IT company
-
మైక్రోసాఫ్ట్‌లో కీలక మార్పు.. ఉద్యోగులకు లేఖలు
ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తమ హెచ్ఆర్ విభాగంలో కీలక మార్పులు చేసింది. కాథ్లీన్ హొగన్ స్థానంలో అమీ కోల్ మన్ను కంపెనీ చీఫ్ పీపుల్ ఆఫీసర్‌గా నియమిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సత్య నాదెళ్ల నేరుగా ఉద్యోగులకు ఈ-మెయిల్ లేఖలు పంపించారు.దశాబ్దానికి పైగా మైక్రోసాఫ్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్‌గా సేవలందించిన హొగన్ "ఆఫీస్ ఆఫ్ స్ట్రాటజీ అండ్ ట్రాన్స్ఫర్మేషన్" ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కానున్నారు. నేరుగా సీఈవో సత్య నాదెళ్లకు రిపోర్ట్ చేసే ఈ హోదాను కొత్తగా సృష్టించారు. చీఫ్ పీపుల్ ఆఫీసర్ గా మైక్రోసాఫ్ట్ పై కాథ్లీన్ చూపిన ప్రభావాన్ని అతిశయోక్తిగా చెప్పలేమని సత్య నాదెళ్ల ఉద్యోగులకు పంపిన ఈమెయిల్ లో పేర్కొన్నారు."గత పదేళ్లకు పైగా ఆమె మన సాంస్కృతిక పరివర్తనకు నాయకత్వం వహించారు. వృద్ధి మనస్తత్వాన్ని స్వీకరించి చురుకుదనంతో కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికి, ప్రపంచ స్థాయి ప్రతిభను ఆకర్షించడానికి, నిలుపుకోవటానికి ఇది మనకు దోహదపడింది" అంటూ సత్య నాదెళ్ల ప్రశంసించారు.ఇక మైక్రోసాఫ్ట్ లో 25 ఏళ్లకు పైగా పనిచేసిన కోల్ మన్ ఇటీవల మానవ వనరులు, కార్పొరేట్ ఫంక్షన్లకు కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. సత్య నాదెళ్ల ఆమెను "నమ్మకమైన సలహాదారు" అని అభివర్ణించారు.ప్రపంచంలో టాప్ టెక్ కంపెనీలలో ఒకటిగా ఉన్న మైక్రోసాఫ్ట్‌కు ప్రపంచవ్యాప్తంగా సుమారు 2,28,000 మంది ఉద్యోగులు ఉన్నారు. అయితే పనితీరు నిర్వహణ ప్రక్రియను సమీక్ష చేపట్టిన మైక్రోసాఫ్ట్ గత జనవరి, ఫిబ్రవరి నెలల్లో దాదాపు 2,000 మంది ఉద్యోగులను తొలగించింది. -
టాప్ ఐటీ కంపెనీకి కొత్త హెచ్ఆర్ హెడ్..
దేశంలో అతిపెద్ద ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)కు కొత్త హెచ్ఆర్ హెడ్ నియమితులయ్యారు. సుదీప్ కున్నుమాల్కు పదోన్నతి కల్పిస్తూ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ (సీహెచ్ఆర్వో)గా టీసీఎస్ నియమించింది. ప్రస్తుత హెచ్ఆర్ అధిపతి మిలింద్ లక్కడ్ పదవీ విరమణ చేస్తున్నారు. మార్చి 14వ తేదీ నుంచి కున్నుమాల్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరిస్తారని ఫైలింగ్‌లో టీసీఎస్ పేర్కొంది.సుదీప్ కున్నుమాల్ ప్రస్తుతం టీసీఎస్‌లో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) విభాగానికి హెచ్ఆర్ ఫంక్షన్ హెడ్‌గా ఉన్నారు. టాటా గ్రూప్ అనుబంధ సంస్థలో దాదాపు ఆరేళ్ల పాటు సీహెచ్ఆర్ఓ, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న ప్రస్తుత మిలింద్ లక్కడ్ పదవీ విరమణ తర్వాత సీహెచ్ఆర్ఓ హోదాకు పదోన్నతి పొందారు. 1987లో టీసీఎస్‌లో ట్రైనీగా చేరిన లక్కడ్ 2006లో మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ అధిపతి హోదాతో పాటు 38 ఏళ్ల పాటు పలు బాధ్యతలు నిర్వర్తించారు. 2019 నుంచి సీహెచ్‌ఆర్‌వోగా పనిచేస్తున్నారు.సుదీప్ కున్నుమాల్ గురించి..బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) వర్టికల్ కోసం హ్యూమన్ రిసోర్సెస్ ఫంక్షన్‌కు నేతృత్వం వహిస్తున్న సుదీప్ కున్నుమాల్ 2000 సంవత్సరం నుంచి ఐటీ రంగంలో పనిచేస్తున్నారు. మదురై కామరాజ్ యూనివర్సిటీ నుంచి హ్యూమన్ రిసోర్స్ మేనేజ్ మెంట్ లో మాస్టర్స్ పూర్తి చేశారు. వ్యూహాత్మక హెచ్ఆర్ చొరవలు, సరికొత్త నియామక పరిష్కారాలు, ప్రాసెస్ ఎక్సలెన్స్ ద్వారా సంస్థాగత వృద్ధిని పెంపొందించడంలో నిబద్ధతతో సుదీప్ కెరియర్ సాగిందని టీసీఎస్ పేర్కొంది. ఉత్తర అమెరికా, యూరప్‌తోపాటు ఆసియా పసిఫిక్ దేశాల్లో ఆయన వివిధ హెచ్ఆర్ లీడర్ షిప్ పొజిషన్లలో పనిచేశారు.ఇదీ చదవండి: జీతాల తేడాలొద్దు.. ఉద్యోగులను మనుషుల్లా చూడండి : ఇన్ఫోసిస్ నారాయణమూర్తి -
TCS చేతికి హ్యాపీ హోమ్స్.. రూ. 2,250 కోట్ల డీల్
దర్శితా సదరన్ ఇండియా హ్యాపీ హోమ్స్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) వెల్లడించింది. ఈ డీల్ విలువ రూ. 2,250 కోట్లు. ఒప్పందంలో భాగంగా దర్శితాకు చెందిన స్థలం, భవంతి టీసీఎస్‌కు దక్కనున్నాయి. వీటిని తమ డెలివరీ సెంటర్ కోసం కంపెనీ ఉపయోగించుకోనుంది.‘2004లో ఏర్పాటైన దర్శితా సదరన్ ఇండియా హ్యాపీ హోమ్స్.. కమర్షియల్ ప్రాపర్టీని అభివృద్ధి చేయడం, పరిశ్రమలకు లీజుకివ్వడం తదితర కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ ప్రాపర్టీ ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నందున, ఆదాయ ఉత్పత్తి ఇంకా ప్రారంభం కాలేదు. అందువల్ల గత మూడు సంవత్సరాల టర్నోవర్ శూన్యం" అని రెగ్యులేటరీ ఫైలింగ్ లో కంపెనీ పేర్కొంది. రెండేళ్ల తర్వాత సంస్థలో 100 శాతం ఈక్విటీ షేర్లను టీసీఎస్ కొనుగోలు చేసే అవకాశం ఉంది.టాటా రియాల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌కు చెందిన రెండు అనుబంధ సంస్థలైన టీఆర్ఐఎల్ బెంగళూరు రియల్ ఎస్టేట్ ఫైవ్ లిమిటెడ్, టీఆర్ఐఎల్ బెంగళూరు రియల్ ఎస్టేట్ సిక్స్ లిమిటెడ్‌లను రూ.1,625 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు ఈ ఏడాది జనవరిలో టీసీఎస్ ప్రకటించింది. ఈ ఒప్పందం 2025 జనవరి చివరి నాటికి ముగిసింది. -
ఫ్రెషర్లకు డిమాండ్: ఐటీలో నియామకాలు డబుల్
గతకొన్ని నెలలుగా దిగ్గజ ఐటీ కంపెనీలు సైతం.. కొత్త ఉద్యోగులను నియమించుకోకపోవడం మాత్రమే కాకుండా, ఉన్న వారిని కూడా ఉద్యోగాల్లో నుంచి తీసేస్తోంది. అయితే త్వరలోనే ఐటీ రంగం పుంజుకుంటుందని.. ఉద్యోగ నియామకాలు కూడా భారీగా ఉంటాయని రిక్రూటింగ్ సంస్థ టీమ్‌లీజ్ తన నివేదికలో వెల్లడించింది.2026 ఆర్థిక సంవత్సరంలో టెక్నాలజీ సేవల రంగంలో ఫ్రెషర్ల నియామకం దాదాపు రెట్టింపు అవుతుందని, గత సంవత్సరంతో పోలిస్తే నియామకాలు 1,50,000 కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా. టీమ్‌లీజ్ డేటా ప్రకారం, మార్చి 2025 నాటికి దాదాపు 85,000 - 95,000 మంది ఫ్రెషర్ల నియమాలకు జరుగుతాయి.అన్ఎర్త్ఇన్సైట్ పరిశోధన ప్రకారం.. యాక్సెంచర్, క్యాప్‌జెమిని, కాగ్నిజెంట్ వంటి ప్రపంచ ఐటీ సేవల సంస్థలు కొత్తగా 1.6 లక్షల నుంచి 1.8 లక్షల ఉద్యోగాలను కల్పించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలలో పెరుగుతున్న డిమాండ్ కారణంగా కొత్త ఉద్యోగాల సంఖ్య కూడా పెరుగుతుంది.ఇదీ చదవండి: నెలకు 10 రోజులు.. టెక్ కంపెనీ కొత్త రూల్! 2024 ప్రారంభం నుంచి కూడా చాలా కంపెనీలు.. తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తూ వచ్చాయి. కాబట్టి కొత్త నియమాల విషయం కొంత ఆలోచించి, ప్రస్తుత టెక్నాలజీకు అవసరమైన నైపుణ్యం ఉన్నవారికి ఉద్యోగావకాశాలు ఇచ్చే అవకాశం ఉంది. ఇండియన్, మల్టి నేషనల్ కంపెనీలు రెండూ కూడా కొత్తవారి నియామకాలను చేపట్టనున్నాయి. అయితే కొత్త నైపుణ్యాలను నేర్చుకున్న.. ఫ్రెషర్లకు ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయని టీమ్‌లీజ్ సర్వేలో వెల్లడైంది. -
ఇన్ఫీ వర్క్ ఫ్రమ్ హోమ్: కొత్త రూల్‌పై క్లారిటీ
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) ఇటీవల వర్క్ ఫ్రమ్ హోమ్(work from home ).. ఆఫీస్ హాజరుకు (Return to office) సంబంధించిన కొత్త రూల్ జారీ చేసింది. తమ ఉద్యోగులు నెలలో కనీసం 10 రోజులు ఆఫీసుకు హాజరుకావాలని కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చిన నేపథ్యంలో అదనపు వర్క్ ఫ్రమ్ హోమ్ రోజులు అవసరమయ్యే ఉద్యోగులు గందరగోళంలో ఉన్నారు. దీనికి సంబంధించి ఇన్ఫోసిస్ స్పష్టత ఇచ్చింది.ఉద్యోగుల్లో గందరగోళంఒక ఉద్యోగి నెలలో కనీసం 10 రోజులు ఆఫీసు నుండి పనిచేయకపోతే "సిస్టమ్ ఇంటర్వెన్షన్"కు దారితీస్తుందని కంపెనీ ప్రకటించింది. అయితే ఈ పదం వాడకం ఉద్యోగుల్లో ఆందోళనకు దారితీసింది. ఏదైనా అత్యవసర కారణం లేదా ఉన్నతాధికారుల అనుమతితో వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుంటే, అది యాప్‌లో నమోదు కాకపోతే తమ సెలవు కోతకు గురవుతుందని ఉద్యోగులు ఆందోళన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎంప్లాయీ యాప్ పై స్పష్టత వచ్చింది.మేనేజర్ అప్రూవల్ తప్పనిసరి ఇన్ఫోసిస్ ఉద్యోగులు తమ హాజరును యాప్‌లో నమోదు చేస్తారు. వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) రిక్వెస్ట్‌లను ఈ యాప్ ఇకపై నేరుగా ఆమోదించదు. ఉద్యోగులు తప్పనిసరిగా తమ కార్యాలయంలో నెలకు 10 రోజులు హాజరు పంచ్ చేయాల్సి ఉంటుందని ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ను ఉటంకిస్తూ ఎకనమిక్స్ టైమ్స్ కథనంలో పేర్కొంది.ఒక నెలలో అందుబాటులో ఉన్న మొత్తం వర్క్ ఫ్రమ్ హోమ్ రోజుల సంఖ్య, ఇప్పటికే ఉపయోగించిన రోజులు, అందుబాటులో ఉన్న రోజులను యాప్ చూపిస్తుంది. అదనపు డబ్ల్యూఎఫ్‌హెచ్ రోజులను మినహాయింపుగా చూపిస్తామని, వాటిని క్రమబద్ధీకరించడానికి ఉద్యోగి తన మేనేజర్‌కు అప్రూవల్ రిక్వెస్ట్‌ను సమర్పించాల్సి ఉంటుందని యాప్‌లో అప్డేట్ చెబుతోంది.దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ సంస్థ అయిన ఇన్ఫోసిస్‌లో ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ కంపెనీలో సుమారు 3,23,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అదనపు వర్క్ ఫ్రమ్ హోమ్ రిక్వెస్ట్‌ను ఆమోదించే లేదా తిరస్కరించే విచక్షణను మేనేజర్లకు ఇవ్వడంపైనా ఉద్యోగులు ఆందోళన వెలిబుచ్చుతున్నారు.అమల్లోకి కొత్త హైబ్రిడ్ విధానంఇన్ఫోసిస్ కొత్త హైబ్రిడ్ విధానం మార్చి 10 నుంచి అమల్లోకి వచ్చింది. వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం దరఖాస్తు చేసుకునే రోజుల సంఖ్యను పరిమితం చేస్తున్నట్లు, నెలలో కనీసం 10 రోజులు లేదా వ్యాపార అవసరాలకు అనుగుణంగా ఆఫీసు నుండి పనిచేయాలని కంపెనీ ఫంక్షనల్ హెడ్స్ గత వారం ఒక ఇ-మెయిల్లో ఉద్యోగులకు తెలియజేశారు. ఈ కమ్యూనికేషన్ జాబ్ లెవల్ 5 (JL5) అంతకంటే తక్కువ స్థాయి ఉద్యోగులకు వర్తిస్తుంది. -
ఐటీలో మారిన పరిస్థితులు: తగ్గిన బెంచ్ టైమ్..
ఐటీ కంపెనీలు ఎప్పటికప్పుడు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ.. ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవడానికి కూడా ప్రయత్నించేవి. అయితే ఇప్పుడు ఐటీ రంగంలో కీలక మార్పులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే.. పలు టెక్ కంపెనీలు బెంచ్ టైమ్, నెంబర్ తగ్గిస్తున్నట్లు వెల్లడించాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఐటీ కంపెనీలలో ప్రాజెక్టులు కేటాయించని ఉద్యోగులను 'బెంచింగ్' అంటారు. వీరిని సంస్థలు బ్యాకప్ మాదిరిగా ఉపయోగించుకుంటాయి. వీరు ఎక్కువ రోజులు బెంచింగ్ మీద ఉంటే.. వారు లేఆఫ్స్‌కు దగ్గర ఉన్నట్లు. నిజానికి కొత్తగా ఉద్యోగంలో చేరినవారిని కొంతకాలం బెంచ్‌పై కూర్చోబెడతారు. కొన్ని సార్లు అనుభవజ్ఞులైన ఉద్యోగులు కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది.ఏడాదిన్నర కాలంగా బెంచ్ సమయం మారుతోంది. 2020-21 ఆర్ధిక సంవత్సరంలో బెంచ్ టైమ్ 45 నుంచి 60 రోజులు ఉండేది. దీనిని ప్రస్తుతం 35 నుంచి 45 రోజులకు తగ్గించారు. దీంతో బెంచ్‌పై ఉన్న ఉద్యోగుల సంఖ్య, సమయం రెండూ తగ్గాయి. ఇది ఐటీ ఉద్యోగులకు పెద్ద ఊరట అనే చెప్పాలి.భారతదేశంలో ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, అసెంచర్, హెచ్‌సీఎల్ వంటి దిగ్గజ కంపెనీలు.. బెంచ్‌పై ఉన్న ఉద్యోగుల సంఖ్యను, బెంచ్‌పై ఉండే సమయాన్ని తగ్గించాయి. దీనికి కారణం గత కొన్ని రోజులుగా కొత్త ఉద్యోగులను తీసుకోకపోవడమే అని తెలుస్తోంది. కరోనా తరువాత లెక్కకు మించిన ప్రాజెక్టులు లభిస్తున్నాయి. దీంతో ఐటీ కంపెనీలోని ఉద్యోగులకు చేతి నిండా పని దొరుకుతోంది. కొన్ని కంపెనీలు ఉద్యోగ నియామకాలను కూడా చేపట్టాయి.ఇదీ చదవండి: మీడియా దిగ్గజం కీలక నిర్ణయం.. 1100 మందిపై వేటు..రెండేళ్లకు ముందు బెంచ్ ఉద్యోగులు 10 నుంచి 15 శాతం ఉండేది. ఇప్పుడు ఈ శాతం 2 నుంచి 5 శాతానికి చేరింది. ఒకప్పుడు ఫ్రెషర్స్ మాత్రమే బెంచ్‌పై ఉండేవాళ్ళు. ఇప్పుడు కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్‌కి సంబంధించిన ప్రత్యేక నైపుణ్యాలకు డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్ల.. ప్రస్తుతం, తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాల అనుభవం ఉన్న ఉద్యోగులు కూడా బెంచ్ లేఆఫ్‌ల ప్రమాదంలో ఉన్నారు. వీరందరూ కొత్త టెక్నాలజీలను తప్పకుండా నేర్చుకోవాల్సిందే. లేకుంటే ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుంది. -
ఈసారి బ్యాడ్ న్యూస్ కాగ్నిజెంట్ ఉద్యోగులకు..
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఇటీవల వేతన పెంపును 5-8 శాతం మధ్య ప్రకటించి ఉద్యోగులను నిరాశ పరిచింది. టీఈఎస్‌లో కూడా శాలరీ హైక్ శాతం సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతుందన్న నివేదికలు వచ్చాయి. తాజగా మరో మల్టీ నేషనల్ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ కూడా ఉద్యోగులకు బ్యాడ్ న్యూసే చెప్పింది.వేతన పెంపు వాయిదాఇటీవల జరిగిన టౌన్ హాల్ సమావేశంలో కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ ఎస్ ఉద్యోగులనుద్దేశించి మాట్లడుతూ బోనస్ లు, జీతాల పెంపు ఆలస్యంతో సహా కంపెనీ వేతన పెంపు ప్రణాళికలపై అప్ డేట్స్ ఇచ్చారు. ఏప్రిల్ లో అమలు జరగాల్సిన జీతాల పెంపును ఆగస్టుకు వాయిదా వేయడంపై ఉద్యోగుల్లో నెలకొన్న అసంతృప్తిని అంగీకరించారు. అయితే వాగ్దానం చేసిన పెంపుదలను గౌరవించడానికి కంపెనీ కట్టుబడి ఉందని ఆయన ఉద్యోగులకు హామీ ఇచ్చారు. కంపెనీ ఆర్థిక లక్ష్యాలు, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా జాప్యం ఒక వ్యూహాత్మక నిర్ణయం అని పేర్కొన్నారు.వేతన ప్రణాళికలుబోనస్ స్ట్రక్చర్ గురించి కూడా కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ చర్చించారు. అర్హత కలిగిన ఉద్యోగులు తమ బోనస్ లను ప్రణాళిక ప్రకారం పొందుతారని ధృవీకరించారు. ఇంటర్నల్ మెమో ప్రకారం మార్చి 10లోగా ఉద్యోగులు తమ బోనస్ లకు సంబంధించిన ఈ లెటర్లను ఆశించవచ్చు. పనితీరును ప్రతిఫలించడం, పోటీ వేతన ప్యాకేజీలను నిర్వహించడంలో కంపెనీ నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు.విస్తృత ఆర్థిక నేపథ్యంఅనిశ్చిత స్థూల ఆర్థిక పరిస్థితులు ఐటీ పరిశ్రమను ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో వేతనాల పెంపులో జాప్యం జరుగుతోంది. ఈ సవాళ్లను నావిగేట్ చేస్తూ ఆపరేటింగ్ మార్జిన్లను పెంచడం, ఆఫీస్ స్పేస్‌ను ఆప్టిమైజ్ చేసుకోవడంపై కాగ్నిజెంట్ దృష్టి సారించింది. ప్రతిభను నిలుపుకోవడం, మార్కెట్లో పోటీగా నిలవడం అనే ఉద్దేశంతో కంపెనీ ఈ ప్రయత్నాలను బ్యాలెన్స్ చేస్తోంది.ఉద్యోగుల ప్రతిస్పందనవేతనాల పెంపు ఆలస్యం గురించి ముందుగానే ప్రస్తావించడం ఉద్యోగుల్లో మిశ్రమ స్పందనకు దారితీసింది. కొంతమంది దీనిని అట్రిషన్ తగ్గించడానికి మనోధైర్యాన్ని పెంచే చర్యగా భావిస్తుండగా మరికొందరు అదనపు ఒత్తిడి, వారి ఆర్థిక ప్రణాళికపై పడనున్న ప్రభావం గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ అనిశ్చితి ఉన్నప్పటికీ పారదర్శకత, ఉద్యోగులకు విలువ ఉండేలా చూడటం పట్ల రవికుమార్ నిబద్ధత సానుకూల పరిణామమని నిపుణులు సూచిస్తున్నారు. -
ఐటీ కంపెనీ కొత్త రూల్.. పరీక్ష పాసైతేనే జీతం పెంపు
ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల వేతన పెంపులు (Salary Hikes) క్లిష్టంగా మారుతున్నాయి. ఒక్కో సంస్థ ఒక్కో నిబంధనను తెస్తున్నాయి. తాజాగా ఎల్టీఐ మైండ్‌ట్రీ (LTIMindtree) సంస్థ కొత్త సామర్థ్య ఆధారిత మదింపు వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా మేనేజర్ స్థాయి ఉద్యోగుల వేతన పెంపును సామర్థ్య పరీక్ష ఉత్తీర్ణతకు లింక్ చేసింది. కంపెనీ వార్షిక అప్రైజల్ కసరత్తులో భాగమైన ఈ చొరవ లక్ష్యం మేనేజర్లు తమ పాత్రలలో రాణించడానికి అవసరమైన నైపుణ్యాలు, పరిజ్ఞానాన్ని కలిగి ఉండేలా చేయడమే.కాంపిటెన్సీ టెస్ట్మిడిల్, సీనియర్ లెవల్ మేనేజర్లకు తప్పనిసరిగా నిర్వహించే ఈ కాంపిటెన్సీ టెస్ట్‌లో కోడింగ్, మ్యాథమెటిక్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ సహా పలు నైపుణ్యాలను అంచనా వేస్తారు. బృందాలకు నాయకత్వం వహించడానికి, సంస్థ ఎదుగుదలను నడిపించడానికి అవసరమైన సాంకేతిక, నిర్వహణ సామర్థ్యాలను అంచనా వేయడానికి ఈ పరీక్ష రూపొందించారు. నాలుగు సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం ఉన్న టీమ్ లీడ్ లు, లీడ్ ఆర్కిటెక్ట్ లను కలిగి ఉన్న పీ3, పీ4, పీ5 బ్యాండ్ ల్లోని మేనేజర్ లు వేతన పెంపునకు అర్హత పొందడానికి ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.చొరవ వెనుక హేతుబద్ధతశరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ పరిశ్రమలో పోటీతత్వంతో ఉండాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సామర్థ్య ఆధారిత అప్రైజల్ వ్యవస్థను అమలు చేయాలని ఎల్టీఐ మైండ్‌ట్రీ కంపెనీ నిర్ణయం తీసుకుంది. సామర్థ్య పరీక్ష ఉత్తీర్ణతను వేతన పెంపునకు అనుసంధానించడం ద్వారా, కంపెనీ తన మేనేజర్లకు తాజా నైపుణ్యాలు, పరిజ్ఞానం ఉందని నిర్ధారించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విధానం శ్రామిక శక్తి మొత్తం సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా నిరంతర అభ్యాసం, అభివృద్ధికి కంపెనీ నిబద్ధతకు అనుగుణంగా ఉంటుంది.పరిశ్రమ ప్రభావంఎల్టీఐమైండ్ట్రీ తీసుకున్న ఈ నిర్ణయం బహుశా భారత ఐటీ పరిశ్రమలో ఇదే మొదటిది కావచ్చు. పనితీరు మదింపులలో నైపుణ్యాల ఆధారిత మదింపుల ప్రాముఖ్యతను హైలైట్ చేస్తూ, ఇతర కంపెనీలు అనుసరించడానికి ఇది ఒక ఉదాహరణను ఏర్పరుస్తుంది. వేతన పెంపునకు సామర్థ్య పరీక్షను తీసుకురావడం మెరిటోక్రసీపై కంపెనీ దృష్టిని, అత్యుత్తమ సంస్కృతిని పెంపొందించే వైఖరిని తెలియజేస్తోంది.ఇది చదివారా? ఇన్ఫోసిస్ లేఆఫ్‌లలో మరో ట్విస్ట్..ఉద్యోగుల రియాక్షన్ఎల్టీఐమైండ్ట్రీ తీసుకొచ్చిన కొత్త అప్రైజల్ వ్యవస్థపై ఉద్యోగుల నుంచి మిశ్రమ ప్రతిస్పందనలు వ్యక్తమవుతున్నాయి. అయితే నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడంక, సామర్థ్యాలను ప్రదర్శించే అవకాశాన్ని కల్పించడాన్ని కొంత మంది ఉద్యోగులు అభినందిస్తున్నారు. అదనపు ఒత్తిడి, వేతనాల పెంపుపై ప్రభావం పడుతుందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరీక్ష నిష్పాక్షికంగా ఉండేలా రూపొందించామని, అందుకు వారు సిద్ధం కావడానికి తగిన సహకారం, వనరులను అందిస్తామని ఎల్‌టీఐమైండ్‌ట్రీ తమ ఉద్యోగులకు హామీ ఇచ్చింది. -
ఇన్ఫోసిస్ లేఆఫ్‌లలో మరో ట్విస్ట్..
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) లేఆఫ్‌లలో మరో పరిణామం చోటుచేసుకుంది. బలవంతపు తొలగింపులపై ఇన్ఫోసిస్ ట్రైనీలు ప్రధానమంత్రి కార్యాలయం (PMO) తలుపులు తట్టారు. ఇన్ఫోసిస్ తమను అన్యాయంగా తొలగించిందని (Layoffs), తిరిగి విధుల్లోకి తీసుకుని భవిష్యత్తులో ఇలాంటి తొలగింపులు జరగకుండా చూడాలని కోరుతూ 100 మందికి పైగా బాధితులు పీఎంవోకి ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది.ఈ ఫిర్యాదుల నేపథ్యంలో ఇన్ఫోసిస్ లో సామూహిక తొలగింపులపై జోక్యం చేసుకోవాలని రాష్ట్ర అధికారులను కోరుతూ కర్ణాటక లేబర్ కమిషనర్ కు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ రెండో నోటీసు పంపింది. పీఎంవోకు పలు ఫిర్యాదులు అందాయని, కార్మిక చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, దీనిపై విచారణ జరపాలని రాష్ట్ర కార్మిక అధికారులను కోరింది. అలాగే బాధితుల పక్షాన పోరాడుతున్న ఐటీ ఉద్యోగుల సంఘం నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (ఎన్ఐటీఈఎస్)కు సమాచారం అందించింది.700 మంది తొలగింపుగత రెండున్నరేళ్లలో క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా నియమించుకున్న సుమారు 700 మంది ట్రైనీలను ఇన్ఫోసిస్ ఫిబ్రవరి 7న తొలగించింది. వీరు 2023 అక్టోబర్‌లోనే విధుల్లోకి చేరారు. అంతర్గత మదింపు కార్యక్రమంలో బాధిత ఉద్యోగులు విఫలమయ్యారని పేర్కొంటూ ఇన్ఫోసిస్ తొలగింపులను సమర్థించుకుంది. వీరిలో పనితీరు సంబంధిత సమస్యల కారణంగా 350 మంది ఉద్యోగులు మాత్రమే రాజీనామా చేశారని కంపెనీ పేర్కొంది. తొలగించిన ఉద్యోగులు అంతర్గత మదింపుల పారదర్శకతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఊహించని విధంగా పరీక్షల్లో క్లిష్టత స్థాయిని పెంచారని, దీంతో ఉత్తీర్ణత సాధించడం కష్టంగా మారిందని బాధితులు ఆరోపిస్తున్నారు.ఇన్ఫోసిస్ స్పందనఈ ఫిర్యాదులపై స్పందించిన ఇన్ఫోసిస్ తన వైఖరిని వివరిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. తమ టెస్టింగ్ ప్రక్రియలను మూల్యాంకన విధాన పత్రంలో పొందుపరిచామని, ట్రైనీలందరికీ ముందస్తుగా తెలియజేశామని తెలిపింది. ఇన్ఫోసిస్ లో చేరే ప్రతి ట్రైనీ కంపెనీలో తమ అప్రెంటిస్ షిప్ ను అంగీకరిస్తూ రిజిస్ట్రేషన్ ఫారమ్ నింపుతారని గుర్తు చేసింది. శిక్షణ ఖర్చును పూర్తిగా ఇన్ఫోసిస్ భరిస్తోందని పేర్కొంది. -
హైదరాబాద్‌లో హెచ్‌సీఎల్ టెక్ మరో జీడీసీ..
ప్రముఖ ఐటీ సంస్థ హెచ్‌సీఎల్ టెక్ (HCLTech) హైదరాబాద్‌లో మరో గ్లోబల్ డెలివరీ సెంటర్‌ను (GDC) తెరిచింది. హైటెక్ సిటీలో ఏర్పాటైన ఈ గ్లోబల్ డెలివరీ సెంటర్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. నగరంలో హెచ్‌సీఎల్ టెక్ సంస్థకు ఇది ఐదో గ్లోబల్ డెలివరీ సెంటర్. ఈ అత్యాధునిక కేంద్రంలో 5,000 మంది ఉద్యోగులు పని చేసుకునేందుకు వెసులుబాటు ఉంది.హైదరాబాద్‌లో హెచ్‌సీఎల్ టెక్ తాజాగా ఏర్పాటు చేసిన గ్లోబల్ డెలివరీ సెంటర్ 3,20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇది ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుండి గోల్డ్ సర్టిఫికేషన్ పొందింది. ఈ కేంద్రం ద్వారా 5,000 ఉద్యోగాలు లభిస్తాయని, ప్రముఖ టెక్ గమ్యస్థానంగా హైదరాబాద్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని అంచనా.2007 నుండి హెచ్‌సీఎల్ టెక్ సంస్థకు హైదరాబాద్ వ్యూహాత్మక ప్రదేశంగా ఉంది. నగరంలో ఈ సంస్థకు 10,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. కొత్త కేంద్రం గ్లోబల్ కెపాసిటీ సెంటర్లకు మద్దతు ఇస్తుంది. ఫైనాన్స్, మాన్యుఫాక్చరింగ్, హెల్త్‌కేర్ వంటి రంగాలలో అధునాతన పరిష్కారాలను అందిస్తుంది.గ్లోబల్ ఏఐ హబ్ గా తెలంగాణట్రిలియన్ డాలర్ల ఎకానమీగా, గ్లోబల్ ఏఐ హబ్ గా తెలంగాణ శరవేగంగా రూపాంతరం చెందుతోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కిల్డ్ వర్క్ ఫోర్స్ పట్ల రాష్ట్రానికి ఉన్న నిబద్ధతను ఆయన నొక్కి చెప్పారు. తెలంగాణ 2.0 గ్రోత్ విజన్ ద్వారా వృద్ధిని వేగవంతం చేయడానికి రాష్ట్రం కట్టుబడి ఉందని రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు పునరుద్ఘాటించారు.హెచ్ సీఎల్ టెక్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ సి.విజయకుమార్ కొత్త కేంద్రంపై హర్షం వ్యక్తం చేస్తూ.. ‘కృత్రిమ మేధ నేతృత్వంలోని సాంకేతిక పరిజ్ఞానంలో ఉత్తేజకరమైన దశలో మనం ఉన్నాం. మా క్లయింట్లకు ఈ పరిష్కారాలను అందించడానికి మా గ్లోబల్ నెట్‌వర్క్‌లో హైదరాబాద్ ఒక వ్యూహాత్మక స్థానం. ఇక్కడి గ్లోబల్ కెపాసిటీ సెంటర్ల పురోగతికి కృషి చేస్తాం’ అన్నారు. -
ఇన్ఫోసిస్ యూటర్న్..
ఉద్యోగుల తొలగింపులపై దేశీయ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ (Infosys) దూకుడు తగ్గించింది. ఉద్యోగులు నేర్చుకోవడానికి ఇంకా ఎక్కువ సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ తన రాబోయే ఉద్యోగుల మదింపులను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఈ నిర్ణయం సరికొత్త ఎత్తుగడ అని, ఇటీవలి తొలగింపుల (Layoff) నుండి దృష్టిని మరల్చడానికి కంపెనీ ప్రయత్నిస్తోందని ఎంప్లాయీ వెల్ఫేర్ గ్రూప్ నాజెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) ఆరోపించింది.తొలగింపుల నేపథ్యంఇన్ఫోసిస్ ఫిబ్రవరి 7న 700 మంది ఉద్యోగులను తొలగించింది. వీరిలో ప్రధానంగా 2022 ఇంజనీరింగ్ బ్యాచ్‌కు చెందిన ఫ్రెషర్స్ ఉన్నారు. వీరు ఇప్పటికే ఆన్‌బోర్డింగ్‌లో రెండు సంవత్సరాల ఆలస్యాన్ని ఎదుర్కొన్నారు. అంతర్గత మదింపుల ఆధారంగా ఈ తొలగింపులు జరిగినట్లు సమాచారం. అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడానికి సదరు ఉద్యోగులకు మూడు అవకాశాలు ఇచ్చినట్లు కంపెనీ చెబుతోంది. అయితే తొలగింపునకు గురైన ఉద్యోగులు దీనిని ఖండిస్తున్నారు. అసెస్ మెంట్ సిలబస్ ను మధ్యలోనే మార్చారని, ముందస్తు సమాచారం లేకుండానే చాలా మందికి తొలగింపు నోటీసులు వచ్చాయని ఆరోపిస్తున్నారు.ఎన్ఐటీఈఎస్ స్పందన..ఇన్ఫోసిస్ చర్యలను విమర్శిస్తూ, తొలగింపులు కార్మిక హక్కుల ఉల్లంఘనగా ఎన్ఐటీఈఎస్ అభివర్ణించింది.. తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరుతూ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. ఎన్ఐటీఈఎస్ అధ్యక్షుడు హర్‌ప్రీత్ సింగ్ సలూజా మాట్లాడుతూ, మదింపులను ఆలస్యం చేయాలని తీసుకున్న ఆకస్మిక నిర్ణయం తొలగింపులపై మరింత వివాదం కొనసాగకుండా కప్పిపుచ్చుకోవడానికేనని విమర్శించారు.ఇన్ఫోసిస్ సమర్థనఉద్యోగులకు అదనపు ప్రిపరేషన్ సమయాన్ని అందించడమే లక్ష్యంగా మదింపులను వాయిదా వేస్తున్నట్లు ఇన్ఫోసిస్ పేర్కొంది. కంపెనీ తమ అన్ని కార్యకలాపాలలో సమ్మతి, పారదర్శకతను పాటించడంలో తమ నిబద్ధతను నొక్కి చెప్పింది. ఇన్ఫోసిస్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ షాజీ మాథ్యూ మాట్లాడుతూ.. కంపెనీ కార్మిక శాఖతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని, వారి విచారణలకు సహకరిస్తూ అవసరమైన సమాచారాన్ని అందిస్తోందని తెలిపారు.ఉద్యోగులపై ప్రభావం..మదింపులను నిరవధికంగా వాయిదా వేయడం చాలా మంది ఉద్యోగులను వారి భవిష్యత్తుపై మరింత అనిశ్చితికి గురిచేసింది. ఆయా అంశాల్లో నిపుణులతో అదనపు శిక్షణ, ఇతర సహకారం అందిస్తామని కంపెనీ హామీ ఇచ్చినప్పటికీ, ఉద్యోగులకు మాత్రం ఆందోళన తొలగడం లేదు. ఉద్యోగుల తొలగింపు, మదింపుల వాయిదాతో తలెత్తిన వివాదం భారత ఐటీ రంగంలో ఉద్యోగ భద్రతపై దేశవ్యాప్తంగా చర్చలకు దారితీసింది. -
టీసీఎస్‌లో ఉద్యోగం ఇక మరింత కష్టం!
ప్రముఖ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తన ఉద్యోగులకు హాజరు నిబంధనలను కఠినతరం చేస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) విధానంలో మార్పులు ప్రకటించింది. నోయల్ టాటా నేతృత్వంలోని ఐటీ దిగ్గజం తీసుకున్న ఈ నిర్ణయం మరింత నిర్మాణాత్మక ఇన్-ఆఫీస్ వర్క్ మోడల్ వైపు మారడాన్ని సూచిస్తుంది. ఇప్పటికీ హైబ్రిడ్ వర్క్ విధానాన్ని కొన్ని కంపెనీ నుండి టీసీఎస్‌ను భిన్నంగా చేస్తుంది.డబ్ల్యూఎఫ్‌హెచ్ పాలసీలో కీలక మార్పులు ఇవే..ఉద్యోగులు ఇప్పుడు త్రైమాసికానికి ఆరు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకోవచ్చు. ఒక వేళ వీటిని ఉపయోగించని పక్షంలో తదుపరి త్రైమాసికానికి బదిలీ చేసుకోవచ్చు.స్థల పరిమితుల కారణంగా ఉద్యోగులు ఒకే ఎంట్రీలో 30 మినహాయింపు అభ్యర్థనలను సమర్పించవచ్చు. నెట్ వర్క్ సంబంధిత సమస్యలను ఒకేసారి ఐదు ఎంట్రీల వరకు లాగిన్ చేయవచ్చు. 10 రోజుల్లోగా సబ్మిట్ చేయని అభ్యర్థనలు స్వయంచాలకంగా తిరస్కరణరకు గురవుతాయి.చివరి రెండు పనిదినాల్లో మాత్రమే బ్యాక్ డేటెడ్ ఎంట్రీలకు అనుమతి ఉంటుంది. ప్రస్తుత నెలకు సంబంధించిన వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంట్రీలను వచ్చే నెల 5వ తేదీ వరకు పెంచుకోవచ్చు.రెండు, మూడు రోజులు ఆఫీసు హాజరును అనుమతించే ఇతర ఐటీ సంస్థల మాదిరిగా కాకుండా టీసీఎస్ ఐదు రోజుల అటెండెన్స్ విధానాన్ని అమలు చేసింది.ఉద్యోగులపై ప్రభావం..సవరించిన విధానం టీసీఎస్ ఉద్యోగులపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. కఠినమైన హాజరు నిబంధనలు, మరింత నిర్మాణాత్మక పని వాతావరణానికి సర్దుబాటు చేయాల్సి ఉంటుందని భావిస్తున్నారు. ఈ మార్పులు ఉత్పాదకతను పెంచడం, ఉద్యోగుల హాజరుపై మెరుగైన పర్యవేక్షణను నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, సహాయక, సానుకూల వర్క్ ప్లేస్ సంస్కృతిని సృష్టించడం ప్రాముఖ్యతను కూడా నొక్కి చెబుతున్నాయి.ఉద్యోగులు ప్రేరణ, నిమగ్నతతో కూడిన సానుకూల పని వాతావరణాన్ని పెంపొందించుకోవాల్సిన ఆవశ్యకతను టీసీఎస్ హెచ్ఆర్ హెడ్ మిలింద్ లక్కడ్ నొక్కి చెప్పారు. సహకార, మద్దతు సంస్కృతిని ప్రోత్సహించాలని, ఉద్యోగులు కలిసి పనిచేయడానికి ఉత్సాహం చూపేలా చూడాలని మేనేజర్లకు పంపిన కమ్యూనికేషన్ లో లక్కడ్ కోరారు. -
‘ఇన్ఫోసిస్ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది’
ఐటీ దిగ్గజాలు కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ మధ్య న్యాయ పోరాటం తీవ్రంగా మారింది. తమ హెల్త్‌కేర్ సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన వాణిజ్య రహస్యాలను ఇన్ఫోసిస్ దొంగిలించి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిందని కాగ్నిజెంట్ ఆరోపించింది. పోటీ ఉత్పత్తిని అభివృద్ధి చేయడానికి ఇన్ఫోసిస్ గోప్యమైన డేటాను దుర్వినియోగం చేసిందని, బహిర్గతం చేయని ఒప్పందాలను (NDAs) ఉల్లంఘించిందని కాగ్నిజెంట్ ఆరోపించింది .కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్‌ల మధ్య యూఎస్ కోర్టులో ఓ దావా నడుస్తోంది. తమ హెల్త్ కేర్ సాఫ్ట్వేర్ ట్రైజెట్టో వాణిజ్య రహస్యాలను ఇన్ఫోసిస్ దొంగిలించిందని ఆరోపిస్తూ కాగ్నిజెంట్ కేసు దాఖలు చేసిందని మింట్ నివేదిక తెలిపింది. "నాన్ డిస్క్లోజర్ అండ్ యాక్సెస్ అగ్రిమెంట్స్ (NDAAs) ద్వారా ఇన్ఫోసిస్ తమ ట్రైజెట్టో వాణిజ్య రహస్యాలను దుర్వినియోగం చేస్తూ ఇన్ఫోసిస్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది" అని 22 పేజీల కోర్టు ప్రతిస్పందనను ఉటంకిస్తూ నివేదిక పేర్కొంది.ఇదీ చదవండి: టీసీఎస్ వీసా ఫ్రాడ్ చేసింది.. మాజీ ఉద్యోగుల ఆరోపణలు తమ ట్రైజెట్టో సమాచారాన్ని ఉపయోగించారా లేదా అన్నది ఆడిట్ చేయడానికి ఇన్ఫోసిస్ నిరాకరించిందని, ఇది తన తప్పును రుజువు చేస్తుందని కాగ్నిజెంట్ వాదిస్తోంది. ఈ చట్టపరమైన వివాదం 2024 ఆగస్టు నాటిది. కాగ్నిజెంట్ మొదట డల్లాస్ కోర్టులో ఈ ప్రకటన చేసింది. గత జనవరి 9న దాఖలు చేసిన కేసులో ఈ ఆరోపణను ఇన్ఫోసిస్ తిరస్కరించింది, కాగ్నిజెంట్‌కు సంబంధించిన హెల్త్ కేర్ సొల్యూషన్స్ బహిరంగంగానే ఉన్నాయని, అందులో వాణిజ్య రహస్యాలు ఏమున్నాయో వారే చూసుకోవాలని కాగ్నిజెంట్‌కు సూచించాలని కోర్టును ఇన్ఫోసిస్ కోరింది.ఇన్ఫోసిస్ ప్రతి దావాఇన్ఫోసిస్ తరువాత కాగ్నిజెంట్ పై ప్రతి దావా వేసింది. దాని సీఈవో రవి కుమార్ ఇన్ఫోసిస్ లో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇన్ఫోసిస్ సొంత హెల్త్‌కేర్ సాఫ్ట్వేర్ ఉత్పత్తిని విడుదల చేయడాన్ని కావాలని ఆలస్యం చేశారని, కాగ్నిజెంట్‌లో ఉద్యోగం కోసం చర్చలు జరిపారని ప్రత్యారోపణలు చేసింది. రవి కుమార్ 2022 అక్టోబర్‌లో ఇన్ఫోసిస్‌ను వీడారు. ఆ తర్వాత ఏడాది అంటే 2023 జనవరిలో కాగ్నిజెంట్‌లో సీఈవోగా చేరారు. రెండు కంపెనీలు ఆరోగ్య సంరక్షణ సేవల రంగంలో పోటీ పడుతున్నాయి. ఇన్ఫోసిస్ ఆదాయంలో దాదాపు 7.5 శాతం లైఫ్ సైన్సెస్ రంగ క్లయింట్ల నుంచే పొందుతోంది. కాగ్నిజెంట్‌కు కూడా తమ క్లయింట్లలో దాదాపు మూడోవంతు హెల్త్ కేర్ నుంచే ఉన్నారు. -
వీసా ఫ్రాడ్.. టీసీఎస్‌పై తీవ్ర ఆరోపణలు
దేశంలో అతిపెద్ద ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) వీసా మోసం (Visa fraud) ఆరోపణలను ఎదుర్కొంటున్నట్లు సమాచారం. అమెరికా కార్మిక చట్టాలను పక్కదారి పట్టించేందుకు కంపెనీ ప్రత్యేక వర్క్ వీసాలను దుర్వినియోగం చేసిందని విజిల్బ్లోయర్లు ఆరోపిస్తున్నారు. ఫ్రంట్‌లైన్ కార్మికులను అమెరికాకు తీసుకురావడానికి వారిని మేనేజర్లుగా ముద్ర వేసి ఎల్-1ఏ మేనేజర్ వీసాలను దుర్వినియోగం చేసిందని వ్యాజ్యాలతోపాటు బ్లూమ్‌బెర్గ్ న్యూస్ ఇన్వెస్టిగేషన్‌లోనూ ఆరోపించారు.2017లో డోనాల్డ్ ట్రంప్ పరిపాలన ఎంప్లాయిమెంట్ వీసాలపై దృష్టి సారించినప్పుడు, కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు అంతర్గత సంస్థాగత చార్ట్‌లను తప్పుగా రూపొందించాలని తనకు సూచించారని డెన్వర్‌లో టీసీఎస్‌కు ఐటీ మేనేజర్‌గా పనిచేసిన అనిల్ కిని ఆరోపించారని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ఫెడరల్ పరిశీలనను తప్పించుకోవడానికి ఫ్రంట్‌లైన్ ఉద్యోగులను మేనేజర్లుగా తప్పుగా చూపించడమే దీని ఉద్దేశమని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.అనిల్ కిని, మరో ఇద్దరు మాజీ టీసీఎస్ ఉద్యోగులతో కలిసి ఫెడరల్ ఫాల్స్ క్లెయిమ్స్ యాక్ట్ కింద దావాలు దాఖలు చేశారని, కంపెనీ ఎల్-1ఏ వీసా వ్యవస్థను దుర్వనియోగం చేస్తోందని ఆరోపించారని నివేదిక పేర్కొంది. మేనేజర్ స్థాయి అధికారుల బదిలీల కోసం ఉద్దేశించిన ఈ వీసాలు, కఠినమైన వేతనం, విద్యా అవసరాలు కలిగిన హెచ్-1బీ నైపుణ్యం కలిగిన కార్మిక వీసాల కంటే తక్కువ నియంత్రణలు కలిగి ఉంటాయి. అనిల్ కిని దావాను ఈ సంవత్సరం ప్రారంభంలో కొట్టివేసినప్పటికీ ఆయన ఈ నిర్ణయాన్ని అప్పీల్ చేశాడని నివేదిక వివరించింది.ఇదీ చదవండి: టీసీఎస్ కొత్త డీల్.. ఫిన్లాండ్ కంపెనీతో..2019 అక్టోబర్, 2023 సెప్టెంబర్ మధ్య యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) 90,000 కంటే ఎక్కువ ఎల్-1ఏ వీసాలను ఆమోదించింది. వీటిని ప్రధానంగా ఐటీ అవుట్సోర్సింగ్ సంస్థలు యూఎస్ కంపెనీలకు సమాచార సాంకేతిక పనులను నిర్వహించడానికి ఉపయోగించాయి. వీటిలో 6,500 కంటే ఎక్కువ ఎల్-1ఏ వీసాలతో టీసీఎస్ అగ్రస్థానంలో ఉంది. తరువాతి ఏడు అతిపెద్ద గ్రహీతలు కలిపి పొందిన ఎల్-1ఏ వీసాల కంటే టీసీఎస్ ఒక్కటే పొందిన ఎల్-1ఏ వీసాల సంఖ్య అధికం.ఖండించిన టీసీఎస్ తమపై వచ్చిన ఆరోపణలను టీసీఎస్ తీవ్రంగా ఖండించింది. "కొనసాగుతున్న వ్యాజ్యాలపై టీసీఎస్ వ్యాఖ్యానించదు. అయితే కొంతమంది మాజీ ఉద్యోగుల ఈ తప్పుడు ఆరోపణలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. వీటిని గతంలో అనేక కోర్టులు, ట్రిబ్యునళ్లు తోసిపుచ్చాయి. టీసీఎస్ అన్ని యూఎస్ చట్టాలకు కట్టుబడి ఉంటుంది" అని కంపెనీ ప్రతినిధి ఒకరు చెప్పినట్లు వార్తా సంస్థ పేర్కొం -
తెలంగాణలో మాజిల్లానిక్ క్లౌడ్ విస్తరణ
హైదరాబాద్: అగ్రగామి టెక్నాలజీ ఆవిష్కర్త మాజిల్లానిక్ క్లౌడ్ లిమిటెడ్ ఇటీవల నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీలో (ఎన్ఎస్ఈ) లిస్టయిన నేపథ్యంలో తదుపరి దశ వృద్ధిని వేగవంతంగా సాధించడంపై దృష్టి పెడుతోంది. ఒకవైపు గణనీయంగా ఉద్యోగావకాశాలు కల్పిస్తూనే మరోవైపు ఏఐ ఆధారిత పరివర్తనపై మరింతగా దృష్టి సారిస్తూ ఈ-సర్వైలెన్స్, స్కానలిటిక్స్ లాంటి వీడియో అనలిటిక్స్ సొల్యూషన్స్, డీప్-టెక్ సొల్యూషన్స్ మొదలైన వాటిల్లో కార్యకలాపాలను విస్తరిస్తోంది.అధునాతన డ్రోన్ టెక్నాలజీలో అగ్రగామిగా తన స్థానాన్ని పటిష్టం చేసుకుంటూ, మాజిల్లానిక్ క్లౌడ్ సంస్థ దేశీయంగా 200 కేజీల పేలోడ్‌ను మోసుకెళ్లగలిగే, వాణిజ్యావసరాలకు అందుబాటులో ఉన్న, అత్యంత శక్తిమంతమైన కార్గో డ్రోన్ అయిన కార్గోమ్యాక్స్ 200KHCని (CargoMax 200KHC) కూడా ఆవిష్కరించింది. బీఎఫ్ఎస్ఐ, టెలికం, ఆటోమోటివ్, హెల్త్‌కేర్ తదితర రంగాల కోసం కస్టమైజ్ చేసిన మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, జెన్ ఏఐ లాంటి అధునాతన కృత్రిమ మేథ సాంకేతికతల ద్వారా లభించే అవకాశాలు ఈ మార్గదర్శ ప్రణాళికకు కీలకంగా ఉండనున్నాయి. ఇటు ఆర్గానిక్గాను అటు వ్యూహాత్మక కొనుగోళ్ల ద్వారా ఇనార్గనిక్గాను వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేలా మాజిల్లానిక్ క్లౌడ్ దృష్టి పెడుతోంది.“సెక్యూరిటీ భవిష్యత్తనేది ఏఐ, సర్వైలెన్స్ కలబోతపై ఆధారపడి ఉంది. తెలంగాణలోని మా కార్యాలయాలు, ముడి డేటాను ఇటు పబ్లిక్ అటు ప్రైవేట్ రంగ క్లయింట్లు తగు నిర్ణయాలు తీసుకోవడంలో తోడ్పడే మేథోసంపత్తిగా తీర్చిదిద్దే, అధునాతన వీడియో అనలిటిక్స్ సిస్టంలను అభివృద్ధి చేసే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా దోహదపడతాయి” అని మాజిల్లానిక్ క్లౌడ్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, గ్లోబల్ సీఈవో జోసెఫ్ సుధీర్ తుమ్మ తెలిపారు.“తెలంగాణ పురోగామి విధానాలు, ప్రతిభావంతుల లభ్యత కారణంగా మా కార్యకలాపాల విస్తరణకు ఇది అనువైన ప్రాంతంగా ఉంది. మేము స్థానికంగా అభివృద్ధికి దోహదపడుతూనే అటు అంతర్జాతీయ క్లయింట్లకు కూడా సేవలు అందించేందుకు మాకు తోడ్పడుతోంది” అని జోసెఫ్ సుధీర్ తుమ్మ వివరించారు. -
టీసీఎస్ కొత్త డీల్.. ఫిన్లాండ్ కంపెనీతో..
సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) ఫిన్లాండ్ సంస్థ యూపీఎమ్ (UPM)తో ఐటీ ట్రాన్స్ఫార్మేషన్ సేవలందించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. రీసైక్లబుల్ ప్రొడక్టులను రూపొందించడంలో ప్రత్యేకత కలిగిన యూపీఎమ్ పునరుత్పాదక ఇంధన మెటీరియల్స్‌ను ముడిసరుకులుగా వినియోగిస్తోంది.11 దేశాలలో కార్యకలాపాలు విస్తరించిన కంపెనీ 10.3 బిలియన్ యూరోల టర్నోవర్‌ను కలిగి ఉంది. యూపీఎమ్ వృద్ధికి డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ సహకరించనున్నట్లు ఒప్పందం సందర్భంగా టీసీఎస్ పేర్కొంది. తద్వారా ఏఐ ఫస్ట్ ఆపరేటింగ్ మోడల్‌ను అందిపుచ్చుకోనున్నట్లు తెలియజేసింది. అయితే ఒప్పందం(కాంట్రాక్ట్) విలువను వెల్లడించలేదు.ఇది చదివారా? ఐటీ కంపెనీల్లో శాలరీ హైక్.. ఈసారి అంచనాలు ఇవే..యూపీఎమ్ ఎంటర్ప్రైజ్ ఐటీ వేల్యూ చైన్‌ను పటిష్టపరిచే బాటలో ఏఐ ఆధారిత అటానమస్ ఎంటర్ప్రైజ్ ప్లాట్‌ఫామ్ ఇగ్నియోను వినియోగించనున్నట్లు టీసీఎస్ వెల్లడించింది. అంతేకాకుండా యూపీఎమ్‌కు చెందిన 15,800 మంది ఉద్యోగులు, మెషీన్ల మధ్య మరింత భాగస్వామ్యానికి ఏఐ ద్వారా మద్దతివ్వనుంది.టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) క్యూ3 ఫలితాల్లో అదరగొట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 31తో ముగిసిన మూడో త్రైమాసికంలో రూ.12,380 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీకి రూ.11058 కోట్ల నికర లాభం రాగా ఈసారి 12 శాతం మేర పెరిగడం గమనార్హం. అలాగే సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో కంపెనీ రూ.11,909 కోట్ల నికర లాభం నమోదు చేసింది. టీసీఎస్ మొత్తం ఆదాయం 5.6 శాతం పెరిగి రూ.63,973 కోట్లకు చేరింది. -
ఐటీ కంపెనీల్లో శాలరీ హైక్.. ఈసారి అంచనాలు ఇవే..
ఓ వైపు ఉద్యోగుల తొలగింపు రేట్లు పెరుగుతున్నప్పటికీ భారతీయ ఐటీ పరిశ్రమ జీతాల పెంపు (Salary hike) విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. టీసీఎస్ (TCS), ఇన్ఫోసిస్ (Infosys), విప్రో (Wipro), హెచ్‌సీఎల్ టెక్ (HCLTech) వంటి అగ్ర సంస్థలు 2025 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో (Q3 FY25) అధిక టర్నోవర్‌ను నివేదించాయి. అయినప్పటికీ ఈ ఏడాది జీతాల పెంపుదల 3% నుండి 6% స్థాయిలోనే ఉంటుందని హెచ్ఆర్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ఇచ్చే శాలరీ హైక్ డిమాండ్ ఆధారిత పెరుగుదల కాదని, ప్రపంచ అనిశ్చితులకు అనుగుణంగా రంగాల వ్యాప్త సర్దుబాటు అని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు . ఈ సంవత్సరానికి ఐటీ ఉద్యోగుల తొలగింపు (అట్రిషన్) రేటు 12-13% వరకు ఉంటుందని అంచనా. కానీ జీతాల పెరుగుదల మాత్రం అంతంతమాత్రంగానే ఉండనుంది. అధిక పనితీరు కనబరిచేవారికి మాత్రం కాస్తంత మెరుగైన వేతన పెంపు లభించే అవకాశం ఉంది.ఏ కంపెనీలో ఏంటి పరిస్థితి?దేశంలో అతిపెద్ద ఐటీ సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అప్రైజల్ సైకిల్‌ను ఇప్పటికే ప్రారంభించింది. ఇప్పటికీ పద్ధతి ప్రకారం నిర్ధిష్ట కాల వ్యవధిలో అప్రైజల్ ప్రక్రియను అమలు చేస్తున్న అతి కొద్ది కంపెనీలలో టీసీఎల్ కూడా ఒకటి. 2025లో ఉద్యోగులకు సగటున 7-8 శాతం జీతాల పెంపును కంపెనీ ప్రకటించిందిఇక ఇన్ఫోసిస్ విషయానికొస్తే 2025 ఆర్థిక సంవత్సరానికి జీతాల పెంపుదల రెండు దశల్లో జరిగింది. జూనియర్ ఉద్యోగులు జనవరిలో వేతన పెంపు అందుకోగా మిగిలిన వారికి ఏప్రిల్‌లో జీతాల పెంపుదల అందుతుంది. దేశంలో పనిచేస్తున్న తమ ఉద్యోగులకు జీతాల పెంపుదల 6-8 శాతం పరిధిలో ఉంటుందని ఇన్ఫోసిస్ సీఎఫ్ఓ ఇప్పటికే సంకేతాలిచ్చారు.మరోవైపు విప్రో, హెచ్‌సీఎల్‌టెక్.. ఈ రెండు కంపెనీలు అధిక అట్రిషన్ రేట్లను నివేదించాయి. అయినప్పటికీ వేతన పెంపుదలలో ఆలోచించి అడుగులు వేస్తున్నాయి. స్థిర పెంపుదల కంటే వేరియబుల్ పే సర్దుబాట్లపైనే ఇవి దృష్టి సారించినట్లు తెలుస్తోంది.ఐటీ పరిశ్రమలో అప్రైజల్ సైకిల్ సాధారణంగా ఏప్రిల్ - జూన్ మధ్య కాలంలో ఉంటుంది. కానీ ఖర్చులను తగ్గించుకునేందుకు చాలా కంపెనీలు అప్రైజల్ సైకిల్‌ను ఏప్రిల్-జూన్ మధ్య కాలం నుండి క్యూ3 (సెప్టెంబర్-అక్టోబర్) కు వాయిదా వేశాయి. -
ఐటీ కంపెనీ బంపరాఫర్: ఉద్యోగులకు రూ.14.5 కోట్ల బోనస్
దేశంలోని చాలా దిగ్గజ కంపెనీలు భారీ లాభాలను పొందినప్పటికీ.. ఉద్యోగులను తొలగించడం, జీతాలు పెంచకపోవడం వంటివి చేస్తుంటాయి. ఇలాంటి ఘటనలు గతంలో కోకొల్లలు. అయితే తాజాగా కోయంబత్తూరుకు చెందిన ఓ కంపెనీ మాత్రం తన ఉద్యోగులకు ఏకంగా రూ.14.5 కోట్ల బోనస్ ప్రకటించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.కోయంబత్తూరుకు చెందిన 'కోవై.కో' అనే కంపెనీ.. సంస్థలో మూడేళ్ళుగా పనిచేస్తున్న 140 మంది ఉద్యోగులకు 'టుగెదర్ వి గ్రో' చొరవ కింద రూ.14.5 కోట్లు విరాళం ప్రకటించింది. ఈ బోనస్‌ను డిసెంబర్ 31, 2022 నాటికి కంపెనీలో మూడు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన వారికి పంపిణీ చేయనున్నట్లు సమాచారం.మూడేళ్లు పూర్తి చేసిన ఉద్యోగులు వారి వార్షిక జీతంలో 50% బోనస్ పొందుతారు. ఇది వారి కృషి, అంకితభావానికి నిదర్శనం. ఇప్పటికే మొదటి దశలో 80 మందికి పైగా ఉద్యోగులు ఇప్పటికే వారి జనవరి జీత చెల్లింపులలో భాగంగా బోనస్‌లను అందుకున్నారు.కంపెనీ వృద్ధికి, విజయానికి సహాయపడే ఉద్యోగులకు.. సంస్థ పొందిన లాభాలలో వాటా ఇవ్వడం నా కల. అందుకే ఉద్యోగులకు బోనస్‌లు ఇస్తున్నట్లు కోవై.కో వ్యవస్థాపకుడు.. సీఈఓ శరవణ కుమార్ అన్నారు. 2023లో కంపెనీ గణనీయమైన లాభాలను ఆర్జించింది. బెంగళూరుకు చెందిన ఫ్లోయిక్ను కొనుగోలు చేసిన తరువాత సంస్థ వేగంగా అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు.ఇదీ చదవండి: ముంబైలో ఆఫీస్ కొన్న సన్నీ లియోన్.. ఎన్ని కొట్లో తెలుసా?ఉద్యోగులకు షేర్ రూపంలో ఇవ్వడం కంటే.. నగదు రూపంలో డబ్బు ఇవ్వడం వల్ల వారి ప్రయోజనాలను ఉపయోగపడుతుంది. బ్యాంక్ లోన్స్ చెల్లించడానికి లేదా ఇతర అవసరాలకు ఈ డబ్బు ఉపయోగపడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకునే బోనస్‌ను నగదు రూపంలో ఇవ్వాలని నిర్ణయించినట్లు శరవణ కుమార్ పేర్కొన్నారు. కంపెనీ తాము ఊహించినదానికంటే ఎక్కువ బోనస్ ఇచ్చినందులు ఉద్యోగుల ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. -
మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగుల తొలగింపు
ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్.. (Microsoft layoffs) మెరుగైన పనితీరు ప్రదర్శించని ఉద్యోగులపై తొలగింపు వేటు వేసింది. బిజినెస్ ఇన్సైడర్ పత్రికలో పేర్కొన్న కథనం ప్రకారం.. మైక్రోసాఫ్ట్ యూఎస్‌లో కొందరు ఉద్యోగులను వారి పనితీరు ఆధారంగా తొలగించడం ప్రారంభించింది.తాజాగా తొలగింపులకు గురైన ఉద్యోగులకు మెడికల్, ప్రిస్క్రిప్షన్, డెంటల్ హెల్త్‌కేర్ ప్రయోజనాలు తక్షణమే ముగుస్తాయని కంపెనీ తొలగింపు లేఖల్లో పేర్కొన్నట్లుగా ఇన్సైడర్ కథనంలో ఉదహరించింది. ముగ్గురు ఉద్యోగులకైతే తొలగింపు పరిహారాన్ని కూడా చెల్లించలేదని పేర్కొంది."మీ పనితీరు కనీస ప్రమాణాలను, అంచనాలను అందుకోలేకపోవడమే మీ తొలగింపునకు కారణం" అని తొలగింపు లేఖల్లో కంపెనీ పేర్కొంది. "మీరు తక్షణమే అన్ని విధుల నుండి వైదొలుగుతున్నారు. మైక్రోసాఫ్ట్ సిస్టమ్‌లు, ఖాతాలు, కార్యాలయాలకు యాక్సెస్‌ను ఈరోజు నుంచే తొగిస్తున్నాం. ఇక మైక్రోసాఫ్ట్ తరఫున మీరు ఇటువంటి పని చేయలేరు" అని వివరించింది.ఇది చదివారా? ఉద్యోగులకు మరో షాకిచ్చిన టీసీఎస్..ఇక తొలగింపునకు గురైన ఉద్యోగి భవిష్యత్తులో మైక్రోసాఫ్ట్‌లో మరో కొత్త ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నప్పుడు కంపెనీలో సదరు ఉద్యోగి గత పనితీరు, తొలగింపునకు గురైన అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని కూడా ఆ లేఖల్లో పేర్కొన్నారు.గతేడాది జూన్ చివరి నాటికి మైక్రోసాఫ్ట్ సంస్థలో దాదాపు 2,28,000 మంది ఫుల్ టైమ్ ఉద్యోగులు ఉన్నారు. ఇవే కాదు.. మైక్రోసాఫ్ట్ ఇటీవల సెక్యూరిటీ, ఎక్స్పీరియన్స్ అండ్ డివైజెస్, సేల్స్, గేమింగ్‌లో విభాగాల్లోనూ పలువురు ఉద్యోగులను తొలగించింది. అయితే తొలగింపులు స్వల్ప స్థాయిలోనే ఉండటం, సమీప కాలంలోనే వీటిని భర్తీ చేయనుండటంతో మొత్తంగా కంపెనీ హెడ్‌కౌంట్‌లో పెద్దగా తగ్గింపు ఉండకపోవచ్చు.భారత్‌లో 2587 మంది టెకీలు2024 ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో మొదటి ఐదు భారతీయ ఐటీ సంస్థల్లో నికరంగా 2,587 మంది ఉద్యోగులు తగ్గారు. (Job cuts) గత త్రైమాసికంతో పోలిస్తే ఇది పూర్తిగా విరుద్ధం. సెప్టెంబర్ త్రైమాసికంలో 15,033 మంది ఉద్యోగులు పెరిగారు. గడచిన మూడు నెలల కాలంలో ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌టెక్ 7,725 మంది ఉద్యోగులను పెంచుకోగా, టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా కంపెనీలు మాత్రం ఉద్యోగులను తగ్గించాయి. -
బీటెక్ జోరు.. ఎంటెక్ బేజారు!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా బీటెక్‌కు ఆదరణ పెరుగుతుంటే, మరోవైపు ఎంటెక్‌లో మాత్రం ప్రవేశాలు గణనీయంగా తగ్గుతున్నాయి. సత్వర ఉపాధి, వీలైతే అమెరికా లాంటి దేశాల్లో ఎమ్మెస్ లక్ష్యంతో బీటెక్‌లో చేరుతున్న విద్యార్థులు.. పై చదువు విషయంలో నిరాసక్తత ప్రదర్శిస్తున్నారు. దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్న ధోరణితో పాటు, పలు మాస్టర్ డిగ్రీ కాలేజీల్లో అవసరమైన మౌలిక వసతులు, సరైన బోధన సిబ్బంది ఉండక పోవడం కూడా ఇందుకు కారణమవుతోందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇంజనీరింగ్‌లో పీహెచ్డీ చేయాలన్నా ఎంటెక్‌తో పనిలేకపోవడం కూడా ప్రవేశాలు తగ్గడానికి మరో కారణమని విశ్లేషిస్తున్నారు.మరోవైపు సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఎంటెక్కు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. దీనివల్ల విద్యార్థుల్లో అదనంగా ఉండే నైపుణ్యం కూడా అంతగా ఏమీ ఉండదని సంస్థలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సాంకేతిక విద్యలో గ్రాడ్యుయేషన్ తర్వాత యువత ఉపాధి వైపు మళ్లిపోతున్నారు. అనేకమంది ఎంఎస్ కోసం విదేశాలకు వెళ్తున్నారు. బీటెక్ చేసిన వారిలో కనీసం 10 శాతం కూడా ఎంటెక్ వైపు వెళ్లడం లేదని ఏఐసీటీఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఏదీ కుదరని పక్షంలో ఎంటెక్‌లో చేరే విద్యార్థులు అత్యాధునిక సాంకేతిక కోర్సుల వైపు మొగ్గు చూపుతున్నారు. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. తగ్గిన సీట్లు.. ప్రవేశాలుఅఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఎంటెక్ ప్రవేశాలపై ఇటీవల పూర్తిస్థాయి సమాచారం వెల్లడించింది. ఎంటెక్ కోర్సుల్లో ప్రవేశాలు ఏడేళ్ల కనిష్టానికి పతనమైనట్టు పేర్కొంది. ఏడేళ్ల క్రితం దేశవ్యాప్తంగా ఎంటెక్ కోర్సుల్లో 68,677 మంది చేరితే, గత మూడు విద్యా సంవత్సరాల్లోనూ ఈ సంఖ్య దాదాపుగా 45 వేలు మాత్రమే కావడం గమనార్హం. ఈ మేరకు అందుబాటులో ఉన్న ఎంటెక్ సీట్ల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతూ వస్తోంది. 2017–18లో దేశవ్యాప్తంగా 1.85 లక్షల సీట్లు ఉంటే, 2024–25 నాటికి 1.24 లక్షలకు తగ్గాయి. ఇక రాష్ట్రంలో 2019–20 విద్యా సంవత్సరంలో 12,892 మంది ఎంటెక్‌లో చేరితే 2023–24 నాటికి ఆ సంఖ్య ఏకంగా 5,271కి దిగజారిపోవడం గమనార్హం.బీటెక్‌లో భిన్న పరిస్థితి బీటెక్ విషయంలో దేశవ్యాప్తంగా ఎంటెక్కు భిన్నమైన పరిస్థితి కన్పిస్తోంది. 2017–18లో 14.75 లక్షల సీట్లుంటే, 7.50 లక్షల మంది విద్యార్థులు చేరారు. 2023–24లో సీట్ల సంఖ్య 13.49 లక్షలకు తగ్గినా..విద్యార్థుల చేరిక మాత్రం గణనీయంగా పెరిగి 11.21 లక్షలకు చేరింది. దాదాపు 58% విద్యార్థులు కంప్యూటర్ సైన్స్, ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్ వంటి కోర్సుల్లోనే చేరుతున్నారు. గ్రాడ్యుయేషన్ తర్వాత సత్వర ఉపాధి, విదేశాల్లో ఎమ్మెస్ తదితర కారణాలతోనే బీటెక్‌లో ప్రవేశాలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.ఎంటెక్తోనూ మంచి భవిష్యత్తు వాస్తవానికి ఎంటెక్‌లో కొన్ని బ్రాంచీలకు భవిష్యత్తులో మంచి డిమాండ్ ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఎంటెక్ కంప్యూటర్ సైన్స్, సంబంధిత కొత్త బ్రాంచీల్లో ఉత్తీర్ణులైన వారికి ఇంజనీరింగ్ కాలేజీల్లో బోధించే అర్హత లభిస్తుంది. బీటెక్‌లో ప్రవేశాలు గణనీయంగా పెరుగుతున్న విషయం విదితమే కాగా అందుకు అనుగుణంగా అధ్యాపకుల అవసరం కూడా ఏర్పడుతోంది. తెలంగాణ వ్యాప్తంగా 1.35 లక్షల బీటెక్ సీట్లున్నాయి. ఇందులో సీఎస్ఈ, ఐటీ, సంబంధిత సీట్లే 68 వేల వరకు ఉన్నాయి.ఈ పరిస్థితుల్లో కంప్యూటర్ సైన్స్ సంబంధిత పాఠ్యాంశాలను బోధించే అధ్యాపకులకు డిమాండ్ పెరుగుతోంది. ఎంటెక్ సీఎస్ఈ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్ లాంటి స్పెషలైజేషన్ ఉంటే మంచి వేతనాలు లభించే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఏఐసీటీఈ లెక్కల ప్రకారం ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు అవసరం. దీన్నిబట్టి కీలకమైన బ్రాంచీలను పరిగణనలోకి తీసుకున్నా తెలంగాణలోని 68 వేల సీట్లకు గాను 3,400 మంది అధ్యాపకుల అవసరం ఉందని విశ్లేషిస్తున్నారు.అదనంగా వచ్చేదేమీ ఉండటం లేదు సీఎస్సీ బీటెక్ తర్వాత ఐటీ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఐటీ రంగంలో చేరిన తర్వాత స్వతహాగా పరిజ్ఞానం ఉంటేనే పురోగతి సాధ్యం. ఒకవేళ రెండేళ్ల పాటు ఎంటెక్ చేసి వచ్చినా ప్యాకేజీలో పెద్దగా మార్పు ఉండదు. బీటెక్ ఫ్రెషర్స్‌కు ఇచ్చే వేతనమే అప్పుడూ ఉంటుంది. అలాంటప్పుడు ఎంటెక్ వల్ల ప్రయోజనం ఏమిటి? – నీలేశ్ పుల్లెల ఐటీ ఉద్యోగిఅర్హత కాదు.. నైపుణ్యమే ముఖ్యంఐటీ రంగంలో ఉన్నతమైన అర్హత కన్నా అభ్యర్థి నైపుణ్యానికి పెద్దపీట ఉంటుంది. బీటెక్ తర్వాత పలు రౌండ్ల ఇంటర్వ్యూల్లో కంపెనీలు విద్యార్థి నైపుణ్యాన్ని అంచనా వేస్తాయి. నైపుణ్యంతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ పరిగణనలోకి తీసుకుని ఉద్యోగాలిస్తాయి. ఈ కారణంగానే ఎక్కువ మంది బీటెక్ తర్వాత ఐటీ రంగంలోకి వస్తున్నారు. – రాహుల్ సౌరభ్ ఐటీ కంపెనీ హెచ్ఆర్ విభాగం ఉద్యోగి -
ఐటీ కంపెనీల్లో ఇదీ పరిస్థితి: ఇన్ఫోసిస్ మాజీ ఉద్యోగి పోస్ట్ వైరల్
వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి సర్వత్రా చర్చ జరుగుతున్న తరుణంలో.. ఇన్ఫోసిస్ (Infosys) మాజీ ఉద్యోగి వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఇందులో ఇన్ఫోసిస్ కంపెనీకి, ఇతర పెద్ద టెక్ సంస్థలకు.. పని సంస్కృతిలో, ఇతర విషయాలలో ఉన్న తేడాను వివరించారు. ఐటీ కార్పొరేట్ సంస్కృతి నిలువు దోపిడీ అంటూ అభివర్ణించాడు.న్యాయమైన పరిహారం అందేలా, కార్మిక విధానాలను సంస్కరించాలని చెబుతూ.. నా 9 సంవత్సరాల అనుభవం అనే శీర్షికతో, తన వ్యక్తిగత ప్రయాణంలో ముఖ్యమైన విషయాలను షేర్ చేశారు.నేను 2008లో ఇన్ఫోసిస్‌లో ఫ్రెషర్‌గా నా ప్రయాణాన్ని ప్రారంభించాను. 2017లో సంస్థను విడిచి మరో కంపెనీలో చేరాను. ఇన్ఫోసిస్ నుంచి బయటకు వచ్చేటప్పుడు నా జీతం రూ. 35,000 మాత్రమే. నేను ఇప్పుడు రూ. 1.7 లక్షలు సంపాదిస్తున్నాను. అంటే ఇన్ఫోసిస్ జీతానికి 400 శాతం ఎక్కువని చెప్పాడు.ఇన్ఫోసిస్‌లో.. ఉద్యోగి రవాణా కోసం నెలకు రూ. 3,200 చెల్లించాల్సి వచ్చేది. కానీ ప్రస్తుత కంపెనీలో అది పూర్తిగా ఉచితం. అంతే కాకుండా నేను ప్రస్తుతం పనిచేస్తున్న కంపెనీలో వెహికల్ పార్కింగ్ ఉచితం. అయితే ఇన్ఫోసిస్ తమ ఉద్యోగుల నుంచి వారి వాహనాల పార్కింగ్ కోసం కూడా డబ్బు వసూలు చేసిందని ఆయన ఆరోపించాడు.ప్రస్తుతం నేను పనిచేస్తున్న కంపెనీలో ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ ధర రూ. 15 నుంచి రూ. 20 మాత్రమే. కానీ ఇన్ఫోసిస్‌లో దీని విలువ రూ. 40.ఇన్ఫోసిస్ పురోగతి వ్యవస్థను అనుసరించింది. ఇందులో ఉద్యోగులకు పదోన్నట్లు ఉంటాయి. కానీ జీతాల పెరుగుదల లేదా బాధ్యతలలో ఎటువంటి మార్పు లేదు. ప్రస్తుత సంస్థలో పదోన్నతులతో పాటు ఉద్యోగులకు నిజమైన బాధ్యతలను అందిస్తూ.. 15-25 శాతం జీతాల పెరుగుదల అందిస్తుంది.ఇన్ఫోసిస్‌లో 9 సంవత్సరాలు పనిచేసిన తర్వాత కూడా.. నేను సింగిల్ డిజిట్ వార్షిక పెంపుదల (Single-Digit Salary Hikes) అందుకున్నాను. ఈ కారణంగా నా జీతం రూ. 35000 వద్దనే ఉండేది. ఇప్పుడు ఆలోచిస్తుంటే.. చాలా సమయం వృధా చేసినట్లు అర్థమవుతుందని అన్నాడు.ఇదీ చదవండి: మొన్న టీసీఎస్.. నేడు విప్రో: ఫ్రెషర్లకు పండగే..ఇన్ఫోసిస్.. ఉద్యోగుల సంక్షేమం గురించి పట్టించుకోవడం లేదు. కానీ తన స్వచ్ఛంద సేవా కార్యక్రమాల గురించి తరచుగా మాట్లాడుతుందని ఆయన ఆరోపించారు. ఉద్యోగి శ్రామికశక్తికి మెరుగైన జీతాలు, సంక్షేమం ద్వారా ఉదారతను చూపించాలని వాదించాడు. ఉద్యోగ భద్రత అనేది ఒక అపోహ మాత్రమే. ఇన్ఫోసిస్‌లో ఉద్యోగ భద్రత (Job Security) ఎక్కువగా ఉందని ఆయన నొక్కి చెప్పారు.Infosys - My 9 years experience of 'unchained' slavery byu/GoatTop607 inbangalore -
ఇన్ఫీ మూర్తి కుటుంబ సంపదలో రూ.1900 కోట్లు ఆవిరి!
ప్రముఖ దేశీయ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ (Infosys) వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి (NR Narayana Murthy) కుటుంబం సంపద ఒక్క రోజులో రూ.1900 కోట్లు ఆవిరైంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)లో శుక్రవారం (జనవరి 17) నాడు ఇన్ఫోసిస్ షేర్లు దాదాపు 6 శాతం నష్టపోయి రూ. 1,812.70 వద్ద ముగిశాయి. ఈ భారీ తగ్గుదలతో మూర్తి కుటుంబం నెట్‌వర్త్‌లో దాదాపు రూ. 1,900 కోట్లు తుడిచిపెట్టుకుపోయాయి. అమ్మకాల నేపథ్యంలో ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.7.54 లక్షల కోట్లకు పడిపోయింది.4.02 శాతం వాటాసెప్టెంబర్ త్రైమాసికం నాటికి కంపెనీలో సమిష్టిగా 4.02 శాతం వాటాను నారాయణ మూర్తి కుటుంబం కలిగి ఉంది. ఇందులో మూర్తి 0.40 శాతం వాటాను కలిగి ఉండగా, ఆయన సతీమణి సుధా మూర్తికి 0.92 శాతం, వారి కుమారుడు రోహన్ మూర్తికి 1.62 శాతం వాటా ఉంది. ఇక వారి కుమార్తె, యూకే (UK) మాజీ ప్రధాన మంత్రి రిషి సునక్ భార్య అక్షతా మూర్తి 1.04 శాతం, నారాయణ మూర్తి మనవడు ఏకగ్రహ రోహన్ మూర్తి 0.04 శాతం వాటాను కలిగి ఉన్నారు. శుక్రవారం నాటి క్షీణత తర్వాత కంపెనీలో మూర్తి కుటుంబం హోల్డింగ్‌ల విలువ రూ. 30,334 కోట్లుగా ఉంది. ఇది గురువారం నాటి రూ. 32,236 కోట్లతో పోలిస్తే గణనీయమైన నష్టాన్ని ప్రతిబింబిస్తోంది.లాభాలు బాగున్నా..ఇన్ఫోసిస్ బలమైన త్రైమాసిక ఆదాయాలను ప్రకటించిన తర్వాత మార్కెట్ కల్లోలం ఏర్పడింది. దేశంలో రెండవ అతిపెద్ద ఐటీ సేవల ఎగుమతిదారు అయిన ఇన్ఫోసిస్ డిసెంబర్ త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం సంవత్సరానికి (YoY) 11 శాతం వృద్ధిని నమోదు చేసి మొత్తం రూ.6,806 కోట్లకు చేరింది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 8 శాతం పెరిగి రూ.41,764 కోట్లకు చేరుకుంది. ఇదే క్రమంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి కంపెనీ తన ఆదాయ వృద్ధి అంచనాను 4.5-5 శాతానికి సవరించింది. ఇది దాని వ్యాపార పథంలో విశ్వాసాన్ని సూచిస్తోంది.ఇదీ చదవండి: విప్రో జూమ్.. టెక్ మహీంద్రా హైజంప్!బలమైన ఫండమెంటల్స్ ఉన్నప్పటికీ, స్టాక్ క్షీణత విస్తృత పరిశ్రమ సవాళ్లు, మార్కెట్ సెంటిమెంట్‌పై పెట్టుబడిదారుల ఆందోళనలను తెలియజేస్తోంది. 1,812.70గా ఉన్న స్టాక్ విలువ ఐటీ రంగంలో రానున్న ఎదురుగాలి గురించిన భయాందోళనలను ప్రతిబింబిస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇన్ఫోసిస్‌లో మూర్తి కుటుంబానికి ఉన్న ముఖ్యమైన వాటా కంపెనీ వారసత్వంలో వారి కీలక పాత్రను తెలియజేస్తోంది. ఐటీ రంగంలోని కీలక పరిణామాలు, ఇన్ఫోసిస్ దీర్ఘకాలిక వృద్ధి పథాన్ని అంచనా వేయడానికి డీల్ పైప్‌లైన్‌ను నిశితంగా పర్యవేక్షించాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. -
విప్రో జూమ్.. టెక్ మహీంద్రా హైజంప్!
ఐటీ దిగ్గజం విప్రో (Wipro) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు (Q3 Results) సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 24% జంప్‌చేసి రూ. 3,354 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం మాత్రం నామమాత్రంగా 0.5% పుంజుకుని రూ. 22,319 కోట్లకు చేరింది.క్యూ4లో ఐటీ సర్వీసుల ఆదాయం 260.2–265.5 కోట్ల డాలర్ల శ్రేణిలో నమోదుకాగలదని (గైడెన్స్) తాజాగా ప్రకటించింది. వెరసి ఆదాయ వృద్ధిని మైనస్ 1% నుంచి +1% మధ్య అంచనా వేసింది. వాటాదారులకు ఒక్కో షేరుకి రూ. 6 చొప్పున మధ్యంతర డివిడెండ్ చెల్లింపునకు కంపెనీ బోర్డు అనుమతించింది. మూడేళ్లపాటు లాభాల్లో 70%వరకూ వాటాదారులకు చెల్లించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.బిలియన్ డాలర్లు: తాజా సమీక్షా కాలంలో 17 భారీ డీల్స్ ద్వారా బిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్లను అందుకున్నట్లు విప్రో వెల్లడించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2025–26)లో కొత్తగా 10,000–12,000 మంది ఫ్రెషర్స్‌కు ఉపాధి కల్పించనున్నట్లు తెలియజేసింది. క్యూ3లో నికరంగా 1,157మంది ఉద్యోగులు తగ్గడంతో మొత్తం సిబ్బంది సంఖ్య 2,32,732కు చేరింది.టెక్ మహీంద్రాఐటీ సొల్యూషన్ల కంపెనీ టెక్ మహీంద్రా (Tech Mahindra) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 93 శాతం దూసుకెళ్లి రూ. 983 కోట్లను తాకింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో ప్రతికూలతల కారణంగా కేవలం రూ. 510 కోట్లు ఆర్జించింది. అయితే ఈ ఏడాది క్యూ2లో సాధించిన రూ. 1,250 కోట్లతో పోలిస్తే నికర లాభం తగ్గింది.ఇదీ చదవండి: ఉద్యోగులకు మరో షాకిచ్చిన టీసీఎస్..కాగా.. మొత్తం ఆదాయం నామమాత్రంగా 1 శాతమే పుంజుకుని రూ. 13,286 కోట్లకు చేరింది. నిర్వహణ లాభ మార్జిన్లు 5.4 శాతం నుంచి 10.2 శాతానికి మెరుగుపడ్డాయి. అయితే రెండేళ్లలో ఇవి 15 శాతానికి బలపడగలవని కంపెనీ సీఈవో, ఎండీ మోహిత్ జోషీ పేర్కొన్నారు. ఈ కాలంలో ప్రధానంగా టెలికం, తయారీ రంగాల నుంచి74.5 కోట్ల డాలర్ల విలువైన ఆర్డర్లు అందుకున్నట్లు సీఎఫ్‌వో రోహిత్ ఆనంద్ వెల్లడించారు. -
ఉద్యోగులకు మరో షాకిచ్చిన టీసీఎస్..
ప్రముఖ దేశీయ ఐటీ దిగ్గజం (IT Company) టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఉద్యోగులకు మరో షాకిచ్చింది. ఇప్పటికే వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని (WFH) పూర్తిగా తొలగించి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ విధానాన్ని అమలు చేస్తున్న టీసీఎస్ అందులోనూ కీలక మార్పులు చేసింది.ఆఫీస్ హాజరు మినహాయింపుల కోసం అభ్యర్థనలకు సంబంధించి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ (WFO) విధానాన్ని టీసీఎస్ తాజాగా సవరించింది. కార్యాలయ హాజరు అవసరాలను కఠినతరం చేసింది. కంపెనీ తన భారతీయ సిబ్బందికి చేసిన ప్రకటన ప్రకారం.. ఆఫీస్ హాజరు మినహాయింపు కోసం ఉద్యోగులు ఒక త్రైమాసికంలో గరిష్టంగా ఆరు రోజులు వ్యక్తిగత అత్యవసర పరిస్థితులను కారణంగా పేర్కొనవచ్చు. ఒక వేళ ఈ మినహాయింపులను వాడుకోలేకపోయినా తరువాత త్రైమాసికానికి బదిలీ చేసుకునే వెసులుబాటు కూడా ఉండదు.ఎంట్రీల్లోనూ పరిమితులుఇక ఒక ఎంట్రీలో గరిష్టంగా 30 మినహాయింపులను సమర్పించడానికి ఉద్యోగులకు అవకాశం ఉంటుంది. నెట్‌వర్క్‌కు సంబంధించిన సమస్యలైతే ఒకేసారికి ఐదు ఎంట్రీలు నివేదించవచ్చు. 10 రోజులలోపు పూర్తి చేయని మినహాయింపు అభ్యర్థనలు వాటంతటవే రిజెక్ట్ అవుతాయి. ఆలస్యంగా చేసే సమర్పణలకు సంబంధించి ప్రస్తుత తేదీ నుండి మునుపటి రెండు తేదీల వరకు మాత్రమే బ్యాక్‌డేటెడ్ ఎంట్రీకి అనుమతి ఉంటుంది. అలాగే ప్రస్తుత నెలలో డబ్ల్యూఎఫ్‌వో ఎంట్రీ కేటగిరీ లేకపోతే తదుపరి నెల 5వ తేదీ వరకు దాన్ని నివేదించవచ్చని కంపెనీ నోట్ పేర్కొంది.కార్యాలయ హాజరు ఆదేశం నుండి మినహాయింపులను అభ్యర్థించడానికి లార్జ్ స్కేల్ అప్లోడ్లు లేదా బ్యాకెండ్ ఎంట్రీలను టీసీఎస్ నిషేధించింది. ఐదు రోజుల వర్క్‌వీక్ హాజరు విధానాన్ని అవలంబించడంలో కొన్ని ఇతర భారతీయ ఐటీ సంస్థలతో పాటు టీసీఎస్ ముందంజ వేసింది. ఇతర సంస్థలు వారానికి రెండు నుండి మూడు రోజుల పాటు కార్యాలయంలో హాజరును తప్పనిసరి చేశాయి. హాజరు సమ్మతితో వేరియబుల్ పేని ముడిపెట్టాయి.ఇదీ చదవండి: ఇన్ఫోసిస్ జీతాల పెంపు.. ఎంత పెరుగుతాయంటే..ఉద్యోగులు స్థిరత్వం సాధించిన తర్వాత ఈ విధానాన్ని నిలిపివేసే అవకాశం ఉందని టీసీఎస్ హెచ్ఆర్ హెడ్ మిలింద్ లక్కాడ్ చెప్పినట్లుగా టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. త్రైమాసిక ఫలితాలు ప్రకటించిన తర్వాత లక్కడ్ మాట్లాడుతూ ఎంట్రీ-లెవల్ ఉద్యోగులు పూర్తి వేరియబుల్ వేతనాన్ని పొందేందుకు అర్హులని, మిడ్, సీనియర్ లెవల్ సిబ్బంది వేరియబుల్ వేతనం వారి పనితీరుపై ఆధారపడి ఉంటుందని వివరించారు.40,000 మంది నియామకంటీసీఎస్ ఈ ఏడాది 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని యోచిస్తున్నట్లు ఐటీ దిగ్గజం చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ (CHRO) మిలింద్ లక్కడ్ వెల్లడించారు. అయితే 2024-25 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఉద్యోగుల సంఖ్య 5,000 మంది తగ్గినట్లు టీసీఎస్ తెలిపింది. 2024-25 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఉద్యోగుల సంఖ్య తగ్గినప్పటికీ.. ఫ్రెషర్లకు ఉద్యోగా అవకాశాలు కల్పించడానికి కట్టుబడి ఉన్నామని ఓ ఇంటర్వ్యూలో మిలింద్ లక్కడ్ స్పష్టం చేశారు.టీసీఎస్ సంస్థలో ఉద్యోగం పొందాలంటే.. కేవలం కోడింగ్ నైపుణ్యాలు ఉంటే సరిపోదని.. అభ్యర్థులకు తగిన విద్యార్హతలు కూడా ఉండాలని లక్కడ్ వెల్లడించారు. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలు పోవని స్పష్టం చేశారు. ఏఐ వల్ల ఉద్యోగుల సామర్థ్యం మెరుగుపడుతుందని తెలిపారు. మనిషి ఆలోచనా శక్తికి ఉన్న ప్రాధాన్యత ఎప్పటికీ తగ్గే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు. ఎందుకంటే క్లయింట్లను నేరుగా సంప్రదించాల్సిన విభాగాలలో.. ఇతర అవసరమైన విభాగాల్లో మానవ వనరుల ప్రాధాన్యత తప్పకుండా ఉంటుందని మిలింద్ లక్కడ్ పేర్కొన్నారు. -
ఇన్ఫోసిస్ జీతాల పెంపు.. ఎంత పెరుగుతాయంటే..
జీతాల పెంపు గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ఇన్ఫోసిస్ (Infosys) కీలక విషయం తెలిపింది. దేశీయ ఐటీ సేవల దిగ్గజం (IT Company) భారత్‌లో పనిచేస్తున్న తమ ఉద్యోగులకు 6-8 శాతం వార్షిక జీతాల పెంపును ఈ ఏడాది జనవరి నుండి ప్రారంభించనుంది. ఇది దాని ప్రణాళికాబద్ధమైన వేతన సవరణలలో మొదటి దశ. రెండవది వచ్చే ఏప్రిల్ నెలలో ప్రారంభమవుతుంది."భారత్‌లో కాంప్ (వార్షిక వేతనాల పెంపు) 6-8% ఉంటుందని ఆశిస్తున్నాం. విదేశీ కాంప్‌లు మునుపటి కాంప్ సమీక్షలకు అనుగుణంగా ఉంటాయి" అని ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జయేష్ సంఘ్రాజ్కా డిసెంబర్‌తో ముగిసిన మూడవ త్రైమాసిక ఫలితాల (Q3FY25) వెల్లడి సందర్భంగా మీడియాతో అన్నారు.బెంగళూరుకు చెందిన ఈ ఐటీ కంపెనీలో ప్రపంచవ్యప్తంగా 3.23 లక్షల మంది పనిచేస్తున్నారు. ఇన్ఫోసిస్ చివరిసారిగా 2023 నవంబర్‌లో జీతాల పెంపును అమలు చేసింది. సాధారణంగా సంవత్సరం ప్రారంభంలో అమలు కావాల్సిన వేతన పెంపు ఆలస్యం అవుతూ వస్తోంది. ప్రపంచ డిమాండ్ వాతావరణంలో ప్రత్యేకించి ఐటీ పరిశ్రమలో విస్తృత అనిశ్చితిని ఇది ప్రతిబింబిస్తోంది. బలహీనమైన విచక్షణ వ్యయం, ఆలస్యమైన క్లయింట్ బడ్జెట్లు, కొనసాగుతున్న స్థూల ఆర్థిక అనిశ్చితి నుండి ఐటీ కంపెనీలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.కాగా వేతన పెంపు ప్రభావం మార్జిన్లపై ఏ మాత్రం పడుతుందన్నది లెక్కించలేదని కంపెనీ తెలిపింది. ఈ క్రమంలో 2025 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికం, 2026 మొదటి త్రైమాసికంలో "కొన్ని ఎదురుగాలులు" తప్పవని సంఘ్రాజ్కా పేర్కొన్నారు. మరోవైపు భారత్ వెలుపల ఉండే ఉద్యోగులకు కూడా జీతం పెంపు సింగిల్ డిజిట్‌లోనే మునుపటి వేతన సమీక్షలకు అనుగుణంగా ఉంటాయి. ఇక అధిక పనితీరు కనబరిచేవారికి ఎలాగూ వేతన పెంపు కాస్త ఎక్కువగానే ఉంటుందని ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ క్యూ3 ఫలితాలను ప్రకటించిన తర్వాత విశ్లేషకులతో మాట్లాడుతూ వెల్లడించారు.రూ.6,806 కోట్ల లాభంఏదేమైనా ఇన్ఫోసిస్ మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలను (Q3 Results) సాధించింది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ రూ.6,806 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. గతేడాది ఇదే త్రైమాసికంలోని రూ.6,506 కోట్లతో పోలిస్తే ఇది 11.4 శాతం అధికం. అదే ఇంతకుముందు త్రైమాసికంలో (Q2FY25) నమోదు చేసిన రూ.6,106 కోట్లతో పోలిస్తే 4.6 శాతం ఎక్కువ.ఇదీ చదవండి: ‘ఇన్ఫోసిస్‌లో ఇదీ పరిస్థితి.. అందుకే జాబ్ మానేశా’ టెకీ పోస్ట్ వైరల్ఇక అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ఆదాయం రూ. 41,764 కోట్లుగా ఉంది. ఇది గతేడాది క్యూ3తో వచ్చిన రూ. 38,821 కోట్లతో పోలిస్తే 7.6 శాతం వృద్ధిని ప్రతిబింబిస్తుంది. అదే సమయంలో మునుపటి త్రైమాసికంలో ఆర్జించిన (Q2FY25) రూ.40,986 కోట్లతో పోలిస్తే 1.9 శాతం పెరుగుదల. స్థిరమైన కరెన్సీ పరంగా ఆదాయం సంవత్సరం మీద 6.1 శాతం, త్రైమాసికం మీద 1.7 శాతం పెరిగింది. త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో భవిష్యత్ ఆదాయ వృద్ధి అంచనాలను కూడా సైతం ఇన్ఫోసిస్ వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయ వృద్ధి 4.5 నుంచి 5 శాతంగా నమోదు కావొచ్చని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. -
కాగ్నిజెంట్ సరికొత్త ఎత్తుగడ.. ప్రత్యర్థులకు దడ!
ప్రముఖ బహుళజాతి ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ (Cognizant) భారత్‌లోని తమ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును (retirement age) 58 నుండి 60 సంవత్సరాలకు పెంచింది. విస్తృత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కాగ్నిజెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొంది.పేరోల్‌లో ఎలాంటి మార్పు లేకుండా ఆన్-సైట్లో బదిలీ అయిన వారితో సహా దేశంలోని కాగ్నిజెంట్ ఉద్యోగులందరికీ ఈ మార్పు వర్తిస్తుంది. అనుభవజ్ఞులను నిలుపుకోవాలనే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ మెమోలో వివరించింది.దేశంలోని చాలా ఐటీ కంపెనీల్లో (IT Company) ప్రస్తుతం పదవీ విరమణ వయస్సు 58 సంవత్సరాలుగా ఉంది. అయితే రిటైర్మెంట్ వయసును పెంచుతూ కాగ్నిజెంట్ ఇప్పుడు తీసుకున్న నిర్ణయంతో పోటీతత్వ ప్రపంచంలో సరికొత్త మార్పులు రానున్నాయి. అనుభవజ్ఞులైన నిపుణులను సద్వినియోగం చేసుకునేందుకు కంపెనీకి ఆస్కారం ఏర్పడుతుంది.చిన్న నగరాలపై దృష్టిభారత్లో జరిగిన ఒక కార్యక్రమంలో కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ పీటీఐతో మాట్లాడుతూ.. కంపెనీ ప్రపంచ కార్యకలాపాలలో భారత్ పాత్ర ఉంటుందన్నది వివరించారు. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము నుండి ఇటీవల ప్రవాసీ భారతీయ సమ్మాన్ 2025 అవార్డును అందుకున్న రవి, గ్లోబల్ టెక్నాలజీ ల్యాండ్‌స్కేప్‌లో భారత్‌కు పెరుగుతున్న ప్రాముఖ్యతను హైలైట్ చేశారు.“కాగ్నిజెంట్ చాలా పెద్ద కంపెనీ. భారత్‌లో మాకు 250,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇంతకుముందు, మేము పెద్ద నగరాల నుండి ఆపరేట్ చేశాము. ఇప్పుడు మేము చిన్న నగరాల నుండి ఆపరేట్ చేస్తున్నాము. మా ప్రయత్నం చిన్న నగరాలకు తీసుకెళ్లడం, కాబట్టి మేము ఇండోర్‌లో ప్రారంభించాము” అని పేర్కొన్నారు.పదవీ విరమణ వయస్సును పెంచడంతోపాటు భారత్-ఆధారిత ప్రతిభ వ్యూహాన్ని రెట్టింపు చేయడం ద్వారా గ్లోబల్ టెక్నాలజీ పవర్‌హౌస్‌గా ఎదుగుతున్న భారత్‌కు సహకారం అందిస్తూనే ప్రపంచ ఐటీ సేవల మార్కెట్లో అగ్రగామిగా తన స్థానాన్ని పటిష్టం చేసుకోవాలని కాగ్నిజెంట్ లక్ష్యంగా పెట్టుకుంది. -
‘ఇన్ఫోసిస్‌లో ఇదీ పరిస్థితి.. అందుకే జాబ్ మానేశా’
దేశంలో టాప్ 2 ఐటీ కంపెనీలో ఉద్యోగం.. ఇంట్లో సంపాదించే వ్యక్తి తనొక్కడే.. చేతిలో మరో జాబ్ ఆఫర్ లేదు.. అయినా ఇన్ఫోసిస్‌లో (Infosys) చేస్తున్న ఉద్యోగాన్ని మానేశాడు పుణేకు చెందిన ఒక ఇంజనీర్ (Pune techie). ఇంత కఠిన నిర్ణయం తాను ఎందుకు తీసుకున్నాడు.. ఇన్ఫోసిస్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయి.. జాబ్ వదులుకునేందుకు దారితీసిన కారణాలు ఏమిటి.. అన్నది ఓ సోషల్ మీడియా పోస్ట్‌లో పంచుకోగా ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.మరో ఆఫర్ చేతిలో లేకుండానే ఇన్ఫోసిస్‌లో తన ఉద్యోగాన్ని ఎందుకు వదిలేశాడో లింక్డ్ఇన్ పోస్ట్‌లో పంచుకున్నారు పుణేకు చెందిన భూపేంద్ర విశ్వకర్మ. తాను రాజీనామా చేయడానికి ఆరు కారణాలను పేర్కొన్నారు. నారాయణ మూర్తి స్థాపించిన టెక్ దిగ్గజంలోని వ్యవస్థాగత లోపాలను, అనేక మంది ఉద్యోగులు నిశ్శబ్దంగా భరించే సవాళ్లను వెలుగులోకి తెచ్చారు."నేను ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్నప్పుడు అనేక వ్యవస్థాగత సమస్యలను ఎదుర్కొన్నాను. చివరికి చేతిలో ఎటువంటి ఆఫర్ లేకపోయినా నిష్క్రమించాలనే కఠినమైన నిర్ణయం తీసుకోవలసి వచ్చింది. కార్పొరేట్ వర్క్‌ప్లేస్‌లలో చాలా ఎదుర్కొంటున్న ఈ సవాళ్ల గురించి నేను బహిరంగంగా మాట్లాడాలనుకుంటున్నాను" అని భూపేంద్ర తన పోస్ట్‌లో పేర్కొన్నారు.జాబ్ మానేయడానికి భూపేంద్ర పేర్కొన్న కారణాలు» ఆర్థిక వృద్ధి లేదు: జీతం పెంపు లేకుండా సిస్టమ్ ఇంజనీర్ నుండి సీనియర్ సిస్టమ్ ఇంజనీర్‌గా ప్రమోషన్ వచ్చింది. మూడేళ్లు కష్టపడి నిలకడగా పనిచేసినా భూపేంద్రకు ఎలాంటి ఆర్థిక ప్రతిఫలం కనిపించలేదు.» అన్యాయమైన పనిభారం: భూపేంద్ర బృందాన్ని 50 నుండి 30 మంది సభ్యులకు కుదించబడినప్పుడు అదనపు పనిభారం మిగిలిన ఉద్యోగులపై పడింది. అయినా పరిహారం, గుర్తింపు లేవు. కేవలం పని ఒత్తిడి మాత్రం పెరిగింది.» అస్పష్టంగా కెరీర్ పురోగతి: నష్టం తెచ్చే పనిని అప్పగించారు. ఇందులో భూపేంద్ర ఎదుగుదలకు అవకాశం కనిపించలేదు. పరిమిత జీతాల పెంపుదల, అస్పష్టమైన కెరీర్ పురోగతి వృత్తిపరమైన డెడ్వెయిట్గా భావించేలా చేసింది.» టాక్సిక్ క్లయింట్ వాతావరణం: తక్షణ ప్రతిస్పందనల కోసం అవాస్తవిక క్లయింట్ అంచనాలు అధిక ఒత్తిడి వాతావరణాన్ని సృష్టించాయి. చిన్నపాటి సమస్యలపైనా పదేపదే ఒత్తిడి పెరగడం వల్ల ఉద్యోగి శ్రేయస్సును దెబ్బతీసే విషపూరితమైన పని సంస్కృతికి దారితీసింది.» గుర్తింపు లేకపోవడం: సహోద్యోగులు, సీనియర్ల నుండి ప్రశంసలు పొందినప్పటికీ, ఇది ప్రమోషన్లు, జీతం పెంపు, లేదా కెరీర్ పురోగతి రూపంలోకి మారలేదు. భూపేంద్ర తన కష్టానికి ప్రతిఫలం కాకుండా దోపిడీకి గురవుతున్నట్లు భావించారు.» ఆన్సైట్ అవకాశాల్లో ప్రాంతీయ పక్షపాతం: ఆన్సైట్ అవకాశాలు మెరిట్ ఆధారంగా కాకుండా మాట్లేడే భాష ఆధారంగా ఇస్తున్నారు. నిర్దిష్ట భాషలు మాట్లాడే ఉద్యోగులు తనలాంటి హిందీ మాట్లాడే ఉద్యోగులను పక్కన పెట్టారని ఆరోపించారు.ఇదీ చదవండి: ముప్పు అంచున మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు.. కలవరపెడుతున్న కంపెనీ ప్లాన్కంపెనీల్లో పని సంస్కృతి, పని ఒత్తిడి పెంచే కార్పొరేట్ అధిపతుల వ్యాఖ్యల నడుమ విస్తృత చర్చలు సాగుతున్న తరుణంలో తాజాగా భూపేంద్ర పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. ఆన్లైన్లో మరింత చర్చకు దారితీసింది. ఈ పోస్ట్‌పై చాలా మంది యూజర్లు ప్రతిస్పందిస్తున్నారు. భూపేంద్రను సమర్థిస్తూ కొందరు, విభేదిస్తూ మరికొందరు కామెంట్లు పెట్టారు. -
ముప్పు అంచున మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు..
ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) ఆలోచన ఉద్యోగులను కలవరపెడుతోంది. బిజినెస్ ఇన్సైడర్ నివేదిక ప్రకారం.. మైక్రోసాఫ్ట్ పనితీరు తక్కువగా ఉన్న ఉద్యోగులను తొలగించాలని (lay off) యోచిస్తోంది. ఈ ఉద్యోగాల కోతలు కంపెనీలోని ముఖ్యమైన భద్రతా విభాగంతో సహా అన్ని భాగాలలో జరుగుతున్నాయి.మైక్రోసాఫ్ట్ దాని పోటీదారుల మాదిరిగానే ఉద్యోగుల పనితీరు నిర్వహణపై బలమైన వైఖరిని తీసుకుంటోంది. మేనేజర్లు గత కొన్ని నెలలుగా ఇదే పనిమీద ఉన్నారు. ఉద్యోగుల పనితీరును వివిధ స్థాయిల్లో లెక్కిస్తున్నారు. ఉద్యోగాల కోతలను కంపెనీ ప్రతినిధి ధ్రువీకరించారని, అయితే బాధిత ఉద్యోగుల సంఖ్యను పంచుకోవడానికి నిరాకరించారని నివేదిక పేర్కొంది."మైక్రోసాఫ్ట్‌లో అధిక-పనితీరు ప్రతిభపై దృష్టి పెడతాము" అని కంపెనీ ప్రతినిధిని ఉటంకిస్తూ నివేదిక పేర్కొంది. "ఉద్యోగులు నేర్చుకోవడానికి, ఎదగడానికి సహాయం చేయడంలో మేము ఎల్లప్పుడూ సహకారం అందిస్తాం. అదే సమయంలో ప్రతిభ చూపనివారి పట్ల తగిన చర్యలు తీసుకుంటాము" అని ప్రతినిధి వివరించినట్లుగా చొప్పుకొచ్చింది.మైక్రోసాఫ్ట్ 2023 నుండి అనేక రౌండ్ల తొలగింపులను చేపడుతూ వస్తోంది. 2024 మేలో మైక్రోసాఫ్ట్‌కు సంబంధించిన ఎక్స్‌బాక్స్ (Xbox) విభాగం ప్రసిద్ధ ఆర్కేన్ ఆస్టిన్‌తో సహా అనేక గేమింగ్ స్టూడియోలను మూసివేసింది. పునర్నిర్మాణ ప్రయత్నంగా సంబంధిత సిబ్బందిని తొలగించింది. అదే సంవత్సరం జూన్‌లో మళ్లీ దాదాపు 1,000 మంది ఉద్యోగులను తొలగించింది. జూలైలో మరో రౌండ్ తొలగింపులు చేపట్టింది.ఇలా పనితీరు కారణాల వల్ల ఏర్పడిన ఖాళీలను మైక్రోసాఫ్ట్ అప్పుడప్పుడూ భర్తీ చేస్తూ వస్తోంది. దీంతో ఇది టెక్ దిగ్గజం మొత్తం హెడ్‌కౌంట్‌లో స్వల్ప మార్పులకు దారితీసింది. నివేదిక ప్రకారం.. ఇది జూన్ చివరి నాటికి 228,000గా ఉంది.ఏఐలో పెట్టుబడులుభారత్లో క్లౌడ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధ (ఏఐ) సామర్థ్యాలను విస్తరించడం కోసం మైక్రోసాఫ్ట్ 3 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.25,700 కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు కంపెనీ ఛైర్మన్, సీఈఓ సత్య నాదెళ్ల పేర్కొన్నారు. భారత్‌లో మానవ వనరులకున్న సామర్థ్యం దృష్ట్యా, 2030 కల్లా కోటి మందికి ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తాజాగా చెప్పారు.ఏ దేశంలోనైనా విస్తరణ నిమిత్తం మైక్రోసాఫ్ట్ పెడుతున్న పెట్టుబడుల్లో ఇదే అత్యధికమని సత్య నాదెళ్ల పేర్కొన్నారు. ఎంత కాలావధిలో ఈ మొత్తం పెడతారన్నది ఆయన వెల్లడించలేదు. భారత్‌లో ఏఐ ప్రగతి చాలా బాగుందని కితాబునిచ్చారు. గతేడాది ఫిబ్రవరిలో మన దేశంలో పర్యటించిన నాదెళ్ల, 2025 కల్లా 20 లక్షల మందికి ఏఐ నైపుణ్య శిక్షణ ఇస్తామని.. గ్రామీణ, చిన్న పట్టణ ప్రాంతాల్లోని వ్యక్తులపై దృష్టి పెడతామని పేర్కొన్నారు. -
ఐటీ ఉద్యోగులకు తీవ్ర నిరాశ.. టాప్ 2 కంపెనీ ఝలక్
దేశంలో రెండవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ (Infosys) వార్షిక వేతనాల పెంపును ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి (Q4FY25)వాయిదా వేసింది. బెంగళూరుకు చెందిన ఈ కంపెనీ చివరిసారిగా 2023 నవంబర్‌లో జీతాల పెంపును అమలు చేసింది.అన్ని ఐటీ కంపెనీలదీ అదే దారిసాధారణంగా సంవత్సరం ప్రారంభంలో అమలు కావాల్సిన వేతన పెంపు ఆలస్యం కావడం ప్రపంచ డిమాండ్ వాతావరణంలో ప్రత్యేకించి ఐటీ సేవల రంగంలో విస్తృత అనిశ్చితిని ప్రతిబింబిస్తోంది. బలహీనమైన విచక్షణ వ్యయం, క్లయింట్ బడ్జెట్ల ఆలస్యం, కొనసాగుతున్న స్థూల ఆర్థిక అనిశ్చితితో ఐటీ కంపెనీలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.ఇటాంటి వాతావరణంలో పోటీ కంపెనీలైన హెచ్‌సీఎల్ టెక్ (HCLTech), ఎల్టీఐ మైండ్‌ట్రీ (LTIMindtree), ఎల్&టీ (L&T) టెక్ సర్వీసెస్ కూడా ఖర్చులను తగ్గించుకునేందుకు, లాభదాయకతను కొనసాగించడానికి రెండవ త్రైమాసికంలో జీతం ఇంక్రిమెంట్లను దాటవేశాయి.క్యూ4లో అక్టోబర్ 17న దశలవారీగా వేతనాల పెంపుదలకు ప్లాన్ చేస్తున్నట్లు ఇన్ఫోసిస్ తెలిపింది. అందులో కొంత భాగం జనవరిలో అమలులోకి వస్తుందని, మిగిలినది ఏప్రిల్‌లో అమలులోకి వస్తుందని క్యూ2 ఫలితాల తర్వాత విలేకరుల సమావేశంలో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జయేష్ సంఘ్రాజ్కా తెలిపారు.లాభం మెరుగురెండవ త్రైమాసికంలో ఇన్ఫోసిస్ నికర లాభం త్రైమాసికానికి 2.2 శాతం పెరిగి రూ. 6,506 కోట్లకు చేరుకుంది. తక్కువ ఆన్సైట్ ఖర్చులు, మెరుగైన వినియోగ రేట్లు, మెరుగైన కార్యాచరణ సామర్థ్యాల కారణంగా మార్జిన్లు 10 బేసిస్ పాయింట్ల మేర మెరుగయ్యాయి.వేతనాల్లో భారీ వ్యత్యాసంసాధారణంగా ఐటీ రంగంలో పనిచేసే ఉద్యోగులకు (IT Employees) మంచి జీతాలు (Salary) ఉంటాయి. అయితే ఇక్కడ కూడా ఉన్నత స్థాయి అధికారులకు, ప్రారంభ స్థాయి ఉద్యోగులకు మధ్య వేతనాల పెంపు విషయంలో భారీ వ్యత్యాసాలు ఉన్నాయి. ‘మనీకంట్రోల్’ విశ్లేషించిన డేటా ప్రకారం.. గత ఐదేళ్లలో దేశంలోని ఐదు ప్రముఖ ఐటీ కంపెనీల్లోని టాప్ ఎగ్జిక్యూటివ్‌ల వేతనాలు 160% పెరిగాయి. కానీ ఫ్రెషర్ల (Freshers) జీతాలు పెరిగింది కేవలం 4 శాతమే.2024 ఆర్థిక సంవత్సరంలో సీఈవోల (CEO) సగటు వార్షిక వేతనం రూ. 84 కోట్లకు చేరువగా ఉండగా, ఫ్రెషర్స్ జీతాలు రూ. 3.6 లక్షల నుంచి రూ. 4 లక్షలకు పెరిగాయి. డేటాలో చేర్చిన కంపెనీల్లో టీసీఎస్ (TCS), ఇన్ఫోసిస్ (Infosys), హెచ్‌సీఎల్ టెక్ (HCLTech), విప్రో (Wipro), టెక్ మహీంద్ర (Tech Mahindra) ఉన్నాయి.ఇదీ చదవండి: అప్పుడు బెంగళూరు.. ఇప్పుడు మరోచోట గూగుల్ భారీ ఆఫీస్!ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో మోహన్‌దాస్ పాయ్‌తో సహా విమర్శకులు వేతన పెరుగుదలలో భారీ వ్యత్యాసంపై ఆందోళన వెలిబుచ్చారు. ఫ్రెషర్లకు తక్కువ జీతం ఇస్తున్నప్పుడు ఉన్నత స్థాయి అధికారులకు ఉదారంగా వేతన ప్యాకేజీలు ఇవ్వడాన్ని తప్పుపడుతున్నారు. పెరుగుతున్న అసమానతలు, ఆర్థిక వినియోగంపై దాని హానికరమైన ప్రభావాన్ని మోహన్‌దాస్ పాయ్ ఎత్తిచూపారు.ఈ ఐటీ కంపెనీల్లో సీఈవోలు, ఫ్రెషర్లు మధ్య వేతన వ్యత్యాసం తీవ్రంగా ఉంది. ఉదాహరణకు విప్రో నిష్పత్తి 1702:1 వద్ద ఉండగా, టీసీఎస్ నిష్పత్తి 192:1. ఐటీ పరిశ్రమలో పరిస్థితి ఇలా ఉంటే.. ఇంజనీరింగ్, తయారీ వంటి ఇతర రంగాలలో వేతన వృద్ధి మరింత దిగజారింది. 2019, 2023 మధ్య ఏటా వేతన వృద్ధి కేవలం 0.8% మాత్రమే. -
అప్పుడు బెంగళూరు.. ఇప్పుడు మరోచోట గూగుల్ భారీ ఆఫీస్!
గూగుల్ (Google) గురుగ్రామ్‌లో 550,000 చదరపు అడుగుల భారీ ఆఫీస్ స్థలాన్ని (office space) లీజుకు తీసుకుంది. ఇది దేశంలోని అతిపెద్ద వర్క్‌స్పేస్ డీల్స్‌లో ఒకటిగా నిలుస్తుందని, గురుగ్రామ్‌లోని మొత్తం టవర్‌ను లీజుకు తీసుకోవడానికి టెక్ దిగ్గజం చర్చలు జరుపుతున్నట్లు ఒక నివేదిక తెలిపింది.ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. గూగుల్ ప్రముఖ మేనేజ్డ్ వర్క్‌స్పేస్ ప్రొవైడర్ అయిన టేబుల్ స్పేస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఆఫీస్ స్థలాన్ని భవిష్యత్తులో అదనంగా 200,000 చదరపు అడుగుల వరకు విస్తరించుకునే అవకాశాన్ని కూడా ఈ సంస్థ గూగుల్‌కు అందిస్తుందని సమాచారం.ఆసక్తికరంగా గూగుల్ గురుగ్రామ్‌లో 700,000 చదరపు అడుగుల లీజును 2022లో ముగించింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు భారీ ఆఫీస్ స్పేస్ కోసం అన్వేషిస్తుండటం గమనార్హం. గూగుల్ గతేడాదే బెంగళూరులోని అలెంబిక్ సిటీలో 6,49,000 చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని లీజుకు తీసుకుంది. మూడు సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్‌తో చదరపు అడుగుకి నెలవారీ అద్దె రూ.62 చొప్పున డీల్ కుదిరినట్లు సమాచారం.2022లో హైదరాబాద్‌లో 600,000 చదరపు అడుగుల లీజు పునరుద్ధరణ, బెంగళూరులోని బాగ్‌మేన్ డెవలపర్లతో 1.3 మిలియన్ చదరపు అడుగుల ఒప్పందంతో సహా భారతదేశంలో గూగుల్ గణనీయమైన విస్తరణల శ్రేణిని గురుగ్రామ్‌లో ఈ తాజా లీజింగ్ అనుసరించింది. -
ఐటీ ఉద్యోగుల జీతాలు ఇంత దారుణమా?
సాధారణంగా ఐటీ రంగంలో పనిచేసే ఉద్యోగులకు (IT Employees) మంచి జీతాలు (Salary) ఉంటాయి. అయితే ఇక్కడ కూడా ఉన్నత స్థాయి అధికారులకు, ప్రారంభ స్థాయి ఉద్యోగులకు మధ్య వేతనాల పెంపు విషయంలో భారీ వ్యత్యాసాలు ఉన్నాయి. ‘మనీకంట్రోల్’ విశ్లేషించిన డేటా ప్రకారం.. గత ఐదేళ్లలో దేశంలోని ఐదు ప్రముఖ ఐటీ కంపెనీల్లోని టాప్ ఎగ్జిక్యూటివ్‌ల వేతనాలు 160% పెరిగాయి. కానీ ఫ్రెషర్ల (Freshers) జీతాలు పెరిగింది కేవలం 4 శాతమే.2024 ఆర్థిక సంవత్సరంలో సీఈవోల (CEO) సగటు వార్షిక వేతనం రూ. 84 కోట్లకు చేరువగా ఉండగా, ఫ్రెషర్స్ జీతాలు రూ. 3.6 లక్షల నుంచి రూ. 4 లక్షలకు పెరిగాయి. డేటాలో చేర్చిన కంపెనీల్లో టీసీఎస్ (TCS), ఇన్ఫోసిస్ (Infosys), హెచ్‌సీఎల్ టెక్ (HCLTech), విప్రో (Wipro), టెక్ మహీంద్ర (Tech Mahindra) ఉన్నాయి.ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో మోహన్‌దాస్ పాయ్‌తో సహా విమర్శకులు వేతన పెరుగుదలలో భారీ వ్యత్యాసంపై ఆందోళన వెలిబుచ్చారు. ఫ్రెషర్లకు తక్కువ జీతం ఇస్తున్నప్పుడు ఉన్నత స్థాయి అధికారులకు ఉదారంగా వేతన ప్యాకేజీలు ఇవ్వడాన్ని తప్పుపడుతున్నారు. పెరుగుతున్న అసమానతలు, ఆర్థిక వినియోగంపై దాని హానికరమైన ప్రభావాన్ని మోహన్‌దాస్ పాయ్ ఎత్తిచూపారు.ఈ ఐటీ కంపెనీల్లో సీఈవోలు, ఫ్రెషర్లు మధ్య వేతన వ్యత్యాసం తీవ్రంగా ఉంది. ఉదాహరణకు విప్రో నిష్పత్తి 1702:1 వద్ద ఉండగా, టీసీఎస్ నిష్పత్తి 192:1. ఐటీ పరిశ్రమలో పరిస్థితి ఇలా ఉంటే.. ఇంజనీరింగ్, తయారీ వంటి ఇతర రంగాలలో వేతన వృద్ధి మరింత దిగజారింది. 2019, 2023 మధ్య ఏటా వేతన వృద్ధి కేవలం 0.8% మాత్రమే.అధిక అట్రిషన్ రేట్లు, తక్కువ ఆన్-సైట్ అవకాశాలు వంటి సవాళ్లను ఐటీ (IT) రంగం ఎదుర్కొంటోంది. ఇది వేతన పరిహారాలపై ప్రభావం చూపుతోంది. సీఈవోల జీతాలు గ్లోబల్ బెంచ్‌మార్క్‌లకు అనుగుణంగా ఉన్నప్పటికీ, పెరుగుతున్న వ్యత్యాసం అసమానతలను మరింత పెంచుతోందని, పెరుగుతున్న జీవన వ్యయాలతో ఇబ్బందులు పడుతున్న మధ్యతరగతి ఉద్యోగులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఫ్రెషర్ల జీతాలను కనీసం రూ. 5 లక్షలకు పెంచాలని, ఈ లాభదాయక సంస్థలకు ఇది సాధ్యమేనని విమర్శకులు పేర్కొంటున్నారు. -
మాదాపూర్: ఐటీ కంపెనీలో అగ్ని ప్రమాదం..
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఐటీ కంపెనీ ఐదు అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలను అదుపులోకి తెస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.వివరాల ప్రకారం..మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్ ఎదురుగా ఉన్న సత్వ బిల్డింగులో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ భవనంలో పలు ఐటీ కంపెనీలు ఉన్నాయి. శనివారం తెల్లవారుజామున అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
చిన్న పట్టణాలకు ఐటీ విస్తరణ
రాయదుర్గం: తెలంగాణ రాష్ట్రంలోని టైర్–2, టైర్–3 పట్టణాలలో ఐటీ సంస్థల ఏర్పాటుకు కంపెనీలు ముందుకురావాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు. ఆదివారం నానక్‌రాంగూడలోని వంశీరామ్ సువర్ణదుర్గా టెక్ పార్కులో గ్లోబల్ ఐటీ, ఇంజనీరింగ్ సొల్యూషన్స్ సంస్థ ‘టెక్‌వేవ్ ఏర్పాటుచేసిన మొదటి ఏఐ ఇంజనీరింగ్ హబ్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలలో మంచి ప్రతిభ కలిగిన విద్యార్థులు ఉన్నారని, వారి కోసం ట్రిపుల్ ఐటీలను కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. టైర్–2, టైర్–3 పట్టణాలలో రోడ్డు, విద్యుత్ సరఫరా, ఇతర మౌలిక వసతుల కల్పనకు అన్ని చర్యలను తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ పట్టణాలలో ఐటీ సంస్థలను ఏర్పాటు చేసేలా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పట్టణాల అభివృద్ధికి అన్ని చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్‌కు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ప్రాధాన్యత ఉందని తెలిపారు. నిబద్ధత ఉంటే ఏదైనా సాధ్యమే.. నిబద్ధత, చిత్తశుద్ధి, ప్రతిభ ఉన్న నాయకత్వం ఉంటే ఎలాంటి సంస్థలకైనా ప్రగతి సాధించేందుకు అవకాశం ఉంటుందని, అందుకు టెక్‌వేవ్ సంస్థనే ఉదాహరణ అని శ్రీధర్‌బాబు తెలిపారు. పది దేశాలలో 3,500 మంది ఉద్యోగులు కలిగి, 20 ఏళ్లు పూర్తి చేసుకొన్న టెక్‌వేవ్ సంస్థ యాజమాన్యాన్ని మంత్రి అభినందించారు.కార్యకలాపాలను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించాలని ఈ సంస్థ ప్రతినిధులను కోరారు. ఈ కార్యక్రమంలో టెక్‌వేవ్ సంస్థ చైర్మన్ దామోదరరావు గుమ్మడపు, సీఈఓ రాజ్ గుమ్మడపు తదితరులు పాల్గొన్నారు. -
ఐటీ కంపెనీల స్టార్టప్ వేట!
ఇప్పుడు ఏ రంగంలో చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డేటా ఎనలిటిక్స్, క్లౌడ్ వంటి అధునాతన సాంకేతికతల వినియోగం అంతకంతకూ జోరందుకుంటోంది. ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ముందున్న ఐటీ కంపెనీలు.. ఆయా విభాగాల్లో తమ సామర్థ్యాలను వేగంగా పెంచుకోవడం కోసం స్టార్టప్ కంపెనీలను బుట్టలో వేసుకుంటున్నాయి. దేశంలో సెమీకండక్టర్ల (చిప్) తయారీ ఊపందుకోవడంతో చిప్ డిజైన్, స్పేస్ టెక్నాలజీ పైగా దృష్టి సారిస్తున్నాయి. ఈ వేటలో యాక్సెంచర్, ఇన్ఫోసిస్, ఐబీఎంతో వంటి దిగ్గజాలతో పాటు మధ్య తరహా ఐటీ సంస్థలైన పర్సిస్టెంట్, సైయంట్, గ్లోబల్ లాజిక్ కూడా ముందు వరుసలో ఉన్నాయి. అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ప్రావీణ్యం కలిగిన చిన్న, స్టార్టప్‌లను దక్కించుకోవడం వల్ల ఐటీ కంపెనీల ఆదాయం, వేల్యుయేషన్లు కూడా పుంజుకోవడానికి వీలుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. జోరుగా.. హుషారుగా... గత నెలలో బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ యాజ్–ఎ–సర్విస్ (సాస్) స్టార్టప్ ప్రెసింటోను ఐబీఎం కొనుగోలు చేసింది. ఇదే నెలలో హైదరాబాద్ ఐటీ ఇంజినీరింగ్ సర్విసుల సంస్థ సైయంట్ అమెరికాకు చెందిన భారతీయ స్టార్టప్ అజిమత్ ఏఐలో 27.3 % వాటాను చేజిక్కించుకుంది. ఇందుకోసం దాదాపు 7.25 మిలియన్ డాలర్లను వెచి్చంచింది. సెమీకండక్టర్ పరిశ్రమలో సైయంట్ సామర్థ్యాల విస్తరణకు ఈ కొనుగోలు దోహదం చేయనుంది.ఇక మరో మిడ్‌క్యాప్ ఐటీ కంపెనీ పర్సిస్టెంట్ సిస్టమ్స్... పుణేకు చెందిన డేటా ప్రైవసీ మేనేజ్మెంట్ సంస్థ ఆర్కాను రూ.14.4 కోట్లకు దక్కించుకోనున్నట్లు ప్రకటించింది. టాప్–2 ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సైతం స్పేస్ టెక్ స్టార్టప్ గెలాక్స్ఐలో రూ.17 కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకొచి్చంది. కంపెనీలో ఇన్నోవేషన్ ఫండ్‌లో భాగంగా ఈ పెట్టుబడి పెడుతోంది. తద్వారా ఆ స్టార్టప్‌లో 20 శాతం ఇన్ఫోసిస్‌కు చిక్కనుంది. మరో అగ్రగామి యాక్సెంచర్ ఈ ఏడాది జూలైలో చిప్ డిజైన్ స్టార్టప్ ఎక్సెల్‌మ్యాక్స్ టెక్నాలజీస్‌ను దక్కించుకుంది. ఫిబ్రవరిలో ఇన్ఫోగెయిన్ కూడా యూఎస్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్టార్టప్ ఇంపాక్టివ్ను కైవసం చేసుకుంది. బడా ఐటీ కంపెనీలు ఇప్పుడు స్టార్టప్ కంపెనీల వెంట పడుతున్నాయి. టెక్నాలజీ సామర్థ్యాలతో పాటు ఆదాయాలు, వేల్యుయేషన్లను పెంచుకోవడమే లక్ష్యంగా దేశీ స్టార్టప్ సంస్థల కొనుగోలుకు తెరతీశాయి. ఏఐ వంటి అధునాతన సాంకేతికతల్లో అంతరాన్ని పూడ్చుకోవడానికి కూడా ఈ వ్యూహం బాగానే పనిచేస్తోంది. మరోపక్క, నిధుల కటకటను ఎదుర్కొంటున్న స్టార్టప్‌లకు ఇది దన్నుగా నిలుస్తోంది.తాజా కొనుగోళ్లు ఇలా...⇒ యాక్సెంచర్ – ఎక్సెల్‌మ్యాక్స్ (చిప్ డిజైన్) ⇒ ఇన్ఫోసిస్ – గెలాక్స్ఐ (స్పేస్ టెక్) ⇒ ఐబీఎం – ప్రెసింటో (సాస్) ⇒ జోరియంట్ – మ్యాపిల్ల్యాబ్స్ (క్లౌడ్ మేనేజ్మెంట్) ⇒ సైయంట్ – అజిమత్ ఏఐ (సెమీకండక్టర్) ⇒ పర్సిస్టెంట్ సిస్టమ్స్ – ఆర్కా (డేటా ప్రైవసీ) -
చిన్న ఐటీ కంపెనీ.. భారీ లాభాలు
సాంకేతిక శిక్షణ, ఐటీ డెవలప్మెంట్, సాఫ్ట్వేర్ సొల్యూషన్లు అందించే విన్సిస్ ఐటీ సర్వీసెస్ ఇండియా ఈ ఏడాది(2024–25) తొలి ఆరు నెలల్లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. చిన్న సంస్థల కోసం ఏర్పాటైన ఎన్ఎస్ఈ ఎమర్జ్ ప్లాట్‌ఫామ్ ద్వారా లిస్టయిన కంపెనీ నికర లాభం ఏప్రిల్–సెప్టెంబర్‌లో 36 శాతం జంప్‌చేసి రూ. 11 కోట్లకు చేరింది.గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 8 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 16 శాతం ఎగసి రూ. 92 కోట్లను అధిగమించింది. కన్సాలిడేటెడ్ ఫలితాలివి. నిర్వహణ లాభం(ఇబిటా) 53% జంప్‌చేసి రూ. 15 కోట్లను దాటింది."ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నాం. ముఖ్యంగా భారత్‌లో డిమాండ్ మందగించడం, సిబ్బంది వ్యయం పెరగడం వంటి ఇబ్బందులు పడ్డాం. అయితే మా సామర్థ్యాలు, భౌగోళికాలు, సౌకర్యాలపై సకాలంలో పెట్టుబడి పెట్టగలిగినందున అటువంటి అనిశ్చితులను ఎదుర్కొనేందుకు బలమైన పునాదిని ఏర్పాటు చేశాం" అని విన్సిస్ చైర్మన్, ఎండీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. -
ఐటీలో కొత్త ట్రెండ్.. మీరొస్తామంటే మేమొద్దంటామా?
ఐటీ పరిశ్రమలో కాగ్నిజెంట్ కొత్త ట్రెండ్ తీసుకొచ్చింది. సంస్థను వీడి వెళ్లిన ఉద్యోగులు తిరిగి రావాలనుకుంటే వారికి ‘మీరొస్తామంటే మేమొద్దంటామా’ అంటూ సాదరంగా స్వాగతం పలుకుతోంది. ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల్లొ 13,000 మంది మాజీ ఉద్యోగులను తిరిగి నియమించుకుని సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది.ఒక కంపెనీలో పనిచేసి వ్యక్తిగత లేదా వృత్తిపరమైన కారణాలతో సంస్థను వీడి తిరిగి అదే కంపెనీలో చేరేవారిని ‘బూమరాంగ్ ఉద్యోగులు’ అని వ్యవహరిస్తారు. కాగ్నిజెంట్‌లో ఇలాంటి పునర్నియామకాలు గత రెండు సంవత్సరాలలో 40% పెరిగాయి.కాగ్నిజెంట్.. ఇతర కంపెనీల మాదిరిగా కేవలం ఉన్న ఉద్యోగులను నిలుపుకోవడంపైన మాత్రమే దృష్టి పెట్టకుండా సంస్థను వీడి వెళ్లిన మాజీ ఉద్యోగులను సైతం స్వాగతిస్తోంది. సాధారణంగా బూమరాంగ్ సంస్కృతి ఇతర రంగాలతో పోలిస్తే ఐటీ పరిశ్రమలో చాలా అరుదు.ఇదీ చదవండి: నో బోనస్.. ఉద్యోగులకు టీసీఎస్ ఝలక్!మాజీ ఉద్యోగులను తిరిగి ఆకర్షించడం అనేది ఇప్పుడు పెద్ద ట్రెండ్‌లో భాగం. దీనిలో కంపెనీలు ఉద్యోగి నిష్క్రమణలను దీర్ఘకాలిక సంబంధాలను కొనసాగించడానికి అవకాశాలుగా చూస్తాయి. సంస్థను వీడి వెళ్తున్న ఉద్యోగులతో మంచిగా వ్యవహరించడం, వారు తిరిగి రావడానికి తలుపులు తెరిచి ఉంచడం ద్వారా సరికొత్త సంస్కృతికి నాంది పలుకుతున్నాయి. డెలాయిట్ వంటి ప్రముఖ కంపెనీలు మాజీ ఉద్యోగుల కోసం ఆలుమ్నీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. -
నో బోనస్.. ఉద్యోగులకు టీసీఎస్ ఝలక్!
దేశీయ అతిపెద్ద ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కొంతమంది ఉద్యోగులకు ఝలక్ ఇచ్చింది. ఆఫీస్ నుంచి పని చేసే విధానాన్ని కఠినంగా అమలు చేస్తున్న టీసీఎస్ జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో కొందరు ఉద్యోగులకు బోనస్ చెల్లింపులను తగ్గించింది.‘మనీకంట్రోల్’ నివేదిక ప్రకారం.. జూనియర్ ఉద్యోగులు ఇప్పటికీ వారి పూర్తి త్రైమాసిక వేరియబుల్ అలవెన్స్‌ను అందుకున్నారు. అయితే కొంతమంది సీనియర్ ఉద్యోగులకు మాత్రం బోనస్‌లో 20-40 శాతం కోత విధించింది ఐటీ దిగ్గజం. కొంతమందికైతే బోనస్ అస్సలు లభించలేదు.“2025 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో జూనియర్ గ్రేడ్లకు 100% క్యూవీఏ (త్రైమాసిక వేరియబుల్ అలవెన్స్) చెల్లించాము. ఇతర అన్ని గ్రేడ్లకు క్యూవీఏ వారి యూనిట్ వ్యాపార పనితీరుపై ఆధారపడి ఉంటుంది” అని టీసీఎస్ ప్రతినిధి చెప్పినట్లుగా మీడియా నివేదికలో పేర్కొన్నారు.టీసీఎస్ కార్యాలయ హాజరు, ఆయా వ్యాపార యూనిట్ల పనితీరు రెండింటి ఆధారంగా బోనస్‌లను నిర్ణయిస్తుంది. ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించేలా కంపెనీ చర్యలు తీసుకుంటోంది. హాజరు విధానాలను స్థిరంగా పాటించకపోవడం క్రమశిక్షణా చర్యకు దారితీస్తుందని టీసీఎస్ గతంలోనే స్పష్టం చేసింది.కార్యాలయ హాజరు కీలకంఉద్యోగుల కార్యాలయ హాజరును కీలక అంశంగా చేరుస్తూ సవరించిన వేరియబుల్ పే విధానాన్ని టీసీఎస్ గత ఏప్రిల్‌లో ప్రవేశపెట్టింది. కొత్త విధానం ఉద్యోగులకు వేరియబుల్ వేతనాన్ని నిర్దేశిస్తూ నాలుగు హాజరు స్లాబ్‌లను ఏర్పాటు చేసింది. కొత్త విధానం ప్రకారం.. 60 శాతం కంటే తక్కువ సమయం కార్యాలయాల పనిచేసే ఉద్యోగులకు త్రైమాసికానికి ఎటువంటి వేరియబుల్ వేతనం లభించదు.ఇదీ చదవండి: ఇంటెల్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..60-75 శాతం మధ్య కార్యాలయ హాజరు ఉన్నవారు వేరియబుల్ వేతనంలో 50 శాతం అందుకుంటారు. అయితే 75-85 శాతం కార్యాలయానికి హాజరయ్యే ఉద్యోగులు వేరియబుల్ పేలో 75 శాతానికి అర్హులు. 85 శాతం కంటే ఎక్కువ ఆఫీస్‌కు వచ్చి పనిచేసినవారు మాత్రమే త్రైమాసికానికి పూర్తి వేరియబుల్ చెల్లింపును అందుకుంటారు. -
ట్రంప్ మానియా..ఐటీపై ప్రభావం ఎంత?
అమెరికా అధ్యక్షుడిగా మరోసారి డొనాల్డ్ ట్రంప్‌నకు అక్కడి ప్రజలు పట్టంకట్టారు. అక్రమ వలసలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన గతంలో ప్రకటించారు. దాంతో అమెరికా వెళ్లాలనుకునే ఐటీ ఉద్యోగులు కొంత నిరాశ చెందుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. గత హయాంలో మాదిరిగానే ఐటీ రంగంపై ప్రతికూల ప్రభావం ఉంటుందనే ఆందోళనలు సహజంగా వ్యక్తమవుతున్నాయి. 80 శాతం పైగా భారత్ ఐటీ సర్వీసుల ఆదాయం అమెరికా నుంచే వస్తోంది. హెచ్1బీ/ఎల్1 వీసాలపై(యూఎస్ కంపెనీలు విదేశీయులకు అందించే వీసాలు) ట్రంప్ తొలిసారి అధికారం వచ్చిన వెంటనే నిబంధనలను కఠినతరం చేయడం తెలిసిందే.వీసా పరిమితులు?గతంలో ట్రంప్ హయాంలో విదేశీ ఐటీ సంస్థలు ఉద్యోగాల్లో అమెరికన్లకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని హుకుం జారీ చేయడంతో పాటు వీసాల జారీపైనా పరిమితులు విధించారు. దీంతో అప్పట్లో ఐటీ కంపెనీలు వ్యయ భారాన్ని ఎదుర్కొన్నాయి. ఈ ప్రభావంతో వీసాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడంతో పాటు విదేశీ సెంటర్లలో స్థానిక నిపుణులకే పెద్దపీట వేశాయి. 2016–17లో అమెరికాలో భారతీయ ఐటీ సంస్థల ఉద్యోగుల్లో మూడింట రెండొంతులు హెచ్1బీ/ఎల్1 వీసాల ద్వారానే నమోదుకాగా, ప్రస్తుతం ఈ సంఖ్య గణనీయంగా తగ్గినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.ఇదీ చదవండి: ఎడిట్ చేసిన ఫొటోను షేర్ చేసిన మస్క్కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు..ఐటీ అగ్ర త్రయం టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో హెచ్1బీ వీసాలు గత పదేళ్లలో 50–80% తగ్గిపోయినట్లు అంచనా. ట్రంప్ నియంత్రణల తర్వాత ఇది జోరందుకుంది. 2019–20లో ఇన్ఫీ గ్లోబల్ సిబ్బంది 65 శాతానికి, విప్రోలో 69 శాతానికి ఎగబాకినట్లు బ్రోకరేజ్ సంస్థ జేఎం ఫైనాన్షియల్ పేర్కొంది. ఈ నేపథ్యంలో ట్రంప్ 2.0 హయాంలో మళ్లీ వీసా పరిమితులు, కఠిన నిబంధనలు విధించినప్పటికీ.. పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చనేది నిపుణుల అభిప్రాయం. దీనికితోడు దేశీయ కార్యకలాపాలపై కార్పొరేట్ ట్యాక్స్‌ను 21% నుంచి 15%కి తగ్గిస్తామన్న ట్రంప్ ప్రతిపాదనలు కూడా భారత్ ఐటీ కంపెనీలకు సానుకూలాంశమని విశ్లేషకులు చెబుతున్నారు. వీసా నియంత్రణలు ఉన్నప్పటికీ ట్రంప్ తొలి విడతలో దేశీ ఐటీ షేర్లు పుంజుకోవడం విశేషం. టీసీఎస్ 185 శాతం, ఇన్ఫోసిస్ 174 శాతం, విప్రో 140 శాతం చొప్పున ఎగబాకాయి. -
భారీగా పెరిగిన మైక్రోసాఫ్ట్ సీఈవో ప్యాకేజీ
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల వేతన ప్యాకేజీ భారీగా పెరిగింది. 2024 ఆర్థిక సంవత్సరానికి గానూ ఆయన ఆర్థిక పరిహారం 63% పెరిగి 79.1 మిలియన్ డాలర్లకు (సుమారు రూ.665 కోట్లు) చేరుకుంది. ఈ మేరకు తాజా ఫైలింగ్‌లో కంపెనీ పేర్కొంది.సత్య నాదెళ్ల ప్యాకేజీ ఈ స్థాయిలో పెరగడానికి ఆయన స్టాక్ అవార్డులు సహాయపడ్డాయి. 2023లో ఆయన 48.5 మిలియన్ డాలర్ల పరిహారం అందుకున్నారు. ఇందులో స్టాక్ అవార్డుల విలువ 39 మిలియన్ డాలర్లు. 2024లో సత్య నాదెళ్ల స్టాక్ అవార్డుల రూపంలో సంపాదించినది 71 మిలియన్ డాలర్లు.జూన్‌తో ముగిసిన 2024 ఆర్థిక సంవత్సరంలో మైక్రోసాఫ్ట్ షేర్లు దాదాపు 31.2% లాభపడ్డాయి. కంపెనీ మార్కెట్ విలువ 3 ట్రిలియన్ డాలర్లు దాటింది. సత్య నాదెళ్ల ప్యాకేజీ భారీగా పెరిగినప్పటికీ ఆయన నగదు ప్రోత్సాహకం మాత్రం సగానికి తగ్గింది. గతంలో 10.7 మిలియన్ డాలర్లకు అర్హత పొందిన ఆయన అనేక సైబర్ సెక్యూరిటీ ఉల్లంఘనల కారణంగా 5.2 మిలియన్ డాలర్లకు తగ్గించుకోవాల్సి వచ్చింది.ఇదీ చదవండి: మైక్రోసాఫ్ట్ నుంచి ఎక్కువగా వెళ్లిపోతున్నది మహిళలే..ఇక ఇతర హై-ప్రొఫైల్ టెక్ బాస్‌లలో యాపిల్ సీఈవో టిమ్ కుక్ 2023లో 63.2 మిలియన్ డాలర్లు సంపాదించారు. ఏఐ-చిప్ దిగ్గజం ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ 2024 ఆర్థిక సంవత్సరంలో 34.2 మిలియన్ డాలర్ల ప్యాకేజీ అందుకున్నారు. -
మైక్రోసాఫ్ట్‌ను వీడుతున్న మహిళా ఉద్యోగులు..
ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌లో వింత ధోరణి కనిపిస్తోంది. సంస్థను వీడుతున్న ఉద్యోగుల్లో అత్యధికం మహిళలే ఉంటున్నారు. నిష్క్రమిస్తున్న వారిలో లాటిన్స్, నల్ల జాతీయులు ఉండటంతో కంపెనీ శ్రామికశక్తి వైవిధ్యంపై ప్రభావం చూపుతోంది.మైక్రోసాఫ్ట్ డైవర్సిటీ అండ్ ఇన్‌క్లూషన్ నివేదిక ప్రకారం.. జూన్ 30తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా కంపెనీని వీడివెళ్లిన ఉద్యోగుల్లో మహిళలు 32.7% మంది ఉన్నారు. ఇది అంతకు ముందు ఏడాదితో పోల్చితే 31% పెరిగింది. స్వచ్ఛంద నిష్క్రమణలు, తొలగింపులు అన్నింటినీ క్రోడీకరించి రూపొందించిన ఈ రిపోర్ట్‌ను తాజాగా విడుదల చేశారు.దెబ్బతింటోన్న వైవిధ్యంఅమెరికాకు సంబంధించిన నిష్క్రమణలలో నల్లజాతి కార్మికులు 10% ఉన్నారు. అంతకుముందు సంవత్సరం ఇది 8.7 శాతంగా ఉండేది. ఇక లాటిన్ అమెరికన్ల నిష్క్రమణలు 8% నుండి 9.8 శాతానికి పెరిగాయి. ఇక పురుషులు, ఆసియన్ ఉద్యోగుల విషయానికి వస్తే ఇది విరుద్ధంగా ఉంది. 2023లో కంటే గతేడాది వీరి నిష్క్రమణలు తక్కువగా నమోదయ్యాయి.ఇదీ చదవండి: ఐటీ పరిశ్రమలో చాన్నాళ్లకు మారిన పరిస్థితులుప్రత్యర్థి కంపెనీలు అవలంభిస్తున్న పోకడలే ఇందుకు కారణంగా మైక్రోసాఫ్ట్ పేర్కొంటోంది. అలాగే తమ భౌతిక, ఆన్లైన్ రిటైల్ వ్యాపారాలలో మార్పులు కూడా కొంత మేరకు కారణమైన ఉండచ్చొని చెబుతోంది. పెద్దగా ప్రాతినిధ్యం లేని సమూహాల నుండి ఉద్యోగులను నియమించుకోవడాన్ని మైక్రోసాఫ్ట్ ఎప్పుడూ కొనసాగిస్తోందని, అయితే వారిని నిలుపుకోవడానికి మరింత చేయాల్సి ఉందని మైక్రోసాఫ్ట్ చీఫ్ డైవర్సిటీ ఆఫీసర్ లిండ్సే-రే మెక్‌ఇంటైర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. -
రిటర్న్ టు ఆఫీస్.. ‘నచ్చకపోతే వెళ్లిపోవచ్చు’
ఇంటి నుంచి పనిచేసే విధానానికి దాదాపు అన్ని కంపెనీలు ఇప్పటికే ముగింపు పలికేశాయి. కొన్ని కంపెనీలు వారంలో కొన్ని రోజులు ఇంటి నుంచి ఇంకొన్ని రోజులు ఆఫీస్ నుంచి పనిచేసే హైబ్రిడ్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఇప్పుడు ఆ పద్ధతికీ మంగళం పాడేసి పూర్తిగా రిటర్న్ టు ఆఫీస్ విధానాన్ని అమలు చేయడం ప్రారంభించాయి.ప్రపంచ టెక్నాలజీ దిగ్గజమైన అమెజాన్ కూడా ఇటీవల వారానికి 5-రోజుల ఇన్-ఆఫీస్ విధానాన్ని ప్రకటించింది. అయితే దీనిపై ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. వివాదాస్పదమైన ఈ విధానాన్ని అమెజాన్ టాప్ ఎగ్జిక్యూటివ్ ఒకరు తాజాగా సమర్థించారు. దీనికి మద్దతు ఇవ్వని వారు మరొక కంపెనీకి వెళ్లిపోవచ్చని చెప్పారు.ఇదీ చదవండి: ఉద్యోగులను తొలగిస్తున్న మెటా..అమెజాన్ ఏడబ్ల్యూఎస్ ఆల్-హ్యాండ్ మీటింగ్‌లో ఆ యూనిట్ సీఈవో మాట్ గార్మాన్ ప్రసంగిస్తూ.. తాను పది మందితో మాట్లాడితే వారిలో తొమ్మిది మంది జనవరిలో అమలులోకి వచ్చే కొత్త విధానానికి మద్దతుగా మాట్లాడారని చెప్పారు. కొత్త విధానం నచ్చని వారు నిష్క్రమించవచ్చని ఆయన సూచించారని రాయిటర్స్ పేర్కొంది.అమెజాన్ ప్రస్తుతం మూడు రోజుల ఇన్-ఆఫీస్ విధానాన్ని అమలు చేస్తోంది. అయితే సీఈవో ఆండీ జాస్సీ గత నెలలో ఐదు రోజుల ఇన్-ఆఫీస్ విధానాన్ని ప్రకటించారు. దీంతో అనేకమంది ఉద్యోగులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. కొంతమంది అయితే స్వచ్ఛంద రాజీనామాలకు దిగుతున్నట్లు చెప్పారు. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి తోటి టెక్నాలజీ కంపెనీలు రెండు-మూడు రోజుల ఇన్-ఆఫీస్ పాలసీలను అమలు చేస్తుండగా అమెజాన్ మరో అడుగు ముందుకేసి పూర్తిగా ఐదు రోజుల ఇన్-ఆఫీస్ పాలసీ అమలుకు సిద్ధమైంది. -
ఎల్‌టీమైండ్‌ట్రీ లాభం ప్లస్.. 2,504 మందికి ఉద్యోగాలు
ముంబై: ఐటీ సర్వీసుల కంపెనీ ఎల్‌టీమైండ్‌ట్రీ ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 8 శాతం పుంజుకుని రూ. 1,251 కోట్లను తాకింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 1,161 కోట్లు ఆర్జించింది.మొత్తం ఆదాయం సైతం 6 శాతం ఎగసి రూ. 9,432 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 8,905 కోట్ల టర్నోవర్ సాధించింది. వాటాదారులకు షేరుకి రూ. 20 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. కీలక విభాగాలలో 20 కోట్ల డాలర్ల డీల్సహా పలు కాంట్రాక్టులు కుదుర్చుకున్నట్లు కంపెనీ సీఈవో, ఎండీ దేవశిష్ చటర్జీ పేర్కొన్నారు.ఈ కాలంలో 2,504 మందిని ఉద్యోగాల్లోకి తీసుకున్నట్లు వెల్లడించారు. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 84,438ను తాకింది. సెప్టెంబర్ కల్లా 742 మంది యాక్టివ్ క్లయింట్లను కలిగి ఉంది. ఫలితాల నేపథ్యంలో ఎల్‌టీమైండ్‌ట్రీ షేరు బీఎస్ఈలో 0.7% బలపడి రూ. 6,402 వద్ద ముగిసింది. -
కార్లు, బైక్‌లు అబ్బో.. అదృష్టమంటే ఈ ఐటీ కంపెనీ ఉద్యోగులదే!
చెన్నైకి చెందిన టీమ్ డిటైలింగ్ సొల్యూషన్స్ అద్భుతమైన బహుమతులతో తమ ఉద్యోగులను ఆశ్చర్యపరిచింది. 28 కార్లు, 29 బైక్‌లను బహుమతిగా ఇచ్చింది. ఉద్యోగుల్లో మరింత ప్రేరణ కల్పించడానికి, ఉత్పాదకతను పెంచడానికి కంపెనీ ఈ చర్య చేపట్టినట్లు తెలుస్తోంది.2005లో ప్రారంభమైన టీమ్ డిటైలింగ్ సొల్యూషన్స్ స్ట్రక్చరల్ స్టీల్ డిజైన్, డిటైలింగ్ సేవలను అందిస్తోంది. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ కణ్ణన్ మీడియాతో మాట్లాడుతూ, ఉద్యోగుల కష్టాన్ని గుర్తించి, అభినందించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈ గుర్తింపు ఉద్యోగులను తమ పాత్రల్లో రాణించేలా మరింత ప్రేరేపిస్తుందని కంపెనీ అభిప్రాయపడింది.ఉద్యోగులకు బహుమతిగా ఇచ్చిన కార్లలో మారుతీ సుజుకీ, హ్యుందాయ్ వంటి కంపెనీలతోపాటు మెర్సిడెస్ బెంజ్ కార్లు కూడా ఉండటం విశేషం. కార్లు, బైక్‌లతో పాటు, టీమ్ డిటైలింగ్ సొల్యూషన్స్ తమ ఉద్యోగులకు వివాహ కానుకను కూడా అందిస్తోంది. గతంలో రూ.50,000గా ఉన్న ఈ కానుకను ఈ ఏడాది రూ.లక్షకు కంపెనీ పెంచింది. -
టీసీఎస్ భేష్.. వచ్చే ఏడాది క్యాంపస్ హైరింగ్ షురూ
ముంబై: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) మరోసారి పటిష్ట ఫలితాలు సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికం(జులై–సెప్టెంబర్)లో నికర లాభం 5 శాతం బలపడి రూ. 11,909 కోట్లను తాకింది. గతేడాది(2023–24) ఇదే కాలం(క్యూ2)లో రూ. 11,342 కోట్లు ఆర్జించింది.అయితే ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్–జూన్)లో ఆర్జించిన రూ. 12,040 కోట్లుతో పోలిస్తే లాభాలు నామమాత్రంగా తగ్గాయి. పన్నుకుముందు లాభం రూ. 15,330 కోట్ల నుంచి రూ. 16,032 కోట్లకు మెరుగుపడింది. ఇక మొత్తం ఆదాయం 7% పుంజుకుని రూ. 64,988 కోట్లకు చేరింది. గతేడాది క్యూ2లో రూ. 60,698 కోట్ల టర్నోవర్ సాధించింది. ఈ ఏడాది క్యూ1లో రూ. 63,575 కోట్ల అందుకున్న సంగతి తెలిసిందే. ఇతర విశేషాలు » ఆర్డర్ బుక్ విలువ (టీసీవీ) 8.6 బి. డాలర్లకు చేరింది. దీనిలో ఉత్తర అమెరికా నుంచి 4.2 బిలియన్ డాలర్లు లభించింది. » మొత్తం సిబ్బంది సంఖ్య 6,12,724కు చేరింది. » షేరుకి రూ. 10 చొప్పున రెండో మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది.» 2025–26కు క్యాంపస్ హైరింగ్ షురూఅనిశ్చితుల ఎఫెక్ట్ గత కొన్ని త్రైమాసికాలుగా కనిపిస్తున్న అప్రమత్తత తాజా క్వార్టర్లోనూ కొనసాగింది. ప్రపంచ భౌగోళిక, రాజకీయ అనిశ్చిత పరిస్థితుల్లోనూ మా అతిపెద్ద విభాగం బీఎఫ్ఎస్ఐ రికవరీ బాటలో సాగుతోంది. వృద్ధి మార్కెట్లలో పటిష్ట పనితీరు చూపాం. క్లయింట్లు, ఉద్యోగులు, వాటాదారుల విలువ పెంపుపై ప్రత్యేక దృష్టిని కొనసాగిస్తున్నాం. – కె.కృతివాసన్, సీఈవో, ఎండీ -
ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఆఫర్ లెటర్ జారీలో మార్పులు
దేశీయ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ తన ఆన్‌బోర్డింగ్ ప్రక్రియలో పెద్ద సంస్కరణను ప్రకటించింది. ఈమెయిల్ల ద్వారా జాబ్ ఆఫర్ లెటర్ల జారీని నిలిపివేయాలని నిర్ణయించింది. కంపెనీలో కొత్తగా చేరేవారందరూ ఇకపై అప్లికేషన్ వివరాలను యాక్సెస్ చేయడానికి కంపెనీ అంతర్గత పోర్టల్‌లోకి లాగిన్ అవ్వడాన్ని తప్పనిసరి చేసింది.నియామక ప్రక్రియలో మోసాలను అరికట్టడం, ఆన్‌బోర్డింగ్ ప్రక్రియలో ఉద్యోగులకు మెరుగైన అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా ఇన్ఫోసిస్ ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ చర్య ఫలితంగా అభ్యర్థులు ఆఫర్ లెటర్‌ను చూపి ఇతర కంపెనీలతో బేరసారాలు చేయడం కష్టతరమవుతుంది."ముఖ్యమైన నోటీసు-ఇన్ఫోసిస్ ఆఫర్ లెటర్, అనుబంధ పత్రాలు మా కెరీర్ సైట్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు తమ లాగిన్ ఆధారాలను ఉపయోగించి దీన్ని యాక్సెస్ చేయవచ్చు. ఇకపై అభ్యర్థులకు ఆఫర్ లెటర్లను ఈమెయిల్‌లకు పంపబోము" కంపెనీ పోర్టల్‌లో పేర్కొంది.భారతీయ సాఫ్ట్వేర్ సేవల పరిశ్రమలో ఫ్రెషర్ల ఆన్‌బోర్డింగ్ జాప్యంపై ఆందోళన పెరుగుతున్న తరుణంలో ఇన్ఫోసిస్ ఇలాంటి కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కంపెనీ ఫైలింగ్‌ల ప్రకారం.. 2024 ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ 24 లక్షల ఉద్యోగ దరఖాస్తులను అందుకుంది. వీటిలో 194,367 మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి 26,975 మందిని ఉద్యోగాల్లోకి తీసుకుంది. -
గిఫ్ట్ సిటీలో కాగ్నిజెంట్.. 2000 మందికి ఉపాధి
అహ్మదాబాద్: గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం కాగ్నిజెంట్ గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్‌సిటీ(గిఫ్ట్ సిటీ) గాంధీనగర్‌లో టెక్‌ఫిన్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. 2025 ఫిబ్రవరిలో ప్రారంభించనున్న ఈ సెంటర్‌ను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సొల్యూషన్ల వ్యూహాత్మక కేంద్రంగా వినియోగించనున్నట్లు పేర్కొంది.ప్రధానంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులు, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) పరిశ్రమలకు సంబంధించిన క్లయింట్లకు ఆధునిక సాంకేతిక సొల్యూషన్లు సమకూర్చనున్నట్లు తెలియజేసింది. ప్రాథమికంగా ఈ సెంటర్లో 500 మంది ఉద్యోగులకు ఉపాధి కల్పించనుంది. రానున్న మూడేళ్లలో ఈ సంఖ్యను 2,000కు పెంచనుంది.ప్రపంచస్థాయి కంపెనీలను ఆకట్టుకోవడంలో రాష్ట్రానికున్న పటిష్టతను గిఫ్ట్ సిటీలో కాగ్నిజెంట్ కొత్త కేంద్రం ప్రతిబింబిస్తున్నట్లు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ పేర్కొన్నారు. కొత్త ఆవిష్కరణలు, అభివృద్ధికి అత్యుత్తమ వాతావారణాన్ని కల్పిస్తున్నట్లు తెలియజేశారు. కాగా.. టెక్‌ఫిన్ సెంటర్ ద్వారా బీఎఫ్ఎస్ఐ క్లయింట్లకు డిజిటల్ పరివర్తనలో తోడ్పాటునివ్వనున్నట్లు కాగ్నిజెంట్ పేర్కొంది. -
ఆఫీసుల్లోనే ఆగిపోతున్న గుండెలు.. మరో టెకీ మృతి
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లోని ప్రముఖ ఐటీ కంపెనీ కార్యాలయంలోని వాష్‌రూమ్‌లో ఓ ఉద్యోగి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం జరిగిందని, మృతుడిని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సీనియర్ అనలిస్ట్ నితిన్ ఎడ్విన్ మైఖేల్ (40) గా గుర్తించామని పోలీసులు తెలిపారు.శుక్రవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో కార్యాలయంలోని వాష్‌రూమ్‌కి వెళ్లిన మైఖేల్ ఎంతకీ బయటకు రాలేదని, సోనెగావ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన అధికారి తెలిపారు. అతని సహచరులు వెంటనే అతనిని నాగ్‌పూర్‌లోని ఎయిమ్స్‌కు తరలించగా పరశీలించిన వైద్యులు అతను మృతిచెందినట్లు ప్రకటించారు.సోనేగావ్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి ప్రమాదవశాత్తు మృతిగా కేసు నమోదు చేశారు. ప్రాథమిక శవపరీక్షలో ఆ వ్యక్తి గుండెపోటుతో మరణించినట్లు తేలిందని పోలీసు అధికారి తెలిపారు. మైఖేల్‌కు భార్య, ఆరేళ్ల కుమారుడు ఉన్నట్లు తెలిసింది.ఇటీవల కార్పొరేట్ ఉద్యోగులు కార్యాలయాల్లోనే మృత్యువాత పడుతున్నారు. లక్నోలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో సదాఫ్ ఫాతిమా అనే మహిళా ఉద్యోగి బ్యాంకులోనే కుప్పకూలి మరణించారు. అంతకుముందు పుణేలోని ఈవై కంపెనీ కార్యాలయంలో కేరళకు చెందిన ఛార్టర్డ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ పెరయిల్ మృతిచెందారు. అధిక పనిభారం, విషపూరితమైన పని సంస్కృతే ఉద్యోగుల మరణాలకు కారణమవుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
యాక్సెంచర్‌లో జోరుగా నియామకాలు
న్యూఢిల్లీ: ఐటీ, కన్సల్టింగ్ సేవల దిగ్గజం యాక్సెంచర్ భారత్‌లో గణనీయంగా నియామకాలు చేపట్టనుంది. ప్రధానంగా ఫ్రెషర్స్‌ను తీసుకోవడంపై మరింతగా దృష్టి పెడుతోంది. కంపెనీ సీఈవో జూలీ స్వీట్ ఈ విషయాలు వెల్లడించారు.జెనరేటివ్ఏఐ (జెన్‌ఏ) మీద ఫోకస్‌తో తమ సర్వీసులను ఎప్పటికప్పుడు సరికొత్తగా తీర్చిదిద్దుకుంటున్నట్లు ఇన్వెస్టర్లతో సమావేశంలో ఆమె వివరించారు. 2024 ఆర్థిక సంవత్సరంలో తమ వ్యాపార వృద్ధికి ఇదే దోహదపడిందని పేర్కొన్నారు. జెన్ఏఐ సాంకేతికతను ఉపయోగించడంలో సిబ్బందికి విస్తృతంగా శిక్షణనిస్తున్నట్లు జూలీ చెప్పారు.ఐర్లాండ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న యాక్సెంచర్‌కి భారత్‌లో 3,00,000కు పైగా సిబ్బంది ఉన్నారు. అంతర్జాతీయంగా 7,74,000 మంది పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. 2024 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 64.90 బిలియన్ డాలర్ల ఆదాయం నమోదు చేసింది. యాక్సెంచర్ సెప్టెంబర్–ఆగస్టు వ్యవధిని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది. -
వర్క్ ఫ్రమ్ హోమ్ రొటీన్ కాదు.. ఇక వచ్చేయండి..
వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని కంపెనీలు స్వస్తి పలుకుతున్నాయి. తాజాగా టెక్ దిగ్గజం డెల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ సేల్స్ టీమ్ ఉద్యోగులను సెప్టెంబరు 30 నుండి ఆఫీస్‌లకు వచ్చేయాలని ఆదేశించింది. వారానికి ఐదు రోజులూ ఆఫీస్ నుంచే పనిచేయాలని డెల్ ఉద్యోగులను కోరిందని దీనికి సంబంధించిన మెమోను తాము చూసినట్లు రాయిటర్స్ పేర్కొంది.ఉద్యోగులకు సహకార వాతావరణాన్ని ఏర్పాటు చేయడం, నైపుణ్యాలను పెంపొందించుకోవడం కోసమే ఈ మార్పు చేస్తున్నట్లు డెల్ తెలిపింది. ఇందుకోస టీమ్ ఆఫీస్‌లో ఉండాల్సిన అవసరం ఉందని మెమో పేర్కొంది. "రిమోట్‌గా పని చేయడం అన్నది మినహాయింపుగా ఉండాలి. రొటీన్ కాకూడదు" అని జోడించింది.మెమో ప్రకారం.. సేల్స్ టీమ్‌లోని ఫీల్డ్ ప్రతినిధులు వారానికి ఐదు రోజులు కస్టమర్లు, భాగస్వాములతో లేదా కార్యాలయంలో పనిచేయాల్సి ఉంటుంది. గతంలో వీరు వారానికి మూడు రోజులు కార్యాలయం నుండి పని చేయాల్సి ఉండేది. ఇక ఆఫీస్‌కు వచ్చేందుకు సాధ్యపడని సేల్స్ టీమ్ సభ్యులు రిమోట్‌గానే పని చేయవచ్చని అని డెల్ వెల్లడించింది.కోవిడ్ మహమ్మారి విజృంభణ సమయం నుండి చాలా కంపెనీలు ఉద్యోగులను ఇంటి నుండి పని చేయడానికి అనుమతించాయి. అయితే, కొన్ని టెక్ సంస్థలు, ఇప్పుడు ఉద్యోగులతో వారంలో రెండు నుండి మూడు రోజులు ఆఫీస్‌ల నుంచి పని చేయిస్తున్నాయి. వచ్చే ఏడాది నుంచి వారానికి ఐదు రోజులు కంపెనీ కార్యాలయాలలో పని చేయాలని గత వారం ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తమ ఉద్యోగులకు ఆదేశాలను జారీ చేసింది. -
ఐటీ కంపెనీలు క్యాంపస్‌లకు వచ్చేస్తున్నాయ్..
చాలాకాలం తర్వాత ఐటీ కంపెనీలు క్యాంపస్‌లకు వచ్చేస్తున్నాయి. దాదాపు ఏడాది సుదీర్ఘ విరామం అనంతరం కంపెనీలు రిక్రూట్మెంట్ డ్రైవ్‌ల కోసం కాలేజీ క్యాంపస్‌లకు వస్తున్నాయి. ఇది ఐటీ పరిశ్రమలో పునరుజ్జీవనాన్ని సూచిస్తోంది. వ్యాపారాలు రికవరీ సంకేతాలను చూపడం, ప్రత్యేక సాంకేతిక ప్రతిభకు డిమాండ్ పెరగడంతో క్యాంపస్ నియామకాలపై కంపెనీలు దృష్టి పెట్టాయి.అయితే గతంలో మాదరి ఎంట్రీ-లెవల్ ఇంజనీర్లను పెద్దమొత్తంలో నియమించుకోవడం కాకుండా క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాలలో నైపుణ్యం కలిగినవారి కోసం ఐటీ కంపెనీలు వెతుకుతున్నాయి. వీరికి వేతనాలు కూడా సాధారణంగా ఎంట్రీ-లెవల్ ఉద్యోగులకు ఇచ్చేదాని కంటే ఎక్కువగా ఆఫర్ చేస్తున్నాయి.క్యాంపస్‌ల బాటలో కంపెనీలుఇన్ఫోసిస్, టీసీఎస్, ఐబీఎం, ఎల్‌టీఐమైండ్‌ట్రీ వంటి ప్రధాన ఐటీ సంస్థలు ప్రారంభ దశ నియామకాల కోసం ఇప్పటికే కాలేజీ క్యాంపస్‌లను సందర్శించాయి. వీటిలో టీసీఎస్ 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని యోచిస్తోంది. అలాగే ఇన్ఫోసిస్ కూడా క్యాంపస్, ఆఫ్-క్యాంపస్ డ్రైవ్‌ల ద్వారా 15,000 నుండి 20,000 మంది ఫ్రెష్ గ్రాడ్యుయేట్లను నియమించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏడాది విరామం తర్వాత విప్రో కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో 10,000 నుండి 12,000 మంది ఫ్రెషర్లను నియమించుకునే ప్రణాళికలతో తిరిగి క్యాంపస్‌ల బాట పట్టనుంది.ఇదీ చదవండి: ఉద్యోగులకు విప్రో కొత్త కండీషన్!మరింత కఠినంగా ఎంపికక్యాంపస్ ప్లేస్మెంట్ ప్రక్రియ ఇప్పుడు మరింత కఠినంగా మారింది. అధిక కట్-ఆఫ్ స్కోర్లు, ప్రత్యేక నైపుణ్యాలు, సర్టిఫికేషన్లకు ప్రాధాన్యం పెరిగింది. అభ్యర్థులను అంచనా వేయడానికి సాంప్రదాయ కోడింగ్ పరీక్షలే కాకుండా వారి నైపుణ్యాలు, నేపథ్యంపై సంపూర్ణ అవగాహన పొందడానికి సోషల్ మీడియా ప్రొఫైల్స్, సంబంధిత సర్టిఫికేషన్లను పరిశీలిస్తున్నాయి. ఈ క్రమంలో హై-డిమాండ్ నైపుణ్యాలపై కంపెనీలు దృష్టి కేంద్రీకరించడం వల్ల క్లౌడ్, డేటా, ఏఐ వంటి అభివృద్ధి చెందుతున్న టక్నాలజీలలో ప్రత్యేక పరిజ్ఞానం ఉన్నవారికే ఉద్యోగ అవకాశాలు దక్కే పరిస్థితి ఏర్పడింది. -
ఆర్నెళ్లు ఆలస్యం.. యాక్సెంచర్ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్
ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులకు ప్రముఖ కన్సల్టింగ్, ఐటీ సంస్థ యాక్సెంచర్ చేదు వార్త చెప్పింది. కన్సల్టెన్సీ రంగంలో కొనసాగుతున్న సవాళ్లను సూచిస్తూ యాక్సెంచర్ తన ప్రమోషన్ సైకిల్లో గణనీయమైన మార్పును ప్రకటించింది. పదోన్నతుల ప్రక్రియను ఆరు నెలలు ఆలస్యం చేసింది.యాక్సెంచర్‌లో ప్రమోషన్లు ఆనవాయితీ ప్రకారం డిసెంబర్లో చేపడతారు. కానీ బ్లూమ్‌బెర్గ్ ద్వారా పొందిన అంతర్గత కంపెనీ సందేశం ప్రకారం.. ప్రమోషన్లు ఇప్పుడు వచ్చే జూన్‌లో జరుగుతాయి. కార్పొరేట్ వ్యయం, స్థూల ఆర్థిక అస్థిరత కఠినతరం కావడం వంటివాటతో ఆర్థిక అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో కంపెనీ ఈ మార్పు చేసినట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: ఆఫీస్‌కు రాకుంటే.. ఉద్యోగులకు విప్రో కొత్త కండీషన్!క్లయింట్ వ్యూహాలు, డిమాండ్ స్థాయిలకు అనుగుణంగా కంపెనీ విజిబులిటీకి కొత్త ప్రమోషన్ షెడ్యూల్ సరిగ్గా సరిపోతుందని కంపెనీ ప్రతినిధి ధ్రువీకరించారు. ఎందుకంటే ఇవి సాధారణంగా సంవత్సరం మధ్య నాటికి స్పష్టంగా తెలుస్తాయి. ఈ వార్తల తర్వాత యాక్సెంచర్ స్టాక్ మంగళవారం దాదాపు 5 శాతం క్షీణతను చూసింది.కన్సల్టెన్సీ పరిశ్రమను ప్రభావితం చేసే విస్తృత ఆందోళనలకు ఇన్వెస్టర్లు ప్రతిస్పందించారు. ప్రమోషన్లను ఆలస్యం చేయాలనే యాక్సెంచర్ నిర్ణయం కన్సల్టెన్సీ పరిశ్రమలో విస్తృత ధోరణిని ప్రతిబింబిస్తుంది. మెకిన్సే, ఎర్నెస్ట్ & యంగ్, ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్ వంటి కంపెనీలు కూడా ఆర్థిక ఇబ్బందులకు ప్రతిస్పందనగా సిబ్బంది సర్దుబాట్లు చేశాయి. -
ఆఫీస్‌కు రాకుంటే.. ఉద్యోగులకు విప్రో కొత్త కండీషన్!
ఉద్యోగులను ఆఫీస్‌లకు రప్పించడానికి దేశీయ ఐటీ దిగ్గజం విప్రో కొత్త కండీషన్ పెట్టింది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్‌కు సంబంధించి నూతన విధానాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆఫీస్‌లో హాజరుకు ఉద్యోగుల లీవ్‌లకు లింక్ పెట్టింది. దీని ప్రకారం.. ఉద్యోగులు వారంలో కనీసం మూడు రోజులు ఆఫీస్‌లకు వచ్చి పనిచేయాలి. లేకుంటే లీవ్స్ వదులుకోవాల్సిందే..కొత్త వర్క్ ఫ్రమ్ ఆఫీస్ పాలసీ గురించి తెలియజేస్తూ సెప్టెంబర్ 2వ తేదీనే ఉద్యోగులకు ఈ-మెయిల్స్ పంపింది. ఈ పాలసీకి కట్టుబడి ఉండాలని ఆదేశించింది. మరోవైపు ఎవరికైనా వర్క్ ఫ్రమ్ హమ్ రిక్వెస్ట్‌లకు అనుమతి ఇచ్చి ఉంటే తక్షణమే వాటన్నింటినీ రద్దు చేసి వారానికి కనీసం మూడు రోజులు ఆఫీస్‌కి వచ్చేలా సూచించాలని హెచ్ఆర్ విభాగానికి కూడా ఆదేశాలు జారీ చేసినట్లు ‘మింట్’ కథనం పేర్కొంది.ఇదీ చదవండి: వచ్చే ఏడాది నుంచి పూర్తిగా ఆఫీస్ నుంచే పనివిప్రో అమలు చేస్తున్న కొత్త వర్క్ ఫ్రమ్ ఆఫీస్ పాలసీ ప్రకారం.. వారంలో మూడు రోజులు ఆఫీస్ హాజరు తప్పనిసరి. ఒక వేళ ఆఫీస్‌కి హాజరుకాకపోతే దాన్ని సెలవుగా పరిగణిస్తారు. అంటే వారంలో మూడు రోజులు ఆఫీస్‌కు రాకపోతే ఆ రోజులను సెలవుగా పరిగణించి ఆ మేరకు లీవ్స్ కట్ చేస్తారని ఓ ఉద్యోగిని ఉటంకిస్తూ మింట్ వివరించింది. అయితే ఈ నిర్భంధ హాజరు విధానం ప్రత్యేకంగా కొన్ని ప్రాజెక్టుల్లో ఉద్యోగులకు మాత్రమేనని, అందరికీ ఇది వర్తించదని చెబుతున్నారు. -
టీసీఎస్ ఉద్యోగులకు ఐటీ నోటీసులు
ప్రముఖ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఉద్యోగులు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు అందుకున్నారు. టీడీఎస్ క్లెయిమ్‌లలో వ్యత్యాసాలు ఉన్నాయంటూ ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలోని సెక్షన్ 143(1) ప్రకారం ఐటీ శాఖ ఈ నోటీసులు జారీ చేసింది.2024 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఉద్యోగులకు కట్ చేసిన టీడీఎస్‌లలో కొంత భాగం ఆదాయపు పన్ను శాఖ రికార్డులలో నమోదు కాలేదని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసుల్లో డిమాండ్ చేసిన మొత్తాలు రూ.50,000 నుంచి రూ.1,45,000 వరకు ఉన్నాయి. టీడీఎస్ వ్యత్యాసాలపై వడ్డీ, ఛార్జీలను సైతం నోటీసుల్లో పేర్కొన్నారు.ట్యాక్స్ పోర్టల్‌లో సాంకేతిక సమస్యల కారణంగా టీడీఎస్ క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా అప్డేట్ కాకపోయి ఉండవచ్చని టీసీఎస్ ఉద్యోగి ఒకరు తెలిపారు. తాము క్లెయిమ్స్‌ను మ్యాన్యువల్ సమర్పించాల్సి వచ్చిందని, సిస్టమ్‌లో నమోదు కాని టీడీఎస్ మొత్తానికి సంబంధించి ఐటీ శాఖ నోటీసులు పంపిందని ఆ ఉద్యోగి వివరించారు.ఇదీ చదవండి: కలవరపెడుతున్న డెల్ ప్రకటనటీడీఎస్ రికార్డుల్లోని వ్యత్యాసాల కారణంగా చాలా మంది ఉద్యోగులకు ఆదాయపు పన్ను రీఫండ్లు ఆలస్యం అయ్యాయి. ఆదాయపు పన్ను శాఖ నుండి ప్రాథమిక అంచనా ఆందోళన కలిగించింది. సమస్యలను సరిదిద్దే వరకు ట్యాక్స్ రీఫండ్‌లో మరింత జాప్యం జరుగుతుందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. డిమాండ్ నోటీసులు ఉన్నప్పటికీ, పన్ను అధికారుల ద్వారా రీప్రాసెసింగ్ పూర్తయ్యే వరకు ఎలాంటి చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదని టీసీఎస్ తమ ఉద్యోగులకు ఇంటర్నల్ ఈ-మెయిల్స్‌లో తెలియజేసింది. -
లేఆఫ్ దడ.. కలవరపెడుతున్న డెల్ ప్రకటన
లేఆఫ్‌ల దడ టెకీలను పీడిస్తూనే ఉంది. తొలగింపులు కొనసాగుతాయని ప్రముఖ టెక్నాలజీ కంపెనీ డెల్ తెలియజేసింది. ఉత్పత్తుల డిమాండ్ తగ్గడం, విక్రయాలు మందగించడంతో వ్యయాలను నియంత్రణకు కంపెనీ కష్టాలు పడుతోంది. ఇప్పటికే వేలాది మందికి లేఆఫ్‌లు ప్రకటించిన కంపెనీ ఇవి ఇంకా కొనసాగుతాయని వెల్లడించడం ఉద్యోగులను కలవరపెడుతోంది.ఇప్పటికే గత నెలలో ప్రకటించిన లేఆఫ్‌లలో దాదాపు 12,500 మందికి ఉద్వాసన పలికింది డెల్. పర్సనల్ కంప్యూటర్లకు డిమాండ్ పుంజుకోకపోవడం, ఏఐ కోసం ఆప్టిమైజ్ చేసిన సర్వర్ల అమ్మకాలు లాభదాయకంగా లేవన్న ఆందోళనల నేపథ్యంలో ఖర్చుల నియంత్రణ కోసం ఉద్యోగుల తొలగింపులు ఇంకా కొనసాగుతాయని ప్రకటించింది.ఇదీ చదవండి: ‘ఇన్ఫోసిస్ సంగతేంటో చూడండి’..బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. డెల్ కంపెనీ ఉద్యోగులను తొలగింపులను కొనసాగించడంతోపాటు నియామకాలను సైతం తగ్గించనుంది. ఉద్యోగుల పునర్వ్యవస్థీకరణ, ఇతర చర్యలు 2025 ఫిబ్రవరి వరకు కొనసాగనున్నాయి. ఈ ఏడాది జూన్‌లో కంపెనీ ప్రకటించిన లేఆఫ్‌లతో చాలా మంది ఉద్యోగులు ప్రభావితమయ్యారు. ఇందులో సేల్స్ ఉద్యోగులే ఎక్కువ మంది. ప్రభావితమైన ఉద్యోగులు 12,500 మందికి పైనే ఉంటారని అంచనా వేసినా దాన్ని కంపెనీ ధ్రువీకరించలేదు. తొలగించినవారికి సీవెరెన్స్ కింద 328 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉందని నివేదిక పేర్కొంది. -
‘ ఇన్ఫోసిస్ సంగతేంటో చూడండి’.. రంగంలోకి ప్రభుత్వం
ఫ్రెషర్లను ఆన్‌బోర్డ్ చేయడంలో జాప్యం చేస్తున్న ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ విషయంలో ప్రభుత్వం స్వయంగా రంగంలోకి దిగింది. ఈ సంగతేంటో చూడాలని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.ఈ మేరకు కర్ణాటక రాష్ట్ర లేబర్ కమిషనర్ కార్యాలయానికి ప్రభుత్వం సూచనలను అందించింది. ఇన్ఫోసిస్ ఫ్రెషర్లను ఆన్‌బోర్డ్ చేయడంలో జాప్యం చేస్తున్న వ్యవహారాన్ని పరిశీలించి తమకు, అభ్యర్థులకు అప్డేట్లను అందించాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కేంద్ర కార్మిక శాఖ కోరింది.ఇన్ఫోసిస్ 2022లో ఆఫర్ లెటర్ ఇచ్చిన 2,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను ఆన్‌బోర్డింగ్ చేయడంలో ఆలస్యం చేస్తోందన్న ఆందోళనల నేపథ్యంలో ఈ చర్య వచ్చింది. ఆన్‌బోర్డింగ్ తేదీలలో సర్దుబాటు చేసినప్పటికీ, ఫ్రెషర్లకు ఇచ్చిన ఆఫర్లను గౌరవిస్తామని, అందిరినీ ఉద్యోగాల్లోకి చేర్చుకుంటామని ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ హామీ ఇచ్చారు. 2024 జూన్ నాటికి 315,000 మంది ఉద్యోగులతో ఐటీ రంగంలో ఇన్ఫోసిస్ ఒక ప్రధానమైన శక్తిగా ఉంది.2,000 మంది గ్రాడ్యుయేట్లను ఇన్ఫోసిస్ ఆలస్యంగా ఆన్‌బోర్డింగ్ చేయడంపై ఐటీ, ఐటీఈఎస్ ఉద్యోగుల యూనియన్ అయిన నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) నుండి కేంద్ర కార్మిక, ఉపాధి శాఖకు ఫిర్యాదు అందింది.ఈ వారం ప్రారంభంలో వచ్చిన నివేదికల ప్రకారం.. ఇన్ఫోసిస్ ఆన్‌బోర్డ్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్న కొంతమంది గ్రాడ్యుయేట్లకు కన్ఫర్మేషన్ ఈమెయిల్‌లను పంపడం ప్రారంభించింది. మైసూర్లో చేరడానికి అక్టోబర్ 7ను షెడ్యూల్ తేదీగా పేర్కొంది. -
30 నెలలు వెయిట్ చేయించి.. షాకిచ్చిన విప్రో!: మండిపడుతున్న ఫ్రెషర్స్
ఏదైనా కంపెనీలో ఒక ఉద్యోగానికి ఎంపికైతే.. ఒక వారం లేదా ఒక నెలలో జాయినింగ్ ఉంటుంది. అయితే దిగ్గజ ఐటీ సంస్థ 'విప్రో' మాత్రం ఆఫర్ లెటర్ ఇచ్చి.. 30 నెలల తరువాత ఫ్రెషర్లను రిజెక్ట్ చేసింది. దీంతో ఆ కంపెనీపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఆఫర్ లెటర్ పొందిన అభ్యర్థులకు కంపెనీ ఓ మెయిల్ పంపించింది. ఇందులో 'మీకు ముందుగా తెలియజేసినట్లు.. ఆన్‌బోర్డింగ్ కోసం ముందస్తు నైపుణ్య శిక్షణను విజయవంతంగా పూర్తి చేయడం తప్పనిసరి'. అర్హత ప్రమాణాలు పూర్తి చేయడంలో ఫ్రెషర్లు విఫలమయ్యారు' అని వెల్లడించింది. ఇన్ని రోజులూ జాయినింగ్ డేట్ పొడిగిస్తూ.. ఆఖరికి ఉద్యోగులను రిజెక్ట్ చేసింది. దీంతో ఉద్యోగులు సోషల్ మీడియాలో తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇన్నేళ్ల నిరీక్షణకు కంపెనీ ఇలాంటి ఫలితం ఇస్తుందని అస్సలు ఊహించలేదని అన్నారు.విప్రో మాత్రం ఫ్రెషర్స్ ఆఫర్స్ లెటర్స్ రద్దు చేసిన తరువాత.. క్లయింట్ అవసరాలకు అనుగుణంగా ప్రతి ఉద్యోగి సరైన నైపుణ్యాలను ప్రదర్శించాలని ఆశిస్తున్నామని వెల్లడించింది. కొత్త టెక్నాలజీలో ఉద్యోగులకు తప్పకుండా ప్రావీణ్యం ఉండాలని పేర్కొంది.ఉద్యోగం వస్తుందని ఎదురు చూసిన ఎంతోమంది ఉద్యోగులకు విప్రో పెద్ద షాక్ ఇచ్చింది. ఓ ప్రముఖ కంపెనీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏ మాత్రం సమంజసం కాదని పలువురు చెబుతున్నారు. దీనిపైన ఐటీ ఉద్యోగ సంఘాలు ఎలా స్పందిస్తాయో త్వరలోనే తెలుస్తుంది. -
బిగ్.. హంబగ్!
సాక్షి, హైదరాబాద్: కాలేజీలో క్యాంపస్ నియామకాలున్నాయా? ఏయే కంపెనీలు వస్తాయి? వార్షిక ప్యాకేజీలు ఎలా ఉంటాయి? ఇంజనీరింగ్‌లో చేరే ప్రతీ విద్యార్థి ముందుగా వాకబు చేసే అంశాలివి. పెద్ద కంపెనీలు క్యాంపస్ నియామకాలు చేపడతాయంటే ఆ కాలేజీకి ఎగబడతారు. కానీ ఐటీ కంపెనీల వల్ల ఇప్పుడు ట్రెండ్ మారిందంటున్నారు నిపుణులు. పెద్ద పెద్ద ఐటీ కంపెనీల కన్నా... చిన్న మధ్య తరహా ఐటీ కంపెనీలే ఎక్కువ వేతనాలు ఇస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే నైపుణ్యం ఉన్న వారికి పెద్ద సంస్థల కన్నా భారీగా జీతాలు చెల్లిస్తున్నాయి. కోవిడ్ తర్వాత ఈ మార్పు స్పష్టంగా కన్పిస్తోందని స్పెషలిస్ట్ స్టాఫింగ్ కంపెనీ ‘ఎక్స్‌ఫెనో’ అధ్యయనంలో వెల్లడైంది.దూసుకెళ్లే అవకాశాలుదేశంలో ఐటీ సేవలు అందించే ఆరు కంపెనీల్లో దాదాపు 20 వేల మంది వేతనాలను పరిశీలించింది. వీళ్లంతా ఇంజనీరింగ్ పూర్తి చేసి, కొత్తగా ఐటీ ఉద్యోగాల్లో చేరినవాళ్ళే. వీళ్ళల్లో 74 శాతం మందికి ఏడాదికి రూ. 2.5 నుంచి రూ. 5 లక్షల వేతనం ఇస్తున్నారు. 12 శాతం మందికి రూ. 5.75 నుంచి రూ. 7 లక్షల వార్షిక వేతనం ఇస్తున్నారు. కేవలం 7 శాతం మంది మాత్రమే రూ. 7.5 లక్షల కన్నా ఎక్కువ వేతనం పొందుతున్నారు⇒ మధ్యస్థంగా ఉండే 10 ఐటీ సర్వీస్ కంపెనీల్లో 5 వేల మంది వేతనాలపై అధ్యయనం చేశారు. 57 శాతం మందికి రూ. 2.5–5 లక్షల వార్షిక ప్యాకేజీ ఇస్తున్నారు. 30 శాతం మందికి రూ.5.75 లక్షల ప్రారంభ వేతనం ఇస్తున్నాయి. 7 శాతం మందికి పెద్ద సంస్థలకన్నా ఎక్కువ వేతనం చెల్లిస్తున్నాయి.⇒ ఆరు పెద్ద కంపెనీల్లో రెండేళ్ల తర్వాతే పదోన్నతులు లభిస్తున్నాయి. వేతనంలో హైక్ నిమిత్తం మధ్యస్థ కంపెనీలు ప్రతీ ఆరు నెలలకూ వృత్తి నైపుణ్య అంచనా వేస్తున్నాయి. 58 శాతం ఫ్రెషర్స్‌కు స్కిల్‌ను బట్టి ప్రమోషన్లు ఇచ్చారు.కోతకు చాన్స్ తక్కువేగడచిన ఐదేళ్లుగా టైర్–1 ఐటీ కంపెనీలు భారీగా ఉద్యోగులను తగ్గించుకున్నాయి. ఆరు కంపెనీల్లో 15 శాతం మేర కోత పెట్టాయి. హై స్కిల్ ఉండి, మధ్యస్థ వేతనం ఉన్న వాళ్ళనే కొనసాగించేందుకు ఇష్టపడుతున్నాయి. ఫ్రెషర్స్ విషయంలో పరిస్థితి దయనీయంగా ఉంటోంది. మార్కెట్ పరిస్థితులు, అంతర్జాతీయంగా వచ్చే పరిస్థితులను పెద్ద కంపెనీలు ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. చిన్న, మధ్యస్థ ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల, స్కిల్స్ ఉంటే అంత తొందరగా తీసేసే అవకాశం ఉండదు. కాబట్టి వేగంగా ప్రమాదం ముంచుకొస్తుందన్న భయం ఉండదని ఉద్యోగులు భావిస్తున్నారు. పెద్ద కంపెనీల ఉద్యోగుల్లో అనుక్షణం భయం వెంటాడుతోంది.ట్రెండ్‌ను కాలేజీలూ పట్టుకోవాలిప్రతీ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా క్యాంపస్ నియామకాలకు సంబంధించిన విభాగం ఉంటుంది. మొదటి సంవత్సరం నుంచే విద్యార్థులకు స్కిల్స్‌పై శిక్షణ ఇస్తున్నాయి. అయితే, పెద్ద కంపెనీల మనోభావాలనే ఈ శిక్షణలో భాగస్వామ్యం చేస్తున్నాయి. దీంతో పాటు చిన్న, మధ్యస్థ ఐటీ సంస్థల అవసరాలు, అవి ఆఫర్ చేస్తున్న జాబ్ మార్కెట్‌పైనా అవగాహన కల్పించాలని హైదరాబాద్ లోని ఓ మల్టీ నేషనల్ కంపెనీ సీనియర్ కన్సల్టెంట్ విశేష్ తెలిపారు. క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్‌లో ఫ్రెషర్స్‌కు పెద్ద కంపెనీలకన్నా, చిన్న కంపెనీలే అత్యధిక వేతనాలు ఇస్తున్నాయి. ఈ దిశగా శిక్షణ ఇస్తే విద్యార్థుల ఉపాధి అవకాశాల్లో మార్పులుండే వీలుంది.వేతనాల్లో పెద్ద వాటితో పోటీ..ఉద్యోగి నిర్వహించే పాత్ర, అతని అనుభవాన్ని బట్టి కంపెనీల్లో వేతనాలుంటున్నాయి. ఈ విషయంలో పెద్ద కంపెనీలతో చిన్న కంపెనీలు ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఇది ఈ మధ్య కన్పిస్తున్న కొత్త ట్రెండ్. - రోహన్ సిల్వెస్టర్ (టాలెంట్ స్ట్రాటజీ అడ్వైజర్,ఇన్‌డీడ్ ఇండియా)నిలబడేందుకు పోరాటం చిన్న, మధ్యస్థ కంపెనీలు తమ ఉనికిని నిలబెట్టుకునేందుకు ఓ రకంగా పోరాటం చేస్తున్నాయి. మార్కెట్లో నిలబడాలని ప్రయత్నిస్తున్నాయి. ఈ కారణంగా నైపుణ్యం ఉన్న ఫ్రెషర్స్‌కు పెద్ద కంపెనీల కన్నా 30 నుంచి 50 శాతం వేతనాలు ఎక్కువ ఇచ్చి చేర్చుకుంటున్నాయి. పదేళ్ళ నికర వృద్ధిలో ఇవి కూడా అత్యుత్తమ ప్రమాణాలకు చేరుకోవడం ఇక్కడ గమనించాల్సిన అంశం. - నీలమ్‌కౌర్ (ఐటీ ప్రొఫెషనల్, ముంబై) చిక్కులు తెస్తున్న ఆర్థికాంశాలు ఆర్థిక మాంద్యం పెద్ద కంపెనీ ఉద్యోగుల స్థితి గతులను మారుస్తోంది. ఈ ప్రభావం చిన్న, మధ్యస్థ కంపెనీల్లో తక్కువగా ఉంటోంది. కొన్ని అంతర్జాతీయ కంపెనీలు కూడా ఐటీ సేవల్లో ఈ సంస్థలకే ప్రాధాన్యమిచ్చే ధోరణి కన్పిస్తోంది. కాబట్టి స్కిల్స్ ఉన్న వాళ్ళకు చిన్న కంపెనీల్లోనూ ఢోకా ఉండదు. ఎంఎస్ ప్రసాద్ (టైర్–1 కంపెనీలో వర్క్‌ఫోర్స్ హెడ్) -
HYD: మాదాపూర్‌లో బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు దండుకుని మాదాపూర్‌లోని మరో సాఫ్ట్వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. దీంతో, మోసపోయామని భావించిన దాదాపు 200 మంది నిరుద్యోగులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.వివరాల ప్రకారం.. అయ్యప్ప సొసైటీలో ఫ్రైడే అప్ కన్సెల్టెన్సీ కంపెనీ నిరుద్యోగులకు టోకరా ఇచ్చింది. ఉద్యోగం ఆశ చూపించి దాదాపు 200 మంది నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసింది. ఒక్కొక్కరి నుంచి రూ.1.50లక్షల చొప్పున వసూలు చేసింది సదరు కంపెనీ. ఇలా.. శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించింది.ఈ క్రమంలో శిక్షణ అనంతరం ప్లేస్మెంట్ ఇప్పించినట్టు నమ్మించి జీతాలు ఇవ్వకుండా మోసం చేసింది. అనంతరం.. కార్యాలయానికి ఉన్న పళంగా తాళం వేయడంతో బాధితులు ఒక్కసారిగా ఖంగుతున్నారు. దీంతో, మోసపోయామని గ్రహించిన బాధితులు శనివారం మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కంపెనీకి బెంగళూరు, విజయవాడలో కేంద్రాలు ఉన్నట్టు సమాచారం. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. -
అవాక్కయ్యేలా ఐటీ కంపెనీ శాలరీ హైక్!
ఫ్రెషర్లకు అతి తక్కువ జీతాల ప్యాకేజీలను అందించినందుకు విమర్శలు ఎదుర్కొంటున్న ఐటీ సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ వేతనాల పెంపులోనూ అలాంటి ధోరణినే అవలంభిస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది ఉద్యోగులకు వార్షిక జీతాల పెంపును అత్యల్పంగా కేవలం 1% మాత్రమే అందించినట్లు నివేదికలు వెల్లడించాయి.ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. కాగ్నిజెంట్ టెక్నాలజీ సర్వీసెస్ కంపెనీ నాలుగు నెలల ఆలస్యంగా జీతాల పెంపును ప్రారంభించింది. జీతాల పెంపు 1% నుంచి 5% వరకు ఉంటుంది. "3 రేటింగ్ ఉన్నవారు 1-3%, 4 రేటింగ్ ఉన్న ఉద్యోగులు 4%, 5 రేటింగ్ పొందిన వారు 4.5% నుంచి 5% వేతన పెంపు అందుకున్నారు" అని సంబంధిత వర్గాలు తెలిపాయి.ఈ అమెరికన్ ఐటీ కంపెనీ గత సంవత్సరం ఏప్రిల్‌లో ఉద్యోగులకు 7 శాతం నుంచి 11 శాతం వరకు వేతనాలు పెంచింది. భారత్‌లో ఈ కంపెనీకి సుమారుగా 254,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇది దాని మొత్తం శ్రామికశక్తిలో 70 శాతం. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 8,100 క్షీణించింది. దీనితో ఉద్యోగుల సంఖ్య 336,300కి తగ్గింది. -
మరిన్ని ఐటీ కంపెనీలకు షోకాజ్ నోటీసులు!.. ఎందుకంటే?
పన్నులు చెల్లించలేదనే కారణంగా ఇన్ఫోసిస్ కంపెనీకి జీఎస్టీ అధికారులు ప్రీ-షోకాజ్ నోటీసు జారీ చేశారు. 2017 జులై నుంచి 2022 మార్చి వరకు 32,403 కోట్ల రూపాయలకు జీఎస్టీ చెల్లింపు చేయలేదనేది ఈ ప్రీ-షోకాజ్ నోటీసు సారాంశం.ఇన్ఫోసిస్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసిన అధికారులు.. మరిన్ని టెక్ కంపెనీలను రాబోయే రోజుల్లో ఇలాంటి నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని సమాచారం. తమ విదేశీ కార్యాలయాల సేవలపై పన్నును ఎగవేసిన ఆరోపణలపై తదుపరి పరిశీలనలో నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.ప్రీ-షోకాజ్ నోటీసు అందుకున్న తరువాత ఇన్ఫోసిస్ స్పందిస్తూ.. ఎప్పటికప్పుడు జీఎస్టీ చెల్లిస్తూనే ఉన్నామని, ఈ విషయంలో తాము కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాల నిబంధలనకు లోబడి పాటించాల్సిన అన్ని నిబంధవులను పాటిస్తున్నట్లు తెలిపింది.ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (ఐజీఎస్టీ) చట్టం ప్రకారం భారతదేశం వెలుపల ఉన్న ఇన్ఫోసిస్ కార్యాలయాలు కంపెనీ నుంచి విభిన్న సంస్థలుగా పరిగణించబడతాయని అధికారులు పేర్కొన్నారు. కాబట్టి బ్రాంచ్ కార్యాలయాలు అందించే అన్ని సేవలను దిగుమతిగా పరిగణిస్తామని, తద్వారా జీఎస్టీ విధించడం జరుగుతుందని వెల్లడించారు. -
ఒక్క నెలలో ఇంత మంది టెకీల తొలగింపా?
ఐటీ రంగంలో పరిస్థితులు ఇంకా మెరుగైనట్లు కనిపించడం లేదు. లేఆఫ్‌ల భయం ఉద్యోగులను ఇంకా వీడలేదు. గడిచిన జూలై నెలలో ప్రపంచవ్యాప్తంగా పలు ఐటీ కంపెనీలు వేలాదిగా ఉద్యోగులను తొలగించాయి. భారత్‌లోనూ గణనీయ సంఖ్యలో ఐటీ ఉద్యోగులు జాబ్స్ కోల్పోయారు.ఐటీ రంగంలో ఉద్యోగుల తొలగింపులు జూలై నెలలోనూ కొనసాగాయి. విదేశాలలోపాటు, భారత్‌లోనూ పలు కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకున్నాయి. గత నెలలో మొత్తంగా దాదాపు 8000 మంది ఉద్యోగాలు కోల్పోగా భారత్‌లో 600 మంది ఉద్వాసనకు గురయ్యారు. జూన్‌తో పోలిస్తే ఉద్యోగుల తొలగింపుల సంఖ్య స్వల్పంగా తగ్గినప్పటికీ, ప్రభావం గణనీయంగానే ఉంది.జూలైలో ప్రధాన తొలగింపులు ఇవేమసాచుసెట్స్కు చెందిన సాఫ్ట్వేర్ కంపెనీ యూకేజీ (UKG) తన వర్క్‌ఫోర్స్‌లో 14% మందిని తొలగించింది. మొత్తం 2,200 మంది ఇంటి బాట పట్టారు. కాలిఫోర్నియాకు చెందిన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ట్యూట్ (Intuit Inc.) కార్యకలాపాల క్రమబద్ధీకరణ పేరుతో దాదాపు 10% మంది అంటే 1,800 మంది ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటించింది.సాఫ్ట్వేర్ కంపెనీలు ఓపెన్ టెక్స్ట్, రెడ్బాక్స్ కూడా ఉద్యోగుల తొలగింపులను ప్రకటించాయి. అవి వరుసగా 1,200, 100 ఉద్యోగాలను తగ్గించాయి. భారతీయ ఎడ్టెక్ దిగ్గజం అన్కాడెమీ పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా 100 మంది మార్కెటింగ్, బిజినెస్, ప్రొడక్షన్ ఉద్యోగులను, 150 మంది సేల్స్ సిబ్బందిని మొత్తంగా 250 మందిని తొలగించింది.చెన్నైకి చెందిన అగ్రిటెక్ సంస్థ వేకూల్ 200 మందికి పైగా ఉద్యోగులను తొలగించగా బెంగళూరు ఆధారిత ఆడియో సిరీస్ ప్లాట్‌ఫారమ్ పాకెట్ఎఫ్ఎం దాదాపు 200 మంది రైటర్లను తొలగించింది. ఇక ‘ఎక్స్’కి పోటీగా వచ్చిన భారతీయ మైక్రోబ్లాగింగ్ సైట్ ‘కూ’ (Koo) డైలీహంట్తో కొనుగోలు చర్చలు విఫలమవడంతో మూతపడింది. దీంతో దాదాపు 200 మంది ఉద్యోగులపై ప్రభావం పడింది. -
ఐటీ నిరుద్యోగుల కష్టాలు తీరినట్టే..!!
గతేడాదినియామకాల మందగమనం తర్వాత, భారతీయ ఐటీ రంగం 2025 ఆర్థిక సంవత్సరం కోసం నియామక ప్రణాళికలను పునరుద్ధరిస్తోంది. దాదాపు 3,50,000 ఉద్యోగాలను జోడించడానికి సిద్ధంగా ఉంది. ఈ రంగానికి డిమాండ్ వాతావరణం మెరుగుపడటంతో కంపెనీలు నియామకాలపై దృష్టి పెట్టాయని స్టాఫింగ్ సంస్థల నిపుణులు చెబుతున్నారు.గడిచిన సంవత్సరంలో స్థూల ఆర్థిక ఎదురుగాలుల కారణంగా నియామక కార్యకలాపాలు బాగా తగ్గిపోయాయి. నాస్కామ్ ప్రకారం, టెక్ పరిశ్రమ 2024 ఆర్థికేడాదిలో 60,000 కొత్త ఉద్యోగాలను మాత్రమే జోడించింది. ఇది అంతకుముందు సంవత్సరంలో వచ్చిన 2,70,000 ఉద్యోగాల కంటే చాలా తక్కువ. ఐటీ మేజర్లు గత ఏడాది మొత్తం ఉద్యోగుల సంఖ్య వృద్ధిలో పడిపోయాయి. అయితే, నియామక ఔట్లుక్ ఇప్పుడు సానుకూలంగా మారుతోంది.ఎన్డీటీవీ నివేదిక ప్రకారం.. “హెడ్‌కౌంట్ తగ్గుదలతో FY25ని ప్రారంభించినందున, భారతీయ అగ్రశ్రేణి ఐటీ సంస్థలు నికర హెడ్‌కౌంట్ జోడింపులను నమోదు చేయడానికి ముందు క్షీణతను భర్తీ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టెక్ రంగం నికర వృద్ధి కోసం ప్రస్తుత ఔట్లుక్ FY24లో చూసినట్లుగా 2,00,000-2,50,000 మధ్య ఉంది. అయితే క్షీణత, విస్తరణ నియామకాల కోసం 3,25,000-3,50,000 కంటే ఎక్కువ నియామకాలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ వృద్ధిలో 60% పైగా అగ్రశ్రేణి ఐటీ సంస్థల నుంచి రావచ్చు’’ ఎక్స్‌ఫెనో ఐటీ స్టాఫింగ్ బిజినెస్ హెడ్ సుందర్ ఈశ్వర్ పేర్కొన్నారు.ఆర్థిక అనిశ్చితులు, ఖర్చు-అవసరాల కారణంగా మొత్తం నియామకాల్లో ఫ్రెషర్లు గణనీయమైన భాగాన్ని కలిగి ఉండే అవకాశం ఉందని టీమ్‌లీజ్ డిజిటల్ బిజినెస్ హెడ్ కృష్ణ విజ్ తెలిపారు. పెద్ద ఐటీ సంస్థలు ఇప్పటికే ఫ్రెషర్ హైరింగ్‌లో గణనీయమైన పెరుగుదలను సూచించాయి. FY25లో టీసీఎస్ 40,000 మంది, హెచ్‌సీఎల్ టెక్ 10,000 మంది, ఇన్ఫోసిస్ లిమిటెడ్ 15,000-20,000 మంది విప్రో 12,000 మంది వరకు ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు ప్రకటించాయి. -
ఐటీ ఫ్రెషర్లకు పండగే.. క్యూ కట్టనున్న కంపెనీలు!
టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌టెక్, విప్రో వంటి పెద్ద ఐటీ సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (FY25) గణనీయమైన సంఖ్యలో ఫ్రెషర్లను నియమించుకునే ప్రణాళికలను ప్రకటించాయి. దీంతో భారత ఐటీ రంగం రిక్రూట్మెంట్ ప్రయత్నాలలో గణనీయమైన పునరుద్ధరణను పొందుతోంది. టాప్ కంపెనీలు మొత్తంగా 80,000 మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నాయన్న వార్తలు ఐటీ ఫ్రెషర్లలో ఉత్సాహాన్ని నింపుతున్నాయి.ముందంజలో టీసీఎస్ ఆదాయపరంగా భారతదేశపు అతిపెద్ద ఐటీ సేవల సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఈ సంవత్సరం 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. జూన్ త్రైమాసికంలోనే 5,452 మంది ఉద్యోగులను చేర్చుకుంది. దాని మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,06,998కి చేరుకుంది.ఇన్ఫోసిస్ వ్యూహాత్మక నియామకందేశంలోని రెండవ అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ ఈ ఆర్థిక సంవత్సరంలో 20,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని యోచిస్తోంది. ఈ నియామకం ఆన్-క్యాంపస్, ఆఫ్-క్యాంపస్ రిక్రూట్మెంట్ మిశ్రమంగా ఉంటుంది. వరుసగా ఆరు త్రైమాసికాలుగా హెడ్‌కౌంట్‌లో క్షీణతను నివేదించినప్పటికీ, ఇన్ఫోసిస్ సీఎఫ్‌వో జయేష్ సంఘ్రాజ్కా భవిష్యత్ వృద్ధిపై ఆశావాదాన్ని వ్యక్తం చేశారు.తాజా ప్రతిభపై హెచ్‌సీఎల్‌టెక్ దృష్టిఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 8,080 మంది ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గినప్పటికీ, ఆర్థక సంవత్సరంలో 10,000 మంది ఫ్రెషర్లను నియమించుకునే ప్రణాళికలను హెచ్‌సీఎల్‌టెక్ ప్రకటించింది. అభివృద్ధి చెందుతున్న టెక్ ల్యాండ్‌స్కేప్‌లో పోటీగా నిలవడానికి ఉత్పాదక ఏఐలో ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడంతో సహా అప్‌స్కిల్లింగ్ కార్యక్రమాలపై దృష్టి సారించడం ద్వారా తాజా ప్రతిభపై పెట్టుబడి పెట్టడం కొనసాగిస్తోంది.విప్రో క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్విప్రో ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 10,000 నుంచి 12,000 మంది ఫ్రెషర్లను ఆన్‌బోర్డ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది ఒక సంవత్సరం విరామం తర్వాత క్యాంపస్ రిక్రూట్మెంట్కు తిరిగి రావడాన్ని సూచిస్తోంది. -
అలాంటి ఉద్యోగుల విషయంలో కఠిన వైఖరి
ఉద్యోగుల కాంట్రాక్టు విషయంలో తన కఠిన వైఖరిని ఐటీ సంస్థ విప్రో స్పష్టం చేసింది. తమ ఉద్యోగులతో కుదుర్చుకున్న కాంట్రాక్ట్ ఒప్పందాలకు కట్టుబడి ఉంటామని విప్రో తెలిపింది. అంటే కాంట్రాక్ట్‌ను ఉల్లంఘించి బయటకు వెళ్లిపోయేవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని తేల్చి చెప్పేసింది."ఉద్యోగులు, ఉన్నత స్థాయి ఎగ్జిక్యూటివ్‌లతో కుదుర్చుకున్న కాంట్రాక్టుల విషయంలో ఖచ్చితంగా ఉంటాం. ఇందులో మా వైఖరి మారలేదు. మారబోదు’’ అని విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ సంస్థ వార్షిక సాధారణ సమావేశంలో అన్నారు. కంపెనీలో ప్రతి ఒక్కరికీ మంచి అవకాశాలు కల్పిస్తున్నామని, కానీ కొంత మంది బయట మంచి అవకాశాలు దొరికితే వెళ్లిపోతున్నారని ఆయన చెప్పారు.గత ఏడాది నవంబర్‌లో విప్రోను వీడి కాగ్నిజెంట్‌లో సీఎఫ్ఓగా చేరిన తమ మాజీ సీఎఫ్ఓ జతిన్ దలాల్ నుంచి కాంట్రాక్టు ఉల్లంఘన కింద విప్రో ఇటీవల రూ.25 కోట్లు కోరింది. 2015లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అయినప్పటి నుంచి దలాల్‌కు మంజూరు చేసిన స్టాక్ యూనిట్ల విలువను బట్టి ఈ మొత్తాన్ని విప్రో డిమాండ్ చేసింది. ఇదే వ్యవహారంలో తన మాజీ యజమాని విప్రోతో వ్యాజ్యాన్ని పరిష్కరించుకోవడానికి ఇటీవల కాగ్నిజెంట్ సీఎఫ్‌వో జతిన్ దలాల్‌కు రూ. 4 కోట్లు చెల్లించింది. -
ఫలించిన టీసీఎస్ మంత్రం.. నిండుగా ఆఫీసులు!
వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అలవాటు పడిన ఉద్యోగులను ఆఫీసులకు రప్పించడానికి టీసీఎస్ వేసిన మంత్రం ఫలించింది. వేరియబుల్ పేను కార్యాలయ హాజరుకు అనుసంధానించే కొత్త విధానాన్ని అమలు చేశాక దాదాపు 70 శాతం ఉద్యోగులు ఆఫీసులకు వస్తున్నారని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ తెలిపారు.అయితే ఇది తాత్కాలిక చర్య అని, దాన్ని ఆ విధంగా చూడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. గత ఏప్రిల్‌లో ఉద్యోగులకు త్రైమాసిక వేరియబుల్ చెల్లింపును వారి కార్యాలయ హాజరుతో లింక్ చేసింది. దీని ప్రకారం 60 శాతం కంటే తక్కువ హాజరు ఉన్నవారు త్రైమాసిక బోనస్‌కు అర్హులు కాదు.వారానికి ఐదు రోజులు తప్పనిసరిగా ఆఫీసు నుంచి పని చేయాలని ఆదేశించిన నెలల తర్వాత ఈ పాలసీ అప్డేట్ వచ్చింది. కొత్త విధానం ప్రకారం ఉద్యోగులు పూర్తి త్రైమాసిక వేరియబుల్ వేతనాన్ని పొందాలంటే కార్యాలయంలో కనీసం 85 శాతం హాజరు ఉండాలి. 75-85 శాతం హాజరున్న ఉద్యోగులు వారి వేరియబుల్ పేలో 75 శాతం, 60-75 శాతం హాజరు ఉన్నవారు 50 శాతం మాత్రమే వేరియబుల్ పే పొందుతారు. -
ఏపీలో టీడీపీ విధ్వంసం.. పారిపోతున్న కంపెనీలు..
-
4,800 మంది బాధితులు.. ఆ ఐటీ కంపెనీపై చర్యలు తీసుకోండి
ఐటీ కంపెనీ డీఎక్స్‌సీ టెక్నాలజీపై ఐటీ ఉద్యోగుల యూనియన్ కార్మిక శాఖకు ఫిర్యాదు చేసింది. 4,800 మందికి పైగా క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌ను ఆన్‌బోర్డ్ చేయడంలో జాప్యం చేసిన డీఎక్స్‌సీ టెక్నాలజీపై చర్యలు తీసుకోవాలని పుణెకు చెందిన ఐటీ ప్రొఫెషనల్ యూనియన్ నాన్యూసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (ఎన్ఐటీఈఎస్) కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖను కోరింది.రెండేళ్లకు పైగా కొనసాగిన ఈ జాప్యం ఫ్రెషర్లకు తీవ్ర ఇబ్బందులను కలిగించిందని ఎన్ఐటీఈఎస్ అధ్యక్షుడు హర్‌ప్రీత్ సింగ్ సలూజా ఒక ప్రకటనలో తెలిపారు. కంపెనీ హామీలను నమ్మిన ఫ్రెషర్లలో చాలా మంది ఇతర ఉద్యోగ ఆఫర్లను తిరస్కరించారని యూనియన్ తెలిపింది. ప్రస్తుతం ఈ అభ్యర్థులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని, ఇంకా ఉద్యోగంలోకి చేర్చుకోకపోవడంతో భవిష్యత్తుపై స్పష్టత లేదని యూనియన్ పేర్కొంది.ఆన్‌బోర్డింగ్ జాప్యంపై ఐటీ ఎంప్లాయీస్ గతంలోనూ పలు కంపెనీలపై కార్మికశాఖకు ఫిర్యాదు చేసింది. 2,000 మందికి పైగా క్యాంపస్ రిక్రూట్మెంట్లను ఆన్‌బోర్డ్ చేయడంలో పదేపదే జాప్యం చేస్తోందంటూ ఇన్ఫోసిస్‌పై దర్యాప్తు జరపాలని గత జూన్ నెల ప్రారంభంలో కోరింది. అంతకు ముందు 2023 జూలైలో టీసీఎస్ 200 మందికి పైగా లేటరల్ రిక్రూట్మెంట్లను ఆలస్యం చేస్తోందని కార్మిక శాఖకు యూనియన్ ఫిర్యాదు చేసింది. -
కార్ పూలింగ్.. వేర్వేరు పనివేళలు
సాక్షి, హైదరాబాద్: ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లు.. ఇలా ఎన్ని నిర్మించినా హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ తగ్గడం లేదు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటోంది. చినుకు పడితే చాలు కిలోమీటర్ల కొద్దీ వాహనాల రద్దీతో వాహనదారులకు నరకం కనిపిస్తోంది. దీంతో సైబరాబాద్ పోలీసులు ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక దృష్టి సారించారు. వివిధ ఐటీ కంపెనీలు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్‌తో కలిసి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు గచ్చిబౌలిలోని ఫీనిక్స్ ఇన్ఫోసిటీలో సమావేశమయ్యారు. ఐటీ కారిడార్‌లో రద్దీని తగ్గించడంతోపాటు నిర్వహణ వ్యూహాలపై సమగ్రంగా చర్చించారు. ఢిల్లీలో అమలవుతున్న కార్ పూలింగ్ విధానాన్ని ఐటీ కారిడార్ పరిధిలోనూ అమలు చేయడాన్ని ఐటీ సంస్థలు పరిశీలించాలని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయెల్ డేవిస్ సూచించారు. ఈ విధానంతో వాహనాల రద్దీ, కాలుష్యం తగ్గడంతోపాటు ఇంధనం ఆదా అవుతుందని తెలిపారు. అలాగే ఉద్యోగులందరికీ ఒకే పనివేళలు కాకుండా వేర్వేరు సమయాలను కేటాయించాలన్నారు. దీనివల్ల కూడా వాహనాల రద్దీ గణనీయంగా తగ్గుతుందని చెప్పారు. ఈ సమావేశంలో ఎస్సీఎస్సీ జనరల్ సెక్రటరీ రమేష్ కాజా తదితరులు పాల్గొన్నారు.కార్ పూలింగ్ అంటే?ఒకే ఆఫీసులో పనిచేసే ఉద్యోగులు ఒక్కో వాహనంలో వచ్చే బదులు నలుగురు చొప్పున కలిసి ఒకే కారులో ఆఫీసుకు రావడాన్ని కార్ పూలింగ్ అంటారు. ఈ విధానంలో ఒకరోజు ఒక ఉద్యోగి కారు తీసుకొస్తే ఆ మరుసటి రోజు మరో ఉద్యోగి కారులో ప్రయాణిస్తారు. దీంతో ప్రతిరోజూ ఒకే సమయంలో, ఒకే రహదారిలో నాలుగు కార్లు రోడ్లపైకి రాకుండా ఒకే కారులో నలుగురు ఉద్యోగులు ఆఫీసుకు చేరుకుంటారు. -
ఐటీలో కోతల కాలం!
సాక్షి, హైదరాబాద్: సాఫ్ట్వేర్ ఉద్యోగం.. ఒకప్పుడు ఉద్యోగార్థుల కలల ప్రపంచం.. సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వస్తే చాలు రెండు చేతులా సంపాదన, వీకెండ్ పార్టీలు, అప్పుడప్పుడూ టూర్లు. ఇక కరోనా వచ్చాక వర్క్ ఫ్రం హోం సౌలభ్యం. ఆ కలలన్నీ ఇప్పుడు సన్నగిల్లుతున్నాయి.. అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం, రాజకీయ సంక్షోభం వంటి కారణాలతో ఐటీ కంపెనీలు ఉద్యోగులను ఎడాపెడా తొలగించేస్తున్నాయి. ఖర్చు తగ్గించుకునే నెపంతో పింక్ స్లిప్ ఇచ్చేసి ఇంటికి పంపేస్తున్నాయి. ఇక కొత్తగా ప్లేస్‌మెంట్స్ ఇచ్చే విషయంలోనూ మీనమేషాలు లెక్కిస్తున్నాయి. ఒకవేళ రిక్రూట్ చేసుకున్నా ఆఫర్ లెటర్ ఇవ్వడం లేదు. అన్ని కంపెనీలదీ అదే బాట.. కరోనా సంక్షోభం తర్వాత ఐటీ రంగంలో చాలా ఒడిదుడుకులు వచ్చాయి. 2022, 2023 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2 వేల కంపెనీలు 4 లక్షల పైచిలుకు ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్లు https://layoffs.fyi అనే సంస్థ వెల్లడించింది. ఉద్యోగాల కోత 2024లోనూ కొనసాగుతోంది. 2024లోమే నాటికి 326 కంపెనీలు 98 వేల మందికి కత్తెరవేశాయి. పెద్ద కంపెనీలే కాదు స్టార్టప్స్ సైతం ఇదే బాట పట్టాయి. ఇక కొన్ని కంపెనీలైతే నష్టాలను భరించలేక ఏకంగా తమ కార్యకలాపాలను నిలిపేశాయి. డెల్ కంపెనీ గత ఏడాది 13వేల మందికి పింక్ స్లిప్ ఇవ్వగా, ఈ ఏడాది 6వేల మందిని సాగనంపింది. టెస్లా కంపెనీలో ఎలాన్ మస్క్ రాత్రికి రాత్రే తమ ఉద్యోగులను ఇంటికి పంపుతున్నట్టు మెయిల్స్ పంపారు. దీంతో వందలాది మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. మైక్రోసాఫ్ట్ 1,900 మందికి కోతపెట్టగా, తీవ్ర నష్టాల ఊబిలో కూరుకుపోయిన బైజూస్ 500 మందిని తొలగించింది. ఇంకా యాపిల్, డెల్, సోనీ, సిస్కో, స్విగ్గీ, యూట్యూబ్, గూగుల్, డుయోలింగో కంపెనీలు కూడా తమ సిబ్బందిని తగ్గించుకున్నాయి. ఇన్నొవేషన్ వల్లేనా.. ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెరి్నంగ్ (ఎంఎల్), ఆటోమేషన్ వల్ల ఉత్పాదకత పెరుగుతుందని అందరూ భావించారు. వీటి వాడకం వల్లే ఉద్యోగాల్లో కోత పడుతోందని లేఆఫ్స్ సంస్థ విశ్లేషించింది. ఇన్నొవేషన్ మూలంగా ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని అంటున్నారు. అయితే అందుకు అనుగుణంగా నైపుణ్యాలు పెంచుకుంటే ఉద్యోగ భద్రత ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఉద్యోగుల పనితీరును అంచనా వేసిన తర్వాతే అడ్జస్ట్మెంట్లో భాగంగా కంపెనీలు ఉద్యోగాల్లో కోత పెడతాయని అంటున్నారు. మంచి పర్ఫార్మెన్స్ చూపించినా.. కంపెనీకి క్లయింట్స్ లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులున్నా కూడా తొలగించేస్తారు. ప్రాజెక్టులు లేకపోవడం కూడా ఉద్యోగులపై ప్రభావం పడుతుంది. ఎంతగా పర్ఫార్మెన్స్ చూపించినా కూడా వారికి అవసరం లేకపోయినా.. బడ్జెట్ లేకపోయినా ఉద్వాసన పలుకుతారు. ఎప్పుడు ఉద్యోగం తొలగిస్తారోనన్న భయంతో ఉద్యోగం చేయాల్సి వస్తోంది. –మౌనిక, సాఫ్ట్వేర్ డెవలపర్, హైదరాబాద్ ఇద్దరి పని ఒక్కరిపైనే.. ఎజైల్ స్క్రమ్ మెథడాలజీ వ్యవస్థతో ఉద్యోగుల పనితీరును ప్రతి రోజూ అంచనా వేస్తుంటారు. ఇచి్చన టార్గెట్‌ను ఎప్పటికప్పుడు పూర్తి చేయాల్సి ఉంటుంది. లేదంటే అందుకు కారణాలను పై అధికారులకు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఒకటి రెండుసార్లు ఇలాగే జరిగితే చెప్పాపెట్టకుండా తొలగించేస్తారు. కంపెనీపై ఆర్థిక భారం తగ్గించుకునేందుకు ఇద్దరి ముగ్గురి పని కూడా ఒకరిపైనే వేసి.. మిగిలిన వారికి పింక్ స్లిప్ ఇస్తున్నారు. ఐటీ రంగం ఇప్పుడు అంత ఆశాజనకంగా లేదు. –పల్లె నరేశ్, ప్రిన్సిపల్ ఇంజనీర్ తప్పని పరిస్థితుల్లోనే.. కాస్త ఇబ్బందికరమే అయినా కంపెనీ ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగుల పనితీరు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని లే ఆఫ్స్ ప్రకటిస్తుంటాం. ఆర్థిక మాంద్యం ప్రభావాలను తట్టుకోవడం మార్కెట్లో పోటీ, ఆర్థికంగా స్థిరంగా ఉండేందుకు తప్పని పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వస్తుంది. చాలా కంపెనీల్లో ఖాళీలు ఉన్నప్పటికీ నైపుణ్యం ఉన్న ఉద్యోగుల కొరత చాలా ఉంది. సాంకేతికతకు అనుగుణంగా ఉద్యోగులు కూడా నైపుణ్యాలు నేర్చుకోకపోతే ఉద్యోగాలు కోల్పోక తప్పని పరిస్థితి ఉంది. –కీర్తి రెడ్డి, బోల్డ్ ఫ్యూజ్ కంపెనీ సీఈవో, వ్యవస్థాపకురాలు -
ఉద్యోగులకు ఇన్ఫోసిస్ బంపరాఫర్.. రూ.8 లక్షల బోనస్!
ప్రముఖ టెక్ దిగ్గజం 'ఇన్ఫోసిస్' తన ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎంప్లాయిస్ ట్రాన్స్ఫర్ పాలసీ కింద ఇన్సెంటివ్ ప్యాకేజీ ఆఫర్ ప్రకటించింది. ముంబై-కర్ణాటక ప్రాంతంలోని టైర్-2 నగరమైన హుబ్బల్లిలో తన ఉనికిని పెంచుకోవడానికి కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.హుబ్బల్లిలోని క్యాంపస్‌కు కంపెనీ స్థానిక ఉద్యోగులను రప్పించడానికి ఇన్సెంటివ్ ప్యాకేజీ ఆఫర్ ప్రకటించింది. దీనికి సంబంధించి కంపెనీ తమ ఉద్యోగులకు ఒక మెయిల్ కూడా పంపింది. అందులో ''భవిష్యత్తును నిర్మించడానికి మీలాంటి ప్రతిభ ఉన్నవారి కోసం వేచి ఉందని'' పేర్కొంది.ఇక ఇన్సెంటివ్ ప్యాకేజీ ఆఫర్ విషయానికి వస్తే.. లెవెల్ 3 లేదా అంతకంటే తక్కువ ఉన్న ఉద్యోగులకు రీలొకేషన్ సమయంలో రూ. 25,000 అందిస్తారు. ఆ తరువాత రెండు సంవత్సరాలలో.. ప్రతి ఆరు నెలలకు ఒకసారి రూ. 25000 అందిస్తారు. ఇలా మొత్తం 24 నెలల్లో రూ.1.25 లక్షలు లభిస్తాయి.లెవెల్ 4 ఉద్యోగులకు కంపెనీ ప్రారంభంలో రూ. 5000 అందిస్తుంది. ఆ తరువాత ప్రతి ఆరు నెలలకు ఒకసారి రూ. 50000 జమచేస్తుంది. ఇలా రెండు సంవత్సరాల్లో ఈ కేటగిరి ఉద్యోగులు మొత్తం రూ. 2.5 లక్షల బోనస్ పొందవచ్చు. ఉన్నత స్థాయి ఉద్యోగులకు రీలొకేషన్ సమయంలో రూ. 1.5 లక్షలు అందిస్తారు. వీరికి రెండు సంవత్సరాల్లో మొత్తం రూ. 8 లక్షలు అందిస్తారు.ఇన్ఫోసిస్ ఇప్పుడు ఇన్సెంటివ్ ప్యాకేజీ ఆఫర్ తీసుకురావడానికి ప్రధాన కారణం.. కర్ణాటక ప్రభుత్వంతో ఏర్పడిన కొన్ని విభేదాలే అని తెలుస్తోంది. కర్ణాటకలోని కొన్ని రాజకీయ పార్టీలు నుంచి సంస్థ మీద ఒత్తిడి పెరగటం మాత్రమే కాకుండా.. ఇన్ఫోసిస్ స్థానికులకు ఉద్యోగాలను కల్పించడంలో విఫలమైందని విమర్శిస్తున్నారు. కంపెనీకి ఉపాధి కల్పన కింద కేటాయించిన 58 ఎకరాల భూమిని కూడా వెన్నక్కి తీసుకోవడానికి ప్రయతిస్తున్నారు. ఈ కారణంగా ముంబై కర్ణాటక ప్రాంతాలకు చెందిన తమ ఉద్యోగులను కంపెనీ హుబ్బళ్ళికి తరలించడానికి ఈ ఆఫర్ తీసుకువచ్చింది. -
మరో భారీ డీల్‌ను దక్కించుకున్న ఇన్ఫోసిస్
భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ పలు కొత్త ప్రాజెక్టులతో దూసుకెళ్తోంది. తాజాగా స్వీడన్ రిటైలర్ ఐకియా నుంచి 100 మిలియన్ డాలర్ల (రూ.850 కోట్లు) డీల్‌ను దక్కించుకుంది. హెచ్‌సీఎల్, క్యాప్ జెమినీ, డీఎక్స్‌సీ వంటి బడా కంపెనీలను దాటుకుని ఈ భారీ డీల్‌ను సొంతం చేసుకుంది.ఈ ఐదేళ్ల ఒప్పందం ప్రకారం.. ఇన్ఫోసిస్ 1,70,000 మంది ఉద్యోగులకు సర్వీస్ డెస్క్, సర్వీస్ నౌ ఆధారిత ఎంటర్ప్రైజ్ సర్వీస్ మేనేజ్మెంట్, ఐటీ సర్వీసెస్ మేనేజ్మెంట్ను అందిస్తుంది. ఇన్ఫోసిస్ కన్జ్యూమర్, రిటైల్, లాజిస్టిక్స్ గ్లోబల్ హెడ్, ఈవీపీ కర్మేష్ వాస్వానీ ఈ డీల్‌కు నేతృత్వం వహించారు. గత ఏడాది ఐటీ దిగ్గజం డాన్స్కే బ్యాంక్ నుంచి 454 మిలియన్ డాలర్ల కాంట్రాక్టును దక్కించుకుంది.ఈ డీల్ కారణంగా చైనా, ఫ్రాన్స్, జర్మనీ, భారత్, పోలాండ్, స్వీడన్, అమెరికా దేశాల్లో ఐకియాలో 350 ఉద్యోగాలపై ప్రభావం పడనుంది. ఈ ఉద్యోగులు ఇన్ఫోసిస్ కు మారనున్నారు. కోల్డ్ కాలింగ్, కొన్ని ప్రారంభ కనెక్షన్లతో ప్రారంభమై వ్యూహాత్మక భాగస్వామ్యంతో ముగిసిన మూడేళ్ల సుదీర్ఘ, సంతృప్తికరమైన ప్రయాణం అని ఇన్ఫోసిస్ కొందరు ఎంపిక చేసిన ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్స్‌లో పేర్కొంది. -
టీసీఎస్‌లో విచిత్ర పరిస్థితి! 80,000 జాబ్స్ ఉన్నాయి.. కానీ..
ఐటీ కంపెనీల్లో అనిశ్చితి కొనసాగుతోంది. ఓ వైపు లేఆఫ్‌ల పేరుతో వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తుండగా మరో వైపు నియామకాలు మందగించాయి. వేలాది మంది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే భారత్‌కు చెందిన ఐటీ దిగ్గజం టీసీఎస్‌లో మాత్రం విచిత్రమైన పరిస్థితి నెలకొంది. కంపెనీలో 80,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కానీ తగిన నైపుణ్యాలున్న అభ్యర్థులు దొరకడం లేదు.స్కిల్స్ గ్యాప్ కారణంగా టీసీఎస్ 80,000 ఖాళీలను భర్తీ చేయడానికి కష్టపడుతోందని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. ఇది ప్రస్తుత ఉద్యోగుల నైపుణ్యాలు, కొత్త ఉద్యోగాల అవసరాల మధ్య అసమతుల్యతను తెలియజేస్తోంది. ఈ అంతరాలను భర్తీ చేయడానికి కాంట్రాక్టర్లపై ఆధారపడవలసి వస్తోందని టీసీఎస్ రిసోర్స్ మేనేజ్మెంట్ గ్రూప్ (ఆర్ఎంజీ) గ్లోబల్ ఆపరేషన్స్ హెడ్ అమర్ షెట్యే టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెప్పారు.ఓ వైపు ఎంపిక చేసుకున్న ఫ్రెషర్లను ఉద్యోగాలలోకి చేర్చుకోకుండా ఇలా స్కిల్ గ్యాప్ పేరుతో వేలాది ఉద్యోగాలను ఖాళీగా ఉంచడంపై ఉద్యోగార్థుల నుంచి విమర్శలు వస్తున్నాయి. టీసీఎస్ సహా భారత ఐటీ దిగ్గజాలు ఫ్రెషర్స్ ఆన్‌బోర్డింగ్‌లో జాప్యం చేస్తుండటంతో చాలామంది జాయిన్ డేట్లను కన్ఫర్మ్ చేసుకోలేకపోతున్నారు. గత రెండేళ్లలో 10,000 మందికి పైగా ఫ్రెషర్లు ఈ జాప్యం వల్ల ప్రభావితమయ్యారని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (ఎన్ఐటీఈఎస్) తెలిపింది. -
ఐటీ కంపెనీలు ఇంతపని చేస్తున్నాయా?.. రోజులు గడుస్తున్నా..
అసలే ఉద్యోగాలు దొరక్క యువత అల్లాడిపోతుంటే.. ఐటీ కంపెనీలు కూడా ఉద్యోగాలు కల్పించడంలో జాప్యం చేస్తున్నాయి. భారతదేశంలోని ఐటీ దిగ్గజాలు సైతం ఫ్రెషర్లను ఉద్యోగంలో చేర్చుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఐటీ ఉద్యోగుల సంఘం నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) పేర్కొంది.గత రెండేళ్ల కాలంలో ఐటీ కంపెనీలు సుమారు 10,000 కంటే ఎక్కువ మంది ఫ్రెషర్లకు ఇంకా ఉద్యోగాలు ఇవ్వలేదని ఎన్ఐటీఈఎస్ వెల్లడించింది. ఈ జాబితాలో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో మొదలైన కంపెనీలు ఉన్నాయి. కంపెనీలు ఉద్యోగాలు ఆఫర్ చేసి.. ఉద్యోగంలో చేర్చుకోవడంలో చాలా ఆలస్యం చూపిస్తున్నట్లు తమకు ఫిర్యాదులు వచ్చాయని.. ఐటీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు హర్‌ప్రీత్ సింగ్ సలూజా తెలిపారు.ఉత్తర అమెరికా, యూరప్ దేశాల్లో ఏర్పడిన వ్యాపార అనిశ్చితి కారణంగా ఫ్రెషర్లను ఆన్‌బోర్డింగ్ చేయడంలో జాప్యం జరుగుతుందని ఐటీ కంపెనీలు చెబుతున్నాయి. వ్యాపార అవసరాలను బట్టి ఫ్రెషర్లను ఉద్యోగంలో చేర్చుకోవడం జరుగుతుందని, ఉద్యోగంలో చేర్చుకోవాలనుకున్నప్పుడు వారికి ముందుగానే సమాచారం తెలియాజేస్తామని ఇన్ఫోసిస్ మెయిల్స్ పంపినట్లు సమాచారం.విప్రో కూడా రెండేళ్ల క్రితం అభ్యర్థులకు అందించిన క్యాంపస్ ఆఫర్లను ఆన్‌బోర్డ్ చేయలేదు. గత సంవత్సరం ముందు, మేము క్యాంపస్‌కి వెళ్లి చాలా ఆఫర్లు చేసాము. వారందరిని ఇంకా ఉద్యోగాల్లో చేర్చుకోలేదు. వారిని ఉద్యోగాల్లో చేర్చుకున్న తరువాత కొత్త ఫ్రెషర్లను తీసుకుంటామని విప్రో సిహెచ్ఆర్ఓ సౌరభ్ గోవిల్ పేర్కొన్నారు.తగ్గిన ఐటీ ఉద్యోగుల సంఖ్యభారతదేశంలో కరోనా మహమ్మారి తరువాత చాలామంది ఐటీ ఉద్యోగులు, తమ ఉద్యోగాలను కోల్పోయారు. కరోనా ప్రభావం తగ్గినా తరువాత కూడా కొన్ని సంస్థలు తమ ఉద్యోగులను తొలగిస్తూనే వచ్చాయి. టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ కంపెనీలు విడుదల చేసిన డేటా ప్రకారం.. 20236-24 ఆర్ధిక సంవత్సరంలో 63759 మంది ఉద్యోగులు తగ్గిపోయారని తెలిసింది. -
ఇన్ఫోసిస్‌లో రూ.కోటి పైగా జీతం.. ఈసారి ఎంత మందికంటే..?
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో ఏడాదికి రూ.కోటికి పైగా జీతం తీసుకునే వారి సంఖ్య ఈ ఏడాది తగ్గింది. కనీసం రూ.1.02 కోట్ల వార్షిక వేతనంతో ఇన్ఫోసిస్ లో ఉద్యోగుల సంఖ్య 2024 ఆర్థిక సంవత్సరంలో 17 శాతం క్షీణించి 103కు పడిపోయిందని సీఎన్‌బీసీ-టీవి 18 గణాంకాలు చెబుతున్నాయి. ఈ 103 మంది ఉద్యోగులు మొత్తంగా ఏడాదికి రూ.176 కోట్ల స్థూల వేతనాన్ని అందుకున్నారు.ఈ టెక్ దిగ్గజంలో సుమారు 124 మంది టాప్ ఎగ్జిక్యూటివ్‌లు 2023 ఆర్థిక సంవత్సరంలో రూ .221 కోట్ల వేతనం పొందారు. రూ. కోటికి పైగా వేతనం పొందే ఉద్యోగుల సంఖ్య 2022 ఆర్థిక సంవత్సరంలో 100 మార్కును దాటగా, 2023 ఆర్థిక సంవత్సరంలో కూడా 124 మంది ఉద్యోగుల సంఖ్యతో అదే స్థాయిలో ఉంది. ఈ జాబితాలో భారత్‌లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. ఇందులో కంపెనీ టాప్ 10 ఉద్యోగులు తీసుకున్న వేతన పరిహారాన్ని చేర్చలేదు.(విప్రోకు భారీ కాంట్రాక్ట్.. వేల కోట్ల అమెరికన్ డీల్)ఇన్ఫోసిస్‌కు ఇటీవల రాజీనామా చేసిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ లలో నర్సింహారావు మన్నెపల్లి, రిచర్డ్ లోబో, శ్వేతా అరోరా, విశాల్ సాల్వి తదితరులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. అయితే ఈ 103 మంది ఉద్యోగుల్లో మూడింట ఒక వంతు మంది 2000 సంవత్సరం కంటే ముందే ఇన్ఫోసిస్ లో చేరారు. వీరు ఏడాదికి సగటున రూ.1.7 కోట్ల వేతనం తీసుకున్నారు. 2024 ఆర్థిక సంవత్సరంలో కీ మేనేజిరియల్ పర్సనల్ సహా పురుష ఉద్యోగులందరి సగటు వేతనం రూ .11 లక్షలుగా ఉంది. అదే విధంగా మహిళా ఉద్యోగులు సగటున రూ .7 లక్షలు వార్షిక వేతనం పొందారు. కాగా ఏడాది మధ్యలో 34 మంది ఉద్యోగులను నియమించుకోగా వీరి సగటు వేతనం నెలకు 8.5 లక్షలు.2024 ఆర్థిక సంవత్సరంలో అధిక చెల్లింపులు అందుకున్న ఉద్యోగులలో కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ) పదవికి రాజీనామా చేసిన నీలాంజన్ రాయ్ రూ .10.7 కోట్ల వార్షిక వేతనంతో జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. కొత్తగా నియమితులైన సీఎపఫ్‌వో జయేశ్ సంఘ్ రాజ్కా రూ.6.1 కోట్లు, దినేష్ ఆర్, సతీష్ హెచ్ సీలు వరుసగా రూ.4.6 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు వేతనం అందుకున్నారు. దినేష్, సతీష్ ఇద్దరూ ఇన్ఫోసిస్ లో ఈవీపీ అండ్ కో-హెడ్ ఆఫ్ డెలివరీగా నియమితులయ్యారు. -
విప్రోకు భారీ కాంట్రాక్ట్.. వేల కోట్ల అమెరికన్ డీల్
ప్రపంచవ్యాప్తంగా ఐటీ పరిశ్రమ ఆర్థిక అనిశ్చితితో ఇబ్బందులను ఎదుర్కొంటున్న వేళ భారత్ ఐటీ దిగ్గజం విప్రో భారీ కాంట్రాక్ట్‌ను దక్కించుకుంది. ప్రముఖ అమెరికా కమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి ఐదేళ్ల కాలానికి 500 మిలియన్ డాలర్ల ( సుమారు రూ. 4,175 కోట్లు ) డీల్ పొందినట్లు కంపెనీ ఎక్స్ఛేంజీలకు సమర్పించిన ఫైలింగ్ లో తెలిపింది.ఈ ఒప్పందంలో భాగంగా అమెరికన్ సంస్థకు కొన్ని ఉత్పత్తులు, పరిశ్రమకు సంబంధించిన పరిష్కారాల కోసం నిర్వహణ సేవలను అందించనున్నట్లు కంపెనీ పేర్కొంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను విప్రో వెల్లడించలేదు.కాగా విప్రో కమ్యూనికేషన్ విభాగం 2024 ఆర్థిక సంవత్సరంలో వార్షిక ప్రాతిపదికన 14.7 శాతం క్షీణించింది. మొత్తం ఆదాయంలో 4.2 శాతం ఈ విభాగం నుంచి కంపెనీ లభించింది. 500 మిలియన్ డాలర్ల నుంచి 1 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలు అగ్రశ్రేణి ఐటీ సేవల సంస్థలకు కీలకం. ఎందుకంటే అవి నేరుగా ఆదాయ వృద్ధిని ప్రభావితం చేస్తాయి.నాలుగో త్రైమాసికంలో విప్రో భారీ డీల్ బుకింగ్స్ 9.5 శాతం పెరిగి 1.2 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. వృద్ధిని వేగవంతం చేయడమే విప్రో తక్షణ ప్రాధాన్యత అని కొత్తగా నియమితులైన సీఈవో శ్రీనివాస్ పలియా గత ఎర్నింగ్స్ కాల్ లో చెప్పారు. -
అది నమ్మక ద్రోహమే.. ఇన్ఫోసిస్‌పై ఐటీ ఉద్యోగుల కంప్లైంట్
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌పై ఐటీ ఉద్యోగుల సంఘం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (ఎన్ఐటీఈఎస్) కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. సుమారు 2,000 మంది క్యాంపస్ రిక్రూట్మెంట్లకు ఆన్‌బోర్డింగ్ ప్రక్రియను ఈ ఐటీ కంపెనీ పదేపదే ఆలస్యం చేస్తోందని, ఇది ఉద్యోగులకు ఆర్థిక, మానసిక ఇబ్బందులను కలిగిస్తోందని యూనియన్ ఆరోపించింది.దీర్ఘకాలిక జాప్యంతో ఆర్థిక ఇబ్బందులుఇన్ఫోసిస్లో రెండేళ్లుగా ఆన్‌బోర్డింగ్ జాప్యం కొనసాగుతోందని, దీంతో బాధితులు అనిశ్చితి, ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారని యూనియన్ పేర్కొంది. ‘‘ఇన్ఫోసిస్ ఆఫర్ లెటర్లపై ఆధారపడి చాలా మంది ఇతర ఉద్యోగ ఆఫర్లను తిరస్కరించారు. ఇప్పుడు ఆదాయంతోపాటు స్పష్టమైన ఆన్‌బోర్డింగ్ టైమ్‌లైన్ లేకపోవడంతో వారు ఆర్థిక ఇబ్బందులు, అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు' అని ఎన్ఐటీఈఎస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇన్ఫోసిస్ చర్యలు తీవ్రమైన నమ్మక ద్రోహాన్ని సూచిస్తున్నాయని, కంపెనీ ద్వారా తమ కెరీర్లు సజావుగా ప్రారంభమవుతాయని యువ నిపుణులు విశ్వసించారని యూనియన్ వాదిస్తోంది.ప్రభుత్వ జోక్యానికి విజ్ఞప్తినియామకాలకు మద్దతు ఇవ్వాల్సిన నైతిక బాధ్యత ఇన్ఫోసిస్ కు ఉందని, దీనిపై జోక్యం చేసుకోవాలని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖను ఎన్ఐటీఈఎస్ కోరుతోంది. అనిశ్చితి వల్ల ఏర్పడిన మానసిక, భావోద్వేగ ఒత్తిడిని పరిష్కరించాలని, జాప్యం జరిగిన కాలానికి పూర్తి వేతనాలు చెల్లించాలని యూనియన్ డిమాండ్ చేస్తోంది. అంతేకాక, ఆన్‌బోర్డింగ్ ఇలాగే కొనసాగితే, సంస్థలో ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలను కనుగొనడంలో నియామకాలకు ఇన్ఫోసిస్ బాధితులకు సహాయం అందించాలని ఎన్ఐటీఈఎస్ కోరుతోంది.ఇలాంటి అంశాల్లో ఐటీ సంస్థలపై ఎన్ఐటీఈఎస్ చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి కాదు. టీసీఎస్ 200 లేటరల్ రిక్రూట్మెంట్లను ఆలస్యం చేసిందని ఎన్ఐటీఈఎస్ దాఖలు చేసిన ఫిర్యాదుపై టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)కు మహారాష్ట్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ గత అక్టోబర్‌లో నోటీసులు జారీ చేసింది. కొత్త నియామకాల్లో జాప్యం దేశీయ ఐటీ సేవల పరిశ్రమలో విస్తృత ధోరణిని ప్రతిబింబిస్తోంది. కంపెనీలు క్యాంపస్ నియామకాలను తగ్గించాయి. దీంతో యువ, తక్కువ వేతనంతో కూడిన ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో యువ ఉద్యోగుల నిష్పత్తి టీసీఎస్‌లో ఐదేళ్ల కనిష్టానికి, ఇన్ఫోసిస్‌లో దశాబ్ద కనిష్ఠానికి పడిపోయాయి. -
సైలెంట్ లేఆఫ్‌లు.. 20 వేల మంది టెకీలు ఇంటికి..
ప్రపంచవ్యాప్తంగా ఐటీ పరిశ్రమ గత కొంత కాలంగా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. లేఆఫ్‌ల పేరుతో లక్షలాది మంది ఉద్యోగులను కంపెనీలు అధికారికంగా తొలిగించాయి. అప్రకటింతగానూ వేలాదిగా ఐటీ ఉద్యోగులు జాబ్స్ కోల్పోయారు. దేశంలోని ఐటీ పరిశ్రమలో 2023 క్యాలెండర్ సంవత్సరంలో దాదాపు 20 వేల మంది ‘సైలెంట్’గా ఉద్యోగాలు కోల్పోయారు.ఆలిండియా ఐటీ అండ్ ఐటీఈఎస్ ఎంప్లాయీస్ యూనియన్ (ఏఐఐటీఈయూ) వెల్లడించిన వివరాల ప్రకారం 2023 క్యాలెండర్ ఇయర్లో దేశ ఐటీ రంగం దాదాపు 20,000 మంది టెకీలను ‘సైలెంట్ లేఆఫ్’ విధానంలో తొలగించింది. మనీకంట్రోల్ నివేదిక ప్రకారం.. ఈ తొలగింపులు చిన్నా పెద్ద అన్ని ఐటీ కంపెనీలలో జరిగాయని, వాస్తవ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని ఏఐటీఈయూ భావిస్తోంది.ఇలా అత్యధికంగా ఉద్యోగులను తొలగించిన ఐటీ కంపెనీల్లో ప్రముఖంగా టీసీఎస్, ఇన్ఫోసిస్, ఎల్టీఐ-మైండ్ ట్రీ, టెక్ మహీంద్రా, విప్రో వంటి దిగ్గజ కంపెనీలు ఉన్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం ఒక్క హెచ్‌సీఎల్ టెక్‌లో మాత్రమే ఉద్యోగుల సంఖ్య పెరిగింది. అప్రకటిత పద్ధతిలో ఉద్యోగులను తొలగించే పరిస్థితిని "సైలెంట్ లేఆఫ్" సూచిస్తుంది. అంటే కాంట్రాక్టులను పునరుద్ధరించకపోవడం, పని గంటలను తగ్గించడం, ముందస్తు పదవీ విరమణకు పురిగొల్పడం, ఖాళీలను భర్తీ చేయకపోవడం వంటివి. -
హమ్మయ్య.. ఇన్ఫోసిస్‌లో ఆ ముప్పు లేదు!
టెక్ పరిశ్రమలో ఎటు చూసినా జనరేటివ్ ఏఐ ప్రభంజనం.. అంతటా లేఆఫ్‌ల భయంతో ఐటీ ఉద్యోగులు హడలెత్తిపోతున్నారు. అయితే ఇన్ఫోసిస్‌లో మాత్రం ఆ ముప్పు లేదంటున్నారు సంస్థ సీఈవో సలీల్ పరేఖ్. జెన్ఏఐ కారణంగా పరిశ్రమలోని ఇతరుల మాదిరిగా తాము ఉద్యోగాలను తగ్గించబోమని సీఎన్‌బీసీ-టీవీ18 ఇంటర్వ్యూలో చెప్పారు.ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విస్తృతితో ఇన్ఫోసిస్ ఉద్యోగులను తొలగిస్తోందా అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. "లేదు, మేము అలా చేయడం లేదు. నిజానికి ఇండస్ట్రీలో ఇతరులు అలా చేశారు. ఆ విధానం సరికాదని మేం చాలా స్పష్టంగా చెప్పాం' అని పేర్కొన్నారు. పెద్ద సంస్థలకు అన్ని సాంకేతికతలు కలిసి వస్తాయనేది తన అభిప్రాయమని ఆయన వివరించారు. వచ్చే కొన్నేళ్లలో కృత్రిమ మేధ (ఏఐ)లో నిపుణులుగా ఎదిగే వారు మరింత మంది తమతో చేరుతారని, ప్రపంచంలోని పెద్ద సంస్థలకు సేవలు అందిస్తామని చెప్పారు. రానున్న రోజుల్లో క్లయింట్ల పరంగా, ఉద్యోగుల సంఖ్య పరంగా మరింత విస్తరిస్తామని పరేఖ్ తెలిపారు.మరి నియామకాలు?లేఆఫ్‌ల విషయాన్ని పక్కన పెడితే 2025 ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్‌లో నియామకాల పరిస్థితి ఎలా ఉండనుంది అన్నదానిపై తన దృక్పథాన్ని పరేఖ్ తెలియజేశారు. ఆర్థిక వాతావరణం మెరుగుపడటం, డిజిటల్ పరివర్తనపై వ్యయం పెరగడం జరిగితే నియామకాలు మళ్లీ ఊపందుకుంటాయని చెప్పారు. అయితే నియామకాలపై ఎటువంటి వార్షిక లక్ష్యం లేకపోయినా ఆర్థిక వాతావరణం ఆధారంగా నియామకాలు చేపడతామని వివరించారు. -
ఆఫీస్‌కి రాకపోతే ఫైరింగే.. ప్రముఖ ఐటీ కంపెనీ వార్నింగ్!
ప్రముఖ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ (Cognizant) రిటర్న్-టు-ఆఫీస్ పాలసీకి సంబంధించి తమ ఉద్యోగులకు గట్టి హెచ్చరిక జారీ చేసింది. పదేపదే రిమైండర్లు చేసినప్పటికీ కార్యాలయానికి తిరిగి రావాలనే ఆదేశాన్ని విస్మరించేవారు తొలగింపు సహా తీవ్రమైన క్రమశిక్షణా చర్యలను ఎదుర్కోవలసి ఉంటుందని కంపెనీ స్పష్టం చేసిందని ‘లైవ్‌మింట్’ కథనం పేర్కొంది."నిర్దేశాలను పాటించడంలో వైఫల్యం కంపెనీ విధానాల ప్రకారం తీవ్రమైన దుష్ప్రవర్తనకు దారితీస్తుందని దయచేసి గమనించండి. తదనుగుణంగా మీపై తగిన క్రమశిక్షణా చర్యలు ప్రారంభించడం జరుగుతుంది. ఇది తొలగింపునకు కూడా దారితీయవచ్చు" అని ఒక ఉద్యోగికి రాసిన లేఖలో కాగ్నెజెంట్ హెచ్చరించినట్లుగా నివేదిక పేర్కొంది.ఇన్ ఆఫీస్ వర్క్ ప్రాముఖ్యతను కాగ్నిజెంట్ ఇంతకు ముందే పునరుద్ఘాటించింది. ఆఫీస్ పాలసీని పాటించడంలో వైఫల్యాన్ని కంపెనీ పాలసీల ప్రకారం తీవ్రమైన దుష్ప్రవర్తనగా పరిగణిస్తామని, ఇది టర్మినేషన్‌కు సైతం దారితీసే అవకాశం ఉందని ఏప్రిల్ 15 నాటి లేఖలో కాగ్నిజెంట్ స్పష్టం చేసింది.భారత్‌లో కాగ్నిజెంట్ శ్రామిక శక్తి గణనీయంగా ఉంది. కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం.. దాని 347,700 మంది ఉద్యోగులలో సుమారు 2,54,000 మంది భారత్‌లోనే ఉన్నారు. కంపెనీ అతిపెద్ద ఉద్యోగుల స్థావరం భారత్ అని దీనిని బట్టీ తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కంపెనీ రిటర్న్-టు-ఆఫీస్ విధానం భారత్‌లో ప్రాధాన్యత సంతరించుకుంది.ఇన్ ఆఫీస్ వర్క్ తప్పనిసరి ఆదేశాలు అనేక కారణాల నుంచి వచ్చాయి. ఆవిష్కరణలు, జట్టు కృషి, బలమైన సంస్థాగత సంస్కృతిని వ్యక్తిగత సహకారం ప్రోత్సహిస్తుందని కంపెనీలు విశ్వసిస్తున్నాయి. అంతేకాకుండా, ప్రత్యేకించి సెన్సిటివ్ డేటా, కాంప్లెక్స్ ప్రాజెక్ట్‌లను నిర్వహించే పరిశ్రమలలో కార్యాచరణ, భద్రతాపరమైన అంశాలు కూడా కారణంగా ఉన్నాయి.టీసీఎస్ (TCS), ఇన్ఫోసిస్ (Infosys), విప్రో (Wipro) వంటి కంపెనీలు కూడా గతంలో రిటర్న్-టు-ఆఫీస్ విధానాన్ని తప్పనిసరి చేశాయి. అయితే, కొన్ని కంపెనీలు రిమోట్ పని సౌలభ్యానికి అలవాటుపడిన కొంతమంది ఉద్యోగుల నుంచి ప్రతిఘటనను ఎదుర్కొన్నాయి. చాలా మంది ఉద్యోగులు రిమోట్ వర్క్ మెరుగైన పని-జీవిత సమతుల్యతను అందిస్తుందని, ప్రయాణ ఒత్తిడిని తగ్గిస్తుందని వాదించారు. అయితే కాగ్నిజెంట్ వంటి కంపెనీలు ఈ ఉద్యోగుల ప్రాధాన్యతలను వ్యాపార అవసరాలు, కార్యాచరణ సామర్థ్యాలతో సమతుల్యం చేస్తున్నాయి. -
Lok Sabha Election 2024: రా రమ్మని.. రారా రమ్మని
భారీ సంఖ్యలో ఉపాధికి నెలవైన ఐటీ, టెక్నాలజీ కంపెనీలు కీలకమైన లోక్‌సభ ఎన్నికల్లోనూ తమ వంతు బాధ్యత నిర్వహిస్తున్నాయి. తమ ఉద్యోగులతో పాటు ప్రజలను కూడా ఓటేలా ప్రోత్సహిస్తున్నాయి. ఓటేయడం పౌరుల బాధ్యత మాత్రమే కాదని, సామూహిక సంకల్ప శక్తికి సంకేతమని పేర్కొంటున్నాయి. భవిష్యత్ మార్గనిర్దేశకుల్ని ఎంచుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉందని గుర్తు చేస్తున్నాయి. ఇప్పటిదాకా ముగిసిన నాలుగు విడతల పోలింగ్‌లోనూ టెక్ కంపెనీల ప్రచారం చెప్పుకోదగ్గ రీతిలో పని చేసింది.ఫ్లిప్‌కార్ట్ ‘‘మీ ఓటును ధ్రువీకరించుకున్నారా?’’ అంటూ ప్రముఖ ఈ కామర్స్ పోర్టల్ ఫ్లిప్‌కార్ట్ పోలింగ్ తేదీల్లో ‘ఎక్స్’ వేదికగా యూజర్లను అప్రమత్తం చేస్తూ వస్తోంది. ఈజ్ మై ట్రిప్ ‘‘రోడ్డెక్కండి. లోక్‌సభ ఎన్నికల వేళ మీ మూలాలకు (నియోజకవర్గాలకు) తిరిగి వెళ్లండి. చూడని ప్రదేశాలను అన్వేíÙంచండి’’ అంటూ ఆన్లైన్ ట్రావెల్ సేవల బుకింగ్ కంపెనీ ఈజ్ మై ట్రిప్ పిలుపునిచి్చంది. మొబిక్విక్ ‘‘డిజిటల్ ఆవిష్కరణల నుంచి దేశ భవిత దాకా అన్నీ కేవలం ఒక్క ట్యాప్‌తోనే’’ అంటూ ఫిన్‌టెక్ సంస్థ మొబిక్విక్ ‘ఎక్స్’ పోస్ట్ ద్వారా ఓటింగ్ హక్కు వినియోగ ప్రాధాన్యతను గుర్తు చేసింది. జొమాటో ‘‘ఎవరు నాయకత్వం వహించాలో ఓటుతో నిర్ణయించడం కంటే ఏం తినాలో నిర్ణయించుకోవడం అంత ముఖ్యమేమీ కాదు’’ అంటూ ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం జొమాటో కూడా ఎక్స్ ద్వారా తన కస్టమర్లకు ఓటు సందేశం ఇచి్చంది. ఓలా ‘‘మన తాతలు స్వాతంత్య్రం కోసం పోరాడారు. మన తల్లిదండ్రులు రోటి, కపడా, మకాన్ కోసం పోరాటం చేశారు. మన కలలకు తగ్గట్టుగా దేశాన్ని నిర్మించడం మన తరం బాధ్యత’’ అంటూ లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓలా సీఈవో భవీశ్ అగర్వాల్ ఎక్స్ ద్వారా కోరారు. స్విగ్గీ ‘‘తర్వాత ఏం తినాలా అంటూ గంటల తరబడి సమయం వెచి్చంచేవారు తదుపరి ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు సైతం అంతే సమయాన్ని కేటాయించాలి’’ అని ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ పిలుపునిచి్చంది. ఈ మేరకు వీడియో సందేశం విడుదల చేసింది. ఓయో ‘‘సరైన ప్రభుత్వం కొలువుదీరేలా చూడండి. వెళ్లి ఓటు వేయండి’’ అని హోటల్ బుకింగ్ సేవల యాప్ ఓయో కోరింది. ర్యాపిడో క్యాబ్ సేవల సంస్థ ర్యాపిడో పోలింగ్ కేంద్రాలకు వెళ్లే వారి కోసం ఉచిత రైడ్లు ఆఫర్ చేస్తోంది. ఇందుకోసం వోట్నౌ కూపన్ వాడుకోవాలని సూచించింది. ‘‘ఓటేయడం మీ బాధ్యత. మిమ్మల్ని పోలింగ్ బూత్‌కు చేర్చడం మా బాధ్యత’’ అని ఎక్స్‌లో పోస్ట్ పెట్టింది. నమ్మ యాత్రి ‘‘మీ దేశ తదుపరి గమ్యస్థానం కేవలం ఒక ప్రెస్ (క్లిక్) దూరంలోనే ఉంది’’ అంటూ క్యాబ్ సేవలను ఆఫర్ చేసే బెంగళూరు కంపెనీ నమ్మయాత్రి ఓటర్లకు ఇచి్చన సందేశానికి నగరంలో పోలింగ్ సందర్భంగా బాగా ఆదరణ లభించింది. ఇన్స్టాగ్రామ్ ఎన్నికల్లో ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచేందుకు సోషల్ మీడియా యాప్ ఇన్స్టాగ్రామ్ సైతం ప్రయతి్నస్తోంది. పోలింగ్ రోజున ఇన్స్టాగ్రామ్ యాప్‌లో సందేశాల ద్వారా యూజర్లను అప్రమత్తం చేస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వాజ్‌పేయిని ఒప్పించి రోడ్లేశా!
బొమ్మలసత్రం/సాక్షి, చిత్తూరు: హైదరాబాద్ అభివృద్ధికి తానే కారణమని.. అందువల్లే ఐటీ కంపెనీలు డబ్బులు సంపాదిస్తున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. ప్రధాని వాజ్‌పేయిని ఒప్పించి అద్దంలాంటి రహదారులు వేయించానన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు శనివారం నంద్యాల, చిత్తూరుల్లో బహిరంగ సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ్ముళ్లు సెల్‌ఫోన్ వాడుతున్నారంటే దానికి కారణం తానేనన్నారు. తెలుగు తమ్ముళ్లు నష్టపోతారని అమరావతిని రాజధానిగా ప్లాన్ చేశానన్నారు. హైదరాబాద్ కంటే అమరావతిని బెస్ట్ సిటీగా మార్చాలని భావించానని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఆడవాళ్లు ఉద్యోగాలకెళ్తే మగవాళ్లు వంట చేసే రోజులు వస్తాయన్నారు. పోలవరం 72 శాతం పూర్తి చేసి.. ఆ నీటిని బనకచర్లకు అనుసంధానం చేయాలని చూశానన్నారు. తన చివరి శ్వాస ఉన్నంతవరకు పేదవాళ్ల అభివృద్ధి కోసమే పనిచేస్తానని తెలిపారు. రూ.16 లక్షల కోట్లు పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చానన్నారు. 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చి రెండింతలు అభివృద్ధి చేశానని వెల్లడించారు. కోవిడ్ సమయంలో కూడా వర్చువల్ సమావేశాలు పెట్టి ప్రజల కోసం పనిచేశానన్నారు. కాగా, నంద్యాలలో చంద్రబాబు సభ అట్టర్‌ఫ్లాప్ అయ్యింది. ఆయన మాట్లాడుతున్నప్పుడే కార్యకర్తలు వెనుదిరిగారు. చంద్రబాబు రోడ్ షోలో డిగ్రీ విద్యార్థి మృతి ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగరంలో శుక్రవారం చంద్రబాబు నిర్వహించిన రోడ్డు షోలో అపశ్రుతి చోటు చేసుకుంది. చంద్రబాబు కాన్వాయ్‌లోని ఒక వాహనం ఫుట్‌పాత్‌పై నిలబడి ఉన్న డిగ్రీ విద్యార్థి కాట్రగడ్డ సాయికృష్ణ డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో కిందపడిపోయాడు. దీంతో తీవ్రంగా గాయాలపాలైన అతడిని ఒక ప్రైవేటు వైద్యశాలలో చేరి్పంచారు. తలకు బలమైన గాయం కావడంతో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. కాట్రగడ్డ సాయికృష్ణను మద్దిపాడు మండలం దొడ్డవరం గ్రామానికి చెందిన విద్యారి్థగా గుర్తించారు. -
అతిపెద్ద ఐటీ కంపెనీ.. సీఈవో జీతం మాత్రం..
దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సీఈవో, ఎండీ కృతివాసన్ 2024 ఆర్థిక సంవత్సరంలో వార్షిక పరిహారంగా రూ. 25.36 కోట్లు తీసుకున్నారు. అతిపెద్ద ఐటీ కంపెనీల సీఈవోల జీతాల్లో ఇదే అత్యంత తక్కువ కావడం గమనార్హం.ఆసక్తికరంగా, బయటకు వెళ్తున్న చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎన్జీ సుబ్రమణ్యం ఇదే సంవత్సరంలో సీఈవో కృతివాసన్ కంటే ఎక్కువ వేతనం అందుకున్నారు. అయితే, సీఈఓగా కృతివాసన్ జీతం 10 నెలల కాలానికి కాగా, సుబ్రమణ్యం వేతనం పూర్తి సంవత్సరానికి. కృతివాసన్ 2023 జూన్ 1న రాజేష్ గోపీనాథన్ నుండి సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. రాజీనామా చేయడానికి ముందు రెండు నెలల స్వల్ప వ్యవధిలో గోపీనాథన్ రూ. 1.1 కోట్లు అందుకున్నారు. అంతకు ముందు ఏడాది అంటే 2023 ఆర్థిక సంవత్సరంలో ఆయన రూ. 29.16 కోట్లు అందుకున్నారు.కృతివాసన్ వేతన పరిహారంలో ప్రాథమిక జీతం, ఇతర ప్రయోజనాలు, అలవెన్సులు, కమీషన్ ఉన్నాయి. టీసీఎస్ వార్షిక నివేదిక ప్రకారం, 2024 ఆర్థిక సంవత్సరంలో ఆయన రూ.21 కోట్ల కమీషన్ అందుకున్నారు. కంపెనీలో కృతివాసన్‌కి 11,232 స్టాక్‌లు ఉన్నప్పటికీ వేతన పరిహారంలో ఎంప్లాయి స్టాక్ పర్చేజ్ స్కీమ్ (ESPS) ఉండదు.2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇతర ఐటీ సంస్థలు తమ వార్షిక నివేదికలను ఇంకా విడుదల చేయలేదు. 2023 ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ రూ. 56 కోట్ల వార్షిక రెమ్యునరేషన్ ప్యాకేజీని పొందారు. ఐటీ కంపెనీ సీఈవోల జీతాల్లో ఇదే అత్యధికం. ఈయన తర్వాత విప్రో సీఈఓ శ్రీనివాస్ పల్లియా సుమారు రూ. 50 కోట్ల అత్యధిక వార్షిక ప్యాకేజీ అందుకున్నారు. రూ. 28.4 కోట్లతో హెచ్‌సీఎల్ టెక్ సీఈవో విజయకుమార్ మూడో స్థానంలో ఉన్నారు. -
దేశంలో నెం.1 ఐటీ కంపెనీ.. 19 ఏళ్లలో తొలిసారి ఇలా..
దేశంలో నంబర్ వన్ ఐటీ సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)లో ఉద్యోగుల సంఖ్య తొలిసారి తగ్గింది. టీసీఎస్‌లో హెడ్‌కౌంట్ తగ్గడం కంపెనీ 2004లో లిస్ట్ అయినప్పటి నుంచి 19 ఏళ్లలో ఇదే మొదటిసారి అని కంపెనీ వెల్లడిందింది. హెడ్‌కౌంట్ అనేది ఒక నిర్దిష్ట వ్యవధిలో కంపెనీలో లేదా నిర్దిష్ట విభాగంలో పని చేసే సిబ్బంది సంఖ్యను సూచిస్తుంది. 202-24 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల సంఖ్య 13,249 తగ్గి మొత్తం సిబ్బంది సంఖ్య 6,01,546కి తగ్గిపోయిందని టీసీఎస్ ప్రకటించింది. ఇక కొత్త ఉద్యోగుల నికర చేరిక మొత్తం సంవత్సరానికి కేవలం 22,600 మాత్రమే. 2022 ఆర్థిక సంవత్సరం డేటాను పరిశీలిస్తే ఆ ఏడాది కంపెనీ 1.03 లక్షల మంది ఉద్యోగులు పెరిగారు. క్యూ 4లో కంపెనీ హెడ్‌కౌంట్ 1,759 తగ్గింది. టీసీఎస్‌లో పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్య 2023 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంతో పోలిస్తే 2024 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 5,680 తక్కువ. అలాగే రెండవ త్రైమాసికంలో కంపెనీలో మొత్తంంగా 6,333 మంది ఉద్యోగులు తగ్గారు. అయితే 2024 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కంపెనీ 523 మందిని అధికంగా నియమించుకుంది. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 24 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో టీసీఎస్ లాభం 9 శాతం పెరిగి రూ. 12,434 కోట్లకు చేరుకుంది. మార్చి 31తో ముగిసిన మూడు నెలల కాలానికి దాని ఆదాయం కూడా 3.5 శాతం పెరిగి రూ. 61,237 కోట్లకు చేరుకుంది. కంపెనీ లాభం అంచనాలను అధిగమించినప్పటికీ, దాని ఆదాయం మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. మరోవైపు టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ 2024 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో అట్రీషన్ (రిటైరవడం, తొలగించడం లేదా మానేయడం ద్వారా కంపెనీని వీడటం) రేటులో 12.5 శాతం క్షీణతను నివేదించారు. రానున్న రోజుల్లో ఈ రేటు మరింత తగ్గుతుందని కంపెనీ అంచనా వేస్తోంది. -
టీసీఎస్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి..
దేశంలో అతిపెద్ద ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఉద్యోగులకు జీతాలు పెంచింది. 4.5 నుంచి 7 శాతం శ్రేణిలో వార్షిక ఇంక్రిమెంట్లను ప్రకటించింది. టాప్ పెర్ఫార్మర్లకు రెండంకెల పెంపుదల ఉంటుందని చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ తెలిపారు. ఈ వేతనాల పెంపు ఏప్రిల్ 1 నుంచి అమలు కానుందని చెప్పారు. "క్యాంపస్ నియామకాలు, పెరిగిన కస్టమర్ విజిట్ల ఫలితంగా అట్రిషన్ 12.5 శాతానికి తగ్గింది. ఉద్యోగులు కార్యాలయానికి తిరిగి రావడం మా డెలివరీ సెంటర్లలో గొప్ప చైతన్యాన్ని కలిగించింది. మా సహచరుల ఉత్సాహాన్ని పెంచింది" అని టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ కొంత మంది పర్ఫార్మర్లకు 12-15 శాతం వరకు జీతాలను పెంచి ప్రమోషన్స్ సైకిల్‌ను ప్రారంభించింది. ఈ పెంపుదల 2023 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చింది. ఫలితాలను ప్రకటించిన తర్వాత లక్కాడ్ మీడియాతో మాట్లాడుతూ, 2023-24లో కంపెనీ చాలా మంది ఫ్రెషర్లను ఆన్‌బోర్డ్ చేసిందని, అయితే, ఇంకా కొంతమందిని చేర్చుకోవాల్సి ఉందని అన్నారు. ఈ మిగిలిన ఫ్రెషర్లను ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో చేర్చుకుంటామని ఆయన తెలిపారు. కాగా 2024 ఆర్థిక సంవత్సరంలో 40,000 మంది ఫ్రెషర్లను చేర్చుకోవాలని యోచిస్తున్నట్లు గతంలో టీసీఎస్ తెలిపింది. అయితే, బడ్జెట్ పరిమితుల కారణంగా ఫ్రెషర్లు, ఇతర నియామకాల ఆన్‌బోర్డింగ్‌ను ఆలస్యం చేస్తోంది. -
వందలాది ఉద్యోగులు ఇంటికి.. ఐటీ కంపెనీ నిర్ణయం
EXL Layoffs: ప్రపంచవ్యాప్తంగా ఐటీ పరిశ్రమలో లేఆఫ్‌లు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న టెక్ కంపెనీలు వేలాదిగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ క్రమంలోనే న్యూయార్క్ కేంద్రంగా ఉన్న ఎక్సెల్ సర్వీస్ (Exl Service) అనే ఐటీ సంస్థ ఏఐ డిమాండ్ పేరుతో వందలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా జనరేటివ్ ఏఐకి పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా న్యూయార్క్ ఆధారిత ఐటీ సంస్థ ఎక్సెల్ సర్వీస్ తన కార్యకలాపాలను పునర్వ్యవస్థీకరిస్తోంది. ఇందులో భాగంగా 800 మంది ఉద్యోగులను తొలగిస్తోంది. వీరు కంపెనీ మొత్తం ఉద్యోగులలో 2 శాతం కంటే తక్కువే అని తెలుస్తోంది. కంపెనీ తాజా నిర్ణయం కారణంగా భారత్, అమెరికాలో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రభావితం కానున్నారు. వీరిలో 400 మందిని పూర్తిగా ఇంటికి పంపిస్తుండగా మిగిలిన 400 మందికి కంపెనీలోని ఇతర విభాగాల్లో అవకాశం ఇవ్వనుంది. ఉద్యోగాల కోత ప్రాథమికంగా యునైటెడ్ స్టేట్స్, భారత్‌లో డేటా అనలిటిక్స్, డిజిటల్ ఆపరేషన్స్‌లో పనిచేస్తున్న జూనియర్ స్థాయి ఉద్యోగులపై ప్రభావం చూపుతుందని వెల్లడైంది. ఎక్సెల్ సర్వీస్ కంపెనీకి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 55 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. గతంలో కంపెనీ సీఈవోగా ఉన్న రోహిత్ కపూర్ ప్రస్తుతం బోర్డు చైర్మన్‌గా పదోన్నతి పొందారు. అలాగే వికాస్ భల్లా, వివేక్ జెట్లీ అనే ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు డేటా, ఏఐ ఆధారిత సొల్యూషన్స్‌తో కూడిన విస్తృత బాధ్యతలను స్వీకరిస్తున్నారు. కాగా ప్రస్తుతం తొలగిస్తున్న వారి స్థానంలో ఏఐ, డేటాలో అత్యంత పరిజ్ఞానం, నైపుణ్యం ఉన్నవారిని నియమించుకోనున్నట్లు తెలుస్తోంది. కంపెనీ తమ క్లయింట్స్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులను నియమించుకోవాల్సి ఉంటుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. -
ఆశగా ఎదురుచూస్తున్న కాగ్నిజెంట్ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్
నాస్డాక్-లిస్టెడ్ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ ఉద్యోగులకు చేదు వార్త ఇది. ఏప్రిల్‌లో జరగాల్సిన జీతాల పెంపు వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. కంపెనీ ఈ ఏడాది ఆగస్టు 1 నుండి "అర్హత" ఉన్న ఉద్యోగులకు జీతాల పెంపును అందజేస్తుందని ‘మనీకంట్రోల్’ నివేదించింది. జీతాల పెంపు గత సంవత్సరంతో పోలిస్తే సుమారు నాలుగు నెలల ఆలస్యం కానుంది. స్థూల ఆర్థిక సమస్యల కారణంగా కంపెనీ బలహీనమైన డిమాండ్ వాతావరణాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో జీతాల పెంపు ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. ఈ అంశం ఇతర ఐటీ కంపెనీలను కూడా ప్రభావితం చేయనుంది. జీతాల పెంపు ఆలస్యాన్ని కంపెనీ సైతం ధ్రువీకరించినట్లు మనీకంట్రోల్ పేర్కొంది. “వార్షిక మెరిట్ పెంపుదల, బోనస్‌ల ద్వారా మా ఉద్యోగుల కృషి, అంకితభావాన్ని గుర్తించడానికి మేము కట్టుబడి ఉన్నాం. ఈ నిబద్ధతలో భాగంగా, అర్హతగల అసోసియేట్లకు మెరిట్ పెంపుదల ఈ సంవత్సరం ఆగస్టు 1న అందిస్తాం. ముఖ్యంగా మూడు సంవత్సరాలలో మా చాలా మంది ఉద్యోగులకు నాలుగు మెరిట్ హైక్స్ దక్కాయి” అని కంపెనీ పేర్కొంది. తాజా చర్యతో మెజారిటీ కాగ్నిజెంట్ ఉద్యోగులు మూడు సంవత్సరాలలో నాలుగు పెంపులను అక్టోబర్ 2021, అక్టోబర్ 2022, ఏప్రిల్ 2023, ఆగస్టు 2024 పొందుతున్నట్లవుతుంది. కాగ్నిజెంట్ ప్రపంచవ్యాప్తంగా 3.47 లక్షల మంది ఉద్యోగులను కలిగి ఉంది. వీరిలో దాదాపు 2.54 లక్షల మంది భారత్‌లోనే ఉన్నారు. -
వర్క్ ఫ్రమ్ ఆఫీస్.. మరో ఎత్తు వేసిన ఇన్ఫోసిస్!
దేశీయ ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ ఉద్యోగులను ఆఫీస్‌లకు రప్పించడానికి మరో ఎత్తు వేసినట్లు తెలుస్తోంది. ఇంజనీరింగ్-ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ENG-IoT) ప్రాజెక్ట్‌లలో పనిచేసే ఉద్యోగులకు 'ఇన్-పర్సన్ కొల్లాబ్ వీక్స్'ని అమలు చేస్తోంది. తాము సమీక్షించిన ఇన్ఫోసిస్ ఉద్యోగుల ఈమెయిల్స్ ఉటంకిస్తూ ఎకనామిక్స్ టైమ్స్ ఈమేరకు పేర్కొంది. వీటి ప్రకారం.. తమకు కేటాయించిన వారాల్లో ఉద్యోగులు వారి సంబంధిత క్యాంపస్‌లలో హాజరు కావాలి. ఆఫీస్ నుంచి పనిచేయాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తూ ప్రతి త్రైమాసికంలో ఉద్యోగులకు నిర్దిష్ట వారాలను నిర్దేశిస్తుంది. గత ఏడాది నవంబర్‌లో ప్రవేశపెట్టిన హైబ్రిడ్ వర్క్ పాలసీ ప్రకారం, ఇన్ఫోసిస్ ఉద్యోగులు నెలకు కనీసం 10 రోజులు లేదా త్రైమాసికానికి 30 రోజులు ఆఫీస్ నుంచి పని చేయాలి. ఈ హైబ్రిడ్ వర్క్ అప్రోచ్ ద్వారా టీమ్ వర్క్, ఉత్పాదకతను పెంపొందించడం ఇన్ఫోసిస్ లక్ష్యం. బేస్ లొకేషన్లకు దూరంగా ఉన్న ఉద్యోగులు ఈ వారాల్లో డెవలప్మెంట్ సెంటర్లకు తిరిగి వచ్చేలా ప్లాన్ చేసుకోవాలని కంపెనీ కోరింది. కొల్లాబ్ వీక్స్‌లో పాల్గొనే ఉద్యోగుల ఖచ్చితమైన సంఖ్య ఇంకా నిర్ణయించలేదని, ప్రతి త్రైమాసికానికి కనీసం ఆరు వారాలు ఆఫీస్ నుంచి పని చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఈ విధానాన్ని ఈ త్రైమాసికం నుంచి అమలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ నిర్దేశిత వారాలలో ఆఫీస్ నుంచి పనిచేసే ఉద్యోగులకు వారికి అనువైన రోజులను ఎంచుకోవడంలో సౌలభ్యాన్ని కంపెనీ అందిస్తోంది. 10 రోజుల వర్క్ ఫ్రమ్ ఆఫీస్ నిబంధనపై మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, క్యాంపస్ హాజరును పెంచాలని ఇన్ఫోసిస్ చూస్తోంది. -
మా జాబ్స్ తీసేసి వాళ్లకు ఇస్తున్నారు.. టీసీఎస్‌పై తీవ్ర ఆరోపణలు
దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)పై అమెరికన్ ఉద్యోగులు తీవ్ర ఆరోపణలు చేశారు. జాతి, వయసు ఆధారంగా టీసీఎస్ తమపై చట్టవిరుద్ధంగా వివక్ష చూపుతుందని, షార్ట్ నోటీసుతో తమను తొలగించి హెచ్1బీ వీసాలపై భారత్ నుంచి ఉద్యోగులను రిక్రూట్ చేస్తోందని అమెరికన్ ఉద్యోగుల బృందం ఆరోపించింది, వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం.. డజన్ల కొద్దీ అతిపెద్ద అమెరికన్ క్లయింట్లు ఉన్న టీసీఎస్‌కు వ్యతిరేకంగా సుమారు 22 మంది అమెరికన్ ఉద్యోగులు యూఎస్ ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. తొలగింపునకు గురైన టీసీఎస్ మాజీ ఉద్యోగుల్లో యూఎస్‌లోని వివిధ రాష్ట్రాల్లో నివసిస్తున్న కాకేసియన్లు, ఆసియన్-అమెరికన్లు, హిస్పానిక్ అమెరికన్లు, 40 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న వారే ఎక్కువ మంది ఉన్నారు. వీరిలో ఎంబీఏ, ఇతర ఉన్నత డిగ్రీలున్నవారూ ఉండటం గమనార్హం. అయితే ఈ ఆరోపణలను టీసీఎస్ ప్రతినిధి కొట్టిపారేశారు. 'చట్టవిరుద్ధమైన వివక్ష'కు సంబంధించిన ఆరోపణలు' అర్హత లేనివి, తప్పుదారి పట్టించేవి' అని తెలిపారు. "యూఎస్‌లో సమాన అవకాశాలు కల్పించే సంస్థగా టీసీఎస్ బలమైన రికార్డును కలిగి ఉంది. దాని కార్యకలాపాలలో చిత్తశుద్ధితో వ్యవహరిస్తుంది" అని కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు. -
సందట్లో సడేమియా.. ఐటీ కంపెనీలకు వల వేస్తున్న కేరళ!
బెంగళూరులో నీటి కొరత.. పొరుగు రాష్ట్రాలకు పెట్టుబడుల కోసం ఐటీ కంపెనీలను తమ రాష్ట్రాలకు రప్పించే అవకాశంగా మారింది. ‘ఎకనామిక్ టైమ్స్’ ఒనివేదిక ప్రకారం.. కేరళకు మారాలని బెంగళూరులోని కొన్ని ఎంఎన్సీ కంపెనీలకు తాను లేఖ రాసినట్లు కేరళ పరిశ్రమలు, న్యాయ శాఖ మంత్రి పి.రాజీవీ తెలిపారు. తమ రాష్ట్రంలో కర్ణాటక కంటే మెరుగైన నీటి వనరులు ఉన్నాయని, గణనీయమైన పెట్టుబడులకు కేరళ అనువైన ప్రదేశం అని మంత్రి రాజీవీ పేర్కొన్నారు. ‘బెంగళూరులో తీవ్రమైన నీటి సంక్షోభం ఉందని తెలుసుకున్నాం. కాబట్టి మేము కొన్ని ఐటీ కంపెనీలను సంప్రదించి కేరళకు తరలించమని కోరాము. మా రాష్ట్రం మంచి ప్రణాళికాబద్ధమైన నీటి సదుపాయాలు కలిగి ఉంది. సహజ వనరులతో నిండి ఉంది. మేము వారికి అవసరమైన అన్ని సౌకర్యాలను అందిస్తాం’ అన్నారు. ఇదీ చదవండి: కంపెనీ మారే ఆలోచనలో ఉద్యోగి.. స్వయంగా రంగంలోకి గూగుల్ కోఫౌండర్ కేరళను దేశంలోని కొత్త సిలికాన్ వ్యాలీగా మార్చాలనే తన ఆశయాన్ని మంత్రి రాజీవీ వెల్లడించారు. ‘‘ప్రస్తుతం కేరళలో పెట్టుబడులపై కొన్ని కంపెనీలతో చర్చలు జరుగుతున్నాయి. మా రాష్ట్రం కొత్త సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా మారే అవకాశం ఉంది. ఆ దిశగా కంపెనీలకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నాం. బెంగళూరు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటున్నందున, కంపెనీలకు తదుపరి అతిపెద్ద ఐటీ గమ్యస్థానంగా కేరళ తనను తాను ప్రదర్శించుకోవాలనుకుంటోంది’ అన్నారు. 66వ నెంబర్ జాతీయ రహదారి వెంబడి నాలుగు కొత్త ఐటీ కారిడార్లను నిర్మించాలని కేరళ ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. -
కంపెనీ మారే ఆలోచనలో ఉద్యోగి.. స్వయంగా రంగంలోకి గూగుల్ కోఫౌండర్
Google employee: ఖర్చులు తగ్గించుకునే నెపంతో టెక్నాలజీ కంపెనీలు లేఆఫ్‌ల పేరుతో వేలాదిగా ఉద్యోగులను వదిలించుకోవడం చూస్తున్నాం. అదే సమయంలో ప్రతిభ ఉన్న ఉద్యోగులు ఇతర సంస్థలకు వెళ్లకుండా వారికి కావాల్సింది ఇచ్చి కాపాడుకుంటున్నాయి కొన్ని కంపెనీలు. ఇలాగే కంపెనీ మారే ఆలోచనలో ఉన్న ఓ ఉద్యోగిని కాపాడుకునేందుకు నేరుగా గూగుల్ కోఫౌండర్ రంగంలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది. ఓపెన్ ఏఐ కంపెనీ కోసం గూగుల్‌ను వీడేందుకు సిద్ధమైన తమ ఉద్యోగికి గూగుల్ కోఫౌండర్ సెర్గీ బ్రిన్ వ్యక్తిగతంగా ఫోన్ చేశారు. ఉద్యోగిని పోస్ట్‌లో కొనసాగేలా ఒప్పించేందుకు అదనపు వేతనం ఇస్తామని హామీ ఇచ్చినట్లుగా ఓ నివేదిక ద్వారా వెల్లడైంది. కాగా కంపెనీ మారేందుకు సిద్ధమైన ఆ ఉద్యోగి గూగుల్‌లో చాలా కాలంగా ఏఐ రీసెర్చర్‌గా పనిచేస్తున్నట్లు తెలిసింది. సదరు గూగుల్ ఉద్యోగి తమకు స్నేహితుడని, అతనికి కోసం స్వయంగా కంపెనీ కోఫౌండర్ సెర్గీ బ్రిన్ రంగంలోకి దిగడం బిగ్ టెక్ కంపెనీల్లో ఏఐ టాలెంట్‌కు ఉన్న డిమాండ్ ట్రెండ్‌ను సూచిస్తోందని ఓ అజ్ఞాత వ్యక్తి తెలిపారు. ప్రస్తుతం అధునాతన ఏఐ నైపుణ్యాలకు డిమాండ్ బిగ్ టెక్ కంపెనీల్లో అత్యధికంగా ఉంది. ఇదీ చదవండి: సందట్లో సడేమియా.. ఐటీ కంపెనీలకు వల వేస్తున్న కేరళ! -
వాళ్లు పోతే పోనీ.. దిగ్గజ ఐటీ కంపెనీలో ప్రమోషన్లు!
Wipro Promotions : భారతీయ ఐటీ సేవల సంస్థ విప్రో ఉద్యోగులకు ప్రమోషన్లు ప్రకటించింది. ఆరుగురు ఉద్యోగులను సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పోస్టులకు, మరో 25 మందిని వైస్ ప్రెసిడెంట్ పోస్టులకు ప్రమోట్ చేసినట్లు అంతర్గత మెమోలను ఉటంకిస్తూ రాయిటర్స్ పేర్కొంది. దేశంలో నాలుగో అతిపెద్ద సాఫ్ట్వేర్ సేవల కంపెనీ అయిన విప్రో నుంచి ఉన్నత స్థాయి నిష్క్రమణల పరంపర తర్వాత సీనియర్-స్థాయి అట్రిషన్‌ను నిరోధించే చర్యగా ఈ ప్రమోషన్లను పరిశ్రమ పరిశీలకులు భావిస్తున్నారు. సీనియర్ వైస్ ప్రెసిడింట్‌గా పదోన్నతి పొందిన చీఫ్ డెలివరీ ఆఫీసర్ అజిత్ మహాలే, హెల్త్‌కేర్ పోర్ట్‌ఫోలియో లీడర్ అనూజ్ కుమార్, క్యాప్కో సీఎఫ్ఓ బెంజమిన్ సైమన్, కెనడా కంట్రీ హెడ్ కిమ్ వాట్సన్, యూరప్ క్లౌడ్ సేల్స్ హెడ్ శ్రీనివాసా హెచ్‌జి, క్లౌడ్ ఆర్మ్ స్ట్రాటజీ అండ్ ఎగ్జిక్యూషన్ ఆర్మ్ హెడ్ సతీష్ వై ఉన్నారు. గత సంవత్సరం ఫైనాన్స్ చీఫ్ జతిన్ దలాల్, చీఫ్ గ్రోత్ ఆఫీసర్ స్టెఫానీ ట్రాట్మాన్, డిజిటల్ అండ్ క్లౌడ్ హెడ్ భరత్ నారాయణన్ సహా చాలా మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు విప్రోను వీడారు. నియామక సంస్థ ఎక్స్‌ఫెనో డేటా ప్రకారం.. దేశంలోని ఐటీ, కన్సల్టింగ్ కంపెనీలలో అసిస్టెంట్ వైస్ ప్రెసిడింట్, వైస్ ప్రెసిడింట్, సీనియర్ వైస్ ప్రెసిడింట్ పోస్టుల సంఖ్య 2024 ఆర్థిక సంవత్సరంలో 11 శాతంగా ఉంది. ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 4 శాతం తగ్గింది. కాగా ప్రమోషన్ల అంశాన్ని విప్రో యాజమాన్యం సైతం ధ్రువీకరించింది. "బలమైన అంతర్గత నాయకులను అభివృద్ధి చేయడంలో కొనసాగుతున్న నిబద్ధత"లో ఇది భాగమని తెలిపింది. అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సంస్థ తక్కువ మంది సీనియర్ ఉద్యోగులను ప్రమోట్ చేసింది. 2023 జనవరిలో విప్రో రికార్డు స్థాయిలో 73 మంది ఉద్యోగులను ప్రమోట్ చేసింది. వీరిలో 12 మందిని సీనియర్ వైస్ ప్రెసిడింట్ స్థాయికి, 61 మందిని వైస్ ప్రెసిడెంట్ స్థాయికి పదోన్నతి కల్పించింది. -
ఆదాయ వృద్ధిని పరిమితం చేసిన ఐటీ దిగ్గజం
అంతర్జాతీయ అనిశ్చితులు, కొత్త ప్రాజెక్టులు రాకపోవడం, బ్యాంకింగ్ వంటి ప్రధాన రంగాల్లోని సంస్థలు టెక్నాలజీ ఆధారిత సేవలపై చేసే ఖర్చును తగ్గించుకోవడంతో ఐటీ సంస్థలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలోనూ ఐటీ సంస్థల ఆదాయాలు, లాభాలు తగ్గుతాయని కొన్ని రేటింగ్ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా కేంద్రంగా పలు దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న ఐటీ దిగ్గజ సంస్థ యాక్సెంచర్ తన భవిష్యత్తు ఆదాయంలో వృద్ధి 1-3 శాతానికే పరిమితం కావొచ్చని పేర్కొంది. గతంలో ఈ అంచనా 2-5 శాతంగా ఉంది. ఈ నేపథ్యంలోనే భారతీయ ఐటీ సంస్థల ఆదాయ వృద్ధిపైనా అనుమానాలు రేకెత్తాయి. ఫలితంగానే దేశీయ ఐటీ సంస్థలైన ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో తదితర కంపెనీల షేర్లు ఇటీవల 1-3% నష్టపోయాయి. నిఫ్టీ ఐటీ సూచీ 3% తగ్గింది. టెక్నాలజీ సూచీలు నెల వ్యవధిలో 9% క్షీణించింది. యాక్సెంచర్ తన ఆదాయ అంచనాలను తక్కువకు సవరించడం వల్లే, స్వల్పకాలంలో దేశీయ ఐటీ షేర్లకు ఒత్తిడి ఎదురవుతోంది. అంతర్జాతీయంగా కార్యకలాపాలు సాగించే అమెరికా కంపెనీ తాజా నిర్ణయంతో దేశీయ ఐటీ కంపెనీల్లోనూ అదే ధోరణి ఉంటుందని మార్కెట్ భావిస్తున్నట్లు తెలిసింది. పలు రంగాల సంస్థలు అంతగా ముఖ్యం కాని స్వల్పకాలిక ప్రాజెక్టులను పక్కన పెడుతున్నాయని యాక్సెంచర్ తన ఆదాయ అంచనాల నివేదికలో పేర్కొంది. ఇలాంటి ప్రాజెక్టులను చేస్తున్న విప్రో, ఎల్టీఐ మైండ్‌ట్రీ, ఎంఫసిస్, ఇన్ఫోసిస్ లాంటి సంస్థలకూ సమీప భవిష్యత్తులో ఇబ్బందులుండే అవకాశాలున్నాయని స్టాక్ బ్రోకింగ్ సంస్థలు అంచనాలు వేస్తున్నాయి. కంపెనీల విచక్షణ ఆధారిత పెట్టుబడి, వచ్చే ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం నుంచి పెరిగేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నాయి. ఇదీ చదవండి: అరచేతిలో ఇమిడే గాలి పంపు.. వీడియో వైరల్ యాక్సెంచర్ సైతం వచ్చే ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంపై ఆశాజనకంగానే ఉంది. ఫలితంగా దేశీయ ఐటీ సంస్థలకూ అప్పుడు కాస్త అనుకూల పరిస్థితులు నెలకొనచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. -
ఎన్నికల బాండ్లు.. ఇన్ఫోసిస్ ఏ పార్టీకి విరాళం ఇచ్చిందంటే..
ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. ఇన్ఫ్రా, ఫార్మా కంపెనీలతోపాటు రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చిన వాటిలో ఐటీ కంపెనీలు ఉండడం విశేషం. తాజాగా ఎస్బీఐ విడుదల చేసిన ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసిన వారి వివరాల ప్రకారం.. ఐటీ రంగంలో సియెంట్ కంపెనీ గరిష్ఠంగా రూ.10 కోట్లు విలువ చేసే బాండ్లను కొనుగోలు చేసింది. అయితే ఆ కంపెనీ ఏ పార్టీకి విరాళం ఇచ్చిందో తెలియరాలేదు. తదుపరి స్థానంలో జెన్సర్ టెక్నాలజీస్ మే 2019లో రూ.3 కోట్లు విలువచేసే వివిధ పార్టీలకు సంబంధించిన ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసినట్లు తెలిసింది. మూడో స్థానంలో ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ అయిన ఇన్ఫోసిస్ 2018 కర్ణాటక ఎన్నికల ముందు దేవెగౌడకు చెందిన జనతాదళ్(సెక్యూలర్) పార్టీకి రూ.1 కోటి విరాళం ఇచ్చినట్లు తెలిసింది. రాజకీయ పార్టీలకు కంపెనీలు ఇచ్చే విరాళాలు పూర్తిగా క్విడ్ ప్రోకో ప్రయోజనాలకు అనుకూలంగా ఉండటంతో పారదర్శకత లోపించిందని.. అందువల్ల ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చే విరాళాలను తప్పనిసరిగా బహిర్గతం చేయాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దాంతో ఎస్బీఐ ఇటీవల వివరాలు వెల్లడించింది. ఇదీ చదవండి: ఆఫీస్‌కు రాకపోతే పదోన్నతులుండవు.. ప్రముఖ టెక్ కంపెనీ కీలక నిర్ణయం కంపెనీల వారీగా ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసిన వివరాలు.. ఫ్యుచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ పీఆర్ రూ.1,368 కోట్లు మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ రూ.966 కోట్లు క్విక్ సప్లైచెయిన్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.410 కోట్లు వేదాంత లిమిటెడ్ రూ.400 కోట్లు హల్దియా ఎనర్జీ రూ.377 కోట్లు భారతి గ్రూప్ రూ.247 కోట్లు ఎస్సెల్ మైనింగ్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రూ.224 కోట్లు వెస్ట్రన్ యూపీ పవర్ ట్రాన్సిమిషన్ కంపెనీ లిమిటెడ్ రూ.220 కోట్లు కెవెంటర్ ఫుడ్‌పార్క్ ఇన్ఫ్రా లిమిటెడ్ రూ.195 కోట్లు మదన్‌లాల్ లిమిటెడ్ రూ.185 కోట్లు -
దేశీయ ఐ.టి. రంగం లో మళ్ళీ గందరగోళం
-
Sudha Murty: ఇన్ఫోసిస్ డైరెక్టర్‌గా రిటైరయ్యేదాన్ని..
దేశంలో అత్యంత గుర్తింపు పొందిన దంపతుల్లో ఇన్ఫోసిస్ (Infosys) వ్యవస్థాపకుడు నారాయణమూర్తి, సుధా మూర్తి ఒకరు. దేశంలో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి చేసిన కృషితో నారాయణమూర్తి ప్రసిద్ధి చెందితే రచయిత్రిగా, సేవా కార్యక్రమాలతో ఆయన సతీమణి సుధా మూర్తి గుర్తింపు పొందారు. అయితే భర్త కంపెనీ కోసం ఎంతో కష్టపడిన ఆమె కంపెనీలో మాత్రం భాగం కాలేకపోయారు. దానికి తన భర్త పెట్టిన షరతే కారణమంటున్నారు సుధా మూర్తి. అనేక దశాబ్దాల సహచర్యం ఉన్న ఈ దంపతులు తమ జీవిత విశేషాల గురించి పలు సందర్భాల్లో పంచుకుంటుంటారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో సుధా మూర్తి తన భర్తతో సాన్నిహిత్యాన్ని, తమ వైవాహిక బంధం గురించి వెల్లడించారు.తమ జీవితంలో ఎదుర్కొన్న అత్యంత ఒత్తిడితో కూడిన సమయాన్ని గుర్తు చేసుకున్నారు. "నేను కంపెనీ (ఇన్ఫోసిస్)లో చేరలేకపోవడమే జీవితంలో నాకు అత్యంత కష్టతరమైన విషయం. నేను ఎందుకు చేరలేకపోయానంటే.. కంపెనీ భార్యాభర్తల కంపెనీ కాకూడదని ఆయన షరతు పెట్టారు. ఆ కష్టతరమైన సమయం నుంచి బయటపడటానికి నాకు చాలా సమయం పట్టింది. నేను ఎంతగానో ప్రేమించిన కంపెనీ, దాని కోసం చాలా పనిచేశాను. కానీ అందులో భాగం కాలేకపోయాను" అన్నారు సుధామూర్తి. అయినప్పటికీ తాను జీవితంలో సంతోషంగా ఉన్నానని ఆమె చెప్పారు. ‘ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, ఇప్పటికి నేను బహుశా ఇన్ఫోసిస్ డైరెక్టర్‌గా పదవీ విరమణ చేసి ఉండేదాన్ని. కానీ నేను నా పనితో చాలా మంది జీవితాలను స్పృశించగలిగాను. బహుశా ఇది దేవుడి నిర్ణయం. నాకు మాత్రమే సాధ్యమైంది" అన్నారు. నారాయణ మూర్తి, సుధామూర్తి చేసిన ఎన్నో త్యాగాల ఫలితమే ఈ రోజు దేశంలో రెండవ అతిపెద్ద ఐటీ కంపెనీగా అవతరించిన ఇన్ఫోసిస్. ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో కంపెనీ వృద్ధి కోసం తమ మూడు నెలల పాపకు దూరంగా ఉండాల్సి వచ్చినట్లు సుధామూర్తి పేర్కొన్నారు. -
ఇక నెలకు 11 రోజులు హాయి.. ఐటీ దిగ్గజం గుడ్‌న్యూస్!
వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి పూర్తిగా స్వస్తి పలుకుతూ ఉద్యోగులను కంపెనీలు బలవంతంగా ఆఫీస్‌లకు పిలిపిస్తున్న ప్రస్తుత తరుణంలో దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) కాస్త ఊరట కలిగిస్తోంది. పూర్తిగా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కాకుండా హైబ్రిడ్ వర్క్ మోడల్‌ను అనుసరిస్తోంది. తాజాగా ఉద్యోగులకు నెలకు 11 రోజుల పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. ఇన్ఫోసిస్ ఉద్యోగుల ఎక్స్పీరియన్స్ ప్లాట్‌ఫామ్ ఇన్ఫీమీ (InfyMe) కొన్ని ఎంపిక చేసిన ఆఫీసుల్లో నెలలో 11 రోజుల పాటు ఇంటి నుండి పని కోసం దరఖాస్తు చేసుకోవడానికి అనుమతిస్తుంది. "మనం ఇప్పుడు హైబ్రిడ్ వర్క్ మోడల్లో ఉన్నాం. మీరు నెలకు పేర్కొన్న కొన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ రోజులను పొందవచ్చు మిగిలిన రోజులలో ఆఫీస్ నుండి పని చేయవచ్చు. అదనపు వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం అభ్యర్థనలు మీ మేనేజర్ ఆమోదానికి లోబడి ఉంటాయి" అని ఇన్ఫీమీ ప్లాట్‌ఫామ్‌లోని సందేశం పేర్కొంది. వారానికి ఐదు రోజులు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అమలు చేస్తున్న ఇతర కంపెనీలకు భిన్నంగా ఇన్ఫోసిస్ గత సంవత్సరం నవంబర్ 20 నుండి జూనియర్, మధ్య స్థాయి ఉద్యోగులను నెలకు 10 రోజులు మాత్రమే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అమలు చేస్తోంది. ఇప్పుడు తాజాగా కల్పించిన వెసులుబాటుతో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులకు, ముఖ్యంగా మహిళలకు ఊరట కలుగుతుంది. -
వర్క్ ఫ్రమ్ హోమ్‌కు మరో ఐటీ కంపెనీ మంగళం!
వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఐటీ ఉద్యోగులకు మరో కంపెనీ ఆఫీసుకి పిలిచింది. ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ భారత్‌లోని తమ ఉద్యోగులను వారానికి కనీసం మూడురోజులు ఆఫీసుకి వచ్చి పని చేయాలని కోరినట్లు ఒక నివేదిక తెలిపింది. దీంతో రిమోట్ వర్కింగ్‌ను ముగించిన తాజా కంపెనీగా కాగ్నిజెంట్ అవతరించింది. వారానికి సగటున మూడు రోజులు ఆఫీసులో ఉండాలని, టీమ్ లీడర్ సూచన మేరకు నడుచుకోవాలంటూ భారత్‌లోని ఉద్యోగులకు గత వారం కాగ్నిజెంట్ సీఈఓ రవి కుమార్ పంపిన మెమోను ఉటంకిస్తూ వార్తా సంస్థ రాయిటర్స్ కథనం పేర్కొంది. అయితే ఎప్పటి నుంచి ఈ ఆదేశాలు అమలవుతాయన్నది కంపెనీ పేర్కొనలేదని నివేదిక తెలిపింది. ఆఫీసు నుండి పని చేయడం వల్ల కంపెనీ సంస్కృతిపై మంచి సహకారం, అవగాహన లభిస్తుందని కాగ్నిజెంట్ చెబుతోంది. అయితే దీని వల్ల ఫ్లెక్సిబులిటీ, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ దెబ్బతింటాయని చాలా మంది ఉద్యోగులు సోషల్ మీడియా వేదికగా ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఆఫీస్‌లో కలిసి పనిచేస్తూ సహకార ప్రాజెక్ట్‌లు, ట్రైనింగ్, టీమ్ బిల్డింగ్ వంటి అంశాలకు సమయం కేటాయించాలని కంపెనీ సీఈవో కోరుతున్నారు. కొత్త యాప్ భారత్ కోసం కొత్త హైబ్రిడ్-వర్క్ షెడ్యూలింగ్ యాప్‌ను కూడా కాగ్నిజెంట్ ప్రారంభించనుంది. ఇది మేనేజర్లకు షెడ్యూల్‌లను సమన్వయం చేయడంలో, వారి టీమ్‌ల కోసం ఆఫీస్‌లో స్పేస్‌ను రిజర్వ్ చేయడంలో సహాయపడుతుందని మెమోలో పేర్కొన్నారు. కాగ్నిజెంట్ 3,47,700 మంది ఉద్యోగులను కలిగి ఉంది. వారిలో దాదాపు 2,54,000 మంది భారతదేశంలోనే ఉన్నారు. టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్టెక్తో సహా అనేక భారతీయ ఐటీ కంపెనీలు ఆఫీస్‌కి వచ్చి పనిచేయాలని ఉద్యోగులను ఇప్పటికే కోరాయి. మార్చి 31 నాటికి ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసు నుండి పని చేయడాన్ని టీసీఎస్ తప్పనిసరి చేసింది. -
‘పెద్ద సంఖ్యలో’.. ఐటీ ఉద్యోగులకు క్యాప్‌జెమినీ చల్లని కబురు!
ప్రముఖ మల్టీనేషనల్ ఐటీ కంపెనీ క్యాప్‌జెమినీ భారత్‌లోని ఐటీ ఉద్యోగులకు చల్లటి కబురు చెప్పింది. దేశీయ వ్యాపారంలో వృద్ధిని అంచనా వేస్తూ 2025 ఆర్థిక సంవత్సరానికి భారతదేశంలో "పెద్ద సంఖ్యలో" ఉద్యోగులను నియమించుకోవాలని యోచిస్తోంది. బిజినెస్ వార్త సంస్థ మింట్‌తో జరిగిన సంభాషణలో క్యాప్‌జెమినీ చీఫ్ టెక్నాలజీ & ఇన్నోవేషన్ ఆఫీసర్ నిషీత్ శ్రీవాస్తవ ఈ విషయాన్ని వెల్లడించారు. పరిశ్రమలోని పోటీ కంపెనీలకు అనుగుణంగా తమ కంపెనీ హెడ్‌కౌంట్ పెరుగుతుందని తెలిపారు. ఇది ఐటీ సెక్టార్లో సవాలుగా ఉన్న 2024 ఆర్థిక సంవత్సరం తర్వాత సానుకూల మార్పును సూచిస్తుంది. క్యాప్‌జెమినీకి 2024 ఫిబ్రవరి నాటికి భారత్‌లో 1,75,000 మంది ఉద్యోగులు ఉన్నారు. నాస్కామ్ ప్రకారం 253.9 బిలియన్ డాలర్లు సంచిత రాబడితో 2024 ఆర్థిక సంవత్సరం ముగియగలదని అంచనా వేస్తున్న భారత ఐటీ రంగం.. స్థూల ఆర్థిక అనిశ్చితి కారణంగా కాలంగా ఎదుర్కొంటున్న వ్యయ కట్టడి పరిస్థితి నుంచి పుంజుకునేలా కనిపిస్తోంది. మింట్ నివేదిక ప్రకారం.. 2024 ఆర్థిక సంవత్సరం మొదటి మూడు త్రైమాసికాలలో టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, విప్రో కంపెనీల్లో 49,936 మంది ఉద్యోగులు తగ్గిపోయారు. మూడవ త్రైమాసిక ఫలితాలను అనుసరించి దేశీయ ఐటీ మేజర్లు వివిధ పరిశ్రమలలోని క్లయింట్ల సెంటిమెంట్‌కు అనుగుణంగా వ్యయం విషయంగా విచక్షణతో వ్యవహరిస్తున్నాయి. -
ఉద్యోగుల విషయంలో టీసీఎస్ తప్పు తెలుసుకుందా?
TCS plans to increase headcount : ఐటీ పరిశ్రమలో లేఆఫ్‌లు నిత్య కృత్యమైన ప్రస్తుత తరుణంలో చాలా కంపెనీలు నియామకాల జోలికే వెళ్లడం లేదు. ఈ క్రమంలో దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఆశ్చర్యకరమైన ప్రణాళికను బయటపెట్టింది. గతేడాది టీసీఎస్ సైతం గణనీయమైన తొలగింపులు చేపట్టింది. రానున్న రోజుల్లో మరిన్ని తొలగింపులు ఉంటాయని భావిస్తుండగా ఇందుకు విరుద్ధంగా తమ శ్రామిక శక్తిని పెంచుకోవాలనే ఉద్దేశాన్ని టీసీఎస్ ప్రకటించింది. కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కేకే కృతివాసన్ నాస్కామ్ సెషన్లో టీసీఎస్ నియామకాల లక్ష్యాల గురించి మాట్లాడారు. రిక్రూట్మెంట్ ప్రయత్నాలను తగ్గించే ప్రణాళికలేవీ లేవని స్పష్టం చేశారు. కీలక మార్కెట్ల నుంచి డిమాండ్ మందగించడంతో సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాల నియామకాలు తగ్గుతాయని పరిశ్రమ నివేదికలు సూచిస్తున్న తరుణంలో ఇందుకు విరుద్ధంగా టీసీఎస్ నుంచి ఈ ప్రకటన వచ్చింది. ముఖ్యంగా 2023లో టీసీఎస్ వేలాది మంది ఉద్యోగులను తొలగించింది. లైవ్‌మింట్ నివేదిక ప్రకారం.. గత సంవత్సరంలో 10,818 మంది ఉద్యోగులను టీసీఎస్ తొలగించింది. నియామక ధోరణుల గురించి ఆందోళనలను ప్రస్తావిస్తూ.. " ఇప్పటికే ఆర్థిక వ్యవస్థలో కొన్ని సానుకూలతలు చూస్తున్నాం. మాకు మరింత మంది సిబ్బంది అవసరం ఉంది" అని కృతివాసన్ పేర్కొన్నారు. నియామక ప్రక్రియలో సర్దుబాట్లు చేసినప్పటికీ, రిక్రూట్మెంట్ కార్యక్రమాలలో ఎలాంటి తగ్గింపు ఉండదని సూచిస్తూ కంపెనీ నియామక ఎజెండా పట్ల టీసీఎస్ నిబద్ధతను ఆయన స్పష్టం చేశారు. 6 లక్షల మందికిపైగా ఉద్యోగులున్న టీసీఎస్.. మార్కెట్లో సవాళ్లు ప్రబలంగా ఉన్నప్పటికీ దాని మధ్యస్థ, దీర్ఘకాలిక అవకాశాల గురించి ఆశాజనకంగా ఉందని పీటీఐ నివేదించింది. ఇటీవలి త్రైమాసిక ఫలితాలలో టీసీఎస్ నికర లాభంలో 8.2 శాతం వృద్ధిని సాధించింది. టీసీఎస్ నియామక ప్రణాళికలతోపాటు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంపై కంపెనీ వైఖరిని సైతం కృతివాసన్ ప్రస్తావించారు. సంస్థాగత సంస్కృతి, విలువలను మెరుగుపరచడానికి రిమోట్ వర్క్ లేదా హైబ్రిడ్ మోడల్‌లు సరైనవి కాదన్నారు. వ్యక్తిగత సహకారం, అభ్యాసం ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. సహోద్యోగులను, సీనియర్లను గమనిస్తూ విలువైన పాఠాలు కార్యాలయ వాతావరణంలో ఉత్తమంగా నేర్చుకోవచ్చని సూచించారు. -
షాకింగ్ లేఆఫ్.. ఇంతకంటే దారుణమైన తొలగింపు ఉంటుందా?
Google shocking layoff: టెక్ పరిశ్రమలో ఇప్పుడు తొలగింపులు సాధారణంగా మారిపోతున్నాయి. అయితే గూగుల్ లాంటి దిగ్గజ కంపెనీలు సైతం లేఆఫ్‌ల విషయంలో దారుణంగా ప్రవర్తిస్తున్నాయి. గూగుల్ తనను ఎంత దారుణంగా తొలగించిందో ఓ ఉద్యోగి సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. ముందు యాక్సెస్ పోయింది.. తర్వాత మెసేజ్ జెమిని ఏఐ మోడల్ అల్గారిథమ్‌లపై పని చేసే తనను గూగుల్ తొలగించిన క్రమాన్ని అలెక్స్ కోహెన్ అనే ఉద్యోగి ‘ఎక్స్’ (గతంలో ట్విటర్)లో షేర్ చేసిన పోస్ట్‌లో వివరించారు. "గూగుల్ నన్ను ఈ రోజు తొలగించిందని పంచుకోవడం విచారంగా ఉంది. జెమిని కోసం అల్గారిథమ్‌ల రూపకల్పనకు ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్న నాకు ఈరోజు ఉన్నట్టుండి హ్యాంగ్అవుట్స్, గూగుల్ డ్రైవ్‌కు యాక్సెస్ పోయింది. ఆ తర్వాత నన్ను తొలగించినట్లు మేనేజర్ నుంచి మెసేజ్ వచ్చింది" అని అలెక్స్ కోహెన్ వాపోయాడు. అయితే తాను 12 నెలల తొలగింపు పరిహారాన్ని (సుమారు రూ.22 కోట్లు ) అందుకుంటున్నానని, ఇది చేతికందిన తర్వాత తాను తదుపరి ఏమి చేయాలో నిర్ణయించుకుంటానని అలెక్స్ కోహెన్ తెలియజేశారు. అయితే గత 5 నెలల్లో ఎల్ఎల్ఎంల గురించి, ఏఐ గురించి ఎంతో నేర్చుకున్నానని, ఆ ప్రయాణం బాగుందని రాసుకొచ్చారు. కాగా ఇంతకుముందు గూగుల్ ఒకప్పుడు ఏఐ విభాగంతో ప్రత్యక్ష ప్రమేయం లేని 'సెర్చ్ టీమ్'లో భాగమైన ఒక ఉద్యోగికి జీతంలో 300 శాతం పెంపును అందించిందని పర్ప్లెక్సిటీ ఏఐ సీఈవో అరవింద్ శ్రీనివాస్ పేర్కొన్నారు. పెట్టుబడుల సామర్థ్యాన్ని పెంచుకునేందుకు కంపెనీ "కఠినమైన ఎంపికలు" చేయాల్సిన అవసరం ఉన్నందున మరిన్ని ఉద్యోగాల కోతలు ఉంటాయని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ స్పష్టం చేశారు. Sad to share that I was laid off from Google today. I was in charge of making the algorithms for Gemini as woke as possible. After complaints on Twitter surfaced today, I suddenly lost access to Hangouts and Google Drive, and my manager (he/him), texted me to let me know that i… — Alex Cohen (@anothercohen) February 22, 2024 -
ఐటీ ఉద్యోగుల జేబులు ఖాళీ అవుతున్నాయ్..
ప్రపంచవ్యాప్తంగా కొన్ని నెలలుగా ఐటీ ఉద్యోగుల జేబులు ఖాళీ అవుతున్నాయి. అంటే జీతాలు తగ్గిపోతున్నాయి. ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్‌ల ప్రకారం.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిపుణులకు జీతం ఆఫర్లు 30 నుంచి 40 శాతం తగ్గాయి. అంతర్జాతీయ స్థూల ఆర్థిక మార్పులు, ఐటీ రంగం మందగమనం నేపథ్యంలో ఈ పతనం ఏడాది క్రితమే మొదలైందని పరిశ్రమలో ఉన్నతస్థాయి ఉద్యోగులు ఎకనామిక్ టైమ్స్‌తో చెప్పారు. కొన్ని పెద్ద టెక్ కంపెనీలు తమ వర్క్‌ఫోర్స్‌ను తగ్గించుకోవడానికి ప్రయత్నించడంతో కొన్ని నెలల క్రితం మార్పు ప్రారంభమైంది. 2021-2022లో కోవిడ్ మహమ్మారితో ఉద్యోగ నియామకాల స్తంభనకు దారితీసిన తర్వాత తక్కువ పే ప్యాకర్లు సాధారణంగా మారిపోయాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం సిరీస్ A ఫండింగ్‌ని దాటిన ప్రారంభ దశ స్టార్టప్‌ల ద్వారానే చాలా వరకు నియామకాలు జరుగుతున్నాయని ఓ నిపుణుడు చెప్పినట్లుగా నివేదక పేర్కొంది. “ఐటీ కంపెనీలు మళ్లీ నియామకాలు ప్రారంభించాయి. అయితే మునుపటి సంవత్సరాల మాదిరిగా కాకుండా నియామకాలలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి" అని ఆ ఎక్స్పర్ట్ తెలిపారు. మంచి టెక్ టాలెంట్ ఉన్న చాలా మంది ప్రస్తుతం మార్కెట్లో వాస్తవిక వేతనాలతో అందుబాటులో ఉన్నారని, అలాంటి కొంతమంది నిపుణులను తాము నియమించుకుంటున్నట్లు ఐవీక్యాప్ వెంచర్స్ వ్యవస్థాపకుడు విక్రమ్ గుప్తా తెలిపారు. పెద్ద సంఖ్యలో సీనియర్ టెక్ టాలెంట్లను స్టార్టప్‌లు ఎంపిక చేసుకుంటున్నాయని కార్న్ ఫెర్రీ ఇండియా ఎండీ నవనిత్ సింగ్ చెబుతున్నారు. ఉద్వాసనకు గురైన, పెద్ద టెక్ కంపెనీలు, స్టార్టప్‌లతో కలిసి పనిచేసిన అభ్యర్థులతో తాము మాట్లాడుతున్నామని, వారు 30 శాతం వరకు తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని మైఖేల్ పేజ్ హెడ్, రీజినల్ డైరెక్టర్ ప్రన్షు ఉపాధ్యాయ్ పేర్కొన్నారు. -
నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్న తరుణంలో నాలుగు రెట్ల జీతమా..!
Google Paid 4 Times More : పెద్ద పెద్ద టెక్ కంపెనీలు సైతం ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్న ప్రస్తుత తరుణంలో కంపెనీ మారుతున్న ఉద్యోగిని నిలుపుకొనేందుకు ఓ టెక్ దిగ్గజం గూగుల్ జీతాన్ని నాలుగు రెట్లు పెంచేందుకు సిద్ధమైంది. టెక్ పరిశ్రమలో లేఆఫ్‌ల పేరుతో వేలాది మందిని తొలగిస్తున్నప్పటికీ ప్రతిభా, పరిజ్ఞానం ఉన్న ఉద్యోగులను వదులుకునేందుకు కంపెనీలు సిద్ధంగా లేవని చెప్పేందుకు ఇదే ఉదాహరణ. సెర్చ్ ఇంజన్ పెర్ప్లెక్సిటీ AI సీఈవో అరవింద్ శ్రీనివాస్ తాను నియమించుకోవడానికి ప్రయత్నిస్తున్న ఒక ఉద్యోగి వేతనాన్ని గూగుల్ ఎలా నాలుగు రెట్లు పెంచిందో చెప్పారు. బిగ్ టెక్నాలజీ పాడ్‌కాస్ట్ హోస్ట్ అలెక్స్ కాంట్రోవిట్జ్తో సంభాషణలో శ్రీనివాస్ ఇలా అన్నారు.. “నేను గూగుల్ నుండి రిక్రూట్ చేయడానికి ప్రయత్నించిన ఒక అద్భుతమైన అభ్యర్థి ఉన్నాడు. అతను ఇప్పటికీ గూగుల్ సెర్చ్ బృందంలో పనిచేస్తున్నాడు. మా కంపెనీలో చేరబోతున్నాడని అతను వారికి చెప్పగానే వారు (గూగుల్) అతని ఆఫర్‌ను నాలుగు రెట్లు పెంచారు. నేనెప్పుడూ ఇలాంటివి చూడలేదు’’ అన్నారు. ప్రతిభను నిలుపుకోవడానికి పెద్ద పెద్ద టెక్ కంపెనీలు పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నాయని ఈ సంఘటన తెలియజేస్తోంది. వారి సంభాషణలో కాంట్రోవిట్జ్ శ్రీనివాస్‌ను టెక్ కంపెనీలు ఎందుకు చాలా మందిని తొలగిస్తున్నాయో మీకు తెలుసా అని అడిగారు. దీనికి శ్రీనివాస్ స్పందిస్తూ.. కంపెనీలు ఎలాంటివారిని తొలగిస్తున్నాయో తనకు తెలియదన్నారు. ఇది పనితీరుపై ఆధారపడి ఉందా లేదా మరేదైనా అన్నదాని తనకు స్పష్టమైన అవగాహన లేదన్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విటర్) లో పోస్ట్ చేసిన ఈ సంభాషణపై యూజర్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. పలువురు యూజర్లు రకరకాలుగా కామెంట్లు పెట్టారు. "ఆ ఇంజనీర్‌కు చాలా తెలుసు" అని ఓ యూజర్ చమత్కరించారు. "మీకు ఇంటర్నల్ హైక్ కావాలంటే KRAని పూరించాల్సిన అవసరం లేదు మరొక కంపెనీకి అప్లయి చేసుకుంటే సరిపోతుంది" అని మరో యూజర్ సూచించారు. "The moment he told them he's going to join us, they quadrupled his offer" - Perplexity CEO @AravSrinivas on recruiting from Google (k, here's the video) pic.twitter.com/HRhrLNPrHJ — Alex Kantrowitz (@Kantrowitz) February 16, 2024 -
అదంతా ఇన్ఫోసిస్ చేసిందే.. ఐటీ దిగ్గజంపై క్లయింట్ నిందలు
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ( Infosys )డేటా లీకేజీ నిందలు ఎదుర్కొంటోంది. ఇన్ఫోసిస్ కీలక క్లయింట్లలో ఒకటైన బ్యాంక్ ఆఫ్ అమెరికా ( Bank of America ) తమ 57,028 మంది కస్టమర్లను ప్రభావితం చేసిన సైబర్ దాడుల సంఘటనకు ఇన్ఫోసిస్ మెక్కామిష్ సిస్టమ్స్ ( Infosys McCamish Systems )కారణమని ఆరోపించింది. ఇన్ఫోసిస్ బీపీఎం అనుబంధ సంస్థ అయిన మెక్కామిష్ సిస్టమ్స్, గత ఏడాది నవంబర్‌లో జరిగిన సైబర్ సెక్యూరిటీ సంఘటనతో ప్రభావితమైంది. దాని ఫలితంగా నిర్దిష్ట అప్లికేషన్లు, సిస్టమ్‌లు అందుబాటులో లేకుండా పోయాయి. ఇన్ఫోసిస్ మెక్కామిష్ అనేది ప్లాట్‌ఫారమ్-ఆధారిత బీపీవో సంస్థ. ఇది జీవిత బీమా, యాన్యుటీ ఉత్పత్తులు, రిటైర్మెంట్ ప్లాన్లకు సంబంధించిన కంపెనీలకు సేవలను అందిస్తుంది. మెక్కామిష్ నిర్దిష్ట పరిశ్రమ క్లయింట్ల కోసం సాఫ్ట్వేర్లను పునఃవిక్రయిస్తుంటుంది. ఈ సంస్థను 2009లో ఇన్ఫోసిస్ బీపీఎం (గతంలో ఇన్ఫోసిస్ బీపీవో) కొనుగోలు చేసింది. "2023 నవంబర్ 3 సమయంలో ఇన్ఫోసిస్ మెక్కామిష్ సిస్టమ్స్ (IMS)లో సైబర్ దాడులు జరిగాయి. ఒక అనధికార థర్డ్ పార్టీ చొరబడి సిస్టమ్‌లను యాక్సెస్ చేసిన ఫలితంగా కొన్ని ఐఎంఎస్ అప్లికేషన్లు అందుబాటులో లేకుండా పోయాయి. బ్యాంక్ ఆఫ్ అమెరికా అందించే వ్యత్యాస పరిహారం ప్లాన్లకు సంబంధించిన డేటా ప్రభావితమై ఉండవచ్చని 2023 నవంబర్ 24న ఐఎంఎస్ తెలియజేసింది. అయితే బ్యాంక్ సిస్టమ్‌లపై ఎటువంట ప్రభావం లేదు" అని కస్టమర్లకు అందించిన నోటీసులో బ్యాంక్ ఆఫ్ అమెరికా పేర్కొంది. ఇదీ చదవండి: హడలిపోతున్న తరుణంలో చల్లటి కబురు.. ఐటీ కంపెనీల ప్లాన్ ఇదే..! -
హడలిపోతున్న తరుణంలో చల్లటి కబురు.. ఐటీ కంపెనీల ప్లాన్ ఇదే..!
ఐటీ పరిశ్రమలలో ప్రస్తుతం లేఆఫ్‌లు బెంబేలెస్తున్నాయి. కొత్త నియామకాలు తగ్గిపోయాయి.. ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి. దీంతో తమ పరిస్థితి ఏంటని ఫ్రెషర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి తరుణంలో వారు ఎగిరి గంతేసే ఓ నివేదిక వెల్లడైంది. టీమ్‌లీజ్ ఎడ్టెక్ కెరీర్ ఔట్లుక్ రిపోర్ట్ 2024 ప్రకారం.. ప్రముఖ ఐటీ దిగ్గజాలు రాబోయే ఆరు నెలల్లో 40,000 మందికి పైగా ఫ్రెషర్లను నియమించుకునే ప్రణాళికలో ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్‌కు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ ఐటీ పరిశ్రమ వృద్ధికి దోహదం చేస్తోందని రిక్రూట్మెంట్ సంస్థ టీమ్‌లీజ్ డిజిటల్ విశ్లేషిస్తోంది. "జెనరేటివ్ ఏఐ ఆటోమేషన్‌కు అనుగుణంగా వర్క్‌ఫ్లో మారబోతోంది. ఈ ఏఐ సిస్టమ్‌లతో సమర్థవంతంగా సహకరించడానికి ఫ్రెషర్లు సిద్ధంగా ఉండాలి" అని టీమ్‌లీజ్ ఎడ్టెక్ సీవోవో జైదీప్ కేవల్రమణి పేర్కొన్నారు. "ఎంప్లాయర్లు కొంతకాలంగా సంప్రదాయవాద అడుగులు వేశారు. ప్రపంచ గందరగోళాల మధ్య నియామకం మందగించింది. అయితే మా ఇటీవలి సర్వే భారతదేశ వృద్ధి కథనంపై ఎంప్లాయర్ విశ్వాసాన్ని వెల్లడిస్తుంది. సంస్థలు తమ భవిష్యత్తు మార్గాలపై మరింత నమ్మకంగా ఉన్నాయి" టీమ్‌లీజ్ వ్యవస్థాపకుడు, సీఈవో ఎడ్టెక్ శంతను రూజ్ తెలిపారు. గతేడాది కంటే తక్కువే.. ఐటీ రంగంలో ఫ్రెషర్ల నియామకం ఉద్దేశం 2024 తొలి ఆర్నెళ్లలో 42 శాతానికి తగ్గింది. 2023లో ఇదే కాలంలో ఇది 49 శాతంగా ఉండేది. ముఖ్యంగా ఎంట్రీ-లెవల్ ప్రొఫెషనల్స్ కోసం నియామక ఉద్దేశం గత ఏడాది ఇదే కాలంలో 62 శాతం నుంచి ప్రస్తుత ప్రథమార్ధంలో (జనవరి-జూన్ 2024) అన్ని రంగాలలో 68 శాతానికి స్వల్పంగా మెరుగుపడిందని నివేదిక పేర్కొంది. ప్రస్తుత క్యాలెండర్ సంవత్సరం ప్రథమార్ధంలో ఫ్రెషర్లను నియమించుకునే అవకాశం ఉన్న మొదటి మూడు పరిశ్రమలు ఈ-కామర్స్, టెక్నాలజీ స్టార్టప్‌లు (55%), ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ (53%), టెలికమ్యూనికేషన్స్ (50%) అని నివేదిక విశ్లేషించింది. -
క్యాంపస్ రిక్రూట్మెంట్లపై ఫ్రెషర్స్ లో కంగారు
-
రెబల్‌గా మారుతున్న ఐటీ ఉద్యోగులు.. తలలు పట్టుకుంటున్న కంపెనీలు!
వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి చాలా కంపెనీలు స్వస్తి చెప్పేశాయి. కొంతకాలం హైబ్రిడ్ విధానంలో పనిచేసేందుకు అవకాశం కల్పించిన కంపెనీలు ఇప్పుడు మొత్తంగా ఆఫీస్‌కి రావాల్సిందేనని ఉద్యోగులపై ఒత్తిడి తెస్తున్నాయి. దీంతో ఇన్నాళ్లూ వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అలవాటు పడిన ఉద్యోగులు ఆఫీస్‌కు రాబోమంటూ ఎదురు తిరుగుతున్నారు. జర్మన్ సాఫ్ట్వేర్ దిగ్గజం శాప్ (SAP) ఇటీవల రిమోట్ వర్క్ ఫ్లెక్సిబిలిటీని తీసేసింది. దీంతో ఉద్యోగులు ఎదురుతిరిగారు. బలవంతంగా ఆఫీసులకు పిలిస్తే రాజీనామా చేస్తామంటూ సుమారు 5 వేల మంది ఉద్యోగులు యాజమాన్యాన్ని బెదిరిస్తున్నారు. ఏప్రిల్ నుంచి అందరూ తప్పనిసరిగా ఆఫీసులకు రావాల్సిందేనని ఆన్-సైట్ వర్క్ గైడెన్స్ జారీ చేయడం ఉద్యోగులకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ఇప్పటివరకు ఉద్యోగులకు లొకేషన్ ఫ్లెక్సిబులిటీ ఇచ్చిన కంపెనీ ఆకస్మికంగా విధానాలను మార్చడం అసమంజసమని శాప్ యూరోపియన్ వర్క్స్ కౌన్సిల్ పేర్కొంది. అయితే కంపెనీ సీఈవో క్రిస్టియన్ క్లైన్ మాత్రం ఉద్యోగులను సాంస్కృతికంగా దగ్గర చేయడం, మార్గదర్శకత్వం, ఉత్పాదకత వంటి వాటి కోసం క్యాంపస్ కో-లొకేషన్ చాలా అవసరమని నొక్కి చెబుతున్నారు. ప్రమోషన్లకు కీలకం.. రిమోట్, ఆన్-సైట్ అంచనాలను బ్యాలెన్స్ చేయడానికి హైబ్రిడ్ విధానంలో మార్పులు చేయాల్సిన ఆవశ్యకతను పరిశ్రమ ఉత్తమ పద్ధతులు, అంతర్గత అభ్యాసాలు తెలియజేస్తున్నాయని శాప్ అధికారిక ప్రకటనలో పేర్కొంది. కోవిడ్ సమయంలో ఉద్యోగులకు అనువైన పని అవకాశాన్ని కల్పించిన మొదటి టెక్ కంపెనీలలో శాప్ కూడా ఒకటి. కానీ 2022 తర్వాత ప్రపంచవ్యాప్తంగా చాలా టెక్ కంపెనీలు ఆన్-సైట్ వర్క్ విధానంపై దృష్టి పెట్టాయి. ప్రోత్సాహకాలు, ప్రమోషన్లు, ఇతర ప్రయోజనాలను వర్తింపజేయడానికి ఆఫీసుకి హాజరును నిర్ణయాత్మకంగా చూస్తున్నాయి. టీసీఎస్ కూడా.. ప్రముఖ దేశీయ టెక్ దిగ్గజం టీసీఎస్ కూడా పెరగనున్న జీతాలు, ప్రమోషన్లతో పాటు ఇతర సౌకర్యాలు రిటర్న్ టు ఆఫీస్ పాలసీపై ఆధారపడి ఉంటాయని చెప్పనట్లు నివేదికలు వచ్చాయి. వేరియబుల్ చెల్లింపులను సైతం ఈ పాలసీతో అనుసంధానం కంపెనీ చేసింది. అసైన్డ్ కోర్సులు పూర్తి చేసి, ప్రారంభంలో ఏడాదికి వేతనం రూ.3 లక్షలకు మించి శాలరీలు తీసుకుంటున్న ఫ్రెషర్లకు సైతం ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. -
Fact Check: రాష్ట్ర ప్రగతికి ‘రామోజీ’ పొగ
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర ప్రగతికి రామోజీ పొగ పెడుతున్నారు. ఐటీ రంగంలో రాష్ట్రం అభివృద్ధి చెందకుండా విష ప్రచారంతో అడ్డుకుంటున్నారు. గత నాలుగు నెలలుగా ఈనాడులో నెలకో అసత్య కథనంతో ప్రగతికి ప్రతిబంధకంగా మారారు. శనివారమూ ఇలాగే ఓ విష కథనం ప్రచురించి యువతను, ఐటీ సంస్థలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. చంద్రబాబు హయాంలో ఐటీ రంగం ఏమాత్రం అభివృద్ధి చెందకపోయినా ఒక్క ముక్కా రాయని రామోజీ.. ఇప్పుడు అనేక దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి వచ్చినా తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారు. చంద్రబాబు హయాంలో హెచ్‌సీఎల్ తప్ప (అది కూడా 2020 మార్చిలో ప్రారంభమైంది) తప్ప పేరున్న ఒక్క ఐటీ సంస్థా రాలేదు. కానీ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభించింది. విప్రో కూడా డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభిస్తోంది. అమెజాన్, బీఈఎల్, రాండ్ శాండ్, టెక్నోటాస్క్, ఐజెన్ అమెరికా సాఫ్ట్వేర్, టెక్‌బుల్, కాంప్లెక్స్ సిస్టమ్స్ వంటి అనేక సంస్థలు వచ్చాయి. అదో పెద్ద కుంభకోణం డిజిగ్నేటెడ్ టెక్నాలజీ పార్క్స్ పథకాన్ని రద్దు చేశారంటూ ఈనాడు గోల పెట్టింది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ఓ పెద్ద కుంభకోణం. ఎటువంటి కంపెనీలూ రాకపోయినా రియల్ ఎస్టేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చేలా పథకాన్ని రూపొందించారు. ఈ పథకం కింద నిర్మించిన భవనాల్లో కంపెనీలు రాకపోతే 70 శాతం అద్దెను, అది కూడా బిల్డర్ ఎంత నిర్ణయిస్తే అంత రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. అందుకే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ పథకాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. మూడు రెట్లు పెరిగిన అంకురాలు అంకుర సంస్థలు మూడు రెట్లు పెరిగాయని శుక్రవారమే రాజ్య సభలో కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి చెప్పినప్పటికీ.., కళ్లకు, చెవులకు గంతలు కట్టుకున్న రామోజీ రాష్ట్ర యువత మెదళ్లలోకి విషం ఎక్కించే ప్రయత్నం చేశారు. 2019లో రాష్ట్రంలో 161 స్టార్టప్‌లు ఉండగా ఇప్పుడు 586కు చేరాయి. వీటిలో ఉద్యోగుల సంఖ్య 1,552 నుంచి 55,669కు పెరిగింది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా నాలుగో పారిశ్రామిక రంగం ఇండస్ట్రీ 4కు చెందిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని కల్పతరవు పేరిట విశాఖలో ఏర్పాటు చేశారు. అక్కడ పెద్ద ఎత్తున స్టార్టప్‌లు వస్తున్నాయి. అలాగే నాస్కామ్ సహాయంతో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగాల స్టార్టప్‌ల కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఏర్పాటు చేశారు. ఆంధ్రా యూనివర్సిటీలో ఏ హబ్, ఓడల నిర్మాణంపైన, మెడ్‌టెక్ జోన్‌లోనూ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలు ఏర్పాటు చేశారు. విశాఖ నుంచి హెస్ఎస్బీసీ వెళ్లిపోయిందంటూ ఈనాడు వాపోయింది. వాస్తవంగా చైనాకు చెందిన ఆ సంస్థ విశాఖే కాదు.. దేశంలోని అన్ని కార్యాలయాలను మూసివేసింది. ఆ భవనంలో డబ్ల్యూఎన్ఎస్ కార్యాలయం నడుస్తోంది. ఐబీఎం వెళ్లిపోయిందంటూ ఈనాడు మరో అబద్ధం అచ్చేసింది. వాస్తవానికి ఐబీఎం అనుబంధ సంస్థ ఐబీఎం దక్ష 2007లో విశాఖలో ఏర్పాటైంది. ఆ తర్వాత ఐబీఎం దానిని కన్సంట్రిక్స్ అనే సంస్థకు విక్రయించింది. కన్సంట్రిక్స్ విశాఖ వెలుపల కార్యకలాపాలను కొనసాగిస్తోంది. ఇప్పుడు ఆ బిల్డింగ్‌లో ఇన్ఫినిటీ అనే సంస్థ పనిచేస్తోంది. 65 కంపెనీలు 47,908 మందికి ఉద్యోగాలు గత నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో ఐటీ రంగంలో కొత్తగా 65 కంపెనీలు ఏర్పాటైనట్లు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. వీటి ద్వారా కొత్తగా 47,908 మందికి ఉద్యోగాలొచ్చాయి. 2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయేనాటికి రాష్ట్రంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 27,643 కాగా, ఇప్పుడు 75,551 మందికి పెరిగింది. వైఎస్ జగన్ ప్రభుత్వ సహకారంతో దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి రావడంతోపాటు ఇప్పటికే కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీలు విస్తరణ చేపట్టాయి. విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించిన టెక్ మహీంద్రా విజయవాడకు విస్తరించింది. హెచ్‌సీఎల్ విజయవాడ నుంచి తిరుపతికి విస్తరించింది. విశాఖలో ఉన్న డబ్ల్యూఎన్ఎస్, పల్సస్ ఐడీఏ వంటి 30కి పైగా ఐటీ కంపెనీలు విస్తరణ చేపట్టాయి. 2012లో 50 మందితో ప్రారంభమైన డబ్ల్యూఎన్ఎస్ గ్లోబల్ సరీ్వసెస్ ఉద్యోగుల సంఖ్య ఇప్పుడు 3,300 దాటింది. వీరిలో 2,000 మంది ఉద్యోగులు గత రెండేళ్లలోనే చేరినట్లు ఆ సంస్థ సీఈవో కేశవ్ ఆర్ మురుగేష్ స్వయంగా ప్రకటించారు. 2019లో 40 మందితో ప్రారంభించిన తమ సంస్థలో ఉద్యోగుల సంఖ్య 4,200 దాటినట్లు పల్సస్ సీఈవో గేదెల శ్రీనుబాబు తెలిపారు. రాష్ట్రంలో ఐటీ రంగం ప్రోత్సాహానికి రాష్ట్ర ప్రభుత్వం మూడు కాన్సెప్ట్ సిటీలు ఏర్పాటు చేస్తోంది. ప్రైవేటు రంగంలో ఐటీ పార్కులనూ ప్రోత్సహిస్తోంది. రూ.21,844 కోట్లతో అదానీ డేటా సెంటర్, భారీ ఐటీ టవర్‌ను ఏర్పాటు చేస్తోంది. రహేజా గ్రూపు ఇనార్బిట్ మాల్తో పాటు ఐటీ టవర్ నిరి్మస్తోంది. ఏపీఐసీసీ రూ.2,300 కోట్లతో మధురవాడలో 19 ఎకరాల్లో ‘ఐ స్పేస్’ పేరుతో ఐటీ టవర్ నిరి్మస్తోంది. విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో ఐటీ రంగానికి సంబంధించి 65 ఎంవోయూలు జరిగాయి. ఈ ఒప్పందాల ద్వారా రూ. 28,867 కోట్ల పెట్టుబడులతో పాటు 1.14,255 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. నిక్సీ వస్తే వెలుగులే విశాఖ కేంద్రంగా నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్చేంజి ఆఫ్ ఇండియా (నిక్సీ) ద్వారా ఇంటర్నెట్ ఎక్స్చేంజి కార్యకలాపాలు మొదలు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇటీవలే నిక్సీ బృందం విశాఖను సందర్శించింది. విశాఖలో ఈ కేంద్రం కార్యకలాపాలు ప్రారంభించేందుకు అన్ని అవకాశాలూ పుష్కలంగా ఉన్నాయని నిర్ధారించింది. ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ ఏర్పాటైతే ఇతర రాష్ట్రాల నుంచి డేటా కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. తక్కువ ఖర్చుతో కూడిన నాణ్యమైన, వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు అందుతాయి. తద్వారా అనేక కంపెనీలు రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభిస్తాయి. -
Google: ఉద్యోగులను వదిలించుకునేందుకు ఇన్ని వేల కోట్లా?
సాధారణంగా ఖర్చును తగ్గించుకునేందుకు కంపెనీలు లేఆఫ్‌ల పేరుతో ఉద్యోగులను తొలిగిస్తున్నాయి. అయితే ఉద్యోగులను వదిలించుకోవడానికి కంపెనీలు వేలాది కోట్లు ఖర్చు చేస్తున్నాయని చేస్తున్నాయని మీకు తెలుసా? అవును నిజమే.. లేఆఫ్‌ల కోసం టెక్ దిగ్గజం గూగుల్ చేసిన ఖర్చు వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. ఇవి చూస్తే అవాక్కవుతారు..! రూ.17 వేల కోట్లు గూగుల్ యాజమాన్య సంస్థ ఆల్భాబెట్ వెల్లడించిన తాజా త్రైమాసిక ఫలితాల ప్రకారం.. తొలగించిన ఉద్యోగులకు సీవెరన్స్ (తొలగింపు పరిహారం), సంబంధిత ఇతర చెల్లింపుల కింద గూగుల్ చెల్లించిన మొత్తం 2.1 బిలియన్ డాలర్లు ( దాదాపు రూ.17 వేల కోట్లు) . ఇది కేవలం 2023 ఒక్క ఏడాదిలో చేపట్టిన లేఆఫ్‌లకు అయిన ఖర్చు మాత్రమే. గూగుల్ 2023 జనవరిలో ప్రకటించిన మొదటి రౌండ్ లేఆఫ్‌లలో దాదాపు 12 వేల మందిని అంటే తమ వర్క్‌ఫోర్స్‌లో సుమారు 6 శాతం మందిని తొలగించింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి భయాలను ఈ తొలగింపులు తెలియజేయడమే కాకుండా టెక్ పరిశ్రమను ఒక్కసారిగా కలవరపాటుకు గురిచేశాయి. తొలగించిన ఉద్యోగులకు చెల్లించేందుకు గూగుల్ 2.1 బిలియన్ డాలర్లు.. దాని నికర ఆదాయంలో 7 శాతం వరకూ ఖర్చు చేసినట్లు తాజా వెల్లడి ద్వారా తెలుస్తోంది. ఉద్యోగుల తొలగింపులకే ఈ స్థాయిలో ఖర్చయితే ఆ ఉద్యోగులను కొనసాగిస్తే ఎంత ఖర్చయ్యేదో అంచనా వేయొచ్చు. 2024లోనూ.. గూగుల్ 2024లోనూ ఇప్పటికే 1000 ఉద్యోగాల తొలగింపును ప్రకటించింది. దీని కోసం 700 మిలియన్ డాలర్లు (రూ.5,800 కోట్లు ) ఖర్చు చేసింది. ఈ ఏడాదిలో లేఆఫ్‌లు ఇంకా కొనసాగుతాయని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఇదివరకే సూచనలు ఇచ్చారు. అయితే గతేడాదిలో ఉన్నంత తొలగింపులయితే ఈ ఏడాదిలో ఉండకపోవచ్చు. -
కాగ్నిజెంట్ మాజీ సీఈవో బర్త్‌డే విషెస్.. ఎవరికో తెలుసా?
ప్రత్యర్థి కంపెనీల నుంచి ఉన్నతస్థాయి ఉద్యోగులను నియమించుకుని వార్తల్లో నిలిచిన సాఫ్ట్వేర్ సంస్థ కాగ్నిజెంట్ మాజీ సీఈవో తాజాగా ఆ కంపెనీకి బర్త్‌డే విషెస్ చెప్పారు. కాగ్నిజెంట్ శుక్రవారం (జనవరి 26) నాటికి 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. కాగ్నిజెంట్ వృద్ధిలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులలో మాజీ సీఈవో ఫ్రాన్సిస్కో డిసౌజా ఒకరు. 2007 జనవరి నుంచి 2019 మార్చి మధ్య కాలంలో 12 సంవత్సరాల పాటు కంపెనీ సీఈవోగా పనిచేసిన ఆయన ఆపై ఒక సంవత్సరం పాటు బోర్డు వైస్ చైర్మన్‌గా కూడా వ్యవహరించారు. 1994 జనవరి 26న భారత్‌లోని చైన్నైలో కాగ్నిజెంట్ ఏర్పాటైంది. ఈ సంస్థకు ప్రస్తుతం ఎస్.రవికుమార్ సీఈవోగా ఉన్నారు. కాగ్నిజెంట్ 30వ వార్షికోత్సవం సందర్భంగా డిసౌజా లింక్డ్ఇన్లో ఓ పోస్టు పెట్టారు. సంస్థలో పనిచేసిన ప్రతి వ్యక్తి ప్రతిభకు, అంకితభావానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. "హ్యాపీ బర్త్‌డే కాగ్నిజెంట్! 30 సంవత్సరాల క్రితం, సాంకేతిక సేవల పరిశ్రమను ఏదో ఒకరోజు తీర్చిదిద్దే లక్ష్యంతో చిన్న జట్టులో భాగమయ్యే అవకాశం నాకు లభించింది. ఈరోజు కాగ్నిజెంట్‌కు 30 ఏళ్లు నిండుతున్నాయి. ఈ సందర్భంగా కంపెనీ ఎదుగుదల, ఆవిష్కరణలు, ఎక్సలెన్స్ ప్రయాణాన్ని ప్రతిబింబిస్తాను" అంటూ రాసుకొచ్చారు. -
ఐటీ ఉద్యోగులకు దెబ్బ మీద దెబ్బ! మళ్లీ ఇంకో ప్రముఖ కంపెనీ..
Tech layoffs 2024: ప్రపంచవ్యాప్తంగా ఐటీ ఉద్యోగులకు లేఆఫ్‌లు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కొత్త సంవత్సరంలోనూ ప్రముఖ కంపెనీలు ఒక దాని వెంట మరొకటి లేఆఫ్‌లను ప్రకటిస్తూనే ఉన్నాయి. యూఎస్‌కు చెందిన క్లౌడ్ ఆధారిత సాఫ్ట్వేర్ కంపెనీ సేల్స్‌ఫోర్స్ దాదాపు 700 మంది ఉద్యోగులను తొలగిస్తోందని వాల్ స్ట్రీట్ జర్నల్ను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్థ నివేదించింది. అమెజాన్, గూగుల్ వంటి టెక్ దిగ్గజాలు ప్రకటించిన లేఆఫ్‌లతో ఇప్పటికే అమెరికాలో తొలగింపుల తరంగం కొనసాగుతుండగా ఇందులో తాజాగా సేల్స్‌ఫోర్స్ చేరింది. సేల్స్‌ఫోర్స్ గత సంవత్సరం 10 శాతం ఉద్యోగాలను తగ్గించింది. కొన్ని కార్యాలయాలను మూసివేసింది. అయితే మార్జిన్లను పెంచడానికి 3,000 మందికి పైగా ఉద్యోగులను తీసుకుంటామని గడిచిన సెప్టెంబరులో కంపెనీ తెలిపింది. వరుస లేఆఫ్‌లు కొత్త ప్రారంభమైనప్పటి నుంచి టెక్ పరిశ్రమలో వరుస లేఆఫ్‌లు కొనసాగుతున్నాయి. Layoffs.fyi పోర్టల్ ప్రకారం.. 2024 ప్రారంభం నుంచి 85 టెక్ కంపెనీలు 23,770 మంది ఉద్యోగులను తొలగించాయి. ఈ వారం మైక్రోసాఫ్ట్ తన గేమింగ్ డివిజన్ యాక్టివిజన్ బ్లిజార్డ్‌లో 1,900 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిపింది. అలాగే ఆన్లైన్ రిటైలర్ ఈబే దాదాపు 1,000 మంది ఉద్యోగుల తొలగింపులను కూడా ప్రకటించింది. -
మళ్లీ టెక్ ‘లేఆఫ్’.. దిగ్గజ కంపెనీల్లో తొలగింపులు ఇలా..
సాక్షి, హైదరాబాద్ : టెక్ ‘లేఆఫ్స్’మళ్లీ మొదలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు భారత్ ఐటీ పరిశ్రమపైనా తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2024 జనవరి తొలి రెండువారాల్లోనే 58 టెక్ కంపెనీలు 7,785 మంది ఉద్యోగులను తొలగించినట్టు లేఆఫ్–ట్రాకింగ్ వెబ్సైట్ లేఆఫ్స్.ఎఫ్‌వైఐ తాజాగా స్పష్టం చేసింది. టెక్ ప్రపంచంలో చోటు చేసుకుంటున్న ఈ లేఆఫ్స్ ట్రెండ్‌ను పరిశీలిస్తే..రాబోయే రోజులు కూడా భారత ఐటీ వృత్తినిపుణులు, టెకీలకు అంత ఆశాజనకంగా ఉండకపోవచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు. నూతన సంవత్సరంలోకి అడుగిడి ఇంకా మూడు వారాలు కూడా దాటకుండానే వేలాది మంది టెక్ స్టార్టప్ ఉద్యోగులు లేఆఫ్స్‌కు గురికాగా, రాబోయే రోజుల్లో ఇంకా కొందరికి ప్రమాదం పొంచి ఉందనే అభిప్రాయపడుతున్నారు. ‘జెనరేటివ్ ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్’పై పెద్ద కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం కూడా దీనికి పరోక్షంగా కారణమని వారంటున్నారు. దిగ్గజ కంపెనీల్లో తొలగింపులు ఇలా.... ► గూగుల్... డిజిటల్ అసిస్టెంట్, హార్డ్‌వేర్ అండ్ ఇంజినీరింగ్ టీమ్‌లలో వందలాదిమంది ► అమెజాన్ సంస్థలోని అమెజాన్ ఆడిబుల్ తమ వర్క్‌ఫోర్స్‌లో ఐదు శాతం ► అమెజాన్ ప్రైమ్ వీడియోలో వందలాదిమంది ఉద్యోగులు ► అమెజాన్ ట్విచ్ తన వర్క్‌ఫోర్స్‌లో 35 శాతం అంటే 500 మంది ► సోషల్ చాట్, మెసేజింగ్ స్టార్టప్ డిస్కార్డ్ 17 శాతం ఉద్యోగులను అంటే 170 మంది ► వీడియోగేమ్ సాఫ్ట్వేర్ ప్రొవైడర్ యూనిటీ సాఫ్ట్వేర్ తన ఉద్యోగుల్లో 25 శాతం అంటే 1,800 మంది ► ఐటీ కంపెనీ జిరాక్స్ తన వర్క్‌ఫోర్స్‌ను 15 శాతం అంటే 3000మంది ► యూఎస్‌కు చెందిన ప్రాప్‌టెక్ కంపెనీ ఫ్రంట్‌డెస్క్ గూగుల్ మీట్లో రెండు నిమిషాల్లోనే తన 200 మంది ఉద్యోగులను తొలగించింది. ఏడాదంతా ఇదే పరిస్థితి ఉండొచ్చు భారతీయ ఐటీ కంపెనీలకు కొత్త ప్రాజెక్టులు రాకపోవడం/వాయిదా పడడంతో ఆ ప్రభావం ఇక్కడి ఐటీ పరిశ్రమపై పడింది. యూఎస్ వడ్డీరేట్ల పెరుగుదల, పరిశ్రమపై చాట్ జీపీటీ వంటి కృత్రిమమేథ ప్రభావాలు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, పాలస్తీనా–ఇజ్రాయిల్ వ్యవహారం, ఎర్రసముద్రంలో హైతీ తీవ్రవాదుల దాడులు వంటివి కూడా తోడు కావడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. ఈ పరిణామాలన్నీ అమెరికా డాలర్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీంతో ఇండియాకు రావాల్సిన నూతన ప్రాజెక్టులు ఆగిపోయాయి. కరోనా కాలంలో భారీగా ప్రాజెక్టులు వస్తాయని కంపెనీలు ఊహించి పెద్ద ఎత్తున ఉద్యోగులను రిక్రూట్ చేశాయి. ఇప్పుడున్న ప్రతికూల పరిస్థితుల్లో కంపెనీలన్నీ కూడా ఉద్యోగుల బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ పేరిట పెద్దసంఖ్యలో లేఆఫ్ చేయడం మొదలుపెట్టాయి. దీంతో కొత్తగా ఉద్యోగాలు రాకపోగా ఉన్న ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నారు. 2020–21 నుంచే యూఎస్ ప్రభుత్వం వడ్డీరేట్లు పెంచడం మొదలుపెట్టింది. ఈ విధంగా చేయడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించొచ్చునని భావించింది. అయితే మూడేళ్లుగా ద్రవ్యోల్బణం అదుపునకు ఆర్థిక వ్యవస్థ నెమ్మదించేలా ఇలాంటి చర్యలే కొనసాగాయి. 2024లో అమెరికా అధ్యక్ష ఎన్నికలున్నందున ఈ ఏడాదంతా కూడా ప్రస్తుత పరిస్థితులే కొనసాగే అవకాశాలున్నాయి. – ఎన్.లావణ్యకుమార్, స్మార్ట్‌స్టెప్స్ సంస్థ సహవ్యవస్థాపకుడు లేఆఫ్ సవాళ్లు ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి ఐటీ దిగ్గజ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా లేఆఫ్స్‌కు దిగడం ఆందోళన కలిగించే పరిణామమే. ఈ ప్రకంపనలు భారత్ టెక్, ఐటీ ఇండస్ట్రీపై కూడా పడడంతో ఇది ఎటువైపు దారితీస్తుంది..ఎలాంటి చిక్కులు, అడ్డంకులు సృష్టిస్తుందనేది చూడాలి. ఆర్థికంగా ఎదురయ్యే పరిస్థితులు, మార్కెట్లో చోటుచేసుకుంటున్న మార్పులు తదితరాలతో మనదేశంలోనూ పెద్ద కంపెనీ లేఆఫ్స్‌కు దిగడం మొదలుపెట్టాయి. గ్లోబల్ ఐటీ వర్క్‌ఫోర్స్‌కు భారత్ అందిస్తున్న భాగస్వామ్యం ముఖ్యమైనది కావడంతో లేఆఫ్స్‌తో ఎదురయ్యే సవాళ్లు ఎదుర్కోవడానికి సిద్ధం కావాల్సిందే. ఐటీరంగమనేది ఆర్థిక పురోగతికి దోహదం చేస్తున్న కారణంగా ప్రస్తుత లేఆఫ్స్ వంటి పరిణామాలతో భారత జాబ్ మార్కెట్ కూడా ఒడిదుడుకులకు గురవుతోంది. ఈ ప్రభావాలు, పరిణామాలను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమ దిగ్గజాలు, వృత్తినిపుణులు కలిసి సంయుక్తంగా ముందుకు సాగితే లేఆఫ్స్ అనంతర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. – కార్తీక్ డాలే, డేటాస్కిల్స్ సంస్థ ఫౌండర్ -
పక్క కంపెనీల నుంచి లాగేసుకోవడం కరెక్టేనా? టెక్ సీఈవోల మాటలు ఇవే..
అన్ని పరిశ్రమల్లోనూ పోటీ అనేది సర్వసాధారణం. అయితే ఇది ఐటీ పరిశ్రమలో మరీ ఎక్కువైంది. పోచింగ్ (ఉద్యోగుల అక్రమ వలసలు) ఐటీ కంపెనీల మధ్య అనారోగ్యకరమైన పోటీకి దారితీస్తోంది. దీనిపై మిశ్రమ స్పందన వస్తోంది. దేశీయ ఐటీ దిగ్గజాలు విప్రో, ఇన్ఫోసిస్‌ల నుంచి చాలా మంది టాప్ ఎగ్జిక్యూటివ్‌లు బయటికి వెళ్లిపోయారు. వీరిలో చాలా మంది ప్రత్యర్థి కాగ్నిజెంట్‌లో చేరారు. కాగ్నిజెంట్ సీఈఓ రవి కుమార్ తాను ఇంతకుముందకు పనిచేసిన ఇన్ఫోసిస్, విప్రో నుంచి దాదాపు 20 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను నియమించుకున్నట్లు సమాచారం. విప్రో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జతిన్ దలాల్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మహ్మద్ హక్ సహా 10 మంది టాప్ ఎగ్జిక్యూటివ్‌లను కాగ్నిజెంట్‌కు కోల్పోయింది. ఈ ధోరణికి అడ్డుకట్ట వేయడానికి కాగ్నిజెంట్‌పై దావా వేసింది. ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు సీఎఫ్ఓ జతిన్ దలాల్‌ను రూ.25.15 కోట్ల నష్టపరిహారం కోరింది. ఐటీ కంపెనీల మధ్య సాగుతున్న ఈ పోచింగ్ వార్‌పై ఆయా కంపెనీల సీఈవోలు స్పందించారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సందర్భంగా సీఎన్‌బీసీ-టీవీ18తో ఎవరెవరు ఏమేమి అన్నారో ఇప్పుడు చూద్దాం.. ఒప్పందాన్ని గౌరవించడం ముఖ్యం తాము ఎవరికీ ఉపాధి లేదా ఉద్యోగ అవకాశాలను నిరోధించడం లేదని, సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని గౌరవించడం చాలా ముఖ్యం, ఇదేమీ అసమంజసమైన అభ్యర్థన కాదని విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ అన్నారు. ఒప్పంద ఉల్లంఘనతో తమ సంస్థ సమాచార గోప్యతకు భంగం కలగకుండా తమను తాము రక్షించుకోవాలని కోరుకుంటున్నామని తెలిపారు. మేము అదృష్టవంతులం ఇన్ఫోసిస్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ సలీల్ పరేఖ్ స్పందిస్తూ "మేము అదృష్టవంతులం. మాకు నాయకత్వ కొరత లేదు. కంపెనీ నాయకత్వ పునర్నిర్మాణాన్ని చాలా త్వరగా పూర్తి చేశాం. కంపెనీలో ఉన్న చాలా మందిని పెద్ద బాధ్యతాయుతమైన పాత్రలలోకి తీసుకున్నాం. అది నిజంగా బాగా పనిచేస్తున్నట్లు అనిపిస్తుంది. కాబట్టి నాకు ఎటువంటి ఆందోళనా కనిపించడం లేదు. నిజానికి మార్పు వల్ల కొన్నిసార్లు ప్రయోజనం కలుగుతుంది" అన్నారు. మాకేం డోకా లేదు "మేము చాలా కాలం నుంచి చాలా స్థిరమైన నాయకత్వాన్ని కలిగి ఉన్నాం. మా తోటివారిలో కొందరికి ఇది రాజీగా అనిపిస్తుంది. కానీ మేము మంచి స్థానంలో ఉన్నందుకు సంతోషిస్తున్నాము" అని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో సి.విజయకుమార్ పేర్కొన్నారు. నా పని మాత్రమే చేస్తున్నా.. “నేను నా పని మాత్రమే చేస్తున్నాను. నేను కాగ్నిజెంట్‌ను ఉద్యోగులు కోరుకునే కంపెనీగా మార్చాలనుకుంటున్నాను” అని కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ అన్నారు. "ఇది స్థిరమైన ప్రక్రియ. నేను మొదటి నుంచి ఇదే చెప్తున్నాను. కంపెనీ కోసం సమర్థులైనవ్యక్తులను అన్వేషించడమే నా పని. మాకు క్లయింట్ సెంట్రిసిటీ డీఎన్ఏ ఉంది. కంపెనీ వారసత్వాన్ని నేను పునరుద్ధరిస్తున్నాను” అన్నారాయన. -
హైదరాబాద్ ఐటీ సంస్థ రామ్ ఇన్ఫో నిధుల సమీకరణ
హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఐటీ సంస్థ రామ్ ఇన్ఫో లిమిటెడ్ భారీ నిధుల సమీకరణ ప్రణాళిక చేపట్టింది. ప్రాధాన్యతా షేర్ల కేటాయింపు ద్వారా రూ.62 కోట్ల నిధుల సమీకరణ ప్రణాళికకు డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపిందని కంపెనీ తాజాగా ప్రకటించింది. సేకరించిన నిధులను కంపెనీ అభివృద్ధి, నాయకత్వ విస్తరణ, జాతీయ, అంతర్జాతీయ విస్తరణ కోసం ఉపయోగించాలని కంపెనీ భావిస్తోంది. టెక్నాలజీ, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఉన్న తమ అనుబంధ, జాయింట్ వెంచర్లలో భవిష్యత్తు పెట్టుబడి అవసరాలను తీర్చడం రామ్ ఇన్ఫో లిమిటెడ్ లక్ష్యంగా పెట్టుకుంది. "కంపెనీ ఆదాయం, స్థిరమైన వృద్ధిని మెరుగుపరచడానికి, సర్వీస్ పోర్ట్‌ఫోలియోను వైవిధ్యపరచడానికి, భౌగోళిక పరిధిని విస్తరించడానికి ఈ వ్యూహాత్మక చర్య ఉద్దేశించినది" అని రామ్ ఇన్ఫో మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనాథ్ రెడ్డి తెలిపారు. బలమైన ఆర్డర్లను, సర్వీస్ గ్రోత్‌ను పెంపొందించుకునేందుకు, తమ షేర్హోల్డర్లకు విలువను సృష్టించడానికి నిధుల సమీకరణ సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు. -
ఏఐలో దూకుడు పెంచిన టీసీఎస్.. ఉద్యోగులకు ‘స్పెషల్ జోన్’
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-రెడీ వర్క్‌ఫోర్స్‌ను సిద్ధం చేసే లక్ష్యంతో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (TCS) తమ వ్యాల్యూ చైన్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలను బలోపేతం చేస్తోంది. ఉత్పాదక ఏఐ ఫౌండేషనల్ స్కిల్స్‌లో 1.5 లక్షల మంది ఉద్యోగులకు శిక్షణ ఇచ్చిన తర్వాత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జెన్ ఏఐలలో ప్రయోగాత్మక నైపుణ్యాన్ని మెరుగుపరచడానికి ఏఐ ఎక్స్పీరియన్స్ జోన్‌ను ప్రారంభించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఏఐ ఎక్స్పీరియన్స్ జోన్ ద్వారా టీసీఎస్ ఉద్యోగులు జనరేటివ్ ఏఐ ఆధారిత అప్లికేషన్లపై పనిచేయవచ్చు. ప్రయోగాలు చేయవచ్చు. అమెజాన్ వెబ్ సర్వీసెస్, గూగుల్ మైక్రోసాఫ్ట్ వంటి సంస్థల నుంచి ఓపెన్ సోర్స్ టెక్నాలజీలు, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్‌తో ప్రయోగాలు చేయడానికి ఈ జోన్ సహాయపడుతుందని టీసీఎస్ పేర్కొంది. కంటెంట్ క్రియేషన్, ఇన్ఫర్మేషన్ డిస్కవరీ, టాస్క్ ఆటోమేషన్ వంటి వినియోగ సందర్భాలలో ఉద్యోగులు ఈ సాధనాలను ఉపయోగించడంలో అనుభవాన్ని పొందవచ్చు. ఇందుకు అవసరమైన అన్ని జెన్ ఏఐ కాన్సెప్ట్‌లను కవర్ చేసే ట్యుటోరియల్స్ ఈ జోన్లో ఉంటాయని కంపెనీ వివరించింది. ఇదీ చదవండి: ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో లేఆఫ్‌లు.. 300 మందికి ఉద్వాసన! ఒకే రకమైన ఆసక్తి కలిగి నిర్దిష్ట సమస్యకు పరిష్కారాన్ని రూపొందించడానికి కలిసి పనిచేసే ప్రపంచంలోని వివిధ ప్రాంతాల సహచరులకు ఏఐ ఎక్స్పీరియన్స్ జోన్ సహకారాన్ని అందిస్తుందని టీసీఎస్ ఏఐ క్లౌడ్ యూనిట్ హెడ్ శివ గణేశన్ తెలిపారు. ఉద్యోగుల తమ ఏఐ సామర్థ్యాన్ని పరీక్షించుకునేందుకు వీలుగా ఈ ఏఐ ఎక్స్పీరియన్స్ జోన్ హ్యాకథాన్లు, ఛాలెంజ్‌లు, పోటీలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు. -
అప్పుడాయన ఆ తప్పు చేయకుంటే ఇన్ఫోసిస్ పుట్టేదే కాదు!
విప్రో వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్‌జీ చేసిన ఒక తప్పు.. దేశంలో అగ్రశ్రేణి ఐటీ సంస్థగా ఉన్న ఇన్ఫోసిస్ (Infosys) పుట్టుకకు కారణమని తెలుసా? అప్పుడాయన ఆ తప్పు చేయకుండా ఉంటే ఇప్పుడు ఇన్ఫోసిస్ ఉండేదే కాదు. ఇంతకీ ఆయన చేసిన తప్పేంటి.. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి (NR Narayana Murthy) స్వయంగా చెప్పిన ఆ విషయం గురించి తెలుసుకుందామా.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) రంగంలో భారత్ గణనీయ అభివృద్ధి సాధించింది. ఇందుకు ఎన్నో సంవత్సరాలుగా అనేక మంది కార్పొరేట్ లీడర్లు చేసిన కృషి ఎనలేనిది. 1981లో కంపెనీని స్థాపించి దేశంలో ఐటీ అభివృద్ధి బాటలో పయనించడానికి అనేకమందికి మార్గం సుగమం చేసిన ఏడుగురిలో ఒకరైన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి ముందువరుసలో ఉంటారు. ప్రస్తుతం ఇన్ఫోసిస్‌లో ఎలాంటి కీలక పాత్ర లేని 77 ఏళ్ల నారాయణమూర్తి.. తనతో విప్రో ఫౌండర్ అజీమ్ ప్రేమ్‌జీ చెప్పిన ఓ ఆసక్తికర విషయాన్ని ఇటీవల వెల్లడించారు. నారాయణమూర్తిని ఉద్యోగంలోకి తీసుకోకపోవడమే తాను చేసిన అతి పెద్ద తప్పులలో ఒకటి అని అజీమ్ ప్రేమ్‌జీ తనతో ఒకసారి చెప్పాడని సీఎన్‌బీసీ టీవీ18కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. పరిస్థితులు అనుకూలంగా జరిగి ఉంటే ఇప్పుడు విప్రో సంస్థకు తిరగుండేది కాదని నారాయణ మూర్తి దంపతులు ఇదే ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. నారాయణ మూర్తి 1981 నుంచి 2002 వరకు 21 సంవత్సరాల పాటు ఇన్ఫోసిస్ సీఈవోగా కొనసాగారు. 2002 నుంచి 2006 వరకు బోర్డు ఛైర్మన్‌గా ఉన్నారు. ఆ తర్వాత చీఫ్ మెంటార్‌గా కూడా సేవలందించారు. 2011లో ఇన్ఫోసిస్ నుంచి రిటైరయ్యారు. నారాయణ మూర్తి ఇప్పుడు ఇన్ఫోసిస్ ఎమెరిటస్ చైర్మన్. -
ఊహించినట్టుగానే జరిగింది.. భారీగా తగ్గిన విప్రో లాభాలు!
దేశంలో పెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన విప్రో ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఫలితాలలో తీవ్రంగా నిరాశపరిచింది. విశ్లేషకులు ఊహించినట్లుగానే లాభాల క్షీణత నమోదైంది. ఉద్యోగుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. 2023-24 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (క్యూ3) ఫలితాలను విప్రో తాజాగా వెల్లడించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 3,065 కోట్లతో పోలిస్తే కన్సాలిడేటెడ్ నికర లాభం రూ. 2,700 కోట్లకు తగ్గిందని కంపెనీ నివేదించింది. అంటే దాదాపు 12 శాతం తగ్గింది. ఈ లాభాల క్షీణత విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే ఉండటం గమనార్హం. క్యూ3 హైలైట్స్: గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.23,229 కోట్లతో పోలిస్తే ఈ త్రైమాసికంలో ఏకీకృత విక్రయాలు రూ.22,205 కోట్లుగా ఉన్నాయి. సేవల శాతం ప్రకారం ఆఫ్‌షోర్ ఆదాయం 59.8 శాతంగా ఉంది. డాలర్ ఆదాయం 2.66 బిలియన్ డాలర్లు ఆపరేటింగ్ మార్జిన్ వరుసగా 11 బేసిస్ పాయింట్లు తగ్గి 16 శాతంగా ఉంది. మొత్తం బుకింగ్‌లు 3.8 బిలియన్ డాలర్లు అట్రిషన్ (ఉద్యోగుల వలసలు) 14.2 శాతంగా ఉంది. విప్రో ఒక్కో షేరుకు రూ.1 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. జనవరి 24ని అదే రికార్డు తేదీగా నిర్ణయించింది. ఫిబ్రవరి 10న లేదా అంతకు ముందే మధ్యంతర డివిడెండ్‌ను చెల్లిస్తామని తెలిపింది. కాగా వచ్చే త్రైమాసికం (క్యూ4)లో ఐటీ సేవల వ్యాపార విభాగం నుంచి 2,615 మిలియన్ డాలర్ల నుంచి 2,669 మిలియన్ డాలర్ల వరకు రాబడి ఉంటుందని విప్రో అంచనా వేస్తోంది. సిబ్బంది నియామకాలు, వ్యాపార కార్యకలాపాలలో తమ పెట్టుబడులు కొనసాగుతాయని విప్రో సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ థియరీ డెలాపోర్టే వెల్లడించారు. -
టీసీఎస్‌లో భారీగా తగ్గిన ఉద్యోగులు.. క్యాంపస్ నియామకాలు డౌటేనా?
దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (TCS)లో ఉద్యోగుల సంఖ్య భారగా తగ్గింది. 2023 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో అంటే మూడు నెలల్లో కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 5,680 పడిపోయిందని ‘ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ నివేదించింది. టీసీఎస్‌లో హెడ్‌కౌంట్ తగ్గడం వరుసగా ఇది రెండో త్రైమాసికం. టీసీఎస్‌లో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2023 జూన్ చివరి నాటికి 6.15 లక్షలు ఉండగా తాజా క్షీణతతో డిసెంబర్ చివరి నాటికి 6.03 లక్షలకు తగ్గింది. మరో ఆందోళనకరమైన విషయం ఏమిటంటే ఎప్పటిలాగా కాకుండా వచ్చే ఆర్థిక సంవత్సరంలో క్యాంపస్ నియామకాల లక్ష్యాన్ని సైతం కంపెనీ స్పష్టం చేయడం లేదు. బలవంతపు తొలగింపుల కంటే కూడా ఉద్యోగులు స్వచ్ఛందంగా కంపెనీని విడిచిపెట్టడం వల్లే హెడ్‌కౌంట్ తగ్గినట్లు భావిస్తున్నారు. కంపెనీ వదిలివెళ్లిన ఉద్యోగుల సంఖ్యకు అనుగుణంగా నియామకాలు చేపట్టనప్పుడు కూడా హెడ్‌కౌంట్ తగ్గుతుంది. తాము మంచి సంఖ్యలోనే ఉద్యోగులను, ట్రైనీలను మార్కెట్ నుంచి నియమించుకున్నామని, నియామకం ఎల్లప్పుడూ అట్రిషన్కి అనుగుణంగా ఉండకపోవచ్చని టీసీఎస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, హెచ్ఆర్ గ్లోబల్ హెడ్ మిలింద్ లక్కడ్ చెబుతున్నారు. అయితే దీనిని ప్రతికూలంగా చూడవలసిన అవసరం లేదని ఆయన తెలిపారు. భవిష్యత్ త్రైమాసికాల్లోనూ ఇదే విధమైన క్షీణత కనిపించవచ్చని ఆయన హింట్ ఇచ్చారు. క్యాంపస్ నియామకాలు డౌటే! ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకునే లక్ష్యానికి టీసీఎస్ ఇప్పటికీ కట్టుబడి ఉందా అంటే మిలింద్ లక్కడ్ స్పష్టత ఇవ్వలేదు. 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మా వద్ద ఖచ్చితమైన సంఖ్య లేదు కానీ క్యాంపస్ నియామకాలలో ముందుంటామని లక్కడ్ చెప్పారు. నేర్చుకునే సామర్థ్యం, జిజ్ఞాస, ఆప్టిట్యూడ్, కోడింగ్ నైపుణ్యాలు ఉన్న విద్యార్థులకు అవకాశం ఉంటుందన్నారు. -
‘హే గూగుల్’.. ఏంటిది? వందలాది ఉద్యోగులను తీసేస్తున్న టెక్ దిగ్గజం
ఆల్ఫాబెట్ యాజమాన్యంలోని టెక్ దిగ్గజం గూగుల్ వందల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తోంది. తమ డిజిటల్ అసిస్టెంట్, హార్డ్‌వేర్, ఇంజినీరింగ్ టీమ్‌లలో పనిచేస్తున్న వందలాది మంది సిబ్బందిని ఇంటికి సాగనంపుతోంది. ఖర్చులను తగ్గించుకోవడానికి ఈ చర్యలు కొంకా కొనసాగుతాయని కంపెనీ తెలిపింది. బాధితుల్లో వాయిస్ అసిస్టెంట్ టీమ్ గూగుల్ చేపట్టిన ప్రస్తుత లేఆఫ్‌లతో ఉద్యోగాలు కోల్పోతున్న వారిలో వాయిస్ ఆధారిత గూగుల్ అసిస్టెంట్, ఆగ్మెంటెడ్ రియాలిటీ హార్డ్‌వేర్ టీమ్‌లో పనిచేస్తున్న వారు ఉన్నారు. కంపెనీ సెంట్రల్ ఇంజనీరింగ్ ఆర్గనైజేషన్‌లోని వర్కర్లపైనా లేఆఫ్‌ల ప్రభావం ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఉత్పత్తుల ప్రాధాన్యతలకు అనుగుణంగా 2023 ద్వితీయార్థంలో తమ అనేక బృందాలు మరింత సమర్థవంతంగా, మెరుగ్గా పని చేయడానికి సిబ్బందిలో మార్పులు చేశాయని గూగుల్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంస్థాగత మార్పులలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని కొంతమంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా గూగుల్ అసిస్టెంట్ టీమ్‌లో తొలగింపులు జరుగుతున్నట్లు సెమాఫోర్ అనే న్యూస్ వెబ్సైట్ మొదట నివేదించింది. 9to5Google అనే గూగుల్ సంబంధిత సమాచార వెబ్సైట్ హార్డ్‌వేర్ టీమ్‌లో పునర్వ్యవస్థీకరణ జరుగుతున్నట్లు పేర్కొంది. ప్రభావిత సిబ్బందికి తొలగింపు సమాచారాన్ని కంపెనీ పంపుతోంది. గూగుల్‌లో ఇతర విభాగాల్లో ఉన్న ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం వీరికి ఉంటుందని కంపెనీ తెలిపింది. ఉద్యోగుల యూనియన్ మండిపాటు గూగుల్ తొలగింపులపై ఆల్ఫాబెట్ వర్కర్స్ యూనియన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’(ట్విటర్)లో పోస్ట్ చేసింది. ‘కంపెనీ కోసం ఉద్యోగులు నిరంతరం కష్టపడుతన్నాం.. దీంతో కంపెనీ ప్రతి త్రైమాసికంలో బిలియన్ల కొద్దీ ఆర్జిస్తోంది. కానీ ఉద్యోగులను తొలగించడం మాత్రం ఆపడం లేదు’ అని వాపోయింది. అయితే తొలగింపులకు వ్యతిరేకంగా తమ పోరాటం ఆపబోమని స్పష్టం చేసింది. Tonight, Google began another round of needless layoffs. Our members and teammates work hard every day to build great products for our users, and the company cannot continue to fire our coworkers while making billions every quarter. We won’t stop fighting until our jobs are safe! — Alphabet Workers Union (AWU-CWA) (@AlphabetWorkers) January 11, 2024 -
Poaching Row: ఐటీ కంపెనీల్లో అక్రమ వలసలు.. పెదవి విప్పిన కాగ్నిజెంట్ సీఎండీ
న్యూఢిల్లీ: ఇతర సంస్థల నుంచి అక్రమంగా అత్యున్నత అధికారులను ఆకట్టుకోవడం(పోచింగ్)వల్ల కంపెనీ బిజినెస్‌పై ఎలాంటి ప్రభావం పడబోదని ఐటీ సేవల దిగ్గజం కాగ్నిజెంట్ ఇండియా చైర్మన్, ఎండీ రాజేష్ నంబియార్ తాజాగా పేర్కొన్నారు. ఇటీవల దేశీ ఐటీ కంపెనీల మధ్య అత్యున్నత అధికారుల అక్రమ వలస(పోచింగ్)లపై తలెత్తిన ఆరోపణల నేపథ్యంలో నంబియార్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ అంశంపై ప్రత్యేకంగా మాట్లాడేందుకు నిరాకరించిన నంబియార్ ఉద్యోగులతో గల కాంట్రాక్టు అమలుకు కంపెనీలు పట్టుబట్టడాన్ని సమర్ధించారు. ఇందుకు ఆయా కంపెనీలకు అధికారముంటుందని వ్యాఖ్యానించారు. అయితే నాన్పోచింగ్పై పరిశ్రమవ్యాప్తంగా వర్తించే నిబంధనలకు ఆస్కారంలేదని స్పష్టం చేశారు. ఒక కంపెనీ నుంచి మరొక కంపెనీ అధికారులను లేదా నిపుణులను తీసుకోవడాన్ని నివారించేందుకు నిబంధనలు వర్తింపచేయలేమని అభిప్రాయపడ్డారు. ఐటీ పరిశ్రమ ప్రధానంగా నైపుణ్య ఆధారితంకావడమే దీనికి కారణమని తెలియజేశారు. నిపుణులతోనే నిర్మితమైన సాఫ్ట్వేర్ సేవల పరిశ్రమలో ఉద్యోగ వలసలకు చెక్ పెట్టేందుకు సరైన నిర్వచనాన్ని ఇవ్వలేమని వివరించారు. అయితే ఉపాధి కల్పనకు సంబంధించి పరిశ్రమవ్యాప్తంగా వర్తించే మార్గదర్శకాలకు వీలున్నట్లు తెలియజేశారు. పోచింగ్ సమస్య తమ కంపెనీపై ప్రభావాన్ని చూపబోదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అంతేకాకుండా పరిశ్రమపైన సైతం ప్రభావాన్ని చూపబోదని అభిప్రాయపడ్డారు. గత కొన్ని వారాలుగా సాఫ్ట్వేర్ సేవల దిగ్గజాల మధ్య పోచింగ్ వివాదాలు తలెత్తిన విషయం విదితమే. దేశీ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఇటీవల.. తమ అధికారులను కాగ్నిజెంట్ అనైతిక పద్ధతుల్లో విధుల్లోకి తీసుకుంటున్నట్లు విమర్శించడంతో పరిశ్రమలో అలజడి తలెత్తింది. గతంలో ఇన్ఫోసిస్‌లో పనిచేసి ప్రస్తుతం కాగ్నిజెంట్ సీఈవోగా వ్యవహరిస్తున్న రవి కుమార్ ఇతర సంస్థల నుంచి 20 మంది సీనియర్ లీడర్లను ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. వీరిలో పలువురు ఇన్ఫోసిస్, విప్రోలో బాధ్యతలు నిర్వహించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా.. ఉద్యోగులతో కనీసం ప్రాథమిక స్థాయిలో నియామకాలలో సైతం ఎలాంటి సర్వీసు ఒప్పందాలు లేదా బాండ్లకు తెరతీయడంలేదని నంబియార్ వివరించారు. క్యాంపస్‌ల నుంచి ప్రధానంగా ఉద్యోగులకు ఎంపిక చేసుకుంటున్నట్లు తెలియజేశారు. ఇది స్వేచ్చా ప్రపంచమని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. -
ఐటీ కంపెనీలకు కార్మిక శాఖ మంత్రి కీలక సూచనలు
ఉద్యోగ భద్రత, ఉద్యోగులతో వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించి ఐటీ కంపెనీలకు కర్ణాటక రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ లాడ్ కీలక సూచనలు చేశారు. ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ తాజా ఇంటర్వ్యూలో ఆయన ఐటీ ఉద్యోగుల సమస్యలను ప్రస్తావించారు. ఐటీ పరిశ్రమకు ప్రధాన కేంద్రమైన బెంగళూరు సహా కర్ణాటక రాష్ట్రంలో దాదాపు 18 లక్షల మంది ఐటీ రంగంలో పనిచేస్తున్నారు. రాష్ట్రంలోని ఐటీ సంస్థలకు ఇప్పటివరకూ ఉన్న మినహాయింపులు తొలగించి వాటిని తమ పరిధిలోకి తీసుకురావాలని ఆ రాష్ట్ర కార్మిక శాఖ ఆలోచిస్తోంది. ఈ ఆలోచన ఇప్పుడు ఏ స్థితిలో ఉందని ప్రశ్నించినప్పుడు దీనిపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఐటీ-బీటీ, పరిశ్రమలతో సహా సంబంధిత మంత్రులతో మాట్లాడుతామని సంతోష్ లాడ్ బదులిచ్చారు. ఆ వైఖరి మానుకోవాలి ఐటీ సంస్థలు కూడా తమ ఉద్యోగులతో వ్యవహరించే విధానాన్ని పరిశీలించుకోవాలని సూచించారు. తమ కంపెనీలు రాత్రిపూట ఈ-మెయిల్ ఐడీలను బ్లాక్ చేయడం, తోటి ఉద్యోగులతో కమ్యూనికేట్ చేయకుండా ఆపడం వంటివి చేస్తున్నాయని చాలా మంది ఉద్యోగులు తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. కానీ వారికి సహాయం చేసే యంత్రాంగం ప్రస్తుతం తమ వద్ద లేదన్నారు. అలాగే ఐటీ ఉద్యోగులు తమ ఉద్యోగ భద్రత గురించి ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ఇదీ చదవండి: Wipro Rule: విప్రోలో మానేస్తే ఇంట్లో కూర్చోవాల్సిందే! చుక్కలు చూపిస్తున్న కఠిన నిబంధన కంపెనీలపై అజమాయిషి చూపించడం తమ ఉద్దేశం కాదని, కార్మిక చట్టాలు ముఖ్యమని యాజమాన్యాలు అర్థం చేసుకోవాలని స్పష్టం చేశారు. ఐటీ కంపెనీ అయినంత మాత్రాన రాత్రికి రాత్రే ఉద్యోగులను తొలగించడం సరికాదన్నారు. ఈ వైఖరి మారాలని సూచించారు. పని వేళల గురించి.. ఐటీ కంపెనీలు గ్రాట్యుటీ, కనీస వేతనాలతో సహా అన్ని ఇతర నిబంధనలకు కట్టుబడి ఉంటున్నాయని, తమ ఆందోళన అంతా ఉద్యోగులను తొలగిస్తున్న విధానాలపై మాత్రమేనని స్పష్టం చేశారు. ఇక పనివేళల గురించి మాట్లాడుతూ ఉద్యోగులకు కొన్నిసార్లు ఎక్కువ పని ఉంటుంది.. కొన్నిసార్లు తక్కువ పని ఉంటుంది. దీనిపై పెద్దగా అభ్యంతరం లేదని, ఉద్యోగుల సామాజిక భద్రతపైనే తాము దృష్టి పెట్టినట్లు మంత్రి సంతోష్ లాడ్ వివరించారు. -
త్వరలో ఫలితాలు.. ఐటీ ఉద్యోగుల కష్టాలు తీరినట్టేనా!
కరోనా మహమ్మారి వ్యాపించినప్పటి నుంచి ప్రపంచ దేశాలు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వచ్చింది, ఇతర సంస్థల పరిస్థితి పక్కన పెడితే ఐటీ కంపెనీల అవస్థలు మాత్రం వర్ణనాతీతం అనే చెప్పాలి. దిగ్గజ కంపెనీలు సైతం ఆర్థిక పరిస్థితుల కారణంగా తమ ఉద్యోగులను తొలగించాల్సి వచ్చింది. అయితే 2023 ప్రారంభం కంటే చివరి త్రైమాసికం కొంత వృద్ధి చెందినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 2023లో పరిస్థితులు కొంత సాధారణస్థాయికి వచ్చినప్పటికీ.. చాలా ఐటీ సంస్థలు బడ్జెట్ విషయంలో ఆచి తూచి అడుగులు వేసాయి. ప్రాజెక్టులు ఆలస్యమవ్వడం, రోజురోజుకి తగ్గుతున్న ఆదాయాల వల్ల ఇలా ప్రవర్తించాల్సి వచ్చినట్లు సమాచారం. ఈ ప్రభావం ఉద్యోగుల మీద, వారి జీతాల మీద కూడా పడింది. ఈ కారణంగానే జీతాల పెంపు కూడా కొంత వాయిదా పడింది. భారతీయ దిగ్గజ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎల్అండ్ టీ, టెక్ మహీంద్రా మొదలైనవన్నీ ఈ నెలలో తమ డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను వెల్లడించనున్నాయి. ఈ ఫలితాలు మునుపటి కంటే కొంత ఆశాజనకంగా ఉంటాయని భావిస్తున్నారు. అయితే కొన్ని కంపెనీలు లాభాల్లో రాకపోయినప్పటికీ వాటి యాజమాన్యాలు భవిష్యత్తు కార్యాచరణ ఎలా ప్రకటిస్తాయోనని మార్కెట్ వర్గాలు వేచిచూస్తున్నాయి. యాజమాన్యాలు ఐటీ రంగానికి సంబంధించి సానుకూలంగా స్పందిస్తే స్టాక్ల్లో మంచి ర్యాలీ కనిపించే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన ఫెడ్ మీటింగ్‌లో రానున్న రోజుల్లో కీలక వడ్డీరేట్లను పెంచబోమనే సంకేతాలు ఇవ్వడం కూడా మార్కెట్లకు పాజిటివ్‌గా ఉందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత ఏడాది డిసెంబర్ వరకు చాలామంది ఐటీ ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు, ఈ ఏడాది ఉద్యోగులను తొలగించే పరిస్థితులు కనిపించనప్పటికీ.. కొత్త ఉద్యోగాలు పెరిగే సూచనలు కూడా ఆశాజనంగా ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే ఆర్టిఫిషీయల్ ఇంటిలిజెన్స్, డాటా సైన్స్, సైబర్‌సెక్యూరిటీ నిపుణులకు డిమాండ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నట్టు తెలిసింది. ఇదీ చదవండి: ఏం ఐడియా.. మనం కూడా ఇలా చేయగలమా! ఐటీ సంస్థల ఫలితాల విషయానికి వస్తే.. టైర్ 1 కంపెనీల వృద్ధి 2.6 శాతం నుంచి 5 శాతం, టైర్ 2 సంస్థల ఆదాయం 1 నుంచి 3 శాతం పెరగవచ్చని భావిస్తున్నారు. అయితే ఖచ్చితమైన ఫలితాలు ఈ నెల చివరి నాటికి అన్నీ అందుబాటులోకి వస్తాయి. ఆదాయ వివరాలు ఎలా ఉన్నా దీర్ఘకాలంలో మాత్రం ఐటీ కంపెనీ స్టాక్స్‌ల్లో ర్యాలీ ఉంటుందని భావిస్తున్నారు. -
విప్రోలో మానేస్తే ఇంట్లో కూర్చోవాల్సిందే! చుక్కలు చూపిస్తున్న కఠిన నిబంధన
అన్ని పరిశ్రమలలోనూ కంపెనీల మధ్య పోటీ అనేది సర్వ సాధారణం. అయితే ఇది ఐటీ కంపెనీల తారస్థాయికి చేరింది. కంపెనీల్లో కీలకంగా వ్యవహరించే సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు ప్రత్యర్థి కంపెనీల్లోకి జంప్ అవుతుండటంతో భారతీయ ఐటీ కంపెనీ విప్రో కఠిన నిబంధన అమలు చేస్తోంది. ఈ నిబంధన కంపెనీ మారిన ఉన్నత ఉద్యోగులకు చుక్కలు చూపిస్తోంది. విప్రో నుంచి వైదొలిగే సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు కంపెనీలో వారి చివరి రోజు నుంచి ఒక సంవత్సరం పాటు 10 ప్రత్యర్థి సంస్థలలో చేరలేరు. ఈ సాఫ్ట్వేర్ సంస్థ నుంచి నిష్క్రమించిన వెంటనే ఈ కంపెనీలలో దేనిలోనూ చేరకుండా వారిని నిరోధించే వారి కాంట్రాక్ట్‌లోని నాన్-కాంపిటేట్ నిబంధన దీనికి కారణం. ఈ నిబంధన ఆధారంగా ప్రత్యర్థి కంపెనీ కాగ్నిజెంట్‌లో చేరిన తమ మాజీ సీఎఫ్‌వో జతిన్ దలాల్‌ను విప్రో ముప్పుతిప్పలు పెడుతోంది. నిబంధన ఉల్లంఘించి ప్రత్యర్థి కంపెనీలో చేరినందుకు గానూ నష్టపరిహారం కింద వడ్డీతో సహా రూ. 25.15 కోట్లు కట్టాలని కోర్టులో దావా వేసింది. విప్రో ప్రత్యర్థి కంపెనీలు ఇవే.. విప్రో ఎగ్జిక్యూటివ్‌ల కాంట్రాక్ట్‌లో పది ప్రత్యర్థి కంపెనీల పేర్లను పేర్కొంది. నాన్-కాంపిటేట్ నిబంధన కింద వారు విప్రోలో మానేసిన తర్వాత సంవత్సరం పాటు ఈ కంపెనీలలో చేరేందుకు వీలు లేదు. ఆ కంపెనీలు ఇవే.. యాక్సెంచర్, క్యాప్‌జెమినీ, కాగ్నిజెంట్, డెలాయిట్, డీఎక్స్‌సీ టెక్నాలజీ, హెచ్‌సీఎల్, ఐబీఎం, ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా. ఈ పేర్లలో ప్రతి ఒక్కటి దలాల్ కాంట్రాక్ట్‌లో పేర్కొన్నట్లు విప్రో తెలిపింది. అయినప్పటికీ ఆయన ప్రత్యక్ష పోటీదారు కంపెనీలో చేరాడని విప్రో వాదిస్తోంది. -
TCS: టీసీఎస్‌లో మరో పరిణామం.. వైదొలిగిన ఎస్వీపీ
దేశీయ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)లో మరో పరిణామం చోటు చేసుకుంది. కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దీనానాథ్ ఖోల్కర్ పదవి నుంచి వైదొలిగారు. కంపెనీ అనుబంధ విభాగాలకు గ్లోబల్ హెడ్‌గా ఉన్న ఆయన 34 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత సంస్థను విడిచిపెట్టారు. ఖోల్కర్ స్థానంలో రాజీవ్ రాయ్‌ను టీసీఎస్ నియమించింది. దీనానాథ్ ఖోల్కర్ 1996లో టీసీఎస్‌లో డేటా వేర్‌హౌసింగ్, డేటా మైనింగ్ గ్రూప్‌ను ప్రారంభించారు. తర్వాత అది బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్రాక్టీస్‌గా మారింది. తన సుదీర్ఘ అనుభవంలో ఆయన టీసీఎస్ ఈసర్వ్ సీఈవో, ఎండీగా, బీఎఫ్ఎస్ఐ బీపీవో హెడ్‌గా ఎదిగారు. 2017-22 కాలంలో అనలిటిక్స్, ఇన్సైట్స్ గ్లోబల్ హెడ్‌గా పనిచేశారు. “నా కెరీర్లో పరిశ్రమలోని అద్భుతమైన నాయకులు, నిపుణులతో, అలాగే టీసీఎస్‌లో మా భాగస్వాములు, మా కస్టమర్లు, అనేక మంది సభ్యులతో కలిసి పని చేయడం నా అదృష్టం. నేను పనిచేసిన ప్రతి బృందం ప్రత్యేకమైనది. అనేక గొప్ప జ్ఞాపకాలను మిగిల్చింది” అని దీనానాథ్ ఖోల్కర్ తన లింక్డ్ఇన్ పోస్ట్‌లో పేర్కొన్నారు. -
భారతీయ ఐటీ కంపెనీ సంచలనం.. ఓనర్లుగా ఉద్యోగులు!
నెలకోసారి జీతమిచ్చే కంపెనీలే కానీ ఆదాయంలో వాటా ఇచ్చే సంస్థల గురించి అరుదుగా వింటుంటాం. అలాంటిదే ఈ భారతీయ ఐటీ కంపెనీ. తమ ఉద్యోగులకు కంపెనీలో ఏకంగా 33 శాతం వాటాను ఇచ్చేస్తోంది. అంతేకాదు ఒక్కొక్కరికీ రూ.15 లక్షల విలువైన కార్లు అందించింది. కంపెనీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న కొందరు ఉద్యోగులనైతే ‘కో ఫౌండర్లు’గా ప్రకటించేసింది. 33 శాతం ఉద్యోగులకే.. ఉద్యోగుల పట్ల పెద్ద మనసు చాటుకున్న ఈ ఐటీ కంపెనీ పేరు ‘ఐడియాస్2ఐటీ’ (Ideas2IT) భారత్‌లో ప్రధాన కార్యాలయం కలిగిన ఈ టెక్ సంస్థ తమ 100 మిలియన్ డాలర్ల ( సుమారు రూ.832 కోట్లు) కంపెనీ యాజమాన్యంలో 33 శాతాన్ని ఉద్యోగులకు బదిలీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో 5 శాతాన్ని 2009లో కంపెనీ పెట్టినప్పటి నుంచి నమ్మకంగా పనిచేస్తున్న 40 ఉద్యోగులకు, మిగిలినదాన్ని మిగతా 700 మంది సిబ్బందికి పంచనున్నట్లు పేర్కొంది. 150 మందికి కార్లు కంపెనీలో వాటాతో పాటు తమ వద్ద ఐదేళ్లకు పైగా సేవలందించిన 50 మంది ఉద్యోగులకు 50 కార్లను కంపెనీ వ్యవస్థాపకులు మురళీ వివేకానందన్, భవాని రామన్ అందజేశారు. ఉద్యోగులు రూ. 8-15 లక్షల ధర రేంజ్లో మారుతీ సుజుకి లైనప్ నుంచి తమకు నచ్చిన వాహనాలను ఎంచుకోవడానికి కంపెనీ అవకాశం కల్పించింది. అంతేకాదు.. ఉద్యోగులకు ఎటువంటి ఖర్చు లేకుండా వీటిని వారి సొంత పేర్లతో రిజిస్టర్ చేసి మరీ ఇచ్చింది. కాగా ఇదివరకే 2022లో ఐదేళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు ఇలాగే 100 కార్లను అందించింది. Ideas2IT, #tech firm valued at $100mn, announces transfer of 1/3rd of company ownership to its most-trusted employees They've just given away 50cars(₹8-15lakh range) to those that have served 5+yrs..In 2022, 100 staff got cars(regd in own name)#chennai #india #business… pic.twitter.com/yYXA7Isddm — Sidharth.M.P (@sdhrthmp) January 2, 2024 సామాన్య యువతకు అవకాశం 2009లో ప్రారంభించి 100 మిలియన్ డాలర్ల సంస్థగా ఎదిగామని, దీని ఫలాలను తమ ఉద్యోగులతో పంచుకోవాలకోవాలనుకుంటున్నట్లు ఐడియాస్2ఐటీ వ్యవస్థాపకుడు మురళీ వివేకానందన్ వెల్లడించినట్లుగా వార్తాసంస్థ వియాన్ పేర్కొంది. ఎంప్లాయీ ఓనర్షిప్ ప్రోగ్రామ్ చొరవలో భాగంగా కంపెనీ దీన్ని చేపట్టింది. ఈ కంపెనీకి భారత్‌తోపాటు యూఎస్, మెక్సికో దేశాల్లో మొత్తం 750 మంది ఉద్యోగులు ఉన్నారు. మరో విశేషం ఏటంటే ఈ కంపెనీ ఉద్యోగుల కోసం ఐఐటీల వెంట పడదు. చిన్న చిన్న పట్టణాలకు చెందిన సామాన్య యువతనే నియమించుకుంటుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. కంపెనీ విలువను నాలుగు సంవత్సరాల వ్యవధిలో మూడు రెట్లు పెంచే వ్యూహంతో ఉన్న చెప్పిన మురళీ వివేకానందన్ కంపెనీ ప్రారంభించడదానికి ముందు సన్, ఒరాకిల్, గూగుల్ సంస్థల్లో పనిచేశారు. ప్రస్తుతం యూఎస్ ఉంటున్న ఆయన భారత్‌లోని చెన్నై, మెక్సికో మధ్య తిరుగుతూ ఉంటారు. -
పెరుగుతున్న నిపుణుల కొరత..
ముంబై: ఐటీ కంపెనీలు నైపుణ్యాల కొరతను ఎదుర్కొంటుండగా, కృత్రిమ మేథ (ఏఐ) దీన్ని మరింత వేగవంతం చేస్తున్నట్టు ఎడ్టెక్ కంపెనీ స్కిల్‌సాఫ్ట్ నిర్వహించిన ‘2023 ఐటీ స్కిల్స్ అండ్ శాలరీ సర్వే’లో తెలిసింది. అర్హత కలిగిన నిపుణులు లభించడం కష్టంగా ఉందని ప్రతి ముగ్గురు ఐటీ కంపెనీల ప్రతినిధుల్లో ఒకరు చెప్పారు. నైపుణ్యాల అంతరం, నైపుణ్యాల కొరత, టెక్నాలజీల్లో మార్పు ఐటీ విభాగాలను ప్రభావితం చేస్తున్నట్టు ఈ సర్వే నివేదిక తెలిపింది. ‘‘ఉద్యోగులకు ఇంతకుముందెన్నడూ లేనట్టు తరచూ మారుతున్న టెక్నాలజీలపై శిక్షణ ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఏఐ తదితర టెక్నాలజీకి సంబంధించిన నైపుణ్యాలు, సామర్థ్యాల నిర్మాణంలో సంస్థలు చురుగ్గా వ్యవహరించాల్సిన దశలో ఉన్నాయి’’అని స్కిల్‌సాఫ్ట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఓర్లా డ్యాలీ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా 5,700 మంది ఐటీ నిపుణులు, కంపెనీల ప్రతినిధుల అభిప్రాయాలను ఈ సర్వేలో భాగంగా స్కిల్‌సాఫ్ట్ తెలుసుకుంది. శిక్షణ ఎంతో అవసరం.. 82 శాతం ఐటీ నిపుణులు శిక్షణ తమ కెరీర్లో ఎంతో ముఖ్యమని చెప్పారు. చేస్తున్న పనిలో ఎలాంటి వృద్ధి లేకపోవడం వల్ల తాము సంస్థను మారాల్సి వచి్చనట్టు ఎక్కువ మంది తెలిపారు. టీమ్ కమ్యూనికేషన్ (40 శాతం), ఇంటర్‌పర్సనల్ కమ్యూనికేషన్ (21 శాతం), ఎమోషనల్ ఇంటెలిజెన్స్ (13) అన్నవి కావాల్సిన మూడు ముఖ్యమైన నైపుణ్యాలుగా ఐటీ రంగ ఉద్యోగులు చెప్పారు. రానున్న రోజుల్లో నాయకత్వ నైపుణ్యాలు కూడా తమ పెట్టుబడుల ప్రాధాన్యతల్లో ఒకటిగా 6 శాతం మంది పేర్కొన్నారు. సాంకేతికేతర నైపుణ్యాల అవసరాన్ని 7 శాతం మంది వ్యక్తం చేశారు. 72 శాతం మంది ఐటీ ఉద్యోగులు తమ టీమ్ నాయకత్వ నైపుణ్యాలు మధ్యస్థం నుంచి తక్కువగా ఉన్నట్టు అంగీకరించారు. ఈ విభాగంలో శిక్షణ పరంగా ఎంతో అంతరం ఉన్నట్టు పేర్కొన్నారు. నాయకత్వంలో శిక్షణ ఇవ్వడం ద్వారా సమగ్రమైన ఐటీ నైపుణ్యాలు సమకూర్చుకునేందుకు ఇప్పుడు పెద్ద అవకాశం కంపెనీల మందున్నట్టు ఈ సర్వే నివేదిక పేర్కొంది. -
ఐటీ ఉద్యోగులకు బలవంతంగా బదిలీలు.. రంగంలోకి దిగిన కార్మిక శాఖ
చాలా కాలంగా వర్క్ ఫ్రం హోమ్ విధానానికి అలవాటు పడిన ఐటీ ఉద్యోగులను దాదాపుగా అన్ని కంపెనీలు ఆఫీసులకు పిలిపిస్తున్నాయి. ఇప్పటికే ఉద్యోగులందరూ ఆఫీసుల బాట పట్టారు. అయితే ఇప్పుడు కొన్ని ఐటీ కంపెనీలు మరో ఝలక్ ఇస్తున్నాయి. ఉద్యోగులకు ముందస్తు సమాచారం లేకుండా రీలొకేట్ చేస్తున్నాయి. దీంతో కార్మిక శాఖ రంగంలోకి దిగింది. ఐటీ ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న యూనియన్ నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) దాఖలు చేసిన ఫిర్యాదుపై మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వ కార్మిక శాఖ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌కు నోటీసు జారీ చేసింది. ముందస్తు నోటీసు, సంప్రదింపులు లేకుండానే 2,000 మందికి పైగా ఉద్యోగులను టీసీఎస్ ఇతర నగరాలకు రీలొకేట్ అవ్వాలని బలవంతం చేసిందని యూనియన్ ఆరోపించింది. ఈ వ్యవహారంపై ఈనెల 18న తమను కలవాలని టీసీఎస్ ప్రతినిధులను కార్మిక శాఖ ఆదేశించినట్లుగా తమకు లభించిన నోటీసును ఉటంకిస్తూ సీఎన్‌బీసీ టీవీ18 పేర్కొంది. టీసీఎస్ చర్యలపై దర్యాప్తు చేయాలని, అటువంటి అనైతిక పద్ధతుల నుంచి ఐటీ ఉద్యోగులను రక్షించాలని తాము కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖను కోరినట్లు నైట్స్ ప్రెసిడెంట్ హర్‌ప్రీత్ సింగ్ సలుజా ఒక ప్రకటనలో తెలిపారు. 2,000 మందికి పైగా నోటీసులు టీసీఎస్ వివిధ ప్రదేశాలలో 2,000 మందికి పైగా ఉద్యోగులకు రీలొకేషన్ నోటీసులు జారీ చేసిందని ఐటీ ఉద్యోగుల సంఘం నైట్స్ తన ఫిర్యాదులో ఆరోపించింది. "టీసీఎస్ 2,000 మందికి పైగా ఉద్యోగులను ఎటువంటి నోటీసు, సంప్రదింపులు లేకుండా వివిధ నగరాలకు బలవంతంగా బదిలీ చేస్తోందని నైట్స్‌కి 180కి పైగా ఫిర్యాదులు అందాయి. ఈ చర్యలతో దీంతో ఉద్యోగులు, వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. బదిలీ ఆదేశాలు ఉల్లంఘిస్తే క్రమశిక్షణా చర్యలు తప్పవని కంపెనీ బెదిరిస్తోంది. ఈ బలవంతపు బదిలీల వల్ల ఉద్యోగులకు కలిగే ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, ఒత్తిడి, ఆందోళనను కంపెనీ విస్మరిస్తోంది" అని హర్‌ప్రీత్ సింగ్ సలూజా పేర్కొన్నారు. ఇప్పటికే వర్క్ ఫ్రం హోమ్‌కు ముగింపు టీసీఎస్ ఇప్పటికే వర్క్ ఫ్రం హోమ్ విధానానికి ముగింపు పలికింది. ఉద్యోగులందరూ వారంలో ఐదు రోజులపాటు ఆఫీసులకు రావాల్సిందేనని గతేడాది అక్టోబర్ 1న అంతర్గత కమ్యూనికేషన్లో ఆదేశించింది. ప్రస్తుతం ఉద్యోగులు వారానికి మూడు రోజుల చొప్పున ఆఫీసులకు వెళ్లాల్సి ఉంది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఆవశ్యకతను టీసీఎస్ తమ 2023 వార్షిక నివేదికలో సైతం హైలైట్ చేసింది. ఇదీ చదవండి: కంపెనీ మారుతావా.. కట్టు రూ. 25 కోట్లు! కాగా టీసీఎస్ గతేడాది ఆగస్టు నెల చివరి నుంచే ఉద్యోగులకు రీలొకేషన్ నోటీసులు పంపుతున్నట్లు తెలుస్తోంది. అందులో కొత్త లొకేషన్లో చేరడానికి 2 వారాల సమయం ఇచ్చినట్లు చెబుతున్నారు. -
ఐటీ కంపెనీ కాగ్నిజెంట్‌కు భారీ ఊరట!
అమెరికాకు చెందిన మల్టీనేషనల్ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్‌కు భారీ ఊరట దక్కింది. రూ. 4,300 కోట్ల పన్ను బకాయిలకు బదులుగా కంపెనీకి చెందిన రూ. 2,956 కోట్ల బ్యాంక్ డిపాజిట్లను ఆదాయపు పన్ను శాఖ లిక్విడేట్ చేయడంపై మద్రాస్ హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. పన్ను బకాయిల కోసం నాలుగు వారాల్లోగా రూ.1,500 కోట్లు చెల్లించాలని, ఆస్తి భద్రతగా పెట్టాలని జస్టిస్ ఆర్ మహదేవన్, జస్టిస్ మహమ్మద్ షఫీక్‌లతో కూడిన డివిజన్ బెంచ్ కాగ్నిజెంట్‌ను ఆదేశించింది. ఈ షరతులను పాటించడంలో విఫలమైతే కంపెనీకి ఇచ్చిన మధ్యంతర స్టే రద్దవుతుందని కోర్టు స్పష్టం చేసింది. దీంతో పాటు రూ. 1,500 కోట్ల చెల్లించడానికి, ఆస్తిని భద్రతగా పెట్టడం కోసం బ్యాంకు డిపాజిట్లపై పెట్టిన తాత్కాలిక స్తంభనను విడుదల చేయాలని కోర్టు ఐటీ శాఖను ఆదేశించింది. ఈ వ్యవహారం 2017-18లో కాగ్నిజెంట్ చేపట్టిన రూ.19,000 కోట్ల షేర్ బైబ్యాక్‌కు సంబంధించినది. ఇది వాటాదారులకు మూలధన లాభాల పన్నును మాత్రమే ఆకర్షిస్తుందని కంపెనీ వాదించగా ఆదాయపు పన్ను శాఖ.. దీనిని సేకరించిన లాభాల పంపిణీగా పరిగణించి డివిడెండ్‌పై వేసినట్లుగా పన్ను విధించింది. -
కంపెనీ మారుతావా.. కట్టు రూ. 25 కోట్లు!
కంపెనీ మారిన మాజీ సీఎఫ్‌వో జతిన్ దలాల్ (Jatin Dalal)కు భారతీయ ఐటీ దిగ్గజం విప్రో (Wipro) ఝలక్ ఇచ్చింది. ఒప్పందాన్ని ఉల్లంఘించి ప్రత్యర్థి కంపెనీలో చేరినందుకు గాను రూ. 25 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని కోరింది. అంతే కాకుండా వడ్డీ కూడా కట్టాలని కోర్టులో దావా వేసింది. కాగ్నిజెంట్ (Cognizant) లో చేరిన తమ మాజీ సీఎఫ్‌వో జతిన్ దలాల్‌పై ఐటీ కంపెనీ విప్రో బెంగళూరులోని సివిల్ కోర్టులో ఇటీవల దావా వేసింది. ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు గాను రూ. 25 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని కోరినట్లు తమకు లభించిన కోర్టు పత్రాలను ఉటంకిస్తూ టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది. ఈ నష్టపరిహారంపై సెప్టెంబర్ 29 నుంచి చెల్లింపు తేదీ వరకు 18 శాతం చొప్పున వడ్డీ కూడా చెల్లించాలని దలాల్‌ను కోరింది. అంతేకాకుండా దలాల్ తమకు సంబంధించిన రహస్య సమాచారాన్ని బహిర్గతం చేయకుండా, తమ కస్టమర్లు లేదా ఉద్యోగులను ఏ విధంగానూ ప్రభావితం చేయకుండా జతిన్ దలాల్‌పై విప్రో శాశ్వత నిషేధం విధించింది. అయితే ఈ విషయాన్ని మధ్యవర్తిత్వానికి రిఫర్ చేయాలని కోర్టును కోరుతూ దలాల్ దరఖాస్తు చేసుకున్నారు. తదుపరి విచారణ జనవరి 3న జరగనుంది. ఈ విషయాన్ని మధ్యవర్తిత్వానికి సూచించాలా వద్దా అనే దానిపై కోర్టు ఉత్తర్వులు జారీ చేస్తుంది. మధ్యవర్తిత్వం అనేది కోర్టులతో పని లేకుండా వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ఉద్దేశించిన ప్రత్యామ్నాయ మార్గం. ఎంప్లాయిమెంట్ కాంట్రాక్ట్‌లో దీనికి అవకాశం ఉంటే ఈ పద్ధతిని ఉపయోగించుకోవచ్చు. జతిన్ దలాల్ డిసెంబర్ 1న కాగ్నిజెంట్‌లో సీఎఫ్‌వోగా చేరారు. ఈ కేసులో మొదటి విచారణ నవంబర్ 28న జరిగింది. డిసెంబరు ప్రారంభంలో దలాల్ ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ యాక్ట్ 1996లోని సెక్షన్ 8 కింద మధ్యవర్తిత్వానికి దరఖాస్తు చేశారు. ఈ సెక్షన్ ప్రకారం.. ఇరుపక్షాలను మధ్యవర్తిత్వానికి సూచించే అధికారం కోర్టులకు లభిస్తుంది. జతిన్ దలాల్‌కు విప్రోలో రెండు దశాబ్దాల అనుభవం ఉంది. 2015 నుంచి ఆయన ఇక్కడ సీఎఫ్‌వోగా పనిచేశారు. 2019 నుంచి ప్రెసిడెంట్‌గా అదనపు బాధ్యతలను సైతం నిర్వహించారు. కాగ్నిజెంట్‌లో ఆయన వీసా ఫార్మాలిటీలు పూర్తయిన తర్వాత యూఎస్ లేదా యూకే వెళ్తారని తెలుస్తోంది. -
ఐటీకి కరోనా భయం
-
ఇన్ఫోసిస్‌కి భారీ షాక్! రూ.12 వేల కోట్ల డీల్ క్యాన్సిల్
దేశీయ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌కి భారీ షాక్ తగిలింది. గ్లోబల్ కంపెనీతో చేసుకున్న సుమారు రూ.12 వేల కోట్ల డీల్ క్యాన్సిల్ అయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ కోసం కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని (MOU) సదరు కంపెనీ రద్దు చేసుకుందని ఇన్ఫోసిస్ వెల్లడించింది. ఈ భారీ ఒప్పందం ఈఏడాది సెప్టెంబర్‌లో ఖరారైంది. 15 సంవత్సరాల కాలానికి చేసుకున్న ఈ డీల్ ప్రారంభంలోనే ముగిసిపోవడం ఐటీ సేవల రంగంలో క్లయింట్ల డిమాండ్, సాంకేతిక బడ్జెట్లలో పెరుగుతున్న అనిశ్చితిని తెలియజేస్తోంది. ఇదీ చదవండి: ...అలా విజయం సాధించినట్లు చరిత్రలో లేదు “గ్లోబల్ కంపెనీతో ఎంఓయూకి సంబంధించి 'కంపెనీ అప్డేట్' పేరుతో 2023 సెప్టెంబర్ 14 నాటి ఇన్ఫోసిస్ ప్రకటనకు ఇది కొనసాగింపు. గ్లోబల్ కంపెనీ ఇప్పుడు ఎంవోయూను రద్దు చేయడానికి నిర్ణయించింది. దీంతో ఇరు పక్షాలు మాస్టర్ అగ్రిమెంట్‌ను అనుసరించడం లేదు” అని కంపెనీ డిసెంబర్ 23న ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. సీఎఫ్‌వో రాజీనామా చేసిన రెండు వారాల్లోనే.. కంపెనీ సీఎఫ్‌వో నీలాంజన్ రాయ్ ఆకస్మికంగా వైదొలిగిన రెండు వారాల లోపే ఈ భారీ డీల్ క్యాన్సిల్ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దేశంలో రెండవ అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన ఇన్ఫోసిస్ మెరుగైన డిజిటల్ సేవలు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అందించడానికి గ్లోబల్ కంపెనీతో అవగాహన ఒప్పందం చేసుకున్నట్లు సెప్టెంబర్ 14న ప్రకటించింది. -
టెక్ దిగ్గజం ఒక్క నిర్ణయం.. చెత్తలోకి 24 కోట్ల కంప్యూటర్లు!
మీ కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్-10నేనా? అయితే వెంటనే జాగ్రత్త పడండి. వేలు పోసి కొనుక్కున్న ఆ కంప్యూటర్/ల్యాప్‌టాప్ నిరుపయోగంగా మారే అవకాశాలున్నాయి. ఎందుకంటారా.. విండోస్-10 ఆపరేటింగ్ సిస్టమ్‌కు ఇప్పటివరకూ ఇస్తున్న సపోర్ట్‌ను నిలిపివేసే ఆలోచనలో మైక్రోసాఫ్ట్ ఉన్నట్లు సమాచారం. అదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 24 కోట్ల కంప్యూటర్లు నిరుపయోగంగా మారతాయని 'కెనాలిస్ రీసెర్చ్' తాజా నివేదికలో వెల్లడించింది. మరిన్ని వివరాలు... మైక్రోసాఫ్ట్ కంపెనీ విండోస్ 10కు సపోర్ట్ చేయడం నిలిపేస్తే.. చాలా మంది అలాంటి కంప్యూటర్లను ఉపయోగించడానికి ఆసక్తి చూపరు. దీంతో ఇవన్నీ పనికిరాని వస్తువులుగా మిగిలిపోవాల్సి వస్తుంది, తద్వారా ఎలక్ట్రానిక్ వ్యర్థాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ వ్యర్దాల బరువు సుమారు 3.20 లక్షల కార్ల బరువుకు సమానంగా ఉండొచ్చని, దీన్ని బట్టి చూస్తే ఎలక్ట్రిక్ స్క్రాప్ భవిష్యత్తులో ఏ స్థాయిలో పెరుగుతాయనేది ఇప్పుడే అర్థమైపోతోంది. విండోస్ 10కు సపోర్టు నిలిచిపోయినప్పటికీ కంప్యూటర్లను మరికొన్నేళ్ల పాటు వాడుకోవడానికి అవకాశం ఉంది, కానీ సేఫ్టీ అప్డేట్స్ లేని కారణంగా ఎక్కువమంది కొత్త కంప్యూటర్లను కొనుగోలు చేసే అవకాశం ఉండటంతో.. ఇవన్నీ నిరుపయోగమే అవుతాయి. ఇదీ చదవండి: భారత్ ఒక్కరోజు అమ్మకాలను చేరుకోలేకపోయిన పాకిస్తాన్ - కారణం ఇదే! నిజానికి మైక్రోసాఫ్ట్ గతంలోనే ఓ సందర్భంలో.. 2025 నాటికి విండోస్ 10కు సపోర్ట్ నిలిపివేయనున్నట్లు వెల్లడించింది. అయితే ఇప్పుడు సెక్యూరిటీ అప్డేట్స్ 2028 వరకు వార్షిక ఫీజుతో అందించనున్నట్లు సమాచారం, ఈ వార్షిక ఫీజు చెల్లించడానికి బదులు అప్డేటెడ్ కంప్యూటర్లను కొనుగోలు చేయొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీంతో స్క్రాప్‌కు వెళ్లే పాత కంప్యూటర్ల సంఖ్య భారీగా పెరుగుతుందని కెనాలిస్ రిపోర్ట్ వెల్లడించింది. -
ఐటీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. కంపెనీల ఆటలు ఇక సాగవు!
ఏకపక్ష తొలగింపులు, ఐడీ బ్లాక్ చేయడం, సామూహిక ఉపసంహరణ, లైంగిక వేధింపులు, అధిక పని గంటలు వంటి ఇబ్బందలు ఎదుర్కొంటున్న ఐటీ ఉద్యోగులకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ బాసటగా నిలిచింది. ఉద్యోగులను వేధించే ఐటీ కంపెనీల ఆట కట్టిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-ఎనేబుల్డ్ సర్వీసెస్ (ఐటీఈఎస్) రంగంలో కంపెనీలు ఉద్యోగుల పట్ల అనుచిత విధానాలు అనుసరిస్తున్న నేపథ్యంలో వీటిని రాష్ట్ర కార్మిక శాఖ పరిధిలోకి తీసుకురావాలని యోచిస్తోంది. చాలా ఐటీ కంపెనీల్లో ఏకపక్ష తొలగింపులు, ఐడీ బ్లాక్ చేయడం, సామూహిక ఉపసంహరణ, లైంగిక వేధింపులు, అధిక పని గంటల వంటి విషయాలు కార్మిక శాఖ దృష్టికి వచ్చాయని అదనపు లేబర్ కమిషనర్ డాక్టర్ జి.మంజునాథ్ తెలిపారు. వీటిలో కొన్నింటిని లేబర్, ఇండస్ట్రియల్ కోర్టులకు రిఫర్ చేసినట్లు చెప్పారు. ఇక మినహాయింపు లేదు! 'సన్‌రైజ్ ఇండస్ట్రీస్'గా పరిగణిస్తున్న ఐటీ కంపెనీలకు కర్ణాటక పారిశ్రామిక ఉపాధి (స్టాండింగ్ ఆర్డర్స్) చట్టం-1946 నుంచి ఆ రాష్ట్ర ప్రభుత్వం చాలా సంవత్సరాలుగా మినహాయింపు ఇస్తూ వస్తోంది. చివరిసారిగా 2019 మే 21న ఐదేళ్లపాటు ఈ మినహాయింపును పొడిగించింది. కానీ ఈసారి మినహాయింపును పొడిగించకుండా ఆయా కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు ఆయా కంపెనీలను శాఖ పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. కర్ణాటకలో మొత్తం 8,785 ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలు ఉన్నాయి. వీటిలో దాదాపు 18 లక్షల మంది పనిచేస్తున్నారు. కోవిడ్ తర్వాత, కంపెనీల వేధింపులపై అనేక ఫిర్యాదులు డిపార్ట్మెంట్లో నమోదయ్యాయి. ఈ ఫిర్యాదులను సమర్థవంతంగా పరిష్కరించడానికి, ఈ రంగంలో పనిచేస్తున్న వారికి ఉద్యోగ భద్రత కల్పించడానికి పారిశ్రామిక ఉపాధి (స్టాండింగ్ ఆర్డర్స్) చట్టం-1946ని ఆయా కంపెనీలకు వర్తింపజేయడం అవసరమని అదనపు లేబర్ కమిషనర్ పేర్కొన్నారు. ఇదీ చదవండి: బెంగళూరులో యాక్సెంచర్ ఏఐ స్టూడియో.. ఏంటిది.. ఏం చేస్తుంది? -
వైజాగ్ ఐటీ కంపెనీ ఎవల్యూటిజ్ ఆదాయ లక్ష్యం రూ. 650 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐటీ సేవలు, ఉత్పత్తుల సంస్థ ఎవల్యూటిజ్ వచ్చే రెండేళ్లలో రూ. 650 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ప్రస్తుతం ఇది రూ. 430 కోట్లుగా ఉంది. వైజాగ్ కేంద్రం ప్రారంభించి పదేళ్లయిన సందర్భంగా సంస్థ వ్యవస్థాపకుడు, సీటీవో ఎ. శ్రీనివాస ఈ విషయాలు చెప్పారు. భారతీయ టెకీలు 2011లో షికాగో కేంద్రంగా ఎవల్యూటిజ్ను ప్రారంభించారు. ఇది దేశీయంగా 2013లో వైజాగ్‌తో మొదలుపెట్టి హైదరాబాద్, నోయిడా, బెంగళూరు తదితర నగరాలకు కార్యకలాపాలు విస్తరించింది. ప్రస్తుతం భారత్‌లో 650 మంది సిబ్బంది ఉండగా.. వైజాగ్, హైదరాబాద్ కార్యాలయాల్లో 500 మంది పైగా ఉన్నారని శ్రీనివాస వివరించారు. పటిష్టమైన వ్యూహాల దన్నుతో రెండేళ్లుగా ఆదాయం 140% వృద్ధి చెందిందని, రాబోయే రోజుల్లోను ఇదే స్ఫూర్తి తో పని చేయనున్నామని ఆయన పేర్కొన్నారు. కృత్రిమ మేథ, మెషీన్ లెర్నింగ్, బిగ్ డేటా మొదలైన సాంకేతికతల ఆధారిత సొల్యూషన్స్‌కి సంబంధించి పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తున్నామని చెప్పారు. -
బెంగళూరులో యాక్సెంచర్ ఏఐ స్టూడియో.. ఏంటిది.. ఏం చేస్తుంది?
Accenture Generative AI Studio: ప్రముఖ ఐటీ కంపెనీ యాక్సెంచర్ బెంగళూరులో జెనరేటివ్ ఏఐ స్టూడియోను ఏర్పాటు చేసింది. దాదాపు రూ.25 వేల కోట్ల పెట్టుబడిలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ జెనరేటివ్ ఏఐ స్టూడియో ఉద్దేశం, ఉపయోగం, అందించే సేవలు వంటి విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.. ప్రస్తుతం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌కు పెరుగుతున్న ప్రాధాన్యం గురించి తెలిసిందే. అన్ని రంగాల వ్యాపారాలు ఈ టెక్నాలజీ వినియోగంపై ఆసక్తి కనబరుస్తున్నాయి. దీన్ని అందిపుచ్చుకునేందుకు ప్రముఖ ఐటీ కంపెనీ యాక్సెంచర్ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. రాబోయే మూడేళ్లలో ఏఐ, డేటా ప్రాక్టీస్‌లో 3 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.25 వేల కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించిన కొన్ని నెలల తర్వాత, డిసెంబర్ 18న యాక్సెంచర్ భారత్‌లోని బెంగళూరులో జనరేటివ్ ఏఐ స్టూడియోను ప్రారంభించింది. ఉత్పాదక కృత్రిమ మేధ (Generative AI) ఆధారంగా పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి క్సెంచర్ డేటా, ఏఐ బృందం క్లయింట్లతో కలిసి పని చేసేందుకు ఓ చోటును కల్పించడమే ప్రాథమికంగా ఈ స్టూడియో ఉద్దేశం. ఏఐ ఆధారిత పరిష్కారాలతో సంస్థలు తమ వ్యాపారాలను మరింత అభివృద్ధి చేసుకునేందుకు ఆస్కారం ఉంటుందని కంపెనీ పేర్కొంటోంది. జనరేటివ్ ఏఐ అనేది ఒక రకమైన కృత్రిమ మేధస్సు. ఇది శిక్షణ డేటాను పోలి ఉండే కొత్త డేటాను రూపొందించగలదు. వ్యాపార ప్రక్రియలను ఆప్టిమైజ్ చేయడానికి దీనిని ఉపయోగించవచ్చని కంపెనీ చెబుతోంది. యాక్సెంచర్‌లోని గ్లోబల్ లీడ్- డేటా & ఏఐ సెంథిల్ రమణి ప్రకారం.. మొత్తం వాల్యూ చైన్‌లోని సామర్థ్యాలకు ప్రాధాన్యతనిస్తూ తమ ఏఐ పెట్టుబడులను పెంచుకోవడానికి ఈ స్టుడియో సహాయపడుతుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌లో పెరిగిన పెట్టుబడి విస్తృత ధోరణిని యాక్సెంచర్ ఏఐ స్టుడియో ప్రతిబింబిస్తుంది. యాక్సెంచర్ నిర్వహించిన ఇటీవలి సర్వేలో 74 శాతం C-సూట్ (ఉన్నత కార్యవర్గాలు) 2024లో తమ ఏఐ సంబంధిత వ్యయాన్ని పెంచాలని యోచిస్తున్నట్లు తెలిపారు. ఇది అంతకుముందు సంవత్సరంలో 50 శాతమే ఉండేది. అందించే సేవలు స్టూడియో ఉత్పాదక ఏఐకి సంబంధించిన అనేక రకాల సేవలను అందిస్తుంది. వీటిలో యాజమాన్య ఉత్పాదకకేఐ మోడల్ “స్విచ్‌బోర్డ్,” అనుకూలీకరణ పద్ధతులు, మోడల్ మేనేజ్డ్ సేవలు, ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు ఉన్నాయి. క్లయింట్లకు ఉత్పాదక ఏఐ పరిష్కారాలను అర్థం చేసుకోవడం, ప్రయోగం చేయడం, స్వీకరించడం, పెంచుకోవడంలో సహాయపడేలా ఈ సేవలను రూపొందించినట్లు యాక్సెంచర్ పేర్కొంటోంది. -
సర్కారు ఖజానాలో పైసల్లేవ్.. క్రమశిక్షణతో ఆదాయం పెంచుతాం!
జగిత్యాల/పెద్దపల్లి: ప్రస్తుతం సర్కారు ఖజానాలో పైసల్లేవని, క్రమశిక్షణతో ఆదాయం పెంచుకుంటామని ఐటీ, పరిశ్రమలు, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం పది రోజుల్లో మరో రెండు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. మంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన శ్రీధర్‌బాబు ఆదివారం జిల్లాలో పర్యటించారు. తొలుత సుల్తానాబాద్ మండలానికి చేరుకున్న ఆయన.. పెద్దపల్లి, కమాన్‌పూర్, సెంటినరీకాలనీ మీదుగా మంథని చేరుకున్నారు. అడుగడగునా ఆయనకు కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, రామగుండం ఎమ్మెల్యే ఠాకూర్ మక్కాన్‌సింగ్ మంత్రి వెంట ఉన్నారు. యువతకు ఉద్యోగాలు ఇస్తాం! జిల్లా కేంద్రంగా మారిన పెద్దపల్లి రూపురేఖలు మార్చుతామని, అభివృద్ధిలో ముందు వరుసలో నిలుపుదామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. జిల్లాలో పరిశ్రమలు ఉన్న రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అవసరం మేరకు మరిన్ని పరిశ్రమలు స్థాపిస్తామని హామీ ఇచ్చారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ, నియోజకవర్గానికి మంత్రి శ్రీధర్‌బాబు అండదండలు ఉండాలన్నారు. గతంలోనూ తనకెంతో సహకారం అందించారని గుర్తుచేశారు. స్పందించిన మంత్రి శ్రీధర్‌బాబు.. సీఎం రేవంత్‌రెడి ఎమ్మెల్యే విజ్జన్నకు అత్యంత సన్నిహితులన్నారు. తామంతా కలిసే జిల్లా అభివృద్ధికి పాటుపడతామని తెలిపారు. జిల్లాతో తనకెంతో అనుబంధం ఉందని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. మంత్రి ఆదేశాలు అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ అన్నారు. ఆరు గ్యాంరెటీలు అమలు చేస్తాం! ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ఇప్పటికే రెండు గ్యారెంటీలు అమలు చేస్తున్నామని, మరో 15 రోజుల్లో ఇంకో రెండు అమలు చేస్తామన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ , పెద్దపల్లికి బైపాస్ రోడ్డు, బస్ డిపో, జిల్లా కోర్టు, 50 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి మంజూరు చేయిస్తామన్నారు. కాగా, సుల్తానాబాద్ ర్యాలీలో పలువురు దొంగలు చేతివాటం ప్రదర్శిస్తూ నాయకులు, ప్రజాప్రతినిధుల పర్సులు చోరీచేశారు. ప్రజలు శాంతి కోరుకున్నారు.. కమాన్‌పూర్ మండలం గొల్లపల్లె వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంత్రికి ఘనస్వాగతం పలికారు. కమాన్‌పూర్ ఎక్స్ రోడ్డు మంత్రి మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో మంథని నియోజకవర్గంలో రౌడీయిజం రాజ్యామేలిందన్నారు. ప్రజలు శాంతియుత వాతావరణం కోరుకుని కాంగ్రెస్‌కు ఓట్లేసి గెలిపించారని అన్నారు. నాయకులు వైనాల రాజు, ఇనగంటి భాస్కర్‌రావు, కోలేటి మారుతి, తొట్ల తిరుపతియాదవ్, ఆకుల ఓదెలు, కట్కం రవీందర్, తొగరి అన్నపూర్ణ పాల్గొన్నారు. ఇవి చదవండి: అడవిబిడ్డకు అపూర్వ స్వాగతం.. మల్లంపల్లిలో మాట్లాడుతున్న సీతక్క! -
అమెరికాలో ఘనంగా హాలిడే పార్టీ.. పాల్గొన్న400 మంది సీఈవోలు
అమెరికాలో ఐటీ సర్వ్ అలయెన్స్ నార్త్ ఈస్ట్ చాప్టర్ వార్షిక ఫ్యామిలీ హాలిడే పార్టీ నిర్వహించింది. నార్త్ ఈస్ట్ చాప్టర్ అధ్యక్షుడు కళ్యాణ్ విజయ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఈవెంట్లో 400 మందికి పైగా కంపెనీ సీఈవో(CEO)లు పాల్గొన్నారు. కుటుంబంతో కలిసి హాజరైన పలువురు ప్రవాసులు ఈ పార్టీలో పాల్గొని సందడి చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సింగర్స్ తమ గాత్రంతో మైమరిపించారు. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా ఎంతో ఘనంగా హాలీడే పార్టీని నిర్వహించారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల కమ్యూనికేషన్ మరింత బలపడుతుందని పేర్కొన్నారు. ఈ పార్టీలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతిఒక్కరికి కళ్యాణ్ విజయ్ ధన్యవాదాలు తెలిపారు. కాగా ఐటీ సర్వ్ అలయెన్స్ అనేది ఐటీ రంగానికి చెందిన 1400 కంపెనీలతో ఏర్పడిన ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. అమెరికాలోని 22 రాష్ట్రాలలో ఉన్న 19 చాప్టర్లలో ఈ సంస్థ ఐటీ సేవలను అందిస్తోంది. ఈ సంస్థలో ఉన్న ఐటీ కంపెనీల మొత్తం ఆదాయం 10 బిలియన్ డాలర్లు. లక్ష మంది ఐటీ నిపుణులు ఈ సంస్థల్లో పనిచేస్తున్నారు. -
ఐటీ కంపెనీ విప్రోలో కీలక నాయకత్వ మార్పు.. రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడి
దిగ్గజ ఐటీ సంస్థ విప్రోలో వచ్చే నెలలో కీలక నాయకత్వ మార్పు చోటుచేసుకోనుంది. కంపెనీ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ స్టెఫానీ ట్రౌట్మన్ డిసెంబర్ 31న వైదొలుగుతున్నట్లు విప్రో రెగ్యులేటరీ ఫైలింగ్‌లో శుక్రవారం ప్రకటించింది. ట్రాట్మన్ను దాదాపు మూడు సంవత్సరాల క్రితం యాక్సెంచర్ పీఎల్సీ నుంయి విప్రో హై-ప్రొఫైల్ హైరింగ్‌లో తీసుకువచ్చింది. విప్రో వెబ్‌సైట్‌లోని ఆమె ప్రొఫైల్ ప్రకారం, ట్రాట్మాన్ అభివృద్ధి భాగస్వాములతో విప్రో సంబంధాలకు నాయకత్వం వహించారు. మార్కెట్ ఇంటెలిజెన్స్‌ను అందించారు. విప్రో బ్రాండ్ అవగాహనను మెరుగుపరిచారు. గ్లోబల్, స్ట్రాటజిక్ పర్స్యూట్ టీమ్ ఏర్పాటుతో సహా సంస్థ అంతటా అమ్మకాల సామర్థ్యాలను అభివృద్ధి చేశారు. స్టెఫానీ ట్రాట్మాన్ సమర్పించిన డిసెంబరు 8 నాటి రాజీనామా లేఖ కాపీని కూడా ఫైలింగ్‌లో కంపెనీ పొందుపరిచింది. సంస్థలో కొనసాగిన మూడేళ్ల కాలంపై ఆమె సంతృప్తి వ్యక్తం చేసిన ట్రౌట్మన్.. విప్రో వెలుపల వ్యక్తిగత, వృత్తిపరమైన లక్ష్యాల కోసమే రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. -
భారత్‌పై అంతర్జాతీయ ఐటీ సంస్థ దృష్టి - వచ్చే ఏడాది నుంచి..
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఐటీ సంస్థ ఇన్నోవా సొల్యూషన్స్ భారత మార్కెట్‌పై మరింతగా దృష్టి పెడుతోంది. వచ్చే ఏడాది (2024) ఇక్కడ కార్యకలాపాలను విస్తరించడంతో పాటు పెద్ద ఎత్తున నియామకాలను కూడా చేపట్టనుంది. సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, భారత విభాగం హెడ్ ప్రదీప్ యడ్లపాటి ఈ విషయాలు తెలిపారు. అమెరికాలోని జార్జియా కేంద్రంగా పనిచేస్తున్న ఇన్నోవా సొల్యూషన్స్ 1998లో ప్రారంభమైంది. 2010లో పేరోల్ సిస్టమ్స్, 2016లో టెక్నాలజీ సొల్యూషన్స్ విభాగంలోకి కంపెనీ ప్రవేశించింది. బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, బీమా), కమ్యూనికేషన్స్, మీడియా తదితర రంగాల్లో వెయ్యికి పైగా క్లయింట్లకు సేవలు అందిస్తోంది. ప్రస్తుతం అమెరికా, భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, సింగపూర్ తదితర దేశాల్లో 100 పైచిలుకు కార్యాలయాలు ఉన్నాయి. అంతర్జాతీయంగా 55,000 మంది పైచిలుకు ఉద్యోగులు ఉండగా.. భారత్‌లో 10,000 మంది సిబ్బంది ఉన్నారు. భారత్, ఆసియా–పసిఫిక్‌లోని తమ కార్యకలాపాల పర్యవేక్షణ కోసం ఈ ఏడాది తొలినాళ్లలో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో కీలక హోదాలో ఉన్న యడ్లపాటిని నియమించుకుంది. -
మరో బ్యాడ్‌న్యూస్: విప్రో ఉద్యోగుల ఆశలు ఆవిరేనా? పిడుగు లాంటి నివేదిక!
Wipro salary hike: దేశీయ ఐటీ దిగ్గజం విప్రో తమ ఉద్యోగులకు షాకుల మీద షాకులిస్తోంది. ఇంటి పని చేస్తున్న ఉద్యోగులందరూ ఆఫీస్‌లకు రావాల్సిందేనని ఇటీవల ఆదేశాలు జారీ చేసిన కంపెనీ ఇప్పుడు జీతాల పెంపు విషయంలో ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు పిడుగు లాంటి నివేదికను రాయిటర్స్ బయటపెట్టింది. విప్రో సంస్థ పనితీరు ఆధారంగా ఇచ్చే వేతన పెంపు విషయంలో ఈ సంవత్సరం అధిక ప్యాకేజీ ఉద్యోగులకు మొండిచేయి చూపిస్తుందని, వారికి వార్షిక వేతన పెంపును దాటవేయవచ్చని రాయిటర్స్ తాజాగా నివేదించింది. ఈ కంపెనీలో డిసెంబర్ నెలలో వేతన సవరణలు జరగాల్సి ఉంది. డిసెంబర్ 1న ఉద్యోగులు పెరిగిన జీతాలు అందుకుంటారని కంపెనీ యాజమాన్యం తమ 2023-24 రెండో త్రైమాసిక ఫలితాల సందర్భంగా ప్రకటించింది. తక్కువ ప్యాకేజీ ఉద్యోగులకు ఊరట నివేదిక ప్రకారం.. విప్రో కంపెనీ జీతాల పెంపును పూర్తిగా విరమించుకోలేదు. తక్కువ ప్యాకేజీ ఉన్న ఉద్యోగులకు మాత్రమే వేతన పెంపును అమలు చేయబోతోంది. వేతన పెంపులో తక్కువ ప్యాకేజీ ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పేర్కొన్న కంపెనీ అంతర్గత మెమోను రాయిటర్స్ ఉటింకించింది. ఆఫీస్‌కు రావాల్సిందే.. ఉద్యోగులు వారానికి మూడు రోజులు తప్పనిసరిగా ఆఫీస్‌కు రావాల్సిందేనని విప్రో ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. కొత్త వర్క్ పాలసీలో భాగంగా నవంబర్ 15 నుంచి ఉద్యోగులు కార్యాలయాల నుంచి పనిచేయాల్సి ఉంటుందని సిబ్బందికి పంపిన ఈమెయిల్స్‌లో పేర్కొంది. కొత్త వర్క్ పాలసీని అనుసరించకపోతే, వచ్చే ఏడాది జనవరి 7 నుంచి పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఇదీ చదవండి: 70-hour work: అన్నేసి గంటలేంటి? ‘సిల్లీ’కాకపోతే: ప్రముఖ కంపెనీ అధినేత్రి కౌంటర్! -
వర్క్ ఫ్రం హోమ్ శకం ముగిసినట్టే..నా? కంపెనీలు ఏమంటున్నాయి?
కోవిడ్ మహమ్మారి సమయంలో వర్క్ ఫ్రం హోమ్ (WFH) విధానం అన్ని కంపెనీలకూ, ముఖ్యంగా టెక్ సంస్థలకు అనివార్యంగా మారింది. ఆ తర్వాత కోవిడ్ పరిమితులు సడలించినప్పటి నుంచి ఐటీ కంపెనీలు, స్టార్టప్‌లు ఉద్యోగుల ఉత్పాదకతను పెంచే క్రమంలో వారిని ఆఫీస్‌లకు రప్పించే హైబ్రిడ్ మోడల్‌ను అమలు చేస్తున్నాయి. ఇప్పుడు, రిమోట్ వర్కింగ్ యుగానికి ముగింపు పలుకుతూ ఉద్యోగులు ఆఫీసు నుంచి పని చేయడాన్ని (WFO) తప్పనిసరి చేస్తున్నాయి. దాదాపు నాలుగేళ్ల నుంచి వర్క్ ఫ్రం హోమ్ చేసిన ఇన్ఫోసిస్ ఉద్యోగులు నవంబర్ 20వ తేదీ నుంచి తిరిగి ఆఫీస్ బాట పట్టనున్నారు. వారంలో మూడు రోజులు ఆఫీసు నుంచే వారు పనిచేయాల్సి ఉంటుందని కంపెనీ ఆదేశాలు జారీ చేసింది. ఇక టీసీఎస్ (TCS) అయితే గత నెలలో తమ ఉద్యోగులకు వారంలో ఐదు రోజుల పాటు ఆఫీస్ నుంచి వర్క్‌ను తప్పనిసరి చేసింది. ఇక విప్రో తమ ఉద్యోగులను వారంలో తమకు నచ్చిన మూడు రోజులు ఆఫీసు నుంచి పని చేసేందుకు మే నెల నుంచి అవకాశం కల్పించింది. హెచ్‌సీఎల్‌టెక్ కూడా తన ఉద్యోగులను వారానికి మూడు రోజులు ఆఫీస్‌లకు వచ్చి పనిచేయాలని కోరింది. ఇదీ చదవండి: ఐటీ హబ్‌లు వెలవెల! భారీగా పడిపోయిన నియామకాలు.. కీలక రిపోర్ట్ వెల్లడి సొనాటా సాఫ్ట్‌వేర్‌లో దశలవారీగా రిటర్న్ టు ఆఫీస్ విధానం అమలుపై కసరత్తు చేస్తున్నారు. మిడ్-మేనేజర్లు, సీనియర్ మేనేజర్లు, లీడర్షిప్ స్థాయిలో ఉన్న ఉద్యోగులు ఇప్పటికే వారానికి రెండు రోజులు ఆఫీసుకు వచ్చి పనిచేస్తున్నారు. వచ్చే జనవరి నుంచి మిగిలిన వారు కూడా హైబ్రిడ్ మోడ్‌లో వారానికి కనీసం రెండు రోజులు ఆఫీసుకు వచ్చి పనిచేస్తారని సొనాటా సాఫ్ట్వేర్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ బాలాజీ కుమార్ చెప్పారు. పూర్తి వర్క్ ఫ్రం హోమ్ విధానం నుంచి ఉద్యోగులను కంపెనీలు ఇప్పుడిప్పుడే హైబ్రిడ్ మోడల్‌కు తీసుకొచ్చి వారానికి కొన్ని రోజులైనా ఆఫీస్‌ల నుంచి పని చేయించుకుంటున్నాయి. అయితే ఈ హైబ్రిడ్ విధానమైనా కొనసాగుతుందా లేదా టీసీఎస్ లాగా అన్ని కంపెనీలు పూర్తిగా వర్క్ ఫ్రం ఆఫీస్‌ను తప్పనిసరి చేసి వర్క్ ఫ్రం హోమ్ శకానికి ముగింపు పలుకుతాయా? అన్న అనుమానం ఉద్యోగ వర్గాల్లో ఉంది. రిమోట్ వర్క్ క్షీణిస్తోంది వంద శాతం రిమోట్ జాబ్స్ అనే భావన క్రమంగా మసకబారుతోందని ర్యాండ్‌స్టాడ్ ఇండియా చీఫ్ పీపుల్ ఆఫీసర్ అంజలి రఘువంశీ చెబుతున్నారు. ఆఫీస్‌కు వచ్చి పనిచేయడానికి భారతీయ ఉద్యోగులు క్రమంగా అలవాటు పడుతున్నారని, వారి అవసరాన్ని బట్టి వారానికి ఒకటి లేదా రెండు రోజులు వర్క్ ఫ్రం హోమ్ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. వారానికి నాలుగు రోజులైతే ఓకే రాండ్‌స్టాడ్ ఇన్సైట్స్ 4-డే వర్క్‌వీక్ క్యాండిడేట్ పల్స్ సర్వే 2023 ప్రకారం, 35 శాతం మంది ఉద్యోగులకు తమ కంపెనీ 4-రోజుల వర్క్‌వీక్‌కి మారితే ప్రతిరోజూ ఆఫీసుకు వెళ్లి పని చేయడానికి అభ్యంతరం లేదు. 43 శాతం మంది ఒక రోజు అదనపు సెలవు వస్తే మిగిలిన రోజుల్లో పని గంటలు కాస్త ఎక్కువైనా పర్వాలేదని అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల అభిప్రాయాలను అదే సమయంలో తమ వ్యాపార అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇద్దరికీ అనువైన విధానాన్ని కంపెనీలు ఆలోచించాలని అంజలీ రఘువంశీ సూచిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికి వర్క్ ఫ్రం ఆఫీస్ మోడల్‌కు ఉద్యోగులు వచ్చినప్పటికీ ఒక్కసారి జాబ్ మార్కెట్ అనుకూలంగా మారిందంటే ఉద్యోగులు తమకు మరింత సౌలభ్యాన్ని అందించే ఉద్యోగాల వైపు వెళ్లే అవకాశం ఉంటుందని, అందువల్ల కంపెనీలు ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందంటున్నారు. దశలవారీగా ఆఫీస్‌లకు.. ఆఫీస్‌లకు వచ్చి పనిచేయడం వల్ల ఉద్యోగుల మరింత నేర్చుకునేందుకు, అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందని హెచ్ఆర్ నిపుణులు నమ్ముతున్నారు. “హైబ్రిడ్ విధానం ఐటీ రంగంలోని ఉద్యోగులపై సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉంది. కొంతమంది ఉద్యోగులు ఆఫీస్ రావడానికి ఇష్టపడవచ్చు. ప్రయాణ ఇబ్బందుల నేపథ్యంలో మరికొంత మంది ఆఫీస్‌లకు రావడానికి ఇష్టపడకపోవచ్చు” అని కెరీర్‌నెట్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో అన్షుమన్ దాస్ చెప్పారు. వర్క్ ఫ్రం హోమ్ మంచి ఆలోచన కాదని ఐటీ కంపెనీల టాప్ ఎగ్జిక్యూటివ్‌లు భావిస్తున్నారు. దశలవారీగా అన్ని కంపెనీలు తమ ఉద్యోగులను ఆఫీస్‌లకు రప్పిస్తున్నాయి. కోవిడ్ మహమ్మారి సమయంలో విస్తృతంగా ఉన్న రిమోట్ వర్క్ విధానం తగ్గుతూ వస్తోంది. రిమోట్ వర్క్ క్రమంగా తగ్గుముఖం పట్టడం కూడా ఉద్యోగులను తిరిగి ఆఫీస్‌లకు రప్పించడానికి కంపెనీల్లో కొనసాగుతున్న ఒత్తిడిని ప్రతిబింబిస్తుందని బిజ్ స్టాఫింగ్ కామ్రేడ్ మేనేజింగ్ పార్టనర్ పునీత్ అరోరా పేర్కొన్నారు. -
వేతనాల్లో ఇంత తేడానా? పదేళ్లలో పెరిగిన సీఈఓ, ఫ్రెషర్స్ శాలరీ రిపోర్ట్
భారతదేశం ఇతర దేశాలతో పోటీపడాలన్నా, ప్రగతి సాధించాలన్నా.. యువత వారానికి 70 గంటలు పనిచేయాలన్న ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి మాటలతో కొందరు ఏకీభవించగా, మరికొందరు వ్యతిరేకించారు. ఈ విషయంపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఐఏఎస్ 'అశోక్ ఖేమ్కా' (Ashok Khemka) తాజాగా ఒక ట్వీట్ చేసాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. అశోక్ ఖేమ్కా ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేసిన పోస్ట్‌లో ఐటీ కంపెనీలలో పనిచేసే ఫ్రెషర్స్, సీఈఓల శాలరీలలో వ్యత్యాసం చూడవచ్చు. దీని ప్రకారం.. 2012లో రూ. 2.75 లక్షల వేతనం పొందే ఇన్ఫోసిస్ ఫ్రెషర్ శాలరీ 2022 నాటికి రూ. 3.6 లక్షలకు చేరింది. దీన్ని బట్టి చూస్తే 10 సంవత్సరాల్లో ఒక ఫ్రెషర్ జీతం కేవలం రూ. 85,000 మాత్రమే పెరిగింది. అయితే 2012లో రూ. 80 లక్షల వేతనం తీసుకునే సీఈఓ శాలరీ 2022 నాటికి రూ. 79.75 కోట్లకు చేరింది. దశాబ్ద కాలంలో పెరిగిన ఫ్రెషర్ వేతనం, సీఈఓ వేతనాల వ్యత్యాసం ఏ స్థాయిలో ఉందో ఇక్కడ స్పష్టంగా చూడవచ్చు. విప్రో, టీసీఎస్, టెక్ మహీంద్రా, L & K ఇన్ఫోటెక్, హెచ్‌సీఎల్, మీడియన్ (Median) సంస్థల్లో కూడా ఇదే విధానం కొనసాగుతోంది. సీఈఓల జీతాలు భారీగా పెరుగుతున్నాయి, ఫ్రెషర్ల వేతనాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇదీ చదవండి: రూ.76 లక్షల రేంజ్ రోవర్ కేవలం రూ.100కే..! ఎగబడుతున్న జనం.. అశోక్ ఖేమ్కా ఈ పోస్ట్ షేర్ చేస్తూ.. ఇన్ఫోసిస్ సీఈఓ వేతనం ఫ్రెషర్ వేతనానికి 2,200 రెట్లు ఎక్కువ. సీఈఓ, ఫ్రెషర్ వరుసగా వారానికి ఎన్ని గంటలు పని చేస్తారు? వారానికి 168 గంటలు మాత్రమే ఉంటాయని అని వెల్లడించాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై పలువురు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. Infosys CEO's pay 2,200 times a fresher's pay. How many hours of work a week does the CEO and a fresher put in respectively? There are only 168 hours in a week. pic.twitter.com/DP1C4ODkAt — Ashok Khemka (@AshokKhemka_IAS) October 29, 2023 -
టీసీఎస్‌లో మరో కొత్త సమస్య! ఆఫీస్‌కి రావాల్సిందే అన్నారు.. తీరా వెళ్తే..
ఐటీ సంస్థలన్నీ వర్క్ ఫ్రం హోమ్ విధానానికి దాదాపుగా స్వస్తి పలికాయి. ఇప్పటికీ కొన్ని కంపెనీలు హైబ్రిడ్ విధానాన్ని అనుసరిస్తుండగా టీసీఎస్ (TCS) మాత్రం ఉద్యోగులందరూ ఆఫీస్‌లకు రావాల్సిందేనని తేల్చిచెప్పేసింది. దీంతో ఉద్యోగులు ఇప్పుడిప్పుడే ఆఫీల బాట పడుతున్నారు. అయితే ఉద్యోగులందరూ కార్యాలయాలకు వస్తుండటంతో మరో సమస్య ఎదురైంది. పని చేసేందుకు సీట్ల కొరత టీసీఎస్ రిటర్న్-టు-ఆఫీస్ ఆదేశాలను ఓ వైపు ఉద్యోగుల నుంచి ప్రతిఘటన ఎదురవుతోంది. మరోవైపు ఆఫీస్‌కు వెళ్తున్న ఉద్యోగులకు మరో కొత్త సమస్య వచ్చింది. ఉద్యోగులందరూ ఆఫీస్ నుంచి పనిచేసేందుకు రావడంతో వారికి తగినన్ని సీట్లు అందుబాటులో లేవు. దీంతో వారికి కేటాయించిన సీట్లపై గందరగోళం నెలకొంది. గత రెండేళ్లలో టీసీఎస్ లక్ష మంది ఉద్యోగులను చేర్చుకుంది. కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 6 లక్షలకు పైగా ఉంది. దీంతో సీట్ల కొరత ఏర్పడింది. కారిడార్లు, లాబీల్లో.. అకేషనల్ ఆక్యుపేషన్ జోన్లు అని పిలిచే ఉద్యోగుల తాత్కాలిక సీటింగ్ సౌకర్యాలను కంపెనీ తొలగించడం వల్ల సమస్య మరింత తీవ్రమైంది. దీంతో ఉద్యోగులందరికీ తగినన్ని సీట్లు లభించగా కొందరు ఆఫీస్ కారిడార్లు, లాబీల్లో కూర్చొని పనిచేసుకుంటున్నారు. అయితే రోజంతా ఇలా పనిచేయడానికి చాలా అసౌకర్యంగా ఉందని ఉద్యోగులు చెబుతున్నట్లు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఓ కథనం ప్రచురించింది. (టీసీఎస్‌కు కార్మిక శాఖ నోటీసులు.. ఎందుకంటే..) ఆఫీస్‌కి రావాల్సిందే.. వారంలో ఐదు రోజులూ కార్యాలయానికి తిరిగి రావాల్సిందేనని టీసీఎస్ ఉద్యోగులను అభ్యర్థిస్తోంది. కొన్ని బృందాలకు వర్క్ ఫ్రం హోమ్ ముగిసింది. ఉద్యోగులు తమకు కేటాయించిన కార్యాలయాలకే రావాలని, తమ ఇళ్లకు దగ్గరగా ఉండే ఆఫీస్‌లు కావాలంటే కుదరదని చెప్పడం గందరగోళానికి తోడైంది. రిటర్న్-టు-ఆఫీస్ మార్పును క్రమబద్ధీకరించడానికి, ఉద్యోగులందరికీ సాఫీగా ఉండేలా చేయడానికి కంపెనీ చేస్తున్న ప్రయత్నంలో ఇది భాగమని టీసీఎస్ హెచ్ఆర్ అధికారులు చెబుతున్నారు. కాకపోతే కొన్ని ఆఫీస్‌లు ఇరుగ్గా ఉండటం, మరికొన్నింటిలో తగినన్ని సౌకర్యాలు లేకపోవడంతో ఈ ఇబ్బంది తలెత్తినట్లు తెలుస్తోంది. (TCS Recruitment Scam: కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలపై టీసీఎస్ కీలక నిర్ణయం!) అయితే ఉద్యోగులు ఎక్కడైతే నియమితులయ్యారో అదే ఆఫీస్ నుంచి పని చేయాలని, లేకుంటే వారికిచ్చే సిటీ అలవెన్స్ కోల్పోవాల్సి ఉంటుందని తమ టీం మేనేజర్లు తెలియజేసినట్లు కొంతమంది ఉద్యోగులు చెబుతున్నారు. టైర్-1 నగరాల్లో పనిచేసే ఉద్యోగులకు నెలకు రూ. 2,000-3,000 సిటీ అలవెన్స్ లభిస్తుంది. కానీ తమ సౌకర్యం కోసం కొందరు ఉద్యోగులు ఈ అలవెన్స్‌ను కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. -
ఐటీ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? ఈ 6 నెలలూ అంతే!
ఐటీ ఉద్యోగార్థులకు గత కొన్ని నెలలుగా గడ్డుకాలమే నడుస్తోంది. రానున్న ఆరు నెలలు మరింత గడ్డుకాలం తప్పదని తెలుస్తోంది. అగ్రశ్రేణి ఐటీ కంపెనీలు ఫ్రెషర్ల నియామకాన్ని మందగించాయి. ప్రస్తుత స్థూల ఆర్థిక అనిశ్చితులను పరిగణనలోకి తీసుకుంటే, ఈ ఆర్థిక సంవత్సరం రెండవ అర్ధభాగంలో గతంలో ఎన్నడూ లేని విధంగా మరింత తక్కువగా ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. (టీసీఎస్‌కు కార్మిక శాఖ నోటీసులు.. ఎందుకంటే..) క్లయింట్లు కూడా ఖర్చులను తగ్గించుకుంటున్న నేపథ్యంలో కంపెనీలు తాము ఇప్పటికే చేసిన అన్ని జాబ్ ఆఫర్లను గౌరవిస్తూ విధుల్లోకి తీసుకోవాలని, ప్రస్తుతం బెంచ్‌లో ఉన్నవారిని పూర్తిగా వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఈ క్రమంలో చాలా ఐటీ కంపెనీలు క్యాంపస్ నియామకాల లక్ష్యాన్ని నిర్దేశించుకోలేదు. ఇప్పటికే తమ వద్ద ఎక్కువమందితో కూడిన ఫ్రెషర్ బెంచ్ ఉందని ఇన్ఫోసిస్ చెబుతోంది. "ప్రస్తుతం మేము ఇంకా క్యాంపస్‌లకు వెళ్లడం లేదు" అని కంపెనీ క్యూ2 ఆదాయాల సదస్సులో ఇన్ఫోసిస్ సీఎఫ్ఓ నిలంజన్ రాయ్ అన్నారు. గత ఏడాది కంపెనీ దాదాపు 50,000 మంది ఫ్రెషర్లను నియమించుకుంది. విప్రో తాము ఇప్పటికే చేసిన అన్ని జాబ్ ఆఫర్లను గౌరవిస్తామని చెబుతూ ఫ్రెషర్ల నియామకాలపై చేతులెత్తేసింది. అయితే స్టాఫింగ్ సంస్థ ఎక్స్‌ఫినో 2024 ఆర్థిక సంవత్సరం ఔట్లుక్ హెడ్‌కౌంట్‌లో 2023 ఆర్థికేడాది ముగింపు కంటే 2.4 శాతం నికర వార్షిక వృద్ధి ఉందని తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో హెడ్‌కౌంట్ సుమారు 2 లక్షలు పెరుగుతుందని అభిప్రాయపడింది. 2023 మార్చిలో 66 లక్షలు ఉన్న ఐటీ సెక్టార్ హెడ్‌కౌంట్ రానున్న మార్చి నాటికి 68 లక్షల మార్క్ కంటే తక్కువగానే ఉంటుందని పేర్కొంది. ఈ సంవత్సరం ఐటీ రంగం గణనీయమైన మార్పునకు గురైంది. ఇది ఎంట్రీ-లెవల్ స్థానాలకు డిమాండ్‌లో సుమారుగా 25-30 శాతం క్షీణించిందని సీఐఈఎల్ హెచ్ఆర్ సర్వీసెస్ ఎండీ, సీఈవో ఆదిత్య నారాయణ్ మిశ్రా తెలిపారు. -
గంటకు 23 మంది.. ఏడాదికి వేలల్లో.. ఆందోళనలో టెకీలు!
కరోనా లాక్డౌన్ సమయంలో కొన్ని కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కల్పించగా, మరికొన్ని సంస్థలు ఆర్ధిక పరిస్థితులను ఎదుర్కోవడానికి చాలామంది ఉద్యోగులను తొలగించాయి. ఇప్పటికీ తొలగింపుల పర్వం కొనసాగుతూనే ఉంది, ఇందులో భాగంగానే ఇటీవల లింక్డ్ఇన్ 668 మంది ఉద్యోగులను తొలగించింది. లింక్డ్ఇన్ తొలగించిన ఉద్యోగులలో ఇంజినీరింగ్, ప్రొడక్ట్, టాలెంట్, ఫైనాన్స్ టీమ్ ఎంప్లాయిస్ ఉన్నారు. కంపెనీ రెవెన్యూ ఇప్పటికీ పురోగతి చెందకపోవడమే ఉద్యోగుల తొలగింపులకు ప్రధాన కారణమని సంస్థ స్పష్టం చేసింది. ఐటీ పరిశ్రమల్లో ఉద్యోగాల కోత కొత్తేమీ కాదు. మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద సంస్థల నుంచి చిన్న కంపెనీల వరకు వరకు లేఆఫ్స్ ప్రకటిస్తూనే ఉన్నాయి. గత రెండేళ్లలో భారీగా పెరిగిన ఉద్యోగాల కోతలు ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. సగటున ప్రతి గంటకు 23 మంది టెక్కీలు ఉద్యోగాలు కోల్పోతున్నట్లు లేఆఫ్.ఫీ (layoff.fyi) వెబ్సైట్ పేర్కొంది. 2022 - 23 సంవత్సరాల్లో ప్రపంచ వ్యాప్తంగా 2,120 టెక్ కంపెనీలు 4,04,962 మంది ఉద్యోగులను తొలగించాయి. 2022లో మాత్రం 1,061 టెక్ కంపెనీలు 164,769 మందిని, 2023 అక్టోబర్ 13 నాటికి 1,059 కంపెనీలు 2,40,193 మంది ఉద్యోగులను తొలగించాయి. ఇదీ చదవండి: ధనవంతుల జాబితాలో రైతు బిడ్డ - సంపద తెలిస్తే అవాక్కవుతారు! 2023 జనవరిలోనే 89,554 మంది టెకీలు తమ ఉద్యోగాలను కోల్పోయారు. 2022లో ప్రారంభమైన ఉద్యోగాల కోతలు 2023 ప్రారంభం నాటికి గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఈ ఏడాది ప్రారంభంతో పోలిస్తే ప్రస్తుతం లేఆప్స్ కొంత తక్కువయ్యాయి, కానీ ఇంకా పూర్తిగా ముగియలేదు. -
ఐటీ ఉద్యోగాల సంక్షోభం: టెకీలకు నిపుణుల సంచలన హెచ్చరికలు
భారతీయ దిగ్గజ ఐటి కంపెనీలు టీసీఎస్) ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్‌టెక్ ఈ వారం తమ క్యూ2 ఎఫ్వై24 ఫలితాలను ప్రకటించాయి. లాభాలు, ఆదాయాలు కాస్త మెరుగ్గా ఉన్నప్పటికీ ఈ కంపెనీలన్నింటిలో ప్రధాన ట్రెండ్‌లో హెడ్‌కౌంట్ సంఖ్య గణనీయంగా తగ్గడంచర్చకు దారి తీసింది. దీనికి తోడు దాదాపు కొత్త హైరింగ్‌పై ఆశాజనక అంచనాలను ప్రకటించలేదు. ఇదే ఐటీ ఉద్యోగార్థులను కలవరానికి గురిచేస్తోంది. ప్రస్తుత పరిస్థితిపై నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇంజనీరింగ్ చదువుతున్న వారి ఉద్యోగాలపై అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు. వీరంతా లేటెస్ట్ టెక్నాలజీ కోర్సులను నేర్చుకోవడంతోపాటు, కొత్త ఉద్యోగాలు వెతుక్కోవడం మంచిదని సూచిస్తున్నారు. ఒకవైపు ఏఐ విధ్వంసంపై ఆందోళన కొనసాగుతోంది. మరోవైపు జాబ్ మార్కెట్లో అనిశ్చితి వేలాదిమంది లేఆఫ్స్ ఆందోళనలో పడేస్తోంది. ముఖ్యంగా సంక్లిష్ట సమయాల్లో ముందుగా కాంట్రాక్టు ఉద్యోగులపై వేటు పడుతుందని, అత్యధిక రిస్క్ గ్రూపులో వారే ఉంటారని ఇండస్ట్రీ నిపుణుల మాట. (IOC Session తిలకం దిద్ది మరీ స్వాగతం..సర్వం సిద్ధం: నీతా అంబానీ) టీసీఎస్ టీసీఎస్‌లో త్రైమాసిక ప్రాతిపదికన 6,333 మంది ఉద్యోగుల సంఖ్య నికరంగా క్షీణించింది. జూన్ త్రైమాసికంలో 615,318 గా ఉన్న ఉద్యోగుల సంఖ్య,సెప్టెంబర్ 30 నాటికి 608,985 వద్దకు చేరడం గమనార్హం. వార్షిక ప్రాతిపదికన చూస్తే గత ఏడాది 616,171 ఉద్యోగు 7,186 మంది తగ్గిపోయారు. తమ నియామక లక్ష్యాలను రీకాలిబ్రేషన్ చేయడం దీనికి కారణమని కంపెనీ చీఫ్ హెచ్ఆర్ మిలింద్ లక్కడ్ తెలిపారు. తెలివైన ఫ్రెషర్లను ముందస్తుగా నియమించుకోవడం, సరైన నైపుణ్యాలతో వారికి శిక్షణ ఇవ్వడంలో పెట్టుబడి పెట్టడం అనే తమ వ్యూహం ఫలిస్తోంది. ఆ టాలెంట్ స్ట్రీమ్‌లోకి రావడంతోపాటు తగ్గిన అట్రిషన్‌ను తగ్గించి, స్థూల జోడింపులను రీకాలిబ్రేట్ చేయగలిగా మని ఆయన పేర్కొన్నారు. ఉత్పాదకతను పెంచడం, ప్రాజెక్ట్ ఫలితాలను పెంచడమే లక్ష్యమని లక్కాడ్ వివరించారు. ఇన్ఫోసిస్ ఇన్ఫోసిస్ తన హెడ్‌కౌంట్‌లో వరుసగా 7,530 మంది ఉద్యోగులు తగ్గిపోయారు. ఇన్ఫోసిస్ త్రైమాసిక ఫలితాల ప్రకారం క్రితం త్రైమాసికంలో కంపెనీలో 3,36,294 మందితో పోలిస్తే సెప్టెంబర్ 2023 నాటికి 3,28,764 మంది ఉన్నారు. గత ఏడాది త్రైమాసికంతో పోల్చినా కూడా ఉద్యోగుల సంఖ్య తగ్గింది. క్యాంపస్‌లలో మాస్ రిక్రూటింగ్ డ్రైవ్‌లను నిర్వహించబోని కూడా సీఎఫ్‌వో నిలంజన్ రాయ్ ఫలితాల విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. కంపెనీ గణనీయ మైన బెంచ్ పరిమాణాన్ని కలిగి ఉందన్నారు. గత ఏడాది 50వేల మంది ఫ్రెషర్లను నియమించుకున్నాం, డిమాండ్ కంటే ముందుగానే నియమించుకున్నాం, ముఖ్యమైన ఫ్రెషర్ బెంచ్ ఇంకా ఉందని ఆయన చెప్పారు. (Infosys: షాకింగ్ న్యూస్ చెప్పిన ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్!) హెచ్‌సీఎల్‌టెక్ కొత్త నియమాలను ప్రకటించినప్పటికీ హెచ్‌సిఎల్‌టెక్ నికర హెడ్‌కౌంట్ మాత్రం క్షీణించింది. క్యూ1లో కంపెనీ హెడ్‌కౌంట్ 2,506 తగ్గా, Q2 FY 24లో 2,299 తగ్గింది. మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,21,139గా ఉంది. ఈ క్షీణత ఇది వరుసగా రెండో త్రైమాసికం. బెంచ్ లేదా శిక్షణలో ఉన్న ఫ్రెషర్లు ప్రాజెక్ట్‌లలో పెట్టడానికి సిద్ధంగా ఉన్నందున కంపెనీలో హెడ్‌కౌంట్ తగ్గిందని సీఎండీ విజయకుమార్ వివరించారు.గత 18 నెలల్లో నియమించుకున్న చాలా మంది ఫ్రెషర్లు సిద్ధంగా ఉన్నారు. అందుకే అట్రిషన్‌ను బ్యాక్‌ఫిల్ చేయలేదు. ఈ కారణంగానే సీక్వెన్షియల్ ప్రాతిపదికన 1 శాతం తగ్గిందని చెప్పారు. సెక్టార్ వ్యూ మూడు ప్రధాన ఐటీ కంపెనీలు తమ ఫలితాలను విడుదల చేశాయి.ఫైనాన్షియల్తో పాటు, నియామకాల విషయానికి వస్తే Q2 త్రైమాసికంలో స్వల్పంగా తగ్గాయి.సంవత్సరం క్రితం త్రైమాసికంలో టీసీఎస్ 9,840 మందిని నియమించుకుంది; ఇన్ఫోసిస్ 10,032 మందిని నియమించుకుంది. HCLTech 8,382 మందిని నియమించుకుంది. ఈ మూడు కంపెనీల సంయుక్త హెడ్‌కౌంట్ వృద్ధి 28,254గా ఉంది. అదే సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో, మొత్తం మూడు కంపెనీల నికర ఉద్యోగుల చేరిక 16,162 వద్ద ప్రతికూలంగా ఉంది. -
ప్చ్.. విప్రో ఉద్యోగులకు తప్పని నిరాశ!
Wipro salary hike: ప్రముఖ దేశీయ టెక్నాలజీ దిగ్గజం విప్రో (Wipro).. తమ ఉద్యోగులకు నిరాశ కలిగించే వార్త చెప్పింది. జీతాల పెంపుదలను వచ్చే డిసెంబర్ నెలకు వాయిదా వేసింది. ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ఉద్యోగులకు వేతన పెంపు డిసెంబర్ 1 నుంచి అమలు చేయనుంది. ఉద్యోగులకు ఈ-మెయిల్ ఈ మేరకు కంపెనీ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ సౌరభ్ గోవిల్ నుంచి ఉద్యోగులకు ఈ-మెయిల్ అందినట్లు ది ఎకనామిక్ టైమ్స్ ఉదహరించింది. "ప్రస్తుతం సవాళ్లతో కూడిన, అనిశ్చిత ప్రపంచ మార్కెట్ పరిస్థితులు ఉన్నప్పటికీ, మా మెరిట్ జీతాల పెంపుదల (MSI) 2023 డిసెంబర్ 1 నుంచి అమలులోకి వస్తుందని చెప్పడానికి సంతోషిస్తున్నాం. రాబోయే వారాల్లో, ప్రస్తుత పరిహారం, నైపుణ్యాలు, పనితీరు ఆధారంగా అర్హత ఉన్న ఉద్యోగులకు మెరిట్ జీతం పెంపును నిర్ణయిస్తాం" అని ఆ ఈ-మెయిల్లో పేర్కొన్నారు. (మాజీ టెలికాం మంత్రికే బురిడీ! ఒక్క ఫోన్ కాల్‌తో రూ.లక్ష మాయం..) స్థూల ఆర్థిక ఎదురుగాలి, మార్జిన్ ఒత్తిళ్ల కారణంగా జీతాల పెంపు ప్రకటనను విప్రో ఈ సంవత్సరం మూడు నెలలు వాయిదా వేసింది. దీంతోపాటు ఈ సంవత్సరం అనేక ప్రముఖ ఐటీ కంపెనీలు జీతాల పెంపును జాప్యం చేస్తున్నాయి. బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగంలో పరిశ్రమ మందగమనం ఇందుకు ముఖ్య కారణంగా చెబుతున్నారు. లాభదాయకతను పెంపొందించుకోడానికి, ఐటీ రంగంలో తన స్థితిని మెరుగుపరచడానికి విప్రో.. గత జులైలో వ్యూహాత్మక మార్పులను చేపట్టింది. కంపెనీ తన క్లయింట్ బేస్‌ను తగ్గించుకుని అధిక మార్జిన్లు, ఎక్కువ ఆదాయం వచ్చే ఒప్పందాలపై దృష్టి పెట్టింది. జూన్ త్రైమాసికంలో విప్రో ఆదాయంలో 2.8 శాతం సీక్వెన్షియల్ క్షీణతను నమోదు చేసిన కొన్నాళ్లకే ఈ వ్యూహం అమలు చేసింది. అదనంగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో, సంస్థ ప్రారంభ ఆఫర్లతో పోలిస్తే కొత్త రిక్రూట్మెంట్ల పే ప్యాకేజీలను దాదాపు 50 శాతం తగ్గించింది. -
ఐటీ కంపెనీలు అంతంతే.. మళ్లీ నిరాశాజనకమే!
న్యూఢిల్లీ: దేశీ ఐటీ కంపెనీలకు సాధారణంగా రెండో త్రైమాసికం పటిష్టమైనదే అయినప్పటికీ ఈసారి మాత్రం ఆర్థిక ఫలితాలు అంతంతమాత్రంగానే ఉండనున్నాయి. అంతర్జాతీయంగా అనిశ్చితి వల్ల స్థూల ఆర్థిక పరిస్థితులపరమైన సవాళ్లు నెలకొనడంతో క్లయింట్లు తమ వ్యయాల విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తుండటం... ఐటీ సంస్థలకు ప్రతికూలంగా ఉండనుంది. పరిస్థితులు మెరుగుపడతాయనేందుకు అర్థవంతమైన సంకేతాలేమీ లేకపోవడంతో క్యూ1లో కనిపించిన బలహీనత రెండో త్రైమాసికంలోనూ కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. అక్టోబర్ 11న టీసీఎస్‌తో మొదలుపెట్టి ఐటీ దిగ్గజాలు రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ప్రకటించనున్న నేపథ్యంలో ఈ అంచనాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అక్టోబర్ 12న ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్, 18న విప్రో ఫలితాలు వెలువడనున్నాయి. ‘సాధారణంగా ఐటీ కంపెనీలకు రెండో త్రైమాసికం పటిష్టంగానే ఉంటుంది. కానీ త్రైమాసికాలవారీగా టాప్ అయిదు కంపెనీల వృద్ధి చూస్తే మైనస్ 1 శాతం (టెక్ మహీంద్రా), ప్లస్ 1.9 శాతం (హెచ్‌సీఎల్ టెక్) మధ్య ఉండొచ్చు‘ అని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఒక నోట్లో తెలిపింది. పెద్ద ఐటీ కంపెనీలు ఒక మోస్తరుగానే ఉన్నా.. మధ్య స్థాయి సంస్థలు మాత్రం మెరుగ్గానే రాణించనున్నాయి. తగ్గనున్న వృద్ధి వేగం .. ఐటీ సేవల రంగం జులై–సెప్టెంబర్ క్వార్టర్లో త్రైమాసికాల వారీగా సగటున 1.5 శాతం, వార్షికంగా 5.7 శాతం వృద్ధి రేటు నమోదు చేయొచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తెలిపింది. దశాబ్దకాలంలో నమోదైన అత్యంత తక్కువ వృద్ధి రేట్లలో ఈ క్వార్టర్ ఒకటి కాగలదని పేర్కొంది. అధిక ద్రవ్యోల్బణం, వినియోగదారులు ఖర్చు పెట్టడం తగ్గించుకుంటూ ఉండటం వంటి పరిణామాలతో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులు, బీమా, రిటైల్, హై–టెక్, కమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో మందగమనం కొనసాగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని వివరించింది. వ్యయాల తగ్గింపు, కన్సాలిడేషన్‌కు సంబంధించిన భారీ డీల్స్‌తో ద్వితీయార్ధంలో ప్రథమ శ్రేణి కంపెనీల వ్యాపారం సాధారణ స్థాయికి తిరిగి రాగలదని, 2025 ఆర్థిక సంవత్సరంలో మెరుగుపడటానికి బాటలు వేయగలవని షేర్‌ఖాన్ వివరించింది. -
ఐటీ దిగ్గజాల కీలక నిర్ణయం: ఆందోళనలో టెకీలు
ఐటీ దిగ్గజ కంపెనీలు కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నాయి. ముఖ్యంగా కోవిడ్-19, లాక్డౌన్ కాలంలో తీసుకొచ్చిన వర్క్ ఫ్రం హోం విధానానికి స్వస్తి పలికేందుకు సంసిద్దమవుతున్నాయి. ఇప్పటికే టీసీఎస్ అక్టోబర్ 1 నుంచి వారంలో 5 రోజులు ఆఫీసు నుంచే పనిచేయాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. ఇపుడిక విప్రో, క్యాప్‌జెమినీ LTIMindtree టాప్ కంపెనీలు వారంలో అన్ని రోజులు లేదా సగం రోజులు ఇక ఆఫీసుకు రావాలని ఉద్యోగులను ఆదేశించినట్టు తెలుస్తోంది. ఎకనామిక్స్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం రిమోట్ వర్క్, వర్క్ ఫ్రమ్ హోమ్ రోజులు ఇక ముగిసినట్టే కనిపిస్తోందని ఐటీ ఉద్యోగులు వాపోతున్నారు. వారానికి 5 రోజులు లేదా వారానికి 3-4 రోజులు ఆఫీసులకు రావాల్సిందేనని తేల్చి చెప్పాయి. దేశంలోని ప్రధాన ఐటీ హబ్‌లైన పూణె , బెంగళూరు, హైదరాబాద్‌లోని పలు కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు మౌఖిక, అనధికారిక కమ్యూనికేషన్ ద్వారా సంబంధిత ఆదేశాలు జారీ చేశాయి. అయితే కొంతమంది మాత్రం ఇంకా రిమోట్ వర్క్ ఉద్యోగాల వేటలో తలమునకలై ఉన్నారు. (మళ్లీ వార్తల్లోకి జార్ఖండ్: ఇక ఆ ఇండస్ట్రీకి తిరుగే లేదు!) కాగా గ్లోబల్‌గా నెలకొన్న ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ఐటీ సంస్థలను కలవరపెడుతున్నాయి. ఆదాయాలు కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో భారీ మందగమనాన్ని ఎదుర్కొంటున్నాయి. ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. వందలమందిని లేఆఫ్స్ చేశాయి. కొత్త నియామకాలను దాదాపు నిలిపి వేశాయి. రానున్న కాలంలో ఇది మరింతగా ముదురుతుందనే ఆందోళనను నిపుణులువ్యక్తం చేస్తున్నారు. -
భారత్ - కెనడా వివాదం: ఐటీ కంపెనీలకు గండమేనా! టెకీల పరిస్థితేంటి?
ఇండియా & కెనడా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఇండియన్ ఐటీ పరిశ్రమ మీద ప్రభావం చూపుతాయా అని చాలామంది కంగారుపడుతున్నారు. ఇది ఎంతవరకు నిజం?, నిజంగానే ప్రభావం ఉంటుందా? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. భారత్, కెనడా మధ్య వివాదం ఫలితంగా భారతీయ ఐటీ సంస్థలు ప్రస్తుతానికి ఎటువంటి ప్రభావానికి లోనయ్యే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. తక్షణం ఎలాంటి ఆందోళ చెందాల్సిన అవసరం లేదని వెల్లడిస్తున్నారు. కెనడా ప్రాంతం నుంచి ఐటీ కంపెనీల ఆదాయం 5 - 6 శాతం వరకు ఉంది. టెక్నాలజీ కౌన్సిల్ ఆఫ్ నార్త్ అమెరికా & కెనడా టెక్ నెట్వర్క్ ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలోనే దాదాపు 15,000 కంటే ఎక్కువ మంది కెనడాలో ఉద్యోగాల కోసం వెళ్లినట్లు తెలుస్తోంది. కరోనా సమయంలో అమెరికాలో వీసా సమస్యల కారణంగా ఎక్కువమంది కెనడాకు పయనమయ్యారు. ఈ ఏడాది జులైలో ఇన్ఫోసిస్ పబ్లిక్ సర్వీసెస్ కొత్త స్టెప్ డౌన్ సబ్సిడరీని ప్రారంభించింది. దీని ద్వారా 2024 నాటికి కెనడాలో ఉద్యోగుల సంఖ్యను 8,000కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. అంతే కాకుండా ఈ జనవరిలో, TCS తన డిజిటల్ పరివర్తనను వేగవంతం చేయడానికి.. అదే విధంగా ఆవిష్కరణను పెంచడానికి కెనడియన్ జెట్ తయారీదారు బొంబార్డియర్ ద్వారా వ్యూహాత్మక భాగస్వామిగా ఎంపికైంది. ఇదీ చదవండి: ముఖేష్ అంబానీ కొత్త కారు.. ధర తెలిస్తే షాకవుతారు! ఇక విప్రో విషయానికి వస్తే.. జనవరిలో కెనడాలోని టొరంటోలో తన సరికొత్త Wipro-AWS లాంచ్ ప్యాడ్ సెంటర్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. కాగా ఇప్పటికే కెనడాలోని మహీంద్రా అండ్ మహీంద్రా అనుబంధ సంస్థ 'రెస్సన్ ఏరోస్పేస్ కార్పొరేషన్' స్వచ్ఛందంగా తమ కార్యకలాపాలను మూసివేస్తున్నట్లు పేర్కొంటూ కెనడా కార్పొరేషన్స్‌కు దరఖాస్తు చేసింది. -
విప్రో సీఎఫ్‌వోగా అపర్ణ అయ్యర్.. గోల్డ్ మెడల్ సీఏ ఈమె..
భారత ప్రముఖ ఐటీ సేవల దిగ్గజం విప్రో (Wipro) చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO)గా అపర్ణ అయ్యర్ (Aparna Iyer) నియమితులయ్యారు. ఇప్పటి వరకూ సీఎఫ్‌వోగా ఉన్న జతిన్ దలాల్ సెప్టెంబర్ 21న తన పదవికి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో అపర్ణ అయ్యర్‌ను విప్రో నియమించింది. అపర్ణ అయ్యర్ 20 ఏళ్లుగా విప్రోలో పనిచేస్తున్నారు. 2003లో చేరినప్పటి నుంచి కంపెనీకి వివిధ సీనియర్ స్థానాల్లో సేవలందించారు. సీనియర్ ఇంటర్నల్ ఆడిటర్‌గా విప్రోలో ఆమె ప్రయాణం ప్రారంభమైంది. (ఈ కంపెనీల్లో సంతోషంగా ఉద్యోగులు.. టాప్ 20 లిస్ట్! ఐటీ కంపెనీలదే హవా..) రెండు దశాబ్దాలకు పైగా కాలంలో అయ్యర్ విప్రో సంస్థలో కీలకమైన నాయకత్వ స్థానాలను నిర్వహించి అంచెలంచెలుగా ఎదిగారు. ఇటీవల ఆమె విప్రో క్లౌడ్ సర్వీసెస్ యూనిట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, సీజీవోగా బాధ్యతలు నిర్వహించారు. ఇంటర్నల్ ఆడిట్, బిజినెస్ ఫైనాన్స్, ఫైనాన్స్ ప్లానింగ్ అండ్ అనాలిసిస్, కార్పొరేట్ ట్రెజరీ, ఇన్వెస్టర్ రిలేషన్స్ వంటి ఆర్థిక సంబంధమైన అంశాల్లో విశేషమైన నైపుణ్యం ఉన్న అపర్ణ అయ్యర్ ఆయా అంశాల్లో పలు కీలక పోస్టులను నిర్వహించారు. అపర్ణ అయ్యర్ క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్, సీఏ 2002 బ్యాచ్‌లో గోల్డ్ మెడల్ విజేతగా గుర్తింపు పొందారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI)లో చేరడానికి ముందు అయ్యర్ 2001లో ముంబైలోని నర్సీ మోంజీ నుంచి కామర్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీని పూర్తి చేశారు. (Tech Jobs: టెక్ ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్.. ఇక రానున్నవి మంచి రోజులే..!) “నిష్ణాతురాలైన అపర్ణ ఫలితాలతో నడిచే లీడర్. విప్రోతో తన 20 ఏళ్ల కెరీర్లో ఆమె మా బిజినెస్ లీడర్లకు డైనమిక్, ఫార్వర్డ్ థింకింగ్ వ్యూహాత్మక భాగస్వామిగా ఉన్నారు” అని విప్రో లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ థియరీ డెలాపోర్టే అన్నారు. విప్రో సీఎఫ్ఓగా నియమితులైన తర్వాత అపర్ణ అయ్యర్ మాట్లాడుతూ "విప్రోకి ఈ ముఖ్యమైన తరుణంలో సీఎఫ్ఓ బాధ్యతలను స్వీకరించడం చాలా ఆనందంగా ఉంది. కంపెనీని స్థిరమైన వృద్ధివైపు నడిపించడానికి, వాటాదారులకు విలువను సృష్టించడానికి సీఈవో థియరీతో, మా ఫైనాన్స్ బృందం, మొత్తం సంస్థతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అని పేర్కొన్నారు.