Reality
-
రియల్టీలోకి రూ.2.29 లక్షల కోట్లు
రియల్ ఎస్టేట్ మార్కెట్లో పెట్టుబడుల పట్ల సంస్థాగత ఇన్వెస్టర్లు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ రంగం 2022–24 మధ్యకాలంలో (మూడేళ్లలో) 26.7 బిలియన్ డాలర్ల (రూ.2.29 లక్షల కోట్లు) ఈక్విటీ పెట్టుబడులను అందుకున్నట్టు సీఐఐ–సీబీఆర్ఈ సంయుక్త నివేదిక తెలిపింది. ఇందులో పావు శాతం అంటే 6.7 బిలియన్ డాలర్లను (రూ.57,600 కోట్లు సుమారు) ముంబై నగరం ఆకర్షించడం గమనార్హం.ముంబైతోపాటు ఢిల్లీ–ఎన్సీఆర్, బెంగళూరు ఈ మూడు నగరాల నుంచి మార్కెట్లోకి వచ్చిన పెట్టుబడులు 16.5 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. మొత్తం రియల్ ఎస్టేట్ రంగంలోకి 2022–24 మధ్య వచ్చిన పెట్టుబడుల్లో 62 శాతాన్ని ఈ మూడు నగరాలు దక్కించుకున్నాయి. పెట్టుబడి శ్రేణికి సంబంధించిన ప్రాజెక్టులు ప్రధానంగా ఈ నగరాల్లో కేంద్రీకృతమై ఉండడం, బలమైన మౌలిక సదుపాయాలు, నైపుణ్య మానవ వనరుల లభ్యత, రియల్ ఎస్టేట్ రంగం క్రమంగా సంఘటితంగా మారుతుండడం ఈ మూడు నగరాలకు అనుకూలిస్తున్నట్టు ఈ నివేదిక వివరించింది. అభివృద్ధిపైనే అధికంగా..ల్యాండ్ డెవలప్మెంట్ ప్రాజెక్టులు 2022–24 మధ్య 44 శాతం మేర ఈక్విటీ పెట్టుబడులను ఆకర్షించినట్టు, ఆ తర్వాత ఆఫీస్ నిర్మాణ ఆస్తుల్లోకి 32 శాతం వచ్చినట్లు సీఐఐ–సీబీఆర్ఈ నివేదిక వెల్లడించింది. ఇక గత మూడేళ్లలో 10 శాతం మేర ఈక్విటీ పెట్టుబడులు (3 బిలియన్ డాలర్లు) టైర్–2 పట్టణ రియల్ ఎస్టేట్‌లోకి వచ్చినట్టు తెలిపింది. ‘భారత రియల్ ఎస్టేట్ రంగం కొత్త వృద్ధి పథంలోకి అడుగు పెట్టింంది. బలమైన మూలధన పెట్టుబడులు, అభివృద్ధికి భూముల లభ్యత ఇందుకు మద్దతునిస్తున్నాయి’ అని సీబీఆర్ఈ భారత ఛైర్మన్, సీఈవో అన్షుమన్ మ్యాగజిన్ తెలిపారు.ఇదీ చదవండి: ఉద్యోగంలో ఉంటారా? ప్యాకేజీ తీసుకొని వెళ్తారా?ఆఫీస్ అసెట్స్, నివాస గృహ ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు బలమైన సెంటిమెంట్ ఉండడం అన్నది స్థిరమైన వినియోగ డిమాండ్‌కు నిదర్శనంగా అన్షుమన్ పేర్కొన్నారు. దేశ రియల్ ఏస్టేట్ రంగం మరింత సంస్థాగతంగా మారుతున్నట్టు సీఐఐ పశ్చిమ ప్రాంత ఛైర్మన్ రిషి కుమార్ బగ్లా తెలిపారు. దీంతో ఈ రంగం మరింత పారదర్శకతతో, అంతర్జాతీయ ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటున్నట్టు చెప్పారు. ఈ రంగం మరింత సంస్థాగతంగా, నియంత్రితంగా మారితే అప్పుడు అంతర్జాతీయ ఫండ్స్ పెద్ద ఎత్తున పెట్టుబడులతో ముందుకు వస్తాయన్నారు. -
రియల్ ఎస్టేట్‌లోకి ఏఐఎఫ్ పెట్టుబడుల వెల్లువ
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ రంగంలో ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్‌లు) పెట్టుబడులు 2024 డిసెంబర్ నాటికి రూ.73,903 కోట్లకు చేరాయి. రియల్ ఎస్టేట్ రంగ కన్సల్టెంట్ సంస్థ ‘అనరాక్’ ఏఐఎఫ్‌లకు సంబంధించి డేటాను విశ్లేషించి ఒక నివేదిక విడుదల చేసింది. గత డిసెంబర్ నాటికి ఏఐఎఫ్‌లు అన్ని రంగాల్లోనూ కలిపి రూ.5,06,196 కోట్లను ఇన్వెస్ట్ చేసినట్టు తెలిపింది. ఇందులో 15 శాతం మేర (రూ.73,903 కోట్లు) రియల్ ఎస్టేట్‌లోకి వచ్చాయని.. రంగాల వారీగా అత్యధిక పెట్టుబడులు రియల్టీకే దక్కినట్టు ఈ నివేదిక తెలిపింది. ‘‘ఏఐఎఫ్‌లతో దేశ రియల్ ఎస్టేట్ ఫైనాన్సింగ్ (రుణ సదుపాయం) గణీయమైన మార్పునకు గురైంది. నిధుల్లేమితో ఇబ్బందులు పడుతున్న ప్రాజెక్టులకు ఏఐఎఫ్ పెట్టుబడులు జీవాన్నిస్తున్నాయి. డెవలపర్లకు కొత్త అవకాశాలను కల్పిస్తున్నాయి’’అని అనరాక్ తెలిపింది. ఏ రంగంలోకి ఎంత మేర.. రియల్ ఎస్టేట్ తర్వాత అత్యధికంగా ఐటీ/ఐటీఈఎస్ రంగంలోకి రూ.30,279 కోట్ల ఏఐఎఫ్ పెట్టుబడులు వెళ్లాయి. ఆ తర్వాత ఫైనాన్షియల్ సర్వీసెస్ రూ.26,807 కోట్లు, ఎన్బీఎఫ్సీ రూ.21,929 కోట్లు, బ్యాంకులు రూ.21,273 కోట్లు, ఫార్మా రూ.18,309 కోట్లు, ఎఫ్ఎంసీజీ రూ.12,743 కోట్లు, రిటైల్ రూ.11550 కోట్లు, పునరుత్పాదక ఇంధన రంగం రూ.11,433 కోట్ల చొప్పున ఏఐఎఫ్ పెట్టుబడులను 2024 డిసెంబర్ నాటికి ఆకర్షించినట్టు అనరాక్ నివేదిక ఆధారంగా తెలుస్తోంది. ఇతర రంగాల్లోకి రూ.2,77,970 కోట్ల ఏఐఎఫ్ పెట్టుబడులు వెళ్లాయి. రియల్ ఎస్టేట్ అభివృద్ధి పరంగా వివిధ దశల్లో ఉన్న నిధుల సమస్యకు ఏఐఎఫ్ రూపంలో పరిష్కారం లభించినట్టు అనరాక్ గ్రూప్ రీజినల్ డైరెక్టర్ ప్రశాంత్ ఠాకూర్ పేర్కొన్నారు. సంప్రదాయ నిధుల సమీకరణ మార్గాల్లో ఇబ్బందులకు ఈ రూపంలో పరిష్కారం లభించినట్టు చెప్పారు. ఏఐఎఫ్‌లు ప్రైవేటు ఈక్విటీ, హెడ్జ్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ తదితర రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఇవి ఇన్వెస్టర్లకు అధిక రిస్క్‌తో కూడిన రాబడులను ఆఫర్ చేస్తుంటాయి. దేశ, విదేశీ ఇన్వెస్టర్ల నుంచి పెద్ద మొత్తంలో నిధులు సమీకరించి, తమ ప్రణాళికలకు అనుగుణంగా పెట్టుబడులు పెడుతుంటాయి. గడిచిన దశాబ్ద కాలంలో సెబీ వద్ద నమోదైన ఏఐఎఫ్‌లు 36 రెట్లు పెరిగాయి. 2013 మార్చి నాటికి 42గా ఉన్నవి 2025 మార్చి 5 నాటికి 1,524కు పెరిగినట్టు డేటా తెలియజేస్తోంది. -
ఇలాంటి ఇల్లు కొంటే తలనొప్పే..
భవన నిర్మాణం సమయంలో తడిగా ఉండే ప్రదేశాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆయా ప్రాంతాల వద్ద అత్యంత నాణ్యత ఉండేలా చూసుకుంటే.. మన కలల సౌధం పది కాలాల పాటు దృఢంగా ఉంటుంది. మరుగుదొడ్లు, స్నానాల గదులు, కిచెన్ సింక్, వాషింగ్ మిషన్ ఉండే చోట నిర్మాణం సమయంలోనే నాణ్యత పాటించేలా చూసుకోవడం కూడా అవసరం. - సాక్షి, సిటీబ్యూరోముఖ్యంగా మరుగుదొడ్లు, స్నానాల గదుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాలు తలనొప్పిగా మారుతుంటాయి. ఇంటి కొనుగోలు సమయంలోనే ఈ విషయాలు గమనించాలి. పైకి ఆకట్టుకునేలా ఉండటమే కాకుండా ఎంత క్వాలిటీ వస్తువులు వాడారు.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అనే విషయాలు తెలుసుకోవాలి.వెంటనే అప్రమత్తం.. వాటర్ ప్రూఫింగ్ సక్రమంగా లేకుంటే టైల్స్‌పై నిలిచిన నీటి నుంచి సన్నగా లీకేజీ ప్రారంభమవుతుంది. ఇందుకు వ్యక్తిగత గృహాలు, విల్లాలు ఏవీ మినహాయింపు కాదు. లీకేజీకి ఎక్కడైనా అవకాశం ఉంటుంది. నిర్మాణం పూర్తయిన సంవత్సరం.. ఆ తర్వాత ఈ సమస్య బయట పడుతుంది. గోడలకు చెమ్మ రావడం, వాసన వస్తుండటం వంటి సంకేతాలు కనిపిస్తుంటాయి. వెంటనే అప్రమత్తం కాకపోతే సమస్య క్రమంగా భవనమంతా వ్యాపిస్తుంది.అదే అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీ బహుళ అంతస్తుల భవనాల్లో మన ఫ్లాట్ కింద ఉన్న వారికి సమస్యలు మొదలవుతాయి. గోడలకు చెమ్మ రావడం, రంగు మారిపోవడం, పెచ్చులుగా రంగు ఊడిపోతుండడం, దుర్వాసన వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. సమస్య తమ ఫ్లాట్‌లోనే ఉందని తొలుత అంతా భావిస్తారు. భవన నిర్మాణదారుడు సరైన వాటర్ ప్రూఫింగ్ విధానం పాటించకపోవడంతో పైఫ్లాట్ నుంచి లీకేజీ అవుతున్నట్లు ఆలస్యంగా గ్రహిస్తారు. వీటిని ప్లంబర్లు, నిర్మాణ మేస్త్రీలు మాత్రమే కచ్చితంగా గుర్తిస్తారు.అక్కడి నుంచే మొదలు.. సాధారణంగా అత్యధిక లీకేజీలు టాయిలెట్ రూమ్ నుంచే మొదలవుతాయి. ఆ ప్రదేశాలలో నీరు నిల్వ ఉండకుండా ఉండేందుకు టైల్స్ ఎగుడుదిగుడుగా లేకుండా చూసుకోవాలి. దీనికంటే ముందు నిర్మాణ దశలోనే కాంక్రీట్ లేదంటే బ్రిక్స్‌తో రసాయనాలు వినియోగించి వాటర్ ప్రూఫ్ బెడ్ ఏర్పాటు చేయాలి. ఇక నీటి పైప్లైన్ల కారణంగానూ లీకేజీలు ఏర్పడతాయి. వంట గదిలో సింక్ దగ్గర, వాషింగ్ మిషన్ ప్రదేశాలలో పైపుల దగ్గర జాగ్రత్తగా వ్యవహరించాలి. -
విశాలమైన ఆఫీస్.. ఫుల్ డిమాండ్
స్థిరాస్తి రంగాన్ని కరోనా ముందు, తర్వాత అని విభజించక తప్పదేమో.. మహమ్మారి కాలంలో ఇంటిలో ప్రత్యేక గది, ఇంటి అవసరం ఎలాగైతే తెలిసొచ్చిందో.. ఆఫీసు విభాగంలోనూ సేమ్ ఇదే పరిస్థితి. కోవిడ్ అనంతరం ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రప్పించాలంటే ఆఫీసు స్థలం విశాలంగా ఉండక తప్పని పరిస్థితి. దీంతో విస్తీర్ణమైన కార్యాలయ స్థలాలకు డిమాండ్ పెరిగింది. – సాక్షి, సిటీబ్యూరోహైదరాబాద్‌లో ఈ ఏడాది తొలి త్రైమాసికం (క్యూ1)లో 25 లక్షల చ.అ. ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరిగాయి. ఇందులో 80 శాతం స్థలం పెద్ద, మధ్య స్థాయి కార్యాలయాల వాటానే ఉన్నాయి. ఈ విభాగంలో 20 లక్షల చ.అ. స్పేస్ లీజుకు పోయింది. అత్యధికంగా 35 శాతం ఐటీ సంస్థలు, 17 శాతం ఫార్మా అండ్ హెల్త్ కేర్ సంస్థలు లీజుకు తీసుకున్నాయని గ్లోబల్ రియల్ ఎస్టేట్ అడ్వైజరీ సావిల్స్ ఇండియా నివేదిక వెల్లడించింది.ఈ ఏడాది తొలి మూడు నెలల్లో దేశంలో కార్యాలయ స్థల లావాదేవీలు సరికొత్త శిఖరాలను అధిరోహించాయి. ఆరు ప్రధాన నగరాలలో క్యూ1లో 1.89 కోట్ల చ.అ. ఆఫీసు స్పేస్ లీజుకు పోయింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 10 శాతం ఎక్కువ. 2020 తర్వాత ఈ స్థాయిలో ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరగడం ఇదే తొలిసారి. ఈ ఏడాది ముగింపు నాటికి ఆఫీసు స్పేస్ లావాదేవీలు 7.10 కోట్ల చ.అ.లకు చేరుతుందని అంచనా.సరఫరాలో 28 శాతం వృద్ధి.. 2025 క్యూ1లో ఆరు మెట్రో నగరాల్లో కొత్తగా మార్కెట్లోకి 86 లక్షల చ.అ. ఆఫీసు స్పేస్ సరఫరా అయింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 28 శాతం అధికం. ఈ ఏడాది ముగింపు నాటికి కొత్తగా 8.15 కోట్ల చ.అ. స్థలం అందుబాటులోకి వస్తుందని అంచనా. లీజులలో వృద్ధి, సరఫరా కారణంగా ఈ త్రైమాసికం ముగింపు నాటికి ఆఫీసు స్పేస్ వేకన్సీ రేటు 15 శాతంగా ఉంది.జీసీసీల జోరు.. ఇప్పటి వరకు దేశంలోని ఆరు మెట్రోలలో 80.62 కోట్ల చ.అ. గ్రేడ్–ఏ ఆఫీసు స్పేస్ అందుబాటులో ఉంది. ఈ ఏడాది ముగింపు నాటికి 87.91 కోట్ల చ.అ.లకు చేరుతుందని అంచనా. స్థూల ఆర్థికాభివృద్ధి, స్థిరమైన ధరలు, నైపుణ్య కార్మికుల అందుబాటు తదితర కారణాలతో ఐటీ, బ్యాంకింగ్, తయారీ రంగాలలో ఫ్లెక్సీబుల్ ఆఫీసు స్పేస్ లావాదేవీలు పెరగడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ సంస్థల గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) ఏర్పాటుతో ఆఫీసు స్పేస్ విభాగం మరింత వృద్ధి సాధిస్తుంది. -
హోమ్ లోన్ ముందుగా చెల్లించడం మంచిదేనా..?
సగటు మనిషి తన జీవితంలో తీసుకునే అతిపెద్ద రుణం ఇంటి కోసమే.. ఇది కనీసం 15–30 ఏళ్ల పాటు చెల్లించాల్సి ఉంటుంది. అంత పెద్ద మొత్తం అన్ని సంవత్సరాలు చెల్లించడం వల్ల చాలా ఎక్కువ మొత్తం వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. మనకు తెలియకుండానే తీసుకున్న రుణం కంటే దాదాపు రెట్టింపుపైనే చెల్లిస్తాం. ఈ నేపథ్యంలో అవకాశం ఉన్నప్పుడు ఇంటి రుణం ముందుగా చెల్లించడం మంచిదేనా? అంటే అవుననే అంటున్నారు ఆర్థిక నిపుణులు. మీకు అందుబాటులో డబ్బు ఉన్నప్పుడు ఇంటి రుణం తీర్చుకోవడం తెలివైన పని అని సూచిస్తున్నారు. అయితే ఇంటి రుణం ముందుగా చెల్లించాలా? లేదా అనే నిర్ణయం మీరు ఎంచుకున్న పన్ను విధానంపై కూడా ఆధారపడి ఉంటుంది. - సాక్షి, సిటీబ్యూరోవీరికి ప్రయోజనకరంఇంటి రుణం ముందస్తు చెల్లింపు.. ముఖ్యంగా ఉద్యోగ విరమణకు దగ్గరగా ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. వారి ఆదాయం తగ్గకముందే బాధ్యతలను క్లియర్ చేయడంలో ఇది సహాయపడుతుంది. మొత్తం వడ్డీ భారాన్ని తగ్గించడంతో పాటు ముందస్తు చెల్లింపు రుణ కాలపరిమితిని తగ్గిస్తుంది. అలాగే క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరుస్తుంది. పైగా ముందస్తు చెల్లింపు ఈఎంఐలను తగ్గించడంలో సహాయపడుతుంది. రుణ గ్రహీత గృహ రుణాన్ని ముందస్తుగా చెల్లించినప్పుడు, అతిపెద్ద ప్రయోజనం మొత్తం వడ్డీ అవుట్గో తగ్గడం, వడ్డీని బాకీ ఉన్న అసలుపై లెక్కించినందున, ఒకేసారి చెల్లింపులు చేయడం వల్ల వడ్డీ వచ్చే బకాయి మొత్తం తగ్గుతుంది.ఈఎంఐల భారం తగ్గుతుంది..ఉదాహరణకు 20 సంవత్సరాల కాల వ్యవధికి 9 శాతం వడ్డీ రేటుతో రూ.50 లక్షల గృహ రుణాన్ని తీసుకుంటే.. రుణ గ్రహీత ఐదు సంవత్సరాల తర్వాత రూ.5 లక్షలను ముందస్తుగా చెల్లిస్తే.. మిగిలిన రుణ బ్యాలెన్స్ సుమారు రూ.39.35 లక్షలకు తగ్గుతుంది. ఫలితంగా భవిష్యత్తు ఈఎంఐల వడ్డీ భారం తగ్గుతుంది. బ్యాంక్ పాలసీని బట్టి రుణ గ్రహీత ఈఎంఐ మొత్తాన్ని తగ్గించుకోవచ్చు లేదా రుణ కాలపరిమితిని తగ్గించుకోవచ్చు. రుణ గ్రహీత ఈఎంఐని మార్చకుండా ఉంచాలని ఎంచుకుంటే రుణ కాలపరిమితి 20 ఏళ్ల నుంచి దాదాపు 15 ఏళ్లకు తగ్గుతుంది. తద్వారా వడ్డీ చెల్లింపులతో సుమారు రూ.16.30 లక్షలు ఆదా అవుతుంది. -
కోటి రూపాయల ఇళ్లే కొంటున్నారు..!
సొంతింటి కల సాకారం చేసుకునేందుకు నగరవాసులు ఎంతైనా ఖర్చు చేసేందుకు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. జేబుకు భారం కాకుండా బడ్జెట్ ఇళ్లను కొని, తర్వాత బాధపడే బదులు.. భవిష్యత్తు అవసరాలను ముందుగానే ఊహించి అధిక విస్తీర్ణం కలిగిన ఖరీదైన గృహాలను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో గ్రేటర్లో రూ.50 లక్షలలోపు ధర ఉండే అందుబాటు ఇళ్ల విక్రయాలు క్రమంగా తగ్గుతూ.. రూ.కోటి కంటే ఎక్కువ ధర ఉండే ప్రీమియం యూనిట్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. – సాక్షి, సిటీబ్యూరోహైదరాబాద్ నగరంలో ఈ ఏడాది మార్చిలో జరిగిన ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లలో అఫర్డబుల్ హౌసింగ్ వాటా 55 శాతంగా ఉంది. కానీ, గతేడాది ఇదే నెలలోని 60 శాతంతో పోలిస్తే మాత్రం ఈ విభాగం వాటా 14 శాతం మేర తగ్గింది. అదే రూ.కోటి కంటే ఖరీదైన ఇళ్ల వాటా ఏడాది కాలంలో 17 శాతం మేర పెరిగింది. మార్చిలో రిజిస్ట్రేషన్స్ అయిన మొత్తం ప్రాపర్టీలలో ఖరీదైన ఇళ్ల వాటా 19 శాతంగా ఉంది. గతేడాది ఇదే నెలలో ఈ విభాగం వాటా 15 శాతమే. దీని అర్థం.. గృహ కొనుగోలుదారులు అందుబాటు గృహాల నుంచి క్రమంగా ఖరీదైన ఇళ్ల వైపు మొగ్గు చూపిస్తున్నారని నైట్‌ఫ్రాంక్ ఇండియా నెలవారీ నివేదిక వెల్లడించింది.👉ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు ఎంతలా పెరిగాయంటే..రూ.4,471 కోట్ల విలువైన ప్రాపర్టీలు.. గ్రేటర్లో గత నెలలో 6,327 ప్రాపర్టీలు రిజిస్ట్రేషన్స్ అయ్యాయి. వీటి విలువ రూ.4,471 కోట్లు.. అయితే అంతకు క్రితం నెలతో పోలిస్తే ప్రాపర్టీల విలువ రూ.14 శాతం మేర, రిజిస్ట్రేషన్లు 6 శాతం వృద్ధి చెందాయి. ఫిబ్రవరిలో రూ.3,925 కోట్ల విలువైన 5,988 యూనిట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. అయితే గతేడాది మార్చితో పోలిస్తే మాత్రం రిజిస్ట్రేషన్లు 8 శాతం తగ్గగా.. విలువ 4 శాతం మేర పెరిగింది. 2024 మార్చిలో రూ.4,275 కోట్ల విలువైన 6,870 యూనిట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి.2 వేల చ.అ. కంటే విస్తీర్ణమైనవి.. గత నెలలో రూ.2,480 కోట్ల విలువైన 3,509 అఫర్డబుల్ యూనిట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. అయితే గతేడాది ఇదే నెలతో పోలిస్తే మాత్రం ఇది 14 శాతం తక్కువ. అలాగే రూ.50 లక్షల నుంచి రూ.కోటి మధ్య ధర ఉన్న 1,605 యూనిట్లు మార్చిలో రిజిస్ట్రేషన్ కాగా.. వీటి విలువ రూ.1,134 కోట్లు. 2024 మార్చితో పోలిస్తే ఈ విభాగంలోనూ రిజిస్ట్రేషన్లు 7 శాతం మేర తగ్గాయి. ఇక, రూ.కోటి కంటే ఖరీదైన ఇళ్లు గత నెలలో 1,213 రిజిస్ట్రేషన్ కాగా.. వీటి విలువ రూ.857 కోట్లు. అయితే గతేడాది మార్చితో పోలిస్తే మాత్రం ప్రీమియం ఇళ్ల విభాగంలో రిజిస్ట్రేషన్లు 17 శాతం, విలువలు 33 శాతం మేర వృద్ధి చెందాయి. గతేడాది మార్చిలో 2 వేల చ.అ. కంటే విస్తీర్ణమైన ఇళ్ల వాటా 13 శాతంగా ఉండగా.. గత నెలకొచ్చే సరికి 16 శాతానికి పెరిగింది. 1,000 నుంచి 2,000 చ.అ. యూనిట్ల వాటా 71 శాతం నుంచి 68 శాతానికి తగ్గింది. -
కోకాపేటలో కొత్త హౌసింగ్ ప్రాజెక్ట్..
సాక్షి, సిటీబ్యూరో: ప్రముఖ నిర్మాణ సంస్థ ఎంఎస్ఎన్ రియాల్టీ అద్భుతమైన ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నియోపోలిస్ ప్రాంతంలో అల్ట్రా లగ్జరీ హైరైజ్ ప్రాజెక్ట్‌ను ‘వన్’ను నిర్మించనుంది. 7.7 ఎకరాల విస్తీర్ణంలో రూ.2,750 కోట్ల పెట్టుబడులతో ఈ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయనుంది.40 లక్షల చ.అ.లలో నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్‌లో 5 టవర్లు, ఒక్కోటి 55 అంతస్తుల్లో ఉంటుంది. 5,250 చ.అ. నుంచి 7,460 చ.అ. విస్తీర్ణంలో మొత్తం 655 యూనిట్లు ఉంటాయి. ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలను సంస్థ సీఎండీ ఎంఎస్ఎన్ రెడ్డి శుక్రవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. అన్నీ 4 బీహెచ్‌కే యూనిట్లే ఉండే ఈ ప్రాజెక్ట్‌లో చ.అ. ధర రూ.11 వేలుగా ఉంటుంది. ప్రతి అపార్ట్‌మెంట్‌కు రెండు బాల్కనీలు, లార్జ్ డెక్ ఉంటుంది. గండిపేట చెరువు వ్యూ ఉండే ఈ ప్రాజెక్ట్‌లో 1.8 లక్షల చ.అ. విస్తీర్ణంలో క్లబ్ హౌస్ ఉంటుంది.ఇందులో 30కి పైగా ఆధునిక వసతులు ఉంటాయి. మూడు స్విమ్మింగ్ పూల్స్, యోగా డెక్, స్కై సినిమా, ఆక్వా జిమ్, వెల్నెస్, లైఫ్‌స్టైల్ జోన్లతో పాటు బ్యాడ్మింటన్, స్క్వాష్, పికిల్‌బాల్, ప్యాడిల్ బాల్ కోర్టులు, బౌలింగ్ అల్లే, క్రికెట్, ఫుట్‌బాల్, గోల్ఫ్ కోసం ప్రత్యేక సిమ్యులేటర్లు ఉంటాయని ఆయన వివరించారు. నగరంలో వచ్చే ఐదేళ్లలో 2 కోట్ల చ.అ.లలో ప్రాజెక్ట్‌లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. -
హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు ఎంతలా పెరిగాయంటే..
సాక్షి, సిటీబ్యూరో: దేశంలో ప్రాపర్టీ ధరలు భారీగా పెరిగాయి. దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో గతేడాది కొత్త ప్రాజెక్టుల ధరలు సగటున 9 శాతం మేర పెరిగినట్లు డేటా అనలిటిక్స్ సంస్థ ప్రాప్ ఈక్విటీ తెలిపింది. 2024–25లో ప్రాపర్టీ ధరలు సగటున 9 శాతం పెరిగి చ.అ.కు రూ.13,197కు చేరినట్లు పేర్కొంది. ఏడాది కాలంలో కోల్‌కతాలో ఇళ్ల ధరలు అత్యధికంగా 29 శాతం మేర పెరిగాయి. ఆ తర్వాత థానేలో 17 శాతం, బెంగళూరులో 15 శాతం, పుణెలో 10 శాతం, ఢిల్లీ–ఎన్సీఆర్లో 5 శాతం, హైదరాబాద్‌లో 5 శాతం, చెన్నైలో 4 శాతంగా ఉన్నాయి.ముంబై, నవీ ముంబైలో ఇళ్ల ధరలు 3 శాతం తగ్గాయి. కాగా రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఇళ్ల ధరలు 18 శాతం పెరిగాయి. అత్యధికంగా బెంగళూరులో 44 శాతం వృద్ధి నమోదయ్యింది. కోల్‌కత్తాలో 29 శాతం, చెన్నైలో 25 శాతం, థానేలో 23 శాతం, ఢిల్లీ–ఎన్సీఆర్లో 20 శాతం, పుణేలో 18 శాతం, నవీ ముంబైలో 13 శాతం, ముంబైలో 11 శాతం, హైదరాబాద్‌లో 5 శాతం పెరుగుదల నమోదు చేసింది. మరోవైపు ఈ ఏడాది జనవరి–మార్చిలో గృహాల అమ్మకాలు 23 శాతం తగ్గి, 1,05,791 యూనిట్లకు చేరుకోగా.. సరఫరా 34 శాతం తగ్గి 80,774లకు చేరుకుంది.ప్రస్తుతం కొత్త ప్రాజెక్ట్‌లలో ధరలను పరిశీలిస్తే.. బెంగళూరులో గతేడాది చ.అ. సగటున ధర రూ.8,577 ఉండగా.. ప్రస్తుతం అది రూ.9,852కు పెరిగింది. కోల్‌కత్తాలో చ.అ. ధర రూ.6,201 నుంచి రూ.8,009కి పెరిగింది. చెన్నైలో రేట్లు చ.అ.కు రూ.7,645 నుంచి రూ.7,989కు పెరిగాయి. హైదరాబాద్‌లో చ.అ.కు రూ.7,890 నుంచి రూ.8,306కు పెరిగాయి. పుణెలో చ.అ.కు రూ.9,877 నుంచి రూ.10,832కు పెరిగాయి. థానేలో సగటు చ.అ. ధర రూ.11,030 నుంచి రూ.12,880కు పెరిగాయి. ఢిల్లీలో చ.అ.కు రూ.13,396 నుంచి రూ.14,020కు పెరిగాయి. -
రియల్ఎస్టేట్లో తగ్గిన ‘పీఈ’ పెట్టుబడులు
సాక్షి, సిటీబ్యూరో: దేశీయ స్థిరాస్తి రంగంలోకి వచ్చిన ప్రైవేట్ ఈక్విటీ(పీఈ) పెట్టుబడులు కాస్త తగ్గాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన పెట్టుబడులు అంతకుముందు ఏడాదితో పోలిస్తే 3 శాతం మేర తగ్గినట్లు రియల్టీ కన్సల్టెంట్ అనరాక్ క్యాపిటల్ వెల్లడించింది.2024–25లో ఈ పెట్టుబడులు 3.7 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్లు తెలిపింది. అంతకుముందు ఏడాది ఇవి 3.8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఆఫీసు భవనాలకు ఇన్వెస్ట్మెంట్స్ తగ్గడమే ఈ క్షీణతకు కారణం. 2020–21లో అత్యధికంగా 6.4 బిలియన్ డాలర్ల పీఈ పెట్టుబడులు రాగా.. 2021–22లో ఇవి 4.3 బిలియన్ డాలర్లకు తగ్గాయి.అయితే 2022–23 కల్లా 4.4 బిలియన్ డాలర్లకు పెరిగినప్పటికీ.. తర్వాత తగ్గుముఖం పట్టాయి. ఐదేళ్లుగా దేశీ రియల్టీలో పీఈ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గుతూ వచ్చాయి. 6.4 బిలియన్ డాలర్ల నుంచి 3.7 బిలియన్ డాలర్లకు అంటే 43 శాతం మేర క్షీణించాయి. -
హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మరో లగ్జరీ ప్రాజెక్ట్
హైదరాబాద్: ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ రాఘవ.. తమ తాజా ప్రాజెక్ట్ 'సింక్ బై రాఘవ'ను ప్రకటించారు. ఈ ప్రీమియం లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఉంది. హైదరాబాద్‌లో అత్యధిక డిమాండ్ కలిగిన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో 7.19 ఎకరాల్లో విస్తరించి ఉన్న రాఘవ ‘సింక్’ ఐదు 61 అంతస్తుల టవర్లు కలిగి ఉంది.సింక్‌లోని ప్రతి రెసిడెన్షియల్ ఫ్లాట్ ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సౌకర్యాలను కలిగి ఉంటుంది. ‘ది ఒయాసిస్’ పార్టీ ప్రాంగణాలు, వాకింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్స్, పిల్లల కోసం ప్రత్యేక ఆట స్థలాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్‌లో ప్రతి టవర్‌లో పికిల్‌బాల్ కోర్టులు, పార్టీ డెక్, యోగా డెక్‌తో కూడిన స్కై లాంజ్ కూడా ఉంది. అంతే కాకుండా వ్యాపార కేంద్రాలు, ప్రఖ్యాత విద్యా సంస్థలు, ఆసుపత్రులు కూడా దీనికి దగ్గరగా ఉన్నాయి.సింక్ బై రాఘవ కేవలం నివాస ప్రదేశం మాత్రమే కాదు, ఇది ఒక హై-ఎండ్ ఆర్కిటెక్చరల్ అద్భుతం. చిన్న చిన్న అంశాల మీద కూడా ప్రత్యేక శ్రద్ద వహిస్తూ.. నాణ్యమైన మెటీరియల్స్ ఉపయోగించినట్లు.. రాఘవ మేనేజింగ్ డైరెక్టర్ హర్ష రెడ్డి పొంగులేటి అన్నారు. డిజైన్, ఫినిష్ , ఫీచర్స్ అన్నీ కూడా ప్రస్తుత జీవన విధానాలకు దగ్గరగా ఉన్నాయని పేర్కొన్నారు. -
అల్లుడితో కలిసి 7 ఎకరాలు కొన్న బాలీవుడ్ నటుడు.. ఎక్కడంటే?
సినీ ప్రముఖులు, క్రీడాకారులు తమదైన రంగాలలో రాణిస్తూనే.. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగానే నటుడు సునీల్ శెట్టి.. ఆయన అల్లుడు & భారత్ క్రికెటర్ కేఎల్ రాహుల్ ఇద్దరూ కలిసి థానే వెస్ట్‌లోని ఓవాలేలో 7 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు తెలిసింది.ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ (ఐజీఆర్) వెబ్సైట్ ప్రకారం.. ఈ భూమి విలువ రూ. 9.85 కోట్లు అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన లావాదేవీలన్నీ.. 2025 మార్చిలో జరిగాయి. ఈ భూమి ఆనంద్ నగర్, కాసర్వాడవలి మధ్య ఉంది. ఇది థానే వెస్ట్‌ను తూర్పు, పశ్చిమ ఎక్స్‌ప్రెస్ హైవేకు సమీపంలో ఉండటం వల్ల వ్యాపార కనెక్టివిటీకి కూడా అనుకూలంగా ఉంటుంది.స్క్వేర్ యార్డ్స్ ప్రకారం.. స్టాంప్ డ్యూటీ ఖర్చులు రూ. 68.96 లక్షలు అని, రిజిస్ట్రేషన్ చార్జీలు రూ. 30,000 అని తెలుస్తోంది.భారతదేశపు ప్రముఖ క్రికెటర్లలో ఒకరైన కేఎల్ రాహుల్.. జాతీయ జట్టు తరపున అన్ని ఫార్మాట్లలో ఆడారు. వైస్ కెప్టెన్‌గా పనిచేశారు మరియు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో జట్లకు నాయకత్వం వహించారు. సియట్ టి20 ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ వంటి అవార్డులతో గుర్తింపు పొందిన రాహుల్, భారతదేశంలో అత్యధిక పరుగులు సాధించిన వారిలో ఒకరుగా ఉన్నారు.ఇదీ చదవండి: టోల్ కలెక్షన్ విధానంలో సంచలన మార్పు: 15 రోజుల్లో అమలు!ఇక నటుడు సునీల్ శెట్టి విషయానికి వస్తే.. ఈయన సుమారు 100 కంటే ఎక్కువ సినిమాలలో నటించారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన కృషికి రాజీవ్ గాంధీ అవార్డు దక్కింది. సినిమాల్లో మాత్రమే కాకూండా ఫిట్నెస్, రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ వెంచర్లలో కూడా సునీల్ శెట్టి రాణిస్తున్నారు. -
హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు తగ్గాయ్..
న్యూఢిల్లీ: హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు ఢీలా పడ్డాయి. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో (2025 జనవరి–మార్చి) మొత్తం 10,647 యూనిట్ల ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో అమ్మకాలు 14,298 యూనిట్లుగా ఉండడం గమనార్హం. అంతేకాదు దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రముఖ నగరాల్లోనూ జనవరి–మార్చి కాలంలో ఇళ్ల అమ్మకాలు 19 శాతం తగ్గిపోయాయి. మొత్తం 98,095 యూనిట్ల విక్రయాలు జరిగాయి. ఈ వివరాలను రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ప్రాప్‌టైగర్ విడుదల చేసింది.ఇళ్ల ధరలు పెరిగిపోవడం, వృద్ధి తగ్గుముఖం పట్టడంతో కొనుగోలుదారులు అప్రమత్త ధోరణితో వ్యవహరించినట్టు వెల్లడించింది. అలాగే, ఎనిమిది ప్రముఖ నగరాల్లో మార్చి త్రైమాసికంలో కొత్త ఇళ్ల సరఫరా 10 శాతం తగ్గినట్టు తెలిపింది. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా డెవలపర్లు వ్యవహరించినట్టు పేర్కొంది. ‘‘ధరలు గణనీయంగా పెరగడం విక్రయాలపై ప్రతికూల ప్రభావం చూపించింది. అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధం కొత్త అనిశ్చితులను తీసుకొచ్చింది. ఇలాంటి తరుణంలో కొనుగోళ్ల పట్ల అప్రమత్తంగా వ్యవహరించడం సాధారణంగా కనిపించేదే’’అని ప్రాప్ టైగర్, హౌసింగ్ డాట్ కామ్ గ్రూప్ సీఈవో ధ్రువ్ అగర్వాల్ తెలిపారు. నగరాల వారీ విక్రయాలు.. 👉 అహ్మదాబాద్‌లో 10,730 ఇళ్ల యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 12,915 యూనిట్లతో పోల్చి చూస్తే 17 శాతం తగ్గాయి. 👉 ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో 8,477 యూనిట్ల విక్రయాలు జరిగాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 10,058 యూనిట్లతో పోల్చి చూస్తే 16 శాతం తగ్గాయి. 👉 ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో అమ్మకాలు 26 శాతం క్షీణించి 30,705 యూనిట్ల ఇళ్లకు పరిమితయ్యాయి. 👉 పుణెలో ఇళ్ల అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 25 శాతం తక్కువగా 17,228 యూనిట్లుగా ఉన్నాయి. 👉 కోల్‌కతాలో విక్రయాలు కేవలం ఒక శాతం తగ్గి 3,803 యూనిట్లుగా ఉన్నాయి. 👉 బెంగళూరులో మాత్రం భిన్నమైన పరిస్థితి కనిపించింది. ఈ ఏడాది జనవరి–మార్చి మధ్యకాలంలో ఇళ్ల అమ్మకాలు 13 శాతం పెరిగి 11,731 యూనిట్లుగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలలో 10,381 యూనిట్లు అమ్ముడుపోవడం గమనార్హం. 👉 చెన్నైలోనూ అమ్మకాలు 8 శాతం పెరిగి 4,774 యూనిట్లుగా ఉన్నాయి. 👉 జనవరి–మార్చి కాలంలో ప్రముఖ నగరాల్లో కొత్త ఇళ్ల సరఫరా 10 శాతం తగ్గి 93,144 యూనిట్లుగా ఉంది. ఈ డేటా కొత్త ఇళ్ల విక్రయాలకు సంబంధించినది. -
గురుగ్రామ్‌లో ‘ట్రంప్’ హౌసింగ్ ప్రాజెక్ట్..
న్యూఢిల్లీ: ‘ట్రంప్’ బ్రాండ్ కింద గురుగ్రామ్‌లో అల్ట్రా–లగ్జరీ రెసిడెన్షియల్ ప్లాజెక్ట్ నిర్మించనున్నట్లు రియల్టీ సంస్థలు ఎం3ఎం గ్రూప్ సంస్థ స్మార్ట్‌వరల్డ్ డెవలపర్స్, ట్రైబెకా డెవలపర్స్ వెల్లడించాయి. దీనిపై రూ. 2,200 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలిపాయి. ఈ ప్రాజెక్టులో 12 లక్షల చ.అ.లతో 288 యూనిట్లను విక్రయించనున్నారు.ఇది అయిదేళ్లలో పూర్తవుతుందని, సుమారు రూ. 3,500 కోట్ల ఆదాయం రావచ్చని అంచనా వేస్తున్నట్లు స్మార్ట్‌వరల్డ్ డెవలపర్స్ సహ వ్యవస్థాపకుడు పంజ్ బన్సల్ తెలిపారు. చ.అ.కు రూ. 27,000 రేటుతో, ఒక్కొక్క అపార్ట్మెంట్ ధర రూ. 8 కోట్ల నుంచి రూ. 12 కోట్ల వరకు ఉంటుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రాండ్‌కి ఆ దేశం వెలుపల భారత్ అతి పెద్ద రియల్టీ మార్కెట్‌గా మారింది. భారత్‌లో ట్రంప్ బ్రాండ్‌కి ట్రైబెకా డెవలపర్స్ సంస్థ అధికారిక ప్రతినిధిగా వ్యవహరిస్తోంది. ట్రంప్ ఈ ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగా, ఈ ఒప్పందం 6–8 నెలల క్రితమే కుదిరినట్లు ట్రైబెకా తెలిపింది. -
హైదరాబాద్‌లో ఆఫీసు స్థలాల అద్దెలు ఇలా..
దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో గతేడాది(2024) ఆఫీసుల స్థలాల అద్దెలు 4–8% పెరిగినట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ వెస్టియన్ ఓ నివేదికలో తెలిపింది. కొత్త వ్యాపారాలు, కంపెనీల విస్తరణ కారణంగా కార్యాలయాల స్థలాలకు గణనీయమైన డిమాండ్ నెలకొందని పేర్కొంది. ‘భారత్‌లో అధిక జనాభా, భారీ కన్జూమర్ బేస్, వేగవంతమైన పట్టణీకరణతో పాటు టెక్నాలజీ, ఫైనాన్స్ రంగాల్లో తక్కువ ధరలకు నైపుణ్యం కలిగిన శ్రామికశక్తి లభిస్తుంది. అందుకే అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు ఆఫీసు స్పేస్ కోసం భారత్ వైపు దృష్టి సారిస్తున్నాయి’ అని వెస్టియన్ సీఈవో శ్రీనివాస్ రావు తెలిపారు.నెలవారీగా కార్యాలయ అద్దెల్లో న్యూఢిల్లీ 8.2 శాతం వృద్ధితో అగ్రస్థానంలో నిలిచింది. చెన్నై 7.7%, ముంబై 6.7% బెంగళూరు 4.7%, పూణే 4.5%, హైదరాబాద్ 4.4%, కోల్కత్తా 3.8 శాతం వృద్ధితో తర్వాతి స్థానాల్లో నిలిచాయి.నగరాల వారీగా చూస్తే ముంబైలో చదరపు అడుగు నెలవారీ సగటు అద్దె 1.6 డాలర్లుగా ఉంది. బెంగళూరులో 1.1 డాలరు, పూణేలో 1 డాలరు, న్యూఢిల్లీలో 0.9 డాలరు, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో 0.8 డాలరు, పూణేలో 0.6 డాలరుగా ఉంది.అంతర్జాతీయ మార్కెట్లో మిశ్రమంగా... అంతర్జాతీయంగా ఎనిమిది పెద్ద ఓవర్సీస్ మార్కెట్లలో ఆఫీసు అద్దె వృద్ధి మిశ్రమంగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. గతేడాది(2024) న్యూయార్క్‌లో సగటు ఆఫీసు అద్దె 1.3% క్షీణించింది. అక్కడ నెలకు చదరపు అడుగుకు అద్దె 7.5 డాలర్లుగా ఉంది. షాంఘైలో 6.8%, హాంగ్‌కాంగ్‌లో 6%, సియాటిల్‌లో 1.9% క్షీణత నమోదైంది. చదరపు అడుగు నెలవారీ సగటు అద్దెలు వరుసగా 2.8 డాలర్లు, 5.9 డాలర్లు, 4.7 డాలర్లుగా ఉన్నాయి. ఇదీ చదవండి: ‘ఉన్నతాధికారులతో బేరసారాలు’.. వదలని పోలీసులు..అయితే లండన్‌లో సగటు ఆఫీసు అద్దెలు 8.6% పెరిగాయి. అక్కడ నెలకు చదరపు అడుగు అద్దె 8.6 డాలర్లుగా ఉంది. మియామీలో 7.3% బోస్టన్‌లో 1.2%, సింగపూర్ 0.5 శాతం పెరిగాయి. చదరపు అడుగు నెలవారీ సగటు అద్దెలు వరుసగా 5.1 డాలర్లు, 5.5 డాలర్లు, 7 డాలర్లుగా ఉన్నాయి. -
రిటైల్ మాల్స్‌కు డిమాండ్ భళా...
న్యూఢిల్లీ: ప్రీమియం షాపింగ్ మాల్స్‌కు నగరాల్లో డిమాండ్ విస్తృతం అవుతోంది. దీనికి అనుగుణంగా వచ్చే రెండేళ్లలో (2026 చివరికి) హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రముఖ నగరాల్లో 19 ప్రీమియం షాపింగ్ మాల్స్ అందుబాటులోకి రానున్నాయి. ఈ వివరాలను రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ సంస్థ తాజాగా ఒక నివేదిక రూపంలో విడుదల చేసింది. 2025, 2026లో నిర్వహణలోకి రానున్న 19 గ్రేడ్ ఏ షాపింగ్ మాల్స్ విస్తీర్ణం 123 లక్షల చదరపు అడుగులుగా ఉండనుంది.ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, పుణె, అహ్మదాబాద్‌లో ఇవి రానున్నాయి. ఇందులోనూ 86 లక్షల చదరపు అడుగులు ఉన్నత శ్రేణికి నిదర్శనమైన గ్రేడ్ ఏ–ప్లస్ రూపంలో ఉండనుంది. నాణ్యమైన వసతుల వైపు కంపెనీల దృష్టి మళ్లిందనడానికి ఇది నిదర్శనమని కుష్మన్ వేక్ఫీల్డ్ నివేదిక పేర్కొంది. గ్రేడ్ ఏ–ప్లస్ మాల్స్‌ను సాధారణంగా ప్రముఖ డెవలపర్లు లేదా సంస్థాగత ఇన్వెస్టర్లు నిర్వహిస్తుంటారు. వీటిల్లో భర్తీ రేటు చాలా మెరుగ్గా (85 శాతానికి పైనే) ఉంటుంది. వినియోగదారుల ఆకాంక్షలకు అనుగుణంగా.. ‘‘భారత రిటైల్ పరిశ్రమ చాలా వేగంగా వృద్ధి చెందుతోంది. వినియోగదారుల ఆకాంక్షలు సైతం అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఉన్నత శ్రేణి మాల్స్ మరిన్ని అందుబాటులోకి రావడం విస్తరణకే కాకుండా నాణ్యత, మెరుగైన అనుభవానికి పెరిగిన ప్రాధాన్యాన్ని తెలియజేస్తోంది. ఉత్పత్తి ఎంత ముఖ్యమో, మెరుగైన బ్రాండ్ అనుభవానికీ నేడు కస్టమర్ అంతే ప్రాధాన్యం ఇస్తున్నారు’’అని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ రిటైల్ ఇండియా హెడ్ ఔసౌరభ్ షట్దాల్ తెలిపారు.సౌందర్య, ఆరోగ్య సంరక్షణ, ఆహారం–పానీయాలు, క్రీడా వ్రస్తాల విభాగాలు రిటైల్ పరిశ్రమ తదుపరి దశను మార్చనున్నాయని చెప్పారు. డిజిటల్‌గా అనుసంధానమైన, భవిష్యత్‌కు అనుకూలమైన రిటైల్ నమూనాలు దేశ వినియోగదారుల ఆకాంక్షలను ప్రతిబింబించేవిగా పేర్కొన్నారు. దేశంలో గ్రేడ్ ఏ షాపింగ్ మాల్స్ విస్తీర్ణం 2024 చివరికి 615 లక్షల చదరపు అడుగులుగా ఉన్నట్టు, ఇందులో గ్రేడ్ ఏ–ప్లస్ మాల్స్ విస్తీర్ణం ఇప్పటికే 63 శాతానికి చేరినట్టు (38.9 మిలియన్ ఎస్ఎఫ్టీ) ఈ నివేదిక వెల్లడించింది. -
అపార్ట్మెంట్ మెయింటెనెన్స్‌పై జీఎస్టీ.. ఇదిగో క్లారిటీ..
అపార్ట్మెంట్ మెయింటెనెన్స్‌పై జీఎస్టీకి సంబంధించి ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. నెలవారీ మెయింటెనెన్స్‌పై జీఎస్టీ వర్తింపునకు సంబంధించి అపార్ట్మెంట్ యజమానులు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల (ఆర్డబ్ల్యూఏ)ల్లో నెలకొన్న అయోమయాన్ని తొలగించేందుకు కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రయత్నించింది.జీఎస్టీ విధింపుపై అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లలోని నివాసితుల్లో నెలకొన్న అయోమయంపై వార్తా కథనాలు వచ్చిన నేపథ్యంలో ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ప్రెస్ రిలేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ విభాగానికి చెందిన డైరెక్టర్ జనరల్ కార్యాలయం స్పష్టత ఇచ్చింది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఆర్డబ్ల్యూఏ మొత్తం టర్నోవర్ రూ.20 లక్షలు దాటకుండా అదే సమయంలో ఒక్కో సభ్యుడి మెయింటెనెన్స్ ఛార్జీల మొత్తం నెలకు రూ.7,500 దాటినా కూడా జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది.ఇలా అయితేనే జీఎస్టీరెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లలోని ఒక్కో సభ్యుడు చెల్లించే నెలవారీ మెయింటెన్స్ రూ.7,500 కంటే ఎక్కువ ఉండి ఆ అసోసియేషన్ వసూలు చేసే మెయింటెన్స్ మొత్తం కూడా సంవత్సరానికి రూ .20 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రమే ఆర్డబ్ల్యూఏ తన సభ్యుల నుండి వసూలు చేసే నెలవారీ సబ్స్క్రిప్షన్ లేదా కంట్రిబ్యూషన్‌పై జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.ఇక హౌసింగ్ సొసైటీ లేదా రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో రెండు లేదా అంతకంటే ఎక్కువ రెసిడెన్షియల్ అపార్ట్ మెంట్లు కలిగి ఉన్నవారికి తమ ప్రతి రెసిడెన్షియల్ అపార్ట్ మెంట్ కు నెలకు రూ.7,500 చొప్పున పరిమితిని వేర్వేరుగా వర్తింపజేయాలని స్పష్టం చేసింది. అంటే ఒక్కో సభ్యుడికి నెలకు రూ.7,500 దాటితే మొత్తం పన్ను పరిధిలోకి వస్తుంది. ఉదాహరణకు మెయింటెనెన్స్ ఛార్జీలు ఒక్కో సభ్యుడికి నెలకు రూ.9,000 అయితే రూ.1,500 వ్యత్యాసంపై కాకుండా మొత్తం రూ.9,000పై 18 శాతం జీఎస్టీ చెల్లించాలి.ఆర్డబ్ల్యూఏలు, హౌసింగ్ సొసైటీలకు ప్రయోజనం చేకూర్చడానికి 2018 జనవరి 18న జీఎస్టీ కౌన్సిల్ తన 25వ సమావేశంలో అపార్ట్మెంట్ మెయింటెనెన్స్‌పై జీఎస్టీ మినహాయింపు పరిమితిని రూ .5,000 నుండి రూ .7,500 కు పెంచింది. -
ఇలాంటి ఇళ్లకే డిమాండ్..
కరోనా, లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితం కావడం అనివార్యమైంది. కరోనా కంటే ముందుతో పోలిస్తే ఇంట్లో గడిపే సమయం పెరిగింది. దీంతో ఇంటి కొనుగోలు ఎంపికలో రాజీపడటం లేదు. రిస్క్ తీసుకునైనా సరే సొంతింటిని కొనుగోలు చేయాలని.. చిన్న సైజు ఇంటి నుంచి విస్తీర్ణమైన గృహానికి వెళ్లాలని.. ఐసోలేషన్ కోసం ప్రత్యేక గది లేదా కుటుంబ సభ్యులతో గడిపేందుకు హాలిడే హోమ్ ఉండాలని భావించే వాళ్ల సంఖ్య పెరిగింది. దీంతో రాబోయే రోజుల్లో గృహ విభాగానికి డిమాండ్ ఏర్పడటం ఖాయమని జేఎల్ఎల్–రూఫ్ అండ్ ఫ్లోర్ సంయుక్తంగా నిర్వహించిన సర్వే వెల్లడించింది. – సాక్షి, సిటీబ్యూరోహైదరాబాద్తో సహా ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్, బెంగళూరు, చెన్నై, పుణే నగరాలలో 2,500 మంది గృహ కొనుగోలుదారులతో సర్వే నిర్వహించింది. పలు కీలకాంశాలివే.. వర్క్ ఫ్రం హోమ్, ఆన్లైన్ క్లాస్‌ల నేపథ్యంలో ఫ్లోర్ ప్లాన్స్లలో మార్పులు చేయాలని కొనుగోలుదారులు కోరుతున్నారు. బాల్కనీ స్థలంలో అదనంగా ఒక గదిని, ఐసోలేషన్ గదిని ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. ఆ తరహా ప్రాజెక్ట్‌లలో కొనుగోళ్లకే కస్టమర్లు మక్కువ చూపిస్తున్నారు. గృహ ప్రవేశానికి సిద్దంగా ఉన్న అపార్ట్మెంట్లు లేదా పేరు మోసిన డెవలపర్లకు చెందిన నిర్మాణంలోని ప్రాజెక్ట్‌లలో మాత్రమే కొనుగోళ్లకు సిద్ధమవుతున్నారు.వచ్చే మూడు నెలల కాలంలో 80 శాతం కంటే ఎక్కువ కొనుగోలుదారులు గృహాలను కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. రూ.75 లక్షల కేటగిరీలోని ప్రాపరీ్టలను కొనేందుకు సుముఖంగా ఉన్నారు. హైదరాబాద్‌తో సహా బెంగళూరు, చెన్నై, ఢిల్లీ–ఎన్సీఆర్ నగరాలలో 3 బీహెచ్‌కే ఫ్లాట్లకు డిమాండ్ పెరిగింది. ఆయా మార్కెట్లలో పెట్టుబడిదారులు తాము ఉండేందుకు గృహాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు.బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లలో విల్లాలు, అభివృద్ధి చేసిన ప్లాట్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ధరలు అందుబాటులో ఉండటం, మార్కెట్లో సానుకూల వాతావరణం నెలకొనడం, ప్రోత్సాహకర ప్రభుత్వ విధానాలతో రాబోయే రోజుల్లో హైదరాబాద్ రియల్టీ మార్కెట్లో ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని ఓ సంస్థ ఎండీ తెలిపారు. కరోనా ప్రారంభం నుంచి ల్యాండ్ బ్యాంక్‌ను సమీకరించిన డెవలపర్లు.. ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్‌లను చేపట్టేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. దీంతో రెండో అర్ధ భాగం నుంచి గృహ లాంచింగ్స్‌లో వృద్ధి నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. -
సొంతింటికే 25 శాతం సంపాదన: లేటెస్ట్ సర్వే
సాక్షి, సిటీబ్యూరో: మన దేశంలో అత్యంత ధనవంతులు తమ సంపదలో 22–25 శాతం మొత్తాన్ని తాము ఉండాలనుకుంటున్న ఇంటి కొనుగోలుకే వెచ్చిస్తున్నట్లు నైట్‌ఫ్రాంక్ ఇండియా తాజా సర్వే వెల్లడించింది. రూ.కోటి కంటే ఎక్కువ ఆదాయం కలిగిన 18–35 ఏళ్ల వయస్సు గల వారిలో 89 శాతం మంది సంపన్న భారతీయులు తమ ప్రాపర్టీని అద్దెకు ఇవ్వడంకంటే అందులో తాము ఉండటానికే మొగ్గు చూపిస్తున్నారు.కోటి డాలర్ల కంటే ఎక్కువ విలువైన ఆస్తులు కలిగిన భారతీయ అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు తమ సంపదలో 22–25 శాతాన్ని తాము నివసించాలనుకునే ప్రధాన ఇంటికి కేటాయిస్తున్నారని, వారి హోల్డింగ్స్‌లో 80–90 శాతం దేశంలోనేకేంద్రీకృతమై ఉన్నాయని నివేదిక వెల్లడించింది.దేశంలో అధిక నికర విలువ కలిగిన వ్యక్తుల సంఖ్య 2024లో 6 శాతం మేర పెరిగి 80,686 నుంచి 85,698కు చేరుకుందని, బిలియనీర్ల సంఖ్య 191కు పెరిగిందని వెల్త్ రిపోర్ట్ వెల్లడించింది. 2028 నాటికి వారి సంఖ్య 93,753కు పెరుగుతుందని అంచనా. హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ) పెట్టుబడుల్లో ఎక్కువ భాగం ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నైలకే వస్తున్నాయి.విదేశీ పెట్టుబడుల విషయానికొస్తే.. ఎక్కువ మంది హెచ్ఎన్ఐలు యూఏఈ, యూకే వంటి దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారని నైట్‌ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజల్ తెలిపారు. సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు 47 శాతం మంది లగ్జరీ కార్లలో పెట్టుబడులకు, 28 శాతం మంది హైఎండ్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లలో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారని పేర్కొన్నారు. -
హైదరాబాద్‌లో పెరుగుతున్న స్మార్ట్ ఇళ్లు..
సాక్షి, సిటీబ్యూరో: కరోనా తర్వాత ఇంటి స్వరూపం మారిపోయింది. ఇంటిలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) ఆధారిత భద్రతా ఉపకరణాల వినియోగం పెరిగింది. రియల్ టైమ్‌లో ట్రాక్ చేసే స్మార్ట్ కెమెరాలు, డిజిటల్ లాక్స్, స్మార్ట్ వీడియో డోర్ బెల్స్, లైట్లు, కర్టెన్లు ప్రతిదీ స్మార్ట్‌గా మారిపోయాయి. వేలిముద్ర, ఐరిష్ చూపిస్తే చాలు ఆటోమెటిక్‌గా ఇంటి తలుపులు తెరుచుకుంటాయి.ఇంట్లో మనం లేకపోయినా ఎవరైనా అతిథులొస్తే ఫోన్లో నుంచే గుమ్మం తెరిచి స్వాగతం పలకొచ్చు. గదిలోకి రాగానే లైట్లు వాటంతటవే ఆన్, ఆఫ్ అవుతుండటం వంటి ఎన్నో ప్రత్యేకతలుంటాయి. చాలా మంది బిల్డర్లు ఇంటి నిర్మాణ సమయంలోనే ఈ స్మార్ట్ ఉపకరణాలను జోడిస్తున్నారు.కోకాపేట, మాదాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి పశ్చిమ హైదరాబాద్‌లోని హైఎండ్ ప్రాజెక్ట్‌లలో ఈ తరహా ఐఓటీ ఉపకరణాల ప్రాజెక్ట్‌లు ఎక్కువగా నిర్మాణంలో ఉన్నాయి. వృద్ధులు, చిన్న పిల్లలు ఉండే వారు వ్యక్తిగత గృహాలలో సైతం వీటిని ఏర్పాటు చేసుకోవడం తప్పనిసరిగా మారింది. -
భారీగా పెరిగిన ఇళ్ల సేల్స్: రూ.50 కోట్లయినా తగ్గేదెలే..
ఇంటి బడ్జెట్ అంటే లెక్కేలేదు. ఒకటి, రెండు కాదు ఏకంగా రూ.50 కోట్లయినా సునాయాసంగా ఖర్చు చేసేస్తున్నారు. గతంలో ఇల్లు కొనాలంటే బడ్జెట్‌ను ప్రధానంగా పరిగణలోకి తీసుకునేవారు. కానీ, ఇప్పుడు ఎంత ఖరీదైన ఇళ్లయితే అంత గొప్ప. కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగానే డెవలపర్లు కూడా ప్రీమియం, అల్ట్రా లగ్జరీ గృహాలను నిర్మిస్తున్నారు. ఏటేటా అందుబాటు గృహాల విక్రయాలు తగ్గుతూ.. అల్ట్రా లగ్జరీ ఇళ్ల అమ్మకాలు పెరుగుతుండటమే ఇందుకు ఉదాహరణ. – సాక్షి, సిటీబ్యూరోఖరీదైన ఇళ్ల విక్రయాల్లో గణనీయమైన వృద్ధిఏటేటా రూ.50 లక్షలలోపు ధర ఉండే అఫర్డబుల్ గృహాల విక్రయాలు తగ్గుతున్నాయి. వీటి స్థానంలో రూ.50 కోట్ల కంటే ఎక్కువ ధర ఉండే అల్ట్రా లగ్జరీ యూనిట్ల అమ్మకాలు శరవేగంగా పెరుగుతున్నాయి. 2025 జనవరి - మార్చి(క్యూ1)లో అమ్ముడైన ఇళ్లలో అందుబాటు గృహాలు 21,010గా ఉన్నాయి కానీ, గతేడాది క్యూ1తో పోలిస్తే ఈ విభాగంలో సేల్స్ 9 శాతం మేర తగ్గాయి. అదే 2025 క్యూ1లో 169 అల్ట్రా లగ్జరీ యూనిట్లు అమ్ముడుపోగా.. గతేడాది క్యూ1తో పోలిస్తే ఏకంగా 483 శాతం వృద్ధి నమోదైంది. అలాగే రూ.50 లక్షల నుంచి రూ.కోటి ధర ఉండే ఇళ్లు 26,832 సేల్ కాగా.. 2024 తొలి త్రైమాసికంతో పోలిస్తే 6 శాతం తక్కువ.ఇక, రూ.కోటి నుంచి రూ.2 కోట్ల ధర ఉండే యూనిట్లు 2 శాతం వృద్ధి రేటుతో 22,230 అమ్ముడుపోయాయి. రూ.2–5 కోట్ల ధర ఉండే ఇళ్లు 28 శాతం వృద్ధితో 13,735 సేల్ అయ్యాయి. అలాగే రూ.5–10 కోట్లు ధర ఉండే గృహాలు 82 శాతం పెరుగుదలతో 3,448 సేల్ అయ్యాయి. రూ.10–20 కోట్లు ఖరీదు చేసే యూనిట్లు 114 శాతం వృద్ధి రేటుతో 658 అమ్ముడయ్యాయి. అలాగే రూ.20–50 కోట్ల ధర ఉండే ప్రీమియం ఇళ్లు 124 శాతం వృద్ధితో 92 యూనిట్లు అమ్ముడుపోయాయి.88,274 ఇళ్ల విక్రయాలు..దేశంలోని 8 ప్రధాన నగరాల్లో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 88,274 యూనిట్లు అమ్ముడుపోయాయని నైట్‌ఫ్రాంక్ ఇండియా తాజా అధ్యయనం వెల్లడించింది. గతేడాది క్యూ1తో పోలిస్తే ఇది రెండు శాతం ఎక్కువ. 2025 క్యూ1లో కొత్తగా 96,309 యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. 2024 క్యూ1తో పోలిస్తే ఇది 3 శాతం అధికం. హైదరాబాద్‌లో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 9,459 ఇళ్లు అమ్ముడుపోగా.. 10,661 యూనిట్లు లాంచింగ్ అయ్యాయి.ఆఫీసు స్పేస్ అధరహో..దేశంలోని 8 ప్రధాన నగరాలలో 2025 క్యూ1లో 2.82 కోట్ల చ.అ. ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరిగాయి. ఇందులో అత్యధికంగా 44 శాతం వాటా గ్లోబల్ కేపబులిటీ సెంటర్లదే(జీసీసీ). 2025 క్యూ1లో జరిగిన లీజుల్లో అత్యధికంగా 1.24 కోట్ల చ.అ. స్థలాలు జీసీసీల ఏర్పాటు కోసమే జరగడం గమనార్హం. ఆఫీసు స్పేస్‌లలో ఐటీ హబ్లైన్ బెంగళూరు, హైదరాబాద్ తీవ్రంగా పోటీపడుతున్నాయి. హైదరాబాద్ 2025 క్యూ1లో 40 లక్షల చ.అ. ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరిగాయి. గతేడాది క్యూ1తో పోలిస్తే ఇది 31 శాతం ఎక్కువ. గతేడాది చివరి త్రైమాసికం (క్యూ4)లో 31 లక్షల చ.అ. లావాదేవీలు పూర్తయ్యాయి. నగరంలో గృహాలు, ఆఫీసు స్థలాల అద్దెలు ఏటా 9 శాతం మేర పెరుగుతున్నాయి. -
మారుతున్న ట్రెండ్: ఇప్పుడంతా ఇల్లు.. ఆఫీసు.. షాపింగ్
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో నగరాలలో సంప్రదాయ షాపింగ్ మాల్స్‌కు కాలం చెల్లింది. ఇల్లు, ఆఫీసు, మాల్ అన్నీ ఒకే చోట ఉండే మిశ్రమ వినియోగ భవనాలు ఊపందుకుంటున్నాయి. నగరవాసులు నివాసం ఉండే చోటుకు సమీపంలోనే కార్యాలయం, వారాంతాల్లో కుటుంబంతో కలిసి ఆనందంగా గడిపేందుకు షాపింగ్ మాల్ కూడా దగ్గర్లోనే ఉండాలని కోరుకుంటున్నారు. దీంతో అపార్ట్మెంట్లు, ఆఫీసు స్పేస్‌తో పాటు రిటైల్ స్పేస్ అందుబాటులో ఉండే మిశ్రమ భవనాలకు డిమాండ్ పెరిగింది.ఈ ఏడాది జనవరి - మార్చి (క్యూ1)లో దేశంలోని 8 ప్రధాన నగరాల్లో 24 లక్షల చ.అ. రిటైల్ స్పేస్ లావాదేవీలు జరిగాయని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ అధ్యయనం వెల్లడించింది. ఏడాది కాలంలో 55 శాతం వృద్ధి రేటు నమోదైంది. అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలో మాల్స్, రిటైల్ సరఫరా పెరగడమే లావాదేవీల వృద్ధికి ప్రధాన కారణం. ఈ ఏడాది వచ్చే మూడు త్రైమాసికాల్లో కొత్తగా 70 లక్షల చ.అ. రిటైల్ స్పేస్ మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుందని అంచనా వేసింది.అత్యధికంగా గ్రేటర్‌లోనే..గృహాలు, కార్యాలయాల విభాగంలోనే కాదు రిటైల్ స్పేస్‌లోనూ హైదరాబాద్ దూసుకెళుతోంది. 2025 క్యూ1లో జరిగిన లావాదేవీల్లో అత్యధికంగా 34 శాతం వాటా మన గ్రేటర్‌దే. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో నగరంలో 8 లక్షల రిటైల్ స్థల లావాదేవీలు జరిగాయి. ఏడాది కాలంతో పోలిస్తే ఇది 106 శాతం ఎక్కువ. హైదరాబాద్ తర్వాత అత్యధికం రిటైల్ స్పేస్ లావాదేవీలు ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్ నగరాల్లో జరిగాయి. 2025 క్యూ1లో దేశంలో జరిగిన మొత్తం రిటైల్ స్థల లీజుల్లో ముంబై 24 శాతం, ఢిల్లీ–ఎన్సీఆర్ 17 శాతం వాటాలను కలిగి ఉన్నాయి. ఆర్థిక రాజధాని(ముంబై)లో 5.8 లక్షల చ.అ., దేశ రాజధానిలో 4.1 లక్షల చ.అ. లావాదేవీలు జరిగాయి.హైస్ట్రీట్కు డిమాండ్..గ్రేటర్లో హైస్ట్రీట్ ప్రాంతాల్లోని రిటైల్ స్పేస్‌కు డిమాండ్ ఎక్కువగా ఉంది. నగరంలో జరిగిన లీజు లావాదేవీల్లో హైస్ట్రీట్ వాటా 90 శాతంగా ఉంది. కొత్తపేట, నల్లగండ్ల, కొంపల్లి వంటి ప్రాంతాల్లో అత్యధిక లావాదేవీలు జరిగాయి. ఒక్క జూబ్లీహిల్స్లోనే ఏకంగా 24 శాతం లావాదేవీల వాటా కలిగి ఉంది. జూబ్లీహిల్స్‌లో రిటైల్ స్పేస్ అద్దెలు ఏటా 13.6 శాతం పెరుగుతున్నాయి. షాపింగ్ మాల్స్‌లో మాత్రం అద్దెలు స్థిరంగా ఉన్నాయి. గచి్చ»ౌలి, నానక్‌రాంగూడ, టోలిచౌకీ ప్రాంతాలలో కొత్త ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, రోడ్ల విస్తరణలతో మౌలిక సదుపాయాలు మెరుగయ్యాయి. సూక్ష్మ మార్కెట్లతో కనెక్టివిటీ పెరగడంతో ఆయా ప్రాంతాలలో రిటైల్ స్టోర్లు, స్థలాలకు ఆదరణ పెరిగింది.దేశీయ బ్రాండ్లదే హవా..ఫ్యాషన్, వెల్నెస్, ఫుడ్ అండ్ బేవరేజెస్ విభాగాలు ఎక్కువగా రిటైల్ స్పేస్‌ను లీజుకు తీసుకుంటున్నాయి. లీజు లావాదేవీల్లో దేశీయ బ్రాండ్ల వాటా ఏకంగా 98 శాతంగా ఉంది. ఫ్యాషన్ విభాగం 27 శాతం, వెల్నెస్ 19 శాతం, ఫుడ్ అండ్ బేవరేజెస్ 16 శాతం లీజు వాటాలను కలిగి ఉన్నాయి. -
ఇల్లు ఏదైనా సరే.. ఇది ఉండాల్సిందే!
1,2,3 బీహెచ్‌కే.. ఇళ్లు ఏదైనా సరే బాల్కనీ ఉండాల్సిందే.. గృహ కొనుగోలుదారులు నిర్మాణం నాణ్యత, ప్రాంతం, ధర, వసతులతో పాటు బాల్కనీకి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. గతంలో ఇంటిలోని ప్రతి అంగుళం స్థలాన్ని వినియోగించాలని భావించిన కస్టమర్లు.. ప్రస్తుతం ఎక్కువ ఓపెన్ స్పేస్ ఉండాలని కోరుకుంటున్నారు. 75 శాతం మంది బాల్కనీ ఉండే ఇళ్ల కొనుగోళ్లకే ఆసక్తి చూపిస్తున్నారని ఫిక్కీ, అనరాక్ సర్వేలో వెల్లడించింది. అలాగే 74 శాతం మంది కస్టమర్లు నాణ్యమైన నిర్మాణాలకే మొగ్గు చూపిస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరో గృహాల ధరలు పెరుగుతున్నప్పటికీ కొనుగోలుదారులు విశాలమైన ఇళ్లకే ఆసక్తి చూపిస్తున్నారు. 50 శాతం మంది కస్టమర్లు 3 బీహెచ్‌కే కొనుగోలుకు ఆసక్తి చూపిస్తే.. 38 శాతం మంది 2 బీహెచ్‌కే గృహాలకు మొగ్గు చూపిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఎన్సీఆర్ నగరాలలో 3బీహెచ్‌కే యూనిట్లకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అధిక ధరల కారణంగా ముంబైలో 44 శాతం మంది కస్టమర్లు 2 బీహెచ్‌కేలకు, 17 శాతం 1 బీహెచ్‌కేలకు ఆసక్తి చూపిస్తున్నారు. పుణేలో 10 శాతం కొనుగోలుదారులు 1 బీహెచ్‌కే జై కొడుతున్నారు.లగ్జరీ ఇళ్లకు డిమాండ్.. రూ.కోటిన్నర ధర ఉన్న గృహాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. 2023 హెచ్–2లో 20 శాతం మంది లగ్జరీ ఇళ్లకు ఆసక్తి చూపించగా.. 2021 హెచ్–2లో ఇది కేవలం 12 శాతంగా ఉంది. రూ.45–90 లక్షల బడ్జెట్ గృహాలకు 33 శాతం మంది మొగ్గు చూపిస్తున్నారు. ఇక అందుబాటు గృహాలకు డిమాండ్ క్రమంగా తగ్గిపోతోంది. 2020 హెచ్–2లో 40 శాతంగా అఫర్డబుల్ హౌసింగ్ గిరాకీ.. 2021 హెచ్–2 నాటికి 25 శాతానికి, 2023 హెచ్–2లో ఏకంగా 21 శాతానికి క్షీణించింది.లాంచింగ్‌లో కొంటున్నారు.. గృహ కొనుగోలుదారుల అభిరుచి మారింది. గతంలో గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న వాటిల్లో కొనేందుకు ఆసక్తి చూపిన కస్టమర్లు.. ప్రస్తుతం లాంచింగ్ ప్రాజెక్ట్‌లలో కొనేందుకు ఇష్టపడుతున్నారు. 2020లో రెడీ టూ మూవ్, లాంచింగ్ ప్రాజెక్ట్‌లలో కొనుగోళ్ల నిష్పత్తి 46:18 శాతంగా ఉండగా.. 2024 నాటికి 23:24 శాతానికి మారింది. అలాగే 2021లో శివారు ప్రాంతాలలో స్థిరాస్తుల కొనుగోలుకు జై కొట్టిన కొనుగోలుదారులు 2024 నాటికి 36 శాతానికి తగ్గారు.పెట్టుబడులకు రియలే బెటర్.. ఏటా దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో ఫ్లాట్ల విస్తీర్ణాలు 11 శాతం మేర పెరుగుతున్నాయి. 2022లో 1,175 చ.అ.లుగా ఉన్న సగటు ఫ్లాట్ల సైజు.. 2024 నాటికి 1,300 చ.అ.లకు పెరిగాయి. 58 శాతం మిలీనియల్స్, 39 శాతం జెన్స్–ఎక్స్ కస్టమర్లు ఇతర పెట్టుబడుల నుంచి వచ్చిన లాభాలతో ఇళ్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. 57 శాతం మంది రియల్ ఎస్టేట్ అత్యంత ప్రాధాన్య పెట్టుబడిగా విశ్వసిస్తున్నారు. ఇందులోనూ 36 శాతం మంది నివాస విభాగంలో పెట్టుబడులకే ఆసక్తి చూపిస్తున్నారు. గృహ రుణ వడ్డీ రేట్లు 8.5 శాతం కంటే తక్కువగా ఉన్నంత కాలం ఇంటి కొనుగోలు నిర్ణయంపై ప్రభావం ఉండదని చెప్పారు. -
ఇల్లు కొనే ట్రెండ్.. కరోనాకు ముందు, తర్వాత..
కరోనా తర్వాత నుంచి గృహ కొనుగోలుదారుల అభిరుచులు మారాయి. నివాస కొనుగోళ్ల ట్రెండ్‌ను కరోనాకు ముందు, ఆ తర్వాత అని విభజించాల్సిన పరిస్థితి వచ్చింది. కోవిడ్ కంటే ముందు ఇల్లు కొనాలంటే మొదటి ప్రాధాన్యత బడ్జెట్ ఎంత అనే.. కానీ, కరోనా తర్వాత బడ్జెట్ అంటే లెక్కేలేదు. విస్తీర్ణమైన ఇళ్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరోమహమ్మారితో వర్క్ ఫ్రం హోమ్, ఆన్లైన్ క్లాసుల నేపథ్యంలో ఇంటిలో గడిపే సమయం పెరిగింది. మరోవైపు ఐసొలేషన్ కారణంగా విశాలమైన, ప్రత్యేక గదుల అవసరం ఏర్పడింది. దీంతో గృహ కొనుగోలుదారులు క్రమంగా విశాలమైన ఇళ్లకు మారిపోతున్నారు. అప్పటిదాకా 2 బీహెచ్‌కే వాసులు.. క్రమంగా 3 వైపు.. 3 బీహెచ్‌కే వాసులు నాలుగు పడక గదుల్లో ఉండేందుకు మొగ్గు చూపిస్తున్నారు. దీంతో గ్రేటర్లో ఇంటి విస్తీర్ణాలు క్రమంగా పెరుగుతున్నాయి. కస్టమర్ల అభిరుచులకు తగినట్టుగా డెవలపర్లు కూడా విశాలమైన ఇళ్లనే నిర్మిస్తున్నారు. 4 బీహెచ్కేకు ఆదరణ.. స్థిరమైన ధరలు, అధిక రాబడుల కారణంగా హైదరాబాద్‌లో ప్రాపర్టీలలో పెట్టుబడులకు పెట్టుబడిదారులు ఆసక్తి చూపిస్తున్నారు. పెద్ద కుటుంబాలు, విలాసవంతమైన జీవనశైలి, ఆధునిక వసతులు కోరుకునేవారు ఎక్కువగా 4 బీహెచ్‌కే అపార్ట్మెంట్లను కొనుగోలు చేస్తున్నారు. మియాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, కొంపల్లి, కూకట్పల్లి వంటి ప్రాంతాలలో 4 బీహెచ్‌కే అపార్ట్మెంట్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. సైనిక్‌పురి, యాప్రాల్, నాచారం, మల్లాపూర్, తార్నాక, సికింద్రాబాద్ వంటి ప్రాంతాల్లోని యూనిట్లకూ ఆదరణ బాగానే ఉంది. వీటి సగటు ధర రూ.1.78 కోట్ల నుంచి ఉన్నాయి.గ్రేటర్లో పెరిగిన విస్తీర్ణాలు.. హైదరాబాద్‌లో ఏటేటా అపార్ట్మెంట్ల విస్తీర్ణాలు పెరుగుతున్నాయి. 2014లో నగరంలో ఫ్లాట్ల సగటు విస్తీర్ణం 1,830గా ఉండగా.. 2018 నాటికి 1,600లకు తగ్గాయి. నాలుగేళ్లలో ఏకంగా ఫ్లాట్ల సైజు 13 శాతం తగ్గింది. కోవిడ్ కాలంలో ఇంట్లో గడిపే సమయం ఎక్కువైపోయింది. దీంతో ఇంటి అవసరం తెలిసొచ్చింది. వర్క్ ఫ్రం హోమ్, ఆన్లైన్ క్లాస్‌లతో ఇంట్లో ప్రత్యేక గది అనివార్యమైపోయింది. దీంతో ఇంటి విస్తీర్ణం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2019లో నగరంలో ఫ్లాట్ల సగటు విస్తీర్ణం 1,700 చ.అ.లుగా ఉండగా.. ఇప్పుడది ఏకంగా 2,200 చ.అ.లకు పెరిగింది.45 శాతం డిమాండ్.. కరోనా కంటే ముందు లగ్జరీ గృహాలైన 4 బీహెచ్‌కే ఫ్లాట్లకు 27 శాతం డిమాండ్ ఉండగా.. ఇప్పుడది ఏకంగా 45 శాతానికి పెరిగిందని అనరాక్–ఫిక్కీ హోమ్ బయ్యర్స్ సెంటిమెంట్ సర్వే వెల్లడించింది. గత ఐదేళ్లలో దేశంలోని ఏడు నగరాల్లో అపార్ట్మెంట్ల విస్తీర్ణాలు 32 శాతం మేర పెరిగాయి. 2019లో సగటు ఫ్లాట్ సైజు 1,145 చ.అ.లుగా ఉండగా.. ఇప్పుడది 1,513 చ.అ.లకు పెరిగింది. -
కొత్త ఇల్లు.. కొత్త ట్రెండ్..
మెట్రో నగరాల్లో గృహ కొనుగోలులో వంట గది కీలకంగా మారింది. అందుబాటు ధర, అభివృద్ధి చెందే ప్రాంతం, వసతులు మాత్రమే కాదండోయ్.. ఇంట్లోని వంట గది శైలి కూడా ఆధునికంగా ఉండాలంటున్నారు కొనుగోలుదారులు. అందుకే సాధారణ కిచెన్స్ స్థానంలో ఇప్పుడు ఓపెన్ కిచెన్స్ ట్రెండ్ నడుస్తోంది. లివింగ్, డైనింగ్ రూమ్‌లతో వంట గది కలిసి ఉండటమే దీని ప్రత్యేకత! – సాక్షి, సిటీబ్యూరోనగరంలోని నిర్మాణ సంస్థలు 1,000 చ.అ.పైన ఉండే ప్రతి ఫ్లాట్‌లోనూ ఓపెన్ కిచెన్ ఏర్పాటుకే ప్రాధాన్యమిస్తున్నాయి. హాలుకు అనుసంధానంగా అడ్డుగా గోడలు లేకుండా ఓపెన్ కిచెన్స్ ఏర్పాటు చేస్తారు. అంటే లివింగ్ రూమ్, డైనింగ్ రూమ్‌కు కిచెన్ కలిసే ఉంటుందన్నమాట. ముచ్చటిస్తూ వంటలు.. » ఓపెన్ కిచెన్స్‌లో సానుకూల, ప్రతికూల రెండు రకాల అంశాలూ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే.. » వంట చేస్తూనే ఇతర గదుల్లో ఉన్నవారితో, ఇంటికి వచ్చిన అతిథులతో సంభాషించవచ్చు. హాల్లో ఉండే టీవీలోని కార్యక్రమాలనూ వీక్షించొచ్చు. » ఓపెన్ కిచెన్ కాబట్టి శుభ్రంగా ఉంచేందుకు శ్రద్ధ తీసుకుంటారు. ఇంటిని అందంగా అలంకరించే కసరత్తును వంట గది నుంచి మొదలుపెడతారు. » ఘుమఘుమలు ఇల్లంతా వ్యాపిస్తాయి. దీంతో కుటుంబ సభ్యుల మూడ్‌ను మారుస్తాయి. » ఇంట్లో చిన్నారులు ఉంటే వంట గది నుంచి కూడా వీరిపై పర్యవేక్షణకు వీలుంటుంది. » వంట పాత్రలు బయటకు కనిపిస్తుంటాయి. కాబట్టి ఇది కొందరికి నచ్చకపోచ్చు. » డిష్వాషర్, మిక్సీల శబ్ధాలు ఇతర గదుల్లోకి వినిపించి అసౌకర్యంగా ఉంటుంది. » దూరపు బంధువులు, అంతగా పరిచయం లేనివారు వచ్చినప్పుడు వారి ముందు వంట చేయడం కొంత మందికి అంతగా నచ్చకపోవచ్చు.సంప్రదాయ వంటగది: » వీటిని పాత రోజుల నుంచి చూస్తున్నవే.. వంట గది ప్రత్యేకంగా ఉంటుంది. ఏకాంతంగా వంట చేయాలని కోరుకునే వారు సంప్రదాయ శైలిలో ఉండే వంటిల్లునే ఇష్టపడతారు. » గదికి అన్ని వైపులా గోడలుంటాయి. అరలు ఎక్కువ ఏర్పాటుకు వీలుండటంతో పాత్రలన్నింటినీ చక్కగా సర్దేయవచ్చు. » వంటింట్లోని శబ్ధాలు, వాసనలు బయటకు రావు. ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది. » చుట్టూ గోడలు ఉండటంతో ఇరుగ్గా, చీకటిగా ఉంటుంది. ఒకేసారి ఎక్కువ మంది తిరిగేందుకు వీలుండదు. » ఇల్లు డిజైన్ సమయంలోనే ఎలాంటి వంట గది కావాలో నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ఒకసారి వంట గదిని నిర్మించేశాక మళ్లీ ఓపెన్ కిచెన్‌లా మార్చాలంటే మరింత ఖర్చు అవుతుంది. -
రూ.50 లక్షల లోపు ఇళ్ల అమ్మకాలు తగ్గాయ్..
ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో రూ. 50 లక్షల లోపు ధర ఉండే అఫోర్డబుల్ గృహాల అమ్మకాలు 9 శాతం క్షీణించినట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా ఒక నివేదికలో తెలిపింది. ఎనిమిది ప్రధాన నగరాల్లో విక్రయాలు 21,010 యూనిట్లకు పరిమితమైనట్లు పేర్కొంది. ఇళ్ల ధరలు, వడ్డీ రేట్లు అధిక స్థాయిలో ఉండటం, సరఫరా తగ్గడం తదితర అంశాలు ఇందుకు కారణమని వివరించింది.నివేదిక ప్రకారం రూ. 50 లక్షల నుంచి రూ. 1 కోటి వరకు ఖరీదు చేసే రెసిడెన్షియల్ సెగ్మెంట్లో కూడా విక్రయాలు 6 శాతం తగ్గి 26,832 యూనిట్లకు క్షీణించాయి. మార్చి త్రైమాసికంలో ఎక్కువగా ప్రీమియం కేటగిరీపైనే గృహాల కొనుగోలుదారులు దృష్టి పెట్టినట్లు రిపోర్ట్ పేర్కొంది. రూ. 1 కోటి పైగా ఖరీదు చేసే ఇళ్ల అమ్మకాలు పెరగడం ఇందుకు నిదర్శనంగా వివరించింది.హైదరాబాద్‌తో పాటు కోల్‌కతా, చెన్నై తదితర 8 నగరాల్లో నిర్వహించిన అధ్యయన నివేదిక ప్రకారం..రూ. 1–2 కోట్ల రేటు ఉన్న గృహాల విక్రయాలు 2 శాతం పెరిగి 22,330 యూనిట్లకు చేరాయి. అలాగే రూ. 2–5 కోట్ల కేటగిరీలో 28 శాతం వృద్ధి చెంది 13,735 యూనిట్లు, రూ. 5–10 కోట్ల విభాగంలో విక్రయాలు ఏకంగా 82 శాతం పెరిగి 3,448 యూనిట్లుగా నమోదయ్యాయి.రూ. 10–20 కోట్ల కేటగిరీలో అమ్మకాలు రెట్టింపై 658 యూనిట్లకు చేరాయి. రూ. 20–50 కోట్ల విభాగంలోనూ రెండు రెట్లు పెరిగి 92 యూనిట్లుగా నమోదయ్యాయి. రూ. 50 కోట్ల పైగా ఖరీదు చేసే ఇళ్ల అమ్మకాలు అనేక రెట్లు పెరిగి 169 యూనిట్లకు చేరాయి.రూ. 2 కోట్ల ధర శ్రేణిలోని ఇళ్ల అమ్మకాలు 2 శాతం పెరిగి 22,330 యూనిట్లకు చేరడం. -
ఇల్లు అమ్మిన ఇషా అంబానీ
భారతీయ బిలియనీర్ ముకేశ్-నీతా అంబానీల కుమార్తె ఇషా అంబానీ కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్‌లో ఉన్న తన 38,000 చదరపు అడుగుల భవనాన్ని విక్రయించారు. జెన్నిఫర్ లోపెజ్-బెన్ అఫ్లెక్ హాలీవుడ్ జంట దీన్ని సొంతం చేసుకుంది. బెవర్లీ హిల్స్‌లో ఉన్న ఈ విశాలమైన ప్రాపర్టీ విలువ 61 మిలియన్ డాలర్లు (సుమారు రూ.500 కోట్లకు పైగా) అని హిందుస్థాన్ టైమ్స్ తెలిపింది.ఇషా భవనాన్ని కొనుగోలు చేయడానికి ముందు ఈ ఇద్దరు నటులు తమ ఆస్తులను కొన్నింటిని విక్రయించారు. అఫ్లెక్ తన పసిఫిక్ పాలిసేడ్స్ నివాసాన్ని 28.5 మిలియన్ డాలర్లకు (సుమారు రూ.237 కోట్లు) విక్రయించగా, లోపెజ్ తన బెల్ ఎయిర్ భవనాన్ని 34 మిలియన్ డాలర్లకు (సుమారు రూ.283 కోట్లు) అమ్మారు. ఇషా అంబానీ అమ్మిన ఈ భవనంలో ఇన్ఫినిటీ పూల్, 24 బాత్రూంలు, అవుట్ డోర్ కిచెన్, సెలూన్, బాక్సింగ్ రింగ్‌తో కూడిన జిమ్, 12 పడక గదులతోపాటు అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. 2022లో ఇషా అంబానీ, ఆనంద్ పిరమల్ ఈ లగ్జరీ బెవర్లీ హిల్స్ ప్రాపర్టీలో ఎక్కువ సమయమే గడిపారు.ఇదీ చదవండి: అంబానీ ఇంటి కరెంటు బిల్లు ఎంతో తెలుసా..?అత్తామామలు ఇచ్చిన ఇంట్లోనే..ప్రపంచ వ్యాపార రంగంలో ప్రముఖ వ్యక్తిగా ఉన్న ఇషా అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. దాతృత్వ కార్యక్రమాల్లోనూ ఆమె చురుకుగా పాల్గొంటున్నారు. వృత్తిపరమైన విజయాలతోపాటు ఇషా తన విలాసవంతమైన జీవనశైలికి ప్రసిద్ధి చెందారు. ప్రీమియం ఆస్తులు, లగ్జరీ కార్లు, అద్భుతమైన ఆభరణాలు, డిజైనర్ దుస్తులు.. ఇలా చాలా విభాగాల్లో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. పిరమాల్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆనంద్ పిరమాల్‌ను వివాహం చేసుకున్న ఆమె దక్షిణ ముంబైలో ఉన్న గులిటా అనే సముద్రం ఒడ్డున ఉన్న భవనంలో నివసిస్తున్నారు. ఆనంద్ తల్లిదండ్రులు అజయ్, స్వాతి పిరమల్ బహుమతిగా ఇచ్చిన ఈ భవనం విలువ సుమారు రూ.450 కోట్లుగా ఉంటుందని అంచనా. -
హైదరాబాద్‌లో రియల్ఎస్టేట్ ధరలు పెరిగే సూచనలు
సాక్షి, సిటీబ్యూరో: కరోనా మహమ్మారి కంటే ముందుతో పోలిస్తే ఇంట్లో గడిపే సమయం పెరిగింది. దీంతో ఇంటి కొనుగోలు ఎంపికలో రాజీ పడటం లేదు. రిస్క్ తీసుకునైనా సరే సొంతింటిని కొనుగోలు చేయాలని.. చిన్న సైజు ఇంటి నుంచి విస్తీర్ణమైన గృహానికి వెళ్లాలని.. ఐసోలేషన్ కోసం ప్రత్యేక గది లేదా కుటుంబ సభ్యులతో గడిపేందుకు హాలిడే హోమ్ ఉండాలని భావించే వాళ్ల సంఖ్య పెరిగింది. దీంతో రాబోయే రోజుల్లో గృహ విభాగానికి డిమాండ్ ఏర్పడటం ఖాయమని జేఎల్ఎల్–రూఫ్‌అండ్‌ఫ్లోర్ సంయుక్తంగా నిర్వహించిన సర్వే వెల్లడించింది.హైదరాబాద్‌తో సహా ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్, బెంగళూరు, చెన్నై, పుణే నగరాలలో 2,500 మంది గృహ కొనుగోలుదారులతో సర్వే నిర్వహించింది. పలు కీలకాంశాలివే.. వర్క్ ఫ్రం హోమ్, ఆన్లైన్ క్లాస్‌ల నేపథ్యంలో ఫ్లోర్ ప్లాన్స్లలో మార్పులు చేయాలని కొనుగోలుదారులు కోరుతున్నారు. బాల్కనీ స్థలంలో అదనంగా ఒక గదిని, ఐసోలేషన్ గదిని ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. ఆ తరహా ప్రాజెక్ట్‌లలో కొనుగోళ్లకే కస్టమర్లు మక్కువ చూపిస్తున్నారు. గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న అపార్ట్మెంట్లు లేదా పేరు మోసిన డెవలపర్లకు చెందిన నిర్మాణంలోని ప్రాజెక్ట్‌లలో మాత్రమే కొనుగోళ్లకు సిద్ధమవుతున్నారు.వచ్చే మూడు నెలల కాలంలో 80 శాతం కంటే ఎక్కువ కొనుగోలుదారులు గృహాలను కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. రూ.75 లక్షల కేటగిరీలోని ప్రాపర్టీలను కొనేందుకు సుముఖంగా ఉన్నారు. హైదరాబాద్‌తో సహా బెంగళూరు, చెన్నై, ఢిల్లీ–ఎన్సీఆర్ నగరాలలో 3 బీహెచ్‌కే ఫ్లాట్లకు డిమాండ్ పెరిగింది. ఆయా మార్కెట్లలో పెట్టుబడిదారులు తామ ఉండేందుకు గృహాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు.ఇదీ చదవండి 👉 ఈవీ ఇళ్లకు డిమాండ్.. ధరల పెరుగుదలా డబుల్!బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లలో విల్లాలు, అభివృద్ధి చేసిన ప్లాట్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ధరలు అందుబాటులో ఉండటం, మార్కెట్లో సానుకూల వాతావరణం నెలకొనడం, ప్రోత్సాహకర ప్రభుత్వ విధానాలతో రాబోయే రోజుల్లో హైదరాబాద్ రియల్టీ మార్కెట్లో ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని జేఎల్ఎల్ ఇండియా (రెసిడెన్షియల్ సర్వీసెస్) ఎండీ శివ కృష్ణన్ తెలిపారు. కరోనా ప్రారంభం నుంచి ల్యాండ్ బ్యాంక్‌ను సమీకరించిన డెవలపర్లు.. ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్‌లను చేపట్టేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. దీంతో రెండో అర్ధ భాగం నుంచి గృహ లాంచింగ్స్‌లో వృద్ధి నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. -
ఈవీ ఇళ్లకు డిమాండ్.. ధరల పెరుగుదలా డబుల్!
ఇంధన వనరుల ధరలు రోజుకో రేటు ఉంటున్న నేపథ్యంలో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలు(ఈవీ) వైపు మొగ్గుచూపుతున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా ఈవీ వాహనాలను ప్రోత్సహిస్తుండటంతో చార్జింగ్ స్టేషన్ల అవసరం పెరిగింది. ఒకవైపు పెట్రోల్ బంక్‌లు, మెట్రో స్టేషన్ల వద్ద ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటవుతుంటే.. మరోవైపు కొత్తగా నిర్మిస్తున్న నివాస, వాణిజ్య సముదాయాలలోనూ వీటిని నెలకొల్పుతున్నారు. - సాక్షి, సిటీబ్యూరో జిమ్, స్విమ్మింగ్ పూల్ అంటూ ప్రకటించే వసతుల జాబితాలో ఈవీ చార్జింగ్ పాయింట్ అనే ప్రత్యేకంగా ప్రకటించే స్థాయికి చేరిందంటే ఆశ్చర్యమేమీ లేదు. దీంతో ప్రస్తుతమున్న సాధారణ నివాస భవనాలలో ధరలు 1 శాతం మేర పెరిగితే.. ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసిన నివాస భవనాలలో ధరలు 2–5 శాతం మేర వృద్ధి చెందుతాయని జేఎల్ఎల్ నివేదిక తెలిపింది.2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాల వాటా 40 శాతం కంటే ఎక్కువకు చేరుతుంది. దీంతో ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఉన్న భవనాలకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. కొత్త ప్రాజెక్ట్‌లోనే కాకుండా ఇప్పటికే ఉన్న భవనాలలో కూడా ఈవీ పాయింట్ల ఏర్పాటు వ్యవస్థ 2026 నాటికి భారీగా పెరుగుతుంది. భవనాల రకం, సహజ వనరుల పునర్వినియోగ(రెట్రోఫిట్) ప్రాజెక్ట్‌ల నివాస తరగతులను బట్టి ధరల పెరుగుదల ఉంటుంది.ప్రస్తుతం నివాస ప్రాంతాలలో యజమానులు సర్వీస్ ప్రొవైడర్ల సహాయంతో ఈవీ స్టేషన్లను ఇన్స్టాల్ చేస్తున్నారు. పెద్దస్థాయి ప్రాజెక్ట్‌లు, గేటెడ్ కమ్యూనిటీలలో అసోసియేషన్లు వీటిని ఏర్పాటు చేస్తున్నాయి. ఇందుకోసం వినియోగదారులపై నిర్ణీత రుసుములను వసూలు చేస్తున్నారు. రానున్న కొత్త నివాస సముదాయాలలో 5 శాతం పార్కింగ్ స్థలాన్ని ఈవీ చార్జింగ్ స్టేషన్ల కోసం కేటాయించబడతాయని జేఎల్ఎల్ ఇండియా స్ట్రాటర్జిక్ కన్సల్టింగ్ అండ్ వాల్యువేషన్ అడ్వైజరీ హెడ్ ఏ.శంకర్ తెలిపారు.ఈవీ స్టేషన్ల ఏర్పాటు కోసం ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్(ఐఓటీ) చార్జింగ్ ఉపకరణాలు, ఇంటర్నెట్ లభ్యత కూడా అందుబాటులో ఉండాలి గనక.. ఇప్పటికే ఉన్న పెద్ద రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లు, బహుళ అంతస్తుల భవనాలలో చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు వ్యయం, పరిమిత విద్యుత్ సరఫరా సామర్థ్యాలను బట్టి 1 శాతం ప్రీమియం ఉంటుందని పేర్కొన్నారు. 60 శాతం కంటే ఎక్కువ నివాసితులు ఈవీ చార్జింగ్ పాయింట్ల అవసరాన్ని కోరుకుంటుంటే ఈ ప్రీమియం 2–5 శాతం వరకు ఉంటుందని తెలిపారు.ఆఫీస్ స్పేస్‌లలో కూడా.. ఈవీ స్టేషన్లు ఉన్న ఆఫీస్ స్పేస్‌లకు కూడా డిమాండ్ ఏర్పడింది. కొందరు స్థల యజమానులు వినియోగదారు రుసుముతో ఈవీ స్టేషన్ల సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మరికొందరు చార్జింగ్ సర్వీస్ ప్రొవైడర్లకు భూమిని లీజుకు లేదా రెవెన్యూ షేర్ మోడల్ ద్వారా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఆఫీస్ పార్కింగ్‌లలో ఖాళీ ప్లేస్‌లు లేకపోవటమే అసలైన సవాల్. ఇప్పటికే ఉన్న కొన్ని కార్యాలయాలలోని పార్కింగ్ ప్లేస్‌లలో ఇలాంటి అవసరాల కోసం కొంత స్థలాన్ని కేటాయించాయి. ప్రభుత్వ విభాగాలు చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసి వాటిని ప్రైవేట్ ఆపరేట్లకు లీజుకు ఇవ్వొచ్చు లేదా దీర్ఘకాలానికి సంబంధిత భూమిని సర్వీస్ ప్రొవైడర్లకు లీజుకు ఇవ్వొచ్చని జేఎల్ఎల్ సూచించింది. -
రియల్ఎస్టేట్ పెట్టుబడులు పెరిగాయ్..
న్యూఢిల్లీ: దేశీ రియల్టీ రంగంలో సంస్థాగత పెట్టుబడులు 2025 జనవరి–మార్చిలో 31 శాతం జంప్ చేసినట్లు రియల్టీ కన్సల్టెంట్ కొలియర్స్ ఇండియా పేర్కొంది. ప్రధానంగా రెసిడెన్షియల్ విభాగంలో పెట్టుబడులు పుంజుకోవడంతో 1.3 బిలియన్ డాలర్లను తాకినట్లు ఒక నివేదికలో వెల్లడించింది. నివేదిక ప్రకారం వీటిలో 60 శాతం వాటాతో దేశీ ఇన్వెస్టర్లు ప్రధాన పాత్ర పోషించారు. వార్షికంగా 75 శాతం వృద్ధితో 0.8 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశారు. పెట్టుబడుల్లో ఇండస్ట్రియల్, వేర్‌హౌసింగ్, ఆఫీస్ విభాగాలకు ప్రాధాన్యత ఇచ్చారు.హౌసింగ్ విభాగంలో నిధులు 3 రెట్లు ఎగసి 30.29 కోట్ల డాలర్లకు చేరగా.. గతేడాది ఇదే కాలంలో 10.26 కోట్ల డాలర్లు మాత్రమే లభించాయి. ఆఫీస్ కాంప్లెక్సులలో సంస్థాగత పెట్టుబడులు 23 శాతం క్షీణించి 43.42 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి. గత జనవరి–మార్చిలో 56.3 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. -
జనంలో పెరుగుతున్న ఆకాంక్ష
వ్యక్తుల ఆదాయాల పెరుగుదల, చిన్న కుటుంబాలు అధికం కావడం, సొంత ఇల్లు కలిగి ఉండాలన్న ఆకాంక్ష.. వెరసి నూతన గృహాల అమ్మకాలను పెంచుతున్నాయి. ఇళ్ల ధరలు దూసుకెళ్లడం కూడా డిమాండ్‌కు ఆజ్యం పోస్తోంది. ప్రధానంగా భారతీయ కస్టమర్లు లగ్జరీ వైపు మొగ్గు చూపుతుండడంతో హైఎండ్ గృహాలకు స్థిర డిమాండ్ ఉంటోంది. ఓ నివేదిక ప్రకారం 62 శాతం మంది సంపన్న భారతీయులు (Indians) రాబోయే ఒకట్రెండేళ్లలో లగ్జరీ రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడికి ఆసక్తి చూపుతున్నారు. ఆస్తుల విలువ పెరుగుదల ఇందుకు కారణమని 55 శాతం మంది తెలిపారు. అధిక ఆదాయ వర్గాలు అందుకుంటున్న రుణాల వాటా 2022 సెప్టెంబర్‌తో పోలిస్తే రెండేళ్లలో 52.63 శాతం పెరగడం దేశంలో లగ్జరీ గృహాల డిమాండ్‌కు నిదర్శనం.దేశవ్యాప్తంగా వ్యక్తిగత గృహ రుణాలు (Individual housing loans) 2024 సెప్టెంబర్ చివరి నాటికి మొత్తం రూ.33.53 లక్షల కోట్లు నమోదయ్యాయి. ఏడాదిలో ఈ రుణాలు 14 శాతం పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–ఫిబ్రవరి కాలంలో బ్యాంకులు ఇచ్చిన అన్ని రకాల లోన్స్ రూ.15.3 లక్షల కోట్లు. ఇందులో హౌసింగ్ లోన్స్ 16.95 శాతం వాటాతో రూ.2.6 లక్షల కోట్లు ఉంది. ఈ కాలంలో పరిశ్రమలు అందుకున్న రుణాలు 14.5 శాతం వాటాకు పరిమితం కావడం గమనార్హం. – సాక్షి, స్పెషల్ డెస్క్పదేళ్లలో 54 శాతం పెరుగుదల.. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ) రెసిడెన్షియల్ ఇండెక్స్ (రెసిడెక్స్) ప్రకారం 2017–18తో పోలిస్తే ఇళ్ల ధరలు 2024 సెప్టెంబర్ చివరినాటికి 38.33 శాతం పెరిగాయి. నిర్మాణంలో ఉన్న ప్రాపర్టీ ధరలు ఏకంగా 42.95 శాతం పెరగడం విశేషం. స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ)లో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల వ్యక్తిగత గృహ రుణాల వాటా 2024లో 11.29 శాతానికి ఎగసింది. 2014లో ఇది 7.3 శాతమే. అంటే పదేళ్లలో 54.65 శాతం పెరిగిందన్న మాట. మొత్తం రుణాల్లో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల వాటా 2015లో 9.76 నుంచి 2024లో 16.57 శాతానికి చేరింది. 2024 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మంజూరైన గృహ రుణాలు రూ.9.07 లక్షల కోట్లు.అధిక ఆదాయ వ్యక్తులే.. వ్యక్తిగత గృహ రుణాల్లో అధిక ఆదాయం పొందుతున్న వ్యక్తులకు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (Housing Finance Companies) ఇచ్చిన రుణాలు 2022 సెప్టెంబర్‌లో 17.1 శాతం ఉంటే.. 2024 సెప్టెంబర్ నాటికి 26.1 శాతానికి పెరిగాయి. ఈ కాలంలో తక్కువ, మధ్యస్థాయి ఆదాయ వర్గాలకు మంజూరు చేసిన రుణాలు తగ్గడం గమనార్హం. వ్యక్తిగత గృహ రుణాల్లో 2023–24లో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు జారీచేసిన మొత్తాల్లో రూ.25 లక్షలకుపైగా విలువ చేసే రుణాల వాటా 58% ఉంది. 2021–22లో ఇది 54.34 శాతం నమోదైంది. రూ.10 లక్షల వరకు విలువ చేసే రుణాల వాటా 10.85 శాతం మాత్రమే. 2024 సెప్టెంబర్ 30 నాటికి ఉన్న మొత్తం వ్యక్తిగత గృహ రుణాలలో ఆర్థికంగా వెనుకబడ్డ, తక్కువ ఆదాయ వర్గాల వాటా 39 శాతం, మధ్య ఆదాయ వర్గాలు 44% ఉంది. తూర్పున మరీ తక్కువ 2024 సెప్టెంబర్‌తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వ్యక్తిగత గృహ రుణాల పంపిణీ రూ.4.10 లక్షల కోట్లుగా ఉంది. ఇందులో దక్షిణాది రాష్ట్రాలు అధికంగా 35.02 శాతం కైవసం చేసుకున్నాయి. పశ్చిమ భారత్ 30.14 శాతం, ఉత్తరాది రాష్ట్రాలు 28.73 శాతం వాటా కలిగి ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాలతో సహా తూర్పు భారత్ వాటా 6.10 శాతమే. ఈశాన్య రాష్ట్రాల వాటా 0.68 శాతం ఉంది. ఇక 2024 సెప్టెంబర్ నాటికి రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో (జీఎస్డీపీ) మొత్తం వ్యక్తిగత గృహ రుణాల్లో మహారాష్ట్ర 18.49 శాతం, తెలంగాణ 18.44 శాతం వాటాతో ముందున్నాయి. చదవండి: హైదరాబాద్‌లో రియల్ఎస్టేట్ పతనం -
ఇళ్లకు కూల్ రూఫ్ వేసుకుంటే సరి..
రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. ఇంటి లోపల వేడి, ఉక్కపోత పెరిగిపోతోంది. దీంతో బయటే కాదు ఇంట్లోనూ ఉండలేని పరిస్థితి. ఇలాంటి సమయంలో ఇళ్లంతా చల్లగా ఉంటే ఆ హాయి వేరే కదూ.. అయితే పైకప్పులో కూల్ రూఫ్ టైల్స్, పెయింటింగ్స్ వేసుకుంటే సరి. సూర్యరశ్మిని గ్రహించి, ఇంట్లోకి వేడిని రాకుండా నిరోధించే శక్తి ఉండటం వీటి ప్రత్యేకత. పట్టణీకరణ, కాంక్రీట్ జంగిల్ కారణంగా నగరాలలో అర్బన్ హీట్ ఐల్యాండ్ (యూహెచ్ఐ) ప్రభావం ఏర్పడుతుంది. దీంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. –సాక్షి, సిటీబ్యూరోవేసవి కాలంలో వేడి గాలులతో 32 కోట్ల మంది భారతీయులు అధిక ప్రమాదకర పరిస్థితులకు గురవుతున్నారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. చెట్ల పెంపకం, వేడి, కాలుష్యాన్ని తగ్గించే ఆచరణీయ పద్ధతులు ఉన్నప్పటికీ ప్రపంచ నగరాలు కూల్ రూఫ్, గ్రీన్ బిల్డింగ్ వంటి వినూత్న పరిష్కార మార్గాల వైపు దృష్టి సారిస్తున్నాయి. న్యూయార్క్, కాలిఫోర్నియా, టొరంటో వంటి అంతర్జాతీయ నగరాలు కూల్ రూఫ్ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తూ గణనీయమైన పర్యావరణ ప్రయోజనాలను పొందుతున్నాయి. ఇదే తరహాలో గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోనూ ‘కూల్ రూఫ్ పాలసీ’ని అమలులోకి తీసుకొచ్చింది. కూల్ ఉంటేనే ఓసీ.. మన రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రభుత్వేతర నివాస, వాణిజ్య భవనాలకు కూల్ రూఫ్ తప్పనిసరి. 600 గజాలు, అంతకంటే ఎక్కువ స్థలంలోని నివాస భవనాలకు కూల్ రూఫ్ ఉండాల్సిందే. అంతకంటే చిన్న ఇళ్లు స్వచ్ఛందంగా స్వీకరించవచ్చు. ప్రభుత్వం భవన నిర్మాణ అనుమతి ప్రక్రియలో కూల్ రూఫ్ విధానాన్ని మిళితం చేసింది. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్(ఓసీ) జారీ చేసేందుకు సంబంధిత అధికారులు కూల్ రూఫ్లను నిర్ధారించుకున్నాకే ఓసీ జారీ చేస్తారు. కూల్ రూఫ్ పాలసీ అమలుతో ఐదేళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏటా సుమారు 12 కోట్ల యూనిట్ల విద్యుత్ ఆదా అవుతోందని ప్రభుత్వం అంచనా వేసింది.ఎంత ఖర్చవుతుందంటే.. కూల్ రూఫ్ టైల్స్‌ను జిర్కోనియం సిలికేట్, జింక్ ఆక్సైడ్ల నానోమీటర్ల పరిమాణంలో ఉండే చిన్న కణాల మిశ్రమాలను అల్యూమీనియం సిలికెట్ కణాలతో కూడిన ప్రత్యేక గ్లేజ్తో తయారు చేస్తారు. వీటిని అధిక ఉష్ణోగ్రతల వద్ద కాలుస్తారు. దీంతో వీటికి సూర్యరశ్మిని గ్రహించి, ఇంట్లోకి వేడిని చేరనివ్వదు. కూల్ రూఫ్ ఏర్పాటుకు రకాన్ని బట్టి చ.అ.కు రూ.120–1,000 వరకు ఖర్చు అవుతుంది. ప్రత్యేకమైన పెయింటింగ్‌లు లేదా నిర్ధిష్ట సిరామిక్ టైల్స్‌తో తయారైన కూల్ రూఫ్‌లు ఉన్నాయి. ఏసీ వినియోగం తక్కువ.. సంప్రదాయ పైకప్పుతో పోలిస్తే కూల్ రూఫ్‌లు తక్కువ సౌరశక్తిని గ్రహిస్తాయి. ఇవి సూర్యరశ్మిని తక్కువగా గ్రహించి, ఇంట్లోకి వేడిని వెళ్లనివ్వదు. దీంతో ఇంట్లో ఏసీ, కూలర్ల వినియోగం తక్కువగా ఉంటుంది. సంప్రదాయ పైకప్పులతో పోలిస్తే కూల్ రూఫ్ పైకప్పు ఉన్న ఇంటిలోపల గది ఉష్ణోగ్రతలు 5–9 డిగ్రీలు తక్కువగా ఉంటాయి. -
ఇసుక, సిమెంట్ లేకుండానే.. గోడలకు ప్లాస్టరింగ్!
సాధారణంగా మనం చూసే భవనాలన్నీ ఇసుక, సిమెంట్ కలిపిన ఆర్సీసీ కాంక్రీట్ లేదా మైవాన్ అల్యూమీనియంతో ఉంటాయి. పైకప్పు, గోడలు అన్నీ వీటితోనే నిర్మిస్తుంటారు. దీంతో ఈ ఇళ్లలో వేడి ఎక్కువగా ఉంటుంది. పైగా ఇసుక, సిమెంట్ ధరల పెరుగుదల కారణంగా గోడలు, ప్లాస్టరింగ్‌లకు అయ్యే ఖర్చు తడిసిమోపడవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా ఖనిజ జిప్సం అందుబాటులోకి వచ్చేసింది. ఇసుక, సిమెంట్ అవసరం లేకుండానే నేరుగా ఇటుకల మీదపూతలాగే పూయడమే మినరల్ జిప్సం పన్నింగ్ ప్రత్యేకత. పైగా దీనికి చుక్క నీటితో క్యూరింగ్ కూడా అవసరం లేదు. అంతేకాకుండా మినరల్ జిప్సం ఇళ్లలో గది ఉష్ణోగ్రతలు 2–3 డిగ్రీలు తక్కువగా ఉంటాయి. – సాక్షి, సిటీబ్యూరోమన దేశంలో అపారమైన నదుల కారణంగా ఇసుక లభ్యత ఎక్కువ. దీన్ని ఆసరా చేసుకొని బ్రిటీష్ రాజులు మన దేశంలో సిమెంట్ కర్మాగారాలు నెలకొల్పి, అందుబాటులో ఉన్న ఇసుకను కలిపి నిర్మాణ రంగంలో వినియోగించడం మొదలు పెట్టారు. కాలక్రమేణా నది ఇసుక కొరత ఏర్పడటంతో రోబో శాండ్ మార్కెట్లోకి వచ్చింది. దీనికి పట్టుత్వం తక్కువగా ఉండటంతో ప్రత్యామ్నాయంగా జిప్సం వినియోగం పెరిగింది. భూగర్భంలో బంగారం, బొగ్గు, ఇనుము వంటి గనులలాగే జిప్సం కూడా ఖనిజమే. మన దేశంలో రాజస్థాన్‌లోని బికానెర్, కశ్మీర్ వ్యాలీలో మాత్రమే మినరల్ జిప్సం గనులు ఉన్నాయి. మార్కెట్లో కాంపోజిట్, మినరల్ జిప్సం అని రెండు రకాలు ఉంటాయి. సిమెంట్ పరిశ్రమల వ్యర్థాల నుంచి వెలువడే తెల్లటి పదార్థాన్ని కాంపోజిట్ జిప్సం అంటారు. దీన్ని ఇటుక, చాక్‌పీస్ తయారీలో ఎక్కువగా వినియోగిస్తుంటారు. మినరల్ జిప్సం భూగర్భంలో నుంచి వెలికితీసే గని. దీని రసాయన నామం కాల్షియం సల్ఫేట్ డీహైడ్రేట్ (సీఏఎస్‌ఓ4).అంతర్గత గోడలు, సీలింగ్లకే.. ఖనిజ జిప్సంకు నిరంతరం నీరు తాకితే తేమ కారణంగా పాడైపోతాయి. అందుకే దీన్ని ఇంటి లోపల అంతర్గత గోడలు, సీలింగ్‌లకు మాత్రమే వినియోగిస్తారు. బయట గోడలకు, బాత్రూమ్, టాయిలెట్స్ గోడలకు వినియోగించరు. ఆర్సీసీ కాంక్రీట్‌ను తాపీతో వేయాలి లేకపోతే చేతులు, కాళ్లకు పొక్కులు వస్తాయి. అదే మినరల్ జిప్సంను నేరుగా చేతులతో కలుపుతూ గోడలకు పూత లాగా పూస్తారు. ఈ గోడలు చాలా తేలికగా ఉండటంతో ఇంటి శ్లాబ్ మీద బరువు పెద్దగా పడదు. మినరల్ జిప్సంను నివాస, వాణిజ్య, కార్యాలయ అన్ని రకాల భవన సముదాయాల నిర్మాణంలో వినియోగిస్తారు.ఎంత ఖర్చు అవుతుందంటే.. ఆర్సీసీ కాంక్రీట్‌తో చదరపు అడుగు గోడ ప్లాస్టరింగ్ రూ.50–55 ఖర్చు అవుతుంది. అదే జిప్సం పన్నింగ్కు అయితే రూ.35–40తో అయిపోతుంది. అలాగే చ.అ. కాంక్రీట్ గోడ క్యూరింగ్‌కు 7 లీటర్ల నీళ్లు అవసరం కాగా.. కనిష్టంగా ఏడు రోజుల పాటు క్యూరింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక, జిప్సం గోడలకు క్యూరింగే అవసరం లేదు. ఉదాహరణకు.. త్రీ బీహెచ్‌కే ఫ్లాట్‌లో అంతర్గత గోడలు నాలుగు వైపులా కలిపితే 5 వేల చ.అ. ఉంటాయి. వీటి క్యూరింగ్‌కు 25 వేల నీళ్లు అవసరం అవుతాయి. ఈలెక్కన ఖనిజ జిప్సంతో నీళ్లు, సమయం, డబ్బు ఆదా అవుతుందన్నమాట.ఇళ్లంతా చల్లగా.. మినరల్ జిప్సంకు వేడి, అగ్ని, ధ్వనిని నిరోధించే శక్తి ఉంటుంది. ఇందులోని థర్మల్ ప్రూఫ్ కారణంగా బయటితో పోలిస్తే ఇంటి లోపల ఉష్ణోగ్రతలు 2–3 డిగ్రీలు తక్కువగా ఉంటాయి. అలాగే ఖనిజ జిప్సంతో ఉండే ఇంట్లో చల్లదనం కోసం ఏసీ ఎక్కువ సమయం వేయాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా మినరల్ జిప్సంకు అగ్ని ప్రమాదాలను తట్టుకుంటాయి. నింతరంగా మూడు గంటల పాటు అగ్నిని నిరోధిస్తాయి. ఖనిజ జిప్సంతో కట్టే గోడలు చాలా మృదువుగా, పాలవలే తెల్లగా ఉంటాయి. దీంతో చూసేందుకు ఎంతో అందంగా ఉంటాయి. -
ఓపెన్ ప్లాటా.. అపార్ట్‌మెంటా?
ఓపెన్ ప్లాటా? అపార్ట్‌మెంటా? ఎందులో పెట్టుబడులకు ఆసక్తి ఉందనే ప్రశ్నకు సగానికి పైగా తొలిసారి ప్రాపర్టీ కొనుగోలుదారుల అభిప్రాయం ఓపెన్ ప్లాటనే సమాధానం. 58 శాతం మంది కస్టమర్లు స్థలం మీద పెట్టుబడులకు మొగ్గు చూపిస్తున్నారని మ్యాజిక్ బ్రిక్స్ సర్వేలో తేలింది. దీర్ఘకాలిక మూలధన లాభాలు, అధిక రాబడులే ఇందుకు ప్రధాన కారణమని వెల్లడించింది. - సాక్షి, సిటీబ్యూరోదేశంలోని సుమారు 2,200 మంది గృహ కొనుగోలుదారులతో సర్వే నిర్వహించింది. ఇందులో 17.1 శాతం మంది కస్టమర్లు పెట్టుబడులకు రెండో ప్రాధాన్యత ఆస్తిగా వాణిజ్య స్థలాలను ఎంచుకున్నారు. ఓపెన్ ప్లాట్లలో అత్యధికంగా బెంగళూరు స్థలాలకు డిమాండ్ ఉంది. 36.5 శాతంతో గ్రీన్ సిటీ అగ్రస్థానంలో ఉండగా.. చెన్నై ప్లాట్లకు 11 శాతం, లక్నో స్థలాలకు 8.9 శాతం ఆసక్తి చూపిస్తున్నారు. 1,000–2,000 చ.అ. మధ్య తరహా ప్లాట్లకు 46.76 శాతం డిమాండ్ ఉంది. రూ.50 లక్షల వరకూ.. రూ.50 లక్షల వరకు ధర ఉండే స్థలాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. 50.83 శాతం మంది ప్లాట్లలో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. గ్రేటర్లో షాద్‌నగర్, కడ్తాల్, సదాశివపేట వంటి ప్రాంతాలలో ప్లాట్ల సరఫరా అత్యధికంగా ఉంది. ఇక్కడ ప్లాట్ల సగటు ధర చ.అ.కు రూ.2,765గా ఉంది. లక్నోలో రూ.2,836, చెన్నైలో రూ.3,208లు పలుకుతున్నాయి. అత్యధికంగా నోయిడాలో రూ.22,523, గుర్గావ్లో రూ.21,901లతో ఖరీదైన మార్కెట్లుగా ఉన్నాయి. -
హాస్టళ్లకు గిరాకీ.. అద్దెలూ పెరుగుతున్నాయ్..
సాక్షి, సిటీబ్యూరో: విద్యార్థుల వసతి గృహాలకు డిమాండ్ పెరుగుతోంది. ఉన్నత విద్యను అభ్యసించేందుకు ప్రతి ఏటా వేలాది మంది విద్యార్థులకు మెట్రో నగరాలకు వలస వస్తుంటారు. ప్రభుత్వ నూతన విద్యా విధానాలు, వినూత్న సాంకేతికత కారణంగా ఉన్నత విద్యను అభ్యసించేందుకు విద్యార్థుల వలసల వృద్ధికి ప్రధాన కారణమని కొలియర్స్ ఇండియా అడ్వైజరీ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్వప్నిల్ అనిల్ తెలిపారు.క్యాంపస్‌లు, హాస్టళ్లు, పీజీ గృహాలలో అపరిశుభ్రత, భద్రత కరువు, ఎక్కువ అద్దెలు వంటి రకరకాల కారణాల వల్ల స్టూడెంట్ హౌసింగ్ విభాగం ఇప్పటివరకు ఈ రంగం అసంఘటితంగా, నియంత్రణ లేకుండా ఉంది. ఒకే వయసు వ్యక్తులతో కలిసి ఉండటం, ఆధునిక సౌకర్యాలు, మెరుగైన ప్రయాణ వసతులతో సులువైన రాకపోకలు, రోజువారీ కార్యకలాపాలలో సహాయం వంటి రకరకాల కారణాలతో యువతరం వసతి గృహాలలో ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాలలో స్టాంజా, హౌసర్, యువర్ స్పేస్, ఓలైవ్ లివింగ్ వంటి సంస్థలు విద్యార్థి వసతి గృహాల సేవలను అందిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో 1.10 కోట్ల మంది వలస విద్యార్థులు ఉండగా.. 2036 నాటికి 3.10 కోట్లకు చేరుతుందని కొల్లియర్స్ నివేదిక అంచనా వేసింది. అయితే ఆయా విద్యార్థులకు కోసం వసతి గృహాలలో కేవలం 75 లక్షల పడకలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని తెలిపింది. కరోనా తర్వాత విద్యార్థి గృహాల అద్దెలు ఏటా 10–15 శాతం మేర పెరుగుతున్నాయి. -
హైదరాబాద్‌లో రియల్ఎస్టేట్ పతనం
రాజకీయ అనిశ్చితి, ప్రభుత్వ ప్రతికూల విధానాలు, ఆకాశాన్నంటిన ప్రాపర్టీ ధరలు.. కారణాలేవైనా.. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం పల్టీలు కొడుతూ పతనమైపోతోంది. రెండేళ్ల క్రితం ఎన్నికలతో మొదలైన స్థిరాస్తి రంగం మందగమనం.. కొత్త ప్రభుత్వం కొలువుదీరి ఏడాదిన్నర కావస్తున్నా ఇప్పటికీ కోలుకోలేదు. ఈ ఏడాది తొలి మూడు నెలల కాలంలో గ్రేటర్లో గృహ విక్రయాలు, లాంచింగ్స్ భారీగా తగ్గాయి. దేశంలోనే ఇళ్ల అమ్మకాలు, లాంచింగ్స్‌లో అత్యధిక క్షీణత మన నగరంలోనే ఉండటం గమనార్హం. - సాక్షి, సిటీబ్యూరో హైదరాబాద్‌లో ఈ ఏడాది తొలి మూడు నెలల్లో (క్యూ1) 10,100 ఇళ్లు అమ్ముడుపోయాయి. 2024 క్యూ1లో 19,660 సేల్ అయ్యాయి. ఏడాది కాలంలో విక్రయాలలో 49 శాతం తగ్గుదల నమోదయిందని అనరాక్ గ్రూప్ రీసెర్చ్ రిపోర్ట్ వెల్లడించింది. అలాగే నగరంలో 2025 క్యూ1లో కొత్తగా 10,275 యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. అదే 2024 క్యూ1లో 22,960 యూనిట్లు ప్రారంభమయ్యాయి. ఏడాదిలో లాంచింగ్స్ 55 శాతం తగ్గాయని పేర్కొంది. అయితే ఆశ్చర్యకరంగా నగరంలో కొత్తగా ప్రారంభమైన ఇళ్లలో లగ్జరీ గృహాలదే ఆధిపత్యం. గ్రేటర్లో కొత్త ఇళ్ల నిర్మాణాలలో రూ.కోటిన్నర కంటే ఎక్కువ ధర ఉండే లగ్జరీ ఇళ్ల వాటా 70 శాతం కంటే ఎక్కువగా ఉంది. ఇన్వెంటరీ 5 లక్షలపైనే.. ఏడు నగరాల్లో అమ్ముడుపోకుండా ఉన్న ఇళ్లు(ఇన్వెంటరీ) కాస్త తగ్గాయి. 2024 క్యూ1లో 5,80,890 యూనిట్ల ఇన్వెంటరీ ఉండగా.. 2025 క్యూ1 నాటికి 5,59,810కు క్షీణించాయి. అంటే ఏడాది కాలంతో పోలిస్తే ఇన్వెంటరీ 4 శాతం తగ్గింది. స్థిరమైన ఆర్థిక పరిస్థితి, జీడీపీ వృద్ధి, ద్రవ్యోల్బణ నియంత్రణ కారణంగా దేశంలో గృహాల ధరలు ఏటేటా పెరుగుతున్నాయి. ఏడాది కాలంలో ప్రాపర్టీ ధరలు మాత్రం 17 శాతం మేర పెరిగాయి. అత్యధికంగా ఎన్సీఆర్లో 34 శాతం, బెంగళూరులో 20 శాతం వృద్ధి చెందాయి.దేశంలోనూ సేమ్.. దేశంలోని ఇతర మెట్రో నగరాల్లోనూ స్థిరాస్తి రంగం తిరోగమనంలోనే ఉంది. ఈ ఏడాది క్యూ1లో ఏడు ప్రధాన నగరాల్లో గృహ విక్రయాలు 28 శాతం, లాంచింగ్స్ 10 శాతం క్షీణించాయి. 2025 క్యూ1లో 93,280 యూనిట్లు అమ్ముడుపోయాయి. అదే గతేడాది క్యూ1లో 1,30,170 ఇళ్లు విక్రయమయ్యాయి. ఇదే సమయంలో 7 నగరాల్లో 2025 క్యూ1లో 1,00,020 యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. 2024లో 1,10,865 గృహాలు ప్రారంభమయ్యాయి. అంటే ఏడాదిలో 10 శాతం లాంచింగ్స్ క్షీణించాయి.లగ్జరీదే హవా.. లాంచింగ్స్‌లో లగ్జరీ, అల్ట్రా లగ్జరీ గృహాలే అత్యధికం. రూ.కోటిన్నర కంటే ఎక్కువ ధర ఉండే ఈ తరహా ఇళ్ల వాటా 42 శాతం ఉన్నాయి. ఆ తర్వాత రూ.80 లక్షల నుంచి రూ.కోటిన్నర ధర ఉండే ప్రీమియం యూనిట్ల వాటా 27 శాతం, రూ.40–80 లక్షల ధర ఉండే అఫర్డబుల్ హౌసింగ్స్ వాటా 12 శాతంగా ఉన్నాయి. -
రియల్టీ లావాదేవీల్లో సీబీఆర్ఈ టాప్
న్యూఢిల్లీ: గతేడాది అత్యధిక స్థాయిలో కమర్షియల్ రియల్ ఎస్టేట్ లావాదేవీల నిర్వహణతో సీబీఆర్ఈ అగ్రస్థానంలో నిలిచింది. ఎంఎస్సీఐ రియల్ అసెట్స్ ప్రకారం 2024లో 63.4 శాతం మార్కెట్ వాటా దక్కించుకుంది. కీలకమైన పారిశ్రామిక (68.7 శాతం), రిటైల్ (64.1 శాతం) తదితర విభాగాల్లోనూ అగ్రగామిగా నిలి్చంది.పెట్టుబడులకు సంబంధించి ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్ టాప్ హబ్‌లుగా (చెరి 23 శాతం) నిలవగా, బెంగళూరు (18 శాతం), చెన్నై (10 శాతం), హైదరాబాద్ (8 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. మార్కెట్ ఫండమెంటల్స్ పటిష్టంగా ఉండటంతో గ్లోబల్ ఇన్వెస్టర్లు గతంలో ఎన్నడూ లేని విధంగా భారతీయ రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు సీబీఆర్ఈ ఇండియా ఎండీ (క్యాపిటల్ మార్కెట్స్, ల్యాండ్) గౌరవ్ కుమార్ తెలిపారు.మరోవైపు అంతర్జాతీయంగాను కమర్షియల్ రియల్ ఎస్టేట్ పెట్టుబడులు విక్రయాల్లో 22 శాతం మార్కెట్ వాటాతో సీబీఆర్ఈ నంబర్ 1 ర్యాంకులో కొనుసాగుతోంది. ఆదాయాన్ని అందించే ప్రాపర్టీలను కొనుగోలు, చేసి విక్రయించే ప్రక్రియను రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ సేల్స్‌గా వ్యవహరిస్తారు.ఆఫీస్ బిల్డింగ్లు, రిటైల్ స్పేస్‌లు, హోటళ్లు, స్థలం లాంటి రియల్ ఎస్టేట్ అసెట్లు అద్దె రూపంలో ఆదాయాన్ని అందిస్తాయి. అలాగే వాటి విలువ కూడా పెరుగుతుంది. సీబీఆర్ఈ లాంటి సంస్థలు ఈ మార్కెట్లో ఇన్వెస్టర్లకు సలహాలివ్వడం, లావాదేవీలను నిర్వహించడం, కొనుగోలుదారులు–విక్రేతలను అనుసంధానించడం ద్వారా పెట్టుబడులు, విక్రయాల్లాంటి విషయాల్లో తోడ్పాటు అందిస్తాయి. -
భూకంపాలకు హోమ్ ఇన్సూరెన్స్ పనికొస్తుందా?
మయన్మార్, థాయ్‌ల్యాండ్ దేశాలలో ఇటీవల అధిక తీవ్రతతో సంభవించిన వినాశకరమైన భూకంపం విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో ఇంటి యజమానుల సన్నద్ధతపై ఆందోళనలను రేకెత్తించింది. భూకంపాలు ఊహించలేనప్పటికీ, సరైన బీమా పాలసీతో మీ ఇంటిని సురక్షితం చేసుకోవడం ఇలాంటి విపత్తుల సమయంలో ఆర్థిక ఉపశమనం కలిగిస్తుంది.హోమ్ ఇన్సూరెన్స్ భూకంపాలను కవర్ చేస్తుందా?ప్రామాణిక గృహ బీమా పాలసీలు సాధారణంగా భూకంప నష్టాన్ని కవర్ చేయవు. అయితే, చాలా బీమా సంస్థలు భూకంప బీమాను యాడ్-ఆన్ లేదా ప్రత్యేక పాలసీగా అందిస్తున్నాయి. ఈ కవరేజీ మీ ఇంటి నిర్మాణం, దాని విషయాలు రెండింటినీ భూకంప కార్యకలాపాల వల్ల కలిగే నష్టాల నుండి రక్షించగలదు.భూకంప బీమా ముఖ్య లక్షణాలుస్ట్రక్చరల్ కవరేజ్: భూకంపాల వల్ల కలిగే నష్టాల నుండి భవనాన్ని రక్షిస్తుంది.కంటెంట్ కవరేజీ: ఇంట్లోని విలువైన వస్తువులు, వస్తువులను కవర్ చేస్తుంది.అదనపు జీవన ఖర్చులు: మీ ఇల్లు నివాసం ఉండలేని విధంగా మారితే తాత్కాలిక వసతి కోసం ఆర్థిక సహాయం అందిస్తుంది.భూకంప బీమా ఎందుకు ముఖ్యం?మయన్మార్, థాయ్‌ల్యాండ్‌తోపాటు భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లోనూ భూకంప ప్రభావం కనిపించింది. మన దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో గతంలోనూ భూకంప ప్రమాదాలు సంభవించాయి. ఇలాంటి ప్రాంతాలలో భూకంప ప్రభావానికి ఇల్లు కూలిపోతే తరువాత పునర్నిర్మించడానికి ఆర్థిక భారం అధికంగా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో భూకంప బీమా నిశ్చింతను ఇస్తుంది. ఇంటి యజమానులకు ఆర్థిక భారం లేకుండా నష్టాల నుండి కోలుకునేలా చేస్తుంది.ఇవి పరిగణనలోకి తీసుకోవాలిమినహాయింపులు: భూకంప బీమా పాలసీలు సాధారణంగా అధిక మినహాయింపులతో వస్తాయి. ఇది క్లెయిమ్ చెల్లింపులను ప్రభావితం చేస్తుంది.కవరేజ్ పరిమితులు: ఇంటి నిర్మాణంతోపాటు ఇంట్లోని వస్తువులకూ గరిష్ట కవరేజీ ఉందో లేదో సరిచూసుకోండి.పాలసీ నిబంధనలు: చేరికలు, మినహాయింపులు, అందుబాటులో ఉన్న ఏదైనా అదనపు రైడర్లను సమీక్షించండి. -
భాగ్యనగరంలో రియల్టీ ఎలా ఉందంటే..
హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో ఈ ఏడాది తొలి మూడు నెల ల్లో ఇళ్ల అమ్మకాలు బలహీనతను ఎదుర్కొన్నాయి. క్రితం ఏడాది తొలి త్రైమాసికంతో పోల్చి చూస్తే 28 శాతం తక్కువగా 93,280 యూనిట్ల అమ్మకాలే నమోదవుతాయన్నది ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అనరాక్ అంచనా వేసింది. క్రితం ఏడాది తొలి క్వార్టర్లో (క్యూ1)లో ఈ నగరాల్లో అమ్మకాలు 1,30,170 యూనిట్లుగా ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఈ ఏడాది తొలి మూడు నెలల్లో ఇళ్ల అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 49 శాతం తగ్గి 10,100 యూనిట్లుగా ఉంటాయన్నది అంచనా. 2024 మొదటి క్వార్టర్లో 19,660 యూనిట్లు అమ్ముడుపోవడం గమనార్హం. ‘‘ఇళ్ల ధరలు గణనీయంగా పెరిగిపోవడం, అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు భారత హౌసింగ్ మార్కెట్ బుల్ ర్యాలీని 2025 క్యూ1లో నిదానించేలా చేశాయి’’అని అనరాక్ తన నివేదికలో పేర్కొంది. పట్టణాల వారీగా విక్రయ అంచనాలుఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో జనవరి–మార్చి మధ్య అమ్మకాలు 20 శాతం తక్కువగా 12,520 యూనిట్లకు పరిమితం కావొచ్చు. క్రితం ఏడాది తొలి క్వార్టర్లో ఇక్కడ 15,650 యూనిట్ల అమ్మకాలు జరిగాయి.ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో విక్రయాలు 26 శాతం క్షీణించి 31,610 యూనిట్లకు పరిమితమయ్యాయి.బెంగళూరులో అమ్మకాలు 16% తక్కువగా 15,000 యూనిట్లకు పరిమితం కావొచ్చు.పుణెలోనూ క్రితం ఏడాది క్యూ1తో పోల్చి చూస్తే 30 శాతం తగ్గి 16,100 యూనిట్లుగా ఉంటాయన్నది అంచనా.చెన్నైలో అమ్మకాలు 26 శాతం క్షీణించి 4,050 యూనిట్లుగా ఉంటాయి.కోల్‌కతా మార్కెట్లోనూ 31 శాతం తక్కువగా 3,900 యూనిట్ల అమ్మకాలు నమోదు కావొచ్చు. క్రితం ఏడాది తొలి క్వార్టర్లో అమ్మకాలు 5,650 యూనిట్లుగా ఉన్నాయి.ఇదీ చదవండి: ఉద్యోగం–జీవితం...సమతుల్యంపై అసంతృప్తిప్రతికూల పరిస్థితుల వల్లే.. ‘‘దేశ ఆర్థిక పరిస్థితులు సానుకూలంగానే ఉన్నా యి. అంతర్జాతీయంగా చూస్తే దేశ జీడీపీ అత్యధిక వృద్ధి రేటును సాధించగా, ద్రవ్యోల్బణం కూడా నియంత్రణలోనే ఉంది. అదే సమయంలో ఇళ్ల ధరలు పెరిగిపోవడం, అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితులు దేశ రియల్ ఎస్టేట్ మార్కెట్ లావాదేవీలపై ప్రభావం చూపించాయి. ఈ పరిణామాలన్నీ కలసి క్యూ1లో దేశ హౌసింగ్ మార్కెట్‌ను నిదానించేలా చేశాయి’’అని అనరాక్ ఛైర్మన్ అనుజ్ పురి తెలిపారు. -
హైదరాబాద్‌లో ఆఫీస్ లీజింగ్ డౌన్..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా టాప్–7 నగరాల్లో ఈ ఏడా ది తొలి మూడు నెలల కాలంలో ఆఫీస్ వసతుల లీజింగ్ మెరుగైన వృద్ధిని చూడగా.. హైదరాబాద్, కోల్‌కతా పట్టణాల్లో క్షీణించింది. జనవరి–మార్చి త్రైమాసికంలో ఇప్పటి వరకు నమోదైన లావాదేవీల ఆధారంగా రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ‘కొలియర్స్ ఇండియా’ ఒక నివేదికను విడుదల చేసింది. టాప్–7 నగరాల్లో స్థూలంగా 159 లక్షల చదరపు అడుగుల మేర (ఎస్ఎఫ్టీ) ఆఫీస్ లీజింగ్ లావాదేవీలు జరిగాయి. క్రితం ఏడాది మొదటి మూడు నెలల కాలంలోని లీజింగ్ 138 లక్షల ఎస్ఎఫ్టీతో పోల్చి చూస్తే 15 శాతం వృద్ధి నమోదైంది. దేశ, విదేశీ కంపెనీల నుంచి బలమైన డిమాండ్ కనిపించింది. పట్టణాల వారీగా లీజింగ్.. → హైదరాబాద్‌లో 17 లక్షల చదరపు అడుగుల లీజింగ్ లావాదేవీలు జరిగాయి. క్రితం ఏడాది మొదటి మూడు నెలల్లో లీజింగ్ 29 లక్షలతో పోల్చి చూస్తే 41 శాతం తగ్గినట్టు తెలుస్తోంది. → కోల్‌కతాలోనూ క్రితం ఏడాది మొదటి త్రైమాసికంతో పోల్చి చూసినప్పుడు 50 శాతం తక్కు వగా లక్ష ఎస్ఎఫ్టీ లీజింగ్ లావాదేవీలే జరిగాయి. → బెంగళూరులో స్థూల లీజింగ్ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 13 శాతం వృద్ధితో 45 లక్షల ఎస్‌ఎఫ్‌టీగా నమోదైంది. → చెన్నై మార్కెట్లో ఆఫీస్ లీజింగ్ ఏకంగా 93 శాతం పెరిగింది. 29 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్థలాలను కంపెనీలు లీజుకు తీసుకున్నాయి. → ఢిల్లీ ఎన్సీఆర్లో 32 శాతం అధికంగా 33 లక్షల ఎస్ఎఫ్టీ లీజింగ్ నమోదైంది. క్రితం ఏడాది తొలి క్వార్టర్లో లీజింగ్ 25 లక్షల చదరపు అడుగులుగా ఉంది. → పుణెలో 12 లక్షల చదరపు అడుగుల లీజింగ్ నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లీజింగ్ 8 లక్షల ఎస్ఎఫ్టీతో పోలి్చతే 50 శాతం పెరగడం గమనార్హం. → ఏడు నగరాల్లో మొత్తం 159 లక్షల ఎస్ఎఫ్టీ లీజింగ్‌లో 137 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్థలాలను కార్పొరేట్ కంపెనీలు తీసుకున్నాయి. ఇందులోనూ 75 శాతం మేర టెక్నాలజీ కంపెనీలు, బీఎఫ్ఎస్ఐ సంస్థలు, ఇంజనీరింగ్, తయారీ రంగ కంపెనీలు తీసుకున్నవే. → మిగిలిన 22 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్థలాలను కోవర్కింగ్ ఆపరేటర్లు లీజుకు తీసుకున్నారు. వీరు తిరిగి చిన్న కంపెనీలకు సబ్ లీజింగ్‌కు ఇస్తుంటారు. 2025లో బలమైన డిమాండ్.. ‘‘కీలక మార్కెట్లో గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ లీజింగ్ బలంగా ఉంది. కార్పొరేట్ కంపెనీల విస్తరణతోపాటు దేశీయ వృద్ధి ఆశావహంగా ఉండడంతో వాణిజ్య రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెరుగుతున్నాయి’’అని కొలియర్స్ ఇండియా ఆఫీస్ సర్విసెస్ ఎండీ అరి్పత్ మెహరోత్రా తెలిపారు. ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ 2025 అంతటా కొనసాగుతుందని అంచనా వేశారు. టెక్నాలజీ, ఇంజనీరింగ్, తయారీ, బీఎఫ్ఎస్ఐ రంగాల్లో కంపెనీల విస్తరణ ప్రణాళికలు ఇందుకు మద్దతుగా నిలుస్తాయని అంచనా వేశారు. -
చెన్నైలో ప్రధాన కార్యాలయం అమ్మిన కాగ్నిజెంట్.. ధర ఎంతంటే..
అమెరికాకు చెందిన ప్రముఖ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ చెన్నైలోని ఓల్డ్ మహాబలిపురం రోడ్ (ఓఎంఆర్) ఒక్కియం తొరైపాక్కంలో ఉన్న 13.68 ఎకరాల ప్రైమ్ ప్రాపర్టీని రూ.612 కోట్లకు విక్రయించింది. నీలాంకరై సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ వారం ప్రారంభంలో ఈ అమ్మకం లావాదేవీలు నమోదయ్యాయి. తొరైపాక్కం కాంప్లెక్స్‌లో సుమారు రెండు దశాబ్దాలకు పైగా ఉన్న కాగ్నిజెంట్ ఇండియా ప్రధాన కార్యాలయం లెగసీ ఇక ముగిసినట్లు తెలుస్తుంది.చెన్నైలో కాగ్నిజెంట్ మొదటి పూర్తి యాజమాన్యంలోని క్యాంపస్‌గా ఉన్న ఈ ప్రాపర్టీకి గణమైన చరిత్ర ఉంది. కంపెనీ సహ వ్యవస్థాపకులు లక్ష్మీ నారాయణన్, చంద్రశేఖరన్‌లకు గతంలో ఈ ఆఫీస్ ఆపరేషనల్ బేస్‌గా పనిచేసింది. ఒకప్పుడు కాగ్నిజెంట్ రిమోట్ కార్యకలాపాలకు ఇది ఎంతో తోడ్పడింది. అయితే ప్రస్తుతం అమ్మిన దాదాపు 15 ఎకరాల్లోని నాలుగు లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలంతో కూడిన ఈ కార్యాలయానికి సుమారు రూ.750 కోట్ల నుంచి రూ.800 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని గత ఏడాది సెప్టెంబరులో ఒక నివేదిక తెలిపింది.ఎంఈపీజెడ్, షోలింగనల్లూరు, సిరుసేరిలోని మూడు సొంత భవనాల్లో కాగ్నిజెంట్ తన కార్యకలాపాలను పటిష్టం చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలకు అనుగుణంగా ఈ విక్రయం జరిగింది. ఈ లావాదేవీని సులభతరం చేయడానికి అంతర్జాతీయ ప్రాపర్టీ అడ్వైజరీ సంస్థ జేఎల్‌ఎల్‌ను నియమించి గత ఏడాది ఆగస్టులో కంపెనీ ఈ ప్రాపర్టీని మార్కెట్లోకి తెచ్చింది. స్థానిక డెవలపర్లు బాశ్యామ్ గ్రూప్, కాసాగ్రాండ్ సహా పలువురు కొనుగోలుదారులతో చర్చించిన తర్వాత బెంగళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ డెవలపర్ బగామానే గ్రూప్ విజయవంతమైన బిడ్డర్‌గా లిస్ట్ అయింది.ఇదీ చదవండి: శామ్సంగ్ కో-సీఈఓ కన్నుమూతఈ ప్రాపర్టీ విక్రయం ద్వారా స్టాంప్ డ్యూటీతోపాటు రిజిస్ట్రేషన్ ఫీజుల కోసం తమిళనాడు ప్రభుత్వానికి రూ.55.08 కోట్లు సమకూరాయి. ఈ లావాదేవీని 2024 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని తొలుత లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రాపర్టీ అప్పగింతకు ముందుగా అంచనా వేసిన దానికంటే అదనంగా దాదాపు మూడు నెలల సమయం పట్టినప్పటికీ కాగ్నిజెంట్ డిసెంబర్ చివరి నాటికే క్యాంపస్‌ను ఖాళీ చేసింది. ఇదిలాఉండగా, రామానుజన్ ఐటీ పార్క్, డీఎల్ఎఫ్, ఆర్ఏ పురంలోని సెయింట్ మేరీస్ రోడ్డులోని కార్యాలయం వంటి ప్రముఖ ప్రదేశాలతో సహా చెన్నై అంతటా లీజుకు తీసుకున్న స్థలాలను కూడా కంపెనీ ఖాళీ చేస్తోంది. -
హైదరాబాద్‌లో పడిపోయిన ఇళ్ల అమ్మకాలు
న్యూఢిల్లీ: హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో ఇళ్ల అమ్మకాలు పడిపోయాయి. జనవరి–మార్చి కాలంలో హైదరాబాద్‌లో 11,114 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు నమోదవుతాయని రియల్ ఎస్టేట్ డేటా విశ్లేషణ సంస్థ ప్రాప్ ఈక్విటీ అంచనా. క్రితం ఏడాది తొలి మూడు నెలల కాలంలోని అమ్మకాలు 20,835 యూనిట్లతో పోల్చి చూస్తే 47 శాతం తగ్గనున్నాయి. ఇలా దేశవ్యాప్తంగా టాప్ 9 నగరాల్లో మార్చి త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు 23 శాతం తక్కువగా 1,05,791 యూనిట్లుగా ఉండొచ్చని అంచనా వేసింది. క్రితం ఏడాది మొదటి మూడు నెలల్లో ఈ నగరాల్లో అమ్మకాలు 1,36,702 యూనిట్లుగా ఉన్నాయి. అధిక ధరలతో డిమాండ్ బలహీనపడడం, ఆర్థిక వృద్ధిపై ఆందోళనలు విక్రయాలు పడిపోవడానికి కారణాలుగా ప్రాప్ ఈక్విటీ తన నివేదికలో పేర్కొంది. తొమ్మిది నగరాల్లో ఢిల్లీ ఎన్సీఆర్, బెంగళూరు మాత్రం వృద్ధిని చూసినట్టు తెలిపింది. ‘‘మూడేళ్లపాటు రికార్డు స్థాయి సరఫరా అనంతరం హౌసింగ్ మార్కెట్లో దిద్దుబాటు చోటుచేసుకుంది. అమ్మకాలు తగ్గుముఖం పట్టడమే ఇందుకు కారణం. కొత్త ఇళ్ల సరఫరా సైతం జనవరి–మార్చి మధ్య 34 శాతం క్షీణించి 80,774 యూనిట్లకు పరిమితం కావచ్చు. క్రితం ఏడాది మొదటి త్రైమాకంలో సరఫరా 1,22,365 యూనిట్లుగా ఉంది. ఇళ్ల ధరలు పెరగడం, బౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, దేశ ఆర్థిక వ్యవస్థలో కొంత బలహీనత అమ్మకాలు తగ్గడానికి కారణాలుగా ఉన్నాయి’’అని ప్రాప్ ఈక్విటీ వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ జసూజ తెలిపారు.పట్టణాల వారీగా విక్రయ అంచనాలు.. → బెంగళూరులో జనవరి–మార్చి మధ్య విక్రయాలు 18,508 యూనిట్లుగా ఉండొచ్చు. క్రితం ఏడాది తొలి క్వార్టర్లో అమ్మకాలు 16, 768 యూనిట్లతో పోల్చితే 10%పెరుగుతాయి. → ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లోనూ 10 శాతం వృద్ధితో 11,221 యూనిట్ల అమ్మకాలు నమోదు కావచ్చు. → చెన్నైలో 4,858 యూనిట్లు అమ్మడు కావచ్చు. క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 4,962 యూనిట్లతో పోల్చి చూస్తే 2 శాతం క్షీణించే అవకాశం ఉంది. → కోల్‌కతాలో 28 శాతం తక్కువగా 4,219 యూనిట్ల విక్రయాలు నమోదవ్వొచ్చు. → ముంబై మార్కెట్లో 10,432 యూనిట్లు అమ్ముడుపోవచ్చు. క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 16,204 యూనిట్లుగా ఉన్నాయి. → నవీ ముంబైలో 7 శాతం తక్కువగా 8,551 యూనిట్లకు పరిమితం కావొచ్చు. → పుణెలోనూ అమ్మకాలు 33 శాతం తక్కువగా 17,634 యూనిట్లుగా ఉంటాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 26,364 యూనిట్లుగా ఉన్నాయి. → థానేలో 27 శాతం క్షీణతతో అమ్మకాలు 19,254 యూనిట్లుగా ఉంటాయి. -
అపార్ట్మెంట్లు విక్రయించిన అక్షయ్ కుమార్
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ముంబయిలోని బోరివాలిలో తనకున్న రెండు రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లను మొత్తం రూ.6.6 కోట్లకు విక్రయించారు. అందులో ఒక యూనిట్ రూ.5.35 కోట్లకు అమ్ముడుపోగా, మరొకటి రూ.1.25 కోట్లకు అమ్ముడైంది. కన్సల్టెన్సీ, హౌసింగ్ ట్రాన్సాక్షన్స్, మార్టగేజ్ అడ్వైజరీ.. వంటి వంటి పలు రకాల సేవలను అందిస్తున్న రియల్ ఎస్టేట్ సంస్థ స్క్వేర్ యార్డ్స్ ఈమేరకు వివరాలు వెల్లడించింది.స్క్వేర్ యార్డ్స్ తెలిపిన వివరాల ప్రకారం ముంబయిలోని ఒబెరాయ్ స్కై సిటీలోని ఈ రెసిడెన్షియల్ యూనిట్లకు సంబంధించి 2025 మార్చిలో లావాదేవీలు నమోదయ్యాయి. ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ (ఐజీఆర్) వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం రూ.5.35 కోట్లకు విక్రయించిన అపార్ట్మెంట్ వాస్తవానికి నవంబర్ 2017లో రూ.2.82 కోట్లకు కొనుగోలు చేశారు. దాంతో 89 శాతం విలువ జోడించినట్లయింది. ఈ అపార్ట్మెంట్ కార్పెట్ ఏరియా 100.34 చదరపు మీటర్లు (1,080 చదరపు అడుగులు). రూ.32.1 లక్షల స్టాంప్ డ్యూటీతో పాటు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.30 వేలు చెల్లించాల్సి వచ్చింది.ఇదీ చదవండి: కేర్ హెల్త్ ఇన్సూరెన్స్‌కు రూ.104.77 కోట్ల నోటీసులు2017లో రూ.67.19 లక్షలకు కొనుగోలు చేసిన మరో అపార్ట్‌మెంట్‌ను అక్షయ్‌కుమార్ రూ.1.25 కోట్లకు విక్రయించారు. 23.45 చదరపు మీటర్ల (252 చదరపు అడుగులు) కార్పెట్ ఏరియా ఉన్న ఈ అపార్ట్మెంట్ లావాదేవీకి రూ.7.5 లక్షల స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు రూ.30,000గా ఉంది. స్కై సిటీలో ఉన్న ఈ ప్రాపర్టీని ఒబెరాయ్ రియాల్టీ 25 ఎకరాల్లో అభివృద్ధి చేసింది. ఇది 3 బీహెచ్‌కే, 3 బీహెచ్‌కే+స్టూడియో, డూప్లెక్స్ అపార్ట్మెంట్లను అందించే రెడీ-టు-మూవ్-ఇన్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌గా ప్రసిద్ధి చెందింది. బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ కూడా 2024 మేలో ఒబెరాయ్ స్కై సిటీలో కొన్ని ఆస్తులను కొనుగోలు చేశారు. -
ఇల్లు కొనేవాళ్లు.. ఇప్పుడేం చూస్తున్నారు..?
గృహ కొనుగోలుదారుల అభిరుచులు మారుతున్నాయి. గతంలో ధర ప్రాధాన్యంగా గృహ కొనుగోలు నిర్ణయం తీసుకునే కస్టమర్లు.. ఆ తర్వాత వసతులను పరిగనలోకి తీసుకున్నారు. కానీ, కరోనా తర్వాతి నుంచి ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడంతో ఇంటి ఎంపికలోనూ ఇదే ధోరణి అవలంబిస్తున్నారు. ధర, సౌకర్యాలే కాదు ఇంటికి చేరువలో ఎలాంటి మౌలిక వసతులు ఉన్నాయి? ఆఫీసులు, వినోద కేంద్రాలు ఎంత దూరంలో ఉన్నాయనే అంశాలను సైతం పరిగనలోకి తీసుకొని గృహాలను ఎంపిక చేస్తున్నారు. –సాక్షి, సిటీబ్యూరోఆరోగ్యానికి ప్రాధాన్యం.. నేటి యువతరం ఇల్లు కొనేటప్పుడు చుట్టుపక్కల ఆరోగ్య సౌకర్యాలు ఎలా ఉన్నాయనేది ప్రధానంగా చూస్తున్నారు. అత్యవసరంలో ఎంత సమయంలో ఆస్పత్రికి చేరుకోవచ్చు? ఎంత దగ్గరలో వైద్య సదుపాయాలు ఉన్నాయనేది ఆరా తీస్తున్నారు. ఇంట్లో పిల్లలు, పెద్దల ఆరోగ్య అవసరాల రీత్యా వీటికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.ఆట స్థలాలు.. ఇల్లు విశాలంగా ఉండటమే కాదు కమ్యూనిటీలో సకల సౌకర్యాలు ఉండాలనేది నేటి గృహ కొనుగోలుదారుల మాట. పిల్లల కోసం క్రీడా సదుపాయాలు, పెద్దలకు క్లబ్‌హౌస్, జిమ్, స్విమ్మింగ్ పూల్ వంటి సదుపాయాలు ఉండాలని భావిస్తున్నారు. ఎక్కువ ఖాళీ స్థలం వదిలి, పచ్చదనం అధికంగా ఉంటే ఇష్టపడుతున్నారు.డే కేర్ సెంటర్.. చిన్న కుటుంబాల నేపథ్యంలో పిల్లల ఆలనాపాలనా చూసే డే కేర్ సౌకర్యాలు ఉండాలని గృహ కొనుగోలుదారులు చూస్తున్నారు. భార్యాభర్తలిద్దరూ కార్యాలయాలకు వెళితే పిల్లలను చూసుకోవడం కష్టం అవుతుంది. వర్క్ ఫ్రం హోమ్ ఉన్నా పిల్లలపై శ్రద్ధ పెట్టలేని పరిస్థితి. కాబట్టి కమ్యూనిటీలో డే కేర్ సదుపాయాలు ఉండాలని కోరుకుంటున్నారు.ఆఫీసుకు దగ్గరలో.. ఇల్లు కొనేటప్పుడు ఆఫీసుకు ఎంత దూరంలో ఉందనేది కస్టమర్ల ప్రాధామ్యాలలో ఒకటి. నగరంలో ట్రాఫిక్‌లోనే అధిక సమయం వృథా అవుతుంది కాబట్టి దూరం, సమయం అనేది ప్రధానంగా మారాయి. ప్రజా రవాణా సౌకర్యాలు ఎలా ఉన్నాయనేది పరిశీలించాకే నిర్ణయం తీసుకుంటున్నారు.వీకెండ్ ఎంజాయ్.. వీకెండ్ వస్తే కుటుంబంతో కలిసి ఆహ్లాదంగా గడిపేందుకు షాపింగ్ మాల్స్, థియేటర్లు ఎంత దూరంలో ఉన్నాయనేవి కూడా కొనుగోలు ఎంపికలో భాగమైపోయాయి. పచ్చని ప్రకృతిని ఆస్వాధించాలని కోరుకునే నివాసితులు శివారు ప్రాంతాలలో ఫామ్‌హౌస్‌లు, విల్లాల కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తున్నారు. -
ఫోర్త్ సిటీ.. దక్షిణ హైదరాబాద్‌కి రియల్ బూమ్!
నీరు ఎత్తు నుంచి పల్లం వైపునకు పారినట్లే.. రియల్ ఎస్టేట్ అవకాశాలు, అభివృద్ధి కూడా మౌలిక వసతులు మెరుగ్గా ఉన్న ప్రాంతం వైపే విస్తరిన్నాయి. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌తో మొదలైన స్థిరాస్తి అభివృద్ధి ఐటీ హబ్ రాకతో గచ్చిబౌలి, మాదాపూర్ వంటి పశ్చిమ ప్రాంతాల వైపు పరుగులు పెట్టింది. కొత్త ప్రాంతంలో అభివృద్ధి విస్తరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం దక్షిణ హైదరాబాద్ వైపు దృష్టిసారించింది. విద్య, వైద్యంతో పాటు ఏఐ సిటీ, ఎలక్ట్రానిక్స్, లైఫ్‌సైన్స్, ఎంటర్టైన్మెంట్ జోన్లతో కూడిన నాల్గో నగరంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయనుంది. అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలతో నిర్మితం కానున్న ఈ కొత్త నగరంతో స్థిరాస్తి అవకాశాలు పశ్చిమం నుంచి దక్షిణ హైదరాబాద్ వైపు మళ్లనుంది. – సాక్షి, సిటీబ్యూరోమన దేశంలో నోయిడా, గ్రేటర్ నోయిడా, దక్షిణ కొరియాలో ఇంచియాన్ ఫ్రీ ఎకనామిక్ జోన్ సక్సెస్‌లను స్ఫూర్తిగా తీసుకొని.. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో నాలుగో నగరం ‘ఫ్యూచర్ సిటీ’ని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. నగరం సమీపంలోని మీర్ఖాన్పేట, బేగరికంచె, ముచ్చర్ల గ్రామాల పరిధుల్లో 814 చదరపు కిలో మీటర్లు, 2,01,318 ఎకరాల విస్తీర్ణంలో ఫోర్త్ సిటీ విస్తరించి ఉంటుంది. కడ్తాల్, ఇబ్రహీంపట్నం, కందుకూరు, మహేశ్వరం, మంచాల్, యాచారం, ఆమన్‌గల్ 7 మండలాల్లోని 56 గ్రామాలు ఫోర్త్ సిటీ పరిధిలోకి వస్తాయి. ఈ నగరం సాకారమైతే 30–35 వేల మందికి ప్రత్యక్షంగా, మరో 60–70 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. ఈ విస్తరణ ప్రణాళిక హైదరాబాద్ రియల్ రంగానికి ఊతంగా నిలవనుంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ హైవేలలో స్థిరాస్తి పెట్టుబడి అవకాశాలు మరింత మెరుగవుతాయి. నివాస, వాణిజ్య, పారిశ్రామిక స్థలాలకు డిమాండ్ ఏర్పడనుంది. ప్రాపర్టీ విలువలు గణనీయంగా పెరుగుతాయి. నెట్‌జీరో సిటీగా నిర్మితం కానున్న ఈ ఫ్యూచర్ సిటీ అభివృద్ధి, పర్యవేక్షణ నిమిత్తం ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసింది. ఫ్యూచర్ సిటీ స్వరూపమిదీఎలక్ట్రానిక్స్ అండ్ సాధారణ పరిశ్రమలు: 4,774 ఎకరాలు లైఫ్ సైన్స్ హబ్: 4,207 ఎకరాలు నివాస, మిశ్రమ భవనాలు: 1,317 ఎకరాలు నివాస భవనాల జోన్: 1,013 ఎకరాలు స్పోర్ట్స్ హబ్: 761 ఎకరాలు ఎడ్యుకేషనల్ అండ్ వర్సిటీ జోన్: 454 ఎకరాలు ఎంటర్టైన్మెంట్: 470 ఎకరాలు హెల్త్ సిటీ: 370 ఎకరాలు ఫర్నీచర్ పార్క్: 309 ఎకరాలు ఏఐ సిటీ: 297 ఎకరాలునెట్జీరో సిటీగా.. చుట్టూ పచ్చదనం, విశాలమైన రహదారులు, ప్రణాళికబద్ధంగా నివాస ప్రాంతాలు, వాణిజ్య క్లస్టర్లు, ఐటీ కంపెనీలు, బహుళ జాతి సంస్థలు ఒక చోట వీటన్నింటికీ దూరంగా పరిశ్రమలు, ఇలా పర్యావరణహితంగా కాలుష్యరహితంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయనున్నారు. నెట్‌జీరో సిటీగా ఏర్పాటుకానున్న ఈ నగరానికి సంబంధించి ప్రభుత్వం వేర్వేరు ప్రణాళికలను తయారు చేసింది. వచ్చే యాభైఏళ్లలో అక్కడ మారనున్న పరిస్థితులను అనువుగా భవిష్యత్ ప్రణాళికలను రూపొందించారు.వ్యర్థాల నిర్వహణ.. పర్యావరణాన్ని కాపాడేందుకు నెట్‌జీరో సిటీలో 33 శాతం గ్రీనరీ ఉండేలా చర్యలు చేపట్టనున్నారు. చెట్లు, వాణిజ్య పంటలు, రహదారుల వెంట నీడనిచ్చే వృక్షాలు ఉంటాయి. వీటి ద్వారా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కంటే ఇక్కడ 2–3 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. ఇళ్లు, పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థ జలాలు, ఘన వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేకమైన వ్యవస్థను రూపకల్పన చేస్తున్నారు. వ్యర్థ జలాలను శుద్ధీకరించి మళ్లీ వినియోగించేందుకు వీలుగా మారుస్తారు. దీంతో పాటు పరిశ్రమలు, ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాల నిర్వహణకు ఇంధనం, విద్యుత్ వినియోగాన్ని తగ్గించి సౌర విద్యుత్ వాడేలా చూస్తారు. పరిశ్రమలు, ఐటీ సంస్థలు, నివాసాలు నిర్మించేటప్పుడు జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కాలుష్యరహిత వస్తువులను వినియోగించేలా చూస్తారు.ఎలక్ట్రానిక్స్, లైఫ్‌సైన్స్‌కు ప్రాధాన్యం..ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్, లైఫ్‌సైన్స్ రంగాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వనుంది. ఈ రెండు రంగాలకే ఏకంగా 64 శాతం భూమిని కేటాయించారు. ఎలక్ట్రానిక్స్, సాధారణ పరిశ్రమలకు 4,774 ఎకరాలు, లైఫ్‌సైన్స్ హబ్‌కు 4,207 ఎకరాలను కేటాయించారు. కొంగరకలాన్‌లో యాపిల్ ఫోన్ విడిభాగాలను తయారు చేస్తున్న ఫాక్స్‌కాన్ సంస్థ ఎలక్ట్రానిక్స్ జోన్లో తన శాఖలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. లైఫ్‌సైన్ జోన్లో ప్రాణాధార మందుల తయారీ, పరిశోధన సంస్థలకు ప్రభుత్వం ప్రాధాన్యం కల్పించనుంది. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ప్రముఖ ఫార్మా సంస్థలు వాటి విస్తరణ ప్రాజెక్ట్‌లను ఇక్కడ ప్రారంభించేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి.రోడ్డు, రైలు, విమానం.. అన్నీ.. » ఫ్యూచర్ సిటీకి రోడ్డు, రైలు, విమాన మార్గాలతో అనుసంధానించేలా అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులను కల్పించనున్నారు. » ఫ్యూచర్ సిటీకి హైదరాబాద్ నుంచి సులభంగా చేరుకునేందుకు విమానాశ్రయం నుంచి ఔటర్ రింగ్ రోడ్‌కు, అలాగే ఔటర్ నుంచి ప్రతిపాదిత ప్రాంతాలు బేగరికంచె, మీర్ఖాన్పేట్, ముచ్చర్ల వరకూ 330 అడుగుల వెడల్పు రహదారులు, ఇతర అంతర్గత రహదారులను నిర్మించనున్నారు. » రావిర్యాల ఓఆర్ఆర్ నుంచి మీర్ఖాన్పేట మీదుగా ముచ్చర్ల, ఆమన్‌గల్ మండలంలోని ఆకుతోటపల్లె వద్ద రీజినల్ రింగ్ రోడ్‌ను కలుపుతూ 40 కిలోమీటర్ల రహదారిని నిర్మించనున్నారు. » దీంతో పాటు రాజేంద్రనగర్‌లో రానున్న కొత్త హైకోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో రైలు మార్గాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. -
రియల్ఎస్టేట్ ఏజెంట్లకు కేంద్రమంత్రి సూచన
భారత రియల్ ఎస్టేట్ రంగ వృద్ధికి వీలుగా.. కార్యకలాపాల్లో విశ్వాసం, పారదర్శకత ఉండేలా చూడాలని ఈ రంగానికి చెందిన ఏజెంట్లకు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ సూచించారు. 2030 నాటికి రియల్ ఎస్టేట్ మార్కెట్ రూ.85 లక్షల కోట్లకు చేరుకోనుందన్న అంచనాను ప్రకటించారు.నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియల్టర్స్ ఇండియా (నార్–ఇండియా) వార్షిక సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి మాట్లాడారు. అంతర్జాతీయంగా అత్యుత్తమ ప్రమాణాలను, కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకోవాలని పరిశ్రమను కోరారు. నార్–ఇండియాలో 50వేల మంది ఏజెంట్లు సభ్యులుగా ఉన్నారు. రియల్ ఎస్టేట్ రంగం వృద్ధిలో ఏజెంట్ల పాత్రను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు.డెవలపర్లు, వినియోగదారుల మధ్య వీరు కీలక వారధిగా పనిచేస్తున్నారని కొనియాడారు. ఏజెంట్ల సూచలను ప్రభుత్వం సీరియస్‌గా పరిశీలిస్తుందని హామీ ఇచ్చారు. 2016లో రెరాను తీసుకురావడాన్ని అద్భుత సంస్కరణగా పేర్కొన్నారు. డెవలపర్లు, కొనుగోలుదారుల మధ్య వివాదాల నివారణకు దీన్ని తీసుకొచ్చారు.అలాగే, రియల్ ఎస్టేట్‌లోకి నూరు శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించడం, వ్యాపార సులభతర నిర్వహణకు తీసుకున్న చర్యలను ప్రస్తావించారు. 2047 నాటికి దేశ జనాభాలో సగం మంది పట్టణాల్లోనే నివసించనున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఇది 35 శాతంగా ఉంది. -
హైదరాబాద్‌లోనూ గ్రీన్ బిల్డింగ్స్..
సాక్షి, సిటీబ్యూరో: పర్యావరణ అనుకూలమైన హరిత భవనాలకు ఆదరణ పెరుగుతోంది. అపార్ట్మెంట్లు, విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలే కాదు ప్రభుత్వం నిర్మించిన సచివాలయం, పోలీసు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, జిల్లా కలెక్టరేట్లు, ఇతరత్రా ఆఫీసు భవనాలు సైతం పర్యావరణ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మిస్తుండటమే ఇందుకు ఉదాహరణ.. స్వచ్ఛమైన గాలి, వెలుతురు రావడంతో పాటు సహజ వనరులను వినియోగించుకోవడం, విద్యుత్, నీటి పొదుపు, సౌరశక్తి వినియోగం, గృహోపకరణాలు సైతం ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్(ఐజీబీసీ) అనుగుణంగా ఉండటమే హరిత భవనాల ప్రత్యేకత. గ్రీన్ బిల్డింగ్స్‌లో 60 శాతం వరకు నీటి వృథాను అరికట్టవచ్చు. నిత్యావసరాలకు వినియోగించే నీరు బయటకు పంపకుండా వాటిని రీసైకిల్ చేసి తిరిగి మొక్కలు, బాత్రూమ్ అవసరాలకు వాడుకోవచ్చు. ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసి వర్షపు నీటిని నిల్వ చేస్తారు. సాధారణ భవనాలతో పోలిస్తే గ్రీన్ బిల్డింగ్స్‌లో నిర్మాణ వ్యయం 8–10 శాతం అధికంగా ఉంటుంది. కానీ.. ఈ భవనాలలో నీరు, విద్యుత్ పొదుపు అవుతున్న కారణంగా ఇంటి నిర్మాణం కోసం అదనంగా వెచ్చించిన వ్యయం 2–3 ఏళ్లలో తిరిగి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇంటి నిర్మాణ సమయంలోనే రీసైకిల్ మెటీరియల్స్‌ను ఉపయోగించడం గ్రీన్ బిల్డింగ్స్ మరొక ప్రత్యేకత. పర్యావరణానికి హాని చేయని ఉత్పత్తులనే నిర్మాణంలో వాడుతుంటారు. ఇటుకల నుంచి టైల్స్ వరకు గ్రీన్ ఉత్పత్తులు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో 720కి పైగా గ్రీన్ బిల్డింగ్ ప్రాజెక్ట్‌లు ఐజీబీసీ వద్ద రిజిస్టర్ అయ్యాయి. దేశవ్యాప్తంగా 11 వేల నిర్మాణాలు ఉన్నాయని ఐజీబీసీ ప్రతినిధులు చెబుతున్నారు. -
ఇళ్లకు జీఎస్టీ.. ఎవరు కట్టాలి?
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ నగరంలో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది. మెరుగైన మౌలిక వసతులు, పారిశ్రామిక ప్రగతి కారణంగా కొత్త ప్రాంతాలలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. మరోవైపు ప్రధాన నగరంలో స్థలం కొరత కారణంగా గృహ నిర్మాణానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పాత ఇళ్లను కూల్చివేసి వాటి స్థానంలో కొత్తవి నిర్మించడం మినహా నిర్మాణదారులకు ప్రత్యామ్నాయం లేదు.ఖైరతాబాద్, అబిడ్స్, బేగంపేట, సనత్‌నగర్, ఈఎస్ఐ, బంజారాహిల్స్ వంటి ప్రాంతాల్లో ఇలాంటి రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇండిపెండెంట్ హౌస్‌లు, నాలుగైదు అంతస్తుల అపార్ట్మెంట్లను కూల్చేసి ఆ స్థలంలో హైరైజ్ భవనాలను నిర్మిస్తున్నారు. ఇందుకోసం భూయజమానులు, ఫ్లాట్ ఓనర్లతో బిల్డర్లు డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకుంటారు. ఖాళీ స్థలాలను అభివృద్ధికి తీసుకుంటే 50 నుంచి 40 శాతం, ప్రాంతాన్ని బట్టి 60 శాతం ఫ్లాట్లను భూయజమానికి ఇస్తామని ఒప్పందం చేసుకుంటారు. మిగిలిన వాటినే డెవలపర్ అమ్ముకుంటాడు.కూల్చి కట్టినా, ఖాళీ ప్రదేశంలో కొత్త భవనాలు కట్టినా పూర్తయిన ఇళ్లకు వస్తు సేవల పన్ను (జీఎస్టీ) చెల్లించాల్సి ఉంటుంది. భూయజమాని వాటా కింద వచ్చిన జీఎస్టీ ఎవరు చెల్లించాలనే అంశంపై ల్యాండ్ ఓనర్లకు, బిల్డర్లు మధ్య వాగ్వాదం నెలకొంటుంది. డెవలపర్ చెల్లించాలని భూయజమాని, ల్యాండ్ ఓనరే కట్టాలని బిల్డర్ల మధ్య సందిగ్ధం నెలకొంది.భవనం కట్టడంతో స్థలం విలువ పెరిగిందని, దీంతో 5 శాతం జీఎస్టీ చెల్లించాలని ప్రభుత్వం బిల్డర్‌కు నోటీసులు పంపిస్తుంది. వాస్తవానికి కొత్తవైనా, పాతవైనా భవనానికి జీఎస్టీ చెల్లించాల్సిన బాధ్యత బిల్డర్‌దే. కాకపోతే భూయజమాని, కస్టమర్ల నుంచి బిల్డర్ జీఎస్టీ వసూలు చేసి కట్టాల్సింది డెవలపరే. -
హైదరాబాద్ రియల్ఎస్టేట్.. రైజింగ్!
కొత్త ప్రభుత్వం, ప్రతికూల ఆర్థిక పరిస్థితులు, వడ్డీ రేట్ల భారం, హైడ్రా దూకుడు కారణాలేవైనా ఏడాదిన్నర కాలంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఒడిదొడుకుల్లో ఉంది. ఈ ఏడాది ఆరంభం నుంచి మార్కెట్ క్రమంగా పుంజుకుంటోంది. ప్రభుత్వ స్థిరమైన విధానాలు, కార్యాచరణ, స్థిరపడిన ధరలు తదితర కారణాలతో జనవరి నుంచి నగర స్థిరాస్తి రంగం కోలుకుంటోంది. –సాక్షి, సిటీబ్యూరోగత నెలలో గ్రేటర్లో రూ.3,925 కోట్లు విలువ చేసే 5,900 యూనిట్లు రిజిస్ట్రేషన్ కాగా.. జనవరిలో రూ.3,293 కోట్ల విలువైన 5,464 ప్రాపర్టీలు రిజిస్ట్రేషన్ అయ్యాయి. నెల రోజుల్లో విలువల్లో 13 శాతం, యూనిట్ల రిజిస్ట్రేషన్లలో 10 శాతం వృద్ధి నమోదైందని నైట్‌ఫ్రాంక్ ఇండియా అధ్యయనం వెల్లడించింది. నగరవాసులు లగ్జరీ ప్రాపర్టీల కొనుగోళ్లకే మొగ్గు చూపుతున్నారు. విశాలమైన ఇళ్ల కోసం ఎంత ఖర్చు చేసేందుకైనా వెనకాడట్లేదు. గతేడాది ఫిబ్రవరిలో రూ.50 లక్షలలోపు ధర ఉన్న గృహాలు 59 శాతం విక్రయించగా.. గత నెలకొచ్చేసరికి వీటి వాటా 56 శాతానికి తగ్గింది.ఇదీ చదవండి: చారిత్రక ‘లక్ష్మీ నివాస్’ బంగ్లా అమ్మకం..వీటి స్థానంలో రూ.కోటి కంటే ఎక్కువ ధర ఉన్న లగ్జరీ ప్రాపర్టీల వాటా గతేడాది ఫ్రిబవరిలో 15 శాతంగా ఉండగా.. ఇప్పుడది ఏకంగా 18 శాతానికి పెరిగింది. అలాగే 2 వేల చ.అ. కంటే విస్తీర్ణమైన ఇళ్ల వాటా 2024 ఫిబ్రవరిలో 13 శాతంగా ఉండగా.. గత నెలలో 17 శాతానికి పెరిగింది. 1,000–2,000 చ.అ. మధ్య ఉన్న ప్రాపర్టీల వాటా 71 శాతం నుంచి 67 శాతానికి తగ్గింది. -
చారిత్రక ‘లక్ష్మీ నివాస్’ బంగ్లా అమ్మకం..
ముంబైలోని అత్యంత చరిత్రాత్మకమైన ప్రాపర్టీలలో ఒకటైన లక్ష్మీ నివాస్ బంగ్లా రికార్డు స్థాయి రియల్ ఎస్టేట్ వ్యవహారంలో చేతులు మారింది. నెపియాన్ సీ రోడ్డులో ఉన్న ఈ చారిత్రక భవనాన్ని రూ.276 కోట్లకు విక్రయించారు. ఇది నగరంలో అత్యంత ఖరీదైన నివాస లావాదేవీలలో ఒకటిగా నిలిచింది. భారత స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించిన లక్ష్మీ నివాస్ దాని నిర్మాణ వైభవానికి మించి చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది.చరిత్రలో నిలిచిపోయిన భవనం1904లో పార్శీ కుటుంబం నిర్మించిన లక్ష్మీ నివాస్ తరువాత 1917లో కపాడియా కుటుంబం యాజమాన్యంలోకి వచ్చింది. అప్పట్లో కేవలం రూ.1.20 లక్షలకు దీన్ని కొనుగోలు చేశారు. భారత స్వాతంత్య్రోద్యమ కీలక దశలో (1942-1945) లక్ష్మీ నివాస్ దేశంలోని ప్రముఖ విప్లవకారులకు సురక్షిత స్థావరంగా ఆశ్రయం కల్పించింది. రామ్ మనోహర్ లోహియా, జయప్రకాశ్ నారాయణ్, అచ్యుత్ పట్వర్ధన్, అరుణా అసఫ్ అలీ వంటి ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు ఇక్కడ ఆశ్రయం పొందారు.అంతేకాదు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ రేడియోకు కీలక ప్రసార కేంద్రంగా ఈ బంగ్లా పనిచేసింది. భారత స్వాతంత్ర్య పోరాట గళాన్ని పెంచింది. బంగ్లా ఉన్న నెపియాన్ సీ రోడ్ ఒకప్పుడు బికనీర్ ప్యాలెస్, కచ్ కోట, వాకనర్ హౌస్ వంటి రాయల్ ఎస్టేట్లతో పాటు ఉన్నత స్థాయి బ్రిటిష్ అధికారుల నివాసాలకు నిలయంగా ఉండేది. అందువల్ల లక్ష్మీ నివాస్ వలసవాద చరిత్రకు, భారత స్వాతంత్ర్య పోరాటానికి ప్రతీకగా నిలుస్తుంది.రికార్డు స్థాయి డీల్జాప్కీకి లభించిన రియల్ ఎస్టేట్ డాక్యుమెంట్లు, ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం లక్ష్మీ నివాస్ అమ్మకం గత ఫిబ్రవరి 28న ఖరారైంది. ఈ లావాదేవీలో రూ.16.56 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించినట్లు తెలుస్తోంది. 19,891 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ బంగ్లా అమ్మకం ధర చదరపు అడుగుకు సుమారు రూ.1.38 లక్షలుగా ఉండటం ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్ కు నిదర్శనం. ఈ ప్రాపర్టీలో గ్రౌండ్ ఫ్లోర్, రెండు పై అంతస్తులు, వెనుక భాగంలో అదనపు నిర్మాణం ఉన్నాయి. ఇది దక్షిణ ముంబై నడిబొడ్డున విశాలమైన ఎస్టేట్‌గా ఉంది.కొత్త ఓనర్లకు అంబానీతో లింక్ఈ ప్రతిష్టాత్మక లక్ష్మీ నివాస్ బంగ్లాను ఇప్పుడు అంబానీ కుటుంబానికి చెందిన వాగేశ్వరి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ తన కీలక వాటాదారుల ద్వారా సొంతం చేసుకుంది. ఈ కంపెనీకి చెందిన ఎలీనా నిఖిల్ మేస్వానీ.. రిలయన్స్ ఇండస్ట్రీస్ లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, అంబానీ వ్యాపార సామ్రాజ్యంలో కీలక వ్యక్తి అయిన నిఖిల్ మేస్వానీ సతీమణి. ఇక ఈ నిఖిల్ మేస్వానీ ఎవరో కాదు. రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపక డైరెక్టర్లలో ఒకరైన రసిక్లాల్ మేస్వానీ కుమారుడు. ఈయన ధీరూభాయ్ అంబానీ అక్క త్రిలోచన మేనల్లుడు. -
భారత్‌లో ట్రంప్ కంపెనీ.. తొలి ఆఫీస్ ఎక్కడంటే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు చెందిన వ్యాపార సమ్మేళనం ట్రంప్ ఆర్గనైజేషన్ భారతదేశ వాణిజ్య రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి అడుగుపెడుతోంది. ట్రంప్ సంస్థ ఆర్గనైజేషన్‌కు భారత్‌లో ప్రాపర్టీ డెవలప్మెంట్ భాగస్వామి అయిన ట్రిబెకా డెవలపర్స్ 289 మిలియన్ డాలర్లకుపైగా అమ్మకాల లక్ష్యంతో దేశంలో మొదటి ట్రంప్-బ్రాండెడ్ వాణిజ్య రియల్ ఎస్టేట్ ప్రాజెక్టును బుధవారం ప్రారంభించింది.దశాబ్ద కాలంలో భారతదేశం అమెరికా వెలుపల ట్రంప్ బ్రాండ్ అతిపెద్ద రియల్ ఎస్టేట్ మార్కెట్‌గా మారింది. ఇక్కడ ట్రిబెకా ఇతర స్థానిక డెవలపర్లతో లైసెన్సింగ్ ఒప్పందాల కింద నాలుగు భారతీయ నగరాల్లో నివాస ప్రాజెక్టుల అభివృద్ధిలో పాలుపంచుకుంది.గత దశాబ్ద కాలంలో అనేక పెద్ద అంతర్జాతీయ, స్థానిక ఐటీ సంస్థలు కార్యాలయాలను ఏర్పాటు చేసిన పశ్చిమ భారత నగరం పుణెలోనే రియల్ ఎస్టేట్ కంపెనీ కుందన్ స్పేసెస్ సహకారంతో "ట్రంప్ వరల్డ్ సెంటర్" పేరుతో ఆఫీస్ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు నాలుగేళ్లలో పూర్తవుతుందని ట్రిబెకా డెవలపర్స్ వ్యవస్థాపకుడు కల్పేష్ మెహతా ముంబైలో రాయిటర్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. -
శంషాబాద్ రియల్ఎస్టేట్ ప్రాజెక్ట్‌లో ఏక్యూఐ
హైదరాబాద్: బయోఫిలిక్, సస్టెయినబుల్ రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామిగా ఉన్న స్టోన్ క్రాఫ్ట్ గ్రూప్ హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్‌లోని తమ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లో ఏక్యూఐ (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) మానిటరింగ్ స్టేషన్‌ను ప్రారంభించింది. ఈ ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్ అక్కడి కమ్యూనిటీ ప్రయోజనం కోసం గాలి నాణ్యతను పర్యవేక్షించడమే కాకుండా పర్యావరణ సుస్థిరత గురించి అవగాహన పెంచడానికి కూడా దోహదం చేస్తుంది.ఈ కార్యక్రమంలో రిపబ్లిక్ ఆఫ్ స్లోవేనియా రాయబారి మతేజా వోడెబ్ ఘోష్, ఎకనామిక్ కౌన్సెలర్ టీ పిరిహ్, జీహెచ్ఎంసీ అర్బన్ బయోడైవర్సిటీ వింగ్ అడిషనల్ కమిషనర్ వీవీఎల్ సుభద్రాదేవి, కేంద్ర ప్రభుత్వ మాజీ అదనపు కార్యదర్శి అశోక్ పావడియా వంటి ప్రముఖులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా రిబ్బన్ కత్తిరించి మొక్కలు నాటారు. అనంతరం ప్రాజెక్ట్ విస్తృత ప్రభావాలను వివరించారు.ఈ సందర్భంగా రిపబ్లిక్ ఆఫ్ స్లోవేనియా రాయబారి మతేజా వోడెబ్ ఘోష్ మాట్లాడుతూ.. సుస్థిర చర్యల ప్రపంచ ప్రాముఖ్యతను తెలియజేశారు. "గాలి నాణ్యతను మెరుగుపరచడానికి, పర్యావరణ సుస్థిరతను ప్రోత్సహించడానికి అన్ని సంస్థలు, ప్రభుత్వాలు, ఎన్జీఓలు, కార్పొరేట్లు, వ్యాపార సంస్థలు - సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.స్టోన్‌క్రాఫ్ట్ గ్రూప్ ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్ కీర్తి చిలుకూరి మాట్లాడుతూ.. రియల్ ఎస్టేట్ అభివృద్ధి అంటే కేవలం భౌతికంగా నివాస ప్రాంతాలను సృష్టించడం కాదని, సుస్థిర సమాజాలను నిర్మించడమని తాము నమ్ముతున్నామన్నారు. పర్యావరణ బాధ్యతను పెంపొందించే దిశగా తాము తీసుకుంటున్న అనేక చర్యల్లో శంషాబాద్ లోని ఏక్యూఐ మానిటరింగ్ స్టేషన్ ఒకటి అన్నారు. -
ఉద్యోగ సంక్షోభం.. రియల్టీ మార్కెట్‌పై భారం
భారతదేశపు సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగ సంక్షోభం నెలకొంది. 2024లో 50,000 మందికి పైగా ఐటీ ఉద్యోగులను తొలగించడం నగర ఆర్థిక వ్యవస్థను కుదిపేసింది. వ్యయ నియంత్రణ చర్యలు, కృత్రిమ మేధ (ఏఐ), ఆటోమేషన్‌ను వేగంగా అందిపుచ్చుకోవడం వల్ల ఉద్యోగుల తొలగింపు టెక్ రంగంపై ప్రభావం చూపడమే కాకుండా రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై ఆందోళనలు రేకెత్తిస్తున్నట్లు ఇన్‌షార్ట్స్ నివేదిక తెలిపింది.సంక్షోభంలో ఐటీ రంగంబెంగళూరు ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభమైన ఐటీ పరిశ్రమ ఇటీవలి కాలంలో గణనీయమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ఎంట్రీ లెవల్ ప్రోగ్రామర్లు, స్టాఫ్ట్వేర్ టెస్టింగ్‌లో భాగంగా ఉన్న కోడింగ్, డీబగ్గింగ్ వంటి పనుల కోసం ఉన్న సాఫ్ట్వేర్ టెస్టర్ల స్థానంలో కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పరిష్కారాల వైపు మొగ్గు చూపుతున్నాయి. ఈ మార్పు వల్ల అనేక ఉద్యోగాలు తొలగింపునకు కారణమవుతుంది. దాంతో వేలాది మంది వృత్తి నిపుణులు నిరుద్యోగులుగా మారుతున్నారు. పేయింగ్ గెస్ట్ (పీజీ) వసతి అందిస్తున్న వారు స్థానికంగా ఉద్యోగులు ఖాళీ చేస్తుండడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.రియల్ ఎస్టేట్‌పై ప్రభావంఉద్యోగులు తొలగింపులు బెంగళూరు రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపాయి. బడ్జెట్ హౌసింగ్‌కు డిమాండ్ గణనీయంగా తగ్గడంతో భూయజమానులు, ప్రాపర్టీ ఇన్వెస్టర్లు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు జూనియర్ ఐటీ ఉద్యోగులతో సందడిగా ఉండే పీజీ సౌకర్యాలు ఇప్పుడు తక్కువ ఆక్యుపెన్సీ రేటుతో సతమతమవుతున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు వంటి టెక్నాలజీ హబ్‌ల సమీపంలో అద్దె ప్రాపర్టీల్లోకి కోట్లాది రూపాయలు వెచ్చించిన ఇన్వెస్టర్లు ప్రాపర్టీ విలువలు పడిపోవడం, యూనిట్లు ఖాళీగా ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఇదీ చదవండి: యూఎస్ మాజీ అధ్యక్షుడి సంతకం కాపీ..?విస్తృత ఆర్థిక ప్రభావాలుఉద్యోగ సంక్షోభం ఐటీ, రియల్ ఎస్టేట్ రంగాలతోపాటు ఇతర విభాగాలకు విస్తరించింది. నగరంలోని ఆర్థిక స్థిరత్వానికి ముప్పు కలిగిస్తుంది. రెస్టారెంట్లు, కేఫ్‌లు, రిటైల్ స్టోర్లు వంటి ఐటీ నిపుణులకు సేవలందించే స్థానిక వ్యాపారాలు దెబ్బతిన్నాయి. కొత్త కొలువు కోసం ఎదురుచేసే తొలగించిన ఉద్యోగుల వ్యయ శక్తి తగ్గడం బెంగళూరులోని వివిధ పరిశ్రమలపై ప్రభావం చూపుతుంది. -
రూ.750 కోట్లతో రియల్టీ కంపెనీ కొనుగోలు
దేశీ రియల్టీ కంపెనీ కోల్టే పాటిల్‌ను కొనుగోలు చేస్తున్న గ్లోబల్ పెట్టుబడుల దిగ్గజం బ్లాక్‌స్టోన్ తాజాగా సాధారణ వాటాదారులకు ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. ఇందుకు షేరుకి రూ.329 ధరలో దాదాపు రూ.759 కోట్లు వెచ్చించనుంది. తొలుత ప్రమోటర్ల నుంచి 25.7 శాతం వాటా(2.28 కోట్ల షేర్లు) సొంతం చేసుకోనున్నట్లు గత వారం ప్రకటించిన విషయం విదితమే. ఇందుకు రూ.750 కోట్లు కేటాయించనుంది. మరోవైపు ప్రిఫరెన్షియల్ పద్ధతిలో దాదాపు 1.27 కోట్ల ఈక్విటీ షేర్ల కోసం రూ. 417 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. దీంతో మరో 14.3 శాతం వాటా చేజిక్కించుకోనుంది. వెరసి 40 శాతం వాటాకు రూ. 1,157 కోట్లు వెచ్చించనుంది. ఈ బాటలో సాధారణ వాటాదారుల నుంచి మరో 26 శాతం వాటా కొనుగోలుకి తాజాగా ఓపెన్ ఆఫర్ ప్రకటించింది.బ్లాక్‌స్టోన్ గ్రూప్ సంస్థలు పబ్లిక్ వాటాదారుల నుంచి 2.3 కోట్ల షేర్లు(26 శాతం వాటా) కొనుగోలు చేసేందుకు ఓపెన్ ఆఫర్ ప్రకటించినట్లు కోల్టే పాటిల్ తాజాగా స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చింది. షేరుకి రూ.329 ధరలో ఆఫర్ ఇచ్చినట్లు తెలియజేసింది. దీంతో కంపెనీలో బ్లాక్‌స్టోన్ మొత్తం 66 శాతం వాటాను సొంతం చేసుకోనున్నట్లు పేర్కొంది. ఇందుకు రూ. 1,800 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు వెల్లడించింది. గత రెండు దశాబ్దాలలో దేశీయంగా 50 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసిన బ్లాక్‌స్టోన్.. పెట్టుబడులను 100 బిలియన్ డాలర్లకు పెంచనున్నట్లు ఇటీవల పేర్కొన్న నేపథ్యంలో తాజా కొనుగోలుకి ప్రాధాన్యత ఏర్పడింది. కాగా.. కోల్టే పాటిల్‌లో ప్రస్తుతం ప్రమోటర్లకు 69.45 శాతం వాటా ఉంది.ఇదీ చదవండి: త్వరలో బంగారం ధర లకారం! తులం ఎంతంటే..ఆక్జో నోబెల్ రేసులో..దేశీ పెయింట్ల బిజినెస్‌ను విక్రయించే ప్రణాళికల్లో ఉన్న డచ్ దిగ్గజం ఆక్జో నోబెల్‌కు తాజాగా బ్లాక్‌స్టోన్ నాన్‌బైండింగ్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆక్జో నోబెల్ ఇండియా కొనుగోలుకి 1.2 బిలియన్ డాలర్ల(రూ. 10,400 కోట్లు) విలువైన బిడ్ దాఖలు చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వెరసి రేసులో జేఎస్‌డబ్ల్యూ గ్రూప్, పిడిలైట్ ఇండస్ట్రీస్ తదితర దేశీ దిగ్గజాలతో పోటీకి తెరతీసినట్లు పరిశ్రమ వర్గాలు తెలియజేశాయి. ప్రస్తుతం దేశీ పెయింట్ల సంస్థలో మాతృ సంస్థ ఆక్జో నోబెల్ ఎన్వీకు 74.76 శాతం వాటా ఉంది. -
రియల్ ఎస్టేట్‌ను వదిలేస్తున్న వారెన్ బఫెట్!
ప్రముఖ ఇన్వెస్టర్, బెర్క్‌షైర్ హతావే చైర్మన్ వారెన్ బఫెట్ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తున్నారు. అమెరికాలోని అతిపెద్ద రియల్ ఎస్టేట్ బ్రోకరేజీ సంస్థల్లో ఒకటైన హోమ్ సర్వీసెస్ ఆఫ్ అమెరికాను విక్రయించాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. పెరుగుతున్న తనఖా రేట్లు, క్షీణిస్తున్న అమ్మకాలు, ఆర్థిక అస్థిరతతో ప్రాపర్టీ మార్కెట్ సతమతమవుతున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇది దేనికి సంకేతం?ఎందుకు వదులుకుంటున్నట్టు?బలమైన కారణం ఉంటే తప్ప బఫెట్ వ్యాపారాలను అమ్మేసుకోడు. మరి ఇప్పుడెందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని వదులుకుంటున్నాడు? మార్కెట్ విస్తరణకు పేరొందిన రియల్ ఎస్టేట్ దిగ్గజం కంపాస్ కు హోమ్ సర్వీసెస్ ఆఫ్ అమెరికాను విక్రయించేందుకు బెర్క్ షైర్ హాత్వే చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. బెర్క్ షైర్ హాత్వే హోమ్ సర్వీసెస్, రియల్ లివింగ్ వంటి బ్రాండ్ల ద్వారా పనిచేస్తున్న హోమ్ సర్వీసెస్ కు 5,400 మంది ఉద్యోగులు, 820 బ్రోకరేజీ కార్యాలయాలతో విస్తృతమైన నెట్ వర్క్ ఉంది.వ్యాపారాన్ని విక్రయించాల్సిన అవసరం కంపెనీ ఎదుర్కొంటున్న ఆర్థిక ఎదురుదెబ్బల నుంచి కూటా ఉద్భవించి ఉండవచ్చు. 2024లో హోమ్ సర్వీసెస్ ఆఫ్ అమెరికా 107 మిలియన్ డాలర్ల నష్టాన్ని ప్రకటించింది. రియల్ ఎస్టేట్ కమిషన్ దావాకు సంబంధించిన 250 మిలియన్ డాలర్ల సెటిల్మెంట్ దీని వెనుక ముఖ్యమైన కారణం. మార్కెట్ పరిస్థితులు బిగుసుకుపోవడం, లాభదాయకత కుంచించుకుపోవడంతో బఫెట్ వ్యూహాత్మకంగా వెనక్కు తగ్గే అవకాశమూ ఉంది.పతనం అంచున అమెరికా హౌసింగ్ మార్కెట్?అమెరికా రియల్ ఎస్టేట్ మార్కెట్ తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపుతో ఆకాశాన్నంటుతున్న తనఖా రేట్లు గృహ అమ్మకాలను గణనీయంగా మందగించేలా చేశాయి. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియల్టర్స్ ప్రకారం, 2023 లో ప్రస్తుత గృహాల అమ్మకాలు దాదాపు 30 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయాయి. రియల్ ఎస్టేట్ బ్రోకరేజీ సంస్థ నుంచి బఫెట్ వైదొలగడం దీర్ఘకాలిక ప్రతికూలతలను ఆయన అంచనా వేస్తున్నట్లు సంకేతాలు ఇస్తున్నాయి. -
ట్రిపుల్ బెడ్ రూమ్ ఇళ్లే కావాలి!
ఇంటి డిజైన్ల విషయంలో టేస్ట్ ఎప్పటికప్పుడు మారుతున్నట్లే.. ఇంటీరియర్‌లోనూ ఎన్నో మార్పులు వస్తున్నాయి. గతంలో చిన్న ఇల్లు ఉండాలనే ఆశలతో ఉన్నవారు కరోనా తర్వాతి నుంచి విశాలంగా ఉండే ఇళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆలస్యమైనా సరే.. కాస్త స్పేస్ ఎక్కువ ఉన్న ఇళ్లనే కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు. - సాక్షి, సిటీబ్యూరోనగరం మధ్యలో ఇరుకు ఇళ్లలో ఉండేకంటే శివారు ప్రాంతాలు, పచ్చదనం ఉండే ప్రాంతాలను ఇష్టపడుతున్నారు. అపార్ట్మెంట్లలో అయితే డబుల్, ట్రిపుల్ బెడ్ రూమ్ ఇళ్లను కొనుగోలు చేస్తున్నారని హౌసింగ్.కామ్ ఇండియన్ రెసిడెన్షియల్ ఇండెక్స్ ఫర్ ఆన్లైన్ సెర్చ్(ఐఆర్ఐఎస్) తెలిపింది. 15 శాతం వృద్ధిగతంలో ప్రాపర్టీ కొనాలంటే ధర, వసతులు ప్రధాన అంశాలుగా ఉండేవి. కరోనా తర్వాతి నుంచి వైద్య సదుపాయాలకు ఎంత దూరంలో ఉంది? భద్రత ఎంత? అనే అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా వైద్య సదుపాయాలు, భద్రత, ఓపెన్ స్పేస్ ఎక్కువగా ఉన్న ప్రాజెక్ట్‌లకు డిమాండ్ పెరిగింది. త్రీ బీహెచ్‌కే, ఆపై పడక గదుల గృహాలలో అంతకు క్రితం ఏడాదితో పోలిస్తే 2024లో 15 శాతం వృద్ధి నమోదైంది. గతేడాది పెద్ద సైజు ప్లాట్లలో 42 శాతం పెరుగుదల కనిపించింది. -
ఇల్లు, ఆఫీసులే కాదు.. గోడౌన్లూ కష్టమే..!
గృహాలు, కార్యాలయ స్థలాలకే కాదు.. గిడ్డంగులకూ హైదరాబాద్ నగరంలో ఆదరణ పెరుగుతోంది. నగరంలో గతేడాది 35 లక్షల చ.అ. వేర్‌హౌస్ స్పేస్‌ల లావాదేవీలు జరిగాయి. మరో 1.64 కోట్ల చ.అ. స్థలాలకు డిమాండ్ ఉందని, ఇది 2024లో వార్షిక లావాదేవీలతో పోలిస్తే దాదాపు ఐదు రెట్లు అదనమని నైట్‌ఫ్రాంక్ ఇండియా నివేదిక వెల్లడించింది. గ్రేటర్లో శంషాబాద్, మేడ్చల్, పటాన్చెరు క్లస్టర్లు వేర్‌హౌస్‌లకు కేంద్ర బిందువులుగా ఉన్నాయి. గ్రేటర్లో గిడ్డంగుల అద్దె నెలకు చ.అ.కు రూ.20.7గా ఉంది. ఏడాది కాలంలో అద్దెలు ఒక శాతం మేర పెరిగాయి. అత్యధికంగా గ్రేడ్–ఏ వేర్‌హౌస్ అద్దెలు పటాన్చెరు పారిశ్రామిక క్లస్టర్లో రూ.24–28గా ఉంది. – సాక్షి, సిటీబ్యూరోగతేడాది లావాదేవీల్లో అత్యధికంగా 34 శాతం తయారీ రంగంలోనే జరిగాయి. పునరుత్పాదక, సస్టెయినబుల్ ఎనర్జీ, ఆటోమోటివ్, ఆటో అనుబంధ పరిశ్రమలు డిమాండ్‌కు చోదకశక్తిగా నిలిచాయి. మేకిన్ ఇండియా, ప్రొడెక్షన్ లింక్డ్ ఇన్వెంటివ్ (పీఎల్ఐ) వంటి ప్రభుత్వ పథకాలు, ప్రోత్సాహకాలతో తయారీ, లాజిస్టిక్ హబ్‌గా హైదరాబాద్ ఆకర్షణగా నిలిచాయి. ఆ తర్వాత 33 శాతం రిటైల్ విభాగంలో లావాదేవీలు జరిగాయి. ఈ–కామర్స్, ఎఫ్ఎంసీజీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ విభాగాలు రిటైల్ డిమాండ్‌కు ప్రధాన కారణాలు.శంషాబాద్ హాట్ ఫేవరేట్.. గతేడాది గిడ్డంగుల లావాదేవీలు అత్యధికంగా శంషాబాద్ క్లస్టర్లో జరిగాయి. బెంగళూరు–హైదరాబాద్ హైవేకు అనుసంధానమై ఉండటం ఈ క్లస్టర్ అడ్వాంటేజ్. ఈ క్లస్టర్లో శంషాబాద్, శ్రీశైలం హైవే, బొంగ్లూరు, కొత్తూరు, షాద్‌నగర్ గిడ్డంగులకు ప్రధాన ప్రాంతాలు. విత్తన ప్రాసెసింగ్ యూనిట్, థర్డ్ పార్టీ లాజిస్టిక్ కంపెనీలు(3పీఎల్), ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ వంటి పారిశ్రామిక రంగం ఈ క్టస్లర్ డిమాండ్‌ను ప్రధాన కారణాలు. గతేడాది గ్రేటర్లో జరిగిన గిడ్డంగుల లావాదేవీల్లో ఈ క్లస్టర్ వాటా 47 శాతం. ఈ క్లస్టర్లో వేర్‌హౌస్ స్థలాలు ఎకరానికి రూ.4–6 కోట్ల మధ్య ఉండగా.. అద్దె చ.అ.కు రూ.18–25 ఉంది.మేడ్చల్, పటాన్‌చెరుల్లో.. మేడ్చల్, పటాన్చెరు క్లస్టర్లలోనూ వేర్‌హౌస్‌లకు డిమాండ్ ఉంది. మేడ్చల్ క్లస్టర్లో మేడ్చల్, దేవరయాంజాల్, గుండ్లపోచంపల్లి, కండ్లకోయ, శామీర్‌పేట ప్రాంతాలు హాట్ ఫేవరేట్‌గా ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో భూముల ధరలు ఎకరం రూ.3–5 కోట్లు ఉండగా.. అద్దెలు చ.అ.కు రూ.18–24 మధ్య ఉన్నాయి. పటాన్చెరు క్లస్టర్లో పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతం, రుద్రారం, పాశమైలారం, ఏదులనాగులపల్లి, సుల్తాన్పూర్ ప్రాంతాలు హాట్ ఫేవరేట్. ఇక్కడ స్థలాల ధరలు రూ.4–7 కోట్ల మధ్య పలుకుతుండగా అద్దె చ.అ.కు రూ.18–28 మధ్య ఉన్నాయి.డిమాండ్ ఎందుకంటే? వ్యూహాత్మక స్థానం, అద్భుతమైన కనెక్టివిటీ, పెరుగుతున్న పారిశ్రామిక కార్యకలాపాలు, లాజిస్టిక్స్‌కు హైదరాబాద్ కేంద్ర బిందువుగా అభివృద్ధి చెందింది. వీటికి తోడు మెరుగైన రోడ్లు, రైలు, విమాన నెట్‌వర్క్‌లతో సమర్థవంతమైన రవాణా వ్యవస్థ కలిగి ఉంది. దీంతో ఫార్మాసూటికల్స్, ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్, పునరుత్పాదక ఇంధనం వంటి పరిశ్రమల ద్వారా నగరంలో గిడ్డంగులకు ఆదరణ పెరుగుతుంది. వీటికి తోడు స్థానిక ప్రభుత్వ విధానాలు, ప్రోత్సాహకాలు, మెరుగైన మౌలిక సదుపాయాలతో గిడ్డంగుల విభాగంలో డిమాండ్‌కు మరో కారణం. -
ఆకాశమంత ఎత్తులో అపార్ట్మెంట్స్.. హైదరాబాద్ టాప్!
ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్లలో ఎక్కువగా కనిపించే హైరైజ్ నిర్మాణాలు క్రమంగా హైదరాబాద్‌లోనూ జోరందుకుంటున్నాయి. అత్యంత ఎత్తులో నివాసం ఉండాలని కోరుకునే వాళ్ల సంఖ్య పెరగడం, భవనాల ఎత్తుకు నిబంధనలు లేకపోవడం వంటి కారణాలతో నగరంలో ఆకాశహర్మ్యాలు పెరుగుతున్నాయి. గతేడాది హైదరాబాద్‌లో 10, అంతకంటే ఎత్తయిన హైరైజ్ ప్రాజెక్ట్‌లు 57 ప్రారంభం కాగా.. బెంగళూరులో 51, చెన్నైలో 10 ప్రాజెక్ట్‌లు మొదలయ్యాయి. దక్షిణాది రాష్ట్రాలలోనే భాగ్యనగరం ప్రథమ స్థానంలో నిలిచిందని అనరాక్ రిపోర్ట్ తెలిపింది. హైదరాబాద్‌లో ఏటా సగటున 1,400 అపార్ట్మెంట్లు నిర్మాణం చేపడితే అందులో సగటున 200 వరకు ఐదు అంతస్తుల పైన ఉండే బహుళ అంతస్తుల నివాస సముదాయాలుంటాయి. ఇందులో నాలుగో వంతు 10 అంతకంటే ఎక్కువ అంతస్తులపైన ప్రాజెక్ట్‌లుంటాయి. – సాక్షి, సిటీబ్యూరో ఆధునిక హంగులతో ఆకాశహర్మ్యాలుహైరైజ్ ప్రాజెక్ట్‌లలో నివాసానికి కస్టమర్ల ఆసక్తి నగరంలో విలాసవంతమైన గృహాలకు ఆదరణముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్లలో భూమి లభ్యత తక్కువ కాబట్టి వర్టికల్ నిర్మాణాలు సహజమే. కానీ, హైదరాబాద్‌కు ఆ సమస్య లేదు. ఔటర్ చుట్టుపక్కల కొన్ని వేల ఎకరాలు అందుబాటులో ఉన్నాయి. అయినా ఆకాశహర్మ్యాలు పెరగడానికి కారణం సిటీలోనే ఉండాలని ఎక్కువ మంది కోరుకోవడమేనని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దీంతో డెవలపర్లు కూడా స్కై స్క్రాపర్లను నిర్మించేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. హైదరాబాద్‌లో ఐదేళ్లలో భూముల ధరలు బాగా పెరిగాయి. ప్రభుత్వమే వీటిని వేలం వేయడంతో ఈ ప్రభావం ధరల పెరుగుదలకు కారణమైందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.వెస్ట్‌లోనే ఎక్కువ..వెస్ట్ హైదరాబాద్‌లోని హైరైజ్ ప్రాజెక్ట్‌లలో నివసించేందుకు నివాసితులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఎస్ఏఎస్, బ్రిగేడ్, అపర్ణా, ప్రణీత్ గ్రూప్, పౌలోమీ, రాఘవ, మైహోమ్, వాసవి, ఐరా రియాల్టీ, హానర్ వంటి సంస్థలు నగరం నలువైపులా హైరైజ్ ప్రాజెక్ట్‌లను చేపడుతున్నాయి.కోకాపేట వంటి ప్రాంతాల్లో ఎకరా ధర రూ.50 కోట్లకు చేరింది. మరోవైపు అపరిమిత ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్(ఎఫ్ఎస్ఐ)తో ఎన్ని అంతస్తులైనా నిర్మించుకునే వెసులుబాటు ఏర్పడింది. దీంతో ఎకరా రూ.10 కోట్లు ఉన్న చోట పది అంతస్తులు, రూ.20 కోట్లుంటే 20 ఫ్లోర్లు.. ఇలా పెంచుకుంటూ పోతున్నారు. కోకాపేట, రాయదుర్గం, శేరిలింగంపల్లి, మణికొండ, నార్సింగి, గచ్చిబౌలి, గోపన్‌పల్లి, మదీనాగూడ, మియాపూర్, తెల్లాపూర్, పుప్పాల్‌గూడ వంటి పశ్చిమ హైదరాబాద్‌లోనే ఎక్కువగా హైరైజ్ ప్రాజెక్ట్‌లు వస్తున్నాయి.ఇలా నియంత్రించాలి..➤ప్రస్తుతం పశ్చిమ హైదరాబాద్‌లో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లు పూర్తయితే అక్కడ జనసాంద్రత, వాహనాల రద్దీ తట్టుకోలేం. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని అక్కడ మౌలిక వసతులను కల్పించాలి. వ్యయాలలో ఆయా ప్రాంతాల్లోని నిర్మాణ సంస్థలనూ ఇందులో భాగస్వామ్యం చేయాలి.➤ప్రాజెక్ట్ మొత్తం స్థలంలో 20 శాతంలోపు మాత్రమే నిర్మాణానికి అనుమతి ఇవ్వాలి. మిగిలిన స్థలాన్ని గ్రీనరీకి, మౌలిక వసతుల కల్పనకు వినియోగించాలి.➤సాధారణ భవన నిర్మాణలతో పోలిస్తే హైరైజ్ భవనాల అనుమతుల జారీలో ప్రత్యేక శ్రద్ధ, నిరంతర తనిఖీ, పర్యవేక్షణ అవసరం. పర్మిషన్ ఫీజులు వస్తున్నాయి కదా అని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా.. భవిష్యత్తులో జరిగే ప్రమాద నష్టాలను ఊహించలేం.➤ప్రతి అంతస్తును ప్రత్యక్షంగా పర్యవేక్షించాలి. పార్కింగ్, డ్రైనేజీ, అగ్ని ప్రమాద నివారణ ఏర్పాట్లు వంటి ఇతరత్రా అంశాలను తనిఖీ చేయాలి.➤హైరైజ్ భవనాలు భూకంపాలు, వరదల వంటి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా నిర్మాణంలో నాణ్యతను పరిశీలించాలి.➤ఇతర మెట్రో నగరాలలో అందుబాటులో ఉన్నంత స్థాయిలో హైదరాబాద్‌లో మెయింటనెన్స్, సపోర్టింగ్ సర్వీస్‌లు అందించే కన్సల్టెన్సీలు అందుబాటులో లేవు. అందుకే కనీసం ఐదేళ్ల పాటు హైరైజ్ భవనాల నిర్వహణ నిర్మాణ సంస్థలే సామాజిక బాధ్యతలా చేపట్టేలా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మెయింటనెన్స్లలో బిల్డర్లకు ఉన్నంత అనుభవం నివాసిత సంఘాలకు ఉండవు.హోదా, అద్దె ఆదాయం కోసం..హైరైజ్ అపార్ట్మెంట్లలో నివాసం ఉండటాన్ని కొనుగోలుదారులు సమాజంలో హోదాగా భావిస్తున్నారు. మెరుగైన రాబడి, అద్దెలు వస్తాయని మంచి పెట్టుబడి సాధనంగా చూస్తున్నారు. ఆయా ప్రాంతాలు ఇప్పటికే అభివృద్ధి చెంది ఉండటం, మెరుగైన రవాణా సదుపాయాలు, దగ్గర్లో విద్యా, వైద్య సదుపాయాలు ఉండటం అన్నింటికీ మించి సకల సౌకర్యాలతో గేటెడ్ కమ్యూనిటీగా తీర్చిదిద్దుతుండటంతో కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఆకాశమంత ఎత్తులో అపార్ట్మెంట్ ఉంటుంది కాబట్టి వాహనాల ధ్వని, వాయు కాలుష్య సమస్యలూ ఉండవు. ఏకాంతం కోరుకునేవారికి అనువైన గృహాలివే. పైగా ఇంట్లోకి ధారాళమైన గాలి, వెలుతురు, సూర్యరశ్మి వస్తాయి. -
పెరిగిన ఇళ్ల విక్రయాలు.. ఆ తొమ్మిది నగరాల్లో అధికం
సాక్షి, సిటీబ్యూరో: గతేడాది నగరంలో రూ.1.05 లక్షల కోట్ల విలువ చేసే గృహాలు అమ్ముడుపోయాయి. అంతకు క్రితం ఏడాదిలో రూ.1.28 లక్షల కోట్ల విలువైన ఇళ్లతో పోలిస్తే ఇది 18 శాతం తక్కువ. 2024లో దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో విక్రయించిన యూనిట్ల విలువల్లో గ్రేటర్ వాటా 21 శాతంగా ఉందని ప్రాప్ ఈక్విటీ నివేదిక వెల్లడించింది. గతేడాది టాప్–9 నగరాల్లో రూ.6.73 లక్షల కోట్ల విలువ చేసే గృహాలు అమ్ముడుపోయాయి.దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో గృహ విక్రయాల విలువలు 12 శాతం మేర పెరిగింది. గతేడాది దేశంలోని 9 ప్రధాన నగరాల్లో 6.73 లక్షల కోట్ల విలువైన గృహాలు అమ్ముడుపోయాయి. అత్యధికంగా ఢిల్లీ ఎన్సీఆర్లో 63 శాతం, ముంబైలో 13 శాతం విక్రయాల విలువ పెరగగా.. హైదరాబాద్‌లో 18 శాతం క్షీణించాయి. గతేడాది నగరంలో గృహాల సçప్లయి 25 శాతం, డిమాండ్ 49 శాతం తగ్గాయి. ఫలితంగా అమ్ముడుపోకుండా ఉన్న గృహాలు(ఇన్వెంటరీ) 2023లో 17 నెలలుగా ఉండగా.. 2024 నాటికి 20 నెలలకు పెరిగింది.ఏడాదిలో రివర్స్..2023లో ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, గుర్గావ్ల కంటే హైదరాబాద్‌లోనే ఎక్కువ విలువైన గృహాలు అమ్ముడుపోయాయి. ఆ సంవత్సరం నగరంలో రూ.1.28 లక్షల కోట్ల విలువ చేసే ఇళ్లు అమ్ముడుపోగా ముంబైలో రూ.1.22 లక్షల కోట్లు, ఢిల్లీ–ఎన్సీఆర్ లో.. రూ.94,143 కోట్లు, గుర్గావ్లో రూ.64,314 కోట్ల విలువైన ఇళ్లు సేల్ అయ్యాయి. కానీ, గతేడాదికి నాటికి ఈ మూడు నగరాల్లో హైదరాబాద్ కంటే ఎక్కువ విలువైన ఇళ్లు అమ్ముడుపోయాయి. ఢిల్లీ–ఎన్సీర్లో రూ.1.53 లక్షల కోట్లు, గుర్గావ్లో రూ.1.06 లక్షల కోట్లు, ముంబైలో రూ.1.38 లక్షల కోట్లు విలువ చేసే యూనిట్లు అమ్ముడు పోయాయి. -
గృహాల ధరలకు బ్రేక్..!
ఐదేళ్లుగా సామాన్య, మధ్యతరగతి కొనలేని స్థితికి చేరిన గృహాల ధరలకు ఈ ఏడాది కాస్త బ్రేక్ పడనుంది. ఇది తుది గృహ కొనుగోలుదారులకు ఎంతో మేలు చేకూర్చే విషయం. సామాన్యులు సొంతింటి కలను సాకారం చేసుకునే సమయమిదే.. ఇన్నాళ్లూ పెట్టుబడిదారుల మార్కెట్‌గా ఎదిగిన నగర రియల్టీ క్రమంగా తుది గృహ కొనుగోలుదారుల చేతికి అందిందని ప్రణీత్ గ్రూప్ డైరెక్టర్ నరేంద్ర కుమార్ కామరాజు అన్నారు. – సాక్షి, సిటీబ్యూరో రియల్ ఎస్టేట్‌లో రెండు విభాగాల కస్టమర్లు ఉంటారు. సొంతంగా తాము ఉండేందుకు ఇంటిని కొనుగోలు చేసే తుది గృహ కొనుగోలుదారులు, లాభాలను ఆశించి ప్రాపర్టీలను కొనుగోలు చేసే పెట్టుబడిదారులు. స్థిరాస్తి పరిశ్రమ స్థిరంగా అభివృద్ధి చెందాలంటే ఎండ్ కస్టమర్లే అవసరం. ఇన్వెస్టర్లతో మార్కెట్లో తాత్కాలిక బూమ్ వస్తుందే తప్ప స్థిరమైన వృద్ధి జరగదు. లాభాలు, ఆదాయం కోసం పాకులాడే ఇన్వెస్టర్లతో రాత్రికి రాత్రే ధరలు పెరుగుతాయి. వచ్చే 6–12 నెలల్లో నిర్మాణం పూర్తికానున్న ప్రాజెక్ట్‌ల్లో ధరలు స్థిరపడ్డాయి. ప్రత్యేకించి సెమీ లగ్జరీ విభాగంలో అపార్ట్మెంట్ల ధరలు చదరపు అడుగుకు రూ.8–10 వేలుగా ఉన్నాయి. జీఎస్టీ మినహాయింపు, అద్దె ఒప్పందాలు, ముందస్తు బుకింగ్‌లపై రాయితీలు వంటి వాటితో డెవలపర్లూ అదనపు ఆఫర్లను అందిస్తున్నారు.ఇన్వెస్టర్లు గాయబ్..సాధారణంగా హైదరాబాద్ ప్రాపర్టీ విక్రయాల్లో 5–20 శాతం వరకు పెట్టుబడిదారుల వాటా ఉంటుంది. కానీ, కరోనా తర్వాత వీరి వాటా 30 శాతానికి మించిపోయింది. నగదు ప్రవాహం పెరగడంతో మార్కెట్లో ఒక్కసారిగా రియల్ బూమ్ నెలకొంది. అప్పటి వరకు పశ్చిమ హైదరాబాద్‌లో రూ.1.5 కోట్ల ధరలు ఉండే అపార్ట్మెంట్లు.. క్రమంగా రూ.2.5–3.5 కోట్లకు పెరిగాయి. ఇదే సమయంలో ఫ్లాట్ల విస్తీర్ణాలూ పెరిగాయి. డిమాండ్‌కు మించి 2 వేల చ.అ.ల కంటే ఎక్కువ విస్తీర్ణమైన అపార్ట్మెంట్ల సరఫరా పెరిగింది. ఏడాదిన్నర కాలంగా మార్కెట్ ప్రతికూలంలో ఉండటంతో చాలా వరకు రిటైల్ ఇన్వెస్టర్లు మార్కెట్ నుంచి వెళ్లిపోయారు. దీంతో ఖరీదైన ఇళ్లకు డిమాండ్ తగ్గడంతో ధరలు స్థిరపడ్డాయి. విక్రయాలు లేకపోవడం, నగదు ప్రవాహం తగ్గడం, వడ్డీలు, నిర్వహణ భారం తదితర కారణాలతో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లలో డెవలపర్లు ధరలు తగ్గించి విక్రయించక తప్పని పరిస్థితి నెలకొంది.నలువైపులా వృద్ధిపై ఫోకస్..ఐదేళ్లలో హైదరాబాద్‌లో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. ఏ నగరమైనా నలువైపులా సమాంతరంగా అభివృద్ధి చెందాలి. దురదృష్టవశాత్తు అది జరగలేదు. గత ప్రభుత్వం కేవలం పశ్చిమంవైపే దృష్టి పెట్టింది. దీంతో మౌలిక వసతులు, అభివృద్ధి అంతా వెస్ట్‌లోనే కేంద్రీకృతమైపోయింది. దీని ప్రభావం నగరం మూడు దిశల్లో పడే స్థాయికి పరిస్థితి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. కనీసం తాజా ప్రభుత్వమైనా నగరం నలువైపులా అభివృద్ధికి ప్రణాళికలు చేపట్టాలి. ప్రస్తుతం ప్రభుత్వం కేవలం దక్షిణ హైదరాబాద్ మీదనే దృష్టిసారించింది. ఇతర జోన్లలో మార్కెట్ కుంటుపడకుండా ఉండాలంటే ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు ఉండాలి. ఎలివేటెడ్ కారిడార్లు, ఔటర్లో రేడియల్ రోడ్లు, ఐటీ, ఇండ్రస్టియల్ పార్క్‌ల వంటి అభివృద్ధి పనులను చేపట్టాలి. ఇదీ చదవండి: ఇంటి అద్దెలు పెరుగుతాయ్..?రాయితీలతో కల సాకారం..ఐదేళ్లలో మార్కెట్లోకి విపరీతంగా సప్లయి వచ్చింది. దీనికి తగినట్లుగా డిమాండ్ డెవలప్ కాలేదు. సప్లయి తగినట్లు డిమాండ్ ఉండాలంటే ప్రభుత్వం నుంచి సానుకూల విధానాలు, ప్రోత్సాహం, కార్యాచరణ ఉండాలి. గృహ కొనుగోలుదారులను ప్రోత్సహించాలి. ఆదాయ పన్ను మినహాయింపులు, జీఎస్టీని 5 శాతం నుంచి 1 శాతానికి తగ్గించడంతో పాటు స్టాంప్ డ్యూటీలో 1 శాతం రాయితీ అందించాలి. దీంతో ఎక్కువ మంది గృహ కొనుగోలుదారులు ముందుకు వస్తారు. సొంతింటి కలను సాకారం చేసుకుంటారు.- నరేంద్ర కుమార్ కామరాజు, డైరెక్టర్, ప్రణీత్ గ్రూప్ -
ఇంటి అద్దెలు పెరుగుతాయ్..?
బెంగళూరులో ఇప్పటికే ఇంటి అద్దెలు సామాన్యుడికి అందనిరీతిలో ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అలాంటిది సమీప భవిష్యత్తులో అద్దెలు మరింత పెరుగుతాయని అంచనాలు వెలువడుతున్నాయి. అందుకు ఇటీవల అక్కడి స్థానిక ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలే కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇంటిలోని వ్యర్థాల తొలగింపు కోసం యూజర్ ఛార్జీలు వసూలు చేయడానికి కర్ణాటక ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దాంతో ఏప్రిల్ 1 నుంచి బెంగళూరు నివాసితుల ఆస్తి పన్నులు గణనీయంగా ప్రభావితం చెందే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే దీనిపై అధికారిక ఉత్తర్వులు ఇంకా జారీ కాలేదు.గృహ వ్యర్థాల నిర్వహణ కోసం నివాసితులకు కర్ణాటక ప్రభుత్వం యూజర్ ఛార్జీలు ఆమోదించడంతో ఏప్రిల్ 1 నుంచి బెంగళూరు ప్రాపర్టీ యజమానుల ప్రాపర్టీ ట్యాక్స్‌లు పెరుగనున్నాయి. బెంగళూరు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ (బీఎస్‌డబ్ల్యూఎంఎల్) గత ఏడాది నవంబర్‌లో ఈ ఫీజును ప్రతిపాదించింది. అయితే అధికారిక ఉత్తర్వులు ఇంకా జారీ కాలేదు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నేతృత్వంలోని పట్టణాభివృద్ధి శాఖ యూజర్ ఫీజును మంజూరు చేసింది. ఈ పద్ధతులు అశాస్త్రీయంగా ఉన్నాయని స్థానికంగా విమర్శలు ఎదురవుతున్నా, ఇంటింటికీ చెత్త సేకరణ, దాని నిర్వహణ సేవలకు నిధులు సమకూర్చే సాధనంగా ఈ ఫీజు తోడ్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఛార్జీల వల్ల ఏటా సుమారు రూ.600 కోట్ల ఆదాయం వస్తుందని బీఎస్‌డబ్ల్యూఎంఎల్ అంచనా వేస్తోంది.ఇదీ చదవండి: ట్రంప్ ప్రభుత్వానికి ఓపెన్ ఏఐ హెచ్చరికప్రభుత్వం విధించాలని తలపెట్టిన యూజర్ ఫీజును ఆస్తి పన్నులో జోడించనున్నారు. భవనం వైశాల్యాన్ని బట్టి ఇది మారుతుంది. నెలకు రూ.10 నుంచి రూ.400 వరకు ఫీజులు ఉండేలా ఆరు శ్లాబులను నిర్ణయించారు. 600 చదరపు అడుగుల వరకు ఉన్న భవనాలకు అతి తక్కువ రుసుము, 4,000 చదరపు అడుగులకు పైబడిన భవనాలకు గరిష్టంగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో బెంగళూరు వాసులకు వార్షిక ఆస్తి పన్ను గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు. పెద్ద అపార్ట్మెంట్ సముదాయాలు, వాణిజ్య సంస్థలు వంటి అధిక వ్యర్థాలు ఉత్పత్తి చేసే భవనాలు వీటి ప్రాసెసింగ్ కోసం వేస్టేజ్ ఎంప్యానెల్డ్ ఏజెన్సీ(వర్థాల నిర్వహణకు కేటాయించిన ప్రత్యేక సంస్థలు)ని ఉపయోగించకపోతే కిలో వ్యర్థానికి అదనంగా రూ.12 వసూలు చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. -
గృహ రుణాల మంజూరులో ప్రాంతీయ అసమానతలు
గృహ రుణాలు 2024 సెప్టెంబర్ నాటికి రూ.33.53 లక్షల కోట్లుగా ఉన్నట్టు నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ) ప్రకటించింది. ఏడాది కాలంలో 14 శాతం మేర పెరిగినట్టు తెలిపింది. ఇందులో మధ్యాదాయ వర్గాలు (ఎంఐజీ) తీసుకున్నవే ఎక్కువగా ఉన్నట్టు వెల్లడించింది. దేశంలో హౌసింగ్ రంగంలో ధోరణులు, పురోగతిపై ఎన్‌హెచ్‌బీ ఒక నివేదిక విడుదల చేసింది. రుణాల మంజూరులో దేశవ్యాప్తంగా ప్రాంతీయ అసమానతలు ఉన్నట్లు తెలిపింది.‘2024 సెప్టెంబర్ నాటికి వ్యవస్థ వ్యాప్తంగా బాకీ ఉన్న వ్యక్తిగత గృహ రుణాల విలువలో తక్కువ ఆదాయ విభాగానికి (ఎల్ఐజీ) సంబంధించి 39 శాతం ఉంటే, ఎంఐజీ విభాగానికి 44 శాతంగా ఉన్నాయి. మరో 17 శాతం అధిక ఆదాయ వర్గాలు (హెచ్ఐజీ) చెల్లించాల్సినవి’ అని ఎన్‌హెచ్‌బీ నివేదిక తెలిపింది. 2024 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరం మొత్తం మీద రూ.9.07 లక్షల కోట్ల వ్యక్తిగత గృహ రుణాలు మంజూరు కాగా, 2024 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆరు నెలల్లో రూ.4.10 లక్షల కోట్లు జారీ అయినట్టు పేర్కొంది. బడ్జెట్లో పీఎం ఆవాస్ యోజన 2.0పై చేసిన ప్రకటన, పట్టణీకరణ, డిజిటైజేషన్‌తో గృహ రంగానికి భవిష్యత్ సానుకూలంగా ఉంటుందని అంచనా వేసింది. హెచ్ఎఫ్సీలు కీలక పాత్రగృహ కొనుగోలుదారుల విస్తృతమైన అవసరాలను తీర్చడంలో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (హెచ్ఎఫ్సీలు) కీలక పాత్ర పోషించినట్టు ఎన్‌హెచ్‌బీ తెలిపింది. అర్హతల ప్రమాణాల్లో వెసులుబాట్లు, బలమైన కస్టమర్ సేవలు, మెరుగైన డాక్యుమెంటేషన్, తక్కువ సమయంలో ప్రాసెస్ చేయడం వంటివి హెచ్‌ఎఫ్‌సీలను మెరుగైన స్థానంలో నిలబెట్టాయని పేర్కొంది. సేవల లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాలకూ గృహ రుణాలను విస్తరించేందుకు ప్రభుత్వం, నియంత్రణ సంస్థలు కృషి చేస్తున్నాయంటూ.. బ్యాంక్‌లు–హెచ్ఎఫ్సీల కోలెండింగ్ ఈ దిశగా తీసుకున్న చర్యగా ప్రస్తావించింది.ఇదీ చదవండి: స్టార్‌లింక్‌కు స్వాగతం అంటూ కేంద్రమంత్రి ట్వీట్.. కాసేపటికే డిలీట్ప్రాంతీయ అసమానతలుహౌసింగ్ రంగం బలమైన వృద్ధిని చూపించినప్పటికీ.. రుణాల మంజూరులో ప్రాంతాల మధ్య నెలకొన్న అంతరాలు హెచ్ఎఫ్సీలకు పెద్ద సవాలుగా ఎన్‌హెచ్‌బీ పేర్కొంది. ‘దక్షిణాది, పశ్చిమాది, ఉత్తరాది రాష్ట్రాల్లోనే అధిక శాతం గృహ రుణాలు మంజూరవుతున్నాయి. అదే సమయంలో తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో రుణాల జారీ తక్కువగా ఉంటోంది’ అని నివేదిక వివరించింది. ఈశాన్య ప్రాంతంలో హెచ్ఎఫ్సీల శాఖల విస్తరణ తక్కువగా ఉంటున్నట్టు తెలిపింది. ఈ తారతమ్యాల తగ్గింపునకు చర్యలు కొనసాగుతాయని పేర్కొంది. -
హైదరాబాద్‌లో తగ్గిన ఇళ్ల విక్రయాలు.. విలువ ఎంతంటే..
న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో గతేడాది ఇళ్ల అమ్మకాల విలువ చెప్పుకోతగ్గ స్థాయిలో పడిపోయింది. 2023తో పోల్చి చూస్తే 18 శాతం తక్కువగా రూ.1.05 లక్షల కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి. 2023లో విక్రయాల విలువ రూ.1.28 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. కానీ, దేశవ్యాప్తంగా టాప్ 9 ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాల విలువ 2024లో నికరంగా 12 శాతం పెరిగి రూ.6,73,000 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. రియల్ ఎస్టేట్ డేటా అనలైటిక్స్ సంస్థ ‘ప్రాప్‌ఈక్విటీ’ ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. 2023లో రూ.6,00,143 కోట్ల విలువైన ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి. ఢిల్లీలో సానుకూల పరిస్థితులు ‘‘ఢిల్లీ–ఎన్సీఆర్ మార్కెట్లో సగటు విక్రయ ధర చదరపు అడుగుకి (ఎస్ఎఫ్టీ) రూ.12,469గా ఉంది. మౌలిక వసతుల అభివృద్ధి మెరుగ్గా ఉండడం, కార్పొరేట్ కంపెనీల ప్రాతినిధ్యం పెరుగుతుండడం, విస్తృత ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రావడంతో డిమాండ్ పెరుగుతోంది’’అని ప్రాప్ ఈక్విటీ వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ జసూజ తెలిపారు. నగరాల వారీగా అమ్మకాలు.. ⇒ గురుగ్రామ్‌లో 2023లో రూ.64,314 కోట్ల ఇళ్ల విక్రయాలు జరిగితే, 2024లో రూ.1,06,739 కోట్లకు పెరిగాయి. ⇒ ఢిల్లీ–ఎన్సీఆర్ ప్రాంతంలో గతేడాది ఇళ్ల అమ్మకాలు 63 శాతం పెరిగి రూ.1,53,000 కోట్లకు చేరాయి. 2023లో అమ్మకాల విలువ రూ.94,143 కోట్లుగానే ఉంది. ⇒ ముంబై మార్కెట్లో అమ్మకాల విలువ 13 శాతం పెరిగి రూ.1.38 లక్షల కోట్లకు చేరింది. ⇒ నవీ ముంబైలోనూ 32 శాతం వృద్ధితో ఇళ్ల అమ్మకాలు రూ.25,000 కోట్లకు చేరాయి. ⇒ థానేలో 6 శాతం అధికంగా రూ.56,000 కోట్ల అమ్మకాలు 2024లో జరిగాయి. ⇒ బెంగళూరు మార్కెట్లో రూ.85,000 కోట్ల విలువైన ఇళ్ల విక్రయాలు గతేడాది జరిగాయి. అంతకుముందు ఏడాది విక్రయాలు రూ.75వేల కోట్లతో పోల్చి చూస్తే 13 శాతం పెరిగాయి. ⇒ చెన్నై మార్కెట్లో 5 శాతం వృద్ధితో ఇళ్ల విక్రయాలు రూ.20,000 కోట్లుగా ఉన్నాయి. ⇒ కోల్‌కతాలో రూ.15,000 కోట్ల అమ్మకాలు చోటుచేసుకున్నాయి. 2023లో విక్రయాలు రూ.13,000 కోట్లతో పోల్చి చూస్తే 15 శాతం వృద్ధి నమోదైంది. ⇒పుణెలో అమ్మకాల విలువ కేవలం ఒక శాతం క్షీణించి రూ.76,000 కోట్లుగా ఉంది. 2023లో ఇక్కడ రూ.77,000 కోట్ల విక్రయాలు జరిగాయి. -
ఇల్లే బంగారమాయె..
బంగారం, గృహం, స్టాక్ మార్కెట్.. ఈ మూడింట్లో ఎందులో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నారని మహిళలను అడిగితే.. ఠక్కున చెప్పే సమాధానం బంగారమే! కానీ, నేటి మహిళల పెట్టుబడి ఆలోచనల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. మొదట సొంతిల్లు.. ఆ తర్వాతే బంగారం, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ అంటున్నారు. 69 శాతం మంది మహిళలు సొంత ఇంటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుండగా.. 31 శాతం మంది పెట్టుబడి కోసం ప్రాపర్టీలను కొనుగోలు చేస్తున్నారని అనరాక్ కన్జ్యూమర్ సెంటిమెంట్ సర్వే వెల్లడించింది. – సాక్షి, సిటీబ్యూరో మన దేశంలో గృహ కొనుగోలు ప్రక్రియలో మహిళలు ఎల్లప్పుడూ కీలక నిర్ణయాధికారులే. మహిళలు స్వతంత్ర, వ్యక్తిగత ఆస్తుల కొనుగోళ్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రాపర్టీ కొనుగోళ్లలో మెజారిటీ మహిళలు తుది వినియోగదారులే. పెట్టుబడి రీత్యా ఆస్తుల కొనుగోళ్లూ ఆశించిన స్థాయిలోనే ఉండటం గమనార్హం. పెరుగుతున్న స్వాతంత్య్రం, వ్యక్తిగత స్వేచ్ఛ, నిర్ణయాధికారం, మెరుగైన ఆదాయ వనరులు కారణంగా గృహ విభాగంలో మహిళా పెట్టుబడిదారులు ఎక్కువగా వస్తున్నారు. 2022 హెచ్2 (జులై–డిసెంబర్)లో మహిళా గృహ కొనుగోలుదారుల్లో తుది వినియోగం: పెట్టుబడి నిష్పత్తి 79:21గా ఉండగా.. 2024 హెచ్2 నాటికి 69:31గా ఉందని తెలిపింది.లాంచింగ్ ప్రాజెక్టుల్లోనే.. సర్వేలో పాల్గొన్న 69 శాతం మహిళలకు రియల్ ఎస్టేట్ అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆస్తి తరగతిగా భావిస్తున్నారు. 2022 హెచ్2లో ఇది 65 శాతంగా ఉండగా.. కోవిడ్ కంటే ముందు 2019 హెచ్2లో 57 శాతంగా ఉంది. గతంలో కొత్తగా ప్రారంభించిన ప్రాజెక్ట్‌లలో కొనుగోళ్లకు 10 శాతం మంది మహిళలు మొగ్గుచూపగా.. ఇప్పుడది 18 శాతానికి పెరిగింది. నిర్మాణం పూర్తయి, గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్లు (రెడీ టు మూవ్) కొనుగోళ్ల ప్రాధాన్యత 29 శాతం మేర తగ్గింది.లగ్జరీకే మొగ్గు.. లగ్జరీ ప్రాపర్టీలకు మహిళలూ ఆసక్తి చూపిస్తున్నారు. రూ.90 లక్షల కంటే ఎక్కువ ధర ఉండే ప్రీమియం ఇళ్ల కొనుగోళ్లకు 52 శాతం ఉమెన్స్ మొగ్గు చూపిస్తున్నారు. వీటిలో 33 శాతం మంది రూ.90 లక్షల నుంచి రూ.1.5 కోట్ల ధర ఉండే ప్రాపర్టీలను ఇష్టపడుతుండగా.. 11 శాతం మంది రూ.1.5 కోట్ల నుంచి రూ.2.5 కోట్ల ధర ఉండే గృహాలను, 8 శాతం మంది రూ.2.5 కోట్ల కంటే ఎక్కువ ధర ఉండే అల్ట్రా లగ్జరీ ప్రాపర్టీల కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తున్నారు. దేశంలో మహిళా హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ) పెరుగుదలకు ఇదే నిదర్శనం.గోల్డ్, స్టాక్ మార్కెట్.. ప్రాపర్టీ తర్వాత మగువలకు అమితాసక్తి బంగారమే. అందుకే రియల్ ఎస్టేట్ తర్వాత గోల్డ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌కే మహిళలు జై కొడుతున్నారు. 2022 హెచ్2లో బంగారంలో పెట్టుబడులకు 8 శాతం మంది మహిళలు ఆసక్తి చూపించగా.. 2024 హెచ్2 నాటికి 12 శాతానికి పెరిగింది. ఇక, ఏటేటా స్టాక్ మార్కెట్ ఆకర్షణ కోల్పోతుంది. రెండేళ్ల క్రితం మార్కెట్లో పెట్టుబడులకు 20 శాతం మంది మహిళలు ఆసక్తి చూపిస్తే.. ఇప్పుడది ఏకంగా 2 శాతానికి పడిపోయింది. -
‘స్త్రీ’రాస్తి రంగంలో.. మహిళలు అంతంతే..
సాక్షి, సిటీబ్యూరో: అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా పోటీ పడుతున్న మహిళలు.. స్థిరాస్తి రంగంలో మాత్రం కాస్త వెనకబడే ఉన్నారు. దేశీయ రియల్ ఎస్టేట్ పరిశ్రమలో మహిళా కార్మికులు పరిమితంగానే ఉన్నారు. ప్రస్తుతం రియల్టీలో 7.1 కోట్ల మంది కార్మికులు పని చేస్తుండగా.. మహిళా కార్మికుల సంఖ్య కేవలం 70 లక్షలే. మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు (ఎల్ఎఫ్పీఆర్) కేవలం 25.1 శాతంగా మాత్రమే ఉందని రియల్టీ సంస్థ మ్యాక్స్ ఎస్టేట్స్, గ్లోబల్ కన్సల్టింగ్ ఇన్ టెన్డమ్ అధ్యయనం వెల్లడించింది. మహిళా జనాభాలో 1.2 శాతమే.. వ్యవసాయం తర్వాత అత్యధిక ఉపాధి, ఉద్యోగ అవకాశాలను సృష్టించే రంగం రియల్ ఎస్టేటే. కానీ, స్థిరాస్తి రంగ శ్రామిక శక్తిలో మహిళ భాగస్వామ్యం అంతంత మాత్రంగానే ఉంది. దేశీయ స్థిరాస్తి రంగం క్రాస్ రోడ్స్‌లో ఉంది. అద్భుతమైన వృద్ధికి సిద్ధంగా ఉంది. అదే సమయంలో తారాస్థాయిలో వృద్ధి చెందకుండా నిరోధించేందుకూ సవాళ్లు ముందున్నాయి. దేశ జనాభాలో మహిళలు 48.5 శాతం మంది ఉన్నారు. ఇందులో దాదాపు 1.2 శాతం మంది మహిళలు రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్నారు.సవాళ్లు ఇవీ.. స్థిరాస్తి రంగంలోని శ్రామిక శక్తిలో అన్ని స్థాయిలలోనూ మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉండటం, అసమాన వేతనం.. ఇవే ఈ రంగంలో మహిళలు ఎదుర్కొంటున్న ప్రధానమైన సవాళ్లు. లింగ సమానతలు పరిష్కరించడం వల్ల గణనీయమైన ఆర్థిక క ప్రయోజనాలు చేకూరతాయి. ఉత్పాదకత, ఆవిష్కరణలు, లాభదాయకత పెరుగుతాయి. అలాగే ఈ రంగంలో బ్లూ, వైట్ కాలర్ మహిళా కార్మికులను శక్తివంతం చేయడానికి నైపుణ్యాభివృద్ధి, శిక్షణ కార్యక్రమాల అవసరం ఉంది. సరైన నాయకత్వం, సాంకేతికత వినియోగంతోనే దీన్ని సాధించగలమని నివేదిక సూచించింది. -
ఇంటి కొనుగోలు.. ‘ఆమె’కు నచ్చితేనే..
సాధారణంగా మహిళలు వంట గది విశాలంగా ఉండాలని కోరుకుంటారు. కానీ, నేటి అవసరాలు, అభిరుచులు మారుతుండటంతో ఆధునిక వసతులనూ కోరుకుంటున్నారు. జిమ్, మెడిటేషన్ వంటి సౌకర్యాలతో పాటు వాకింగ్, జాగింగ్ ట్రాక్స్, గ్రీనరీ స్పేస్, పిల్లల కోసం పార్క్, స్పోర్ట్స్ వంటి వసతులను ఎంచుకుంటున్నారని ఆర్క్ గ్రూప్ సీఈఓ మేఘన గుమ్మి తెలిపారు. గృహిణి, ఉద్యోగిని ఎవరైనా సరే ఇంటిని, కుటుంబ సభ్యుల బాగోగులను చూసుకునేది మహిళే. దీంతో ఇంట్లో ఏ గదికి ఎంత స్పేస్ అవసరమో నిర్ణయించగలదు. వాస్తవానికి పురుషుల కంటే మహిళలకే దృశ్యీకరణ (విజువలైజేషన్) శక్తి ఎక్కువగా ఉంటుంది. తాను ఉండబోయే కిచెన్, బెడ్ రూమ్, బాల్కనీ ఇంట్లోని ప్రతీది ఏ విధంగా ఉండబోతుందో ఊహించగలదు. –సాక్షి, సిటీబ్యూరోఐదారేళ్ల క్రితం వరకూ రియల్ ఎస్టేట్ రంగంలో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉండేది. అయితే స్థిరాస్తి రంగంలో వృత్తి నైపుణ్యం, ఆదాయ వనరులు పెరగడం, వర్క్ కల్చర్ మారడంతో క్రమంగా ఈ విభాగంలో మహిళలు ప్రవేశిస్తున్నారు. అడ్మినిస్ట్రేషన్, హెచ్ఆర్, మార్కెటింగ్, సేల్స్ విభాగంలోనే కాదు సైట్ల మీద కూడా మహిళలు పనిచేసే స్థాయికి ఎదిగారు. దీంతో రియల్టీ సెక్టార్ అసంఘటిత రంగం నుంచి సంఘటిత రంగంగా అభివృద్ధి చెందుతుంది. ఐటీ, ఫార్మా వంటి రంగాల్లో మాదిరిగా రియల్టీ సెగ్మెంట్లోనూ వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి.ఆమెకు నచ్చితేనే.. ఇల్లు కొందామని నిర్ణయించుకున్నాక.. ప్రాంతం, ధర, ప్రాజెక్ట్, వసతులు ఏవైనా సరే భర్తకు నచ్చినా సరే అంతిమంగా నిర్ణయించాల్సింది, ఓకే చేయాల్సిందీ ఇల్లాలే. ఆమెకు నచ్చకుండే ఇంటి కొనుగోలు చేయరు. సొంతింటి ఎంపికలో మహిళల పవర్ అదీ. అపార్ట్మెంట్లతో పోలిస్తే విల్లాలలో ఓపెన్ స్పేస్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉండటంతో నేటి యంగ్ ఉమెన్స్ విల్లాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మరోవైపు నిర్ణయాధికారం, కొనుగోలు శక్తి పెరగడంతోనూ ప్రాపర్టీలకు డిమాండ్ ఏర్పడింది.ఇన్ఫ్రాకు నీడ రియల్టీ.. మనల్ని అంటిపెట్టుకొని నీడ ఎలాగైతే ఫాలో అవుతుందో.. ఇన్ఫ్రాకు రియల్ ఎస్టేట్ కూడా అంతే. మౌలిక వసతులు అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలోనే రియల్ పరుగులు పెడుతుంది. భూముల ధరలు పెరగడంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో అభివృద్ధి చెందుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం సౌత్ హైదరాబాద్ వైపు ఫోకస్ పెట్టింది. కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, రాయదుర్గం వంటి పశ్చిమ ప్రాంతాలు ఇప్పటికే కిక్కిరిసిపోయాయి. ఇక్కడ సామాన్యులు కొనే పరిస్థితి లేదు. సౌత్‌లో ఇన్ఫ్రా డెవలప్మెంట్తో కొత్తూరు, షాద్‌నగర్, ఆదిభట్ల, ముచ్చర్ల వంటి దక్షిణ ప్రాంతాలు బాగా డెవలప్ అవుతాయి. ప్రస్తుతం ఆయా ప్రాంతాలలో ధరలు తక్కువగా ఉన్నాయి కాబట్టి సామాన్య, మధ్యతరగతి ఈ టైమ్‌లో కొనుగోలు చేయడం ఉత్తమం. ఏ నగరమైనా సమాంతరంగా అభివృద్ధి చెందాలి. కానీ, మౌలిక వసతుల కల్పనలో హెచ్చు తగ్గులు కారణంగా అభివృద్ధి కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. దీంతో హైదరాబాద్‌లో వెస్ట్, సౌత్ జోన్లో భూముల ధరలు బాగా పెరిగాయి. మూసీ సుందరీకరణ, మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్డు, ఫ్యూచర్ సిటీ.. హైదరాబాద్ స్థిరాస్తి రంగాన్ని నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లడం ఖాయం. ఈ బృహత్తర ప్రాజెక్ట్‌లతో రియల్ ఎస్టేట్ మార్కెట్ మళ్లీ పుంజుకోవడం ఖాయం. -
ఇంటి ఓనర్ మహిళ అయితే ఎన్ని ప్రయోజనాలో..
ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలంటారు పెద్దలు. కానీ, ఇల్లే ఇల్లాలి పేరు మీద ఉండాలంటారు నిపుణులు! రెండూ నిజమే. మొదటి దాని గురించి చర్చ అవసరం లేకపోయినా.. రెండో దాని గురించి మాత్రం అవసరమే. ఎందుకంటే ఇంటి ఓనర్ లేదా కో–ఓనర్ మహిళ అయితే ఎన్నో ప్రయోజనాలున్నాయి గనక! గృహ రుణం నుంచి మొదలు పెడితే వడ్డీ రాయితీ, ఆదాయ పన్ను మినహాయింపు, స్టాంప్ డ్యూటీ తగ్గింపు.. ఇలా ఎనెన్నో ప్రయోజనాలున్నాయి. అందుకే తెలివైన గృహ కొనుగోలుదారుడు ఇంటిని భార్య, తల్లి లేకపోతే అక్క, చెల్లి మొత్తమ్మీద మహిళ పేరు మీద కొనుగోలు చేస్తారని నిపుణులు చెబుతున్నారు. – సాక్షి, సిటీబ్యూరోస్టాంప్ డ్యూటీలో తగ్గింపు.. పలు రాష్ట్రాలు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ల సమయంలో మహిళలకు స్టాంప్ డ్యూటీ రాయితీని అందిస్తున్నాయి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మహిళలకు 1 శాతం రాయితీ ఉండేది. ప్రస్తుతం లేదు. ఢిల్లీలో ప్రాపర్టీ కొనుగోలుదారులకు మగవారికైతే ప్రాపర్టీ విలువలో 6 శాతం స్టాంప్ డ్యూటీ వసూలు చేస్తుండగా.. మహిళ ఓనరైతే 4 శాతం చెల్లించాల్సి ఉంటుంది. జమ్మూ అండ్ కశ్మీర్లో అయితే మహిళ ప్రాపర్టీ కొనుగోలుదారులకు స్టాంప్ డ్యూటీనే లేదు. ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనూ మహిళా ఓనర్లకు స్టాంప్ డ్యూటీ మినహాయింపులు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అయితే పట్టణ, గ్రామీణ ప్రాంతాల వర్గీకరణ ఆధారంగా కూడా స్టాంప్ డ్యూటీలో మినహాయింపు ఉంది.ఐటీప్రయోజనాలు..గృహ యజమాని లేదా సహ–యజమాని మహిళ అయితే ఆదాయ పన్ను మినహాయింపులు కూడా ఉన్నాయి. భార్యభర్తలు ఇద్దరూ ఉద్యోగులైతే ఇద్దరు వేర్వేరుగా అసలు, వడ్డీలపై ఐటీ తగ్గింపులను క్లయిమ్ చేసుకునే వీలుంది. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ ప్రకారం సహ దరఖాస్తుదారు ప్రిన్సిపల్ అమౌంట్‌పై ఏడాదికి రూ.1.5 లక్షల వరకు, చెల్లించిన వడ్డీపై రూ.2 లక్షల వరకు ప్రయోజనాన్ని పొందవచ్చు. అలాగే సెక్షన్ 80ఈఈ కింద ఇతర క్లెయిమ్‌లతో పాటు తొలిసారి గృహ యజమానురాలు మహిళ అయితే ప్రిన్సిపల్ అమౌంట్ మీద రూ.50 వేలు తగ్గింపు కూడా అందుతుంది. అద్దె ఆదాయంపై కూడా.. మహిళలు ఆస్తిని విక్రయించేటప్పుడు క్యాపిటల్ గెయిన్ మినహాయింపులను కూడా పొందవచ్చు. అంతేకాకుండా ప్రాపర్టీని మహిళలు అద్దెకు ఇస్తే.. ఆమె రెండు రకాల తగ్గింపులకు క్లయిమ్ చేసుకోవచ్చు. అద్దెకు ఇచ్చిన ప్రాపర్టీపై ఏదైనా లోన్‌పై చెల్లించే వడ్డీపై పన్ను తగ్గింపుతో పాటు రెంటల్ ఆదాయంపై 30 శాతం స్టాండర్డ్ డిడెక్షన్ లభిస్తుంది. అయితే పన్ను ప్రయోజనాలను క్లెయిమ్ చేయాలంటే మహిళలకు ఆదాయ వనరులు ఉండాల్సిందే. గృహ రుణ వడ్డీ రేట్ల తగ్గింపు..బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలు మహిళలను విశ్వసనీయ రుణ గ్రహీతలుగా పరిగణిస్తుంటాయి. అందుకే స్థిరాస్తి రంగంలో మహిళా పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక రుణ కార్యక్రమాలను, స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకొస్తుంటాయి. తక్కువ వడ్డీ రేట్లకు రుణాలను అందిస్తున్నాయి. ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ వంటి బ్యాంకులలో పురుష రుణ గ్రహీతలతో పోలిస్తే మహిళలకు హోమ్ లోన్ వడ్డీ రేట్లు 0.5 నుంచి 1 శాతం తక్కువగా ఉంటాయి.ఈ శాతం తక్కువగా కనిపిస్తున్నప్పటికీ దీర్ఘకాలంలో డబ్బు, ఈఐఎంను ఆదా చేస్తుంది. ప్రధాన్‌మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద లో ఇన్‌కం గ్రూప్(ఎల్ఐజీ) కేటగిరీ కింద మహిళలకు రూ.6 లక్షల రుణానికి 6.5 శాతం వడ్డీ రాయితీతో.. రూ.2.67 లక్షల వరకు సబ్సిడీని పొందవచ్చు. ఇన్‌కం సోర్స్ లేని మహిళలకు బ్యాంక్‌లు రుణాలను అందించవు.వారసులకు బదిలీ సులువు..మహిళ పేరిట ప్రాపర్టీ ఉంటే అది ఆమె ఎస్టేట్‌లో భాగమవుతుంది. ఎటువంటి చట్టపరమైన చిక్కులు లేకుండా ఆమె వారసులకు సులభంగా బదిలీ అవుతుంది. అయితే విడాకుల సమయంలో సేల్‌డీడ్ ఆధారంగా ఆస్తి కేటాయింపులు ఉంటాయి. ఏదైనా చట్టపరమైన వివాదాలు తలెత్తితే ఆస్తి మహిళ పేరు మీద ఉన్నప్పటికీ భర్త ఉమ్మడిగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. -
హైదరాబాద్‌లో రూ.1,500 కోట్ల రియల్ఎస్టేట్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో మరో భారీ రియల్ ఎస్టేట్ (Real Estate) ప్రాజెక్ట్ రాబోతోంది. రియల్ ఎస్టేట్ రంగంలో తన ముద్రను విస్తరించడానికి జువారీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యాజమాన్యంలోని అనుబంధ సంస్థ జువారి ఇన్‌ఫ్రావరల్డ్ ఇండియా లిమిటెడ్ (జువారీ ఇన్ఫ్రా) గంగోత్రి డెవలపర్స్‌తో డెవలప్మెంట్ మేనేజ్మెంట్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. హైదరాబాద్ లోని కొల్లూరు మైక్రో మార్కెట్ లో సుమారు 9.4 ఎకరాల విస్తీర్ణంలో ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్టును అభివృద్ధి చేయడమే ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం లక్ష్యం.1,730 అపార్ట్మెంట్లు"జువారి గంగోత్రి త్రిభుజ" పేరుతో చేపట్టిన ఈ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ కొల్లూరు మైక్రో మార్కెట్ లో ఒక మైలురాయిగా నిలవనుంది. ఈ ప్రాజెక్టులో 1,730 విశాలమైన మూడు, నాలుగు పడక గదుల అపార్ట్మెంట్లతో కూడిన తొమ్మిది ఎత్తైన టవర్లు ఉంటాయి. రూ.1,500 కోట్లకు పైగా అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్ సుమారు 3.8 మిలియన్ చదరపు అడుగుల అమ్మకపు విస్తీర్ణాన్ని, సుమారు 5.3 మిలియన్ చదరపు అడుగుల మొత్తం అభివృద్ధి ప్రాంతాన్ని కలిగి ఉంటుంది.ఒప్పందం పరిధిడెవలప్మెంట్ మేనేజ్మెంట్ అగ్రిమెంట్ కింద బ్రాండింగ్, మార్కెటింగ్, సేల్స్, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ (సీఆర్ఎం), నిర్మాణ పర్యవేక్షణతో సహా సమగ్ర నిర్వహణ సేవలను జువారీ ఇన్ఫ్రా అందిస్తుంది. ఈ సహకారం రియల్ ఎస్టేట్ అభివృద్ధిలో జువారీ ఇన్ఫ్రా నైపుణ్యాన్ని, గంగోత్రి డెవలపర్స్ నిర్మాణ సామర్థ్యాలను ప్రపంచ స్థాయి రెసిడెన్షియల్ ప్రాజెక్టును అందించడానికి ఉపయోగిస్తుంది.ఇది చదివారా? హైదరాబాద్‌లో డేటా సెంటర్ల జోరు.. ఆ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ హుషారుసౌకర్యాలు, ఫీచర్లుఈ ప్రాజెక్ట్ అక్కడ నివసించేవారి జీవన అనుభవాన్ని మెరుగుపరచడానికి రూపొందించిన జీవనశైలి సౌకర్యాల శ్రేణిని అందిస్తుంది. స్విమ్మింగ్ పూల్స్, ఫిట్నెస్ సెంటర్లు, క్రీడా సౌకర్యాలు, ల్యాండ్‌స్కేప్డ్ గార్డెన్లతో సహా 50కి పైగా జీవనశైలి సౌకర్యాలతో పాటు సుమారు 100,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక గ్రాండ్ క్లబ్ హౌస్ ప్రధాన ఫీచర్‌గా ఉంటుంది. ఆధునిక నగరవాసుల అవసరాలను తీర్చడం ద్వారా స్థిరమైన జీవన వాతావరణాన్ని అందించడం ఈ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ లక్ష్యం.వ్యూహాత్మక స్థానంవ్యూహాత్మకంగా ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ 2కు కేవలం రెండు నిమిషాల దూరంలో ఉన్న ఈ ప్రాజెక్టు హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి కీలక వ్యాపార కేంద్రాలకు అద్భుతమైన కనెక్టివిటీని అందిస్తుంది. ఈ స్థానం ప్రధాన ఉపాధి కేంద్రాలు, విద్యా సంస్థలు, ఆస్పత్రులు, వినోద కేంద్రాలకు అందుబాటులో ఉంటుంది. ఈ సౌలభ్యాన్నీ కోరుకునే గృహ కొనుగోలుదారులకు ఇది అనువైన ఎంపికగా మారుతుంది. -
హైదరాబాద్‌లో డేటా సెంటర్ల జోరు
దక్షిణాది నగరాల్లో డేటా సెంటర్ల జోరు కొనసాగుతోంది. గ్లోబల్ డేటా సెంటర్లకు చిరునామాగా నిలుస్తున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, వ్యూహాత్మక మౌలిక సదుపాయాల పెట్టుబడులు, డిజిటల్ సేవలకు పెరుగుతున్న డిమాండ్ డేటా సెంటర్ల వృద్ధికి ప్రధాన కారణాలు. ప్రస్తుతం చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో 47 లక్షల చ.అ.ల్లో 213 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. మరో 27 లక్షల చ.అ.ల్లో 186 మెగావాట్లు నిర్మాణ దశలో, 24 లక్షల చ.అ.ల్లో 168 మెగావాట్లు ప్రణాళిక దశలో ఉన్నాయని కొల్లియర్స్ ఇండియా నివేదిక వెల్లడించింది. - సాక్షి, సిటీబ్యూరోప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటా సెంటర్ల సామర్థ్యంలో 35 ఆక్యుపెన్సీ బ్యాకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్ఎస్ఐ) విభాగానిదే.. ఆ తర్వాత 30 శాతం ఐటీ రంగం, 20 శాతం క్లౌడ్ సర్వీస్ విభాగం, ఇతరుల వాటా 15 శాతంగా ఉంది. డేటా సెంటర్ల నెలవారీ ఛార్జీలు కిలోవాట్‌కు రూ.6,650 నుంచి 8,500లుగా ఉన్నాయి.ప్రభుత్వ విధానాలు, మెరుగైన మౌలిక వసతులు, కనెక్టివిటీ కారణంగా హైదరాబాద్‌లో డేటా సెంటర్ల జోరు కొనసాగుతోంది. అత్యంత వేగంగా నగరం డేటా సెంటర్ల హాట్‌స్పాట్‌గా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం భాగ్యనగరంలో 10 లక్షల చ.అ.ల్లో 47 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లు అందుబాటులో ఉండగా.. మరో 3 లక్షల చ.అ.ల్లో 20 మెగావాట్లు నిర్మాణంలో, 5 లక్షల చ.అ.ల్లో 38 మెగావాట్లు ప్రణాళిక దశలో ఉన్నాయి. ప్రస్తుతం నగరంలో మైక్రోసాఫ్ట్, సీటీఆర్ఎల్ఎస్ వంటి పలు సంస్థలు డేటా సెంటర్లున్నాయి. గచ్చిబౌలి, మేకగూడ, షాద్‌నగర్, చందన్‌వ్యాలీ వంటి పలు ప్రాంతాల్లో మరిన్ని డేటా సెంటర్లు రానున్నాయి.రాయితీలు, పన్ను ప్రోత్సాహకాలు.. ప్రత్యేకమైన డేటా సెంటర్ పాలసీలు పెట్టుబడిదారులకు స్పష్టమైన, నిర్మాణాత్మక కార్యచరణకు దోహదపడతాయి. దీంతో ఆయా నగరాల్లో పెట్టుబడుల ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. డేటా సెంటర్ల ఏర్పాటుకు అవసరమైన భూ సేకరణలో గణనీయమైన రాయితీలు, విద్యుత్ టారీఫ్‌లలో తగ్గుదల, గణనీయమైన పన్ను మినహాయింపులు దక్షిణ దేశంలో డేటా సెంటర్ల పెట్టుబడుల ఆకర్షణకు ప్రధాన కారణాలని చెప్పొచ్చు. విద్యుత్, టెలీకమ్యూనికేషన్స్ మౌలిక వసతుల్లో పెట్టుబడులు అధిక వేగం, విశ్వసనీయతను నిర్ధారిస్తుంది. ఇది డేటా సెంటర్ల కార్యకలాపాలకు కీలక అంశం. సరళీకృత విధానాలు, వేగవంతమైన అనుమతి ప్రక్రియలు, బ్యూరోక్రాట్స్ నియంత్రణల తగ్గింపులు వంటివి డేటా సెంటర్ల ప్రాజెక్ట్‌లను ప్రోత్సహిస్తున్నాయి.చెన్నై, బెంగళూరులో.. జలాంతర్గామి కేబుల్ కనెక్టివిటీని అందించే వ్యూహాత్మక తీర ప్రాంతం కారణంగా చెన్నై ప్రధాన డేటా సెంటర్ హబ్‌గా మారింది. ప్రస్తుతం చెన్నైలో 17 లక్షల చ.అ.ల్లో 87 మెగావాట్ల సామర్థ్యం ఉన్న డేటా సెంటర్లు ఉన్నాయి. మరో 23 లక్షల చ.అ.ల్లో 156 మెగావాట్లు నిర్మాణంలో ఉండగా.. 16 లక్షల చ.అ.ల్లో 104 మెగావాట్లు ప్రణాళికలో ఉంది. అనుకూల వాతావరణం, మెరుగైన విద్యుత్ మౌలిక సదుపాయాలు వంటివి చెన్నైని డేటా సెంటర్ల పెట్టుబడులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మార్చాయి. బెంగళూరు: సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో ప్రస్తుతం 20 లక్షల చ.అ.ల్లో 79 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లున్నాయి. మరో లక్ష చ.అ.ల్లో 10 మెగావాట్లు నిర్మాణంలో, 3 లక్షల చ.అ.ల్లో 26 మెగావాట్లు పైప్‌లైన్‌లో ఉన్నాయి. బలమైన సాంకేతిక నైపుణ్యం, నిపుణుల లభ్యత బెంగళూరు డేటా సెంటర్ల మార్కెట్‌కు చోదకశక్తిగా నిలుస్తున్నాయి.ఐఓటీతో డిమాండ్.. 5జీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ), క్లౌడ్ సర్వీస్‌లు, ఎంటర్‌ప్రైజ్‌ల డిజిటలైజేషన్ పెరుగుదల కారణంగా డేటా సెంటర్ల డిమాండ్ మరింత పెరుగుతుందని కొల్లియర్స్ ఇండియా అడ్వైజరీ సర్వీసెస్ హెడ్ స్వాప్నిల్ అనిల్ అభిప్రాయపడ్డారు. 2030 నాటికి దక్షిణాది నగరాల్లో డేటా సెంటర్ల సామర్థ్యంలో 80 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా వేశారు. -
కో-వర్కింగ్‌కు డిమాండ్..
సాక్షి, సిటీబ్యూరో: కరోనా తర్వాతి నుంచి కో-వర్కింగ్ స్పేస్‌కు డిమాండ్ పెరిగింది. స్టార్టప్స్‌తో పాటు ప్రధాన కంపెనీలు కూడా ఫ్లెక్సిబుల్ వర్క్ ప్లేస్‌ల నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నాయి. దీంతో దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో ప్రతి ఏటా కో–వర్కింగ్ స్పేస్ లావాదేవీల వాటా 20 శాతానికి పైగా ఉంటుంది.కో–వర్కింగ్ స్పేస్ డిమాండ్‌కు ప్రధాన కారణం సిటీ సెంటర్లు లేదా ప్రధాన ఉపాధి కేంద్రాలలో మాత్రమే కాకుండా నగర వ్యాప్తంగా విస్తరించి ఉండటమే.. అభివృద్ధి చెందుతున్న కొత్త ఏరియాలు, శివారు ప్రాంతాలు, గృహ సముదాయాలకు చేరువలో ఈ సెంటర్లు ఉంటున్నాయి. అలాగే ప్రధాన మెట్రో నగరాలలో షాపింగ్ మాల్స్, హోటళ్లలోనూ ఫ్లెక్సిబుల్ స్పేస్‌లు అందుబాటులోకి వచ్చాయి.దీంతో చాలా కంపెనీలు ఉద్యోగుల గృహాలకు చేరువలో ఉండే కో–వర్కింగ్ స్పేస్‌లను తీసుకొని కార్యకలాపాలు సాగిస్తున్నాయని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్ పూరీ తెలిపారు. అలాగే ఫ్లెకిబుల్ ఆఫీస్ స్పేస్ అద్దె కూడా సాధారణ ఆఫీసు స్పేస్ రెంట్స్‌కు సమానంగా ఉండటం, రెగ్యులర్ ఆఫీసు స్పేస్‌కు ఉండే 3–4 ఏళ్ల లాకిన్ పీరియడ్‌తో పోలిస్తే కో–వర్కింగ్ స్పేస్‌కు కాల పరిమితి ఉండకపోవటం వంటివి కూడా కంపెనీల ఆకర్షణకు కారణాలని ఆయన పేర్కొన్నారు. -
రూ.3 లక్షలకే రెండు గుంటలు.. తొందరపడితే..
‘హైదరాబాద్ నుంచి 140 కి.మీ. దూరంలో ఉన్న నారాయణ్‌ఖేడ్‌లో ఓ నిర్మాణ సంస్థ ఫామ్‌ల్యాండ్ వెంచర్‌ను అభివృద్ధి చేస్తున్నామని ప్రచారం చేస్తుంది. రెండు గుంటలు (242 గజాలు)కు రూ.3 లక్షలు చెల్లిస్తే.. ప్రతినెలా రూ.15 వేల అద్దె చొప్పున 20 నెలల్లో తర్వాత మొదట్లో కట్టిన రూ.3 లక్షలతో సహా మొత్తం రూ.6 లక్షలు కొనుగోలుదారుడికి చెల్లిస్తోంది. అలాగే 4 గుంటల స్థలానికి రూ.6 లక్షలు చెల్లిస్తే.. ప్రతినెలా రూ.30 వేల చొప్పున 20 నెలల తర్వాత రూ.12 లక్షలు, అలాగే 8 గుంటలకు రూ.12 లక్షలు కడితే.. నెలకు రూ.24 వేల చొప్పున 20 నెలల్లో రూ.24 లక్షలు రిటర్న్ చేస్తుంది.’ ఇలా అపార్ట్మెంట్లకు ప్రతినెలా అద్దె చెల్లించినట్లుగానే ఓపెన్ ప్లాట్లకు, ఫామ్ల్యాండ్లకు కూడా రెంట్ చెల్లిస్తామని కొత్త తరహా మోసాలకు తెరలేపారు పలువురు బిల్డర్లు. – సాక్షి, సిటీబ్యూరోఇప్పటికే గృహ నిర్మాణంలో ప్రీలాంచ్ విక్రయాల పేరిట జరిగిన దందాలో మోసపోయిన కొనుగోలుదారులు పోలీసు స్టేషన్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటే.. కొత్తగా బై బ్యాక్, రెంటల్ ఇన్‌కం, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ వంటి సరికొత్త ఆఫర్ల పేరిట అమాయకులను నట్టేట ముంచేస్తున్నారు.ఫామ్‌ప్లాట్లు, ఖాళీ స్థలాలను అక్రమ మార్గంలో విక్రయిస్తూ సామాన్యులను నిలువునా ముంచేస్తున్నారు. ఏడాదిలో అద్దెతో సహా కట్టిన సొమ్మును వాపస్ ఇస్తామని నమ్మించి మోసం చేస్తున్నారు. ఒకవేళ ఏడాది తర్వాత మార్కెట్ ఒడిదుడుకులలో ఉన్నా లేక కంపెనీ బోర్డు తిప్పేసినా నష్టపోయేది కొనుగోలుదారుడే. ఎందుకంటే ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం గజానికి రూ.5 వేలు కూడా పలకని ప్రాంతంలో రూ.10 వేలకు పైగానే ధరతో విక్రయించి.. ముందస్తుగానే బిల్డర్లు సొమ్ము వసూలు చేసేస్తున్నారు. కరోనా కాలంలో పుట్టుకొచ్చిన ఏవీ ఇన్ఫ్రాకాన్, జయగ్రూప్, ఫార్చ్యూన్ 99 వంటి పలు కొత్త నిర్మాణ సంస్థలు ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నాయి. డీటీసీపీ, హెచ్ఎండీఏ నుంచి ఎలాంటి నిర్మాణ అనుమతులు, రెరాలో నమోదు చేయకుండానే వెంచర్లను విక్రయిస్తున్నారు. సదాశివపేట, నారాయణ్‌ఖేడ్, నందివనపర్తి, చేవెళ్ల, జనగాం, బచ్చన్నపేట, చౌటుప్పల్, యాదాద్రి వంటి ప్రధాన నగరం నుంచి వందకుపైగా కి.మీ. దూరంలో ఉన్న శివారు ప్రాంతాల్లో ఈ తరహా ప్రాజెక్ట్‌లు కుప్పలుతెప్పలుగా ఉన్నాయి. రహదారులు, విద్యుత్, మురుగునీటి వ్యవస్థ వంటి కనీస మౌలిక వసతులు కూడా సరిగా లేని ప్రాంతాలలో వందలాది ఎకరాలలో ప్రాజెక్ట్‌లు చేస్తున్నామని మాయమాటలు చెబుతున్నారు.నమ్మకస్తులే మధ్యవర్తులుగా.. గ్రామాలు, శివారు ప్రాంతాలలో టీచర్లు, ఎల్ఐసీ ఏజెంట్లు, రిటైర్డ్ ఉద్యోగులను రియల్ ఎస్టేట్ ఏజెంట్లుగా నియమించుకుంటున్నారు. గ్రాఫిక్స్ హంగులను అద్ది రంగురంగుల బ్రోచర్లను ముద్రించి ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం చేస్తూ కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారు. ప్రతినెలా స్టార్ హోటళ్లలో మధ్యవర్తులతో సమావేశం నిర్వహించి, ఎక్కువ విక్రయాలు చేసిన ఏజెంట్లకు విదేశీ టూర్లు, కార్లు, బంగారం వంటివి బహుమతులుగా అందజేస్తున్నారు.ఇదీ చదవండి: లగ్జరీ రియల్ ఎస్టేట్.. మంచి లాభాలకు ఇదే రూట్! -
లగ్జరీ రియల్ ఎస్టేట్.. మంచి లాభాలకు ఇదే రూట్!
సాక్షి, సిటీబ్యూరో: అస్థిరత, వేగంగా మారుతున్న మార్కెట్ యుగంలో పెట్టుబడులకు ఆశించిన లాభాలు రావాలంటే వ్యూహాత్మక, వైవిధ్యభరిత ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. పెట్టుబడి సాధనాలలో రియల్ ఎస్టేట్ దీర్ఘకాలిక సంపద సృష్టి సాధనంగా మారింది. ఇందులోనూ లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఆకర్షణీయమైన పెట్టుబడి మార్గం.వైవిధ్యభరితమైన పెట్టుబడులతో రిస్క్ తక్కువగా ఉండటమే కాకుండా స్థిరమైన, నిరంతర లాభాలను అందుకోవచ్చు. పన్ను ప్రయోజనాలతో పాటు దీర్ఘకాల మూలధన లాభాలు అందుతాయి. సాంప్రదాయ పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలో మార్కెట్ హెచ్చుతగ్గులు పెట్టుబడిదారులను అనిశ్చితిలోకి నెట్టేసే భయాందోళనలు కలిగిస్తుంది. ఇలాంటి ప్రతికూల సమయంలో లగ్జరీ రియల్టీ పెట్టుబడులు తక్కువ అస్థిరత, స్థిరమైన, సమతుల్య పెట్టుబడి విధానంతో మార్కెట్ గందరగోళ పరిస్థితుల నుంచి బయటపడవచ్చు.మార్కెట్ సెంటిమెంట్‌పై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. అద్దె ఆదాయం, నిరంతర నగదు ప్రవాహం ఉంటుంది. నివాస, వాణిజ్య, రిటైల్ ఇలా ప్రాపర్టీ రకాలు, ప్రాంతాలను బట్టి ఆదాయ వృద్ధిలో ప్రయోజనాలను అందుకోవచ్చు. పెట్టుబడులకు భద్రతతో పాటు దీర్ఘకాలిక రాబడులు ఉంటాయి. ద్రవ్యోల్బణం కాలక్రమేణా పెట్టుబడుల విలువలను తగ్గిస్తుంది.కానీ, స్థిరాస్తి రంగంలో పెట్టుబడులపై చాలా కాలంగా ద్రవ్యోల్బణ ఒత్తిడి లేదు. వినియోగదారుల ధరలు పెరిగే కొద్దీ స్థిరాస్తి విలువ కూడా పెరుగుతుంది. స్థిరాస్తి రంగంలో పెట్టుబడులపై దీర్ఘకాలిక మూలధన లాభాలను అందుకోవచ్చు. 2021లో 200 బిలియన్ డాలర్లుగా ఉన్న భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ 2030 నాటికి ఒక ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ అంచనా వేసింది. -
హైదరాబాద్‌లో ‘గ్లోబల్’ జోష్
గ్లోబల్ కేపబులిటీ సెంటర్స్(GCC)లకు ఇండియా ప్రధాన కేంద్రంగా మారింది. అంతర్జాతీయ బహుళ జాతి సంస్థలు ఇక్కడ జీసీసీ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ముందుకొస్తున్నాయి. గతేడాది దేశంలోని 7 ప్రధాన నగరాల్లో 2.83 కోట్ల చ.అ. జీసీసీ ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరిగాయని అనరాక్ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. - సాక్షి, సిటీబ్యూరోరెండేళ్లలో ఏకంగా 5.28 కోట్ల చదరపు అడుగుల డీల్స్ పూర్తయ్యాయి. జీసీసీ లావాదేవీల్లో ఐటీ హబ్‌లైన బెంగళూరు, హైదరాబాద్‌లు పోటీపడుతున్నాయని పేర్కొంది. 1.2 కోట్ల చదరపు అడుగులతో బెంగళూరు టాప్‌లో ఉండగా హైదరాబాద్‌లో 48.6 లక్షల చదరపు అడుగుల మేర జీసీసీ ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరిగాయి.జీసీసీ అంటే? అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలకు చెందిన అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలు తమ ప్రధాన కార్యాలయాలకు పొరుగు, ప్రాసెస్ సేవలను అందించేందుకు నైపుణ్యంతో పాటు చవకగా మానవ వనరులు లభించే ఇతర దేశాల్లో ఏర్పాటు చేసుకునే ఉప కార్యాలయాలనే గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు (జీసీసీ)లుగా పేర్కొంటారు.మూడో స్థానంలో హైదరాబాద్దేశంలోని బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (BFSI) రంగానికి చెందిన జీసీసీలలో దాదాపు 35% లేదా 42 బెంగళూరులో ఉండగా 16 జీసీసీలతో హైదరాబాద్.. ఢిల్లీ ఎన్సీఆర్ (22) తర్వాత మూడవ స్థానంలో ఉంది. అయితే నైపుణ్యాలు కలిగిన 19% మంది యాక్టివ్ ఉద్యోగార్థులతో రెండవ స్థానంలో ఉందని కెరీర్‌నెట్ తెలిపింది. -
రోహిత్ శర్మ అపార్ట్మెంట్ అద్దె ఎంతంటే..?
సొంతంగా అపార్ట్మెంట్ కొనుగోలు చేసి చాలామంది అద్దెలతోనే రూ.వేలు సంపాదిస్తున్నారు. విభిన్న రంగాల్లో తాము సంపాదించిన డబ్బంతా రియల్టీలో పెట్టుబడిగా పెట్టి రెగ్యులర్ ఇన్కమ్గా మలుచుకుంటున్నారు. తమ స్థాయికి తగినట్లు దాదాపు చాలామంది ఈ వ్యాపారంలో రాణిస్తున్నారు. అలాంటివారిలో ప్రముఖ భారత క్రికెటర్ రోహిత్ శర్మ ఏమీ తీసిపోలేదు. ముంబయిలోని లోయర్ పరేల్‌లో ఉన్న తన విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను ఇటీవల నెలకు రూ.2.6 లక్షలకు లీజుకు ఇచ్చారు. జనవరి 2025లో నమోదైన ఈ రియల్టీ లావాదేవీకి సంబంధించిన వివరాలను స్క్వేర్ యార్డ్స్ విడుదల చేసింది.ప్రైమ్ లొకేషన్, ప్రీమియం సౌకర్యాలుమాక్రోటెక్ డెవలపర్స్ లిమిటెడ్ (లోధా గ్రూప్) అభివృద్ధి చేసిన హై-ఎండ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ‘లోధా మార్క్విస్-ది పార్క్’లో ఈ అపార్ట్మెంట్ ఉంది. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ), నారిమన్ పాయింట్ వంటి ప్రధాన వ్యాపార ప్రాంతాలకు సమీపంలో ఉండడంతో భారీగా డిమాండ్ ఏర్పడింది. రోహిత్ శర్మకు చెందిన ఈ ప్రాపర్టీలో 1,298 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా, రెండు కార్ పార్కింగ్ స్థలాలు ఉన్నాయి. రోహిత్, అతని తండ్రి గురునాథ్ శర్మ 2013 మార్చిలో రూ.5.46 కోట్లకు ఈ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. స్క్వేర్ యార్డ్స్ వివరాల ప్రకారం ప్రస్తుత అద్దె ఆదాయం నెలకు రూ.2.6 లక్షలుగా ఉంది. ఇది 6 శాతం అద్దె రాబడిని ప్రతిబింబిస్తుంది.లోధా మార్క్విస్-ది పార్క్‌లో శర్మ కుటుంబానికి ఉన్న ఆస్తి ఇది ఒక్కటి మాత్రమే కాదు. మరో అపార్ట్‌మెంట్‌ను కూడా కొనుగోలు చేశారు. దీన్ని 2024 అక్టోబర్‌లో నెలకు రూ.2.65 లక్షలకు అద్దెకు ఇచ్చారు. ఇది ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్లో వ్యూహాత్మక పెట్టుబడులను హైలైట్ చేస్తుంది.ఇదీ చదవండి: రోజూ రెండు కోట్ల మంది భక్తులు.. అంతరాయంలేని కనెక్టివిటీ!ముంబయి స్థిరాస్తి మార్కెట్ ఎదుగుదలకు కారణాలు..ముంబయి భౌగోళిక పరిమితులు రియల్టీ రంగాన్ని భారీగా పెంచుతున్నాయి. ఒక వైపు అరేబియా సముద్రం ఉండడం, మరోవైపు విస్తరణకు పరిమిత భూమి ఉండడం ప్రాపర్టీ ధరల పెరుగుదలకు కారణమవుతుంది. ప్రధాన ఆర్థిక కేంద్రంగా, మెరుగైన ఉద్యోగ అవకాశాలు, జీవన ప్రమాణాలను కోరుకునే ప్రజలను ముంబయి ఆకర్షిస్తుంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) వంటి అనేక బహుళజాతి సంస్థలు, ఆర్థిక సంస్థలకు పుట్టినిల్లు ముంబయి. వృత్తి నిపుణులు, విద్యార్థులు, ప్రవాసుల రాక కారణంగా అద్దె ఆస్తులకు డిమాండ్ ఎక్కువగా ఉంది. దక్షిణ ముంబయి, బాంద్రా, అంధేరి, పొవాయ్ వంటి ప్రాంతాల్లో అద్దె భారీగా ఉంటుంది. -
భారత్‌లో ఖరీదైన నివాసాలు వీరివే!.. జాబితాలో ఫస్ట్ ఎవరంటే?
ప్రపంచంలో చాలామంది ధనవంతులు ఉన్నారు, వీరిలో దాదాపు అందరూ.. విలాసవంతమైన జీవితాలను గడుపుతూ, ఖరీదైన బంగ్లాలు, వాహనాలు కలిగి ఉన్నారు. అయితే అత్యంత విలాసవంతమైన లేదా ఖరీదైన నివాసాలను కలిగి ఉన్న.. కుబేరులు ఎవరు? వారికి సంబంధించిన రియల్ ఎస్టేట్స్ వంటివి ఈ కథనంలో తెలుసుకుందాం..ముఖేష్ అంబానీభారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నివాసాన్ని కలిగి ఉన్నారు. ముంబైలో ఉన్న 27 అంతస్తుల నివాసం (ఆంటిలియా) విలువ దాదాపు రూ. 15,000 కోట్లు. ఇది కాకుండా దుబాయ్‌లోని పామ్ జుమేరాలో బంగ్లా, యూకేలోని బకింగ్‌హామ్‌షైర్ ఎస్టేట్, మాన్‌హట్టన్‌లో లగ్జరీ హోటల్ (న్యూయార్క్) వంటివి ఉన్నాయి.పంకజ్ ఓస్వాల్2023లో స్విట్జర్లాండ్‌లోని జింగిన్స్లో.. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన భవనాలలో ఒకటైన 'వరి విల్లా' (Vari Villa)ను కొనుగోలు చేశారు. 40,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ నిర్మాణ కళాఖండాన్ని ఒబెరాయ్ ఉదయవిలాస్, ది లీలా హోటల్స్ వంటి వాటికి ప్రసిద్ధి చెందిన జెఫ్రీ విల్కేస్ రూపొందించారు. దీని ధర రూ. 1,650 కోట్లు.లక్ష్మీ మిట్టల్ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకరైన.. లక్ష్మీ మిట్టల్ లండన్‌లో 'బిలియనీర్స్ రో'లో రెండు విలాసవంతమైన భవనాలను కలిగి ఉన్నారు. వీటి విలువ రూ. 2,000 కోట్ల కంటే ఎక్కువ ఉంటుందని సమాచారం. ఇది మాత్రమే కాకుండా.. ఢిల్లీలో కూడా రూ. 31 కోట్ల ఖరీదైన బంగ్లా కలిగి ఉన్నారు. రియల్ ఎస్టేట్ కాకుండా.. క్వీన్స్ పార్క్ రేంజర్స్ అనే ఫుట్‌బాల్ క్లబ్‌కు యజమానిగా ఉన్నారు.అదార్ పూనవాలాసీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ 'అదార్ పూనవల్లా' 2023 చివరిలో లండన్‌లోని హైడ్ పార్క్ సమీపంలోని అబెర్కాన్వే హౌస్‌ను సుమారు రూ. 1,444 కోట్లకు కొనుగోలు చేశారు. ఇది 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇది ఒకప్పుడు డొమినికా కుల్జిక్ యాజమాన్యంలో ఉండేది.హిందూజా బ్రదర్స్హిందూజా సోదరులు ప్రకాష్, అశోక్, శ్రీచంద్, గోపీచంద్.. కార్ల్టన్ హౌస్ టెర్రస్ అనే విలాసవంతమైన ఆరు అంతస్తుల విలాసవంతమైన ప్యాలెస్ కలిగి ఉన్నారు. ఇది లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్ దగ్గర ఉంది. దీనిని 2006లో కొనుగోలు చేశారు. ఇది యూకేలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన భవనాలలో ఒకటిగా ఉంది.ఇదీ చదవండి: రోజుకు రూ.27 కోట్లు విరాళం ఇచ్చిన వ్యక్తి.. ఈయన గురించి తెలుసా?రవి రుయాఎస్సార్ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు 'రవి రుయా' 2023లో లండన్‌లోని హనోవర్ లాడ్జ్‌ను సుమారు రూ. 1,200 కోట్లకు కొనుగోలు చేశారు. ఇది కూడా అత్యంత ఖరీదైన విలాసవంతమైన భవనాలలో ఒకటిగా ఉంది. -
హైదరాబాద్‌లో పెరిగిన ఇళ్ల ధరలు.. ఎంతంటే..
హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల ధరలు గత అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో 2 శాతం పెరిగినట్టు క్రెడాయ్–కొలియర్స్–లైసస్ ఫొరాస్ సంయుక్త నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా టాప్–8 నగరాల్లో ఇళ్ల ధరలు సగటున 10 శాతం పెరగ్గా.. అత్యధికంగా ఢిల్లీ ఎన్సీఆర్లో 31 శాతం ఎగసినట్టు తెలిపింది. ఈ మేరకు ఒక నివేదిక విడుదల చేసింది. బలమైన డిమాండ్‌కుతోడు అధిక నిర్మాణ వ్యయాలు ధరలు పెరగడానికి దారితీసినట్టు పేర్కొంది. వరుసగా 16వ త్రైమాసికంలోనూ ఇళ్ల ధరలు పెరిగినట్టు ఈ నివేదిక వెల్లడించింది. విశాలమైన ఇళ్లు, మెరుగైన జీవనశైలికి ప్రాధాన్యం వంటివి హౌసింగ్ డిమాండ్‌ను పెంచినట్టు క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ బొమన్ ఇరానీ తెలిపారు. నిర్మాణ వ్యయాలు, భూమి కొనుగోలు ధరలు పెరగడం ధరలకు ఆజ్యం పోసినట్టు చెప్పారు. రేట్ల తగ్గింపుతో విక్రయాలకు ఊతంటాప్–8 నగరాల్లో ఈ ఏడాది కూడా ఇళ్ల ధరలు పెరుగుతాయని కొలియర్స్ ఇండియా సీఈవో బాదల్ యాగ్నిక్ అంచనా వేశారు. ‘రానున్న రోజుల్లో బెంచ్‌మార్క్ రుణ రేట్లు మరింత తగ్గే అవకాశాలున్నాయి. దీంతో చాలా పట్టణాల్లో ఇళ్ల విక్రయాలు పుంజుకోవచ్చు. దీంతో ఇళ్ల ధరలు గతంలో మాదిరే 2025లోనూ పెరిగే అవకాశం ఉంది’ అని యాగ్నిక్ వివరించారు. అందుబాటు ధరల ఇళ్లు, మధ్యస్థ ధరల విభాగంలో ఇళ్ల సరఫరా, విక్రయాలు రానున్న రోజుల్లో పెరగొచ్చని లైసస్ ఫొరాస్ ఎండీ పంకజ్ కపూర్ అంచనా వేశారు. డిసెంబర్ త్రైమాసికంలో ఇళ్ల విక్రయాలు స్వల్పంగా తగ్గాయని, కొత్త ఇళ్ల ఆవిష్కరణ మోస్తరుగా ఉండడాన్ని కారణంగా పేర్కొన్నారు.ఇదీ చదవండి: జీసీసీలు @ రూ.8.72 లక్షల కోట్లుపట్టణాల వారీగా ధరల పెరుగుదలహైదరాబాద్లో 2024 అక్టోబర్–డిసెంబర్ క్వార్టర్లో ఇళ్ల ధరలు అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 2 శాతం పెరిగాయి. చదరపు అడుగు (ఎస్ఎఫ్టీ) ధర రూ.11,351కి చేరింది. ఢిల్లీ ఎన్సీఆర్లో ఎస్ఎఫ్టీ ధర 31 శాతం ఎగసి రూ.11,993కు చేరింది. బెంగళూరులో 23 శాతం పెరిగి ఎస్ఎఫ్టీ ధర రూ.12,238గా ఉంది. అహ్మదాబాద్‌లో ధరలు 15 శాతం పెరగడంతో చదరపు అడుగు రూ.7,725కు చేరింది. చెన్నైలో 6 శాతం వృద్ధితో ఎస్ఎఫ్టీ ధర రూ.8,141గా ఉంది.ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో ధరలు 3 శాతం పెరగడంతో ఎస్ఎఫ్టీ రూ.20,725కు చేరింది. పుణెలో ఇళ్ల ధరలు 9 శాతం పెరిగాయి. ఎస్ఎఫ్టీ రూ.9,982గా నమోదైంది. కోల్‌కతాలో అతి తక్కువగా ఒక శాతం ధర పెరగడంతో ఎస్ఎఫ్టీ రూ.7,971కి చేరింది. -
ఇళ్లు కట్టి.. ఈవీ చార్జింగ్ ఎక్కడ?
ప్రజల్లో పర్యావరణ స్పృహ పెరిగిపోయింది.. మంచిదే..! శబ్ద, వాయు కాలుష్యంతో మానవాళికి ఉపద్రవంగా మారుతున్న పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలు(ఈవీ) వినియోగించాలని వినియోగదారులు భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం కూడా ఈవీ వాహనాల కొనుగోళ్లు, వినియోగంపై ప్రత్యేక రాయితీలు అందిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఈవీ పాలసీని సైతం తీసుకొచ్చింది. అయితే వాహనాల కొనుగోళ్లకు రాయితీలు ఇస్తేనే సరిపోదు.. ఆయా వాహనాల చార్జింగ్ పాయింట్లు, స్టేషన్ల ఏర్పాటుపై కూడా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. – సాక్షి, సిటీబ్యూరోఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ డెవలపర్లకు వ్యాపారంతో పాటు సామాజిక బాధ్యత కూడా కాస్త ఎక్కువే. ప్రభుత్వం ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కోసం పెద్ద ఎత్తున మౌలిక వసతులు కల్పిస్తున్న తరుణంలో.. బిల్డర్లు కూడా తమవంతు బాధ్యతగా భవన సముదాయాల్లోనే ఈవీ స్టేషన్ల ఏర్పాటుకు ముందుకు వస్తున్నారు. ఇక్కడే స్పష్టత లోపించింది. భవన సముదాయాల్లో ఎక్కడ ఈవీ స్టేషన్లు, పాయింట్లను ఏర్పాటు చేయాలనే దానిపై స్పష్టత కొరవడింది. బేస్మెంట్, సెల్లార్లోనా లేదా బయట ఓపెన్ స్పేస్‌లో ఈవీ స్టేషన్ ఏర్పాటు చేయాలా? అనే అంశంపై ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయలేదు. దీంతో ఈవీ పాలసీ అమలులో ఉన్నా.. స్పష్టత లేకపోవడంతో స్టేషన్ల ఏర్పాటుకు బిల్డర్లు వెనుకంజ వేస్తున్నారు.బిల్డర్‌ను బాధ్యుడిని చేస్తే ఎలా? ప్రస్తుతం గృహ కొనుగోలుదారులు వారి అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా నివాస సముదాయాల్లో వసతులను కోరుకుంటున్నారు. పర్యావరణ స్పృహ పెరిగిన నేపథ్యంలో కస్టమర్లు వారు ఉండే చోటే ఈవీ చార్జింగ్ స్టేషన్ ఉండాలని అడుగుతున్నారు. అయితే ప్రభుత్వం నుంచి స్పష్టమైన నిబంధనలు లేకపోవడంతో బిల్డర్లు పునరాలోచనలో పడుతున్నారు. ఒకవేళ సెల్లార్లో ఈవీ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో ఏమైనా ప్రమాదాలు సంభవిస్తే దానికి బిల్డర్‌ను బాధ్యులు చేస్తే ఎలా? అని సంశయంలో పడిపోతున్నారు.ఈవీపై స్పష్టత అవసరమే.. సాధారణంగా బిల్డర్ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసిన తర్వాత నివాస సముదాయాన్ని అసోసియేషన్‌కు అప్పచెబుతాడు. వారు ఈవీ చార్జింగ్ స్టేషన్‌ను సరిగా నిర్వహణ చేయపోయినా, ఇతరత్రా కారణాల వల్ల ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఎలా? అని పలువురు డెవలపర్లు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో నివాస సముదాయాల్లో ఈవీ స్టేషన్ల ఏర్పాటుపై స్పష్టమైన నిబంధనలు జారీ చేయాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు. ఉదాహరణకు గతంలో ప్రాజెక్ట్‌కు అగ్ని ప్రమాద శాఖ నిరభ్యంతర ధృవీకరణ పత్రం(ఎన్ఓసీ) వచ్చిందంటే ఇక ఆ ప్రాజెక్ట్ వంక అధికారులు చూసేవారు కాదు. కానీ, ఇప్పుడు ప్రతీ మూడేళ్లకు ఒకసారి రెన్యూవల్ చేసుకోవాలని కొత్త నిబంధనలను జోడించారు. ఇదే ఆహ్వానించదగ్గ పరిణామం. ఎందుకంటే ప్రాజెక్ట్‌ను అసోసియేషన్‌కు అప్పజెప్పిన తర్వాత నిర్వహణ సరిగా లేకపోవడంతో ప్రమాదం జరిగినప్పుడు ఫైర్ సేఫ్టీ ఉపకరణలు పనిచేయవు. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజా నిబంధనలతో నిర్వహణ సక్రమంగా ఉండటంతో పాటు క్రమంతప్పకుండా మాక్ డ్రిల్స్ చేస్తుంటారు. దీంతో ప్రమాదాలను నియంత్రించే అవకాశం ఉంటుంది. -
వేసవి వచ్చేస్తోంది.. ఇంటి సీలింగ్ ఎలా ఉండాలంటే..
వేసవి కాలం వచ్చేస్తోంది.. బయటే కాదు ఇంట్లో ఉన్నా ఎండ వేడి తగులుతుంది. అసలు ఇంటి పైకప్పు ఉందా లేదా అన్నట్టుగా ఉంటుంది ఇంట్లో వేడి. సాధారణ సీలింగ్ ఉన్న ఇంట్లో అయితే ఈ వేడిమి తీవ్రత మరింత ఎక్కువే. దీనికి పరిష్కారం చూపించి.. మండు వేసవిలో ఇంటిని చల్లగా మార్చేస్తుంది ‘ఫాల్స్ సీలింగ్’! ఫాల్స్ సీలింగ్ ప్రధాన ఉద్దేశం.. గదిలో ఆహ్లాద వాతావరణం ఏర్పర్చడమే. అలసిన మనసు, శరీరానికి సాంత్వన చేకూర్చడమే. ఫాల్స్ సీలింగ్‌తో ఇంట్లోని వాతావరణాన్ని అందంగా, ఆహ్లాదంగా మార్చుకోవటమే కాకుండా సాధారణ ఇంటి పైకప్పును డైమండ్, చతురస్రం, గోళాకారం వంటి విభిన్న ఆకృతుల్లో అందంగా కూడా తీర్చిదిద్దుకోవచ్చు.– సాక్షి, సిటీబ్యూరో» ఫాల్స్ సీలింగ్ రంగుల ఎంపికలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వారేమంటారంటే.. » గోడ రంగుతో పోల్చుకుంటే సీలింగ్‌కు వేసే వర్ణం తేలికగా ఉండాలి. అప్పుడు పైకప్పు తక్కువ ఎత్తులో ఉందనిపిస్తూ, విశాలంగా ఉన్న భావనను కలిగిస్తుంది. ముదురు షేడ్లను ఎంచుకుంటే పైకప్పు ఎత్తులో ఉందన్న అభిప్రాయాన్ని కలిగిస్తుంది. » మిగతా గదులతో పోల్చుకుంటే పడక గది సీలింగ్‌నే ఎక్కువసేపు చూస్తాం కాబట్టి వర్ణాల్లో సాదాసీదావి కాకుండా నేటి పోకడలకు అద్దంపట్టేవి ఎంచుకోవాలి. మధ్యస్తం, డార్క్, బ్రౌన్ వర్ణాలు పడకగదికి చక్కగా నప్పుతాయి. ఎందుకంటే ఈ వర్ణాలు ఉత్సాహపరిచే విధంగా, స్వభావానికి అనుకూలంగా ఉంటాయి మరి. » తాజాదనం ఉట్టిపడుతున్న లుక్ రావాలంటే మోనోక్రోమాటిక్ థీమ్‌ను ఎంచుకోవాలి. రెండు, మూడు వర్ణాలు కలిసినవి ఎంచుకుంటే మాత్రం అది పడకగది గోడలకు వేసిన రంగు కంటే తేలికగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మీ సీలింగ్ ప్రశాంత భావనను కలగజేస్తుంది. » గోడల రంగుకు, సీలింగ్‌కు ఒకే రకమైనవి కాకుండా.. వేర్వేరు వర్ణాల్ని కూడా వేసుకోవచ్చు. దగ్గర దగ్గర రంగులు కాకుండా, చూడగానే తేడా ఇట్టే కన్పించే వర్ణాలను ఎంపిక చేసుకోవటం మేలు. దృశ్య వ్యక్తీకరణ ప్రదేశంగా సీలింగ్‌ను వినియోగించుకోండి. ఆహ్లాదభరితమైన ఆకాశం, లేదంటే గదితో కలిసిపోయేలా ఆకట్టుకునే ఆకారాలు, వర్ణాలతో నాటకీయత కన్పించేలా అలంకరించుకోవచ్చు. జాగ్రత్తలివే.. » ఫాల్స్ సీలింగ్ ఎంపికలో ధర కంటే నాణ్యతకే ప్రాధాన్యమివ్వాలి. » ఫ్లోర్ నుంచి పైకప్పు మధ్య కనీసం 12 అడుగుల ఎత్తు అయినా ఉండాలి. » ఏమరుపాటుగా ఉంటే ఫాల్స్ సీలింగ్‌తో పాటు ఎయిర్ కండిషన్ మెషిన్ కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది. » ఉడెన్ ఫాల్స్ సీలింగ్‌లో అయితే ఎలుకలతో పాటు చెదలు, పురుగులు చేరే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. » దుమ్ము, ధూళి చేరకుండా అప్పుడప్పుడు శుభ్రం చేయాలి. -
సొంతిల్లు, వ్యాపారం దీర్ఘకాల లక్ష్యాలు
ముంబై: సొంతిల్లు సమకూర్చుకోవడం, వ్యాపారం ప్రారంభించడం, ఆర్థిక స్వేచ్ఛ.. మిలీనియల్స్ (1980–1996 మధ్య జన్మించినవారు) టాప్–3 దీర్ఘకాలిక ప్రాధాన్యతలుగా ఉన్నాయి. ‘ఫైబ్–మిలీనియల్ అప్‌గ్రేడ్ ఇండెక్స్’ నిర్వహించిన అధ్యయనంలో ఈ ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. మెట్రోలు, నాన్ మెట్రో పట్టణాల్లో 8,000 మంది వ్యక్తుల అభిప్రాయాలను ఈ అధ్యయనంలో భాగంగా తెలుసుకున్నారు. ముఖ్యమైన అంశాలు.. → 30 ఏళ్లలోపు వయసు వారిలో 41 శాతం మంది సొంతంగా ఇల్లు సమకూర్చుకోవడం తమ తొలి లక్ష్యంగా చెప్పారు. → ఒంటరి పురుషులతో పోల్చితే, ఒంటరి మహిళల్లో సొంతంగా ఇల్లు కొనుగోలు చేయడం ఎక్కువ ప్రాధాన్య లక్ష్యంగా ఉంది. → వ్యాపారం ప్రారంభించడం, దాన్ని వృద్ది చేయడం 21 మంది లక్ష్యంగా ఉంది. → దీర్ఘకాలంలో ఆర్థిక స్వేచ్ఛ సాధించడమే తమ లక్ష్యమని 19 శాతం మంది చెప్పారు. → ఇక స్వల్పకాల లక్ష్యాలను గమనించినట్టయితే.. వృత్తిలో ఎదుగుదల, కొత్త గ్యాడ్జెట్, వాహనం కొనుగోలు, ఆరోగ్యం విషయంలో దృఢంగా ఉండాలని (కంటి సర్జరీలు, దంత చికిత్సలు తదితర) మిలీనియల్స్ కోరుకుంటున్నారు. → పోటీ పెరగడంతో మంచి ఉద్యోగం సంపాదించే విషయంలో మెట్రోల్లోని మిలీనియల్స్ ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. ఇలా భావిస్తున్నవారు 60 శాతంగా ఉన్నారు. → తాము పొదుపు చేస్తామని, ఆర్థిక అంశాలకు వ్యూహాత్మకంగా ప్రణాళిక వేసుకుంటామని 39 శాతం మంది చెప్పారు. → 21 శాతం మంది ఇతర ఆదాయ వనరుల కోసం అన్వేషిస్తామని చెబితే, దీర్ఘకాల లక్ష్యాల కోసం రుణ సాయం తీసుకుంటామని 29 శాతం మంది తెలిపారు. → 15 శాతం మందిలో దీర్ఘకాల ఆర్థిక ప్రణాళిక లేనే లేదు. → స్వల్పకాల ఆకాంక్షలను తీర్చుకునేందుకు ఫైనాన్షియల్ ఇనిస్ట్యూషన్స్ నుంచి రుణాలు తీసుకుంటామని చాలా మంది చెప్పారు. → ఈ విషయంలో యువతరానికి మార్గదర్శనం అవసరమని ఈసర్వే నివేదిక అభిప్రాయపడింది. బాధ్యతాయుతమైన రుణాల దిశగా వారిని చైతన్యవంతం చేయాలని, తద్వారా తమ రుణ పరపతిని కాపాడుకుంటూనే కలలను సాకారం చేసుకోగలరని పేర్కొంది. -
రియల్టీలో ఆసక్తి.. లగ్జరీ ప్రాపర్టీల కొనుగోళ్లకు మొగ్గు
దేశీయ స్థిరాస్తి రంగంలో పెట్టుబడులకు హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ), అల్ట్రా హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (యూహెచ్‌ఎన్‌ఐ)లు ఆసక్తిగా ఉన్నారు. ఫలితంగా లగ్జరీ, అల్ట్రా ప్రీమియం ప్రాపర్టీలకు డిమాండ్ పెరిగింది. 65 శాతం మంది హెచ్ఎన్ఐ, యూహెచ్‌ఎన్‌ఐలు రూ.4–10 కోట్లు ధర ఉన్న లగ్జరీ ప్రాపర్టీ కొనుగోలుకు మొగ్గు చూపుతుండగా.. 13 శాతం మంది రూ.25 కోట్లకు పైన ధర ఉన్న స్థిరాస్తులపై ఆసక్తిగా ఉన్నారని ఇండియా సోత్‌బైస్ ఇంటర్నేషనల్ రియల్టీ(ఐఎస్‌ఐఆర్) వార్షిక సర్వే వెల్లడించింది. - సాక్షి, సిటీబ్యూరో కరోనాతో స్థిరాస్తి రంగానికి జరిగిన ప్రధాన మేలు.. సొంతింటి అవసరం తెలిసి రావడమే.. మరీ ముఖ్యంగా గృహ విభాగంలో యువతరం భాగస్వామ్యం పెరగడం. 74 శాతం సంపన్న కొనుగోలుదారులు ద్రవ్యోల్బణాన్ని నిరోధించేందుకు రియల్ ఎస్టేట్ ఒక ప్రధాన ఆస్తిగా పరిగణిస్తారు.61 శాతం మంది హెచ్ఎన్ఐ, యూహెచ్‌ఎన్‌ఐలు 2024–25లో లగ్జరీ ప్రాపర్టీలను కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. 34 శాతం మంది హైరైజ్ అపార్ట్మెంట్లు కొనుగోలుకు ఆసక్తిగా ఉండగా.. 30 శాతం మంది ఫామ్‌హౌస్‌లు, హాలిడే హోమ్స్‌లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే 23 శాతం మంది వాణిజ్య సముదాయాలలో పెట్టుబడులకు, 15 శాతం మంది స్థలాలపై ఆసక్తిగా ఉన్నారు.గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 34 శాతం మంది హెచ్ఎన్ఐ, యూహెచ్‌ఎన్‌ఐలు విలాసవంతమైన ప్రాపర్టీలను కొనుగోలు చేశారు. ఇప్పటికీ చాలామంది కొనుగోలుదారులు లగ్జరీ గృహాల కోసం శోధిస్తున్నారు. వచ్చే రెండు మూడేళ్లు దేశీయ రియల్టీ రంగం సరికొత్త రికార్డులను చేరుకుంటుందని విశ్వసిస్తున్నారు. 16 నెలలుగా లగ్జరీ గృహాల ధరలు పెరిగాయి. 2015 గరిష్ట ధరలతో పోలిస్తే స్వల్ప పెరుగుదలేనని తెలిపారు. విశాలవంతమైన గృహాలు, గ్రీనరీ ఎక్కువగా ఉండే ప్రాపర్టీలకే లగ్జరీ కొనుగోలుదారులు మొగ్గు చూపిస్తున్నారు. సంపన్న భారతీయుల ప్రాపర్టీ ఎంపికలో తొలి ప్రాధాన్యత మెరుగైన ఫిజికల్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదుపాయాలకే..ఈ నగరాలే హాట్‌స్పాట్స్.. సంపన్న కొనుగోలుదారులు ప్రాపర్టీ కొనుగోళ్లకు ప్రధాన కారణం మెరుగైన జీవన శైలి. మూలధన వృద్ధి, భవిష్యత్తు తరాలకు ఆస్తి వంటివి ఆ తర్వాతి అంశాలు. ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, గోవా, బెంగళూరు నగరాలలో గృహాల కొనుగోళ్లకు హెచ్ఎన్ఐ, యూహెచ్‌ఎన్‌ఐలు ఆసక్తిగా ఉన్నారు. 11 శాతం మంది సంపన్నులు విదేశాలలో ప్రాపర్టీలకు మొగ్గు చూపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా భయాలు తగ్గుముఖం పట్టడంతో విలాసవంతమైన భారతీయులు న్యూయార్క్, మయామి, లండన్, దుబాయ్, లిస్బన్ దేశాలలో లగ్జరీ అపార్ట్మెంట్ల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. -
హైదరాబాద్‌లో ఇంటి అద్దెలు పైపైకి!
తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం అధిక సంఖ్యలో హైదరాబాద్ నగరానికి వలస వస్తుండటంతో ఇక్కడ ఇంటి అద్దెలు (house rent) పెరుగుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం హైదరాబాద్‌లో ఇంటి అద్దెలు భారీగా పెరిగాయి. - సాక్షి, సిటీబ్యూరోహైదరాబాద్లోని దాదాపు అన్ని కార్యాలయాలు వర్క్ ఫ్రమ్ హోమ్ (Work from home) విధానాన్ని ఎత్తివేయడంతో అంతా నగరానికి చేరుకున్నారు. దీంతో ప్రధానంగా మెరుగైన ప్రయాణ సాధనాలు, పని కేంద్రాలకు చేరువలో ఉన్న అద్దె ఇళ్లకు డిమాండ్ ఉందని మ్యాజిక్‌బ్రిక్స్.కామ్ తెలిపింది.ప్రాపర్టీల విలువ పెరగడంతో గృహ యజమానులు అద్దెల కంటే లాభదాయకమైన ఆస్తుల విక్రయాల కోసం అన్వేషిస్తున్నారు. దీంతో సప్లై తగ్గడంతో అద్దె గృహాలకు డిమాండ్‌తో పాటు అద్దెలు కూడా పెరిగాయి.ఇదీ చదివారా? హైదరాబాద్ రియల్ ఎస్టేట్.. రిజిస్ట్రేషన్లు రయ్.. రయ్..ఈ ఏడాది హైదరాబాద్‌లో అద్దె గృహాలకు డిమాండ్ 22 శాతం మేర పెరిగింది. సరఫరా 2.1 శాతం క్షీణించగా.. సగటు రెంట్లు 4.5 శాతం మేర పెరిగాయి. అద్దెల మార్కెట్లో డిమాండ్, సప్లై వాటా 50, 39 శాతంగా ఉన్నాయి.గచ్చిబౌలి, కొండాపూర్‌లో అత్యధికంగా అద్దెలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. కార్యాలయాలు, ఉపాధి కేంద్రాలకు సమీపంలో ఉండటం, ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్)తో మెరుగైన కనెక్టివిటీ కారణం. 55 శాతం మంది అద్దెదారులు రూ.10 వేలు నుంచి రూ.20 వేలు నెలవారీ అద్దెలకు కోసం వెతుకుతున్నారు. 1000 చదరపు అడుగుల నుంచి 1,500 చ.అ. విస్తీర్ణంలో ఉన్న గృహాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. -
ప్రకటన కంపెనీల ఆగడాలకు ‘మాడా’ చెక్
దాదర్: ముంబైవ్యాప్తంగా ఖాళీస్థలాల్లో హోర్డింగులు నిర్మించి వాటిని అద్దెకివ్వాలని మహారాష్ట్ర హౌసింగ్ ఏరియా డెవలఫ్‌మెంట్ అథారిటీ (మాడా) నిర్ణయించింది. త్వరలోనే ఈ నిర్ణయానికి ఆమోదముద్ర వేయనుంది. ముంబైసహా ఉప నగరాలలో అనేక చోట్ల మాడాకు సొంత స్ధలాలున్నాయి. వీటిలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న స్ధలాల్లో హోర్డింగులు నిర్మించి వాటిని ప్రకటనల కంపెనీలకు అద్దెకు ఇవ్వనుంది. ఇప్పటికే బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) తమ సొంత స్ధలాల్లో హోర్డింగులు ఏర్పాటు చేసుకునేందుకు ప్రకటనల కంపెనీలకు అనుమతినిచ్చింది. వీటి ద్వారా ఏటా కొన్ని కోట్ల రూపాయలు అదనంగా అర్జిస్తోంది. ఇదే తరహాలో మాడా హోర్డింగులు నిర్మించి అద్దెకు ఇవ్వాలని భావిస్తోంది. హోర్డింగులపై ప్రత్యేక సర్వే... గతేడాది వర్షా కాలంలో ఘాట్కోపర్లోని చడ్డా నగర్లో 80/80 అడుగుల భారీ హోర్డింగ్ పక్కనే ఉన్న పెట్రోల్ బంకుపై కూలింది. ఈ ఘటనలో సుమారు 14 మంది చనిపోగా 60పైగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో అప్రమత్తమైన మాడా తమ సొంత స్ధలాల్లో ఏర్పాటుచేసిన హోర్డింగులపై సర్వే చేపట్టి వాటి స్ధితి గతులను పరిశీలించింది. ఈ సర్వేలో మొత్తం 62 భారీ హోర్డింగులకు గానూ 50 హోర్డింగులకు మాత్రమే నో అబ్జక్షన్ సరి్టఫికెట్ ఉందని తేలింది. అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన మిగిలిన 12 హోర్డింగులను నేలమట్టం చేసింది.నిబంధనల ప్రకారం కంపెనీలు హోర్డింగులు ఏర్పాటు చేసే ముందు బీఎంసీ నుంచి కచి్చతంగా అనుమతి పొందాల్సి ఉంటుంది. ఆ తరువాత స్ధలం యజమానిగా మాడా నుంచి ఎన్ఓసీ తీసుకోవల్సి ఉంటుంది. కానీ హోర్డింగుల ఏర్పాటుపై ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. భారీ హోర్డింగుల ఏర్పాటుకు పటిష్టమైన పునాది, బేస్మెంట్, ఇనుప చానెళ్లు తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే అవి గాలివేగాన్ని తట్టుకుని నిలబడగలుగుతాయి. అయితే కాంట్రాక్టు దక్కించుకున్న కంపెనీలు ఖర్చుల తగ్గింపుకోసం నామమాత్రంగా పునాదులు తవ్వి హోర్డింగులు నిర్మించి ప్రకటనల కంపెనీలకు లీజుకు ఇస్తున్నారు. ఇలాంటి హోర్డింగులు వర్షాకాలంలో వేగంగా వీచే గాలుల తాకిడికి తట్టుకోలేక నేల కూలుతున్నాయి. ఫలితంగా భారీ ఎత్తున ప్రాణ, ఆస్తి నçష్టం చోటుచేసుకుంటోంది. ఘాట్కోపర్లో గతేడాది జరిగిన హోర్డింగ్ ప్రమాదానికి ఇదే ప్రధాన కారణమని తేలింది. అనుమతి 40/40 అడుగులకు తీసుకుని రెట్టింపు సైజ్( 80/80)హోర్డింగును ఏర్పాటుచేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తమ సొంత స్ధలాల్లో స్వయంగా పటిష్టమైన పునాదులతో, బేస్‌మెంట్‌తో హోర్డింగుల ఇనుప చానెళ్లు నిర్మించి అద్దెకివ్వాలని మాడా భావించింది. ఇదీ చదవండి: కంటెంట్ క్వీన్స్ మ్యాజిక్ : ‘యూట్యూబ్ విలేజ్’ వైరల్ స్టోరీ -
కో-వర్కింగ్ సెంటర్ల జోరు.. హైదరాబాద్‌లో 26,000 సీట్లు
కో-వర్కింగ్ సెంటర్ ఆపరేటర్లు ఎనిమిది ప్రధాన నగరాల్లో గత ఏడాది రికార్డు స్థాయిలో 2.24 లక్షల సీట్లను అద్దెకు తీసుకున్నారు. 2023తో పోలిస్తే 43.6 శాతం వృద్ధి నమోదైంది. కార్పొరేట్ సంస్థల నుండి మేనేజ్డ్ ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ పెరగడం ఇందుకు కారణమని రియల్టీ కన్సల్టెంట్ కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదిక వెల్లడించింది.ఈ నివేదిక ప్రకారం.. 2023లో బెంగళూరు, ఢిల్లీ–ఎన్సీఆర్, పుణే, కోల్‌కత, ముంబై, హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్‌లలో మొత్తం 1.56 లక్షల డెస్క్‌లను కో–వర్కింగ్ లేదా ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ ఆపరేటర్లు కార్పొరేట్ సంస్థలకు అందించాయి. గత ఏడాది ఆపరేటర్లు బెంగళూరులో 64,000, పుణే 38,000, ఢిల్లీ ఎన్సీఆర్ 38,000, ముంబై 28,000, హైదరాబాద్ 26,000, చెన్నైలో 25,000 సీట్లను అద్దెకు ఇచ్చాయి. కోల్‌కత, అహ్మదాబాద్ కేవలం చెరో 1,900 సీట్లకే పరిమితం అయ్యాయి. బలమైన వృద్ధి నమోదు.. ఆఫీస్ స్పేస్ ఆపరేటర్లు తమ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవడానికి రియల్ ఎస్టేట్ డెవలపర్లు, ప్రాపర్టీ యజమానుల నుండి అద్దెకు ఆఫీసు స్థలాన్ని తీసుకుని.. మౌలిక సదుపాయాలతో కార్పొరేట్స్, నిపుణులు, వ్యక్తులకు వర్క్‌స్పేస్‌ను అందిస్తాయి. ‘సంప్రదాయ కార్యాలయాల ఏర్పాటుతోపాటు మేనేజ్డ్ వర్క్‌స్పేస్‌ను అంతర్జాతీయ సంస్థలు లీజుకు తీసుకుంటున్నాయి.దీంతో ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్‌కు డిమాండ్ ప్రస్తుత సంవత్సరంతోపాటు రాబోయే కాలంలో బలమైన వృద్ధి నమోదు చేయనుంది. దీంతో మేనేజ్డ్ స్పేస్ ఆపరేటర్ల ద్వారా ప్రధాన నగరాల్లోని గ్రేడ్ ఏ/ఏ+ ఆస్తులను మరింతగా పెంచుతుంది’ అని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ ఫ్లెక్స్ విభాగం హెడ్ రమిత అరోరా తెలిపారు. -
హైదరాబాద్ రియల్ ఎస్టేట్.. రిజిస్ట్రేషన్లు రయ్.. రయ్..
హైదరాబాద్‌లో ఖరీదైన ఇళ్ల అమ్మకాలు నిరంతరం పెరుగుతున్నాయి. మొత్తం ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ల సంఖ్య స్థిరంగా ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్ అయిన ఇళ్ల మొత్తం విలువ గత సంవత్సరంతో పోలిస్తే 5 శాతం పెరిగింది. అయితే అధిక సరఫరా కారణంగా అపార్ట్మెంట్ అమ్మకాల్లో మాత్రం మార్కెట్ ఫ్లాట్ వృద్ధిని నమోదు చేసింది. మొత్తం 5,444 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఈ మేరకు రియల్ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఓ నివేదిక విడుదల చేసింది.హైదరాబాద్ నివాస మార్కెట్ ప్రధానంగా హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి అనే నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉంది. ప్రాథమిక, ద్వితీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ల నుండి కూడా లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. "రిజిస్ట్రేషన్లలో రూ. 50 లక్షల లోపు ప్రాపర్టీలు ఆధిపత్యం చెలాయించాయి. కానీ ప్రీమియమైజేషన్ వైపు బలమైన మార్పు కనిపించింది. 2025 జనవరిలో రూ. 1 కోటి లేదా అంతకంటే ఎక్కువ ధర ఉన్న ఇళ్ల ధర 12% పెరిగింది. ఇది అధిక విలువ కలిగిన ప్రాపర్టీలకు పెరుగుతున్న ప్రాధాన్యతను ప్రతిబింబిస్తుంది" అని నైట్ ఫ్రాంక్ పేర్కొంది.హైదరాబాద్‌లో రిజిస్ట్రేషన్ అయిన ప్రాపర్టీలలో ఎక్కువ భాగం 1,000 నుండి 2,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్నవే. రిజిస్ట్రేషన్లన్నింటిలో వీటి వాటా 69%. 2024 జనవరిలో రిజిస్ట్రేషన్ అయిన 13%తో పోలిస్తే 2000 చదరపు అడుగుల కంటే ఎక్కువ పరిమాణంలో ఉన్న యూనిట్లు మొత్తం రిజిస్ట్రేషన్లలో 14% వాటా కలిగి ఉన్నాయని నైట్ ఫ్రాంక్ వివరించింది.మేడ్చల్-మల్కాజ్గిరి టాప్నైట్ ఫ్రాంక్ ప్రకారం.. జిల్లా స్థాయిలో చూస్తే 45% ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లతో మేడ్చల్-మల్కాజ్గిరి అగ్ర స్థానంలో ఉండగా 41% రిజిస్ట్రేషన్లతో రంగారెడ్డి జిల్లా ఆ తర్వాత స్థానంలో ఉంది. హైదరాబాద్ జిల్లా మొత్తం రిజిస్ట్రేషన్లలో మిగిలిన 14% వాటాను అందించింది. అమ్ముడుపోయిన నివాస ఆస్తుల సగటు ధర 2025 జనవరిలో 3% పెరుగుదలను చూసింది. జిల్లాలలో మేడ్చల్-మల్కాజ్గిరి అత్యధికంగా 11% పెరుగుదలను చూసిందని రిజిస్ట్రేషన్ డేటా చెబుతోంది.గృహ కొనుగోలుదారులు పెద్ద పరిమాణంలో, ఉన్నతమైన సౌకర్యాలను అందించే ఖరీదైన ఆస్తులను కూడా కొనుగోలు చేశారు. 2025 జనవరిలో జరిగిన మొదటి ఐదు డీల్స్‌లో 3,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ, రూ. 5.5 కోట్ల కంటే పైబడి విలువైన ఆస్తులు ఉన్నాయి. ఈ లావాదేవీలలో మూడు పశ్చిమ హైదరాబాద్‌లో రిజిస్ట్రేషన్ కాగా, రెండు రిజిస్ట్రేషన్లు సెంట్రల్ హైదరాబాద్‌లో జరిగాయి. -
హైదరాబాద్‌లో టూరిస్ట్ ఇళ్లు.. సకల వసతులు
సాక్షి, సిటీబ్యూరో: వేసవి సెలవుల్లో సేద తీరడానికి పలు కుటుంబాలు పర్యాటక ప్రదేశాలకు వెళ్తుంటాయి. కానీ, అక్కడి వసతి ఎలా? హోటళ్లలో ఉండాలంటే.. కాస్త ఖర్చు ఎక్కువే. నచ్చిన వంట వండుకోలేం. సరైన ఆతిథ్యాన్ని స్వీకరించలేం. వాళ్లు పెట్టినవాటిలో నుంచి ఎంపిక చేసుకొని తినాలి. దీనికి పరిష్కారం చూపించేవే పర్యాటక విడిదులు. స్టార్ హోటళ్లను తలదన్నేలా ఆధునిక వసతులు అందించడమే ఈ టూరిస్ట్ ఇళ్ల ప్రత్యేకత.ఇళ్లు.. హోం స్టేలుగా! భాగ్యనగరం అంటేనే చక్కని ఆతిథ్యానికి చిరునామా. అందుకే విదేశీ పర్యాటకులు ఇక్కడి ఆత్మీయత, ఆతిథ్యానికి ముగ్ధులవుతుంటారు. ఈ ఆనందాన్ని ద్విగుణీకృతం చేసేందుకు పర్యాటక శాఖ హోం స్టే పథకం ప్రవేశపెట్టింది. ఇదే తరహాలో పలు ప్రైవేట్ సంస్థలూ సేవలందిస్తున్నాయి. నగరంలోని గృహ యజమానులు తమ ఇళ్లను అద్దెకు ఇచ్చే బదులుగా ఇలా హోంస్టే సంస్థలతో ఒప్పందం చేసుకుంటున్నారు. ఆకట్టుకునేలా గృహాలను తీర్చిదిద్ది, అన్ని సౌకర్యాలు కల్పించి, పర్యాటకులకు తాత్కాలికంగా కిరాయికి ఇస్తున్నారు.అన్ని రకాల వసతులు.. ఎయిర్ బీఎన్బీ, వీఆర్బో, బుకింగ్.కామ్, మేక్ మై ట్రిప్, ట్రావెల్ స్టేషన్, హోమ్ టుగో వంటి సంస్థలు హోం స్టే సేవలను అందిస్తున్నాయి. దేశంలోని అన్ని ప్రధాన నగరాలతోపాటు పర్యాటక ప్రాంతాలు, బీచ్‌లు, తీర్థయాత్రలు అన్నిచోట్లా టూరిస్ట్ ఇళ్లు అందుబాటులో ఉన్నాయి. కిచెన్, స్విమ్మింగ్ పూల్, జిమ్ వంటి అన్ని రకాల వసతులు ఈ హోం స్టేలలో ఉంటాయి. సౌకర్యాలను బట్టి అద్దె ఒక రాత్రికి రూ.5 వేల నుంచి ఉంటాయి.ఆయా పర్యాటక ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న హోం స్టేల వివరాలను సంస్థలు తమ వెబ్సైట్లలో పొందుపరుస్తున్నాయి. వారికి అనువైన వసతిని వెతుక్కోవచ్చు. ఇందులోనే ధరలను కూడా నిర్ణయిస్తారు. వండి వడ్డించే భోజనం వివరాలు కూడా ఉంటాయి. విమానాశ్రయం నుంచి నేరుగా బస చేసే ఇంటికి వచ్చి ఆతిథ్యాన్ని అందుకోవచ్చు. -
ట్రంప్ నిర్ణయాల ఎఫెక్ట్.. అమెరికాలో అమ్మకానికి భారీగా ఇళ్లు!
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత.. డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇతర దేశాలను మాత్రమే కాకుండా, ఆ దేశ ప్రజలను కూడా భయపెడుతున్నాయి. దీంతో వాషింగ్టన్ డీసీలో రియల్ ఎస్టేట్ మార్కెట్ పతనం జరగనున్నట్లు భావించి.. వేల ఇళ్లను అమ్మకానికి ఉంచారు. దీనికి సంబంధించిన సోషల్ మీడియా పోస్టులు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.వాషింగ్టన్ డీసీలో గత 14 రోజుల్లోనే 4,271 కంటే ఎక్కువ ఇళ్ళు అమ్మకానికి ఉంచినట్లు.. ఒక ఎక్స్ యూజర్ పేర్కొంటూ.. ''ఎలుకలు పారిపోతున్నాయి” అని అన్నారు. నగరవాసులు తమ వస్తువులను సర్దుకుని.. సామూహికంగా నగరం విడిచి వెళ్తున్నారని అన్నారు.4,271 houses put up for sale in just the last 14 days in Washington, D.C. The rats are running away. 🇺🇸 pic.twitter.com/Ra5Gq21RBJ— Joseph 💎✌️🪑🇺🇸 Tesla Long Term Investor (@ShrimpTeslaLong) February 15, 2025వలసలకు కారణం.. ఇలాన్ మస్క్ నేతృత్వంలోని 'డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ' (DOGE) అని చెబుతున్నారు. నగరంలో, ఆ చుట్టుపక్కల అమ్మకానికి ఉన్న 14,825 ఇళ్లను చూపించే ఫోటోలను కూడా షేర్ చేశారు. నగరంలో 500 కంటే ఎక్కువ ఇల్లు రూ. 8 కోట్ల కంటే ఎక్కువ ధరకు అమ్మకానికి ఉన్నాయని.. అమెరికన్లను సురక్షితంగా ఉంచే విధానాలపై పనిచేసే థింక్ ట్యాంక్ అయిన సెంటర్ ఫర్ సెక్యూరిటీ పాలసీలో పనిచేస్తున్న సీనియర్ విశ్లేషకుడు పేర్కొన్నారు.ఇదీ చదవండి: యూపీఐ లిమిట్ పెంచుకోండిలా..ఆన్లైన్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌ప్లేస్ అయిన 'జిల్లో'లో అమ్మకానికి ఉన్న ఇళ్ల జాబితాలను మరో ఎక్స్ యూజర్ షేర్ చేసాడు. ఏడు రోజులలో 201, 14 రోజులలో 378, 30 రోజులలో 706, 90 రోజులలో 1,198 కొత్త ఇళ్లు అమ్మకానికి ఉన్నట్లు పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా షేర్ చేసాడు.Zillow Washington DC new home listings:•7 days: 201 new homes•14 days: 378 new homes•30 days: 706 new homes•90 days: 1,198 new homesIs this volume typical for the season? pic.twitter.com/KbGh3VOWhS— Architectoid (@Architectoids) February 15, 2025 -
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కొత్త రికార్డు..
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం కొత్త రికార్డులను సృష్టిస్తోంది. కోకాపేట, మోకిల పరిధిలో రికార్డుస్థాయిలో భూములు అమ్ముడుపోగా.. తాజాగా లగ్జరీ గృహాల ధరల వృద్ధిలో మరో మైలురాయిని చేరుకుంది. దేశంలోని ప్రధాన మెట్రో నగరాలతో పోలిస్తే భాగ్యనగరంలో విలాసవంతమైన ఇళ్ల ధరలు 42 శాతం మేర పెరిగాయి. రూ.కోటిన్నర కంటే ఎక్కువ ధర ఉండే ఈ ప్రీమియం యూనిట్ల రేట్లు గత ఐదేళ్లలో హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పెరిగాయని అనరాక్ గ్రూప్ తాజా అధ్యయనంలో వెల్లడైంది. నివేదికలోని పలు కీలకాంశాలివే..హైదరాబాద్‌లో 2018లో విలాసవంతమైన ఇళ్ల ధరలు చదరపు అడుగుకు రూ.7,450గా ఉండగా.. 2024 నాటికి ఏకంగా రూ.10,580కి పెరిగాయి. ఇదే సమయంలో బెంగళూరు, ముంబై నగరాల్లో లగ్జరీ ఇళ్ల ధరలు 27 శాతం మేర పెరిగాయి. కోవిడ్ అనంతరం లగ్జరీ గృహాల సరఫరా, డిమాండ్ పెరగడమే ఈ వృద్ధికి కారణమని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్ పూరి తెలిపారు. 2018లో బెంగళూరులో ప్రీమియం ఇళ్ల ధరలు చ.అ.కు రూ.10,210గా ఉండగా.. ఇప్పుడది రూ.12,970కి పెరిగింది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో రూ.23,119 నుంచి రూ.29,260కి చేరింది.దేశంలోని సగటు..2018 నుంచి 2024 నాటికి దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో సరసమైన గృహాల విలువలు సగటున 15 శాతం మేర పెరిగితే.. విలాసవంతమైన గృహాల విలువ 24 శాతం వృద్ధి నమోదైంది. రూ.కోటిన్నర కంటే ఎక్కువ ధర కలిగిన ఇళ్ల ధరలు చ.అ.కు సగటున 2018లో 12,400గా ఉండగా.. 2024 నాటికి 15,350కి పెరిగాయి.అందుబాటు గృహాల్లో 15 శాతం.. ఏడు ప్రధాన నగరాల్లో రూ.40 లక్షలలోపు ధర ఉండే సరసమైన గృహాల విలువలు 15 శాతం మేర పెరిగాయి. 2018లో సగటు ధర చ.అ.కు రూ.3,750గా ఉండగా.. ఇప్పుడది రూ.4,310కి పెరిగింది. అఫర్డబుల్ కేటగిరీలో ఎన్సీఆర్లో అత్యధికంగా 19 శాతం మేర ధరలు పెరిగాయి. ఈ విభాగపు ధరల వృద్ధిలో హైదరాబాద్‌ది రెండో స్థానం. ఐదేళ్లలో మన నగరంలో 16 శాతం మేర ధరలు పెరిగాయి. అందుబాటు గృహాల ప్రారంభ ధర చ.అ.కు రూ.4 వేలుగా ఉంది. ఐదేళ్ల కాలంలో టాప్–7 నగరాల్లో రూ.80 లక్షల నుంచి రూ.కోటిన్నర మధ్య ధర ఉండే మధ్య తరగతి విభాగంలోని ఇళ్ల విలువల్లో 18 శాతం మేర వృద్ధి చెందాయి. 2018లో సగటు ధర చ.అ.కు రూ. 6,050లుగా ఉండగా.. ఇప్పుడది రూ.7,120కి పెరిగింది. ఈ విభాగంలోనూ అత్యధికంగా 23 శాతం ధరల వృద్ధి హైదరాబాద్‌లోనే నమోదైంది. మన నగరంలో మిడ్‌సైజ్ గృహాల ప్రారంభ ధర చ.అ.కు రూ.5,780గా ఉంది. -
ఇల్లు ఎప్పుడు కొనాలి?
మార్కెట్ పడిపోతున్నప్పుడు కొనడం, పెరుగుతున్నప్పుడు అమ్మటమే లాభసాటి స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ చేసే పని! ఇదే సూత్రం రియల్ ఎస్టేట్‌కూ వర్తిస్తుంది. ప్రతికూల సమయంలో కొనుగోలు చేస్తే రేటు కలిసి వస్తుంది. మార్కెట్ బాగున్నప్పుడు విక్రయిస్తే రాబడి రెండింతలవుతుంది. హోమ్ బయ్యర్ నుంచి ఇన్వెస్టర్‌గా ఎదగాలంటే చేయాల్సిందిదే. స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు మాదిరిగానే స్థిరాస్తి రంగానికి కూడా కండీషన్స్ అప్లయి అనేది ఉంటుంది. ప్రాంతం ఎంపిక మొదలు డెవలపర్ ట్రాక్ రికార్డ్, ఆర్థిక పరిస్థితి, ప్రాంతం అభివృద్ధి అవకాశాలు, ప్రాజెక్ట్‌లోని వసతులు వరకు అన్నింటినీ పరిగణనలోకి తీసుకొని కొనుగోలు చేయాలి. అప్పుడే పెట్టుబడికి తగిన ప్రతిఫలాలను అందుకోవడం సాధ్యం. –సాక్షి, సిటీబ్యూరోఅభివృద్ధిని ముందుగానే అంచనా వేయాలి.. ప్రాంతం అభివృద్ధిని ముందుగా అంచనా వేయగలిగితే దాని ప్రతిఫలాలను వంద శాతం ఆస్వాదించవచ్చు. మెరుగైన మౌలిక వసతులు, భద్రత, కనెక్టివిటీ, నిత్యావసరాలు, అందుబాటు ధర వంటి వాటిని సమీక్షించుకొని ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవాలి. ఆయా అంశాల్లో బాచుపల్లి, దుండిగల్, మల్లంపేట, బౌరంపేట ప్రాంతాలు హాట్ డెస్టినేషన్. ఎందుకంటే.. 200 అడుగుల రోడ్లు, ఫ్లై ఓవర్, స్కైవే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పైగా ఓఆర్ఆర్ దుండిగల్ ఎగ్జిట్ మాత్రమే కాకుండా మల్లంపేట వద్ద మరో ఎగ్జిట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వీటితో ఇతర జిల్లా కేంద్రాలు, పలు ప్రాంతాలతో కనెక్టివిటీ పెరిగింది. కనెక్టివిటీ ఇబ్బందుల కారణంగా గతంలో ఆఫీసుకు దగ్గరలో ఉండే ప్రాజెక్ట్‌లలో కొనుగోలు చేసేందుకే కస్టమర్లు మొగ్గు చూపేవాళ్లు. కానీ, ఇప్పుడు మెట్రో రైలు, ఫ్లైఓవర్లు, స్కైవేలు, ఓఆర్ఆర్, లింక్ రోడ్లు వంటి వాటితో కనెక్టివిటీ మెరుగైంది. దీంతో ప్రధాన నగరంలోని బడ్జెట్‌తోనే 5–6 కి.మీ. దూరమైనా సరే పెద్ద సైజు అపార్ట్మెంట్ లేదా విల్లా కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.భూమి ధర మేరకే నిర్ణయం... శివారు ప్రాంతాల్లో భూముల క్రయవిక్రయాలు నిలిచిపోయాయంటే దానర్థం రేట్లు పడిపోయాయని కాదు. గత 3–4 ఏళ్లుగా స్థలాల ధరలు విపరీతంగా పెరిగిపోయి ప్రస్తుతం స్థిరంగా నిలిచిపోయాయి. భూమి ధరను బట్టే ఓపెన్ ప్లాట్, అపార్ట్మెంట్, విల్లా వంటి ప్రాజెక్ట్ చేయాలని బిల్డర్లు నిర్ణయించుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త డెవలపర్ ల్యాండ్ కొని, ప్రాజెక్ట్ చేసే పరిస్థితి లేదు. ఒకవేళ ఉన్నా గతంలో స్థల సమీకరణ చేసిన డెవలపర్లు నిర్మించే ప్రాజెక్ట్‌లతో పోలిస్తే ధరలు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు బాచుపల్లిలో రెండేళ్ల క్రితం ఎకరం రూ.12–13 కోట్లకు కొనుగోలు చేసిన ప్రణీత్ గ్రూప్ అపార్ట్‌మెంట్‌ను నిర్మిస్తోంది. చదరపు అడుగుకు రూ.5,500 చొప్పున విక్రయిస్తోంది. ఇప్పుడిదే ప్రాంతంలో ఎకరం రూ.20 కోట్లు–25 కోట్లుగా ఉంది. ఇలాంటి చోట కొత్త బిల్డర్ నిర్మించే ప్రాజెక్ట్‌లో ధర చదరపు అడుగుకు రూ.7 వేలు ఉంటే తప్ప గిట్టుబాటుకాని పరిస్థితి. దీంతో ధర తక్కువగా ఉన్న చోట కొనుగోలు చేయడమే కస్టమర్లకు లాభం. పైగా తుది దశకు చేరుకున్న పాత ప్రాజెక్ట్‌ల్లో కొనుగోలు చేస్తే గృహ ప్రవేశం చేసేయొచ్చు.రేపటి అవసరాన్ని గుర్తించి కొనాలి.. ప్రతికూల సమయంలో గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న వాటిల్లో కొనడమే ఉత్తమమని చాలామంది సలహా ఇస్తుంటారు. కానీ, ఒడిదుడుకుల మార్కెట్లో అమ్మకాలు లేకుండా నిర్మాణాన్ని పూర్తి చేసే సామర్థ్యం ఉందా అని ఆలోచించాలి. అందుకే ప్రతికూలంలోనూ బిల్డర్ ట్రాక్ రికార్డ్, ఆర్థిక సామర్థ్యం, గతంలో డెలివరీ చేసిన ప్రాజెక్ట్‌లు వంటి అంశాలను చూసి రెండేళ్లలో పూర్తయ్యే ప్రాజెక్ట్‌లో కొనుగోలు చేసినా నష్టం ఏమీ ఉండదు. పైగా రెడీ టు ఆక్యుపైతో పోలిస్తే వీటిల్లో ధర తక్కువగా ఉంటుంది. విస్తీర్ణం, ఇతరత్రా అంశాలపై బిల్డర్‌తో బేరసారాలు చేసే అవకాశం కూడా ఉంటుంది. భవిష్యత్తు అవసరాన్ని గుర్తించి వినియోగదారులు గృహాలను కొనుగోలు చేయాలి. చాలామంది ప్రస్తుతం సంపాదించే ఆదాయానికి పరిమితమై నిర్ణయం తీసుకుంటారు. కానీ, రేపటి రోజున ఆదాయ సామర్థ్యం పెరగొచ్చు. పెద్ద ఇళ్లు అవసరం ఏర్పడొచ్చు. అందుకే ఈ రోజు 2 బీహెచ్‌కే కొనేచోట 2–3 ఏళ్లలో డెలివరీ చేసే ప్రాజెక్ట్‌లో 2.5 బీహెచ్‌కే కొనుగోలు చేయడం ఉత్తమం. పైగా నిర్మాణంలో ఉంటుంది కాబట్టి 2 బీహెచ్‌కే ధరకే వస్తుంది. -
క్విప్ కింగ్ రియల్ ఎస్టేట్..
క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్మెంట్ (క్విప్) మార్గంలో ఇన్వెస్టర్లకు ఈక్విటీ షేర్లను విక్రయించడం ద్వారా రియల్ ఎస్టేట్ డెవలపర్లు గతేడాది రూ. 22,320 కోట్లు సమీకరించాయి. 2024లో అన్ని రంగాలు కలిసి 99 క్విప్ ఇష్యూల ద్వారా మొత్తం రూ. 1,41,482 కోట్లు సమకూర్చుకున్నాయి. ఇందులో రియల్ ఎస్టేట్ రంగం అగ్రస్థానంలో నిల్చింది. 8 డెవలపర్లు, 1 రీట్ (రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్) కలిసి రూ. 22,320 కోట్లు సమీకరించాయి.క్విప్ ద్వారా వచ్చిన మొత్తం నిధుల్లో ఇది 16 శాతం. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. మార్కెట్లలో హెచ్చుతగ్గులు నెలకొన్నప్పటికీ క్యాపిటల్ మార్కెట్లు పటిష్టంగానే ఉన్నాయని, కంపెనీలు భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని అనరాక్ చైర్మన్ అనుజ్ పురి చెప్పారు.రియల్ ఎస్టేట్ రంగం వృద్ధి అవకాశాలపై సంస్థాగత ఇన్వెస్టర్లు అత్యంత బుల్లిష్‌గా ఉన్నట్లు వివరించారు. వివిధ రంగాలు 2020లో ఆల్‌టైం గరిష్ట స్థాయిలో క్విప్ మార్గంలో రూ. 80,816 కోట్లు సమీకరించాయి. 2024 గణాంకాలు దాని కన్నా 75 శాతం అధికం కావడం గమనార్హం. 2025లో క్విప్ ఫండింగ్ మిశ్రమంగా ఉండొచ్చని పురి తెలిపారు.నివేదిక ప్రకారం .. గోద్రెజ్ ప్రాపర్టీస్ రూ. 6,000 కోట్లు, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ రూ. 5,000 కోట్లు, బ్రూక్‌ఫీల్డ్ ఇండియా రీట్ రూ. 3,500 కోట్లు, మ్యాక్రోటెక్ డెవలపర్స్ రూ. 3,300 కోట్లు, బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ రూ. 1,500 కోట్లు సమీకరించాయి. -
ప్రతాప సింగారంలో హెచ్ఎండీఏ భారీ వెంచర్
హైదరాబాద్‌కు తూర్పున ఉన్న ప్రతాప సింగారం (pratap singaram) ‘రియల్’శోభ సంతరించుకోనుంది. దీనికిగాను హెచ్ఎండీఏ (HMDA) నడుంబిగించింది. ఈ మేరకు ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ కూడా ముగిసింది. భారీ వెంచర్‌కు ఫైనల్ లేఅవుట్ (lay out) సిద్ధం చేసింది. నగరం నలుదిక్కులా శివారు ప్రాంతాలు శరవేగంతో అభివృద్ధి చెందాలన్న ప్రభుత్వ సంకల్పంలో భాగంగా ఇది కార్యరూపం దాల్చబోతోంది. ఉప్పల్ భగాయత్ (uppal bhagayath) తరహాలో వెంచర్ రూపుదిద్దుకోనుంది. దాదాపు 150 మంది రైతుల నుంచి ఇప్పటికే 133 ఎకరాల పట్టాభూమితోపాటు మరో 18 ఎకరాల అసైన్డ్ భూమిని అధికారులు ల్యాండ్ పూలింగ్‌లో భాగంగా సేకరించారు. అసైన్డ్ భూమిని రైతులు ఇచ్చినప్పటికీ కలెక్టర్ ఆమోదముద్ర పడాల్సి ఉంది.వెంచర్ అభివృద్ధికి రూ.120 కోట్లు వెంచర్‌ను అన్ని రకాల మౌలిక వసతులతో అభివృద్ధి చేసేందుకు హెచ్ఎండీఏకు ప్రభుత్వం రూ.120 కోట్లను ఈ ఏడాది జనవరి 7న విడుదల చేసింది. 60:40 నిష్పత్తిలో ప్లాట్ల విస్తీర్ణాన్ని విభజించి ఎకరాకు 1,741 చదరపు గజాల అభివృద్ధి చేసిన ప్లాట్లను రైతు వాటాగా కేటాయిస్తారు. హెచ్ఎండీఏకు మొత్తం 30 ఎకరాల వాటా వస్తుంది. దీని విలువ సుమారు రూ. 270 కోట్లు ఉంటుందని అంచనా. ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తున్నందున ప్రతాపసింగారానికి రూ. 10 కోట్లను ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించి తమ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. అందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అసైన్డ్ ల్యాండ్ ఇచ్చిన రైతులకు చట్ట ప్రకారం అభివృద్ధి చేసిన లేఅవుట్లో ఎకరాకు 600 చదరపు గజాలు కేటాయించాలి. కానీ, వెయ్యి చదరపు గజాలు కావాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రోడ్ల నిర్మాణం, ప్లాట్ల కేటాయింపు.. వెంచర్ ప్రతిపాదనలు సిద్ధం చేసి మూడేళ్లు అవుతోంది. కొద్ది మంది రైతులు భూములను స్వాధీనం చేయడంలో జాప్యం కారణంగా లేఅవుట్ పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగలేదు. నిర్ణీత గడువులోగా లెంచర్ అభివృద్ధి చేయలేకపోతే రైతులకు భూమి విలువలో ఏటా 5 శాతం పరిహారంగా హెచ్ఎండీఏ చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే వెంచర్లో రోడ్లు నిర్మించి, మార్కింగ్ చేసిన ప్లాట్లను రైతులకు కేటాయించారు. ఉప్పల్ భగాయత్ నుంచి ఓఆర్ఆర్ వరకు 150 అడుగుల వెడల్పుతో వెళ్లే రేడియల్ రోడ్ నెంబర్ 20 మణిహారంలా ఈ వెంచర్‌కు ఆనుకునే ఉంది.త్వరలో ప్లాట్ల రిజిస్ట్రేషన్ షురూ.. ఇరిగేషన్ అధికారులు వెంచర్‌ను పరిశీలించి ఎన్వోసీ జారీ చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ ముగియగానే రైతులకు ప్లాట్లను రిజిస్టర్ చేసేందుకు హెచ్ఎండీఏ కసరత్తు చేస్తోంది. అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండేవిధంగా 110, 130, 190, 200, 220, 300, 400, 600, 1,200, 1,300, 1,500, 2,000 గజాల చొప్పున, ఒక ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలుగా ప్లాటింగ్ చేశారు. ఐటీ, వర్క్ స్టేషన్లు, డేటా సెంటర్ల ఏర్పాటు దిశగా కసరత్తు జరుగుతోంది. వీటి ద్వారా సుమారు 10 వేలకుపైగా మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉంటాయి.చదవండి: నీకోసం ఈ లోకం బహుమానం చేసేస్తా..డేటా సెంటర్ కోసం కృషి ప్రతాప సింగారంలోని హెచ్ఎండీఏ వెంచర్లో డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరాం. రూ.10 కోట్లను ప్రత్యేకంగా కేటాయించి ఈ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశాం. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. ల్యాండ్ పూలింగ్‌కు రైతులు సహకరించడాన్ని శుభపరిణామంగా భావిస్తున్నా. – మలిపెద్ది సుభాష్‌రెడ్డి, ప్రతాపసింగారంతూర్పు వైపు అభివృద్ధికి దోహదం.. హెచ్ఎండీఏ వెంచర్ల వల్ల తూర్పు హైదరాబాద్‌లో ఆస్తులకు డిమాండ్ పెరుగుతోంది. నగరంతో అద్భుతమైన అనుసంధానం ఏర్పడుతోంది. వ్యక్తిగతంగా భూములను అభివృద్ధి చేసుకోవడం అనేక ఖర్చులతో కూడుకున్న పని, కష్టసాధ్యం. అందుకే ల్యాండ్ పూలింగ్ను సమ్మతించాం. ఈ వెంచర్‌ను సకాలంలో అభివృద్ధి చేసి, మరో వెంచర్‌కు శ్రీకారం చుట్టాలని కోరుతున్నాం. – జున్ను నరేష్, భూ యజమాని, ప్రతాపసింగారం -
ఆఫీస్ మార్కెట్ రారాజు.. హైదరాబాద్
హైదరాబాద్: ఆఫీస్ మార్కెట్‌కు ఆకర్షణీయ కేంద్రంగా హైదరాబాద్ అవతరిస్తోంది. 134 మిలియన్ చదరపు అడుగుల (ఎస్ఎఫ్టీ) ఆఫీస్ స్పేస్‌తో దేశ ఆఫీస్ స్పేస్ (కార్యాలయ వసతులు) మార్కెట్లో హైదరాబాద్ 15 శాతం వాటా కలిగి ఉండగా, 2030 నాటికి 200 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరుకుంటుందని సీబీఆర్ఈ దక్షిణాసియా, హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) సంయుక్త నివేదిక అంచనా వేసింది. అంతర్జాతీయ సంస్థల నుంచి ఆఫీస్ స్పేస్‌కు బలమైన డిమాండ్ నెలకొందని, 2014 నుంచి చూస్తే హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ పరిమాణం మూడొంతులు పెరిగినట్టు తెలిపింది.అంతర్జాతీయ వ్యాపార, టెక్నాలజీ కేంద్రంగా హైదరాబాద్ అవతరించడం డిమాండ్‌కు అనుగుణంగా మారే స్వభావాన్ని తెలియజేస్తున్నట్టు సీబీఆర్ఈ ఇండియా చైర్మన్, సీఈవో అన్షుమన్ మ్యాగిజన్ పేర్కొన్నారు. విస్తృతమైన మౌలిక వసతులు, నైపుణ్య మానవ వనరుల లభ్యతతో భారత దేశ రియల్ ఎస్టేట్‌కు కీలక వృద్ధి కేంద్రంగా మారినట్టు తెలిపింది. టెక్నాలజీ, బీఎఫ్ఎస్ఐ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో గ్లోబల్ కేపబులిటీ సెంటర్లకు (జీసీసీ) హైదరాబాద్ ముఖ్య ఎంపికగా ఉన్నట్టు వెల్లడించింది.పర్యావరణ అనుకూల వసతులు..గ్రీన్ సరి్టఫైడ్ (పర్యావరణ అనుకూల ధ్రువీకరణ పొందిన) ఆఫీస్ వసతుల పరంగా హైదరాబాద్ మార్కెట్ దేశంలో 18 శాతం వాటా కలిగి ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది.డెవలపర్లు గ్రీన్ స్పేసెస్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారని, పర్యావరణ అనుకూల చర్యలు తీసుకుంటున్నారని వివరించింది. ఇందుకు సానుకూల ప్రభుత్వ విధానాలు ప్రోత్సాహమిస్తున్నట్టు పేర్కొంది. హైదరాబాద్ ఆఫీస్ లీజింగ్‌లో టెక్నాలజీ రంగం 31 శాతం వాటాతో అగ్రగామిగా ఉన్నట్టు తెలిపింది.జీసీసీలకు బెంగళూరు తర్వాత హైదరాబాద్ రెండో అతిపెద్ద కేంద్రంగా (లీజు పరంగా) ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. టెక్నాలజీ, ఫార్మా, బయో టెక్నాలజీ, ఫైనాన్షియల్ సరీ్వసెస్ ఇలా వివిధ రంగాల్లో జీసీసీలను హైదరాబాద్ ఆకర్షిస్తున్నట్టు పేర్కొంది. ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలైటిక్స్ వంటి అత్యాధునిక టెక్నాలజీల వినియోగం పెరిగే కొద్దీ హైదరాబాద్ ఆఫీస్ మార్కెట్ వృద్ధి మరింత వేగాన్ని అందుకుంటుందని అంచనా వేసింది.లీజింగ్‌లోనూ టాప్ఆఫీస్ స్పేస్ మార్కెట్లో ఈ ఏడాది హైరాబాద్, ఢిల్లీ ఎన్సీఆర్ అత్యధిక వృద్ధిని చూస్తాయని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ‘కొలియర్స్ ఇండియా’ సంస్థ అంచనా వేసింది. ఈ రెండు చోట్లా 10–15 మిలియన్ ఎస్ఎఫ్టీ చొప్పున గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ లీజింగ్ కార్యకలాపాలు నమోదు కావచ్చని తెలిపింది. దేశవ్యాప్తంగా ఆరు ప్రముఖ నగరాల్లో ఈ ఏడాది ఆఫీస్ స్పేస్ లీజింగ్ బలంగా ఉంటుందని.. 65–70 మిలియన్ ఎస్ఎఫ్టీ మేర లీజింగ్ నమోదు కావొచ్చని అంచనా వేసింది.2025 సంవత్సరంలో ఈ ఆరు నగరాల్లో ఆఫీస్ స్పేస్ మార్కెట్ ఎలా ఉండొచ్చన్న అంచనాలతో నివేదికను ఫిక్కీ 18వ రియల్ ఎస్టెట్ సదస్సు సందర్భంగా విడుదల చేసింది. ఈ ఆరు నగరాల్లో 2024లో స్థూల ఆఫీస్ లీజింగ్ 66.4 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉండగా.. ఈ ఏడాది 65–70 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంటుందని అంచనా వేసింది. జీసీసీల విస్తరణ, ఆశావహ వ్యాపార వాతావరణంతో లీజింగ్ పరి మాణం పెరగొచ్చని తెలిపింది.బెంగళూరులో అధిక డిమాండ్ ఈ ఏడాది స్థూల ఆఫీస్ స్పేస్ డిమాండ్‌లో మూడింట ఒక వంతు బెంగళూరు నుంచే ఉంటుందని కొలియర్స్ ఇండియా ఆఫీస్ సర్వీసెస్ ఎండీ అరి్పత్ మెహరోత్రా తెలిపారు. జీసీసీలు, ఇంజనీరింగ్, తయారీ సంస్థలు, ఫ్లెక్స్ ఆఫీస్ స్పేస్ ఆపరేటర్ల నుంచి డిమాండ్ ఉంటుందన్నారు. ముంబై, చెన్నై పుణెలలో 5–10 మిలియన్ ఎస్ఎఫ్టీ చొప్పున డిమాండ్ ఉండొచ్చని చెప్పారు. టాప్ మెట్రో నగరాల్లో జీసీసీలు అతిపెద్ద ఆఫీస్ స్పేస్ వినియోగదారులుగా ఉన్నట్టు అనరాక్ గ్రూప్ కమర్షియల్ లీజింగ్ ఎండీ పీయూష్ జైన్ సైతం తెలిపారు. -
స్టూడియో అపార్ట్మెంట్లకు తగ్గిన డిమాండ్
తెల్లారింది లేచామా.. ఆఫీసుకు వెళ్లామా.. రాత్రికి ఎప్పుడో ఇంటికి చేరుకున్నామా.. మరుసటి రోజు మళ్లీ సేమ్ టు సేమ్.. ఇదే నగరవాసి జీవితం.. సంపాదన బిజీలో పడిన సగటు జీవికి కాసేపు సేదతీరేందుకే గూడు. ఇదంతా కరోనాకు ముందు.. కరోనా వచ్చి సగటు మనిషి ప్రపంచాన్నే మార్చేసింది. కేవలం తినడం, పడుకోవడమే కాదు.. ఆఫీసు, స్కూల్, వ్యాయామం, వినోదం అన్నీ ఇంటి నుంచే కావడంతో ఒకప్పుడు హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన స్టూడియో అపార్ట్మెంట్లకు క్రమంగా డిమాండ్ పడిపోయింది. వీటి స్థానంగా విశాలమైన గృహాలు, ఫ్లాట్స్‌కు గిరాకీ పెరిగిపోయింది. – సాక్షి, సిటీబ్యూరో బెడ్ కం లివింగ్ రూమ్, కిచెన్, అటాచ్డ్ బాత్రూమ్ ఉండే వాటిని స్టూడియో అపార్ట్మెంట్ అంటారు. కరోనా మొదలైన ఏడాది(2020) నుంచి దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఈ తరహా అపార్ట్మెంట్ల సరఫరా క్రమంగా క్షీణిస్తూ వస్తోంది. గతేడాది తొలి అర్ధ వార్షికం(జనవరి–జూన్)లో 1,063 ప్రాజెక్ట్‌లు లాంచింగ్ కాగా.. ఇందులో కేవలం 9 శాతం(91 ప్రాజెక్ట్‌లు) మాత్రమే స్టూడియో అపార్ట్మెంట్ ప్రాజెక్ట్‌లు ఉన్నాయని అనరాక్ రీసెర్చ్ తాజా నివేదిక వెల్లడించింది. గతేడాది 1,207 ప్రాజెక్ట్‌లు లాంచింగ్ కాగా.. ఇందులో 145 ప్రాజెక్ట్‌లు స్టూడియో అపార్ట్మెంట్లున్నాయి. 19 శాతానికి స్టూడియో ప్రాజెక్ట్‌లు.. 2013 నుంచి 2019 మధ్య స్టూడియో అపార్ట్మెంట్ల ట్రెండ్ క్రమంగా పెరుగుతూ వచ్చింది. 2013లో ఏడు ప్రధాన నగరాల్లో 2,102 ప్రాజెక్ట్‌లు ప్రారంభం కాగా.. ఇందులో 4 శాతంతో 75 ప్రాజెక్ట్‌లు స్టూడియో అపార్ట్మెంట్లు ఉన్నాయి. అలాగే 2014లో 151, 2015లో 190, 2016లో 128, 2017లో 197, 2018లో 446 స్టూడియో ప్రాజెక్ట్‌లు లాంచ్ అయ్యాయి. 2019లో 1,921 ప్రాజెక్ట్‌లు ప్రారంభం కాగా.. 19 శాతం వాటాతో 368 ప్రాజెక్ట్‌లు స్టూడియో అపార్ట్మెంట్లే..లొకేషన్ ముఖ్యం.. స్టూడియో అపార్ట్మెంట్లను బ్యాచ్లర్స్, పర్యాటకులు, వ్యాపార ప్రయాణికులు, యువ దంపతులు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. వీటికి విస్తీర్ణంతో కాకుండా లొకేషన్ ఆధారంగా డిమాండ్ ఉంటుంది. తరచూ ఇవి ఉపాధి, వ్యాపార కేంద్రాల చుట్టూ, ఖరీదైన ప్రదేశాలలో ఎక్కువగా ఉంటాయని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్ పూరీ తెలిపారు. కానీ, కరోనా కారణంగా వర్క్ ఫ్రం హోమ్ సంస్కృతి మొదలైంది. దీంతో 2020 నుంచి పెద్ద సైజు ఇళ్లకు డిమాండ్ పెరిగిందన్నారు.మన దగ్గర తక్కువే.. స్టూడియో అపార్ట్మెంట్లకు ఉత్తరాది నగరాల్లో ఉన్నంత డిమాండ్ దక్షిణాదిలో ఉండదు. ముంబై, పుణె నగరాల్లో ఈ తరహా ఇళ్ల ట్రెండ్ కొనసాగుతోంది. 2013–20 మధ్య కాలంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో లాంచింగ్ అయిన స్టూడియో అపార్ట్మెంట్లలో 96 శాతం వాటా ముంబై, పుణెలదే. ఇదే కాలంలో దక్షిణాది నగరాలైన బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లలో కేవలం 34 స్టూడియో ప్రాజెక్ట్‌లు ప్రారంభమయ్యాయి. గతేడాది హెచ్–1లో ఏడు నగరాలలో ప్రారంభమైన 91 స్టూడియో ప్రాజెక్ట్‌ల్లో.. 71 ప్రాజెక్ట్‌లు ముంబైలోనే ఉన్నాయి. ఆ తర్వాత పుణెలో 18, బెంగళూరులో రెండు ప్రాజెక్ట్‌లు లాంచ్ అయ్యాయి. -
ఇవన్నీ ఉంటేనే ఇల్లు కొంటాం..
నివాస సముదాయాల్లో అన్ని వసతులు ఉండాల్సిందే.. ఆ విషయంలో మాత్రం అస్సలు తగ్గేదే లే అంటున్నారు కొనుగోలుదారులు.. గతంలో కమ్యూనిటీలలో జిమ్, స్విమ్మింగ్ పూల్ వంటి నాలుగైదు వసతులు ఉంటే సరిపోయేది. కానీ.. ప్రస్తుతం భవిష్యత్తు అవసరాలతో పాటు అభిరుచులకు తగ్గట్టుగా వసతులు ఉండాల్సిందే. ఇంటి నుంచి పని కోసం కో–వర్కింగ్ స్పేస్, ఆన్లైన్ క్లాస్‌ల కోసం డిజిటల్ క్లాస్ రూమ్ నుంచి మొదలుపెడితే.. టెర్రస్, క్లబ్హౌస్పై సౌర విద్యుత్ ఏర్పాట్లు, ఔట్‌డోర్ జిమ్, ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్స్, హోమ్ థియేటర్, ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్లు, పెట్పార్క్, గోల్ఫ్‌కోర్స్ వరకూ అన్ని ఆధునిక వసతులు కావాలని గృహ కొనుగోలుదారులు భావిస్తున్నారు. –సాక్షి, సిటీబ్యూరోపెట్ పార్క్, స్పా..జంతు ప్రేమికుల కోసం కూడా డెవలపర్లు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నివాస సముదాయాల్లో వసతుల జాబితాలో పెట్ పార్కులు కూడా చేరిపోయాయి. గేటెడ్ కమ్యూనిటీలలో కొనుగోలుదారులు పెంచుకునే పెంపుడు జంతువుల కోసం పెట్పార్క్, క్లబ్‌హౌస్‌లో పెట్ స్పాలను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు పెంపుడు జంతువుల ఆహార ఉత్పత్తులు, శిక్షకులు, వ్యాయామ ఉపకరణాలు వంటివి ఆయా ప్రాజెక్ట్‌లలో అందుబాటులో ఉంటాయి.సోలార్, హోమ్ గార్డెనింగ్ సొంతిల్లు కొనుగోలు చేసే క్రమంలో గేటెడ్ కమ్యూనిటీలో కామన్ ఏరియాలు ఎంత వరకు ఉన్నాయో అడిగి మరీ తెలుసుకుంటున్నారు. గతంలో కామన్ ఎలివేటర్, కామన్ కారిడార్, గ్యారేజ్, స్టేర్‌కేస్ ఉండేవి ఇప్పుడు వాటిని ప్రైవేట్ కావాలని అడుగుతున్నారు. ఇంట్లో సొంత అవసరాల కోసం కమ్యూనిటీ గార్డెన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. చిన్నపాటి స్థలంలో ఆకు కూరలు, కూరగాయలు పండించుకునేలా వర్టికల్ గార్డెనింగ్, బాల్కనీలలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వారాంతాల్లో కమ్యూనిటీ వాసులతో ఆహ్లాదంగా గడిపేందుకు ఔట్‌డోర్ కిచెన్, డైనింగ్ ఏరియా ఏర్పాటు చేస్తున్నారు. టెర్రస్, క్లబ్హౌస్పై సౌర విద్యుత్ ఏర్పాటు చేస్తున్నారు. వీధి దీపాలు, ఇతరత్రా అవసరాల కోసం ఈ విద్యుత్‌నే వినియోగిస్తున్నారు. దీంతో నివాసిత సంఘానికి కరెంట్ బిల్లు భారం తగ్గుతుంది.ఈవీ చార్జింగ్ స్టేషన్లుపెట్రోల్, డీజిల్ వంటి వాహనాలతో పర్యావరణం కాలుష్యం అవుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాయి. వాహన కొనుగోళ్లపై రాయితీలు అందిస్తుండటంతో పాటు చార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేస్తున్నాయి. డెవలపర్లు కూడా నివాస, వాణిజ్య సముదాయాల నిర్మాణంలో ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. నగరానికి చెందిన మైహోమ్, రాజపుష్ప, ప్రణీత్ గ్రూప్, పౌలోమి ఎస్టేట్స్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలు కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా వసతులను కల్పిస్తున్నారు.వసతులు ఇలా..నివాస సముదాయంలో ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్లు, ప్రతి పార్కింగ్ ప్లేస్ వద్ద చార్జింగ్ పెట్టుకునేందుకు వీలుగా పాయింట్లను ఇస్తున్నారు. జంతు ప్రేమికుల కోసం నివాస సముదాయంలోనే పెట్పార్క్, క్లబ్‌హౌస్‌లో పెట్ స్పాలను ఏర్పాటు చేస్తున్నారు. పెంపుడు జంతువుల ఆహార ఉత్పత్తులు, శిక్షకులు, వ్యాయామ ఉపకరణాలు వంటివి ఆయా ప్రాజెక్ట్‌లలో అందుబాటులో ఉంటాయి.రిచ్‌మ్యాన్ గేమ్‌గా పిలిచే గోల్ఫ్ కూడా వసతుల జాబితాలో చేరిపోయింది. ఆహ్లాదకరమైన వాతావరణంలో జిమ్ చేయాలని అందరూ భావిస్తున్నారు. దీంతో ఇండోర్ జిమ్‌లు కాస్త ఔట్‌డోర్‌లో ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఓజోనైజ్డ్ మెడిటేషన్ హాల్, ఉష్ణోగ్రత నియంత్రణ స్విమ్మింగ్ పూల్స్ వచ్చేశాయి.వైద్య అవసరాల కోసం మినీ ఆస్పత్రి, మెడికల్ షాపు, అంబులెన్స్, పారా మెడికల్ సిబ్బంది ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.గతంలో మాదిరిగా సినిమాలకు వెళ్లే పరిస్థితి లేకపోవటంతో నివాస సముదాయంలోనే మల్టీప్లెక్స్ అనుభూతి కలిగేలా స్క్రీన్లు, సౌండ్ సిస్టమ్స్‌ను డెవలపర్లు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా డిజిటల్ క్లాస్ రూమ్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. -
హైదరాబాద్‌లో షాపింగ్ మాల్స్.. రిటైల్ స్పేస్‌కు గిరాకీ
గతేడాది హైదరాబాద్ స్థిరాస్తి రంగానికి (Real estate) బాగానే కలిసొచ్చింది. నివాస, వాణిజ్య, కార్యాలయ విభాగాలతో పాటు రిటైల్ రంగం కూడా మెరుగైన పనితీరునే కనబర్చింది. షాపింగ్ మాల్స్‌లో రిటైల్ స్పేస్ క్రమంగా పెరుగుతోంది. గతేడాది నగరంలో 18 లక్షల రిటైల్ స్పేస్ లావాదేవీలు జరిగాయని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదిక వెల్లడించింది. - సాక్షి, సిటీబ్యూరోబంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, కోకాపేట వంటి సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్(సీబీడీ) ప్రాంతాల్లో 2 లక్షల చ.అ.లావాదేవీలు జరిగాయని తెలిపింది. దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాలలో కొత్తగా 59.48 లక్షల చ.అ.విస్తీర్ణంలో 11 షాపింగ్ మాల్స్ అందుబాటులోకి వచ్చాయి.సిటీలో మూడు మాల్స్ గతేడాది అత్యధికంగా హైదరాబాద్‌లో మూడు మాల్స్ అందుబాటులోకి వచ్చాయి. పుణె, చెన్నైలో రెండేసి, ముంబై, ఢిల్లీ, ఎన్సీఆర్, బెంగళూరు, అహ్మదాబాద్‌లో ఒక్కోటి చొప్పున అందుబాటులోకి వచ్చాయి. కోల్‌కత్తాలో ఒక్క మాల్ కార్యరూపంలోకి రాలేదు. 2023లో 15 లక్షల చ.అ.షాపింగ్ మాల్ స్పేస్ మార్కెట్లోకి రాగా.. ఈ ఏడాది నిర్మాణంలో ఉన్న మరో 20 లక్షల చ.అ. స్థలం అందుబాటులోకి రానుంది.నల్లగండ్ల, నానక్‌రాంగూడ, కొంపల్లి వంటి ప్రాంతాలలో కొత్త మాల్స్ నిర్మాణంలో ఉన్నాయి. నల్లగండ్లలో అపర్ణా సంస్థ 7 లక్షల చ.అ. విస్తీర్ణంలో మాల్ అండ్ మల్టీప్లెక్స్‌ను నిర్మిస్తోంది. కూకట్పల్లి 16.60 లక్షల చ.అ. లేక్‌షోర్ మాల్స్ శరవేగంగా నిర్మాణ పనులు పూర్తి చేసుకుంటున్నాయి.5–25 శాతం పెరిగిన అద్దెలు నగరంలో ఫ్యాషన్, హైపర్ మార్కెట్, ఫుడ్ అండ్ బేవరేజ్ వంటి విభాగాల పనితీరు బాగుండటంతో రిటైల్ స్పేస్‌కు గిరాకీ పెరిగింది. ప్రధానంగా కొంపల్లి, కోకాపేట, ఏఎస్‌రావ్ నగర్, నల్లగండ్ల, వనస్థలిపురం, కొండాపూర్, మణికొండ వంటి ప్రాంతాల్లో ఎక్కువ కార్యకలాపాలు జరిగాయి. అమీర్‌పేట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కొంపల్లి, కొత్తపేట, మాదాపూర్ వంటి ప్రధాన ప్రాంతాల్లో అద్దెలు పెరిగాయి. గత కొన్ని త్రైమాసికాలలో ఆయా ప్రాంతాలలో అద్దెలు 5–25 శాతం మేర వృద్ధి చెందాయి. -
హైదరాబాద్‌లో ఇళ్లకు డిమాండ్..
దేశీయ రియల్ ఎస్టేట్ రంగం వృద్ధిలో హైదరాబాద్, బెంగళూరు, ముంబై నగరాలు కీలకంగా మారాయి. ఈ ఏడాది గృహ విక్రయాలు ఈ మూడు నగరాల్లోనే అధిక స్థాయిలో జరిగాయి. తక్కువ వడ్డీ రేట్లు, స్థిరమైన ప్రాపర్టీ ధరలే ఇందుకు కారణమని హౌసింగ్. కామ్ ఇండియన్ రెసిడెన్షియల్ ఇండెక్స్ ఫర్ ఆన్లైన్ సెర్చ్ (ఐఆర్ఐఎస్) అంచనా వేసింది. రియల్టీ స్టేక్ హోల్డర్లు, ప్రభుత్వం, బ్యాంక్‌లు, ప్రాపర్టీ ఇన్వెస్టర్లు అందరూ టర్న్ ఎరౌంట్ మార్కెట్ కోసం ఎదురు చూస్తున్నారని తెలిపింది. అది గతేడాది సానుకూల దృక్పథంతో మొదలైందని తెలిపింది. గతేడాది వృద్ధే ఈ ఏడాది కూడా కొనసాగుతోంది. – సాక్షి, సిటీబ్యూరో ప్రధాన నగరంలో ఇరుకు ఇళ్ల మధ్య ఉండటం బదులు శివారు ప్రాంతాలు, హరిత భవనాలు, విస్తీర్ణం ఎక్కువగా ఉండే ఫ్లాట్లు, విల్లాలను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ద్వితీయ శ్రేణి పట్టణాలలోని ప్రాపర్టీలకు డిమాండ్ ఏర్పడింది. గతంలో సూరత్, జైపూర్, పాట్నా, మోహాలీ, లక్నో, కోయంబత్తూరు వంటి ద్వితీయ శ్రేణి పట్టణాలు ఆన్లైన్లో ప్రాపర్టీల సెర్చ్‌లో గణనీయమైన వృద్ధి నమోదు చేశాయని తెలిపింది. ఆయా ద్వితీయ శ్రేణి పట్టణాల్లో గృహ కొనుగోళ్లకు ఆసక్తి కనబరుస్తున్నారని పేర్కొంది. నోయిడాలోని నోయిడా ఎక్స్టెన్షన్, ముంబైలోని మీరా రోడ్ ఈస్ట్, అంధేరి వెస్ట్, బోరివలీ వెస్ట్, బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ ప్రాంతాలు ఈ ఏడాది దేశీయ నివాస సముదాయ మార్కెట్‌ను లీడ్ చేస్తాయని తెలిపింది.మారిన అభిరుచులు.. ఆన్లైన్లో రూ.2 కోట్లకు పైబడిన ప్రాపర్టీల శోధన ఒకట్నిర శాతం వృద్ధి చెందిందని పేర్కొంది. గతంలో ప్రాపర్టీ కొనాలంటే ధర, వసతులు ప్రధాన అంశాలుగా ఉండేవి. ప్రస్తుతం గృహ కొనుగోలుదారుల ఎంపికలో మార్పులొచ్చాయని హౌసింగ్.కామ్ కన్జ్యూమర్ సెంటిమెంట్ ఔట్లుక్ తెలిపింది. 3 బీహెచ్‌కే, ఆపై పడక గదుల గృహాల్లో 2023తో పోలిస్తే 2024లో 15 శాతం వృద్ధి నమోదైందని పేర్కొన్నారు. అదే సమయంలో గతేడాది పెద్ద సైజు ప్లాట్లలో 42 శాతం పెరుగుదల కనిపించిందని తెలిపింది.అద్దెలకు గిరాకీ.. ప్రాజెక్ట్‌ల ఆలస్యం, దివాళా డెవలపర్లు వంటి ప్రతికూల వాతావరణంలోనూ నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్సీఆర్)లో ప్రాపర్టీ కోసం సెర్చ్ గణనీయంగా పెరిగింది. నోయిడా ఎక్స్టెన్షన్ ప్రాంతం ఆన్లైన్ ప్రాపర్టీ సెర్చింగ్‌లో ప్రథమ స్థానంలో నిలిచింది. ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ఈ రీజియన్‌లో పలు మౌలిక సదుపాయల ప్రాజెక్ట్‌లను ప్రకటించడం, ధరలు అందుబాటులో ఉండటం వంటివి ఈ రీజియన్‌లో ప్రాపర్టీల వృద్ధికి కారణమని తెలిపింది. ఐటీ, ఫార్మా కంపెనీలు ఉద్యోగ నియామకాలను పెంచడంతో ముంబై, బెంగళూరు, ఢిల్లీ మార్కెట్లలో అద్దెలకు గిరాకీ పెరిగిందని పేర్కొంది. -
ముంబైలో ఆఫీస్ కొన్న సన్నీ లియోన్: ఎన్ని కొట్లో తెలుసా?
సినీతారలు, క్రికెటర్స్ లేదా పారిశ్రామిక వేత్తలు చాలామంది ఎప్పటికప్పుడు ఖరీదైన వాహనాలు, ప్లాట్స్ వంటివి కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇప్పటికే చాలామంది ముంబై వంటి అభివృద్ధి చెందిన నగరాల్లో ఆస్తులను కొనుగోలు చేశారు. తాజాగా ఈ జాబితాలోకి నటి 'సన్నీ లియోన్' (Sunny Leone) కూడా చేరింది. కోట్ల రూపాయలు వెచ్చించి ఓ కమర్షియల్ బిల్డింగ్ కొనుగోలు చేసింది.బర్త్ డే సాంగ్స్‌కు కేర్ ఆఫ్ అడ్రస్‌గా పాపులర్ అయిన సన్నీ లియోన్.. ముంబైలోని ఓషివారాలో రూ. 8 కోట్లకు ఆఫీస్ స్థలాన్ని కొనుగోలు చేసినట్లు స్క్వేర్ యార్డ్స్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్ వెల్లడించింది. ఇక్కడే ఆమె తన కార్యకలాపాలను కొనసాగించే అవకాశం ఉంది.బిగ్ బి, అజయ్ దేవగన్, కార్తీక్ ఆర్యన్ కార్యాలయాలు ఉన్న భవనంలోనే సన్నీ లియోన్ కార్యాలయాన్ని కొనుగోలు చేసింది. ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం.. కొనుగోలుకు సంబంధించిన లావాదేవీ ఫిబ్రవరి 2025లో జరిగినట్లు సమాచారం.సన్నీ లియోన్ ఆస్తిని.. ఆనంద్ కమల్నాయన్ పండిట్ & రూపా ఆనంద్ పండిట్ యాజమాన్యంలోని ఐశ్వర్య ప్రాపర్టీ అండ్ ఎస్టేట్స్ నుంచి కొనుగోలు చేసింది. ఆనంద్ పండిట్.. టోటల్ ధమాల్, చెహ్రే మరియు ది బిగ్ బుల్ వంటి చిత్రాలను నిర్మించారు.ఇదీ చదవండి: కొత్త బిజినెస్‌లోకి అనన్య బిర్లా: ఇషా అంబానీకి పోటీ!?సన్నీ లియోన్ కొనుగోలు చేసిన ఆఫీస్ స్థలంలో 176.98 చదరపు మీటర్ల (1,904.91 చదరపు అడుగులు) కార్పెట్ ఏరియా, 194.67 చదరపు మీటర్ల (2,095 చదరపు అడుగులు) బిల్ట్ అప్ ఏరియా వంటివి ఉన్నాయి. అంతే కాకుండా ఇందులో మూడు కార్ పార్కింగ్ స్థలాలు కూడా ఉన్నాయి. ఈ లావాదేవీకి రూ. 35.01 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లింపు, మరో రూ. 30,000 రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించాల్సి వచ్చింది. -
హైదరాబాద్‌లో ఇల్లు కొంటున్నారా..?
సొంతిల్లు ప్రతి ఒక్కరి జీవిత కల. పైసా పైసా కూడబెట్టి, గృహ రుణంతో సొంతింటి కలను నెరవేర్చుకుంటారు. గృహ కొనుగోలు (Buying House)నిర్ణయంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా, నిర్లక్ష్యం వహించినా కష్టార్జితమంతా వృథా అవుతుంది. మరీ ముఖ్యంగా తొలిసారి గృహ కొనుగోలుదారులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రాపర్టీని (Property) కొనుగోలు చేయడం అంటే కేవలం ఆర్థికపరమైన నిర్ణయం మాత్రమే కాదు.. జీవనశైలి ఎంపిక. ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే అందబాటు ధరలు, అభివృద్ధి అవకాశాలు, దీర్ఘకాలిక పెట్టుబడికి సరైనది హైదరాబాద్. నగరంలో గృహ కొనుగోలుదారులు ఈ పంచ సూత్రాలు పాటిస్తే సొంతింటిని దక్కించుకోవచ్చు. – సాక్షి, సిటీబ్యూరోబంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కోకాపేట ప్రాంతాలు విలాసవంతమైన జీవనం, పెట్టుబడుల వృద్ధిలో అగ్రస్థానంలో ఉన్నాయి. వృద్ధి సమతుల్యత, అందుబాటు ధరల కోసమైతే నార్సింగి, కొల్లూరు, రాజేంద్రనగర్, తెల్లాపూర్ వంటి అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలను ఎంపిక చేసుకోవచ్చు. ఆయా ప్రాంతాలు ఆధునిక మౌలిక సదుపాయాలు, ఐటీ కారిడార్లకు సమీపంలో ఉండటంతో నివాసం ఉండేందుకు, పెట్టుబడులకు రెండింటికీ అనువైన ప్రాంతాలు.లగ్జరీ ప్రాపర్టీల కొనుగోలుదారులు ఇంటి ధరను మాత్రమే కాదు రిజిస్ట్రేషన్ ఫీజులు, ప్రీమియం వసతులు, హైఎండ్ ఇంటీరియర్ కూడా పరిగణలోకి తీసుకోవాలి. విలాసవంతమైన జీవితాన్ని విలువైనదిగా చేసే నిర్వహణ చార్జీలు కూడా ఉంటాయని గమనించాలి.విలాసవంతమైన ఇల్లు, దాని నిర్మాణ శైలి గురించి తెలుసుకోవాలి. లగ్జరీ ప్రాపర్టీల అనుభూతిని పొందాలంటే డెవలపర్ కీలకపాత్ర పోషిస్తారు. వారి ఉన్నత నైపుణ్యం, సకాలంలో డెలివరీ, వినూత్నమైన డిజైన్లు, ఎలివేషన్లకు ప్రసిద్ధి చెందిన బిల్డర్ ప్రాజెక్ట్‌లను ఎంచుకోవడం ఉత్తమం. నిర్మాణంలో నాణ్యత, ప్రత్యేకతలు అందించే రెరా ఆమోదిత ప్రాజెక్ట్‌లకు ప్రాధాన్యత ఇవ్వాలి.ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో స్టేషన్లు, రాబోయే మౌలిక సదుపాయాల ప్రాంతాలలో స్థలాలు, గృహాలను కొనుగోలు చేస్తే తక్కువ కాలంలో విలువ రెట్టింపు అవుతుంది. ప్రైవసీ, ప్రశాంతతను కోరుకునే వారికీ ఈ ప్రాంతాలే బెటర్. రవాణా సదుపాయాలు, కనెక్టివిటీ ఉన్న ప్రాంతాలైతే రాకపోకలు సౌలభ్యంగా ఉంటుంది.ఎంపిక చేసిన ప్రాపర్టీకి సంబంధించి న్యాయ నిపుణులు, ప్రొఫెషనల్స్ సలహాలు తీసుకోవాలి. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ వంటి ప్రభుత్వ విభాగాల నుంచి నిర్మాణ అనుమతులు గురించి ఆరా తీయాలి. -
బడ్జెట్ 2025-26: రియల్ ఎస్టేట్‌కు బూస్ట్!
దేశంలో రియల్ఎస్టేట్ రంగానికి వైభవం తీసుకొచ్చేలా కేంద్ర ప్రభుత్వం 2025-26 బడ్జెట్లో పలు కీలక నిర్ణయాలు ప్రకటించింది.మధ్యతరగతి గృహ కొనుగోలుదారులకు స్థోమతను పెంచేలా రూ. 12 లక్షలు.. స్టాండర్డ్ డిడక్షన్లతో కలుపుకొంటే రూ.12.75 లక్షల వరకు ఆదాయంపై పన్ను ఉండదని ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఇది ప్రజల కొనుగోలు శక్తిని పెంచుతుందని, హౌసింగ్ డిమాండ్, రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులను పెంచుతుందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంటున్నారు."కొత్త పన్ను నిర్మాణం మధ్యతరగతి పన్నులను గణనీయంగా తగ్గిస్తుంది. వారి చేతుల్లో ఎక్కువ డబ్బు ఉండేలా చేస్తుంది. గృహ వినియోగం, పొదుపు, పెట్టుబడిని పెంచుతుంది" అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. రియల్ ఎస్టేట్‌కు తాజా బడ్జెట్లో ఎలాంటి నిర్ణయాలు ప్రకటించారో ఇప్పుడు చూద్దాం..నిలిచిపోయిన ప్రాజెక్టుల్లో లక్ష ఇళ్లను పూర్తి చేసేందుకు స్వామి (SWAMIH ) ఫండ్-2ను ప్రభుత్వం ప్రకటించింది. 2025 బడ్జెట్లో అదనంగా లక్ష ఇళ్ల నిర్మాణం కోసం కొత్త స్వామి ఫండ్ 2కి రూ.15,000 కోట్ల కేటాయింపును ప్రకటిచింది. దీంతో చాలా కాలంగా ఆలస్యమవుతున్న రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లలో ఇళ్లు కొనుగోలుచేసిన వేలాది మందికి ఉపశమనం కలగనుంది.స్వామి స్కీమ్ కింద ప్రస్తుతం ఉన్న 50,000 నివాస యూనిట్లు పూర్తికావడం, మరో 40,000 పైప్‌లైన్‌లో ఉండటం సంక్షోభాన్ని పరిష్కరించడంలో ప్రభుత్వ గట్టి ప్రయత్నాన్ని తెలియజేస్తోందని నిపుణులు చెబుతున్నారు.అద్దె ఆదాయంపై వార్షిక టీడీఎస్ పరిమితిని ప్రస్తుత రూ. 2.4 లక్షల నుండి రూ.6 లక్షలకు పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. అద్దెపై వార్షిక టీడీఎస్ పరిమితిని రూ.2.40 లక్షల నుండి రూ.6 లక్షలకు పెంచడం వలన చిన్న పన్ను చెల్లింపుదారులు, భూస్వాములు కూడా గణనీయంగా ప్రయోజనం పొందుతారని రియల్ ఎస్టేట్ నిపుణులు అంటున్నారు.ఇన్వెస్టర్లు ఇప్పుడు కేవలం ఒకటి కాకుండా రెండు స్వీయ-ఆక్రమిత ఆస్తులకు నిల్ వాల్యుయేషన్‌ను క్లెయిమ్ చేయవచ్చు. ఇది రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ పెట్టుబడికి అనుకూలమైన చర్య.పట్టణ మౌలిక సదుపాయాలను పెంచేందుకు ప్రభుత్వం రూ.1 లక్ష కోట్ల అర్బన్ ఛాలెంజ్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తుంది. అర్బన్ డెవలప్మెంట్ ఫండ్ ఏర్పాటు వల్ల మౌలిక సదుపాయాలు పెరుగుతాయని, రియల్ ఎస్టేట్ సామర్థ్యం పుంజుకుంటుందని, నగరాలు ప్రధాన వృద్ధి కేంద్రాలుగా మారుతాయని నిపుణులు తెలిపారు.ప్రపంచ వ్యాపార కేంద్రంగా భారతదేశ స్థానాన్ని బలోపేతం చేస్తూ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ (GCC)ను ఆకర్షించడానికి, ప్రోత్సహించడానికి రాష్ట్రాలకు సహాయపడే జాతీయ మార్గదర్శక ఫ్రేమ్‌వర్క్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. పెరుగుతున్న దేశ ఆర్థిక ప్రభావం దృష్ట్యా ఈ చర్య బెంగళూరు, ముంబై, హైదరాబాద్, పూణె, చెన్నై వంటి ప్రధాన మెట్రోలతో పాటు టైర్-II, టైర్-III నగరాల్లో ఆఫీస్ స్పేస్ డిమాండ్‌ను పెంచుతుందని భావిస్తున్నారు.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025-26 ముఖ్యాంశాలు -
ఏఐతో రియల్ ఎస్టేట్ సేవలు..
దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ (real estate) రంగంలో సుమారు 5 లక్షల మంది ఉంటే, అందులో కేవలం 15 శాతం మంది మాత్రమే సాంకేతికతను, ఆన్లైన్ టూల్స్‌ను వినియోగిస్తున్నారని ఇటీవల పలు సర్వేలు వెల్లడించాయి. ముఖ్యంగా హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో రియల్ ఎస్టేట్ వ్యవస్థ అనేది దళారులపై ఆధారపడి ముందుకుసాగుతోంది. - సాక్షి, సిటీబ్యూరోఇందులో 80 నుంచి 85 శాతం వరకూ దళారులు మాన్యువల్ ప్రక్రియలపై ఆధారపడుతున్నారని రియల్ రంగ అధ్యయనాలు తెలిపాయి. ఈ తరుణంలో హైదరాబాద్ వంటి మహానగరాల్లో బ్రోకర్లు, గృహ కొనుగోలుదారులు, వ్యాపారులు ప్రధాన ఆస్తి పోర్టల్‌ను వినియోగించడం ఉత్తమమని మ్యాజిక్ బ్రిక్స్ సీఈఓ సుధీర్ పాయ్ తెలిపారు. దేశవ్యాప్త నెట్‌వర్క్‌తో.. దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన సాంకేతిక మౌలిక సదుపాయాలు, విస్తారమైన అమ్మకాల నెట్‌వర్క్‌తో, కన్సల్టెంట్లకు సీఆర్ఎమ్ పరిష్కారంగా ‘రీడ్ ప్రో’ (READPRO)ను ఆవిష్కరించామని సుధీర్ తెలిపారు. కృత్రిమ మేధ ఆధారిత సీఆర్ఎమ్ వేదికగా ఈ ‘రీడ్ ప్రో’ రెండు వందలకు పైగా నగరాల్లో 95 వేల యాక్టివ్ బ్రోకర్ లైసెన్స్‌లను సాధించింది. రియల్–టైమ్ సేల్స్ ట్రాకింగ్, లీడ్ ఇంటిగ్రేషన్, పెర్ఫార్మెన్స్ అనలిటిక్స్ వంటి ఫీచర్లతో ఈ రీడ్ ప్రో డేటా, లీడ్ మేనేజ్మెంట్, లైవ్ టీమ్ అప్డేట్లు, రియల్–టైమ్ పెర్ఫార్మెన్స్ ట్రాకింగ్, పెర్ఫార్మెన్స్ డాష్‌బోర్డ్‌లు, కంపాస్ వంటి అధునాతన సాధనాల ద్వారా లీడ్ జనరేషన్లో 200% పెరుగుదలకు సహాయపడిందన్నారు.రెండు కోట్ల కస్టమర్లకు.. ఈ ఆస్తి పోర్టల్‌లో వెరిఫైడ్ లీడ్స్, సైట్ సందర్శనలతో పాటు.. రెండు కోట్లకు పైగా కస్టమర్లు, 15 లక్షల జాబితాలతో మ్యాజిక్ బ్రిక్స్ రియల్ ఎస్టేట్ పరిశ్రమకు నాయకత్వం వహిస్తోంది. గృహ కొనుగోలు దారులు, దళారుల సామర్థ్యాలను, అవకాశాలను మెరుగు పరచడంలో ‘రీడ్ ప్రో’ వంటి సేవలు అత్యవసరమని రీడ్ ప్రో వ్యవస్థాపకుడు అక్షయ్ సేథ్ పేర్కొన్నారు. -
మాల్స్‌లో తగ్గిన రిటైల్ లీజింగ్
న్యూఢిల్లీ: షాపింగ్ మాల్స్, హై స్ట్రీట్లలో (ప్రముఖ షాపింగ్ ప్రాంతాలు) రిటైల్ స్థలాల లీజింగ్ 2024లో 10 శాతం తగ్గిపోయింది. దేశవ్యాప్తంగా ఎనిమిది నగరాల్లో 64 లక్షల చదరపు అడుగుల లీజింగ్ కార్యకలాపాలు 2024లో నమోదయ్యాయి. హైదరాబాద్, చెన్నై మాత్రం రాణించాయి. ఈ వివరాలను రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్ఈ వెల్లడించింది. 2023లో ఇవే నగరాల్లో స్థూల రిటైల్ స్పేస్ లీజింగ్ 71 లక్షల చదరపు అడుగులుగా ఉండడం గమనార్హం. ‘‘భార త రిటైల్ స్పేస్ విభాగం 2025లో గణీయమైన వృద్ధిని చూడనుంది. హైదరాబాద్, ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, బెంగళూరులో 50–60 లక్షల చదరపు అడుగుల గ్రేడ్–ఏ మాల్స్ స్థలాలు ఈ ఏడాది వినియోగంలోకి రానున్నాయి’’అని సీబీఆర్ఈ ఇండియా చైర్మన్, సీ ఈవో అన్హుమన్ మ్యాగజిన్ తెలిపారు. మధ్య శ్రేణి ఫ్యాషన్, వ్యాల్యూ ఫ్యాషన్, క్రీడా వ్రస్తాలు, జ్యుయ లరీ విభాగాల నుంచి బలమైన డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా సైతం మెరుగ్గా ఉంటుందని అంచనా వేశారు. రిటైల్ కేంద్రాలు షాపింగ్, డైనింగ్, వినోదం కలిసిన వినూత్నమైన అనుభవాన్ని అందిస్తూ, వినియోగదారులను ఆకర్షిస్తున్నట్టు తెలిపారు. పట్టణాల వారీగా లీజింగ్ → హైదరాబాద్ మార్కెట్లో 2024లో రిటైల్ స్పేస్ లీజింగ్ డిమాండ్ 10 లక్షల చదరపు అడుగులకు చేరింది. అంతక్రితం ఏడాది ఇది 7 లక్షల చదరపు అడుగులుగానే ఉంది. → చెన్నైలోనూ రిటైల్ స్పేస్ లీజింగ్ 6 లక్షల ఎస్ఎఫ్టీ నుంచి 7 లక్షల ఎస్ఎఫ్టీకి పెరిగింది. → ఢిల్లీ ఎన్సీఆర్లో 2023లో 14 లక్షల చదరపు అడుగుల లీజింగ్ నమోదు కాగా, 2024లో 10 లక్షల ఎస్ఎఫ్టీకి పరిమితమైంది. → బెంగళూరులో పెద్దగా మార్పు లేకుండా 19 లక్షల ఎస్ఎఫ్టీ లీజింగ్ లావాదేవీలు జరిగాయి. → ముంబైలో 10 లక్షల ఎస్ఎఫ్టీ నుంచి 8 లక్షల ఎస్ఎఫ్టీకి లీజింగ్ తగ్గింది. → పుణెలోనూ 8 లక్షల చదరపు అడుగుల నుంచి 6 లక్షలకు పరిమితమైంది. → కోల్‌కతాలో రిటైల్ స్పేస్ లీజింగ్ లక్ష చదరపు అడుగుల నుంచి 2 లక్షలకు పెరిగింది. → అహ్మదాబాద్‌లో 5 లక్షల నుంచి 4 లక్షల ఎస్ఎఫ్టీకి పరిమితమైంది. -
వచ్చే రెండేళ్లలో రూ. 1000 కోట్లు: రియల్టీ దిగ్గజం
చెన్నై: కార్యకలాపాల విస్తరణలో భాగంగా రియల్టీ దిగ్గజం జీ స్క్వేర్ రియల్టర్స్ వచ్చే రెండేళ్లలో రూ. 1,000 కోట్లు పైగా ఇన్వెస్ట్ చేయనుంది. ప్రస్తుతం హైదరాబాద్, కోయంబత్తూర్ తదితర నగరాల్లో ప్లాట్లను విక్రయిస్తున్న కంపెనీ ఇక తెలంగాణ, కర్ణాటక, తమిళనాడువ్యాప్తంగా రెసిడెన్షియల్ విభాగంలోకి విస్తరించాలని భావిస్తోంది. విల్లాలు, అపార్ట్మెంట్లను కూడా నిర్మించనుంది. ప్లాట్ మార్కెట్లో విజయవంతమైన నేపథ్యంలో గృహాల మార్కెట్లోకి కూడా ప్రవేశిస్తున్నట్లు సంస్థ ఎండీ బలరామజయం తెలిపారు. జీ స్క్వేర్ ఇప్పటివరకు 127 ప్రాజెక్టులను పూర్తి చేసిందని, 15,000 మంది పైగా కస్టమర్లకు సేవలు అందించిందని వివరించారు. -
ఇంటి కలకు భరోసా!
గత బడ్జెట్లో అందించిన పలు ప్రోత్సాహక చర్యలకు కొనసాగింపుగా, 2025 బడ్జెట్లోనూ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి పలు కీలక చర్యలు ఉంటాయని పరిశ్రమ వర్గాలు ఆశావహంగా ఉన్నాయి. ముఖ్యంగా 2024 ద్వితీయ భాగంలో ఇళ్ల అమ్మకాలు బలహీనడపడ్డాయి. అందుబాటు ధరల ఇళ్ల విభాగంలో (అఫర్డబుల్ హౌసింగ్) ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో పన్నుల ఉపశమనంతోపాటు, రియల్ ఎస్టేట్ రంగానికి మౌలిక రంగం హోదా కల్పించాలని, అనుమతులకు సింగిల్ విండో విధానం తీసుకురావాలని ఈ రంగం కోరుతోంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన విస్తరణ, పారిశ్రామిక పార్కుల అభివృద్ధి, స్టాంప్ డ్యూటీ తగ్గింపు వంటి చర్యలకు గత బడ్జెట్లో చోటు కల్పించడం గమనార్హం. పరిశ్రమ వినతులు → మౌలిక రంగం హోదా కల్పించాలి. దీనివల్ల డెవలపర్లకు తక్కువ రేట్లకే రుణాలు అందుబాటులోకి వస్తాయి. కొనుగోలు దారులకు ఈ మేరకు ధరల్లో ఉపశమనం లభిస్తుంది. → రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌కు పలు రకాల అనుమతులు పొందేందుకు ఎంతో కాలం వృధా అవుతోంది. అన్ని రకాల అనుమతులకు సింగిల్ విండో (ఏకీకృత విభాగం) తీసుకురావాలి. → గతేడాది ఇళ్ల అమ్మకాలు క్షీణించడాన్ని రియల్టీ రంగం ప్రధానంగా ప్రస్తావిస్తోంది. అందుబాటు ధరల విభాగం (రూ.45 లక్షల్లోపు/60–90 చ.మీ కార్పెట్ ఏరియా)లో 2017 నుంచి అమ్మకాల్లో స్తబ్దత నెలకొంది. గత నాలుగేళ్లలో ధరలు పెరిగినందున ఈ విభాగం ధరల పరిమితిని సవరించాలి. → ఆదాయపన్ను పాత విధానంలో సెక్షన్ 24 కింద గృహ రుణ వడ్డీ చెల్లింపులపై రూ.2 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉండగా, దీన్ని మరింత పెంచాలి. కొత్త విధానంలోనూ వెసులుబాటు ఇవ్వాలి. → మరింత మంది డెవలపర్లు ఆఫీస్ స్పేస్ విభాగంలోకి అడుగు పెట్టేందుకు వీలుగా అద్దె ఆదాయంపై పన్ను ప్రయోజనాలు కల్పించాలి. → దేశవ్యాప్తంగా జీసీసీల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు కల్పించాలి. ప్రాపర్టీ లీజులకు జీఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సదుపాయం అందించాలి.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
రియల్టీపైనే కుబేరుల కన్ను..
న్యూఢిల్లీ: దేశీయంగా అత్యంత సంపన్నులు (హెచ్ఎన్ఐలు, యూహెచ్‌ఎన్‌ఐలు) రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్ చేయడంపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. వచ్చే రెండేళ్లలో రియల్టీపై గణనీయంగా పెట్టుబడులు పెట్టాలని 62 శాతం మంది పైగా కుబేరులు భావిస్తున్నారు. సంపన్నుల పెట్టుబడుల ధోరణులపై లగ్జరీ ప్రాపర్టీలకు సంబంధించిన రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ ఇండియా సోత్బీస్ ఇంటర్నేషనల్ రియల్టీ నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. పెద్ద నగరాలకు చెందిన 623 మంది హెచ్ఎన్ఐలు, యూహెచ్‌ఎన్‌ఐలు ఇందులో పాల్గొన్నారు.ఈ సర్వే ప్రకారం, భారత ఆర్థిక వృద్ధిపై ఆశాభావం కాస్త నెమ్మదించినప్పటికీ, వృద్ధి పటిష్టంగానే ఉండగలదనే అంచనాలు ఉన్నాయి. 2024లో ఆశాభావం 79 శాతంగా ఉండగా 2025 సర్వేలో ఇది 71 శాతానికి నెమ్మదించింది. అయినప్పటికీ, దేశ జీడీపీ వృద్ధి 6 శాతం నుంచి 6.5 శాతం వరకు ఉండొచ్చన్న అంచనాల నేపథ్యంలో.. భారత్ అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఎకానమీగానే కొనసాగుతుందని చాలా మటుకు హెచ్ఎన్ఐలు, యూహెచ్‌ఎన్‌ఐలు విశ్వసిస్తున్నారు.‘ఏడాది, రెండేళ్లలో రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్ చేయాలని భావిస్తున్న సంపన్నుల సంఖ్య 2024లో 71 శాతంగా ఉండగా 2025లో 62 శాతానికి పరిమితమైంది. అయినప్పటికీ పెట్టుబడులకు ఆకర్షణీయమైన సాధనంగా రియల్టీపై ఇంకా గట్టి నమ్మకం ఉండటాన్ని ఇది సూచిస్తుంది‘ అని నివేదిక వివరించింది. రాబడులపై ఆశాభావం.. పెట్టుబడి గణనీయంగా వృద్ధి చెందుతుందనే అంచనాలే, లగ్జరీ రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రధాన కారణమని సంపన్నులు వెల్లడించారు. 2024లో ఇలా చెప్పిన వారి సంఖ్య 44 %గా ఉండగా ప్రస్తుతం ఇది 55 శాతానికి పెరిగింది. ఇక రియల్టీ పెట్టుబడులపై రాబడులు 12–18% స్థాయిలో ఉంటాయని సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు సగం మంది ఆశాభావంతో ఉన్నారు. 38% మంది మాత్రం ఇది 12% కన్నా తక్కువే ఉంటుందని భావించగా .. 18 శాతానికి మించి ఉంటుందని 15%మంది అభిప్రాయపడ్డారు.‘కాస్త ఆచితూచి వ్యవహరించే ధోరణి నెలకొన్నా, దేశీయంగా లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్ వృద్ధి కొనసాగుతుంది. ముఖ్యంగా విశాలమైన ఫార్మ్‌హౌస్‌లు, గేటెడ్ కమ్యూనిటీ విల్లాలు మొదలైన వాటికి డిమాండ్ ఉంటుందని భావిస్తున్నాం‘ అని ఇండియా సోత్బీస్ ఇంటర్నేషనల్ రియల్టీ ఎండీ అమిత్ గోయల్ తెలిపారు. ఒకప్పుడు హోదాకు చిహ్నంగా నిల్చిన లగ్జరీ రియల్ ఎస్టేట్ ప్రస్తుతం మెరుగైన పెట్టుబడి సాధనంగా మారిందని సంస్థ సీఈవో అశ్విన్ చడ్ఢా పేర్కొన్నారు.బిలియనీర్ల బూస్ట్..దేశీయంగా బిలియనీర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం సైతం రియల్టీకి కలిసొస్తోందని నివేదిక పేర్కొంది. యూబీఎస్ నివేదికను ఉటంకిస్తూ, కుబేరుల సమష్టి సంపద 42 శాతం వృద్ధి చెంది ఏకంగా దాదాపు 905 బిలియన్ డాలర్ల స్థాయిని దాటిందని వివరించింది. గత దశాబ్దకాలంలో భారత్‌లో బిలియనీర్ల సంఖ్య రెట్టింపై 185కి చేరుకోగా, మొత్తం సంపద మూడు రెట్లు పెరిగినట్లు తెలిపింది. దీంతో అంతర్జాతీయంగా అత్యధిక సంఖ్యలో కుబేరులకు కేంద్రంగా అమెరికా, చైనా తర్వాత భారత్ మూడో స్థానంలో ఉన్నట్లు వివరించింది -
అభిషేక్ బచ్చన్‌కు ఎస్బీఐ నుంచి భారీ ఆదాయం
బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) తనయుడు అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడు, నిర్మాతగా ప్రసిద్ధి చెందారు. గురు, ధూమ్, దోస్తానా, హ్యాపీ న్యూ ఇయర్, బంటీ ఔర్ బబ్లీ వంటి చిత్రాలలో తన నటనతో గుర్తింపు పొందారు. అభిషేక్ నటనతో పాటు వ్యాపార రంగంలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. క్రీడలలోనూ చురుకుగా పాల్గొనే ఆయనకు వివిధ క్రీడా జట్లలో వాటాలు ఉన్నాయి.ఎస్బీఐ నుంచి నెలకు రూ.18లక్షలుదేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అభిషేక్ బచ్చన్‌కు ప్రతి నెలా రూ. 18 లక్షలు చెల్లిస్తుందని మీకు తెలుసా? అభిషేక్ బచ్చన్, విశ్వ సుందరి, బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్‌ను పెళ్లాడిన విషయం తెలిసిందే. ఈ దంపతులకు ఆరాధ్య బచ్చన్ అనే ఒక కుమార్తె ఉంది.రూ.280 కోట్ల నెట్‌వర్త్ ఉన్న అభిషేక్ బచ్చన్ తమ విలాసవంతమైన జుహు బంగ్లా, అమ్ము, వాట్స్ భవనాల్లోని గ్రౌండ్ ఫ్లోర్ కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో లాభదాయకమైన లీజు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఎస్బీఐ ఈ స్థలాన్ని 15 సంవత్సరాల పాటు లీజుకు తీసుకుంది. ఇది బచ్చన్ కుటుంబానికి గణనీయమైన అద్దె ఆదాయాన్ని అందిస్తుంది.రియల్ ఎస్టేట్ ఒప్పందాలను బయటపెట్టే జాప్కీ (Zapkey.com) అనే సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. బచ్చన్ కుటుంబం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య 15 సంవత్సరాల లీజు ఒప్పందం కుదిరింది. అభిషేక్ బచ్చన్ ప్రస్తుతం బ్యాంకు నుంచి నెలవారీ అద్దె రూ.18.9 లక్షలు తీసుకుంటున్నారు. ఈ అద్దె కాలానుగుణంగా పెరుగుదలకు సంబంధించిన క్లాజులు కూడా లీజులో పత్రాల్లో ఉన్నాయి. అద్దె ఐదేళ్ల తర్వాత రూ. 23.6 లక్షలకు, పదేళ్ల తర్వాత రూ. 29.5 లక్షలకు పెరుగుతుంది. నివేదికల ప్రకారం.. బచ్చన్ కుటుంబ నివాసమైన ‘జల్సా’కు సమీపంలో ఉన్న భవనంలో 3,150 చదరపు అడుగుల స్థలాన్నే ఎస్బీఐ లీజుకు తీసుకుంది. -
లగ్జరీ ఇళ్లల్లో కొత్త ట్రెండ్..
ఆధునికత, విలాసవంతమైన జీవనశైలికి యువ గృహ కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు. లగ్జరీ కాదు.. అంతకుమించి కోరుకుంటున్నారు. దీంతో 4 వేల నుంచి 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అపార్ట్మెంట్లను నిర్మిస్తున్నారు. ఇవి విశాలంగా ఉంటున్నాయే తప్ప సేవలపరంగా యువ కస్టమర్లలో అసంతృప్తి ఉంది. వీరిని సంతృప్తి పరిచేలా యువ డెవలపర్లు బ్రాండెడ్ హౌసింగ్‌లను నిర్మిస్తున్నారు. అగ్రశ్రేణి ఆతిథ్య సంస్థలతో కలిసి బ్రాండెడ్ రెసిడెన్సీ ప్రాజెక్ట్‌లను చేపడుతున్నారు. ఇప్పటివరకు ముంబై, బెంగళూరు, గుర్గావ్ వంటి నగరాలకే పరిమితమైన ఈ తరహా ప్రాజెక్ట్‌లు హైదరాబాద్‌లోనూ నిర్మితమవుతున్నాయి. – సాక్షి, సిటీబ్యూరోమారియట్, తాజ్, లీలా, ఇంటర్కాంటినెంటల్ వంటి అగ్రశ్రేణి ఆతిథ్య సంస్థలతో కలిసి విలాసవంతమైన అపార్ట్మెంట్లను నిర్మించడమే ఈ రెసిడెన్సీల ప్రత్యేకత. డిజైనింగ్, ఆర్కిటెక్చర్, ఎలివేషన్స్, విస్తీర్ణం, వసతులు, సేవలు.. అన్నీ టాప్ క్లాస్‌గా ఉంటాయి. బ్రాండెడ్ రెసిడెన్సీ అంటే కేవలం ప్రాపర్టీని కొనుగోలు చేయడం కాదు.. అంతర్జాతీయ జీవనశైలి అనుభూతిని పొందడం.బ్రాండెడ్ రెసిడెన్సీలు అంటే? స్టార్ హోటల్ సేవలు, అపార్ట్మెంట్ కలిపి ఉండే మిశ్రమ వినియోగ ప్రాజెక్ట్‌లనే బ్రాండెడ్ రెసిడెన్సీలు అంటారు. ఇందులో లేఔట్ స్థలంలో నివాసాల కోసం ప్రత్యేకంగా ఒక టవర్ ఉంటుంది. పక్కనే మరో టవర్‌లో హోటల్ ఉంటుంది. నివాసితులకు సేవలన్నీ ఆతిథ్య సంస్థలే అందిస్తాయి. కొన్ని ప్రాజెక్ట్‌లలో దిగువ అంతస్తుల్లో హోటల్, ఎగువ అంతస్తులో నివాస యూనిట్లు ఉంటాయి. నివాసితులకు ప్రత్యేక యాప్ ఉంటుంది. దాంట్లో నుంచి హోటల్లోని ఫుడ్, స్పా, సెలూన్ వంటి ఆర్డర్ చేయవచ్చు. వాళ్లే అపార్ట్‌మెంట్‌కు వచ్చి సర్వీస్ చేస్తారు. బ్రాండెడ్ గృహాల నిర్వహణ మొత్తం ఆతిథ్య సంస్థల ఆపరేటర్లే చూసుకుంటారు. హెచ్ఎన్ఐ, ప్రవాసులు కస్టమర్లు.. కొనుగోలుదారులకు అంతర్జాతీయ జీవనశైలి, డెవలపర్లకు అధిక రాబడి అందించే ప్రీమియం బ్రాండెడ్ గృహాలకు ఆదరణ పెరిగింది. ఫైవ్, సెవెన్ స్టార్ హోటళ్లు బ్రాండెడ్ రెసిడెన్సీల విభాగంలోకి ఎంట్రీ ఇచ్చాయి. దీంతో హెచ్ఎన్ఐలు(హై నెట్‌వర్త్ ఇండివిడ్యు వల్స్), ప్రవాసులు, బిజినెస్ టైకూన్లు, సినీ, క్రీడా సెలబ్రిటీలు డిజైనర్ హోమ్స్‌కు ఆసక్తి చూపిస్తున్నారు. బ్రాండెడ్ రెసిడెన్సీ కస్టమర్లు రెండు, లేదా మూడో గృహ కొనుగోలుదారులై ఉంటారు. దీంతో వీరికి ఆధునిక వసతులే అధిక ప్రాధాన్యత. ఎవరెక్కువ, వినూత్న, విలాసవంతమైన వసతులు అందిస్తారో అందులో కొనుగోలు చేస్తారు.ఎక్కడ వస్తున్నాయంటే.. దేశంలోని విలాసవంతమైన మార్కెట్లో హైదరాబాద్ వాటా 10 శాతంగా ఉంది. మన దేశంలో బ్రాండెడ్ హౌసెస్ 2,900 యూనిట్లు ఉండగా.. గ్లోబల్ మార్కెట్లో 3 శాతం వాటాగా నమోదైంది. అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు ఉన్న ప్రాంతాల్లోనే ఈ తరహా ప్రాజెక్ట్‌లకు డిమాండ్ ఉంటుంది. కోకాపేట, నియోపొలిస్, హైటెక్‌సిటీ, రాయదుర్గం, నానక్‌రాంగూడ, పుప్పాలగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రీమియం ప్రాంతాల్లో ఈ తరహా నిర్మాణాలు వస్తున్నాయి. శ్రీఆదిత్య హోమ్స్, బ్రిగేడ్ వంటి పలు నిర్మాణ సంస్థలు బ్రాండెడ్ రెసిడెన్సీలను నిర్మిస్తున్నాయి. వీటి ధరలు రూ.6–8 కోట్ల నుంచి ప్రారంభమవుతాయి.ప్రైవసీ, భద్రత.. కరోనా తర్వాత విలాసవంతమైన ఇళ్ల అమ్మకాలు పెరుగుతూ ఉన్నాయి. మిగతా విభాగంలోని ఇళ్లపై ప్రభావం పడినా.. అత్యంత లగ్జరీ ఆవాసాలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఐటీ, ఫార్మా, తయారీ రంగంతో పాటు కాస్మోపాలిటన్ కల్చర్‌తో నగరంలో లగ్జరీకి మించి జీవనశైలి కోరుకుంటున్నారు. సెవెన్ స్టార్ హోటల్లో మాదిరి గ్రాండ్ లాంజ్, డబుల్ హైట్ బాల్కనీ, హోమ్ ఆటోమేషన్, స్కై వ్యూ, స్పా, స్కై లాంజ్, మినీ థియేటర్, రూఫ్‌టాప్ డైనింగ్, ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్, ప్రైవసీ, భద్రత అన్ని ఉంటాయి.ఎక్కువ గ్రీనరీ, ఓపెన్ స్పేస్.. ఆర్కిటెక్చర్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ డిజైన్, పర్యావరణహితంగా ఉండేలా అంతర్జాతీయ డిజైనర్లతో తోడ్పాటు అందిస్తారు. ఈ ప్రాజెక్ట్‌లలో విశాలమైన బాల్కనీ, గ్రీనరీ, ఓపెన్ స్పేస్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దీంతో సాధారణ గృహాలతో పోలిస్తే రెసిడెన్సీలలో 5–7 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. ఇంట్లోకి గాలి, వెలుతురు ధారాళంగా వస్తాయి. వేర్వేరుగా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ద్వారాలు, ప్రతి అపార్ట్‌మెంట్‌కు ప్రత్యేక మార్గం ఉంటుంది. అపార్ట్మెంట్ ఫేసింగ్ ఎదురెదురుగా ఉండదు. దీంతో పూర్తిగా ప్రైవసీ ఉంటుంది. ఒకేరకమైన అభిరుచులు, జీవన శైలి కోరుకునే నివాసితులు ఒకే గేటెడ్ కమ్యూనిటీలో ఉండటంతో వీరి మధ్య సామాజిక సంబంధాలు బలపడతాయి. -
రియల్ ఎస్టేట్ సంస్థలు.. అదిరే లాభాలు!
రియల్ ఎస్టేట్ సంస్థ మాక్రోటెక్ డెవలపర్స్ (Macrotech Developers)ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్లో రూ.944 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. ఇళ్లకు డిమాండ్ పెరగడం ఇందుకు ప్రధాన కారణమని కంపెనీ తెలిపింది. గతేడాది ఇదే క్యూ3లో ఆర్జించిన రూ. 503 కోట్లతో పోలిస్తే ఇది 88 శాతం అధికంగా ఉంది. మొత్తం ఆదాయం రూ.2,958 కోట్ల నుంచి రూ.4,146 కోట్లకు చేరింది.‘‘డిసెంబర్ క్వార్టర్లో మొత్తం రూ.4,510 కోట్ల ముందస్తు విక్రయాలు జరిగాయి. ప్రీ–సేల్స్ రూ.4వేల కోట్ల పైగా జరగడం ఇది వరుసగా నాలుగో త్రైమాసికం. ఎన్నడూ లేని విధంగా ఈ క్యూ3లో మొత్తం రూ.4,290 కోట్ల వసూళ్లు జరిగాయి’’ అని కంపెనీ ఎండీ–సీఈవో అభిషేక్ లోధా తెలిపారు.– 2024–25 ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలల్లో నికరలాభం రూ.883 కోట్ల నుంచి రూ.1,842 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం రూ.6,385 కోట్ల నుంచి రూ.9,749 కోట్లకు చేరింది. ఇదే కాలంలో ముందస్తు విక్రయాలు 25% వృద్ది చెంది రూ.12,820 కోట్లు జరిగాయి. మైండ్‌స్పేస్ రీట్ లాభం అప్రియల్టీ రంగ సంస్థ మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ రీట్ (Mindspace REIT) ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. నికర నిర్వహణ ఆదాయం(ఎన్వోఐ) 8 శాతం పుంజుకుని రూ. 522 కోట్లను తాకింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 473 కోట్లు మాత్రమే ఆర్జించింది.యూనిట్ హోల్డర్లకు ఒక్కో యూనిట్‌కు రూ. 5.32 చొప్పున పంపిణీ చేయనున్నట్లు కంపెనీ తెలియజేసింది. తద్వారా రూ. 315.5 కోట్లు వెచ్చించనుంది. దీనిలో ఒక్కో యూనిట్‌కు రూ. 3.2 చొప్పున డివిడెండ్ కలసి ఉంది. ఇందుకు రూ. 190 కోట్లు చెల్లించనుంది. ఈ కాలంలో 1.7 మిలియన్ చదరపు అడుగులను లీజ్ కిచ్చినట్లు కంపెనీ సీఈవో రమేష్ నాయిర్ పేర్కొన్నారు.కాగా.. సస్టెయిన్ ప్రాపర్టీస్‌లో 100 శాతం వాటా కొనుగోలుకి ఆఫర్ ఇచ్చినట్లు మైండ్‌స్పేస్ రీట్ వెల్లడించింది. హైదరాబాద్ రాయ్దుర్గ్లోని కామర్‌జోన్ ఐటీ పార్క్‌లో 1.8 మిలియన్ చదరపు అడుగులను సస్టెయిన్ కలిగి ఉన్నట్లు తెలియజేసింది. బీఎస్ఈలో మైండ్‌స్పేస్ రీట్ షేరు 0.6 శాతం క్షీణించి రూ. 375 వద్ద ముగిసింది. -
షారుఖ్ ఖాన్‌కి రూ.9 కోట్లు వెనక్కి..
బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్‌కి (Sharukh Khan) మహారాష్ట్ర ప్రభుత్వం వెనక్కి ఇస్తోంది. సముద్రానికి ఎదురుగా ఉన్న తన బంగ్లా 'మన్నత్' (Mannat) లీజును యాజమాన్యంగా మార్చుకునేందుకు అధికంగా చెల్లించిన రూ.9 కోట్లను మహారాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఇవ్వనుంది.2019లో షారుఖ్ ఖాన్, ఆయన భార్య గౌరీ ఖాన్ బాంద్రాలోని పురాతన ఆస్తిని 'క్లాస్ 1 పూర్తి యాజమాన్యం'గా మార్చారని, దాని కోసం కొంత ప్రీమియం ప్రభుత్వానికి చెల్లించారని రెసిడెంట్ సబర్బన్ కలెక్టర్ సతీష్ బాగల్ తెలిపారు. ప్రీమియం లెక్కింపులో ట్యాబులేషన్ లోపాన్ని గుర్తించిన తర్వాత, షారుఖ్ ఖాన్ దంపతులు ఇటీవల మంజూరైన రీఫండ్ కోసం రెవెన్యూ అథారిటీకి దరఖాస్తు చేసుకున్నారని ఆయన వివరించారు.మన్నత్ భవనం లీజ్ కన్వర్షన్ కోసం షారుఖ్ ఖాన్ దంపతులు మహారాష్ట్ర ప్రభుత్వానికి రూ. 25 కోట్లకు పైగా ప్రీమియం చెల్లించినట్లు మీడియా కథనాలు వచ్చాయి. అయితే ఇది ఎంత వరకూ వాస్తవం అన్నది అధికారులు ధ్రువీకరించలేదు.ఇంద్ర భవనమే!బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నివసించే రూ. 200 కోట్ల విలువైన బంగ్లా మన్నత్ ఇంద్ర భవనాన్ని తలపిస్తుంది. ఈ భవనాన్ని చూసేందుకు అభిమానులు తండోపతండాలుగా వస్తుంటారు. ఈ ఇంటి ఇంటీరియర్ డిజైనింగ్ అంతా గౌరీ ఖాన్ (Gouri Khan) స్వయంగా చేయించారు.ఈ బంగ్లాను షారుఖ్ ఖాన్ 2001లో కొనుగోలు చేశారు. ఆ తర్వాత దానికి మన్నత్ అని పేరు పెట్టారు. గౌరీ ఖాన్ తన భర్త షారుఖ్ కోసం ఇంట్లో ప్రత్యేకంగా ఓ కార్నర్ ని తయారు చేయించారు. అక్కడ షారుఖ్ ఖాన్ కి వచ్చిన అవార్డులన్నింటినీ ప్రత్యేకంగా అలంకరించారు. మన్నత్ చాలా విశాలంగా ఉంటుంది. ఇంట్లో భారీ లగ్జరీ హోమ్ థియేటర్ ఉంది. ఆరు అంతస్తుల ఈ ఇంట్లో లిఫ్ట్ వ్యవస్థ కూడా ఉంది. అంతేకాదు, ఇంటి మెట్లను చెక్కతో తయారు చేయగా, ఇంటి అలంకరణ కోసం చెక్కతో పాటు వివిధ దేశాల నుంచి ప్రత్యేకమైన ఇంటీరియర్ ని ఉపయోగించారు.మన్నత్ గురించి మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ బంగ్లాను మొదట సల్మాన్ ఖాన్ కొనాలనుకున్నారట. కానీ సల్మాన్ తండ్రి సలీం ఇంత పెద్ద బంగ్లా మనకు అవసరం లేదని చెప్పడంతో ఆయన ఆ ఆలోచనను విరమించుకున్నారు. -
హైదరాబాద్‌లో ఇళ్ల విక్రయాలు డీలా..
హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు (Housing sales) 2024లో నెమ్మదించాయి. 2023తో పోలిస్తే 25 శాతం తక్కువగా, 61,722 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2023లో విక్రయాలు 82,350 యూనిట్లుగా ఉండడం గమనార్హం. అంతేకాదు, దేశవ్యాప్తంగా తొమ్మిది నగరాల్లోనూ 2024లో ఇళ్ల అమ్మకాలు 9% మేర క్షీణించాయి. 4.71 లక్షల యూనిట్ల ఇళ్ల అమ్మకాలు నమోదయ్యాయి.2023లో ఈ తొమ్మిది నగరాల్లో అమ్మకాలు 5,14,820 యూనిట్లుగా ఉన్నాయి. ఈ మేరకు ప్రాప్ ఈక్విటీ (PropEquity) సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది. డిమాండ్‌తోపాటు, తాజా సరఫరా తగ్గడం ఇందుకు కారణాలుగా పేర్కొంది. తొమ్మిది నగరాల్లో కొత్త ఇళ్ల సరఫరా (విక్రయానికి అందుబాటులోకి రావడం) 15 శాతం తగ్గి 4,11,022 యూనిట్లుగా ఉంది.పట్టణాల వారీగా విక్రయాలు.. బెంగళూరులో ఇళ్ల అమ్మకాలు 2024లో 9 % క్షీణించి 60,506 యూనిట్లుగా నమోదు.చెన్నైలో 11% తక్కువగా 19,212 యూనిట్లు అమ్ముడయ్యాయి. కోల్‌కతాలో అమ్మకాలు 2023తో పోల్చితే కేవ లం 1% తగ్గి 19,212 యూనిట్లకు పరిమితం.ముంబైలో అమ్మకాలు 6% క్షీణించాయి. 50,140 యూనిట్ల విక్రయాలు జరిగాయి.నవీ ముంబైలో మాత్రం విక్రయాలు 16 శాతం పెరిగి 33,870 యూనిట్లుగా ఉన్నాయి.పుణెలో ఇళ్ల విక్రయాలు 13 శాతం తగ్గి 92,643 యూనిట్లుగా ఉన్నాయి. థానేలో 5% తక్కువగా 90,288 యూనిట్ల అమ్మకాలు జరిగాయి.ఢిల్లీ ఎన్సీఆర్లో గతేడాది ఇళ్ల అమ్మకాలు 5% వృద్ధితో 43,923 యూనిట్లుగా నమోదయ్యాయి.“2024లో హౌసింగ్ సప్లై,సేల్స్ తగ్గడానికి అధిక బేస్ ఎఫెక్ట్ కారణం. 2023లో ఇది అత్యంత గరిష్టానికి చేరింది. గణాంకాలను విశ్లేషణ ప్రకారం సేల్స్ పడిపోయినప్పటికీ, 2024లో సరఫరా-స్వీకరణ నిష్పత్తి 2023లో ఉన్నట్టుగానే ఉంది. ఇది రియల్ ఎస్టేట్ రంగం ప్రాథమికాలు బలంగా, ఆరోగ్యంగా ఉన్నాయని సూచిస్తున్నాయి” అని ప్రాప్‌ఈక్విటీ వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ జసూజా అన్నారు. -
దక్షిణ హైదరాబాద్‌కు 'రియల్' అభివృద్ధి!
నీళ్లు ఎత్తు నుంచి పల్లెం వైపునకు ప్రవహించినట్లే.. రోడ్లు, విద్యుత్, రవాణా వంటి మెరుగైన మౌలిక సదుపాయాలు ఉన్న చోటుకే అభివృద్ధి విస్తరిస్తుంది. ఐటీ ఆఫీస్ స్పేస్, నివాస, వాణిజ్య సముదాయాలతో కిక్కిరిసిపోయిన పశ్చిమ హైదరాబాద్ అభివృద్ధి (Real estate Development) క్రమంగా దక్షిణ హైదరాబాద్ (South Hyderabad) మార్గంలో శరవేగంగా విస్తరిస్తోంది. విమానాశ్రయంతో పాటు ఔటర్ మీదుగా వెస్ట్‌తో సౌత్ అనుసంధానమై ఉండటం ఈ ప్రాంతం మెయిన్ అడ్వాంటేజ్. దీనికి తోడు ప్రభుత్వం కూడా ఏఐ, ఫ్యూచర్ సిటీలను దక్షిణ హైదరాబాద్‌లోనే అభివృద్ధి చేయనుంది. పుష్కలంగా భూముల లభ్యత, అందుబాటు ధర, మెరుగైన రవాణా, మౌలిక వసతులు ఉండటంతో దక్షిణ ప్రాంతంలో రియల్ మార్కెట్ అభివృద్ధి చెందే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని శ్రీఆదిత్య హోమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆదిత్యరెడ్డి అన్నారు. ‘సాక్షి రియల్టీ’ ఇంటర్వ్యూలోని మరిన్ని అంశాలివీ.. – సాక్షి, సిటీబ్యూరోనగరం నాలుగు వైపులా అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రధాన నగరంలో మూసీ సుందరీకరణ, శివార్లలో ఫ్యూచర్ సిటీ, మెట్రో రెండో దశ విస్తరణ వంటి బృహత్తర ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుట్టింది. ఆయా ప్రాజెక్ట్‌లతో గృహ కొనుగోలుదారుల భావోద్వేగాలు మారుతాయి. జనసాంద్రత, రద్దీ ప్రాంతాల్లో ఉండే బదులు ప్రశాంతత కోసం దూరప్రాంతాలను ఎంచుకుంటారు. ఇదే సమయంలో మెట్రో విస్తరణతో కనెక్టివిటీ పెరగడంతో పాటు ఆయా మార్గాలలో రియల్ ఎస్టేట్ అవకాశాలు ఏర్పడతాయి. ఉదాహరణకు ఓల్డ్‌సిటీ, చాంద్రయాణగుట్ట మీదుగా శంషాబాద్‌కు మెట్రో అనుసంధానంతో ఆయా ప్రాంతాల్లో కూడా గేటెడ్ కమ్యూనిటీలు జోరుగా వస్తాయి. దీంతో బడ్జెట్ హోమ్స్‌తో సామాన్యుడి సొంతింటి కల మరింత చేరువవుతుంది.ట్రిపుల్ ఆర్తో ఉద్యోగ అవకాశాలు హైదరాబాద్ అభివృద్ధి దశను మార్చేసిన ఔటర్ రింగ్ రోడ్డుకు అవతల 30 కి.మీ. దూరంలో రీజినల్ రింగ్ రోడ్డు(ట్రిపుల్ ఆర్)ను నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఔటర్ లోపల ప్రాంతం ఇప్పటికే రద్దీ అయిపోయింది. ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్కు, ట్రిపుల్ ఆర్ నుంచి రాష్ట్ర సరిహద్దుల వరకు ఇలా వేర్వేరు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అభివృద్ధి ప్రణాళికలు, మాస్టర్ ప్లాన్లను చేపట్టాలి. ట్రిపుల్ ఆర్తో నగరంతోనే కాదు రాష్ట్రంలోని ఇతర జిల్లాలూ అనుసంధానమై ఉంటాయి. కనెక్టివిటీ పెరిగి రవాణా మెరుగవుతుంది. దీంతో ప్రధాన నగరంపై ఒత్తిడి తగ్గడంతో పాటు శివారు, పట్టణ ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందుతాయి. ట్రిపుల్ ఆర్ ప్రాంతాల్లో కేవలం నివాస, వాణిజ్య సముదాయాలే కాదు గిడ్డంగులు, పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది. దీంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి.సిటీ వ్యూతో బాల్కనీ కల్చర్.. లగ్జరీ హౌసింగ్ అంటే కనిష్టంగా 2,500 చ.అ. విస్తీర్ణం ఉండాలి. అయితే విస్తీర్ణం మాత్రమే లగ్జరీని నిర్వచించలేదు. బెంగళూరు, ముంబైలలో 3 వేల చ.అ. ఫ్లాట్లనే ఉబర్ లగ్జరీ అపార్ట్‌మెంట్‌గా పరిగణిస్తారు. కానీ, మన దగ్గర 6, 8, 10 వేల చ.అ.ల్లో కూడా అపార్ట్మెంట్లు కూడా నిర్మిస్తున్నారు. అయినా కూడా ఇతర మెట్రోలతో పోలిస్తే మన దగ్గరే ధరలు తక్కువగా ఉంటాయి. ఉదాహరణకు.. హైదరాబాద్‌లో 5–10 వేల చ.అ. ఫ్లాట్ రూ.6–12 కోట్లలో ఉంటే.. బెంగళూరు, ముంబై నగరాల్లో 3 వేల చ.అ. ఫ్లాటే రూ.12 కోట్లు ఉంటుంది. పుష్కలమైన స్థలం, వాస్తు, కాస్మోపాలిటన్ కల్చర్, ఆహ్లాదకరమైన వాతావరణం, జీవనశైలి బాగుండటం వల్లే హైదరాబాద్‌లో లగ్జరీ ప్రాజెక్ట్‌లు వస్తున్నాయి. మన నగరంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి విశాలమైన, డబుల్ హైట్ బాల్కనీలను వాడుతుంటారు. అదే ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో వాతావరణం పొల్యూషన్ కాబట్టి బాల్కనీలు అంతగా ఇష్టపడరు.ఇంటి అవసరం పెరిగింది గతంలో ఇండిపెండెంట్ హౌస్‌లు ఎక్కువగా ఉండేవి. అందుకే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అబిడ్స్ వంటి పాత నగరంలో ఈ తరహా ఇళ్లే ఎక్కువగా కనిపిస్తాయి. కానీ, ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీలు, లగ్జరీ కమ్యూనిటీ లివింగ్ల ప్రాధాన్యం పెరిగింది. దీంతో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట వంటి ఖరీదైన ప్రాంతాల్లో నివాసానికి ఆసక్తి చూపిస్తున్నారు. కరోనా తర్వాత ఇంటి ప్రాముఖ్యత, అవసరం తెలిసొచ్చింది. వర్క్ ఫ్రం హోమ్‌తో 50–60 శాతం సమయం ఇంట్లోనే గడపాల్సిన పరిస్థితి. ఇప్పుడున్న పిల్లలు సెల్ఫోన్లు, టీవీలకు అతుక్కుపోతున్నారు. బయటకు వెళ్లి ఆడుకోవాలంటే ట్రాఫిక్ ఇబ్బందులు, భద్రత ఉండదు. అదే గేటెడ్ కమ్యూనిటీల్లో ఇబ్బందులు ఉండవు. కమ్యూనిటీ లివింగ్లలో గృహిణులు, పిల్లలకు రక్షణ ఉండటంతో పాటు ఒకే తరహా అభిరుచులు ఉన్నవాళ్లు ఒకే కమ్యూనిటీలో ఉంటారు. అలాగే ఒకే ప్రాంతంలో అన్ని వసతులు అందుబాటులో ఉంటాయి. దీంతో టెన్షన్ ఉండదు. చోరీలు, ప్రమాదాల వంటి భయం ఉండదు. సీసీటీవీ కెమెరాలు, 24/7 సెక్యూరిటీ సిబ్బందితో భద్రత ఉంటుంది. నిరంతరం నిర్వహణతో కమ్యూనిటీ పరిశుభ్రంగా, హైజీన్‌గా ఉంటుంది. థర్డ్ పార్టీ మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా వంద శాతం పవర్ బ్యాకప్, నిరంతరం నీటి సరఫరా ఉంటుంది. -
రియల్ ఎస్టేట్: ఫ్లాటా.. ప్లాటా.. ఏది బెటర్?
ఓపెన్ ప్లాట్ (Open plot), అపార్ట్మెంట్, కమర్షియల్ స్పేస్, రిటైల్.. ఇలా రియల్ ఎస్టేట్ (Real estate) పెట్టుబడులకు సాధనాలు అనేకం. కానీ, ఓపెన్ ప్లాట్లలో ఇన్వెస్ట్మెంట్స్తోనే అధిక రాబడి వస్తుందని హౌసింగ్.కామ్ సర్వే తెలిపింది. 2015 నుంచి దేశంలోని 8 ప్రధాన నగరాలలో ప్రతి సంవత్సరం స్థలాల ధరలలో 7 శాతం వృద్ధి నమోదవుతుంటే.. అపార్ట్మెంట్లలో మాత్రం 2 శాతమే పెరుగుదల కనిపిస్తోందని పేర్కొంది. హైదరాబాద్ (Hyderabad), చెన్నై, బెంగళూరు నగరాల్లోని నివాస ప్లాట్లకే ఎక్కువ డిమాండ్ ఉందని వెల్లడించింది. – సాక్షి, సిటీబ్యూరోపెద్ద నగరాలలో స్థలాల కొరత ఎక్కువగా ఉండటం, విపరీతమైన పోటీ నేపథ్యంలో ఉన్న కొద్ది స్థలాల ధరలు ఎక్కువగా ఉన్నాయని హౌసింగ్.కామ్ గ్రూప్ సీఈఓ ధ్రువ్ అగర్వాలా తెలిపారు. అందుకే ప్రధాన నగరాలలో పరిమిత స్థాయిలోని స్థలాలకు డిమాండ్ ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి సమయంలో ఓపెన్ ప్లాట్లకు, ఇండిపెండెంగ్ గృహాలకు డిమాండ్ ఏర్పడింది. దీంతో పెద్ద నగరాల్లోని శివారు ప్రాంతాలలో బడా డెవలపర్లు ఓపెన్ ప్లాట్ వెంచర్లు, వ్యక్తిగత గృహాల ప్రాజెక్ట్‌లను చేపడుతున్నారని, దీంతో డిమాండ్ పునఃప్రారంభమైందని చెప్పారు.కరోనాతో పెరిగిన డిమాండ్.. ఢిల్లీ–ఎన్సీఆర్, పుణే, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్కత్తా, అహ్మదాబాద్ ఎనిమిది ప్రధాన నగరాల్లో సాధారణంగా కొనుగోలుదారులు ఓపెన్ ప్లాట్ల కంటే ఫ్లాట్లు కొనుగోలు చేయడానికే ఇష్టపడతారు. ఎందుకంటే భద్రతతో పాటు పవర్ బ్యాకప్, కార్ పార్కింగ్, క్లబ్‌హౌస్, జిమ్, స్విమ్మింగ్ పూల్, గార్డెన్ వంటి కామన్ వసతులు ఉంటాయని అపార్ట్మెంట్ కొనుగోళ్లకే మొగ్గు చూపుతున్నారు. కానీ, కరోనా నేపథ్యంలో కామన్ వసతులు వినియోగం, అపార్ట్మెంట్లలో ఎక్కువ జనాభా వంటివి శ్రేయస్కరం కాదనే అభిప్రాయం ఏర్పడింది. దీంతో సొంతంగా స్థలం కొనుగోలు చేసి ఇళ్లు కట్టుకోవడమో లేక వ్యక్తిగత గృహాలను కొనుగోలు చేసేందుకే కొనుగోలుదారులు మొగ్గు చూపుతున్నారు.13–21 శాతం పెరిగిన ధరలు..హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలతో పాటూ గుర్గావ్లోని కొన్ని ప్రధాన ప్రాంతాలలోని నివాస స్థలాలకు డిమాండ్ పెరుగుతుందని హౌసింగ్.కామ్ రీసెర్చ్ హెడ్ అంకితా సూద్ తెలిపారు. 2018 నుంచి ఆయా నగరాలలోని ఓపెన్ ప్లాట్లలో రెండంకెల వృద్ధి నమోదవుతుందని పేర్కొన్నారు. గత మూడు సంవత్సరాలలో ఈ నగరాల్లో భూముల ధరలు 13–21 శాతం మేర పెరిగాయని చెప్పారు. ఇదే నగరాల్లోని అపార్ట్మెంట్ల ధరలలో మాత్రం 2–6 శాతం మేర వృద్ధి ఉందని తెలిపారు. కరోనా నేపథ్యంలో కొనుగోలుదారుల అభిరుచుల్లో వచ్చిన మార్పులు, పాలసీలతో రాబోయే త్రైమాసికంలో ఈ డిమాండ్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు.ఇదీ చదవండి: జూబ్లీహిల్స్‌లో బంగ్లా.. రూ.40 కోట్లు!హైదరాబాద్‌లో ప్లాట్లకే డిమాండ్ ఎక్కువఇతర దక్షిణాది నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోని ఓపెన్ ప్లాట్లకే డిమాండ్ ఎక్కువ గా ఉంది. 2018–24 మధ్య కాలంలో నగరంలోని స్థలాలలో గరిష్టంగా 21 శాతం వార్షిక వృద్ధి రేటు నమోదవుతుంది. శంకర్పల్లి, పటాన్చెరు, తుక్కుగూడ, మహేశ్వరం, షాద్‌నగర్ ప్రాంతాల్లోని స్థలాలకు డిమాండ్, ధరల పెరుగుదల ఎక్కువగా ఉందని తెలిపింది. కాగా.. చెన్నైలో ప్లాట్లలో వార్షిక వృద్ధి రేటు 18 శాతం, బెంగళూరులో 13 శాతం ఉంది. చెన్నైలో అంబత్తూరు, అవడి, ఒరిగడం, శ్రీపెరంబుదూర్, తైయూర్ ప్రాంతాలలో, బెంగళూరులో నీలమంగళ, దేవనహళ్లి, చిక్కబల్లాపూర్, హోస్కేట్, కొంబల్‌గోడు ప్రాంతాల్లోని ప్లాట్లకు ఆదరణ ఎక్కువగా ఉంది.2018–24 మధ్య ఢిల్లీ–ఎన్సీఆర్లో ప్లాట్ల వార్షిక వృద్ధి రేటు 15 శాతంగా ఉంది. సోహ్నా, గుర్గావ్లో భూముల ధరలు ఏటా 6 శాతం పెరుగుతున్నాయి. సెక్టార్ 99, ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే, సెక్టార్ 95ఏ, సెక్టార్ 70ఏ, సెక్టార్ 63లలోని నివాస స్థలాలలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. -
రియల్టీలో మహిళలకు ఉపాధి ఎక్కడ?
రియల్ ఎస్టేట్ రంగంలో ఉపాధి పరంగా మహిళలకు తగినన్ని అవకాశాలు దక్కడం లేదని రియల్టీ(Realty) సంస్థ మ్యాక్స్ ఎస్టేట్స్, ఇన్ టాండెమ్ గ్లోబల్ కన్సల్టెంగ్‌తో కలసి నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. భారత రియల్ ఎస్టేట్ పరిశ్రమ 7.1 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తుంటే, అందులో మహిళలు 70 లక్షలుగానే (10 శాతం) ఉన్నట్టు తెలిపింది. ఈ రంగంలో సమానత్వం సాధనకు ఎంతో సమయం పడుతుందని పేర్కొంది.‘భారత రియల్ ఎస్టేట్(Real Estate) రంగం కూడలి వద్ద ఉంది. అసాధారణ వృద్ధికి సిద్దంగానే ఉన్నా, సవాళ్ల కారణంగా పూర్తి సామర్థ్యాలను చూడలేకుంది. భారత జనాభాలో మహిళలు 48.5 శాతంగా ఉంటే, ఇందులో కేవలం 1.2 శాతం మందికే రియల్ ఎస్టేట్ రంగంలో ఉపాధి లభిస్తోంది’అని ఈ నివేదిక వెల్లడించింది. ఒకవైపు మహిళలకు తగినంత ప్రాతినిధ్యం లేకపోగా, మరోవైపు వారికి వేతన చెల్లింపుల్లో అసమానత్వం ఈ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లలో ఒకటిగా పేర్కొంది.‘ఉపాధి కల్పనలో రియల్ ఎస్టేట్ రంగానికి గణనీయమైన పాత్ర ఉంది. అయినప్పటికీ మహిళలకు సమాన అవకాశాల కల్పన పరంగా ఎంతో దిగువన ఉంది. లింగ అసమానతను పరిష్కరించడం ద్వారా ఆర్థిక ప్రయోజనాలను, ఉత్పాదకతను, ఆవిష్కరణలను, లాభదాయకతను గణనీయంగా పెంచొచ్చు’ అని ఈ నివేదిక సూచించింది. బ్లూకాలర్, వైట్ కాలర్ మహిళా కార్మికుల సాధికారత పెంచేందుకు నైపుణ్య శిక్షణ అందించాలని పేర్కొంది. మరింత మంది మహిళలకు భాగస్వామ్యం కలి్పంచడం వల్ల ఈ రంగం ముఖచిత్రం మారిపోతుందని ఇన్టాండెమ్ గ్లోబల్ కన్సల్టెంగ్ ఎండీ శర్మిష్ట ఘోష్ అభిప్రాయపడ్డారు. -
హైదరాబాద్‌లో పెరిగిన రిజిస్ట్రేషన్లు.. ఏ ప్రాంతంలో ఎక్కువంటే..
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ 2024లో గణనీయమైన వృద్ధిని కనబరిచింది. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు ఏడాది ప్రాతిపదికన 7 శాతం పెరిగాయి. ఈమేరకు నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక విడుదల చేసింది. నగరంలో 2023లో 71,912 ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు జరగ్గా, 2024లో 76,613 రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. నమోదైన మొత్తం ఆస్తుల విలువ కూడా 23 శాతం పెరిగి రూ.47,173 కోట్లకు చేరింది.ప్రీమియం ప్రాపర్టీస్హైదరాబాద్ ప్రాపర్టీ మార్కెట్లో రూ.1 కోటి, అంతకంటే ఎక్కువ విలువ చేసే గృహాల రిజిస్ట్రేషన్లు పెరిగాయి. 2023లో అంతకుముందు ఏడాది కంటే 10 శాతం పెరగ్గా, ఇప్పుడు రిజిస్ట్రేషన్లలో 14 శాతం వృద్ధి నమోదైంది. వినియోగదారులు ప్రీమియం ప్రాపర్టీల వైపు మళ్లడం గృహ కొనుగోలుదారుల ఆకాంక్షలను, నగరవాసుల ఆర్థిక మూలాలను ప్రతిబింబిస్తుంది.జిల్లాల వారీగా..రియల్టీ వ్యాపారం సీటీ పరిసరాల్లో పెరుగుతున్న నేపథ్యంలో మొత్తం రిజిస్ట్రేషన్లలో 83 శాతం మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లోనే ఎక్కువగా ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు జరిగాయి. మేడ్చల్-మల్కాజ్గిరిలోనే 42 శాతం, రంగారెడ్డిలో 41 శాతం రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. మిగిలిన 17% వాటా హైదరాబాద్ జిల్లా నుంచి ఉంది.ప్రాపర్టీ పరిమాణాల వారీగా..ప్రాపర్టీ పరిమాణాల పరంగా చూస్తే 1,000 నుంచి 2,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న వాటిని గృహాల నిర్మాణానికి వినియోగించారు. మొత్తం రిజిస్ట్రేషన్లలో వీటి వాటా 69%గా ఉంది. 2000 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణం కలిగిన ఆస్తులు 2023లో 11 శాతం ఉండగా, 2024లో 14 శాతానికి పెరిగాయి. 2024 డిసెంబరులో లావాదేవీల సగటు ధర 6% పెరిగింది.ఇదీ చదవండి: రూ.1,275 లక్షల కోట్లకు ప్రపంచ కుబేరుల సంపదనైట్ ఫ్రాంక్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజాల్ మాట్లాడుతూ.. లగ్జరీ జీవనానికి అలవాటు పడుతున్న నేపథ్యంలో ప్రీమియం గృహాలపై ఆసక్తి పెరుగుతుందన్నారు. అభివృద్ధి చెందుతున్న మార్కెట్ అవసరాలకు అనుగుణంగా అధునాతన ప్రాజెక్టులను ప్రారంభించడం ద్వారా డెవలపర్లు వినియోగదారుల డిమాండ్‌కు వేగంగా స్పందిస్తున్నారని చెప్పారు. -
ఇళ్ల నిర్మాణ వ్యయంలో భారీ కోత..?
భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామీణ గృహనిర్మాణ పథకం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ (PMAY-G)కు 2025 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదిత వ్యయం కంటే తక్కువ ఖర్చు చేయనున్నట్లు అంచనా. ఈ పథకం అమలుకు గతంలో అంచనా వేసిన దానికంటే రూ.20,000 కోట్లు కోత విధించబోతున్నట్లు తెలిసింది. ఈ పథకానికి సంబంధించి 2025-26 ఏడాదికి వాస్తవ వ్యయం సుమారు రూ.35,000 కోట్లు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీని గత బడ్జెట్(Budget) అంచనా రూ.54,500 కోట్ల కంటే చాలా తక్కువ.2025 నుంచి వచ్చే ఐదేళ్లలో రెండు కోట్ల ఇళ్లను నిర్మించాలని, గ్రామీణ కుటుంబాలకు అందుబాటు ధరల్లో గృహాలను అందించాలని పీఎంఏవై-జీ లక్ష్యంగా పెట్టుకుంది. పక్కా గృహాల నిర్మాణానికి యూనిట్‌కు రూ.2.39 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. అయితే, రాబోయే ఆర్థిక సంవత్సరానికి ముందుగా అనుకున్న మేరకు ఖర్చు చేయలేరనే అంచనాలు వెలువడుతున్నాయి. దాంతో ఈ పథకం లక్ష్యం నీరుగారినట్లువుతుందని లబ్ధిదారులు, మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ పథకం రెండో దశ ప్రారంభంలో ఆర్థిక సాయం అందించడంలో తీవ్రంగా జాప్యం జరగడమే ఈ అంచనాకు ప్రధాన కారణం. అర్హులైన కుటుంబాలను గుర్తించేందుకు సర్వే కొనసాగుతోందని, 2025 మార్చి వరకు ఈ సర్వే జరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. దాంతో సర్వే పూర్తై, నిధులు విడుదలై, ఇళ్ల నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందనే ప్రశ్నలు వస్తున్నాయి. పైగా 2025-26లో పథకం అమలు వ్యయంలో కోత విధిస్తారనే అంచనాలతో ఇళ్ల నిర్మాణం ప్రశ్నార్థకంగా మారుతుంది.ఇదీ చదవండి: చైనాపై ఆధారపడటాన్ని తగ్గించాలిపీఎం జన్‌మన్‌కు రూ.3.06 లక్షల కోట్లు2025 ఆర్థిక సంవత్సరం నుంచి ఐదేళ్లలో 20 లక్షల పక్కా గృహాలను నిర్మించాలనే లక్ష్యంతో ప్రధాన మంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (PM JANMAN)ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం పీఎంఏవై-జీ 2.0లో భాగంగా ఉంది. ఇది 2024-25 ఆర్థిక సంవత్సరం నుంచి 2028-29 ఆర్థిక సంవత్సరం వరకు మొత్తం రూ.3.06 లక్షల కోట్లు కేటాయించింది. ఇలా ప్రధానంగా పీఏంఏవై-జీ అమలులో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అదే తరహా కొత్త పథకాలు ప్రవేశపెట్టి లబ్ధిదారులను తగ్గిస్తుండడం పట్ల విమర్శలు వస్తున్నాయి. -
విశాలమైన ఇళ్ల కొనుగోలు.. టైర్–2 జోరు
కరోనా నేపథ్యంలో మొదలైన వర్క్ ఫ్రం హోమ్ (Work form Home) నేటికీ కొనసాగుతుండటంతో ‘టైర్–2’ (tier 2 cities) ద్వితీయ శ్రేణి పట్టణాల్లోని ప్రాపర్టీలకు డిమాండ్ ఏర్పడింది. ప్రధాన నగరంలో ఇరుకు ఇళ్ల మధ్య ఉండటం బదులు శివారు ప్రాంతాలకు, హరిత భవనాలు, విస్తీర్ణం ఎక్కువగా ఉండే గృహాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపు తున్నారు. -సాక్షి, సిటీబ్యూరోకరోనా రెండో దశ ఉధృతి నేపథ్యంలో సూరత్, జైపూర్, పాట్నా, మోహాలీ, లక్నో, కోయంబత్తూరు వంటి ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఆన్లైన్లో ప్రాపర్టీల శోధన గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయని హౌసింగ్.కామ్ ఇండియన్ రెసిడెన్షియల్ ఇండెక్స్ ఫర్ ఆన్లైన్ సెర్చ్(ఐఆర్ఐఎస్) తెలిపింది. ఆయా ద్వితీయ శ్రేణి పట్టణాల్లో గృహ కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారని పేర్కొంది. నోయిడాలోని నోయిడా ఎక్స్టెన్షన్, ముంబై లోని మీరా రోడ్ ఈస్ట్, అంధేరి వెస్ట్, బోరివలీ వెస్ట్, బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ ప్రాంతాలు ఈ ఏడాది దేశీయ నివాస సముదాయ మార్కెట్‌ను లీడ్ చేస్తాయని తెలిపింది.మారిన అభిరుచులు.. ఆన్లైన్లో రూ.2 కోట్లకు పైబడిన ప్రాపర్టీల శోధన ఒకటిన్నర శాతం వృద్ధి చెందిందని పేర్కొంది. గతంలో ప్రాపర్టీ కొనుగోలు చేయాలంటే ధర, వసతులు ప్రధాన అంశాలుగా ఉండేవి. కరోనా తర్వాత నుంచి గృహ కొనుగోలుదారుల ఎంపికలో మార్పులొచ్చాయి. వైద్య సదుపాయాలకు ఎంత దూరంలో ఉంది? భద్రత ఎంత? అనే వాటికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపింది.గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా వైద్య సదుపాయాలు, భద్రత, ఓపెన్ స్పేస్ ఎక్కువగా ఉన్న ప్రాజెక్ట్‌లకు డిమాండ్ ఉంటుందని హౌసింగ్.కామ్ గ్రూప్ సీఈఓ ధ్రువ్ అగర్వాలా తెలిపారు. 3 బీహెచ్‌కే, ఆపై పడక గదుల గృహాల్లో అంతకు క్రితం ఏడాదితో పోలిస్తే 2021లో 15 శాతం వృద్ధి నమోదయ్యిందని పేర్కొన్నారు. అదే సమయంలో గతేడాది పెద్ద సైజు ప్లాట్లలో 42 శాతం పెరుగుదల కనిపించింది.అద్దెలకు గిరాకీ.. ప్రాజెక్ట్‌ల ఆలస్యం, దివాలా డెవలపర్లు వంటి ప్రతికూల వాతావరణంలోనూ నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్సీఆర్)లో ప్రాపర్టీ శోధనలు గణనీయమైన స్థాయిలో పెరిగింది. నోయిడా ఎక్స్టెన్షన్ ప్రాంతం ఆన్లైన్ ప్రాపర్టీ సెర్చింగ్‌లో ప్రథమ స్థానంలో నిలిచింది. కేంద్రం, ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వాలు ఈ రీజియన్‌లో పలు మౌలిక సదుపాయ ప్రాజెక్ట్‌లను ప్రకటించడం, ధరలు అందుబాటులో ఉండటం వంటివి ఈ రీజియన్‌లో ప్రాపర్టీల వృద్ధికి కారణమని తెలిపింది.ఐటీ, ఫార్మా కంపెనీలు ఉద్యోగ నియామకాలను పెంచడంతో ముంబై, బెంగళూరు, ఢిల్లీ మార్కెట్లలో అద్దెలకు గిరాకీ పెరిగిందని పేర్కొంది. ఈ ఏడాది దేశీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ వృద్ధికి మరీ ముఖ్యంగా నివాస సముదాయ మార్కెట్లో ముంబై, బెంగళూరు, హైదరాబాద్ అత్యంత కీలకంగా కానున్నాయని అంచనా వేసింది. -
జూబ్లీహిల్స్‌లో బంగ్లా.. రూ.40 కోట్లు!
సాక్షి, సిటీబ్యూరో: కరోనా తర్వాత నుంచి లగ్జరీ గృహాలకు (luxury homes) ఆదరణ పెరిగింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో రూ.80 కోట్ల ఖరీదైన రెండు బంగ్లాలు, ఒక్కోటి రూ.40 కోట్ల చొప్పున అమ్ముడుపోయాయి. గతేడాది దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో రూ.40 కోట్లకు పైగా విలువైన 59 అల్ట్రా లగ్జరీ గృహాల విక్రయాలు జరిగాయని అనరాక్ గ్రూప్ నివేదిక వెల్లడించింది. వీటి విలువ రూ.4,754 కోట్లు. వీటిలో 53 అపార్ట్మెంట్లు కాగా.. 6 బంగ్లాలు ఉన్నాయి.2023లో సుమారు రూ.4,063 కోట్ల విలువైన 58 లగ్జరీ గృహాలు విక్రయించారు. మొత్తం అమ్మక విలువలో వార్షిక పెరుగుదల 17 శాతంగా ఉంది. 2024లో అమ్ముడైన అల్ట్రా లగ్జరీ గృహాలలో రూ.100 కోట్ల విలువైన యూనిట్లు 17 ఉన్నాయి. వీటి విలువ రూ.2,344 కోట్లు. గతేడాది 88 శాతం వాటాతో అత్యధికంగా ముంబైలో 52 అల్ట్రా లగ్జరీ యూనిట్లు సేల్ అయ్యాయి. ఢిల్లీ–ఎన్సీఆర్లో మూడు, బెంగళూరు, హైదరాబాద్‌లో రెండేసి గృహాలు అమ్ముడయ్యాయి.హెచ్ఎన్ఐ, ప్రవాసుల డిమాండ్ గత రెండేళ్లలో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 130 అల్ట్రా లగ్జరీ గృహాలు విక్రయమ్యాయి. వీటి విలువ రూ.9,987 కోట్లు. 2022లో రూ.1,170 కోట్ల విలువైన 13 యూనిట్లు అమ్ముడుపోయాయి. వీటిలో 10 అపార్ట్మెంట్లు కాగా మూడు బంగ్లాలు ఉన్నాయి. 2023లో రూ.4,063 కోట్ల విలువైన 58 యూనిట్లు అమ్ముడయ్యాయి.హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ), ప్రవాసులు వ్యక్తిగత వినియోగం, పెట్టుబడుల కోసం అల్ట్రా లగ్జరీ గృహాలను కొనుగోలు చేస్తున్నారు. ఇన్పుట్ వ్యయం పెరుగుదల, బలమైన కొనుగోలుదారుల డిమాండ్ కారణంగా మెట్రో నగరాలలో ఈ తరహా ఇళ్ల పెరుగుతున్నాయి. దీంతో గ్రేడ్–ఏ డెవలపర్లు అల్ట్రా లగ్జరీ ప్రాజెక్ట్‌ల నిర్మాణాలకు మొగ్గు చూపుతున్నారు. -
అపార్ట్మెంట్, విల్లా కలిస్తే..
అవునూ.. హైదరాబాద్ నిర్మాణ రంగం (Hyderabad realty) ట్రెండ్ మారింది. అపార్ట్మెంట్, విల్లా రెండింటినీ మిక్స్ చేస్తూ స్కై విల్లాస్ (Sky villa) హాట్ కేక్‌లుగా అవతరించాయి. ఒక అపార్ట్మెంట్లో ఫ్లోర్‌కు ఒక్క ఫ్లాట్ మాత్రమే, అది కూడా 6 వేల నుంచి 16 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో.. పైగా విలాసవంతమైన వసతులు, భద్రత, ప్రైవసీలతో కట్టిపడేస్తున్నాయి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్(హెచ్ఎన్ఐ), ప్రవాసులు స్కై విల్లాస్ కొనుగోలుకు ఆసక్తి చూపిస్తుండటంతో నగరంలో వీటి నిర్మాణాలు జోరందుకున్నాయి.గతంలో విలాసవంతమైన ఇళ్లలో నివసించాలనుకునేవారి కోసం విల్లాలు, బంగ్లాలు నిర్మించేవారు. వీటికి కొంత పరిమితులున్నాయి. భూమి ధర విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో డెవలపర్లకు ప్రధాన నగరంలో విల్లాలు, బంగ్లాలు నిర్మించడం సాధ్యం కాదు. దీంతో ఎత్తయిన అపార్ట్మెంట్లలో స్కై విల్లాలను నిర్మిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లోని పచ్చదనం, సిటీ వ్యూ అనుభూతిని కలిగిస్తుండటంతో ఎత్తయిన భవనాల్లో నివసించాలనే కోరిక పెరిగింది. దీంతో మల్టీ లెవల్ స్కై విల్లాలు నివాస సముదాయ విభాగంలో హాటెస్ట్ ట్రెండ్‌గా మారింది. జీవనశైలి పట్టణ వినియోగదారుల్లో ప్రజాదరణ పొందుతోంది. – సాక్షి, సిటీబ్యూరోస్కై విల్లాస్ అంటే? విల్లాలు, అపార్ట్మెంట్ల డిజైన్, వసతులు ఒకే భవనంలో కలిపి ఉండేవే స్కై విల్లాలు లేదా విల్లామెంట్‌లు. సాధారణంగా విల్లాలు పెద్ద ఫ్లోర్ ప్లాన్, ఎక్కువ స్థలం కలిగి ఉండే స్వతంత్ర గృహాలు. వీటిల్లో లగ్జరీ వసతులు, ఔట్‌డోర్ స్పేస్ ఎక్కువగా ఉంటుంది. ఇక, అపార్ట్మెంట్లు చిన్నగా, సమూహంగా ఉంటాయి. వీటిల్లో నివాసితులు కామన్ ఏరియాలను షేరింగ్ చేసుకుంటారు. ఈ రెండు కాన్సెప్ట్‌లు కలిపి.. విల్లాలోని విశాలమైన స్థలం, లగ్జరీ, ప్రైవసీ, అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లోని సౌకర్యాలు, భద్రత కలిపి డిజైన్ చేసేవే స్కై విల్లాస్. సరళభాషలో చెప్పాలంటే ఇదొక డూప్లెక్స్ అపార్ట్మెంట్.ప్రైవసీ, ఆధునిక వసతులు.. ఒక స్వతంత్ర బంగ్లా మాదిరి కాకుండా స్కై విల్లాలు భవనం మొత్తం అంతస్తులో విస్తరించి ఉంటాయి. రెండు లేదా అంతకంటే ఎక్కువ అంతస్తులో విస్తరించి ఉండే విశాలమైన బహుళ స్థాయి గృహాలే స్కై విల్లాలు. ఈ ప్రాజెక్ట్‌లలో జన సాంద్రత తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రైవసీ, భద్రత ఎక్కువ. ఇంటి పరిమాణాన్ని బట్టి స్కై విల్లాలను ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ ఆటోమేషన్, టెక్నాలజీతో విలాసవంతంగా తీర్చిదిద్దవచ్చు.స్కై విల్లాల్లో చాలా వరకు నాలుగు వైపులా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. దీంతో సూర్యరశ్మి, గాలి, వెలుతురు ధారాళంగా వస్తాయి. మంచి వెంటిలేషన్ ఉంటుంది. స్కై విల్లాలలో ప్రైవేట్ లాన్, సన్డెక్తో కూడిన ప్రైవేట్ పూల్, ప్రత్యేక లిఫ్ట్, సెంట్రల్ ఎయిర్ కండీషనర్, హోమ్ థియేటర్, లగ్జరీ బెడ్ రూమ్స్, కిచెన్, స్టాఫ్ క్వార్టర్స్ వంటివి ఉంటాయి. అలాగే బ్యాడ్మింటన్ కోర్ట్, గోల్ఫ్ కోర్స్‌లు, విశాలమైన పిల్లల ఆట స్థలాలు, విలాసవంతమైన క్లబ్‌హౌస్, కాఫీ షాప్, స్విమ్మింగ్ పూల్తో పాటు ల్యాండ్ స్కేప్ గార్డెన్, వాకింగ్ ట్రాక్స్ వంటి వాటితో ప్రశాంత వాతావరణం ఉంటుంది.ఎక్కడ వస్తున్నాయంటే? స్కై విల్లాస్ ధరలు అపార్ట్మెంట్ల కంటే 30–40 శాతం ఎక్కువగా, విల్లా కంటే 20–30 శాతం తక్కువగా ఉంటాయి. ఈ ప్రాజెక్ట్‌ల్లోని ఫ్లాట్లు భారీ విస్తీర్ణంతో పాటు సకల సౌకర్యాలు ఉండటంతో వీటి ప్రారంభ ధర రూ.6 కోట్ల నుంచి ఉంటాయి. కొల్లూరు, ఉప్పల్, కోకాపేట, కొండాపూర్, నార్సింగి, పుప్పాలగూడ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఈ తరహా ప్రాజెక్ట్‌లు వస్తున్నాయి. 30–50 అంతస్తుల భవనాల్లో ఇలాంటి స్కై విల్లాలు నిర్మిస్తున్నారు. ఆకాశహర్మ్యల్లో ఎత్తుకు వెళ్లే కొద్దీ నిర్మాణ వ్యయం పెరుగుతుంది.అందుకే ఖర్చును తగ్గించుకునేందుకు 6 వేల నుంచి 16 వేల చ.అ. విస్తీర్ణంలో ఒకటే ఫ్లాట్ ఉండేలా ప్రత్యేకంగా డిజైనింగ్ చేస్తున్నారు. అపార్ట్మెంట్లోని పైఅంతస్తులో ఈ తరహా స్కై విల్లాలను కడుతున్నారు. సౌకర్యాలకు లోటు లేకుండా ఆకాశహరమ్యల్లో ప్రతీ గేటెడ్ కమ్యూనిటీల్లో ఉన్నట్లే క్లబ్‌హౌస్‌తో పాటు అన్ని రకాల ఆధునిక వసతులను కల్పిస్తున్నారు. ఒక్కో క్లబ్‌హౌస్ 50 వేల చ.అ.విస్తీర్ణంలో ఉంటుంది.ప్రయోజనాలివీ..» విల్లామెంట్ ప్రయోజనాల్లో ప్రధానమైనది విల్లాలాంటి అనుభూతి. నివాసితులు విడిగా ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో ఉండే వసతులు, సౌలభ్యాలను ఆస్వాదించవచ్చు. ఇందులో స్విమ్మింగ్ పూల్, జిమ్, పార్క్‌లు వంటి భాగస్వామ్య సౌకర్యాలతో పాటు భద్రత, నిర్వహణ సేవలు ఉంటాయి.» డూప్లెక్స్ డిజైన్ బెడ్ రూమ్‌లు, బాత్రూమ్లు, లివింగ్, డైనింగ్ ఏరియాలతో పాటు ప్రైవేట్ టెర్రస్ లేదా గార్డెన్ ఉంటాయి. అదనంగా విల్లామెంట్లలో ప్రైవేట్ లిఫ్ట్, విశాలమైన కార్ పార్కింగ్ సౌకర్యాలుంటాయి.» స్కై విల్లాస్ సాంప్రదాయ అపార్ట్మెంట్ కంటే ఎక్కువ స్థలం, ప్రైవసీని అందిస్తాయి.» విల్లామెంట్ కాంప్లెక్స్‌లు సెక్యూరిటీ గార్డులు, సీసీటీవీ కెమెరాలతో కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. నివాసితులకు సురక్షితమైన జీవనం, మనశ్శాంతిని అందిస్తాయి.» విల్లాలాగే ప్రాపర్టీ మొత్తం నిర్వహణ వ్యయం యజమాని భరించాల్సిన అవసరం లేదు. విల్లామెంట్‌ల నిర్వహణ కమ్యూనిటీలోని అందరూ పాలుపంచుకుంటారు. దీంతో నివాసితులకు వ్యయం, సమయం ఆదా అవుతుంది. -
రియల్టీలో పీఈ పెట్టుబడులు ప్లస్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి తొమ్మిది నెలల్లో రియల్టీ రంగంలోకి ప్రయివేట్ ఈక్విటీ(Private equity) పెట్టుబడులు 6 శాతం పెరిగాయి. ఏప్రిల్–డిసెంబర్లో 2.82 బిలియన్ డాలర్లకు చేరాయి. ప్రధానంగా ఇండ్రస్టియల్, లాజిస్టిక్స్ పార్క్‌లు పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. రియల్టీ కన్సల్టెంట్ అనరాక్ గణాంకాల ప్రకారం గతేడాది(2023–24) ఇదే కాలంలో 2.66 బిలియన్ డాలర్ల పీఈ పెట్టుబడులు లభించాయి. అయితే డీల్స్ 24కు పరిమితమయ్యాయి. గతేడాది 30 లావాదేవీలు నమోదయ్యాయి. మొత్తం పీఈ పెట్టుబడుల్లో విదేశీ ఫండ్స్ వాటా 82 శాతంకాగా.. దేశీయంగా 18 శాతం నిధులు లభించాయి. ఇండస్ట్రియల్, లాజిస్టిక్స్ విభాగం అత్యధికంగా 62 శాతం పెట్టుబడులను సమకూర్చుకుంది. ఈ బాటలో హౌసింగ్ 15 శాతం, ఆఫీస్ విభాగం 14 శాతం, మిక్స్డ్ వినియోగ ప్రాజెక్టులు 9 శాతం పెట్టుబడులను ఆకర్షించాయి. ఇదీ చదవండి: భారత్ ఎకానమీ వృద్ధి కోతటాప్–10 డీల్స్ హవాతొలి 9 నెలల మొత్తం పీఈ లావాదేవీలలో టాప్–10 డీల్స్ వాటా 93 శాతమని అనరాక్(Anarock Capital) క్యాపిటల్ సీఈవో శోభిత్ అగర్వాల్ వెల్లడించారు. 1.54 బిలియన్ డాలర్ల విలువైన రిలయన్స్, ఏడీఐఏ, కేకేఆర్ వేర్‌హౌసింగ్ డీల్‌ను అతిపెద్ద లావాదేవీగా పేర్కొన్నారు. దీనితోపాటు 20.4 కోట్ల డాలర్ల విలువైన బ్లాక్‌స్టోన్, లోగోస్ ఈక్విటీ డీల్.. లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ రంగానికి ప్రోత్సాహాన్నిచ్చినట్లు తెలియజేశారు. ఈ రంగం మొత్తం పీఈ పెట్టుబడుల్లో 62 శాతం వాటాను ఆక్రమించుకున్నట్లు వెల్లడించారు. -
లగ్జరీ ఇళ్ల మెరుపులు
న్యూఢిల్లీ: విశాలమైన ఇళ్లు, ప్రీమియం సదుపాయాలు కోరుకునే సంపన్నుల సంఖ్య పెరుగుతుండటంతో దానికి అనుగుణంగా లగ్జరీ ఇళ్లకు డిమాండ్ కూడా గణనీయంగా పెరుగుతోంది. 2024లో హైదరాబాద్ సహా ఏడు ప్రధాన నగరాల్లో రూ. 4 కోట్లకు పైగా ఖరీదు చేసే లగ్జరీ ఇళ్ల అమ్మకాలు 53 శాతం ఎగిసినట్లు రియల్ ఎస్టేట్ సంస్థ సీబీఆర్ఈ తెలిపింది. మొత్తం 19,700 యూనిట్లు అమ్ముడైనట్లు వివరించింది. హైదరాబాద్‌లో లగ్జరీ ఇళ్ల అమ్మకాలు 2,030 యూనిట్ల నుంచి 70 పెరిగి 2,100 యూనిట్లకు చేరాయి. ఢిల్లీ–ఎన్సీఆర్లో (నేషనల్ క్యాపిటల్ రీజియన్) అత్యధికంగా 10,500 యూనిట్లను రియల్టీ సంస్థలు విక్రయించాయి. 2023 క్యాలెండర్ సంవత్సరంలో రూ. 4 కోట్ల ఖరీదు చేసే లగ్జరీ ఇళ్లు 12,895 అమ్ముడయ్యాయి. కొనుగోళ్లకు నెలకొన్న డిమాండ్‌తో రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పటిష్టంగా ఉందని, రాబోయే క్వార్టర్లలోనూ ఇదే ధోరణి కొనసాగవచ్చని సీబీఆర్ఈ చైర్మన్ అన్షుమన్ మ్యాగజైన్ తెలిపారు. మధ్యస్థాయి ప్రాజెక్టుల ఉండే పుణె, చెన్నై తదితర నగరాలు కూడా హై–ఎండ్ ప్రాజెక్టుల వైపు మళ్లుతున్నాయని పేర్కొన్నారు. ప్రీమియం ప్రాంతాల్లో ఆధునిక సదుపాయాలు, అసమానమైన సౌకర్యాన్ని అందించే హై–ఎండ్ ఇళ్లకు డిమాండ్ భారీగా ఉంటోందని క్రిసుమి కార్పొరేషన్ ప్రెసిడెంట్ ఆకాశ్ ఖురానా వివరించారు. సీబీఆర్ఈ డేటా ప్రకారం.. → రూ. 4 కోట్ల పైబడి ఖరీదు చేసే ఇళ్ల అమ్మకాలు ముంబైలో 4,200 యూనిట్ల నుంచి 5,500 యూనిట్లకు పెరిగాయి. → పుణెలో 400 నుంచి 825 పెరగ్గా, బెంగళూరులో 265 యూనిట్ల నుంచి 50కి పడిపోయాయి. → కోల్‌కతాలో అమ్మకాలు 310 నుంచి 530కి, చెన్నైలో 165 యూనిట్ల నుంచి 275 యూనిట్లకు పెరిగాయి. -
హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ ఖాళీ
డిమాండ్‌కు మించి తాజా సరఫరా తోడవుతున్నందున 2026 మార్చి నాటికి హైదరాబాద్‌లోని మొత్తం కార్యాలయ స్థలంలో 24.5 శాతం ఖాళీగా ఉండవచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. వేకెన్సీ స్థాయి 2023 మార్చిలో 14.1 శాతం, 2025 సెప్టెంబర్‌లో 19.3 శాతంగా ఉందని తెలిపింది.‘హైదరాబాద్ మార్కెట్లో గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ ఆక్యుపెన్సీ 2026 మార్చి నాటికి 75.5–76 శాతానికి చేరవచ్చు. 2023 మార్చి నాటికి ఇది 86 శాతం నమోదైంది. నికర ఆక్యుపెన్సీతో పోలిస్తే సరఫరా ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్‌లో 2016–17 నుంచి 2023–24 మధ్య ఆఫీస్ స్పేస్ సరఫరా వార్షిక వృద్ధి రేటు ఏటా 14 శాతం దూసుకెళ్లింది. టాప్–6 ఆఫీస్ మార్కెట్లలో ఇది సుమారు 7 శాతం నమోదైంది. ఈ ఆరు మార్కెట్లలో 2024 మార్చి 31 నాటికి అందుబాటులో ఉన్న మొత్తం కార్యాలయ సరఫరాలో హైదరాబాద్ వాటా 15 శాతం. 2026 మార్చి నాటికి ఇది 17 శాతానికి చేరవచ్చు’ అని నివేదిక వివరించింది.ఇదీ చదవండి: బేర్.. ఎటాక్! మార్కెట్ నేల చూపులు ఎందుకంటే..అంచనాలు లేకుండా..అపరిమిత ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ) నియమాన్ని కలిగి ఉన్న ఏకైక ప్రముఖ భారతీయ నగరం హైదరాబాద్ అని ఇక్రా కార్పొరేట్ రేటింగ్స్ వైస్ ప్రెసిడెంట్, కో–గ్రూప్ హెడ్ అనుపమ రెడ్డి తెలిపారు. ‘ఈ నిబంధనలను సద్వినియోగం చేసుకుని కొంతమంది డెవలపర్లు సమీప కాలంలో లీజింగ్‌పై సరైన అంచనాలు లేకుండా భారీగా ఊహించుకుని నిర్మాణాలు చేపడుతున్నారు. ఫలితంగా డిమాండ్–సరఫరా మధ్య భారీగా అసమతుల్యత ఏర్పడింది’ అని అన్నారు. ‘2023–24 ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్‌లో 1.9 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ తోడైంది. ఇది హైదరాబాద్ చరిత్రలో అత్యధికం. అలాగే ఇతర టాప్ నగరాలతో పోలిస్తే ఇక్కడే ఎక్కువ. ఈ అధిక సరఫరా ధోరణి 2024–25, 2025–26 వరకు కొనసాగుతుంది. ఏటా 1.7–2 కోట్ల చదరపు అడుగుల కొత్త సరఫరా తోడు కానుంది. -
గోవాలో హై డిమాండ్ వేటికంటే..
పర్యాటక రంగంలో వృద్ధికి సంబంధించిన ఆందోళనలు ఉన్నప్పటికీ, అధిక నికర ఆస్తులు కలిగిన వ్యక్తులు (HNI), విదేశీ పెట్టుబడిదారులకు గోవా రియల్ ఎస్టేట్ మార్కెట్ ఆసక్తిగా కనిపిస్తోంది. హాలిడే హోమ్‌లు, స్టేయింగ్ రూమ్‌లకు డిమాండ్ అధికంగా ఉంది. అధిక అద్దె రాబడి, స్థిరమైన జీవనం సాగించేందుకు చాలామంది గోవాను ఎంచుకుంటున్నట్లు నిపుణులు తెలియజేస్తున్నారు.రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థలు, డెవలపర్ల ప్రకారం గోవాలోని బ్రాండెడ్ హోటళ్లు, రెంటల్ విల్లాలు పీక్ సీజన్లో పూర్తిగా బుక్ అవుతున్నాయి. ఈ కేటగిరీల్లో పెట్టుబడులు స్థిరంగా ఉన్నాయని కొనుగోలు దారులు భావిస్తున్నారు. సుస్థిర జీవనానికి ప్రాధాన్యమిచ్చే హెచ్ఎన్ఐలకు గోవా(Goa Realty)లోని పర్యావరణ అనుకూల గేటెడ్ కమ్యూనిటీలు ఆకర్షణీయంగా తోస్తున్నాయి.అంజునా, అర్పోరా, బగా, కలంగుటే, కాండోలిమ్, వాగ్తోర్ వంటి ప్రాంతాలతో సహా గోవా నార్త్ బీచ్ పోర్చుగీస్ పరిసరాలు, ప్రసిద్ధ రెస్టారెంట్లు, హోటళ్లు, బీచ్‌లకు దగ్గరగా ఉండటం వల్ల గృహ కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రాపర్టీ ధరలు ఏడాది ప్రాతిపదికన 19 శాతం పెరుగుదల నమోదు చేస్తున్నట్లు మార్కెట్ వర్గాలు తెలియజేస్తున్నాయి.ఇదీ చదవండి: క్రికెట్ యాడ్స్ ద్వారా రూ.6,000 కోట్లు టార్గెట్విదేశీ పెట్టుబడిదారులు(foreign funds) తమ పోర్ట్‌ఫోలియోలను వైవిధ్యంగా విస్తరించడానికి గోవాలోని నాణ్యమైన ఆస్తులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. హెచ్ఎన్ఐలు అద్దె ఆదాయాన్ని సృష్టించడానికి విల్లాలను కొనుగోలు చేస్తున్నారు. ఓ విదేశీ సంస్థ గోవాలోని ప్రతిష్టాత్మక హోటల్‌ను కొనుగోలు చేసే చివరి దశలో ఉంది. యాక్సిస్ ఈకార్ప్ సీఈఓ ఆదిత్య కుష్వాహా మాట్లాడుతూ..‘దేశీయ, అంతర్జాతీయంగా పెరుగుతున్న ఆకర్షణ గోవా రియల్టీ వ్యాపారం మరింత మెరుగుపడేలా చేస్తోంది. స్థిరంగా అద్దె వస్తుండడంతో ఎన్ఆర్ఐ కస్టమర్లు ఇక్కడ ఆస్తులు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు’ అని తెలిపారు. -
హైదరాబాద్ రియల్ ఎస్టేట్.. ఆల్ టైమ్ హై!
హైదరాబాద్ (Hyderabad) రియల్ ఎస్టేట్ (real estate) ఆల్ టైం హై స్థాయికి చేరుకుంది. గతేడాది నగరంలో రికార్డు స్థాయిలో గృహ విక్రయాలు, ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం, వడ్డీ రేట్ల పెంపు, హైడ్రా దూకుడు ఇవేవీ భాగ్యనగరంలో స్థిరాస్తి రంగాన్ని కదిలించలేకపోయాయి. కొత్త ప్రభుత్వ విధానాలతో కొద్ది కాలం అస్థిరత ఏర్పడినా.. మార్కెట్ తిరిగి శరవేగంగా పుంజుకుంది. దీంతో హైదరాబాద్ రియల్టీలో పూర్వ వైభవం సంతరించుకుంది. నగరంలో గతేడాది 32,974 యూనిట్లు విక్రయించగా.. 1.56 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లావాదేవీలు జరిగాయని నైట్‌ఫ్రాంక్ ఇండియా తాజా నివేదిక వెల్లడించింది. – సాక్షి, సిటీబ్యూరోఆర్థికవృద్ధి, మెరుగైన మౌలిక సదుపాయాలు, కొనుగోలుదారుల అభిరుచిలో మార్పుల కారణంగా హైదరాబాద్‌లో గృహ విక్రయాలు పెరిగాయి. గతేడాది నగరంలో 12 శాతం వృద్ధి రేటుతో 36,974 ఫ్లాట్లు అమ్ముడుపోయాయి. ప్రస్తుతం సిటీలో అపార్ట్మెంట్ల సగటు ధర చ.అ.కు రూ.5,974. ఏడాదిలో అపార్ట్మెంట్ల ధరలు 8 శాతం మేర పెరిగాయి. గతేడాది సిటీలో 44,013 యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. అంతకు క్రితం ఏడాదితో పోలిస్తే 6 శాతం తగ్గాయి. హైడ్రా దూకుడు వ్యవహారంతో కొత్త గృహాల ప్రారంభానికి డెవలపర్లు ఆచితూచి వ్యవహరించడంతో లాంచింగ్స్‌లో క్షీణత నమోదయ్యింది. పశ్చిమ హైదరాబాదే.. హైటెక్ సిటీ, కోకాపేట, రాయదుర్గం, కూకట్పల్లి, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి పశ్చిమ హైదరాబాదే కస్టమర్ల చాయిస్‌గా ఉంది. ఎల్బీనగర్, కొంపల్లి ప్రాంతాల్లో ధరల పెరుగుదల అధికంగా ఉంది. ఆయా ప్రాంతాల్లో వరుసగా 11, 10 శాతం మేర రేట్లు పెరిగాయి. ఆ తర్వాత బంజారాహిల్స్‌లో 8 శాతం, కోకాపేటలో 8 శాతం, మణికొండలో 6, నాచారం, సైనిక్‌పురిలో 5 శాతం మేర ధరలు పెరిగాయి. ప్రస్తుతం నగరంలో అత్యధికంగా చ.అ.ధరలు బంజారాహిల్స్‌లో రూ.14,400–16,020 మధ్య ఉండగా.. జూబ్లీహిల్స్‌లో 13,400–14,034, కోకాపేటలో 10,045–12,500, మణికొండలో రూ.8,500–9,220 మధ్య ధరలు ఉన్నాయి.ఆఫీస్ అ‘ధర’హో.. 2024లో హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ లావాదేవీలు సరికొత్త శిఖరాలను అధిరోహించాయి. గతేడాది కొత్తగా 1.03 కోట్ల చ.అ.ఆఫీస్ స్పేస్ పూర్తి కాగా.. 1.56 కోట్ల చ.అ. స్పేస్ లావాదేవీలు జరిగాయి. కార్యాలయాల స్థలం లీజు, కొనుగోళ్లలో గ్లోబల్ కెపబులిటీ సెంటర్స్(జీసీసీ) ఆధిపత్యాన్ని కొనసాగించాయి. గతేడాది జరిగిన ఆఫీసు స్పేస్ లావాదేవీల్లో జీసీసీ వాటా 49 శాతంగా ఉంది. 51 లక్షల చ.అ.ఆఫీస్ స్పేస్‌ను బహుళ జాతి కంపెనీలు జీసీసీ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. దేశీయ వ్యాపార సంస్థలు 24 లక్షల చ.అ.లు, ఫ్లెక్సీబుల్ ఆఫీసు స్పేస్ 18 లక్షల చ.అ.లు, 12 లక్షల చ.అడుగుల స్థలంలో థర్డ్ పార్టీ ఐటీ సంస్థల లావాదేవీలు ఉన్నాయి. నగరంలో ఆఫీస్ స్పేస్ ధర చ.అ.కు సగటున రూ.70గా ఉంది. ఏడాది కాలంలో ధరలు 7 శాతం మేర పెరిగాయి.దేశవ్యాప్తంగా ఇలా.. గతేడాది దేశంలోని 8 ప్రధాన నగరాల్లో 3,72,936 యూనిట్లు లాచింగ్ కాగా.. 3,50,612 ఇళ్లు అమ్ముడుపోయాయి. అంతకు క్రితం ఏడాదితో పోలిస్తే లాంచింగ్స్‌లో 6 శాతం, విక్రయాల్లో 7 శాతం వృద్ధి నమోదైంది. దేశంలో ఇంకా 4,95,839 యూనిట్ల ఇన్వెంటరీ ఉంది. వీటి విక్రయానికి 5.8 నెలల సమయం పడుతుంది. ఇక, గతేడాది 7.19 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్ లావాదేవీలు జరగ్గా.. 5.03 కోట్ల చ.అ. స్థలం కొత్తగా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం 8 నగరాల్లో మొత్తం 97.3 కోట్ల చ.అ.ఆఫీస్ స్పేస్ స్టాక్ ఉంది. -
మొదట కొనేది ఇల్లే.. ఆ తర్వాతే పెళ్లి, ఫ్యూచర్
చదువు పూర్తయ్యిందా.. మంచి ఉద్యోగం, తర్వాత పెళ్లి, పిల్లలు, రిటైర్మెంట్ నాటికి ఓ సొంతిల్లు.. మన నాన్నల ఆలోచనలివే కదూ! కానీ, ప్రస్తుత తరం ఆలోచనలు, అభిరుచులూ మారాయి. చదువు కొనసాగుతుండగానే ఉద్యోగావకాశాలు నడిచొస్తున్నాయి. దీంతో యువత ముందుగా స్థిరమైన నివాసానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ తర్వాతే పెళ్లి, విదేశీ ప్రయాణాలు, ఫ్యూచర్ ఇతరత్రా వాటి కోసం ప్లానింగ్ చేస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరోవిరివిగా రుణాల లభ్యత, బహుళ ఆదాయ మార్గాలు, మంచి ప్యాకేజీతో స్థిరమైన ఉద్యోగ అవకాశాలు ఉండటంతో స్థిరాస్తి రంగంలో పెట్టుబడులకు యువత ఆసక్తి చూపిస్తోంది. 2018లో గృహ కొనుగోలుదారుల్లో మిలీనియల్స్ (25–35 ఏళ్ల వయస్సు గలవారు) వాటా 28 శాతంగా ఉండగా.. గతేడాదికి 37 శాతానికి పెరిగింది. 2030 నాటికి 60 శాతానికి చేరుతుందని జేఎల్ఎల్ ఇండియా అంచనా వేసింది.ఇటీవల కాలంలో దేశీయ స్థిరాస్తి రంగంలో సరికొత్త మార్పులు వచ్చాయి. గతంలో రిటైర్డ్, సీనియర్ సిటీజన్స్, సంపన్న వర్గాల గృహ కొనుగోళ్లు, పెట్టుబడులు ఉండేవి. కానీ, కొన్నేళ్లుగా మిలీనియల్స్, జెన్–జెడ్ కస్టమర్ల వాటా పెరిగింది. జీవితం ప్రారంభ దశలోనే దీర్ఘకాలిక పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. తొలి కారు, డిజైనర్ హ్యాండ్ బ్యాగ్‌లాగే ప్రాపర్టీకి నేటి యువత ప్రాధాన్యత ఇస్తోంది. అందుబాటులో టెక్నాలజీ.. మ్యాజిక్‌బ్రిక్స్.కామ్, హౌసింగ్.కామ్, 99 ఎకర్స్ వంటి రియల్ ఎస్టేట్ యాప్స్ యువ కొనుగోలుదారుల ప్రాపర్టీ శోధనను మరింత సులువు చేశాయి. గతంలో ప్రాపర్టీ కొనుగోలు చేయాలంటే భౌతికంగా వెళ్లి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించడం, పరిసర ప్రాంతాల వాకబు వంటివి పెద్ద ప్రయాస ఉండేది. కానీ, నేటి యువతరానికి అంత టైం లేదు. దుస్తులు, ఫుడ్ ఆర్డర్ చేసినంత సులువుగా ప్రాపర్టీ కొనుగోళ్లు జరిగిపోవాలని కోరుకుంటున్నారు. వీరి అభిరుచికి తగ్గట్టు ప్రాపర్టీ సమీక్ష, రేటింగ్ యాప్స్, త్రీడీ వ్యూ, వర్చువల్ టూర్ వంటి సాంకేతికత పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాయి. గృహ రుణాలకు పోటీ.. యువ గృహ కొనుగోలుదారులకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు సైతం పోటీపడి హోమ్లోన్స్ అందిస్తున్నాయి. రుణాల మంజూరులో వేగం, తక్కువ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. క్రౌడ్ ఫండింగ్, ప్రాపర్టీ షేరింగ్ వంటి పాక్షిక యాజమాన్య ప్లాట్‌ఫామ్‌లు పరిమిత మూలధనంతో స్థిరాస్తి రంగంలో పెట్టుబడులకు అవకాశాలు కల్పిస్తున్నాయి. దీంతో భారీ ముందస్తు చెల్లింపులు అవసరం లేకుండానే నేటి యువ కస్టమర్లు లక్ష కంటే తక్కువ ప్రారంభ పెట్టుబడితో యువ ఇన్వెస్టర్లు ఖరీదైన, విలాసవంతమైన ప్రాపర్టీలను కొనుగోలు చేస్తున్నారు. ఐటీ హబ్‌లలో యువ పెట్టుబడులు.. బెంగళూరు, హైదరాబాద్ వంటి ఐటీ హబ్‌లలో యువ ఐటీ ఉద్యోగులు రియల్ ఎస్టేట్ మార్కెట్లో గణనీయమైన ప్రభావం చూపుతున్నారు. రూ.80 లక్షల నుంచి రూ.కోటి మధ్య ధర కలిగిన 2 బీహెచ్‌కే అపార్ట్మెంట్ల కొనుగోళ్లలో వీరి ప్రాధాన్యత అధికంగా ఉంది. కరోనాతో అలవాటైన వర్క్ ఫ్రం హోమ్‌తో యువ ఉద్యోగులకు నిత్యం ఆఫీస్‌కు వెళ్లాలనే టెన్షన్ లేదు. దీంతో ఆఫీస్ పరిసర ప్రాంతాల్లో ఇళ్లు ఉండాలనుకోవడం లేదు.ఇదీ చదవండి: హైదరాబాద్‌లో లక్ష ఇళ్లు @సేల్!మెరుగైన రవాణా సౌకర్యాలు ఉంటే సిటీకి కాస్త దూరమైనా సరే ప్రాపర్టీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పైగా ప్రధాన ప్రాంతంలో కొనుగోలు చేసే ధరతోనే శివార్లలో పెద్ద సైజు ఇళ్లు, వసతులను పొందవచ్చనేది వారి అభిప్రాయం. అయితే గ్రీనరీతో పాటు విద్యుత్, నీటి వినియోగాన్ని ఆదా చేసే ప్రాజెక్ట్‌లు, సౌర ఫలకాలు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వంటి పర్యావరణ అనుకూల ఫీచర్లు ఉండే ఇళ్లను కోరుకుంటున్నారు.పెరిగిన పట్టణ గృహ యజమానులు.. కరోనాతో అలవాటైన వర్క్ ఫ్రం హోమ్ విధానంతో యువ ఉద్యోగులు ఆఫీసులో కూర్చొని పనిచేసే అవసరం లేదు. వారు ఇప్పుడు తమ పనికి కాకుండా జీవనశైలికి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో వారికి నచ్చిన ప్రాంతంలో నివసించే స్వేచ్ఛ కోరుకుంటున్నారు. వేగవంతమైన పట్టణీకరణ, సాంకేతిక ఆవిష్కరణలు, వినియోగదారుల అభిరుచులతో గృహ కొనుగోలుదారుల్లో మార్పులు వచ్చాయి.ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు కీలకమైన వృద్ధి కేంద్రాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. 2020లో పట్టణ గృహ యజమానుల రేటు 65 శాతంగా ఉండగా.. 2025 నాటికి 72 శాతానికి పెరుగుతుందని జేఎల్ఎల్ అంచనా వేసింది. సరసమైన గృహ రుణాలు, నివాస సముదాయంలో యువ కొనుగోలుదారుల ప్రాధాన్యతే ఈ వృద్ధికి ప్రధాన కారణాలు. -
హైదరాబాద్‌లో లక్ష ఇళ్లు @సేల్!
డిమాండ్‌కు మించి సరఫరా జరుగుతుండటంతో హైదరాబాద్‌లో (hyderabad) అమ్ముడుపోకుండా ఉన్న ఇళ్లు(ఇన్వెంటరీ) (residential real estate inventory) పెరిగిపోతున్నాయి. దేశంలోని ఏడు ప్రధాన మెట్రో నగరాలతో పోలిస్తే ముంబై తర్వాత హైదరాబాద్‌లోనే అత్యధిక ఇన్వెంటరీ ఉంది. - సాక్షి, సిటీబ్యూరోఇక, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాలతో పోలిస్తే మన దగ్గరే ఎక్కువ. గతేడాది నాటికి గ్రేటర్లో 1,01,091 ఇళ్ల ఇన్వెంటరీ (వీటిలో నిర్మాణంలో ఉన్నవి, పూర్తయినవి కలిపి) ఉంది. వీటి విక్రయానికి కనిష్టంగా 19 నెలల కాలం పడుతుంది. గత రెండేళ్లలో నగరంలో గృహాల సరఫరా పెరగడమే ఇన్వెంటరీ పెరుగుదలకు ప్రధాన కారణం.దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో ఏడాది తొలి తొమ్మిది నెలల కాలంలో మొత్తం 5,64,416 యూనిట్ల ఇన్వెంటరీ మిగిలి ఉందని, వీటి విక్రయానికి కనిష్టంగా 14 నెలల కాలం పడుతుందని అనరాక్ గ్రూప్ నివేదిక వెల్లడించింది.ఇదీ చదవండి: మెట్రో వెంట.. రియల్ ఎస్టేట్ బూమ్!2024లో కొత్త ఇళ్ల సరఫరా అంతకు ముందు ఏడాదితో పోలిస్తే తగ్గిందని అనరాక్ నివేదిక పేర్కొంది. ఎన్నికల నేపథ్యంలో అప్రూవల్స్‌లో జాప్యం కారణంగా హౌసింగ్ సప్లయి తగ్గిపోయినట్లు చెప్పినట్లు చొప్పుకొచ్చింది.2025 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని ప్రధాన నగరాల్లో దాదాపు 253 మిలియన్ చ.అ.మేర కొత్త ఇళ్ల సరఫరాను ప్రారంభించే ప్రణాళికలను టాప్ 11 లిస్టెడ్ డెవలపర్లు ఏడాది ప్రారంభంలో ప్రకటించారని అనరాక్ గుర్తు చేసింది. అయితే సార్వత్రిక, రాష్ట్రాల ఎన్నికల కారణంగా వీటిలో కేవలం 23% లేదా 57 మిలియన్ చ.అ.ల మేర ప్రాజెక్ట్‌లు మాత్రమే ఏడాది ప్రథమార్థంలో ప్రారంభమయ్యాయి. -
మెట్రో వెంట.. సొంతింటి ప్రయాణం!
హైదరాబాద్ స్థిరాస్తి రంగాన్ని నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లింది మెట్రో, ఔటర్ ప్రాజెక్ట్‌లే.. మెట్రో రైలుతో ప్రధాన నగరంలో, ఓఆర్ఆర్తో శివారు ప్రాంతాలతో కనెక్టివిటీ పెరిగింది. దీంతో నగరంలో రియల్ బూమ్ ఏర్పడింది. తాజాగా ప్రభుత్వం రెండో దశలో ఔటర్ రింగ్ రోడ్డు వరకూ మెట్రో విస్తరించాలని నిర్ణయించింది. దీంతో మెట్రో మార్గంలో చుట్టూ 10 కి.మీ. వరకూ స్థిరాస్తి అవకాశాలు మెరుగవుతాయి. ఇదే సమయంలో మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లను అనుసంధానిస్తే నగరం నలువైపులా ప్రయాణం సులువవుతుంది. బడ్జెట్ గృహాల లభ్యత పెరిగి, ఐటీ ఉద్యోగ వర్గాల సొంతింటి కల సాకారమవుతుందని జనప్రియ అప్స్కేల్ ఎండీ క్రాంతి కిరణ్‌రెడ్డి అన్నారు. – సాక్షి, సిటీబ్యూరోప్రజల దైనందిన జీవితంలో ప్రజారవాణా అత్యంత కీలకం. దీంతో ప్రభుత్వం మెట్రోని పొడిగించాలని నిర్ణయించింది. వచ్చే 5–10 ఏళ్లలో దశలవారీగా మెట్రో 2.0 అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ రియల్టీ మరింత దూరం విస్తరిస్తోంది. సాధారణంగా ప్రజలు మెరుగైన రవాణా సదుపాయాలు ఉన్న ప్రాంతాల్లోనే ఉండేందుకు ఇష్టపడతారు.ఐటీ కేంద్రాల చుట్టుపక్కల ఇళ్ల ధరలు రూ.కోటి దాటిపోయాయి. ఐటీ ఉద్యోగ వర్గాలకు అందనంత ఎత్తుకు ఎగబాకాయి. మెట్రోతో శివార్లకు రవాణా సౌకర్యం రావడంతో ఐటీ కారిడార్‌లో పనిచేసే ఉద్యోగులు ఆయా ప్రాంతాల్లో నివాసం ఉంటూ రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో వీరంతా తమ బడ్జెట్లో నివాసాలు దొరికే తూర్పు హైదరాబాద్‌లో కొనుగోలు చేశారు.విదేశాల్లో ప్రైవేట్‌కే స్టేషన్ల బాధ్యత.. సింగపూర్, న్యూయార్క్ వంటి దేశాల్లో మాదిరిగా నగరంలోనూ భూగర్భ మెట్రో ఉంటే మేలు. విదేశాలలో భూగర్భ మెట్రో స్టేషన్ నిర్మాణ వ్యయాన్ని స్థానికంగా హోటల్స్, మాల్స్ వంటి వాణిజ్య సముదాయాలకే అప్పగిస్తారు. స్టేషన్ నుంచి వచ్చిపోయే ప్రయాణికులకు ఆయా వాణిజ్య సముదాయాలకు యాక్సెస్ ఉంటుంది. దీంతో యజమానులకు బిజినెస్ అవుతుంది. ప్రతిఫలంగా స్టేషన్ నిర్మాణ వ్యయాన్ని వాణిజ్య యజమానులే భరిస్తారు. దీంతో అటు ప్రభుత్వం, ఇటు యజమానికి ఇద్దరికీ లాభమే.ఇదీ చదవండి: వెస్ట్ హైదరాబాద్.. వామ్మో ఎంత ఎత్తో..చిత్తడి, వదులుగా ఉండే నేలలో భూగర్భ మెట్రో కష్టమవుతుంది. కానీ, మనది రాతి భూభాగం. భూగర్భ మెట్రో లైన్ కోసం సొరంగం తవ్వడం కష్టమవుతుందేమో.. కానీ ఒకసారి తవ్వాక నియంత్రణ సులువు. రోడ్డు మార్గం ఎలా ఉంటుందో మెట్రో లైన్ కూడా అలాగే వేయాల్సి ఉంటుంది. పైగా వంకర్లు ఉండే మార్గంలో ఎక్కువ బోగీలతో మెట్రోను నడపడం కుదరదు. కానీ, భూగర్భ మెట్రోను ఏ నుంచి బీ పాయింట్‌కు సరళ రేఖ మాదిరిగా వేయవచ్చు. దీంతో మెట్రో రైలు వేగం పెరగడంతో పాటు ఎక్కువ బోగీలతో మెట్రో నడపొచ్చు.భవిష్యత్తు ఈ ప్రాంతాలదే.. ఇప్పటి వరకు ఐటీ, ఫార్మా రంగాల బహుళ జాతి సంస్థలే నగరానికి ప్రాధాన్యం ఇచ్చాయి. కానీ, కొన్నేళ్లుగా తయారీ రంగంలో కూడా మల్టీనేషనల్ కంపెనీలు విస్తరిస్తున్నాయి. ఫాక్స్‌కాన్, టాటా ఎయిరోస్పేస్ వంటి సంస్థలు ఆదిభట్ల, శంషాబాద్ ప్రాంతాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఐటీ అంతా వెస్ట్‌లోనే ఉంది కాబట్టి ఈ ప్రాంతాలకు ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. కానీ, ఇప్పటికే ఆయా ప్రాంతాలలో నివాస, వాణిజ్య భవనాలతో కిక్కిరిసిపోవడంతో ఈ అభివృద్ధి చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరిస్తుంది. కొంగరకలాన్, ఆదిభట్ల, శంషాబాద్, కొల్లూరు, శామీర్‌పేట వంటి ప్రాంతాల్లో మార్కెట్ ఊపందుకుంటుంది.హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు.. ఐటీలోనే కాదు రియల్ ఎస్టేట్‌లోనూ హైదరాబాద్, బెంగళూరు పోటీ పడుతున్నాయి. రెండు నగరాలకు ఉన్న తేడా.. రోడ్ల వెడల్పు. బెంగళూరులో ఎయిర్‌పోర్టు రోడ్డు తప్ప అన్నీ దాదాపు 60 ఫీట్ల రోడ్లే.. కానీ, మన దగ్గర 100, 140 ఫీట్ల రోడ్లు కూడా ఉన్నాయి. నగరంలో అంత పెద్ద రోడ్లు ఎలా వచ్చాయి? రోడ్డు వెడల్పుగా ఉంటే అపరిమిత ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్(ఎఫ్ఎస్ఐ) ఉంటుందని యజమానులు రోడ్ల కోసం భూములు ఇచ్చారు.ఇదీ చదవండి: హైదరాబాద్‌లో అక్కడ.. కోకాపేట ధరలో సగానికే లగ్జరీ ఫ్లాట్లు..!దీంతో భారీ టౌన్‌షిప్‌లు, స్కై స్క్రాపర్లు వస్తున్నాయి. తాజాగా హైరైజ్ ప్రాజెక్ట్‌లతో ట్రాఫిక్ పెరుగుతోందని ఎఫ్ఎస్ఐపై ఆంక్షలు పెట్టాలనే ప్రతిపాదనకు బదులుగా రోడ్లను ఇంకా వెడల్పు చేయడం ఉత్తమం. హైదరాబాద్ రియల్టీకి వరమైన జీవో–86 వల్లే దేశ, విదేశీ పెట్టుబడులు వచ్చాయి. అలాంటి సమర్థవంతమైన జీవోపై ఆంక్షలు పెట్టాలనుకోవడం సరైన నిర్ణయం కాదు. -
ఆఫీసు స్థలాలకు డిమాండ్.. ఆల్‌టైమ్ హై!
దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన నగరాల్లో 2024లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ (office space) నూతన గరిష్టాలకు చేరింది. మొత్తం 719 లక్షల చదరపు అడుగుల (ఎస్ఎఫ్టీ) పరిమాణంలో లీజు లావాదేవీలు నమోదయ్యాయి. 2023లో స్థూల లీజింగ్‌తో పోల్చి చూసినప్పుడు 21 శాతం అధికం కాగా, కరోనా విపత్తుకు ముందు ఏడాది 2019 గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 19 శాతం వృద్ధి కనిపించింది. ఈ వివరాలను రియల్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్‌ఫ్రాంక్ ఇండియా (Knight Frank) విడుదల చేసింది. కరోనా కారణంగా 2020, 2021 సంవత్సరాల్లో ఆఫీస్ స్పేస్ మార్కెట్ కుదేలవగా ఆ తర్వాత నుంచి ఏటా పుంజుకుంటూ వస్తోంది. నగరాల వారీ లీజింగ్బెంగళూరులో స్థూల ఆఫీస్ లీజింగ్ ముందటి సంవత్సరంతో పోల్చితే 2024లో 45 శాతం వృద్ధితో 181 లక్షల ఎస్ఎఫ్టీకి చేరింది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో 25% వృద్ధితో స్థూల లీజింగ్ 127 లక్షల ఎస్‌ఎఫ్‌టీగా నమోదైంది.హైదరాబాద్‌లో డిమాండ్ 17 శాతం పెరిగి 103 లక్షల చదరపు అడుగులకు చేరుకుంది.ముంబై మార్కెట్లోనూ 40 శాతం వృద్ధి నమోదైంది. 104 లక్షల చదరపు అడుగుల లీజింగ్ లావాదేవీలు జరిగాయి. పుణెలో 19 శాతం పెరిగి 80 లక్షల చదరపు అడుగులకు చేరింది. అహ్మదాబాద్‌లో 64 శాతం వృద్ధితో 30 లక్షల ఎస్ఎఫ్టీ స్థూల లీజింగ్ లావాదేవీలు నమోదయ్యాయి. చెన్నై మార్కెట్లో 25 శాతం క్షీణించి 81 లక్షల ఎస్ఎఫ్టీకి పరిమితమైంది. కోల్‌కతాలో స్థూల ఆఫీస్ స్పేస్ లీజింగ్ స్వల్పంగా 14 లక్షల చదరపు అడుగులకు తగ్గింది.సానుకూలతలు ఎన్నో.. ఆఫీస్ స్పేస్ లీజింగ్ నూతన గరిష్టాలకు చేరడం వెనుక దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండడం, బలమైన దేశీ వినియోగం, అంతర్జాతీయంగా పెరుగుతున్న భారత్ ప్రాతినిధ్యం తదితర అంశాలను కారణాలుగా నైట్‌ఫ్రాంక్ ఇండియా పేర్కొంది. ఆఫీస్ స్పేస్‌కు అసాధారణ డిమాండ్ ఉండడం దేశ, విదేశీ సంస్థల్లో వ్యాపార విశ్వాసానికి నిదర్శనంగా పేర్కొంది. జీసీసీలు, ఐటీఈఎస్, బీఎఫ్ఎస్ఐ రంగాలు ఈ డిమాండ్‌కు దన్నుగా నిలుస్తున్నట్టు తెలిపింది. -
హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాల జోరు
న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు ఆల్‌టైమ్ గరిష్టానికి చేరాయి. 2024లో 12 శాతం అధికంగా 36,974 యూనిట్ల ఇళ్లు అమ్ముడుపోయినట్టు నైట్‌ఫ్రాంక్ ఇండియా సంస్థ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఎనిమిది నగరాల్లో 2024లో 7 శాతం మేర ఇళ్ల విక్రయాలు పెరిగాయి. మొత్తం 3,50,613 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది 12 ఏళ్ల గరిష్ట స్థాయి. హైదరాబాద్‌తోపాటు పుణెలో ఆల్‌టైమ్ గరిష్టాలకు విక్రయాలు చేరగా, ముంబైలో 13 ఏళ్ల గరిష్టానికి చేరుకున్నట్టు నైట్‌ఫ్రాంక్ తెలిపింది. ‘‘ప్రీమియం ఇళ్లకు డిమాండ్ నెలకొంది. రూ.2–5 కోట్ల విభాగంలోని ఇళ్ల విక్రయాల్లో 85 శాతం వృద్ధి నమోదైంది.మరోవైపు రూ.50 లక్షల్లోపు ధరలో, రూ.50లక్షల నుంచి రూ.కోటి మధ్య ధరల విభాగాల్లోనూ వృద్ధి లేకపోవడం లేదా బలహీనపడడం కనిపించింది’’అని తెలిపింది. రూ.2–5 కోట్ల ధరల ఇళ్లకు బలమైన డిమాండ్ ఉన్నట్టు నైట్‌ఫ్రాంక్ ఇండియా చైర్మన్, ఎండీ శిశిర్ బైజాల్ తెలిపారు. 2020 నుంచి నివాస గృహాల మార్కెట్ అద్భుతమైన ర్యాలీని చూసిందని, 2024 విక్రయాలు 12 ఏళ్ల గరిష్టానికి చేరాయని చెప్పారు. ‘‘ప్రీమియమైజేషన్ ధోరణి పెరిగిపోయింది. ఇళ్ల మార్కెట్లో క్రమంగా అధిక ధరల వైపు కస్టమర్లు మళ్లుతున్నారు. మెరుగైన జీవన అవసరాలకు అనుగుణంగా ఎంపిక చేసుకుంటున్నారు’’అని వివరించారు. స్థిరమైన ఆర్థిక వృద్ధి, వడ్డీ రేట్లు అనుకూలిస్తున్నట్టు చెప్పారు. పట్టణాల వారీ విక్రయాలు.. ⇒ 2024లో ముంబైలో ఇళ్ల అమ్మకాలు అంతక్రితం ఏడాదితో పోలి్చతే 11 శాతం పెరిగి 96,187 యూనిట్లుగా ఉన్నాయి. ⇒ బెంగళూరులో 2 శాతం అధికంగా 55,362 ఇళ్ల యూనిట్లు అమ్ముడయ్యాయి. ⇒ పుణెలో 6 శాతం వృద్ధితో ఇళ్ల అమ్మకాలు 52,346 యూనిట్లకు చేరాయి. ⇒ అహ్మదాబాద్‌లో 15 శాతం వృద్ధి కనిపించింది. 18,462 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. ⇒ కోల్‌కతాలోనూ 16 శాతం పెరిగి 17,389 యూనిట్లు అమ్ముడయ్యాయి. ⇒ చెన్నైలో అమ్మకాలు 9 శాతం మేర పెరిగి.. 16,238 యూనిట్లకు చేరాయి. ⇒ ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో 4 శాతం క్షీణించి 57,654 యూనిట్లకు విక్రయాలు పరిమితమయ్యాయి. అందుబాటు ధరల ఇళ్ల విభాగం మెరుగుపడుతుంది.. ‘‘ఇళ్ల మార్కెట్లో సెంటిమెంట్ బలంగా ఉంది. ధరలతోపాటు అమ్మకాల్లోనూ స్థిరమైన పెరుగుదల కనిపిస్తోంది. రూ.కోటిలోపు ఇళ్ల అమ్మకాలు బలహీనపడడం పట్ల ఆందోళనలు నెలకొన్నాయి. కానీ, అందుబాటు ధరల ఇళ్లకు ప్రభుత్వం నుంచి మద్దతు, ప్రైవేటు రంగం ఆసక్తి చూపిస్తుండడంతో ఈ విభాగంలో అమ్మకాలు స్థిరపడతాయి’’అని నైట్‌ఫ్రాంక్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీసెర్చ్ సీనియర్ ఈడీ గులామ్ జియా వివరించారు. -
ఇంటి విలువను పెంచే ల్యాండ్ స్కేపింగ్
గతంలో ప్రతి చిన్న అవసరానికి బయటకు వెళ్లేవారు. ఇంట్లో గడిపే సమయం తక్కువగా ఉండేది. కానీ, ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక అంతా ఆన్లైన్ మీదే ఆధారపడుతున్నారు. దీంతో ఇంట్లో గడిపే నాణ్యమైన సమయం పెరిగింది. ఇల్లు, పరిసర ప్రాంతాలు స్వచ్ఛమైన గాలి, వెలుతురు, ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చదనం ఉండాలని కోరుకుంటున్నారు. ఈనేపథ్యంలో నివాస సముదాయాల్లో (Residential) ల్యాండ్ స్కేపింగ్‌కు (landscaping) ఆదరణ పెరిగింది. - సాక్షి, సిటీబ్యూరోవేగవంతమైన పట్టణీకరణ, పెరుగుతున్న భవన నిర్మాణ సముదాయాలతో హైదరాబాద్ (hyderabad) అర్బన్ జంగిల్‌గా మారిపోతోంది. దీంతో నివాసితులకు పచ్చదనం, ఆహ్లాదకర వాతావరణం అనుభూతి కలిగించాలంటే ల్యాండ్ స్కేపింగ్ అనివార్యమైపోయింది. కనుచూపు మేర పచ్చదనం, అది కూడా సేఫ్టీ, సెక్యూరిటీ ఉండే గేటెడ్ కమ్యూనిటీలోనే ఉండాలని నేటి గృహ కొనుగోలుదారులు కోరుకుంటున్నారు. పురుగుమందులు, రసాయనాలతో గాలి, నేల కాలుష్యం అవుతోంది. దీంతో సేంద్రీయ, సస్టెయినబుల్ గార్డెనింగ్‌కు ఆదరణ పెరుగుతోంది. వాక్ వే, టెర్రస్లలో.. సువాసన, ఆకర్షణీయమైన పూల మొక్కలు, చెట్లు, గడ్డితో నివాస సముదాయంలో వాక్, రన్ వే, డెక్‌లు, టెర్రస్ వంటి ప్రాంతాల్లో ల్యాండ్ స్కేపింగ్‌లను చేపడుతున్నారు. విశ్రాంతి తీసుకోవడానికి, సమావేశాల కోసం వినూత్న లైట్లతో ప్రత్యేకమైన థీమ్‌లతో అందంగా అలంకరిస్తున్నారు. స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణంతో కూడిన ల్యాండ్ స్కేపింగ్‌తో బార్బిక్యూ వంటి ఔట్‌డోర్ ఈవెంట్లు, పార్టీలను చేసుకునేందుకు ఆహ్లాదకరమైన వేదికగా ఉంటుంది.ఇదీ చదవండి: వెస్ట్ హైదరాబాద్.. వామ్మో ఎంత ఎత్తో..విద్యుత్ బిల్లు ఆదా.. గ్లోబల్ ల్యాండ్ స్కేపింగ్ సర్వీస్ మార్కెట్ 2024లో 330.8 బిలియన్ డాలర్లుగా ఉందని, 2024 నుంచి 2030 నాటికి 6.7 శాతం వృద్ధి రేటు ఉంటుందని పరిశ్రమ వర్గాల అంచనా. వేసవి వచ్చిదంటే చాలు భానుడి ప్రతాపం 43 డిగ్రీలు దాటుతోంది. ఎండ, ఉక్కపోతతో ఇంట్లో ఉండలేని పరిస్థితి. ఏసీ, కూలర్లు ఉన్నా కృత్రిమమే. దీంతో ల్యాండ్ స్కేపింగ్ ప్రాజెక్ట్‌లకు డిమాండ్ పెరిగింది. ల్యాండ్ స్కేపింగ్ ప్రాజెక్ట్‌లలో ఉష్ణోగ్రతలు 2–3 డిగ్రీలు తక్కువగా ఉంటుంది. సాధారణ ఇళ్లతో పోలిస్తే ల్యాండ్ స్కేపింగ్ గృహాల్లో విద్యుత్ బిల్లు రూ.700 నుంచి రూ.వెయ్యి వరకు ఆదా అవుతుంది.ఇంటి విలువ 20 శాతం వృద్ధి.. ల్యాండ్ స్కేపింగ్‌తో ఇల్లు, పరిసర ప్రాంతాల రూపరేఖలు మారిపోతాయి. సహజ సౌందర్యం, ఆకర్షణీయంగా ఉంటుంది. అందమైన ల్యాండ్ స్కేపింగ్‌తో ఇంటి విలువ దాదాపు 20 శాతం వరకు పెరుగుతుంది. నిరంతరం గ్రీనరీ చూస్తుండటంతో మనిషిలో ఒత్తిడి తగ్గడంతో పాటు సృజనాత్మకత పెరుగుతుంది. ల్యాండ్ స్కేపింగ్‌తో పరిసర ప్రాంతాల్లో గాలి కాలుష్యం తగ్గుతుంది. అలాగే గడ్డి, పొదలతో కూడిన ల్యాండ్ స్కేపింగ్ మట్టిని బలంగా ఉండేలా చేస్తుంది. దీంతో వరదలు, వర్షం వంటి వాటితో భూమి కోతలను నివారిస్తుంది. అంతేకాకుండా సీతాకోకచిలుకలు, చిన్న పక్షలు వంటి స్థానికంగా జీవవైవిధ్యానికి ల్యాండ్ స్కేపింగ్ ఆసరాగా నిలుస్తుంది.క్లబ్ హౌస్‌లో కో–వర్కింగ్ ప్లేస్.. కరోనా తర్వాతి నుంచి వర్క్ ఫ్రం హోమ్ విధానం అలవాటయ్యింది. ఉద్యోగుల ఆసక్తి, నిర్వహణ వ్యయం తక్కువగా ఉండటం, మెరుగైన ఉత్పాదకత కారణంగా ఇప్పటికీ కొన్ని బహుళ జాతి కంపెనీలు ఇంటి నుంచి పని విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఇంట్లో ప్రత్యేకంగా కొంత స్పేస్ ఆఫీస్ కోసం వినియోగిస్తే ఒప్పుకోవడం లేదు. ఇంట్లో పిల్లల అల్లరి, పెద్దల అవసరాలు, బంధువులు వస్తే హడావుడి తదితర కారణాలతో ఇంట్లోనే ఆఫీస్ స్పేస్ ఇస్తే ఇష్టపడటం లేదు.ఇదీ చదవండి: హైదరాబాద్‌లో అక్కడ.. కోకాపేట ధరలో సగానికే లగ్జరీ ఫ్లాట్లు..!క్లబ్‌హౌస్‌లో ప్రత్యేకంగా కో–వర్కింగ్ స్పేస్ ఇస్తున్నారు. హై నెట్వర్క్ స్పీడ్‌తో వైఫై సేవలను అందిస్తున్నారు. కూర్చునేందుకు వీలుగా మంచి కుర్చీలు, ఇతరత్రా ఏర్పాట్లను చేస్తున్నారు. దీంతో ఆయా నివాస సముదాయంలో వర్క్ ఫ్రం హోమ్ చేసుకునే నివాసితులందరూ ఒకే చోట పనిచేసుకునే వీలు కలుగుతుంది. దీంతో ఇంట్లో ఎలాంటి అంతరాయం కలగదు. పైగా అత్యవసర సమయంలో వెంటనే ఇంటికి చేరుకోవచ్చు. -
వెస్ట్ హైదరాబాద్.. వామ్మో ఎంత ఎత్తో..
హైదరాబాద్ నగరంలో హైరైజ్ నిర్మాణాలు (High rise apartments)ఆకాశాన్ని తాకుతున్నాయి. గతంలో పాతిక ఫ్లోర్ల భవనం అంటే.. వామ్మో అనుకునే పరిస్థితి. కానీ, ఇప్పుడు 50 అంతస్తులపైనే నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. స్కై స్క్రాపర్లలో (skyscrapers) నివాసం అనేది స్టేటస్ సింబల్‌గా మారిపోవడంతో ప్రవాసులు, ఎంటర్ప్రెన్యూర్లు, బ్యూరోక్రాట్ల అభిరుచి మేరకు డెవలపర్లు పోటాపోటీగా ఆకాశహర్మ్యాలను నిర్మిస్తున్నారు.దీంతో పశ్చిమ హైదరాబాద్‌లో (hyderabad) తలెత్తి చూస్తే తప్ప అపార్ట్మెంట్ కనిపించని పరిస్థితి! దేశంలో హైరైజ్ ప్రాజెక్ట్‌లకు పెట్టింది పేరు ముంబై. ఇక్కడ భూమి లభ్యత తక్కువ కాబట్టి వర్టికల్ నిర్మాణాలు సహజమే. కానీ, హైదరాబాద్‌లో భూమి లభ్యత ఉన్నప్పటికీ అధిక ధరల కారణంగా డెవలపర్లు హైరైజ్ ప్రాజెక్ట్‌లను చేయక తప్పని పరిస్థితి. మరోవైపు అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులున్న ప్రాంతంలో నివాసం ఉండేందుకు కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తుండటంతో ఎత్తయిన గృహ సముదాయాలు వెలుస్తున్నాయి. – సాక్షి, సిటీబ్యూరోవెస్ట్లోనే ఎక్కువ.. షేక్‌పేట, రాయదుర్గం, మదీనాగూడ, ఖాజాగూడ, పుప్పాలగూడ, గండిపేట, కోకాపేట, గచ్చిబౌలి, నానక్‌రాంగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కొండాపూర్ వంటి పశ్చిమ హైదరాబాద్ ప్రాంతాల్లోనే ఎక్కువగా హైరైజ్ ప్రాజెక్ట్‌లు నిర్మాణంలో ఉన్నాయి. ప్రవాసులు, హెచ్ఎన్ఐలు సెకండ్ డెస్టినేషన్‌గా హైదరాబాద్‌లో లగ్జరీ అపార్ట్మెంట్ ఉండాలని కోరుకుంటున్నారు. అధిక అద్దెలు, ఆస్తుల విలువల పెంపు కారణంగా పెట్టుబడిదారులు ఇలాంటి ప్రాజెక్ట్‌లను ఎంచుకుంటున్నారు. దీంతో అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులున్న పశ్చిమ హైదరాబాద్‌లోనే ఆకాశహర్మ్యాలు ఎక్కువగా వస్తున్నాయి. భవనం ఎత్తు పెరిగే కొద్దీ నిర్మాణ వ్యయం పెరుగుతుంది కాబట్టి హైరైజ్ ప్రాజెక్ట్‌లలో అపార్ట్మెంట్ల ధరలు ప్రీమియంగానే ఉంటాయి.బాల్కనీలోంచి సిటీ వ్యూ.. ప్రస్తుతం నగరంలో 200 మీటర్ల ఎత్తు అంటే 50 నుంచి 59 అంతస్తుల హైరైజ్ ప్రాజెక్ట్‌లు నిర్మాణంలో ఉన్నాయి. ప్రవాసులు, హైనెట్ వర్త్ ఇండివిడ్యువల్స్, ఎంటర్ప్రెన్యూర్లు, ఐటీ, ఫార్మా రంగాల్లోని ఉన్నతోద్యోగులు ఎక్కువగా ఆకాశహర్మ్యాలలో ఉండేందుకు ఇష్టపడుతున్నారు. హైరైజ్ ప్రాజెక్ట్‌ల ఎంపికకు మరో ప్రధాన కారణం సిటీ వ్యూ.. 200 మీటర్ల ఎత్తులోని ఫ్లాట్‌లోంచి చూస్తే సిటీ మొత్తం కనిపిస్తుంది. ఉదయం, సాయంత్రం సమయాల్లోని నగరంలోని పరిసరాలను ఆస్వాదించవచ్చు. అంతేకాకుండా హైఎండ్ కుటుంబాలు, అభిరుచులు కలిగిన నివాసితులు ఒకే చోట ఉండటంతో వారి మధ్య సామాజిక బంధం మరింత బలపడుతుంది. జీవన నాణ్యత మెరుగవుతుంది.స్వచ్ఛమైన గాలి, వెలుతురుఅత్యంత ఎత్తులో ఫ్లాట్ ఉంటుంది కాబట్టి వాహనాల ధ్వని, వాయు కాలుష్య సమస్యలూ ఉండవు. ఏకాంతం కోరుకునేవారికి అనువైన గృహాలివే. పైగా ఇంట్లోకి ధారాళమైన గాలి, వెలుతురు, సూర్యరశ్మి వస్తాయి. ఈ ప్రాజెక్ట్‌లకు చేరువలోనే అంతర్జాతీయ విద్యా, వైద్య సంస్థలు, వినోద కేంద్రాలు, నిత్యావసరాలు అన్నీ లభ్యమవుతాయి. ఇంట్లో ఉన్నంత సేపు కుటుంబ, వృత్తి, కెరీర్ వంటి వ్యాపకాలపై ఫోకస్ చేయవచ్చు. వీటిల్లో క్లబ్ హౌస్‌తో పాటు వాకింగ్, జాగింగ్ ట్రాక్‌లు, స్విమ్మింగ్ పూల్, జిమ్, డే కేర్ సెంటర్, మెడిటేషన్ హాల్స్, వెయిటింగ్ రూమ్స్ వంటి అన్ని రకాల ఆధునిక వసతులుంటాయి. సీసీటీవీ కెమెరాలు, సెక్యూరిటీతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉంటాయి.మరింత మౌలిక వసతులు కల్పించాలి పెరుగుతున్న జనాభాకు తగ్గట్టు గృహాలను అందించాలంటే హైరైజ్ నిర్మాణాలే సరైనవి. కాకపోతే ప్రజల జీవన నాణ్యత మెరుగు పరిచేందుకు అవసరమైన రహదారులు, నీటి సరఫరా, మురుగు నీటి వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించాలి. – ప్రశాంత్‌రావు, డైరెక్టర్, పౌలోమీ ఎస్టేట్స్ -
కోకాపేట ధరలో సగానికే లగ్జరీ ఫ్లాట్లు..!
ఐటీ రంగంలో దాదాపు 80 శాతం వరకు హైటెక్ సిటీ, కొండాపూర్, మాదాపూర్ ప్రాంతాల్లోనే పనిచేయాల్సి ఉంటుంది. అక్కడకు సుమారు 10 కిలోమీటర్ల పరిధిలో నివాసం ఉండాలంటే.. కోకాపేట ప్రాంతం చూసుకుంటే అక్కడ చదరపు అడుగు ధర దాదాపు రూ.12–14 వేల వరకు ఉంటోంది. మిగిలిన ప్రాంతాలన్నీ ఇప్పటికే బాగా రద్దీగా ఉంటున్నాయి. దాంతో ఇప్పుడు చాలామంది బాలానగర్ వైపు చూస్తున్నారు. - సాక్షి, సిటీబ్యూరోఒకప్పుడు బాలానగర్ అంటే పారిశ్రామికవాడ అని, భూగర్భ జలాలు కలుషితం అయ్యాయని, గాలి కూడా కాలుష్యంతో ఉంటుందని అనుకునేవారు. కానీ ఇప్పుడు అలాంటి అభిప్రాయాలు అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్నవి.. కేవలం నైఫర్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ), సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ వంటి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు మాత్రమే.ఒకప్పుడు ఇక్కడ ఉండే ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ (ఐడీపీఎల్) వంటి కంపెనీలు కొన్ని వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించినా, అది చాలాకాలం క్రితమే మూతపడింది. పైపెచ్చు, ఈ కంపెనీకి చెందిన 100 ఎకరాల భూముల్లో పచ్చదనం విస్తరించింది. ఇంతకుముందు బాలానగర్ దాటి చింతల్, గుండ్లపోచంపల్లి ప్రాంతాల వరకు గేటెడ్ కమ్యూనిటీలు విస్తరించాయి గానీ, బాలానగర్‌లో ఇంతకుముందు రాలేదు.లగ్జరీ నిర్మాణాలు షురూ.. ఇప్పుడిప్పుడే బాలానగర్ వైపు కూడా లగ్జరీ నిర్మాణాలు మొదలవుతున్నాయి. కోకాపేటతో సహా ఇతర ప్రాంతాల్లో లభించే సదుపాయాలన్నీ ఇక్కడ కూడా లభిస్తున్నాయి. కానీ, కోకాపేటలో చదరపు అడుగు దాదాపు రూ.12–14 వేలు ఉండగా, ఇక్కడ దాదాపు రూ.6 నుంచి రూ.7 వేలకే లభ్యమవుతున్నాయి. అంటే ఇంచుమించు కోకాపేట ధరలో సగానికే లగ్జరీ ఫ్లాట్లు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.హైటెక్ సిటీకి బాలానగర్ ప్రాంతం కూడా దాదాపు 12–13 కిలో మీటర్ల దూరంలోనే ఉంది. అయితే, ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు వంటి మౌలిక సదుపాయాలు రావడంతో అర గంటలోపే బాలానగర్ నుంచి హైటెక్ సిటీకి చేరుకోవచ్చు. పైగా ఈ ప్రాంతంలో మంచి పెద్ద పెద్ద స్కూళ్లు, ఇంజినీరింగ్ కాలేజీలు కూడా ఇక్కడ ఉండటంతో పిల్లల చదువుల గురించి ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. మాల్స్, మల్టీప్లెక్సులు కూడా ఉండటంతో వినోదం, విహారానికి కూడా మంచి అవకాశాలున్నాయి.బాలానగర్ వైపు.. మాదాపూర్, కొండాపూర్ వంటి ప్రాంతాల్లో లగ్జరీ ఫ్లాట్లు కావాలంటే ఎంత లేదన్నా కనీసం రూ.6 నుంచి రూ.7 కోట్లకుపైగా పెట్టాలి. అదే బాలానగర్‌లో లగ్జరీ ఫ్లాటు అంటే దాదాపు 2 వేల చ.అ. విస్తీర్ణం ఉండే ఫ్లాటు అన్ని సౌకర్యాలతో కలిపి కూడా సుమారు రూ.కోటిన్నర– రెండు కోట్లలోపే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైటెక్ సిటీకి సమీపంలో ఇంత తక్కువ ధరలో, అన్ని సదుపాయాలు ఉన్న ప్రాంతంలో దొరకడం దాదాపు ఇంకెక్కడా లేదు. కాబట్టి, ఐటీ జనాలు క్రమంగా ఇప్పుడు బాలానగర్ వైపు చూస్తున్నారు. గతంలో వేర్వేరు ప్రాంతాల్లో పనిచేసినా, చివరకు హైదరాబాద్ వచ్చి స్థిరపడాలని అనుకుంటున్నవారు కూడా బాలానగర్ ప్రాంతం వైపు మొగ్గు చూపుతున్నారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగుల ఇల్లు.. ఇదే కొత్త ట్రెండు!
సొంతిల్లు ప్రతి ఒక్కరి స్వప్నం.. దానికి తగ్గట్టుగానే ఇంటిని (homes) అభిరుచికి తగ్గట్లు నిర్మించుకోవడంతో పాటు సరికొత్త ఇంటీరియర్ (interior) ఏర్పాటు చేసుకుంటున్నారు. విల్లా, ఫ్లాట్, ఇండిపెండెంట్ హౌజ్ ఇలా ఏదైనా సరే.. కొత్తదనం కొట్టొచ్చినట్లు కనిపించేలా తీర్చిదిద్దుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు నగరవాసులు. ఇంట్లోకి అడుగు పెట్టగానే వావ్ అనిపించేలా హాల్, మోడ్రన్ కిచెన్, బెడ్రూమ్స్తో పాటు బాల్కనీని (balcony) ముస్తాబు చేసుకుంటున్నారు. కాఫీ కప్పుతో అలా బాల్కనీలోకి వెళ్తే మనసుకు హాయినిచ్చేలా మలుచుకుంటున్నారు. చాలామంది గ్రీనరీ ఫీల్ కోసం ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ లాన్ ఏర్పాటు చేసుకొని అందమైన మొక్కలతో అలంకరిస్తున్నారు. బాల్కనీ, పెంట్‌హౌస్ సైజును దృష్టిలో ఉంచుకొని కొన్ని సంస్థలు ప్రత్యేక డిజైన్లతో మైమరపిస్తున్నాయి.కరోనా కాలం తర్వాత నగరవాసులు ఎన్నో నూతన ఒరవడుల వైపు ఆసక్తి కనబరిచారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు (software employees) ఇలాంటి వాటికి అధికంగా మొగ్గుచూపారు. దీనికి ఓ కారణం ఉంది.. లాక్డౌన్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ (work from home) కారణంగా అధిక సంఖ్యలో ఉద్యోగులు ఇళ్లలో ఉండటం, వర్క్ స్ట్రెస్ తగ్గించుకోవడం కోసం ఇంట్లో ఇంటీరియర్‌తో పాటు బాల్కనీ ఆహ్లాదకరంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. వర్క్ మధ్యలో ఫ్యామిలీతో అలా బాల్కనీ, పెంట్‌హౌస్‌లో కూర్చొని సరదాగా కాసేపు గడిపి మళ్లీ పని చేసుకుంటున్నారు. నగరంలో వేగంగా విస్తరిస్తున్న రియల్ ఎస్టేట్ (real estate) వ్యాపారంతో సమానంగా ఇంటీరియర్, పలు థీమ్స్‌తో కొన్ని సంస్థలు రంగంలోకి దిగాయి. ఇప్పటి వరకు ఒకలా.. ఇప్పటి నుంచి మరోలా అనే విధంగా ముస్తాబు చేస్తున్నాయి. అపార్ట్మెంట్స్ బాల్కనీ.. అపార్ట్మెంట్ బాల్కనీ కొద్ది స్పేస్ అయినా వాటిని మరింత సుందరీకరణకు మొగ్గు చూపుతున్నారు. కొందరు వారికి నచ్చిన థీమ్స్‌తో డిజైన్ చేయించుకుంటారు. థీమ్ నేమ్స్, లైటింగ్ కొటేషన్స్, సేఫ్టీ కోసం ఇన్విజిబుల్ గ్రిల్స్, వాల్ ఆర్ట్‌ను ఎంచుకుంటున్నారు. వర్క్‌ఫ్రమ్ హోమ్ ఉన్న వారు బాల్కానీని ఆఫీస్ థీమ్స్‌తో పాటు పలు విభిన్న థీమ్స్‌తో సిటీ వ్యూ చూస్తూ డిజైన్స్ కోరుకుంటున్నారు. పిల్లలకు స్టడీస్ ఇంట్రెస్ట్ రావడానికి సరికొత్త డిజైన్స్ ఎంచుకుంటున్నారు. గ్రీనరీతో పాటు ఉన్న స్పేస్‌లో మొక్కలు, రెండు మూడు రకాల కూరగాయలు పెంచుతున్నారు. త్రీ బెడ్రూమ్స్లో ఒక బెడ్రూమ్లో కొత్త థీమ్స్‌కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. విల్లాస్ కల్చర్ పెరిగింది. పెంట్‌హౌస్‌లో ఉన్న స్పేస్‌కి చాలా ఖర్చు పెడుతున్నారు. సిటీ వ్యూ కనబడేలా అవుట్ డోర్ స్విమ్మింగ్ పూల్, జెకూజీ, బార్ కౌంటర్, హోమ్ థియేటర్ తదితర సౌకర్యాలు ఏర్పాటు చేసుకుంటున్నారు.ఫ్యూచర్లో బాల్కనీ స్పేస్ పెరుగుతుంది విల్లాస్, అపార్ట్‌మెంట్స్‌లో ఇంటీరియర్‌కి ఎంతో ఖర్చు చేస్తున్నారు. అందులో భాగంగానే బాల్కనీని చేరుస్తున్నారు. ఫ్యూచర్లో బాల్కనీ స్పేస్ రెట్టింపు అవుతుంది. గ్రీనరీ, ఇంట్లోనే వెజిటబుల్స్ పెంచుకొనేలా ఉన్న స్పేస్‌తో కాకుండా కొత్త స్పేస్ ఇచ్చే ఆలోచన అపార్ట్మెంట్, గేటెడ్ కమ్యూనిటీలో వస్తోంది. వచ్చిన అతిథులు బాల్కనీ, పెంట్‌హౌస్ చూసి వావ్ అనేలా ఉండాలని కోరుకుంటున్నారు. వారు బాల్కనీ, పెంట్హౌస్లనే ఇష్టపడేలా డిజైన్ చేసుకుంటున్నారు. వర్క్‌ఫ్రమ్ హోమ్ ఉన్న వారు ఆఫీస్ థీమ్స్‌తో పాటు పలు విభిన్న థీమ్స్‌తో సిటీ వ్యూ ఉండేలా డిజైన్స్ కోరుకుంటున్నారు. పిల్లలకు స్టడీస్ పట్ల ఇంట్రెస్ట్ రావడానికి వారికి నచ్చినట్లు డిజైన్ చేస్తున్నారు. గ్రీనరీతో పాటు ఉన్న స్పేస్‌లో మొక్కలు, రెండు మూడు రకాల కూరగాయలు పెంచుతున్నారు. – హేమలత రామా, స్వర్గ బాల్కనీ మేకోవర్స్, సీఈఓ -
త్వరలో టీజీ రెరా యాప్..
రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనంతో పాటు కొనుగోలుదారుల ప్రయోజనాలను రక్షించేందుకు ఉద్దేశించినదే తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(TG-RERA). సాంకేతికత వినియోగం పెరిగిన ఈ రోజుల్లో టీజీ రెరా సేవలకు కూడా ఆధునికత చేర్చాలని నిర్ణయించారు. రియల్ ఎస్టేట్(Real Estate) ప్రాజెక్ట్‌లు, ఏజెంట్ల రిజిస్ట్రేషన్, ఫిర్యాదుల ట్రాకింగ్, రియల్ టైం నోటిఫికేషన్ల క్రమబద్ధీకరణ కోసం టీజీ రెరా యాప్‌ను తీసుకురానున్నట్లు టీజీ రెరా ఛైర్మన్ డాక్టర్ ఎన్.సత్యనారాయణ ‘సాక్షి రియల్టీ’తో చెప్పారు. అలాగే ప్రాజెక్ట్‌లు, ఏజెంట్ల రిజిస్ట్రేషన్లు తక్షణ ధ్రువీకరణ కోసం క్యూఆర్ కోడ్ సాంకేతికత అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం టీజీ రెరా వెబ్సైట్(Website)లో రిజిస్ట్రేషన్లు, ఫిర్యాదులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నప్పటికీ.. వినియోగదారులకు మరింత సౌలభ్యాన్ని అందించడమే దీన్ని ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. ‘సాక్షి రియల్టీ’ ఇంటర్వ్యూ పూర్తి వివరాలివీ.. – సాక్షి, సిటీబ్యూరోనివాస సముదాయాలు మాత్రమే రెరాలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా? వాణిజ్య భవనాలకు రెరా రిజిస్ట్రేషన్ అవసరం లేదా?జవాబు: నివాస, వాణిజ్య ఏ భవనమైనా సరే రెరాలో రిజిస్ట్రేషన్ చేయాల్సిందే. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ, యూడీఏ, టీజీఐఐసీ, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ నుంచి అనుమతి పొందిన 500 చ.మీ. లేదా 8 యూనిట్ల కంటే ఎక్కువ ఫ్లాట్లు ఉన్న ప్రతీ ప్రాజెక్ట్ కూడా ఆర్ఈ(R and D) చట్టంలోని సెక్షన్–3 కింద రిజిస్ట్రేషన్ చేయాలి.రెరాలో రిజిస్ట్రేషన్ చేయకుండానే విక్రయాలు చేస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు?జవాబు: బ్రోచర్లు, కరపత్రాలతో సహా అన్ని ప్రింట్, ఎల్రక్టానిక్, సోషల్ మీడియాలో ప్రచురించే ప్రకటనలు, ప్రాజెక్ట్(Project)లకు తప్పనిసరిగా రెరా రిజిస్ట్రేషన్ నంబరు ఉండాలి. దాన్ని ప్రదర్శించాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే తొలుత షోకాజ్ నోటీసు జారీ చేస్తారు. 15 రోజుల వ్యవధిలో ప్రత్యుత్తరాన్ని సమర్పించాలి. లేని పక్షంలో ప్రాజెక్ట్ వ్యయంలో 10 శాతం వరకు జరిమానా విధిస్తారు. ఉల్లంఘనలు పునరావృతమైతే సంబంధిత ప్రమోటర్‌కు మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా విధిస్తారు.ఇల్లు కొనేందుకు కొనుగోలు దారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?జవాబు: ప్రాపర్టీ కొనుగోలు చేసే ముందు కొనుగోలుదారులు సంబంధిత ప్రాజెక్ట్‌కు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ(HMDA), డీటీసీపీ, యూడీఏ, టీజీఐఐసీ వంటి స్థానిక సంస్థల నుంచి నిర్మాణ అనుమతులు ఉన్నాయా? లేదా అని తెలుసుకోవడంతో పాటు రెరాలో రిజిస్ట్రేషన్ అయ్యిందో లేదో నిర్ధారించుకోవాలి. రెరా వెబ్సైట్ ద్వారా ప్రాజెక్ట్ రెరా రిజిస్ట్రేషన్ నంబర్‌ను పరిశీలించవచ్చు. అలాగే లీగల్ టైటిల్, ఆమోదిత లేఔట్ ప్లాన్, ప్రాజెక్ట్ పేరు, వసతులు, ప్రాంతం వివరాలు, చట్టపరమైన టైటిల్ డీడ్స్, ప్రాజెక్ట్ నిర్మాణ గడువు వంటి అన్ని రకాల వివరాలను పరిశీలించవచ్చు.బాధితులు రెరాకు ఎలా ఫిర్యాదు చేయాలి? జవాబు: రెరా రిజిస్ట్రేషన్ లేకుండా, ప్రీలాంచ్, బైబ్యాక్ స్కీమ్‌ల పేరిట ప్రచారం చేసినా, విక్రయాలు చేసినా టీజీ రెరాకు ఫిర్యాదు చేయవచ్చు. 040–29394972 లేదా 9000006301 వాట్సాప్ నంబరులో ఫిర్యాదు చేయవచ్చు. అలాగే https://rera.telangana.gov.in/complaint/ లేదా rera-maud@telangana.gov.in లేదా secy-rera-maud@telangana.gov.inలకు ఈ–మెయిల్స్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. అంతేకాకుండా అగ్రిమెంట్ ఆఫ్ సేల్ లేదా సేల్‌డీడ్‌లో పేర్కొన్న గడువులోగా ప్రాజెక్ట్‌ను పూర్తి చేయకపోయినా, అడ్వాన్స్‌గా 10 శాతం కంటే ఎక్కువ సొమ్ము వసూలు చేసినా రెరాకు ఫిర్యాదు చేయవచ్చు.ఇప్పటి వరకు రెరాలో ఎన్ని ప్రాజెక్ట్‌లు రిజిస్ట్రేషన్ అయ్యాయి?జవాబు: ఇప్పటివరకు టీజీ రెరాలో 9,129 ప్రాజెక్ట్‌లు రెరాలో రిజిస్ట్రేషన్ అయ్యాయి. వీటిలో అత్యధికంగా రంగారెడ్డిలో 2,954, అత్యల్పంగా ఆసిఫాబాద్‌లో 2 ప్రాజెక్ట్‌లు రిజిస్టర్ అయ్యాయి. జిల్లాల వారీగా చూస్తే.. మేడ్చల్–మల్కాజ్గిరి 2,199, సంగారెడ్డి 986, హైదరాబాద్ 516, వరంగల్ అర్బన్ 414, యాదాద్రి భువనగిరి 349, మహబూబ్‌నగర్ 257, ఖమ్మం 280, నిజామాబాద్ 158, కరీంనగర్ 144, సిద్దిపేట 101, వికారాబాద్ 101, సూర్యాపేట 98, నల్లగొండ 87, నాగర్‌కర్నూల్ 66, మెదక్ 61, కామారెడ్డి 53, మంచిర్యాల 37, భద్రాది కొత్తగూడెం 34, జగిత్యాల 32, ఆదిలాబాద్ 31, మహబూబాబాద్ 27, పెద్దపల్లి 26, జనగాం 24, వనపర్తి 21, రాజన్న సిరిసిల్ల 19, జోగులాంబ గద్వాల్ 17, నిర్మల్ 12, వరంగల్ రూరల్ 12, జయశంకర్ 11 ప్రాజెక్ట్‌లు రిజిస్టరయ్యాయి.ఇప్పటి వరకు రెరా ఎంత జరిమానా విధించింది? ఎంత వసూలైంది?జవాబు: ఇప్పటి వరకు రెరా నిబంధనల ఉల్లంఘనదారులపై రూ.40.95 కోట్ల జరిమానాలు విధించాం. ఇందులో రూ.15.64 కోట్లు వసూలు చేశాం.నిర్మాణ సంస్థలు జరిమానా చెల్లించకపోతే రెరా తదుపరి చర్యలు ఏంటి?జవాబు: రెరా విధించిన జరిమానా లేదా వడ్డీ పరిహారం చెల్లించడంలో ప్రమోటర్ విఫలమైతే.. అది రెవెన్యూ బకాయిగా పరిగణిస్తారు. ఈ తరహా కేసులను ఆర్ఈ(ఆర్అండ్డీ) చట్టం–2016లోని సెక్షన్ 40(1) కింద జరిమానా లేదా వడ్డీ రికవరీ చేయాలని సంబంధిత జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేస్తాం.ఇప్పటి వరకు ఎంత మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లు రెరాలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు?జవాబు: రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కూడా తప్పనిసరిగా రెరాలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. రెరా రిజిస్ట్రేషన్ నంబరు లేకుండా ఏజెంట్లు ప్లాట్లు, ఫ్లాట్, ఇల్లు ఏ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌ను విక్రయించకూడదు. ఇప్పటి వరకు టీజీ–రెరాలో 3,925 మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లు రిజిస్టరయ్యారు.ఇదీ చదవండి: భవిష్యత్తులో కనుమరుగయ్యే ఉద్యోగాలు ఇవే..ఈమధ్య కాలంలో బిల్డర్ల చీటింగ్ కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి. వీటిలో చాలా మంది బిల్డర్లు ఏజెంట్ల ద్వారా విక్రయాలు చేసినవాళ్లే.. మరి, ఏజెంట్ల మీద రెరా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది?జవాబు: రెరా చట్టంలోని 9, 10లను ఉల్లంఘించిన రియల్ ఎస్టేట్ ఏజెంట్లపై కూడా రెరా జరిమానా విధిస్తుంది. ఇప్పటి వరకు భృగు ఇన్ఫ్రా, సాయిసూర్య డెవలపర్స్, భారతి ఇన్ఫ్రా డెవలపర్స్, రియల్ ఎస్టేట్ అవెన్యూ కన్సల్టెంట్ సర్వీసెస్, యంగ్ ఇండియా హౌసింగ్ ప్రై.లి. వంటి ఏజెంట్లపై రెరా చర్యలు తీసుకున్నాం. రెవెన్యూ రికవరీ చట్టం కింద జరిమానా రికవరీ చేసేందుకు సంబంధిత జిల్లా కలెక్టర్ చర్యలు కూడా ప్రారంభించారు.ఇప్పటి వరకు రెరా ఎన్ని ఫిర్యాదులను పరిష్కరించింది?జవాబు: టీజీ రెరా పోర్టల్ ద్వారా ప్రాజెక్ట్‌లు, ఏజెంట్ల రిజిస్ట్రేషన్ మాత్రమే కాకుండా ఆన్లైన్లో కేసుల విచారణ కూడా చేపడుతున్నాం. దీంతో ఎక్కడి నుంచైనా సరే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మౌఖిక వాదనాలు వినిపించవచ్చు. ఇప్పటి వరకు 1,216 ఫిర్యాదులను పరిష్కరించాం. -
భారీ స్థాయిలో ఆఫీస్ వసతుల నిర్మాణం
పని ప్రదేశాలకు (Work Space) డిమాండ్ పెరుగుతోంది. ఈ విభాగంలో దేశ, విదేశీ కంపెనీల అవసరాలను తీర్చేందుకు వీలుగా దేశవ్యాప్తంగా ప్రముఖ పట్టణాల్లో 250 లక్షల చదరపు అడుగుల (Sft) ఆఫీస్ వసతుల నిర్మాణం జరుగుతున్నట్టు రియల్టీ కన్సల్టెంట్ అనరాక్ వెల్లడించింది. హౌసింగ్ బ్రోకరేజీ, క్యాపిటల్ మార్కెట్ లావాదేవీలు, రిటైల్, ఇండస్ట్రియల్, వేర్‌హౌసింగ్ లీజింగ్ విభాగాల్లో సేవలు అందిస్తున్న అనరాక్ ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లోకి అడుగు పెట్టడం గమనార్హం.భారత ఆఫీస్ మార్కెట్‌కు 2024 ఎంతో సానుకూలంగా నిలిచిపోతుందని అనరాక్ కమర్షియల్ లీజింగ్ అండ్ అడ్వైజరీ ఎండీ పీయూష్ జైన్ తెలిపారు. రికార్డు స్థాయిలో ఆఫీస్ మార్కెట్ లీజింగ్ లావాదేవీలు నమోదైనట్టు, ఖాళీ ఆఫీస్ స్పేస్ తగ్గినట్టు చెప్పారు. 2025లోనూ ఆఫీస్ మార్కెట్లో బలమైన డిమాండ్ కొనసాగుతుందన్నారు. కరోనా తర్వాత ఆఫీస్ మార్కెట్ చాలా బలంగా కోలుకున్నట్టు పేర్కొన్నారు. గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్లను (జీసీసీలు) బహుళజాతి సంస్థలు భారత్‌తో పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేస్తుండడం, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, పుణె, చెన్నై, అహ్మదాబాద్, కోల్‌కతా నగారల్లో ఆఫీస్ స్పేస్‌కు గణనీయమైన డిమాండ్‌ను తీసుకొస్తున్నట్టు జైన్ వెల్లడించారు. ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ (గంటలు, రోజుల తరబడి లీజింగ్‌కు అవకాశం ఇచ్చేవి) ఆపరేటర్లు పెద్ద ఎత్తున కార్యకలాపాలను విస్తరిస్తూ, ఆఫీస్ స్పేస్‌లను లీజుకు తీసుకుంటున్నట్టు అనరాక్ నివేదిక తెలిపింది.ఈ రంగాల నుంచి డిమాండ్..ఐటీ/ఐటీఈఎస్, ఫైనాన్షియల్ సర్వీసెస్ (బ్యాంకులు సహా), ఇంజినీరింగ్ అండ్ తయారీ రంగ కంపెనీలు ఆఫీస్ స్పేస్ లీజింగ్ డిమాండ్‌కు కీలకంగా ఉన్నట్టు అనరాక్ నివేదిక వెల్లడించింది. ‘2025 సంవత్సరంలో డిమాండ్ ఆశావహంగా ఉండనుంది. స్థిరీకరణ, విస్తరణ, హైబ్రిడ్ పని నమునా డిమాండ్‌కు మద్దతుగా నిలవనున్నాయి. గురుగ్రామ్, బెంగళూరు, పుణెలో గ్రేడ్–1 ఆఫీస్ స్పేస్ సరఫరాలో కొరత ఉంది. డెవలపర్లు ఈ అంతరాన్ని భర్తీ చేసేందుకు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20–25 మిలియన్ (200–250 లక్షల ) ఎస్ఎఫ్టీ గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ నిర్మాణంలో ఉంది. సకాలంలో నిర్మాణం పూర్తి చేసే డెవలపర్లు పెరుగుతున్న డిమాండ్ అవకాశాలను సొంతం చేసుకోవడంలో ముందుంటారు’ అని జైన్ తెలిపారు. ఈ డిమాండ్ స్థిరంగా కొనసాగుతుందన్నారు. తక్కువ వ్యయాలు, నైపుణ్య మానవ వనరులు, నిర్వహణ సామర్థ్యాలు వెరసి బీఎఫ్ఎస్ఐ, హెల్త్‌కేర్, టెక్నాలజీ, ఆర్అండ్డీ పరిశ్రమల్లో జీసీసీలకు భారత్ చిరునామాగా మారుతోందన్నారు. ఇదీ చదవండి: స్వరంతో సంపద సృష్టించిన గాయనీమణులుసవాళ్లు ఇవే..ఆఫీస్ స్పేస్ మార్కెట్లో సవాళ్ల గురించి జైన్ ప్రస్తావించారు. అధిక ముడి సరుకుల ధరలు, సరఫరా సమస్యలతో నిర్మాణంలో జాప్యం నెలకొనడం ప్రధాన సవాలుగా ఉన్నట్లు చెప్పారు. ఆఫీస్ స్పేస్‌లో స్వల్పకాల లీజుకు ప్రాధాన్యం ఇస్తుండడం ఈ విభాగంలో దీర్ఘకాల ఒప్పందాలపై ప్రభావం చూపిస్తున్నట్టు తెలిపారు. -
ప్రాపర్టీ ఎంపికలో పిల్లలూ కీలకమే..
‘మా వాడికేం తెలుసు, వాడింకా చిన్నపిల్లోడే..’ ‘పెద్దవాళ్ల నిర్ణయాల్లో చిన్నోడివి తలదూర్చటం ఎందుకు..?’ ‘నీకింకా నిర్ణయం తీసుకునేంత వయస్సు రాలేదులే..’..పిల్లల విషయంలో మన పెద్దల అభిప్రాయాలివీ. కానీ, నేటి జనరేషన్ పేరెంట్స్ ఇలాంటి మాటలకు టాటా చెప్పేశారు. ఎందుకంటే ఇప్పుడు ప్రాపర్టీ(Property) ఎంపికలో పిల్లలే అంతిమ నిర్ణేతలయ్యారు. పిల్లల అవసరాలు, అభిరుచులకు తగ్గట్టుగా ఉన్న ప్రాజెక్ట్‌లకే తల్లిదండ్రులు జై కొడుతున్నారు. దీంతో ప్రాజెక్ట్ ఎలివేషన్ నుంచి వసతుల వరకూ పిల్లలను ఆకట్టుకునే ప్రత్యేక థీమ్‌లు, క్లబ్‌హౌస్‌లతో నిర్మాణ సంస్థలు ప్రాజెక్ట్‌లను చేపడుతున్నాయి. ఇల్లంటే నాలుగు గోడలు కాదు.. పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరి అవసరాలు, అభిరుచులకు తగ్గట్టుగా ఉండాలి. అందుకే మూస ధోరణిలో నిర్మించే ప్రాజెక్ట్(Project)లను కొనుగోలుదారులు ఆదరించడం లేదు. ఇది వరకు అంతగా పట్టించుకోని చిన్నారుల అవసరాలే ఇప్పుడు గృహ కొనుగోలు నిర్ణయాలను చాలా వరకు ప్రభావితం చేస్తున్నాయి. విదేశీ తరహాలో నిర్మాణం, ఆధునిక వసతులు ఉండే ప్రాజెక్ట్‌లలో కొనుగోళ్లకే మొగ్గు చూపిస్తున్నారు. అవును.. సొంతిల్లు కొంటున్నామంటే ఇప్పుడు పిల్లల అభిరుచులు, అవసరాలు తీరడం కూడా ముఖ్యమే. – సాక్షి, సిటీబ్యూరోపెద్దలు వృత్తి, ఉద్యోగ రీత్యా అధిక సమయం బయటే గడుపుతారు. వాస్తవానికి ఇంట్లో ఎక్కువ సమయం గడిపేది చిన్నారులే. పాఠశాల సమయం మినహా మిగతా సమయం ఇంట్లోనే ఉంటారు. ఇంట్లో, పరిసరాల్లో వీరి అవసరాలు తీరే వసతులు ఏ మేరకు ఉంటున్నాయనేది కీలకం. సౌకర్యాలంటే ప్రత్యేకంగా వారికంటూ ఒక గది, అందులో నచ్చేట్లుగా ఉండే రంగులు, ఇంటీరియర్(interior) మాత్రమే కాదన్నది నేటితరం పిల్లల భావన. బయట పరిసరాలు వీరిని ఎక్కువ ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి కేవలం బాల్యం వరకే కాదు పెరిగి పెద్దయ్యే వరకూ చుట్టుపక్కల తగిన వసతులు ఉండేలా చూడటం పెద్దల బాధ్యత. కొత్తగా పెళ్లయిన దంపతులు సైతం ఇల్లు కొనేటప్పుడు పిల్లల గురించి పరిగణలోకి తీసుకోవడం మర్చిపోవద్దు.కిడ్స్ థీమ్‌లతో ప్రాజెక్ట్‌లు..నివాస సముదాయంలోని క్లబ్‌హౌస్‌లు కమ్యూనిటీ లివింగ్‌ను ప్రోత్సహించడంతో పాటు పిల్లలకు మంచి అలవాట్లు పెంపొందేందుకు సహాయపడతాయి. దీంతో నిర్మాణ సంస్థలు డిస్నీ, హ్యారీపోర్టర్ వంటి కిడ్స్ థీమ్(Kids Theme)లతో కూడిన ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నాయి. వీటిల్లో చిన్న పిల్లలు ఆడుకునే క్రమంలో కిందపడిపోయినా గాయాలు కాకుండా మృదువైన ఆట పరికరాలు, ఇంటరాక్టివ్ అండ్ ఎడ్యుకేషనల్ టాయ్స్ ప్లే ఏరియాలు, ఆర్ట్, డ్యాన్స్ ఇతరత్రా హాబీల శిక్షణ తరగతుల కోసం యాక్టివిటీ జోన్లు, చిట్టడవి, శాండ్ పిట్స్, ట్రీ బెంచ్, మినీ సాకర్ ఫీల్డ్, యాంపీ థియేటర్ వంటి ఇతరత్రా వసతుల జోన్లను కల్పిస్తున్నారు.మంచి కమ్యూనిటీ, ప్లేగ్రౌండ్ఒకవైపు విశాలమైన ఆట స్థలాలు, వినూత్నమైన ఎలివేషన్లతో పిల్లలను ఆకట్టుకుంటే.. మరోవైపు ప్రాజెక్ట్‌లోనే క్రచ్, ప్లేగ్రౌండ్, మంచి కమ్యూనిటీ వంటి వాటితో తల్లిదండ్రులనూ కట్టిపడేస్తున్నారు బిల్డర్లు. అనారోగ్య సమస్యలు తలెత్తితే ఆస్పత్రికి వెళ్లేందుకు ఎక్కువ దూరం ప్రయాణం చేయడం, వర్షం కురుస్తున్నప్పుడు ఇంటి నుంచి కిలో మీటర్ల దూరం ఉండే స్కూల్‌కు పిల్లలను పంపించేందుకు తల్లిదండ్రులు ఏమాత్రం ఇష్టపడట్లేదు. అందుకే అపార్ట్మెంట్ కొనుగోలు చేసేముందు పిల్లల అవసరాలు, ఆరోగ్యాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రాజెక్ట్‌లోనే స్విమ్మింగ్ పూల్, జిమ్ వంటి వసతులే కాదు, ఇందులోనే కమ్యూనిటీ మంచి సర్కిల్, ప్లేగ్రౌండ్ వంటివి ఉంటేనే కొనేందుకు ముందుకొస్తున్నారు. పార్కులు, థియేటర్లు, మాల్స్, రెస్టారెంట్లు ఉన్నాయో లేవో కూడా కొనుగోలుదారులు చూస్తున్నారని నిర్మాణదారులు అంటున్నారు. ధరలపై ప్రభావం..వసతులన్నీ ఉంటే ఆ ప్రాంతం అభివృద్ధి చెంది ఉంటుంది. సహజంగానే దీని ప్రభావం ధరలపై ఉంటుంది. పేరున్న పాఠశాలలు, ఆస్పత్రులు, ప్రజా రవాణా, మాల్స్ ఉన్నట్లయితే ఎక్కువ మంది ఆ చుట్టుపక్కల నివాసం ఉండేందుకు ఆసక్తి చూపుతుంటారు. దీంతో కొత్త నిర్మాణాలకు డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. ఇవన్నీ చూపెట్టి ఆయా ప్రాంతంలో ఉన్న ధరల కంటే ఎక్కవ ధరకు విక్రయించేవారు ఉంటారు. నాణ్యమైన నిర్మాణం, గడువులోగా పూర్తి చేసే నిర్మాణదారులనే అంతిమంగా ఎంపిక చేసుకోవాలి.అభిరుచుల కోసం క్లబ్‌హౌస్‌లు..ప్రస్తుతం మార్కెట్లో చాలా ప్రాజెక్ట్‌లు పిల్లల వసతులపై దృష్టిపెడుతున్నాయి. వారు ఆటలాడుకునేందుకు ప్రత్యేకంగా స్థలం కేటాయిస్తున్నాయి. తక్కువ లోతులో ఈత కొలనులు నిర్మిస్తున్నాయి. పెద్దలకే కాదు పిల్లల కోసం వేర్వేరు ప్లే కోర్టులను తమ ప్రాజెక్ట్‌లో చేరుస్తున్నాయి. తక్కువ స్థలంలో నిర్మాణాలు చేపడుతూ ఖాళీ స్థలం ఎక్కువ ఉండేలా పచ్చదనానికి పెద్దపీట వేస్తున్నాయి. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల కోసం ప్రత్యేకంగా ట్యూషన్లు చెప్పిస్తుంటారు. ఈ దృష్ట్యా కొన్ని నిర్మాణ సంస్థలు అపార్ట్మెంట్లలోనే ట్యూషన్ గదులను నిర్మిస్తున్నాయి. వ్యాపకాలు, అభిరుచులకు పదును పెట్టేలా చిన్నారుల కోసం ప్రత్యేకంగా క్లబ్‌హౌస్‌లను నిర్మించడం నేటి పోకడ. ఉద్యోగాలకు వెళ్లిన తల్లిదండ్రుల కంటే పిల్లలు పాఠశాల నుంచి ముందుగానే ఇంటికి చేరుకుంటారు. అమ్మానాన్న వచ్చే వరకు వీరు క్లబ్ హౌస్‌లో ఇతర నైపుణ్యాలను పెంపొందించుకునే కార్యక్రమాల్లో పాల్గొనే సదుపాయం కల్పిస్తున్నాయి.నేటి పేరెంట్స్ నిర్ణయంలో మార్పులుమెట్రో నగరాల్లో భార్యభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయక తప్పని పరిస్థితి. దీంతో పిల్లలకు సమయం కేటాయించలేని పరిస్థితి. అందుకే కనీసం నివాసం ఉండే ప్రాజెక్ట్‌లోనైనా పిల్లల అవసరాలు, అభిరుచులను తీర్చేవిధంగా ఉండాలని భావిస్తున్నారు. చిన్నారులకు భద్రమైన, ఆధునిక వసతులను అందించే ప్రాజెక్ట్‌లను కోరుకుంటున్నారు.– వంశీకృష్ణ, డైరెక్టర్, ప్రైమార్క్ డెవలపర్స్ -
హైదరాబాద్‌లో తగ్గిన ఇళ్ల అమ్మకాలు - కారణం ఇదే..
హైదరాబాద్ (Hyderabad) ఇళ్ల మార్కెట్ నీరసించింది. ఈ ఏడాది మొత్తం మీద ఇళ్ల అమ్మకాలు క్రితం ఏడాది కంటే 5 శాతం తక్కువగా నమోదు కావొచ్చంటూ రియల్ ఎస్టేట్ (Real Estate) కన్సల్టెంట్ అనరాక్ తెలిపింది. 58,540 యూనిట్ల అమ్మకాలు ఉంటాయని అంచనా వేసింది. క్రితం ఏడాది విక్రయాలు 61,715 యూనిట్లుగా ఉన్నాయి.హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో ఈ ఏడాది ఇళ్ల అమ్మకాలు 4 శాతం తగ్గి రూ.4.6 లక్షల యూనిట్లుగా ఉండొచ్చంటూ.. 2024 ఏడాదిపై అంచనాలతో అనరాక్ నివేదిక విడుదల చేసింది. గతేడాది ఇవే నగరాల్లో 4,76,530 యూనిట్లు అమ్ముడయ్యాయి. కాకపోతే గతేడాదితో పోల్చితే ఇళ్ల అమ్మకాల విలువ ఈ ఏడాది 16 శాతం పెరిగి రూ.5.68 లక్షల కోట్లుగా ఉంది.ఒక ఇల్లు సగటు విక్రయ ధర ఈ ఏడాది 21 శాతం పెరిగింది. భూముల ధరలు, కార్మికుల వేతనాలు, ముడి సరుకుల ధరలు పెరగడం ఇందుకు కారణాలుగా ఉన్నాయి. అలాగే, సాధారణ, అసెంబ్లీ ఎన్నికల సమయంలో నియంత్రణ పరమైన అనుమతుల్లో జాప్యంతో కొత్త హౌసింగ్ ప్రాజెక్టుల ప్రారంభం నిదానించడాన్ని కూడా కారణంగా పేర్కొంది.ఇదీ చదవండి: రూ.16.8 కోట్ల అడ్వాన్స్.. నెల అద్దె తెలిస్తే షాకవుతారు!ఇళ్ల ధరలు పెరగడంతో అమ్మకాల విలువ గతేడాది కంటే అధికంగా ఉన్నట్టు వివరించింది. ‘‘భారత హౌసింగ్ రంగానికి 2024 మిశ్రమంగా ఉంది. సాధారణ ఎన్నికలకు తోడు, నిర్మాణ అనుమతుల్లో జాప్యం నెలకొంది. నూతన ఇళ్ల సరఫరాపై దీని ప్రభావం పడింది. గతేడాదితో పోల్చితే ఇళ్ల అమ్మకాలు సంఖ్యా పరంగా తగ్గినప్పటికీ, ధరల పెరగుదలతో అమ్మకాల విలువ 16 శాతం పెరిగింది’’అని అనరాక్ చైర్మన్ అనుజ్ పురి తెలిపారు.సరఫరాలో క్షీణత➤తాజా ఇళ్ల సరఫరా ఏడు ప్రధాన నగరాల్లో ఈ ఏడాది 7 శాతం తగ్గి, 4,12,520 యూనిట్లుగా ఉండొచ్చు.➤ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ఈ ఏడాది ఇళ్ల అమ్మకాలు గతేడాదితో పోల్చితే 6 శాతం తగ్గి 61,900 యూనిట్లుగా ఉంటాయి. గతేడాది 65,625 యూనిట్ల విక్రయాలు జరిగాయి. ➤ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (MMR)లో అమ్మకాలు ఒక శాతం పెరిగి 1,55,335 యూనిట్లకు చేరొచ్చు.➤బెంగళూరులో ఇళ్ల అమ్మకాలు 2 శాతం వృద్ధితో 65,230 యూనిట్లుగా ఉండొచ్చని అంచనా. ➤పూణేలో 6 శాతం తక్కువగా 81,090 యూనిట్ల విక్రయాలు నమోదు అవుతాయి.➤కోల్‌కతాలో 20 శాతం క్షీణతతో 18,335 యూనిట్లకు అమ్మకాలు పరిమితం కావొచ్చు.➤చెన్నైలో 11 శాతం తగ్గి 19,220 యూనిట్లుగా ఉంటాయని అనరాక్ నివేదిక అంచనా వేసింది. -
హైదరాబాద్‌లో ఆఫీస్ లీజింగ్ కళకళ
హైదరాబాద్ (Hyderabad) మార్కెట్లో కార్యాలయ స్థలాలకు (office space) బలమైన డిమాండ్ కొనసాగుతోంది. ప్రస్తుత ఏడాది మొత్తం మీద గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ లీజింగ్ 56 శాతం పెరిగి 12.5 మిలియన్ చదరపు అడుగులు (ఎస్ఎఫ్టీ)గా ఉన్నట్టు కొలియర్స్ ఇండియా (Colliers) నివేదిక వెల్లడించింది. క్రితం ఏడాది లీజు పరిమాణం 8 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉన్నట్టు పేర్కొంది. ఇక దేశవ్యాప్తంగా ఆరు ప్రధాన నగరాల్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ ఈ ఏడాది 14 శాతం పెరిగి 66.4 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉన్నట్టు కొలియర్స్ నివేదిక తెలిపింది. క్రితం ఏడాది ఇవే పట్టణాల్లో స్థూల కార్యాలయ స్థలాల లీజింగ్ 58.2 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. పట్టణాల వారీగా.. » బెంగళూరులో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 21.7 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరింది. క్రితం ఏడాది 15.6 మిలియన్ ఎస్ఎఫ్టీ లీజుతో పోల్చితే 39 శాతం పెరిగింది. » ముంబైలోనూ 43 శాతం వృద్ధితో 10 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా నమోదైంది. » పుణెలో ఆఫీస్ స్పేస్ లీజింగ్ క్రితం ఏడాదితో పోల్చి చూస్తే 4 శాతం పెరిగి 5.7 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరింది. » చెన్నైలో స్థూల లీజింగ్ 35 శాతం క్షీణతతో 6.8 మిలియన్ ఎస్ఎఫ్టీకి పరిమితమైంది. 2023లో ఇదే పట్టణంలో లీజింగ్ 10.5 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. » ఢిల్లీ ఎన్సీఆర్లోనూ 16 శాతం తక్కువగా 9.7 మిలియన్ ఎస్ఎఫ్టీ లీజు నమోదైంది.2025లోనూ గరిష్ట స్థాయిలోనే.. టెక్నాలజీ, ఇంజనీరింగ్, తయారీ కంపెనీలతోపాటు ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీల నుంచి ఆఫీస్ స్థలాలకు ఈ ఏడాది డిమాండ్ ఎక్కువగా ఉన్నట్టు కొలియర్స్ ఇండియా నివేదిక తెలిపింది. 2025లోనూ ఆఫీస్ స్పేస్ లీజింగ్ గరిష్ట స్థాయిలోనే కొనసాగొచ్చొని కొలియర్స్ ఇండియా ఆఫీస్ సర్వీసెస్ విభాగం ఎండీ అర్పిత్ మెహరోత్రా అంచనా వేశారు. వచ్చే కొన్నేళ్ల పాటు లీజింగ్ 60 మిలియన్ ఎస్ఎఫ్టీకి మించి కొనసాగడం సాధారణ అంశంగా మారుతుందన్నారు. గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల (జీసీసీలు) నుంచి స్థిరమైన డిమాండ్ కొనసాగడం పెద్ద పరిమాణంలో ఆఫీస్ స్థలాల లీజింగ్‌కు మద్దతుగా నిలుస్తున్నట్టు బెంగళూరు కేంద్రంగా పనిచేసే సుమధుర గ్రూప్ సీఎండీ మధుసూదన్ పేర్కొన్నారు. లాజిస్టిక్స్, ఇండస్ట్రియల్ వసతులకూ డిమాండ్ దేశవ్యాప్తంగా టాప్–8 నగరాల్లో లాజిస్టిక్స్, ఇండస్ట్రియల్ (ఎల్‌అండ్‌ఐ) వసతుల లీజింగ్ ప్రస్తుత ఏడాది మొత్తం మీద 50–53 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉండొచ్చని కుష్మన్ అండ్ వేక్ ఫీల్డ్ సంస్థ తెలిపింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, పుణె, అహ్మదాబాద్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్) పరిధిలో గతేడాది లాజిస్టిక్స్ అండ్ ఇండస్ట్రియల్ వసతుల లీజింగ్ 53.57 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉన్నట్టు పేర్కొంది. ఈ ఏడాది అక్టోబర్ వరకు లీజింగ్ ఈ నగరాల్లో 41 మిలియన్ ఎస్ఎఫ్టీని అధిగమించినట్టు తెలిపింది.‘‘ప్రభుత్వం 2020లో ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) ప్రకటించిన నాటి నుంచి ఇండస్ట్రియల్ స్థలాల లీజింగ్‌లో మెరుగైన వృద్ధి నమోదవుతోంది. దీనికితోడు రిటైల్, ఈ–కామర్స్ సైతం బలంగా అవతరించడం డిమాండ్‌కు మద్దతుగా నిలిచింది’’అని ఈ నివేదిక వెల్లడించింది. బలమైన పారిశ్రామిక కార్యకలాపాలకు తోడు వినియోగ దోరణి విస్తృతం కావడంతో 2025లో లీజింగ్ బలంగా కొనసాగొచ్చని అంచనా వేసింది. చైనా ప్లస్ వన్ విధానంతో భారత్ సైతం ప్రయోజనం పొందుతుండడం ఈ రంగాల్లో డిమాండ్‌కు కలిసొస్తున్నట్టు వివరించింది. -
భవనాల ఎత్తుకు క్యాప్ పెట్టండి!
‘ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్(ఎఫ్ఎస్ఐ) పరిమితులు ఉన్నాయి. కానీ, ఔటర్ రింగ్ రోడ్డు వరకూ స్థలాల లభ్యత ఉన్న హైదరాబాద్‌లో మాత్రం ఎఫ్ఎస్ఐపై ఆంక్షలు లేవు. దీంతో రోడ్డు, స్థలం విస్తీర్ణంతో సంబంధం లేకుండా బిల్డర్లు ఇష్టారాజ్యంగా హైరైజ్ భవనాలను నిర్మిస్తున్నారు. దీంతో భూములు, అపార్ట్మెంట్ల ధరలు పెరుగుతున్నాయి. ఒకే ప్రాంతంలో భవన నిర్మాణాలు ఉండటంతో రోడ్లపై వాహనాల రద్దీ, కాలుష్యం పెరగడంతో పాటు విద్యుత్, డ్రైనేజీ, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలపై అదనపు భారం పడుతుంది’ అని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్(నరెడ్కో) వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ ఛైర్మన్ ఎం.ప్రేమ్‌కుమార్ అన్నారు. ‘సాక్షి రియల్టీ’తో ఆయన ఇంటర్వ్యూ పూర్తి వివరాలివీ.. – సాక్షి, సిటీబ్యూరోమౌలిక వసతులు, డిమాండ్ ఉన్న ప్రాంతంలో తక్కువ స్థలం దొరికినా చాలు బిల్డర్లు హైరైజ్ భవనాలు కట్టేస్తున్నారు. దీంతో స్థలాలు, అపార్ట్మెంట్ల ధరలు పెరగడం తప్ప సమాంతర అభివృద్ధి జరగడం లేదు. నగరాభివృద్ధికి ఆకాశహర్మ్యలే ప్రతీక. ఆర్థికంగా, సాంకేతికంగా మనం ఎంత శక్తిమంతులమో ఇవి నిరూపిస్తాయి. అలా అని రోడ్డు, మౌలిక సదుపాయాలపై పడే ప్రభావాన్ని అంచనా వేయకుండా అనుమతులు ఇవ్వకూడదు. ఎఫ్ఎస్ఐపై ఆంక్షలు ఉంటేనే బిల్డర్లు ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కాకుండా ఓఆర్ఆర్ చుట్టూ ఖాళీగా ఉన్న ప్రాంతాల వైపు దృష్టిసారిస్తారు. దీంతో ధరలు తగ్గి, సామాన్యుల సొంతింటి కల సాకారం అవుతుంది. నార్సింగి, పుప్పాలగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ఖరీదైన ప్రాంతాల్లో కనీసం నివాస భవనాలకైనా ఎఫ్ఎప్ఐపై క్యాప్ పెట్టాలి.మూసీ పరిహారంగా స్థలాలు..గ్లోబల్ సిటీగా బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్న హైదరాబాద్‌లో కంపుకొట్టే మూసీ నది ఉండటం శోచనీయం. విదేశీ పర్యాటకులు, పెట్టుబడులను ఆకర్షించాలంటే మూసీ సుందరీకరణ అనివార్యం. ఈ బృహత్తర కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం అభినందనీయం. అయితే మూసీ పరివాహక ప్రాంతంలోని నివాసితులను ఒప్పించి ఆయా భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. మూసీ బాధితులకు శివారు ప్రాంతంలో ప్రభుత్వమే లేఔట్ చేసి, 60–80 గజాల చొప్పున స్థలాన్ని కేటాయించాలి. దీంతో వాళ్లే సొంతంగా ఇళ్లు కట్టుకుంటారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుల నిధులను ఇతర అవసరాలకు వినియోగించుకోవచ్చు. మెట్రో, ఎంఎంటీఎస్ విస్తరణతో రవాణా వ్యవస్థ మరింత మెరుగవుతుంది. రోడ్ల మీద వాహనాల రద్దీతో పాటు ప్రయాణ సమయం తగ్గుతుంది. మెరుగైన రవాణాతో నగరం సమాంతరంగా అభివృద్ధి చెందుతుంది.ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ఎన్ని ఇళ్లు అమ్మకానికి ఉన్నాయంటే..చెరువుల్లో పట్టా భూములు..చెరువులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు ఏర్పాటైన హైడ్రా ఉద్దేశం మంచిదే. కానీ, ప్రభుత్వం దీన్ని సరైన రీతిలో పరిచయం చేయలేదు. ఇప్పటికీ గ్రేటర్లో చాలా చెరువులకు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను ప్రభుత్వం నిర్ధారించలేదు. అయినా ఆగమేఘాల మీద బుల్డోజర్లతో కూల్చివేతలు చేశారు. అలా కాకుండా ముందుగా చెరువులకు కంచె వేసి, బఫర్ జోన్లను నిర్ధారించాలి. గ్రేటర్‌లోని చాలా చెరువుల్లో పట్టా భూములు ఉన్నాయి. ఆయా భూయజమానులకు 400 శాతం ట్రాన్స్ఫర్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) భూములను స్వాధీనం చేసుకోవాలి. ఈ విధానాన్ని హైదరాబాద్‌కే కాకుండా రాష్ట్రమంతటా అమలు చేయాలి. అప్పుడే బాధితులు ముందుకొస్తారు. గతంలో కొనుగోలుదారులు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పర్మిషన్ ఉందా అడిగేవారు కానీ ఇప్పుడు హైడ్రా పర్మిషన్ ఉందా అని అడుగుతున్నారు. -
హైదరాబాద్‌లో ఎన్ని ఇళ్లు అమ్మకానికి ఉన్నాయంటే..
డిమాండ్‌కు మించి సరఫరా జరుగుతుండటంతో హైదరాబాద్‌లో అమ్మకానికి ఉన్న ఇళ్లు(ఇన్వెంటరీ) పెరిగిపోతున్నాయి. దేశంలోని ఏడు ప్రధాన మెట్రో నగరాలతో పోలిస్తే ముంబై తర్వాత హైదరాబాద్‌లోనే అత్యధిక ఇన్వెంటరీ ఉంది. ఇక, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాలతో పోలిస్తే మన దగ్గరే ఎక్కువ. ప్రస్తుతం గ్రేటర్లో 1,01,091 ఇళ్ల ఇన్వెంటరీ (వీటిలో నిర్మాణంలో ఉన్నవి, పూర్తయినవి కలిపి) ఉంది. వీటి విక్రయానికి కనిష్టంగా 19 నెలల కాలం పడుతుంది.రెండేళ్లలో నగరంలో గృహాల సరఫరా పెరగడమే ఇన్వెంటరీ పెరుగుదలకు ప్రధాన కారణం. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఏడాది తొలి తొమ్మిది నెలల కాలంలో మొత్తం 5,64,416 యూనిట్ల ఇన్వెంటరీ మిగిలి ఉందని, వీటి విక్రయానికి కనిష్టంగా 14 నెలల కాలం పడుతుందని అనరాక్ గ్రూప్ నివేదిక వెల్లడించింది.ఇదీ చదవండి: ట్రంప్ కలం నుంచి జాలువారిన అక్షరాలునగరాల వారీగా ఇన్వెంటరీ (యూనిట్లలో)ఎన్సీఆర్ ఢిల్లీ 85,460 ఎంఎంఆర్ ముంబయి 1,86,677 బెంగళూరు 46,316 పుణే 88,176 హైదరాబాద్ 1,01,091 చెన్నై 28,758 కోల్‌కతా 25,938 -
సోలారే సోబెటరూ..
సాక్షి, సిటీబ్యూరో: ఈ మధ్య కాలంలో వచ్చిన అధునాతన సాంకేతిక మార్పుగా అవతరించి, సామాజికంగా అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న వాటిలో ‘సోలార్ విద్యుత్ శక్తి, ఈ–వాహనాలు’ హవా కొనసాగిస్తున్నాయి. ఈ రెండు అంశాలు సామాజిక జీవన వైవిధ్యంలో పెను మార్పులకు నాంది పలికాయి. ఒక వైపు విపరీతంగా పెరిగిపోతున్న కరెంట్ వాడకం, దానికి అనుగుణంగానే పెరిగిపోతున్న విద్యుత్ ఛార్జీలు. వెరసీ అందరి చూపూ సోలార్ విద్యుత్ వైపునకు మళ్లింది.దశాబ్ద కాలంగానే సోలార్కు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నప్పటికీ అది నగరాల వరకే పరిమితమైంది. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంతో గ్రామీణ ప్రాంతాల్లోనూ సోలార్ సెట్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ స్కీంలో భాగంగా దేశవ్యాప్తంగా కోటి ఇళ్లకు సోలార్ వ్యవస్థను వ్యాప్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ప్రత్యేక సబ్సిడీలను సైతం అందిస్తున్నారు. కొన్నేళ్లుగా సోలార్ వ్యవస్థ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న వ్యాపార సంస్థలు సైతం ఈ సందర్భంగా వారి సేవలు పెంచుతున్నాయి. కొన్ని సంస్థలైతే వివిధ జిల్లాల్లోని టౌన్లలో ప్రత్యేకంగా ఎక్స్పీరియన్స్ సెంటర్లను ఆవిష్కరించి ఈ సోలార్ సెట్ వాడకంపై అవగాహన కల్పిస్తున్నారు.సూర్య ఘర్ స్కీంతో సబ్సిడీ..హైదరాబాద్ వంటి నగరాల్లో సోలార్ వాడకంపై అవగాహన మెరుగ్గానే ఉంది. సోలార్ విద్యుత్ వినియోగించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఇప్పుడిప్పుడే ఈ విధానానికి అలవాటు పడుతున్నారు. ఈ సోలార్ పద్ధతులు వ్యక్తిగత ఇళ్లతో పాటు చిన్న–పెద్ద తరహా పరిశ్రమల్లోనూ విరివిగా వాడుతున్నారు. వారి వారి విద్యుత్ వాడకానికి అనుగుణంగానే పీఎం సూర్య ఘర్ స్కీంలో ఒక కిలో వాట్ నుంచి వినియోగాన్ని బట్టి అవసరమైనన్ని కిలో వాట్ల సోలార్సెట్లను, వాటికి సబ్సిడీని అందిస్తుంది. ఈ సోలార్ విధానాన్ని రెసిడెన్షియల్ ఏరియాలో, స్కూల్స్, ఫామ్ హౌజ్‌లు, రైస్‌మిల్స్ వంటి చిన్న తరహా పరిశ్రమల్లోనూ ఎక్కువగా వాడుతున్నారు. పరిశ్రమలైనా, వ్యక్తిగత వినియోగమైనా.. టెక్నాలజీ పెరగడంతో కరెంట్ వినియోగం సైతం అధికంగా పెరిగిపోయింది. గతంలో ఇళ్లలో రూ.200 నుంచి రూ.500ల కరెంట్ బిల్ అత్యధికం అనుకుంటే.. ఇప్పుడది రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు పెరిగిపోయింది. ఇక పరిశ్రమల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మిషనరీ, అధునాతన సాంకేతికత వినియోగం పెరగడంతో వాటి చార్జీలు మూడింతల కన్నా పైగానే పెరిగాయని నిపుణులు తెలుపుతున్నారు. పర్యావరణ హితం.. సోలార్ సిస్టం..విద్యుత్ తయారీ కోసం ప్రస్తుతం వాడే పద్ధతులన్నీ ఏదో విధంగా పర్యావరణానికి హాని చేసేవే అని పరిశోధకుల అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. సాధారణంగా థర్మల్, గ్యాస్, విండ్, హైడ్రో తదితర పద్ధతుల్లో విద్యుత్‌ను సేకరిస్తున్నారు. ఈ తరుణంలో కిలో వాట్ సోలార్ సిస్టమ్ పెట్టుకుంటే కొన్ని వందల మొక్కలు పెంచిన దానితో సమానమని, అంతటి కాలుష్యాన్ని తగ్గించే విధానంగా సోలార్ నిలుస్తుందని నిపుణుల మాట. ప్రస్తుతం గ్లోబల్ వార్మింగ్ పెరగడం, కార్బన్ మోనాక్సైడ్ స్థాయిలు పెరగడం.. తదితర కారణాలతో ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు ఏర్పడటం, వెరసీ పర్యావరణ మార్పులతో పెను ప్రమాదాలను ఎదుర్కొంటున్నాం. ఇలాంటి తరుణంలో కాలుష్యరహిత పద్ధతులైన సోలార్ సిస్టమ్ అత్యంత శ్రేయస్కరమని భావిస్తున్నారు. అంతా లాభమే.. – రాధికా చౌదరి, ఫ్రెయర్ ఎనర్జీ కోఫౌండర్రాష్ట్రంలో సోలార్ వినియోగంపై అవగాహన పెరిగింది. ఈ రంగంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, ఉత్తర్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనూ సేవలందిస్తున్నాం. కరోనా అనంతరం సోలార్ ఎనర్జీను వినియోగించేవారి సంఖ్య అధికంగా పెరిగింది. పీఎం సూర్య ఘర్ స్కీం కూడా దీనికి కారణం. ఇందులో భాగంగా రూ.2 లక్షల సోలార్ సెట్ బిగించుకుంటే దాదాపు రూ.78 వేల సబ్సిడీ లభిస్తుంది. మిగతా పెట్టుబడి కూడా రెండు మూడేళ్ల కరెంట్ ఛార్జీలతో సమానం. కాబట్టి మూడేళ్ల తర్వాత వినియోగించే సోలార్ కరెంట్ అంతా లాభమే. -
రియల్టీలో ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: దేశీ రియల్టీ రంగంలో ప్రైవేట్ ఈక్విటీ(పీఈ) పెట్టుబడులు భారీగా ఎగిశాయి. ప్రస్తుత క్యాలండర్ ఏడాది(2024)లో ఇప్పటివరకూ 4.15 బిలియన్ డాలర్లు లభించాయి. రియల్టీ రంగ కన్సల్టెంట్ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక ప్రకారం వార్షికంగా ఇవి 32 శాతం అధికం. పెట్టుబడుల్లో అత్యధికంగా హౌసింగ్ విభాగానికి ప్రవహించినట్లు తెలియజేసింది. 2024 ఇండియాలో పీఈ పెట్టుబడుల ట్రెండ్ పేరుతో నివేదికను విడుదల చేసింది. ఈ వివరాల ప్రకారం 2024లో ఇప్పటివరకూ రియల్టీలో పీఈ పెట్టుబడులు 415 కోట్ల డాలర్లను అధిగమించాయి.వేర్‌హౌసింగ్ ఆధిపత్యంరియల్టీ రంగ మొత్తం పీఈ పెట్టుబడుల్లో వేర్‌హౌసింగ్ 45 శాతం వాటాతో అగ్రస్థానంలో నిలవగా.. రెసిడెన్షియల్ విభాగం 28 శాతం వాటాను ఆక్రమించింది. కార్యాలయ విభాగం 26 శాతం పెట్టుబడులను ఆకట్టుకుంది. అయితే గతేడాదితో పోలిస్తే రెసిడెన్షియల్ విభాగం రెట్టింపునకుపైగా వృద్ధితో 117.7 కోట్ల డాలర్లు అందుకుంది. గృహ కొనుగోళ్లలో వినియోగదారుల నుంచి పెరుగుతున్న డిమాండ్ ప్రభావం చూపుతోంది. కాగా.. వేర్‌హౌసింగ్‌కు 187.7 కోట్ల డాలర్లు అందితే.. ఆఫీస్ ప్రాపర్టీలకు 109.8 కోట్ల డాలర్లు లభించాయి. పదేళ్లుగా పెరుగుదల..ప్రధానంగా భారత్‌లో గత దశాబ్ద కాలం నుంచి పెట్టుబడులు పుంజుకుంటున్నట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్, ఎండీ శిశిర్ బైజల్ పేర్కొన్నారు. ఇందుకు ఆర్థిక సుస్థిరత, నిరవధిక వృద్ధి సహకరిస్తున్నట్లు తెలియజేశారు. ఈకామర్స్, థర్డ్‌పార్టీ లాజిస్టిక్స్ ఊపందుకున్న నేపథ్యంలో వేర్‌హౌసింగ్‌కు భారీ డిమాండ్ నెలకొన్నట్లు వివరించారు. వెరసి వేర్‌హౌసింగ్ విభాగం అత్యధిక పెట్టుబడులకు నెలవుగా మారినట్లు తెలియజేశారు. ఈ బాటలో గృహ రంగం సైతం ప్రస్తావించదగ్గ స్థాయిలో పెట్టుబడులను ఆకట్టుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: మళ్లీ భగ్గుమన్న బంగారం.. తులం ఎంతో తెలుసా?ఆఫీసులు కళకళపీఈ పెట్టుబడుల్లో కార్యాలయ విభాగం కొంతమేర నీరసించినప్పటికీ ఉద్యోగులు తిరిగి వర్క్‌ప్లేస్‌లకు రావడం, ఆఫీసులు పెరగడం, అద్దెలు బలపడటం వంటి అంశాలు అండగా నిలుస్తున్నట్లు శిశిర్ వివరించారు. ఇక దేశీయంగా మొత్తం రియల్టీ పీఈ పెట్టుబడుల్లో ముంబై 50 శాతం వాటాను ఆక్రమించడం గమనార్హం! మొత్తం పెట్టుబడుల్లో 42 శాతం వాటాకు సమానమైన 1.7 బిలియన్ డాలర్లు యూఏఈ నుంచి లభించాయి. దేశీ పీఈ ఇన్వెస్టర్లు 32 శాతం వాటాకు సమానమైన 1.3 బిలియన్ డాలర్లు సమకూర్చారు! సింగపూర్ ఫండ్స్, ఇన్స్టిట్యూషన్స్ నుంచి 63.37 కోట్ల డాలర్లు ప్రవహించాయి. -
హైదరాబాద్ ‘రియల్’ ట్రెండ్
దేశీయ స్థిరాస్తి రంగంలో హైదరాబాద్ పవర్ హౌస్‌గా మారింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ), లైఫ్ సైన్స్ రంగాల బహుళ స్థిరాస్తి పెట్టుబడులకు వేదికగా అభివృద్ధి చెందింది. గతంలో సిటీ రియల్ ఎస్టేట్‌లో ఐటీ కంపెనీలు, ఉద్యోగుల లావాదేవీలు ఎక్కువగా జరుగుతుండేవి. కానీ, కొంతకాలంగా ఫార్మాసూటికల్స్ రంగం నుంచి కూడా పెట్టుబడులు, కొనుగోళ్లు పెరుగుతున్నాయి. దీంతో గృహాలు, ఆఫీసులు, గిడ్డండులు, డేటా సెంటర్లకు డిమాండ్ ఏర్పడింది. – సాక్షి, సిటీబ్యూరోఇదీ రియల్ వృద్ధి..హైదరాబాద్‌లో ఈ ఏడాది తొమ్మిది నెలల్లో రూ.36,461 కోట్లు విలువ చేసే రూ.59,386 గృహాలు అమ్ముడుపోయాయని నైట్‌ఫ్రాంక్ ఇండియా తెలిపింది. అలాగే మార్కెట్లోకి కొత్తగా 85 లక్షల చ.అ. ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఉన్న ఆఫీస్ స్పేస్‌తో కలిపి మొత్తం 87 లక్షల చ.అ. కార్యాలయాల స్థలాల లావాదేవీలు జరిగాయి. ఇక గ్రేటర్లో 54 లక్షల చ.అ. గిడ్డంగుల స్థలం, 47 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 20 మెగావాట్లు నిర్మాణంలో ఉండగా.. మరో 38 మెగావాట్లు ప్రణాళిక దశలో ఉన్నాయని కొల్లియర్స్ ఇండియా నివేదిక తెలిపింది.భవిష్యత్తులో మరింత జోష్ఫోర్త్ సిటీ, ఏఐ సిటీ, టీ–స్క్వేర్, ఫార్మా క్లస్టర్లు, మెట్రో విస్తరణతో పాటు విమానాశ్రయంతో కనెక్టివిటీ, రీజినల్ రింగ్‌రోడ్ వంటి బృహత్తర ప్రాజెక్ట్‌లకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీంతో సిటీ విస్తరణ పెరగడంతో పాటు పెట్టుబడులకు అపారమైన అవకాశాలు ఏర్పడతాయి. దీంతో హైదరాబాద్‌లో ఇళ్లు, ఆఫీసులు, వేర్‌హౌస్, డేటా సెంటర్లకు మరింత డిమాండ్ ఏర్పడుతుందని పరిశ్రమ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. వచ్చే 3–4 ఏళ్లలో నగరంలో కొత్తగా లక్ష గృహాలు లాంచింగ్ అవుతాయని, 2026 నాటికి ఏటా 1.7–1.9 కోట్ల చ.అ. ఆఫీసు స్థలాన్ని అందుబాటులోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే వచ్చే రెండేళ్లలో వేర్‌హౌస్ స్థలం 40 లక్షల చ.అ.కు, డేటా సెంటర్ల సామర్థ్యం 23 మెగావాట్లకు విస్తరిస్తాయని అంచనా.ఐటీ వర్సెస్ ఫార్మా..ఐటీ, ఐటీఈఎస్ ఎగుమతులు, ఉత్పత్తులతో హైదరాబాద్ ఐటీ హబ్‌గా పేరొందింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఐటీ ఎగుమతులు 11.3 శాతం పెరిగి రూ.2.68 లక్షల కోట్లను అధిగమించాయి. ప్రస్తుతం 1,500లకు పైగా ఐటీ, ఐటీఈఎస్ కంపెనీల్లో 9 లక్షలకు పైగా ఉద్యోగులున్నారు. టీ–హబ్, టీ–వర్క్స్ వంటి ఇన్నోవేషన్ పవర్హౌస్లతో నగరం 4 వేల స్టార్టప్‌లకు ఆతిథ్యం ఇస్తోంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్(ఏఐ), సెమీకండక్టర్ల డిజైన్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ వంటి అత్యాధునిక సాంకేతికతలపై దృష్టి పెట్టడంతో అభివృద్ధి మరింత జోరందుకుంటుంది.లైఫ్ సైన్సెస్ క్యాపిటల్‌గా పిలిచే హైదరాబాద్‌లో 1,500లకు పైగా ఫార్మాసూటికల్స్, బయోటెక్ కంపెనీలున్నాయి. దేశంలోని మొత్తం ఫార్మా ఎగుమతుల్లో మన రాష్ట్రం వాటా 20–30 శాతం. దేశంలో మూడింట ఒక వంతు వ్యాక్సిన్లు హైదరాబాద్ నుంచే ఉత్పత్తి అవుతున్నాయి. 2023–24లో రూ.36,893 కోట్ల ఫార్మాసూటికల్స్ ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. వచ్చే పదేళ్లలో లైఫ్ సైన్స్ పరిశ్రమ వంద బిలియన్ డాలర్ల అభివృద్ధి చేయాలని, కొత్తగా 4 లక్షల ఉద్యోగాలను సృష్టించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఫార్మా క్లస్టర్లు, జీనోమ్ వ్యాలీ, మెడికల్ డివైస్ పార్క్‌ల విస్తరణ తదితర బృహత్తర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.ఇదీ చదవండి: మళ్లీ భగ్గుమన్న బంగారం.. తులం ఎంతో తెలుసా?2023–24 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ఎగుమతులు రూ.1,16,182 కోట్లు కాగా.. ఇందులో రూ.2,68,233 కోట్లు ఐటీ, రూ.36,893 కోట్ల ఫార్మాస్యూటికల్స్ ఎగుమతుల వాటాను కలిగి ఉన్నాయి. నగరంలో ఐటీతో మొదలైన రియల్ బూమ్ ఫార్మా ఎంట్రీతో నెక్ట్స్ లెవల్‌కి చేరింది. బలమైన ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వ వ్యూహాత్మక ప్రణాళికలు, వ్యాపార అనుకూల విధానాలు, అంతర్జాతీయ మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి, అందుబాటులో ప్రాపర్టీల ధరలు.. ఇవన్నీ ఐటీ, ఫార్మా రంగాలకు చోదక శక్తిగా మారాయి. బహుళ రంగాల్లో అంతర్జాతీయ కంపెనీలు కొలువుదీరడంతో నగరం శరవేగంగా అభివృద్ధి చెందింది. రాష్ట్రంలో ఐటీ, ఫార్మా ఎగుమతుల్లో గ్రేటర్ వాటా 60 శాతానికి పైగానే ఉంటుంది. వెస్ట్ హైదరాబాద్‌తో పాటు పోచారం, ఆదిభట్ల వంటి ప్రాంతాల్లో ఐటీ సంస్థలు, మేడ్చల్, కొత్తూరు, పటాన్చెరు వంటి ప్రాంతాల్లో వేర్‌హౌస్‌లు, శంషాబాద్, కందుకూరు, మేకగూడ వంటి ప్రాంతాల్లో డేటా సెంటర్లకు డిమాండ్ ఏర్పడింది. -
హైదరాబాద్‌లో ఇల్లు.. రూ.కోటి అయినా కొనేద్దాం!
కరోనా తర్వాత నుంచి విలాసవంతమైన ఇళ్లకు డిమాండ్ పెరిగింది. దీంతో హైదరాబాద్‌లో గృహాల ధరలు పెరిగిపోయాయి. 2024 తొలి అర్ధ ఆర్థిక సంవత్సరం(హెచ్1)లో నగరంలో ఇళ్ల సగటు ధర రూ.84 లక్షలుగా ఉండగా.. 2025 హెచ్1 నాటికి రూ.1.15 కోట్లకు పెరిగింది. ఏడాది కాలంలో 37 శాతం ధరలు వృద్ధి చెందాయని అనరాక్ తాజా నివేదిక వెల్లడించింది. అలాగే నగరంలో 2024 హెచ్1లో రూ.25,059 కోట్లు విలువ చేసే 29,940 యూనిట్లు అమ్ముడుపోగా.. 2025 హెచ్1 నాటికి 27,820 ఇళ్లు విక్రయించారు. వీటి విలువ రూ.31,993 కోట్లు. - సాక్షి, సిటీబ్యూరోదేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో విక్రయాలు, లాంచింగ్స్ రికార్డు స్థాయిలో జరిగాయి. 2024 హెచ్1 గృహాల ధర సగటున రూ.కోటిగా ఉండగా.. 2025 హెచ్1 నాటికి 23 శాతం పెరిగి, ఏకంగా రూ.1.25 కోట్లకు చేరింది. ఇక, 2024 ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య కాలంలో టాప్–7 సిటీస్‌లో రూ.2,79,309 కోట్లు విలువ చేసే 2,27,400 యూనిట్లు అమ్ముడుపోగా.. 2025 హెచ్1 నాటికి రూ.2,35,800 కోట్ల విలువైన 2,35,200 విక్రయమయ్యాయి. యూనిట్ల అమ్మకాల్లో 3 శాతం క్షీణత ఉన్నప్పటికీ.. సేల్స్ వ్యాల్యూ మాత్రం 18 శాతం పెరిగింది.ఇదీ చదవండి: హైదరాబాద్ రియల్ఎస్టేట్లో కొత్త మైక్రో మార్కెట్..ముంబైలో స్థిరంగా ధరలు.. ఆసక్తికరంగా ఏడాది కాలంలో ముంబై(ఎంఎంఆర్)లో యూనిట్ల ధరలు పెరగలేదు. 2024 హెచ్1లో ధర సగటున రూ.1.45 కోట్లుగా ఉండగా.. 2025 హెచ్1లోనూ అదే ధర ఉంది. ఇక, అత్యధికంగా ఢిల్లీ–ఎన్సీఆర్లో ఇళ్ల ధరలు పెరిగాయి. 2024 హెచ్1లో ఇక్కడ ధర సగటు రూ.93 లక్షలు కాగా.. 2025 హెచ్1 నాటికి రూ.1.45 కోట్లకు పెరిగాయి. ఆ తర్వాత బెంగళూరులో గతంలో రూ.84 లక్షలు ఉండగా.. ఇప్పుడు రూ.1.21 కోట్లు, చెన్నైలో రూ.72 లక్షల నుంచి రూ.95 లక్షలకు, పుణేలో రూ.66 లక్షల నుంచి రూ.85 లక్షలకు, అలాగే 2024 హెచ్1లో కోల్‌కత్తాలో యూనిట్ ధర సగటు రూ.53 లక్షలుగా పలకగా.. 2025 హెచ్1 నాటికి రూ.61 లక్షలకు పెరిగింది. -
ఇంటి ధర రూ.85! రెనొవేషన్కు రూ.3.8 కోట్లు!!
ఇంటి ధర కేవలం రూ.85.. కానీ దాని రెనొవేషన్కు మాత్రం ఏకంగా రూ.3.8 కోట్లు ఖర్చు అయింది.. ‘అదేంటి.. రూ.85కే ఇళ్లు ఎక్కడ దొరుకుతుంది. అద్దె ఇళ్లే దాదాపు రూ.15,000 వరకు ఉంది. మరి అంత తక్కువకు ఇళ్లు ఎవరిస్తారు?’ అని అనుకుంటున్నారా. అలా అయితే మనం ఇటలీలో జరిగిన ఈ సంఘటన గురించి తెలసుకోవాల్సిందే.ఇటలీలోని సాంబుకా డి సిసిలియాలో 2019లో నిరుపయోగంగా ఉన్న ఇళ్లను వేలం వేశారు. అలా చాలా ఏళ్లుగా ఉపయోగంలోలేని ఓ ఇంటిని చికాగోకు చెందిన ఆర్థిక సలహాదారు మెరెడిత్ టాబోన్ కొనుగోలు చేశారు. కేవలం 1.05 డాలర్లు(రూ.85)కే దాన్ని వేలంలో దక్కించుకున్నారు. ఆ ఇంటిని 17 శతాబ్దంలో నిర్మించినట్లు తెలిసింది. దానికి కరెంట్, నీటి సౌకర్యం లేదు. వేలం పూర్తయిన తర్వాతే తాను ఆ ఇంటిని చూశారు. సాంబుకా డి సిసిలియా ప్రాంత్రంలో ఓ మూలన ఉన్న ఆ ఇంటిని మొదటగా చూసి మెరెడిత్ దాన్ని పునరుద్ధరణ చేయించాలనుకున్నారు. దాంతో గడిచిన నాలుగేళ్లల్లో అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దారు. అందుకు 4,46,000(దాదాపు రూ.3.8 కోట్లు) ఖర్చు అయినట్లు ఆమె తెలిపారు. View this post on Instagram A post shared by Meredith Tabbone (@meredith.tabbone)ఇదీ చదవండి: మళ్లీ డబ్బు పెడుతున్న ఎఫ్పీఐలుమెరెడిత్ టాబోన్ ఇంత ఖర్చు చేసి ఎందుకు దీన్ని పునరుద్ధరించారని ఓ మీడియా సంస్థ అడిగిన ప్రశ్నకు ‘1908లో నా కుంటుంబం యూఎస్‌కు వెళ్లడానికి ముందు మా ముత్తాత ఈ ప్రాంతంలోనే ఉండేవారు. తన జ్ఞాపకాలకు గుర్తుగా దీన్ని ఎంచుకున్నాను’ అని సమాధానం ఇచ్చారు. ఇంటికి సంబంధించిన వీడియో తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అదికాస్తా వైరల్‌గా మారింది. కాగా, ఇంట్లో ప్రత్యేకంగా డిజైనింగ్, టైల్స్, ఇంటీరియర్.. వంటి వాటికి భారీగా ఖర్చవుతున్నాయి. ప్రస్తుత రోజుల్లో ఇల్లు కట్టేందుకు అయ్యే ఖర్చు ఒకెత్తైతే, మన అభిరుచులకు తగినట్లుగా ఇంటీరియర్ డిజైన్ చేయించేందుకు అయ్యే ఖర్చు తడిసిమోపెడవుతుంది. -
రికార్డు స్థాయిలో ఆఫీస్ లీజింగ్
న్యూఢిల్లీ: కార్యాలయ వసతుల(ఆఫీస్ స్పేస్) మార్కెట్ ఈ ఏడాది మంచి జోరును కొనసాగించింది. గతేడాదితో పోల్చితే సుమారు 14 శాతం అధికంగా 85 మిలియన్ చదరపు అడుగుల మేర (ఎస్ఎఫ్టీ) స్థూల లీజింగ్ ఈ ఏడాది ఎనిమిది ప్రధాన నగరాల్లో నమోదవుతుందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ తన అంచనాలు వెల్లడించింది. 2023లో ఇవే నగరాల్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 74.6 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉండడం గమనార్హం.‘‘ఎనిమిది ప్రధాన నగరాల్లో 2022 నుంచి ఆఫీస్ స్పేస్ స్థూల లీజింగ్ ఏటా 70 మిలియన్ ఎస్ఎఫ్టీపైనే ఉంటూ వస్తోంది’’అని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదిక వివరించింది. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 66.7 మిలియన్ ఎస్ఎఫ్టీ స్థూల లీజింగ్ లావాదేవీలు జరిగినట్టు ప్రకటించింది. స్థూల ఆఫీస్ స్పేస్ లీజింగ్ 2018లో 49.1 మిలియన్ ఎస్ఎఫ్టీ, 2019లో 67.7 మిలియన్ ఎస్ఎఫ్టీ, 2020లో 46.6 మిలియన్ ఎస్ఎఫ్టీ, 2021లో 50.4 మిలియన్ ఎస్ఎఫ్టీ, 2022లో 72 మిలియన్ ఎస్ఎఫ్టీ, 2023లో 74.6 మిలియన్ ఎస్ఎఫ్టీ చొప్పున నమోదైనట్టు ఈ నివేదిక వెల్లడించింది. ఈ రంగాల్లో డిమాండ్ అధికం.. ముఖ్యంగా ఐటీ–బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ (ఐటీ–బీపీఎం), బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (బీఎఫ్ఎస్ఐ), ఇంజనీరింగ్, తయారీ రంగాలతోపాటు, ఫ్లెక్స్ ఆపరేటర్ స్పేస్ విభాగాలు ఈ వృద్ధిని నడిపిస్తున్నట్టు కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదిక వెల్లడించింది. ఈ రంగాలు మెరుగైన పనితీరు చూపిస్తున్నట్టు తెలిపింది. ‘‘2024 భారత ఆఫీస్ రంగానికి రికార్డుగా నిలిచిపోతుంది. స్థూల లీజింగ్ ఈ ఏడాది 85 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరుకోవచ్చు.ఇందులో నికర వినియోగం 45 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉండొచ్చు. భారత వాణిజ్య రియల్ ఎస్టేట్‌లో అత్యధిక గరిష్ట స్థాయి ఇది’’అని కుష్మన్ అండ్ వేక్ ఫీల్డ్ తెలిపింది. మొత్తం ఆఫీస్ లీజింగ్‌లో గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు (జీసీసీ) 30 శాతం వాటా ఆక్రమిస్తాయని పేర్కొంది. డిమాండ్ పెరగంతో ప్రముఖ ప్రాంతాల్లో కార్యాలయ వసతుల అద్దెల పెరుగుదలపై ఒత్తిడి నెలకొన్నట్టు తెలిపింది. ‘‘2025లో అధిక శాతం నూతన వసతుల సరఫరా ప్రముఖ ప్రాంతాల చుట్టూనే ఉండనుంది. స్థిరమైన సరఫరాతో అద్దెల పెరుగుదల మోస్తరు స్థాయిలో ఉండనుంది. దీంతో కిరాయిదారుల అనుకూల సెంటిమెంట్ కొంత కాలం పాటు కొనసాగనుంది’’అని వివరించింది. -
హైదరాబాద్‌లో బోటింగ్ విల్లాలు..
పొద్దున లేవగానే గలగలా పారే నీటి సవ్వడి.. వీకెండ్ వస్తే కుటుంబంతో కలిసి హ్యాపీగా పడవలో షికారు.. వీటి కోసం ఎక్కడో టూరిస్ట్ ప్లేస్‌కు వెళ్లాల్సిందేనని అనుకోకండి. నగర స్థిరాస్తి రంగంలోనే తొలిసారిగా ప్రణీత్ గ్రూప్ నివాస సముదాయంలోనే బోటింగ్ సదుపాయాన్ని కల్పిస్తోంది. -సాక్షి, సిటీబ్యూరోగాగిళ్లపూర్లో నిర్మిస్తున్న గ్రూవ్ పార్క్ లగ్జరీ విల్లా గేటెడ్ కమ్యూనిటీలో బోటింగ్ వసతిని అందుబాటులోకి తీసుకురానుంది. ఈమేరకు ప్రాజెక్ట్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని కంపెనీ డైరెక్టర్ నరేంద్ర కుమార్ కామరాజు తెలిపారు. ప్రాజెక్ట్‌కు మధ్యలో చెరువు ఉండటంతో నివాసితులకు వినూత్నంగా బోటింగ్ సేవలను అందించాలని నిర్ణయించామని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: హైదరాబాద్ రియల్ఎస్టేట్లో కొత్త మైక్రో మార్కెట్..70 ఎకరాల్లో 884 ట్రిపులెక్స్ విల్లాలను నిర్మిస్తున్నామని, ఇప్పటికే 50 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయని ఆయన చెప్పారు. 167 నుంచి 350 గజాల్లో వేర్వేరు విస్తీర్ణాలలో స్పానిష్ ఆర్కిటెక్చర్ విల్లాలు ఉన్నాయని, ప్రారంభ ధర రూ.1.70 కోట్లుగా నిర్ణయించామని పేర్కొన్నారు. -
ఇంటికి టైల్.. యమస్టైల్!
ఇళ్లు నిర్మించుకోవడం ఒక ఎత్తయితే.. టైల్స్ ఎంపిక మరో ఎత్తు.. ఏ మాత్రం తేడా వచ్చినా ఇంటి అందం పూర్తిగా దెబ్బతింటుంది. అయితే ఎంత పెద్ద ఇల్లు కట్టినా ఆకర్షణీయంగా కనిపించడంలో కీలక పాత్ర పోషించేది నేలపై పరిచే టైల్స్. వాటి డిజైన్ ఎంపిక విషయంలో దాదాపు ఒక యుద్ధం చేసినంత కసరత్తు చేస్తారనడంలో అతిశయోక్తి లేదు. అందుకే చాలా కంపెనీలు కస్టమర్ల అభిరుచులు, ట్రెండ్‌కు తగ్గట్టు తయారు చేస్తున్నాయి. ప్రతి ఏటా కస్టమర్ల అభిరుచుల్లో చాలా తేడా కనిపిస్తోందని పలు కంపెనీలు చెబుతున్నాయి. రంగులు, డిజైన్లు, ఆకారాల విషయంలో ప్రజలు ఎంతో జాగ్రత్త వహిస్తున్నారని పేర్కొంటున్నాయి. – సాక్షి, సిటీబ్యూరోప్రకృతి నుంచి స్ఫూర్తి టైల్స్ డిజైన్ రూపొందించే విషయంలో ప్రతి అంశం నుంచి స్ఫూర్తి పొందుతుంటారని తయారీదారులు చెబుతున్నారు. ఒక్కొక్కరి టేస్ట్ ఒక్కోలా ఉంటుందని, ప్రకృతికి సంబంధించి చెట్లు, పూలు, ఆకులను మనసులో ఉంచుకుని తయారు చేస్తుంటామని పేర్కొంటున్నారు. ఇక, వివిధ రకాల ఆకారాలు కూడా ముఖ్యమని, రంగులు, విభిన్న కాన్సెప్టులతో మార్బుల్, స్టోన్స్‌తో రూపొందిస్తుంటామని చెబుతున్నారు. గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో సుస్థిరాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని తయారు చేస్తున్నారు.రూ.35 నుంచి ప్రారంభం.. టైల్స్‌లో కూడా ఒక్కో డిజైన్, ఒక్కో ఆకారాన్ని బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంది. ప్రతి చదరపు అడుగు టైల్కు రూ.35 నుంచి రూ.500 వరకు కూడా ఉంది. సెరామిక్ టైల్స్‌కు కాస్త తక్కువ ధర ఉంటుంది. విట్రిఫైడ్, మార్బుల్ టైల్స్, గ్రానైట్ టైల్స్, వుడ్ లుక్ టైల్స్, సిమెంట్ టైల్స్ వంటి రకాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మార్బుల్ టైల్స్‌కు కాస్త ధర ఎక్కువ ఉంటుందని అందరికీ తెలిసిందే. ఎక్కువగా సెరామిక్ టైల్స్‌కు కస్టమర్లు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ తర్వాత విట్రిఫైడ్ టైల్స్‌కు, ఆ తర్వాత వేరే రకం టైల్స్‌ను వాడుతున్నారు. ఏటా భారీస్థాయిలో వృద్ధి.. టైల్స్ రంగం ఏటా భారీ స్థాయిలో వృద్ధి నమోదు చేస్తోంది. ఏటా 11.96 శాతం పెరుగుదల కనిపిస్తోందని కెన్ పరిశోధనలు తేల్చాయి. 2023లో టైల్స్ మార్కెట్ ఏకంగా 8,543.9 మిలియన్ డాలర్లు నమోదు చేయగా, 2030 నాటికి ఈ మార్కెట్ విలువ ఏకంగా 13,265.2 మిలియన్ డాలర్లకు ఎగబాకుతుందని అంచనా వేస్తున్నారు. 2024 నుంచి 2030 మధ్య ఈ రంగం ఏకంగా 6.5 శాతం వృద్ధి నమోదు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. దినుసుల స్ఫూర్తిగా.. దేశంలోని మసాలా దినుసులను స్ఫూర్తిగా తీసుకుని టైల్స్ డిజైన్ రూపొందిస్తుంటాను. భారతీయత ఉట్టిపడేలా, ఇక్కడి ప్రకృతి రమణీయతను టైల్స్ డిజైన్స్‌లో ఉండేలా చూసుకుంటాను. అనేక దేశాల్లో ఇలాంటి డిజైన్స్‌కు యమ గిరాకీ ఉంది. ప్రజల అభిరుచికి తగ్గట్టు టైల్స్ డిజైన్స్ రూపొందించేందుకు నిరంతరం ప్రయత్నిస్తుంటాను. – మారియా కాస్టిలో, రీజెన్సీ టైల్స్ చీఫ్ డిజైనర్ -
హైదరాబాద్ రియల్ఎస్టేట్లో కొత్త మైక్రో మార్కెట్
బోనమెత్తిన భక్తుల కోర్కెలు తీర్చే గ్రామదేవతగా పూజించే గండిమైసమ్మ.. అందుబాటు ధరల్లోనే సామాన్య, మధ్యతరగతి సొంతింటి కలనూ తీరుస్తోంది. అర్ధగంట ప్రయాణ వ్యవధిలోనే ఐటీ కారిడార్‌కు చేరుకునే వీలు, శంషాబాద్ విమానాశ్రయంతో పాటు ఇతర జిల్లా కేంద్రాలకు చేరుకునేందుకు ఔటర్ రింగ్ రోడ్డుతో కనెక్టివిటీ.. సమీప దూరంలోనే అంతర్జాతీయ విద్యా, వైద్య సంస్థలు, వినోద, ఉపాధి కేంద్రాలు.. అన్నింటికీ మించి అందుబాటులోనే గృహాల ధరలు ఉండటంతో బహదూర్‌పల్లి, గండిమైసమ్మ ప్రాంతాలకు డిమాండ్ ఏర్పడింది. –సాక్షి, సిటీబ్యూరోనీరు ఎత్తు నుంచి పల్లెం వైపు ప్రవహించినట్టే.. అభివృద్ధి కూడా మెరుగైన మౌలిక వసతులు ఉన్న ప్రాంతాల వైపే విస్తరిస్తుంది. ఇందుకు సరైన ఉదాహరణ బహదూర్‌పల్లి, గండిమైసమ్మ ప్రాంతాలు. ఐటీ కారిడార్‌కు చేరువలో ఉండటంతో మియాపూర్, బాచుపల్లి ప్రాంతాల్లో అభివృద్ధి చెందాయి. దీంతో ఇక్కడ పెద్ద ఎత్తున నివాస, వాణిజ్య సముదాయాలు వెలిశాయి. ఇప్పుడా డెవలప్మెంట్ బాచుపల్లికి కొనసాగింపుగా.. బహదూర్‌పల్లి, గండిమైసమ్మ మార్గంలో విస్తరించింది. అన్నింటికీ మించి చౌక ధరలతో సామాన్య, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను గండిమైసమ్మ తీరుస్తోంది.వెస్ట్, నార్త్ జోన్లతో కనెక్టివిటీ.. మెరుగైన రోడ్లు, రవాణా సదుపాయాలతో వెస్ట్, నార్త్ హైదరాబాద్ ప్రాంతాలకు సులువుగా చేరుకునే వీలు ఉండటం బహదూర్‌పల్లి, గండిమైసమ్మ ఏరియాల ప్రత్యేకత. ఇక్కడి నుంచి అరగంటలో బాచుపల్లి మార్గంలో ప్రగతినగర్ మీదుగా జేఎన్టీయూకి, అక్కడి నుంచి హైటెక్‌సిటీకి వెళ్లొచ్చు. ఇప్పటికే మియాపూర్–బాచుపల్లి ఆరులైన్ల రహదారి మార్గం నిర్మాణంలో ఉంది. ఇది పూర్తయితే ప్రయాణ సమయం మరింత తగ్గుతుంది. అలాగే 1.5 కి.మీ. దూరంలోని దుండిగల్ ఔటర్ ఎగ్జిట్–5 ఎక్కితే శంషాబాద్ విమానాశ్రయానికి ఈజీగా చేరుకోవచ్చు.ఉపాధి అవకాశాలు మెండుగానే.. ఉపాధిపరంగా ఐటీ కారిడార్‌కు సులువుగా చేరుకోవడంతో పాటు స్థానికంగా పలు ఫార్మా కంపెనీల పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు ఇక్కడే ఉన్నాయి. కండ్లకోయ, బహదూర్‌పల్లి ఐటీ పార్క్‌లు ఉండటంతో ఉపాధి అవకాశాలు మెరుగ్గానే ఉన్నాయి. సమీపంలోని గౌడవెల్లిలో 600 ఎకరాల్లో అర్బన్ ఫారెస్ట్, దూలపల్లిలో ఫారెస్ట్ అకాడమీలు ఉండటంతో చుట్టూ పచ్చదనంతో ప్రశాంత వాతావరణం, కాలుష్య రహిత గృహాలు ఉండటం ఈ ప్రాంతాల ప్రత్యేకత. గండిమైసమ్మ చుట్టు పక్కల పదుల సంఖ్యలో ఇంటర్నేషనల్ స్కూళ్లు, ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలున్నాయి. మల్లారెడ్డి, టెక్ మహీంద్రా విశ్వవిద్యాలయాలు చుట్టుపక్కలే ఉన్నాయి. వైద్య కళాశాలతో పాటు నారాయణ హృదయాలయ, మల్లారెడ్డి, జీవీకే ఆస్పత్రులు చేరువలోనే ఉన్నాయి.అందుబాటు ధరల్లోనే ఇళ్లు..హైదరాబాద్ రియల్టీలో కొత్త మైక్రో మార్కెట్‌గా వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో ఇక్కడ పెద్ద ఎత్తున గృహ నిర్మాణం జరుగుతోంది. బహదూర్‌పల్లి, గండిమైసమ్మ, బాసుర్గడి, గౌడవెల్లి, అయోధ్యక్రాస్ రోడ్స్ వంటి ప్రాంతాల్లో అపార్ట్మెంట్లు, విల్లా ప్రాజెక్ట్‌లో నిర్మాణంలో ఉన్నాయి. ప్రైమార్క్, రూబ్రిక్ కన్స్ట్రక్షన్స్, వాసవి, ప్రణీత్ గ్రూప్, అపర్ణా వంటి సంస్థలు పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపడుతున్నాయి. ప్రస్తుతం ఆయా ప్రాంతాలల్లో ధర చదరపు అడుగుకు రూ.5,500 వేలుగా చెబుతున్నారు. ప్రాజెక్ట్‌లలోని వసతులు, విస్తీర్ణాలను బట్టి ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి.ఇదీ చదవండి: హైదరాబాద్ 2.o.. అభివృద్ధి ఖాయం!నార్త్ వేవ్‌లో సెంచరీ క్రాస్.. నిర్మాణ రంగంలో దశాబ్ధన్నర కాలం అనుభవంలో ఇప్పటివరకు 18 లక్షల చ.అ.ల్లో 30కు పైగా ప్రాజెక్ట్‌లను పూర్తి చేశాం. తాజాగా బహదూర్‌పల్లిలో 13.5 ఎకరాల్లో నార్త్వేవ్ గేటెడ్ కమ్యూనిటీని నిర్మిస్తున్నాం. 14 బ్లాక్‌లు, ఒక్కోటి 9 అంతస్తుల్లో మొత్తం 1,026 యూనిట్లు ఉంటాయి. నార్త్ వేవ్ ప్రాజెక్ట్‌ను కిడ్స్ సెంట్రిక్ జోన్‌గా తీర్చిదిద్దుతున్నాం. ఇందులో పిల్లలకు, పెద్దలకు ప్రత్యేకంగా ప్లే ఏరియా, పెట్ జోన్, ఔట్‌డోర్ ఫిట్నెస్ స్టేషన్, యోగా, స్విమ్మింగ్ పూల్, జిమ్, క్రికెట్ పిచ్, బీబీక్యూ పార్టీ లాన్, మినీ గోల్ప్, రాక్ క్లయింబింగ్, ప్లే స్కూల్.. ఇలా వందకు పైగా ఆధునిక వసతులను కల్పిస్తున్నాం. – సాయికృష్ణ బొర్రా, డైరెక్టర్, ప్రైమార్క్ డెవలపర్స్మాడ్యులర్ కిచెన్ ఫ్రీ.. గండిమైసమ్మ– మేడ్చల్ మార్గంలోని అయోధ్య క్రాస్‌రోడ్స్‌లో 5.2 ఎకరాల్లో శ్రీవెన్ త్రిపుర ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. 3 టవర్లలో 638 యూనిట్లుంటాయి. న్యూ ఇయర్ సందర్భంగా ప్రతి ఫ్లాట్‌కు మాడ్యులర్ కిచెన్‌ను ఉచితంగా అందిస్తున్నాం. అలాగే ఈ ఏడాది డిసెంబర్ 31లోపు ఫ్లాట్ కొనుగోలు చేసేవారికి లోయర్ ఫ్లాట్, ఈస్ట్, కార్నర్ ఫ్లాట్లపై ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవు. అలాగే 12 నెలల పాటు నిర్వహణ ఉచితం. ఆఫర్లతో కస్టమర్లకు సుమారు రూ.5–6 లక్షలు ఆదా అవుతుంది. 50 వేల చదరపు అడుగుల క్లబ్ హౌస్‌లో స్విమ్మింగ్ పూల్, జిమ్, టెన్నిస్ కోర్ట్, సూపర్ మార్కెట్, బాంక్వెట్ హాల్ వంటి అన్ని రకాల వసతులు ఉంటాయి. 299 యూనిట్లతో కూడిన టవర్–1ను దసరా నాటికి కస్టమర్లకు హ్యాండోవర్ చేస్తాం. నిర్మాణంలో ఉన్న మిగిలిన రెండు టవర్లను 2027 మార్చి వరకు పూర్తి చేస్తాం. – ఎండీ కృష్ణరావు, రూబ్రిక్ కన్స్ట్రక్షన్ -
హైదరాబాద్ 2.o.. అభివృద్ధి ఖాయం!
‘మూసీ పునరుజ్జీవం, మెట్రో విస్తరణ బృహత్తర ప్రాజెక్ట్‌లతో హైదరాబాద్ అభివృద్ధి ఖాయం. ఏ నగరంలోనైనా సరే ప్రభుత్వం, డెవలపర్లు సంయుక్తంగా ప్రజా కేంద్రీకృత విధానాలతో నగరానికి అవసరమైన మౌలిక సదుపాయాలను సృష్టిస్తారు. రోడ్లు, విద్యుత్, డ్రైనేజ్, నీరు వంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్లను ప్రభుత్వం కల్పిస్తే.. కాలనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలపర్లు చేపడతారు’ అని తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్(టీడీఏ) ప్రెసిడెంట్ జీవీ రావు అన్నారు. – సాక్షి, సిటీబ్యూరోసబర్బన్ పాలసీ అవసరం.. విద్యా, ఉద్యోగం, ఆరోగ్యం, వినోదం ఇలా ప్రతీ అవసరం కోసం ప్రజలు ప్రధాన నగరానికి రావాల్సిన, ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఏటా 3 లక్షల మంది నగరానికి వలస వస్తున్నారు. శివారు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయకపోతే కోర్ సిటీలో జన సాంద్రత పెరిగి, బెంగళూరు, ఢిల్లీ మాదిరిగా రద్దీ, కాలుష్య నగరంగా మారే ప్రమాదం ఉంది. అందుకే శివారు ప్రాంతాలు మెరుగైన మౌలిక వసతులతో అభివృద్ధి చెందేందుకు సబర్బన్ పాలసీ అవసరం. మెట్రో విస్తరణతో ప్రధాన నగరం, శివారు ప్రాంతాలు అనుసంధానం కావడంతో పాటు శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. శరవేగమైన పట్టణీకరణ కారణంగా మౌలిక సదుపాయాల కల్పన తప్పనిసరి. అందుకే హైదరాబాద్ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.10 వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. ఇందులో ఈ ఏడాది రూ.5 వేల కోట్ల నిధులతో నాలాల పునరుద్ధరణ పూర్తి చేయాలి.ఆదాయంలో 25–30 శాతం వాటా.. ప్రస్తుతం గ్రేటర్లో 1.1 కోట్ల జనాభా ఉంది. మెరుగైన మౌలిక వసతులతో దేశంలోనే నివాసితయోగ్యమైన నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా నిలిచింది. వ్యవసాయం తర్వాత రెండో అత్యధిక ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే పరిశ్రమ రియల్ ఎస్టేట్ రంగం. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, జీఎస్టీ, నిర్మాణ అనుమతుల రుసుము, ఇంపాక్ట్ ఫీజు, ఆదాయ పన్ను ఇలా స్థిరాస్తి రంగం నుంచి ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయం సమకూరుతుంది. రాష్ట్ర ఆదాయంలో 25–30 శాతం వాటా స్థిరాస్తి రంగానిదే.‘యూజర్ పే’తో గ్రోత్ కారిడార్‌లో రోడ్లు.. ఓఆర్ఆర్ నిర్మాణ సమయంలోనే గ్రోత్ కారిడార్‌కు రెండు వైపులా రహదారులను ప్లాన్ చేశారు. కానీ.. ఇప్పటికీ వేయలేదు. ప్రస్తుత ప్రభుత్వం ఆయా రోడ్లను ప్రత్యామ్నాయ ఆదాయ మార్గంగా మార్చుకోవచ్చు. ఫైనాన్షియల్ హోల్డింగ్ కంపెనీతో హెచ్ఎండీఏ ఒప్పందం చేసుకొని, రైతుల నుంచి భూములను సేకరించి రహదారులను నిర్మించాలి. ఇందుకైన వ్యయాన్ని ఈ రోడ్లను వినియోగించుకునే డెవలపర్ల నుంచి వసూలు చేస్తారు. ఉదాహరణకు టోల్ మాదిరిగా ఏ నుంచి బీ రోడ్డు నిర్మాణానికి అయిన వ్యయాన్ని బిల్డర్లు ‘యూజర్ పే’ రూపంలో చెల్లిస్తారు. దీంతో ప్రభుత్వంపై వ్యయ భారం తగ్గడంతో పాటు మెరుగైన రోడ్లతో ఆయా ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతాయి. ఈ రోడ్లలో కొన్ని రీజినల్ రింగ్ రోడ్ అనుసంధానించబడి రేడియల్ రోడ్లుగా అభివృద్ధి చెందుతాయి.వాక్ టు వర్క్‌తో.. ఫోర్త్ సిటీ.. తెలంగాణ ప్రభుత్వం 50 వేల ఎకరాల్లో ఫోర్త్ సిటీ నిర్మాణాన్ని తలపెట్టింది. అయితే.. ఈ పట్టణం ప్రణాళికబద్ధమైన అభివృద్ధికి ప్లాన్ చేయాలి. వాక్ టు వర్క్ కాన్సెప్ట్‌లతో కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విద్యా, వైద్య, క్రీడా మౌలిక సదుపాయాల కల్పనతో ఫోర్త్ సిటీ స్వయం సమృద్ధి చెందుతుంది. ఈ మోడల్‌ను హైదరాబాద్‌లోని మిగతా మూడు వైపులకూ విస్తరించాలి.నివాస, వాణిజ్య స్థిరాస్తికి డిమాండ్.. హైడ్రా దూకుడుతో కొంత కాలంగా స్థిరాస్తి రంగం మందగమనాన్ని ఎదుర్కొంది. అయితే నిర్మాణ అనుమతులు ఉన్న ప్రాజెక్ట్‌ల జోలికి వెళ్లమని ప్రభుత్వం ప్రకటించడంతో ప్రస్తుతం మార్కెట్లో నిలకడ వాతావరణం నెలకొంది. దీంతో కొత్త కస్టమర్ల నుంచి ఎంక్వైరీలు పెరిగాయి. ఐటీ, ఫార్మా పరిశ్రమలకు కేరాఫ్ హైదరాబాద్. ఆయా రంగాల్లో 1.50 లక్షల కొత్త ఉద్యోగాలతో రాబోయే కాలంలో నివాస, వాణిజ్య స్థిరాస్తి రంగానికి డిమాండ్ తప్పకుండా ఉంటుంది. ఉప్పల్ నుంచి నారాపల్లి, పరేడ్ గ్రౌండ్ నుంచి శామీర్‌పేట, పరేడ్ గ్రౌండ్ నుంచి కొంపల్లి ఫ్లై ఓవర్లను ప్రభుత్వం నిర్మించనుంది. ఈ మూడు మార్గాలతో పాటు ఆదిభట్ల నుంచి లేమూరు మార్గంలో నివాస కార్యకలాపాలు పెరగనున్నాయి. దీంతో సామాన్య, మధ్యతరగతికి అందుబాటులో ధరల్లో ఇళ్లు లభ్యమవుతాయి. -
ఎవరీ 'రిషి పార్టి'.. ఏకంగా రూ.190 కోట్ల ప్లాట్ కొన్నాడు
హర్యానాలోని గురుగ్రామ్ ఇప్పుడు లగ్జరీ ప్రాపర్టీ మార్కెట్ విభాగంలో.. ముంబై, బెంగళూరులతో పోటీ పడుతోంది. అల్ట్రా లగ్జరీ ప్రాజెక్ట్ ది కామెలియాస్‌లో వ్యాపారవేత్త 'రిషి పార్టి' (Rishi Parti) ఏకంగా రూ. 190 కోట్లు చెల్లించి.. 16,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. ఇంతకీ రిషి పార్టీ ఎవరు? ఆయనకు సంబంధించిన కంపెనీలు ఏవి? అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.ఎవరీ రిషి పార్టి?ఇన్ఫో-ఎక్స్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, ఫైండ్ మై స్టే ప్రైవేట్ లిమిటెడ్, ఇంటిగ్రేటర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో సహా నాలుగు కంపెనీలకు 'రిషి పార్టి' డైరెక్టర్. అయితే ఎక్కువగా ఇన్ఫో-ఎక్స్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్‌పై ద్రుష్టి సారిస్తున్నారు. అంతే కాకుండా ఈయన ఏంజెల్ ఇన్వెస్టర్‌గా ఉన్నారు.ఇన్ఫో-ఎక్స్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ఇన్ఫో-ఎక్స్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అనేది లాజిస్టిక్స్‌కు సంబంధించిన కంపెనీ. ఇది 2001లో ప్రారంభమైనట్లు సమాచారం. ఈ సంస్థ లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి లాజిస్టిక్స్ కంపెనీలలో కొత్తదనానికి మార్గం వేస్తోంది. రిషి పార్టి దీనిని 24ఏళ్ల వయసులో మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి ప్రారభించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ కంపెనీలో 150 ఉద్యోగులు పనిచేస్తున్నట్లు సమాచారం. -
ప్రాపర్టీ సందర్శన సేవలు ప్రారంభం
రియల్టీ రంగంలో ఆన్లైన్ సేవలందిస్తున్న టైమ్స్ గ్రూప్ ఆధ్వర్యంలోని మ్యాజిక్‌బ్రిక్స్ సంస్థ తన వినియోగదారులకు మెరుగైన సర్వీసు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. ప్రాపర్టీ కొనుగోలు, అమ్మకాలకు సంబంధించిన వినియోగదారులు మరింత సమర్థంగా నిర్ణయం తీసుకునేందుకు వీలుగా హైదరాబాద్‌లో ప్రాపర్టీ సందర్శనను ప్రారంభించింది. ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రాపర్టీ కొనుగోలు చేయాలంటే చాలామందికి అనుమానాలుంటాయి. కాబట్టి నేరుగా ప్రాపర్టీ సందర్శించి నిర్ణయం తీసుకునేందుకు మ్యాజిక్స్బ్రిక్స్ తన ప్లాట్‌ఫామ్ ద్వారా అవకాశం కల్పిస్తుంది.మ్యాజిక్ బ్రిక్స్ 100కుపైగా బిల్డర్లతో కలిసి హైదరాబాద్‌లో సైట్ విజట్ ప్రోడక్ట్లను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపింది. ఇప్పటికే బెంగళూరులో ఉన్న ఈ సర్వీసును విస్తరించినట్లు ప్రకటించింది. ఔరా రియల్టీ, విజన్ ఇన్ఫ్రా డెవలపర్స్, ఎలిగెంట్ ఇన్ఫ్రా, అపర్ణ కన్స్ట్రక్షన్స్ వంటి ప్రముఖ సంస్థలతో సహా 100కు పైగా డెవలపర్లతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు పేర్కొంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆరునెలల్లో 120కి పైగా ప్రాజెక్టుల్లో 8,200 కంటే ఎక్కువ సైట్ సందర్శనలను అందించినట్లు తెలిపింది. వినియోగదారులు సగటున రూ.1.25 కోట్లతో 450 కంటే ఎక్కువ విలువైన ఇళ్లు బుక్ చేసుకున్నట్లు వివరించింది.ఇదీ చదవండి: పది పాసైన మహిళలకు ఎల్ఐసీ ఉపాధి అవకాశంఈ కార్యక్రమానికి సంబంధించి మ్యాజిక్ బ్రిక్స్ సీఈఓ సుధీర్ పాయ్ మాట్లాడుతూ..‘సాధారణంగా పండగ సీజన్ తరువాత డిసెంబరులో నివాస కొనుగోళ్లు తగ్గుతాయి. అయితే గత 2-3 సంవత్సరాలుగా ఇంటి యజమానుల ఆకాంక్ష మేరకు డిమాండ్ బలంగానే ఉంటుంది. ఇళ్లు కొనాలని ఆసక్తి ఉన్నవారు పండగలు, ప్రత్యేక రోజులకు అతీతంగా కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. దేశవ్యాప్తంగా కంపెనీ అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రాపర్టీ విజిట్ ఫెస్ట్‌కు మంచి స్పందన ఉంది. కొంతమంది కొనుగోలుదారులతో ఒకే రోజులో 4-5 ప్రాపర్టీలను సందర్శించడం వల్ల నిర్ణయాలు తీసుకునే సమయాన్ని దాదాపు 50% తగ్గించేందుకు వీలవుతుంది. రియల్టీ రంగంలో టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలకు అందిస్తూ మెరుగైన సేవలు అందుబాటులో ఉంచుతున్నాం’ అన్నారు. -
అపార్ట్మెంట్ ఖరీదు అబ్బో.. దేశంలోనే ఖరీదైన డీల్!
దేశంలోనే ఖరీదైన రియల్ ఎస్టేట్ మార్కెట్ ఏది అంటే ముంబై అని చెబుతారు. కానీ ఖరీదైన ప్రాపర్టీ డీల్స్‌లో ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతం ముంబైని మించిపోతోంది. గుర్గావ్లోని డీఎల్ఎఫ్ కామెలియాస్‌లోని ఓ అపార్ట్మెంట్ ఇటీవల రూ. 190 కోట్లకు అమ్ముడుపోయింది. ఇది ఎన్సీఆర్లో అత్యంత ఖరీదైన హై-రైజ్ కండోమినియం అపార్ట్మెంట్ డీల్‌గా నిలిచింది. చదరపు అడుగుల ధర (కార్పెట్ ఏరియా) పరంగా దేశంలోనే అతిపెద్దది.ఇండెక్స్ట్యాప్కు లభించిన పత్రాల ప్రకారం.. ఇన్ఫో ఎక్స్ సాఫ్ట్వేర్ టెక్ ప్రయివేట్ లిమిటెడ్ అనే కంపెనీ పేరుతో దాని డైరెక్టర్ రిషి పార్థీ ఈ 16,290 చదరపు అడుగుల పెంట్‌హౌస్‌ని కొనుగోలు చేశారు. ఈ డీల్ డిసెంబర్ 2న నమోదైంది. ఇందుకోసం కంపెనీ రూ.13 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించింది. అయితే ఈ డీల్‌పై డీఎల్ఎఫ్ స్పందించలేదు.దేశంలోనే అతిపెద్దది“చదరపు అడుగుల ప్రకారం చూస్తే ఒక హై రైజ్ అపార్ట్‌మెంట్‌కు రూ. 190 కోట్ల ధర దేశంలోనే అత్యధికం. ఇది ముంబైని మించిపోయింది. సూపర్ ఏరియాను పరిగణనలోకి తీసుకుంటే చదరపు అడుగుకు రూ. 1.18 లక్షలు, కార్పెట్ ఏరియా పరంగా అయితేరూ. 1.82 లక్షలు. ఢిల్లీ ఎన్సీఆర్లో ప్రాపర్టీ ధరలు సూపర్ ఏరియా ప్రాతిపదికన ఉండగా, ముంబైలో కార్పెట్ ఏరియాలో ఉంటాయి. కాబట్టి ఈ గుర్గావ్ ఒప్పందం కార్పెట్ ఏరియా పరంగా ముంబై ధర కంటే చాలా అధికం’’ అని రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ ప్రొపెక్విటీ ఫౌండర్-సీఈవో సమీర్ జసుజా పేర్కొన్నారు.ఇదీ చదవండి: అద్దెను ఈఎంఐగా చెల్లిస్తే చాలు.. ఇల్లు సొంతం!ముంబైలోని టానియెస్ట్ ఏరియాల్లో కార్పెట్ ఏరియా ధరలు రూ. 1,62,700 వరకు ఉన్నాయి. ఈ కామెలియాస్ డీల్‌కు ముందు జరిగిన అత్యంత ఖరీదైన అపార్ట్మెంట్ డీల్‌లలో ముంబైలోని లోధా మలబార్లో జరిగిన డీల్ ఒకటి. ఇక్కడ ఓ కంపెనీ గత ఏడాది చదరపు అడుగుకు (కార్పెట్ ఏరియా) రూ. 1,36,000 చొప్పున రూ. 263 కోట్లకు మూడు అపార్ట్మెంట్లను కొనుగోలు చేసింది.