దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన నగరాల్లో 2024లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ (office space) నూతన గరిష్టాలకు చేరింది. మొత్తం 719 లక్షల చదరపు అడుగుల (ఎస్‌ఎఫ్‌టీ) పరిమాణంలో లీజు లావాదేవీలు నమోదయ్యాయి. 2023లో స్థూల లీజింగ్‌తో పోల్చి చూసినప్పుడు 21 శాతం అధికం కాగా, కరోనా విపత్తుకు ముందు ఏడాది 2019 గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 19 శాతం వృద్ధి కనిపించింది. ఈ వివరాలను రియల్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్‌ఫ్రాంక్ ఇండియా (Knight Frank) విడుదల చేసింది. కరోనా కారణంగా 2020, 2021 సంవత్సరాల్లో ఆఫీస్ స్పేస్ మార్కెట్ కుదేలవగా ఆ తర్వాత నుంచి ఏటా పుంజుకుంటూ వస్తోంది.
నగరాల వారీ లీజింగ్
బెంగళూరులో స్థూల ఆఫీస్ లీజింగ్ ముందటి సంవత్సరంతో పోల్చితే 2024లో 45 శాతం వృద్ధితో 181 లక్షల ఎస్‌ఎఫ్‌టీకి చేరింది.
ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిధిలో 25% వృద్ధితో స్థూల లీజింగ్ 127 లక్షల ఎస్‌ఎఫ్‌టీగా నమోదైంది.
హైదరాబాద్‌లో డిమాండ్ 17 శాతం పెరిగి 103 లక్షల చదరపు అడుగులకు చేరుకుంది.
ముంబై మార్కెట్లోనూ 40 శాతం వృద్ధి నమోదైంది. 104 లక్షల చదరపు అడుగుల లీజింగ్ లావాదేవీలు జరిగాయి.
పుణెలో 19 శాతం పెరిగి 80 లక్షల చదరపు అడుగులకు చేరింది.
అహ్మదాబాద్‌లో 64 శాతం వృద్ధితో 30 లక్షల ఎస్‌ఎఫ్‌టీ స్థూల లీజింగ్ లావాదేవీలు నమోదయ్యాయి.
చెన్నై మార్కెట్లో 25 శాతం క్షీణించి 81 లక్షల ఎస్‌ఎఫ్‌టీకి పరిమితమైంది.
కోల్‌కతాలో స్థూల ఆఫీస్ స్పేస్ లీజింగ్ స్వల్పంగా 14 లక్షల చదరపు అడుగులకు తగ్గింది.
సానుకూలతలు ఎన్నో..
ఆఫీస్ స్పేస్ లీజింగ్ నూతన గరిష్టాలకు చేరడం వెనుక దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండడం, బలమైన దేశీ వినియోగం, అంతర్జాతీయంగా పెరుగుతున్న భారత్ ప్రాతినిధ్యం తదితర అంశాలను కారణాలుగా నైట్‌ఫ్రాంక్ ఇండియా పేర్కొంది. ఆఫీస్ స్పేస్‌కు అసాధారణ డిమాండ్ ఉండడం దేశ, విదేశీ సంస్థల్లో వ్యాపార విశ్వాసానికి నిదర్శనంగా పేర్కొంది. జీసీసీలు, ఐటీఈఎస్, బీఎఫ్‌ఎస్‌ఐ రంగాలు ఈ డిమాండ్‌కు దన్నుగా నిలుస్తున్నట్టు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment