
వైఎస్సార్‌టీఏ జిల్లా అధ్యక్షుడిగా గోవిందస్వామి
చిత్తూరు కలెక్టరేట్ : వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా ఎం.గోవిందస్వామి (ఎస్‌జీటీ)ని ప్రకటించారు. సోమ వారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్‌కుమార్‌రెడ్డి, సుధీర్ ఈ విషయం వెల్లడించారు. నూతన జిల్లా అధ్యక్షుడు గోవిందస్వామి మాట్లాడుతూ జిల్లాలోని టీచర్లకు ఎటువంటి సమస్యలున్నా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. అనంతరం ఏపీ పరిశ్రమలు, సాంకేతిక సంస్థ ఉపాధ్యక్షులు కండ్లగుంటి బాబు, తదితర ఉపాధ్యాయులు నూతన జిల్లా అధ్యక్షుడిని అభినందించారు.
హత్యాయత్నం కేసులో ఇద్దరి అరెస్టు
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో మూడు రోజుల క్రితం జరిగిన హత్యాయత్నం కేసులో నిందితులు మణితేజ, చంద్రను టూటౌన్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. పాత కక్షల నేపథ్యంలో శనివారం పాత కలెక్టరేట్ సమీపంలో చామంతిపురానికి చెందిన మనోజ్‌పై మణితేజ, చంద్ర కత్తితో దాడి చేసి పారిపోయారు. దీనిపై కేసు నమోదుచేసిన పోలీసు లు నిందితులను అరెస్టు చేసి జడ్జి ఎదుట హాజరుపరిచారు. వారికి జడ్జి 14 రోజుల రిమాండుకు ఆదేశించడంతో చిత్తూరులోని జిల్లా జైలుకు తరలించారు.
రైలు నుంచి పడి
గుర్తు తెలియని మహిళ మృతి
కుప్పంరూరల్: బెంగళూరు – చైన్నె రైల్వే మార్గంలో కుప్పం పట్టణానికి సమీపంలోని ఫ్‌లై ఓవర్ వద్ద సుమారు 55 ఏళ్ల మహిళ రైలు నుంచి జారిపడి మృతి చెందినట్లు కుప్పం రైల్వే పోలీసులు సోమవారం తెలిపారు. మృతురాలు ఎరుపు రంగు జాకెట్, గళ్లచీర కట్టుకుందని చెప్పారు. ఈమె ఆచూకీ తెలిసిన వారు కుప్పం రైల్వే పోలీసుస్టేషన్ 9000716436, 9494228854 నంబర్లలో సంప్రదించాలని కోరారు. మృతదేహాన్ని కుప్పం ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు చెప్పారు.