలా చేయాలంటూ రైటర్ రవి ప్రశ్నించడంతో అతనిని టార్గెట్ చేసి వీఆర్‌కు పంపించినట్లు తెలుస్తోంది. చూశారా మేము చెప్పింది చేయకపోతే ఇలానే ఉంటుందంటూ స్థానిక పోలీసు ఉన్నతాధికారులకు టీడీపీ నాయకులు హెచ్చరికలు పంపుతున్నారు. రాజకీయంగా తమ పలుకుబడిని చూపేందుకే చిరుద్యోగిపై ప్రతాపం చూపారంటూ పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. 500 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం కార్వేటినగరం : 5 వందల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి.. వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ సీఐ సత్యనారాయణ పేర్కొన్నారు. శుక్రవారం కార్వేటినగరం ఎకై ్స జ్ శాఖ కార్యాలయం ఆవరణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ మాట్లాడుతూ.. సారా రహిత ఆంధ్రప్రదేశ్‌గా మార్చే క్రమంలో భాగంగా దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండలంలోని జంగాలపల్లి సమీపంలోని చిన్న కాలువలో నాటు సారా తయారీ స్థావరాలపై దాడులు నిర్వహించి, సారా తయారీకి సిద్ధం చేసి ఉంచిన 500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి మూడు డ్రమ్ములను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అలాగే బెల్లం ఊటకు సంబంధించిన చిన్నతయ్యూరు గ్రామం మిల్టన్ కుమారుడు పొన్న ప్రభుపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. దాడుల్లో ఎస్ఐ సుబ్రమణ్యం, హెడ్ కానిస్టేబుల్ మునిసుందరం, సిబ్బంది పాల్గొన్నారు. ‘కళైకావేరి’తో ఎస్వీయూ ఒప్పందం తిరుపతి సిటీ : తమిళనాడులోని తిరుచిరాపల్లెకు చెందిన కళై కావేరి లలిత కళల కళాశాలలో పలు అంశాలపై ఎస్వీయూ కళలప్రదర్శన అధ్యయన విభాగం శుక్రవారం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు అధ్యాపకులు, విద్యార్థులు పరస్పర అభ్యసన, పరిశోధన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించునే వెసులుబాటు ఉంటుంది. కార్యక్రమలో ఆచార్య శంకర్ గణేష్, ఆచార్య ఉమామహేశ్వరి, డాక్టర్ పత్తిపాటి వివేక్, ఉదయ భాస్కర్ పాల్గొన్నారు. -
శ్రీవారి దర్శనానికి 18 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్ట్మెంట్లు నిండాయి. గురువారం అర్ధరాత్రి వరకు 58,872 మంది స్వామివారిని దర్శించుకోగా 23,523 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.71 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాన్ని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలో అనుమతించరని స్పష్టం చేసింది. -
● 306 లీటర్ల పాలకు డబ్బులు ఇవ్వని వైనం ● లబోదిబోమంటున్న ఏజెంటు
పాడి రైతులకు ‘హెరిటేజ్’ అన్యాయం రొంపిచెర్ల : రైతుల నుంచి సేకరించిన పాలకు డబ్బు సక్రమంగా చెల్లించడం లేదని మండలంలోని చెంచెంరెడ్డి గారిపల్లె పంచాయతీ లంకిపల్లెవారిపల్లెకు చెందిన హెరిటేజ్ ఏజెంట్ రెడ్డెప్ప నాయుడు ఆరోపించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 20 ఏళ్లుగా హెరిటేజ్ ఏజెంటుగా పని చేస్తున్నానని తెలిపారు. అయితే ఈనెల 1, 2, 4, 5వ తేదీలలో పీలేరు హెరిటేజ్ డెయిరీ 306 లీటర్ల పాలు పోసుకుని ఒక రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. నాలుగు రోజుల పాల డబ్బులు రైతులకు తన చేతి నుంచి రూ.10 వేలు ఇచ్చినట్లు చెప్పారు. ఏజెంట్‌గా తనకు ఒక లీటరు పాలకు రూ.90 పైసల నుంచి రూపాయి మాత్రమే ఇస్తారని, అయితే రూ.10 వేలు సొంత సొమ్మును పాలు పోసిన రైతులకు ఇస్తే హెరిటేజ్ డెయిరీ పట్టించుకోకుండా పాడి రైతులకు అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా హెరిటేజ్ అధికారులు స్పందించి 306 లీటర్ల పాల డబ్బును చెల్లించాలని కోరారు. -
పోలీసులకు సేవా పతకాలు
చిత్తూరు అర్బన్ : జిల్లా పోలీసుశాఖలో పని చేస్తున్న 10 మంది పోలీసులకు ఈ ఏడాది ఉగాది సేవా పతకాలను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. చిత్తూరు సీసీఎస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న మునిరత్నంకు ఉత్తమ సేవా పతకం, ఆర్ముడ్ రిజర్వు విభాగం డీఎస్పీ మహబూబ్ బాష, స్పెషల్ బ్రాంచ్ సీఐ మనోహర్, ఏఎస్ఐ జి.దేవరాజులునాయుడు (డీసీసీ–చిత్తూరు), హెడ్ కానిస్టేబుళ్లు నీమతుల్ల (డీసీఆర్బీ–చిత్తూరు), బాలాజీ (గుడుపల్లె), వెంకటేశ్వర్లు (డీసీఆర్బీ–చిత్తూరు), ఎం.సురేష్‌కుమార్ (ఏఆర్–చిత్తూరు)తో పాటు కానిస్టేబుళ్లు పి.హరిబాబు (పంజాణి), ఎల్.మణిగండన్ (ట్రాఫిక్–చిత్తూరు)కు సేవా పతకాలకు ఎంపిక చేసినట్లు ఉత్తర్వులు వెలువడ్డాయి. -
అటవీ చట్టాలపై అవగాహన
చిత్తూరు కార్పొరేషన్ : ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా స్థానిక అటవీ ప్రాంతంలో పలు అంశాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. శుక్రవారం నగరవనం ఆవరణలో మొక్కల పెంపకంపై తిరుపతి బయెట్రిమ్ డీఎఫ్ఓ నరేంద్రన్ పలు సూచనలు చేశారు. ఎర్ర చందనం చెట్ల ఆవశ్యకత పెరిగే విధానం గురించి తెలిపారు. అలాగే వాటి విత్తనాలను ఎలా సేకరించి నాటాలి, పెంచాలి అనే అంశాల గురించి విపులంగా చెప్పారు. అనంతరం డీఎఫ్ఓ భరణి అటవీ ప్రాంతంలో జరిగే పనులకు ఎలా అంచనాలు వేయాలి అనే అంశంపై మాట్లాడారు. పనులు వాటి ప్రతిపాదన, అనుమతి, నిర్మాణాలు, వివరాల నమోదు గురించి ఆమె తెలియజేశారు. అటవీ ప్రాంతం సరిహద్దులు, ఆక్రమణలు నివారణ గురించి మాట్లాడారు. అటవీ చట్టాల గురించి ఫ్లయింగ్‌స్క్వాడ్ డీఎఫ్ఓ గురు ప్రభాకర్ తెలిపారు. వన్యప్రాణుల వేట నిందితులను పట్టుకోవడం, సాక్ష్యాల సేకరణ, నిందితులను ఎలా పట్టుకోవాలి.. కేసు నమోదు గురించి తెలియజేశారు. ఏ అంశాలు నాన్ బెయిల్ కింద వస్తాయో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలిపారు. బెయిలబుల్ కేసులు ఏవి, ఏ కేసుకు ఎంత జరిమానా, శిక్ష పడుతుందో విశదీకరించారు. కార్యక్రమంలో శిక్షణ డీఎఫ్ఓ సంకేత్గౌడ్, ఎఫ్ఆర్వోలు థామస్, వెంకట సుబ్బయ్య పాల్గొన్నారు. -
బడుల విలీనంపై ప్రభుత్వం స్పందించాలి
చిత్తూరు కలెక్టరేట్ : కూటమి ప్రభుత్వం వెంటనే పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సోమశేఖరనాయుడు డిమాండ్ చేశారు. ఆ సంఘం నాయకులు జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్ 5వ తేదీన తిరుపతిలో ఐదు జిల్లాల ప్రాంతీయ విద్యా సదస్సు, పోరుబాట సదస్సు జరుగుతుందన్నారు. ప్రభుత్వం తొలి సంతకం చేసిన డీఎస్సీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జీవీ రమణ మాట్లాడుతూ.. 117 జీవో రద్దు, పాఠశాలల విలీనంపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయుల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలన్నారు. తిరుపతి జిల్లా కేంద్రంలో నిర్వహించే పోరుబాట సదస్సుకు చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి అధిక సంఖ్యలో సంఘం సభ్యులు, టీచర్లు పాల్గొనాలన్నారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మణిగండన్, నాయకులు సుధాకర్ రెడ్డి, కె.రెడ్డెప్ప నాయుడు, రెహనా బేగం, ఎస్పీ బాషా, సరిత, ఏకాంబరం, పార్థసారథి, పంటపల్లి సురేష్, ఈశ్వర్ పాల్గొన్నారు. -
తాగునీటి సమస్య లేకుండా చూడండి
● క్రమం తప్పక ట్యాంకులను శుభ్రం చేయించాలి ● పంట నీటి కుంటలు నిర్మించండి ● పలు శాఖల వరుస సమీక్షలో కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో వరుస సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఈ మేరకు కలెక్టర్ మాట్లాడుతూ వేసవిని దృష్టిలో పెట్టుకుని రక్షిత మంచి నీటి సరఫరాపై ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల అధికారులు ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. ఓవర్ హెడ్ ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రం చేయించాలని ఆదేశించారు. ఈ ప్రక్రియను మండల స్పెషల్ ఆఫీసర్లు పర్యవేక్షించాలన్నారు. జిల్లాలో బహిరంగ మల మూత్ర విసర్జన జరగకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ నెలాఖరు లోపు జిల్లాలోని అన్ని ఓవర్‌హెడ్ ట్యాంకులను శుభ్రం చేయించాలన్నారు. అనంతరం జియోట్యాగింగ్ తో ఫొటోలు సమర్పించాలని కోరారు. జిల్లాలో 15 రోజుల వ్యవధిలో 308 చేతి పంపులు మరమ్మతులు కాగా 233 రిపేర్లు చేయించినట్లు తెలిపారు. 190 పైప్‌లైన్ లీకేజీలను గుర్తించి మొత్తం అన్ని పైపులకు మరమ్మతులు చేపట్టామన్నారు. 225 పంపు సెట్లు మరమ్మతులను గుర్తించి 221 పంపు సెట్లకు మరమ్మతు చేయించినట్లు తెలిపారు. గృహ నిర్మాణాల పురోగతిలో అలసత్వం వద్దు జిల్లాలో గృహ నిర్మాణాల పురోగతిలో అలసత్వ వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ హెచ్చరించారు. ఈ మేరకు హౌసింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకంలో చేపట్టిన వివిధ దశల్లో ఉన్న 6,568 గృహాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న గృహాలను పూర్తి చేసేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ లకు ప్రభుత్వం అందిస్తున్న అదనపు సహాయంను క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. అదనపు సహాయానికి ఇప్పటి వరకు 16,406 మంది లబ్ధిదారులను గుర్తించడం జరిగిందన్నారు. ఇందులో 6,388 మందికి సంబంధించి రూ.9.20 కోట్లు ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు. జిల్లాలోని పూతలపట్టు, గంగాధరనెల్లూరు నియోజకవర్గాల్లో లే అవుట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలోని కుప్పం, పుంగనూరు, పలమనేరు, నగరి నియోజకవర్గాల్లో 175 అంగన్వాడీ భవనాలు మంజూరు కాగా రూ.47 లక్షలతో పూర్తి చేసినట్లు తెలిపారు. జల సంరక్షణకు చర్యలు చేపట్టాలి జిల్లాలో జల సంరక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. పెద్ద ఎత్తున నీటి కుంటలను నిర్మించాలన్నారు. జల సంరక్షణ చర్యల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పెద్ద ఎత్తున పంట నీటి కుంటల నిర్మాణాలు చేపట్టాలన్నారు. జూన్ నెలాఖరు లోపు నీటి కుంటల నిర్మాణం చేపట్టేందుకు జిల్లాలో ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. వేసవిలో ఉపాధి కూలీలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కూలీలకు తాగునీటి సౌకర్యం, ఇతర సౌకర్యాలను పకడ్బందీగా చేపట్టాలన్నారు. సమీక్షల్లో జెడ్పీ సీఈవో రవికుమార్ నాయుడు, డ్వామా పీడీ రవికుమార్, హౌసింగ్ పీడీ గోపాల్‌నాయక్, డీపీవో సుధాకర్ తదితర అధికారులు పాల్గొన్నారు. -
అటవీ చట్టాలపై అవగాహన
అటవీ చట్టాలపై అధికారులకు పూర్తి అవగా హన అవసరమని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డీఎఫ్ఓ వివరించారు. శనివారం శ్రీ 22 శ్రీ మార్చి శ్రీ 2025చిత్తూరు అర్బన్ : కూటమి పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఖాకీ యూనిఫామ్‌పై చల్లిన బురదను కడుక్కోవడానికి జిల్లాలో ఏక పక్షంగా 264 మంది పోలీసులు బదిలీ అయ్యారు. కాగా వేల మంది పోలీసుల పనులు చేసే జిల్లా పోలీసు కార్యాలయంలో గాడితప్పిన కొందరు మినిస్టీరియల్ సిబ్బందిని దారిలో ఎవరు పెడతారు..? ఇన్స్పెక్టర్ల వద్ద డ్రైవర్ డ్యూటీ చేస్తూ ఆర్థిక పనులు చక్కబెడుతున్న వాళ్లకు బదిలీ ఉండదా..? డీఎస్పీల వద్ద తిష్ట వేసిన తిమింగలాల అక్రమాలకు కళ్లెం వేయలేరా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. డీపీవోపై పట్టు అవసరం.. వేల మంది పోలీసులు స్టేషన్లో.. రోడ్లపై డ్యూటీలు చేయడం కనిపిస్తూనే ఉంటుంది. రూ.వంద లంచం తీసుకున్న వాళ్లను నిర్దాక్షణ్యంగా సస్పెండ్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ ఆరోగ్యం బాగోలేక మెడికల్ లీవు పెట్టుకున్న కానిస్టేబుల్.. తన పెండింగ్ వేతనం కోసం డీపీవోకు వెళ్లాలి. ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్)పై రుణం తీసుకుంటే తప్ప పిల్లాడి చదువు కొనసాగించలేని వాళ్లు, ఎనిమిదేళ్లకోసారి వచ్చే ఇంక్రిమెంటును సకాలంలో ఇవ్వకపోవడంతో.. దాని బకాయిల కోసం తిరిగే సీనియర్ పోలీసులు, కమిటేషన్ లీవుల కోసం సీటు.. సీటుకు సెల్యూట్ కొట్టి నెలల పాటు తిరిగే హెడ్‌కానిస్టేబుళ్లు.. వీళ్లందరినీ ఒకే చోట చూడాలంటే అది జిల్లా పోలీసు కార్యాలయమే. అటాచ్మెంట్ పేరుతో.. పోలీసుల సంక్షేమ కోసం పనిచేసే డీపీవోలో ఒక్క రూపాయి తీసుకుంటే పాపమని భావించే నిర్ణీత గడువుకన్నా ముందుగా పనులు పూర్తిచేసే మినిస్టీరియల్ సిబ్బంది ఇక్కడ చాలా మందే ఉన్నారు. ఇదే సమయంలో సాటి డిపార్టుమెంటులో పని చేస్తున్న పోలీసులకు సాయం చేయాలన్నా చేతులు చాచే అవినీతి జలగలు కూడా ఇక్కడే కనిపిస్తుంటారు. పరిపాలన కోసం డీపీవోలో ఉన్న మినిస్టీరియల్ ఉద్యోగులు చేయాల్సిన పనులు సకాలంలో చేయకపోవడంతో వారికి తోక సాయంగా స్టేషన్లో విధులు నిర్వర్తించే పోలీసులను అటాచ్మెంట్ల ద్వారా పిలిపించి విధులు చేయించుకోవడం డీపీవోలో సర్వసాధారణమనే విమర్శలున్నాయి. ఇక సిబ్బంది బదిలీల్లో వందల పేర్ల మధ్యలో తమకు కావాల్సిన వ్యక్తుల ఒకటి, రెండు పేర్లను ఇరికించి కోరుకున్న చోటుకి బదిలీ చేయడం, వాళ్ల నుంచి ఆర్థిక భరోసా పొందుతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. వీటన్నింటికీ చెక్ పెట్టాలంటే ముందుగా పోలీసు బాసుకు డీపీవోపై పట్టు అవసరమనే వాదనలు వినిపిస్తున్నాయి. – 8లో– 8లోన్యూస్రీల్ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టలేరనే చందంగా.. సాక్ష్యాత్తు జిల్లా పోలీసు కార్యాలయంలో అటాచ్మెంట్ల పేరుతో ఏళ్లకు తరబడి తిష్టవేసి విధులు నిర్వహిస్తూ.. లంచాలు మరిగిన అవినీతి జలగలను పసిగట్టలేకపోతున్నారు.. ఏళ్లుగా పాతుకుపోయిన కొంత మంది చిన్న స్థాయి ఉద్యోగులు .. ఉన్నతాధికారులనే బెదిరించే స్థాయిలో వీరు వ్యవహారాలు చక్కబెడుతున్నారు. మరోవైపు అసాంఘిక కార్యకలాపాలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. వీటిన్నింటిపై జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రక్షాళన జరగాలని కొంత మంది పోలీసులు సైతం కోరుకుంటుండడం విశేషం. జిల్లా పోలీసు కార్యాలయంలో ఫైలుకో రేటు? మినిస్టీరియల్ స్టాఫ్ విధులకు.. పీసీల సాయం సబ్–డివిజన్ కార్యాలయాల్లోనూ వారిదే హవా ఐడీ పార్టీ, ఐడబ్ల్యూ, డ్రైవర్ల డ్యూటీల్లో కదలని వైనం చిత్తూరు పోలీసు శాఖలో మరింత ప్రక్షాళన అవసరమే.. అసాంఘిక కార్యకలాపాలు పోషిస్తూ.. చిత్తూరు వెస్ట్ పరిధిలో ఐడీ పార్టీ పేరిట ఓ కానిస్టేబుల్ బెట్టింగులను ప్రోత్సహిస్తూ, అసాంఘిక కార్యకలాపాలను తన కనుసన్నల్లో చేయిస్తున్నా అడిగే దిక్కులేదు. ఐడబ్ల్యూ (రైటర్లు) పేరిట పలమనేరు డివిజన్లోని ఓ కానిస్టేబుల్ ప్రతి రోజూ సాయంత్రం ఇంటికి వెళ్లేలోపు జేబులో రూ.2 వేలు ఉండాల్సిందే. అయిదేళ్లల్లో మూడు సార్లు ఓ డీఎస్పీ క్యాంపు కార్యాలయాన్నే తన సీటుగా మలుచుకుని సబ్–డివిజన్ మొత్తం షాడో డీఎస్పీగా పేరొందిన వ్యక్తిని, చిత్తూరులో ఓ సీఐ వద్ద పనిచేసే డ్రైవర్ ఫైనాన్స్‌లు ఇస్తూ, సెటిల్మెంట్లు చేస్తున్నా ఎవ్వరూ అడగని పరిస్థితి. అసలు ఇన్స్పెక్టర్ల వద్ద డ్రైవర్ల రూపంలో ఏళ్ల తరబడి పాతుకుపోయిన వాళ్లను ఎందుకు కదిలించడంలేదని ప్రశ్నిస్తున్నారు. వారికి బదిలీ ఉండదా..? పుంగనూరులో టీడీపీ కార్యకర్త హత్య ఘటనను కారణంగా చూపిస్తూ జిల్లా పోలీసు శాఖలో జరిగిన బదిలీల పర్వంపై ఖాకీలు రగిలిపోతున్నారు. తమ కడుపుమంట పోసుకున్న కూటమి పార్టీ నేతలకు శాపనార్థాలు పెడుతున్నారు. ఇదే సమయంలో బాసు తీసుకునే నిర్ణయాల వల్ల కలిగే తప్పొప్పులను చెప్పలేకపోతున్న ‘ప్రత్యేక విభాగం’ వాస్తవాలను చెప్పకుండా మౌనం వహించడంపై గుర్రుమంటున్నారు. -
దౌర్జన్యంగా నిర్వహించిన వేలంపాటను రద్దు చేయాలి
– మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి డిమాండ్ శ్రీరంగరాజపురం (కార్వేటినగరం) : కూటమి నా యకుల దౌర్జన్యంతో పెనుమూరు షాపింగ్ కాంప్లెక్స్‌కు నిర్వహించిన వేలం పాటను రద్దు చేసి అ ధికారుల సమక్షంలో బహిరంగ వేలం పాట నిర్వహించాలని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వా మి డిమాండ్ చేశారు. శుక్రవారం పెద్ద తయ్యూరు లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ.. దౌర్జన్యంతో వేలం పాట నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని విమర్శించారు. కలెక్టర్, ఎస్పీ వెంటనే స్పందించి అర్హులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మహాసముద్రం దయాసాగర్‌రెడ్డి పది మంది పేదలకు మంచి చేయాలనే ఉద్దేశంతో నూతన వాణిజ్య కాంప్లెక్స్ నిర్మాణాన్ని చేపడితే, నేడు కూటమి నాయకులు షాపింగ్ కాంప్లెక్స్ వేలం పాటకు రాజకీయ రంగు పులిమి తక్కువ ధరలకే పచ్చనేతలకు కట్టబెట్టి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోందని ఆరోపించారు. అదే విధంగా 49 కొత్తపల్లి మిట్టలో జరిగే వారపు సంతలో వేలం పాట దక్కించుకున్న వైఎస్సార్సీపీ సానుభూతి పరుడికి అధికారులు సహకరించాలని కోరారు. ఆయన వెంట జిల్లా ఉపాధ్యక్షుడు గురవారెడ్డి, జనార్దన్, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేడు పోర్ట్‌ఫోలియో జడ్జి సమీక్ష చిత్తూరు అర్బన్ : చిత్తూరు పోర్ట్ ఫోలియో జడ్జి జస్టిస్ సురేష్‌రెడ్డి శనివారం జిల్లాలోని న్యాయమూర్తులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. చిత్తూరు నగరంలోని జెడ్పీ సమావేశ మందిరంలో చిత్తూరు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న న్యాయమూర్తులతో ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం వరకు ఈ సమీక్ష జరగనుంది. -
లక్ష్యం దిశగా అడుగులు
● జిల్లాలో చురుగ్గా పన్నుల వసూళ్ల ప్రక్రియ ● లక్ష్యం రూ.24.30 కోట్లు.. వసూలు రూ.20.96 కోట్లు ● ఇప్పటికే 86 శాతం పూర్తి ● రాష్ట్రంలో జిల్లా రెండో స్థానం ● గడువు నాటికి వందశాతం పూర్తికి కృషి చిత్తూరు కార్పొరేషన్ : పంచాయతీల అభివృద్ధికి.. కార్మికులకు నెలనెలా జీతాలకు పన్నుల వసూళ్లే కీలకం. సకాలంలో పన్ను వసూలు చేస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. మార్చి నెలాఖరులోగా పన్ను వసూలు చేయాలి. గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించాలని జిల్లా, మండల స్థాయి అధికారులు తరచూ ఆదేశాలు జారీ చేస్తుంటారు. వీటిని పక్కాగా అమలు చేయడానికి జిల్లా పంచాయతీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. గడువు సమయంలో తొందర పడకుండా ముందుస్తుగా దశల వారీగా ఒత్తిడి తెచ్చారు. దీంతో నిర్దేశించిన లక్ష్యంలో గురువారం నాటికే 86 శాతానికి చేరుకున్నారు. మరో పది రోజుల్లో అనుకున్న లక్ష్యానికి చేరుకోవాలని పనిచేస్తున్నారు. పన్నుల వసూళ్లలో రాష్ట్రంలో ప్రస్తుతం చిత్తూరు జిల్లా రెండో స్థానంలో ఉందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలో నవంబర్ నుంచే.. ఏటా పన్నుల వసూళ్లు చేయాలని అధికారులు చెప్పడం క్షేత్రస్థాయి సిబ్బంది సరే అనడం.. తీరా మార్చినెల అయ్యాక ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడం సర్వసాధారణంగా మారింది. కానీ వీటిపై ఈసారి అధికారులు రూట్ మార్చారు. చివరి రోజుల్లో పరుగెత్తే బదులు ముందు నుంచి నడుస్తామని పక్కా ప్లాన్ చేసుకున్నారు. నవంబర్ నుంచే రోజూ పన్నుల వసూళ్లు, ఇతర విషయాల మీద సమావేశాలు సిబ్బందితో నిర్వహించారు. వారిని వీటిపై సిద్ధం చేస్తూ పలు సూచనలు చేశారు. స్వర్ణ పంచాయతీ వెబ్సైట్లో అసెస్మెంట్ వివరాలను సిద్ధం చేసుకున్నారు. పంచాయతీ వారీగా ఎంత రావాలి? ఎంత వస్తుంది ?ఎక్కడ ఆలస్యమవుతుంది? అనే విషయాల పై ఎక్కువ ఫోకస్ పెట్టారు. ప్రభుత్వం కల్పిస్తున్న వసతులు గురించి స్థానికులకు తెలియజేస్తూ పన్నులు చెల్లించాలని గ్రామస్తులకు చెబుతూ వసూళ్లు ప్రారంభించారు. జనవరి నుంచి వీటిని వేగవంతం చేస్తూ వచ్చారు. దీంతో మార్చి 20 నాటికి 86 శాతం నిర్దేశించిన లక్ష్యానికి చేరుకున్నారు. మార్చి 25 నాటికి 90 శాతం నెలాఖారుకు 95 శాతం లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులు టార్గెట్ పెట్టుకున్నారు. పంచాయతీ ఉద్యోగులు, మండల అధికారులు, డివిజనల్ అధికారులు సమష్టిగా వీటిపై ఫోకస్ పెట్టారు. ప్రతి పంచాయతీలో సెక్రటరీలు, బిల్ కలెక్టర్లు, సచివాలయ ఉద్యోగులు, కాంట్రాక్టు సిబ్బంది అందరికీ పలు ఆదేశాలు అధికారులు ఇచ్చారు. పన్నుల వసూళ్లను బట్టి పనితీరున అర్థం చేసుకోవచ్చు. అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శుల నేతృత్వంలో బిల్ కలెక్టర్లతో పాటు సచివాలయ ఉద్యోగులు ఏ విధంగా పనిచేస్తున్నారో తెలుస్తోంది. ఎంపీడీఓల ప్రత్యేక పర్యవేక్షణ వీటికి తోడు అయింది. ప్రత్యేక చర్యలు పంచాయతీల అభివృద్ధికి ప న్ను బకాయిలు విఘాతం కా కూడదు. ప్రతి ఒక్కరూ మార్చి 31 లోపు పాత బకాయిలు, ప్రస్తుత పన్నులు అందరూ చెల్లించాలి. నవంబరు నుంచి వసూళ్ల పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. అప్పటి నుంచి వసూళ్లను ప్రారంభించి జనవరి నుంచి వేగం పెంచాం. వందశాతం వసూళ్లే లక్ష్యంగా పనిచేయాలి. ప్రతి ఒక్కరూ ఇలాగే పనిచేసి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి కృషి చేయాలి. –సుధాకర్‌రావు, డీపీఓ, చిత్తూరు జిల్లా 86 శాతం వసూళ్లు జిల్లా పరిధిలో 697 పంచాయతీలు ఉండగా లక్ష్యంలో 86 శాతం వసూళ్లు రాబట్టారు. చిత్తూ రు, నగరి, పలమనేరు, కుప్పం రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. పాత బకాయిలు రూ.4.75 కోట్లు కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను, పన్నేతరాలు కలిపి రూ.19.55 కోట్లు వసూలు కావాల్సి ఉంది. పాత బకాయిలతో కలిపి ఇప్పటికి రూ.24.30 కోట్లలో రూ.20.96 కోట్లు వసూలు అయింది. ఈనెలాఖరులోగా మిగిలిన రూ.3.34. కోట్ల వసూలు అవ్వాల్సి ఉంది. నగరి డివిజన్లో రూ.1.42 కోట్లు, కుప్పంలో రూ.1.42 కోట్లు, చిత్తూరు డివిజన్లో రూ.9.79 కోట్లు, పలమనేరు రూ.7.43 కోట్లు వసూళ్లు వచ్చింది. అంటే చిత్తూరు మొదటి స్థానంలో, పలమనేరు, నగరి, కుప్పం తర్వాత స్థానాల్లో ఉన్నాయి. రాష్ట్ర అధికారులు ఫిబ్రవరిలోపు 50 శాతం, మార్చి రెండో వారానికి 75 శాతం, చివరికి 100 శాతం చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. డివిజన్ పంచాయతీలు పన్నుల లక్ష్యం వసూళ్లు (రూ.కోట్లలో) (రూ.కోట్లలో) చిత్తూరు 296 11.77 9.99 నగరి 102 1.79 1.72 పలమనేరు 206 8.99 7.73 కుప్పం 93 1.74 1.52 మొత్తం 697 24.30 20.96 -
గురుకులాలకు దరఖాస్తు గడువు పెంపు
సదుం : ఉమ్మడి జిల్లాల్లోని ఎంజేపీ గురుకుల పాఠశాల, కళాశాలల్లో ప్రవేశం కోసం దర ఖాస్తు గడువును పెంపొందించినట్లు శుక్రవా రం గురుకులాల కన్వీనర్ శ్రీనివాసులరెడ్డి తెలిపారు. జూనియర్ ఇంటర్, 5వ తరగతిలో ప్రవేశానికి, 6, 7, 8, 9 తరగతులలో బ్యాక్‌లా గ్ సీట్ల భర్తీకి ఈనెల 25 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఏప్రిల్ 4న ఇంటర్ , 27న 5వ తరగతి, 28న 6,7,8,9 తర గతులలో బ్యాక్లాగ్ సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు. సదుం, సత్యవేడు, తంబళ్లపల్లె, ఐతేపల్లె, కుప్పం, కలికిరి, పీలేరు, ఉదయమాణిక్యం, పెద్దపంజాణి, పులిచర్లలోని ఎంజేపీ పాఠశాలల్లో ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు. ప్రవేశ పరీక్ష ఫలితాల ఆధారంగా సీట్లను భర్తీ చేస్తామని వెల్లడించారు. మెడికల్ దుకాణాలపై విజిలెన్స్ దాడులు చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరలోని పలు మెడికల్ దుకాణాలపై పోలీసులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఆపరేషన్ గరుడలో భాగంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రీజినల్ అధికారి కరీముల్లా, డ్రగ్ ఇన్స్పెక్టర్ కీర్తన, పోలీసు అధికారులు మహేశ్వర్, అనిల్‌కుమార్ బృందాలుగా కలిసి దాడులు నిర్వహించారు. వైద్యుడి సిఫార్సు లేకుండా కొన్ని మందులు ఇవ్వడం, బిల్లులు ఇవ్వకుండా విక్రయాలు చేస్తున్న కొంగారెడ్డిపల్లె అపోలో, మురకంబట్టు మెడ్‌లైఫ్ దుకాణాల లైసెన్సుల రద్దుకు ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు తెలిపారు. నిధుల దుర్వినియోగంపై కార్యదర్శి సస్పెన్షన్ చిత్తూరు కలెక్టరేట్ : పంచాయతీ నిధుల దుర్వినియోగంపై బంగారుపాళ్యం మండలం గుండ్లకట్టమంచి పంచాయతీ కార్యదర్శి ఉమాపతిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. బంగారుపాళ్యం మండలం గుండ్లకట్టమంచి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న సమయంలో పంచాయతీ నిధులు రూ.3,68,441 దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఆ నిధుల పై సమగ్ర విచారణ చేసిన అనంతరం ఉమాపతిని సస్పెండ్ చేశారు. దుర్వినియోగం అయిన నిధులను రికవరీ చేయాల్సిందిగా తహసీల్దార్‌ను ఆదేశిస్తున్నట్లు కలెక్టర్ ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. సర్పంచ్‌కు షోకాజ్ జారీ చిత్తూరు కార్పొరేషన్ : నిధులు దుర్వినియోగం చేసిన కారణంగా బంగారుపాళ్యం మండలం గుండ్లకట్టమంచి పంచాయతీ సర్పంచ్ శ్రీనివాసులుకు షోకాజ్ నోటీసు ఇచ్చినట్లు డీపీఓ సుధాకర్‌రావు తెలిపారు. వారం రోజుల లోపు వీటిపై సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 24 మందికి జరిమానా చిత్తూరు అర్బన్ : మద్యం తాగి వాహనాలు నడిపిన 24 మందికి రూ.2.40 లక్షల జరిమానా విధిస్తూ చిత్తూరులోని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఉమాదేవి శుక్రవారం తీర్పునిచ్చారు. చిత్తూరు ట్రాఫిక్ సీఐ నిత్యబాబు రెండు రోజులుగా వాహనాలు తనిఖీ చేస్తుండగా పలువురు మద్యం తాగి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించారు. మొత్తం 24 మందిపై కేసు నమోదు చేసి, కోర్టుకు తరలించారు. ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున మొత్తం రూ.2.40 లక్షల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. పంటలు ఎండుతున్నాయని కార్యాలయానికి తాళం – కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వాలని రైతుల నిరసన పలమమేరు : పట్టణంలోని గంగవరం మండల ట్రాన్స్‌కో ఏఈ కార్యాలయానికి శుక్రవారం ఆ మండలానికి చెందిన పలువురు రైతులు తాళం వేసి నిరసన తెలిపారు. మండలంలో రైతులకు చెందిన ట్రాన్స్ఫార్మర్లు కాలి కొత్త ట్రాన్స్ఫార్మర్ల కోసం వస్తుంటే పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దీంతో తమ పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్య పరిష్కరించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. -
‘పది’ పరీక్షలకు మోహరించిన అధికారులు
చౌడేపల్లె : స్థానిక ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షా కేంద్రంలో మూడు స్క్వాడ్ బృందాలు శుక్రవారం తనిఖీలు చేపట్టాయి. ‘సాక్షి’లో హిందీ పరీక్షలో మాస్ కాపీయింగ్..? అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆదేశాల మేరకు పరీక్షా కే ంద్రం వద్ద ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. మూడవ రోజు ఇంగ్లీషు పరీక్షకు హాజరైన విద్యార్థులను ప్రధాన గేటు వద్ద పోలీసులు, సచివాలయ మహిళా సంరక్షకులు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను మాత్రమే లోపలికి తనిఖీ చేసి పంపారు. చిత్తూరు నుంచి అడిషనల్ ఫ్లైయింగ్ స్క్వాడ్‌తో పాటు రెండు సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు పరీక్ష కేంద్రం ప్రారంభం నుంచి పరీక్షలు ముగిసే వరకు అక్కడే ఉన్నారు. పరీక్షా కేంద్రం వద్ద అదనపు పోలీసు సిబ్బందిని కేటాయించారు. కాగా మొత్తం 500 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా 8 మంది విద్యార్థులు పరీక్షలకు డుమ్మా కొట్టారు. పరీక్షా కేంద్రాన్ని ఎంఈఓ తిరుమలమ్మ, తహశీల్దార్ హనుమంతునాయక్, ఎస్ఐ నాగేశ్వరరావు తనిఖీ చేశారు. రొంపిచెర్లలో కట్టుదిట్టంగా పరీక్షలు రొంపిచెర్ల : రొంపిచెర్లలో జరుగుతున్న పదో తగరతి పరీక్షలపై జిల్లా విద్యాశాఖ అధికారులు పట్టు బిగించారు. నాలుగు రోజుల కిందట బాలుర ఉన్నత పాఠశాలలోని పరీక్ష కేంద్రంలో ఏర్పాటు చేసిన రెండు సీసీ కెమెరాలను గుర్తు తెలియని దొంగలు చోరీ చేశారు. దీంతో శుక్రవారం రొంపిచెర్ల బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలో పరీక్షలు పూర్తి అయ్యే వరకు సిట్టింగ్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేశారు. అయితే పరీక్ష కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకు ఇంత వరకు కనెక్షన్ ఇవ్వలేదని సమాచారం. -
ఇంతకీ ఎవరీ అబ్బాయి!
● 2 నెలలుగా రిమ్మర్స్ స్కూల్లోనే.. పలమనేరు : ఎవరి బిడ్డో తెలియదు.. ఏ ఊరో చెప్పడం లేదు. ఎలాంటి వివరాలు నోట రావ డం లేదు. మూడు నెలల కిందట పలమనేరు మండలంలోని బేరుపల్లిలో మూతబడిన ప్రభుత్వ బడి వద్ద ఉంటుంటేవాడు. గమనించిన స్థానికులు ఆ 22 ఏళ్ల అబ్బాయి చిరునామా తెలుసుకునేందుకు ప్రయత్నించినా లాభం లే కుండా పోయింది. దీంతో గ్రామస్తులు అతడిని రెండు నెలల కిందట పట్టణ సమీపంలోని నడింపల్లి వద్ద గల రిమ్మర్స్ బుద్ధిమాంద్యం గల పాఠశాలలో చేర్పించారు. బుద్ధి మాంద్యం కారణంగా తానెవరో చెప్పలేకపోతున్నాడు. కానీ అతని ఆచూకీ కోసం తల్లిదండ్రులు, బంధువులు ఎవరైనా ఉంటే వచ్చి తీసుకెళ్లవచ్చునని స్కూల్ నిర్వాహకులు తనూజ తెలిపారు. ఇతర వివరాల కోసం 98850 40345 అనే నంబరును సంప్రదించాలని సూచించారు. ఒక్కొక్కరికి ఒక్కో న్యాయమా?పలమనేరు : కూటమి నేతలు ఎలాంటి అక్రమాలు చేసినా అధికారులు పట్టించుకోవడంలేదు. అదే వైఎస్సార్సీపీ వాళ్లు ఏ చిన్న తప్పు చేసిన ఆఘమేఘాలపై వేధింపులకు దిగుతున్నారు. ఇది కొన్నాళ్లుగా పలమనేరులో అధికారుల తీరు. వివరాలు ఇలా..బొమ్మిదొడ్డికి చెందిన సుబ్రమణ్యంనాయుడు ఇంటి వెనుక పశువులను కట్టేసుకునేందుకు కొంత మేర చెరువు స్థలంలో రేకుల షెడ్డు వేశాడు. దీనిపై పచ్చనేతల సమాచారంతో స్థానిక రెవెన్యూ అధికారులు హుటాహుటిన గురువారం షెడ్డును జేసీబీతో తొలగించేశారు. ఇదే విధంగా అక్కడే చెరువు స్థలాన్ని ఆక్రమించుకున్న కూటమి నేతల జోలికెళ్లకపోవడంపై విస్మయం వ్యక్తం అవుతోంది. కూటమి నేతలకు అయితే నిబంధనలకు చెల్లుచీటీ పాడుతున్నారు. వేరే పార్టీకి అయితే నిబంధనల పేరుతో వేధింపులకు దిగుతుండడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టపగలే చైన్ స్నాచింగ్ ● యువతి మెడలోంచి బంగారు గొలుసు లాక్కెళ్లిన దొంగలు నగరి : నగరి మున్సిపాలిటీ తిరుపతి రోడ్డు 7కే క్రికెట్ టర్ఫ్ పక్కనే ఉన్న వీధిలో పట్టపగలే గుర్తుతెలి యని వ్యక్తులు మహిళ మెడలోంచి బంగారు గొలుసు లాక్కెళ్లిన సంఘటన చోటు చేసుకుంది. బాధితురాలు భార్గవి తెలిపిన వివరాల మేరకు. గుండ్రాజుకుప్పంకు చెందిన ఆమె నగరి పట్ణణంలోని బ్యాంకులో పని నిమిత్తం వెళ్లింది. అక్కడ పనిముగించుకొని ఇంటికి బయలుదేరేందుకు ఆటోలో కొంత దూరం మరో మహిళతో కలిసి 7 కే క్రికెట్ టర్ఫ్ వద్దకు చేరుకొంది. అక్కడి నుంచి ఇద్దరూ స్వగ్రామానికి నడుచుకుంటూ బయలుదేరారు. అప్పటికే ఇద్దరు హెల్మెట్ వేసుకొని దారిపక్కనే ఆగి ఉన్నారు. వారిని పట్టించుకోకుండా నడుస్తూ వెళుతుండగా వెనుక నుంచి వేగంగా వీరిని దాటుకొని ముందుకెళ్లినవారు కొంతదూరం వెళ్లాక నిర్మానుష్య ప్రాంతంలో తిరిగీ ఎదురుగా రాగా బైక్ వెనుక కూర్చున్న వ్యక్తి భార్గవి మెడలోని బంగారు గొలుసును పట్టుకొని లాక్కెళ్లాడు. లాక్కెళ్లిన సరడు, తాళిబొట్టు, కాసులతో కలిపి సుమారు 3 సవరాలని బాధితురాలు వాపోయింది. కాగా వారు బైక్‌లో వెళ్లే దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. దాని ఆధారంగా సీఐ విక్రమ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాలిక అదృశ్యం పుంగనూరు : మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక అదృశ్యం అయింది. గురువారం ఇంటి నుంచి కనిపించకుండా వెళ్లిందని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్ఐ లోకేష్ తెలిపారు -
తప్పిన పెను ప్రమాదం
● టైర్ పంచర్‌తో ఉల్కిపడ్డ ప్రయాణికులు ● ఊపిరి పీల్చుకున్న స్థానికులు కార్వేటినగరం : చిత్తూరు నుంచి పుత్తూరుకు వస్తున్న బస్సు గురువారం కార్వేటినగరం సమీపంలో జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున శబ్ధంతో పాటు దుమ్ములేచి పోవడంతో బస్సులోని ప్రయాణికులతో పాటు, స్థానికులు ఉల్కిపడ్డారు. అక్కడ ఏం జరిగిందో అక్కడున్న వారికి అర్థం కాలేదు. ప్రయాణికులు భయబ్రాంతులకు గురై బస్సు నుంచి దిగారు. తీరా చూస్తే బస్సు ముందు టైర్ పంచర్ అయినట్లు డ్రైవర్ గుర్తించారు. అయితే 5 అడుగుల దూరంలో పెద్ద కల్వర్టు ఉంది. అలాగే అదే ప్రాంతంలో 33 కేవీ విద్యుత్ స్తంభం ఉండటంతో మరింత భయ బ్రాంతులకు గురయ్యారు. టైర్ పంచర్ అయిన విషయాన్ని గుర్తించిన డ్రైవర్ అప్రమత్తంగా బస్సును రోడ్డు వైపు మళ్లించి ఆపడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులతో పాటు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ అధికారులు నాణ్యమైన టైర్లతో బస్సు సర్వీసులను నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
కొత్తపల్లి సంత మార్కెట్‌పై వైఎస్సార్సీపీ పట్టు
● వేలంలో ఇరువర్గాల మధ్య పోటాపోటీ ● రూ.9.15 లక్షలకు దక్కించుకున్న నేత శ్రీరంగరాజపురం(కార్వేటినగరం) : కూటమి నాయకులు ఎన్ని జిమ్మిక్కులు చేసినా పోలీసులను రంగంలోకి దించినా మరోమారు కొత్తపల్లి మిట్ట సంత మార్కెట్‌ను వైఎస్సార్సీపీ పట్టు నిలుపుకుంది. ఎప్పుడూ లేని విధంగా నగరి డీఎస్పీ, కార్వేటినగరం సీఐ, మరో ఇద్దరు ఎస్ఐలు, 20 మంది పోలీస్ సిబ్బంది, మరో ప్రత్యేక దళాలు 20 మంది నడుమ నిర్వహించిన సంత వేలంలో వైఎస్సార్సీపీ నాయకులు పట్టు నిలుపుకుని మార్కెట్‌ను సొంతం చేసుకున్నారు. ప్రతి ఆదివారం నిర్వహించే వారపు సంతకు గురువారం పంచాయతీ అధికారులు వేలం పాట ప్రకటించారు. ఇరువ్గాల మధ్య పోటా పోటీగా కొనసాగిన వేలం పాటలో ఎట్టకేలకు వైఎస్సార్సీపీ నాయకుడు జయచంద్రారెడ్డి రూ.9.15 లక్షలతో దక్కించుకున్నారు. ఎన్నడూ లేని విధంగా వేలం పాటకు పోలీసు బలగాలు మోహరించడంపై గ్రామాల్లో చర్చనీయాంశంగా మారింది. -
న్యాయం చేయాలని.. భర్త ఇంటి ఎదుట ధర్నా
గంగవరం : వారిద్దరూ ఆరేళ్లుగా ప్రేమించుకున్నారు.. ఒకరికొకరు ఇష్టపడ్డారు.. కులాంతర వివా హం చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నా ఆరు మాసాలకే కట్టుకున్న భార్యను వంచించి వదిలేసి.. వెళ్లిపోయాడు.. దీంతో భర్త రాక కోసం నెల రోజులు పాటు ఆమె నిరీక్షించింది.. చేసేది లేక గంగవరం గ్రామంలోని తన భర్త ఇంటి ముందు గురువారం తనకు న్యాయం చేయాలంటూ ఆమె ధర్నాకు దిగింది. బాధితురాలు కథనం మేరకు మబ్బువారిపేట గ్రామానికి చెందిన నాగరాజు కుమార్తె రమ్య, గంగవరం గ్రామానికి చెందిన భరత్ ఇద్దరూ కలిసి ఆరేళ్లుగా ప్రేమించుకున్నారు. అయితే ఇద్దరూ కలిసి జీవితంలో స్థిరపడ్డాక వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. భరత్ అందుకు ఒప్పుకోకుండా ఇంట్లో అతడికి సంబంధాలు చూస్తున్నారని, వెంటనే పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానంటూ ఆమెని మభ్యపెట్టడంతో ఇద్దరూ కలిసి వివాహం చేసుకున్నారు. అలా జరిగిన వారి వివాహం జీవితం ఆరు మాసాలకే పఠాపంచలైంది. వివాహం అనంతరం ఇద్దరూ తిరుపతి, ముళబాగిల్ ప్రాంతాల్లో కాపురం పెట్టారు. అతడికి ఎలాంటి పని లేకపోవడంతో ఆమె మెడికల్ షాపులో పనిచేస్తూ భర్తను పోషించేది. అంతలో భరత్ కుటుంబీకుల నుంచి ఒత్తిడి రావడంతో కొన్ని నెలల తరువాత ఇద్దరూ కలిసి గంగవరానికి రాగానే ఆమైపె దాడికి పాల్పడ్డారంటూ ఆమె పేర్కొంది. నీ సామాజిక వర్గం తక్కువదని.. మా బిడ్డను ఎలా పెళ్లి చేసుకుంటావంటూ భర్త కుటుంబీకులు ఆమెను చిత్రహింసలకు గురి చేశారంటూ ఆరోపించింది. అప్పట్లో ఆమె పోలీసులను ఆశ్రయించగా ఇరువురూ కలిసి స్టేషన్లో రాజీ కుదుర్చుకున్నారు. ఆ తరువాత ఇద్దరూ కలిసి ముళబాగిల్‌లో నివాసం ఉండేవాళ్లు. కొన్ని రోజులు తరువాత మళ్లీ తన భర్త కుటుంబీకుల నుంచి ఫోన్‌కాల్స్ రావడంతో ఉన్నట్టుండి ఆమెను అక్కడే విడిచి ఎక్కడికో వెళ్లిపోయాడంటూ ఆమె ఆరోపించింది. అక్క డ దాదాపు 20 రోజులు ఒంటరిగా గడిపి తిరిగీ ఆమె పుట్టింటికి చేరింది. ఎన్నిసార్లు తన భర్తకు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో తనకు న్యాయం కోసం గంగవరంలోని తన భర్త ఇంటి ముందు కుటుంబంతో సహా ధర్నాకు దిగింది. తన భర్త వచ్చే వరకూ ఎన్నాళ్లు అయినా అక్కడే నిరీక్షిస్తానంటూ ఆమె తెలిపింది. స్పందించిన పోలీసులు ధర్నా చేస్తున్న ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా అందుకు ఆమె ఒప్పుకోలేదు. ఇద్దరినీ కలుపుతామంటూ పోలీసులు హామీ ఇచ్చారు. తన భర్త కుటుంబీకుల నుంచి తనకు ప్రాణహాని ఉందని తనకు న్యాయం చేయాలంటూ ఆమె పోలీసులను కోరింది.● మోసగించాడని భార్య ఆందోళన -
వసతిగృహాల్లో వైద్య సిబ్బంది ఉండాలి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని సాంఘిక సంక్షేమ (ఎస్సీ) వసతి గృహాల్లో మెరుగైన వసతులు కల్పించాలని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వినాయకం డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లో సాంఘిక సంక్షేమ శాఖఽ అధికారి చిన్నయ్యకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో పారిశుద్ధ్య కార్మికుల పోస్టులను పూర్తిగా భర్తీ చేయాలన్నారు. వార్డెన్ పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల చాలా మంది వార్డెన్లు అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారని చెప్పారు. కామాటి, వాచ్మెన్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలోని ఎస్సీ బాలికల వసతి గృహాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి వసతి గృహంలో డాక్టర్, నర్సు రెగ్యులర్‌గా అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఆ సంఘ నాయకులు మురళి, భాస్కర్, షణ్ముగం, మహేష్ పాల్గొన్నారు. బోయకొండలో వేలం పాట వాయిదా చౌడేపల్లె : బోయకొండ గంగమ్మ ఆలయంలో వివిధ హక్కులపై లీజుకిస్తూ నిర్వహించాల్సిన వేలం పాటను వాయిదా వేస్తున్నట్లు ఈఓ ఏకాంబరం ప్రకటించారు. ఐదు హక్కులపై వేలం పాటను అధికారులు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. వేలం పాటదారులు పాల్గొనేందుకు ఆసక్తి చూపకపోవడంతో ఈనెల 28వ తేదీకి వాయిదా వేసినట్లు ఈఓ తెలిపారు. లారీని ఢీకొన్న కారు గంగవరం: లారీని ఎదురుగా కారు ఢీకొట్టిన ఘటన మండలంలో గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. పలమనేరు వైపు నుంచి మదనపల్లి వైపు వెళ్తున్న డీజిల్ ట్యాంకర్ లారీని ఎదురుగా అజాగ్రత్తగా వస్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న పృధ్వి(22), పక్క సీట్లో కూర్చున్న సూర్య(21) ఇద్దురూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ట్యాంకర్ పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు పేర్కొన్నారు. -
ఇలవైకుంఠం.. ఇదేం అపచారం
వేంకటాద్రి నిలయం.. పరమ పవిత్రం..భక్తికి.. ముక్తికి..ఆధ్యాత్మికత క్షేత్రం..కలియుగ వైకుంఠవాసుడు కొలువైన ఇలవైకుంఠంగా పేరుగాంచిన పుణ్యస్థలం..ఇంతటి ప్రాధాన్యం శేషాచలంపై భక్తులు ఎంతో భక్తిభావంతో ప్రవర్తిస్తారు. అందుకే ఇక్కడ మద్యం, మాంసం, మత్తు పదార్థాలు, పానీయాలకు చోటు లేదు. ఇక్కడంతా ఆధ్యాత్మిక చింతనే కనిపిస్తుంది. అయితే కాల‘కూటమి’ అధికారంలోకి వచ్చింది. తిరుమలలో అపవిత్రత రాజ్యమేలుతోంది. నిత్యం మందుబాబులు చిందులేస్తుండడంతో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఇలవైంకుంఠంలో ఇదేం రచ్చ అని ఆవేదన చెందుతున్నారు. తిరుమల: శ్రీవేంకటేశ్వర స్వామివారు వెలసిన దివ్య క్షేత్రం తిరుమల. స్వామివారి దర్శనార్థం దేశ విదేశాల నుంచి భక్తులు తరలివచ్చి, స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. పవిత్ర పుణ్యక్షేత్రం కావడంతో తిరుమలలో మాంసం, మత్తు పదార్థాలు, పానీయాలపై టీటీడీ నిషేధం విధించింది. తిరుమల పవిత్రతను, భక్తులకు భక్తిభావాన్ని పెంపొందించేలా అనేక చర్యలు అమలు చేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికా రంలోకి రాగానే తిరుమలలో మందుబాబులకు అడ్డా గా మారింది. రోజుకో ప్రాంతంలో రెచ్చిపోతున్నారు. తిరుమలలో మద్యం విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. పీకలుదాక మద్యాన్ని సేవించి తిరుమలలో హల్చల్ చేస్తున్న ఘటనలు అనేకం. శ్రీవారి ఆలయానికి సమీపంలోని శ్రీ భూవరాహస్వామి ఆలయం వద్ద ఓ యువకుడు మద్యం మత్తులో హల్చల్ చేశాడు. మద్యం మత్తులో ఓ మహిళా భక్తురాలిపై దుసురుగా, అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా తిరుమలలో మద్యం ఎంత కావాలన్నా సేవిస్తానని, ఎంత మద్యం కావాలో చెప్పు.. నీకు తెచ్చిస్తాం అంటూ ఊగిపోయాడు. పోలీసులకు కావాలంటే కూడా అమ్ముతా అంటు రెచ్చిపోయాడు. ఆ విషయం విజిలెన్స్ కానిస్టేబుల్‌కి సైతం తెలుసు అంటూ విర్రవీగాడు. వెంటనే అక్కడికి చేరుకున్న విజిలెన్స్ సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. నిద్ద్దురోతున్న నిఘా టీటీడీ నిత్యం మూడంచెల భద్రత నడుమ నిఘా వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది. భక్తుల రక్షణ, శ్రీవారి ఆలయ భద్రత నిర్వహణను టీటీడీ విజిలెన్‌న్స్, స్టేట్ పోలీస్, ఎస్బీ, విజిలెన్స్ వింగ్, ఇలా అనేక విభాగాలు తిరుమలలో నిత్యం పహారా కాస్తుంటాయి. తిరుపతి నుంచి మద్యం తిరుమలకు రాకుండా అలిపిరిలో తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయినా వారి కళ్లుగప్పి తనిఖీలను దాటుకుని తిరుమలకు చేరుకుంటున్నారు. పోలీస్ శాఖ నుంచి అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ, సీఐలు, ఎస్ఐలు భద్రత ప్రమాణాలు చేపడుతుంటే.. సీవీఎస్వో, వీజీఓ, ఏవీఎస్వో, వీఐ, ఇతర అదనపు సిబ్బంది ఆలయ భద్రతతో పాటు భక్తులకు రక్షణ కల్పిస్తూ ఉంటారు. గంజాయి మత్తులో భక్తులపై దాడి ఈ ఘటన జరిగిన రెండు రోజుల వ్యవధిలోనే కొందరు యువకులు మద్యం, గంజాయి మత్తులో డీ టైప్ క్వార్టర్స్ వద్ద హల్చల్ చేశారు. మేము లోకల్.. మమల్ని ఏమీ చేయరంటూ అనధికార వ్యక్తులు జానాల్ని భయభ్రాంతులకు గురిచేశారు. మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరంటూ భక్తులపై దాడికి దిగారు. ఓ భక్తుని తలపై బలమైన ఆయుధంతో మోది గాయాలపాలు చేశారు. తిరుమలలో మందుబాబులు హల్చల్ నియంత్రించలేకపోతున్న విజిలెన్స్, పోలీస్ అడ్డదారిలో తిరుమలకి మద్యం తిరుమలలో యథేచ్ఛగా అక్రమ మద్యం తిరుమలలో చిన్న గంజాయి ప్యాకెట్లు, మద్యం బాటిళ్లు యథేచ్ఛగా దొరుకుతున్నాయి. భారీ స్థాయిలో మత్తు పదార్థాలను నిఘా కళ్లు గప్పి తిరుమలకు తరలిస్తున్నారు. రోడ్డు మార్గం మీదుగా కొంతమేర అక్రమార్కులు తనిఖీ సిబ్బంది కళ్లు గప్పి తరలిస్తుంటే.. మరి కొంతమంది మామండూరు, అన్నమయ్య నడక మార్గాల మీదుగా తిరుమలకు అక్రమ మద్యం తరలిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాంతాల్లో సరైన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయక పోవడంతోనే మద్యం సరఫరా అవుతున్నట్లు భక్తులు అభిప్రాయపడుతున్నారు. తిరుమలలో ఎకై ్సజ్ శాఖ ఏం చేస్తుంది? తిరుమలలో ఎకై ్సజ్ శాఖ సీఐ స్థాయి అధికారితో పాటు సిబ్బంది కూడా ఉన్నారు. అయితే ఈ శాఖ పనితీరు రోజురోజుకూ తీసికట్టుగా మారుతోంది. తిరుమలలో ఎకై ్సజ్ పోలీసులు ఉన్నారా? లేదా అన్న అనుమానం సైతం భక్తులు వ్యక్తం చేస్తున్నారు. అందుకు నిదర్శనం ఇటీవల వరుసగా జరుగుతున్న ఘటనలే కారణం. తిరుమలలో ఎకై ్సజ్ ప్రోహిబిషన్ విభాగం అధికారులు తిరుమలలో అక్రమ మద్యం, ఇతర మత్తుపదార్థాలను గుర్తించి సీజ్ చేయా ల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఏ విభాగం అధికారులు తిరుమలలో అక్రమ మద్యం, గంజాయి విక్రయాలపై దృష్టి సారించకపోవడం గమనార్హం. అలాగే ఎకై ్సజ్ శాఖకు సంబంధించిన స్పెషల్ టాస్క్ ఫోర్స్, టాస్క్ ఫోర్స్ టీమ్‌లు సైతం నిర్వీర్యంగానే కనిపిస్తున్నాయి. తిరుమలలో ఎకై ్సజ్ పోలీసులు ఉన్నా కూడా లేనట్లే అని భక్తులు వాపోతున్నారు. -
మైనారిటీ గురుకుల ప్రవేశాలకు ఆహ్వానం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రం సమీపంలో మురుకంబట్టులోని మైనారిటీ గురుకుల బాలికల పాఠశాలలో ప్రవేశాలకు అర్హులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ భార్గవి తెలిపారు. ఈ మేరకు గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. 2025–26 విద్యా సంవత్సరంలో మైనారిటీ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో 80 సీట్లు, 6,7,8 తరగతుల్లో (బ్యాక్లాగ్) సీట్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ముస్లిం (బీసీ–ఈ, బీసీ–బీ, బీసీ–సీ (కన్వర్టటెడ్ క్రిస్టియన్) విద్యార్థులకు మొదటి ప్రాధాన్యం ఉంటుందన్నారు. దర ఖాస్తు చేసుకునే విద్యార్థులకు ఏప్రిల్ 25న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఆసక్తి, అర్హత ఉన్న విద్యార్థులు ఈనెల 31 వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మహిళా ఉద్యోగులు సమస్యలుంటే తెలపండి ● కలెక్టరేట్లో ఫిర్యాదుల పెట్టె ప్రారంభం చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగులు ఏవైనా సమస్యలుంటే ధైర్యంగా తెలియజేయా లని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడించారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లో మహిళా ఉద్యోగుల ఫిర్యాదుల పెట్టెను కలెక్టర్, జేసీలు ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కా రానికి కృషి చేస్తామన్నారు. ఎటువంటి సమస్యలున్నా ఫిర్యాదు పెట్టెలో లేఖ రూపంలో తెలియజేయవచ్చని చెప్పా రు. కార్యక్రమంలో డీఆర్ఓ మోహన్ కుమా ర్, డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి, కలెక్టరేట్ ఏవో కులశేఖర్, ఏపీ జేఏసీ మహిళా విభా గం చిత్తూరు జిల్లా అధ్యక్షురాలు జయంతి, జనరల్ సెక్రటరీ లత, కో చైర్మన్ శోభ, మెంబర్ సెక్రటరీలు సరిత, పుష్పలత, ఇతర మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. ‘సీఎంసీ’లో మెడికల్ రీయింబర్స్‌మెంట్‌కు అవకాశం చిత్తూరు కలెక్టరేట్ : చిత్తూరు జిల్లా, తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లాలో ఉన్న సీఎంసీ ఆసుపత్రుల్లో మెడికల్ రీయింబర్స్‌మెంట్‌కు ప్రభుత్వం అవకాశం కల్పించిందని విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కేశవులు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎంసీ ఆసుపత్రుల్లో విశ్రాంత ఉద్యోగులు హెల్త్ కార్డులతో మెడికల్ రీయింబర్స్మెంట్ పొందవచ్చన్నారు. చిత్తూరు సీఎంసీ ఆసుపత్రిలో ఈ ఏడాది మార్చి 2వ తేదీ నుంచి 2028వ సంవత్సరం మార్చి 2వ తేదీ వరకు, వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో 2027 జూన్ 22 వరకు, రాణిపేట ఆసుపత్రిలో 2028 మార్చి 2వ తేదీ వరకు వైద్య చికిత్సలు పొందేందుకు ప్రభుత్వం గుర్తింపు కల్పించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని విశ్రాంత ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్థానిక సంస్థల ఉప ఎన్నిక చిత్తూరు కార్పొరేషన్ : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల్లోని పలు పదవులకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఖాళీగా ఉన్న పదవులకు ఈనెల 27వ తేదీన ఉప ఎన్నిక నిర్వహించి భర్తీ ప్రక్రియ చేపట్టనున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని తిరుపతి రూర ల్, సదుం, తవణంపల్లి మండల పరిషత్ అధ్యక్ష స్థానాలు, పెనుమూరు, పీలేరు మండలాల్లో కో ఆప్షన్ సభ్యులకు ఎన్నిక నిర్వహించనున్నారు. తిరుపతి ఎంపీపీ పదవికి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన విషయం విధితమే. అదే విధంగా సదుం ఎంపీపీ ఎల్లప్ప అనారోగ్యంతో మృతి చెందారు. తవణంపల్లి ఎంపీపీ గీత తన పదవికి రాజీనామా చేయడం వల్ల ఆ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా పరిషత్ అధికారులు కసరత్తు నిర్వహిస్తున్నారు. -
సారా నిర్మూలనకు ప్రణాళికలు
● సారా అనర్థాలపై అవగాహన కల్పించండి ● సమావేశంలో కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడి చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో నాటు సారా తయారీ, అమ్మకం, రవాణా చట్టరీత్యా నేరమని కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లో నవోదయం 2.0 కార్యక్రమం అమలుపై సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నవోదయం 2.0 ద్వారా నాటు సారాను పూర్తిగా నిర్మూలించడానికి ప్రణాళికలను సిద్ధం చేసిందన్నారు. ఈ కార్యక్రమం అమలులో ఎకై ్సజ్, పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. నాటు సారా తయారీ, అమ్మకం, రవాణా చట్టరీత్యా నేరమన్నారు. చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే పీడీ యాక్ట్ కు గురవుతారని హెచ్చరించారు. నాటుసారా వినియోగం వల్ల కలిగే అనర్థాలను క్షేత్రస్థాయిలో అధికారులు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో చిత్తూరు అర్బన్, రూరల్, కార్వేటినగరం, నగరి, పుంగనూరు, కుప్పం, పులిచెర్ల మండలాల్లోని 52 గ్రామాల్లో నాటుసారా తయారీ, వినియోగం ఉన్నట్లు గుర్తించామని వెల్లడించారు. ప్రత్యేక కార్యాచరణ.. జిల్లాలో నాటుసారాను నిర్మూలించేందుకు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. కేటగిరీల వారీగా గ్రామా లకు ఎకై ్సజ్, ప్రొహిభిషన్ అధికారులను నియమించి కార్యాచరణ ప్రణాళికను అమ లు చేయాలన్నారు. నాటుసారా తయారీకి ప్రధాన ముడి సరుకుగా వాడే నల్లబెల్లం అమ్మకాలను నియంత్రించాలన్నారు. నాటుసారా తయారీదారులను గుర్తించి కళాజాతలు, గ్రామ సభలు, గోడపత్రికలు, కరపత్రాలు, స్వయం సహాయక సంఘాలు, ఎన్జీఓ ల ద్వారా అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలన్నారు. నాటుసారా తయా రు చేసే వారికి ప్రత్యామ్నాయంగా జీవనోపాధులు కల్పించడానికి చర్యలు చేపట్టాలని డీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. నాటుసారా తయారీ, రవాణా, వినియోగం పై సమాచారం తెలిసిన వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 14405 కు కాల్ చేసి తెలియజేయాలని కోరారు. ఎస్పీ మణికంఠ చందోలు మాట్లాడుతూ.. నాటుసారా తయారీ, అమ్మకం, రవాణా పై సంబంధిత శాఖలతో కలసి పోలీస్ యంత్రాంగం పనిచేస్తోందన్నారు. చట్ట రీత్యా నేరమైన సారా తయారీ, అమ్మకాలు, తదితరాల కారణాల వలన పట్టుబడితే జరిమానాలు విధిస్తామని హెచ్చ రించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ జి.విద్యాధరి, డీఎఫ్‌వో భరణి, ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ విజయ శేఖర్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, తహశీల్దార్లు, ఇతర సంబంధిత అధికారులు హాజరయ్యారు. -
శ్రీసిటీ కంపెనీలకు సీఐఐ అవార్డులు
శ్రీసిటీ (వరదయ్యపాళెం): పరిశ్రమల్లో అత్యున్నత భద్రతా ప్రమాణాలను పాటించిన శ్రీసిటీలోని మూడు పరిశ్రమలకు ‘2024 సీఐఐ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ ఎక్సలెన్స్ అవార్డ్స్’ దక్కా యి. విశాఖపట్నం నోవోటెల్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథి డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్ మాదిరెడ్డి ప్రతాప్ ఈ అవార్డులను అందజేశారు. శ్రీసిటీకి చెందిన మొండెలెజ్ ఇండియా, కెలాగ్స్, డానియెలి కంపెనీలు ఈ పురస్కారాలను అందుకున్నాయి. ఇందులో మొండెలెజ్ ఇండియా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఇండస్ట్రియల్ సేఫ్టీ లీడర్షిప్ అవార్డ్ కింద బంగారు పతకం దక్కింది. 2024 సంవత్సరానికి బెస్ట్ సేఫ్టీ పర్ఫార్మర్గా ఫుడ్ ప్రాసెసింగ్ విభాగంలో గోల్డ్ అవార్డును కెల్లాగ్స్ అందుకుంది. ఇక డానియెలి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు ఇండస్ట్రియల్ సేఫ్టీ లీడర్షిప్ అవార్డ్ కింద ఇంజినీరింగ్ విభాగంలో గోల్డ్ పురస్కారం సొంతమైంది. విజేతలకు శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి అభినందనలు తెలిపారు. -
సమారోహం..
సంస్కృత భాష పరిరక్షణ.. సంస్కృతి మనుగడే లక్ష్యంగా బోధన చేస్తున్న జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో గురువారం జరిగిన నాలుగో దీక్షాంత సమారోహం సంస్కృతికి ఛత్రం పట్టింది. పతకాలు.. పట్టాలు.. పీహెచ్‌డీలు అందుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆనందం అవధులు దాటి, ఉప్పొంగింది. ఘనంగా జాతీయ సంస్కృత వర్సిటీ నాలుగో స్నాతకోత్సవం ● 22 మందికి బంగారు పతకాలు ప్రదానం ● 564 మందికి డిగ్రీ, పీజీ..75 మందికి పీహెచ్డీ పట్టాల అందజేత ● సంస్కృత భాషాభివృద్ధే లక్ష్యంగా వర్సిటీ అడుగులు ఐదు మహాగ్రంథాల ఆవిష్కరణ రామానుజ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో సురపురం శ్రీనివాసాచార్య రచించిన సిద్ధాంత చింతామణి, రీసె ర్చ్ అండ్ పబ్లికేషన్స్ విభాగం ద్వారా శివరామభట్ సంపాదకీయంలోని మహస్వినీ పత్రికను, అనంతరం జ్యోతిష్య విభాగం డీన్ కృష్ణేశ్వర్ ఝా ఆధ్వర్యంలో వేదవేదాంగం, డాక్టర్ సోమనాథ దా స్ రీసెర్చ్ అండ్ పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో వర్సిటీ న్యూస్ లెటర్ శేముషీ గ్రంథాలను అతిథుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ వెంకట నారాయణరావు, డీన్లు దక్షణమూర్తి శర్మ, రజనీకాంత శుక్లా, పరీక్షల నియంత్రణాధికారి కే సాంబశివమూర్తి పాల్గొన్నారు. 564 మందికి డిగ్రీ, పీజీ పట్టాలు.. 75 మందికి పీహెచ్‌డీలు వర్సిటీ నాలుగో స్నాతకోత్సవంలో భాగంగా 2023–24 అకడమిక్ విద్యాసంవత్సరానికి సంబంధించి 75 మంది విద్యార్థులకు విద్యావారిధి(పీహెచ్డీ) పట్టాలను అందజేశారు. అలాగే 564 మంది విద్యార్థులకు ఆచార్య, ఎంఏ, ఎమ్మెస్సీ, బీఏ, బీఎస్సీ, ఎమ్మెస్సీ యోగాథెరఫీ, సర్టిఫికెట్, డిప్లొమో పట్టాలను అతిథుల చేతుల మీదుగా అందజేశారు. స్నాతకోత్సవంలో గ్రంథాలను ఆవిష్కరిస్తున్న అతిథులు, వర్సిటీ అధికారులుతిరుపతి సిటీ: జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం నాలుగో దీక్షాంత సమారోహం అట్టహాసంగా జరిగింది. తిరుపతి మహతి ఆడిటోరియం వేదికగా గురు వారం జరిగిన వర్సిటీ నాలుగో స్నాతకోత్సవానికి అధ్యక్ష హోదాలో హాజరైన వర్సిటీ చాన్సలర్ పద్మభూషణ్ ఎన్ గోపాలస్వామికి వేదపండితులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా రాష్ట్రీ సంస్కృత విద్యాపీఠం మాజీ వీసీ పద్మశ్రీ డాక్టర్ వీఆర్ పంచముఖి ఆన్లైన్ విధానంలో హాజరై, కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం సంస్కృతభాష పరిరక్షణకు మూలకేంద్రమని కొనియాడారు. ప్రాచీన సంస్కృత భాషను సంరక్షిస్తూ, ఆధునిక వైజ్ఞానిక తత్త్వాలను అనుసంధానిస్తూ, భారతీయ జ్ఞాన పరంపరను భావిభారతావనికి అందిస్తున్న ఉత్తమ క్షేత్రంగా వర్సిటీ విరాజిల్లుతుందన్నారు. త్వరలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను సంస్కృత భాషతో అనుసంధానం చేసేందుకు విశేష పరిశోధనలు చేస్తామని తెలిపారు. నూతన పరిశోధనల వేదిక ఎన్ఎస్యూ వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి వర్సిటీ ప్రగతి, అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధునాత సాంకేతిక పరిజ్ఞానంతో నూతన పరిశోధనలకు వర్సిటీ వేదికవుతోందన్నారు. సంస్కృత భాషాభివృద్ధే వర్సిటీ లక్ష్యంగా పనిచేస్తోందని చెప్పారు. దేశంలో పూర్తి స్థాయిలో అన్ని విభాగాల్లో సంస్కృత భాష బోధిస్తు న్న ఏకై క వర్సిటీ జాతీయ సంస్కృత వర్సిటీ అని కొనియాడారు. రానున్న విద్యాసంవత్సరం నుంచి వర్సిటీలో ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యాకోర్సులను సైతం ప్రారంభించనున్నట్లు తెలిపారు. హృదయాన్ని స్పృశించిన సన్నివేశాలు ఎన్ఎస్యూ నాలుగో స్నాతకోత్సవంలో పట్టాలు, బంగారు పతకాలు పొందిన విద్యార్థులు తల్లిదండ్రు లు కలిసిన సన్నివేశాలు వీక్షకులు హృదయాన్ని కట్టిపడేశాయి. పీజీ ఓవరాల్ టాపర్‌గా నిలిచి 4 పతకాలతో పాటు, ఒక బంగారు పతకం సాధించిన అమిత్ విక్ర మ్ కుమారుడు, కుమార్తె తండ్రి సాధించిన పతకా లను పట్టుకుని ముద్దాడిన సంఘటన పలువురిని క లచి వేసింది. అలాగే పీజీ జ్యోతిష్యశాస్త్రంలో టాపర్‌గా నిలిచిన కేరళకు చెందిన ఎంపీ అన్గే విద్యార్థి తల్లి షీజా కేరళ నుంచి వచ్చి, కుమార్తెను ముద్దాడి అక్కున చే ర్చుకుని ఆనందబాష్పాలు రాల్చింది. అలాగే పీహెచ్ డీ పట్టా అందుకున్న దివ్యాంగుడు కే హరిబాబుకు అధికారులు మోకాళ్లపై నిలుచుని పట్టా అందజేశారు. అనంతరం భార్య, ఆయన కుమారుడు డాక్టరేట్ ప ట్టాను చూస్తూ ఆనందోత్సహాంలో మునిగితేలారు.బంగారు పతకాలను సాధించిన ఆనందంలో తలపాగాలను గాలిలోకి విసిరేస్తున్న విద్యార్థులు ఓవరాల్ టాపర్‌గా అమిత్ విక్రమ్, జానకి వర్సిటీలో ఆచార్య (పీజీ) స్థాయిలో విద్యార్థి కేఎస్ అమిత్ విక్రమ్ ఓవరాల్ టాపర్‌గా నిలిచి సుమారు ఐదు పతకాలను సాఽధించారు. అలాగే శాస్త్రి (డిగ్రీ) కోర్సులో ఓవరాల్ టాపర్‌గా నిలిచిన వై జానకి నాలుగు బంగారు పతకాలు కై వసం చేసుకుంది. ప్రాక్–శాస్త్రిలో (ఇంటర్) ప్రథమస్థానంలో నిలిచిన లక్ష్మీ ప్రసన్న బంగారు పతకం అందుకున్నారు. మెరిసిన 22 మంది బంగారు కొండలువిశ్వవిద్యాలయంలో వివిధ కోర్సుల్లో ప్రతిభ చూ పి ప్రథమస్థానం సాధించిన 22 మంది విద్యార్థులు బంగారు పతకాలను కై వసం చేసుకున్నారు. గోల్డ్‌మెడల్స్ సాధించిన వారిలో శాసీ్త్ర విభాగంలో వై జా నకి, బీఏలో జి సంధ్య, బీఎస్సీలో వి త్రిపురసుందరి, బీఎస్సీ యోగాలో టి అభినయ పసిడి పతకాలు అందుకున్నారు. ఆచార్య విభాగంలో సునీతాప్రుష్టి, వైష్ణవి, అన్గా, అనురిధ్ భరద్వాజ్, మహదేవన్, దే వప్రసాద్ భట్, అజిత్ సింగ్, విక్రమ్, తునుశ్రీ, హే మసుందర్రావు, శుభశ్రీ, అస్రఫ్ అలమ్‌ఖాన్, కి షోర్ పాండే, సాగరిక సర్కార్, ఎంఎలో సంధ్యబాయ్, ఎమ్మెస్సీలో అభినయ్శ్రీ, ఎమ్మెస్సీ యోగాలో ఎం దేవీప్రసన్న బంగారు పతకాలు సాధించారు. వీరితో పాటు బీఈడీలో మోనికా బొహిదర్, ఎంఈడీలో జయక్రిష్ణరాయ్ ఉన్నారు. -
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పోరాటం
చిత్తూరు కలెక్టరేట్ : ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పోరాటం చేయనున్నట్లు వైఎస్సార్ టీచర్స్ అసోిసియేషన్ రాష్ట్ర ట్రెజరర్ రెడ్డి శేఖర్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం విజయవాడలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి పలు అంశాలపై, సంఘం అభివృద్ధిపై చర్చించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసిన నాడు–నేడు పనులను కొనసాగించాలన్నారు. పాఠశాలలు మూతపడేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడితే ఆందోళనలు తప్పవన్నారు. టీచర్ల సమస్యల పరిష్కారంపై పోరాడేందుకు తమ సంఘం ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. టీచర్లకు విడుదల చేయాల్సిన బకాయిలను కూటమి ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలన్నారు. క్లస్టర్ సమావేశాల్లో, సీనియారిటీ జాబితాల ప్రక్రియలో ఉన్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలు, సమస్యలను మాజీ సీఎం దృష్టికి తీసుకెళ్లి సూచనలను స్వీకరించారు. కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
బెట్టింగ్ మాఫియా!
● రేపటి నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రారంభం ● విస్తరిస్తున్న ఆన్లైన్ బెట్టింగ్‌ల జోరు ● టాస్ నుంచి మ్యాచ్ ముగిసే దాకా పందాలు ● ఊబిలోకి జారుతున్న క్రికెట్ అభిమానులు ● ఆన్లైన్ ద్వారానే లావాదేవీలు ఆన్లైన్ బెట్టింగ్ ఇలా.. ఆండ్రాయిడ్ ఫోన్లో క్రికెట్ బెట్టింగ్ చేసేవారు కొన్ని యాప్‌లను డౌన్లోడ్ చేసుకుంటున్నారు.ఆ తరువాత మ్యాచ్‌ను ప్రత్యక్షంగానూ పరిశీలిస్తూ పందేలు కాస్తారు. మ్యాచ్ చూసేందుకు ఒక మొబైల్, బెట్టింగ్ కాసేందుకు మరో మొబైల్ వినియోగించి ఆన్లైన్లో క్రికెట్ బుకీలు సంప్రదింపులు జరుపుతుంటారు. బార్లు, ఇళ్ల మధ్య స్థావరాలు ,క్రికెట్ గ్రౌండ్లు ఏర్పాటు చేసుకొని వ్యవహారాన్ని చక్క బెట్టుకొంటున్నారు. గుడిపాల : క్రికెట్ బెట్టింగ్ మాఫియా చాపకింద నీరులా సాగుతోంది. ముఖ్యంగా ఐపీఎల్ సీజన్లో ఎక్కువగా ఉంటోంది. క్రికెట్ బుకీలు ఏకంగా తిష్ట వేసి క్రీడాభిమానులను ఈ రొంపిలోకి దింపి సొమ్ములు చేసుకుంటున్నారు. క్రికెట్ పిచ్చి ఉన్న పలువురు ఈ ఊబిలోకి దిగి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే చాలు యువత మ్యాచ్‌లను తిలకించేందుకు ఎంతో ఉత్సాహం చూపుతుంటారు. అదే సమయంలో వారి ఉత్సాహాన్ని సొమ్ము చేసుకోవడానికి బుకీలు రంగంలోకి దిగుతుంటారు. క్రికెట్ అంటే అభిమానమా..మీ పేవరేట్ టీమ్ గెలుస్తుందనే నమ్మకం మీకుందా.. నిజంగా ఉంటే బెట్టింగ్ కట్టచ్చు కదా.. సరదా తీరుతుంది.. డబ్బులు గెలుచుకోవచ్చు..అంటూ వారిని చిన్నగా ఊబిలోకి దించుతున్నారు. జిల్లాలోని పలు నియోజకవర్గంలోని మండల కేంద్రాలతో పాటు అన్ని గ్రామాల్లో ఈ వ్యవహారం గుట్టుగా సాగుతోంది. బెట్టింగ్ అంతా దాదాపుగా ఫోన్లోనే జరుగుతుంది. ఇరువర్గాలను ఫోన్లోనే కాంటాక్ట్ చేసి బెట్టింగ్ కాయిస్తారు. గెలిచిన వారి నుంచి కమీషన్ పొందుతారు.పట్టణాలు, పల్లెల్లోని యువకులను టార్గెట్ చేస్తున్నారు. క్రికెట్ బెట్టింగ్ కారణంగా చిత్తూరు నియోజకవర్గంలో ఎంతో మంది యువకులు అప్పులపాలైన సంఘటన లు లేకపోలేదు.మరికొందరు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ప్రతి బాల్కో రేటు టాస్ వేసే సమయం నుంచి బ్యాటింగ్ ఎవరు ఎంచుకొంటారు... బౌలింగ్ ఎవరు చేస్తారు...నుంచి బెట్టింగ్ ప్రారంభమవుతుంది.ఏ ఆటగాడు ఎన్ని పరుగులు చేస్తారు.బాల్‌కు ఎన్ని పరుగులు వస్తాయి..ఎవరు గెలుస్తారు..ఎన్ని పరుగులతో మ్యాచ్ పూర్తవుతుంది.ఇలా ప్రతిదానికీ ఒక పందెం ఉంటుంది. మొదలైన జోరు గ్రామాల్లో బెట్టింగ్‌ల జోరు అప్పుడే మొదలైంది. రేపటి నుంచి ఐపీఎల్–2025 క్రికెట్ మ్యాచ్‌లు ప్రారంభమమై.. మేనెల 25వతేదీన ముగుస్తాయి. ఇందులో బెట్టింగ్‌ల జోరు అప్పుడే ఊపందుకుంది. ఎక్కువగా చైన్నె, బెంగుళూరు, హైదరాబాద్, ముంబయి టీమ్‌లపై యువకులు బెట్టింగ్‌లు కాస్తున్నారు. ఫోన్లోనే మంతనాలు బెట్టింగ్ వ్యవహారం మొత్తం ఫోన్లోనే సాగుతోంది. చాలాచోట్ల ఎస్..నో..ఓకే...డన్..ఈటింగ్ వంటి కోడ్ లాంగ్వేజీని దీనికోసం వాడుతుంటారు. క్రికెట్‌పై పెద్దగా పరిజ్ఞానం లేకున్నా ఆడుతుంది..గెలుస్తుంది...ఓడుతుంది అనే సూత్రాలతో పందేలు కాస్తుంటారు.చాలా మంది టీవీలు చూస్తూనే పందేలు కడుతుంటారు.గ్రౌండ్లో చూసే ఆటకు, టీవీల్లో చూసే వారికి మూడు బంతుల సమయం తేడా ఉంటుంది. బంతి బంతికి ఆట ఎలా ఉంటుందో ముందే తెలుసుకొని బెట్టింగ్ కాసేవారి జేబులను బుకీలు గుల్ల చేస్తున్నారు. మ్యాచ్ ఎవరు గెలుస్తారో? ఎవరు ఓడిపోతారో అనే కాకుండా ఎవరు ఎన్ని పరుగులు చేస్తారు...ఈ ఓవర్లో ఎన్ని పరుగులు వస్తాయనే కోణంలోనూ పందాలు కాస్తారు. -
ఏకపక్ష ‘బదిలీల’లు
ఉద్యోగుల బదిలీలంటే కొన్ని నిబంధనలు.. నియమాలు ఉంటాయి. తొలుత సినీయారిటీ గుర్తించాలి. బదిలీలకు కౌన్సెలింగ్ నిర్వహించాలి. ఆపై ఉద్యోగులకు కొంత వెసులుబాటు ఇవ్వాలి. వీటన్నింటికీ తిలోదకాలిచ్చారు.. ఎవరో బురదచల్లారు.. దాన్ని కడిగేయాలి.. అన్న చందంగా చిత్తూరు పోలీసు శాఖలో ఏకపక్షంగా బదిలీలలు సాగించారు ఉన్నతాధికారులు. దీనిపై పెదవి విరుస్తున్నారు చిరుద్యోగులు. చిత్తూరు అర్బన్: చిత్తూరు పోలీసు శాఖలో జరిగిన బదిలీల (డీఓలు) ప్రక్రియ.. ఆ శాఖను కుదిపేస్తోంది. మూడు రోజులుగా ఏకంగా 264 మంది సిబ్బందిని బదిలీ చేయడం.. అందులోనూ పుంగనూరు నియోజకవర్గంలోని సిబ్బందికి పూర్తిగా అక్కడి నుంచి స్థానచలనం కల్పించడంతో ఏ ఇద్దరు పోలీసులు తారాసపడినా.. బదిలీలపైనే చర్చిస్తున్నారు. కేవలం కూటమి ప్రజాప్రతినిధి పోలీసుశాఖపై రుద్దిన బురదను కడిగే ప్రయత్నంలో వందలాదిమంది సిబ్బందిని ఏకపక్షంగా బదిలీ చేయడంపై సిబ్బంది పెదవి విరుస్తున్నారు. సాధారణంగా సిబ్బంది బదిలీలు వేసవి సెలవులు పూర్తికావచ్చే సమయంలో నిర్వహిస్తారు. అప్పుడే పిల్లల్ని స్కూళ్లను మార్చడం, ఇళ్లు మార్చుకోవడం సాధ్యమవుతుంది. పైగా తప్పనిసరిగా బదిలీలకు ఓ కటాఫ్ కాలాన్ని.. అంటే ఐదేళ్ల పాటు ఒకే స్టేషన్లో పనిచేసేవాళ్లను తప్పనిసరి బదిలీలోకి తీసుకురావడం, నాలుగేళ్లు, మూడేళ్ల కాలపరిమితి పనిచేస్తున్న వారిని కలిపి కౌన్సెలింగ్ నిర్వహించేవాళ్లు. ఏయే స్టేషన్లో ఖాళీలున్నాయో చూపి.. పారదర్శకంగా బదిలీల ప్రక్రియ జరిగేది. కానీ ఈ దఫా జరిగిన బదిలీల్లో ఇవేవీ పరిగణలోకి తీసుకోకుండా.. కేవలం పోలీసుశాఖపై అధికారపార్టీ నేతలు చేసిన వ్యాఖ్యల ఆధారంగా సిబ్బందికి స్థానచలనం కల్పించారు. విద్యా సంవత్సరం ముగియడానికి మరో నెల గడువున్న నేపథ్యంలో ఉన్నట్టుండి జరిగిన బదిలీలపై పోలీసు కుటుంబాల పరిస్థితిని పెనంపై నుంచి పొయ్యిలోకి పడినట్లు అయ్యింది. సిబ్బంది స్థానచలనాల విషయంలో పైకి పుంగనూరు హత్య కనిపిస్తున్నా.. ఈపాపం మాత్రం కూటమి నేతలు మూటగట్టుకోక తప్పదనేది సుస్పష్టం. ఇంతటితో బదిలీల ప్రక్రియ ముగిసిపోలేదని.. ఇది తేనెతుట్టిను కదిపినట్లేనని తెలుస్తోంది. త్వరలో మరికొన్ని బదిలీలు జరగనున్నట్లు సమాచారం. పోలీసు సంక్షేమ కోసం ఏర్పాటైన పోలీసు యూనియన్ నాయకులు కూడా తమ గోడును ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లకపోవడంపై జిల్లాలోని పోలీసులంతా ముక్త కంఠంతో యూనియన్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. వాస్తవానికి ఇతర ప్రభుత్వ శాఖల్లోని సిబ్బందిలాగా ఉద్యోగులకు అన్యాయం జరిగినా, ఇబ్బందులు వచ్చినా ధర్నాలు, నిరసనలు చేసే ప్రక్రియ పోలీసుశాఖలో కుదరదు. సాటి పోలీసుల బాధలను అధికారుల దృష్టికి తీసుకెళ్లలేని తరుణంలో యూనియన్ నాయకులు ఆ పోస్టులకు రాజీమానా చేయడం ఉత్తమమని సిబ్బంది బహిరంగంగానే దుమ్మెత్తిపోస్తున్నారు. పోలీసుశాఖను కుదిపేస్తున్న ట్రాన్స్ఫర్లు ఏ ఇద్దరు పోలీసులెదురైనా డీఓలపైనే చర్చ పరీక్షలయ్యేంత వరకు సమయం కోరుతున్న వైనం ఉన్నచోటిని కాపాడుకునేందుకు యూనియన్ మౌనం వాస్తవాలను బహిర్గతం చేయలేకపోతున్న అధికారులు -
వ్యాపారికి నైవేద్యం
కర్షక కష్టం..అసలే వేసవి కాలం.. దిగుబడి అంతంత మాత్రం.. అదీ మార్కెట్‌కు తెచ్చేందుకు ఎనలేని కష్టం.. దక్కని సరైన ఫలితం.. పోనీ వినియోగదారుడికై నా చౌకధరలంటే అదీ లేని వైనం.. ఎందుకీ దుస్థితి అంటే రైతు సొంతంగా విక్రయించుకోలేని బలహీనత ఆసరాగా మండీ వ్యాపారి, దళారీ ఇష్టారాజ్యం.. అదే సరుకు తిరిగి కొనాలన్నా రెట్టింపు వ్యయం.. వెరసి.. పుడమి పుత్రుడికి మిగులుతోంది నష్టం.. వ్యాపారి, దళారీకి కురుస్తున్న కాసుల వర్షం.. ఇదీ జిల్లాలోని రైతులు దుస్థితి.ఇదీ రైతులు, వ్యాపారులకున్న ధరల్లో తేడా... కూరగాయ రైతుకు రీటైల్‌గా వ్యత్యాసం పేరు దక్కే ధర ధర (రూపాయిల్లో)టమాట 10 20 10 బంగాళాదుంప 12 22 10 క్యాబేజీ 02 12 10 బెండ 18 28 10 కాకర 20 40 20 దోస 15 25 10 బీన్స్ 20 40 20 చిక్కుడు 25 40 15 వంగ 20 40 20 పచ్చిమిరప 15 40 25 ముల్లంగి 03 15 12 కొత్తిమీర కట్ట 05 10 05 కందులు 40 60 20 అలసంద 45 80 35 మునగ 30 60 30 బీర 15 60 45 మొక్కజొన్న 10 20 10పలమనేరు: పలమనేరులో టమాట సాగు చేసిన రైతులు ఇక్కడి మార్కెట్‌కు వెళ్లి టమాట కిలో రూ.10 లెక్కన విక్రయిస్తున్నారు. అదే టమాట మార్కెట్ బయట రిటైల్‌గా బండిపై వ్యాపారి కిలో రూ.20కి అమ్ముతున్నాడు. కేవలం గంటల వ్యవధిలోనే రైతుకు వ్యాపారికి మధ్య కిలోకు రూ.10 వ్యత్యాసం వస్తోంది. ఇదంతా చూస్తుంటే ఆరుగాలం కష్టపడి పంటసాగు చేసి రైతు కంటే గంటల్లో సరుకును కొన్న దళారులు, మండీ వ్యాపారులు బాగుపడుతున్నారేగానీ రైతుకు మిగిలిందేమీ లేదన్నట్టుగా మారింది. జిల్లాలో కూరగాయల సాగుచేసే రైతుల పరిస్థితి అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివిలా మారింది. భారీగా పంట పెట్టుబడులు జిల్లాలోనే కూరగాయల సాగులో పలమనేరు హార్టికల్చర్ డివిజన్ ముందంజలో ఉంది. ఇక్కడ ఏటా పలు రకాల కూరగాయల సాగు 50 వేల హెక్టార్లుగా ఉంటుంది. సుమారు 30 వేల మంది రైతులు ఈ పంటలను సాగు చేస్తున్నారు. ప్రధానంగా టమాట పంటను ఎకరా సాగు చేయాలంటే పంట పెట్టుబడిగా రూ.2 లక్షలు, బంగాళాదుంపకు రూ.2 లక్షలు, బీన్స్‌కు రూ.లక్ష, ఇతర పంటలకు ఎకరానికి రూ.50 వేలుగా సగటున పెట్టుబడి పెట్టాల్సివస్తోంది. అమ్మాలంటే తక్కువ.. కొనాలంటే ఎక్కువ జిల్లాలో రైతులు అమ్మే ధరలకు, బహిరంగ మార్కెట్లో పలుకుతున్న ధరలకు భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. దీనికి కారణమేమిటంటే రైతు పండించిన ధరను మార్కెట్‌కు తీసుకెళితే అక్కడ పదిశాతం కమీషన్ పెట్టుకుని మండీ వ్యాపారులు కొంటారు. దానిపై లాభం పెట్టుకుని హోల్‌సేల్ వ్యాపారికి అమ్ముతారు. వారి వద్ద నుంచి అధిక ధరకు కొనే రీటైల్ వ్యాపారులు వారి లాభం పెట్టుకుని అమ్మకాలు సాగిస్తున్నారు. కిలో రూ.10కి టమాట అమ్మిన రైతు అదే టమాటను ఇంటికి కొనాలంటే రూ.20 ఇచ్చి కొనాల్సిందే. గంటల వ్యవధిలోనే మారిపోతున్న కూరగాయల ధరలు దళారులు, మండీవ్యాపారులు, రీటైల్ వ్యాపారులు మేలు ఆరుగాలం కష్టించి పండించిన రైతులకు దక్కని గిట్టుబాటు ఇదీ జిల్లాలోని కూరగాయల కర్షకుల పరిస్థితి పంట వ్యాపారుల పాలు రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మాత్రం గిట్టుబాటు ధర లభించడంలేదు. మేము మార్కెట్లో అమ్మిన కూరగాయలనే మళ్లీ మార్కెట్లో కొనాలంటే రెట్టింపు ధర పెట్టి కొనాలి. దీనిపై ప్రభుత్వం గానీ, మార్కెటింగ్ అధికారులు గానీ పట్టించుకోవడం లేదు. ఇలా అయితే రైతులు అప్పులపాలు కావాల్సిందే. గంటల వ్యవధిలో మా సరుకును కొన్న మండీవ్యాపారులు, హోల్‌సేల్ వ్యాపారులు లాభాలు గడిస్తున్నా, కష్టపడిన రైతులకు మాత్రం నష్టాలు తప్పడం లేదే. – అమరనాథ్ రెడ్డి, రైతు, చిన్నపరెడ్డిపల్లి, గంగవరం మండలం గిట్టుబాటు ధరలు నిర్ణయించాలి అన్ని రకాల ఉత్పత్తులకు గ్యారెంటీ ధరలుంటాయి. వాటిపై ఎంత ఎమ్మార్పీ ఉంటే అంతే ఇచ్చి జనం కొనుగోలు చేయాలి. అదే రైతులు పండించిన పంట ఉత్పత్తులకు మాత్రం కనీస మద్దతు ధరలుండవు. రైతంటే అందరికీ అలుసుగా మారింది. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా రైతులకు మేలు చేయాలనే తలంపు లేకుండా పోతోంది. ఫలితంగా రైతులు కష్టాల్లో పుట్టి, కష్టాల్లో పెరిగి, కష్టాల్లోనే చస్తున్నారు. – ఉమాపతి నాయుడు, రైతుసంఘ నాయకులు, పలమనేరు -
కాపీయింగ్‌కు పాల్పడితే చర్యలు
ఐరాల: పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో కాపీయింగ్‌కు పాల్పడితే చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ విద్యాధరి ఆదేశించారు. బుధవారం మండలంలోని అగరంపల్లె జెడ్పీ హైస్కూల్ పరీక్ష కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇన్చార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో మార్చి 17 నుంచి ప్రారంభమైన పరీక్షల నిర్వహణ ఏప్రిల్ 1వ తేదీ వరకు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పా ట్లు చేశామన్నారు. జిల్లాలో 118 కేంద్రాల్లో సుమారు 21 వేల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలుకు హాజరవుతున్నారన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు తాగునీటి వసతితో పాటు ఓఆర్ఎస్ ప్యాకె ట్లు, మెడికిల్ కిట్ అందుబాటులో ఉంచుకోవడమే కాకుండా వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద 163 భారత న్యాయ సంహిత నియమాలు వర్తిస్తాయని సూచించారు. మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి అర్ధగంట ముందుగానే చేరుకోవాలన్నారు. ఒత్తిడికి గురి కాకుండా పరీక్షలు రాయడంతో మంచి ఫలితాలు సాధించవచ్చని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ మహేష్‌కుమార్, ఎంఈఓ రుషేంద్రబాబు, అధికారులు పాల్గొన్నారు. అలసత్వం వహిస్తే వేటు ఖాయం – నలుగురు ఇన్విజిలేటర్ల తొలగింపు చిత్తూరు కలెక్టరేట్ : పదోతరగతి పబ్లిక్ పరీక్షల విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చీఫ్, డిపార్ట్మెంట్, ఇన్విజిలేటర్లపై వేటు ఖాయమ ని జిల్లా విద్యాశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు రెండు పాఠ్యాంశాలకు సంబంధించిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు పూర్తయ్యాయి. ఈ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు ఫ్లయింగ్‌స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్లను నియమించారు. విద్యార్థుల పరంగా ఎలాంటి డిబార్ జరగకపోగా, విధి నిర్వహణలో అలసత్వం వహించిన నలుగురు ఇన్విజిలేటర్లను విధుల నుంచి తొలగించారు. పూతలపట్టులో ఇద్దరు, నగరిలో ఒకరు, జీడీనెల్లూరు నెల్లేపల్లి పరీక్ష కేంద్రంలో ఒక ఇన్విజిలేటర్‌ను విధుల నుంచి తప్పించారు. పది పరీక్షల అబ్జర్వర్ జ్యోతికుమారి బుధవారం జిల్లాలోని పలు పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇన్చార్జ్ కలెక్టర్ విద్యాధరి ఐరాల మండలం కాణిపాకం జెడ్పీ హైస్కూల్ పరీక్ష కేంద్రాన్ని, డీఆర్వో మోహన్‌కుమార్ కొంగారెడ్డిపల్లిలోని గాండ్లపల్లి నగరపాలక ఉన్నత పాఠశాలను తనిఖీ చేసి పరీక్షల తీరును పర్యవేక్షించారు. ఫ్లయింగ్ స్క్వాడ్లు 13 మంది 55 పరీక్ష కేంద్రాలను, సిట్టింగ్ స్క్వాడ్ల సభ్యులు 41 పరీక్ష కేంద్రాలను తనిఖీలు చేశారు. హిందీ పరీక్షకు 20,609 మంది విద్యార్థులకు గాను 20,198 మంది హాజరుకాగా 411 మంది గైర్హాజరైనట్లు డీఈఓ వరలక్ష్మి వెల్లడించారు. -
పది పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరా ధ్వంసం
–పోలీసులకు ఫిర్యాదు రొంపిచెర్ల: స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలోని పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసినట్లు ఆ స్కూలు ప్రధానోపాధ్యాయులు మోహన్‌రెడ్డి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. హెచ్ఎం కథనం మేరకు.. రొంపిచెర్ల మండలంలో ఏటా పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరుగుతుందని కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్, డీఈఓకు ఫిర్యాదు చేశారు. దీంతో రొంపిచెర్ల బాలుర, బాలికల ఉన్నత పాఠశాలల్లోని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మాస్ కాపీయింగ్ జరగడం లేదని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సీసీ కెమెరాలను ధ్వంసం చేశారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై విద్యాశాఖ అధికారులు పోలీసులు, డీఈఓకు ఫిర్యాదు చేశారు. సీసీ ఘటన స్థలాన్ని బుధవారం ఎస్ఐ సుబ్బారెడ్డి, ఎంఈఓ శ్రీనివాసులు పరిశీలించారు. -
● దోపిడీకి పక్కా ప్రణాళికలు ● శ్రమశక్తి సంఘాల ముసుగులో దోచుకునేలా కుట్రలు ● ఉపాధి మేట్లుగా 95 శాతం అనుయాయులే ● వారి చేతుల్లోనే హాజరు, కూలీల డిమాండ్
వైఎస్సార్సీపీ పాలనలో స్వర్ణయుగం వైఎస్సార్ సీపీ హయాంలో ఉపాధి కూలీల సంక్షేమానికి గత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌న్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. రికార్డు స్థాయిలో పనులు కల్పించారు. ఎనన్ఐసీ సర్వర్‌తో ప్రతి పనినీ పర్యవేక్షిస్తూ పైసా అవినీతికి తావు లేకుండా చర్యలు చేపట్టారు. శ్రమశక్తి సంఘాలతో కూలీల శ్రమదోపిడీని గుర్తించి వాటిని రద్దు చేశారు. ప్రతి పైసాను కష్టపడిన కూలీల ఖాతాకు చేర్చారు. ఫలితంగా అప్పటికే ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు సైతం స్వగ్రామాలకు చేరుకుని ఉపాధి పనులతో ఎంతో సంతోషంగా జీవించారు. గత ఐదేళ్లపాటు ఎలాంటి కష్టాలు లేకుండా జీవించిన ఉపాధి కూలీలకు ప్రస్తుత కూటమి పాలనలో కష్టాలు తప్పడం లేదు. ఉపాధి హామీ పేదలకు వరం. వలసల నివారణే దీని లక్ష్యం.. అయితే ఆ ఆశయానికి కూటమి సర్కారు తూట్లు పొడుస్తోంది. ఉపాధి కూలీల కడుపుకొట్టడానికి శ్రమశక్తి సంఘాల పేరుతో పచ్చనేతలు పక్కా ప్రణాళికలు రచించారు. మేట్ల నియామకంలో సీనియారిటీకి తిలోదకాలిచ్చి కూటమి నేతల సిఫార్సులకు పెద్ద పీట వేశారు. ఫలితంగా పచ్చనేతలకు సిరులు.. కూలీలకు ఇక కష్టాలు మిగలనున్నాయి. కార్వేటినగరం మండలంలో ఉపాధి పనులు చేస్తున్న కూలీలుచిత్తూరు కలెక్టరేట్ : కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత గతంలో ఎన్నడూ లేని విధంగా ఉపాధి హామీ పథకంలో అక్రమాలు ఊపందుకున్నాయి. ఎన్ని మార్గాలున్నాయో, అన్ని మార్గా ల్లో ఉపాధి నిధులను తమ జేబుల్లోకి వేసుకునేందుకు పచ్చ నేతలు పక్కా ప్రణాళికలు రచించుకున్నారు. మస్టర్లలో దొంగపేర్లు రాసి సొమ్మంతా సొంత ఖాతాల్లో వేసుకునేందుకు టీడీపీ నాయకులు రంగం సిద్ధం చేశారు. కొత్తగా ఏర్పాటు కాబోతున్న శ్రమశక్తి సంఘాల ముసుగులో పక్కా దోపిడీకి స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ప్రతి 25 నుంచి 50 మంది కూలీలకు ఓ శ్రమశక్తి సంఘం ఏర్పాటు చొప్పున ఈ ప్రక్రియ జిల్లాలో దాదాపు పూర్తికావొస్తోంది. మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 32 మండలాల్లో యాక్టివ్ జాబ్‌కార్డుల సంఖ్య 2.18 లక్షలు కాగా, వీటి పరిధిలో 3.62 లక్షల మంది ఉపాధి కూలీలు నమోదయ్యారు. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా దాదాపు 11,500 శ్రమశక్తి సంఘాలు కొత్తగా ఏర్పాటు కాబోతున్నాయి. దోపిడీకే మేట్లు ఉపాధి నిధులను అందిన కాటికి దోచుకునేందుకు మేట్లు విధానాన్ని కూటమి సర్కారు అమల్లోకి తీసుకొచ్చిందని విమర్శలు వెలువెత్తుతున్నాయి. మేట్లుగా ఎంపికై న వారు కూలీలను ఉపాధి పనులకు తీసుకెళ్లడం, వారి అవసరాల మేరకు ఆన్లైన్లో డిమాండ్ పెంచుకోవడం, హాజరు నమోదు, వేతనాలకు సిఫారసు తదితర పనులను పర్యవేక్షించాల్సి ఉంది. ఈ మొత్తం ప్రక్రియనే టీడీపీ నేతల అక్రమాలకు ఊతమైంది. మస్టర్లలో దొంగ పేర్లు చేర్చి, ఉపాధి కూలీల సొమ్ము కాజేసేలా పక్కా ప్రణాళికను రచించారు. ఆ మేరకు ముందుకు అడుగులు వేస్తున్నారు. మేట్‌గా ఉన్న వారికి వారి పరిధిలోని ఒక్కొక్క కూలీపై రూ.1.50 చొప్పున చెల్లిస్తారు. ఈ లెక్కన జిల్లాలో యాక్టివ్‌గా ఉన్న 2.18 లక్షల మంది కూలీలకుగాను రోజుకు రూ.3.27 లక్షలు మేట్ల ఖాతాలకు చేరుతోంది. 100 రోజులకు రూ.3.27 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ రకంగా కూలీల శ్రమదోపిడీకి కూటమి సర్కార్ తెరలేపింది.పచ్చనేతలు సూచించిన వారికే పెద్దపీట జిల్లా సమాచారం జిల్లాలో యాక్టివ్ జాబ్‌కార్డులు : 2.18 లక్షలు నమోదైన కూలీల సంఖ్య : 3.62 లక్షలు 2024–25 లో పనిదినాల లక్ష్యం : 19,83,401 పూర్తయిన పనిదినాలు : 17,50,438 ఏర్పాటు కాబోతున్న శ్రమశక్తి సంఘాలు సుమారు : 11,500 దోచుకునేందుకే.. కొత్త కొత్తగా వింత నిర్ణయాలు కూటమి ప్రభుత్వ పాలనలో అమలవుతున్నాయి. ఈ నిర్ణయాలన్నీ మార్పుల కోసం కాదు.. దోచుకునేందుకే. పూటగడవని ఉపాధి కూలీలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు. ఉపాధి హామీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. మేట్లు విధానం రూపంలో ఉపాధి నిధులను పక్కదారి పట్టించేందుకు కుట్రలు చేస్తున్నారు. ఇలాంటి కుట్రలను సహించేది లేదు. ఉపాధి కూలీలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని మేము డిమాండ్ చేస్తుంటే అవి కల్పించకుండా దోపిడీకి స్కెచ్ వేయడం అన్యాయం. – వాడ గంగరాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి, చిత్తూరు జిల్లా ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రతి శ్రమశక్తి సంఘానికి ఓ మేట్‌ను నియమించారు. అయితే స్థానిక టీడీపీ ప్రజాప్రతినిధులు ఒత్తిళ్లకు తలొగ్గిన డ్వామా అధికారులు నిబంధనలను తుంగలో తొక్కి, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఉపాధి కూలీల్లో సీనియారిటీకి తిలోదకాలిచ్చి, పచ్చనేతలు సూచించిన వారికే పెద్దపీట వేశారు. ఇలా జిల్లాలోని ప్రతి గ్రామంలోనూ పచ్చనేతలు గుర్తించిన వారే క్షేత్ర సహాయకులు, మేట్లగా చలామణి అవుతున్నారు. ఈ విధానంపై ఉపాధి కూలీల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పరోక్షంగా టీడీపీ నేతలకు దోచిపెట్టేందుకే మేట్ల వ్యవస్థను కూటమి సర్కార్ అమల్లోకి తెచ్చిందని మండిపడుతున్నారు. మండుటెండలో శ్రమించే తమపై వీరి పెత్తనం ఏమిటని కూలీలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే విషయాన్ని బాహటంగా ప్రశ్నిస్తే వేతనాల్లో కోత వేస్తారమోననే భయం కూడా కూలీలను వెంటాడుతోంది. -
అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు
ఐరాల: ప్రజల నుంచి అందిన రెవెన్యూ సమస్యల అర్జీలను నిర్ణీత గడువు లోపు పరిష్కరించాలని, ఈ విషయంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని వీఆర్వోలను జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ విద్యాధరి హెచ్చరించారు. బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెవెన్యూ సదస్సుల్లో, ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీల పరిష్కారానికి సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలించి, నివేదికలు సిద్ధం చేయాలని తహసీల్దార్ మహేష్‌కుమార్‌ను ఆదేశించారు. ప్రజలు ఎక్కువగా రెవెన్యూ సమస్యల పరిష్కారం నిమిత్తం కార్యాలయానికి వస్తుంటారని, సమస్యల నిమిత్తం వచ్చే ప్రజలతో సిబ్బంది సానుకూలంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యాలయ ఆవరణలో మొక్కల పెంపకం చేపట్టాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. -
ఏనుగుల దాడులను అరికట్టాలి
బంగారుపాళెం: అటవీశాఖ అధికారులు ఏనుగుల దా నులను ఆరికట్టి రైతుల పంటను కాపాడాలని సీపీఐ జిల్లా కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. బుధవా రం మండలంలోని బోడబండ్లలో ఏనుగుల దాడిలో పంటలు నష్టపోయిన బాధిత రైతులు సురేష్, కృష్ణయ్య, సంజీవి, భాస్కర, గోవిందు, ఈశ్వర్, శీను, లలిత, కృష్ణయ్య, మునేంద్ర, వెంకటప్ప, చంద్రయ్య, నాగభూషణం, సుధాకర్, సుబ్రమణ్యం, రామకృష్ణ, రాజేంద్ర, రవి, లోకనాథం మందడి పొలాలను సీపీఐ నాయకులు పరిశీలించారు. అనంతరం బాధిత రైతులతో కలసి స్థానిక పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీసీఐ సీనియర్ నాయకుడు మణి, జిల్లా కార్యవర్గ సభ్యులు దాసరి చంద్ర, జిల్లా కౌన్సిల్ సభ్యులు కుమారి, రఘు రైతులు పాల్గొన్నారు. -
అడిగేదెవరు?.. ఆపేదెవరు?
అధికారం మాది.. మేము చెప్పిందే వేదం.. మమ్మల్ని అడిగేవారు లేరు.. ఆపేవారు లేరు అంటూ పెనుమూరులో పచ్చనేతలు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే పలు దందాలు చేస్తున్నారు. నేడు బస్టాండు వేలంలోనూ తమ ప్రతాపం చూపుతున్నారు. వేలం పాటలో పాల్గొనాలంటే టీడీపీ నేతలై ఉండాలని హుకుం జారీ చేశారు. ఈ సంఘటన బుధవారం గంగాధరనెల్లూరు మండలం, పెనుమూరు బస్టాండు వేలంపాటలో చోటుచేసుకుంది. పెనుమూరు(కార్వేటినగరం) : కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చినప్పుటి నుంచి పెనుమూరులో రెడ్‌బుక్ పాలన రాజ్యమేలుతుంది. రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వం భూములను కబ్జా చేసుకున్నారు. ఈ సంఘటన మరవక ముందే బస్టాండ్ వేలంలోనూ వారి ప్రతాపం చూపుతున్నారు. వేలం పాటకు వచ్చేవారిని బెదిరించి భయాందోళనకు గురి చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు సైతం టీడీపీ ఏజెంట్లుగా మారి, పచ్చనేతలు తప్ప ఎవరు వేలం పాటలో పాల్గొనకూడదని హుకుం జారీ చేసినట్లు తెలిసింది. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పెనుమూరు ఆదాయం పెంపునకు గత ప్రభుత్వ హయాంలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన నారాయణస్వామి సుమారు రూ.1.08 కోట్ల వ్యయంతో బస్టాండ్‌లో సుమారు 24 దుకాణాలు కలిగిన కాంప్లెక్స్ నిర్మాణానికి కృషి చేశారు. అది పూర్తి అయినప్పటికీ ఎన్నికల కోడ్ కారణంగా ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. ప్రస్తుతం ఆ కాంప్లెక్స్‌లో దుకాణాలను అద్దెకు ఇవ్వడానికి వేలం పాటలకు అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో టీడీపీ నేతలు తామే వేలం పాటల్లో పాల్గొనాలని, ఇతరులు పాల్గొనకూడదని హుకుం జారీ చేశారు. అధికారులు కూడా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని వేలం పాటలో ఎవరినీ పాల్గొననీయకుండా అడ్డుకుంటుందని స్థానికులు విమర్శిస్తున్నారు. అంతే కాకుండా వేలం పాటలో పాల్గొనడానికి బ్యాంకుల్లో డీడీలు చెల్లించిన 300 మందిని టీడీపీ నాయకులు, అధికారులతో పాటు బెదిరించి, తిరుపతి నుంచి రప్పించిన 50 మంది గూండాలతో భయందోళనకు గురి చేశారు. అయినప్పటికీ పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించి ఏ మాత్రం పట్టించుకోలేదు. నిబంధనలకు విరుద్ధంగా వేల పాటలు నిర్వహించి, అధికార పార్టీ నాయకులకు కట్టబెట్టారని స్థానిక వ్యాపారులు వాపోతున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడింది. ఒక్కొక్క గదికి నెలకు సుమారు రూ.10 నుంచి రూ.15 వేల వరకు అద్దెరావాల్సి ఉండగా పచ్చనేతలు అతి తక్కువ ధరకే తమ అనుచరులకు అప్పగించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారబలంతో రెచ్చిపోతున్న కూటమి నేతలు టీడీపీ ఏజెంట్లుగా మారుతున్న అధికారులు బస్టాండ్ వేలంపాటలో ఎవరూ పాల్గొనవద్దని హుకుం భగ్గుమన్న వర్గ విభేదాలు వేలం పాటలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే వర్గం వర్స్స్ టీడీపీ మండల అధ్యక్షుడి రుద్రయ్య వర్గం బాహాబాహీలకు దిగాయి. తమ వర్గం వారికి గదులు లేకుండా చేయడంతో రెచ్చిపోయిన ఇరువర్గాలు గొడవ పడ్డాయి. ఈ క్రమంలో హైకోర్టు న్యాయవాది, టీడీపీ రాష్ట్ర నాయకుడు గద్వాల జగదీష్ నిలదీయడంతో ఆయనపై కర్రలతో, రాళ్లతో దాడికి దిగారు. అలాగే ఆయన కారును పెనుమూరు బస్టాండ్‌లో ధ్వంసం చేశారు. దీంతో పెనుమూరు మండలానికి చెందిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్.బీ సుధాకర్‌రెడ్డి ఈ వ్యవహారాన్ని సీఎం దృష్టికి తీసుకెళతానని చెప్పడంతో రచ్చ సద్దుమణిగింది. -
హిందీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్?
● స్థానిక ఉపాధ్యాయులు, ఇన్విజిలేటర్లపై ఆరోపణలు ● ఉన్నతాఽధికారులు చర్యలు తీసుకోవాలి చౌడేపల్లె: స్థానిక ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో బుధవారం నిర్వహించిన పదో తరగతి హింది పబ్లిక్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరిగిందన్న ఆరోపణలు వెలువెత్తాయి. ఉన్నత పాఠశాలలో రెండు పరీక్ష కేంద్రాలున్నాయి. వీటిలో మొత్తం 500 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. వీటి నిర్వహణకు మొత్తం మండలంలో పనిచేస్తున్న 26 మంది ఎస్జీటీలను ఇన్విజిలేటర్లుగా నియమించారు. స్థానిక ఉన్నత పాఠశాలలో ఉన్న టీచర్లకు సుపరిచితులైన ఇన్విజిలేటర్లు ఉండడంతో మాస్ కాపీయింగ్ జోరుగా సాగుతోందని పలువురు విమర్శించారు. అలాగే స్థానిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, పరీక్ష కేంద్రం వద్ద తిష్ట వేసి, ఇన్విజిలేటర్లైపె ఒత్తిడి తెస్తూ మాస్ కాపీయింగ్‌కు సహకారమిస్తున్నారని పలువురు విమర్శించారు. స్థానికంగా ఉండే ఉపాధ్యాయులకు స్థానికంగా ఉన్న ఇన్విజిలేటర్లను నియమించడంతోనే మాస్ కాపీయింగ్ జోరుగా సాగుతోందని పలువురు విమర్శించారు. రాబోయే ఇంగ్లిషు పరీక్షలో మరింత జోరుగా సాగే అవకాశం ఉందని సమాచారం. ఉన్నతాధికారులు పరీక్ష కేంద్రంపై దృష్టి సారించి, చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఈ విషయమైన పరీక్ష కేఽంద్రం చీఫ్ వేణును వివరణ కోరగా అలాంటిదేమీ జరగలేదని, మూడుసార్లు స్క్వాడ్ తనిఖీ చేసిందని, పటిష్టంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు బదులిచ్చారు. -
కాన్పులన్నీ విధిగా నమోదు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): అన్ని కాన్పులను విధిగా నమోదు చేయాలని డీఎంఅండ్‌హెచ్‌ఓ ప్రభావతీదేవి ఒక ప్రకటనలో ఆదేశించారు. జిల్లాలోని ప్రైవేటు హాస్పిటల్స్, నర్సింగ్‌హోమ్‌ల్లో జరిగే కాన్పుల సంఖ్యను విధిగా హెచ్ఎంఐఎస్, సీఆర్ఎస్ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. జనన లెక్కలో తప్పిదాలు ఉండకూడదన్నారు. ఆన్లైన్లో నమోదు చేయాల్సిన బాధ్యత ప్రైవేటు ఆస్పత్రులదేనన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు. పార్కింగ్ ఫీజు వేలం రూ. 2.12 కోట్లు కాణిపాకం: కాణిపాకంలో బుధవారం పార్కింగ్ ఫీజు వేలం నిర్వహించారు. 2025–26 సంవత్సరానికి గాను కాణిపాకం గ్రామ పంచాయతీ, దేవస్థానం సంయుక్తంగా నిర్వహించిన ఈ వేలంలో రూ. 2.12కోట్ల వరకు పలికింది. కాణిపాకానికి చెందిన ఆర్.సెల్వం పార్కింగ్ ఫీజు హక్కును కై వసం చేసుకున్నారు. ఇన్చార్జ్ పంచాయతీ కార్యదర్శి కుసుమ కుమారి మాట్లాడుతూ, నిబంధనల ప్రకారం ఫీజు వసూలు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచ్ శాంతి సాగర్ రెడ్డి, వార్డు సభ్యులు, ఆలయ అధికారులు, వేలం పాటదారులు, గ్రామస్తులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. చిత్తూరు విద్యార్థికి గేట్ జాతీయ స్థాయి ర్యాంకు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాకు చెందిన విద్యార్థి వర్షిత్ గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్(గేట్) ఫలితాల్లో జాతీయ స్థాయిలో 13వ ర్యాంకు సాధించాడు. ఈ నెల 19వ తేదీన గేట్ పరీక్ష ఫలితాలు విడుదల చేశారు. జిల్లాలోని యాదమరి మండలం కే.గొల్లపల్లి జెడ్పీ హైస్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్న సుధాకర్, అదే మండలంలో దళవాయిపల్లి ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న పద్మజ దంపతుల కుమారుడు వర్షిత్ గేట్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 13 స్థాయి ర్యాంకు సాధించాడు. 25న ప్రసన్నుడి కల్యాణోత్సవం తిరుపతి కల్చరల్ : అప్పలాయిగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఈనెల 25వ తేదీన స్వామివారి కల్యాణమహోత్సవం నిర్వహించనున్నారు. ప్రతి నెలా శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని ఉదయం 10.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి వారికి కల్యాణం నిర్వహించడం ఆనవాయితీ. -
బహుదానది.. ఆగని ఇసుక దందా
సాక్షి టాస్క్‌ఫోర్స్: కూటమి నేతల కనుసన్నల్లోనే అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా సాగుతోంది. రేయింబవళ్లు యంత్రాలతో తవ్వి సుమారు 15 టిప్పర్ల ద్వారా ఇసుకను హైవే మీదుగానే సరిహద్దులు దాటిస్తున్నారు. ఐరాల మండలంలోని బహుదా నదిలో ఇసుక అక్రమ రవాణా జోరుగా జరుగుతోంది. మైనగుండ్లపల్లె సమీపంలోని బహుదానదిలో నడిబొడ్డున(మధ్యలో) హిటాచ్ యంత్రాలతో సుమారు 20 అడుగుల లోతు మేరకు నీటిలో నుంచి ఇసుకను తవ్వి టిప్పర్లకు లోడ్ చేసి, హైవే మీదుగానే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు తరలిస్తున్నారు. అండుగంటుతున్న భూగర్భ జలాలు వర్షాకాలంలో బహుదానది ఒక సంవత్సరం ప్రవహిస్తే మూడేళ్ల పాటు పరిసర గ్రామాల్లో వ్యవసాయబోర్లు, తాగునీటి బోర్లలో భూగర్భజలాలు పుష్కలంగా ఉంటాయి. దీంతో రైతులు పంట సాగు చేసుకోవడానికి నీటి కొరత ఉండదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో బహునదిలో 20 అడుగుల లోతు వరకు ఇసుక తవ్వకాలు జరుపుతుండడంతో భూగర్భజలాలు అడుగంటిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. నిద్రావస్థలో అధికార యంత్రాంగం బహుదానదిలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం శోచనీయం. రేయింబవళ్లు యథేచ్ఛగా టిప్పర్లతో తరలిస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోకుండా అధికార యంత్రాంగం నిద్రావ్యవస్థలో జోగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా అధికారుల మొద్దు నిద్ర వీడి బహుదా నదిలో అక్రమ ఇసుక తవ్వకాలను అరికట్టాలని రైతులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నీవానదిలో.. గంగాధరనెల్లూరు: నియోజకవర్గ కేంద్రానికి సమీపంలోని నీవానదిలో ఇసుక దందా మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది. ఇసుక అక్రమ రవాణాతో కూటమి నేతలు జేబులు నింపుకుంటున్నారు. చిత్తూరు మార్గంలోని నీవానదిపై ఉన్న బ్రిడ్జికి నూరు మీటర్ల దూరంలో నుంచి టిప్పర్ల ద్వారా ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం. మండల కేంద్రానికి కూత వేటులో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా అధికారులు పట్టించుకోక పోవడంపై సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి. -
ఇసుమంతైనా భయం లేదు!
అక్రమమా..సక్రమమా.. తరువాత సంగతి.. గాలి ఉన్నప్పుడే తూర్పార పట్టాలన్నట్టుంది ఇసుకాసురుల పరిస్థితి. ఇసుక పాలసీని అతిక్రమించి నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుపుతున్నారు. తాగునీటి బోర్లను సైతం తవ్వేస్తున్నారు. అడ్డుకోవడానికి వెళ్లిన అధికారులపైనా దౌర్జన్యం చేసి, అక్కడికి రానీయకుండా వారినీ అడ్డుకుంటున్నారు. ఇదీ కౌండిన్యలో సాగుతున్న ఇసుక దందా. పలమనేరు: కౌండిన్య నదిలో నిత్యం జేసీబీలు, ట్రాక్టర్లను పెట్టి కావాల్సినంత తోడేస్తున్నారు. చివరకు మున్సిపల్ పంప్‌హౌస్ వద్ద బోర్లను సైతం ఇసుకాసురులు తోడేస్తుంటే చేసేదిలేక స్థానిక మున్సిపల్ అధికారులు బుధవారం అక్కడికి వెళ్లారు. నదిలో సాగుతున్న ఇసుక అక్రమ రవాణాను ఆపేందుకు మున్సిపల్ కమిషనర్, డీఈలు ప్రయత్నించగా వారిపైనే ఇసుకాసురులు దౌర్జన్యానికి దిగారు. దీంతో వారు పోలీసులకు ఫోన్ చేసి కొన్ని ట్రాక్టర్లను మాత్రం సీజ్ చేయించారు. అక్కడున్న జేసీబీలను డ్రైవర్ల అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. పంప్‌హౌస్ వద్ద బోర్లు నాశనం పలమనేరు పట్టణానికి కౌండిన్య నదిలోని పంప్‌హౌస్ నుంచి మంచినీటి సరఫరా సాగుతోంది. అక్కడ మున్సిపల్ అధికారులు ఏడు బోర్లను డ్రిల్ చేశారు. వీటిల్లో ఇటీవల ఇసుకను తోడేయడంతో రెండుబోర్లలో నీరు రావడంలేదు. దీనిపై స్పందించిన మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి, సిబ్బందితో కలసి అక్కడికెళ్లి పరిశీలించారు. ఆయన ముందే పదులసంఖ్యలో ట్రాక్టర్లు, జేసీబీలను చూసి అక్కడికెళ్లి ఇసుక తోడకూదంటూ అడ్డుకున్నారు. దీనిపై ఇసుకాసురులు సైతం తగ్గేదేలేదంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో ఆయన పోలీసులను పిలిపించేలోపు అక్కడున్న ట్రాక్టర్లు జేసీబీలు వెళ్లిపోగా రెండు ట్రాక్టర్లను మాత్రం పోలీసులు తూతూ మంత్రంగా సీజ్ చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ఆయన గంగవరం, పలమనేరు తహసీల్దార్లకు తెలుపుతామని పేర్కొన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా... నదిలో ఇసుకను తోడుతున్నవారిని అడిగితే ఇంటి నిర్మాణానికని చెబుతున్నారు. ఇంకొందరు ట్రాక్టర్లకు పచ్చ పెయింట్, డ్రైవర్‌కు పచ్చ కండువా, జేబులో చంద్రబాబు ఫొటో పెట్టుకుని అధికారులనే బెదిరిస్తున్నారు. నియోజకవర్గంలోని కొంగోళ్లపల్లి, ముసలిమొడుగు, కూర్మాయి, మొరం, ముదరంపల్లి, బైరెడ్డిపల్లి, గుండుగల్లు, చిన్నూరు తదితర గ్రామాల్లో ఇసుక రవాణా చేసే వారే పదులసంఖ్యలో ఉన్నారు. ఈ గ్రామాల్లో పది నుంచి ఇరవై ట్రాక్టర్లు, గ్రామానికి రెండు, మూడు జేసీబీలున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అధికారులనే అడ్డుకున్న ఇసుక స్మగర్లు కౌండిన్యలో ఆగని అక్రమరవాణా మున్సిపల్ పంప్‌హౌస్ వద్ద భారీగా తవ్వకాలు అడ్డుకున్న అధికారులపై దౌర్జన్యం పగటి డంప్‌లకు.. రాత్రి కర్ణాటకకు.. గతంలో ఇక్కడి నుంచి ఇసుకను అక్రమంగా కర్ణాటకలోని హొసకోటకు తరలించేవారు. ఇప్పుడలా కాదు కర్ణాటక నుంచే టిప్పర్లు డంపుల వద్దకే వస్తున్నాయి. ఓ ట్రాక్టర్ ఇసుకను చెప్పిన చోటుకు తెచ్చి దింపితే రూ.2 వేలుగా నిర్ణయించారు. ఓ టెన్‌వీలర్ టిప్పర్‌కు 6 ట్రాక్టర్ లోడ్లు. అంటే డంపు వద్దకు చేరితే టిప్పర్ విలువ రూ.12 వేలు. తోడిన ఇసుకను రహస్యప్రదేశాల్లో డంప్‌ల్లో దింపుకుంటున్నారు. ఆపై రాత్రుల్లో కర్ణాటక నుంచి టిప్పర్లు రాగానే ఇసుకను లోడింగ్ చేస్తున్నారు. దీంతో అక్కడి వ్యాపారులు స్పాట్లోనే టిప్పర్‌కు రూ.24 వేలు చెల్లిస్తున్నారు. అంటే టిప్పర్ ఇసుకను అమ్మితే రూ.12 వేల గిట్టుబాటు. -
‘రుణం ఇప్పిస్తామని మోసం చేశారు’
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : రుణం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి ముగ్గురు మహిళలు తమ వద్ద నగలు, డబ్బు తీసుకొని మోసం చేశారని చిత్తూరు నగరం ఎంజీఆర్ వీధికి చెందిన ధనలక్ష్మి పేర్కొన్నారు. చిత్తూరు ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఆమె విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. వ్యాపారం నిమిత్తం రుణం కోసం తాము ప్రయత్నిస్తుండగా.. ముగ్గురు మహిళలు రుణం ఇస్తామని మాయ మాటలు చెప్పి తమ వద్దనున్న రూ. 4 లక్షల విలువైన బంగారు నగలు, 4 లక్షలు నగదు తీసుకున్నారని చెప్పారు. నగలను వారి పేరిటే తాకట్టుపెట్టి డబ్బులు మాకు ఇవ్వకుండా వాళ్లే తీసుకున్నారని వాపోయారు. మా డబ్బులు, నగలు ఎప్పుడు ఇస్తావని ప్రశ్నించగా..ఆ మహిళలు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ఆరోపించారు. కాజూరు ప్రాంతానికి చెందిన దేవి మాట్లాడుతూ.. ఆ ముగ్గురు మహిళలు తనకు రూ.10 లక్షలు బ్యాంక్ రుణం ఇస్తామని చెప్పి, బ్యాంక్ డిపాజిట్ పేరుతో రూ.లక్షలు తీసుకున్నారని వాపోయారు. పోలీసులకు ఫిర్యాదు ఇచ్చామని అయితే ఇప్పటి వరకు కేసును నమోదు చేయలేదన్నారు. జిల్లా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి వారిపై కేసులు నమోదు చేసి తమ నగదును రికవరీ చేసి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. -
హత్య కేసులో నిందితుడి అరెస్టు
పుత్తూరు : పట్టణ పరిధిలో ఈనెల 9వ తేదీన చినరాజుకుప్పం గ్రామంలో జరిగిన బి.మణికంఠ(29) హత్య కేసులో నిందితుడైన బి.వెంకటేశులును అరెస్టు చేసినట్లు సీఐ సురేంద్రనాయుడు తెలిపారు. మంగళవారం సీఐ మీడియాకు వెల్లడించిన వివరాలు ఇలా.. చినరాజుకుప్పం గ్రామానికి చెందిన బి.సుబ్బరాయులు, చెంచమ్మ కుమారుడు మణికంఠ ఈనెల 9వ తేదీన తన చిన్నాన్న వెంకటేశులు ఇంట్లో హత్యకు గురయ్యాడు. మృతుడు మణికంఠకు స్వయాన చిన్నాన్న అయిన బి.వెంకటేశులుతో కలసి తరచూ మద్యం తాగడం, గొడవ పడడం సాధారణ విషయంగా గ్రామస్తులు, కుటుంబ సభ్యులు భావించేవారు. పుట్టుకతో వికలాంగుడైన వెంకటేశులును మణికంఠ తరచూ హేళనగా మాట్లాడేవాడని, తరచూ కొడుతూ నిన్ను చంపేస్తే నీ ఆస్తి మొత్తం తనకు వస్తుందని చెప్పేవాడు. ఈ నేపథ్యంలో ఈనెల 9వ తేదీన వెంకటేశులు ఇంట్లో మద్యం తాగుతూ ఇద్దరి మద్య గొడవ ప్రారంభమైంది. ఈక్రమంలో మణికంఠ.. వెంకటేశులును కొడుతూ తిట్టడం ప్రారంభించాడు. మణికంఠ మద్యం మత్తులో జోగుతున్న సమయంలో అతడి నుంచి తనకు ముప్పు పొంచి ఉందని భావించిన వెంకటేశులు తన వద్దనున్న రోకలిబండతో మనికంఠ తలపై బలంగా కొట్టడం జరిగింది. మనికంఠ మృతి చెందినట్లు భావించిన తర్వాత ఇంటి బయటకు వచ్చిన వెంకటేశులు ఏడుస్తూ కూర్చున్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన లావణ్య అనే గ్రామస్తురాలు రక్తపు మడుగులో పడి ఉన్న మనికంఠను చూసి కేకలు పెడుతూ అందరికీ చెప్పింది. దీంతో అక్కడి నుంచి వెంకటేశులు పరారయ్యాడు. మృతుడు తల్లి చెంచమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పుత్తూరు డీఎస్పీ రవికుమార్ పర్యవేక్షణలో కేసు దర్యాప్తు చేసిన సీఐ సురేంద్రనాయుడు మంగళవారం నిందితుడు వెంకటేశులును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
ఇసుక నిల్వలు సీజ్
పాలసముద్రం : నరసింహపురం జగనన్న కాలనీ సమీపంలో డంప్ చేసిన ఇసుకను మంగళవారం ఎస్ఐ చిన్నరెడ్డెప్ప సీజ్ చేసి తహసీల్దార్ అరుణకుమారికి అప్పగించారు. ఎస్ఐ చిన్నరెడ్డప్ప మాట్లాడుతూ.. నరసింహపురం పంచాయతీ జగనన్న కాలనీ సమీపంలో అనుమతి లేకుండా 15 లోడ్ల ఇసుక నిల్వలు ఉన్నాయని ఫిర్యాదు వచ్చిందన్నారు. వెంటనే వీఆర్ఓ రమేష్ సిబ్బందితో వెళ్లి ఇసుక నిల్వలను సీజ్ చేసి తహసీల్దార్‌కు అప్పగించామని తెలిపారు. నేటి నుంచి జిల్లాలో ప్రత్యేక ఆధార్ శిబిరాలు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా బుధవారం నుంచి ప్రత్యేక ఆధార్ శిబిరాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం ముందస్తు కసరత్తు పూర్తి చేసింది. జిల్లాలో గుర్తించిన ప్రాంతాల్లో షెడ్యూల్ మేరకు బుధవారం నుంచి 22వ తేదీ వరకు, ఆ తర్వాత 25 నుంచి 28వ తేదీ వరకు స్పెషల్ క్యాంప్‌లను నిర్వహించనున్నారు. ఈ క్యాంప్‌లను జిల్లాలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు వెల్లడించారు. జిల్లాలో పుట్టినప్పటి నుంచి ఆధార్ కార్డుకు దరఖాస్తు చేసుకోని చిన్నారుల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చన్నారు. జిల్లాలోని సచివాలయాలు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో ఈ ప్రత్యేక ఆధార్ శిబిరాలను నిర్వహించనున్నారు. ఆరేళ్ల వయస్సు లోపు చిన్నారుల పేర్లతో కొత్తగా ఆధార్‌కార్డు నమోదు, పాత కార్డుల్లో చేర్పులు, మార్పులకు అవకాశం కల్పించనున్నట్లు అధికారులు వెల్లడించారు. -
పన్నుల వసూళ్లు.. పూర్
● ఆస్తి పన్ను వసూళ్లల్లో మున్సిపాలిటీలు వెనుకంజ ● పది రోజుల్లో ముగియనున్న గడువు ● రూ.కోట్లకు గానూ.. అరకొరగానే వసూళ్లు ● పన్నులు రాకుంటే అభివృద్ధికి గడ్డుపరిస్థితే ! చిత్తూరు అర్బన్ : ఆస్తిపన్ను.. స్థానిక సంస్థలైన మున్సిపాలిటీలకు ప్రాణవాయువు. కానీ ప్రస్తుతం జిల్లాలో ఆస్తి పన్ను వసూళ్లు మందకొడిగా సాగుతోంది. 2024–25 ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో 12 రోజుల సమయం మాత్రమే ఉంది. చిత్తూరు కార్పొరేషన్‌తో పాటు మిగిలిన నాలుగు మున్సిపాలిటీల్లో ప్రభుత్వ భవనాలతో కలిసి లక్ష వరకు భవనాలున్నాయి. ఈనెలాఖరుకు పాత బకాయిలతో కలిసి మొత్తం రూ.62.63 కోట్లు వసూలు కావాల్సి ఉంటే.. మంగళవారం సాయంత్రానికి రూ.29.48 కోట్లు వసూలయ్యింది. కొన్ని చోట్ల కమిషనర్లు మున్సిపాలిటీ ఖజానాను బలోపేతం చేసే దిశగా తీసుకుంటున్న చర్యలు ఆస్తి పన్ను వసూళ్ల ప్రభావంపై సానుకూలంగానే చూపిస్తోంది. అదే సమయంలో మరికొన్ని మున్సిపాలిటీలు పన్ను వసూళ్లపై అసలు ఏ మాత్రం దృష్టి పెట్టడంలేదని గణాంకాలే చెబుతున్నాయి. పన్ను వసూళ్లకు కొద్ది రోజులు మాత్రమే గడువు ఉండటంతో ఆశించిన స్థాయిలో ఏ మేరకు ఆస్తి పన్ను వసూళ్లవుతాయో అధికారులకు అర్థంకాని పరిస్థితి. వడ్డీ మాఫీ చేస్తారని? ఆస్తి పన్నుపై గత ప్రభుత్వం వడ్డీని మాఫీ చేసింది. ఈసారి కూడా వడ్డీ మాఫీ చేస్తే భారీ మొత్తంలో పన్నులు వసూలయ్యే అవకాశం ఉంది. ప్రజలపై పడిన అదనపు భారం కూడా తగ్గనుంది. వడ్డీ మాఫీ చేస్తారో..?లేదో..? అని ప్రజల్లో అనుమానాలు ఉండటం వసూళ్లపై ప్రభావం చూపిస్తోంది. ఇదే సమయంలో వసూలైన పన్నులు నేరుగా ప్రభుత్వ పీడీ ఖాతాలో జమ చేస్తుండటంతో అభివృద్ధి పనులకు ఈ మొత్తాన్ని వెచ్చించే వెసులుబాటు అధికారులకు, కౌన్సిల్‌కు ఉండటంలేదు. పరిస్థితి ఇలాగే ఉంటే రానున్న రోజుల్లో మున్సిపాలిటీల్లో విద్యుత్ బిల్లులు కూడా చెల్లించే పరిస్థితి ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లాలోని మున్సిపాలిటీల్లో పన్నుల వసూళ్లు ఇలా.. మున్సిపాలిటీ భవనాలు మొత్తం బకాయి వసూలు (కోట్లలో..) చిత్తూరు 44,879 రూ.39.60 రూ.16.97 పుంగనూరు 13,637 రూ.7.20 రూ.4.48 పలమనేరు 13,447 రూ.4.92 రూ.3.16 కుప్పం 12,998 రూ.6.38 రూ.2.51 నగరి 14,837 రూ.4.53 రూ.2.35 -
నీతి తప్పిన ఆ ఖాకీ ఎవరు..?
● చిత్తూరులోని పోలీసు అధికారిపై డీఐజీ ఆరా ● విచారణ చేస్తామని ప్రకటించిన ఎస్పీ ● అవినీతి ఆరోపణలపై కానిస్టేబుళ్ల బదిలీ చిత్తూరు అర్బన్ : చిత్తూరులోని ఓ స్టేషన్‌ను అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మార్చేసిన అధికారిపై అనంతపురం డీఐజీ షీమోషీ ఆరా తీస్తున్నారు. ఓ చోరీ కేసులో దొంగ నుంచి రూ.12.50 లక్షల లంచం తీసుకోవడం, డబ్బులు తీసుకుని కేసులు నమోదు చేయకపోవడం, పోలీస్ బాస్ తన ప్యాకెట్లో ఉన్నారని ప్రగల్భాలు పలికి అవినీతి కార్యకలాపాలు చేస్తున్న పోలీసు అధికారిపై శ్రీసాక్షిశ్రీ దినపత్రికలో మంగళవారం శ్రీకాసుక్కూర్చున్న ఖాకీశ్రీ శీర్షికన వార్త ప్రచురితమైన విషయం తెలిసిందే. చిత్తూరు పోలీసు అతిథి గృహంలో ఉన్న డీజీఐ షీమోషీ ఈ కథనంపై అధికారులతో చర్చించినట్లు సమాచారం. దొంగ నుంచి రూ.12.50 లక్షలు లంచం తీసుకున్నాడనే ఆరోపణలపై ఇప్పటికే విచారణ చేపట్టామని డీఐజీకు వివరించగా.. పత్రికలో వచ్చిన ఇతర ఆరోపణలపై కూడా విచారణ చేయాలని ఆమె ఆదేశించినట్లు తెలిసింది. మరోవైపు చిత్తూరులో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ మణికంఠ మాట్లాడుతూ.. అవినీతి ఆరోపణలు వచ్చిన అధికారిపై విచారణ జరుపుతున్నామని, త్వరలోనే వివరాలు వెల్లడిస్తామన్నారు. ఈ అధికారి చెప్పినట్లు చేసి, దొంగ నుంచి డబ్బులు తీసుకోవడంలో కీలకంగా వ్యవహరించారనే అవినీతి ఆరోపణలపై సంబంధిత పోలీస్ స్టేషన్‌లోని ముగ్గురు సిబ్బందిపై బదిలీ వేటు పడింది. వీళ్లను ఆ పోలీస్ స్టేషన్ విధుల నుంచి తప్పిస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఏకంగా పోలీస్ శ్రీబాస్శ్రీ పేరు చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటున్న ఆ అధికారి వ్యవహార శైలిపై జిల్లా పోలీసుశాఖలో తీవ్ర చర్చ జరుగుతోంది. -
తీగ లాగితే.. డొంక కదిలింది!
● స్కూటర్ చోరీ కేసులో విచారిస్తే.. దోపిడీ దొంగలు దొరికారు ● వివరాలు వెల్లడించిన ఎస్పీ మణికంఠ చిత్తూరు అర్బన్: తీగ లాగితే.. డొంక కదిలినట్టు.., ఓ ద్విచక్రవాహనం చోరీ కేసులో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు మోస్ట్ వాంటెడ్ దొంగలు దొరికారు. ఈ మేరకు గల్లా హేమచంద్ర (27), కొండరాజు సురేష్ (27), షేక్ మస్తాన్ (24), పోలి వరప్రసాద్ (20), సంజయ్ కుమార్ (23) అనే ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఒక్కొక్కరిపై 60, 57, 27 కేసులున్న కరుడుగట్టిన నేరగాళ్లతోపాటు.. రూ.35 లక్షల విలువైన బంగారు వెండి ఆభరణాలు పట్టుబడ్డాయి. మంగళవారం ఈ మేరకు చిత్తూరు నగరంలోని పోలీసు అతిధిగృహంలో ఎస్పీ మణికంఠ చందోలు, ఏఎస్పీ రాజశేఖర్‌రాజు, డీఎస్పీ సాయినాథ్, పూతలపట్టు సీఐ కృష్ణమోహన్‌తో కలిసి మీడియాకు వివరాలను వెల్లడించారు. ఈనెల 6వ తేదీన పూతలపట్టులో పార్కింగ్ చేసిన తన మోటారు సైకిల్ కనిపించడంలేదని బాధితుడు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుని, లభించిన కొద్దిపాటి ఆధారాలతో దర్యాప్తు ప్రారంభించారు. తొలుత తవణంపల్లె మండలం జెట్లిపల్లె, పల్లెచెరువు పంచాయతీకు చెందిన గల్లా హేమచంద్రను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ క్రమంలో అనుమానితుడిపై చిత్తూరు, తిరుపతి, కడప, కర్నూలు, బద్వేలు ప్రాంతాల్లో దాదాపు 60కు పైగా కేసులు ఉన్నట్లు, అందులోనూ 20 కేసుల్లో నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్లు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. నిందితుడు ఇచ్చిన సమాచారంతో ప్రకాశం జిల్లా సీఎస్ పురానికి చెందిన సురేష్ (ఇతడిపై 27 కేసులు), తిరుపతి జిల్లా పుత్తూరుకు చెందిన షేక్ మస్తాన్ (57 కేసులు), సత్యసాయి జిల్లా ఓడిసికి చెందిన వరప్రసాద్, చిత్తూరు రూరల్ మండలం తాళంబేడుకు చెందిన సంజయ్‌కుమార్‌ను అరెస్టు చేశారు. ఇళ్లలో దొంగతనాలు, చైన్‌స్నాచింగ్, ఆలయాల్లో హుండీల చోరీ, స్కూటర్లను అపహరించండం వంటి కేసుల్లో నిందితులు తప్పించుకుని తిరుగుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితులు చోరీలు చేసి దాచి ఉంచిన రెండు ద్విచక్ర వాహనాలు, 316 గ్రాముల బంగారు ఆభరణాలు, 3.150 కిలోల వెండి ఆభరణాలు, ఓ టీవీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరుతో పాటు ఇతర జిల్లాల్లో వీటిని చోరీ చేసినట్లు తెలిపారు. కేసు ఛేదించడంలో ప్రతిభ చూపించిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు. -
తమ్ముళ్లు.. ఐపీఎస్ అనిపించారు
● జిల్లా పోలీసు బాస్ మెడపై ‘పచ్చ’కత్తి..! ● చిత్తూరు జిల్లాలో రాజకీయ బదిలీలు ● జిల్లాలో 264 మంది పోలీసుల బదిలీ ● పుంగనూరు హత్యను ఆయుధంగా మలుచుకున్న కూటమి నేతలు ● పోలీసుశాఖలో రాజకీయ బదిలీలపై తీవ్ర చర్చ ● అసెంబ్లీ సమావేశాలైపోతే ‘బాసు’ బదిలీ? చిత్తూరు అర్బన్/ పుంగనూరు : ‘‘పుంగనూరులో మా కార్యకర్త (టీడీపీ) హత్యకు కారణం పోలీసులే. పోలీస్ స్టేషన్లలో గత ప్రభుత్వంలో పనిచేసిన వాళ్లు ఇంకా ఉన్నారు. వాళ్లను బదిలీ చేయమంటే ఎస్పీ ఒప్పుకోలేదు. అందుకే ఈ హత్య జరిగింది. దీనికి కారణం పోలీసు శాఖే’’ అంటూ మూడు రోజుల కిందట కూటమి ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇది ఏకంగా చిత్తూరు జిల్లా పోలీసు బాసు మెడపై కత్తిపెట్టి లొంగదీసుకునేంత పనిచేసింది. రెండు రోజులుగా చిత్తూరు పోలీసుశాఖలో ఏకంగా 264 మంది పోలీసులను ఉన్నట్టుండి బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. వీరిలో కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్ఐలు ఉన్నారు. పుంగనూరులో జరిగిన హత్యా ఉదంతాన్ని అడ్డంపెట్టుకున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఐపీఎస్ అధికారిని లక్ష్యంగా చేసుకుని బహిరంగ వ్యాఖ్యలు చేయడంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రాజకీయ బదిలీలు జరిగినట్లు స్పష్టమవుతోంది. కూటమి పాలనలో.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చిత్తూరు జిల్లాలో ఆ పార్టీ నాయకులు చేస్తు న్న దౌర్జన్యాలు అన్నీ ఇన్నీ కావు. ఎస్పీ క్యాంపు కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న గ్రానైట్ ఫ్యాక్టరీల పన్నుల వసూలు బిల్డింగ్‌ను పెట్రోలు పోసి తగులబెట్టడం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే లక్ష్యంగా దాడులకు తెగబడటం సర్వసాధారణంగా చేసేశారు. తాజాగా పుంగనూరులో వెంకటరమణ, రామకృష్ణ ఇరువురు బంధువులే. వీరి మధ్య నెలకొన్న పాత గొడవలు రామకృష్ణ హత్యకు దారితీశాయి. ఈ ఘటనలో పోలీసుల వైఫల్యం కనిపిస్తున్నా, నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు పుంగనూరు సీఐతో పాటు ఓ హెడ్‌కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. పరిస్థితి అక్కడితో ఆగిపోలేదు. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెల లు సమీపిస్తుంటే అన్ని ప్రభుత్వ విభాగాల్లో ‘పచ్చ’ ముద్ర వేసిన ఆ పార్టీ నేతలు.. పోలీసు శాఖలోనూ ఎస్ఐ, సీఐ, డీఎస్పీ, ఏఎస్పీల్లో సామాజికవర్గం సాక్ష్యంగా బదిలీలు చేయించారు. కానీ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐలోనూ తాము చెప్పిన వాళ్లను బదిలీ చేయాలని పోలీసు బాసుపై ఒత్తిడి తీసు కొచ్చారు. జిల్లాలోని ప్రతీ పోలీస్ స్టేషన్లో ఎవరు పనిచేయాలి..? అనే పేర్లతో కూడిన జాబితాను రూ పొందించారు. ఇందులో అన్నింటికీ ఒప్పుకోని పోలీ సు బాసు మెడపై పుంగనూరు హత్య ఘటనను ఆ యుధంగా ఉపయోగించారు. ఫలితంగా సోమ వారం 45 మంది, మంగళవారం 219 మంది సిబ్బందిని బదిలీ చేస్తూ చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు ఉత్తర్వులు జారీ చేశారు. రెండు రోజుల వ్యవధిలో ఏకంగా 264 మంది సిబ్బందిని బదిలీ చేయడం వెనుక కూటమి పార్టీ ఎమ్మెల్యేలు చక్రం తిప్పారన్నది సుస్పష్టం. అసెంబ్లీ సమావేశాలు కాగానే.. అసెంబ్లీ సమావేశాలు పూర్తవగానే ‘పోలీసు బాసు’ను కూడా జిల్లా నుంచి పంపించేస్తామని కూటమి నేతలు బహిరంగంగానే కార్యకర్తల వద్ద చెబుతున్నారు. బ్యూరోకాట్స్పై అధికారపార్టీ నాయకులు ఈస్థాయిలో ఒత్తిళ్లు చేస్తే ఎవరూ పనిచేసే పరిస్థితులు ఉండవని ఉన్నతాధికారులు పెదవి విరుస్తున్నారు. ఇలాంటి ఘటనల వల్ల కొత్తగా వచ్చే అధికారులు సైతం చట్టానికి లోబడి కాకుండా.. తాము రూపొందించిన రెడ్‌బుక్ రాజ్యాంగానికి తదనుగుణంగా పనిచేయాల్సి ఉంటుందని కూటమి నేతలు హెచ్చరికలు పంపించారు. మరోవైపు పుంగనూరు హత్యానంతరం అనంతపురం డీఐజీ షీమోషీ సైతం చిత్తూరులో ఉంటూ ఇక్కడి పరిస్థితులను చక్కబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పుంగనూరు పోలీస్‌స్టేషన్ పుంగనూరులో పోలీసులందరూ బదిలీ ... పుంగనూరు పోలీస్‌స్టేషన్‌లో పని చేస్తున్న సీఐ శ్రీనివాసులు, హెడ్ కానిస్టేబుల్ సుబ్రమణ్యం హత్య కేసులో నిర్లక్ష్యం వహించారని సస్పెండ్ అయ్యారు. ఇక్కడ పని చేస్తున్న ఎస్ఐని అనంతపురానికి బదిలీ చేశారు. ఇక్కడ ఎస్ఐలు లేని కారణంగా ఆయనను కొనసాగిస్తున్నారు. కాగా ఎమ్మెల్యే అరిచారని స్థానిక పోలీస్ స్టేషన్లో ఒక ఏఎస్ఐని, ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లను కలిపి సుమారు 40 మంది పోలీసులను బదిలీ చేశారు. కాగా ఈ హత్య కేసులో వీరికి ఏమాత్రం సంబంధం లేకపోవడం గమనార్హం. మేమేమి తప్పుచేశాం... అర్ధాంతరంగా బదిలీ అయిన పోలీస్ కుటుంబాల్లో మేమేమి తప్పు చేశాం....మా భర్తలు ఏం తప్పు చేశారు... అర్ధాంతరంగా బదిలీలు చేస్తే మా పిల్లలు చదువులేంటి...మా కుటుంబంలోని వృద్ధులను ఎలా సంరక్షించాలి. ఉద్యోగులైన భార్యభర్తలకు కూడా అవకాశాలు కోల్పోయాం. తప్పు చేసిన వారితో పాటు మేము శిక్ష అనుభవించాలా అంటూ బదిలీ అయిన పోలీసు కుటుంబాల్లోని పలువురిలోనూ ఈ విధమైన ప్రశ్నలే వినపడుతున్నాయి. ఈ విషయమై జిల్లా ఎస్పీ మరోసారి పునరాలోచించాలి. -
ఘనంగా ‘ప్రపంచ సోషల్ వర్క్ డే’
తిరుపతి సిటీ : పద్మావతి మహిళా వర్సిటీ సోషల్ వర్క్ విభాగాధిపతి డాక్టర్ పి.తవితా తులసి ఆధ్వర్యంలో మంగళవారం ప్రపంచ సోషల్ వర్క్ డే ఘనంగా నిర్వహించారు. అకడమిక్ గాంధీయన్ స్టడీస్ ఈడీ గోపాల కృష్ణమూర్తి ముఖ్యఅతిథిగా విచ్చేసి శ్రీఇంటర్ జనరేషనల్ సోలిడారిటీ క్రియేటింగ్ ఏ వరల్డ్ ఆఫ్ ఈక్వాలిటీ, జస్టిస్ అండ్ హ్యూమన్ రైట్స్ ఫర్ ఆల్ఙ్ అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రగతి ఆర్గనైజేషన్ డైరెక్టర్ కేవీ రమణ, ఆంధ్ర బెస్ట్ విమెన్ అవార్డు గ్రహీత కమల, ప్రొఫెసర్ అనురాధ, డాక్టర్ లలిత కుమారి పాల్గొన్నారు. అలాగే ఎస్వీయూలో సోషల్ వర్క్‌డే నిర్వహించారు. ప్రిన్సిపల్ సుధారాణి, సెట్విన్ మేనేజర్ మోహన్, ప్రొఫెసర్ చంద్రశేఖరయ్య, డాక్టర్ రీనా, డాక్టర్ సునీల్, డాక్టర్ కోదండరెడ్డి పాల్గొన్నారు. -
మాతాశిశు సంరక్షణకు కృషి
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : మాతా శిశు సంరక్షణను పకడ్బందీగా నిర్వహించాలని డీఎంఅండ్‌హెచ్‌ఓ సుధారాణి ఆదేశించారు. చిత్తూరు నగరంలోని తన కార్యాలయంలో మంగళవారం ఆశా నోడల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. గర్భిణుల సేవలు పక్కాగా అమలు కావాలన్నారు. వైద్య సేవల్లో నిర్లక్ష్యం ఉండకూడదన్నారు. మాతా శిశు సంరక్షణకు కృషి చేయాలన్నారు. నిత్యం తల్లులతో పాటు పిల్లలను పర్యవేక్షణలో ఉంచాలన్నారు. క్రమం తప్పకుండా టీకాలు అందించాలన్నారు. ఎన్సీడీ సర్వేను వేగవంతం చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా క్షయ నివారణ అధికారి వెంకట ప్రసాద్, డీఐఓ హనుమంతరావు, అధికారులు అనూష, ప్రవీణ, రామ్మోహన్, మూర్తి పాల్గొన్నారు. రేపటి నుంచి వార్షిక తనిఖీ చిత్తూరు కార్పొరేషన్ : ట్రాన్స్‌కో పరిధిలోని డివిజన్ కార్యాలయాల నందు సాధారణ వార్షిక తనిఖీలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా 20న పుంగనూరు డివిజన్ కార్యాలయం, 21 చిత్తూరు అర్బన్ డివిజన్, 22న చిత్తూరు రూరల్ డివిజన్ కార్యాలయాల్లో తనిఖీలు ఉంటాయన్నారు. 25న ఎంఆర్టీ జిల్లా కార్యాలయంలో పరిశీలన నిర్వహించనున్నారు. ఎస్ఈ, టెక్నికల్ ఈఈ, పీఓ, ఏఓల బృందం ఫైల్స్, సబ్ స్టేషన్ల సరఫరా, ట్రిప్పింగ్ ఫైళ్లను పరిశీలించనున్నారు. పల్లెలపై నిఘా పెట్టాలి కుప్పం రూరల్ : అటవీ సిబ్బంది బాధ్యతతో పనిచేయాలని జిల్లా అటవీశాఖ అధికారిణి ఎస్.ధరణి ఆదేశించారు. మంగళవారం అట వీ సిబ్బంది యూనిఫామ్, షూ, బెల్టు, క్యాప్ లు, టార్చ్లైట్లు, అగ్ని నిరోధక పరికరాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏనుగులు అటవీ ప్రాంతాల్లోకి వచ్చినప్పుడు సున్నితంగా మెలగాలని సూచించా రు. ముందస్తు రైతులకు సమాచారం ఇచ్చి పొలాల వైపునకు రాకుండా నిత్యం నిఘా ఉంచాలన్నారు. వేసవిలో ఎక్కడా అడవిలో మంటలు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రేంజర్ జయశంకర్, సిబ్బంది ఉన్నారు. ఎస్పీఎంలో పోలీసుల విచారణ చిత్తూరు కార్పొరేషన్: ట్రాన్స్ఫార్మర్ కష్టాలు పేరిట సాక్షి పత్రికలో సోమవారం ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. మంగళవారం ఈ మేరకు ట్రాన్స్‌కో ఏపీటీఎస్ (యాంటీ పవ ర్ తెఫ్ట్ స్క్వాడ్) పోలీసులు విచారణ చేపట్టారు. చిత్తూరు లోని ఎస్పీఎం (ట్రాన్స్ఫార్మర్ల మర మ్మతు కేంద్రం)ను పరిశీలించారు. అనంతరం పలు అంశాలపై సంబంధిత అధికారులను ఆరా తీశారు. నూతన ఓఆర్‌ఎం (ఆయిల్ రీజనరేషన్ మిషన్) ఏర్పాటు చేసినప్పటికీ ఎందుకు ఇన్స్టాల్ చేయలేదు..? టెక్నీషియన్లు ఎందుకు రావడం లేదు...? వారంటీ గడువు ఎంత కాలం ఉంది..? వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు. వేసవి కాలంలో మిషన్ అందుబాటులో ఉంటే ఉపయోగాలు ఏంటీ..? ఎప్పుడు మిషన్‌ను ఇన్స్టాల్ చేసే అవకాశం ఉంది..?అనే విషయాలపై చర్చించారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం.జేసీకి సావనీరు అందజేత చిత్తూరు కలెక్టరేట్ : అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహస్థాపనను పురస్కరించుకుని ముద్రించిన పుస్తకం (సావనీరు)ను ఆ కమిటీ సభ్యులు జాయింట్ కలెక్టర్ విద్యాధరికి అందజేశారు. ఈ మేరకు మంగళవారం ఆ విగ్రహ కమిటీ సభ్యులు జేసీని మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం ఆ కమిటీ సభ్యులు చిత్తూరు నగరంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి అంశాలపై జేసీతో చర్చించారు. ఈ కార్యక్రమంలో విగ్రహస్థాపన కమిటీ సభ్యులు కట్టమంచి బాబీ, అమర్నాథ్, సహదేవ నాయుడు, అరుణకుమారి, రమేష్, శ్రీహరి పాల్గొన్నారు. -
● తెల్లబియ్యం.. సన్నబియ్యంగా రీసైక్లింగ్ ! ● రేషన్ మాఫియాగా కొందరు కూటమి నేతలు ● ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న వైనం ● ప్రతి నెలా రూ.లక్షల్లో దందా ● డీలర్ షాపుల నుంచే అక్రమాలు ఆరంభం ● 9 నెలల్లో 807.09 క్వింటాళ్ల బియ్యం పట్టివేత ● చోద్యం చూస్తున్న జిల్లా ప
కాణిపాకం : జిల్లాలో రేషన్ బియ్యం దందా యథేచ్ఛగా సాగుతోంది. కూటమి నేతలే అక్రమ వ్యాపారులుగా అవతారమెత్తి దందాను నడిపిస్తున్నారు. పేదలకు ఇచ్చే రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. కార్డుదారుల నుంచి ఈ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు తరలిస్తున్నారు. అక్కడ బియ్యం వ్యాపారులకు అధిక ధరకు విక్రయించి భారీగా లాభాలు ఆర్జిస్తున్నారు. పోలీసుల కంట్లో పడడంతో బియ్యం అక్రమ వ్యాపా రం బట్టబయలవుతోంది. 9 నెలల కాలంలో అక్రమంగా నిల్వలు, తరలిస్తున్న 807.9 క్వింటాళ్ల బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. పౌర సరఫరాల శాఖ అధికారులు మాత్రం అక్రమార్కులను పట్టుకోవడంలో వెనుకంజ వేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో పరిస్థితి.. జిల్లాలో 5.40 లక్షల మంది కార్డుదారులు ఉన్నారు. వీరికి ప్రతినెలా అందించేందుకు 15 వేల టన్నుల రేషన్ బియ్యాన్ని ప్రభుత్వం జిల్లాకు కేటాయిస్తోంది. అయితే, రేషన్ తీసుకుంటున్న వారిలో 50 శాతం మంది బియ్యాన్ని వినియోగించడం లేదు. వాటిని వ్యాపారులకు విక్రయిస్తున్నారు. చిరు వ్యాపారులు గ్రామాల్లో ఇంటింటా తిరుగుతూ పేదల నుంచి కిలో బియ్యాన్ని రూ.10 నుంచి రూ.17 వరకూ కొనుగోలు చేస్తున్నారు. వారు ఈ బియ్యాన్ని మిల్లర్లకు కేజీ రూ.20కు అమ్ముతున్నట్లు తెలుస్తోంది. మిల్లర్లు ఇచ్చిన సొమ్ముతోనే చిరు వ్యాపారులు గ్రామాల్లో తిరుగుతూ బియ్యం కొనుగోలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీని కోసం కిలోకు రూ.5 నుంచి రూ.10 వరకూ కమీషన్లలో మునిగి తేలుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ రేషన్ దందా జిల్లాలో పెచ్చుమీరింది. కూటమి నేతలు కొందరు పేదల బియ్యాన్ని అక్రమ వ్యాపారంగా మలుచుకున్నారు. డైరెక్టుగా డీలర్లతో డీల్ కుదుర్చుకుని కూటమి నేతలు అక్రమ వ్యాపారాన్ని దర్జాగా నడిపిస్తున్నారు. తమిళనాడు, కర్ణాటకకు తరలిస్తూ..లక్షల్లో ఆదాయం గడిస్తున్నారు. పోలీసులు పట్టుకుంటే.. పంచనామాకే పరిమితం 9 నెలల కాలంలో జిల్లా నలుమూల నుంచి భారీగా రేషన్ బియ్యం పట్టుకున్నారు. ఈ మధ్య కాలంలో 28 కేసులు నమోదు కాగా 807.91 క్వింటాళ్ల బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న బియ్యం తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు వెళుతున్న సమయంలో పోలీ సులు పట్టుకుంటున్నారు. లేకుంటే స్థానికుల సమాచారంతో భారీ నిల్వలను గుర్తించి కేసులు పెడుతున్నారు. పౌర సరఫరాల శాఖ అధికారులు ఈ వ్యవహారం తెలిసినా పట్టించుకోవడం లేదు. పోలీసులు పట్టుకున్నా కేసులు పెట్టేందుకు జంకుతున్నారు. కేవలం పంచనామా రాసి వెళ్లిపోతున్నారు. డీలర్ల నుంచే ఈ దందా నడుస్తున్నా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి రేషన్ మాఫియాపై కొరడా ఝలిపిస్తేతప్ప దందాకు అడ్డుకట్ట పడదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా సమాచారం కార్డుదారుల సంఖ్య: 5.40 లక్షలు బియ్యం సరఫరా ప్రతినెలా: 15 వేల టన్నులు కిలో బియ్యం బయట అమ్ముతున్న ధర: రూ. 10 నుంచి రూ.17 వరకు నెలనెలా అక్రమంగా వెళుతున్న బియ్యం: 5 వేల టన్నుల నుంచి 8 వేల టన్నుల వరకు మిగులు ఇలా.. కార్డుదారులకు రేషన్ ఇవ్వకుండా, డీలర్లే డబ్బులకు విక్రయించడం తూకంలో కోతలు, డబ్బాలు పెట్టి రేషన్ పంపిణీ ఇంటింటికీ వెళ్లి రేషన్ సేకరించడం పేదల కడుపు నింపాల్సిన రేషన్ బియ్యం కొందరి కూటమి నేతల జేబులు నింపుతున్నాయి. ఈ దందాకు కొంత మంది రేషన్ డీలర్లే లోపాయికారిగా సహకరిస్తుండడంతో రేషన్ దందా రాష్ట్రం సరిహద్దులు దాటిపోతున్నాయి.. ఈ బియ్యం సైక్లింగ్ అయి తిరిగీ సన్నబియ్యంగా మన మార్కెట్లోకి దూసుకొస్తున్నాయి. రేషన్ దందా ఇంత పెద్ద ఎత్తున సాగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలకు దారితీస్తోంది. ఇందులో ఎవరి వాటాలు వారికి ఉండడంతో రేషన్ దందా యథేచ్ఛగా సాగిపోతోందనే విమర్శలు గుప్పుమంటున్నాయి. రేషన్ పట్టుకున్న వివరాలు ఇలా నెల 6ఏ పట్టుబడ్డ బియ్యం కేసులు క్వింటాళ్లల్లో.. జూన్ 2024 1 6.16 ఆగష్టు 8 131.9 సెప్టెంబర్ 6 93.98 అక్టోబర్ 1 24.1 నవంబర్ 3 18.65 డిసెంబర్ 4 316.56 ఫిబ్రవరి–25 3 110.99 మార్చి–25 2 104.57 సరిహద్దు ప్రాంతాలే.. అక్రమ రేషన్ వ్యాపారానికి జిల్లాలోని పలమనేరు, చిత్తూరు, బంగారుపాళ్యం, యాదమరి, గుడిపాల, జీడీనెల్లూరు, ఎస్ఆర్పురం, కార్వేటినగరం, నగరి, పుంగనూరు, కుప్పం, శాంతిపురం ప్రాంతాలు కేంద్ర బిందువుగా మారాయి. ఇక్కడి నుంచి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు లారీలు, ఆటోల ద్వారా యథేచ్ఛగా సరిహద్దులు దాటుతున్నాయి. సన్నబియ్యంగా తిరిగీ మార్కెట్లోకి... రేషన్ బియ్యాన్ని రీ సైక్లింగ్ చేసి సన్న బియ్యంగా చూపుతున్నారు. తక్కువ ధరకు కొనుగోలు చేసే రేషన్న బియ్యాన్ని సోనా మసూరి వంటి బ్రాండెడ్ బియ్యంలో కలిపి విక్రయిస్తున్నారు. సన్నంగా మర పట్టడంతో వినియోగదారులు గుర్తించలేక మోసపోతున్నారు. అటు తూకం దగ్గర సైతం ఇదే పరిస్థితి. 25 కిలోలు ఉండే ప్యాకెట్లో ఉండేది 23 కిలోలే. రెండు కిలోలు తరుగును చూపిస్తుంటారు. ఇటు బియ్యం నకిలీతో పాటు తూకంలో సైతం వినియోగదారుడు నష్టపోవాల్సి వస్తోంది. ఇంత జరుగుతున్నా పౌర సరఫరాల శాఖ, తూనికలు కొలతలు శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఎవరు చేసినా వదిలిపెట్టం రేషన్ దందా ఎవరు చేసిన వదిలిపెట్టం. కచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటాం. డీలర్లు చేసినా కేసులు పెడుతాం. ఇప్పటికే చాలా కేసులు పెట్టాం. రేషన్ బియ్యంతో అక్ర మ వ్యాపారం చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలిపెట్టం. ఎక్కడైనా నిల్వలు ఉంటే చెప్పండి పట్టుకుంటాం. కేసులు పెడుతాం. – శంకరన్, డీఎస్ఓ, చిత్తూరు -
పారదర్శకంగా ఓటరు జాబితా
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో పారదర్శకంగా ఓటరు జాబితా రూపొందించేలా చర్యలు చేపడతున్నటుల డీఆర్ఓ మోహన్‌కుమార్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. డీఆర్ఓ మాట్లాడుతూ ఓటరు జాబితా కసరత్తుకు రాజకీయ పార్టీలు సహకరించాలన్నారు. ఈ క్రమంలోనే ఎపిక్ కార్డులను ఆధార్‌కు అనుసంధానం చేసే ప్రక్రియను వేగవంతంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి నిబంధనలు, చట్టాల్లో అవసరమైన మార్పు చేర్పులకు రాజకీయ పార్టీల నుంచి సూచనలు స్వీకరిస్తున్నామన్నారు. ఓటరు నమోదు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని చెప్పారు. అలాగే నోటీసు ఇచ్చిన తర్వాతే మృతి చెందిన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగిస్తామని స్పష్టం చేశారు. రెండు నియోజకవర్గాలలో ఓటు హక్కు కలిగి ఉన్నవారిని గుర్తించి, వెంటనే తొలగించాలని బీఎల్ఓలకు ఆదేశాలిచ్చినట్లు వివరించారు. పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. జిల్లాలో ఫారం 6,7,8 సంబంధించి 8,268 దరఖాస్తులు నమోదు కాగా 4,933 పరిష్కరించామని తెలిపారు. సమావేశంలో చిత్తూరు, పలమనేరు, నగరి, కుప్పం, ఆర్డీఓలు శ్రీనివాసులు, భవానీ, భవానీ శంకరి, శ్రీనివాసులు, ఎన్నికల సెక్షన్ సూపరింటెండెంట్ వాసుదేవన్, సిబ్బంది ఉమాపతి, మనోజ్, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఉదయ్, అట్లూరి శ్రీనివాసులు, సురేంద్ర, యశ్వంత్, సుబ్రమణ్యం, లోకనాథం, గంగరాజు పాల్గొన్నారు. -
రేడియోగ్రాఫర్ పోస్టుల దరఖాస్తుకు గడువు పెంపు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లా వైద్య విధాన పరిషత్‌లోని రేడియోగ్రాఫర్ పోస్టుల దరఖాస్తు గడువును పొడిగించినట్లు డీసీహెచ్ఎస్ ప్రభావతీదేవి తెలిపారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ ఈ మేరకు దరఖాస్తులను ఈనెల 24వతేది వరకు స్వీకరించనున్నటువెల్లడించారు. అయితే రికార్డ్ అసిస్టెంట్ పోస్టును జాబితా నుంచి తొలగించినట్లు వివరించారు. రీసర్వే పకడ్బందీగా చేయాలి పూతలపట్టు (కాణిపాకం) : రీసర్వేను పకడ్బందీగా చేపట్టాలని స్టేట్ నోడల్ ఆఫీసర్ గోవిందరావ్ ఆదేశించారు. పూతలపట్టు మండలం వడ్డెపల్లిలో పైలట్ ప్రాజెక్టు కింద జరుగుతున్న రీసర్వేను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. రీసర్వే జరుగుతున్న విధి విధానాలను అడిగి తెలుసుకున్నారు. రీసర్వే విషయాన్ని ముందుగానే భూయజమానులకు తెలియజేయాలన్నారు. రీసర్వేకు రాకుంటే నోటీసులు ఇవ్వాలని చెప్పారు. సర్వే పక్కాగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ఏడీ జయరాజు, రీ సర్వే డీటీ మునిక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు. -
వెదురు పెంపకంపై వర్క్‌షాప్
చిత్తూరు కలెక్టరేట్ : డీఆర్డీఏ కార్యాలయంలో సోమవారం చిత్తూరు, ప్రకాశం, తిరుపతి, అన్నమయ్య, నంద్యాల జిల్లాల ఏంపీఎలు, సీసీలతో వెదురు పెంపకంపై ఒక్క రోజు వర్క్‌షాపు నిర్వహించారు. డీఆర్డీఏ పీడీ శ్రీదేవి మాట్లాడుతూ వెదురు పెంపకంతో అనేక లాభాలున్నాయన్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం వెదురుకు మంచి డిమాండ్ ఉందని తెలిపారు. అతి తక్కువ ఖర్చుతో ఎలాంటి భూముల్లోనైనా వెదురు సాగు చేయవచ్చన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందవచ్చని వెల్లడించారు.సంఘాల్లోని మహిళా రైతులకు వెదురుపెంపకంపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రస్తుతం కనుమరుగవుతున్న వెదురును ప్రోత్సహించాలని సూచించారు. పోడు భూముల సైతం ఈ పంట సాగుచేయవచ్చని, తద్వారా ఏటా రూ.లక్ష వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉన్నట్లు వివరించారు. ఇందుకు ఇండస్ట్రీ ఫౌండేషన్ తరపున పూర్తి సాంకేతిక పరిజ్ఞానం అందజేస్తారని తెలిపారు. కార్యక్రమంలో సెర్ఫ్ జేఈ వెంకటరావు, ఇండస్ట్రీ ఫౌండేషన్ శాస్త్రవేత్తలు అశోక్, కుసుమ, అమృత, శ్రీకాంత్ పాల్గొన్నారు. పలువురు తహసీల్దార్ల నియమాకం చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని పలు మండలాలకు తహసీల్దార్లను నియమించారు. సోమవారం ఈ మేరకు ఇన్చార్జి కలెక్టర్ విద్యాధరి ఉత్తర్వులు జారీచేశారు. ఈ క్రమంలో ముగ్గురు తహసీల్దార్లను డిప్యూటేషన్ పద్ధతిలో, నలుగురు డీటీలకు తహసీల్దార్లుగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. అందులో భాగంగా రామకుప్పం తహసీల్దార్ బాబును వెదురుకుప్పానికి, విజయపురం తహసీల్దార్ మాధవరాజును గంగవరానికి, పూతలపట్టు తహసీల్దార్ గుర్రప్పను కలెక్టరేట్‌కు బదిలీ చేశారు. శాంతిపురం డీటీ కౌలేష్కు రామకుప్పం తహసీల్దార్‌గా, వెదురుకుప్పం డీటీ రమేష్‌బాబుకు పూతలపట్టు, జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయం డీటీ శ్యాంప్రసాద్‌రెడ్డికి బైరెడ్డిపల్లె, కుప్పం ఆర్డీఓ కార్యాలయ డీటీ ప్రసన్నకుమార్‌కు శాంతిపురం తహసీల్దార్‌గా బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పోలీసు గ్రీవెన్స్‌కు 57 ఫిర్యాదులు చిత్తూరు అర్బన్: జిల్లా ఆర్ముడు రిజర్వు (ఏఆర్) కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కారం వేదికకు 57 ఫిర్యాదులు అందాయి. ఏఎస్పీ రాజశేఖర్‌రాజు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అర్జీలను క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మాట్లాడుతున్న డీఆర్డీఏ పీడీ శ్రీదేవి -
ప్రశాంతంగా ‘పది’ పరీక్షలు ప్రారంభం
● తొలిరోజు 856 మంది గైర్హాజరు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా సోమవారం పదోతరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొత్తం 118 కేంద్రాల్లో తొలిరోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు తెలుగు పరీక్ష నిర్వహించారు. విద్యార్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను లోపలికి తీసుకెళ్లకుండా క్షుణ్ణంగా తనిఖీలు చేసి కేంద్రాల్లోకి అనుమతించారు. మొదటి పరీక్షకు మొత్తం 20,746 మంది విద్యార్థులకు గాను 19,890 మంది హాజరైనట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. 856 మంది గైర్హాజరైనట్లు వివరించారు. ఈ క్రమంలోనే పలు పరీక్ష కేంద్రాలను ఇన్చార్జి కలెక్టర్ విద్యాధరి, డీఈఓ తనిఖీ చేశారు. అమలు కాని నిబంధనలు నిబంధనల ప్రకారం పరీక్ష కేంద్రానికి 100 మీటర్ల దూరంలో ఉన్న జిరాక్స్,నెట్ సెంటర్లను పరీక్ష పూర్తయ్యే వరకు మూసివేయాల్సి ఉంటుంది. అయితే చిత్తూరులోని గిరింపేట నగరపాలక ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రానికి సమీపంలో జిరాక్స్ సెంటర్తెరిచే ఉంచారు. ఇదే విధంగా జిల్లాలోని పలమనేరు, కుప్పం, నగరి, పూతలపట్టు, పుంగనూరులెఓ పలు జిరాక్సు సెంటర్లు మూత పడలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
● తూతూమంత్రంగా ప్రజాసమస్యల పరిష్కార వేదిక ● వివిధ సమస్యలపై వెల్లువెత్తుతున్న అర్జీలు ● క్షేత్రస్థాయిలో పట్టించుకోని అధికారులు ● మాయమాటలతో ఎండార్స్‌మెంట్‌పై సంతకాలు ● చిత్తశుద్ధి లేని ప్రభుత్వ వైఖరిపై మండిపడుతున్న జిల్లా వాసులు ● సాక్షి విజిట్‌లో వెల్లడైన
గత పది నెలలుగా కలెక్టరేట్‌కు వచ్చిన అర్జీల వివరాలు రెవెన్యూ: 22,470 సర్వే శాఖ: 15,977 పోలీస్: 2,118 హౌసింగ్: 756 మున్సిపల్: 558 సివిల్ సప్లయిస్: 524 పీఆర్ ఇంజినీరింగ్: 441 పంచాయతీరాజ్: 399 సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ: 372 ఎస్పీడీసీఎల్: 334 పశుసంవర్థకశాఖ: 296 ఆర్డబ్ల్యూఎస్: 231 దేవదాయశాఖ: 171 గ్రామీణాభివృద్ధి: 126 పబ్లిక్ హెల్త్: 125 వాటర్ రీసోర్స్: 122 సోషల్ వెల్ఫేర్: 113 ఇతర శాఖలు: 677 మొత్తం: 45,810పొలం బాట కబ్జా చేశారు.. న్యాయం చేయండి. బతకడమ కష్టంగా ఉంది.. పింఛన్ ఇప్పించండి. దాహార్తితో అలమటిస్తున్నాం.. నీరు అందించండి. పంట కాలువను పూడ్చేశారు.. చర్యలు తీసుకోండి. శ్మశానం అధ్వాన్నంగా ఉంది.. కనీస సౌకర్యాలు కల్పించండి. కనిపెంచిన బిడ్డలు తరిమేశారు.. ఆదుకోండి. ఇలా ప్రజలకు ఏ సమస్య వచ్చినా అధికారు ల వైపే చూస్తుంటారు. ఒక్క అర్జీ ఇస్తే తమ కష్టం తీరిపోతుందని నమ్ముతుంటారు. అయి తే క్షేత్రస్థాయిలో జనం ఆశలు నెరవేరడం లేదు. మండలస్థాయిలో పట్టించుకోవడం లేదు. కలెక్టరేట్‌కు వెళ్లినా ఫలితం కనిపించడం లేదు. ఈ క్రమంలోనే ప్రతి సోమవారం నిర్వ హించే ప్రజాసమస్యల పరిష్కార వేదిక ప్రహ సనంగా మారిపోయింది. బాధితులు అందించే వినతులకు అతీగతీ లేకుండా పోతోంది. చిత్తూరు కలెక్టరేట్ : కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు మొత్తం 45,810 అర్జీలు వచ్చాయి. ఇందులో 32,900 పరిష్కరించినట్లు అధికారిక నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు మాత్రం వినతులు పెరుగుతూనే ఉన్నాయి. క్షేత్రస్థాయిలో తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల అధికారులు తూతూమంత్రంగా ప్రజల అర్జీలకు సమాధానం ఇస్తున్నారని తెలిసింది. ఈ విషయాన్ని సోమవారం కలెక్టరేట్‌కు విచ్చేసిన పలువురు అర్జీదారులే వెల్లడించారు. మండల స్థాయి అధికారులు ఏ మాత్రం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో దూరాభారం అయినా ప్రతి సోమవారం చిత్తూరుకు వస్తున్నట్లు వాపోతున్నారు. ఒక్కొక్కరిది..ఒక్కో ఆవేదన జిల్లా కేంద్రంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు పలు ప్రాంతాల నుంచి ప్రజలు వందల సంఖ్యలో విచ్చేస్తున్నారు. ప్రతి వారం వచ్చిన వారే మళ్లీ వస్తున్నారు. సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఆదేశిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అధికారులు పట్టించుకోవడం లేదు. గ్రీవెన్స్‌లో సమస్యలు వెల్లడిస్తున్న వారిలో ఒక్కొక్కరిది...ఒక్కొక్క ఆవేదన. అధికారులు కరుణించపోవడంతో చేసేదేమి లేక ప్రజలు వినతులను పలుమార్లు ఇస్తూనే ఉన్నారు. ఏమార్చి సంతకం చేయించుకుని.. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చేచ ప్రతి అర్జీని అధికారులు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. వీటిని పరిష్కరించేందుకు ఒక్కొక్క సమస్యను బట్టి నిర్ణీత గడువు ఉంటుంది. ఆ లోపు సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్లి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాల్సి ఉంటుంది. అయితే అధికారులు అలా చేయకుండా అర్జీదారులను ఏమారుస్తున్నారు. పరిష్కార తేదీ సమీపంలో వారిని కార్యాలయాల వద్దకు పిలిపించి మాయమాటలు చెప్పి సంతకాలు చేయించుకుంటున్నారు. తర్వాత అర్జీ పరిష్కరించినట్లు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. కూటమి టీడీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈతతంగమే సాగుతోంది. ఏదీ పరిష్కారం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత పది నెలల్లో ఇప్పటి వరకు 32,824 పరిష్కరించామని కలెక్టరేట్ అధికారులు గొప్పలు చెప్పుకుంటున్నారు. మిగిలిన 12,880 అర్జీలు మాత్రమే పెండింగ్‌లో ఉన్నట్లువ వెల్లడిస్తున్నారు. అయితే ఇవన్నీ తప్పుడు లెక్కలే అని క్షేత్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. సౌకర్యాలు కల్పించాలి మాది కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం పీఎంకే తాండా. మా కాలనీలో 1,200 మంది నివాసముంటున్నాం. మా కాలనీకి సమీపంలో ఉన్న శ్మశానంలో మౌలిక వసతులు లేవు. ఎవరైనా మృతి చెందితే శ్మశానానికి వెళ్లాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ మేరకు మౌలిక వసతులు కల్పించాలని చాలా సార్లు వినతులిచ్చాం. ఎవరూ పట్టించుకోవడం లేదు. – ధనపాల్ నాయక్, మూర్తి నాయక్, పీఎంకే తాండా వాసులుశ్మశాన స్థలంలో బోరు వేస్తున్నారు మాది కార్వేటి నగరం మండలం కేశవకుప్పం ఎస్టీ కాలనీ. సర్వే నంబర్ 18లో శ్మశానవాటికకు ఎకరా భూమిని ప్రభుత్వం మంజూరు చేసింది. ఆ శ్మశాశాన్ని ఎస్టీ కాలనీ వాసులు ఉపయోగించుకుంటున్నారు. అయితే ఇటీవల ఓ వ్యక్తి అక్రమంగా ఈ స్థంలో బోరు వేసుకుంటున్నాడు. దీంతో అధికారులను ఆశ్రయించాం. శ్మశానానికి హద్దులు గుర్తించి ప్రహరీగోడ, సీసీ రోడ్డు వేయించాలని కోరాం. న్యాయం జరుగుతుందో లేదో చూడాలి. – వెంకటరామయ్య, జయరామయ్య, కేశవకుప్పం గ్రామస్తులుభూమిని ఆక్రమించుకుంటున్నారయ్యా! మాది యాదమరి మండలం కృష్ణపల్లె. మా గ్రామంలో నివాసముండేందుకు గాను కాస్త భూమి నా పేరుతో ఉంది. నేను వృద్ధాప్యంలో ఉండడంతో ఆ భూమిని మరొకరు ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అడిగినందుకు బెదిరిస్తున్నారు. మా మండల తహసీల్దార్ కు సమస్య చెప్పినప్పటికీ న్యాయం చేయలేదు. కలెక్టర్‌కు సమస్య చెప్పుకుంటే న్యాయం జరుగుతుందని ఇంత దూరం వచ్చా. – కస్తూరి, వృద్ధురాలు, యాదమరి మండలం. -
భవిత భారం..‘శిక్షణ’ దూరం
చిత్తూరులో డీఎస్సీ అభ్యర్థులకు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని పలువురు డీఎస్సీ అభ్యర్థులు డిమాండ్ చేశారు.మంగళవారం శ్రీ 18 శ్రీ మార్చి శ్రీ 2025● పశువుల దాహార్తిని తీర్చే గొల్లయాదవ కుంటకు వెళ్లే దారి సమస్యపరిష్కరించాలని ఐరాల మండలం పుల్లూరు గ్రామస్తులు విన్నవించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఇన్చార్జి కలెక్టర్ విద్యాధరికి అర్జీ అందించారు. గొల్లయాదవ కుంటకు సమీపంలోని డీకేటీ భూమిని కొనుగోలు చేసిన ఓ వ్యక్తి ఇప్పుడు తమకు దారి లేకుండా చేసి ఇబ్బందులు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై పలుమార్లు తహసీల్దార్‌కు వినతులు సమర్పించిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ● వెదురుకుప్పం మండలం మారేపల్లె దళితవాడకు చెందిన రైతు సింగారయ్య సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్‌లో తన సమస్యను మొరపెట్టుకున్నాడు. తనకున్న కొద్దిపాటి భూమిలో వరి నాటుకుంటే, అగ్రకులానికి చెందిన ఓ వ్యక్తి స్వార్థంతో తమకు వచ్చే నీటి కాలువను దౌర్జన్యంగా పూడ్చి వేసి ఇబ్బందిపెడుతున్నాడని పేర్కొన్నాడు. దీంతో నీరు అందక పంట ఎండిపోతోందని, ఈ విషయంపై తహసీల్దార్‌కు పలుమార్లు విన్నవించుకున్నా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయాడు.– 8లో– 8లోన్యూస్రీల్ -
శాస్త్రోక్తం..‘చతుర్థి’వ్రతం
కాణిపాకం: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సోమవారం శాస్త్రోక్తంగా సంకటహర చతుర్థి వ్రతం నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్ధి, బుద్ధి సమేత గణపతి ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఆస్థాన మండపంలో కొలువుదీర్చారు. ఉదయం 10 నుంచి 11 గంటలు, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు వ్రతం జరిపించారు. పెద్దసంఖ్యలో భక్తులు వ్రతం ఆచరించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ క్రమంలోనే రాత్రి వినాయక స్వామివారు స్వర్ణరథం అధిరోహించి మాడవీధుల్లో విహరించారు. భక్తులు కర్పూరహారతులు సమర్పించారు. కార్యక్రమంలో ఈఓ పెంచల కిషోర్ పాల్గొన్నారు. ఉద్యోగం పేరుతో టోకరా పలమనేరు : తమ కుమారుడికి సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇప్పిస్తానంటూ పలమనేరుకు చెందిన ఎంఎస్ రంజిత్ అనే వ్యక్తి రూ.25లక్షలకు టోకరా వేశాడని స్థానిక సాయినగర్‌కు చెందిన విశ్వనాథ్, ప్రభావతి దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఈ మేరు చిత్తూరులో ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. తమ కుమారుడు రాజేష్‌కు బెంగళూరులో భారీ ప్యాకేజీతో ఉద్యోగం ఇప్తిస్తాని రంజిత్ తమ వద్ద రెండు, మూడు విడతలు డబ్బులు తీసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉద్యోగం ఇప్పించకపోగా, తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వడం లేదని వాపోయారు. దీనిపై స్థానిక పోలీసుల ఆశ్రయించినా ప్రయోజనం లేకుండా పోవడంతో ఎస్పీకి విన్నవించినట్లు వెల్లడించారు. ప్రత్యేక నైపుణ్యమే లక్ష్యం తిరుపతి అర్బన్: ప్రత్యేక నైపుణ్యం సాధించడానికి ప్రభుత్వ ఉద్యోగులకు కోర్సులను ఏర్పాటు చేస్తున్నట్లు డీఆర్వో నరసింహులు తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఉద్యోగులకు శిక్షణ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల నైపుణ్యంతో సుపరిపాలన పెంపొందించే దిశగా కోర్సులు ఉంటాయని చెప్పారు. ఐ గాట్ కర్మయోగి పోర్టల్ యాప్ ద్వారా రాష్ట ప్రభుత్వం మూడు రకాల కోర్సులను ప్రవేశపెట్టినట్టు వెల్లడించారు. జిల్లాలో డీడీఓలు అందరూ ఈ యాప్ గురించి అవగాహన చేసుకోవాలని చెప్పారు. ఈ కోర్సులను మార్చి 20వ తేదీ లోపు పూర్తి చేయాలని సూచించారు. లాగిన్ కు సంబంధించిన సమస్యలు తలెత్తితే 9652171785, 9063494729 నంబనర్లలో సంప్రదించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ ట్రైనింగ్ అధికారి వెంకటేష్ , సీపీఓ ప్రేమ్‌చంద్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి విక్రమ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. -
విద్యార్థుల ఆకలి కేకలు
● పది పరీక్ష కేంద్రాల బడుల్లో ఇబ్బందులు ● పట్టించుకోని విద్యాశాఖ అధికారులు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లావ్యాప్తంగా పది పరీక్ష కేంద్రాలున్న ప్రభుత్వ పాఠశాలల్లో సోమవారం విద్యార్థులు ఆకలి కేకలు పెట్టాల్సి వచ్చింది. జిల్లాలోని 70 సర్కారు బడుల్లో పరీక్ష కేంద్రాలను ఎర్పాటు చేశారు. ఆయా బడుల్లో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు తరగతులు నిర్వహించాల్సి ఉంది. విద్యార్థులకు మధ్యాహ్నభోజనం పెట్టాలంటే ఉదయం నుంచి కార్మికులు బడుల్లోనే వంట చేయాల్సి వస్తుంది. అయితే పరీక్షలు నిర్వహిస్తున్న కేంద్రాల్లో పోలీసులు వంట మనుషులను లోనికి అనుమతించని పరిస్థితి ఏర్పడింది. దీంతో జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్నం పాఠశాలలకు వచ్చే విద్యార్థుల కోసం భోజనం ఎక్కడ వండాలో తెలియని దుస్థితి దాపురించింది. ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో క్షేత్రస్థాయి అధికారులకు జిల్లా విద్యాశాఖ నుంచి ఆదేశాలు వచ్చాయి. సమీపంలోని ప్రాథమిక పాఠశాల, వసతి గృహాలుంటే అక్కడ మధ్యాహ్నభోజనం తయారు చేయించాలని సూచించారు. దీంతో అప్పటికప్పుడు ప్రాథమిక పాఠశాలలు, వసతి గృహాల్లో వంట చేసుకుని ఆటోల్లో పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు వడ్డించాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే పలువురు విద్యార్థులకు ఆహారం అందక పస్తులుండాల్సి పరిస్థితి తలెత్తింది. దీంతో విద్యాశాఖ అధికారులపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఆశలు ఆవిరి!
● ద్రవిడ వర్సిటీలో ఔట్సోర్సింగ్ సిబ్బంది వేతన వెతలు ● ఏడాది నుంచి జీతాలు అందక అవస్థలు ● ఫైనాన్స్ అప్రూవల్ ఇవ్వలేమని చేతులెత్తేసిన ప్రభుత్వం ● సమ్మెకు సన్నద్ధమవుతున్న ఉద్యోగులు కుప్పం : ద్రవిడ విశ్వవిద్యాలయంలో సుమారు 15 ఏళ్ల నుంచి ఔట్సోర్సింగ్ విధానంలో 206 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి ఏడాది నుంచి జీతాలు రావడం లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కుప్పం పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంపై భరోసా ఇచ్చారు. వెంటనే జీతాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. తర్వాత ఆరునెలల వేతనాలు మాత్రం అందించారు. తర్వాత నుంచి వేతనాల ఊసే వదిలేశారు. ఇక అప్పటి నుంచి ఔట్సోర్సింగ్ సిబ్బంది నానా అవస్థలు పడుతున్నారు. కుటుంబపోషణకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భూములిచ్చినవారే అధికం ద్రవిడ వర్సిటీ అభివృద్ధికి భూములు త్యాగం చేసిన రైతుల కుటుంబాల్లోనే పలువురికి ఔట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు ఇచ్చారు. అది కూడా అటెండర్లు, స్వీపర్లు వంటి చిరుద్యోగులుగానే పనిచేస్తున్నారు. వీరు మొదట్లో 250 మందికి పైగా ఉండేవారు. ప్రస్తుతం 206 మంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. జీతాలు ఇవ్వలేం..! ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని ద్రవిడ వర్సిటీ అధికారులు ప్రభుత్వానికి విన్నవించారు. ఈ మేరకు ఫైనాన్స్ అప్రూవల్ మంజూరు చేయాలంటూ కోరారు. దీనికి సంబంధించిన ఫైళ్లను ప్రభుత్వం సోమవారం తిరస్కరించినట్లు తెలిసింది. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వర్సిటీనే జీతాలు చెల్లించుకోవాలని తేల్చిచెప్పినట్లు సమాచారం. రిజిస్ట్రార్ దీంతో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నాయకులను పిలిపించి విషయం వివరించారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వంపై పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయంటూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ద్రవిడ వర్సిటీనే నమ్ముకుని చాలీచాలని జీతాలతో బతుకుతున్నామని, ప్రస్తుతం అది కూడా అందకపోవడంతో ఆత్మహత్యలే శరణ్యంగా మారుతోందని వాపోతున్నారు. మోగనున్న సమ్మె సైరన్? జీతాలు ఇవ్వలేమని ప్రభుత్వం తేల్చిచెప్పిన నేపథ్యంలో ఉద్యోగులు సమ్మెకు సైరన్ మోగించనున్నట్లు సమాచారం. ఈ మేరకు వర్సిటీలో నాన్‌టీచింగ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు బుధవారం సమావేశమై సమ్మైపె చర్చించనున్నట్లు తెలిసింది. -
ప్రవేశాలను పెంచడం చేతగాకే...
ప్రవేశాలను పెంచుకోవడం చేతగాకనే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. ఎమ్మెస్సీ ఎలక్ట్రానిక్స్, తమిళ్, ఉమెన్ స్టడీస్ వంటి కోర్సులకు చరమగీతం పాడుతూ మరిన్ని కోర్సులను మెడ్జ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే జరిగితే విద్యార్థి సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏడీ బిల్డింగ్‌ను ముట్టడిస్తాం. – ఎస్.చిన్న, ఏఐఎస్ఏ జిల్లా కార్యదర్శి, తిరుపతి స్వతహాగా పీజీసెట్ బెటర్ వర్సిటీ అభివృద్ధి పథంలో నడవాలంటే కోర్సులను తొలగించడం కాదు. ప్రవేశాలను ప్రొత్సహించి, స్కిల్ డెవలప్మెంట్పై శిక్షణ ఇవ్వాలి. ఉపాధి, ఉద్యోగావకాశాలను పెంచే ప్రయత్నం జరగాలి. కామన్ పీజీసెట్‌ను రద్దు చేసి, వర్సిటీ స్వతహాగా పీజీసెట్ నిర్వహిస్తే అడ్మిషన్లు పెరుగుతాయి. – భగవత్ రవి, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, తిరుపతి -
‘కాసు’క్కూర్చున్న ఖాకీ!
● పోలీస్‌స్టేషన్‌లోనే యథేచ్ఛగా లావాదేవీలు ● ధనార్జనే ధ్యేయంగా విధులు ● ఆఖరుకు దొంగల నుంచి కూడా రూ.లక్షలు వసూలు ● చిత్తూరులో వివాదాస్పదంగా ఓ పోలీస్ అధికారి తీరు చిత్తూరు అర్బన్ : పోలీస్ వృత్తి నిబద్ధతతో కూడుకుంది. శాంతిభద్రతల రక్షణతో ముడిపడింది. ప్రజలు ప్రశాంతంగా జీవనం సాగించేలా భరోసా కల్పిస్తుంది. అలాంది ఉన్నతమైన శాఖలో పనిచేస్తున్న ఓ ఖాకీ తీరు ప్రతిష్టాత్మక వ్యవస్థ పరువును మంటగలుపుతోంది. రక్షకభటులకు ఆలయంతో సమానమైన స్టేషన్‌ను అవినీతి కార్యకలాపాలకు అడ్డాగా మార్చేయడం విమర్శలకు తావిస్తోంది. ఘనత వహించిన సదరు పోలీసు అధికారి అవినీతి చిట్టా నుంచి ఒక్కొక్కటి బయటకు రావడం జిల్లా పోలీస్‌శాఖను కుదిపేస్తోంది. ఘనత వహించిన అధికారి పద్దులో నుంచి మచ్చుకు కొన్ని.. ● ఎవరైనా బంగారు ఆభరణాలు పోగొట్టుకున్నామని స్టేషన్‌కు వెళితే, లాఠీ ఎత్తుకుని మరీ తరుముకుంటున్నాడు. శ్రీఏయ్, ఆ కథలన్నీ నాకు చెప్పొద్దు. ఎక్కడో పోగొట్టుకుని నా స్టేషన్‌కు వస్తావా? పో బయటికిశ్రీ అంటూ వెంటపడే ఆ అధికారి.. బెంగళూరులోని ఓ ప్రముఖ వ్యక్తి ఇంట్లో పోగొట్టుకున్న నగల ఘటనపై చిత్తూరులో కేసు నమోదు చేయడం విడ్డూరమే మరి. ● నాలుగు నెలల క్రితం చిత్తూరు నగరంలోని ఓ స్థలానికి సంబంధించిన సివిల్ గొడవల్లో కూటమి పార్టీకి చెందిన ఓ నేత, అదే పార్టీ సానుభూతిపరుడైన మరో చోటా నేత రోడ్డెక్కి శాంతి భద్రతలకు విఘాతం కలిగించారు. అప్పటికే చోటా నేత నుంచి రూ.5 లక్షలు తీసుకున్న ఆ అధికారి.. కనీసం కేసు కూడా నమోదు చేయలేదనే ఆరోపణలున్నాయి. ● ఓ ఇంట్లో తాపీ పనికివచ్చిన వ్యక్తి ఇటీవల పనిచేస్తూ మిద్దైపెనుంచి పడి మృతి చెందాడు. వాస్తవానికి ఈ ఘటనపై ఇంటి యజమానిని పిలిపించి..ఆ మరణానికి నువ్వే కారణం, నీపై కేసు నమోదుస్తున్నా.. అని చెప్పి, తర్వాత 195 సెక్షన్ కింద కేసు మార్చేశారని స్టేషన్ సిబ్బందే బహిరంగంగా చెప్పుకుంటున్నారు. దీనికి ప్రతిఫలంగా రూ.3 లక్షలు ఇంటి యజ మాని నుంచి ఆ ఖాకీ నొక్కేసినట్లు చెబుతున్నారు. ● ఫిబ్రవరి ఓరోజు రాత్రి తప్పతాగిన సంపన్న కుటుంబానికి చెందిన ఓ యువకుడు కారు నడుపుతూ, వేరే కారులో ముందు వెళుతున్నవాళ్లను భయబ్రాంతులకు గురిచేశాడు. నడిరోడ్డుపై అవతలివాళ్ల కారు అడ్డగించి, అందర్నీ కిందకు దించి కారును తనిఖీ చేశాడు. ప్రాణభయంతో స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు ఇస్తే డ్రంక్ డ్రైవ్ కింద ఫైన్ కట్టించి నిందితుడిని వదిలేశాడు. ప్రతిఫలంగా ఆ సంపన్న యువకుడి నుంచి రూ.1.50 లక్షల లంచం తీసుకున్నాడనే ఆరోపణలూ గుప్పుమన్నాయి. ● ఇక పలువురు మద్యం దుకాణాల యజమానులను స్టేషన్‌కు పిలిపించి నెలసరి మామూళ్లు డిమాండ్ చేయ డం ఆయనకే చెల్లు. అక్రమంగా ఇసుక తరలింపు, పర్మిట్‌లేని గ్రానైట్ లారీలు, క్రికెట్ బెట్టింగులు నిర్వహించే వారి నుంచి నెలసరి భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడతున్నట్టు స్టేషన్ మొత్తం కోడై కూస్తోంది. ● ఇటీవల రాయచోటిలో పట్టుబడ్డ ఓ దొంగ.. శ్రీసార్, చిత్తూరులోని ఓ పోలీస్ అధికారికి రూ.12.5లక్షలు లంచంగా ఇచ్చా. మీకు ఎంత కావాలి..?శ్రీ అంటూ సవాల్ విసిరాడు. చోరీ కేసులో దొంగతో చేతులుకలిపిన సదరు ఖాకీ, భారీగా సొమ్ములు బొక్కేసినట్లు చెప్పుకుంటున్నారు. స్టేషన్లో పనిచేసే ముగ్గురు కానిస్టేబుళ్లు జరిగింది వాస్తవమంటూ ఓ అధికారి ఎదుట అంగీకరించడంతో.. వారిపై బెదిరింపులకు దిగినట్లు విమర్శలున్నాయి. ● ఇన్ని ఆరోపణలున్నా.. ఆ అధికారి చెప్పే ఫైనల్ మాట... శ్రీబాసుశ్రీ నన్ను డైరెక్ట్‌గా తెచ్చుకున్నాడు. ఆయన వద్దకు వెళితే నాకిచ్చే మర్యాదే వేరు. ఈ మధ్య ఉన్నతాధికారి చేసిన ఓ పనికిమాలిన పనికి బాస్ ఫైర్ అయ్యాడు. నేనువెళ్లి నచ్చచెప్పాకా వదిలేశాడు. లేదంటే ఆ అధికారి అవుట్.. ఎవ్వడూ నన్నేం చేయలేడు..శ్రీశ్రీ అని చెప్పడం ఆయనకే చెల్లు. -
భవిత భారం.. ‘శిక్షణ’ దూరం
చిత్తూరు కలెక్టరేట్ : మెగా డీఎస్సీ నిర్వహణపై ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని, దీంతో తమ భవిష్యత్ భారంగా మారిందని డీఎస్సీ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఈ మేరకు కలెక్టరేట్ ఎదుట డీఎస్సీ అభ్యర్థులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలమనేరుకు చెందిన మునికుమార్ మాట్లాడుతూ ప్రతి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ప్రత్యేకంగా డీఎస్సీ ఉచిత శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామన్న హామీని తుంగలో తొక్కేశారని మండిపడ్డారు. రాయలసీమకు సంబంధించి అనంతపురం ఒక్కచోటే కోచింగ్ సెంటర్ పెట్టడం దారుణమన్నారు. అంత దూరం వెళ్లి శిక్షణ పొందాలంటే కష్టతరంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ మేరకు చిత్తూరులోనే శిక్షణ ఇప్పించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయకపోవడం అన్యాయమన్నారు. అనంతరం ఇన్చార్జి కలెక్టర్ విద్యాధరికి వినతిపత్రం సమర్పించారు. ఈ క్రమంలోనే ధర్నా నిర్వహిస్తున్న డీఎస్సీ అభ్యర్థులకు సీపీఐ జిల్లా కార్యదర్శి నాగరాజు మద్దతు పలికారు. దూర ప్రాంతాల్లో శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తే మహిళా అభ్యర్థుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కోచింగ్ కేంద్రాల ఎంపికలో అధికారులు పారదర్శక పాటించలేదని, ముడుపు ఇచ్చిన వారికే సెంటర్లు కట్టబెట్టారని ఆరోపించారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి చిత్తూరుకు శిక్షణ కేంద్రం మంజూరు చేయకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కలెక్టరేట్ ఎదుట డీఎస్సీ అభ్యర్థుల ధర్నా చిత్తూరులో కోచింగ్ సెంటర్ ఏర్పాటుకు డిమాండ్ -
బెల్లం ఊట ధ్వంసం
పాలసముద్రం : మండలంలోని నరసింహపురంలో సారా బట్టీలపై కార్వేటినగరం ఎకై ్సజ్ సీఐ శిరీషాదేవి, పాలసముద్రం ఎస్ఐ చిన్నరెడ్డిప్ప తమ సిబ్బందితో కలసి సోమవారం దాడులు చేశారు. సుమారు వెయ్యిలీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారు. సీఐ మాట్లాడుతూ సారా తయారు చేసినా, విక్రయించినా కేసులు తప్పవని హెచ్చరించారు. కలెక్టరేట్ గ్రీవెన్స్‌కు 279 వినతులు చిత్తూరు కలెక్టరేట్ : కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ మేరకు ఇన్చార్జి కలెక్టర్ విద్యాధరి అర్జీలు స్వీకరించారు. డీఆర్ఓ మోహన్‌కుమార్, ఆర్డీఓ శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రవికుమార్‌నాయుడు పాల్గొన్నారు. ఈ క్రమంలో కలెక్టరేట్ గ్రీవెన్స్‌కు వివిధ సమస్యలపై మొత్తం 279 వినతులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. -
పేట్రేగుతున్న ‘పచ్చ’ మాఫియా!
● ఇసుక, గ్రావెల్‌ను అడ్డదిడ్డంగా తోడేస్తున్న వైనం ● సరిహద్దు రాష్ట్రాలకు యథేచ్ఛగా తరలింపు ● రూ. లక్షలు స్వాహా చేస్తున్న కూటమి నేతలు కార్వేటినగరం : సమయం లేదు మిత్రమా.. అందిన కాడికి దోచేద్దాం.. ఎవరైనా అడ్డొస్తే అంతు చూస్తాం. మాట వినకపోతే ఏ అధికారినైనా వదిలి పెట్టే ప్రసక్తే లేదు. అక్రమాలను అడ్డుకుంటున్న అధికారులపై కూటమి నాయకుల బెదిరింపులు, దాడులతో హడలిపోతున్నారు. కూటమి ప్రభుత్వంలో చోటా నాయకుల నుంచి ప్రజా ప్రతినిధుల వరకూ అక్రమాలు, దందాలు, దోపిడీలు రోజురోజుకూ పేట్రేగిపోతున్నాయి. చిత్తూరు జిల్లాలో కూటమి నాయకులు చేస్తున్న దందాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. కొంత మంది ఎమ్మెల్యేల కనుసన్నల్లో ఇసుక, మట్టిని విచ్చల విడిగా తోడేస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల అండదండలతో రూ. కోట్లు ఆర్జిస్తున్నారు. పట్టగపలే యథేచ్ఛగా గ్రావెల్‌తో పాటు ఇసుకను తోడి రవాణా చేస్తున్నా అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు. వందల సంఖ్యలో ట్రాక్టర్లు, టిప్పర్లతో ఒక పక్క ఇసుక మరోపక్క గ్రావెల్‌ను తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు తరలించి రూ.కోట్లు దండుకుంటున్నారు. అక్రమార్కుల అడ్డాగా జీడీ నెల్లూరు గంగాధర నెల్లూరులోని ఆరు మండలాల్లోనూ కూటమి నేతలు మట్టి, ఇసుక దోపిడీ చేస్తూ రూ.కోట్లు గడిస్తున్నారన్నది బహిరంగ రహస్యం. తమిళనాడుకు సరిహద్దు ప్రాంతమైన గంగాధర నెల్లూరు పచ్చ మాఫియాకు అడ్డాగా మారింది. ప్రధానంగా పాలసముద్రం, గంగాధర నెల్లూరు, శ్రీరంగరాజపురం, కార్వేటినగరం మండలాల్లో నిత్యం ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా గ్రావెల్‌ను తరలిస్తున్నారు. ఇసుక దోపిడీ ఇలా.. ● గంగాధర నెల్లూరు మండలంలోని ముక్కలత్తూరులో నీవానది నుంచి చైన్నెకి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. ఇక్కడ ఇసుకను డంప్ చేసి రాత్రికి రాత్రే తమిళనాడుకు తరలించి దోచేస్తున్నారు. ● పాలసముద్రం మండలం నుంచి నిత్యం వందల టన్నుల్లో ఇసుక తరలిస్తున్నారు. గంగాధర నెల్లూరు మండలంలోని నీవా నది నుంచి పాలసముద్రం మండలంలోని వనదుర్గాపురం, సింహరాజపురం, బలిజకండ్రిగ, మటవలం గ్రామాల్లో డంప్ చేసి రాత్రికి రాత్రే టిప్పర్లలో కూటమి నేతలు ఇసుకను తరలిస్తున్నారు. ఒక టిప్పర్ ఇసుక రూ.25 వేలు ధర పలుకుతోంది. 16 చక్రాలు గల టిప్పర్లలో రెండు రోజుల కొకసారి ఇసుకను తరలిస్తూ దోపిడీ చేస్తున్నారు. ● పచ్చికాపల్లం, వెదురుకుప్పం ప్రాంతాల నుంచి మట్టి దోపిడీ జరుగుతోంది. ఇటీవల బ్రాహ్మణపల్లె సమీపంలో అక్రమంగా మట్టిని తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో వాహనాలను అడ్డుకోబోయిన వీఆర్ఏపై అధికార పార్టీకి చెందిన వ్యక్తి దాడి చేశాడు. బాఽధితుడి ఫిర్యాదు మేరకు తహసీల్దార్ ఆ వ్యక్తిపై కేసు నమోదుకు సిపార్సు చేసినా ఓ ఎమ్మెల్యే అడ్డుతగిలి కేసు నమోదు చేయకుండా కాపాడినట్లు విమర్శలు వస్తున్నాయి. ● శ్రీరంగరాజపురంలో కూటమి నేతలు విచ్చలవిడిగా మట్టి దందా చేస్తున్నారు. గ్రావెల్ కోసం గుట్టలను మాయం చేస్తున్నారు. ● కార్వేటినగరం మండలంలో గ్రావెల్, ఇసుక అక్రమ రవాణాకు అడ్డూ అదుపూ లేదు. ఓ ఎమ్మెల్యే మండలం కావడంతో ఇసుకను డంప్ చేసుకుని రవాణా చేస్తున్నారు. ఇక్కడ నుంచి పళ్లిపట్టు మీదుగా చైన్నెకి తరలివెళుతోంది. క్వారీల్లో దందాలు క్వారీ యజమానుల వద్ద నుంచి స్థానిక ఎమ్మెల్యే పేరు చెప్పి వసూళ్లకు తెగబడుతున్నారు. ఆరు మండలాల్లోనూ పీఏలను నియమించిన ఆయన వివరాలను సేకరించి దందాలకు పాల్పడుతున్నారు. నేను ఎమ్మెల్యే పీఏని మామూళ్లు ఇస్తావా సీజ్ చేయమంటావా అంటూ బెదిరింపులకు దిగుతున్నట్లు యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
వరసిద్ధుని సేవలో రూరల్ డెవలప్మెంట్ కమిషనర్
కాణిపాకం : కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామిని ఆదివారం రాష్ట్ర పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ కృష్ణతేజ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి స్వామి దర్శనభాగ్యం కల్పించారు. అనంతరం వేద ఆశీర్వచన మండపంలో పండితులు ఆశీర్వచనాలు అందించారు. ఈఓ పెంచల కిషోర్ శేష వస్త్రంతో సన్మానించి స్వామి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ శాంతి సాగర్‌రెడ్డి, ఏఈఓ రవీంద్రబాబు, డీపీఓ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. టీకాలలో రొంపిచెర్ల మొదటి స్థానం రొంపిచెర్ల : గాలి కుంటు వ్యాధి టీకాలు వేయడంలో రొంపిచెర్ల మండలం చిత్తూరు జిల్లాలో మొదటి స్థానంలో నిలిచింది. మండలంలో 7,854 పశువులకుగాను 5,701 పశువులకు గాలి కుంటు వ్యాధి టీకాలు, 520 దూడలకుగాను 367 దూడలకు బ్లూ సోసిస్ వ్యాధి టీకాలు, 5000 గొర్రెలు, మేకలకు మశూచి వ్యాధి నిరోధక టీకాలు వేయడంలో చిత్తూరులో రొంపిచెర్ల మండలం మొదటి స్థానంలో నిలిచింది. అలాగే 121 పశువులకు బీమా చేసి మొదటి స్థానంలో ఉన్నట్లు మండల పశు వైద్యాధికారి శ్రీధర్ తెలిపారు. మండలానికి పశు బీమా కోసం రూ.20 వేలు బడ్జెట్‌ను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. అయితే పశు బీమా కోసం రూ.1,85,856 లక్షల వరకు ఖర్చు చేశామని తెలిపారు. దీంతో మండలానికి అదనంగా రూ.1,65,856 లక్షలు మళ్లీ మంజూరు చేస్తున్నారని తెలిపారు. జిల్లాలో 98.2 శాతం బడ్జెట్‌ను ఖర్చు చేసి జిల్లాలోనే మొదటి స్థానంలో నిలవడం జరిగిందన్నారు. గ్రేడ్–3 ఏఎన్ఎం పదోన్నతుల్లో గోల్మాల్ ? చిత్తూరు రూరల్ (కాణిపాకం) : ఉమ్మడి జిల్లాలో గ్రేడ్ –3 ఏఎన్ఎంల పదోన్నతుల్లో గోల్మాల్ చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండేళ్ల పాటు జీఎన్ఎం శిక్షణ పూర్తి చేసుకున్న ఏఎన్ఎంలు ఇందుకు అర్హులు. అయితే గత 6 నెలలుగా ఈ పదోన్నతుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో పదోన్నతుల కోసం కొంత మంది అడ్డదారులు తొక్కినట్లు విమర్శలు వస్తున్నాయి. కుల ధ్రువీకరణ పత్రం తప్పుగా ఇచ్చినట్లు తెలిసింది. సిఫార్సులు, కాసులకు ప్రాధాన్యం ఇచ్చారని విమర్శలు వస్తున్నాయి. రోస్టర్ పాయింట్లు మొత్తం గోల్ మాల్ జరిగిందని కొంత మంది ఏఎన్ఎంలు సోమవారం కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేయనున్నారు. రెండు కిలోల గంజాయి స్వాధీనం చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలో ఓ ముఠా నుంచి రెండు కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ఇరువారం శివారులో గంజాయి విక్రయిస్తున్నట్లు టూటౌన్ సీఐ నెట్టికంటయ్యకు సమాచారం అందింది. దీంతో ఆయన సిబ్బందితో కలిసి దాడులు చేశారు. అల్లాబతో పాటు మరికొందరు గంజాయి విక్రయిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. ఈ దాడుల్లో రెండు కిలోలకు పైగా గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఓ ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. -
నేటి నుంచి ఇంటర్ మూల్యాంకనం
చిత్తూరు కలెక్టరేట్ : ఇంటర్ పరీక్షలు ఈనెల 15వ తేదీతో ముగిశాయి. ఈక్రమంలో మూల్యాంకన ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు జిల్లా కేంద్రంలోని పీసీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఎంపిక చేశారు. ఈ ఏర్పాట్లను డీవీఈఓ సయ్యద్ మౌలా పర్యవేక్షించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 1,33 లక్షల ఇంటర్మీడియట్ జవాబు పత్రాలు జిల్లాకు చేరాయి. వీటిని పీసీఆర్ ప్రభుత్వ కళాశాలలోని స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. జిల్లా వ్యాప్తంగా వివిధ జూనియర్ కళాశాలల్లో అనుభవం ఉన్న 510 మంది అధ్యాపకులను మూల్యాంకన విధులకు నియమించారు. ఈనెల 31వ తేదీలోపు మూల్యాంకన ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నారు. సెల్ఫోన్లు వినియోగించొద్దు పీసీఆర్ ప్రభుత్వ జూనియర్ కళా శాలలో ఇంటర్ మూల్యాంకన ప్ర క్రియ నిర్వహించనున్నాం. ఇందు కు అవసరమైన అన్ని కేడర్లలో సి బ్బందిని నియమించాం. విధుల్లో ఉన్న సిబ్బంది సె ల్ఫోన్లు వినియోగించడానికి వీల్లేదు. – సయ్యద్ మౌలా, జిల్లా ఇంటర్మీడియట్ డీవీఈఓ -
బైక్ అదుపుతప్పి టీచర్ మృతి
చౌడేపల్లె : మండలంలోని చౌడేపల్లె – మదనపల్లె రోడ్డులోని బోయకొండ సమీపంలోని పక్షిరాజపురం వద్ద ఆదివారం బైక్ బోల్తాపడి ఉపాధ్యాయుడు మృతి చెందాడు. ఎస్ఐ నాగేశ్వరరావు కథనం మేరకు.. మదనపల్లె పట్టణం ఎన్వీఆర్ లేఅవుట్లో నివాసముంటున్న ఎం.వెంకటరమణ(55) చౌడేపల్లెలో బంధువుల గృహ ప్రవేశానికి వచ్చాడు. తిరిగి వెళ్తుండగా పక్షిరాజపురం వద్ద బైక్ అదుపుతప్పి బోల్తాపడింది. తీవ్రంగా గాయపడిన ఆయనను స్థానికులు 108లో మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు ఆయన అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. వేర్వేరు ప్రమాదాల్లో ఒకరి మృతి – ఇద్దరికి తీవ్రగాయాలు కుప్పం : నియోజకవర్గంలో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఓ వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం ఉదయం కుప్పం – పలమనేరు జాతీయ రహదారిలోని సామగుట్టపల్లి వద్ద ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో జయప్ప (65) అక్కడికక్కడే మృతి చెందాడు. శాంతిపురం మండలం సొన్నేగానిపల్లి గ్రామానికి చెందిన జయప్ప కర్ణాటక రాష్ట్రం కామసముద్రంలో తన కూతురు ఇంటికి వెళ్లి తిరిగీ వస్తుండగా మార్గమధ్యలో పలమనేరు నుంచి కుప్పానికి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కుప్పం నుంచి మల్లానూరు ప్రధాన రోడ్డు మార్గంలో వానగుట్టపల్లి వద్ద ఓ కారు ద్విచక్ర వాహనదారుడిని ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కుప్పం నుంచి స్వగ్రామానికి వెళ్తున్న ద్విచక్ర వాహనదారులు సింగారవేలు, మురళీలను మల్లానూరు నుంచి కుప్పం వైపు వస్తున్న ఓ కారు ఢీకొంది. దీంతో సింగారవేలు, మురళీలకు తీవ్రంగా గాయపడ్డారు. ఇరువురు కుప్పం పీఈఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు కుప్పం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రాన్స్‘ఫార్మర్’కష్టాలు
● కాలిపోతున్న వాటికి మరమ్మతులు కరువు ● 2 నెలలుగా ప్రారంభం కానీ ఓఆర్‌ఎం ● ముగియనున్న వారంటీ గడువు ● పేమేంట్ పెండింగ్‌తో ఆగిన ఇన్స్టాలేషన్ ముగియనున్న వారంటీ గడువు ఆగస్టు నాటికి ఓఆర్‌ఎం గడువు ముగియనున్నది. ఇంకా ఇన్స్టాల్ కూడా కాలేదు. వాటిని వినియోగించి మరమ్మతు సమస్యలు వస్తే అప్పుడు వారంటీతో ఉచితంగా సేవలు పొందవచ్చు. ఆగస్టు నెల ముగిస్తే సేవలకు పైకం చెల్లించాల్సి వస్తుంది. వాటికి ఆర్థికంగా అనుమతులు వచ్చే వరకు పడిగాపులు కాయాలి. గత ప్రభుత్వంలో 90 శాతం వరకు డబ్బులు చెల్లించాలి. ప్రస్తుతం పది శాతం పెండింగ్‌లో ఉన్న మొత్తంను చెల్లించాలి. ఏనుగంతా చెల్లించి తోక మాత్రం కట్టలేను అన్న చందంగా మారింది. ఆ డబ్బులు చెల్లించపోవడంతో టెక్నీషియన్లు ఇన్స్టాల్ చేయడానికి రావడం లేదని తెలుస్తోంది. చిత్తూరు కార్పొరేషన్ : ఎండలు మండుతున్నాయి.. పగలే చుక్కలు కనిపిస్తున్నాయి. దీంతో విద్యుత్ పరికరాల వినియోగం పెరిగింది. ఓవర్ లోడ్‌తో జిల్లాలో వ్యవసాయ, నివాస ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ బాగు చేయడానికి (రీజనరేషన్) తెచ్చిన నూతన ఓఆర్‌ఎం మిషన్ ప్రారంభానికి ముహూర్తం కుదరడం లేదు. పేరు ఘనం ఆచరణ శూన్యం అన్నట్లు మారింది అధికారుల తీరు. ట్రాన్స్‌కో అధికారుల చొరవ చూపి మిషన్‌ను ఇన్స్టాల్ చేయకపోతే వేసవిలో తిప్పలు తప్పవు. రెండు నెలలుగా టెక్నీషియన్ రాకపోవడంతో మిషన్ అలంకారప్రాయంగా చిత్తూరులోని ఎస్పీఎంలో ఉంది. వారంటీ గడువు దగ్గర పడింది. గత ప్రభుత్వం 90 శాతం నిధులు చెల్లించింది. ప్రస్తుతం పది శాతం నిధుల పెండింగ్‌తో ఇన్స్టాలేషన్ ఆగింది. 2 నెలలుగా ప్రారంభం కానీ ఓఆర్‌ఎం డిస్కం (రాయలసీమ, నెల్లూరు జిల్లాలు) పరిధిలో మొట్టమొదట సారిగా చిత్తూరుకు ఎస్పీఎం (స్పెషల్ మెయింటెన్స్)కు ఓఆర్‌ఎం (ఆయిల్ రీజనరేషన్ మిషన్)ను కేటాయించారు. తొలుత వీటిని తిరుపతి జిల్లా రేణిగుంటకు మంజూరు చేసినా అక్కడ ఎస్పీఎం మరమ్మతు పనులు జరుగుతుండటంతో కొత్తగా ఏర్పడిన ట్రాన్స్‌కో చిత్తూరు జిల్లాకు వీటిని బదిలీ చేశారు. దాదాపు రూ.50 లక్షల వ్యయంతో డిస్కంలో మోడల్‌గా మొట్ట మొదటి ఓఆర్‌ఎంను జనవరిలో చిత్తూరు ఎస్పీఎంలో బిగించారు. జిల్లాలో చిత్తూరు, పలమనేరు, పుంగనూరు ప్రాంతాల్లో ఎస్పీఎం కేంద్రాలున్నాయి. వీటి చుట్టు పక్కల నియోజకవర్గాల నుంచి పాడైన ట్రాన్స్ఫార్మర్లను మరమ్మతు చేసి పంపుతారు. చిత్తూరు కేంద్రంలో ఎక్కువగా కాలిపోయినవి వస్తుంటాయి. ఫిబ్రవరి నెలాఖరు వరకు జిల్లాలో రోజు దాదాపు 20 ట్రాన్స్ఫార్మర్లను మరమ్మతు చేసి పంపుతున్నారు. మార్చిలో వీటి సంఖ్య మరో పది పెరిగాయి. రానురాను ఈ సంఖ్య మరింత పెరగనుంది. ఇందులో ఎక్కువగా ఆయిల్ మార్పు చేయాల్సినవి వస్తాయి. ప్రతి ట్రాన్స్ఫార్మర్కు దాదాపు 50–70 లీటర్ల ఆయిల్‌ను శుద్ధి చేసి వాడుతుంటారు. ప్రస్తుతం చిత్తూరులో ఉన్న మిషన్ రోజు 200 లీటర్లను మాత్రమే శుద్ధి చేస్తుంది. అంతే పది ట్రాన్స్ఫార్మర్లు పూర్తవడానికి దాదాపు 5 రోజులు సమయం పడుతుంది. ఎండతో పాటు ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతులు పెరుగుతుంటాయి. అప్పటికి నూతన ఓఆర్‌ఎం అందుబాటులోకి రాకపోతే ట్రాన్స్ఫార్మర్ మరమ్మతుకు రోజుల తరబడి రైతులు వేచి చూడాలి. కొత్త ఓఆర్‌ఎం రోజు 2 వేల లీటర్ల ఆయిల్‌ను శుద్ధి చేస్తుంది. జిల్లాలోని ఎస్‌పీఎంలకు ఇక్కడికి నుంచి ఆయిల్‌ను శుద్ధి చేసి పంపవచ్చు. అలా చేయాలంటే మిషన్‌ను మొదట టెక్నీషియన్లు ఇన్స్టాల్ (కనెక్షన్) ఇవ్వాలి. ఇబ్బందులు లేకుండా చూస్తాం టెక్నీషియన్లు బిజీగా ఉండటంతో బిగింపు ఆలస్యమవుతోంది. ఇప్పటికే పలుమార్లు వీటిపై ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ చర్చించారు. టెక్నికల్ టీమ్‌తో మాట్లాడుతున్నాం. పది రోజుల్లో వాటిని బిగించి పనులు ప్రారంభించాలని చూస్తున్నాం. వేసవిలో ట్రాన్స్ఫార్మర్లు రిపేరుకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం. – వాసుదేవరెడ్డి, ఈఈ ఎంఆర్టీ విభాగం -
జల్లికట్టు జోరు..జన హోరు
వెదురుకుప్పం : కోడెగిత్తల జోరు.. యువత హుషారు ... దూసుకుపోతున్న ఎడ్లను కట్టడి చేసే క్రమంలో యువత చూపిన ఉత్సాహం ఆ గ్రామంలో సందడి నెలకొంది. ఆదివారం మండలంలోని కొమరగుంట లో జరిగిన జల్లికట్టు ఉల్లాసంగా ఉత్సాహంగా సాగింది. జన ప్రవాహాన్ని చీల్చుకుంటూ దూసుకుపోయిన ఎడ్లు యువతను హోరెత్తించాయి. ఓ పక్క యువత కేరింతలు మరోపక్క ప్రజల అరుపులు, కేకలతో జల్లి కట్టు దుమ్మురేపింది. ముందుగా వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన ఎడ్ల కొమ్ములకు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన జెండాలు, బెలూన్లు, పలకలు కట్టి బహుమతులతో సిద్ధం చేశారు. అప్పటికే యువత పెద్ద ఎత్తును గ్రామాలకు చేరుకుని బహుమతులు గెలుచుకునేందుకు అల్లి వద్ద నిలబడ్డారు. ఈక్రమంలో ఎడ్లను ముస్తాబు చేసి విడతల వారీగా పందానికి ఉసిగొల్పారు. దీంతో కోడెగిత్తలు రంకెలేసుకుంటూ పరుగులు తీశాయి. దూసుకుపోయిన ఎడ్లను నిలువరించి పలకలు పట్టేందుకు యువత ప్రయత్నం చేశారు. కొన్ని ఎడ్ల వేగాన్ని నిలువరించిన యువకులు పలకలను లాక్కొని ఆనందంతో మురిసిపోయారు. చుట్టు పక్కల ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో హాజరు కావడంతో ఈ ప్రాంగణం కిక్కిరిసింది. -
రేపటి నుంచి అన్నమయ్య సంకీర్తనోత్సవాలు
తిరుపతి కల్చరల్: శ్రీత్యాగరాజ స్వామి కల్చరల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈనెల 18 నుంచి 22వ తేదీ వరకు ఐదు రోజుల పాటు త్యాగరాజ మండపంలో అన్నమయ్య సంకీర్తనోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ అధ్యక్ష, కార్యదర్శులు మోహన్ సుందరం, కంచి రఘురాం తెలిపారు. ఆదివారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గత 80 ఏళ్లుగా ట్రస్ట్ ఆధ్వర్యంలో త్యాగరాజ ఉత్సవాలను చేపడుతూ ప్రతిభావంతులైన ప్రముఖ విద్యాంసులచే త్యాగరాజ సంగీతోత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. తిరుమల శ్రీవారి పరమభక్తుడైన అన్నమయ్యకు క్రోధి నామ సంవత్సరం స్వామివారు సాక్షాక్తరించి ఆశీస్సులు అందించారన్నారు. ఆ పవిత్రమైన ఏడాదిని పురస్కరించుకుని ఐదు రోజుల పాటు అంటే ప్రతి రోజు సాయంత్రం 4 నుంచి 9.30 గంటల వరకు ప్రముఖ విద్యాంసులచే అన్నమయ్య సంకీర్తన కచేరీలు ఉంటాయని తెలిపారు. -
యథేచ్ఛగా మట్టి దందా
● ఆనవాళ్లు కోల్పోతున్న చెరువులు ● కూటమి నాయకుల కనుసన్నల్లో మట్టి దోపిడీ ● కుప్పంలో అడ్డుపడేది ఎవరు.. అడిగేది ఎవరు? కుప్పం రూరల్ : కుప్పం నియోజకవర్గంలోని చెరువుల్లో మట్టి దోపిడీ విచ్చలవిడిగా సాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మట్టి దోపిడీకి అడ్డూఅదుపు లేకుండా సాగుతోంది. నిత్యం ఏదో ఒక చెరువులో మట్టి తొలగిస్తూనే ఉన్నారు. రాత్రీ,పగలు తేడా లేకుండా మట్టి దోపిడీ చేస్తూ రూ.లక్షల్లో వెనుకేసుకుంటున్నారు. ఈ మొత్తం తతంగం కూటమి నేతల కనుసన్నల్లోనే సాగుతుండడంతో చర్యలు తీసుకునేందుకు అధికారులు వెనుకంజ వేస్తున్నారు. దీంతో అక్రమార్కుల ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. పరిస్థితి ఇలా.. కుప్పం నియోజకవర్గంలో 500కు పైగా చెరువులను ప్రజల తాగునీరు, సాగునీటి అవసరాల కోసం అప్పట్లో నిర్మాణాలు చేపట్టారు. ఒక కుప్పం మండలంలోనే 145 చెరువులు ఉన్నాయి. ఇందులో వంద ఎకరాలకు పైగా ఆయకట్టు ఉన్న చెరువులు 8, వందకు లోపు ఆయకట్టు ఉన్న చెరువులు 137 ఉన్నాయి. వీటిలో నిత్యం ఏదో ఒక చోట మట్టి దోపిడీ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా కుప్పం పట్టణానికి ఆనుకున్న ఉన్న లక్ష్మీపురం, వీరప్పనాయునిచెరువు, దామలచెరువు, కుప్పం చెరువు, పెద్దబంగారునత్తం చెరువుల్లో దోపిడీ ఎక్కువైంది. ఇక్కడ మట్టి దోచుకోవడం పరిపాటిగా మారింది. దీంతో 50 నుంచి 60 అడుగుల మేర గుంతలు ఏర్పడి చెరువులు కళా విహీనంగా మారింది. గుంతల్లో జేసీబీ, ట్రాక్టర్లు ఉన్నా కనిపించని విధంగా తయారైంది. ఇంత పెద్ద ఎత్తున గుంతలు ఏర్పడడంతో వర్షాలు కురిసినా నీరు ఎక్కువ కాలం నిలువ ఉండదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చెరువుల్లో పైభాగాన ఉండే మట్టి, ఇసుక తొలగిస్తే నీరు త్వరగా ఇంకిపోయి భూమి అడుగుల్లోకి వెళ్లిపోతుందని సూచిస్తున్నారు. పట్టించుకోని అధికారులు నిత్యం చెరువుల్లో మట్టి దోపిడీ జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. సామాన్యుడి చెరువులోకి వెళ్లి వచ్చినా ఆంక్షలు గుర్తుకు వచ్చే అధికారులకు భారీ యంత్రాలతో అడ్డ గోలుగా మట్టి తరలిపోతున్నా కనిపించడం లేదు. ముఖ్యంగా కుప్పం పట్టణానికి ఆనుకుని ఉన్న లక్ష్మీపురం, కుప్పం, వీరప్పనాయుని, పెద్దబంగారునత్తం చెరువుల్లో నిత్యం రాత్రీ, పగలు తేడా లేకుండా దోపిడీ జరుగుతోంది. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. ముఖ్యమంత్రి నియోజక వర్గంలో కావడం, దోపిడీ వెనుక కూటమి నేతల హస్తం ఉండడంతో ఏ వైపు నుంచి ఏ రకమైన ఒత్తిడి వస్తుందో అని అధికారులు వెనుకడుగు వేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. ప్రతి రోజు కుప్పం వచ్చి వెళ్లే జిల్లా అధికారులు సైతం ఈ దోపిడీని అడ్డుకోలేకపోవడం దారుణమని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి మట్టి దోపిడీకి అడ్డుకట్ట వేసి చెరువులను కాపాడాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.కూటమి నేతల కనుసన్నల్లోనే .. ఇది వరకు ఒక ఎత్తు... కూటమి ప్రభుత్వం రావడంతో మరో ఎత్తు అన్న విధంగా మట్టి దోపిడీ పరిస్థితి తయారైంది. కూటమి ప్రభు త్వం రావడంతో బియ్యం, ఇసుకతో పాటు మట్టి దోపిడీపై వారి కన్నుపడింది. అధినేత నియోజక వర్గం కావడంతో తమకు అడ్డు ఉండదని, చోటామోటా నాయకుల నుంచి మండల స్థాయి వరకు మట్టి దోపిడీకి పాల్పడుతున్నారు. ఒక్కో ట్రాక్టర్ లోడు మట్టి రూ.400 వరకు పలుకుతుండడంతో అక్రమార్కులు నిత్యం లక్షల్లో దోచుకుంటున్నారు. -
వృక్ష సంపదపై అధ్యయనం
తిరుపతి సిటీ : ఎస్వీయూ వృక్షశాస్త్ర విభాగం విద్యార్థులు మూడు రోజుల పశ్చిమ కనుమల వృక్ష సంపద, జీవ వైవిధ్యం అధ్యయన యాత్రకు శ్రీకారం చుట్టారు. అధ్యాపకులు నాగలక్ష్మి, దేవమ్మ, కామాక్షమ్మ, వేణు, అంకన్న పర్యవేక్షణలో, విద్యార్థులు రూపేష్, శివాని నేతృత్వంలో యాత్ర చేపట్టారు. ప్రధానంగా కేరళలోని హొగెనెకల్ జలపాతం, టీ ఫ్యాక్టరీ, థ్రెడ్ గార్డెన్, రోజ్ గార్డెన్, నేషనల్ బొటానికల్ గార్డెన్, ఊటీ కొండలు, అతిరేపల్లి వాటర్‌ఫాల్స్ వంటి ప్రదేశాలను సందర్శించారు. ఆయా ప్రాంతాల్లోని వృక్షసంపదను అధ్యయనం చేశారు. అధ్యాపకులు మాట్లాడుతూ వైవిధ్యమైన మొక్క భాగాలను విద్యార్థులు సేకరించారని, వాటిని హెర్బెరియం షీట్ల ద్వారా నిల్వ చేయనున్నట్లు వెల్లడించారు. సోమవారం యాత్ర ముగించుకుని వర్సిటీకి చేరుకోనున్నట్లు తెలిపారు. -
పకడ్బందీగా ‘పది’ పరీక్షలు
● రేపటి నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పరీక్షల నిర్వహణ ● డీఈఓ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు ● సమావేశంలో డీఆర్ఓ మోహన్‌కుమార్ వెల్లడి చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డీఆర్ఓ మోహన్‌కుమార్ అన్నారు. ఈ మేరకు శనివారం కలెక్టరేట్లో శ్రీపదిశ్రీ పరీక్షల ఏర్పాట్లపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఈనెల 17 నుంచి మార్చి 31 వరకు ఎస్ఎస్సీ, ఏప్రిల్ 1వతేదీ వరకు ఓపెన్ స్కూల్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యాశాఖ, పోలీస్, రెవెన్యూ శాఖల సమన్వయంతో ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు. ఎస్ఎస్సీ పరీక్షలకు 118 కేంద్రాల్లో 20,954 మంది రెగ్యులర్, 294 మంది ప్రైవేట్ విద్యార్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. దీంతో పాటు 20 పరీక్షా కేంద్రాలలో 1,165 మంది ఓపెన్ స్కూల్ విద్యార్థులు మొత్తం 22,413 మంది హాజరు కానున్నారన్నారు. సమయానికి కేంద్రాలకు చేరుకోవాలి శ్రీపదిశ్రీ పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సమయానికి కేంద్రాలకు చేరుకోవాలని డీఆర్ఓ తెలిపారు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్య్హ్నాం 12.30 గంటల వరకు, ఓపెన్ స్కూల్ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యార్థులు ఉదయం 9.30 గంటల లోపు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆలస్యం అయితే 10 గంటల వరకు పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారన్నారు. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఉండదని చెప్పారు. విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో హాల్ టికెట్ చూపించి ఉచితంగా ప్రయాణం చేయవచ్చన్నారు. పరీక్షల నిర్వహణకు చీఫ్, డిపార్ట్మెంట్, ఇన్విజిలేటర్లను నియమించినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 163 నియమాలు ప్రతి పరీక్ష కేంద్రం వద్ద 163 భారత న్యాయ సంహిత నియమాలు వర్తిస్తాయన్నారు. పరీక్ష కేంద్రాలకు సమీపంలో ఎలాంటి జిరాక్స్ కేంద్రాలు లేకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రైవేట్ పరీక్ష కేంద్రాల్లో జిరాక్స్ మిషన్లు, సీసీ కెమెరాలు పనిచేయకుండా పరీక్షలు పూర్తి అయ్యే వరకు సీజ్ చేయడం జరుగుతుందన్నారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తు ఉంటుందన్నారు. పరీక్ష కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్లేందుకు అనుమతి లేదన్నారు. జిల్లాలో 11 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించినట్లు తెలిపారు. ఈ సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. సమస్యల పరిష్కారం కోసం డీఈఓ కార్యాలయంలో కాల్ సెంటర్ ఏర్పాటు చేశారన్నారు. సమస్యలున్నట్లైతే 9032185001 నంబర్లో సంప్రదించాలని కోరారు. ఈ సమావేశంలో డీఈఓ వరలక్ష్మి,, ఏడీ వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. -
ప్లాస్టిక్ కవర్లు వద్దు.. కాటన్ బ్యాగులే ముద్దు
ప్రైవేటు ఆస్పత్రులపై దాడులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని అడిషనల్ డైరెక్టర్ ఆదేశించారు.ఆదివారం శ్రీ 16 శ్రీ మార్చి శ్రీ 2025కొత్త జంటలు వంటపై తంటాలు పడుతోంది. పెళ్లి కూతుర్లు వంటింట్లో అడుగు పెట్టాలంటే తెగ ఫీలైపోతున్నారు. వంట చేయడం రాక కొంత మంది వంట గదికి దూరంగా ఉండిపోతున్నారు. మరికొంత మంది పని ఒత్తిళ్లతో వంట దగ్గరికి వెళ్లలేకపోతున్నారు. ఇంకొంత మంది యూట్యూబ్ పాఠాలతో వంట వండేందుకు అపసోపాలు పడుతున్నారు. వారు వండిందే వారికే నచ్చక సింపుల్‌గా ఆన్లైన్ ఆర్డర్లు పెట్టుకుంటున్నారు. లేకుంటే పాస్ట్ ఫుడ్‌ను వెతుక్కుంటున్నారు. వీటి సంఖ్య జిల్లాలో గణనీయంగా పెరిగింది. ఇలా ఆరగించడం వల్ల అనారోగ్య సమస్యలు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాణిపాకం : ఒకప్పుడు పెళ్లి చూపులంటే.. వరుడు వైపు వరకట్నంతో పాటు అమ్మాయికి వంటా వచ్చా అని అడిగేవాళ్లు. ఏ రకమైనవి ఎక్కువగా వండుతావ్ అని గుచ్చి గుచ్చి ప్రశ్నించేవారు. అప్పట్లో చదువు, ఉద్యోగం చూసేవారు కాదు. అమ్మాయి చక్కగా వండి పెడుతూ..ఇంట్లో ఉంటే చాలనుకునేవారు. ఇప్పుడు అమ్మాయి ఎంత వరకు చదువుకుంది..ఏం చేస్తోంది అని మాత్రమే చూస్తున్నారు. వధువు వైపు నుంచి...వరుడు చదువు, ఉద్యోగం, ఫ్యామిలీ పరిస్థితి చూసి..పెళ్లి ఫిక్స్ చేసేస్తున్నారు. అమ్మాయికి వంట వచ్చా అని అడిగే వాళ్లు పూర్తిగా కరువయ్యారు. చదువులపైనే దృష్టి పెడుతున్నారు.. ఒకప్పుడు ఆడ పిల్లలు 10 ఏళ్ల వయస్సు వచ్చిందంటేనే తల్లులు వంటింటికి తీసుకెళ్లి రకరకాల వంటలు చేయడం నేర్పేవాళ్లు. అత్తారింటికి వెళితే మీ అమ్మ వంట చేయడం నేర్పలేదా అని మమ్మలను చులకనగా మాట్లాడతారని తల్లులు పట్టుబట్టి వాళ్ల పిల్లలకు వంట నేర్పేవాళ్లు. ఇప్పుడు పల్లె, పట్నం అనే తేడా లేకుండా తల్లిదండ్రులు పిల్లలను చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. పిల్లల చదువుపై దృష్టి పెడుతున్నారు. బాగా చదివి సాఫ్ట్వేర్ ఉద్యోగం, ప్రభుత్వం ఉద్యోగం, డాక్టర్ అవ్వాలని, ఇతర ఉద్యోగాల కోసం అన్వేషిస్తున్నారు. ఇందులో చాలా మంది ఉన్నత చదువుల కోసం బయట రాష్ట్రాలకు, విదేశాలకు పంపుతున్నారు. ఒకప్పుడు మగ పిల్లలను చదివిస్తే ప్రయోజకుడై..పోషిస్తారని అనుకునేవాళ్లు. ఇప్పుడు మగ పిల్లలతో పాటు ఆడ పిల్లలను సమానంగా చదివిస్తున్నారు. చదువు తప్ప మరేది ముట్టుకోనివ్వడం లేదు. ఈ క్రమంలో ఆడ పిల్లలు వంటింటికి దూరమవుతున్నారు. తల్లులు సైతం పెళ్లైతే వంట నేర్చుకుంటుంది లే అని తేలికగా వదిలేస్తున్నారు. వంట చేయడం రాదు పెళ్లైన కొత్త జంటలు లగ్జరీ లైఫ్ వెతుక్కుంటున్నారు. పెళ్లికి ముందు నుంచే ఏ పని ముట్టుకోకుండా జీవించేయాలని కలలు కంటున్నారు. ముఖ్యంగా ఆడ పిల్లలు పుట్టింట్లో ఉన్నట్లుగా ఉండాలని కోరుకుంటున్నారు. అత్తారింటికి వెళ్లినా.. కాఫీ అంటే బెడ్ రూమ్‌కే వచ్చేయాలనే అనుకుంటున్నారు. వంట వచ్చిన మొగుడైతే ఇంకా బెటర్ అని మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారు. ఇలా పుట్టింట్లో వంట నేర్చుకోక కొత్త పెళ్లి కూతుర్లు ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగా కాపురం పెట్టిన వారైతే వంట కోసం తంటాలు పడుతున్నారు. కొందరు యూట్యూబ్ చూసి వంట పాఠాలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నంలో చేతులు కాల్చుకుంటూ వద్దురా..ఈ వంట తంటా అంటూ చాలించుకుంటున్నారు. ఆ వండిన వంట రుచికరంగా లేకపోవడంతో అబ్బాయిలు ఆమడదూరం వెళ్లిపోతున్నారు. ఇక ఉద్యోగ రీత్యా దంపతులు ఇద్దరూ వంటింటికి దూరంగా ఉంటున్నారు. 8 గంటల పని, తర్వాత ఇంటి పని, ఇతర పనులు వెరసి అలసిపోతున్నారు. – 8లో– 8లోన్యూస్రీల్ కొత్త జంటలకు వంట కష్టాలు ఆన్లైన్లో ఆర్డర్ల వెల్లువ వంట గదిని ముట్టుకోని వైనం కొందరు యూట్యూబ్ ద్వారా వంట పాఠాలు.. ఇంకొందరికి పని ఒత్తిళ్లు పాస్ట్ ఫుడ్‌కు రుచి మరిగిన వైనం వెంటాడుతున్న అనారోగ్య సమస్యలు ఫాస్ట్ ఫుడ్‌కు జై కొడుతున్నారు దంపతులు ఇద్దరూ సంపాదన మీద పోటీ పడుతున్నారు. బిజీ లైఫ్‌లో పడిపోతున్నారు. నువ్వా నేనా అంటూ పనుల్లో నిమగ్నమైపోతున్నారు. ఈ తరుణంలో భార్య వంటింటికి దూరమై బయట ఫుడ్ కోసం అన్వేస్తున్నారు. అలాగే చాలా మంది వంట రాక అల్లాడిపోతున్నారు. యూట్యూబ్ చూసి వండిన ఆ టేస్ట్ రాకపోవడంతో ముద్ద మింగుడు పడడం లేదు. దీంతో ఫాస్ట్ ఫుడ్‌పై పడిపోతున్నారు. మూడు పూటల ఫాస్ట్‌ఫుడ్‌ను ఆరగిస్తున్నారు. లేకుంటే దర్జాగా ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్లు పెట్టుకుంటున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే వాళ్ల పరిస్థితి అయితే అర్ధరాత్రి కూడా ఆర్డర్లు పెట్టుకుని ఆవురావురమని తినేస్తున్నారు. ఫుడ్ దొరక్కపోయినా ఫిజ్జాలు, బర్గర్లు తెప్పించుకుని కడుపు నింపుకుంటున్నారు. దీని ఫలితంగా జిల్లాలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు విచ్చలవిడిగా పుట్టుకొచ్చాయి. బిర్యానీ సెంటర్లు సందుకొక్కటి ఉన్నాయి. వీరి రాకతో ఆ సెంటర్లు, హోటళ్లు నిండిపోతున్నాయి. కొత్త జంటలతో కళకళలాడుతున్నాయి. ఏడాది కిందట పైళ్లెన ఓ జంట ఉద్యోగం చేసుకుంటోంది. భర్త చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తే... భార్య ప్రైవేటుగా పనిచేస్తోంది. ఈ ఇద్దరూ వారి వృత్తిలో బిజీగా గడుపుతున్నారు. వంట చేయడం రాదు. దీంతో కొన్ని నెలలు వంట మనిషిని పెట్టుకున్నారు. రుచి లేదని ఆమెను చాలించారు. ఈ కారణంగా ఎక్కువగా ఫాస్ట్‌పుడ్ సెంటర్లను ఆశ్రయిస్తుంటారు. ఆస్పత్రి ఆవరణం, పలమనేరు రోడ్డు, మురకంబట్టు రోడ్డు, లేకుంటే తమిళనాడులోని వేలూరుకు సైతం వెళుతున్నారు. బయట ఫుడ్ డేంజర్..? అధికంగా బయట ఫుడ్ తినడం వల్ల అనారోగ్య సమస్యలు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, బ్రెయిన్ స్ట్రోక్, క్యాన్సర్, రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ తదితర సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువగా పెళ్లైన వారు లావు కావడానికి ఇది కూడా ఒక కారణమని వెల్లడిస్తున్నారు. రిజిస్ట్రర్ కార్యాలయంలో జరిగిన పెళ్లిళ్ల వివరాలు 2022 2568 2023 4019 2024 4214 2025 1638 హోటళ్ల వివరాలు హోటళ్లు 73 రెస్టారెంట్లు 395 క్యాంటీన్లు 98 దాబాలు 56 అనారోగ్యం పాలుకావద్దు ఫాస్ట్ ఫుడ్ ప్రస్తుత సమాజంలో ఫ్యాషన్‌గా మారింది. పేద, మధ్య ధనిక తేడా లేకుండా ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా కొత్తగా పెళ్లైన వారు చాలా మందికి వంట రాదు అని బయట ఫుడ్ తింటున్నారు. ఇది మంచిది కాదు. వీలైనంత వరకు తగ్గించుకుంటే మంచిది. తాజాగా వండి తినడం ఉత్తమం. బయట తినడం వల్ల అనేక రోగాలు మనిషిని చుట్టుముడుతాయి. – వెంకట ప్రసాద్, వైద్య నిపుణుడు, చిత్తూరు -
కాణిపాకంలో ప్రిన్సిపల్ సెక్రటరీ
కాణిపాకం : కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని శనివారం రాష్ట్ర మైనారిటీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హర్షవర్ధన్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు స్వాగతం పలికి స్వామి దర్శనం కల్పించారు. వేద ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదం, చిత్రపటం అందజేశారు. కార్యక్రమంలో ఏఈఓ రవీంద్రబాబు, సిబ్బంది కోదండపాణి, బాలాజీనాయుడు పాల్గొన్నారు. ప్రత్యేక అధికారిని కలిసిన ఇంచార్జి కలెక్టర్ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా పర్యటనకు విచ్చేసిన జిల్లా ప్రత్యేక అధికారి చక్రధర్ బాబును ఇంచార్జి కలెక్టర్ విద్యాధరి మర్యాద పూర్వకంగా కలిశారు. శనివారం ఆర్ అండ్‌బీ అతిథి గృహంలో ఆయనను కలిసి మొక్కను అందజేసి స్వాగతం పలికారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా పర్యవేక్షణకు నియమితులైన జిల్లా ప్రత్యేక అధికారి పలు ప్రాంతాల్లో పర్యటించి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల సమస్యలను పరిశీలించనున్నారు. అనంతరం జిల్లాలోని అభివృద్ధి, సంక్షేమ పథకాల వివరాలను ఇంచార్జి కలెక్టర్ ఆయనకు వివరించారు. ‘పది’ పరీక్షలకు అంతరాయం లేని కరెంటు చిత్తూరు కార్పొరేషన్ : ‘పది’ పరీక్షలకు అంతరాయం లేని కరెంటు సరఫరా ఇవ్వాలని ట్రాన్స్‌కో ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. శనివారం అర్బన్ డివిజన్ కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. వేసవికి కరెంటు కోతలు లేకుండా ముందుస్తుగా 11 కేవీ లైన్లను సర్వే చేయాలన్నారు. లైన్‌కు అడ్డంగా ఉన్న తీగలను తొలగించి, వదులుగా ఉన్న వైర్లను బిగుతుగా చేయాలన్నారు. సెక్షన్ల వారీగా లోడ్ మానిటరింగ్ చేసి ఎక్కడెక్కడ ఓవర్‌లోడ్ ఉందో గుర్తించాలన్నారు. చిత్తూరులో 160 కేవీ సామర్థ్యం గల ట్రాన్స్ఫార్మర్లు 4, బంగారుపాళ్యం 2, నగరిలో 2 అదనపు ట్రాన్స్ఫార్మర్లు పెడుతున్నామన్నారు. కార్యక్రమంలో ఈఈ మునిచంద్ర, జగదీష్, ఏఓ ప్రసన్న ఆంజనేయులు, డీఈలు ప్రసాద్, ఆనంద్, కొండయ్య, ఏఏఓ గీత, ఏఈలు, సబ్ ఇంజినీర్లు పాల్గొన్నారు. విద్యార్థుల్లో ఒత్తిడిని పోగొట్టాలి చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో కేజీబీవీ పాఠశాలల్లో నియమితులైన హెల్త్ కౌన్సిలర్లు విద్యార్థుల్లో ఒత్తిడిని పోగొట్టేలా దృష్టి సారించాలని జిల్లా సమగ్రశిక్ష శాఖ ఏపీసీ వెంకటరమణ అన్నారు. శనివారం డీఈఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో హెల్త్ కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పరీక్షలంటే భయం, తీవ్ర ఒత్తిడి, మానసిక, వ్యక్తిగత సమస్యలతో ఇబ్బంది పడే విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ఏడుగురు హెల్త్ కౌన్సిలర్లను నియమించారన్నారు. జిల్లాలో నియమితులైన హెల్త్ కౌన్సిలర్లు విధుల పట్ల నిబద్ధతతో పనిచేయాలన్నారు. సమావేశంలో సమగ్రశిక్ష శాఖ గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇంద్రాణి, తదితరులు పాల్గొన్నారు. -
ఫోరెన్సిక్ ల్యాబ్ పరిశీలన
చిత్తూరు అర్బన్ : చిత్తూరులోని ఎకై ్సజ్ అండ్ ప్రొహిభిషన్ (ఆబ్కారీ) శాఖకు సంబంధించిన ఫోరెన్సిక్ ల్యాబ్‌ను ఎస్పీ మణికంఠ శనివారం పరిశీలించారు. నకిలీ మద్యం, మాదక ద్రవ్యాల విశ్లేషణ విధానాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఇక్కడున్న యంత్ర పరికరాల కచితత్వాన్ని, వెలువరించే నివేదికలపై అధికారులతో మాట్లాడారు. అనంతరం మత్తు పదార్థాల బారిన పడ్డ వారిని, బయటపడేసే డీ–అడిక్షన్ సెంటర్‌ను తనిఖీ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఎకై ్సజ్, పోలీసు శాఖ సంయుక్తంగా పనిచేసి అక్రమ మద్యం, మాదక ద్రవ్యాలను నివారించాల్సి ఉందన్నారు. ఇందు కోసం ప్రణాళికతో ముందుకు వెళతామన్నారు. ఎస్పీ వెంట సీఐలు జయరామయ్య, నెట్టికంటయ్య, నిత్యబాబు ఉన్నారు. -
ఇస్కాఫ్ జిల్లా కమిటీ ఎంపిక
చిత్తూరు కార్పొరేషన్ : ఇస్కాఫ్ జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు రాష్ట్ర కార్యదర్శి శ్రీధర్‌రావు తెలిపారు. శనివారం చిత్తూరులో భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం (ఇస్కాఫ్) 4వ మహాసభలో కమిటీని ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా ఏ.ఆర్.సౌందర్ రాజన్, జిల్లా కార్యదర్శి ఎం.నాగముని, జిల్లా సహాయ కార్యదర్శి దుర్గ, జిల్లా ఉపాధ్యక్షుడిగా చంద్రయ్య, కోశాధికారి బాలాజీ రావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 1941లో ఫ్రెండ్స్ ఆఫ్ సోవియట్ యూనియన్ పేరుతో మహాత్మా గాంధీ, నెహ్రూ, సరోజినీ నాయుడు ఇతర నాయకుల సహకారంతో ప్రారంభమైందన్నారు. 1952లో ఇండోస్ సోవియట్ సాంస్కృతిక సంఘంగా మారిందన్నారు. సంస్థకు జస్టిస్ వి.ఆర్.కృష్ణయ్య, జస్టిస్ బీ.పీ.జీవన్ రెడ్డి, రాజ్యసభ మాజీ ఎం.పీ.సయ్యద్ అజిత్ బాషా ప్రముఖులు జాతీయ స్థాయిలో పనిచేశారని కొనియాడారు, ప్రపంచ శాంతికి తోడ్పడటం, ఆర్థిక సంక్షోభాలను అధిగమించడం, ఇరుగు పొరుగు దేశాలతో స్నేహ పూర్వక సంబంధాలు పెంపొందించడం కోసం ఇస్కాఫ్లో సభ్యులుగా చేరాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు రామచంద్రయ్య, నాగమణి, సౌందర్ రాజన్ , నాగరాజు పాల్గొన్నారు. మాతా శిశు ఆరోగ్యమే లక్ష్యం చిత్తూరు రూరల్ (కాణిపాకం) : మాతా శిశు ఆరోగ్యమే లక్ష్యంగా పని చేయాలని స్టేట్ ఎంసీహెచ్ నోడల్ అధికారి అనిల్ ఆదేశించారు. చిత్తూ రు నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్యశా ఖ కార్యాలయంలో శనివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో స మీక్షించారు. మాతా శిశు సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను విధిగా పాటించాలన్నారు. గర్భిణులు , బిడ్డకు ఆరోగ్య సేవలను అందించాలన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వద్దన్నారు. పుట్టిన బిడ్డను పీహెచ్సీ వైద్యులు పర్యవేక్షించాలన్నారు. మాతా శిశు మరణాల నివారణకు కృషి చేయాలన్నారు. జాతీయ ఆ రోగ్య కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. డీఎంఅండ్‌హెచ్‌ఓ సుధారాణి, జిల్లా క్షయ నివారణ అధికారి వెంకట ప్రసాద్ ఉన్నారు. మాట్లాడుతున్న శ్రీధర్‌రావు -
కిండర్ గార్టెన్ జోన్ ప్రారంభం
కుప్పం : ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూలులో కిండర్ గార్టెన్ యాక్టివిటీ తరగతి గదిని డెన్మార్క్‌కు చెందిన ప్రొఫెసర్ పల్లె జప్సన్ ప్రారంభించారు. శనివారం ఢిల్లీ పబ్లిక్ స్కూలు ప్రాంగణంలో ఐడీపీఎస్ చైర్మన్ దయానిధి ఆధ్వర్యంలో ఈ తరగతి గదిని ప్రారంభించారు. కుప్పంలో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రారంభించడం శుభ పరిణామన్నారు. గ్రామీణ ప్రాంతమైన కుప్పంలో ఇంటర్నేషనల్ స్థాయి విద్యను అందించడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డా.అరుల్ రాజ్, మౌళి, జస్టిసన్ ఐఆర్ఎమ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పాల్గొన్నారు. -
రైలు నుంచి కిందపడి వ్యక్తి మృతి
చిత్తూరు కార్పొరేషన్ : రైలులో ప్రయాణిస్తున్న వ్యక్తి ప్రమాదవశాత్తు కాలు జారి పడి మృతి చెందిన సంఘటన శనివారం జరిగింది. రైల్వే ఎస్సై ప్రవీణ్‌కుమార్ కథనం మేరకు వివరాలు ఇలా.. స్థానిక సంజయ్‌గాంధీనగర్‌కు చెందిన హేమకుమార్ (31) చిత్తూరు– తిరుపతి ఇంటర్సిటీ రైలులో వెళ్తుండగా చిత్తూరు సమీపంలోని ఘగర్ ఫ్యాక్టరీ వద్ద కాలు జారీ పడ్డారన్నారు. తీవ్రగాయాలతో ఉన్న అతడిని రైల్వే సిబ్బంది గుర్తించి 108కి సమాచారం ఇచ్చారన్నారు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు. -
వరసిద్ధుని సేవలో జిల్లా ప్రత్యేక అధికారి
కాణిపాకం : జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణలో భాగంగా జిల్లా ప్రత్యేక అధికారి కె. వి.ఎన్ చక్రధర్ బాబు జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ జి.విద్యాదరితో కలసి శనివారం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్నారు. దర్శనార్థం విచ్చేసిన జిల్లా ప్రత్యేక అధికారి తొలుత ఆలయ అతిథి గృహానికి చేరుకోగా ఆలయ ఈఓ పెంచల కిశోర్ స్వా గతం పలికారు. ఆలయానికి విచ్చేసిన జిల్లా ప్రత్యేక అధికారికి ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనానంతరం జిల్లా ప్రత్యేక అధికారికి వేద పండితులు వేద ఆశీర్వాదం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, ఐరాల తహశీల్దార్ మహేష్ కుమార్, ఆలయ ఏఈఓ కృష్ణారెడ్డి, రవీంద్ర బాబు పాల్గొన్నారు. జిల్లాకు ‘పది’ పరీక్షల అబ్జర్వర్ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో శ్రీపదిశ్రీ పబ్లిక్ పరీక్షల పర్యవేక్షణకు అబ్జర్వర్‌గా నియమితులైన జ్యోతిర్మయి శనివారం జిల్లా కేంద్రానికి వచ్చారు. విశాఖపట్టణం డైట్ కళాశాల ప్రిన్సిపల్ గా విధులు నిర్వహిస్తున్న ఆమెను జిల్లా పదో తరగతి పరీక్షల అబ్జర్వర్‌గా నియమించారు. ఆమె మార్చి 17వ తేదీ నుంచి ఏప్రిల్1వ తేదీ వరకు పది పరీక్షలను పర్యవేక్షిస్తారు. జిల్లాలోని పలు పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేయనున్నారు. పరీక్షల నిర్వహణలో పాటించాల్సిన నియమ, నిబంధనలను ఆదివారం చీఫ్, డిపార్ట్మెంట్ అధికారులకు సూచనలు ఇవ్వనున్నారు. అక్రమ గ్రానైట్‌కు రూ.16.91 లక్షల జరిమానా శాంతిపురం : అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తూ పట్టుబడిన నాలుగు లారీలకు రూ16,91,866 జరిమానా విధించినట్లు రాళ్లబూదుగూరు ఎస్ఐ నరేష్ తెలిపారు. ఈనెల 5న కృష్ణపట్టణం ఓడ రేవుకు రవాణా అవుతున్న 4 లారీలను కుప్పం–మదనపల్లి జాతీయ రహదారిపై మొరసనపల్లి వద్ద పోలీసులు పట్టుకున్నారు. లారీలను సీజ్ చేసి మైన్స్, కమర్షియల్ ట్యాక్స్, రవాణా శాఖలకు సమాచారం అందివ్వడంతో ఆయా శాఖల అధికారులు గ్రానైట్ బ్లాకులను పరిశీలించి జరిమానాలను ఖరారు చేశారు. గనులు, భూగర్భ వనరుల శాఖ రూ 9,92,066, వాణిజ్య పన్నుల శాఖ రూ.3 లక్షలు, రవాణా శాఖ రూ 3,99,800 జరిమానా విధించాయని ఎస్ఐ చెప్పారు. అక్రమ రవాణా చేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. -
● హత్య ఘటనపై పుంగనూరు సీఐ, హెడ్ కానిస్టేబుల్ సస్పెన్షన్
మొన్న అభినందన.. నిన్న అభిశంసన చిత్తూరు అర్బన్/పుంగనూరు : పుంగనూరు సీఐ శ్రీనివాసులు, హెడ్ కానిస్టేబుల్ సుబ్రమణ్యంను సస్పెండ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు వెలువడ్డాయి. పుంగనూరు మండలం ఒంటిమిట్ట గ్రామంలో శుక్రవారం రాత్రి లక్ష్మీనరసింహ స్వామి ఊరేగింపులో వెంకటరమణ, రామకృష్ణ కుటుంబాలు గొడవ పడ్డాయి. ఈ క్రమంలో శనివారం రామకృష్ణ హత్యకు గురయ్యాడు. ఈ వ్యవహారంలో నివేదిక ఇవ్వాలని డీఐజీ నుంచి ఆదేశాలు రావడంతో.. ఎస్పీ మణికంఠ ప్రాథమికంగా విచారించారు. సీఐ నిర్లక్ష్యంతో పాటు హెడ్ కానిస్టేబుల్ పనితీరు బాగలేదని ఎస్పీ నివేదిక ఇచ్చారు. దీంతో వీరిద్దరినీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. కాగా రెండు రోజుల కిందట చిత్తూరులో జరిగిన నేర సమీక్ష సమావేశంలో.. సీఐ శ్రీనివాసులు తన ఉత్తమ పనితీరుకు గానూ ఎస్పీ మణికంఠ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. సరిగ్గా 24 గంటలు ముగిసేరికి ఆయన్ను విధుల నుంచి సస్పెండ్ చేయడం పోలీసుశాఖలో చర్చనీయాంశంగా మారింది. కేవలం అధికారపార్టీ సానుభూతిపరులకు ఏదైనా జరిగితే ఒకలా.. ప్రతి పక్ష పార్టీ మద్దతుదారులపై దాడులు జరిగితే మరోలా వ్యవహరిస్తుండం విమర్శలకు తావిస్తోంది.పోలీసుశాఖలో ‘స్వచ్ఛాంధ్ర’ చిత్తూరు అర్బన్ : నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయం, ఆర్ముడు రిజర్వు కార్యాలయం, పోలీస్ స్టేషన్లలో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. చిత్తూరులోని పోలీసు కార్యాలయంలో ఏఎస్పీలు రాజశేఖర్‌రాజు, శివానంద కిషోర్ కలిసి మొక్కలు నాటారు. ఏఆర్ డీఎస్పీ మహబూబ్‌బాష, ఆర్ఐ సుధాకర్ పాల్గొన్నారు. -
స్వచ్ఛత పాటించాలి : డీఆర్ఓ
చిత్తూరు కలెక్టరేట్ : ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా పెట్టుకోవాలని డీఆర్ఓ మోహన్‌కుమార్ అన్నారు. శనివారం కలెక్టరేట్లో స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. కలెక్టరేట్లోని పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. డీఆర్ఓ మాట్లాడుతూ.. ప్రతి మూడో శనివారం స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లోని ప్రాంగణాలను పరిశుభ్రంగా పెట్టుకోవాలని చెప్పారు. అనంతరం స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్లోని అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సమయం కేటాయించాలి.. ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతకు సమయం కేటాయించాలని సమగ్రశిక్ష శాఖ ఏపీసీ వెంకటరమణ అన్నారు. శనివారం డీఈఓ కార్యాలయంలో స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. కార్యాలయ సిబ్బందితో స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు. తమ వంతు కృషి గా స్వచ్ఛత కార్యక్రమాలకు శ్రమదానం చేయాలన్నారు. కార్యక్రమంలో పలువురు సిబ్బంది పాల్గొన్నారు. -
అభివృద్ధికి అడ్డుపడితే సహించేది లేదు ..
