Office space leasing
-
హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ ఖాళీ
డిమాండ్‌కు మించి తాజా సరఫరా తోడవుతున్నందున 2026 మార్చి నాటికి హైదరాబాద్‌లోని మొత్తం కార్యాలయ స్థలంలో 24.5 శాతం ఖాళీగా ఉండవచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. వేకెన్సీ స్థాయి 2023 మార్చిలో 14.1 శాతం, 2025 సెప్టెంబర్‌లో 19.3 శాతంగా ఉందని తెలిపింది.‘హైదరాబాద్ మార్కెట్లో గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ ఆక్యుపెన్సీ 2026 మార్చి నాటికి 75.5–76 శాతానికి చేరవచ్చు. 2023 మార్చి నాటికి ఇది 86 శాతం నమోదైంది. నికర ఆక్యుపెన్సీతో పోలిస్తే సరఫరా ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్‌లో 2016–17 నుంచి 2023–24 మధ్య ఆఫీస్ స్పేస్ సరఫరా వార్షిక వృద్ధి రేటు ఏటా 14 శాతం దూసుకెళ్లింది. టాప్–6 ఆఫీస్ మార్కెట్లలో ఇది సుమారు 7 శాతం నమోదైంది. ఈ ఆరు మార్కెట్లలో 2024 మార్చి 31 నాటికి అందుబాటులో ఉన్న మొత్తం కార్యాలయ సరఫరాలో హైదరాబాద్ వాటా 15 శాతం. 2026 మార్చి నాటికి ఇది 17 శాతానికి చేరవచ్చు’ అని నివేదిక వివరించింది.ఇదీ చదవండి: బేర్.. ఎటాక్! మార్కెట్ నేల చూపులు ఎందుకంటే..అంచనాలు లేకుండా..అపరిమిత ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ) నియమాన్ని కలిగి ఉన్న ఏకైక ప్రముఖ భారతీయ నగరం హైదరాబాద్ అని ఇక్రా కార్పొరేట్ రేటింగ్స్ వైస్ ప్రెసిడెంట్, కో–గ్రూప్ హెడ్ అనుపమ రెడ్డి తెలిపారు. ‘ఈ నిబంధనలను సద్వినియోగం చేసుకుని కొంతమంది డెవలపర్లు సమీప కాలంలో లీజింగ్‌పై సరైన అంచనాలు లేకుండా భారీగా ఊహించుకుని నిర్మాణాలు చేపడుతున్నారు. ఫలితంగా డిమాండ్–సరఫరా మధ్య భారీగా అసమతుల్యత ఏర్పడింది’ అని అన్నారు. ‘2023–24 ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్‌లో 1.9 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ తోడైంది. ఇది హైదరాబాద్ చరిత్రలో అత్యధికం. అలాగే ఇతర టాప్ నగరాలతో పోలిస్తే ఇక్కడే ఎక్కువ. ఈ అధిక సరఫరా ధోరణి 2024–25, 2025–26 వరకు కొనసాగుతుంది. ఏటా 1.7–2 కోట్ల చదరపు అడుగుల కొత్త సరఫరా తోడు కానుంది. -
హైదరాబాద్ రియల్ ఎస్టేట్.. ఆల్ టైమ్ హై!
హైదరాబాద్ (Hyderabad) రియల్ ఎస్టేట్ (real estate) ఆల్ టైం హై స్థాయికి చేరుకుంది. గతేడాది నగరంలో రికార్డు స్థాయిలో గృహ విక్రయాలు, ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం, వడ్డీ రేట్ల పెంపు, హైడ్రా దూకుడు ఇవేవీ భాగ్యనగరంలో స్థిరాస్తి రంగాన్ని కదిలించలేకపోయాయి. కొత్త ప్రభుత్వ విధానాలతో కొద్ది కాలం అస్థిరత ఏర్పడినా.. మార్కెట్ తిరిగి శరవేగంగా పుంజుకుంది. దీంతో హైదరాబాద్ రియల్టీలో పూర్వ వైభవం సంతరించుకుంది. నగరంలో గతేడాది 32,974 యూనిట్లు విక్రయించగా.. 1.56 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లావాదేవీలు జరిగాయని నైట్‌ఫ్రాంక్ ఇండియా తాజా నివేదిక వెల్లడించింది. – సాక్షి, సిటీబ్యూరోఆర్థికవృద్ధి, మెరుగైన మౌలిక సదుపాయాలు, కొనుగోలుదారుల అభిరుచిలో మార్పుల కారణంగా హైదరాబాద్‌లో గృహ విక్రయాలు పెరిగాయి. గతేడాది నగరంలో 12 శాతం వృద్ధి రేటుతో 36,974 ఫ్లాట్లు అమ్ముడుపోయాయి. ప్రస్తుతం సిటీలో అపార్ట్మెంట్ల సగటు ధర చ.అ.కు రూ.5,974. ఏడాదిలో అపార్ట్మెంట్ల ధరలు 8 శాతం మేర పెరిగాయి. గతేడాది సిటీలో 44,013 యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. అంతకు క్రితం ఏడాదితో పోలిస్తే 6 శాతం తగ్గాయి. హైడ్రా దూకుడు వ్యవహారంతో కొత్త గృహాల ప్రారంభానికి డెవలపర్లు ఆచితూచి వ్యవహరించడంతో లాంచింగ్స్‌లో క్షీణత నమోదయ్యింది. పశ్చిమ హైదరాబాదే.. హైటెక్ సిటీ, కోకాపేట, రాయదుర్గం, కూకట్పల్లి, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి పశ్చిమ హైదరాబాదే కస్టమర్ల చాయిస్‌గా ఉంది. ఎల్బీనగర్, కొంపల్లి ప్రాంతాల్లో ధరల పెరుగుదల అధికంగా ఉంది. ఆయా ప్రాంతాల్లో వరుసగా 11, 10 శాతం మేర రేట్లు పెరిగాయి. ఆ తర్వాత బంజారాహిల్స్‌లో 8 శాతం, కోకాపేటలో 8 శాతం, మణికొండలో 6, నాచారం, సైనిక్‌పురిలో 5 శాతం మేర ధరలు పెరిగాయి. ప్రస్తుతం నగరంలో అత్యధికంగా చ.అ.ధరలు బంజారాహిల్స్‌లో రూ.14,400–16,020 మధ్య ఉండగా.. జూబ్లీహిల్స్‌లో 13,400–14,034, కోకాపేటలో 10,045–12,500, మణికొండలో రూ.8,500–9,220 మధ్య ధరలు ఉన్నాయి.ఆఫీస్ అ‘ధర’హో.. 2024లో హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ లావాదేవీలు సరికొత్త శిఖరాలను అధిరోహించాయి. గతేడాది కొత్తగా 1.03 కోట్ల చ.అ.ఆఫీస్ స్పేస్ పూర్తి కాగా.. 1.56 కోట్ల చ.అ. స్పేస్ లావాదేవీలు జరిగాయి. కార్యాలయాల స్థలం లీజు, కొనుగోళ్లలో గ్లోబల్ కెపబులిటీ సెంటర్స్(జీసీసీ) ఆధిపత్యాన్ని కొనసాగించాయి. గతేడాది జరిగిన ఆఫీసు స్పేస్ లావాదేవీల్లో జీసీసీ వాటా 49 శాతంగా ఉంది. 51 లక్షల చ.అ.ఆఫీస్ స్పేస్‌ను బహుళ జాతి కంపెనీలు జీసీసీ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. దేశీయ వ్యాపార సంస్థలు 24 లక్షల చ.అ.లు, ఫ్లెక్సీబుల్ ఆఫీసు స్పేస్ 18 లక్షల చ.అ.లు, 12 లక్షల చ.అడుగుల స్థలంలో థర్డ్ పార్టీ ఐటీ సంస్థల లావాదేవీలు ఉన్నాయి. నగరంలో ఆఫీస్ స్పేస్ ధర చ.అ.కు సగటున రూ.70గా ఉంది. ఏడాది కాలంలో ధరలు 7 శాతం మేర పెరిగాయి.దేశవ్యాప్తంగా ఇలా.. గతేడాది దేశంలోని 8 ప్రధాన నగరాల్లో 3,72,936 యూనిట్లు లాచింగ్ కాగా.. 3,50,612 ఇళ్లు అమ్ముడుపోయాయి. అంతకు క్రితం ఏడాదితో పోలిస్తే లాంచింగ్స్‌లో 6 శాతం, విక్రయాల్లో 7 శాతం వృద్ధి నమోదైంది. దేశంలో ఇంకా 4,95,839 యూనిట్ల ఇన్వెంటరీ ఉంది. వీటి విక్రయానికి 5.8 నెలల సమయం పడుతుంది. ఇక, గతేడాది 7.19 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్ లావాదేవీలు జరగ్గా.. 5.03 కోట్ల చ.అ. స్థలం కొత్తగా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం 8 నగరాల్లో మొత్తం 97.3 కోట్ల చ.అ.ఆఫీస్ స్పేస్ స్టాక్ ఉంది. -
ఆఫీసు స్థలాలకు డిమాండ్.. ఆల్‌టైమ్ హై!
దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన నగరాల్లో 2024లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ (office space) నూతన గరిష్టాలకు చేరింది. మొత్తం 719 లక్షల చదరపు అడుగుల (ఎస్ఎఫ్టీ) పరిమాణంలో లీజు లావాదేవీలు నమోదయ్యాయి. 2023లో స్థూల లీజింగ్‌తో పోల్చి చూసినప్పుడు 21 శాతం అధికం కాగా, కరోనా విపత్తుకు ముందు ఏడాది 2019 గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 19 శాతం వృద్ధి కనిపించింది. ఈ వివరాలను రియల్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్‌ఫ్రాంక్ ఇండియా (Knight Frank) విడుదల చేసింది. కరోనా కారణంగా 2020, 2021 సంవత్సరాల్లో ఆఫీస్ స్పేస్ మార్కెట్ కుదేలవగా ఆ తర్వాత నుంచి ఏటా పుంజుకుంటూ వస్తోంది. నగరాల వారీ లీజింగ్బెంగళూరులో స్థూల ఆఫీస్ లీజింగ్ ముందటి సంవత్సరంతో పోల్చితే 2024లో 45 శాతం వృద్ధితో 181 లక్షల ఎస్ఎఫ్టీకి చేరింది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో 25% వృద్ధితో స్థూల లీజింగ్ 127 లక్షల ఎస్‌ఎఫ్‌టీగా నమోదైంది.హైదరాబాద్‌లో డిమాండ్ 17 శాతం పెరిగి 103 లక్షల చదరపు అడుగులకు చేరుకుంది.ముంబై మార్కెట్లోనూ 40 శాతం వృద్ధి నమోదైంది. 104 లక్షల చదరపు అడుగుల లీజింగ్ లావాదేవీలు జరిగాయి. పుణెలో 19 శాతం పెరిగి 80 లక్షల చదరపు అడుగులకు చేరింది. అహ్మదాబాద్‌లో 64 శాతం వృద్ధితో 30 లక్షల ఎస్ఎఫ్టీ స్థూల లీజింగ్ లావాదేవీలు నమోదయ్యాయి. చెన్నై మార్కెట్లో 25 శాతం క్షీణించి 81 లక్షల ఎస్ఎఫ్టీకి పరిమితమైంది. కోల్‌కతాలో స్థూల ఆఫీస్ స్పేస్ లీజింగ్ స్వల్పంగా 14 లక్షల చదరపు అడుగులకు తగ్గింది.సానుకూలతలు ఎన్నో.. ఆఫీస్ స్పేస్ లీజింగ్ నూతన గరిష్టాలకు చేరడం వెనుక దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండడం, బలమైన దేశీ వినియోగం, అంతర్జాతీయంగా పెరుగుతున్న భారత్ ప్రాతినిధ్యం తదితర అంశాలను కారణాలుగా నైట్‌ఫ్రాంక్ ఇండియా పేర్కొంది. ఆఫీస్ స్పేస్‌కు అసాధారణ డిమాండ్ ఉండడం దేశ, విదేశీ సంస్థల్లో వ్యాపార విశ్వాసానికి నిదర్శనంగా పేర్కొంది. జీసీసీలు, ఐటీఈఎస్, బీఎఫ్ఎస్ఐ రంగాలు ఈ డిమాండ్‌కు దన్నుగా నిలుస్తున్నట్టు తెలిపింది. -
భళా హైదరాబాద్
న్యూఢిల్లీ: కార్యాలయ స్థలాల (ఆఫీస్ స్పేస్) మార్కెట్లో సందడి నెలకొంది. 2024లో ఈ మార్కెట్లో లీజు లావాదేవీలు గణనీయంగా పెరిగాయి. హైదరాబాద్‌లో 37 శాతం వృద్ధితో 123 లక్షల చదరపు అడుగుల (ఎస్ఎఫ్టీ) స్థూల లీజింగ్ లావాదేవీలు నమోదయ్యాయి. 2023లో 90 లక్షల ఎస్ఎఫ్టీ మేర లావాదేవీలు జరగడం గమనార్హం. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన నగరాల్లో 885 లక్షల చదరపు అడుగుల (ఎస్ఎఫ్టీ) విస్తీర్ణం మేర స్థూల లీజింగ్ 2024లో నమోదైనట్టు కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదిక వెల్లడించింది. అంతకుముందు ఏడాది 746 లక్షల ఎస్ఎఫ్టీతో పోల్చి చూస్తే 19 శాతం వృద్ధి నమోదైనట్టు తెలిపింది. ‘‘భారత ఆఫీస్ మార్కెట్‌కు 2024 నిర్ణయాత్మకమైనది. రికార్డు స్థాయిలో లీజింగ్ నమోదైంది. ఆఫీస్ స్పేస్‌కు అంతర్జాతీయంగా భారత్ బలమైన వృద్ధి మార్కెట్ అని మరోసారి నిరూపితమైంది’’అని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ ఇండియా సీఈవో అన్షుల్ జైన్ పేర్కొన్నారు. గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు (జీసీసీలు) పెరుగుతుండడం బహుళజాతి సంస్థలకు భారత్ వ్యూహాత్మక ప్రాధాన్యమైనదిగా తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. ఆఫీస్ స్పేస్ డిమాండ్‌లో 30 శాతం డిమాండ్ జీసీసీల నుంచే వస్తోంది. ‘‘2025లో గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ డిమాండ్ బలంగా ఉండనుంది. అంతర్జాతీయ ఆఫీస్ మార్కెట్లో భారత్ ఆధిపత్యం బలపడనుంది’’అని జైన్ అంచనా వేశారు. తాజా లావాదేవీలు, రెన్యువల్ అన్నీ స్థూల లీజింగ్ కిందకే వస్తాయి. పట్టణాల వారీగా లీజింగ్.. → బెంగళూరులో 259 లక్షల చదరపు అడుగుల స్థూల లీజింగ్ లావాదేవీలు 2024లో నమోదయ్యాయి. అంతకుముందు ఏడాది లీజింగ్ పరిమాణం 158.3 లక్షల చదరపు అడుగులుగా ఉంది. అత్యధికంగా 64 శాతం వృద్ది ఇక్కడ నమోదైంది. → ముంబైలో స్థూల లీజింగ్ 27 శాతం పెరిగి 178.4 లక్షల చదరపు అడుగులకు చేరింది. → అహ్మదాబాద్‌లో 11 శాతం అధికంగా 18.1 లక్షల ఎస్ఎఫ్టీ లీజు లావాదేవీలు జరిగాయి. → ఢిల్లీ ఎన్సీఆర్లో మాత్రం క్రితం ఏడాదితో పోలి్చతే 3 శాతం తక్కువగా 131.4 లక్షల చదరపు అడుగుల లీజింగ్ లావాదేవీలు నమోదయ్యాయి. → పుణెలో 84.7 లక్షల ఎస్ఎఫ్టీ లీజింగ్ రికార్డు అయింది. 2023లో లీజు పరిమాణం 97.4 లక్షల ఎస్ఎఫ్టీతో పోల్చితే 13 శాతం తగ్గింది. → కోల్‌కతా ఆఫీస్ మార్కెట్లో 17 లక్షల చదరపు అడుగుల లీజు లావాదేవీలు నమోదయ్యాయి. అంతకుముందు ఏడాదితో పోల్చితే స్థిరంగా కొనసాగింది. → ఐటీ–బీపీఎం, ఇంజనీరింగ్ అండ్ తయారీ, బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సరీ్వసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) రంగాలు ఆఫీస్ స్పేస్ డిమాండ్‌లో ప్రముఖ పాత్ర పోషించాయి. → మొత్తం స్థూల లీజింగ్‌లో కోవర్కింగ్ ఆపరేటర్లు 14 శాతం తీసుకున్నారు. ప్రాపర్టీ యజమానుల నుంచి ఆఫీస్ స్పేస్ లీజు తీసుకుని, కార్పొరేట్లు, ఇతరులకు వీరు లీజుకు ఇవ్వనున్నారు. తగ్గిన ఖాళీ స్థలాలు.. 2024లో వాణిజ్య రియల్ ఎస్టేట్‌లో రికార్డు స్థాయి లావాదేవీలు నమోదైనట్టు, ఖాళీ స్థలాలు గణనీయంగా తగ్గినట్టు ముంబైకి చెందిన రహేజా కార్ప్ ఎండీ, సీఈవో వినోద్ రోహిరా తెలిపారు. మౌలిక వసతులకు ప్రాధాన్యం ఇచ్చే అన్ని పట్టణాల్లోనూ వాణిజ్య రియల్ ఎస్టేట్‌లో వృద్ధి నమోదైనట్టు చెప్పారు. గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ ఇక ముందూ కొనసాగుతుందన్నారు. -
అప్పుడు బెంగళూరు.. ఇప్పుడు మరోచోట గూగుల్ భారీ ఆఫీస్!
గూగుల్ (Google) గురుగ్రామ్‌లో 550,000 చదరపు అడుగుల భారీ ఆఫీస్ స్థలాన్ని (office space) లీజుకు తీసుకుంది. ఇది దేశంలోని అతిపెద్ద వర్క్‌స్పేస్ డీల్స్‌లో ఒకటిగా నిలుస్తుందని, గురుగ్రామ్‌లోని మొత్తం టవర్‌ను లీజుకు తీసుకోవడానికి టెక్ దిగ్గజం చర్చలు జరుపుతున్నట్లు ఒక నివేదిక తెలిపింది.ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. గూగుల్ ప్రముఖ మేనేజ్డ్ వర్క్‌స్పేస్ ప్రొవైడర్ అయిన టేబుల్ స్పేస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఆఫీస్ స్థలాన్ని భవిష్యత్తులో అదనంగా 200,000 చదరపు అడుగుల వరకు విస్తరించుకునే అవకాశాన్ని కూడా ఈ సంస్థ గూగుల్‌కు అందిస్తుందని సమాచారం.ఆసక్తికరంగా గూగుల్ గురుగ్రామ్‌లో 700,000 చదరపు అడుగుల లీజును 2022లో ముగించింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు భారీ ఆఫీస్ స్పేస్ కోసం అన్వేషిస్తుండటం గమనార్హం. గూగుల్ గతేడాదే బెంగళూరులోని అలెంబిక్ సిటీలో 6,49,000 చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని లీజుకు తీసుకుంది. మూడు సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్‌తో చదరపు అడుగుకి నెలవారీ అద్దె రూ.62 చొప్పున డీల్ కుదిరినట్లు సమాచారం.2022లో హైదరాబాద్‌లో 600,000 చదరపు అడుగుల లీజు పునరుద్ధరణ, బెంగళూరులోని బాగ్‌మేన్ డెవలపర్లతో 1.3 మిలియన్ చదరపు అడుగుల ఒప్పందంతో సహా భారతదేశంలో గూగుల్ గణనీయమైన విస్తరణల శ్రేణిని గురుగ్రామ్‌లో ఈ తాజా లీజింగ్ అనుసరించింది. -
హైదరాబాద్‌లో ఆఫీస్ లీజింగ్ కళకళ
హైదరాబాద్ (Hyderabad) మార్కెట్లో కార్యాలయ స్థలాలకు (office space) బలమైన డిమాండ్ కొనసాగుతోంది. ప్రస్తుత ఏడాది మొత్తం మీద గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ లీజింగ్ 56 శాతం పెరిగి 12.5 మిలియన్ చదరపు అడుగులు (ఎస్ఎఫ్టీ)గా ఉన్నట్టు కొలియర్స్ ఇండియా (Colliers) నివేదిక వెల్లడించింది. క్రితం ఏడాది లీజు పరిమాణం 8 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉన్నట్టు పేర్కొంది. ఇక దేశవ్యాప్తంగా ఆరు ప్రధాన నగరాల్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ ఈ ఏడాది 14 శాతం పెరిగి 66.4 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉన్నట్టు కొలియర్స్ నివేదిక తెలిపింది. క్రితం ఏడాది ఇవే పట్టణాల్లో స్థూల కార్యాలయ స్థలాల లీజింగ్ 58.2 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. పట్టణాల వారీగా.. » బెంగళూరులో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 21.7 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరింది. క్రితం ఏడాది 15.6 మిలియన్ ఎస్ఎఫ్టీ లీజుతో పోల్చితే 39 శాతం పెరిగింది. » ముంబైలోనూ 43 శాతం వృద్ధితో 10 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా నమోదైంది. » పుణెలో ఆఫీస్ స్పేస్ లీజింగ్ క్రితం ఏడాదితో పోల్చి చూస్తే 4 శాతం పెరిగి 5.7 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరింది. » చెన్నైలో స్థూల లీజింగ్ 35 శాతం క్షీణతతో 6.8 మిలియన్ ఎస్ఎఫ్టీకి పరిమితమైంది. 2023లో ఇదే పట్టణంలో లీజింగ్ 10.5 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. » ఢిల్లీ ఎన్సీఆర్లోనూ 16 శాతం తక్కువగా 9.7 మిలియన్ ఎస్ఎఫ్టీ లీజు నమోదైంది.2025లోనూ గరిష్ట స్థాయిలోనే.. టెక్నాలజీ, ఇంజనీరింగ్, తయారీ కంపెనీలతోపాటు ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీల నుంచి ఆఫీస్ స్థలాలకు ఈ ఏడాది డిమాండ్ ఎక్కువగా ఉన్నట్టు కొలియర్స్ ఇండియా నివేదిక తెలిపింది. 2025లోనూ ఆఫీస్ స్పేస్ లీజింగ్ గరిష్ట స్థాయిలోనే కొనసాగొచ్చొని కొలియర్స్ ఇండియా ఆఫీస్ సర్వీసెస్ విభాగం ఎండీ అర్పిత్ మెహరోత్రా అంచనా వేశారు. వచ్చే కొన్నేళ్ల పాటు లీజింగ్ 60 మిలియన్ ఎస్ఎఫ్టీకి మించి కొనసాగడం సాధారణ అంశంగా మారుతుందన్నారు. గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల (జీసీసీలు) నుంచి స్థిరమైన డిమాండ్ కొనసాగడం పెద్ద పరిమాణంలో ఆఫీస్ స్థలాల లీజింగ్‌కు మద్దతుగా నిలుస్తున్నట్టు బెంగళూరు కేంద్రంగా పనిచేసే సుమధుర గ్రూప్ సీఎండీ మధుసూదన్ పేర్కొన్నారు. లాజిస్టిక్స్, ఇండస్ట్రియల్ వసతులకూ డిమాండ్ దేశవ్యాప్తంగా టాప్–8 నగరాల్లో లాజిస్టిక్స్, ఇండస్ట్రియల్ (ఎల్‌అండ్‌ఐ) వసతుల లీజింగ్ ప్రస్తుత ఏడాది మొత్తం మీద 50–53 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉండొచ్చని కుష్మన్ అండ్ వేక్ ఫీల్డ్ సంస్థ తెలిపింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, పుణె, అహ్మదాబాద్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్) పరిధిలో గతేడాది లాజిస్టిక్స్ అండ్ ఇండస్ట్రియల్ వసతుల లీజింగ్ 53.57 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉన్నట్టు పేర్కొంది. ఈ ఏడాది అక్టోబర్ వరకు లీజింగ్ ఈ నగరాల్లో 41 మిలియన్ ఎస్ఎఫ్టీని అధిగమించినట్టు తెలిపింది.‘‘ప్రభుత్వం 2020లో ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) ప్రకటించిన నాటి నుంచి ఇండస్ట్రియల్ స్థలాల లీజింగ్‌లో మెరుగైన వృద్ధి నమోదవుతోంది. దీనికితోడు రిటైల్, ఈ–కామర్స్ సైతం బలంగా అవతరించడం డిమాండ్‌కు మద్దతుగా నిలిచింది’’అని ఈ నివేదిక వెల్లడించింది. బలమైన పారిశ్రామిక కార్యకలాపాలకు తోడు వినియోగ దోరణి విస్తృతం కావడంతో 2025లో లీజింగ్ బలంగా కొనసాగొచ్చని అంచనా వేసింది. చైనా ప్లస్ వన్ విధానంతో భారత్ సైతం ప్రయోజనం పొందుతుండడం ఈ రంగాల్లో డిమాండ్‌కు కలిసొస్తున్నట్టు వివరించింది. -
రికార్డు స్థాయిలో ఆఫీస్ లీజింగ్
న్యూఢిల్లీ: కార్యాలయ వసతుల(ఆఫీస్ స్పేస్) మార్కెట్ ఈ ఏడాది మంచి జోరును కొనసాగించింది. గతేడాదితో పోల్చితే సుమారు 14 శాతం అధికంగా 85 మిలియన్ చదరపు అడుగుల మేర (ఎస్ఎఫ్టీ) స్థూల లీజింగ్ ఈ ఏడాది ఎనిమిది ప్రధాన నగరాల్లో నమోదవుతుందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ తన అంచనాలు వెల్లడించింది. 2023లో ఇవే నగరాల్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 74.6 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉండడం గమనార్హం.‘‘ఎనిమిది ప్రధాన నగరాల్లో 2022 నుంచి ఆఫీస్ స్పేస్ స్థూల లీజింగ్ ఏటా 70 మిలియన్ ఎస్ఎఫ్టీపైనే ఉంటూ వస్తోంది’’అని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదిక వివరించింది. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 66.7 మిలియన్ ఎస్ఎఫ్టీ స్థూల లీజింగ్ లావాదేవీలు జరిగినట్టు ప్రకటించింది. స్థూల ఆఫీస్ స్పేస్ లీజింగ్ 2018లో 49.1 మిలియన్ ఎస్ఎఫ్టీ, 2019లో 67.7 మిలియన్ ఎస్ఎఫ్టీ, 2020లో 46.6 మిలియన్ ఎస్ఎఫ్టీ, 2021లో 50.4 మిలియన్ ఎస్ఎఫ్టీ, 2022లో 72 మిలియన్ ఎస్ఎఫ్టీ, 2023లో 74.6 మిలియన్ ఎస్ఎఫ్టీ చొప్పున నమోదైనట్టు ఈ నివేదిక వెల్లడించింది. ఈ రంగాల్లో డిమాండ్ అధికం.. ముఖ్యంగా ఐటీ–బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ (ఐటీ–బీపీఎం), బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (బీఎఫ్ఎస్ఐ), ఇంజనీరింగ్, తయారీ రంగాలతోపాటు, ఫ్లెక్స్ ఆపరేటర్ స్పేస్ విభాగాలు ఈ వృద్ధిని నడిపిస్తున్నట్టు కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదిక వెల్లడించింది. ఈ రంగాలు మెరుగైన పనితీరు చూపిస్తున్నట్టు తెలిపింది. ‘‘2024 భారత ఆఫీస్ రంగానికి రికార్డుగా నిలిచిపోతుంది. స్థూల లీజింగ్ ఈ ఏడాది 85 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరుకోవచ్చు.ఇందులో నికర వినియోగం 45 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉండొచ్చు. భారత వాణిజ్య రియల్ ఎస్టేట్‌లో అత్యధిక గరిష్ట స్థాయి ఇది’’అని కుష్మన్ అండ్ వేక్ ఫీల్డ్ తెలిపింది. మొత్తం ఆఫీస్ లీజింగ్‌లో గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు (జీసీసీ) 30 శాతం వాటా ఆక్రమిస్తాయని పేర్కొంది. డిమాండ్ పెరగంతో ప్రముఖ ప్రాంతాల్లో కార్యాలయ వసతుల అద్దెల పెరుగుదలపై ఒత్తిడి నెలకొన్నట్టు తెలిపింది. ‘‘2025లో అధిక శాతం నూతన వసతుల సరఫరా ప్రముఖ ప్రాంతాల చుట్టూనే ఉండనుంది. స్థిరమైన సరఫరాతో అద్దెల పెరుగుదల మోస్తరు స్థాయిలో ఉండనుంది. దీంతో కిరాయిదారుల అనుకూల సెంటిమెంట్ కొంత కాలం పాటు కొనసాగనుంది’’అని వివరించింది. -
హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్‌కు కొరత
న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో కార్యాలయ వసతులకు (ఆఫీస్ స్పేస్) సంబంధించి కొత్త సరఫరా 25 శాతం తగ్గి 4.10 మిలియన్ చదరపు అడుగులకు (ఎస్ఎఫ్టీ) పరిమితమైంది. స్థూల లీజింగ్ సైతం 25 శాతం తగ్గి 2.79 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా నమోదైంది. దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లోనూ కొత్త కార్యాలయ వసతుల సరఫరా జూలై–సెప్టెంబర్ కాలంలో 4 శాతం మేర తగ్గి 12.8 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. ఇదే కాలంలో ఏడు నగరాల పరిధిలో ప్రైమ్ వర్క్‌స్పేస్ (ప్రధాన ప్రాంతాల్లో) స్థూల లీజింగ్ 17 శాతం పెరిగి 18.61 మిలియన్ ఎస్ఎఫ్టీలకు చేరింది. ఈ వివరాలను రియల్టీ కన్సల్టెంట్ ‘వెస్టియన్’ విడుదల చేసింది. నగరాల వారీ వివరాలు.. → బెంగళూరులో ఆఫీస్ స్పేస్ కొత్త సరఫరా 33 శాతం పెరిగి 3.60 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరింది. ఇక్కడ లీజింగ్ 84 శాతం పెరిగి 6.63 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. → ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో సరఫరా 360 శాతం అధికమై 2.3 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా నమోదైంది. స్థూల లీజింగ్ 17 శాతం వృద్ధితో 1.49 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరింది. → పుణెలో ఆఫీస్ వసతుల సరఫరా 26 శాతం తగ్గి 1.4 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. ఇక్కడ ఆఫీస్ స్పేస్ లీజింగ్ 112 శాతం పెరిగి 2.33 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరింది. → ముంబైలో కొత్త సరఫరా 0.90 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. స్థూల లీజింగ్ 2 శాతం తగ్గి 2.25 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. → చెన్నైలో తాజా ఆఫీసు వసతుల సరఫరా 58 శాతం తగ్గి 0.5 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా నమోదైంది. లీజింగ్ పరంగా పెద్ద మార్పు లేకుండా 2.01 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. → కోల్‌కతాలో గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ విభాగంలో సెప్టెంబర్ క్వార్టర్లో తాజా సరఫరా లేదు. ఆఫీస్ స్పేస్ లీజింగ్ 45 శాతం తక్కువగా 0.11 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా నమోదైంది. → బీఎఫ్ఎస్ఐ, ఫ్లెక్సిబుల్ స్పేస్ ఆపరేటర్లు ఆఫీస్ స్పేస్ డిమాండ్ కీలక చోదకాలుగా ఉన్నట్టు వెస్టియన్ తెలిపింది. వేగంగా వృద్ధి చెందుతున్న భాగ్యనగరం దేశ వ్యాప్తంగా ఆరు ప్రముఖ నగరాల్లో వేగంగా వృద్ధి చెందుతున్న నగరంగా హైదరాబాద్‌కు మొదటి స్థానం దక్కింది. పరిపాలన, సామాజిక ఆర్థిక అంశాలు, రియల్ ఎస్టేట్, మౌలిక వసతుల ఆధారంగా నైట్‌ఫ్రాంక్ ఇండియా ఈ విషయాన్ని ప్రకటించింది. వివిధ వృద్ది అంశాల ఆధారంగా ఆరు ప్రధాన నగరాల పనితీరును నైట్‌ఫ్రాంక్ విశ్లేషించింది. ‘‘వీటిల్లో హైదరాబాద్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతోంది. బలమైన మౌలిక వసతుల అభివృద్ధి, రియల్ ఎస్టేట్ డిమాండ్ పెరగడం, అల్ట్రా హెచ్ఎన్ఐలు(అధిక ధనవంతులు), హెచ్ఐఎన్ల జనాభా పెరుగుదల, చురుకైన విధానాలు సామాజిక ఆర్థిక పరపతిని పెంచుతున్నాయి’’ అని నైట్‌ఫ్రాంక్ నివేదిక పేర్కొంది. అద్భుతమైన నిపుణుల లభ్యత, వ్యాపార నిర్వహణకు ఉన్న అనుకూలతలతో బెంగళూరు అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రెండో నగరంగా నిలిచింది. ముంబై ఎప్పటి మాదిరే అన్ని అంశాల్లో స్థిరమైన పురోగతి చూపించింది. దేశ ఆర్థిక రాజధాని హోదాను కాపాడుకుంది. విడిగా చూస్తే గొప్ప మౌలిక వసతులు, పరిపాలన పరంగా ఢిల్లీ ఎన్సీఆర్కు టాప్ ర్యాంక్ దక్కింది. సామాజిక ఆర్థిక అంశాల పరంగా బెంగళూరు ముందంజలో ఉంది. రియల్ ఎస్టేట్ వృద్ధి పరంగా హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. -
ఆఫీస్ స్పేస్‌కు భలే గిరాకీ.. భారీగా పెరిగిన లీజింగ్
న్యూఢిల్లీ: కార్యాలయ వసతుల లీజింగ్ (ఆఫీస్ స్పేస్)కు బలమైన డిమాండ్ కొనసాగుతోంది. సెప్టెంబర్ త్రైమాసికంలో దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రముఖ పట్టణాల్లో (టాప్–8) 24.8 మిలియన్ చదరపు అడుగుల మేర (ఎస్ఎఫ్టీ) ఆఫీస్ లీజింగ్ నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలోని గణాంకాలతో పోల్చి చూస్తే 66 శాతం పెరిగింది. ఆఫీస్ స్పేస్ లీజింగ్ మార్కెట్ చరిత్రలో త్రైమాసికం వారీ ఇది రెండో గరిష్ట స్థాయి.ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 9 నెలల్లో 66.7 మిలియన్ ఎస్ఎఫ్టీ మేర లీజింగ్ నమోదైంది. పూర్తి ఏడాదికి 80 మిలియన్ ఎస్ఎఫ్టీ దాటిపోతుందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ‘కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్’ సంస్థ అంచనా వేసింది. గతేడాది టాప్–8 పట్టణాల్లో 74.5 మిలియన్ చదరపు అడుగుల (ఎస్ఎఫ్టీ) ఆఫీస్ స్పేస్ లీజు లావాదేవీలు నమోదయ్యాయి. 2018లో 49.1 మిలియన్ ఎస్ఎఫ్టీ, 2019లో 67.7 మిలియన్ ఎస్ఎఫ్టీ, 2020లో 46.6 మిలియన్ ఎస్ఎఫ్టీ, 2021లో 50.4 మిలియన్ ఎస్ఎఫ్టీ, 2022లో 72 మిలియన్ ఎస్ఎఫ్టీ చొప్పున లీజింగ్ నమోదైంది. జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో ఆఫీస్ మార్కెట్ గణాంకాలతో కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ ఒక నివేదికను విడుదల చేసింది. పటిష్ట మార్కెట్ ‘‘మార్కెట్ మూలాలు బలంగా ఉండడంతో భారత ఆఫీస్ మార్కెట్లో లీజింగ్ అసాధారణ స్థాయిలో కొనసాగుతోంది. టాప్–8 పట్టణాల్లో వేకెన్సీ రేటు (ఖాళీగా ఉన్న ఆఫీస్ స్పేస్) తక్కువగా ఉండడం ఆఫీస్ వసతులకు బలమైన డిమాండ్‌ను సూచిస్తోంది’’అని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ ఇండియా సీఈవో అన్షుల్ జైన్ తెలిపారు. ఈ వృద్ధిలో గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు (జీసీసీఉల) కీలక పాత్ర పోషిస్తున్నాయని.. ఆవిష్కరణలు, వృద్ధికి కీలక అవుట్సోర్స్ మార్కెట్‌గా భారత్ స్థానాన్ని బలోపేతం చేస్తున్నాయని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదిక తెలిపింది.ఇదీ చదవండి: ల్యాండ్ డీల్స్ జోరు.. టాప్‌లో హైదరాబాద్ఇటీవలి కాలంలో సగటు త్రైమాసికం లీజింగ్ 20 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంటోందని, 2024 మొత్తం మీద లీజింగ్ 80 మిలియన్ ఎస్ఎఫ్టీని దాటుతుందని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ టెనెంట్ రిప్రజెంటేషన్ ఎండీ వీరబాబు తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో సరఫరా పరిమితంగా ఉన్నట్టు చెప్పారు. సమీప కాలంలో సరఫరా పెరగొచ్చని.. అయినా సరే డిమాండ్ ఎక్కువగా ఉంటుందన్నారు.టాప్–8 పట్టణాల్లో వేకెన్సీ రేటు 17.1 శాతంగా సెప్టెంబర్ త్రైమాసికంలో నమోదైంది. ఇది 14 త్రైమాసికాల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. జూన్ త్రైమాసికంతో పోల్చి చూస్తే 0.60 శాతం మేర వేకెన్సీ రేటు తగ్గింది. హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, పుణె, అహ్మదాబాద్ పట్టణాల గణాంకాలు ఈ నివేదికలో ఉన్నాయి. -
దేశంలో ఆఫీస్ స్పేస్ విస్తరణ.. కారణం..
దేశీయంగా మూడో త్రైమాసికంలో ప్రధానం నగరాల్లోని కంపెనీలు 19 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని లీజ్‌కు తీసుకున్నట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. 2023లో ఇదే సమయంలో అద్దెకు తీసుకున్న 16.1 మిలియన్ చదరపు అడుగుల స్థలంతో పోలిస్తే ఈసారి 18 శాతం పెరుగుదల నమోదైందని నివేదికలో పేర్కొంది. 2024 సంవత్సరం మొదటి 9 నెలల్లో 53.7 మిలియన్ చదరపు అడుగుల మేర ఆఫీస్ స్థలాన్ని లీజ్‌కు తీసుకున్నట్లు నైట్ ఫ్రాంక్ నివేదించింది.నివేదికలోని వివరాల ప్రకారం..2024 క్యూ3లో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు (జీసీసీ) 7.1 మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని అద్దెకు తీసుకున్నాయి. ఆఫీస్ స్పేస్‌కు మార్కెట్లో డిమాండ్ భారీగా పెరుగుతోంది. జీసీసీల వృద్ధి అందుకు ప్రధాన కారణంగా నిలుస్తుంది. దాంతోపాటు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి. దేశంలో 2024 క్యూ3లో బెంగళూరు నగరం 5.3 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ అద్దెతో మొదటిస్థానంలో నిలిచింది. ఎన్సీఆర్ ఢిల్లీ 3.2, ముంబయి 2.6, పుణె 2.6, చెన్నై 2.6, హైదరాబాద్‌లో 2.2 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఆఫీస్ స్పేస్‌ను లీస్‌కు తీసుకున్నారు. కొత్తగా హైదరాబాద్ నగరం 4.2, పుణె 2.7, బెంగళూరు 2.5, ఎన్సీఆర్ ఢిల్లీ 0.9, ముంబయి 0.8 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఆఫీస్ స్థలాన్ని నిర్మించాయి.ఇదీ చదవండి: మార్కెట్ కల్లోలానికి కారణాలుదేశంలోని ఐటీ కంపెనీలు, ఇతర టెక్ సర్వీస్‌లు అందించే సంస్థలు కొంతకాలంగా అనుసరిస్తున్న వర్క్‌ఫ్రంహోం, హైబ్రిడ్ వర్క్ కల్చర్‌కు స్వస్తి పలుకుతున్నాయి. క్రమంగా ఉద్యోగులను పూర్తి స్థాయిలో ఆఫీస్ నుంచే పని చేయాలని మెయిళ్లు పంపుతున్నాయి. దాంతో కరోనా సమయం నుంచి ఇంటి వద్ద పనిచేస్తున్నవారు తిరిగి కార్యాలయాలకు వస్తున్నారు. నిత్యం సంస్థలు తమ కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. దాంతో గడిచిన 3-4 ఏళ్ల నుంచి కంపెనీల్లోని మానవ వనరులు పెరిగాయి. తిరిగి అందరూ ఆఫీస్‌కు వస్తుండడంతో అందుకు సరిపడా స్పేస్‌ను లీజ్‌కు తీసుకుంటున్నాయి. దేశీయంగా మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఫలితంగా ప్రధాన నగరాల్లో జీసీసీల సంఖ్య పెరుగుతోంది. వాటిలోనూ పెద్ద సంఖ్యలో ఉద్యోగులు చేరుతుండడంతో అద్దె స్థలం పెరుగుతోంది. -
ఆఫీస్ స్పేస్ మార్కెట్లో హైదరాబాద్ జోరు
న్యూఢిల్లీ: కార్యాలయ వసతులకు (ఆఫీస్ స్పేస్) డిమాండ్ బలంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఆరు ప్రముఖ పట్టణాల్లో జూలై–సెప్టెంబర్ మధ్య 17.3 మిలియన్ చదరపు అడుగుల (ఎస్ఎఫ్టీ) స్థూల లీజింగ్ నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లీజింగ్ పరిమాణం 13.2 మిలియన్ ఎస్ఎఫ్టీ కంటే 31 శాతం పెరిగినట్టు కొలియర్స్ ఇండియా విడుదల చేసిన డేటా స్పష్టం చేసింది. బెంగళూరు, హైదరాబాద్ మార్కెట్లలోనే సగం మేర లీజింగ్ నమోదు కావడం గమనార్హం. పట్టణాల వారీగా లీజింగ్ » హైదరాబాద్ మార్కెట్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ సెపె్టంబర్ క్వార్టర్లో 16 శాతం పెరిగి రూ.2.9 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో స్థూల లీజింగ్ 2.5 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. » బెంగళూరులో 6.3 మిలియన్ ఎస్ఎఫ్టీ లీజింగ్ జరిగింది. ఒక త్రైమాసికం వారీగా అత్యధిక లీజింగ్ ఇదే కావడం గమనించొచ్చు. క్రితం ఏడాది ఇదే కాలంలో లీజింగ్ 3.4 మిలియన్ ఎస్ఎఫ్టీతో పోలి్చతే 85 శాతం పెరిగింది. » పుణెలో స్థూల ఆఫీస్ స్పేస్ లీజింగ్ 2.6 మిలియన్ ఎ స్ఎఫ్టీగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఒ క మిలియన్ ఎస్ఎఫ్టీ లీజింగ్ నమోదైంది. » ముంబైలో 1.7 మిలియన్, చెన్నైలో 1.4 మిలియన్ ఎస్ఎఫ్టీ చొప్పున స్థూల లీజింగ్ జరిగింది. » ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో ఆఫీస్ లీజింగ్ క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 25%పెరిగి 2.4 మిలి యన్ ఎస్ఎఫ్టీకి చేరుకుంది. స్థూల లీజింగ్‌లో రెన్యువల్స్, ఆసక్తి వ్యక్తీకరణ లావాదేవీలను కలపలేదు. టెక్నాలజీ రంగం నుంచి డిమాండ్ జూలై –సెపె్టంబర్ కాలంలో నమోదైన స్థూల లీజింగ్‌లో 25 శాతం మేర టెక్నాలజీ రంగం నుంచే ఉన్నట్టు కొలియర్స్ ఇండియా డేటా తెలియజేసింది. ఆ తర్వాత బీఎఫ్ఎస్ఐ కంపెనీలు, ఫ్లెక్స్ స్పేస్ ఆపరేట్ల నుంచి లీజ్ ఒప్పందాలు అధికంగా జరిగాయి. ‘‘గడిచిన 2–3 ఏళ్లలో వివిధ రంగాలు, విభిన్న మార్కెట్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ ఎంతో ఆకర్షణీయంగా ఉంది. లీజింగ్ మార్కెట్ ఏటేటా కొత్త గరిష్టాలకు చేరుకుంటోంది. 2024లోనూ అధిక డిమాండ్, సరఫరా కనిపిస్తోంది’’అని కొలియర్స్ ఇండియా ఆఫీస్ సరీ్వసెస్ ఎండీ అర్పితా మల్హోత్రా తెలిపారు.హైదరాబాద్, బెంగళూరు, ముంబై మార్కెట్లలో ఈ ఏడాది మొదటి మూడు త్రైమాసికాల్లో (జనవరి–సెప్టెంబర్) ఆఫీస్ స్పేస్ డిమాండ్ 2023 మొత్తం డిమాండ్‌ను అధిగమించినట్టు చెప్పారు. సెపె్టంబర్ క్వార్టర్లో లీజు లావాదేవీల్లో రూ.లక్ష ఎస్ఎఫ్టీకి మించినవే 65 శాతంగా ఉన్నట్టు తెలిపారు. -
ఆరు నగరాల్లో జీసీసీల జోరు
న్యూఢిల్లీ: గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్‌ను (జీసీసీ) ఏర్పాటు చేయడానికి ఆరు ప్రధాన నగరాల్లో అంతర్జాతీయ సంస్థలు 2022 నుండి 2024 జూన్ మధ్య సుమారు 53 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని లీజుకు తీసుకున్నాయి. వీటిలో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పుణే, ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై ఉన్నాయి. ఈ కాలంలో లీజుకు తీసుకున్న మొత్తం ఆఫీస్ స్పేస్‌లో బెంగళూరు ఏకంగా 40 శాతం వాటా కైవసం చేసుకుంది. హైదరాబాద్‌కు 21, చెన్నైకి 14 శాతం వాటా ఉంది. ప్రాపర్టీ కన్సల్టెంట్ సీబీఆర్ఈ, హైరింగ్ సొల్యూషన్స్ కంపెనీ జాయిన్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. జీసీసీలు ఇటీవలి కాలంలో తమ భారతీయ కార్యకలాపాలను గణనీయంగా విస్తరించాయి. నైపుణ్యం కలిగిన సిబ్బంది, తక్కువ వ్యయాలు, అనుకూల వ్యాపార వాతావరణం ఇందుకు కలిసి వచి్చంది. ఈ సెంటర్స్ వృద్ధి పథం భారత్‌లోని మొదటి ఆరు మెట్రోపాలిటన్ ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉంటుందని అంచనా. అసాధారణ ప్రతిభగల వ్యక్తులు వీటిని నడిపిస్తున్నారు. ఈ అంశం జీసీసీల విస్తరణ, భవిష్యత్తు అభివృద్ధికి వీలు కలి్పస్తుంది. దిగ్గజ కార్పొరేట్ కంపెనీలు తమ జీసీసీల కోసం పెద్ద ఎత్తున కార్యాలయ స్థలాలను సమకూర్చుకోవడం ద్వారా భారత్ పట్ల తమ దీర్ఘకాలిక నిబద్ధతను ధృవీకరిస్తున్నాయి. -
హైదరాబాద్‌లో కార్యాలయ స్థలాలకు డిమాండ్
న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో కార్యాలయ స్థలాలకు డిమాండ్ బలంగా ఉన్నట్టు వర్క్‌ప్లేస్ సొల్యూషన్స్ సంస్థ వెస్టియన్ వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చి చూసినప్పుడు ఆఫీస్ స్పేస్ లీజింగ్ 48 శాతం వృద్ధితో 3.4 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో 2.30 మిలియన్ చదరపు అడుగుల మేర (ఎస్ఎఫ్టీ) లీజింగ్ చోటు చేసుకుంది. దేశవ్యాప్తంగా ఏడు ప్రముఖ పట్టణాల్లో జూన్ త్రైమాసికంలో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 23 శాతం పెరిగి 17.04 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా నమోదైంది. పట్టణాల వారీగా.. → బెంగళూరులో కార్యాలయ స్థలాల లీజింగ్ 15 శాతం వృద్ధితో 4.25 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలానికి ఇది 3.70 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. ఐటీ – ఐటీఈఎస్, ఏఐ అండ్ రోబోటిక్స్ కంపెనీలే మొత్తం లీజింగ్‌లో 69 శాతం మేర వాటా కలిగి ఉన్నాయి. → ముంబైలో బలమైన వృద్ధి నమోదైంది. 88 శాతం పెరిగి 3.39 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. → పుణెలో 60 శాతం వృద్ధితో 2.88 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. → చెన్నైలో మాత్రం క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోలి్చనప్పుడు 20 శాతం తగ్గి 1.75 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా నమోదైంది. → ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో 1.4 మిలియన్ చదరపు అడుగుల తాజా లీజింగ్ నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 43 శాతం తగ్గింది. → కోల్‌కతా మార్కెట్లో రెట్టింపు పరిమాణంలో 0.23 మిలియన్ ఎస్ఎఫ్టీ లీజింగ్ నమోదైంది.ఇక ముందూ బలమైన వృద్ధి..‘‘అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ.. భారత ఆఫీస్ స్పేస్ మార్కెట్ క్యూ2(జూన్ క్వార్టర్)లో బలమైన లావాదేవీలుగా వేదికగా నిలిచింది. ఐటీ–ఐటీఈఎస్, బీఎఫ్ఎస్ఐ రంగాల నుంచి బలమైన డిమాండ్ నేపథ్యంలో లీజింగ్ మార్కెట్ ఇక మీదటా వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నాం. ఫ్లెక్స్ స్పేస్ ఈ వృద్ధిలో కీలక పాత్ర పోషించనుంది’’అని వెస్టియన్ సీఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలోనూ ఆఫీస్ స్పేస్ లీజింగ్ 18 శాతం వృద్ధితో 30 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉన్నట్టు వెస్టియన్ నివేదిక వెల్లడించింది. గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్ ఏడు పట్టణాల్లో బలంగా ఉందని.. ఈ ఏడాది మొత్తం మీద 60 మిలియన్ ఎస్ఎఫ్టీ అధిగమించొచ్చని పేర్కొంది. -
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
దేశవ్యాప్తంగా ఆఫీస్ స్పేస్ లీజింగ్ గణనీయంగా పెరిగింది. ప్రస్తుతేడాది తొలి త్రైమాసికంలో ఆఫీస్ స్థలాల లీజింగ్‌లో వృద్ధి నమోదైందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ వెస్టియన్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. టాప్ ఏడు ప్రధాన నగరాల్లో ఆఫీస్ లీజింగ్ డేటాను విడుదల చేసింది.2024 జనవరి-మార్చిలో ఆఫీస్ లీజింగ్ 13 శాతం పెరిగి 134 లక్షల చదరపు అడుగులకు చేరుకుంది. ఇది సంవత్సరం క్రితం ఇదే కాలంలో 118.5 లక్షల చదరపు అడుగులు ఉండేది. అయితే 2023 నాల్గవ త్రైమాసికంలో గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో 31 శాతం తగ్గింది.మెట్రో నగరాల్లో అత్యధికంగా చెన్నైలో ఆఫీస్ స్థలాల డిమాండ్ రెండింతలు పెరిగింది. ఏడాది క్రితం 16 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన స్థలం లీజుకు తీసుకోగా, ఈసారి ఏకంగా 33.5 లక్షల చదరపు అడుగులకు చేరుకున్నట్లు నివేదిక వెల్లడించింది.హైదరాబాద్‌లో భారీగా లీజింగ్ హైదరాబాద్‌లోనూ ఆఫీస్ స్థలం లీజింగ్ భారీగా పెరిగింది. తొలి త్రైమాసికంలో 22.7 లక్షల చదరపు అడుగులు లీజుకు తీసుకున్నట్లు వెస్టియన్ నివేదిక తెలిపింది. ఏడాది క్రితం నమోదైన 15 లక్షల కంటే ఇది 50 శాతం అధికం కావడం విశేషం. మరోవైపు, దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆఫీస్ స్థలం లీజు తగ్గుముఖం పట్టింది. జనవరి నుంచి మార్చి మధ్యకాలంలో 18.1 లక్షల చదరపు అడుగుల స్థలం మాత్రమే లీజుకు పోయిందని తెలిపింది.ఏడాది క్రితం తీసుకున్న 24 లక్షల చదరపు అడుగులతో పోలిస్తే 25 శాతం తగ్గింది. అలాగే ఢిల్లీ-ఎన్సీఆర్ రీజియన్‌లో కూడా 40 శాతం తగ్గింది. దేశవ్యాప్తంగా ఆఫీస్ లీజింగ్‌లో దక్షిణాది నగరాలైన బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వాటా 61 శాతంగా ఉంది. ఈ మూడు నగరాల్లో వాటా 54 శాతం పెరిగింది. అయితే బెంగళూరులో ఆఫీస్ లీజింగ్ 33 లక్షల చదరపు అడుగుల నుంచి 26.2 లక్షల చదరపు అడుగులకు పడిపోవడం గమనార్హం.ఆర్థిక రాజధాని ముంబైలో ఆఫీస్ స్థలం లీజు 12 లక్షల అడుగుల నుంచి 24.9 లక్షలకు పెరగడం విశేషం. కోల్‌కతాలో మాత్రం 3.5 లక్షల చదరపు అడుగుల నుంచి 1.6 లక్షల అడుగులకు పడిపోయింది. పుణెలో ఆఫీస్ స్థలం సగానికి సగం పడిపోయింది. ఏడాది క్రితం 15 లక్షల చదరపు అడుగులు కాగా, ఈ సారి 7.1 లక్షల చదరపు అడుగులకు జారుకుంది.ఇక రంగాలవారీగా తీసుకుంటే ఐటీ, ఐటీఈఎస్ రంగానికి చెందిన సంస్థలు అధికంగా ఆఫీస్ స్థలాలను లీజుకు తీసుకున్నాయి. వీటి వాటా 47 శాతంగా ఉంది. అలాగే బీఎఫ్ఎస్ఐ రంగం వాటా 11 శాతంగా ఉంది. -
వర్క్‌స్పేస్‌కు డిమాండ్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ కంపెనీలు తమ ఉద్యోగాలను భారత్‌కు అవుట్సోర్సింగ్ చేస్తుండటంతో దేశీయంగా ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ గణనీయంగా పెరిగిందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ నైట్ ఫ్రాంక్ ఒక నివేదికలో తెలిపింది. 2023లో మొత్తం వర్క్ స్పేస్ లీజింగ్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ), థర్డ్ పార్టీ ఐటీ సేవల సంస్థల వాటా 46 శాతంగా నమోదైందని వివరించింది. ‘ఆసియా పసిఫిక్ హొరైజన్: హార్నెసింగ్ ది పొటెన్షియల్ ఆఫ్ ఆఫ్‌షోరింగ్‘ రిపోర్టు ప్రకారం భారత్‌లో ఆఫ్‌షోరింగ్ పరిశ్రమ గణనీయంగా పెరిగింది. గ్లోబల్ ఆఫ్‌షోరింగ్ మార్కెట్లో 57 శాతం వాటాను దక్కించుకుంది. వ్యయాలను తగ్గించుకునేందుకు, నిర్వహణ సామరŠాధ్యలను మెరుగుపర్చుకునేందుకు కంపెనీలు తమ వ్యాపార ప్రక్రియలను లేదా సర్వీసులను ఇతర దేశాల్లోని సంస్థలకు అవుట్సోర్స్ చేయడాన్ని ఆఫ్‌షోరింగ్‌గా వ్యవహరిస్తారు. దీన్నే బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ (బీపీవో)గా కూడా వ్యవహరిస్తారు. ఇందులో జీసీసీలు, గ్లోబల్ బిజినెస్ సర్వీసులు (జీబీఎస్) మొదలైనవి ఉంటాయి. కంపెనీలు వేరే ప్రాంతాల్లో అంతర్గతంగా ఏర్పాటు చేసుకునే యూనిట్లను జీసీసీలుగా వ్యవహరిస్తారు. నివేదికలోని ఇతర ముఖ్యాంశాలు.. ► 2023లో ఆఫ్‌షోరింగ్ పరిశ్రమలో మొత్తం లీజింగ్ పరిమాణం 27.3 మిలియన్ చ.అ.గా నమోదైంది. క్రితం సంవత్సరంతో పోలిస్తే 26 శాతం పెరిగింది. జీసీసీలు 20.8 మిలియన్ చ.అ., థర్డ్ పార్టీ ఐటీ సేవల సంస్థలు 6.5 మిలియన్ చ.అ. ఆఫీస్ స్పేస్‌ను లీజుకి తీసుకున్నాయి. ► భారత ఎకానమీకి ఆఫ్‌షోరింగ్ పరిశ్రమ గణనీయంగా తోడ్పడుతోంది. 2023లో మొత్తం సేవల ఎగుమతుల్లో దీని వాటా దాదాపు 60 శాతంగా నమోదైంది. సర్వీస్ ఎగుమతులు 2013లో 63 బిలియన్ డాలర్లుగా ఉండగా 2023లో మూడు రెట్లు వృద్ధి చెంది 185.5 బిలియన్ డాలర్లకు చేరాయి. ఆఫ్‌షోరింగ్ సేవలు అందించే గ్లోబల్ సంస్థల్లో 42 శాతం కంపెనీలకు భారత్‌లో కార్యకలాపాలు ఉన్నాయి. ► 2023 నాటికి దేశీయంగా జీసీసీల సంఖ్య 1,580 పైచిలుకు ఉంది. దేశీ ఆఫీస్ స్పేస్ లీజింగ్ లావాదేవీల్లో వీటి వాటా 2022లో 25 శాతంగా ఉండగా 2023లో 35 శాతానికి చేరింది. జీసీసీల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థల వాటా గణనీయంగానే ఉన్నప్పటికీ తాజాగా ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లో వృద్ధికి సెమీకండక్టర్లు, ఆటోమొబైల్, ఫార్మా తదితర రంగాలు కారణంగా ఉంటున్నాయి. ► రాబోయే దశాబ్ద కాలంలో ఆఫీస్ మార్కెట్‌కు జీసీసీలే చోదకాలుగానే ఉండనున్నాయి. 2030 నాటికి దేశీయంగా వీటి సంఖ్య 2,400కి చేరనుంది. -
హైదరాబాద్‌లో దూసుకెళ్తున్న రియల్టీ రంగం
దేశవ్యాప్తంగా ఆఫీస్ స్థలాలకు డిమాండ్ పెరుగుతోంది. కొవిడ్ భయాలు తొలగి క్రమంగా దాదాపు చాలా కంపెనీలు వర్క్‌ఫ్రంహోం కల్చర్‌కు స్వస్తి పలుకుతాన్నాయి. ఉద్యోగులను కార్యాలయాల నుంచే పనిచేయాలని కోరుతున్నాయి. దాంతో దేశీయ, అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలు కొత్తగా కార్యాలయాలను ఏర్పాటు చేస్తుండటంతో ఆఫీస్ స్థలాలు హాట్‌కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఈ జనవరి-మార్చి మధ్యకాలంలో ఆరు మెట్రో నగరాల్లో ఆఫీస్ స్థలాల లీజులో 35 శాతం వృద్ధి నమోదైందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కొల్లియర్స్ ఇండియా తాజాగా వెల్లడించింది. దేశవ్యాప్తంగా టాప్-6 నగరాలైన బెంగళూరు, దిల్లీ-ఎన్సీఆర్, ముంబై, చెన్నై, హైదరాబాద్, పుణెలో సమీప భవిష్యత్తులో 13.6 మిలియన్ల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఆఫీస్ స్థలాన్ని లీజుకు తీసుకునే అవకాశాలున్నాయని పేర్కొంది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో ఇది 10.1 మిలియన్ చదరపు అడుగులుగా ఉండడం గమనార్హం. హైదరాబాద్‌తోపాటు ముంబై, బెంగళూరు, దిల్లీ-ఎన్సీఆర్లలో ఆఫీస్ స్థలాల లీజు పెరగగా, చెన్నైలో తగ్గుముఖం పట్టింది. హైదరాబాద్‌లో అత్యధికంగా 2.9 మిలియన్ చదరపు అడుగుల స్థలం లీజుకు తీసుకున్నారని నివేదిక వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే రెండు రెట్లు పెరిగినట్లు వెల్లడించింది. వచ్చే త్రైమాసికానికిగాను ఇప్పటికే కార్పొరేట్ సంస్థలు తమ లీజుకు సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకున్నాయని తెలిపింది. నివేదికలోని కొన్ని ప్రధానాంశాలు ముంబైలో ఆఫీస్ స్థలం డిమాండ్ 90 శాతం ఎగబాకి 1 మిలియన్ చదరపు అడుగుల నుంచి 1.9 మిలియన్ చదరపు అడుగులకు చేరుకోనుంది. బెంగళూరులో కార్యాలయాల స్థలం 25 శాతం పెరిగి 4 మిలియన్ చదరపు అడుగులకు చేరుకోనుంది. గతేడాది ఇది 3.2 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. దిల్లీ-ఎన్సీఆర్లో 2.5 మిలియన్ చదరపు అడుగుల స్థలం లీజుకు తీసుకునే అవకాశం ఉంది. క్రితం ఏడాది కంటే ఇది 14 శాతం అధికం. చెన్నైలో ఆఫీస్ స్పేస్ డిమాండ్ 6 శాతం తగ్గి 1.6 మిలియన్ చదరపు అడుగుల నుంచి 1.5 మిలియన్ చదరపు అడుగులకు తగ్గింది. ఇదీ చదవండి: భారత్‌లో భారీ నిక్షేపాలు.. తేలిగ్గా, దృఢంగా మార్చే ధాతువు -
మొన్న వార్నింగ్.. ఇప్పుడు ఆఫీస్ స్పేస్ - టెక్ దిగ్గజం కొత్త వ్యూహం!
భారతదేశపు అతిపెద్ద ఐటీ కంపెనీ 'టీసీఎస్' (TCS) నోయిడాలో సుమారు 4 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని లీజుకు తీసుకుంది. ఇది ఢిల్లీ - ఎన్సీఆర్ ప్రాంతాల్లో అతిపెద్ద ఆఫీస్ స్పేస్‌లలో ఒకటి కానున్నట్లు సమాచారం. లీజుకు తీసుకోవడం వెనుక ఉన్న ప్రధాన కారణం రిటర్న్ టు ఆఫీస్ అని తెలుస్తోంది. ఇప్పటికే TCS కంపెనీ తమ ఉద్యోగులను తప్పకుండా ఆఫీసులకు రావాలని ఫైనల్ వార్ణింగ్ ఇచ్చింది. ఈ క్రమంలోనే కంపెనీ ఆఫీస్ స్థలాన్ని లీజుకు తీసుకుంది. ఈ స్థలం నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేలోని అసోటెక్ బిజినెస్ క్రెస్టెరాలో ఉంది. ఆఫీస్ స్పేస్ అవసరాలకు ఐటీ కంపెనీలు ప్రధాన కారణమని, వర్క్ ఫ్రమ్ హోమ్ ముగింపు వల్ల రాబోయే రోజుల్లో ఆఫీసులకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులందరూ ఆఫీసులకు రావడం మొదలుపెడితే.. ఆఫీస్ స్థలాలు ఎక్కువ అవసరమవుతాయి. దీంతో నోయిడా ప్రాంతంలో ఆఫీసులకు మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఇక్కడ జెన్పాక్ట్, సెలెబల్ టెక్నాలజీస్ వంటి కంపెనీలు కూడా ఆఫీసు స్థలాలను లీజుకు తీసుకున్నాయి. ఇదీ చదవండి: మెదడులో చిప్ పనిచేస్తోంది.. నిజమవుతున్న మస్క్ కల! రిటర్న్ టు ఆఫీస్ TCS కంపెనీలో ఇప్పటికే 65 శాతం మంది ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీసుకు వస్తున్నారు. అయితే ఇప్పుడు మిగిలిన ఉద్యోగులందరూ కూడా మార్చి ఆఖరినాటికల్లా ఆఫీసులకు రావాల్సిందేనని కంపెనీ డెడ్‌లైన్ విధించినట్లు సమాచారం. కంపెనీలో పనిచేసి ఉద్యోగులకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించడానికి టీసీఎస్ సిద్ధమైంది. -
Real Estate: ఈ ఏడాది 20% వృద్ధి ఉండొచ్చు
న్యూఢిల్లీ: ఆఫీస్ స్పేస్ (కార్యాలయ స్థలాలు) లీజుకు వచ్చే ఏడాది మంచి డిమాండ్ ఉంటుందని జేఎల్ఎల్ ఇండియా అంచనా వేసింది. దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లో 20 శాతం వృద్ధి నమోదు కావచ్చని పేర్కొంది. ప్రస్తుత ఏడాది ఈ పట్టణాల్లో 37–39 మిలియన్ చదరపు అడుగులు (ఎస్ఎఫ్టీ) మేర లీజు నమోదు అవుతుందని అంచనా వేసింది. గతేడాది 38 మిలియన్ ఎస్ఎఫ్టీ స్థాయిలోనే, ఈ ఏడాది కూడా డిమాండ్ స్థిరంగా ఉండొచ్చని తెలిపింది. హైదరాబాద్, ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, పుణె పట్టణాలకు సంబంధించిన వివరాలతో నివేదిక విడుదల చేసింది. ఆఫీస్ స్పేల్ లీజు డిమాండ్ 2019లో 47.92 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంటే, 2020లో 25.38 మిలియన్ ఎస్ఎఫ్టీ, 2021లో 26.03 మిలియన్ ఎస్ఎఫ్టీ చొప్పున ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయంగా మందగమన పరిస్థితులు నెలకొన్నప్పటికీ, ఈ ఏడాది భారత్‌లో కార్యాలయ స్థలాలకు డిమాండ్ స్థిరంగా ఉందని, వచ్చే ఏడాది తదుపరి దశ వృద్ధిని చూస్తుందని జేఎల్ఎల్ ఇండియా తెలిపింది. ‘‘2023 జనవరి–సెప్టెంబర్ వరకు ఆఫీస్ స్పేల్ లీజు 26 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. 2022 మొత్తం ఏడాది లీజు పరిమాణంలో ఇది 68 శాతానికి సమానం. ఈ ఏడాది చివరికి లీజు సర్దుబాటు పరిమాణం 37–39 మిలియన్ ఎస్ఎఫ్టీకి పెరుగుతుంది’’అని వెల్లడించింది. 2024లో 47 మిలియన్ ఎస్ఎఫ్టీ ఈ ఏడాది ఆఫీస్ స్పేస్ లీజు భారత్‌లో 45–47 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉండొచ్చని జేఎల్ఎల్ ఇండియా తెలిపింది. ఈ ఏడాదితో పోలిస్తే 20–22 శాతం వృద్ధి నమోదు కావచ్చని పేర్కొంది. ‘‘ఏడు పట్టణాల్లో మొత్తం ఆఫీస్ స్పేస్ 2023 చివరికి 800 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరుకుంటుంది. 2023 సెప్టెంబర్ చివరికి ఇది 792.8 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది’’అని జేఎల్ఎల్ ఇండియా ఆఫీస్ లీజింగ్ అడ్వైజరీ హెడ్ రాహుల్ అరోరా తెలిపారు. ఫ్లెక్సిబుల్ స్పేస్ లీజింగ్ 2023లో గతేడాది గరిష్ట స్థాయిని అధిగమిస్తుందని, 1,45,000 సీట్లుగా ఉండొచ్చని పేర్కొంది. -
భారత్‌కు క్యూ కడుతున్న సంస్థలు.. గ్లోబుల్ కేపబులిటి సెంటర్ల జోరు!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ కార్యకలాపాల సామర్థ్య కేంద్రాలు (జీసీసీలు) భారత్‌లో 2025 నాటికి 1,900కు చేరుకుంటాయని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ సీబీఆర్ఈ సౌత్ ఏషియా తెలిపింది. మొత్తం ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లో (కార్యాలయ స్థలం) వీటి వాటా 35–40 శాతానికి చేరుకుంటుందని పేర్కొంది. ప్రస్తుతం భారత్‌లో 1,580 జీసీసీలు ఉన్నట్టు తెలిపింది. బహుళజాతి సంస్థల కార్యకలాపాలకు వేదికగా ఉండే వాటిని జీసీసీలుగా చెబుతారు. భారత్ ఆకర్షణీయం భారత్ కాకుండా బ్రెజిల్, చైనా, చిలే, చెక్ రిపబ్లిక్, హంగరీ, ఫిలిప్పీన్స్, పోలాండ్ సైతం జీసీసీ కేంద్రాలుగా అవతరిస్తున్నట్టు ఈ నివేదిక తెలిపింది. అయితే, లీజు వ్యయాల పరంగా, నైపుణ్య మానవ వనరుల పరంగా భారత్ ఎంతో ఆకర్షణీయంగా ఉంటూ, జీసీసీలకు ప్రాధాన్య కేంద్రంగా ఉన్నట్టు వివరించింది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య కాలంలో భారత్‌లో జీసీసీల విస్తరణ దూకుడుగా ఉందని, ఆరు పట్టణాల్లో మొత్తం ఆఫీస్ లీజులో వీటి వాటా 38 శాతానికి చేరుకుందని తెలిపింది. ప్రస్తుత ఏడాది మొదటి ఆరు నెలల్లో జీసీసీల ఆఫీసు లీజు పరిమాణం 9.8 మిలియన్ చదరపు అడుగులుగా ఉన్నట్టు వెల్లడించింది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ జీసీసీ ఆఫీస్ లీజులో 77 శాతం వాటాను (జనవరి–జూన్ మధ్య) ఆక్రమిస్తున్నట్టు పేర్కొంది. ‘‘జీసీసీలకు భారత్ అత్యంత ప్రాధాన్య కేంద్రంగా మారింది. నైపుణ్య మానవ వనరులు, తక్కువ వ్యయాలు, వ్యాపార అనుకూల వాతావరణం, ప్రభుత్వ మద్దతుకు జీసీసీల వృద్ధి సాక్షీభూతంగా నిలుస్తుంది’’అని సీబీఆర్ఈ భారత్, ఆగ్నేయాసియా చైర్మన్, సీఈవో అన్షుమన్ మేగజిన్ పేర్కొన్నారు. ద్వితీయ శ్రేణీ పట్టణాల్లోనూ.. చిన్న, మధ్య స్థాయి బహుళజాతి సంస్థలు సైతం క్రమంగా భారత్‌లోకి అడుగుపెడుతున్నట్టు ఈ నివేదిక తెలిపింది. కంపెనీలు ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ జీసీసీల ఏర్పాటు ద్వారా విస్తరణకు ఆసక్తి చూపిస్తున్నట్టు పేర్కొంది. -
ఆఫీస్ స్పేస్ డిమాండ్ అంతంతే
ముంబై: వాణిజ్య కార్యాలయ స్థలాల లీజు (ఆఫీస్ స్పేస్) మార్కెట్లో డిమాండ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్తబ్దుగా ఉండొచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. 32–34 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లీజు నమోదు కావచ్చని పేర్కొంది. అదే సమయంలో, దేశీయంగా వాణిజ్య రియల్టీ మార్కెట్లో ఉన్న సహజ బలాలు, ఉద్యోగులు తిరిగి కార్యాలయానికి వచ్చి పని చేస్తుండడం అన్నవి మధ్య కాలానికి భారత్‌లో ఆఫీస్ స్పేస్ లీజు డిమాండ్‌ను పెంచుతాయని తెలిపింది. దేశీ ఆఫీస్ స్పేస్ మార్కెట్లో ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు 42–45 శాతం వాటాతో అగ్రగామిగా ఉన్న విషయాన్ని ఈ నివేదిక గుర్తు చేసింది. బహుళజాతి సంస్థలకు చెందిన అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాలు (జీసీసీ) సైతం గడిచిన కొన్ని సంవత్సరాల్లో కిరాయిదారులకు కీలక విభాగంగా మారినట్టు తెలిపింది. మొత్తం ఆఫీస్ స్పేస్ లీజు మార్కెట్లో జీసీసీల వాటా మూడింట ఒక వంతుగా ఉన్నట్టు పేర్కొంది. ‘‘ఆఫీస్ స్పేస్ నికర లీజు పరిమాణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండు అంశాల వల్ల ప్రభావితమవుతుంది. ఐటీ, ఐటీఈఎస్ కంపెనీల్లో నికర ఉద్యోగుల నియామకాలు నిలిచాయి. ఆదాయం తగ్గి, లాభదాయకతపై ఒత్తిళ్ల నెలకొన్నాయి. ఈ రంగం వ్యయ నియంత్రణలపై దృష్టి సారించొచ్చు. యూఎస్, యూరప్‌లో స్థూల ఆర్థిక సవాళ్ల నేపథ్యంలో జీసీసీలు దేశీయంగా పెద్ద స్థాయి లీజింగ్ ప్రణాళికలను వాయిదా వేయవచ్చు’’అని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ గౌతమ్ షాహి వివరించారు. దేశీయంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సరీ్వసులు, ఇన్సూరెన్స్, కల్సలి్టంగ్, ఇంజనీరింగ్, ఫార్మా, ఈ కామర్స్ విభాగాలు ఆఫీస్ స్పేస్ మార్కెట్లో మిగిలిన వాటా ఆక్రయమిస్తాయని చెబుతూ.. వీటి నుంచి డిమాండ్ కారణంగా 2023–24లో 32–34 మిలియన్ చదరపు అడుగుల లీజ్ నమోదు కావచ్చని క్రిసిల్ రేటింగ్స్ పేర్కొంది. ఉద్యోగుల రాక అనుకూలం.. కంపెనీల యాజమాన్యాలు ఉద్యోగులు తిరిగి కార్యాలయాలకు వచ్చి పని చేయాలని కోరుతుండడం ఆఫీస్ స్పేస్ లీజు మార్కెట్‌కు ప్రేరణగా క్రిసిల్ రేటింగ్స్ అభిప్రాయపడింది. ఇప్పటి వరకు ఇంటి నుంచే పనికి వీలు కల్పించిన కంపెనీలు, ఇప్పుడు వారంలో ఎక్కువ రోజులు కార్యాలయాలకు రావాలని కోరుతుండడాన్ని ప్రస్తావించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగులు కార్యాలయాలకు రాక 40 శాతంగా ఉంటే, అది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 65–70 శాతానికి చేరుతుందని వివరించింది. సమీప కాలంలో సమస్యలు నెలకొన్నప్పటికీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆఫీస్ స్పేస్ లీజు మార్కెట్ 10–12 శాతం వృద్ధితో 36–38 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంటుందని క్రిసిల్ రేటింగ్స్ అసోసియేట్ డేరెక్టర్ సైనా కత్వాల తెలిపారు. మధ్య కాలానికి వృద్ధి ఇదే స్థాయిలో ఉంటుందన్నారు. తక్కువ వ్యయాల పరంగా ఉన్న అనుకూలత, నైపుణ్య మానవ వనరుల లభ్యత నేపథ్యంలో జీసీసీలు ఆఫీస్ స్పేస్ లీజు మార్క్‌ను ముందుండి నడిపిస్తాయని క్రిసిల్ రేటింగ్స్ పేర్కొంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై ఎంఎంఆర్‌లో గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ 2023 మార్చి నాటికి 705 మిలియన్ చదరపు అడుగులుగా ఉన్నట్టు తెలిపింది. ఆసియాలోని ప్రముఖ పట్టణాలతో పోలిస్తే భారత్‌లోని పట్టణాల్లోనే సగటు ఆఫీస్ స్పేస్ లీజు ధర తక్కువగా ఉన్నట్టు వెల్లడించింది. -
ఆఫీస్ స్పేస్ లీజులో హైదరాబాద్ టాప్
బెంగళూరు: ఆఫీస్ స్పేస్ లీజు (కార్యాలయ వసతి) పరంగా హైదరాబాద్ మార్కెట్ మంచి వృద్ధిని చూపించింది. జూలై–సెపె్టంబర్ కాలంలో స్థూల లీజు పరిమాణం ఏకంగా రెండున్న రెట్లు పెరిగి 2.5 మిలియన్ చదరపు అడుగులుగా (ఎస్ఎఫ్టీ) నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఆఫీస్ స్పేస్ లీజు ఒక మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగానే ఉంది. దేశవ్యాప్తంగా ఆరు ప్రధాన పట్టణాల్లో స్థూల ఆఫీస్ స్పేస్ లీజు సెపె్టంబర్ త్రైమాసికంలో 2 శాతం వృద్ధితో 13.2 ఎస్‌ఎఫ్‌టీగా నమోదైనట్టు కొలియర్స్ ఇండియా తెలిపింది. ఇందుకు సంబంధించి గణాంకాలను శుక్రవారం విడుదల చేసింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో స్థూల లీజు పరిమాణం 12.9 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. స్థూల లీజు పరిమాణంలో లీజు రెన్యువల్, ఆసక్తి వ్యక్తీకరణపై సంతకం చేసిన లావాదేవీలను పరిగణనలోకి తీసుకోలేదు. ప్రధానంగా హైదరాబాద్‌తోపాటు ముంబై, పుణె, చెన్నై మార్కెట్లలో ఆఫీస్ స్పేస్ లీజుకు డిమాండ్ పెరిగినట్టు కొలియర్స్ ఇండియా నివేదిక తెలిపింది. పట్టణాల వారీగా.. ► బెంగళూరులో స్థూల ఆఫీస్ స్పేస్ లీజు (తాజా) సెపె్టంబర్ క్వార్టర్లో 3.4 మిలియన్ చదరపు అడుగులకు పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే కాలంలోని 4.4 మిలియన్ ఎస్ఎఫ్టీతో పోలిస్తే తగ్గింది. ► ఢిల్లీ ఎన్సీఆర్ మార్కట్లోనూ స్థూల లీజు పరిమాణం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 4.3 మిలియన్ చదరపు అడుగుల నుంచి 3.2 మిలియన్ చదరపు అడుగులకు క్షీణించింది. ► ముంబైలో స్పల్ప వృద్ధితో 1.6 మిలియన్ నుంచి 1.7 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరింది. ► చెన్నైలో ఒక మిలియన్ నుంచి 1.4 మిలియన్‌కు, పుణెలో 0.6 మిలియన్ నుంచి ఒక మిలియన్ చదరపు అడుగులకు స్థూల ఆఫీస్ స్పేస్ లీజు వృద్ధి చెందింది. ఇదే ధోరణి కొనసాగొచ్చు.. ‘‘భారత ఆఫీస్ స్పేస్ డిమాండ్ ఈ ఏడాది మొదటి మూడు త్రైమాసికాల్లో (జనవరి–సెపె్టంబర్) 2022లో మాదిరే ఉంది. దేశ స్థూల ఆర్థిక అంశాలు బలంగా ఉండడం ఆఫీస్ స్పేస్ డిమాండ్‌కు మద్దతునిచి్చంది. ఇదే ధోరణి చివరి త్రైమాసికంలోనూ (అక్టోబర్–డిసెంబర్) కొనసాగొచ్చు’’అని కొలియర్స్ ఇండియా ఎండీ పీయూష్ జైన్ తెలిపారు. 2022లో నమోదైన చారిత్రక ఆఫీస్ స్పేస్ లీజు రికార్డు 2023లో అధిగమిస్తుందేమో చూడాలన్నారు. చివరి త్రైమాసికంలో హైదరాబాద్, చెన్నైలో డిమాండ్ బలంగా ఉంటుందని కొలియర్స్ ఇండియాకు చెందిన అరి్పత్ మెహరోత్రా పేర్కొన్నారు. బెంగళూరు దేశ ఆఫీస్ సేŠప్స్ లీజులో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందన్నారు. -
ఆఫీస్ స్పేస్ లీజింగ్ తగ్గొచ్చు
న్యూఢిల్లీ: కార్యాలయ స్థలాల (ఆఫీస్ స్పేస్) లీజు ఈ ఏడాదిలో 20 శాతం క్షీణించి 40 మిలియన్ చదరపు అడుగులకు (ఎస్ఎఫ్టీ) పరిమితం కావొచ్చని కొలియర్స్ ఇండియా నివేదిక తెలిపింది. కంపెనీలు తమ విస్తరణ ప్రణాళికలను వాయిదా వేస్తుండడం ఇందుకు కారణమని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఆరు ప్రముఖ పట్టణాలపై వివరాలతో కూడిన నివేదికను గురువారం విడుదల చేసింది. స్థూలంగా ఆఫీస్ స్పేస్ లీజు 2023లో 40–45 మిలియన్ ఎస్ఎఫ్టీ మధ్య ఉండొచ్చని, క్రితం ఏడాదిలో ఇది 50.3 మిలియన్ చదరపు అడుగులుగా ఉందని తెలిపింది. కాకపోతే ఈ ఏడాది మార్చిలో వేసిన అంచనా కంటే ఎక్కువే ఉంటున్నట్టు పేర్కొంది. ఇక ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో (జూన్ వరకు) 24.7 మిలియన్ ఎస్ఎఫ్టీ ఆఫీస్ స్పేస్ లీజు నమోదైంది. ద్వితీయ ఆరు నెలల్లో (డిసెంబర్ వరకు) మరో 15.3–20.3 మిలియన్ చదరపు అడుగుల మధ్య ఉంటుందని అంచనా వేసింది. స్థూల లీజు పరిమాణంలో రెన్యువల్స్‌ను కలపలేదు. వెలుపలి డిమాండ్ బలహీనంగా ఉన్నప్పటికీ, బలమైన ఆర్థిక కార్యకలాపాలు ఆఫీస్ స్పేస్ లీజు ఈ మాత్రం మెరుగ్గా ఉండడానికి మద్దతుగా నిలిచినట్టు వివరించింది. ‘‘జనవరి–మార్చి మధ్య 10.1 మిలియన్ ఎస్ఎఫ్టీ మేర కార్యాలయ స్థలాలు భర్తీ అయ్యాయి. తర్వాతి మూడు నెలల కాలంలో ఇది మరింత పుంజుకున్నది. ఏప్రిల్–జూన్ మధ్య 14.6 మిలియన్ చదరపు అడుగులు మేర లీజు నమోదైంది. త్రైమాసికం వారీగా చూస్తే 46 శాతం పుంజుకున్నది’’అని కొలియర్స్ ఇండియా వివరించింది. పట్టణాల వారీగా.. బెంగళూరులో అత్యధికంగా 12–14 మిలియన్ ఎస్ఎఫ్టీ కార్యాలయ స్థలాల లీజు నమోదైంది. ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో 9–11 మిలియన్ ఎస్ఎఫ్టీ, చెన్నైలో 7–9 మిలియన్ చదరపు అడుగుల మేర కంపెనీలు లీజుకు తీసుకున్నాయి. హైదరాబాద్, ముంబై, పుణె మార్కెట్లలో ఇది 4–6 మిలియన్ చదరపు అడుగుల మధ్య ఉంది. సరఫరాకు తగ్గట్టు లీజు పరిమాణం నమోదు అవుతుండడం, ఖాళీ స్థలాలు ఫ్లాట్‌గానే ఉండడం వల్ల అద్దెలు పెరిగే అవకాశం ఉన్నట్టు కొలియర్స్ ఇండియా నివేదిక అంచనా వేసింది. ఆఫీస్ స్పేస్ డిమాండ్ మృదువుగా ఉన్నప్పటికీ, ఫ్లెక్సిబుల్ వర్క్స్పేసెస్కు డిమాండ్ స్థిరంగా కొనసాగుతున్నట్టు ఈ విభాగంలో సేవలు అందించే అర్బన్వోల్ట్ సహ వ్యవస్థాపకుడు అమల్ మిశ్రా తెలిపారు. -
ఆఫీస్ లీజింగ్‌లో స్తబ్ధత
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏడు ప్రముఖ పట్టణాల్లో ఆఫీసు లీజ్ మార్కెట్ జూన్ త్రైమాసికంలో బలహీన పనితీరు చూపించింది. మొత్తం ఆఫీసు లీజు విస్తీర్ణం 6 శాతం క్షీణించి 13.9 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. ఏడు ప్రముఖ పట్టణాల్లో స్థూల ఆఫీస్ లీజు క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో 14.8 మిలియన్ చదరపు అడుగులుగా ఉండడం గమనార్హం. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై సంయక్తంగా 8.2 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ లీజును నమోదు చేశాయి. ఈ మూడు మార్కెట్లు సంయుక్తంగా 59 శాతం వాటాను ఆక్రమించాయి. ఏప్రిల్–జూన్ త్రైమాసికంపై రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ‘వెస్టియన్’ ఓ నివేదికను విడుదల చేసింది. అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో దేశీయంగా పెద్ద సంస్థలు, ఎంఎన్‌సీలు నిర్ణయాలు తీసుకోవడంలో నెలకొన్న జాప్యమే ఈ పరిస్థితికి కారణమని వెస్టియన్ నివేదిక పేర్కొంది. కాకపోతే మార్చి త్రైమాసికంలో పోలిస్తే, జూన్ క్వార్టర్లో ఏడు పట్టణాల్లో ఆఫీస్ స్పేస్ లీజు డిమాండ్ 17 శాతం పెరిగినట్టు వెల్లడించింది. జూన్ త్రైమాసికంలో ఆఫీస్ స్పేస్ వినియోగం, కొత్త వసతుల పూర్తి పెరిగినట్టు వెస్టియన్ సీఈవో శ్రీనివాసరావు తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థ బలమైన పనితీరు ఆఫీస్ మార్కెట్‌పై ప్రభావం చూపిస్తున్నట్టు చెప్పారు. టెక్నాలజీ రంగం ముందు ఆఫీస్ స్పేస్ లీజులో టెక్నాలజీ రంగం ముందున్నట్టు వెస్టియన్ తెలిపింది. ఆ తర్వాత ఇంజనీరింగ్, తయారీ రంగం నుంచి డిమాండ్ ఉందని.. ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్‌లోనూ కదలిక వచ్చినట్టు వివరించింది. సెపె్టంబర్ త్రైమాసికానికి సంబంధించి నియామకాల ఉద్దేశ్యాలు మెరుగుపడినట్టు, దేశ వృద్ధి అవకాశాల పట్ల ఆశావహ పరిస్థితికి ఇది నిదర్శనమని పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్లు స్థిరపడితే ద్వితీయ ఆరు నెలల కాలంలో భారత్‌లో రియల్ ఎసేŠట్ట్ కార్యకలాపాల్లో చురుకుదనం కనిపించొచ్చని అంచనా వేసింది. పట్టణాల వారీగా.. ► విడిగా చూస్తే హైదరాబాద్ ఆఫీస్ లీజు మార్కెట్లో 4 శాతం క్షీణత కనిపించింది. 