Jangaon
-
ఇంటర్మీడియట్లో ‘రెజోనెన్స్’ సత్తా
హన్మకొండ: ఇంటర్మీడియట్ ఫలితాల్లో రెజోనెన్స్ జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. మంగళవారం వెలువడిన ఫలితాల్లో వరంగల్, హ నుమకొండలోని రెజోనెన్స్ జూనియర్ కళాశాలలు 90 రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారని ఆ విద్యా సంస్థల చైర్మన్ లెక్కల రాజిరెడ్డి తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ, బీపీసీలో రాష్ట్ర ఫస్ట్ ర్యాంకుతోపాటు మొత్తం 80 రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించినట్లు వివరించారు. నలుగురు విద్యార్థులు 470 మార్కులగాను 468 మార్కులతో రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంకుసాధించారని, 22 మంది విద్యార్థులు 470 మార్కులకు 467 మార్కులతో రాష్ట్ర స్థాయి రెండో ర్యాంకు సాధించారన్నారు. 21 మంది తృతీయ ర్యాంకు, 25 మంది రాష్ట్ర స్థాయి 4వ ర్యాంకు సాధించారని తెలిపారు. ద్వితీయ సంవత్సరంలోనూ విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో జయకేతనం ఎగుర వేశారన్నారు. 21 మంది విద్యార్థులు రాష్ట్ర టాప్ మార్కులు, 995, 994, 993, 992, 991, 990తో పాటు మరిన్ని ఉత్తమ ర్యాంకులు సాధించారని వివరించారు. ఎంపీసీ మొదటి సంవత్సరంలో భూక్యా మనోజ్ కుమార్ 468, వేముల అనిక్షిత 468, గందె వర్ష 468, మంతిని సహస్ర 468 మార్కులు, ద్వితీయ సంవత్సరంలో నీలం నిక్షిత 995, బుర్ర అక్షిత 994, బీపీసీ మొదటి సంవత్సరంలో గండ్ర శ్రీజ 438, దావర్తి శ్రీనిధి 436, దర్ముల శ్రీతిక 436, ద్వితీయ సంవత్సరంలో ఎం.పూజశ్రీ 992, ఆర్.ఇక్షావర్ 992, డి.త్రిలోచన్ 992, ఎం.అస్మిత 992 మార్కులు సా ధించారని వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థా యి ర్యాంకులు సాధించిన విద్యార్థులను కళాశాల చైర్మన్, డైరెక్టర్లు, అధ్యాపకులు అభినందించారు. డైరెక్టర్లు లెక్కల మహేందర్ రెడ్డి, మాదిరెడ్డి దేవేందర్ రెడ్డి, సీఏఓ లెక్కల రమ్య, అకడమిక్ డీన్ గోపాలరావు, డీన్ కె.సాంబశివుడు పాల్గొన్నారు. -
పారదర్శకంగా ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక
జనగామ: ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం మొదటి విడత లబ్ధిదారుల ఎంపికను పారదర్శకంగా చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ సచివాలయం నుంచి సీఎస్ శాంతికుమారి, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దాన కిశోర్, హౌసింగ్ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ గౌతమ్‌లతో కలిసి ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతిపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. వీసీలో అదనపు కలెక్టర్లు పింకేష్ కుమార్, రోహిత్ సింగ్‌లతో కలిసి కలెక్టర్ రిజ్వాన్ బాషా పాల్గొన్నారు. గ్రామాలు, మున్సిపల్ వార్డుల పరిధిలో ఇందిరమ్మ కమిటీల ద్వారా అర్హుల జాబితా ఎంపిక చేయాలని, ఇందిరమ్మ కమిటీ ఆమోదించిన ప్రతీ 200 ఇళ్లకు ఒక ప్రత్యేక అధికారిని నియమించి, ఏప్రిల్ 30 లోపు మరోసారి ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేసేలా చూడాలన్నారు. భూ భారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించేందుకు అన్ని మండలాల్లో సదస్సులను నిర్వహించాలన్నారు. వీసీలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, ఆర్డీవోలు గోపీరాం, వెంకన్న, డీఆర్డీవో పీడీ వసంత, హోసింగ్ పీడీ మాతృనాయక్ తదితరులు పాల్గొన్నారు. బ్యాంకర్లు సహకరించాలి రాజీవ్ యువ వికాసం పథకం అమలుకు బ్యాంకర్లు సహకరించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశం హాలులో అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్‌తో కలిసి రాజీవ్ యువ వికాసం పథకం, వాల్టాచట్టం అమలుపై బ్యాంకర్లు, సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, అర్హుల జాబితాను తయారు చేయాలన్నారు. ఈ సమీక్షలో డీఆర్డీవో పీడీ వసంత, డీపీఓ స్వరూప, లీడ్ బ్యాంకు మేనేజర్ శ్రీధర్, అధికారులు ఉన్నారు. వీసీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి -
రజతోత్సవ సభను విజయవంతం చేయాలి
జనగామ: ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంలో ఈ నెల 27న తలపెట్టిన బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మాజీ హోం మంత్రి మహమూద్ అలీ పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్ నుంచి వరంగల్‌లో జరిగే సభాస్థలికి వెళ్లే క్రమంలో ఆయన జనగామ ఆర్టీసీ చౌరస్తాలో కాసాపు ఆగగా, నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తిరుగు ప్రయాణంలో జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డితో సమావేశమయ్యారు. రజతోత్సవ సభ దేశ చరిత్రలో నిలిచి పోతుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ మైనార్టీ అధ్యక్షుడు మొహమ్మద్ సలీం, సాజిద్ భాయ్, జహంగీర్ హుస్సేన్, పానుగంటి ప్రవీణ్, గులాం జానీ, రిజ్వాన్, తిప్పారపు విజయ్, సయ్యద్ ఫజల్, రాజేష్ రెడ్డి, అన్వర్ పాషా, అక్తర్ పాషా, ఆమీర్ రాజ్, కుమార్, తదితరులు ఉన్నారు. మాజీ హోంమంత్రి మహమూద్ అలీ -
ఇంటర్లో ‘శివాని’ విజయదుందుభి
హసన్‌పర్తి: ఇంటర్మీడియట్ ఫలితాల్లో భీమారంలోని శివాని కళాశాల విజయదుందుభి మోగించింది. జూనియర్ ఎంపీసీ విభాగంలో కళాశాలకు చెందిన నేరేళ్ల రిషిత 468 మార్కులు, నాగుల నవదీప్ 468 మార్కులు, చక్రిక 468, ఎన్.జశ్వంత్ 467, వరుణ్ తేజా 467, శివకుమార్ 467, తేజాశ్రీ 467, పూజిత 467, సంధ్యా 467 మార్కులు సాధించినట్లు శివాని విద్యాసంస్థల కరస్పాండెంట్ స్వామి తెలిపారు. బీపీసీ విభాగంలో బానోత్ స్వాతి 435 మార్కులు, ఇంద్రజా 434 మార్కులు సాధించారు. సీఈసీ విభాగంలో మేకల కార్తీక్ 484 మార్కులు సాధించాడు. సీనియర్ ఎంపీసీ విభాగంలో చీరాల శైజా 995 మార్కులు, కె. మాధవి 995, బి. మనీషా 993, నక్షత్ర 993, దివ్యశ్రీ 992, రోజా 992, పోరెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి 991, జెమిని 990 మార్కులు సాఽధించినట్లు కరస్పాండెంట్ తెలిపారు. బీపీసీ విభాగంలో హర్షిణి 993 మార్కులు, హన్సిక 992, సుష్మిత 992 మార్కులు సాధించారని కరస్పాండెంట్ స్వామి చెప్పారు. ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులను కరస్పాండెంట్ స్వామి, ప్రిన్సిపాళ్లు చంద్రమోహన్, సురేందర్‌రెడ్డి, డైరెక్టర్లు రాజు, రమేశ్, మురళీధర్, సురేశ్, సంతోశ్‌రెడ్డి అభినందించారు. -
కాళోజీ కళాశాల ప్రభంజనం
హసన్‌పర్తి: ఇంటర్మీడియట్ ఫలితాల్లో చింతగట్టులోని కాళోజీ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. సీనియర్, జూనియర్ విభాగాల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించినట్లు కళాశాల చైర్మన్ శ్యాంసుందర్‌రెడ్డి తెలిపారు. సీనియర్ ఇంటర్ బీపీసీ విభాగంలో సురేశ్ 993 మార్కులు, ఎస్. వైష్ణవి 991 మార్కులు, ఎంపీసీ విభాగంలో సీహెచ్. శ్రీకృతి 991 మార్కులు, జి. తేజస్వీని 991, హాసిని 989, స్ఫూర్తి 985,అనురాఘవగౌడ్ 985 మార్కులు, సాధించినట్లు చెప్పారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో ఎస్. వంశీ 463 మార్కులు, సింధు 461, కె. అక్షిత 460 , శ్రీనిధి 460 మార్కులు, బీపీసీ విభాగంలో ఆశ్రయ 428 మార్కులు, ఆర్.మానస 421, హారిక 421మార్కులు సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను చైర్మన్ శ్యాంసుందర్‌రెడ్డి, ప్రిన్సిపాల్ వై.కె.ఎస్. డైరెక్టర్లు తిరుపతిరెడ్డి, అనిల్‌రెడ్డి, మధుకర్‌రెడ్డి,ఎం.సతీశ్‌కుమార్ అభినందించారు. -
‘సువిద్య’ విద్యార్థుల విజయకేతనం
హన్మకొండ: ఇంటర్మీడియట్ ఫలితాల్లో హనుమకొండ నక్కలగుట్టలోని సువిద్య జానియర్ కాలేజీ ఫ ర్ గర్ల్స్ విజయకేతనం ఎగురవేసింది. మంగళవారం వె లువడిన ఫలితాల్లో తమ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణులయ్యారని కళాశాల కరస్పాండెంట్ కె.శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్లు ఎ.జితేందర్ రెడ్డి, ఎన్.వెంకట్ రెడ్డి తెలిపారు. ఎంపీసీ మొద టి సంవత్సరంలో ఎన్.ధృతి రెడ్డి 467 మార్కులు, ఎస్.జీవిక 463, పి.శ్రీజ 459, బీపీసీ మొదటి సంవత్సరంలో పి.షణ్ముక ప్రియ 424, ద్వితీయ సంవత్సరంలో ఎం.సిరిచందన 986, బి.దేవిశ్రీ 985, డి.ప్రీతిక 985 మార్కులు సాధించారన్నారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను కరస్పాండెంట్, డైరెక్టర్లు, ప్రిన్సిపాల్ అభినందించారు. -
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
చిల్పూరు: పల్లగుట్ట గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీలకు ఎంపికై నట్లు హెచ్ఎం వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. ఇటీవల శ్రీవాణి పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి షూటింగ్ బాల్ బాలబాలికల సబ్ జూ నియర్ విభాగంలో జరిగిన సెలక్షన్లో అభిజ్ఞ, ప్రీతి, యామిని, సాయిప్రియ, సుశాంత్, కార్తీక్, అక్షయ్, విష్ణులు రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. ఈనెల 25 నుంచి 27వ తేదీ వరకు నారాయణపేట జిల్లా మక్తల్‌లో జరిగే పోటీల్లో పాల్గొంటారన్నారు. ఎంపికై న విద్యార్థులను పాఠశాల ఆవరణలో పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ దేవ్‌సింగ్, చిల్పూరు ఆలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్‌రావు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ చిర్ర నాగరాజు, ఉపాధ్యాయులు అభినందించారు. -
జూనియర్ ఇంటర్లో ‘ఇన్స్పైర్’కు ప్రథమ ర్యాంకు
హసన్‌పర్తి: ఇంటర్మీడియట్ ఫలి తాల్లో ఎర్రగట్టుగుట్ట సమీపంలోని ఇన్స్పైర్ అకాడమీ విద్యాసంస్థకు చెందిన తీగల సాయి శ్రే ష్టత జూనియర్ ఇంటర్లో రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు సా ధించినట్లు డైరెక్టర్ భరత్‌కుమార్ తెలిపారు. ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు 468 మార్కులు సాధించిన రాష్ట్రంలో ప్రథమ స్థా నంలో నిలిచిందన్నారు. అలాగే, ఎంపీసీ విభాగంలో మేర్గు అజయ్ 464, వంశీ 464, శ్రీ చరణ్ 463, సాయిప్రియా 462, సిరి చందన 460, సాయి ప్రియ 462, బైపీసీ విభాగంలో మధుప్రియ 432 మార్కులు, కీర్తిరోషి 431, సీఈసీ విభాగంలో నూతన శ్రీ 459మార్కులు, కిరణ్మయి 455 మార్కులు సాఽధించినట్లు చెప్పారు.ఈ సందర్భంగా సాయి శ్రేష్టతను అభినందించారు. కార్యక్రమంలో కళాశాల పాలకవర్గ సభ్యులు రాజ్‌కుమార్,మమత, సుంకరి శ్రీరాంరెడ్డి, హరీశ్‌గౌడ్, శివ తదితరులు పాల్గొన్నారు. -
‘భూ భారతి’తో సమస్యల పరిష్కారం
నర్మెట/తరిగొప్పుల: ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టంతో రైతుల భూ సమస్యల పరిష్కారం సులభతరం కానుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. మంగళవారం నర్మెట, తరిగొప్పుల మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన భూ భారతి అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ధరణీలో పరిష్కారం కాని పలు సమస్యలకు భూ భారతిలో పరిష్కారం చూపబడిందని, దరఖాస్తుల స్వీకరణకు ఏడాదికాలం (2026 ఏప్రిల్ 14వ తేదీ) వరకు సమయం ఉందన్నారు. క్రయవిక్రయాల్లో హిస్టరీ ఆఫ్ డాక్యుమెంట్స్తోపాటు భూమికి సంబంధించిన నక్షా జత పరచడం జరుగుతుందన్నారు. ఎవరైనా మోసపూరిత రికార్డులను మార్చినా అలాంటివి రద్దు చేసే అధికారం ఈ చట్టానికి ఉందన్నారు. గతంలో మాదిరిగా వీఆర్ఓల స్థానంలో గ్రామపాలన అధికారిని నియమించి భూ క్రయవిక్రయాలు నమోదు చేసి రికార్డులు అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ రోహిత్ సింగ్, ఎస్డీసీ సుహాసిని, ఆర్డీఓ గోపిరాం, ఎంపీడీఓలు అరవింద్ చౌదరి, దేవేందర్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా -
సివిల్స్‌లో మెరిశారు..
ఐదోసారి ఐఏఎస్ కొట్టాడు.. ● ఇప్పటికే ఐపీఎస్ శిక్షణలో జయసింహారెడ్డి ● తాజాగా ఆల్ ఇండియా స్థాయిలో 46వ ర్యాంకు హన్మకొండ: హనుమకొండకు చెందిన రావుల జయసింహారెడ్డి ఐదో ప్రయత్నంలో ఐఏఎస్ ర్యాంకు సాధించాడు. గతంలో ఐపీఎస్‌కు ఎంపికై న జయసింహారెడ్డి ఈసారి ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. ఆల్ ఇండియా స్థాయిలో 46వ ర్యాంకు సాధించారు. జయసింహారెడ్డి తండ్రి రావుల ఉమారెడ్డి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో సహ పరిశోధన సంచాలకుడిగా విధులు నిర్వహిస్తుండగా తల్లి లక్ష్మి గృహిణి. జయసింహారెడ్డి గతంలో సివిల్స్ రాయగా ఒకసారి 217, మరోసారి 104 ర్యాంకు సాధించగా ఐపీఎస్ వచ్చింది. ప్రస్తుతం నేషనల్ అకాడమీ హైదరాబాద్‌లో ఐపీఎస్ శిక్షణ పొందుతున్నారు. జయసింహారెడ్డి పాఠశాల విద్య 7వ తరగతి వరకు జగిత్యాలలో, 8 నుంచి 10 వరకు హనుమకొండ ఎస్ఆర్ ఎడ్యు స్కూల్లో చదివారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు. హైదరాబాద్ ఐఐటీలో బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అభ్యసించారు. తర్వాత 2020 నుంచి సివిల్స్‌కు సన్నద్ధమయ్యారు. మొదటి రెండు ప్రయత్నాల్లో ప్రిలిమ్స్ వరకు వెళ్లారు. మూడో ప్రయత్నంలో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలో ప్రతిభ కనబరిచి 217వ ర్యాంకు సాధించారు. నాలుగో ప్రయత్నంలో మరింత మెరుగైన ప్రతిభ కనబరిచి 104వ ర్యాంకు సాధించారు. ఓ వైపు ఐపీఎస్ శిక్షణ పొందుతూనే ఐదో ప్రయత్నంలో 46వ ర్యాంకు సాధించి తన లక్ష్యం చేరుకున్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు రావుల లక్ష్మి, ఉమారెడ్డి మాట్లాడుతూ తమ కుమారుడు ఐఏఎస్ సాధించడం సంతోషంగా ఉందన్నారు. తనకు ఇద్దరు కుమారులని, అందులో జయసింహారెడ్డి చిన్నవాడని, పెద్ద కుమారుడు మనీష్ చంద్రారెడ్డి కాలిఫోర్నియాలో ఆపిల్ సంస్థలో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యూపీఎస్సీ ఫలితాల్లో మనోళ్ల సత్తా.. నలుగురు ఉమ్మడి వరంగల్ జిల్లా అభ్యర్థులకు అత్యుత్తమ ర్యాంకులు నెలరోజుల్లో డబుల్ ధమాకా ● మొన్న గ్రూప్ వన్, ఇప్పుడు సివిల్స్ ● సత్తాచాటిన వరంగల్ వాసి ● తెలుగు రాష్ట్రాల్లో టాపర్‌గా నిలిచిన శివాని సాక్షి, వరంగల్: రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి సివిల్స్ ర్యాంక్‌ల్లో ఇట్టబోయిన సాయి శివాని టాపర్‌గా నిలవడంతో వరంగల్ పేరు ఒక్కసారిగా మార్మోగింది. నెలవ్యవధిలోనే ఆమె డబుల్ ధమాకా సాధించారు. రెండు ప్రభుత్వ ఉద్యోగాలు, అవి కూడా గ్రూప్–1లో రాష్ట్ర స్థాయిలో 21వ ర్యాంకు, ఇప్పుడూ సివిల్స్‌లో ఏకంగా జాతీయ స్థాయిలో 11వ ర్యాంక్ సాధించి ఔరా అనిపించారు. వరంగల్ శివనగర్ వాసవీ కాలనీలోని తమ ఇంట్లోనే చదువుకుంటూ, ఆన్లైన్ పాఠాలు వింటూ జాతీయస్థాయి ఘనత సాధించడం విశేషం. బీటెక్ పూర్తయిన మూడేళ్లలోనే రెండో ప్రయత్నంలో సివిల్స్ సాధించి వరంగల్‌కు పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చారు. తండ్రి రాజు మెడికల్ రిప్రజంటేటివ్‌గా పనిచేస్తుండగా, అమ్మ రజిత గృహిణిగా ఉంటూ తమ కుమార్తె సాయి శివాని కల సాకారం కోసం వెన్నుతట్టి ప్రోత్సహించారు. వారి ప్రోద్బలం, సాయి శివాని పట్టుదలతో చదవడంతోనే ఈ ఘనత సాధ్యమైంది. దేశ అత్యున్నత సర్వీస్ సివిల్స్‌లో మనోళ్లు మెరిశారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మంగళవారం విడుదల చేసిన తుది ఫలితాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా అభ్యర్థులు అత్యుత్తమ ర్యాంకులు కై వసం చేసుకున్నారు. వరంగల్ శివనగర్‌కు చెందిన ఇట్టబోయిన సాయి శివాని 11వ ర్యాంకు, హనుమకొండకు చెందిన రావుల జయసింహారెడ్డి 46, నీరుకుళ్లకు చెందిన పోతరాజు హరిప్రసాద్ 255, భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన గుగులోత్ జితేందర్ నాయక్ 855 ర్యాంకులు సాధించారు. దీంతో కుటుంబీకులు, బంధుమిత్రులు అభినందనలు తెలిపారు. నీరుకుళ్ల యువకుడు.. సివిల్స్ సాధించాడు ● తండ్రి ప్రోత్సాహంతో 255వ ర్యాంకు ఆత్మకూరు: హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుళ్లకు చెందిన పోతరాజు హరిప్రసాద్ సివిల్స్ సాధించారు. తండ్రి పోత్సాహంతో యూపీఎస్సీ ఫలితాల్లో జాతీయస్థాయిలో 255 ర్యాంకు సాధించారు. కాగా, హరిప్రసాద్‌కు ఐఏఎస్ పోస్టు దక్కనుంది. హరిప్రసాద్ తండ్రి కిషన్ నల్లబెల్లి మండలం నందిగామ జెడ్పీ హైస్కూల్లో తెలుగు స్కూల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. తల్లి విజయ గృహిణి. వీరు హనుమకొండలోఉంటున్నారు. హరిప్రసాద్ పాఠశాల విద్య హనుమకొండలోని ఆర్యభట్ట పాఠశాలలో కొనసాగింది. ఇంటర్మీడియట్ హైదరాబాద్‌లోని నారాయణ కళాశాలలో చదివారు. ఐఐటీ ముంబయిలో బీటెక్(ఎలక్రికల్)2016లో పూర్తి చేశారు. అనంతరం జపాన్‌లోని ఓ కంపెనీలో 2017 నుంచి 2019 వరకు పనిచేశారు. అనంతరం ఇంటికి వచ్చి సివిల్స్‌కు సన్నద్ధమయ్యారు. ఇంటివద్దే చదువుకున్నారు. రెండుసార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. తాజా ఫలితాల్లో 255వ ర్యాంకు సాధించి తన కల సాకారం చేసుకున్నారు. నాన్న ప్రోత్సాహంతో.. మా నాన్న ప్రోత్సాహంతోనే సివిల్స్ వైపు దృష్టి సారించా. ఎలాంటి కోచింగ్ లేకుండా ఇంటి వద్దే ప్రణాళికతో ప్రిపేరయ్యా. 255 ర్యాంకు రావడం ఆనందంగా ఉంది. నాకు ఐఏఎస్ వచ్చే అవకాశం ఉంది. – పోతరాజు హరిప్రసాద్, సివిల్స్ 255 ర్యాంకర్కొడుకు కలెక్టర్ కావాలనుకున్నా..నా కొడుకును కలెక్టర్ చేయాలనే కల నెరవేరింది. సివిల్స్‌తోనే సమాజ సేవ సాధ్యం. అందులోనే తృప్తి ఉంటుంది. మా గ్రామీణ ప్రాంతం నుంచి నా కొడుకు సివిల్స్ సాధించడం గర్వంగా ఉంది. – పోతరాజు కిషన్, హరిప్రసాద్ తండ్రి సొంతంగా ప్రిపేర్.. ● సివిల్స్‌లో 855 ర్యాంకు సాధించిన జితేందర్ నాయక్ భూపాలపల్లి అర్బన్: సివిల్స్‌లో భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన గుగులోత్ జితేందర్ నాయక్ మెరిశారు. ఐపీఎస్ కావాలనే లక్ష్యంతో ఎలాంటి శిక్షణ లేకుండా ఇంట్లోనే చదువుకుంటూ యూపీఎస్సీ ఫలితాల్లో 855 ర్యాంకు సాధించారు. జితేందర్ తండ్రి హేమానాయక్ భూపాలపల్లి ఏరియా సింగరేణి వర్క్‌షాపులో ఉద్యోగం చేస్తున్నారు. జితేందర్ 2021లో బీటెక్ పూర్తి చేసి 2022లో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఏడాది పాటు ఉద్యోగం చేశారు. అనంతరం 2023 నుంచి ఇంట్లోనే ఉండి సివిల్స్‌కు సన్నద్ధమయ్యారు. ఎలాంటి శిక్షణ లేకుండా సొంతంగా చదువుకున్నట్లు తెలిపారు. చిన్నప్పటి నుంచి సివిల్ సాధించాలనే లక్ష్యంతో చదువుకున్నట్లు జితేందర్ పేర్కొన్నారు. -
తాగునీటి కొరత ఉండొద్దు
పాలకుర్తి టౌన్: నియోజకవర్గంలో వేసవిలో తాగునీటి కొరత లేకుండా చూడాలని ఎమ్మెల్యే యశ్వసినిరెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం మండలకేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఇరి గేషన్, మున్సిపల్, ఆర్డబ్ల్యూఎస్ శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాలకుర్తి, చెన్నూరు రిజర్వాయర్ల నీటి నిల్వల వివరాలు, తొర్రూరు ట్యాంక్ బండ్ పనులు వేగవంతం చేయాలన్నారు. కాల్వల పూడికతీత సమస్య ప్రధానంగా ఉందని, పలు ప్రాంతాల్లో కాల్వల్లో భారీగా పూడిక పేరుకుపోవడంతో నీటి ప్రవాహం సక్రమంగా జరగడం లేదన్నారు. రిజర్వాయర్ల పనులు వేగవంతం చేయాలి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి -
జనగామ
బుధవారం శ్రీ 23 శ్రీ ఏప్రిల్ శ్రీ 202 సివిల్స్‌లో మెరిశారు..9● ఉమ్మడి వరంగల్ జిల్లానుంచి నలుగురి ఎంపిక ● తెలుగు రాష్ట్రాల మొదటి ర్యాంకర్ వరంగల్‌వాసే ● సాయి శివానికి 11వ, జయసింహారెడ్డికి 46వ ర్యాంకు ● నీరుకుళ్ల యువకుడు హరిప్రసాద్‌కు 255వ ర్యాంకు ● ఐఏఎస్ కావాలని లక్ష్యంతోనే ముందుకు.. ● ఐపీఎస్ గోల్ కొట్టానంటున్న 855వ ర్యాంకర్ జితేందర్ నాయక్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం విడుదల చేసిన సివిల్స్ ఫలితాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లానుంచి నలుగురు అభ్యర్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. తెలుగు రాష్ట్రాల మొదటిర్యాంకర్ వరంగల్ నగరవాసే. వరంగల్ శివనగర్‌కు చెందిన ఇట్టబోయిన రాజ్ కుమార్, రజిత దంపతుల కుమార్తె సాయి శివాని ఆలిండియా స్థాయిలో 11వ ర్యాంకు, రావుల జయసింహారెడ్డి 46వ ర్యాంకులు సాధించి జిల్లా పేరుప్రతిష్టలను దేశస్థాయిలో నిలిపారు. – సాక్షి నెట్వర్క్– వివరాలు 10లోu -
పుట్టుకనుంచే రెండు కాళ్లు పనిచేయవు
పదకొండేళ్ల కూతురు మిన్నుకు పుట్టుక నుంచే రెండు కాళ్లు పనిచేయవు. 5వ తరగతి చదువుతోంది. సదరం సర్టిఫికెట్ కోసం పదేళ్ల నుంచి స్లాట్ బుకింగ్‌కు ప్రయత్నిస్తున్నాను. రెండు నెలల క్రితం స్లాట్‌బుకింగ్ దొరుకగా సదరంలో పర్మనెంట్ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇప్పటికీ రెండుసార్లు గ్రీవెన్స్‌కు వచ్చిన. పింఛన్ మాత్రం రావడం లేదు. కాళ్లు పనిచేయని పరిస్థితి ప్రత్యక్షంగా కనిపిస్తున్నా కనికరించడంలేదు. – కూతురు మిన్నుతో తండ్రి విద్యాసాగర్, వల్మిడి(పాలకుర్తి) -
భూ భారతి చట్టంతో సమస్యల పరిష్కారం
పాలకుర్తి టౌన్/కొడకండ్ల: భూములకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకువచ్చిందని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. 2025 భూ భారతి చట్టం అమలుపై సోమవారం పాలకుర్తి, కొడకండ్ల మండల కేంద్రాల్లోని రైతు వేదికల్లో నిర్వహించిన అవగాహ న సదస్సుల్లో ఆయన మాట్లాడారు. ఈ నెలాఖరు వరకు జిల్లాలోని అన్ని మండలాల్లో అవగాహన సదస్సులు పూర్తి చేయడంతో పాటు మే ఒకటి నుంచి ఎంపిక చేసిన పైలట్ మండలంలో చట్టం అమలు చేస్తూ రైతుల నుంచి భూములకు సంబంధించిన సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పా రు. జూలై నుంచి అన్ని మండలాల్లో అమలు చేస్తామని వివరించారు. అన్ని సమస్యలు తీరుతాయి : ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి పాలకుర్తిలో నిర్వహించిన సదస్సులో ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ భూ భారతి చట్టంతో రైతుల అన్ని భూ సమస్యలు తీరుతాయని చెప్పారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులు ధరణితో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ మోసపోయారన్నారు. ధరణి సమస్యలేని ఊరు, తండా లేదని చెప్పారు. భూ భారతి చట్టం ద్వారా భూముల రికార్డు పారదర్శకంగా నిర్వహించి భవిష్కత్ తరాలకు భూ హక్కుల విషయంలో స్పష్టత కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో అదపు కలెక్టర్ రోహిత్‌సింగ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ హనుమనాయక్, ఏడీఏ పరశురాంనాయక్, ఆర్డీఓ డీఎస్ వెంకన్న, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మంజుల తదితరులు పాల్గొన్నారు. రైతులు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ కొడకండ్ల : అకాల వర్షాల నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో రైతులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా సూచించారు. స్థానిక మార్కెట్ యార్డులోని కొనుగోలు కేంద్రాన్ని సోమవారం సందర్శించిన ఆయన రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. టార్పాలిన్ కవర్లతో పాటు ధాన్యాన్ని తూర్పారబట్టే మిషన్లు సరిపోక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా మరిన్ని పంపిస్తామని చెప్పారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని నిర్వాహకులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్, తహసీల్దార్ చంద్రమోహన్, సీనియర్ అసిస్టెంట్ సుమన్, ఏఓ విజయ్‌రెడ్డి, ఏపీఎం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అవగాహన సదస్సుల్లో కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా -
కార్పొరేట్ తరహాలో సర్కారు విద్య
పాలకుర్తి టౌన్: సర్కారు పాఠశాలల్లో కార్పొరేట్ తరహా నాణ్యమైన విద్య అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రూ.30 లక్షల నిధులతో నిర్మించనున్న ప్రహరీ, మరుగుదొడ్ల పనులకు పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఝాన్సీరెడ్డితో కలిసి భూమి పూజ చేశారు. అనంత రం పాఠశాలలో వంట గదిని సందర్శించి భోజనంనాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ విద్యార్థులకు విద్యాతో పాటు పోషకాలతో కూడిన మధ్యాహ్న భోజనం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మెనూ చార్జీలు పెంచింద ని గుర్తు చేశారు. పాలకుర్తి ప్రజల చిరకాల వాంఛ అయిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరుకు సీఎం సుముఖంగా ఉన్నారని పేర్కొన్నారు. సమావేశంలో పాఠశాల హెచ్ఎం పాయం శోభారాణి, రాపాక సత్యనారాయణ, యాకాంతరావు, కమ్మగాని ఆంజ నేయలుగౌడ్, కమ్మగాని నాగన్న, ఎడవెల్లి సోమమల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి -
టీకాతో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది
జనగామ రూరల్: టీకాతో పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని జిల్లా వైద్యాధికారి మల్లికార్జున్‌రావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో ప్రత్యేక వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. జిల్లాలో నేటి(మంగళవారం) నుంచి 28వ తేదీ వరకు ప్రత్యేక టీకాల కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లలో నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం ఇప్పటివరకు టీకాలు వేయించని పిల్లలకు, కొన్ని టీకాలు వేయించి మధ్యలో వదిలేసిన పిల్లలకు వేయించాలని కోరారు. మురికి వాడలు, ఇటుక బట్టీలు, నిర్మాణ ప్రాంతాలు, సంచార జాతులు, కోళ్ల ఫారాలు, రైస్, జిన్నింగ్ మిల్లుల పరిసరాల్లో నివాసముండే కుటుంబాల పిల్లల్లో టీకాలు వేయించని వారికి సమీప పీహెచ్సీ, సబ్ సెంటర్లలో ఇప్పించాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్లు శ్రీతేజ, మౌనిక ప్రియదర్శిని, జయపాల్ రెడ్డి, సూపర్వైజర్లు ఉపేంద్ర, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా వైద్యాధికారి మల్లికార్జున్‌రావు -
జాబ్ మేళా ఎన్నికల స్టంట్ కాదు
పాలకుర్తి: జాబ్ మేళాతో నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది.. మేళా నిర్వహించింది ఎన్నికల స్టంట్ కోసం కాదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సోమవారం పాలకుర్తిలో బబ్బూరి శ్రీకాంత్ ఆధ్వర్యాన చారిటబుల్ ట్రస్టు నిర్వహించిన జాబ్ మేళాలో ఎంఎన్‌సీలు సహా 100 కంపెనీలు పాల్గొన్నా యి. పాలకుర్తి, దేవరుప్పుల, రాయపర్తి, తొర్రూరు, పెద్దవంగర మండలాల నుంచి నిరుద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దయాకర్‌రావు మాట్లాడుతూ.. గత పదేళ్లుగా జాబ్ మేళాలు నిర్వహించి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పా రు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు పసునూరి నవీన్, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్‌రావు, మాజీ ఎంపీపీ నల్ల నాగిరెడ్డి, అభినయ్, సహకా ర సొసైటీ చైర్మన్ బొబ్బాల అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించాలి జనగామ రూరల్: గ్రామీణ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించాలని ఫీల్డ్ అసిస్టెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు లావు బాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ వద్ద ఎఫ్‌ఏలు నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మేనిఫెస్టోలో తెలిపినట్లు ఎఫ్‌ఏలకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ పేస్కేల్ ఇవ్వాలన్నారు. జనవరి నుంచి పెండింగ్‌లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని, హెల్త్ కార్డులు జారీ చేసి విధి నిర్వహణలో మరణించిన ఫీల్డ్ అసిస్టెంట్ కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్ ఏఓకు వినతిపత్రం అందజేశారు. సిబిల్ స్కోర్ ఉంటేనే ‘రాజీవ్ యువ వికాసం’బచ్చన్నపేట : రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకునేవారి సిబిల్ స్కోర్ సక్రమంగా ఉంటేనే అర్హులని జిల్లా వ్యవసాయ అధికారి రామారావునాయక్ అన్నారు. సోమవారం స్థాని క ఎంపీడీఓ కార్యాలయంలో సీబీఐ, టీజీబీవీ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న ప్రతీ ఒక్కరు అప్లికేషన్ ఫారాలను ఎంపీడీఓ కార్యాలయంలో అందజేయాలని చెప్పారు. వాటిని గ్రామాల వారీగా విభజించి ఏ బ్యాంకు పరిధిలోకి వస్తే వారికి అందజేస్తామ ని, బ్యాంకు అధికారులు సిబిల్ స్కోరు, ఖాతా పూర్వాపరాలను పరిశీలించి అర్హులను గుర్తించి జాబితా ఇస్తారని పేర్కొన్నారు. అనంతరం వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి లబ్ధిదారుల ను ఎంపిక చేయనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటమల్లికార్జున్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ గోపీనా యక్, టీజీబీవీ ఫీల్డ్ ఆఫీసర్ అనూష పలువురు పాల్గొన్నారు. పోలీస్ క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తాం.. వరంగల్ క్రైం : జాతీయస్థాయి క్రీడల్లో రాణించే పోలీస్ క్రీడాకారులకు పూర్తి సహాయ సహకారా లు అందిస్తామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. గత నెలలో మధ్యప్రదేశ్ ఇండోర్‌లో జరిగిన 18వ జాతీయ పోలీస్ షూటింగ్ (స్పోర్ట్స్) చాంపియన్ షిప్ పోటీల్లో తెలంగాణ పోలీస్ తరఫున ప్రాతినిధ్యం వహించి 300 మీటర్ల మహిళా విభాగంలో సిల్వర్ మెడల్ సాధించిన సుబేదారి ఏఎస్సై సువర్ణను సోమవారం కమిషనరేట్ కార్యాలయంలో సీపీ ఘనంగా సత్కరించారు. భవిష్యత్‌లోనూ ఈ క్రీడలో రాణించేందుకు అవసరమైన సహకారా న్ని అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పరిపాలన విభాగం అదరపు డీసీపీ రవి తదితరులు పాల్గొన్నారు. -
వచ్చే నెలలో టీచర్లకు ట్రైనింగ్
విద్యారణ్యపురి: రాష్ట్రంలో ఉపాధ్యాయులకు వేసవిలో శిక్షణ ఇవ్వనున్నారు. తొలుత ఆసక్తి ఉన్న ఉపాధ్యాయులను మండల, జిల్లాస్థాయిలో రిసోర్స్ పర్సన్లుగా నియమించనున్నారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వుల ప్రకారం ఉమ్మడి జిల్లా పరిధి హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో పనిచేస్తున్న మండల, జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలల, మోడల్‌స్కూల్స్, రెసిడెన్షి యల్ పాఠశాలల నుంచి ఆసక్తి కలిగిన ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్లు, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు, గెజిటెడ్ హెడ్మాసర్లను రిసోర్స్పర్సన్లుగా ఎంపిక చేయనున్నారు. ఇందుకోసం ఆయా జిల్లాల డీఈఓలు.. సదరు ఉపాధ్యాయులనుంచి ఈనెల 22నుంచి 24వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరి స్తారు. ప్రతీ జిల్లాలో ప్రాథమిక పాఠశాలలనుంచి మండలస్థాయిలో రిసోర్స్ పర్సన్లుగా తెలుగు, ఇంగ్లిష్, మ్యాఽథ్స్, ఈవీఎస్ సబ్జెక్టులనుంచి ఇద్దరు చొప్పున ఎంఆర్పీల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. జిల్లాస్థాయికి డీఆర్పీలుగా కూడా ఆయా సబ్జెక్టులకు ఒక్కో సబ్జెక్టుకు ఇద్దరు చొప్పున ఎంపిక చేసేందుకు దరఖాస్తులు తీసుకుంటారు. ఉర్దూ మీడియం, స్పెషల్ ఎడ్యుకేషన్నుంచి కూడా రిసోర్స్ పర్సన్లను నియమిస్తారు. జిల్లాస్థాయిలో హైస్కూళ్లనుంచి.. ప్రతీ జిల్లానుంచి హైస్కూల్‌స్థాయిలో విద్యాబోధన చేస్తున్న టీచర్లు ప్రతీ సబ్జెక్టునుంచి నలుగురి చొప్పున 9 సబ్జెక్టులకు 36మందిని జిల్లాస్థాయి రిసోర్స్పర్సన్లుగా ఎంపిక చేస్తారు. ఉర్దూ మీడియంలో ఐదు సబ్జెక్టులకు ఇద్దరు చొప్పున పది మందిని నియమిస్తారు. దరఖాస్తులు తీసుకున్నాక అందులోనుంచి అవసరం మేరకు సంబంధిత అధికారులు ఎంపిక చేస్తారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు ప్రతీ జిల్లాలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించాక ఏ జిల్లాకు ఆ జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంట ర్వ్యూలు నిర్వహిస్తారు. డెమో ద్వారా ఎంపిక చేస్తా రు. ఎంపిక చేసిన జాబితాలను ఆయా జిల్లాల డీఈ ఓలు ఈనెల 28వ తేదీ వరకు రాష్ట్ర విద్యాపరిశోధ న శిక్షణామండలికి, ఎస్ఈఆర్టీ అధికారులకు పంపనున్నారు. ఇదిలా ఉండగా హనుమకొండ జిల్లాలో ఆసక్తిగల తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూమీడియం ఉ పాధ్యాయులు నిర్దేశించిన అప్లికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ వాసంతి సోమవారం కోరారు. ఇతర సమచారం కోసం కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ఎంపిక చేసిన రిసోర్స్ పర్సన్లకు శిక్షణ ఎంపికై న మండల, జిల్లాస్థాయి రిపోర్స్ పర్సన్లకు ఆయా సబ్జెక్టుల వారీగా కూడా రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణామండలి అధికారులు త్వరలోనే సబ్జెక్టు ఎక్స్‌పర్ట్స్‌తో శిక్షణ ఇవ్వనున్నారు. వీరి ద్వారా జిల్లాస్థాయిలో ఉపాధ్యాయులకు శిక్షణలు ఉంటాయని సమాచారం. గుణాత్మక విద్యను అమలుచేసేందు కు ఉపాధ్యాయులకు అందించే శిక్షణలకు ఈ రిసోర్స్పర్సన్లను వినియోగిస్తారు. రిసోర్స్ పర్సన్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం డీఈఓ కార్యాలయాల్లో స్వీకరణ నేటినుంచి ఈనెల 24వరకు గడువు ఇంటర్వ్యూ, డెమో ద్వారా ఎంపికలు -
లాభాల ఆయిల్ పామ్
జనగామ రూరల్: వంట నూనెల వినియోగం రోజు రోజుకూ పెరుగుతోంది. ఈనేపథ్యంలో పామాయి ల్ సాగుపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. సాగు విస్తీర్ణం పెంచడానికి రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తూ అవసరమైన పెట్టుబడి సాయం చేస్తోంది. ఆయిల్ పామ్ మొక్కల అందజేత నుంచి డ్రిప్ పరికరాలు, అంతర పంటల సాగు తదితరాల కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రకాల సబ్సిడీలు ఇస్తున్నాయి. 2021 నుంచి ఇప్పటివరకు జిల్లాలో 6,976 ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటలు సాగయ్యాయి. 2025–26 ఆర్థిక సంవత్సరం జనగామ మండలం ఎల్లంల గ్రామంలో ఏర్పాటు చేసిన ఆయిల్ పామ్ నర్సరీలో 2లక్షల 25 వేల మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. ఇవి 3,947 ఎకరాలకు సరిపోతాయని అధికారులు చెబుతున్నారు. పెరుగుతున్న ధరలు వంట నూనెల ఉత్పత్తులకు పామాయిల్ వినియో గం పెరగడం, ఎగుమతులకు ప్రోత్సాహకాలు లభిస్తుండటం ఆయిల్ పామ్ ధరలు పెరగడానికి కారణంగా చెప్పవచ్చు. గతేడాది ఆగస్టు వరకు ఆయిల్ పామ్ టన్ను ధర రూ.14వేలు ఉండగా.. సెప్టెంబర్‌లో రూ.17వేలు, అక్టోబర్‌లో రూ.10 వేలు, నవంబర్‌లో రూ.30వేలు ఉంది. నవంబర్ నుంచి ఇప్పటి వరకు రూ.20 వేలకు పైగానే కొనసాగిన ధరలు మార్చి 31 వరకు రూ.20,871 కొనుగోలు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నిరంతర దిగుబడి ఆయిల్ పామ్ దిగుబడి నాలుగేళ్ల తర్వాత మొదలవుతుంది. పదేళ్లలోపు చెట్ల నుంచి ప్రతి ఏడాది 6 టన్నుల వరకు, పదేళ్లు దాటిన చెట్ల నుంచి ఏడాదికి 10 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ఏడాదంతా పంట వస్తూనే ఉంటుంది. దీనికి తోడు ప్రారంభంలో అంతర పంటలు వేసుకోవచ్చు. కూరగాయలు, పప్పు దినుసులు ఇతర పంటలతో అదనపు ఆదా యం సమకూరుతుంది. సాగుకు ప్రోత్సాహకాలు.. ఆయిల్ పామ్ తోటల సాగుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ‘నేషనల్ మిషన్ ఎడిబు ల్ ఆయిల్–ఆయిల్ పామ్ ప్లాంటేషన్’ ఏర్పాటు చేసి సబ్సిడీ అందిస్తోంది. ఎకరాకు రూ.50,018 సబ్సిడీ లభిస్తుండగా.. రూ.190 విలువ చేసే మొక్కలను ప్రభుత్వం రూ.20కే ఇస్తోంది. ఎకరాకు దాదాపు 50 నుంచి 57 మొక్కలు నాటాలి. పంట సాగు చేసే రైతులకు ప్రభుత్వం ఎకరాకు ఏటా రూ.2,100 పెట్టుబడి, అంతర పంటల సాగుకు రూ.2,100 అందిస్తోంది. అలాగే సన్నకారు రైతులకు 90 శాతం, పెద్ద రైతులకు 80 శాతం సబ్సిడిపై డ్రిప్ సౌకర్యం కల్పిస్తోంది. దరఖాస్తులు స్వీకరిస్తున్నాం.. ఆయిల్ పామ్ పంటలకు మంచి ధర లభిస్తోంది. జిల్లాలో రైతులు పండించిన పంటను ప్రభుత్వం, ప్రైౖవేట్ కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయి. ఆదాయం మెరుగ్గా ఉండడంతో సాగుపై రైతుల్లో ఆసక్తి పెరుగుతోంది. పెండింగ్ దరఖాస్తులన్నీ పూర్తికావడంతో మళ్లీ కొత్తగా దరఖాస్తులు తీసుకుంటున్నాం. ఉద్యానవన పంటల సాగుకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకా లను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. – శ్రీధర్, ఉద్యాన శాఖ అధికారి, జనగామ ఇప్పటి వరకు జిల్లా రైతులు సాగు చేసిన ఆయిల్ పామ్ తోట వివరాలు పంట సాగుపై ఆసక్తి చూపుతున్న రైతులు సబ్సిడీలతో ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం జిల్లాలో 6,976 ఎకరాల్లో సాగుసంవత్సరం రైతులు ఎకరాలు 2021–22 73 426 2022–23 925 3204 2023–24 720 2170 2024–25 386 1176 మొత్తం 2105 6976 -
అత్తా కోడళ్ల పంచాయితీ.. ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెన్షన్
జనగామ జిల్లా: అత్తా కోడళ్లు కొట్టుకున్న వివాదంలో డబ్బులు డిమాండ్ చేసిన హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీసు కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. జనగామ జిల్లా తరిగొప్పుల మండల కేంద్రానికి చెందిన అత్తాకోడళ్లు ఎదునూరి లచ్చవ్వ, ఎదునూరి మంజుల నల్లా నీటి విషయంలో ఈనెల 15న గొడవపడ్డారు. ఈ ఘటనలో ఎదునూరి లచ్చవ్వ తలకు గాయాలయ్యాయి. దీంతో బాధితురాలు తన చిన్న కోడలు మంజుల, కుమారుడు నాగరాజుపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో హెడ్‌కానిస్టేబుల్ గుగులోతు బాలోజి, కానిస్టేబుల్ నునావత్ రాజు నాగరాజుకు ఫోన్‌చేసి కేసు నమోదు చేయవద్దంటే రూ.20 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని నాగరాజు గ్రామానికి చెందిన వ్యక్తికి తెలుపగా.. వీరి మధ్య సంభాషణను రికార్డుచేసి... కమిషనర్‌కు పంపించి చర్యలు తీసుకోవాలని కోరారు. విచారణ చేపట్టిన సీపీ డబ్బులు డిమాండ్ చేసినట్లు తేలడంతో బాలోజి, రాజును సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
గిట్టుబాటు ధర చెల్లించేది కేంద్రమే..
రఘునాథపల్లి: రైతులు పండించిన పంటలకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి గిట్టుబాటు ధరలు చెల్లించేది ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వమేనని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పెరుమాండ్ల వెంకటేశ్వర్లు అన్నారు. మండలంలోని కోమళ్లలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పార్టీ నాయకులతో కలిసి ఆదివారం సందర్శించారు. కొనుగోలు కేంద్రంలో సమస్యలు ఉన్నాయా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పిస్తున్నది కూడా కేంద్ర ప్రభుత్వమేనని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి మంద వెంకటేష్‌యాదవ్, బూత్ అధ్యక్షుడు వల్లాల శ్రీను, బాల్నె వెంకటయ్య, మంకెన అన్నపురెడ్డి, మంద రాములు, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు వెంకటేశ్వర్లు -
రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీలకు ఎంపిక
జఫర్‌గఢ్: మండలంలోని కూనూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీలకు ఎంపికై నట్లు ఆ పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ ఆకుల సాయికుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థులు సదాశివ, భరత్ ఇటీవల స్టేషన్‌ఘన్‌పూర్‌లోని శ్రీవాణి గురుకుల పాఠశాలలో నిర్వహించిన జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు తెలిపారు. ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు నారాయణపేట జిల్లాలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో వీరు పాల్గొననున్నట్లు తెలిపారు. ఎంపికై న విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు ఎండీ పర్వేజ్, షూటింగ్ బాల్ జిల్లా అసోసియేషన్ బాధ్యులు సాంబరాజు అభినందించారు. మార్కెట్లో అవినీతిపై విచారణ చేపట్టాలి జనగామ రూరల్: జనగామ, కొడకండ్ల, స్టేషన్ ఘనపూర్ వ్యవసాయ మార్కెట్ల పరిధిలో సీసీఐ పత్తి కొనుగోలులో జరిగిన అవినీతిపై విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా చందు నాయక్ ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. వ్యవసాయ మార్కెట్ల పరిధిలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాల్లో దొంగ టీఆర్‌లతో కోట్ల రూపాయలు కొల్లగొట్టి సొమ్ము చేసుకున్న వ్యవసాయ మార్కెటింగ్ శాఖ జిల్లాస్థాయి అధికారుల నుంచి కింది స్థాయి అధికారుల వరకు పాత్ర ఉన్న ప్రతి ఒక్కరిపై విచారణ చేపట్టి కేసులు నమోదు చేయాలని పేర్కొన్నారు. మూడు వ్యవసాయ మార్కెట్ల పరిధిలో 15 పత్తి మిల్లులు ఉన్నాయని ఈ మిల్లుల్లో ప్రభుత్వం రైతు సంఘం పోరాట ఫలితంగా పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారని ఆన్లైన్ తక్ పట్టీలు సంబంధం లేని వ్యక్తులపై టీఆర్, ఐడీ నంబర్లు సృష్టించి ప్రతి కింటాకు రూ.22 చొప్పున సుమారు రూ.కోటి 20 లక్షలు అక్రమ పద్ధతిలో చేతులు మారినట్టు తెలుస్తుందని తెలిపారు. పల్లికాయ కొనుగోలుపై పూర్తిస్థాయిలో విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టాలని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ పక్షోత్సవాలు జనగామ: ఆరోగ్య తెలంగాణ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో పో షణ పక్షోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఆదివా రం కుర్మవాడ, బెగ్గర్స్ కాలనీల పరిధిలోని అంగన్వాడీ సెంటర్లలో పోషణ పక్షోత్సవం నిర్వహించారు. తలుల్లు, గర్భిణులు, పిల్లల్లో పోషకాహార లోపం ఉండొద్దని డీడబ్ల్యూఓ ఫ్లోరెన్సీ, వైద్యారోగ్య శాఖ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రవీందర్‌గౌడ్, ఐసీడీఎస్ సూపర్వైజర్ మనోహర, సీహెచ్ఓ జానమ్మ పిలుపునిచ్చారు. చిరుధాన్యాల ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. తల్లులు, బాలింతలు, గర్భిణీలు పోషకాహారం తీసుకోవాలని తెలిపారు. చేతులను శుభ్రం చే సుకునే ఏడు రకాల పద్ధతులను వివరించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే బాలా మృతం, పాలు, స్నాక్స్, సంపూర్ణ భోజనం ఎ లా ఉందని తల్లులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తల్లులు, పిల్లలతో పోషణ ప్రతిజ్ఞ చేయించారు. బెగ్గర్స్ కాలనీ సెంటర్లో ప్రీ స్కూల్ పిల్లలకు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించి, సర్టిఫికెట్లను అందజేశారు. పవిత్ర, హేమలత, స్వర్ణలత, స్వప్న, ప్రమీల, లక్ష్మి ఉన్నారు. -
కొత్తవారికి మార్గనిర్దేశం చేయండి
జనగామ: వైద్యరంగంలోకి కొత్తగా వచ్చే వారికి మార్గనిర్దేశం ఐఎంఏ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ డాక్టర్ రాంచంద్రునాయక్ అన్నారు. శనివారం రాత్రి జిల్లా కేంద్రంలోని భ్రమరాంబ కన్వెన్షన్ హాల్లో ఐఎంఏ జనగామ శాఖ నూతన కార్యవర్గ పదవీ ప్రమాణ స్వీకారమహోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా రాంచంద్రునాయక్ మాట్లాడుతూ ఐఎంఏలో పరస్పర సహకారం ఉండాలన్నారు. వృత్తిలో ఈర్ష్య, ద్వేశాలకు దూరంగా ఉంటూ సంఘటితంగా ఉంటే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చన్నారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. సమాజంలో వైద్యుల పాత్ర కీలకమని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా పని చేయాలని సూచించారు. డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి మాట్లాడుతూ వైద్యులు ప్రత్యక్ష దైవస్వరూపులని అన్నారు. జిల్లా ఐఎంఏ నూతన అధ్యక్షుడిగా డాక్టర్ బాలాజీ, కార్యదర్శిగా అమృతం శ్రీకాంత్‌తోపాటు కమిటీని ఎన్నుకోగా, ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ద్వారాకానాథరెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన అధ్యక్షుడు బాలాజీ మాట్లాడుతూ 1993లో ప్రారంభమైన జనగామ ఐఎంఏ రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఐఎంఏ పూర్వ అధ్యక్షుడు డాక్టర్ లవకుమార్‌రెడ్డి, డాక్టర్ జె.వెంకటేశ్వర్లు, రాష్ట్ర కోశాధికారి డాక్టర్ దయాల్ సింగ్, డీఎంహెచ్ఓ మల్లికార్జున్‌రావు, మాజీ అధ్యక్షుడు డాక్టర్ ఏ.శ్రీనివాస్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పోకల జమునలింగయ్య, డాక్టర్లు సీహెచ్ రాజమౌళి, లక్ష్మీనారాయణ నాయక్, పి.సుగుణకర్ రాజు, రవీందర్‌గౌడ్, జి.గోపాల్ రెడ్డి, కల్నల్ భిక్షపతి, ఇన్నారెడ్డి, స్వప్న లింగమూర్తి, విజయలక్ష్మి, ప్రీతీదయాల్, ఎల్.అశోక్, స్వప్న రాథోడ్, రంజిత్ కుమార్, విజ్ఞశ్రీ, లయన్స్ ఇంటర్నేషనల్ పూర్వ జిల్లా గవర్నర్ కన్న పరశురాములు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ డాక్టర్ రాంచంద్రు నాయక్ -
ఆదర్శ నియోజకవర్గమే లక్ష్యం
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్‌ఘన్‌పూర్: నియోజకవర్గ ప్రజలు తనపై నమ్మకంతో గెలిపించారని, నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని కొత్తపల్లి గ్రామంలో రూ.15 కోట్లతో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన, దాతల సహకారంతో ఏర్పాటు చేసిన గ్రంథాలయ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే కడియం, ఎంపీ కడియం కావ్యతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చెవుల యాదగిరి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో కడియం శ్రీహరి మాట్లాడారు. కొత్తపల్లి క్రాస్ రోడ్డు జాతీయ రహదారి నుంచి కొత్తపల్లి, తాటికొండ, జిట్టెగూడెం గ్రామాల మీదుగా మల్లన్నగండి రూ.15 కోట్లతో రోడ్డు వెడల్పు, బీటీ రోడ్డు పనులను చేపట్టనున్నట్లు తెలిపారు. వారం రోజుల్లో కొత్తపల్లి గ్రామస్తులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తానన్నారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పేదలకు సన్నబియ్యం, రైతులకు సన్నబియ్యానికి బోనస్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. మూర్ఖులు చేస్తున్న విమర్శలు పట్టించుకోనని స్పష్టం చేశారు. అనంతరం ఎంపీ కావ్య మాట్లాడుతూ.. గత పదేళ్లలో ఓ ప్రబుద్దుడు అభివృద్ధిలో నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించాడని, తినడం, తాగడం, ఊగడం, వాగడమే పనిగా ఉన్నాడని పరోక్షంగా మాజీ ఎమ్మెల్యే రాజయ్యపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధిలో వెనుకబడిన నియోజకవర్గాన్ని ప్రస్తుతం ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గానికి రూ.800 కోట్లు మంజూరీ చేయించి స్వయంగా సీఎంచే శంకుస్థాపన చేయించిన ఘనత కడియందే అన్నారు. కొత్తపల్లి గ్రామానికి తన ఎంపీ నిధుల నుంచి మహిళా కమ్యూనిటీ భవనం, హైమాస్ లైట్లకు నిధులు మంజూరీ చేస్తానని హామీ చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాంబాబు, ఏఎంసీ చైర్పర్సన్ లావణ్యశిరీష్‌రెడ్డి, నాయకులు కీసర ముత్యంరెడ్డి, యాదగిరి, మధుసూదన్‌రెడ్డి, శిరీష్‌రెడ్డి, నరేందర్‌గౌడ్, శివచరణ్‌రెడ్డి, ఆనందం, రాజు, వెంకటస్వామి, కుమారస్వామి, రవి, రాజ్‌కుమార్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. -
యూడైస్ వెరిఫికేషన్
జనగామ: జాతీయ సమాచార కేంద్రం పర్యవేక్షణలో యూనిఫైడ్ డిస్ట్రిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ (యూడైస్) ద్వారా పాఠశాలల డేటా బేస్‌ను సేకరించేందుకు కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ రెండేళ్ల క్రితం శ్రీకారం చుట్టింది. విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య, పాఠశాల పరిధిలో మౌలిక వసతులతోపాటు మరో 30 అంశాలకు సంబంధించి డేటాబేస్‌ను అభివృద్ధి చేశారు. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల సమగ్ర సమాచారాన్ని యూడైస్‌లో అప్లోడ్ చేశారు. అయితే ఆన్లైన్లో పొందుపరిచిన వివరాలు క్షేత్రస్థాయిలో సరిపోల్చే విధంగా ఉన్నాయా.. లేదా..? తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వే పేరిట థర్డ్ పార్టీ వెరిఫికేషన్‌కు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఈ నెల 15వ తేదీ నుంచి డీఈడీ, బీఈడీ ట్రెయినీ విద్యార్థులతో నిర్వహిస్తున్న థర్డ్ పార్టీ వెరిఫికేషన్ నేటి (సోమవారం)తో ముగియనుంది. పడిపోయిన ర్యాంక్ ! ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. సర్కారు బడుల్లో కనీస మౌలిక వసతి సౌకర్యాలను మెరుగుపర్చడంతోపాటు సాంకేతికత ఆధారంగా డిజిటల్ విద్యపై ప్రత్యేక దృష్టి సారించింది. పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య, కంప్యూటర్లు, ల్యాబ్స్, విద్యుత్ సౌకర్యం, సోలార్ ప్యానెల్స్, ఫర్నిచర్, ప్లే గ్రౌండ్, చేతులను శుభ్రం చేసుకునే వసతి, విద్యార్థుల వారీగా ఆరోగ్య రికార్డులు, కిచెన్ గార్డెన్లు, ఇంటర్నెట్, కిచెన్షెడ్లు, ఇంటిగ్రేటెడ్ సైన్స్ ల్యాబ్స్, వసతి సౌకర్యాలు ఏ మేరకు ఉన్నాయనే దానిపై యూడైస్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేసింది. పాఠశాలల వారీగా ఉపాధ్యాయులు విద్యార్థుల సమగ్ర సమాచారంతోపాటు కేంద్రం ఇచ్చిన ఫార్మెట్ ప్రకారం కనీస మౌలిక వసతి సౌకర్యాల వివరాలను అందులో పొందుపరిచారు. రాష్ట్రంలోని అనేక జిల్లాల నుంచి ఇచ్చిన యూడైస్ సమాచారంలో క్లారిటీ లేకపోవడంతో దేశంలో తెలంగాణ ర్యాంకు పడిపోయింది. దీంతో కేంద్రం నుంచి విద్యాభివృద్ధి కోసం రావాల్సిన నిధుల వాటా తగ్గిపోయే ప్రమాదం ఏర్పడింది. ఈక్రమంలో మేల్కొన్న సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం యూడైస్ సర్వేను థర్డ్ పార్టీ ద్వారా మరోసారి వెరిఫికేషన్ చేసేందుకు నిర్ణయం తీసుకుని, అమలు చేస్తోంది. వివరాల పునఃపరిశీలన జిల్లాలో ఐదు యాజమాన్యాల (స్థానిక సంస్థలు, ప్రభుత్వ, కేజీబీవీ, మోడల్, టీఆర్ఐఈఎస్, యూఆర్ఎస్) పరిధిలో 460 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఈ బడుల పరిధిలో ఆన్లైన్లో పొందుపరిచిన యూడైస్ వివరాలను క్రాస్ చెక్ చేసుకునేందుకు 43 మంది డీఈడీ, బీఈడీ ట్రేయినీ విద్యార్థుల ద్వారా థర్డ్ పార్టీ వెరిఫికేషన్ చేయిస్తున్నారు. ఒక్కో విద్యార్థి రోజుకు రెండు నుంచి మూడు పాఠశాలల్లో సర్వే చేస్తున్నారు. ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో యూడైస్ ప్లస్ వెబ్సైట్లో నమోదు చేసిన 30 అంశాల సమాచారం సరిగ్గా ఉందా.. లేదా.. అనే కోణంలో పరిశీలన చేసి, తుది నివేదికను విద్యాశాఖ ఉన్నతాధికారులకు అందించనున్నారు. ఉన్నతాధికారుల పరిశీలన అనంతరం వివరాలను ప్రధానోపాధ్యాయులు వెబ్సైట్లో సరి చేయనున్నారు. సర్వే కొనసాగుతోంది జిల్లాలోని 460 సర్కారు బడుల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య, పాఠశాల పరిధిలో కనీస సౌకర్యాలతోపాటు మరో 30 అంశాలకు సంబంధించి యూడైస్ డేటాబేస్‌పై థర్డ్ పార్టీ వెరిఫికేషన్ కొనసాగుతోంది. పాఠశాలల వారీగా ఆన్లైన్ చేసిన వివరాలు, క్షేత్రస్థాయిలో సరిపోల్చే విధంగా ఉన్నాయా లేదా అని తెలుసుకునేందుకు సర్వే ఉపయోగపడుతుంది. సౌకర్యాలు, విద్యార్థుల సంఖ్య పెరుగుదల ఉంటే యూడైస్‌లో నమోదు చేస్తారు. – తోట రాజు, సమగ్ర శిక్ష ప్లానింగ్ కో ఆర్డినేటర్ సర్కారు పాఠశాలల్లో థర్డ్ పార్టీ పరిశీలన నేటితో ముగియనున్న సర్వే 460 పాఠశాలలు.. 43 మంది డీఈడీ, బీఈడీ విద్యార్థులు -
చిక్కుల్లో చేప
ఎదుగూబొదుగు లేని మీనం!● టెండర్లు, చేప పిల్లల పంపిణీలో ఆలస్యం ● సిండికేట్‌గా మారిన కాంట్రాక్టర్లు ● నాసిరకం, ఇష్టారాజ్యంగా సరఫరా ● 750 గ్రాముల బరువు దాటని చేపలు ● ఎండదెబ్బ.. దిగుబడిపై సన్నగిల్లిన ఆశలు ● నష్టపోతున్నామంటున్న మత్స్యకారులు సాక్షిప్రతినిధి, వరంగల్ : మత్స్యకారుల జీవనోపాధికి ప్రభుత్వం వంద శాతం రాయితీపై చేప పిల్లలను పంపిణీ చేస్తోంది. 2024–25 సంవత్సరానికి గాను ఉమ్మడి వరంగల్ పరిధి 3,861 నీటి వనరుల్లో ఈ ఏడాది 14.07 కోట్ల చేప పిల్లలు వదలాలి. 2024 జనవరిలోనే 35–40, 80–100 మిల్లీమీటర్ల పరిమాణమున్న చేప పిల్లల సరఫరాకు టెండర్లు పూర్తి చేశారు. ఆయా ప్రాంతాల్లో వాతావరణానికి తగినట్టుగా మెరిగెలు, బొచ్చె, రవ్వు, బంగారు తీగ లాంటి చేప పిల్ల లను ఉత్పత్తి చేసి సరఫరా చేయాల్సి ఉంది. అయితే ఏటా టెండర్లు దక్కించుకుంటున్న గుత్తేదారు సంస్థలు స్థానికంగా పెంచకుండా ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చినవి చెరువుల్లో వదిలి చేతులు దులుపుకుంటున్నారు. జూన్‌లో పంపిణీ చేయాల్సిన చేప పిల్లలను ఆగస్టులో మొదలెట్టి అక్టోబర్ వరకు పంపిణీ చేశారు. ఈలోగా కొన్ని మత్స్య సహకార సంఘాల నాయకులు, సభ్యులు డబ్బులు పోగేసుకుని చేప పిల్లలు కొనుగోలు చేసి చెరువుల్లో పోశారు. చాలాచోట్ల గుత్తేదార్లు సరఫరా చేసిన చేప పిల్లలు నాసిరకంగా ఉండగా.. వాటిలో ఇప్పటికీ ఎదుగుదల లేదని మత్స్యకారులు అంటున్నారు. చేప పిల్లల పంపిణీ 63.11 శాతమే ఉమ్మడి వరంగల్‌లో 3,861 చెరువులు, కుంటలు ఉండగా.. 14.07 కోట్ల చేప పిల్లలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మత్స్యశాఖ ప్రకటించింది. అయితే.. 35–40 మిల్లీమీటర్ల పిల్లలు 4.89 కోట్లు, 80–100 మిల్లీమీటర్లవి 3.99 కోట్లు.. మొత్తం 8.88(63.11 శాతం) కోట్లు పంపిణీ చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వాస్తవానికి జూన్ మొదటి వారం నుంచే చేప పిల్లలు చెరువుల్లో పోయాల్సి ఉంది. అలాగైతే ఆరేడు నెలల గడువులో ఒక్కో నెలకు పావుకిలో పెరిగినా రెండు, రెండున్నర కిలోలకు పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ఓ వైపు నాసిరకం విత్తన చేపపిల్లలు, మరోవైపు ఆలస్యంగా చెరువుల్లో వదలడం.. ఎండిపోతున్న చెరువుల్లో తీవ్రమైన ఎండవేడి.. ఈ ప్రతికూల కారణాలతో చెరువులో చేప ఎదగడం లేదు. మార్చి చివరి నుంచి చేపలు పట్టే అవకాశం ఉన్నా 450–750 గ్రాముల సైజులోనే ఉండటంతో మిన్నకుండిపోయారు. ఇప్పటికై నా ప్రభుత్వం కాంట్రాక్టర్లు, దళారులతో ఉచిత చేప పిల్లలను పంపిణీ చేయకుండా వాటికి అయ్యే మొత్తాన్ని నేరుగా మత్స్య పారిశ్రామిక సంఘాల అకౌంట్లలోకి జమ చేస్తే.. నచ్చిన చేప పిల్లలను సకాలంలో కొనుగోలు చేసి చెరువులు, కుంటల్లో పోస్తే మంచి ఫలితాలు వస్తాయని మత్స్యకారులు, సంఘాల నాయకులు అంటున్నారు. -
చెరువులు, చేప పిల్లల పంపిణీ వివరాలు
ఉమ్మడి జిల్లాలో చెరువులు 3,861ఉచిత చేప పిల్లల పంపిణీ లక్ష్యం 14.07 కోట్లు 3,462 చెరువుల్లో పోసిన చేప పిల్లలు 8.88 కోట్లు 35 నుంచి 45 మిల్లీమీటర్ల చేపలు 4.89 కోట్లు 80 నుంచి 100 మిల్లీమీటర్ల చేపలు 3.99 కోట్లు పెరగాల్సిన సైజు 1.5 కేజీ నుంచి 2.5 కేజీలు ప్రస్తుత సైజు 450 నుంచి 750 గ్రాములు -
గాలిదుమారం.. అకాల వర్షం
అకాల వర్షాలు, ఈదురుగాలులు రైతులను వెంటాడుతూ దడ పుట్టిస్తున్నాయి. పొద్దంతా ఎండలు దంచి కొడుతూ.. సాయంకాలం ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు ఆగమాగం చేస్తున్నాయి. శనివారం జిల్లాలోని జనగామ, బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పుల, రఘునాథపల్లితో పాటు తదితర మండలాల్లో కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసిపోయింది. విద్యుత్ స్తంభాలు కూలడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట తడిసిపోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.● కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం ● విద్యుత్ సరఫరాకు అంతరాయం– మరిన్ని ఫొటోలు IIIలోu -
ఆర్మీలో చేరాలనుంది..
కబడ్డీ రాష్ట్రస్థాయిలో విజేతగా నిలిచా. హనుమకొండ జేఎన్ఎస్లో పలుమార్లు శిక్షణ తీసుకున్నా. ఈశిక్షణతో కబడ్డీలో విజేతగా నిలిచా. నాకు ఆర్మీలో ఉద్యోగం పొందాలని ఉంది. సమయాన్ని వృథా చేయకుండా సెలవుల్లో పుస్తకపఠనం చేస్తా. – ఇట్టబోయిన గణేశ్, విద్యార్థి, వేలేరు పలు రంగాల్లో అవగాహన కల్పించాలి.. పిల్లలకు చదువుతోపాటు పలు రంగాల్లో ఆసక్తి కలిగేలా అవగాహన కలిగించి ప్రోత్సహించాలి. నాకు ఇద్దరు పిల్లలు అమ్మాయి, అబ్బాయి. వారిని రామకృష్ణ మఠంలో బాలసంస్కార్ క్లాస్‌కు పంపిస్తాను. విలువిద్య, స్విమ్మింగ్ నేర్పిస్తున్నా. – చింత శ్యాంసుందర్, హనుమకొండ కోచింగ్ పంపిస్తున్నాం.. మాకుమార్తె వర్షిణి ఇంటర్ ప్రథమ సంవత్సరం పూర్తయింది. ప్రస్తుతం కళాశాలకు వేసవి సెలవులు ప్రకటించడంతో నీట్ కోచింగ్‌కు పంపిస్తున్నాం. అలాగే కూచిపూడి, సంగీతంలో కూడా శిక్షణ ఇప్పిస్తున్నాం. – కొలిపాక సునీత, స్టేషన్‌ఘన్‌పూర్ -
ప్రణాళికాబద్ధంగా యాసంగి కొనుగోళ్లు
జనగామ రూరల్: ప్రణాళికాబద్ధంగా యాసంగి ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్‌తో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అకాల వర్షాలు కారణంగా రైతులు నష్టపోకుండా ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు. సన్న బియ్యం నాణ్యతపై సామాజిక మాద్యమాల్లో వస్తున్న వ్యతిరేక వార్తలను పరిశీలించి తప్పుడు వార్తలైతే ఖండించాలని సూచించారు. నీటిపారుదల ప్రాజెక్టుల పరిధిలో తాగునీటి సరఫరా ఇబ్బందులు ఉంటే సమాచారం అందించాలని, వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ వీసీలో కలెక్టర్ రిజా్వ్న్బాషా, అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి సరస్వతి, సివిల్ సప్లయీస్ డీఎం హతీరాం, మార్కెటింగ్, ఇరిగేషన్ శాఖల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి -
మహిళల హక్కుల పరిరక్షణలో కేంద్రం విఫలం
● ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి జనగామ రూరల్: మహిళల హక్కుల పరిరక్షణలో కేంద్రం విఫలమైందని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. ఈ మేరకు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మహిళా హక్కుల పరిరక్షణ యాత్ర శనివారం జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా మహిళలు బస్టాండ్ చౌరస్తాలో ఘన స్వాగతం పలికారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పట్టణంలో ని నెహ్రూపార్క్ వద్ద ఇర్రి అహల్య అధ్యక్షతన ఏ ర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ రాజ్యాంగంలో సీ్త్ర పురుషులకు సమాన హక్కులు కల్పించబడ్డాయని, కానీ అసమానతలు ఇంకా తగ్గడం లేదన్నారు. జిల్లా అధ్యక్షురాలు అరుణ జ్యోతి, రాష్ట్ర సహాయ కార్యదర్శి బుగ్గవేటి సరళ, ఆశాలత, సా యి లీల, జిల్లా కార్యదర్శి ఎండీ షబానా, భవాని, పి.కల్యాణి, బి.రమ, విజేందర్ పాల్గొన్నారు. మాట్లాడుతున్న ఐద్వా రాష్ట్ర కార్యదర్శి లక్ష్మి -
వసతుల కల్పనకు కృషి
● హైకోర్టు జడ్జి జస్టిస్ అనిల్‌కుమార్ జనగామ రూరల్: జిల్లా కోర్టులో వసతుల క ల్పనకు కృషి చేస్తానని హైకోర్టు జడ్జి జస్టిస్ జె.అనిల్‌కుమార్ అన్నారు. శనివారం జిల్లా కో ర్టును ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రిజ్వాన్ బాషా, డీసీపీ రాజమహేంద్రనాయక్, ఏసీపీ పండరి చేతన్ నితిన్ ఆయనకు పూల మొక్క అందించి స్వాగతం పలి కారు. అనంతరం న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను జడ్జి దృష్టికి తీసుకువచ్చా రు. జిల్లా జడ్జి రవీంద్రశర్మ ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణంలోని గుమాస్తా సంఘ భవనం, ఈసేవ, మహిళా బార్ అసోసియేషన్, లాకర్ రూంలను సందర్శించి పరిశీలించారు. అనంతరం జడ్జి జస్టిస్ అనిల్‌కుమార్ మాట్లాడుతూ జిల్లా కోర్టులో క్యాంటీన్, జిరాక్స్ సెంటర్, మహిళా బార్ అసోసియేషన్‌కు హాల్ తదితర సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామన్నారు. అ నంతరం కోర్టు ఆవరణలో జిల్లా జడ్జి, న్యాయవాదులతో కలిసి మొక్కలు నాటారు. నూతన బార్ అసోసియేషన్ సభ్యులు జడ్జిని శాలువా తో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గోపిరామ్, తహసీల్దార్ హుస్సేన్, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు డి. హరిప్రసాద్ యా దవ్, జనరల్ సెక్రటరీ పి.రామకృష్ణ, సీనియర్ న్యాయవాదులు శ్రీరామ్ శ్రీనివాస్, జాన్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, సునీత రాణి పాల్గొన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్: ఘన్పూర్ డివిజన్ కేంద్రంలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టును హైకోర్టు జడ్జి జస్టిస్ అనిల్‌కుమార్ జిల్లా జడ్జి రవీంద్రశర్మతో కలిసి శనివారం సందర్శించారు. కోర్టు హాల్, చాంబర్, బార్ అసోసియేషన్ హాల్, టాయిలెట్లను పరిశీలించారు. స్టేషన్‌ఘన్‌పూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కనకం రమేశ్ ఆధ్వర్యంలో జడ్జికి పలు సమస్యలతో కూడిన వినతులు అందించారు. సమస్యల పరిష్కారానికి జడ్జి సానుకూలంగా స్పందించారు. పాలకుర్తి టౌన్: సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శనివారం హైకోర్టు జడ్జి జస్టిస్ అనిల్‌కుమార్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. -
‘భూ భారతి’పై అవగాహన ఉండాలి
స్టేషన్‌ఘన్‌పూర్: భూ రికార్డుల్లో తప్పులను సరిదిద్దడానికి, రైతులకు మెరుగైన సేవలు అందించడానికి భూ భారతి–2025 చట్టాన్ని తీసుకొచ్చినట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో స్థానిక రైతువేదికలో శనివారం భూ భారతి (భూమిపై హక్కులు, రికార్డులు) చట్టంపై అవగాహన సదస్సును నిర్వహించారు. తహసీల్దార్ వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ముఖ్యఅతిథిగా కడియం హాజరై మాట్లాడారు. పార్ట్ బీ ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. రెవెన్యూ అధికారులు, సిబ్బంది పారదర్శకంగా పనిచేయాలన్నారు. అనంతరం కలెక్టర్ రిజ్వాన్ బాషా మాట్లాడుతూ భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి భూ భారతి చట్టం పనిచేస్తుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రో హిత్సింగ్, ఏఎంసీ చైర్పర్సన్ జూలుకుంట్ల లావణ్యశిరీష్‌రెడ్డి, ఎంపీడీఓ విజయశ్రీ, ఆర్ఐలు శ్రీకాంత్, సతీష్, డీటీ ఫణికిషోర్, రైతులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
ఆదివారం శ్రీ 20 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
– IIలోuపుస్తకాలతో కుస్తీ పడిన చిన్నారులకు రిలీఫ్ దొరికినట్లయ్యింది. ఇన్నాళ్లు బండెడు బుక్స్‌ను మోసిన ఆ చిన్ని భుజాలకు కాస్తంత విశ్రాంతి దొరికింది. ఇప్పటికే పలు ప్రైవేట్ స్కూళ్లు వేసవి సెలవులు ఇచ్చాయి. ప్రభుత్వ స్కూళ్లు మాత్రం ఈ నెల 24 నుంచి సెలవులు ప్రకటించాయి. స్పెషల్ క్లాసులు, ట్యూషన్లు, హోంవర్క్‌లు, బైహాట్లు ఇప్పుడివేమీ లేవు. అలాగని ఈ సెలవుల్లో వాళ్లేం ఖాళీగా ఉండరు. ఫోన్ చూడడమో, లేక టీవీకి అతుక్కుపోవడమో చేస్తుంటారు. ఈ సెలవుల్ని వినియోగించుకుంటే భవితకు పునాది వేసుకోవచ్చు. వారికి ఇష్టమైన క్రీడలు, నాట్యం, ఆత్మరక్షణ విద్య, స్విమ్మింగ్, ఇతర రంగాలను తెలుసుకుని ప్రోత్సహించాలి. పిల్లల్ని ఆ దిశగా నడిపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. అప్పుడే వారిలో మానసికోల్లాసంతోపాటు శారీరక దృఢత్వం అలవడుతుంది. సెలవుల్ని ఎలా వినియోగించుకోవాలనేదే ఈ వారం ‘సాక్షి’ ప్రత్యేకం. – హన్మకొండ కల్చరల్పర్యాటక ప్రాంతాల సందర్శన ఓరుగల్లు ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతం. వేసవిలో ఆహ్లాదం, ఆనందం కోసం తల్లిదండ్రులు పిల్ల లను ఉమ్మడి జిల్లాలోని పలు పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లవచ్చు. ముఖ్యంగా హనుమకొండ హంటర్‌రోడ్డులోని జూ పార్కు, సైన్స్‌సెంటర్, వేయిస్తంభాల గుడి, భద్రకాళి ఆలయం, రామప్ప, లక్నవరం, పాకాల సరస్సు ఖిలా వరంగల్కోట తదితర ప్రదేశాలను సందర్శించవచ్చు. సజీవంగా నిలిచిపోయే కళ చిత్రలేఖనం. ఉమ్మడి జిల్లాలో చాలా మంది ఆర్టిస్టులు ఉచితంగా చిత్రలేఖనాన్ని నేర్పిస్తున్నారు. కొంత మంది నిర్ణీత రుసుముతో బొమ్మలు గీయడం నేర్పిస్తున్నారు. మరికొంత మంది ఆన్లైన్ క్లాసుల ద్వారా విద్యార్థులను బొమ్మలు గీయడంలో నేర్పరులుగా మారుస్తున్నారు. కాగా.. వరంగల్ కాపువాడకు చెందిన చిత్రకళలో డాక్టరేట్ సాధించిన యాకయ్య విద్యార్థులకు చిత్రలేఖనంలో మెళకువలు నేర్పుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని లైబ్రరీలు విద్యార్థులకు స్వాగతం పలుకుతున్నాయి. శాస్త్ర, సాంకేతిక, కథలు, కవితలు, అన్నిరకాల పోటీ పరీక్షల పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఉచితంగా మేధను పెంచుకునేందుకు ఇవి చక్కటి సోపానాలు. ఉన్నత స్థానంలో ఉన్న వారంతా పుస్తకాల పురుగులే. నగరవాసులు అయితే వరంగల్, హనుమకొండలోని సెంట్రల్ లైబ్రరీలకు పిల్లలను ఎంచక్కా పంపొచ్చు. నృత్య, సంగీత శిక్షణతో మానసిక ప్రశాంతత కలుగుతుంది. సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. వరంగల్‌కు చెందిన నటరాజ కళాకృష్ణ నృత్యజ్యోతి అకాడమీ గురువు రంజిత్ ఆధ్వర్యంలో ఈనెల 24వ తేదీ నుంచి పేరిణి నాట్య కళాపరిచయం పేరిట 45 రోజులు నిర్వహించే శిక్షణ శిబిరాన్ని ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా ప్రాయోగిక, ప్రాథమిక స్థాయి శిక్షణతో పాటు ప్రశంస పత్రం అందజేస్తారు. అంతేకాకుండా హనుమకొండకు చెందిన శ్రీశివానంద నృత్యమాల నాట్యాచార్యులు బొంపల్లి సుధీర్‌రావు ఆధ్వర్యంలో భరతనాట్యం, కూచిపూడి నాట్యాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి.న్యూస్రీల్క్రీడల్లో శిక్షణ..పిల్లలు వేసవి సెలవుల్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలిసజీవ కళ చిత్రలేఖనం.. వారికి ఇష్టమైన కళలు, ఆటల్లో శిక్షణ ఇప్పించాలి.. సెల్‌ఫోన్‌ను దూరం పెట్టాలి.. పుస్తకాల్ని చేరువ చేయాలి ఆ బాధ్యత తల్లిదండ్రులదే.. పుస్తక పఠనం..భగవద్గీత శ్లోక శిక్షణ.. సామాజిక సేవ -
పట్టాలెక్కినకొనుగోళ్లు
276 ఐకేపీ, పీఏసీఎస్ సెంటర్లు●అధిక తేమతో ఇబ్బందులు ధాన్యం సేకరణకు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు సిద్ధంగా ఉన్నప్పటికీ.. అధిక తేమ కారణంగా ఆలస్యం అవుతోంది. ధాన్యంలో తేమ 23 నుంచి 30 శాతానికి పైగా వస్తుండడంతో మద్దతు ధర కోసం రైతులు రోజుల తరబడి ఆరబోసి నిరీక్షించాల్సి వస్తోంది. ఒక్కో రైతు 10 రోజుల నుంచి సెంటర్లలోనే పడిగాపులు కాస్తున్నారు. కాగా తరిగొప్పుల మండల పరిధిలో గన్నీ బ్యాగుబరువు, తరుగు పేరుతో బస్తాకు 40 కేజీలకు బదులు 41.2 కిలోలు తూకం వేస్తున్నారు. దీంతో ఒక్కో బస్తాకు కిలో 200 గ్రాములు నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ● దొడ్డు, సన్న రకం ధాన్యం సేకరణ ● ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం 57,260 క్వింటాళ్లు ● అధిక తేమతో ఆలస్యంగా కాంటాలు ● రైతులకు తప్పని పడిగాపులు -
నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్లు
సామాన్య ప్రజల కోసమే ‘భూ భారతి’ చట్టం ● రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ● భూ భారతి పైలట్ మండలం వెంకటాపురం (ఎం)లో రెవెన్యూ సదస్సు ● హాజరైన మంత్రులు ధనసరి సీతక్క, కొండా సురేఖ తదితరులువెంకటాపురం(ఎం)/ములుగు: అర్హులైన పేదలందరికీ పార్టీలకతీతంగా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని, ఈ నెలాఖరులోగా ప్రతీ గ్రామంలో ప్రారంభిస్తామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భూ భారతి పైలట్ మండలంగా ఎంపిక చేసిన ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలకేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగిన రెవెన్యూ సదస్సుకు మంత్రులు ధనసరి అనసూయ సీతక్క, కొండా సురేఖలతో కలిసి ఆయన హాజరయ్యారు. పలువురు రైతులనుంచి దరఖాస్తులు స్వీకరించి రశీదులు అందజేశారు. అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఇందిరమ్మ పేరు వింటేనే ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. జిల్లాలో గిరిజనులు, గిరిజనేతరులు ఉన్నారని, ఈ ప్రాంత సమస్యలపై ప్రత్యేక కమిటీ వేసి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. భూ సమస్యలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని చెప్పారు. రైతుల వద్దకే వెళ్లి అధికారులు భూ సమస్యలు పరిష్కరిస్తారని పేర్కొన్నారు. రైతును రాజు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ : మంత్రి కొండా సురేఖ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిరంతరం రైతుల గురించి ఆలోచించి రైతును రాజుగా చేశారని మంత్రి కొండా సురేఖ అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రైతులకు న్యాయం చేసేందుకే భూభారతి చట్టాన్ని తీసుకు వచ్చారని చెప్పారు. రైతులను ఇబ్బందులు పెట్టకుండా అధికారులు సేవలందించాలని, తప్పు చేసే వారిపై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. భూమికి రైతుకు ఉన్న బంధమే తల్లీబిడ్డ సంబంధం: మంత్రి ధనసరి సీతక్క తల్లీబిడ్డకు ఎలాంటి సంబంధం ఉంటుందో భూమికి రైతుకు అలాంటి బంధం ఉంటుందని, గత ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకొచ్చి రైతుల ఆత్మహత్యలకు కారణమైందని మంత్రి సీతక్క అన్నారు. నేడు రైతుల సమస్యలను పరిష్కరించడానికి సీఎం రేవంత్‌రెడ్డి భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చారని చెప్పారు. కార్యక్రమంలో మహబూబాబా ద్ ఎంపీ పోరిక బలరాంనాయక్, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, కేఆర్.నాగరాజు, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు, కలెక్టర్ దివాక ర టీఎస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, అదనపు కలెక్టర్ మహేందర్ జీ, ఆర్డీఓ వెంకటేష్, తహసీల్దార్ గిరిబాబు, ఎంపీడీఓ రాజు తదితరులు పాల్గొన్నారు. -
క్రీడలతో మానసిక ఉల్లాసం
● డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డిజనగామ: క్రీడలతో శారీరక ధృడత్వంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రం ప్రెస్టన్ మైదానంలో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి రాజీవ్ మెమోరియల్ ట్రోఫీ(కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి క్రికెట్ టోర్నమెంట్ సీజన్–1) ముగింపు వేడుకల్లో శుక్రవారం పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతనం జనగామ వ్యవసాయ మార్కె ట్ చైర్మన్ బనుక శివరాజ్‌యాదవ్ ఆధ్వర్యాన ఏర్పా టు చేసిన సమావేశంలో కొమ్మూరి మాట్లాడారు. నేటితరం యువత చదువుతో పాటు ఆటల్లోనూ రాణించాలని, రేపటి భవిష్యత్ కోసం అన్ని రకాలు గా సన్నద్ధమై ఉండాలని సూచించారు. పోటీల్లో మహబూబాబాద్ ప్రథమ, జనగామ జట్టు ద్వితీ య స్థానంలో నిలిచాయి. కార్యక్రమంలో ఆర్గనైజ ర్లు, క్రీడాకారులతో పాటు సీఐ దామోదర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చెంచారపు బుచ్చిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మెరుగు బాలరాజ్, మాజీ కౌన్సిలర్ మేడ శ్రీనివాస్, నాయకులు చెంచారపు కరుణాకర్ రెడ్డి, కడారు ప్రవీణ్‌కుమార్, విజయ్, మల్లారెడ్డి, ప్రకాశ్ యాదవ్ పాల్గొన్నారు. -
కుటుంబ సమస్యలు కులపెద్దలే పరిష్కరించాలి
జాతీయ గీతాలాపనలో రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్, న్యాయమూర్తులు వీబీ నిర్మలా గీతాంబ, సీహెచ్.రమేశ్ బాబు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్ ఉమ్మడి వరంగల్ పరిధిలోని ఆయా జిల్లాల న్యాయ సేవా సంస్థలు గుర్తించిన కమ్యూనిటీ మీడియేటర్ల మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం హనుమకొండలోని డీసీసీ బ్యాంక్ ఆడిటోరియంలో నిర్వహించారు. రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్ మాట్లాడుతూ కుటుంబ సమస్యలను కులపెద్దలే పరిష్కరించాలన్నారు. – వరంగల్ లీగల్– వివరాలు IIలోu -
వేంకటేశ్వరస్వామికి ప్రత్యేక అలంకరణ
చిల్పూరు: శ్రీ బుగులు వేంకటేశ్వరాలయంలో శుక్ర(లక్ష్మి) వారాన్ని పురస్కరించుకుని భూనీల సమేత స్వామివారిని అర్చకులు పుష్ప, తులసీ దళాలతో అలంకరించారు. అంతకు ముందు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈఓ లక్ష్మీప్రస న్న, చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్‌రావు, సిబ్బంది, ధర్మకర్తలు పాల్గొన్నారు. శ్రీసోమేశ్వరుడికి న్యాయమూర్తి పూజలుపాలకుర్తి టౌన్: జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించి హైకోర్టు రిజిస్ట్రార్‌గా పదోన్నతి పొందిన డి.రవీంద్రశర్మ కుటుంబ సభ్యులు శుక్రవారం శ్రీ సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారిని అర్చకులు స్వామివారి శేషవస్త్రాలతో సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆల య ఈఓ మోహన్‌బాబు, అర్చకులు డీవీఆర్. శర్మ, దేవగిరి అనిల్‌శర్మ, మత్తగజం నాగరాజు, సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. నేడు బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ క్యాంప్జనగామ రూరల్: జిల్లా పరిధిలోని వినియోగదారులకు జనగామ టెలిఫోన్ ఎక్చేంజ్ పరిధి లో శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కస్టమర్ సర్వీస్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు సబ్ డివిజినల్ ఇంజినీర్ చంద్రగిరి ప్రసాద్ తెలిపారు. ఈ క్యాంపులో సంస్థకు సంబంధించి వివిధ సర్వీసులు, మొబైల్, ఇంట ర్నెట్, వైఫై, సిగ్నల్ సమస్యలు పరిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. క్యాంప్‌లో వరంగల్ ఏజీఏం దయాకర్‌తో పాటు ఎస్డీఈలు శ్రీహరి, రాంప్రసాద్, షఫీక్ పాల్గొంటారని వినియోగదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఒక ప్రకటనలో కోరారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రతే ధ్యేయంజనగామ: ఉద్యోగుల ఆరోగ్య భద్రతే ధ్యేయంగా ఎన్పీడీసీఎల్ పాటుపడుతోందని ఎస్ఈ వేణుమాధవ్ అన్నారు. శుక్రవారం జనగామ డివిజనల్ కార్యాలయంలో జిల్లాలోని విద్యుత్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రి ఆధ్వర్యాన మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఇందులో 200 మందికి వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆస్పత్రి యాజ మాన్యం, డాక్టర్లను డీఈలు గణేష్, లక్ష్మీనారా యణ, వై.రాంబాబు, ఏడీఈ పి.రణధీర్‌రెడ్డి, ఏఈ పి.శంకర్‌తో కలిసి ఎస్ఈ సత్కరించారు. -
కిషన్‌రెడ్డికి క్షమాపణ చెప్పాలి
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ జనగామ రూరల్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కి ఎమ్మెల్సీ దయాకర్, అంజన్‌కుమార్ వెంటనే క్షమాపణ చెప్పాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు వారి దిష్టిబొమ్మను శుక్రవారం జిల్లా కేంద్రం చౌరస్తాలో దహనం చేశారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడు తూ.. రాజ్యాంగబద్ధంగా ఉన్నత పదవుల్లో ఉన్న ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని అనుచిత వ్యాఖ్యలతో మాజీ పార్లమెంట్ సభ్యుడు అంజన్‌కుమార్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ విమర్శించడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. చౌకబారు మాటలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలన్నా రు. లేదంటే పార్టీ కార్యకర్తలు ఆగ్రహానికి గురికావా ల్సి వస్తుందని హెచ్చరించారు. బొమ్మకంటి అనిల్ ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శివరాజ్ యాదవ్, దేవర ఎల్లయ్య, బజ్టూరి లక్ష్మీనరసయ్య, డాక్టర్ కల్నల్ భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం తెచ్చి 12రోజులైంది..
మూడు ఎకరాల్లో వరి సాగు చేయగా.. 150 బస్తాల దిగుబడి మాత్రమే వచ్చింది. ఇంతకు ముందు సీజన్లలో 250 బస్తాల వరకు వచ్చింది. వడ్లు అమ్మడానికి 12 రోజుల క్రితం కొనుగోలు కేంద్రానికి వచ్చిన. తేమ ఉందని తీసుకోలేదు. ఆరబోసి ఎదురు చూస్తున్నాను. – ముదావత్ హర్య, అల్యతండా(అబ్దుల్‌నాగారం) సెంటర్లపై నిత్యం పర్యవేక్షణ జిల్లాలోని ధాన్యం కొనుగోలు సెంటర్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. అకాల వర్షాల నేపథ్యంలో టార్పాలిన్ కవర్లను అవసరం మేరకు అందుబాటులో ఉంచాం. సంబంధిత శాఖల ఉన్నతాధికా రులు పర్యటిస్తూ కొనుగోళ్లలో జాప్యం లేకుండా చూడడంతో పాటు రైతులకు సౌకర్యాల కల్పనపై దృష్టి సారించారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంట నే డబ్బు చెల్లింపులు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకుంటున్నాం. – రోహిత్‌సింగ్, అదనపు కలెక్టర్(రెవెన్యూ) -
ఓపెన్ స్కూల్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షలు ఈనెల 20 నుంచి నిర్వహించనున్నారు. అందుకు హనుమకొండ, వరంగల్, ములుగు, జనగామ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆరు జిల్లాల్లో మొత్తం టెన్త్ విద్యార్థులు 2,679 మంది, ఇంటర్మీడియట్ పరీక్షలకు 4,707 మంది పరీక్షలు రాయనున్నారు. వీరి కోసం 34 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 34 మంది చీఫ్ సూపరింటెండెంట్లను, 35 మంది డిపార్టుమెంటల్ ఆఫీసర్లను నియమించారు. 9 ఫ్లయింగ్ స్క్వాడ్ల బృందాలు, 35 సిట్టింగ్ స్కా్వ్డ్ల బృందాలను ఏర్పాటు చేశారు. 418 మంది ఇన్విజిలేటర్లుగా విధులను నిర్వర్తించనున్నారు. టెన్త్, ఇంటర్ విద్యార్ధులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ప్రత్యేక సబ్జెక్టులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రెండు పూటలా పరీక్షలు నిర్వహిస్తారు. ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హనుమకొండ డీఈఓ వాసంతి, ఓపెన్ స్కూల్ ఉమ్మడి వరంగల్ జిల్లా కో–ఆర్డినేటర్ అనగొని సదానందం శుక్రవారం తెలిపారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు 80084 03631, 93460 20003 సంప్రదించాలని వారు సూచించారు. ఉమ్మడి జిల్లాలో టెన్త్‌లో 2,679 మంది ఇంటర్లో 4,707 మంది విద్యార్థులు -
ఉలిక్కి పడిన రైతులు
ధాన్యం కొనుగోలు కేంద్రం సమీపంలో పిడుగుపాటు బచ్చన్నపేట/జనగామ : ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షం కురుస్తోంది.. ధాన్యం ఆరబోసిన రైతులంతా కొనుగోలు కేంద్రం సమీపాన చెట్టు కింద ఏర్పాటు చేసిన పందిరి కిందకు చేరారు. కొద్ది దూరంలో ఒక్కసారిగా పిడుగు పడింది. ఆ ధాటికి కూర్చున్న స్థలం నుంచి ఎగిరి పక్కకు పడ్డారు. 12 మందికి గాయాలు కాగా.. అందులో ఎనిమిది మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యా రు. బచ్చన్నపేట మండలం అలింపూర్ గ్రామ చివరన ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనతో జిల్లాలోని రైతులందరూ ఉలిక్కిపడ్డారు. కొనుగోలు కేంద్రానికి 20 మీటర్ల దూరంలో హైటెన్షన్ వైరు ఉంది. పిడుగు పాటుకు మెరుపులు వచ్చాయి. అదే సమయంలో వర్షం పడుతోంది. ఈ క్రమంలో విద్యుత్ షాక్ వచ్చి ఈ ప్రమాదం జరిగి ఉంటుంద ని గ్రామస్తులు అంటున్నారు. పిడుగు పడిన సమయంలో కొనుగోలు కేంద్రం వద్ద దాదాపు 200 మంది ఉన్నట్లు సమాచారం. ఎనిమిది మందికి తీవ్ర అస్వస్థత పిడుగు పాటు ఘటనలో గాయపడ్డ వారిలో ఎనిమి ది మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అందులో గ్రామానికి చెందిన దండ్యాల మల్లారెడ్డి, గంట పద్మ, వంగపల్లి సుశాంత్‌రెడ్డి, వంగపల్లి మల్లారెడ్డి, పాకాల మల్లయ్య, బీరెడ్డి జనార్ధన్‌రెడ్డి, బీరెడ్డి భారతమ్మ, పారుపల్లి నందిని ఉన్నారు. వారు జనగామ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అపస్మారక స్థితికి చేరిన వంగపల్లి సుశాంత్, పారుపల్లి నందినికి ఆస్పత్రి వైద్యులు సీపీఆర్ చేయడంతో ప్రాణాపాయం తప్పింది. పిడుగు ధాటికి గాయపడిన వారిలో ఒక్కొక్కరూ ఒక్కో రకమైన ఇబ్బందులతో బాధపడుతున్నారు. అవయవాలు పని చేయక కొందరు, మరికొందరు మాట్లాడలేక పోతున్నారు. నరాల జబ్బులు కూడా వచ్చే ప్రమాదం ఉంటుందని వారి కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. ఆస్పత్రి క్షతగాత్రుల బంధువులు, కుటుంబ సభ్యులతో కిక్కిరిసి పోయింది. సెంటర్ల వద్ద భద్రతపై ఆందోళన.. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద పిడుగు పాటు సంఘటనలు గతంలో ఎన్నడూ జరగలేదు. ఇలాంటి పరిస్థితుల్లో చోటు చేసుకున్న పిడుగు పాటు జిల్లా యంత్రాంగంతో పాటు రైతుల కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ఈ క్రమంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద భద్రతపై చర్చ మొదలైంది. చెట్ల కింద చలువ పందిరి వేయడం.. ధాన్యం ఆరబోసుకునే స్థలం పక్కనే విద్యుత్ హైటెన్షన్ తీగలు, కొన్ని చోట్ల కొబ్బరి, తాటిచెట్లు ఉండడంతో పిడుగు పాటుకు గురయ్యే అవకాశం ఉందని రైతులు అంటున్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు, అకాల వర్షాలు సంభవించిన సమయంలో రైతులకు అవగాహన కల్పించి, రక్షిత ప్రదేశానికి పంపించేలా సెంటర్ల నిర్వాహకులకు అవగాహన కల్పించాల్సి ఉంది. 12 మందికి గాయాలు.. వీరిలో 8 మందికి తీవ్ర అస్వస్థత ఆస్పత్రికి తరలింపు.. చికిత్స పొందుతున్న క్షతగాత్రులు అలీంపూర్ ఘటనతో తెరపైకి రైతుల భద్రత అంశం అకాల వర్షాలు, వడగళ్లు కురిస్తే షెల్టర్లు ఎక్కడ? -
శిశువు మృతి ఘటనపై విచారణ
పాలకుర్తి టౌన్: స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీ కి వచ్చిన గర్భిణి కడుపులో శిశువు మృతి చెందిన ఘటనపై కలెక్టర్ ఆదేశాలతో డీఎంహెచ్ఓ మల్లికా ర్జున్‌రావు గురువారం విచారణ చేపట్టారు. గర్భిణి ఎప్పుడు ఆస్పత్రిలో చేరింది. ఆమెకు చేసిన పరీక్షలు ఏమిటి. ఇచ్చిన మందుల వివరాలతోపాటు ఆ సమయంలో విధుల్లో ఉన్న వైద్య సిబ్బంది సమా చారం తెలుసుకున్నారు. అలాగే గర్భిణిని జనగామ ఎంసీహెచ్‌కు ఎందుకు రెఫర్ చేయలేదు.. చేస్తే వారు వెళ్లలేదా.. ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని ఎవరు సూచించారు.. బాధిత కుటుంబ సభ్యులు వెల్లడించిన అంశాలపై విచారణ చేపట్టారు. అలాగే ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. విచారణలో అడిషనల్ డీఎంహెచ్ ఓ రవీందర్, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ సుధీర్, డాక్టర్ సిద్ధార్ధరెడ్డి పాల్గొన్నారు. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యమే కారణం పలు కోణాల్లో విచారణ చేపట్టిన డీఎంహెచ్ఓ ఈ ఘటనకు వైద్యులతో పాటు ఆరోగ్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని తేల్చారు. బాధ్యులైన గైనకాలజి స్ట్ డాక్టర్ కె.అపర్ణను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రెండు రోజులుగా విధులకు రాకుండా పర్యవేక్షణ లోపానికి కారణమైన సూపరింటెండెంట్ డాక్టర్ పరమేశ్వరిని సస్పెండ్ చేయడానికి కమిషనర్ వైద్య విధాన పరిషత్‌కు రెకమండ్ చేశా రు. అలాగే ఆస్పత్రికి వచ్చిన గర్భిణి అర్చన విషయంలో అమర్యాదగా వ్యవహరించిన స్టాఫ్‌నర్సు జె.నీల, ఎంపీహెచ్ఏ కృష్ణవేణిలకు మెమో జారీ చేశారు. కొద్దిరొజులుగా విధులకు గైరాజరవుతున్న జీడీఎంఓ భరత్‌ను విధుల నుంచి తొలగించారు. గర్భిణిని సకాలంలో ఉన్నత ఆస్పత్రికి రెఫర్ చేయడంలో నిర్లక్ష్యం వహించి డాక్టర్ స్వప్నకు సైతం మెమో జారీ చేశారు. ఇద్దరు వైద్యుల సస్పెన్షన్ పలువురికి మెమోలు జారీ -
‘భూ భారతి’తో రైతులకు న్యాయం
చిల్పూరు: భూ సమస్యల పరిష్కారానికే కాంగ్రెస్ ప్రభుత్వం ‘భూ భారతి’ చట్టాన్ని తెచ్చింది.. దీని ద్వారా రైతులకు సరైన న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మండల కేంద్రంలో గురువారం ఆర్డీఓ వెంకన్న అధ్యక్షతన భూ భారతి ఆర్ఓఆర్–2025 చట్టంపై కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్ ఆధ్వర్యాన నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మా ట్లాడారు. గత ప్రభత్వం తెచ్చిన ధరణిలో చాలా పొరపాట్లు జరిగాయని, అర్హులైన రైతులు నష్టపోగా పాలకులు వేల ఎకరాల భూమిని కబ్జా చేశారని అన్నారు. ధరణి ద్వారా అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకున్న వారిని గుర్తించి క్రిమినల్ కేసులు పెట్టాలని అన్నారు. భూ సమస్యలు లేని రాష్ట్రంగా మార్చాల నే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. అధికారులు గ్రామ స్థాయిలో రైతులకు అవగాహన కల్పించడంతోపాటు ఈ చట్టంతో కలిగే ప్రయోజ నాలను వివరించాలన్నారు. ఈ సదస్సులో తహసీల్దార్ సరస్వతి, ఆర్ఐ చీకటి వినీత్, చిల్పూరు ఆలయ మైర్మన్ శ్రీధర్‌రావు, వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ లావణ్య, ఎంపీఓ మధుసూదన్, వ్యవసాయాధికారి నజీరుద్ధీన్, మాధవీలత తదితరులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం రఘునాథపల్లి: మండల పరిధిలోని లక్ష్మీతండా, ఇబ్రహీంపూర్లో ఐకేపీ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలతో పాటు ఫతేషాపూర్ నుంచి రామచంద్రగూడెం వరకు నిర్మించిన బీటీ రోడ్డును, ఇబ్రహీంపూర్లో పునరుద్ధరించిన మహిళా సంఘం భవనాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, జనగామ మార్కెట్ కమిటీ చైర్మన్ శివరాజ్‌యాదవ్, మాజీ జెడ్పీటీసీ లింగాల జగదీష్‌చందర్‌రెడ్డి, ఆర్డీఓ గోపిరాం, తహసీల్దార్ ఎండీ.మోహ్సి న్ముజ్తబ, ఎంపీడీఓ గార్లపాటి శ్రీనివాసులు, అడిషనల్ డీఆర్డీఓ శ్రీనివాస్, ఏఓ శ్రీనివాస్‌రెడ్డి, ఏపీఎం సారయ్య, కోళ్ల రవిగౌడ్, నామాల బుచ్చయ్య, మల్కపురం లక్ష్మయ్య, మాలోతు నర్సింహ, పయ్యావుల కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
నేడు ‘డయల్ యువర్ డీఎం’
హన్మకొండ: ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు శుక్రవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ వరంగల్–1 డిపో మేనేజర్ పి.అర్పిత ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నా రు. హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సిద్దిపేట, పాలకుర్తి, తరిగొప్పుల రూట్ ప్రయాణికులు 99592 26047 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యలు వివరించడంతోపాటు, సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి లింగాలఘణపురం: దేవాలయ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆ శాఖ నల్గొండ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ కె.భాస్కర్ అన్నా రు. గురువారం జీడికల్ వీరాచల శ్రీరామచంద్రస్వామి ఆలయంలో జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాలకు చెందిన దేవాలయాల ఈఓలతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆలయాల పేర్లతో ఉన్న భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాల ని, నిర్వహణ సక్రమంగా చేపట్టాలని ఆదేశించా రు. ఈఓలు లక్ష్మీప్రసన్న, వంశీ పాల్గొన్నారు. నేడు మార్కెట్‌కు సెలవు జనగామ: గుడ్ ఫ్రైడే సందర్భంగా జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు నేడు(శుక్రవారం) సెలవు ప్రకటించినట్లు చైర్మన్ బనుక శివరాజ్‌యాదవ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించి వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించడానికి మార్కెట్‌కు తీసుకురావొద్దని సూచించారు. 19న మార్కెట్ సేవలు కొనసాగుతాయని తెలిపారు. 24న ఉచిత విద్య టాలెంట్ టెస్ట్ జనగామ రూరల్: నిరుపేద విద్యార్థులకు ఉచిత విద్య లక్ష్యంతో టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యాన ఈనెల 24న జిల్లా కేంద్రంలో టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చంద్రశేఖర్‌రావు, వెంకటేష్ తెలి పారు. గురువారం పట్టణంలో వారు మాట్లాడు తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతిభా వంతులైన గ్రామీణ పేద విద్యార్థులకు ప్రవేశ పరీక్ష ద్వారా ఉచిత విద్య అందించనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 4,5,6 తరగతులు చదివే వారికి అర్హత పరీక్ష ద్వారా 5,6,7 తరగతుల్లో ప్రవేశం పొందే అవకాశం ఉందన్నారు. డిగ్రీ, ఆపై విద్య వరకు ఉచిత హాస్టల్ ప్రవేశంతో కూడిన విద్య అందించనున్నట్లు వివరించారు. పౌష్టికాహారంతోనే ఆరోగ్యం రఘునాథపల్లి: పౌష్టికాహారంతోనే ఆరోగ్యంగా ఉంటామని డీడబ్ల్యూఓ ఫ్ల్లోరెన్స్ అన్నారు. గురువారం నిడిగొండ అంగన్వాడీ కేంద్రంలో నిర్వ హించిన పోషణ పక్షం కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. పుట్టిన బిడ్డకు వెంటనే ముర్రు పాలు తాగిస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతుంద ని, ఆరునెలల వరకు తల్లిపాలు ఇవ్వాలని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అంది స్తున్న పోషకాహారాన్ని గర్భిణులు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆంగన్వాడీ టీచర్లు సీహెచ్.జయలక్ష్మి, వీరలక్ష్మి, అంజనీబాయి, శోభ పాల్గొన్నారు. అలాగే శ్రీమన్నారాయణపురం, భాంజీపేట అంగన్వా డీ కేంద్రాల్లో పోషణ పక్షంలో భాగంగా ఆకలి పరీక్ష నిర్వహించారు. -
శుక్రవారం శ్రీ 18 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
నీడ లేక రోడ్డు పక్కన కల్వర్టుపై ప్రయాణికులు కొడకండ్ల: మొండ్రాయి క్రాస్‌రోడ్(చింతల్ బస్‌స్టాప్) సమీపంలో బస్‌షెల్టర్ లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. లక్ష్మక్కపల్లి, రామన్నగూడెం, బోడోనికుంట, పెద్దబాయి, మొండ్రాయి పరిసర తండాలకు చెందిన ప్రయాణికులు నిత్యం మండల కేంద్రంతో పాటు జనగామ, తిరుమలగిరి, పాలకుర్తి తదితర ప్రాంతాలకు వెళ్తుంటారు. బస్‌షెల్టర్ లేక చెట్ల కింద సేద దీరాల్సిన దుస్థితి. సంవత్సరాల తరబడి సమస్య ఉన్నా పట్టించుకున్న వారే లేరు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని.. నలుగురు కూర్చుంటే నిండి పోతుందిన్యూస్రీల్చెట్లకింద సేదదీరాల్సిందే.. -
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
జనగామ: ప్రభుత్వ పథకాల అమలుకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం నుంచి ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం, తాగునీటి సరఫరా, ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ, పింఛన్లు, కుక్కకాటు నివారణ తదితర అంశాలపై స్పెషల్ డిప్యూ టీ కలెక్టర్లు, ఆర్డీఓలు, మండల ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, పంచా యతీ కార్యదర్శులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గానికి కేటాయించిన 3,500 ఇంది రమ్మ ఇళ్ల కోసం అర్హులను మాత్రమే ఎంపిక చేయాలన్నారు. మండల, మున్సిపాలిటీ స్థాయిలో ఇందిరమ్మ, వార్డు కమిటీల ద్వారా ఈనెల 18 నుంచి 21 వరకు ఎంపీడీఓలకు వచ్చే జాబితా ప్రకారంగా లబ్ధిదారులను గుర్తించాలని చెప్పారు. 22 నుంచి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వ నిబంధనల మేరకు సర్వేచేసి అర్హులను ఎంపిక చేయాలని సూచించా రు. మే 2న జీపీ కార్యాలయాల్లో అర్హుల జాబితా ప్రదర్శించడంతోపాటు మే 3 నుంచి 5 వరకు లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేశాక అర్హులకు ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం కింద ఎంపీడీఓలు మండల స్థాయిలో బ్యాంకర్లతో సమావేశాలు నిర్వహించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న శాశ్వత వలస పింఛన్లు, మరణించిన పింఛన్‌దారుల పరిశీలన వేగంగా చేపట్టాలని తెలిపారు. తాగునీటి వనరులు లేని గ్రామాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. ఎల్ఆర్ఎస్ పథకం కింద వచ్చిన దరఖాస్తుదారుల భూముల పరిశీలన వేగంగా చేపట్టాలని, అభ్యంతరాలు లేని వాటికి ప్రొసీడింగ్స్ జారీ చేయాలని ఆదేశించారు. వీధి కుక్కల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సమీక్షలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు సుహాసిని, హనుమాన్‌నాయక్, ఆర్డీఓలు గోపిరాం, వెంకన్న, మున్సిపల్ కమిషనర్లు వెంకటేశ్వర్లు, రవీందర్, డీపీఓ స్వరూపరాణి, డిప్యూటీ సీఈఓ సరిత, ఎల్డీఎం శ్రీధర్, ఈడీ ఎస్పీ కార్పొరేషన్ మాధవిలత, గృహ నిర్మాణ శాఖ పీడీ మాతృనాయక్ తదితరులు పాల్గొన్నారు. మహనీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలి.. మహనీయులు డాక్టర్ బీఆర్.అంబేడ్కర్, బాబు జగ్జీవన్‌రామ్, జ్యోతిబాపూలే ఆశయాలను స్ఫూర్తి గా తీసుకుని ముందుకు సాగాలని కలెక్టర్ రిజ్వానా బాషా అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో మహనీయుల ఉత్సవాల కమిటీ ఆధ్వర్యాన పార్నంది వెంకటస్వామి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో కమిటీ గౌరవ అధ్యక్షుడు మేడ శ్రీనివాస్, పలు శాఖల అధికారులు డాక్టర్ విక్రమ్ కుమార్, మాధవిలత, రవీందర్, వెంకటేశ్వర్లు, పులి శేఖర్, డాక్టర్లు సీహెచ్.రాజమౌళి, సుగుణాకర్‌రాజు తదితరులు పాల్గొన్నారు. ‘కుంట’ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి జిల్లా కేంద్రం సూర్యాపేట రోడ్డులోని బతుకమ్మకుంట అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అధికారులను ఆదేశించారు. గురువారం బతుకమ్మ కుంటను సందర్శించిన కలెక్టర్ మాట్లాడుతూ.. బతుకమ్మకుంటను మరింత అభివృద్ధి చేయడానికి రూ.కోటి 50 లక్షలు మంజూరయ్యాయని, సుందరీకరణ నేపథ్యంలో గ్రిల్స్, కాలిబాట, లైటింగ్, వ్యాయామ పరికరాలు, చిన్నారులకు ఆటస్థలం, పరికరాలు, మినీ పార్కు పనులు నెలరోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే కుంట పూడికతీత పనులు త్వరగా పూర్తిచేయాలన్నారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, నీటి పారుదల శాఖ ఈఈ మంగీలాల్, ఏఈ మహిపాల్, పలువురు అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా -
కారు కిరాయి.. ఇంధనం పరాయి
సాక్షిప్రతినిధి, వరంగల్: పరకాలలోని హుజూరాబాద్ రోడ్డున ఉన్న ఓ పెట్రోల్ బంకుకు గత నెల 25న స్కైబ్లూ కలర్ కియా కారులో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చా రు. క్యాన్లలో రూ.7,500 (78.67 లీటర్ల) డీజిల్ పోయించుకున్నారు. డబ్బులు ఇమ్మని అడగ్గా ఫోన్ పే చేస్తామని స్కాన్ చేశారు. డబ్బులు రాలేదని చెప్పగా.. వస్తాయని చెప్పి కారులో ఉడాయించారు. దీంతో పెట్రోల్ బంక్ మేనేజర్ ఈనెల 12న పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాయపర్తిలో హెచ్‌పీ పెట్రోల్ బంకులోకి గత నెల 31న రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో బ్లూ కలర్ బెలోనో కారు వెళ్లింది. అందులోని ముగ్గురు వ్యక్తులు మూడు క్యాన్లలో రూ.10,508 విలువైన 110.22 లీటర్ల డీజిల్ పోయించుకున్నా రు. స్కానర్ ద్వారా పేమెంట్ చేసినట్లు చెప్పారు. డబ్బులు జమ కాలేదని చెప్పినా వినకుండా కారు స్టార్ట్ చేసుకుని వెళ్లారు. దీంతో ఆ బంకు క్యాషియర్ ఈ నెల 15న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ... ఇలా సుమారు 25 రోజుల్లో సుమారు 25 బంకుల్లో డీజిల్, పెట్రోల్ దొంగిలించిన ఆకతా యి ల వ్యవహారం వరంగల్ కమిషనరేట్ పోలీసులకు సవాల్‌గా మారింది. గత కొద్ది రోజులుగా ఆకతాయిలు కొందరు సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలను అద్దెకు తీసుకుని కారుతోపాటు క్యాన్లలో ఇంధనం తీసుకెళ్లి అమ్ముకుంటూ.. ఆ డబ్బుతో జల్సా చేయ డం పరిపాటిగా మారింది. అత్యధికంగా పరకాల, దామెర, నడికూడ, రాయపర్తి, జఫర్‌గఢ్, రేగొండ, నల్లబెల్లి మండలాల్లోని బంకుల్లో ఈ తరహా దందా లకు పాల్పడినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసిన పరకాల, రాయపర్తి పోలీసులు నిందితుల కోసం ఆరా తీయగా.. ఇంధనం దొంగ ల గుట్టురట్టయ్యింది. కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. సుమారు 12 మంది వరకు పనీపాట లేని యువకులు మూడు టీములుగా ఏర్పడి ‘సెల్ఫ్ డ్రైవింగ్’ వాహనాలకు అద్దెకు తీసుకుని ఆ వాహనాల నంబర్ ప్లేట్లు తీసి పెట్రోల్ బంకుల్లో వెళ్లి ఇంధనం దొంగిలిస్తూ జల్సాలు చేస్తుండగా పోలీసులు వారి ఆట కట్టించినట్లు సమాచారం. మూడు టీములకు చెంది న సభ్యులను అరెస్టు చేసేందుకు సిద్ధమైన పోలీసులు అదుపులో ఉన్నవారినుంచి పూర్తి వివరాలు రాబడుతున్నట్లు సమాచారం. కాగా నేడో, రేపో నిందితులను అరెస్టు చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. స్కాన్ చేసినట్లు యాక్షన్.. ఇంధనం క్యాన్లతో పరార్ పెట్రోల్ బంకులకు బురిడీ కొట్టించి జల్సా మూడు బృందాలుగా ఆగడాలు.. పోలీసుల అదుపులో ఆకతాయిలు -
విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి
● ఎన్పీడీసీఎల్ డీఈ రాంబాబు స్టేషన్‌ఘన్‌పూర్: విధుల నిర్వహణలో విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎన్పీడీసీఎల్ స్టేషన్‌ఘన్‌పూర్ డీఈ వై.రాంబాబు అన్నారు. స్థానిక సబ్‌స్టేషన్‌లో విద్యుత్ సిబ్బంది చేపట్టిన పనులను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యుత్ లైన్లో పనిచేస్తున్న సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని, లైన్ క్లియర్ తీసుకున్నప్పటికీ ఎర్త్ కట్టెలు వాడాలని చెప్పారు. ప్రస్తుత సీజన్లో విద్యుత్ లైన్లు తెగి ఇతర లైన్లపై పడి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయని, అప్రమత్తతే విద్యుత్ సిబ్బందికి శ్రీరామరక్ష అన్నారు. ప్రజలకు మెరుగైన సేవలందించాలి●● డీపీఓ స్వరూపరాణి తరిగొప్పుల: ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా పంచాయతీ అధికారి నాగపురి స్వరూపరాణి అన్నారు. అంకుషాపూర్ గ్రామపంచాయతీని ఆమె బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డుల నిర్వహణ, పన్నుల వసూలు, ఎస్టీఓలో నిధుల జమ తదితరాల విషయాలపై పంచాయతీ కార్యదర్శి అమనగంటి మహేందర్‌కు సూచనలు చేశారు. అనంతరం అంగన్వాడీ సెంటర్లో కొనసాగుతున్న పోషణ పక్షం కార్యక్రమంలో పాల్గొని మాతా శిశు సంరక్షణపై అవగాహన కల్పించారు. బలవర్థకమైన ఆహారం తీసుకునేలా జాగ్రత్తలు పాటించాలని, పచ్చదనం, పరిశుభ్రతపై ప్రత్యేక చొరవ చూపించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీఓ మాలతి, అంగన్వాడీ టీచర్ రాధ పాల్గొన్నారు. తాగునీటి ఎద్దడి రానివ్వద్దు నర్మెట: తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి నాగపురి స్వరూపారాణి అన్నారు. నర్మెట జీపీని సందర్శించిన ఆమె రికార్డులను పరిశీలించి కార్యదర్శి కందకట్ల శ్రీధర్‌కు పలు సూచనలు చేశారు. పన్నులు వంద శాతం వసూలు చేయడంతో పాటు పారిశద్ధ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, తాగునీటి ట్యాంకులను క్లోరినేషన్ చేయించాలని సూచించారు. అనంతరం చౌరస్తాలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఆమె వెంట ఎంపీడీఓ బోడపాటి అరవింద్ చౌదరి, తరిగొప్పుల ఎంపీఓ ఎం.మాలతి, కార్యదర్శులు వంశి, యాకూబ్, గణేష్, అనిల్, శ్రీకాంత్, లింగం తదితరులు పాల్గొన్నారు. -
గురువారం శ్రీ 17 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
జనగామ: భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. అప్పుడే ఎండలు మే నెలను తలపిస్తున్నాయి. ఉదయం 8 గంటలు దాటిందంటే ఒంట్లో నుంచి చెమటలు ఉబికి వస్తున్నాయి. రోజువారీ కూలీ పనులకు వెళ్లే కార్మికులు, చిరు వ్యాపారులు తల్లడిల్లి పోతున్నారు. ఇక ఇళ్లలో ఉండే ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వృద్ధులు, చిన్న పిల్లలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఎండల తీవ్రత పెరగడంతో ప్రజలు ఉక్కపోత, వేడి గాలుల కారణంగా డీ హైడ్రేషన్‌కు గురవుతున్నారు. ఇళ్లలో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు వినియోగిస్తున్నా వేడి గాలి తప్ప ఉపశమనం లభించడంలేదు. ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా పెరుగుతుండడంతో పరిస్థితులు ఇప్పుడే ఇలా ఉంటే మున్ముందు ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో బుధవారం ఉదయం 11.30 గంటలకు 32 డిగ్రీల సెల్సీఎస్ టెంపరేచర్ నమోదు కాగా.. మధ్యాహ్నం 3 గంటల వరకు 40 డిగ్రీలు దాటి పోయింది. అధిక వేడితో జనం అల్లాడి పోయారు. జిల్లాలో ఒక శాతం మాత్రమే అటవీ సంపద ఉండ డం.. ఉన్న పచ్చదనం కాస్త కనుమరుగైపోతున్న నేపథ్యంలో ప్రజలు నీడపట్టున ఉపశ మనం పొందలేని పరిస్థితి నెలకొంది. రోడ్ల విస్తరణ పేరుతో దశాబ్దాల నాటి మహావృక్షాలను తొలగించడం.. కొత్తగా నాటిన మొక్కల సంరక్షణ బాధ్యతను గాలికి వదిలేయడంతో వాతావరణ అసమతుల్యత కు కారణమవుతోంది. వాతావరణంలో విచిత్ర పరిస్థితులు నెలకొంటున్నాయి. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంట ల వరకు ఎండలు నిప్పుల కొలిమిని తలపిస్తున్న తరుణంలో ఈదురు గాలులతో కూడిన వర్షాలు, వడగళ్లు కురిసి ఒక్కసారి గా వాతావరణం చల్లబ డుతోంది. రాత్రి తేమగా ఉంటూ.. తెల్లారే సరికి అగ్నిగుండంలా మారిపోతోంది. గంటల వ్యవధిలోనే వాతావరణంలో మార్పుల చోటుచేసు కోవడం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి యువకులు, విద్యార్థులు బావులు, ఈత కొలనుల్లో సేద దీరుతున్నారు. కొందరు శీతల పానీయాలు, కొబ్బరి బొండాలతో కాస్త చల్లబడుతున్నారు. ● పొద్దంతా ఎండవేడితో మంట ● సాయంకాలం ఈదురు గాలులు ● ప్రజలకు చెమటలు.. అన్నదాతలకు ముచ్చెమటలు ● విచిత్ర వాతావరణంతో పెరుగుతున్న అనారోగ్య బాధితులుపొద్దంతా ఎండ మంట.. -
ఉపాధి హామీ పనుల పరిశీలన
జనగామ రూరల్: శామీర్‌పేట గ్రామంలో ఉపాధి హామీ పనులను జిల్లా అదనపు గ్రామీణ అభివృద్ధి అధికారి చంద్రశేఖర్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఉపాధి హామీ కూలీల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే కూలి రూ.307 వచ్చే విధంగా కొలతల ప్రకారం పనిచేయాలని, ఇందుకు సంబంధిత అధికారులు, ఎఫ్‌ఏలు కృషి చేయాలని చెప్పా రు. కార్యక్రమంలో ఎంపీడీఓ సంపత్ కుమార్, ఈసీ మాధవరెడ్డి, టీఏ అనిల్‌గౌడ్, ఫీల్డ్ అసిస్టెంట్ రాములు పాల్గొన్నారు. దేవాలయ భూమికి హద్దులుచిల్పూరు: శ్రీ బుగులు వేంకటేశ్వరస్వామి దేవాలయానికి సంబంధించిన భూమిని ఇటీవ ల రెండుమార్లు సర్వే చేసిన అనంతరం బుధవారం దేవాదాయ శాఖ ఏడీ మన్నెంకొండ ఆధ్వర్యాన సిబ్బంది హద్దులు నాటారు. ఆలయానికి 229 ఎకరాల భూమి ఉండగా అందులో కొంత అన్యాక్రాంతమైనట్లు తెలియగా సర్వే నిర్వహించి హద్దులు ఏర్పాటు చేసినట్లు ఏడీ చెప్పారు. తహసీల్దార్ సరస్వతి, ఈఓ లక్ష్మీప్రసన్న, చైర్మన్ శ్రీధర్‌రావు, ధర్మకర్తలు గనగోని రమేష్, కొలిపాక రాజు, వెంకటేశ్వర్లు, మోతె మహేష్, భూక్య శ్రీను పాల్గొన్నారు. కోళ్ల గూడులో బాలికదేవరుప్పుల: కామారెడ్డికి చెందిన మహమ్మద్ యూసఫ్ పాషా కూతురు మెహరిన్(నాలుగేళ్ల వయసు) ఇంటి వద్ద బుధవారం తప్పిపోయింది. బాధిత కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా స్పందించిన ఎస్సై సృజన్‌కుమార్ సిబ్బందిని పంపించారు. చుట్టుపక్కల వెతుకుతుండగా పరిసరాల్లోని మరో ఇంటిలో ని కోళ్ల గూడులో మెహరిన్ కనిపించింది. వెంట నే బాలికను ఇంటి వద్దకు తీసుకెళ్లి తల్లిదండ్రులకు అప్పగించారు. బాలిక ఆచూకీ సత్వరమే కనుగొన్న హెడ్ కానిస్టేబుల్ సదయ్య, కానిస్టేబుళ్లు యాకూబ్, అశోక్, యాకేష్, గౌస్ పాషాను స్థానికులు అభినందించారు. నియామక ఇంటర్వ్యూలు కేయూ క్యాంపస్: కేయూ పరిధి దూరవిద్యాకేంద్రంలో డిప్లొమా ఇన్ యోగా కోర్సు బోధనకు బుధవారం కౌన్సెలర్ల నియామకానికి ఇంట ర్వ్యూలు నిర్వహించారు. దూర విద్య డైరెక్టర్ బి.సురేష్‌లాల్, విద్యావిభాగం డీన్ ఎన్.రాంనాఽథ్కిషన్, బీఓఎస్, వరంగల్ నిట్ ఫిజికల్ డైరెక్టర్ రవికుమార్ పాల్గొన్నారు. 9 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. -
వైద్య సేవలను వినియోగించుకోవాలి
● జిల్లా వ్యవసాయ అధికారి రామారావునాయక్బచ్చన్నపేట : గ్రామీణ ప్రాంత ఆస్పత్రుల్లో ఉచితంగా అందించే వైద్య సేవలను ప్రజలు వినియోగించుకోవా లని జిల్లా వ్యవసాయ అధికారి రామారావునాయక్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని జీపీ కార్యాలయంలో మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఆధ్వర్యాన నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరంలో ఆయన మాట్లాడారు. ఉచిత వైద్య శిబిరాలు పేదలకు వరం లాంటివని, వృద్ధులు, చేతకాని వారు కూడా దూర ప్రాంతాల్లో ఉన్న ఆస్పత్రులకు వెళ్లకుండా అందుబాటులో ఉన్న శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటమల్లికార్జున్, పంచాయతీ కార్యదర్శి నర్సింహచారి, నాయకులు నల్లగోని బాలకిషన్‌గౌడ్, గుర్రపు బాల్‌రాజు, అల్వాల రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి చేతల్లో చూపిస్తాం..
పాలకుర్తిటౌన్: పాలకుర్తి అభివృద్ధిని మాటల్లో కాదు.. చేతల్లో చూపిస్తాం.. ఏం అభివృద్ధి జరుగుతున్నదో దయాకర్‌రావుకు చెప్పాల్సిన అవసరం తమకు లేదని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, నియోజకవర్గ నాయకులతో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు. చిన్న వయసులో ఎమ్మెల్యేగా తనకు అవకాశం దక్కిందని జీర్ణించుకోలేని నాయకులు బురద జల్లుతున్నారని అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి ఇప్పటి వరకు రూ.450 కోట్ల నిధులు తీసుకువచ్చినట్లు చెప్పిన ఆమె.. తొర్రూరు, పాలకుర్తి ఆస్పత్రులను అప్‌గ్రేడ్ చేశామని, త్వరలోనే అందుబాటులోకి వస్తాయన్నారు. పాలకుర్తి, చెన్నూరు రిజర్వాయర్లను తన హయాంలో పూర్తి చేస్తానని చెప్పారు. ఝాన్సీరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు ఆడబిడ్డలు అండగా ఉండటం కొందరికి రుచించడం లేదని, మమ్మల్ని, కాంగ్రెస్‌ను తక్కువ అంచనా వేయవద్దని సూచించారు. దయాకర్రావులాగా పాలకుర్తిలో దోచుకుని అమెరికాలో దాచుకోవడానికి ఇక్కడికి రాలేదని స్పష్టం చేశారు. సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, జాటోతు హమ్యానాయక్, సీనియర్ నాయకులు ముత్తినేని సోమేశ్వరరావు, నెమరుగొమ్ముల ప్రవీణ్‌రావు, గిరగాని కుమారస్వామి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ లావుడ్య మంజుల, చాపల బాపురెడ్డి, రాజేష్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి -
నేటి నుంచి ఉప్పల మల్లన్న జాతర
దేవరుప్పుల: నేటి నుంచి 19వ తేదీ వరకు మండల కేంద్రంలో ఉప్పల మల్లన్న జాతర జరగనుందని ఆలయ పూజారి పెద్దాపురం వెంకటేశ్వరశర్మ మంగళవారం తెలిపారు. ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు జరిగే జాతరలో రోజువారీగా అభిషేకాలు, పద్మశాలీలచే శావ ఊరేగింపు, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకము, శివపార్వతుల కల్యాణం, బండ్లు తిరుగుట, వాసవీ మాత ఆలయంలో అర్చనలు, దోపోత్సవము, అగ్నిగుండాలు, ఏకాంతసేవలు, వసంతోత్సవం, రుత్విక్ సన్మానంతో ముగయనుందన్నారు. పూర్వం మండల కేంద్రానికి ఓ ఉప్పు వ్యాపారి బస్తాలను వాగులో నుంచి ఎడ్లబండిపై తీసుకువస్తుండగా మార్గమధ్యలో ఆ బండి దిగబడింది. దీంతో బస్తాలు కిందికి దింపే క్రమంలో శివలింగం (దేవర) ఉప్పులో దొరికింది. దీంతో ఆ గ్రామానికి వేదబ్రహ్మణులు దేవరుప్పుల (దేవర +ఉప్పుల)గా నామకరణం చేసి ఊరుకు పడమర శివాలయాన్ని స్థాపించారని ఇక్కడి పూర్వికులు చెబుతుంటారు. ఆనాటి నుంచి ఏటా శ్రీ భ్రమరాంభ మల్లికార్జునస్వామి కల్యాణోత్సవాలను మూడు రోజులపాటు నిర్వహిస్తారు. ఈ సారి ప్రతిష్టాత్మతకంగా జరిగే జాతరలో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వార్షిక కల్యాణ సహిత నూతన పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ, గణపతి, నంది విగ్రహాల పునఃప్రతిష్ఠాపనకు సిద్ధం చేస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు. -
‘భూ భారతి’పై అవగాహన సదస్సులు నిర్వహించాలి
జనగామ రూరల్: భూ భారతి చట్టంపై అవగాహన సదస్సులను నిర్వహించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్‌తో కలిసి తహసీల్దార్లు, ఎంఏఓలు, ఏఈఓలు, డిప్యూటీ తహసీల్దార్లు, డీపీఎంలు, ఏపీఎంలతో భూ భారతి – కొత్త ఆర్ఓఆర్ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజల భూ సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా భూ భారతి నూతన ఆర్ఓఆర్ చట్టాన్ని ప్రారంభించిందన్నారు. ఈ చట్టం కింద హక్కుల రికార్డును రూపొందించడం, భూమిపై హక్కులు సంక్రమించినప్పుడు ఆ రికార్డులో మార్పులు చేయడం ప్రధాన ఉద్దేశ్యమన్నారు. రికార్డులో తప్పుల సవరణకు అవకాశం, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేసేందుకు ముందుగా భూముల సర్వే, మ్యాప్ తయారీ, గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ, భూ సమస్యల పరిష్కారానికి రెండంచెల అప్పీల్ వ్యవస్థ, మొదలగునవి భూ భారతిలో కీలక అంశాలన్నారు. అలాగే జిల్లాలో ఇప్పటివరకు 162 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు. నిర్వాహకులు ప్రతీరోజు కేంద్రాలను పర్యవేక్షించాలన్నారు. వర్షాలతో ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు సుహాసిని, హనుమాన్ నా యక్, ఆర్డీఓలు గోపీరాం, వెంకన్న, డీఏఓ రా మారావు నాయక్, డీసీఎస్ఓ సరస్వతి, డీఆర్డీఏ వసంత, డీఎం సీఎస్ హతీరాం, డీసీఓ రాజేందర్ రెడ్డి, ఏసీఎస్ఓ ఇర్ఫాన్ అహ్మద్ ఖాన్ పాల్గొన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా -
ధాన్యం కొనుగోళ్లు సమర్థవంతంగా నిర్వహించాలి
జనగామ రూరల్: ధాన్యం కొనుగోళ్లు సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రతీరోజు కేంద్రాలను పర్యవేక్షించాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ రోహిత్ సింగ్ ఆదేశించారు. మంగళవారం జనగామ మండలం పెంబర్తి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ఓపీఎంఎస్లో వివరాలను నమోదు చేయాలన్నారు. అకాల వర్షాలతో ధాన్యం తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. పౌరసరఫరాల శాఖ అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి, పరిశీలించాలన్నారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల అధికారి సరస్వతి, సహకార శాఖ అధికారి రాజేందర్ రెడ్డి, డీఎం మేనేజర్ హథిరాం తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ -
క్రీడాప్రాంగణాల్లో పిచ్చిమొక్కలు
జనగామ రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు గత ప్రభుత్వం పట్టణాలతోపాటు ప్రతీ పంచాయతీ పరిధిలో క్రీడాప్రాంగణాలు ఏర్పాటు చేసింది. ప్రభుత్వ భూములు ఉన్న చోట మైదానాలు సిద్ధం వేశారు. కానీ నిర్వహణ లేకపోవడంతో పిచ్చిమొక్కలతో నిండిపోయాయి. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన క్రీడామైదానాలను పట్టించుకునే వారే కరువయ్యారు. జిల్లా వ్యాప్తంగా 281 గ్రామ పంచాయతీలు, 201 ఆమ్లెట్ విలేజ్‌లు ఉండగా మొత్తం 483 గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు గుర్తించి 450 వరకు నిర్మాణాలు పూర్తి చేశారు. ఏడాదిన్నర నుంచి గ్రామాల్లో సర్పంచ్‌లు లేకపోవడంతో పంచాయతీ కార్యదర్యులు ప్రత్యేక అధికారులు పట్టించుకోక ఆదరణ కరువైందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నిధుల దుర్వినియోగం క్రీడాప్రాంగణాల ఏర్పాటుకు గత ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చుచేసింది. ప్రతీ పంచాయతీలో సుమారు రూ. 50వేల నుంచి రూ. 2 లక్షల వరకు ఖర్చు చేసింది. పట్టణాల్లో కొంత అదనంగా నిధులు వెచ్చించింది. జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామ పంచాయతీల్లో అనువుగా ఉన్న చోట క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసింది. ఒక్కొక్క క్రీడా ప్రాంగణానికి రూ.2 లక్షల వరకు వెచ్చించినా.. క్రీడా సామగ్రి అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు అటువైపు చూడటం లేదు. ప్రస్తుతం వేసవి సెలవుల దృష్ట్యా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రాంగణాలు బాగు చేయాలని కోరుతున్నారు. నిబంధనలు ఇలా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద క్రీడా ప్రాంగణాల ఏర్పాటు చేపట్టారు. ఆయా గ్రామాల్లో క్రీడా స్థలానికి ఎకరం విస్తీర్ణంలో నిర్మాణం చేపట్టి ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ కోర్టులు, లాంగ్ జంప్, హై జంప్ పీట్లు ఏర్పాటు చేయాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. ఎంపిక చేసిన స్థలం చుట్టూ ఫెన్షింగ్ మాదిరిగా గానుగ, గుల్మోహార్, నిమ్మ, చింత, వేదురు, తంగేడు చెట్లు నాటాలని సూచించారు. గ్రామాలకు దూరంగా.. ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రతీ గ్రామ పంచాయతీలో ఎకరం స్థలంలో అన్ని రకాల వసతులతో ప్రాంగణం ఏర్పాటు చేయాల్సి ఉండగా కొన్ని గ్రామాల్లో స్థలం లభించకపోవడంతో అందుబాటులో ఉన్న స్థలంలో నిర్మించారు. కొన్ని గ్రామాల్లో ఊరికి దూరంగా ఉండడంతో వాటిని చూసే నాఽథుడు కరువయ్యారు. లక్షలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన ప్రాంగణాలు పనికి రాకుండా పోతున్నాయి. ప్రాంగణాలు ఎలా ఉన్నాయో జిల్లా అధికారులు పర్యవేక్షించిన దాఖలాలు లేవు. ఇప్పటికై న ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి క్రీడాప్రాంగణాలను వినియోగంలోకి తీసుకురావాలని క్రీడాకారులు కోరుతున్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు.. గ్రామీన క్రీడాకారులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. క్రీడలపై ఆసక్తి ఉన్నప్పటికీ క్రీడాస్థలాలు లేక ఇబ్బంది పడుతున్నారు. పట్టణాలు, గ్రామాల్లో ఉన్న క్రీడా ప్రాంగణాలు అలంకార ప్రాయంగా మారాయి. వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి. – ఎడ్ల శ్రీనివాస్, మరిగడి గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలి..గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేలా ప్రభుత్వం కృషి చేయాలి. గతంలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు వినియోగంలోకి తీసుకురావాలి. యువతను ప్రోత్సహించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేలా కృషి చేయాలి. – సురేందర్, కబడ్డీ జాతీయ క్రీడాకారుడు రూపురేఖలు కోల్పోతున్న ఆటస్థలాలు జిల్లా వ్యాప్తంగా 483 గ్రామాల్లో ఇదే పరిస్థితి పట్టించుకోని సంబంధిత అధికారులు -
అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన
పాలకుర్తి టౌన్: జాతీయ అగ్నిమాపక భద్రతా వారోత్సవాల సందర్భంగా మంగళవారం మండల కేంద్రంలోని క్లాత్‌స్టోర్స్, షాపింగ్ కాంప్లెక్స్‌లో ఫస్ట్ ఎయిడ్ ఫైర్ ఫైటింగ్ సిస్టంపై పాలకుర్తి అగ్నిమాపక కేంద్ర అఽధికారి సీహెచ్ శ్రీరాములు ఆధ్వర్యంలో షాపింగ్ కాంఫ్లెక్స్ సిబ్బందికి అగ్ని ప్రమాద నివారణ భఽద్రత చర్యలు వివరించారు. అగ్ని ప్రమాదాలు నివారణపై అవగాహన కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక కేంద్రం సిబ్బంది రామయ్య, నాగరాజు, అశోక్, ప్రశాంత్, ప్రదీప్‌కుమార్, మహేందర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
వచ్చేస్తున్నాయ్..
జనగామ రూరల్: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో పనులు చేపడుతుంది. ఇప్పటి వరకు 80 శాతం పనులు పూర్తయ్యాయి. అయితే ప్రభుత్వ బడుల్లో చదువుకునే విద్యార్థులకు గతేడాది పాఠ్యపుస్తకాల ముద్రణ ఆలస్యంగా ప్రారంభం అయింది. దీంతో సకాలంలో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. గత అనుభవాలు దృష్టిలో ఉంచుకోని వచ్చే విద్యా సంవత్సరం పాఠశాలల పునఃప్రారంభం రోజే విద్యార్థులకు సమస్యలు రాకుండా పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫామ్స్ అందించడానికి తగు చర్యలు తీసుకుంటుంది. ఇందుకు అవసరమైన పుస్తకాలు జిల్లాకు విడతల వారీగా అందిస్తున్నారు. జిల్లాలో 2,78,310 పుస్తకాలు అవసరం జిల్లాకు అవసరమైన పాఠ్యపుస్తకాలు ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నాయి. 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులందరికీ ఉచితంగా పుస్తకాలు అందజేయనున్నారు. మొత్తం 2,78,310 లక్షల పుస్తకాలు అవసరం ఉండగా ప్రస్తుతం మొదటి విడతగా 15,680 పుస్తకాలు జిల్లాకు చేరుకున్నాయి. 1 నుంచి 3వ తరగతి పుస్తకాలు కొంత తక్కువగా వచ్చాయి. 4 నుంచి 10వ తరగతి పుస్తకాలు వస్తున్నాయి. వీటి ని భద్ర పరిచేందుకు జిల్లా కేంద్రంలోని గోదాములు ఏర్పాటు చేసి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇండెంట్ పూర్తి కాగానే వాటిని ఆయా మండలాలకు పంపిణీ చేయనున్నారు. అక్కడ నుంచి పాఠశాలలకు సరఫరాల చేసి జూన్‌లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయనున్నారు. క్యూఆర్ కోడ్‌తో ముద్రణ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధన కొనసాగుతుంది. విద్యార్థుఽలకు అన్ని విషయాలు అర్థం అయ్యే విధంగా ఇబ్బందులు పడకుండా ఉండాలని పాఠ్యపుస్తకాల్లో ఇంగ్లిష్, తెలుగు భాషల్లోనూ పుస్తకాలను ముద్రిస్తున్నారు. అలాగే పుస్తకాలపై క్యూఆర్ కోడ్‌తో ముద్రిస్తున్నారు. దీంతో పుస్తకాలు పక్కదారి పట్టకుండా ఉండే అవకాశం ఉంది. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా జిల్లా, మండలం, పాఠశాల పేరుతో ఆన్లైన్లో రానుంది. దీంతో ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు పక్కదారి పట్టే అవకాశం ఉండదు. పునఃప్రారంభం రోజే పంపిణీ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వి ద్యార్థులందరికీ జూన్‌లో పాఠశాలలు పునఃప్రారంభం రోజే పా ఠ్యపుస్తకాలు పంపిణీకి చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే జిల్లాకు 16 వేలకు వరకు పుస్తకాలు వచ్చాయి. వాటిని గోదాముల్లో భద్రపరిచాం. మిగతావి వచ్చిన తర్వాత అన్ని మండలాలకు అందజేస్తాం. అలాగే విద్యార్థులకు నోట్ పుస్తకాలు, ఏకరూప దుస్తులు అందిస్తాం. సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం. – రమేశ్, డీఈఓజిల్లాకు చేరుకున్న పాఠ్యపుస్తకాల వివరాలు పాఠశాలల పునఃప్రారంభం రోజే అందించేలా సన్నద్ధం జిల్లాకు 2,78,310 లక్షల పాఠ్యపుస్తకాలు అవసరం మొదటి విడత చేరుకున్నవి 15,6801వ తరగతి తెలుగు: 1,617 6వ తరగతి ఎస్ఎస్ తెలుగు మీడియం: 2,400 9వ తరగతి ఫిజికల్ సైన్స్: 937 4వ తరగతి ఎన్విరాన్మెంట్ సైన్స్: 50 8వ తరగతి ఇంగ్లిష్: 4,750 9వ తరగతి తెలుగు: 4,800 8వ తరగతి బయోసైన్స్ (తెలుగుమీడియం): 1,112జిల్లాలో పాఠశాలల వివరాలు జిల్లాలో 12 మండలాల్లో ప్రభుత్వ స్థానిక సంస్థల పాఠశాలలు 504 ఉన్నాయి. ఇందులో 341 ప్రాథమిక పాఠశాలలు, 64 ప్రాథమికోన్నత పాఠశాలలు, 103 ఉన్నత పాఠశాలలు ఉండగా మొత్తం 35 వేలకుపైగా విద్యార్థులు ఉన్నారు. -
వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి
జనగామ రూరల్: హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరు రాములు అన్నారు. మంగళవారం యూనియన్ జిల్లా విస్తృత స్థాయి సమావేశం రాపర్తి రాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హమాలీ కార్మికులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి సామాజిక భద్రత, సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు. కార్మిక వ్యతిరేక చట్టాల రద్దుకు మే 20వ తేదీన జాతీయ సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయని, హమాలీ కార్మికుల పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి యాటల సోమన్న, సుంచు విజేందర్, అన్నేబోయిన రాజు, తాండ్ర ఆనందం, సుంకు రాజు, గజ్వేల్ రమేశ్, బి.భాస్కర్, పోతం మధు, మంగ నరసింహ, రాజు తదితరులు పాల్గొన్నారు. ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాములు -
జీడికల్ హుండీ ఆదాయం రూ.1.42లక్షలు
లింగాలఘణపురం: మండలంలోని జీడికల్ వీరాచల రామచంద్రస్వామి హుండీ ఆదాయం రూ.1,42,859లు వచ్చినట్లు ఈఓ వంశీ తెలిపారు. మంగళవారం దేవాదాయ ఇన్స్పెక్టర్ వెంకటలక్ష్మి పర్యవేక్షణలో హుండీ లెక్కించారు. దేవస్థాన చైర్మన్ మూర్తి, డైరెక్టర్లు వెంకన్న, శ్రీశైలం, శ్రీధర్‌రెడ్డి, జనగామ ఉప్పలమ్మ గుడి ఈఓ రాములు, సిబ్బంది భరత్, మల్లేశం, శంకర్ తదితరులు ఉన్నారు. రైతులకు నష్టపరిహారం చెల్లించాలి జనగామ రూరల్: వడగండ్లతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అన్నారు. మంగళవారం సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ రిజ్వాన్ బాషాకు వినతి పత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లాలో యాసంగిలో రైతులు పెట్టుబడులు పెట్టి పంటలు వేయగా భూగర్భ జలాలు తగ్గి జిల్లాలో 40శాతం పంటలు ఎండిపోగా మిగతా పంట రైతుల చేతికి వచ్చే సమయంలో అకాల వర్షంతో రైతులకు తీవ్రంగా నష్టపరిచిందన్నారు. నష్టపోయిన రైతుకు ఎకరానికి రూ. 50 వేల నష్టపరిహారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి చందు, గంగాపురం మహేందర్, తోటి దేవదానం, గురజాల లక్ష్మీనరసింహారెడ్డి, కల్యాణం లింగం, పల్లెర్ల లలిత, మబ్బు ఉప్పలయ్య పాల్గొన్నారు జిల్లా జడ్జిగా ప్రతిమ జనగామ రూరల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు జిల్లాల ప్రధాన న్యాయమూర్తులను బదిలీ చేశారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్టార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్లో అడిషనల్ జిల్లా సెషన్స్ జడ్జిగా విధులు ని ర్వహిస్తున్న బి.ప్రతిమ జిల్లా జడ్జిగా రానున్నా రు.ఈనెల 23న బాధ్యతలు స్వీకరించనున్నారు. ఖైదీల హక్కులపై అవగాహన జనగామ రూరల్: ఖైదీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులపై అవగాహన ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి సి.విక్రమ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సబ్ జైలును సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం అందరికీ సమాన హక్కుల కల్పించిందని, వాటిని ఉపయోగించు కోవాలన్నారు. తెలిసి చేసినా.. తెలియక చేసిన తప్పు..తప్పేనని, వ్యక్తిగత నియంత్రణ తప్పనిసరిగా ఉండాలన్నారు. ఖైదీలకు న్యాయవాది ఉన్నాడా లేడా అని అడిగి తెలుసుకున్నారు. బెయిలు వచ్చి షూరిటీ పెట్టుకోలేనివారు, దీర్ఘకాలికంగా వ్యాధులతో బాధపడుతున్న వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ కృష్ణకాంత్ తదితరులు పాల్గొన్నారు. ‘ఉపాధి’ పనుల పరిశీలన స్టేషన్‌ఘన్‌పూర్: మండలంలోని అక్కపెల్లిగూడెంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టిన పనులను సెస్ (సెంట్రల్ ఎకనామిక్ స్టాటిస్టికల్ స్టడీస్) రాష్ట్ర డైరెక్టర్ ప్రొఫెసర్ రేవతి మంగళవారం పరిశీలించారు. గ్రా మ పంచాయతీ కార్యదర్శి అవినాష్‌తో కలిసి సా గుకు యోగ్యంకాని పదిహేను ఎకరాల భూమిని ఉపాధి పనులతో సాగులోకి తీసుకువచ్చిన పనులను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఈజీఎస్ పనులను వినియోగించుకుంటున్నారని, సాగులో లేని భూమిని సాగులోకి తీసుకురావడం, వ్యవసాయ భూముల వద్దకు రోడ్లు వేయడం, పొలంగట్లపై కొబ్బరి, టేకు, నిమ్మ చెట్లు పెంచడం బాగుందన్నారు. -
నేటినుంచి సామాజిక, ఆర్థిక సర్వే
జనగామ: జనగామ పురపాలిక డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్‌కు అనుబంధంగా అమృత్–2.0 పథకంలో భాగంగా నేటి(బుధవారం)నుంచి పట్టణంలో సామాజిక, ఆర్థిక సర్వే నిర్వహించనున్నారు. పట్టణంలోని 30 వార్డుల పరిధిలో సుమారు 16,400 వ్యాపార, వాణిజ్య సంస్థలు (నిర్మాణాలు) ఉన్నాయి. ఇందులో 10 శాతం అసెట్స్ పరిధిలో కుటుంబాల సర్వే చేపట్టే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పురపాలిక సిబ్బంది ఆధ్వర్యంలో ప్రతీ వార్డులో 10 శాతం కుటుంబాలను సెలెక్టు చేసుకుని ఇంటింటి సర్వే చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. టౌన్ ప్లానింగ్ నిబంధనలను అనుసరిస్తూ, మాస్టర్ ప్లాన్‌లోని జనరల్ టౌన్ ప్లానింగ్ స్కీం తయారీలో భాగంగా భూ వినియోగ విభజన, రహదారులు, మురికి కాల్వలు, పారిశుద్ధ్య, తాగునీటి సరఫరా, పచ్చదనంకు సంబంధించి కార్యాచరణ రూపొదించాలని అందులో పేర్కొన్నారు. సర్వేలో పట్టణ పేరు, వార్డు నంబర్, ఇంటి యజమాని పేరు, వయసు, ఏరియా పేరు, ల్యాండ్ మార్కు, విద్యార్హతలు, వృత్తి, తదితర వివరాలు నమోదు చేసుకుంటారు. నేటి నుంచి సర్వే ప్రారంభమవుతుందని, పట్టణ ప్రజలు సహకరించాలని కమిషనర్ వెంకటేశ్వర్లు తెలిపారు. -
సీఎం సమావేశంలో కలెక్టర్ రిజ్వాన్‌బాషా
జనగామ: హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో సోమవారం కలెక్టర్లతో సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా పాల్గొన్నారు. ఈ సమావేశంలో భూ భారతి, ఇందిరమ్మ ఇళ్లు, వేసవిలో తాగునీటి ప్రణాళికలపై సీఎ రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. రాజ్యాంగ పరిరక్షణకు పాటుపడాలి స్టేషన్‌ఘన్‌పూర్: బీజేపీ పాలనలో భారత రాజ్యాంగంపై దాడి జరుగుతుందని, రాజ్యాంగాన్ని మార్చే కుట్రలు చేస్తున్నారని, రాజ్యాంగ పరిరక్షణకు ప్రతిఒక్కరూ పాటుపడాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఘన్పూర్ డివిజన్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం అంబేడ్కర్ జయంతి, ‘జై బాపు, జైభీమ్, జైసంవిధాన్’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కార్యక్రమ జిల్లా కోఆర్డినేటర్ లకావత్ ధన్వంతి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. స్థానిక కొత్త గాంధీ చౌరస్తా నుంచి స్టేషన్‌ఘన్‌పూర్ బస్టాండ్ వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళుళులర్పించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం నిరంకుశ పాలన సాగిస్తూ అరాచకాలు చేస్తుందని, దళితులు, క్రిస్టియన్లు, ముస్లింలు, మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయన్నారు. మాజీ జెడ్పీచైర్‌పర్సన్ లకావత్ ధన్వంతి, ఏఎంసీ చైర్పర్సన్ జూలుకుంట్ల లావణ్యశిరీష్‌రెడ్డి, నాయకులు బెలిదె వెంకన్న, సీహెచ్.నరేందర్‌రెడ్డి, శిరీష్‌రెడ్డి, జగదీష్ చందర్‌రెడ్డి, పొట్లపల్లి శ్రీధర్‌రావు, సింగపురం వెంకటయ్య, బూర్ల శంకర్, పోశాల కృష్ణమూర్తి, వెంకటేశ్వర్లు కార్యకర్తలు పాల్గొన్నారు.ప్రభుత్వ ఉపాధ్యాయడి వినూత్న ప్రచారం పాలకుర్తి టౌన్: మాదకద్రవ్యాలతో కలిగే అనర్థాలపై సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గోరెంట్ల జెడ్పీఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త రాచకొండ ప్రభాకర్ వినూత్న ప్రచారం చేస్తూ ప్రజలను ఆలోచింపజేస్తున్నారు. సోమవారం పాలకుర్తి మండలకేంద్రంలోని వారాంతపు సంతలో మైకులో మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలు–అనర్థాలపై ప్రచారం నిర్వహించారు. కరపత్రాలు, పోస్టర్ల ద్వారా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతను సన్మార్గంలో నడిపించేందుకు తన వంతుగా ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. దూమపానం, మద్యపానంతో పోలిస్తే డ్రగ్స్ వందల రెట్లు ప్రమాదకరమైనవన్నారు. డ్రగ్స్‌కు అలవాటు పడిన వారిని మానిపించడం కష్టమన్నారు. బానిసలుగా మారిన వ్యక్తులు నేరాలకు పాల్పడుతారన్నారు. ప్రజలు చైతన్యవంతులై డ్రగ్స్, గంజాయికి యువతను దూరంగా ఉంచాలని కోరారు. హిందువులు ఐక్యతతో ఉండాలిజనగామ: హిందువు ఐక్యత, చైతన్యంతోనే మ రెన్నో కార్యక్రమాలు చేపడుతూ మన శక్తిని చా టి చెప్పాలని విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి మోహన కృష్ణ భార్గవ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రం శ్రీరాంనగర్ కాలనీ సీతా రామచంద్రస్వామి దేవస్థానంలో వీహెచ్‌పీ నగర కార్యకర్తలతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో హనుమాన్ శోభాయాత్రకు వందలాది మంది హిందువులు తరలి వచ్చి విజయవంతం చేశారని, ఈ విజయానికి కృషి చేసిన కార్యకర్తలు, హిందూ సంస్థలు, యాజమాన్యాలు, వ్యాపారవేత్తలు, భజన మండళ్లు, దేవాలయాల నిర్వాహకులు, నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు పాశం శ్రీశైలం, సహా కార్యదర్శి చిలువేరు హర్షవర్ధన్, ఉల్లెంగుల రాజు, నగర ప్రముఖ్ అంబటి బాలరాజు, సభ్యులు కుందారపు బైరునాథ్, మాసరాజు, కుర్రెముల రాంప్రసాద్, ఉమాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బడుగుల ఆశాజ్యోతి అంబేడ్కర్
జనగామ రూరల్: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని, ఆయన ఆశయాలను కొనసాగించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. సోమవారం అంబేడ్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని జిల్లా షెడ్యూల్ కులముల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, డీసీపీ రాజమహేంద్రనాయక్‌తో కలిసి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. డాక్టర్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో అసాధారణ ప్రతిభాశాలి అంబేడ్కర్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాణ, షెడ్యూల్ కులముల మార్గదర్శకుడు అంబేడ్కర్ ఆలోచనలు, ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ సమాజంలో ప్రజలందరూ స్వేచ్ఛగా జీవించేందుకు రాజ్యాంగం దోహదపడిందన్నారు. విద్యనే అభివృద్ధికి పునాది అన్నారు. కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ అంబేడ్కర్ అనగారిణ వర్గాల అభ్యున్నతికి పాటు పడి మహానీయుడన్నారు. కార్యక్రమంలో ఏసీపీ నితిన్ చేతన్, ఆర్డీఓ గోపిరామ్, జిల్లా షెడ్యూల్ కులముల అభివృద్ధి అధికారి డాక్టర్ విక్రమ్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మాధవి లత, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు పారనంది వెంకటస్వామి, కందుకూరి ప్రభాకర్, విజయ్, ధనలక్ష్మి, ధర్మభిక్షం, శివ శంకర్, శేఖర్, ప్రజా ప్రతినిధులు, నాయకులు, పోలీస్ అధికారులు, కళాకారులు పాల్గొన్నారు. జిల్లాలో ఘనంగా జయంతి వేడుకలు పాల్గొన్న కలెక్టర్ రిజ్వాన్ బాషా, ఎమ్మెల్యే పల్లా, డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి -
నివేదిక వచ్చాక ప్రహరీ నిర్మాణం
కాకతీయ యూనివర్సిటీ భూములకు సంబంధించి గత కొన్నినెలల క్రితం విజిలెన్స్ అధికారుల సమక్షంలో రెవెన్యూ సర్వేయర్లతో సర్వే జరిగింది. అన్నిచోట్ల హద్దులను నిర్ణయించి మార్కింగ్ చేశారు. యూనివర్సిటీ భూమిపై నివేదిక రావాల్సి ఉంది. వారంరోజుల్లో వస్తుందని భావిస్తున్నాం. నివేదిక వచ్చాక గతంలో నిర్ణయించినట్లు కాకుండా ఇటీవల వేసిన రివైజ్డ్ ఎస్టిమేషన్ రూ.20కోట్లతో చుట్టూరా హద్దుల ప్రకారం గోడ నిర్మిస్తాం. గతంలో ఇచ్చిన కాంట్రాక్టును సైతం క్యాన్సెల్ చేయించాల్సింది. మళ్లీ మరో సంస్థకు అప్పగించాలనే ఆలోచన చేస్తున్నాం.●– ఎన్.వాసుదేవరెడ్డి, కేయూ అభివృద్ధి అధికారి -
విగ్రహావిష్కరణలో ఉద్రిక్తత
దేవరుప్పుల: మండల కేంద్రంలోని జనగామ–సూర్యాపేట రహదారి దేవరుప్పుల చౌరస్తాలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సోమవారం స్థానిక దళితుల కమిటీ ఆధ్వర్యంలో ఎర్రబెల్లి దయాకర్‌రావు, పలువురి దాతల సహకారంతో విగ్రహం, గద్దె నిర్మాణం పూర్తయింది. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఆవిష్కరణ నిలిచిపోయింది. ఇటీవల విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులు విగ్రహావిష్కరణకు బీఆర్ఎస్ అనుబంధ నాయకులకు మా త్రమే ఆహ్వానం పలకడంతో వివాదం తెరమీదకు వచ్చింది. ఈ విషయమై తహసీల్దార్, పోలీసులు నిర్వాహకులతో చర్చించారు. వివాదాస్పదం కాకుండా వ్యవహరించాలని సూచించారు. కేవలం విగ్రహ నిర్మాణ కమిటీ ప్రతినిధులు మా త్రమే విగ్రహాన్ని ఆవిష్కరించాలని సూచించారు. దీంతో నిర్వాహక ప్రతినిధులు జోగు సోమనర్స య్య, చింత యాదగిరి, భాషిపాక అబ్బయ్య, యాదగిరి, సుదర్శన్, ఎల్లేష్ తదితరులు కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ క్రమంలో ఎర్రబెల్లి దయాకర్‌రావు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నాయకులు ఎర్రబెల్లిని విగ్రహం వద్దకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. అంతా సద్దుమనిగాకా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అయితే అంబేడ్కర్ విగ్రహావిష్కరణలో అధికార పార్టీ రాద్ధాంతంతో కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడితే ఊరుకునేది లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి హెచ్చరించారు. కమిటీ పిలుపుమేరకు దాతగా వచ్చానని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పల్ల సుందర్రామిరెడ్డి, దయాకర్, రవి, రామ్‌సింగ్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
ప్రభుత్వానికి నివేదిక అందిస్తాం..
● వ్యవసాయ, హార్టికల్చర్ అధికారులు జనగామ: అకాల వర్షంతో నష్టపోయిన పంటల వివరాలను ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని వ్యవసాయ, హార్టికల్చర్ అధికారులు తెలిపారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశాల మేరకు సోమవారం జనగామ మండలం పెంబర్తి, సిద్దెంకి, చిల్పూర్, పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల, లింగాలఘణపురం, తరిగొప్పుల మండలాల పరిధిలో వడగళ్ల వర్షంతో నష్టపోయిన మామిడి తోటలు, వరి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయాధికారి రామారావు, హార్టీకల్చర్ అధికారి శ్రీధర్ మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలిపారు. రైతుల వారీగా పూర్తి సమగ్ర నివేదికను తయారు చేసి సమర్పించాలని వ్యవసాయ విస్తరణ అధికారులను ఆదేశించారు. వారి వెంట ఏడీఏ వసంత, ఏఓ వెంకటేశ్వర్లు, వ్యవసాయ విస్తరణ అధికారి ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు. అగ్నిప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలిపాలకుర్తి టౌన్: అగ్నిప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక కేంద్రం అధికారి శ్రీరాములు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని లక్ష్మినర్సింహస్వామి ఆలయంలో వారోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 14 నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలు ఎండాకాలంలో సంభవించే అ గ్నిప్రమాదాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక కేంద్రం సిబ్బంది రామయ్య, నాగరాజు, అశోక్, ప్రశాంత్, ప్రదీప్‌కుమార్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. -
నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
జనగామ రూరల్: వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుకు ఫోన్ ద్వారా విజ్ఞప్తి చేశారు. అనంతరం సిద్దంకి, ఎల్లంల, పెంబర్తి గ్రామాల్లో పర్యటించి నష్టపోయిన పంటలను వ్యవసాయశాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఎకరాకు రూ.10వేల చొప్పున నష్టపరిహారం అందించాలన్నారు. అలాగే మామిడి రైతులకు నష్టపరిహారం అందించాలన్నారు. కార్యక్రమంలో ఏడీఏ బీనా, నాయకులు ఉన్నారు. రైతులను ఆదుకుంటాం: డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని, నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వ పరమైన సహాయం అందించేలా కృషి చేస్తానని డీసీసీ అధ్యక్షుడు కొ మ్మూరి ప్రతాప్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని పెంబర్తి, ఎల్లంల, సిద్ధంకి గ్రామాల్లో దె బ్బతిన్న పంటలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ రైతుల రెక్కల కష్టం నీటిపాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన నష్టంపై నివేదిక సి ద్ధం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామని రైతులకు ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, రాజమౌళి, నిమ్మతి మహేందర్‌రెడ్డి, సుంకరి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, రాజిరెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి -
రూ.50వేల నష్టపరిహారం చెల్లించాలి
జనగామ రూరల్: అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులకు ప్రతీ ఎకరాలకు రూ.50వేల నష్టపరిహారం చెల్లించాలని రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య చందునాయక్ డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలో జరిగిన రైతు సంఘం జిల్లా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు పంటల బీమా పథకాన్ని తీసుకువస్తామని హామీ ఇచ్చి నేటికీ అమలు చేయలేదన్నారు. తక్షణమే ఫసల్ బీమాను రైతులకు అనుకూలంగా మార్చి చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. పంట నష్ట పరిహారం రూ.10వేలు ప్రకటించడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రాపర్తి సోమయ్య, ఉపాధ్యక్షుడు మాచర్ల సారయ్య, మంగ బీరయ్య, జిల్లా సహాయ కార్యదర్శి రమావత్ మీట్యా నాయక్, రవీందర్ రెడ్డి, రాజవ్వ, నక్క యాకయ్య, లింగబోయిన కుమారస్వామి, ఉర్సుల కుమార్, రైతులు పాల్గొన్నారు. -
పెళ్లి కావట్లేదని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
జనగామ జిల్లా: పెళ్లి సంబంధం కుదరడం లేదన్న మనస్థాపంతో జనగామ జిల్లా కొడ కండ్ల మండలం నీలి బండ తండాకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ గుగులోత్ నీల (26) ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గుగులోత్ హేమ, చిన్ని దంపతుల రెండో కుమార్తె నీల 2020లో ఏఆర్ కానిస్టే బుల్గా ఎంపికై వరంగల్‌లో పనిచేస్తోంది. శనివారం విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన నీల.. ఎవరూ లేని సమయంలో ప్యాన్‌కు ఊరి వేసుకుంది. పెళ్లి సంబంధం కుదరడం లేదన్న మనస్థాపంతో తన కూతురు ఆత్మహత్య చేసు కుందని మృతురాలి తల్లి చిన్ని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చింత రాజు తెలిపారు. ఒకే కాన్పులో ముగ్గురు శిశువులుముస్తాబాద్(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో ఆదివారం ఓ గర్భిణికి ముగ్గురు శిశువులు జన్మించారు. తల్లితో పాటు ముగ్గురు శిశువులు క్షేమంగా ఉన్నారు. ముస్తాబాద్ మండలం చిప్పలపల్లికి చెందిన కొడెండ్ల సృజనకు ఆదివారం పురిటినొప్పులు రాగా.. మండల కేంద్రంలోని శ్రీతిరుమల నర్సింగ్‌హోమ్‌కు తరలించారు. వైద్యపరీక్షలు చేసిన వైద్యులు స్రవంతి, శ్రీకాంత్‌లు.. సృజన గర్భంలో ముగ్గురు శిశువులు ఉన్నట్లు గుర్తించి.. వెంటనే శస్త్రచికిత్స చేశారు. సృజన ఇద్దరు ఆడ శిశువులు, ఒక మగ శిశువుకు జన్మనిచ్చారు. ఆస్పత్రి వైద్యులు మాట్లాడుతూ 15వేల మంది గర్భిణుల్లో.. ఇలా ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మిస్తారని తెలిపారు. -
మాకూ కావాలి ‘స్లాట్ బుకింగ్’
కాజీపేట అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖలో పైలెట్ ప్రాజెక్ట్‌గా చేపట్టిన స్లాట్ బుకింగ్ పద్ధతి తమకు కుడా కావాలని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలతో పాటు ఆయా పరిధి భూక్రయవిక్రయదారులు కోరుకుంటున్నారు. భూ దస్తావేజుల రిజిస్ట్రేషన్ నిమిత్తం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అడుగుపెడితే ఏ సమయానికి రిజిస్ట్రేషన్ పూర్తవుతుందో.. సబ్ రిజిస్ట్రార్ ఎప్పుడు పిలుస్తాడో తెలియక ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాస్తున్నారు. ఈ క్రమంలో పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ ప్రక్రియతో 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తవడంతోపాటు మరో 15 నిమిషాల్లో దస్తావేజులు చేతికందుతున్నాయి. దీంతో స్లాట్ బుకింగ్ విధానం అమలుకు అన్ని కార్యాలయాల నుంచి డిమాండ్ పెరుగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధి వరంగల్ఫోర్ట్, వరంగల్ రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈనెల 10న ప్రారంభించిన స్లాట్ బుకింగ్ పైలెట్ ప్రాజెక్ట్ విజయవంతమైంది. కోరుకున్న సమయానికి.. కోరుకున్న రోజు రిజిస్ట్రేషన్ పూర్తి కావడంతో భూక్రయవిక్రయదారులతో పాటు రుణాల కోసం బ్యాంకులకు వెళ్లే వారు సమయానికి దస్తావేజులు చేతికి రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్ ఆర్వో, భీమదేవరపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ, పరకాల, కొడకండ్ల, మహబూబాబాద్, ములుగు, నర్సపేట, వర్ధన్నపేట, భూపాలపల్లి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు స్లాట్ బుకింగ్ ప్రక్రియ కోసం ఎదురుచూస్తున్నాయి. తగ్గనున్న పనిభారం నాన్ స్లాట్ రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తున్న తరుణంలో సబ్ రిజిస్ట్రార్లు త్వరగా పనులు ముగించుకుని ఇంటికి వెళ్లే ఆస్కారం లేక ఒక్కోరోజు రాత్రి 8 గంటల వరకు సైతం కార్యాలయాల్లో ఉండాల్సి వస్తోంది. స్లాట్ బుకింగ్ ప్రక్రియలో భాగంగా ఉదయం 10.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పని సమయాలతో సబ్ రిజిస్ట్రార్లకు పనిభారం తగ్గడంతో పాటు భూక్రయవిక్రయదారులకు సమయం కలిసి వస్తుంది. రోజుకు 53 స్లాట్ బుకింగ్స్.. ప్రతి రోజు ఉదయం 10.30 నుంచి 1.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 24 చొప్పున స్లాట్ బుకింగ్స్ కల్పించారు. అలాగే వృద్ధులు, దివ్యాంగులు, పేషంట్ల కోసం ప్రత్యేకంగా సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు 5 స్లాట్ బుకింగ్స్ ఆన్లైన్లో బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించారు. ఈ విధానంతో రిజిస్టేషన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రస్తుతం రోజువారీ జరిగే రిజిస్ట్రేషన్లు ఇలా... భీమదేవరపల్లి : 20 నుంచి 30 స్టేషన్‌ఘన్‌పూర్ : 25 నుంచి 30 జనగామ : 40 నుంచి 55 కొడకండ్ల : 7 నుంచి 15 మహబూబాబాద్ : 45 నుంచి 60 ములుగు : 10 నుంచి 20 వరంగల్ ఆర్వో : 70 నుంచి 110 వరంగల్ రూరల్ : 25 నుంచి 35 వరంగల్ఫోర్ట్ : 25 నుంచి 40 వర్ధన్నపేట : 6 నుంచి 15 నర్సంపేట : 20 నుంచి 35 పరకాల : 15 నుంచి 25 భూపాలపల్లి : 20 నుంచి 30 15 నిమిషాల్లో ప్రక్రియ పూర్తి ఎదురుచూస్తున్న 11 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు తగ్గనున్న పనిభారం, సమయం ఆదా స్లాట్ బుకింగ్‌తో మెరుగైన సేవలు.. భూక్రయవిక్రయదారులు తాము ఎంచుకున్న రోజు, సమయానికి దస్తావేజుల రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు స్లాట్ బుకింగ్ విధానం ఎంతో ఉపయోగపడుతుంది. మెరుగైన, త్వరితగతిన సేవలు అందుతాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వేచి ఉండాల్సిన అవసరం లేదు. స్లాట్ బుక్ చేసుకుని సరైన సమయానికి వస్తే చాలు. వృద్ధులు, అనారోగ్యంగా ఉన్నవారికి సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ప్రత్యేక సమయం కేటాయించడంతో ఇబ్బందులు తలెత్తవు. – ఆనంద్, సబ్ రిజిస్ట్రార్, వరంగల్ఆర్వో -
ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేయాలి
● టీటీఐఎఫ్ ప్రధాన కార్యదర్శి మంజుల పాలకుర్తి టౌన్: సచివాలయం ఎదుట వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేయాలని తెలంగాణ తల్లి ఐలమ్మ ఫౌండేషన్ (టీటీఐఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్యాల మంజుల కోరారు. ఆదివారం మండలకేంద్రంలోని తెలంగాణ తల్లి ఐలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐలమ్మ వారసులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంజుల మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని, చాకలి ఐలమ్మ పేరిట మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ఐలమ్మ వారసులు కడు దయనీయ స్థితిలో ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నారని, వారి సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలన్నారు. జిల్లాకు ఐలమ్మ పేరు పెట్టాలని, పాలకుర్తిలో ఐలమ్మ స్మారక పార్కు నిమిత్తం ఐదు ఎకరాల భూమిని కేటాయించాలని కోరారు. త్వరలోనే ఐలమ్మ వారసుడు చిట్యాల జంపయ్య నేతృత్వంలో పాలకుర్తి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఐలమ్మ కుటుంబ సభ్యులు చిట్యాల యాకయ్య, రమేశ్, సంపత్, రాజశేఖర్, పంతగి రాజు, చిట్యాల మంజుల, లింగమ్మ, గట్టమ్మ, వెంకటమ్మ, భారతమ్మ, సంధ్యారాణి, అండాలు తదితరులు పాల్గొన్నారు. -
పాలకుర్తి సమ్మక్క, సారక్కలు ఎలా ఉన్నారు..
పాలకుర్తి టౌన్: పాలకుర్తి సమ్మక్క, సారక్కలు ఎలా ఉన్నారు...చెల్లి యశస్వినిరెడ్డి బాగున్నవా... అక్క ఝాన్సీరెడ్డి బాగున్నవా.. ఆడబిడ్డలపై సీఎం రేవంత్‌రెడ్డి ఆత్మీయ పలకరింపు. ఆదివారం హైదరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా సీఎం రేవంత్‌రెడ్డిని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ ఝాన్సీరెడ్డి కలిశారు. పాలకుర్తి నియోజవర్గ అభివృద్ధి, ప్రాజెక్టులు, తొర్రూరు మున్సిపాలిటీ అభివృద్ధిపై సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు ఎమ్మెల్యే తెలిపారు. తొర్రూరు పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.50 కోట్ల నిధులు కేటాయించాలని సీఎం కోరారు. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించి నియోజవర్గ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తుందని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. సీఎంను కలిసిన వారిలో వరంగల్ మాజీ జెడ్పీ చైర్పర్సన్ లకావత్ ధన్వంతి, డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ తదితరులు ఉన్నారు. యశస్వినిరెడ్డి, ఝాన్సీరెడ్డిని ఆత్మీయంగా పలకరించిన సీఎం -
వడగండ్లు.. కడగండ్లు
అకాల వర్షంతో అపారనష్టం ● నేలరాలిన వరి ధాన్యం, మామిడికాయలు ● పెంబర్తి, ఎల్లంల, సిద్దెంకిలో తీవ్రనష్టం ● జనగామ మార్కెట్, ఐకేపీ కేంద్రాల్లో తడిసిన ధాన్యం ● నీటిని తొలగించేందుకు రైతుల అరిగోస ● ఆదుకోవాలని అన్నదాతల వేడుకోలుజనగామ రూరల్: జిల్లాలోని పలు మండలాల్లో కురిసిన వడగండ్ల వాన రైతులకు కడగండ్లను మిగిల్చింది. ఆదివారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి జనగామ మండలం పెంబర్తి ఎల్లంల, సిద్దెంకి గ్రామాల్లో వందలాది ఎకరాల్లో మామిడికాయలు, వరి పంట నేలరాలాయి. ఇళ్లపై వడగళ్లు కరియడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఇంటి ఎదుట రాశులుగా పేరుకుపోయిన వడగళ్లను చూసి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. చిల్పూరు, జఫర్‌గఢ్, లింగాలఘణపురం, కొడకండ్ల, దేవరుప్పుల, పాలకుర్తి తదితర మండలాల్లో కురిసిన అకాల వర్షానికి కోతకు సిద్ధంగా ఉన్న వరిపంట నేలరాలగ అమ్ముకునేందుకు ఐకేపీ సెంటర్‌కు తీసుకువచ్చిన ధాన్యం తడిసి ముద్దయింది. పెంబర్తిలో చల్ల దామోదర్‌రెడ్డికి చెందిన మామడి తోట పూర్తిగా దెబ్బతిన్నది. రాలిన మామిడికాయలను చూసి రైతు విలపించారు. ప్రభుత్వం వెంటనే సంబందిత అధికారులతో సర్వే చేయించి పంటనష్ట పరిహారం అందించాలని వేడుకుంటున్నారు. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం అకాలవర్షంతో జనగామ వ్యవసాయ మార్కెట్ కాటన్ యార్డులో ఏర్పాటు చేసిన ఐకేపీ సెంటర్లో వేలాది బస్తాలు తడిసిపోయాయి. గానుగుపహాడ్, మరిగడి, ఎర్రగుల్లపహాడు, పెద్ద పహాడ్, వడ్లకొండ, నాగారం తదితర గ్రామాల నుంచి ఐకేపీ సెంటర్‌కు నాలుగు రోజుల క్రితం సుమారు 20వేల పైగా బస్తాల ధాన్యం తీసుకువచ్చారు. ధాన్యంలో అత్యధిక శాతం ఉండడంతో కొనుగోలు ఆలస్యంగా జరుగుతున్నాయి. ఆదివారం కురిసిన భారీ వర్షంతో వేలాది బస్తాల ధాన్యం తడిసిపోయింది. సుమారు 20 బస్తాల వరకు వరద నీటిలో కొట్టుకుపోయాయి. వరిగింజలను కాపాడుకునేందుకు రైతులు పడరాన్ని పాట్లు పడ్డారు. ఆ మూడు గ్రామాల్లోనే ఎక్కువ.. జనగామ మండలం సిద్దెంకి, ఎల్లంల, పెంబర్తి గ్రామాల్లో ఊహించని నష్టం జరిగింది. సుమారు 12 నుంచి 15 వందల ఎకరాల్లో వరి పంటకు నష్టం జరగగా, 50 నుంచి 150 ఎకరాల వరకు మామిడి కాయలు రాలిపోయినట్లు రైతులు చెబుతున్నారు. ఇంతటి నష్టం తామెన్నడూ చూడలేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
తడిసిన ధాన్యం పరిశీలన
జనగామ రూరల్: వ్యవసాయ మార్కెట్ పత్తియార్డులో చిటకోడూర్ ఐకేపీ సెంటర్లో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్, సీఐ దామోదర్‌రెడ్డి ఆదివారం పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడి తడిసిన ధాన్యానికి తగిన పరిష్కార మార్గం చూపేలా కృషి చేస్తామని రైతులకు తెలిపారు. అదనపు కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలిపారు. రైతులకు అండగా ఉంటామన్నారు. దరఖాస్తుల గడువుపెంచాలి స్టేషన్‌ఘన్‌పూర్: రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాఽధి కల్పనకు నూతనంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు గడువును మరో వారం రోజులు పెంచాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ మహమ్మద్ యూనుస్ అన్నారు. ఘన్పూర్ డివిజన్ కేంద్రంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు కులం ధృవీకరణ పత్రం కోసం నిరుద్యోగ యువత రోజుల తరబడి తహసీల్దార్ కార్యాలయాలు, మీ సేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి వారం పదిరోజులు గడిచినా సర్టిఫికెట్లు రావడం లేదని, ఈ విషయమై అధికారులను అడిగితే సర్వర్ సమస్య ఉందని చెబుతున్నారన్నారు. ఈ విషయమై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు గడువు పొడిగించాలని, అభ్యర్థులకు త్వరగా కులం, ఆదాయం సర్టిఫికెట్లు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సరస్వతి పుష్కరాల పనుల పరిశీలన కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో మే 15నుంచి 26వరకు జరుగనున్న సరస్వతినది పుష్కరాల పనులను రాష్ట్ర దేవాదాయశాఖ ధార్మక సలహాదారు గోవిందహరి పరిశీలించారు. ఆదివారం ఆయన ముందుగా శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకున్నారు. ఆయనను ఈఓ మహేష్ శాలువాతో సన్మానించగా, అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం వీఐపీ (సరస్వతి) ఘాటు వద్ద నిర్మిస్తున్న పుష్కరఘాటు, సరస్వతి మాత విగ్రహం ఏర్పాటు పనులను ఆయన పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఆయన వెంట సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఉపప్రధాన అర్చకుడు ఫణీంద్రశర్మ ఉన్నారు. ప్రశాంతంగా ఎన్డీఏ పరీక్ష కేయూ క్యాంపస్: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజిలో ఆదివారం ఎన్డీఏ(నేషనల్ డిఫెన్స్ అకాడమీ) పరీక్షను నిర్వహించారు. ఈపరీక్ష కేంద్రాన్ని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య సందర్శించారు. పరీక్షలు నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. పరీక్షల్ని పకడ్బందీగా నిర్వహించాలని సంబంఽధిత అధికారులకు సూచింంచారు. పరీక్షల నిర్వహణపై ఏర్పాట్ల గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. ఆర్ట్స్అండ్ సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్.జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పించాలి హన్మకొండ చౌరస్తా: త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పించాలని భారత దివ్యాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేశ్ డిమాండ్ చేశారు. ఇటీవల ఎన్నికై న హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా మానుక సతీశ్, యువజన విభాగం అధ్యక్షుడిగా నడిపల్లి శ్రీధర్, జనగామ జిల్లా అధ్యక్షుడు ఏషబోయిన రమేశ్చేత ఆదివారం ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా రాజేశ్ మాట్లాడుతూ రాష్ట్రంలో వికలాంగుల సమస్యలను తక్షణమే పరిష్కరించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎండీ షరీఫ్, జిల్లా సభ్యుడు నరేవ్, అనిల్, మమత తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుల ఉద్యమ దిక్సూచి యూటీఎఫ్
● రాష్ట్ర కార్యదర్శి రంజిత్‌కుమార్ స్టేషన్‌ఘన్‌పూర్: రాష్ట్రంలో ఉపాధ్యాయుల ఉద్యమ దిక్సూచి టీఎస్‌యూటీఎఫ్ అని రాష్ట్ర కార్యదర్శి కా నుగంటి రంజిత్‌కుమార్ అన్నారు. యూటీఎఫ్ ఆవి ర్భావ దినోత్సవం సందర్భంగా ఘన్పూర్ డివిజన్ కేంద్రంలో ఆదివారం యూటీఎఫ్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా రంజిత్‌కుమార్ హాజరై మాట్లాడారు. ప్రభుత్వ విద్యారంగ సంక్షేమం కోసం, ఉపాధ్యాయుల హక్కుల కోసం కట్టుబడి అనేక ఉద్యమాలు చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బకాయి ఉన్న ఐదు విడతల కరువు భత్యాన్ని వెంటనే చెల్లించాలని, వేతన సవరణ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని డి మాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు మంగు జయప్రకాష్, చిక్కుడు శ్రీనివాస్, కోరుకొప్పుల రాజు, కుసుమ రమేష్, తాడూరి సుధాకర్, బానోతు వసంత్‌నాయక్, అడికె సతీష్‌కుమార్, పిట్టల మహేందర్ పాల్గొన్నారు. -
అంబేడ్కర్‌ను కించపరిస్తే సహించేది లేదు..
● డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి జనగామ రూరల్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను కించపరిస్తే సహించేది లేదని డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి అన్నారు. ఆదివారం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో భాగంగా జనగామ మండలం శామీర్‌పేట, పసరమడ్ల గ్రామాల్లో సన్నాహక సమావేశం, పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా శామీర్‌పేటలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంపై చేస్తున్న కుట్రలను తిప్పు కొట్టాలన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ఇందుకు ప్రజలు చైతన్యం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, మండల అధ్యక్షుడు లింగాల నర్సిరెడ్డి, గంగం నర్సింహరెడ్డి, సర్వల నర్సింగరావు, గణిపాక మహేందర్, జిల్లా మహిళా అధ్యక్షురాలు బడికే ఇందిరా తదితరులు పాల్గొన్నారు. పోస్టల్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి దేవరుప్పుల: హనుమకొండ డివిజన్ పరిధి పోస్టల్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారించాలని భారతీ య పోస్టల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ డివిజన్ నా యకుడు ఓడపల్లి అశోక్‌గౌడ్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం సూపరింటెండెంట్ హన్మంతుకు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శాఖపరంగా విధులకు మించి అదనపు పనిభారం, నిర్దేశిత లక్ష్యాలను చేయాలనే డిమాండ్‌తో మానసికంగా ఉద్యోగులు ఇబ్బందులకు గురౌతున్నారన్నా రు. మారుతున్న కాలానికి అనుగుణంగా పోస్టల్ కార్యాలయాల్లో ఆధునిక పరికరాలు లేకపోవడంతో నిర్వహణ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శంకర్‌నాయక్, సత్యనారాయణ, మురళికృష్ణ, శ్రీనివాస్, మనోజ్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు. -
అన్నదాతను ముంచిన అకాల వర్షం
నల్లగొండ/జనగామ రూరల్/వేములపల్లి: రాష్ట్రంలోని పలు జిల్లాలో ఆదివారం ఈదురు గాలులు, వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. దీంతో మామిడి, వరి వంటి పంటలు దెబ్బతిన్నాయి. నల్లగొండ జిల్లాలో పిడుగుపాటుతో ఓ రైతు మరణించాడు. జనగామ, ములుగు జిల్లాల్లో ఆదివారం సాయంత్రం కురిసిన వడగళ్ల వానతో భారీ పంట నష్టం జరిగింది. మామిడి తోటల్లో కాయలు రాలిపోయాయి. జనగామ మండలంలోని పెంబర్తి, సిద్దెంకి, ఎల్లంల, గానుగుపహాడ్.. చిల్పూర్ మండలం ఫత్తేపూర్.. జఫర్‌గఢ్ మండలం ఓబులాపూర్.. పాలకుర్తి మండలం వావిలాల, నారబోయినగూడెంలో వరి పంట దెబ్బతింది. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కాటన్ యార్డులోని ఐకేపీ సెంటర్లో సుమారు 20 వేల బస్తాల ధాన్యం తడిసిపోయింది. ములుగు జిల్లా ఏటూరునాగారం, కన్నాయిగూడెం మండలాల్లో 150 ఎకరాల్లో వరిపంట దెబ్బతింది. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలంలోని పలు గ్రామాల్లో ఈదురు గాలులకు వందల ఏళ్ల నాటి మామిడి వృక్షాలు నేలకూలాయి. శాలిగౌరారం మండల కేంద్రంలోని మార్కెట్ యార్డు ఆవరణలో ధాన్యం కొట్టుకుపోయింది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలోని అనంతారం, తొండ.. జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి, కోడూరు తదితర గ్రామాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. జాజిరెడ్డిగూడెంలో నోముల నరేష్ ఇంట్లో చెట్టుకొమ్మ విరిగి గేదెపై పడటంతో అది మృత్యువాత పడింది. యాదాద్రి భువనగిరి జిల్లాని పలు మండలాల్లో మామిడి తోటలకు నష్టం వాటిల్లింది. నల్లగొండ జిల్లా వేములపల్లి మండలంలోని సల్కునూరు గ్రామంలో గోపు సుధాకర్‌రెడ్డి (63) అనే రైతు తన పొలం వద్ద పనిచేస్తుండగా పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. -
మళ్లీ సమ్మెబాట!
వనజీవికి నివాళి ఆదివారం శ్రీ 13 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025జనగామ రూరల్: గ్రామాల అభివృద్ధేతోనే దేశ ప్రగతి.. పల్లెలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు.. మురికి కాల్వలు, వార్డులు శుభ్రం చేయడం.. చెత్త తరలింపు.. నీటి సరఫరా.. కరెంటు సమస్యల పరిష్కారం.. ఇలా పొద్దంతా అన్ని రకాల పనులతో చాకిరీ చేస్తున్న గ్రామ సేవకులకు ఇచ్చేది అరకొర వేతనమే. అదికూడా సమయానికి అందక కుటుంబాలు గడవక పడరాని పాట్లు పడుతున్నారు. డిమాండ్ల సాధనకు గతంలో సమ్మె చేయగా.. కంటి తుడుపుగా కొన్ని హామీలు ఇచ్చిన పాలకులు చేతులు దులుపుకున్నారు. అయి తే గత ఐదు నెలల నుంచి వేతనాలు రావడంలేదు. దీంతో మళ్లీ సమ్మె బాట పట్టేందుకు పంచాయతీ కార్మికులు సన్నద్ధం అవుతున్నారు. ఇప్పటికే యూనియన్ నాయకులు అధికారులకు సమ్మె నోటీసులు అందజేశారు. 1,210 మంది జీపీ కార్మికులు జిల్లాలో 281 గ్రామ పంచాయితీలు ఉండగా 1,210 మంది జీపీ కార్మికులు మల్టీపర్పస్ విధులు నిర్వహిస్తున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వర్కర్ల సంఖ్య లేదు. 25 శాతం తక్కువగా ఉన్నా రు. అదనపు పనిభారం పడుతోంది. గ్రామ పంచా యతీల్లో మల్టిపర్పస్ విధానం కారణంగా అన్ని రకాల పనులు చేయించడంతో కార్మికులకు కష్టాలు తప్పడంలేదు. ప్రదాకర పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్న వీరికి అరొకరగా చెల్లించే రూ.9,500 వేతనం నెలల తరబడి అందక కుటుంబాలు గడవక అప్పులు చేస్తూ కాలం గడుపుతున్నారు. మల్టీపర్పస్ విధానం కార్మికుల ప్రాణాల మీదికి వస్తోంది. రెండు రోజుల క్రితం రఘునాథపల్లి మండలం మేకలగట్టుకు చెందిన కారోబార్ వేల్పుల నాగరాజు విద్యుత్ సమస్య పరిష్కారం కోసం స్తంభం ఎక్కవగా విద్యుత్ షాక్ గురయ్యాడు. జీపీ కార్మికుల డిమాండ్లు ఇవీ.. ● పర్మనెంట్ చేసి రేగ్యులర్గా వేతనం చెల్లించాలి. ● జీఓ 60 ప్రకారం స్వీపర్లకు రూ.15,600, బిల్ కలెక్టర్, కారోబార్లకు రూ.19,500 చెల్లించాలి. ● జీఓ 51ని సవరించి మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలి. ● ప్రతి కార్మికుడికి ప్రమాద బీమా రూ.10 లక్షలు, దహన సంస్కారాలకు రూ.20 వేలు ఇవ్వాలి. ● రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.5 లక్షలు చెల్లించాలి. ● అనారోగ్యంతో మరణిస్తే కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. ● ఏడాదికి కార్మికులకు మూడు జతల యూ ని ఫామ్, చెప్పులు, సబ్బులు, నూనెల కొనుగో లుకు నగదు రూపంలో అలవెన్స్ చెల్లించాలి. ● ప్రతి కార్మికుడికి ఈఎస్ఐ, పీఎఫ్ సదుపాయం కల్పించి ఎనిమిది గంటల పని విధానం అమలు చేయాలి. ● కార్మికుల అక్రమ తొలగింపులు ఆపి ఉద్యోగ భద్రత కల్పించాలి.న్యూస్రీల్గ్రామసేవకులపై పట్టింపేది..? ఐదు నెలలుగా అందని వేతనాలు కుటుంబాలు గడవక ఇబ్బందులు కనీసవేతనం, ఉద్యోగ భద్రత కరువు తిరిగి సమ్మెబాట పట్టనున్న కార్మికులు..! అధికారులకు సమ్మె నోటీసులు అందజేసిన కార్మిక నాయకులు -
అవసరమైతే బ్లాక్ లిస్టులోకి..
– వివరాలు 8లోuకూలి కూడా గిట్టడం లేదు.. నెలంతా పని చేస్తే రోజువారీ కూలి కూడా గిట్టడం లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామంలో మురికి కాల్వ లు, వార్డులు శుభ్రం చేయడం.. చెత్త తరలింపు.. నీటి సరఫరా తదితర పనులు చేస్తున్నాం. వచ్చే అరకొర జీతంతో ఇల్లు గడవక ఇబ్బందులు పడుతున్నాం. వ్యవసాయ పనులకు పోదామంటే సమయం దొరకదు. పొద్దంతా ఇదే చాకిరి. అప్పు తెచ్చుకుని పూట గడుపుతున్నాం. – బొల్లం లక్ష్మి, జీపీ కార్మికురాలు, వడ్లకొండ కడియం రాజీనామా చేసే వరకు వదలం ● భూ చెర పడుతున్న ఆంధ్రా అల్లుడు, బినామీలు ● జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డిభూమి ఆక్రమించినట్లు నిరూపిస్తే రాజీనామా ● పట్టా భూములను రైతులకు చెందాలనడం కబ్జా చేసినట్టా? ● ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిహన్మకొండ: అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచా యతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణనీటి సరఫ రా, మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క అధికారులను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్లోని కాన్ఫరెన్న్స్హాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా పంచాయతీరాజ్ శాఖ, మిషన్ భగీరథ శాఖ లపై శనివారం ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సీతక్క మాట్లాడుతూ పనులు దక్కించుకోవడంలో చూపుతున్న శ్రద్ధ సకాలంలో పూర్తిచేయడంపై కాంట్రాక్టర్లు శ్రద్ధ చూపడం లేదన్నారు. ఇప్పటికీ మొదలుపెట్టని పనులకు తిరిగి టెండర్లు పిలవాలని సూచించారు. ఏళ్లుగా పనులు మొదలు పెట్టని, పూర్తిచేయని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెట్టాలన్నారు. కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. వర్షాకాలం ప్రారంభమయ్యేలోగా పనులు పూర్తి పూర్తిచేయించే బాధ్యత ఎస్ఈలదే అని, కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించి వారికి సూచనలు చేయాలన్నారు. టెండర్లకు సిద్ధంగా ఉన్న రోడ్లకు వారంలోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి సకాలంలో పనులు పూర్తి చేయించాలని చెప్పారు. నిధుల కొరత లేదని, పీఎంజీఎస్‌వై నిఽధులతోపాటు రాష్ట్ర ప్రభుత్వం రూ.400 కోట్లు ఇచ్చిందని వివరించారు. అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయాలని, గ్రామాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవడం లేదు.. అభివృద్ధి పనులు జరుగుతున్న తీరుపై ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టినవి ఇప్పటికీ పూర్తి చేయలేదని, తన పదవి కాలంలోపైనా పూర్తి చేస్తారా అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధికారుల ను ప్రశ్నించారు. తమ నియోజకవర్గాల్లో రోడ్ల పనులు అసంపూర్తిగా ఉన్నాయని ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కడియం శ్రీహరి, రాంచంద్రునాయక్.. మంత్రి, ఈఎన్సీ కనకరత్నం దృష్టికి తీసుకెళ్లారు. పనులు పూర్తి చేయించడంలో అధికారులు వ్యవహరిస్తున్న వైఖరిపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం.. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మహబూ బాబాద్ ఎంపీ బలరాంనాయక్ మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేయాలని, తాను ప్రతిపాదనలు పంపిన రోడ్లను మంజూరు చేయాలని ఎమ్మె ల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మీరు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఒక్కరే ఉన్నారని, అప్పుడు మీకు ప్రభుత్వం ఎంతగానో సహకరించిందని, ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఒక్కడినే ఉన్నానని, నిష్పక్షపాతంగా నియోజకవర్గ అభివృద్ధికి సహకరించి నిధులు మంజూరు చేయాలని మంత్రి సీతక్క కు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో ఎంపీ బలరాంనాయక్ కలుగజేసుకుని బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేస్తే తాము చెల్లిస్తున్నామన్నారు. దీంతో పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఇక్కడ రాజకీయాలు చేయడం మంచిది కాదని, రాజకీయాలు బయట చూసుకుందామన్నారు. సమావేశంలో ఎంపీలు కడియం కావ్య, పోరిక బలరాంనాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి, ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ కృపాకర్‌రెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్లు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. బాల్యవివాహాల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలిబాల్య వివాహాల నిర్మూలనకు అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళ శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్లో మహిళా, శిశు, దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమశాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, కమిషనర్ కాంతి వెస్లీతో కలిసి ఉమ్మడి జిల్లాలోని జిల్లా సంక్షేమ శాఖ అధికారులు, సీడీపీఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ ములుగు జిల్లాలోని మారుమూల గ్రామమైన రాయినిగూడెంలో పోషణ్ పక్వాడా కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు ఇష్టంగా తినే ఆహారంపై దృష్టి పెట్టాలన్నారు. బాల్య వివాహాలు జరగకుండా చూడడ మే అందరి లక్ష్యం కావాలన్నారు. ‘అమ్మమాట – అంగన్వాడీ బాట’ కార్యక్రమాన్ని వచ్చే ఏడాది కూడా నిర్వహిస్తామని చెప్పారు. పనుల్లో నిర్లక్ష్యం వహించే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క పంచాయతీరాజ్ శాఖ, మిషన్ భగీరథపై హనుమకొండ కలెక్టరేట్లో సమీక్ష అభివృద్ధి పనుల తీరుపై ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేల అసంతృప్తి ఏళ్లుగా పెండింగ్‌లోనే ఉంటున్నాయని అధికారులపై అసహనం -
బీజేపీ పాలనలో రాజ్యాంగంపై దాడి
స్టేషన్‌ఘన్‌పూర్: బీజేపీ పాలనలో భారత రాజ్యాంగంపై దాడి జరుగుతున్నది.. రాజ్యాంగాన్ని మార్చే కుట్రలను తిప్పికొట్టాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ కార్యక్రమంపై శనివారం స్థానికంగా ఎమ్మె ల్యే కడియం శ్రీహరి అధ్యక్షతన నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆమె మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం నిరంకుశ పాలన సాగిస్తోందని, అమిత్‌షా రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను అవమానించేలా పార్లమెంట్లో మాట్లాడారని అన్నారు. ప్రజలను చైతన్యం చేస్తూ ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త రాజ్యాంగ పరిరక్షణకు బాధ్యతగా పాటుపడాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడు తూ.. రాజ్యాంగాన్ని కాపాడుకుంటే మనల్ని కాపాడుతుందని అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ శ్రేణులు ప్రజలతో కలిసి జాతీయ జెండా, అంబేడ్కర్, గాంధీజీ ఫొటోలతో గ్రామాల్లో ర్యాలీలు, పాదయాత్రలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం జిల్లా కోఆర్డినేటర్ లకావత్ ధన్వంతి, ఏఎంసీ చైర్పర్సన్ లావణ్యశిరీష్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ నరేందర్‌రెడ్డి, నాయకులు బెలిదె వెంకన్న, మారుడోజు రాంబాబు, శిరీష్‌రెడ్డి, లింగాజీ, జగదీష్‌చందర్‌రెడ్డి, పొట్లపల్లి శ్రీధర్‌రావు, కట్టా మనోజ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య -
మార్కెట్‌కు రెండు రోజులు సెలవు
జనగామ రూరల్: జనగామ వ్యవసాయ మార్కెట్‌కు రెండు రోజులు సెలవు ప్రకటిస్తూ మార్కెట్ చైర్మన్ బనుక శివరాజ్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. 13వ తేదీ ఆదివారం, 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా మార్కెట్ బందు ఉంటుందని, రైతులు గమనించి వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించడానికి తీసుకురావొద్దని సూచించారు. మంగళవారం మార్కెట్ తిరిగి పునఃప్రారంభం అవుతుందన్నారు. షూటింగ్‌బాల్ అసోసియేషన్ జిల్లా కమిటీ ఎన్నిక స్టేషన్‌ఘన్‌పూర్: జనగామ జిల్లా షూటింగ్‌బాల్ అసోసియేషన్ నూతన కమిటీని శనివారం స్థానికంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐలయ్య ఆధ్వర్యాన ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఇనుగా ల యుగేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షులుగా ఎన్.సాంబన్న, దేవ్‌సింగ్, రాజిరెడ్డి, చుక్కమ్మ, ప్రధాన కార్యదర్శిగా అన్నెపు కుమార్, సహాయ కార్యదర్శులుగా రాజు, సాంబరాజు, చందర్, అశోక్, ఉదయ్‌కిరణ్, కోశాధికారిగా చింతకింది సుధాకర్, కార్యవర్గ సభ్యులుగా నరేష్, అరవింద్, దిలీప్, రమేష్, మధుసూదన్, చందర్, రాజు, మధు, రమేష్, మహేష్ ఎన్నికయ్యారు. రాజరాజేశ్వరీదేవికి తామర పూలతో అర్చన హన్మకొండ కల్చ రల్: వరంగల్ ఎంజీఎం ఎదురుగా ఉన్న రాజరాజేశ్వరీదేవి ఆలయంలో నిర్వహిస్తున్న శ్రీలలితా యాగంలో భాగంగా శనివారం అమ్మవారికి లక్ష తామరపూలతో అర్చన చేశారు. ఆలయ అర్చకుడు ఎల్లంభట్ల లక్ష్మణశర్మ ఆధ్వర్యంలో ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి ఉదయం తామరపూలతో అర్చన నిర్వహించారు. సాయంత్రం పౌర్ణమి తిథిని పురస్కరించుకుని అమ్మవారికి లక్ష బిల్వార్చన చేపట్టారు. అధిక సంఖ్య లో మహిళలు పాల్గొని దీపారాధన చేశారు. దశవిధహారతుల అనంతరం అన్నప్రసాదాల వితరణ చేశారు. ఆలయ చైర్మన్ వద్దిరాజు వెంకటేశ్వరరావు పర్యవేక్షించారు. ‘మిస్ వరల్డ్ పోటీలు రద్దు చేయాలి’ హన్మకొండ: రాష్ట్రంలో నిర్వహించనున్న మిస్ వరల్డ్ పోటీలను రద్దు చేయాలని ప్రొఫెసర్ కాత్యాయని అన్నారు. హనుమకొండలో మిస్ వరల్డ్ పోటీలపై అందాల పోటీల వ్యతిరేక కమిటీ ఆధ్యర్యంలో శనివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రొఫెసర్ కాత్యాయని మాట్లాడుతూ.. అందాన్ని ఆనంది స్తాం.. కానీ అందం పెట్టుబడి కావడమే సమస్యగా పరిణమించిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకప్పుడు కార్పొరేట్ సంస్థలు ఇలాంటివి నిర్వహించేవని, ఇప్పుడు ఏకంగా ప్రభుత్వమే నిర్వహించడంలో ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నా యో అర్థమవుతుందని విమర్శించారు. ప్రభుత్వాలు ప్రజలను ప్రజాసమస్యలను పట్టించుకో కుండా పెట్టుబడిదారులకు ఉపయోగపడే కార్య క్రమాన్ని రూ.200 కోట్ల ఖర్చుతో నిర్వహిస్తే రూ.1,500 కోట్ల లాభాలు వస్తాయని మాట్లాడ డం విడ్డూరంగా ఉందని విమర్శించారు. మహిళా ప్రతినిధి కళ మాట్లాడుతూ.. కేసీఆర్ పదేళ్లు దోచుకొని ఓటమికి గురయ్యారన్నారు. ఆయన అన్యాయాలు భరించలేకే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆరు గారెంటీలతో గద్దెనెక్కిస్తే.. గ్యారెంటీలను గాలికి వదిలి లాభాలే లక్ష్యంగా పాలన చేస్తున్నారని తూర్పారబట్టారు. సమావేశంలో రత్నమాల, రమాదేవి, వెంగల్రెడ్డి, అంజనీ, విలాసిని, జ్యోతికరమణి పాల్గొన్నారు. నకిలీ వైద్యుడిపై కేసు ఎంజీఎం: వరంగల్ కాశిబుగ్గలోని సుహానా ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో వైద్యం చేస్తున్న నకిలీ వైద్యుడు జి.సదానందంపై కేసు నమోదు చేసిన ట్లు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు శనివారం తెలిపారు. అశాసీ్త్రయ పద్ధతిలో హై డోస్ యాంటీ బయాటిక్స్, స్టెరాయిడ్స్ ఇంజ క్షన్లు ఇవ్వడంతో పాటు ఫార్మసీ లైసెన్స్ లేకుండా పెద్ద మొత్తంలో మందులు నిల్వ ఉంచినట్లు సభ్యులు గుర్తించారు. ఇంతేజార్ గంజ్ పోలీస్‌స్టేషన్‌లో రిజిస్టర్డ్ డాక్టర్ డి.లాలయ్యకుమార్, చైర్మన్ డాక్టర్ మహేశ్‌కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్ఎంసీ చట్టం సెక్షన్ 34, 54, టీఎస్‌ఎంపీఆర్ చట్టం సెక్షన్ 22 ప్రకారం.. ఈకేసు నమోదు చేశారు. చట్ట ప్రకారం నకిలీ వైద్యుడికి జైలు శిక్ష రూ.5 లక్షలు జరిమానా విధించే అవకాశం ఉందని కౌన్సిల్ సభ్యులు నరేశ్ పేర్కొన్నారు. -
శనివారం శ్రీ 12 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
– 10లోuవైభవంగా పారువేటపాలకుర్తి టౌన్: తెలంగాణ రెండో భద్రాద్రిగా వెలుగొందుతున్న వల్మిడీ సీతారామచంద్రస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా 10వ రోజున స్వామి వారికి బండ్లు తిరుగుట, పారువేట నిర్వహించారు. అలాగే శుక్రవారం రాత్రి నిర్వహించిన శ్రీపుష్పయాగం, దోపోత్సవం, ద్రజారోహణం కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. జీఓ 129ని సవరణ చేయాలి జనగామ రూరల్: జీఓ 129ని సవరించాలని తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి పెద్దాపురం రమేశ్ అన్నారు. శుక్రవారం పెండెల శ్రీనివాస్ అధ్యక్షతన జిల్లా స్థాయి సమావేశం యూని యన్ కార్యాలయంతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీఓనంబర్ 129 ద్వారా గ్రామ రెవెన్యూ అధికారులు చాలా నష్ట పోతున్నామని, సుమారు 20 నుంచి 25 సంవత్సరాల నుంచి సర్వీస్ చేసిన వారికి అవకాశం కల్పించకపోవడం బాధాకరమన్నారు. అనంతరం కలెక్టర్ రిజ్వన్ బాషాకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నామల పరుశరాములు, రవీందర్, యాదగిరి, సుదీర్ రెడ్డి నరేష్, శ్రీకాంత్, కొండ య్య, క్రాంతి, షకీల్, సాంబయ్య, గంగరాజు, రామచంద్రం, తదితరులు పాల్గొన్నారు. గోపా యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా సతీష్గౌడ్స్టేషన్ఘన్పూర్: గోపా యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా మండలంలోని ఇప్పగూడెం గ్రామానికి చెందిన మందపురం సతీష్‌గౌడ్‌ను నియమించినట్లు గోపా (గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెసనల్స్ అసోసియేషన్) యువజన రాష్ట్ర అధ్యక్షుడు కోరుకొప్పుల నాగేష్‌గౌడ్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సతీష్చేసిన సేవలను గుర్తించి యువజన అధ్యక్షుడిగా నియమించామన్నారు. అనంతరం సతీష్‌గౌడ్ మాట్లాడుతూ సంఘ నిర్ణయాలకు కట్టుబడి పనిచేస్తూ జిల్లా వ్యాప్తంగా గౌడజాతి గొంతుకగా నిలుస్తానన్నారు. తనను ఎంపిక చేసిన రాష్ట్ర అధ్యక్షుడితోపాటు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. వ్యవసాయ కార్పొరేటీకరణ ను వెనక్కి తీసుకోవాలిజనగామ రూరల్: మోదీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను, కార్పొరేటీకరణను వెనక్కి తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా చందు నాయక్, రాష్ట్ర కమిటీ సభ్యుడు మోకు కనకరెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రజాసంఘాల కార్యాలయం వద్ద అఖిల భారత కిసాన్ సభ 89వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం జెండా ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్రం నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవడంలో విఫలమైందని, మళ్లీ పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో బూడిద గోపి, సుమ, యాకన్న, శ్రీకాంత్, మంగ బీరయ్య, కర్రే సత్తయ్య, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.జనగామ: ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ప్లాస్టిక్ మహమ్మారిని కూకటి వేళ్లతో పికిలి పారేసేందుకు పురపాలిక అధికారులు నడుంబిగించారు. 75 మైక్రాన్ల కన్నా తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ వినియోగం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు సంబంధించి కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ గతంలోనే 571(బి) జీఓ విడుదల చేసిన సంగతి తెలిసిందే. నిబంధనలను అతిక్రమించిన వ్యాపారులకు జరిమానా వేయాలని అందులో పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌తో పాటు 75 మైక్రాన్ల కన్నా తక్కువ మందం కలిగిన కవర్ల అమ్మకాలు చేయకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పెనుముప్పుగా ప్లాస్టిక్ ప్లాస్టిక్ కవర్ల వినియోగం పర్యావరణానికి పెనుముప్పుగా మారిపోతుంది. ప్రమాదకరమైన ప్లాస్టిక్‌పై గతం నుంచే నిషేధం అమలులో ఉన్నప్పటికీ, ఎవరూ పట్టించుకోలేదు. ప్లాస్టిక్ వినియోగంపై గతంలో ఎన్విరాన్మెంటల్, శానిటేషన్ అధికారులు రెగ్యులర్‌గా తనిఖీలు చేపట్టినప్పటికీ, కొంతకాలం పాటు వదిలేశారు. దీంతో ప్లాస్టిక్ అమ్మకాలు తిరిగి మొదలయ్యాయి. అలాగే జిల్లాలోని జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి నియోజకవర్గాల పరిధిలో ప్లాస్టిక్ అమ్మకాలపై ఎలాంటి నిషేధం లేదు. జిల్లా కేంద్రంతో పాటు మండలాల పరిధిలో రోజు వారీగా 10 క్వింటాళ్ల వరకు ప్లాస్టిక్ కవర్ల అమ్మకాలు జరుగుతాయి. ఇందులో 45 శాతం ప్లాస్టిక్ అమ్మకాలు పట్టణంలో జరుగుతుండగా మండలాల పరిధిలో 55 శాతం మేర ఉంటాయని అంచనా. పట్టణంలోని ప్లాస్టిక్ నిషేధం అమలులో ఉన్నప్పటికీ, మండలాలు, గ్రామాల్లో మాత్రం యథావిధిగా క్రయవిక్రయాలు జరుగుతూనే ఉన్నాయి. పురపాలిక, గ్రామపంచాయతీల పరిధిలో రోజు వారీగా సేకరించే చెత్తలో 25 శాతానికి పైగా వాడి పారేసిన ప్లాస్టిక్ ఉండడం ఎంత ప్రమాదమో తెలియజేస్తోంది. క్యారీ బ్యాగుల్లో ఉండే పిగ్మెంట్లు, ప్లాస్టిక్ సైజర్లు, యాంటి ఆక్సిడెంట్ల వల్ల నాడీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. చెత్తతో కలిపి వేసిన క్యారీ బ్యాగులను తింటున్న మూగ జీవాలకు ప్రమాదం లేకపోలేదు. పట్టింపులేకనే.. ప్లాస్టిక్‌తో ముప్పును సీరియస్‌గా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం 2011లో ప్రత్యేక జీఓను జారీ చేసింది. 20 మైక్రాన్ల మందం కంటే తక్కువ ఉన్న పాలిథిన్ కవర్లు అమ్మొద్దని ముందుగా ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ఆ తర్వాత 75కు పెంచింది. నిబంధనలు అతిక్రమించి తయారీ చేసినా, హోల్‌సేల్, రిటేయిల్ అమ్మకాలు జరిపినా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హెచ్చరికలను జారీ చేసింది. ప్లాస్టిక్ వాడకంపై గ్రామస్థాయి నుంచి ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు తయారీ సంస్థలను పూర్తిగా మూసి వేసినప్పుడే వందశాతం నిర్మూలించవచ్చని పర్యావరణ ప్రేమికులు అభిప్రాయ పడుతున్నారు. మొదలైన తనిఖీలు పట్టణంలో గత రెండు, మూడు నెలలుగా ప్లాస్టిక్ వినియోగంపై తనిఖీలు చేపడుతున్నారు. కవర్లను అమ్మే వ్యాపారులకు రూ.5 వందల నుంచి అంతకుపైగా జరిమానా వేస్తూ ముందస్తుగా హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకు 200 దుకాణాలకు పైగా జరిమానాలు విధించారు. 75 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ కవర్లతో పాటు బ్యాగులు, వాడి పారేసే గ్లాసులు, ప్రమాదకరమైన ప్లాస్టిక్ కవర్లను ఎట్టి పరిస్థితుల్లో అమ్మరాదని సూచనలు చేస్తున్నారు. పట్టణంలో రోజువారీగా 11 టన్నుల చెత్త సేకరణ జరుగుతుంది. ఇందులో ఒకటిన్నర టన్నుల ప్లాస్టిక్ వస్తుంది. టీస్టాల్స్, హోటల్స్, ఫంక్షన్ హాల్స్, భోజనం హోటల్స్, తదితర దుకాణాల వద్ద ప్లాస్టిక్, పేపర్ టీ గ్లాస్లు, వాటర్ బాటిల్స్, తాగు నీటి గ్లాసులు ఇలా ఇష్టారీతిలో బయట వేయడంతో అవి డ్రెయినేజీల్లోకి కొట్టుకు పోతున్నాయి. పట్టణంలోని ప్రధాన కూడళ్లలోని డ్రెయినేజీల్లో మురికి నీటికంటే ఎక్కువగా ప్లాస్టిక్ వ్యర్థపదార్థాలే కనిపిస్తాయి. విస్తృత తనిఖీలు చేపడుతున్నాం.. పట్టణంలో ప్లాస్టిక్ కవర్లను ఎవరూ వినియోగించొద్దు. దుకాణా యజమానులు సహకరించాలి. ప్లాస్టిక్‌కు బదులుగా జూట్ బ్యాగులు ఉపయోగించి, పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ పాటుపడాలి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌తో పెను ప్రమాదం పొంచి ఉంది. ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి, విస్త్రృత తనిఖీలు చేపడుతున్నాం. నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు చేస్తే జరిమానా విధిస్తాం. – వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ ఇన్చార్జ్ వీసీలతో ముందుకు సాగని పనులు●● మూడు జిల్లాలకు విస్తరించిన పరిధి ● పెండింగ్‌లో రూ.వందల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు ● ఇప్పటికే స్మార్ట్‌సిటీ, ఇండస్ట్రియల్, ఐటీ కారిడార్‌గా పేరు ● భవిష్యత్‌లో ఎయిర్పోర్ట్, మాస్టర్‌ప్లాన్–2041 అమలు ● పూర్తి కాలపు ఐఏఎస్ ఉంటేనే ప్రగతిపథంలో ‘కుడా’ న్యూస్రీల్పట్టణంలో అడుగడుగునా నిఘా ప్రత్యేక బృందాల ఆధ్వర్యంలో తనిఖీలు 75 మైక్రాన్ల కంటే తక్కువ ఉండొద్దు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు -
రైతుల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి జఫర్‌గఢ్: రైతుల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వమని, దేశంలో సన్నధాన్యానికి బోనస్ ఇస్తున్న ఏకై క రాష్ట్రం తెలంగాణ అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో మసీదు బండపై ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం స్థానిక రెవెన్యూ కార్యాలయం ఎదుట కల్యాణలక్ష్మి, సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అనంతరం 68 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, 94 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ తీగల కర్ణాకర్‌రావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్‌రెడ్డి, నూకల ఐలయ్య, తహసీల్ధార్ శంకరయ్య, ఇల్లందుల బా బు, భూక్య సురేశ్ తదితరులు పాల్గొన్నారు. -
అణగారిన వర్గాల అభ్యున్నతికి పూలే కృషి
హన్మకొండ: అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన గొప్ప సంఘసంస్కర్త జ్యోతిబా పూలే అని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో జ్యోతిబా పూలే జయంతిని నిర్వహించారు. ఈసందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీఎండీ మాట్లాడుతూ.. కులం పేరుతో తరతరాలుగా అణిచివేతకు గురైన ప్రజలకు ధైర్యం కల్పించిన వ్యక్తి పూలే అని కొనియాడారు. సీ్త్రలు అభివృద్ధి చెందితే సమాజం అభివృద్ధి చెందుతుందని, సీ్త్ర విద్య కోసం పోరాడిన గొప్పసంస్కర్త జ్యోతిబా పూలే అన్నారు. 1873 సెప్టెంబర్ 24న సత్యశోధన సమాజాన్ని స్థాపించారని, పూలే కేవలం కులవ్యవస్థ రూపు మాపడమే కాకుండా సామ్రాజ్యవాద వ్యతిరేక, కార్మికవర్గ, రైతాంగ పక్షంగా పోరాడారని వివరించారు. పూలే జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో ఇంచార్జ్ డైరెక్టర్లు బి.అశోక్ కుమార్, టి.సదర్ లాల్, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సీఈలు కె.తిరుమల్‌రావు, రాజుచౌహాన్, రవీంద్రనాథ్, బికంసింగ్, వెంకటరమణ, జాయింట్ సెక్రటరి కె.రమేష్, జీఎంలు అన్నపూర్ణ, వేణుబాబు, వాసుదేవ్, నాగ ప్రసాద్, శ్రీనివాస్, మల్లికార్జున్, దేవేందర్, కృష్ణ మోహన్, గిరిధర్, సత్యనారాయణ, కంపెనీ సెక్రటరీ కె.వెంకటేశం పాల్గొన్నారు. గొప్పసామాజిక సంఘ సంస్కర్త కేయూ క్యాంపస్: మహాత్మాజ్యోతిబా పూలే గొప్ప సామాజిక సంఘసంస్కర్త అని కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రతాప్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పూలే జయంతిని యూనివర్సిటీలోని సెనెట్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్య ద్వారానే అసమానతలు తొలగిపోతాయని విద్యా ప్రాధాన్యతను పూలే ఆనాడే చాటిచెప్పారన్నారు. పూలేను స్ఫూర్తి, ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కాన్సిటిట్యూషన్ రెలవెన్స్ సోషియో ఎకనామిక్ పొలిటికల్ అండ్ ఎడ్యూకేషనల్ ఇంప్లికేషన్ ఆన్ బీసీస్ ఇన్ తెలంగాణ అనే అంశంపై ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ సీహెచ్ శ్రీనివాస్ కీలకోపన్యాసం చేశారు. తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడు సిరికొండ సంజీవరావు, కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం, బీసీ సెల్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడారు. పాలకమండలి సభ్యులు ఆచార్య సురేష్‌లాల్, డాక్టర్ అనితారెడ్డి, మల్లం నవీన్, సుకుమారి, చిర్ర రాజు, పుల్లూరు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. తొలుత కేయూ దూరవిద్యా కేంద్రంలోని పూలే దంపతుల విగ్రహాలకు వీసీ, రిజిస్ట్రార్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బోధన, బోధనేతర సిబ్బంది, పలువురు పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి -
కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్జనగామ రూరల్: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ పిలుపునిచ్చారు. గావ్ చలో బస్తీ చలో కార్యక్రమంలో భాగంగా పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి నెహ్రూ పార్కు, గణేష్ టెంపుల్ వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలు, మున్సిపాలిటీల్లో పాదయాత్రల ద్వారా పార్టీ కార్యకర్తలు ప్రజల వద్దకు వెళ్లి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలను వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు బుడుగుల రమేశ్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు దేవరాయ ఎల్లయ్య, నాయకులు లక్ష్మినర్సయ్య, జగదీష్, అశోక్, మైపాల్, ఈర్ల నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి
దామెర: ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతిచెందిన ఘటన హనుకొండ జిల్లా దామెర మండలంలోని తక్కళ్లపహాడ్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై అశోక్ తెలిపిక కథనం ప్రకారం.. నగరంలోని 3వ డివిజన్ ఆరెపల్లికి చెందిన సుంకరి వీరేందర్ వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. కాగా శుక్రవారం పనినిమిత్తం తన అత్తగారి ఊరైన ఆగ్రంపహాడ్కు వెళ్లి ద్విచక్రవాహనంపై తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో దామెర మండలంలోని తక్కళ్లపహాడ్ పాఠశాల సమీపానికి రాగానే జాన్‌డీర్ ట్రాక్టర్ ఢీ కొట్టింది. దీంతో వాహనంపై ఉన్న వీరేందర్ ఎగిరిపడ్డాడు. అనంతరం ట్రాక్టర్ అతనిపై నుంచి వెళ్లింది. దీంతో తీవ్రగాయాలతో వీరేందర్ అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటనా స్థలాన్ని ట్రైయినీ ఎస్పీ మనన్ భట్, ఎస్సై అశోక్ పరిశీలించి, వివరాలు సేకరించారు. వీరేందర్ భార్య సుంకరి అరుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై తెలిపారు. -
సన్న బియ్యం పథకం దేశానికే ఆదర్శం
కొత్తగూడ: సన్న బియ్యం పంపిణీ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని పంచాయతీరాజ్, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పరిధి గుంజేడులో సన్న బియ్యం పథకాన్ని శుక్రవారం ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. నిరుపేదల కడుపు నింపాలనే లక్ష్యంతో సీఎం రేవంత్‌రెడ్డి సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం సరఫరా చేసిన బియ్యంతో వండిన ఆహారాన్ని చిన్నారులతో కలసి భుజించారు. ఐసీడీఎస్ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన స్టాల్‌ను సందర్శించారు. చిన్న పాపకు ప్రభుత్వం సరఫరా చేసిన పౌష్టికాహర ఉగ్గును స్వయంగా తినిపించారు. గర్భిణులకు పౌష్టికాహర కిట్లు అందజేశారు. అనంతరం కలెక్టర్ అద్వైత్ కుమార్‌సింగ్, డీఎఫ్ఓ విశాల్‌తో కలిసి ముసలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల గూర్చి అధికారులతో చర్చించారు. గుంజేడు ముసలమ్మ జాతరను ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని మంత్రి సీతక్క హమీ ఇచ్చారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ..కొత్తగూడ, గంగారం మండలాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. 30 పడకల ఆస్పత్రి భవణ నిర్మాణం స్థల కేటాయింపులో జాప్యంపై సమీక్షించిన మంత్రి.. సమస్యలుంటే పరిష్కరించి ఆస్పత్రి నిర్మాణం జరిగేలా చూడాలని కలెక్టర్, డీఎఫ్ఓలకు సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ కృష్ణవేణి, డీడబ్ల్యూఓ ధనమ్మ, డీఆర్డీఓ మధుసూదన్‌రాజు, డీఎస్ఓ ప్రేమ్‌కుమార్, సీడీపీఓ షబానా అజ్మీ, తహసీల్దార్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు. పంచాయతీరాజ్, సీ్త్రశిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గుంజేడులో సన్న బియ్యం పథకం ప్రారంభం -
జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి
జనగామ రూరల్:అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేయాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య, భువనగిరి ఎంపీ, దిశ కమిటీ కోకన్వీనర్ చామల కిరణ్‌కుమార్‌రెడ్డిలు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో దిశ (జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ) చైర్మన్ కడియం కావ్య అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎంపీ, దిశ కమిటీ చైర్మన్ కడియం కావ్య మాట్లాడుతూ రెండేళ్లుగా ఒక్కసారి కూడా దిశ సమావేశం నిర్వహించలేదని ఇకపై నిరంతరం దిశ సమావేశం ఉంటుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కేన్సర్ స్క్రీనింగ్ టెస్ట్‌లు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులు మరింతగా కృషి చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయిస్తున్న నిధులను సక్రమంగా వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిధులను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్ రిజ్వాన్ బాషా మాట్లాడుతూ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి ఉపాధి హామీ పథకం కింద 31.7 లక్షల పని దినాలను కూలీలకు కల్పించడం జరిగిందని, అలాగే రాష్ట్రంలో 4వ స్థానంలో ఉన్నామన్నారు. ప్రధాన మంత్రి కృషి సంచాయీ యోజన పథకం కింద భూగర్భ జలాలను పెంపొందించే విధంగా వాటర్ షెడ్ పనులను చేపట్టామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కింద పట్టణంలో 760 ఇళ్లకు, గ్రామీణంలో 3,633 ఇళ్లు మంజూరయ్యాయన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్, డీసీపీ రాజ మహేంద్ర నాయక్, డీఆర్డీఏ వసంత, ఆర్డీఓ గోపీరాం, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వరంగల్, భువనగిరి ఎంపీలు కడియం కావ్య, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి కలెక్టరేట్లో దిశ సమావేశం -
‘కుడా’కు కావాలి ఓ ఐఏఎస్!
సాక్షిప్రతినిధి, వరంగల్: గ్రేటర్ వరంగల్.. హైదరాబాద్ తర్వాత తెలంగాణలో రెండో నగరం. రాష్ట్ర రాజధానికి సమానంగా అభివృద్ధి చేస్తామని సీఎం, మంత్రులు పదే పదే చెబుతున్నారు. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(కుడా) ద్వారా మహా నగరాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఉందని కూడా ప్రకటించారు. అయితే.. అభివృద్ధి, సంక్షేమ పథకాలు పరుగులు పెట్టాలంటే ‘కుడా’కు ప్రత్యేకంగా ఓ ఐఏఎస్ అధికారిని నియమిస్తేనే సాధ్యమన్న చర్చ జరుగుతోంది. 1982 నుంచి సుమారు 25 మందికిపైగా అధికారులు ‘కుడా’ వైస్ చైర్మన్లుగా పని చేశారు. కొందరు వైస్ చైర్మన్‌తో పాటు వరంగల్ మున్సిపల్ కమిషనర్‌గా కూడా వ్యవహరించారు. అయితే 2009, 2011లో ప్రత్యేకంగా ‘కుడా’ వైస్ చైర్మన్లను నియమించిన ప్రభుత్వం.. ఆతర్వాత పూర్తి కాలపు వీసీలను నియమించలేదు. 2009 నవంబర్ 12న జక్కుల శంకరయ్యను ‘కుడా’ వీసీగా నియమించగా, ఆ తర్వాత 2013–14లో యాదగిరిరెడ్డి కొంతకాలం పని చేశారు. అనంతరం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) కమిషనర్లే.. ‘కుడా’ వైస్ చైర్మన్లుగా వ్యవహరిస్తున్నారు. కమిషనర్లే ఇన్చార్జ్ వీసీలు 2013–14 తర్వాత సుమారు పదకొండేళ్ల నుంచి ‘కుడా’కు పూర్తి కాలపు వైస్ చైర్మన్లను ప్రభుత్వాలు నియమించలేదు. యాదగిరిరెడ్డి తర్వాత ఐఏఎస్ అధికారులు పౌసమి బసు, ప్రశాంత్ జీవన్ పాటిల్, సర్ఫరాజ్ అహ్మద్ వరుసగా జీడబ్ల్యూఎంసీ కమిషనర్లుగా, ‘కుడా’ వైస్ చైర్మన్లుగా పని చేశారు. ఆతర్వాత ఎస్.దయానంద్ తర్వాత శృతిఓజా, వీపీ గౌతమ్, పమేలా సత్పతి, ప్రావీణ్య, రిజ్వాన్‌బాషా మొదలు ప్రస్తుతం ఉన్న అశ్విని తానాజీ వాకడే వరకు ఐఏఎస్‌లే మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్లుగా, ఇన్చార్జ్ వీసీలుగా ఉన్నారు. 2016లో జిల్లాల పునర్విభజన తర్వాత ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం ఉన్న జిల్లాకు కూడా కలెక్టర్‌గా ఐఏఎస్ అధికారులను నియమిస్తున్నారు. వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాలకు విస్తరించిన ‘కుడా’కు పూర్తికాలపు వైస్‌చైర్మన్ ఐఏఎస్ అధికారిని నియమించాలని నగర ప్రజలు కోరుతున్నారు. ప్రత్యేక ఐఏఎస్ ఉంటే మేలు మూడు జిల్లాలకు విస్తరించిన ‘కుడా’ పరిధిలో కోట్లాది రూపాయల విలువ చేసే అభివృద్ధి పనులపై ప్రభుత్వం హామీలు ఇచ్చింది. సుమారు రూ.10 వేల కోట్ల పనులకు సమర్పించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్)లు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. ● జీఎంఆర్ నిరభ్యంతర పత్రంతో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. 750 ఎకరాల స్థలం అందుబాటులో ఉండగా.. మరో 450 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం సేకరించాల్సి ఉంది. కాకతీయ మెగా జౌళి పార్కు కోసం రాష్ట్ర ప్రభుత్వం 1,200 ఎకరాల భూసేకరణ చేసి, టీజీఐఐసీ ద్వారా మౌలిక వసతులు కల్పించింది. ఇప్పటికే కొన్ని పరిశ్రమలు పని మొదలు పెట్టినా.. కేంద్రం నుంచి పీఎం మిత్ర కింద రూ.200 కోట్లు రాబట్టేందుకు ’ఎస్పీవీ’ (ప్రత్యేక ప్రయోజన వాహకం) ఏర్పాటు చేయడంతో పాటు రూ.500 కోట్ల మంజూరుపై చర్చ జరుగుతోంది. ● ఓరుగల్లుకు కీలకమైన స్మార్ట్‌సిటీ పథకం ద్వారా రూ.941.53 కోట్లతో 47 పనులకు నిధులు మంజూరు చేశారు. 28 పనులు పూర్తవగా.. 19 కొనసాగుతున్నాయి. స్మార్ట్‌రోడ్లు అసంపూర్తిగా ఉండడం, భద్రకాళి, వడ్డేపల్లి, ఉర్సు చెరువు బండ్ సుందరీకరణ పనులు.. నిధులు, పర్యవేక్షణ లేక జాప్యమవుతున్నాయి. ● గ్రేటర్ వరంగల్‌కు ఓ మంచి డంపింగ్ యార్డు లేదు. రోజూ 480 టన్నుల చెత్త పోగవుతున్నా.. డంపింగ్ చేసేందుకు రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్లతో ప్రతిపాదించారు. ● మహా నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు కోసం ప్రభుత్వంలో రూ.669.59 కోట్ల అంచనా వ్యయంతో పనులకు శంకుస్థాపన చేశారు. భూసేకరణ కోసం రూ.157.95 కోట్లు కేటాయించగా.. రహదారి నిర్మాణం కోసం రూ.551.64 కోట్లు మంజూరయ్యాయి. త్వరలోనే సరిపడా నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. ● వరంగల్ నగర అభివృద్ధి కీలకమైన 2041 మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించిన ‘కుడా’ పూర్తి స్థాయిలో అమలు కాకపోవడానికి పూర్తి కాలపు ఐఏఎస్ అధికారి వీసీగా లేకపోవడమేనన్న చర్చ కూడా జరుగుతోంది. ఐఏఎస్‌ను వీసీగా నియమించాలి కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వరంగల్(కుడా)కు బల్దియా కమిషనర్‌ను వీసీగా నియమించడం ఆనవాయితీగా వస్తున్నది. ఇన్చార్జ్ వీసీ పూర్తి స్థాయిలో దృష్టి సారించకపోవడంతో అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతున్నది. ఇకనైనా ప్రభుత్వం స్పందించి ‘కుడా’కు ఐఏఎస్ స్థా యి అధికారిని వీసీగా నియామకం చేయాలి. – అచ్చ వినోద్‌కుమార్, సామాజిక న్యాయవేదిక జిల్లా కార్యదర్శి రెగ్యులర్ వీసీని నియమించాలి అభివృద్ధిలో హైదరాబాద్‌తో పోటీపడుతున్న వరంగల్ మహా నగరం మరింత ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చెందాలంటే కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థకు సీనియర్ ఐఏఎస్ అధికారిని రెగ్యులర్ వైస్‌చైర్మన్‌గా నియమించాలి. ఇప్పటి వరకు ఇన్చార్జ్ వీసీలుగా మున్సిపల్ కమిషనర్, కలెక్టర్లను ప్రభుత్వం నియమిస్తూ వస్తున్నది. తద్వారా ‘కుడా’ అభివృద్ధికి ప్రణాళికలను పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోతున్నారు. సీనియర్ ఐఏఎస్‌ను వైస్‌చైర్మన్‌గా నియమిస్తే మాస్టర్‌ప్లాన్‌ను పటిష్టంగా అమలు చేసే అవకాశం ఉంటుంది. – నిమ్మల శ్రీనివాస్, సామాజికవేత్త, హనుమకొండ -
ఆదర్శప్రాయుడు మహాత్మాజ్యోతిబా పూలే
జనగామ రూరల్: ఆదర్శప్రాయుడు మహాత్మా జ్యోతిబా పూలే, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అ న్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో పూలే 199వ జయంతిని ఘ నంగా నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ పాల్గొని జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సామాజిక ఉద్యమకారుడిగా, కుల వివక్షతకు వ్యతిరేకంగా అన్ని వర్గాల సమానత్వానికి పాటుపడిన మహనీయుడన్నారు. సమానత్వం లేని కాలంలో సత్య శోధక్ సమాజ్ను ఏర్పాటు చేసి సమానత్వానికి ఎంతగానో కృషి చేశారన్నారు. అంతకుముందు సమాచార పౌరసంబంధాల శాఖ ఆ ధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళా కారుల బృందాలచే పూలే గొప్పతనాన్ని పాటల ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి రవీందర్, డీఎస్సీ డీఓ విక్రమ్, జిల్లా అధికారులు, వివిధ సంఘాల నాయకులు వెంకట మల్లయ్య, వేముల బాలరాజ్, నారోజు రామేశ్వర చారి, జామ మల్లేష్, బాల్డే మల్లేశం, శివరాత్రి దు ర్గయ్య, శివరాత్రి కుమార్, కడారి రమేష్, జూకంటి శ్రీశైలం, మామిడల రాజు, మంగ రామకృష్ణ, కన్నా పరశురాములు తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ రిజ్వాన్ బాషా -
వేరుశనగ సాగుపై రైతులకు శిక్షణ
మామునూరు: ఖిలా వరంగల్ మండలం మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో అధిపతి కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత మిషన్ నేతృత్వంలో శుక్రవారం వేరుశనగ సాగుపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కేవీకే సీనియర్ శాస్త్రవేత్త, కోఆర్డినేటర్ డాక్టర్ రాజన్న హాజరై వేరుశనగ సాగుపై శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి, మాట్లాడారు. రైతులకు టీసీజీఎస్–1694(విశిష్ట) వేరుశనగ సాగు వివరాలను రైతులకు వివరించారు. అనంతరం రైతులకు టీ సీజీఎస్ 1694 రకం వేరు శనగ విత్తనాలు అందజేశారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ సౌమ్య, రాజు, రైతు కోఆర్డినేటర్ రాజిరెడ్డి, హర్షరెడ్డి, సాయిచంద్, రైతులు పాల్గొన్నారు -
సైక్లింగ్ రోడ్ పోటీలకు కేయూ జట్టు
కేయూ క్యాంపస్: బికనీర్‌లోని మహారా గంగాసింగ్ యూనివర్సిటీలో ఈనెల 10 నుంచి నిర్వహించే ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ సైక్లింగ్ రోడ్(పురుషుల) పోటీలకు కేయూ జట్టును ఎంపిక చేసినట్లు కేయూ స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీ ఆచార్య వై.వెంకయ్య శుక్రవారం తెలిపారు. జట్టులో ఎన్.రాకేష్(శ్రీఅరుణోదయం డిగ్రీ కాలేజీ హనుమకొండ), ఎండీ.రియాజ్(మాస్టర్జీ డిగ్రీ కాలేటీ హనుమకొండ), జె.సంజీవ్, జి.లోకేష్(వరంగల్ కిట్స్), ఎన్.మహేందర్‌యాదవ్(యూసీపీఈ కేయూ), కె.బాలమురుగన్ (ఎల్బీ కాలేజీ వరంగల్) ఉన్నారు. వీరికి హనుమకొండలోని జాగృతి డిగ్రీ కాలేజీ ఫిజికల్ డైరెక్టర్ ఎ.రాజేష్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారని వెంకయ్య పేర్కొన్నారు. సెలవు రోజుల్లో ప్రత్యేక టూర్ ప్యాకేజీ హన్మకొండ: పర్యాటక ప్రాంతాల సందర్శనకు సెలవు రోజుల్లో ప్రత్యేక టూర్ ప్యాకేజీని తీసుకొచ్చినట్లు తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ డిప్యూటీ మేనేజర్(మార్కెటింగ్) టి.శ్రీనివాస్ రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండో శనివారం, ఆదివారం, అంబేడ్కర్ జయంతి రోజు సోమవారం వరంగల్, రామప్ప, లక్నవరం ప్రాంతాల పర్యటనకు ప్రత్యేక టూర్ ప్యాకేజీ అమలు చేస్తున్నట్లు వివరించారు. ఉదయం 8 నుంచి రాత్రి 7.30 వరకు పర్యాటక ప్రాంతాల సందర్శన ఉంటుందని పేర్కొన్నారు. ఏసీ బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. చార్జీలు పెద్దలకు రూ.980, పిల్లలకు రూ.790గా నిర్ణయించినట్లు వివరించారు. భోజన చార్జీలు రూ.150, బోటింగ్ చార్జీలు రూ.50 అదనం అని తెలిపారు. పర్యాటకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. అందుబాటులోకి టీజీ ఎన్పీడీసీఎల్ యాప్ హన్మకొండ: ఐఫోన్ వినియోగదారులకు టీజీ ఎన్పీడీసీఎల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్ ఎస్ఈ పి.మధుసూదన్ రావు, వరంగల్ సర్కిల్ ఎస్ఈ కె.గౌతం రెడ్డి తెలిపారు. మరిన్ని సాంకేతిక అంశాలు జోడించి టీజీ ఎన్పీడీసీఎల్ యాప్‌ను ఆధునీకరించినట్లు వారు వేర్వేరు ప్రకటనలో వెల్లడించారు. ఐఫోన్ యాప్ స్టోర్ నుంచి టీజీ ఎన్పీడీసీఎల్ యాప్‌ను డౌన్లోడు చేసుకోవచ్చన్నారు. ఈ యాప్‌లో 20 ఫీచర్లు ఉన్నాయని వివరించారు. రిపోర్ట్ ఆన్ ఇన్సిడెంట్, కనూ్స్య్మర్ గ్రీవెన్సెస్, న్యూ కంప్లైంట్, కంప్లైంట్ స్టేటస్, రీఓపెన్, సెల్ఫ్ రీడింగ్, పే బిల్స్, బిల్ హిస్టరీ, ఆన్ లైన్ పేమెంట్ హిస్టరీ, కొత్త సర్వీస్ స్థితి, లింక్ ఆధార్ – మొబైల్, డొమెస్టిక్ బిల్ క్యాలిక్కులెటర్, కొత్త కనెక్షన్ ఎ లా తీసుకోవాలి, పేరు– లోడ్ మార్పు, పవర్ క ంజమ్సన్ గైడ్‌లైన్స్, టారిఫ్ డీటెయిల్స్, ఎనర్జీ సేవింగ్ టిప్స్, సేఫ్టీ టిప్స్, ఫీడ్ బ్యాక్, మై అ కౌంట్, వినియోగదారుల బిల్లు సమాచారం, వినియోగదారుల పరిధిలోని అధికారి వివరా లు, కాంటాక్ట్ ఆజ్.. అనే ఫీచర్లు ఈ యాప్‌లో అందుబాటులో ఉన్నాయని వివరించారు. వ్యక్తిపై కేసు నమోదు బయ్యారం: వితంతు మహిళపై లైంగికదాడికి యత్నించిన వ్యక్తిపై శుక్రవారం బయ్యారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని పీహెచ్సీ సమీపంలో నివసించే కె.కార్తీక్ గురువారం రాత్రి ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లోకి వెళ్లాడు. ఈ క్రమంలో లైంగికదాడికి యత్నించటంతో మహిళ కేకలు వేయగా కార్తీక్ పరారయ్యాడు. ఈ మేరకు బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. మహిళ ఆత్మహత్య బచ్చన్నపేట: మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని కట్కూర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎనుగుల లక్ష్మి(59)కి ఇటీవల అనారోగ్య సమస్యలతోపాటు మానసికంగా కూడా సరిగా ఉండడంలేదు. ఈక్రమంలో శుక్రవారం కుటుంబ సభ్యులు వ్యవసాయ పనులకు వెళ్లారు. పనులు ముగించుకుని వచ్చేలోగా లక్ష్మి ఉరివేసుకుని కన్పించింది. మృతురాలికి భర్త ఎల్లయ్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలాన్ని ఎస్సై ఎస్కే హమీద్ పరిశీలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
జిల్లా సమాఖ్యకు పెట్రోల్‌బంక్!
● 10 గుంటల భూమికి ప్రపోజల్ ● సెర్ప్ నుంచి నిధులు జనగామ: జనగామ జిల్లా కేంద్రంలో మరో పెట్రోల్‌బంకు రాబోతుంది. జిల్లా సమాఖ్యకు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి స్థల పరిశీలన పూర్తి కాగా, ప్రపోజల్స్ సర్కారుకు పంపించారు. రాష్ట్రంలో నారాయణపేట్‌లో సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్‌బంక్ రన్నింగ్ అవుతుండగా.. రెండవ బంకు జనగామకు రానుంది. పట్టణంలోని సిద్దిరోడ్డు వైపు స్థలంకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా... సర్కారు ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు. రూ.కోటి నిధులతో చేపట్టే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నిధులను సెర్ఫ్ ఉంచి ఇవ్వనున్నారు. ప్రభుత్వం నుంచి భూ కేటాయింపులు పూర్తయిన వెంటనే పెట్రోలు బంకు నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. -
మంటగలిసిన మానవత్వం
వడదెబ్బకు గురైన కన్నతల్లికి అంత్యక్రియలు చేయని కొడుకు..చిట్యాల: కన్న తల్లికి అంత్యక్రియలు నిర్వహించకుండా ఇంటికి తాళం వేసి పారిపోయాడు ఆ కొడు కు.. కుల పెద్దలు దహన సంస్కారాలు నిర్వహించగా.. పెద్ద కూతురు నిప్పు పెట్టిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నైన్పాక గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గోనెల మల్లయ్య–రాధమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు స్వరూప, వసంత, కుమారుడు ఓదెలు ఉన్నారు. ముగ్గురికి వివాహం అయింది. కాగా పదే ళ్ల క్రితమే మల్లయ్య అనారోగ్యంతో మృతి చెందా డు. ఈ క్రమంలో కొడుకు ఒదెలు తల్లి రాధమ్మతో నిత్యం గొడవ పెట్టుకుని ఆమెను బయటకు గెంటేశాడు. దీంతో ఆ మాతృమూర్తి గ్రామంలోనే ఓ అద్దె ఇంట్లో ఉంటూ కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నది. గురువారం ఉదయం గ్రామస్తులతో కలిసి ఉపాధి హామీ పనికి వెళ్లిన రాధమ్మ అక్కడే అస్వస్థతకు గురైంది. విషయం తెలిసినా ఉపాధి హామీ పని చేస్తున్న కుమారుడు ఓదెలు పట్టించుకోకుండా ఇంటికి వెళ్లిపోయాడు. గ్రామస్తులు చిన్న కుమార్తెకు సమాచారం ఇవ్వగా అక్కడికి చేరుకుని తల్లిని తీసుకుని భూపాలపల్లి ఆస్పత్రికి వెళ్లారు. ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యులు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి పంపించారు. ఈక్రమంలో శుక్రవారం తెల్లవారుజామున రాధమ్మ మృతి చెందడంతో చిన్న కూతురు ఇంటికి తీసుకువెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న కుమారుడు ఓదెలు అతని భార్య, కుమార్తెను గ్రామంలో వదిలేసి అతని కుమారుడితో కలిసి వెళ్లిపోయాడు. గ్రామస్తులు అతడి ఆచూకి వెతికినా లభించకపోవడంతో స్థానిక ఎస్సై శ్రావణ్‌కుమార్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన అక్కడికి చేరుకుని మృతిరాలి కుమార్తెలతో మాట్లాడి అంత్యక్రియలకు ఒప్పించారు. అంత్యక్రియలను కులస్తుల సహకారంతో నిర్వహించగా.. పెద్ద కూతురు స్వరూప తల్లికి తలకొరివి పెట్టింది. దహన సంస్కారాలు చేసిన కులస్తులు తలకొరివి పెట్టిన పెద్ద కూతురు -
రూపాయిన్నర కోసం లొల్లి
జనగామ: జనగామ వ్యవసాయ మార్కెట్ కాటన్ యార్డులో ఏర్పాటు చేసిన ఐకేపీ కొనుగోలు కేంద్రంలో రూ.1.50 (రూపాయిన్నర) లొల్లితో రెండు రోజులుగా కొనుగోళ్లు నిలిచి పోయాయి. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులకు తీవ్ర ఇబ్బందులు తప్పడంలేదు. రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని బస్తాలో నింపి కాంటా వేసిన తర్వాత లారీలో లోడ్ చేసినందుకు హమాలీలకు రైతులు క్వింటాకు రూ.80 చెల్లిస్తున్నారు.అయితే లారీ కాంట్రాక్టర్ నుంచి బస్తాకు రూ. 1.50 పైసలు ఇవ్వాలని హమాలీలు డిమాండ్ చేస్తుండగా.. ససేమిరా అనడంతో రెండు రోజులుగా కాంటా నిలిచి పోయింది. రైతుల నుంచి వ్యతిరేకత రావడంతో ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, సివిల్ సప్లయిస్ డీఎం హతీరామ్, మార్కెటింగ్ మేనేజర్ నరేంద్ర, పౌర సరఫరాల శాఖ నాయబ్ తహసీల్దార్ శ్రీనివాస్ లారీ కాంట్రాక్టర్, హమాలీలతో చర్చలు జరిపారు.అయినా రూ.1.50 పైసలు ఇచ్చేందుకు సదరు కాంట్రాక్టర్ ఒప్పుకోలేదు. ప్రస్తుతం జిల్లాలోని ఐకేపీ సెంటర్లలో క్వింటా ధాన్యం కాంటా వేసి, లోడ్ చేస్తే రూ.60 ఉండగా, ఇక్కడ మాత్రం రూ.80 ఇస్తున్నారని, సర్దుకు పోవాలని హమాలీలకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. ఇరువురి మధ్య గురువారం రాత్రి వరకు చర్చలు సాగుతూనే ఉన్నాయి. -
రైతుల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం
స్టేషన్‌ఘన్‌పూర్: సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతిగా పనిచేస్తుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని తానేదార్పల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషాతో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ డీఎస్ వెంకన్న అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. తానేదార్పల్లి గ్రామస్తులు చాలా అదృష్టవంతులని, జనవరిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలను ఈ గ్రామంలోనే ప్రారంభించినట్లు తెలిపారు. ఆయా సంక్షేమ పథకాల విషయంలో అధికారులు అప్రమత్తంగా, బాధ్యతగా పనిచేయాలన్నారు. రైతులు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతుభరోసాతో పాటు సన్నాలకు క్వింటాకు రూ.500 బోనస్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్, డీఆర్డీఏ వసంత, డీఏఓ రామారావునాయక్, ఏఎంసీ చైర్పర్సన్ లావణ్యశిరీష్‌రెడ్డి, డీఎం సీఎస్ హతీరాం, గృహనిర్మాణ పీడీ మాతృనాయక్, ఎంపీడీఓ విజయశ్రీ, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఏపీఎం కుమారస్వామి, నాయకులు వెంకన్న, ఇంద్రారెడ్డి, పద్మారెడ్డి, కుమారస్వామి పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. మండలంలోని విశ్వనాధపురంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏఎంసీ చైర్పర్సన్ లావణ్యశిరీష్‌రెడ్డి గురువారం ప్రారంభించారు. అవినీతి రహిత పాలనే లక్ష్యం అవినీతి రహిత పాలనే లక్ష్యమని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఘన్పూర్ డివిజన్ కేంద్రంలోని రైతువేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం చేపట్టారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కడియం శ్రీహరితోపాటు కలెక్టర్ షేక్ రిజ్వాన్‌బాషా, అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్ హాజరయ్యారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా చూడాలని అధికారులకు చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీఓ డీఎస్ వెంకన్న, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
ఆర్థిక ప్రగతికి సంఘాలు కృషి చేయాలి
జనగామ రూరల్: సహాకార సంఘాలు ప్రజల ఆర్థిక ప్రగతికి కృషి చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా సహకార అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సహకార సంఘాల కార్యకలాపాల పనితీరును అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్‌తో కలిసి సంబంధిత శాఖల అధికారులతో గురువారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సహకార సంఘాల పరిధిలోని వివిధ వృత్తి కుటుంబాలను బలోపేతం చేసేందుకు గ్రామస్థాయిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, రైతుసేవా సహకార సంఘాలు, పాల ఉత్పత్తుల సహకార సంఘాలు, మత్స్యసహకార సంఘాలు, కల్లుగీత కార్మిక సంఘాల ద్వారా విస్తృత సేవలు అందించాలన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత సేవలందించడానికి మరిన్ని సహకార సంఘాల ఏర్పాటు చేయాలన్నారు. రైతు ఉత్పత్తి కేంద్రాలను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పరిధిలో ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకతను అధికారులతో సమీక్షిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వివరించారు. మత్స్యసహకార సంఘాలు, పాల ఉత్పత్తుల సహకార సంఘాలు తమ వ్యాపార పరిధిని పెంచుకొని సంబంధిత వృత్తి గ్రామీణ ప్రజలకు మరింత సేవలందించాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో జెడ్పీ డిప్యూటీ సీఈఓ సరిత, జిల్లా సహకార శాఖ అధికారి రాజేందర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి రామారావు నాయక్, జిల్లా మత్స్యశాఖ అధికారి రాణా ప్రతాప్, పశుసంవర్ధన శాఖ అధికారి రాధా కిషన్, నాబార్డ్ ఏజీఎం చంద్రశేఖర్, విజయడైరీ అధికారి సత్యనారాయణ, డీసీసీబీ అధికారి అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పనుల్లో వేగం పెంచాలి స్టేషన్‌ఘన్‌పూర్: గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచేలా అధికారులు చూడాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్‌బాషా అన్నారు. మండలంలోని తానేదార్‌పల్లిలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను అధికారులతో కలిసి గురువారం ఆయన పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడారు. భూమిపూజ ఎప్పుడు చేశారు, మొరం, ఇసుక ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారని ఆరా తీశారు. కాగా, అక్కడే ఉన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు వెంకన్న మాట్లాడుతూ.. ఇసుకతో సమస్య ఉందని, గోదావరి ఇసుక కొనాలంటే ప్రజలు ఇ బ్బంది పడుతున్నారని, లోకల్ ఇసుకకు అనుమతి ఇవ్వాలని లబ్ధిదారుల పక్షాన కోరారు. దీంతో కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ తహసీల్దార్‌కు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల ద్వారా పేదల సొంతింటి కలను సాకారం చేస్తుందన్నారు. పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికై న గ్రామాల్లో నిర్మాణాలు త్వరగా పూర్తిచేసేలా అధికారులు బాధ్యతగా పనిచేస్తూ లబ్ధిదారులను చైతన్యం చేయాలన్నారు. కార్యక్రమంలో గృహ నిర్మాణ పీడీ మాతృనాయక్, ఎంపీడీఓ విజయశ్రీ, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీఓ నర్సింగరావు, పంచాయతీ కార్యదర్శి వెంకటరమణ, నాయకులు మంతెన ఇంద్రారెడ్డి, పద్మారెడ్డి, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ -
జీపీ కార్మికుడికి ప్రభుత్వమే వైద్యం అందించాలి
సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజు రఘునాథపల్లి: విద్యుదాఘాతానికి గురై తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మండలంలోని మేకలగట్టు పంచాయతీ కార్మికుడు వేల్పుల నాగరాజుకు ప్రభుత్వమే పూర్తి వైద్య ఖర్చులు భరించి మెరుగైన వైద్యం అందించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాపర్తి రాజు డిమాండ్ చేశారు. ఈ నెల 5వ తేదీన గ్రామంలో వీధిలైట్లు వేస్తూ నాగరాజు విద్యుదాఘాతానికి గురై తీవ్ర గాయాలతో హనుమకొండ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా అధికారులు పట్టించుకోక పోవడాన్ని నిరసిస్తూ మండలంలోని పంచాయతీ కార్మికులు గురువారం ఎంపీడీఓ కార్యాలయం ముందు భైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్బంగా రాజు మాట్లాడుతూ మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేసి పంచాయతీ కార్మికులకు ఉద్యోగ భద్రత, ప్రమాద బీమా, ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పులు చేసి వైద్యం చేయించుకుంటున్న నాగరాజుకు ప్రభుత్వం వైద్య సేవలు అందించకుంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాసులుకు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. కార్యక్రమంలో ఉమ్మగోని రాజేష్‌గౌడ్, మహేందర్, రాపోలు రాజ్‌కుమార్, సత్యనారాయణ, కొయ్యడ బిక్షపతి, నల్ల రాజన్న, ఎండీ అజ్మత్, ప్రభాకర్, నీలం మధు, యాదలక్ష్మి, రేణుక పాల్గొన్నారు. -
సీతారామచంద్రస్వామికి చక్రస్నానం
పాలకుర్తి టౌన్: మండలంలోని వల్మిడి శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో బ్రహ్మత్సవాల్లో భాగంగా 9వ రోజు గురువారం స్వామి వారికి ప్రాతరారాధన, పూర్ణహుతి, రాములవారి గుండంలో స్వామివారి చక్రస్నానం నిర్వహించారు. చక్రవర్తి తీర్థప్రసాద గోష్ఠ అర్చకులు వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. నేడు డయల్ యువర్ డీఎం జనగామ రూరల్: ఆర్టీసీ జనగామ డిపోలో నేడు (శుక్రవారం) డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ స్వాతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. డిపో పరిధిలోని బచ్చన్నపేట, దేవరుప్పుల, లింగాలఘన్పూర్, నర్మెట్ట, తరిగొప్పుల, రఘునాధపల్లి, మద్దూర్, పాలకుర్తి మండలాల పరిధిలోని గ్రామాల ప్రజలు ఫోన్ చేయాలని తెలిపారు. ఆర్టీసీ బస్సు సర్వీస్ సేవలకు సంబంధించి సమస్యలతోపాటుగా సూచనలు సలహాలను తెలిపేందుకు డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 10.00 గంటల నుంచి 11.00 గంటల వరకు 99592 26050 ఫోన్ నంబర్‌కు డయల్ చేయాలని కోరారు. గడువు పొడిగింపు జనగామ రూరల్: అగ్ని వీర్ ఆన్లైన్ కామన్ ఎంట్రెన్స్ పరీక్ష దరఖాస్తు గడువు పొడిగించినట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి సాహితి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత సైన్యంలో అన్ని కేటగిరీలలో జూనియర్ కమిషన్ ఆఫీసర్లు, ఇతర హోదాల నియామకం కోసం ఈ పరీక్షకు దరఖాస్తు గడువు మార్చి 12వ తేదీ నుంచి ఏప్రిల్ 25వ తేదీ వరకు పెంచినట్లు తెలిపారు . పార్టీని మరింత బలోపేతం చేయాలి బీజేపీ జిల్లా అధ్యక్షుడు చౌడ రమేష్ జనగామ రూరల్: గ్రామస్థాయిలో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలు అంకితభావంతో పని చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు చౌడ రమేష్ కోరారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు బోమ్మగంటి అనిల్‌గౌడ్ నేతృత్వంలో బస్తీ చలో.. గావ్ చలో అభియాన్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని జూబ్లీ గార్డెన్స్‌లో పార్టీ కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడుతూ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పర్యటించి కార్యకర్తలను చైతన్యపర్చాలన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధి సాధిస్తుందన్నారు. బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు లక్ష్మీనర్సయ్య, దేవర ఎల్లయ్య, కార్తీక్తేజ, బింగి రమేష్, అశోక్, చంద్రయ్య, జగదీష్, హరిప్రసాద్ పాల్గొన్నారు. ఆహ్వానం దేవరుప్పుల : తెలుగు భాషకు పట్టాభిషేకం పేరుతో మే 8వ తేదీన హైదరాబాద్‌లోని త్యాగరాయ గానసభలో తలపెట్టిన అంతర్జాతీయ కవి సమ్మేళనంలో కవితా గానం చేసేందుకు మండల కేంద్రానికి చెందిన సామాజిక కవి, రచయిత అంకాల సోమయ్యకు భాషా చైతన్యసమితి అధ్యక్షులు బడేసాబ్ గురువారం ఆహ్వానం పంపించారు. సోమయ్య ఎంపికపై జనగామ రచయితల సంఘం అధ్యక్షుడు అయిలా సోమనరసింహాచారి, కవులు హర్షం వ్యక్తం చేశారు. కలెక్టరేట్లో నేడు పూలే జయంతి జనగామ రూరల్: జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నేడు కలెక్టరేట్లో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలను నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ అధికారి రవీందర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హాజరవుతారని పేర్కొన్నారు. ఉదయం 10గంటలకు నిర్వహించే ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. -
వణికిస్తున్న వరుణుడు
శుక్రవారం శ్రీ 11 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025– 8లోuజనగామ: రైతన్నలకు వరుణుడు వణుకుపుట్టిస్తున్నాడు. యాసంగి సీజన్లో కరువు నష్టాన్ని మిగిల్చితే.. ఉన్న కాసింత పంటను అమ్ముకుందామంటే ప్రకృతి కన్నెర్ర చేస్తూ ఆగం చేస్తోంది. గాలి దుమారం, అకాల వర్షం భయంతో పచ్చిమీదనే రైతులు పంటను కోస్తున్నారు. తీరా.. పంటను అమ్ముకునేందుకు మార్కెట్‌కు వెళితే.. వర్షం భయం వెంటాడుతోంది. గడిచిన మూడు రోజులుగా గాలి దుమారం, చిరుజల్లులతో అన్నదాతలు అతలాకుతలం అవుతున్నారు. వాతావరణ మార్పులు.. ఎండాకాలంలో వాతావరణం గతితప్పిందా అన్నట్లుగా.. పరిస్థితులు మారుతున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు 38 డిగ్రీల ఉష్ణోగ్రతలతో భగ్గున మండిపోతుండగా, సాయంకాలం వాతావరణం చల్లబడిపోతుంది. దీంతో కోతకోసి మార్కెట్‌కు తీసుకొచ్చిన ధాన్యం ఎండిన తర్వాత, మళ్లీ తడుస్తుంది. దీంతో క్వింటా ధాన్యం రూ.200 నుంచి రూ.400 తక్కువకు విక్రయించే పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తగ్గిన దిగుబడి.. జిల్లాలో యాసంగి సీజన్లో 1.80లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. వర్షాభావ పరిస్థితులు, ఎండిన చెరువులతో భూగర్భ జలాలు అడుగంటి 30 శాతం మేర పంటలు ఎండిపోయాయి. దీంతో దిగుబడి తగ్గిపోయింది. ప్రస్తుతం చాలాచోట్ల మరో పదిరోజుల తర్వాత కోతలు మొదలు పెట్టాల్సి ఉంది. కానీ అకాల వర్షం భయంతో పచ్చి కోతలు చేపట్టడంతో సరాసరి మిగులుబాటు అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. జనగామ మార్కెట్లో తడిసిన ధాన్యం జిల్లాలో గురువారం కురిసిన వర్షంతో కల్లాలు, మార్కెట్లో ఉన్న ధాన్యం తడిసింది. జనగామ మార్కెట్‌తోపాటు కాటన్ యార్డులో ఏర్పాటు చేసిన ఐకేపీ సెంటర్లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న ధాన్యం రాసులు తడిసి పోగా, కొంతమేర ధాన్యం కొట్టుకుపోయింది. వరదలో కొట్టుకుపోతున్న ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు ఇబ్బందులుపడ్డారు. గాలిదుమారం ప్రారంభం కాగానే, ధాన్యం రాసులపై టారాల్పిన్ కవర్లు కప్పి ఉంచినా, స్వల్ప నష్టం జరిగింది. పొద్దంతా ఎండిన ధాన్యం తడిసిపోవడంతో తేమ శాతం పెరిగిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. బండపై ధాన్యాన్ని ఆరబోశా.. మూడెకరాల భూమిని కౌలుకు తీసుకొని వరి సాగు చేశా. సుమారు రూ.75వేలకు పైగా పెట్టుబడి పెట్టిన. సాగునీరు అందక 25 శాతంమేర నష్టపోగా, ఉన్న పంటకు నీటిని అద్దెకు తీసుకుని కాపాడాను. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో పచ్చిమీదనే పంట కోసిన. ధాన్యాన్ని బండపై ఆరబోశాను. మబ్బులు చూస్తుంటే గుబులు పుడుతుంది. – సముద్రాల యాకయ్య, రైతు, జఫర్గఢ్న్యూస్రీల్ ఉదయం ఎండలు.. సాయంత్రం గాలులు ముమ్మరంగా కోతలు.. కల్లాల్లో ధాన్యం జిల్లాలో తగ్గిన దిగుబడి.. మార్కెట్లో తడిసిన ధాన్యం -
దొడ్డువడ్లకూ బోనస్ ఇవ్వాలి
నర్మెట/బచ్చన్నపేట/తరిగొప్పుల/జనగామ రూరల్: దొడ్డు ధాన్యానికి సైతం తెలంగాణ ప్రభుత్వం బోనస్ అందించాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. నర్మెట మండలంలోని హన్మంతా పురం, బొమ్మకూర్, మల్కపేట, మచ్చుపహాడ్, అ మ్మాపురం, వెల్దండలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభంకాగా మల్కపేట, మచ్చుపహాడ్ ఎమ్మెల్యే పాల్గొన్నారు. బచ్చన్నపేట మండలంలోని కేసిరెడ్డిపల్లి, కొడవటూర్, తరిగొప్పుల మండలంలోని అబ్దుల్‌నాగారం, అక్కరాజుపల్లి, పోతారం, జనగామ మండలం పెంబర్తి, పెద్దపహడ్, అడవికేశావాపూర్, ఎర్రగోల్లపహడ్ వెంకిర్యాల గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని తెలిపారు. దేవాదుల మూ డో ఫేజ్‌లో రూ.1,600 కోట్లతో 1,800 క్యూసెక్కుల నీటి పంపిణీకి కేసీఆర్ ప్రభుత్వం 2014లోనే పనులు ప్రారంభించిందన్నారు. ఎమ్మెల్యే రాక ఆలస్యం కావడంతో హన్మంతాపూర్, బొమ్మకూర్‌లో చేర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ స్వేత, డీసీసీ ఉపాధ్యక్షుడు గంగం నర్సింహారెడ్డితో కలసి కేంద్రాలను ప్రారంభించడంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య తీవ్రవాగ్వాదం చోటుచేసుకుంది. సీఐ అబ్బయ్య, ఎస్సై నగేశ్ ఇరువర్గాలకు నచ్చజెప్పడంతో కార్యక్రమాలు సజావుగా సాగాయి. ఆయా కార్యక్రమాల్లో చేర్యాల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ శ్వేత, నర్మెట తహసీల్దార్ రామానుజాచార్యులు, ఎంపీడీఓ అరవింద్ చౌదరి, ఏఓ మనోహిత్ విక్రమ్‌రావు, ఏపీఎం రవి, సీసీలు యాదగిరి, కవిత, కు మార్, నాయకులు నర్సింగారావు, రాజిరెడ్డి, తేజావత్ గోవర్ధన్, శ్రీనివాస్, గౌస్, లక్ష్మీనారాయణ, లక్ష్మి, అంజయ్య, బచ్చన్నపేటలో పీఏసీఎస్ చైర్మన్ పూర్ణచందర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాల్‌రెడ్డి, సీఈఓ బాలస్వామి, రూపాచైతన్య, అనిల్‌రాజ్, తరిగొప్పు ల తహసీల్దార్ మహిపాల్‌రెడ్డి, ఏపీఎం విజయ, పింగిళి జగన్మోహన్రెడ్డి, అర్జుల సంపత్‌రెడ్డి, చిలువే రు లింగం, శ్రీనివాస్ రెడ్డి, రాజేశ్వర్‌గౌడ్, సంజీవ, సుదర్శన్‌గౌడ్, రామరాజు, మహేందర్, సంపత్, బీమయ్య, రవీందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ బను క శివరాజ్, నిమ్మతి మహేందర్‌రెడ్డి, చిర్ర శ్రీనివాస్ రెడ్డి, మేకల కళింగరాజు, ప్రమోద్‌రెడ్డి, ప్రేమలతరెడ్డి, శ్రీనివాస్, నర్సిరెడ్డి, లక్ష్మీనారాయణనాయక్, రాజమౌళి, రాంమ్మోహన్, భాస్కర్‌రెడ్డి, నాయకు లు, రైతులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి -
వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపన పూజలు
జనగామ: జిల్లా హెడ్ పోస్టాఫీసు ఏరియా సంతోషిమాత, ఆంజనేయస్వామి ఆలయ మహారా జ గోపుర, ధ్వజస్తంభ, పరివార సమేత, విగ్రహ స్థిర ప్రతిష్ఠాపన మహోత్సవ వేడుకలు గురువారం అంగరంగ వైభవోపేతంగా ప్రారంభమాయ్యాయి. ఆలయ ప్రధాన పూజారి శ్రీనివాసశర్మ ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ వేద పురాణం మహేశ్వరశర్మ పర్యవేక్షణలో ఈ నెల10 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించనున్న పూజా కార్యక్రమాలను మొదలు పెట్టారు. మొదటి రోజు వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ విగ్రహాలకు పూజలు చేశారు. 11వ తేదీన గోపూజ, గురువందనం, పుణ్యాహవచనం, అరణి మధనం, యా గశాల ప్రవేశం, గణేష హోమం, స్థాపిత దేవతా పూజలు, జలాధివాసం తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 12న స్థాపిత దే వతాపూజలు, విగ్రహాలకు స్నపనం, ధాన్యాధి వాసం, ప్రదోషకాల పూజలు, రాజోపచారాలు, 13న హవనములు, శయాధివాస, ఫలనుష్పాధివాస, హిరణ్యాధివాసములు, 14న ప్రతిష్ఠాంగ హోమాలు, గర్త న్యాసం, పిండికాస్థాపన, మూర్తి స్థాపన, స్వాతి నక్షత్ర మిథున లగ్న ముహూర్తంలో విగ్రహాల ప్రాణప్రతిష్ఠ, బలిహరణం, మహాపూర్ణాహుతితో వేడుకలు ముగుస్తాయి. -
ఐక్యంగా ఉండి రాజకీయంగా ఎదగాలి
లింగాలఘణపురం: కురుమలు ఐక్యంగా ఉండి రాజకీయంగా ఎదగాలని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని నెల్లుట్లలో కురుమ సంఘం ఆధ్వర్యంలో బీరప్పగుడి నిర్మాణానికి గురువారం ఎమ్మెల్యే కడియం శ్రీహరి భూమిపూజ చేశారు. అనంతరం ఆలేరు ఎమ్మెల్యే, విప్ బీర్ల ఐలయ్య ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గతంలో కురుమ సామాజిక వర్గానికి చెందిన తల్లిదండ్రులు తమ పిల్లలను గొర్రెల మేపడం, వ్యవసాయ పనులకు పంపించారని, దీంతో ఎదగలేకపోయారని అన్నారు. నేడు కురుమలు డాక్లర్లు, ఐఏఎస్, ఐపీఎస్‌లు అవుతున్నారని, అదేవిధంగా రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఉందని, తాను ఎమ్మెల్యేగా గెలువడానికి కురుమ కులస్తులు ఎంతో కృషి చేశారని అన్నారు. ఆలయ నిర్మాణానికి సహకారం చేస్తానని చెప్పారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ కురుమలు నమ్మకానికి, నీతికి, నిజాయితీకి మారుపేరుగా నిలిచారని అన్నారు. నియోజకవర్గంలో కురుమలకు తగిన స్థానం కల్పిస్తానని చెప్పారు. అదేవిధంగా బీరప్పగుడి సమీపంలోనే రూ.20 లక్షలతో కురుమ భవనం నిర్మించేందుకు నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమాల్లో కురుమ సంఘం జనగామ జిల్లా అధ్యక్షుడు కంచె రాములు, కొమురవెల్లి దేవస్థాన మాజీ చైర్మన్ సంపత్, మాజీ జెడ్పీటీసీ గుడి వంశీధర్‌రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ శివకుమార్, లింగాల దీపక్‌రెడ్డి, కురుమ సంఘం మండల అధ్యక్షుడు చంద్రమౌళి, అంజనేయులు, సంపత్, మల్లేశం, ఐలయ్య, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. కురుమలకు సహకారం అందిస్తాం నెల్లుట్లలో బీరప్పగుడి నిర్మాణానికి భూమిపూజ పాల్గొన్న విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే కడియం -
చివరి ఆయకట్టు వరకు నీరందించాలి
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి జనగామ రూరల్: దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు పరిధిలోని చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా తగిన చర్యలు తీసుకోవాలని స్టేషన్‌ఘన్‌పూర్ ఎ మ్మెల్యే కడియం శ్రీహరి అధికారులను ఆదేశించా రు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశహాల్లో కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్, నీటి పారుదల శాఖ అధికారులతో దేవాదుల ఎత్తిపోతల పథకం కింద భూసేకరణ ప్రక్రియ, పెండింగ్ పనుల పురోగతి, సాగు నీటి సరఫరాపై సమీక్షించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారానే ఘన్పూర్ నియోజకవర్గంలోని ఏడు మండలాలకు సాగుకు నీరు అందుతోందని యుద్ధప్రాతిపదికన దేవాదుల ప్రాజెక్టు పెండింగ్ పనులను పూర్తి చేయాలన్నారు. మల్లన్నగండి లిఫ్ట్ 1, 2 పనులను జులై లోగా పూర్తిచేసి, సాగు నీరు అందించాలన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు సమన్వయంతో పెండింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్డీసీలు సుహాసిని, హనుమాన్ నాయక్, ఆర్డీఓలు గోపీరాం, వెంకన్న, మార్కెట్ కమిటీ చైర్మ న్ లావణ్య, మారుజోడు రాంబాబు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అశోక్, నీటి పారుదల శాఖ ఎస్ ఈలు, ఈఈలు, డీఈలు పాల్గొన్నారు. -
సన్నబియ్యం పంపిణీ విప్లవాత్మకం
స్టేషన్‌ఘన్‌పూర్: దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి పేదలకు రేషన్‌షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ పథకం చేపట్టడం విప్లవాత్మకమైన నిర్ణయమని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎస్సీకాలనీలో రేషన్‌బియ్యం లబ్ధిదారురాలు తాటికొండ యాదమ్మ ఇంటిలో వండిన భోజనాన్ని ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్ రిజ్వాన్‌బాషా, అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్ తదితరులు సహఫంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీమంతులు తినే సన్నబియ్యాన్ని పేదలకు అందిస్తున్న ఘనత సీఎం రేవంత్‌రెడ్డిదే అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సన్నబియ్యం పంపిణీ పథకం పేదల ఆత్మగౌరవ పథకమన్నారు. సన్నరకం వరిధాన్యం ఎక్కువగా సాగుచేసేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, ఈ దిశగానే సన్నరకం పండించిన వారికి క్వింటాకు రూ.500 బోనస్ చెల్లిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ జూలుకుంట్ల లావణ్యశిరీష్‌రెడ్డి, ఆర్డీఓ డీఎస్ వెంకన్న, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఆర్ఐ శ్రీకాంత్, నాయకులు సీహెచ్.నరేందర్‌రెడ్డి, సింగపురం వెంకటయ్య, చింత ఎల్లయ్య, చింత జాకబ్, తాటికొండ యాదగిరి, సన్నీ తదితరులు పాల్గొన్నారు. పోషణ పక్షోత్సవాలను విజయవంతం చేయాలి ప్రతి అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ అభియాన్ కింద చేపట్టే పోషణ పక్షం 2025 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మహిళలు, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్‌తో కలిసి ఐసీడీఎస్ సూపర్వైజర్లు, సీడీపీఓలకు పోషణ్ అభియాన్–పోషణ పక్షం కార్యకమంపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు ఈ నెల 22 వరకు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల పౌష్టికాహారంపై అవగాహన కల్పించాలన్నారు. అనంతరం వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఫ్లోరెన్స్, డీఏఓ రామారావు నాయక్, డీఎస్సీడీఓ విక్రమ్, డీఎంహెచ్ఓ మల్లిఖార్జున్ రావు, డీఈఓ రమేష్, డిప్యూటీ డీఎంహెచ్ఓ శ్రీదేవి, ప్రోగ్రామింగ్ అధికారి రవీందర్, పోషణ్ అభియాన్ జిల్లా కో–ఆర్డినేటర్ రాజశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్‌ఘన్‌పూర్‌లో లబ్ధిదారుడి ఇంటిలో భోజనం చేసిన ఎమ్మెల్యే, కలెక్టర్ -
ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం
జనగామ: జనగామ మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ (ఏసీ) పింకేష్ కుమార్ అన్నారు. శానిటేషన్ నిర్వహణ, కరువైన ఆహ్లాదం, చెత్తతో నిండి పోయిన రోడ్లు, అస్తవ్యస్తంగా వీధి దీపాల నిర్వహణ తదితర పట్టణ సమస్యలపై సాక్షిలో ప్రచురితమవుతున్న వరుస కథనాలకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ పింకేష్ కుమార్ స్పందించారు. బుధవారం కమిషనర్ వెంకటేశ్వర్లు, ఏఈ మహిపాల్‌తో కలిసి పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. జనాభా పెరుగుదల, రోజురోజుకు పెరుగుతున్న అవసరాలకు కనుగుణంగా పట్టణాన్ని నలుదిక్కులా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక చేస్తున్నట్లు చెప్పారు. జంక్షన్ల అభివృద్ధి, విశాలవంతమైన రహదారుల విస్తరణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. బతుకమ్మకుంట రహదారి సెంటర్‌తో పాటు ట్రాఫిక్ కంట్రోల్ రూం, బస్టాండ్ నుంచి హనుమకొండ వెళ్లే రోడ్డు, నెహ్రుపార్క్, రోడ్లు భవనాలు శాఖ అతిథి గృహం, 60 ఫీట్ల రోడ్డును పరిశీలన చేశారు. సదరు ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళిక తయారు చేసి, ప్రతిపాదనలు పంపించాలని కమిషనర్‌ను ఆదేశించారు. శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టి వార్డుల్లో పర్యటించిన ఏసీ పింకేష్ కుమార్ -
గురువారం శ్రీ 10 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
– 8లోuజిల్లాలోని మూడు నియోజకవర్గాల పరిధిలో పంచాయతీ కార్యదర్శుల బదిలీలకు రంగం సిద్ధమైంది. ఈ సారి మండలాలు, గ్రామాల పరిధిలో కాకుండా, నియోజకవర్గ మార్పులు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. గతంలో 73 మంది బదిలీ కాగా ఈసారి ఒకే గ్రామంలో రెండేళ్ల పాటు పని చేసిన సెక్రటరీలను బదిలీ చేయనున్నారు. దీంతో 170 నుంచి 180 మంది వరకు ఈ జాబితాలో ఉండే అవకాశం ఉంది. గ్రామాల అభివృద్ధిలో ముఖ్య భూమిక పోషిస్తున్న కార్యదర్శులు సొంతంగా ఖర్చు చేసుకుంటున్న బిల్లులను ఇచ్చిన తర్వాత బదిలీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం పంచాయతీ కార్యదర్శుల ఫోరం జిల్లా అధ్యక్షుడు వెంకటచారి, కార్యదర్శి బొట్ల శంకర్, అసోసియేట్ అధ్యక్షుడు దేవి ప్రసాద్, కోశాధికారి యుగేందర్, వైస్ ప్రెసిడెంట్ అనిల్ రాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రవీణ్, కార్యవర్గ సభ్యులు మహేందర్, గాదెపాక క్రాంతి, శ్రీనివాస్, భాగ్యలక్ష్మితో కలిసి టీఎన్జీఓ కార్యదర్శి పెండెల శ్రీనివాస్‌తో కలిసి పంచాయతీ కార్యదర్శులు కలెక్టర్ రిజ్వాన్ బాషాను కలిసి వినతి చేశారు. ఆకస్మిక బదిలీలను వెంటనే నిలిపేయాలని విన్నవించారు. గ్రామాల్లో అన్నీ తామై పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులు● ఇప్పటికే ఒక్కో గ్రామంలో రూ.లక్ష నుంచి రూ.5లక్షల వరకు ఖర్చు ● సుమారు రూ.5 కోట్ల బకాయి ● ట్రాన్స్ఫర్ చేస్తే డబ్బులెలా అంటూ ఆందోళన ● టీఎన్జీఓతో కలిసి కలెక్టర్‌కు వినతి ● జిల్లాలో 281మంది సెక్రటరీలు జనగామ: ప్రభుత్వ ఆదేశాలు లేవు.. బదిలీ కాలం కాదు.. ఒక్కసారిగా ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు పిడుగులాంటి వార్త. ఊరు కాదు.. మండలం అసలే కాదు... నియోజకవర్గం మార్పుతో ఉద్యోగులకు టెన్షన్ పట్టుకుంది. మళ్లీ బదిలీలు చేస్తే బకాయిలు ఎలా వస్తాయని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం నుంచి పైసా రాకున్నా.. పైపులైన్ లీకేజీ నుంచి వీధిదీపాల నిర్వహణ వరకు కార్యదర్శులు ముఖ్యభూమిక పోషిస్తున్నారు. జీపీలో ఖర్చు చేస్తున్న ప్రతీ పైసా కార్యదర్శుల జేబులో నుంచి ఖర్చు చేస్తున్నదే. ఒక్కో సెక్రటరీ రూ.1లక్ష నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చు చేయగా.. సుమారు రూ.5 కోట్ల మేర ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నిధులు లేవని కార్యదర్శులు చేతులెత్తేస్తే... జీపీ పాలన ఒక్కసారిగా కుప్పకూలిపోడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. జిల్లాలో 281 మంది కార్యదర్శులు జిల్లాలో జీపీ కార్యదర్శుల బదిలీ ప్రక్రియ ఆందోళన కలిగిస్తోంది. చాగల్, శివునిపల్లి స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపల్ పరిధిలోకి వెళ్లడంతో 280 జీపీలకు కుదించబడింది. 12 మండలాల పరిధిలో 281 పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. పాలక మండళ్ల పదవీ కాలం ముగిసి పోవడంతో 2024 ఫిబ్రవరి 1 నుంచి బాధ్యత అంతా కార్యదర్శులపై పడింది. ప్రభుత్వం నుంచి పైసా రాకపోవడంతో జీపీల్లో పని చేస్తున్న కార్యదర్శులపై భారం పడింది. ట్రాక్టర్ మెయింటెనెన్స్, శానిటేషన్ నిర్వహణ, వీధి దీపాలు, మోటార్ల రిపేరు, ఊర్లలో కనీస మౌలిక వసతి సౌకర్యాలకు సంబంధించి ప్రతీ పైసా సెక్రటరీలు అప్పులు తెచ్చి ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఇప్పటి వరకు ఒక్కో కార్యదర్శి రూ.లక్ష నుంచి రూ.5లక్షలు ఖర్చు చేశారు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో దివాలా తీసే పరిస్థితికి వచ్చారు. ఈ క్రమంలో గతేడాది 73 మంది సెక్రటరీలను బదిలీ చేయగా... జీపీల కోసం ఖర్చు చేసిన నిధులపై ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ బదిలీ సాధారణం కావడంతో కొత్తగా వచ్చిన కార్యదర్శులకు పాత బిల్లుల బాధ్యత అప్పగించి మరో ఊరికి వెళ్లారు. కొత్త సెక్రటరీల పరిస్థితి షరా మామూలుగానే మారడంతో పాత డబ్బులు ఇచ్చుడేమో కానీ... కొత్తగా ఖర్చు చేసే వాటికి అప్పులు చేస్తున్నారు. న్యూస్రీల్మరోసారి బదిలీ పిడుగుబిల్లులు రాక ఆర్థిక ఇబ్బందులు పంచాయతీ కార్యదర్శుల ఆకస్మిక బదిలీలు నిలిపేయాలి. గతేడాది ఫిబ్రవరి నుంచి పాలకవర్గం లేకున్నా.. కార్యదర్శులు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చే విధంగా పరిపాలన నడిపిస్తున్నారు. గ్రామాల్లో ప్రజలకు కనీస మౌలిక వసతి సౌకర్యాల కోసం సెక్రటరీలో సొంత డబ్బులు ఖర్చు చేస్తున్నారు. ఆ బిల్లులు రాక ఆర్థిక పరమైన ఇబ్బందులను ఎదుర్కొంటూ ముందుకు వెళుతున్నారు. ఇప్పుడు ఆకస్మికంగా బదిలీ చేస్తుండడంతో పెండింగ్‌లో ఉన్న బిల్లుల పరిస్థితిపై అయోమయానికి గురవుతున్నారు. బదిలీ చేస్తే పాత బిల్లులు వచ్చే పరిస్థితి ఉండదు. – పెండెల శ్రీనివాస్, టీఎన్జీఓ జిల్లా కార్యదర్శి -
సకాలంలో వైద్యపరీక్షలు చేయించుకోవాలి
● సీనియర్ సివిల్ జడ్జి సి.విక్రమ్ జనగామ రూరల్: వృద్ధులు సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి సి.విక్రమ్ అన్నారు. ఈ మేరకు బుధవారం ప్రపంచ ఆరోగ్య దినం పురస్కరించుకుని ఓబుల్ కేశవాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ సంయుక్తంగా కోమటిరెడ్డి సుశీలమ్మ వృద్ధాశ్రమంలో వైద్య, కంటి పరీక్షల శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై వైద్యశిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. వృద్ధులు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డీఎంహెచ్ఓ మల్లికార్జున్‌రావు మాట్లాడుతూ వృద్ధాప్యంలో కంటిచూపు మందగిస్తుందని, అవసరమైన శస్త్రచికిత్సలు చేసుకుని అద్దాలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రవీందర్, ఆశ్రమ ఇన్చార్జ్ డి.లక్ష్మ ణ్, ఫ్లోరెన్స్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
అక్రమ కేసులతో సబ్ జైళ్లు సరిపోతాయా!
● ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి జనగామ: రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులపై అక్ర మ కేసులు బనాయిస్తూ పోతుంటే సబ్ జైళ్లు పరిపోతాయా? అని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని విమర్శిస్తూ సోషల్ మీడియాలో వచ్చిన పోస్టును ఫా ర్వర్డ్ చేశారని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు తిప్పారపు విజయ్ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా, బుధవారం జనగామ సబ్ జైలులో ఎమ్మెల్యే ములా ఖత్ ద్వారా ఆయనను పరామర్శించారు. అనంత రం ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకుల అక్రమ అరెస్ట్‌లను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఒక ఎమ్మెల్యేగా తనను కడియం శ్రీహరి బొచ్చు కుక్క అని తిడితే తప్పు లేదు కానీ, అది తప్పు అని వచ్చిన పోస్టును ఫార్వర్డ్ చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడిపై అక్రమ కేసులు పెట్టి వేధించడం ఇదెక్కడి న్యాయమన్నారు. కడియం శ్రీహరిని దళిత జాతి క్షమించదన్నారు. ఎమ్మెల్యే వెంట పట్టణ అధ్యక్షుడు తాళ్ల సురేష్‌రెడ్డి, మసిఉర్ రెహమాన్, ఎండీ సమ్మద్, ముస్త్యాల దయాకర్, బాల్దె సిద్దిలింగం, యాదగిరిగౌడ్ తదితరులు ఉన్నారు. -
‘టెన్త్’ మూల్యాంకనంలో నిర్లక్ష్యం..
విద్యారణ్యపురి: హనుమకొండలోని కాజీపేట ఫాతిమా హైస్కూల్లో ‘టెన్త్’ మూల్యాంకనం కొనసాగుతోంది. ఇద్దరు స్కూల్ అసిస్టెంట్లు అసిస్టెంట్ ఎగ్జామినర్లు( ఏఈ)గా మూల్యాంకనంలో భాగంగా మార్కులు పోస్టింగ్ చేయడంలో పొరపాట్లు చేస్తున్నారు. స్క్రూటినీలో ఆయా పొరపాట్లు గుర్తించి సక్రమంగా మూల్యాంకనం చేయాలని చీఫ్ ఎగ్జామినర్, సిబ్బంది సూచించినా అలాగే నిర్లక్ష్యం చే స్తుండడంతో వారిని విధుల నుంచి టెన్త్ స్పాట్ క్యాంపు ఆఫీసర్, డీఈఓ వాసంతి రిలీవ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మ్యాథ్స్కూల్ అసిస్టెంట్‌కు మూల్యాంకనం విధులు అప్పగించగా మంగళవారం నిర్లక్ష్యం వహించా రు. విద్యార్థుల జవాబుపత్రాల్లో మార్కుల పోస్టింగ్‌లో పొరపాట్లు చేస్తున్నట్లు స్క్రూటినీలో గుర్తించా రు. సక్రమంగా చేయాలని సూచించినా బుధవారం కూడా అదేమాదిరి చేయడంతో అతడు చేసిన జవా బుపత్రాలను క్యాంప్ ఆఫీసర్‌కు వాసంతికి చూపించారు. దీంతో అతడిని రిలీవ్ చేశారు. అలాగే, జేఎస్ భూపాలపల్లిజిల్లాలో బయోసైన్స్ ఎస్ఏ కూడా సో మవారం ఏఈగా మూల్యాంకనం విధుల్లో చేరారు. సరిగా చేయకపోవడంతో గుర్తించి సంబంధిత సీఈ, ఇతర సిబ్బంది చెప్పినా మార్కుల పోస్టింగ్‌లలో పొరపాట్లుచేస్తుండగా రెండురోజులు అలాగే తప్పులు చేస్తుండడంతో పరిశీలించి మంగళవారం రిలీవ్ చేశారు. ఆయా ఇద్దరు స్కూల్అసిస్టెంట్లపై చర్యలు తీసుకోవాలని డీఈఓ వాసంతి గురువారం జయశంకర్ భూపాలపల్లి డీఈఓకు లిఖితపూర్వక సమాచారం పంపనున్నారు. వీలైతే సస్పెండ్ చేయాలనేది ఆదేశించనున్నారనేది చర్చ జరగుతుంది.చెప్పకుండా విధుల నుంచి వెళ్లిన టీచర్ మహబూబాబాద్ జిల్లాలో ఇంగ్లిష్ స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ మంగళవారం ఫాతిమా హైస్కూల్ స్పాట్ క్యాంపు వద్దకు వచ్చారు. తనకు విధులు అప్పగిస్తే అసిస్టెంట్ ఎగ్జామినర్‌గా మూల్యాంకనం చేస్తానని చెప్పగా అక్కడ సంబంధిత అధికారులు అతడికి విదులు అప్పగించారు. పది జవాబుపత్రాలు మూల్యాంకనం చేశాక మంగళవారం మధ్యాహ్నం ఎవరికి చెప్పకుండా క్యాంపు నుంచి వెళ్లిపోయాడు. దీంతో సంబంధిత సిబ్బంది అతడికి ఫోన్‌చేస్తే స్విచాఫ్ వచ్చింది. బుధవారం కూడా క్యాంప్‌నకు రాలేదు. ఫోన్లో సంప్రదించే యత్నం చేసినా అందుబాటులోకి రావడం లేదు. ఈ విషయం డీఈఓ వాసంతికి తెలియజేయగా మహబూబాబాద్ డీఈఓకు కూడా సంబంధిత టీచర్‌పై సమాచారం ఇచ్చారు. అలాగే, అతడిపై చర్యలు తీసుకోవాలని గురువారం లిఖితపూర్వకంగా మహబూబాబాద్ డీఈఓకు పంపనున్నారు. అతడిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇద్దరు స్కూల్ అసిస్టెంట్ల రిలీవ్ చెప్పకుండా క్యాంప్ నుంచి వెళ్లిన మరో టీచర్ చర్యలు తీసుకోవాలని డీఈఓలకు సమాచారం -
ఎల్సీ యాప్‌తో విద్యుత్ ప్రమాదాలకు చెక్
● ఎన్పీడీసీఎల్ ఎస్ఈ వేణుమాధవ్ జనగామ: విద్యుత్ శాఖ ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు ఎల్సీ యాప్‌ను (లైన్ క్లియర్) ప్రవేశపెట్టడం జరిగిందని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ టి.వేణుమాధవ్ తెలిపారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో వి ద్యుత్ ప్రమాదాల నివారణకు అమలు చేస్తున్న కా ర్యక్రమాలపై ఆ శాఖ అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించారు. విద్యుత్ ప్రమాదాలపై రూ పొందించిన యాప్ అమలు తీరు తెన్నులను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరిస్తూ, వారి సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం ఎస్ఈ మా ట్లాడుతూ జిల్లాలో 78, 33/11కేవీ సబ్స్టేషన్లు ఉన్న ట్లు స్పష్టం చేశారు. ఎల్సీ యాప్ ద్వారా ప్రతి ఒక్కరూ పూర్తిగా అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎల్సీ తీసుకునే సమయంలో యాప్ నిబంధనలు పాటిస్తూ, ఫొటోలను అప్లోడ్ చేయాలన్నారు. ని బంధనలు పాటిస్తూ పని చేస్తే ప్రమాదాలను తగ్గించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ డీఈలు రాంబాబు, లక్ష్మీనారాయణరెడ్డి, విజయ్ కుమార్, ఎంఆర్టీ టెక్నికల్ డీఈ గణేష్, ఏడీఈలు, ఏఈలు, లైన్మన్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
యాసంగి ధాన్యం సేకరణ షురూ
జనగామ రూరల్: యాసంగి సీజన్లో ధాన్యం సేకరణకు జిల్లా యంత్రాంగం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రేడ్–ఏ రకం (సన్నాలు) ధాన్యం క్వింటాకు రూ.2,320, సాధారణ రకం (దొడ్డు) ధాన్యం క్వింటాకు రూ.2,300గా కనీస మద్దతు ధర ప్రకటించాయి. ప్రభుత్వం ప్రకటించిన ధరతో రైతుల నుంచి ధాన్యం సేకరణకు జిల్లా యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయగా మంగళవారం నుంచి కొనుగోళ్లు ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 300 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించి అకాల వర్షాల నుంచి ఽతడవకుండా టార్ఫలిన్లు అందుబాటులో ఉంచారు. సన్నాలకు రూ.500 బోనస్ సన్నరకం ధాన్యం క్వింటాకు రూ.500 బోనస్ చొప్పున ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. యాసంగిలో 3,75,453 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేయగా అందులో సన్నరకం 1,05,891, దొడ్డు రకం 2,69,562 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేశారు. కొనుగోలు కేంద్రాల్లో వేర్వేరుగా ధాన్యం సేకరించనున్నారు. టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద సమస్యల పరిష్కారానికి, ధాన్యం కొనుగోళ్లు, అమ్మకాల్లో రైతులకు సమస్యలు తలెత్తితే ఫిర్యాదు చేసేందుకు జిల్లా యంత్రాంగం టోల్ ఫ్రీ నంబర్ 9963407064 ఏర్పాటు చేసింది.మిల్లర్లు నిబంధనలు పాటించాలి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మిల్లర్లు ప్రభుత్వ నిబంధనలను పాటించాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం జనగామ మండలం శామీర్‌పేట, వడ్లకొండ గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మా ర్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు 17 శాతం తేమతో ధా న్యాన్ని తీసుకువస్తే గిట్టుబాటు ధర వస్తుందన్నారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తిస్తే వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలన్నా రు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మేకల కళింగ రాజు, ప్రేమలత రెడ్డి, ప్రమోద్‌రెడ్డి, ఎడ్ల శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు. జిల్లాలో 300 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబర్ 9963407064 కొనుగోలుకు ఏర్పాట్లు పూర్తి జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పర్యవేక్షించాలి. జిల్లాలో 300 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా ఇందులో ఐకేపీ 164, పీఏసీఎస్ 134, డీసీఎంఎస్ 2 ఉన్నాయి. రైతుల సమస్య పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులో ఉంది. రైతులు సద్వినియోగం చేసుకోవాలి. – రోహిత్ సింగ్, అదనపు కలెక్టర్ -
నిధులు
బుధవారం శ్రీ 9 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025‘పీఎంశ్రీ’ పాఠశాలలకు– 8లోuజనగామ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాశాఖకు నిధుల వరద కురిపించాయి. పీఎంశ్రీ, భవిత సెంటర్లు, బాలికలకు శానిటరీ నాప్కిన్స్, యూనిఫాం స్టిచింగ్, క్రీడా సామగ్రి కొనుగోలుకు రూ.37.93 లక్షల మేర నిధులు విడుదల చేసింది. నిధుల ఖర్చుకు సంబంధించి ఉత్తర్వుల కాపీలో పేర్కొనగా.. నిబంధనలను అనుసరించి మెటీరియల్ కొనుగోలు చేయనున్నారు. పీఎంశ్రీలో 15 పాఠశాలలు.. జిల్లాలో పీఎంశ్రీ(స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) పథకంలో 15 పాఠశాలలను ఎంపిక చేశారు. ఇందులో 5 మోడల్, ఒక సోషల్ వెల్ఫేర్ (జఫర్‌గఢ్), యూఆర్ఎస్, 8 ఉన్నత పాఠశాలలు (జెడ్పీఎస్ఎస్) ఉన్నాయి. ఇందులో విద్యను అభ్యసిస్తు న్న 2,650 మంది బాలికలకు శానిటరీ నాప్కిన్స్ కొ నుగోలుకు రూ.7.95 లక్షల బడ్జెట్ విడుదల చేసింది. ఒక్కో విద్యార్థినికి రూ.300 చొప్పున కేటాయించగా, 50 శానిటరీ నాప్కిన్స్ ఇవ్వాల్సి ఉండగా.. పలు పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్పోర్ట్స్ మెటీరియల్ కొనుగోలుకు ఒక్కో పా ఠశాలకు రూ.50వేల చొప్పున రూ.7.50 లక్షలు వి డుదల చేసింది. విద్యార్థుల అవసరాలను బట్టి ని బంధనల మేరకు క్రీడా సామగ్రి కొనుగోలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. ప్రభుత్వం 100 నుంచి 150 రకాల ఆప్షన్ చూపించింది. యూనిఫాం కూలి డబ్బులు.. జిల్లాలో విద్యార్థులకు రెండు జతల యూనిఫాం స్టిచింగ్కు సంబంధించి 2024–25 వార్షిక సంవత్సరంలో పెండింగ్‌లో ఉన్న కూలి వేతనం డబ్బులను సర్కారు విడుదల చేసింది. 32,965 మంది విద్యార్థులకు రెండు జతల యూనిఫాం ఉచితంగా ఇవ్వగా, స్టిచింగ్ చార్జీల కింద ఒక్కో యూనిఫాంకు స్వయం సహాయక సంఘాలకు రూ.75గా నిర్ణయించింది. ఈ లెక్కన రూ.49.44 లక్షల స్టిచింగ్ చార్జీలకు గాను రూ.32.96లక్షలు గతంలో ఇవ్వగా, ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న రూ.16.48 లక్షలు విడుదల చేసింది. 2025–26 నూతన విద్యా సంవత్సరంలో 29,158 మంది విద్యార్థులకు రెండు జతల యూనిఫాం కోసం ప్రభుత్వం క్లాత్ పంపించింది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, మెప్మా పర్యవేక్షణలో యూనిఫాంలను స్టిచింగ్ చేయిస్తున్నారు. జూన్ 10వ తేదీ వరకు యూనిఫాం అందించాలని విద్యాశాఖ అధికారుల ఆదేశాలు జారీ చేశారు. న్యూస్రీల్ఒక్కో భవిత కేంద్రానికి రూ.2లక్షలుజిల్లాలో 12 మండలాల పరిధిలో భవిత సెంటర్లు (ప్రత్యేక అవసరాల పిల్లల కేంద్రం) ఉన్నాయి. ఇందులో మూడు కేంద్రాలకు పక్కా భవనాలు ఉండగా, 9 సెంటర్లను ఆయా పాఠశాలలకు అనుబంధంగా కొనసాగిస్తున్నారు. సమగ్ర శిక్షణ ప్రాజెక్టు కింద పక్కా భవనాలు ఉన్న జనగామ, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్ భవిత సెంటర్లకు ఒక్కోదానికి రూ.2లక్షల చొప్పున మొత్తం రూ.6 లక్షలు విడుదల చేశారు. ప్రత్యేక అవసరాల పిల్లల కోసం ప్రభుత్వం సూచించిన మేరకు యూ టేబుల్, కుర్చీలు, స్పోర్ట్స్ కిట్లు, మానవ శరీర భాగాలు, నిత్యందన జీవితంలో ఉపయోగించే యాప్స్, కూరగాయలు, నంబరింగ్ తదితర పరికరాలను కొనుగోలు చేసి, పిల్లలకు వాటిపై అవగాహన కల్పించాల్సి ఉంటుంది. జిల్లాలో 15 స్కూళ్లలో 2,650 మంది విద్యార్థులు శానిటరీ నాప్కిన్స్, స్పోర్ట్స్ సామగ్రికి బడ్జెట్ గత సంవత్సరం యూనిఫాం స్టిచింగ్ కూలి విడుదల భవిత సెంటర్లకు రూ.6 లక్షలుఒక్కో జతకు రూ.75జిల్లాలో 2024–25 సంవత్సరంలో విద్యార్థులకు రెండు జతల యూనిఫాం ఇవ్వగా, మహిళా సంఘాలకు స్టిచింగ్ చార్జీల కింద ఒక్కో జతకు రూ.75 చొప్పున ఇచ్చారు. ఇందులో రూ.49.44 లక్షలు రావాల్సి ఉండగా, పెండింగ్‌లో ఉన్న రూ.16.48లక్షల నిధులను విడుదల చేసింది. – పెనుగొండ రమేశ్, ఏఏపీ ఇన్చార్జ్, జనగామసద్వినియోగం చేసుకోవాలి.. పీఎంశ్రీ పథకంలో ఎంపికై న 15 పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న 2,650 మంది బాలికలకు శానిటరీ నాప్కిన్స్ కొనుగోలుకు రూ.7.95 లక్షలు, ఒక్కో పాఠశాలకు స్పోర్ట్స్ మెటీరియల్ కొనుగోలుకు రూ.7.50 లక్షల నిధులను విడుదల చేసింది. జిల్లాలోని మూడు భవిత సెంటర్లకు ప్రత్యేక అవసరాల పిల్లల బోధన తరగతులకు అవసరమైన వాటిని కొనుగోలుకు రూ.6 లక్షల బడ్జెట్ వచ్చింది. ఆయా పాఠశాలలు నిధులను సద్వినియోగం చేసుకోవాలి – భువనగిరి నర్సింహారావు, సీఎంఓ, జనగామ -
పిల్లల మానసిక ఎదుగుదలకు చర్యలు
స్టేషన్‌ఘన్‌పూర్: పిల్లల మానసిక ఎదుగుదలకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ సుధీర్ అన్నారు. రాష్ట్రీయ బాలస్వస్థ్య కార్యక్రమంలో భాగంగా కమిషనరేట్ ఫ్యామిలీ వెల్ఫేర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాల మేరకు స్థానిక జెడ్పీఎస్ఎస్లోని అంగన్వాడీ కేంద్రం–2లో మంగళవారం శిశువుల మానసిక ఎదుగుదల లోపాలను గుర్తించుట, దృష్టి లోపాలను గుర్తించుటకు ఆర్బీఎస్కే స్టేషన్‌ఘన్‌పూర్ టీం బృందంచే 121 మంది పిల్లలకు నిర్ధేశిత మార్గదర్శకాలకు అనుగుణంగా పరీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన డిప్యూటీ డీఎంహెచ్ఓ మాట్లాడారు. పిల్లల మానసిక ఎదుగుదల, దృష్టి లోపాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. పిల్లల ఎదుగుదలకు పౌష్టికాహారం అందించాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ పద్మజ, డా క్టర్ అజయ్‌కుమార్, శ్రీనాథ్, ఆఫ్రీన్, మౌనిక, ఏ ఎన్ఎం రాణి, సూపర్వైజర్ సంధ్యారాణి, అంగన్వాడీ టీచర్ రాణి తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ సుధీర్ -
విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి
● విద్యుత్ వినియోగదారుల ఫోరం చైర్మన్ వేణుగోపాలాచారి లింగాలఘణపురం: విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదులపై వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని టీజీఎన్పీడీసీఎల్ విద్యుత్ వినియోగదారుల ఫోరం చైర్మన్ వేణుగోపాలాచారి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని సబ్‌స్టేషన్‌లో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. విద్యుత్ సమస్యలను సిబ్బంది ఏ మేరకు పరిష్కరించారని తెలుసుకున్నారు. 34 ఫిర్యాదులు రాగా అందులో 18 వరకు వెంటనే పరిష్కరించారు. జనగామ డీఈ లక్ష్మినారాయణ రెడ్డి, ఏడీఈ అనిల్‌కుమార్, ఏఈలు శంకరయ్య, నర్సింహ్ములు, నర్సింహ్మరెడ్డి, సీజీఆర్ఎఫ్ ఏఈ శశిధర్, సిబ్బంది పాల్గొన్నారు. -
‘ఎల్ఆర్ఎస్’ ప్రక్రియను వేగవంతం చేయాలి
జనగామ రూరల్: ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. మంగళవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశా రు. ఈ సందర్భంగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారు ల ప్లాట్ల క్రమబద్ధీకరణ ఆన్లైన్ విధానాన్ని పర్యవేక్షించి సంబంధిత వివరాలను అడిగి తెలుసుకొని, సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం కింద వచ్చిన దరఖాస్తుదారుల భూముల పరిశీలనను వేగంగా చేపట్టా లని, అభ్యంతరాలు లేని వాటికి త్వరగా ప్రొసిడింగ్స్ జారీ చేయాలన్నారు. ఈ నెలాఖరు వరకు రాయితీ గడువును పెంచినందున దరఖాస్తుదారులు ఎల్ఆర్ఎస్ కింద పూర్తిస్థాయి రుసుం చెల్లించి, భూముల క్రమబద్ధీకరణ చేసుకోవాలన్నారు. అలాగే రాజీవ్ యువ వికాసం పథకం కింద దరఖాస్తు చేసుకునే లబ్ధిదారులకు రేషన్ కార్డు ఉంటే ఆదాయ ధ్రువీకరణ పత్రం అవసరం లేదని కలెక్టర్ వెల్లడించారు. ఆసక్తి గల వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని, అందుకు సంబంధించిన ధ్రువపత్రాలను మున్సిపల్, ఎంపీడీఓ కార్యాలయాల్లో అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, డీఎస్సీడీఓ విక్రమ్, బీసీ సంక్షేమ అధికారి రవీందర్, టీపీఎస్ ప్రశాంతి, అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా -
నూతన విద్యావిధానాన్ని రద్దు చేయాలి
జనగామ రూరల్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్య విధానాన్ని రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.మూర్తి డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక విజయ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఎస్ఎఫ్ఐ 4వ జిల్లా మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విశ్వ విద్యాలయాల్లో సంస్కరణల పేరుతో యూజీసీ రూపొందించిన ముసాయిదా అమల్లోకి వస్తే విశ్వవిద్యాలయాలు కేంద్ర ప్రభుత్వం గుప్పిట్లోకి వెల్లుతాయని, రాష్ట్రాల హక్కులను హరించడానికే కేంద్రం ఈ ముసాయిదాను తీసుకువచ్చిందన్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కారం చూపకపోతే ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో కిరణ్, ధర్మభిక్షం, సందీప్, సుమా తదితరులు పాల్గొన్నారు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.మూర్తి -
బతుకమ్మకుంటలో పారిశుద్ధ్య పనులు
జనగామ: జనగామ బతుకమ్మకుంటలో పారిశుద్ధ్య పనులు ఎట్టకేలకు మొదలయ్యాయి. ‘ఆహ్లాదం కరువు’ శీర్షికన గత నెల 28న సాక్షిలో ప్రచరితమైన కథనానికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, అధికారులు స్పందించారు. సాక్షిలో వచ్చిన కథనం క్లిప్పింగ్‌తో బతుకమ్మకుంట వాకర్స్ అసోసియేషన్, అమ్మ ఫౌండేషన్ ప్రతినిధులు కలెక్టర్‌కు మెమోరాండం అందించగా, పలువురు కుంట ప్రాంతంలో నిరసన తెలిపారు. ఈ మేరకు మంగళవారం బీఆర్ఎస్ నాయకులు మసిఉర్ రెహమాన్, అనితతో కలిసి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి బతుకమ్మకుంటకు వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లకు ఫోన్ చేయగా.. శానిటేషన్ కార్మికులతో కలిసి ఆయన అక్కడకు చేరుకున్నారు. వాకర్స్, కుటుంబ సమేతంగా వచ్చే పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు. స్పెషల్ ఆఫీసర్ పులి శేఖర్ ఆధ్వర్యంలో కార్మికులు బతుకమ్మకుంటలోని పిచ్చిమొక్కలు, పేరుకుపోయిన చెత్తా, చెదారం, మైదానం శుభ్రం చేశారు. వాకర్స్ నడిచే ట్రాక్‌కు రెండు వైపులా ఏపుగా పెరిగిన మొక్కలను తొలగిస్తున్నారు. అలాగే కుంటలోని వాటర్ నుంచి దుర్వాసన వెదజల్లుతుండగా.. అందులోని నాచు, చెత్తను మాత్రమే తీయించనున్నట్లు అధికారులు చెప్పారు. శానిటేషన్ పనులు ప్రారంభం కావడానికి కృషి చేసిన సాక్షికి వాకర్స్, పట్టణ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. కుంట అభివృద్ధికి రూ.1.50 కోట్లు జనగామ ఐకాన్ బతుకమ్మకుంట అభివృద్ధికి రూ.1.50 కోట్లు నిధులను ఖర్చు చేయనున్నారు. 2015 ఎల్ఆర్ఎస్ నిధులతో పాటు పురపాలికకు సంబంధించి 18 బ్యాంకు ఖాతాలను క్లోజ్ చేయగా వచ్చిన డబ్బులతో కుంట అభివృద్ధికి వెచ్చించనున్నారు. కుంటలోని నీటి చుట్టూ రేలింగ్, కలర్ లైటింగ్, వాకింగ్ ట్రాక్ నిర్మాణం, తదితర అభివృద్ధి పనులు చేయనున్నారు. ఇందుకు సంబంధించి స్పెషల్ ఆఫీసర్ ఆదేశాల మేరకు నిధులను సమీకరించుకోగా, త్వరలోనే పనుల కోసం టెండర్లను పిలువనున్నట్లు ఏఈ మహిపాల్ మంగళవారం తెలిపారు. పర్యవేక్షించిన ఎమ్మెల్యే పల్లా -
విజిలెన్స్ విచారణ జరిపించాలి
జనగామ రూరల్: జనగామ వ్యవసాయ మార్కెట్లో జరుగుతున్న అవినీతిపై విజిలెన్స్ విచారణ జరిపించాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి భూక్యా చందునాయక్ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ సూపరింటెండెంట్‌కు వినతిపత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ సీసీఐ, పల్లికాయ కొనుగోలులో జరిగిన అవినీతిపై విచారణ జరపాలన్నారు. సీఎంఆర్ బియ్యం ప్రభుత్వానికి ఇవ్వకుండా ఉన్న రైస్ మిల్లులను బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు. మార్కెట్లో ధాన్యం కనీసం మద్దతు ధర రూ.1,850కు కొనుగోలు చేయాలని జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, కనీస సౌకర్యాలు, గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలని కోరారు. తక్షణమే గత రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన ఆడిట్ నిర్వహించి విజిలెన్స్ విచారణ జ రిపి అవినీతి అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి అజ్మీరా సురేష్ నాయక్, తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మంగ బీరయ్య, జిల్లా కమిటీ సభ్యులు బో డ రాములు, తదితరులు పాల్గొన్నారు. -
హామీల అమలులో విఫలం
జఫర్‌గఢ్: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొని జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చేసిన ఏ వాగ్ధానం కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో దేశం అన్ని విధాల అభివృద్ధి చెందుతోందన్నారు. మండల అధ్యక్షుడు కోరుకొప్పుల గణేష్‌గౌడ్, అంజిరెడ్డి, మదన్మోహన్, తౌటి సురేష్‌గౌడ్, గడ్డం రాజు, మారపల్లి రవి, మేకల పవన్, సంగా గోపాల్, తదితరులు పాల్గొన్నారు. అవకాశవాద రాజకీయాలు చేస్తున్న ఎమ్మెల్యే కడియం స్టేషన్‌ఘన్‌పూర్: స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ అన్నారు. ఘన్పూర్ డివిజన్‌కేంద్రంలో బీజేపీ మండలస్థాయి క్రియాశీల సభ్యుల సదస్సును మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు సట్ల వెంకటరమణగౌడ్, పార్లమెంట్ కోకన్వీనర్ ఇనుగాల యుగేందర్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రమేశ్ -
చిల్పూరు ఆలయంలో భక్తుల తాకిడి
చిల్పూరు: బుగులు వేంకటేశ్వరస్వామి సన్నిధిలో మంగళవారం అష్టదళ పాద పద్మారాధన పూజ వైభవంగా నిర్వహించారు. ఆలయ ఈఓ భాగం లక్ష్మిప్రసన్న, చైర్మన్ శ్రీధర్‌రావుల ఆధ్వర్యంలో భక్తుల సమక్షంలో 108 బంగారు పుష్పాలు, వెండి పాదపద్మంను అర్చకులు రవీందర్‌శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యుల వేద మంత్రాల నడుమ స్వామివారి ముందు ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ కుర్రెంల మోహన్, వీరన్న, మళ్లికార్జున్, లక్ష్మి, వసంత, గాదె శేఖర్, స్వరూప, మహేష్, హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు. 12న వీర హనుమాన్ విజయయాత్ర జనగామ రూరల్: ఈనెల 12న నిర్వహించనున్న వీర హనుమాన్ విజయయాత్రను జయప్రదం చేయాలని వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు మంచాల రవీందర్ అన్నారు. మంగళవారం పట్టణంలో కరపత్రాలు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ చౌరస్తా నుంచి బస్టాండ్ వరకు వైభవంగా జరుగనున్న యాత్రకు ప్రజలు, భక్తులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్‌కృష్ణ భార్గవ, ఉపాధ్యక్షులు బచ్చు బాలనారాయణ, కార్యదర్శులు చిలువేరు హర్షవర్ధన్, మాసరాజు, సభ్యులు కుమారస్వామి, లక్ష్మణ్ శివరామ్, రాజు, సత్యం తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు అవార్డులు జనగామ: ప్రగతి చక్రం త్రైమాసిక పురస్కారా ల్లో భాగంతో మంగళవారం వరంగల్‌లో జరి గిన వేడుకల్లో జనగామ డిపోకు చెందిన నలు గురు ఉద్యోగులకు రీజియన్ అవార్డ్స్ అందుకున్నట్లు డిపో మేనేజర్ స్వాతి మంగళవారం తెలి పారు. ఇంధన పొదుపులో డ్రైవర్లు టి.ఎస్. నారాయణ, ఎండీ అయూబ్ ఖాన్, అత్యధిక ఇన్సెంటివ్ సాధించిన కేటగిరీలో కండక్టర్ బాబురావు, శ్రామిక్ ఎం.శ్రీనివాస్ నలుగురు ఉద్యోగులు రీజనల్ మేనేజర్ డి.విజయ భాను చేతుల మీదుగా ప్రశంస పత్రాలు, నగదు అవార్డ్స్ అందుకున్నట్లు డీఎం తెలిపారు. 108 పైలట్లకు ఉత్తమ అవార్డు జనగామ రూరల్: జిల్లాలో 108 వాహనంలో పనిచేసే కె.రాజన్న, జి.అనిల్ పైలట్లు మంగళవారం ఉత్తమ స్టార్ అవార్డు అందుకున్నారు. అంబులెన్స్‌లో క్షతగాత్రులను సకాలంలో ఆస్పత్రికి చేరుస్తూ, వాహనానికి సకాలంలో మరమ్మతులు, షెడ్యుల్ సర్వీస్, డీసెల్ టాపప్, ఎయిర్ చెకింగ్ చేయిస్తూ, వాహనానికి మంచి మైలేజి తెచ్చినందుకు జిల్లా ప్రోగ్రాం మేనేజర్ నసీరుద్దీన్, జిల్లా మేనేజర్ ఎం.శ్రీనివాస్ చేతుల మీదుగా స్టార్ అవార్డును అందించారు. గ్యాస్ ధరలు తగ్గించాలి జనగామ రూరల్: పెంచిన గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు రాపర్తి రాజు అన్నారు. మంగళవారం ధరల పెంపుకు నిరసనగా పట్టణ కేంద్రంలోని నెహ్రూ పార్క్ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్యాస్ సిలిండర్‌పై రూ.50 పెంచడం దారుణమన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్, బూడిది గోపి, భూక్య చందు నాయక్, కళ్యాణం లింగం, లలిత, శ్రావణ్, బీరయ్య, శ్రీకాంత్, వెంకటేశ్, సాంబరాజు తదితరులు పాల్గొన్నారు. -
సబ్‌స్టేషన్ సమీపంలో మంటలు
● గాలి దుమారానికి ట్రిప్ అయిన విద్యుత్ ● నిప్పురవ్వలతో అంటుకున్న ఎండుగడ్డి రఘునాథపల్లి: కంచనపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో సోమవారం రాత్రి మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా వచ్చిన గాలి దుమారంతో సబ్‌స్టేషన్‌లో విద్యుత్ ట్రిప్ అయింది. ఈ క్రమంలో ఓ ట్రాన్స్ఫార్మర్ నుంచి నిప్పు రవ్వలు కిందపడగా నేలపై ఉన్న ఎండు గడ్డికి అంటుకున్నాయి. ఆ మంటలు సబ్‌స్టేషన్ చుట్టూరా ఉన్న ఎండు గడ్డికి విస్తరించి చుట్టుముట్టాయి. అప్రమత్తమైన సిబ్బంది గ్రామానికి విద్యుత్ సరఫరా నిలిపి వేశారు. స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి, పోలీసులకు సమాచా రం ఇవ్వగా సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చారు. ఫైరింజన్ వచ్చే సరికి మంటలు పూర్తిగా చల్లారడంతో వెనుదిరిగారు. ఈ విషయమై విద్యుత్ ఏఈ రాహుల్‌ను వివరణ కోరగా సబ్‌స్టేషన్ చుట్టు పక్కలనే మంటలు వ్యాపించా యి.. సబ్‌స్టేషన్‌లో ఎలాంటి నష్టం జరగలేదు.. మంటలు తగ్గాక గ్రామంలో విద్యుత్ పునరుద్ధరించినట్లు ఆయన పేర్కొన్నారు. -
ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలి
జనగామ రూరల్: రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించి అడ్తిదారులు, ఖరీదుదారులు కొనుగోలు చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి భూక్యా చందునాయక్ అన్నారు. వ్యవసాయ మార్కెట్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి నరేంద్రకు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మార్కెట్లో పూర్తిస్థాయి డిజిటల్ ఈ–నామ్ అమలు కావడం లేదని, బిడ్డింగ్‌లో ధరలు వేయకుండా ఆఫ్‌లైన్ పద్ధతిలో తక్కువ ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేసే పరిస్థితి వారం రోజుల నుంచి కొనసాగుతున్నదని చెప్పారు. ఈ–నామ్లో సమయానికి అనుగుణంగా ఖరీదారులు వచ్చేలా చర్యలు చేపట్టడంతోపాటు కనీస మద్దతు ధర రూ.1,850తో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మార్కెట్లో మొక్కజొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభించి రైతులకు ఉచితంగా భోజన వసతి కల్పించాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు ఉపేందర్, మంగ బీరయ్య, బోడ రాములు, ఉర్సుల కుమార్, తాండ్ర ఆనందం తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి చందునాయక్ -
ఆహ్లాదకర వాతావరణం కల్పించాలి
బతుకమ్మకుంట దుర్గంధంతో కంపుకొడుతోంది. అందులోని నీటిని తొలగించి ఆహ్లాదకర వాతావరణం కల్పించాలి. ఆట వస్తువులు, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి కుటుంబ సమేతంగా పిల్లలతో గడిపే విధంగా తీర్చిదిద్దాలని పట్టణానికి చెందిన పిట్టల సురేష్, గాదెపాక రాంచందర్, వెంకటస్వామి, తుంగ కౌశిక్ అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ● మండలాల్లో అసలు స్పందనే లేదు ● వచ్చిన అర్జీలు ఫార్వర్డ్ చేయడంతో సరి.. ● పరిష్కారం మాత్రం పెండింగ్‌లోనే.. -
ఎల్ఐసీ జనగామకు ప్రత్యేక గుర్తింపు
● రాష్ట్రంలో నంబర్ 1 ● జోనల్ 2వ స్థానం ● జాతీయ స్థాయి 15వ ర్యాంకుజనగామ: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) జనగామ శాఖ వ్యాపార పరంగా జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చడంతో పాటు రాష్ట్రంలో నంబర్ వన్ ర్యాంకు సాధించింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఏడు అంశాలపై వ్యాపార పోటీ జరిగింది. 9,300 పాలసీలు, రూ.85కోట్ల టార్గెట్‌తో స్థానిక మేనేజర్ జి.హరిలా ల్ నేతృత్వంలో ఏజెంట్లు, డెవలప్ మెంట్ ఆఫీసర్లు పడిన కష్టానికి ఫలితం దక్కింది. జిల్లా కేంద్రంలో 1986 సంవత్సరం ఎల్ఐసీ జనగామ శాఖ నెలక్పొగా అంచెలంచెలుగా ఎదుగుతూ 14 మంది డెవలప్మెంట్ ఆఫీసర్ల పర్యవేక్షణలో 1,075 మంది ఏజెంట్లకు చేరుకుంది. సమష్టి కృషితో జోనల్ స్థాయి(ఏపీ, తెలంగాణ, కర్ణాటక) 2వ స్థానం, జాతీయ స్థాయిలో 15వ స్థానం, తెలంగాణ రాష్ట్రంలో ఓవరాల్‌గా నంబర్ వన్ స్థానంలో నిలిచి చరిత్రలో కొత్త అధ్యాయానికి నాందీ పలికింది. విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని పనిచేయాలి● ఎల్ఐసీ సీనియర్ డివిజనల్ మేనేజర్ సుబ్రహ్మణ్యన్ ఎల్ఐసీ జనగామ శాఖ సాధించిన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని డీఓలు, ఏజెంట్లు పనిచేయాలని సంస్థ సీనియర్ విజనల్ మేనేజర్ ఎం.సుబ్రహ్మణ్యన్ పిలుపునిచ్చారు. ఎల్ఐసీ జనగామ విభాగం 2024–25 ఆర్థిక సంవత్సరం సాధించిన విజయాల సందర్భంగా మేనేజర్ హరిలాల్ అధ్యక్షతన సోమవారం పెద్ద ఎత్తున సంబురాలు జరుపుకున్నారు. వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన సుబ్రహ్మణ్యన్ మాట్లాడుతూ.. ఎల్ఐసీ జనగామ శాఖ కొత్త చరిత్ర సృష్టించిందని, ప్రతికూల వాతావరణ పరిస్థితులను తుట్టకుని ఇంతటి ఘనత సాధించడం అభినందనీయమన్నారు. అనంతరం సుబ్రమణ్యన్ చేతుల మీదుగా హరిలా ల్ అవార్డు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్ ప్రసాద్ బస్వరాయ్, సేల్స్ మేనేజర్ పి.రవి శంకర్, స్టేషన్‌ఘన్‌పూర్ బ్రాంచ్ మేనేజర్ జె.మోతీలాల్, అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ జి.దునీలాల్ తదితరులు పాల్గొన్నారు. -
అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించాలి
● సీపీఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా జనగామ రూరల్: బాణాపురం ఇంది రమ్మ కాలనీ వద్ద బైపాస్ రోడ్‌పై అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించాలి.. ఈ విషయమై 11వ తేదీలోపు స్పష్టమైన ప్రకటన చేయకుంటే నేషనల్ హైవేను దిగ్బంధిస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు రాపర్తి రాజు హెచ్చరించారు. సోమవారం పట్టణ కార్యదర్శి జోగు ప్రకాశ్ అధ్యక్షతన దీక్షా శిబిరం నుంచి కార్యకర్తలు, ప్రజలు పాదయాత్రగా కలెక్టరేట్‌కు చేరుకుని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేషనల్ హైవే అథారిటీ అధికారుల అనాలోచిత నిర్ణయం ఫలితంగా ప్రజలకు ప్రమాదం పొంచిఉందన్నారు. అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని 72 రోజుల నుంచి రిలే దీక్షలు చేస్తూ.. ప్రజాప్రతినిధులు, ఎమ్మె ల్యే, ఎంపీలకు తెలిపినా పట్టించుకోవడంలేని అన్నా రు. అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణం చేపడితే పదివేల మంది ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు బొట్ల శేఖర్, బూడిద గోపి, సుంచు విజేందర్, బోడ నరేందర్, భూక్య చందు, చిట్యాల సోమన్న, ఎండీ.అజారుద్దీన్, బిట్ల గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
గ్యాస్ భారం రూ.75లక్షలు
● సబ్సిడీ, ఉజ్వల సిలిండర్లపై రూ.50 పెంపు జనగామ: కేంద్రం సబ్సిడీ, ఉజ్వల గ్యాస్ సిలిండర్ల ధరలు పెంచింది. పెట్రో, డీజిల్ ధరలను సైతం పెంచగా.. ఆ భారమంతా ఆయిల్ కంపెనీ లే భరిస్తాయని ప్రకటించడం కొంత ఊరట అని చెప్పవచ్చు. సబ్సిడీ సిలిండర్ ప్రస్తుత ధర రూ.857 ఉంది. ఇందులో ఉజ్వల సిలిండర్‌కు రూ.300, సబ్సిడీ బండపై కేంద్రం రూ.40, రాష్ట్ర ప్రభుత్వం రూ.319 వినియోగదారుడి ఖాతాలో జమ చేస్తోంది. జిల్లాలో 12 గ్యాస్ కంపెనీలు ఉండగా, 1.50లక్షల సబ్సిడీ సిలిండర్లు ఉన్నాయి. ఇందులో 10వేల వరకు ఉజ్వల కనెక్షన్లు ఉన్నాయి. సబ్సిడీ సిలిండర్‌పై రూ.50 పెంపుతో జిల్లా గ్యాస్ వినియోగదారులపై నెలనెలా అదనంగా రూ.75 లక్షల మేర భారం పడనుంది. -
నమ్మకం సడలుతోంది..!
కలెక్టరేట్ గ్రీవెన్స్‌కు తగ్గుతున్న వినతులురూ.5 భోజనం ప్రారంభించాలి జనగామ వ్యవసాయ మార్కెట్లో రైతులకు మేలు చేసే విధంగా రూ.5 భోజనం ప్రారంభించాలి. విశ్రాంతి గదిని మరింత విశాలంగా మార్చాలి. మార్కెట్‌కు సరుకులను తీసుకువచ్చే క్రమంలో మంచి ధర వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. ధర పడిపోకుండా జాగ్రత్త వహించాలి. – కన్నారపు పరుశరాములు అసైన్డ్ భూమి నుంచి కాల్వ తీయాలి మా అమ్మ శెట్టి సుజాత పేరున 343ఏ, 354ఏ సర్వే నంబర్లలో 7 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దేవాదుల కాల్వ నిర్మాణానికి అధికారులు తమ మూడెకరాల భూమి నుంచి సర్వే చేశారు. పక్కనే ఉన్న అసైన్డ్ భూమి నుంచి కాల్వ తీయాలని వేడుకుంటున్నా పట్టించుకోవడం లేదు. మాకు వేరే ఆధారం లేదు. భూమిని కాపాడాలి. – శిరంశెట్టి మహేందర్, మల్లంపల్లి(పాలకుర్తి)ఒకరి స్థలం.. మరొకరికి రిజిస్ట్రేషన్ గ్రామంలో తన పేరిట 157 గజాల ఇంటి స్థలం ఉంది. గత ఏడాది డిసెంబర్ 18 వరకు ఇంటి పన్ను చెల్లించాను. ఇదే సమయంలో తమకు తెలియకుండా స్థలాన్ని గ్రామ అధికారి మరొకరి పేరు మీద అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసి ఇంటి స్థలాన్ని తమకు కాకుండా చేశారు. న్యాయం చేయాలని అర్జీ పెట్టుకోగా.. విచారణ చేపట్టాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. – గుండని సుజాత, లింగంపల్లి(బచ్చన్నపేట) -
ప్రజలకు కాపలా కుక్కలా పనిచేస్తా..
జనగామ: ‘నియోజకవర్గ ప్రజలకు కాపలా కుక్కలా పనిచేస్తా.. కడియం శ్రీహరిలా నేను గుంట నక్కను కాదు’ అంటూ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్టేషన్ఘపూర్కు మున్సి పాలిటీ, డిగ్రీ కాలేజీ, లిఫ్ట్ ఇరిగేషన్, 100 పడకల ఆస్పత్రి, నవాబ్‌పేటకు లైనింగ్‌ను కడియం శ్రీహరి నాడు ఆపేసి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నాడని అన్నారు. అభివృద్ధిని ఆపే చరిత్ర వాళ్లదైతే.. పనులు చేసే చరిత్ర తమదని పేర్కొన్నారు. కడియం తనను బొచ్చు కుక్క అంటూ మాట్లాడారు.. అవును నేను కుక్కనే.. నా ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే వారిని కాపాడేందుకు కాపలా కుక్కగా ఉంటానే తప్ప.. ఆయనలా గుంట నక్క వేశాలు మాత్రం వేయనని అన్నారు. ముసలితనానికి వచ్చి న కడియం.. అటవీ భూముల మీద కన్నేశాడని, వాటిని కాపాడేందుకు నేను రేసు కుక్కలా పరుగెత్తుతానని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ నిర్వహించే వరంగల్ సభను అడ్డుకునే శక్తి ఎవ్వరికీ లేదని స్పష్టం చేశారు. 2001లో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కూడా బహిరంగ సభలకు అనేక అడ్డంకులు తలపెట్టినా ఎక్కడా ఆగలేదన్నారు. ప్రతీ కార్యకర్త కథానాయకుడిగా మారి ప్రజా వ్యతి రేఖ పాలన సాగిస్తున్న కాంగ్రెస్‌ను ఇంటికి పంపించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మాజీ ఎంపీపీలు మేక కలింగరాజు, భైరగోని యాదగిరి గౌడ్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, ఎడ్ల శ్రీనివాస్, జయ ప్రకాశ్‌రెడ్డి, కాస భాస్కర్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. కడియం లాగా గుంట నక్కను కాదు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి -
జనగామ
మంగళవారం శ్రీ 8 శ్రీ ఏప్రిల్ శ్రీ 20257పక్క ఫొటోలో తన నానమ్మ(కమలమ్మ) వద్ద ఉన్న బాలుడి పేరు బండి అఖిల్(09). ఇతడికి పుట్టుకతోనే మానసిక పరిస్థితి బాగోలేదు. బయటకు వెళ్లాలంటే ఎవరైనా తోడుండాల్సిందే. బచ్చన్నపేట మండల అలీంపూర్కు చెందిన కమలమ్మ కుమారుడు బండి అజయ్‌కి ఇద్దరు కుమారులు. అతను కూలీ పనులకు వెళ్లి పిల్లలను పోషించుకుంటున్నాడు. తల్లి కమలమ్మ వారి బాగోగులు చూసుకుంటోంది. దివ్యాంగుడైన అఖిల్‌కు సదరం క్యాంపులో 2024 ఫిబ్రవరిలో వందశాతం వైకల్యంతో సర్టిఫికెట్ ఇచ్చారు. ఏడాది దాటిపోయినా ఇప్పటి వరకు పింఛన్ మంజూరు కాలేదు. ‘మనవడిని తీసుకుని గ్రీవెన్స్‌కు, అధికారుల వద్దకు తిరుగుతున్నా ప్రయోజనం లేకుండా పోయింది’ అని కమలమ్మ వాపోయింది. పింఛన్ వచ్చేలా చూడాలని అర్జీ పెట్టుకుంది. న్యూస్‌రీల్ -
రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
● పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాలకుర్తి/దేవరుప్పుల: కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కు అండగా నిలిచి వారి కష్టాలను తీర్చుతున్నదని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. సోమవారం పాలకుర్తి మండల పరిధి ముత్తారం, లక్ష్మీనారాయణపు రం, దేవరుప్పుల మండల కేంద్రంలోని కొత్తకాల నీ, నీర్మాల గ్రామాల్లో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. రైతులకు ఏకకాలంలో రుణమాపీ, ఉచిత కరెంటు అందించడంతోపాటు పంటలకు గిట్టుబాటు ధర కల్పించడానికి సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో వరి దిగుబడి పెరిగిందని, దళారులకు తక్కువ ధరకు విక్రయించి మోసపోకుండా ప్రభుత్వం ప్రోత్సాహకంగా ఇస్తున్న రూ.500 బోనస్‌ను సద్వినియోగం చేసుకో వాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ వసంత, ఐలమ్మ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మంజుల భాస్కర్, టీపీసీసీ సభ్యుడు డాక్టర్ ఎల్.లక్ష్మీనారాయణనాయక్, ఎంపీడీఓ రాములు, తహసీల్దార్ శ్రీనివాస్, ఐకేపీ ఏపీఎం పిట్టల నరేందర్, పార్టీ నాయకుడు నల్ల శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. -
‘నేను ప్రజలకు కాపలా కుక్కను.. నీలాగా గుంట నక్కను కాదు’
జనగామ జిల్లా : స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిల మధ్య వాగ్వాదం రోజురోజుకూ ీవ్రతరమవుతోంది. ఈ నేతలు ఇద్దరు కౌంటర్ల మీద కౌంటర్ల ఇచ్చకోవడంతో జిల్లాలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. తాజాగా కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలకు పల్లా రాజేశ్వర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తనను బొచ్చు కుక్క అన్న వ్యాఖ్యలను తనదైన శైలిలో తిప్పికొట్టారు పల్లా.తాను కుక్కనేనని, కాకపోతే ప్రజలకు విశ్వాసంగా పని చేసే కాపలా కుక్కనన్నారు. అదే సమయంలో కడియం శ్రీహరిని గుంట నక్కతో పోల్చారు. నీలాగా గుంట నక్కను కాదంటూ మండిపడ్డారు. ‘ఘన్‌పూర్‌కు మున్సిపాలిటీ వస్తే ఆపేసారు, డిగ్రీ కాలేజీ ఆపేసారు, లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేసారు, 100 పడకల ఆస్పత్రిని ఆపేశారు. నవాబ్‌పేటకు లైనింగ్ వస్తే దాన్ని కూడా ఆపేశారు. ఆపేసే చరిత్ర వాళ్లది.. పనులు చేయడమనే చరిత్ర మనది’ అంటూ మండిపడ్డారు.ఇటీవల తనను ‘బొచ్చు కుక్క’ అనేలా మాట్లాడిన కడియంను పల్లా గట్టిగానే తిప్పికొట్టారు. “అవును నేను కుక్కనే..నా ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే, వారిని కాపాడేందుకు కాపలా కుక్కగా ఉంటాను. నీలాగా గుంట నక్కను మాత్రం కాదు,” అని పల్లా స్పష్టంగా చెప్పారు. ‘అటవీ భూములపై జరుగుతున్న ఆక్రమణల గురించి కూడా స్పందించారు.ముసలితనానికి అటవీ భూముల మీద కన్నేస్తున్నారు. ఒకరిపై 25 ఎకరాలు, మరొకరిపై మరో 25 ఎకరాలు ఆ భూములను కాపాడటానికి నేను రేసు కుక్కలా ఉంటా’ అని తెలిపారు.కేసీఆర్ , బీఆర్ఎస్ పార్టీకి విశ్వాసం ఉన్న కుక్కను. ప్రజలను కాపాడటంలో ఎప్పుడూ ముందుండే లక్షణాలు నాకు ఉన్నాయి. నిన్ను ఎదుర్కొనే గుణాలు కూడా నా వద్ద ఉన్నాయి’ అని కూడా హెచ్చరించారు. -
భూముల అన్యాక్రాంతంపై ఫ్లెక్సీలు
స్టేషన్‌ఘన్‌పూర్: తాటికొండలో సీతారామచంద్రస్వామి దేవస్థానానికి చెందిన మాన్యం భూముల అన్యాక్రాంతంపై శ్రీరామనవమి రోజున దేవస్థానం, గ్రామంలోని ప్రధాన కూడళ్ల వద్ద పలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన రియల్ ఎస్టే ట్ వ్యాపారి నారబోయిన శ్రీనివాస్కల్యాణ్ పేరిట శ్రీరాముడిని పేదవాడిగా ఏమి లేనివాడిగా చేసిందెవరు.. నాయకుల లోపమా, అధికారుల లోపమా, రాముడి ఆస్తి ఎక్కడ అంటూ ప్రశ్నిస్తూ పలు ప్రదేశాల్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. గ్రామంలో శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం పేరిట ఏ సర్వేనంబర్లలో ఎన్ని ఎకరాల భూమి ఉంది.. తదితర వివరాలతో ఫ్లెక్సీని ఏర్పాటు చేయడంతో సదరు ఫ్లెక్సీలను చూసిన గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ఈ విషయమై శ్రీనివాస్కల్యాణ్ను సంప్రదించగా తాటికొండ సీతారామచంద్రస్వామి దేవస్థానం భూమి 86.35 ఎకరాలు ఉంటుందని, అందులో దాదాపు ఏడు ఎకరాలు అర్చకుడికి ఇవ్వగా 79 ఎకకరాలు ఉండాలన్నారు. ఇందులో దాదాపు 50 ఎకరాలకు పైగా అన్యాక్రాంతం అయిందని, ఇటీవల వ్యక్తిగత పనులపై తహసీల్దార్ కార్యాలయంలో ధరణిలో చూడగా మొత్తం 79 ఎకరాలు దేవుని మాన్యం భూములుగానే చూపిస్తుందన్నారు. దేవుని పేరిట 79 ఎకరాల భూమి ఉండగా శ్రీరాముడిని పేదవాడిగా చేసి ఎందుకు చందాలు వేసి ప్రతీ ఏటా కల్యాణం నిర్వహించాల్సిన అవసరం ఏముందన్నారు. తాను వ్యక్తిగతంగా ఎవరినీ విమర్శించడం లేదని, ఈ విషయమై ప్రతిఒక్కరూ ఆలోచించాలని ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. -
బీజేపీతోనే సుస్థిర పాలన
జనగామ రూరల్: దేశంలో బీజేపీ పాలనతో సుస్థిర అభివృద్ధి సాధ్యమని, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ అన్నారు. ఆదివారం బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ పథకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రెండు పార్లమెంటు స్థానాలు ఉన్నటువంటి దేశంలో ప్రస్తుతం అతిపెద్ద పార్టీగా అవతరించిందన్నారు. ప్రపంచంలో 14 కోట్ల మంది సభ్యత్వం కలిగిన ప్రపంచంలోనే ఏకై క రాజకీయ పార్టీకి బీజేపీ అన్నారు. మోదీపాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. దేశంలో 370 ఆర్టికల్ రద్దు అయోధ్యలో రామ్ మందిర నిర్మాణాన్ని నిర్మించిన ఘనత నరేంద్ర మోదీకి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు దశమంతరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కేవీఎల్ఎన్ రెడ్డి, లేగ రామ్మోహన్ రెడ్డి, ఉడుగుల రమేశ్, జిల్లా ప్రధాన కార్యదర్శి శివరాజ్ యాదవ్, పజ్జురి లక్ష్మీ నరసయ్య, కీర్తి నర్సయ్య, డాక్టర్ బిక్షపతి, కొంతం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ -
కల్యాణం..రమణీయం
నవాబుపేట, వల్మిడిలో పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యేలు కడియం, యశస్వినిరెడ్డి భక్తజనసంద్రంగా మారిన ‘జనగామ’ వేదపండితుల సమక్షంలో కోదండ రాముడి వివాహంజనగామ: వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ సీతారాముల కల్యాణం ఆదివారం జిల్లా వ్యాప్తంగా కనుల పండువగా జరిగింది. భక్తుల జయ జయ ధ్వానాల మధ్య సీతారాముడి వివాహ వేడుకలు అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ నియోజకవర్గాలతో పాటు పట్టణంలోని పాతబీటు బజార్లో 72వ ఏట శ్రీ రాముడి పట్టాభిషేకం, కల్యాణ వేడుకలను వైభవంగా నిర్వహించారు. మహిళలు సీత మ్మ తల్లికి ఒడి బియ్యం పోసి, పట్టు వస్త్రాలను స మర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీరాంనగర్ కాలనీ, మూలబావి శ్రీ హనుమత్ రామనాథ సహిత శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఆలయ ప్రధాన అర్చకుడు, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డాక్టర్ మోహనకృష్ణ భార్గవ ఆధ్వర్యంలో రామనవమి వేడుకలు నిర్వహించారు. సాయంకాలం ఉత్సవ మూర్తులతో ఊరేగింపు నిర్వహించారు. జీడికల్ వీరాచల రామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామ నవమి సందర్భంగా సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. నవాబుపేటలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పాలకుర్తి మండలం వల్మిడి పుణ్యక్షేత్రంలో ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించి కల్యాణం వీక్షించారు. – మరిన్ని ఫొటోలు 9లోu -
‘ఉపాధి’ కూలీలకు చేయూత
జనగామ రూరల్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు చేస్తున్న కూలీలకు కనీస వేతనం పెంచుతూ కేంద్రం తీపి కబురు అందించింది. 2024–25 ఆర్థిక సంవత్సరం ఉపాధి కూలీలకు వేతనం రూ.300 చెల్లించగా.. ప్రస్తుతం రూ.7 పెంచడంతో జిల్లాలోని 2.31 లక్షల మంది కూలీలకు లబ్ధి చేకూరనుంది. ఉపాధి హామీ పథకం ప్రారంభంలో 2005 అక్టోబర్ 2న కనీస వేతనం రూ.87.50 ఉంది. 2006 నుంచి చట్టంగా మారి దేశవ్యాప్తంగా అమలైంది. ప్రస్తుతం పెరుగుతున్న నిత్యావసరాల ధరలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కనీస వేతనం పెంచింది. ఉపాధిలో చేపట్టే పనులు జాబ్‌కార్డు కలిగిన ప్రతిఒక్కరికీ ఉపాధి హామీ పథకంలో పని కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా జల వనరుల సంరక్షణ, నర్సరీల నిర్వహణ, మొక్కలు నాటడం, సంరక్షణ, పంట పొలాలకు మట్టి కట్టలు, పొలాలకు వెళ్లేందుకు మట్టిరోడ్లతోపాటు వివిధ అభివృద్ధి పనులు కల్పిస్తున్నారు. చేపట్టిన పనుల కొలతల ఆధారంగా కూలీలకు వేతనం చెల్లిస్తారు. కొత్త పనులు ప్రారంభం ఉపాధి హామీ కూలీలకు పెంచిన వేతనం ఈ నెల మొదటి వారం నుంచి అమలు కానుంది. అలాగే 2025–26 ఆర్థిక సంవత్సరం నూతన పనులు ప్రారంభం కానున్నాయి. మండుతున్న ఎండల దృష్ట్యా ఉదయం సమయంలోనే పనులు పూర్తి చేసుకునేలా సంబంధిత అధికారులు కూలీలకు అవగాహన కల్పిస్తున్నారు. పని ప్రదేశాల్లో కూలీలు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. పెరుగుతున్న కూలీల సంఖ్య ఉపాధి హామీ పనులకు వచ్చే కూలీల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. జిల్లాలో నిత్యం 18వేలకు పైగా కూలీలు పనులకు హాజరవుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో వ్యవసాయ పనులు పూర్తి కావస్తున్నాయి. మే ప్రారంభం నాటికి రోజువారీ కూలీలు 70 వేలకు పెరిగే అవకాశం ఉంది. వేసవిలో ఇతర ఏ పనులు ఉండకపోవడం.. అలాగే భూమి లేని నిరుపేదలకు ఉపాధి హామీ జాబ్ కార్డు ఉండి ఏడాదికి కనీసం 20 రోజుల పనిచేసి ఉన్నవారికి రూ.12 వేల చొప్పున ప్రభుత్వం అందజేస్తుండటంతో ఈసారి కూలీలు పెరగనున్నారు. ప్రతి కూలీకి 100 రోజులు పని కల్పించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో ఉపాధి కూలీల వివరాలు రోజువారీ వేతనం రూ.300 నుంచి రూ.307కు పెంపు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఈనెల నుంచి అమలు జిల్లాలో 2.31 లక్షల కూలీలకు లబ్ధిజాబ్కార్డులు : 1,18,000 కూలీలు : 2,31,000 ఆక్టివ్ జాబ్‌కార్డులు : 77,000 ఆక్టివ్ కూలీలు : 1,26,000 రోజువారీ సగటు కూలి : రూ.222.67 కూలి రేటు పెంచడం శుభపరిణామం కేంద్ర ప్రభుత్వం ఉపాధి కూలీలకు రోజువారీ గతంలో చెల్లించిన రూ.300 వేతనానికి అదనంగా రూ.7 పెంచింది. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల దృష్ట్యా కూలి రేటు పెంచడం శుభపరినామం. వ్యవసాయ పనులు పూర్తయితే ఉపాధి పనుల్లో వేగం పెరిగే అవకాశం ఉంది. మే మొదటి వారంలో కూలీలు అధిక సంఖ్యలో పనులకు రానున్నారు. – వసంత, డీఆర్డీఓ -
అండర్‌పాస్ నిర్మాణం చేపట్టాలి
జనగామ రూరల్: పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ వద్ద నిర్మాణం జరుగుతున్న బైపాస్ రోడ్లో అండర్‌పాస్ బ్రిడ్జి నిర్మించి ప్రజలకు మేలు చేయాలని సీపీఎం పట్టణ కార్యదర్శి జోగు ప్రకాశ్ అన్నారు. బ్రిడ్జి నిర్మాణానికి సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో బాణాపురం దీక్ష శిబిరం నుంచి పాదయాత్ర కలెక్టరేట్ వరకు పాదయాత్ర, కలెక్టర్ కార్యాలయం ఎదుట మహాఽ దర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 69వ రోజులుగా రిలే నిరాహార దీక్షలు చే స్తున్నా.. అధికారులు, ప్రభుత్వం స్పందించకపోవడం సరికాదన్నారు. కాగా ఆదివారం దీక్షలను ఐద్వా పట్టణ నాయకురాలు బూడిద వా ణి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి చీర రజిత, తాళ్లపల్లి అనిత, ఆకుల మంజుల, తదితరులు పాల్గొన్నారు రణదివే స్ఫూర్తితో ఉద్యమించాలిజనగామ రూరల్: కామ్రెడ్ బీటీఆర్ రణదివే స్ఫూర్తితో కార్మికులు ఉద్యమించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సుంచు విజేందర్ అన్నారు. ఆదివారం జిల్లా కార్యాలయంలో రణదివే 35వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కోశాధికారి అన్నబోయిన రాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రామిక మహిళల సమస్యల పరిష్కారానికి అనేక ఉద్యమాలు, పోరాటాలు చేశారన్నారు. ఆయన పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో బూడిద ప్రశాంత్, గంగారబోయిన మల్లేష్ రాజ్, ఉపేందర్ శివరాత్రి రాజు, చీర శ్రీను, కనక చారి, శంకర్, మల్లేష్, మమత, పద్మ తదితరులు పాల్గొన్నారు. లీకేజీలను గుర్తించిన ఇంజనీర్లు టన్నెల్లోకి దిగిన మెగా సిబ్బంది ధర్మసాగర్: హనుమకొండ జిల్లా ధర్మసాగర్‌లోని రిజర్వాయర్ సమీపాన ఇటీవల జరిగిన టన్నెల్ లీకేజీలను ఎట్టకేలకు ఇంజనీర్లు గుర్తించారు. దేవాదుల పథకంలో భాగంగా 3వ ప్యాకేజీ కింద దేవన్నపేట పంపుహౌస్ నుంచి రిజర్వాయర్ సమీపం వరకు పైపులైన్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి సుమారు 200 మీటర్లు రిజర్వాయర్ వరకు టన్నెల్ నిర్మించారు. ఈ క్రమంలో గత నెల 27న రిజర్వాయర్‌లోకి నీటిని పంపింగ్ చేయగా వారం రోజుల క్రితం టన్నెల్ లీకేజీ అయింది. దీనితో పంపులు ఆపివేసి టన్నెల్ నుంచి నిటిని డీ వాటరింగ్ చేశారు. ఈ క్రమంలో ఆదివారం పైపు నుంచి టన్నెల్లోకి దిగిన మెగా ఇంజనీర్లు, సిబ్బంది లీకేజీలను కనుక్కుని మరమ్మతులు ఎలా చేయాలో పరిశీలించారు. -
తాటి ముంజలొచ్చాయ్..
● పోషక విలువలు కలిగిన ప్రకృతి ప్రసాదంజనగామ: అత్యధిక పోషక విలువలు కలిగిన తాటి ముంజల సీజన్ వచ్చేసింది. అలసట నుంచి ఉపశమనం కలిగించి ఆరోగ్యాన్నిచ్చే ముంజ లంటే ప్రతిఒక్కరికీ ఇష్టమే. జిల్లాతోపాటు యాదాద్రి భువనగిరిలోని అనేక ప్రాంతాల నుంచి జనగామ పట్టణానికి తీసుకువచ్చి అండర్ రైల్వేబ్రిడ్జి, నెహ్రూపార్కు ఏరియాల్లో విక్రయిస్తున్నారు. పెరిగిన వేసవి ఎండల తీవ్రతనుంచి ఉపశమనం పొందడానికి ప్రజలు ముంజలను కొనుగోలు చేస్తుండడంతో డిమాండ్ పెరిగింది. డజనుకు రూ.60 చొప్పున అమ్ముతున్నారు. ప్రకృతి ప్రసాదించిన ఈ ముంజలు గతంలో ఊళ్లలో ఉచితంగా లభించేవి. ఇప్పుడు ధరలు పెరిగిపోవడంతో సామాన్య, మధ్యతరగతి వర్గాలకు కాస్త భారంగా మారింది. పోషకాలు అధికం తాటి ముంజల్లో అనేక పోషకాలున్నాయి. ఉష్ణతాపాన్ని తట్టుకునే శక్తి ఉంటుంది. డీ హైడ్రేషన్‌కు గురికాకుండా శరీరానికి అవసరమైన నీటి శాతాన్ని అందించడంతో పాటు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి. క్యాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, ఐరన్, సల్ఫర్, కాపర్ పుష్కలంగా ఉంటాయి. రక్తహీనతను తగ్గించడం.. మలబద్ధకాన్ని దూరం చేస్తాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. -
పేదల అభివృద్ధే లక్ష్యం
జనగామ రూరల్: పేదల అభివృద్ధే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్‌యాదవ్ అన్నారు. ఆదివారం జనగామ మండలం శామీర్‌పేట గోపరాజుపల్లి గ్రామాల్లో ప్రజా పాలనలో భాగంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ చేపట్టిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికే దక్కుతుందన్నారు. సన్న బియ్యంను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు లింగాల నర్సిరెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు గణిపాక మహేందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మెరుగు బాలరాజు, జిల్లా నాయకుడు బడికే కృష్ణస్వామి, సేవాదళ్ నాయకులు సాదం మధుసూదన్, దాసరి శేఖర్, తోటపల్లి రాజిరెడ్డి, కడకంచి కొమురయ్య, ఏఎంసీ డైరెక్టర్ నామాల శ్రీనివాస్, నర్సింగరావు, వెంకట్రామ్ రెడ్డి, వెంకట్, కనకరాజు, రంజిత్, నేతాజీ, నవీన్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ శివరాజ్ -
బతుకమ్మకుంటను అభివృద్ధి చేయండి
● వాకర్స్ వినూత్న నిరసన జనగామ : పట్టణంలోని బతుకమ్మ కుంటను అభివృద్ధి చేయాలని కోరుతూ వాకర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పిట్టల సురేష్ ఆధ్వర్యంలో వాకర్స్ శనివారం ప్లకార్డులతో వినూత్న నిరసన తెలిపారు. కుంట అపరిశుభ్రతపై ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన కథనాలకు వాకర్స్ అసోసియేషన్ స్పందించి ఆందోళన చేట్టారు. కుంటలోని నీరు చెత్తాచెదారంతో నిండి దుర్వాసన వెదజల్లుతోందని పాముల సంచారం, కోతుల స్వైర విహారం, అసాంఘిక కార్యకలాపాలతో బతుకమ్మ కుంట అధ్వానంగా తయారైందన్నారు. కుంటను అభివృద్ధి చేయని పక్షంలో నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని కోరారు. ప్రస్తుతం కుంట వద్ద నిమి షం సమయం కూడా కూర్చుండే పరిస్థితి లేదన్నారు. వీధిలైట్లు సరిగా వెలగక పోవడంతో భయాందోళనగా ఉందని చెప్పారు. పిల్లలకు ఆట పరికరాలు, వాకింగ్ ట్రాక్, పార్కు, పచ్చదనం ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తుంగ కౌశిక్, వెంపటి అజయ్, దినేష్, ఈశ్వర్, సాయి, అర్జున్ వినయ్, అభినవ్, శ్రీకాంత్, సిద్దు తదితరులు పాల్గొన్నారు -
రామయ్య పెళ్లికి రారండోయ్
నేడు సీతారాముల కల్యాణంజిల్లా కేంద్రం, జీడికల్, వల్మిడి తదితర ఆలయాల్లో ఏర్పాట్లు పూర్తి జనగామ/పాలకుర్తి టౌన్: జగదభిరాముడి కల్యాణా నికి సర్వం సిద్ధమైంది. ఆదివారం(నేడు) నిర్వహించే సీతారాముల పరిణయ వేడుకను పురస్కరించుకుని జిల్లాలోని ఆలయాలను ముస్తాబు చేశారు. పట్టణంలోని పాతబీటు బజారు పందిరి వద్ద 72వసారి స్వామి వారి కల్యాణ మహోత్సవం నిర్వహిస్తుండగా.. లింగాలఘణపురం మండలం జీడికల్ శ్రీసీతారామచంద్రస్వామి, పాలకుర్తి మండలం వల్మిడి ఆలయంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఆలయాలు, మండపాల వద్ద నిత్యపూజలు, అన్నదా న కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రాములోరి కల్యాణానికి తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం ఆలయా ల వద్ద చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. మజ్జిక, తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసులు బందోబస్తు చేపట్టనున్నారు. ఇదిలా ఉండగా స్వామివారి కల్యాణ వేడుకలకు ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కడియం శ్రీహరి, యశస్వినిరెడ్డి, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. వల్మిడి ఆలయంలో కల్యాణోత్సవానికి వచ్చే భక్తుల వాహనా ల పార్కింగ్ ఏర్పాట్లను జనగామ వెస్ట్‌జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్ శనివారం పరిశీలించారు. -
సరస్వతీ పుష్కరాల్లో ‘జ్ఞానతీర్థం’ శోభ
● పుష్కరఘాట్‌కు కాకి, హంస, మకరం చిత్రాలతో కూడిన రాయి రెయిలింగ్ కాళేశ్వరం: జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో మే 15 నుంచి 26 వరకు నిర్వహించే సరస్వతి పుష్కరాల్లో జ్ఞానతీర్థం (ఆహ్వాన విగ్రహం) ఏర్పాటు చేయనున్నారు. పుష్కరాల అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.25కోట్ల నిధులు మంజూరు చేసి విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర దేవాదా యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ పలుమార్లు చేసిన సమీక్షలు, క్షేత్రస్థాయి పర్యటనలతో పనులు ఊపందుకున్నాయి. రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రత్యేక దృష్టి సారించడంతో పనుల్లో వేగం పెరిగింది. సరస్వతీ పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం రూ.20 లక్షలతో ‘జ్ఞానతీర్థం’ ఎఫ్ఆర్పీ ఫైబర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తాళపత్ర గ్రంథాలతో రెండు చేతుల్లో దీపం వెలిగి ప్రకాశించేలా ఫైబర్ విగ్రహం నిర్మాణం చేయనున్నా రు. దీని నమూనా చిత్రాలను ఆర్కిటెక్ట్‌లు, ఇంజనీర్లు తయారు చేశారు. ఈ విగ్రహం ఉద్దేశం ఏమిటంటే.. పూర్వం కాకి నదిలో స్నానం చేసి హంసలాగా మారి జ్ఞానం పొందింది. అలా ఇక్కడి నదిలో స్నా నం చేసిన భక్తులు జ్ఞానాన్ని పొందుతారని సారంశంగా, భక్తులను ఆహ్వానించేలా ఉండే విధంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయవర్గాలు తెలిపాయి. అదేవిధంగా జ్ఞానతీర్థం (వీఐపీ) ఘాట్ రెయిలింగ్‌ను కాకి, హంస, మకరం చిత్రాలను రాతిపై చెక్కి అమర్చనున్నారు. -
సర్కారు స్కూళ్లను కాపాడుకోవాలి
జనగామ రూరల్: సర్కారు స్కూళ్లను కాపాడుకో వాలని పబ్లిక్ అఫైర్స్ ఎడ్యుకేషన్ ఓఎస్డీ అడపు శ్రీధర్ అన్నారు. యశ్వంతపూర్ ప్రభుత్వ ప్రాథమి క, ఉన్నత పాఠశాల ప్రారంభమై 60 ఏళ్లు నిండిన సందర్భంగా వార్షికోత్సవాన్ని ప్రధానోపాధ్యాయు డు దివాకర్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ.. తాను ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ప్రభుత్వ పాఠశాలనే కారణమని అన్నారు. లక్ష్యం కోసం నిబద్ధతతో శ్రమించాను కాబట్టే నేడు సీఎం పేషీలో ఓఎస్డీగా ప్రభుత్వంలో కీలకమైన స్థాయిలో ఉన్నాన ని చెప్పారు. పాఠశాల అభివృద్ధికి తోడ్పాటు అంది స్తానని తెలిపారు. ఏంఈఓ బి.శ్రీనివాస్ మాట్లాడు తూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడాని కి ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నారని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల న్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సంపత్ కుమార్, రాజీవ్ రెడ్డి, లయన్ ఎడమ సంజీవరెడ్డి, బి.సుధాకర్, గండి ప్రవీణ్, మాజీ సర్పంచ్ గండి లావణ్య, బొట్ల జ్యోతి తదితరులు పాల్గొన్నారు. పబ్లిక్ అఫైర్స్ ఎడ్యుకేషన్ ఓఎస్డీ శ్రీధర్ -
సిటీ పోలీస్ యాక్టు
● కమిషనరేట్ పరిధిలో నేటినుంచి నెల రోజులపాటు అమలు ● పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ వెల్లడివరంగల్ క్రైం: శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేటి నుంచి(ఆదివారం) మే 5 వరకు సిటీ పోలీస్ యాక్టు అమలులో ఉంటుంద ని సీపీ సన్‌ప్రీత్‌సింగ్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కమిషనరేట్ పరిధి లో పోలీస్ అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి మైకులు, డీజేలు వినియోగించరాదని హెచ్చరించారు. సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపుల ను నిషేధించినట్లు పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా మద్యం సేవించినా కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. శబ్ద కాలుష్య నియంత్రణలో భాగంగా డీజే సౌండులను నిషేధించామని, ఆస్పత్రులు, విద్యాలయాలకు 100 మీటర్ల దూరం వరకు వినియోగించరాన్నారు. మైకులు విని యోగించాల్సి వస్తే స్థానిక ఏసీపీల అనుమతి తప్పనిసరని వివరించారు. మైకులకు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు అనుమతి తీసుకుని వినియోగించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సిటీ పోలీస్ యాక్టు ఉత్తర్వుల ను కమిషనరేట్ పరిధిలో ఎవరు అతిక్రమించినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
విద్యుత్ ప్రమాదాలకు చెక్
జనగామ: విద్యుత్ వినియోగదారులకు మరింత నాణ్యమైన సేవలు అందించడంతో పాటు తరుచూ సంభవిస్తున్న ప్రమాదాలను నివారించేందుకు ఎన్పీడీసీఎల్ ఆన్లైన్ ఎల్సీ(లైన్ క్లియ ర్) యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు యాప్ సేవలపై సంస్థ ఎస్ఈ వేణుమాధవ్ శనివారం సర్కిల్ కార్యాలయం నుంచి సంబంధిత ఏఈలు, అధికారులు, ఉద్యోగులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. విద్యుత్ నిలిపి వేసే సమయంలో ఎల్సీ తీసుకుని మరమ్మతు పనులు చేపట్టే క్రమంలో జరుగుతున్న మానవ తప్పిదా లను నిరోధించడానికి ఈ యాప్ ఉపయోగపడుతుందన్నారు. ఏఈ అనుమతి లేకుండా ఎల్సీ తీసుకునే పరిస్థితి ఉండదని, లైన్మెన్ యాప్ ఓపెన్ చేసి ఎల్సీ కోసం ఏఈకి రిక్వెస్ట్ పెట్టుకుంటే.. ఇవ్వొచ్చా, ఇవ్వొద్దా అనే విషయం ఆయన ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఏఈ ఎల్సీకి అనుమతిచ్చిన వెంటనే లైన్మెన్కు యాప్ ద్వారా మెసేజ్ చేరగా.. ఏ ఫీడర్‌కు ఇవ్వాలనే విషయం సబ్‌స్టేషన్ ఆపరేటర్‌కు సైతం వెళ్తుందన్నారు. విద్యుత్ లైన్ మరమ్మతు పూర్తయిన వెంటనే ఆ పనికి సంబంధిచి ఫొటోను యాప్‌లో అప్లోడ్ చేసి ఎల్సీ రిటర్న్ చేస్తే ఆ సమాచారం ఏఈకి వెళ్తుందన్నారు. ఇదిలా ఉండగా.. ఆపరేటర్ ఎల్సీ ఇచ్చే సమయంలో జరిగే పొరపాట్లను సరిచేసుకునేలా యాప్ ఎపటికప్పుడు తెలియజేస్తుందని చెప్పారు. ఎక్కడైనా డబుల్ ఫీడింగ్, దీనికి వేరే ఫీడర్‌తో అనుసంధానం కలిగి ఉందా.. లేదా.. ఇతర వాటితో క్లియరెన్స్ ఎలా ఉంది.. అనే విషయమై యాప్ హెచ్చరిక చేస్తుందని వివరించారు. ఆపరేటర్ జాగ్రత్తలు, నియమ నిబంధనలకు సంబంధించి ఫొటోలు తీసి యాప్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందని వివరించారు. అందుబాటులోకి ఆన్లైన్ ‘ఎల్సీ’ యాప్ ఏఈ అనుమతి మేరకే లైన్ క్లియరెన్స్ ఎన్పీడీసీఎల్ ఎస్ఈ వేణుమాధవ్ -
యువతకు ఉపాధి భరోసా
‘రాజీవ్ యువ వికాసం’ పథకంతో నిరుద్యోగులకు సబ్సిడీ రుణాలు జనగామ రూరల్: నిరుద్యోగ యువత స్వయం ఉపాధిలో రాణించి ఆర్థికంగా ఎదగడానికి రాష్ట్ర ప్రభుత్వం యువ వికాసం పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సబ్సిడీపై రుణాలు అందించాలని నిర్ణయించింది. ఇందుకు దరఖాస్తు గడువు ఈనెల 5వ తేదీ వరకు విధించినా.. సర్వర్ సమస్య, దరఖాస్తుదారులకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీకి సమయం పట్టడం.. ఏ యూనిట్‌కు ఎంత మొత్తం ఇస్తారో నిర్ణయం కాకపోవడంతో దరఖాస్తు చేసుకునేందుకు వెనుకాడారు. దీంతో ప్రభుత్వం గడువును ఈనెల 14వ తేదీ వరకు పొడిగించింది. ఇప్పటి వరకు మొత్తం 12 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. గడువు పొడిగించడంతోపాటు విధి విధానాలు విడుదలైనందున దరఖాస్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కమిటీల పరిశీలన ఇలా.. ‘రాజీవ్ యువ వికాసం’ పథకానికి ఆన్‌లైన్‌తోపాటు మండల, మున్సిపల్ ప్రజాపాలన సేవా కేంద్రాల్లో మాన్యువల్‌గా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆయా ప్రాంతాల్లో వచ్చిన దరఖాస్తులను మున్సిప ల్, మండల కమిటీలు పరిశీలించి అర్హులను ఎంపిక చేసి జిల్లా కమిటీకి పంపుతాయి. జిల్లా కమిటీలు ఆ జాబితాను పరిశీలించి రుణం మంజూరు చేయాల్సి ఉంటుంది. తర్వాత లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందిస్తారు. వచ్చిన దరఖాస్తులు బీసీ : 6,077 ఎస్సీ : 3,456 ఎస్టీ : 1,790 ఇతరులు : 1,121 మొత్తం : 12,444 ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులు 12వేలు ఈనెల 14 వరకు గడువు పొడిగింపు -
గొప్ప మానవతావాది జగ్జీవన్ రామ్
● అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్ జనగామ రూరల్: గొప్ప మానవతావాది బాబూ జగ్జీవన్ రామ్.. ఆయన ఆశయాలను భవిష్యత్ తరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాల ని అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్ అన్నారు. డాక్టర్ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా శనివారం పట్టణంలోని ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్ వద్ద జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యాన నిర్వహించిన వేడుకల్లో డీసీపీ రాజమహేంద్రనాయక్, ఏసీపీ నితిన్ చేతన్, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు వెంకటస్వామి తదితరులు జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కేక్ కట్ చేశారు. అనంతరం సభలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జగ్జీవన్‌రామ్ రూపకల్పన చేసిన మహోన్నత వ్యవ స్థ కారణంగానే నేడు అట్టడుగున ఉన్న బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అమలవుతున్నాయని చెప్పారు. ఆయన ఆశయాలను పుణికి పుచ్చుకొని ముందడుగు వేయాలన్నారు. డీసీపీ రాజమహేంద్రనాయక్ మాట్లాడుతూ.. ప్రజల్లో సామాజిక పరమై న చైతన్యం తీసుకురావల్సిన అవసరముందని, విద్యార్థులను భాగస్వామ్యులను చేయాలన్నారు. జగ్జీవన్‌రామ్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని పేర్కొన్నారు. అనంతరం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. కార్యక్రమంలో ఆర్డీఓ గోపిరామ్, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి డాక్టర్ విక్రమ్, ఎస్పీ కార్పొరేషన్ ఈడీ మాధవీలత, బీసీ సంక్షేమాధికారి రవీందర్, కార్మిక శాఖ అధికారి కుమారస్వామి, మున్సిపల్ కమిషన ర్ వెంకటేశ్వర్లు, కల్నల్ భిక్షపతి, డాక్టర్లు సుధాకర్, రాజమౌళి, ప్రీతి దయాళ్, ఉత్సవ కమిటీ సభ్యులు రాములు, రామంచందర్, మల్లిగారి రాజు, మధు, బోట్ల నర్సింగరావు, తిప్పారపు విజయ్, ప్రభాకర్, ధనలక్ష్మి, ధర్మభిక్షం, బోట్ల శేఖర్, కిషోర్, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
‘రాజీవ్ యువ వికాసం’ యువతకు వరం
రఘునాథపల్లి: ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం యువతకు వరం లాంటిదని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరగాని ప్రీతమ్ అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో యువ వికాసం హెల్ప్ డెస్క్‌ను సందర్శించారు. ఆన్లైన్, ఆఫ్‌లైన్ ద్వారా నమోదైన దరఖాస్తుల వివరాలు ఎంపీడీఓను అడిగి తెలుసుకున్నారు. మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తుకు రూ.100 తీసుకుంటున్నారని కొందరు యువకులు చైర్మన్ దృష్టికి తీసుకరాగా, రూ.45 మాత్రమే తీసుకోవాలని.. అడిషనల్ కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడి మీ సేవ కేంద్రాల్లో అభ్యర్థుల వద్ద అదనపు రుసుం వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతకుముందు మండలంలోని కోమళ్లలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పొందిన పాడి గెదెల యూనిట్‌ను సందర్శించి లబ్ధిదారులతో మాట్లాడారు. చైర్మన్ వెంట ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మాధవీలత, ఎంపీడీఓ గార్లపాటి శ్రీనివాసులు, ఎంపీఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.