
22 మంది విద్యార్థుల డిబార్
తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలో గురువారం నుంచి ప్రారంభమైన డిగ్రీ 2వ, 4వ సెమిస్టర్ పరీక్షల్లో తొలిరోజు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 22 మంది విద్యార్థులను డిబార్ చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ దామ్లానాయక్ తెలిపారు. హైపవర్ ఇన్‌స్ఫెక్షన్ కమిటీ ఇచ్చిన సమాచారం మేరకు మదనపల్లి జోన్ పరిధిలో 16 మంది, చిత్తూరు జోన్ పరిధిలో ఆరుగురు విద్యార్థులు మాస్‌కాపీయింగ్‌కు పాల్పడగా అధికారులు వారిని డిబార్ చేసినట్లు పేర్కొన్నారు.
డీపీఓకు రాష్ట్రస్థాయి అవార్డు
చిత్తూరు కార్పొరేషన్: గత ఆర్థిక సంవత్సరం పంచాయతీ పన్నుల వసూళ్లలో రాష్ట్ర స్థాయిలో జిల్లా మొదటి స్థానం వచ్చింది. ఇందుకుగాను జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా గురువారం డీపీఓ సుధాకర్‌రావు విజయవాడలో డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్‌కల్యాణ్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. గుడిపాల మండలం చీలాపల్లె పంచాయతీలో జలజీవన్ మిషన్, ఇతర పథకాల్లో ప్రతిభ చూపినందుకు గుడి పాల ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ పవన్‌కుమార్, సర్పంచ్ అరుణ్‌కుమార్ అవార్డులు అందుకున్నారు.
పశుబీమా పథకాన్ని
సద్వినియోగం చేసుకోండి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): పశు బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇన్‌చార్జ్ జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి అరిఫ్ తెలిపారు. ఒక కుటుంబానికి 100 జీవాల వరకు బీమా చేసుకోవచ్చన్నారు. పది పశువులకు బీమా సౌకర్యం వర్తిస్తుందన్నారు. ప్రభుత్వ రాయితీ పోను మేలు జాతి పశువుకు రూ.288, నాటు జాతి పశువురూ.114 ప్రీమియం చెల్లించాల్సి ఉందన్నారు. అలాగే గొర్రెలు, మేకలు, పందులకు సంవత్సరకాలనికి రూ.27, రెండేళ్లకు రూ.40, మూడేళ్లకు రూ.56 చొప్పున్న ప్రీమియంగా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ అవకాశాన్ని పాడిరైతులు సద్వినియోగంచేసుకోవాలని, ప్రీమియం చెల్లింపునకు రైతు భరోసా కేంద్రాలను సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు.
సీఎంసీ ఆస్పత్రిలో
సౌకర్యాలపై ఆరా
గుడిపాల: చీలాపల్లె సీఎంసీ ఆస్పత్రిలో రోగులకు అందిస్తున్న సౌకర్యాలపై జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆరా తీశారు. గురువారం సీఎంసీ ఆస్పత్రిని ఆయన సందర్శించారు. రోగులకు వైద్యం అందిస్తున్న సౌకర్యాలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఎమెర్జెన్సీ, ఎక్స్‌రే, ఓపీ కేంద్రాలను సందర్శించారు.

22 మంది విద్యార్థుల డిబార్