
దర్శితా సదరన్ ఇండియా హ్యాపీ హోమ్స్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) వెల్లడించింది. ఈ డీల్ విలువ రూ. 2,250 కోట్లు. ఒప్పందంలో భాగంగా దర్శితాకు చెందిన స్థలం, భవంతి టీసీఎస్‌కు దక్కనున్నాయి. వీటిని తమ డెలివరీ సెంటర్ కోసం కంపెనీ ఉపయోగించుకోనుంది.
‘2004లో ఏర్పాటైన దర్శితా సదరన్ ఇండియా హ్యాపీ హోమ్స్.. కమర్షియల్ ప్రాపర్టీని అభివృద్ధి చేయడం, పరిశ్రమలకు లీజుకివ్వడం తదితర కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ ప్రాపర్టీ ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నందున, ఆదాయ ఉత్పత్తి ఇంకా ప్రారంభం కాలేదు. అందువల్ల గత మూడు సంవత్సరాల టర్నోవర్ శూన్యం" అని రెగ్యులేటరీ ఫైలింగ్ లో కంపెనీ పేర్కొంది. రెండేళ్ల తర్వాత సంస్థలో 100 శాతం ఈక్విటీ షేర్లను టీసీఎస్ కొనుగోలు చేసే అవకాశం ఉంది.
టాటా రియాల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌కు చెందిన రెండు అనుబంధ సంస్థలైన టీఆర్ఐఎల్ బెంగళూరు రియల్ ఎస్టేట్ ఫైవ్ లిమిటెడ్, టీఆర్ఐఎల్ బెంగళూరు రియల్ ఎస్టేట్ సిక్స్ లిమిటెడ్లను రూ.1,625 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు ఈ ఏడాది జనవరిలో టీసీఎస్ ప్రకటించింది. ఈ ఒప్పందం 2025 జనవరి చివరి నాటికి ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment