
ఇంటర్ డీఐఈఓగా శ్రీనివాసులు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా ఇంటర్మీడియట్ డీఐఈఓగా ఏ. శ్రీనివాసులు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కోనశశిధర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వుల మేరకు శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూ రు జిల్లా కేంద్రంలో డీకే ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్‌గా విధులు నిర్వహిస్తున్న ఏ శ్రీనివాసులును చిత్తూరు డీఐఈఎగా నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఆయనకు వైఎస్సార్‌కడప జిల్లా ఇంటర్మీడియట్ విద్య ఆర్జేడీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. గతంలో చిత్తూరు డీఐఈఓగా పనిచేస్తున్న సయ్యద్ మౌలా తన పూర్వపు స్థానం కణ్ణన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్‌గా కొనసాగనున్నారు. నూతన డీఐఈఓ త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు.
వరసిద్ధుడికి
రూ.1.77 కోట్ల ఆదాయం
కాణిపాకం: వరసిద్ధి వినాయకస్వామివారి ఆలయానికి హుండీల ద్వారా రూ.1.77 కోట్ల ఆదాయం వచ్చిందని ఈఓ పెంచలకిషోర్ తెలిపారు. కాణిపాకంలోని వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో హుండీల్లోత భక్తుల సమర్పించిన కానుకలను సోమవారం ఆలయాధికారులు లెక్కించారు. హుండీల ద్వారా దేవస్థానానికి రూ.1.71,77,943 ఆదాయం వచ్చిందని ఆయన తెలిపారు. అలాగే గోసంరక్షణ హుండీ ద్వారా రూ.13,814, నిత్యాన్నదానం హుండీ ద్వారా రూ.42,436 వచ్చిందన్నారు. 309 యూఎస్‌ఏ డాలర్లు, 10 యూరోలు, 50 కెనడా డాలర్లు, 5 ఆస్ట్రేలియా డాలర్స్, 4 మలేషియా రింగిట్స్, 135 యూఏఈ దిర్హామ్స్ వచ్చాయన్నారు. బంగారం 165 గ్రాములు, వెండి 1.350 కిలోలు భక్తులు కానుక రూపంలో సమర్పించుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు రవీంద్రబాబు, హరిమాధవరెడ్డి, ధనంజయ, ప్రసాద్, నాగేశ్వరరావు, కోదండపాణి, శ్రీధర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

ఇంటర్ డీఐఈఓగా శ్రీనివాసులు