పెద్దపంజాణి: మండలంలోని పలమనేరు–పుంగనూరు రోడ్డు ముత్తుకూరు క్రాస్ వద్ద ఆదివారం సాయంత్రం ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడంతో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల క థనం మేరకు.. మండలంలోని కొళత్తూరు పంచా యతీ గళ్లావారిపల్లికి చెందిన వెంకటరమణ కు మారుడు జ్యోతీశ్వర్ మదనపల్లిలోని ఓ హోటల్ లో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో స్వగ్రామం నుంచి మదనపల్లికి ద్విచక్ర వాహనంలో బయలుదేరాడు. ముత్తుకూరు క్రాస్ వద్ద పుంగనూరు నుంచి పలమనేరు వెళుతున్న కారు ఢీకొంది. తీ వ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్న జ్యోతీశ్వర్‌ను స్థానికులు 108లో పుంగనూరు ప్ర భుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు మదనపల్లి ఏరియా ఆస్పత్రికి రెఫర్ చేశారు.
ఈతకెళ్లిన విద్యార్థి మృతి
బైరెడ్డిపల్లె: స్నేహితులతో కలిసి సరదాగా ఈతకెళ్లిన విద్యార్థి మృతి చెందిన సంఘటన మండల సమీపంలోని కర్ణాటక రాష్ట్రం సనిగపల్లెలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు..మండలంలోని గంగినాయనపల్లెకు చెందిన వెంకటరమణరెడ్డి కుమారుడు తేజేష్‌రెడ్డి (10) బైరెడ్డిపల్లెలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు రావడంతో అమ్మమ్మ గ్రామమైన సనిగపల్లెకు వెళ్లాడు. అక్కడ గ్రామ సమీపంలోని చెరువులో ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.