కార్వేటినగరం : నియోజకవర్గం అభివృద్ధికి అడ్డుపడితే ఎవరినీ సహించబోనని, అయ్యా అయ్యా అంటూ సలాం కొట్టేవాడిని కాదు..నన్ను రెచ్చగొడితే వేరే లాంగ్వేజ్‌లో మాట్లాడుతా అని జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ టీడీపీ నాయకులపై నిప్పులు చెరిగారు. శనివారం పెనుమూరులో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అయ్యా, అయ్యా అంటూ అగ్రకులస్తుల కు సలాం కొట్టే వాడ్ని నేను కాదూ. నన్ను రెచ్చ గొడితే ఎవ్వరనని చూడను వేరే భాషలో మాట్లా డుతా అని టీడీపీ నాయకులను హెచ్చరించారు. మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు అందరూ అధికార పార్టీకి మారినప్పుడు ఏమయ్యారు మీరంతా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీలో ఉంటూ తనని విమర్శించే వారిని క్షమించబోనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నేను ఆర్డినరీ ఎమ్మెల్యేను కానూ ప్రపంచ దేశాలను చుట్టి వచ్చిన మేధావిని, నాకు ప్రపంచ దేశాల్లో కార్లు, బంగళాలు ఉన్నాయి. వేరేవారి వద్ద మీ పప్పులు ఉడకవు కాబట్టే ఈ థామస్ వద్ద చూపిస్తున్నారు. మీడియా ముందు కాబట్టి పచ్చి బూతులు తిట్టలేకపోతున్నా..అంటూ టీడీపీలో ఉంటూ తనపై విమర్శలు చేస్తున్న వారిపై ఎమ్మెల్యే విరుచుకుపడ్డాడు. నేను దళితుడనే చులకన భావంతో చూస్తున్నారా...? నేను దళితుడైనంత మాత్రం మీకు వంగి వంగి సలాంలు కొట్టాలా..? నాకు అంతటి కర్మ పట్టలేదు. నాకు తిక్కరేగిందా మీ అంతు చూస్తానని హెచ్చరించారు. దళితుడంటే అంత చులకనా మీకు మీరు ఎవ్వరితోనైనా పెట్టుకొండి ఈ థామస్‌తో డ్రామా లు ఆడితే మీకు తగిన గుణపాఠం నేర్పేందుకు సిద్ధంగా ఉంటా పేదల కోసం రాజకీయానికి వచ్చా, మీకు వంగి, వంగి నమస్కారాలు చేసేందుకు కాదని దుయ్యబట్టారు. ఎస్సీ సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేయడానికే ఎస్సీ నియోజకవర్గంగా కేటాయించారు. ఎస్సీలను తక్కువ చూస్తే ఊరుకునేది లేదని పత్రికలు కూడా ఎస్సీల అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. దళితుడు అయితే వంగి సలాం కొట్టాలా? మేయర్లు, డిప్యూటీ మేయర్లు మారినప్పుడు ఏమయ్యారు మీరంతా దళితులను చిన్న చూపు చూస్తే ఊరుకొనేది లేదు టీడీపీ నాయకులపై ఎమ్మెల్యే థామస్ ఫైర్ -
వ్యక్తిగత గొడవలతో హత్య
● నిందితుడు, బాధితులు బంధువులే పుంగనూరు : వ్యక్తిగత గొడవల కారణంగా పుంగనూరు మండలంలో ఓ యువకుడు దూరపు బంధువును శనివారం హత్య చేశాడు. వివరాలిలా ఉన్నాయి. పుంగనూరు మండలం కృష్ణాపురానికి చెందిన రామకృష్ణ (55), ఆయన కుమారుడు సురేష్ ఈనెల 10న ట్రాక్టర్‌తో మట్టి తోలుకుంటుండగా అదే గ్రామానికి చెందిన దూరపు బంధువులైన వెంకటరమణ, అతని కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. తమ ఇంటి ముందుగా ట్రాక్టర్ వెళ్లకూడదని గొడవ పడ్డారు. ఈ క్రమంలో ఇరువర్గాల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం రాత్రి ఒంటిమిట్ట గ్రామంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలు జరిగాయి. ఆ సమయంలో రామకృష్ణ కుటుంబ సభ్యులు, వెంకటరమణను కించ పరుస్తూ ప్రవర్తించడంతో ఇరువురి మధ్య వివాదం చెలరేగింది. దీనిని గమనించిన పోలీసులు ఇరువురికి సర్దిచెప్పి పంపేశారు. ఈ క్రమంలో శనివారం ఉదయం రామకృష్ణ, ఆయన కుమారుడు సురేష్‌పై వెంకట రమణ కొడవలితో దాడి చేశాడు. ఇద్దరూ తీవ్రంగా గాయ పడడంతో మదనపల్లె ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో రామకృష్ణ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న వెంటనే పలమనేరు డీఎస్పీ ప్రభాకర్, సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. గ్రామంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మృతదేహాన్ని పోస్టు మార్టానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆస్పత్రి వద్ద ఆందోళన.. ఈ కేసులో పోలీసులు సక్రమంగా విధులు నిర్వహించలేదని, బాధిత కుటుంబం మదనపల్లె ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టింది. గతంలో నిందితుడికి, హతుడికి జరిగిన కేసుల్లో పోలీసులు సక్రమంగా విధులు నిర్వహించలేదని ఆరోపించారు. పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి, టీడీపీ పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జి చల్లా రామచంద్రారెడ్డి మదనపల్లెలో బాధిత కుటుంబీకులను పరామర్శించారు. -
రేసు కుక్కల దాడి.. 10 మేకలు బలి
కార్వేటినగరం : రేసు కుక్కలు (అడవి కుక్కలు) దాడి చేసి 10 మేకలను బలి తీసుకున్న సంఘటన మండల పరిధిలోని టీకేఎం పేట గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు కథనం మేరకు వివరాలు ఇలా.. టీకేఎం పేట గ్రామానికి చెందిన ఏసునాధ, సుందరమ్మకు చెందిన మేకలను ఇంటి ఆవరణలో ఉంచగా గురువారం రాత్రి రేసు కుక్కలు దాడిచేసి ఏసునాధన్ఽకు చెందిన 6 మేకలను, అలాగే సుందరమ్మకు చెందిన 4 మేకలపై దాడి చేసి గాయపరచడంతో 10 మేకలు మృతి చెందాయి. మేకలపై ఆధారపడి జీవనం గడుపుతున్నారని పేర్కొన్నారు. -
ఒంటరి ఏనుగు బీభత్సం
– పంట పొలాలు ధ్వంసం గుడిపాల: ఒంటరి ఏనుగు హల్చల్ చేసింది. పంట పొలాలను ధ్వంసం చేసింది. వెప్పాలమానుచేను, పిళ్లారికుప్పం, అడవిచేను గ్రామాల్లోని పలు రైతులకు సంబంధించిన వరి , అరటి, కొబ్బరి తోటలను నాశనం చేసింది. పిళ్లారికుప్పంలో కొబ్బరి చెట్ల అడుగు భాగం మొత్తాన్ని తినేసింది. గుడిపాల మండలంలోని పిళ్లారికుప్పం, పాపసముద్రం, అడవిచేను, బండపల్లె, చిత్తపార ప్రాంతాల్లో వరి పంటను రైతులు అత్యధికంగా సాగు చేశారు. ప్రస్తుతం ఏనుగు ఆ ప్రాంతం వైపే ఉండడంతో రైతులు భయాందోళన చెందుతున్నారు. పొలాల వద్దకు రాత్రి వేళల్లో వెళ్లవద్దు రైతులు రాత్రి వేళల్లో పొలాల వద్దకు వెళ్లవద్దని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. ఏ సమయంలో ఏ ప్రాంతంలోకి ఒంటరి ఏనుగు సంచరిస్తుందో తెలియడం లేదని రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. పాడి పశువులను కొంత మంది రైతులు పొలాల వద్ద కట్టేస్తున్నారని వాటిని ఇంటి వద్దకు తీసుకువెళ్లాలని సూచించారు. పంట నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం అందజేస్తామని డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఆనందరెడ్డి తెలిపారు. -
‘స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర’ను విజయవంతం చేయండి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ సుమత్ కుమార్ గాంధీ తెలిపారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా మూడో శనివారాన్ని స్వచ్ఛాంధ్ర దినోత్సవం గా ప్రకటించిందన్నారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్రలో ప్రతి నెలా ఒక ఇతివృత్తంతో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ నెల 15వ తేదీన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం పునర్వినియోగ వస్తువుల ప్రోత్సాహం (ఎస్ఏఎస్ఏ) ప్రధాన అంశంగా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పట్టణాలు, గ్రామాలు, పారిశ్రామిక, వాణిజ్య ప్రాంతాలు, ఆస్పత్రులు, విద్యాసంస్థలు, సంక్షేమ వసతిగృహాలు, అంగన్వాడీ తదితర కేంద్రాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను పకడ్బందీగా చేపట్టాలన్నారు. నిత్య జీవితంలో స్వచ్ఛత భాగం కావాలన్నారు. స్వచ్ఛత ప్రాముఖ్యతను తెలిపేలా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం పునర్వినియోగ వస్తువుల ప్రోత్సాహంపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రతి శాఖలో కార్యక్రమాలు నిర్వహించి, వివరాలను స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రయాప్లో తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని ఆదేశించారు. -
పచ్చ‘ప్రళయం’
డ్రైవర్స్ కాలనీలో పచ్చప్రళయం కొనసాగు తోంది.సర్కారు అండతో తెలుగు తమ్ముళ్లు గూండా గిరి చేస్తున్నారు.గణేశా అని సంబోధించాలి వరసిద్ధుడి ఆలయంలో అధికారులు, సిబ్బంది సెల్‌ఫోన్, సెట్లో తొలుత గణేశా అని సంబోధించాలని ఈఓ తెలిపారు.శనివారం శ్రీ 15 శ్రీ మార్చి శ్రీ 2025కాణిపాకం/చిత్తూరు కార్పొరేషన్: క్రయ విక్రయాల్లో సాంకేతిక పరిజ్ఞానం పెరిగినా అవేమీ మోసాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. కల్తీ విక్రయాలు ఆగడం లేదు. ఈ తరుణంలో ఏం చేయాలి.. ఎవరికి ఫిర్యాదు చేయాలన్న విషయం నేటికీ చాలా మందిలో అవగాహన లేదు. ఈ తరుణంలో వినియోగదారులు మేలుకోవాలని పలు శాఖల అధికారులు హెచ్చరిస్తున్నారు. కొనే ముందు పలు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. మార్కెట్లో మోసాలను పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుంది. చల్లగా దోచేస్తున్నారు అసలే వేసవికాలం.. మంచినీటి ప్యాకెట్లు, ఐస్‌క్రీమ్‌లు, శీతల పానీయాలకు గిరాకీ ఎక్కువ. ఇదే అదనుగా కొంతమంది అక్రమార్కులు.. సరైన ముద్రలు, బిల్లులు లేకుండానే నాసిరకం సరుకును మార్కెట్లోకి వదిలేస్తున్నారు. తయారీ తేదీ లేకుండానే లక్షల కొద్దీ నీళ్ల ప్యాకెట్లను విక్రయించేస్తున్నారు. వీటిపై అధికారులు 31 కేసులు నమోదు చేసి, రూ.75,500 అపరాధం విధించారు. తప్పుల తక్కెడ వే బ్రిడ్జిలపై గత ఆర్థిక సంవత్సరంలో 17 కేసులు నమోదయ్యాయి. హోల్‌సేల్ డీలర్లపై 5, రిటైల్ డీలర్లపై 79 కేసులను నమోదు చేశారు. చౌక దుకాణాల్లో మోసాలపై 16 కేసులు నమోదయ్యాయి. డీలర్లు తూకంలో డబ్బాలు పెట్టి మోసాలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. బియ్యం మిల్లులపై 37, ఎరువుల దుకాణాలపై 25 కేసులు నమోదుయ్యాయి. ఇంధనం ● పెట్రోల్, డీజల్ నింపడానికి ముందు మీటర్ రీడింగ్ 0లో ఉందో లేదో చూడాలి. ● బంకు సిబ్బంది మాటల్లో పెట్టి దృష్టి మరల్చి రీడింగ్ జంప్ చేయడానికి ప్రయత్నిస్తే అడ్డుకోవాలి. ● అనుమానం వస్తే బంకులోని ముద్రతతో ఉన్న ఐదు లీటర్ల పరిమాణం గల కొలత పాత్ర ద్వారా సరిచూసుకోవచ్చు. ● కొనుగోలు చేసిన పెట్రోలు/డీజిలు సరైన ధర చెల్లిస్తున్నారో? లేదో గమనించి బిల్లు తీసుకోవాలి. ● ఇంధనం నాణ్యత మీద అనుమానం ఉంటే బంకు దగ్గరున్న ఫిల్టర్ పేపర్ తీసుకుని ఒక చుక్క పెట్రోలు దానిపై వేయాలి. రెండు నిమిషాల్లో ఎలాంటి మరక లేకుండా ఆవిరైతే నాణ్యత ఉందని అర్థం. ● తూనికలు కొలతల చట్టం నిబంధనలు రూల్ 10 షెడ్యూలు 1 టేబుల్ 2 ప్రకారం ఎరువులు, విత్త నాలు, సిమెంటు, బియ్యం వినియోగదారుల సమక్షంలోనే తూకం వేసి, ప్యాకేజీపై ముద్రించిన నికర బరువు ఉందో లేదో సరిచూసి డెలివరీ ఇవ్వాలి. ● వ్యాపారుల దగ్గర తప్పనిసరిగా ప్యాకేజీలను తూకం వేసే పరికరం ఉండాలి. ● వ్యాపారులు ఉపయోగిస్తున్న తూనిక పరికరం తూనికలు కొలతల శాఖకు చూపించి ముద్రలు వేయించుకుని ధ్రువీకరణ పత్రం పొందాలి. దీన్ని పరికరం దగ్గరే స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలి. ● వ్యాపార స్థలంలో ఉన్న ప్యాకేజీలపై లీగల్ మెట్రాలజీ చట్టం, నిబంధనల ప్రకారం అన్ని అంశాలు తప్పనిసరిగా ముద్రించి ఉండాలి. ఇఫ్తార్ సహర్ శనివారం (సా) ఆదివారం (ఉ) చిత్తూరు 6–29 5–00 పుంగనూరు 6–30 5–04బంగారు కొనుగోలులో భద్రం ● ఆభరణాల్లో రాళ్లకు, బంగారానికి వేర్వేరుగా తూకం వేస్తున్నారో లేదో గమనించాలి. చెల్లించిన సొమ్ముకు సరిపడా తూకం గల బంగారు ఆభరణాలు అందుతున్నాయో? లేదో తూనిక యంత్రంపై సరిచూసుకోవాలి. ● బంగారం నగల రశీదు (బిల్లు)లో స్వచ్ఛత (క్యారటేజ్) తెలియజేశారో లేదో గమనించండి. ● రశీదులో స్వచ్ఛతకు అనుగుణంగా బంగారం గ్రాము ధర ఉందో లేదో చూడండి. ● బంగారు నగలు కొన్నప్పుడు ఒక మిల్లీ గ్రాము వరకు కచ్చితత్వం గల ఎలక్ట్రానిక్ తూనిక యంత్రం వాడుతున్నారో? లేదో గమనించాలి. ● బంగారు నగలు తూకం వేసే ఎలక్ట్రానిక్ కాటాపై తూనికలు కొలతల శాఖ సీలు ఉందో? లేదో చూడాలి. హక్కులు తెలుసుకోవాలి వినియోగదారులు మరింత చెతన్యవంతులు కావాల్సి ఉంది. ప్రతి కొనుగోలుకు తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలి. మోసాలు జరిగినట్లు గుర్తిస్తే ప్రశ్నించడానికి ఈ బిల్లులే ఆధారం అవుతాయి. ఎవరైనా మోసాపోయాం అని అధికారుల ఫిర్యాదు చేసినా వారికి అండగా ఉంటాం. బాధితులకు న్యాయం జరిగేంత వరకు సహకారం అందిస్తాం. వినియోగదారులు కచ్చితంగా హక్కులపై అవగాహన కలిగి ఉండాలి. – శేషాద్రి జిల్లా వినియోగదారులసంఘ అధ్యక్షుడు, చిత్తూరు 1967కు కాల్ చేయండి వస్తువుల కోనుగోలులో సమస్యలుంటే 1967 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేయండి. తూకం, కొలతల్లో తూనికల కొలతలశాఖ ముద్ర ఉండాలి. ఏ వస్తువు అయిన ఎమ్మార్పీ కంటే ఎక్కవ ధరకు విక్రయించకూడదు. జిల్లాలో గత 11 నెలల్లో డీసీ సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు పలు దుకాణల్లో తనిఖీలు చేసి 721 కేసులు నమోదు చేసి రూ.80 లక్షల వరకు జరిమానా విధించాం. వినియోగదారులకు ఎటువంటి సమస్య ఉన్న టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి తెలుపవచ్చు. మాకు వచ్చే ఫిర్యాదులపై చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. – స్వామి, సహాయకమిషనర్, తూనికల కొలతలశాఖ ●– 8లో– 8లో– 8లోన్యూస్రీల్నేటి నుంచే ఒంటిపూట బడులు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఈ నెల 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు శుక్రవారం డీఈఓ కార్యాలయానికి చేరా యి. ఆ ఉత్తర్వుల మేరకు జిల్లాలోని అన్ని యాజ మాన్య పాఠశాలలు శనివారం నుంచి ఒంటి పూ ట బడులను తప్పనిసరిగా అమలు చేయాలన్నా రు. ప్రైవేట్ యాజమాన్యాలు పూర్తి రోజు పాఠశాలలు నిర్వహిస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పాఠశాలలు నిర్వహించాలన్నారు. అలాగే పదో తరగతి పబ్లిక్ పరీక్ష కేంద్రాలున్న పాఠశాలలు మాత్రం మధ్యాహ్నం 1.15 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పాఠశాలలు నిర్వహించాలని పే ర్కొన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా పంచాయతీ, ఆర్డబ్ల్యూఎస్ అధికారుల సహకారంతో పాఠశా లల్లో తాగునీటి వసతి ఏర్పాటు చేసుకోవాలన్నా రు. వైద్య ఆరోగ్యశాఖ అధికారుల సహకారంతో ఓఆర్ఎస్ ప్యాకెట్లు ప్రతి పాఠశాలలో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలోని డీవైఈఓ, ఎంఈఓలు తమ పరిధిలోని పాఠశాలలను పర్యవేక్షించాలన్నారు. సెలవులో కలెక్టర్ – ఇన్చార్జి కలెక్టర్‌గా విద్యాధరి చిత్తూరు కలెక్టరేట్: వ్యక్తిగత పనుల నిమిత్తం కలెక్టర్ సెలవు పెట్టడంతో ఇన్చార్జి కలెక్టర్‌గా విద్యా ధరి అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు కలెక్టర్ సు మిత్‌కుమార్ గాంధీ సెలవు పెట్టారు. అప్పటి వర కు జాయింట్ కలెక్టర్ విద్యాధరి కలెక్టర్‌గా వ్యవహరించనున్నారు. మామూళ్లు ఇవ్వలేదని.. హైవే మట్టి తరలింపునకు బ్రేకులు చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు –తచ్చూ రు హైవే రోడ్డుకు మట్టి తరలిస్తుంటే కూటమినేతలు అడ్డుపడ్డారు. ఇస్తే మామూళ్లు ఇవ్వండి.. లేదంటే ఆపేయండి అంటూ కూటమి నేతలు మ ట్టి తరలింపును పట్టుబట్టి ఆపేశారు. ఈ రోడ్డుకు చిత్తూరు మండలం పెరుమాళ్లకండ్రిగ పంచా యతీ వరదరాజులపల్లి సమీపంలోని గుట్టలో మ ట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. దీనిని పసిగట్టిన కూటమినేతలిద్దరు కొండెక్కి కూర్చుకున్నారు. ఐదుగురితో కలిసి బుధవారం రాత్రి హైవేకు మ ట్టి తరలిస్తున్న వ్యక్తితో బేరసాలు చేయాలని చూ శారు. ఆ బేరం తెగకపోవడంతో రోడ్డు పాడవుతోందని సాకు చూపి ఊళ్లో పంచాయితీ పెట్టించారు. ఆ పెద్దమనుషులు వీరి ఆగడాలు తెలిసి అది రెవెన్యూ అధికారులు చూసుకుంటారు..మా కు సంబంధం లేదని చేతులెత్తేశారు. చేసేదీ లేక మండల నాయకుల సాయం తీసుకుని రెవెన్యూ అధికారులపై ఒత్తిడి పెంచారు. పట్టుబట్టి మట్టి తరలింపును ఆపేశారు. దీంతో హైవేకు మట్టితరలిస్తున్న నిర్వాహకులు కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది. తక్కువ తూకం..నాణ్యత లోపం..గడువుకు ముందే దెబ్బతినడం..నిర్లక్ష్యసమాధానం..బాధ్యతారాహిత్యం.. నిత్యావసర వస్తువుల మొదలు అత్యాధునిక ఎలక్ట్రానిక్ పరికరాల వరకు ముందు..వెనుక దగా.. చివరకు నష్టపోయేది వినియోగదారుడే. ఈ లోపాలపై ప్రశ్నిస్తే తమకు సంబంధం లేదంటూ చేతులు దులిపేసుకుంటున్నారు వ్యాపారులు. ఇలాంటి సందర్భాల్లో చట్టం ఏమీ చేయాలో తెలియని కొనుగోలుదారుడికి రక్షణగా చట్టం ఉంది. దాని ద్వారా ప్రశ్నించే హక్కు ఉంది. మనం చేయాల్సింది వినియోగించుకుని మేలుకోవడమే. నేడు జాతీయ వినియోగదారుల దినోత్సవ సందర్భంగా సాక్షి ప్రత్యేక కథనం. క్రయ.. విక్రయాల్లో ప్రజలు అయోమయం తూకాల్లో మోసాలు జోరుగా కల్తీలు మోసాలు, కల్తీలపై ప్రజలకు అవగాహన లేమి మేల్కోవాలంటున్న అధికారులు వ్యాపారం కేసులు అపరాధ రుసుం (రూపాయిల్లో) పెట్రోల్, ఎల్పీజీ 10 1,93,000 బంగారు దుకాణాలు 2 3,00,000 ఐరన్, స్టీల్ 13 88,500 హార్డ్‌వేర్ 109 4,29,000 రైతుబజార్ 18 15,000 మాంసం దుకాణాలు 36 39,000 ఎలక్ట్రానిక్స్ 15 57,000 టెక్స్టైల్స్ 5 1,49,000 రేషన్‌షాపులు 16 42,500 ఆయిల్ దుకాణాలు 8 64,500 స్వీట్స్ 24 1,34,000 రైస్‌మిల్లు, దుకాణాలు 37 3,00,000 వెయింగ్ బ్రిడ్జిలు 17 5,93,000 డిస్పెన్సింగ్పంపులు 6 2,39,000 ఈ–కామర్స్ 6 4,60,000 తూనికల కొలతలపై ఫిర్యాదులకు.. చిత్తూరు డివిజన్ – 78938 13707 చిత్తూరు, జీడీనెల్లూరు, పూతలపట్టు నియోజకవర్గాలు, నగరి, నిండ్ర, విజయపురం మండలాలు పలమనేరు డివిజన్ – 97044 95165 పలమనేరు, కుప్పం, పుంగనూరు నియోజకవర్గాలు వినియోగదారుడా మేలుకో.. ప్యాకేజీలపై ముద్రించిన బరువు కచ్చితంగా ఉందో లేదో ఎలక్ట్రానిక్ కాటాలో సరిచూసుకోవాలి. తూనిక రాయి అడుగు భాగాన ముద్రిత సంవత్సరం, విభాగం, ఇన్స్పెక్టర్ సంఖ్య ఉన్నాయో? లేదో చూడాలి. పాత్రలకు సొట్టలున్నాయేమో? గమనించాలి. ఎలక్ట్రానిక్ కాటాపై ప్రామాణిక తూకం రాళ్లు పెట్టి అది సరిగా పనిచేస్తుందో? లేదో చూడాలి. ఎలక్ట్రానిక్ కాటాపై ఉన్న ఏ బటన్ నొక్కినా తేడా కనిపించకూడదు. ప్యాకేజీ వస్తువులపై తయారీ తేదీ, నెల, సంవత్సరం.. తయారీదారు పూర్తి చి రునామా ఫోన్ నంబర్, ఈ–మెయిల్ చిరునామా ఉన్నాయో? లేవో చూసుకోవాలి. ప్యాకేజీలు ఆకర్షణీయంగా ఉన్నంత మాత్రాన నాణ్యమైన సరకులని భావించొద్దు. ఆకర్షణీయమైన ప్రకటనలు చూసీ మోసపోవద్దు. జంబో సైజు, ఎకానమీ సైజు వస్తువుల కొనుగోలులోనూ అప్రమత్తంగా ఉండాలి. మార్పు దిశగా.. సినిమా థియేటర్లల్లో అధిక ధరలను నియంత్రించే దిశగా 629 జీఎస్ఆర్ ఉత్తర్వులు అమల్లోకొచ్చాయి. దీని ప్రకారం వస్తువులపై ధరలు పెంచి ముద్రించకూడదు..అధిక ధరలకు విక్రయించకూడదు. ఒకే కంపెనీ ఉత్పత్తిని వేర్వేరు చోట్ల రెండు రకాల ధరలతో విక్రయించకూడదు. అయితే కొన్నిచోట్ల ప్రీమియం ప్రోడక్టుల పేరుతో పానీయాలు, ఇతర సరుకులను వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. లూజు అమ్మకాలపై నియంత్రణ లేకపోవటంతో తినుబండారాలు, శీతల పానీయాలకు అధిక ధరలు వసూలు చేస్తున్నారు. థియేటర్లలో అధిక ధరలపై 22 కేసులు నమోదు కాగా, రూ.1,32,500 అపరాధం వసూలు చేశారు. పెట్రోలు బంకుల్లో మోసాల నుంచి గట్టేక్కేందుకు కంపెనీలు ఐరన్ కేసింగ్ సీజ్ చేసిన పల్సర్ యూనిట్లను వాడుతున్నాయి. దీన్ని మార్చాలని విడదీస్తే మళ్లీ కొత్త పరికరాన్ని వేసుకోవాల్సిందే. అయినా మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ రకం మోసాలపై అధికారులు 36 కేసులు నమోదు చేసి, రూ.3 లక్షలు అపరాధం విధించారు. బంగారం తూకాల్లో మోసాలను నియంత్రించేందుకు ఎక్స్ఆర్ఎఫ్ యంత్రాలు అందుబాటులోకి రానున్నాయి. సాంకేతికతతో కూడిన మైక్రోస్కోప్ ఫోకస్ ఎక్స్‌రే ఫ్లోరోసెస్స్ యంత్రం ఆధారంగా ఆభరణం స్వచ్ఛతతోపాటు అందులో కలిసిన ఇతర లోహాల స్థాయి, అమర్చిన రాళ్ల బరువునూ లెక్కలతో సహా చెప్పి బిల్లు ఇస్తుంది. త్వరలో నగరానికి ఈ యంత్రం రానుంది. తూనికలు–కొలతల శాఖ కార్యాలయంలో ఆన్లైన్ ప్రక్రియ అమల్లోకి వచ్చింది. ముద్రలు వేశాక ఇచ్చే ధ్రువీకరణ పత్రాలు (వీసీ), ప్యాకింగ్ లైసెన్సులు, కాటాల తయారీ లైసెన్సులు, మరమ్మతుల డీలర్ల లైసెన్సుల ప్రక్రియలన్నీ ఆన్లైన్లోనే. గ్యాస్ బండారం గ్యాస్ సిలిండర్లపై ముద్రితమైన బరువు తప్ప.. వాస్తవంగా ఎంత ఉందో అంచనా ఉండదు. వినియోగదారుడి ఎదుట బరువు తూ.చ. తప్పక అందించాలన్న నిబంధన అమలు కావడంలేదు. ప్లాంట్ల స్థాయి నుంచే మోసాలుంటున్నాయి. ఎల్పీజీ సిలిండర్లలో మోసాలపై గతేడాది 10 కేసులు నమోదుకాగా రూ.1.93 లక్షల అపరాధ రుసుమును వసూలైంది. -
వినియోగించుకుంటే వజ్రాయుధమే
వస్తు రూపంలోనో.. సేవల రూపంలోనో మనిషి మోసపోతూనే ఉంటాడు. ఇలాంటి పరిస్థితిలో వినియోగదారుడికి అండగా నిలుస్తుంది వినియోగదారుల ఫోరమ్. ఈ ఫోరం మెట్లు ఒక్కసారి ఎక్కితే కొనుగోలుదారుడికి తప్పక న్యాయం జరుగుతుంది. దీన్ని వినియోగించుకుంటే వజ్రాయుధంగా పనిచేస్తుంది. చిత్తూరు అర్బన్: కొన్న వస్తువు నాణ్యత లేకపోయినా.. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి రూ.వేలల్లో బిల్లు చెల్లిస్తే సరిగా పట్టించుకోకపోయినా.. హోటల్లో రూ.40 వెచ్చించి తిన్న ఇడ్లీ బాగలేపోయినా.. ఓ సామాన్యుడి కడుపు మండిపోతుంది. ఎందుకంటే రూపాయి సంపాదించడానికి అతడు పడే కష్టం అలాంటిది. అలాంటి సామాన్యుడికి రక్షణ కల్పించడానికి అండగా నిలుస్తుంది వినియోగదారుల కమిషన్. అంతర్జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వినియోగదారుల కమిషన్ పనితీరుపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. అంతర్జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వినియోగదారుల కమిషన్ పనితీరుపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. తప్పనిసరి న్యాయం వాస్తవానికి లోపరహిత వస్తుసేవలు పొందడం అందరి హక్కు. చాలా సంస్థలు నైతికతకు నీళ్లొదిలి నాసిరకం వస్తువులు, సరకులు, సేవలను అంటగడుతున్నాయి. తద్వారా వినియోగదారుల ప్రయోజనాలను అవి తుంగలో తొక్కుతున్నాయి. ఈ క్రమంలో ఒక వ్యక్తి కొన్న వస్తువు సరిగ్గా పనిచేయకపోయినా, పొందిన సేవలో లోపం ఉన్నా ఆ వ్యక్తి వినియోగదారుల కమిషన్ మెట్లెక్కవచ్చు. ఒక్కసారి కమిషన్‌లో తనకు జరిగిన మోసంపై తగిన ఆధారాలతో ఫిర్యాదు చేస్తే తప్పకుండా న్యాయం జరుగుతుంది. వినియోగదారుడిని రక్షించడంతో పాటు మోసపోయిన వారికి న్యా యం చేయాలనే లక్ష్యంతో ఏర్పాటయ్యిందే ‘జిల్లా వినియోగదారుల కమిషన్’. వినియోగదారుల కమిషన్ ఎలా పనిచేస్తుందంటే..! చట్టంలో ఇలా..! 1986లో భారత ప్రభుత్వం వినియోగదారుల రక్షణ కోసం ఓ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. అదే వినియోగదారుల పరిరక్షణ చట్టం. ఈ చట్టాన్ని అమలుచేయడానికి ‘రీడ్రసల్ ఫోరమ్స్’ను ఏర్పాటు చేశా రు. మోసపోయిన వ్యక్తికి సగటు న్యాయం తప్పనిసరిగా సకాలంలో అందించాలన్నదే ఈ చట్టం లక్ష్యం. ఆర్టీసీ, రైల్వే, తపాలాశాఖ, బీఎస్ఎన్ఎల్ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు డబ్బులు కట్టించుకుని సేవలు అందించే రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు కంపెనీలు ఎవరు మోసం చేసినా కమిషన్ తలుపుకొట్టి న్యాయం పొందొచ్చు. జిల్లా స్థాయిలో వినియోగదారుల ఫోరంగా ఉన్న బెంచ్‌ను 2020 జూ లైలో వినియోగదారుల కమిషన్‌గా మార్చారు. కమిషన్‌లో వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదు లను పరిష్కరించడానికి ఓ అధ్యక్షులతోపాటు ఇద్దరు సభ్యులుగా ఉంటారు. మనం నిత్యం న్యాయస్థానాల్లో జరిగే వాదనలు, ప్రతివాదనలు లాగే ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత కమిషన్ తీర్పును వెలువరుస్తుంది. తెల్ల కాగితంపై ఫిర్యాదు.. మనకు జరిగిన అన్యాయంపై కమిషన్ ఎదుట మన తరపు వాదనను మనమే స్వీయంగా వినిపించుకోవచ్చు. న్యాయవాది అవసరం తప్పనిసరికాదు. కమిషన్‌లో ఫిర్యాదు చేసే ముందు సేవాలోపం, కొన్న వస్తువుకు సంబంధించిన బిల్లు తప్పనిసరి. ఓ తెల్లకాగితంలో తాను మోసపోయిన విధానాన్ని రాసి, సంతకం చేసి కమిషన్‌కు ఇస్తే.. ప్రతివాదికి నోటీసులు పంపిస్తారు. 90 రోజుల్లో మన కేసును పరిష్కరించాలని చట్టంలోనే రూపొందించారు. జిల్లా స్థాయిలో ఇచ్చిన తీర్పుపై సంతృప్తి చెందకుంటే రాష్ట్ర, జాతీయ స్థాయిలోని కమిషన్‌ను ఆశ్రయించే వెలుసుబాటు ఉంది. చిత్తూరులోని వినియోగదారుల కమిషన్ కార్యాలయంలో ఫోన్–08572235577 నెంబరుకు సంప్రదించి ఫిర్యాదులపై సహాయం తీసుకోవచ్చు. అవగాహనే తొలి అస్త్రం.. ఆపై చట్టం మోసపోయిన వాళ్లకు అండగా కమిషన్ ఆశ్రయిస్తే ఉచిత న్యాయసేవ.. పరిహారం నేడు అంతర్జాతీయ వినియోగదారుల దినోత్సవం ఎవరు వినియోగదారులు..? వినియోగదారుల హక్కుల చట్టం 1986 ప్రకారం తమ అవసరాల కోసం వస్తువులు కొనేవాళ్లు, సేవలు పొందే ప్రతీ ఒక్కరూ వినియోగదారుడే. కొనుగోలుదారుల అనుమతితో ఏదైనా వస్తువును, సేవలను ఉపయోగించుకునే వాళ్లు కూడా వినియోగదారులే. అంటే సమాజంలోని ప్రతీ ఒక్క వ్యక్తి ఏదో ఒకరూపంలో వినియోగదారులే అవుతారు. గెలిచిన ధీరులు చిత్తూరు నగరంలోని కొంగారెడ్డిపల్లెకు చెందిన శ్రీదేవి అనే గృహిణి ఓ రిఫ్రిజిరేటర్‌ను రూ.11 వేలు వెచ్చించి కొన్నారు. ఆర్నెళ్ల తరువాత ఫ్రిడ్జి తలుపు తుప్పు పట్టడం ప్రారంభించింది. దుకాణ యజమా నికి చెబితే పట్టించుకోలేదు. తీరా కమిషన్‌లో ఫిర్యాదు చేస్తే తగిన బిల్లులు, ఫ్రిడ్జి చూసిన కమిషన్ ఆ మహిళకు కొత్త రిఫ్రిజిరేటర్ ఇవ్వడంతో పాటు కోర్టు ఖర్చులకు రూ.3 వేలు, ఆమె పడిన మానసిక వేదనకు రూ. 10 వేలు పరిహారం ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది. పశువుల కొనుగోలు సమయంలో బీమా చేస్తే, అవి మృత్యువాత పడితే పరిహారం ఇవ్వలేదని పలమనేరుకు చెందిన వెంకటముని అనే వ్యక్తి కమిషన్‌లో కేసు వేశారు. మృతి చెందిన రెండు ఆవులకు రూ.1.20 లక్షల బీమా, కోర్టు ఖర్చులకు రూ.5 వేలు, వెంకటముని పడిన బాధకు రూ.5 వేలు పరిహారం ఇవ్వా లని కమిషన్ ఇచ్చిన తీర్పు బీమా కంపెనీల్లో బాధ్యతను పెంచినట్లయ్యింది. నాసిరకం హెల్మెట్ విక్రయించినందుకు రూ.10 వేల పరిహారం ఇవ్వాలనే కమిషన్ తీర్పును అమలుచేయనందుకు కుప్పం పట్టణానికి చెందిన శివ య్య మళ్లీ కమిషన్ తలుపు తట్టాడు. తీర్పు అమలు చేయని చిత్తూరులోని డీలర్‌కు, బెంగళూరులోని కంపెనీదారుడి అరెస్టు వారెంటు జారీ చే యడంతో వినియోగదారుడి పరిహారం ఇచ్చేశారు. -
మూసానా...మజాకానా
● కూటమి నేత అక్రమ రేషన్ వ్యాపారం గుట్టురట్టు ● తిమ్మసముద్రం కోడిగుట్టలో తాళం పగలగొట్టి రూ.1.24 లక్షలు విలువ చేసే 5టన్నుల బియ్యం స్వాధీనం ● అక్రమ వ్యాపారి టీడీపీ నేత మూసపై 6ఏ కేసు నమోదు సాక్షి టాస్క్‌ఫోర్స్: కూటమి నేత అక్రమ రేషన్ వ్యా పారం గుట్టు రట్టు అయ్యింది. అక్రమ నిల్వలు బట్టబయలయ్యాయి. రూ.1.24 లక్షలు విలువ చేసే 5 టన్ను ల బియ్యం నిల్వలను రెవెన్యూ అధికారులు, పోలీసులు తాళం పగలగొట్టి పట్టుకున్నారు. బియ్యం అక్రమ వ్యాపారిగా పేరుమోసిన కూటమి నేత మూసాపై శుక్రవారం 6ఏ కేసు నమోదు చేశారు. ఆ తర్వాత తీగా కదిలిస్తే డొంకా కదిలింది. రేషన్‌బి య్యాన్ని సన్నబియ్యంగా మార్చి రూ.లక్షల్లో ఆదా యం గడిస్తున్నట్లు అధికార వర్గాలు గుర్తించాయి. పట్టుబడింది ఇలా... చిత్తూరు నగరం మురకంబట్టు ప్రాంతంలోని తిమ్మసముద్రం కోడిగుట్టలో మూసా అనే కూటమినేత భారీగా రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ చేసినట్లు స్థానికులు పోలీసులు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. ఈ మేరకు గురువారం రాత్రి రంగంలోకి దిగిన పోలీసులు, రెవెన్యూ అధికారులకు మూసా కనిపించకుండా పోయాడు. పలుమార్లు ఫోన్ చేసిన స్పందించకపోవడంతో అక్రమ నిల్వ ఉన్న ఇంటి తాళం పగలగొట్టారు. దీంతో భారీగా అక్రమ బియ్యం నిల్వలు బయటపడ్డాయి. 5 టన్నుల బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.1.24 లక్షలుగా రెవెన్యూ అధికారులు గుర్తించారు. దీంతో ఆర్ఐ దినేష్ సమక్షంలో పంచనామా రాశారు. 6ఏ కేసు నమోదు చేశారు. ఈ కేసులో పలు విషయాలు బయటపడ్డాయి. దందా ఇలా.. మూసాకు అక్రమ రేషన్ వ్యాపారం మజాగా మారింది. కొంతమంది డీలర్లను చేతిలో వేసుకుని అక్రమ దందాకు ఆజ్యం పోస్తున్నాడు. డీలర్ల ద్వారా బల్క్‌గా రేషన్ బియ్యం సేకరించి, అక్రమ బియ్యం వ్యాపారం దర్జాగా చేసుకుంటున్నాడు. అలాగే కొంత మంది అక్రమ వ్యాపారులతో చేతులు కలిపి అక్రమ బియ్యం దందాకు తెరలేపుతున్నాడు. ఇలా భారీగా రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసుకుని సన్నబియ్యంగా మార్చేస్తున్నాడు. బ్రాండ్ పేరుతో మార్కెట్లో అమ్మకానికి పెడుతున్నారు. అధికారాన్ని అడ్డుగా పెట్టుకుని సరిహద్దులు దాటిస్తున్నాడు. సన్నబియ్యంగా మార్చిన బియ్యాన్ని లారీల్లో నింపి అధికంగా కర్ణాటకకు తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఒకసారిగా రూ. 5 లక్షలకుపైగా విలువ చేసే సరుకు హద్దులు దాటి వెళుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ విషయం ఆనోటా..ఈ నోటా పడి అలా అధికారుల చెవిలో పడడంతో అక్రమ బియ్యం గుట్టు రట్టు అయ్యింది. రెడ్‌హ్యాండెడ్‌గా చేతికి చిక్కింది. మూసాపై కేసు నమోదు చేశారు. కానీ అతని అక్రమ వ్యాపారంలో భాగమైన మరో ఇద్దరిపై కేసు నమోదు చేస్తారా? లేదా..అనేది ప్రశ్నర్థాకంగా మారింది. భారీ స్థాయిలో రేషన్ బియ్యం పట్టుబడితే కేవలం ఆ ఒక్క వ్యక్తిపై కేసు నమోదు చేయడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. టీడీపీ కన్నుసన్నల్లో జరుగుతున్న అక్రమవ్యాపారాలు బట్టబయలవుతున్నా అధికారులు చోద్యం చూడడంపై అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. సంబంధిత శాఖ అధికారులు అక్రమ వ్యాపారుల మామూళ్ల మత్తుల్లో జోగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది నిజమే..? రెండు రోజుల నుంచి అధికారులకు అక్రమ రేషన్ బియ్యం నిల్వలపై ఫిర్యాదులు జోరందుకున్నాయి. అధికారులు తాళం పగలగొట్టక ముందు 10 టన్నులకు పైగా బియ్యం ఉన్నట్లు సమాచారం. అధికార పార్టీ ఒత్తిడితో 5 టన్నులకు పైగా బియ్యాన్ని మళ్లించారని తెలుస్తోంది. ఆ తర్వాతే తాళం పగలకొట్టి మిలిగిన 5 టన్నుల బియ్యాన్ని పట్టుకున్నట్లు చూపించారనే ఆరోపణలు వస్తున్నాయి. -
విద్యుదాఘాతంతో యువకుడి దుర్మరణం
పెద్దపంజాణి: మండలంలోని చీకలదిన్నేపల్లి సమీపంలోని ఓ కోళ్ల ఫారంలో విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పెద్దపంజాణి పోలీసుల కథనం మేరకు.. చత్తీస్‌ఘడ్‌కు చెందిన సంతూ యాదవ్ కుమారుడు ఖిరసే యాదవ్ (25) ఆరు నెలల నుంచి చీకలదిన్నేపల్లి సమీపంలోని ఓ కోళ్ల ఫారంలో కూలీగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో కోళ్ల ఫారంలోని ఫ్యాన్‌ను సరిచేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యదాఘాతానికి గురై కోమాలోకి వెళ్లాడు. వెంటనే ప్రమాదాన్ని గుర్తించిన ఇతర కూలీలు 108 వాహనంలో అతన్ని పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. కోళ్లఫారం మేనేజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి ఆత్మహత్య పుంగనూరు: పట్టణంలోని భగత్‌సింగ్‌కాలనీ చెందిన అబ్దుల్వాహాబ్ కుమారుడు సయ్యద్(22) అనారోగ్యంతో శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కొన్ని రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న సయ్యద్ ఇంట్లోనే ఉరి వేసుకున్నాడు. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు కాపాడే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే మృతి చెందడంతో పోలీసులు శవాన్ని పోస్టుమార్టానికి తరలించి, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఎస్వీయూలో జర్మనీ భాష అభ్యసన కేంద్రం! తిరుపతి సిటీ : ఎస్వీయూ ఇంజినీరింగ్ కళాశాల ‘స్టడీ వింగ్స్ ఓవర్సీస్ సంస్థ’ సహకారంతో జర్మనీ భాష అభ్యసన కేంద్రాన్ని త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఉప కులపతి కార్యాలయంలో స్టడీ వింగ్స్ సంస్థ ప్రతినిధులు శుక్రవారం వర్సిటీ వీసీ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. జర్మనీలో విద్యా, ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దీని కోసం వర్సిటీ నందు ‘స్టడీ వింగ్స్ టు ఓవర్సీస్’ సంస్థ సహకారంతో జర్మనీ అభ్యసన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. సమావేశం అనంతరం సంస్థ ప్రతినిధులు ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులతో ఇంట్రాక్షన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో స్టడీ వింగ్స్ సంస్థ ప్రతినిధులు నరేంద్ర రెడ్డి, వల్లేరు సుకన్య, అధ్యాపకులు, ఇంజినీరింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. -
రైస్ మిల్లులో చోరీ
పుత్తూరు: పట్టణంలోని నెత్తం గ్రామం వద్ద ఉన్న రైస్ మిల్లులో శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో చోరీ జరిగింది. దుండగులు మిల్లు తలుపుల తాళాలు పగలగొట్టి, ఏసీ, ఇన్వట్టర్ను చోరీ చేసేందుకు ప్రయత్నించారు. స్థానికులు గుర్తించి కేకలు పెట్టడంతో దుండగులు పారిపోయారు. విషయం తెలుసుకుని మిల్లు వద్దకు వచ్చిన యజమాని బాలసుబ్రమణ్యం మిల్లులో అమర్చిన సీసీ కెమెరాలు, హార్డ్‌డిస్క్ చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఓబయ్య తెలిపారు. -
బాస్కెట్‌బాల్ క్రీడాభివృద్ధికి పకడ్బందీ చర్యలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో బాస్కెట్‌బాల్ క్రీడాభివృద్ధికి పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర బాస్కెట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు చెంగల్రాయనాయుడు తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మెసానికల్ మైదానంలో అండర్ 23 రాష్ట్ర జట్లకు ఎంపికై న క్రీడాకారులకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంపిక చేసిన రాష్ట్రస్థాయి జట్లు ఈ నెల 18 నుంచి 24 వ తేదీ వరకు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటాయన్నారు. జాతీయ స్థాయి పోటీలు అసోం రాష్ట్రంలోని గౌహతిలో నిర్వహిస్తారన్నారు. రాష్ట్రస్థాయి జట్లల్లో మంచి ప్రతిభ చాటిన 25 మంది పురుషులు, 25 మంది మహిళలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎంపికై న జట్లకు ఈ నెల 6 నుంచి 14 వ తేదీ వరకు జిల్లా కేంద్రంలోని మెసానికల్ మైదానంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చామన్నారు. ఈ శిక్షణలో ప్రత్యేక ప్రతిభ చాటిన 12 మంది క్రీడాకారులు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. ఎంపికై న క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీల్లో మంచి ప్రతిభను చాటాలన్నారు. చిత్తూరు ట్రాఫిక్ సీఐ నిత్యబాబు మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఎన్పీ జయప్రకాష్, కార్యదర్శి సురేష్‌బాబు, కోచ్‌లు నాగరాజు, రుద్ర, బాబు, జాను, రాజేశ్వరి, డీఎస్డీవో బాలాజి, పీడీ బాబు తదితరులు పాల్గొన్నారు. ● బాస్కెట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చెంగల్రాయనాయుడు -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
బైక్‌ను ఢీకొన్న కారు..ఒకరి మృతిగంగవరం: ముందు వెళుతున్న బైక్‌ను వెనుక నుంచి కారు ఢీకొన్న ప్రమాదంలో బైక్‌పై వెళుతున్న ఒకరు మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన గంగవరం మండలంలో శుక్రువారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని ఆలకుప్పం గ్రామానికి చెందిన నరేష్(28), విజయ్(24) బైక్‌లో పలమనేరుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో జాతీయ రహదారిలో గోవిందశెట్టిపల్లి గ్రామం వద్ద బెంగళూరు వెళుతున్న కారు వేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌లో వెనుక కూర్చున్న నరేష్ తీవ్ర గాయాలతో ఘటనా స్థలంలోనే మృతి చెందగా బైక్ నడుపుతున్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న హైవే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం వేలూరు సీఎంసీకి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారును సీజ్ చేసి, స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.రెండు ద్విచక్రవాహనాల ఢీ.. మరొకరు..పాలసముద్రం : మండలంలోని పాలసముద్రం దళితవాడ మార్గంలో రెండు ద్విచక్రవాహనాలు అదుపుతప్పి ఢీకొనడంతో తమిళనాడువాసి మణి మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. తమిళనాడు రాష్ట్రం ఈడిగపల్లెకు చెందిన మణి(55) సొంతపని పాలసముద్రం గ్రామానికి వచ్చాడు. అనంతరం స్వగ్రామానికి తిరుగుప్రయాణమయ్యాడు. పాలసముద్రం దళితవాడ నుంచి గుండుబావి వద్ద హోట్‌లో భోజనం పార్శిల్ తీసుకువెళ్లడానికి విజయ్‌కుమార్ అనే వ్యక్తి ద్విచక్రవాహనంలో ఎదురుగా వస్తుండగా మార్గం మధ్యలోని మలుపు వద్ద రెండు ద్విచక్రవాహనాలు అదుపుతప్పి ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఈడిగపల్లెకు చెందిన మణి అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన విజయ్‌కుమార్‌ను 108లో ఆస్పత్రికి తరలించారు. సమాచారమందుకున్న పోలీసులు సంఘటనస్థలానికి చేరుకుని, పరిశీలించారు. మణి కుమారుడు ఉదయ్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చిన్నరెడ్డిప్ప తెలిపారు.చిత్తూరు జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. గంగవరం మండలంలో కారు బైక్‌ను ఢీకొని ఒకరు, పాలసముద్రం మండలంలో రెండు బైక్‌లు ఢీకొని మరొకరు దుర్మరణం చెందారు. -
పుట్టిన రోజే.. ఆఖరి రోజు
● కబళించిన కరెంటు తీగలు ● అక్కడికక్కడే యువకుడు దుర్మరణం ● వేటగాళ్ల పనేనా లేక రైతు అనాలోచిత నిర్ణయమా! గంగవరం : పుట్టిన రోజే ఓ యువకుడికి ఆఖరి రోజు అవుతుందని ఊహించలేకపోయాడు. పొలాల వద్ద లాగిన కరెంటు తీగలు మృత్యువు రూపంలో కబళించాయి. ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందాడు. ఈ ఘటన గంగవరం మండలంలోని కొత్తపల్లి, మేలుమాయి సరిహద్దు పొలాల వద్ద బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, అటవీశాఖ అధికారుల కథనం మేరకు.. మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన యువకుడు కార్తీక్ (22) డిగ్రీ కోర్సును మధ్యలో ఆపేసి గ్రామంలోనే కూలి పనులకు వెళ్తున్నాడు. అయితే బుధవారం రోజున అతని పుట్టిన రోజు కావడంతో గ్రామంలో తోటి స్నేహితులు యుగంధర్, చరణ్, అజయ్‌తో కలిసి గ్రామంలోని రైతు సేవా కేంద్రం ఎదుట రాత్రి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అంతటితో తమ ఇళ్లకు వెళ్లిపోకుండా ఊరికి సమీపంలోని మేలుమాయి రెవెన్యూకు సంబంధించిన పొలాల వద్దకు ఎందుకనో వెళ్లారంటూ గ్రామస్తులు చెబుతున్నారు. కొందరు ఆవు తప్పిపోవడంతో వెతకడం కోసం వెళ్లారని, మరికొందరేమో టెంకాయల కోసం వెళ్లారంటూ.. ఒక్కోరు.. ఒక్కోరకంగా చెబుతున్నారు. అయితే తామెందుకు వెళ్లారనే వాస్తవాలు వెలికిరాలేదు. ఇదిలా ఉండగా కార్తీక్‌తో పాటు తన స్నేహితులు అందరూ కలిసి పొలాల వద్దకు వెళ్లగానే అక్కడి పొలంలో లాగిన కరెంటు తీగల తీవ్రతకు కార్తీక్ శరీర భాగాలు పూర్తిగా కాలిపోయి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. అతడిని కాపాడే క్రమంలో మరో యువకుడు యుగంధర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. మిగిలిన యువకులు సురక్షితంగా తప్పించుకున్నారు. జరిగిన విషయాన్ని తోటి స్నేహితులు సెల్‌ఫోన్ ద్వారా కుటుంబీకులకు సమాచారం ఇవ్వగా ఊరి జనంతో పాటు అటవీశాఖ, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి ఎలా జరిగిందనే వివరాలను కార్తీక్ స్నేహితుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయగా వాళ్ల నుంచి సరైన సమాధానం రాలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వేటగాళ్ల పనేనా లేక రైతు అనాలోచిత నిర్ణయమా! ప్రమాదానికి కారణం వేటగాళ్లు వన్యప్రాణుల వేట కోసం కరెంటు తీగలు లాగడంతో ఈ ప్రమాదం జరిగిందా లేక రైతు తమ పొలంలో పంటను పందుల నుంచి కాపాడుకునేందుకు తన అనాలోచిత నిర్ణయం కారణంగా ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
● ఆందోళనలో డీఎస్సీ అభ్యర్థులు ● సీఎం జిల్లాకు కేటాయించని కోచింగ్ సెంటర్ ● కూటమి ప్రభుత్వంలో బూటకపు మాటలు ● రాయలసీమకు అంతా ఒకేచోట కోచింగ్ ● ముడుపులు ఇచ్చిన వారికి ఆమోదం !
చిత్తూరు కలెక్టరేట్ : సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా చిత్తూరు. ఇది పేరుకు మాత్రమే.. సీఎం సొంత జిల్లాకు ఒరిగిందేమి లేదు. ప్రస్తుతం డీఎస్సీ అభ్యర్థులకు ప్రభుత్వం కుచ్చుటోపి పెట్టింది. డీఎస్సీ పరీక్ష కోసం చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 45 వేలకు పైగా అభ్యర్థులు సన్నద్ధం అవుతున్నారు. ఇందులో పేద అభ్యర్థులకు మంచి కోచింగ్ సెంటర్లలో డీఎస్సీ శిక్షణ ఇప్పిస్తామని కూటమి హామీ ఇచ్చింది. ఆ హామీ నెరవేరుస్తారని జిల్లా డీఎస్సీ అభ్యర్థులు ఎదురుచూశారు. పది నెలలుగా ఆ హామీ మాత్రం నెరవేరలేదు. తాజాగా సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లాలో ఒక్క కోచింగ్ సెంటర్‌కు సైతం డీఎస్సీ శిక్షణకు అను మతి ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ వ్యవహారంపై డీఎస్సీ అభ్యర్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. చిత్తూరు జిల్లా కేంద్రంలో డీఎస్సీ శిక్షణ ఇచ్చేందుకు అర్హత ఉన్న కోచింగ్ సెంటర్ ఉన్నప్పటికీ...ఆ శిక్షణ సంస్థ దరఖాస్తులు చేసుకున్నా మంజూరు చేయకుండా ఆపేశారు. పోతేపోని జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో వేరే కోచింగ్ సెంటర్లకు అనుమతులిచ్చారా అంటే అదీ లేదు. జిల్లా వ్యాప్తంగా డీఎస్సీకి శిక్షణ పొందుతున్న పేద అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తామని హామీ ఇచ్చారు. ఇందులో ఒక్కో అభ్యర్థికి రూ.28 వేలు శిక్షణ రుసుం చెల్లిస్తామని చెప్పారు. అయితే ప్రస్తుతం జిల్లాలో ఒక్క కోచింగ్ సెంటర్‌కు సైతం అనుమతివ్వకుండా మోసగించారు. పక్క జిల్లాల్లో పోలీస్ ఉద్యోగాలకు కోచింగ్ ఇచ్చే పలు సెంటర్లకు డీఎస్సీ శిక్షణకు అనుమతులివ్వడంపై నిరుద్యోగులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. డీఎస్సీ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా కోచింగ్ సెంటర్లను ఎంపిక చేయకుండా ఆమ్యామ్యాలకు కక్కుర్తి పడి అనుభవం లేని కోచింగ్ సెంటర్లకు అనుమతులివ్వడం విమర్శలకు తావిస్తోంది. ఈ వ్యవహారం కూటమి టీడీపీ ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వ లింకుడ్ కోచింగ్ సెంటర్ల పేరుతో జరుగుతున్న మాయాజాలమని తెలుస్తోంది. రాయలసీమ పరిధిలో ఒకే ఒక శిక్షణ కేంద్రాన్ని కూటమి ప్రభుత్వం ఎంపిక చేసింది. అనంతపురం జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ శిక్షణ కేంద్రాన్ని ఎంపిక చేస్తున్నట్లు రాష్ట్ర అధికారులు ప్రకటించారు. ఆ కేంద్రానికి చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్ కడప, ఇతర జిల్లాల నుంచి డీఎస్సీ అభ్యర్థులు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. డీఎస్సీ పరీక్షకు సన్నద్ధమవుతున్న అభ్యర్థుల్లో ఎక్కువ మంది మహిళలున్నారు. మహిళలు అంత దూరం వెళ్లి శిక్షణ పొందాలంటే శ్రమతో కూడుకున్న పని అని వాపోతున్నారు. సీఎం తన సొంత జిల్లాతో పాటు, రాయలసీమలోని డీఎస్సీ అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లారు. కూటమి టీడీపీ ఇచ్చిన మాటను తప్పి డీఎస్సీ అభ్యర్థుల జీవితాలతో ఆటలాడుతోంది. ప్రభుత్వం తరఫున కోచింగ్ ఇవ్వాలంటే కనీసం రెండు నోటిఫికేషన్లు కోచింగ్ ఇచ్చి, జీఎస్టీ ఏటా చెల్లించన వారై ఉండాల్సి ఉంటుంది. అదే విధంగా సంవత్సరానికి రూ.50 లక్షల టర్నోవర్ ఉండి కనీసం ఒక్కో నోటిఫికేషన్లో వంద మంది ఉండాలనే నిబంధన ఉంది. ఈ నిబంధనలకు అర్హత ఉన్న కోచింగ్ కేంద్రం జిల్లా కేంద్రంలో ఉన్నప్పటికీ ఎంపిక చేయకుండా ముడుపులు ఇవ్వలేదనే కారణంతో పక్కన పెట్టేశారు. డీఎస్సీ శిక్షణకు ఆప్షన్లు నమోదు చేసుకోండి చిత్తూరు కలెక్టరేట్ : డీఎస్సీ శిక్షణకు అభ్యర్థులు ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి చెన్నయ్య తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ అధికారుల ఆదేశాల మేరకు జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ డీఎస్సీ అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఉచిత వసతి, భోజన సదుపాయంతో డీఎస్సీ శిక్షణ ఇస్తారన్నారు. అభ్యర్థుల నమోదు ప్రక్రియ పూర్తి కావడంతో 1000 మంది అభ్యర్థుల షార్ట్ లిస్ట్‌ను విడుదల చేశారన్నారు. సంబంధిత అభ్యర్థులు ఎంపానెల్డ్ కోచింగ్ సంస్థల్లో వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలన్నారు. ఎంపికై న అభ్యర్థులు జ్ఞానభూమి పోర్టల్‌లోని www.mdfc.apcfss.in లో ఈ నెల 15వ తేదీలోపు ఆప్షన్లు నమోదు చేసుకోవాలని కోరారు.విడ్డూరంగా ఉంది డీఎస్సీ శిక్షణ పొందుతున్న వారిలో చిత్తూరు జిల్లాలో అధిక శాతం మంది మహిళలున్నారు. చిత్తూ రు జిల్లా కేంద్రంలో శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తారని అనుకున్నాం. అయితే చివరికి శిక్షణ కేంద్ర మే లేకుండా చేశారు. మహిళలు అనంతపురానికి వెళ్లి శిక్షణ ఎలా పొందేది. డీఎస్సీ నిరుద్యోగులకు అన్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకోవడం సరైన పద్ధతి కాదు. జిల్లా కేంద్రంలో అనుభవం ఉన్న కోచింగ్ సెంటర్‌కు అనుమతి ఇచ్చి శిక్షణ ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నాం. – ఉమామహేశ్వరి, డీఎస్సీ అభ్యర్థిని రాయలసీమలో ఒకే ఒక కేంద్రం ఎంపిక స్థానికంగా ఏర్పాటు చేయాలి కూటమి టీడీపీ ప్రభుత్వానికి చిత్తూరు జిల్లా అంటే అలుసెందుకో అర్థం కావడం లేదు. ఉన్నతాధికారులకు ఆ మాత్రం క్షేత్రస్థాయి పరిస్థితులు తెలియవా. రాయలసీమ మొత్తానికి ఒక శిక్షణ కేంద్రం. అదీ అనంతపురంలో ఎంపిక చేయడం విడ్డూరంగా ఉంది. ఇదంతా చూస్తుంటే డీఎస్సీ అభ్యర్థులపై కక్ష సాధింపు దిశగానే చేస్తున్నారనిపిస్తోంది. ప్రభుత్వం చిత్తూరు జిల్లా కేంద్రంలో శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి శిక్షణ మొదలుపెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. – కోమల, డీఎస్సీ అభ్యర్థిని దరఖాస్తు చేసుకున్నా.. లక్ష్యాన్ని నీరుగార్చి.. నిబంధనలకు నీళ్లు ఉచిత కోచింగ్ పేరుతో నమ్మించి మోసం -
భర్త కుటుంబీకులపై భార్య బంధువుల దాడి
పెద్దపంజాణి : భర్త కుటుంబీకులపై భార్య బంధువులు దాడి చేసి గాయపరిచిన సంఘటన మండలంలోని మాదనపల్లి పంచాయతీ చింతలపల్లిలో గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్హెచ్ఓ మురళీరాజు కథనం మేరకు వివరాలు.. మండలంలోని చింతలపల్లి గ్రామానికి చెందిన శంకరప్ప కుమారుడు గణేష్‌కు బైరెడ్డిపల్లి మండలం ఎర్రకదిరేపల్లి గ్రామానికి చెందిన రాజప్ప కుమార్తె జమునతో 5 ఏళ్ల కిందట వివాహమైంది. ఈ క్రమంలో నాలుగు నెలల కిందట జమున తన తమ్ముడికి ఆపరేషన్ అని చెప్పి పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి భర్త గణేష్ ఫోన్ చేసినా ఇంత వరకూ అత్తగారింటికి రాలేదు. ఈ నేపథ్యంలో 10వ తేదీ మధ్యాహ్నం జమున బంధువులు కొంత మంది రౌడీలతో చింతలపల్లికి వచ్చి భర్త గణేష్ కుటుంబీకులతో మాట్లాడాలని చెప్పి వారిపై దాడి చేసి గాయపరిచి వెళ్లిపోయారు. ప్రస్తుతం క్షతగాత్రులు పుంగనూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గణేష్ తండ్రి శంకరప్ప ఫిర్యాదు మేరకు మంజుల, రాజప్ప, లక్ష్మీపతి, ప్రభాకర్, కవిత, సరసమ్మ, వికాస్‌పై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్హెచ్ఓ చెప్పారు. -
విద్యుత్ షాక్‌తో లైన్మెన్ మృతి
పాలసముద్రం : మండలంలోని తొలికండ్రిగ దళితవాడకు చెందిన వినాయకం(44) గురువారం విద్యుత్ షాక్ కొట్టి మృతి చెందాడు. వివరాలు ఇలా..మండలంలోని తొలికండ్రిగ దళితవాడకు చెందిన వినాయకం తమిళనాడు పల్లిపట్టులో విద్యుత్ శాఖలో లైన్మెన్గా పనిచేస్తున్నారు. పల్లిపట్టు పట్టణ పంచాయతీలోని కార్యాలయం ముందు ఉన్న విద్యుత్ స్తంభంపై తీగలు మరమ్మతు చేస్తుండగా అకస్మాత్తుగా విద్యుత్ షాక్ కొట్టి స్తంభంపై నుంచి పడి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బంధువులు పల్లిపట్టు చేరుకుని మృతదేహాన్ని తొలికండ్రిగకు తీసుకొచ్చి అంత్యక్రియలు చేపట్టారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. పశువైద్యశాఖ గ్రామ సహాయకురాలు ఆత్మహత్యాయత్నం గుడుపల్లె : మండలంలోని పొగురుపల్లి గ్రామ సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న పశువైద్యశాఖ గ్రామ సహాయకురాలు జ్ఞానశ్రీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా.. పొగురుపల్లి గ్రామంలో ఇటీవల టీడీపీ మండల నాయకుడి బంధువులకు గోకులం షెడ్లు ఇవ్వాలని ఆమైపె ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఒత్తిడి తాళలేక మనస్తాపానికి గురైంది. దీంతో బుధవారం రాత్రి పురుగు మందు తాగి జ్ఞానశ్రీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. తృటిలో ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం జ్ఞానశ్రీ పీఈఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మండలంలోని టీడీపీ నాయకుల ఒత్తిళ్లే జ్ఞానశ్రీ ఆత్మహత్యాయత్నానికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ‘మా కుటుంబాన్ని ప్రభుత్వం వేధిస్తోంది’ కుప్పంరూరల్ : మా కుటుంబాన్ని కూటమి ప్రభుత్వం వేధిస్తోందని వైఎస్సార్ సీపీ కుప్పం నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షుడు సర్దార్‌బాషా ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం తన నివాసంలో తమ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని వివరించారు. టీడీపీలో చేరాలని ఒత్తిళ్లు ఎక్కువ అయ్యాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో షాదీమహల్ మరమ్మతులకు చేసిన రూ.21 లక్షలు ఖర్చు చేసినా ఇప్పటి వరకు ఇవ్వకుండా వేధిస్తున్నారన్నారు. తన కుమార్తె రేష్మాభాను కుప్పం మున్సిపాలిటీలోని మెప్మాలో సంఘమిత్రగా పని చేస్తోందని, ఆమెను తొలగించాలని అనేక రకాలుగా కూటమి నాయకులు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. తాను గత ఆగస్టులో కోర్టుకు వెళ్లి స్టే తెచ్చినా.. కోర్టు ఆదేశాలను దిక్కరించి సీవో జగదీష్ అనేక రకాలుగా ఒత్తిళ్లు తెస్తున్నారని వాపోయారు. గ్రూపు సమావేశాల్లో మహిళా సభ్యులంతా ఏకతాటిగా రేష్మాభానునే సంఘమిత్రగా కొనసాగాలని తీర్మానించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. తాను ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని, తాను అధినేత జగన్మోహన్రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెంటే నడుస్తానని తెగేసి చెప్పారు. అధికారులు, నాయకులు ఒత్తిళ్లు ఆపకపోతే తగిన రీతితో జవాబు ఇస్తామని హెచ్చరించారు. -
కుప్పంలో సింగపూర్ బృందం
కుప్పం మున్సిపాలిటిలో డీపీఆర్ తయారు చేసేందుకు సింగపూర్‌నకు చెందిన కన్సల్టెన్సీ సంస్థ పట్టణంలో పర్యటించింది. సీఎంకు చిత్తూరు గుర్తు లేదా.. సీఎం సారుకు చిత్తూరు జి ల్లా గుర్తు లేదా.. ప్రభు త్వం తరఫున శిక్షణ ఇ స్తారని ఎదురు చూస్తూనే ఉన్నాం. ఇంత వరకు అతీ గతి లేదు. ఇదిగో ఇస్తారు...అదిగో ఇస్తారని పది నెలలుగా చెబు తూనే ఉన్నారు. చివరికి చిత్తూరు జిల్లాలో శిక్షణ కేంద్రమే లేకుండా చేశారు. ఇది న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు. – మునికుమార్, డీఎస్సీ అభ్యర్థి – 8లో -
క్రియేటివిటీ, నైపుణ్యాలతో ఇంజినీర్లకు గుర్తింపు
–జేఎన్టీయూ వీసీ సుదర్శనరావు నారాయణవనం: క్రియేటివిటీ, నైపుణ్యాలతోనే యువ ఇంజినీర్లకు గుర్తింపు లభిస్తుందని అనంతపురం జేఎన్టీయూ వైస్ చాన్స్‌లర్ సుదర్శనరావు పేర్కొన్నారు. పుత్తూరు సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలల 24వ జూబిలేషన్ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పాల్గొన్నారు. ఓపెన్ ఆడిటోరియంలో గురువారం సాయంత్రం జరిగిన వేడుకల్లో ఆయన మాట్లాడుతూ ఇంజినీరింగ్ విద్యార్థులు సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం కాకుండా కోడీంగ్, డీ–కోడింగ్, ప్రాబ్లమ్ సొల్యాషన్ల మీద పనిచేయలని, పారిశ్రామిక వేత్తలుగా ఎదనాలని పిలుపునిచ్చారు. సెమీ కండక్టర్ టెక్నాలజీ, నిర్మాణ, విద్యాత్ రంగాల్లో స్టార్టప్ ప్రాజెక్ట్‌లపై దృష్టి సారించాలని చెప్పారు. కళాశాలల చైర్మన్ డాక్టర్ అశోకరాజు మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడలు, యోగా, ధ్యానంపై దృష్టి పెట్టి మానసికంగా ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. అకడమిక్ టాపర్లకు మెడల్స్, సర్టిఫికెట్లను అందజేశారు. దక్షిణాది సినీ నటి సంయుక్తా మీనన్ ఆటల పాటలతో అలరించారు. యాంకర్ భానుశ్రీ తన మాట తీరుతో ఆకట్టుకున్నారు. ఇంజినీరింగ్ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఉర్రూతలూగించాయి. -
ఇళ్ల నిర్మాణాల పురోగతిలో అలసత్వం వద్దు
చిత్తూరు కలెక్టరేట్ : ఇళ్ల నిర్మాణాల పురోగతిలో అలసత్వం వద్దని కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్లో హౌసింగ్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇళ్ల నిర్మాణానికి అదనంగా 50 వేల నుంచి లక్ష వరకు అందిస్తున్న ప్రభుత్వ ఆర్థిక సహాయంపై అవగాహన పెంచాలన్నారు. ఇళ్ల నిర్మాణాల పనుల్లో పురోగతి ఉండేలా హౌసింగ్ అధికారులు పని చేయాలని ఆదేశించారు. జిల్లాలో 17,898 మంది లబ్ధిదారులకు రూ.119.65 కోట్లు లబ్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఇళ్ల నిర్మాణాలు చేపట్టే లబ్ధిదారులకు అవగాహన కల్పించి వివిధ దశల్లో ఉన్న ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయించేలా చర్యలు చేపట్టాలన్నారు. అదనపు సాయం పొందేందుకు బేస్మెంట్ స్థాయిలో ఏఈ, రూఫ్ లెవల్ స్థాయిలో డీఈలు బాధ్యత తీసుకుని ఇళ్ల నిర్మాణాలకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈనెల 15వ తేదీ నుంచి 23 వరకు క్షేత్ర స్థాయిలో లబ్ధిదారులకు అదనపు ఆర్థిక సాయంపై అవగాహన చేపట్టాలన్నారు. గృహ నిర్మాణాల్లో చివరి దశకు రావాలంటే ఫ్లోరింగ్, కిటికీలు, తలుపులు, ఇంటి బయట, లోపల పెయింటింగ్ మిగిలిన స్థాయిల్లో పూర్తి చేయాలన్నారు. మండలాల వారీగా ఎంపీడీవోలు, హౌసింగ్ అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రణాళికతో ఇళ్ల నిర్మాణాల పురోగతికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో హౌసింగ్ పీడీ గోపాల్‌నాయక్, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శిగా వెంకటరమణ
తిరుపతి మంగళం : వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన టి.వెంకటరమణను చిత్తూరు, తిరుపతి జిల్లాల పార్టీ ఆర్గనైజేషన్ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీచేసింది. మాతాశిశు మరణాలు కట్టడి చేయాలి చిత్తూరు రూరల్ (కాణిపాకం) : మాతా శిశు మరణాలను కట్టడి చేసేందుకు వైద్య బృందం సమష్టిగా పని చేయాలని, క్షేత్రస్థాయిలో పర్యటించి గర్భిణుల సేవలను విస్తృతం చేయాలని గైనిక్ వైద్యురాలు ఉషశ్రీ ఆదేశించారు. చిత్తూరు నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో గురువారం మాతా శిశు మరణాలపై జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. వైద్య సిబ్బంది ప్రణాళిక ప్రకారం పనిచేయాలన్నారు. వైద్య ఆరోగ్య సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. మాతృ మరణాల నివారణకు వైద్య శాఖ చేస్తున్న సేవలపై గర్భిణులకు అవగాహన కల్పించాలన్నారు. హైరిస్క్ కేసులపై నిర్లక్ష్యం చూపకుండా మెరుగైన వైద్య సేవలను అందించాలన్నారు. మాతృ మరణాల నివారణలో భాగంగా గర్భిణుల సేవల్లో నిర్లక్ష్యం ఉండకూడదని ఉషశ్రీ పేర్కొన్నారు. సమావేశంలో వైద్యులు అనూష, లత, ఐసీడీఎస్ పీడీ అయేషా, 108 మేనేజర్ మోహన్‌బాబు పాల్గొన్నారు. సీనియారిటీ జాబితాలో తప్పిదాలు చిత్తూరు కలెక్టరేట్ : టీచర్ల సీనియారిటీ జాబితాల్లో అనేక తప్పిదాలు చోటు చేసుకున్నాయని రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆపస్ రాష్ట్ర అధ్యక్షుడు బాలాజీ తెలిపారు. ఈ మేరకు ఆ సంఘ నాయకులు గురువారం రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజును కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అన్ని జిల్లాల్లో సీనియారిటీ లిస్టులు మెరిట్ ప్రాతిపదికన, మెరిట్ కమ్ రోస్టర్ పద్ధతిలోనే తయారు చేయాలన్నారు. ప్రతి జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ నుంచి హెడ్ మాస్టర్ ఉద్యోగోన్నతికి అర్హత కలిగిన స్కూల్ అసిస్టెంట్ల సీనియారిటీ జాబితాను ప్రచురిస్తారన్నారు. 117 జీఓ రద్దు విషయంలో మోడల్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు పేరెంట్ కమిటీల ఆధారంగానే ఉంటాయని తెలిపారు. హైస్కూల్ ప్లస్‌లను కొనసాగిస్తారన్నారు. ఎయిడెడ్ నుంచి గవర్నమెంట్, జిల్లా పరిషత్‌లో విలీనం అయిన వారికి విలీనం అయ్యేటప్పుడు అమలు చేసిన ఉత్తర్వుల మేరకే సర్వీస్ వెయిటేజ్ ఇస్తారన్నారు. అంతర్ జిల్లా బదిలీలు, అంతర్ మున్సిపాలిటీ బదిలీలు నిర్వహించాలని కోరినట్లు వెల్లడించారు. -
బెడిసికొట్టిన దోపిడీ ప్లాన్
● తాను మునిగి.. అందరినీ ముంచి ! ● ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు దోపీడీకి యత్నం ● ఉన్నది పోగొట్టుకుని.. కాళ్లు , నడుము విరగొట్టుకున్న వైనం ● సుబ్రమణ్యం నేర చరిత్రపై చిత్తూరు వాసుల ఆశ్చర్యం చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలోని గాంధీ రోడ్డులో జరిగిన దోపిడీ యత్న ఘటనలో ప్రధాన నిందితుడు సుబ్రమణ్యం విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే చిత్తూరులో సోఫాలు కొనేవాళ్లల్లో 60 శాతం మందికి పైగా ప్రజలు ఏదో ఒకసారి సుబ్రమణ్యం దుకాణానికి తప్పకుండా సందర్శించినవాళ్లే. ప్రజలతో పాటు కొందరు అధికారులు కూడా రెడ్డిగుంట సమీపంలో ఉన్న ఆ దుకాణాన్ని సందర్శించే ఉంటారు. దుకాణానికి వచ్చిన వాళ్లతో ‘అన్నా, రా అన్నా, కూర్చోనా..:!’ అంటూ ఆప్యాయంగా పలకరించడం. అధికారులు ఎవరైనా ఫైనల్ చేసిన బిల్లులో రూ.5 వేలు నుంచి రూ.10 వేల వరకు తగ్గించి తీసుకోవడం ఇతడి నైజం. దీంతో తక్కువ కాలంలో ఇతడి దుకాణం పేరు నగరం మొత్తం పాకింది. ఇదే సమయంలో సోఫాలు చాలా మందికి అప్పులు ఇవ్వడం, పలువురి వద్ద వడ్డీలకు డబ్బులు తీసుకుని సకాలంలో తిరిగీ చెల్లించకపోవడంతో సుబ్రమణ్యానికి ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. సంపాదించుకున్న బ్రాండ్‌తోనే వ్యాపారాన్ని విజయవంతం చేయాల్సిన అతను, అదే బ్రాండ్‌ను తాకట్టుపెట్టడంతో వ్యక్తిగతంగా ఇబ్బందులు తప్పలేదు. ఈ దుకాణంలో 50 మందికి పైగా కార్మికులు ప్రతి రోజూ పనిచేస్తుంటారు. వాళ్లకు సక్రమంగా జీతాలు ఇవ్వకపోవడంతో పలువురు దుకాణాన్ని వీడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సమయంలో ఆర్థిక కష్టాలను గట్టెక్కడానికి దోపిడీ ప్లాన్ చేసిన సుబ్రమణ్యానికి తరచూ తాను గిఫ్ట్‌లు కొనుగోలు చేసే గాంధీరోడ్డులోని చంద్రశేఖర్ దుకాణం గుర్తుకు వచ్చింది. చంద్రశేఖర్ రోజూ బ్యాంకుకు వెళ్లడం, దుకాణంలోనే రూ.లక్షల విలువైన సరుకు ఉండటంతో ఇంట్లో రూ.కోట్లలో నగదు ఉన్నట్లు గుర్తించిన నిందితుడు దోపిడీకి ప్లాన్ చేశాడు. తన వద్ద పనిచేసే కుర్రాళ్లతో పాటు పాత పరిచయాలున్న వాళ్లను తీసుకొచ్చి దోపిడీకి ప్రయత్నించి పోలీసులకు చిక్కాడు. అయితే సుబ్రమణ్యం గత చరిత్ర తవ్వితీసిన పోలీసులు ఇతనిపై నంద్యాలలో రెండు హత్య కేసులు, నాలుగు దోపిడీ కేసులు ఉండటంపై చాలా మందిని షాక్‌కు గురి చేసింది. పైగా ఓ దోపిడీ కేసులో పదేళ్ల జైలు శిక్ష కూడా అనుభవించాడని తెలియడంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దోపిడీ యత్నం సమయంలో ఓ భవనం పైనుంచి కిందకు దూకిన సుబ్రమణ్యంకు రెండు కాళ్లు విరగడం, నడుము వద్ద ఎముకలకు బీటలు రావడంతో ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కనిపించడంలేదు. నేరచరిత్ర ఉన్న సుబ్రమణ్యం.. తాను మునిగిపోవడంతో పాటు తన వద్ద పనిచేసే వాళ్లను కూడా ముంచినట్లయ్యింది. మరోవైపు నిందితుల వద్ద ఉన్నది బొమ్మ తుపాకులని అప్పటికి తెలియక, మెడపై కత్తులు పెట్టినా ధైర్యంగా సాహసం చేసి నలుగురు నిందితులను నిర్భందించిన ఉమాపతి అతని స్నేహితులు నిజమైన హీరోలుగా మారారు. ఇదే సమయంలో నిందితుల వద్ద తుపాకులు ఉన్నాయని తెలిసి, బుల్లెట్‌ఫ్రూఫ్ జాకెట్లు ధరించి, ఒక భవనం నుంచి మరో భవనంపైకి ఎక్కుతూ.. ఏ నిమిషం ఎలాంటి ఘటన ఎదురవుతుందో తెలియక ఆపరేషన్‌లో పాల్గొన్న పోలీసులను.. ప్రత్యక్ష్యంగా చూసిన ప్రజలు వారి సేవలపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
పలమనేరు కోర్టులో రూ.1.02 కోట్లకు ఐపీ
పలమనేరు : నియోజకవర్గంలోని వీకోటకు చెందిన లక్ష్మీనారాయణ అనే వ్యాపారి రూ.1.02 కోట్లకు స్థానిక కోర్టులో ఐపీ దాఖలు చేసినట్లు గురువారం తెలిసింది. అతడు వీకోటలో వ్యాపారాలు చేస్తూ భారీగా నష్టపోయినట్లు తాను అప్పులు తీసుకున్న 16 మందికి అప్పులు చెల్లించలేనని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై స్థానిక లాయర్ కవిత ద్వారా ఆయన పిటిషన్ దాఖలు చేశారు. కుప్పంలో సింగపూర్ బృందం కుప్పం : కుప్పం మున్సిపాలిటీలో డీపీఆర్ సిస్టం తయారు చేసేందుకు సింగపూర్‌నకు చెందిన సుర్బాన్ జార్జ్ కన్సల్టెన్సీ సంస్థకు చెందిన ఓ బృందం కుప్పంలో పర్యటించింది. మున్సిపాలిటీ పరిధిలోని హరితా రిసార్ట్, జమీందర్ పార్కు, డీకేపల్లి పార్కు, బస్టాండు, ఎన్టీఆర్ స్టేడియం, కొత్తపేట మార్కెట్ కాంప్లెక్స్‌తో పట్టణంలో 11 ప్రాంతాలను పరిశీలించారు. వీరి వెంట మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు, రెవెన్యూ అధికారులు ఉన్నారు. ముగిసిన విరించి తిరుపతి సిటీ: పద్మావతి మహిళా వర్సిటీ ఇందిరా ప్రియదర్శిని వేదికగా గత రెండు రోజుల పాటు సాగిన విరించి–2025 టెక్‌ఫెస్ట్ గురువారం ముగిసింది. స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది. సంప్రదాయం, సాంస్కృతికం ప్రతిబింబించేలా వేడుకలు సాగాయి. విద్యార్థినులు ఆటపాటలతో అదగొట్టారు. ముగింపు కార్యక్రమానికి వేదిక్ వర్సిటీ వీసీ సదాశివమూర్తి ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. రెండవ రోజు విద్యార్థుల సృజనాత్మక శక్తికి పదును పెట్టే పోటీలను నిర్వహించారు. అనంతరం ముఖ్యఅతిథి చేతుల మీదుకు ప్రతిభకనబరిచిన విద్యార్థులకు బహుమతులందించారు. వీసీ ప్రొఫెసర్ ఉమ, రిజిస్ట్రార్ రజిని, డైరెక్టర్ మల్లికార్జున, అధ్యాపకులు, సుమారు 900మంది విద్యార్థులు పాల్గొన్నారు. -
మహిళల రక్షణకే ‘శక్తి’ బృందాలు
చిత్తూరు అర్బన్ : మహిళలు, బాలికలపై నేరాలు జరగకుండా ఉండేందుకు, ముందస్తు అప్రమత్తం చేయడానికి జిల్లా వ్యాప్తంగా ‘శక్తి’ బృందాల ఏర్పాటుపై అధికారులు దృష్టి సారించాలని చిత్తూరు ఎస్పీ మణికంఠ ఆదేశించారు. గురువారం చిత్తూరు నగరంలోని జిల్లా పోలీసు శిక్షణా కేంద్రంలో పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. గ్రామాలు, పట్టణాల్లో మహిళలను చైతన్యం చేయడానికి శక్తి బృందాలను ఉపయోగించుకోవాలన్నారు. పోలీస్ స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న కేసుల విషయాల్లో నిర్లక్ష్యం వద్దని, దర్యాప్తు పూర్తి చేసి కోర్టుకు ఛార్జ్‌షీట్ సమర్పించాలన్నారు. ఇదే సమయంలో నేరం చేసిన నిందితులకు శిక్ష పడేలా దర్యాప్తు ఉండాలన్నారు. గంజాయి, ఎర్ర చందనం, సారా, ఇసుక స్మగ్లింగ్ చేసే వ్యక్తులపై పీడీ యాక్టులు పెట్టడానికి వెనకాడొద్దని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు నిత్యం వాహనాల తనిఖీలు చేపట్టాలన్నారు. రాత్రి గస్తీలు పెంచాలని, పాత నేరస్తుల కదలికపై నిఘా ఉంచాలన్నారు. సైబర్ నేరాలబారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉండాలన్నారు. పోలీసు వాట్సాప్ నంబర్ 94409 00005, సైబర్ మిత్ర 91212 11100 నంబర్లను ప్రజలు ఉపయోగించుకోవాలన్నారు. ఎన్ఫోర్స్మెంట్లో గతనెల ఉత్తమ ప్రతిభ చూపించిన చిత్తూరు వన్‌టౌన్ సీఐ జయరామయ్య, పుంగనూరు సీఐ శ్రీనివాసులు, కల్లూరు ఎస్ఐ వెంకటేశ్వరులను ఎస్పీ అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. సమావేశంలో ఏఎస్పీ రాజశేఖర్‌రాజు, పలువురు డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐ పాల్గొన్నారు. -
ఎంబీబీఎస్ ఫలితాల్లో పీఈఎస్ హవా!
గుడుపల్లె : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ ద్వితీయ సంవత్సరం ఎంబీబీఎస్ పరీక్షా ఫలితాల్లో పీఈఎస్ మెడికల్ కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపారని కళాశాల ప్రిన్సిపల్ హెచ్ఆర్ కృష్ణారావు తెలిపారు. జనవరి–2025లో నిర్వహించిన ద్వితీయ సంవత్సరం ఎంబీబీఎస్ ఫలితాల్లో 91 శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. 146 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 133 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. డిస్టింక్షన్ 16, ఫస్ట్ క్లాస్ 67, సెకెండ్ క్లాస్ 50 మంది సాధించారని తెలిపారు. ఇందులో ధార్మిక శ్రేష్ట 81%, ఆస్తాగోల్ 80%, లక్ష్మీ మానస 80%, భవిష్యా 80%, శ్రీదీప్తి 80%తో టాపర్లుగా నిలిచారు. టాపర్లుగా నిలిచిన వైద్య విద్యార్థులకు పీ ఈ ఎస్ కళాశాల అధ్యాపకులు అభినందించారు. -
కర్షక గుండెకోత
అనధికార విద్యుత్ కోతలు..రైతులకు వాతలు ● గంటకోసారి విద్యుత్ సరఫరా ఆపివేత ● అధికారులపై రైతుల కన్నెరర్ర ● పట్టించుకోని ప్రభుత్వం కరెంటు లేకపోవడంతో బాధపడుతున్న రైతుతోటకనుమ సబ్‌స్టేషన్‌లో ఉన్న ఒకటే ట్రాన్స్ఫార్మర్ కర్షకులకు జీవనం నిత్యం పరీక్షగా మారుతోంది. అనధికారిక విద్యుత్ కోతలు.. ఎప్పుడు ఎంత సమయం ఆగిపోతుందో తెలియని దుస్థితితో కంటి మీద కునుకులేకుండా పోతోంది. దీంతో ఆశల పంట తడారిపోకుండా జీవ‘తడులు’ ఇచ్చుకునేందుకు నానా అగచాట్లు పడుతున్నారు. అడిగినా సమాధానం చెప్పే అవసరం లేదన్న ధీమాతో కూటమి సర్కారు పుడమి పుత్రుల కష్టం.. పంట భవితవ్యంతో చెలగాటమాడుతోంది. హలధారులకు విద్యుత్ సరఫరాలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వంతోపాటు అధికారుల అలసత్వంతో అన్నదాతల ఆ‘శని’పాతంగా మారుతోంది. ఫలితంగా కర్షకుడికి గుండెకోత మిగులుతోంది. వి.కోట: బైరెడ్డిపల్లి–వి.కోట మండలాలకు శాశ్వతంగా లోవోల్టేజ్ సమస్యకు చరమగీతం పాడాలన్న సంకల్పంతో గత వైఎస్సార్సీపీ ఫ్రభుత్వం మండలంలో తోటకనుమ గ్రామం వద్ద 132/33 కేవీ సబ్‌స్టేషన్‌ను నిర్మించింది. ప్రస్తుత పాలకులు తామే గొప్ప అని ఆ సబ్‌స్టేషన్‌ను ఆడంబరంగా ప్రారంభించారు. సరఫరా మొదలైంది. అన్నదాతల్లో ఆశలు చిగురించాయి. ఏళ్ల తరబడి ఎదుర్కొంటున్న సమస్యకు అడ్డుకట్టపడిందని సంబరపడ్డారు. అది కాస్త మూన్నాళ్ల ముచ్చటగా మిగిలింది. కేవలం మూడు నెలలు మాత్రమే విద్యుత్ సరఫరా కొనసాగింది. ఫిబ్రవరిలోనే అనధికారిక కోతలు మొదలయ్యాయి. సబ్‌స్టేషన్‌లో 31.5 మెగావాట్ల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడంతో 24 మెగావాట్ల విద్యుత్ లోడ్ వినియోగించుకోవచ్చు. దీని నుంచి వి.కోట మండలంలో 7 సబ్స్టేషన్లకు విద్యుత్ సరఫరా ఇవ్వాల్సి ఉంది. అలాగే కస్తూరినగరం, వి.కోట. పాపేపల్లిమిట్ట, యాలకల్లు, పాముగానిపల్లి తదితర 33/11 కేవీ సబ్టేషన్కు విద్యుత్ సరఫరా చేయాల్సిఉంది. అలాగే బైరెడ్డిపల్లి మండలంలో 6 సబ్స్టేషన్లకు తోటకనుమ నుంచి సరఫరా అందిస్తున్నారు. ఇందులో బైరెడ్డిపల్లి, తీర్థం, కడపనత్తం, తదితర మూడు సబ్స్టేషన్లకు సరఫరా ఇచ్చారు. ఫలితంగా రైతులకు 7 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా అందించాలి. ఇందులో పగటిపూట 4 గంటలు, రాత్రి పూట నిరంతరాయంగా అందించాల్సి ఉంది. అయితే ఫిబ్రవరి నెల నుంచే అనధికారిక కోతలు మొదలయ్యాయి. ఒకే ట్రాన్స్‌ఫార్మర్‌తో అగచాట్లు సబ్‌స్టేషన్‌లో ఒకే ట్రాన్స్ఫార్మర్ ఉండడంతో అధిక లోడ్డు కారణంగా బ్రేకర్ పడిపోతోంది. దీంతో విద్యుత్ సిబ్బంది కోతలకు సిద్ధమయ్యారు. రెండు ఫీడర్లకు సరఫరా ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఒక ఫీడర్ లో ఒక గంట సమయం విద్యుత్ సరఫరా ఆపివేస్తున్నారు. అనంతరం మరో ఫీడర్‌కు విద్యుత్ సరఫరా నిలిపేసి, మరో ఫీడర్‌కు విద్యుత్ పునరుద్ధరిస్తున్నారు. ఇలా అనధికారిక కోతలు విధిస్తున్నారు. ఈ అనధికారిక కోతలు పంటలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. రైతుల కోసం ప్రభుత్వం నిర్దేశించిన ఏడు గంటల విద్యుత్ అందడం లేదు. దీంతో సబ్‌స్టేషన్‌కు రైతులు ఫోన్ చేసి, అధికారులను నిలదీసినా సమాధానం దొరకడం లేదు. కర్షకులకు ఇక్కట్లు వేసవి ప్రారంభంలోనే అనధికారిక కోతలు విధిస్తున్నారు. దీంతో కర్షకులు ఇక్కట్లు పడుతున్నారు. పంటలకు నీరందక ఎండిపోతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో పంటల పరిస్థితి ఏమిటని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా 132/33 కేవీ సబ్‌స్టేషన్‌లో 31.5 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు అనువుగా రెండు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే వీటి ఏర్పాటుపై కూటమి ప్రభుత్వం కానీ, అధికారులు కానీ దృష్టి సారించడం లేదు. ఫలితంగా నిత్యం ఉన్న ఒక్క ట్రాన్స్ఫార్మర్ బ్రేకర్ పడిపోతోంది. దీంతో పంటలకు నీరందకుండాపోతోంది. అధికారుల కాలయాపన మంజూరు చేశాం.. విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పుకుంటున్న పాలకులు ఎటుపోయారని రైతులు నిలదీస్తున్నారు. నాణ్యమైన విద్యుత్ అందిస్తామని చెప్పిన మాటలు నీటమూటలుగా మిగిలాయని రైతులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ సరఫరాపై ఉన్నతాధికారులకు నివేదికలు పంపామంటూ స్థానిక అధికారులు కాలయాపన చేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. ఇప్పటికై నా ఏపీ ఏస్పీడీసీఎల్ ఉన్నతాధికారులు తక్షణమే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. కుప్పంలోనూ ఏడు గంటలే ! శాంతిపురం: సీఎం చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యంవహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోనూ రైతులకు కరెంటు కష్టాలు తప్పడం లేదు. వ్యవసాయానికి ఏడు గంటల పాటు విద్యుత్ ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నా.. వాస్తవంలో సరఫరా ఆరు నుంచి 6.30 గంటలకు మించటం లేదు. తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 వరకూ అన్ని ఫీడర్లలో త్రీఫేజ్ సరఫరా ఇస్తున్నారు. తర్వాత ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఓ ఫీడర్లో, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 వరకూ మరో ఫీడర్లో సరఫరా ఇస్తున్నారు. ఏకధాటిగా ఐదు గంటల పాటు విద్యుత్ ఉంటున్న సమయంలో కనీసం అర గంటకు తగ్గకుండా అప్రకటిత విద్యుత్ కోత అమలవుతోంది. దీంతో తమ పంటలు ఎండిపోకుండా చూసేందుకు రైతులు ఆపసోపాలు పడుతున్నారు. దండికుప్పం పంచాయతీలోని నిమ్మనపల్లెకు చెందిన రైతు 30 సొన్నేగానిపల్లి వద్ద పొలం లీజుకు తీసుకుని దాదాపు 3.5 ఎకరాల్లో బంగాళాదుంప సాగు చేశారు. కరెంటు కోతలతో నీరు ఇవ్వలేని స్థితిలో ఆ రైతు జనరేటర్‌ను ఏర్పాటు చేసుకుని పంటను కాపాడుకుంటున్నాడు. పంట ఎండిపోతోంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు నిరంతరాయంగా తొమ్మిది గంటలు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం పగలు 5 గంటలు, రాత్రి పూట రెండు గంటలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. ఇలాంటి కరెంటు కోతలతో రైతులు పంటలను పండించడం అటుఉంచితే, చేతికొచ్చిన పంటలకు సమయానికి నీరు అందించలేక, పంటలను ఎండిపోతోంది. ఎండుతున్న పంటలను చూస్తే గుండే పిండేస్తుంది. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు రైతులకు నిరంతరాయంగా 9 గంటలు కరెంటు ఇవ్వాలి. – రమేష్, రైతు, దాసార్లపల్లి గ్రామం, వి.కోట -
ఆలయం వద్ద మద్యం షాపు వద్దు
పుత్తూరు: స్థానిక నగరంరోడ్డులోని శ్రీఆంజనేయస్వామి ఆలయ సమీపంలో మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేయడానికి సన్నహాలు చేస్తున్నారని, ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో మద్యం షాపును ఏర్పాటు చేయవద్దని స్థానికులు కోరుతున్నారు. ఈ మేరకు బుధవారం ఎకై ్సజ్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ ఆలయం ఎదురుగానే గ్రంథాలయం, సినిమా హాలు ఉన్నాయని. ఇక్కడ మద్యం షాపునకు ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. నగరం రోడ్డు అనునిత్యం భారీ వాహనాలతో రద్దీగా ఉంటుందని, ఇదే ప్రదేశంలో పలు ప్రమాదాలు జరిగి పలువురు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఇక్కడ మద్యం షాపు ప్రారంభిస్తే, తాగి తూలుతూ తిరిగే మద్యం ప్రియులు రోడ్డు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలున్నాయని తెలిపారు. ఇక్కడి పరిస్థితులను అనుసరించి అధికారులు మద్యం దుకాణానికి అనుమతులు ఇవ్వకూడదని వారు కోరుతున్నారు. పంటలపై గజ దాడులు పెద్దపంజాణి: మండలంలోని పలమనేరు రేంజ్ కీలపట్ల ఫారెస్టు బీట్ నుంచి వచ్చిన ఏనుగులు ముదిరెడ్డిపల్లికి చెందిన రమణారెడ్డి తదితరుల టమాట పంటను తొక్కి నాశనం చేశాయి. మామిడి చెట్లను విరిచేశాయని బాధితులు వాపోయారు. సమాచారం అందుకున్న రాయలపేట ఫారెస్టు బీట్ ఆఫీసర్ రవికుమార్ బుధవారం పంట నష్టాన్ని పరిశీలించారు. నష్టపరిహారం మంజూరుకు చర్యలు చేపడతామన్నారు. ఏనుగులు పంటలపైకి రాకుండా ట్రాకర్ల సాయంతో అడవిలోకి మళ్లించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కాగా మండలంలోని పెద్దకాప్పల్లి పంచాయతీ అటవీ సరిహద్దు గ్రామాలైన తిప్పిరెడ్డిపల్లి, కొత్తబూరగపల్లి, పెనుగొలకల, పెద్దకాప్పల్లి, ముదిరెడ్డిపల్లి, బందార్లపల్లి, జిట్టంవారిపల్లి, గౌరీనగర్, ఆకులవారిపల్లి రైతులకు చెందిన పంటలను గత కొంతకాలంగా ఏనుగులు ధ్వంసం చేస్తున్నాయి. ఏనుగుల దాడుల్లో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టం జరిగిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. -
ఒంటి..తుంటరి మళ్లీ వచ్చింది!
తమిళనాడు నుంచి వెనక్కి.. గుడిపాల: ఒంటరి ఏనుగు.. భలే తుంటరి.. తమిళనాడు ప్రాంతానికి వెళ్లినట్టే వెళ్లి 24 గంటలు గడవక ముందే మళ్లీ తిరిగి వెనక్కి వచ్చేసింది. బుధవారం సాయంత్రం గుడిపాల మండలంలోని పల్లూరు గ్రామానికి సమీపంలో మకాం వేసింది. సాయంత్రం రోడ్డుపై ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఏనుగును చూసి భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అటవీశాఖ అధికారులు బాణసంచా పేల్చి అటవీప్రాంతంలోకి తరిమారు. రోడ్డు పక్కన ఎక్కువగా వరి, చెరుకు, మామిడి పంటలున్నాయి. రాత్రి వేళలో పంటను తినేందుకు ఒంటరి ఏనుగు రావచ్చని ఎవరూ కూడా రాత్రి వేళల్లో ఒంటరిగా వెళ్లవద్దని పల్లూరు, పానాటూరు గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఏనుగు కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఆనందరెడ్డి తెలిపారు. తూర్పు, పడమర అటవీశాఖ అధికారులు ప్రభాకర్‌రెడ్డి, మధు, ఢిల్లీరాణి, అరుణ ఏనుగు కదలికలపై కన్నేసి ఉంచారు. -
పోటీతత్వంతో ఉన్నత భవిత
నారాయణవనం: యువ ఇంజినీర్లు పోటీ తత్వం పెంపొందించుకుంటే ఉన్నత భవిష్యత్ పొందవచ్చని సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలల చైర్మన్ డాక్టర్ అశోకరాజు తెలిపారు. బుధవారం కళాశాలలోని ఇండోర్ స్టేడియంలో జుబిలేషన్ డే నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం అశోక్‌రాజు మాట్లాడుతూ జీవితంతో ఎంత ఎత్తుకు ఎదిగినా, కుటుంబ సభ్యులకు సమయం కేటాయించాలని సూచించారు. మంచి జీవనశైలిని అలవర్చుకోవాలని కోరారు. అనంతరం ఆయనను విద్యార్థులు ఘనంగా సత్కరించారు. ఈ క్రమంలోనే వివిధ క్రీడాపోటీల్లో విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జుబిలేషన్లో భాగంగా గురువారం చేపట్టే కార్యక్రమాలకు జేఎన్టీయూ అనంతరపురం వీసీ సుదర్శనరావు, సినీనటి సంయుక్తా మీనన్, యాంకర్ భానుశ్రీ హాజరుకానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పాఠశాల స్థలం కబ్జాకు యత్నం – అడ్డుకున్న మహిళపై దాడి శ్రీరంగరాజపురం : ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని కబ్జాకు ప్రయత్నించిన వారిని అడ్డుకున్న మహిళపై దాడి చేసి గాయపరిచిన సంఘటన మండలంలోని పొదలపల్లి దళితవాడలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. పొదలిపల్లి దళితవాడలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నిర్మాణానికి గతంలో జయరామయ్య తల్లిదండ్రులు సర్వే నంబర్ 213/16లో 1.13 ఎకరాల స్థలాన్ని విరాళంగా ఇవ్వడం జరిగింది. నాడు–నేడు పథకం ద్వారా పాఠశాలను అభివృద్ధి పరిచారు. మిగిలిన స్థలంలో అంగన్వాడీ కేంద్రం నిర్మించడానికి గత ప్రభుత్వంలో నిధులు మంజూరు అయ్యాయి. కానీ అంగన్వాడీ కేంద్రానికి కేటాయించిన స్థలాన్ని ఆక్రమిండానికి ప్రయత్నంచారు. కూటమి ప్రభుత్వం రావడంతో అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త నాగులయ్య కుమారుడు శ్రీరాములు కబ్జా ప్రయత్నించాడు. భూకబ్జాను జయరామయ్య భార్య విజయ అడ్డుకోవడంతో ఆమైపె విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచాడు. గాయపడిన మహిళను స్థానికులు 108 వాహనంలో చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుప్పంలో డిజిటల్ హెల్త్ నెర్వ్ సెంటర్ సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో రూ.5.34 కోట్లతో డిజిటల్ హెల్త్ నెర్వ్ సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు వైద్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరులోని టాటా డిజిటల్ హెల్త్ నెర్వ్ సెంటర్ ఆధ్వర్యంలో కుప్పంలో ఒక సెంటర్‌ను ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ సెంటర్లో సేవలు అందించడానికి గత నెలలో కొందరు సిబ్బందిని డిప్యుటేషన్‌పై ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ వీరపాండియన్ నియమించారు. -
డామిట్.. కథ అడ్డం తిరిగింది!
చిత్తూరు అర్బన్: నగరంలోని గాంధీరోడ్డులో బుధవా రం చోరీ యత్నం జరిగింది. ఈ ఘటన సంక్షిప్తంగా.. చిత్తూరు నగరంలోని గాంధీరోడ్డు–లక్ష్మీ థియేటర్ కూడలి వద్ద ఓ మారుతి ఓమ్నీ వ్యాను వచ్చి ఆగింది. అందులోంచి దిగిన ఆరుగురికి పైగా వ్యక్తులు ఎదురుగా ఉన్న ‘పుష్ప షాపింగ్ కిడ్ వరల్డ్’ దుకాణంపైన ఉన్న చంద్రశేఖర్ ఇంట్లోకి చొరబడ్డారు. మొహానికి మాస్కులు, టోపీలు పెట్టుకున్న వ్యక్తులు చంద్రశేఖర్, అతని తల్లి సరస్వతి, భార్య శాంతి వైపు తుపాకులు చూపించి, బంధించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంట్లో ఉన్న డబ్బు, బంగారు నగలు బ్యాగులో వేయాలని చెబుతుండగా.. చంద్రశేఖర్ పెద్దగా కేకలు వేయడంతో పైఅంతస్తులో ఉన్న కుమారుడు లోకేష్, ఇతని భార్య మానస పరుగు పరుగున కింద అంతస్తులోకి వచ్చారు. వాళ్లకు తుపాకీ చూపి కింద కూర్చోపెట్టారు. చంద్రశేఖర్ ప్రతిఘటించడంతో తల, చేతికి గాయా లయ్యాయి. నిందితుల్లో ఒకరు బొమ్మ తుపాకీ పేల్చగా, అతి టప్ మంటూ శబ్దం చేసింది. వెంటనే తప్పించుకున్న లోకేష్ రోడ్డుపైకి వచ్చి సాయం కోసం అరవడం, చంద్రశేఖర్ మిద్దైపె నుంచే దొంగలు అని కేకలు వేశారు. స్థానికంగా టీ తాగడానికి వచ్చిన ఉమాపతి, అతని స్నేహితులు హుటాహుటిన దొంగలు ఉన్న భవనంలోకి ప్రవేశించారు. వీళ్లను చూసిన వెంటనే ఇద్దరు పారిపోయారు. ఇక ఉమాపతి గొంతుకు కత్తి పెట్టడంతో నిందితుడిని కాలితో తన్నాడు. కత్తి కిందపడడంతో స్థానికులంతా కలిసి నిందితులపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. తాళ్ల సాయంతో నలుగురు నిందితులను కట్టేసి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నలుగురు నిందితులను స్థానికులు, పోలీసులకు అప్పగించారు. మరో ఇద్దరు తుపాకులతో ఇంట్లోనే ఉన్నట్లు చెప్పడంతో అలజడి మొదలైంది. టూటౌన్ సీఐ నెట్టికంటయ్య తన సిబ్బందితో కలిసి మరో భవనం నుంచి చంద్రశేఖర్ ఇంట్లోకి ప్రవేశించారు. అందర్నీ బయటకు తీసుకొచ్చారు. ఎస్పీ మణికంఠ ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుల వద్ద ఆయుధాలున్నాయనే సమాచారం రావడంతో సాయుధ బలగాలను రప్పించారు. బుల్లెట్‌ఫ్రూఫ్ జాకెట్లు ధరించి చేతుల్లో తుపాకులు పట్టుకున్న అధికారులు, సిబ్బంది భవనం లోపలకు వెళుతున్నారు, బయటకు వస్తున్నారు. కానీ ఏం జరుగుతోందో ఎవ్వరికీ అర్థం కావడంలేదు. నిందితులు వచ్చిన కారుకు తమిళనాడుకు చెందిన ద్విచక్రవాహన నంబర్ వేసుకోవడంతోపాటు, ప్రెస్ అని స్టిక్కర్ వేసుకోవడం, కారులో కత్తి, పెట్రోలు గుర్తించిన పోలీసులు దీన్ని చిన్న ఘటనగా భావించలేదు. విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. తిరుమలలో ఉన్న ఆక్టోపస్ బలగాల సాయం తీసుకోవాలని డీజీపీ చెప్పడంతో.. ఎస్పీ మణికంఠ వారిని చిత్తూరుకు రప్పించారు. 20 మందికి పైగా ఉన్న ఆక్టోపస్ బలగాలు ఘటనా స్థలం మొత్తాన్ని జల్లెడ పట్టాయి. చుట్టుపక్కల భవనాల్లో సైతం వెతికినా పారిపోయిన నిందితుల ఆచూకీ లభ్యం కాలేదు. పోలీసుల ఆపరేషన్ ముగిసింది. అందరూ వెనుతిరుగుతున్న సమయంలో... ఘటన జరిగిన భవనం గ్రౌండ్ ఫ్లోర్లో బ్యాంకు ఉంది. దొంగలు బ్యాంకులో దాక్కున్నారా..? బ్యాంకును దోచుకోవడానికి వచ్చారా..? అనే ప్రశ్నలు తలెత్తడంతో మళ్లీ ఆక్టోపస్ బలగాలు బ్యాంకులోకి తుపాకులతో ప్రవేశించి, వెతికినా ఎవరూ కనిపించకపోవడంతో ఊపిరి పీల్చుకుని ఎక్కడివాళ్లు అక్కడికి వెళ్లిపోయారు. ‘‘ఊరంతా అప్పులు. ఒక్క దోపిడీ చేస్తే, వచ్చేదాంతో అప్పులన్నీ కొట్టేయచ్చు. చోరీల్లో ఆరితేరినవాళ్లను సాయం అడిగితే వచ్చేదాంట్లో వాటాలు అడుగుతారు. తలా రూ.2 వేలు ఇస్తే నా వద్ద పనిచేసేవాళ్లే వచ్చేస్తారు. ఇక అంతా సిద్ధం. పదండి లోపలకు..’’ అన్నాడు ముఠా నాయకుడు. డామిట్ అప్పుడే కథ అడ్డం తిరిగింది. భవన యజమాని ప్రతిఘటించాడు. స్థానికంగా ఉన్న యువకులు పిచ్చ కొట్టొడుకొట్టారు. ఒకరి కాలు విరిగింది. మరొకరికి మొహం మారిపోయింది. తీరా పోలీసుల రంగ ప్రవేశంతో ఉత్కంఠ నెలకొన్నా.. చివర్లో అందరూ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. ఒక్క దోపిడీతో.. అప్పులన్నీ కొట్టేద్దామనే ఆశ చిత్తూరులో రచ్చరచ్చ చేసిన కొత్త దొంగలు బొమ్మ తుపాకీలతో పట్టపగలు ఇంట్లో చోరీకి యత్నం ప్రతిఘటించిన యజమాని.. స్థానికులే హీరోలైన వైనం జిల్లా ఎస్పీ నుంచి.. ఆక్టోపస్ బలగాల పరుగులు కంటిమీద కునుకులేక.. ఆపై ఊపిరి తీసుకున్న ఖాకీలు 10 గంటలు: సీన్ కట్ చేస్తే.. చిత్తూరు నగరంలోని కలెక్టరేట్ భవనం వెనుక ఉన్న జీకే నగర్లో కాపురముంటున్న సుబ్రమణ్యంరెడ్డి 16 ఏళ్ల క్రితం కర్నూలు నుంచి వచ్చి ఇక్కడ సోఫాలు తయారు చేసి విక్రయిస్తున్నాడు. అందరికీ అప్పులు ఇచ్చి, ఆర్థికంగా నష్టపోవడంతో ఒక్క దోపిడీ చేసి అప్పులన్నీ సెటిల్ చేద్దామని ఇలా తొలి ప్రయత్నంగా చోరీకి ప్రయత్నించి చావుదెబ్బలు తిని.. కటకటాలపాలయ్యాడు. సుబ్రమణ్యంరెడ్డితోపాటు కర్నూలు, అనంతపురం జిల్లాకు చెందిన నవీన్, ఇబ్రహీమ్ బాషా, ప్రవీణ్, రామాంజనేయులు పోలీసులకు చిక్కగా.. రాజేష్‌తో పాటు మరో ఇద్దరు తప్పించుకున్నట్లు తెలుస్తోంది. గురువారం ఈ ఘటనపై వివరాలను మీడియాకు వివరించే అవకాశం ఉంది. చంద్రశేఖర్ బ్యాంకుల నుంచి నగదు తీసుకెళ్లడాన్ని చూసి, పది రోజుల పాటు రెక్కీ నిర్వహించినా ఫలితం లేకుండా పోయిందని నిందితులు తెగ మదనపడిపోవడం కొసమెరుపు. ఉదయం 6.28 గంటలు: 6.57 గంటలు: 8.10 గంటలు: ఉదయం 6.35 గంటలు: 7.23 గంటలు: 9 గంటలు: 9.30 గంటలు: 6.40 గంటలు: 7.47 గంటలు: -
వాణిజ్య పంటల సాగుపై విస్తృత అవగాహన
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని రైతులకు వాణిజ్య పంటల సాగుపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ఖరీఫ్ కార్యచరణ ప్రణాళికల సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని రైతుల దృష్టిని వాణిజ్య పంటల సాగు వైప మళ్లీంచాలన్నారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారి మురళికృష్ణ, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రతి పరిశ్రమలో మాక్‌డ్రిల్ తప్పనిసరి జిల్లాలోని ప్రతి పరిశ్రమలో కచ్చితంగా అధికారుల సమక్షంలో మాక్‌డ్రిల్ నిర్వహించాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ ఆదేశించారు. జిల్లాలో రసాయనాల ఉత్పత్తుల పరిశ్రమల్లో ప్ర మాదాల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. వెబ్‌ల్యాండ్ కరెక్షన్పై ప్రత్యేక దృష్టి పెట్టండి జిల్లాలోని తహసీల్దార్లు వెబ్‌ల్యాండ్ కరెక్షన్స్‌పై ప్ర త్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ నెల ఖారులోపు కరెక్షన్లు పూర్తి చేయాలన్నారు. ఇళ్ల నిర్మాణాలకు అదనపు ఆర్థిక సహాయం ఎస్సీ, ఎస్టీ, బీసీ లబ్ధిదారులు త్వరతిగతిన ఇళ్ల ని ర్మాణాలను పూర్తి చేసేందుకు ప్రభుత్వం అదనంగా ఆర్థిక సహాయం చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. గ్రామా ల్లో, నగరాల్లో బోర్ల మరమ్మతులు, పైప్లైన్ల లీకేజీలను గుర్తిస్తున్నట్లు చెప్పారు. -
కలెక్టర్ ఆదేశాలు భేఖాతర్
గుడిపాల: ఓ పంచాయతీ కార్యదర్శిని గుడిపాల మండలం నుంచి పాలసముద్రం మండలానికి జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ గత ఫిబ్రవరి 25వ తేదీన బదిలీ చేశారు. అయితే కలెక్టర్ ఉత్తర్వులను ఆ పంచాయతీ కార్యదర్శి ఏ మాత్రం లెక్కచేయలేదు. వెంటనే తనకు ఉన్న పలుకుబడితో తెలుగుదేశం నాయకుల వద్ద నుంచి అధికారులకు ఫోన్ల ద్వారా ఒత్తిడి తెప్పించారు. దీంతో అధికారులు కూడా అతన్ని రిలీవ్ చేయకుండా పెండింగ్‌లో పెట్టేశారు. వివరాలులోకి వెళితే.. 189 కొత్తపల్లె పంచాయతీకి పంచాయతీ కార్యదర్శిగా మోహన్ (గేడ్–3) పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా అతనిపై ఆరోపణలు రావడంతో అతన్ని పాలసముద్రం మండలం ఆముదాల పంచాయతీకి కార్యదర్శిగా బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ గత ఫిబ్రవరి 25వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. అయితే కలెక్టర్ ఆదేశాలను ఏ మాత్రం లెక్క చేయకుండా టీడీపీ నాయకుల వద్ద నుంచి అధికారులకు ఫోన్లు చేయించి రిలీవ్ చేయకుండా నిలిపివేశారు. కలెక్టర్ ఆదేశాలను కూడా పట్టించుకోరా? అంటూ పలువురు గుసగుసలాడుతున్నారు. -
ఎన్సీడీ సర్వే వేగవంతం చేయండి
నిండ్ర: ఎన్సీడీ సర్వే వేగవంతం చేయాలని డీఎంహెచ్ఓ సుధారాణి ఆదేశించారు. నిండ్ర ప్రభుత్వ వైద్యశాలను ఆమె బుధవారం తనిఖీ చేసి, రికార్డులు పరిశీలించారు. వైద్యసేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందితో మాట్లాడుతూ తల్లీబిడ్డ ఆరోగ్య సేవలు వందశాతం అమలుకు కృషి చేయాలన్నారు. అనంతరం గ్రామంలో నిర్వహిస్తున్న ఎన్సీడీ సర్వేని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎచ్ఎం ప్రొగ్రాం ఆఫీసర్ ప్రవీణ, ఎఫ్ఆర్ఎస్ కోఆర్టినేటర్ నవీన్ తేజ్, నిండ్ర వైద్యాధికారి వినిషా తదితరులు పాల్గొన్నారు. రోడ్డు విస్తరణకు న్యాయశాఖ స్థలం 25 సెంట్ల అప్పగింత చిత్తూరు అర్బన్: నగరంలో హైరోడ్డు విస్తరణ కోసం తన పరిధిలోని 25 సెంట్ల భూమిని జిల్లా న్యాయశాఖ కార్పొరేషన్‌కు అప్పగించింది. ప్రస్తుతం నగరంలో హైరోడ్డు విస్తరణ కోసం ప్రభుత్వ భూములను కార్పొరేషన్ అధికారులు సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా న్యాయశాఖ ప్రహరీలోపల ఉన్న 25 సెంట్ల భూమిని హైకోర్టు ఆదేశాలతో కార్పొరేషన్‌కు అప్పగించారు. దీంతో ఇప్పటికే ఉన్న ప్రహరీని తొలగించి, కొత్తగా ప్రహరీ నిర్మించడానికి కార్పొరేషన్ అధికారులు బుధవారం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నగర అభివృద్ధికి ప్రతీ ఒక్కరూ సహకరించాలని కమిషనర్ నరసింహప్రసాద్ కోరారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు బార్ అసోసియేషన్ నాయకులు, సీనియర్ న్యాయవాదులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ఇంటర్ పరీక్షలో విద్యార్థి డిబార్ చిత్తూరు కలెక్టరేట్ : ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పదో రోజు పరీక్షలో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన ఒక విద్యార్థిని డిబార్ చేసినట్లు డీవీఈఓ సయ్యద్‌మౌలా వెల్లడించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని సోమల మండలం ఎస్కేవీఎన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన ఒక విద్యార్థిని డిబార్ చేసినట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 50 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు 14,034 మంది విద్యార్థులకుగాను 13,424 మంది హాజరుకాగా, 610 మంది గైర్హాజరైనట్లు వెల్లడించారు. నేడు కవయిత్రి మొల్ల జయంతి చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలో గురు వారం కవయిత్రి అటుకూరి మొల్లమాంబ జయంతి వేడుకలు నిర్వహించనన్నట్లు కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ వెల్లడించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కలెక్టరేట్లో ఉదయం 10.30 గంటలకు నిర్వహించే కవయిత్రి మొల్ల జయంతి వేడుకల్లో సంఘ నాయకులు, ప్రజలు, వివిధ శాఖల అధికారులు పాల్గొనాలని కోరారు. లెవెల్ క్రాసింగ్‌లు మూసివేత చిత్తూరు కలెక్టరేట్ : రైల్వే ఓవర్‌బ్రిడ్జి నిర్మాణంలో జిల్లాలో రేణిగుంట–అరక్కోణం సెక్షన్ పరిధిలోని లెవెల్ క్రాసింగ్‌లు మూసివేయనున్నట్లు కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రేణిగుంట– అరక్కోణం సెక్షన్ పరిధిలో నగరి–వేపగుంట, వేపగుంట యార్డు, వేపగుంట–పుత్తూరు, తడుకు యార్డులో ఉన్న లెవెల్ క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాల నివారణ, మెరుగైన రవాణా వ్యవస్థ ఏర్పాటుకు రైల్వే శాఖ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపడుతోందన్నారు. ఈ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పనులు చేపడుతున్నందున లెవెల్ క్రాసింగ్లను శాశ్వతంగా మూసి వేయనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
హోరు
యువత పోరు.. చిత్తూరు కలెక్టరేట్/చిత్తూరు కార్పొరేషన్ : చిత్తూరు నియోజకవర్గ ఇన్చార్జ్ విజయానందరెడ్డి ఆధ్వర్యంలో యువత కదం తొక్కారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడంతోపాటు ఎన్నికల్లో ఇ చ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు భృతి అందించాలని, మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ముందుగా జిల్లా కేంద్రంలోని అమూల్ డెయిరీ వద్ద నుంచి ప్రారంభమైన ర్యాలీ కలెక్టరేట్ వరకు సాగింది. దారి పొడువునా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ యువకులు ముందుకు సాగారు. సమస్యలు ప్రశ్నిస్తామన్న పవన్‌కళ్యాణ్ ఏమయ్యారని ప్రశ్నించారు. కలెక్టరేట్ వద్ద యువకులు, నాయకులను పోలీసులులోనికి పంపించకుండా అడ్డుకున్నారు. కూటమి టీడీపీ, పోలీసుల వైఖరిని నిరసిస్తూ గంటకు పైగా యువకులు కలెక్టరేట్ గేటు వద్ద బైఠాయించి ధర్నా చేశారు. లోనికి పంపకుండా అడ్డుకున్న పోలీసుల వైఖరికి నిరసనగా మహిళలు సైతం గేటు వద్ద బైఠాయించి, నినాదాలు చేశారు. అనంతరం రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ముఖ్య నాయకులు కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీని కలిసి సమస్యలను వివరించి వినతిపత్రం అందజేశారు. వివిధ ప్రాంతాల నుంచి కార్యక్రమంలో పాల్గొన్న 1500 మంది నిరుద్యోగులు, విద్యార్థులు, నాయకులు కార్యకర్తలు తమ డిమాండ్లు పరిష్కరించాలని నినదించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ భరత్, మాజీ ఎంపీ రెడ్డెప్ప, పూతలపట్టు, పలమనేరు మాజీ ఎమ్మెల్యేలు సునీల్‌కుమార్, వెంకటేగౌడ, జీడీనెల్లూరు నియోజకవర్గ సమన్వకర్త కృపాలక్ష్మి, డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే లలితకుమారి, నాయకులు, ప్రజాప్రతినిధులు గాయత్రీదేవి, లీనారెడ్డి, హరిణిరెడ్డి, గౌహతిసుబ్బారెడ్డి, అంజలిరెడ్డి, ధనంజయరెడ్డి, కుమార్ రాజా, కేపీ శ్రీధర్, జయపాల్, ప్రకాష్, జ్ఞానజగదీష్, రాహుల్‌రెడ్డి, మనోజ్‌రెడ్డి, శశిదీప్రెడ్డి, విష్ణు, సోమశేఖర్‌రెడ్డి, ధనుంజయరెడ్డి, ప్రతాప్‌రెడ్డి, బుజ్జిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, హరిరెడ్డి, మనోహర్, శిరీష్‌రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, సురేష్‌రెడ్డి, చిన్నారెడ్డి, మనోహర్‌రెడ్డి, ప్రకాష్‌రెడ్డి, దామోదర్‌రాజు, సుధాకర్‌రెడ్డి, ఎం.రెడ్డెప్ప, కేశవులు, కృష్ణమూర్తి, బాగారెడ్డి, గణేష్‌యాదవ్, ప్రహ్లాద, గిరిరాజారెడ్డి, గురవారెడ్డి, విజయబాబు, మణి, సరితజనార్థన్, కిషోర్‌కుమార్‌రెడ్డి, గుణశేఖర్రెడ్డి, మునిరాజారెడ్డి, హరిబాబు, విజయ్‌కుమార్‌రెడ్డి, అన్బుఅలగన్ పాల్గొన్నారు. ప్రశ్నిస్తామన్న పవన్ నువ్వెక్కడయ్యా! అమూల్ డెయిరీ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ కలెక్టర్ సుమిత్‌కుమార్‌కు డిమాండ్ల పరిష్కారానికి వినతిపత్రం అందజేత తరలివచ్చిన వేలాది మంది నిరుద్యోగులు, విద్యార్థులు, నేతలు, కార్యకర్తలు కూటమి సర్కారు కరుణిస్తుందని నిరుపేద విద్యార్థులు, నిరుద్యోగులు ఆశపడ్డారు.. ఎన్నికల్లో బాబు ఇచ్చిన హామీలను నెరవేరుస్తారేమోని ఎదురుచూశారు.. విద్యకు భంగం కలగకుండా ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తారేమోనని పది నెలలు పడిగాపులు కాశారు. డీఎస్సీతోపాటు ఇతర కొలువులు ఇస్తారని వేచి చూశారు. ఎప్పుడిస్తారో తెలియక ఆందోళన చెందారు.. సర్కారు నిర్లక్ష్య వైఖరితో విసిగి వేసారిపోయారు.. ఆవేదనతో నలిగిపోయారు. ఆగ్రహంతో రగిలిపోయారు.. ఈ క్రమంలో తల్లడిల్లిన నిరుపేద విద్యార్థులు, నిరుద్యోగుల గుండె మండింది. వైఎస్సార్సీపీ పిలుపు మేరకు బుధవారం నిర్వహించిన యువత పోరుకు నిరుద్యోగులు, యువకులు పోటెత్తారు. జగనన్న పాలనలో సజావుగా అందిన పథకాలను గుర్తు చేసుకున్నారు. చిత్తూరు నియోజకవర్గ ఇన్చార్జ్ విజయానందరెడ్డి నేతృత్వంలో యువత పోరు హోరెత్తింది. యవత కదంతొక్కింది. కలెక్టరేట్‌ను ముట్టడించి ఆందోళనకు దిగింది. ప్రజా విద్రోహ పాలనకు వ్యతిరేకంగా నినదించింది. నిలువునా మోసం చేశారు –వైఎస్సార్ సీపీ రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు కలెక్టరేట్ : చంద్రబాబు ఎప్పటిలాగే యువతను నిలువునా మోసం చేశారని వైఎస్సార్ సీపీ రీజినల్ కోఆర్డినేటర్, మాజీమంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ అందని విద్యార్థులు, ఉద్యోగాలు లేని నిరుద్యోగుల పక్షాన బుధవారం జిల్లా కేంద్రంలో యువత పోరు హోరెత్తింది. జిల్లా కేంద్రంలోని అమూల్ డెయిరీ నుంచి కలెక్టరేట్ వరకు విద్యార్థులు, నిరుద్యోగులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా వెళ్లారు. అనంతరం డిమాండ్లను పరిష్కరించాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీకి వినతిపత్రం అందజేశారు. యువత పోరులో పాల్గొన్న పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టామన్నారు. పేద విద్యార్థుల ఉన్నత భవిష్యత్‌కు నాడు దివంగత వైఎస్సార్ ఫీజురీయింబర్స్‌మెంట్‌ను అమలు చేశారన్నారు. అలాగే గత ఐదేళ్లలో మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో జగన్న వసతిదీవెన, విద్యాదీవెన పథకాలతో సకాలంలో ఫీజురీయింబర్స్‌మెంట్ నిధులు అందించారన్నారు. ప్రస్తుతం ఐదో త్రైమాసికం జరుగుతున్నా ఇప్పటివరకు ఉన్నతవిద్య చదివే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ మంజూరు చేయలేదన్నారు. ఫీజురీయింబర్స్‌మెంట్ అందక విద్యార్థులు కళాశాలకు వెళ్లకుండా వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు. ఫీజురీయింబర్స్‌మెంట్‌పై పోరును కొనసాగిస్తామని చెప్పారు. యువతకు నిరుద్యోగ భృతి ఎక్కడ ? ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వస్తానే నిరుద్యోగులకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన కూటమి మాట నిలబెట్టుకోలేదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ఎప్పటి లాగే ఈసారి కూడా నిరుద్యోగులను మోసగించారని విమర్శించారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.7,200 కోట్లు నిరుద్యోగ భృతి ఇవ్వాలన్నారు. 2014లో ఇలానే ఎలాంటి హామీలు అమలు చేయలేదన్నారు. జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాల్లో గత ఐదేళ్లల్లో రూ.18 వేల కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఖర్చు చేసినట్లు తెలిపారు. 17 మెడికల్ కళాశాలలను రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత వైఎస్.జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. వాటిని ప్రస్తుతం చంద్రబాబు ప్రైవేట్‌పరం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ఆధీనంలోనే మెడికల్ కళాశాలలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. గతంలో ఉన్న మద్యం బ్రాండ్లనే ప్రస్తుతం విక్రయిస్తూ, ధరలు పెంచి మరీ దోచుకుంటున్నట్లు విమర్శించారు. గేట్లకు తాళం వేసి.. మహిళల దురుసుగా ప్రవర్తించి.. యువత పోరుకు విచ్చేసిన మహిళలను పోలీసులు దురుసు ప్రవర్తనతో కలెక్టరేట్‌లోనికి రానివ్వకుండా నెట్టేశారు. వన్ టౌన్ సీఐ మహిళలను లోనికి రానివ్వకుండా కలెక్టరేట్ గేట్లకు తాళం వేసి దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఆగ్రహించిన రాష్ట్ర మహిళ విభాగం ప్రధాన కార్యదర్శి గాయత్రీదేవి, మున్సిపల్ విభాగం రాష్ట్ర కార్యదర్శి హరిణిరెడ్డి, చిత్తూరు నియోజకవర్గ మహిళ విభాగం అధ్యక్షురాలు గాయత్రీదేవి నాయకులు హరిషారెడ్డి గంట పాటు గేటు వద్దే బైఠాయించి కూటమి తీరుపై నినాదాలు చేశారు. లోనికి అనుమతి లేదని చెప్పాల్సిన పోలీసులు ఇలా మెహన గేటు వేసి దురుసు ధోరణి ప్రవర్తించడం దారుణమని గాయత్రీదేవి మండిపడ్డారు. మహిళలను కంట్రోల్ చేసేందుకు మహిళా పోలీసులను బందోబస్తులో పెట్టుకోకపోవడం సరికాదన్నారు. విద్యార్థులు, యువత సమస్యలపై శాంతియుతంగా నిరసన చేసేందుకు వస్తే దురుసుగా ప్రవర్తించడం అన్యాయమన్నారు. నిరుద్యోగులకు నిలువునా మోసం కూటమి ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడంతో మాటలు, హామీలు తప్పితే అమలు చేయడం లేదు. వేలాది మంది వాటిపై ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఉద్యోగం రాక, కుటుంబ పోషణ భారమై సతమతమవుతున్నారు. ఎన్నికల ముందు ఉద్యోగాలు ఇస్తాం లేకుంటే , నిరుద్యోగ భృతి కల్పిస్తామని చంద్రబాబు హామీనిచ్చారు. అధికారంలోకి వచ్చి 9 నెలలవుతున్నా భృతి మాటే లేదు. – శ్రీనివాసులు, జెడ్పీ చైర్మన్ ఇంటికో ఉద్యోగం కల్పించాలి టీడీపీ మేనిఫెస్టోలో ప్రకటించినట్లు ఇంటికో ఉద్యోగం కల్పించాలి. దీనికి సంబంధించిన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. నిరుద్యోగులు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ప్రతినెల రూ.3వేల నిరుద్యోగభృతి మంజూరు చేయాలి. అలా చేస్తే ఉద్యోగాల కోసం కోచింగ్ సెంటర్లకు వెళ్లే పేద విద్యార్థులకు వెసులుబాటు ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలి. – భరత్, ఎమ్మెల్సీ -
బ్రాస్లెట్ అప్పగింత
కాణిపాకం: వరసిద్ధి వినాయకస్వామి దర్శనార్థం వచ్చిన ఓ భక్తురాలు పొగొట్టుకున్న బంగారు బ్రా స్లెట్‌ను ఆమెకు తిరిగి అప్పగించారు. బంగారుపాళెం మండలం నల్లంగాడు గ్రామానికి చెందిన కీర్తన బుధవారం కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనార్థం విచ్చేశారు. ఈ క్రమంలో చేతిలోని సుమారు 14 గ్రాములు బ్రాస్లెట్ ఆలయంలో జారి పడిపోయింది. ఇది గమనించిన అటెండర్ వీరముణి ఆ ఆభరణాన్ని తీసుకుని అధికారులకు అప్పగించారు. అనంతరం ఆ ఆభరణం ఎవరిదన్న విషయం ఆరా తీసి, హోంగార్డు వినాయకం, ఆలయ ఏఈఓ రవీంద్రబాబుతో కలిసి బాధితురాలు కీర్తనకు అప్పగించారు. జెడ్పీ బడ్జెట్ ఆమోదం చిత్తూరు కార్పొరేషన్: ఉమ్మడి చిత్తూరు జిల్లా జెడ్పీ బడ్జెట్‌ను ఆమోదిస్తూ ప్రభుత్వం జీఓ నెంబర్ 151ను బుధవారం విడుదల చేసింది. 2024–2025కు సంబంధించి అధికారులు పంపిన రివైజ్డ్ బడ్జెట్ పరంగా ఆదాయం రూ.4,133 కోట్లు, వ్యయం రూ.4,039 కోట్లకు అంగీకరం తెలిపింది. ఏడాది చివరిలో జెడ్పీలోని 11 అనుబంధశాఖల పరంగా పెట్టిన ఖర్చు, వ్యయం వివరాల నివేదిక ప్రభుత్వానికి పంపుతారు.మహిళా అభ్యున్నతికి కృషి కుప్పం: మహిళా అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని కడా పీడీ వికాస్ మర్మత్ అన్నారు. బుధవారం జైపూర్‌కు చెందిన ప్రైమ్ టైర్ మార్కెట్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ కంపెనీ యాజమాన్యం కుప్పం నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా ఆర్థికాభివృద్ధిపై మహిళలకు రెండు నెలల పాటు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక వ్యవస్థపై అవగాహన, డిజిటల్ విధానంలో కొనుగోలు, లావాదేవీలు తదితర అంశాలపై అవగాహన కల్పించి మహిళలకు అన్నివిధాలా సహాయ సహకారాలు అందించేందుకు ఈ సంస్థ పనిచేస్తుందన్నారు. దేశవ్యాప్తంగా పలుచోట్ల సంస్థ చేపట్టిన కార్యక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకర్షితులై ప్రయోగాత్మకంగా కుప్పంలో ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. మొదటి దశగా కుప్పం మండలంలో ప్రైమ్టైర్ మార్కెటింగ్ సంస్థ వంద మంది మహిళలతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రైమ్టైర్ మార్కెట్ ప్రతినిధులు అజేతాషాన్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. 15 మందిపై కేసులు పలమనేరు: పట్టణంలో మంగళవారం విద్యార్థులకు సంబంధించిన గొడవలో కొందరు గ్యాంగ్‌లు చేరి, గొడవలకు కారణమై ఆపై పోలీసుల విధులను అడ్డుకున్న సంఘటనలకు సంబంధించి 15 మందిపై కేసు నమోదు చేసినట్టు పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ బుధవారం తెలిపారు. కొందరి బైక్‌లను స్వాధీనం చేసుకుని వారిపై దాడి చేయడం, విచారణకు వచ్చిన పోలీసులపై దౌర్జన్యం, కార్ట్ అండ్ సర్చ్‌లో మారణాయుధాలకు సంబంధించి కేసులు నమోదు చేశారు. దీంతో పాటు పట్టణంలోని పలు అక్రమాలకు పాల్పడే వ్యక్తులపై చర్యలు తప్పవని ఆయన తెలిపారు. మరోవైపు రెండ్రోజుల్లో రౌడీ షీటర్లు, గంజా స్మగర్లు, ఆకతాయిలు, జులాయిలకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు తెలిపారు. -
హోంగార్డు అని చెప్పి చితకబాదాడు!
వెదురుకుప్పం: పొలంలో పనిచేసుకుంటున్న తనపై ఓ వ్యక్తి హోంగార్డు అని చెప్పి మహిళ అని చూడకుండా చితకబాదినట్లు మండలంలోని పచ్చికాపల్లం గ్రామానికి చెందిన సుగుణ బుధవారం వెదురుకుప్పం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి పోలీసులకిచ్చిన ఫిర్యాదు మేరకు.. తాను పొలంలో పనిచేసుకుంటుండగా మా ఊరు కాదు మా మండలం కాని ప్రకాష్ అనే వ్యక్తి మోటారు సైకిల్‌పై వచ్చి, తనపై దౌర్జన్యం చేసి దాడికి పాల్పడ్డాడు. 2012 నుంచి తమ అనుభవంలో ఉన్న భూమిలో పనులు చేసుకుంటుండగా ప్రకాష్ వచ్చి, ఇది తమ భూమి అని చెప్పి బెదిరించాడు. తమ ఊరికొచ్చి తమ పొలం వద్దకు వచ్చి అకారణంగా తమను చంపేస్తామని బెదిరించి కొట్టి గాయపరచినట్లు విలపించింది. మెడలో ఉన్న నల్లపూసల దండ, వేలుకి ఉన్న ఉంగరాన్ని కూడా తీసుకుని వెళ్లిపోయినట్లు తెలిపింది. అరుపులు, కేకలు వేస్తున్నా ఏ మాత్రం కనికరించకుండా అడ్డు వచ్చిన మా అక్క, మా భావపై కూడా దాడికి పాల్పడినట్లు చెప్పింది. దాడికి పాల్పడిన ప్రకాష్ వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంది.