
రైతుల రక్తం పీల్చేస్తున్నారు!
● చిత్తూరులో కూటమి పార్టీ దౌర్జన్యాల ‘గేటు’ ● పేదల నుంచి రైతుల వరకు ఇష్టారాజ్యంగా వసూలు ● అడిగే దిక్కులేదు.. అడగాల్సిన అధికారుల మౌనం ● ‘మార్కెట్ గేట్’ పేరిట జనం నుంచి రూ.లక్షల లూఠీ
బలవంతపు వసూళ్లు
చిత్తూరులో రోడ్లపై చిన్నపాటి వ్యాపారాలు చేసుకునేవారు, రైతుల రక్తాన్ని పీలుస్తూ.. వారి కష్టాన్ని దర్జాగా దోచుకోవడానికి ‘గేటు’ అనే పేరు పెట్టుకున్న కూటమి పార్టీకి చెందిన నాయకులు నడిరోడ్డుపై చేస్తున్న దౌర్జ న్యాలను ప్రశ్నించే దిక్కు కనిపించడంలేదు. ఎక్కడో మారుమూల పల్లెలో పనులు దొరకని రైతులు పండించుకున్న కూరగాయాలను చిత్తూరులో విక్రయించుకుని, నాలుగు రూపాయలు సంపాదించుకోవడాని కి వస్తుంటే.. వాళ్ల రక్తాన్ని పీల్చేస్తున్నారు. చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, గంగాధరనెల్లూరు నియోజకవర్గాల్లోని మండలాల రైతులు, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలకు చెందిన రైతులు చిత్తూరు నగరానికి కూరగాయలను తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. కార్పొరేషన్ అధికారులు నిర్ణయించిన ధరలు కాకుండా.. గేటు కాంట్రాక్టు దక్కించుకున్న వ్యక్తులు ఇష్టారాజ్యంగా బలవంతపు వసూళ్లకు పాల్పడుతూ రైతుల ఉసురు పోసుకుంటున్నారు.
తాటి ముంజెలు అమ్ముతున్న వ్యక్తి నుంచి
రూ.50 గేటు వసూలు చేస్తున్న కలెక్షన్ బాయ్
‘‘మండుటెండల్లో కొబ్బరికాయలు అమ్ము తున్న ఈ రైతు పేరు సుబ్రమణ్యం. రోజూ కొబ్బరికాయల కోసం చెట్టు ఎక్కే కొడుకు.. అదే చెట్టు పైనుంచి పడి చనిపోతే, వయసైపోయిన భార్య ను పోషించడానికి, ఈ పెద్దాయనే ప్రస్తుతం చెట్టు ఎక్కి కొబ్బరికాయలు కోసుకొచ్చి చిత్తూరు లో అమ్ముతున్నాడు. ఇందుకోసం ఈ రైతు రోజూ చెల్లిస్తున్న కప్పం రూ.50. వాస్తవానికి కట్టాల్సిన గేటు రూ.20 మాత్రమే.’’
‘‘రెండు రోజుల కిందట చిత్తూరు ప్రశాంత్ నగర్ వద్ద బలవంతపు గేటు వసూళ్లపై చిత్తూరుకు చెందిన జగ్గా, జంగాలపల్లెకు చెందిన కిరణ్ అనే ఇరువర్గాలు రోడ్లపై కొట్టుకున్నాయి. వా రపు సంతలో గేటు ఎవరు వసూలు చేయాలో తెలియక ఇరువర్గాలు కొట్టుకోవడంతో యాద మరి పోలీసులు కేసులు నమోదు చేశారు.’’
చిత్తూరు అర్బన్: నగరంలో మార్కెట్ గేటు పేరిట కూటమి పార్టీకి చెందిన నేతల బహిరంగ దోపిడీకి పాల్పడుతున్నారు. రోజూ వేలాది మంది రైతులు, రోడ్లపై పూసలు అమ్మేవారు, కూరగాయలు, బొమ్మలు, పండ్లు, ఆకు కూరలు విక్రయించే వారు.. ఇలా ప్రతి ఒక్కరి నుంచి దౌర్జన్యంగా మార్కెటు గేటును వసూలు చేస్తున్నారు. అసలు ఎవరు గేటు చెల్లించాలి..? ఎవరికి మినహాయింపు ఉంది..? తట్టలో వ్యాపారం చేస్తే ఎంత..? బుట్ట పెట్టుకునే వాళ్లు ఎంత ఇవ్వాలి..? అనే ప్రశ్నలకు కార్పొరేషన్ అధికారులు నోరువిప్పి మాట్లాడకపోవడం, కనీసం నగరంలో గేటు ధరలు తెలిపే బోర్డులు పెట్టకపోవడం ఈ దౌర్జన్యాలకు ఊతమిచ్చినట్లవుతోంది.
నెలకు రూ.20 లక్షలకు పైనే..
చిత్తూరు నగరానికి ఐదు కిలో మీటర్ల పరిధిలో జరుగుతున్న గేటు దౌర్జన్యకాండను అటు పాలకులు, ఇటు అధికారులు పట్టించుకోవడంలేదు. రోజుకు రూ.60 వేల నుంచి రూ.లక్ష వరకు గేటు వసులు చేస్తున్నారు. నెలకు సగటున రూ.20 లక్షల చొప్పున, ఏటా రూ.2 కోట్లపైనే వసూలు చేస్తున్నారు. గేటు వసూలు చేయడం చట్టవిరుద్ధం కాదు. కానీ వసూలు చేయాల్సిన దానికన్నా ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తుండడమే సమస్యకు కారణం. చాలా మంది రైతులు వాళ్ల కన్నీళ్లను దిగమింగుకుని ఈ గేటు చెల్లిస్తున్నారు. గేటు వసూళ్లల్లో వచ్చిన విభేదాలు నాటి టీడీపీ ప్రభుత్వ హయంలో అప్పటి మేయర్ అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ జంట హత్యలకు కారణమనే విషయం చిత్తూరు ప్రజలకు తెలిసిన బహిరంగ సత్యం. అలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఈ బలవంతపు గేటుకు కళ్లెం వేయాల్సిన అవసరం ఉంది.
చిన్న సన్నకారులు రైతులు.. చిన్న కమతాల్లో వ్యవసాయం.. అరకొర దిగుబడులు.. ఆ పంట ఉత్పత్తులు చిత్తూరులో విక్రయం.. వచ్చిన సంపాదనతో జీవనం.. అయితే ఆ బడుగుజీవులనూ కూటమి నేతలు విడవడం లేదు. కాసులపై ఆశతో మార్కెట్ గేట్ పేరిట బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. అడిగే దిక్కులేక పోవడంతో ఆ కర్షకులు కక్కలేక మింగలేక తమకు వచ్చిన అరకొర ఆదాయంలో వారడిగినంత ముట్టజెప్పుతున్నారు.

రైతుల రక్తం పీల్చేస్తున్నారు!

రైతుల రక్తం పీల్చేస్తున్నారు!

రైతుల రక్తం పీల్చేస్తున్నారు!