2.3 మిలియన్ చదరపు అడుగులకు పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 2.4 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. ► చెన్నై మార్కెట్లో 83 శాతం వృద్ధితో 1.2 నుంచి 2.2 మిలియన్ చదరపు అడుగులకు పెరిగింది. ► బెంగళూరులో 12 శాతం క్షీణించి 3.7 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. ► ముంబై మార్కెట్లో 25 శాతం క్షీణించి 1.8 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. ► పుణెలో 6 శాతం పెరిగి 1.8 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంది. ► ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లోనూ 5శాతం తక్కువగా 2 మిలియన్ చదరపు అడుగులకు ఆఫీస్ లీజు పరిమితమైంది. ► కోల్‌కతాలో ఏకంగా 88 శాతం క్షీణించి 0.1 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. ► జూన్ త్రైమాసికంలో ఆఫీస్ లీజులో టెక్నాలజీ రంగం 26% వాటా ఆక్రమించింది. ఇంజనీరింగ్, తయారీ రంగం వాటా 19%గా ఉంటే, ఫ్లెక్సి బుల్ ఆఫీస్ స్పేస్ వాటా 18%గా నమోదైంది. ► ఈ ఏడాది జనవరి–జూన్ వరకు దేశవ్యాప్తంగా ఏడు పట్టణాల్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 25.8 మిలియన్ చదరపు అడుగులుగా ఉంటే.. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై పట్టణాల వాటాయే 14.6 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. -
పెరిగిన గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్.. హైదరాబాద్‌లో 108.2 మిలియన్ ఎస్ఎఫ్టీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆరు ప్రధాన పట్టణాల్లో గ్రేడ్ ఏ ప్రీమియం కార్యాలయ స్థలాల (ఆఫీస్ స్పేస్) లభ్యత మార్చి చివరికి 700 మిలియన్ చదరపు అడుగులు (ఎస్ఎఫ్టీ) దాటింది. ఇందులో బెంగళూరు వాటా 28 శాతంగా ఉంది. ఈ వివరాలతో రియల్టర్ల సంఘం క్రెడాయ్, డేటా అనలైటిక్ సంస్థ సీఆర్ఈ మ్యాట్రిక్స్ సంయుక్తంగా ఓ నివేదిక విడుదల చేశాయి. 2022 డిసెంబర్ నాటికి గ్రేడ్ ఏ ఆఫీసు స్థలాల నిల్వలు (లీజుకు అందుబాటులో ఉన్న) 692.91 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. (వైట్‌హౌస్ డిన్నర్‌కోసం కడుపు మాడ్చుకున్నా..ఆసాంతం అద్భుతం: ఆనంద్ మహీంద్ర) ఇక 2021 డిసెంబర్ నాటికి ఇది 643.84 ఎస్ఎఫ్టీ ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. బెంగళూరులో 195.8 మిలియన్ ఎస్ఎఫ్టీ, ఢిల్లీ ఎన్సీఆర్లో 139.6 మిలియన్ చ.అడుగులు, ముంబై మెట్రో పాలిటన్ రీజియన్ లో 118.1 మిలియన్ చదరపు అడుగులు, హైదరాబాద్‌లో 108.2 మిలియన్ చదరపు అడుగులు, పుణెలో 72.4, చెన్నైలో 67.5 ఎస్ఎఫ్టీ చొప్పున గ్రేడ్ ఏ ప్రీమియం ఆఫీసు స్థలాల నిల్వలున్నాయి. స్థిరమైన డిమాండ్ మద్దతుతో 2030 నాటికి గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్ లభ్యత బిలియన్ ఎస్ఎఫ్టీకి చేరుకుంటుందని ఈ నివేదిక అంచనా వేసింది. (రూ. 10వేల కోట్ల సుందర్ పిచాయ్ లగ్జరీ భవనం (ఫోటోలు)) కోవర్కింగ్ స్పేస్ 7 శాతం కోవర్కింగ్ స్పేస్ గత ఐదేళ్లలో అపార వృద్ధిని చూసిందని, ఇది 50 మిలియన్ చదరపు అడుగులు దాటినట్టు ఈ నివేదిక తెలిపింది. ఆరు పట్టణాల్లో మొత్తం ఆఫీసు స్థలాల్లో 7 శాతానికి చేరుకున్నట్టు పేర్కొంది. ‘‘దేశ వాణిజ్య రియల్ ఎస్టేట్ రంగం స్థిరమైన వృద్ధిని సాధిస్తుండడం అభినందనీయం. ఈ పెరుగుదలకు అనేక కారణాలను చెప్పొచ్చు. దేశ ఆర్థిక మూలాలు బలంగా ఉండడం, నూతన తరం పరిశ్రమల వృద్ధి, బహుళజాతి సంస్థల రాక పెరగడాన్ని చెప్పుకోవచ్చు. వినూత్నమైన కార్యాలయ డిజైన్లు, ప్రంపచస్థాయి మౌలిక సదుపాయాలు, అత్యాధునిక టెక్నాలజీ అనుసంధానత అన్నీ కలసి మన వాణిజ్య ప్రాపర్టీలకు డిమాండ్‌ను ఆకర్షణీయంగా మార్చేస్తున్నాయి’’ క్రెడాయ్ ప్రెసిడెంట్ బోమన్ ఇరానీ తెలిపారు. ‘‘700 మిలియన్ ఎప్‌ఎఫ్‌టీ అంటే గణనీయమైనది. ఇందులో 25 శాతం గత ఐదేళ్ల కాలంలో అందుబాటులోకి వచి్చందే. డెవలపర్లు భవన నిర్మాణాల్లో ఎంతో వినూత్నతతో, ఈఎస్జీని దృష్టిలో పెట్టుకుని ప్రపంచస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు’’అని సీఆర్ఈ మ్యాట్రిక్స్, ఇండెక్స్ ట్యాప్ సీఈవో అభిõÙక్ కిరణ్ గుప్తా తెలిపారు. -
బెంగళూరు, ముంబైకి దీటుగా హైదరాబాద్.. తెలంగాణ కొత్త రికార్డులు
సాక్షి, హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో పాటు ఐటీ ఆధారిత సేవల రంగం ఎగుమతులు, ఉద్యోగాల కల్పనలో తెలంగాణ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. రాష్ట్రం ఏర్పడే నాటికి రూ.57 వేల కోట్లుగా ఉన్న ఐటీ ఎగుమతులు 2022–23 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.2.41 లక్షల కోట్లకు చేరాయి. దీంతో ఐటీ రంగంలో భారత్‌లో అగ్రస్థానంలో ఉన్న కర్ణాటక, మహారాష్ట్రతో తెలంగాణ పోటీ పడుతున్నట్టయింది. తెలంగాణ రాష్ట్ర రెండో ఐసీటీ పాలసీ (2021–26)లో రూ.3 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు, 10 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన 2022–23 ఐటీ శాఖ ప్రగతి నివేదిక ప్రకారం.. తెలంగాణ ఈ లక్ష్యాన్ని రెండేళ్లు ముందుగానే అంటే 2024 నాటికే చేరుకుంటోంది. ఈ నేపథ్యంలో ఐటీ, ఐటీ ఆధారిత సేవల రంగంలో ఎగుమతులు, ఉద్యోగాల కల్పనలో కొత్త లక్ష్యాలను నిర్దేశించుకునేందుకు రాష్ట్ర ఐటీ శాఖ సన్నద్ధమవుతోంది. దేశంలో ఏ ఇతర రాష్ట్రం సాధించని రీతిలో 2022–23లో తెలంగాణ ఐటీ ఎగుమతుల్లో 31.44 శాతం వార్షిక వృద్ధిరేటు, ఉద్యోగాల కల్పనలో 16.2 శాతం రికార్డు వృద్ధి రేటును సాధించింది. దీంతో ఏడాది కాలంలోనే కొత్తగా 1.26 లక్షల ఉద్యోగాలు, ఎగుమతుల్లో రూ.57 వేల కోట్లకు పైగా వృద్ధిని ఐటీ రంగం సాధించింది. 17.31% సీఏజీఆర్‌తో పురోగమనం తెలంగాణ రాష్ట్ర అవతరణ నుంచి 17.31 శాతం సీఏజీఆర్ (సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు)తో వృద్ధి చెందడంతోనే ఐటీ రంగం శరవేగంగా పురోగమిస్తోంది. రాష్ట్ర అవతరణ నాటి పరిస్థితులతో పోలిస్తే ఐటీ ఎగుమతుల్లో నాలుగు రెట్లు, ఉద్యోగాల కల్పనలో మూడు రెట్లు పురోగతి సాధించగా, మరో మూడు రెట్లు పరోక్ష ఉద్యోగాలు వచ్చినట్లు అంచనా. 2022–23లో భారత్ ఐటీ ఎగుమతులు 9.36 శాతం ఉంటే, తెలంగాణలో మాత్రం 31.44 శాతం పెరిగాయి. 2014లో మొత్తం దేశ ఐటీ ఉద్యోగాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాటా 9.83% గా ఉంటే ప్రస్తుతం కొత్త ఉద్యోగాల కల్పనలో ఒక్క తెలంగాణ వాటా 27.6%గా ఉంది. భారత్ గణాంకాలతో పోలిస్తే దేశంలో ఐటీ రంగంలో వచ్చిన కొత్త ఉద్యోగాల్లో తెలంగాణ నుంచి 2021–22లో 33 శాతం వస్తే, 2022–23లో 44 శాతం వచ్చాయి. అంటే దేశంలో కొత్తగా వస్తున్న ప్రతి రెండు ఐటీ ఉద్యోగాల్లో ఒకటి తెలంగాణ నుంచే వస్తున్నట్లు భావించవచ్చు. ఉద్యోగాల్లో బెంగళూరు తర్వాత .. కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం 2021–22లో దేశం నుంచి రూ.3.95 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు జరగ్గా, ఇందులో మూడో వంతు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ నుంచే జరుగుతున్నాయి. భారతీయ సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో కర్ణాటక నుంచి 34.2 శాతం, మహారాష్ట్ర నుంచి 20.4 శాతం, తెలంగాణ నుంచి 15.6 శాతం చొప్పున జరిగాయి. దేశ వ్యాప్తంగా సుమారు 50 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉండగా, రాష్ట్ర ప్రభుత్వ ఐటీ శాఖ తాజా నివేదిక ప్రకారం తెలంగాణలోనే 9.05 లక్షల మంది పని చేస్తున్నారు. ఉద్యోగాల కల్పనలో బెంగళూరు తర్వాత రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్ ఐటీ ఎగుమతుల్లోనూ రెండో స్థానంలో నిలిచే దిశగా దూసుకుపోతోంది. పెట్టుబడులకు ప్రత్యేక ఆకర్షణగా బెంగళూరు, హైదరాబాద్ పెట్టుబడులు ఆకర్షించడం ద్వారా ఐటీ రంగం వృద్ధిలో పోటీ పడుతున్నాయి. బెంగళూరుతో పోలిస్తే స్టార్టప్ వాతావరణం, ఐటీ రంగంలో మౌలిక వసతుల కల్పన హైదరాబాద్‌లో కొంత ఆలస్యంగా పుంజుకున్నా ప్రస్తుతం పెట్టుబడులకు హైదరాబాద్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దేశ ఐటీ రాజధానిగా బెంగళూరుకు పేరున్నా ఇటీవలి కాలంలో ఐటీ పార్కులు, ఎస్ఈజెడ్లు హైదరాబాద్‌లో శరవేగంగా ఏర్పాటవుతుండటంతో రెండు నగరాల మధ్య ఐటీ, ఐటీ ఆధారిత సేవల కంపెనీలను ఆకట్టుకోవడంలో పోటీ నెలకొంది. ఆఫీస్ స్పేస్ వినియోగంలో ముంబయి, బెంగళూరు నగరాలకు మించి హైదరాబాద్ అగ్రస్థానంలో ఉంది. 2021లో ఆఫీస్ స్పేస్ వినియోగం 129 శాతం పెరగ్గా, ఐదు మెట్రో నగరాలతో పోలిస్తే 6 శాతం సగటు వృద్ధిరేటు నమోదైంది. బెంగళూరుతో పోలిస్తే జీవన వ్యయం కూడా తక్కువ కావడంతో ఐటీ నిపుణులు హైదరాబాద్ వైపు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నివేదిక (2021–22) ప్రకారం భారత్‌లో ఐటీ ఉద్యోగుల సంఖ్య: సుమారు 50 లక్షలు బెంగళూరు 15 లక్షలు హైదరాబాద్ 7.78 లక్షలు తమిళనాడు 10 లక్షలు పుణె 4 లక్షలు