
వైభవంగా ఉరుసు ప్రారంభం
పుంగనూరు: పట్టణంలోని చెరువు కట్టపై ఉన్న హజరత్ సయ్యద్‌నూర్‌షావలిబాబా ఉరుసు ఉత్సవం శుక్రవారం గంధంతో వైభవంగా ప్రారంభమైంది. రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముస్లిం వేషధారణలో చాదర్‌ను నెత్తిన పెట్టుకుని ర్యాలీగా వచ్చి దర్గాలో బహూకరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కాగా 27వ తేదీన ఖవ్వాలి, 28న తహలీల్ ఫాతేహా నిర్వహిస్తారు. ఈ మేరకు దర్గాను విద్యుత్ దీపాలతో అలంకరించారు. దర్గాలో ప్రత్యేక పూలు చాదర్‌లు పెట్టి హజరత్‌లు పూజలు చేశారు. స్థానిక ఎన్‌ఎస్.పేటలోని కళాశాల మైదానంలో ఉరుసు సందర్భంగా దుకాణాలు, రంగుల రాట్నాలు ఏర్పాటు చేశారు. ఉరుసు కార్యక్రమానికి వేలాది మంది ముస్లిం, హిందువులు రానుండటంతో దర్గా కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉరుసు కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో అన్నదానం ప్రారంభించారు. మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా, కమిషనర్ మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు పారిశుద్ధ్య కార్యక్రమాలు, మంచినీరు, వైద్యసేవలతో పాటు విద్యుత్ అంతరాయం కలగకుండ ఏర్పాట్లు చేపట్టారు. అలాగే పలమనేరు డిఎస్పీ ప్రభాకర్ ఆధ్వర్యంలో సీఐ సుబ్బరాయుడు, ఎస్‌ఐలు లోకేష్, కేవీ రమణ, సిబ్బంది కలసి ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు.
చాదర్ బహూకరించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి
ప్రార్థనలో పాల్గొన్న వేలాది మంది ముస్లింలు