రియల్టీలోకి 14 శాతం పెరిగిన పెట్టుబడులు | Institutional investments in realty sector rises 14% during Jan-Jun period | Sakshi
Sakshi News home page

రియల్టీలోకి 14 శాతం పెరిగిన పెట్టుబడులు

Published Sat, Jul 9 2022 6:40 AM | Last Updated on Sat, Jul 9 2022 8:10 AM

Institutional investments in realty sector rises 14% during Jan-Jun period - Sakshi

న్యూఢిల్లీ: రియల్‌ ఎస్టేట్‌లో ఇనిస్టిట్యూషన్స్‌ పెట్టుబడులు ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 14 శాతం పెరిగి 2.6 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. కార్యాలయం, రిటైల్‌ విభాగాలు ఎక్కువగా పెట్టుబడులను ఆకర్షించాయి. ఈ వివరాలను కొలియర్స్‌ ఇండియా తాజా నివేదికలో పేర్కొంది.

► ఆఫీస్‌ స్పేస్‌ విభాగం 1,277 మిలిలియన్‌ డాలర్లను 2022 జనవరి–జూన్‌ మధ్య ఆకర్షించాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో వచ్చిన పెట్టుబడులు 1,068 మిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి.  
► రిటైల్‌ రియల్‌ ఎస్టేట్‌ విభాగంలోకి వచ్చిన పెట్టుబడులు 492 మిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో వచ్చిన 77 మిలియన్‌ డాలర్లతో పోలిస్తే ఆరు రెట్లకు పైగా వృద్ధి కనిపిస్తోంది.  
► డేటా కేంద్రాలు తదితర ప్రత్యామ్నాయ ప్రాపర్టీల విభాగంలోకి ఇనిస్టిట్యూషన్స్‌ పెట్టుబడులు 53 శాతం పెరిగి 370 మిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో ఈ విభాగంలోకి 241 మిలియన్‌ డాలర్లు వచ్చాయి.  
► మిశ్రమ వినియోగ ప్రాపర్టీల విభాగంలోకి 230 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో అసలు ఏ మాత్రం పెట్టుబడులు రాలేదు.
► ఇండస్ట్రియల్, లాజిస్టిక్స్‌ అసెట్స్‌ విభాగంలో మాత్రం ఇనిస్టిట్యూషన్స్‌ నుంచి పెట్టుబడులు 77 శాతం తగ్గి 180 మిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.  
► నివాస ప్రాపర్టీల విభాగంలోకి సైతం 45 శాతం తగ్గి 86 మిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి.  
► దేశీ ఇన్వెస్టర్ల వాటా క్రితం ఏడాది మొదటి ఆరు నెలల్లో ఉన్న 13 శాతం నుంచి ఈ ఏడాది జూన్‌ నాటికి 38 శాతానికి పెరిగింది.  
► అత్యధికంగా ఢిల్లీ ఎన్‌సీఆర్‌ మార్కెట్‌ 35 శాతం పెట్టుబడులను ఇనిస్టిట్యూషన్స్‌ నుంచి ఆకర్షించింది. ముంబై 11 శాతం, చెన్నై 10 శాతం సంపాదించాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement