డైయింగ్‌ ప్లాంట్లు తరలించాల్సిందే | - | Sakshi
Sakshi News home page

డైయింగ్‌ ప్లాంట్లు తరలించాల్సిందే

Published Sat, Apr 26 2025 12:27 AM | Last Updated on Sat, Apr 26 2025 12:27 AM

డైయిం

డైయింగ్‌ ప్లాంట్లు తరలించాల్సిందే

డైయింగ్‌ యూనిట్లు నివాసాలకు దూరంగా తరలించాల్సిందేనని నగరి మున్సిపల్‌ కౌన్సిలర్లు రోడ్డెక్కారు.

శనివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

కుప్పం మున్సిపల్‌ చైర్మన్‌.. ఈ పదవికి కావాల్సిన బలం కూటమి పార్టీలకు లేదు..అయితేనేం.. అధికార బలం ఉంది.. ఆ బలుపు కనబరిచి.. ప్రలోభాల ఎర చూపి.. ఎత్తులు, జిత్తులు వేసి.. ఎలాగైనా చైర్మన్‌ గిరిని దక్కించుకోవాలని యత్నిస్తున్నారు. ఇందుకు బెంగళూరు కేంద్రంగా క్యాంపు రాజకీయాలకు తెర లేపారు. ప్రతిపక్ష పార్టీ కౌన్సిలర్ల ఇళ్లకు వెళ్లి నగదు ఆశ చూపి.. దానికి లొంగకుంటే బెదిరింపులకు పాల్పడుతున్నారు కూటమి నేతలు.

కుప్పంరూరల్‌: స్థానిక మున్సిపల్‌ చైర్మన్‌ పదవికి కావాల్సిన బలం లేకపోయినా అధికార బలం కనబరిచి ఆ పదవి దక్కించుకోవాలని కూటమి యత్నిస్తోంది. కూటమి ప్రభుత్వం రాగానే అప్పటి వరకు ఉన్న కుప్పం మున్సిపల్‌ చైర్మన్‌ డాక్టర్‌ సుధీర్‌ అనివార్య కారణాలతో రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో కుప్పం మున్సిపల్‌ చైర్మన్‌ పదవి 2024 నవంబరు 5వ తేదీ నుంచి ఖాళీగా ఉంది. చైర్మన్‌ ఎన్నిక కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం మిగిలిన తుని, పాలకొండలతో పాటు కుప్పం మున్సిపాలిటికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నెల 28వ తేదీన ఎన్నికకు ముహూర్తం ఖరారు చేసింది. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీల్లో ఒక్కసారిగా ఎన్నికల వేడి రగిలింది. బలం లేకపోయినా ఎలాగైన అధికారాన్ని అడ్డం పెట్టుకుని చైర్మన్‌ గిరి దక్కించుకోవాలని టీడీపీ సర్వశక్తులు ఒడ్డుతోంది.

ఎన్నికలు ఇలా...

సంఖ్యాపరంగా చూసుకుంటే వైఎస్సార్‌సీపీకి 15, టీడీపీకి 12 ఓట్లు ఉన్నాయి. మొత్తం 27 మంది సభ్యుల్లో 14 మంది ఎన్నికకు హాజరైతే కోరంగా పరిణగించి, ఎన్నికలు నిర్వహిస్తారు. హాజరైన అభ్యర్థుల్లో ఎక్కువ మంది ఎవరికి చేతులెత్తి మద్దతు తెలుపుతారో వారు చైర్మన్‌ అభ్యర్థిగా పరిగణిస్తారు.

బెంగళూరు కేంద్రంగా క్యాంపు

రాజకీయాలు

కుప్పం మున్సిపాలిటీ ఎన్నికలు 28న జరగనున్న నేపథ్యంలో నాలుగు రోజులు ముందుగా వైఎస్సార్‌ సీపీ, టీడీపీ అధిష్టానాలు కౌన్సిలర్లను బెంగళూరు తరలించి క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. ఎవరికి వారు తమ అభ్యర్థులు జారీ పోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కౌన్సిలర్ల ఫోన్లు స్విచ్‌ ఆఫ్‌ చేసి క్యాంపునకు తరలించారు. అక్కడ అన్ని రకాల సదుయాలు కల్పించి కౌన్సిలర్లు జారిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అందరి దృష్టి సోమవారంపైనే...

కుప్పం మున్సిపాలిటీలోని ప్రజల దృష్టి సోమవారంపైనే నిలిచింది. ఎవరు మున్సిపాలిటీ చైర్మన్‌ అవుతారో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎన్నిక జరుగుతుందా..? జరిగితే ఎవరు గెలుస్తారు..? అధికార పార్టీ తమ అధిపత్యాన్ని నిలుపుకునేందుకు ఎలాంటి కుతంత్రాలు పన్నుతోంది..? అనే విషయాలపై ప్రజల దృష్టి నిలిచింది. ఏది ఏమైనప్పటికీ సుమారు 56 వేల జనాభా ఉన్న కుప్పం ప్రజల చూపు సోమవారంపైనే నిలిచింది.

కుప్పం మున్సిపాలిటీలో

ప్రస్తుత బలాబలాలు..

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పులివెందుల నియోజక వర్గంతోపాటు ప్రతిపక్ష నాయకుడి నియోజక వర్గమైన కుప్పంపై వివక్ష చూపకుండా ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేశారు. ఇందులో భాగంగానే కుప్పానికి రెవెన్యూ, పోలీసు డివిజన్లు వచ్చాయి. కుప్పం పట్టణాన్ని ఆరు పంచాయతీలతో కలిపి మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్‌ చేశారు. ఈ క్రమంలో కుప్పం మున్సిపాలిటీకి 2021 నంబర్‌ 15వ తేదీన ఎన్నికలు నిర్వహించారు. పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన వైఎస్సార్‌ సీపీకి ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. మున్సిపాలిటీలో 25 వార్డులకుగాను వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు 19 మంది, టీడీపీ అభ్యర్థులు 6 గెలుపొందారు. వైఎస్సార్‌ సీపీ సభ్యులు అధిష్టానం అభీష్టం మేరకు డాక్టర్‌ సుధీర్‌ను చైర్మన్‌గా ఎన్నుకున్నారు. ఆయన నాయకత్వంలో మున్సిపాలిటీలో అభివృద్ధి పరుగులు తీసింది. గత ఏడాది జూన్‌ 4వ తేదీన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మున్సిపాలిటీలో కుదుపు మొదలైంది. కూటమి నాయకులు, ప్రభుత్వం నుంచి వైఎస్సార్‌ సీపీ సభ్యులపై రకరకాల ఒత్తిళ్లు మొదలయ్యాయి. మొదటి వికెట్‌గా 2024 నంబర్‌ 5వ తేదీన చైర్మన్‌ డాక్టర్‌ సుధీర్‌ చైర్మన్‌ పదవితోపాటు, 16వ వార్డు కౌన్సిలర్‌ అభ్యర్థిత్వానికి రాజీనామా చేసి, టీడీపీలోకి వెళ్లిపోయారు. దీంతో 16 వవార్డు కౌన్సిలర్‌ ఖాళీ కాగా, మొత్తం కౌన్సిలర్ల సంఖ్య 24కు చేరింది. ఆయన బాటలోనే మరో ఐదుగురు కౌన్సిలర్లు టీడీపీలోకి వెళ్లిపోయారు. వెళ్లిన వారిలో 24వ వార్డు కౌన్సిలర్‌ సయ్యద్‌ ఆలీ తిరిగి వైఎస్సార్‌సీపీలోకి వచ్చారు. ఈ పరిణామంతో మున్సిపాలిటీలో వైఎస్సార్‌ సీపీకి 14, టీడీపీకి 10 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వీరే కాకుండా ఎక్స్‌ అఫిషియో సభ్యులు స్థానిక ఎమ్మెల్యే చంద్రబాబు, పట్టభద్రుల ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌, వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్సీ భరత్‌ మున్సిపాలిటీ ఓటర్లుగా ఉన్నారు. వీరిని కలుపుకుంటే వైఎస్సార్‌ సీపీ కి 15, టీడీపీ 12గా సమీకరణలు మారాయి.

ఆశావహుల్లో గుబులు...

వైఎస్సార్‌ సీపీ చైర్మన్‌ అభ్యర్థి ఎవరనే విషయం కౌన్సిలర్లకు అధిష్టానం ఇప్పటికే స్పష్టం చేసిన దృష్ట్యా అందరు ఏకతాటిపై ఉన్నారు. అధికార పార్టీ టీడీపీలో మాత్రం అలజడి నెలకొంది. ముఖ్యంగా 19వ వార్డు కౌన్సిలర్‌ జిమ్‌ దాము, 20వ వార్డు కౌన్సిలర్‌ సోమశేఖర్‌, 5వ వార్డు కౌన్సిలర్‌ సెల్వం చైర్మన్‌ రేసులో ఉన్నారు. వీరు ముగ్గురు తమకంటే తమకే అధిష్టానం ఆశీర్వాదం ఉన్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. తమ పార్టీ వారే కాకుండా ఎదుట పార్టీ వారిని ఫోన్ల ద్వారా పలకరిస్తూ తమకే మద్దతుగా నిలవాలని ఆశావాహుల్లో ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు.

– 10లో

– 10లో

న్యూస్‌రీల్‌

28న కుప్పం మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక

బలం లేకపోయినా నెగ్గేందుకు సిద్ధమవుతున్న టీడీపీ

ఎలాగైనా చైర్మన్‌ పదవి దక్కించుకోవాలని ప్రలోభాలు

మొదలైన ఇరుపార్టీల క్యాంపు రాజకీయాలు, రహస్య సమావేశాలు

కుప్పంలో హాట్‌టాపిక్‌గా మారిన చైర్మన్‌ ఎన్నిక

కుప్పం మున్సిపాలిటీ సమాచారం

మొత్తం వార్డులు – 25

ఎన్నికల్లో పాల్గొంటున్న వార్డు సభ్యులు – 24

ఎక్స్‌ అఫిసియో సభ్యులు – 3

మొత్తం జనాభా – 48,532

(2011 లెక్కల ప్రకారం)

మొత్తం ఓటర్లు – 39,319

పురుష ఓటర్లు – 18,838

మహిళా ఓటర్లు – 20,473

ట్రాన్స్‌జెండర్లు – 8

కుప్పంలో 144 సెక్షన్‌ అమలు

కుప్పం: మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక సందర్భంగా కుప్పం మండల పరిషత్‌ కార్యాలయ ప్రాంగణంలో 144 సెక్షన్‌ అమలు చేస్తున్నట్లు ఆర్డీఓ శ్రీనివాసులరాజు తెలిపారు. ఈ నెల 28వ తేదీన మున్సిపాలిటీ చైర్మన్‌ ఎన్నిక జరగనుండడంతో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. మండల పరిషత్‌ కార్యాలయంలో చైర్మన్‌ ఎన్నిక నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యాలయం వంద మీటర్ల దూరంలో పూర్తి స్థాయిలో 144 సెక్షన్‌ అమలులో ఉంటుందన్నారు.

డైయింగ్‌ ప్లాంట్లు తరలించాల్సిందే
1
1/1

డైయింగ్‌ ప్లాంట్లు తరలించాల్సిందే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement