గూగుల్ (Google) గురుగ్రామ్‌లో 550,000 చదరపు అడుగుల భారీ ఆఫీస్ స్థలాన్ని (office space) లీజుకు తీసుకుంది. ఇది దేశంలోని అతిపెద్ద వర్క్‌స్పేస్ డీల్స్‌లో ఒకటిగా నిలుస్తుందని, గురుగ్రామ్‌లోని మొత్తం టవర్‌ను లీజుకు తీసుకోవడానికి టెక్ దిగ్గజం చర్చలు జరుపుతున్నట్లు ఒక నివేదిక తెలిపింది.
ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. గూగుల్ ప్రముఖ మేనేజ్డ్ వర్క్‌స్పేస్ ప్రొవైడర్ అయిన టేబుల్ స్పేస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఆఫీస్ స్థలాన్ని భవిష్యత్తులో అదనంగా 200,000 చదరపు అడుగుల వరకు విస్తరించుకునే అవకాశాన్ని కూడా ఈ సంస్థ గూగుల్‌కు అందిస్తుందని సమాచారం.
ఆసక్తికరంగా గూగుల్ గురుగ్రామ్‌లో 700,000 చదరపు అడుగుల లీజును 2022లో ముగించింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు భారీ ఆఫీస్ స్పేస్ కోసం అన్వేషిస్తుండటం గమనార్హం. గూగుల్ గతేడాదే బెంగళూరులోని అలెంబిక్ సిటీలో 6,49,000 చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని లీజుకు తీసుకుంది. మూడు సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్‌తో చదరపు అడుగుకి నెలవారీ అద్దె రూ.62 చొప్పున డీల్ కుదిరినట్లు సమాచారం.
2022లో హైదరాబాద్‌లో 600,000 చదరపు అడుగుల లీజు పునరుద్ధరణ, బెంగళూరులోని బాగ్‌మేన్ డెవలపర్‌లతో 1.3 మిలియన్ చదరపు అడుగుల ఒప్పందంతో సహా భారతదేశంలో గూగుల్ గణనీయమైన విస్తరణల శ్రేణిని గురుగ్రామ్‌లో ఈ తాజా లీజింగ్ అనుసరించింది.
Comments
Please login to add a commentAdd a comment