రేపు అథ్లెటిక్స్, చెస్ ఎంపికలు
చిత్తూరు కలెక్టరేట్ : అథ్లెటిక్స్, చెస్ ఎంపిక పోటీలు ఈనెల 4వ తేదీన నిర్వహిస్తున్నట్లు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ బాబు వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో అథ్లెటిక్స్, చెస్ ఎంపిక పోటీలు పకడ్బందీగా నిర్వహించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఈనెల 4న ఉదయం 9 గంటలకు అన్నమయ్య జిల్లా మదనపల్లి జెడ్పీ హైస్కూల్‌లో అథ్లెటిక్స్ అండర్–14, 17 బాల, బాలికల ఎంపికలు నిర్వహిస్తామన్నారు. అదే విధంగా చెస్ అండర్– 14, 17 బాల, బాలికల పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అథ్లెటిక్స్ డివిజన్ స్థాయిలో మొదటి స్థానంలో ఎంపికై న వారు జిల్లా స్థాయి పోటీలకు అర్హులన్నారు. ఒక సెట్ అర్హత ఫాం లను తీసుకురావాలని ఆయన తెలిపారు.
కిక్కిరిసిన కాణిపాకం
కాణిపాకం : కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. సెలవు కావడంతో భభక్తులు ఉదయం నుంచి రాత్రి వరకు పోటెత్తారు. క్యూలో జనం కిక్కిరిసిపోయారు. బారులు తీరిన భక్తజనులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం కల్పించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈవో పెంచల కిషోర్ జనం రద్దీన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ఇబ్బందులు లేకుండా చూశారు.
నేడు ప్రజాసమస్యల
పరిష్కార వేదిక
చిత్తూరు కలెక్టరేట్ : ప్రజల సమస్యల పరిష్కా రం కోసం 3న సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సమావేశానికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పక హాజరు కావాలన్నారు. గైర్హాజర య్యే వారిపై శాఖాపరంగా చర్యలుంటాయని కలెక్టర్ హెచ్చరించారు.
విద్యార్థుల ఆధార్ అప్‌డేట్‌కు గడువు పొడిగింపు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆధార్ అప్‌డేట్‌కు ప్రభుత్వం ఈనెల 6వ తేదీ వరకు గడువు పొడిగించిందని డీఈవో వరలక్ష్మి వెల్లడించారు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. విద్యార్థుల ఆధార్ అప్‌డేట్‌ను ఈ నెల 6 వ తేదీ లోపు పూర్తి చేసేలా హెచ్‌ఎంలు, ఎంఈవో, డీవైఈవోలు చర్యలు చేపట్టాలన్నారు. ఎంపీడీవోలతో సమన్వయం చేసుకుని పెండింగ్ ఉన్న విద్యార్థుల ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్‌ను పూర్తి చేయించాలన్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచి పదో తరగతి విద్యార్థులకు నామినల్ రోల్ యూడైస్‌లో తీసుకుంటారన్నారు. అపార్ ఐడీ, బయోమెట్రిక్ విద్యార్థులకు తప్పనిసరి అని తెలిపారు. ఈ ముఖ్యమైన విషయం ప్రతి హెచ్‌ఎం తప్పనిసరిగా ప్రత్యేక ప్రాధాన్యంగా భావించి అమలు చేయాలని డీఈవో ఆదేశించారు.


