
లింక్డ్ఇన్ 2025 టాప్ కంపెనీస్ ఇండియా లిస్ట్‌లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), యాక్సెంచర్, ఇన్ఫోసిస్ తొలి మూడు స్థానాలను దక్కించుకున్నాయి. ఈ వార్షిక ర్యాంకింగ్ కెరీర్ వృద్ధి, నైపుణ్య అభివృద్ధి, దీర్ఘకాలిక విజయం కోసం ఉత్తమ పని ప్రదేశాలను హైలైట్ చేస్తూ ఉద్యోగార్థులు, ఉద్యోగులు తమ కెరీర్లలో ఎలా ముందుకు వెళ్లాలో మార్గదర్శనం చేస్తుంది.
ముందంజలో టెక్ టైటాన్స్
టీసీఎస్, యాక్సెంచర్, ఇన్ఫోసిస్ ల ఆధిపత్యం భారత ఉపాధి రంగంలో టెక్నాలజీ, కన్సల్టింగ్ సేవలకు పెరుగుతున్న ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తోంది. ఈ కంపెనీలు తమ ఉద్యోగుల కేంద్రీకృత కార్యక్రమాలకు ప్రత్యేకమైనవిగా నిలుస్తాయి. అప్ స్కిల్లింగ్, నాయకత్వ అభివృద్ధి, సృజనాత్మక-ఆధారిత పని వాతావరణంలో భారీగా పెట్టుబడులు పెడతాయి.
క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో గణనీయమైన పెట్టుబడులు పెడుతూ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్‌లో టీసీఎస్ ముందంజలో ఉంది.
కన్సల్టింగ్, బిజినెస్ స్ట్రాటజీ, ఎంటర్ప్రైజ్ టెక్నాలజీలో యాక్సెంచర్ పవర్ హౌజ్‌గా ఉంటూ గ్లోబల్ డిజిటల్ సొల్యూషన్స్‌ను నడిపిస్తోంది.
ఏఐ ఇంజినీరింగ్, సాఫ్ట్‌వేర్ డెవలప్మెంట్, సస్టెయినబిలిటీ కన్సల్టింగ్‌పై ఇన్ఫోసిస్ దృష్టి సారించింది.
ఎమర్జింగ్ ట్రెండ్స్.. హైరింగ్ తీరుతెన్నులు
లింక్డ్ఇన్ ర్యాంకింగ్ కొన్ని ఆకర్షణీయమైన ధోరణులతో భారతదేశపు అభివృద్ధి చెందుతున్న జాబ్ మార్కెట్‌ను కూడా వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేసింది.
టాప్ ఇన్-డిమాండ్ రోల్స్: ఫ్రాడ్ అనలిస్టులు, బిజినెస్ ఆపరేషన్స్ అనలిస్టులు, ఫైనాన్షియల్ ఎనలిస్టులు వంటి ఉద్యోగాలకు కంపెనీలు చురుగ్గా నియామకాలు జరుపుతున్నాయి.
డిమాండ్ ఉన్న నైపుణ్యాలు: ఏఐ ఇంజినీరింగ్, మొబైల్ యాప్ డెవలప్మెంట్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్‌లో నైపుణ్యానికి కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి.
పరిశ్రమ మార్పులు: టెక్నాలజీ, ఫైనాన్స్, ఎంటర్ప్రైజ్ సాఫ్ట్‌వేర్లు ఆధిపత్యం కొనసాగిస్తుండగా, టాప్ 25 కంపెనీల్లో 19 కంపెనీలు ఈ రంగాలకు చెందినవే కావడం గమనార్హం.
కొత్త కంపెనీలే: ఈ జాబితాలోని కంపెనీల్లో సగానికి పైగా మొదటిసారి ప్రవేశించినవే కావడం యజమాని ప్రాధాన్యతలు, వర్క్ ప్లేస్ అప్పీల్ లో మార్పును సూచిస్తోంది.
జాబితాలో టాప్ 10 కంపెనీలు ఇవే..
1. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్): ఐటీ సర్వీసెస్
2. యాక్సెంచర్: కన్సల్టింగ్ అండ్ ఐటీ సర్వీసెస్
3. ఇన్ఫోసిస్: ఐటీ సర్వీసెస్
4. ఫిడిలిటీ ఇన్వెస్ట్మెంట్స్: ఫైనాన్షియల్ సర్వీసెస్
5. కాగ్నిజెంట్: ఐటీ సర్వీసెస్
6. ఒరాకిల్: సాఫ్ట్వేర్ అండ్ క్లౌడ్ సర్వీసెస్
7. జేపీ మోర్గాన్ ఛేజ్: ఫైనాన్షియల్ సర్వీసెస్
8. అమెజాన్: ఈ-కామర్స్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్
9. ఆల్ఫాబెట్ ఇంక్ (గూగుల్): టెక్నాలజీ
10. డిపాజిటరీ ట్రస్ట్ అండ్ క్లియరింగ్ కార్పొరేషన్ (డీటీసీసీ): ఫైనాన్షియల్ సర్వీసెస్